Bhupesh Baghel
-
కాంగ్రెస్ వలసవాద మనస్తత్వానికి ఇదే ఉదాహరణ : ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ: పార్లమెంట్లో కాంగ్రెస్ వ్యవహార శైలిపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉన్న నమ్మకం.. మన దర్యాప్తు సంస్థలపై లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారాయన.ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ అసత్య ప్రచారానికి దిగింది. లోక్‌సభ వాయిదా తీర్మానంతో ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తమ సొంత పార్టీ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ వ్యవహారాన్ని పక్కన పెడుతోంది. దీనిని బట్టే ఆ పార్టీ అర్ధసత్యాలు ప్రచారం చేస్తోందని అర్థమవుతోంది.ఆ పార్టీకి భారత దర్యాప్తు సంస్థలపై లేని నమ్మకం విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉండడం మన దౌర్భాగ్యం. విదేశీ దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్‌కు ఉన్న నమ్మకం.. వాళ్ల వలసవాద మనసత్వానికి ఉదాహారణ నిలుస్తోంది’ అని ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.The Congress’ adjournment motion in the Lok Sabha conveniently targets @ysjagan garu while conspicuously shielding their own CM in Chhattisgarh. This selective narrative exposes Congress’ penchant for telling only half the story. Their faith in foreign agencies over Indian…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 27, 2024 -
Bhupesh Baghel: ‘ఏడాదిలోపే మధ్యంతరం’
రాయ్‌పూర్: లోక్‌సభకు ఆరు నెలల నుంచి ఏడాదిలోపే మధ్యంతర ఎన్నికలు ఖాయమని కాంగ్రెస్ నేత భూపేశ్ బఘెల్ శుక్రవారం జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘బీజేపీకి చెందిన యూపీ సీఎం ఆదిత్యనాథ్, రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ పీఠాలు కదులుతున్నాయి. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయడం ఖాయం. రోజుకు మూడుసార్లు దుస్తులు మార్చుకునే అలవాటున్న మోదీ ఇప్పుడు ఒకే డ్రెస్‌తో మూడు కార్యక్రమాలకు వెళుతున్నారు. ఏం తిన్నదీ పట్టించుకోవడం మానేశారు’’ అంటూ బఘెల్ ఎద్దేవా చేశారు. -
‘ ఏడాదిలోపు మధ్యంతర ఎన్నికలు ’.. చత్తీస్‌గఢ్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
రాయ్‌పూర్: దేశంలో ఆరు నెలల నుంచి ఏడాది లోపు మధ్యంతర ఎన్నికలు రానున్నాయని చత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఓ బహిరంగ సభలో మాట్లాడారు.‘‘ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలల నుంచి ఏడాది లోపు దేశంలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లను పక్కన పెట్టనున్నారు. యోగి ఆదిత్యనాథ్ కుర్చి కదులుతోంది. సీఎం భజన్‌లాల్ తడబడుతున్నారు. ఫడ్నవిస్ రాజీనామా చేస్తున్నారు. .. రోజుకు మూడు డ్రెస్సులు మార్చే వారు (మోదీ) ఇప్పడు ఒకే డ్రెస్‌తో మూడు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇప్పడు వాళ్లు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం ధరిస్తున్నారనేది ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గట్టి గుణపాఠం. పార్టీలను విడగొట్టే, ప్రజల చేత ఎన్నకోబడిన సీఎంలను జైలులో పెట్టిన బీజేపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు’’ అని బఘేలా అన్నారు.మరోవైపు.. ఎన్డీయే కూటమి పక్షనేతగా నరేంద్రమోదీని భాగస్వామ్య పక్షనేతలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్న రోజునే భూపేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేయటంతో సంచలనంగా మారింది. -
‘మోదీ మూడో టర్ము’.. భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు
రాయ్‌పూర్: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంపై ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్‌పూర్‌లో శుక్రవారం(జూన్7) జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బగేల్ మాట్లాడారు. ‘లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రావొచ్చని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బగేల్ పిలుపునిచ్చారు. ‘పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలలు లేదా ఏడాదిలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు. యోగి ఆదిత్యనాథ్ కుర్చీ కదులుతోంది. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ కుర్చీ ఊగుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్ ఇప్పటికే రాజీనామా చేస్తానంటున్నారు’అని బగేల్ ఎద్దేవా చేశారు. -
Bhupesh Baghel: పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చేశారు
న్యూఢిల్లీ: పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైనా ఎన్నికల సంఘంపై, ఈవీఎంల పనితీరుపై విపక్షాల ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగెల్ సోమవారం రాత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోటీ చేసిన రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ ముగిశాక పలుచోట్ల ఏకంగా ఈవీఎంలనే మార్చేశారని పేర్కొన్నారు! ‘‘పలు బూత్‌ల్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల సీరియల్ నంబర్లు పోలింగ్ తర్వాత మారిపోయాయి. ఫామ్ 17సీలో పొందుపరిచిన సమాచారమే ఇందుకు రుజువు. దీనివల్ల వేలాది ఓట్లు ప్రభావితమవుతాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సాక్ష్యాలంటూ ఈవీఎంల తాలూకు తొలి నంబర్లు, మారిన నంబర్లతో కూడిన వివరాలను పోస్ట్ చేశారు. ‘‘ఇలా మార్చిన ఈవీఎం నంబర్ల తాలూకు జాబితా చాలా పెద్దది. అందరికీ తెలియాలని చిన్న జాబితా మాత్రమే పోస్ట్ చేస్తున్నా’’ అని తెలిపారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. ఇలా నంబర్లను ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ అని ఈసీని ఉద్దేశించి భగెల్ ప్రశ్నించారు. చాలా లోక్‌సభ స్థానాల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నాం. నంబర్లను ఏ పరిస్థితుల్లో మార్చాల్సి వచి్చందో ఈసీ బదులివ్వాల్సిందే. దీనివల్ల ఆయా స్థానాల్లో ఎన్నికల ఫలితంపై ప్రభావం పడితే అందుకు ఎవరిది బాధ్యత?’’ అంటూ మండిపడ్డారు. పోలింగ్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా 150 జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆదివారం ఆరోపించడం తెలిసిందే. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, రుజువులుంటే ఇవ్వాలని సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు. -
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మక లోక్‌సభ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ, కిశోరీ లాల్ శర్మ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులను నియమించింది.రాయ్‌బరేలీ, అమేథీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా భూపేశ్ బాఘెల్, అశోక్ గెహ్లాట్లను నియమించే ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.ప్రియాంక గాంధీ ఇప్పటికే ప్రచారానికి నాయకత్వం వహించారు. సోమవారం నుంచి ఎన్నికలు ముగిసే వరకు రాయ్‌బరేలీ, అమేథీలలో క్యాంపెయిన్ చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రచారంలో భాగంగా ప్రియాంక ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందిని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, గాంధీ కుటుంబంతో దశాబ్దాలుగా కుటుంబ సంబంధాలు ఉన్న వారితో ఇప్పటికే ఔట్ రీచ్ ప్రారంభమైందని ఆ వర్గాలు తెలిపాయి. రెండు నియోజకవర్గాల్లో డిజిటల్, సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తారని సమాచారం.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వంటి అగ్రనేతల ప్రచార ప్రణాళికలను, షెడ్యూల్‌ను కూడా ప్రియాంక గాంధీ చూసుకుంటారు. ఈమె ఎన్నికల ప్రచారంలో భాగంగా 200 నుంచి 300 గ్రామాలను కవర్ చేస్తూ.. రెండు నియోజక వర్గాలకు సమయాన్ని కేటాయిస్తుందని సమాచారం.ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీలో వేసిన బలమైన పునాదుల కారణంగా అయన భార్య, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980లలో గెలుపొందారు. తరువాత గాంధీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అమేథీలో ప్రస్తుత బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ చేతిలో ఉంది. దీన్ని మళ్ళీ హస్తం హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.#LokSabhaElections2024 | Congress appoints Bhupesh Baghel as AICC Senior Observer to Raebareli and Ashok Gehlot to Amethi. pic.twitter.com/GSJ0EQvwBv— ANI (@ANI) May 6, 2024 -
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి తండ్రి కన్నుమూత
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ తండ్రి నందకుమార్ బఘెల్(89) కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన రాయ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నందకుమార్ బఘేల్‌కు ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె. ప్రజల తుది దర్శనం కోసం ఆయన భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం శాంతి నగర్‌లోని పటాన్ సదన్‌లో ఉంచారు. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలియగానే ఆయన ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ చేరుకున్నారు. నందకుమార్ బఘెల్ అంత్యక్రియలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనే సమాచారం ఇంకా వెల్లడికాలేదు. -
బఘెల్‌కు ‘బోనస్’ దక్కలేదు
ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. రెండు పారీ్టలూ అంతే పోటాపోటీగా సంక్షేమ, ప్రజాకర్షక పథకాలను ప్రకటించాయి. వరికి దేశంలోనే అత్యధికంగా అందిస్తూ వస్తున్న బోనస్ తమను గట్టెక్కించి అధికారాన్ని నిలబెడుతుందని ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. మోదీ హామీల పేరుతో బీజేపీ ప్రకటించిన పథకాలకే ప్రజలు జై కొట్టారు. ఎదురుదెబ్బ నేపథ్యంలో.. వరుసగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రజల్లో నెలకొన్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గట్టి దెబ్బ కొట్టింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ వెంటనే సీఎం బఘెల్ పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాల అమలు ప్రారంభించారు. రైతులు, గిరిజనులు, పేదలను ఎవరినీ వదలకుండా అందరికీ సాయం అందేలా చూశారు. ముఖ్యంగా వరికి ఆయన అందిస్తున్న బోనస్ సూపర్ హిట్టయింది. మళ్లీ గెలిస్తే పథకాన్ని మరింత విస్తరిస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఇది ఒక దశలో బీజేపీని బాగా కలవరపరిచింది. దీనికి తోడు భూమిలేని కార్మికులకు వార్షిక ఆర్థిక సాయం రూ.10,000కు పెంచుతామని, కేజీ టు పీజీ ఉచిత విద్య, 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ సహా పలు హామీలెన్నో కాంగ్రెస్ ఇచి్చంది. దాంతో ‘మోదీ గ్యారంటీలు’ పేరుతో బీజేపీ దూకుడుగా ఎన్నో పథకాలు ప్రకటించింది. క్వింటాకు రూ.3,100 చొప్పున ఎకరాకు 21 క్వాంటాళ్లను సేకరిస్తామని పేర్కొంది. ప్రతి వివాహితకూ ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, పీఎం ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్ల నిర్మాణం, పేదలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, కాలేజీ విద్యార్థులకు ప్రయాణ భత్యం, నిరుపేద కుటుంబంలో పుట్టే ఆడపిల్లకు రూ.1.5 లక్షలు తదితరాలెన్నో ప్రకటించింది. వీటికి తోడు ప్రధాని మోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. డబుల్ ఇంజన్ సర్కారుకు చాన్సిస్తే అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తామని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ప్రజలపై బాగా ప్రభావం చూపాయి. చివరికి బఘెల్ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ కొత్త హామీల కంటే బీజేపీ ‘మోదీ గ్యారంటీ’ల వైపే ప్రజలు మొగ్గు చూపారు. ముంచిన ‘మహదేవ్’ ఆరోపణలు... మోదీ గ్యారంటీలకు తోడు, పోలింగ్ సమీపించిన వేళ సీఎం బఘెల్‌పై ముసురుకున్న బెట్టింగ్ యాప్ ముడుపుల ఆరోపణలు కాంగ్రెస్‌కు బాగా చేటు చేశాయి. ఈ ఉదంతంలో ఒక కొరియర్‌ను అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించడం, దుబాయ్‌కి చెందిన మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి బఘెల్‌కు ఏకంగా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందించినట్టు అతడు చెప్పాడని పేర్కొనడం సంచలనం రేపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Chhattisgarh: 57 అప్పటికి 75 అవుతుంది.. ఎగ్జిట్‌పోల్స్‌పై సీఎం బఘేల్
రాయపూర్: ఎగ్జిట్ పోల్ అంచనాలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాష్ట్రంలో బీజేపీపై కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యాన్నే అందించడాన్ని తోసిపుచ్చుతూ తమ పార్టీ భారీ మెజారిటీ సాధించే దిశగా పయనిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా సర్వేలు కాంగ్రెస్‌కు సీట్లు 57 అని అంచనా వేస్తున్నప్పటికీ కౌంటింగ్ రోజైన డిసెంబర్ 3న ఫలితాలు వెలువడే నాటికి ఆ సంఖ్య 75కి పెరుగుతుందన్నారు. గురువారం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలైన అనంతరం బఘేల్ మీడియాతో మాట్లాడారు. "ఏడు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అంకెలు స్థిరంగా ఉన్నాయా? రెండు రోజుల తర్వాత, ఈ ఎగ్జిట్-పోల్ అంచనాలలో పేర్కొన్న సంఖ్యలు స్థిరపడతాయి. ఎగ్జిట్-పోల్ అంచనాలతో సంబంధం లేకుండా మేము ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం" అన్నారు. ఒక ఎగ్జిల్ పోల్ ఫలితాన్ని ప్రస్తావిస్తూ 57 (కాంగ్రెస్ సీట్లు) ఏమిటి? కౌంటింగ్ నాటికి ఇది 75 అవుతుంది అన్నారు. ఇండియా టుడే చాణక్య నిర్వహించిన సర్వేలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 57-66 సీట్లు వస్తాయని, బీజేపీకి 33-42 సీట్లు వస్తాయని, 0-3 సీట్లు ఇతరులకు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు స్వల్ప మెజారిటీ సూచనల నేపథ్యంలో బీజేపీ 'ఆపరేషన్ కమలం' ప్రారంభిస్తుందా అనే దానిపై సీఎం బఘేల్ స్పందిస్తూ వారికి ఆ అవకాశం లేదని, తమకు మెజారిటీ ఉందని, తమ కృషిపై, ప్రజలపై విశ్వాసం ఉందని పేర్కొన్నారు. మూడు సర్వేలు కాంగ్రెస్ స్పష్టమైన విజయం సాధిస్తుందని అంచనా వేయగా, మరికొన్ని ఆ పార్టీ గెలుపు రేంజ్లో ఉందని చెప్పాయి. ఏబీపీ సీ-ఓటర్ అంచనాల ప్రకారం.. 90 మంది సభ్యుల అసెంబ్లీ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ 41-53 సీట్లు గెలుచుకోనుంది. బీజేపీకి 36-48 సీట్లు, ఇతరులకు 0-4 సీట్లు వస్తాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా పోల్ కాంగ్రెస్‌కు 40-50 సీట్లు, బీజేపీకి 36-46 సీట్లు, ఇతరులకు 1-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్‌కు 44-52 సీట్లు, బీజేపీకి 34-42 సీట్లు, ఇతరులకు 0-2 సీట్లు వచ్చాయి. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ పోల్ కాంగ్రెస్‌కు 46-56 సీట్లు, బీజేపీకి 30-40 సీట్లు, ఇతరులకు 3-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్ 42-53, బీజేపీ 34-45, ఇతరులకు 0-3 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ 44.6 శాతం ఓట్లతో 46-54 సీట్లు, 42.9 శాతం ఓట్లతో బీజేపీ 35-42 సీట్లు, 12.5 శాతం ఓట్లతో ఇతరులు 0-2 సీట్లు సాధిస్తాయని పీ-మార్క్ పోల్ పేర్కొంది. -
‘మూడొంతుల మెజారిటీ ఖాయం.. మళ్లీ అధికారంలోకి వస్తున్నాం’
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో నాలుగింట మూడొంతుల మెజారిటీతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అన్నారు. తెలంగాణలోని కరీంనగర్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందన్నారు. కాబట్టి అక్కడ నాలుగింట మూడు వంతుల మెజారిటీతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ను నమ్మండి.. ‘కాంగ్రెస్‌ను నమ్మండి... కేసీఆర్‌ని మీరు చాలా చూశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన వారిని నమ్మండి. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మీరే బలపడతారు’ అని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు 17 శాఖలను తమ వద్దే ఉంచుకున్నారని, తెలంగాణపై రూ.5 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజలు మార్చకుంటే రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లకు పెరుగుతాయన్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితి గురించి భూపేంద్ర బఘేల్ సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. తెలంగాణలో బీజేపీ తన ఇద్దరు "పిల్లల" భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతోందంటూ పేర్లు తీసుకోకుండా పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, ఇక్కడ కూడా పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాసుకొచ్చారు. -
అందుకే కడుతున్నారు.. రామ మందిరంపై ఛత్తీస్‌గఢ్ సీఎం వ్యాఖ్యలు
రాయపూర్: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సీఎం బఘేల్ ఆదివారం ఉదయం ఇక్కడి మహాదేవ్ఘాట్ వద్ద ఖరున్ నదిలో పవిత్ర స్నానం చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసమంతా సూర్యోదయానికి ముందు స్నానం చేయడం ఛత్తీస్‌గఢ్‌లో ఆచారంగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా తాను కూడా మహదేవ్ఘాట్లో దిగి ఖరున్ నదిలో స్నానం చేసినట్లు చెప్పారు. సూర్యోదయానికి ముందు స్నానం చేయడం ఆరోగ్యానికి కూడా మంచిదని ఆయన పేర్కొన్నారు. సుప్రీం నిర్దేశంతోనే.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తుది దశలో ఉంది. వచ్చే జనవరి 22న ప్రతిష్ఠాపన జరగనున్న ఈ రామ మందిరం వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ప్రధాన అంశంగా మారింది. దీనిపై ఛత్తీస్‌గఢ్ సీఎం మాట్లాడుతూ “సుప్రీం కోర్టు నిర్దేశంతోనే అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. కానీ బీజేపీ దాని మీద రాజకీయం చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో చాలా చోట్ల మేమూ అనేక రామ మందిరాలు నిర్మించాం. కానీ మేము వాటి పేరు మీద ఓట్లు అడగడం లేదు’ అన్నారు. తెలంగాణలో ప్రచారం మరోవైపు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నానని, ఇందు కోసం రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తానని బఘేల్ తెలియజేశారు. తెలంగాణలో నవంబర్ 30న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. శనివారం రాజస్థాన్‌లో జరిగిన పోలింగ్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదవడం వెనుక అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలు ఉన్నాయన్నారు. కాగా నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు (Chhattisgarh Assembly Elections) పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
Mahadev app case: సీఎం బఘేల్‌కు డబ్బు పంపలేదు
రాయ్‌పూర్: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్‌చేసిన నగదు కొరియర్ ఆసిమ్ దాస్ తాజాగా మాటమార్చాడు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్ల నగదు పంపించారని విచారణలో అతడు అంగీకరించాడని ఈడీ వెల్లడించడం తెల్సిందే. ఆసిమ్ తన లాయర్ షోయబ్ అల్వీ ద్వారా మరో వాంగ్మూలమిస్తూ ఈడీ డైరెక్టర్, ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. ‘‘ఈ కేసులో నన్ను బలిపశువును చేస్తున్నారు. వాస్తవానికి సీఎం బఘేల్సహా ఏ రాజకీయనేతకూ నేను డబ్బులు అందజేయలేదు. ఈడీ అధికారులు ఇంగ్లిష్‌లో ఉన్న వాంగ్మూలంపై బలవంతంగా నా సంతకం చేయించుకున్నారు. నాకు ఇంగ్లిష్ రాదు. ఎవరో వచ్చి డబ్బు సంచులు కారులో పెట్టి వెళ్లిపోయాడు. డబ్బుతో నేను హోటల్రూమ్కి వెళ్లగానే ఈడీ అధికారులొచ్చి అరెస్ట్‌చేశారు. కేసులో నన్ను కావాలనే ఇరికించారని నాకప్పుడు అర్ధమైంది’’ అని దాస్ వివరించారు. -
15 సీట్లు గెలిస్తే చాలు.. సీఎం బఘేల్
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 55 సీట్లు గెలుస్తామని మాజీ సీఎం రమణ్ సింగ్ చేసిన వ్యాఖ్యపై బఘేల్ స్పందిస్తూ.. ఇది ఆయన చేసిన బూటకపు ప్రకటన అని కొట్టిపారేశారు. రమణ్ సింగ్ వ్యాఖ్యలపై బఘెల్ మాట్లాడుతూ ‘రమణ్ సింగ్ ప్రజాదరణ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడే 52 సీట్లను అధిగమించలేదు. ఇప్పుడు 55 సీట్లు గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు? ఆయన ఇదంతా తమ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచడానికే చెబుతున్నాడు. కనీసం 15 సీట్లయినా సాధిస్తారో లేదో ఫలితాలు వచ్చాక అందరికీ తెలిసిపోతుంది’ అన్నారు. నవంబర్ 7న మొదటి దశ ఎన్నికల తర్వాత మాజీ సీఎం రమణ్ సింగ్ రాష్ట్రంలో బీజేపీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మొదటి దశ ఎన్నికలు ముగిశాయి. 20 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈ 20 సీట్లలో బీజేపీ కనీసం 14 స్థానాలను గెలుచుకుంటుంది" అని రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 90 నియోజకవర్గాలు ఉండగా నవంబర్ 7న తొలిదశ, నవంబర్ 17న రెండో దశతో ఎన్నికలు ముగిశాయి. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో డెబ్బై స్థానాలకు నేడు నిర్ణయాత్మక రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందులో కాంగ్రెస్, బీజేపీలతో పాటు అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, మరికొన్ని చిన్న పార్టీలు పోటీలో ఉన్నాయి. గిరిజనులు, వెనకబడిన తరగతులనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్న చిన్నపార్టీలు ఈ సారి కీలకంగా మారనున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. బిలాస్పూర్ ప్రాంతంలో ఈ సారి పోరు హోరాహోరీగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో 25 నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లలో ఇవి దాదాపు మూడో వంతు. 2018 ఎన్నికలలో ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ ఈ సారి ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోవచ్చు. ఇక్కడి ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ కూడా సరైన పనితీరు కనబర్చలేదని నిపుణులు భావిస్తున్నారు. 2018లో ఈ డివిజన్లో కాంగ్రెస్ 12, బీజేపీ ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ రెండు సీట్లు గెలుచుకోగా, అజిత్ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జోగి) మూడు సీట్లు గెలుచుకుంది. 2018 కంటే ఎక్కువగా దాదాపు 75 సీట్లను కాంగ్రెస్ ఈ సారి గెలుస్తుందని భఘేల్ ఇప్పటికే ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరినీ ఆదుకున్నామని తెలిపిన భఘేల్... అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో అందరికీ ప్రయోజనం చేకూరిందని, అవన్నీ ఓట్లుగా మారుతాయని ధీమాతో ఉన్నారు. కానీ సాంప్రదాయంగా కాంగ్రెస్‌కు వచ్చే గిరిజనులు, వెనకబడిన తరగతుల ఓట్లను ఈసారి చిన్న పార్టీలు చీల్చనున్నాయి. ఈ మార్పుతో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు ఈ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయని అంచనాలు చెబుతున్నాయి. 2018లో రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 68 సీట్లతో కాంగ్రెస్ విజయాన్ని కైవసం చేసుకుంది. 2013 జిరామ్ ఘాటి మావోయిస్ట్ దాడి తర్వాత రాష్ట్రంలో పార్టీకి కొత్త ఉత్సాహం తెచ్చిన బఘేల్.. ప్రధాన నేతగా ఎదిగారు. సీఎం కుర్చీ కోసం మరో ముగ్గురు నేతలు పోటీలో ఉన్నా కేంద్ర అధిష్ఠానం ఆయనకే పగ్గాలు అప్పగించింది. ఈసారి, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రధాని మోదీనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రెండింటిలోను వెనుకబడిన తరగతులు, గిరిజనులపై బీజేపీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. గిరిజనుల ఓట్లు సంప్రదాయంగా కాంగ్రెస్‌కే పోయేవి. కానీ ఈసారి ఆ విధానం మారేలా కనిపిస్తోంది. చిన్న పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్-జోగి (JCC), హమర్ రాజ్ పార్టీ, మాజీ కాంగ్రెస్ నాయకుడు అరవింద్ నేతమ్ నేతృత్వంలోని సర్వ్ ఆదివాసీ సమాజ్, ఆప్, ఆయా స్థానాల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన అభ్యర్థులను నిలబెట్టాయి. వారు ఓట్లలో కొంత భాగాన్ని అయినా ప్రభావం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గిరిజనులు, వెనకబడిన వర్గాల ఓట్ల చీలిక ఒకింత బీజేపీకే కలిసి వచ్చేలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్.. లైవ్ అప్డేట్స్ -
‘కాంగ్రెస్ మళ్లీ వస్తే మహిళలకు ఏటా రూ.15 వేలు’
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తాజాగా హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ రెండోదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేశారు. రాష్ట్రంలో గృహిణులైన మహిళందరికీ సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి కౌంటర్‌గా సీఎం భూపేష్ బఘేల్ రూ.15,000 ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో మహిళా సాధికారత కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు రాయ్‌పూర్‌లో విలేకరులతో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మహిళలకు ‘ఛత్తీస్‌గఢ్ గృహలక్ష్మి యోజన’ కింద ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని బఘేల్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 20 స్థానాలకు తొలి దశ పోలింగ్ నవంబర్ 7న ముగిసింది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. -
మహదేవున్నీ వదల్లేదు!
దుర్గ్: దుబాయ్‌కి చెందిన మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌కు ముడుపుల అంశంలో కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సదరు యాప్‌తో తనకున్న సంబంధాలేమిటో బఘేల్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. యాప్ నిర్వాహకుల నుంచి ఆయనకు ఇప్పటిదాకా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందినట్టు ఈడీ శుక్రవారం ప్రకటించడం, అది దేశవ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో శనివారం దుర్గ్ నగరంలో బీజేపీ ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ‘‘దోపిడీకి ఏ ఒక్క అవకాశాన్నీ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు వదల్లేదు. చివరికి మహదేవుని పేరును కూడా వాళ్లు వదిలిపెట్టలేదు. బెట్టింగ్ కంపెనీకి చెందిన భారీ మొత్తాలను రెండు రోజుల క్రితం రాయ్‌పూర్‌లో పట్టుకున్నారు. అదంతా రాష్ట్ర పేదలు, యువత నుంచి దోచిందే. అలాంటి డబ్బుతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందలమెక్కుతున్నారు. పట్టుబడ్డ డబ్బును సీఎం బఘేల్‌కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. దుబాయ్‌లోని యాప్ నిర్వాహకులతో తమకున్న బంధమేమిటో కాంగ్రెస్ ప్రభుత్వం, బఘేల్ బయట పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. ఉచిత రేషన్ మరో ఐదేళ్లు దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్న ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను మరో ఐదేళ్ల పాటు పొడిగించనున్నట్టు మోదీ ప్రకటించారు. దేశంలో అతి పెద్ద కులం పేదరికం మాత్రమేనన్నారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టముండదని ఆరోపించారు. -
80 కోట్లమంది పేదలకు ప్రయోజనం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగించేందుకు బీజేపీ నేతృత్వంలోని రేంద్ర మోదీ సర్కార్ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ అధికారుల అంచన ప్రకారం దాదాపు రూ. 2 లక్షల కోట్ల వ్యయం కానుంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. తద్వారా 80 కోట్లమంది మరో ఐదేళ్లపాటు లబ్ధి పొందుతారని, అన్ని వర్గాలకు ఉచిత బియ్యం అందుతాయని ప్రధాని మోదీ వెల్లడించారు. మరోవైపు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా ‘అక్రమ డబ్బు'ను ఉపయోగిస్తోందంటూ కాంగ్రెస్‌పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ప్రజల్ని దోచుకొనే ఏ అవకాశాన్నీ కాంగ్రెస్ వదిలిపెట్టదు. చివరికి ఆన్లైన్బెట్టింగ్ యాప్ ‘మహదేవ్’ ను కూడా వదల్లేదంటూ ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్రభుత్వంపై ప్రధాని విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నిందితులందరిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం.. ప్రతి పైసా వారి నుంచి తీసుకుంటాం వారి జైలుకు పంపిస్తామన్నారు. కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీని గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. (షాకింగ్ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి) కాగా 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలోపేద ప్రజలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(PMGKAY)ను పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం లబ్దిదారులందరికీ, నెలకు ఉచితంగా ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాలను అందిస్తోంది. దీన్ని జూలై 2013లో తీసుకొచ్చిన ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ (ఆహార భద్రత స్కీమ్) NFSAతో విలీనం చేసింది. ఈ పథకానికి అయ్యే ఖర్చును రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే అందిస్తోంది. దీని ద్వారా 81.35 కోట్ల మందికి ఉచిత రేషన్ అందుతోంది. (కూరగాయల వ్యాపారి రూ.21 కోట్ల స్కాం: మాస్టర్ మైండ్ కోసం వేట) ఇటీవల, ఆహార మంత్రి, పీయూష్ గోయల్, PMGKAY కింద, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు (ఫేజ్ I నుండి ఫేజ్ VII వరకు మొత్తం) దాదాపు 1,118 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ప్రభుత్వం కేటాయించిందని పార్లమెంటుకు తెలియజేశారు. దీనికి సంబంధించి మొత్తం మంజూరైన బడ్జెట్ దాదాపు రూ. 3.91 లక్షల కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న, రెండో విడతలో మిగతా 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. (డేంజర్ బెల్స్ : టెక్ కంపెనీల కీలక చర్యలు) -
మహదేవ్ ప్రమోటర్ల నుంచి ఛత్తీస్‌గఢ్ సీఎంకి రూ.508 కోట్లు.. ఈడీ సంచలన ఆరోపణలు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో నాయకులు ప్రచారంలో దూసుకున్నారు. దీంతో చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వాడీవేడిగా మారింది తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి సీఎం భూపేష్ బఘేల్ రూ. 508 కోట్లు స్వీకరించినట్లు ఈడీ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహదేవ్ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్‌లో భారీ మొత్తంలో నగదు చెలామణి అవుతున్నట్లు తమకు గురువారం సమాచారం అందిందని ఈడీ అధికారులు తెలిపారు ఈ మేరకు హోటల్ ట్రిటన్లతోపాటు భిలాయ్‌లోని మరోచోట ఈడీ సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఖర్చు కోసం యూఏఈ నుంచి నగదు తీసుకొస్తున్న అసిమ్ దామ్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు ఈడీ తెలిపింది. ఆయన కారు, నివాసంపై సోదాలు జరపగా.. రూ.5.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. అయితే ఆ డబ్బును రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెట్టేందుకు మహదేవ్ యాప్ ప్రమోటర్లు బఘేల్‌కు డెలివరి చేసేందుకు ఉద్ధేశించినట్లు నగదుతో పట్టుబడిన వ్యక్తి తమకు తెలిపినట్లు ఈడీ వెల్లడించింది. అంతేగాక మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్‌కు రూ. 508 కోట్లు చెల్లింపులు చేసినట్లు చెప్పారని పేర్కొంది. కాగా చత్తీస్‌గఢ్‌లో తొలి దశ ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వహకులు విదేశాల్లో ఉంటూ, ఛత్తీస్‌గఢ్‌లోని తన సన్నిహితులతో బెట్టింగ్ సిండికేట్ నడుపుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసింది. ఇప్పటివరకు రూ. 450 కోట్లకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకుంది. మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసులో ఈడీ ఇటీవలే తొలి ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఇందులో యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ సహా 14 మంది నిందితులుగా ఉన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా
ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు భూపేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీలో అంతర్గత కలహాలు, భూపేష్‌కు ప్రత్యామ్నాయంగా పార్టీ నాయకుడిని తెరమీదకు తేవడంలో కేంద్ర బీజేపీ విఫలమవడంతోపాటు రాష్ట్ర పార్టీపై అధిష్టానానికి పట్టు సడలడం వంటి కారణాలతో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఆశలు అడియాశలవుతున్నాయి. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ రెండిరతలు స్థానాలు అధికంగా సాధించవచ్చు. ఛత్తీస్‌గఢ్‌లో పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ`పోల్ సర్వేలో కాంగ్రెస్ 55 నుంచి 60, బీజేపీ 29 నుంచి`34, బీఎస్పీ, ఇండిపెండెంట్లు రెండు స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని తేలింది. 90 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ 46. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్నా కాంగ్రెస్ సొంతంగా మెజార్టీ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలే కాకుండా గోండ్వాన్ గణతంత్ర పరిషత్, సర్వ్ ఆదివాసీ సమాజ్ మద్దతిస్తున్న హమారా రాజ్ పార్టీ, ఛత్తీస్‌గఢ్ క్రాంతి సేనా పార్టీలు కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అయితే వాటి ప్రభావం తక్కువగానే ఉంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి స్థాపించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జోగీ) పార్టీ బీఎస్పీతో కలిసి 2018 ఎన్నికల్లో పోటీ చేయగా, ఆ కూటమి 7 స్థానాలు (జేసీసీ 5, బీఎస్పీ 2) పొందింది. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ 0 ` 2 సీట్లు పొందవచ్చు. జేసీసీ, ఆప్ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశాలు లేవు. 2018లో 43% ఓట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి 47%, 33% ఓట్లు పొందిన బీజేపీ ఈసారి 42% పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. బీజేపీ 2018 కంటే 9% ఓట్లు అధికంగా పొందనుంది. ఏ సర్వేలో అయినా మూడు శాతం మార్జిన్ వ్యత్యాసం ఉండే అవకాశాలుంటాయనేది ఇక్కడ గమనార్హం.పీపుల్స్ పల్స్ బృందం జూన్ 2023లో రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో వెలువడిన ప్రభుత్వ అనుకూలత ఫలితాలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక సమీకరణాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం, పార్టీ పనితీరు మొదలైన అంశాలలో కాంగ్రెస్ ఇతర పార్టీల కంటే ముందంజలో ఉండడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సరైన పాత్ర పోషించడంలో విఫలం చెందిందని సర్వేలో స్పష్టమైంది. భౌగోళికంగా ఛత్తీస్‌గఢ్ ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలుగా ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ను సర్గుజ డివిజన్‌గా కూడా పిలుస్తారు. బార్లాపూర్, సూరజ్‌పూర్, మానేంద్రఘర్`చిర్మిరి`భరత్పూర్, కోరియా, కోర్బా, రాయగఢ్, సర్గుజ్ జిల్లాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ డివిజన్లో ఎస్టీ, ఓబీసీ ఓటర్లు అధికం. ఎస్టీలలో కాన్వర్, ఖైర్వార్, కోర్బా, గోండ్, ఓరాన్, ఓబీసీలలో సాహు, రౌత్, రాజ్వాడే, ఎస్సీలలో హరిజనులు ఈ ప్రాంతంలో కీలకం. ఇక్కడ 23 స్థానాలుండగా 2018లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి సింగ్‌డియో, రాష్ట్ర మంత్రి జైసింగ్ అగర్వాల్, బీజేపీ ఎంపీలు రామ్‌విచార్ నేతం, గోమతి సాయి, రేణుకా సింగ్ ఇక్కడ ప్రముఖ నేతలు. 2018లో సింగ్‌డియో కాబోయే సీఎం అనే ప్రచారంతో కాంగ్రెస్ ఇక్కడ మెరుగైన ఫలితాలు పొందింది.ఇక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే సింగ్‌డియో ప్రభావం తగ్గింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ తిరస్కరించడం కాంగ్రెస్‌కు ఇబ్బందులు కలిగిస్తోంది. మరోవైపు బీజేపీ రేణుకా సింగ్, గోమతి సాయి, రామ్‌విచార్ నేతం ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపడం వల్ల రాబోయే ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి. సుర్గుజ్లోని 14 స్థానాల్లో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా పొందని బీజేపీ ఈ ఎన్నికల్లో 4 నుండి 7 సీట్లు పొందే అవకాశాలున్నాయి. మధ్య ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో రాయ్‌పూర్, బిలాస్పూర్, దుర్గ్ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాలున్నాయి. ఈ డివిజన్లో అధిక జనాభాతో 55 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఎస్టీలలో గోండ్లు, కాన్వర్, ఓబీసీలో కుర్మి, మారర్, కాలర్, సాహు, దేవాంగన్, యాదవ్, ఎస్సీలలో సాత్నామి, హరిజనులు ప్రధానంగా ఉన్నారు. సింధి, రాజ్‌పుత్, పంజాబీ, బ్రాహ్మిణ్, ముస్లిం ఓటర్ల ప్రభావం కూడా ఉంది. ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ సావో వంటి ప్రధాన నేతలు ఈ ప్రాంతానికి చెందిన వారే. ఇక్కడ 2018లో విఫలమైన బీజేపీ ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. జేసీసీ బలహీనపడడంతో ఆ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రభుత్వ వ్యవసాయ అనుకూల నిర్ణయాలు కాంగ్రెస్‌కు లబ్ది చేకూర్చవచ్చు. పనితీరు సరిగ్గాలేని ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. ఈ ప్రాంతంలోని ముంగేలి, బాలోడా బజార్, జాంగీర్ చాంపా జిల్లాల్లో బీజేపీకి, మిగతా జిల్లాలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. బీఎస్పీకి ఇక్కడ ఒక స్థానం రావచ్చని సర్వేలో వెల్లడయ్యింది. ఎస్టీ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతాన్ని బస్తర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 12 స్థానాల్లో 11 ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నాయి. ఇక్కడ ఒక్క జగదల్పూర్ మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉంది. బస్తర్, దంతేవాడ, సుక్మ, కాన్కేర్, కోండాగావ్ జిల్లాలున్నాయి. ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. గతంలో ఇది బీజేపీకి పట్టున్న ప్రాంతం. అయితే 2018లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోస్థానం గెలిచి మొత్తం 12 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఎస్టీలలో గోండ్, మారియా`మురియా, భాత్ర హల్బీట్ సామాజిక వర్గాల ప్రభావం ఉంది. ఇక్కడ ఓబీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రభావం తక్కువ. కాంగ్రెస్ నుండి ఎక్సైజ్ మంత్రి కవాసీ లాక్మా, డిప్యూటీ స్పీకర్ సంత్రామ్ నేతం, పీసీసీ అధ్యక్షులు మోహన్ మార్కమ్, లాకేశ్వర్ భాగేల్, ఎంపీ దిపాక్ బాయిక్, బీజేపీ నుండి కేదర్ కష్యప్, మాజీ మంత్రి లతా ఉసేంది, మా జీ ఎంపీ దినేష్ కష్యప్ ఈ ప్రాంత ప్రముఖ నేతలు. సుక్మా జిల్లాలో సీపీఐ ప్రభావం కొంత ఉంది. సర్వ్ ఆదివాసీ సమాజ్ ప్రభావం కూడా ఈ ప్రాంతంలో కనపడుతోంది. ఈ ప్రాంతంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే కాంగ్రెస్ గతంలో కంటే కొన్ని స్థానాలు కోల్పోయినా అధిక స్థానాలు మాత్రం పొందవచ్చు. పంటలకు మద్దతు ధర, పేదలకు పట్టా భూముల పంపిణీ కాంగ్రెస్‌కు లబ్ది చేకూరుస్తున్నాయి.2018లో ఒక్క సీటు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 3 నుండి 4 స్థానాలు పొందే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. వివిధ సామాజిక వర్గాల ప్రభావం రాయ్‌పూర్, బిలాస్పూర్, జగదల్పూర్, అంబిక్‌పూర్, కోబ్రా, రాయిగఢ్ మొదలగు నగరాల్లో రాజపూత్, బ్రాహ్మిణ్, సింధీ, పంజాబీ, మార్వాడీ, బనియా సామాజిక వర్గాల ప్రభావం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓడియా, బెంగాలీల ప్రభావం కూడా ఉంది. ఈ సామాజిక వర్గాలలో బీజేపీ పట్ల కొంత మొగ్గు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీల ఓటింగ్ బ్యాంక్ అధికం. ఓబీసీలలో అధికంగా ఉండే సాహు సామాజిక వర్గం బీజేపీ పట్ల కొంత మొగ్గు చూపిస్తోంది. ఓబీసీలో రెండో పెద్ద సామాజికవర్గం కుర్మీలది. వీరు సెంట్రల్ రీజియన్‌లో అధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భూపేష్ కుర్మీ కావడంతో వీరు కాంగ్రెస్ వైపు ఉన్నారు. చేనేతకు చెందిన పానికాస్ వర్గం కాంగ్రెస్ వైపు ఉంది. చిన్న తరహా సాగు చేసుకునే అఘరియా వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. వ్యవసాయ రంగానికి చెందిన మారర్ సామాజిక వర్గం కాంగ్రెస్ పట్ల అనుకూలంగా ఉంది. సెంట్రల్ ప్రాంతంలో అధికంగా ఉండే కాలర్ సామాజిక వర్గం బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోయింది. దేవాంగన్ సామాజిక వర్గంతోపాటు మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ప్రాబల్యం ఉన్న యాదవ్ సామాజిక వర్గం కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది. ఎస్సీలు ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఎస్సీల్లో అధికంగా ఉన్న సాతనమీ, హరిజన, మహార్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఎస్టీల ప్రభావం ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఉంది. ఎస్టీల్లో అధికంగా ఉండే గోండులు కాంగ్రెస్, బీజేపీ, సర్వ్ ఆదివాసీ పార్టీల మధ్య చీలిపోయారు. ఎస్టీలలో రెండో పెద్ద సామాజిక వర్గమైన కన్వార్ బీజేపీకి, ఉత్తర ప్రాంతంలో ఉన్న ఖైర్వార్, ఓరాన్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. పహాడి కోబ్ర సామాజిక వర్గం బీజేపీకి, హల్బా సామాజిక వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. మరియా`మురియా, భాట్రా సామాజిక వర్గాలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలి ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో రెండు శాతానికి పైగా ఉన్న ముస్లింలు, దాదాపు రెండు శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యమంత్రికి ప్రజాదరణ ముఖ్యమంత్రి భూపేష్ సంతృప్తికరమైన పనితీరుతోపాటు ఛత్తీస్‌గఢ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో జనాకర్షణ నేతగా ఎదిగారు. కోవిడ్ సమయంలో మినహాయించి మిగతా కాలంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. మరోవైపు పార్టీలో ఆయన ప్రత్యర్థి సింగ్‌డియో సొంత ప్రాంతంలోనే బలహీనపడడం కూడా భూపేష్‌కు కలిసివస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు సరితూగే మరో నాయకులు ఎవరూ లేరని పీపుల్స్ పల్స్ సర్వేలో ప్రజలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి భూపేశ్‌కు పోటీగా బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారా అని పీపుల్స్‌పల్స్ ప్రజలను ప్రశ్నించగా స్పందనే రాలేదు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్‌సింగ్‌ను భూపేష్‌కు సరైన ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించకపోవడం గమనార్హం. ఎన్నికల్లో ప్రభావిత అంశాలు 2018లో రైతులకు రుణమాఫీతో పాటు ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ఇచ్చిన హామీని భూపేష్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. వరికి మద్దతు ధరను క్వింటాల్‌కు 3200 రూపాయలుగా ప్రకటించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనపై వస్తున్న విమర్శలకు దీటుగా 7 లక్షల ఉచిత గృహ నిర్మాణాలు చేపడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ, శ్రామికుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం ఇచ్చే 7000 రూపాయలను 10000కు పెంచుతామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆత్మానంద్ స్కూల్స్ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలను ఈ స్థాయికి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ పథకాలు, వరాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనున్నాయని సర్వేలో వెల్లడైంది. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన కింద చేపట్టిన పనులకు సంబంధించి కేంద్రం నిధులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయనే ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నాయి. దీనిపై బీజేపీ ‘మోర్ ఆవాజ్ మోర్ అధికార్’ పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టి 2023 మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిరచింది. బీజేపీ పరివర్తన యాత్రలో, ఎన్నికల ప్రచారంలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. మైనింగ్ రంగంలో, పీఎస్సీ నియామకాల్లో, మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిరదని ఆరోపిస్తూ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, జేసీసీ పార్టీలు వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లను నిరాకరించింది. దీంతో ఈ పార్టీలకు రెబల్ అభ్యర్థుల బెడద తప్పలేదు. బస్తర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో క్రిస్టియన్ మిషనరీలు డబ్బు ప్రలోభాలతో గిరిజనులలో మత మార్పిడిని ప్రోత్సాహిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ పరిణామాలు బీజేపీని సమర్థించే గిరిజనులు, క్రిస్టియన్లుగా మారిన గిరిజనుల మధ్య ఘర్షణలకు దారితీశాయి. బీమేతెరా, కావార్థా జిల్లాల్లో కూడా హిందూ ముస్లిం మతకలహాలు జరిగాయి. కావార్దాలో బజరంగ్ దళ్ నేత విజయ్ శర్మకు, సాజాలో ఈశ్వర్‌సాహు (మతకలహాలలో మృతి చెందిన సాహు తండ్రి)కు బీజేపీ అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. ఈ ప్రభావం అరడజను స్థానాలకు మించి ఉండక పోవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పీపుల్స్‌పల్ సంస్థ ఛత్తీస్‌గఢ్‌లో 2023 అక్టోబర్ 15 నుండి 31వ తేదీ వరకు మొత్తం 90 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసుకొని, ఓటర్లను కలుసుకొని ప్రతి పోలింగ్ స్టేషన్ నుండి 15`20 శాంపిల్స్‌ను శాస్త్రీయ పద్ధతిలో సేకరించింది. కులం, ప్రాంతం, స్త్రీలు, పురుషులు, అన్ని వయసుల వారికి సమప్రాధాన్యతిస్తూ మొత్తం 6120 శాంపిల్స్ సేకరించి సర్వే నిర్వహించింది. పీపుల్స్ పల్స్ సర్వేలో డేటా విశ్లేషణకు ‘పొలిటికోస్’ బృందం సహాయసహకారాలు అందించింది. ఈ సర్వే నిర్వహించిన సమయానికి ప్రధాన పార్టీలు 90 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినా రెండో దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడంతోపాటు బీజేపీ నుండి సరైన ప్రత్యామ్నాయ నేతలు కూడా లేకపోవడంతో రాబోయే ఎన్నికల్లో మరోమారు విజయఢంకా మోగించి కాంగ్రెస్ అధికారం నిలుపుకునే అవకశాలు ఉన్నాయని పీపుల్స్‌పల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. -
ఛత్తీస్‌గడ్‌లో హోరాహోరీ పోరు
దేశంలో కొద్ది రోజుల్లో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, భూపేష్ బఘెల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ తన ఎంపీలను, కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి భూపేష్ బఘెల్ పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ దుర్గ్‌లో ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ దుర్గ్ కోటను ఛేదించడం అంత సులువు కాదని, ఇది ఎప్పటికీ కాంగ్రెస్‌కు కంచుకోట అని అన్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ రాయ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలు బీజేపీ మద్దతు పలకాలని కోరారు. కాగా ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 7, 17 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు? -
నోరు జారిన రాహుల్.. బీజేపీ సెటైర్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నోరు జారారు. అదానీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కి సూచించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు కురిపించింది. అదాని వంటి పారిశ్రామిక వేత్తల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీనే అని చివరకు రాహుల్ గాంధీయే ఒప్పుకున్నారని బీజేపీ మండిపడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. బీజేపీ ధనవంతులకు సేవ చేస్తోందని ఆరోపించారు. అదానీ గ్రూపును ప్రస్తావిస్తూ కేంద్రం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పనిచేస్తోందని అన్నారు. అదే క్రమంలో అదానీ కోసం పనిచేయాలని భూపేష్ భగేల్‌కు కూడా సూచించారు. "బీజేపీ అదానీ ప్రయోజనాల కోసం 24X7 సేవ చేస్తోంది. బీజేపీతో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కూడా అదానీ వంటి వారి కోసం పనిచేస్తున్నారు. కానీ మేము రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల కోసం పని చేస్తున్నాము. ఇదే తేడా" అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ ప్రసంగం సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో సీఎం పదవిలో ఉన్న భూపేష్ బఘేల్ కూడా అక్కడే ఉన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు ఆయన ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. అటు.. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ అందిపుచ్చుకుంది. ఛత్తీస్‌గఢ్ సీఎం అదానీ గ్రూప్ కోసం పనిచేస్తున్నట్లు రాహుల్ గాంధీ ఒప్పుకున్నారని బీజేపీ ఐటీ సెల్ నాయకుడు అమిత్ మాలవీయ అన్నారు. ఇదీ చదవండి: కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు -
అరచేతిలో బొంగరం తిప్పిన ఛత్తీస్‌గఢ్ సీఎం: ప్రత్యర్థులకు సవాలేనా?
