Tokyo 2020 Olympics
-
రవి దహియాకు అరుదైన గౌరవం
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, స్టార్ రెజ్లర్ రవి దహియాకు చక్కని గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు జరిగే క్వీన్స్ బ్యాటన్ రిలేను బుధవారం భారత్‌లో రవి ప్రారంభించాడు. తనకిది అరుదైన గౌరవమని, బర్మింగ్‌హామ్‌లో స్వర్ణం గెలిచేందుకు తీవ్రంగా చెమటోడ్చుతున్నట్లు రవి చెప్పాడు. ఈ ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగనున్నాయి. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
Bajrang Punia: కొత్త కోచ్ అన్వేషణలో బజరంగ్... అతడితో జట్టు కట్టే అవకాశం
Bajrang Punia May Tie Up With Andriy Stadnik Ahead Paris Olympics: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా 2024 పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల కోసం కొత్త కోచ్‌ను నియమించుకునే పనిలో పడ్డాడు. ఉక్రెయిన్‌కు చెందిన బీజింగ్ ఒలింపిక్స్ (2008) కాంస్య పతక విజేత అండ్రీ స్టాడ్నిక్తో అతను సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇప్పటిదాకా బజరంగ్‌కు జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్ కోచ్‌గా ఉన్నాడు. షాకో శిక్షణలో బజరంగ్ పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించాడు. కాగా జార్జియన్ కోచ్ షాకో బెంటినిడిస్ వద్ద మార్గనిర్దేశనంలో బజరంగ్టో క్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. అదే విధంగా ఏసియన్ గేమ్స్-2018లో స్వర్ణం, వరల్డ్ చాంపియన్‌షిప్-2019లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. చదవండి: Rahul Dravid: నా ఫస్ట్‌లవ్ ద్రవిడ్.. తన కోసం మళ్లీ క్రికెట్ చూస్తా: నటి MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్ సిక్సర్.. ధోని ఫొటో వైరల్ -
Neeraj Chopra: నీరజ్‌కు సీఎస్కే నజరానా.. కోటి రూపాయలతో పాటు...
CSK Felicitates Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్ నీరజ్ చోప్రాను ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. గతంలో ప్రకటించిన విధంగా రూ. 1 కోటి నగదు పురస్కారం అందజేసింది. దీనితో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన జెర్సీ నంబర్ 8758 (ఒలింపిక్స్ నీరజ్ విసిరిన 87.58 మీటర్ల దూరం)ను అందించింది. మరోవైపు మహీంద్ర సంస్థ కూడా కస్టమైజ్డ్ 87.58 చిత్రం, రిజిస్ట్రేషన్ నంబర్ 8758తో కూడిన ఎస్‌యూవీని బహుకరించింది. చదవండి: Virat kohli: అలా చేయలేకపోయాం.. అందుకే రెండింటిలో ఓడిపోయాం.. అయితే T20 World Cup 2021 Ind Vs NZ: ఏందిరా అయ్యా ఇది.. 70 బంతుల దాకా బౌండరీ కొడితే ఒట్టు! The one with the Golden boy @Neeraj_chopra1 ! Super happy to hand our 💛 to the arms that made us proud! Read : https://t.co/qiiw18aLH6#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/rMpHwWD2F7 — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 31, 2021 -
కోచ్ కావాలనే ఓడిపోమన్నాడు.. మనికా బాత్రాపై చర్యలు!
Manika Batra: టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీల్లో తనను కావాలనే ఓడిపోమన్నాడంటూ భారత కోచ్ సౌమ్యదీప్ రాయ్‌పై ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు చేసిన టీటీ ప్లేయర్ మనికా బాత్రా చిక్కులో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా ఈ వివాదంపై దృష్టి పెట్టిన అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్) విచారణ జరుపుతోంది. ఇప్పటికే దీనిపై సమావేశం నిర్వహించిన ఐటీటీఎఫ్, మనికాపై చర్యలు తీసుకోవచ్చు. చదవండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే -
Neeraj Chopra: అదే కసి.. అదే తపన.. ఫొటో వైరల్
Neeraj Chopra Photo Goes Viral: ‘‘ఇంతకు ముందున్న... అదే తపన.. అదే కసితో ఈ వారం నుంచి శిక్షణ మొదలుపెట్టేశాను. గత ఒలింపిక్ పతకం సాధించేందుకు శిక్షణ పొందిన చోటే మరోసారి శిక్షణ పొందడం మంచి విషయం! మీ సందేశాలతో నాకు మద్దతుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఉద్వేగభరిత పోస్ట్ చేశాడు. బల్లెం చేతబట్టి పట్టి ప్రాక్టీసు ప్రారంభించినట్లు వెల్లడించాడు. కాగా హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా భారత్‌కు తొలి పసిడి అందించిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా అతడు చరిత్రకెక్కాడు. ఇక ఆగష్టు 7 నాటి నీరజ్ గెలుపును కళ్లారా చూసి భారతావని గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. అయితే, నీరజ్ చోప్రా మాత్రం... విజయాన్ని ఆస్వాదిస్తూ కూర్చోకుండా వెంటనే పని ప్రారంభిస్తానన్న తన మాటలు నిజం చేస్తూ మళ్లీ బల్లెం పట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అతడిని మరోసారి అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి View this post on Instagram A post shared by Neeraj Chopra (@neeraj____chopra) -
Hima Das: స్టార్ అథ్లెట్ హిమా దాస్‌కు కరోనా...
Hima Das Tests Covid-19 Positive: భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్ బుధవారం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తొడ కండరాల గాయం కారణంగా టోక్యో ఒలిపింక్స్‌కు ఆర్హత సాధించలేకపోయిన హిమా.. ప్రస్తుతం పాటియాలాలోని నేషనల్ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతుంది. ఈ క్రమంలో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణైంది 'నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఆరోగ్యం బాగానే ఉంది. మునుపటి కంటే బలంగా తిరిగి రావడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. సురక్షితంగా ఉండండి." అని హిమదాస్ ట్వీట్ చేసింది. హిమాదాస్ 2018లో అండర్-20 ప్రపంచ చాంపియన్ షిప్లో 400 మీటర్ల ఈవెంట్లో విజయం సాధించింది. దాంతో ఈ ఈవెంట్లో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారతీయ స్ప్రింటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఈక్రమంలోనే హిమా దాస్‌ను అస్సాం ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో గౌరవించింది. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు.. -
Manpreet Singh: తండ్రి కాబోతున్న భారత జట్టు కెప్టెన్!
Indian Hockey Skipper Manpreet Singh: భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నాడు. తొలిసారి తండ్రి కాబోతున్న అనుభూతిని ఆస్వాదిస్తూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బతవుతున్నాడు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన మన్‌ప్రీత్... గర్భవతి అయిన భార్యతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. తెలుపు రంగు టీషర్టులు వేసుకుని ట్విన్నింగ్ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తున్న ఈ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మన్‌ప్రీత్ సింగ్ గతేడాది డిసెంబరులో మలేషియా దేశానికి చెందిన తన స్నేహితురాలు ఇలి నజ్వా సిద్ధిఖీని వివాహం చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో జలంధర్‌లో వీరి పెళ్లి జరిగింది. అయితే, ఆ సమయంలో కరోనా వ్యాప్తి కారణంగా విమాన రాకపోకల్లో ఆంక్షలు ఉన్న విషయం విదితమే. ఈ క్రమంలో నజ్వా ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అయితే, తమకు సమాచారం లేకుండా నజ్వా పంజాబీ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం తప్పుగానే పరిగణిస్తామని మలేసియా ఉప ప్రధాని(మత వ్యవహారాలు) మర్జుక్ అప్పట్లో పేర్కొన్నారు. ఇక ఆట విషయానికొస్తే... టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి: Viral Video: ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. స్లిప్స్‌లో ఎనిమిది మంది ఫీల్డర్లు.. తొలి బంతికే! If you don’t know, now ya know! A grand adventure is about to begin in November 💖 #babyIM #babyontheway @illisaddique pic.twitter.com/BuFxlUekUs — Manpreet Singh (@manpreetpawar07) October 1, 2021 -
సంచలన ఆరోపణలు.. ఢిల్లీ హైకోర్టులో మనిక బత్రాకు భారీ ఊరట
న్యూఢిల్లీ: భారత స్టార్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ఎంపిక నిర్ణయంపై గురువారం స్టే విధించింది. జాతీయ శిబిరంలో పాల్గొన్న వారినే ఎంపిక చేయాలనే నిబంధనకు ఈ స్టే వర్తిస్తుంది. అంటే ఇకపై అంతర్జాతీయ టోర్నీలకు ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. జాతీయ శిబిరానికి హాజరు, గైర్హాజరుతో సంబంధం ఉండదు. అలాగే మనిక చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కూడా కోర్టు కేంద్ర క్రీడాశాఖను ఆదేశించింది. కాగా ఒలింపిక్ క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా సుతీర్థ ముఖర్జీ కోసం జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ తనను ఓడిపోవాలని సూచించారని మనిక ఆరోపించింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. దీనిపై గురువారం విచారించిన జస్టిస్ రేఖ పల్లి టీటీఎఫ్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన సమాఖ్యకు నోటీసు జారీ చేయాల్సిందిగా ఆర్డర్ పాస్ చేస్తానని అన్నారు. ఓ మేటి క్రీడాకారిణి ఆరోపణలపై తదుపరి చర్యలు చేపట్టకుండానే జాతీయ శిబిరంలో తప్పనిసరిగా పాల్గొంటేనే ఎంపిక చేస్తామని ఎలా అంటారని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది క్రీడాశాఖ విచారణ చేపడుతుందని కోర్టుకు విన్నవించారు. చదవండి: Naomi Osaka: మళ్లీ ఎప్పుడు ఆడతానో తెలీదు.. నిరవధిక విరామం -
నీరజ్ చోప్రాకి అభినవ్ బింద్రా క్యూట్ గిఫ్ట్..
ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు తొలి వ్యక్తిగత స్వర్ణం గెలిచిన షూటర్ అభినవ్ బింద్రా తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సందర్భంగా నీరజ్‌ను అభినందించిన బింద్రా.. .తన తరఫునుంచి ‘టోక్యో’ పేరు గల కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చి దానికి తోడుగా ‘పారిస్’ను తీసుకురావాలని ఆకాంక్షించాడు. వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్ ఫైనల్లో సురేఖ బృందం యాంక్టాన్ (యూఎస్ఏ): వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వెన్నం జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. కాంపౌండ్ విభాగంలో సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియ గుర్జర్ లతో కూడిన జట్టు సెమీ ఫైనల్లో 226–225 తేడాతో అమెరికాపై విజయం సాధించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో కొలంబియాతో భారత్ తలపడుతుంది. అంతకు ముందు భారత జట్టు... ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్‌పై, క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌పై గెలుపొందింది. చదవండి: ఇక ‘బ్యాట్స్‌మన్’ కాదు.. బ్యాటర్! -
నేడు నా కల నెరవేరింది: నీరజ్ చోప్రా భావోద్వేగం
Neeraj Chopra Takes Parents On Their First Flight: పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులు అనుభవించే ఆనందమే వేరు. బిడ్డలు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటే వారి సంబరం అంబరాన్నంటుంది. అదే సమయంలో తమ తమ చిన్న చిన్న కోరికలను నెరవేర్చేందుకు వారు చేసే ప్రయత్నాలు ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా తన తల్లిదండ్రులకు ఇలాంటి ఆనందాన్నే అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడిని ముద్దాడిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... వ్యక్తిగత విభాగంలో ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయస్సులోనే ఈ రికార్డు సాధించి, తన ఎదుగులకు ఎంతగానో పాటుపడిన తల్లిదండ్రులు, కోచ్‌లు.. సాయం అందించిన ప్రభుత్వాలకు అరుదైన కానుక అందించాడు. ఇక నీరజ్ చోప్రా.. తాజాగా ‘తన’ చిన్నపాటి, చిరకాల కలను నిజం చేసుకున్నాడు. తల్లిదండ్రులు సరోజ్ దేవి, సతీశ్ కుమార్‌ను తొలిసారిగా విమానం ఎక్కించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శనివారం షేర్ చేసిన నీరజ్.. ‘‘నా కల నేడు నెరవేరింది. మొట్టమొదటి సారిగా నా తల్లిదండ్రులు విమాన ప్రయాణం చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాల వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: ‘టాటా ఏఐఏ’ బ్రాండ్ అంబాసిడర్‌గా నీరజ్ చోప్రా ఇక నీరజ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ‘‘ఈ ఫొటోలను సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరెప్పుడైనా ఒత్తిడికి లోనైనా, నిరుత్సాహానికి గురైనా ఈ ఫొటోలను చూడండి. అన్నీ చిటికెలో మాయమైపోతాయి. నువ్వు సూపర్ నీరజ్ భాయ్. ఈ ప్రపంచంలోని సంతోషమంతా నీ పేరెంట్స్ కళ్లలోనే కనిపిస్తోంది’’ అంటూ ప్రశంసిస్తున్నారు. చదవండి: భారీ నజరానాలు, కోట్లల్లో డబ్బు.. కేవలం ఇవేనా.. అసలు సంగతి వేరే! A small dream of mine came true today as I was able to take my parents on their first flight. आज जिंदगी का एक सपना पूरा हुआ जब अपने मां - पापा को पहली बार फ्लाइट पर बैठा पाया। सभी की दुआ और आशिर्वाद के लिए हमेशा आभारी रहूंगा 🙏🏽 pic.twitter.com/Kmn5iRhvUf — Neeraj Chopra (@Neeraj_chopra1) September 11, 2021 Save these pictures folks , Whenever you feel depressed,demotivated just see this picture and get back the pleasure and motivation to fulfill your dreams . ❣️❣️🙏🙏 — PURUSHOTTAM KUMAR (@CAyar_Puru) September 11, 2021 -
భారీ నజరానాలు, కోట్లల్లో డబ్బు.. కేవలం ఇవేనా.. అసలు సంగతి వేరే!
