Tokyo Olympics
-
Neeraj Chopra: రూ. 52 లక్షల వాచ్!.. కోట్ల ఆస్తి.. కష్టే ఫలి!
వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత జావెలిన్ త్రో సూపర్‌స్టార్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం ఆటతోనే కాదు.. తన గుణగణాలతో అందరి మనసులు దోచుకున్నాడంటూ ఈ హర్యానా అథ్లెట్‌ను కొనియాడుతున్నారు అభిమానులు. నీరజ్ పెంపకం కూడా ఎంతో గొప్పగా ఉందంటూ అతడి తల్లిదండ్రులను కూడా ప్రశంసిస్తున్నారు.పాకిస్తాన్ పసిడి పతక విజేత అర్షద్ నదీమ్ కూడా తమ బిడ్డలాంటి వాడేనని నీరజ్ తల్లి సరోజ్ దేవి చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అదే విధంగా.. ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతకధారిగా భారత హాకీ స్టార్ శ్రీజేశ్కు ఫ్లాగ్‌బేరర్‌గా అవకాశం ఇస్తామన్నపుడు.. నీరజ్ సంతోషంగా ఒప్పుకొన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం నీరజ్ చోప్రా విలాసవంతమైన జీవితం, అతడి దగ్గర ఉన్న ఖరీదైన వస్తువల గురించి చర్చిస్తున్నారు. మరి అతడి నెట్‌వర్త్ ఎంతో తెలుసా?!ఉమ్మడి కుటుంబంహర్యానాలోని పానిపట్‌లో గల ఖాంద్రా గ్రామంలో డిసెంబరు 24, 1997లో నీరజ్ చోప్రా ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి సతీశ్ కుమార్, తల్లి సరోజ్ దేవి. పందొమ్మిది సభ్యులు ఉన్న ఉమ్మడి కుటుంబం వారిది. నీరజ్‌కు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. చెల్లెల్లు సంగీత- సరిత.ఇక పదకొండేళ్ల వయసులోనే 90 కిలోల బరువుతో బాధపడ్డ నీరజ్‌ను తండ్రి సమీప జిమ్‌లో చేర్పించాడు. ఊబకాయం వల్ల ఒత్తిడికి లోనైన నీరజ్‌లో స్ఫూర్తిదాయక మాటలతో ఆత్మవిశ్వాసం నింపేది అతడి తల్లి. ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూనే కొడుకును జావెలిన్ త్రోయర్‌గా ఎదిగేలా ప్రోత్సహించారు ఆ తల్లిదండ్రులు.ఓవర్‌నైట్ స్టార్గాఈ క్రమంలో అనూహ్య రీతిలో.. అంచనాలు తలకిందులు చేస్తూ భారత ఆర్మీ సుబేదార్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి యావత్ భారతావని దృష్టిని ఆకర్షించాడు. వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన ఈ అథ్లెట్ కోసం వాణిజ్య ప్రచార సంస్థలు క్యూకట్టాయి.ఈ నేపథ్యంలో నీరజ్ పేరుప్రఖ్యాతులతో పాటు సంపద కూడా అమాంతం పెరిగింది. తమ గ్రామంలోనే అత్యంత విలాసవంతమైన ఇల్లు కలిగి ఉంది నీరజ్ కుటుంబం. ఖాంద్రాలోని ఈ మూడంతస్తుల భవనం విలువ కోట్లలో ఉంటుందని సమాచారం.లగ్జరీ కార్లుఇక నీరజ్ గ్యారేజీలో ఆనంద్ మహీంద్రా అందించిన ప్రత్యేకమైన వాహనంతో పాటు.. ఫోర్ట్ ముస్టాంగ్ జీటీ(సుమారు రూ. 93.52 లక్షలు), టయోటా ఫార్చునర్(సుమారు రూ. 33.43 లక్షలు), రేంజ్ రోవర్ స్పోర్ట్(రూ. 2 కోట్లు), హార్లే డేవిడ్సన్ బైకు(రూ. 11 లక్షలు), బజాజ్ పల్సర్(రూ. లక్ష) ఉన్నాయి.నెట్‌వర్త్ ఎంతంటే?కాగా టోక్యోలో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. ఈసారి వెండి పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక జావెలిన్ త్రో క్వాలిఫయర్స్ సందర్భంగా నీరజ్ ధరించిన వాచ్‌పై కూడా నెట్టింట చర్చ జరుగుతోంది. ఒమేగా బ్రాండ్‌కు చెందిన ఆక్వా టెరా అల్ట్రా వాచ్ విలువ సుమారుగా రూ.52 లక్షలు ఉంటుందని సమాచారం. అన్నట్లు జాతీయ మీడియా DNA రిపోర్టు ప్రకారం.. నీరజ్ చోప్రా ఆస్తుల నికర విలువ సుమారు 32 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వివిధ బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా నీరజ్‌కు అధిక మొత్తంలో ఆదాయం చేకూరుతున్నట్లు సమాచారం. కష్టే ఫలిటోక్యోలో స్వర్ణం సాధించిన తర్వాత క్యాష్ ప్రైజ్ రూపంలో నీరజ్ చోప్రాకు మొత్తంగా రూ. 13 కోట్లు దక్కాయి. నైక్, ఒమేగా వంటి ప్రముఖ బ్రాండ్లకు అతడు ప్రచారకర్త. ఆటగాడిగా తనను నిరూపించుకునే క్రమంలో గాయాలతో సతమతమైనా.. ఎన్నో కఠినసవాళ్లు ఎదురైనా వాటిని దాటుకుని ఉన్నతశిఖరాలకు చేరిన నీరజ్ చోప్రా యువతకు ఆదర్శం అనడంలో సందేహం లేదు.చదవండి: ఒట్టేసి చెప్పు బాబూ: నీరజ్ చోప్రాతో మనూ భాకర్ తల్లి -
వచ్చాడు... విసిరాడు... ఫైనల్ చేరాడు
అనూహ్యమేమీ కాదు...అలవాటు లేనిదేమీ కాదు... అడుగు పెడితే చాలు జావెలిన్‌తో అద్భుతంగా ఆడుకునే భారత స్టార్ నీరజ్ చోప్రా ఒలింపిక్ వేదికపై మళ్లీ తన బంగారు వేటను మొదలు పెట్టాడు. అసలు పోరుకు ముందు అర్హత సమరంలో తనదైన శైలిలో అదరగొట్టాడు. క్వాలిఫయింగ్ పోరులో ఒకే ఒక్క త్రో విసిరి అలా అలవోకగా ముందంజ వేశాడు... మరో మాటకు తావు లేకుండా అగ్ర స్థానంతో దర్జాగా ఫైనల్లోకి అడుగు పెట్టి ఒక లాంఛనం ముగించాడు... ఎక్కడా తడబాటు లేదు, కాస్త ఉత్కంఠ పెంచినట్లుగా కూడా కనిపించలేదు. రోజూ చేసే పని ఇదేగా అన్నట్లుగా క్షణాల వ్యవధిలో త్రో పూర్తి చేసి వెనక్కి తిరిగి చూడకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు... ఇదే తరహా ప్రదర్శనను రేపు జరిగే ఫైనల్లోనూ చూపిస్తే మన బంగారు బాలుడి ఒడిలో వరుసగా రెండో ఒలింపిక్స్‌లో మరో పసిడి పతకం పరుగెత్తుకుంటూ వచ్చి వాలడం ఖాయం! పారిస్: కోట్లాది భారత అభిమానుల పసిడి ఆశలను మోస్తూ బరిలోకి దిగిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సత్తా చాటిన నీరజ్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించే లక్ష్యంతో మైదానంలోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్ గ్రూప్ ‘బి’లో నీరజ్ తన జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి క్వాలిఫై అయ్యాడు. ఫైనల్ చేరేందుకు అర్హత మార్కు 84 మీటర్లు కాగా... తన తొలి ప్రయత్నంలోనే అంతకంటే ఎక్కువ దూరం బల్లెం విసరడంతో నీరజ్‌కు మళ్లీ త్రో చేయాల్సిన అవసరమే రాలేదు. గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’ రెండూ కలిపి నీరజ్‌దే అత్యుత్తమ ప్రదర్శన. వ్యక్తిగతంగా కూడా ఈ దూరం నీరజ్ కెరీర్లో రెండో స్థానంలో నిలుస్తుంది.2022లో అతను జావెలిన్‌ను 89.94 మీటర్లు విసిరాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కూడా అయిన నీరజ్‌తో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమైన అండర్సన్ పీటర్స్ (గ్రెనడా), జూలియన్ వెబర్ (జర్మనీ) జావెలిన్‌ను 88.63 మీటర్లు , 87.76 మీటర్లు వరుసగా రెండు, మూడు స్థానాలతో ముందంజ వేశారు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (86.59 మీటర్లు) కూడా ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. 84 మీటర్లు విసిరిన లేదా రెండు గ్రూప్‌లలో కలిపి 12 మంది అత్యుత్తమ స్కోరర్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. క్వాలిఫయింగ్‌లో 9 మంది 84 మీటర్ల మార్క్‌ను అందుకొని ముందంజ వేయగా, మరో ముగ్గురికి మాత్రం టాప్–12లో రావడంతో అవకాశం లభించింది. పోటీలో నిలిచిన మరో భారత జావెలిన్ త్రోయర్ కిషోర్ జెనా తీవ్రంగా నిరాశపరిచాడు. జావెలిన్‌ను 80.73 మీటర్లు మాత్రమే విసిరిన అతను గ్రూప్ ‘ఎ’లో తొమ్మిదో స్థానానికే పరిమితం కావడంతో ఫైనల్ అవకాశం చేజారింది. గత ఏడాది ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను 87.54 మీటర్ల దూరం విసిరి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కిషోర్... అసలు సమయంలో కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయాడు. మరోవైపు మహిళల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ కిరణ్ పహాల్ నిరాశపర్చింది. ఈ ఈవెంట్లో ఆమె సెమీఫైనల్ చేరడంలో విఫలమైంది. ఆరుగురు పాల్గొన్న రెపిచాజ్ హీట్–1లో మొదటి స్థానంలో నిలిస్తేనే సెమీస్ చేరే అవకాశం ఉండగా... 52.59 సెకన్లలో పరుగు పూర్తి చేసిన కిరణ్ ఆరో స్థానంతో ముగించింది.ఎప్పుడైనా తొలి ప్రయత్నమే మెరుగ్గా ఉండాలని భావిస్తా. ప్రతీసారి అది సాధ్యం కాకపోవచ్చు. అలా జరిగింది కూడా. నేను ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నా. ఎలాంటి ఇబ్బంది లేదు. ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అయితే క్వాలిఫయింగ్కంటే ఫైనల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాబట్టి సన్నద్ధత కూడా చాలా బాగుండాలి. నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఫైనల్ సాయంత్రం జరుగుతుంది కాబట్టి వాతావరణం కాస్త చల్లగా ఉండవచ్చు. అయితే దానికి అనుగుణంగానే సిద్ధమవుతా. ఫైనల్ చేరిన వారంతా బలమైన ప్రత్యర్థులే కాబట్టి ఎవరితోనూ ప్రత్యేకంగా పోటీ ఉండదు. –నీరజ్ చోప్రా -
మీరా ఔరా అనిపించేనా?
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో... పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్‌కు పతకం అందించి సంబరాల్లో ముంచెత్తిన భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను... బుధవారం ‘పారిస్’ క్రీడల బరిలోకి దిగనుంది. 49 కేజీల విభాగంలో గత ఒలింపిక్స్‌లో 202 కేజీలు (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రజతం గెలిచిన మీరాబాయిపై ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.అయితే కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న చాను.. ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఇప్పటి వరకు భారత్‌కు రెండు పతకాలు దక్కగా... ఆ రెండూ మహిళా లిఫ్టర్లే గెలిచారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో దిగ్గజ లిఫ్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా... టోక్యోలో మీరాబాయి రజతం నెగ్గింది. గత ఒలింపిక్స్‌లో మెరుపులు మెరిపించిన మీరాబాయి.. ఆ తర్వాత గాయాల బారిన పడి అదే స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయింది.2022 కామన్వెల్త్ క్రీడల్లో మాత్రమే 200 కేజీల మార్కు దాటగ లిగింది. ఇక తాజాగా ‘పారిస్’ క్రీడల్లో మీరాబాయి ఎంట్రీ వెయిట్ 200 కేజీలుగా నమోదు చేసుకుంది. ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్ హో జీహుయి (చైనా), డెలాక్రజ్ (అమెరికా), సురోచన ఖామ్బో (థాయ్‌లాండ్), మిహేలా కామ్బెయి (రొమేనియా) మీరాకన్నా మెరుగైన ఎంట్రీ వెయిట్ నమోదు చేసుకున్నారు. ఈసారి పోటీల తీవ్రతను బట్టి చూస్తే.. మీరాబాయి తన అత్యుత్తమ ప్రదర్శన (205 కేజీలు) కనబర్చగలిగితేనే పతకం రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయి. చైనా లిఫ్టర్ హో జీహుయి మరోసారి స్వర్ణంపై గురి పెట్టింది. మీరాబాయి గాయం నుంచి పూర్తిగా కోలుకుందని కోచ్ విజయ్ శర్మ పేర్కొన్నారు. ‘మీరా 200 కేజీలు సునాయాసంగా దాటగలదు. టోక్యో ఒలింపిక్స్‌లో ఎత్తిన 202 కేజీల బరువును మించిన ప్రదర్శన చేస్తుంది. సవాలు స్వీకరించేందుకు చాను సిద్ధంగా ఉంది’ అని విజయ్ శర్మ అన్నాడు. -
41 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.. కానీ ఓవర్ నైట్ స్టార్ కాలేకపోయాడు
ప్రపంచవ్యాప్తంగా క్రీడా అభిమానులు, అథ్లెట్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఒలింపిక్స్-2024కు సర్వం సిద్దమైంది. జూలై 26న ప్యారిస్ వేదికగా ఈ విశ్వక్రీడలకు తెరలేవనుంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు సత్తాచాటేందుకు సిద్దమయ్యారు.బంగారు పతకాలే లక్ష్యంగా భారత క్రీడాకారులు ప్యారిస్‌కు పయనమయ్యారు. ఇక గత ఒలింపిక్స్‌లో తృటిలో పసిడి పతకాన్ని చేజార్చుకున్న భారత హకీ జట్టు.. ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించి తమ 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. భారత హాకీ జట్టుపై ఈసారి భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ విశ్వక్రీడ్లలో భారత హాకీ జట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. ఒలింపిక్స్‌లో ఏకంగా 8 బంగారు పతకాలు గెలుచుకున్న ఘనత భారత హాకీ టీమ్‌ది. ఇండియా హాకీ టీమ్ ఖాతాలో ఇప్పటివరకు 8 బంగారు పతకాలు, మూడు కాంస్య, ఒక రజత పతకం ఉన్నాయి. 1928లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన తొట్టతొలి ఒలింపిక్స్‌లోనే పసిడి పతకం సాధించిన భారత హాకీ జట్టు.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.1928లో ఆమ్‌స్టర్‌డామ్‌లో మొదలైన భారత స్వర్ణయాత్ర 1980 మాస్కో ఒలిపింక్స్ వరకు కొనసాగింది. ఆ మధ్యలో ఓ సిల్వర్, రెండు కాంస్య పతకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విశ్వక్రీడల్లో ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించిన భారత హాకీ జట్టుకు అనూహ్యంగా గడ్డు కాలం ఎదురైంది. 1980 తర్వాత దాదాపు 41 ఏళ్ల పాటు హాకీలో భారత్ పతకం సాధించలేకపోయింది.ఈ సమయంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు.. తమ 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే టోక్యో ఒలిపింక్స్‌లో భారత్ కాంస్య పతకాన్ని ముద్దాడడంలో ఓ ఆటగాడిది కీలక పాత్ర. ఆ మిడ్ ఫీల్డర్ అద్బుతమైన గోల్‌తో భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చి బ్రాంజ్ మెడల్ నెగ్గేలా చేశాడు. కానీ అతడు మాత్రం ఓవర్ నైట్‌స్టార్‌గా మారలేకపోయాడు. ఇప్పటికి ఆ హాకీ ప్లేయర్ పేరు చాలా మందికి తెలియదు. అతడే భారత మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్.సూపర్ గోల్.. సూపర్ విన్2020 టోక్యో ఒలింపిక్స్ హాకీ క్వార్టర్-ఫైనల్లో భారత్, గ్రేట్ బ్రిటన్ తలపడ్డాయి. క్వార్టర్ఫైనల్లో భారత్ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్లో 7వ నిమిషంలో భారత్ మొదటి గోల్ చేయగా.. రెండో క్వార్టర్ ప్రారంభమైన వెంటనే 16వ నిమిషంలో రెండో గోల్ చేసింది. దీంతో సెకెండ్ క్వార్టర్ ముగిసే సరికి భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే మూడో క్వార్టర్ ఆఖరి నిమిషంలో బ్రిటన్ గోల్ సాధించి తిరిగి గేమ్‌లోకి వచ్చింది. దీంతో భారత డగౌట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగో క్వార్టర్స్ ఆరంభం నుంచే స్కోర్‌ను సమం చేయడానికి బ్రిటన్ తీవ్రంగా శ్రమించింది. దీంతో భారత ఆటగాళ్లు సైతం ఒత్తడిలోకి వెళ్లారు. బ్రిటన్ను గోల్లు చేయనివ్వకుండా భారత్ డిఫెన్స్ ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. మ్యాచ్ ముగిసే సమయం దగ్గరపడుతున్న కొద్ది అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఏ క్షణాన బ్రిటన్ గోల్ కొట్టి స్కోర్ సమం చేస్తుందోనని అంతా భయపడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో 57వ నిమషాన భారత మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్ అద్భుతమైన గోల్ కొట్టి అందరిని ఊపిరి పీల్చుకునేలా చేశాడు. దీంతో భారత్ 3-1 తేడాతో బ్రిటన్ను ఓడించి 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. ఇక టోక్యోలో భారత్‌కు కాంస్య పతకం అందించిన హార్దిక్ సింగ్.. ఇప్పుడు ప్యారిస్ వెళ్లిన హాకీ జట్టులోనూ సభ్యునిగా ఉన్నాడు. కాగా పంజాబ్‌కు చెందిన హార్దిక్ సింగ్.. 2018 నుంచి భారత హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
Paris Olympics 2024: విశ్వ క్రీడల్లో భారత్.. హాకీలో అత్యధికంగా..!
విశ్వ క్రీడల్లో (ఒలింపిక్స్) భారత ప్రస్తానం 1900వ సంవత్సరంలో మొదలైంది. ఆ ఎడిషన్‌లో భారత్ కేవలం ఒకే ఒక అథ్లెట్‌తో పాల్గొంది. భారత్ తరఫున బ్రిటిష్ అథ్లెట్ (అప్పటికి భారత్ బ్రిటిష్ పాలనలో ఉండింది) నార్మన్ ప్రిచార్డ్ పురుషుల 200 మీటర్ల రన్నింగ్ రేస్, 200 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొని రెండు రజత పతకాలు సాధించాడు.భారత్ 1920లో తొలిసారి స్వదేశీ ఆథ్లెట్లతో ఒలింపిక్స్‌లో పాల్గొంది. బెల్జియంలో జరిగిన ఆ ఎడిషన్‌లో భారత్ తరఫున ఐదుగురు అథ్లెట్లు రెండు క్రీడా విభాగాల్లో పాల్గొన్నారు. ఆ ఎడిషన్‌లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది.అనంతరం 1924 పారిస్ ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు చేదు అనుభవమే ఎదురైంది. ఆ ఎడిషన్‌లో భారత్ 12 మంది అథ్టెట్లను బరిలోకి దించినా ప్రయోజనం లేకుండా పోయింది.భారత్ తొలిసారి స్వతంత్రంగా ఒలింపిక్స్ పతకాన్ని 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్‌లో సాధించింది. ఆ ఎడిషన్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఏకంగా గోల్డ్ మెడల్నే సాధించి చరిత్ర సృష్టించింది.ఆ ఎడిషన్ (1928) నుంచి భారత్ వరుసగా ఐదు ఒలింపిక్స్‌లో (1932, 1936, 1948, 1952, 1956) స్వర్ణ పతకాలకు సాధించి పురుషుల హాకీలో మకుటం లేని మహారాజులా కొనసాగింది.1952 ఫిన్లాండ్ ఒలింపిక్స్‌లో భారత్ తొలిసారి రెజ్లింగ్‌లో పతకం సాధించింది. ఆ ఎడిషన్‌లో పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో ఖషాబా జాదవ్ కాంస్య పతకాన్ని సాధించి, భారత్ తరఫున తొలి పతకం సాధించిన భారతీయ అథ్లెట్‌గా చరిత్రపుటల్లోకెక్కాడు.1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఎడిషన్‌లో భారత్‌కు లభించిన ఏకైక పతకం ఇదే.1964 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తిరిగి పురుషుల హాకీలో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది.1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌కు వచ్చే సరికి భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది.1976 మాంట్రియాల్ ఒలింపిక్స్‌లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆ ఎడిషన్‌లో 26 మంది క్రీడాకారులు 5 విభాగాల్లో పోటీపడినా ఒక్క పతకం కూడా దక్కలేదు.1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు తిరిగి మరోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అనంతరం 1984 లాస్ ఏంజెలెస్, 1988 సియోల్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరవలేకపోయింది.మూడు ఎడిషన్ల తర్వాత భారత్ మరోసారి ఓ పతకం సాధించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ కాంస్య పతకం సాధించాడు.2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున తొలిసారి ఓ మహిళ పతకం సాధించింది. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించింది.2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్ షూటింగ్లో రజత పతకం సాధించింది. పురుషుల డబుల్స్ ట్రాప్‌లో రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్ భారత్‌కు ఆ ఎడిషన్‌లో ఏకైక పతకాన్ని అందించాడు.2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ తొలిసారి రెండిటి కంటే ఎక్కవ పతకాలు సాధించి. ఆ ఎడిషన్‌లో భారత్ ఓ గోల్డ్ మెడల్‌తో పాటు రెండు కాంస్య పతకాలను సాధించింది. పురుషుల షూటింగ్లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని.. పురుషుల రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, పురుషుల బాక్సింగ్‌లో విజేందర్ సింగ్ కాంస్య పతకాలను సాధించారు.2012 లండన్ ఒలింపిక్స్‌లో 83 మంది క్రీడాకారులతో 13 విభాగాల్లో పాల్గొన్న భారత్.. రెండు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించింది. పురుషుల షూటింగ్లో విజయ్‌కుమార్, పురుషుల రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజత పతకాలు సాధించగా.. పురుషుల షూటింగ్లో గగన్ నారంగ్, మహిళల బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, మహిళల బాక్సింగ్‌లో మేరీ కోమ్, పురుషుల రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకాలు సాధించారు.2012 ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు గెలిచిన భారత్ 2016 రియో ఒలింపిక్స్‌లో మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఎడిషన్‌లో కేవలం రెండు పతకాలతోనే సరిపెట్టుకుంది. మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు రజతం, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించారు.120 ఏళ్ల భారత ఒలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యధిక పతకాలను 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సాధించింది. ఈ ఎడిషన్‌లో భారత్ ఏకంగా ఏడు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇందులో ఓ గోల్డ్, రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా.. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ చాను.. పురుషుల రెజ్లింగ్‌లో రవికుమార్ దాహియా రజత పతకాలను.. మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహెయిన్, పురుషుల రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా, పురుషుల హాకీ టీమ్ కాంస్య పతకాలను సాధించాయి.జులై 26 నుంచి ప్రారంభంకాబోయే పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 113 మంది క్రీడాకారులతో 16 విభాగాల్లో పాల్గొంటుంది. మరి ఈసారి భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి. ఓవరాల్‌గా భారత్ ఇప్పటివరకు 35 ఒలింపిక్స్ పతకాలు సాధించగా.. ఒక్క పురుషుల హాకీలోనే 11 పతకాలు రావడం విశేషం. -
Paris Olympics: బజరంగ్, రవి దహియాలకు షాక్
సోనెపట్ (హరియాణా): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన రవి దహియా... కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ పూనియాలకు షాక్! పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్నల్లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్ (65 కేజీలు), రవి (57 కేజీలు) అనూహ్యంగా ఓడిపోయారు. ఆదివారం నిర్వహించిన ట్రయల్స్‌లో సెమీఫైనల్లో బజరంగ్ 1–9తో రోహిత్ చేతిలో ఓడాడు. ఫైనల్లో రోహిత్‌పై సుజీత్ కల్కాల్ గెలుపొంది ఆసియా, వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన 57 కేజీల విభాగంలో తొలి బౌట్లో రవి దహియా 13–14తో అమన్ సెహ్రావత్ చేతిలో... రెండో బౌట్లో 8–10తో ఉదిత్ చేతిలో ఓడిపోయాడు. ఇతర ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో జైదీప్ (74 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), దీపక్ నెహ్రా (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) విజేతలుగా నిలిచి భారత జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ఏప్రిల్ 19 నుంచి 21 వరకు కిర్గిస్తాన్‌లో... వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ మే 9 నుంచి 12 వరకు ఇస్తాంబుల్‌లో జరుగుతాయి. -
ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు మీరాబాయి దూరం.. కారణం?