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ప్రత్యేకతే వేరు. ప్రత్యర్థులను తనదైన పంచ్‌లతో తిప్పి కొట్టడం ఈ కాంగ్రెస్ సీనియర్‌నేతకు బాగా అలవాటు. దీపావళి సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం కొరడా దెబ్బలు తిన్నా, ఇటీవల కీలక సమావేశంలో కాండ్రీ క్రష్ ఆడినా ఆయనకే చెల్లు. తాజాగా బొంగరం తిప్పుతూ వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో నెటిజన్లును ఆకట్టుకుంటోంది. దీంతో బొంగరం తిప్పినంత ఈజీగా ఈ సారి కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్ దేశాయ్ దీనికి సంబంధించిన ఒక వీడియోను ఎక్స్( ట్విటర్)లో షేర్ చేశారు. అలా విసిరి.. ఇలా అలవోకగా అరచేతిలో బొంగరం తిప్పుతూ ప్రత్యర్థులకు పరోక్షంగా సవాల్ విసురుతున్నట్టే కనిపించారు. దీంతో ‘వారెవ్వా.. లట్టూ మాస్టర్... డౌన్ టూ ఎర్త్ పోలిటీషియన్’ అంటూ సీఎంను రాజ్‌దీప్ అభివర్ణించారు. కాగా 2023 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా తన సత్తా చాటుకునేందుకు భూపేష్ భగెల్ సర్వ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రైతులే నిర్ణయాత్మక అంశం అని, వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలు తమకు విజయాన్ని అందిస్తాయనే విశ్వాసాన్ని ప్రకటించారు. అధికార కాంగ్రెస్ 90లో 75 ప్లస్ సీట్లు గెలుచు కుంటుందనే ధీమా వ్యక్తం చేశారు భూపేష్ బఘేల్. సీఎం పటాన్ నుంచి, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవో అంబికాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. అటు రాష్ట్ర అసెంబ్లీ పోల్స్ కి సంబంధించి మొత్తం 90 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. ఆ క్రమంలో నలుగురు అభ్యర్థులతో కూడిన చివరి జాబితాను బీజేపీ బుధవారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. A chief minister who is a master of the ‘lattoo’. Chattisgarh CM @bhupeshbaghel is hoping to spin a top around his opponents.. comes across as a down to earth politician. #ElectionsOnMyPlate is back with a new season from next week. We start with the battle for Chattisgarh. 👍 pic.twitter.com/jL5VpanSMB — Rajdeep Sardesai (@sardesairajdeep) October 26, 2023 -
ఛత్తీస్‌గఢ్‌లో హోరాహోరీ పోరు
ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మళ్లీ నెగ్గాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు ఉన్న జనాదరణే తమ పార్టీని మళ్లీ గెలిపిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కంచుకోట ఛత్తీస్‌గఢ్ తమ చేజారిపోయే ప్రసక్తే లేదని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అధికార పీఠం దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. భూపేశ్ బఘేల్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారంతా తమనే ఆదరిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆమ్ ఆద్మీ పారీ్టతో సహా ఇతర చిన్నాచితక పార్టీలు సైతం అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. కొన్ని సీట్లయినా గెలుచుకొని కింగ్‌మేకర్ కావాలని చిన్న పార్టీలు ఆరాటపడుతున్నాయి. కాంగ్రెస్ అవినీతే బీజేపీ అస్త్రం చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2018లో అధికారం లభించింది. విపక్ష బీజేపీ మొదట్లో బలహీనంగా ఉన్నట్లు కనిపించినా ఎన్నికలు సమీపించేకొద్దీ బలం పుంజుకుంటోంది. అధికార కాంగ్రెస్‌కు సవాలు విసురుతోంది. ప్రభుత్వ పథకాల అమల్లో అవినీతి, కుంభకోణాలు, బుజ్జగింపు రాజకీయాలు, మత మారి్పడులను ప్రధానంగా తెరపైకి తీసుకొస్తూ బఘేల్ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఏడాది క్రితం వరకూ బల్లగుద్ది మరీ చెప్పిన విశ్లేషకులు ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నారు. బీజేపీకి విజయావకాశాలు మెరుగయ్యాయని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార వ్యూహం మార్చారు. కాంగ్రెస్ అవినీతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందంటూ ప్రజలకు తెలియజేస్తున్నారు. మోదీకి లభిస్తున్న జనాదరణ ఎన్నికల్లో ఓట్లుగా మారి తమకు లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. చదవండి: శరద్ పవార్‌పై అసోం సీఎం వ్యంగ్యాస్త్రాలు మోదీ, షా మంత్రాంగం ఛత్తీస్‌గఢ్‌పై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. మోదీ గత మూడు నెలల్లో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా తరచుగా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న అవినీతిని ఎండగడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే బఘేల్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించి, గెలుపు దిశగా నడిపించడానికి మోదీ, షా ప్రాధాన్యం ఇస్తున్నారు. జనాభాలో 32 శాతం గిరిజనులే రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచి, అసెంబ్లీలో అడుగు పెడతామని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీలో తమ ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల్లో సర్వ ఆదివాసీ పార్టీ, గోండ్వానా గణతంత్ర పార్టీ కూడా పోటీ పడుతున్నాయి. రాష్ట్ర జనాభాలో 32 శాత మంది గిరిజనులు ఉన్నారు. వారి ఓట్లపై అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు గాను 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 68 సీట్లు గెలుచుకొని జయకేతనం ఎగురవేసింది. బీజేపీకి కేవలం 15 సీట్లు లభించాయి. మాజీ సీఎం అజిత్ జోగీ స్థాపించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే)కు ఐదు సీట్లు దక్కాయి. బీఎస్పీ రెండు స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఎన్నికల్లో 75 సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల రాయ్‌పూర్: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో బరిలో దిగనున్న తమ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదలచేసింది. ఆదివారం 30 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించగా బుధవారం 53 స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదలచేసింది. భత్గావ్ నుంచి పరాస్నాథ్ రాజ్వాడే, కట్ఘోరా నుంచి పురుషోత్తం కన్వర్, బెల్తారా నుంచి విజయ్ కేసర్వాణి, అకల్తారా నియోజకవర్గం నుంచి రాఘవేంద్ర సింగ్, బిల్హా నుంచి సియారామ్ కౌశిక్ బరిలో నిలుస్తున్నారు. 14 ఎస్టీ, ఆరు ఎస్సీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం విడుదలైన అభ్యర్థుల జాబితా ప్రకారం ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్.. పటాన్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న తొలి దఫా, నవంబర్ 17న రెండో దఫాలో పోలింగ్ ఉంటుంది. -
కాంగ్రెస్ కీలక సమావేశం.. క్యాండీ క్రష్ ఆడుతూ ఛత్తీస్‌గఢ్ సీఎం
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో తలమునకలైంది. దీనికి సంబంధించి రాయపూర్‌లో అతి ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ క్యాండీక్రష్ ఆడడం రాజకీయంగా మాటల యుద్ధానికి దారి తీసింది. రాయపూర్‌లో మంగళవారం రాత్రి అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో సీఎం బఘేల్ తన ఫోన్లో క్యాండీక్రష్ ఆడుతూ కనిపించారు. ఈ ఫొటోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ‘‘అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతూ ఉంటే సీఎం హాయిగా క్యాండీక్రష్ ఆడుతూ రిలాక్సవుతున్నారు. బహుశా కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవదని ఆయనకూ తెలిసి ఉంటుంది’’ అని మాలవీయ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. వీటిని బఘేల్ తిప్పికొడుతూ గతంలో తాను ఛత్తీస్‌గఢ్ సంప్రదాయ క్రీడలు గిల్లీ దందా, భవురా ఆడినప్పుడు కూడా బీజేపీ విమర్శలు చేసిందని గుర్తు చేశారు. ‘‘ఛత్తీస్‌గఢ్ సంప్రదాయ క్రీడలు ఎంత ఇష్టంగా ఆడతానో క్యాండీక్రష్ అంతే ఇష్టంగా ఆడతాను. క్యాండీక్రష్‌లో చాలా లెవల్స్ పూర్తయ్యాయి. ఇంకా ఆటని కొనసాగిస్తూ లెవల్స్ అన్నీ దాటతాను. ఎవరు అధికారంలోకి వస్తారో రారో ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు’’ అని ఎదురుదాడి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
ప్రధానిపై ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్ నేత
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ మాయకత్వంలో ఛత్తీస్‌గఢ్ చాలా అభివృద్ధి చెందిందని భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకముందని అన్నారు. మాకు చాలా ఇచ్చారు.. ఛత్తీస్‌గఢ్‌లోని తొమ్మిది జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం లక్ష మందికి సికిల్ సెల్ వ్యాధి కౌన్సెలింగ్ కార్డులను అందజేశారు. ఈ సందర్బంగా ఛత్తీస్గఢ్లోఅనేక మేజర్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ ప్రధానిని స్వాగతిస్తూ.. మీరు మాకేదో ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌కు చాలా ఇచ్చారు. భవిష్యతులో కూడా మాకు చాలా ఇస్తారని విశ్వసిస్తున్నాను అన్నారు. కేంద్రంలోని మీ నాయకత్వంలో మేమంతా పనిచేశాము. ఇంతవరకు కేంద్రాన్ని ఎలాంటి సాయం అడిగినా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరించి రాష్ట్రానికి చాలా చేశారన్నారు. మా రాష్ట్రం కేంద్రం సహాయంతో అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకెళుతుందని ఆశిస్తున్నానన్నారు. Chattisgarh Deputy CM TS Singh Deo praises PM Modi for always supporting Chattisgarh Govt pic.twitter.com/QuavHjfgQD — DR.TEENA KAPOOR SHARMA (@Teenasharma_77) September 15, 2023 ఈ రాష్ట్రం పవర్‌హౌస్.. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో పవర్‌హౌస్ లాంటిదని ఇలాంటి పవర్‌హౌస్‌లు తమ శక్తి సామర్ధ్యాల మేరకు పనిచేస్తేనే దేశం కూడా అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేయనున్నామని అందులో భాగంగానే ఈరోజు కొన్నిటికి శంకుస్థాపన చేశామని అన్నారు. ఈ సంఫర్బంగా జులైలో రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్, అలాగే రాయ్‌పూర్-ధన్‌బాద్ ఎకనామిక్ కారిడార్ శంకుస్థాపన కోసం వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. छत्तीसगढ़ देश के लिए पावर हाउस की तरह है, आज दुनिया भारत से सीखने की बात कर रही है! - प्रधानमंत्री श्री @narendramodi जी #विजय_शंखनाद_रैली pic.twitter.com/8BbzdKXz5u — BJP Chhattisgarh (@BJP4CGState) September 14, 2023 అదీ అసలు కారణం.. ఛత్తీస్‌గఢ్‌లో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూకుడును పెంచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం రేసులో ఉన్న టీస్ సింగ్ దేవ్‌ను కాదని భూపేష్ బాఘేల్‌ను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటి నుంచి టీఎస్ సింగ్ దేవ్ స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారు. అసలే త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి వైఖరి కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇది కూడా చదవండి: ప్రధానికి కేజ్రీవాల్ సవాల్.. ధైర్యముంటే పేరు మార్చండి.. -
వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా
నయా రాయపూర్: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్ర మంత్రి అమిత్ షా పేరుతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతిని లక్ష్యం చేసుకుని 'ఆరోప్ పత్ర' పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతిని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడుతోందని గాంధీ కుటుంబానికి ఏటీఎంలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మొత్తం అవినీతి రికార్డులన్నిటినీ బద్దలు కొట్టేసిందని ఏకరువు పెట్టారు. అదొక్కటే మార్గం.. అమిత్ షా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులను నిరోధించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. బొగ్గు, మద్యం, ఆన్లైన్ బెట్టింగులతో రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని కుంభకోణాలు, దౌర్జన్యాలు, పెట్రేగిపోతున్నాయని ఇక్కడ పరిస్థితి బాగుపడాలంటే అది ఒక్క బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని అన్నారు. డిసైడ్ చేసుకుని వార్ వన్‌సైడ్ చేయండి.. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా జరిగిన కుంభకోణాల ప్రస్తావన తీసుసుకొస్తూ ఛత్తీస్‌గఢ్ యువతను ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసలుగా చేసే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా లేక వారిని బంగారు భవిష్యత్తు వైపుకు నడిపించే బీజేపీ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని.. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో.. అభివృద్ధికి బాటలు వేసే బీజేపీ ప్రభుత్వం కావాలో ఆలోచించుకొమ్మని.. గిరిజన సంస్కృతిని కాపాడే బీజేపీ కావాలో, మతమార్పుడులతో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే కాంగ్రెస్ కావాలో ఛత్తీస్‌గఢ్ ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. వారిని వదిలిపెట్టం.. ఛత్తీస్‌గఢ్‌లో బాఘేల్ ప్రభుత్వం మొత్తం అవినీతి రికార్డులన్నిటినీ బద్దలుకొట్టేసిందని బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడ్డ పార్టీ ఒక్కరినీ తలకిందులుగా వేలాడదీసి గాడిలో పెడతామని అన్నారు. కేంద్రంలోనూ ఇక్కడా బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే కేవలం రెండేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని అన్నారు. ఇది కూడా చదవండి: 'ఇండియా' కూటమి తర్వాతి ప్రణాళిక అదుర్స్!! -
ఛత్తీస్‌గఢ్‌లో రెండోసారి కూడా కాంగ్రెస్సేనా?.. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది?
