గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రవీంద్రభారతిలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చాంబర్ నుంచి కొందరు ఫర్నిచర్‌ను తీసుకువెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం కొంతమంది వ్యక్తులు ఫర్నిచర్‌ను తీసుకువెళుతుండగా ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తులకు, ఓయూ జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
#OU student union leaders stopped the shifting of furniture from Former Minister Srinivas Goud's office, alleging that public property is being moved illegally. pic.twitter.com/cHlqXF4zgb
— Sudhakar Udumula (@sudhakarudumula) December 6, 2023
ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్‌ను ఎలా తీసుకువెళతారని జేఏసీ నాయకులు వారిని ప్రశ్నించారు. దీంతో వారు ఫర్నిచర్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనపై టీజీఓ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, తమ కార్యాలయంలో వినియోగించుకునేందుకు ఆ ఫర్నిచర్‌ను తీసుకువెళ్లాలనుకున్నామని, అయితే అది ప్రభుత్వానిదని తెలియడంతో ఆ ప్రయత్నం మానుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment