Athlete
-
అరుదైన ఒలింపిక్ స్వర్ణానికి రూ.5 కోట్లు
బోస్టన్: అమెరికా గడ్డపై 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్ నాటి బంగారు పతకం శుక్రవారం వేలంలో దాదాపు రూ.5 కోట్లు పలికింది! దానిపై ‘ఒలింపియాడ్, 1904’అని రాసుంది. ముందువైపు విజేత పుష్పగుచ్ఛం పట్టుకొని ఉండగా వెనకవైపు పురాతన గ్రీస్‌లో విజయానికి అధిదేవత నైక్, దేవతల రాజు జ్యూస్ ఉన్నారు.దీన్ని అమెరికన్ అథ్లెట్ ఫ్రెడ్షూల్కు ప్రదానం చేశారు. ఆ ఒలింపిక్స్‌లో అమెరికన్లు 96 ఈవెంట్లలో ఏకంగా 78 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నేటి ఒలింపిక్స్ వెండిపై బంగారు పూత పూసిన పతకాలిస్తున్నారు. అప్పట్లో మాత్రం అచ్చమైన బంగారంతో చేసిన పతకాలే ఇచ్చేవారు. ఇలాంటి పతకాలు వేలానికి రావడం అసాధారణమని వేలం సంస్థ ఆర్ఆర్ ఆక్షన్ పేర్కొంది.2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకంతో పాటు 1932, 1964, 1998 2012 ఒలింపిక్స్ పతకాలతో సహా వందలాది ఒలింపిక్ వస్తువులు వేలంలో అమ్మకానికి వచ్చాయి. ఒలింపిక్ స్మృతి చిహ్నాలకు ఎప్పటినుంచో మంచి ధర లభిస్తోంది. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెలెస్‌లో జరగనున్నాయి. ఈ నగరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనుండటం 1932, 1984 తరువాత ఇది మూడోసారి.ఇదీ చదవండి: రోమ్‌లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్ -
5 వేల మీటర్లలో గుల్వీర్ సింగ్ కొత్త జాతీయ రికార్డు
యోగిబో అథ్లెటిక్స్ చాలెంజ్ కప్ టోర్నీలో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు. జపాన్ లో శనివారం జరిగిన ఈ రేసులో 26 ఏళ్ల గుల్వీర్ 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా 13 నిమిషాల 18.92 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును గుల్వీర్ బద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో పోర్ట్లాండ్ ట్రాక్ ఫెస్టివల్లో గుల్వీర్ ఈ సమయాన్ని నమోదు చేశాడు. -
ఉగాండా మహిళా అథ్లెట్ విషాదాంతం
నైరోబి: తన భాగస్వామితో ఏర్పడిన స్థల వివాదం చివరకు ఉగాండా మహిళా ఒలింపియన్ అథ్లెట్ రెబెకా చెపె్టగె ప్రాణాలను తీసింది. గత నెలలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రెబెకా మారథాన్ ఈవెంట్లో పాల్గొని 44వ స్థానంలో నిలిచింది.పలు అథ్లెటిక్ శిక్షణ కేంద్రాలున్న ట్రాన్స్ ఎన్జొయా ప్రాంతంలో 33 ఏళ్ల రెబెకా స్థలం కొని ఇల్లు కట్టుకుంది. దీనిపై రెబెకా, ఆమె భాగస్వామి డిక్సన్ డియెమా మధ్య గత ఆదివారం పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాతి రోజు సోమవారం డిక్సన్ తనవెంట గ్యాసోలిన్ (పెట్రోలియం ఉత్పాదన)ను క్యాన్‌లో తీసుకొచ్చి రెబెకాపై పోసి నిప్పంటించాడు. వెంటనే ఆమె శరీరమంతా మంటలు అంటుకోవడంతో పాటు డిక్సన్కూ కాలిన గాయాలయ్యాయి. అనంతరం ఇద్దరిని కెన్యాలోని హాస్పిటల్లో చేర్పించగా గురువారం ఉదయం రెబెకా మృతి చెందింది. 30 శాతం కాలిన గాయాలున్న డిక్సన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీస్ కమాండర్ జెరెమా ఒలీ కొసిమ్ తెలిపారు. -
సూపర్ సిఫాన్...
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలు గెలిచిన నెదర్లాండ్స్ మహిళా అథ్లెట్ సిఫాన్ హసన్ ‘పారిస్’లోనూ మూడు పతకాలతో మెరిసింది. ‘పారిస్’లో ఇప్పటికే 5000 మీటర్లు, 10000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించిన 31 ఏళ్ల సిఫాన్... ఆదివారం జరిగిన మారథాన్ రేసులో ఏకంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని సిఫాన్ 2 గంటల 22 నిమిషాల 55 సెకన్లలో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా పూర్తి చేసి కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేసింది. 2012 లండన్ గేమ్స్‌లో 2 గంటల 23 నిమిషాల 7 సెకన్లతో జెలెనా టికి (ఇథియోపియా) నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును సిఫాన్ సవరించింది. తాజా విజయంతో సిఫాన్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో డిస్టెన్స్ రన్నింగ్ (5000, 10000 మీటర్లు, మారథాన్)లోని మూడు ఈవెంట్లలో పతకాలు గెలిచిన తొలి మహిళా అథ్లెట్‌గా సిఫాన్ గుర్తింపు పొందింది. పురుషుల్లో ఎమిల్ జటోపెక్ (చెక్ రిపబ్లిక్; 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో... 5000, 10000 మీటర్లు, మారథాన్) మూడు స్వర్ణ పతకాలు గెలిచాడు. -
సెకనులో 5000వ వంతు తేడాతో...
గన్ పేలింది... పురుషుల 100 మీటర్ల పరుగు ప్రారంభమైంది... ఎనిమిది మంది అసాధారణ అథ్లెట్లు దూసుకుపోయారు. 30 మీటర్లు ముగిసేసరికి థాంప్సన్ తొలి స్థానంలో, కెర్లీ రెండో స్థానంలో ఉండగా... అందరికంటే నెమ్మదిగా 0.178 సెకన్ల రియాక్షన్ టైమ్‌తో ఆలస్యంగా మొదలుపెట్టిన లైల్స్ చివరగా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. 60 మీటర్లు ముగిసేసరికి థాంప్సన్, కెర్లీ తొలి రెండు స్థానాల్లోనే కొనసాగగా... లైల్స్ మూడో స్థానానికి దూసుకుపోయాడు. కానీ తర్వాతి 40 సెకన్లలో కథ పూర్తిగా మారింది. లైల్స్ ఒక్కసారిగా అద్భుతాన్ని చూపించాడు. మెరుపు వేగంతో చిరుతలా చెలరేగిపోయి లక్ష్యం చేరాడు. 90 మీటర్ల వరకు కూడా ఏ దశలోనూ అగ్రస్థానంలో లేని లైల్స్ అసలైన ఆఖరి 10 మీటర్లలో అందరినీ వెనక్కి నెట్టేశాడు. ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగులో కొత్త చాంపియన్‌గా అవతరించాడు. 100 మీటర్ల స్ప్రింట్‌లో కొత్త విజేతస్వర్ణం గెలుచుకున్న అమెరికన్ నోవా లైల్స్జమైకా అథ్లెట్ థాంప్సన్‌కు రెండో స్థానంఇద్దరూ 9.79 సెకన్లలో రేసు పూర్తిఫోటో ఫినిష్‌తో తేలిన ఫలితం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన అథ్లెట్‌ను నిర్ణయించడం అంత సులువుగా జరగలేదు. నోవా లైల్స్ (అమెరికా), కిషాన్ థాంప్సన్ (జమైకా) ఇద్దరూ 9.79 సెకన్లలోనే రేసు పూర్తి చేశారు. దాంతో ‘ఫోటో ఫినిష్’ను ఆశ్రయించాల్సి వచి్చంది. చాలాసేపు ఉత్కంఠ నెలకొంది. తామిద్దరిలో ఎవరూ గెలిచామో కూడా తెలీని లైల్స్, థాంప్సన్ ఒకరి భుజంపై మరొకరు చేయి వేసి ఏం జరిగిందో ఎదురు చూస్తూ వచ్చారు. చివరకు ఇద్దరి మధ్య తేడా సెకనులో 5000వ వంతు మాత్రమే అని తేలింది. లైల్స్ టైమింగ్ 9.79 (.784) సెకన్లు కాగా, థాంప్సన్ టైమింగ్ 9.79 (.789)గా వచి్చంది. దాంతో 20 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగు గెలిచిన అమెరికా అథ్లెట్‌గా లైల్స్ ఘనత సాధించగా... 98 మీటర్ల పాటు ఆధిక్యంలో ఉండి కూడా థాంప్సన్ రజతానికే పరిమితమయ్యాడు. ఫ్రెడ్ కెర్లీ (అమెరికా; 9.81 సెకన్లు) కాంస్య పతకం గెలుచుకున్నాడు.పారిస్: అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక ఈవెంట్ పురుషుల 100 మీటర్ల పరుగు ఊహించినంత ఉత్కంఠను రేపి అదే స్థాయిలో ఆసక్తికర ఫలితాన్ని అందించింది. గత కొంత కాలంగా స్ప్రింట్స్‌లో అద్భుత ప్రదర్శనలు చేస్తూ ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కూడా అయిన నోవా లైల్స్పై అంచనాలు పెరిగాయి. దానికి తగినట్లుగా అతను సిద్ధమయ్యాడు. తాజా రేసులో కూడా లైల్స్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. పరుగు పూర్తి చేసేందుకు లైల్స్‌కు 44 అంగలు పట్టగా, థాంప్సన్ 45 అంగలు తీసుకున్నాడు. చివరకు ఇదే తేడాను చూపించింది.27 ఏళ్ల లైల్స్ తన కెరీర్ అత్యుత్తమ టైమింగ్‌తో ఒలింపిక్ స్వర్ణాన్ని అందుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో అత్యంత హోరాహోరీగా సాగిన 100 మీటర్ల పరుగు ఇది. ఫైనల్లో పాల్గొన్న ఎనిమిది మంది కూడా 10 సెకన్లలోపు పరుగు పూర్తి చేయడం ఇదే మొదటిసారి. విజేతకు, చివరి స్థానంలో నిలిచిన అథ్లెట్ టైమింగ్‌కు మధ్య అతి తక్కువ (0.12 సెకన్లు) తేడా మాత్రమే ఉండటం కూడా మరో విశేషం. ఈ రేసులో 4వ, 5వ, 6వ, 7వ, 8వ స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఆయా స్థానాల్లో కొత్త ప్రపంచ రికార్డు టైమింగ్స్‌ను నమోదు చేయడం మరో ఆసక్తికర అంశం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ఇటలీ స్ప్రింటర్ మార్సెల్ జాకబ్స్ ఈసారి ఐదో స్థానంతో ముగించాడు. అనామకుడేమీ కాదు!100 మీటర్ల పరుగులో విజేతగా నిలిచి ‘ఫాస్టెస్ట్ మ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్న నోవా లైల్స్ అనూహ్యంగా దూసుకు రాలేదు. గత కొంత కాలంగా అతను అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారిన అతను స్ప్రింట్స్‌లో మంచి విజయాలు సాధించాడు. వరుసగా మూడు వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అతను పతకాలు గెలుచుకున్నాడు. 2019లో 200 మీ., 4్ఠ100 మీటర్ల రిలేలో 2 స్వర్ణాలు గెలుచుకున్న అతను 2022లో కూడా ఇవే ఈవెంట్లలో స్వర్ణం, రజతం సాధించాడు. అయితే 2023లో బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్íÙప్లో అతని కెరీర్లో హైలైట్ ప్రదర్శన వచి్చంది. ఈ ఈవెంట్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలేలలో స్వర్ణాలు సాధించిన అతను...దిగ్గజం ఉసేన్ బోల్ట్ (2015) తర్వాత ఒకే ప్రపంచ చాంపియన్‌ప్‌లో ‘ట్రిపుల్’ సాధించిన తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ ప్రదర్శన వల్లే ఒలింపిక్స్‌లోనూ అతనిపై అంచనాలు పెరిగాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 200 మీటర్ల పరుగులో కాంస్యం గెలవడంలో సఫలమైన లైల్స్... అంతకుముందు అమెరికా ఒలింపిక్ ట్రయల్స్‌లో విఫలం కావడంతో 100 మీటర్ల పరుగులో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఇప్పుడు అదే ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న అతను, 200 మీటర్ల పరుగులోనూ స్వర్ణంపై గురి పెట్టాడు. ‘ఫోటో ఫినిష్’ ఈ విధంగా... రేస్ సమయంలో నిర్వాహకులు ‘స్లిట్ వీడియో సిస్టం’ను ఏర్పాటు చేసి దీనిని ఫినిషింగ్ లైన్‌కు అనుసంధానిస్తారు. అథ్లెట్లు లైన్‌ను దాటే సమయంలో ఈ వీడియో సిస్టం సెకనుకు 2000 చొప్పున అత్యంత స్పష్టమైన చిత్రాలు (స్కానింగ్) తీస్తుంది. ఎవరైనా అథ్లెట్ అడ్డు వచ్చి మరో అథ్లెట్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉండే ప్రమాదం ఉండటంతో ట్రాక్‌కు రెండోవైపు కూడా అదనపు కెమెరాను ఏర్పాటు చేస్తారు. ఈ రేసు ముగింపు క్షణాన్ని చూస్తే లైల్స్కంటే ముందే థాంప్సన్ కాలు లైన్‌ను దాటినట్లుగా కనిపిస్తోంది. కానీ అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నిబంధనల ప్రకారం అథ్లెట్ కాలుకంటే అతని నడుము పైభాగం (ఛాతీ, పొత్తికడుపు, వీపు) ముందుగా లైన్‌ను దాటాలి. సరిగ్గా ఇక్కడే లైల్స్ పైచేయి సాధించాడు. ఫోటో ఫినిష్‌లో దీని కారణంగానే టైమింగ్ విషయంలో మరింత స్పష్టత వచ్చింది. -
Dandi Jyothika Sri: గోదావరి తీరం నుంచి ఒలింపిక్స్ దాకా...
జ్యోతిక శ్రీ దండి భారతీయ క్రీడాకారిణి. మహిళల 400 మీ. పరుగులో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ΄్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో 4 x 400 భారత మహిళల రిలే జట్టులో భాగంగా పాల్గొంటోంది. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. జ్యోతిక ఇప్పటి వరకు రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది.అయినా సరే... వెనుకంజ వేయనివ్వలేదు...మేం ఐరన్‌కి సంబంధించిన వర్క్స్ చేస్తాం. జ్యోతిక చిన్నప్పుడు స్థానికంగా జరిగే రన్నింగ్ పోటీలు చూసి, తనూ ఉత్సాహం చూపేది. తన ఆసక్తి చూసి, కోచ్ దగ్గర చేర్చాం. అలా క్రీడలవైపు ్రపోత్సహించాం. 2013లో స్థానికంగా జరిగే పోటీలో పాల్గొంది. అక్కణ్ణుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటూ వచ్చింది. పాల్గొన్న ప్రతి పోటీలో విజేతగా నిలిచింది. వరల్డ్ కాంపిటిషన్స్కి స్కూల్ రోజుల్లోనే వెళ్లింది. టర్కీకి వెళ్లినప్పుడు లక్ష రూపాయలు తప్పనిసరి అన్నారు. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చేశారు. ఇంటర్మీడియట్లో మంచి గ్రేడ్ వచ్చింది. చదువును కొనసాగిస్తూనే, ఉద్యోగం తెచ్చుకుంటాను అంది. కానీ, స్పోర్ట్స్‌లోనే ఉండమని, అదే మంచి భవిష్యత్తును ఇస్తుంది అని చె΄్పాను. విజయవాడలోని అకాడమిలో నాలుగేళ్లు, హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో రెండేళ్లు ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా తన పట్టుదల నన్ను వెనుకంజ వేయనివ్వలేదు. రెండేళ్లుగా ఇండియన్ క్యాంపులో ఉండటం వల్ల నాకు కొంచెం వెసులు బాటు వచ్చింది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో తన సత్తా చాటడానికి వెళ్లింది. ఇన్నాళ్ల కృషికి తగిన ఫలితం నేడు చూస్తున్నాం. స్పోర్ట్స్‌లో రాణిస్తూనే డిగ్రీ చదువుతోంది. స్పిరిచ్యువల్ ఆర్ట్స్ వేస్తుంది.దేశానికి పతకం తీసుకురావాలనే లక్ష్య సాధన కోసమే కృషి చేస్తోంది. – దండి శ్రీనివాసరావు, జ్యోతిక శ్రీ తండ్రి, తణుకు, పశ్చిమగోదావరి జిల్లాపిల్లల లక్ష్యం కోసం...మాకు ఇద్దరు కూతుళ్లు. చిన్నప్పుడు జ్యోతిక పరుగు మొదలు పెట్టినప్పుడు ఊళ్లో మాకో బిల్డింగ్ ఉండేది. పిల్లల లక్ష్యాల కోసం ఆ బిల్డింగ్ అమ్మి ఖర్చుపెడుతూ వచ్చాం. పిల్లలే మాకు బిల్డింగ్ అనుకున్నాం. స్పోర్ట్స్ అంటే మంచి పోషకాహారం, ఫిట్నెస్, ట్రయినింగ్ ఉండాలి. ఖర్చు అని చూసుకోలేదు. – లక్ష్మీ నాగ వెంకటేశ్వరి, జ్యోతిక శ్రీ తల్లి -
తెలంగాణ అథ్లెట్ సాయికిరణ్‌కు స్వర్ణం
దుద్యాల్: జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన అల్వాల్ సాయికిరణ్ పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం జరిగిన ఈవెంట్లో వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల సాయికిరణ్ ఇనుప గుండును 18.36 మీటర్ల దూరం విసిరాడు. గచ్చి»ౌలి స్టేడియంలో ‘ద్రోణాచార్య’ అవార్డు గ్రహీత, కోచ్ నాగపురి రమేశ్ వద్ద సాయికిరణ్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
స్వర్ణ పతకం నెగ్గిన జ్యోతిక శ్రీ
ఇండియన్ గ్రాండ్‌ప్రి–3 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ దండి జ్యోతిక శ్రీ తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేసింది. బెంగళూరులో బుధవారం జరిగిన ఈ మీట్లో జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల రేసులో విజేతగా నిలిచింది. జ్యోతిక శ్రీ 400 మీటర్లను అందరికంటే వేగంగా 51.53 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శుభా వెంకటేశ్ (తమిళనాడు; 52.34 సెకన్లు) రెండో స్థానంలో, పూవమ్మ రాజు (కర్ణాటక; 52.62 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. -
ట్విట్టర్లో కోహ్లి అరుదైన ఫీట్..
-
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
సెర్టోహన్బాష్ (నెదర్లాండ్స్): కొత్త సీజన్‌ను భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో ప్రారంభించింది. గురువారం జరిగిన హ్యారీ షుల్టింగ్ గేమ్స్‌లో బరిలోకి దిగిన జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. హ్యారీ షుల్టింగ్ గేమ్స్ వరల్డ్ అథ్లెటిక్స్‌లో ‘ఇ’ కేటగిరీ కిందికి వస్తాయి. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును విశాఖపట్నంకు చెందిన జ్యోతి 12.87 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆమె కెరీర్లో ఇది నాలుగో అత్యుత్తమ సమయం. మిరా గ్రూట్ (నెదర్లాండ్స్; 13.67 సెకన్లు) రెండో స్థానంలో, హనా వాన్ బాస్ట్ (నెదర్లాండ్స్; 13.84 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (12.77 సెకన్లు) జ్యోతి ఇంకా అందుకోకపోయినా ర్యాంకింగ్స్ ప్రకారం జ్యోతికి ఒలింపిక్ బెర్త్ ఖరారు కానుంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో జ్యోతి 26వ స్థానంలో ఉంది. మొత్తం 40 మంది ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఇందులో 25 మంది అర్హత ప్రమాణ సమయం ఆధారంగా... మరో 15 మంది వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా అర్హత సాధిస్తారు. -
రజతంగా ఐశ్వర్య కాంస్యం
గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ ఐశ్వర్య మిశ్రా కాంస్యం సాధించింది. అయితే ఇప్పుడు ఆమె ప్రదర్శనకు రజత పతకంగా ప్రమోషన్ దక్కింది. ఈ ఈవెంట్లో రజతం సాధించి ఉజ్బెకిస్తాన్ అథ్లెట్ ఫరీదా సొలియెవా డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. దాంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఆమెపై 3 ఏళ్ల నిషేధం విధించింది. ఫలితంగా ఐశ్వర్య టైమింగ్ (53.07)ను రెండో స్థానంగా గుర్తిస్తూ ఆమె కాంస్యాన్ని రజతంగా మార్చారు. -
16 ఏళ్ల రికార్డు బద్దలు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ‘ద టెన్’ అథ్లెటిక్స్ మీట్లో 25 ఏళ్ల గుల్వీర్ ఈ ఘనత సాధించాడు. గుల్వీర్ తాను పాల్గొన్న హీట్స్‌లో 10,000 మీటర్లను 27 నిమిషాల 41.81 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 16 ఏళ్లుగా సురేందర్ సింగ్ (28ని:02.89 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును గుల్వీర్ తిరగరాశాడు. గుల్వీర్ కొత్త జాతీయ రికార్డు సృష్టించినా పారిస్ ఒలింపిక్స్ (27 నిమిషాలు) అర్హత ప్రమాణ సమయాన్ని అధిగమించలేకపోయాడు. -
24 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డు విజేత దుర్మరణం.. కోచ్ కూడా!
Kelvin Kiptum: కెన్యా అథ్లెట్, మారథాన్ ప్రపంచ రికార్డు విజేత కెల్విన్ కిప్టం దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో 24 ఏళ్ల ఈ యువ అథ్లెట్ మరణించాడు. ఆ సమయంలో కెల్విన్‌తో పాటే కారులో ఉన్న అతడి కోచ్ గెర్వాస్ హాకిజిమనా కూడా కన్నుమూశాడు. ఈ ఘటన క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నింపింది. కెల్విన్, గెర్వాస్ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. వారి ఆత్మలకు శాంతి కలగాలంటూ వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కోయే విచారం వ్యక్తం చేశాడు. కాగా పురుషుల మారథాన్ ఈవెంట్లో కెల్విన్ కిప్టం ప్రపంచ రికార్డు సాధించాడు. అక్టోబరు 8, 2023లో చికాగో మారథాన్‌లో పాల్గొన్న అతడు రెండు గంటల 35 సెకండ్లలోనే పరుగు పూర్తి చేశాడు. తద్వారా రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన ఎల్యూడ్ కిచోగ్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఎల్యూడ్ కంటే 34 సెకండ్ల ముందే లక్ష్యాన్ని చేరుకుని ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో... రెండు గంటల ఒక నిమిషానికి ముందే మారథాన్ పూర్తి చేసిన పురుష అథ్లెట్‌గా కెల్విన్ చరిత్రకెక్కాడు. పారిస్ ఒలింపిక్స్-2024 లక్ష్యంగా ముందుకు సాగుతున్న అతడు ఇలా హఠాన్మరణం చెందాడు. కోచ్‌తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో కెల్విన్ కిప్టం కారు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కెల్విన్, కోచ్ గెర్వాస్ అక్కడిక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.కాగా కెల్విన్ కిప్టంకు భార్య అసెనాథ్ రోటిచ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: Devon Conway - Kim Watson: ‘గర్భస్రావం.. మా బిడ్డను కోల్పోయాం’ -
‘అథ్లెటిక్స్ను మరింత మార్కెటింగ్ చేయాలి’
భారత్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఎక్కువ మంది అభిమానులకు చేరువయ్యేందుకు తగినంత మార్కెటింగ్ కూడా చేయాలని అతను అన్నాడు. ‘డైమండ్ లీగ్, కాంటినెంటల్ టూర్స్, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ వంటి పెద్ద ఈవెంంట్లను భారత్‌లో ప్రసారం చేయాలి. ప్రస్తుతం హైలైట్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉంటున్నాయి. రాత్రి 1–2 వరకు మేల్కొని అభిమానులు అథ్లెటిక్స్ చూసేందుకు సిద్ధమైనా, వారికి ఆ అవకాశం ఉండటం లేదు’ అని నీరజ్ అన్నాడు. కెన్యా, గ్రెనడాలాంటి దేశాలు కూడా ప్రపంచ స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తుండగా మనం ఎందుకు చేయలేమని నీరజ్ వ్యాఖ్యానించాడు. ‘నేను వరల్డ్ అథ్లెటిక్స్ అధికారులను ఎప్పుడు కలిసినా వారు భారత్‌లో ఇలాంటి ఈవెంట్ నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే జరిగితే ఎక్కువ మంది అథ్లెటిక్స్ను చూసి ఆకర్షితులవుతారనేది నా నమ్మకం’ అని నీరజ్ చెప్పాడు. -
‘నందివర్ధనం’.. పేద కుటుంబం నుంచి వచ్చి.. ‘అవరోధాలు’ అధిగమించి
Asian Games 2023: గత కొంత కాలంగా వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శనలతో సత్తా చాటుతూ వచ్చిన తెలంగాణ అథ్లెట్ అగసార నందిని అసలు సమయంలో తన ఆటను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలిసారి కాంస్యంతో మెరిసింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో నందిని మూడో స్థానంలో నిలిచి కంచు పతకాన్ని సొంతం చేసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఏడు ఈవెంట్లలో కలిపి నందిని 5712 పాయింట్లు సాధించింది. హెప్టాథ్లాన్‌లోని తొలి ఆరు ఈవెంట్లు ముగిసేసరికి నందిని ఐదో స్థానంలో నిలిచింది. 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసి 100 మీటర్ల హర్డిల్స్ (4వ స్థానం), హైజంప్ (9వ స్థానం), షాట్‌పుట్ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్‌జంప్ (3వ స్థానం), జావెలిన్ త్రో (9వ స్థానం)... ఇలా వరుసగా ఆమె ప్రదర్శన కొనసాగింది. అయితే చివరి ఈవెంట్ 800 మీటర్ల పరుగులో సత్తా చాటడంతో కాంస్యం ఖాయమైంది. ఈ పరుగును 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసిన నందిని అగ్ర స్థానంలో నిలిచింది. దాంతో ఓవరాల్ పాయింట్లలో ఆమె మూడో స్థానానికి ఎగబాకింది. 2018 ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన మరో భారత అథ్లెట్ స్వప్న బర్మన్ చివరి వరకు పోటీలో నిలిచినా... ఓవరాల్‌గా 5708 పాయింట్లతో నాలుగో స్థానానికే పరిమితమైంది. పేద కుటుంబం పేద కుటుంబం నుంచి వచ్చి నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివిన నందిని అదే పాఠశాలలో నెలకొల్పిన అథ్లెటిక్స్ అకాడమీ తొలి బ్యాచ్ విద్యార్థిని. ప్రస్తుతం సంగారెడ్డిలోని తెలంగాణ సాంఘిన సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాలలో బీబీఏ చదువుతున్న నందినికి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ తాజా విజయానికి రూ. 1 లక్ష నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. #KheloIndiaAthlete @AgasaraNandini's journey to 🥉at #AsianGames2022 is a testament to years of dedication and hard work. With a total score of 5712 in Women's Heptathlon, we have got a new champion🏆 Congratulations, Nandini. We wish to see you shine in all of your future… pic.twitter.com/nTRt320IIU — SAI Media (@Media_SAI) October 1, 2023 -
రజతం నెగ్గిన నిత్య
చండీగఢ్: ఇండియన్ గ్రాండ్‌ప్రి ఐదో మీట్లో తెలంగాణ అథ్లెట్ జి. నిత్య మహిళల 100 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మీట్లో నిత్య 100 మీటర్ల దూరాన్ని 11.85 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. శ్రాబణి నందా (ఒడిశా; 11.77 సెకన్లు) స్వర్ణం, దానేశ్వరి (కర్ణాటక; 11.94 సెకన్లు) కాంస్యం సాధించారు. -
స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ.. క్రీడాకారిణికి అసభ్య మెసేజ్‌లు..
సాక్షి, హైదరాబాద్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటన మరువక ముందే మరో కీచకుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో కీచక ఉద్యోగి వేధింపుల బండారం బట్టబయలైంది. ఓ జాతీయ క్రీడాకారిణిపై మంత్రి పేషీ ఉద్యోగి వేధింపుల ఘటన సంచలనం రేకెత్తించింది. మంత్రి సిఫార్సుతో వచ్చినా వేధింపులు తప్పలేదని ఆ క్రీడాకారిణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని, కెరీర్‌కు భయపడి ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని బాధితురాలు మీడియాకు తెలిపింది. ‘‘స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ వేధించాడు. అసభ్యకర మెసేజ్‌లతో వేధింపులకు పాల్పడ్డాడు. స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫీసుకు వెళ్లినా నన్ను కలవనివ్వలేదు. గతంలో వేధింపులకు గురైనా బయటకు రాలేకపోయామంటూ బాధితురాలు వాపోయింది. -
కాంస్యంతో జ్యోతి జాతీయ రికార్డు
చెంగ్డూ (చైనా): భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మరో ఘనత సాధించింది. ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి 12.78 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో 12.82 సెకన్లతో గత ఏడాది తానే నెలకొల్పిన జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. గత నెలలో ఆసియా చాంపియన్‌గా నిలిచిన జ్యోతి తదుపరి ఈనెల మూడో వారంలో హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిలో పోటీపడుతుంది. అథ్లెటిక్స్‌లో శుక్రవారమే భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో అమ్లాన్ బొర్గోహైన్ కాంస్య పతకం సాధించాడు. అమ్లాన్ 20.55 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం భారత జట్టు 11 స్వర్ణాలు, 5 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా తెలుగమ్మాయి
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అమ్మాయికి పసిడి పతకం గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ సాధించింది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి స్వర్ణ పతకంతో మెరిసింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ తన తడాఖా చూపించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకంతో మెరిసింది. ఈ క్రమంలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందింది. జ్యోతితోపాటు పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్... పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్ పసిడి పతకాలు నెగ్గారు. బ్యాంకాక్: గత రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయి మీట్లలో నిలకడగా రాణిస్తున్న భారత అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్‌పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 12.82 సెకన్లతో జ్యోతి పేరిటే జాతీయ రికార్డు ఉంది. గత నెలలో జాతీయ అంతర్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జ్యోతి 12.92 సెకన్ల సమయం నమోదు చేసి స్వర్ణం గెలిచింది. అయితే ఆసియా చాంపియన్‌షిప్‌లో వర్షం కారణంగా ట్రాక్ తడిగా ఉండటంతో జ్యోతి 13 సెకన్లలోపు పూర్తి చేయలేకపోయింది. స్వర్ణం నెగ్గిన జ్యోతికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, రిలయెన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలిపారు. ♦ పురుషుల 1500 మీటర్ల ఫైనల్ రేసును అజయ్ కుమార్ సరోజ్ 3ని:41.51 సెకన్ల లో ముగించి బంగారు పతకాన్ని సాధించా డు. ఈ పోటీల్లో అజయ్కిది మూడో పతకం. 2017లో స్వర్ణం, 2019లో రజతం గెలిచాడు. ♦ పురుషుల ట్రిపుల్ జంప్‌లో కేరళ అథ్లెట్ అబ్దుల్లా అబూబాకర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన అబూబాకర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో 16.92 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచాడు. ♦ పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. ఢిల్లీకి చెందిన తేజస్విన్ 7,527 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఐశ్వర్య మిశ్రా 53.07 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాను. ఈ మెగా ఈవెంట్ కోసం తీవ్రంగా శ్రమించా. పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. ఆసియా చాంపియన్‌షిప్‌లో నా అత్యుత్తమ సమయాన్ని నమోదు చేస్తానని ఆశించా. అయితే రేసు మొదలయ్యే సమయానికి వర్షం కురవడంతో ఇబ్బంది పడ్డా. ఐదో హర్డిల్‌లో ఆధిక్యం అందుకోగా, ఆరో హర్డిల్‌ను కూడా అలవోకగా అధిగమించాను. అయితే ఏడో హర్డిల్ దాటే సమయంలో కాస్త తడబడటంతో 13 సెకన్లలోపు రేసును ముగించలేకపోయా. జపాన్ అథ్లెట్స్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని భావించా. పతకాల గురించి ఆలోచించకుండా సాధ్యమైనంత వేగంగా పరిగెత్తాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. పలు టోర్నీలలో నేను క్రమం తప్పకుండా 13 సెకన్లలోపు సమయాన్ని నమోదు చేశా. భవిష్యత్‌లో నా సమయాన్ని మరింత మెరుగుపర్చుకొని మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించినందుకు ఆనందంగా ఉంది. –జ్యోతి యర్రాజీ -
గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా..