డిసెంబర్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్ మూడ్ సర్వే’లో వెల్లడయ్యింది. జూన్ మాసంలో సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 53 నుండి 60, బీజేపీకి 20 నుండి 27 స్థానాలు, బీఎస్పీ, ఇండిపెండెంట్, ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక్కొక్క స్థానం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46 స్థానాలు. అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ మార్కును కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా పొందే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌పల్స్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడయ్యింది. వెనుకంజలో ఏ పార్టీ? 2018 ఎన్నికల్లో 43.03 ఓట్లు పొందిన కాంగ్రెస్ 2.96 శాతం అధిక ఓట్లతో 46 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో తేలింది. 2018 ఎన్నికల్లో 33 శాతం ఓట్లు పొందిన బీజేపీ 5 శాతం అధిక ఓట్లతో 38 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో వెల్లడయ్యింది. 2018లో కాంగ్రెస్ కంటే బీజేపీకి 10 శాతం ఓట్లు తక్కువరాగా ఇప్పుడు రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 8 శాతం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలు గెల్చుకున్న బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకంజలో ఉందని సర్వేలో తేలింది. చదవండి: పెన్‌డ్రైవ్ బయటికొస్తే సీఎం రాజీనామా: కుమారస్వామి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగడానికి కారణం ఇదేనా? కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉండడమే. బీజేపీ జాతీయత, హిందుత్వ అంశాలకు ప్రత్యామ్నాయంగా సీఎం భూపేష్ ఛత్తీస్‌గఢ్ ఆత్మ గౌరవం అంశంలో భాగంగా ‘ఛత్తీస్‌గఢ్ మాతారి’, ‘గదో నవా ఛత్తీస్‌గఢ్’ వంటి నినాదాలకు ప్రజలు ఆకర్షితులయ్యినట్లు పీపుల్‌పల్స్ సర్వేలో వెల్లడయ్యింది. ప్రభుత్వం స్థానిక పండుగలకు గుర్తింపు ఇచ్చి సెలవులు ప్రకటించడం, ఛత్తీస్‌గఢ్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం, రాష్ట్ర గీతం ‘‘అర్ప`పైరి కి ధర్’’ ప్రవేశపెట్టడం వంటి సెంటిమెంట్ అంశాలు కాంగ్రెస్ విజయానికి తోడ్పడుతున్నాయి. ‘‘రామవంగమన్ పాత్’ పేరిట శ్రీరాముడు వనవాసం చేసిన రాష్ట్ర పరిధిలోని 75 స్థానాలను గుర్తించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడం, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ‘‘బెన్ ములాఖత్’’ పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ విజయానికి తోడ్పడుతున్నాయి. ‘‘కహో దిల్ సే, కాంగ్రెస్ ఫిర్ సే’’, ‘భూపేష్ హై తో, భరోసా హై’’ వంటి నినాదాలు ప్రజలకు చేరువవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి ఏ పార్టీ కృషి చేస్తుందని ఓటర్లను పీపుల్స్ పల్స్ అడగగా కాంగ్రెస్ అని 48%, బీజేపీ అని 40%, జేసీసీ అని ఒక శాతం, బీఎస్పీ అని ఒక శాతం, ఎవరూ కారని 10% మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు మరోసారి అవకాశమిస్తారా అని సర్వేలో ఓటర్లను అడగగా అవకాశం ఇస్తామని 47%, ఇవ్వమని 40%, ఏమీ చెప్పలేమని 13% మంది తెలిపారు. సీఎం పనితీరు ఎలా ఉంది? బీజేపీకి మూడు మార్లు అవకాశమిచ్చినట్టే కాంగ్రెస్‌కు కూడా మరోసారి అవకాశమిద్దామనే అభిప్రాయాన్ని ఓటర్లు వెల్లడిరచారు. ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉందని ఓటర్లను ప్రశ్నించగా బాగుందని 45%, పర్వాలేదని 15%, బాగోలేదని 30%, ఏమీ చెప్పలేమని 10% మంది అభిప్రాయపడ్డారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఓటర్లను సర్వేలో ప్రశ్నించగా 20% సంతృప్తిగా ఉన్నట్టు, 31% పాక్షింగా సంతృప్తిగా ఉన్నట్టు, 17% అసంతృప్తిగా ఉన్నట్టు, 21% పాక్షికంగా అసంతృప్తిగా ఉన్నట్టు, ఏమీ చెప్పలేమని 11% మంది అభిప్రాయపడ్డారు. ప్రాంతాలవారీగా రాజకీయ వాతావరణం ఛత్తీస్‌గఢ్ ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలుగా ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ను సర్గుజ డివిజన్‌గా కూడా పిలుస్తారు. 23 స్థానాలున్న ఈ డివిజన్లో ఎస్టీ, ఓబీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సింగ్‌డియో, రాష్ట్ర మంత్రి జైసింగ్ అగర్వాల్ ప్రభావంతో 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. సింగ్‌డియో కాబోయే ముఖ్యమంత్రి అనే ప్రచారం ఇక్కడ 2018లో కాంగ్రెస్ విజయానికి దోహదపడిరది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత ఆ పార్టీకి ఇక్కడ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల సింగ్‌డియోకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కాంగ్రెస్‌కు కొంత సానుకూలం. 2018తో పోలిస్తే ఇక్కడ బీజేపీకి ప్రస్తుతం కొంత సానుకూలమైన వాతావరణం ఉందని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. చదవండి: 'ఏ'కేద్దాం.. 'బీ' రెడీ! మధ్య ఛత్తీస్‌గఢ్ డివిజన్లో రాయ్‌పూర్, బిలాస్పూర్, దుర్గ్ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాలున్నాయి. ఈ డివిజన్లో 55 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఎస్టీ, సింధి, రాజ్‌పుత్, పంజాబీ, బ్రాహ్మిణ్ సామాజిక ఓటర్ల ప్రభావం కూడా ఇక్కడ ఉంది. ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ సావో వంటి ప్రధాన నేతలు ఈ ప్రాంతానికి చేందిన వారే. ఈ ప్రాంతంపై పట్టున్న బీజేపీ 2018 ఎన్నికల్లో నష్టపోయింది. బీజేపీ బలపడ్డట్టు కనిపించినా.. కొన్ని సంవత్సరాల క్రితం కబీర్దామ్, బీమెత్ర జిల్లాల్లో మతకలహాల హింసతో ఇక్కడ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ బీజేపీ బలపడ్డట్టు కనిపిస్తున్నా, సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. వ్యవసాయ ప్రాధాన్యత గల ఈ ప్రాంతంలో ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉంది. ఈ డివిజన్లో గత ఎన్నికల్లో మంచి ఫలితాలు పొందిన జేసీసీ, బీఎస్పీ బలహీనపడడంతో కాంగ్రెస్, బీజేపీలకు ప్రయోజనం కలుగుతోంది. మొత్తంమీద ఈ ప్రాంతంలో బీజేపీ బలపడ్డట్టు కనిపించినా, కాంగ్రెస్ ఆధిప్యతం కొనసాగే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ దుర్మరణం!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. రాయ్‌పూర్‌లో షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) యూట్యూబ్‌లో వైరల్ రీల్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. దేవరాజ్ తన 'దిల్ సే బురా లగ్తా హై' అనే డైలాగ్‌తో మరింత పేరు సంపాదించుకున్నారు. ఆయనకు యూట్యూబ్‌లో అతనికి 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కమెడియన్ దేవ్‌రాజ్ పటేల్ పట్ల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సంతాపం ప్రకటించారు. కాగా.. 2021లో భువన్ బామ్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ధిండోరాలో దేవరాజ్ విద్యార్థి పాత్రలో కనిపించాడు. దేవ్‌రాజ్ తన మరణానికి కొన్ని గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ షేర్ చేశాడు. సీఎం ట్విటర్లో రాస్తూ.. ''దిల్ సే బురా లగ్తా హై'తో మనందరినీ నవ్వించిన దేవరాజ్ పటేల్ ఈరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చిన్న వయసులో తన అద్భుతమైన ప్రతిభను కోల్పోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగాక. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని ట్వీట్ చేశారు. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) “दिल से बुरा लगता है” से करोड़ों लोगों के बीच अपनी जगह बनाने वाले, हम सबको हंसाने वाले देवराज पटेल आज हमारे बीच से चले गए. इस बाल उम्र में अद्भुत प्रतिभा की क्षति बहुत दुखदायी है. ईश्वर उनके परिवार और चाहने वालों को यह दुःख सहने की शक्ति दे. ओम् शांति: pic.twitter.com/6kRMQ94o4v — Bhupesh Baghel (@bhupeshbaghel) June 26, 2023 View this post on Instagram A post shared by Devraj Patel (@imdevrajpatel) -
ఛత్తీస్‌గఢ్ అమరులకు ఘన నివాళులు
దంతెవాడ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో బుధవారం మావోయిస్టుల మందుపాతర పేల్చిన ఘటనలో అమరులైన 10 మంది పోలీసు సిబ్బంది, ఒక డ్రైవర్‌కు ఘనంగా నివాళులర్పించారు. కర్లి ప్రాంతంలోని పోలీస్‌లైన్స్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో మృతుల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం రోదనలు, భారత్ మాతా కీ జై నినాదాలతో ప్రతిధ్వనించింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తదితరులు హాజరై మృతులకు పూలతో నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను బఘేల్ ఓదార్చారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను వాహనాల్లో సొంతూళ్లకు తరలించారు. సీఎం బఘేల్ కూడా భుజం కలిపి ఒక జవాను మృతదేహాన్ని వాహనం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాలు వృథా కావని, మావోయిస్టులపై పోరు మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. దంతెవాడ జిల్లా అరన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసుల వాహనాన్ని నక్సల్స్ మందుపాతరతో పేల్చిన ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు(డీఆర్జీ) విభాగానికి చెందిన 10 మంది జవాన్లు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. శవపేటికను మోస్తున్న సీఎం బఘేల్ -
కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఈడీ దాడులు.. సీఎం సంచలన కామెంట్స్
ప్రతిపక్ష పార్టీల నేతలే టార్గెట్‌గా దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బొగ్గు కుంభకోణం కేసులో కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. వివరాల ప్రకారం.. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ సోమవారం 14 చోట్ల తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ రామ్ గోపాల్ అగర్వాల్‌కు రూ. 52 కోట్లు ముడుపులు ముట్టినట్లు డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొన్నది. ఆరి డోంగ్రి మైనింగ్‌లో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. టన్ను బొగ్గు సరఫరాపై అక్రమంగా రూ.25 వసూల్ చేసి.. 2021లో సగటున సుమారు 500 కోట్లు వసూల్ చేసినట్లు ఈడీ ఆరోపణ చేసింది. ఈ కేసులో భాగంగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక, ఈడీ తనిఖీలపై సీఎం భూపేష్ భఘేలే స్పందించారు. ఈ సందర్భంగా సీఎం భఘేల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం అవడాన్ని బీజేప తట్టుకోలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదారణ చూసి బీజేపీ భయాందోళనకు గురువుతోంది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానికి చెందిన అసలు విషయాలు వల్ల బీజేపీ ఇబ్బందిపడుతోంది. వీటిని నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే బీజేపీ.. ఈడీ దాడులు చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ దేశానికి నిజం తెలుసు.. పోరాడి గెలుస్తాం అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ ప్లీనర్ రాయ్‌పూర్‌లో జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ దాడులు జరగడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. -
దయలేని బడ్జెట్
కేంద్ర బడ్జెట్లో పేదలకు, రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. గత బడ్జెట్లో దేశంలోని రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని బీరాలు పలికింది. ఆ వాగ్దానాల్లో ఎన్ని నెరవేరాయో ఆర్థిక మంత్రి తెలపాల్సి ఉంది. ఇక, ఈసారి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 33 శాతం కోత విధించారు. యువతకు, రైతులకు, నిరుపేదలకు ప్రయోజనాలు కలిగించని క్రూరమైన బడ్జెట్ ఇది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇది చివరి సంపూర్ణ బడ్జెట్. దీనిపై ప్రజలు చాలా ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఒక్కమాటలో చెప్పాలంటే 2023–24 కేంద్ర బడ్జెట్... వంచనాత్మక బడ్జెట్‌గా మారిపోయింది. మన దేశ యువతకు, రైతులకు, కార్మికులకు, మహిళలకు, షెడ్యూల్డ్ తెగలకు, నిరు పేదలకు ఎలాంటి ప్రయోజనాలను కలిగించని, ప్రకటించని క్రూరమైన బడ్జెట్‌గా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం తనిఖీ, ఉపాధి కల్పన వంటి చర్యల గురించి ప్రస్తావించడంలో బడ్జెట్ విఫలమైంది. పైగా ఇవి ఇప్పుడు చాలా ప్రధానమైనవి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలపై ఒక కన్ను వేసి ఈ బడ్జెట్‌ని సిద్ధం చేసినట్లు అర్థమౌతోంది. కానీ మధ్యతరగతిపై పడుతున్న ఒత్తిడిని అర్థం చేసుకున్నానని ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన రాజకీయ గిమ్మిక్కుగా మారిపోయింది. ఎందుకంటే మధ్యతరగతికి భారంగా పరిణమించిన ధరల పెరుగుదల నుంచి ఉపశమన చర్యలకు సంబంధించి ఎలాంటి తక్షణ, నిర్దిష్ట చర్యలను బడ్జెట్ ప్రకటించలేదు మరి. అత్యవసర వస్తువులపై జీఎస్టీని తగ్గించడం ద్వారా తమ చేతుల్లో కాసింత నగదు ఉండటానికి ఈ బడ్జెట్లో చర్యలు తీసుకుంటారని ధరల పెరుగుదల భారాన్ని మోస్తున్న సాధారణ పౌరులు ఆశలు పెట్టుకున్నారు. ఆలాగే కొన్ని అవసరమైన రాయి తీలు కూడా ప్రకటిస్తారనుకున్నారు. కానీ అసలైన సమస్యను ఎవరూ ముట్టలేదు. ప్రభుత్వం పెద్ద పెద్ద గణాంకాలు వల్లె వేస్తూ, పథకాలకు ఆకర్షణీయమైన పేర్లను పెట్టి ప్రజలను బుజ్జగించడానికి ప్రయ త్నించింది. ఆర్థిక వృద్ధిపై అంతర్జాతీయ షట్‌డౌన్ ప్రభావం, ఆరోగ్య, విద్యా ఫలితాలను మెరుగుపర్చడం వంటి సమస్యలపై బడ్జెట్ ఎలాంటి దృష్టీ పెట్టలేకపోయింది. పైగా నూతన పన్ను విధానం ప్రకారం ఆదాయ పన్ను రాయితీని ఏడు లక్షల రూపాయలకు పెంచామనీ, పన్ను శ్లాబ్‌లు మార్చామనీ ప్రభుత్వం గొప్పగా చేసిన ప్రకటన కూడా వేతన జీవులకు పిడుగుపాటులా తగిలింది. ఎందుకంటే ఈ రాయితీకి 80–సి కింద ఎలాంటి మినహాయింపూ ఇవ్వలేదు. దీర్ఘకాలంలో వ్యక్తుల సామాజిక భద్రత కోసం అవసరమైన పొదుపులను ఇది నిరుత్సాహపరుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీమా రంగాన్ని చావు దెబ్బ తీస్తుంది. అంతే కాకుండా బీమా ఏజెంట్ల ఉద్యోగాలను దెబ్బ తీస్తుంది. రాజకీయంగా ప్రభావితం చేసే అతి కొద్దిమందికి ప్రత్యక్ష ప్రయోజనాలు ఇస్తూ, అత్యధిక ట్యాక్స్ శ్లా్లబ్ మాత్రం తగ్గించారు. వేగంగా పెరుగుతున్న నిరుద్యో గాన్ని తాజా బడ్జెట్ ప్రస్తావించలేదు. రాష్ట్రాల, దేశ ఆర్థిక వ్యవస్థను ఉద్దీపింపజేసే అతి ముఖ్యమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా 33 శాతం కోత విధించారు. ఈ ఒక్క అంశాన్ని చూసినా చాలు ఈ బడ్జెట్ పేదల వ్యతిరేక మైనదని రుజువవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళనలు, డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేయాలని ఛత్తీస్‌గఢ్ చేసిన డిమాండ్, కేంద్ర పన్నుల బకాయలు, బొగ్గు రాయల్టీల బదిలీ వంటి అంశాలను గాలికి వదిలేశారు. బొగ్గు రాయల్టీల రేటును ఈ సంవత్సరం అసలు పెంచలేదు. దీన్ని చివరిసారి 2014లో మాత్రమే పెంచారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, జగదల్పూర్, సర్గుజా వంటి ప్రాంతాలు డిమాండ్ చేసిన కొత్త రైళ్లను అసలు ప్రకటించలేదు. 2022 చివరికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ సమయంలో హమీ ఇచ్చింది. ప్రతి పేదవాడికీ ఇల్లు నిర్మించి ఇస్తామనీ, 60 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామనీ కూడా వాగ్దానం చేసింది. కానీ గత బడ్జెట్లో ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేరాయో ఆర్థిక మంత్రి మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. దేశ జీడీపీకి వ్యవసాయం 14–15 శాతం మేరకు దోహదం చేస్తోంది. కానీ కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం లేదా రైతులకు గ్యారంటీ ఆదాయాన్ని కల్పిస్తామనే మాట కూడా తాజా బడ్జెట్లో కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం ఆవు పేడను ఉపయో గించుకునేందుకు ఇప్పుడు గోవర్ధన్ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఛత్తీస్‌గఢ్ నమూనాకు వట్టి అనుకరణ మాత్రమే. రెండు రూపాయ లకు కిలో ఆవు పేడను కొనడం ద్వారా గత రెండేళ్లుగా ‘గోదాన్ న్యాయ్ యోజన’ను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ వస్తోంది. దశలవారీగా ఈ పథ కాన్ని అమలు చేయడం ద్వారా ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నిలకడైన పురోగతిని రాష్ట్రం ప్రభుత్వం సాధించింది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ రైతులు వానపాము ఎరువును తయారు చేస్తున్నారు. రసాయనిక ఎరువులపై ఆధారపడటం తగ్గించుకున్నారు. పైగా ఈ పథకంతో ముడిపడి ఉన్న మహిళల ఆదాయం కూడా పెరిగింది. కట్టుదప్పిన పశువుల ద్వారా పంటలకు కలుగుతున్న నష్టం సమస్య గురించి తాజా బడ్డెట్ అసలు ప్రస్తావించలేదు. అలాగే సీఎన్జీ, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరలు చుక్కలనంటు తున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి బడ్జెట్ నిర్దిష్టంగా ఏమీ పేర్కొనలేదు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో బయోగ్యాస్, గ్రీన్ గ్రోత్ (మన సంక్షేమానికి అతి కీలకమైన సహజ వనరులు, పర్యావర ణానికి నష్టం కలిగించని అభివృద్ధి)పై దృష్టి పెడతామని బడ్జెట్ పేర్కొంది. కానీ వరి నుంచి ఇథనాల్ ఉత్పత్తికి అనుమతి కోరుతూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వరుసగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతులు ఇవ్వకుండా ఇప్పటికీ పెండింగులో ఉంచుతోంది. ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్లో చిరుధాన్యాల కనీస మద్దతు ధర గురించి అసలు ప్రస్తావించలేదు. కానీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మేము 52 రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాము. భూపేశ్ బఘేల్ వ్యాసకర్త ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి -
చత్తీస్‌గఢ్ సీఎం డిప్యూటీ సెక్రటరీ అరెస్టు
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియాను ఈడి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ ఆరోపలపై సౌమ్యను అరెస్టు చేసినట్లు పేర్కొంది. గతేడాది చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో దాడులు నిర్వహించి సుమారు రూ. 100 కోట్లకు పైగా హవాలా రాకెట్‌ను వెలికితీసినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. అంతేగాక హవాల లావదేవీల కింద అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించకుండా నగదు చేతులు మారుతోందని ఈడీ పేర్కొంది. ఫిబ్రవరి 2020లో చౌరాసియా ఇంటిపై కూడా దాడి చేసింది. ఐతే ముఖ్యమంత్రి భూపేష్ కేంద్ర ఏజెన్సీ చేసిన దాడిని రాజకీయ ప్రతీకార దాడి అభివర్ణించారు. పైగా తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. (చదవండి: కాంగ్రెస్‌ను వీడిన ముగ్గురు నాయకులకు...బీజేపీ కీలక భాద్యతలు) -
బఘేల్ విన్యాసాలు.. భలే భలే
రాయ్‌పూర్: గిర్రున తిరిగి నీటిలో హుషారుగా మునకలు వేస్తున్న పెద్దాయనను చూశారా. వయసు శరీరానికే గానీ మనసు కాదు అన్నట్టుగా విన్యాసాలు చేస్తున్నారాయన. ఆయనేమి సామాన్య వ్యక్తి కాదు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం చత్తీస్‌గఢ్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేశ్ బఘేల్ పుణ్యస్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన నీటి విన్యాసాలు ప్రదర్శించారు. ఒక్క గెంతున నీటిలోకి దుమికారు. వెనక్కి గెంతి కూడా ఆయనీ విన్యాసాన్ని ప్రదర్శించారు. ఈ వీడియోను ట్విటర్లో భూపేశ్ బఘేల్ షేర్ చేశారు. మహాదేవ్ పేరు తలచుకుని.. సంపూర్ణ కార్తీక స్నానం ఆచరించినట్టు పేర్కొన్నారు. గత నెలలో దుర్గ్ జిల్లాలో జరిగిన గౌరి పూజాకార్యక్రమంలో కొరడాతో కొట్టించుకుని ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. (క్లిక్ చేయండి: మా గవర్నర్ అనర్హుడు.. తప్పించండి) -
కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకంటే?
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపేశ్ బఘేల్ తన చేతి మణికట్టుపై కొరడాతో కొట్టించుకున్నారు. ఆయన దుర్గ్ జిల్లాలోని జజంగిరి, కుమ్హారి అనే రెండు గ్రామాలలో జానపద సంప్రదాయంలో భాగంగా ఆయన ఇలా కొరడాతో కొట్టించుకున్నారు. గౌరి పూజ సమయంలో ఇలా కొరడాతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతారు. ఎలాంటి చెడు జరగకుండా అమ్మ కాపాడుతుందని విశ్వసిస్తారు. భూపేశ్ బఘేల్ రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన కార్యాలయం పేర్కొంది. అందుకు సబంధించిన వీడియోని చత్తీస్‌గఢ్ సీఎం ట్వీట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. सोंटे का प्रहार और परंपराओं का निर्वहन. pic.twitter.com/SV82qommmu — Bhupesh Baghel (@bhupeshbaghel) October 25, 2022 (చదవండి: కలిచివేసే ఘటన: చావుబతుకుల మధ్య ఉంటే చుట్టూ చేరి ఫోటోలు తీస్తూ...) -
మాట నిలబెట్టుకున్న సీఎం.. టెన్త్, ఇంటర్ టాపర్లకు హెలికాప్టర్ రైడ్
రాయ్‌పూర్: టెన్త్, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి హెలికాప్టర్ రైడ్ కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాప్టర్లో తనతో పాటు తీసుకెళ్లి గగన విహారం చేయించారు. తొలిసారి హెలికాప్టర్ ఎక్కిన క్రమంలో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలా సంతోషంగా ఉందని, ఈ రైడ్ ద్వారా ఇతర విద్యార్థుల్లోనూ ఉత్సాహం నింపినట్లవుతుందన్నారు. 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులను హెలికాప్టర్లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. చదవుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా హెలికాప్టర్ రైడ్‌పై ట్వీట్ చేశారు. ‘చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన వారిని హెలికాప్టర్లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్ రైడ్‌ను ఆస్వాదిస్తారు’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. మరోవైపు.. విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ టెకమ్. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. #WATCH | Raipur, Chhattisgarh: Toppers of class 12 and class 10 were taken on a helicopter ride by the state govt as was promised by CM Bhupesh Baghel in May pic.twitter.com/gjHu8lGBKS — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 8, 2022 𝗛𝗲𝗹𝗶𝗰𝗼𝗽𝘁𝗲𝗿 𝗥𝗶𝗱𝗲🚁 देखिए, बच्चे कितने खुश हैं! हमने वादा किया था कि 10वीं और 12वीं के टॉपर बच्चों को हम हेलीकॉप्टर राइड कराएँगे। आज इसकी शुरुआत हो गयी है। कक्षा 10वीं और 12वीं के 125 छात्र-छात्राएं लेंगे हेलीकॉप्टर जॉयराइड का आनंद। pic.twitter.com/5c4dbOvTbx — Bhupesh Baghel (@bhupeshbaghel) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
భయానక రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోబా సమీపంలో ఓ ట్రక్కు-ట్రాకర్ట్ ఢీకొట్టుకున్నాయి. ట్రాక్టర్ మలుపు తీసుకుంటుండగా ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరంతా మొహ్లాయ్ గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. బాధితులందరూ మజర్ కట్టాకు చెందినవారని వెల్లడించారు. మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని.. గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
ఆవు పేడతో సూట్‌కేస్.. అసెంబ్లీకీ తీసుకువెళ్లిన ఛత్తీస్‌గఢ్ సీఎం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగల్ బుధవారం వెరైటీ బ్రీఫ్‌కేసుతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యి అందరికీ షాక్ ఇచ్చారు. ఇది వరకే బడ్జెట్ సమావేశాలకు సూట్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చేవారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాత పద్ధతులకు స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఛతీస్‌గఢ్ సీఎం కూడా ఇంకాస్త ముందడుగా వేసి ఏకంగా ఆవు పేడతో తయారైన బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకుని అసెంబ్లీకి వెళ్లారు. ఆవు పేడకు చెందిన పొడి, గమ్, పిండి, ఇతర పదార్థాలతో పాటు కొండగావ్‌కు చెందిన కళాకారులు హ్యాండిల్, కలపతో తయారు చేశారు. ఆ సూట్‌కేసుపై సంస్కృతంలో “గోమయే వసతే లక్ష్మి” అని రాసి ఉంది. అంటే దీని అర్థం “లక్ష్మి దేవత ఆవు పేడలో ఉంటుంది”. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆవుపేడతో తయారైన బ్రీఫ్‌కేస్‌తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం భారత్‌లో ఇదే తొలిసారి. దీన్ని తయారు చేసేందుకు పది రోజులు పట్టినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గత నెలలో పశువుల పెంపకం గ్రామస్తులు, గౌతన్‌లు, గౌతమ్ కమిటీలతో సంబంధం ఉన్న మహిళా సంఘాల కోసం తన ప్రధాన పథకం గోధన్ న్యాయ్ యోజన కోసం రూ.10.24 కోట్లను విడుదల చేసింది. పశువుల యజమానులకు కనీస ఆదాయ మద్దతును అందించడమే ఈ పథకం లక్ష్యం. ఆవు పెంపకందారులు, రైతుల నుంచి ఆవు పేడను సేకరిస్తామని 2020లో రాష్ట్రం ప్రకటించింది, భారతదేశంలో అలా చేసిన మొదటి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. -
వట్టి శుష్క వాగ్దానాల బడ్జెట్
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే రెండు ఉపద్రవాలను దేశం ఎదుర్కొంటోంది. ఉపాధి అవకాశాలను పెంచి ద్రవ్యోల్బణ సూచిని తగ్గించడానికి ఆర్థిక మంత్రి ప్రాధాన్యత ఇస్తారని భావించారు. అయితే బడ్జెట్లో కేటాయించిన నిధులు పేదలను, కార్మికులను, వలస కూలీలను వంచించాయనే చెప్పాలి. రైతులకు స్వావలంబనతో కూడిన సంక్షేమ చర్యలు చేపట్టడానికి కనీస నిధులను కూడా బడ్జెట్లో కేటాయించలేదు. ఇక వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నది వట్టి మాటే. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర పాలకులు దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మరోసారి చిదిమివేశారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 కేంద్ర బడ్జెట్ పూర్తిగా దిశారహితం గానూ, పేదలకు, రైతులకు వ్యతిరేకం గానూ రూపొందింది. ఇది ఆర్థికరంగంలో బీజేపీ పాలకుల వైఫల్యంపై శ్వేతపత్రం మాత్రమే. గత కొన్నేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపయిందంటూ కేంద్రప్రభుత్వం ఊదరగొడు తోంది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతుల పెరిగిన ఆదాయంపై ఒక్క మాటంటే ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న 100 విశ్వనగరాల పురోగతి మాట ఏమిటి? బడ్జెట్లో చూపించిన కేటాయింపులు కొత్త సీసాలో పోసిన పాత సారా తప్ప మరేమీ కాదంటే అది అసందర్భ వ్యాఖ్య కాదు. కరోనా మహమ్మారి ద్వారా కలిగిన నష్టాలను పూరించ డానికి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు సహాయాన్ని అందిస్తున్నట్లు ఘనంగా ప్రకటించు కుంది. కానీ, దీనికి ప్రత్యామ్నాయంగా 2023 మార్చి వరకు చిన్న కార్పొరేషన్లకు అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. అయితే ద్రవ్య సమస్యల్లో ఇప్పటికే కూరుకు పోయిన చిన్న సంస్థలు క్రెడిట్ స్కోర్‌ని మెయిన్‌టెయిన్ చేసే స్థితిలో లేవన్న ఇంగితజ్ఞానం ప్రదర్శించడంలోనూ భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు నిజంగా చేయవలసింది ఏమిటంటే చిన్న తరహా సంస్థలను ప్రోత్స హించడమే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 14 నుంచి 15 శాతంగా ఉంటోంది. ఈ తరుణంలో రైతుల ఆదాయాన్ని పెంచగలిగితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్‌గా పనిచేస్తుంది. వ్యవసాయ పనుల్లో విస్తృతంగా పాల్గొం టున్న రైతులు తమ రాబడికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కనీస మద్దతు ధర పథకాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఒక్క పదం కూడా తాజా బడ్జెట్ ప్రతిపాదనలో కనిపించదు. గ్రామీణ భారతావనికి ఘోరమైన అన్యాయం చేయడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన విజయం సాధించింది. రైతులకు స్వావలంబనతో కూడిన సంక్షేమ చర్యలు చేపట్టడానికి కనీస నిధులను కూడా ఈ తాజా కేంద్ర బడ్జెట్లో కేటాయిం చలేదు. ఇక వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నది వట్టి మాటే మరి. గంగానది పొడవునా రసాయన రహిత స్వచ్ఛ వ్యవ సాయాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కానీ ఛత్తీస్‌గఢ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనికి పూను కున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను రైతుల ఖాతాలకు బదలాయించాలని నిర్ణయించింది.. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్నదానికి కొనసాగింపు మాత్ర మేనని చెప్పాలి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఇప్పటికే కనీస మద్దతు ధరను రైతుల ఖాతాకు నేరుగా బదిలీ చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దగ్గరి దారి ఏమిటంటే ప్రత్యక్ష నగదు బదిలీని అమలుపర్చటమే! ఈవిధంగానే కరోనా మహమ్మారి కాలం పొడవునా ఆర్థిక మాంద్యం నుంచి చత్తీస్‌గఢ్ తన్ను తాను కాపాడుకోగలిగింది. కేంద్రప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధిని విస్తరిస్తున్నట్లు చెబుతూ వచ్చింది కానీ బడ్జెట్లో దీని ప్రస్తావన కూడా తేలేదు. పసలేని వాగ్దానాలను చేయ డంలో నరేంద్ర మోదీ నేతృత్వం లోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాటుదేలి పోయింది. ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసం గంలో ఏడు చోదక శక్తుల గురించి మాట్లాడారు. అవేమిటంటే – రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జల మార్గాలు, నిర్మాణ రంగం. వీటితో ఆర్థికవ్యవస్థను ముంద డుగు వేయించవచ్చని మంత్రి పేర్కొన్నారు. కానీ వీటికి సరిపడా నిధుల కేటాయింపు బడ్జెట్లో కనిపించలేదు. ఎంత వెచ్చిస్తారనే సంఖ్యలనూ పేర్కొనలేదు. గతంలోని కొన్ని బడ్జెట్లను మనం పరిశీలించినట్లయితే, పెద్ద పెద్ద బులెటిన్లను ప్రకటించారు. సమర్థ మౌలిక వసతుల మిషన్, జాతీయ వ్యాప్తంగా డిజిటల్ వెల్ బీయింగ్ మిషన్ వంటివి వీటిలో కొన్ని. కానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు మాత్రం ఊహించినంత పరిమాణంలో లేదు. పోతే, ప్రధాని గతిశక్తి పథకం మార్గంలో మౌలిక వసతులపై వ్యయాన్ని పెంచుతారా అంటే అదీ స్పష్టం కావడం లేదు. ప్రస్తుతం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే రెండు ఉప ద్రవాలను మన దేశం ఎదుర్కొంటోంది. ఉపాధి అవకా శాలను పెంచి ద్రవ్యోల్బణ సూచిని తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రాధాన్యం ఇస్తారని భావించారు. అయితే బడ్జెట్లో కేటా యించిన నిధులు భారత ప్రజలను ప్రత్యేకించి పేదలను, కార్మికులను, వలస కూలీలను, మహమ్మారి కాలంలో పూర్తిగా మూతపడిన ఆర్థిక సంస్థలను వంచించాయనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ‘పనికి ఆహార పథకా’నికి నిధుల కేటాయింపును పెంచలేదు. ఎప్పటిలాగే ఇది ఎన్నికల సంవత్సరంలో మాత్రమే పట్టించుకునే అంశంగా ఉండిపోయింది. దీంతో అసలే కరోనా దెబ్బతో జీవితాలు అతలాకుతలమైన పేదప్రజలపై పిడుగు పాటు తప్పదు. ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడానికి వస్తూత్పత్తితో లింక్ చేసిన ప్రోత్సాహక పథకం ద్వారా, కొత్తగా 60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు కానీ దీనికి సంబంధించిన గణాంకాలు కానీ, ఎలా ఉద్యోగాలను çసృష్టిస్తా రన్న ఎరుక కానీ బడ్జెట్లో కనిపించలేదు. కేంద్రప్రభుత్వం ఉపాధి కల్పనపై ఎలాంటి నమూనా ఇవ్వనందున నిరు ద్యోగితకు వ్యతిరేకంగా రోడ్లమీదికి వస్తున్న లక్షలాది మంది యువతకు ఇది పూర్తిగా నిరాశపరిచే అంశమే అవుతుంది. నిరుద్యోగ పరిస్థితులతో ఎలా వ్యవహరించాలనే విషయమై కేంద్రం మా ఛత్తీస్‌గఢ్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మా రాష్ట్ర నిరుద్యోగితా రేటు దేశ సగటు నిరుద్యోగ రేటు కన్నా తక్కువగా ఉందని నివేదికలు ఇప్పటికే తేటతెల్లం చేశాయి కూడా! ఆర్థిక వ్యవస్థను నిధుల లేమి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది కాబట్టే కొనుగోలుదారుకు సాధికారత కల్పించాలని కేంద్రం కోరుకుంటోంది. కానీ ఈ భావన కూడా ఇప్పుడు డిమాండ్ లేని సరకుగా మారిపోయింది. ప్రభుత్వం ఏమి చేస్తోందో అంతుబట్టడం లేదు. వేళ్లమీద లెక్కబెట్టగల కార్పొ రేట్లకు సంపద ధారపోయడం కంటే కేంద్ర ప్రభుత్వాధికారులు అధిక జనాభా చేతుల్లోకి డబ్బు వచ్చిపడేలా ప్రత్యామ్నాయ లక్ష్యాలను ఇకనైనా రూపొందించుకోవాలి. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందనే చెప్పాలి. కంపెనీలపై పన్నును 18 నుంచి 15 శాతానికి తగ్గించారు కానీ అదే సమ యంలో ఆదాయ పన్ను విభాగంలో వేతన జీవులకు ఎలాంటి ఊరటనూ అందించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తాజా కేంద్ర బడ్జెట్ ఒక దిశా దశా లేని శుష్క వాగ్దానాల బడ్జెట్. మధ్య తరగతికి మొండిచెయ్యి చూపిన బడ్జెట్. అంతకుమించి నిరు పేదల మాడు పగలగొట్టిన బడ్జెట్! భూపేశ్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి –కాంగ్రెస్ నాయకుడు -
‘అమర జవాన్ల జ్యోతిని మా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం’
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గం కాంగ్రెస్‌దైతే.. గాడ్సే, వీర్ సావర్కర్ల హింసాత్మక మార్గం ప్రధాని మోదీది అని అన్నారు. అమర జవాన్ల జ్యోతి విశిష్టత తెలియక మోదీ ప్రభుత్వం దాన్ని తొలగించిందని ఆరోపించారు. ప్రజల మనోభావాలను కేంద్రం దెబ్బతీసిందని మండిపడ్డారు. అమర జవాన్ల జ్యోతిని ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటు చేస్తామన్న భూపేష్ బాగేల్.. ఫిబ్రవరి 3న దీనికి రాహుల్‌గాంధీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. -
Chhattisgarh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు.. ఇక నుంచి..
ఛత్తీస్‌ఘడ్: భారతదేశమంతట 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్.. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పని దినాలతో పాటు పలు విధానపర నిర్ణయాలను ప్రకటించారు. అదే విధంగా, పెన్షన్ పథకంలో రాష్ట్రప్రభుత్వం వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులలో సామర్థ్యం, ఉత్పాదకతను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భూపేష్ బఘెల్ తెలిపారు. ఆయా నివాస ప్రాంతంలో వ్యాపారాలు చేసే చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ప్రవేశపెడుతన్నట్లు పేర్కొన్నారు. ఇది చిరువ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రజా భద్రతకు ఇబ్బందులు కల్గించే ఎలాంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బిల్డింగ్ కోడ్‌లోని నిబంధలను అందరు పాటించాలని సూచించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లలో సెకండ్ బిల్డింగ్ పర్మిషన్ పథకానికి అనుగుణంగా ప్రణాళిక నిబంధనలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉపాధి కల్పనతోపాటు రవాణా సౌకర్యాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిబంధలను సులభతరం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. మహిళల భద్రత కోసం మహిళ సేఫ్టీ సెల్స్‌ను ఏర్పాటు చేస్తామని భూపేష్ బఘెల్ ప్రకటించారు. ఛత్తీస్‌ఘడ్ ప్రాంతంలో దట్టమైన అడవులతో కూడి ఉంటుంది. ఈ క్రమంలో గిరిజనులు ఎక్కువగా జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడతారు. వీరి కోసం అటవీ వాసులకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయనున్నట్లు సీఎం తెలిపారు. పారిశ్రామిక విధానంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ పార్కుల్లోని ప్లాట్లలో 10 శాతం భూమిని ఓబీసీ వర్గానికి రిజర్వు చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా రైతుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి పప్పుధాన్యాలకు కూడా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని సీఎం తెలిపారు. అలాగే కార్మికులకు జన్మించిన మొదటి ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 20,000 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు భూపేష్ బఘెల్ తెలిపారు. చదవండి: టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం -
కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి
-
కొరడా దెబ్బలు తిన్న సీఎం.. ఎందుకో తెలుసా?
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా గోవర్థన పూజ సందర్భంగా కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. ఇందులో భాగం గానే రాష్ట్ర సీఎం కూడా కొరడా దెబ్బలు తిని అక్కడి ఆలయ సంప్రదాయాన్ని పాటించారు. ఈ వీడియోను భూపేష్ స్వయంగా ట్విటర్లో షేర్ చేశారు. ఒక వ్యక్తి సీఎం చేతులపై కొరడాతో కొట్టడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. శుక్రవారం రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలోని ఒక గ్రామంలో గోవర్ధన్ పూజ పండుగ వేడుకలకు హాజరైన సీఎం సంప్రదాయం ప్రకారం 'సొంట' (గడ్డితో చేసిన కొరడా)తో కొరడాతో కొట్టించుకుని ఆ బాధను భరించడం విశేషం. ప్రజల సంక్షేమం కోసం ఇలా చేశానని, తద్వారా సకల శుభాలు కలుగుతాయని ఆయన చెప్పారు. గోవు ఎంత సుభిక్షంగా ఉంటే ప్రజలు అంత అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో గోవర్ధన్ పూజకు ఆదరణ ఉంటుందని సీఎం చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి ఏటా గోవర్ధన్ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ పూజలో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. అందులో భాగంగా కొంతమంది కొరడాతో దెబ్బలు కొడుతుంటారు. ఇలా కొరడా దెబ్బలు తింటే తమ అభివృద్ధికి అడ్డంకులన్నీ తొలగిపోతాయని రాష్ట్ర ప్రజల నమ్మకం. ఈ క్రమంలోనే సీఎం భూపేష్ బఘేల్ కూడా కొరడా దెబ్బలు తిన్నారు. గ్రామ పెద్ద భరోసా ఠాకూర్ జంజ్గిరిలో ఈ సంప్రదాయాన్ని నిర్వహించి, ప్రజలను వారి కోరిక మేరకు కొరడాతో కొట్టేవారనీ, అతని మరణం తరువాత, అతని కుమారుడు బీరేంద్ర ఠాకూర్ అతని వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నాడని అధికారులు తెలిపారు. प्रदेश की मंगल कामना और शुभ हेतु आज जंजगिरी में सोटा प्रहार सहने की परंपरा निभाई। सभी विघ्नों का नाश हो। pic.twitter.com/bHQNFIFzGv — Bhupesh Baghel (@bhupeshbaghel) November 5, 2021 -
రూ.50 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించిన పంజాబ్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు
లక్నో: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆ ఘటనలో జర్నలిస్ట్ కశ్యప్ తోపాటు చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కూడా మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. కాగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరి వద్ద ఆందోళనకారులపైకి కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకాదు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్, ఎస్యూవీ వాహనంలోల ఒకదానిపై కూర్చుని నిరసనకారుల మీదకు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెలువెత్తడంతో ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలతో బీజేపీ ప్రభుత్వం పై దాడి చేస్తున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చన్నీ, బాఘేల్ ఇద్దరూ కూడా లక్నో పర్యటనలో ఉన్నారు. ఇదిలాఉండగా... ఉత్తర ప్రభుత్వం కూడా చనిపోయిన రైతు కుటుంబాలకు 45 లక్షల పరిహారంతోపాటు ప్రభుత్వం ఉద్యోగం, గాయపడిన వారికి రూ. 10 లక్షల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్
రాయ్‌పూర్: ఓ సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్టయ్యారు. తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ సంబంధిత సామాజికవర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి తాజాగా మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్. చదవండి: తండ్రిపై కేసు నమోదును సమర్ధించిన ముఖ్యమంత్రి బ్రాహ్మణులు విదేశీయులని, వారిని బహిష్కరించాలని ఇటీవల నంద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారని, బ్రాహ్మాణులను గ్రామాల్లోకి రానివ్వొద్దని చెప్పినట్లు సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ ఆరోపించింది. ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని డీడీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాముడికి వ్యతిరేకంగా కూడా నంద్ కుమార్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో సంస్థ పేర్కొంది. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఉన్నాయని చెబుతూ వాటి సాక్ష్యాలు కూడా అందించారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆ సమాజం ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుపై విచారణ చేపట్టిన అనంతరం పోలీసులు నంద్ కుమార్‌ను తాజాగా అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో హాజరుపరిచారు. 15 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీకి న్యాయస్థానం ఆదేశించింది. తండ్రిపై కేసు నమోదు కావడంపై ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ స్పందించారు. ‘నా తండ్రివి, నావి రాజకీయ సిద్ధాంతం, నమ్మకాలు వేరు. ఒక కుమారుడిగా నేను నా తండ్రిని గౌరవిస్తా. కానీ ఒక ముఖ్యమంత్రిగా అతడి తప్పిదాలు, సమాజాన్ని ఇబ్బందులకు గురి చేసే అంశాలను క్షమించలేను’ అని పేర్కొన్నాడు. ‘మా నాన్న చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఒక సమాజాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడంతో నేను బాధపడ్డా. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు విఘాతం కలగడం సహించలేను’ అని భూపేశ్ పేర్కొన్నారు. ‘చట్టం కన్నా ఎవరూ ఎక్కువ కాదు’ అని స్పష్టం చేశారు. చదవండి: జైలు మరుగుదొడ్డిలో సొరంగం.. ‘జులాయి’ సినిమాలో మాదిరి -
తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి
రాయ్‌పూర్: ఓ సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి తండ్రిపై కేసు నమోదైంది. తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ సంబంధిత సామాజికవర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక బ్రాహ్మణులు విదేశీయులని, వారిని బహిష్కరించాలని ఇటీవల నంద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారని, బ్రాహ్మాణులను గ్రామాల్లోకి రానివ్వొద్దని చెప్పినట్లు సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ ఆరోపించింది. ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని డీడీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాముడికి వ్యతిరేకంగా కూడా నంద్ కుమార్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో సంస్థ పేర్కొంది. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఉన్నాయని చెబుతూ వాటి సాక్ష్యాలు కూడా అందించారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆ సమాజం ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రిపై కేసు నమోదు కావడంపై ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ స్పందించారు. ‘నా తండ్రివి, నావి రాజకీయ సిద్ధాంతం, నమ్మకాలు వేరు. ఒక కుమారుడిగా నేను నా తండ్రిని గౌరవిస్తా. కానీ ఒక ముఖ్యమంత్రిగా అతడి తప్పిదాలు, సమాజాన్ని ఇబ్బందులకు గురి చేసే అంశాలను క్షమించలేను’ అని పేర్కొన్నాడు. ‘మా నాన్న చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఒక సమాజాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడంతో నేను బాధపడ్డా. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు విఘాతం కలగడం సహించలేను’ అని భూపేశ్ పేర్కొన్నారు. ‘చట్టం కన్నా ఎవరూ ఎక్కువ కాదు’ అని స్పష్టం చేశారు. అంటే పరోక్షంగా తన తండ్రిపై కేసు నమోదును సమర్ధించినట్లు కనిపిస్తోంది. నంద్ కుమార్ ఓబీసీలకు మద్దతుగా రాజకీయం చేస్తున్నారని ఆ రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. చదవండి: తుపాకీలతో పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం -
సీఎం పదవికి రొటేషన్ ఫార్ములా ఏదీ లేదు
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో ఢిల్లీలో మరోసారి భేటీ అయ్యారు. తర్వాత బఘేల్ మీడియాతో మాట్లాడారు. పార్టీకి చెందిన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారన్నారు. రాష్ట్రానికి వచ్చి పరిస్థితిని స్వయంగా చూడాలని రాహుల్‌ను కోరినట్లు తెలిపారు. మంత్రి సింగ్ దేవ్ వాదిస్తున్నట్లుగా రొటేషన్ ఫార్ములా అంటూ ఏదీ లేదని బఘేల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2018లో కాంగ్రెస్ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల తర్వాత రొటేషన్ పద్ధతిలో చేపట్టేందుకు తనకు హామీ ఇచ్చారని, దాని ప్రకారమే సీఎం పీఠం తనకు ఇవ్వాలని సింగ్‌దేవ్ వాదిస్తున్నారు. -
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో సంక్షోభం: రాహుల్ గాంధీతో సీఎం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న సంక్షోభం తారస్థాయికి చేరింది. సీఎం భూపేష్ బగేల్, ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్ల మధ్య విభేదాలు ఢిల్లీకి చేరాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఇద్దరు నేతలు మంగళవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అధిష్టానం ఆదేశాలతోనే తాను ఢిల్లీకి వచ్చినట్లు మంత్రి సింగ్ దేవ్ తెలిపారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి పదవి మార్పు జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక, 2018 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు భూపేష్ బగేల్‌తోపాటు టీఎస్ సింగ్ దేవ్ కూడా సీఎం రేస్‌లో పోటీపడ్డారు. అయితే అధిష్టానం మాత్రం భూపేష్ బగేల్‌కు సీఎం అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు రెండున్నరేళ్ల తర్వాత టీఎస్ సింగ్ దేవ్ ముఖ్యమంత్రి అవుతారని అధిష్టానం హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా గత జూన్ నెలతో సీఎం భూపేష్ బగేల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సీఎంగా టీఎస్ సింగ్ నియమితులవుతారా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ విషయంపైనే నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీతో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. -
ఆ బుడ్డోడి పాటకు ఫిదా.. రూ. 23 లక్షల కారు గిఫ్ట్..!
