chief minister post
-
డ్రైవర్ సీటు కోసం కాంగ్రెస్ కూటమిలో కొట్లాట: మోదీ విమర్శలు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచార స్పీడ్‌ను పెంచాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష కూటమిపై విమర్శలు గుప్పించారు. డ్రైవర్ సీటు కోసం మహా వికాస్ అఘాడీ నేతలు కొట్టుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంవీఏ కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై ఉన్న అంతర్గత పోరును ఉద్ధేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.గత అయిదేళ్లలో మహారాష్ట్రలో మారిన ప్రభుత్వాలను ప్రాస్తావిస్తూ.. ఎంవీయే కూటమి రాష్ట్రంలో రెండున్నరేళ్లు పాలించిందని, ఆ కాలంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ప్రజలను లూటీ చేసేందుకు వారు రాజకీయాల్లో ఉంటారని, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తారని మండిపడ్డారు. తర్వాత ఏర్పడిన మహాయుతి అధికారంలో రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి మాత్రమే రాష్ట్రంలో సుపరిపాలనను అందించగలదనే మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.మహారాష్ట్ర ప్రజలను ఏది అడిగినా హృదయపూర్వకంగా ఇచ్చేస్తారని వ్యాఖ్యానించారు.ఈ మేరకు ధూలేలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలోని గిరిజన వర్గాలను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. గిరిజన వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ప్రజల్లో విష బీజాలు నాటి, మతం పేరుతో దేశ విభజనకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అయితే వారంతా ఐక్యంగా ఉన్నంతకాలం బలంగా ఉంటారని.. ఏ శక్తీ వారిని అడ్డుకోలేదని అన్నారు.ఇక జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో జరుగుతున్న గందరగోళాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కశ్మీర్‌పై వారి కుట్రను ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించారని.. అది ఎప్పటికీ జరగని పని అని మోదీ స్ప ష్టం చేశారు. -
‘రేవంత్ కుర్చీకి కౌంట్‌డౌన్.. ఆరు నెలల్లో కొత్త ముఖ్యమంత్రి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తోందని సంచలన కామెంట్స్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్‌పై సీనియర్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్ హాలీడే పీరియడ్ అయిపోయింది. రేవంత్‌కు కౌంట్ డౌన్ మొదలైంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తాజాగా మీడియా చిట్‌చాట్‌లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. రేవంత్ హాలీడే పీరియడ్ అయిపోయింది.. కౌంట్ డౌన్ మొదలైంది. 2025 జూన్ నుంచి డిసెంబర్‌లోపు రేవంత్ పదవి పోవడం ఖాయం. రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయ కోసం కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్ వ్యతిరేక వర్గం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. మేనిఫెస్టోను కాదు అని.. సొంత ఎజెండాను రేవంత్ అమలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు.. సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరు అని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన చేస్తోంది.సీనియర్ మంత్రులు హైడ్రా, మూసీ, ల్యాండ్ సెటిల్మెంట్ల మీద రేవంత్‌పై ఫిర్యాదు చేసినట్లు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. సీనియర్ మంత్రులు చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. మూసీ ప్రాజెక్టు కాస్ట్ మూడు వంతులు పెంచి.. రేవంత్ స్వార్థం కోసం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నారు. సీఎం రేవంత్ ఏకపక్ష ధోరణికి చాలా మంది నేతలు ఒప్పుకోవడం లేదు. రేవంత్ ఏడు సార్లు ఢిల్లీకి వెళ్లినా రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. 11 నెలలు దాటింది.. ఏడాదిన్నరలోపే కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయం.భట్టి విక్రమార్క నేను సైతం సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి చెరువుల కబ్జాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడమే ఒక ఉదాహరణ. ముగ్గురు మంత్రులు సీఎం రేసులో పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పక్కా సమాచారంతోనే మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని.. నా నాలుకపై పుట్టుమచ్చ ఉందని ముందుగానే పసిగట్టి ఆయన ఇలా మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉత్తమ్, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క ముగ్గురూ పోటీ పడుతున్నారు. అలాగే, కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారు. -
కాంగ్రెస్ దే హార్యానా.. సీఎం పీఠం ఎవరిదంటే..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 నియోజకవర్గాలకు గానూ 55కి పైగా స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఇక రేపు(అక్టోబర్ 8) అధికారిక ఫలితాలు వెలువడనున్న ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై చర్చ మొదలైంది.ప్రధానంగా సీఎం పదవికి ముందంజలో ఉన్న పార్టీ సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అయితే ఆ పదవికి కావాల్సిన అర్హతలు, అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు.@నేనేమీ చెప్పలేను. నేనే కాదు. ఎవరూ ఏం చెప్పలేరు.. సీఎం ఎవరనే విషయం హైకమాండ్ ప్రకటన తర్వాతే తెలుస్తుంది.. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారు.. నేను ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో మాట్లాడాను.. ఈ విషయం హైకమాండ్‌కు తెలుసు. అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది.’ అని కుమారి సెల్జా సోమవారం తెలిపారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర’ ఆయనపై. పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చేసిందని పేర్కొన్నారు. ‘రాహుల్ యాత్రతో మొత్తం మారిపోయింది. ఆయనపై ప్రజల్లో ఉన్న అవగాహన, కాంగ్రెస్‌పై ఉన్న అభిప్రాయం, బీజేపీపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. అందుకే లోక్‌సభలో బీజేపీ సీట్లు ఎలా తగ్గాయో చూశాం. హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.’ అని పేర్కొన్నారు. -
సీఎం పదవికి రాజీనామా చేస్తా
-
ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా
-
Rajasthan Election Result 2023: గహ్లోత్ మేజిక్కు తెర!
రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈసారి ‘మేజిక్’ చేయలేకపోయారు. మెజీíÙయన్ల కుటుంబం నుంచి వచి్చన ఆయన, ఈసారి కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సంక్షేమ, ప్రజాకర్షక పథకాలతో సహా అందుబాటులో ఉన్న ట్రిక్కులన్నీ ప్రయోగించినా లాభం లేకపోయింది. అధికార పార్టీని ప్రజ లు ఇంటికి సాగనంపే 30 ఏళ్ల ఆనవాయితీ అప్రతిహతంగా కొనసాగింది. దాంతో కాంగ్రెస్ పరా జయం చవిచూసింది. ‘‘సీఎం పదవిని వదిలేయా లని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కానీ సీఎం పదవే నన్ను వదలడం లేదు’’ అని పదేపదే గొప్ప గా చెప్పుకున్న 72 ఏళ్ల గహ్లోత్ చివరికి ఓటమిని అంగీకరించి ఆ పదవిని వీడాల్సి వచ్చింది. ఏ పథకమూ ఆదుకోలేదు... గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు గహ్లోత్ రాజకీయ జీవితానికి పెద్ద అగి్నపరీక్షగా మారాయి. సీఎంగిరీని విడిచి పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించాలన్న అధిష్టానం ఆదేశాలను ధిక్కరించడం ద్వారా పెను సాహసమే చేశారాయన. ఆ క్రమంలో సోనియా, రాహుల్‌గాంధీ ఆగ్రహానికి గురైనా వెనకాడలేదు. చివరికి అధిష్టానమే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి కలి్పంచారు. ఈ దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా గెలిపించకపోతే తన రాజకీయ జీవితమే ప్రమాదంలో పడుతుందని గ్రహించి దూకుడు ప్రదర్శించారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వాడుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందునుంచే పుంఖానుపుంఖాలుగా పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలకు తెర తీశారు. పేదలకు కారుచౌకగా వంట గ్యాస్ మొదలుకుని ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా దాకా ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ మంచి పేరే వచి్చంది. ఏం చేసినా చివరికి ప్రజల మనసును మార్చలేక, అధికార పార్టీని ఓడించే ‘ఆనవాయితీ’ని తప్పించలేక చతికిలపడ్డారు. దెబ్బ తీసిన విభేదాలు...? యువ నేత సచిన్ పైలట్‌తో విభేదాలు కూడా రాజస్థాన్‌లో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీశాయనే చెప్పాలి. ముఖ్యంగా 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయక శక్తిగా ఉన్న గుజ్జర్లు తమ వర్గానికి చెందిన పైలట్‌కు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందన్న భావనకు వచ్చారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీని దెబ్బ తీసిన అంశాల్లో ఒకటని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల వేళ గహ్లోత్‌కు పైలట్ నిజానికి పెద్దగా సహాయ నిరాకరణ చేయలేదు. పైపెచ్చు స్నేహ హస్తమే సాచారు. కానీ గహ్లోత్ మాత్రం తానేంటో అధిష్టానానికి నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో పైలట్‌కు ప్రాధాన్యం దక్కకుండా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన పైలట్‌ను అలా పక్కన పెట్టడం కూడా పార్టీకి చేటు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'సీఎం పదవిని వదిలేద్దామనుకున్నా.. కానీ..?'