అట్లాంటా: పీచ్ ట్రీలో జరిగిన మహిళల 10 కిలోమీటర్ల పరుగుపందెంలో ఇతియోపియా కు చెందిన ఒలింపియన్ అథ్లెట్ సెన్బెర్ టెఫెరి మొత్తం పరుగు పందాన్ని పూర్తి చేసి గమ్యస్థానానికి ఆమడ దూరంలో చేయకూడని పొరపాటు చేసి 10,000 యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీని కోల్పోయింది. ఇతియోపియాకు చెందిన 28 ఏళ్ల అథ్లెట్ సెన్బెర్ టెఫెరి జులై 4న జరిగిన అట్లాంటాలో జరిగిన 10,000 కిలోమీటర్ల పరుగు పందెంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది. మొత్తం పరుగు పందాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సెన్బెర్ చివరి అంచెలో పరిగెడుతుండగా ఆమె పొరపాటున ఆమె ముందున్న ఎస్కార్ట్ బైక్ ను అనుసరించి కుడి వైపుకు తిరిగిపోయింది. అప్పటికి పరుగులో ఆమె మిగతా వారికంటే చాలా ముందుంది. కానీ ఆమె రాంగ్ టర్న్ తీసుకుని పెద్ద పొరపాటు చేయడంతో మిగతావారు ఆమెకంటే ముందు గమ్యాన్ని చేరుకున్నారు. పక్కనున్న వారు సెన్బెర్ ను అప్రమత్తం చేశాక మళ్ళీ ఆమె సరైన దిశగా పరుగు లంఘించుకుని గమ్యాన్ని చేరుకొని మూడో స్థానంలో నిలిచింది. ఈ రేసులో మొదటి స్థానంలో నిలిచిన టెస్ఫే 10 వేల డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకోగా సెన్బెర్ మాత్రం 3000 డాలర్ల ప్రైజ్ మనీతో సరిపెట్టుకుంది. రేసు పూర్తయ్యాక సెన్బెర్ జరిగిన పొరపాటుకి బాధతో కుమిలిపోయింది. సహచరులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. కీలకమైన దశలో సెన్బెర్ చేసిన పొరపాటు ఖరీదు 7 వేల డాలర్లన్న మాట. During the women's elite division of the Peachtree Road Race, a 10-kilometer race held annually in Atlanta on July 4, one runner took a wrong turn just before the finish line, costing her the win pic.twitter.com/qRs9Umk19y — CNN (@CNN) July 4, 2023 ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో వీరంగం.. కంప్యూటర్లను నేలకేసి కొట్టి.. -
తప్పుడు వీడియో షేర్ చేస్తావా? అంటూ మహిళా అథ్లెట్‌పై కోచ్ భార్య దాడి
కర్ణాటక: కోచ్ భార్య మహిళా అథ్లెట్‌పై దాడి చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. బిందురాణి అనే అథ్లెట్ ప్రాక్టీస్ కోసం కంఠీరవ స్టేడియం వెళ్లారు. అక్కడ శ్వేత అనే మహిళ బిందురాణిని నోటికొచ్చినట్లు తిట్టి చేయి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. కోచ్‌ల గ్రూప్‌లో ప్రైవేట్ కార్యక్రమం వీడియోను బిందు షేర్ చేసిందని, తప్పుడు వీడియోను షేర్ చేస్తావా అంటూ కోచ్ యతీశ్ భార్య శ్వేత దాడి చేసినట్లు తెలిసింది. ఆమైపె తాను అథ్లెటెక్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బిందురాణి తెలిపింది. -
జ్యోతికి రెండో స్వర్ణం
భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకంతో మెరిసింది. శుక్రవారం 100 మీటర్ల విభాగంలో బంగారు పతకం నెగ్గిన జ్యోతి... శనివారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ రేసులోనూ విజేతగా నిలిచి తన ఖాతాలో రెండో పసిడి పతకాన్ని జమ చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి అందరికంటే వేగంగా 12.92 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయి అగసార నందిని (13.55 సెకన్లు) కాంస్య పతకాన్ని గెల్చుకుంది. మహిళల 4గీ100 మీటర్ల రిలే ఫైనల్లో జ్యోతి యర్రాజీ, భగవతి భవాని యాదవ్, బొద్దిపల్లి దుర్గా, చెలిమి ప్రత్యూషలతో కూడిన ఆంధ్రప్రదేశ్ బృందం (46.61 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసార నందిని 5703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని (5654 పాయింట్లు) కూడా అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ (5323 పాయింట్లు) కాంస్యం సాధించింది. -
ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అథ్లెట్.. 32 ఏళ్ల టోరి బోవి హఠాన్మరణం
ఫ్లోరిడా: ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ మహిళా అథ్లెట్ టోరి బోవి (అమెరికా) హఠాన్మరణం చెందింది. ఫ్లోరిడాలోని ఆమె నివాసంలో విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఆమె మరణానికి గల కారణాలను ఇంకా వెల్లడి కాలేదు. కొంత కాలంగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతోందని సమాచారం. 32 ఏళ్ల టోరి బోవి 2016 రియో ఒలింపిక్స్‌లో 4*100 మీటర్ల రిలేలో స్వర్ణం, 100 మీటర్లలో రజతం, 200 మీటర్లలో కాంస్య పతకం సాధించింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 2015 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్లలో కాంస్యం నెగ్గిన ఆమె... 2017లో లండన్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. అంతేకాకుండా 4*100 మీటర్ల రిలే పసిడి పతకం సొంతం చేసుకున్న అమెరికా జట్టులో సభ్యురాలిగా ఉంది. లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానం డైమండ్ లీగ్ మీట్లో ఆమె నాలుగుసార్లు 100 మీటర్లలో, నాలుగుసార్లు 200 మీటర్లలో స్వర్ణ పతకాలను సాధించింది. 2019లో దోహా వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టోరి బోవి 100 మీటర్ల విభాగంలో సెమీఫైనల్‌కు చేరినా ఆమె సెమీఫైనల్ రేసులో పోటీపడలేదు. ఈ మెగా ఈవెంట్లోనే ఆమె లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆమె మరో అంతర్జాతీయ ఈవెంట్లో పోటీపడలేదు. చదవండి: PBKS Vs MI: 4 వికెట్లే కోల్పోయి 7 బంతులు ఉండగానే ఛేదన -
Jyothi Yarraji: జ్యోతి యర్రాజీకి స్వర్ణం
బెంగళూరు: ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్లో ఆంధ్రప్రదేశ్ మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం సాధించింది. బెంగళూరులో సోమవారం జరిగిన ఈ మీట్లో జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి అందరికంటే వేగంగా 13.44 సెకన్లలో గమ్యానికి చేరింది. తెలంగాణకు చెందిన అగసార నందిని కాంస్య పతకం గెలిచింది. నందిని 13.85 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇది కూడా చదవండి: బోపన్న జోడీ శుభారంభం మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. మొనాకోలో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 6–3, 10–8తో రాఫెల్ మటోస్ (బ్రెజిల్)–డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జంటపై విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ ఎనిమిది ఏస్‌లు సంధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యూట్జ్ (జర్మనీ)లతో బోపన్న, ఎబ్డెన్ తలపడతారు. చదవండి: IPL 2023: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్’ ఖాన్‌కు ఊహించని షాక్! IPL 2023: కాస్త హుందాగా ప్రవర్తించు గంభీర్! మీకు మా కోహ్లి చేతిలో ఉందిలే! ఏంటి రాహుల్ భయ్యా ఇది..? ఓహో టెస్లుల్లా ఆడుతున్నందుకేనా.. 17 కోట్లు! -
Hijab: అరెస్ట్ కాదు.. ఆమెకు ఘన స్వాగతం!
టెహ్రాన్: అంతర్జాతీయ క్రీడా వేదికలో హిజాబ్ లేకుండా పాల్గొని.. వార్తల్లో ప్రముఖంగా నిలిచింది ఇరాన్ అథ్లెట్ ఎల్నాజ్ రెకాబీ. అయితే.. ఆపై ఆమె ప్రభుత్వాగ్రహానికి గురికాకతప్పదని, జైలు శిక్ష ఖాయమని అంతా భావించారు. అంతేకాదు.. స్వయంగా ఆమె తన అరెస్ట్ భయాన్ని సైతం వ్యక్తం చేయడం, ఆ వెంటనే కనిపించడం లేదన్న కథనాలతో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇక భయాందోళనల నడుమ బుధవారం వేకువజామున రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్న ఆమెకు ఊహించని సీన్ కనిపించింది. వేల మంది ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఆమెకు ఘనస్వాగతం పలికారు. హిజాబ్ లేకుండా పోటీల్లో పాల్గొన్న ఆమె తెగువకు సలాం చేస్తూ నినాదాలు చేశారు. ఆ గ్రాండ్ వెల్కమ్ను రెకాబీ సైతం అంతే ఆత్మీయంగా స్వీకరించింది. 33 ఏళ్ల వయసున్న రెకాబీ.. ఇరాన్ తరపున సియోల్(దక్షిణ కొరియా రాజధాని)లో ఆదివారం జరిగిన క్లయింబింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నారు. గతంలో హిజాబ్‌తోనే ఆమె ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఆదివారం ఈవెంట్ సందర్భంగా ఆమె హిజాబ్ ధరించకపోవడంతో ఆమె ఇరాన్ ప్రభుత్వ ఆగ్రహానికి గురికాక తప్పదని అంతా భావించారు. ఇరాన్లో జరుగుతున్న హిజాబ్ నిరసనల్లో భాగంగానే ఆమె అలా చేసి ఉంటుందని అంతా చర్చించుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అరెస్ట్ కాక తప్పదని అనుకున్నారు. కానీ, ఆ అంచనా తప్పింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెని గతంలో స్పందిస్తూ.. ఇరాన్ మహిళా అథ్లెట్లకు మెడల్స్ కంటే హిజాబ్ ముఖ్యమని సూచించారు. అయితే.. రెకాబీ మాత్రం హిజాబ్ తొలగించి మరీ పోటీల్లో పాల్గొంది. ఇక హిజాబ్ తొలగింపుపై ఇరాన్ నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో ఆమె క్షమాపణలు చెప్తూ.. అది అనుకోకుండా జరిగిందంటూ ఓ సందేశం సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టెహ్రాన్‌లో ల్యాండ్ అయిన ఆమెకు.. ముందు ముందు ఎలా ఉంటుందన్నది చూడాలి మరి!. ఇదీ చదవండి: తప్పు జరిగిపోయింది.. క్షమించండి -
విషాదం నింపిన మారథాన్.. ట్రాక్‌పైనే కుప్పకూలిన అథ్లెట్
గత ఆదివారం నిర్వహించిన లండన్ మారథాన్ 2022లో విషాదం నెలకొంది. మారథాన్‌లో పాల్గొన్న 36 ఏళ్ల అథ్లెట్ ట్రాక్‌పైనే కుప్పకూలాడు. ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా అథ్లెట్ మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. అయితే చనిపోయిన అథ్లెట్ కుటుంబసభ్యుల వినతి మేరకు నిర్వాహకులు పేరును వెల్లడించలేదు. అయితే అథ్లెట్ మాత్రం సౌత్-ఈస్ట్ ఇంగ్లండ్‌కు చెందినవాడని పేర్కొన్నారు. మరో మూడు మైళ్లు చేరుకుంటే అతని రేసు పూర్తయ్యేది.. కానీ విధి మరోలా తలిచింది అంటూ మారథాన్ నిర్వాహకులు తమ బాధను వ్యక్తం చేశారు. ''లండన్ మారథాన్‌లో పాల్గొన్న ప్రతి అథ్లెట్ ఇవాళ మరణించిన తమ సహచర అథ్లెట్‌కు నివాళి అర్పిస్తున్నారు. అతని కుటుంబసభ్యుల వినతి మేరకు ఈ విషయాన్ని మీడియాకు దూరంగా ఉంచాలని భావించాం. అతని కుటుంబసభ్యులకు ఇవే మా ప్రగాడ సానభుతి.''అంటూ పేర్కొంది. ఇక అథ్లెట్ మరణంపై తుది రిపోర్టు రావాల్సి ఉందని నిర్వహాకులు పేర్కొన్నారు. ఇక ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా లండన్ మారథాన్ 2022 ఘనంగా జరిగింది. దాదాపు 40వేల మంది ఈ మారథాన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. 26.2 మైళ్ల దూరంలో భాగంగా సౌత్ లండన్‌లోని గ్రీన్విచ్ నుంచి మాల్ వరకు ఈ మారథాన్ జరిగింది. పురుషుల విభాగంలో కెన్యాకు చెందిన అమోస్ కిప్రుటో విజయం సాధించాడు. కిప్రుటో రెండు గంటల నాలుగు నిమిషాల 39 సెకన్లలో మారథాన్‌ను పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఇథియోపియాకు చెందిన యెహువాలా మారథాన్‌ను 2 గంటల 17 నిమిషాల 25 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. చదవండి: 'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ -
బహుముఖం: ‘జెమ్’వాల్
చిన్నప్పటి నుంచి ఎంతోమంది సాహసికుల గురించి వింటూ పెరిగింది ఇషానిసింగ్ జమ్వాల్. అయితే ఆ సాహసాలు ఆమె చెవికి మాత్రమే పరిమితం కాలేదు. ‘ఛలో... మనమెందుకు చేయకూడదు’ అని అనిపించేలా చేశాయి. తాజాగా కార్గిల్‌లోని కున్ శిఖరాన్ని అధిరోహించి ‘జెమ్’ అనిపించుకుంది... ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ (ఐఎంఎఫ్)కు చెందిన తొమ్మిదిమంది సభ్యులు కార్గిల్‌లోని 7,077 మీటర్ల ఎత్తయిన కున్ శిఖరాన్ని అధిరోహించడానికి గత నెల చివరి వారంలో బయలుదేరారు. తాజాగా కున్ శిఖరాన్ని అధిరోహించిన ఇషానిసింగ్ జమ్వాల్ జేజేలు అందుకుంటుంది. ‘ఈ సాహసయాత్రలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని పర్వతారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది ఇషా. హిమాచల్‌ప్రదేశ్‌లోని పహ్నల గ్రామానికి చెందిన ఇషానిసింగ్కు చిన్నప్పటి నుంచి ఎడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఆరవతరగతి నుంచే రకరకాల సాహసక్రీడల్లో పాల్గొనేది. స్కీయింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మన దేశం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది. పర్వతారోహణపై ఆసక్తితో మనాలిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో శిక్షణ తీసుకుంది. చిన్నప్పుడు ఇషా తన పుస్తకాలలో రాసుకున్న ‘ఎడ్వెంచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ’ ‘నెవర్ గివ్ అప్’ ‘లైఫ్ ఈజ్ యాన్ ఎడ్వెంచర్’లాంటి వాక్యాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఎడ్వెంచర్ స్పోర్ట్స్‌కు సంబంధించిన రకరకాల విషయాలను ఇషాకు చెబుతుండేవారు. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే పర్వతారోహణలో రికార్డ్ సృష్టించిన ఫ్రెంచ్ మహిళ మేరీ ప్యారడైస్ నుంచి ఆల్ఫ్లోని మ్యాటర్‌హార్న్ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళ లూసీ వాకర్ వరకు ఎంతోమంది సాహహికులైన మహిళలు గురించి చెబుతుండేది తల్లి నళినీసింగ్. పుస్తకాల విషయానికి వస్తే అలనాటి ‘నో పిక్నిక్ ఆన్ మౌంట్ కెన్యా’ నుంచి ఇప్పటి ‘నో షార్ట్ కట్స్ టు దీ టాప్’ వరకు ఇషాకు ఎన్నో ఇష్టం. విన్న మాట కావచ్చు, చదివిన అక్షరం కావచ్చు తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ఇషానిసింగ్కు ఉపయోగపడ్డాయి. ‘ఇషా కున్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించడం ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు తండ్రి శక్తిసింగ్. ఇషానిలోని మరోకోణం... మోడలింగ్. ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఇషాని ‘తనిష్క్’ కోసం చేసిన ఒక యాడ్‌లో ఆమెను ‘మౌంటెనీర్’ ‘అథ్లెట్’ ‘మోడల్’ అంటూ పరిచయం చేస్తారు. అయితే ఆ వరుసలో చేర్చాల్సిన మరో విశేషణం... మోటివేషనల్ స్పీకర్. ఆమె ఉపన్యాసాలు ఆకట్టుకోవడమే కాదు స్ఫూర్తిని ఇస్తాయి. ‘మనకు మనం కొత్తగా కనిపించే ప్రయత్నం చేయాలి’ అంటుంది ఇషానిసింగ్. అప్పుడే కదా విజయాలు మన దరి చేరేవి! -
'రిటైర్ అయ్యే రోజున కచ్చితంగా పతకం అందుకుంటా'
అమెరికా లెజెండరీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్ పతకంతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఓరెగాన్‌లోని హ్యూజిన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఫెలిక్స్ 4X400 మీటర్ల మిక్స్డ్ రిలేలో కాంస్య పతకం సాధించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అలిసన్ ఫెలిక్స్‌కు ఇది 19వ పతకం కావడం విశేషం. 36 ఏళ్ల అలిసన్ ఫెలిక్స్ అమెరికా ట్రాక్ అండ్ ఫీల్డ్ టీమ్‌లో ఎన్నో ఏళ్లుగా ముఖ్య క్రీడాకారిణిగా ఉంది. తన కెరీర్లో ఫెలిక్స్ 19 వరల్డ్ చాంపియన్‌షిప్ పతకాలతో పాటు 13 ఒలింపిక్ పతకాలు గెలుచుకుంది. ఏడుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేతగా అలిసన్ ఫెలిక్స్ నిలవడం విశేషం. తాను రిటైర్ అయ్యే రోజున కచ్చితంగా మెడల్ అందుకుంటానని అలిసన్ ఫెలిక్స్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. తాజాగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకంతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అలీసన్ తన మాటను నిలబెట్టుకుంది. What a race 🔥 The Dominican Republic 🇩🇴 overtakes the Netherlands 🇳🇱 and the USA 🇺🇸 in the dying metres to take world mixed 4x400m victory!#WorldAthleticsChamps pic.twitter.com/tJb3EWKpid — World Athletics (@WorldAthletics) July 16, 2022 చదవండి: Kick Boxing: నిర్లక్ష్యం.. రింగ్‌లోనే కుప్పకూలిన కిక్ బాక్సర్ Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో వేర్వేరుగా వసతి! -
పెద్దల సభకు పరుగుల రాణి
ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిన అథ్లెట్ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్ గర్ల్’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ. ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. The remarkable PT Usha Ji is an inspiration for every Indian. Her accomplishments in sports are widely known but equally commendable is her work to mentor budding athletes over the last several years. Congratulations to her on being nominated to the Rajya Sabha. @PTUshaOfficial pic.twitter.com/uHkXu52Bgc— Narendra Modi (@narendramodi) July 6, 2022 కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉష పేరును ఎగువసభకు ప్రతిపాదించారు. ఉష ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని మోదీ స్వయంగా ట్వీటర్ వేదికగా శుభాకంక్షలు తెలిపారు. ఉష (కేరళ) సహా తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌లను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ఎగువసభకు నామినేట్ చేసింది. -
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మెరిసిన మన్యం బిడ్డ
పచ్చని కొండ కోనల్లో.. అమాయకంగా జీవించే ఆదివాసీల బిడ్డ ఘనత సాధించింది. కట్టెలమ్ముకునే ఇంట పుట్టిన ఆమె.. జాతీయ వేదికపై పసిడి పతకంతో మెరిసింది. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఖేలో ఇండియా యూత్‌గేమ్స్‌లో పాల్గొని.. బంగారు పతకాన్ని సాధించింది. తనతోటి ఆదివాసీ బిడ్డలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి.. అల్లూరి జిల్లా మన్యాన్ని మురిపించింది. ఆమే కుంజా రజిత. – కూనవరం(రంపచోడవరం) కారడవిలో కుగ్రామం కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని దట్టమైన అడవిలో ఉన్న కుగ్రామం రామచంద్రాపురం. రజిత స్వగ్రామం. 35 ఏళ్ల కిందట పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్ నుంచి రజిత తండ్రి మారయ్య కుటుంబం ఇక్కడకు వలస వచ్చింది. రెక్కాడితేగాని డొక్కాడని దయనీయ స్థితి మారయ్య కుటుంబానిది. కుంజా మారయ్య, భద్రమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. చివరి సంతానమే కుంజా రజిత. భర్త చనిపోయాక కుటుంబ భారం భద్రమ్మ పైనే పడింది. అడవికెళ్లి కట్టెలు మోపు తెచ్చుకొని అమ్ముకోవడం ద్వారా కుటుంబాన్ని పోషించుకునేది. రజిత ప్రతి రోజూ 12 కిలోమీటర్లు దూరం కాలిబాటన చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి లీడ్స్ పాఠశాలలో చదువుకోవడం.. తిరిగి 12 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకునేది. అలా ఒకటి నుంచి 8 వరకు అక్కడే చదివింది. సెలవుల్లో తల్లి వెంట కట్టెలకు వెళ్లి చేదోడుగా ఉండేది. చిన్నప్పటి నుంచి పరుగు పందాలంటే రజితకు భలే ఇష్టం. పరుగులో రజితలోని వేగాన్ని ఆమె పెద్దన్న జోగయ్య గమనించాడు. స్థానిక పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాడు. పతకాల పంట 2019 అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగు విభాగంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచి వెండి పతకం సాధించింది. ఇటీవల గుజరాత్లో జరిగిన జాతీయ ఖేలో ఇండియా అథ్లెటిక్ పోటీలో కాంస్యం గెలుపొందింది. జాతీయ ఓపెన్ 400 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసింది. హర్యానాలో మంగళవారం జరిగిన జాతీయ ఖేలో ఇండియా అథ్లెటిక్ పోటీల్లో అండర్–20 విభాగంలో 400 మీటర్ల పరుగు పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచింది. రజిత 56.07 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకం దక్కించుకుంది. ఆగని పరుగు కాటుకపల్లి పాఠశాలలో 8వ తరగతి వరకే ఉండేది. అనంతరం నెల్లూరు ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో రజిత 9, 10 అక్కడే పూర్తి చేసింది. ఆ సమయంలో పరుగులో శిక్షణకు బీజపడింది. నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్ ఆధ్వర్యంలో ఆమె శిక్షణ పొందింది. మంగళగిరిలో ఇంటర్మీయట్ చదువుతూ గుంటూరు శాప్ ద్వారా గురువులు కృష్ణ మోహన్, మైకే రసూల్ వద్ద అథ్లెటిక్స్ శిక్షణ తీసుకుంది. ఓ పక్క చదువు, సాధన చేస్తూనే పోటీల్లో పాల్గొనేది. అక్కడే తన ఆటలోని బలాలు, బలహీనతలు తెలుసుకుని మరింత రాటుదేలింది. అంతర్జాతీయ స్థాయికి చేరాలంటే అత్యుత్తమ శిక్షణ అవసరమని భావించి.. ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగుబండి రమేష్‌ను సంప్రదించింది. ఆయన శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఆమె పరిస్థితిని గమనించిన ఆయన పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలోని మైత్రీ ఫౌండేషన్‌కు దృష్టికి తీసుకెళ్లారు. వారు ఫిజియోథెరపీ, అవసరమైన దుస్తులు, బూట్లు వంటివన్నీ అందిస్తున్నారు. ఆమె ఆటతీరు, కుటుంబ పరిస్థితి గమనించిన లెక్కల మాస్టార్ నాగేంద్ర ప్రతి నెలా కొంత మొత్తం అందజేస్తున్నారు. -
కేరళ నుంచి పీటీ ఉష... కర్ణాటక నుంచి అశ్వనీ నాచప్ప...ఏపీ నుంచి దండి జ్యోతిక!
కేరళ నుంచి ఒక పీటీ ఉష... కర్ణాటక నుంచి ఒక అశ్వనీ నాచప్ప... అస్సాం నుంచి ఒక హిమదాస్... వారి అడుగు జాడల్లో మరో పరుగుల విజేత... ఏపీ నుంచి దండి జ్యోతిక. దేశంలో దండిగా పతకాలు సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ వేదిక మీద... బంగారంలా మెరిసింది. దండి జ్యోతిక శ్రీ పుట్టింది, పెరిగింది ఆంధ్రప్రదేశ్, పశి్చమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో. పదవ తరగతి వరకు ఆమె విద్యాభ్యాసం, క్రీడాకారిణిగా తొలినాటి సాధన కూడా తణుకులోనే. క్రీడాకారిణిగా ఎదగాలనే ఆకాంక్షను కొనసాగించిందామె. విజయవాడలో ఇంటర్ మీడియట్ చదువుతున్న రోజుల్లో రన్నింగ్ ప్రాక్టీస్ కొనసాగించింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న జ్యోతిక తాజాగా టర్కీలో జూన్ నాలుగో తేదీ జరిగిన సెవెన్త్ ఇంటర్నేషనల్ స్ప్రింట్ అండ్ రిలే కప్ నాలుగు వందల మీటర్లలో స్వర్ణం సాధించి, విజేతగా ఇండియాలో అడుగుపెట్టింది. నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ చాంపియన్íÙప్లో పాల్గొనడానికి టర్కీ నుంచి నేరుగా చెన్నైకి చేరిన జ్యోతిక సాక్షితో మాట్లాడింది. ట్రాక్ వదల్లేదు జ్యోతిక తండ్రి శ్రీనివాసరావు బాడీ బిల్డర్. క్రీడాకారుడు కావాలనే ఆయన కల నెరవేరలేదు. తండ్రి కల నెరవేరకపోవడానికి ఆయనకు తల్లిదండ్రులకు క్రీడల విలువ తెలియకపోవడం, ప్రోత్సాహం లేకపోవడమే ప్రధాన కారణం అంటోంది జ్యోతిక. తనలో క్రీడాకారిణిని చూసుకుని తండ్రి సంతోషపడుతున్నారని, నాన్నకు గర్వకారణంగా నిలవగలగడం తనకు ఆనందాన్నిస్తోందని చెప్పింది. ‘‘నేను సెవెన్త్ క్లాసు నుంచే ఆటల్లో చురుగ్గా ఉన్నాను. కానీ పోటీలకు వెళ్లింది నైన్త్ క్లాస్ నుంచే. నాలో స్పోర్ట్స్ పర్సన్ ఉన్నట్లు మొదటిసారి గుర్తించింది కూడా మా నాన్నగారే. తణుకులో ఉన్నప్పుడు స్కూల్ పీఈటీ మాస్టారు సీతారామయ్య గారితోపాటు నాన్న కూడా శిక్షణ ఇచ్చారు. టోర్నమెంట్లకు వెళ్లేటప్పుడు ప్రతిసారీ నాకు తోడు వస్తారు. నాతోపాటు పాల్గొనే వాళ్ల వివరాలతోపాటు, వాళ్లు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నారు, ఎంత సమయం ప్రాక్టీస్ చేస్తున్నారు వంటి వివరాలతోపాటు తనకు తెలిసిన మెళకువలు చెప్పి గైడ్ చేస్తుంటారు. బంధువులు, స్నేహితులు కలిసినప్పుడు ‘మీ నాన్నలాంటి నాన్న ఉండడం నీ అదృష్టం’ అంటుంటారు. వాళ్ల మాట నిజమే. టీవీ లేదు.. సినిమా లేదు! ఇంటర్లో ఉన్నప్పుడు సీనియర్ అథ్లెట్స్‌తో కలిసి ఒక ఇల్లు తీసుకుని ఉన్నాను. ఆ ఇంట్లో నో టీవీ. అందరమూ అథ్లెట్లమే కావడంతో ఎవరికీ టీవీ చూసే టైమ్ ఉండేది కాదు. కాలేజ్‌కి వెళ్లడం, రన్నింగ్ ప్రాక్టీస్ చేయడమే లైఫ్. క్లాసు పుస్తకాలు తప్ప ఇతర సాహిత్య రచనలు చదవడం కూడా కుదరదు. ఆశ్చర్యంగా ఉంటుందేమో కానీ, సినిమాలు చూసింది కూడా లేదు. ఖాళీ సమయంలో పెన్సిల్ డ్రాయింగ్ వేస్తుంటాను. కోచ్ వినాయక్ ప్రసాద్ మా అథ్లెట్లందరికీ శిక్షణనిచ్చేవారు. టోర్నమెంట్ల సమయంలో మా అమ్మ వచ్చి భోజనం వండి పెట్టేది. నేనేమీ కేలరీల లెక్క చూసుకుంటూ తినడం అనేది జరగనే లేదు. శక్తినిచ్చే పోషకాహారం తీసుకోవడం వరకే. అభ్యంతరాలు తొలి మెడల్ వరకే ఆడపిల్లకు ఈ పరుగులేంటనే మాట చాలామంది అమ్మాయిలకు ఎదురైనట్లుగానే నాకూ తప్పలేదు. ఒకసారి మెడల్ వచి్చన తరవాత ఇక ప్రశంసలే. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ మెడల్స్ అందుకున్నాను. ఇన్నేళ్ల సాధన తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడల్ వచ్చింది. నేను 2016లో ఒకసారి టరీ్కకి వెళ్లాను. అది నా తొలి ఇంటర్నేషనల్ టోర్నమెంట్. అయితే అప్పుడు ఫైనల్స్‌కి చేరలేకపోయాను. ఆ తరవాత ఏడాది ఏషియన్ యూత్ చాంపియన్íÙప్లో నాలుగో స్థానానికి పరిమితమయ్యాను. టర్కీ పోటీల్లో రెండవ ప్రయత్నంలో స్వర్ణం సాధ్యమైంది. హైదరాబాద్‌లో కోచ్ రమేశ్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. గత ఏడాది అక్టోబర్ నుంచి త్రివేండ్రంలో నేషనల్ క్యాంప్‌లో తీసుకున్న శిక్షణతోపాటు టర్కీలో రష్యన్ కోచ్ గలీనా మేడమ్ శిక్షణ నా విజయానికి బాగా దోహదం చేశాయి. నెల రోజులు టర్కీలో ఉండి శిక్షణ తీసుకున్న తర్వాత పోటీలో పాల్గొన్నాను. ఇక నా భవిష్యత్తు లక్ష్యాల విషయానికి వస్తే... ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో విజయం సాధించాలి. ఆ తర్వాత ఒలింపిక్స్‌ని లక్ష్యంగా తీసుకుంటాను. తణుకులో ఉన్నప్పుడు నాలుగు వందల మీటర్ల లక్ష్యాన్ని చేరడానికి 58 నుంచి 59 సెకన్లు పట్టేది. విజయవాడ లో ప్రాక్టీస్ టైమ్‌కి 54 నిమిషాలకు చేరాను. ఇప్పుడు 53.05 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేశాను. 52 సెకన్లకు చేరడానికి ప్రాక్టీస్‌ని కంటిన్యూ చేస్తున్నాను’’ అంటూ ప్రాక్టీస్‌కి టైమవుతోందని ముగించింది. – వాకా మంజులారెడ్డి టరీ్కకి వెళ్లడానికి ముందు గత ఏడాది అక్టోబర్ నుంచి త్రివేండ్రంలో నేషనల్ క్యాంప్‌లో తీసుకున్న శిక్షణతోపాటు టర్కీలో రష్యన్ కోచ్ గలీనా మేడమ్ శిక్షణ బాగా దోహదం చేశాయి. నెల రోజులు టర్కీలో ఉండి శిక్షణ తీసుకున్న తర్వాత పోటీలో పాల్గొన్నాను. – జ్యోతికశ్రీ, అథ్లెట్ -
పతకాలు ‘దండి’గా!.. అంతర్జాతీయ పతకమే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన యువ అథ్లెట్ దండి జ్యోతికశ్రీ మహిళల 400 మీటర్ల వ్యక్తిగత పరుగు విభాగంలో రికార్డులు సృష్టిస్తోంది. గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన తొలి అండర్–23 అథ్లెటిక్ చాంపియన్ షిప్లో 53.05 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణంతో మెరిసి యావత్తు క్రీడాలోకం దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఏకంగా 18 పతకాలతో సత్తా చాటి భారత ఒలింపిక్ చాంప్ శిక్షణ జట్టులో స్థానం దక్కించుకుంది. చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే.. 6 నెలలుగా త్రివేండ్రంలోని నేషనల్ అథ్లెటిక్ క్యాంపు (ఎన్ఏసీ)లో అంతర్జాతీయ కోచ్ గలీనా (రష్యా) పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతోంది. ఈ ఏడాది చైనాలో జరగాల్సిన ఏషియన్స్లో గేమ్స్ వాయిదా పడటంతో జూలైలో ఇంగ్లాండ్‌లో జరిగే కామన్వెల్త్ పోటీలపై దృష్టి సారించింది. ముందుగా జూన్‌లో జరిగే ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ చాంపియన్ షిప్లో విజయం సాధించి, అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 రోజుల క్యాంపులో భాగంగా టర్కీలో మెలకువలు నేర్చుకుంటోంది. శాయ్ సెంటర్లో శిక్షణ.. జ్యోతికశ్రీ 2016 నుంచి సుమారు నాలుగేళ్ల పాటు విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) సెంటర్లో చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ పర్యవేక్షణలో రాటుదేలింది. ఈ క్రమంలో 2017 బ్యాంకాక్‌లో జరిగిన రెండో ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో నాల్గవ స్థానంలో నిలిచింది. అదే ఏడాది కెన్యాలోని నైరోబి నగరంలో జరిగిన ప్రపంచ అండర్–18 చాంపియన్‌షిప్‌లో, 2016 టర్కీ దేశంలోని ట్రాబ్జోన్ నగరంలో వరల్డ్ స్కూల్ గేమ్స్ చాంపియన్ షిప్లో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో పాటు జాతీయ పోటీల్లోనూ జూనియర్ విభాగంలో 400 మీటర్ల వ్యక్తిగత పరుగు, రిలే విభాగాల్లో కలిపి ఏకంగా 7 స్వర్ణాలు, 6 రజత, 3 కాంస్య పతకాలను ఒడిసిపట్టింది. ఏడాదిన్నర కిందట హైదరాబాద్‌లోని శాయ్ సెంటర్లో కోచ్ రమేష్ శిక్షణలో సీనియర్ విభాగంలోకి అడుగిడిన తర్వాత ఈ ఏడాది కాలికట్లో జరిగిన 25వ జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. తండ్రే తొలి గురువు.. జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు బీరువాలు తయారు చేసే వ్యాపారి. బాడీ బిల్డర్ కావాలని కలలు కన్న ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లక్ష్యాన్ని దూరం చేశాయి. అయితే పాఠశాల పరుగు పోటీల్లో చిన్న కుమార్తె జ్యోతికశ్రీలో ప్రతిభను గమనించి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆయనే తొలి గురువుగా మారి నిత్యం దగ్గరుండి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. ఈ క్రమంలోనే 7వ తరగతిలోనే జ్యోతికశ్రీ రన్నింగ్‌పై మక్కువ పెంచుకుంది. తొలిసారిగా 2015 విశాఖలో జరిగిన జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్లో 1000 మీటర్ల విభాగంలో కాంస్యంతో అదరగొట్టింది. ఇక శాయ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న తరుణంలో జ్యోతికశ్రీ బయట హాస్టళ్లలో ఉండాల్సి వచ్చేది. ఈ క్రమంలో తండ్రి శ్రీనివాసరావు తనకు వచ్చే ఆదాయంలో నెలకు రూ.20 వేలకుపైగా జ్యోతికశ్రీ శిక్షణకు ఖర్చు చేసేవారు. రైలు ప్రయాణం చేస్తే అలసిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తన కుమార్తె పోటీలకు వెళ్లేటప్పుడు శ్రీనివాసరావు అప్పుచేసి మరీ విమాన టికెట్లు తీసేవారు. అంతర్జాతీయ పతకమే లక్ష్యం జూలైలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించటంతోపాటు పతకం గెలవటమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. 400, 100 మీటర్ల పరుగు విభాగంలో ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తున్న 8 మంది క్రీడాకారిణుల జట్టులో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఉండటం గర్వంగా ఉంది. ప్రస్తుతం నా టైమింగ్‌ను మరింత మెరుగుపరచుకుందేకు ప్రయత్నిస్తున్నాను. – దండి జ్యోతికశ్రీ, అథ్లెట్ -
20 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు కొట్టిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్
న్యూఢిల్లీ: సైప్రస్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ స్వర్ణ పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.23 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 13.38 సెకన్లతో అనురాధా బిస్వాల్ (ఒడిశా) పేరిట 20 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. -
వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్‌ని తాగిన అథ్లెట్లు...ఆ తర్వాత..
School athletes drink sanitiser: నిజానికి దేశాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందింప చేసేందుకు దోహదపడేవి క్రీడలు. అంతేకాదు ఐక్యతను చాటి చెప్పేందుకే ప్రపంచ దేశాలన్నీ క్రీడలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఆయ దేశాలు తమ క్రీడాకారులకు కావల్సిన సౌకర్యాలను కల్పించి మరి దేశ విదేశాల్లో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది కూడా. కానీ కొన్నిచోట్ల అరకొర సౌకర్యాలతో సమస్యలను ఎదుర్కొంటున్న క్రీడాకారులు ఉన్నారు. అంతేకాదు స్పోర్ట్స్ ట్రైయినింగ్ సెంటర్లలో క్రీడాకారులకు సంబంధించిన డైట్ విషయంలో నిర్లక్ష్యం వహించి వారి జీవితాలతో ఆడుకున్న సందర్భాలు అనేకం. అచ్చం అలానే ఒక పాఠశాలలోని అథ్లెట్లు స్పోర్ట్స్ నిర్వాహకులు నిర్లక్ష్య వైఖరితో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే...జపాన్‌లోని ఒక పాఠశాలలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ జపాన్‌లోని యమనాషి ప్రిఫెక్చర్లో నిర్వాహకులు గత వారాంతంలో బాలికల 5 వేల మీటర్ల మారథాన్ రేసును నిర్వహించారు. ఐతే పొరపాటున నిర్వాహకులు వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్‌ని కప్పుల్లో వేసి సర్వ్ చేశారు. దీంతో ఒక అథ్లెట్ వాంతులు చేసుకుని రేసు నుంచి నిష్క్రమించగా, మరో ఇద్దరు మాత్రం ఉమ్మివేసి రేసుని తిరిగి కొనసాగించినట్లు జపాన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మొత్తం ముగ్గురు అథ్లెట్లు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. తాగునీటి వాటర్ బాటిల్ తోపాటు శానిటైజర్ కూడా అదే ప్లాస్టిక్ బాటిల్‌తో ఉందని హైస్కూల్ యమనాషి స్పోర్ట్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని యమనాషి గవర్నర్ కొటారో నాగసాకి తెలిపారు. అంతేకాదు ఆయన అథ్లెట్లకు వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక క్షమాపణలు చెప్పారు కూడా. (చదవండి: శ్రీలంకలో ఆగని అల్లర్లు.. ప్రధాని ఇంటికి నిప్పు) -
సిక్కోలు చిన్నోడు ‘హర్డిల్స్’లో దూకుడు
సాక్షి, అమరావతి: పేదరికం అడ్డుగోడలను అధిగమించి సిక్కోలు చిన్నోడు చిన్ననాటి నుంచే ‘హర్డిల్స్’లో అదరగొడుతున్నాడు. గొప్ప అథ్లెట్ కావాలన్న ఆకాంక్షతో రికార్డులు సృష్టిస్తూ పతకాలను ఒడిసిపడుతున్నాడు. లావేటి యశ్వంత్ కుమార్ (20) రెండేళ్ల వ్యవధిలో 13 జాతీయ పతకాలను సాధించి క్రీడాలోకం దృష్టిని ఆకర్షించి మెరుపు వేగంతో అంతర్జాతీయ ట్రాక్‌వైపు దూసుకెళ్తున్నాడు. సీనియర్లతో తలపడి మరీ.. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామానికి (పాత శ్రీకాకుళం జిల్లా) చెందిన యశ్వంత్ కుమార్ హర్డిల్స్ 110 మీటర్ల విభాగంలో అద్భుత ప్రతిభ కనపరుస్తున్నాడు. వాలీబాల్ క్రీడాకారుడైన తండ్రి సూరంనాయుడు ప్రోత్సాహంతో క్రీడల్లో అడుగుపెట్టాడు. గతేడాది గౌహతిలో జరిగిన 36వ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 110 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే కాకుండా లక్ష్యాన్ని 13.92 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. సీనియర్ విభాగాల్లో సైతం పోటీపడి పతకాలు సాధించడం గమనార్హం. పాటియాలా సీనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ మీట్లో కాంస్యం, ఢిల్లీలో అండర్–23 అథ్లెటిక్స్ మీట్లో రజతం, వరంగల్ సీనియర్ ఓపెన్ ఈవెంట్లో 5వ స్థానంతో సత్తా చాటాడు. ఈ ఏడాది సీనియర్ విభాగంలోకి అడుగిడిన యశ్వంత్ ఫిబ్రవరిలో మంగుళూరులో జరిగిన ఇంటర్ వర్సిటీ పోటీల్లో ఆచార్య నాగార్జున వర్సిటీ తరఫున 110 మీటర్ల లక్ష్యాన్ని 14.32 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణంతో మెరిశాడు. కసరత్తు చేస్తున్న యశ్వంత్ కుమార్ రెండేళ్లుగా బళ్లారిలో శిక్షణ యశ్వంత్ రెండేళ్లుగా బళ్లారిలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. సిడ్నీ ఒలింపిక్ హర్డిల్స్ స్వర్ణ పతక విజేత మాజీ అథ్లెట్ అనియర్ గార్సియా పర్యవేక్షణలో కఠోర సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం 110 మీటర్ల హర్డిల్స్‌లో యశ్వంత్ ఉత్తమ టైమింగ్ 14.10 సెకన్లుగా ఉంది. అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాలంటే 13.62 సెకన్లు, ఒలింపిక్స్‌కు 13.32 సెకన్లు (పోటీల్లో విజేతల ప్రతిభను బట్టి ఈ సమయం మారుతుంటుంది) వేగం ఉండాలి. అండర్ 16, 18, జూనియర్, సీనియర్ హర్డిల్స్ ఎత్తులో వ్యత్యాసం ఉండటం, జూనియర్‌గా ఉన్నప్పుడే సీనియర్ పోటీల్లో పాల్గొన్న అనుభవం యశ్వంత్‌కు అంతర్జాతీయ పోటీల్లో సులభంగా అర్హత సాధించేందుకు దోహదపడనుంది. రెండేళ్ల క్రితమే సీనియర్ ఏషియన్ ఇండోర్, జూనియర్ ఏషియా, జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధించినప్పటికీ కరోనా అడ్డుతగిలింది. ఏషియన్, కామన్వెల్త్కు సిద్ధం.. ప్రస్తుతం సీనియర్లో విభాగంలో సిద్ధాంత్ తింగాలియ పేరుతో ఉన్న రికార్డు (13.48 సెకన్లు) బద్ధలుగొట్టి అంతర్జాతీయ పోటీలకు అర్హత పొందేలా యశ్వంత్ సిద్ధమవుతున్నాడు. ఈ నెల 29న కర్నాటకలో జరిగే ఖేలో వర్సిటీ పోటీల ద్వారా వరల్డ్ వర్సిటీ పోటీలకు, జూన్‌లో ఇంటర్ స్టేట్ చాంపియన్ షిప్ ద్వారా కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో అడుగుపెట్టేలా టెక్నిక్‌పై దృష్టి సారించాడు. స్పోర్ట్స్ స్కూల్ నుంచి... యశ్వంత్ హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి నుంచి తొమ్మిది వరకు చదివాడు. అనంతరం గోల్కొండలోని బాయ్స్ స్పోర్ట్స్ కోమ్ (ఆర్మీ ఆర్టీ సెంటర్ సెలక్షన్లో ఎంపికై) సీబీఎస్సీలో టెన్త్ పూర్తి చేశాడు. ఇంటర్ దూరవిద్యలో పూర్తైంది. తరువాత గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోని టెన్విక్ అకాడమీలో (అనిల్ కుంబ్లే అకాడమీ) అంతర్జాతీయ శిక్షకుడు అద్రిమామ్(దక్షిణాఫ్రికా), ఎరిక్ డిక్సన్ (అమెరికా) వద్ద ఏడాది పాటు శిక్షణ పొందాడు. ప్రస్తుతం సత్తెనపల్లిలో డిగ్రీ ఫైనలియర్ బీకాం చదువుతున్నాడు. కుటుంబ నేపథ్యం.. యశ్వంత్ తండ్రి సూరంనాయుడు హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. నేషనల్ వాలీబాల్, త్రోబాల్ రిఫరీగా ఉన్న ఆయనకు ఇద్దరు కుమారులు. వారి భవిష్యత్తు కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేశారు. చిన్న కుమారుడు సిద్ధ వరప్రసాద్ జిమ్నాస్టిక్ క్రీడాకారుడు. ట్రైనింగ్ సెంటర్లో భోజన, వసతి సౌకర్యాలను మాత్రమే సమకూరుస్తారు. కుమారుల ప్రాక్టీస్ కోసం అవసరమైన షూలు, పౌష్టికాహారం, దుస్తుల కోసం నెలకు దాదాపు ఇద్దరు రూ.10వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. సొంత గ్రామంలో చిన్న ఇల్లు మినహా ఆ కుటుంబానికి వేరే ఆస్తులు లేవు. 110 మీటర్ల హర్డిల్స్‌లో విజయాలు.. ► 32వ సౌత్ జోన్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2021లో స్వర్ణం ► ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020లో స్వర్ణంతో పాటు 14.10 సెకన్లలో లక్ష్యం పూర్తి చేసి కొత్త రికార్డు ► 35వ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ ► 31వ సౌత్ జోన్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2019లో స్వర్ణం ► గుంటూరు జాతీయ జూనియర్–2019 పోటీల్లో ద్వితీయ స్థానం ► 17వ ఫెడరేషన్ కప్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్–2019 రిలేలో (4 గీ 100) కాంస్యం. ► సౌత్‌జోన్ జాతీయ పోటీలు–2018లో 100 మీటర్ల మిడే రిలేలో స్వర్ణం, 100 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం ► 2016లో విశాఖలో జరిగిన అంతర్ జిల్లాల జాతీయ పోటీల్లో కాంస్యం సాయం కావాలి.. రోజుకు ఒక సెషన్ చొప్పున వారంలో ఆరు సెషన్లు శిక్షణ ఉంటుంది. జిమ్, ట్రాక్‌పై కఠినంగా శ్రమించాలి. ఫిట్నెస్ కాపాడుకుంటూ సెలవు రోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. నా తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లోనూ లక్ష్యం వైపు నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రోత్సాహకాలు దక్కలేదు. ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నా. – లావేటి యశ్వంత్ కుమార్, అథ్లెటిక్స్ క్రీడాకారుడు -
ఈ తాత మామూలోడు కాదండోయ్
తాత అనేగానే.. ఒళ్లు కుంగిపోయి, చర్మం ముడతలు పడి, సరిగ్గా కదల్లేక ఓ మూలన కూర్చుంటాడు అనుకుంటారేమో. ‘కబాలీ.. రా’ రేంజ్లో హుషారు చూపిస్తుంటాడీ తాత. ఈ తాత మామూలోడు కాదు. పేరు.. సావాంగ్ జన్‌ప్రామ్. వయసు 102 ఏళ్లు. ఉండేది థాయ్‌లాండ్ సాముత్ సాంగ్ఖ్రమ్ ప్రావిన్స్‌లో. పోయినవారం అక్కడ 26వ ఇటెరేషన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. అందులో 100-105 ఏళ్ల కేటగిరీకి జరిగిన పోటీల్లో ఈ తాతే మొత్తం మెడల్స్ మెడలో వేసేసుకున్నాడు. స్వతహాగానే ఈ పెద్దాయన ఒక అథ్లెట్. అందుకే ఈ ఏజ్‌లోనూ హుషారుగా పోటీల్లో పాల్గొంటూ వస్తున్నాడు. ఈసారి పోటీల్లో ఈయనగారు ఏకంగా ఓ రికార్డ్ కూడా నెలకొల్పాడు. తన ఈడు వాళ్లతో పోటీపడి వంద మీటర్ల పరుగు పందెంను 27.08 సెకన్లలో పూర్తి చేశాడు. 100 మీటర్ల పరుగు పందెంలో జమైకా పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్ట్ పేరిట ఉంది(2009లో 9.58 సెకండ్లు). అలాంటిది ఈ ఏజ్‌లో ఈ తాత ఈ రికార్డును నెలకొల్పడం గొప్పే కదా! Sawang Janpram, 102, broke the Thai 100m record – for centenarians – at the annual Thailand Master Athletes Championships https://t.co/GZcaQGrAoR pic.twitter.com/OxqGLiXySI — Reuters (@Reuters) March 3, 2022 ఈ గొప్పతనం వల్లే ఈ తాతకి.. లేడీస్లోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. యూత్ ఫిజికల్ టిప్స్ కోసం ఈ తాతను కలుస్తుంటారు.. ఇక డెభ్భై ఏళ్ల ఆయన కూతురే సిరిపాన్.. ప్రస్తుతం సావాంగ్కు ట్రయినర్‌గా ఉంది. ఆటలే నన్ను ధృడంగా ఉంచుతున్నాయి. టైంకి మంచిగా తిని.. ఎక్సర్సైజులు గట్రా చేస్తే నాలాగే మీరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నాడు ఈ తాత. వీటితో పాటు పాజిటివ్ మైండ్ తన తండ్రి ఆరోగ్య రహస్యం అంటోంది సిరిపాన్. థాయ్‌లాండ్ మాస్టర్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ పోటీలు 1996 నుంచి నడుస్తున్నాయి. అప్పుడు కేవలం 300 మంది మాత్రమే పాల్గొన్నారు. మరి ఇప్పుడో.. 2 వేల మంది.. అదీ 35 నుంచి 102 ఏళ్ల మధ్యవయస్కులు పాల్గొంటున్నారు. అంటే.. ఫిట్నెస్ మీద థాయ్‌లాండ్ ప్రజలకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
అలుపెరుగని అథ్లెటిక్.. పరుగులో రారాజు
మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఆయన వయసు 67 ఏళ్లు...అయినా 20 ఏళ్ల యువకుడిలా ఫిట్‌గా ఉంటాడు. ఎవరైనా సరే నాతో పరుగెత్తగలరా అంటూ సవాల్ విసురుతాడు. కచ్చితంగా గెలిచే తీరుతాడు. 60–75 ఏళ్ల విభాగంలో పోటీలో పాల్గొంటూ పతకాలు గొల్లగొడుతున్నాడు. అతనే ఇందిరాకాలనీకి చెందిన ఆకుల కనకరాజు. ఇప్పటికీ అదే ఉత్సాహం కనకరావుకు ఇప్పడు 65 ఏళ్లు. అయినా నిత్యయువకుడిలా పరుగులో రాణిస్తున్నాడు. తెల్లవారు జామునే నిద్ర లేవడం.. రన్నింగ్‌కు వెళ్లడం నిత్య దినచర్య. ప్రస్తుతం కనకరాజు షిప్‌యార్డ్ జూనియర్ కళాశాలలో పీఈటీగా పనిచేస్తున్నాడు. రన్నింగ్‌తో పాటు బాడీబిల్డింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్ వంటి క్రీడలు కనకరాజుకు అనుభవం ఉంది. ఆ క్రీడల్లో కూడా పతకాలు సాధించాడు. 1972లో తొలిసారిగా.. 1972లో ఇండియన్ నేవి విశాఖలో ఏర్పాటు చేసిన పది కిలో మీటర్ల పరుగు పందెంలో తొలి స్థానంలో నిలిచాడు. అప్పటి నుంచి ఏటా వివిధ రాష్ట్రాలలో జరిగే పరుగు పందెంలో పాల్గొని పతకాలు సాధించాడు. 65 ఏళ్ల వయసులో కూడా (2000వ సంవత్సరం) హరియానలో జరిగిన జాతీయ స్థాయి 4 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. వంద, రెండు వందలు ,మూడు వందలు, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ఇప్పటి వరకు నాలుగు వందల వరకు పతకాలు సాధించాడు. ఇప్పటి వరకు సాధించిన పతకాలు 140 జీవీఎంసీ 60వ వార్డు పరిధి ఇందిరాకాలనీ– 1 ప్రాంతానికి చెందిన ఆకుల కనకరాజు అథ్లెటిక్స్ రాణిస్తు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వయసు 67 ఏళ్లయినా వెనుకడుగు వేయకుండా పరుగులో నంబర్–1 గా నిలుస్తున్నాడు. పదో తరగతి పూర్తి చేసిన కనకరాజు ఇండియన్ ఆర్మీలో చేరాడు. అక్కడ అధికారులు ఇచ్చిన పోస్టు నచ్చక ఏడాదికి తిరిగి వచ్చాశాడు. విశాఖలో హోంగార్డుగా ఐదేళ్లు పనిచేశాడు. అనంతరం సీలేరు వద్ద గల ప్రభుత్వ ఐటీఐలో మేల్ నర్స్‌గా చేరాడు. తరువాత విశాఖ సెంట్రల్ జైల్లో మేల్ నర్సింగ్ విధులు నిర్వహించి అక్కడే పదవీ విరమణ పొందాడు. కనకరాజు 13 ఏళ్ల వయసులోనే పరుగు మొదలు పెట్టాడు. షిప్‌యార్డ్, జింక్, పోర్టు గ్రౌండ్లో రన్నింగ్ ప్రాక్టిస్ చేశాడు. -
ఈటింగ్ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థిని మృతి
ఈటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న ఓ విద్యార్థిని మృతిచెందిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. గెలవాలనే తొందరలో ఆహారం గొంతులో ఇరక్కుపోయి, ఊపిరాడక అర్థాంతరంగా తనువుచాలింది. అసలేంజరిగిందంటే.. అమెరికాలో టఫ్ట్స్ యూనివర్సిటీ గతవారం హాట్ డగ్స్ ఈటింగ్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్లో అదే యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చదువుతున్న మడ్లిన్ అనే 20 ఏళ్ల విద్యార్థిని కూడా పాల్గొంది. ఐతే హఠాత్తుగా హాట్ డగ్ గొంతులో ఇరుక్కుపోవడంతో, ఊపిరిఆడక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్వహణ బృందం హుటాహుటిన బోస్టన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఎంతప్రయత్నించినా ఆమె ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. సంఘటన జరిగిన తర్వాత రోజు ఆమె మరణించిందని వైద్యులు మీడియాకు వెల్లడించారు. నిజానికి ఆమె ఒక గొప్ప అథ్లెట్ కూడా. ఈ విషాద సంఘటన తాజాగా వెలుగుచూసింది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
స్టార్ అథ్లెట్ అలెక్స్ క్వినెజ్ కాల్చివేత...
క్విటో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఈక్వెడార్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్ అలెక్స్ క్వినెజ్ను దుండగులు కాల్చిచంపారు. గ్వాయకిల్ నగరంలో అతను కాలి్చవేతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. 32 ఏళ్ల అలెక్స్ 2019లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య పతకం సాధించాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించినప్పటికీ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ‘ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు’ అనే నిబంధన అతిక్రమించడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. అథ్లెట్ మృతిపట్ల ఈక్వెడార్ అధ్యక్షుడు గులెర్మో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్ ఏంటి?’ -
కెన్యా అథ్లెట్ అగ్నెస్ అనుమానాస్పద మృతి
Kenya Athlete Agnes Tirop Death.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లలో (2017, 2019) పది వేల మీటర్ల విభాగంలో రెండు కాంస్య పతకాలు గెలిచిన కెన్యా మహిళా రన్నర్ అగ్నెస్ టిరోప్ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. 25 ఏళ్ల అగ్నెస్ ఇంట్లోనే మరణించిందని, ఆమె మృతికి గల కారణాలు తెలియలేదని కెన్యా ట్రాక్ సమాఖ్య తెలిపింది. ఇంట్లోనే విగతజీవిగా పడి ఉండటంతో ట్రాక్ సమాఖ్య... అగ్నెస్ భర్తపై అనుమానాలను వ్యక్తం చేసింది. గత ఆగస్టులో ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో 5000 మీటర్ల పరుగులో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: Uber Cup: ఐదేళ్ల తర్వాత... తొలిసారిగా.. -
చిన్న వయసులో పారా ఒలింపిక్స్‌కు హాజరైన మహిళా అథ్లెట్..!
కషిష్ లక్రాకు 18 ఏళ్లు. తన కాళ్ల మీద తాను నిలబడలేదు. కాని రెండు చేతుల్లో బలంగా దేశ పతాకాన్ని రెపరెపలాడించాలని పట్టుదలగా ఉంది. మంగళవారం నుంచి మొదలైన టోక్యో పారా ఒలింపిక్స్‌లో దేశం నుంచి హాజరవుతున్న అతి చిన్న వయసు అధ్లెట్ లక్రా 14 ఏళ్ల వయసులో డాక్టర్లు ఇక నువ్వు జీవితాంతం బెడ్ మీద ఉండాలి అని చెప్తే విధిని సవాలు చేసి నేడు దేశానికి ప్రతినిధిగా ఎదిగింది. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోయే వారికి అతి పెద్ద స్ఫూర్తి లక్రా. టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ (దివ్యాంగుల ఒలింపిక్స్)లో భారత్ నుంచి 54 మంది క్రీడాకారులు హాజరవుతున్నారు. ఇది గతంతో పోలిస్తే పెద్ద సంఖ్య. ఈ మొత్తం 54 మందిలో అందరి కంటే చిన్నది కషిష్ లక్రా. 18 ఏళ్ల వయసులో పారా ఒలింపిక్స్‌కు హాజరైన మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు స్థాపించినట్టే. క్లబ్‌త్రోలో ఆమె పాల్గొననుంది. క్లబ్ అంటే 40 సెం.మీల కొయ్యగూటం. దానిని విసరాలి. ఎఫ్ 51 విభాగం (చేతికి ఉండే లోపం స్థాయిని బట్టి చేసే విభాగం) లో ఆమె పాల్గొననుంది. ‘నేను కచ్చితంగా నా దేశానికి పతకం తెస్తాను’ అని కషిష్ అంది. ఢిల్లీ అమ్మాయి ఢిల్లీలో అందరిలాంటి అమ్మాయే కషిష్. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. మూడో క్లాసులోనే స్కేటింగ్ మొదలెట్టింది. ఆ తర్వాత బాడ్మింటన్ ఆడాలని అనుకుంది. కాని దాని కోచింగ్ కోసం డబ్బు ఖర్చు అవుతుందని ఆ స్తోమత లేక రెజ్లర్‌గా మారింది. ఏడో క్లాసులో జూనియర్ రెజ్లర్‌గా ఢిల్లీలో శిక్షణ మొదలెట్టింది. చిన్నప్పటి నుంచి బలశాలి అయినందువల్ల రెజ్లర్‌గా రాణించి ‘ఖేలో ఇండియా’ యూత్ గేమ్స్‌కు ఎంపికైంది. 2018 జనవరిలో ఆ గేమ్స్ జరగనున్నాయి. వాటి కోసం 2017 నవంబర్‌లో నజఫ్‌గడ్‌లోని గవర్నమెంట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కుస్తీ ప్రాక్టీసు చేస్తున్న 14 ఏళ్ల కషిష్ పట్టు జారి పడిపోయింది. వెన్నుపూసకు బలమైన గాయాలయ్యాయి. స్పృహ తప్పిపోయింది. కొన్నాళ్ల తర్వాత స్పృహలోకి వచ్చిన కషిష్కు తన మెడకూ మిగిలిన శరీరానికి ఏ సంబంధమూ లేదని అర్థమైంది. మెడ దిగువ భాగమంతా చలనం కోల్పోయింది. ఎంతో భవిష్యత్తును కలగన్న ఆ టీనేజ్ బాలిక బెంబేలెత్తి పోయింది. తన బతుక్కు ఇక ఏ అర్థమూ లేదని అనుకుంది. దానికి తోడు డాక్టర్లు ఆమె తల్లిదండ్రులతో ‘చనిపోయే అవకాశమే ఎక్కువ’ అన్నారు. అంతే కాదు ఒకవేళ బతికినా జీవితాంతం మంచం మీదే ఉండాలన్నారు. కాని కషిష్, ఆమె తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మమ్మ, తాతయ్య ఈ సవాలును దాటాలని గట్టిగా అనుకున్నాను. దాటారు కూడా. ఫిజియోథెరపీ మూడు–నాలుగు నెలలు కషిష్ ఫిజియోథెరపీ కోసం అంతులేని సంకల్పబలంతో సహకారం అందించింది. ఫిజియోథెరపిస్ట్ ఆమెలో ఆత్మవిశ్వాసం నింపాడు. మంచానికే పరిమితం అని చెప్పిన డాక్టర్ల అంచనాలకు విరుద్ధంగా ఆమె లేచి కూచోగల్గింది. వీల్‌చైర్‌లో కదిలే శక్తి పొందింది. ఒక్కసారి వీల్‌చైర్‌లో కూచున్నాక ‘నేను చదువుకుంటా’ అని కషిష్ అంది. ఏ స్కూల్లో అయితే అంతవరకూ చదువుతూ ఉందో ఆ స్కూల్ వాళ్లు ‘మేము చేర్చుకోము’ అన్నారు. అది పెద్ద దెబ్బ. ఆ తర్వాత షాలీమార్ బాగ్‌లోని మోడరన్ పబ్లిక్ స్కూల్ ఆమెకు అడ్మిషన్ ఇవ్వడమే కాదు ఆమె క్రీడాసక్తిని కూడా ప్రోత్సహించింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత సత్యపాల్ సింగ్ ఆమెకు కోచ్‌గా ఉండటానికి ముందుకు వచ్చాడు. క్లబ్ త్రోలో శిక్షణ ఇచ్చాడు. వ్యాయామం పట్ల ఆసక్తి ఉన్న కషిష్ తన సోదరుడితో కలిసి వ్యాయామం చేస్తూ దారుఢ్యాన్ని పెంచుకోవడమే కాదు, శక్తి కొద్దీ క్లబ్‌ను విసరడానికి శిక్షణ తీసుకుంది. జైత్రయాత్ర ఆ తర్వాత కషిష్ ఆగలేదు. స్టేట్ లెవల్లో గోల్డ్ మెడల్ సాధించింది. నేషనల్ లెవల్లో గోల్డ్, సిల్వర్ పతకాలు సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ గెలిచింది. 2019లో దుబయ్‌లో జరిగిన సీనియర్ ఛాంపియన్ షిప్లో ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం క్లబ్ త్రోలో ప్రపంచ ర్యాంకులో 8వ స్థానంలో ఉంది కషిష్. అందుకే భారత ప్రభుత్వం ఆమెను టోక్యోకు ఎంపిక చేసింది. ‘ఒకప్పుడు కదల్లేను అనుకున్నాను. ఇవాళ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాను. నా స్వప్నం సత్యమైంది’ అంది కషిష్. ‘మా అమ్మ నా వెంట నీడలా ఉండి ఈ విజయాలు సాధించేలా చేసింది. నా కోచ్‌లు నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. వారు లేకుంటే నేను లేను’ అంటుంది కషిష్. బహుశా రెండు మూడు రోజుల్లో మనం కషిష్ గురించి మంచి వార్త వింటామనే ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ కషిష్. -
ఎన్నోఏళ్ల భారత్ కల.. రేపు నిజమయ్యే ఛాన్స్!