భారత ఒలింపిక్స్, పారాలింపిక్స్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి మనకు స్వర్ణాల పంట పండింది. టోక్యో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) పసిడి అందించి చరిత్ర సృష్టించగా.. పారాలింపిక్స్‌లో అవని లేఖరా, సుమిత్ అంటిల్, ప్రమోద్ భగత్, కృష్ణా నగర్, మనీష్ నర్వాల్ స్వర్ణాలు సాధించి గర్వకారణమయ్యారు. వీరితో పాటు మన క్రీడాకారులంతా మెరుగ్గా రాణించడంతో ఒలింపిక్స్‌లో మొత్తంగా 7 పతకాలు, పారాలింపిక్స్‌లో 19 పతకాలు మన సొంతమయ్యాయి. అయితే, మెడల్స్ సాధించిన ఆటగాళ్లలో చాలా మంది హర్యానాకు చెందిన వారే కావడం విశేషం. మొత్తంగా.. ఈ రాష్ట్రానికి చెందిన 9 మంది అథ్లెట్లు పతకాలు గెలవడం గమనార్హం. ముఖ్యంగా గత రెండు ఎడిషన్లలో పారాలింపిక్స్‌లో హర్యానా అథ్లెట్లు ఆరు మెడల్స్‌తో మెరవడం వారి ప్రతిభకు అద్దం పడుతోంది. మరి దేశ జనాభాలో కేవలం 2 శాతం గల ఈ చిన్నరాష్ట్రం భారత్‌కు క్రీడామణికాంతులను అందించే నర్సరీగా ఎలా మారింది? విశ్వ వేదికపై సత్తా చాటిన హర్యానా సక్సెస్ సీక్రెట్ ఏంటి? భారీ ఆర్థిక సాయం, నజరానాలు ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకం సాధించిన క్రీడాకారులకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా హర్యానా భారీ నజరానాలు అందజేస్తుంది. ఒలింపిక్‌లో స్వర్ణం సాధిస్తే ఆరు కోట్లు, రజతానికి 4, కాంస్యానికి రెండున్నర కోట్ల రూపాయలు క్రీడాకారులకు ఇచ్చేది. అంతేకాదు తృటిలో పతకం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా 50 లక్షల ప్రోత్సాహకం అందించేది. 2018 వరకు ఈ సంప్రదాయాన్ని పాటించింది. ఇక తాజా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రతీ ప్లేయర్‌కు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు అందించింది. ఈ తరహాలో క్రీడల కోసం భారీగా ఖర్చు చేయడం హర్యానాకు మాత్రమే సాధ్యమైంది. ఈ విషయం గురించి హాకీ ఇంటర్నేషనల్ మాజీ ప్లేయర్, ప్రస్తుత క్రీడా శాఖా మంత్రి సందీప్ సింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఆటగాళ్లు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. అలాంటి సందర్భాల్లో క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే ధైర్యం చేయాలంటే ఈమాత్రం ప్రోత్సాహకాలు ఉండాలి. వారి కుటుంబాలకు కూడా ఓ భరోసా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. నిజానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అందించే నజరానాల కంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అందించే మొత్తం చాలా ఎక్కువ. విశ్వక్రీడల్లో పసిడి సాధిస్తే 75 లక్షలు, మిగతా ఒలింపియన్స్‌కు కేవలం లక్ష రూపాయల బహుమానం మాత్రమే ఉంటుంది. మూలాలే బలంగా.. సాధారణంగా చాలా రాష్ట్రాల్లో ఒలింపిక్స్ లేదంటే ఇతర ప్రధాన ఈవెంట్లలో పతకం సాధించిన తర్వాత క్రీడాకారులను ప్రభుత్వ ఉద్యోగాలు వరిస్తాయి. కానీ హర్యానాలో అందుకు భిన్నం. మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి.. ఆర్థిక భరోసా ఉండేలా ముందుగానే ఉద్యోగ భద్రత కల్పించడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన బాక్సర్ మనోజ్‌కుమార్ ఈ విషయం గురించి చెబుతూ.. ‘‘చాలా మంది చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చినవారే. ఆర్థిక తోడ్పాటు లేనివారే. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే భవిష్యత్తు బాగుంటుందని భావిస్తారు. అందుకే, క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి ప్రభుత్వం ముందుగానే ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు చేపడుతోంది. కాబట్టి ఇక వారు ఎలాంటి ఆందోళన లేకుండా ఆటలపై దృష్టి సారించే వీలు కలుగుతుంది’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా పోలీస్ విభాగం సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆటగాళ్లకు చోటు కల్పించేలా చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రాల్లో హర్యానా ఉందనడంలో అతిశయోక్తి లేదు. మట్టిలోని మాణిక్యాలు.. ప్రతిభకు పదునుపెట్టి 2008 నాటి నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో హర్యానాకు చెందిన కనీసం ఒక రెజ్లర్ అయినా సరే కచ్చితంగా పతకం సాధించడం పరిపాటిగా మారింది. ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం రాష్ట్రం నుంచి తొమ్మిది మంది రెజ్లర్లు ప్రాతినిథ్యం వహించారు. అదే విధంగా.. కామన్వెల్త్ క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఏసియన్ గేమ్స్‌లోనూ ఇప్పటికే సత్తా చాటారు. మాజీ రెజ్లర్, ప్రస్తుతం కోచ్‌గా సేవలు అందిస్తున్న ఈశ్వర్ దహియా(2016 ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ ఈయన శిక్షణలోనే రాటు దేలారు) ఈ విషయాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘మట్టిలో మాణిక్యాలను గుర్తించి, సహజమైన ప్రతిభను వెలికితీయడం ఇక్కడ సర్వసాధారణం. ప్రభుత్వం కూడా అనేక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే, ఇంకాస్త మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే పతకాల పంట పండుతుంది. అయితే, కేవలం మెడల్స్ వస్తేనే మేం సంతృప్తి చెందం. సాధించాల్సింది ఇంకా ఉందనే విషయాన్ని ఎల్లపుడూ గుర్తుపెట్టుకుంటాం’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించారు. విశ్వవేదికపై మెరిసిన హర్యానా ఆణిముత్యాలు టోక్యోలో హర్యానా ప్లేయర్లు అద్భుతమే చేశారు. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర లిఖించగా.. రెజ్లర్లు రవికుమార్ దహియా(రజతం), భజరంగ్ పునియా(కాంస్యం) మెడల్స్ సాధించారు. అంతేగాక ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా సెమీస్ చేరిన మహిళా హాకీ జట్టులోనూ కెప్టెన్ రాణీ రాంపాల్ సహా తొమ్మిది మంది ప్లేయర్లు ఉండటం విశేషం. పసిడి సాధించిన నీరజ్ చోప్రా తమ రాష్ట్రం గురించి మాట్లాడుతూ.. ‘‘హర్యానా ప్రజలు పోరాటయోధులు. క్రీడల్లో మా విజయానికి ఈ గుణమే కారణం. మేం దృఢంగా ఉంటాం. జాతీయంగా ఎప్పుడో మా ప్రతిభను నిరూపించుకున్నాం. ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జిస్తున్నాం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన షూటర్ మనీష్ నర్వాల్ కోచ్ రాకేశ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ఫరిదాబాద్ వంటి పలు పట్టణాల్లో అనేక షూటింగ్ రేంజ్‌లు ఉన్నాయి. షూటింగ్ పట్ల ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనం. బల్లాబ్‌ఘర్‌లో ఉన్న నా రేంజ్లోనూ దాదాపు 10 మంది అంతర్జాతీయంగా పోటీపడుతున్నారు. 30-35 మంది జాతీయంగా వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. మా వ్యవస్థ క్రీడలను ప్రోత్సహించే విధంగా ఉంది. విజయాలు సాధించడానికి మూలాలు బలంగా ఉండటమే కారణం’’ అని పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో హర్యానా 2008 బీజింగ్: ►రెండు కాంస్యాలు- బాక్సర్ విజేందర్‌సింగ్, రెజ్లర్ సుశీల్ కుమార్ 2012 లండన్: ►ఒక రజతం(రెజ్లర్ సుశీల్ కుమార్), రెండు కాంస్యాలు(రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్) 2016 రియో: ►ఒక కాంస్యం(రెజ్లర్ సాక్షి మాలిక్) 2020 టోక్యో: ►ఒక స్వర్ణం(నీరజ్ చోప్రా), ఒక రజతం(రెజ్లర్ రవికుమార్ దహియా), 2 కాంస్యాలు(రెజ్లర్ భజరంగ్ పునియా), పురుషుల హాకీ జట్టు సభ్యులు పారాలింపిక్స్‌లో పతకాలు 2016 రియో ►రజతం(షాట్‌పుట్టర్ దీపా మాలిక్) 2020 టోక్యో: ►2 స్వర్ణాలు(జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షూటర్ మనీష్ నర్వాల్), ఒక రజతం(షూటర్ సింగ్‌రాజ్ అధానా), 2 కాంస్యాలు(అధానా, ఆర్చర్ హర్వీందర్ సింగ్) - వెబ్‌డెస్క్ చదవండి: Virat Kohli: అరె ఏంట్రా ఇది.. ఈసారి వసీం, మైకేల్ ఒకేమాట! -
టోక్యో గెలిచింది
కరోనా వచి్చనా... వేరియంట్లతో కలకలం రేపినా... ఓ ఏడాది వాయిదా పడినా... ఆఖరి దాకా అనుమానాలే ఉన్నా... మెజార్టీ జపనీయులు వ్యతిరేకించినా... సక్సెస్ (ఒలింపిక్స్)... డబుల్ సక్సెస్ (పారాలింపిక్స్)... టోక్యో ఇప్పుడు వేదిక కాదు... ముమ్మాటికి విజేత! ఎనిమిదేళ్ల జపాన్ శ్రమ వృథా కాలేదు. నాడు ఆతిథ్య హక్కులు పొందిన రాజధాని (టోక్యో) నేడు హ్యాపీగా ముగించేంత వరకు... చేసిన కసరత్తు, పడిన శ్రమ, వెచ్చించిన వ్యయం, కట్టుదిట్టంగా రూపొందించిన నియమావళి, వేసుకున్న ప్రణాళికలు అన్నీ కుదిరాయి. మాటు వేసిన మహమ్మారిని జయించి మరీ ఒలింపిక్స్, పారాలింపిక్స్ భేషుగ్గా జరిగాయి. భళారే అన్నట్లుగా ముగిశాయి. ప్రేక్షకులు లేని లోటు ఉన్నా... ఆటగాళ్లకు, అధికారులకు ఏ లోటు లేకుండా జపాన్ పకడ్బందీగా పనులు చక్కబెట్టిన తీరుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), పారాలింపిక్ కమిటీ (ఐపీసీ), ప్రపంచ క్రీడా సమాఖ్యలు ఫిదా అయ్యాయి. టోక్యోకు జయ హో అన్నాయి. ఇక ఒలింపిక్ టార్చ్ చలో చలోమని పారిస్ (2024) బాట పట్టింది. ఇంకో మూడేళ్లే ఉన్న తదుపరి ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ ఏర్పాట్లలో తలమునకలైంది. మనం... అందరం... కలుద్దాం పారిస్‌లో..! సందడి చేద్దాం ఒలింపిక్స్‌లో! ఎదురులేని చైనా మొత్తం 162 దేశాలు పాల్గొన్న టోక్యో పారాలింపిక్స్‌లో చైనా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చైనా 96 స్వర్ణాలు, 60 రజతాలు, 51 కాంస్యాలతో కలిపి మొత్తం 207 పతకాలు సాధించింది. 124 పతకాలతో బ్రిటన్ (41 స్వర్ణాలు, 38 రజతాలు, 45 కాంస్యాలు) రెండో స్థానంలో... 104 పతకాలతో అమెరికా (37 స్వర్ణాలు, 36 రజతాలు, 31 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా 78 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. తదుపరి పారాలింపిక్స్ 2024లో పారిస్‌లో జరుగుతాయి. -
పతకం చేజార్చుకున్న 24 మంది ఒలింపియన్లకు టాటా కార్లు
ఇటీవల ముగిసిన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత అథ్లెట్లకు ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లను బహుమతిగా ఇచ్చినట్లు టాటా మోటార్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. అత్యంత కఠిన పరిస్థితులలో తృటిలో వారు పతకాన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ, వారు దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. భారత ఒలింపిక్ జట్టు దృఢత్వం, సంకల్పం వారిని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాయి. వారు ప్రతి దశలో అంచనాలను మించి సత్తా చాటారు, చివరి శ్వాస వరకు పోరాడారు. అందుకే దేశంలోని లక్షలాది మంది హృదయాలను వారు గెలుచుకున్నారు అని టాటా పేర్కొంది. .@imranirampal in a candid conversation with Shailesh Chandra - President, PVBU and EVBU, Tata Motors.#ALTROZForOlympians #TheGoldStandard #Altroz pic.twitter.com/GLFZFlqwPR — Tata Motors Cars (@TataMotors_Cars) August 26, 2021 అందుకే వారిని గౌరవించడానికి టాటా మోటార్స్ 24 ఒలింపియన్లకు బహుమతిగా ఆల్ట్రోజ్ ప్రీమియం కార్లను ఇచ్చింది. కార్లను తీసుకున్నవారిలో హాకీ, కుస్తీ, బాక్సింగ్, గోల్ఫ్, డిస్కస్ త్రో వంటి వివిధ క్రీడలకు చెందినవారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి హై స్ట్రీట్ గోల్డ్ కలర్ ఆల్ట్రోజ్ కీలను ఇచ్చారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వేహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో వారు చూపించిన పూర్తి నిబద్ధతను, అజేయ స్ఫూర్తిని చూసి మేము చాలా గర్వపడుతున్నాము. ఈ రోజు వారితో అదే వేదికను పంచుకోవడం నాకు దక్కిన గౌరవం. వారి చేసిన కృషిని అంగీకరిస్తూ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ గోల్డ్ కలర్ టాటా ఆల్ట్రోజ్ కారును వారికి బహుమతిగా ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.(చదవండి: ఇక మొబైల్ ఫోన్లలో అదిరిపోయే గ్రాఫిక్స్!) S.No. Athlete Name Sport 1 Neha Goyal Hockey 2 Rani Rampal Hockey 3 Navneet Kaur Hockey 4 Udita Duhan Hockey 5 Vandana Katariya Hockey 6 Nisha Warsi Hockey 7 Savita Punia Hockey 8 Monika Malik Hockey 9 Deep Grace Ekka Hockey 10 Gurjit Kaur Hockey 11 Navjot Kaur Hockey 12 Sharmila Devi Hockey 13 Lalremsiami Hockey 14 Sushila Chanu Hockey 15 Salima Tete Hockey 16 Nikki Pradhan Hockey 17 Rajani Etimarpu Hockey 18 Reena Khokhar Hockey 19 Namita Toppo Hockey 20 Aditi Ashok Golf 21 Deepak Punia Wrestling 86 kg 22 Kamalpreet Kaur Discus Throw 23 Satish Kumar Boxing 91 kg 24 Pooja Rani Boxing 75 kg -
ఫైనల్‌కు ముందు నీరజ్ జావెలిన్‌ను ఆ పాకిస్తానీ ఎందుకు తీసుకెళ్లాడు?
ముంబై: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన విషయం తెలిసిందే. అయితే కీలకమైన ఫైనల్‌కు ముందు జరిగిన ఒక ఆసక్తికర ఘటనను టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా బయటపెట్టాడు. ఫైనల్ ప్రారంభానికి ముందు ఒక్కసారిగా నా జావెలిన్ కనిపించకుండా పోయిందని అతడు తెలిపాడు. ఎంత వెతికిన నా జావెలిన్ కనిపించలేదు. అయితే సడెన్‌గా అది పాకిస్థాన్‌కు చెందిన నదీమ్ అర్షద్ చేతుల్లో కనిపించింది. నా జావెలిన్‌తో అతడు అటూఇటూ తిరుగుతున్నాడు. అది చూసి.. భాయ్ ఆ జావెలిన్ ఇవ్వు. అది నాది. నేను ఫైనల్లో దానినే విసరాలి అని అడిగాను. దీంతో అర్షద్ దానిని తిరిగి ఇచ్చేశాడు అని నీరజ్ చెప్పాడు. ఈ గందరగోళం వల్లే తాను తన తొలి త్రోను హడావిడిగా విసరాల్సి వచ్చిందని నీరజ్ అన్నాడు. కాగా జావెలిన్ త్రో ఫైనల్లో నదీమ్ అర్షద్ 6 వ స్థానాన్ని దక్కించుకోవడానికి బాగా కష్టపడ్డాడని నీరజ్ తెలిపాడు. ఎప్పటినుంచో మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉందని అతను చెప్పాడు. చదవండి: నీరజ్ చోప్రా ముందు అసభ్యకర డ్యాన్స్‌లు; ఫ్యాన్స్ ఆగ్రహం Here we can see Neeraj asking for his Javelin to Arshad #NeerajChopra #Tokyo2020 #ArshadNadeem pic.twitter.com/FTqfGyjlrI — vishal ghandat (@VishalGhandat) August 25, 2021 -
హాకీ ఆటగాళ్లకు గౌరవం.. పాఠశాలల పేర్లు మార్చిన పంజాబ్
చండీగఢ్: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడంచి భారత పురుషుల జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. కాగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లు పంజాబ్ నుంచి ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో వారి విజయానికి గౌరవంగా భారత పురుషుల హాకీ టీమ్ లో భాగమైన పంజాబ్‌కు చెందిన వివిధ ఆటగాళ్ల పేర్లను పది ప్రభుత్వ పాఠశాలల కు పెట్టాలని పంజాబ్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ అంగీకారం తెలిపారని పంజాబ్ విద్యాశాఖా మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా స్పష్టం చేశారు. చదవండి:IPL 2021: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ యువ పేసర్ మిథాపూర్ జలంధర్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలకు హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు చెప్పారు. ఇకపై ఆ పాఠశాల పేరును ఒలింపియన్ మన్‌ప్రీత్ సింగ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్, మిథాపూర్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే అమృత్‌సర్‌లోని తిమ్మోవల్ పాఠశాల పేరును వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరుతో మార్చనున్నట్లు పేర్కొన్నారు. అట్టారి పాఠశాల పేరును ఒలింపియన్ శంషర్ సింగ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌గా.. ఫరీద్‌కోట్‌లోని బాలికల పాఠశాల పేరును ఒలింపియన్ రూపిందర్‌పాల్ సింగ్ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలగా మారుస్తామన్నారు. ఖుస్రోర్‌పూర్ పాఠశాల పేరును ఒలింపియన్ హార్దిక్ సింగ్ పాఠశాల అని, గురుదాస్‌పూర్‌లోని చాహల్ కలాన్ పాఠశాల పేరును ఒలింపియన్ సిమ్రంజిత్ సింగ్ ప్రభుత్వ పాఠశాలగా మార్చనున్నట్లు మంత్రి వెల్లడించారు. చదవండి:Nithin Maestro Trailer: ‘మాస్ట్రో’ మూవీ ట్రైలర్ విడుదల, ఉత్కంఠ రేపుతున్న క్రైం సీన్స్ -
టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులను సన్మానించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఆయన నివాసంలో ప్రధాని మోదీ క్రీడాకారులను సన్మానించారు. కాగా జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణంతో సహా ఏడు పతకాలతో భారత అథ్లెట్లు టోక్యో నుంచి తిరిగి వచ్చారు. ఆదివారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో భారత క్రీడాకారుల అద్భుతమైన ప్రదర్శనను మోదీ ప్రశంసించారు. ఇక ఈ ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్ మహిళామణి 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు (రజతం, కాంస్యం) గెలిచిన తొలి భారత మహిళగా పీవీ సింధు రికార్డులకెక్కింది. ఇక ఆర్మీ నాయక్ సుబేదార్ విశ్వక్రీడల్లో (అథ్లెటిక్స్) బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్ పాజిబుల్’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు. రవి దహియా 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో రజతం సాధించి భారత వెండికొండగా మారాడు. మరోవైపు భారత హకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. మన్‌ప్రీత్ జట్టును నడిపిస్తే... గోల్‌కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడ, స్ట్రయికర్ సిమ్రన్‌జీత్ సింగ్ ప్రదర్శన పోడియంలో నిలబెట్టాయి. ఇక అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌లో విజేందర్, మేరీకోమ్‌ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది. దిగ్గజం మేరీకోమ్ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. అంతేకాకుండా ఫేవరెట్‌గా టోక్యోకు వెళ్లిన గోల్డెన్ రెజ్లర్ బజరంగ్ పూనియా కాంస్యంతో మురిపించాడు. -
‘పతకాలే కాదు హృదయాలు గెలిచారు’
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికెత్తారు. ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ సారి పతక విజేతలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారి అద్భుతమైన ప్రదర్శన దేశంలోని యువతకు స్ఫూర్తినిచి్చందని ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల ప్రదర్శన చూసి భారత్ గరి్వస్తోంది. అథ్లెట్లు పతకాలే కాదు హృదయాల్ని గెలిచారు. యువతకు ప్రేరణగా నిలిచారు. ఇక్కడికొచి్చన అతిథులు, దేశంలోని ప్రజలంతా ఈ సంద ర్భంగా వారికి జేజేలు పలకాలి’ అని మోదీ అన్నారు. ఈ వేడుకల్లో పతక విజేతలు నీరజ్ చోప్రా, సింధు, మీరాబాయి, లవ్లీనా, రవి, బజరంగ్, పురుషుల హాకీ జట్టు సభ్యులతో పాటు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇతర ప్లేయర్లు పాల్గొన్నారు. -
భారత రెజ్లింగ్ సమాఖ్యకు వినేశ్ ఫొగాట్ క్షమాపణ
సాక్షి, న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్యకు వినేశ్ ఫొగాట్ క్షమాపణ చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో తన ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్ఐ పంపిన నోటీసుపై ఆమె స్పందిస్తూ ఆదివారం క్షమాపణ కోరారు. కాగా, టోక్యోలో ఫొగాట్ ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్ఐ తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆమెపై నిషేధంపై త్వరలో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోనుంది. నిన్న(శనివారం) ఆమె స్పందిస్తూ.. ‘మన దేశంలో ఎంత వేగంగా పైకి ఎదుగుతామో అంతే వేగంగా కింద పడిపోతాం. ఒక్క పతకం రాలేదంటే ఇక అంతా అయిపోయినట్లే. ఇప్పుడూ అదే జరుగుతోంది. అంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓటమికి కారణాలేమిటో నాకు బాగా తెలుసు. ఒలింపిక్స్ కోసం అన్ని రకాలుగా సిద్ధమై వచ్చాను. కానీ నన్ను దురదృష్టం వెంటాడింది’ అని వినేశ్ పేర్కొంది. రెజ్లింగ్‌పై అవగాహనలేని, షూటింగ్‌తో సంబంధం ఉన్న ఫిజియోను తనకు కేటాయించారని, బౌట్‌కు ముందు తన బరువు తగ్గించుకునే విషయంలో తానే ఆమెకు వివరించాల్సి వచ్చిందని వినేశ్ ఆరోపించింది. రెండుసార్లు కరోనా సోకడంతో తన శరీరంలో అసలు ప్రొటీన్ లేకుండా పోయిందని ఆమె చెప్పింది. తన వల్ల భారత రెజ్లర్లు కోవిడ్ బారిన పడకూడదనే విడిగా ఉన్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించిన వినేశ్... గత రెండేళ్లుగా చాలాసార్లు డిప్రెషన్‌కు గురయ్యానని వెల్లడించింది. -
నా మనసు విరిగిపోయింది.. ఇక: వినేశ్ ఫొగాట్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకావకాశం ఉన్న రెజ్లర్‌గా బరిలోకి దిగి విఫలం కావడంతో పాటు క్రమశిక్షణ తప్పిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మౌనం వీడింది. తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించడంతోపాటు ఒలింపిక్స్ ముందు, పోటీలు జరిగే సమయంలో తాను మానసికంగా ఎంత వేదన అనుభవించిందో వెల్లడించింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత వినేశ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తాత్కాలిక నిషేధం విధించింది. ‘మన దేశంలో ఎంత వేగంగా పైకి ఎదుగుతామో అంతే వేగంగా కింద పడిపోతాం. ఒక్క పతకం రాలేదంటే ఇక అంతా అయిపోయినట్లే. ఇప్పుడూ అదే జరుగుతోంది. అంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓటమికి కారణాలేమిటో నాకు బాగా తెలుసు. ఒలింపిక్స్ కోసం అన్ని రకాలుగా సిద్ధమై వచ్చాను. కానీ నన్ను దురదృష్టం వెంటాడింది’ అని వినేశ్ పేర్కొంది. రెజ్లింగ్‌పై అవగాహనలేని, షూటింగ్‌తో సంబంధం ఉన్న ఫిజియోను తనకు కేటాయించారని, బౌట్‌కు ముందు తన బరువు తగ్గించుకునే విషయంలో తానే ఆమెకు వివరించాల్సి వచ్చిందని వినేశ్ ఆరోపించింది. రెండుసార్లు కరోనా సోకడంతో తన శరీరంలో అసలు ప్రొటీన్ లేకుండా పోయిందని ఆమె చెప్పింది. తన వల్ల భారత రెజ్లర్లు కోవిడ్ బారిన పడకూడదనే విడిగా ఉన్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించిన వినేశ్... గత రెండేళ్లుగా చాలాసార్లు డిప్రెషన్‌కు గురయ్యానని వెల్లడించింది. ‘నేను మానసికంగా సన్నద్ధంగా లేను కాబట్టి పోటీ పడలేను అని అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ చెబితే నిజమే కదా అంటూ మనోళ్లూ సానుభూతి పలుకుతారు. బరిలోకి దిగకపోవడం సంగతి తర్వాత, నేను మానసికంగా సన్నద్ధంగా లేనని ఒక్కసారి చెప్పి చూడండి. ఏం జరుగుతుందో’ అని వినేశ్ గుర్తు చేసింది. తన ఓటమి గురించి కనీసం తాను కూడా బాధపడే అవకాశం ఇవ్వకుండా అంతా కత్తులతో సిద్ధమయ్యారని వినేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘స్వర్ణం గెలిచే అవకాశం ఉన్నవారిలో నన్నూ చేర్చండి అని నేను అడిగానా? ఓడితే అందరికంటే ఎక్కువగా బాధ పడేది నేనే కదా. నేను మళ్లీ రెజ్లింగ్‌లోకి ఎప్పుడు అడుగు పెడతానో, అసలు ఆడతానో కూడా తెలీదు. 2016 ‘రియో’లో కాలు విరిగినప్పుడే బాగుంది. కనీసం దేనికి చికిత్స చేయాలో తెలిసింది. కానీ ఇప్పుడు నా మనసు విరిగి పోయింది’ అని ఆమె బాధను ప్రదర్శించింది. నోటీసుకు స్పందించాల్సిందే! వినేశ్‌పై చర్య తీసుకునే విషయంలో ఆమెకు పంపిన నోటీసు విషయంలో స్పందన కోసం ఎదురు చూస్తున్నామని డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. ‘వినేశ్ నుంచి మాకు ఇంకా సమాధానం రాలేదు. ఆమె తన సమస్య గురించి ఏం రాసుకుందనేది మాకు అనవసరం. నోటీసు ఇచ్చిన మరో రెజ్లర్ సోనమ్ స్పందించింది. క్షమాపణ కోరిన ఆమె ఇకపై తప్పు చేయనని హామీ ఇచ్చింది’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఒకరు వెల్లడించారు. చదవండి: మేయర్ అత్యుత్సాహం.. పంటి గాట్లతో గోల్డ్ మెడల్ రీప్లేస్ -
ఓవరాక్షన్లో మెడల్‌ను గట్టిగా కొరికేశాడు, ఆపై..
సాధారణంగా ఒలింపిక్స్ మెడల్స్ సాధించి.. ఫొటోగ్రాఫర్ల ఫోజుల కోసం పంటిగాట్లు పెట్టినట్లు అథ్లెట్లు నటించడం చూస్తున్నదే. కానీ, ఓ మేయర్ అతి వల్ల జపాన్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. అథ్లెట్ నుంచి మెడల్ అందుకుని.. కసితీరా పంటితో గాట్లు పెట్టాడు ఆయన. ఈ చర్యకతో ఆయనకి వ్యతిరేకంగా ఏడు వేల ఫిర్యాదులు రావడం విశేషం. సాఫ్ట్ బాల్ ప్లేయర్ మియూ గోటో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. సంబురాల్లో భాగంగా సొంత వూరు జపాన్ సెంట్రల్ సిటీ నయోగాలో జరిగిన ఓ ఈవెంట్‌కి ఆమె హాజరైంది. అక్కడే ఆ నగర మేయర్ టకాషి కవామురా అత్యుత్సహం ప్రదర్శించాడు. ఆమె నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకుని మెడలో వేసుకున్న కవామురా.. తన ముఖానికి ఉన్న మాస్క్ కిందకి లాగేసి మరీ ఆ గోల్డ్ మెడల్‌ను గట్టిగా కొరికేశాడు. మెడల్‌పై పంటిగాట్లు బలంగా పడ్డాయి. ఈవెంట్ తర్వాత ఆ డ్యామేజ్ చూసి ఆందోళన చెందిన మియూ వెంటనే టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకుల్ని సంప్రదించింది. చదవండి: గ్రేటెస్ట్ జాబితాలో బల్లెం వీరుడి ప్రదర్శన ఇక టోక్యో నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆ మెడల్‌ను మార్చేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మార్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ మెడల్ మార్పిడికి అయ్యే ఖర్చును ఐవోసీనే భరించబోతోంది. మరోవైపు కరోనా టైంలో మాస్క్ తీసేసి నిర్లక్క్ష్యంగా వ్యవహరించడం, పైగా ఆమె విజయాన్ని అగౌరవపర్చడం తీవ్ర నేరాలంటూ మేయర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెతున్నాయి. ఈ తరుణంలో తన స్థాయిని మరిచి ప్రవర్తించిన తీరుకు టకాషి కవామురా క్షమాపణలు తెలియజేశాడు. ఆమెకు కృతజ్ఞతలు ఒక టోక్యో ఒలింపిక్స్ వేదికగా మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జమైకా హర్డ్లింగ్ అథ్లెట్ హన్స్లే పర్చమెంట్ 110 మీటర్ల రేసులో స్వర్ణం సాధించాడు. అయితే రేసుకి ముందు పొరపాటున వేరే వేదిక దగ్గరికి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న వలంటీర్ ఒకామె.. జరిగిన పొరపాటును గుర్తించి సరైన వేదిక దగ్గరికి వెళ్లడం కోసం హన్స్లేకి డబ్బులిచ్చి మరీ సాయం చేసింది. View this post on Instagram A post shared by Hansle Parchment, OLY (@parchment_hansle) దీంతో డిస్క్వాలిఫైయింగ్ను తప్పించుకుని అతను అర్హత సాధించడం, ఆపై ఫైనల్ రేసులో గోల్డ్ సాధించాడు. ఇక తన విజయానికి మూల కారణమైన ఆ వలంటీర్‌ను వెతుక్కుంటూ వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలియజేశాడు ఈ జమైకన్ అథ్లెట్. -
ఇక పద... పారాలింపిక్స్‌కు!
న్యూఢిల్లీ: నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్‌ను చిరస్మరణీయం చేసుకున్న భారత్ అదే వేదికపై మళ్లీ పతకాల వేటకు వెళ్లింది. పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు 54 మంది సభ్యులతో కూడిన భారత జట్టు గురువారం అక్కడికి బయల్దేరింది. టోక్యోలోనే ఈ నెల 24 నుంచి దివ్యాంగ విశ్వక్రీడలు జరుగనున్నాయి. భారత ఆటగాళ్లు పోటీ పడే ఈవెంట్లు 27న మొదలవుతాయి. ముందుగా ఆర్చరీ పోటీలు జరుగుతాయి. పారాలింపిక్ చాంపియన్లు దేవేంద్ర జఝారియా (ఎఫ్–46 జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (టి–63 హైజంప్), ప్రపంచ చాంపియన్ సందీప్ చౌదరి (ఎఫ్–64 జావెలిన్ త్రో) ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. దేవేంద్ర మూడో స్వర్ణంపై కన్నేశాడు. తను ఇదివరకే ఏథెన్స్(2004), రియో (2016) పారాలింపిక్స్‌లో బంగారు పతకాలు నెగ్గాడు. గత పారాలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం గెలుపొందింది. మన జట్టు దిగ్విజయంగా పతకాలతో తిరిగి రావాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, భారత పారాలింపిక్ సంఘం అధికారులు గురువారం జరిగిన ‘వర్చువల్ సెండాఫ్’ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగనంపారు. -
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న చాను, ఫ్యాన్స్ ఫిదా
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి భారత్ పతకాల ఖాతా తెరిచిన కోట్లాది భారతీయుల మనసుదోచుకున్న మణిపూర్ మణిపూస మీరాబాయి చాను సంప్రదాయ దుస్తుల్లో మెరిసి పోతోంది. ట్రెడిషనల్ దుస్తులంటేనేఎప్పటికీ ఇష్టపడతానంటూ ఒక ఫోటోను ఆమె ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు. దీంతో అద్భుతంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కితాబిచ్చారు. మోడ్రన్ దుస్తులకంటే సాంప్రదాయక దుస్తులు మరింత మెరుగ్గా, అందంగా ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ముంబైలో తన ఫ్యావరెట్ హీరో, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను మీరాబాయి చాను బుధవారం కలిశారు. ఈ ఫోటోలను కూడా ఆమె ట్వీట్ చేశారు. ఒలింపిక్ మెడల్ విజేతను కలవడం ఆనందంగా ఉందంటూ సల్మాన్ ఖాన్ కూడా ట్వీట్ చేశారు. మీరాబాయ్ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్‌ను కూడా కలిసింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకుని సగ్వంగా సొంత గ్రామానికి చేరుకున్న చాను, అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది. మణిపూర్ ప్రభుత్వం చానుకు కోటి రూపాయల రివార్డుతోపాటు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పోర్ట్స్)గా నియమించనున్న సంగతి తెలిసిందే. (Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్) బాలీవుడ్ స్టార్ హీరోతో మీరాబాయి క్రికెట్ స్టార్‌తో ఒలింపిక్ స్టార్ మీరాబాయి మీరాబాయి బర్త్‌డే వేడుకలు Always happy to be in my traditional outfits. pic.twitter.com/iY0bI69Yh5 — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 12, 2021 -
టాప్–10లో నీరజ్ పసిడి ప్రదర్శన
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో కనబరిచిన స్వర్ణ పతక ప్రదర్శన మరో స్థాయికి చేరింది. టోక్యో ఒలింపిక్స్‌లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో పది అద్భుత ఘట్టాల్లో అతని ప్రదర్శనకు స్థానం లభించిందని ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) వెల్లడించింది. 23 ఏళ్ల చోప్రా ఫైనల్లో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర పుటలకెక్కాడు. ‘ఒలింపిక్స్‌కు ముందు నీరజ్ చోప్రా ప్రతిభ గురించి చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. విశ్వక్రీడల్లో బంగారు విజేతగా చరిత్ర సృష్టించాక అతని ప్రొఫైల్ ఆకాశాన్ని తాకింది. అంతలా అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు’ అని ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) తమ వెబ్సైట్లో పేర్కొంది. విజయం తర్వాత నీరజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘ఈ అనుభూతి అద్భుతమైంది. ఈ క్షణం నాతో చిరకాలం ఉండిపోతుంది. దేశానికి స్వర్ణం అందించేందుకు నాకు మద్దతు తెలిపినవారికి, ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశాడు. ఇది లక్షల మందిని చేరుకుంది. ఒలింపిక్స్‌కు ముందు అతని ఇన్‌స్టాగ్రామ్‌లో 1,43,000 మంది ఫాలోవర్లు ఉండగా... ఒలింపిక్ చాంపియన్ అయ్యాక, ఆ పోస్ట్ పెట్టాక ఏకంగా 32 లక్షల మంది ఫాలోవర్లు జమ అయ్యారని డబ్ల్యూఏ తెలిపింది. రెండో ర్యాంక్‌కు నీరజ్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మరో ఘనత సాధించారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు ప్రపంచంలోనే రెండో ర్యాంకును చేరుకున్నారు. 1,315 స్కోరుతో నీరజ్ చోప్రా రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. కాగా 1,396 స్కోరుతో జర్మనీ ఆటగాడు జొహెనెస్ వెటెర్ అగ్రస్థానంలో నిలిచాడు. గత ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో నిలిచిన నీరజ్ బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 2వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. -
లిటిల్ మాస్టర్ తో వెయిట్ లిఫ్టర్
-
భారత హాకీ ప్లేయర్ల పై కాసుల వర్షం
-
ఒలింపిక్స్ విజేతల సందడి: వందనా కటారియా భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చూపించిన సొంతగడ్డపై అడుగిడిన క్రీడాకారులను ఘన స్వాగతం లభించింది. నగదు పురస్కారాలు, సత్కారాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి గౌరవించాయి. ముఖ్యంగా ఒడిశా ముఖ్యమంత్ర నవీన్ పట్నాయక్ రాష్ట్రానికి చెందిన పురుషులు, మహిళా హాకీ క్రీడాకారులను సన్మానించారు. బీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌కు 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని, అలాగే దీప్ గ్రేస్ ఎక్కా నమితా టోపోలకు ఒక్కొక్కరికి రూ .50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. మరోవైపు టోక్యో 2020 లో పాల్గొన్న మహిళల హాకీ జట్టు సభ్యులు సలీమా టేట్, నిక్కీ ప్రధాన్ తమ సొంత రాష్ట్రానికి చేరుకున్న రాంచీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన పురుషులు మహిళల హాకీ క్రీడాకారుల లుకూడాఅమృత్సర్ చేరుకున్నారు. కామన్వెల్త్ ఆసియన్ గేమ్స్ వచ్చే నెల నుండి శిక్షణను ప్రారంభిస్తామని, హాకీ జట్టు ఆటగాడు గుర్జంత్ సింగ్ వెల్లడించారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్‌కు వందన కటారియాకు డెహ్రాడూన్ విమానాశ్రయంలోనూ, గ్రామంలోనూ వాయిద్యాలతో గ్రామస్తులు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల తండ్రిని కోల్పోయిన వందనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంటికి చేరినపుడు తనను తాను ఎలా నిభాయించుకోవాలో అర్థంకాలేదని పేర్కొన్నారు. అటు ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న మీరా బాయి చాను టెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిసారు. Amid 'dhols', Indian Women Hockey team's Vandana Katariya receives a warm welcome at Dehradun Airport, Uttarakhand. "We were broken after losing the bronze medal match, didn't win a medal but have won hearts. The team performed well at #Tokyo2020, " she says pic.twitter.com/VEa5jv8mLs — ANI (@ANI) August 11, 2021 Odisha CM Naveen Patnaik felicitated Men and Women hockey players from the state- Deep Grace Ekka, Namita Toppo, Birendra Lakra and Amit Rohidas for their performance at #Tokyo2020; handed over a cash award of Rs 2.5 crores to Birendra Lakra & Amit Rohidas. pic.twitter.com/Wt6ks6gYsC — ANI (@ANI) August 11, 2021 Family members of Indian men and women hockey players from Punjab receive them at Amritsar "We'll start training from next month. We have a busy year ahead due to Commonwealth & Asian Games. Confidence of team is high," says men's hockey team player Gurjant Singh pic.twitter.com/CpZDqXmSPr — ANI (@ANI) August 11, 2021 -
స్టార్లుగా ఊహించుకుంటున్నారు: సోనం మాలిక్‌కు నోటీసు
న్యూఢిల్లీ: తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన మరో మహిళా రెజ్లర్ సోనమ్ మాలిక్ టోక్యో బయల్దేరడానికి ముందు పాస్‌పోర్ట్‌ను డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయంలో తీసుకోవాలని అధికారులు చెప్పారు. ఆమె మాత్రం తన పాస్‌పోర్ట్‌ను తీసుకొని రావాలని ఏకంగా భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులను ఆజ్ఞాపించింది. రెజ్లర్ల క్రమశిక్షణా రాహిత్యం ఆ నోటా ఈ నోటా భారత ఒలింపిక్ సంఘానికి (ఐఓఏ) తెలిసింది. రెజ్లర్లు ప్రవర్తన నియమావళిని అతిక్రమించడం ఏమాత్రం రుచించని ఐఓఏ... ‘మీ క్రీడాకారుల్ని మీరు నియంత్రించలేరా’ అని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను తలంటింది. ఈ క్రమంలో సోనమ్ మాలిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘కెరీర్ మొదట్లోనే వీళ్లు తమను తాము స్టార్లుగా ఊహించుకుంటున్నారు. అందుకే విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఇదే మాత్రం క్షమించరానిది’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఈ సందర్భంగా చెప్పారు. ఇక టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో వ్యవహరించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. టోక్యో ఒలింపిక్స్‌లో జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ సలహాలు తీసుకునేందుకు నిరాకరించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రాపై భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చదవండి: Neeraj Chopra: గర్ల్‌ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ -
స్వప్న లోకంలో విహరిస్తున్నా అనుకున్నా: నీరజ్ చోప్రా
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకుని భారత్ అథ్లెట్స్‌లో వందేళ్ల కల సాకారం చేయడమే కాదు, అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన జావెలిన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా(23) ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బంగారు పతకం సాధించడం ఇంకా కలగానే ఉంది. ఏదో స్పప్నలోకంలో విహరిస్తున్న అనుభవం కలిగిందంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్‌లో బంగారు పతకంతో హీరోగా నిలిచిన నీరజ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్‌లో మంగళవారం మాట్లాడాడు. పతకాన్ని సాధించడం ప్రతీ అథ్లెట్ కల..అందులోనూ ఒలింపిక్ స్వర్ణం గెలవడం అంటే మామూలు విషయం కాదని నీరజ్ పేర్కొన్నాడు. అందుకే తాను బంగారు పతకాన్ని సాధించాను అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను, కలగా ఉంది. దేశం కోసం గొప్ప పని చేశానని ఇండియాలో అడుగుపెట్టినపుడు, ఎయిర్‌పోర్ట్‌లో కోలాహలం చూసినపుడు మాత్రమే అర్థమైందన్నారు. భారత అథ్లెట్లలో ఆలోచన ఈసారి చాలా భిన్నంగా ఉందనీ, కేవలం పాల్గొనడంతోనే సరిపెట్టకుండా, అందరూ పతకం కోసం పోటీ పడ్డారని వ్యాఖ్యానించాడు. (Naresh Tumda: రోజుకూలీగా మారిన క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్) గత వారం టోక్యోలో 87.58 మీటరలు విసిరి పురుషుల ఫైనల్లో సంచలనాత్మక విజయాన్ని సాధించాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత గడ్డ మీద అడుగుపెట్టిన నీరజ్ చోప్రాతోపాటు అథ్లెట్లు, ఇతర పతక విజేతలకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 87.58 మీటర్లు విసిరి తన ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి భారతదేశానికి అథ్లెటిక్స్‌లో చారిత్రాత్మక మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. చదవండి : షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్ -
విదేశీ కోచ్‌ల సత్తా! ఒక్కొక్కరి జీతాలు ఎంతంటే..
స్వదేశీ కోచ్‌లు ఎక్కడ? అనే విమర్శలను కాసేపు పక్కనపెడితే.. ఫారిన్ కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్లు ఈ దఫా ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యను పెంచడంలో భారత్‌కు వెన్నెముకగా నిలిచారు. నీరజ్ కోసం జర్మనీ ఉవీ హోన్, పురుషుల హాకీ కోసం ఆసీస్ గ్రాహం రెయిడ్, లవ్లీనా-మహిళా బాక్సింగ్ టీం కోసం ఇటలీ రఫలే బెర్గామాస్కో, భజరంగ్ పూనియా కోసం షాకో బెంటిండిస్, పీవీ సింధు కోసం దక్షిణకొరియా పార్క్, సెమీస్ దాకా చేరిన మహిళా హాకీ టీం కోసం నెదర్లాండ్స్ జోయర్డ్ మరీన్.. ఇలా అంతా విదేశీ కోచ్‌ల హవానే ఈసారి కనిపించింది. భారత అథ్లెట్లు-ప్లేయర్లు నీరజ్ చోప్రా, పీవీ సింధు, లవ్లీనా, మీరాబాయ్ ఛాను, రవి దహియా, భజరంగ్ పూనియా, మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల హాకీ టీం-రాణి రాంపాల్ నేతృత్వంలోని మహిళా హాకీ టీం.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో ప్రముఖంగా నిలిచిన వీళ్లందరికీ ఉన్న ఒకే కామన్ పాయింట్.. అంతా విదేశీ కోచ్‌ల ఆధ్వర్యంలో సత్తా చాటినవాళ్లే. అవును.. వీళ్ల ఘనత వల్ల స్వదేశీ కోచ్‌ల ప్లేసుల్లో ఈసారి విదేశీ కోచ్‌ల పేర్లు ఎక్కువగా తెరపై వినిపించి.. కనిపించాయి. పతకాల మేజర్ సక్సెస్ రేటు పరదేశీ కోచ్‌లదే అయినా.. స్వదేశీ కోచ్‌లకు స్థానం దక్కకపోవడంపై కొంత విమర్శలు వినిపించాయి. వీళ్లే టా(తో)ప్ విదేశీ కోచ్‌ల్లో ఎక్కువ జీతం అందుకుంది ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం, భారత పురుషుల హాకీ జట్టు కోచ్ గ్రాహం రెయిడ్. నెలకు పదిహేను వేల డాలర్ల జీతం(పదకొండు లక్షలకుపైనే) అందుకున్నాడాయన. ఆ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్ హాకీ లెజెండ్ జోయర్డ్ మరీన్ నెలకు పదివేల డాలర్లు(ఏడున్నర లక్షల రూపాయలపైనే) అందుకున్నారు. ఇక బాక్సింగ్ డైరెక్టర్ శాంటియాగో నియేవా(అర్జెంటీనా) ఈ లిస్ట్‌లో ఎనిమిది వేల డాలర్ల(దాదాపు ఆరు లక్షల రూపాయలు)తో మూడో ప్లేస్‌లో నిలవగా, జావెలిన్ త్రో కోచ్ ఉవే హోన్ నెలకు ఎనిమిదివేల డాలర్లతో నాలుగో ప్లేస్‌లో, రైఫిల్ కోచ్‌లు ఓలెగ్ మిఖాయిలోవ్-పావెల్ స్మిర్నోవ్ (రష్యా)లు చెరో 7,500 డాలర్లు ( ఐదున్నర లక్షల రూపాయలు)లతో తర్వాతి స్థానంలో నిలిచారు. కొత్తేం కాదు విదేశీ కోచ్‌ల్ని ఆశ్రయించడం మనకేం కొత్త కాదు. అందులో ఎలాంటి దాపరికమూ లేదు. 80వ దశకం నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ విదేశాల నుంచి స్పెషలిస్టులను తెప్పించుకోవడం మొదలుపెట్టింది. సిడ్నీ ఒలింపిక్స్(2000) టైం నాటికి అది తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా హాకీ, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్ లాంటి మేజర్ ఈవెంట్లు విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో మెరుగైన ప్రదర్శనకు దారితీయడంతో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ప్రముఖంగా విదేశీ కోచ్‌లకే ఎందుకు ప్రాధాన్యం? అనే ప్రశ్నకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నుంచి వివరణ.. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడమే. శాయ్ ఎంపిక చేసే కోచ్‌లలో ఎక్కువ మంది గతంలో ఛాంపియన్లుగా ఉన్నవాళ్లో లేదంటే విజయాలను అందుకున్న అనుభవం ఉన్నవాళ్లో ఉంటారు. వాళ్లకు మన కోచ్‌లతో పోలిస్తే సైంటిఫిక్-టెక్నికల్ నాలెడ్జ్, ట్రిక్కులు- జిమ్మిక్కులు, డైట్‌కు సంబంధించిన వివరాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. అందుకే కేవలం సలహాల కోసమే ఒక్కోసారి వాళ్లను నియమించుకుంటాయి కూడా. అలాగని మన దగ్గరా సత్తా ఉన్నవాళ్లు లేరని కాదు. ‘సక్సెస్‌తో పాటు అనుభవం’ అనే పాయింట్ మీదే ఫోకస్ చేస్తూ ఫారిన్ కోచ్‌లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తోంది శాయ్. అలాగే వీళ్లకు నెలకు మినిమమ్ నెలకు నాలుగు వేల డాలర్లకు తగ్గకుండా శాలరీ ఇస్తుంటుంది. అలాగే వాళ్లతో పని కూడా అదే తీరులో చేయించుకుంటాయి మన స్పోర్ట్స్ అథారిటీలు. విదేశీకే ప్రయారిటీ టోక్యో ఒలింపిక్స్ కోసం టోక్యోకు వెళ్లిన 126 మంది అథ్లెట్ల కోసం (9 విభాగాలు) 32 మంది విదేశీ కోచ్‌లు(50 మంది స్వదేశీ కోచ్‌లను సొంత ఖర్చులతో భారత ప్రభుత్వం పంపించింది) పని చేశారు. సక్సెస్ జోరు.. ఆటగాళ్లతో ఈ కోచ్‌ల టెంపో కారణంగా మరికొంత కాలం వీళ్లనే కోచ్‌లుగా కొనసాగించాలని శాయ్ భావిస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 30, 2021 వరకు వీళ్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. పారిస్, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టకుని.. మరో నాలుగేళ్లపాటు విదేశీ కోచ్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
ఓవైపు కోటి నజరానా.. మరోవైపు వెయ్యి రూపాయల ధోతి, షర్టు!
తిరువనంతపురం: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన గోల్ కీపర్ పరాట్టు రవీంద్రన్ శ్రీజేశ్కు మళయాళీ వ్యాపారవేత్త ఒకరు భారీ నగదు కానుక అందించనున్నారు. గల్ఫ్‌లో నివాసం ఉంటున్న వీపీఎస్ హెల్త్‌కేర్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షంషీర్ వయలిల్ తన తరఫు నుంచి కేరళకు చెందిన శ్రీజేశ్కు రూ. కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. పీఆర్ శ్రీజేశ్కు కేరళ చేనేత శాఖ వెయ్యి రూపాయల విలువ చేసే ధోతి, షర్టు రివార్డుగా ప్రకటించినట్లు మలయాళ వార్తా సంస్థ జన్మభూమి వెల్లడించింది. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఒలింపియన్‌కు ఇంతటి ఘన సన్మానమా.. భేష్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం.. శ్రీజేశ్ పట్ల అభిమానాన్ని డబ్బుతో పోల్చి చూడవద్దని హితవు పలుకుతున్నారు. కాగా కేరళకు చెందిన శ్రీజేశ్ భారత పురుషుల హాకీ జట్టులో గోల్ కీపర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీపై 5-4 తేడాతో గెలుపొంది టీమిండియా 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం దక్కించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. చదవండి: Neeraj Chopra: తను ఒలింపియన్ అయితే కావొచ్చు.. కానీ -
టోక్యో ఒలింపిక్స్ విజేతలకు క్రీడాశాఖ సత్కారం
-
వీరులకు బ్రహ్మరథం.. విమానాశ్రయంలో రచ్చ
ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులు సోమవారం టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం, అదీ స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... రజత, కాంస్య పతకాలు సాధించిన రెజ్లర్లు రవి, బజరంగ్.. కాంస్యం నెగ్గిన మహిళా బాక్సర్ లవ్లీనా... 41 ఏళ్ల విరామం తర్వాత విశ్వ క్రీడల్లో పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు... నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వ ర్యంలో పతక విజేతలకు సన్మాన కార్యక్రమం జరిగింది. తాను సాధించిన పతకం తన ఒక్కడిదే కాదని, దేశ ప్రజలందరిదని నీరజ్ చోప్రా అన్నాడు. నీరజ్ చోప్రా, రవి దహియా బజరంగ్, లవ్లీనా ‘మీరంతా నవతరం హీరోలు...’ ► టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలపై ప్రశంసల జల్లు ► స్వదేశంలో ఘన స్వాగతం ► కేంద్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన... ప్రపంచాన్ని గెలవాలనుకునే భారత కొత్త తరానికి స్ఫూర్తిగా నిలిచిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మున్ముందు కూడా అన్ని రకాలుగా క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి సోమవారం స్వదేశం చేరుకున్న అథ్లెట్ నీరజ్ చోప్రా, రెజ్లర్లు రవి దహియా, బజరంగ్ పూనియా, మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌లతో పాటు భారత పురుషుల హాకీ జట్టు సభ్యులకు సోమవారం కేంద్ర ప్రభుత్వం తరఫున ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ... ‘స్వీయ క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో భారత అథ్లెట్లు చూపించారు. సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతకంతో నీరజ్ చోప్రా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్; రజతం నెగ్గిన రెజ్లర్ రవి దహియాకు జ్ఞాపికను అందజేస్తున్న అనురాగ్ ఠాకూర్, చిత్రంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పతకాలు సాధించే వరకు వారి ప్రయాణం చాలా గొప్పగా సాగింది. నవ భారతంలో వీరంతా నవతరం హీరోలు. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనపై జాతి యావత్తూ సంబరాలు చేసుకుంది. మన దేశంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు అందరినీ ఒక్కచోటికి చేర్చే శక్తి క్రీడలకు మాత్రమే ఉంది. క్రీడల్లో మన దేశం మరింత ఘనతలు సాధించేలా సహకారం అందిస్తాం’ అని ఠాకూర్ అన్నారు. ఒలింపిక్ చరిత్రలో భారత్ ఈసారి ఎక్కువ (7) పతకాలు గెలవడం తనకు చాలా సంతోషం కలిగించిందన్న మాజీ క్రీడా శాఖ మంత్రి, ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మన దేశం మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. టోక్యోలో రజత, కాంస్యాలు సాధించి కొద్ది రోజుల క్రితమే భారత్‌కు వచ్చేసిన మీరాబాయి చాను, పీవీ సింధు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కేక్ కట్ చేస్తున్న భారత హాకీ జట్టు సభ్యులు విమానాశ్రయంలో రచ్చ... టోక్యో విజేతలకు సోమవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో అభిమానులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ‘సాయ్’ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని తమ ఆటగాళ్లకు ‘వెల్కమ్’ చెప్పారు. అయితే ఈ సందర్భంగా పరిస్థితి అంతా గందరగోళంగా మారిపోయింది. అభిమానులు, ఆటగాళ్ల సన్నిహితులతో విమానాశ్రయం నిండిపోవడంతో బాగా రచ్చ జరిగింది. త్రివర్ణ పతాకాలతో ఎయిర్పోర్ట్ వద్ద డప్పు, ఇతర వాయిద్యాలతో ఫ్యాన్స్ పెద్ద శబ్దాలు చేస్తూ హంగామా సృష్టించారు. సెల్ఫీల కోసం మీద పడిపోతున్న వారి నుంచి తప్పించుకొని బయటకు రావడానికి ఆటగాళ్లు బాగా ఇబ్బంది పడ్డారు. నీరజ్ పోలీస్ భద్రత మధ్య బయటకు రాగా... బజరంగ్ పూనియా, రవి దహియాలను అతని మిత్రులు భుజాలపై ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఒలింపిక్ స్వర్ణం సాధించిన తర్వాత రోజు తీవ్రమైన ఒంటి నొప్పులతో బాధపడ్డాను. అయితే నా విజయం ముందు అది చాలా చిన్న విషయం. జావెలిన్ విసిరిన సమయంలో నేను నా వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని మాత్రమే అనుకున్నాను. అయితే త్రో ఇంకా చాలా దూరం వెళ్లింది. ఈ పతకం నా ఒక్కడిదే కాదు. భారతదేశ ప్రజలందరిది. ప్రత్యర్థి ఎంత బలమైనవాడైనా సరే మన అత్యుత్తమ ఆట ప్రదర్శించాలని, ప్రత్యర్థి గురించి భయపడవద్దని చెబుతా. అదే బంగారు పతకాన్ని తెచ్చి పెట్టింది. నాకూ పొడవాటి జుట్టు ఉంచడమే ఇష్టం. వేడి వల్ల చెమట పట్టి ఇబ్బంది కావడంతో జుట్టు తగ్గించుకున్నా. – సన్మాన కార్యక్రమంలో నీరజ్ చోప్రా -
హ్యాట్రిక్ ‘వందన కథ చెపుతుందిదే..బేటీ ఖేల్నేదో!
