srinivas goud
-
తెలుగు ఆడియెన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్న మరో హాలీవుడ్ మూవీ
డేవిడ్ ఆండర్సన్ దర్శకత్వంలో ఎరిక్ ఆండర్సన్ నిర్మాతగా బాల్టాజర్ ప్లాటో, డేవిడ్ ఆండర్సన్ స్క్రీన్ ప్లే వహిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం ఏజెంట్ గై 001. ఈ చిత్రానికి ఆంటోన్ క్లౌడ్ జంపర్ గెస్టిన్ సంగీతాన్ని అందించగా డెన్నిస్ ఆండర్సన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు. ఆంటోన్ కార్ల్సన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా కీలక పాత్రలో నటిస్తూ వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో పి శ్రీనివాస గౌడ్ నిర్మిస్తూ సహాయ నిర్మాతగా పి హేమంత్ వ్యవహరిస్తూ దీప ఆర్ట్స్ బ్యానర్ ద్వారా జనవరి 31వ తేదీన ఎంతో ఘనంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఇప్పటికే తెలుగులో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో వస్తున్న మరొక అద్భుతమైన యాక్షన్ అండ్ అడ్వెంచర్లు కలిగిన చిత్రంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. టీజర్ ను చూస్తే డబ్బు చుట్టూ తిరిగే ఒక పొలిటికల్ డ్రామాలా కనిపిస్తుంది. మేయర్ సీటు కోసం జరిగే ఫైట్స్ అలాగే కొన్ని అడ్వెంచర్లు ఉన్నట్లు తెలుస్తుంది. చిత్రం ఎంత నాణ్యంగా ఉండబోతుంది అనేది టీజర్ లోని నిర్మాణం విలువలు ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. -
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మహబూబ్ నగర్ కేసు నమోదు
-
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు
సాక్షి, మహబూబ్‌నగర్: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇటీవలే పార్టీ కార్యకర్త వరద భాస్కర్‌ను పోలీసులు కొట్టారనే ఆరోపణపై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. మరో పదిహేను మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తపై వన్‌టౌన్ సీఐ దౌర్జన్యం చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని బీఆర్ఎస్ కార్యకర్తను రబ్బరు బెల్టుతో సీఐ కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఐ తీరును వ్యతిరేకిస్తూ మహబూబ్‌నగర్ పీఎస్ ముందు శ్రీనివాస్‌గౌడ్ ఆందోళనకు దిగుతూ.. పోలీసుల తీరుపై శ్రీనివాస్‌గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మాజీ మంత్రి సోదరుడు శ్రీకాంత్ గౌడ్
-
కులగణన కోసం 14న సత్యాగ్రహం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెంటనే కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈనెల 14న హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఓబీసీ సత్యాగ్రహ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గురువారం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, జాతీయ కార్యదర్శి ఎన్.సాయికిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్, అభినేష్»ొమ్మ ప్రవీణ్ కుమార్ తదితరులు శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కులగణన చేసి రిజర్వేషన్స్‌పై ఉన్న 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఓబీసీ నేషనల్ ఫెలోషిప్లను 5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా హైకోర్టు చెప్పిన విధంగా మూడు నెలల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని కులాల గణన చేయాలని కోరారు. -
మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ప్రాణ హాని ఉందని శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు 4+4 గన్మెన్లను కేటాయించాలని పిటిషన్లో కోరారు. శ్రీనివాస్‌గౌడ్ వేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థునను హైకోర్టు నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొంది. శ్రీనివాస్ గౌడ్‌కు గన్మెన్లు అవసరమో? లేదో? తెలపాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలనీ హైకోర్టు డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు.. మార్చి 19కి వాయిదా వేసింది. -
‘ఎమ్మెల్యేలకు ఎర’పై దర్యాప్తు కొనసాగుతోంది
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు కొన సాగు తుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మ హంతి తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడి స్తామన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. గతేడాది అక్టో బర్లో నాటి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పైలట్ రోహిత్‌రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని ఫాంహౌస్‌లో ముగ్గురు బీజేపీ రాయబారులు మంతనాలు జరపడం తెలిసిందే. దీనిపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేసి ఢిల్లీలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభా రతి అలియాస్ సతీష్ శర్మ, హైద రాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజీ స్వా మిలను అరెస్టు చేశారు. మరోవైపు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కూడా కొనసాగుతుందని సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో శ్రీనివాస్ గౌడ్‌పై హత్యా యత్నం కేసులో రాఘవేందర్ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, మున్నూ రు రవి, మధుసూదన్ రాజును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారంతా విచారణకు రావాల్సిందే..: మాదక ద్రవ్యాల కేసుల్లో సినీ పరిశ్రమకు చెందిన వాళ్లను వదిలిపెడుతున్నా మనేది ఆరోపణ మాత్రమేనని సీపీ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు. కబాలీ తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి) కేసు దర్యాప్తులో ఉందని, ఈ కేసులో ఎవరినీ వద లిపెట్టబోమన్నారు. విచారణలో కేపీ చౌదరి వెల్లడించిన పేర్లలో ప్రతి ఒక్కరూ వి చారణకు రావాల్సిందేనని చెప్పారు. గోవా నుంచి హైదరాబాద్‌కు 82.75 గ్రాము ల కొకైన్‌ను తరలిస్తుండగా కేపీ చౌదరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు లో చౌదరిని విచారించగా.. డ్రగ్స్ కింగ్‌పిన్ ఎడ్విన్ న్యూన్స్తోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 900 మందితో సత్సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఇందులో ఓ ప్రముఖ దర్శకుడు, ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్టులున్నారు. -
మాజీ మంత్రి చాంబర్ నుంచి ఫర్నిచర్ తరలింపు!
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రవీంద్రభారతిలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చాంబర్ నుంచి కొందరు ఫర్నిచర్‌ను తీసుకువెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం కొంతమంది వ్యక్తులు ఫర్నిచర్‌ను తీసుకువెళుతుండగా ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తులకు, ఓయూ జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. #OU student union leaders stopped the shifting of furniture from Former Minister Srinivas Goud's office, alleging that public property is being moved illegally. pic.twitter.com/cHlqXF4zgb — Sudhakar Udumula (@sudhakarudumula) December 6, 2023 ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్‌ను ఎలా తీసుకువెళతారని జేఏసీ నాయకులు వారిని ప్రశ్నించారు. దీంతో వారు ఫర్నిచర్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనపై టీజీఓ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, తమ కార్యాలయంలో వినియోగించుకునేందుకు ఆ ఫర్నిచర్‌ను తీసుకువెళ్లాలనుకున్నామని, అయితే అది ప్రభుత్వానిదని తెలియడంతో ఆ ప్రయత్నం మానుకున్నామని తెలిపారు. -
నా మనసుకు దగ్గరైన కథ ఇది
హన్సిక టైటిల్ రోల్ చేసిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు శ్రీనివాస్ గౌడ్, దర్శకుడు అశోక్ అతిథులుగా హాజరై, ఈ సినిమా హిట్టవ్వాలన్నారు. హన్సిక మాట్లాడుతూ– ‘‘మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ ఫిల్మ్ ఇది. నా మనసుకు దగ్గరైన కథ. దర్శకుడు శ్రీనివాస్‌గారు ఎంతో కష్టపడ్డారు. ప్రభాకర్‌గారు రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు నన్ను మరోసారి ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘నేను కొత్త దర్శకుడిని అయినా కథను నమ్మి, నన్ను ప్రోత్సహించిన హన్సికగారికి, సపోర్ట్ చేసిన ప్రభాకర్‌గారికి, సహకరించిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు. శ్రీనివాస్ ఓంకార్. ‘‘ప్రత్యేక శ్రద్ధతో ఈ సినిమా చేసిన హన్సికకు థ్యాంక్స్’’ అన్నారు ప్రభాకర్. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, ఎడిటర్ చోటా కె ప్రసాద్, కెమెరామేన్ కిశోర్, కో ప్రోడ్యూసర్ బండి పవన్ కుమార్, లైన్ ప్రోడ్యూసర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
దాతలూ దయచూపండి!
సాక్షి, పెద్దపల్లి: హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే కార్మికుడు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. వైద్యానికి డబ్బు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన నాగపూరి శ్రీనివాస్‌గౌడ్ నాలుగు నెలల క్రితం హైబీపీతో పక్షవాతానికి గురికాగా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. అతడికి భార్య శ్రీలత, ఇద్దరు కూతుర్లు అంజలి, భార్గవి ఉన్నారు. శ్రీనివాస్ పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. మంచానికే పరిమితం కావడంతో వైద్యంకోసం కుటుంబసభ్యులు తెలిసినవారి వద్ద రూ.10లక్షల వరకు అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. అయినా కోలుకోలేదు. నాలుగు నెలల నుంచి కుటుంబ పోషణ భారం కావడంతో ఇద్దరు ఆడపిల్లలు చదువుకు దూరమయ్యారు. వైద్యానికి దాతలు సాయం చేస్తే కోలుకుంటాడని శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మూత్రపిండాల్లో రాళ్లు తొలగింపునకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని కుటుంబసభ్యులు రోదిస్తూ తెలిపారు. ఆపరేషన్‌కు రూ.5లక్షలు అవుతాయని, తమ వద్ద చిల్లిగవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు మానవత్వంతో సా యం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. - దాతలు సాయం చేయాల్సిన ఫోన్ పే నంబర్ : 96761 73272 -
కోర్టు తీర్పుపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. వారి వల్లే అంటూ..
సాక్షి, మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్ వేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. కాగా, కోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ధర్మం గెలిచింది. గతంలో మంత్రులుగా చెలామని అయ్యి ఈ రాష్ట్రానికి ఏమీ చేయని వాళ్లు పనిచేసే వాళ్లను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే ఇలాంటి కేసులు వేశారు. బీసీలతోనే బీసీ నాయకత్వాన్ని బలహీన పరుచాలనే దుర్బుద్ధితో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ ఇద్దరు నన్ను ఇబ్బందుల పాలు చేయాలనే తలంపుతో ఈ చర్యలకు తెరలేపారు. గతంలో ఈ వ్యక్తుల వల్లే జిల్లా సర్వనాశనం అయ్యింది. ఈరోజు కుల, మతాలకు అతీతంగా అందరికీ అండగా నిలుస్తూ అభివృద్ధిలో జిల్లాను నడుపుతుంటే చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లకు పుట్టగతులు లేకుండా పోతాయని వాళ్ళ బంధువులే మాతో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచాలన్నదే మా అభిమతం. ఇప్పటికైనా మారండి, ప్రజా క్షేత్రంలోకి రండి అంతే కానీ కేసులు వేసి పైశాచిక ఆనందం పొందడం మానుకోండి. ప్రజలే నాకు దేవుళ్లు, ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆయన ఆశీస్సులతో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి శాయశక్తుల కృషి చేస్తాం. నాకు అండగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్.. -
హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్ వేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. వివరాల ప్రకారం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అయితే, 2018లో శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని అందులో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పులను నేటికి వాయిదా వేసింది. దీంతో నేడు తీర్పును వెలువరించింది. ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పెద్ద ఊరట లభించింది. మంత్రికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న(సోమవారం) ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్ 30వ తేదీన ఎన్నికలకు కౌంటిగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇది కూడా చదవండి: ఎన్నికల తేదీలు వచ్చాయో లేదో.. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల సర్వేల లొల్లి -
రాజ్యాధికారమే బీసీల లక్ష్యం కావాలి
కేయూ క్యాంపస్: ’’అర శాతం, ఐదు శాతం ఉన్నవాళ్లు బహుజనులపై పెత్తనం చెలాయిస్తున్నారనీ, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా.. సర్దార్ సర్వాయి పాపన్న పోరా ట స్ఫూర్తితో బీసీలు, గౌడన్నలు చైతన్యవంతం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం గౌడ సంఘాల ఉ మ్మడి వరంగల్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్ లో నిర్వహించిన గౌడ గర్జన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు కూడా బహుజన కులాలకు జనాభా ప్రతిపాదికన సీట్లు కేటాయించడంలేదని, బీసీలను ఓటర్లుగానే వాడుకుంటున్నారని ఆరోపించారు. మన హక్కులను సాధించుకోవాలంటే ఎక్కువ శాతం వాటా ఉన్న బీసీలే అధికారంలోకి రావాలన్నారు. ఇందుకు రాబోయే రోజుల్లో ఓబీసీ పార్టీ కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ కూడా బీసీని సీఎం చేస్తామనడం లేదు ఏ పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తా మని చెప్పటం లేదని శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు. ’’బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 సీట్లు కేటాయించగా అందులో ఐదుశాతం ఉన్న రెడ్లకు 40 టికెట్లు ఇచ్చారు.. అర శా తం ఉన్న వెలమలకు 12 సీట్లు ఇచ్చారు.. ఈ లెక్కన బీసీలకు ఇచ్చింది తక్కువే. ఉ మ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క గౌడ్‌కు కూడా టికెట్ ఇవ్వదు.. ఇంకా బీఆర్ఎస్ బీఫామ్‌లు ఇవ్వలేదు కాబట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు, గౌడలకు సీట్లు కేటాయించాలి.. లేని పక్షంలో లక్షమందితో హైదరాబాద్‌కు వచ్చి ఆ పార్టీ కార్యాలయానికి తాళం వేస్తాం’అని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్లకే ఎక్కువ సీట్లు ఇచ్చి బీసీలను విస్మరిస్తే గాంధీ భవన్‌కు తరలివస్తామన్నారు. గాంధీ భవన్‌ను రెడ్డిభవన్‌గా మార్చుకోవాలని ఎద్దేవాచేశారు. బీజేపీ సైతం అదేబాటలో ఉండబోతోందని, ప్రధాని నరేంద్ర మోదీ తాను ఓబీసీ అని చెప్పుకుంటున్నారే తప్ప ఓబీసీలకు ఒరగబెట్టిందేమి లేదని ఆయన విమర్శించారు. గౌడ సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ బైరి రవికృష్ణగౌడ్ అధ్యక్షతన ఈ సభలో తెలంగాణ గౌడసంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరిగౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, జిల్లా అ«ధ్యక్షుడు చిర్ర రాజు గౌడ్, బాధ్యులు కత్తి వెంకటస్వామి గౌడ్ పాల్గొన్నారు. తొలుత ఏకశిల పార్కు నుంచి గౌడలు ర్యాలీగా ఆడిటోరియం గ్రౌండ్‌కు చేరుకున్నారు. -
రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల వెల్లువ
మాదాపూర్: రాష్ట్రంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచదేశాలతో పోటీ పడుతోందన్నారు. రాష్ట్రంలో సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విదేశీ పర్యాటకులు దేశంలో ఎక్కువ శాతం రాష్ట్రాన్ని సందర్శిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా రిజర్వాయర్లు కడుతున్నారని వాటిని సందర్శకులు వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం విశేషంగా ఆకట్టుకుంటోందని వివరించారు. శ్రీనివాస్‌గౌడ్ మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సోమవారం వరల్డ్ టూరిజం డే–2023 వేడుకలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ జిల్లా కేంద్రంలో మూడు రోజులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఫుడ్ ఫెస్టివల్, చేనేత ఉత్పత్తుల స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వేడుకలకు వచ్చిన ప్రతినిధుల కోసం తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రతి చెరువు వద్ద బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో చివరిరోజు అవార్డులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ పర్యాటక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక కమిషనర్ శైలజారామయ్యర్, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎండీ మనోహర్, డైరెక్టర్ నిఖిల పాల్గొన్నారు. -
నిజామాబాద్ అర్బన్‌లో.. 'బిగాల గణేష్‌గుప్త'కే అవకాశం ఎక్కువ..
సాక్షి, నిజామాబాద్: ప్రతి ఎన్నికల్లో కాలనీల్లో మౌలిక సదుపాయలు, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి వసతి , పెన్షన్ల కేటాయింపు ఈ అంశాలు ముఖ్యంగా ప్రభావితం అవుతాయి.. ఈ పనులతో పాటు ప్రజాప్రతినిధులు అభ్యర్థులు కాలనీ వాసులతో అందుబాటులో ఉండే వారి పట్ల ప్రజలు మొగ్గుచూపుతారు. మరోవైపు కులాల వారిగా ఓటర్లు ప్రధానంగా ప్రభావం చూపుతారు. అర్బన్‌లో ముస్లీంలు, మున్నూరు కాపులు, పద్మశాలిలు వరుసగా అత్యధిక ఓటర్లు కలిగి ఉన్నారు. ఇక్కడ కులాల వారిగా ఏదైనా అభ్యర్థికి మద్దతు ఇవ్వడంలోనూ ముందుకు వస్తే రాజకీయ సమీకరణలు తీవ్రంగా ఉంటాయి. కులాల వారు మద్ధతు తెలిపితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మైనార్టీలు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఏకపక్షంగా ఎంఐఎంకు, మైనార్టీ నాయకులకు ఎక్కువ మద్దతు పలుకుతున్నారు. వీరి ఓట్లను సాధించిన వారు అనుకూలంగా మలుచుకున్నవారు గెలిచే అవకాశాలు ఎక్కువ. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ.. నిజామాబాద్ అర్బన్‌లో ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మళ్లీ పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతన్ని కాదని మరొకరికి టికెట్ ఇస్తే ఇతర నాయకులు బలంగా లేరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బిగాల గణేష్‌గుప్త తమ్ముడు మహేష్గుప్తకు టికెట్ ఇప్పించాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అర్బన్‌లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీపీసీసీ రాష్ట్ర నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ మరోసారి తనకే టికెట్ కావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ టికెట్ తనకే వస్తుందని ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. మరో వైపు సీనియర్ నాయకుడు కేశవేణు , తాహెర్బిన్హుందాన్లు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఎన్ఆర్ఐ నరాల కళ్యాణ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మరోసారి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ధన్పాల్ సూర్యనారాయణ సైతం టికెట్ కోసం ఈసారి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఐఎం తరపున భైంసా మున్సిపల్ చైర్మన్ జుబేర్‌తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ ఫయూమ్లు, మాజీ కార్పొరేటర్ రఫత్ఖాన్లు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల సంఖ్య.. అర్బన్ నియోజక వర్గంలో ముస్లీం ఓటర్లు అధికంగా ఉంటారు. వీరు 48వేల వరకు ఉండగా, మున్నూరుకాపు ఓటర్లు 44 వేల వరకు ఉంటారు. పద్మశాలిలు 41 వేల వరకు ఉంటారు. వీరే అర్బన్‌లో రాజకీయాలకు కీలకంగా మారారు. భౌగోళిక పరిస్థితుల పరంగా.. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలో భౌగోళిక పరిస్థితుల పరంగా పెద్దగా గుర్తింపు బడిన అంశాలు లేవు. ఖిల్లా రామాలయం, నీల కంఠేశ్వరాలయం, శంభునిగుడి, జెండాగుడిలు ఉన్నాయి. ఇందులో శుంభుని గుడి రాజకీయ పరంగా తరచుగా వివాదం అవుతుంది. ఈ గుడికి అనుకొని ఉన్న ముస్లిం దుకాణాలను తొలగించాలని వివాదాలు జరుగుతాయి.. టికెట్ల కేటాయింపులో ఆసక్తికరం.. అర్బన్ నియోజక వర్గంలో కులాల వారిగా ఓటర్లు కీలకంగా ఉండగా అభ్యర్థుల టికెట్ల కేటాయింపులో ఆసక్తికరంగా ఉంటుంది. సీనియర్ రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయించుకోవడం ఎక్కువగా కొనసాగుతుంది. సామాన్య, తక్కువ స్థాయి లీడర్లకు పోటీచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.. డి. శ్రీనివాస్ కుటుంబం మూడు పార్టీల్లో కొనసాగింది.. ఆ తరవాత డి. శ్రీనివాస్ బీఆర్ఎస్ కు దూరం కావడంతో ప్రస్తుతం ఆ సంఖ్య రెండుకు చేరింది.. ఆయన పెద్దకొడుకు సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ గూటికి మళ్లీ చేరిపోగా చిన్న కొడుకు అరవింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. వర్గాల వారిగా.. అర్బన్ నియోజక వర్గంలో హిందూ, ముస్లీం వర్గాలకు సంబంధించి తరచుగా వివాదాలు నెలకొనడం జరుగుతుంది. ఇక్కడ రాజకీయ పరిస్థితులు అలాగే ఉన్నాయి. రెండు వర్గాల వల్ల ఓటర్లు కూడా హిందూ, ముస్లీం వారిగా ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఇక్కడ బీజీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలువడం, మున్సిపల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు రెండవ స్థానంలో నిలువడం ఆసక్తికరంగా మారింది. -
TS Election 2023: దేశంలోనే అగ్రగామిగా.. : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్: వ్యవసాయ రంగం అభివృద్ధిలో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్‌తోపాటు పాలమూరు కరువును శాశ్వతంగా రూపుమాపాలన్న ఉద్దేశంతో రూ.35,200 కోట్లతో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్ భవన సముదాయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా కర్వెన రిజర్వాయర్ నుంచి సాగునీటిని తీసుకువచ్చి జిల్లా మొత్తం సస్యశ్యామలం చేస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో 2.18 లక్షల ఎకరాల సాగు మాత్రమే ఉండగా.. గత తొమ్మిదేళ్లలో సాగు విస్తీర్ణం 3.50 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. -
పర్యాటక మంత్రి హామీతోనైనా.. చంద్రగఢ్ దశ మారేనా?
వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పురాతన కట్టడాల్లో చంద్రగఢ్ కోట ఒకటి. చుట్టూ రాతితో నిర్మించిన కోట చూడగానే అప్పటి నిర్మాణశైలి గుర్తుకొస్తుంది. అలాంటి కోట శిథిలావస్థకు చేరడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 18వ శతాబ్దంలో మరాఠా రాజుల కాలంలో బాజీరావు పీశ్వా ఆత్మకూర్ సంస్థానానికి సంబంధించి పన్ను వసూలు చేయడానికి చంద్రసేనుడిని నియమించారు. చంద్రసేనుడు ఈ ప్రాంతంలోని ధర్మాపురం గ్రామానికి ఉత్తర దిశగా ఉన్న ఎత్తైన కొండపై ఈ కోట నిర్మించారు. చంద్రసేనుడు ఇక్కడి నుంచే వివిధ సంస్థానాధీశుల నుంచి పన్నులు వసూలు చేసి మరాఠాకు పంపేవాడు. చంద్రసేనుడు నిర్మించిన కోట కావడంతో దీనికి చంద్రగఢ్ కోటగా నామకరణం చేశారు. నేడు ఇక్కడ ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శత్రువుల కదలికలను గుర్తించేందుకు.. కోట పైభాగంలో ఉండే సైనికులు శత్రు సైనం దండెత్తడానికి వస్తే సుమారు పది కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టి ఫిరంగులతో దాడి చేసేందుకు వీలుగా కోటగోడ భాగంలో భారీ రంధ్రాలను ఏర్పాటు చేశారు. పర్యాటక మంత్రి హామీతోనైనా.. అమరచింతలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చంద్రగఢ్ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి సూచించారు. మంత్రి హామీతో చంద్రగఢ్ కోట పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోటకు మరమ్మతులు చేయించి పార్క్‌లు ఏర్పాటుచేస్తే వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మంత్రి చొరవతో చంద్రగఢ్‌కు పూర్వ వైభవం రావాలని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు. ‘చుట్టూ పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణంలో ఎత్తైన కొండపై 18వ శతాబ్దంలో నాటి సంస్థానాదీశుడైన చంద్రసేనుడు చంద్రగఢ్ కోటను నిర్మించారు. కోట మధ్యలో రామలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు తాగునీటి కోసం రాతిపొరల మధ్య ఏర్పాటుచేసిన ఎనిమిది చిన్న చిన్న కొలనులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ ఏడాది పొడవునా నీరు ఉండటం విశేషం.’ ఇదీ ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం కోటలోని రాతి గోడలు శిథిలావస్థకు చేరాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోటను సందర్శించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అప్పట్లో కేవలం కోటపైకి వెళ్లడానికి వీలుగా సీసీ రహదారి నిర్మించి వదిలేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రగఢ్ కోటను పట్టించుకునే వారే కరువయ్యారు. -
చిరస్మరణీయుడు కాళోజీ
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): ప్రముఖ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడని పలువురు ప్రముఖులు కొనియాడారు. శనివారం ఇక్కడి రవీంద్రభారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ 109వ జయంతి ఉత్సవాలు, తెలంగాణ భాషా దినోత్సవాలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎౖMð్సజ్, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత ఈ ప్రాంత మహనీయుల జయంతి, వర్థంతి వేడుకలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికా రికంగా నిర్వహిస్తోందని తెలిపారు. సాహిత్య రంగానికి కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాళోజీ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. కొంతమంది మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, అందులో కాళోజీ ఒకరని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ కవి జయరాజ్ కు కాళోజీ స్మారక పురస్కారం ప్రదానం చేశారు. రూ.1,00,116 రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీని వాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమ ణాచారి, కార్పొరేషన్ల చైర్మన్లు జూలూరు గౌరీశంకర్, ఆయాచితం శ్రీధర్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దీపికారెడ్డి, ఎం.శ్రీదేవి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
సాయిచంద్ కుటుంబానికి రూ.కోటిన్నర ఆర్థికసాయం
బడంగ్పేట్/అమరచింత: ప్రజా గాయకుడు, దివంగత నేత సాయిచంద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడలో నివాసం ఉంటున్న సాయిచంద్ సతీమణి రజినీకి సోమవారం ప్రభుత్వం తరఫున రూ.కోటి చెక్కును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి అందజేశారు. అనంతరం రజినీతో పాటు చిన్నారులను ఓదార్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, జెడ్పీ చైర్‌పర్మన్ తీగల అనిత తదితరులు పాల్గొన్నారు. రజనికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సబితారెడ్డి, దాసోజు సాయిచంద్ తండ్రి, చెల్లెలికి చెక్కుల అందజేత అణగారిన వర్గాల బాధలను, ఆంధ్ర పాలకుల నైజాన్ని ఎండగట్టిన మహాగాయకుడు సాయిచంద్ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సాయిచంద్ తండ్రి వెంకట్రాములు, చెల్లెలు ఉజ్వలకు చెరో రూ.25 లక్షల చొప్పున చెక్కులను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
నెలలోపు సిద్దిపేటకు రైలు: మంత్రి హరీష్‌రావు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కేసీఆర్ కలలు కన్న సిద్దిపేట సాకారమవుతుందని.. మంత్రి హరీష్‌రావు అన్నారు. నెలలోపు సిద్దిపేటకి రైలు రాబోతుందన్నారు. ఆదివారం ఆయన డ్రోన్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోమటి చెరువులో స్కై రెస్టారెంట్, టన్నెల్ అక్వేరియం, వర్చువల్ రియాలిటీ డోమ్ థియేటర్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని హరీష్‌రావు కోరారు. ఆయన మాకు ఆదర్శం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హరీష్ రావు మా అందరికి ఆదర్శప్రాయుడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లిన, ఎక్కడున్నా, ఏం చూసినా ఇది సిద్దిపేటకు కావాలంటాడు. సిద్దిపేటను ఆదర్శంగా తీసుకుని తాము కూడా మహబూబ్ నగర్లో కొన్ని పనులు చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చదవండి: ఇదేం పిచ్చి రా బాబోయ్.. మొహాలకు న్యూస్ పేపర్లు చుట్టుకొని.. -
నేడే మద్యం లాటరీలు
సాక్షి, హైదరాబాద్/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రానున్న రెండేళ్ల కాలానికిగాను లైసెన్సుల మంజూరు కోసం నేడు(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్‌షాపులకు లాటరీలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీన ముగిసిన నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘డ్రా’తీయనున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణ ద్వారా ఈ లాటరీల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, ఈ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, లాటరీలో విజేతలకు వెంటనే షాపుల కేటాయింపు ఉత్తర్వులు అందజేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే డ్రా తీసే ప్రదేశంలోకి అనుమతించాలని, లాటరీ ప్రక్రియ విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. కాగా, మంత్రి ఆదివారం మహబూబ్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో కూడా ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాటరీ ప్రక్రియ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. -
స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ.. క్రీడాకారిణికి అసభ్య మెసేజ్‌లు..
సాక్షి, హైదరాబాద్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటన మరువక ముందే మరో కీచకుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో కీచక ఉద్యోగి వేధింపుల బండారం బట్టబయలైంది. ఓ జాతీయ క్రీడాకారిణిపై మంత్రి పేషీ ఉద్యోగి వేధింపుల ఘటన సంచలనం రేకెత్తించింది. మంత్రి సిఫార్సుతో వచ్చినా వేధింపులు తప్పలేదని ఆ క్రీడాకారిణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని, కెరీర్‌కు భయపడి ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని బాధితురాలు మీడియాకు తెలిపింది. ‘‘స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ వేధించాడు. అసభ్యకర మెసేజ్‌లతో వేధింపులకు పాల్పడ్డాడు. స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫీసుకు వెళ్లినా నన్ను కలవనివ్వలేదు. గతంలో వేధింపులకు గురైనా బయటకు రాలేకపోయామంటూ బాధితురాలు వాపోయింది. -
Drone Show: మహబూబ్‌నగర్ ట్యాంక్‌బండ్‌పై ఆకట్టుకున్న మెగా లేజర్ షో (ఫోటోలు)
-
సర్దార్ పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం
గన్‌పౌండ్రీ (హైదరాబాద్): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ మహరాజ్ 373వ జయంతి జాతీయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ కులస్తుల అనేక సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. పాపన్న చరిత్ర తెలుసుకుంటే జాతిపట్ల అప్పట్లో ఎంత వివక్షత ఉందో తెలుస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని పెట్టేందుకు జీవో జారీ చేశామని హెచ్ఎండీఏ అధికారులు స్థలాన్ని అన్వేషీస్తున్నట్లు వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ, బహుజనులంతా ఐక్యంగా ఉన్నప్పుడే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు భరత్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. 75 సంవత్సరాల రాజమండ్రి పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తి పార్లమెంటుకు ఎంపిక కావడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ బయోపిక్‌పై రూపొందించిన సినిమా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లే రవికుమార్‌గౌడ్, జై గౌడ్ ఉద్యమం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వి.రామారావుగౌడ్ పాల్గొన్నారు. -
హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో వేధింపులు.. హరికృష్ణ స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి బండారం బట్టబయలైంది. కాగా, లైంగిక వేధింపుల అధికారికి మంత్రి అండదండలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇక, విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ దీనిపై స్పందించారు. తాజాగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ చేసి నన్ను సస్పెండ్ చేశారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అని కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆభివృద్ది, సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. క్రీడాకారిణిలకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు వారిలో ధైర్యం నింపేందుకు వెంటనే చర్యలను చేపట్టాము. గతంలో మహిళల పట్ల జరిగిన లైంగిక వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం… — V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023 ఇదిలా ఉండగా.. ఈ లైంగిక వేధింపుల ఘటనపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. బాలికలపై వేధింపుల ఘటనను ఎమ్మెల్సీ కవిత సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ.. తక్షణమే సదరు అధికారిపై చర్యలు చేపట్టాలని, విచారణ జరిపి బాధితురాళ్లకు న్యాయం జరిపించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ట్విట్టర్ వేదికగా కోరారు. ఇది కూడా చదవండి: హెచ్ఎం వేధింపులు.. జాబ్ కావాలంటే , నేను చెప్పినట్లు వినాల్సిందే! -
అద్భుతం.. ‘అనన్య’ నృత్యం..
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): దీపాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నృత్యగురువు దీపికారెడ్డి శిష్యురాలు అనన్య పొలసాని కూచిపూడి నృత్య అరంగేట్రం శనివారం రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె చక్కటి హావభావాలతో నర్తించిన పుష్పాంజలి, భామాకలాపం ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్ గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు హాజరై అనన్యను అభినందించారు. అనన్య ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మేనకోడలు. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు.. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చర్యలు
సాక్షి, మహబూబ్‌నగర్/హైదరాబాద్: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మరో పదిమందిపై కేసులు నమోదయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. నేడు రెండవ శనివారం, 13న ఆదివారం సెలవు ఉండటంతో 14న కోర్టుకు కేసుకు సంబంధించిన నివేదిక ఇవ్వడానికి పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. చదవండి: కారిడార్ వార్!... ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యం ఇదీ కేసు.. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్‌పై దాఖలైన కేసులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు రాష్ట్ర, కేంద్ర రిటర్నింగ్ అధికారులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 2018, డిసెంబర్లో ఎన్నికలు జరిగిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ను శ్రీనివాస్‌గౌడ్ ట్యాంపరింగ్ చేశారని, అయినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో దావా వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి, మంత్రి సహా సదరు అధికారులపై కేసు నమోదు చేయాలని తీర్పునిచ్చారు. కేసు నమోదైంది వీరిపైనే.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు అప్పటి అధికారులు, ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండర్ సెక్రటేరియల్ రాజీవ్‌కుమార్, సంజయ్‌కుమార్, రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్, సెక్రెటరీ, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, కలెక్టర్ వెంకట్రావు, డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీఓ శ్రీనివాసులు, టెక్నికల్ అధికారి వెంకటే‹Ùగౌడ్, విశ్రాంత ఉద్యోగి సుధాకర్, న్యాయవాది రాజేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదైనట్టు సమాచారం. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు.. కోర్టు కీలక ఆదేశాలు
-
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు
-
బహుజన చక్రవర్తి పాపన్నగౌడ్
కందుకూరు: మొగల్ పాలకుల దౌర్జన్యాలు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి 33 కోటలను జయించి, గోల్కొండ కోటను సైతం ఆరు నెలల పాటు పాలించిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కందుకూరులో గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సిద్ధూగౌడ్, సీనియర్ నాయకుడు అంజయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో కలిసి ఆయన ఆవిష్కరించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గొలుసు కట్టు చెరువులను నిర్మించిన ఘనత పాపన్నకే దక్కుతుందన్నారు. ఆయన జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నాయకుడు వీరేందర్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఐఏఎస్ అధికారులపై కేసు
-
కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో మోసపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాలలో, కేటీఆర్‌కు వంద ఎకరాలలో ఫామ్ హౌస్‌లు, రూ.వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, టీవీలు, పేపర్లు వచ్చాయి కానీ దత్తత తీసుకున్న పాలమూరు మాత్రం పడావు పడిందన్నారు. ఉద్యమ సమయంలో ఎంపీగా గెలిపించిన మహబూబ్‌నగర్ జిల్లాకు, జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఆదివారం జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో కాంగ్రెస్‌లో చేరిన మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాధ అమర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అమరెందర్ రాజు, కౌన్సిలర్ రమాదేవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్ఎస్ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లును అమ్మి పాలమూరును అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ సీఎం అయి తొమ్మిదేళ్లయినా అతీగతీ లేకుండా పోయిందన్నారు. పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానన్న హామీ ఏమైందన్నారు. వక్ఫ్ భూములనూ వదలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని, వక్ఫ్ భూములను సైతం వదలకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్.. ఏ దందాలో చూసినా బీఆరెస్ నేతలే ఉన్నారని, వాళ్ల అరాచకాలను ఎదిరించేందుకు కాంగ్రెస్‌లో చేరడం అభినందనీయమన్నారు. పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించవద్దని, అక్రమ కేసులు పెడితే మిత్తితో సహా చెల్లిస్తామని రేవంత్ హెచ్చరించారు. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఛాన్స్ దొరికిన ప్రతీసారీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై హస్తం నేతలు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ తొమ్మిదేళ్ల పాలనలో పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారు. వక్ఫ్ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అలంపూర్ అభివృద్ధి శూన్యం. కేసీఆర్ చేతిలో పాలమూరు జిల్లా మోసపోయింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసేది కాంగ్రెస్ పార్టీనే. మహబూబ్ నగర్ జిల్లాలో 14కి 14 సీట్లు కాంగ్రెస్‌ను గెలిపించండి. ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ‘కవిత లిక్కర్ స్కాంపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు’ -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో చుక్కెదురు
-
Telangana:బీసీ దారిలో బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ అంశంలో కాంగ్రెస్‌పై మూకుమ్మడిగా విమర్శల దాడికి దిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల బీఆర్ఎస్లోని బీసీ మంత్రులు, నేతలు లక్ష్యంగా చేసిన విమర్శలు.. బీసీల్లో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిదాడికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ బీసీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సంస్థల చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. భేటీపై కొన్ని గంటల ముందు మాత్రమే సమాచారం అందడంతో పరిమిత సంఖ్యలోనే బీసీ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 25న విస్తృత స్థాయిలో బీసీ నేతల భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగడదాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల బీసీ మంత్రులు, ఇతర నేతల పట్ల చేసిన వ్యాఖ్యలు, బీసీ నేత దాసోజు శ్రవణ్‌కు వచ్చిన బెదిరింపులు తదితర అంశాలు తలసాని ఆధ్వర్యంలోని భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. బీసీ సభల పేరిట ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ చేస్తున్న హడావుడి, సూర్యాపేటలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు చేస్తున్న సన్నాహాలపైనా నేతలు చర్చించారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం బీసీల కోసం అమలు చేసిన పథకాలు, చేకూరిన లబ్ధి తదితరాలను విశ్లేషించారు. ఆత్మ గౌరవ భవనాలు మొదలుకుని అన్ని బీసీ కులాల కోసం అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్‌ను ఎండగట్టాలని.. లేకుంటే కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని భేటీలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. కార్యాచరణపై ఈ నెల 25న విస్తృత భేటీ బీసీల ఆత్మగౌరవాన్ని చాటడంతోపాటు బీసీల కోసం బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలు, పథకాలను వివరించేందుకు ‘బీసీ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ బీసీ నేతలు నిర్ణయించారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ బీసీ ఆత్మగౌరవ సభలు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చారు. రాష్ట్ర మంత్రివర్గం మొదలుకుని పార్లమెంట్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో పరేడ్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 25న హైదరాబాద్‌లో మరోమారు విస్తృత స్థాయి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, 93బీసీ కుల సంఘాల నేతలను ఆహ్వానించనున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కాంగ్రెస్ భూస్థాపితమే.. – మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, గంగుల హెచ్చరిక – త్వరలో బీసీ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా కించపర్చే ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరు సరికాదని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ మండిపడ్డారు. బీసీల జోలికొస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. తలసాని కార్యాలయంలో బీసీ నేతల భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులతో బీసీల్లో కొట్లాట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జనాభాలో 56శాతంగా ఉన్న బీసీలు ఆత్మగౌరవాన్ని వదులుకోబోరన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉందంటున్న కాంగ్రెస్ ఎంత మంది బీసీలకు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీలను కదిలించేందుకు అవసరమైన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
పర్యాటక రంగాభివృద్ధికి కృషి
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నూతనంగా కొనుగోలు చేసిన రెండు ఏసీ బస్సులు, ఒక మినీ వాహనాన్ని శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గతంలో రెండు బస్సులను కొనుగోలు చేశామని, ప్రస్తుతం రూ.5 కోట్ల వ్యయంతో మరో రెండు బస్సులను కొనుగోలు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, షిరిడీలకు భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. కాళేశ్వరం, నాగార్జునసాగర్, సోమశిల, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాలలో 5 పాయింట్లుగా ఈ పర్యాటక బస్సులను నడిపేందుకు త్వరలో ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, గీత కార్మికుల సహకార సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నన్ను రమ్మంటారా?.. మీరొస్తారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యా వ్యవస్థ, విద్యార్థులను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అకారణంగా అవమానించారని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో చూసి పరీక్షలు రాస్తున్నారని చేసిన బొత్స వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయం మీడియా సెంటర్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చకు నన్ను రమ్మంటారా?.. మీరొస్తారా..? అని సవాల్ విసిరారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.. పోనీ హైదరాబాద్... ఎక్కడైనా సరే చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. మీ విద్యార్థులు మా విద్యార్థులతో పోటీ పడితే అసలు విషయం బయటపడుతుందన్నారు. ఏపీ నుంచి చదువు కోవడానికి తెలంగాణకు వస్తున్నారే తప్ప.. తెలంగాణ వాళ్లు ఏపీకి పోవడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అందరినీ సమానంగా చూసి ఉంటే రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండేవని, మీలాంటి వ్యక్తుల వ్యాఖ్యలతోనే తెలంగాణ విడిపోయిందని ఆరోపించారు. తిరుమల శ్రీవారి దర్శనం కావాలంటే రకరకాల ఇబ్బందులని, అదే మా దగ్గర యాదాద్రి, వేములవాడ, రామప్ప, భద్రకాళి ఎక్కడైనా సరే అందరినీ ఒకే రకంగా చూస్తామన్నారు. తమ పార్టీ బీఆర్ఎస్కు ఏపీ నుంచి కూడా బాగా ఆదరణ ఉందని శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. -
ఆధునిక హంగులతో.. పర్యాటక కేంద్రాల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌తో పాటు వివిధ పట్టణాలలో ఆధునిక మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రులు తెలిపారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా యోసూ పట్టణంలోని బిగ్ ఓ మ్యూజికల్ ఫౌంటెన్ షోను శనివారం మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తదితరులు తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఫౌంటెన్ కంటే ఆధునికమైన ఫౌంటెయిన్‌ను కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. దక్షిణ కొరియాలోని పర్యాటక ప్రదేశాలను పరిశీలించి ఆధునిక హంగులతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలో వివిధ పట్టణాల్లోని పర్యాటక కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా ఆధునిక పరిజ్ఞానంతో పనిచేసే మ్యూజికల్ ఫౌంటెయిన్లు, జెయింట్ వీల్స్, వాటర్ స్పోర్ట్స్ వంటి వాటిని కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, మహబూబ్‌నగర్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. -
పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనతో తెలంగాణ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఈనెల 7 వరకు దక్షిణ కొరియాలో పర్యటించనుంది. ఈ బృందం శుక్రవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోగా.. ఆ దేశంలో భారత అధికారులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గోదావరి నది ఒడ్డునున్న కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, మహబూబ్‌నగర్‌లోని ట్యాంక్ బండ్ అభివృద్ధి, అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్ జెయింట్ వీల్ వేవ్ పూల్, వాటర్ రైడ్స్, వాటర్ స్పోర్ట్స్, మన్యంకొండ వద్ద తొలిసారిగా నిర్మిస్తున్న రోప్ వే, హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయని వివరించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ వాటర్ రివర్ ఫ్రంట్‌ను అధ్యయనం చేస్తున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. -
కులవృత్తులకు పూర్వ వైభవం
మణికొండ: బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కుల వృత్తులకు పూర్వ వైభవం వస్తోందని, అందరూ ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్ నగరశివారు కోకాపేటలో గౌడ్లకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో ఆత్మగౌరవ భవనానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రప్రభుత్వం వైన్స్‌ల కేటాయింపులో గౌడ్లకు 15శాతం రిజర్వేషన్ కల్పిస్తోందని, నీరా పాలసీతో వేలాది మంది ఉపాధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఎప్పటినుంచో ఉన్న కల్లు దుఖాణాలను తాడి బార్లుగా మార్చాలనే ఆలోచన చేస్తున్నామని, నీరా కేఫ్‌లను జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.30 కోట్ల తాటి, ఈత మొక్కలను నాటామని, కల్లు అంటే ఉన్న చులకన భావం పోగొట్టి, కల్లు దుఖాణాల రూపురేఖలను మార్చితే మరింత మందికి ఉపాధి కలుగుతుందన్నారు. గౌడ్ల అభ్యున్నతికి మరిన్ని సంక్షేమ పథకాలను తేవాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని కులవృత్తుల వారు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, వారంతా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, కల్లుగీత సహకార సంఘం చైర్మన్ పల్లె రవికుమార్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అంజయ్యగౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బి.భిక్షమయ్య, సత్యనారాయణ, గౌడ సంఘం నాయకులు పల్లె లక్ష్మణ్‌గౌడ్, బాల్‌రాజ్‌గౌడ్, వనజ ఆంజనేయులుగౌడ్, పెద్ద ఎత్తున గౌడ కులçస్తులు పాల్గొన్నారు. -
ఉప్పల్ స్టేడియంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
-
హెచ్‌సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. హెచ్‌సీఏలో అవినీతి పెరిగిపోయిందని.. సెలక్షన్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ తీరును ప్రభుత్వం గమనిస్తుందని త్వరలోనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ''ఉప్పల్ స్టేడియంకు సంబంధించిన లీజ్ త్వరలో ముగిసిపోతుంది. ఉప్పల్ స్టేడియం లీజ్‌పై ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. హెచ్‌సీఏ అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఉప్పల్ స్టేడియాన్ని స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించే యోచనలో ఉన్నాం.'' అని వెల్లడించారు. చదవండి: చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఇన్ని లీటర్ల పాలా!
-
బిఆర్ ఎస్, కాంగ్రెస్ ల మధ్య బూతుల మోత
-
లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి.. ఎంత ఇబ్బంది పడ్డాడో
-
ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, పెద్దపల్లి:ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పెద్దపల్లిలో ఓ రెస్టారెంట్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌కు వెళ్తున్న మంత్రి.. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జిల్లాకేంద్రంలోని కూనారం చౌరస్తాలో తన అనుచరుని రెస్టారెంట్‌కు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు లిఫ్ట్‌ను ఆశ్రయించారు. సామర్థ్యం మించిపోవడంతో లిఫ్ట్ తలుపులు మూసుకున్నా.. ఎటూ కదల్లేదు.తలుపు తెరుచుకోకపోవడంతో మంత్రి కాసేపు లిఫ్ట్‌లోనే ఉండిపోయారు. దీంతో పోలీసులు, హోటల్ నిర్వాహకులు కాసేపు శ్రమించి తలుపులు తెరిచారు. అనంతరం మంత్రి నవ్వుకుంటూ బయటికొచ్చి ‘పెద్దపల్లి ఎప్పటికీ గుర్తుండిపోతుంది..’ అంటూ చెన్నూర్ పయనమయ్యారు. చదవండి: ముఖం చూశాకే ముందుకు! -
నీరు తాగుతున్నమంత్రి శీనన్న
-
హుస్సేన్ సాగర్ : కమ్మని నీరా.. కేఫ్ లోపల ఎలా ఉందో చూసేయండి (ఫొటోలు)
-
నెక్లెస్‌రోడ్‌లో నేడు నీరా కేఫ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఎన్నో పోషక విలువలకు నెలవై.. పల్లె ప్రాంతాలకే అలవాలమై ‘నీరా’ జనాలు అందుకున్న అత్యుత్తమ పానీయం. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన నీరాను.. నగరవాసులకు చేరువ చేసేందుకు రంగం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన నీరా కేఫ్ ఇవాళ(బుధవారం) ప్రారంభం కానుంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం నీరాకేఫ్‌ను ప్రారంభించనున్నారు. ఈ పానీయాన్ని ఆస్వాదించేందుకు తరలివచ్చే జనాల కోసం ప్రభుత్వం ఇక్కడ అన్ని వసతులు కల్పించింది. అదే సమయంలో.. ఇక్కడ ఏర్పాటు చేసిన పలు చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. 👉 నెక్లెస్ రోడ్డులో 2020 జులై 23న నీరాకేఫ్‌ను శంకుస్థాపన చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. నీరా కేఫ్‌లో మొత్తం 7 స్టాళ్లు ఉంటాయి. 500 మంది కూర్చునేందుకు వీలుంటుంది. రేట్లు ఎలా ఉంటాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 👉 నగర శివారు నందన వనంలోని పదెకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. నీరా నాలుగు డిగ్రీల వద్ద సురక్షితంగా నిల్వ ఉంటుంది. తాటి, ఈత నీరా సేకరించాక దాన్ని సీసాల్లో పోసి.. ఐస్ బాక్సుల్లో నగరానికి తీసుకొస్తారు. నీరా కేఫ్‌లో శుద్ధి చేసి.. ప్యాకింగ్ చేసి.. విక్రయిస్తారు. 👉 నీరా కేఫ్‌ను.. పోష్ రెస్టారెంట్ తరహాలో తీర్చిదిద్దారు. తియ్యటి నీరాతో పాటు నోరూరించే అనేక ఆహార పదార్థాలు కూడా లభిస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్టు ఉంటుంది. మొదటి అంతస్తులో నీరాను అమ్ముతారు. నీరాను అక్కడే కూర్చుని తాగవచ్చు. లేదంటే టేక్ అవే సౌకర్యం కూడా ఉంది. 👉 పల్లెల్లో తాళ్లు, ఈదుల మధ్య కూర్చున్న అనుభూతి కలిగేలా... కేఫ్ చుట్టూ తాటి చెట్ల ఆకృతులు, పైకప్పును తాటాకు ఆకృతిలో రూపొందించారు. 👉 నీరా కేఫ్ నుంచి ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. కల్లుకు, నీరాకు ఎంతో తేడా ఉంది. కల్లులో ఆల్కాహాల్ శాతం ఉంటుంది. కానీ నీరాలో ఆల్కాహాల్ ఉండదు. నీరా రుచి తియ్యగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అలలపై పడవ ప్రయాణం.. సహజ నీరా పానీయం
సాక్షి, హైదరాబాద్: సాగర తీరం మరో ఆతిథ్యానికి సన్నద్ధమైంది. సహజమైన నీరాతో పాటు తెలంగాణ రుచులను అందజేసే నీరా కేఫ్ ప్రారంబో త్సవానికి సర్వం సన్నద్ధమైంది. పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న నీరా కేఫ్‌ను ఈ నెల 3వ తేదీన ప్రారంభించనున్నారు. హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఏర్పాటు చేసిన నీరాకేఫ్ నగరవాసులకు సరికొత్త అనుభూతినివ్వనుంది. ఇక్కడి నుంచి సాగర్‌లో విహరించేందుకు పర్యాటకశాఖ బోటు షికారును కూడా అందుబాటులోకి తెచ్చింది. పీపుల్స్‌ప్లాజా వైపు వచ్చే సందర్శకులు నీరా సేవనంతో పాటు పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన నీరా పానీయాన్ని నగరవాసులకు అందించేందుకు ఎక్సైజ్ శాఖ సుమారు రూ.10 కోట్లతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా సమీపంలో ఈ కేఫ్‌ను నిర్మించింది. ఆకర్షణీయంగా భవనం.. నీరాభవనం తాటాకుతో చేసిన రేక ఆకృతిలో ఎంతో ఆకర్షణీయంగా నిర్మించారు. పల్లెల్లో తాటి, ఈత కల్లును తాటాకులతో చేసిన రేకలు, మోదుగాకు డొప్ప(దొన్నె)లలో సేవించడానికి ఇష్టపడతారు. ఇలా ఆకుల్లో తాగడం వల్ల పానీయం సహజత్వం ఏ మాత్రం కోల్పోకుండా ఉంటుంది. అలాంటి తాటాకు రేక కప్పినట్టుగా నీరా భవనాన్ని నిర్మించడం విశేషం. తెలంగాణ పల్లెలను తలపిస్తూ అందమైన మ్యూరల్స్, చేతివృత్తులను ప్రతిబింబించే శిల్పాలతో భవనం ప్రాంగణాన్ని రూపొందించారు. ఈ కేఫ్‌లో మొత్తం ఏడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక కౌంటర్‌ను పూర్తిగా నీరా కోసం కేటాయించగా మిగతా ఆరింటిలో వివిధ రకాల ఆహార పదార్ధాలు, ఐస్‌క్రీమ్‌లు, బిర్యానీలు లభిస్తాయి. హుస్సేన్ సాగర్ జలాలను, పోటెత్తే అలలను వీక్షిస్తూ నచ్చిన రుచులను ఆస్వాదించవచ్చు. ఇందుకనుగుణంగా సీటింగ్ సదుపాయం ఉంటుందని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారి ఒకరు తెలిపారు. భవనం మొదటి అంతస్థులో ఉన్న విశాలమైన హాల్లో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకలు నిర్వహించుకోవచ్చు. విందులు ఏర్పాటు చేసుకొనే సదుపాయం కూడా ఉంటుంది. ఆరోగ్య ప్రదాయిని.... తాటి, ఈత చెట్ల నుంచి తెల్లవారుజామునే సేకరించే నీరాలోని సహజమైన పోషకవిలువలు ఏ మాత్రం పోకుండా శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేసి విక్రయిస్తారు. ఇందుకోసం నీరా భవనంలో ప్రత్యేక శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేశారు. భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముది్వన్లో ఏర్పాటు చేసిన తాటివనాల్లో నీరా కోసమే ప్రత్యేకంగా పెంచిన తాటి, ఈత చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. దాంతోనే అనుబంధ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు. ‘పానీయంలోని స్వచ్ఛతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు.. తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం మొదలు.. దానిని వినియోగదారులకు చేర్చడంవరకు పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నాం’అని నిర్వాహకులు తెలిపారు. నీరాలో శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. నీరాతో పాటు తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ద్వారా తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను కూడా విక్రయించనున్నారు. ఆడ, మగ(పోద్దాడు, పరుపుదాడు) తాటి చెట్ల నుంచి సేకరించే రెండు రకాల తాటి బెల్లం కూడా ఇక్కడ లభించనుంది. ఆహార ఉత్పత్తులు ధర (సుమారుగా) 300 ఎంఎల్ తాటి నీరా రూ. 90 200 ఎంఎల్ తాటి నీరా రూ. 60 తాటిబెల్లం (కిలో) రూ.1000 తాటి చక్కెర (కిలో) రూ. 1050 తాటి బూస్ట్ రూ. 1100 తాటి తేనె (లీటర్) రూ.1200 ఈత బెల్లం (కిలో) రూ.900 ఈత తెనె (లీటర్) రూ.1000 -
బీఆర్ఎస్ లీడర్, గాయకుడు కాన్గల్ శ్రీనివాస్‌గౌడ్ మృతి
సిద్దిపేటఅర్బన్/తొగుట: బైక్‌పై నుంచి పడి బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందాడు. సిద్దిపేట అర్బన్ మండలం కిష్టసాగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. తొగుట మండలం కాన్గల్ గ్రామానికి చెందిన మరు పల్లి శ్రీనివాస్ గౌడ్(43) మూడు రోజుల క్రితం బండిపై నుంచి పడడంతో తలకు తీవ్రగా యాల య్యాయి. కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభు త్వ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఆస్ప త్రి నుంచి డిస్చార్జి అయిన తర్వాత పొన్నా లలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా కిష్టసాగర్ రోడ్డులో స్పృహ తప్పి పడిపోయాడు. వడదెబ్బ తగిలి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాన్గల్‌లో విషాదం ఉద్యమపాటలతో తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన గాయకుడు కాన్గల్ శ్రీనివాస్‌గౌడ్ మృతితో విషాదం అలుముకుంది. కాన్గల్ గ్రామానికి చెందిన మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్ టీడీపీలో క్రీయాశీల కార్యకర్తగా పనిచేశారు. 2001లో టీఆర్ఎస్లో చేరారు. దొమ్మాట ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి మీటింగ్‌ను అడ్డుకొని వార్తల్లోకెక్కారు. వార్డు మెంబర్‌గా, విద్యా కమిటీ చైర్మన్‌గా, ఏఎంసీ డైరెక్టర్‌గా, పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా.. శ్రీనివాస్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. -
నిఖత్ జరీన్‌కు ఘనస్వాగతం
శంషాబాద్: ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ గెలుచుకున్న నిఖత్ జరీన్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నిఖత్‌కు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చాంపియన్‌న్‌షిప్ సాధించిన నిఖత్ యువతకు ఆదర్శమని ప్రశంసించారు. అనంతరం ఓపెన్‌టాప్ జీప్‌లో ఆమెతో పాటు ప్రయాణించారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నిఖత్‌కు స్వాగతం పలికిన వారిలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఆంజనేయగౌడ్, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు ఉన్నారు. -
Nikhat Zareen Photos: బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
కిషన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత సెల్ఫోన్లను ధ్వంసం చేశారని గతంలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉపసంహరించుకోవాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నా రు. ఈడీ విచారణలో భాగంగా తాను గతంలో ఉపయోగించిన 10 సెల్ఫోన్లను మంగళవారం కవిత అధికారులకు సమ ర్పిం చినందున... కిషన్‌రెడ్డి కవితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని కిషన్‌రెడ్డి ఎలాంటి ఆధారాలతో ఆరోపణలు చేశారని ఆయన ప్రశ్నించారు. శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కిషన్‌రెడ్డి ఏ ఆధారాలు లేకుండా ఊహించుకొని అబద్ధాలతో ఒక మహిళ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరన్న విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఆడబిడ్డపై కక్ష సాధింపు: సీఎం కేసీఆర్‌ను, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీఆర్ఎస్ను ఎదుర్కోలేక తెలంగాణ ఆడబిడ్డ కవితపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. దేశంలో లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకొని విదేశాలకు పారిపోయిన అవినీతిపరులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టుకోవట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక లక్షల కోట్లు కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టి ఉల్లిగడ్డపై పొట్టు లాంటి రూ.100 కోట్ల స్కామ్ అనే పేరుతో లేని అధారాలను సృష్టించి కవితను వేధిస్తూ అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్ని స్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం వచ్చినప్పటి నుంచి కొందరు అనవసర వ్యాఖ్యలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటలపాటు విచారణ చేస్తూ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కేంద్రంలోని బీజేపీ గుర్తుంచుకోవాలని, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మాటిమాటికి సౌత్‌గ్రూప్ అనే పేరుతో దక్షిణ భారతదేశాన్ని, తెలంగాణ మహిళలను కేంద్ర ప్రభుత్వం బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. నిష్పక్షపాతంగా పనిచేసే దర్యాప్తు సంస్థలను, అధికారులను తమకు అనుకూలంగా పనిచేయాలని చెప్పడం దేశానికే అరిష్టమన్నారు. -
‘ఆడబిడ్డపై మీ ప్రతాపమా?.. లలిత్‌మోదీ, విజయ్ మాల్యా ఎక్కడున్నారు’
న్యూఢిల్లీ: సెల్ఫోన్లు ధ్వంసం చేశారన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ధ్వంసం చేయని ఫోన్లను చేశారంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులు ఆమమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి నెలలో కవితను ఈడీ విచారణకు పిలిచింది. కానీ ఫోన్లు ధ్వంసం చేశారని నవంబర్లోనే ప్రచారం చేశారని విమర్శించారు. ఆడబిడ్డపై మీ ప్రతాపమా? అని మంత్రి ధ్వజమెత్తారు. ఇది వందకోట్ల స్కామ్ అయితే.. మీ నీరవ్ మోదీ ఎన్నికోట్ల స్కామ్ చేశారు? లలిత్‌మోదీ, విజయ్ మాల్యా ఎక్కడున్నారని ప్రశ్నించారు. లక్షల కోట్ల స్కాంలు వదిలేసి వందకోట్ల కేసు వెంటపడుతున్నారని అని దుయ్యబట్టారు. ఒక మహిళ అని చూడకుండా కవితను 10 రోజులుగా వేధిస్తున్నారని విమర్శించారు. లేని ఆధారాలు ఉన్నట్లు సృష్టించి వేధిస్తున్నారని.. కవితకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కవిత ఫోన్లను ధ్వంసం చేశారని కిషన్‌రెడ్డి ఎలా మాట్లాడతారు. ఒక మహిళ గురించి ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యత ఉండాలి. ఎలాంటి ఆధారాలంతో కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు?. ఫోన్లను ధ్వంసం చేయలేదని కవిత గతంలోనే చెప్పారు. నోటీసులు ఇవ్వకముందే ఫోన్ల ధ్వంసం గురించి ప్రచారం మొదలు పెట్టారు. కవిత ఫోన్లు భద్రంగా ఉన్నాయి. ఇవాళ వాటిని ఆమె ఈడీకి సమర్పించారు’ అని మంత్రి తెలిపారు. -
‘కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందిపెడితే రాష్ట్రం అగ్నిగుండమే’
సాక్షి, హైదరాబాద్: మహిళా దినోత్సవం రోజు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీచేయడం మహిళలను గౌరవించకపోవడమేనని, కేసీఆర్ కుటుంబమే టార్గెట్‌గా బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలున్నారని, రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితను అడ్డం పెట్టుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ, ఈడీలను కేంద్రం భ్రష్టుపట్టిస్తోందని, బ్యాంక్‌లకు ఎగనామం పెట్టి దేశం దాటిన వాళ్లకు కేంద్రం అండగా నిలుస్తూ, మాటవినని వారిపై కేసులు పెట్టి వేధిస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు తెలంగాణ రాష్ట్రం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసిన కేంద్రం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన అదానీ గురించి ఎందుకు నోరు మెదపదని మంత్రి నిలదీశారు. -
నకిలీ మద్యం సరఫరా చేస్తే పీడీ యాక్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయానికి గండికొట్టేందుకు ఇతర రాష్ట్రాల్లోని మద్యాన్ని సరఫరా చేస్తున్నారని అలాంటి వారిని గుర్తించి పీడీ యాక్టు నమోదు చేయాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖలోని టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను పటిష్టపర్చాలని ఆదేశించారు. ఒడిషాలో నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రానికి సరఫరా చేస్తున్న మాఫియాను ఎక్సైజ్ అధికారులు సమర్థవంతంగా అడ్డుకున్నారని మంత్రి అభినందించారు. అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర, గోవా నుంచి రాష్ట్రానికి వస్తున్న నకిలీ మద్యాన్ని కూడా అరికట్టాలన్నారు. ఎక్సైజ్ ఆదాయం పెరిగేందుకు అధికారులు నిబద్ధతతో కృషి చేయడమే కారణమన్నారు. సమీక్షాసమావేశంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, అడిషనల్ కమిషనర్ అజయ్ కుమార్, జాయింట్ కమిషనర్లు ఖురేషి, కె ఏ బి శాస్త్రి, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, బ్రివరేజ్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారని తెలిపారు. గురువారం బీఆర్కేఆర్ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రముఖ షూటర్ ఈషా సింగ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యలకు ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్‌లు వివిధ క్రీడాపోటీల్లో తెలంగాణ ప్రతిభను చాటి చెప్పారని, వారికి రూ. 2 కోట్ల చొప్పున ప్రభుత్వ నజరానాతో పాటు 600 చదరపు గజాల ఇంటి స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గౌరవిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. పాలమూరుకు చెందిన కిన్నెర కళాకారుడు మొగిలయ్య ప్రతిభను తెలంగాణ ప్రభుత్వమే తొలుత గుర్తించి గౌరవించిందని అన్నారు. ఆయనకు కుటుంబ పోషణకోసం నెలకు రూ. 10 వేలు ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కిన్నెర కళను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తరువాతే కేంద్రం మొగిలయ్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిందన్నారు. ఈ సందర్భంగా కోటి రూపాయల నజరానాతో పాటు ఇంటి స్థలం పట్టా పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని.. తదనుగుణంగా ఆయన కోరుకున్న చోట ఇంటి స్థలం ఇస్తున్నామని తెలిపారు. కాగా, తన కళను గుర్తించి గౌరవించడంతో పాటు ఇంటి స్థలం, కోటి రూపాయలు ఇచ్చిన మహనీయుడు కేసీఆర్ అని కిన్నెర మొగిలయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరికి జూబ్లీహిల్స్.. మొగిలయ్యకు బీఎన్ రెడ్డి నగర్‌లోనా? పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయింపుపై అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు అసహనానికి గురయ్యారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా బాలరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండానే మొగిలయ్యకు ఇంటి స్థలం పంపిణీ చేశారని, స్థానిక శాసనసభ్యుడిగా స్థలం పంపిణీ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతి, ఖ్యాతిని జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన క్రీడాకారులు, కళాకారులకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో స్థలాలు ఇచ్చారని, మొగిలయ్యకు మాత్రం బీఎన్‌రెడ్డి నగర్లో ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అయితే, తదనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం గురించి తనకు ముందస్తు సమాచారం లేకపోవడంపై మాత్రమే మంత్రి సహాయక సిబ్బందిపై తాను ఆగ్రహం వ్యక్తం చేశానని బీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. -
త్వరలో హైదరాబాద్‌లో నీరా కేఫ్: మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల సంప్రదాయక జీవనోపాధిని పెంపొందించడంతో పాటు ఆరోగ్య పానీయాన్ని హైదరాబాద్ వాసులకు అందించేందుకు నీరా పాలసీని తీసుకొస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆల్కహాల్ లేని నీరాను దాని ఉప ఉత్పత్తులను శుద్ధి చేసి హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శాసనసభలో సభ్యులు ప్రకాశ్‌గౌడ్, ఆత్రం సక్కు, మెతుకు ఆనంద్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ...రూ.12.20 కోట్లతో నీరాకేఫ్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. రోమ్నగరానికి చెందిన రచయిత కొన్ని శతాబ్దాల క్రితమే ఈ సంప్రదాయ చెట్లకు సంబంధించి రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. త్వరలోనే నూతన క్రీడా విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12,076 క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
హెచ్‌సీఏ అస్తవ్యస్తంగా మారింది: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
-
బీసీల చరిత్రలో ఇది సువర్ణాధ్యాయం
ఉప్పల్: దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రులు గంగుల కమాలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లా రెడ్డిలు అన్నారు. వెనుకబడిన వర్గాల చరిత్రలో ఈ రోజు సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో 38 ఎకరాలలో 13 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు భూమి పూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు వివిధ కులసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత 75 ఏళ్లలో ఇంతవరకు ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని విధంగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆత్మగౌరవ భవనాలను తమ కులం ప్రతిష్టను ఇనుమడించేలా, సంస్కృతి వెళ్లి విరిసేలా డిజైన్లు చేసి నిర్మించుకునే ఆవకాశం వారికే ఇచ్చారన్నారు. ఆత్మగౌరవ భవనాల్లో దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి, తమ సంస్కృతిని చాటేలా కమ్యూనిటీ హాళ్లు, పిల్లల చదువు కోసం లైబ్రరీలు, రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆత్మగౌరవ భవనాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ రావడంతోనే వెనుకబడిన కులాల్లో పెద్ద మార్పు వచ్చిందన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ..వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. కుల వృత్తులకు చేయూత ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దోపిడీ చేస్తుందని, బీజేపీ మతం మత్తులో ముంచుతుందని విమర్శిస్తూ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి చేస్తుందని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కుల వ్యవస్థపై జోతిబాపూలే అద్భుత పరిశోధన చేసి మనమంతా ఒక్కటే అని, కేవలం వృత్తిపరంగా కులాలకింద విభజితులైనట్లు చెప్పారని పేర్కొన్నారు. అయితే అందరినీ కలపడానికి పూలే పడ్డ ఆవేదన నేడు కేసీఆర్‌లో కనబడుతోందన్నారు. సమూహంగా ఎదగడానికి ఈ భవనాలు దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరి శంకర్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఉప్పల్ తహసీల్దార్ గౌతం కుమార్, బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ముఠాను అడ్డుకుని ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచారు
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్న ముఠాల ఆగడాలను ఎక్కడికక్కడ శాఖ సిబ్బంది అడ్డుకుని ఆదాయాన్ని పెంచారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన కేలండర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆయుధాలు లేకుండా ధైర్య సాహసాలతో ఒడిశాలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న మాఫియా ముఠాను అధికారులు పట్టుకున్నారని తెలిపారు. గుడుంబా, గంజాయి రహిత రాష్ట్రంగా నిలపడానికి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు సమర్థవంతంగా కృషి చేశారని శ్రీనివాస్‌గౌడ్ ప్రశంసించారు. అధికారులపై ఒత్తిడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే త్వరలో అన్ని జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించి హెడ్ కానిస్టేబుళ్ల సమస్యలను పరిష్కరిస్తామని, పదోన్నతులు, ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీఇచ్చారు. భాగ్యనగర్ టీఎన్జీవోస్ ( గచ్చిబౌలి) మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కేలండర్‌ను తన క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. -
వచ్చే ఏడాదిలోగా కేబుల్ కార్ అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పర్యాటకుల సౌలభ్యం కోసం వచ్చే ఏడాది కల్లా ఆధునాతన కేబుల్ కార్‌ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం స్పెయిన్ పర్యటనలో భాగంగా కేబుల్ కార్‌ను పరిశీలించి అందులో తిరిగారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ ఎత్తైన కొండలపై కొలువైన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చారిత్రక భువన గిరి కోట, దుర్గం చెరువు లాంటి అనువైన పర్యాటక ప్రదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో అధునాతన కేబుల్ కార్‌ను ప్రవేశపెట్టేలా చూస్తున్నామని వివరించారు. పర్యాటక ప్రదేశాలను విదేశీ పర్యాట కులకు పరిచయం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. -
పర్యాటకరంగ అభివృద్ధికి సీఎం పెద్దపీట: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: పర్యాటకరంగ అభి వృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పర్యాటక, సాంస్కృతి కశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రపంచ పర్యాటకుల స్వర్గధామంగా తెలంగాణ మారిందని కొనియాడారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరి గిన ప్రపంచ ట్రావెల్ అండ్ టూరిజం మీట్లో తెలంగాణ పర్యాటక వైభవాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో బుద్ధవనం ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్నామన్నారు. టెంపుల్ టూరి జానికి ప్రత్యేక ఆకర్షణ తెలంగాణ అని, హైదరా బాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం గుర్తింపు పొందిందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా యాదాద్రి దేవాలయం అభివృద్ధి చేశామని వివరించారు. -
మనోభావాలు ముఖ్యం.. ఆచితూచి వ్యవహరించాలి
గీత వృత్తికి చెందిన గౌడ కులస్థుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో... వారి సంక్షేమార్థం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భువనగిరి జిల్లా ‘నందనం’ అనే గ్రామంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో నీరా శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం పట్ల సర్వతా హర్షం వ్యక్తమైంది. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై నెక్లెస్ రోడ్డులో ఒక నీరా హబ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో దానికి ‘వేదామృతం’ అని పేరు పెట్టారు. అదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. హైదరాబాద్‌లోని కొంతమంది బ్రాహ్మణ వర్గం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహా దారైన డాక్టర్ రమణాచారిని కలిసి నీరాపానీయానికి ‘వేదామృతం’ అనే నామకరణం ఎంత వరకు సమంజసమైనది అని ప్రశ్నిస్తూ వినతి పత్రం సమర్పించారు. దీంతో వాద ప్రతివాదాలు ఊపందుకున్నాయి. హిందువుల పవిత్ర గ్రంథాలలో ‘వేదాలు’ అనేవి చాలా ప్రాధాన్యం సంతరించుకొన్నవనీ, అవి ప్రపంచానికి మార్గదర్శకాలనీ, నీరాకు వేదామృతం అనే పేరు పెట్టడం హైందవ జాతిని అవమానించేదిగా ఉందనే విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చారు ఈ పేరును వ్యతిరేకించేవారు. అయితే కల్లుగీత వృత్తిపై ఆధారపడిన గౌడ కుల సంఘాలు, నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేదామృతం పేరును సమర్థించడంతో సమస్య జటిలమైందని చెప్పాలి. ఆయుర్వేద వైద్యపరంగా నీరా అనేది సర్వరోగ నివారిణి అనీ, ముఖ్యంగా క్యాన్సర్‌ను కూడా నివారించే ఔషధ గుణాలున్నాయనేది వారి వాదం. వేదాల్లో సురాపానం గురించి ఉందనీ, ‘సుర’ అంటే అమృతం అనీ, దేవతలూ, రాక్షసులూ దానిని సేవించారని ప్రకటనలు ఇవ్వడం సరికాదు. వేదాలకు భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యం, పవిత్రతను దృష్టిలో పెట్టుకుని గౌడ సోదరులు వేదామృతం అనే పేరును సమర్థించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమాజంలోని అన్ని వర్గాల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: నిజంగా కులగణన అవసరమేనా?) – డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్ రిటైర్డ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, చేవెళ్ల -
