
సాక్షి, హైదరాబాద్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటన మరువక ముందే మరో కీచకుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో కీచక ఉద్యోగి వేధింపుల బండారం బట్టబయలైంది. ఓ జాతీయ క్రీడాకారిణిపై మంత్రి పేషీ ఉద్యోగి వేధింపుల ఘటన సంచలనం రేకెత్తించింది. మంత్రి సిఫార్సుతో వచ్చినా వేధింపులు తప్పలేదని ఆ క్రీడాకారిణి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇప్పటి వరకు నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని, కెరీర్‌కు భయపడి ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని బాధితురాలు మీడియాకు తెలిపింది. ‘‘స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ వేధించాడు. అసభ్యకర మెసేజ్‌లతో వేధింపులకు పాల్పడ్డాడు. స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫీసుకు వెళ్లినా నన్ను కలవనివ్వలేదు. గతంలో వేధింపులకు గురైనా బయటకు రాలేకపోయామంటూ బాధితురాలు వాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment