ఇటీవల ముగిసిన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత అథ్లెట్లకు ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లను బహుమతిగా ఇచ్చినట్లు టాటా మోటార్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. అత్యంత కఠిన పరిస్థితులలో తృటిలో వారు పతకాన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ, వారు దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. భారత ఒలింపిక్ జట్టు దృఢత్వం, సంకల్పం వారిని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. వారు ప్రతి దశలో అంచనాలను మించి సత్తా చాటారు, చివరి శ్వాస వరకు పోరాడారు. అందుకే దేశంలోని లక్షలాది మంది హృదయాలను వారు గెలుచుకున్నారు అని టాటా పేర్కొంది.
.@imranirampal in a candid conversation with Shailesh Chandra - President, PVBU and EVBU, Tata Motors.#ALTROZForOlympians #TheGoldStandard #Altroz pic.twitter.com/GLFZFlqwPR
— Tata Motors Cars (@TataMotors_Cars) August 26, 2021
అందుకే వారిని గౌరవించడానికి టాటా మోటార్స్ 24 ఒలింపియన్లకు బహుమతిగా ఆల్ట్రోజ్ ప్రీమియం కార్లను ఇచ్చింది. కార్లను తీసుకున్నవారిలో హాకీ, కుస్తీ, బాక్సింగ్, గోల్ఫ్, డిస్కస్ త్రో వంటి వివిధ క్రీడలకు చెందినవారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి హై స్ట్రీట్ గోల్డ్ కలర్ ఆల్ట్రోజ్ కీలను ఇచ్చారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వేహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో వారు చూపించిన పూర్తి నిబద్ధతను, అజేయ స్ఫూర్తిని చూసి మేము చాలా గర్వపడుతున్నాము. ఈ రోజు వారితో అదే వేదికను పంచుకోవడం నాకు దక్కిన గౌరవం. వారి చేసిన కృషిని అంగీకరిస్తూ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ గోల్డ్ కలర్ టాటా ఆల్ట్రోజ్ కారును వారికి బహుమతిగా ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.(చదవండి: ఇక మొబైల్ ఫోన్‌లలో అదిరిపోయే గ్రాఫిక్స్!)
S.No. | Athlete Name | Sport |
1 | Neha Goyal | Hockey |
2 | Rani Rampal | Hockey |
3 | Navneet Kaur | Hockey |
4 | Udita Duhan | Hockey |
5 | Vandana Katariya | Hockey |
6 | Nisha Warsi | Hockey |
7 | Savita Punia | Hockey |
8 | Monika Malik | Hockey |
9 | Deep Grace Ekka | Hockey |
10 | Gurjit Kaur | Hockey |
11 | Navjot Kaur | Hockey |
12 | Sharmila Devi | Hockey |
13 | Lalremsiami | Hockey |
14 | Sushila Chanu | Hockey |
15 | Salima Tete | Hockey |
16 | Nikki Pradhan | Hockey |
17 | Rajani Etimarpu | Hockey |
18 | Reena Khokhar | Hockey |
19 | Namita Toppo | Hockey |
20 | Aditi Ashok | Golf |
21 | Deepak Punia | Wrestling 86 kg |
22 | Kamalpreet Kaur | Discus Throw |
23 | Satish Kumar | Boxing 91 kg |
24 | Pooja Rani | Boxing 75 kg |
Comments
Please login to add a commentAdd a comment