భౌగోళికంగా విడిపోయినా మనసులు కలిసే ఉన్నాయి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భౌగో ళికంగా విడిపోయినప్ప టికీ మన మనసులు కలిసే ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యా టక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొ న్నారు. తెలుగు ప్రజలకు మంత్రి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా వెళ్లి శ్రీనివాస్‌గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీలోని జేఏసీ, అమరావతి ఉద్యోగుల సంఘాల నాయకులు బొప్పరాజు, వైవీ రావు తదితరులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో చిరకాల మిత్రుడు బొప్పరాజుతో కలసి కొన్ని దశాబ్దాలు ఉద్యోగ సమస్యలపై కలసి పనిచేశామని గుర్తు చేశారు. ప్రభు త్వంతో ఘర్షణ వైఖరి లేకుండా సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి, ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకొని వెళుతూ పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలనే సంకల్పం విజయ వంతం కావాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భగవంతుడు మరింత శక్తినివ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. -
వ్యవసాయ శాఖలో అలజడి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో అలజడి చేలరేగింది. ఈ శాఖలోని ఒక సంఘానికి చెందిన ఉద్యోగులు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్‌రావుపై బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సభకు సంబంధిత శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్ రావును ఆనవాయితీగా ఆహ్వానించాల్సి ఉండగా, వారు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగక పుండు మీద కారం చల్లినట్లుగా ఈ శాఖకు సంబంధం లేని మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సభకు ఆహ్వానించడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. డైరీ ఆవిష్కరణ సభ వాడీవేడిగా కొనసాగింది. సగానికిపైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే ఒక సంఘం ఇలా చేయడంతో ఒక్కసారిగా వ్యవ సాయ శాఖలో కలకలం చెలరేగింది. వివక్ష.. వేధింపుల వల్లే? వ్యవసాయ శాఖలో రెండు సంఘాలున్నాయి. అందులో తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కీలక మైంది. ఈ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభ మంగళవారం హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగింది. దీనికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హాజరయ్యారు. సాధారణంగా ఏటా వ్యవసాయ శాఖ మంత్రిని, కార్యదర్శిని పిలవడం ఆనవాయితీ అయినా, కావాలనే వారిని ఆహ్వానించలేదని, ఈ శాఖ మంత్రిని కాకుండా మరో మంత్రిని పిలిచారని తీవ్ర మైన రచ్చ జరుగుతోంది. తమ సంఘంపై వివక్ష చూపడం, సంఘం సభ్యులను ఇష్టారాజ్యంగా వివిధ ప్రాంతాలకు పంపించడం, వేధింపులకు గురిచేయడం జరుగుతోందని ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేశారు. విజిలెన్స్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు ఈ సభలో అసోసియేషన్ అధ్యక్షుడు రాజారత్నం మాట్లాడుతూ, తమ సంఘంపై వివక్ష కొనసాగు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ దాడుల పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నార న్నారు. తమ అసోసియేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ఉన్నందుకే ఈ వివక్ష అని మండి పడ్డారు. తమ సంఘానికి మద్దతు ఇచ్చే వారిని బదిలీ పేరుతో బయటికి పంపిస్తున్నారని ఆరోపించారు. 317 జీవో పేరుతో 15 మందిని బదిలీ చేశా రన్నారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో 2018 తరువాత ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదన్నారు. రెండు సంఘాల మధ్య గొడవలు ఉన్నందునే పదో న్నతులు ఇవ్వలేదని చెప్తున్నారన్నారు. తమ నిరస నను వ్యక్తం చేయడం కోసమే డైరీ ఆవిష్కరణకు మంత్రి నిరంజన్‌రెడ్డిని, కార్యదర్శి రఘునందన్ రావును ఆహ్వానించలేదన్నారు. తమకు అను కూలంగా ఏమీ చేయకున్నా ఫర్వాలేదని, కానీ ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. శాఖలో ఒకరిద్దరు చీడ పురుగుల్లా తయారయ్యారన్నారు. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వివక్ష తగదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డైరీ ఆవిష్కరణ అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో ఉద్యోగులపై వివక్ష తగదని అన్నారు. ఈ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సాటి ఉద్యోగులపై వివక్ష చూపితే ఎలాగని ప్రశ్నించారు. ‘సావిత్రీబాయి పూలే, అంబేడ్కర్ లాంటి వారికే అవమానాలు తప్పలేదు.. ఎవరు, ఎంతగా అవమానపరచినా వారు బాధపడలేదు. వెనక్కు తగ్గలేదు. శరీరం కుంగిపోతున్నా మనసు కుంగిపోలేదు. అలా కుంగిపోతే రాజ్యాంగం, రిజర్వేషన్లు వచ్చేవి కాదు. పట్టుదలను వదలొద్దు. భయం, పిరికితం వద్దు. ఎవరో ఒకరిద్దరు అధికారులు, ఒకరిద్దరు నాయకులను ఇబ్బంది పెట్టి వేధిస్తే అయ్యేదేమీ లేదు. ప్రమోషన్లు రాకపోతే చస్తమా. ధైర్యంగా ఉండాలి..’అంటూ వ్యవసాయ శాఖ ఉద్యోగులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభయం ఇచ్చారు. ఈ ప్రభుత్వం అందరిదని, ఒకప్పుడు వ్యవసాయ శాఖ అంటేనే ఎక్కువగా తెలిసేది కాదని, కానీ సీఎం కేసీఆర్ దీనిని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. గువ్వల బాల రాజు మాట్లాడుతూ, తాము ఎప్పుడూ ఉద్యమ స్పూర్తితోనే ఉంటామన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము ఉద్యోగుల వెంట ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు కె.రాములు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా
పటాన్చెరు టౌన్: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని జీఎంఆర్ హాల్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర మహాసభలు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పదో ప్లీనరీ మహాసభలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఇది బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. తమది తెలంగాణ వాదమని అన్నారు. కొన్ని పేపర్లకు పేరు ఉండదు.. ఊరు ఉండదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తాయని విమర్శించారు. ప్రధాని మోదీ తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రెస్‌మీట్ పెట్టిందిలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ 300 మంది జర్నలిస్టులతో సమావేశం పెడతారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిందని, దమ్ముంటే మోదీ కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఉద్యమంలో వారు చేసిన పోరాటాలు మరచిపోలేమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వార్తలను ఉన్నది ఉన్నట్లు రాయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్లీనరీలో ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశారో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు గమనించాలని కోరారు. ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు బలం వచ్చిందని అన్నారు. -
కర్ణాటకలో గీత వృత్తిని పునరుద్ధరించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గౌడ, ఈడిగ సామాజిక వర్గాల అభివృద్దికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కల్లు, గీత వృత్తిని పునరుద్ధరించాలని మంగళూరు నుంచి బెంగళూరు వరకు జేడీఎస్ పార్టీ నిర్వహిస్తున్న పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. గురువారం ఆయన కర్ణాటకలోని గుల్బర్గాలో పాదయాత్ర వాల్ పోస్టర్, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తాటి, ఈత చెట్ల పన్నును పూర్తిగా రద్దు చేశామని, గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ఇస్తున్నామని తెలిపారు. దేశంలో లేక్కడా లేని విధంగా తెలంగాణలో నీరా విధానాన్ని ప్రవేశపెట్టి, నీరాను ఒక్క గౌడ కులస్తులు మాత్రమే ఉత్పత్తి చేసేలా చూసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈడిగ, గౌడ సామాజిక వర్గాల అభివృద్ధికి, ఆర్థికంగా ఎదిగేందుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోని వైన్ షాపులలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేడీఎస్ గుల్బర్గా జిల్లా అధ్యక్షుడు బాలరాజు, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగాని బాలరాజుగౌడ్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ పొత్తు కోసమే బాబు నాటకాలు
సాక్షి, హైదరాబాద్: ‘‘గూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాను అన్నట్టుగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వ్యవహారం కనిపిస్తోంది. ఏపీని అభివృద్ధి చేయలేక అప్పుల పాలు చేసి చీత్కారానికి గురైన ఆయన తెలంగాణలో ఉద్ధరిస్తానని మాట్లాడుతున్నారు. ఏపీలో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించిన వ్యక్తి ఇక్కడేం చేస్తారు? చంద్రబాబుది భస్మాసుర హస్తం. కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే నాటకాలు ఆడుతున్నారు..’’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. చంద్రబాబు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పెడితే ప్రజలు బుద్ధి చెప్పారని, అయినా ఏదో ఉద్ధరిస్తానంటూ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఖమ్మంలో టీడీపీ సభ పెట్టి పక్క రాష్ట్రం నుంచి జనాలను తరలించారని విమర్శించారు. ఏపీలో కష్టపడితే నాలుగు ఓట్లయినా వస్తాయని, అక్కడ చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? అని వ్యాఖ్యానించారు. గురువారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రులు పువ్వాడ అజయ్, వి.శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్లతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రశ్నిస్తే కాల్చి చంపారు.. తెలంగాణ యువత, విద్యార్థులు, రైతులతోపాటు అన్ని రంగాలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆయన పాలనను ప్రశ్నించిన యువత, విద్యార్థులను నక్సలైట్ల పేరిట కాల్చి చంపారని హరీశ్‌రావు ఆరోపించారు. ఫ్రీజోన్ పేరిట హైదరాబాద్‌ను హస్తగతం చేసుకుని యువత నోట మట్టికొట్టారని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి అంతా తనవల్లేనని చెప్పుకొంటున్న చంద్రబాబు.. చివరికి కేసీఆర్ కృషితో పరిష్కారమైన నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకించిన రైతులను బషీర్‌బాగ్ చౌరస్తాలో కాల్చిచంపిన చంద్రబాబుకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకునే రకమని, ఆయనకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు లేదని పేర్కొన్నారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు నమ్మబోరని, ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఉందని చెప్పారు. ఒక్క ప్రాజెక్టూ తేలేదు.. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఖమ్మం జిల్లాకు ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్లు రుజువు చేసినా ముక్కు నేలకు రాస్తానని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. నాడు చంద్రబాబు వల్లే భద్రాచలం కరకట్ట నిర్మాణం పూర్తిగా జరగలేదని.. దీనితో పట్టణం వరద ముప్పు ఎదుర్కుంటోందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారన్నారు. లకారంలో 30 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. వేల మంది మరణాలకు కారకుడు.. చంద్రబాబు రాక వెనుక ఎవరున్నారో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉందని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగానే ఉన్నారని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేల మంది మృతికి కారణమైన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష: హరీశ్‌రావు రైతులు ధాన్యం ఆరబెట్టేందుకు ఉపాధి హామీ పథకం నిధులతో కల్లాలు నిర్మించుకుంటే.. అందుకు ఖర్చు చేసిన రూ.151 కోట్లను వెనక్కి ఇవ్వాలని కేంద్రం అడగటం దారుణమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో చేపలు ఆరబెట్టే కల్లాల నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం నిధులు ఇచ్చిందని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించనందునే ఐదేళ్లలో రూ.30వేల కోట్లు రాకుండా కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీలకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని, పనిదినాలను కూడా పరిమితం చేసిందని చెప్పారు. -
పుస్తకాలే ఉద్యమాలను ఉరకలెత్తించాయి
సాక్షి, హైదరాబాద్: పుస్తకాలే ఉద్యమాలను ఉరకలెత్తించి మార్పునకు దోహదపడ్డాయని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం ఇక్కడ 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సాగిన ఉద్యమాలకు పుస్తకాలు దన్నుగా నిలిచాయని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా పుస్తక పఠనం, పుస్తక జ్ఞానం శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తే చెడును అధిగమించేందుకు పుస్తకపఠనం చాలా అవసరమన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ పుస్తకాల్లోనే చరిత్ర అంతా నిక్షిప్తమవుతుందని పేర్కొన్నారు. గాడ్సేను దేశభక్తుడిగా చేసి గాంధీని చరిత్రలో లేకుండా చేసేందుకు కొంతమంది వక్రీకరణలకు ప్రయత్నిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ ధోరణి దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. ప్రముఖ పాత్రికేయులు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, అనేక కొత్త పదాలను నేర్చుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థి ఏడాదికి పది పుస్తకాలు చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, పత్రికా సంపాదకులు సుధాభాస్కర్, తిగుళ్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విభిన్నం... వైవిధ్యం... పుస్తక ప్రదర్శనలో మొత్తం 300 స్టాళ్లలో పుస్తకాలు కొలువుదీరాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రచురణ సంస్థలు విభిన్న రంగాల పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చాయి. మొదటిరోజే పుస్తకప్రియులతో ఆ ప్రాంగణంలో సందడి నెలకొంది. పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియా వెల్లువలోనూ పుస్తకానికి ఏమాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనగా సందర్శకులతో కళకళలాడింది. తెలుగు రచయితలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ పబ్లిషర్స్, విశాలాంధ్ర, నవోదయ, ఎమెస్కో, మంచిపుస్తకం, మిళింద్ పబ్లిషర్స్, అన్వీక్షి, నవతెలంగాణ తదితర ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. శ్రీశ్రీ, గోపీచంద్, రావిశాస్త్రి, తిలక్, కొడవటిగంటి కుటుంబరావు వంటి గొప్ప కవులు, రచయితల రచనలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జనవరి 1వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. ఈ ఏడాది పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రముఖ ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు పేరు, పుస్తకావిష్కరణలు, సాహిత్యసభలు నిర్వహించే వేదికకు ప్రముఖకవి అలిశెట్టి ప్రభాకర్ పేరు పెట్టారు. -
నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపుతాం
హైదరాబాద్: రాష్ట్రంలో కల్తీ మద్యం సరఫరాను ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఇందులో ఎంతటి వారి ప్రమేయమున్నా వదిలి పెట్టేది లేదని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొబేషనరీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీస్టేషన్లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అసలు మద్యానికి ఏమాత్రం తేడా లేకుండా స్టిక్కర్లు, బాటిళ్లు, కార్టన్లు తీసుకుని వెళ్లి స్కాన్ చేసినా బయటపడని విధంగా ఒడిశాలోని కటక్ జిల్లా అభయ్‌పూర్ అటవీ ప్రాంతంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారని తెలిపారు. దొరికిన ఒక బాటిల్ ఆధారంగా కేవలం నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో పోలీసులు డొంకంతా కదిలించారని అభినందించారు. -
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తదితరులు మంగళవారం మంత్రిని కలిశారు. పుస్తక ప్రదర్శనకు తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్) స్టేడియంలో అనుమతివ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 35 ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని భాషల పుస్తకాలతో పాటు తెలుగు భాషా సంస్కృతి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దేశవ్యాప్తంగా 300 లకుపైగా పబ్లిషర్స్ రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు) -
గీతకార్మికులకు మోపెడ్లు
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల తరహాలో గీతకార్మికులకు కూడా మోపెడ్లు ఇచ్చే విషయమై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని, ఇందుకు అవసరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. నీరాపాలసీలో భాగంగా నీరాకేఫ్ ప్రారంభోత్సవం, ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్, నీరా చిల్లింగ్ కేంద్రాల ఏర్పాటుతోపాటు ఎక్సైజ్‌శాఖ పరిధిలోని పలు అంశాలపై మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గీతకార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎక్సైజ్ శాఖ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. వృత్తి నిర్వహణలో భాగంగా ప్రమాదవశాత్తు గీతకార్మికులు చెట్లపై నుంచి కింద పడినప్పుడు సంభవించే శాశ్వత అంగవైకల్యానికి ఇచ్చే సర్టిఫికెట్ల జారీని సులభతరం చేయాలని, ఆర్థోపెడిక్ అసిస్టెంట్ సర్జన్ ఈ సర్టిఫికెట్లు ఇచ్చేలా నిబంధనలు సవరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో మెడికల్ బోర్డు పేరిట ముగ్గురు డాక్టర్లు సంబంధిత సర్టిఫికెట్ ఇచ్చే ప్రక్రియలో భాగస్వాములయ్యేవారు. సాధారణ మరణాలకూ ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. 10 రోజుల్లో సీఎం చేతుల మీదుగా నీరాకేఫ్ ప్రారంభం ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గీతకార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం నీరాపాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో రూ.20 కోట్లతో నిర్మించిన నీరాకేఫ్‌ను సీఎం కేసీఆర్ పదిరోజుల్లో ప్రారంభించేందుకు వీలుగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేల్, చారుకొండ, మునిపల్లెల్లో చిల్లింగ్ ప్లాంట్ల నిర్మాణపనులను శరవేగంగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆ శాఖ ఉన్నతాధికారులు అజయ్‌రావు, డేవిడ్ రవికాంత్, దత్తురాజ్ గౌడ్, చంద్రయ్య, సత్యనారాయణ, రవీందర్రావు, అరుణ్‌కుమార్, విజయ్‌భాస్కర్‌గౌడ్, నవీన్ పాల్గొన్నారు. -
జర్నలిస్టుల త్యాగాలు గొప్పవి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: సమాజంలో జర్నలిస్టులు చేస్తున్న త్యాగాలు గొప్పవి అని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీ సీ కల్యాణ మండపంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ద్వితీయ మహాసభలు ఘనంగా జరిగాయి. అంతకుముందు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్ ఎదుట ఏర్పాటు చేసిన జెండాను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ అకాడమీ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.60 కోట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు క్రియాశీల పాత్రను పోషించారని గుర్తు చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ వీహెచ్, సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఏపీ డబ్ల్యూజేఎఫ్ అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి. ఆంజనేయులు, ఎన్‌ఎఫ్‌డబ్ల్యూజే నేత శాంతకుమారి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలకు అత్యంత ప్రాధాన్యం
రాయదుర్గం (హైదరాబాద్): క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో శనివారం ‘విన్నింగ్ ది గేమ్ ఆఫ్ మైండ్’ అంశంపై స్పోర్ట్స్ కాంక్లేవ్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. క్రీడలు మన నిత్యజీవితంగో ముఖ్య భాగమైపోయాయన్నారు. ఇవి మనకు ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని కల్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయన్నారు. ప్రస్తుత యువత క్రీడలను తమ కెరియర్‌గా ఎంచుకుంటున్నారన్నారు. బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రపంచానికి శాంతిని అందిస్తూనే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. క్రీడాకారులు జయాపజయాలను సమన్వ యం చేసుకోవడం ఎంతగానో అవసరమన్నారు. క్రీడాకారులకి సఫలత పొందడానికి 30 శాతం శారీరక శక్తి 70 శాతం మానసికశక్తి అవసరమన్నారు. ఈ సందర్భంగా జాతీయ ఆర్చరీ కోచ్ డాక్టర్ రవిశంకర్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ రమేష్ నాగపూరి, ది హిందూ క్రీడల విభాగం డిప్యూటీ ఎడిటర్ వీవీ సుబ్రహ్మణ్యం, ప్రముఖ క్రీడా సైకాలిజిస్ట్ డాక్టర్ సి. వీరేందర్, ప్రముఖ న్యూట్రిషియనిస్ట్ ఆరాధనా శర్మ, శాంతి సరోవర్ డైరెక్టర్ బీకే కుల్దీప్ దీదీ, బ్రదర్ ఈవీ గిరీష్, బీకే అంజలి తదితరులు ప్రసంగించారు. -
సాహితీ లోకానికి ఇది ఓ కరదీపిక
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు, అధ్యాపకులకు, సాహిత్యలోకానికి ‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’ ఓ కరదీపికగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ గ్రంథం అన్ని రకాల పోటీ పరీక్షలకు, తెలుగు సాహిత్య అధ్యయనానికి దోహదం చేస్తుందన్నారు. తన కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌తో కలిసి మంగళవారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో 50 మంది రచయితలు పూర్వయుగం తొలిపాలకులు, వేములవాడ చాళుక్యులు నుంచి మొదలుకుని మలిదశ తెలంగాణ ఉద్యమ సాహిత్యం వరకు నిక్షిప్తం చేశారని పేర్కొన్నారు. గోనబుద్దారెడ్డి, పాల్కురికి సోమనాథుడు, పోతన, భాస్కర రామాయణ కవులు, మారన, గౌరన, గోపరాజు ఇంకా ఆనాటి సంప్రదాయ కవిత్వ పంక్తిలో తెలంగాణది సింహభాగమని వివరించారు. గౌరీశంకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురిస్తున్న ప్రస్తుత బృహత్ గ్రంథం ‘‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’’అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మామిడి హరికృష్ణ, గ్రూప్–1 అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్, కాళోజీ పురస్కార అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ప్రముఖ సాహిత్య విమర్శకులు కేపీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
మల్లారెడ్డి ఐటీ దాడులపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటే
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమ వారం రవీంద్రభారతిలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటేనని పేర్కొన్నారు. గత పాలకులు కులవృత్తులను విస్మరించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కుల సంఘాలు ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడానికి స్థలంతో పాటు రూ.5 కోట్ల నిధులను కేటాయించినట్లు శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. మత్స్యకారుల చేపల పెంపకం కోసం రూ.185 కోట్ల నిధులను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం పలు రంగాల్లో రాణిస్తున్న ముదిరాజ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాజేందర్, యువజన విభాగం అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జగన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాజీ పీఏ కుమారుడి ఆత్మహత్య
గచ్చిబౌలి/మహబూబ్‌నగర్ క్రైం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వద్ద గతంలో వ్యక్తిగత సహాయకుడి (పీఏ)గా పనిచేసిన రెవెన్యూ ఉద్యోగి దేవేందర్ కుమారుడు కేసిరెడ్డి అక్షయ్‌కుమార్ (23) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. అక్షయ్ మహబూబ్‌నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ స్కాంలో నిందితుడని పోలీసులు తెలిపారు. సోమవారం సీఐ గోనె సురేశ్ కథనం మేరకు వివరాలు ఇలా... మహబూబ్‌నగర్‌లోని మోనప్పగుట్టకు చెందిన అక్షయ్ కుమార్.. అమెజాన్ సంస్థలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు వచ్చాడు. కొండాపూర్‌లోని శిల్పవ్యాలీలో నివాసం ఉండే అక్క మల్లిక వద్ద ఉంటున్నాడు. ఈ నెల 19న అక్క మల్లిక, బావ నవీన్ ఊరికి వెళ్లి తిరిగి సోమవారం ఉదయం వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్షయ్‌ని పిలిచారు. ఎంత పిలిచినా పలకకపోవడంతో వారు మరో తాళం చెవితో తలుపు తీశారు. బెడ్ రూమ్‌లోకి వెళ్లి చూడగా అక్షయ్ చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సీఐ తెలిపారు. తన తండ్రికి చెడ్డ పేరు వస్తుందని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. అక్షయ్ తండ్రి ప్రస్తుతం మంత్రి వద్ద విధులు నిర్వహించడం లేదని పోలీసులు చెప్పారు. స్కాం ఏంటంటే... మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లిలో సయ్యద్ కలాం పాషా అనే వ్యక్తికి బి–120 నంబర్ గల డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. అయితే ఆ ఇల్లు సమాధి పక్కనే ఉండటంతో పాషాకు నచ్చలేదు. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, తాను పనిచేసి పెడతానని చెప్పి రూ.30వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఎవరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు కావాలనుకుంటే ఇప్పిస్తానని చెప్పడంతో ఇస్తాషాద్దీన్ అనే వ్యక్తి రూ.70 వేలు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చినా కూడా పనిచేయలేదంటూ పాషా, ఇస్తాషాద్దీన్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు సెప్టెంబర్ 30న అక్షయ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకు అక్షయ్ ఆత్మహత్య చేసుకోవడం.. పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. -
తండ్రి జ్ఞాపకార్థం తుక్కుగూడలో ఫ్రీ అంబులెన్స్ సేవలు
సాక్షి, రంగారెడ్డి: ముప్పిడి నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రజలకు లైఫ్ సపోర్ట్ కలిగిన ప్రత్యేక అంబులెన్స్‌ను అందించారు ట్రస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్. తుక్కుగూడ ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడేందుకు ఈ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి స్వర్గీయ ముప్పిడి నారాయణ గౌడ్.. తుక్కుగూడ బొడ్రాయి, మంకాలమ్మ దేవాలయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మార్కెట్ యార్డ్ సహా గ్రామ అభివృద్ధికి 35 ఏళ్లపాటు అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ముప్పిడి నారాయణ గౌడ్ ఆశయాలకు అనుగుణంగా గ్రామ ప్రజలకు ఎమర్జెన్సీలో ఉపయోగపడే విధంగా ఉచిత అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు శ్రీనివాస్ గౌడ్. 24 గంటల పాటు ఈ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఏ ఆపద వచ్చినా 7416718585 నెంబర్‌కి కాల్ చేసి వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ముదిరాజ్, కౌన్సిలర్లు హేమలత రాజు గౌడ్, రాజమోణి రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ రఘురామరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిరణ్మయి శ్రీధర్ గౌడ్, పూజారులు ప్రవీణ్ శర్మ, ప్రదీప్ శర్మ, ప్రభాకర్ గౌడ్, శంకరయ్య, వెంకటస్వామి గౌడ్, బాలరాజు గౌడ్, హరినాథ్, రమేష్ శ్రీధర్ మాజీ సర్పంచ్ నరసింహ ముదిరాజ్, మల్లేష్ గౌడ్ సహా ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత -
ఓటమి భరించలేక బీసీ నేతలపై కుట్రలు...
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఓటమి భరించలేక బీసీ నేతలపై బీజేపీ కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగహ్రం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, ఈడీ, ఐటీ పేరిట బీసీ నేతలపై దాడులకు దిగిందని దుయ్యబట్టారు. గురువారం లండన్ నుంచి ఆయన ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి చేతనైతే బ్యాంకుల్లో రుణాల పేరిట రూ.కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా వంటి ఘరానా మోసగాళ్లను దేశానికి పట్టుకు రావాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే గ్రానైట్ వ్యాపారంలో ఉన్న మంత్రి గంగుల కుటుంబంపై కక్ష కట్టి ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాల మంత్రి కాబట్టే ఆయన్ను టార్గెట్ చేశారని, గంగులకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఈడీ, ఐటీలకు బెదరబోమని స్పష్టం చేశారు. అకమ్ర దాడులతో తెలంగాణ నేతలను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమనేది ఈ ఘటనతో సహా ఇప్పటికే ఎన్నో మార్లు రుజువైందని మంత్రి పేర్కొన్నారు. -
తన స్వార్థం కోసమే రాజీనామా చేశారు: శ్రీనివాస గౌడ్
-
ప్రలోభాలకు తెలంగాణ లొంగదు
చౌటుప్పల్: ప్రలోభాలకు తెలంగాణ సమాజం లొంగబోదని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకత్వం ఆ పార్టీలో చేర్చుకునేందుకు చేసిన కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి వారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు నిరసన వ్యక్తం చేశారు. మోదీ, బీజేపీ, రాజగోపాల్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. బీజేపీ చేసే కుట్రలకు తెలంగాణలో తావు లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీకి మునుగోడులో ఓటమి తప్పదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించారు. మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకత్వం ప్రలోభాలకు గురిచేసిందన్నారు. అనంతరం వారు జాతీయ రహదారిపై బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ నిరసన.. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని విమర్శిస్తూ తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ నేతృత్వంలో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోదీ, అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం ఆయనే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇటీవలి కాలంలో కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టండి అంటూ ప్రజలను పదే పదే కోరారు. అప్పుడే తెలంగాణకు విముక్తి కలుగుతుందని కామెంట్స్ చేశారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది కేటీఆరే. మా భవిష్యత్ నాయకుడు కేటీఆరే. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు. గతంలో చిరంజీవి వచ్చారు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ వస్తారేమో? అంటూ కామెంట్స్ చేశారు. -
లారీలపై తగ్గనున్న గ్రీన్‌ట్యాక్స్
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి దిగుతామని లారీ యజమానుల సంఘం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి సారించింది. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ వారితో భేటీ అయ్యారు. తాజాగా ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రవాణాశాఖ కమిషనర్ శ్రీనివాసరాజులతో కలసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన గ్రీన్‌ట్యాక్స్‌ను తగ్గించి అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఏడు నుంచి 12 ఏళ్ల మధ్య వాహనాలకు ప్రస్తుతం రూ.6 వేల వరకు విధిస్తున్న గ్రీన్‌ట్యాక్స్‌ను రూ.1,500, 12 ఏళ్లు దాటిన వాహనాలకు గరిష్టంగా రూ.25 వేల వరకు ఉన్న మొత్తాన్ని రూ.3 వేలకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం తెలిసింది. ఇది తమకు భారంగా ఉన్నందున ఆ పన్నును ఎత్తేయాలని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ పన్నును గరిష్టస్థాయిలో తగ్గిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌ను అమలు చేసేందుకు కూడా హామీ ఇచ్చా రు. లారీలు ఏపీలోకి ప్రవేశించిన ప్రతీసారీ రూ.2 వేలు పన్ను చెల్లించాల్సి వస్తోంది. దానికి బదులు ఏడాదికి ఒకేసారి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ వసూలు చేసి ఎన్నిసార్లయినా వెళ్లివచ్చేందుకు అవకాశం కల్పించాలని ఏళ్లుగా లారీ యజమానులు కోరుతున్న దానిని కొలిక్కి తెస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. లైసెన్సుల సస్పెన్షన్‌పై ఉపశమనం.. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్లే లారీలను పట్టుకున్నప్పుడు డ్రైవర్ల లైసెన్సులను నిర్ధారిత కాలానికి సస్పెండ్ చేస్తున్నారు. ఆ సస్పెన్షన్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌కు కూడా సానుకూలత లభించింది. సస్పెన్షన్ బదులు పెనాల్టీ విధించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. తైబజార్లలో లారీవాలాలనుంచి కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్న మొత్తం తమకు భారంగా ఉందని, వ్యాపారుల నుంచి వసూలు చేసుకోవాల్సిన మొత్తాన్ని లారీల నుంచి వసూలు చేయటం ఏంటని సంఘం నేతలు ప్రశ్నించారు. ఇసుక క్వారీల్లోని ఇబ్బందులనూ వారి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామని కూడా పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సందారెడ్డి, ఉపాధ్యక్షుడు యాదయ్య, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దని, రాజకీయ నేతలు నీతి, నిజాయితీతో సేవలందించి స్ఫూర్తిగా నిలవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్లోని జేపీఎన్సీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డితో కలిసి కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్.జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జయ ప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్యాయాలు, అక్రమాలకు అరాచకా నికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పటిష్టతకు అలుపె రగకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ అని.. ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చాన ని వెల్లడించారు. తాను, జైపాల్‌రెడ్డి ఇద్దరమూ జాతీయవాదులమే.. అయినా సిద్ధాంతపరంగా భిన్నమైనవాళ్లమని అన్నారు. చట్టసభల్లో ఉన్నత ప్రమాణాలు పాటించాలని.. డిస్కస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి కానీ డిస్ట్రబ్ చేయకూడదన్నారు. చట్టసభల్లో మాట్లాడండి, శాంతియుతంగా పోరాడండి, కానీ సభను జరగనివ్వండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండని పిలుపునిచ్చారు. కలలు కనండి, కష్టపడండి, సాకారం చేసుకోండని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జైపాల్‌రెడ్డి భార్య లక్ష్మి, ఆయన సోదరుడు పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణను ఇబ్బందులపాలు చేయొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులపాలు చేయొద్దని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్నిరంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, కేంద్రం ప్రకటిస్తున్న అవార్డుల్లోనూ తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. ఇటీవల ఇచ్చిన సంసద్ ఆదర్శ్ గ్రామయోజన, స్వచ్ఛభారత్‌లో అవార్డులు గెలుచుకున్న తెలంగాణ మంగళవా రం కేంద్ర పర్యాటక శాఖ ఇచ్చిన జాతీయ పర్యాటక అవార్డుల్లో మూడో ఉత్తమ రాష్ట్రంగా అవార్డు అందుకున్నామని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశ జీడీపీలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఇప్ప టికైనా సీఎం కేసీఆర్ చేస్తున్న పనులను ప్రధాని మోదీ గుర్తించాలని కోరారు. తెలంగాణ పురోగమిస్తున్నందునే కేంద్రం అవార్డులు అందిస్తోందని, తాము చేస్తున్న పనులు తప్పు అయితే తెలంగాణకు ఇన్ని అవార్డులు ఎలా వస్తున్నాయో కేంద్రం ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా తెలంగాణతో కేంద్రం పోటీపడాలని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే భారత్ నంబర్ వన్ అవుతుందన్నారు. -
Hyderabad: ఉప్పల్ స్టేడియానికి క్రీడామంత్రి శ్రీనివాస్‌గౌడ్
-
ఉప్పల్ స్టేడియానికి క్రీడామంత్రి.. వారందరికీ ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: క్రీడా అభిమానుల జీవితాలతో ఆటలు ఆడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. టికెట్లు గోల్‌మాల్‌పై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. జింఖానా గ్రౌండ్లో టికెట్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో గాయపడిన క్రీడాభిమానులతో కలిసి మంత్రి ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. గాయపడిన క్రీడాభిమానులందరికీ బాక్స్ టికెట్లు ఇచ్చి ఈ రోజు మ్యాచ్‌ను ఉచితంగా చూసే అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నవీనను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఆమెకు క్రీడా శాఖ తరపున ప్రమోషన్ ఇవ్వడంతోపాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డీజీపీకి కూడా లెటర్ రాశామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. చదవండి: (India Vs Australia: బ్లాక్ దందా.. రూ.850 టికెట్ రూ.11,000) -
హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హెచ్‌సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు. చదవండి: హెచ్‌సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి? సమావేశానికి ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తప్పవన్నారు. తెలంగాణ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకునేదిలేదన్నారు.హెచ్‌సీఐ పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రి అన్నారు. కాగా, ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్‌సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. -
HCA రాజకీయాలు ప్రభుత్వం పై రుద్దితే తీవ్ర పరిణామాలు ఉంటాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
ఉప్పల్‌లో మూడో టీ20.. హెచ్‌సీఏకు క్రీడామంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్స్ విషయంలో బ్లాక్ టికెట్స్‌పై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. టికెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్ కేటాయిస్తున్నారో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివరాలతో సహా చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో స్టేడియం కట్టారన్నది గుర్తుంచుకోవాలన్నారు. పది మంది ఎంజాయ్ చేయడానికి, బ్లాక్ దందా కోసం మ్యాచ్ టికెట్స్ ఇవ్వలేదన్నారు. క్రికెట్ మ్యాచ్ టికెట్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దన్నారు. హెచ్‌సీఏ మ్యాచ్‌కు సంబంధించి టికెట్స్ అన్నింటిని సేల్ చేయాలని ఆదేశించారు. బ్లాక్ దందా జరిగినట్లు తెలిస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెప్టెంబరు 25న(ఆదివారం) ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్- ఆసీస్ మధ్య మూడో టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: (స్వపక్షంలో విపక్షం.. గులాబీ పార్టీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలు) -
బుద్ధవనంలో బౌద్ధారామం నిర్మిస్తాం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో బౌద్ధారామం నిర్మిస్తామని, అందుకు వసతులు, సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంగోలియా దౌత్యాధికారి గన్‌బోల్డ్ దంబజావ్ ప్రతిపాదన చేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్‌లో ప్రతిష్టాత్మక బుద్ధవనం ప్రాజెక్టును పరిశీలించి వచ్చిన గన్‌బోల్డ్ దంబజావ్, మల్లేపల్లి లక్ష్మయ్య, తదితరులు గురువారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో సమావేశమయ్యారు. ఇరుపక్షాల మధ్య బౌద్ధ, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో సంబంధాలు పెంపొందించుకునే దిశగా చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా బుద్ధవనంలో మంగోలియా వాస్తు శైలి ఉట్టిపడేలా బౌద్ధారామం నిర్మించడానికి మంగోలియా దౌత్యాధికారి ఆసక్తి వ్యక్తం చేశారు. దీంతో బుద్ధవనంలో ఉన్న ఖాళీ స్థలంలో బౌద్ధారామానికి స్థలాన్ని కేటాయించడానికి తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎం.డి బి.మనోహర్‌ను మంత్రి ఆదేశించారు. మంగోలియా పర్యాటక రంగంతో పరస్పర సహకార ఒప్పందానికి సైతం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. -
సర్వాయి పాపన్న పోస్టల్ స్టాంపులు ముద్రించాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మారుమూల పల్లెలో జన్మించి రాజుగా ఎదిగిన దివంగత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌పై వివిధ డినామినేషన్లలో పోస్టల్ స్టాంపులు ముద్రించి విడుదల చేయాలని ఎక్సైజ్ శాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్ రీజినల్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ లేఖ రాశారు. 17వ శతాబ్దంలో వరంగల్ జిల్లా ఘన్పూర్ మండలం తాటికొండలో జన్మించిన, వరంగల్ జిల్లాలోని ఖిల్లాషాపూర్ నుంచి పాలించిన నాయకుడు సర్వాయి పాపన్న అని పేర్కొన్నారు. ఆయన్ను చరిత్రకారులు బార్బరా, థామస్ మెట్కాఫ్ ‘రాబిన్ హుడ్–లైక్’ అని వర్ణించారని గుర్తు చేశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రజలనే సైన్యంగా నియమించుకున్న నాయకుడు సర్దార్ పాపన్న అని అన్నారు. -
బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నించే వారిని అణచి వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఇతర రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్న బీజేపీ నేతల మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేర న్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి సోమవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేవలం ఒకరిద్దరు వ్యాపారుల కోసమే పనిచేస్తూ, ఏ వర్గానికీ కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం ద్వారా రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్రం కుట్ర పన్నిందని, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రభుత్వాలను కూల్చడమే ఎజెండాగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. భోజనాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి భోజనాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని, మహబూబ్‌నగర్‌లో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే 2 రోజుల పర్యటనతో ఇదే విషయం స్పష్టమైందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా స్థితిగతులు తెలుసుకోకుండా కేంద్ర మంత్రి విమర్శలు చేశారని, కేసీఆర్ పాలనలోనే పాలమూరు జిల్లా దశ మారిందని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారో తెలుసుకునేందుకు బీజేపీ నేతలు గ్రామాల్లో పర్యటించాలని ఎమ్మెల్యే అంజయ్య అన్నారు. వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. ఇదీ చదవండి: దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు: మంత్రి తలసాని -
‘పాలమూరు’కు హోదా ఇస్తారనుకున్నాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తున్నామని చెప్పేందుకు ఇటీవల కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే మహబూబ్‌నగర్ పర్యటనకు వచ్చినట్లు భావించామని ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కానీ, వీరి వైఖరి చూస్తుంటే పాలమూరుకు నిధులివ్వడం పక్కనబెట్టి ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు సృష్టించడమే ఉద్దేశంగా కనిపిస్తోందని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని వెంకటాపూర్, మాచన్‌పల్లితండాలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ, సుష్మాస్వరాజ్ హామీ నెరవేర్చేందుకు కేంద్రమంత్రి వచ్చారని అనుకున్నామని, ఒకరి ఇంట్లో టిఫిన్, మరొకరి ఇంట్లో భోజనం, స్టార్ హోటల్లో సేదతీరుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. పాలమూరుకు జాతీయ హోదాతోపాటు రూ.లక్ష కోట్ల నిధులు విడుదల చేసి బీజేపీ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. పొలాలకు సాగునీరు పారించాలని తాము చూస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం రక్తం పారించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. -
సర్వాయి పాపన్న తెలంగాణకు గర్వకారణం
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని రాష్ట్రమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రవీంద్ర భారతిలో గురువారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ...తెలంగాణ వాడి వేడిని నాడే చాటిచెప్పిన శౌర్యుడు పాపన్నని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై నీరా కేంద్రం, గౌడ ఆత్మగౌరవ భవనాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బహుజన ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నగరంలో విలువైన భూములను ఇవ్వడంతోపాటు రూ.95 కోట్లను విడుదల చేశారని వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే వాటి మీద కనీసం అవగాహన లేని వ్యక్తులే విమర్శలు చేస్తున్నారని దుయ్య బట్టారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక టేశం, ఎక్సైజ్ శాఖ కమి షనర్ సర్పరాజ్ అహ్మద్, ఎస్.హరిశంకర్ గౌడ్, పల్లె లక్ష్మణ్ రావుగౌడ్, వివిధ సంఘాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు. -
Telangana: అన్ని జిల్లా కలెక్టరేట్లలో పాపన్న జయంతి వేడుకలు: శ్రీనివాస్ గౌడ్