జైపూర్: సీఎం పదవిని వదిలేద్దామనుకున్నా.. కానీ అదే తనను వదలట్లేదని అన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలని చెప్పారు. 2018లో ఎన్నికల సందర్భంగా సీఎం పదవి కోసం సచిన్ పైలెట్ పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న గహ్లోత్.. ఈ మేరకు మాట్లాడారు. పార్టీ అధిష్ఠానానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. 'సీఎం పదవిని వదిలేయాలని అనుకున్నా.. కానీ నేను ఎందుకు వదలాలి? ఆ పోస్టే నన్ను వదలట్లేదు.హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఏదైనా అంగీకారమే. సోనియా గాంధీ నన్ను మూడు సార్లు సీఎంను చేశారు.' అని గహ్లోత్ అన్నారు. రాజస్థాన్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అశోక్ గహ్లోత్‌కు, సచిన్ పైలెట్‌కు మధ్య ఇటీవల మళ్లీ వార్ నడిచింది. కానీ అధిష్ఠానం మరోసారి చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దింది. అయితే.. తాజాగా జైపూర్‌లో నిర్వహించిన సమావేశంలో.. మరోసారి కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎంను అని గహ్లోత్ తెలిపారు. 2030 విజన్‌కు పిలుపునిచ్చారు. బలమైన రాజస్థాన్‌ను నిర్మిద్దామని అన్నారు. '2030 గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు. విద్య, ఆరోగ్యం, విద్యుత్, నీరు, రవాణా, రహదారులు వంటి రంగాల్లో విశేషమైన సేవ చేశాను. ఎందుకు నేను మరోసారి ముందుకు పోకూడదు అనిపించింది.' అని గహ్లోత్ అన్నారు. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గహ్లోత్‌ను కూడా పోటీలో నిలిచారు. గహ్లోత్ కేంద్ర స్థాయిలో ఉంటే.. సచిన్‌ను రాష్ట్ర స్థాయిలో ప్రధాన నాయకునిగా మారనున్నారని పుకార్లు వచ్చాయి. అయితే.. రాజస్థాన్‌లో సీఎంగా తాను మాత్రమే ఉండాలని ఎమ్మెల్యేలు పట్టుబడగా.. తప్పక ఉండాల్సి వచ్చిందని గహ్లోత్ చెప్పారు. ఇదీ చదవండి: Nuh violence: హర్యానా అల్లర్లు.. బుల్డోజర్ యాక్షన్‌కు హైకోర్టు బ్రేక్.. -
సీఎం పదవికి రొటేషన్ ఫార్ములా ఏదీ లేదు
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో ఢిల్లీలో మరోసారి భేటీ అయ్యారు. తర్వాత బఘేల్ మీడియాతో మాట్లాడారు. పార్టీకి చెందిన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారన్నారు. రాష్ట్రానికి వచ్చి పరిస్థితిని స్వయంగా చూడాలని రాహుల్‌ను కోరినట్లు తెలిపారు. మంత్రి సింగ్ దేవ్ వాదిస్తున్నట్లుగా రొటేషన్ ఫార్ములా అంటూ ఏదీ లేదని బఘేల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2018లో కాంగ్రెస్ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల తర్వాత రొటేషన్ పద్ధతిలో చేపట్టేందుకు తనకు హామీ ఇచ్చారని, దాని ప్రకారమే సీఎం పీఠం తనకు ఇవ్వాలని సింగ్‌దేవ్ వాదిస్తున్నారు. -
సీఎం కావడానికి అర్హతలున్నాయి: కర్ణాటక మంత్రి ఉమేష్
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పెరుగుతోంది. యడియూరప్ప స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి వ్యాఖ్యానించారు. తాను తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తన వయసు ప్రస్తుతం 60 ఏళ్లేనని అన్నారు. పరిణామాలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అవకాశం వస్తే సీఎంగా రాష్ట్రానికి సేవ చేస్తానని, చక్కటి పరిపాలన అందిస్తానని చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సీఎం యడియూరప్ప ప్రకటనను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప స్వాగతించారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో బీజేపీ పెద్దల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్, హోంమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో బీజేపీ అధిష్టానానికి తాను ఎలాంటి సూచనలు ఇవ్వలేదని యడియూరప్ప చెప్పారు. ఎవరి పేరునూ తాను సూచించలేదన్నారు. ఒకవేళ పార్టీ నాయకత్వం తనను కోరినా తదుపరి సీఎం పేరును ప్రతిపాదించలేనని స్పష్టం చేశారు. తాను పదవి నుంచి తప్పుకోవడం తథ్యమని యడియూరప్ప సంకేతాలిచ్చిన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు
-
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తప్పుకున్న తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలూ కేటీఆర్‌కు ఉన్నాయని, తెలంగాణ ఉద్యమంలోనూ కేటీఆర్ క్రియాశీలకంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. గతంలోనూ టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌ను సీఎంను చేసి.. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళుతారని ఊహాగానాలూ వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ పగ్గాలు అప్పగించారు. దీంతో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ పార్టీని, భవిష్యత్తులో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని నడుపుతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
తమిళనాడు సీఎంగా పళనిస్వామి
-
తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా పళనిస్వామి
తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి నియమితులయ్యారు. ఆయనను ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆహ్వానించారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు పళనిస్వామి తదితరులు లేఖ అందించడంతో గవర్నర్ ఆయనకు ముందుగా అవకాశం కల్పించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాంతో శశికళ వర్గం అధికారాన్ని చేజిక్కించుకున్నట్లయింది. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు ట్రయల్ కోర్టు విధించిన జైలుశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేయడంతో ముఖ్యమంత్రి కావాలన్న శశికళ ఆశలకు గండి పడింది. దాంతో వెంటనే ఆమె రాష్ట్ర రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్న పళనిస్వామిని తమ వర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే కాక, అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నుకున్నట్లు వెంటనే ప్రకటించారు. దాంతో.. ఆయనకు తొలుత అవకాశం కల్పించాలని గవర్నర్ విద్యాసాగర్‌రావు నిర్ణయించారు. 15 రోజుల్లోగా ఆయన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 1954 మార్చి 2న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి.. బీఎస్సీని మధ్యలోనే ఆపేశారు. 80లలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ముందునుంచి ఆయన అన్నాడీఎంకేలోనే ఉన్నారు. తొలుత జయలలితకు, ఆమె మరణం తర్వాత శశికళకు ఆయన విధేయుడిగా వ్యవహరించారు. సేలం డెయిరీ చైర్మన్ నుంచి మంత్రి వరకు ఎదిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అవుతున్నారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి.. పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! ఎవరీ పళనిస్వామి..? ఈ రోజే గవర్నర్ నిర్ణయం.. తమిళనాట ఉత్కంఠ ముఖ్యమంత్రిగా పళనిస్వామికి అవకాశం! గవర్నర్‌తో పళనిస్వామి భేటీ పళనిస్వామికే మెజార్టీ ఉంది... పళనిస్వామే ఎందుకు! తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
అక్రమాస్తుల కేసు.. శశికి మరో షాక్!
-
అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధపడుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళను అక్రమాస్తుల కేసు వెంటాడుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత జయలలితతోపాటు ఆమె నెచ్చెలి అయిన శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి త్వరగా బయటపడితే.. సీఎం పదవి చేపట్టేందుకు తనకు లైన్ క్లియర్ అవుతుందని శశికళ భావిస్తున్నారు. కానీ ఇప్పట్లో ఆ అవకాశాలు లేవని తాజా పరిణామాలు చాటుతున్నాయి. ఈ కేసు నుంచి జయలలిత పేరును తొలగించాలని తాజాగా కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయపరమైన అంశం కావడంతో కర్ణాటక పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించే అవకాశముంది. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆలస్యమయ్యే అవకాశముంది. దీంతో సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం లేదని తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు శశికళను, ఆమె కుటుంబసభ్యులను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును జయలలిత సవాల్ చేయడంతో కర్ణాటక హైకోర్టు ఈ తీర్పును కొట్టేసింది. హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో జయలలిత మరణించడం, ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే అధినేత్రిగా ఎన్నికకావడమే కాకుండా.. సీఎం పదవి కోసం సిద్ధమవుతుండటంతో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వారంలోనే ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని గతంలో సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చింది. అయితే, శుక్రవారం ఈ కేసు లిస్టింగ్ కాకపోవడంతో వచ్చేవారం తీర్పు రావొచ్చునని భావిస్తున్నారు. -
శశికళకు భారీ ఊరట!
-
శశికళకు ఎదురుతిరిగిన 20మంది ఎమ్మెల్యేలు?
-
తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం
చెన్నై: ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటా పోటీగా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌తో గురువారం భేటీ అయిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం,అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ బయటికి వస్తున్నప్పుడు మాత్రం నవ్వుతూ కనిపించారు. అధికారం తమదే అన్న రీతిలో ఇద్దరు నేతలు ధీమాగా కనిపించారు. అయితే వీరిద్దరి హావాభావాల వెనుక మరో కోణం కూడా ఉండి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. గవర్నర్‌తో భేటీ అనంతరం నవ్వుతూ కనిపించిన పన్నీర్ సెల్వం ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని మరోసారి చెప్పారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని, శశికళ ఒత్తిడి చేయడం వల్లే పదవికి రాజీనామా చేశానని ఆయన మీడియాకు చెప్పారు. తనకు అండగా నిలబడిన ఎమ్మెల్యేలకు పన్నీర్ సెల్వం కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే శుభవార్త చెప్తానంటూ ఆయన విలేకరుల సమావేశాన్ని ముగించారు. మద్దతుదారులైన నేతలు, కార్యకర్తల మధ్య పన్నీర్ ఈ సందర్భంగా నవ్వుతూ కనిపించారు. ఆయన నవ్వుతూ కళకళలాడటంతో అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. మరో వైపు ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు పావులు కదుపుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ కూడా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సమావేశమయ్యారు. 120కిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు తనకుందని, మెజారిటీ (117) మద్దతు తనకు ఉన్న కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఆమె గవర్నర్‌ను కోరినట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని, అవసరమైతే.. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు కూడా సిద్ధమని ఆమె తెలిపినట్టు తెలుస్తోంది. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంతకాలను ఆమె ఈ సందర్భంగా గవర్నర్‌కు సమర్పించారు. ఆమె వెంట పదిమంది మంత్రులు ఉన్నారు. అయితే, ఎమ్మెల్యేలు ఎవరూ ఆమె వెంట రాకపోవడం గమనార్హం. ఎమ్మెల్యేలంతా శశికళ ఏర్పాటుచేసిన క్యాంపులోనే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శశికళ అభ్యర్థనపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే భేటీ అనంతరం శశికళ కూడా నవ్వుతూ కనిపించారు. మద్దతుదారులకు అభివాదం చేస్తూ ఆమె వాహనంలో పోయేస్ గార్డెన్‌కు వెళ్లిపోయారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి ఇద్దరికిద్దరూ సిధ్దం అంటూ ప్రకటనలు చేశారు. అయితే ఈ నవ్వు వెనుక మరో కోణం దాగి ఉందని అంటున్నారు విశ్లేషకులు. మోహంలో కొద్దిగా టెన్షన్ కనిపించినా తమకు అండగా ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ చేయిజారిపోతారో అనే భావన ఇద్దరిలో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే తన వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా శశికళ క్యాంపు రాజకీయాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరితో భేటీ అనంతరం గవర్నర్ తీసుకునే నిర్ణయం పై తమిళ ప్రజలే కాకుండా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
శశికళకు ఎదురుతిరిగిన 20మంది ఎమ్మెల్యేలు?
తన వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ క్యాంపు రాజకీయాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, శశికళ క్యాంపులో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు ఎదురుతిరిగినట్టు సమాచారం. తాము పన్నీర్ సెల్వానికి మద్దతునిస్తామని, తమను విడిచిపెట్టాలని వారు కోరుతున్నట్టు చెప్తున్నారు. అయితే, ఇందుకు అనుమతించని శశి వర్గం బలవంతంగా వారిని బంధించి రిసార్ట్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. వందలమంది శశికళ మనుషులు ఎమ్మెల్యేలు జారిపోకుండా, తప్పించుకోకుండా అనుక్షణం కాపలా కాస్తున్నారని సమాచారం. ఆ 20 మంది ఎమ్మెల్యేలను శశికళ విడిచిపెడతారా? వారు ఓపీఎస్‌కు మద్దతునిచ్చేందుకు వీలుంటుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మూడు గ్రూపులుగా విడిగొట్టి.. ఎవరికి తెలియకుండా వివిధ రిసార్టులకు, బీచ్‌లకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు, వారిని తన గుప్పిట ఉంచుకునేందుకు శశికళ ఈ ఎత్తుగడ వేశారు. చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం గోల్డెన్ బే రిసార్ట్‌లో ఓ గ్రూపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు క్యాంపుగా ఉన్నారు. ఈ రిసార్టుకు మీడియాను కూడా అనుమతించడం లేదు. ఉన్నఫలనా ఎమ్మెల్యేలు తరలించడంతో ఎమ్మెల్యేలు కట్టుబట్టలతో వచ్చారని, దీంతో వారికి సరైన దుస్తులు కూడా అందుబాటులో లేవని, జైలులో ఉన్న భావన వారిలో కలుగుతున్నదని తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో క్యాంపులోని పలువురు ఎమ్మెల్యేలు కలత చెందుతున్నట్టు సమాచారం. శశి క్యాంపులో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని అంటున్నారు. చదవండి : శశిపై మొట్టమొదట తిరగబడ్డది ఈయనే! -
గవర్నర్‌తో శశికళ భేటీ!