అంతా అనుకున్నట్లు జరిగితే... ఎన్నో ఏళ్లుగా ఒలింపిక్స్‌లో భారత్‌ను ఊరిస్తోన్న అథ్లెటిక్స్ పతకం సోమవారం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మహిళల డిస్కస్ త్రో విభాగంలో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ ప్రదర్శన పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 25 ఏళ్ల ఈ పంజాబీ అమ్మాయి శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో మూడో ప్రయత్నంలో నేరుగా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసే కనీస అర్హత మార్క్‌ను (64 మీటర్లు) అందుకుంది. అంతేకాకుండా ఫైనల్‌కు అర్హత పొందిన మొత్తం 12 మందిలో కమల్‌ప్రీత్ రెండో స్థానంలో నిలువడం విశేషం. భారత్‌కే చెందిన మరో డిస్కస్ త్రోయర్ సీమా పూనియా నాలుగోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నప్పటికీ ఈసారి కూడా క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగి నిరాశపరిచింది. టోక్యో: ఒలింపిక్స్‌లో శనివారం భారత అథ్లెట్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డిస్కస్ త్రో ఈవెంట్లో కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు అర్హత సాధించగా... సీమా పూనియా క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయింది. పురుషుల లాంగ్‌జంప్ క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్ ఓవరాల్‌గా 25వ స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’లో పోటీపడిన కమల్‌ప్రీత్ మూడో ప్రయత్నంలో డిస్క్‌ను 64 మీటర్ల దూరం విసిరి తన గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. తొలి ప్రయత్నంలో ఆమె డిస్క్‌ను 60.29 మీటర్లు... రెండో ప్రయత్నంలో 63.97 మీటర్ల దూరం విసిరింది. 16 పాల్గొన్న ఈ విభాగంలో వలారీ ఆల్మన్ (అమెరికా) 66.42 మీటర్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. 64 మీటర్ల దూరం విసిరితే నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. 15 మందితో కూడిన గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ భారత మరో డిస్కస్ త్రోయర్ సీమా డిస్క్‌ను 60.57 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానం లో నిలిచింది. మొత్తం రెండు గ్రూప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. ఓవరాల్‌గా సీమా 16వ స్థానం లో నిలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకోలేకపోయింది. సోమవారం స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం ఫైనల్ జరుగుతుంది. క్వాలిఫయింగ్‌లో కమల్ ప్రీత్ ప్రదర్శన డిఫెండింగ్ చాంపియన్ సాండ్రా పెర్కోవిచ్ (క్రొయేషియా–63.75 మీటర్లు), వరల్డ్ చాంపియన్ వైమి పెరెజ్ (క్యూబా–63.18 మీటర్లు) కంటే మెరుగ్గా ఉండటం విశేషం. దాంతో కమల్‌ప్రీత్ ఇదే ప్రదర్శనను ఫైనల్లోనూ పునరావృతం చేస్తే పతకం వచ్చే అవకాశముంది. ‘తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నందుకు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యాను. అయితే తొలి త్రో వేశాక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫైనల్లో నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి భారత్‌కు పతకం అందించమే నా ఏకైక లక్ష్యం’ అని వచ్చే ఏడాది అమెరికాలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు కూడా అర్హత పొందిన కమల్‌ప్రీత్ వ్యాఖ్యానించింది. ►పురుషుల లాంగ్‌జంప్‌లో భారత ప్లేయర్ శ్రీశంకర్ 7.69 మీటర్ల దూరం దూకి గ్రూప్ ‘బి’లో 13వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 29 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్‌కు 25వ స్థానం దక్కింది. -
Tokyo Olympics: రూల్స్ సవరణ.. రెచ్చిపోతున్న అథ్లెట్లు
టోక్యో: కరోనా కట్టడితో అథ్లెట్లకు ఊపిరి ఆడని పరిస్థితి. ఒలింపిక్స్ విలేజ్‌లో ఆహ్లాదంగా గడపలేని పరిస్థితులు, కఠిన నిబంధనలు, ఆల్కహాల్- సెక్స్‌కి దూరం కావడం వెరసి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు కొంతలో కొంత ఊరట ఇచ్చింది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ. సోషల్ మీడియా కఠిన నిబంధనల్ని ఎత్తేయడంతో అథ్లెట్లంతా ఒక్కసారిగా రెచ్చిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సోషల్ మీడియా రూల్స్‌ను సవరించింది. దీంతో టిక్‌టాక్ లాంటి వీడియో జనరేట్ కంటెంట్ యాప్‌లలో రెచ్చిపోతున్నారు అథ్లెట్లు. ఖాళీ టైం దొరికితే చాలు.. వాళ్లరూమ్లలో షార్ట్ వీడియోలు తీసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరికి ఈ-పాపులారిటీ దక్కుతుండడం విశేషం. ఐరిష్ జిమ్నాస్ట్ రైస్ మెక్‌క్లెనాగన్ ‘యాంటీ-సెక్స్’ బెడ్ పుకార్లను బద్ధలు కొట్టిన వీడియోతో మొదలైన సందడిని వందల మంది అథ్లెట్లు కొనసాగిస్తూ వస్తున్నారు. అమెరికన్ రగ్బీ ప్లేయర్ ఇలోనా మహెర్ తన టీంతో కలిసి, వాలీబాల్ ప్లేయర్ ఎరిక్ షోజీ, ఐరిష్ ట్రాక్ స్టార్ లియోన్ రెయిడ్.. ఈ జాబితాలో ముందున్నారు. అథ్లెట్లకు కేటాయించిన రూమ్‌ల్లో వాళ్ల చేస్తున్న సందడి మామూలుగా ఉండడం లేదు. “Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB — Rhys Mcclenaghan (@McClenaghanRhys) July 18, 2021 I drop about 3 tiktoks a day from here in the village. Follow me for a good laugh. pic.twitter.com/VzxDKhJZ5r — Raven HULK Saunders (@GiveMe1Shot) July 27, 2021 టఫ్ ఐవోసీ రూల్స్ ఐవోసీలోని ఇంతకు ముందు రూల్స్ ప్రకారం.. అథ్లెట్లతో పాటు కోచ్‌లు, అధికారులు ఎవరైనా కూడా ఫొటోలు మాత్రమే పోస్ట్ చేయాలి. కాంపిటీషన్ వెన్యూ నుంచి కూడా పోస్టులు పెట్టొచ్చు. కానీ, ఆడియో-వీడియో కంటెంట్ మాత్రం పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే నాన్-ఒలిపింక్ స్పాన్సర్స్‌కు సంబంధించిన పోస్ట్‌లు కూడా చేయకూడదు. అలా చేస్తే ఫైన్‌తో పాటు బ్యాన్‌కు కూడా అవకాశం ఉందని హెచ్చరికలు ఉండేవి. అయితే 2018 వింటర్ ఒలింపిక్స్ టైంలో అథ్లెట్లు.. ఆడియెన్స్‌తో ఇంటెరాక్ట్ అవుతూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసే అవకాశం కల్పించింది. అంతేకాదు వ్లోగర్స్ వీడియోలు తీసుకోవచ్చని పేర్కొంది. అయితే అదే ఒలింపిక్స్‌లో ఐస్ డ్యాన్సింగ్ అక్కాచెల్లెలు మయియా-అలెక్స్ షిబుటానీ ఒలింపిక్స్ వ్లోగ్ కక్రియేట్ చేయగా.. గంటలో దానిని యూట్యూబ్ కాపీరైట్స్ పాలసీ ఉల్లంఘనల పేరిట తొలగించేసింది. అప్పటి నుంచి కొన్ని పరిమితులతో వీడియోలకు అవకాశం ఇచ్చింది. ఇక కరోనా టైంలో ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉండడంతో అథ్లెట్లు వాళ్ల అనుభవాల్ని సన్నిహితులతో పంచుకోవచ్చని పేర్కొంది. అది కూడా నాన్-కమర్షియల్ అయితేనే. -
పేద క్రీడాకారుడికి ‘గిఫ్ట్ ఏ స్మైల్’
సాక్షి, హైదరాబాద్: ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఓ నిరుపేద క్రీడాకారుడికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గుండారం గ్రామానికి చెందిన క్రీడాకారుడు ముడావత్ వెంకటేశ్ ఇటీవల నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా సంస్థ (ఎన్ఎస్ఎన్ఐఎస్)లో డిప్లొమా కోర్సులో సీటు సంపాదించాడు. అయితే, పేద గిరిజన కుటుంబానికి చెందిన వెంకటేశ్‌కు ఆ కోర్సులో చేరేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడంతో మంత్రి కేటీఆర్‌ను సంప్రదించాడు. విషయం తెలిసిన హైదరాబాద్‌కు చెం దిన టీఆర్ఎస్ యువజన llనేత ఉగ్గం రాకేశ్‌యాదవ్ వెంకటేశ్‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా గురువారం రూ. 1.8 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వెంకటేశ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రాకేశ్ యాదవ్‌ను కేటీఆర్ అభినందించారు. -
ఒలింపిక్స్ క్రీడా మహోత్సవం ప్రారంభం..
టోక్యో: కోవిడ్ దెబ్బతో పలుమార్లు వాయిదాపడిన ఒలింపిక్స్ క్రీడలు ఎట్టకేలకు లాంఛనంగా ప్రారంభయ్యాయి. జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా మహోత్సవాలు భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు మొదలయ్యాయి. ఒలింపిక్స్ క్రీడలను జపాన్ చక్రవర్తి నరహిటో ప్రారంభించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం 1000 అతిథుల సమక్షంలో ఆరంభోత్సవం జరిగింది. భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ భారత జెండాని పట్టుకుని భారత బృందాన్ని నడిపించారు. 203 దేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేల మంది అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో సత్తాచాటేందుకు సిద్దంగా ఉన్నారు. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటే అథ్లెట్లకి భారత ఒలింపిక్ సంఘం నగదు పురస్కారాలని ప్రకటించింది. స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది. అలానే టోక్యోలో ఉన్న అథ్లెట్లకి రోజువారి భత్యం కింద రూ.3,723 ఇవ్వనున్నారు. -
ద్యుతి చాంద్‌కు ప్రధాని శుభాకాంక్షలు
భువనేశ్వర్: టోక్యోలో జరగనున్న ఒలింపిక్ క్రీడలకు ఎంపికైన రాష్ట్ర క్రీడాకారిణి స్ప్రింటర్ ద్యుతి చాంద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్సులో ఆమెతో మాట్లాడి ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించి భారత దేశానికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి. ఒలింపిక్ క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్లు పరుగు పందెంలో ద్యుతి చాంద్ పాల్గొంటుంది. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడం ఆమెకి వరుసగా ఇది రెండో సారి. -
జాతీయ గీతానికి అవమానం! ఆమెది తలపొగరేనా?
ఆమెది మామూలు తలపొగరు కాదు. తిక్క కుదర్చాల్సిందే. ఇంతకు ముందు కూడా ఇలాగే చేసింది. జాతీయ గీతం అంటే ఆమెకు లెక్కే లేదు. దేశమంటే గౌరవమూ లేదు. ముందు ఆమెను ఒలింపిక్స్‌కు పోనివ్వకుండా అడ్డుకోండి.. ఇది యూఎస్ ఒలింపిక్స్ కమిటీకి చేరుతున్న ఫిర్యాదులు. హామర్ థ్రో క్రీడాకారిణిగా ఒలింపిక్స్‌కు వెళ్లబోతున్న గ్వెన్ బెర్రీని.. అక్కడి ప్రజలు అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే.. న్యూయార్క్: శనివారం నాడు యూఎస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒలింపిక్ ట్రయల్స్ జరిగాయి. హమర్ థ్రో విభాగంలో మూడో ప్లేస్‌లో నిలిచింది 32 ఏళ్ల గ్వెన్ బెర్రీ. ఆపై మెడల్స్ బహుకరణ తర్వాత.. జాతీయ గీతం ప్రదర్శించిన టైంలో పోడియం వద్ద ఆమె తలబిరుసు ప్రదర్శించింది. ఆ టైంలో ఆమె మిగతా ఆటగాళ్లకు వ్యతిరేక దిశలో నిలబడింది. పైగా ఏ మాత్రం గౌరవం లేకుండా.. నడుం మీద చెయ్యి వేసుకుంది. జాతీయ గీతం అంటే ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరించింది. అంతకు ముందు నెత్తి మీద నల్ల గుడ్డతో నిరసన కూడా వ్యక్తం చేసింది. అందుకే ఆమె మీద అమెరికన్లు మండిపడుతున్నారు. నాకంత ఓపిక లేదు దీనిపై బెర్రీ వివరణ ఇచ్చుకుంది. ఐదు నిమిషాలు తమను ఎండలో ఎదురుచూసేలా చేశారని, అందుకే అలా చేశానని చెప్పింది. ఇక బెర్రీ చేష్టలపై దుమారం చెలరేగింది. రాజకీయ నేతలంతా ఆమెపై విరుచుకుపడ్డారు. మరోవైపు శాంతియుత నిరసన ప్రదర్శన కావడంతో వైట్ హౌజ్ కూడా ఆమె తప్పును మన్నించినట్లు ప్రకటించింది. అయినా విమర్శలు మాత్రం ఆగట్లేదు. ఆమెను ఒలింపిక్స్‌కు వెల్లనీయకుండా అడ్డుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ యూఎస్ ఒలింపిక్స్ కమిటీకి పలువురు మెయిల్స్ పెడుతున్నారు. “I’m here to represent those … who died due to systemic racism. That’s why I’m going. The anthem doesn’t speak for me, it never has.” - @MzBerryThrows Gwen, you got so much love coming from me 🤍 https://t.co/haoDJdavO8 — Morolake Akinosun™ (@MsFastTwitch) June 29, 2021 కొనసాగుతున్న నిరసన కానీ, ఆమె ఉద్దేశం అది కానే కాదు. అది నిరసన. నల్ల జాతీయలపై అమెరికాలో జరుగుతున్న దాడులు, కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే ఆమె ఆ పని చేసింది. ఆ టీ షర్ట్ మీద యాక్టివిస్ట్ అథ్లెట్ అని రాసి ఉంటుంది. పైగా బెర్రీకి ఇది కొత్తేం కాదు. ఇంతకు ముందు 2019లో పాన్ అమెరికన్ గేమ్స్ సందర్భంగా జాతీయ గీతం ప్రదర్శితమైన సందర్భంలో పిడికిలిని బిగించి తన ఉద్దేశ్యాన్ని చాటింది. ఆ టైంలో ఆమె చేష్టలతో స్పాన్సర్షిప్ కంపెనీలు దూరమయ్యాయి. 12 నెలల పాటు ఆమెపై వేటు పడింది. అయినా ఆమె జాతి వివక్ష వ్యతిరేక నిరసనలు ఆపనంటోంది బెర్రీ. తాజా పరిణామాల నేపథ్యంలో ‘నాతో ఆటలు ఆపండి’అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందామె. ఇక జాతి.. వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం ఇలాంటి శాంతియుత ప్రదర్శనలకు అమెరికాలో అనుమతి ఉందని, అందుకే ఆమెపై ఎలాంటి చర్యలు ఉండబోవని యూఎస్ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆమె ఒలింపిక్స్ ప్రయాణం సాఫీగా సాగనుంది. కానీ, టోక్యో ఒలింపిక్స్ వేదికపై మాత్రం ఇలాంటివి కుదరవు. రూల్ నెంబర్ 50 ప్రకారం.. ఎలాంటి నిరసనలకు అంతర్జాతీయ ఆటల పోటీల్లో చోటు లేదు. చదవండి: ఎట్టకేలకు దిగొచ్చిన ఫేస్బుక్ -
Tokyo Olympics: కరోనా కలకలం.. ఫస్ట్ కేసు గుర్తింపు!
సమ్మర్ ఒలింపిక్స్ 2020(2021)లో కరోనా కలకలం మొదలైంది. వేడుకలకు ఐదు వారాల ముందే ఆటగాళ్లలో మొట్టమొదటి కేసును అధికారులు గుర్తించారు. టోక్యో గడ్డపై అడుగుపెట్టిన ఉగాండాకు చెందిన ఓ అథ్లెట్‌కు కరోనా పాజిటివ్ సోకడంతో అంతా ఉలిక్కి పడ్డారు. టోక్యో: ఒలింపిక్స్ కోసం శనివారం రాత్రి ఎనిమిది మందితో కూడిన ఉగాండా టీం టోక్యోలోని నారిటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగింది. ఆ మరుసటి రోజు వీళ్లు ఆతిథ్య పట్టణం ఒసాకాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈలోపు ఆ బృందానికి టెస్ట్‌లు నిర్వహించగా.. ఓ ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని అటు నుంచి అటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వ్యాక్సిన్ వేసుకున్నా.. అయితే ఉగాండా టీంలోని అథ్లెట్లంతా చాలా రోజుల క్రితమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. బయలుదేరే ముందు చేసిన టెస్టుల్లో అందరికీ నెగెటివ్ నిర్ధారణ అయ్యింది కూడా. అయినా కూడా ఆ అథ్లెట్‌కు కరోనా ఎలా సోకిందనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఆ ఆటగాడి పేరును వెల్లడించేందుకు అధికారులు ఇష్టపడడం లేదు. ఇక జపాన్‌లో అంతర్జాతీయ ప్రయాణికులకు రెండువారాల క్వారంటైన్ అమలులో ఉన్నప్పటికీ.. ఒలింపిక్స్ ప్లేయర్స్ కోసం ఆ నిబంధనను మార్చారు. వ్యాక్సిన్ వేయించుకోకున్నా ఫర్వాలేదని పేర్కొంటూ.. బయో బబుల్స్, సోషల్ డిస్టెన్స్ పాటించడం, రోజూవారీ పరీక్షల్లో పాల్గొన్నా సరిపోతుందని పేర్కొంది. విమర్శలు.. కరోనా టైంలో ఒలింపిక్స్ నిర్వాహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. వేల మంది ఆటగాళ్ల మధ్య కరోనాను ఎలా కట్టడి చేస్తారని మండిపడుతున్నారు. ఇక తాజా పరిణామం(ఉగాండా ఆటగాడికి పాజిటివ్)తో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఈసారి ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం టోక్యో ఒలింపిక్స్ కమిటీ భేటీ కానుంది. చదవండి: కండోమ్‌లు ఇక ఇంటికి తీసుకెళ్లండి -
Milka Singh: ‘ఫ్లయింగ్ సిఖ్’ అయ్యాడిలా...
పాకిస్తాన్ దిగ్గజ అథ్లెట్ అబ్దుల్ ఖాలిఖ్. అప్పట్లో ఆయనకు ఆసియాలోనే అత్యంత వేగవంతమైన రన్నర్‌గా పేరుంది. అంతటి పరుగు వీరుడ్ని అది కూడా వారి గడ్డమీదే ఓడించిన ఘనత మన సింగ్‌ది. 1960లో జరిగిన ఇండోృపాక్ స్పోర్ట్స్ మీట్లో 200 మీటర్ల పరుగులో మిల్కా అతన్ని ఓడించి పసిడి పట్టాడు. సింగ్ పరుగుకు ముగ్ధుడైన అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్... ‘ఫ్లయింగ్ సిఖ్’ బిరుదుతో మిల్కాను సత్కరించారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో మరో రెండు స్వర్ణాలు (400 మీ., 4్ఠ400 రిలే) సాధించాడు. 1964లో రిటైరైన మిల్కా ఆర్మీ ఉద్యోగాన్ని కూడా వదిలేసి పంజాబ్ రాష్ట్రంలోనే క్రీడాధికారిగా ఉన్నత ఉద్యోగం చేశాడు. అతని జీవిత గాథతో బాలీవుడ్లో తెరకెక్కిన ‘బాగ్ మిల్కా బాగ్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. -
ఈ క్రికెటర్లో పూర్తి అథ్లెట్‌ను చూశాను: టీమిండియా ఫీల్డింగ్ కోచ్
భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ టీమిండియా ఆటగాడు శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. తాను ఇటువంటి క్రికెటర్‌ను చూడలేదంటూ కితాబిచ్చాడు. కాగా ఐపీఎల్ రాణించడంతో వెలుగులోకి వచ్చిన గిల్ జాతీయ జట్టులోనూ సత్తా చాటి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ జాబితాలో గిల్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. శుభమన్ గిల్ ఒక పూర్తి అథ్లెట్: భారత ఫీల్డింగ్ కోచ్ కేవలం ఏడు టెస్టుల అనుభవంతో శుభమన్ అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా కొత్తవాడనే చెపాలి. గత కొన్ని సంవత్సరాలుగా టెస్ట్ ఓపెనర్లకు ఇంగ్లండ్ పిచ్‌లు అంతటి అనుకూలం కాదు. పైగా ఈ మెగా ఈవెంట్లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నెర్ లాంటి పేసర్లని ఎదుర్కొనే గిల్ రాణించాల్సి ఉంటుందని శ్రీధర్ తెలిపారు. గిల్ గురించి మాట్లాడుతూ.. '' అతను సన్నగా పొడవైనవాడు, గ్రౌండ్‌లోనే చురుకుగా కదలడం, బ్యాటింగ్ పద్ధతిలోనూ లోపాలు లేవు, అలాగే ఫీల్డింగ్ పరంగానూ ఆకట్టుకుంటున్నాడు. ఇలా నేను చూసిన క్రికెటర్లలో పూర్తి అథ్లెట్ అతనేనని భావిస్తున్నట్లు'' టైమ్స్ ఆఫ్ ఇండియాతో చాట్‌లో అన్నారు. ఈ నెలాఖరులో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడినప్పుడు చాలా మంది కళ్ళు శుబ్‌మన్ గిల్‌పై ఉండనున్నాయి. ఇదిలావుండగా.. డబ్ల్యుటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ వెళ్లనుంది. విరాట్ కోహ్లి జట్టు అక్కడికి వెళ్లిన తర్వాత 10 రోజుల క్వారంటైన్లో గడపనున్నారు. అందువల్ల, కివీస్‌పై అంతిమ యుద్ధానికి సిద్ధం కావడానికి వారికి ఎక్కువ సమయం లభించదు. చదవండి: దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు -
హబ్బీ అంటే నువ్వేరా అబ్బీ!
ఊఫ్! సెమీస్‌లో సెరీనా డౌన్ అయ్యారు! కానీ మొన్న చూడాలి. క్వార్టర్ ఫైనల్స్‌లో తన ప్రత్యర్థి సిమోవా హ్యాలెప్ను నాకౌట్ చేస్తుంటే సెరెనా భర్త అలెక్స్ మురిసిపోయారు. ఆరోజు ఆయన వేసుకున్న వైట్ టీ షర్ట్ సెరెనా గుండెల్లో పూలు పూయించే ఉండాలి. ఆ టీ షర్ట్‌పై రాకెట్ పట్టుకుని ఉన్న సెరెనా ఇలస్ట్రేషన్ ఉంది! అలెక్స్ వేసుకున్న టీ షర్ట్ మీది సెరెనా బొమ్మ పక్కనే పెద్ద అక్షరాలతో ‘గ్రేటెస్ట్ ఫిమేల్ అథ్లెట్’ అని రాసి ఉంది. ఫిమేల్ అనే మాటపై అడ్డంగా ఇంటూ కొట్టి ఉంది. అది ఓ కంపెనీ తయారు చేసిన టీ షర్ట్. కొట్టేయడం ఎందుకంటే ఫిమేల్ అనే మాట సెరెనాకు నచ్చదు.‘గ్రేట్ అథ్లెట్స్ ఉంటారు కానీ, గ్రేట్ ఉమెన్ అథ్లెట్స్ అంటూ ఎక్కడా ఉండరు’ అని సెరెనా కొన్నేళ్ల క్రితం వాదనగా అన్న ఆ మాట కోట్గా ప్రసిద్ధి చెందింది. అది దృష్టిలో పెట్టుకునే ఆ టీషర్ట్ కంపెనీ ఆ విధంగా ఇంటూ కొట్టినట్లున్న కాప్షన్‌తో షర్ట్‌ను డిజైన్ చేసింది. దానిని అలెక్స్ ధరించి ఆమె ఆట చూడటానికి వచ్చారు. ‘నువ్వు కరెక్ట్’ అని భార్యకు సంకేతం ఇవ్వడం అది. భార్య బొమ్మ ఉన్న షర్ట్‌ని వేసుకొచ్చాడంటే.. ‘నువ్వు గెలిచి తీరతావ్’ అని చెప్పడం అది. భర్త అంత ప్రోత్సాహం ఇస్తూ కళ్లెదుట కనిపిస్తుంటే సెమీస్‌ను కూడా గెలిచేస్తారని సెరెనా అభిమానులు అనుకున్నారు. అయితే నవోమీ గెలిచారు. గురువారం సెమీస్‌లో సెరెనా ఓడిపోయినప్పటికీ అదేమీ పెద్దగా బాధించే విషయం అవలేదు అలెక్స్‌కి. ‘బాగా ఆడావ్’ అని అన్నారు. అలెక్స్ (అలెక్సిస్ ఒహానియన్) అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యూర్, ఇన్వెస్టర్. ‘రెడిట్’ కంపెనీ ఆయనదే. సెరెనాతో పెళ్లి కాకముందు సెరెనాకు పెద్ద ఫ్యాన్ అతడు. ప్రేమించి, ‘విల్యూ మ్యారీ మీ’ అని ప్రపోజ్ చేసి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నారు. ‘బ్లాక్ అండ్ వైట్. రెడిట్ టు ఫైట్’ అని ఆ స్థాయిలోని ఫ్రెండ్స్ కూడా అతడిని ఆట పట్టించారని అంటారు. అది తెలిసి సెరెనా కూడా నవ్వుకున్నారట. ఇప్పుడు ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. సెరెనా టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఆయన మరింత హ్యాపీగా ఉంటారు. మూడేళ్ల కూతురు ఒలింపియా తండ్రితో కలిసి తల్లి ఆటను చూస్తూ, మూడ్‌ని బట్టి చప్పట్లు కొడుతుంటుంది. ఆ దృశ్యం అలెక్స్‌కి మరింత ఆనందాన్నిస్తుందట. 2017 జనవరి 1 ఆక్లాండ్‌లో ఉన్నారు సెరెనా అలెక్స్. న్యూజిలాండ్ జనాభా మొత్తం జనవరి ఫస్ట్ కోసం ఆక్లాండ్ వచ్చినట్లుగా ఉన్నారు ఆ రోజు. ఒకరికొకరు తగులుకుంటూ తిరుగుతున్నారు. అప్పుడే వాళ్లొక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఏడాదే పెళ్లి చేసుకోవాలని. అప్పుడు కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ చూడ్డానికే సెరెనాతో కలిసి యు.ఎస్. నుంచి ఆక్లాండ్ వెళ్లారు అలెక్స్. చదవండి: (చేజారిన ఆశలు : సెరెనా భావోద్వేగం) -
ఒలింపిక్ పతక విజేత కన్నుమూత
వాషింగ్టన్: అలనాటి మేటి అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత చార్లీ మూర్ (అమెరికా) కన్ను మూశారు. 91 ఏళ్ల చార్లీ మూర్ కొంతకాలంగా పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి ఆయన మృతి చెందినట్లు ప్రపంచ అథ్లెటిక్స్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి వేదికగా జరిగిన 1952 ఒలింపిక్స్‌లో బరిలో దిగిన ఆయన 400 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. అంతేకాకుండా 1600 మీటర్ల రిలే ఈవెంట్లో పాల్గొన్న మూర్ అమెరికాకు రజత పతకాన్ని సాధించి పెట్టారు. అనంతరం జరిగిన బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌లో పాల్గొని 440 మీటర్ల హర్డిల్స్‌లో 51.6 సెకన్లలో గమ్యాన్ని చేరి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. 1978లో కార్నెల్స్ అథ్లెటిక్ హాల్ ఆఫ్ ఫేమ్‌తోపాటు 1999లో యూఎస్ఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ హాల్ ఫేమ్‌లో మూర్ చోటు దక్కించుకున్నారు. కెరీర్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మూర్ వ్యాపారవేత్తగా, ఇన్వెస్టర్‌గా, అథ్లెటిక్స్ పాలనాధికారిగా పలు బాధ్యతలను నిర్వర్తించారు. తన కెరీర్‌కు తోడ్పాటు అందించిన మెర్సెర్స్‌బర్గ్ అకాడమీకి తాను సాధించిన రెండు ఒలింపిక్ పతకాలను విరాళంగా ఇచ్చారు. హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు మూర్ ‘13 స్టెప్ అప్రోచ్’ టెక్నిక్‌ను సూచించారు. దీనిని అథ్లెట్స్ ఇప్పటికీ హర్డిల్స్‌లో ఉపయోగిస్తుండటం విశేషం. (చదవండి: ధోనిపై విమర్శలకు, ఫ్యాన్ సమాధానం) -
ఇద్దరిలో ఎవరు గొప్ప.. మీరే చెప్పండి
న్యూయార్క్ : ఒకరు చూస్తే రెండుసార్లు ఒలింపిక్స్‌లో పోటీ పడిన అథ్లెట్, మరొకరేమో మోడల్ కమ్ అథ్లెట్.. వీరిద్దరు చేసిన వర్కవుట్ చాలెంజ్‌లో ఎవరు విజేతగా నిలిచారనేది మాత్రం వీడియోలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మిడిల్ ట్రాక్ డిస్టెన్స్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న అమెరికన్ అథ్లెట్ నిక్ సిమ్మండ్స్ సొంతంగా ఒక యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తున్నాడు. ఆటకు రిటైర్మంట్ ప్రకటించిన తర్వాత యూట్యూబ్ చానెల్ ద్వారా ఫిటనెస్పై సూచనలు, సలహాలు అందిస్తున్నాడు. తాజాగా తన లాగా వర్కవుట్ చేయాలంటూ ఇన్స్టాగ్రామ్ మోడల్ కమ్ అథ్లెట్ క్లారీ పి థామస్‌ను ఆహ్వానించాడు. నిక్ అడిగిన వెంటనే క్లారీ థామస్ వర్కవుట్ చాలెంజ్‌కు ఒప్పుకుంది. కాగా క్లారీ థామస్‌కు ఇన్‌స్టాలో దాదాపు 7.7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సహజంగానే మంచి అథ్లెట్ అయిన ఆమె వర్కవుట్స్‌లో నిక్‌ను మించి ప్రదర్శన నమోదు చేసింది. ' నేను సహజంగానే అథ్లెట్‌ను.. మోడల్‌గా కంటే అథ్లెట్‌గా ఉండడానికే ఎక్కవగా ఇష్టపడుతా' అంటూ పేర్కొంది. పుల్ అప్స్ నుంచి మొదలుకొని రోఫ్ క్లైంబింగ్ వరకు క్లారీ నిక్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే ఇద్దరిలో ఎవరు గెలిచారనేది మాత్రం వీడియో చూసి తెలుసుకోవాల్సిందే. నిక్ ఈ వీడియోనూ తన యూట్యూబ్ చానెల్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 2లక్షలకు పైగా వీక్షించారు. ఇద్దరు పోటాపోటీగా వర్కవుట్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 'ఇది చూడడానికి ఫన్‌గా అనిపిస్తున్నా.. మీరు మాకు ఆదర్శంగా నిలిచారు' అంటూ కామెంట్లు పెడతున్నారు. (జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి) (ఆయన నాపై అత్యాచారం చేశారు) -
‘గోల్డెన్’ గ్రాఫ్...
