న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో ఢిల్లీలో మరోసారి భేటీ అయ్యారు. తర్వాత బఘేల్ మీడియాతో మాట్లాడారు. పార్టీకి చెందిన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారన్నారు. రాష్ట్రానికి వచ్చి పరిస్థితిని స్వయంగా చూడాలని రాహుల్‌ను కోరినట్లు తెలిపారు. మంత్రి సింగ్ దేవ్ వాదిస్తున్నట్లుగా రొటేషన్ ఫార్ములా అంటూ ఏదీ లేదని బఘేల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2018లో కాంగ్రెస్ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల తర్వాత రొటేషన్ పద్ధతిలో చేపట్టేందుకు తనకు హామీ ఇచ్చారని, దాని ప్రకారమే సీఎం పీఠం తనకు ఇవ్వాలని సింగ్‌దేవ్ వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment