టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తప్పుకున్న తర్వాత టీఆర్‌ఎస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలూ కేటీఆర్‌కు ఉన్నాయని, తెలంగాణ ఉద్యమంలోనూ కేటీఆర్ క్రియాశీలకంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.