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: బహుజనుల కోసమే పుట్టిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ నెల 18న అన్ని జిల్లా కలెక్టరేట్లలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరుగుతాయని, రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం, తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో, చిక్కడపల్లిలోని కల్లు కంపౌండ్ వద్ద తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ... సర్వాయి పాపన్న కులవృత్తులను ఏకం చేసిన గొప్ప వ్యక్తని కొనియాడారు. కేంబ్రిడ్జి వర్సిటీలో పాపన్న విగ్రహాన్ని పెట్టారని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ నెల 18న ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో జయంతి వేడుకలను నిర్వహిస్తుందని చెప్పారు. సర్వాయి పాపన్న పేరున భవనం త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. బహుజన విప్లవకా రుడు సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం కోసం పయనించాలని పిలుపునిచ్చారు. జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటం గొప్ప పరిణామన్నారు. కార్యక్రమాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీలు మల్లు రవి, వి.హన్మంతరావు, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్కుమార్గౌడ్, విప్లవ గాయని విమలక్క, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, ఎంవి.రమణ, బెల్లయ్యనాయక్, తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలరాజ్‌గౌడ్, గౌడ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ఫైరింగ్‌పై కక్కుర్తి రాజకీయాలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/గన్‌ఫౌండ్రీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటనపై కొందరు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. బీసీలు రాజకీయంగా ఎదిగితే ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీలు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలతో పాటు విలువైన స్థలాలను కేటాయించినట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం మహబూబ్‌నగర్‌లోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జరిగిన ఫ్రీడం రన్‌ను ప్రారంభించేందుకు చేసిన ఫైరింగ్‌ను అనవసర వివాదం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరారు. కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన తెలిపారు. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అరెస్టు చేయాలి
సాక్షి, హైదరాబాద్: తన వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్వో) నుంచి తుపాకీ తీసుకొని గాలిలోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ఏ చట్టం ప్రకారం మహబూబ్‌నగర్‌లో మంత్రి కాల్పులు జరిపారో జిల్లా ఎస్పీ, డీజీపీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వేలాది మంది హాజరైన ర్యాలీని ప్రారంభించేందుకు మంత్రి తుపాకీ తీసి కాల్చడమేమిటని రఘునందన్ ప్రశ్నించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్లు అని మంత్రి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. భద్రతా సిబ్బంది వద్ద రబ్బర్ బుల్లెట్లు ఉంటే ఎమ్మెల్యేలంతా ఆలోచించుకోవాలని, తమకు భద్రతగా ఉన్న గన్మెన్ల వద్ద ఉన్నవి రబ్బర్ బుల్లెట్లా? అసలు బుల్లెట్లా? తెలియాలని అన్నారు. మంత్రి కాల్పుల ఘటనను పక్కదారి పట్టించేందుకు జిల్లా ఎస్పీ, తానే మంత్రికి తుపాకీ ఇచ్చినట్లు చెపుతున్నారని, ఏ చట్టం ప్రకారం పోలీసు తుపాకీని ఎస్పీ ఇలా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎస్పీ సమక్షంలో తుపాకీ పేలిస్తే దాన్ని ఇప్పటి వరకు సీజ్ చేయలేదు. మంత్రిపై కేసు నమోదు చేసే అవకాశమున్నా కేసు పెట్టలేదు. ఆ తుపాకీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేదు’అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు డీజీపీ కార్యాలయానికి గానీ ఎస్పీ కార్యాలయానికి వెళ్లేందుకు కానీ సిద్ధంగా ఉన్నానని, ఎప్పుడు రమ్మంటారో చెప్పాలన్నారు. -
కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు పెట్టాలి
-
వజ్రోత్సవ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైరింగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ రైఫిల్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ ప్రారంభోత్సవంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు సమక్షంలో పోలీస్ వెపన్తో రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంత్రి ఎలా ఫైరింగ్ చేస్తారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే మంత్రి కాల్పులు జరిపిన ఆయుధం ఎస్ఎల్ఆర్ అని ముందు ప్రచా రం జరిగింది. ఆ తర్వాత ఇన్సాస్ వెపన్ అని పోలీస్ అధికారులు చెప్పారు. దీనిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ‘సాక్షి‘తో మాట్లాడుతూ తాను ఎవరి వద్దా గన్ తీసుకోలేదని, ఎస్పీనే స్వయంగా ఇస్తే కాల్చానని వివరణ ఇచ్చారు. గతంలో వరంగల్‌లో జరిగిన కార్యక్రమాల్లో కూడా ఫైరింగ్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాల్చానన్నారు. ఆ అధికారం నాకుంది: ఎస్పీ దీనిపై మహబూబ్‌నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లును ఫోన్లో సంప్రదించగా బుల్లెట్లు లేని బ్లాంక్ అమ్యూనేషన్ను ఉత్సవాల సందర్భంగా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఉపయోగించింది ఎస్ఎల్ఆర్ వెపన్ కాదు.. దేశీతయారీ ఇన్సాస్ వెపన్. దీనికి అనుమతి ఇచ్చే అధికారం ఎస్పీగా నాకు ఉంది. ప్రభు త్వం ద్వారా నిర్వహించే ఉత్సవాలు, ర్యాలీ లు, క్రీడల ప్రారంభ సమయంలో బ్లాంక్ అమ్యునేషన్ను ఉపయోగించడం ఆనవాయితీగా ఉంది. బ్లాంక్ అమ్యునేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వీటిని వినియోగించడం చట్టబద్ధమే’ అని స్పష్టంచేశారు. ఇందులో ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని చెప్పారు. ఈ నెల 11న వరంగల్‌లో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో ఇన్సాస్ బ్లాంక్ అమ్యునేషన్ మాత్రమే వినియోగించినట్లు ఒక ప్రకటనలో వివరించారు. తుపాకీని మంత్రి వినియోగించారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అధికారులపై చర్యలు ఉంటాయని పోలీస్‌శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విచారణ జరుపుతున్నాం: అదనపు డీజీపీ జితేందర్ మంత్రి గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనపై పోలీస్ శాఖ విచారణ జరుపుతోందని శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. అది గిట్టని వారి ప్రచారం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ‘ఫ్రీడం ర్యాలీ’ ఘటనపై మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ శనివారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలోనూ తనపై ఈ తరహా దుష్ప్రచారాలు అనేకం జరిగాయని, రాజకీయంగా గిట్టనివారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. ‘ర్యాలీలు జరిగినప్పుడు బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ (ఖాళీ తుపాకీ)తో గాల్లోకి కాల్చడం సర్వసాధారణం. బుల్లెట్లు లేని గన్ పేల్చినప్పుడు శబ్దం మాత్రం వస్తుంది. అందులో కనీసం రబ్బరు బుల్లెట్లు కూడా ఉండవు. జిల్లా ఎస్పీకి గన్ ఇచ్చే అధికారం ఉంది. నేను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిని కూడా. తుపాకులు, బుల్లెట్ల గురించి నాకు సంపూర్ణ అవగాహన ఉంది’ అని శ్రీనివాస్‌గౌడ్ వివరణ ఇచ్చారు. ‘క్రీడా శాఖ మంత్రిగా నాకు కొన్ని అధికారాలున్నాయి. వరంగల్‌లో లేని వివాదం మహబూబ్‌నగర్‌లో ఎందుకు వచ్చిందో గమనించాలి. రాజకీయాల్లో నేను ఎదగడాన్ని కొందరు ఓర్చుకోలేక పోతున్నారు. వజ్రోత్సవాలను హైలైట్ చేయకుండా చిన్న ఘటనను పెద్దగా చిత్రీకరిస్తున్నారు. బురద జల్లే పద్ధతి సరికాదు’ అని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాగా, రైఫిల్ అసోసియేషన్ మెంబర్ అయినా, స్పోర్ట్స్ మంత్రి అయినా.. ఇన్సాస్ రైఫిల్‌ను జనాల్లో ఫైర్ చేయడం తప్పని కొందరు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను బర్తరఫ్ చేయాలి: డీకే అరుణ
సాక్షి,హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో బహిరంగంగా గాలిలో కాల్పులు జరిపిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. శనివారం తిరంగా ర్యాలీలో మంత్రి గాలిలో కాల్పులు జరపడం చూస్తే తెలంగాణ లో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతుందని సందేహం వ్యక్తం చేశారు. తాను క్రీడా మంత్రిననీ, కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని మంత్రి చెప్పడం సిగ్గు చేటని, మంత్రి వెంట ఉన్న భద్రతా సిబ్బంది వాడుతున్నవి కూడా రబ్బర్ బుల్లెట్లేనా అని ఆమె ఎద్దేవా చేశారు. ఎస్పీనే తుపాకీతో గాలిలో కాల్పులు జరపమన్నారని మంత్రి చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుMý ుని ఆ అధికారిని సస్పెండ్ చేయాలన్నారు. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో కీలక పలుపు
-
బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి
గన్‌ఫౌండ్రీ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జైగౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ గత ప్రభుత్వాలు కల్లు, నీరాలపై తప్పు డు ప్రచారం చేసి అమ్మకాలను నిషేధించగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ గీతవృత్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ నెల 22న రూ.5 కోట్ల ఇ గౌడ ఆత్మగౌరవ భవనం నిర్మాణం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. మంచి రాజుగా గుర్తింపు పొందిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను లండన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీ గుర్తించినా ఇక్కడి పాలకులు ఇంకా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఏపీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ విద్యతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బహుజనుల అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారని తెలిపారు. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్
-
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్
సాక్షి, మేడ్చల్: మంత్రి శ్రీనివాస్ గౌడ్హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది. శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ సహా 18 మందికి మహబూబ్‌నగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్ కోర్టులో రాజు, పుష్పలత పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్‌పై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని రాజు తెలిపారు. చదవండి: మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా? తన ఇంట్లో సీసీటీవీ, హర్డ్ డిస్క్‌లను దొంగించారని రాజు పిటిషన్లో పేర్కొన్నారు. సాక్షిగా ఉన్న తన భర్త విశ్వనాథ్‌ను కిడ్నాప్ చేశారని పుష్పలత ఫిర్యాదు చేశారు. హత్యకు కుట్ర కేసులో గతంలో రాజు, విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ బయటకొచ్చాక మహబూబ్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఢిల్లీ కేంద్రంగా బీసీలు ఉద్యమించాలి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీలంతా ఐకమత్యం సాధించాలని, బీసీల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఇందు కోసం ఢిల్లీ కేంద్రంగా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని, ఆగస్టు 7న ఢిల్లీలో తలపెట్టిన ‘ఓబీసీ జాతీయ మహాసభ’లో బీసీలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మొదటి సారి ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఆగస్టు 7న ఢిల్లీలో తలకోటోర్ స్టేడియంలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ బ్రోచర్‌ను శుక్రవారం మంత్రుల నివాసంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వచ్చిన మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ గణన, ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ, చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంపు డిమాండ్లపై బీసీలంతా ఐక్యంగా పోరాడాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. -
సమస్యలు పరిష్కరించండి
శ్రీనగర్‌కాలనీ (హైదరాబాద్): పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రెస్టారెంట్స్ అండ్ బార్ లైసెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.దామోదర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.జైపాల్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు విజయ్‌కు మార్గౌడ్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం సంఘం నాయకులు మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి అసోసియేషన్ సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. బార్ లైసెన్స్ 2బీ ఫీజును నాలుగు వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించాలని, ఎంఆర్పీ రౌడింగ్ఆఫ్ను వైన్స్ మాదిరిగా మద్యం కోటాలో కలపకుండా స్టాక్ ఇవ్వాలని కోరారు. జాతీయ రహదారులపై అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న డాబాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, బెల్ట్‌షాప్‌లను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కూడా వినతి పత్రాన్ని అందజేశామని సంఘం నాయకులు తెలిపారు. మంత్రిని కలసినవారిలో అసోసియేషన్ గౌరవ సలహాదారు బాలరాజ్‌గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, రాజుగౌడ్, శ్రీనివాసగుప్తా తదితరులు ఉన్నారు. -
గౌడ ఆత్మగౌరవ భవనంలో అందరికీ ప్రాతినిధ్యం
సాక్షి, హైదరాబాద్: గౌడ ఆత్మగౌరవ భవనంలో అన్ని గౌడ సంఘాలకు ప్రాతినిధ్యం ఉంటుందని ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో గౌడ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కులాల ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ ఎంతో విలువైన భూములు కేటాయించారన్నారు. అందులో భాగంగా గౌడ కులస్తుల ఆత్మగౌరవ భవనానికి ఐదెకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన ఆత్మగౌరవ భవన నిర్మాణంలో అన్ని గౌడ సంఘాలకు ప్రాతినిధ్యం ఉంటుందని గతంలో గౌడ సంఘాల సమన్వయ సమావేశంలో స్పష్టం చేశామన్నారు. ఇందులో ఎలాంటి అపోహలు నమ్మొద్దని వివిధ గౌడ సంఘాల ప్రతినిధులకు, మేధావులకు, గీత వృత్తిదారులకు, నాయకులకు ఈ సందర్భంగా సూచించారు. సంతకాలు లేకుండా సోషల్ మీడియా ప్రచారంలో పెట్టిన ట్రస్ట్/సొసైటీ నకిలీ డాక్యుమెంట్లు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కావని, గౌడలు ఐక్యంగా ఉండాలని శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. -
టీటీఎఫ్ హైదరాబాద్ 2022: ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్)హైదరాబాద్- 2022 రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 4 దేశాలు, 150 స్టాళ్లు, 19 రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిజం ప్రతినిధులు టూరిజం ప్రచారంలో భాగంగా టూరిజం స్టాల్స్ ను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యటకాభివృద్ధి కోసం అనేక చర్యలను చేపట్టారన్నారు. కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు లభించిందన్నారు. అలాగే భూదాన్ పోచంపల్లికి వరల్డ్ బెస్ట్ టూరిజం గ్రామంగా గుర్తింపు లభించిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రాచుర్యం లభించేలా టూరిజంప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితమైన ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కరివేన, ఉద్ధండ పూర్ రిజర్వాయర్ల ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధిని సీఎం నేతృత్వంలో చేస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలో అతిపెద్ద అర్బన్ ఎకో టూరిజం పార్క్, కేసీఆర్ ఎకో పార్క్, అతిపెద్ద జలపాతాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల గత రెం డేళ్లనుంచి పర్యాటక రంగం ఎంతో నష్టపోయిందన్నారు. ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో టూరిజంలో అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఇండియా టూరిజం రీజినల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, టీటీఎఫ్ చైర్మన్ సంజీవ్ అగర్వాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే: కేటీఆర్
కవాడిగూడ: వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే అని, అందుకే అల్లూరి సీతారామరాజు జయంతిని తెలంగాణలో అధికారికంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీతారామరాజు 125వ జయంతిని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సోమవారం ట్యాంక్‌బండ్‌పై అధికారికంగా నిర్వహించింది. మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, మాధవరం కృష్ణారావు, వివేకానంద, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంబీర్పూర్ రాజు, నవీన్‌లు ట్యాంక్‌బండ్‌పై ఉన్న సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ జల్ జమీన్ జంగల్ కోసం కొము రం భీమ్ పోరాడారని, అల్లూరి కూడా బ్రిటిష్ పాలకులతో పోరాడి ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. క్షత్రియుల కోసం కేసీఆర్ మూడు ఎకరాల భూమిని కేటాయించారని, త్వరలో భవన నిర్మాణం పూర్తి చేసుకోవాలని, దానికి అల్లూరి పే రు పెట్టడమే సముచితమని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ సీఎం అయిన తరువాతే వైతాళికులను గౌరవించుకోవ డం మొదలైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు వర్మ, శ్యామలరాజు, మైనర్ రాజు, రామరాజు, వరదరాజులు, ఆఫ్గన్ రామరాజు, జోనల్ కమిషనర్ శ్రీనివా స్‌రెడ్డి, ముషీరాబాద్ సర్కిల్ 15 ఏఎంహెచ్‌వో మైత్రేయి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నాయకులు బీఎన్ రెడ్డి, తలసాని సాయికిరణ్, ముఠా జైసింహతోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అల్లూరి అభిమానులు పాల్గొన్నారు. -
ఏడు రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ జిల్లాలో జూలై 7వ తేదీ నుంచి 7 రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ప్రగతి భవన్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్నాహక సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, కవులు, సాహితీవేత్తలను గౌరవించే విధంగా తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవాన్ని చాటేలా ‘కాకతీయ వైభవ సప్తాహం’ను నిర్వహించాలని ఆదేశించారు. కాకతీయుల వైభవాన్ని, ప్రతిష్టను పెంచేవిధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనేలా కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు భాగస్వాములు అయ్యేలా సాహితీ, సాంస్కృతిక, కళా కార్యక్రమాలను, మేధో చర్చలను రూపొందించాలన్నారు. విద్యార్థి, యువత కూడా ఉత్సాహంగా పాల్గొనేలా, అందరూ గర్వ పడేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. కాకతీయ వైభవ సప్తాహంను విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: దిశ ఎన్కౌంటర్: హైకోర్టుకు చేరిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక -
మంత్రి వాహనంలో బడికెళ్లిన బాలుడు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఫతేపూర్ మైసమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ అమ్ము కుంటున్న బాలుడు విజయ్ కుమార్ తనను చదివించాలని ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వేడుకోగా.. ఆయన సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. బాలునికి కొత్త దుస్తులు, బూట్లు, సూట్ కేస్, ఇతర వస్తువులను ఇప్పించిన మంత్రి... సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారిక వాహనంలో జిల్లా కేంద్రంలోని రిషి పాఠశాలకు పంపించారు. మంత్రి స్వయంగా లగేజీని తీసుకొచ్చి బాలుడిని కారులో ఎక్కించి స్కూల్‌కు పంపించారు. -
సార్.. నన్ను చదివించండి!
నవాబుపేట: మండలంలోని మైసమ్మ ఆలయం వద్ద కూల్‌డ్రింక్స్ అమ్ము తున్న ఓ బాలుడిని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దత్తత తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కాకర్లపహాడ్‌కు చెందిన మల్లెల బుజ్జమ్మ, వెంకటేష్ దంపతుల కుమారుడు విజయ్‌కుమార్ స్థానికంగా ఆరో తరగతి చదువుతున్నాడు. ప్రతి ఆదివారం మైసమ్మ ఆలయం వద్ద కూల్‌డ్రింక్స్ అమ్ముతుంటాడు. ఆదివారం అమ్ముతుండగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అలా వెళుతున్న మంత్రి బాలుడిని చూసి పలకరించాడు. ‘ఏం చదువుతున్నావ్?’అనగానే మంత్రి చేయి పట్టుకుని ‘సార్! నేను చదువుకుంటా.. నన్ను చదివించండి. ప్లీజ్’అంటూ విలపించాడు. వెంటనే బాలుని పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని భరోసానిచ్చారు. బాలుడిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని రిషి పాఠశాలలో బాలుడిని చేర్పించి, అక్కడే హాస్టల్ వసతి కల్పించాలని సిబ్బందికి సూచించారు. తమ కొడుకుపై మంత్రి చూపిన ఔదార్యాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ బాగా ఆడాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎమ్.వినయ్ బాబు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాకంపై బీఉ చందర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రంతో రణధీర్, నందిని రెడ్డి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని తెలంగాణ మంత్రి శీనివాస్ గౌడ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాటలు, టీజర్ చూశాక ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమని అర్థమవుతోంది. అందరూ కొత్తవారు నటించిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. సింగిల్ విండో విధానం ద్వారా తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకోవడానికి తక్కువ రేట్లతో పర్మిషన్స్ ఇస్తున్నాం. తెలంగాణలో ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మంచి కల్చర్ ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకి అన్నివిధాలసహకరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ భాష, యాసలో వచ్చే చిత్రాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఈ కోవలో సీతారామపురంలో ఒక ప్రేమ జంట చిత్రం కూడా బాగా ఆడాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు`` అన్నారు. దర్శకుడు వినయ్ బాబు మాట్లాడుతూ.. డిఫరెంట్ వేలో ఆలోచించి తీసిన లవ్ స్టోరి ఇది. ప్రేమించడం కాదు...ఆ ప్రేమను నిలబెట్టుకోవాలన్న అంశాన్ని మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ఎక్కడా వల్గారిటీకి తావుండదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది’అన్నారు. నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ…‘దర్శకుడు వినయ్ బాబు చెప్పిన కథ నచ్చి మా అబ్బాయి రణధీర్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. ఎక్కడా రాజీ పడకుండా కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టాం. గ్రామీణ వాతావరణంలో జరిగే చక్కటి ప్రేమకథా చిత్రమిది. కథలో మంచి మలుపులు ఉన్నాయి. కథా పరంగా చాలా పెద్ద సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా అవుట్ పుట్ బాగొచ్చింది. దర్శకుడు చెప్పినదానికన్నా సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. -
ఇలాంటి చిత్రాలు భావితరాలకు అవసరం
‘‘ప్రజలను చైతన్యవంతులను చేయాలనే మంచి కాన్సెప్ట్‌తో తీస్తున్న ‘సాచి’ సినిమా పెద్ద విజయం సాధించాలి. ఇలాంటి సినిమాలు భావితరాలకు అవసరం’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సంజన, మూలవిరాట్ అశోక్ రెడ్డి ప్రధాన పాత్రల్లో వివేక్ పోతిగేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సాచి’. సత్యానంద్ స్టార్ మేకర్స్ సమర్పణలో ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతిగేని నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సత్యానంద్ మాస్టర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లాప్ కొట్టారు. నిర్మాత రామ్మోహన్ రావు గౌరవ దర్శకత్వం వహించారు. వివేక్ పోతిగేని మాట్లాడుతూ– ‘‘ఖమ్మంలో జరిగిన వాస్తవ ఘటనతో ‘సాచి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. ‘‘తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నాం’’ అన్నారు ఉపేన్ నడిపల్లి. ఈ చిత్రానికి సంగీతం: వి. భరద్వాజ్. -
గొప్ప సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి
గన్‌ఫౌండ్రీ/కవాడిగూడ(హైదరాబాద్): సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సాహితీవేత్త అని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. కుల, మత పిచ్చితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నటువంటి వారికి సురవరం జీవితం ఓ సమాధానమన్నారు. ఆయన లాంటి వ్యక్తిత్వమున్న నాయకులు దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సురవరం ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, సురవరం ప్రతాప్‌రెడ్డి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలువురికి అందజేసింది. పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాదరెడ్డి, రచయిత ఈమణి శివనాగిరెడ్డి, డాక్టర్ సింకిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్.శేషశాస్త్రి, జె.చెన్నయ్యకు రూ.లక్ష చెక్కుతో పాటు స్మారక పురస్కారాలను ప్రదానం చేసింది. ప్రజల పక్షాన నిలిచిన సురవరం నిరంతరం ప్రజల పక్షాన నిలిచిన గొప్ప మహనీయుడు, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని మం త్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. శనివారం సురవరం జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం ( ఫోటోలు)
-
నిఖత్‌కు నీరాజనం
శంషాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి నిఖత్ జరీన్‌కు హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం లభించింది. నిఖత్ జరీన్‌తోపాటు జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మూడు స్వర్ణ పతకాలు సాధించిన షూటర్ ఇషాసింగ్, జాతీయ మహిళల ఫుట్‌బాల్ లీగ్‌లో టైటిల్ గెలిచిన కేరళ గోకులం క్లబ్ జట్టుకు ఆడిన గుగులోత్ సౌమ్య కూడా శుక్రవారం నగరానికి వచ్చారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి ఓపెన్‌టాప్ జీప్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పలు పాఠశాలలకు చెందిన క్రీడాకారులు కూడా రహదారి వెంట ఆత్మీయ స్వాగతం పలికారు. జాతీయ పతాకాలు చేతబట్టి నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా కార్యదర్శి సందీప్ సుల్తానియా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. క్రీడలకు పెద్ద పీట ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయిలో తెలంగాణ అమ్మాయిలు రాష్ట్రం, దేశం గర్వపడేలా పతకాలు సాధించారంటూ కితాబునిచ్చారు. క్రీడారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, దేశానికి మంచి క్రీడాకారులను ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఊరూరా క్రీడా మైదానాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగానికి ప్రా«ధాన్యత తక్కువగా ఉండేదన్నారు. అన్ని రంగాల్లో బాగుపడుతున్న రాష్ట్ర ప్రగతిని చూసి ఢిల్లీ నుంచి వస్తున్న కొందరు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి ఏమి చేయలేని వారు.. వారి సొంత రాష్ట్రాల్లో బాగుచేయలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిఖత్ జరీన్, ఇషాసింగ్, సౌమ్య ముగ్గురు కూడా నిజామాబాద్ బిడ్డలు కావడం జిల్లాకు గర్వకారణంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మరింత వన్నె తెస్తా: నిఖత్ జరీన్ తాను సాధించిన పతకం దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిందని ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ అన్నారు. భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి మరింత వన్నె తెచ్చేలా పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎంతగానో ప్రోత్సాహం అందించా రని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. -
కుమార్తె వివాహం.. సీఎంకు పెళ్లి పత్రిక అందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన కుమార్తె శ్రీహర్షిత వివాహానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎంను బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో కలిశారు. ఈనెల 26న హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో రాత్రి 9 గంటలకు జరగనున్న వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ సీఎంకు పెళ్లిపత్రిక అందజేశారు. Called on Hon’ble CM Sri KCR Garu at Pragathi Bhavan & invited to attend the wedding of my younger daughter Sri Harshitha on 26th May. pic.twitter.com/MQPbLJfGZY — V Srinivas Goud (@VSrinivasGoud) May 18, 2022 -
జూన్ 2న నీరా కేఫ్ ప్రారంభం
కడ్తాల్: హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద రూ.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్‌ను జూన్ 2న దీనిని ప్రారంభిస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో నీరా పైలెట్ ప్రాజెక్టు కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రంలో తయారు చేస్తున్న నీరా, దాని అనుబంధ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గీత వృత్తిని పరిరక్షించేందుకు 4 కోట్ల ఈత, తాటి మొక్కలను పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో నీరా కేఫ్‌లను విస్తరిస్తామన్నారు. కల్లు గీత కార్మికులకు మరింత ఉపాధి కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా ముద్విన్ సహా యాద్రాద్రి భువనగిరి జిల్లా నందనం, సర్వేలు, సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో నీరా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. రియల్ ఎస్టేట్ వెం చర్ల పేరుతో తాటి, ఈత వనాలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్చిట్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీనివాస్‌గౌడ్ (ప్రస్తుత మంత్రి) సమర్పించిన అఫిడవిట్‌ను తర్వాత మార్చినట్టుగా అందిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టేసింది. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపామని, ఎలాంటి తప్పిదం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన కలెక్టర్‌కు సమాచారం ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పూర్తిస్థాయిలో విచారించాం ‘2018 ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్ సమర్పించిన అఫిడవిట్‌ను తర్వాత మార్చారని చలువగాలి రాఘవేంద్రరాజు 2021 ఆగస్టు 2న, అదే ఏడాది డిసెంబర్ 16న ఫిర్యాదు చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిని నివేదిక కోరాం. ఆయన మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ సహా 25 మంది అభ్యర్థులు మొత్తం 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీనివాస్‌గౌడ్ 2018 నవంబర్ 14న మూడు సెట్లు, నవంబర్ 19న మరో సెట్ నామినేషన్ వేశారు. చదవండి👉🏻 Telangana: త్వరలో 13వేల పోస్టులు భర్తీ మొత్తం 51 సెట్లలో 10 తిరస్కరణకు గురయ్యాయి. ఆరు సెట్లకు సంబంధించి అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద 14 మంది అభ్యర్థులకు గాను 35 సెట్ల నామినేషన్లు మిగిలాయి. ఒక్కో అభ్యర్థికి ఒక్క సెట్ (సక్రమమైన) నామినేషన్ చొప్పున 14 పోగా.. మిగిలిన 21 మల్టిపుల్/డూప్లికేట్ సెట్లు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో వెబ్‌జెనెసిస్ అప్లికేషన్ విధానం ప్రకారం మల్టిపుల్/డూప్లికేట్ నామినేషన్లు, వాటికి అనుసంధానమైన అఫిడవిట్లు పబ్లిక్ డొమైన్లో కనిపించే ఆప్షన్ లేదు. ఈ మేరకు 2018 నవంబర్ 14న శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఇతర అభ్యర్థులకు సంబంధించిన మల్టిపుల్/డూప్లికేట్ నామినేషన్లు, అఫిడవిట్లు కనిపించకుండా పోయాయి. వెబ్‌జెనెసిస్ అప్లికేషన్ విధానంలో ఈ అఫిడవిట్లు కనిపించకుండా పోయినందున దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేం.. చర్యలు తీసుకోలేం..’అని ఎన్నికల ప్రధాన అధికారి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఫిడవిట్లు మార్చారనే ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపామని, అలాంటివేమీ జరగలేదని తేలడంతో ఫిర్యాదులు డిస్పోజ్ చేస్తున్నామని తెలిపారు. ధ్రువీకరించిన కలెక్టర్ ఈ విషయాన్ని మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావ్ ధ్రువీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని కలిగించాయని, రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు, అధికారుల నైతిక బలాన్ని, ఐక్యతను కాపాడేలా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చిందని ఆయన చెప్పారు. చదవండి👉 దక్షిణ డిస్కంలో తొలి లైన్‌ఉమెన్‌గా శిరీష -
టీఆర్ఎస్తోనే తెలంగాణకు రక్ష
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి, రక్షణ టీఆర్ఎస్తోనే సాధ్యమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుమారు 300మంది బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. వీరిలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సత్యంయాదవ్, కోయిల్‌కొండ మండలం రాంపూర్ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు పెద్ద రాములు యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ చేరికలు జిల్లా అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా రైతుబంధు కో–ఆర్డినేటర్ గోపాల్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, వైస్‌ఛైర్మన్ గణేష్, గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు శాంతన్న తదితరులు పాల్గొన్నారు. -
క్షతగాత్రులను ఆదుకున్న మంత్రి
రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు. వనపర్తికి చెందిన డీసీఆర్బీ కానిస్టేబుల్ దాసరి వెంకటస్వామి, భార్య సింధు, కుమారుడు కవినందన్‌దాస్, కూతురు అద్వికతో కలసి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరారు. వీరి కారు మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట వద్దకు చేరుకోగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికీ స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో అడ్డాకులలో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించారు. స్వల్ప గాయాలతో బయట పడిన క్షతగాత్రులకు నీళ్లు తాగించి స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం చేయించాలని అడిషనల్ కలెక్టర్ తేజాస్ నందులాల్ పవార్‌ను ఆదేశించారు. –అడ్డాకుల -
అడ్డగోలు దందా కుదరదు
సనత్‌నగర్(హైదరాబాద్): ‘అడ్డగోలుగా పబ్‌లను నడిపిస్తామంటే హైదరాబాద్‌లో ఉండొద్దు.. వేరే రాష్ట్రమో, దేశమో వెళ్లిపోండి. ఇక్కడ ఉండి డ్రగ్స్ దందా చేస్తామంటే కుదరదు. డ్రగ్స్‌తో పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా అవసరమనుకుంటే నగర బహిష్కరణ చేస్తాం’అని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. పబ్‌ల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ముఖ్యంకాదని, అవసరమైతే ఒక్క జీఓతో అన్నీ మూసివేయిస్తామని స్పష్టంచేశారు. చేతనైతే నిబంధనల మేరకు నడిపించాలని, అక్రమ పద్ధతిలో చేయాలను కుంటే బంద్ చేసుకోవాలని చెప్పారు. శనివారం హైదరాబాద్ పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా... తెలంగాణలో 40% ఏరియా జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందని, విదేశీయులు పెట్టుబడులు పెట్టాలంటే భద్రతాపరంగా హైదరా బాద్ ఏవిధంగా ఉంది, ఇక్కడ పాలసీలు ఎలా ఉన్నాయనే అంశాలను ప్రధానంగా తీసుకుంటారని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌రహిత రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డ్రగ్స్, గుడుంబా, గంజాయి వినియోగం, అ మ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. అయితే అక్కడక్కడ ర్యాడిసన్ పబ్ లాం టి చీడ పురుగులు డబ్బుకు కక్కుర్తిపడి రా ష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నాయని చెప్పారు. ర్యాడిసన్ పబ్‌పై ఎవరో చెబితే తమ డిపార్ట్మెంట్ దాడి చేయలేదని, డ్రగ్స్ దందాను అరికట్టే క్రమంలో అధికారులే కస్టమర్ల మాదిరి వెళ్లి దాడులు చేశారని స్పష్టంచేశారు. డ్రగ్స్ దందా వెనుక ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చ రించారు. అయితే అక్కడ ఉన్నవారం తా దోషులుగా పేర్కొనడం సరికాదన్నారు. అన్ని కోణాల్లో సీసీ కెమెరాలు.. నగరంలో ఉన్న 65 పబ్‌ల్లో అన్ని కోణాల్లో సీసీ కెమెరాలు ఉండాలని, అలా లేని పబ్‌లను తాత్కాలికంగా మూసివేసి సీసీ కెమెరాలను అమర్చుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆయా సీసీ కెమెరాలను ఎక్సైజ్ విభాగానికి అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. తద్వారా పబ్‌ల్లో ఏమి జరుగుతుందో అధికారులు ఆన్లైన్లోనే పర్యవేక్షించే వీలుంటుందన్నారు. పబ్ లకు సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నా సంబంధిత సీఐ, ఏఈఎస్, ఈఎస్‌లను బాధ్యులను చేస్తామన్నారు. సమావేశంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ సర్ఫరాజ్, అదనపు కమిషనర్ అజయ్‌రావు, జాయింట్ కమిషనర్ ఖురేషీ, రం గారెడ్డి జిల్లా డీసీ డేవిడ్‌రాజు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి ఉన్న మంచిపేరు చెడిపోవద్దు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
ఎక్సైజ్ అధికారులకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో ఎస్సై స్థాయి నుంచి అదనపు కమిషనర్ వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు పదోన్నతులు లభించాయి. శనివారం ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పదోన్నతుల పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పదోన్నతులు సాధించిన ఉద్యోగులను అభినందించారు. రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే గంజాయి, గుడుంబాలను నిర్మూలించగలిగామని చెప్పారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అజయ్‌రావు, హరికిషన్, అంజన్‌రావు, డేవిడ్ రవికాంత్, శాస్త్రి, ఖురేషి, సురేశ్‌రాథోడ్, చంద్రయ్యగౌడ్, దత్తురాజుగౌడ్, సత్యనారాయణ, రవీందర్రావు, గణేశ్‌గౌడ్, కిషన్‌నాయక్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్దేశపూర్వకంగానే కేసులో ఇరికించారు
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో తమను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని నిందితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టు అయి జైలులో ఉండి కండిషన్ బెయిల్ మీద విడుదలైన ఏ–1 రాఘవేంద్రరాజు, ఏ–2 అమరేందర్‌రాజు, ఏ–3 రవి, ఏ–4 మధుసూదన్, ఏ–5 యాదయ్య, ఏ–6 నాగరాజు, ఏ–7 విశ్వనాథ్ శుక్రవారం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు. మేడ్చల్ కోర్టు ఈ కేసు విచారణను చేపట్టి మొత్తం ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు వారంలో రెండురోజులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయా ల్సి ఉంది. నిందితులు మీడియాతో మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా అక్రమ కేసు. దీనిని సీబీఐకి అప్పగించాలి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అరాచకాలను సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం’అని పేర్కొన్నారు. ‘ఫిబ్రవరి 22న ఎన్నికల కమిషన్ నుంచి నాకు లేఖ వచ్చింది, ఆ రోజు నేను రాష్ట్రపతిభవన్ వద్ద ఉన్నట్లుగా ఆధారాలున్నాయి. నన్ను హత్య చేసే క్రమంలోనే ఈ హైడ్రామా జరిగింది’అని రాఘవేంద్రరాజు ఆరోపించారు. తాను మంత్రి వల్ల దాదాపు రూ.11 కోట్లు నష్టపోయానని, తనపై 13 కేసులు పెట్టించారని, తమ కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. మంత్రిపై తాను వేసిన కేసుల విషయమై రాజీ చేసుకోవడానికే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. సస్పెన్స్ తలపించే విధంగా తమ స్టోరీ ఉందని, రాంగోపాల్ వర్మ సినిమా తీస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వారు పేర్కొనడం గమనార్హం. 2014 నుంచి మహబూబూనగర్ పట్టణంలో అశాంతి నెలకొందని, ఎవరైనా మంత్రి అరాచకాలను ప్రశ్నిస్తే వారి కుటుంబాలపై దాడి చేయించడం, లేదంటే కేసులు పెట్టించడం, ఆర్థికంగా ఇబ్బందులపాలు చేయడం మామూలైపోయిందని మరో నిందితుడు మున్నూరు రవి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎక్సైజ్ ఉద్యోగులకు ‘ఉగాది కానుక’
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన తరహాలోనే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఎస్ఐ నుంచి అదనపు కమిషనర్ స్థాయి అధికారుల పదోన్నతులతో పాటు పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా నేడు పదోన్నతుల పత్రాలను రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అందజేస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. -
నెక్లెస్‌రోడ్డులో రూ.25 కోట్లతో నీరా కేఫ్
ఖైరతాబాద్ (హైదరాబాద్): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరుగున పడుతున్న కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నీరా కేఫ్ పనులను శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. తెలంగాణ ఆవిర్భావ దినం కంటే ముందే నీరా కేఫ్‌ను ప్రారంభించడంతోపాటు పూర్వీకుల చరిత్రను ఉట్టిపడేలా తీర్చిదిద్దుతామన్నారు. బుధవారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. నీరాతోపాటు తాటి బెల్లం, తాటి చక్కెర తయారుచేసి ప్రత్యేక ప్యాకింగ్‌తో అందజేస్తామని తెలిపారు. ఆయుర్వేదిక్ డాక్టర్ల పర్యవేక్షణతోపాటు సీసీఎంబీ, సీఎస్ఐఆర్, ఐఐసీటీ వంటి సంస్థల సహకారంతో శాస్త్రీయంగా పరీక్షించి వీటి లాభాలను ప్రజలకు వివరిస్తామన్నారు. నల్లగొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఔషధ గుణాలున్న నీరా, కల్లు ఉత్పత్తికోసం ఇప్పటికే 4.25కోట్ల చెట్లను పెంచామని, రాబోయే రోజుల్లో 5 కోట్ల చెట్లు పెంచి స్వచ్ఛమైన కల్లును సీసాల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కె.కిషోర్ గౌడ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ 3 గంటలే నిద్రపోతున్నారు
వరంగల్ స్పోర్ట్స్/వరంగల్/ఖిలా వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రోజుకు మూడు గంట లు మాత్రమే నిద్రిస్తూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి అనుక్షణం తాపత్రయ పడుతున్నారని మంత్రి శ్రీని వాస్‌గౌడ్ పేర్కొన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 2 రోజుల పాటు జరగనున్న 8వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ఖిలా వరంగల్ మధ్యకోటలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న మ్యూజియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.వరంగల్ పోచమ్మ మైదాన్‌లో హరిత హోటల్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా ప్రతి జిల్లాలో ఐదు టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 40 ఏళ్లు పైబడిన వెటరన్ క్రీడాకారులు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు అథ్లెటిక్స్ మీట్ నిర్వహణ కార్యదర్శి కూరాకుల భారతి తెలిపారు. -
ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటక రంగంపై నిర్లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్
వైరా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యా టక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఖమ్మం జిల్లాకు వచ్చి నప్పటికి.. ఇప్పటికీ అభివృద్ధిలో ఎంతో తేడా ఉందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రూ.89 లక్షలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని, వైరా రిజర్వాయర్ వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు స్పీడ్ బోట్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వైరా రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా వైరాలో ఇండోర్ స్టేడియం ప్రారంభించాక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతుండగా, ఉపాధి హామీ ఫీల్ట్ అసిస్టెంట్లు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. -
హైదరాబాద్‌కు 2051 వరకు నీటి సమస్య రాకుండా చేశాం: కేటీఆర్
ప్రతీ పట్టణంలో కొత్త నల్లా కనెక్షన్ రూపాయికే ఇస్తున్నాం. గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రతీ సంవత్సరం ఎండాకాలంలో ఖాళీ కుండలతో నిరసనలు జరిగేవి. నేను హైదరాబాద్‌లో స్కూలుకు వెళ్లినప్పుడూ ఇవే కనిపించేవి. వాటి వల్ల ఎప్పుడూ స్కూలు ఆలస్యమయ్యేది. దానికి కారణం భట్టి విక్రమార్క వాళ్ల పార్టీనే. హైదరాబాద్‌కు 2051 సంవత్సరం వరకు కూడా నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాం. – మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాబోయే పదీ పదిహేనేళ్లల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాదే ఎక్కువ జనాభా ఉన్న నగరంగా ఉండనుందని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలను వెనక్కు నెడుతుందని, అందువల్ల దానికి తగినట్లుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. శనివారం అసెంబ్లీలో తన శాఖ పద్దుపై సభ్యుల చర్చ అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ‘మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసమే పట్టణాలకు ప్రజల వలస ఉంటుంది. హైదరాబాద్ నుంచే 45–50% రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వస్తుంది. మొత్తం పట్టణాల నుంచే 70% జీఎస్డీపీ వస్తుంది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకునే మున్సిపాలిటీలను పెంచాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 142 మున్సిపాలిటీల్లో ప్రతీ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, ప్రతీ ఇంటికి నీటి సరఫరా, వైకుంఠ ధామం, డిజిటల్ డోర్ నంబర్, మెకనైజ్డ్ ధోబీ ఘాట్, మానవ వ్యర్థాల శుద్ధీకరణ, పచ్చదనం పెంచడం వంటివి చేస్తాం. 1,600 నర్సరీలు అన్ని మున్సిపాలిటీల్లో పెట్టాం. దేశంలో హైదరాబాద్ ‘ట్రీ సిటీ ఇండియా’అని ఐక్యరాజ్యసమితి చెప్పింది. హైదరాబాద్‌ను జీరో వేస్ట్ నగరంగా మార్చాలన్నది లక్ష్యం’అని కేటీఆర్ చెప్పారు. మరో 25 వేల పడకలు: హరీశ్‌రావు ఇప్పటివరకు రాష్ట్రంలో తలసరి ప్రభుత్వం చేసే వైద్య ఖర్చు రూ.1,695 అని, ప్రస్తుత బడ్జెట్లో రూ.3,092 ఖర్చు చేయబోతున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ పద్దుపై జరిగిన చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. ‘డయాలసిస్‌లో సింగిల్ యూజ్ సిస్టమ్ తెచ్చాం. తమిళనాడులో అక్కడి సీఎం స్టాలిన్ మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీని వైఎస్సార్ ప్రారంభించినా, మంచి పథకం కాబట్టి దాన్ని బలోపేతం చేశాం. కోవిడ్‌లో అత్యధికంగా ప్రాణాలను కాపాడిన రాష్ట్రంగా జాతీయ ఆర్థిక సర్వే చెప్పింది. కేంద్రం అవార్డులు కూడా ఇచ్చింది. ఖమ్మంకు మెడికల్ కాలేజీ, ఖమ్మం జిల్లాకు నర్సింగ్ కాలేజీ ఇస్తున్నాం. అందుకు అనువైన స్థలం చూడాలని ఈరోజే కలెక్టర్‌కు లేఖ రాశాను. ఉస్మానియా ఆసుపత్రిపై కోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే కొత్త భవనం కడతాం’అని హరీశ్ చెప్పారు. టూరిస్టులు 200 శాతం పెరిగారు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రానికి వచ్చే దేశ విదేశీ టూరిస్టుల సంఖ్య 200 శాతం పెరిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తన శాఖలకు సంబంధించి పద్దులపై చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ప్రతీ జిల్లాలో స్పోర్ట్స్ స్కూళ్లను పెంచాలని భావిస్తున్నాం. స్పోర్ట్స్ అకాడమీలను ఒక్కో జిల్లాలో ఏర్పాటు చేస్తాం. సెట్విన్ చిన్న ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనుకుంటున్నాం. సెట్విన్ సంస్థను ప్రతీ నియోజకవర్గానికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఒక్కో జిల్లాను ఒక పర్యాటక ప్రాంతంగా చేయాలని నిర్ణయించాం’అని చెప్పారు. -
అధిక ధరలు.. నిషేధంలో భాగమే: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ధరలు తగ్గిస్తే మద్యం మామూలు వాళ్లకు అందుబాటులోకి వస్తుందని, ఇంకా ఎక్కువ తాగుతారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ధర తక్కువ పెడితే చాయ్‌కి బదులు మందు తాగడం ప్రారంభి స్తారని.. ఎక్కువ ధరలు పెడితే తాగకుండా ఇంటి ఖర్చుల గురించి ఆలోచిస్తారని పేర్కొన్నారు. అధిక ధరలు పెట్టడం నిషేధంలో ఒక భాగమన్నారు. శుక్రవారం శాసనసభలో ఎక్సైజ్ శాఖ పద్దులపై సభ్యులకు ప్రశ్నలకు శ్రీనివాస్‌గౌడ్ సమాధానమి చ్చారు. దేశవ్యాప్తంగా మద్య నిషేధం అమలు చేస్తే రాష్ట్రంలోనూ అమలు చేస్తామని కేసీఆర్ ఇప్పటికే చెప్పారని గుర్తుచేశారు. మద్యం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభు త్వం అనుకోవడం లేదని.. అక్రమ మద్యాన్ని కట్టడి చేయడం వల్లే ఆదాయం పెరిగిందని చెప్పారు. రైతుల తరహాలో గీత కార్మికులకూ బీమా.. గీత కార్మికుల సాధారణ మరణాలకు సైతం పరిహారం చెల్లించేందుకు రైతుబీమా తరహాలో కొత్త పథకాన్ని తెస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ వర్గంవారి సంక్షేమానికి బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. నెక్లెస్ రోడ్డులో రూ.12 కోట్లతో నీరా కేఫ్‌ను, భువనగిరి నందనవనంలో రూ.7 కోట్లతో నీరా ఉత్పత్తుల సంస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గీత కార్మికుల కోసం చెట్లు ఎక్కే యంత్రాలను అందు బాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 10, 15 అడుగులే ఉండే తాటి చెట్లను అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాఖను కోరామన్నారు. జనాన్ని మద్యానికి బానిస చేస్తున్నారు: భట్టి రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా రూ.37వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను తాగుడుకు భయంక రంగా అలవాటు చేస్తోందని, బానిసలుగా మార్చు తోందని మండిపడ్డారు. కల్తీ కల్లు, డ్రగ్స్‌ను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఎప్పటి నుంచి ఇస్తారో తెలపాలని కోరారు. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో మరో పరిణామం
-
విచారణకు హాజరుకావాలని జితేందర్‌రెడ్డి పీఏ రాజుకు నోటీసులు
-
టీ పెట్టారు.. రూ.లక్షలు కొట్టారు
మాదాపూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఆదివారం తెలంగాణ టీ చాంపియన్ షిప్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి ఆనరరీ కాన్సుల్, రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా ఫర్ తెలంగాణ, సుచరిండియా ఏపీ సీఈఓ లయన్ కిరమ్, నిలోఫర్ కేఫ్ చైర్మన్ ఎ.బాబురావు, గోద్రేజ్ జెర్సీ సీఈఓ భూపేంద్రసూరి, మల్లారెడ్డి హెల్త్‌సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతిరెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మాడిశెట్టి రాజ్గోపాల్లతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళలతో టీ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభినందనీయులన్నారు. గతంలో ఎన్నడూ లేని సరికొత్త విధానంతో రకరకాల టీలను పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. పోటీల్లో 104 Ðమంది పాల్గొన్నారు. ప్రథమ బహుమతి కింద లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, ముగ్గురు రన్నరప్‌లకు రూ.25 వేల చొప్పున మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో సంచలన విషయాలు..!
