
భువనేశ్వర్: టోక్యోలో జరగనున్న ఒలింపిక్ క్రీడలకు ఎంపికైన రాష్ట్ర క్రీడాకారిణి స్ప్రింటర్ ద్యుతి చాంద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్సులో ఆమెతో మాట్లాడి ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించి భారత దేశానికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి. ఒలింపిక్ క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్లు పరుగు పందెంలో ద్యుతి చాంద్ పాల్గొంటుంది. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడం ఆమెకి వరుసగా ఇది రెండో సారి.
Comments
Please login to add a commentAdd a comment