Asian Weightlifting Championships: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో తాష్కెంట్లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు ఆమె దూరం కానుంది. అక్టోబర్‌లో జరిగిన హాంగ్జౌ ఆసియా క్రీడల సందర్భంగా మీరాబాయి తుంటికి గాయమైంది. దీంతో అప్పటి నుంచి ఆమె మరే టోర్నీ బరిలోనూ దిగలేకపోయింది. ఇక ప్రపంచ మాజీ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన మీరాబాయి మార్చిలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. థాయ్‌లాండ్‌లో పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో భాగమైన ప్రపంచకప్ టోర్నీతో.. ఆమె పునరాగమనం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వారియర్స్ ఘనవిజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో బెంగాల్ వారియర్స్ జట్టు మూడో విజయం నమోదు చేసింది. పట్నా పైరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 60–42తో గెలిచింది. వారియర్స్ తరఫున కెపె్టన్ మణీందర్ సింగ్ 15 పాయింట్లు, నితిన్ 14 పాయింట్లు స్కోరు చేశారు. ఈ గెలుపుతో వారియర్స్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్; బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
పదే పదే అదే ప్రశ్న.. పీవీ సింధు ఆన్సర్ ఇదే
PV Sindhu Comments: తమ అభిమాన ఆటగాళ్ల రికార్డులతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్షిప్ స్టేటస్ ఏమిటన్న అంశంపై క్యూరియాసిటీ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇంటర్వ్యూ చేసే వాళ్లు కూడా సెలబ్రిటీలను ఇలాంటి విషయాల గురించి అడగటం కామన్. బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది. ఆట గురించి కాకుండా పదే పదే ఆమె వ్యక్తిగత విషయాల గురించి అడగటంతో దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది సింధు. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సింధును.. మీ రిలేషన్ స్టేటస్ ఏమిటని అడగగా.. సింగిల్ అని బదులిచ్చింది. ‘‘ప్రస్తుతం బ్యాడ్మింటన్ మీదే నా ధ్యాస. ఒలింపిక్స్‌లో మరో మెడల్ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొంది. అనంతరం.. ‘‘మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు’’ అని మరో ప్రశ్న ఎదురుకాగా.. ‘‘ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. అయితే, ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో డెస్టినీలో ఉంటుంది. నా నుదిటి రాతపై ఏది ఉంటే అదే జరుగుతుంది’’ అని ఈ ఒలింపియన్ సమాధానమిచ్చింది. ఆ తర్వాత మరో ప్రశ్న.. ‘‘మీరు ఎవరితో అయినా డేటింగ్ చేశారా?’’.. ఈసారి సింధు.. ‘‘లేదు.. అస్సలు లేదు’’ అని బదులిచ్చింది. అదే విధంగా.. ‘‘అసలు ఇలాంటి విషయాల గురించి అంతగా ఆలోచించే పనిలేదు. జీవితం అలా సాగిపోతుందంతే! ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది’’ అని బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుత ఆట తీరుతో ఎవరికీ సాధ్యం కాని రీతిలో కాగా.. పూసర్ల వెంకట సింధు ఇప్పటికే రెండుసార్లు విశ్వక్రీడల్లో పతకాలు సాధించింది. రియో ఒలింపిక్స్-2016లో రజతం గెలిచిన ఈ బ్యాడ్మింటన్ స్టార్.. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం అందుకుంది. తద్వారా రెండుసార్లు ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. ఇక ప్రస్తుతం సింధు దృష్టి మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడంపైనే కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో ఇప్పటికే బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణే మార్గదర్శనంలో ముందుకు సాగేందుకు సిద్ధమైంది. ప్రకాశ్ సర్ కేవలం తన మెంటార్, గురు మాత్రమే కాదని.. మంచి స్నేహితుడిలా తనను గైడ్ చేస్తూ ఉంటారని సింధు ఒక సందర్భంలో చెప్పింది. చదవండి: WC T20: గాయాలతో హార్దిక్ సతమతం.. బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక అతడికే పగ్గాలు.. -
రీసైక్లింగ్‌కు దిక్సూచి.. టోక్యో ఒలింపిక్స్! ఈ విశేషాలు తెలుసా?
Pudami Sakshiga 2023: జపాన్ రాజధాని టోక్యోలో 2020లో జరిగిన ఒలింపిక్స్ రీసైక్లింగ్‌కే దిక్సూచిగా నిలిచిపోతాయి. ఒలింపిక్స్ నిర్వహణలో రీసైక్లింగ్‌తో జపాన్ చేసిన ఏర్పాట్లు పుడమి భవిష్యత్తునే నిలబెట్టాయి. ఒలింపిక్స్‌లో రీసైక్లింగ్ పోటీలు, పతకాలు ఉండకపోవచ్చు గాని, ప్రపంచాన్నే విస్మయపరచే రీసైక్లింగ్ ప్రాజెక్టులతో జపాన్ మహా విజేతగా నిలిచి, యావత్ ప్రపంచానికే పర్యావరణ సుస్థిర మార్గాన్ని చూపింది. టోక్యో ఒలింపిక్స్‌ను ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 300 కోట్ల మందికిపైగా జనాలు వీక్షించారు. వాళ్లు వీక్షించినది కేవలం క్రీడలను మాత్రమే కాదు, ఆ క్రీడల నిర్వహణలో ‘సూక్ష్మంలో మోక్షం’లా జపాన్ ప్రభుత్వం రీసైక్లింగ్‌తో చేసిన అద్భుతమైన ఏర్పాట్లను కూడా. జపాన్ సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో పుడమికి హితవుగా ఉందో 2020 నాటి ఒలింపిక్స్ క్రీడల కార్యక్రమాలే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాయి. ఒలింపిక్స్ క్రీడా కార్యక్రమాల కోసం జపాన్ పూర్తిగా పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తయిన విద్యుత్తునే ఉపయోగించుకుంది. ఎక్కువగా సౌర విద్యుత్తును, బయోమాస్ నుంచి ఉత్పత్తయిన విద్యుత్తును ఈ క్రీడల కోసం ఉపయోగించుకోవడం విశేషం. కలపతో ఒలింపిక్స్ విలేజ్ అలాగే, ఒలింపిక్స్ విలేజ్‌ను స్థానిక అధికారులు విరాళంగా ఇచ్చిన కలపతో నిర్మించారు. ఇందులో వాడిన కలప తర్వాత రీసైక్లింగ్‌కు పనికొచ్చేదే! ఒలింపిక్స్ క్రీడాకారుల కోసం నిర్మించిన వసతి భవనాలను, కార్యక్రమాలు మొత్తం ముగిశాక స్థానిక జనాభాకు నివాసాలుగా పనికొచ్చేలా నిర్మించారు. రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో పోడియంలు మెడల్స్ ప్రదర్శన సమయంలో క్రీడాకారులు ఉపయోగించే పోడియంలను కూడా జపాన్ ప్లాస్టిక్ వ్యర్థాలతోనే తయారు చేసింది. ప్రతి పోడియంలోని చిన్న చిన్న ఘనాకారపు మాడ్యూల్స్ కూడా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారైనవే! ఒలింపిక్స్ పోడియంల తయారీకి జపాన్ 24.5 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించింది. ఈ వ్యర్థాలను ప్రజల ఇళ్ల నుంచి సేకరించింది. ఒలింపిక్స్–2020 క్రీడోత్సవాలకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కగానే, జపాన్ దీనికోసం 2018 నుంచే ఏర్పాట్లను ప్రారంభించింది. సౌరఫలకాలు కూడా రీసైక్లింగ్‌కు పనికొచ్చేవే! ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ కొత్త జాతీయ స్టేడియం నిర్మాణానికి ఉపయోగించిన ప్లైవుడ్ ప్యానెల్స్ తయారీకి 87 శాతం కలపను ఆగ్నేయాసియా వర్షారణ్యాల నుంచి సేకరించారు. స్టేడియం పైకప్పుకు అమర్చిన సౌరఫలకాలు కూడా రీసైక్లింగ్‌కు పనికొచ్చేవే! తక్కువ వనరులతో, తక్కువమంది మనుషులతో, తక్కువ గంటల్లో పుడమికి వీలైనంత తక్కువ హానిచేసే సాంకేతిక పరిజ్ఞానంతో ఒలింపిక్స్ వంటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యమేనని జపాన్ నిరూపించింది. రీసైక్లింగ్ టెక్నాలజీతో టోక్యో ఆవిష్కరించిన ప్రాజెక్టులన్నీ పుడమికి హితమైనవే! వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కొన్నింటిని పరిశీలిద్దాం... అథ్లెట్ల కోసం కార్డ్బోర్డ్ మంచాలు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్ల విశ్రాంతి కోసం జపాన్ వినూత్నమైన ఏర్పాట్లు చేసింది. అథ్లెట్లు నిద్రించేందుకు ప్రత్యేకంగా హైరెసిస్టెంట్ కార్డ్బోర్డ్ మంచాలను ఏర్పాటు చేసింది. మంచాల తయారీకి ఎన్నిసార్లయిన రీసైక్లింగ్‌కు పనికొచ్చే పాలిథిన్ ఫైబర్లతో ఈ మంచాల తయారీ జరిగింది. శరీరానికి ఎగువ, మధ్య, దిగువ భాగాల్లో హాయినిచ్చే విధంగా మూడు వేర్వేరు విభాగాలతో ఈ మంచాలను రూపొందించారు. అంతేకాదు, ప్రతి అథ్లెట్ శరీరాకృతికి అనుగుణంగా వారు మాత్రమే ఉపయోగించుకునేలా ఈ కార్డ్బోర్డ్ మంచాలను, వాటిపై పరుపులను తయారు చేశారు. ఒలింపిక్స్ క్రీడలు ముగిశాక కార్డ్‌బోర్డ్‌ను పేపర్ ఉత్పత్తులుగా, పరుపులను ప్లాస్టిక్ ఉత్పత్తులుగా రీసైకిల్ చేసే ఉద్దేశంతో జపాన్ ప్రభుత్వం వీటిని తయారు చేయించింది. పాత సెల్ఫోన్లతో పతకాలు! ఒలింపిక్స్ విజేతలకు పతకాలను ఆతిథ్య దేశమే ఇవ్వడం ఆనవాయితీ. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశాలు విజేతలకు ఇవ్వాల్సిన పతకాలను ప్రత్యేకంగా తయారు చేయిస్తుంటాయి. వాటికి కావలసిన కంచు, వెండి, బంగారు లోహాలను సమకూర్చుకుంటుంటాయి. జపాన్ మాత్రం పతకాల తయారీకి ప్రత్యేకంగా ప్రయాస పడలేదు. పతకాల తయారీ కోసం ప్రజల నుంచి వాడిపడేసిన పాత సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విరాళంగా సేకరించింది. వాటి నుంచి వేరుచేసిన లోహాలతోనే విజేతలకు పతకాలను తయారు చేయించింది. ప్రజల నుంచి విరాళంగా వచ్చిన వాటిలో ఏకంగా 60.21 లక్షల పాత నోకియా ఫోన్లు ఉండటం విశేషం. అల్యూమినియం వ్యర్థాలతో ఒలింపిక్ టార్చ్ రీసైక్లింగ్, రీయూజ్ సాంకేతికతకు జపాన్ అందించిన ఒలింపిక్స్ పతకాలు వినూత్న ఉదాహరణగా నిలుస్తాయి. అల్యూమినియం వ్యర్థాలతో ఒలింపిక్ టార్చ్! ఒలింపిక్స్‌లో కీలకం ఒలింపిక్ టార్చ్. ఒలింపిక్స్ టార్చ్ తయారీకి జపాన్ అల్యూమినియం వ్యర్థాలను ఉపయోగించింది. జపాన్‌లో 2011లో భూకంపం, సునామీ సంభవించాక అప్పట్లో నిర్వాసితుల కోసం నిర్మించిన తాత్కాలిక గృహాల నుంచి సేకరించిన అల్యూమినియం వ్యర్థాలనే ఒలింపిక్ టార్చ్ తయారీకి వాడారు. జపాన్ జాతీయ పుష్పం సాకురా చెర్రీ పూవును పోలినట్లు ఐదువిభాగాలుగా ముడుచుకున్న ఒలింపిక్ టార్చ్‌ను తయారు చేశారు. స్థానిక రవాణాకు రీసైకిల్ వాహనాలు జపాన్‌కు చెందిన వాహనాల తయారీ సంస్థ టయోటా డ్రైవర్‌లేని వాహనాలను త్వరలోనే రోడ్ల మీదకు తెచ్చేందుకు సులువైన మార్గాలను అన్వేషిస్తోంది. రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాలే అదే స్ఫూర్తితో ఒలింపిక్స్ క్రీడాకారులను వసతి ప్రదేశం నుంచి క్రీడా స్థలికి, క్రీడా మైదానం నుంచి వసతి ప్రదేశానికి, టోక్యో నగరంలో వారు స్థానికంగా తిరగడానికి వీలుగా జపాన్ పూర్తిగా రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగించింది. పెద్ద తలుపులు, సులువుగా ఎక్కి దిగడానికి వీలుగా వీటి నిర్మాణం ఉండటంతో క్రీడాకారులు వీటిలో సౌకర్యవంతంగా ప్రయాణించగలిగారు. ఒలింపిక్స్ తర్వాత టోక్యోలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లోను 42 పెద్దస్థాయి క్రీడా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లోనూ జపాన్ పూర్తిగా రీసైకిల్డ్ ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగించింది. -నరసింహారావు -
National Games 2022: తెలంగాణ నెట్‌బాల్ జట్టుకు రజతం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ఖాతాలో నాలుగో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే మూడు పతకాలు లభించగా... తాజాగా నెట్‌బాల్ క్రీడాంశంలో తెలంగాణ జట్టుకు రజత పతకం దక్కింది. భావ్‌నగర్‌లో శుక్రవారం జరిగిన పురుషుల నెట్‌బాల్ ఫైనల్లో తెలంగాణ 73–75తో (16–9, 12–18, 16–20, 29–28) హరియాణా చేతిలో పోరాడి ఓడిపోయింది. రజత పతకం నెగ్గిన తెలంగాణ జట్టులో బి.విక్రమాదిత్య రెడ్డి, సయ్యద్ అమ్జాద్ అలీ, జన్ను హరీశ్, కంబాల శ్రీనివాసరావు, ముజీబుద్దీన్, మొహమ్మద్ ఇస్మాయిల్, పి.వంశీకృష్ణ, కె.సుమన్, కురకుల సంయుత్, బి.రంజీత్ కుమార్, సయ్యద్ మొహమ్మద్ అహ్మద్, ఎన్.లునావత్ అఖిల్ సభ్యులుగా ఉన్నారు. మహిళల టీమ్ టెన్నిస్‌లో తెలంగాణ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తెలంగాణ 0–2తో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. మణిపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 84+క్లీన్ అండ్ జెర్క్‌లో 107) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. -
నీరజ్ చోప్రా 'జావెలిన్'కు భారీ ధర.. దక్కించుకుంది ఎవరంటే?
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో అథ్లెట్ విభాగంలో తొలి పతకం.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో అథ్లెట్‌గా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. తాజాగా అతను టోక్యో ఒలింపిక్స్‌లో వాడిన జావెలిన్‌ను ఈ-వేలంలో బీసీసీఐ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. నీరజ్ జావెలిన్‌ను దాదాపు రూ.1.5 కోట్ల బిడ్‌తో బీసీసీఐ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా టోక్యో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం భారత ప్రధాని టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తన నివాసానికి మర్యాద పూర్వకంగా ఆహ్వానించి అథ్లెట్లను ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రా.. ప్రధాని మోదీకి ఒక జావెలిన్‌ను అందజేశాడు. దీనితో పాటు మరికొందరు అథ్లెట్లు కూడా తమ వస్తువులను ప్రధాని మోదీకి కానుకగా ఇచ్చారు. మహిళా బాక్సర్ లవ్లీనా బొర్హంగైన్ పతకాలతో దేశఖ్యాతిని ఇనుమడింపచేసిన క్రీడాకారులకు చెందిన వస్తువులను వేలం వేయాలని ప్రధాని భావించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును ''నమామి గంగే'' కార్యక్రమానికి ఉపయోగించాలని ప్రధాని తీర్మానించారు. కాగా 2014లో గంగా నది పరిరక్షణ, పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో ప్రధాని మోదీ నమామి గంగే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. కాగా కోవిడ్-19 తొలి దశలో బీసీసీఐ పీఎం కేర్ ఫండ్స్‌కు రూ. 50 కోట్లు విరాళం ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది. ఇక గతేడాది సెప్టెంబర్- అక్టోబర్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లకు చెందిన వస్తువులకు ఈ-వేలం నిర్వహించారు. ఫెన్సర్ భవానీ దేవీ తాజాగా ఈ-వేలానికి సంబంధించిన వివరాలు వెల్లడించగా.. నీరజ్ చోప్రా జావెలిన్‌కు భారీ స్థాయిలో పోటీ ఏర్పడగా.. చివరకు బీసీసీఐ రూ. 1.5 కోట్లు బిడ్ వేసి దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే మహిళా ఫెన్సర్ భవానీ దేవి వాడిని ఖరవాలానికి రూ 1.25 కోట్ల ధర పలకడం విశేషం. అలాగే పారాలింపియన్ సుమిత్ అంటిల్ జావెలిన్‌ను రూ. 1.002 కోట్లకు మరొక సంస్థ సొంతం చేసుకుంది. సుమిత్ అంటిల్ అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మహిళా బాక్సర్ లవ్లీనా బొర్హంగైన్ బాక్సింగ్ గ్లోవ్స్ రూ. 91 లక్షలకు అమ్ముడయ్యాయి. ఓవరాల్‌గా ఈ-వేలానికి దాదాపు 8600 బిడ్స్ రావడం విశేషం. ఇక ఇటీవలే నీరజ్ చోప్రా తాను స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోను లుసానే ఒలింపిక్ మ్యూజియానికి విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని లుసానే ఒలింపిక్ మ్యూజియం నిర్వాహకులు తమ ట్విటర్లో అధికారికంగా ప్రకటించారు. చదవండి: Neeraj Chopra: చిన్న గ్యాప్ మాత్రమే.. ప్రపంచ రికార్డుతో ఘనంగా రీఎంట్రీ Serena Williams-Lebron James: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచినపుడు.. అద్భుతమైన ఫీలింగ్: స్మృతి మంధాన
Commonwealth Games 2022- Smriti Mandhana: ‘‘విశ్వవేదికపై భారత జాతీయ జెండా రెపరెపలాడినపుడు.. జాతీయ గీతం విన్నపుడు కలిగే అద్భుతమైన, అనిర్వచనీయమైన భావన ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో ఇలాంటి అద్బుత క్షణాలను మేము కూడా ఆస్వాదించాం. స్వర్ణ పతకం గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం’’ అని భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అన్నారు. ఆసీస్‌తో తొలి పోరు.. కాగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగష్టు 8 వరకు కామన్వెల్త్ క్రీడలు-2022 నిర్వహించేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల తర్వాత క్రికెటర్లకు ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో తిరిగి పాల్గొనే అవకాశం వచ్చింది. మన జెండా ఎగరాలి.. ఇందులో భాగంగా భారత మహిళా జట్టు పతకం కోసం పోటీ పడేందుకు సిద్ధమైంది. కాగా టీ20 ఫార్మాట్లో నిర్వహించే కామన్వెల్త్ క్రికెట్ విభాగంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు మొదటగా జూలై 29న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో స్మృతి మంధాన మాట్లాడుతూ.. ‘‘కేవలం నామమాత్రపు విజయాలకే మేము పరిమితం కావాలనుకోవడం లేదు. మన జెండా పైకెగరాలి. జాతీయ గీతం వినిపించాలి. ప్రతి ఒక్కరు అనుభవించాలనుకునే అద్భుత భావన. ఒలంపిక్స్‌లో భారత్‌కు పసిడి పతకం అందించిన నీరజ్ చోప్రా గురించి తలచుకున్నప్పుడల్లా నాకు గూస్బంప్స్ వస్తాయి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. 💬 💬 We are aiming for Gold Medal at the Commonwealth Games: #TeamIndia vice-captain @mandhana_smriti. 👍 👍#B2022 pic.twitter.com/7Tsovu3Y12 — BCCI Women (@BCCIWomen) July 22, 2022 మేము సైతం.. అలాంటి బెస్ట్ ఫీలింగ్ కోసం తాము కూడా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఒలంపిక్స్‌లో కాకపోయినా కామన్వెల్త్లో పతకం గెలిచి ఈ లోటు పూడ్చుకుంటామని చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి జట్లను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సమాయత్తమయ్యామని, ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని స్మృతి మంధాన పేర్కొన్నారు. కాగా కామన్వెల్త్ క్రీడలు-2022లో మొత్తం ఎనిమిది మహిళా క్రికెట్ జట్లు పోటీ పడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్తాన్ ఉండగా.. గ్రూప్ బిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఉన్నాయి. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా బంగారు పతకం గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs WI 1st ODI: రుతురాజ్‌కు నో ఛాన్స్! ధావన్‌తో ఓపెనర్‌గా అతడే! ఇక ఫినిషర్‌గా ఎవరంటే.. Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు! -
నీరజ్ చోప్రా అరుదైన ఫీట్.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు
భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ఈ లీగ్‌లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును చోప్రా బద్దలు కొట్టాడు. గురువారం స్టాక్‌హోమ్ వేదికగా జరిగిన ఈ లీగ్ పోటీల్లో నీరజ్ తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు. ఈ పోటీల్లో 89.4 మీటర్ల అద్భుతమైన త్రోతో రెండో స్థానంలో నిలిచిన చోప్రా రజిత పతకం కైవసం చేసుకున్నాడు. ఇక గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.31 మీటర్ల బెస్ట్ త్రోతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. కాగా డైమండ్ లీగ్‌లో నీరజ్‌కు ఇదే తొలి పతకం. కాగా ఇటీవల ఫిన్లాండ్ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా.. ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డైమండ్ లీగ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 89.4 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. ఆ తర్వాత వరుసగా చోప్రా 84.37మీ, 87.46మీ, 84.77మీ, 86.67, 86.84మీ త్రోలు చేశాడు. చదవండి: FIH Women's Hockey World Cup 2022: మహిళల ప్రపంచకప్ హాకీకి సర్వం సిద్దం Olympic Champion @Neeraj_chopra1 sets the new National Record and Personal Best at 2022 #StockholmDL with a throw of 89.94m, finishing 2nd Take a look at the record breaking throw! pic.twitter.com/r3X7IK7LSp — Anurag Thakur (@ianuragthakur) July 1, 2022 -
నెదర్లాండ్స్‌కు భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య మహిళల ప్రొ లీగ్‌లో భారత జట్టు సంచల నం సృష్టించింది. ప్రపంచ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. భారత్ తరఫున నేహా (11వ ని.లో), సోనిక (28వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్‌కు జాన్సెన్ ఇబ్బి (40వ ని.లో) ఏకైక గోల్ అందించింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన నెదర్లాండ్స్ జట్టు సభ్యులెవరూ ప్రొ లీగ్‌లో ఆడేందుకు ఇక్కడకు రాలేదు. నేడు రెండు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. -
IPL 2022: ప్రారంభ వేడుకల్లేవు.. ఈసారి వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
BCCI To Felicitate Tokyo Olympics Medallists: వరుసగా నాలుగో ఏడాది ప్రారంభ వేడుకలు లేకుండానే క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షురూ కానుంది. అయితే, ఈసారి ఓపెనింగ్ సెర్మనీ స్థానంలో టోక్యో ఒలింపిక్స్ 2020 పతక విజేతలను (భారత) ఘనంగా సత్కరించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయమై ఇదివరకే ఒలింపిక్ విజేతలకు ఆహ్వానాలు పంపింది. జావెలిన్ త్రో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాతో పాటు రెజ్లర్లు బజరంగ్ పూనియా (కాంస్యం), రవి దాహియా (రజతం), వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (రజతం), బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ (కాంస్యం), షట్లర్ పీవీ సింధు (కాంస్యం), భారత పురుషుల హాకీ జట్టు సభ్యులు (కాంస్యం) ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కు సత్కారంతో పాటు కోటి రూపాయల నజరానా కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. No #IPL Opening ceremony for the 4th consecutive year. Last time it was held in 2018Instead BCCI will felicitate few of the Olympians ahead of #CSKvKKRGold Medalist Neeraj Chopra will attend the CEREMONY and will recieve 1 Crore from BCCI pic.twitter.com/B9tFWxkeoq— Abhijeet ♞ (@TheYorkerBall) March 26, 2022 మార్చి 26న ముంబైలోని వాంఖడేలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్‌కు ముందు టోక్యో ఒలింపిక్స్ విజేతల సన్మాన కార్యక్రమం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఎందుకు లేవంటే.. 2008 నుంచి 2018 వరకు పదేళ్లపాటు నిర్విరామంగా జరిగిన ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు 2019 సీజన్లో బ్రేక్ పడింది. ఆ ఏడాది భారత సైనికులపై ఉగ్రదాడి (పూల్వామా మారణకాండ) జరిగిన కారణంగా ఐపీఎల్ వేడుకలు రద్దు చేశారు. ఇక 2020, 2021 సీజన్లలో కరోనా కారణంగా ఓపెనింగ్ సెర్మనీ ఊసే లేదు. చదవండి: IPL 2022: చెన్నై, కేకేఆర్ ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ అరుదైన రికార్డులేంటో చూద్దాం..! -
తన ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టాడు..
టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ మోండో డుప్లాంటిస్ పోల్ వాల్ట్‌లో మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. బెల్గ్రేడ్ ఇండోర్ మీటింగ్ అథ్లెటిక్స్ టోర్నీలో 22 ఏళ్ల ఈ స్వీడన్ ప్లేయర్ 6.19 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. ఈ క్రమంలో 2020 ఫిబ్రవరిలో గ్లాస్గో టోర్నీలో 6.18 మీటర్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా డుప్లాంటిస్కిది మూడో ప్రపంచ రికార్డు. ఈనెల 18 నుంచి బెల్‌గ్రేడ్‌లోనే జరగనున్న ప్రపంచ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో డుప్లాంటిస్ బరిలోకి దిగనున్నాడు. -
జ్వెరెవ్‌కు ఊరట.. జరిమానా, సస్పెన్షన్ నిలుపుదల
అకాపుల్కో(మెక్సికో): టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) నుంచి చెప్పుకోదగ్గ ఊరట లభించింది. ఏటీపీ జరిమానా, సస్పెన్షన్ వేటు నిలుపుదల చేసింది. గత నెల మెక్సికో ఓపెన్‌లో డబుల్స్ మ్యాచ్ ఓడిన వెంటనే జ్వెరెవ్ చైర్ అంపైర్ కుర్చికేసి బలంగా తన రాకెట్ విరిగేలా పదేపదే కొట్టాడు. దీంతో టోర్నీ నిర్వాహకులు సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన జ్వెరెవ్‌ను పంపించేశారు. దాంతో పాటు 40 వేల డాలర్లు (రూ. 30 లక్షలు), ఆ టోర్నీలో పొందిన ఏటీపీ పాయింట్లను జరిమానాగా విధించారు. ఇది పూర్తిగా మెక్సికో ఓపెన్‌కు సంబంధించిన పెనాల్టీ అయితే... ఏటీపీ నుంచి మరో 25 వేల డాలర్లు (రూ. 19 లక్షల 25 వేలు) జరిమానా, 8 వారాల సస్పెన్షన్ వేటు కూడా వేశారు. తాజాగా ఏటీపీ ఈ శిక్షను తాత్కా లికంగా నిలిపివేసి, ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంచింది. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ముగిసే ప్రొబేషన్ వరకు అతని ప్రవర్తన హుందాగా ఉంటే ఏ సమస్యా లేదు. ఏటీపీ శిక్ష కూడా ఉండదు. ఈ ప్రొబేషన్ కాలంలో జ్వెరెవ్ తన అనుచిత ప్రవర్తనను పునరావృతం చేస్తే మాత్రం ఏటీపీ శిక్షను తక్షణం అమలు చేస్తారు. -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నీరజ్ చోప్రా.. భారత్ నుంచి మూడో ఆటగాడిగా
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. మొత్తం ఏడు విభాగాల్లో వివిధ క్రీడలకు చెందిన ఆటగాళ్లను లారెస్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ చేశారు. కాగా 2022 లారెస్ స్పోర్ట్స్ వరల్డ్ బ్రేక్‌త్రూ అవార్డుకు నీరజ్ చోప్రా సహా మరో ఐదుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. రష్యన్ టెన్నిస్ స్టార్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ డానియెల్ మెద్వెదెవ్, స్పానిష్ ఫుట్‌బాలర్ పెడ్రీ, బ్రిటన్ టెన్నిస్‌స్టార్ ఎమ్మా రాడుక్కాను, వెనిజులా అథ్లెట్ యులిమర్ రోజస్ తోపాటు ఆసీస్ స్విమ్మర్ అరియార్నే టిట్మస్‌లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300 మంది స్పోర్ట్స్ జర్నలిస్టులు ప్రతిష్టాత్మక అవార్డుకు ఏడు కేటగిరీ నుంచి ఆటగాళ్లను నామినేట్ చేశారు. ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఏప్రిల్‌లో అవార్డు విజేతలను ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే నీరజ్ చోప్రా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుతో పాటు ఇటీవలే పద్మశ్రీ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు నామినేషన్స్ కు భారత్ తరఫున ఎంపికైన మూడో అథ్లెట్ నీరజ్ చోప్రా కావడం గమనార్హం. ఇంతకు ముందు ఈ అవార్డు నామినేషన్స్ కు 2019లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఎంపికవ్వగా.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా లారెస్ స్పోర్ట్స్ అవార్డ్ నామినేషన్స్‌కు సెలెక్ట్ అయ్యాడు. 2000–2020 కాలానికి గానూ ప్రకటించిన లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును సచిన్ గెలుచుకోవడం విశేషం. A special feeling to be nominated along with some exceptional athletes for the Laureus World Breakthrough of the Year award. Congratulations to @DaniilMedwed, @pedri, @EmmaRaducanu, @TeamRojas45 and Ariarne Titmus on their nominations. #Laureus22 🇮🇳 pic.twitter.com/16pUMmvQBE — Neeraj Chopra (@Neeraj_chopra1) February 2, 2022 -
ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన ఐపీఎల్.. రెండో స్థానంలో సమ్మర్ ఒలింపిక్స్
క్యాచ్‌రిచ్ లీగ్‌గా ముద్రపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయింది. యుగోవ్స్ 2022 స్పోర్ట్స్ బజ్ ర్యాంకింగ్స్‌లో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలించింది. రెండో స్థానంలో టోక్యో ఒలింపిక్స్(సమ్మర్ ఒలింపిక్స్) నిలవగా.. మూడోస్థానంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు యుగోవ్స్ తెలిపింది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ తొలి అంచె పోటీలు మనదగ్గరే జరగ్గా.. కరోనా విజృంభణతో రెండో అంచె పోటీలు యూఏఈ వేదికగా జరిగింది. అయినప్పటికి భారత అభిమానులను అలరించిన ఐపీఎల్ 50.8 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. కాగా యుగోవ్స్ స్పోర్ట్స్ ర్యాంకింగ్స్‌లో ఐపీఎల్ తొలిస్థానంలో నిలవడం వరుసగా రెండోసారి. గతేడాది ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ ఐపీఎల్‌దే తొలిస్థానం. ►ఇక ఐపీఎల్ తర్వాత ఇండియాలో అత్యంత ఎక్కువ జనాధరణ పొందింది టోక్యో ఒలింపిక్స్. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా మరుసటి ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో గతేడాది ఆగస్టులో నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నడూ లేనంతగా మనకు ఏడు పతకాలు రావడం విశేషం. ఇందులో నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చరిత్రలో నిలిచిపోయింది. 49.2 పాయింట్లతో .. కేవలం 1.6 పాయింట్ల తేడాతో తొలిస్థానం కోల్పోయినప్పటికి.. రెండోస్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ►సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగితే ఇండియాలో ఎక్కువమంది చూస్తుంటారు. కానీ గతేడాది జరిగిన ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో టీమిండియా నిరాశపరిచింది. సూపర్-12 దశలోనే ఇంటిబాట పట్టినప్పటికి.. ఐసీసీ టోర్నీని ఇండియా అభిమానులు ఆదరించారని సర్వేలో తేలింది. 45.9 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచిన ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్.. అంతకముందు ఇచ్చిన స్కోరు కంటే 0.4 మాత్రమే తక్కువగా ఉండడం విశేషం. ►ఈ మూడింటి తర్వాత ఫుట్‌బాల్ వరల్డ్‌కప్(28.3 పాయింట్లు), ఇండియన్ సూపర్ లీగ్(20.4 పాయింట్లు), వింబుల్డన్ చాంపియన్‌షిప్(టెన్నిస్, 18 పాయింట్లు) వరుసగా 4,5,6 స్థానాల్లో నిలవగా.. ప్రొ కబడ్డీ లీగ్ 17.9 పాయింట్లతో ఏడోస్థానం.. ఏసియన్ గేమ్స్ 15.3 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిదో స్థానంలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) 13.3.. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 13 పాయింట్లతో తొమ్మిది, 10 స్థానాల్లో ఉన్నాయి. ఇక యుగోవ్స్ తమ ర్యాంకింగ్స్‌ను స్పోర్ట్స్ ఇండెక్స్ రోజువారీగా బ్రాండ్ల పట్ల ప్రజల అవగాహనను కొలమానంలోకి తీసుకొని నిర్థారణ చేస్తుంది. -
భారత హాకీ దిగ్గజం చరణ్‌జిత్ సింగ్ కన్నుమూత
Hockey Legend Charanjit Singh Passed Away: భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత చరణ్‌జిత్ సింగ్(90) కన్నుమూశారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారధిగా వ్యవహరించిన ఈ మాజీ మిడ్ ఫీల్డ్ ఆటగాడు.. ఇవాళ ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లోని తన స్వగృహంలో తనువు చాలించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుత్ను ఆయన.. కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు దృవీకరించారు. చరణ్‌జిత్ మరణ వార్తను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. చరణ్‌జిత్ సింగ్ మృతి పట్ల భారత హాకీ సమాఖ్య విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించింది. On behalf of Hockey India, we mourn the loss of a great figure of Indian Hockey, Shri Charanjit Singh.May his soul Rest in Peace🙏 pic.twitter.com/PTb38lHDS6— Hockey India (@TheHockeyIndia) January 27, 2022 చదవండి: అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ -
నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నీరజ్ చోప్రాను పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించనుంది. జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నీరజ్‌చోప్రాకు పతకం అందించనున్నాడు. ఇక ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా నిలిచాడు. చదవండి: Australian Open Grandslam 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన నాదల్, యాష్లే బార్టీ గతంలో 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత నీరజ్ సాధించిన స్వర్ణమే రెండోది. నీరజ్ గత సంవత్సరం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. ఇక ఇండియన్ ఆర్మీలో నీరజ్ చోప్రా జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 384 మంది రక్షణ సిబ్బందిని గ్యాలంటరీ మరియు ఇతర అవార్డులతో సత్కరించనున్నారు. అవార్డులలో 12 శౌర్య చక్రాలు, 29 పరమ విశిష్ట సేవా పతకాలు, నాలుగు ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 53 అతి విశిష్ట సేవా పతకాలు, 13 యుద్ధ సేవా పతకాలు, మూడు బార్ టు విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 122 విశిష్ట సేవా పతకాలు, 81 సేన పతకాలు, రెండు వాయు సేన పతకాలు, 40 సేన పతకాలు, ఎనిమిది నేవీసేన పతకాలు, 14 నావో సేన పతకాలతో విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారు. చదవండి: Australian Open 2022: 'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ' -
రవి దహియాకు అరుదైన గౌరవం
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, స్టార్ రెజ్లర్ రవి దహియాకు చక్కని గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు జరిగే క్వీన్స్ బ్యాటన్ రిలేను బుధవారం భారత్‌లో రవి ప్రారంభించాడు. తనకిది అరుదైన గౌరవమని, బర్మింగ్‌హామ్‌లో స్వర్ణం గెలిచేందుకు తీవ్రంగా చెమటోడ్చుతున్నట్లు రవి చెప్పాడు. ఈ ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగనున్నాయి. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
బాక్సర్ లవ్లీనాకు బంపరాఫర్.. డీఎస్పీగా ఉద్యోగం, అదనంగా నెలకు రూ.లక్ష
Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ డీఎస్పీగా నియమితులయ్యారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో లవ్లీనా భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన ఆమె సెమీస్ చేరారు. అయితే వరల్డ్ నంబర్ వన్ టర్కీకి చెందిన బుసెనజ్తో జరిగిన సెమీస్‌లో ఓడిపోవడంతో ఆమె కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత ఆమెకు డీఎస్పీ ఉద్యోగంతోపాటు కోటి రూపాయల పారితోషికం ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఉదయం లవ్లీనాకు డీఎస్పీ నియామక పత్రం అందజేశారు. నెలవారీ జీతంతోపాటు లవ్లీనాకు బాక్సింగ్ ట్రైయినింగ్ ఖర్చుల కోసం అదనంగా రూ.లక్ష ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. దాంతోపాటు పంజాబ్‌లోని పటియాలలో కోచింగ్ తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే అంతర్జాతీయ స్థాయి కోచ్‌తో గువాహటిలోనే ట్రయినింగ్ ఇప్పిస్తామని చెప్పారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలిస్ శాఖకు కృతజ్ఞతలు చెప్పిన లవ్లీనా.. తన లక్ష్యం వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమేనని అన్నారు. (చదవండి: హాకీ జట్టు కెప్టెన్‌గా సవితా పునియా.. గోల్‌కీపర్‌గా మన అమ్మాయి రజని) -
Rewind 2021: ఈసారి మనకు ఒలింపిక్స్‌లో స్వర్ణం, రజతం, కాంస్యం!
Tokyo Olympics: ఆధునిక ఒలింపిక్స్ 1896లో ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వాటిలో భారతదేశానికి సంబంధించినంత వరకు మైలురాయిలాంటి విజయాలను అందించిన సంవత్సరంగా 2021 మిగిలిపోతుంది. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా ప్రాబల్యం కారణంగా వాయిదా పడి, నిబంధనల మేరకు చివరకు 2021లో నిర్వహించారు. ఈ ఒలిపింక్స్‌లో మన దేశం స్వర్ణం, రజతం, కాంస్యం.. ఇలా మూడు రకాల పతకాలను గెలుచుకుని ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఆట తీరుపై అంచనాలను పెంచింది. మన క్రీడాకారులు కూడా ఎంతో ప్రతిభను ప్రదర్శించి విజయాలను చేజిక్కించుకున్నారు. బజరంగ్ పూనియా హరియాణా జజ్జర్ ప్రాంతానికి చెందిన బజరంగ్ అరవై అయిదు కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో కజకిస్తాన్‌కు చెందిన నియజ్ బెకోవన్ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించాడు. నీరజ్ చోప్రా స్వాతంత్య్ర భారత చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని ఒలింపిక్స్‌లో సాధించిన క్రీడాకారుడిగా నీరజ్ రికార్డ్ సృష్టించాడు. అంతగా గుర్తింపులేని జావెలిన్ త్రో క్రీడలో అంతర్జాతీయ దిగ్గజాలను సైతం కాలదన్ని స్వర్ణపతాకంతో భారతీయ కలలను నెరవేర్చాడు. హరియాణా పానిపట్టు జిల్లాలోని ‘ఖంద్రా’గ్రామంలో పదిహేడు మంది ఉండే ఉమ్మడి కుటుంబంలో పెద్దబ్బాయి అయిన నీరజ్ తన కలలను మాత్రమే కాక భారతీయుల కలలనూ నిజం చేశాడు. మీరాబాయి చాను మణిపూర్‌లోని ఇంఫాల్‌కు చెందిన మీరాబాయి 2021, ఆగస్ట్ 5న టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయ త్రివర్ణ పతాకం రెపరెలాడేలా చేసింది. నలభై తొమ్మిది కిలోల వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో స్నాచ్ విభాగంలో ఎనభై ఏడు కిలోలను, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 115 కిలోలను ఎత్తి మొత్తం 202 పాయింట్లతో భారత్‌కు వెండి పతకాన్ని ఖాయం చేసింది. ఇరవై ఆరేళ్ల మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో భారత విజయయాత్రకు శ్రీకారం చుట్టింది. రవికుమార్ దహియా టోక్యో ఒలింపిక్స్‌లో యాభై ఏడు కిలోల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో రజత పతకాన్ని సాధించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతాక విజేతగా, ఏషియన్ చాంపియన్‌గా మంచి ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న దహియా ఒలింపిక్స్‌లోనూ అదే పరంపరను సాగించడం విశేషం. లవ్లీనా బొర్గొహెన్ అస్సాంలోని గోలాఘాట్‌లో జన్మించిన లవ్లీనా కిక్‌బాక్సింగ్‌తో కెరీర్ మొదలుపెట్టింది. టోక్యో ఒలిపింక్స్‌లో అరవై తొమ్మిది కిలోల బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. పి.వి. సింధు బాడ్మింటన్ క్రీడలో చెరిగిపోని ముద్రవేసిన తెలుగు అమ్మాయి పూసర్ల వెంకట సింధు ఈసారి కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించింది. పారాలింపిక్స్‌లో భారతీయులు శారీరకంగా, మానసికంగా ఉన్న సవాళ్లు సంకల్పాన్ని ఉసిగొల్పి, దీక్షగా మలచి, పట్టువిడువని సాధనగా మార్చితే విజయం పతకంగా ఇంటికి రాదూ! అలా మిగిలిన ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే క్రీడాసంరంభమే.. రెండో ప్రపంచానంతరం ప్రారంభమైన పారాలింపిక్స్. 2021 సంవత్సరపు ఈ క్రీడల్లో మన దేశ పతాకం రెపరెపలాడింది. మొత్తం 17 మంది క్రీడాకారులు 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు సాధించి మన సత్తా చాటారు. ఆ విజేతలు వీరే.. అవనీ లేఖరా రోడ్డు ప్రమాదంలో వెన్నెముక విరిగి నడుం కింది భాగం చచ్చుబడిపోయి.. వీల్‌చైర్‌కే అంకితమైంది. అయినా అధైర్యపడక మొక్కవోని దీక్షతో షూటింగ్ నేర్చుకుని భారత్ తరపున పారాలింపిక్స్‌కి ఎన్నికైంది. ఈ పోటీల్లో పాల్గొన్న మొదటిసారే రెండు పతకాలను సాధించిన తొలి భారతీయ యువతిగా రికార్డ్ సృష్టించింది. తంగవేలు మరియప్పన్ తమిళనాడులోని సేలం జిల్లా, పెరియనడాగపట్టి అనే కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన తంగవేలు ఓ బస్సు ప్రమాదంలో కుడికాలిని పోగొట్టుకున్నాడు. అయినా పాఠశాల స్థాయి నుంచే హైజంప్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఓవైపు ఆ క్రీడను సాధన చేస్తూనే మరో వైపు జీవనాధారం కోసం పేపర్‌బాయ్‌గా పనిచేసేవాడు. రియో పారాలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ గెలుపునే టోక్యో పారాలింపిక్స్‌లోనూ కొనసాగించి హైజంప్‌లో రెండో విడతా బంగారు పతకాన్ని సాధించాడు. ప్రమోద్ భగత్ బిహార్‌లోని హాజీపూర్‌లో జన్మించిన ప్రమోద్ పోలియోతో ఎడమ కాలిని కోల్పోయాడు. అయితే క్రికెట్ పట్ల ప్రేమతో ఎప్పుడూ గ్రౌండ్లో గడుపుతూ తన వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంగా మలచుకునే ప్రయత్నం చేసేవాడు. ఆ తర్వాత తన మేనత్తతో భువనేశ్వర్ వెళ్లి అక్కడే తన దృష్టిని బాడ్మింటన్ వైపు మరల్చాడు. నాలుగుసార్లు బాడ్మింటన్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించి వరల్డ్ నంబర్ వన్‌గా ప్రశంసలు పొందాడు. అయితే టోక్యో పారాలింపిక్స్‌తో తొలిసారి బాడ్మింటన్‌ను ప్రవేశపెట్టడం వల్ల ఈ పోటీలో పాల్గొని స్వర్ణపతకాన్ని సాధించి దేశ కీర్తిని చాటాడు. సుమిత్ కుస్తీలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలు గన్న సుమిత్ 2014లో జరిగిన ఓ యాక్సిడెంట్లో ఎడమకాలిని పోగొట్టుకున్నాడు. తన దృష్టిని అథ్లెటిక్స్ అందులోనూ ‘జావెలిన్ త్రో’ వైపు మరల్చి తీవ్రమైన సాధన చేశాడు. ఆ పోటీలో పాల్గొనెందుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పోటీదారులను వెనక్కి నెట్టి టోక్యో పారాలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దేవేంద్ర ఝఝరియా రాజస్థాన్, చుంచ జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టిన దేవేంద్ర ఎనిమిదేళ్ల వయసులో విద్యుదాఘాతానికి గురై ఎడమ చేయి కాలిపోవడంతో దాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినా ఆత్మన్యూనతకు లోనుకాకుండా ఒంటి చేత్తోనే ఆడగలిగిన క్రీడ జావెలిన్ త్రోని ఎంపిక చేసుకొని పట్టుదలతో ప్రాక్టీస్ చేశాడు. ఏథెన్స్ పారాలింపిక్స్‌లో ప్రపంచరికార్డును సృష్టించేంతగా ఎదిగాడు. తర్వాత రియో పారాలింపిక్స్‌లో, ప్రస్తుత టోక్యో పారాలింపిక్స్‌లో కూడా విజేతగా నిలిచి మూడు పారాలింపిక్స్ పతకాలు గెలుచుకున్న ఏకైక భారతీయుడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతనికిప్పుడు 40 ఏళ్లు. ఆ వయసులో ఈ విజయం నిజంగా విశేషం. కృష్ణ నాగర్ రాజాస్థాన్కు చెందిన కృష్ణ .. హార్మోన్ల లోపం వల్ల మరుగుజ్జుగా ఉండిపోయాడు. కానీ బాడ్మింటన్ పట్ల ఆసక్తితో దాన్ని నేర్చుకుని టోక్యో పారాలింపిక్స్‌లో పతకాన్ని సాధించి మరుగుజ్జుతనం తన లక్ష్యసాధనకు ఆటంకం కాదని నిరూపించాడు. మనీష్ నర్వాల్ హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన మనీష్ పుట్టుకతోనే కుడిచేయిపై పట్టును కోల్పోయి, ఒంటి చేతితోనే జీవితాన్ని నెట్టుకు రాసాగాడు. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే ఈ 19ఏళ్ల కుర్రాడు తన లోపాన్ని దృష్టిలో పెట్టుకుని తన ఏకాగ్రతను షూటింగ్ వైపు మళ్లించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. భావినా పటేల్ గుజరాత్, మెహసాగా జిల్లాకు చెందిన భావినా పోలియో వల్ల కాళ్లను పోగొట్టుకుని చక్రాల కుర్చీకే పరిమితం అయింది. ఎన్నో ప్రతిబంధకాలను అధిగమించి టేబుల్ టెన్నిస్‌ను నేర్చుకుని టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుని ఈ క్రీడలో పతకాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ క్రీడాకారిణి వయసు ఎంతో తెలుసా.. పందొమ్మిదేళ్లు మాత్రమే. సమీర్ బెనర్జీ భారతీయ మూలాలున్న ఈ అమెరికన్ యువకుడు ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. అరుదైన రికార్డ్ సృష్టించాడు. సమీర్ తండ్రి అస్సాం రాష్ట్రీయుడు. తల్లిది ఆంధ్రప్రదేశ్. అబ్దుల్ రజాక్ గుర్నా ప్రతిష్ఠాత్మక నోబెల్ సాహిత్య పురస్కారాన్ని 2021 గాను గెలుచుకున్న సాహితీవేత్త అబ్దుల్ రజాక్. టాంజానియాకు చెందిన ఆయన 1994లో ‘ప్యారడైజ్’ నవలతో సాహిత్య ప్రస్థానం మొదలుపెట్టారు. ఆయన రచనల్లో వలసవాదపు మూలాలు, తూర్పు ఆఫ్రికా దేశాల్లోని ఆధునికత తాలూకు విధ్వంసం, సాంస్కృతిక సంఘర్షణలు కనిపిస్తాయి. 1948లో, జాంజిబార్‌లో జన్మించిన అబ్దుల్ 1960వ దశకంలో శరణార్థిగా ఇంగ్లండ్‌కు చేరాడు. అనంతరం అక్కడే ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేసి, రిటైర్ అయ్యాడు. -
ఫెన్సర్ భవానీ దేవికి క్రీడా శాఖ చేయూత
ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవి (తమిళనాడు) వచ్చే ఏడాది నాలుగు అంతర్జాతీయ టోర్నమెంట్లలో బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలలో పాల్గొనేందుకు భవానీ దేవికి రూ. 8 లక్షల 16 వేలు కేంద్ర క్రీడా శాఖ మంజూరు చేసింది. జార్జియాలో వచ్చే జనవరి 14 నుంచి 16 వరకు జరిగే ప్రపంచకప్ టోర్నీతో భవానీ దేవి సీజన్ మొదలవుతుంది. ఆ తర్వాత బల్గేరియాలో, గ్రీస్‌లో, బెల్జియంలో జరిగే ప్రపంచకప్ టోర్నీలలోనూ ఆమె పోటీపడుతుంది. వైల్డ్ కార్డుతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో... మెల్బోర్న్లో వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 30 వరకు జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే (బ్రిటన్) వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ముర్రే చివరిసారిగా 2019లో ఆడాడు. అనంతరం తుంటి గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకొని ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడాల్సి ఉండగా... కరోనా బారిన పడటంతో బరిలోకి దిగలేదు. చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. -
Bajrang Punia: కొత్త కోచ్ అన్వేషణలో బజరంగ్... అతడితో జట్టు కట్టే అవకాశం
Bajrang Punia May Tie Up With Andriy Stadnik Ahead Paris Olympics: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా 2024 పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల కోసం కొత్త కోచ్‌ను నియమించుకునే పనిలో పడ్డాడు. ఉక్రెయిన్‌కు చెందిన బీజింగ్ ఒలింపిక్స్ (2008) కాంస్య పతక విజేత అండ్రీ స్టాడ్నిక్తో అతను సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇప్పటిదాకా బజరంగ్‌కు జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్ కోచ్‌గా ఉన్నాడు. షాకో శిక్షణలో బజరంగ్ పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించాడు. కాగా జార్జియన్ కోచ్ షాకో బెంటినిడిస్ వద్ద మార్గనిర్దేశనంలో బజరంగ్టో క్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. అదే విధంగా ఏసియన్ గేమ్స్-2018లో స్వర్ణం, వరల్డ్ చాంపియన్‌షిప్-2019లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. చదవండి: Rahul Dravid: నా ఫస్ట్‌లవ్ ద్రవిడ్.. తన కోసం మళ్లీ క్రికెట్ చూస్తా: నటి MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్ సిక్సర్.. ధోని ఫొటో వైరల్ -
Neeraj Chopra: అదే కసి.. అదే తపన.. ఫొటో వైరల్
Neeraj Chopra Photo Goes Viral: ‘‘ఇంతకు ముందున్న... అదే తపన.. అదే కసితో ఈ వారం నుంచి శిక్షణ మొదలుపెట్టేశాను. గత ఒలింపిక్ పతకం సాధించేందుకు శిక్షణ పొందిన చోటే మరోసారి శిక్షణ పొందడం మంచి విషయం! మీ సందేశాలతో నాకు మద్దతుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఉద్వేగభరిత పోస్ట్ చేశాడు. బల్లెం చేతబట్టి పట్టి ప్రాక్టీసు ప్రారంభించినట్లు వెల్లడించాడు. కాగా హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా భారత్‌కు తొలి పసిడి అందించిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా అతడు చరిత్రకెక్కాడు. ఇక ఆగష్టు 7 నాటి నీరజ్ గెలుపును కళ్లారా చూసి భారతావని గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. అయితే, నీరజ్ చోప్రా మాత్రం... విజయాన్ని ఆస్వాదిస్తూ కూర్చోకుండా వెంటనే పని ప్రారంభిస్తానన్న తన మాటలు నిజం చేస్తూ మళ్లీ బల్లెం పట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అతడిని మరోసారి అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి View this post on Instagram A post shared by Neeraj Chopra (@neeraj____chopra) -
అమృతాంజన్ బ్రాండ్ అంబాసిడర్లుగా చాను, పునియా
ముంబై: టోక్యో ఒలింపిక్ గేమ్స్ విజేతలైన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను, రెజ్లర్ బజరంగ్ పునియాలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నట్లు అమృతాంజన్ హెల్త్‌కేర్ వెల్లడించింది. జాయింట్ మజిల్ స్ప్రే, పెయిన్ ప్యాచ్, బ్యాక్ పెయిన్ రోల్ ఆన్ వంటి నొప్పి నివారణ ఉత్పత్తులకు వీరు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారని సంస్థ సీఎండీ శంభు ప్రసాద్ తెలిపారు. టీవీ, డిజిటల్ ప్రకటనలతో పాటు వినియోగదారులకు చేరువయ్యేందుకు నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో వీరు పాలుపంచుకుంటారని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులుగా తమకు ఎదురయ్యే కండరాలు నొప్పులు మొదలైన సమస్యల నుంచి ఉపశమనానికి అమృతాంజన్ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడ్డాయని మీరా బాయ్ చాను, బజరంగ్ పునియా తెలిపారు. -
గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటన
Olympic Bronze Medalist Rupinder Singh, Birendra Lakra Retired: టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు స్టార్ క్రీడాకారులు గంటల వ్యవధిలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. తొలుత డ్రాగ్ ఫ్లికర్‌గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించగా.. గంటల వ్యవధిలో మరో స్టార్ ఆటగాడు, డిఫెండర్ బీరేంద్ర లక్రా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. రూపిందర్ గురువారం ట్విటర్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించగా.. బీరేంద్ర లక్రా వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే రిటైర్ అవుతున్నట్లు ఈ ఇద్దరూ ప్రకటించారు. భారత హాకీకి చేసిన సేవలకు గాను హాకీ ఇండియా వీరిద్దరిని అభినందించింది. ఇదిలా ఉంటే, దేశంలో అత్యుత్తమ డ్రాగ్ ఫ్లికర్‌గా గుర్తింపు పొందిన 30 ఏళ్ల రూపీందర్ పాల్.. భారత్ తరఫున 223 మ్యాచ్‌ల్లో 119 గోల్స్ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అతను నాలుగు కీలక గోల్స్ సాధించి జట్టు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, 31ఏళ్ల బీరేంద్ర లక్రా విషయానికొస్తే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అతను.. 201 మ్యాచ్‌ల్లో 10 గోల్స్ సాధించాడు. 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో లక్రా కీలక సభ్యుడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు.. -
నీరజ్ తో ఒప్పందాలకు కార్పొరేట్ కంపెనీలు
-
ఆమె కత్తి మహా పదును.. ఏకంగా రూ.10 కోట్లు దాటింది
-
ఆమె కత్తి మహా పదును.. ఏకంగా రూ.10 కోట్లు దాటింది
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు(సెప్టెంబర్ 17)ను పురస్కరించుకుని వివిధ సందర్భాల్లో ఆయనకు బహుమతులుగా అందిన వస్తువుల ఈ-వేలం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారుల పరికరాలు, దుస్తులు కూడా వేలానికి ఉంచారు. ఈ క్రమంలో విశ్వక్రీడల్లో భారత్ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడ్డ తొట్టతొలి మహిళగా చరిత్ర సృష్టించిన భవానీ దేవి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒలింపిక్స్‌లో ఆమె ఉపయోగించిన కత్తి(ఫెన్స్)కి ఈ-వేలంలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఆమె కత్తిని రూ. 60లక్షల బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.10 కోట్లను దాటింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం పతక విజేత షట్లర్ కృష్ణ నాగర్, మరో షట్లర్ సుహాస్ యతిరాజ్(రజత పతక విజేత)లు ఉపయోగించిన రాకెట్ల ధర కూడా రూ.10 కోట్లకు చేరింది. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెను రూ. కోటి బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.1.20 కోట్ల వద్ద కొనసాగుతోంది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు రాకెట్‌కు రూ. 80లక్షల బేస్‌ధరతో వేలం నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం రూ. 90లక్షలు దాటింది. బాక్సింగ్ సంచలనం లవ్లీనా చేతి గ్లౌజులను రూ. 80 లక్షల బేస్‌ప్రైజ్ వద్ద వేలం ప్రారంభించగా.. ప్రస్తుతం రూ.1.80 కోట్ల వద్ద కొనసాగుతోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక వెబ్సైట్లో (pmmementos.gov.in) ఈ వేలం ఇవాల్టి నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ వేలం ద్వారా సమకూరే నిధులను నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు. చదవండి: టీ20ల చరిత్రలో అరుదైన ఘనత.. ఆ జాబితాలో ఇద్దరూ విండీస్ యోధులే -
ప్రముఖ క్రికెటర్లను దాటేసిన నీరజ్ చోప్రా..!
Neeraj Chopra Social Media Valuation: టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రపుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. జావెలింగ్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా భారత్‌కు సరికొత్త పతకాన్ని సాధించి రికార్డును నెలకొల్పాడు. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా నీరజ్ దూసుకుపోయాడు. బంగార పతకం సాధించిన ఒక్కరోజులోనే అతని సోషల్‌మీడియా అకౌంట్లకు గణనీయంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. పలు కంపెనీలు తమ కంపెనీలకు నీరజ్‌ను బ్రాండింగ్ చేయడం కోసం క్యూ కట్టాయి. వాల్యూయేషన్‌లో నీరజ్ హవా...! 23 ఏళ్ల నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యాన్ని పొందాడు. చోప్రా ఒలింపిక్ గోల్డ్ గెలిచిన రోజు నుంచి సోషల్, డిజిటల్ మీడియా రంగంలో అతడి వాల్యూ విపరీతంగా పెరిగింది. రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ యూగోవ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం... ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ మెన్షన్ పర్సన్‌గా నీరజ్ నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 2.9 మిలియన్ల యూజర్లు నీరజ్ గురించి ప్రస్తావించారు. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలో నీరజ్ ప్రస్తావన సుమారు 2055 శాతంగా ఉంది. దీంతో నీరజ్ చోప్రా సోషల్ మీడియా వాల్యుయేషన్ ఏకంగా 428 కోట్లకు పెరిగింది. సాధారణ ఇండియన్ అథ్లెట్ల కంటే మూడు రెట్లు ఎక్కువ..! నీరజ్ చోప్రాకు జెఎస్డబ్ల్యూ స్పోర్ట్ తన మద్దతును అందిస్తోంది. ప్రస్తుతం జెఎస్డబ్ల్యూ నీరజ్ చోప్రాకు దీర్ఘకాలిక సహకారాన్ని అందించాలని చూస్తోంది. పలు ఇతర బ్రాండ్లు కూడా నీరజ్ చోప్రాపై ఆసక్తి కనబరుస్తున్నాయి. యూగోవ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం, గోల్డ్ మెడల్ సాధించినప్పటి నుంచి నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో ఇంటారక్షన్స్ సుమారు 86.3శాతం చొప్పున 12.79 మిలియన్లకు పెరిగింది. రికార్డుస్థాయిలో 4.05 మిలియన్ల మేర వీడియో ఎంగేజ్మెంట్ ఇంటారక్షన్స్ నమోదయ్యాయి. ఇది సోషల్ మీడియాలో దిగ్గజ ఇండియన్ అథ్లెట్ల సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. నీరజ్ చోప్రా ప్రస్తుతం సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో కెఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లను దాటేశాడు. సహజంగానే, నీరజ్ చోప్రా సోషల్‌మీడియా ఖాతాల అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య కూడా వేగంగా పెరిగింది, అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఇప్పుడు 4.4 మిలియన్లుగా నమోదైంది, ఫాలోవర్స్‌లో 2297శాతం మేర పెరుగుదలను సూచిస్తోంది. -
నేడు నా కల నెరవేరింది: నీరజ్ చోప్రా భావోద్వేగం
Neeraj Chopra Takes Parents On Their First Flight: పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులు అనుభవించే ఆనందమే వేరు. బిడ్డలు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటే వారి సంబరం అంబరాన్నంటుంది. అదే సమయంలో తమ తమ చిన్న చిన్న కోరికలను నెరవేర్చేందుకు వారు చేసే ప్రయత్నాలు ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా తన తల్లిదండ్రులకు ఇలాంటి ఆనందాన్నే అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడిని ముద్దాడిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... వ్యక్తిగత విభాగంలో ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయస్సులోనే ఈ రికార్డు సాధించి, తన ఎదుగులకు ఎంతగానో పాటుపడిన తల్లిదండ్రులు, కోచ్‌లు.. సాయం అందించిన ప్రభుత్వాలకు అరుదైన కానుక అందించాడు. ఇక నీరజ్ చోప్రా.. తాజాగా ‘తన’ చిన్నపాటి, చిరకాల కలను నిజం చేసుకున్నాడు. తల్లిదండ్రులు సరోజ్ దేవి, సతీశ్ కుమార్‌ను తొలిసారిగా విమానం ఎక్కించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శనివారం షేర్ చేసిన నీరజ్.. ‘‘నా కల నేడు నెరవేరింది. మొట్టమొదటి సారిగా నా తల్లిదండ్రులు విమాన ప్రయాణం చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాల వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: ‘టాటా ఏఐఏ’ బ్రాండ్ అంబాసిడర్‌గా నీరజ్ చోప్రా ఇక నీరజ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ‘‘ఈ ఫొటోలను సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరెప్పుడైనా ఒత్తిడికి లోనైనా, నిరుత్సాహానికి గురైనా ఈ ఫొటోలను చూడండి. అన్నీ చిటికెలో మాయమైపోతాయి. నువ్వు సూపర్ నీరజ్ భాయ్. ఈ ప్రపంచంలోని సంతోషమంతా నీ పేరెంట్స్ కళ్లలోనే కనిపిస్తోంది’’ అంటూ ప్రశంసిస్తున్నారు. చదవండి: భారీ నజరానాలు, కోట్లల్లో డబ్బు.. కేవలం ఇవేనా.. అసలు సంగతి వేరే! A small dream of mine came true today as I was able to take my parents on their first flight. आज जिंदगी का एक सपना पूरा हुआ जब अपने मां - पापा को पहली बार फ्लाइट पर बैठा पाया। सभी की दुआ और आशिर्वाद के लिए हमेशा आभारी रहूंगा 🙏🏽 pic.twitter.com/Kmn5iRhvUf — Neeraj Chopra (@Neeraj_chopra1) September 11, 2021 Save these pictures folks , Whenever you feel depressed,demotivated just see this picture and get back the pleasure and motivation to fulfill your dreams . ❣️❣️🙏🙏 — PURUSHOTTAM KUMAR (@CAyar_Puru) September 11, 2021 -
‘టాటా ఏఐఏ’ బ్రాండ్ అంబాసిడర్‌గా నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ప్రకటించింది. బహుళ సంత్స రాల బ్రాండ్ భాగస్వామ్యంగా దీన్ని పేర్కొంది. దేశవ్యాప్తంగా వినియోగదారులుకు అత్యుత్తమ జీవిత బీమా, ఆరోగ్య బీమా రక్షణకుతోడు, ఆరోగ్య పరిష్కారాలను అందించాలన్న కంపెనీ ప్రయత్నాలకు నీరజ్‌చోప్రా మద్దతుగా నిలుస్తారని టాటా ఏఐఏ లైఫ్ తన ప్రకటనలో తెలిపింది. నీరజ్ భాగస్వామ్యంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీ మరింత విస్తరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. (చదవండి: IND VS ENG: ఇంగ్లండ్‌లో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే) -
క్విజ్ పోటీ విజేతకు బహుమతి అందజేసిన 'సాక్షి' డిజిటల్
సాక్షి, హైదరాబాద్/ నెల్లూరు: ఈ ఏడాది జులై, ఆగస్ట్ మాసాల్లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత్ ఏ విభాగంలో ఎన్ని(స్వర్ణ, రజత, కాంస్య) పతకాలు గెలుచుకుంటుందో గెస్ చేయాలంటూ Sakshi.com జులై 23న ఓ క్విజ్ పోటీని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కాంపిటీషన్లో కచ్చితమైన గణాంకాలు చెప్పిన టాప్-3 పాఠకులకు 5 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని 'సాక్షి’ డిజిటల్ విభాగం ప్రకటించింది. విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన ఈ పోటీలో నెల్లూరుకు చెందిన డాక్టర్ సదా వెంకటేశ్వర్లు విజేతగా నిలిచారు. టోక్యోలో భారత్ ఏడు పతకాలు సొంతం చేసుకుంటుందని ఒలింపిక్స్ ముగియక ముందే వెంకటేశ్వర్లు వేసిన అంచనా నిజమైంది. దీంతో ‘సాక్షి’ డిజిటల్ విభాగం ముందుగా ప్రకటించినట్టుగా విజేతకు 5 వేల రూపాయల నగదు అందజేసింది. నెల్లూరులోని సాక్షి ఎడిషన్ కార్యాలయంలో బుధవారం బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ రావు, ఎడిషన్ ఇన్చార్జి మోహన్.. డాక్టర్ సదా వెంకటేశ్వర్లు తరఫున ఆయన సతీమణి కె.ప్రవీణకు డీడీని అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ మాట్లాడుతూ.. ‘సాక్షి’ నిర్వహించిన పోటీలో తన భర్త విజేత కావడం ఆనందంగా ఉందన్నారు. ‘సాక్షి’ డిజిటల్ విభాగం వీక్షకులకు పోటీలు నిర్వహించడం.. నగదు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. చదవండి: Olympics, Paralympics: మట్టిలో మాణిక్యాలు.. హర్యానా సక్సెస్ సీక్రెట్? -
భారీ నజరానాలు, కోట్లల్లో డబ్బు.. కేవలం ఇవేనా.. అసలు సంగతి వేరే!
భారత ఒలింపిక్స్, పారాలింపిక్స్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి మనకు స్వర్ణాల పంట పండింది. టోక్యో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) పసిడి అందించి చరిత్ర సృష్టించగా.. పారాలింపిక్స్‌లో అవని లేఖరా, సుమిత్ అంటిల్, ప్రమోద్ భగత్, కృష్ణా నగర్, మనీష్ నర్వాల్ స్వర్ణాలు సాధించి గర్వకారణమయ్యారు. వీరితో పాటు మన క్రీడాకారులంతా మెరుగ్గా రాణించడంతో ఒలింపిక్స్‌లో మొత్తంగా 7 పతకాలు, పారాలింపిక్స్‌లో 19 పతకాలు మన సొంతమయ్యాయి. అయితే, మెడల్స్ సాధించిన ఆటగాళ్లలో చాలా మంది హర్యానాకు చెందిన వారే కావడం విశేషం. మొత్తంగా.. ఈ రాష్ట్రానికి చెందిన 9 మంది అథ్లెట్లు పతకాలు గెలవడం గమనార్హం. ముఖ్యంగా గత రెండు ఎడిషన్లలో పారాలింపిక్స్‌లో హర్యానా అథ్లెట్లు ఆరు మెడల్స్‌తో మెరవడం వారి ప్రతిభకు అద్దం పడుతోంది. మరి దేశ జనాభాలో కేవలం 2 శాతం గల ఈ చిన్నరాష్ట్రం భారత్‌కు క్రీడామణికాంతులను అందించే నర్సరీగా ఎలా మారింది? విశ్వ వేదికపై సత్తా చాటిన హర్యానా సక్సెస్ సీక్రెట్ ఏంటి? భారీ ఆర్థిక సాయం, నజరానాలు ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకం సాధించిన క్రీడాకారులకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా హర్యానా భారీ నజరానాలు అందజేస్తుంది. ఒలింపిక్‌లో స్వర్ణం సాధిస్తే ఆరు కోట్లు, రజతానికి 4, కాంస్యానికి రెండున్నర కోట్ల రూపాయలు క్రీడాకారులకు ఇచ్చేది. అంతేకాదు తృటిలో పతకం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా 50 లక్షల ప్రోత్సాహకం అందించేది. 2018 వరకు ఈ సంప్రదాయాన్ని పాటించింది. ఇక తాజా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రతీ ప్లేయర్‌కు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు అందించింది. ఈ తరహాలో క్రీడల కోసం భారీగా ఖర్చు చేయడం హర్యానాకు మాత్రమే సాధ్యమైంది. ఈ విషయం గురించి హాకీ ఇంటర్నేషనల్ మాజీ ప్లేయర్, ప్రస్తుత క్రీడా శాఖా మంత్రి సందీప్ సింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఆటగాళ్లు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. అలాంటి సందర్భాల్లో క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే ధైర్యం చేయాలంటే ఈమాత్రం ప్రోత్సాహకాలు ఉండాలి. వారి కుటుంబాలకు కూడా ఓ భరోసా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. నిజానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అందించే నజరానాల కంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అందించే మొత్తం చాలా ఎక్కువ. విశ్వక్రీడల్లో పసిడి సాధిస్తే 75 లక్షలు, మిగతా ఒలింపియన్స్‌కు కేవలం లక్ష రూపాయల బహుమానం మాత్రమే ఉంటుంది. మూలాలే బలంగా.. సాధారణంగా చాలా రాష్ట్రాల్లో ఒలింపిక్స్ లేదంటే ఇతర ప్రధాన ఈవెంట్లలో పతకం సాధించిన తర్వాత క్రీడాకారులను ప్రభుత్వ ఉద్యోగాలు వరిస్తాయి. కానీ హర్యానాలో అందుకు భిన్నం. మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి.. ఆర్థిక భరోసా ఉండేలా ముందుగానే ఉద్యోగ భద్రత కల్పించడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన బాక్సర్ మనోజ్‌కుమార్ ఈ విషయం గురించి చెబుతూ.. ‘‘చాలా మంది చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చినవారే. ఆర్థిక తోడ్పాటు లేనివారే. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే భవిష్యత్తు బాగుంటుందని భావిస్తారు. అందుకే, క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి ప్రభుత్వం ముందుగానే ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు చేపడుతోంది. కాబట్టి ఇక వారు ఎలాంటి ఆందోళన లేకుండా ఆటలపై దృష్టి సారించే వీలు కలుగుతుంది’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా పోలీస్ విభాగం సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆటగాళ్లకు చోటు కల్పించేలా చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రాల్లో హర్యానా ఉందనడంలో అతిశయోక్తి లేదు. మట్టిలోని మాణిక్యాలు.. ప్రతిభకు పదునుపెట్టి 2008 నాటి నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో హర్యానాకు చెందిన కనీసం ఒక రెజ్లర్ అయినా సరే కచ్చితంగా పతకం సాధించడం పరిపాటిగా మారింది. ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం రాష్ట్రం నుంచి తొమ్మిది మంది రెజ్లర్లు ప్రాతినిథ్యం వహించారు. అదే విధంగా.. కామన్వెల్త్ క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఏసియన్ గేమ్స్‌లోనూ ఇప్పటికే సత్తా చాటారు. మాజీ రెజ్లర్, ప్రస్తుతం కోచ్‌గా సేవలు అందిస్తున్న ఈశ్వర్ దహియా(2016 ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ ఈయన శిక్షణలోనే రాటు దేలారు) ఈ విషయాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘మట్టిలో మాణిక్యాలను గుర్తించి, సహజమైన ప్రతిభను వెలికితీయడం ఇక్కడ సర్వసాధారణం. ప్రభుత్వం కూడా అనేక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే, ఇంకాస్త మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే పతకాల పంట పండుతుంది. అయితే, కేవలం మెడల్స్ వస్తేనే మేం సంతృప్తి చెందం. సాధించాల్సింది ఇంకా ఉందనే విషయాన్ని ఎల్లపుడూ గుర్తుపెట్టుకుంటాం’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించారు. విశ్వవేదికపై మెరిసిన హర్యానా ఆణిముత్యాలు టోక్యోలో హర్యానా ప్లేయర్లు అద్భుతమే చేశారు. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర లిఖించగా.. రెజ్లర్లు రవికుమార్ దహియా(రజతం), భజరంగ్ పునియా(కాంస్యం) మెడల్స్ సాధించారు. అంతేగాక ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా సెమీస్ చేరిన మహిళా హాకీ జట్టులోనూ కెప్టెన్ రాణీ రాంపాల్ సహా తొమ్మిది మంది ప్లేయర్లు ఉండటం విశేషం. పసిడి సాధించిన నీరజ్ చోప్రా తమ రాష్ట్రం గురించి మాట్లాడుతూ.. ‘‘హర్యానా ప్రజలు పోరాటయోధులు. క్రీడల్లో మా విజయానికి ఈ గుణమే కారణం. మేం దృఢంగా ఉంటాం. జాతీయంగా ఎప్పుడో మా ప్రతిభను నిరూపించుకున్నాం. ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జిస్తున్నాం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన షూటర్ మనీష్ నర్వాల్ కోచ్ రాకేశ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ఫరిదాబాద్ వంటి పలు పట్టణాల్లో అనేక షూటింగ్ రేంజ్‌లు ఉన్నాయి. షూటింగ్ పట్ల ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనం. బల్లాబ్‌ఘర్‌లో ఉన్న నా రేంజ్లోనూ దాదాపు 10 మంది అంతర్జాతీయంగా పోటీపడుతున్నారు. 30-35 మంది జాతీయంగా వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. మా వ్యవస్థ క్రీడలను ప్రోత్సహించే విధంగా ఉంది. విజయాలు సాధించడానికి మూలాలు బలంగా ఉండటమే కారణం’’ అని పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో హర్యానా 2008 బీజింగ్: ►రెండు కాంస్యాలు- బాక్సర్ విజేందర్‌సింగ్, రెజ్లర్ సుశీల్ కుమార్ 2012 లండన్: ►ఒక రజతం(రెజ్లర్ సుశీల్ కుమార్), రెండు కాంస్యాలు(రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్) 2016 రియో: ►ఒక కాంస్యం(రెజ్లర్ సాక్షి మాలిక్) 2020 టోక్యో: ►ఒక స్వర్ణం(నీరజ్ చోప్రా), ఒక రజతం(రెజ్లర్ రవికుమార్ దహియా), 2 కాంస్యాలు(రెజ్లర్ భజరంగ్ పునియా), పురుషుల హాకీ జట్టు సభ్యులు పారాలింపిక్స్‌లో పతకాలు 2016 రియో ►రజతం(షాట్‌పుట్టర్ దీపా మాలిక్) 2020 టోక్యో: ►2 స్వర్ణాలు(జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షూటర్ మనీష్ నర్వాల్), ఒక రజతం(షూటర్ సింగ్‌రాజ్ అధానా), 2 కాంస్యాలు(అధానా, ఆర్చర్ హర్వీందర్ సింగ్) - వెబ్‌డెస్క్ చదవండి: Virat Kohli: అరె ఏంట్రా ఇది.. ఈసారి వసీం, మైకేల్ ఒకేమాట! -
ఐపీఎల్లో పది సెకన్ల యాడ్‌కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా?