మూడు నెలల క్రితం హాకీ ప్లేయర్ వందనా కటారియా తండ్రి మరణించాడు. చివరి చూపులకు నోచుకోలేని దూరంలో ఒలింపిక్స్ ట్రయినింగ్లో ఉంది వందన. ‘అన్నీ వదిలేసి నాన్న కోసం ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తా’ అని ఏడ్చింది వందన. కాని దేశం కోసం ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ‘తక్కువ కులం’ అమ్మాయి ఇంత ఎదగడం ఇష్టం లేని ‘అగ్రవర్ణ కుర్రాళ్లు’ ఆమె ఇంటి ముందు హంగామా సృష్టించారు. కాని విజేత ఎప్పుడూ విజేతే. దేశమే ఆమె కులం. అందుకే నేడు ఆమెను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి అంబాసిడర్‌ని చేసింది. కొందరు పూలదండలు పొందుతారు. మరి కొందరు రాళ్లనూ పూలు చేసుకుంటారు. ఉత్తరాఖండ్ సి.ఎం. పుష్కర్ సింగ్ ధమి ఆదివారం (ఆగస్టు 8) వందనా కటారియాను తమ రాష్ట్ర ‘బేటీ బచావో’ కాంపెయిన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు. వందనా కటారియా హరిద్వార్ జిల్లాలోని రోష్నాబాద్‌లో పుట్టి పెరిగింది. భారతీయ మహిళా హాకీలో కీలకమైన ఫార్వర్డ్ ప్లేయర్. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ చేసి, అలాంటి రికార్డు సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె చేసిన అద్భుత ప్రయాణం ఈ ఊరి నుంచే మొదలైంది. నిజానికి వందనను ‘బేటీ బచావో’ కాంపెయిన్తోపాటు ‘బేటీ ఖేల్నేదో’ (అమ్మాయిలను ఆడనివ్వండి) క్యాంపెయిన్‌కి కూడా అంబాసిడర్ ని చేయాలి. ఎందుకంటే కుటుంబం, ఊరు కూడా ఆమె ఆటకు అభ్యంతరాలు చెప్పాయి. చెట్ల కొమ్మలతో బి.హెచ్.ఇ.ఎల్లో టెక్నిషియన్‌గా పని చేసే నహర్ సింగ్ తొమ్మిది మంది సంతానంలో ఒకమ్మాయి వందన. ఆమె అక్క, చెల్లి.. ముగ్గురూ కలిసి చెట్ల కొమ్మలతో హాకీ ఆడేవారు. అక్క, చెల్లి జిల్లాస్థాయిలోనే ఉండిపోతే వందనా ఒలింపిక్స్ దాకా ఎదిగింది. కాని వీళ్లు ముగ్గురూ క్రీడల్లోకి వెళతామంటే వాళ్ల నానమ్మ ఒప్పుకోలేదు. అన్నయ్యలు కూడా ఒప్పుకోలేదు. మిగిలిన చెల్లెళ్లు ఆటలో ఆగిపోయినా వందనా మీరట్ కు వెళ్లి అక్కడి స్పోర్ట్స్ స్కూల్‌కు జాయిన్ అవుదామని నిశ్చయించుకున్నప్పుడు అన్నయ్యలు ఎక్కడ చదివిస్తాం అని పెదవి విరిచారు. పైగా ఊరి వాళ్లు ఎందుకు ఆడపిల్లలకు ఆటలు అని ఎప్పుడూ వందన తండ్రికి సుద్దులు చెప్పేవారే. కాని తండ్రి ఆమె ప్రతిభను గౌరవించాడు. సపోర్ట్ చేశాడు. నువ్వు ఒకరోజు దేశానికి పేరు తేవాలి... మన ఊరికి పేరు తేవాలి అనేవాడు. దురదృష్టవశాత్తు మూడు నెలల క్రితమే ఆయన చనిపోయాడు. అప్పుడు వందన ట్రయినింగ్ క్యాంప్‌లో ఉంది. రావడం సులువు కాదు. రాకుండా ఉండలేదు. ‘నాన్న కోసం వచ్చేస్తాను అన్నయ్యా... ఆయన్ను చివరి చూపు చూడాలని ఉంది’ అని ఏడ్చింది వందన. ‘వద్దమ్మా... ఇక్కడి పనులు మేము చూసుకుంటాం. నాన్నకు నువ్వు మెడల్ తీసుకురావడమే అసలైన నివాళి’ అని అన్నయ్య చెప్పాడు. ఆమె ఆగిపోయింది. ఒలింపిక్స్‌లో ఆడింది. ఒకే మ్యాచ్‌లో మూడు గోల్స్ కొట్టింది. అది ఆమె ఘనత. ఎదగకూడదా? పాలేరు కొడుకు పాలేరు కావాలి... పని మనిషి కూతురు పని మనిషి కావాలి అనే భావజాలం మన దేశంలో కొందరిలో ఉంది. ఒక కులం వాళ్లు ఇంతలోనే ఉండాలి ఒక కులం వాళ్లు రాజ్యాలు ఏలాలి అనుకునే సంకుచిత మనస్తత్వం ఉందనేది వాస్తవం. వందన సొంత ఊరు రోష్నాబాద్‌లో ఉంది. చిన్న గల్లీలో ఉంటుంది వందన ఇల్లు. వందన ఎదగడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడటం, పేరు రావడం ఆ ఊరిలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కుర్రాళ్లకు నచ్చలేదు. వందన సోదరుడు ‘మమ్మల్ని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ల బాధ పడలేక సిసి కెమెరాలు బిగించాం’ అన్నాడు. అవమానించాలని చూసిన రోజు భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్ సెమి ఫైనల్స్‌కు వెళ్లి దేశమంతా గొప్ప ప్రశంసలు పొందింది. అర్జెంటీనాతో మేచ్ గెలిస్తే ఫైనల్స్‌లోకి వెళ్లేది. నిజానికి వందనా హాకీ స్టార్ అయ్యాక ఊళ్లో ఎంతో మార్పు వచ్చింది. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. అగ్రవర్ణాల వారు కూడా వందనను ఎంతో మెచ్చుకున్నారు. ఊళ్లో వందన కుటుంబానికి ఎంతో గౌరవం కూడా పెరిగింది. కాని అదే సమయంలో కొందరు కుర్రాళ్లు మాత్రం భరించలేకపోయారు. అర్జెంటీనాతో మ్యాచ్ ఓడిన రోజు మ్యాచ్ అయిన వెంటనే వారు వందన ఇంటి ముందుకు వచ్చి టపాకాయలు కాల్చారు. ‘ఇలాంటి వాళ్లు (తక్కువ వర్ణాల వాళ్లు) టీమ్‌లో ఉండటం వల్లే ఇండియా ఓడిపోయింది’ అనే అర్థంలో కామెంట్లు చేశారు. చాలా అవమానించే ప్రయత్నం చేశారు. వందన కుటుంబం ఆ దాడికి దిగ్భ్రాంతి చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశమంతా దీనిపై నిరసనలు జరిగాయి. ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రభుత్వమే అడ్డుగా నిలబడి.. దేశం కోసం ఆడిన వందన ఇలాంటి దాడి ఎదుర్కొనడం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా సహించలేకపోయింది. వెంటనే ఆ రాష్ట్ర క్రీడల మంత్రి రంగంలో దిగి వందన కుటుంబానికి ధైర్యం చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆమెను తమ మహిళా, శిశు సంక్షేమ శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. తమ రాష్ట్రానికి చెందిన గొప్ప క్రీడాకారిణిగా ఆమెను గౌరవిస్తున్నామని తెలిపారు. మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో రాణించాలంటే అదీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నుంచి రాణించాలనంటే ముందు ‘అమ్మాయి’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత ‘వనరులు’ అనే అడ్డంకిని దాటాలి, తర్వాత వెనుకబడిన వర్గాల నుంచి అయినట్టయితే ‘సామాజిక వివక్ష’నూ దాటాలి. ఇన్ని అడ్డంకులను దాటి, దాటుతూ కూడా వందన సమున్నతంగా నిలబడింది. వందన ఉదంతం ఇలాంటి నేపథ్యం ఉన్నవాళ్లకు క్రీడల్లో ఎన్ని అడ్డంకులు ఉంటాయో తెలియజేస్తోంది. ఇలాంటి నేపథ్యం ఉన్నా ఈ దేశంలో విజయం సాధించేందుకు సకల అవకాశాలు ఉన్నాయని కూడా తెలియచేస్తోంది. మనం చూడాల్సింది ఈ రెండో కోణాన్నే. వందనా కటారియా -
ఢిల్లీకి చేరిన ఒలింపిక్స్ బృందం.. ఐఓఏ అధికారుల ఘన స్వాగతం
ఢిల్లీ: భారత ఒలింపిక్స్ బృందం సోమవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఒలింపిక్స్ కీడ్రాకారులకు ఐఓఏ అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ సజావుగా సాగిన టోక్యో ఒలింపిక్స్ ముగిసాయి. కోవిడ్ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహించారు. ఇక ఈ ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్ మహిళామణి 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు (రజతం, కాంస్యం) గెలిచిన తొలి భారత మహిళగా పీవీ సింధు రికార్డులకెక్కింది. ఇక ఆర్మీ నాయక్ సుబేదార్ విశ్వక్రీడల్లో (అథ్లెటిక్స్) బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్ పాజిబుల్’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు. రవి దహియా 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో రజతం సాధించి భారత వెండికొండగా మారాడు. మరోవైపు భారత హకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. మన్‌ప్రీత్ జట్టును నడిపిస్తే... గోల్‌కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడ, స్ట్రయికర్ సిమ్రన్‌జీత్ సింగ్ ప్రదర్శన పోడియంలో నిలబెట్టాయి. ఇక అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌లో విజేందర్, మేరీకోమ్‌ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది. దిగ్గజం మేరీకోమ్ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. అంతేకాకుండా ఫేవరెట్‌గా టోక్యోకు వెళ్లిన గోల్డెన్ రెజ్లర్ బజరంగ్ పూనియా కాంస్యంతో మురిపించాడు. -
నీరజ్ ఒలింపియన్ కావొచ్చు.. కానీ: భారత అథ్లెట్ తేజస్విన్
న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా. అందని ద్రాక్షగా ఉన్న దశాబ్దాల కలను నెరవేర్చి భారతీయుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే, తాను సాధించిన బంగారు పతకంలాగే నీరజ్ మనసు కూడా బంగారమేనట. స్నేహితుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడేందుకు ఈ 23 ఏళ్ల ఆర్మీ సుబేదార్ వెనుకాడట. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఫ్రెండ్, భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ ఈ మాట అంటున్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన కాలమ్‌లో.. నీరజ్ అందరికంటే ఎంతో ప్రత్యేకమని, ఎవరి మనసునూ నొప్పించడని పేర్కొన్న తేజస్విన్.. అతడితో తనకున్న అనుబంధం గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ‘‘మా అందరి కంటే తను ఎంతో విభిన్నం. ఇండియాకు తొలి స్వర్ణం సాధించి పెట్టిన అథ్లెట్ కదా తను. కానీ తనకు ఏమాత్రం గర్వం ఉందు. జోహన్నెస్ వెట్టర్(జర్మనీ జావెలిన్ త్రో ప్లేయర్- వరల్డ్ నంబర్ 1)కు పతకం చేజారడం తను విచారం వ్యక్తం చేశాడు. ఒక స్నేహితుడు ఏదైనా కోరితే.. నో చెప్పడం నీరజ్‌కు అస్సలు ఇష్టం ఉండదు. ఎంతో మంది స్నేహితులు తన నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నారు. కానీ.. తను మాత్రం కనీసం వారి పేర్లు కూడా రాసుకోలేదు. ఈ విషయం నీరజ్ నాకు స్వయంగా చెప్పాడు. ఇతరులను ఇబ్బందిపెట్టడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండదు అమ్మో.. నీరజ్‌తో రూం షేర్ చేసుకుంటే అంతే ఇక! నీరజ్‌కు అత్యంత ఆప్తుడైన హైజంపర్ తేజస్విన్ 2018 కామన్వెల్త్ గేమ్స్ వంటి మేజర్ ఈవెంట్ల సమయంలో అతడితో కలిసి రూం కూడా షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో.. బెంగళూరులో రెండు వారాల పాటు తనతో కలిసి ఉన్న విషయాన్ని గుర్తుచేసుకున్న తేజస్విన్.. ‘‘15 రోజుల పాటు నీరజ్‌తో ఒకే గదిలో ఉన్నాను. తను ఒలింపిక్ చాంపియన్ అయితే కావొచ్చు గానీ.. ఇప్పటికీ తనతో రూం షేర్ చేసుకోవాలంటే నాకు భయమే. ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకోవడం తనకు చేతకాదు. ఒక్కసారి తన గదిలోకి వెళ్లి చూస్తే.. దుస్తులేమో బెడ్ మీద ఆరేసి ఉంటాయి.. సాక్సులు ఎక్కడో కింద పడేసి ఉంటాయి. అయినా నేనేమీ అనేవాడిని కాదు. ఎందుకంటే తనతో గదిని పంచుకోవడమే నాకు గొప్ప విషయం. ఇద్దరం కలిసి ఫ్రైడ్ రైస్ తినేవాళ్లం. రాత్రివేళ మట్కా కుల్ఫీ లాగించేసేవాళ్లం. వీడియో గేమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. మినీ మిలిటియా అంటే తనకు క్రేజ్. ఇక టోక్యోలో నీరజ్ పసిడి గెలిచాడని తెలియగానే.. నేను ఆనందంతో ఉబ్బితబ్బియ్యాను. 20 పుషప్‌లు చేశాను. పారిస్‌కు ఎలా సన్నద్ధం కావాలన్న అంశం గురించి అప్పుడే ఆలోచనలు గిర్రున తిరిగాయి’’ అని స్నేహితుడి అరుదైన ఘనత పట్ల తేజస్విన్ సంతోషం వ్యక్తం చేశాడు. గర్ల్‌ఫ్రెండ్ ఉందా అని అడుగుతా ‘‘స్నేహితుల కోసమే ఇంత చేస్తాడు కదా.. ఈసారి నీరజ్‌ను కలిస్తే.. ‘‘నీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందా’’ అని అడుగుతాను’’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా తమిళనాడుకు చెందిన తేజస్విన్ 2017లో అమెరికాకు వెళ్లి కేన్సస్ స్టేట్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు అభ్యసిస్తూ అథ్లెటిక్స్ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల అమెరికాలో జరిగిన బిగ్–12 అవుట్డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల హైజంప్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించాడు. చదవండి: Aditi Ashok: పార్, బర్డీ, ఈగల్.. ఈ పదాలు ఏంటో తెలుసా? -
వారెవ్వా: ‘పంచ్’ అదిరిందిగా.. బాక్సింగ్‌లో టాప్ ఎవరంటే!
టోక్యో: ఒలింపిక్స్‌లో క్యూబా బాక్సర్ల పంచ్‌లకు ప్రత్యర్థుల వద్ద సమాధానాలు కరువయ్యాయి. ఆదివారం పురుషుల లైట్‌వెయిట్ (63 కేజీలు) విభాగంలో జరిగిన ఫైనల్ బౌట్లో క్యూబా బాక్సర్ ఆండీ క్రూజ్ 4–1తో కీషాన్ డేవిస్ (అమెరికా)పై గెలుపొందాడు. డేవిస్‌పై క్రూజ్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. పురుషుల +91 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రిచర్డ్ టొర్రెస్ జూనియర్ (అమెరికా) 0–5తో బకోదిర్ జలొలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. దాంతో 17 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గాలని చూసిన అమెరికాకు నిరాశే మిగిలింది. ఓవరాల్‌గా బాక్సింగ్‌లో ఐదు పతకాలు (నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం) సాధించిన క్యూబా టాప్ పొజిషన్లో నిలిచింది. వాటర్‌పోలో విజేత సెర్బియా పురుషుల విభాగంలో ఆదివారం జరిగిన వాటర్‌పోలో ఫైనల్లో సెర్బియా 13–10 గోల్స్ తేడాతో గ్రీస్‌పై గెలుపొందింది. నికోలా జాక్సిచ్ మూడు గోల్స్ చేసి సెర్బియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో హంగేరి తర్వాత వాటర్పోలోలో వరుసగా రెండు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ నెగ్గిన జట్టుగా సెర్బియా నిలిచింది. గతంలో హంగేరి 2000–08 మధ్య జరిగిన ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ స్వర్ణాలను గెల్చుకుంది. చదవండి: మనసులు గెలిచిన అదితి.. పార్, బర్డీ, ఈగల్ అంటే ఏంటో తెలుసా? -
అదరగొట్టిన కిప్చోగెదే: మరోసారి స్వర్ణం అతడిదే
టోక్యో: పురుషుల మారథాన్ రేసులో తనకు తిరుగులేదని కెన్యా అథ్లెట్ ఎలూయిడ్ కిప్‌చోగె మరోసారి నిరూపించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన అతడు... ఐదేళ్ల తర్వాత జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆదివారం జరిగిన ఈ మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు) కిప్‌చోగె 2 గంటల 8 నిమిషాల 38 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించాడు. ఒలింపిక్స్‌లో కిప్చోగెకిది నాలుగో పతకం కాగా... ఇందులో రెండు స్వర్ణాలు ఉన్నాయి. అంతేకాకుండా పురుషుల మారథాన్‌లో రెండు పసిడి పతకాలు సాధించిన మూడో అథ్లెట్‌గా కిప్‌చోగె నిలిచాడు. గతంలో అబెబె బికిలా (ఇథియోపియా–1960, 64), వాల్దెమర్ సిరి్పన్స్కి (జర్మనీ–1976, 80) కిప్‌చోగె కంటే ముందు ఈ ఘనతను సాధించారు. మొత్తం 106 మంది ఈ మారథాన్‌లో పాల్గొనగా... 30 మంది రేసును పూర్తి చేయకుండా మధ్యలోనే వైదొలిగారు. చదవండి: Tokyo Olympics: 37 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ తొలిసారిగా.. -
37 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ తొలిసారి; బ్రిటన్ సైక్లిస్ట్ సరికొత్త చరిత్ర
టోక్యో: హ్యాండ్‌బాల్‌లో ఫ్రాన్స్ సరికొత్త చరిత్రను లిఖించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆదివారం మహిళల విభాగంలో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 30–25తో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ)పై గెలుపొంది స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే పురుషుల విభాగంలోనూ ఫ్రాన్స్ జట్టే స్వర్ణాన్ని నెగ్గడంతో... 37 ఏళ్ల తర్వాత రెండు విభాగాల్లోనూ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ నెగ్గిన తొలి జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. కాంస్యం కోసం జరిగిన పోరులో నార్వే 36–19తో స్వీడన్‌పై నెగ్గింది. జేసన్ కెన్నీ రికార్డు స్వర్ణాలు ఒలింపిక్స్‌లో బ్రిటన్ సైక్లిస్ట్ జేసన్ కెన్నీ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల 200 మీటర్ల కీరిన్ ఫైనల్ రేసులో జేసన్ అందరి కంటే ముందుగా 10.481 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణాన్ని నెగ్గాడు. తద్వారా ఒలింపిక్స్‌లో ఏడో స్వర్ణాన్ని సాధించిన జేసన్... బ్రిటన్ తరఫున అత్యధిక పసిడి పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా ఘనతకెక్కాడు. 0.763 సెకన్లు వెనుకగా రేసును ముగించిన మొహమ్మద్ అజీజుల్లాస్ని (మలేసియా) రజతాన్ని... హ్యారీ లావ్రిసెన్ (నెదర్లాండ్స్) కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. చదవండి: భజ్జీ నువ్వు కరెక్టే.. కానీ అలా అనకూడదు: గౌతమ్ గంభీర్ -
చైనాను వెనక్కి నెట్టి.. టాప్ ర్యాంకులో అమెరికా
Tokyo Olympics: విశ్వ క్రీడల్లో మరోసారి తమ ఆధిపత్యం చాటుకున్న అమెరికా టోక్యో ఒలింపిక్స్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించింది. పోటీల చివరి రోజు వరకు అమెరికా స్వర్ణాల సంఖ్యలో చైనాకంటే రెండు పతకాలు వెనుకంజలో ఉంది. అయితే ఆఖరి రోజు అమెరికా మూడు పసిడి పతకాలు సాధించి చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. మహిళల వాలీబాల్‌లో తొలిసారి అమెరికాకు బంగారు పతకం లభించింది. మహిళల బాస్కెట్‌బాల్‌లో అమెరికా జట్టు ఏడోసారి విజేతగా నిలిచింది. సైక్లింగ్ ఓమ్నియమ్ పాయింట్స్ రేసులో జెన్నిఫర్ వాలెంటి అమెరికాకు స్వర్ణాన్ని అందించింది. గత ఏడు ఒలింపిక్స్‌లో అమెరికా అగ్రస్థానంలో నిలవడం ఇది ఆరోసారి. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో చైనా తొలిసారి టాప్ ర్యాంక్‌లో నిలవగా, అమెరికా రెండో స్థానానికి పరిమితమైంది. వాలీబాల్‌లో తొలిసారి... వాలీబాల్ మహిళల విభాగంలో జరిగిన ఫైనల్లో అమెరికా 25–21, 25–20, 25–14తో బ్రెజిల్ మహిళల జట్టుపై గెలుపొంది తొలిసారి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. బాస్కెట్‌బాల్‌లోనూ అమెరికా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికే పురుషుల విభాగంలో పసిడి పతకంతో నెగ్గిన అమెరికా... మహిళల విభాగంలోనూ మెరిసింది. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో అమెరికా 90–75తో జపాన్‌పై ఘనవిజయం సాధించి స్వర్ణంతో మెరిసింది. తద్వారా వరుసగా ఏడోసారి (1996 నుంచి 2020) ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన అమెరికా మహిళల జట్టు... పురుషుల టీమ్ సరసన నిలిచింది. 1936–1968 మధ్య జరిగిన ఏడు ఒలింపిక్స్‌ల్లోనూ అమెరికా పురుషుల జట్టు స్వర్ణాలు నెగ్గింది. చదవండి: నీరజ్ చోప్రాకు ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ భారీ నజరానా -
పీవీ సింధును సత్కరించిన సినీ నటుడు శివారెడ్డి
సాక్షి, మణికొండ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సినీ నటుడు శివారెడ్డి సత్కరించారు. ఆదివారం ఆమె నివాసానికి వెళ్లి వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటం గర్వకారణమని అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఆమె పతకం సాధించిన సందర్భంలోని ఫొటోను సింధుకు బహూకరించానని, తన కామెడీ ఎంతో బాగుంటుందని సింధుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను అభినందించారని శివారెడ్డి పేర్కొన్నారు. కాగా టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు మూడో స్థానంతో మరో పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా నిలిచింది. -
పారిస్‌లో కలుద్దాం.. అందరికీ ‘అరిగాటో’...
క్రీడల్లో గెలుపోటములు సహజం... కానీ ఈసారి క్రీడల్లో ఫలితాలు కాదు... క్రీడలు మహమ్మారిని ఓడించడమే అతి పెద్ద విజయం... కరోనా కేసులు, పాజిటివ్ ప్రమాద ఘంటికలు, దేశంలో నిరసనలు, వందల కోట్ల రూపాయల నష్టం... అయినా ఆటలు ఆగలేదు. ప్రేక్షకులకు అనుమతి లేదు... స్పాన్సర్లు తమ సొంత ప్రచారానికి కూడా ఇష్టపడలేదు... ఏ రోజు ఏ అనూహ్య ఘటన జరిగి క్రీడలపై ప్రభావం పడుతుందని నిర్వాహకులకు క్షణక్షణం భయం... కానీ క్రీడలు మాత్రం నిరాటంకంగా కొనసాగాయి. ఒకవైపు కోవిడ్‌తో సహవాసం చేస్తూ కూడా మరోవైపు పోటీలు కొనసాగాయి. స్వర్ణం, రజతం, కాంస్యం... ఒలింపిక్స్ అంటే ఈ మూడు పదాలపైనే చర్చ సాగేది. ఇప్పుడు వీటితో పాటు కోవిడ్ కూడా ఒలింపిక్ క్రీడల్లో నేనున్నానంటూ వచ్చింది. అయితే చివరకు ఆటదే పైచేయి అయింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పతకధారులు, పతాకధారుల అద్భుత ప్రదర్శనలు మాత్రం చరిత్రలో నిలిచిపోయాయి. బయట ఏం జరిగినా ఆటపై మాత్రం వాటి ప్రభావం పడకపోవడంతో విశ్వ క్రీడల్లో అసమాన ఆటను చూసే అవకాశం అభిమానులకు దక్కింది. అన్ని రకాల అభినందనలకు అర్హమైన జపాన్ దేశం తమకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ‘అరిగాటో’ (జపాన్ భాషలో థ్యాంక్యూ) అంటూ ముగించింది. టోక్యో: 2020 విశ్వ క్రీడల సంబరానికి తెర పడింది. అన్ని అవరోధాలను అధిగమించి రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను మురిపించిన టోక్యో ఒలింపిక్స్ ఆదివారం ఘనంగా ముగిశాయి. ఏడాది పాటు వాయిదా పడి ఒకదశలో అసలు జరుగుతాయా లేదా అనే సందేహాలు రేకెత్తినా... అడ్డంకి లేకుండా ఆటలు కొనసాగడం విశేషం. క్రీడల ప్రారంభానికి ముందు కరోనా కేసులతో బెంబేలెత్తినా... ఒక్కసారి పోటీలు మొద లు కాగానే ఎలాంటి సమస్య రాకుండా అందరి దృష్టి ఫలితాలపైనే నిలవడం ఈ క్రీడలు విజయవంతం అయ్యాయనడానికి పెద్ద సంకేతం. టోక్యో గవర్నర్ యురికో కొయికె ఒలింపిక్ జెండాను వచ్చే ఒలింపిక్స్ జరిగే పారిస్ మేయర్ అనె హిడాల్గోకు అందించడంతో లాంఛనం పూర్తయింది. చలో పారిస్... మూడేళ్ల వ్యవధిలోనే మళ్లీ ఒలింపిక్స్ రానున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 2024 ఒలింపిక్స్ జరుగుతాయి. ప్రపంచ ఫ్యాషన్ కేంద్రం పారిస్‌లో వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ జరగనుండటం విశేషం. గతంలో రెండుసార్లు ఈ నగరం ఒలింపిక్స్‌కు (1900, 1924) ఆతిథ్యం ఇచ్చింది. ఘనంగా ఉత్సవం... ప్రారంభోత్సవంలాగే నిర్వాహకులు ముగింపు ఉత్సవంలో కూడా తమదైన ముద్ర చూపించారు. ‘వరల్డ్స్ వి షేర్’ థీమ్‌తో సాగిన ముగింపు ఉత్సవంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన వివిధ క్రీడాంశాలకు సంబంధించి పోటీలతో కూడిన ప్రత్యేక వీడియోను వేదికపై చూపించారు. ప్రారంభోత్సవ రోజున వెలిగించిన క్రీడా జ్యోతి మెల్లగా ఆరిపోవడంతో అధికారికంగా ఆటలకు ముగింపు లభించింది. స్టేడియంలో ఉన్న భారీ స్క్రీన్‌పై ‘అరిగాటో’ (జపాన్ భాషలో థ్యాంక్యూ) అని ప్రదర్శించారు. శనివారం రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన బజరంగ్ పూనియా భారత జట్టు ‘ఫ్లాగ్ బేరర్’గా ముగింపు కార్యక్రమంలో ముందుండి నడవగా... పరిమిత సంఖ్యలో ఉన్న మన క్రీడాకారులు అతడిని అనుసరించారు. ఆగస్టు 24 నుంచి ఇదే టోక్యోలో దివ్యాంగుల కోసం పారాలింపిక్స్ జరుగుతాయి. 48వ స్థానంలో భారత్... టోక్యోలో భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో 128 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 7 గెలిచిన భారత్ ఒలింపిక్స్ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో (స్వర్ణాల సంఖ్య ఆధారంగా) భారత్ 48వ స్థానంలో నిలిచింది. నెగ్గిన మొత్తం పతకాల సంఖ్య ప్రకారమైతే భారత్‌కు 33వ స్థానం దక్కింది. అయితే ఒలింపిక్స్‌లో స్వర్ణాల సంఖ్య ఆధారంగానే ర్యాంక్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం నెగ్గగా... మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను... పురుషుల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో రవి దహియా రజత పతకాలు సాధించారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు... మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్... పురుషుల రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా... పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలు గెల్చుకున్నాయి. కొన్ని మరచిపోలేని... పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగే క్రీడాకారులకు ప్రతీ పోరు, ప్రతీ ఈవెంట్ ఒక పోరాటమే. గెలుపు సాధించిన ప్రతీ ఒక్కరు హీరోలే. కొత్త ప్రపంచ రికార్డులు, ఒలింపిక్ రికార్డులకు తోడు ప్రతీ క్రీడలోనూ తమదైన ముద్ర వేసిన ఘటనలు కొన్ని అలా మిగిలిపోతాయి. టోక్యో అలా కొన్ని మరచిపోలేని క్షణాలను గుర్తు చేసుకుంటే... అమెరికాదే ఆధిపత్యం... రియో ఒలింపిక్స్‌తో పోలిస్తే 7 స్వర్ణాలు సహా మొత్తంగా 8 పతకాలు తగ్గినా సరే... అగ్రరాజ్యం అమెరికా ఒలింపిక్స్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలతో (మొత్తం 113 పతకాలు) యూఎస్ నంబర్‌వన్‌గా నిలిచింది. శనివారం వరకు కూడా చైనా ఆధిక్యంలో నిలవడంతో... ఈసారి అమెరికా రెండో స్థానానికే పరిమితం అయ్యేటట్లు అనిపించింది. అయితే చివరి రోజు సాధించిన పతకాలు యూఎస్ఏను మళ్లీ ముందంజలో నిలిపాయి. ఆతిథ్య జపాన్ దేశం మూడో స్థానంతో సంతృప్తికరంగా ముగించింది. జపాన్ 27 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలు (మొత్తం 58) గెలుచుకుంది. తుర్క్మెనిస్తాన్, సాన్మరినో, బుర్కినఫాసో దేశాలు తొలిసారి ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాయి. ► జమైకా స్ప్రింటర్ ఎలైన్ థాంప్సన్ 100 మీ., 200 మీ. పరుగులో రియో ఒలింపిక్స్ తరహాలోనే మళ్లీ స్వర్ణ పతకాలు సాధించింది. ఒలింపిక్ చరిత్రలో ఒక మహిళా స్ప్రింటర్ ఇలా పతకాలు నిలబెట్టుకోవడం ఇదే తొలిసారి. 4గీ100 మీటర్ల రిలేలోనూ ఎలైన్ సభ్యురాలిగా ఉన్న జమైకా స్వర్ణం సాధించింది. ► పురుషుల హైజంప్‌లో స్వర్ణాన్ని ఇద్దరు ఆటగాళ్లు పంచుకోవడం అరుదైన ఘటనగా నిలిచిపోయింది. పోరులో సమానంగా నిలిచిన అనంతరం ‘జంప్ ఆఫ్’ ఆడకుండా ముతాజ్ బర్షిమ్ (ఖతర్), గియాన్‌మార్కో తంబేరి (ఇటలీ) స్వర్ణాన్ని పంచుకున్నారు. ► అమెరికా తరఫున ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలిచిన అథ్లెట్‌గా అలీసన్ ఫెలిక్స్ (11 పతకాలు) కొత్త ఘనతను తన పేరిట లిఖించుకుంది. ఈసారి ఆమె రెండు పతకాలు సాధించింది. ఓవరాల్‌గా కార్ల్ లూయిస్ (10 పతకాలు) రికార్డును అధిగమించింది. ► టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం 90 కొత్త ఒలింపిక్ రికార్డులు (ఆర్చరీ–3; అథ్లెటిక్స్–10; సైక్లింగ్ ట్రాక్–6; మోడర్న్ పెంటాథ్లాన్–7; షూటింగ్–11; స్పోర్ట్స్ క్లైంబింగ్–2; స్విమ్మింగ్–21; వెయిట్‌లిఫ్టింగ్–30)... 18 కొత్త ప్రపంచ రికార్డులు (అథ్లెటిక్స్–3; సైక్లింగ్ ట్రాక్–3; షూటింగ్–1; స్పోర్ట్స్ క్లైంబింగ్–1; స్విమ్మింగ్–6; వెయిట్‌లిఫ్టింగ్–4) నమోదయ్యాయి. ► ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు (7) సాధించిన రెండో మహిళగా ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఎమా మెక్‌కియాన్ నిలిచింది. 1952 హెల్సింకీలో సోవియట్ యూనియన్ జిమ్నాస్ట్ మారియా గొరొకొవ్స్కయా సాధించిన ఘనతను ఎమా సమం చేసింది. ► పురుషుల 100 మీటర్ల పరుగులో జమైకా, అమెరికా అథ్లెట్లను దాటి ఇటలీకి చెందిన మార్సెల్ జాకబ్స్ (9.80 సెకన్లు) విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల 4గీ100 మీటర్ల రిలేలో కూడా జాకబ్స్ నేతృత్వంలో ఇటలీనే తొలిసారి స్వర్ణం అందుకుంది. -
Tokyo Olympics: ఏడు పతకాల కథ