-
శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసు విచారణలో ఉంది: సబితా
-
సీబీఐ విచారణ జరిపించాలి: డీకే అరుణ
సాక్షి,హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు సంబంధించిన మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్లోనే కట్టుకథ అల్లారని, హత్యకు కుట్ర అంటూ పోలీసులు, శ్రీనివాస్ గౌడ్ కలిసి కథను రక్తి కట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం ఆదేశాలు లేకుండా పోలీసు కమిషనర్‌స్థాయి వ్యక్తి తప్పుడు కేసులు పెట్టే సాహసం చేయరని, ఈ కుట్రలో ఏ1గా సీఎం కేసీఆర్, ఏ2గా శ్రీనివాస్ గౌడ్ నిలుస్తారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. ఈ పరిణామాలపై పార్టీ జాతీయ నాయకత్వానికి, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసి సీబీఐ విచారణ కోరతామన్నారు. గురువారం పార్టీ నాయకులు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కొల్లి మాధవి, భరత్‌గౌడ్‌లతో కలిసి అరుణ మీడియాతో మాట్లాడారు. ఈ హత్య సుపారీకి రూ.12 కోట్లు, 15 కోట్లు అని బూటకపు మాటలు చెబుతున్నారని, అంత ఆర్థిక శక్తి ఉన్న వారెవ్వరూ అక్కడ లేరని అరుణ అన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పథకం ప్రకారమే ఈ నాటకానికి తెరతీసినట్టున్నారని సందేహం వ్యక్తంచేశారు. ఎదిరిస్తున్న వారిపై తప్పుడు కేసులు మహబూబ్‌నగర్ భూలావాదేవీల్లో మంత్రి శ్రీని వాస్ గౌడ్ అనుచరుల అరాచకాలు శ్రుతిమించాయని, వారిని ఎదిరిస్తున్న వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అరుణ ఆరోపించారు. ‘శ్రీనివాస్‌గౌడ్‌పై ఎలాంటి కుట్రలు చేయాల్సిన అవస రం మాకు లేదు. మంత్రి తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్లు రాఘవేంద్రరాజు ఎలక్షన్ పిటిషన్ వేశాక మమ్మల్ని కలిస్తే మద్దతునిచ్చాం. ఈ పిటిషన్ వెన క్కి తీసుకోవాలని రాఘవేంద్రరాజుపై మంత్రి ఒత్తిడి తెచ్చినా వెనక్కు తగ్గకపోవడంతో కిడ్నాప్ చేయించారు. మున్నూరు రవి ఉద్యమ విద్యార్థి నేత, కేసీఆర్‌కు వీరాభిమాని.. ఆయనకు, శ్రీనివాస్‌గౌడ్‌కు మధ్య ఏం విభేదాలు వచ్చాయో మాకు తెలియదు. గత ఏప్రిల్ 27న శ్రీనివాస్‌గౌడ్‌పై 19 ఎకరాల 35 గుంటల భూమి విషయంపై సీఎంవోకు మున్నూరు రవి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సొంత పార్టీ వాళ్లే మంత్రి వేధింపులు తట్టుకోలేక ఏకమై ఇలా చేసి ఉండొచ్చు’అని ఆమె పేర్కొ న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పులిలా గర్జించిన కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇప్పుడు కేసీఆర్ ముందు పిల్లిలాగా మారారని ఎద్దేవాచేశారు. -
మాటల యుద్ధంలో మరో అంకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నా అధికార టీఆర్ఎస్తో పాటు విపక్ష జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ నడుమ సాగుతున్న రాజకీయ పోరు రోజురోజుకూ వేడెక్కుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్, పట్టు సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్ నడుమ వివిధ అంశాలపై సాగుతున్న మాటల యుద్ధంలో.. తాజా గా రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ హత్యకు సంబంధించిన ‘సుపారీ’అంశం చేరింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ వేడిని ఇది మరింత రాజేసింది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మంత్రిపై హత్యాయత్నానికి సంబంధించిన అంశంపై సీబీఐ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుంటే.. నిందితులకు షెల్టర్ ఇచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిపై కేసులు నమోదు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. పోలీసులు కాకుండా రాజకీయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా తలపడాలని, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తప్పిదాలను ఎత్తిచూపుతున్న వారికి మద్దతు ఇస్తే తప్పేంటి అని డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారి ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కాగా తమపై చేసే ఎలాంటి కుట్రలనైనా ఛేదిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కేసులో నిందితులకు బీజేపీ నేతలు ఆశ్రయం కల్పించడం సిగ్గుచేటని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. మంత్రి హత్యకు కుట్ర పన్నిన పాత్రధారులకు ఆశ్రయం ఇచ్చిన బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డిపై కేసులు నమోదు చేయాలంటూ ఎదురుదాడి చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే బీజేపీ సుపారీ హత్యా రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి ఆరోపించారు. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసు: కీలక విషయాలను వెల్లడించిన నిందితుడు
సాక్షి, హైదరాబాద్: తన వ్యాపారాలను దెబ్బతీసి, ఆర్థికంగా నష్టం కలిగించడంతోనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నినట్టుగా.. ఈ కేసులో కీలక నిందితుడు రాఘవేందర్‌రాజు వెల్ల డించినట్టు సమాచారం. ఈ మేరకు పోలీసుల విచారణలో కీలక అంశాలను బయటపెట్టినట్టు తెలిసింది. మంత్రి తనతోపాటు తన కుటుం బాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడని పేర్కొన్నట్టు సమాచారం. తన స్థిరాస్తి వ్యాపారాన్ని దెబ్బతీశాడని, తనకున్న బార్‌ను మూసి వేయించాడని, తన ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌ను రద్దు చేయించాడని వివరించినట్టు తెలిసింది. అంతేగాకుండా తనపై అక్రమంగా ఎక్సైజ్ కేసులు నమోదు చేయించినట్టుగా పేర్కొన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మంత్రి హత్యకు కుట్ర పన్నినట్టుగా నిందితుడు రాఘవేందర్‌రాజు వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలో అరెస్టు చేసిన నిందితులు రాఘ వేందర్రాజు, రవి, మధుసూదన్‌రాజు, అమరేందర్రాజులను పేట్ బషీరాబాద్ పోలీసులు గురువారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. అనంతరం మంత్రి హత్యకు కుట్ర వ్యవహారంలో పూర్తి వివరాలు రాబట్టేందుకు ఎనిమిది మంది నిందితులను వారం రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మీడియాతో మాట్లాడకుండా.. మంత్రి హత్యకు కుట్ర ఘటన, ఇతర అంశాలకు సంబంధించి పోలీసు అధికారులెవరూ మీడియాతో మాట్లాడలేదు. తమకు తెలియకుండా మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఫరూక్, హైదర్ అలీలపై హత్యయత్నానికి సంబంధించి సుచిత్ర చౌరస్తాలో లాడ్జిలో సీసీ పుటేజీ ఆధారాల కోసం పోలీసులు వెళ్లగా.. హార్డ్‌డ్రైవ్ పనిచేయడం లేదని గుర్తించినట్టు తెలిసింది. పోలీసుల రిపోర్టులో ఏముంది? మొదట ఫరూక్, హైదర్ అలీలపై జరిగిన హత్యాయత్నం, అనంతరం మంత్రి హత్యకు చేసిన కుట్ర బయటపడటం వరకు వివరాలను పేట్‌బషీరాబాద్ పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. ‘‘మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్‌రాజు, ఆయన సోదరుడు నాగరాజు కలిసి బార్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రకేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన అమరేందర్‌రాజు, మధుసూదన్‌రాజు కూడా వారి సోదరులే. మహబూబ్‌నగర్ టీచర్స్ కాలనీకి చెందిన బంగారం షాపు వ్యాపారి గులాం హైదర్అలీ జిల్లాకు చెందిన ఓ వీఐపీ మద్దతుతో రాఘవేందర్‌రాజు బార్ వ్యాపారాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. తరచూ ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేయడం, ఆర్ధికంగా నష్టం కలిగించే చర్యలకు పాల్పడటం చేసేవాడు. తన వ్యాపారాలకు హైదర్అలీ అడ్డు తగులుతుండటాన్ని సహించలేకపోయిన రాఘవేందర్‌రాజు ఎలాగైనా అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని స్థానికులైన దండేకర్ విశ్వనాథ్‌రావు, వరద యాదయ్యలకు వివరించాడు. వారు అవసరమైన ఆయుధాలను సమకూర్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్ 18న మహబూబ్‌నగర్ ఎక్సైజ్ కోర్టు హాజరైన ఫరూక్‌ను రాఘవేందర్‌రాజు, నాగరాజు కలుసుకున్నారు. హైదర్‌అలీని చంపేందుకు ఆయుధాలు సమకూర్చాలని కోరారు. కానీ హైదర్అలీ తన స్నేహితుడే కావటంతో ఫరూక్ ఈ విషయాన్ని అతడికి తెలిపాడు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రాణభయంతో గతనెల 23న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ లాడ్జిలో దిగారు. 25న వారిపై నాగరాజు, విశ్వనాథ్‌రావు, యాదయ్య హత్యాయత్నం చేయగా.. ఫరూక్, హైదర్అలీ తప్పించుకొని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. రాఘవేందర్‌రాజు సూచన మేరకే హత్యకు ప్రయత్నించామని తెలిపారు. అదే సమయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు రాఘవేందర్‌రాజు కుట్ర పన్నుతున్నట్టు నాగరాజు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ లొకేషన్ల ఆధారంగా రాఘవేందర్‌రాజు, అమరేందర్‌రాజు, మధుసూదన్‌రాజు, ఇతరులను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.’’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆయుధాలు ఎవరి హత్య కోసం? నిందితులైన రాఘవేందర్‌రాజు నుంచి రెండు బుల్లెట్లు ఉన్న పిస్టల్, మున్నూరు రవి నుంచి ఆరు బుల్లెట్లు ఉన్న రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఆయుధాలను హైదర్ అలీని చంపేందుకు సిద్ధం చేసుకున్నారా? లేక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కోసం కొనుగోలు చేసినవా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అంతేగాకుండా ఈ వ్యవహారంలో మరో ఇద్దరు నేతల అనుచరుల హస్తమున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫరూక్ దొరికినప్పుడే బయటపడితే.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర వ్యవహారంలో కీలకంగా ఉన్న ఫరూక్ అహ్మద్ కరుడుగట్టిన నేరగాడని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మంత్రి హత్య కోసం సుపారీ తీసుకున్న ఫరూక్.. ఆ తర్వాత నెల రోజులకే అక్రమ ఆయుధాలతో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్‌కు (ఎస్ఓటీ) చిక్కాడు. ఎస్ఓటీ పోలీసులు గగన్‌పహాడ్‌లోని అతడి ఇంటిపై దాడి చేసి.. రెండు నాటు తుపాకులు, 44 తూటాలను కూడా స్వాధీనం చేసుకుని, ఫరూక్‌ను అరెస్టు చేశారు. తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఫరూక్ ఆయుధాలు ఎందుకు వినియోగిస్తున్నాడు? వాటితో ఏం చేయదల్చుకున్నాడనే వివరాలు రాబట్టడంలో ఎస్ఓటీ, ఆర్జీఐఏ పోలీసులు నిర్లక్ష్యం వహించినట్టు విమర్శలు వస్తున్నాయి. లేకుంటే మంత్రి హత్యకు కుట్ర విషయం అప్పుడే బయటపడి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరుడుగట్టిన నేరస్తుడే.. ఫరూక్ అహ్మద్ అలియాస్ జావిద్ అలియాస్ సైతాన్ ఫరూఖ్ (44) స్వస్థలం మహబూబ్‌నగర్ అని.. కొన్నేళ్ల కింద హైదరాబాద్‌కు మకాం మార్చాడని పోలీసులు చెప్తున్నారు. స్థిరాస్తి వ్యాపారం పేరిట కొందరి నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకొని మోసం చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. 2016లో రాజేంద్రనగర్‌లో ఖదీర్ అనే వ్యక్తి నుంచి ఒక తుపాకీని కొనుగోలు చేసి.. ఒకేరోజు కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌లో ఇద్దరు వ్యక్తులను హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి. ఆ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన ఫరూక్.. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయుధాలను కొనుక్కొచ్చి, బెదిరింపులకు, దోపిడీలకు పాల్పడినట్టుగా వంగూరు, సైఫాబాద్, నాంపల్లి, జడ్చర్ల, హుమాయూన్‌నగర్, మహబూబ్‌నగర్, ఆర్జీఐఏ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. -
జితేంద్రర్రెడ్డి ఇంటికి వెళ్లనున్న బండి సంజయ్
-
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర రిమాండ్ రిపోర్ట్
-
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రపై డీకే అరుణ రియాక్షన్
-
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర: ‘కిడ్నాప్’ల వ్యవహారంలో సంచలన మలుపు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పట్టణానికి చెందిన పలువురి కిడ్నాప్, అదృశ్యం, అరెస్టుల వ్యవహారం సంచలన మలుపు తీసు కుంది. వారం రోజులుగా మహబూబ్‌నగర్, హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలో చోటు చేసుకున్న వరుస అపహరణ ఘటనల వెనుక కొత్త కోణం వెలుగుచూసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన సదరు వ్యక్తులు.. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించడంతో కలకలం మొద లైంది. ఈ కుట్రలో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణ అనుచరుల హస్తమున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని సీపీ వెల్లడించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే పోలీసులు అరెస్టు చేసిన నిందితులకు మంత్రిని హత్య చేసేంత ధైర్య ముందా? అన్న సందేహాలను జిల్లాలోని విపక్ష నేతలు, నిందితుల బంధువులు వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్లో నలుగురు అన్నదమ్ములే.. మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్రాజుతో పాటు మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్‌రాజు, మధుసూదన్‌రాజు, నాగరాజు, భండేకర్ విశ్వనాథరావు, తెలంగాణ ఉద్యమ కారుడు మున్నూరు రవి, వరద యాదయ్య కలిసి మంత్రి హత్యకు కుట్రపన్నారని పోలీసులు ప్రకటిం చారు. వీరిలో అమరేందర్‌రాజు, మధుసూదన్ రా జు, నాగరాజు, రాఘవేందర్‌రాజు నలుగురూ అన్న దమ్ములే. ఇందులో సుపారీ గ్యాంగ్‌కు డబ్బులు ఇచ్చేందుకు మధుసూదన్‌రాజు, అమరేం దర్రాజు ముందుకొచ్చారని పోలీసులు చెప్తున్నారు. మొదటి నుంచీ విభేదాలతో..: మంత్రి హత్య కేసులో నిందితులుగా చేర్చిన నలుగురు అన్నదమ్ములకు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మొదటి నుంచీ విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన అమరేందర్‌రాజు.. ప్రస్తుతం మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన భార్య రాధ గతంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అయితే టీఆర్ఎస్లో చేరిన కొన్నిరోజుల తర్వాత అమరేందర్‌రాజు కుటుంబం.. శ్రీనివాస్‌గౌడ్‌తో అంటీముట్టనట్టుగానే ఉన్నట్టు ప్రచారంలో ఉంది. 2018 ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్ తప్పుడు అఫిడవిట్ వేశారని, తర్వాత స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపర్ చేసి వివరాలు మార్చారని రాఘవేందర్‌రాజు ఫిర్యాదు చేశారు. 2019 జనవరి 24న కోర్టులో కేసు కూడా వేశారు. శ్రీనివాస్‌గౌడ్‌ను డిస్క్వాలిఫై చేసి, ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఆ కేసు 2020 మార్చి 24న విచారణకు వచ్చినా.. కరోనా నేపథ్యంలో వాయిదాపడింది. ఈ క్రమంలో రాఘవేందర్రావు.. 2021 ఆగస్టు 2న కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కు ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన సీఈసీ.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. ఇటీవల సీఈవో శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసులోకి వెళ్లిన క్రమంలో.. ఈసీ వెబ్సైట్ ట్యాంపరింగ్‌పై నిజానిజాలు తేల్చాలని సాంకేతిక బృందానికి సీఈసీ ఆదేశించినట్టు తెలిసింది. కాగా.. నెల క్రితం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్ నగ ర్లో మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. తాను రాజకీయంగా ఎదుగుతున్నందున కక్ష గట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని.. దుష్ప్రచారం వెనుక ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ హస్తం ఉందని మండిపడ్డారు. అనుమానాలున్నాయి: బంధువులు నాగరాజు, భండేకర్ విశ్వనాథరావు, యాదయ్యను కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్లారని 23, 24వ తేదీల్లో వారి భార్యలు మహబూబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు 25వ తేదీన ఫరూక్, హైదర్ అలీలను హత్య చేసేందుకు ప్రయత్నించారని, 26న అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించడంపై అనుమానాలు ఉన్నాయని నిందితులు బంధువులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తమ వారిని చర్లపల్లి జైలుకు పంపిన తర్వాతే పోలీసులు సమాచారం ఇచ్చారని.. తీరా జైలు వద్దకు వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు జాప్యం చేసి ములాఖత్ ఇచ్చారని నాగరాజు, యాదయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న కొన్ని తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తమ వారిపై ఇలా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఇక ఈ వ్యవహారంలో బీజేపీ నేతల హస్తంపై ఆరోపణలు వస్తుండటంతో.. రాజకీయ రచ్చకు తెరతీసినట్లేనని జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాగంటే.. మహబూబ్‌నగర్ పట్టణంలోని బీకేరెడ్డి కాలనీకి చెందిన చలువగాలి నాగరాజును గత నెల 23న రాజేంద్రనగర్‌లోని ఓ బేకరీ సమీపంలో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారని.. అప్పటి నుంచి తన భర్త ఆచూకీ లేదని నాగరాజు భార్య గీత అదేరోజు సాయంత్రం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరుసటి రోజు మిస్సింగ్‌గా కేసు నమోదు చేశారు. 24న మహబూబ్‌నగర్‌కు చెందిన మైత్రి ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు వరద యాదయ్యను ఇద్దరు వ్యక్తులు షాప్ వద్దకు వచ్చి ప్రింటింగ్ ఆర్డర్ ఇస్తామంటూ బయటికి పిలిచి ఎత్తుకెళ్లినట్లు ఆయన భార్య సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24వ తేదీనే పట్టణానికి చెందిన మరో వ్యక్తి భండేకర్ విశ్వనాథరావును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ముగ్గురినీ మంత్రిపై హత్యాయత్నం కేసులో అరెస్టు చేసినట్టు పేట్‌బషీరాబాద్ పోలీసులు 26వ తేదీన ప్రకటించారు. 28న ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో.. మహబూబ్‌నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు మున్నూరు రవి, జితేందర్‌రెడ్డి డ్రైవర్ థాపాతోపాటు రాఘవేందర్‌రాజు, మధుసూదన్‌రాజులను అదుపులోకి తీసుకుని బుధవారం అరెస్టు చూపించారు. ఇమేజ్ కోసం అల్లిన కథ ఇది శ్రీనివాస్‌గౌడ్ తన ఇమేజ్ను పెంచుకునేందుకు అల్లిన కథ. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణలపై ఆరోపణలు చేసి ఇమేజ్ పెంచుకోవాలని కుట్రలు చేయడం తగదు. ఎన్నికల అఫిడవిట్‌ను మార్చిన విషయంలో తనకు వచ్చిన ఇబ్బందులను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి హత్యకు కుట్ర కథనాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సుపారీ ఇచ్చేంత డబ్బులు విశ్వనాథ్ భండేకర్, మున్నూర్ రవి, యాదయ్యలకు ఎక్కడివి? – వీరబ్రహ్మచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నా భర్తను ఇరికించారు నా భర్త మైత్రి యాదయ్యను కుట్ర పూరి తంగా కేసులో ఇరికించారు. ఆయనకు ఏ పాపం తెలియదు. హత్యలు చేసేంత క్రూరుడు కాదు. మంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో కక్ష పెంచుకుని కేసులో ఇరికించారు. – నాగమణి, మైత్రి యాదయ్య భార్య మా అక్క షాక్‌లో ఉంది... మా అక్క షాక్‌లో ఉంది. చక్కర వచ్చి పడిపోయి ప్రస్తుతం ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేదు. మూడు రోజులుగా ఏమీ తినలేదు. మాకు ఏమీ అర్థం అవ్వడం లేదు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. – అనిల్ (విశ్వనాథ్ భండేకర్ బావమరిది) మంత్రి హత్యకు కుట్ర దారుణం తెలంగాణలో హత్యా రాజకీయాలకు చోటు లేదు. జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్ హత్యకు కుట్ర చేయడం దారుణం. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. – డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు -
మంత్రి గౌతమ్ రెడ్డికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం
-
పేద విద్యార్థులకు పెన్నిధి
మహబూబ్‌నగర్ రూరల్: విద్యార్థులు, పేదలు, ఆస్పత్రుల్లో రోగుల సహా యకులకు హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ మండలం కోడూర్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 వేల భోజనాలు అందించే సామర్థ్యం కలిగిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ను, మహబూబ్‌నగర్ నియోజ కవర్గంలోని 20 వేలమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పా హారం అందించే ‘స్వస్త్య ఆహార’ పథకాన్ని మంత్రి శనివారం ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం పేద విద్యార్థులకు పెన్నిధి లాంటిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, ఫౌండర్ సత్యగౌర చంద్రదాస్ ప్రభూజి, జెడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.