కరోనా సంక్షోభంతో ఆదాయం పడిపోయిన టెలివిజన్ రంగానికి ఆటలు ఊపిరి పోస్తున్నాయి. ఒకప్పుడు టీవీ యాడ్ రెవెన్యూలో పది శాతంగా ఉన్న స్పోర్ట్స్ వాటా ఇటీవల 20 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా టీమిండియాలో క్రికెట్లో విజయాలు సాధిస్తుంటే దానికి తగ్గట్టుగా టీవీల యాడ్ రెవిన్యూ బౌండరీలు దాటేస్తోంది. ఆదుకున్న ఆస్ట్రేలియా పర్యటన కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. వ్యాపారాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో దాని ప్రభావం అడ్వెర్‌టైజ్ రంగంపై పడింది. దీంతో యాడ్ రెవెన్యూ ఆధారంగా నడిచే టెలివిజన్ రంగానికి పెద్ద చిక్కే వచ్చి పడింది. అయితే ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా సంచలనం సాధించడం.. ఆ వెంటనే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకవడంతో ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ పట్టాలెక్కింది. మధ్యలో కరోనా కరోనా సెకండ్ వేవ్ ఇబ్బంది పెట్టినా టోక్యో ఒలింపిక్స్ ఆదుకున్నాయి. పెరిగిన స్పోర్ట్స్ వాటా టీవీ యాడ్ రెవెన్యూలో కరోనా ముందు వరకు స్పోర్ట్స్ వాటా 10 నుంచి 15 శాతం వరకే ఉండేది. అయితే ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ప్రారంభంతో ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ వాటా 20 శాతానికి పెరిగిందని ఇంటిగ్రేటెడ్ మీడియా ఆఫ్ అడ్వెర్టైజింగ్ కంపెనీ డీడీబీ గ్రూప్ ఎండీ రామ్ మోహన్ సుందరమ్ తెలిపారు. కరోనాకి ముందు టీవీ యాడ్ రెవెన్యూ రూ. 28,000 కోట్లు ఉండగా ఇందులో క్రీడల వాటా రూ. 2,500 కోట్లుగా ఉండేంది. ఐపీఎల్ తర్వాత ఇది ఏకంగా రూ. 4500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు చేరుకుందని ఆయన వెల్లడించారు. అగ్రస్థానం క్రికెట్‌దే టీవీలకు ఆదాయం సంపాదించి పెడుతున్న ఆటల్లో క్రికెట్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్ ద్వారా రూ.300ల నుంచి రూ. 400 కోట్ల ఆదాయం వచ్చింది. త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ ద్వారానే రూ.1,200 కోట్ల రెవెన్యూ వస్తుందని యాడ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 14 సీజన్ యాడ్ రెవిన్యూ విలువ అయితే ఏకంగా రూ. 2,500 కోట్లుగా ఉంది. క్షణానికి లక్ష ప్రపంచకప్, టోక్యో ఒలింపిక్స్‌లను మించిన డిమాండ్ బుల్లితెరపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్‌కి ఉంది. ఇటీవల మధ్యలో ఆగిపోయిన సీజన్ 14కి సంబంధించి కేవలం పది సెకన్ల యాడ్‌కి రూ. 14 లక్షల వంతున ఛార్జ్ చేశాయి టీవీలు. అంటే ఒక్క సెకనుకి లక్షకు పైగానే ధర పలుకుతోంది. అయినా సరే కార్పొరేట్ కంపెనీలు వెనక్కి తగ్గడం లేదు. టీవీలు అడిగినంత సొమ్ము చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటున్నాయి. సినిమాను దాటేసింది ఇండియన్ టెలివిజన్ యాడ్ రెవిన్యూలో ఇప్పటికీ అగ్రస్థానం సీరియల్లే ఆక్రమించాయి. ఆ తర్వాత సినిమాలు, న్యూస్, స్పోర్ట్స్, మ్యూజిక్, కిడ్స్ విభాగాలు ఉండేవి. క్రమంగా సినిమాలను స్పోర్ట్స్ వెనక్కి నెట్టేస్తోంది. పిచ్ మాడిసన్ 2019 రిపోర్టు ప్రకారం యాడ్ రెవెన్యూలో న్యూస్ వాటా 11 శాతం ఉండగా స్పోర్ట్స్ వాటా 10 శాతానికి చేరుకుంది. సినిమాలు 8 శాతానికే పరిమితం అయ్యాయి. మ్యూజిక్, కిడ్స్ 3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. చదవండి : Jeff Bezos: ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..! -
సెక్స్ లైఫ్ గురించి ప్రశ్న.. నీరజ్ చోప్రా ఎలా స్పందించాడో చూడండి..
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో క్రీడలో స్వర్ణ పతకం సాధించి భారత ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన నీరజ్ చోప్రా.. రాత్రిరాత్రి దేశంలో పెద్ద స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని ఇంటర్వ్యూ చేసేందుకు ప్రముఖ మీడియా సంస్థలు, జర్నలిస్ట్‌లు క్యూ కడుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ నీరజ్‌ను ఆన్లైన్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇందులో పలువురు అతని వ్యక్తిగత, క్రీడా జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. If you thought Malishka was Cringe WATCH Rajeev Sethi go a STEP FURTHER 😡 He asked Neeraj Chopra : "How Do you Balance your Sеx Life with your training??" Disgusted Neeraj replied "Aapke question se mera mann bhar gaya" #NeerajChopra #RajeevSethi pic.twitter.com/qwVd7hAot4— Rosy (@rose_k01) September 3, 2021 ఇదే క్రమంలో ప్రముఖ చరిత్రకారుడు రాజీవ్ సేథీ లైన్లోకి వచ్చి నీరజ్‌ను ఇబ్బంది పెట్టే ప్రశ్న ఒకటి సంధించాడు. 'అందమైన కుర్రాడివి.. నీ సెక్స్ జీవితాన్ని, అథ్లెటిక్స్ను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావంటూ' దిమ్మతిరిగిపోయే ప్రశ్న వేశాడు. ఓ ప్రముఖ వ్యక్తి అకస్మాత్తుగా ఇలాంటి ప్రశ్న వేసేసరికి నీరజ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఏం మాట్లాడాలో తెలీక కాసేపు గమ్మునుండిపోయాడు. అయితే ఈ షాక్ నుంచి తేరుకున్న అనంతరం నీరజ్ చాలా హుందాగా స్పందించాడు. 'సారీ సర్' అని సమాధానం ఇచ్చాడు. అయినా సరే రాజీవ్ సేథీ నీరజ్‌ను వదిలిపెట్టలేదు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటూ పట్టుపట్టాడు. అయినప్పటికీ నీరజ్ సహనం కోల్పోకుండా 'ప్లీజ్ సర్, మీ ప్రశ్నతో నా మనసు నిండిపోయిందంటూ' చాలా హుందాగా జవాబిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నీరజ్‌కు ఇలాంటి ప్రశ్నను సంధించిన రాజీవ్ సేథి వైఖరిని చాలా మంది ప్రముఖులు తప్పుపట్టారు. ఈ వీడియోపై శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. 'ఎదుర్కొన్న చెత్త ప్రశ్నలకు కూడా సౌమ్యంగా సమధానం చెప్పిన నీరజ్ చోప్రాపై నాకు గౌరవం పెరిగిందని, నిజమైన స్పోర్ట్స్ పర్సన్ ఇలానే వ్యవహరిస్తాడని నీరజ్‌ను ఆకాశానికెత్తాడు. ఇలా చాలామంది నెటిజన్లు నీరజ్ వ్యవహరించిన తీరుకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. చదవండి: కపిల్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం.. -
మీరాబాయి... పారిస్‌లో స్వర్ణం సాధించాలి: అమిత్ షా
న్యూఢిల్లీ: 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కోసం ప్రయత్నించాలని భారత వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చానును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. శనివారం న్యూఢిల్లీలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 51వ రైజింగ్ డే వేడుకల్లో మీరాబాయిని అమిత్ షా సన్మానించారు. మీరాబాయి కష్టానికి, నిబద్ధతకు పతకం రూపంలో టోక్యోలో ప్రతిఫలం లభించింది. దేశంలో ప్రధాని నుంచి సామాన్యుడి వరకు కూడా ఆమె ఘనతను కొనియాడారు. ఆమెకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. వచ్చే ఒలింపిక్స్‌లో పసిడి కోసం ప్రయత్నించాలని కోరుతున్నాను. దేశమంతా ఆ క్షణం కోసం ఎదురుచూస్తోంది’ అని అమిత్ షా అన్నారు. చదవండి: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్.. -
కోచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. భారత స్టార్ ప్లేయర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ నేషనల్ కోచ్ సౌమ్యదీప్ రాయ్‌పై స్టార్ ప్లేయర్ మనికా బత్రా సంచలన ఆరోపణలు చేసింది. దోహా వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో జాతీయ కోచ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నాడని ఆమె ఆరోపించింది. అయితే అందుకు తాను అంగీకరించలేదని, టోక్యో ఒలింపిక్స్‌లో అందుకే అతని సహాయం తీసుకోలేదని టీటీ సమాఖ్యకు నివేదించింది. ఫిక్సింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఇందుకు కావాల్సిన సాక్షాధారాలు తన దగ్గరున్నాయని, సరైన సమయంలో వాటిని అధికారుల ముందుంచుతానని పేర్కొంది. మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై మాట్లాడేందుకు కోచ్ నా వ్యక్తిగత హోటల్ గదికి వచ్చాడని, తాను మాట వినకపోవడంతో బెదిరింపులకు దిగాడని, ఓ శిష్యురాలు కోసమే ఆయన ఇదంతా చేశాడని వెల్లడించింది. కాగా, జాతీయ కోచ్‌పై మనికా బత్రా చేసిన ఆరోపణలపై టీటీఎఫ్ఐ విచారణ చేపట్టకపోవడం పలు అనుమానలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాల మధ్య టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన ప్రపంచ 56వ ర్యాంకర్ మనికా బాత్రా మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఒలింపిక్స్ సందర్భంగా నేషనల్ కోచ్ సేవలను తిరస్కరించడంపై అప్పట్లో టేబుల్ టెన్నిస్ సమాఖ్య మనికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చదవండి: వారెవ్వా క్యా సీన్ హై.. ట్రాక్‌పైనే అంధ అథ్లెట్‌కు లవ్ ప్రపోజల్ -
హాకీ ప్లేయర్ వివేక్ సాగర్‌కు నజరానా.. డీఎస్పీగా ఉద్యోగం
భోపాల్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టులో సభ్యుడైన మధ్యప్రదేశ్‌కు చెందిన వివేక్ సాగర్‌ను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖలో డీఎస్పీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం మధ్యప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాగా అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోటి రూపాయల చెక్కును కూడా వివేక్ సాగర్‌కు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్రా మీడియాతో మాట్లడూతూ.. భారత హాకీ జట్టులో సభ్యడైన వివేక్ సాగర్‌ను డీఎస్పీగా నియమించాలని క్యాబినెట్ మంగళవారం నిర్ణయించిందని అన్నారు. 2025-26 నాటికి మధ్యప్రదేశ్‌లో మొత్తం అక్షరాస్యత లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ .110.84 కోట్ల నిధులను ఆమోదించిందని, దీని ద్వారా "నవ భారత సాక్షరతా అభియాన్" కింద కోటి మందికి పైగా విద్య అందిస్తామని మిశ్రా చెప్పారు. చదవండి: IPL 2021: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
మేరీకోమ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా
ఢిల్లీ: 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్‌కు రినాల్డ్ ఇండియా ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్ 2020 ఫ్లాగ్ బేరర్‌గా(పతాకధారి) వ్యవహరించిన మేరీకోమ్‌కు రినాల్డ్ ఇండియా కైగర్ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారును అందించింది. అంతకముందు టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత.. భారత మహిళ వెయిట్‌లిఫ్టర్ మీరాభాయి చానుకు కూడా రినాల్డ్ కైగర్ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారునే గిఫ్ట్‌గా అందించింది. కాగా షినీ విల్సన్, అంజూ బాబీ జార్జీ తర్వాత మేరీకోమ్ ఒలింపిక్స్‌లో ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించిన మూడో భారత మహిళ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం తెస్తుందనుకున్న మేరీకోమ్ క్వార్టర్స్ చేరకుండానే రెండో రౌండ్లోనే తిరుగుముఖం పట్టింది. రౌండ్ 16 పోరులో కొలంబియన్ బాక్సర్ వాల్నసీయా విక్టోరియా చేతిలో మేరి కోమ్ ఓటమి పాలైంది. 3-2 తేడాతో మేరీ కోమ్ ఓటమి పాలైంది. కాగా లండన్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో మేరీకోమ్ క్యాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే వయసు రిత్యా చూస్తే మాత్రం మేరీకోమ్‌కు ఇవే ఆఖరి ఒలింపిక్స్ అని అంతా భావించారు. కానీ తాను 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా పాల్గొంటానని మేరీకోమ్ ధీమా వ్యక్తం చేసింది. చదవండి: Mary Kom: నాకింకా వయసైపోలేదు. మరో నాలుగేళ్లు ఆడతా -
పీవీ సింధుకు తపాలా శాఖ గౌరవం
సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చిత్రంతో తపాలాశాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను రూపొందించింది. పీవీ సింధు చేతుల మీదుగా తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్రకుమార్ ఇతర తపాలా ఉన్నతాధికారులతో కలిసి ఈ కవర్‌ను విడుదల చేశారు. దీన్ని గౌరవంగా భావిస్తున్నట్లు సింధు పేర్కొంది. -
శెబ్బాష్ భవీనా.. ఈమె జీవితం నేర్చుకోవాల్సిన పాఠం
Bhavina Patel Wins Silver Medal: తొందరపడితే చరిత్రను తిరగరాయలేం.. ఊరికే చరిత్రను సృష్టించలేం.. ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా డైలాగ్. అయితే నిజ జీవితంలోనూ ఇది అక్షర సత్యమని నిరూపించింది భవీనాబెన్ పటేల్. టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో తొలి పతకం(రజతం) సాధించి చరిత్ర సృష్టించిన భవీనాబెన్ పటేల్.. అందుకోసం పడ్డ కష్టం, గెలుపు కోసం పడ్డ తాపత్రయం ఎందరికో స్ఫూర్తిదాయకం కూడా.. సాక్షి, వెబ్‌డెస్క్: టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ మహిళ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. సెమీస్‌లో చేరినప్పుడే ఆమెకు పతకం ఖాయమైనప్పటికీ శనివారం జరిగిన సెమీస్ పోరులో గెలిచిన భవీనా ఫైనల్‌కు అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో గెలిస్తే బంగారు పతకాన్ని గెలిచే అవకాశం వచ్చింది. అయితే తుది పోరులో చైనా క్రీడాకారిణి.. ప్రపంచ నెంబర్‌వన్.. చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. టోక్యో పారాలింపిక్స్‌లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్ పటేల్ జీవితం ఒక ఆదర్శం. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ.. ఒడిదుడుకులతో విజయాలు సాధించింది. చదవండి: Tokyo Paralympics: భవీనాబెన్ పటేల్‌కు రజతం An accomplishment that will echo through #IND 🗣️ Bhavina Patel receives her medal as she wins the nation's first #silver in #ParaTableTennis at the #Tokyo2020 #Paralympics ❤️pic.twitter.com/l4xzgHpYWK — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 29, 2021 పోలియో బారిన పడి... గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్‌లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్‌లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్‌గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్‌కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్‌ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్‌లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. ప్రస్తుతం ఆమె సాధించిన విజయానికి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. -
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. ఆర్మీ స్టేడియానికి అతని పేరు
పుణే: అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్ స్వర్ణాన్ని అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ (ఏఎస్ఐ)కు నీరజ్ పేరు పెట్టారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న డిఫెన్స్ రంగానికి చెందిన క్రీడాకారులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాజ్‌నాథ్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నీరజ్ చోప్రాతో పాటు తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ (ఆర్చరీ), అమిత్, మనీష్ కౌషిక్, సతీష్ కుమార్ (బాక్సింగ్), వారి కోచ్‌లను సన్మానించారు. చోప్రాకు జావెలిన్‌ను బహుకరించిన కేంద్ర మంత్రి.. ఏఎస్ఐ పేరును నీరజ్ చోప్రా స్టేడియంగా మార్చుతున్నట్టు ప్రకటించారు. ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం భారత్‌కు రావాలనేది తన ఆకాంక్ష అని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ అన్నారు. చదవండి: Tokyo Paralympics:టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌కు భవీనాబెన్ -
పాక్ అథ్లెట్ నా జావెలిన్‌ను ట్యాంపర్ చేయలేదు: నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్.. తన జావెలిన్‌ను ట్యాంపర్ చేయాలని ప్రయత్నించాడని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నీరజ్ చోప్రా స్పందించాడు. ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ.. అతను ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతను మాట్లాడుతూ.. దయచేసి నన్ను, నా కామెంట్లను వ్యక్తిగత ఎజెండాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశాడు. క్రీడాకారుల మధ్య ఎటువంటి వైరుధ్యాలు ఉండవని, దేశాలు, ప్రాంతాలకు అతీతంగా క్రీడలు అందరినీ ఏకం చేస్తాయని పేర్కొన్నాడు. मेरी आप सभी से विनती है की मेरे comments को अपने गंदे एजेंडा को आगे बढ़ाने का माध्यम न बनाए। Sports हम सबको एकजूट होकर साथ रहना सिखाता हैं और कमेंट करने से पहले खेल के रूल्स जानना जरूरी होता है 🙏🏽 pic.twitter.com/RLv96FZTd2 — Neeraj Chopra (@Neeraj_chopra1) August 26, 2021 ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై కొంత మంది నెటిజన్లు ఉద్దేశపూర్వకంగా దుమారం రేపుతున్నారని, వారి కామెంట్లు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయని, అలాంటి వాటిని నిజమైన భారతీయులు పట్టించుకోవద్దని కోరాడు. నదీమ్ నా జావెలిన్‌ను పట్టుకోవడం పొరపాటుగా జరిగి ఉంటుందని, ఇందులో అతను ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పేమీ ఉండదని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. కాగా, కీలకమైన ఫైనల్‌కు ముందు జరిగిన ఓ ఆసక్తికర ఘటనకు సంబంధంచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నీరజ్ స్పందించాల్సి వచ్చింది. ఆ వీడియోలో పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ నీరజ్ చోప్రా జావెలిన్‌ను పట్టుకొని తిరగడం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో నదీమ్.. నీరజ్ జావెలిన్‌ను ట్యాంపర్ చేయాలని ప్రయత్నించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్ 2020లో ఫైనల్లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 87.58 మీటర్లు విసిరి అథ్లెటిక్స్‌లో భారత్ 100 ఏళ్ల స్వర్ణ పతక నిరీక్షణకు తెరదించాడు. చదవండి: పతకం చేజార్చుకున్న 24 మంది ఒలింపియన్లకు టాటా కార్లు -
పతకం చేజార్చుకున్న 24 మంది ఒలింపియన్లకు టాటా కార్లు
ఇటీవల ముగిసిన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత అథ్లెట్లకు ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లను బహుమతిగా ఇచ్చినట్లు టాటా మోటార్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. అత్యంత కఠిన పరిస్థితులలో తృటిలో వారు పతకాన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ, వారు దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. భారత ఒలింపిక్ జట్టు దృఢత్వం, సంకల్పం వారిని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. వారు ప్రతి దశలో అంచనాలను మించి సత్తా చాటారు, చివరి శ్వాస వరకు పోరాడారు. అందుకే దేశంలోని లక్షలాది మంది హృదయాలను వారు గెలుచుకున్నారు అని టాటా పేర్కొంది. .@imranirampal in a candid conversation with Shailesh Chandra - President, PVBU and EVBU, Tata Motors.#ALTROZForOlympians #TheGoldStandard #Altroz pic.twitter.com/GLFZFlqwPR — Tata Motors Cars (@TataMotors_Cars) August 26, 2021 అందుకే వారిని గౌరవించడానికి టాటా మోటార్స్ 24 ఒలింపియన్లకు బహుమతిగా ఆల్ట్రోజ్ ప్రీమియం కార్లను ఇచ్చింది. కార్లను తీసుకున్నవారిలో హాకీ, కుస్తీ, బాక్సింగ్, గోల్ఫ్, డిస్కస్ త్రో వంటి వివిధ క్రీడలకు చెందినవారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి హై స్ట్రీట్ గోల్డ్ కలర్ ఆల్ట్రోజ్ కీలను ఇచ్చారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వేహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో వారు చూపించిన పూర్తి నిబద్ధతను, అజేయ స్ఫూర్తిని చూసి మేము చాలా గర్వపడుతున్నాము. ఈ రోజు వారితో అదే వేదికను పంచుకోవడం నాకు దక్కిన గౌరవం. వారి చేసిన కృషిని అంగీకరిస్తూ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ గోల్డ్ కలర్ టాటా ఆల్ట్రోజ్ కారును వారికి బహుమతిగా ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.(చదవండి: ఇక మొబైల్ ఫోన్లలో అదిరిపోయే గ్రాఫిక్స్!) S.No. Athlete Name Sport 1 Neha Goyal Hockey 2 Rani Rampal Hockey 3 Navneet Kaur Hockey 4 Udita Duhan Hockey 5 Vandana Katariya Hockey 6 Nisha Warsi Hockey 7 Savita Punia Hockey 8 Monika Malik Hockey 9 Deep Grace Ekka Hockey 10 Gurjit Kaur Hockey 11 Navjot Kaur Hockey 12 Sharmila Devi Hockey 13 Lalremsiami Hockey 14 Sushila Chanu Hockey 15 Salima Tete Hockey 16 Nikki Pradhan Hockey 17 Rajani Etimarpu Hockey 18 Reena Khokhar Hockey 19 Namita Toppo Hockey 20 Aditi Ashok Golf 21 Deepak Punia Wrestling 86 kg 22 Kamalpreet Kaur Discus Throw 23 Satish Kumar Boxing 91 kg 24 Pooja Rani Boxing 75 kg -
ఒలింపిక్స్‌లో నారీ భేరీ: మువ్వన్నెల కీర్తి పతాకలు