-
శశికి కేసుల ఉచ్చు.. సుప్రీం తాజా అప్డేట్!
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు పావులు కదుపుతున్న వీకే శశికళను అక్రమాస్తుల కేసు వెంటాడుతున్నది. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తుందని అందరూ భావించారు. ఈ తీర్పు ప్రతికూలంగా వస్తే.. శశికళకు సీఎం పదవి చేపట్టే చాన్స్ ఉండదని అనుకున్నారు. అయితే, సుప్రీంకోర్టు శుక్రవారం లిస్టింగ్‌లో ఈ కేసు నమోదుకాలేదు. దీంతో ఈ కేసులో వచ్చేవారం తీర్పు వెలువడే అవకాశముందని భావిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలితతోపాటు శశికళను, ఆమె కుటుంబసభ్యులను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును జయలలిత సవాల్ చేయడంతో కర్ణాటక హైకోర్టు దీనిని కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో జయలలిత మరణించడం, ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే అధినేత్రిగా ఎన్నికకావడమే కాకుండా.. సీఎం పదవి కోసం సిద్ధమవుతుండటంతో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వారంలోనే ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని గతంలో సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చింది. అయితే, శుక్రవారం ఈ కేసు లిస్టింగ్ కాకపోవడంతో వచ్చేవారం తీర్పు రావొచ్చునని భావిస్తున్నారు. చదవండి : శశికళకు ఎదురుతిరిగిన 20మంది ఎమ్మెల్యేలు? -
క్షణక్షణం.. గవర్నర్‌తో శశికళ భేటీ!
చెన్నై: ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు పావులు కదుపుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ గురువారం రాత్రి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సమావేశమయ్యారు. 120కిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు తనకుందని, మెజారిటీ (117) మద్దతు తనకు ఉన్న కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఆమె గవర్నర్‌ను కోరినట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని, అవసరమైతే.. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు కూడా సిద్ధమని ఆమె తెలిపినట్టు తెలుస్తోంది. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖలను ఆమె ఈ సందర్భంగా గవర్నర్‌కు సమర్పించారు. ఆమె వెంట పదిమంది మంత్రులు ఉన్నారు. అయితే, ఎమ్మెల్యేలు ఎవరూ ఆమె వెంట రాకపోవడం గమనార్హం. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే ఆమె వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలంతా శశికళ ఏర్పాటుచేసిన క్యాంపులోనే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శశికళ అభ్యర్థనపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పోయెస్ గార్డెన్ నుంచి నేరుగా మేరినా బీచ్ చేరుకున్న ఆమె.. అక్కడ దివంగత జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. తన చేతిలోని ఎమ్మెల్యేల సంతకాలున్న పత్రాలను సమాధి వద్ద ఉంచారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగంతో కనిపించారు. జయలలిత తరహాలో ఆకుపచ్చని చీర కట్టుకున్న శశికళ ఒకింత కన్నీటి పర్యంతమవుతూ అమ్మ సమాధి వద్దనుంచి రాజ్‌భవన్‌కు కదిలారు. -
శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్!
చెన్నై: గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌తో భేటీ అయిన అనంతరం తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. నవ్వుతూ కనిపించిన ఆయన ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని మరోసారి చెప్పారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని, శశికళ ఒత్తిడి చేయడం వల్లే పదవికి రాజీనామా చేశానని ఆయన మీడియాకు చెప్పారు. తనకు అండగా నిలబడిన ఎమ్మెల్యేలకు పన్నీర్ సెల్వం కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే శుభవార్త చెప్తానంటూ ఆయన విలేకరుల సమావేశాన్ని ముగించారు. మద్దతుదారులైన నేతలు, కార్యకర్తల మధ్య పన్నీర్ ఈ సందర్భంగా నవ్వుతూ కనిపించారు. ఆయన నవ్వుతూ కళకళలాడటంతో అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. అయితే, పన్నీర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది? ఆయనకు గవర్నర్ మరో అవకాశం ఇస్తారా? లేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. -
గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు?
చెన్నై: తమిళనాట రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెలం (ఓపీఎస్) గురువారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వీరి భేటీ 20నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, సెల్వం నువ్వా-నేనా అన్నరీతిలో తలపడుతున్న నేపథ్యంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అందరి దృష్టి గవర్నర్‌పై నెలకొన్న నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై వీరు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మొత్తం తనకు మద్దతుగా ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలతో ఓపీఎస్ గవర్నర్‌ను కలిశారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు తనకు అవకాశం ఇప్పించాలని ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌ను కోరినట్టు సమాచారం. శశికళ ఒత్తిడి చేయడం వల్లే రాజీనామా చేశానని, వీలుంటే తన రాజీనామాను వెనుకకు తీసుకుంటానని కూడా ఓపీఎస్ చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో తనకు మరో అవకాశం ఎందుకు కల్పించాలో ప్రధానంగా సెల్వం.. గవర్నర్‌కు వివరించినట్టు చెప్తున్నారు. తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరిచేందుకు ప్రస్తుతం గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) ఆయన దేనిని ఎంచుకుంటారన్నది రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. -
శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్?
ఆ విచక్షణాధికారం ఉందంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత తమిళనాట అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం తారస్థాయిలో చేరిన నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. శశికళను ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తమకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం చెబుతున్నది. తనకు కూడా మెజారిటీ ఉందని, అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశమిస్తే.. తన బలమేమిటో నిరూపించుకుంటానని పన్నీర్ సెల్వం చెప్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తే ప్రస్తుతం పన్నీర్ సెల్వం వద్దు ఆరుగురు ఎమ్మెల్యేలకు మించి బలం లేదని చెప్తున్నది. దీంతో అంకెల సమీకరణాలు ఇప్పుడు తమిళనాట ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శశికళ, పన్నీర్ సెల్వంలలో ఎవరి ముఖ్యమంత్రి కావాలన్న మ్యాజిక్ ఫిగర్ 117 ఉండాల్సిందే. దీంతో మెజారిటీ మద్దతు ఉన్న శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని గవర్నర్ ఆహ్వానించకతప్పదా? అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన అధికార పార్టీ నేత ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుందని ఆయన తెలిపారు. తన పుస్తకం 'ఫియర్లెస్ ఇన్ అపోజిషన్' విడుదల సందర్భంగా ఆయన 'ది హిందూ'తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మెజారిటీ సంఖ్యాబలమున్న పార్టీ నాయకుడితో ప్రమాణం చేయించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత గవర్నర్‌కు ఉంటుంది. ప్రస్తుతమున్న ఆయా కారణాల వల్ల ప్రమాణాన్ని కొద్దిరోజులు వాయిదా వేస్తున్నానని చెప్పే విచక్షణాధికారం కూడా గవర్నర్‌కు ఉంటుంది. ఇది చిన్నపాటి అవకాశం. రాజ్యాంగబద్ధత దీనికి ఉందా? లేదా? అన్నది చూడలేదు కానీ, ఈ అవకాశం గవర్నర్‌కు ఉంటుందని నేను భావిస్తున్నా' అని ఆయన చెప్పారు. ప్రస్తుతం గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) ఆయన దేనిని ఎంచుకుంటారన్నది రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాయిదా ఆప్షన్ కూడా ఆయన ఎంచుకుంటారా? అన్నది చూడాలి అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ?