ఎవరేమనుకున్నా... మధ్యలో మహమ్మారి దూరినా... కేంద్ర క్రీడా శాఖ ముందు నుంచీ ఒకే మాట చెప్పింది. ఈసారి మనం 2012 లండన్ గేమ్స్ ఆరు పతకాల సంఖ్యను దాటేస్తాం... డబుల్ డిజిట్ (పది పతకాలైనా) కూడా సాధిస్తాం! మాజీ క్రీడల మంత్రి, ప్రస్తుత న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఎక్కడికెళ్లినా ఇదేమాట అన్నారు. ఆయన అన్నట్లే ‘టోక్యో డ్రీమ్స్’ సగం నెరవేరాయి. ఏడు పతకాలతో భారత్ ‘లండన్’ను దాటేసింది. పతకాల పరంగా పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. షూటర్ల గురి కుదిరి ఉంటే... బాక్సర్ల ‘పంచ్’ కూడా అదిరిపోయుంటే... గోల్ఫ్‌లో కాస్త అదృష్టం కలిసొచ్చి ఉంటే... రెజ్లింగ్‌లో దీపక్ పూనియా, వినేశ్ తడబడకపోతే... ఆర్చరీలో బాణం మెరిసుంటే... ఆయన అన్నట్లే పతకాల ‘సంఖ్య’ రెండంకెలు కచ్చితంగా దాటేది. నాలుగు దశాబ్దాల తర్వాత భారత హాకీ అదిరిపోయిందనుకుంటే... అంతకుమించిపోయే అబ్బుర ఫలితం అథ్లెటిక్స్‌లో వచ్చింది. మొత్తానికి టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ స్ఫూర్తితో 2024 పారిస్‌లో మనం మరింత పైకి ఎదగాలని... స్వర్ణ కాంతులు మరిన్ని విరజిమ్మాలని కోరుకుందాం. ‘రియో’ గాయాన్ని ‘టోక్యో’ మాపింది. ఏడు పతకాలతో క్రీడాభారతిని ఆనందడోలికల్లో ముంచేసింది. పతకాలు సాధించిన వారు ముమ్మాటికి విజేయులే! అలాగే పతకాల్ని త్రుటిలో కోల్పోయిన పోరాట యోధులు కూడా ఇక్కడ విజేతలే! ఎందుకంటే ఇక్కడ ఫలితమే తేడా. కానీ పోరాటంలో విజేతకి పరాజితకి తేడా లేదంటే అతిశయోక్తి కాదు. మహిళల హాకీ జట్టు కాంస్యానికి దూరమైనా ప్రదర్శనతో మన గుండెల్లో నిలిచింది. రెజ్లర్ దీపక్ పూనియా, గోల్ఫర్ అదితి పతకాలకు చేరువై చివరకు దూరమయ్యారు. మొత్తానికి టోక్యోలో మన క్రీడాకారుల శ్రమకు మంచి ఫలితాలే వచ్చాయి. మీరా రజత ధీర... ఈ ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను శుభారంభమే నీరజ్ బంగారానికి నాంది అయ్యిందేమో! ఆరంభ వేడుకలు ముగిసి పోటీలు మొదలైన తొలి రోజే ఆమె రజతంతో బోణీ కొట్టింది. ‘లండన్’ దాటేందుకు ఈ వెయిట్‌లిఫ్టరే జేగంట మోగించింది. 26 ఏళ్ల చాను పోయిన చోటే వెతుక్కోవాలనుకుంది. ‘రియో’ ఒలింపిక్స్ చేదు అనుభవాన్ని టోక్యో ఒలింపిక్స్ రజతంతో చెరిపేసింది. 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్ మహిళామణి 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. సింధు పతకాల విందు... ‘రియో’లో భారత ఆశల పల్లకిని ఫైనల్‌దాకా మోసిన ఏకైక క్రీడాకారిణి పీవీ సింధు. బ్యాడ్మింటన్‌లో రన్నరప్ అయిన సింధు పతకం రంగుమార్చాలని, స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగింది. తనకెదురైన జపాన్ స్టార్ అకానె యామగుచిని క్వార్టర్స్‌లో మట్టికరిపించిన తెలుగు తేజం దురదృష్టవశాత్తు సెమీస్‌లో తడబడింది. వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్‌కు తలవంచిన 26 ఏళ్ల సింధు కాంస్య పతక పోరులో మాత్రం పట్టువీడని పోరాటం చేసింది. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు (రజతం, కాంస్యం) గెలిచిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. నీరజ్ ‘మిషన్ పాజిబుల్’... భారత్ ‘టోక్యో డ్రీమ్స్’లో అథ్లెటిక్స్ పతకం ఉంది. కానీ పసిడి మాత్రం లేదు. నీరజ్ చోప్రా ఆ టోక్యో డ్రీమ్స్ ఊహకే అందని విధంగా జావెలిన్ విసిరేశాడు. 23 ఏళ్ల ఈ ఆర్మీ నాయక్ సుబేదార్ విశ్వక్రీడల్లో (అథ్లెటిక్స్) బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్ పాజిబుల్’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు. హరియాణా రైతు బిడ్డ ఇప్పుడు భరతమాత ముద్దుబిడ్డ అయ్యాడు. రెజ్లింగ్‌లో హరియాణా బాహుబలి రవి దహియా. తన శారీరక సామర్థ్యానికి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించిన రవి మల్లయుద్ధంలో మహాబలుడు. ఛత్రశాల్ స్టేడియం చెక్కిన మరో చాంపియన్ రెజ్లర్. పసిడి వేటలో కాకలు తిరిగిన సింహబలుడితో చివరకు పోరాడి ఓడాడు. 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో రజతం సాధించి భారత వెండికొండగా మారాడు. పురుషుల హాకీ కంచు... మన తాత, తండ్రులకు తెలిసిన ఒలింపిక్స్ హకీ ఘన చరిత్రను మనకూ తెలియజేసిన ఘనత కచ్చితంగా మన్‌ప్రీత్‌సింగ్ సేనదే. విశ్వక్రీడల్లో నాలుగు దశాబ్దాల నిరాశకు టోక్యోలో చుక్కెదురైంది. పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. సెమీస్‌లో బెల్జియం చేతిలో పరాజయం ఎదురైనా... పతకం ఆశ మిగిలుండటంతో ప్లేఆఫ్‌లో జర్మనీపై సర్వశక్తులు ఒడ్డి గెలిచిన తీరు అసాధారణం. మన్‌ప్రీత్ జట్టును నడిపిస్తే... గోల్‌కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడ, స్ట్రయికర్ సిమ్రన్‌జీత్ సింగ్ ప్రదర్శన పోడియంలో నిలబెట్టాయి. లవ్లీనా పంచ్... పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్. భారత తురుపుముక్క, దిగ్గజం మేరీకోమ్ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. ఒలింపిక్స్‌కు ఆఖరి కసరత్తుగా యూరోప్ వెళ్లేందుకు సిద్ధమైన 23 ఏళ్ల లవ్లీనాను కోవిడ్ అడ్డుకుంది. కానీ ఆమె టోక్యోలో పతకం గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేకపోయింది. అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌లో విజేందర్, మేరీకోమ్‌ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది. బజరంగ్ పట్టు... ఫేవరెట్‌గా టోక్యోకు వెళ్లిన గోల్డెన్ రెజ్లర్ బజరంగ్ పూనియా కాంస్యంతో మురిపించాడు. గంపెడాశలు పెట్టుకున్న షూటర్లతో పోల్చితే బజరంగ్ ముమ్మాటికి నయం. బాల్యం నుంచే కుస్తీ పట్లు పట్టిన ఈ హరియాణా రెజ్లర్ టోక్యో వేదికపై కంచు పట్టు పట్టాడు. ఇతన్నీ ఛత్రశాల్ స్టేడియమే చాంపియన్ రెజ్లర్‌గా తీర్చిదిద్దింది. అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు నెగ్గిన ఇతని ఖాతాలో తాజాగా ఒలింపిక్ పతకం కూడా భర్తీ అయ్యింది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆదివారం తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. ‘ఎన్నో రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌లో సాధించిన పతకంతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది’ అని మీరాబాయి ట్వీట్ చేసింది. -
ఒలింపిక్స్‌లో సాధించలేకపోయా.. కానీ ఆ రికార్డు బద్దలుకొడతా
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయుల బంగారు స్వప్నం సాకారమైంది. రెండు వారాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పసిడి దృశ్యం శనివారం ఆవిష్కృతమైంది. అథ్లెటిక్స్ ఈవెంట్లో భాగంగా పురుషుల జావెలిన్ త్రోలో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా అద్వితీయ ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అయితే నీరజ్ జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలని భావించాడు. కానీ దానిని అందుకోలేకపోయాడు. స్వర్ణ పతకం సాధించిన అనంతరం సెలబ్రేషన్స్‌లో భాగంగా నీరజ్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడాడు. ''ఈ సంవత్సరం తనకు చాలా ముఖ్యమైంది. రెండు మూడు అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడం తనకు చాలా సహాయపడింది. అందువల్లే ఒలింపిక్స్‌కు ఎలాంటి ఒత్తిడి లేకుండా సన్నద్ధమయ్యాను. అంతేగాక నా ప్రదర్శనపై దృష్టి పెట్టగలిగాను. టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచాను. అయితే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగినప్పుడు 90.57 మీటర్ల ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టాలని అనుకున్నా. ఇప్పడు అది సాధ్యపడలేదు.. కానీ రానున్న రోజుల్లో కచ్చితంగా ఆ రికార్డును బద్దలుకొడుతా. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలనే ఆకాంక్షను నెరవేర్చుకున్నా.ఇక నా నెక్స్ట్ టార్గెట్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే. దాని సన్నద్దత కోసం లాసాన్నే, పారిస్, జూరిచ్ జావెలిన్ ఫైనల్లో పాల్గొనబోతున్నా. '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఈ ఏడాదే జరగాల్సి ఉన్నప్పటికి టోక్యో ఒలింపిక్స్ జరగడంతో వచ్చే ఏడాదిలో జరగనుంది. #WATCH | My participation in the two-three international competitions helped me a lot. So there was no pressure on me while playing in #TokyoOlympics and I was able to focus on my performance: Javelin throw Gold medalist Neeraj Chopra pic.twitter.com/nefpG9Tla7 — ANI (@ANI) August 7, 2021 -
'37 ఏళ్ల నా కలను నిజం చేశావు బేటా'
ఢిల్లీ: నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణంతో జపాన్ గడ్డపై మువన్నెల జెండాను రెపరెపలాడించాడు. ఈ నేపథ్యంలో 'పరుగుల రాణి' పీటీ ఉష నీరజ్ చోప్రాను అభినందిస్తూ అతనితో దిగిన పాత ఫోటోను తన ట్విటర్లో షేర్ చేసింది. '' 37 ఏళ్ల తర్వాత నా కలను నిజం చేశావు.. థ్యాంక్యూ బేటా.. ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయానన్న బాధను ఈరోజుతో మర్చిపోయేలా చేశావు. నేను సాధించకుంటే ఏంటి.. ఒక భారతీయుడిగా నువ్వు దానిని చేసి చూపించావు'' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం పీటీ ఉష ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా '' పయ్యోలి ఎక్స్‌ప్రెస్'' .. '' పరుగుల రాణిగా'' పేరు పెందిన పీటీ ఉష.. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం సాధించే అవకాశం కోల్పోయింది. ఆ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్ విభాగంలో పోటీ పడిన ఆమె సెకనులో వందోవంతులో కాంస్య పతకం కోల్పోవాల్సి వచ్చింది. పీటీ ఉష 400 మీ హార్డిల్స్‌ను 55. 42 సెకన్లలో పూర్తి చేయగా.. రోమానియాకు చెందిన క్రిస్టియానా కోజోకారు 55.41 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్యం గెలుచుకోవడంతో ఉష నాలుగో స్థానంలో నిలిచింది. అలా ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు పతకం అందించాలనేది కలగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని పీటీ ఉష స్వయంగా చాలా ఇంటర్య్వూల్లో పేర్కొంది. అయితే ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా మాత్రం పీటీ ఉష రికార్డు పదిలంగా ఉంది. అంతకముందు 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలతో పాటు రజతం సాధించింది. అలాగే 1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో 2 రజతాలు, 1990 ఆసియాడ్ లో 3 రజతాలు, 1994 ఆసియాడ్‌లో ఒక రజత పతకాన్ని సాధించింది. Realised my unfinished dream today after 37 years. Thank you my son @Neeraj_chopra1 🇮🇳🥇#Tokyo2020 pic.twitter.com/CeDBYK9kO9 — P.T. USHA (@PTUshaOfficial) August 7, 2021 THE THROW THAT WON #IND A #GOLD MEDAL 😍#Tokyo2020 | #StrongerTogether | #UnitedByEmotion @Neeraj_chopra1 pic.twitter.com/F6xr6yFe8J — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 7, 2021 -
సుశీల చానుకు మణిపూర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
టోక్యో: ఒలింపిక్స్ కాంస్య పోరులో భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్ చేతిలో 4-3 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఆరంభం నుంచి బ్రిటన్‌కు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ చివర్లో పెనాల్టి కార్నర్లు సమర్పించుకొని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మహిళల హాకీ జట్టు ప్రదర్శనకు దేశం మొత్తం అండగా నిలబడుతోంది. పతకం సాధించికపోయినా, అద్భుతంగా ఆడారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓటమి అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనైన రాణి రాంపాల్ సేనను బాధపడొద్దంటూ ఓదార్చి.. దీనిని స్పూర్తిగా తీసుకొని మున్ముందు మరిన్ని పథకాలు సాధించాలని ధైర్యం చెబుతున్నారు. అయితే భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్‌తో ఓడిపోయినప్పటికీ జట్టులోని మణిపూర్‌కు చెందిన మిడ్‌ఫీల్డర్ సుశీల చానును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. చానుకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భారీ నజరానా అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘ నేను ఇంఫాల్‌లో అడుగుపెట్టిన వెంటనే సుశీల చానుతో మాట్లాడాను. ఈరోజు తృటిలో కాంస్యం పథకం చేజారింది. కానీ ఒలింపిక్స్‌లో మహిళల జట్టులో సుశీల ప్రదర్శనను అభినందిచాల్సిన విషయం. ఆమెకు యువజన వ్యవహారాలు, స్పోర్ట్స్ విభాగంలో ఉద్యోగంతోపాటు 25 లక్షల నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు' తెలిపారు. మణిపూర్‌లో హాకీని మరింతగా అభివృద్ధి చేయాలని భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ సుశీల చేసిన సూచనపై సీఎం స్పందింస్తూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో హాకీ కోసం ఆస్ట్రోటార్ఫ్ పిచ్‌లనుకూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలదిపారు. కాంస్య పతకం మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు విజయం, ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించిన మహిళల జట్టు ప్రదర్శన గర్వకారణమని అని పేర్కొన్నారు. కాగా 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళ హాకీ జట్టుకు సుశీల చాను నాయకత్వం వహించారు. -
నీరజ్ చోప్రాకు సీఎస్కే అరుదైన గిఫ్ట్.. అదేంటంటే
టోక్యో: ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్ విభాగంలో తొలిసారి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం కొల్లగొట్టిన భారత్‌కు గోల్డెన్ ముగింపునిచ్చిన నీరజ్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు సహా పలు కార్పొరేట్ సంస్థలు భారీ నజరానాను ప్రకటిస్తూ వచ్చాయి. ఇందులో భాగంగానే ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నీరజ్ చోప్రాకు అరుదైన కానుకను ఇచ్చింది. ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో అతని ప్రదర్శనకు గాను రూ. కోటి రివార్డుతో పాటు ప్రత్యేక జెర్సీని గిఫ్ట్‌గా అందించనుంది. జావెలిన్ త్రోలో అతను స్వర్ణం కొట్టేందుకు కారణమైన 87.58 మీటర్ల దూరాన్ని సీఎస్కే ప్రత్యేకంగా తీసుకుంది. 8758 పేరుతో ఒక స్పెషల్ సీఎస్కే జెర్సీని తయారు చేయించి నీరజ్‌కు అందజేయనుంది. సీఎస్కే జట్టు ఉన్నంతకాలం నీరజ్ చోప్రా స్పెషల్ జెర్సీ మా గుర్తుగా ఉంటుందని.. అది అతనికి ఇచ్చే గౌరవమని సీఎస్కే ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు. Anbuden saluting the golden arm of India, for the Throw of the Century! 8️⃣7⃣.5⃣8⃣ 🥇🔥 CSK honours the stellar achievement by @Neeraj_chopra1 with Rs. 1 Crore. @msdhoni Read: https://t.co/zcIyYwSQ5E#WhistleforIndia #Tokyo2020 #Olympics #WhistlePodu 🦁💛 📸: Getty Images pic.twitter.com/lVBRCz1G5m — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 7, 2021 -
ఒలింపిక్స్ ఫైనల్ డే: భారత్ ర్యాంక్ 47.. టాప్‌లో ఎవరంటే?