అమ్మాయిలకు ఆటలేంటి... ఈ మాట కాలమానాలకు అతీతంగా నాటి తరం నుంచి నేటి తరం వరకు వినిపిస్తూనే ఉంది. ఇలాంటి ఆలోచనకు దేశం, ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేదు... మీ ఇంట్లోనో, పక్కింట్లోనో, స్నేహితుల వద్ద, బంధువుల వద్ద ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కూడా మీరు వినే ఉంటారు. ఆటతో ఆకాశపు అంచును అందుకున్నా... అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు చేసినా ఆడపిల్లకు అవసరమా అనే వాక్యం ఎక్కడినుంచో వెతుక్కుంటూనే వస్తుంది. అలా అని అమ్మాయి ఆగిపోలేదు. అలా ఆటల్లో దూసుకుపోతూనే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారతనారి తన సత్తా చాటి మువ్వన్నెల కీర్తి పతాకను ఎగురవేసింది. అడ్డంకులు సృష్టించడం కాదు... అవకాశాలు ఇస్తే ఎంతటి ఘనతనైనా సాధించగలనని చూపించింది. వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న మెగా స్పోర్టింగ్ ఈవెంట్ ఒలింపిక్స్‌ను ఈ సారి నిర్వహణ కమిటీ మహిళల కోణంలో కాస్త ప్రత్యేకంగా మార్చింది. జెండర్ ఈక్వాలిటీ పాటిస్తూ పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్ల సంఖ్య కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. మహిళలు కూడా ప్రముఖంగా కనిపించేలా... పురుషులు మాత్రమే ఇప్పటి వరకు పాల్గొన్న కొన్ని ఈవెంట్లలో సమానంగా మహిళలను కూడా చేర్చి మిక్స్డ్ ఈవెంట్లుగా మలచింది. ఇలాంటి ఈవెంట్ల సంఖ్య 18 కావడం విశేషం. అన్నింటికి మించి క్రీడల ప్రారంభోత్సవం రోజున తమ దేశ పతాకాన్ని తీసుకొని నడిచే అరుదైన గౌరవం కూడా స్త్రీలకే అందించింది. గతంలో ఒకే ఒక్క ఫ్లాగ్ బేరర్ ఉంటుండగా... టోక్యోలో ఒక దేశం నుంచి ఒక పురుష అథ్లెట్, ఒక మహిళా అథ్లెట్ జెండా పట్టుకొని నడిచే అవకాశం కల్పించడం ఒలింపిక్స్ స్థాయిని పెంచాయి. పీవీ సింధు (బ్యాడ్మింటన్ సింగిల్స్, కాంస్యం) ఒకసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటే చాలు జీవితం ధన్యమైనట్లుగా భావించి∙ఒలింపియన్ అనే గుర్తింపుతో తిరిగేవారు ఎంతో మంది. కానీ రెండు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటే రెండు సార్లూ పతకంతో తిరిగి రావడం అసాధారణం. అలాంటి ఘనతను తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు సాధించింది. చాలా మంది క్రీడాకారుల కష్టాల నేపథ్యంతో పోలిస్తే... అలాంటివేమీ లేవు కాబట్టి సింధుకు అంతా పూలబాటే అనుకుంటే పొరపాటు. ఒక్కసారి బరిలోకి దిగిన తర్వాత ప్లేయర్ల ఆట మాత్రమే మాట్లాడుతుంది. వారి ఆర్థిక, సామాజిక అంశాలేవీ ప్రత్యర్థికి కనిపించవు. అంటే ఒక పతకం గెలుపు వెనుక ఉండే ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల, అంకితభావమే ఆటగాళ్లను నడిపిస్తాయి. తొలిసారి 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు ఆ తర్వాత ఇక చాలంటూ ఆగిపోలేదు. మరో ఒలింపిక్ పతకానికి గురి పెట్టింది. టోక్యో క్రీడలకు కొన్ని నెలల ముందునుంచైతే ఒక్క రోజు కూడా ఆమె విరామం తీసుకోలేదు. ఆటతో పాటు ఫిట్నెస్ కోసం గంటల కొద్దీ కఠోర సాధన చేసింది. అవే ఆమెను ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమ మహిళా క్రీడాకారిణిగా తీర్చి దిద్దాయి. ఒలింపిక్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత ప్లేయర్‌గా సింధు చరిత్ర సృష్టించింది. మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్ – రజతం, 49 కేజీల విభాగం) ప్రపంచ క్రీడల్లో అతి పెద్ద వేదికపై ఘోర వైఫల్యం తర్వాత ఒక క్రీడాకారిణి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తిరిగి కోలుకొని ఆటపై దృష్టి పెట్టాలంటే, అదీ పతకం కోసం పోరాడాలంటే ఎంతటి పట్టుదల ఉండాలి! మణిపురి మణిపూస మీరాబాయి చాను అలాంటి పోరాటతత్వం తనలో ఉందని నిరూపించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో చాను తన ఈవెంట్‌ను కూడా పూర్తి చేయలేకపోయింది. ఆరు ప్రయత్నాల్లో ఒకే ఒక్కసారి మాత్రమే ఆమె నిర్ణీత బరువును ఎత్తగలిగింది. ఆ పోరు తర్వాత మొదలైన కన్నీటి ప్రవాహం ఎప్పుడో గానీ ఆగలేదు. అన్నీ మరచి ఆటపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని భావించిన చాను మళ్లీ పైకెగసింది. అనూహ్యంగా దూసుకొచ్చిన స్టార్ ప్లేయర్ మాదిరిగా కాకుండా తన కెరీర్లో ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ మళ్లీ ఆటపై మెల్లగా తన ముద్ర చూపించింది. ఇప్పుడు టోక్యోలో అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ పతకాన్ని అందుకుంది. ఊరికి సమీపంలో అడవినుంచి కట్టెలు కొట్టి తెచ్చే కుటుంబంలో ఒకరిగా ఉంటూ అవే కట్టెల మోపులను మోయడంతో మొదలైన ఆమె బరువులెత్తే ప్రస్థానం ఒలింపిక్ రజతం వరకు సాగింది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఏనాడూ వెనక్కి తగ్గని మీరాబాయి లాంటి అమ్మాయి ఎందరికో స్ఫూర్తి. లవ్లీనా బొర్గొహైన్ (బాక్సింగ్ – 69 కేజీలు, కాంస్యం) ఇద్దరు అక్కలు కిక్ బాక్సింగ్ ఆడారు. వారిని చూసి తాను బాక్సింగ్ వైపు వచ్చింది. అయితే సహజంగానే చిరు వ్యాపారి అయిన తండ్రికి తమ ముగ్గురు అమ్మాయిలను ఆటల్లో పెట్టే స్తోమత లేదు. మొదటి ఇద్దరు జాతీయ స్థాయి ఆటతోనే ముగించారు. కానీ ఆ తండ్రి మూడో కూతురిని మాత్రం అంతర్జాతీయ స్థాయికి చేర్చాలని మనసులో గట్టిగా అనుకున్నాడు. లవ్లీనా కూడా తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఒలింపిక్స్‌లో ఆడి నా కల నెరవేర్చమ్మా అన్న నాన్నకు మాట ఇచ్చిన లవ్లీనా పాల్గొనడంతోనే సరి పెట్టలేదు. పతకం తెచ్చి మరీ మురిపించింది. అసోంలో వెనుకబడిన గోలాఘాట్ ప్రాంతంనుంచి వచ్చి లవ్లీనా ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోవడం వెనుక అద్భుతాలు ఏమీ లేవు. అడుగడుగునా ఆమె కష్టం మాత్రమే ఉంది. ఈ ఏడాది ఆరంభంలో సహచరులంతా ప్రత్యేక శిక్షణ కోసం విదేశాలకు వెళ్లిన సమయంలో లవ్లీనా కరోనా బారిన పడింది. దాంతో ఆ అవకాశం చేజారింది. అక్కడకు వెళ్లి తన ఆట అత్యుత్తమంగా మారేదని, కచ్చితంగా ఒలింపిక్ పతకం సాధించేదాన్నని ఆమె అనుకుంది. అయితే ఆ నిరాశను దూరం చేసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇక్కడే ఉండి తన పంచ్‌లకు పదును పెట్టింది. ఇప్పుడు అసోం గర్వపతాకగా నిలిచింది. పతకం సాధించిన రోజునుంచి ఇప్పటి వరకు లవ్లీనా తన పురోగతిలో లెక్క లేనన్ని సార్లు నాన్న గురించి చెప్పడం చూస్తేనే ఆమెను ప్రోత్సహించడంలో తండ్రి పాత్ర ఏమిటో అర్థమవుతుంది. మేరీ కోమ్ (బాక్సింగ్ – 51 కేజీలు, క్వార్టర్ ఫైనల్) బాక్సింగ్‌లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి విజయం వెనుక ఎంత శ్రమ దాగి ఉంటుందో ఊహించడం కష్టం. మణిపూర్‌లోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మేరీ కోమ్ భారత బాక్సింగ్‌కు పర్యాయపదంగా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనే కాంస్యం సాధించి మేరీకోమ్ మరో పతకం కోసం ఈ సారీ పోరాడినా దురదృష్టవశాత్తూ చేజారింది. అయితే ఏం... మేరీకోమ్ క్రీడా పటిమను ఆ పతకంతో తూచలేం కదా! ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, తాను నమ్మిన ఆటలో తనపై నమ్మకంతో ఆమె సాగించిన ప్రయాణం అసాధారణం. టోక్యోలో పతకం గెలవకపోయినా తన ఆటతో మేరీకోమ్ అందరికీ ప్రేరణనిచ్చింది. అదితి అశోక్ (గోల్ఫ్ – నాలుగో స్థానం) గోల్ఫ్‌లో భారతదేశం మొత్తం పతకం కోసం ఆసక్తిగా ఎదురు చూసిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. కానీ 23 ఏళ్ల అమ్మాయి ఒక్కసారిగా మన క్రీడాభిమాల దృష్టినంతా తన వైపు తిప్పుకునేలా చేయగలిగింది. బెంగళూరుకు చెందిన అదితి అశోక్ తన అసాధారణ ఆటతో టోక్యో ఒలింపిక్స్‌లో చివరి వరకు పోరాడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 200వ స్థానంలో ఉన్నా... ఆమె పట్టుదల ముందు ఆ అంకె బాగా చిన్నదైపోయింది. ఒక్క స్ట్రోక్...ç Üరిగ్గా చెప్పాలంటే కొన్ని మిల్లీ మీటర్ల తేడాతో అదితి కాంస్య పతకాన్ని కోల్పోయింది. అయినా సరే ఆటపై తన ముద్ర చూపించి అందరి మనసులు గెలుచుకోగలిగింది. గోల్ఫ్‌పై అందరూ చర్చించేలా చేయగలిగింది. భవానీ దేవి (ఫెన్సింగ్) ఎవ్వరూ నడవని దారిలో నడవడమే ఆమెకు తెలిసిన ఆట.. ఆమె స్పోర్ట్స్ ఫిలాసఫీ కూడా. అందుకే అరుదైన క్రీడ ఫెన్సింగ్‌లోకి అడుగు పెట్టింది భవానీ దేవి. ఖరీదైన క్రీడే అయినా కత్తితో సహవాసం చేయడంలో ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆ ఆటకు సంబంధించి ఏమాత్రం సౌకర్యాలు లేని పరిస్థితులు, ఫలితాలు అసలే కనిపించని చోట తన ముద్ర చూపించడం కోసం ఎంతో కష్టపడింది. చివరకు పురుషుల విభాగంలోనూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఒలింపిక్స్‌లోకి ప్రవేశించిన తొలి భారత ఫెన్సర్‌గా కీర్తి గడించింది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆమె, రెండో పోరులో తగ్గింది. అయితే భవాని ఎదిగిన తీరును చూస్తే ఈ ఓటమి అసలు లెక్కలోనిదే కాదు. కొత్త ఆలోచనలతో, ధైర్యంతో ముందుకు సాగాలని భావించే ప్రతీ అమ్మాయికి ఫెన్సర్ భవానీ ఒక ఆదర్శం. కమల్‌ప్రీత్ కౌర్ (డిస్కస్ త్రో – ఆరో స్థానం) పంజాబ్‌లోని కబర్వాలా గ్రామంలో కమల్ కుటుంబానికి 26 ఎకరాల పొలం ఉంది. పాడి గేదెలు, ఇతర పశుసంపదకు లోటు లేదు. హాయిగా పెళ్లి చేసుకొని దర్జాగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు కోరుకుంటే నేను ఆటలు ఆడతానని కమల్ చెప్పింది. అయినా సరే, దేనికి లోటు లేదు కాబట్టి సరదాగా ఆడుతుందేమో అనుకున్నారు కానీ ఎంతో శ్రమ దాగి ఉండే అథ్లెటిక్స్ను ప్రొఫెషన్‌గా ఎంచుకుంటుందని వారు ఊహించలేదు. కమల్ ఏకంగా డిస్కస్ త్రోను విసరడాన్నే సాధన చేసింది. పట్టుదలగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తన త్రోతో ఒలింపిక్స్ వరకు చేరింది. టోక్యో పోటీలకు ముందు ఆమెపై పెద్దగా అంచనాలు లేవు కానీ క్వాలిఫయింగ్‌లో కమల్ జోరు ఆశలను పెంచింది. చివరకు ఆరో స్థానంతో సరిపెట్టుకున్నా... డిస్కస్ త్రోలో ఒక భారత త్రోయర్ సాధించిన ఈ ఘనత చాలా గొప్పదే. అందుకే ఆమె ఈవెంట్ జరిగిన రోజు ఫలితంతో సంబంధం లేకుండా ఆ ఊర్లో సంబరాలు జరిగాయి. కమల్ ఇంట్లో మిఠాయి తినందే ఊళ్లోవాళ్లెవ్వరూ ఆ ఇంటి గుమ్మం దాటలేదు. డబ్బుకు కొదవ లేకున్నా... ప్లేయర్‌గా ఆమె కూడా సగటు అథ్లెట్‌గానే పలు ఇబ్బందికర పరిస్థితులను అధిగమించి ఈ స్థాయికి చేరింది. ఒక దశలో కమల్‌ను సహచర మహిళా అథ్లెట్లు మగాడు అంటూ, పాల్గొనే అర్హత లేదంటూ ఫిర్యాదుల వరకు వెళ్లినా అన్నీ తట్టుకొని నిలిచింది. ఆమె పోరాటం నిజంగా అందరిలో స్ఫూర్తి నింపేదే. ఆ 16 మంది... ఒలింపిక్స్‌లో గెలుపు ఒక్కటే గొప్పతనాన్ని నిర్దేశించదు. పతకాల పట్టికలో తమ పేరు లిఖించుకోలేకపోయినా... ఆటపై బలమైన ముద్ర వేయగలగడం వారు సాధించిన విజయం. అలా చూస్తే భారత మహిళల హాకీ సాధించిన ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే. 1980 తర్వాత ఎనిమిది ఒలింపిక్స్‌లలో అసలు అర్హతే సాధించలేకపోయింది. ఎట్టకేలకు 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నా దక్కింది 12వ స్థానమే. అక్కడినుంచి ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానంలో నిలవగలిగిందంటే మన మహిళల ప్రస్థానం ఎలా సాగిందో అర్థమవుతుంది. కాంస్యపతక పోరులోనూ అద్భుతంగా ఆడినా దురదృష్టవశాత్తూ జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే మన అమ్మాయిల ఆటను చూసినవారు మాత్రం స్థానంతో సంబంధం లేకుండా జేజేలు పలకకుండా ఉండలేకపోయారు. రాణి రాంపాల్ (హరియాణా) 26 ఏళ్ల రాణి జీవితంలో దాదాపు సగభాగం అంతర్జాతీయ హాకీకే అంకితం కావడం విశేషం. 14 ఏళ్లకే తొలి మ్యాచ్ ఆడిన రాణి చాలా మందిలాగే విరిగిన హాకీ స్టిక్‌తో ఆట మొదలు పెట్టి ఆపై దూసుకుపోయింది. నిక్కీ ప్రధాన్ (జార్ఖండ్) నక్సలైట్లకు అడ్డాలాంటి ప్రాంతంనుంచి వచ్చి దేశానికి హాకీలో ప్రాతినిధ్యం వహించి తొలి హాకీ క్రీడాకారిణిగా నిలిచింది. ఆటపై పిచ్చితో హాకీ స్టిక్ కొనడం కోసమే కార్మికురాలిగా కూడా పని చేసింది. రాంచీ అకాడమీలో చేరిన తర్వాతే తొలిసారి ఆమెకు హాకీ స్టిక్, షూ లభించాయి. నిషా వార్సి (హరియాణా) టైలర్‌గా పని చేస్తున్న తండ్రి హాకీ ఆడేందుకు ప్రోత్సహించాడు. ఆటలో వేగంగా ఎదుగుతున్న సమయంలో 2015లో పక్షవాతంతో తండ్రి కుప్పకూలడంతో తల్లితో పాటు ఒక ఫోమ్ ఫ్యాక్టరీలో పని చేయాల్సి రావడంతో కీలక సమయంలో అవకాశం కోల్పోయింది. అయితే పట్టుదలగా తిరిగొచ్చి ఆటలో సత్తా చాటింది. సుశీలా చాను (మణిపూర్) భారత జట్టులో సీనియర్ క్రీడాకారిణి. 2016 రియో ఒలింపిక్స్‌లో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. దీప్ గ్రేస్ ఎక్కా (ఒడిశా) అన్న దినేశ్ ఎక్కా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో స్ఫూర్తి పొందిన దీప్ తాను అదే స్థాయికి ఎదిగేందుకు చాలా కష్టపడింది. ఇంట్లో పనులు చేసుకోకుండా ఆటలేంటి అంటూ ఊరంతా వెక్కిరించినా... కుటుంబ సభ్యుల మద్దతుతో ఆమె ముందుకు ఉరికింది. నేహా గోయల్ (హరియాణా) ఇంట్లో తాగుబోతు తండ్రితో బాధలు పడలేక ఎక్కువ సమయం బయట గడిపే క్రమంలో నేçహాకు హాకీ పరిచయమైంది. సైకిల్ చక్రంలో ఒక పుల్లను బిగిస్తే ఐదు రూపాయలు ఇచ్చే ఫ్యాక్టరీలో తల్లితో కలసి పని చేసిన ఆమె, రెండు పూటలా మంచి భోజనంపై ఆశతో హాకీ హాస్టల్లో చేరి తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఉదితా దుహన్ (హరియాణా) తండ్రి హ్యండ్ బాల్ క్రీడాకారుడు కావడంతో ఆటలపై ఆసక్తి పెంచుకున్న ఉదిత... హాకీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. జూనియర్ స్థాయిలో రాణించి సీనియర్ టీమ్‌లోకి ఎదిగింది. లాల్రెమ్సియామి (మిజోరం) తన రాష్ట్రం నుంచి హాకీ జాతీయ జట్టుకు ఆడిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సియామి... కెరీర్ ఆరంభంలో హిందీ, ఇంగ్లీష్లలో ఏదీ రాకపోవడంతో చాలా కాలం సైగల భాషతోనే సహచరులతో సంభాషించేది. వందనా కటారియా (ఉత్తరాఖండ్) ఒలింపిక్స్ సమయంలో ఎక్కువగా చర్చలోకి వచ్చిన పేరు. ఆమె ఆటను బట్టి కాకుండా కులం పేరుతో వందన దూషణకు గురైంది. హరిద్వార్‌లో చుట్టుపక్కల వాళ్లంతా వెక్కిరించినా తండ్రి అండగా నిలబడి హాకీ నేర్పించాడు. ఆమె ఆటలో ఎదిగేందుకు తాను చేయగలిగినంతా చేసిన ఆయన మూడు నెలల క్రితం వందన... జాతీయ శిబిరంలో ఉన్న సమయంలో చనిపోయాడు. దురదృష్టవశాత్తు అంత్యక్రియలకు వెళ్లలేకపోయిన వందన... దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో హ్యట్రిక్ సాధించి కన్నీళ్లపర్యంతమైంది. సలీమా టెటె (జార్ఖండ్) హాకీ ఆటకు సంబంధించి ఎలాంటి కనీస సౌకర్యాలు లేకుండా... రాళ్లు, రప్పలను కాస్త జరిపి మట్టి మైదానాన్ని సిద్ధం చేసుకుంటే తప్ప ఆడలేని పరిస్థితిలో సలీమా హాకీకి ఆకర్షితురాలు కావడం విశేషం. పొలంలో పని చేసి సంపాదించిన డబ్బుతో ఆమె స్టిక్ కొనుక్కుంది. నవనీత్ కౌర్ (హరియాణా) 2013నుంచి భారత జట్టులో రెగ్యులర్‌గా ఆడుతున్న కొందరిలో నవనీత్ కూడా ఉంది. రియో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న కౌర్... జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. మోనికా మలిక్ (హరియాణా) భారత జట్టులో ఉన్నత విద్యావంతురాలు. పోలీస్ అయిన తండ్రి ప్రోత్సాహంతో హాకీలోకి వచ్చి సత్తా చాటిన మోనికా ఎంబీఏ పూర్తి చేసింది. షర్మిలా దేవి (హరియాణా) జాతీయ స్థాయి హాకీ ఆటగాడైన తాతతో కలసి తొలిసారి మైదానానికి వెళ్లిన షర్మిలలో ఆటపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. అన్ని వైపులనుంచి దక్కిన ప్రోత్సాహంతో పూర్తిగా హాకీపైనే దృష్టి పెట్టింది. సవితా పూనియా (హరియాణా) తాత ప్రోత్సాహం, తండ్రి సహకారంతో సవితా హాకీలోకి అడుగు పెట్టింది. అయితే గోల్‌కీపర్‌కు ఉండే భారీ కిట్‌తో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం బాగా ఇబ్బందిగా మారి ఒక దశలో ఆటను వదిలేద్దామని అనుకుంది. అయితే అప్పటికే స్థానిక పోటీల్లో గోల్ కీపర్‌గా వచ్చిన గుర్తింపునకు తగిన ప్రోత్సాహం కూడా దక్కడంతో ఆటను కొనసాగించింది. సుదీర్ఘ కాలంగా భారత గోల్‌కీపర్‌గా జట్టు విజయాల్లో ప్రధాన భాగంగా మారింది. గుర్జీత్ కౌర్ (పంజాబ్) తాను చదువుతున్న హాస్టల్ సమీపంలో హాకీ గ్రౌండ్ ఉండటంతో ఆటకు ఆకర్షితురాలైన గుర్జీత్... ఒక్కసారి హాకీ స్టిక్ తీసుకున్న తర్వాత వెనుదిరిగిచూడలేదు. ఆసీస్‌పై విజయంలో ఆమె చేసిన గోల్ కీలక పాత్ర పోషించింది. నవజోత్ కౌర్ (హరియాణా) మెకానిక్ అయిన తండ్రి తన పిల్లల్లో ఒక్కరైనా క్రీడల్లో ఉండాలని కోరుకున్నాడు. ఆయన కల నెరవేర్చే క్రమంలో నవజోత్ హాకీ స్టిక్ అందుకుంది. 2012 నుంచి టీమ్‌లో ఆమె కీలక సభ్యురాలు. -
నీరజ్ చోప్రా ముందు అసభ్యకర డ్యాన్స్‌లు; ఫ్యాన్స్ ఆగ్రహం
టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ముందు యువతులు చేసిన అసభ్యకర డ్యాన్స్ వివాదాస్పదంగా మారింది. దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. వివరాల్లోకి వెళితే.. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాను శుక్రవారం రేడియో జాకీ మలిష్కా మెండోన్సా జూమ్ యాప్ ద్వారా ఇంటర్య్వూ చేసింది. చదవండి: Neeraj Chopra: గర్ల్‌ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ ఇంటర్య్వూలో భాగంగా మలిష్కాతో పాటు కొందరు యువతులు లాప్టాప్లో నీరజ్ చోప్రాను చూస్తూ 1957 బాలీవుడ్ సినిమా ''నయా దౌర్''లోని ''ఉడెన్ జబ్ జబ్ దల్హే తేరీ'' పాటకు అసభ్యకర డ్యాన్స్‌లు చేశారు. ఆ తర్వాత మలిష్కా నీరజ్‌కు కొన్ని ప్రశ్నలు వేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ మలిష్కా తన ట్విటర్లో షేర్ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్లు యువతులను ఒక ఆట ఆడుకున్నారు. ''దేశానికి పతకం తెచ్చిన వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేది.. మీ ప్రవర్తనతో తల దించుకునేలా చేశారు... అతనికి మీరిచ్చే గౌరవం ఇదేనా'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇక నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్ రెండో రౌండ్లో 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్ ముగింపు ఇచ్చాడు. చదవండి: స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు తీవ్ర జ్వరం Ladiesssss..Yes I got the hard hitting, deep answers too but..Take the first 4 secs before the cam moves to the zoom call to guess who we are dancing for😇 ;) #udejabjabzulfeinteri and then tell me I did it for all of us😄 #gold #olympics #neerajchopra @RedFMIndia @RedFM_Mumbai pic.twitter.com/SnEJ99MK31 — Mumbai Ki Rani (@mymalishka) August 19, 2021 -
‘అప్పుడు ఎందుకు నవ్వలేదు’.. రవిని ప్రశ్నించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో భేటీ సందర్భంగా ఓ పతకధారిని ఉద్దేశించి ప్రధాని మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగంలో రవి దహియా రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, రవి బౌట్లో ఎప్పుడూ గంభీరంగా ఉంటాడని, మెడల్ మ్యాచ్ అనంతరం పతకం అందుకున్న సమయంలోనూ నవ్వలేదని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. సాధారణంగా హర్యానాకు చెందినవారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటారు, దేశం గర్వించే గొప్ప విజయాన్ని సాధించిన సందర్భంగా కూడా నీ ముఖంలో చిరు నవ్వు కనిపించలేదేమంటూ రవి దహియాను మోదీ ప్రశ్నించారు. ఇందుకు రవి దహియా బదులిస్తూ.. అప్పుడు తాను నెర్వస్‌గా ఉన్నానని, అందుకే తన ముఖంలో ఎటువంటి హావభావాలను పలకలేదని, ప్రస్తుతం తాను కుదుటపడ్డానని ప్రధానికి చెప్పుకొచ్చాడు. కాగా, హర్యానాకు చెందిన 23 ఏళ్ల రవి దాహియా టోక్యో ఒలింపిక్స్‌లో కొలంబియా, బల్గేరియా, కజకిస్తాన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరాడు. ఫైనల్లో రష్యా రెజ్లర్‌తో భీకరంగా పోరాడి రజత పతకంతో మెరిశాడు. చదవండి: లివింగ్‌స్టోన్ ఊచకోత.. 10 సిక్సర్లు, 3 ఫోర్లతో 92 నాటౌట్ -
నీరజ్ చోప్రాకు స్వగ్రామంలో ఘన స్వాగతం
పానిపట్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు హర్యానా పానిపట్‌లోని తన స్వగ్రామం సమల్ఖాలో ఘన స్వాగతం లభించింది. దారిపొడవునా అతన్ని అభినందిస్తూ గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో దేశానికి స్వర్ణం అందించిన వ్యక్తిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకున్నాడు. తన స్వగ్రామంలో గ్రామస్తులు చూపిన ప్రేమపై నీరజ్ సంతోషం వ్యక్తం చేశాడు. మీ నుంచి ఇంత ప్రేమను పొందడం చాలా సంతోషంగా ఉంది. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నాకు రానున్న కాలంలోనూ ఇదే తరహా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నా. దేశానికి మరిన్ని పతకాలు తీసుకొచ్చేందుకు మరింత కష్టపడతా అంటూ తెలిపాడు. -
మాట నిలబెట్టుకున్న ప్రధాని.. పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముందుగా తాను చెప్పినట్లుగానే.. తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి ఐస్ క్రీం తిన్నారు. స్వాంత్రంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిన్న ఎర్రకోటకు ఆథ్లెట్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అనంతరం మోదీ తన నివాసంలో ఒలింపిక్స్ అథ్లెట్స్ కి ఆతిథ్యం ఇచ్చారు. వారు చేసిన కృషిని అభినందించారు.. వారి విజయాలను ప్రశంసించారు. భారత అథ్లెట్స్ కి ఒలింపిక్స్ కి వెళ్లడానికి మందు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాగా.. ఆ సమయంలో వారందరి వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలను మోదీ తెలుసుకున్నారు. పతకంతో తిరిగి వచ్చాక ఐస్‌క్రీమ్ తిందామని సింధుతో చెప్పిన ఆయన.. దాని ప్రకారమే నేడు సింధు తో కలిసి ప్రధాని ఐస్‌క్రీమ్ తిన్నారు. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో గెలుచుకున్న బ్రాంజ్ మెడల్ తో పాటు.. గతంలో రియో ఒలింపిక్స్‌లో సాధించిన పతకాన్ని కూడా ఈ సందర్భంగా సింధు తన వెంట తీసుకెళ్లింది. ఆ రెండింటిని ధరించి.. ప్రధాని మోదీతో కలిసి ఆమె ఫోటో దిగింది. @Pvsindhu1 getting treated to an ice-cream by PM Modi at 7LKM #Olympics2021 pic.twitter.com/CZX6c8X114 — Megha Prasad (@MeghaSPrasad) August 16, 2021 -
చూపుడు వేలుపై 3 గంటలకు పైగా
భవానీపట్న (ఒడిశా): హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు టోక్యో ఒలింపిక్స్‌లో ఆకట్టుకోగా... ఓ ఒడిశా యువకుడు మరో అరుదైన ఫీట్ చేశాడు. బొలాంగిర్ జిల్లాలోని జముత్జోలా గ్రామానికి చెందిన 25 ఏళ్ల రాజ్‌గోపాల్ భోయ్ కుడిచేతి చూపుడు వేలుపై ఏకంగా 3 గంటల 22 నిమిషాల 22 సెకన్లపాటు హాకీ స్టిక్‌ను నిలబెట్టాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నించాడు. గిన్నిస్ నిబంధనల మేరకు సమయాన్ని నమోదుచేసే వారు, జడ్జిలు, వీక్షకుల సమక్షంలో... వీడియో చిత్రీకరణ జరుగుతుండగా... రాజ్‌గోపాల్ ఈ అరుదైన ఫీట్ చేశాడు. అత్యధిక సమయం చూపుడు వేలిపై హాకీ స్టిక్‌ను నిలబెట్టిన వరల్డ్ రికార్డు ప్రస్తుతం 2 గంటల 22 నిమిషాలతో బెంగళూరుకు చెందిన హిమాంశు గుప్తా పేరిట ఉంది. రాజ్‌గోపాల్ విన్యాసానికి సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను నిశితంగా అధ్యయనం చేసిన అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు అతని ఘనతను గుర్తించి సర్టిఫికెట్ జారీచేయనున్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో శక్తి కావాలని... సంకల్పబలంతోనే ఇది సాధ్యమని ఈ ఫీట్‌కు నిర్వాహకునిగా వ్యవహరించిన సత్యపిర్ ప్రధాన్ అన్నారు. -
ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి రాష్ట్రపతి తేనీటి విందు
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఒలింపిక్స్‌లో మీరు సాధించిన పతకాలతో 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న దేశ గౌరవాన్ని మరింత పెంచారని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. అనంతరం వారితో ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా ఏడు పతకాలు సాధించగా.. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. https://t.co/6W1xZNwvV6 — President of India (@rashtrapatibhvn) August 14, 2021 -
Independence Day 2021: జాతీయ గీతాన్ని మార్మోగించాడు
భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్ రెండో రౌండ్లో 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్ ముగింపు ఇచ్చాడు. ఆగస్టు 15తో 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతావని జాతీయ గీతాన్ని జపాన్ గడ్డపై మారుమోగించాడు. -
Vinesh Phogat: ఇక రెజ్లింగ్‌కు తిరిగొస్తానో లేదో!
