ఢిల్లీ: పార్లమెంట్‌లో కాంగ్రెస్ వ్యవహార శైలిపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉన్న నమ్మకం.. మన దర్యాప్తు సంస్థలపై లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారాయన.
ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ అసత్య ప్రచారానికి దిగింది. లోక్‌సభ వాయిదా తీర్మానంతో ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తమ సొంత పార్టీ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ వ్యవహారాన్ని పక్కన పెడుతోంది. దీనిని బట్టే ఆ పార్టీ అర్ధసత్యాలు ప్రచారం చేస్తోందని అర్థమవుతోంది.
ఆ పార్టీకి భారత దర్యాప్తు సంస్థలపై లేని నమ్మకం విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉండడం మన దౌర్భాగ్యం. విదేశీ దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్‌కు ఉన్న నమ్మకం.. వాళ్ల వలసవాద మనసత్వానికి ఉదాహారణ నిలుస్తోంది’ అని ట్వీట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
The Congress’ adjournment motion in the Lok Sabha conveniently targets @ysjagan garu while conspicuously shielding their own CM in Chhattisgarh. This selective narrative exposes Congress’ penchant for telling only half the story. Their faith in foreign agencies over Indian…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 27, 2024
Comments
Please login to add a commentAdd a comment