భారీ రాజకీయ సంక్షోభం ఇప్పుడు తమిళనాడును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి, జయలలిత నెచ్చెలి వీకే శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధమవుతుండగా.. చివరిక్షణంలో పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో తమిళనాట రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జయలలిత మృతి తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇప్పుడు ఆమె రాజకీయ వారసత్వం కోసం శశికళ, పన్నీర్ సెల్వం హోరాహోరీగా తలపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఈ ఇద్దరు నేతలు ఎత్తులు-పైఎత్తులు వేస్తుండటంతో తమిళనాట సామాన్యులు బిత్తరపోతున్నారు. ఏ క్షణంలో ఏం జరగుతుందో తెలియక తికమక పడుతున్నారు. ఈ సమయంలో పలువురు సినీ ప్రముఖులు సైతం మీడియా ముందుకొచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ సైతం మౌనాన్ని వీడారు. ఆపద్ధర్మ సీఎం ఓపీఎస్‌కు మద్దతు పలికారు. కొందరి అధికార దాహం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందంటూ పరోక్షంగా శశికళను తప్పుబట్టారు. కానీ జయలలిత మానసపుత్రుడిగా, రాజకీయ వారసుడిగా మీడియాలో ప్రచారమైన ప్రముఖ హీరో అజిత్ కుమార్ మాత్రం ఇంతవరకు పెదవి విప్పలేదు. జయలలిత మృతి తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నా.. ప్రస్తుతం రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరినా అజిత్ మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. జయలలిత తనను కొడుకులా చూసుకునేవారని గతంలో చెప్పిన అజిత్.. ఇప్పుడెందుకు మౌనాన్ని ఆశ్రయించారనే వాదన వినిపిస్తోంది. ఆయన మౌనంపై కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 'జయలలిత అతన్ని కన్నకొడుకులా చూసుకున్నది' అని సినీ వర్గాలు అంటున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో జయలలిత ఆస్పత్రిపాలైనప్పుడు మొదట ఆమెను ఆస్పత్రిలో పరామర్శించింది అజితే. ఆయనను తన వారసుడిగా ప్రకటిస్తూ జయలలిత విలునామా కూడా రాశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. జయ మరణం తర్వాత అజిత్ తెరముందుకు రాకుండా శశికళ అడ్డుకున్నదన్న కథనాలూ లేకపోలేదు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయితే.. ఆయన అజిత్‌ను ఆదరించే అవకాశముందన్న ప్రచారమూ జరిగింది. అమ్మకు మద్దతుగా డీఎంకేను ఢీకొట్టిన అజిత్..! ద్రావిడ రాజకీయాలంటే అన్నాడీఎంకే-డీఎంకే మధ్య బద్ధవైరమే గుర్తొస్తుంది. ఈ క్రమంలో అజిత్ ఓ అవార్డుల వేడుకలో నేరుగా డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హం. సినిమాల్లో రాజకీయాలు తీసుకురావద్దంటూ డీఎంకే దిగ్గజం కరుణానిధిని ఉద్దేశించి ఆయన చేసిన ఈ ప్రసంగానికి సూపర్ స్టార్ రజనీకాంత్ లేచినిలబడి మరీ మద్దతు ప్రకటించారు. జయలలిత స్ఫూర్తితోనే అజిత్ సిక్స్‌ప్యాక్..! దివంగత నేత జయలలిత స్ఫూర్తితోనే అజిత్ మళ్లీ జిమ్‌కు వెళ్లడం ప్రారంభించాడట. 2015లో వేదాలం సినిమా విడుదల సందర్భంగా అమ్మను అజిత్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి జయలలిత వాకబు చేశారట. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టిన అజిత్.. తాజా సినిమా 'వివేకం' కోసం అందరూ ఆశ్చర్యపోయేలా సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. -
విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం!
చెన్నై: తమిళనాట రాజకీయాలు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠరేపుతున్న తరుణంలో ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైలో అడుగుపెట్టారు. ఆపద్ధర్మ సీఎం హోదాలో పన్నీర్ సెల్వం ఎదురెళ్లి మరీ విద్యాసాగర్‌కు సాదర స్వాగతం తెలిపారు. ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ-పన్నీర్ సెల్వాం నువ్వా-నేనా అన్న స్థాయిలో హోరాహోరీగా తలపడుతుండటంతో ఈ సంక్షోభంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ నిర్ణయం ఏమిటా.. అని తమిళనాడే కాదు యావత్ దేశం ఎదురుచూస్తున్నది. ఇలాంటి తరుణంలో రాజ్‌భవన్‌లో అడుగుపెట్టిన గవర్నర్ మరికాసేపట్లో డీజీపీ, సీఎస్‌లను కలువబోతున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆయన సమీక్షిస్తారు. ఇప్పటికే మొదట ఓపీఎస్‌కు, ఆ తర్వాత శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తరుణంలో గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) గవర్నర్ దేనిని ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
శశిపై మొట్టమొదట తిరగబడ్డది ఈయనే!
-
శశిపై మొట్టమొదట తిరగబడ్డది ఈయనే!
ఒకప్పుడు జయలలిత నెచ్చెలిగా తెరవెనుక ఉన్న వీకే శశికళ.. ఇప్పుడు జయలలిత మరణంతో తెరముందుకొచ్చి ఎత్తుకు పైఎత్తు వేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఆరితేరిన నేతగా ఆమె రాజకీయ వ్యూహాలు పదునెక్కుతున్నాయి. కానీ, అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో శశికళ అనూహ్యంగా ఎదుగుతుండటంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. శశికళ కుటుంబసభ్యలు అన్నాడీఎంకే తమ పిడికిట్లో తీసుకోవాలని ప్రయత్నిస్తుండటంపై కృష్ణగిరికి జిల్లాకు చెందిన వన్నియార్ నేత కేపీ మునుస్వామి మొట్టమొదట తిరుగుబావుటా ఎగురవేశారు. శశికళ కుటుంబం తీరుపై కేపీ మునుస్వామి బాహాటంగా విమర్శలు చేశారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో శశికళకు ఎదురైన మొట్టమొదటి తిరుగుబాటు ఇదే. కానీ, ఆమె ఆయన విషయాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. మునుస్వామిపై చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు తిరుగుబాటు నేత పన్నీర్ సెల్వం రాజకీయ శిబిరంలో మునుస్వామి కూడా చేరారు. ఎస్పీ షణ్ముగనాథన్, పీహెచ్ పాండియన్, సాయిదై దురైస్వామి, సీవీ షణ్ముగం, ఈ మధుసూధన్ తదితర నేతలు ఓపీఎస్ వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. శశి వర్గంలోని అసంతృప్త, అసమ్మతి ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు వీరు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఓ రిసార్ట్‌లో తిష్టవేసిన శశి వర్గంలోని ఎమ్మెల్యేలలో ఒకరైన ఎస్పీ షణ్ముగనాథన్ బాత్ రూం బ్రేక్ అని చెప్పి.. ఝలక్ ఇచ్చారు. చాకచక్యంగా శశి వర్గం నుంచి తప్పించుకొని సెల్వం గూటికి చేరుకున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా గుండెదడ, ఇతరత్రా కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నా.. కట్టుదిట్టమైన భద్రత నడుమ, వారు కదలకుండా నిఘా పెట్టినట్టు కథనాలు వస్తున్నాయి. చదవండి : శశికళకు పన్నీర్ సెల్వం మాస్టర్ స్ట్రోక్! -
శశికళకు పన్నీర్ సెల్వం మాస్టర్ స్ట్రోక్!
నిన్నమొన్నటివరకు సౌమ్యుడిగా, పెద్దగా ఎత్తులు, పైఎత్తులు తెలియని అమాయక నేతగా ముద్రపడ్డ పన్నీర్ సెల్వం.. అసలైన సమయంలో తన రాజకీయ చాతుర్యాన్ని చాటుతున్నారు. ఎవరూ ఊహించని అంశాలను తెరపైకి తీసుకొచ్చి.. ప్రత్యర్థి వీకే శశికళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా ఆయన సంధించిన ప్రశ్నాస్త్రాలు చిన్నమ్మ వర్గానికి ముచ్చెమటలు పట్టించేవే! తనపై విషప్రయోగం చేశారన్న ఆరోపణలతో పోయెస్ గార్డెన్ నుంచి శశికళను జయలలిత వెళ్లగొట్టిన సంగతి తెలిసిందే. తిరిగి జయలలిత చెంతకు చేరేందుకు ఆమె నెచ్చెలి శశికళ క్షమాపణ చెప్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖను ఇప్పుడు బట్టబయలు చేసిన పన్నీర్ సెల్వం.. అందులోని అంశాల ఆధారంగా ఘాటైన ప్రశ్నాస్త్రాలను సంధించారు. ఎందుకీ ఆశ? జయకు రాసిన క్షమాపణ లేఖలో తనకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు లేవని, రాజకీయాలకు దూరంగా ఉంటానని శశికళ స్పష్టంగా చెప్పారని, ఇప్పుడెందుకు ఆమెకు కొత్తగా రాజకీయాలపై ఆసక్తి కలిగిందని సెల్వం నిలదీశారు. జయలలిత మృతి తర్వాత రాజకీయ పదవుల కోసం తహతహలాడటం పలు అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. జయలలిత 30 ఏళ్లు కష్టపడి నిర్మించిన రాజకీయ వారసత్వాన్ని ఎగరేసుకుపోయేందుకు శశికళ ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. అమ్మకు ఇష్టంలేని కుటుంబాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? శశికళ కుటుంబాన్ని జయలలిత అసలు ఇష్టపడేవారు కాదనే విషయం బహిరంగ రహస్యమే. తిరిగి తనను పోయెస్ గార్డెన్‌లోకి అనుమతించాలని అభ్యర్థిస్తూ జయలలితకు శశికళ రాసిన క్షమాపణ లేఖలో తన కుటుంబసభ్యులతో ఇక ఎలాంటి సంబంధాలు కొనసాగించబోనని శశి హామీ ఇచ్చారు. ఇప్పుడు జయలలిత మరణం తర్వాత ఆమె కుటుంబసభ్యులు అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పన్నీర్ సెల్వం సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు అమ్మలేని సమయంలో ఎందుకు మీ కుటుంబంతో సన్నిహితంగా ఎందుకు మెలుగుతున్నారని ప్రశ్నించారు. జయలలితను తాను ఎన్నడూ మోసం చేయలేదని శశికళ పచ్చి అబద్ధం చేప్తున్నారని, ఆమెకు తమిళనాడు ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. సెల్వం సూటిగా, స్పష్టంగా సంధించిన ఈ ప్రశ్నాస్త్రాలు శశి వర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేవేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చదవండి.. శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! -
శశికళ సీఎం అయ్యే అవకాశాల్లేవా?
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్న శశికళకు ఇంకా ఏమైనా అడ్డంకులున్నాయా? సుమారు వంద మంది వరకు ఎమ్మెల్యేలు ఆమె వెంట ఉన్నట్లుగా ఇప్పటికి తెలుస్తున్నా, ఇంకా అభ్యంతరాలు ఏవైనా వస్తాయా? అవును.. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు కొన్ని కంపెనీలలో వాటాలున్నాయి. ఆ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో వ్యాపారం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆమె ముఖ్యమంత్రి అయితే, ఆ కంపెనీలకు లబ్ధి కలిగించాలన్న 'స్వామిభక్తి' అధికారుల్లో సహజంగానే ఉంటుంది కాబట్టి 'ప్రయోజనాల మధ్య వైరుధ్యం' కింద శశికళకు ముఖ్యమంత్రి పదవి అందకుండా పోయే అవకాశం లేకపోలేదన్నది నిపుణుల వాదన. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత 'ట్రంప్ ఎంపైర్'కు దూరం కావాల్సి వచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇలాంటి పరిస్థితే చిన్నమ్మకు కూడా ఎదురవుతుందని అంటున్నారు. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావు మళ్లీ ఎప్పుడు తన కార్యాలయానికి వచ్చి బాధ్యతలు చేపడతారో ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన వచ్చేసరికల్లా ప్రతిపక్షాలు శశికళ వ్యాపార ప్రయోజనాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లిక్కర్ రీటైలింగ్ సంస్థ టాస్మాక్‌కు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని సరఫరా చేసే మిడాస్ డిస్టిలరీస్‌లో శశికళ ప్రధాన వాటాదారు. ఈ విషయాన్ని పలువురు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు కూడా తప్పుపడుతున్నారు. ఈ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న పత్రాలు పరిశీలించి ఏ విషయమూ తేలుస్తామని ఒక సంస్థ ప్రతినిధి వెంకటేశన్ చెప్పారు. 2003లో స్థాపించిన మిడాస్ సంస్థకు 2009-11 సంవత్సరాల మధ్య రూ. 360 కోట్ల టర్నోవర్ ఉంది. కానీ ఒక్కసారిగా 2014-15 నాటికి ఆ సంస్థ టర్నోవర్ రూ. 1400 కోట్లకు పెరిగిపోయింది. జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాతకు, అంతకంటే ముందు నాటికి ఈ సంస్థ వ్యాపారంలో అనూహ్య వృద్ధి కనిపించడాన్నే అనుమానంగా చూస్తున్నారు. అమ్మచాటు చిన్నమ్మగా ఉన్నప్పుడే వ్యాపారాలు ఇలా ఉంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇంకెలా ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవే తరహా ప్రశ్నలను కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా లేవనెత్తుతున్నారు. శశికళపై కొన్ని సీరియస్ కేసులు ఉన్నాయని, ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులు తమిళనాడు ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నారని, అలాంటప్పుడు అది ప్రత్యక్షంగానే ప్రయోజన వైరుధ్యం అవుతుందని ఆయన చెప్పారు. పైగా ఇటీవలే శశికళ సన్నిహిత బంధువు ఒకరు 'జాజ్ సినిమాస్' సంస్థను టేకోవర్ చేశారని, దాంతోపాటు ఈ వ్యక్తి అనేక వెంచర్లలో ఉన్నారని, ఇదే కాక.. ఒకప్పుడు వీడియో క్యాసెట్లు అద్దెకు ఇస్తూ ఉన్న వ్యక్తి ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారన్న విషయం మీద కూడా దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష డీఎంకే వాదిస్తోంది. ఇవన్నీ పక్కన పెట్టినా.. మరో నాలుగైదు రోజుల్లో జయలలిత ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. ఆ కేసులో శశికళ ఎ2గా ఉన్నారు. దాంట్లో శిక్ష పడితే మాత్రం.. ఇక ఇప్పట్లో ముఖ్యమంత్రి పదవి మీద ఆశలను ఆమె వదులుకోవాల్సిందే. -
నేనేంటో కొన్ని గంటలలో చూపిస్తా: పన్నీర్
-
సెల్వం సౌమ్యుడే కాదు.. సునామీ కూడా!
చెన్నై: ఒక్క బాంబులాంటి విషయంతో నెట్టింట్లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, జయలలితకు విధేయుడు, సౌమ్యుడు అయిన పన్నీర్ సెల్వం రాత్రికి రాత్రి తమిళనాడులో మెరీనా బీచ్ వద్ద రాజకీయ సునామీ సృష్టించి హీరో అయ్యారు. సాధారణంగా అతితక్కువ మాత్రమే మాట్లాడే ఆయన, గత రాత్రి మెరీనా బీచ్‌లోని అమ్మ (జయలలిత) సమాధి వద్ద ఓ 40 నిమిషాలపాటు కూర్చుని అనంతరం ప్రెస్ మీట్ పెట్టి నెటిజన్ల నోట జేజేలు పలికించుకుంటున్నారు. తనను శశికళ ముఖ్యమంత్రి పదవికి బలవంతంగా రాజీనామా చేయించారని, పార్టీ సీనియర్లంతా తనను అవమానించారని, నిజాలు చెప్పి పార్టీని, ప్రజలను కాపాడాలని అమ్మ ఆత్మ తనతో చెప్పడంతో తాను ఆ విషయం చెప్పకుండా ఉండలేకపోయానని చెప్పి అనూహ్యంగా బాంబు పేల్చారు. ఇప్పటికే శశికళపై తమిళనాడు వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుండటం, అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉండటంతో అసలు ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడమే గగనం అవుతున్న పరిస్థితుల్లో పన్నీర్ కొట్టిన తాజా దెబ్బకు శశికళ దిమ్మతిరిగినట్లయింది. దీంతో అంతకుముందు శశికళను వ్యతిరేకించిన నెటిజన్లంతా ఇప్పుడు పన్నీర్ సెల్వాలని జై కొడుతున్నారు. ఇప్పటికైనా చాలా ధైర్యంగా నిజాలు చెప్పినందుకు అభినందనలంటూ డీఎంకే ఎమ్మెల్యే జే అంబజగన్ ట్వీట్ చేశారు. అలాగే ఏఐఏడీఎంకే ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ కూడా తాను పన్నీర్ వెంటేనంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో తనను పదవి నుంచి తీసేసినా పన్నీర్‌తో ఉంటానని చెప్పారు. అమ్మ తమతోనే ఉందని, అమ్మను అభిమానించే, గౌరవించే ఎంపీలు, ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారని ట్వీట్ చేసి ఆకర్షించారు. అలాగే ఓ రాజ్యసభ ఎంపీ కూడా సెల్వానికి మద్దతిచ్చారు. అలాగే, 200మంది పార్టీ కార్యకర్తలు సెల్వం ఇంటిముందుకెళ్లి అన్నాదురై గీతాలు ఆలపించడం మొదలుపెట్టారు. ఇక నెటిజన్లయితే, శశికళ కుటుంబం చేతికి తమిళ పాలన పగ్గాలు పోవడాన్ని తాము అస్సలు ఊహించలేకపోతున్నామని, సెల్వం అయితే, అందరినీ కలుపుకుకొని పోయే స్వభావం ఉన్నందున ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే బావుంటుందని అంటున్నారు. ఏదేమైనా తాను మాట్లాడను.. మాట్లాడితే మిగితా వాళ్లంతా తన మాటలే వింటారు అన్నంతగా ఇప్పుడు తమిళనాడు అతి పెద్ద చర్చకు సెల్వం తెరలేపారు -
నేనేంటో కొన్ని గంటలలో చూపిస్తా: పన్నీర్ సెల్వం
నిన్న మొన్నటి వరకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, అసలు నోరు విప్పని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. తానేంటో కొన్ని గంటల్లోనే చూపిస్తానని సవాలు చేశారు. ఇప్పటివరకు తాను నోరు విప్పింది కేవలం పది శాతమేనని, ఇంకా 90 శాతం మిగిలే ఉందని అన్నారు. అవన్నీ తనతో చెప్పించే ప్రయత్నం చేయొద్దని అవతలి పక్షాన్ని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం నుంచి తన దీక్ష, వ్యాఖ్యలు, పార్టీ పదవి తొలగింపు వంటి పరిణామాలతో తీవ్ర ఉత్కంఠ రేపిన పన్నీర్ సెల్వం.. ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. (చదవండి: సంచలన నిజాలు వెల్లడించిన పన్నీర్) తాజాగా బుధవారం ఉదయం మరోసారి ఆయన తమిళ మీడియాతో మాట్లాడారు. తాను ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యానని వాళ్లు ఆరోపించడం సహజమేనని అన్నారు. తిరుగుబాటు చేసినప్పుడు ఎవరిమీదైనా ఇలాగే బురద చల్లుతారన్నారు. శశికళకు ఇంత అర్జంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలని ఎందుకు అనిపిస్తోందని, తమిళనాడులో పరిస్థితులను ఆమె అర్థం చేసుకోవట్లేదా అని అన్నారు. తాను ప్రతిరోజూ అపోలో ఆస్పత్రికి వెళ్లానని, కానీ అమ్మను ఆస్పత్రిలో ఒక్కసారి కూడా చూసే అవకాశం తనకు రాలేదని, అమ్మను ఆస్పత్రిలో చూడలేని దురదృష్టవంతుడినని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీకి, జయలలితకు నిజమైన విశ్వాసపాత్రుడిని తానేనని పన్నీర్ సెల్వం చెప్పారు. షీలా బాలకృష్ణన్ రాజీనామా గురించి ఇప్పుడేమీ చెప్పలేనని, ఆమెకు ఇప్పటికే ఎక్స్టెన్షన్ ఇచ్చామని అన్నారు. తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిణామం వెనుక ఒక శక్తి ఉందని చెప్పారు. -
ముఖ్యమంత్రి పదవా.. ఇప్పుడైతే నాకొద్దు!