టెన్నిస్ ప్రపంచంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజయం సాధించడమే పెద్ద ఘనత. ఒక్క ట్రోఫీతోనే జీవితకాలం సంతృప్తి పొందేవారు ఎందరో. అలాంటిది ఒకే క్యాలెండర్ సంవత్సరంలో నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకోవడం అంటే దిగ్గజాలకు మాత్రమే సాధ్యం. చరిత్రలో కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఫీట్‌ను చేసి చూపించగా... వారిలో జర్మనీ స్టార్ స్టెఫీ గ్రాఫ్ ప్రదర్శన మరింత ప్రత్యేకం. 1988లో స్టెఫీ గ్రాఫ్ నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు అదే ఏడాది ప్రతిష్టాత్మక సియోల్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధించింది. తద్వారా ఇలాంటి అరుదైన రికార్డు సృష్టించిన ఏకైక ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. స్టెఫీ గ్రాఫ్ సృష్టించిన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ రికార్డుకు మరో ప్రత్యేకత ఉంది. స్టెఫీకి ముందు ఈ ఫీట్ చేసిన మిగతా నలుగురు 1978కి ముందు చేసినవారే. 1978 నుంచే మూడు సర్ఫేస్‌లలో గ్రాండ్‌స్లామ్ జరుగుతోంది. అప్పటివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ పచ్చికపై, యూఎస్ ఓపెన్ మట్టి కోర్టులపై జరిగేవి. తర్వాత ఈ రెండు వేదికలు కూడా హార్డ్ కోర్టులుగా (స్వల్ప తేడా ఉంటుంది) మారాయి. అలా అన్ని తరహా కోర్టుల్లో గ్రాండ్‌స్లామ్ సాధించిన ఘనత స్టెఫీకే చెల్లింది. తర్వాతి రోజుల్లో ఇలా గెలవడం అసాధ్యంగా మారిపోవడంతో ఒకే ఏడాది కాకపోయినా... ఏదో ఒక సమయంలో గ్రాండ్‌స్లామ్ గెలవడమే గొప్పగా మారింది. దానినే టెన్నిస్ ప్రపంచం ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ అంటూ వ్యవహరించడం మొదలుపెట్టింది. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టెఫీ గ్రాఫ్ తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను 1987లో ఫ్రెంచ్ ఓపెన్ రూపంలో సాధించింది. 1983లో తొలిసారి ‘మేజర్’ బరిలోకి దిగినా తొలి నాలుగేళ్లలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్ మాత్రమే. 1987 ఆగస్టు 17న తొలిసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్టెఫీ నంబర్‌వన్‌గా నిలిచింది. ఆపై ఆమె సాధించిన రికార్డులు, ఘనతలకు లెక్కే లేదు. నాలుగుకు నాలుగు... ర్యాంకుల్లో అగ్రస్థానంతో ఏడాదిని మొదలుపెట్టిన స్టెఫీ ‘గ్రాఫ్’ అమిత వేగంతో ఎదురు లేకుండా దూసుకుపోయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో 6–1, 7–6 (7/3)తో నాటి అమెరికా దిగ్గజం క్రిస్ ఎవర్ట్‌ను ఓడించి టైటిల్ అందుకుంది. టోర్నీలో ఆమె ఒక్క సెట్ కూడా ఓడిపోలేదు. ఆపై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఫ్రెంచ్ ఓపెన్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో కేవలం 34 నిమిషాల్లో 6–0, 6–0తో నటాషా జ్వెరేవా (సోవియట్ యూనియన్)ను చిత్తుచిత్తుగా ఓడించింది. 1911 తర్వాత ‘డబుల్ బేగల్’తో ఒక గ్రాండ్‌స్లామ్ ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి. టెన్నిస్ పరిభాషలో ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా సెట్ గెలిస్తే బేగల్ అంటారు. వింబుల్డన్‌లో స్టెఫీకి మరో విజయం దక్కింది. ఫైనల్లో స్టెఫీ 5–7, 6–2, 6–1తో వరుసగా ఆరుసార్లు (1982–87) టైటిల్ సాధించి జోరు మీదున్న మార్టినా నవ్రతిలోవా (అమెరికా)ను బోల్తా కొట్టించడంతో ఈ జర్మనీ అమ్మాయి పేరు మారుమోగిపోయింది. ఇక సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ ఫైనల్లో స్టెఫీ 6–3, 3–6, 6–1తో గాబ్రియెలా సబాటిని (అర్జెంటీనా)పై నెగ్గడంతో ఆమె ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత పూర్తయింది. ఒలింపిక్ వేటలో... యూఎస్ ఓపెన్ ఫైనల్ ముగిసిన తర్వాత వారం రోజుల్లోనే దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఒలింపిక్స్ జరిగాయి. ఇన్ని ఘనతలు సాధించిన తర్వాత ఇంత తక్కువ వ్యవధి ఉంటే ఈతరం ఆటగాళ్లు విశ్రాంతి పేరుతో ఒలింపిక్స్‌కే చివరి నిమిషంలో డుమ్మా కొట్టేవారేమో. కానీ స్టెఫీ అలా చేయలేదు. న్యూయార్క్ నుంచి హడావుడిగా స్వదేశం వెళ్లి ఒకే ఒక రోజు విరామం తర్వాత తమ పశ్చిమ జర్మనీ దేశపు ఇతర అథ్లెట్లతో కలిసి ఒలింపిక్స్ వెళ్లే విమానం ఎక్కింది. దేశం కోసం సాధించే పతకానికి తన దృష్టిలో చాలా విలువ ఉందని ఆమె చూపించింది. గ్రాండ్‌స్లామ్ ఫామ్‌ను ఒలింపిక్స్‌లోనూ కొనసాగిస్తూ దూసుకుపోయింది. ఒక్క క్వార్టర్ ఫైనల్లో మాత్రం ఆమెకు కాస్త పోటీ ఎదురైంది. సోవియట్ యూనియన్‌కు చెందిన లారిసా సావ్చెంకోకు ఒక సెట్ చేజార్చుకొని చివరకు మ్యాచ్ గెలుచుకుంది. ఫైనల్లో ఆమెకు మరోసారి అర్జెంటీనా అందగత్తె సబాటిని ఎదురైంది. కొద్ది రోజుల క్రితమే హోరాహోరీగా సాగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆమెను ఓడించిన గ్రాఫ్‌కు ఈసారి ఎదురులేకుండా పోయింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో స్టెఫీ 6–3, 6–3తో సబాటినిపై గెలుపొంది శిఖరాన నిలిచింది. స్టెఫీ గ్రాఫ్ సాధించిన అద్భుతాన్ని పొగుడుతూ ప్రపంచ మీడియా తొలిసారి ‘గోల్డెన్ స్లామ్’ అనే పదాన్ని ఉపయోగించింది. అది ఆమె కోసమే పుట్టిందన్నట్లుగా మరో ప్లేయర్ కోసం దానిని వాడాల్సిన అవసరం లేకపోయింది. పురుషులు, మహిళల విభాగాల్లోనూ ఇప్పటికీ మరెవరూ అందుకోలేని ఘనతగా ‘గోల్డెన్‌స్లామ్’ నిలిచిపోయింది. -
మనం మరచిన మల్లయోధుడు
ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్... ఈ తరంలో చాలామందికి తెలియని పేరు! గడిచిపోయిన గతానికి... మరచిపోయిన మల్లయోధుడే జాదవ్! స్వాతంత్య్రం రాకముందే కుస్తీ క్రీడలో ఆరితేరాడు. రాటుదేలాక ఒలింపిక్స్‌లో పోటీపడ్డాడు. దీనికంటే ముందు ఆర్థిక సమస్యలతోనూ తలపడ్డాడు. అయినా సరే చివరకు విశ్వ క్రీడల్లో సత్తా చాటాడు. తన రెండో ఒలింపిక్స్ ప్రయత్నంలో కాంస్యం సాధించాడు. స్వతంత్ర భారతావని తరఫున వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి చేరాడు. ఇప్పుడైతే దేశంలో ఏ మూలనో ఉన్నా కూడా ప్రతిభ ఉన్నవారు నిమిషాల నిడివి వీడియోలతోనే వైరల్ అవుతున్నారు. తర్వాత్తర్వాత ‘రియల్ హీరో’లూ అవుతున్నారు. కానీ దేశానికి స్వేచ్ఛావాయువులొచ్చిన తొలి నాళ్లలో రియల్ హీరో అయినా... ఖాషాబా వైరల్ మాత్రం కాలేకపోయాడు. ఇది అలనాటి కాలమహిమ! అందుకే రోజులో గంటల తరబడి మట్టిలో కసరత్తు చేసి ఒలింపిక్స్ లాంటి విశ్వక్రీడలకు 1948లోనే అర్హత సాధించగలిగాడు. ఇప్పుడెన్నో వసతులు... ‘టాప్’లాంటి పథకాలున్నాయి. అప్పుడేవీ లేవు. కాబట్టే అర్హత సాధించినా... ఒలింపిక్స్ బరిలోకంటే ముందు ఆర్థిక సవాళ్లతోనే జాదవ్ పట్టు పట్టాల్సి వచ్చింది. విలేజ్‌లో విజేయుడు... మహారాష్ట్రలోని అప్పటి కొల్హాపూర్ సంస్థానంలోని గోలేశ్వర్ అనే మారుమూల పల్లెకు చెందిన ఖాషాబా మల్లయుద్ధంలో సింహబలుడు. బాల్యంలోనే ప్రత్యర్థుల్ని ‘మట్టి’కరిపించే క్రీడలో తెగ కుస్తీ పట్టేవాడు. ఇలా ఊరు–వాడా గెలిచాక ఓ రోజు జాతీయ చాంపియన్‌నే ఓడించడంతో విశ్వక్రీడలకు అర్హత పొందాడు. 1948లో బెంగాల్‌కు చెందిన జాతీయ ఫ్లయ్ వెయిట్ చాంపియన్ నిరంజన్ దాస్‌ను కంగుతినిపించి అదే ఏడాది లండన్ ఒలింపిక్స్‌కు సై అన్నాడు. కానీ అణాలతో, నాణేలతో గడిచే ఆ రోజుల్లో రూపాయలు, వేలు వెచ్చించి వెళ్లేదెట్లా? కొల్హాపూర్ సంస్థానాధీశుడు దయతలచడంతో జాదవ్ లండన్ పయనమయ్యాడు. పాల్గొన్న తొలి విశ్వక్రీడల్లో ఆరో స్థానంతో ఖాషాబా టాప్–10లో నిలిచాడు. మరో నాలుగేళ్లకు హెల్సింకి (1952) ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా... మళ్లీ కాసుల కష్టాలు ‘హాయ్’, హలో అని పల కరించాయి. విరాళాలతో, తెలిసిన వారి చేయూతతో కిట్ కొనుక్కునే పైసలే పోగయ్యాయి. మరి పయనానికి డబ్బులెక్కడ్నించి తేవాలి. జాదవ్ ప్రతిభా, పాటవం తెలిసినా కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్. ఖర్దీకర్ తన ఇంటిని తాకట్టు పెట్టి రూ. 7000 జాదవ్ చేతుల్లో పెడితే అతను... కాంస్య పతకం పట్టుకొచ్చాడు. నిజానికి ఆ మెగా ఈవెంట్లో అతనికి స్వర్ణం కాకపోయినా... రజతమైనా దక్కేది. కానీ వెంటవెంటనే బౌట్‌లోకి దిగాల్సి రావడం, ఇదేంటనీ దన్నుగా నిలిచి అడిగే భారత అధికారి ఎవరూ లేకపోవడంతో ఏకబికిన వరుసగా బౌట్లు ఆడేయడంతో అలసిసొలసి కాంస్యానికి పరిమితమయ్యాడు. ఖాషాబా నెగ్గిన ఒలింపిక్ పతకం రుణపడి... తలపడి... పతకం గెలిచాక ఖాషాబా కష్టాలు కొంత తీరాయి. కానీ లక్షల్లో నజరానాలొచ్చాయనుకుంటే పొరపాటే. ఇటు రాష్ట్రం నుంచీ, అటు కేంద్రం నుంచీ ప్రోత్సాహకంగా నజరానా కాదు కదా నయాపైసా రాలేదు. ఘనస్వాగతం కూడా లభించలేదు. కానీ ఊర్లో మాత్రం ఈ విజేయుడి పతక ఆగమనానికి 151 ఎడ్లబండ్లతో స్వాగతం పలకడం అప్పట్లో గొప్ప విశేషం. ఇక ఆ తర్వాత టోర్నీలు ఆడగా వచ్చిన డబ్బులు, బతుకుదెరువు కోసం చేసిన కొలువుతోనే తన ప్రిన్సిపాల్ ఇంటిపై ఉన్న రుణాన్ని జాదవ్ తీర్చేశాడు. తర్వాత మహారాష్ట్ర పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఏళ్లకు ఏళ్లు ఎదుగుబొదుగు (పదోన్నతి) లేని ఉద్యోగం చేశాడు. 1984లో 58 ఏళ్ల ప్రాయంలో ఆగస్టు 14న మోటర్ సైకిల్ ప్రమాదంలో ఖాషాబా జాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. జాతికి తెలియదు సరేకానీ... ఈ జాతి రత్నం గురించి భారతీయులెవరికీ అంతగా తెలియకపోవడం వింతేమీ కాదు. కానీ తొలి వ్యక్తిగత పతకం అందించిన చాంపియన్ గురించి భారత ప్రభుత్వంగానీ, మహారాష్ట్ర ప్రభుత్వంగానీ పట్టించుకోకపోవడమే విడ్డూరం. అందుకేనే మో అతను బతికుండగా ఏ గుర్తింపూ దక్కలేదు. ఏ పురస్కారం అతని చేతికి అందలేదు. చివరకు చనిపోయాక కూడా అలసత్వమే చేశారు పాలకులు. జాదవ్ కన్నుమూసిన దశాబ్దం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం 2004లో ‘శివ్ ఛత్రపతి’ అవార్డును అతని కుటుంబసభ్యులకు అందజేయగా... తీరిగ్గా కేంద్రం అర్జున అవార్డును (2000)లో ప్రదానం చేసింది. జాతి క్షోభించే తప్పును ఇప్పటికీ భారత ప్రభుత్వం సవరిం చుకోనేలేదు. అందుకే ఒలింపిక్ పతకం గెలిచినా... ‘పద్మశ్రీ’ వరించని ఏకైక భారత క్రీడాకారుడిగా ఇప్పటికీ మిగిలిపోయాడు. -
అంజూ జార్జ్ యూటర్న్‌పై బీజేపీ ఫైర్
బెంగళూర్ : అథ్లెట్ అంజూ జార్జ్ తాను బీజేపీలో చేరలేదని ప్రకటించడం పట్ల కాషాయ పార్టీ మండిపడింది. పార్టీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప సమక్షంలో బీజేపీ జెండాను అందిపుచ్చుకున్న అంజూ జార్జ్ పార్టీలో చేరిక విషయంపై మాటమార్చడం విస్మయం కలిగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర మీడియా కన్వీనర్ ఎస్ శాంతారాం అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగ వేదికపై పార్టీ అధ్యక్షుడి నుంచి జెండాను అందుకోవడానికి అర్ధం ఏమిటో ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. ఇదే వేదికపై అంజూ జార్జ్ చేరికను యడ్యూరప్ప స్వయంగా ప్రకటించారని చెప్పారు. కాగా తాను బీజేపీలో చేరలేదని అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ అథ్లెట్ అంజూ జార్జ్ వెల్లడించారని వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో ఈనెల 6న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యుల సంఖ్యను 20 శాతం మేర పెంచాలనే లక్ష్యంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. -
క్రీడాకారిణిగా నటించాలని ఆశ!
సినిమా: ప్రతి మనిషి జీవితం పెళ్లికి ముందు ఆ తరువాతలా ఉంటుంది. అందుకు నటీమణులు అతీతం కాదు. సంచలన నటి సమంత ఆ విషయాన్నే అంటోంది. తనకు అనిపించింది నిర్భయంగా చెప్పేసే నటి సమంత. ఈ సుందరి వివాహం ముందు ఆ తరువాత జరుగుతున్న విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అవేంటో చూద్దాం. వివాహానంతరం మనసుకు ప్రశాంతత లభించింది. పెళ్లికి ముందు నేను నటించిన ప్రతి సన్నివేశాన్ని నేను మానిటరింగ్ చేసుకుని నటించేదాన్ని. బాగా నటించానా అన్నది నాకు నేనే పరిశీలించుకునేదాన్ని. వివాహానంతరం నా భర్త నాగచైతన్య నటించే సన్నివేశాలను మానిటరింగ్ చేస్తున్నాను. తగిన సలహాలు ఇస్తుంటాను. ఇదంతా చూసి నా భర్త నువ్వెందుకు కష్టపడతావు దర్శకుడు చూసుకుంటారుగా అని అంటుంటారు. అయినా నేను ఊరుకోను. భర్త గురించి ఆలోచించడం భార్య బాధ్యత. వివాహానంతరం మా మధ్య ఒక ఒప్పందం చేసుకున్నాం. మేమిద్దం సెలబ్రిటీలమే. మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. మాపై అభిమానుల అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటిని పూర్తి చేయడానికి మంచి కథా చిత్రాల్లోనే కలిసి నటించాలన్నదే ఆ ఒప్పందం. అలా నటించిన చిత్రమే మజిలీ. ఇకపై కూడా వైవిధ్యభరిత కథా చిత్రాలను చేయాలన్నదే నా కోరిక. నిజ జీవితానికి సినిమా జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నాగచైతన్య ఒక సన్నివేశంలో బాగా నటిస్తే ప్రశంసిస్తాను. ఆశించిన విధంగా నటించకపోతే తిట్టేస్తాను. ఇకపోతే నేను నటించే చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటే ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కథలో తల దూర్చను. అదే కథ నచ్చకపోతే ఆ తరువాత ఎన్ని మార్చులు చేసినా నటించడానికి అంగీకరించను. సినీనటిగా ఒక లక్ష్యాన్ని చేరుకున్నాను. సినిమా విషయంలో నా శ్రద్ధ ముందు కంటే ఇప్పుడు ఎక్కువ అయ్యింది. ఐదారు చిత్రాల్లో ఒకే సారి నటించడం కంటే మంచి కథా చిత్రం ఒక్కటి చేస్తే చాలు అని భావిస్తున్నాను. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నా గురించి పలు విమర్శలు ప్రచారం అవుతున్నాయి. అయితే అలాంటి వాటిని పట్టించుకోవడం మానేశాను. తమిళంలో నేను నటించిన సూపర్ డీలక్స్ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇందులో నేను స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా నటించాను. దానిని పలువురు విమర్శిస్తున్నారు. నటిస్తున్నప్పుడు సహ నటుడిపై చేయి వేయడం, ముద్దు పెట్టడం, సన్నిహిత సన్నివేశాల్లో నటించడం, పాత్రకు తగ్గట్టుగా నటించడం నా వృత్తి. ఎందుకంటే నేను నటిని. నటించకుండా ఎలా ఉండగలను. ముందే చెప్పినట్లు, సినిమా జీవితం వేరు, నిజజీవితం వేరు. నిజ జీవితంలో నేను భావోద్రేకాలకు గురవ్వను. అలసిపోను. అందుకు విభిన్నంగా మజిలీ చిత్రంలో నటించాను. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నిజంగానే గ్లిజరిన్ లేకుండా ఏడ్చేశాను. ప్రస్తుతం హీరోయిన్లకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలు వస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ విషయమే. నాకు ఒక క్రీడాకారిణిగా నటించాలన్నది ఆశ. అదే విధంగా దివ్యాంగురాలిగానూ నటించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు విరామం లేకుండా నటిస్తున్నాను. కాస్త నటనకు గ్యాప్ తీసుకుందామంటే సమంతకు అవకాశాలు లేవు అని ప్రచారం చేసేస్తారు. తమిళ చిత్రం 96 రీమేక్‌లో నటించబోతున్నాను. ఇది మేలో సెట్‌పైకి వెళ్లబోతోంది. తాజాగా నటించిన ఓ బేబీ ఎంత చక్కగున్నావే చిత్రం త్వరలో తెరపైకి రానుంది అని నటి సమంత పేర్కొంది. -
రామబాణమ్మ
రామబాణం రయ్యిన వెళుతుంది. గురి తప్పదు. లక్ష్యాన్ని ఛేదిస్తుంది. రామసుబ్బమ్మ కూడా అంతే. డెబ్బయ్ ఏళ్ల వయసులోనూ ఆమె పరుగులు తీస్తూనే ఉన్నారు. పతకాలు సాధిస్తూనే ఉన్నారు. అందుకే ఆమె రామబాణమ్మ. ఆమె స్వప్నమే ఆమెను బాణంలా సంధిస్తోంది. ‘గొప్పగా ఆలోచించాలి, పెద్ద కల కనాలి.. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రమించాలి’ అని అబ్దుల్ కలామ్ చెప్పాడని ఆమె చదవలేదు. కానీ ఆమె పెద్ద కల కంటోంది. డెబ్బై ఏళ్ల వయసులో ఆ కలను నిజం చేసుకోవడానికి సిద్ధమైంది! తాను పుట్టిన ఊరి పేరు విదేశాల రికార్డుల్లో నమోదు కావాలని కలకంటోంది మానికల రామసుబ్బమ్మ. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన రామసుబ్బమ్మ వెటరన్ క్రీడాకారిణిగా ఇప్పటికి ఇరవై పతకాలు సాధించింది. రాబోయే ఆగస్టులో శ్రీలంకలో జరిగే వెటరన్ అథ్లెట్ మీట్ పరుగు పందెంలో విజయం సాధించాలనేది ఇప్పుడామె లక్ష్యం. ఇంతవరకు సాధించిన విజయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు రామసుబ్బమ్మ. కావలి పట్టణం నార్త్ జనతాపేటలో పుట్టిన మానికల రామసుబ్బమ్మది నిరుపేద కుటుంబం. తండ్రి తోటమాలి, తల్లి ఇళ్లలో పనులు చేసేవారు. రామసుబ్బమ్మ ఆరవ తరగతి వరకు విశ్వోదయ గర్ల్స్ హైస్కూల్లో చదివింది. తల్లి అనారోగ్యం కారణంగా పనులకు వెళ్లలేకపోవడంతో రామసుబ్బమ్మ పుస్తకాలను కట్టిపెట్టి, తల్లి చేస్తున్న ఇళ్లలో పనులకు వెళ్లాల్సి వచ్చింది. ఆ మలుపుతో ఆమె జీవితం గానుగెద్దులా అయిపోయిందనే చెప్పాలి. అయితే జీవితాన్ని అదే చట్రంలో తిరగనివ్వకుండా తన నైపుణ్యంతో కొత్త పట్టాలను ఎక్కించుకున్నారు రామసుబ్బమ్మ. భర్త మాలకొండయ్య జవహర్‌భారతి కాలేజ్ మెస్‌లో వంట చేసేవారు. రామసుబ్బమ్మ జనతాపేటలోని టీచర్ల ఇళ్లలో పనులు చేసేవారు. మురుకులు, చెక్కల వంటి తినుబండారాలు చేసి అమ్మేవారు. ఆ సంపాదనతోనే కూతురు జయలక్ష్మిని, కొడుకు మహేశ్‌ని.. ఇద్దర్నీ ఎంఎ. ఎంఈడీ చదివించారు. ‘గోల్డెన్’ స్టూడెంట్! విశ్వోదయ గర్ల్స్ స్కూల్‌కి 2005లో స్వర్ణోత్సవాలు జరిగాయి. ఆ స్వర్ణోత్సవాలు స్కూల్కనే అనుకున్నారు అప్పటికందరూ. అవి రామసుబ్బమ్మ జీవితాన్ని మలుపు తిప్పుతాయని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. చివరికి ఆమె కూడా. స్వర్ణోత్సవాల ఏర్పాట్ల గురించి టీచర్లు మాట్లాడుకోవడం విని, తాను కూడా ఆ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్‌నని, అందులో జరిగే ఆటలపోటీల్లో తాను పాల్గొనవచ్చా అని అడిగారు. అలా మొదలైన రామసుబ్బమ్మ పరుగు పన్నెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్య పతకాలతో నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు మాత్రమే పరిమితమైన ఆమె తొలిసారిగా విదేశాల్లో పోటీలకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అథ్లెట్‌గా తన కెరీర్ ఎలా ప్రారంభమైందీ, ఎలా కొనసాగుతోందీ వివరంగా చెప్పారు రామసుబ్బమ్మ. ‘‘విశ్వోదయ స్వర్ణోత్సవాలు జరుగుతున్నప్పుడు పరుగుపందెంలో పాల్గొని గెలిచాను. అప్పుడు కూడా పోటీలకు బయటకు వెళ్లాలనుకోలేదు. ఆ తర్వాత ఒకసారి నెల్లూరు నుంచి కావలికి రైల్లో వస్తున్నప్పుడు కోటేశ్వరమ్మ, రాజేశ్వరి అనే ఇద్దరు అథ్లెట్లు ఆటల పోటీల గురించి మాట్లాడుకుంటున్నారు. నన్ను పరిచయం చేసుకుని ఆ పోటీలకు నేనూ రావచ్చా అని అడిగాను. అప్పటి నుంచి ఆటల పోటీలకు వాళ్లు వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్లడం మొదలు పెట్టారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మూడు బంగారు పతకాలు, విజయనగరం జిల్లా ఎస్‌కోటలో మూడు బంగారు పతకాలు, నాసిక్‌లో రజతాలు తెచ్చుకున్నాను. పుట్టినప్పటి నుంచి ఒక్క రోజు కూడా పని చేయకుండా కూర్చున్న ఒళ్లు కాదు నాది. ఎంత పనినైనా అవలీలగా చేసేస్తాను. అలాంటిది నాకు పరుగెత్తడం ఒక లెక్క కానే కాదు. నాసిక్‌లో బంగారు పతకంతో వస్తానని మా జనతాపేట వాళ్లంతా అనుకున్నారు. పోటీలకు వెళ్లడానికి వాళ్లలో కొందరు నాకు డబ్బు సాయం కూడా చేశారు. అయితే నాకు భాష రాకపోవడంతో నిర్వాహకులు చెప్పిన సూచనలు అర్థం చేసుకోలేకపోయాను. పక్క వాళ్లు పరుగు ప్రారంభించడం చూసి నేను పరుగందుకున్నాను. అప్పటికే