Bachpan Ka Pyaar Boy: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్ డిర్డో అనే బాలుడు ఒక్కపాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. హసదేవ్ పాఠశాలలో ‘బచ్ పన్ కా ప్యార్ హై’ పాట పాడుతుండగా కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు చేరింది. ఆ బుడతడి గొంతుకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ కూడా ఫిదా అయ్యారు. హసదేవ్ డిర్డోని పిలిపించుకుని బచ్పన్ కా ప్యార్ పాట పాడించుకుని.. ఆశీర్వదించారు. ఇక అనుష్క శర్మ కూడా హసదేవ్ గొంతుకు పడిపోయారు. ఈ క్రమంలో హసదేవ్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. అందేంటే హసదేవ్ పాటకు ఫిదా అయిన ఎంజీ కంపెనీ.. ఆ పిల్లాడికి 23 లక్షల రూపాయల విలువ చేసే ఎంజీ హెక్టార్ కారును బహుకరించిందనేది ఆ వార్తల సారాంశం. ఇక హసదేవ్ డిర్డో ఎంజీ కారు ముందు నిలబడి ఉన్న ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. వీటిలో హసదేవ్ చేతిలో కారు కీ పట్టుకుని ఉండటం.. పక్కనే కంపెనీ యజమాని, ఓ సేల్స్‌గర్ల్ ఉండటంతో అందరు ఇది నిజమని భావించారు. కానీ హసదేవ్‌కు కారు బహుకరించారనే వార్త అవాస్తవం. దీన్ని స్వయంగా ఎంజీ కంపెనీనే ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘హసదేవ్ డిర్డో ఎంజీ కంపెనీ నిర్వహించిన ఓ డీలర్షిప్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు. ఆ సమయంలో హసదేవ్ కారు ముందు ఫోటో దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటో, వీడియో వైరల్ కావడంతో అందరూ మా కంపెనీ హసదేవ్‌కు ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిందని భావించారు. అయితే ఈ వార్త అవాస్తం. ఆ కార్యక్రమానికి హాజరయినందుకు మేం హసదేవ్ డిర్డోకి కేవలం 21 వేల రూపాయలు బహుమతిగా ఇచ్చాం’’ అని వెల్లడించారు. ఇదే విషయాన్ని హస్దేవ్ కుటుంబీకులు కూడా ధ్రువీకరించారు. -
Chhattisgarh: హరేలీ పండుగ.. వెదురు బొంగులు కట్టుకుని సీఎం డ్యాన్స్..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలు హరేలీ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. దీనిలో భాగంగా.. వ్యవసాయ పరికరాలు, ఆవులను, ప్రకృతిని ఆరాధించారు. కాగా, ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా హరేలీ వేడుకను ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో, ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ భగేల్ రాయ్‌పూర్‌లో జరిగిన హరేలీ వేడుకలలో పాల్గోని డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో భాగంగా.. సీఎం డప్పులు కొడుతూ.. సంప్రదాయ నృత్యం చేస్తూ స్థానికులలో మరింత ఉత్సాహాన్నినింపారు. ప్రధానంగా ఉత్తరాదిన, గోండ్ జాతి తెగలలో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు రైతులు.. భెల్వా చెట్లకొమ్మలను, ఆకులను వారిపోలాల్లో వేస్తారు. మంచి పంట పండాలని కోరుకుంటారు. అదే విధంగా, వేప కొమ్మలను తమ ఇంటి గుమ్మాలకు వేలాడదీస్తారు. దీని వలన ఎలాంటి చీడలు ఇంట్లోకి రావని నమ్ముతారు. అయితే, హరేలీలో ప్రధానంగా కాలికి వెదురు బొంగులు కట్టుకుని దాని సహయంతో నడుస్తారు. దీన్ని గేడిరేసు అని పిలుస్తారు. కాగా, సీఎం భూపేష్ భగేల్ కూడా తన కాళ్లకు వెదురు బొంగులు కట్టుకుని ఉత్సాహంగా గడిపారు. ప్రజలతో కలిసి .. డ్యాన్స్ చేస్తూ సంతోషంగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH Chhattisgarh Chief Minister Bhupesh Baghel takes part in Hareli festival (of worshipping farm equipment and cows) celebrations today, in Raipur pic.twitter.com/0SARUhfkqt — ANI (@ANI) August 8, 2021 हमर हरेली तिहार#JaiJohar_HareliTihar pic.twitter.com/KGglfrwWei — Bhupesh Baghel (@bhupeshbaghel) August 8, 2021 -
పేదరైతు కొడుకు పాట.. నసీబ్‌ను మార్చేసింది
Viral Kid Sahdev Dirdo: సోషల్ మీడియా ఎప్పుడు.. ఎవరిని.. ఎలా ఫేమస్ చేస్తుందో ఊహించడం కష్టం. అయితే సానుకూల ధోరణి, లేదంటే వ్యతిరేక విమర్శలతోనైనా సరే పాపులర్ అయిపోతుంటారు. ఇక దక్కిన పాపులారిటీని నిలబెట్టుకోలేక కనుమరుగు అయ్యేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇదిలా ఉంటే ‘ జానే మేరీ జానేమన్.. బస్‌పన్ క్యా ప్యార్ మేరా..’ అంటూ ఓ సాంగ్ రీమిక్స్ వెర్షన్ నార్త్ ఇండియాను తెగ ఊపేస్తోంది. కారణం ఈ పాటను యూనిఫాల్లో ఉన్న సహదేవ్ అనే పిలగాడు అమాయకంగా పాడడమే. రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా చింద్‌ఘడ్‌కు చెందిన సహదేవ్ డిర్దో(14).. ఈ కుర్రాడు నార్త్ ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్ స్టార్. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ పిల్లాడి వీడియో మొత్తం దేశానికి చేరింది. ఆపై రీమిక్స్తోడై సోషల్ మీడియా ఊగిపోతోంది. టీవీ షోల దగ్గరి నుంచి ఫిల్మ్సెలబబ్రిటీల దాకా ఈ చిన్నారి గాత్రాన్ని ఎక్కించేసుకున్నారు. బుల్లితెర రియాలిటీ షోలు అయితే ప్రతీరోజూ ఈ పాటను వాడేసుకుంటున్నాయి. చివరికి ఆ చిన్నారి టాలెంట్-దక్కిన ఫేమ్కి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ సైతం ఫిదా అయ్యారు. సహదేవ్‌ను పిలిపించుకుని ఘనంగా సన్మానించారు కూడా. ఇంతకీ రెండేళ్ల క్రితం ఆ పిలగాడు పాడిన పాట ఎలా వైరల్ అయ్యిందంటే.. बचपन का प्यार....वाह! pic.twitter.com/tWUuWFP71f — Bhupesh Baghel (@bhupeshbaghel) July 27, 2021 కమలేష్ బారోత్ అనే ప్రైవేట్ ఆల్బమ్స్ సింగర్ కమ్ ఆర్టిస్ట్ కంపోజ్ చేసిన ‘బచ్పన్ కా ప్యార్’ సాంగ్ 2019లో యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. నార్త్‌లో రూరల్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది ఈ పాట. ఆ టైంలో స్కూల్లో తన టీచర్ కోసం ‘బచ్(స్)పన్ క్యా ప్యార్’ అంటూ పాడేశాడు ఏడో తరగతి చదివే సహదేవ్. ఆ పాట ఆ టీచర్‌ను ఆకట్టుకోవడంతో ఫోన్లో రికార్డు చేశాడు. ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినప్పటికీ.. అది వైరల్ అవ్వడానికి రెండేళ్లు పట్టింది. అటు ఇటు తిరిగి ఈ పాట ర్యాపర్ బాద్షా చేతికి చేరింది. ఇంకేం అతగాడు దాన్నీ రీమిక్స్ చేసి ఇన్స్టాగ్రామ్ వదిలాడు. దీంతో ఆ వాయిస్ ఎవరిదా? అనే ఆరాలు ఎక్కువయ్యాయి. చివరికి మీడియా హౌజ్‌ల చొరవతో ఎట్టకేలకు చిన్నారి సహదేవ్ వెలుగులోకి వచ్చాడు. View this post on Instagram A post shared by BADSHAH (@badboyshah) ఫ్రెండ్సే చూపించారు సహదేవ్ తండ్రి పేద రైతు. ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తల్లి కూలీ పనులకు వెళ్తుంటుంది. ఇక మనోడు గవర్నమెంట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంతకీ ఈ పాట ఎలా బట్టీపట్టావ్ అని అడిగితే.. తన ఇంట్లో టీవీ లేదని, రోడ్డు మీద టీవీల్లో చూసి బట్టీపట్టానని అమాయకంగా చెప్తున్నాడు సహదేవ్. ఇక ఇప్పుడు ఇంటర్నెట్లో తన పాట వైరల్ అయ్యింది కూడా తన స్నేహితుడి తండ్రి మొబైల్లోనే చూశాడట. ఊరంతా తనని ‘సూపర్‌స్టార్’ అని పిలుస్తున్నారని మురిసిపోతున్నాడు సహదేవ్. ఈ చిన్నారి కుటుంబ ఆర్థికస్థితి తెలిసి చాలామంది దాతలు సాయానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు ఈ సాంగ్ రీమిక్స్ కారకుడైన ర్యాపర్ బాద్షా.. ఈ కుర్రాడికి తనతో కలిసి ఆల్బమ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. View this post on Instagram A post shared by vishnu_singh91 (@only_mod031zzz) -
ప్రభుత్వ స్పందనపై ఆరోగ్యశాఖ మంత్రి అసంతృప్తి.. అసెంబ్లీ నుంచి వాకౌట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తనపై సొంత పార్టీ కాంగ్రెస్ ఎంఎల్ఏ చేసిన ఆరోపణలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదంటూ అసెంబ్లీ నుంచి ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్‌దేవ్ వాకౌట్ చేశారు. తనపై ఎంఎల్ఏ బృహస్పత్ సింగ్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వ స్పందన పరిమితంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసి, సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడింది. సొంత ప్రభుత్వ సమాధానంపై ఒక మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం ఎక్కడా జరగలేదని ఎద్దేవా చేసింది. ఎంఎల్ఏ చేసిన ఆరోపణలపై అసెంబ్లీ కమిటీతో విచారణ జరపాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తూ సభను స్తంభింపజేశారు. దీంతో సభ వాయిదా పడింది. తన కాన్వాయ్‌పై దాడి జరిగిందని, దీని వెనుక సింగ్ దేవ్ హస్తం ఉందని ఆదివారం ఎమ్మెల్యే బృహస్పత్ ఆరోపించారు. తన ప్రాణాలకు మంత్రి సింగ్‌దేవ్ నుంచి ముప్పుందన్నారు. అయితే వీటిని సింగ్‌దేవ్ కొట్టిపారేశారు. తనేంటో ప్రజలకు తెలుసన్నారు. హోంమంత్రి ప్రకటన మంగళవారం ఈ అంశంపై హోంమంత్రి తామరధ్వజ్ సాహు చేసిన ప్రకటనపై బీజేపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తనకు ఈ అంశంపై ఎలాంటి ఫిర్యాదు అందనందున ఎంఎల్ఏను కానీ, మంత్రిని కానీ దీనిపై మాట్లాడమని ఆదేశించలేనని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ గందరగోళం నడుమ సింగ్‌దేవ్ హఠాత్తుగా లేచి ‘‘జరిగింది చాలు! నేనూ మనిషినే, నా ఇమేజ్ గురించి అందరికీ తెలుసు’’ అని అన్నారు. స్పీకర్ సూచన మేరకు సీఎం తనను పిలిపించి మాట్లాడారని, ఇంత జరిగినా తిరిగి సభలో ప్రభుత్వ స్పందన చాలా పరిమితంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇచ్చేవరకు నేను సభకు హాజరు అవలేను. అప్పటివరకు సభా కార్యకలాపాల్లో పాల్గొనే అర్హత నాకు లేదని భావిస్తున్నాను.’’ అని ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై మీడియాతో మాట్లాడేందుకు ఆయన విముఖత చూపారు. సింగ్ చర్యతో సభలో పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగడంతో పదినిమిషాలు సభను వాయిదా వేశారు. తిరిగి సభ ఆరంభమవగానే బీజేపీ సభ్యులు ఈ అంశంపై ఆందోళనను కొనసాగించారు. ఇది సభా మర్యాదకు చెందిన అంశమని, అందువల్ల ఆరోపణలపై హౌస్ ప్యానెల్ విచారణ జరపాలని మాజీ సీఎం రమణ్ సింగ్ పట్టుబట్టారు. ఇదే సమయంలో సింగ్‌దేవ్ తిరిగి అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. తన సహచరులు ఫోన్ చేసి పరిస్థితి వివరించడంతో తిరిగి వచ్చినట్లు ఆయన మీడియాకు చెప్పారు. అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లి పరిస్థితిపై చర్చించారు. -
విషాదం: కుటుంబ కలహాలతో ఐదుగురు కుమార్తెలు సహా...
రాయ్‌పూర్: కుటుంబ కలహాలతో విసిగిన ఓ మహిళ తన ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. మహాసముంద్–బెల్సొందా మార్గంలోని ఇమ్లిభట కెనాల్ వంతెనపై రైలు పట్టాలపై పడి ఉన్న ఆరు మృతదేహాలను గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు. బెంచా గ్రామానికి చెందిన కేజవ్ రామ్ సాహు పొరుగూరు ముధెనాలోని రైస్ మిల్లులో కార్మికుడు పనిచేస్తున్నాడు. బుధవారం మద్యం తాగి ఇంటికి వచ్చిన కేజవ్‌రామ్ ఇంటి ఖర్చుల విషయమై భార్య ఉమా సాహు(45)తో గొడవపడ్డాడు. రాత్రి భోజనం తర్వాత అతడు నిద్రపోయాడు. భర్తతో జరిగిన తగవుతో తీవ్ర మనస్తాపం చెందిన ఉమా సాహు, కుమార్తెలు అన్నపూర్ణ(18), యశోద(16), భూమిక(14), కుంకుం(12), తులసి(10)లను వెంట తీసుకుని అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని రైల్వే వంతెనపైకి వెళ్లింది. వేగంగా వెళ్తున్న రైలు కిందపడి వారంతా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. వారి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు. కనిపించకుండాపోయిన తన భర్య, కూతుళ్ల కోసం బుధవారం రాత్రే వెదికాననీ, ఉదయానికల్లా వారు తిరిగి వస్తారని భావించినట్లు కేజవ్ సాహు పోలీసులకు తెలిపాడు. కాగా, ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం భూపేశ్ బఘేల్ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ఇంటర్నెట్ సౌకర్యం లేని వారికీ జీవించే హక్కుంది -
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తొలి సంతకం నాదే: సీఎం
న్యూఢిల్లీ: జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఛత్తీస్‌ఘఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పోల్చారు. బీజేపీని ఏదైనా అనండి కానీ, భారత్‌ను విడగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం జైలుకు పంపుతామంటూ ఇటీవల అమిత్ షా హెచ్చరించిన విషయం తెలిసిందే. అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛత్తీస్‌ఘడ్ సీఎం.. హిట్లర్ సైతం తనను ఎవరేమన్నా పర్వాలేదని, జర్మనీని మాత్రం అనడానికి వీళ్లేదని తన ప్రసంగాల్లో చెప్పేవారని, 'మోటా భాయ్, ఛోటా భాయ్' సైతం అదే స్వరంతో, అదే భాషలో మాట్లాడుతున్నారని అన్నారు. జాతీయ పౌర రిజిస్టర్ అమలు చేస్తామని ఒకరు లేదని మరొకరు.. ఇందులో ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేల్చాలన్నారు. ఎన్ఆర్సీని అమలు చేస్తే మాత్రం వ్యతిరేకంగా సంతకం చేసే మొదటి వ్యక్తిని తానే అవుతానని బఘేల్ పునరుద్ఘాటించారు. ఎన్ఆర్సీ అమలు చేయడం వల్ల భూముల్లేని నిరుపేదలు, నిరక్షరాస్యులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. (మోదీ-షా ఇద్దరిలో ఎవరు నిజం : బాఘేలా) -
మోదీ-షా ఇద్దరిలో ఎవరు నిజం..!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ-షా మధ్య విభేదాలు ఉన్నాయని, వీరిద్దరి మధ్య అంతర్గత సంఘర్షణతో దేశ ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏపై ఇద్దరూ విరుద్ధ ప్రకటన చేస్తూ.. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం రాయ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మోదీ నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే, రెండోసారి అధికారంలోకి వచ్చాక అమిత్ షా నేతృత్వంలో ఆర్టికల్ 370 రద్దు, ఎన్ఆర్సీ, సీఏఏ వంటి వివాదాస్పద చట్టాలు తీసుకువచ్చారని విమర్శించారు. వీటన్నింటిపై మోదీ-షా మధ్య అవగాహన లోపం ఎంతో ఉందని భాఘేలా అభిప్రాయపడ్డారు. పలు సందర్భాల్లో ఎన్ఆర్సీని అమలు చేసే ప్రసక్తేలేదని మోదీ ప్రకటిస్తే.. అమలు చేసి తీరుతామని అమిత్ షా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వీరిద్దరిలో ఎవరు నిజమని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత.. అమిత్ షానే అంతా తానై వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన విమర్శించారు. ప్రధానంగా ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగ సమస్య దేశ ప్రజలను తీవ్రంగా వెంటాడుతోందని సీఎం అన్నారు. అయినా.. వీటిపై ఎవరూ కనీసం చర్చ కూడా జరపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద చట్టాలను తెరపైకి తీసుకువస్తోందని మండిపడ్డారు. కాగా సీఎం వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష నాయకులు, కేంద్రంలో అధికార బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎందరో తరలిరాగా అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. తెల్లరంగు కుర్తా పైజామా, ముదురు నీలం రంగు నెహ్రూ జాకెట్ ధరించి వచ్చిన 44 ఏళ్ల ఈ ఆదివాసీ నేత అందరినీ ఆకర్షించారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఆరు నెలలు తిరక్కముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడంతో విపక్షాల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 47 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ప్రమాణ స్వీకారానికి హాజరైన వారిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లు ఉన్నారు. విపక్షాల బలం పెరుగుతూ ఉండడంతో వీరంతా చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకున్నారు. సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు అలంఘీర్ ఆలమ్, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రామేశ్వర్ ఒరాయన్, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద భోక్త కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని అభినందనలు జార్ఖండ్ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన సోరెన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తరఫు నుంచి వీలైనంత సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎంగా రెండోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన శిబూసోరెన్ వారసుడిగా హేమంత్ సోరెన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఆయన రాష్ట్ర పగ్గాలను చేపట్టడం ఇది రెండోసారి. సోరెన్ గతంలో ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే సీఎంగా కేవలం 14 నెలలు మాత్రమే ఉన్నారు. బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి హేమంత్ పకడ్బందీ వ్యూహాలనే రచించారు. -
గిరిజనులతో చిందేసిన రాహుల్
-
రాహుల్ గాంధీ వెరైటీ డాన్స్ చూశారా?
రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. సంప్రదాయ తలపాగా ధరించి... డోలు వాయిస్తూ ఉల్లాసంగా గడిపారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న జాతీయ గిరిజన నృత్య మహోత్సవాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి రాహుల్ వేదిక మీద సందడి చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ మేరకు... ‘ఇది ఒక ప్రత్యేకమైన పండుగ. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వాన్ని రక్షించేందుకు ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా ఈ ఉత్సవంలో 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆరు దేశాలకు చెందిన దాదాపు 1350పైగా గిరిజన కళాకారులు పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించనన్ను ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ సహా కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు హాజరయ్యారు. కాగా ఈ నృత్యోత్సవంలో గిరిజన వివాహాలు, ఆచార వ్యవహారాలు, పండుగలు, వ్యవసాయ పనులు తదితర విషయాలను ప్రతిబింబించేలా కళాకారులు నృత్యరీతులు ప్రదర్శించనున్నారు. మొత్తం 29 గిరిజన సమూహాలు 43కు పైగా సంప్రదాయ పద్ధతులను నృత్య రూపంలో ఆవిష్కరించనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితర నాయకులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. #WATCH Chhattisgarh: Congress leader Rahul Gandhi takes part in a traditional dance at the inauguration of Rashtriya Adivasi Nritya Mahotsav in Raipur. pic.twitter.com/HpUvo4khGY — ANI (@ANI) December 27, 2019 -
మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం : కాంగ్రెస్ సీఎం
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ హితం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతునిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ఎంతగా విభేదించినా అది దేశ అంతర్గత విషయమన్నారు. భఘేల ఢిల్లీ వెళ్తూ స్థానిక విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ‘విదేశీ వ్యవహార విషయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వేసే ప్రతీ అడుగుకీ, రాజకీయాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇందులో వేరే మాటకు తావులేద’ని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370డి ఆర్టికల్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. ఈ పరిణామం అనంతరం జమ్ముకశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని బీజేపీ నిలదీయడంతో తర్వాత రాహుల్‌గాంధీ తేరుకొని పాక్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శించినా, కాంగ్రెస్ వైఖరిపై ప్రజలకు అనుమానం కలిగించడంలో అధికార పార్టీ సఫలీకృతమయిందనే భావన నెలకొంది. దీనిపై భఘేల స్పందిస్తూ.. ‘దేశం లోపల మేం కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను గట్టిగా నిలదీస్తాం, ప్రశ్నలు సంధిస్తాం, సమాధానాలు రాబడ్తాం. అయితే అది దేశ అంతర్గతం. ఈ విషయాలు ఇమ్రాన్‌కు ఎందుకు? అతను తన దేశ పరిస్థితులపై దృష్టి సారిస్తే మంచిద’ని హితవు పలికారు. -
కన్నీటిపర్యంతమైన ముఖ్యమంత్రి బఘేల్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కన్నీటి పర్యంతమయ్యారు. తన స్థానంలో ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (సీపీసీసీ) అధ్యక్ష పదవిని మోహన్ మార్కమ్ చేపడుతున్న సందర్భంగా ఆయన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన బఘేల్ పార్టీని ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో ఆయన వారసుడిగా సీపీసీసీ పదవిలో మార్కమ్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఆయన పదవీ స్వీకార కార్యక్రమం శనివారం రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బఘేల్.. గత ఐదేళ్లుగా తనతో కలిసి పనిచేసిన పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన నాయకత్వంలో పార్టీకి సహకరించిన వారిని గుర్తుచేసుకున్నారు. ‘2013లో ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత రాహుల్ గాంధీ సీపీసీసీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఘోరపరాజయం అనంతరం పార్టీ నాయకులు ప్రారంభించిన పోరాటం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చే వరకు కొనసాగింది' అని బఘేల్ పేర్కొన్నారు. సీపీసీపీ నూతన అధ్యక్షుడు మోహన్ మార్కమ్ కష్టపడి పనిచేసే వ్యక్తి, నిరాడంబరంగా ఉంటూ అందరితో కలిసిపోతారని ఆయన ప్రశంసించారు. ఈ నెల 28న సీపీసీసీ అధ్యక్షుడిగా మోహన్ మార్కమ్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. -
రాజద్రోహం కేసు ; ఆయనవల్లే బయటపడ్డా..!
రాయ్‌పూర్ : ఇన్వర్టర్ల తయారీ సంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కైందంటూ ప్రభుత్వంపై విమర్శలకు దిగిన ఓ వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేవిధంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశాడంటూ రాజనంద్‌గాం జిల్లాకు చెందిన మంగీలాల్ అగర్వాల్‌పై రాజద్రోహం కేసు నమోదు చేశారు. అయితే, ఈఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మంగీలాల్‌పై పెట్టిన రాజద్రోహం కేసును ఉపసంహరించుకొన్న పోలీసులు శనివారం ఆయనను విడుదల చేశారు. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవడంలో ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ పాత్ర ప్రధానమైందని మంగీలాల్ చెప్పుకొచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి : ప్రభుత్వంపై విమర్శలు; రాజద్రోహం కేసు, అరెస్టు) -
ఇన్వర్టర్ల అమ్మకాలు పెంచాలనే పవర్ కట్..
రాయ్‌పూర్ : కరెంటు కోతల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించిన ఓ పౌరుడిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేవిధంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశాడంటూ రాజద్రోహం కేసు నమోదు చేశారు. రాజనంద్‌గాం జిల్లాకు చెందిన మంగీలాల్ అగర్వాల్ పవర్‌కట్‌ను నిరసిస్తూ ఓ వీడియో రూపొందించారు. ఇన్వర్టర్ కంపెనీతో.. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా కరెంటు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్వాకం వల్లే ప్రతీ రెండు గంటలకొకసారి 10 నుంచి 15 నిమిషాల పాటు కరెంటు పోతోందని పేర్కొన్నారు. ఇన్వర్టర్ల అమ్మకాలు పెంచుకునే క్రమంలో ఆయా ఉత్పత్తుల కంపెనీలు మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉందని.. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత జటిలం కానుందని వ్యాఖ్యలు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ప్రభుత్వ, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అగర్వాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. దీంతో భూపేశ్ బఘేల్ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ బీజేపీ విమర్శించింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అమాయకులను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడింది. -
‘మోదీకి మానసిక వైద్యం ఎంతో అవసరం’
రాయ్‌పూర్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతి పరుడు అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ స్పందిస్తూ.. మోదీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా నిద్రలేకపోవడం మూలంగా మోదీకి మతిభ్రమించిందని, వెంటనే ఆయన్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని బాఘేల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ రోజుకు మూడు, నాలుగు గంటలే నిద్రపోతున్నారని అందుకే ఆయనకు ఆ పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా మోదీపై కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్న భూపేష్ బాఘేల్.. తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. సరిగా నిద్రపోనివారు మానసిక అనారోగ్యానికి గురవుతుంటారని, మోదీకి కూడా అలాంటి జబ్బే వచ్చిందని పేర్కొన్నారు. మోదీని మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయి చాలా ఏళ్లైందని.. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటమేంటని బాఘెల్ ప్రశ్నించారు. రాజీవ్ హయాంలో ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను మోదీ మర్చిపోవడం దారుణమన్నారు. ఆయన పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని గుర్తుచేశారు. కాగా మే 4న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘ రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్‌గా దేశ రాజకీయాల్లో వచ్చారు. కానీ నంబర్ వన్ అవినీతి పరుడిగా జీవితం ముగించారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ప్రజ్ఞ అప్పట్లో ఒకరిని పొడిచింది
జబల్పూర్: మాలేగావ్ కేసులో నిందితురాలు, భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్‌పై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2001లో ఆమె ఒక వ్యక్తిని పొడిచారని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘ప్రజ్ఞా ఠాకూర్‌కు ఛత్తీస్‌గఢ్‌తో ఒక సంబంధం ఉంది. ఆమె మరిది బిలాయ్‌గఢ్‌లో పనిచేసేవారు. అప్పట్లో ఆమె దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉండేది. 2001లో బిలాయ్‌గఢ్‌లో శైలేంద్ర దేవ్‌గణ్ అనే వ్యక్తి ఛాతీపై ఆమె కత్తితో పొడిచింది. ఆమె తరచూ గొడవల్లో తలదూర్చేది. ఆమెది నేర స్వభావం. అంతేతప్ప, సాధ్వి మాదిరిగా మాత్రం కాదు’ అని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి హితేశ్ బాజ్‌పేయి తీవ్రంగా స్పందించారు. ‘సీఎం సారీ చెప్పాలి. లేదంటే మేం వేసే పరువునష్టం కేసుకు సిద్ధపడాలి’ అని హెచ్చరించారు. -
‘ఆ అయిదు పథకాల పేర్లు మారాయి’
రాయ్‌పూర్ : ప్రభుత్వాలు మారగానే కీలక విధానాల సంగతి ఎలా ఉన్నా ప్రముఖ పథకాలు, ప్రాజెక్టుల పేర్లు మారుతుంటాయి. ఇదే ఒరవడిలో చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి భూపేశ్ బఘేల్ సారథ్యంలో నూతనంగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, దివంగత జన సంఘ్ నేత పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పేరుతో ఉన్న 5 పధకాల పేర్లు మార్చింది. పురపాలక, అభివృద్ధి శాఖలకు చెందిన ఈ పధకాలకు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ల పేర్లు పెట్టారు. ఆయా పధకాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం సోమవారం రాత్రి నోటికేషన్ జారీ చేసిందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యా స్వావలంభన యోజన పథకాన్ని రాజీవ్ గాంధీ స్వావలంభన యోజనగా, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ సర్వసమాజ్ మంగళ భవన్‌ను ఇక నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సర్వసమాజ్ మంగళభవన్‌గా వ్యవహరిస్తారు. కాగా పండిట్ దీన్‌దయాళ్ శుద్ధి నీటిని ఇకమీదట ఇందిరా ప్రియదర్శిని శుద్ధ పేజల్‌గా పిలుస్తారు. కాగా అభివృద్ధి పధకాల పేర్ల మార్పు నిర్ణయాన్ని చత్తీస్‌గఢ్ మాజీ సీఎం, బీజేపీ నేత రమణ్ సింగ్ ఖండించారు. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పేర్ల మార్పు తతంగానికి నిరసనగా తాము ఆందోళనల బాట పడతామని చత్తీస్‌గఢ్ మాజీ సీయం, బీజేపీ నేత రమణ్ సింగ్ వాపోయారు. ప్రభుత్వ తీరుపై తాము చత్తీస్‌గఢ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని రమణ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మెంటాలిటీకి చత్తీస్‌గఢ్ సర్కార్ తీరు నిదర్శమని ఆయన చెప్పకొచ్చారు. -
కాంగ్రెస్ సీఎంల వివాదాస్పద నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొలువుతీరిన కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రులు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరవు తీస్తున్నాయా? రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను అవి దెబ్బతీయనున్నాయా? అసలు ఆ వివాదాస్పద నిర్ణయాలు ఏమిటీ? మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్లో వెలువడగానే ముఖ్యమంత్రి పదవికి జ్యోతిరాదిత్య సింధియాకు బదులుగా కమల్‌నాథ్‌ను రాహుల్ గాంధీ ఎంపిక చేయడమే మొట్టమొదట వివాదాస్పదమైంది. 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్‌నాథ్ పాత్రను తప్పుపట్టిన నానావతి కమిషన్, ఆయన నుంచి వివరణ కోరింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2015లో సిక్కుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. అలాంటప్పుడు సీఎం పదవికి ఆయన్ని దూరంగా పెట్టి ఉంచాల్సింది. పార్టీకి అతి తక్కువ మెజారిటీ ఉన్నందున ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి కమల్‌నాథ్ వంటి అనుభవజ్ఞులు ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ సిక్కుల ఊచకోతతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని సీఎంను చేశారంటూ ఆరోపించడం ఇక్కగ గమనార్హం. ఇక కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. యూపీ, బీహార్ నుంచి వస్తున్న వలసదారులు స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని కూడా ఆయన చెప్పారు. ఇక రాష్ట్ర సచివాలయంలో గత 13 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ‘వందేమాతరం’ గీతాలాపనను నిలిపివేయడం. పైగా ఆ ఆనవాయితీని మరింత మెరుగ్గా అమలు చేద్దామనే ఉద్దేశంతోనే రద్దు చేశానంటూ సమర్థించకున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసు బ్యాండ్తోని వందేమాతర గీతాలాపన పునరుద్ధరిస్తున్నట్లు కమల్‌నాథ్ ప్రకటించాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రం నుంచి జైలుకెళ్లిన వారికి బీజేపీ ప్రభుత్వం 2008లో ప్రవేశపెట్టిన నెలకు పాతిక వేల రూపాయల పింఛన్ పథకాన్ని నిలిపివేయడం కమల్ నాథ్ సర్కార్ తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అంతే చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కూడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. 2014 నుంచి 2017 వరకు బస్తర్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచే సిన ఎస్ఆర్పీ కల్లూరిని రాష్ట్ర అవినీతి వ్యతిరేక బ్యూరో, ఆర్థిక నేరాల విభాగంకు అధిపతిగా నియమించడం వివాదాస్పదమైంది. ఆ మూడేళ్ల కాలంలో ఆయన అనేక బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడ్డారని, ప్రజలపై దౌర్జన్యం చేయడంతోపాటు రేప్‌లు చేశారన్న ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. అప్పుడు కల్లూరిని జైల్లో పెట్టాలని చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో డిమాండ్ చేసిన భూపేష్ ఆయన సీఎం హోదాలో పదవిలోకి తీసుకోవడం వివాదాస్పదమైంది. ఇలాంటి నిర్ణయాలు మొత్తం కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయకపోయినా ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
ఆ మంత్రులంతా కోటీశ్వరులే!
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఇటీవలే తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన ఆయన మొత్తం 12 మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. కాగా ఆయన కేబినెట్లోని మంత్రులంతా కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్), ఛత్తీస్‌గఢ్ ఎలక్షన్ వాచ్ తాజాగా నివేదిక విడుదల చేశాయి. వీరందరి సగటు ఆస్తి విలువ రూ. 47.13 కోట్లని వెల్లడించాయి. ఆయన ఆస్తి విలువ రూ. 500 కోట్లు! భూపేశ్ బఘేల్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యేలందరిలో అంబికాపూర్ ఎమ్మెల్యే టీఎస్ బాబా రూ. 500.01 కోట్ల సంపాదనతో అగ్రస్థానంలో నిలవగా.... కోంటా నియోజకవర్గానికి చెందిన గిరిజన నేత కవాసి లక్ష్మా రూ. 1.9 కోట్ల ఆస్తి కలిగి ఉండి చివరి స్థానం పొందారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఇక సీఎం భూపేశ్ బఘేల్ ఆస్తి రూ. 21.5 కోట్లుగా పేర్కొన్న ఏడీఆర్... మిగిలిన 9 మంది మంత్రుల ఆస్తుల విలువ రూ. 8 కోట్లలోపే అని పేర్కొంది. -
సీఎం సలహాదారుగా అశ్లీల సీడీ నిందితుడు
రాయ్‌పూర్ : గత ఏడాది కలకలం రేపిన సెక్స్ సీడీ ఉదంతంలో పేరు వినిపించిన సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మ చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ రాజకీయ సలహాదారుగా నియమితులయ్యారు. అశ్లీల సీడీ కేసులో బీజేపీ నేత ప్రకాష్ బజాజ్ ఫిర్యాదు మేరకు 2017 అక్టోబర్‌లో వర్మను ఘజియాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. సీడీ పేరుతో తనను బ్లాక్ మెయిల్ చేశారని పాండ్రి పోలీస్ స్టేషన్లో ప్రకాష్ బజాజ్ ఫిర్యాదు చేయడంతో వర్మను అరెస్ట్ చేశారు. ఇక వర్మతో సహా సీఎంకు నలుగురు సలహాదారులను నియమిస్తూ చత్తీస్‌గఢ్ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హిందీ దినపత్రిక ఎడిటర్‌గా రాజీనామా చేసి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మరో జర్నలిస్టు రుచిర్ గార్గ్‌ను సీఎం మీడియా సలహాదారుగా నియమించారు. ఇక ప్రదీప్ శర్మ ప్రణాళిక, విధాన, వ్యవసాయ సలహాదారుగా, రాజేష్ తివారీ పార్లమెంటరీ సలహాదారుగా నియమితులయ్యారని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. -
6100 కోట్ల రైతు రుణ మాఫీ
రాయ్‌పూర్/గువాహటి/ భువనేశ్వర్: దాదాపు రూ.6,100 కోట్ల స్వల్పకాలిక పంట రుణాలను మాఫీ చేస్తామని ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ప్రకటించారు. బఘేల్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీలోపు సహకార బ్యాంకులు, ఛత్తీస్‌గఢ్ గ్రామీణ బ్యాంకుల నుంచి 16.65 లక్షల మంది రైతులు తీసుకున్న రూ.6,100 కోట్ల మేర రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించారు. రుణమాఫీతో పాటు వరి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.2,500కు పెంచుతామన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగు పడినట్లయింది. అదే బాటలో అసోం.. సుమారు 8 లక్షల మంది రైతులకు చెందిన రూ.600 కోట్ల రుణాలను రద్దు చేయనున్నట్లు అసోంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల రైతు రుణాల్లో 25 శాతం వరకు రద్దు అవుతాయి. దీంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పంట రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాల్లో రూ.10వేల సబ్సిడీ ఇస్తామని తెలిపారు. మేమూ చేస్తాం ఒడిశా బీజేపీ తమకు అధికారమిస్తే రైతుల రుణాలన్నిటినీ రద్దు చేస్తామని ఒడిశా బీజేపీ వాగ్దానం చేసింది. రాష్ట్రంలో 2019లో ఎన్నికలు జరగనున్నాయి. ‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణాలన్నీ రద్దు చేస్తాం. రైతులకు వడ్డీలేని రుణాలిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బసంత్ పాండా తెలిపారు. ఇదే హామీని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ ఇంతకుమునుపే ఇచ్చారు. -
కుర్చీ వెనుక కహాని!