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణించి ఇప్పటికి 23 రోజులు గడిచింది. కానీ ప్రస్తుత పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాత్రం అధికార పగ్గాలు చేపట్టడానికి ససేమిరా అంటున్నారు. వారం రోజుల సంతాప దినాలు ముగిసిన తర్వాత ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని అంతా భావించారు. దివంగత సీఎం కూడా తన ఆరోగ్యం బాగోవట్లేదని, తన కుమార్తెకు నాయకత్వం అప్పగించాలని భావిస్తున్నానని గతంలో చెప్పారు. దానికి అనుగుణంగానే పార్టీ వర్గాలు కూడా మెహబూబా ముఫ్తీనే తమ నాయకురాలిగా ఎన్నుకున్నాయి. అయితే.. ప్రస్తుతం కశ్మీర్లో ఉన్న పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రం ముందు అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా నడవట్లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని.. ఇలాంటి తరుణంలో తాను సీఎం అయితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని మెహబూబా ముఫ్తీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 10 నెలల్లో కూటమి ఎజెండా అమలు కాలేదన్నది ఆమె అభిప్రాయం. తన తండ్రి, పార్టీ ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని ఆమె ఆందోళన చెందుతున్నట్లు పీడీపీ అగ్రనాయకులు చెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ముందు అనుకున్నదాని కంటే మరింత ఉదారంగా ముందుకొచ్చి, జమ్ము కశ్మీర్ ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటిస్తే తప్ప రాబోయే కాలంలో పాలన సవ్యంగా సాగడం కష్టమేనన్నది ఆమె భావనగా తెలుస్తోంది. మెహబూబాకు సుదీర్ఘ రాజకీయ కెరీర్ ముందుందని, అందువల్ల ఆమె తాత్కాలిక ప్రయోజనాల కోసం తొందరపడే మనిషి కారని పార్టీ నాయకుడు ఒకరు అన్నారు. వేర్పాటువాదులతో చర్చల పునరుద్ధరణ, ఆర్మీ ఆక్రమించుకున్న భూములు ఖాళీ చేయించడం, విద్యుత్ ప్రాజెక్టుల యాజమాన్యాన్ని రాష్ట్రానికి తిరిగి ఇవ్వడం లాంటి అంశాలపై గట్టి హామీ కావాలని ఆమె కోరుకుంటున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు ఏ కూటమికీ మద్దతు ఇవ్వడానికి సుముఖంగా లేకపోవడంతో.. ఇక అక్కడ మధ్యంతర ఎన్నికలు వచ్చినా తప్పు లేదని పరిశీలకులు అంటున్నారు. మొత్తం 87 మంది సభ్యులున్న కశ్మీర్ అసెంబ్లీకి 2014లో జరిగిన ఎన్నికల్లో పీడీపీకి 28 స్థానాలు రాగా, బీజేపీ 25 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12, సీపీఎంకు 1, పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు 2 స్థానాలు రాగా, మరో నాలుగు స్థానాల్లో ఇతరులు గెలిచారు. -
సీఎం ఎంపికపై రెండుగా చీలిన ఎమ్మెల్యేలు!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎంపికపై బీజేపీలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి పదవి ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు రెండు వర్గాలు విడిపోయారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నావిస్ ల పేర్లు తెరపైకి వచ్చాయి. బీజేపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు నాగపూర్ లోని గడ్కరీ నివాసంలో సమావేశమైనట్టు తెలుస్తోంది. 40 మంది ఎమ్మెల్యేలు గడ్కరీకి మద్దతు తెలిపినట్టు వార్తలు వెలువడుతున్నాయి. గడ్కరీనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలంటూ మహారాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుధీర్ ముంగటివార్ డిమాండ్ చేశారు. ఇప్పటికే దేవేంద్ర ఎంపికపై పార్టీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. గతంలో ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేదని వ్యాఖ్యానించిన గడ్కరీ.. ఆ పదవిపై ఆశలు పెంచుకోవడంపై బీజేపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
'దళితులు సీఎం పదవికోసం ఆరాట పడలేదు'
కరీంనగర్: ముఖ్యమంత్రి పదవికోసం దళితులు ఏనాడు ఆరాటపడలేదని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం దళితుడునే సీఎం చేస్తామని కేంద్రమంత్రి జైరాం రమేష్ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గతంలో దళితులు సీఎం పదవిని చేపట్టడంతో, రానున్న రోజుల్లో ఆ పదవిని బీసీ వర్గానికి కట్టబెట్టాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేయడంతో సర్వే స్పందించారు. దళితుడ్ని సీఎం చేయడం కాంగ్రెస్ ఎజెండా కాదని, అయితే అవకాశం వస్తే దళితుడు సీఎం అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. తమకు సీఎం పదవి కేటాయించాలని దళితులు ఎప్పుడూ అడగలేదని, ఆ విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఎప్పుడూ తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. పదవుల కోసం ఆరాటపడే స్లోగన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దేనని సర్వే తెలిపారు. ఎప్పటికైనా టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాల్సిందేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమతో పొత్తుపెట్టుకుంటే వారికే శ్రేయస్కరమన్నారు. -
సింగిల్ డే సీఎంగానైనా....
నెల్లూరు : రాష్ట్ర విభజనపై ప్రజలు తీవ్రంగా రగిలిపోతుంటే, మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మాత్రం చివరి దశలో అయినా సీఎం కుర్చీ సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సీఎం పదవికి రాజీనామా చేయటానికి రెండు రోజుల ముందు నుంచే ఆనం ఢిల్లీలో లాబీయింగ్ మొదలు పెట్టారు. 39 నెలల తర్వాత చేస్తున్న రెండో ప్రయత్నం నెరవేరొచ్చనే ఆశ ఆనం వర్గీయుల్లో వ్యక్తం అవుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత 2009లో అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్యకు సీఎం కుర్చీ వరించిన సంగతి తెలిసిందే. అనేక కారణాలరీత్యా 2010 నవంబరులో రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిని తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అప్పట్లో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రాంనారాయణరెడ్డి ఏఐసీసీ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నించారు. సీఎం పదవిపై అప్పట్లో ఆయన చాలా ధీమాగా వ్యవహరించారు. అయితే ఊహించని విధంగా అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ సీఎంగా ఎంపిక చేయడంతో ఆనం తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలతో సీఎం కిరణ్ కచ్చితంగా అర్థాంతరంగా పదవి పోగొట్టుకోవడం ఖాయమని రాంనారాయణరెడ్డి అంచనా వేశారు. కిరణ్ రాజీనామాతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించరాదని అధిష్టానానికి విన్నవించుకుంటున్న వర్గంతో ఆయన చేతులు కలిపారు. -
సీమాంధ్రకు ఆశ్చర్యపడే ప్యాకేజీ! : డీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తాను ఆశించడం లేదని, దానికోసం ఎవరినీ అడగలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పష్టంచేశారు. కొందరు తాము సీఎంలమన్నట్టు చెప్పుకుంటున్నా తాను అలా అనడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరుతున్న సమయంలో సీమాంధ్రులను సంతోషపర్చేం దుకు హైదరాబాద్‌పైనో, ఇంకో విషయంలోనో కొన్ని చిన్నచిన్న సర్దుబాట్లు తప్పకపోవచ్చని,రెండుప్రాంతాల మధ్య సద్భావనకోసం తెలంగాణ ప్రజలు అంగీకరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.గురువారం తన నివాసంలో డీఎస్ మీడియాతో మాట్లాడారు. రెండుప్రాంతాల ప్రజలకు న్యాయం చేసేందుకు కేంద్రమంత్రుల బృందం ఎంతో కసరత్తు చేసి నివేదికను రూపొందిస్తోందని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాల వారు ఆమోదించేలా ఈ నివేదిక ఉండబోతోందన్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువుపై కొందరు ఏవేవో మాట్లాడుతున్నారని, పదేళ్లే కాదు మరో రెండేళ్లు అదనంగా ఉన్నా ఎవరికీ అభ్యంతరం ఉండరాదని చెప్పారు. చిన్నచిన్న సర్దుబాట్లను బూచిగా చూపి ప్రజలను రెచ్చగొట్టి తెలుగుజాతి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నించవచ్చని, వాటికి ఆస్కారమివ్వరాదని కోరారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతున్న నేతలు అదెంతవరకు ఆచరణయోగ్యమో ఆలోచించాలన్నారు. ైెహ దరాబాద్ రెవెన్యూ జిల్లా, జీహెచ్ఎంసీ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేయొచ్చని తెలిపారు. కేంద్రం సీమాంధ్రకోసం రూపొందిస్తున్న ప్యాకేజీ వారినే ఆశ్చర్యానికి గురిచేసేలా ఉండబోతుందన్నారు.