కొంత ఆలస్యం అయిపోయింది. స్వర్ణం జారిపోయింది. రజతంతో వచ్చాను. కావలికి వచ్చిన తర్వాత నన్ను పంపించిన వాళ్లందరూ ‘అయ్యో’ అన్నారు. నేను అధైర్యపడకుండా ఉండడానికి ‘రజతం అయినా తక్కువా! భాష తెలియని చోటుకెళ్లి సాధించావ’న్నారు. కానీ నాకు మాత్రం కొరత ఉండిపోయింది. మళ్లీ అదే నాసిక్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్’ నాలుగు కేటగిరీల్లో బంగారు పతకాలు తెచ్చుకున్న తర్వాత ఆ కొరత తీరింది. ఊరు సన్మానించింది రెండేళ్ల క్రిందట థాయ్‌లాండ్‌లో పోటీలకు వెళ్లడానికి అవకాశం వచ్చింది. నాకు ఎవరో ఒకరు సర్దేవాళ్లేమో, కానీ నాతోపాటు పోటీలకు వచ్చే వాళ్లకు డబ్బు సర్దుబాటు కాక మానుకున్నారు. దాంతో నేనూ వెళ్లలేదు. ఈసారి శ్రీలంక వెళ్తున్నాం. బంగారు పతకాలతో తిరిగొస్తాననే నమ్మకం నాకుంది. గత డిసెంబర్లో మా కావలి పట్టణంలో పెద్దవాళ్లు కొంతమంది కలిసి నాకు సన్మానం చేసి, ‘కావలిరత్న’ అనే బిరుదునిచ్చారు. ఓపికున్నంత కాలం పోటీల్లో పాల్గొనమని ప్రోత్సహించారు. నేను పరుగెత్తగలిగినన్ని రోజులు ఈ పరుగు ఆపను. ఓపిక తగ్గిన తర్వాత జావెలిన్ త్రో కి వెళ్తాను. జావెలిన్ త్రో ప్రాక్టీస్ త్వరలోనే మొదలు పెడతాను. పని చేస్తూనే ఉన్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఏ పనీ లేకుండా గడపలేదు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన తర్వాత మా నాన్నతోపాటు నేను కూడా డీఆర్ గారి (విద్యాసంస్థల స్థాపకులు) తోటలో చెట్లకు నీళ్లు పోసేదాన్ని. మా అమ్మ అనారోగ్యం తర్వాత స్కూలు మానేసి పాచి పనులు చేయడం మొదలుపెట్టాను. స్కూలు టీచర్ల ఇళ్లలో పని చేయడంతో నాకు జ్ఞానం అబ్బింది. ‘డబ్బు శాశ్వతం కాదు, జ్ఞానమే శాశ్వతం, జ్ఞానం బతికిస్తుంది, చదువుని నిర్లక్ష్యం చేయకూడదు’ అని టీచర్లు వాళ్ల పిల్లలకు చెప్పడం విని ఇంటి కొచ్చి నా పిల్లలకు పదే పదే చెప్పేదాన్ని. చదువు లేకపోవడంతో బతకడానికి నేను రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను. మీరు చదువుకుంటే చూడాలని ఉందని చెప్పేదాన్ని. వాళ్లు కూడా అలాగే చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా బతుకు నాదే పిల్లలిద్దరికీ మంచి జీతాలు వస్తున్నా నేను, మా ఆయన వాళ్ల సంపాదన మీద ఆధారపడలేదు. ఈ మధ్య వరకు మా ఇంటి ముందు ఖాళీ స్థలంలో కస్తూరి, నందివర్ధనం, మల్లెపూలు, కనకాంబరాల పూల చెట్లు పెంచి, పూలు అమ్మేదాన్ని. ఇల్లు కట్టుకోవడానికి నేలంతా చదును చేసి మొక్కలు తీసేశాం. ఇప్పుడు కూడా నన్ను ఏదో ఒక పనికి పిలుస్తూనే ఉంటారు. ఆరోగ్యం బాగలేని పెద్ద వాళ్లను చూసుకోవడానికి పిలుస్తుంటారు. వాళ్లకు పసిబిడ్డకు చేసినట్లు అన్ని పనులూ చేస్తాను. పరుగెత్తలేని రోజు, పని చేయలేని రోజు నా జీవితంలో రాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అని ముగించారు రామసుబ్బమ్మ. అల్లుడినీ ప్రోత్సహించారు ఏ తల్లయినా, తండ్రయినా తమకు పుట్టిన పిల్లల భవిష్యత్తు మీద కలలు కంటారు. వాళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారు. కానీ రామసుబ్బమ్మ అల్లుడిని, కోడలిని కూడా చదివించింది. ఎం.ఎ, ఎంఈడీ చదివిన కూతుర్ని పదవ తరగతితో చదువాపేసి పనులు చేసుకుంటున్న కుర్రాడితో పెళ్లి చేసింది. ‘నీ భార్య ఇంత చదువుకుంది, నువ్వు కూడా చదువుకో’ అని అల్లుడు చెంచయ్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చేరే వరకు ఊరుకోలేదు. అతడు బి.ఎ, ఎం.ఎ పూర్తి చేసిన అతడిప్పుడు జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ పిహెచ్డీ చేస్తున్నారు. అలాగే కోడలు మహేశ్వరి చేత పెళ్లయిన తర్వాత బీఈడీ చేయించారు. ఇప్పుడామె హిందీ టీచర్. మనిషికి జీవితాన్నిచ్చేది జ్ఞానమేననే ఆమె ఫిలాసఫీని పిల్లల ద్వారా నిరూపించుకున్నారామె. అలాగే ఆమెకి మిగిలి ఉన్న విదేశీ బంగారు పతకం కల కూడా నెరవేరాలని కోరుకుందాం. – వాకా మంజులారెడ్డి -
ఆర్జనలోనూ సింధు గర్జన
న్యూయార్క్: ప్రపంచంలో అటు ప్రైజ్‌మనీ, ఇటు ప్రకటనల రూపంలో అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారిణుల జాబితాలో బ్యాడ్మింటన్ తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధుకు చోటు దక్కింది. 2017 జూన్ నుంచి 2018 జూన్ వరకు అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల వివరాలతో ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజా నివేదిక విడుదల చేసింది. ఇందులో 85 లక్షల డాలర్ల (రూ. 59 కోట్లు) సంపాదనతో సింధు ఏడో స్థానంలో నిలిచింది. టోర్నీలు ఆడటం ద్వారా సింధు ప్రైజ్‌మనీ రూపంలో ఐదు లక్షల డాలర్లు... వాణిజ్య ఒప్పందాల ద్వారా 80 లక్షల డాలర్లు సంపాదించింది. భారత్ నుంచి ఈ ఘనత అందుకున్న ఏకైక క్రీడాకారిణి ఆమెనే కావడం విశేషం. టాప్–10 జాబితాలో రేస్ కార్ డ్రైవర్ డానికా ప్యాట్రిక్ (75 లక్షల డాలర్లు), సింధు మినహా మిగతా వారంతా టెన్నిస్ స్టార్లే. అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ కోటీ 81 లక్షల డాలర్లు (రూ.126 కోట్లు) వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానం దక్కించుకుంది. టాప్–10 జాబితా 1. సెరెనా (అమెరికా) కోటీ 81 లక్షల డాలర్లు (రూ. 126 కోట్లు); 2. వొజ్నియాకి (డెన్మార్క్) కోటీ 30 లక్షల డాలర్లు (రూ. 90 కోట్లు); 3. స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) కోటీ 12 లక్షల డాలర్లు (రూ. 78 కోట్లు); 4. ముగురుజా (స్పెయిన్) కోటీ 10 లక్షల డాలర్లు (రూ. 76 కోట్లు); 5. షరపోవా (రష్యా) కోటీ 5 లక్షల డాలర్లు (రూ. 73 కోట్లు); 6. వీనస్ విలియమ్స్ (అమెరికా) కోటీ 2 లక్షల డాలర్లు (రూ. 71 కోట్లు); 7. పీవీ సింధు (భారత్) 85 లక్షల డాలర్లు (రూ. 59 కోట్లు); 8. హలెప్ (రొమేనియా) 77 లక్షల డాలర్లు (రూ. 53 కోట్లు); 9. డానికా ప్యాట్రిక్ (అమెరికా) 75 లక్షల డాలర్లు (రూ. 52 కోట్లు); 10. కెర్బర్ (జర్మనీ) 70 లక్షల డాలర్లు (రూ. 48 కోట్లు). -
ఫోర్బ్స్ జాబితాలో సింధుకు చోటు
న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రైజ్‌మనీతో పాటు వాణిజ్య ఒప్పందాల ద్వారా అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న క్రీడాకారిణుల జాబితాను ఫోర్బ్స్ తాజాగా ప్రకటించింది. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకోగా, పీవీ సింధు ఏడో స్థానంలో నిలిచారు. అయితే ఇలాంటి జాబితాల్లో భారత్ నుంచి టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ సింధునే కావడం గమనార్హం. నోకియా, పానసోనిక్, బ్రిడ్జిస్టోన్, గటోరేడ్, రెక్కిట్ బెంకిసెర్తో పాటు మరికొన్ని టాప్ బ్రాండ్లతో సింధుకు వాణిజ్య ఒప్పందాలున్నాయని ఫోర్బ్స్ ప్రకటనలో వివరించింది. గత రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన భారత క్రీడాకారణి సింధు.. కామన్వెల్త్ గేమ్స్-2018తో పాటు బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో 2017, 2018లలో ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. టాప్ 10 జాబితాలో ఇద్దరు మినహా ఇతర క్రీడాకారిణులు టెన్నిస్ ప్లేయర్లే. సింధు, ఫార్ములావన్ రేస్ డ్రైవర్ డానికా పాట్రిక్‌లు మాత్రమే నాన్ టెన్నిస్ క్రీడాకారిణులు కావడం విశేషం. తల్లి అయిన తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ ఫోర్బ్స్ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. క్రీడాకారిణులు.. వారి ఆదాయం (ప్రైజ్ మనీ, వ్యాపార ఒప్పందాలు) 1. సెరెనా విలియమ్స్ - 18.1 మిలియన్ల డాలర్లు 2. కరోలిన్ వోజ్నియాకి - 13 మిలియన్ల డాలర్లు 3. స్లోనే స్టిఫెన్స్ - 11.2 మిలియన్ల డాలర్లు 4. గార్బైన్ ముగురుజా - 11 మిలియన్ల డాలర్లు 5. మరియా షరపోవా - 10.5 మిలియన్ల డాలర్లు 6. వీనస్ విలియమ్స్ - 10.2 మిలియన్ల డాలర్లు 7. పీవీ సింధు - 8.5 మిలియన్ల డాలర్లు 8. సిమోనా హలెప్ - 7.7 మిలియన్ల డాలర్లు 9. డానికా పాట్రిక్ - 7.5 మిలియన్ల డాలర్లు 10. ఎంజెలిక్ కెర్బర్ - - 7 మిలియన్ల డాలర్లు -
ఆ అమ్మాయి పేరు... ‘ఏషియన్ గేమ్స్’
ఇండోనేసియా జంటకు ఓ అమ్మాయి జన్మించింది. అది కూడా సరిగ్గా ఆసియా క్రీడలు మొదలైన 18వ తేదీనే కావడం విశేషం. ప్రసవ తేది సెప్టెంబర్‌లో ఉండగా ఓ నెల ముందే కలిగిన ఆ సంతానానికి గేమ్స్ పేరే పెట్టారు. ఇండోనేసియాకు చెందిన యొర్డానియా, వెరనొవా డెని దంపతులు. వీరికి ఇదివరకే ముగ్గురు పిల్లలున్నారు. గర్భంతో ఉన్న యొర్డానియాకు వచ్చే నెల డెలివరీ డేట్ ఇచ్చారు వైద్యులు. ఆశ్చర్యంగా ఆమె 18న ఓ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీంతో తల్లిదండ్రులు మెగా ఈవెంట్‌ను పురస్కరించుకొని ఆ చిన్నారికి ‘అబిదా ఏషియన్ గేమ్స్’ అని పేరు పెట్టారు. అంతేకాదు... తన కుమార్తెను ప్రొఫెషనల్ అథ్లెట్‌గా చేస్తానని వెరనొవా డెని చెప్పారు. ‘ఈ పేరు మా పాప భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. తనలో ప్రతిభవుంటే తప్పుకుండా అథ్లెట్‌ను చేస్తా’ అని అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ అథ్లెట్ మృతి
నైరోబి : కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్ నికోలస్ బెట్(28) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా హర్డల్స్ చాంపియన్ షిప్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా నాంది కౌంటీలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బెట్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన బెట్ ప్రమాద స్థలంలోనే మృతి చెందారని కౌంటీ అధికారులు తెలిపారు. ప్రపంచ చాంపియన్.. బెట్ 2015లో జరిగిన 400 మీటర్ల హర్డల్స్ పోటీల్లో బంగారు పతకం సాధించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. చైనాలో జరిగిన షార్ట్ డిస్టెన్స్ హర్డల్స్ రేస్ పోటీల్లో విజేతగా నిలిచి చైనాలో ఆ ఘనత సాధించిన మొదటి కెన్యా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు. రెండుసార్లు ఆఫ్రికా హర్డల్స్ చాంపియన్‌షిప్ సొంతం చేసుకున్నారు. బెట్ సోదరుడు హరోన్ కోయిచ్ కూడా 400 మీటర్ల హర్డ్లర్ కావడం విశేషం. కాగా, 2016 లో బ్రెజిల్లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు బెట్ అర్హత సాధించలేదు. BREAKING: 28 year old Beijing World Championship gold medalist Nicholas Bett dies in car crash in Nandi. He had just returned from the Continental Championships 😢 pic.twitter.com/ypndezlslh — Mr waddis The Brand (@kipronoenock) August 8, 2018 -
రన్నింగ్ 70
‘అచీవ్మెంట్’ అనే మాట చాలా గొప్పది. అయితే అదెప్పుడో చాలా మామూలు మాట అయిపోయింది కోటేశ్వరమ్మ విషయంలో! ఎంత పెద్ద విజయం అయినా ఇప్పుడామెకు ఒక మైలురాయి. అంతే! ఇటీవల కూడా నాలుగు గోల్డ్‌మెడల్స్ గెలుచుకుని ఇండియా వచ్చిన ఈ డెబ్బైయ్ ఏళ్ల అథ్లెట్.. ఊపిరి ఉన్నంత వరకూ గ్రౌండ్ ఆడుతూ ఉండడమే తన కోరిక అని అంటున్నారు. ఏనుగుల కోటేశ్వరమ్మ వయసు 70. ఫిజికల్ డైరెక్టర్‌గా రిటైరయ్యి పన్నెండేళ్లవుతోంది. సాధారణంగా రిటైర్ అయిన వాళ్లను... ‘ఖాళీయే కదా! ఇప్పుడేం చేస్తున్నారు’ అని చాలా మామూలుగా అడిగేస్తుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం, ఎదుటి వాళ్లు సమాధానపడేలా చెప్పడం కొంచెం కష్టమే. అయితే కోటేశ్వరమ్మకు మాత్రం చెప్పడానికి చాలా విజయాలున్నాయి. రిటైర్ అయిన తర్వాతనే ఆమె అంతర్జాతీయ స్థాయి అథ్లెట్ మీట్లలో పాల్గొన్నారు. సగౌరవంగా జాతీయ పతాకాన్ని భుజాల మీద కప్పుకుని, దేశానికి ప్రతినిధిగా వినమ్రంగా తలవంచి బంగారు పతకాలను ధరించారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన ‘సింగపూర్ అథ్లెటిక్స్ అండ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ 2018’ లో పాల్గొని నాలుగు బంగారు పతకాలతో ఇండియాకి వచ్చారు. 17 దేశాల క్రీడాకారులు పాల్గొన్న పోటీలలో నాలుగు మెడల్స్ (అన్నీ స్వర్ణాలే) సాధించిన ఏకైక క్రీడాకారిణి ఆమె. గత ఏడాది మలేసియా నుంచి రెండు స్వర్ణాలను తెచ్చారు. అంతకు ముందు శ్రీలంకలో మూడు స్వర్ణాలు ఆమె సొంతమయ్యాయి. ఆమె పాల్గొన్న తొలి ఇంటర్నేషనల్ అథ్లెట్ మీట్ 2014. అప్పుడామె రెండు కాంస్యాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తన జీవితంలో అన్నీ బంగారు, వెండి పతకాలే. కాంస్యం అందుకున్న ఒకే ఒక్క సందర్భం జపాన్ చాంపియన్ షిప్‌లోనే అంటారామె. 66 ఏళ్ల వయసులో, తొలిసారి విదేశీ ప్రత్యర్థులతో పోటీపడడంలో కొంత తడబాటు తప్పలేదు. కానీ ఆమె మాత్రం ‘తన చిన్న ప్రపంచం’లో ఇంటర్నేషనల్ మీట్లో పాల్గొనడమే పెద్ద విజయం అంటారు. చిన్న ప్రపంచం వెనుక కోటేశ్వరమ్మ ‘తన చిన్న ప్రపంచం’ అన్న మాట వెనుక చాలా పెద్ద అర్థమే ఉంది. నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో పుట్టి పెరిగారామె. స్కూలు, కాలేజ్, ఉద్యోగం, ఇప్పుడు విశ్రాంత జీవనం కూడా కావలిలోనే. తండ్రి చిన్న ప్రభుత్వోద్యోగి, తల్లి గృహిణి. ఏడుగురు సంతానంలో చిన్నమ్మాయి. అక్కలు, అన్నలు ఒక్కరు కూడా క్రీడారంగంలో అడుగుపెట్టలేదు. కోటేశ్వరమ్మకు మాత్రం ఇల్లు, ఆట స్థలమే లోకం. ఐదవ తరగతిలో డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ అందుకోవడం నుంచి డిగ్రీ వరకు హైజంప్, లాంగ్ జంప్, రన్నింగ్ రేస్‌లలో వరుసగా మెడల్స్ అందుకున్నారు. షాట్ పుట్, డిస్కస్‌త్రో, జావలిన్ త్రోలతోపాటు వంద మీటర్లు, రెండు వందల మీటర్లు, నాలుగు వందల మీటర్లలో, జిల్లా, స్టేట్, నేషనల్స్‌లో ఆమె అందుకున్న మెడల్స్ వందకు పైగానే ఉంటాయి. అయినా తన ప్రపంచం చాలా చిన్నదనే అంటారామె. ‘‘ఒలింపిక్స్‌లో రాణించే నైపుణ్యం, ఫిట్నెస్ ఉండి కూడా ఎక్స్పోజర్ లేని కారణంగానే నా పరిధి కుదించుకుపోయింది. అప్పట్లో ఇప్పటిలా ఎలక్ట్రానిక్ మీడియా విస్తరించలేదు. పేపర్లలో ఒలింపిక్స్ గురించి చదివినా కూడా కోచింగ్ ఎక్కడ తీసుకోవాలో, ఎలా అప్లయ్ చేసుకోవాలో మార్గదర్శనం చేసే వాళ్లు లేరు. దాంతో నేషనల్స్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ మాత్రమైనా సాధించగలిగానంటే... అది నేను చదువుకుని, ఉద్యోగం చేసిన విశ్వోదయ, జవహర్‌భారతి విద్యాసంస్థల స్థాపకులు డీఆర్ (దొడ్ల రామచంద్రరెడ్డి) గారి ప్రోత్సాహమే. నా భర్త కూడా స్పోర్ట్స్ పర్సన్ కావడం నాకు చాలా ఉపకరించింది’’అంటారామె. తొలి ఫోన్‌కాల్ కోటేశ్వరమ్మ భర్త జయచంద్ర రావు ఫుట్‌బాల్ ప్లేయర్. పిల్లలకు పదేళ్లు నిండినప్పటి నుంచి స్పోర్ట్స్ మీట్లకు అందరూ వెళ్లేవాళ్లు. మెడల్స్ సాధించడం ఎవరికైనా సంతోషమే. అయితే ఆ అచీవ్మెంట్లు ఆమెలోని క్రీడాకారిణికి పెద్దగా ఎగ్జయిట్‌మెంట్‌ని ఇచ్చేవి కావు కానీ ఆమెలోని తల్లిని బాగా సంతోషపెట్టేవి. ‘‘పిల్లలు నా మెడల్‌ను పట్టుకుని తాకి చూస్తూ మురిసిపోతుంటే ఎక్కడ లేని ఆనందం కలిగేది. ఆ స్ఫూర్తితోనే మా ఇద్దరమ్మాయిలు, అబ్బాయి ముగ్గురూ క్రీడాకారులయ్యారు. తల్లిగా నా పిల్లలను, నా 33 ఏళ్ల ఉద్యోగ జీవితంలో వేలాది మందిని క్రీడాకారులుగా తీర్చిదిద్దాను. వందల మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కొందరు పిల్లలు ఉద్యోగం వచ్చిన వెంటనే తొలి ఫోన్ నాకే చేస్తుంటారు. అలాంటప్పుడు ఎంత సంతోషం వేస్తుందో మాటల్లో చెప్పలేను’’ అంటూ కళ్లు తుడుచుకున్నారామె. పెన్షన్ డబ్బు దాచుకుని వేర్ దేర్ ఈజ్ ఏ విల్ దేరీజ్ ఏ వే... అనే నానుడి నిజమేననిపిస్తుంది కోటేశ్వరమ్మను చూస్తే. ఇంటర్నేషనల్స్‌లో ఆడాలనే సంకల్పంతో పెన్షన్ డబ్బు దాచుకున్నారామె. భర్త పోయి పాతికేళ్లయింది. అప్పటికి పిల్లలు పూర్తిగా స్థిరపడలేదు. కుటుంబ బాధ్యతను పూర్తిగా తానే మోయాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఆర్థిక సర్దుబాట్లు తప్పవు. దాంతో ఇంటర్నేషనల్ అథ్లెట్ మీట్ కలను తనలోనే దాచుకోక తప్పలేదు. బాధ్యతలు తీరిపోయి, ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత దాచుకున్న డబ్బుతో నాలుగేళ్లుగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్‌లో పాల్గొంటున్నారు, విజేతగా తిరిగొస్తున్నారు. ఎన్ని సాధించినా ఇది తీరే దాహం కాదంటారామె. ఇప్పటికింకా ఆసియా దాటి బయటకు వెళ్లలేదని, వరల్డ్ స్పోర్ట్స్‌లో విజేతగా మెడల్ అందుకోవడం తన లక్ష్యమంటున్నారు. ఊహ తెలిసిన తర్వాత పెళ్లయి, పిల్లలు పుట్టిన పదేళ్ల పాటు మాత్రమే ఆటలకు దూరంగా గడిపారామె. తన జీవితంలో వెనక్కి చూసుకుంటే ఇల్లు, గ్రౌండ్ తప్ప మరేమీ లేవంటూ... ఊపిరి ఉన్నంత వరకు ఆడుతూనే ఉండాలి, గ్రౌండ్‌లోనే శ్వాస వదలాలని తన కోరిక అంటున్నారు. ఉద్యోగం నుంచి రిటైర్ కావచ్చు, కానీ క్రీడాకారిణిగా రిటైర్ కావడమనే ఊహనే భరించలేకపోతున్నారు కోటేశ్వరమ్మ. ఆటల్లో దెబ్బ తగల్లేదు కానీ ఇన్నేళ్ల క్రీడా జీవితంలో ఒక్క దెబ్బ కూడా తగిలించుకోలేదామె. అయితే పక్కింటి బాదం చెట్టు కాయలను దొంగతనంగా కోసేటప్పుడు తగిలిన గాయం మచ్చ ఇప్పటికీ అలా ఉండిపోయింది. ‘కర్ర గుచ్చుకుపోయి, కండ ఊడి వచ్చేసింది. అయినా కట్టుకుని కూడా ఆ మర్నాడే ఆటలకు వెళ్లి పోయాను’ అని నవ్వుకుంటూ మోకాలికి కిందగా ఉన్న మచ్చను తడుముకున్నారు. ఆటలాడితే జీవితం అందంగా ఉంటుంది. నిజమే, కోటేశ్వరమ్మ ఫిట్నెస్ కోసం ఏ వ్యాయామమూ చేయరు. రోజూ ఇష్టమైనంత సేపు ఆడటమే ఆమె ఆరోగ్య రహస్యం. ‘ఉన్నది ఒక్కటే జీవితం. ఆడుతూ ఆహ్లాదంగా జీవిస్తేనే ఆనందం, ఆరోగ్యం’. అందుకు ఈ క్రీడాకారిణి జీవితమే నిదర్శనం. ఇప్పటికీ అద్భుతమే! రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రథమ పౌరుడిని కలవడం నా జీవితంలో అత్యంత అద్భుతంగా అనిపించే సంఘటన. ఇప్పుడు గుర్తు చేసుకున్నా కూడా ఒళ్లు రోమాంచితమవుతుంది. టెన్త్‌క్లాస్(1966)లో ఉన్నప్పుడు ఎన్íసీసీ క్యాడెట్‌గా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్నాను. ఆ తర్వాత రోజు పిల్లలందరినీ రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు. అప్పుడు మన రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు. మాకు రోజ్ గార్డెన్ అంతా తిప్పి చూపించారు. అన్ని రకాల గులాబీ పూలను, అంత పెద్ద తోటను చూడటం మాకదే తొలిసారి. మా సంతోషం చూసి ఆయన పూలు కోయించి మాకందరికీ ఇచ్చారు. రాష్ట్రపతిని కలవడానికి వేసుకున్న మెరూన్ కలర్ బ్లేజర్ని ఇప్పటికీ దాచుకున్నాను. పెరేడ్ కోసం మా టీమ్ ఢిల్లీలో దిగిన రోజు మాత్రం అత్యంత విషాదకరం. ఢిల్లీ స్టేషన్లో రైలు దిగగానే మన దేశ రాజధాని నగరం ఇది అని పిల్లలంతా కేరింతల్లో ఉన్నాం. అప్పుడు తెలిసింది ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణించారని. వివరాలు తెలిసే వయసు కాదు కానీ మనసంతా ఏదో తెలియని గుబులు ఆవరించిందప్పుడు. ప్రాక్టీస్‌లో మునిగిపోయాక ఇక ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాం. ఆ ఢిల్లీ పర్యటన ముగించుకుని కావలికి రాగానే రైల్వే స్టేషన్లో ఘనస్వాగతం. జిల్లా నుంచి పెరేడ్‌కు వెళ్లింది నేను మాత్రమే. వీధివీధిలో షామియానాలు వేసి పట్టణం అంతా ఊరేగించారు నన్ను. చిన్నప్పుడు అంత పెద్ద సంతోషం అనుభవంలోకి రావడంతోనో ఏమో, నేను ఎన్ని మెడల్స్ సాధించినా సరే, ఒక్కొక్క మైలురాయిని దాటుతున్నట్లు ఉంటోంది తప్ప గొప్ప అచీవ్మెంట్ అని మనసు పొంగిపోవడం లేదు. బహుశా ఆసియా దాటి ప్రపంచ స్థాయిలో మెడల్ సాధించినప్పుడు నా మనసు నిండుతుందేమో. – ఏనుగుల కోటేశ్వరమ్మ, వెటరన్ అథ్లెట్ -
కామెరూన్ అథ్లెట్ల తలోదారి..!