ఢిల్లీ: భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన ఆమెపై క్రమశిక్షణ చర్యల కింద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్య్లూఎఫ్ఐ) తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన వినేశ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన కాలమ్‌లో..'ఇక రెజ్లింగ్‌కు తిరిగొస్తానో రానో' అంటూ కామెంట్ చేయడం ఆసక్తి కలిగించింది. ''భారత్‌లో ఎంత వేగంగా ఎదుగుతారో అంతే వేగంగా పతనమవుతారని నాకు తెలుసు. ఒక్క మెడల్ పోయిందంటే ఇక అంతే. పని ముగిసినట్లే. రెజ్లింగ్‌లోకి నేను ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదు.. రాకపోవచ్చు కూడా. నా కాలు విరిగినప్పుడే బాగుంది. ఇప్పుడు నా శరీరం విరగలేదు కానీ.. మనసు మాత్రం కుంగిపోయింది.'' అని చెప్పుకొచ్చింది. ఒలింపిక్స్‌కు ముందు 2017లో కాంకషన్‌కు గురవడం, ఆ తర్వాత రెండుసార్లు కొవిడ్ బారిన పడి కోలుకున్న వినేశ్ తాజా వ్యాఖ్యలతో కెరీర్ ఇక ముగిసినట్టేనా అని కొంతమంది భావిస్తున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్ 53 కేజీల రెజ్లింగ్ కేటగిరిలో పోటీ పడిన ఆమె పతకం సాధిస్తుందని అంతా భావించారు. కానీ క్వార్టర్ఫైనల్లోనే ఓడిపోయి వినేశ్ ఇంటిదారి పట్టింది. -
కాంస్యాన్ని కోల్పోయిన వారికి బహుమతిగా టాటా కార్లు
తమ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత క్రీడాకారులు చరిత్రను సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పతకాల సంఖ్య పెరిగింది. నీరజ్ చోప్రా, మీరాబాయి చాను వంటి చాలా మంది అథ్లెట్లు పతకాలు సాధించగా, తమ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచి దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న వారు ఉన్నారు. అయితే, టోక్యో ఒలింపిక్స్ లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత క్రీడాకారులకు టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్కడ ఓడినా.. మా మనసు గెలుచుకున్నారు అని టాటా ప్రకటించింది. భారతీయ ఒలింపియన్స్ ను సత్కరించిన రెండవ భారతీయ కార్ల కంపెనీగా టాటా మోటార్స్ నిలిచింది. ఇంతకు ముందు ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు ఎక్స్‌యూవీ 700 ఎడిషన్ కారును మహీంద్రా కంపెనీ బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "ఒలింపిక్స్ అంటే కేవలం పతకాలు మాత్రమే కాదు, మన దేశానికి ఈసారి ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లు ఒలింపిక్స్ లో కనబరిచిన కృషిని, స్ఫూర్తిని చూసి మేము సంతోషిస్తున్నాము. ఒత్తిడిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కూడా వారు పతకాన్ని కోల్పోయి ఉండవచ్చు.. కానీ వారు తమ అంకితభావంతో లక్షలాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. ఇది భారతదేశంలో రాబోయే వర్ధమాన క్రీడాకారులకు వారు నిజమైన స్ఫూర్తి” అని అన్నారు. As a gesture of gratitude, Tata Motors is happy to deliver ALTROZ - #TheGoldStandard to all the Indian athletes who narrowly missed the bronze at #TokyoOlympics. They may not have claimed a medal, but won millions of hearts and inspired billions to set #TheGoldStandard. pic.twitter.com/SlZazXG6HK — Tata Motors Cars (@TataMotors_Cars) August 13, 2021 -
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన పీవీ సింధు, రజనీ
-
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన పీవీ సింధు, రజనీ
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన పీవీ సింధు, రజనీ, సాయిరాజ్‌లు శుక్రవారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ సింధు, రజనీ, సాయిరాజ్‌లను ఘనంగా సన్మానించారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన మహిళగా రికార్డు సాధించింది. ఇక భారత మహిళల హాకీ జట్టులో రజనీ గోల్ కీపర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 41 ఏళ్ల తర్వాత సెమీస్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. -
ఓవరాక్షన్లో మెడల్‌ను గట్టిగా కొరికేశాడు, ఆపై..
సాధారణంగా ఒలింపిక్స్ మెడల్స్ సాధించి.. ఫొటోగ్రాఫర్ల ఫోజుల కోసం పంటిగాట్లు పెట్టినట్లు అథ్లెట్లు నటించడం చూస్తున్నదే. కానీ, ఓ మేయర్ అతి వల్ల జపాన్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. అథ్లెట్ నుంచి మెడల్ అందుకుని.. కసితీరా పంటితో గాట్లు పెట్టాడు ఆయన. ఈ చర్యకతో ఆయనకి వ్యతిరేకంగా ఏడు వేల ఫిర్యాదులు రావడం విశేషం. సాఫ్ట్ బాల్ ప్లేయర్ మియూ గోటో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. సంబురాల్లో భాగంగా సొంత వూరు జపాన్ సెంట్రల్ సిటీ నయోగాలో జరిగిన ఓ ఈవెంట్‌కి ఆమె హాజరైంది. అక్కడే ఆ నగర మేయర్ టకాషి కవామురా అత్యుత్సహం ప్రదర్శించాడు. ఆమె నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకుని మెడలో వేసుకున్న కవామురా.. తన ముఖానికి ఉన్న మాస్క్ కిందకి లాగేసి మరీ ఆ గోల్డ్ మెడల్‌ను గట్టిగా కొరికేశాడు. మెడల్‌పై పంటిగాట్లు బలంగా పడ్డాయి. ఈవెంట్ తర్వాత ఆ డ్యామేజ్ చూసి ఆందోళన చెందిన మియూ వెంటనే టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకుల్ని సంప్రదించింది. చదవండి: గ్రేటెస్ట్ జాబితాలో బల్లెం వీరుడి ప్రదర్శన ఇక టోక్యో నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆ మెడల్‌ను మార్చేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మార్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ మెడల్ మార్పిడికి అయ్యే ఖర్చును ఐవోసీనే భరించబోతోంది. మరోవైపు కరోనా టైంలో మాస్క్ తీసేసి నిర్లక్క్ష్యంగా వ్యవహరించడం, పైగా ఆమె విజయాన్ని అగౌరవపర్చడం తీవ్ర నేరాలంటూ మేయర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెతున్నాయి. ఈ తరుణంలో తన స్థాయిని మరిచి ప్రవర్తించిన తీరుకు టకాషి కవామురా క్షమాపణలు తెలియజేశాడు. ఆమెకు కృతజ్ఞతలు ఒక టోక్యో ఒలింపిక్స్ వేదికగా మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జమైకా హర్డ్లింగ్ అథ్లెట్ హన్స్లే పర్చమెంట్ 110 మీటర్ల రేసులో స్వర్ణం సాధించాడు. అయితే రేసుకి ముందు పొరపాటున వేరే వేదిక దగ్గరికి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న వలంటీర్ ఒకామె.. జరిగిన పొరపాటును గుర్తించి సరైన వేదిక దగ్గరికి వెళ్లడం కోసం హన్స్లేకి డబ్బులిచ్చి మరీ సాయం చేసింది. View this post on Instagram A post shared by Hansle Parchment, OLY (@parchment_hansle) దీంతో డిస్క్వాలిఫైయింగ్ను తప్పించుకుని అతను అర్హత సాధించడం, ఆపై ఫైనల్ రేసులో గోల్డ్ సాధించాడు. ఇక తన విజయానికి మూల కారణమైన ఆ వలంటీర్‌ను వెతుక్కుంటూ వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలియజేశాడు ఈ జమైకన్ అథ్లెట్. -
ఇక పద... పారాలింపిక్స్‌కు!
న్యూఢిల్లీ: నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్‌ను చిరస్మరణీయం చేసుకున్న భారత్ అదే వేదికపై మళ్లీ పతకాల వేటకు వెళ్లింది. పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు 54 మంది సభ్యులతో కూడిన భారత జట్టు గురువారం అక్కడికి బయల్దేరింది. టోక్యోలోనే ఈ నెల 24 నుంచి దివ్యాంగ విశ్వక్రీడలు జరుగనున్నాయి. భారత ఆటగాళ్లు పోటీ పడే ఈవెంట్లు 27న మొదలవుతాయి. ముందుగా ఆర్చరీ పోటీలు జరుగుతాయి. పారాలింపిక్ చాంపియన్లు దేవేంద్ర జఝారియా (ఎఫ్–46 జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (టి–63 హైజంప్), ప్రపంచ చాంపియన్ సందీప్ చౌదరి (ఎఫ్–64 జావెలిన్ త్రో) ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. దేవేంద్ర మూడో స్వర్ణంపై కన్నేశాడు. తను ఇదివరకే ఏథెన్స్(2004), రియో (2016) పారాలింపిక్స్‌లో బంగారు పతకాలు నెగ్గాడు. గత పారాలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం గెలుపొందింది. మన జట్టు దిగ్విజయంగా పతకాలతో తిరిగి రావాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, భారత పారాలింపిక్ సంఘం అధికారులు గురువారం జరిగిన ‘వర్చువల్ సెండాఫ్’ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగనంపారు. -
లవ్లీనాకు భారీ ప్రోత్సాహకాలు: డీఎస్పీ ఉద్యోగం.. రూ. కోటి నజరానా
డిస్పూర్: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్‌కు అసోం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహాకాలు ప్రకటించింది. లవ్లీనాకు డీఎస్పీ ఉద్యోగం ఆఫర్ చేయడంతో పాటు కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన లవ్లీనాకు గురువారం గౌహతిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం బాక్సర్ లవ్లీనాను రాష్ట్ర పోలీసుశాఖలో డీఎస్పీగా చేరమని అభ్యర్థించారు. అంతేకాక ఆమెకు కోటి రూపాయల నజరాన ప్రకటించారు. అలానే లవ్లీనా కోచ్‌కు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది అసోం ప్రభుత్వం. అలానే అసోంలోని గోలాఘాట్ జిల్లాలోని సౌపాతర్‌లో లవ్లీనా బోర్గోహెయిన్ పేరు మీద రూ. 25 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు హిమంత శర్మ తెలిపారు. సన్మాన కార్యక్రమం సందర్భంగా హిమంత బిస్వా శర్మ స్వయంగా గౌహతి విమాన్రాశయం చేరుకుని లవ్లీనాకు స్వాగతం పలికారు. అనంతరం బాక్సర్ భారీ కటౌట్లతో అలంకరించిన బస్సులో లవ్లీనాను ఎక్కించుకుని సిటీ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో లవ్లీనాకు సన్మానం జరిగింది. సాయంత్రం లవ్లీనా.. గవర్నర్ జగదీష్ ముఖిని కూడా కలిసే అవకాశం ఉంది. -
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన.. క్రికెట్‌పై ఎఫెక్ట్?
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ అనంతరం భారతీయ కుటుంసభ్యుల ఆలోచనల్లో మార్పులు వచ్చాయంటోంది కమ్యూనిటీ ప్లాట్‌ఫాం ‘లోకల్ సర్కిల్స్’ సర్వే. అధిక శాతం కుటుంబసభ్యులు తమ పిల్లలు, మనుమలు మనవరాళ్లు ఎవరైనా క్రికెట్ కాకుండా ఇతర క్రీడను కెరియర్‌గా ఎంచు కొంటే మద్దతిచ్చి ప్రోత్సహిస్తామని స్పష్టం చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 18 వేల మందితో ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే. నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోలో స్వర్ణం), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం), హాకీ తదితర క్రీడల్లో భారతీయ క్రీడాకారుల రాణించిన నేపథ్యంలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న కోణంలో సర్వే నిర్వహించింది. 71 శాతం కుటుంబ సభ్యులు క్రికెట్ కాకుండా ఇతర క్రీడల్లో పిల్లలకు మద్దతిస్తా మని పేర్కొన్నారు. దేశంలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబసభ్యులు క్రికెట్ కాకుండా మరో క్రీడ వల్ల ఆర్థికాభివృద్ధి ఉండదని, స్థిరమైన ఆదాయం ఉండదని భావిస్తారని... అయితే ఒలింపిక్స్ అనంతర సర్వేలో క్రికెట్‌యేతర క్రీడలకు మద్దతు ఉందని తేలిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒలింపిక్స్ సమయంలోనే సర్వే నిర్వహించగా.. భారతీయ క్రీడాకారులు పాల్గొన్న క్రీడలను వీక్షించారా అన్న ప్రశ్నకు 51 శాతం అవునని, 47 శాతం మంది కాదని, రెండు శాతం ఎలాంటి అభిప్రాయం చెప్పలేదని సర్వే తెలిపింది. 51 శాతం మందిలో కుటుంబంలో ఎవరో ఒకరు ఒలింపిక్స్ వీక్షించారని తెలిపింది. 2016 ఒలింపిక్స్ సమయంలో 20 శాతం మందే భారతీయ క్రీడాకారుల పాటవాలను వీక్షించామని చెప్పగా తాజా సర్వేలో రెట్టింపునకు పైగా వీక్షించామని చెప్పడాన్ని బట్టి గణనీయమై స్థాయిలో మార్పులు వస్తున్నట్లుగా సర్వే అభివర్ణించింది. చిన్నారులు క్రికెట్ కాకుండా వేరే క్రీడను కెరియర్‌గా ఎంచుకుంటే మీ వైఖరి ఏంటి అని ప్రశ్నించగా.. 71 శాతం ప్రోత్సహిస్తామని చెప్పగా 19 శాతం మంది క్రికెట్‌కే ఓటు వేశారని, పది శాతం మంది ఎలాంటి అభిప్రాయం వెలుబుచ్చలేదని తెలిపింది. దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 18వేల మంది కుటుంబసభ్యులు సర్వేలో పాల్గొన్నట్లు ‘లోకల్ సర్కిల్స్’ తెలిపింది. వీరిలో 9,256 మంది ఒలింపిక్స్ వీక్షించామని చెప్పారని తెలిపింది. 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు పాల్గొన్నారని, టైర్–1 జిల్లాల నుంచి 42 శాతం, టైర్–2 నుంచి 29 శాతం, గ్రామీణ ప్రాంతాల నుంచి 29 శాతం మంది పాల్గొన్నారని లోకల్ సర్కిల్స్ వివరించింది. -
టాప్–10లో నీరజ్ పసిడి ప్రదర్శన
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో కనబరిచిన స్వర్ణ పతక ప్రదర్శన మరో స్థాయికి చేరింది. టోక్యో ఒలింపిక్స్‌లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో పది అద్భుత ఘట్టాల్లో అతని ప్రదర్శనకు స్థానం లభించిందని ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) వెల్లడించింది. 23 ఏళ్ల చోప్రా ఫైనల్లో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర పుటలకెక్కాడు. ‘ఒలింపిక్స్‌కు ముందు నీరజ్ చోప్రా ప్రతిభ గురించి చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. విశ్వక్రీడల్లో బంగారు విజేతగా చరిత్ర సృష్టించాక అతని ప్రొఫైల్ ఆకాశాన్ని తాకింది. అంతలా అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు’ అని ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) తమ వెబ్సైట్లో పేర్కొంది. విజయం తర్వాత నీరజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘ఈ అనుభూతి అద్భుతమైంది. ఈ క్షణం నాతో చిరకాలం ఉండిపోతుంది. దేశానికి స్వర్ణం అందించేందుకు నాకు మద్దతు తెలిపినవారికి, ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశాడు. ఇది లక్షల మందిని చేరుకుంది. ఒలింపిక్స్‌కు ముందు అతని ఇన్‌స్టాగ్రామ్‌లో 1,43,000 మంది ఫాలోవర్లు ఉండగా... ఒలింపిక్ చాంపియన్ అయ్యాక, ఆ పోస్ట్ పెట్టాక ఏకంగా 32 లక్షల మంది ఫాలోవర్లు జమ అయ్యారని డబ్ల్యూఏ తెలిపింది. రెండో ర్యాంక్‌కు నీరజ్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మరో ఘనత సాధించారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు ప్రపంచంలోనే రెండో ర్యాంకును చేరుకున్నారు. 1,315 స్కోరుతో నీరజ్ చోప్రా రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. కాగా 1,396 స్కోరుతో జర్మనీ ఆటగాడు జొహెనెస్ వెటెర్ అగ్రస్థానంలో నిలిచాడు. గత ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో నిలిచిన నీరజ్ బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 2వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. -
తల్లి మెడలో కాంస్య పతకం.. ఒడిలో హాయిగా నిద్రపోయాడు
జలంధర్: టీమిండియా పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ చేసిన పని సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒలింపిక్స్ నుంచి ఇటీవలే తన ఇంటికి చేరుకున్న మన్‌ప్రీత్ కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపాడు. ఒలింపిక్స్‌లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లికి చూపించి మురిసిపోయాడు. ఆ తర్వాత తన తల్లి మెడలో ఆ పతకాన్ని వేసి.. ఒడిలో హాయిగా నిద్రపోతున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది. పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ లీగ్‌లో ఆస్ట్రేలియా మినహా మిగతా జట్లపై మంచి విజయాలను నమోదు చేసింది. ఇక సెమీస్‌లో బెల్జియం చేతిలో ఓడినప్పటికి.. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అద్భుతంగా ఆడిన మెన్స్ టీమ్ 5-4 తేడాతో విజయం సాధించి 41 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించింది. ఈ విజయంలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ కీలకం.. ఒత్తిడి సమయాల్లో జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. కాగా ఇటీవలే టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్న పురుషుల హాకీ జట్టు సభ్యులకు ఘన స్వాగతం లభించింది. View this post on Instagram A post shared by Manpreet Singh (@manpreetsingh07) -
లిటిల్ మాస్టర్ తో వెయిట్ లిఫ్టర్
-
'సచిన్ సార్‌ను కలిశాను.. చాలా హ్యాపీగా ఉంది'
ముంబై: టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిసింది. ముంబైలోని ఆయన ఇంటికి వెళ్లి కొద్దిసేపు మాట్లాడింది. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ విశేషాలను గురించి సచిన్ ఆమెను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిచారు. అనంతరం సచిన్‌ను కలిసిన ఫోటోలను ట్విట్టర్లో మీరాబాయి చాను షేర్ చేసుకుంది. ''సచిన్ సార్‌ని ఉదయం కలిశాను. నన్ను ప్రోత్సహిస్తూ ఆయన మాట్లాడిన మాటలను ఎప్పటికి మరిచిపోలేను. నిజంగా ఎంతో స్ఫూర్తి పొందాను.. చాలా హ్యాపీగా ఉంది'' అంటూ ట్వీట్ చేసింది. కాగా మీరాబాయి చేసిన ట్వీట్‌పై సచిన్ కూడా రిప్లై ఇచ్చాడు. మీరాబాయిని కలవడం నాకు సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌లో రజతం తెచ్చినందుకు ఎంతో గర్విస్తున్నా.. మున్ముందు జరిగే క్రీడల్లో ఇలాంటి అద్భుత ప్రదర్శనలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌ను మరిపిస్తూ ఏడు పతకాలతో మురిసిన భారత్ టోక్యో ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం ఏడు పతకాలు కొల్లగొట్టింది. Loved meeting @sachin_rt Sir this morning! His words of wisdom & motivation shall always stay with me. Really inspired. pic.twitter.com/Ilidma4geY — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 11, 2021 -
ఏపీ హాకీ ప్లేయర్ రజనికి ప్రోత్సహకాలు
-
భారత హాకీ ప్లేయర్ల పై కాసుల వర్షం
-
హాకీ క్రీడాకారిణి రజనికి ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ క్రీడాకారిణి ఇ.రజనికి సీఎం వైఎస్ జగన్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ.25 లక్షల నగదుతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను రజని, ఆమె తల్లిదండ్రులు మంగళవారం కలిశారు. రజనిని సీఎం జగన్ సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. గత ప్రభుత్వంలో రజనికి ప్రకటించిన పెండింగ్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలో వెయ్యి గజాల నివాస స్థలం, నెలకు రూ.40 వేల ఇన్సెంటివ్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. (చదవండి: దివ్యాంగుల జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన వైఎస్సార్ జిల్లా కుర్రాడు) రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీ ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీని తీసుకురానున్నట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) తెలిపారు. పాఠశాల దశ నుంచే ఒత్తిడి లేని విద్యనందిస్తూ క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. హాకీ క్రీడాకారిణి ఇ.రజినిని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒలింపిక్స్ హాకీ జట్టులో దక్షిణ భారతదేశం నుంచి పొల్గొన్న ఏకైక క్రీడాకారిణి రజని అని కొనియాడారు. రజనికి సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన ప్రోత్సాహకాలతోపాటు గత ప్రభుత్వాలు ప్రకటించి విస్మరించిన రూ.67.50 లక్షల నగదు ప్రోత్సాహకాలను సైతం విడుదల చేయనున్నట్టు చెప్పారు. క్రీడాకారిణి రజిని మాట్లాడుతూ.. 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుందన్నారు. తమ జట్టు పతకానికి కేవలం ఒక అడుగు దూరంలోనే నిలిచిందని, త్వరలో జరగబోయే ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాని చెప్పారు. హాకీలో మరింతగా రాణించేందుకు ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ్, శాప్ ఎండీ ఎన్.ప్రభాకర్‌రెడ్డి, రజని తల్లిదండ్రులు పాల్గొన్నారు. 110 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 6 పతకాలు రజని స్వగ్రామం చిత్తూరు జిల్లా యనమలవారిపల్లె. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్ హాకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో రియో ఒలింపిక్స్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్–2020లో కూడా ఆమె పాల్గొన్నారు. 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లు ఆడి సత్తా చాటుకున్నారు. 2010 ఏషియన్ చాంపియన్ ట్రోఫీలో కాంస్యం, 2013 మలేషియాలో జరిగిన ఆసియా కప్‌లో కాంస్యం, అదే ఏడాది జపాన్‌లో జరిగిన ఏషియన్ చాంపియన్ ట్రోఫీలో రజతం, 2016 సింగపూర్‌లో జరిగిన ఏషియన్ చాంపియన్ ట్రోఫీ, 2017 జపాన్‌లో జరిగిన ఆసియా కప్‌లో బంగారు పతకాలు, 2018 జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో రజత పతకాలు సాధించింది. -
ఒలింపిక్స్ విజేతల సందడి: వందనా కటారియా భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చూపించిన సొంతగడ్డపై అడుగిడిన క్రీడాకారులను ఘన స్వాగతం లభించింది. నగదు పురస్కారాలు, సత్కారాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి గౌరవించాయి. ముఖ్యంగా ఒడిశా ముఖ్యమంత్ర నవీన్ పట్నాయక్ రాష్ట్రానికి చెందిన పురుషులు, మహిళా హాకీ క్రీడాకారులను సన్మానించారు. బీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌కు 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని, అలాగే దీప్ గ్రేస్ ఎక్కా నమితా టోపోలకు ఒక్కొక్కరికి రూ .50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. మరోవైపు టోక్యో 2020 లో పాల్గొన్న మహిళల హాకీ జట్టు సభ్యులు సలీమా టేట్, నిక్కీ ప్రధాన్ తమ సొంత రాష్ట్రానికి చేరుకున్న రాంచీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన పురుషులు మహిళల హాకీ క్రీడాకారుల లుకూడాఅమృత్సర్ చేరుకున్నారు. కామన్వెల్త్ ఆసియన్ గేమ్స్ వచ్చే నెల నుండి శిక్షణను ప్రారంభిస్తామని, హాకీ జట్టు ఆటగాడు గుర్జంత్ సింగ్ వెల్లడించారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్‌కు వందన కటారియాకు డెహ్రాడూన్ విమానాశ్రయంలోనూ, గ్రామంలోనూ వాయిద్యాలతో గ్రామస్తులు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల తండ్రిని కోల్పోయిన వందనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంటికి చేరినపుడు తనను తాను ఎలా నిభాయించుకోవాలో అర్థంకాలేదని పేర్కొన్నారు. అటు ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న మీరా బాయి చాను టెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిసారు. Amid 'dhols', Indian Women Hockey team's Vandana Katariya receives a warm welcome at Dehradun Airport, Uttarakhand. "We were broken after losing the bronze medal match, didn't win a medal but have won hearts. The team performed well at #Tokyo2020, " she says pic.twitter.com/VEa5jv8mLs — ANI (@ANI) August 11, 2021 Odisha CM Naveen Patnaik felicitated Men and Women hockey players from the state- Deep Grace Ekka, Namita Toppo, Birendra Lakra and Amit Rohidas for their performance at #Tokyo2020; handed over a cash award of Rs 2.5 crores to Birendra Lakra & Amit Rohidas. pic.twitter.com/Wt6ks6gYsC — ANI (@ANI) August 11, 2021 Family members of Indian men and women hockey players from Punjab receive them at Amritsar "We'll start training from next month. We have a busy year ahead due to Commonwealth & Asian Games. Confidence of team is high," says men's hockey team player Gurjant Singh pic.twitter.com/CpZDqXmSPr — ANI (@ANI) August 11, 2021 -
మీ పేరు నీరజ్ లేక వందన అయితే మీకు 'ఆ రైడ్' ఫ్రీ
హరిద్వార్: మీ పేరు నీరజ్ లేదా వందన అయితే, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉచిత రోప్‌వే రైడ్ పొందండంటూ ఉషా బ్రెకో లిమిటెడ్ రోప్‌వే కంపెనీ ప్రకటించింది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, భారత మహిళా హాకీ ప్లేయర్ వందన కటారియాలను గౌరవిస్తూ సదరు రోప్‌వే కంపెనీ ఆగస్టు 11 నుంచి 20 వతేదీ వరకు అక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఉచిత రైడ్లను ప్రకటించింది. ఉషా బ్రెకో లిమిటెడ్.. ‘ఉడాన్ ఖటోలా’ బ్రాండ్ పేరుతో రోప్‌వేలను నిర్వహిస్తోంది. చండీదేవి ఆలయ దర్శనం కోసం వచ్చే నీరజ్, వందన అనే పేరుగల పర్యాటకులు రోప్‌వేను ఉచితంగా ఉపయోగించుకోగలరని హరిద్వార్ రోప్ వే కంపెనీ హెడ్ మనోజ్ దోభల్ తెలిపారు. అయితే, ఇందుకోసం వారు తమ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆగస్టు 7 న ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్గాచరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత మహిళా హాకీ ఫార్వర్డ్ వందనా కటారియా హరిద్వార్ నివాసి కావడం ఉషా బ్రెకో లిమిటెడ్ రోప్‌వే కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. వందనా కటారియాను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించింది. -
స్టార్లుగా ఊహించుకుంటున్నారు: సోనం మాలిక్‌కు నోటీసు
న్యూఢిల్లీ: తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన మరో మహిళా రెజ్లర్ సోనమ్ మాలిక్ టోక్యో బయల్దేరడానికి ముందు పాస్‌పోర్ట్‌ను డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయంలో తీసుకోవాలని అధికారులు చెప్పారు. ఆమె మాత్రం తన పాస్‌పోర్ట్‌ను తీసుకొని రావాలని ఏకంగా భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులను ఆజ్ఞాపించింది. రెజ్లర్ల క్రమశిక్షణా రాహిత్యం ఆ నోటా ఈ నోటా భారత ఒలింపిక్ సంఘానికి (ఐఓఏ) తెలిసింది. రెజ్లర్లు ప్రవర్తన నియమావళిని అతిక్రమించడం ఏమాత్రం రుచించని ఐఓఏ... ‘మీ క్రీడాకారుల్ని మీరు నియంత్రించలేరా’ అని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను తలంటింది. ఈ క్రమంలో సోనమ్ మాలిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘కెరీర్ మొదట్లోనే వీళ్లు తమను తాము స్టార్లుగా ఊహించుకుంటున్నారు. అందుకే విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఇదే మాత్రం క్షమించరానిది’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఈ సందర్భంగా చెప్పారు. ఇక టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో వ్యవహరించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. టోక్యో ఒలింపిక్స్‌లో జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ సలహాలు తీసుకునేందుకు నిరాకరించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రాపై భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చదవండి: Neeraj Chopra: గర్ల్‌ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ -
గర్ల్‌ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఒలింపిక్ టైటిల్‌తో మహిళా అభిమానులు కూడా జతయ్యారు. కానీ నాకైతే గర్ల్‌ఫ్రెండే ఇప్పటివరకు లేదు. భవిష్యత్తులో నన్ను ప్రేమించే నెచ్చెలి ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఇప్పుడు నేను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టాను. ఈవెంట్లు, ప్రదర్శన, పతకాలు ఇవే నా ముందున్నవి. మిగతావన్నీ ఆ తర్వాతే! తదుపరి జరి గే పోటీలు, సన్నాహక శిబిరాలపైనే ఎక్కువగా ఆలోచిస్తాను. నాకు పానీ పూరిలంటే ఇష్టం. కానీ టోక్యోలో ఈవెంట్ కోసం వాటి ని తినలేదు. కడుపు నొప్పి, ఇతరత్రా ఆరోగ్య సమస్యల రిస్క్ ఎందు కని వాటికి దూరంగా ఉన్నాను’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా మంగళవారం స్వదేశం చేరుకున్నాడు. ఈ సందర్భంగా నీరజ్‌ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఘనంగా సన్మానించింది. నీరజ్ నెగ్గిన స్వర్ణ పతకంతో తల్లిదండ్రులు సతీశ్, సరోజ్ దేవి, చిన్నాన్న భీమ్ చోప్రా ఈ సన్మాన కార్యక్రమంలో నీరజ్ తల్లిదండ్రులు సరోజ్ దేవి–సతీశ్, చిన్నాన్న భీమ్ చోప్రా పాల్గొన్నారు. ఇక దేశంలో జావెలిన్ త్రోకు ప్రాచుర్యం తెచ్చేందుకు ఏఎఫ్ఐ కీలక నిర్ణయం తీసుకుంది. నీరజ్ బంగారు పతకంతో మెరిసిన ఆగస్టు 7వ తేదీని ‘జాతీయ జావెలిన్ డే’గా నిర్వహిస్తామని ప్రకటించింది. -
నీరజ్ చోప్రా ‘టోక్యో’ ఘనతకు గుర్తింపు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారంతో చరిత్ర సృష్టించిన రోజు ఇక ప్రతి యేటా పండగ కానుంది. వేడుకగా జరగనుంది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఆగస్టు 7వ తేదీని ‘జాతీయ జావెలిన్ డే’గా నిర్వహిస్తామని ప్రకటించింది. 23 ఏళ్ల నీరజ్ ఈ నెల 7న టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో మెరిసి అథ్లెటిక్స్ పసిడి కలను నిజం చేశాడు. విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. స్వదేశం చేరిన నీరజ్‌ను ఏఎఫ్ఐ మంగళవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఏఎఫ్ఐ ప్రణాళిక సంఘం చైర్మన్ లలిత్ భానోత్ ‘దేశంలో జావెలిన్ త్రోకు ప్రాచుర్యం తెచ్చేందుకు, ఈ క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు ఇకపై ఆగస్టు 7వ తేదీని జాతీయ జావెలిన్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇందులో భాగంగా యేటా ఆ రోజు రాష్ట్ర సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తాం. వేడుకగా బహుమతుల ప్రదానోత్సవం జరుపుతాం’ అని తెలిపారు. నీరజ్ చోప్రా మాట్లాడుతూ ‘నాకు చాలా గర్వంగా ఉంది. నా స్వర్ణ విజయాన్ని చిరస్మరణీయంగా మారుస్తున్నందుకు సంతోషంగా ఉంది. అథ్లెటిక్స్ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఎంతో మందికి ఇది ప్రేరణ అవుతుంది’ అని అన్నారు. నా లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్... ఒలింపిక్ స్వర్ణ పతకంతో తన ప్రయాణం ఆగిపోదని భవిష్యత్‌లో జరిగే అన్ని మెగా ఈవెంట్స్‌లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతానని నీరజ్ వ్యాఖ్యానించాడు. ‘నేను ఇదివరకే 2018 ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకాలు గెలిచాను. ఇప్పుడు ఒలింపిక్ స్వర్ణం సాధించాను. ఇక నా లక్ష్యం వచ్చే ఏడాది అమెరికాలో జరిగే ప్రపంచ చాంపియషిప్ టైటిల్. ఇది కూడా పెద్ద ఈవెంట్. చెప్పాలంటే ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని మెగా ఈవెంట్. ఒక్క ఒలింపిక్ స్వర్ణంతోనే ఆగిపోను. ఇంకా మెరుగయ్యే ందుకు కష్టపడతాను. తదుపరి ఆసియా, కామన్వెల్త్ గేమ్స్, ఒలిం పిక్స్ పతకాలు నెగ్గేందుకు కృషి చేస్తాను’ అని నీరజ్ అన్నాడు. నీరజ్ నెగ్గిన స్వర్ణ పతకంతో తల్లిదండ్రులు సతీశ్, సరోజ్ దేవి, చిన్నాన్న భీమ్ చోప్రా మాజీ లాంగ్‌జంపర్, ప్రస్తుత ఏఎఫ్ఐ ఉపాధ్యక్షురాలైన అంజూ బాబీ జార్జ్ మాట్లాడుతూ ‘నీరజ్ స్వర్ణం తెచ్చిన రోజు భారత అథ్లెటిక్స్ చరిత్రలో కలకాలం నిలిచిపోయే రోజు. అథ్లెటిక్స్‌లో ఇంతకు మించిన ఘనత ఇంకోటి లేనే లేదు. యువతకు అతనే స్ఫూర్తి’ అని కొనియాడింది. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం శనివారం నిర్వహించే కార్యక్రమంలో నీరజ్ చోప్రాకు రూ. 2 కోట్ల 51 లక్షలు... కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టులో సభ్యులుగా ఉన్న 8 మంది తమ రాష్ట్ర ఆటగాళ్లకు రూ. 2 కోట్ల 51 లక్షల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వనుంది. -
వినేశ్ ఫొగాట్ సస్పెండ్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో వ్యవహరించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే సంజాయిషీ కోరుతూ ఆమెతో పాటు మరో రెజ్లర్ సోనమ్ మాలిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టోక్యో విశ్వక్రీడల్లో వినేశ్ క్వార్టర్ ఫైనల్లో ఓడింది. హంగేరి శిక్షణకు వెళ్లిన ఆమె అక్కడి నుంచే నేరుగా టోక్యోకు వచ్చింది. కానీ భారత జట్టు క్రీడాకారులు బస చేసిన క్రీడా గ్రామంలో ఉండకుండా వెలుపల తన హంగేరి కోచ్, సహాయకులతో బస చేసింది. భారత ఇతర మహిళా రెజ్లర్లు సోనమ్, సీమా, అన్షు భారత్ నుంచి టోక్యోకు రావడంతో వారి నుంచి తనకు కరోనా సోకే ప్రమాదం ఉండవచ్చని భావిస్తూ వినేశ్ వారితో కలిసి ఉండేందుకు, కలిసి ప్రాక్టీస్ చేసేందుకు నిరాకరించింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ బౌట్లలో టీమిండియా అధికారిక ‘శివ్ నరేశ్’ టీమ్ జెర్సీలను కాదని వినేశ్ నైకీ జెర్సీలను ధరించి బరిలోకి దిగింది. ఆమె విపరీత పోకడ, క్రమశిక్షణ రాహిత్యం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఆగ్రహం తెప్పించింది. దీంతో కఠిన చర్యలు చేపట్టింది. ‘ఫొగాట్ తన ప్రవర్తనతో తీవ్రస్థాయిలో క్రమశిక్షణను ఉల్లంఘించింది. అందుకే తాత్కాలిక నిషేధం విధించాం. ఇపుడామె ఎలాంటి రెజ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీల్లేదు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసు కూడా పంపాం. సంజాయిషీ ఇచ్చేందుకు ఈ నెల 16లోగా గడువిచ్చాం’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఒకరు వెల్లడించారు. -
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలికిన పోలీసులు పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి దేశానికి వన్నె తెచ్చిన పీవీ సింధును సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పీవీ సింధు తండ్రి పీవీ రమణతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు. -
స్వప్న లోకంలో విహరిస్తున్నా అనుకున్నా: నీరజ్ చోప్రా
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకుని భారత్ అథ్లెట్స్‌లో వందేళ్ల కల సాకారం చేయడమే కాదు, అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన జావెలిన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా(23) ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బంగారు పతకం సాధించడం ఇంకా కలగానే ఉంది. ఏదో స్పప్నలోకంలో విహరిస్తున్న అనుభవం కలిగిందంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్‌లో బంగారు పతకంతో హీరోగా నిలిచిన నీరజ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్‌లో మంగళవారం మాట్లాడాడు. పతకాన్ని సాధించడం ప్రతీ అథ్లెట్ కల..అందులోనూ ఒలింపిక్ స్వర్ణం గెలవడం అంటే మామూలు విషయం కాదని నీరజ్ పేర్కొన్నాడు. అందుకే తాను బంగారు పతకాన్ని సాధించాను అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను, కలగా ఉంది. దేశం కోసం గొప్ప పని చేశానని ఇండియాలో అడుగుపెట్టినపుడు, ఎయిర్‌పోర్ట్‌లో కోలాహలం చూసినపుడు మాత్రమే అర్థమైందన్నారు. భారత అథ్లెట్లలో ఆలోచన ఈసారి చాలా భిన్నంగా ఉందనీ, కేవలం పాల్గొనడంతోనే సరిపెట్టకుండా, అందరూ పతకం కోసం పోటీ పడ్డారని వ్యాఖ్యానించాడు. (Naresh Tumda: రోజుకూలీగా మారిన క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్) గత వారం టోక్యోలో 87.58 మీటరలు విసిరి పురుషుల ఫైనల్లో సంచలనాత్మక విజయాన్ని సాధించాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత గడ్డ మీద అడుగుపెట్టిన నీరజ్ చోప్రాతోపాటు అథ్లెట్లు, ఇతర పతక విజేతలకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 87.58 మీటర్లు విసిరి తన ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి భారతదేశానికి అథ్లెటిక్స్‌లో చారిత్రాత్మక మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. చదవండి : షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్ -
విదేశీ కోచ్‌ల సత్తా! ఒక్కొక్కరి జీతాలు ఎంతంటే..
స్వదేశీ కోచ్‌లు ఎక్కడ? అనే విమర్శలను కాసేపు పక్కనపెడితే.. ఫారిన్ కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్లు ఈ దఫా ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యను పెంచడంలో భారత్‌కు వెన్నెముకగా నిలిచారు. నీరజ్ కోసం జర్మనీ ఉవీ హోన్, పురుషుల హాకీ కోసం ఆసీస్ గ్రాహం రెయిడ్, లవ్లీనా-మహిళా బాక్సింగ్ టీం కోసం ఇటలీ రఫలే బెర్గామాస్కో, భజరంగ్ పూనియా కోసం షాకో బెంటిండిస్, పీవీ సింధు కోసం దక్షిణకొరియా పార్క్, సెమీస్ దాకా చేరిన మహిళా హాకీ టీం కోసం నెదర్లాండ్స్ జోయర్డ్ మరీన్.. ఇలా అంతా విదేశీ కోచ్‌ల హవానే ఈసారి కనిపించింది. భారత అథ్లెట్లు-ప్లేయర్లు నీరజ్ చోప్రా, పీవీ సింధు, లవ్లీనా, మీరాబాయ్ ఛాను, రవి దహియా, భజరంగ్ పూనియా, మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల హాకీ టీం-రాణి రాంపాల్ నేతృత్వంలోని మహిళా హాకీ టీం.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో ప్రముఖంగా నిలిచిన వీళ్లందరికీ ఉన్న ఒకే కామన్ పాయింట్.. అంతా విదేశీ కోచ్‌ల ఆధ్వర్యంలో సత్తా చాటినవాళ్లే. అవును.. వీళ్ల ఘనత వల్ల స్వదేశీ కోచ్‌ల ప్లేసుల్లో ఈసారి విదేశీ కోచ్‌ల పేర్లు ఎక్కువగా తెరపై వినిపించి.. కనిపించాయి. పతకాల మేజర్ సక్సెస్ రేటు పరదేశీ కోచ్‌లదే అయినా.. స్వదేశీ కోచ్‌లకు స్థానం దక్కకపోవడంపై కొంత విమర్శలు వినిపించాయి. వీళ్లే టా(తో)ప్ విదేశీ కోచ్‌ల్లో ఎక్కువ జీతం అందుకుంది ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం, భారత పురుషుల హాకీ జట్టు కోచ్ గ్రాహం రెయిడ్. నెలకు పదిహేను వేల డాలర్ల జీతం(పదకొండు లక్షలకుపైనే) అందుకున్నాడాయన. ఆ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్ హాకీ లెజెండ్ జోయర్డ్ మరీన్ నెలకు పదివేల డాలర్లు(ఏడున్నర లక్షల రూపాయలపైనే) అందుకున్నారు. ఇక బాక్సింగ్ డైరెక్టర్ శాంటియాగో నియేవా(అర్జెంటీనా) ఈ లిస్ట్‌లో ఎనిమిది వేల డాలర్ల(దాదాపు ఆరు లక్షల రూపాయలు)తో మూడో ప్లేస్‌లో నిలవగా, జావెలిన్ త్రో కోచ్ ఉవే హోన్ నెలకు ఎనిమిదివేల డాలర్లతో నాలుగో ప్లేస్‌లో, రైఫిల్ కోచ్‌లు ఓలెగ్ మిఖాయిలోవ్-పావెల్ స్మిర్నోవ్ (రష్యా)లు చెరో 7,500 డాలర్లు ( ఐదున్నర లక్షల రూపాయలు)లతో తర్వాతి స్థానంలో నిలిచారు. కొత్తేం కాదు విదేశీ కోచ్‌ల్ని ఆశ్రయించడం మనకేం కొత్త కాదు. అందులో ఎలాంటి దాపరికమూ లేదు. 80వ దశకం నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ విదేశాల నుంచి స్పెషలిస్టులను తెప్పించుకోవడం మొదలుపెట్టింది. సిడ్నీ ఒలింపిక్స్(2000) టైం నాటికి అది తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా హాకీ, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్ లాంటి మేజర్ ఈవెంట్లు విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో మెరుగైన ప్రదర్శనకు దారితీయడంతో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ప్రముఖంగా విదేశీ కోచ్‌లకే ఎందుకు ప్రాధాన్యం? అనే ప్రశ్నకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నుంచి వివరణ.. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడమే. శాయ్ ఎంపిక చేసే కోచ్‌లలో ఎక్కువ మంది గతంలో ఛాంపియన్లుగా ఉన్నవాళ్లో లేదంటే విజయాలను అందుకున్న అనుభవం ఉన్నవాళ్లో ఉంటారు. వాళ్లకు మన కోచ్‌లతో పోలిస్తే సైంటిఫిక్-టెక్నికల్ నాలెడ్జ్, ట్రిక్కులు- జిమ్మిక్కులు, డైట్‌కు సంబంధించిన వివరాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. అందుకే కేవలం సలహాల కోసమే ఒక్కోసారి వాళ్లను నియమించుకుంటాయి కూడా. అలాగని మన దగ్గరా సత్తా ఉన్నవాళ్లు లేరని కాదు. ‘సక్సెస్‌తో పాటు అనుభవం’ అనే పాయింట్ మీదే ఫోకస్ చేస్తూ ఫారిన్ కోచ్‌లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తోంది శాయ్. అలాగే వీళ్లకు నెలకు మినిమమ్ నెలకు నాలుగు వేల డాలర్లకు తగ్గకుండా శాలరీ ఇస్తుంటుంది. అలాగే వాళ్లతో పని కూడా అదే తీరులో చేయించుకుంటాయి మన స్పోర్ట్స్ అథారిటీలు. విదేశీకే ప్రయారిటీ టోక్యో ఒలింపిక్స్ కోసం టోక్యోకు వెళ్లిన 126 మంది అథ్లెట్ల కోసం (9 విభాగాలు) 32 మంది విదేశీ కోచ్‌లు(50 మంది స్వదేశీ కోచ్‌లను సొంత ఖర్చులతో భారత ప్రభుత్వం పంపించింది) పని చేశారు. సక్సెస్ జోరు.. ఆటగాళ్లతో ఈ కోచ్‌ల టెంపో కారణంగా మరికొంత కాలం వీళ్లనే కోచ్‌లుగా కొనసాగించాలని శాయ్ భావిస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 30, 2021 వరకు వీళ్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. పారిస్, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టకుని.. మరో నాలుగేళ్లపాటు విదేశీ కోచ్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.