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా భూపేశ్ బఘేల్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక్క రోజు ముందు వరకు రాజకీయం రోజుకో రంగు మారింది. సీఎం కుర్చీకోసం భూపేశ్ బఘేల్, టీఎస్ సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహు, చరణ్‌దాస్ మహంత్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. చరణ్‌దాస్ మహంత్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అంతగా కష్టపడిందేమీ లేదన్న భావన అందరిలోనూ ఉంది. దీంతో ఆయన మొదట్లోనే సీఎం రేసు నుంచి తప్పుకున్నారు. తామ్రధ్వజ్ సాహుకు జనాకర్షణ అంతగా లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. ఇక మిగిలింది భూపేశ్ బఘేల్, సింగ్‌దేవ్. వీరిద్దరూ సీఎం పదవి కోసం కాంగ్రెస్ అధిష్టానం వద్ద గట్టిప్రయత్నాలే చేశారు. ఇద్దరికీ చెరి రెండున్నరేళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ భావించారు. రాజీ కుదరకపోతే సాహును సీఎంను చేయాలని రాహుల్ భావించారు. ఈ విషయాన్ని పార్టీలో అంతర్గతంగా ప్రకటించారు. కానీ, ప్రజాప్రతినిధుల మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్న రాహుల్ సమస్య పరిష్కారానికి సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేని రంగంలోకి దించారు. పార్టీకి చెందిన మొత్తం 68 మంది ఎమ్మెల్యేలతో ఖర్గే విడివిడిగా మాట్లాడారు. శక్తి యాప్ ద్వారా కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఖర్గే చేసిన కసరత్తులో సింగ్‌దేవ్‌కే భారీగా మద్దతు లభించింది. దీంతో, ఛత్తీస్‌గఢ్ కాబోయే సీఎం సింగ్‌దేవ్ అన్న ప్రచారం ఒక రోజంతా సాగింది. తన నివేదికతో మల్లికార్జున ఖర్గే ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలుసుకున్నారు. అక్కడ మళ్లీ సీన్ మారిపోయింది. ఓబీసీ కార్డు బఘేల్‌కు అనుకూలంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్‌కు కారణం ఓబీసీల ఓట్లే. మరో అయిదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఓబీసీ నాయకుడినే సీఎంను చేయాలని పార్టీ ప్రధానకార్యదర్శి పీఎల్ పూనియా వంటి నేతలు రాహుల్‌కి సలహా ఇచ్చారు. దీంతో సింగ్‌దేవ్ స్థానంలో బఘేల్ పేరు చేరింది. సీఎం కుర్చీలో బఘేల్ ఎంత కాలం ఉంటారన్నది అనుమానమే. బఘేల్, సింగ్‌దేవ్‌లను చెరో రెండున్నరేళ్లు సీఎంగా చేయడానికే రాహుల్ నిర్ణయానికి వచ్చారని, లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున మొదటి ప్రాధాన్యం బఘేల్‌కు ఇచ్చారని సమాచారం. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పనితీరు వంటివాటి ఆధారంగానే కాంగ్రెస్ అధిష్టానం భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఎమ్మెల్యేల అండదండలు, కార్యకర్తల మద్దతు సింగ్‌దేవ్‌కే ఉన్నప్పటికీ ఓబీసీ కార్డు బఘేల్‌ను సీఎం పీఠానికి దగ్గర చేసింది. -
ముగ్గురు సీఎంల పట్టాభిషేకం
ఆ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు ప్రమాణ స్వీకారం చేయడం ఆనంద డోలికల్లో ముంచితే, మరోవైపు ఆ పార్టీని వెంటాడుతున్న సిక్కుల ఊచకోత కేసులో తీర్పు ఇరకాటంలో పడేసింది. 1984 నాటి ఈ కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌ను హైకోర్టు దోషిగా తేల్చింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన గహ్లోత్, కమల్‌నాథ్, బఘేల్ సీఎంలుగా ప్రమాణం చేయగా.. సజ్జన్‌కుమార్‌కు యావజ్జీవ శిక్ష పడింది. సిక్కుల ఊచకోతలో పాపం మూటగట్టుకున్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ సీఎంగా ఎలా ఎంపిక చేస్తారని బీజేపీ నిలదీసింది. ఈ ఘటనలన్నీ ఒకే రోజు జరగడం గమనార్హం. సోమవారం ఉదయం రాజస్తాన్ సీఎంగా అశోక్ గహ్లోత్ జైపూర్‌లో, మధ్యాహ్నం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ భోపాల్‌లో, సాయంత్రం రాయ్‌గఢ్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎంగా భూపేశ్ బఘేల్ ప్రమాణం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఆడంబరంగా జరిగిన ఈ మూడు కార్యక్రమాలకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్, ఆర్జేడీ తదితర ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్‌నాథ్ రైతుల రుణమాఫీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. తర్వాత ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎం బఘేల్ రైతుల స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తానని చెప్పారు. గహ్లోత్ ముచ్చటగా మూడోసారి.. జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ రాజస్తాన్‌కు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సోమవారం ఉదయం జైపూర్‌లోని ఆల్బర్ట్ హాల్లో కన్నులపండువగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కల్యాణ్‌సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రిగా యువనేత సచిన్ పైలట్ ప్రమాణం చేశారు. రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి అయిన నాలుగో నేతగా గహ్లోత్ రికార్డు సృష్టించారు. గహ్లోత్ మొదటి సారిగా 1998లో, ఆ తర్వాత 2008లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆల్బర్ట్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, మాజీ సీఎం వసుంధరా రాజే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముక్తిమోర్చా నేత హేమంత్ సోరేన్, జార్ఖండ్ వికాస్ మోర్చా నేత బాబూలాల్ మరాండీ, కర్ణాటక, ఏపీ సీఎంలు కుమారస్వామి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. దాదాపు 11వేల మంది కూర్చునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో ఆల్బర్ట్ హాల్ కిటకిటలాడింది. చాలా మంది కుర్చీల పైకెక్కి తమ అభిమాన నేతల ప్రమాణ స్వీకారాన్ని ఆసక్తిగా తిలకించారు. దీంతో కొందరు నేతలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు హైరానా పడాల్సి వచ్చింది. గహ్లోత్, పైలట్ ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరు నేతల అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు చేపట్టింది. రాజధానికి వచ్చే రోడ్లన్నిటిలోనూ సోమవారం ట్రాఫిక్ స్తంభించింది. సఫా ధరించిన పైలట్ సచిన్ పైలట్(41) ప్రమాణ స్వీకారం సందర్భంగా తెల్లటి కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్‌తోపాటు తలపై రాజస్తానీ స్టయిల్ ఎర్రటి తలపాగా ‘సఫా’ ధరించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు ‘సఫా’ ధరించబోనంటూ 2014లో ఆయన శపథం చేశారు. గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన పైలట్..ఈసారి అసెంబ్లీకిఎన్నికయ్యారు. గహ్లోత్‌కు అభినందనలు చెబుతున్న మాజీ సీఎం వసుంధరా రాజే తలపాగాతో పైలట్ రుణమాఫీపై తొలి సంతకం మధ్యప్రదేశ్ 18వ సీఎంగా కమల్‌నాథ్ భోపాల్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్‌పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులెవరూ లేకుండా ఆయన ఒక్కరే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం లభించింది. రాహుల్‌కు ఎదురెళ్లిన కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఆయన్ను వేదికపైకి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేష్ త్రివేది, కర్ణాటక, పుదుచ్చేరి సీఎంలు కుమారస్వామి, నారాయణస్వామి, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు.. కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాశ్ జోషి, బాబూలాల్‌గౌర్ హాజరయ్యారు. అయితే, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. రూ.2 లక్షల రుణమాఫీ.. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నూతన సీఎం కమల్‌నాథ్ రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. దీంతో రాహుల్ గాంధీ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అవుతాయి. సీఎం సంతకం అయిన వెంటనే రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్ అరోరా ‘మధ్యప్రదేశ్‌లోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో స్వల్ప కాలిక రుణాలు తీసుకున్న అర్హులైన రైతులకు చెందిన రూ.2 లక్షల లోపు రుణాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. భోపాల్‌లో సింధియా, కమల్‌నాథ్‌లతో చేతులు కలిపిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజకీయ లబ్ధి కోసమే అల్లర్ల అంశం 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటనలకు సంబంధించి తనపై ఎటువంటి కేసులు లేవని, చార్జిషీట్లు కూడా దాఖలు కాలేదని మధ్యప్రదేశ్ కొత్త సీఎం కమల్‌నాథ్ స్పష్టం చేశారు. ఈ అల్లర్లలో తన ప్రమేయం ఉందంటూ వెలువడుతున్న వార్తలు రాజకీయ లబ్ధి కోసం లేవనెత్తినవేనన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడా రు. ‘గతంలో పలుమార్లు ప్రమాణ స్వీకారం చేశాం. ఈ రోజు కూడా చేశా. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జిగా కూడా పనిచేశా. అప్పట్లో నాపైన ఎలాంటి కేసులు లేవు. చార్జిషీటు కూడా లేదు. ఇప్పుడే ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది? దీని వెనుక రాజకీయ కారణాలున్నాయన్న విషయం మీకు తెలుసు’ అని కమల్‌నాథ్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం బఘేల్ రాయ్‌పూర్: కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లోని బల్బీర్ జునేజా ఇండోర్‌స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, భారీ వర్షం రాకతో ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం సైన్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి మార్చాల్సి వచ్చింది. పెథాయ్ తుపాను ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ముందుగా సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కురియడంతో కార్యక్రమ వేదికను హడావుడిగా బల్బీర్ జునేజా ఇండోర్ స్టేడియంలోకి మార్చారు. బఘేల్‌తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ టీఎస్ సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహు కూడా ఈ కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, మాజీ సీఎం రమణ్‌సింగ్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రమాణం అనంతరం సీఎం బఘేల్ చెప్పారు. రాష్ట్రంలో 2018, నవంబర్ నాటికి 16.65 లక్షల మంది రైతులు సహకార, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ.6,100 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారని, వీటన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పారు. బఘేల్‌తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఐక్యతా రాగం...: సోమవారం జైపూర్‌లో అశోక్ గహ్లోత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఐక్యత తెలుపుతున్న నేతలు..ఎంకే స్టాలిన్, చంద్రబాబు, కమల్‌నాథ్, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి, రాహుల్, శరద్‌యాదవ్, జ్యోతిరాదిత్య సింథియా, మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ అందరూ కలిసి ఒకే బస్సులో...: గహ్లోత్ ప్రమాణస్వీకార వేదిక వద్దకు బస్సులో వెళ్తున్న రాహుల్, మన్మోహన్, శరద్ పవార్, శరద్ యాదవ్, స్టాలిన్ తదితరులు మేనల్లుడికి అభినందనలు..: జ్యోతిరాదిత్యను ఆప్యాయంగా హత్తుకున్న మేనత్త, రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే -
బీజేపీ నేతలకు పక్కలో బల్లెం!
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బగేల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సమక్షంలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. కాగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. అయితే గిరిజన వాసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా పేరొందిన ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడటంలో భూపేశ్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో బఘేల్‌తోపాటు సీనియర్ నేతలు టీపీ సింగ్ దేవ్, తమరాథ్‌వాజ్ సాహు, చరణ్‌దాస్ మహంత్‌లు సీఎం రేస్‌లో ఉండటంతో పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోయింది. దశల వారీగా పార్టీ సీనియర్ నేతలు, ఆశావహులతో చర్చలు జరిపిన అనంతరం భూపేష్‌ను సీఎంగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకే నియోజక వర్గం... 1986లో యూత్ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1993లో పటాన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బఘేల్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటైన(2000) తర్వాత 2003లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన అదే స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా పటాన్ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేష్ తొలిసారిగా సీఎంగా పదవి చేపట్టారు. బీజేపీకి పక్కలో బల్లెం ఛత్తీస్‌గఢ్‌ని దాదాపు 15 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీకి చెక్ పెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించిన భూపేశ్ బఘేల్ మధ్యప్రదేశ్‌లోని(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) దుర్గ్ జిల్లాలో ఓ సాధారణ రైతు కుటుంబంలో 1961, ఆగస్టు 23న జన్మించారు. చందూలాల్ చంద్రశేఖర్ ప్రోద్బలంతో 1980 దశకం ప్రారంభంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 1994–95లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. క్రమంగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. కుర్మి సామాజిక వర్గానికి చెందిన భూపేశ్‌కు రాష్ట్రంలో ఉన్న 52 శాతం మంది ఓబీసీల్లో మంచి పలుకుబడి ఉంది. 1993లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన బఘేల్.. అజిత్ జోగీతో పాటు దిగ్విజయ్ సింగ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. భూపేశ్ బఘేల్ సంఘ సంస్కర్తగా పేరుపొందారు. పేదలు ఆర్థికంగా చితికిపోకుండా ఉమ్మడి మధ్యప్రదేశ్ లో సామూహిక వివాహాలు జరిపించారు. అంతేకాకుండా బీజేపీ నేతలకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ప్రతీ సందర్భంలోనూ బీజేపీని ఇరుకున పెట్టేలా మాట్లాడటంతో పాటు ఓ బీజేపీ నేతకు సంబంధించిన అశ్లీల దృశ్యాల సీడీని విడుదల చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో బఘేల్ జైలుకు సైతం వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత బఘేల్‌తో పాటు ఆయన భార్య భూకబ్జాలకు పాల్పడ్డారని రమణ్‌సింగ్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. అంతేకాకుండా సొంత పార్టీలోనూ ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నింటిని ఓపికగా సహించిన భూపేశ్ బఘేల్ నేడు ఛత్తీస్‌గఢ్ మూడో ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు. బఘేల్‌కు ముందు అజిత్ జోగి(మూడేళ్లు), రమణ్‌సింగ్(15 సంవత్సరాలు) ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. -
బీజేపీకి పక్కలో బల్లెం!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ నేతలందరితో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ.. సీనియర్ నేత భూపేశ్ బఘేల్(57)ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేశారు. అనంతరం ఆదివారం నాడిక్కడ సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బఘేల్‌ను శాసన సభాపక్ష(సీఎల్పీ) నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పరిశీలకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..‘నిజంగా ఇది కఠినమైన నిర్ణయమే. ఎందుకంటే బఘేల్, చరణ్‌దాస్ మహంత్, టి.ఎస్. సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహూ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీలో ఈ నలుగురి హోదా సమానమే. వీరందరితో పలు దఫాలుగా చర్చించిన మీదట బఘేల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాహుల్ ఎంపిక చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర శాసన సభ్యులకు తెలియజేశాం. వారంతా ఏకగ్రీవంగా బఘేల్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ కాలేజ్ మైదానంలో బఘేల్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. బఘేల్‌తో పాటు ఇంకెవ్వరూ మంత్రులుగా ప్రమాణం చేయడంలేదు’ అని తెలిపారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినందున తమముందు చాలా సవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకుంటామనీ, బఘేల్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారైన బఘేల్‌కు కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలిపింది. బఘేల్ ఎంపికకు ముందు కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా నడిచింది. నలుగురు నేతలు సీఎం పదవి కోసం పోటీపడటంతో పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ వీరితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరికి రాహుల్ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారో వారికే మద్దతు ప్రకటిస్తామని ఈ నెల 12న సీఎల్పీ చేత తీర్మానం చేయించారు. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 68 సీట్లతో ఘనవిజయం సాధించగా, బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది. రుణమాఫీపైనే తొలి సంతకం: బఘేల్ ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం పెడతానని కాబోయే ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తెలిపారు. అలాగే 2013లో మావోయిస్టుల చేతిలో కాంగ్రెస్ నేతల ఊచకోతపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులు, ఆదివాసీలు, యువత, మహిళలు, చిరువ్యాపారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. దుర్గ్ జిల్లాలోని పతన్ నియోజకవర్గం నుంచి బఘేల్ గెలుపొందారు. 2013, మే 25న ఛత్తీస్‌గఢ్‌లోని జీరమ్ లోయ ప్రాంతంలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ, రాష్ట్ర పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్ సహా 25 మంది కీలక నేతలు, కార్యకర్తలు చనిపోయారు. బీజేపీకి పక్కలో బల్లెం ఛత్తీస్‌గఢ్ లో దాదాపు 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడటంలో కీలకంగా వ్యవహరించిన భూపేశ్ బఘేల్ మధ్యప్రదేశ్‌లోని(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) దుర్గ్ జిల్లాలో ఓ సాధారణ రైతు కుటుంబంలో 1961, ఆగస్టు 23న జన్మించారు. చందూలాల్ చంద్రశేఖర్ ప్రోద్బలంతో 1980 దశకం ప్రారంభంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం ఐదేళ్లకే యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 1994–95లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. క్రమంగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. కుర్మి సామాజిక వర్గానికి చెందిన భూపేశ్‌కు రాష్ట్రంలో ఉన్న 52 శాతం మంది ఓబీసీల్లో మంచి పలుకుబడి ఉంది. దుర్గ్ జిల్లా పటాన్ నియోజకవర్గం నుంచి బఘేల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1993లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన బఘేల్.. అజిత్ జోగీతో పాటు దిగ్విజయ్ సింగ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. భూపేశ్ బఘేల్ సంఘ సంస్కర్తగా పేరుపొందారు. పేదలు ఆర్థికంగా చితికిపోకుండా ఉమ్మడి మధ్యప్రదేశ్(2000, నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు)లో సామూహిక వివాహాలు జరిపించారు. అంతేకాకుండా బీజేపీ నేతలకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ప్రతీ సందర్భంలోనూ బీజేపీని ఇరుకున పెట్టేలా మాట్లాడటంతో పాటు ఓ బీజేపీ నేతకు సంబంధించిన అశ్లీల దృశ్యాల సీడీని విడుదల చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో బఘేల్ జైలుకు సైతం వెళ్లాల్సి వచ్చింది. ఆతర్వాత బఘేల్‌తో పాటు ఆయన భార్య భూకబ్జాలకు పాల్పడ్డారని రమణ్‌సింగ్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. అంతేకాకుండా సొంత పార్టీలోనూ ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నింటిని ఓపికగా సహించిన భూపేశ్ బఘేల్, నేడు ఛత్తీస్‌గఢ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బఘేల్‌కు ముందు అజిత్ జోగి(మూడేళ్లు), రమణ్‌సింగ్(15 సంవత్సరాలు) ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. -
ఛత్తీస్‌గఢ్ సీఎంగా భూపేశ్ బఘేల్
-
వీడిన ఉత్కంఠ.. చత్తీస్‌గఢ్ సీఎం ఖరారు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెరదించింది. నేడు రాయ్‌పూర్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ భూపేశ్ బఘేల్‌ను పక్షనేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా బఘేల్ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. తాజా ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. సీఎం ఎంపిక విషయంలో మాత్రం నాలుగు రోజుల పాటు తీవ్ర కసరత్తు చేసింది. బఘేల్‌తోపాటు సీనియర్ నేతలు టీపీ సింగ్ దేవ్, తమరాథ్‌వాజ్ సాహు, చరణ్‌దాస్ మహంత్‌లు సీఎం రేస్‌లో ఉండటంతో పార్టీ అధిష్టానం ఎటూ తెల్చుకోలేకపోయింది. దశలు వారీగా పార్టీ సీనియర్ నేతలు ఆశావహులతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా శనివారం ఆశావహులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. తొలి నుంచి అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని సీఎం ఎంపిక ఉంటుందని తెలిపిన కాంగ్రెస్ అధిష్టానం.. ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బఘేల్ వైపే మెగ్గు చూపింది. కాగా, బఘేల్ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా సమాచారం. ఛత్తీస్‌గఢ్ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 68, బీజేపీకి 15, జేసీసీకి 5, బీఎస్పీకి 2 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. 1961లో ఓ రైతు కుటుంబంలో జన్మించిన బఘేల్.. 1986లో యూత్ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1993లో పటాన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బఘేల్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2003లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన అదే స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి బఘేల్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఓ మంత్రికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలపై ఆయనకు సీబీఐ కోర్టు 14 రోజుల జైలు శిక్ష విధించింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన బఘేల్ తన తరఫున వాదించడానికి ఓ లాయర్‌ను కూడా నియమించుకోలేదు. -
ముందు బఘేల్, తర్వాత దేవ్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ సీఎం పదవిపై నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. నలుగురు కీలక నేతలతో దోబూచులాడిన సీఎం పదవి చివరికి భూపేశ్ బఘేల్‌ను వరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత టీపీ సింగ్ దేవ్‌కు సీఎంగా అవకాశమిచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్..ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు సుదీర్ఘ చర్చలు సాగించింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు రాష్ట్ర పరిశీలకుడు ఖర్గే, ఛత్తీస్‌గఢ్ వ్యవహారాల ఇన్చార్జి పీఎల్ పునియా ఈ చర్చల్లో పాల్గొన్నారు. తామ్రధ్వజ్ సాహును ఎంపిక చేస్తూ శనివారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకున్నారు. తామ్రధ్వజ్ కేబినెట్లో తాము మంత్రులుగా కొనసాగబోమంటూ సీఎం రేసులో ఉన్న భూపేశ్ బఘేల్, టీపీ సింగ్ దేవ్, చరణ్‌దాస్ మహంత్ తిరుగుబాటు చేశారు. దీంతో సోనియా గాంధీ, ప్రియాంకా వాధ్రా గాంధీ రంగంలోకి దిగి రాజీ ఫార్ములాను తెరపైకి తెచ్చారని సమాచారం. దీని ప్రకారం.. బఘేల్ రెండున్నరేళ్లు, ఆ తర్వాత టీపీ సింగ్ దేవ్‌కు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించేందుకు అధిష్టానం అంగీకరించింది. అయితే, నేడు రాయ్‌పూర్‌లో జరిగే సీఎల్పీ సమావేశం అనంతరం అంతిమ నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. పలుకుబడి, మైనింగ్ లాబీ.. కుర్మి వర్గానికి చెందిన బఘేల్‌కు కొంత మేర ప్రజల్లో సానుకూలత ఉంది. గట్టి పలుకుబడి, ధనిక మైనింగ్ లాబీ మద్దతు బఘేల్‌కు పుష్కలంగా ఉంది. ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు రాజధానిలో భారీగా లాబీయింగ్ జరిగిందని సమాచారం. కాంగ్రెస్ రాజీ సూత్రం సాహు వర్గ నేతలకు గట్టి దెబ్బ అని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వర్గం వారంతా బీజేపీని వదిలి ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ వెంట ఉన్నారు. ఈ ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ఉంటుందనే దానిపైనే ప్రస్తుతం అందరి దృష్టీ ఉంది. అయితే, రాజాలు లేదా రాజ్‌పుత్ వర్గానికి చెందిన సింగ్ దేవ్ లాంటి వారికి బదులు గిరిజన నేతలకు ప్రోత్సాహమిచ్చి వృద్ధిలోకి తేలేకపోయిందనే భావం ప్రజల్లో కాంగ్రెస్‌పై ఉంది. -
హీరోయిన్‌తో సీఎం సెల్ఫీపై దుమారం
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్(బీజేపీ) బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్‌తో సెల్పీ తీసుకోవడం దుమారం రేపింది. రాష్ట్రంలో ఓ పక్క రైతుల ఆత్మహత్యల కొనసాగుతుంటే, వాటిని పట్టించుకోకుండా ఎంచక్కా సినీ తారలతో సెల్ఫీలు తీసుకుంటూ సీఎం బిజీగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. సీఎం చేయాల్సిన పని ఇదేనా అంటూ ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో బాలల హక్కుల కోసం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి కరీనాకపూర్ ప్రత్యేక అతిథిగా, రమణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉత్తమ టీచర్లకు కరీనా, రమణ్ సింగ్‌లు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కరీనాతో సెల్ఫీ తీసుకుంటా రమణ్ సింగ్ కెమెరా చేతికి చిక్కారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల అంశాలను పట్టించుకోకుండా సినీ తారలతో ముఖ్యమంత్రి సెల్ఫీలు దిగడమేంటని కాంగ్రెస్ చీఫ్ భూపేష్ బాగెల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
'పొరపాటున అత్యాచారాలు జరుగుతున్నాయి'
మహిళలపై అత్యాచారాలు పొరపాటుగానే జరుగుతున్నాయని తాజాగా ఛత్తీస్‌గఢ్ హోం శాఖ మంత్రి రామ్ సేవక్ పైక్రా తాజాగా సెలవిచ్చారు. ఎవరికి అత్యాచారం చేయాలనే అనుకోరని... ఒక్కోసారి పొరపాటుగా అవి జరుగుతాయని తెలిపారు. శనివారం ఛత్తీస్గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో రామ్ సేవక్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార సంఘటనలపై స్పందించాలని ఆయన్ని విలేకర్లు కోరారు. దాంతో ఆయన పై విధంగా స్పందించారు. అయితే రాష్ట్రంలో మహిళలపై ఎక్కడ ఎప్పడు ఎటువంటి దాడులు జరిగిన వెంటనే స్పందించాలని పోలీసు శాఖను ఆదేశించినట్లు చెప్పారు. అయితే రామ్ సేవక్ వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపేష్ బాగల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోం మంత్రి స్థానంలో ఉండి అత్యాచార ఘటనలపై రామ్ సేవక్ స్పందించిన తీరు సరిగాలేదని భూపేష్ విమర్శించారు. మహిళలను కించపరిచేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని భూపేష్ ఈ సందర్బంగా హోం మంత్రి రామ్ సేవక్‌ను డిమాండ్ చేశారు.