గోల్డ్‌కోస్ట్: ధనిక దేశాల్లో జరిగే ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనేందుకు రావడం... జట్టు నుంచి పారిపోయి తలోదారి చూసుకోవడం పేద దేశాల అథ్లెట్లకు రివాజుగా మారిపోయింది. ఈసారి ఆస్ట్రేలియాలో కామెరూన్ అథ్లెట్లు ఐదుగురు జట్టు నుంచి తప్పించుకున్నారు. ఇందులో ముగ్గురు వెయిట్‌లిఫ్టర్లు ఒలివియెర్, అర్కెంజ్లైన్, ఫౌవోద్జి కాగా ఇద్దరు బాక్సర్లు క్రిస్టియాన్ ఎన్ద్జి, ఫొట్సల ఉన్నారు. వీరంతా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చారు. సందు చూసుకొని క్రీడాగ్రామం నుంచి తప్పించుకున్నారు. మంగళవారం నుంచి పత్తాలేకుండా పోయారని కామెరూన్ వర్గాలు తెలిపాయి. ఫిర్యాదు అందుకున్న ఆస్ట్రేలియా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌కు వచ్చిన వారిలో వందకు పైగా అథ్లెట్లు ఇలాగే తప్పించుకొని అనధికారికంగా ఉంటున్నట్లు తెలిసింది. కామెరూన్ మీడియా అధికారి సైమోన్ మొలొంబె మాట్లాడుతూ ఆటలాడేందుకు వచ్చిన అథ్లెట్లు చట్టాలను గౌరవించాలని సూచించారు. -
అత్త ఉన్న కోడలు ఉత్తమురాలు
మెట్టినిల్లు మెచ్చిన కోడలు ఆమె! మెట్టెల సవ్వడి కాదు ఆ ఇంట్లో వినపడింది... మెడల్స్ హోరు!! మొట్టికాయలు వేసే అత్తగారు కాదు... వీపు తట్టిన తల్లి ఆవిడ! కోడలు గొప్పది! ఆమె దీక్ష అనంతమైంది!! ఇంట గెలిచింది అత్తగారు... రచ్చ గెలిచింది కోడలు!! ‘‘అంట్లు తోమే చేతులు కావు... మెడల్స్ మోసే చేతులు ఇవి. పెళ్లయిందని నీ లక్ష్యాన్ని మార్చుకోనక్కర్లేదు అనేది నా అభిప్రాయం.. తర్వాత నీ ఇష్టం’’ అంటూ వంటింట్లో గిన్నెలు కడుగుతున్న కొత్త కోడలికి చెప్పారు అత్తగారు. ఆలోచనలో పడింది కోడలు. ఏవో భయాలు, ఇంకేవో బెదురు ఊహలతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమెకి ఆ ఇంటి వాతావరణం, అత్తగారి స్పందన చాలా చిత్రంగా అనిపించాయి. నిజం చెప్పాలంటే తెలియని భరోసా కలిగించింది. చాలా రోజులుగా అలాంటి ఆసరా కోసం చూస్తోంది. ఇల్లు ఊడ్వడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం... కోడలు పని కాదు అని అర్థం చేసుకుంది అత్తగారు! అవును... తన అత్తగారు సాక్షాత్తు అత్త రూపంలో ఉన్న అమ్మే! ఇన్నాళ్లూ నిస్సత్తువగా ఉన్న తన కాళ్లకు శక్తినిచ్చాయి ఆవిడ మాటలు. ఆవిడ ఆదరణ తన ఆశయాలకు జీవం పోసింది. ఆ ఆదరణతో! ఎస్.. తను పరుగెడుతుంది. ట్రాక్ తన ప్రపంచం! అది చుట్టేస్తుంది! నిర్ణయం తీసుకుంది. నిశ్చయమైపోయింది! ఇది స్నేహా జైన్ కథ. కోడలి సామర్థ్యాన్ని తెలుసుకుని, ఆమెను వంటింటికి పరిమితం చేయకుండా, ప్రపంచానికి పరిచయం చేసిన ఓ అత్తగారి కథ! స్నేహా జైన్ రాజస్థాన్ అథ్లెట్. వంద మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ పోటీల్లో జాతీయ, ఆసియా ట్రాక్, ఫీల్డ్ రికార్డుల సృష్టికర్త. మాస్టర్స్ టోర్నమెంట్లలో 149 బంగారు పతకాలు సాధించిన బంగారు లేడి. 40 ఏళ్ల స్నేహా పరుగుల కెరీర్ పెళ్లి తర్వాతే వేగం పుంజుకుంది. అయిదేళ్ల వయసులో... స్నేహ ఐదో ఏట నుంచి పరుగే ఆమె వాహనం. వీధి చివర ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లాలన్నా, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి వెళ్లాలన్నా ఉరకడమే! నడక అనే మాటే లేదు. మధ్యలో వచ్చే చిన్న చిన్న దిబ్బలు, పిల్ల కాల్వల మీదుగా తేలికగా జంప్ చేయడమే.. జాగ్రత్తగా దాటడమనే ఊసే లేదు. ఆమెలోని ఈ ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు, బడిలో టీచర్స్... స్నేహను ప్రోత్సహించడం ప్రారంభించారు. అలా ఆమె రన్నింగ్ ట్రాక్ 1989లో రాజస్థాన్ పక్షాన నేషనల్స్‌లో పరుగులు తీసేవరకు వెళ్లింది... 1996 వరకు సాగింది. షాక్ అండ్ బ్రేక్ ఆ ఏడు (1996) బెంగళూరులో జరుగుతున్న నేషనల్ అథ్లెటిక్స్ స్క్వాడ్‌లో భాగమయ్యే భాగ్యం దొరికింది స్నేహకు. ఎంతో ఉత్సాహం గా ఉంది. అంతలోకే స్నేహ తల్లి మరణించిందనే విషాద వార్త స్నేహను హతాశురాలిని చేసింది. ఉన్నపళంగా నేషనల్ స్పోర్ట్స్ క్యాంప్ నుంచి బయలుదేరింది. అక్కడితో ఆమె పరుగు ఆగిపోయింది. అప్పటికే క్యాన్సర్ పేషెంట్ అయిన తల్లిని చూసుకోవడం కోసం ఇంటర్ మొదటి సంవత్సరంతోనే చదువు ఆపేసింది స్నేహ. అమ్మను ముంబైకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించడం మొదలుపెట్టింది. ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడమే కాకుండా, తన కంటె చిన్నవారైన తమ్ముళ్ల ఆలనాపాలనా కూడా స్నేహ మీదే పడింది. ఈ బాధ్యతలు చదువు మీదే కాకుండా ఆట తీరు పైనా ప్రభావం చూపాయి. అయినా సమయం చిక్కినప్పుడల్లా ప్రాక్టీస్ చేసేది. తల్లిని చూసుకోవడానికి అక్క వచ్చినప్పుడల్లా పోటీలకు వెళ్లేది. అలాగే బెంగళూరు వెళ్లింది. తల్లి మరణంతో షాకై ఇల్లు చేరింది. అప్పటి నుంచి కోలుకోలేదు. ట్రాక్ ఎక్కలేదు. పెళ్లి... దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా చెల్లెలు రోజులు వెళ్లదీస్తుంటే చూసి చలించిపోయింది స్నేహ అక్క. పెళ్లి చేస్తే కొత్త జీవితంలోకి అడుగు పెడుతుందని చెల్లికి పెళ్లి సంబంధం కుదిర్చింది. చెల్లెలి గురించి ఆ ఇంటి వాళ్లకు అంతా చెప్పింది. ఆమె పరుగుల రాణి అని, ఎక్కుపెట్టిన బాణంలా రివ్వున దూసుకెళ్తుందని, చెల్లి అందుకున్న పతకాలను చూపించింది. అవన్నీ స్నేహ అత్తగారి మెదడులో చెరగని ముద్ర వేశాయి. అలా 2000లో మూడు ముళ్లతో స్నేహ అత్తింటికి వచ్చింది. పెళ్లయిన తెల్లవారే కోడలిగా ఆ ఇంటి పనులు పంచుకోవడానికి వంటింట్లోకి వెళ్లింది. అప్పుడే అత్తగారు ఆ సలహా ఇచ్చింది. పరుగుల ట్రాక్ పైకి మళ్లీ... నాలుగేళ్లుగా పరుగు మరిచిపోయిన కాళ్లను సమాయత్తం చేయడం కష్టమని ప్రాక్టీస్‌లో తేలింది స్నేహకు. అయినా వెనకడుగు వేయలేదు. కాని పూర్వపు ఫామ్ రాలేకపోయింది. పోటీల్లో పతకాలు సాధించలేకపోయింది. అత్తగారు అంత ఎంకరేజ్ చేస్తున్నా తాను ఖాళీ చేతులతో ఇంటికి వస్తుంటే ఆమె ఏమనుకుంటుందోనని చాలా ఒత్తిడికి లోనైంది స్నేహ. ఇక్కడా ఆ అత్త అమ్మ మనసుతో ఆలోచించింది. ‘‘పతకాలు సాధించడం అనుకున్నంత తేలిక కాదని నాకు తెలుసు. శక్తి వంచన లేకుండా ప్రయత్నించడం మన ధర్మం. ఫలితం ఆ భగవంతుడి ఇష్టం. అధైర్యపడకు. నమ్మకం కోల్పోకు’’ అని కోడలి భుజం తట్టింది. అప్పటిదాకా భరించిన ఒత్తిడి మాయమైపోయింది స్నేహలో. ఈలోపే ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కావడంతో మళ్లీ బ్రేక్. మళ్లీ ప్రాక్టీస్. మళ్లీ పోటీలు వచ్చేసరికి స్నేహకు 35 ఏళ్లు వచ్చేశాయి. నేషనల్ అథ్లెటిక్ కాంపిటీషన్‌కు ఆ వయసు వాళ్లకు అనుమతి లేదని తేల్చేశారు. నిరాశ పడుతుండగా, అత్తగారి చిరునవ్వు స్నేహలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అప్పుడే... అంటే 2007లో మాస్టర్స్ కాంపిటీషన్స్ ఉంటాయని, ఆ వయసు వాళ్లూ అందులో పాల్గొనొచ్చని స్నేహకు తెలిసింది. ఫస్ట్ మాస్టర్స్ టోర్నమెంట్‌లోనే లాంగ్‌జంప్ నేషనల్ రికార్డ్ సాధించింది. ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. పతకాల వేట ప్రారంభమైంది. పెళ్లి తర్వాత పాల్గొన్న ఈవెంట్స్‌లో 149 గోల్డ్ మెడల్స్ సాధించింది. అత్తగారి ఆశీర్వాదం ఫలించింది. 37వ మాస్టర్స్ నేషనల్ గేమ్స్‌లో 100 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, నాలుగు వందల మీటర్ల, పదహారు వందల మీటర్ల రిలే పోటీల్లో అయిదు బంగారు పతకాలు సొంతం చేసుకుంది. తన కూతురు ఆర్చి, కొడుకు వంశ్లకు రోల్‌మోడల్‌గా నిలిచింది. ‘‘పిల్లలకే కాదు ఈ దేశానికే రోల్ మోడల్ నా కోడలు’’అంటారు స్నేహ అత్తగారు. ‘‘కితాబు నాకివ్వడం ఆమె గొప్పతనం. ఆమె లేనిదే నేను లేను. అమ్మపోయిన దుఃఖంలో నా క్రీడలను పూర్తిగా మర్చిపోయాను. అలాంటి నన్ను మళ్లీ క్రీడాకారిణిగా నిలబెట్టారు అత్తమ్మ. ఆమెతో పాటు నా భర్త, మామగారు అందరూ నాకు అండగా నిలిచారు. నా సామర్థ్యాన్ని నిరూపించుకుని మంచి క్రీడాకారిణిగా నిలబడటానికి చేయూతనిచ్చారు. మన దేశంలో ఇలాంటి మెట్టినిల్లు దొరకడం నా అదృష్టం’’ అంటారు స్నేహా జైన్ చెమ్మగిల్లిన కళ్లతో. అయితే 2016లో మాస్టర్స్ టోర్నమెంట్లో 150వ మెడల్ కోసం శ్రీలంక వెళ్లినప్పుడు 1996లో సంఘటన స్నేహకు పునరావృతం అయింది. కార్డియాక్ అరెస్ట్‌తో మామగారు చనిపోయారని సమాచారం అందింది. హుటాహుటిని తిరుగుప్రయాణమైంది స్నేహ. అలా ఆమె కెరీర్లో 150 గోల్డ్‌మెడల్ మైలురాయిని దాటలేకపోయింది. కాని ఆమె వెనక అత్తగారున్నారు. ఆ విశ్వాసంతోనే స్నేహా జైన్ కసరత్తు మొదలుపెట్టింది. ఆల్ ద బెస్ట్ టు స్నేహ. – శరాది -
అథ్లెట్ గోపీచంద్‌కు కాంస్యం
ఏఎన్‌యూ: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పతకాల బోణీ చేసింది. అండర్–20 పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో ఏపీ అథ్లెట్ జి. గోపీచంద్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్లో గోపీచంద్ 14.25 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రన్నగూడెంకి చెందిన గోపీచంద్ రాజమండ్రి ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజిలో చదువుతున్నాడు. -
అథ్లెట్‌కు ఆర్మీలో ఉద్యోగం
కురవి: మండల కేంద్రం శివారులోని చీకటిచింతల తండాకు చెందిన అథ్లెట్ భూ క్యా గణేష్‌కు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. రెండు నెలల క్రితం ఆర్మీ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన గణేష్‌ను సైనిక ఉద్యోగానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలి పారు. ఈ మేరకు ఈనెల 30న విధుల్లో చేరాలని బుధవారం వారు ఓ లేఖ ద్వారా సమాచారం అందించారు. కాగా, గణేష్ ఎనిమిదో తరగతి నుంచే పరుగు పోటీల్లో ప్రతిభ కనబరచడంతో హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో సీటు లభించింది. మూ డేళ్లుగా అక్కడే ఉండి చదువుకుని జార్ఖం డ్లో జరిగిన జాతీయస్థాయి, గుడివాడలో జరిగిన పైకా, హరిద్వార్‌లో జరిగిన ఇంటర్డిస్టిక్ట్ర్ పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని పతకాలు సాధించాడు. ఇదిలా ఉండగా, ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైన గణేష్‌ను గురువులు సారంగపాణి, గుమ్మళ్ల సురేందర్, వెంకటయ్య, కోచ్‌లు కర్నం సింధూవర్మ, సంగెం అనిల్, పీఈటీ మేక దామోదర్‌రెడ్డి అభినందించారు. -
భారత అథ్లెట్ సుధాకు 'జికా'పరీక్షలు!
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ సుధా సింగ్ తీవ్ర జ్వరానికి గురి కావడంతో ఆమెకు జికా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒలింపిక్స్ ముగిసిన అనంతరం బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్‌కు చేరిన సుధా సింగ్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది. దాంతోపాటు బాగా నీరసించిపోవడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఫోర్టిస్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే దోమ కాటు ద్వారా వచ్చే డెంగ్యూ, చికెన్‌గున్యాలు ఆమెకు సోకలేదని లేదని అక్కడ చేసిన టెస్టుల్లో తేలింది. కాగా, బ్రెజిల్ లో జికా వైరస్ తీవత్ర హెచ్చుగా ఉండటంతో ఆ మేరకు టెస్టులు కూడా చేయాలని డాక్టర్లు భావించారు. దానిలో భాగంగా ఆమె రక్త నమూనాను పుణెలోని జికా వైరస్ ఇనిస్టిట్యూట్‌కు పంపారు. మంగళవారం ఈ వైరస్‌కు సంబంధించిన టెస్టులు పూర్తయిన తరువాత రిపోర్ట్ వెల్లడిస్తామని కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో సుధా సింగ్ మూడు వేల మీటర్ల స్టీపల్ చేజ్లో పాల్గొంది. -
చీకటిని చీల్చుకుంటూ మళ్లీ పుట్టావ్!
ఓటమిని రుచి చూసిన వాళ్లకే గెలుపు విలువ తెలుస్తుంది... అవమానాన్ని ఎదుర్కొన్నవాళ్లకే గౌరవం గొప్పతనం అర్థమవుతుంది.. వివక్షను అనుభవించిన వారికే దాని వెనకున్న బాధ బోధపడుతుంది.. నల్లజాతి సూరీడు పుట్టిన గడ్డ నుంచి అందుకున్న స్ఫూర్తితో... జాతికి వెలుగులు నింపుతూ... ప్రపంచానికి క్రీడోపదేశం చేస్తూ.. చీకటిని చీల్చుకుంటూ మళ్లీ పుట్టిన సెమెన్యా విజయగాథ ఇది. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా సమీపంలో ఓ కుగ్రామంలో పుట్టిన సెమెన్యా కాస్టర్‌కు చిన్నప్పటినుంచి సాకర్ అంటే అభిమానం. ఎలాగైనా ఈ క్రీడలో రాణించాలనే సంకల్పంతో పరుగును ప్రారంభించింది. అయితే ఈ పరుగు కాస్త ఆమెను ట్రాక్ ఎక్కించి ప్రపంచానికి కొత్త అథ్లెట్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో చిన్నచిన్న ఈవెంట్లలో పాల్గొన్న సెమెన్యా.. జాతీయ రికార్డులతో శభాష్ అనిపించుకుంది. 2008లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ యూత్‌గేమ్స్‌లో 800 మీటర్ల ఈవెంట్లో 2.04.23 టైమింగ్‌తో స్వర్ణం గెలుచుకుంది. 2009లో జరిగిన ఆఫ్రికన్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్లు, 1500 మీటర్లలో రికార్డు టైమింగ్స్‌తో స్వర్ణాలు సాధించింది. గెలుపుపై అనుమానాలు 2009లో బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ 800 మీటర్ల ఫైనల్ రేసుకు అంతా సిద్ధమైంది. అప్పటికే జోరుమీదున్న సెమెన్యా మీదే అందరి దృష్టి. రేసు ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు... సెమెన్యా నిషేధిత డ్రగ్స్ వాడి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేసిన ఐఏఏఎఫ్ (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్) ఈ అథ్లెట్‌పై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన అథ్లెట్లు ఆశ్చర్యపోయినా... దీన్ని ఏమాత్రం పట్టించుకోని సెమెన్యా మరింత మెరుగైన టైమింగ్‌తో (1.55.45) బంగారుపతకాన్ని అందుకుంది. దీంతో ఐఏఏఎఫ్ మరిన్ని అనుమానాలు వ్యక్తం చేసి... డ్రగ్స్ కాదు, సెమెన్యాకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. సెమెన్యా.. హమ్ హైనా సెమెన్యాపై ఐఏఏఎఫ్ ఆరోపణలను తోటి క్రీడాకారులు తీవ్రంగా ఖండించారు. స్ప్రింటర్ దిగ్గజం మైకెల్ జాన్సన్ కూడా క్రీడాసంఘం తీరుపై బహిరంగంగానే మండిపడ్డారు. నల్లజాతీయురాలైనందుకే సెమెన్యా హక్కులు, వ్యక్తిగత జీవితాన్ని అవమానిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మీడియా కూడా ఆమెకు అండగా నిలిచింది. గొప్ప అథ్లెట్‌ను అవమానపరుస్తున్నారంటూ పతాకశీర్షికలో వార్తలు రాసింది. అయితే సెమెన్యా మోసం చేసిందని భావించటం లేదని.. ‘అరుదైన ఆరోగ్య స్థితి’ (రేర్ మెడికల్ కండీషన్) ఉండొచ్చనే అనుమానంతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు 2009లోనే క్రీడాసంఘం స్పష్టం చేసింది. పరీక్షల ఫలితాలు వచ్చేంతవరకు సెమెన్యా ఏ ఈవెంట్లో పాల్గొనరాదని ఆదేశించింది. ఏడాది నిరీక్షణ తర్వాత 2010లో సెమెన్యా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనేందుకు ఐఏఏఎఫ్ పచ్చజెండా ఊపింది. 2010, 2011లో పలు ఈవెంట్లలోనూ ఈ నల్లజాతీయురాలు సత్తాచాటింది. ఈమెపై ఉన్న వివాదాలన్నీ పక్కనపెట్టి.. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తమదేశ పతాకధారిగా సెమెన్యాను దక్షిణాఫ్రికా ఎంచుకుంది. ఈ ఒలింపిక్స్‌లో ఆమె 800 మీటర్లలో రజతం సాధించింది. ఆ తర్వాత పలు ఈవెంట్లలోనూ పతకాలు గెలిచింది. 2016 ఒలింపిక్స్‌లో 800 మీటర్ల రేసులో స్వర్ణంతో తనలో సత్తా తగ్గలేదని నిరూపించింది. ‘మనం ఎలా ఉంటామనేది కాదు. మనమెలా పరిగెడతామనేదే ముఖ్యం’ అని చెప్పింది. బాల్యం నుంచి కసి, పట్టుదలతో రాణించిన సెమెన్యాకు జీవితంలో ఎత్తుపల్లాలు తెలుసు. అందుకే అవమానాలను, ఛీత్కారాలను మౌనంగా భరించింది.తనపై ఆరోపణలు అసత్యమని తేలాక.. మళ్లీ ట్రాక్ ఎక్కి రికార్డుల మోత మోగిస్తోంది. సంబరాలకు దూరమే చిన్న ఈవెంట్లు గెలిస్తేనే.. ప్రపంచాన్ని గెలిచినట్లు సంబరపడతాం. కానీ సెమెన్యా మాత్రం జీవితంలో బాధను, సంతోషాన్ని ఒకేలా చూస్తుంది. ‘ఏడేళ్లుగా చాలా బాధపడ్డా. మళ్లీ ఈ స్థితికి చేరుకుంటానని అనుకోలేదు. నేనూ ప్రపంచ చాంపియన్‌నే. కానీ ఎప్పుడు గెలిచినా సంబరాలు చేసుకోలేదు. సంబరాలు నా దృష్టిలో ఓ జోక్. నేను చిన్నప్పటినుంచే అబ్బాయిల మధ్య పెరిగాను. దీన్నిప్పుడు మార్చుకోలేం’ అని సెమెన్యా తెలిపింది. ఆరోపణలతో అంతర్జాతీయ కెరీర్‌కు దూరంగా ఉన్న విరామంలో.. ప్రిటోరియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ సైన్స్ కోర్సులో చేరింది. 2015లో తన దీర్ఘకాల మిత్రురాలు వాయిలెట్ లెడ్లీ రసేబోయాను 2015 చివర్లో సెమెన్యా పెళ్లి చేసుకుంది. సెమెన్యా రేసుకు సెక్యూరిటీ మొన్నటివరకు సెమెన్యాను అవమానించిన క్రీడా సంఘమే.. రియోలో జరిగిన 800 మీటర్ల ఫైనల్‌కు పటిష్టమైన భద్రత ఏర్పాటుచేసింది. ఈ భద్రత సెమెన్యా కోసమే. ఆమె తోటి రన్నర్ల అభిమానులు.. సెమెన్యాపై దాడిచేసే అవకాశం ఉందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలతోనే అప్రమత్తమయ్యారు. శభాష్... సెమెన్యా మహిళల 800 మీటర్ల విభాగంలో స్వర్ణం సొంతం రియో డి జనీరో: వివాదాస్పద దక్షిణాఫ్రికా అథ్లెట్ కాస్టర్ సెమెన్యా అంచనాలకు అనుగుణంగా రాణించి రియో ఒలింపిక్స్‌లో మెరిసింది. మహిళల 800 మీటర్ల విభాగంలో సెమెన్యా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ రేసులో 25 ఏళ్ల సెమెన్యా ఒక నిమిషం 55.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాంకైన్ నియోన్‌సబా (బురుండి-1ని:56.49 సెకన్లు) రజతం, మార్గరెట్ వాంబుయ్ (కెన్యా-1ని:56.89 సెకన్లు) కాంస్యం సాధించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సెమెన్యా ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేసి ఈ విభాగంలో పసిడి పతకం నెగ్గిన తొలి దక్షిణాఫ్రికా అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. ఫైనల్ రేసులో సెమెన్యాకు తన ప్రత్యర్థుల నుంచి ఎలాంటి పోటీ ఎదురుకాలేదు. తొలి ల్యాప్‌ను 57.59 సెకన్లలో ముగించి అగ్రస్థానంలోకి వెళ్లిన సెమెన్యా ఆ తర్వాత ఇదే దూకుడు కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ద్యుతి దెబ్బకు నిబంధనల మార్పు 2015లో భారత అథ్లెట్ ద్యుతిచంద్పై కూడా సెమెన్యాకు ఆపాదించిన ఆరోపణలు తలెత్తాయి. దీనిపై మరోసారి లింగ నిర్ధారణపైనా.. కొందరు మహిళల్లో టెస్టోస్టెరాన్ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల వారి సామర్థ్యం పెరుగుతుందన్న ఐఏఏఎఫ్ వాదనపైనా తీవ్రమైన చర్చ జరిగింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో ‘ద్యుతి వర్సెస్ భారతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్, ఐఏఏఎఫ్’ కేసులో వాదోపవాదనల తర్వాత టెస్టోస్టెరాన్‌తో సామర్థ్యం పెరుగుతుందనేది అపోహ అని నిరూపితమైంది. దీంతో ఐఏఏఎఫ్ నిబంధనల్లోని ‘హైపర్‌ఆండ్రోజెనిజమ్’ను రద్దుచేశారు. -
బ్రెజిల్ 'ఎగిరింది'
పోల్‌వాల్ట్‌లో థియాగో సిల్వాకు స్వర్ణం ఒలింపిక్ రికార్డుతో అగ్రస్థానం ఆతిథ్య దేశానికి రెండో పసిడి ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 77 వేల కోట్లు పోసి ఒలింపిక్స్ నిర్వహిస్తున్నాం. కనీసం ఏడు స్వర్ణాలు అయినా కళ్లచూడాలి అనుకున్నాం... కోటి కష్టాలు, వేవేల విమర్శలు అన్నింటినీ తట్టుకొని ఆటల పండగకు ఆతిథ్యం ఇస్తున్నాం... గుప్పెడు పతకాలు మా గడపలో వాలాలని కోరుకోవడంలో తప్పేముంది... ఇదీ బ్రెజిల్ ప్రజల మనసులో మాట. అయితే వారు ఆశించిన ఆనందం మాత్రం అంతే స్థాయిలో దక్కడం లేదు. పది రోజుల వరకు ఒక్క పసిడి పతకంతోనే సరి పెట్టుకున్న ఆ దేశంలో ఇప్పుడు అభిమానుల మోముపై మళ్లీ చిరునవ్వు పూసింది. పోల్‌వాల్ట్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బ్రెజిల్ అథ్లెట్ థియాగో సిల్వా అనూహ్యంగా స్వర్ణాన్ని అందుకొని మళ్లీ తమ దేశవాసుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. రియో: ఒలింపిక్స్‌లో వారం రోజుల తర్వాత బ్రెజిల్ మళ్లీ సంతోషంలో మునిగింది. ఈ సారి అథ్లెటిక్స్‌లో ఆ జట్టుకు పసిడి పతకం లభించింది. 22 ఏళ్ల థియాగో బ్రాజ్ ద సిల్వా పోల్‌వాల్ట్‌లో విజేతగా నిలిచి స్వర్ణ కాంతులు పంచాడు. 6.03 మీటర్ల ఎత్తు ఎగిరి అగ్రస్థానం అందుకున్న సిల్వా... గత పోటీల స్వర్ణ విజేత, వరల్డ్ రికార్డ్ సాధించిన రెనాడ్ లావిలెనీ (ఫ్రాన్స్)కు షాక్ ఇచ్చాడు. 5.98 మీటర్ల ఎత్తును దాటిన రెనాడ్కు రజత పతకం లభించగా, శామ్ కెండ్రిక్స్ (అమెరికా-5.85 మీ.) కాంస్యం అందుకున్నాడు. థియాగో కొత్త ఒలింపిక్ రికార్డు నెలకొల్పడం విశేషం. తొలి సారి ఆరు మీటర్లు దాటి నాలుగేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సిల్వాపై ఎవరూ పెద్దగా పతక ఆశలు పెట్టుకోలేదు. ఈ ఏడాది ఆరంభంలో జర్మనీలో జరిగిన ఇండోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో అతను గరిష్టంగా 5.93 మీటర్లు ఎగిరాడు. రియోలో అతను తన అత్యుత్తమ ప్రదర్శనకంటే మరో 10 సెంటీ మీటర్లు మెరుగైన ప్రదర్శన చూపించగలిగాడు. 1952 తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు గెలిచిన ఆటగాడిగా నిలవాలని బరిలోకి దిగిన ప్రధాన పోటీదారు లావిలెనీ 5.98 మీటర్ల ఎత్తును సునాయాసంగా అధిగమించాడు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ థియాగో 6.03 మీటర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ క్షణంలో బ్రెజిల్ దేశం మొత్తం ఉత్కంఠకు లోనైంది. తన తొలి ప్రయత్నంలో సిల్వా దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దాంతో అందరిలో నిరాశ కనిపించింది. అయితే తన శక్తినంతా కూడదీసుకొని రెండో ప్రయత్నంలో అతను 6.03 మీటర్లను కొట్టేశాడు. తన జీవితంలో అతి పెద్ద లక్ష్యాన్ని అధిగమించాడు. ప్రేక్షకుల గోల మధ్య... సిల్వా ప్రదర్శనతో లావిలెనీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. రెండు ప్రయత్నాల్లోనూ అతను దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. మూడో ప్రయత్నం కోసం రన్‌వే వద్ద నిలబడగానే స్టేడియంలో గోల మొదలైంది. దీనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అతను ‘థమ్స్ డౌన్’ అంటూ సైగ చేశాడు. దాంతో బ్రెజిల్ అభిమానులు మరింత రెచ్చిపోయారు. చివరకు పెద్ద జంపింగ్‌కు ప్రయత్నించి డిఫెండింగ్ చాంపియన్ మోకాలు బార్‌కు తగలడంతో నిరాశగా వెనుదిరిగాడు. మరుక్షణంలో సిల్వా పేరుతో ఆ ప్రాంగణమంతా హోరెత్తింది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రేక్షకుల ప్రవర్తన ఇలా ఉండటం అసహనం కలిగించిందని... 1936లో జెస్సీ ఓవెన్స్‌ను కూడా ఇలాగే ప్రేక్షకులు ఆట పట్టించారని పోలిక తెస్తూ లావిలెనీ విమర్శలు చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. దాంతో అతను తాను తప్పుడు పోలిక తీసుకొచ్చానని, ఏదో ఆవేశంలో అన్న మాట అంటూ చివరకు అందరికీ క్షమాపణ చెప్పుకున్నాడు. ►రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్‌కు ఇది రెండో స్వర్ణం. జూడోలో రఫెలా సిల్వా తమ దేశానికి మొదటి స్వర్ణాన్ని అందించింది. ►1984 ఒలింపిక్స్ తర్వాత బ్రెజిల్‌కు అథ్లెటిక్స్‌లో పసిడి లభించడం ఇదే తొలిసారి. ► లండన్ ఒలింపిక్స్‌లో బ్రెజిల్ మొత్తం 3 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఖాతాలో ఇంకా 2 స్వర్ణాలే ఉన్నాయి. ►2012లో మరో 5 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 17 పతకాలు సాధించింది. రియోలో 4 రజతాలు, 4 కాంస్యాలు సహా ఇప్పటి వరకు గెలిచిన మొత్తం పతకాలు 10. మరి సొంత గడ్డపై గత రికార్డును ఆ దేశం మెరుగు పరుచుకుంటుందో లేదో చూడాలి. -
అథ్లెట్ మెడకు వ్యభిచార ఉచ్చు
సింగపూర్: సింగపూర్ కు చెందిన పారా అథ్లెట్ ఒకరు కటకటాలపాలయ్యాడు. వ్యభిచారం చేయించేందుకు సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్ ద్వారా మహిళలను, మైనర్లను కొనుగోలు చేస్తున్నందుకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 38 నెలల జైలు శిక్ష విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అదామ్ కామిస్ అనే వ్యక్తి సింగపూర్ జాతీయ పారా అథ్లెట్ గా ఉన్నాడు. ఓ ప్రమాదంలో గాయపడిన అతడు వికలాంగుడిగా మారాడు. 2013లో ఫేస్ బుక్ ఖాతా తెరిచి దానిద్వారా వ్యభిచారం చేయించేందుకు 11మంది మహిళలను రిక్రూట్ చేశాడు. ఒక మైనర్ బాలికను కూడా రిక్రూట్ చేసి వ్యభిచార కూపంలోకి దించాడు. వారి వద్ద నుంచి ఐదు నుంచి యాబై శాతం వరకు కమిషన్ తీసుకునే వాడు. ఒక ఎస్కార్ట్ ఉద్యోగిగా తనను తాను పరిచయం చేసుకొని డబ్బు ఎరగా వేసేవాడు. వెంటనే డబ్బు దక్కుతుందని ఆశతో మహిళలు తొందరగా అతడితో మాటలు కలిపేవారు. ఆ క్రమంలో వారిని వ్యభిచారంలోకి మెల్లగా లాగేవాడు. ఇక పదహారేళ్ల విద్యార్థినిని కలిసి తన అపార్ట్ మెంట్‌కు తీసుకెళ్లి లైంగికంగా అనుభవించడమే కాకుండా ఆమెతో కూడా వ్యభిచారం చేయించే కుట్ర చేశాడు. ఎంతో చాకచక్యంతో పోలీసులు ఈ విషయాన్ని గ్రహించి అతడిని అరెస్టు చేశారు. 30 అభియోగాల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. గతంలో 2010లో ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌కు ప్రతినిధిగా కూడా పనిచేశాడు. -
స్వేచ్ఛాడే
శోభాడేని స్వేచ్ఛాడే అనడానికి రెండు కారణాలు. ఒకటి: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నెలల్లో ఆమె జన్మించారు. రెండు: రచయిత్రి, కాలమిస్టు కనుక ఆమె ఊహల్లో కావలసినంత స్వేచ్ఛ. అయితే ఈ రెండూ పైపై కారణాలు మాత్రమే. లోతైన కారణం ఏమిటంటే... స్వేచ్ఛ ఆమె జీవన విధానం. ఇంట్లో, బయటి ఇరుకులో ఆమె ఎప్పుడూ ఫిట్ కాలేదు. ఒళ్లు విరుచుకున్నట్లుగా... ఆలోచనలు పరుచుకోడానికి స్పేస్ ఉన్నచోటే ఆమె కుదురుగా ఉన్నారు. శోభాడేను అర్థం చేసుకోవడం చాలా కష్టం. రాకుమారి కేట్ మిడిల్టన్ ఆ మధ్య ఇండియా వచ్చినప్పుడు.. ‘చీర కట్టుకోడానికి తగిన ఒంపులు ఆ పిల్లకు లేవు’ అని శోభాడే బహిరంగంగా అనడం భారతీయులందరినీ నివ్వెరపరిచింది. నిజానికి శోభాడే మాట్లాడింది కేట్కి లేని వాటి గురించి కాదు. చీరకు ఉండవలసిన వాటి గురించి! శోభ.. చీరల డిజైనింగ్‌లో కూడాస్పెషలిస్టు మరి. తనకు తెలిసిన దాని గురించి మాట్లాడకుండా ఉండలేని స్వేచ్ఛాప్రియత్వమే ఈ డెబ్బై ఏళ్ల సౌందర్యరాశి వ్యక్తిత్వాన్ని నిత్యం శోభాయమానం చేస్తోంది. సోఫిస్టికేటెడ్, స్లెండర్, స్మార్ట్, షార్ప్, ష్రూడ్! ఇవన్నీ ‘ఎస్’తో మొదలయ్యే మాటలు. శోభాడేని నిర్వచించే మాటలు కూడా! శోభాడే పేరూ ‘ఎస్’తోనే మొదలౌతుంది. ఆమె రాసిన పుస్తకాల్లో దాదాపుగా అన్నీ ‘ఎస్’తో స్టార్ట్ అయినవే.. సిస్టర్స్, స్టారీ నైట్స్, సల్ట్రీ డేస్, సెకండ్ థాట్స్, సెలెక్టివ్ మెమరీ, సర్వైవింగ్ మెన్.. ఇలా. శోభాడే నవనాగరికురాలు (సోఫిస్టికేటెడ్). ఆమెవి నాజూకైన భావాలు (స్లెండర్). వివేకవంతురాలు (స్మార్ట్). చురుకైన మనిషి (షార్ప్). నేర్పరి (ష్రూడ్). ఏంటీ ‘ఎస్’? సెంటిమెంటా? ‘ఎస్’లో ఏదైనా పవర్ ఉందా? శోభాడేని చాలామంది అడిగారు. పవర్ ‘ఎస్’లో లేదు. ‘నో’లో ఉంది. ‘నో’ చెప్పడంలో ఉంది.. అన్నట్లు నవ్వేస్తారు శోభాడే. జీవితంలో ప్రతి విషయాన్నీ ఆమె తేలిగ్గానే తీసుకున్నారు. విత్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఏదైనా.. తొలగించుకోవడంలో లేదు.. తగిలించుకోవడంలో ఉంది అని నమ్ముతారు శోభ! తలచినదే జరగాలి! సంప్రదాయం కుటుంబంలో సంకెళ్లు తెంచుకోలేనివిగా ఉంటాయి. అసలు తెంచుకోవాలన్న ఊహే రానివ్వని విధంగా ఉంటాయి. మహారాష్ట్ర సారస్వత బ్రాహ్మణ కుటుంబంలోని ఈ ఆడపిల్ల ఊహనూ రానిచ్చింది, వాటిని తెంపుకునీ బయటికి రానూ వచ్చింది! సాధారణంగా.. వద్దన్న పని చెయ్యొద్దు అన్నప్పుడు పెద్దవాళ్ల భ్రుకుటి ముడివడుతుంది. కానీ.. చెయ్యాలనుకున్న పనిని చెయ్యొద్దు అన్నప్పుడు శోభాడే భ్రుకుటి ముడివేస్తుంది! ఆమె జీవితమంతా ఇదే ధోరణి. నాన్న చెప్పినా వినలేదు శోభాడే సెయింట్ జేవియర్స్ కాలేజీ స్టూడెంట్. అంతవరకు బాగుంది. మోడలింగ్ చేస్తానంటే మాత్రం తండ్రి ఒప్పుకోలేదు. ‘మా అమ్మాయి న్యాయ మంత్రిత్వశాఖలో ప్రభుత్వ కార్యదర్శి లేదా పెద్ద అధికారి’ అని చెప్పుకోవడం ఆయనకు గర్వం. అప్పటికే ఆయన రెండు మూడు గర్వాలను తలపై కిరీటంలా ధరించి ఉన్నారు. కొడుకు ఇంజినీర్. ఒక కూతురు ఆఫ్తాల్మిక్ సర్జన్. ఇంకో కూతురు ‘లా’ గ్రాడ్యుయేట్. వీళ్లందరి వరుసలోనే చిన్న కూతురు శోభను ఐ.ఎ.ఎస్.కు పంపించాలనుకున్నారు. కానీ శోభ పెదవి విరిచింది. ఊహు.. ఈ మాటను ఇలా చెప్పకూడదు. తండ్రి ముందు పెదవి విరిచేంత ధైర్యం చేసింది! ‘వావ్’ అంటూ వచ్చి అడిగారు శోభ శరీర నిర్మాణం పెళుసుగా ఉంటుంది. ఈ మాట సరిగా అర్థం కాకపోతే ‘నాజూకు’గా అనుకోవచ్చు. మోడలింగ్ చూపు ఇలాగే ఉంటుంది. ఇక ఆ దృఢమైన దవడ కండరాలు, ఆమె ఆత్మవిశ్వాసం కూడా మోడలింగ్‌కు అవసరమైన సౌందర్య సాధనాలే. అయితే శోభకు తనలో ఇంతుందని తెలీదు! తండ్రీకూతుళ్లు ఓ రోజు తాజ్ లాంజ్‌లో కూర్చొని ఉన్నారు. ఏ అతిథి కోసమో ఎదురుచూస్తున్నారు. అటుగా వెళుతున్న వారెవరో శోభను చూశారు! ‘వావ్’ అనుకున్నారు. అలా చాలామంది శోభను చూసి వావ్ అనుకోవడం మామూలే కానీ, ఇక్కడ వావ్ అనుకున్నది, వీళ్ల దగ్గరికొచ్చి శోభను పరిచయం చేసుకున్నది మోడలింగ్ ఫీల్డ్ వాళ్లు. ఆ తర్వాత శోభ ఖటావ్ శారీస్, తాజ్ టీ, పాండ్స్, బాంబే డయింగ్.. అన్నీ టాప్ బ్రాండ్స్.. వాటికి మోడల్ అయ్యారు. ఆరేళ్లు తన 22 వ యేట వరకు శోభ మోడలింగ్‌కి శోభ తెచ్చారు. మరి బాలీవుడ్ శోభకు ఎట్రాక్ట్ కాలేదా? అయింది. కానీ శోభే బాలీవుడ్‌కి ఎట్రాక్ట్ కాలేదు! ఏంటీ అమ్మాయి? ఏం లేదు. మృదుభాషి. ఆమె ఆలోచనలు మాత్రమే నిరంతరం మాట్లాడుతూ ఉంటాయి. వాటి ధ్వని అక్షరాల్లో వినిపిస్తుంది. అంతే తప్ప అస్తమానం మానవలోకంలో తిరుగాడుతుండే స్త్రీ కాదు శోభాడే. సత్యజిత్‌రాయ్, ఇంకా ఒకరిద్దరు బెంగాలీ దర్శకులు.. సినిమాల్లోకి వస్తారా అని శోభను అడిగారు. శోభ రాలేననలేదు. చేయలేనన్నారు. క్రీడలు.. క్రియేటివిటీ శోభ అథ్లెట్ కూడా అని చెబితే సడెన్‌గా ఇక్కడ టాపిక్ డైవర్ట్ అయినట్లు ఉంటుంది. శోభ కూడా ఇలాగే ఆటల్నుంచి డైవర్ట్ అయ్యారు. చదువుకునే రోజుల్లో ఆమె రాష్ట్ర స్థాయి అథ్లెట్. ఇక బాస్కెట్ బాల్లో అయితే ఆమె రికార్డ్ హోల్డర్. కానీ అటువైపే వెళ్లలేదు. మోడలింగ్ చేస్తూనే మాస్ కమ్యూనికేషన్స్‌లోకి వచ్చేశారు. భవాన్స్ కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. తర్వాత ‘క్రియేటివ్ యూనిట్’లో కాపీ రైటర్‌గా చేశారు. అదొక యాడ్ ఏజెన్సీ. స్టార్‌డస్ట్, సొసైటీ, సెలబ్రిటీ పత్రికలకు ఎడిటర్‌గా చేయడం శోభ జర్నలిజం కెరీర్‌లోని శిఖరాగ్ర దశ. మూడూ ఒకే దేహంలా ఉండే ఈ పత్రికలకు మూడు వేర్వేరు ఆత్మలను ఇచ్చి, కొత్త తరం జర్నలిస్టులను తయారు చేశారు శోభా డే. రాయలేదు! చెక్కారు!! మరి ఇన్నిన్ని పుస్తకాలు ఎలా రాశారు? ఎప్పుడు రాశారు? ఎందుకు రాశారు? మొదటిది: తపన. అది ఆమెను నిలవనివ్వలేదు. అందుకు రాశారు. రెండోది: తపన. దానికి టైమింగ్స్ ఉండవు. ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు రాశారు. మూడోది: తపన. దాని పని అది చేసుకుపోయింది. పుస్తకాలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చేశాయి. జీవితంలోని ప్రతిక్షణం ఆమెకొక ప్రేరణ. ‘సోషలైట్ ఈవినింగ్స్’ లో శోభాడే ముంబై మహా నగరపు సంపన్న జీవితాల్లోని ఏకాంతపు విషాదాన్ని, విఫల వివాహాలను, పరస్పర్శలోని ఓదార్పును కోరుకునే దేహాలను, ఆత్మలను... శిల్పాల నీడల్లా చెక్కారు. న్యూ యాంగిల్ సామాజిక పరిణామాల్లో కొత్త కోణాలను చూస్తారు, వ్యాఖ్యానిస్తారు శోభాడే. దేశంలో ముందు వరుసలో ఉన్న కాలమిస్టు ఆమె. రోజుకి కనీసం 1500 పదాలైనా రాయగల శక్తిమంతురాలు. ఒక్కోరోజు రాయడానికి ఏమీ ఉండదు. అయినా సరే ఏమీ రాయకుండా ఉండలేదు. సంతృప్తి... పశ్చాత్తాపం ఏ కళతోనూ, ఏ కలలోనూ సంతృప్తి చెందని మనిషి శోభాడే. ఆవులకు మాత్రమే సంతృప్తి ఉంటుందని ఆమె అభిప్రాయం. ఆవు అయినా ఎలా సంతృప్తి చెందుతుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని శోభాడే మాటల్లో వినడమే బాగుంటుంది. ‘‘కొంచెం దాణా, కుడితి, నీడ, పక్కనే తన లేగదూడలు ఉంటే చాలు ఆవు సంతృప్తి చెందుతుంది’ అంటారు శోభ. మరి జీవితంలోని పశ్చాత్తాపాలు? అవి లేకుండా జీవితం ఎలా ఉంటుందని ఆమె ప్రశ్న. బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ శోభాడే బోల్డ్ అండ్ బ్యూటీఫుల్. కాలేజ్ బయట, కాలేజ్ లోపల. అలా గడిచాయి ఆ రోజులు. ఇప్పుడీ జనరేషన్ మీద ఏమిటి ఆమె అభిప్రాయం? అసలు మనకో అభిప్రాయం ఎందుకు ఉండాలి అనేది శోభ క్వొశ్చన్. ఎందుకంటే ఆమె కొన్ని పుస్తకాల్లో రాశారు.. ఇప్పటి అమ్మాయిలు మరీ గడుసుగా తయారయ్యారని. అయ్యారని రాశాను కానీ, అవకూడదని రాయలేదుగా అని శోభ! అమె చిన్న కూతురు డీజే అవుదామని అనుకుంది. ఆ మాటే అమ్మతో చెప్పింది. వద్దన్నారు శోభ.. తన స్వభావానికి భిన్నంగా. నేను చేసేది చేసేదే అన్నట్లు డీజే దారిలోకి వెళ్లింది చిన్నమ్మాయి. ఆ మాత్రం ధైర్యం ఉండాలి అమ్మాయిలకు అంటారు శోభ. దీన్ని మనం ద్వంద్వ వైఖరి అనుకోనవసరం లేదు. ద్వైదీభావం అనుకోవాలి. శోభాడే మనోగతం మగవాళ్లలో నచ్చనివి? నోటి దుర్వాసన, చుండ్రు ఆదర్శ పురుషుడు అంటే? ఆదర్శ పురుషులంటూ ఎవరూ ఉండరు. సూపర్‌మేన్, రావణ్ కాంబినేషన్ నచ్చుతుంది నాకు. కానీ ఈ కాంబినేషన్‌తో మనకు మగాళ్లెవరూ కనిపించరు. మీ చర్మం నిగారింపు రహస్యం ఏమిటి? జీన్స్ బట్టి వచ్చింది. ప్లస్ మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్... రచయిత్రి కాకపోయుంటే... ఆర్కిటెక్ట్ ని అయుండేదాన్ని. చక్కటి ఆకాశ హర్మ్యాలను కట్టి ఉండేదాన్ని. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలాగే పుడతారా? మీరు ఇప్పుడు ఉన్నట్లే.. ఈ ప్రశ్న మీరు ఏ మిస్ ఇండియాకో వెయ్యవలసింది (నవ్వుతూ) మీ సోషల్ స్టేటస్‌ని మీ భర్త దిలీప్ డే ఎంజాయ్ చేస్తారా? ఏం ప్రశ్న అండీ ఇది! ఏకాలంలో ఉన్నారు? మీకు ఇంకా ఏమేం ఇష్టం? సినిమాలు... సినిమాలు. చాలా చూస్తాను. అలాగే ప్రయాణాలు నాకు ఇష్టం. తెల్లారేసరికల్లా మిలియన్ డాలర్లు (సుమారు 7 కోట్ల రూపాయలు) మీ ముంగిట్లోకి వచ్చిపడితే.. అవన్నీ ఖర్చయిపోయేంత వరకు దక్షిణమెరికాలో పర్యటిస్తాను. మీకు చాలా భాషలు తెలుసంటారు? చాలా కాదు. కొన్ని. హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్.. కొద్దిగా ఫ్రెంచి. అభిమాన రచయిత విక్రమ్ సేథ్, స్కాట్ ఫిట్టెగరాల్డ్ నచ్చిన సినిమాలు చాలా. ‘పాకీజా’ వాటిల్లో ఒకటి. ఎవరంటే ప్రేమ? జీవించడం, ప్రేమించడం. -
మహిళా అథ్లెట్ పై ఐరన్ రాడ్ తో దాడి
మధుర: అంతర్జాతీయ మహిళా అథ్లెట్‌పై ఐరన్ రాడ్‌తో దాడి చేసి గాయపరిచిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి అస్మా అల్వి(25) తీవ్రంగా గాయపడింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గత కొద్దిరోజులగా ఆమెను అసభ్య పదజాలంతో వేధించడంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం అస్మా అల్విపై దాడి చేశారు. ముందుగా ఓ వ్యక్తి ...ఆమె బ్యాగ్‌ను గుంజుకునేందుకు యత్నించడంతో ఆమె అడ్డుకుంది. అదే సమయంలో మరోవ్యక్తి అల్విపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. దాంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు అల్విని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారి అనుపమ్ సింగ్ తెలిపారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా అల్విపై జరిగిన దాడిని క్రీడా సమాఖ్య ఖండించింది. నిందితులను పట్టుకొని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. కాగా 2005లో ఉజ్బెకిస్థాన్ ఛాంపియన్ షిప్ లో అల్వి 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పథకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో ఆమె పలు బంగారు పతకాలు గెలుచుకుంది. -
బోల్ట్ తప్పుకున్నాడు
కింగ్ స్టన్: పరుగుల చిరుత, జమైకా స్ప్లింటర్ ఉస్సేన్ బోల్ట్ మెల్లగా వెనుకబడి పోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. అతను ఈరోజు జమైకాలో జరగుతున్న జాతీయ పరుగు పందెం బరి నుంచి తప్పుకున్నాడని ఓ మీడియా సంస్థ తెలిపింది. ఈ పరుగు పందెం జాబితా చూస్తే అందులో బోల్ట్ పేరు లేదని, దాని గురించి వాకబు చేయగా ఆయన పరుగు పందెం నుంచి తప్పుకున్నాడని స్పష్టమైందని తెలిసింది. వచ్చే ఆగస్టు బీజింగ్‌లో జరగనున్న ప్రపంచ చాంపియన్ షిప్ పోటీకి ట్రయల్ ల్లాంటి ఈ పోటీ నుంచి బోల్ట్ అనూహ్యంగా తప్పుకోవడం అందరినీ ఆలోచింపజేస్తుంది. గతంలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ పేరిట అరుదైన రికార్డులు(100 మీ-10.12 సెకండ్లు), (200 మీ-20.13 సెకండ్లు) ఉన్నాయి. కాగా, గతవారం న్యూయార్క్‌లో జరిగిన డైమాండ్ లీగ్‌లో 200 మీటర్ల పరుగు పూర్తి చేసేందుకు 20.29 సెకన్ల సమయం తీసుకున్నాడు. దీంతో బోల్ట్ ఫిట్ నెస్‌పై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్ బోల్ట్ అందుకోస్తాడా అని ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారట. -
మరో అథ్లెట్ ఆత్మహత్యాయత్నం
తిరువనంతపురం: మొన్నటికి మొన్న మహిళా అథ్లెట్ ఆత్మహత్య సంఘటన మరిచిపోకముందే కేరళలో మరో యువ క్రీడాకారుడి ఆత్మహత్యాయత్నం క్రీడావర్గాల్లో కలకలం రేపింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. శిక్షణలో ఉన్న 18 ఏళ్ల అథ్లెట్ చేతి మణికట్టును కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు పారిపోయాడు. చేతికి గాయం చేసుకొని పడి ఉన్న అతడ్ని గమనించి మెడికల్ కాలేజీకి తరలించారు. గాయానికి కుట్టు వేసిన వైద్యులు అతనికి ప్రాణాపాయం లేదని తేల్చారు. కానీ మానసిక వైద్య విభాగానికి రెఫర్ చేశారు. ఇంతలోనే అతడు కనిపించాకుండా పోయాడని పోలీసులంటున్నారు. అయితే హాస్టల్లో దొంగతనం చేయడంతో సహచరులు అతడిని ప్రశ్నించారని, దీంతో క్షణికావేశంతో ఆత్మహత్యకు ప్రయత్నించి..పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా గత నెలలో విషపూరితమైన పళ్లు తిని నలుగురు మహిళా అథ్లెట్లు ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది. కోచ్ వేధింపుల వల్లే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
ఆనందమే అందం
ఐదు పదులు దాటినా తరగని అందం.. ఆత్మవిశ్వాసం నిండిన చూపు, కట్టిపడేసే చిరునవ్వు.. ఒకప్పటి మిస్ ఇండియా, మిస్ ఇంటర్నేషనల్ రన్నరప్.. క్రీడాకారిణి, నటి, రాజకీయ, సామాజికవేత్త... ఇలా విభిన్న రంగాలలో మేటి అయినా తల్లిగా, నానమ్మగా తాను ఎక్కువ సంతృప్తిని పొందుతున్నానని చెప్పే స్త్రీమూర్తి నఫీసా అలీతో కాసేపు... - ఓ మధు అథ్లెట్.. బ్యూటీక్వీన్, పొలిటీషియన్.. ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి? అథ్లెట్ కావటం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ గ్యారంటీగా ఉంటుంది. చదువు ఇంటెలిజెన్స్‌ని పెంచుకోవడానికి సహకరిస్తుంది. అలాగే సహజంగా మన పుట్టుక కొన్ని అవకాశాలు కల్పిస్తుంటుంది. పెరిగిన వాతావరణం కొంత హెల్ప్ చేస్తుంది. అలా అదృష్టవశాత్తు అవన్నీ నాకు అమరాయి. మనకున్న పాజిబిలిటీస్ నుంచి ముందుకు సాగటమే జీవితమంటే. అందుకే నా జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందంగా గడుపుతున్నా. ఫిట్‌గా ఉండటానికి ఏం చేస్తుంటారు? వాతావరణ కాలుష్యం, జీవన శైలి మార్పులు అనారోగ్యానికి ఆహ్వానం పలుకుతుంటాయి. వాటిని తట్టుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో ప్రవేశం కలిగి వుండాలి. అథ్లెట్ కావడం వల్ల అనారోగ్యం పాలు కారని చెప్పలేం. కాని అనారోగ్యం పాలైనా తొందరగా కోలుకునేందుకు ఉపకరిస్తుంది. అందుకే, అందరూ జీవితంలో తప్పకుండా ఏదో ఒక క్రీడతో కనెక్ట్ కావాలి. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాలు పలకరిస్తుంటాయి. వీటిని తట్టుకోవడానికి, నియంత్రించడానికి మనం ఫిట్‌గా ఉండటం ద్వారా ప్రయత్నించాలి. క్రీడాకారిణులు రాణించాలంటే? నేను స్వతహాగా క్రీడాకారిణిని. అవకాశం కల్పిస్తే ఎంతోమంది మంచి క్రీడాకారిణులు దేశానికి ఎన్నో పతకాలు తీసుకురాగలరు. ఇటీవల కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారిణులు రాణిస్తున్నారు. అయితే అందరికీ సమానావకాశాలు రావటం లేదనేది వాస్తవమే. స్ఫూర్తి ఉన్న వారందరికీ అవకాశాలు కల్పించే అంశంలో కొంత బ్యాలెన్స్ రావలసి ఉంది. తగిన శిక్షణావకాశాల్ని మెరుగుపరిస్తే ఫలితం ఉంటుంది. రాజకీయాలు, సినిమాలు, సేవ.. వీటిలో మీరు ఎక్కువ ఎంజాయ్ చేసింది ఏది? నేను నా మదర్‌హుడ్‌ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను అమ్మమ్మనయ్యా. అథ్లెట్ కావటం వల్ల నా గ్రాండ్ చిల్డ్రన్‌తో పరుగెడుతూ అలసట లేకుండా ఆడుకోగలుగుతున్నాను. అదినాకెంతో సంతోషాన్నిస్తుంది. చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా ఎన్నో సేవలు అందించారు. వాటి గురించి కొన్ని వివరాలు... చదువంటే పుస్తకాలే కాదు. వినోదం ద్వారా కూడా పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. చక్కటి సినిమాలు చూసే అవకాశం పిల్లలకు ఉండాలని నెహ్రూ ఆశించే వారు. పిల్లల సృజనకు కావలసిన వాతావరణం సృష్టించాలన్నదే ఆయన ఆంతర్యం. ఇందుకోసం మేం బాలల చిత్రోత్సవాలను నక్సల్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో సైతం ప్రదర్శించాం. సందేశాత్మక, స్ఫూర్తిదాయక చిత్రాలను చూడటం ద్వారా పిల్లల్లో లక్ష్యాల కల్పన, వివిధ విషయాలపై అవగాహన కలుగుతాయి. హైదరాబాద్ గురించి? గతంలో హైదరాబాద్‌లో ఫిలిం ఫెస్టివల్స్ నిమిత్తం చాలాసార్లు వచ్చాను. ఇక్కడి వారితో నాకు ప్రత్యేక అనుబంధం వుంది. హైదరాబాద్ కల్చర్, హెరిటేజ్ ఇండియాలోనే యూనిక్ అనిపిస్తుంది. చార్మినార్ దగ్గరుండే చిన్న చిన్న బజారుల్లో కొత్తకొత్తగా తయారు చేసే వస్తువులను షాపింగ్ చేస్తుంటాను. హైదరాబాద్ వచ్చి బిర్యాని పట్ల నాకున్న ప్యాషన్‌కు న్యాయం చెయ్యకుండా వెళ్లింది లేదు. హుస్సేన్‌సాగర్, పురాతన కట్టడాలు, సాలార్జంగ్ మ్యూజియం నాకు నచ్చిన స్పాట్స్. ఒక మాట... కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రతిభను కనబర్చనివ్వరు. దీనివల్ల పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటకు రాకుండాపోతుంది. అదే విదేశాలలో పిల్లలను చూస్తే వీల్ చెయిర్లో ఉన్న పిల్లలు కూడా ఎంతో ప్రొడక్టివ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లల భవిష్యత్తు వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. దానిని గుర్తించటమే పెద్దవారిగా మన బాధ్యత. -
పరుగు పందెంలో 8 వ నెల గర్భవతి
పుట్టబోయే బిడ్డకి చెప్పుకునేందుకు ఆ తల్లి దగ్గర ఓ గొప్ప కథ ఉంది! 'బుజ్జి కన్నా... ఎనిమిదో నెల గర్భంతో నిన్ను మోస్తూ నేను 800 గజాలు పరుగెత్తానురా' అని ఆమె తన పిల్లవాడికి చెప్పుకోవచ్చు. 800 మీటర్ల పరుగుపందెంలో అయిదు సార్లు అమెరికన్ ఛాంపియన్ గా నిలిచిన అలీషియా మోంటానో కొత్త చరిత్ర సృష్టించింది. ఎనిమిదో నెల గర్భంతో ఆమె జాతీయ ఛాంపియన్ షిప్ లో పాల్గొంది. ఆమె పోటీలో అందరికన్నా ఆఖరుగా నిలిచింది. కానీ అందరికన్నా ఎక్కువ చప్పట్లను పొందింది ఆమే! యావత్ స్టేడియం లేచి నిల్చుని ఆమెను అభినందించింది. ఆఖరికి ఛాంపియన్ షిప్ గెలిచిన వారు కూడా ఆమెనే ప్రశంసించారు. గర్భిణీ స్త్రీలు వ్యాయామం చేయాలన్న అంశానికి ప్రచారం కల్పించేందుకే ఆమె ఈ సాహసానికి పూనుకుంది. మామూలుగా చాలా మంది గర్భవతులు విశ్రాంతి పేరిట కాయకష్టాన్ని పూర్తిగా ఆపేస్తారు. కానీ అలీసియా గర్భవతి అయినప్పటి నుంచీ పరుగు ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఛాంపియన్ షిప్ లో పాల్గొనడానికి ఆమె వైద్యుల అనుమతి తీసుకుంది. పరుగుల రాణికి పుట్టిన ఆ బిడ్డ పరుగుల యువరాజు అయితీరతాడేమో! -
అమ్మతనాన్ని మించి...
ఒలింపిక్స్‌లో పాల్గొనాలని.. పతకం సాధించి దేశ గౌరవాన్ని అంతర్జాతీయంగా ఇనుమడింపచేయాలని ప్రతీ అథ్లెట్ కోరుకుంటారు. నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మకమైన ఈ పోటీల కోసం తీవ్రంగా చెమటోడుస్తారు. గాయాల వల్లనో లేదంటే మరే కారణం వల్లనైనా ఒలింపిక్స్‌కు దూరమైతే వారు పడే బాధ వర్ణనాతీతం. అయితే గర్భిణిగా ఉన్న అథ్లెట్లు పతకం సాధించాలన్న ఆశయంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒలింపిక్స్‌లో పాల్గొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పదిమందికి పైగా గర్భిణి అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఓ వైపు ప్రాణాన్ని లెక్క చేయకుండా.. లక్ష్యం వైపు వాళ్లు వేసిన అడుగులు తోటి అథ్లెట్లలో స్ఫూర్తిని నింపేవి. కొందరు తమకు తెలిసి బరిలోకి దిగితే.. మరికొందరు గర్భిణులమని తెలియకుండానే పోటీల్లో పాల్గొన్నారు. ఇంకొందరైతే తాము గర్భిణులమని ఒలింపిక్స్ ముగిసిన తర్వాత వెల్లడించారు. అలాంటివారిలో కొందరు... 1- ఆంకీ వాన్ గ్రన్స్వెన్... ఈక్వెస్ట్రియన్ స్టార్ అథ్లెట్.. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో గ్రన్స్వెన్ బరిలోకి దిగినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. కారణం ఆమె ఐదు నెలల గర్భిణి. అయినా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి వ్యక్తిగత డ్రెస్సేజ్ విభాగంలో పతకం సాధించింది. అది కూడా బంగారు పతకం కావడం విశేషం. డచ్‌కు చెందిన గ్రన్స్వెన్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్ నుంచి 2012 లండన్ ఒలింపిక్స్ వరకు ప్రతీ ఒలింపిక్స్‌లోనూ ఈక్వెస్ట్రియన్‌లో తన ప్రతిభతో పతకం సాధిస్తూ వచ్చింది. ఒలింపిక్స్‌లో ఏ రైడర్ కూడా ఇన్ని పతకాలు సాధించలేదు. 2- సుర్యానీ స్పెషల్ రికార్డ్... నుర్ సుర్యానీ మహ్మద్ తైబి... మలేసియాకు చెందిన ఈ షూటర్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో ఆమె ఎనిమిది నెలల గర్భిణి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బరిలోకి దిగిన సుర్యానీ 34వ స్థానంలో నిలిచింది. పతకం సాధించకపోయినా సుర్యానీ మాత్రం స్పెషల్ రికార్డును సొంతం చేసుకుంది. 8 నెలల గర్భంతో పోటీల్లో పాల్గొన్న తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డులకు ఎక్కింది. 3- 2010 వాంకోవర్ వింటర్ ఒలింపిక్స్‌లో కెర్స్టిన్ (జర్మనీ) స్కెలెటన్ క్రీడాంశంలో రజత పతకం సాధించింది. పోటీ సమయానికి ఆమె రెండు నెలల గర్భిణి. జునో స్టోవర్ ఇర్విన్(అమెరికా)...1952 ఒలింపిక్స్ డైవింగ్‌లో కాంస్య పతకం సాధించింది. అప్పటికే ఆమె మూడున్నర నెలల ప్రెగ్నెంట్. జర్మనీ ఆర్చర్ కరోలినా 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ల్లో గర్భిణిగానే పోటీల్లో బరిలోకి దిగింది. 2000లో కరోలినా లక్ష్యాన్ని గురిపెట్టి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కెర్రీ వాల్ష్తో పాటు అన్నా మారియా జోహన్సన్ (హ్యాండ్‌బాల్), నుర్ సుర్యానీ(షూటింగ్) కూడా గర్భిణిలే. ఒక ఒలింపిక్స్‌లో ముగ్గురు ప్రెగ్నెంట్ అథ్లెట్లు బరిలోకి దిగడం తొలిసారి. తొలి ఒలింపియన్ జులిన్... 1920 ఒలింపిక్స్‌లో మగ్డా జులిన్.. ఫిగర్ స్కేటింగ్ సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగి బంగారు పతకం సాధించింది. అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి. గర్భిణిగా బరిలోకి దిగిన తొలి ఒలింపియన్. 4- కెర్రీ వాల్ష్ జెన్నింగ్స్.. అమెరికా బీచ్ వాలీబాల్ స్టార్... లండన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో కెర్రీ బరిలోకి దిగింది. అయితే అప్పుడు ఆమె ఏడు వారాల గర్భిణి.. తోటి అథ్లెట్లు వద్దని వారించారు.. డాక్టర్లయితే పిండంతో పాటు ప్రాణానికి ప్రమాదమని కెర్రీని హెచ్చరించారు. అయినా ఆమె ఇవేమీ పట్టించుకోలేదు. ప్రాణాన్ని పణంగా పెట్టి అమెరికాకు స్వర్ణాన్ని అందించింది. -
ఉత్సాహంగా పుణే మారథాన్
పింప్రి, న్యూస్‌లైన్: పుణే అంతర్జాతీయ మారథాన్ ఆసక్తికరంగా సాగింది. ఆదివారం ఉదయం డెక్కన్ ఖండోజీ బాబా చౌక్ నుంచి ప్రారంభమైన ఈ పోటీల్లో ముందునుంచి అనుకున్నట్టుగానే పురుష, మహిళల విభాగాల్లో ఇథియోపియో అథ్లెట్లే సత్తా చాటారు. బేలాచు ఎండలే అబానేహ పురుషుల ఫుల్ మారథాన్‌ను నెగ్గి కెరీర్లో తొలి టైటిల్ కైవసం చేసుకున్నాడు. పురుషుల, మహిళల హాఫ్ మారథాన్‌లో హబతాము అర్గా, అబేరూ జూహూదె తేసేమా నెగ్గి రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఇథియోపియన్ అథ్లెట్లు మూడు బంగారు పతకాలను తమ ఖాతాలో వేసుకున్నట్టయ్యింది. తమకు పోటీగా వచ్చిన కెన్యా అథ్లెట్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కాగా, పురుషుల ఫుల్ మారథాన్‌లో ఇథియోపియా అథ్లెట్ బేలాచు ఎండలే అబానేహ 2.17.52 సెకన్లలో 42 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుకొని తొలి స్థానంలో నిలిచాడు. కెన్యా అథ్లెట్ ఎజికియల్ చెరోప్ 2.18.16 సెకన్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఖడికిలోని బాంబే ఇంజనీరింగ్ గ్రూప్ నుంచి ఉదయం 7 గంటల 20 నిమిషాలకు ప్రారంభమైన హాఫ్ మారథాన్‌లో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే విజేతలుగా ఇథియోపియన్ అథ్లెట్లే నిలిచారు. తర్వాత స్వార్గేట్ వద్ద గల నెహ్రూ స్టేడియంలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు సురేష్ కల్మాడీ, నగర మేయర్ చంచలా కోద్రే తదితరులు పాల్గొన్నారు. ప్రభావం చూపని భారత్ అథ్లెట్లు రాష్ట్ర సహకార మంత్రి హర్షవర్ధన్ పాటిల్, ప్రముఖ క్రీడాకారిణి (షూటర్) అంజలీ భగావల్ ప్రారంభించిన ఈ మారథాన్‌లో భారత్ అథ్లెట్లు ప్రభావం చూపలేదు. నాసిక్‌కు చెందిన భికు కైర్‌నర్ 2.27.04 సెకన్లలో గమ్యాన్ని చేరి బెస్ట్ టైమింగ్ నమోదు చేసి 16వ స్థానంలో నిలిచాడు. స్థానిక అథ్లెట్లు కే.మూర్తి (2.51.51), విజయ్ అహీర్ (3.03.33) 23, 26వ స్థానాల్లో నిలిచారు.