► టోక్యో ఒలింపిక్స్ వేడుకలు సాయంత్రం 4.30కి జరగనున్నాయి. కోవిడ్ కారణంగా ముగింపు వేడుకలు నిరాడంబరంగా జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించినరెజ్లర్ భజరంగ్ పునియా భారత బృందం ఫ్లాగ్ బేరర్‌గా ఉండనున్నాడు. ► మెన్స్ మారథాన్‌లో కెన్యా అథ్లెట్ ఎలియుడ్ కిప్చోగే చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ఎలియుడ్ కిప్చోగే రికార్డు అందుకున్నాడు. మెన్స్ మారథాన్‌లో కిప్చోగే 2 గంటల 8 నిమిషాల 38 సెకన్లతో తొలి స్థానం ఉండగా.. నెదర్లాండ్స్‌కు చెందిన నగాయే 2 గంటల 9 నిమిషాల 58 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజతం.. ఇక బెల్జియంకు చెందిన బెల్ అబ్డీ 2 గంటల 10 నిమిషాలలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలపొందాడు. ఇక కిప్చోగేకు ఒలింపిక్స్‌లో వరుసగా రెండో స్వర్ణం కాగా.. ఓవరాల్‌గా 2004 ఎథెన్స్లో కాంస్య, 2008 బీజింగ్‌లో రజతం, రియో 2016లో స్వర్ణం, తాజాగా టోక్యోలో మరోసారి స్వర్ణం కొల్లగొట్టాడు. Back-to-back golds!#KEN's Eliud Kipchoge wins his second consecutive Olympic men's marathon in a time of 2:08.38.@WorldAthletics #Athletics @OlympicsKe pic.twitter.com/pqDsJDVxDw — Olympics (@Olympics) August 8, 2021 టోక్యో: టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. దాదాపు అన్ని క్రీడాంశాల్లో పోటీలు పూర్తవ్వగా.. మరికొన్ని క్రీడలు ఈరోజు జరగనున్నాయి. అయితే ఈ ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్యాలతో మొత్తంగా ఏడు పతకాలతో చరిత్ర సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాల అత్యుత్తమ ప్రదర్శనను టోక్యో ఒలింపిక్స్‌లో బ్రేక్ చేసి మరుపురానిదిగా మలుచుకుంది. కాగా విశ్వక్రీడలు ముగింపు వేడుకలను ఆతిథ్య దేశం ఘనంగా నిర్వహించనుంది. ఇక ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 85 దేశాలు పతకాల ఖాతా తెరవగా భారత్ ఏడు పతకాలు( స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్యాలు) సాధించడం ద్వారా పతకాల పట్టికలో 47వ స్థానంలో నిలిచింది. ఇక పతకాల వేటలో టాప్ 3 స్థానాల కోసం ఎప్పటిలాగే అమెరికా, చైనా , జపాన్ పోటీ పడగా.. 39 స్వర్ణాలతో అమెరికా తొలి స్థానంలో నిలవగా.. 38 స్వర్ణాలతో చైనా రెండో స్థానం, 27 స్వర్ణాలతో ఆతిథ్య జపాన్ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్ పతకాల వారిగా చూసుకుంటే అమెరికా 113 పతకాలు(39 స్వర్ణం, 41 రజతం, 33 కాంస్యం); చైనా 88 పతకాలు( 38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం); జపాన్ 58 పతకాలు (27 స్వర్ణం, 14 రజతం, 17 కాంస్యం) ఉన్నాయి. -
అతను మనోడు కాడు.. అథ్లెటిక్స్‌లో నీరజ్‌దే తొలి స్వర్ణం
టోక్యో: 1900 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రిటీష్–ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్‌లో 2 రజత పతకాలు (200 మీ.పరుగు, 200 మీ.హర్డిల్స్) సాధించాడు. అయితే పేరుకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడని చెబుతున్నా, నాటి బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో, స్వాతంత్య్రానికి 47 ఏళ్ల ముందు సాధించిన ఈ విజయానికి భారతీయత ఆపాదించడంలో అర్థం లేదు. అందుకే నీరజ్ సాధించిన స్వర్ణమే అథ్లెటిక్స్‌లో మన దేశానికి దక్కిన మొదటి పతకంగా భావించాలి. నిజానికి అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) 2005లో ప్రచురించిన అధికారిక ట్రాక్ అండ్ ఫీల్డ్ గణాంకాల్లో గ్రేట్ బ్రిటన్ తరఫునే ప్రిచర్డ్ పాల్గొన్నట్లుగా పేర్కొంది. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మాత్రం తమ ఒలింపిక్ పతకాల జాబితాలో ప్రిచర్డ్ ప్రదర్శనను భారత్ ఖాతాలోనే ఉంచింది! -
నీరజ్ చోప్రాకు స్వర్ణం.. ఇంట్లో సంబరాలు; వీడియో వైరల్
చంఢీఘర్: హరియాణా రాష్ట్రం, పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామం నీరజ్ స్వస్థలం. వ్యవసాయం చేసుకునే 17 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం. అధిక బరువు, అల్లరి పిల్లాడు కావడంతో కాస్త ఆటల్లో పెడితే కుదురుగా ఉంటాడని భావించిన తండ్రి సతీశ్ 13 ఏళ్ల నీరజ్‌ను సమీపంలోనే ఉన్న పానిపట్‌లోని స్టేడియానికి తీసుకెళ్లాడు. అయితే అక్కడి అన్ని ఆటల్లో అతనికి జావెలిన్ త్రో కొత్తగా అనిపించి ఆసక్తి పెరిగింది. కోచ్ జై చౌదరి మార్గనిర్దేశనంలో, బాబాయ్ భీమ్ చోప్రా అండగా నీరజ్ జావెలిన్ త్రోలోనే తన భవిష్యత్తును వెతుక్కునేందుకు సిద్ధమయ్యాడు. తన సహజసిద్ధమైన ప్రతిభతో చోప్డా కొద్ది రోజుల్లోనే ఆటలో మెరుగయ్యాడు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన తర్వాత అతని పయనం పంచ్కులాలోని ‘సాయ్’ స్పోర్ట్స్ హాస్టల్‌కు చేరింది. అక్కడి నుంచి నీరజ్ తన శ్రమ, పట్టుదలతో ఒక్కసారిగా ఎదిగిపోయాడు. వివిధ దశల్లో కోచ్‌లుగా వ్యవహరించిన గ్యారీ కాల్వర్ట్, యువ్ హాన్ అతడి ఆటను పైస్థాయికి తీసుకెళ్లగా, ప్రస్తుత కోచ్ క్లాస్ బార్టోనెట్జ్ నీరజ్‌ను చాంపియన్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. #WATCH live from javelin thrower Neeraj Chopra's residence in Panipat, Haryana Chopra wins gold at #TokyoOlympics https://t.co/0kj0q2Pruu — ANI (@ANI) August 7, 2021 -
16వసారి స్వర్ణం.. మళ్లీ వాళ్లే!
టోక్యో: ఒలింపిక్స్‌లో అమెరికా పురుషుల బాస్కెట్‌బాల్ టీమ్ మరోసారి మెరిసింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికా 87–82తో ఫ్రాన్స్‌పై నెగ్గి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గత మూడు విశ్వక్రీడల్లోనూ (2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో) స్వర్ణం నెగ్గిన అమెరికా... తాజా ప్రదర్శనతో వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ పసిడి నెగ్గిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా అమెరికాకు ఇది 16వ ఒలింపిక్స్ స్వర్ణం. ఇందులో 1936–68 మధ్య జరిగిన ఏడు వరుస ఒలింపిక్స్‌ల్లోనూ అమెరికా పసిడి నెగ్గడం విశేషం. ఫైనల్ తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా... కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన అమెరికా విరామ సమయానికి 44–39తో ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్‌ను అమెరికా 27–24తో ముగించింది. ఇక చివరి క్వార్టర్లో పుంజుకున్న ఫ్రాన్స్ 19–16తో పైచేయి సాధించినా ఓటమి తప్పలేదు. దాంతో ఫ్రాన్స్ రజతంతో సరిపెట్టుకుంది. అమెరికన్ స్టార్ కెవిన్ డ్యురాంట్ 29 పాయింట్లు స్కోరు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 107–93తో స్లొవే నియాపై గెలుపొందింది. -
గ్రేటెస్ట్ ఫెలిక్స్...
టోక్యో: అలీసన్ ఫెలిక్స్ సాధించింది. ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన అమెరికన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా ఫెలిక్స్ కొత్త చరిత్రను సృష్టించింది. శనివారం జరిగిన మహిళల 4 X 400 మీటర్ల రిలే పరుగులో అమెరికా బృందం స్వర్ణం గెలిచింది. సిడ్నీ మెక్లాఫ్లిన్, ఫెలిక్స్, దలీలా మొహమ్మద్, ఎతింగ్ మూలతో కూడిన అమెరికా టీమ్... రేసును 3 నిమిషాల 16.85 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఒలింపిక్స్‌లో 4్ఠ400మీ.లో అమెరికాకు ఇది వరుసగా ఏడో స్వర్ణం కావడం విశేషం. 1996 నుంచి ఇప్పటి వరకు ఈ విభాగంలో అమెరికాయే విజేతగా నిలుస్తుంది. శుక్రవారం జరిగిన 400 మీటర్ల పరుగులో ఫెలిక్స్ కాంస్యాన్ని నెగ్గడం ద్వారా... అప్పటి వరకు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అమెరికా తరఫున అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా ఉన్న కార్ల్ లూయిస్ (10 పతకాలు) సరసన చేరింది. అయితే తాజా స్వర్ణంతో తన ఖాతాలో 11వ పతకాన్ని చేర్చుకున్న ఫెలిక్స్ కార్ల్ లూయిస్‌ను వెనక్కి నెట్టింది. ఓవరాల్‌గా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 12 పతకాలతో ఫిన్లాండ్కు చెందిన పావో నుర్మీ తొలి స్థానంలో ఉన్నాడు. పతకం తేడాతో 35 ఏళ్ల ఫెలిక్స్ రెండో స్థానంలో ఉంది. అమెరికా తర్వాత 3 నిమిషాల 20.53 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్న పోలాండ్ జట్టు రజతం, 3 నిమిషాల 21.24 సెకన్లలో రేసును ముగించిన జమైకా జట్టు కాంస్యం గెల్చుకున్నాయి. పురుషుల విభాగంలోనూ అమెరికాదే హవా పురుషుల 4 X 400 రిలే పరుగులోనూ అమెరికాకే స్వర్ణం దక్కింది. శనివారం జరిగిన ఫైనల్లో మైకేల్ చెర్రీ, బ్రైస్ డెడ్మోన్, రాయ్ బెంజమిన్, మైకేల్ నోర్మన్లతో కూడిన అమెరికా టీమ్ అందరికంటే ముందుగా 2 నిమిషాల 55.70 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో అమెరికాకు ఇది 18వ స్వర్ణం కావడం విశేషం. 2 నిమిషాల 57.18 సెకన్లలో రేసును ముగించిన నెదర్లాండ్స్ రజతాన్ని... 2 నిమిషాల 57.27 సెకన్లలో గమ్యాన్ని చేరిన బొట్స్వానా కాంస్యాన్ని సొంతం చేసుకున్నాయి. సిఫాన్ సూపర్ రన్... చివరి 200 మీటర్లలో తన పరుగులో వేగం పెంచిన నెదర్లాండ్స్ అథ్లెట్ సిఫాన్ హసన్ టోక్యో ఒలింపిక్స్‌లో మరో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల 10,000 మీటర్ల పరుగులో 29 నిమిషాల 55.32 సెకన్లలో గమ్యాన్ని చేరిన సిఫాన్ విజేతగా నిలిచింది. ఈ ఒలింపిక్స్‌లో ఆమెకు ఇది మూడో పతకం కావడం విశేషం. 5000 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గిన ఆమె... 1500 మీటర్ల పరుగులో కాంస్యాన్ని సొంతం చేసుకుంది. కల్కిదాన్ గెజహెగ్నె (బహ్రెయిన్) రజతాన్ని సొంతం చేసుకుంది. 9800 మీటర్ల వరకు రేసును లీడ్ చేసిన లెటెసెన్‌బెట్ గిడీ (ఇథియోసియా) చివరి 200 మీటర్లలో ఆధిక్యాన్ని చేజార్చుకుని మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. -
చేరువై..దూరమై
టోక్యో: పతకం తెచ్చేట్లు కనిపించిన భారత మహిళా గోల్ఫర్ అదితి అశోక్‌కు నిరాశ ఎదురైంది. ఒకే ఒక్క స్ట్రోక్‌తో ఒలింపిక్ పతకానికి దూరమైంది. శనివారం జరిగిన చివరిదైన నాలుగో రౌండ్‌లోని 18 హోల్స్‌ను ఆమె 68 అండర్ –3 స్ట్రోక్‌ల్లో పూర్తి చేసింది. దాంతో మొత్తం 72 హోల్స్‌ను 269 అండర్ –15 స్ట్రోక్‌ల్లో పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. అంటే 72 హోల్స్‌ను పూర్తి చేయడానికి 284 స్ట్రోక్‌లను నిర్దేశించగా... అదితి 15 తక్కువ స్ట్రోక్ల్లోనే పూర్తి చేసింది. అయితే మూడో స్థానంలో నిలిచిన లిడియా కో (న్యూజిలాండ్) 72 హోల్స్‌ను పూర్తి చేయడానికి 268 స్ట్రోక్‌లను మాత్రమే తీసుకుంది. దాంతో ఒకే ఒక్క స్ట్రోక్‌తో అదితికి కాంస్యం చేజారింది. అమెరికా గోల్ఫర్ నెల్లీ కోర్డా 267 అండర్ –17 స్ట్రోక్‌లతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని... మోనె ఇనామి (జపాన్) 268 అండర్ –16తో రజతాన్ని సొంతం చేసుకున్నారు. చివర్లో మోనె, లిడియా కో సంయుక్తంగా రెండో స్థానంలో నిలువగా.. వీరిద్దరికీ ప్లే ఆఫ్ నిర్వహించారు. ఇందులో మోనె నెగ్గింది. నాలుగో రౌండ్‌ను అదితి అద్భుతంగా ఆరంభించింది. హోల్ నంబర్ 5, 6, 8, 13, 14లను నిర్దేశించిన స్ట్రోక్‌ల కంటే ఒక స్ట్రోక్ తక్కువ (బర్డీ)లోనే ముగించింది. అయితే 9, 11వ హోల్స్‌ను పూర్తి చేయడానికి మాత్రం నిర్దేశించిన దాని కంటే ఒక స్ట్రోక్ (బొగీ)ను అదనంగా తీసుకుంది. 16వ హోల్ పూర్తయ్యేసరికి అదితి పతక స్థానంలోనే ఉంది. అయితే తుపాను రావడంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ బ్రేక్ వల్ల అదితి ఏకాగ్రత చెదరడంతో చివరి రెండు హోల్స్‌ను తక్కువ స్ట్రోక్‌ల్లో ముగించలేకపోయింది. ‘పతకం గెలిచేందుకు 100 శాతం నేను ప్రయత్నించా. ఇతర టోర్నీల్లో నాలుగో స్థానం వచ్చింటే నేను చాలా సంతోషించేదాన్ని.. కానీ ఒలింపిక్స్‌లో అలా కాదు. టాప్–3కి మాత్రమే పతకాలను ఇస్తారు. త్రుటిలో మెడల్‌ను చేజార్చుకున్నందుకు చాలా బాధగా ఉంది. నేను కొన్ని చాన్స్‌లను మిస్ చేసుకున్నాను. చివరి తొమ్మిది హోల్స్‌లో నేను మరింత బాగా ఆడాల్సి ఉండాలి. ఈ రోజు నాకు కలిసి రాలేదు.’ – అదితి -
జై బజరంగ్ భళి...
శీతాకాలం... తెల్లవారుజాము 2 గంటలకు ఎముకలు కొరికే చలిలో... ఓ 11 ఏళ్ల బాలుడు ఇంట్లో దిండ్లను వరుస పెట్టి దుప్పటి కప్పి తాను పడుకున్నట్లు చేసి అఖాడాకు వెళ్లేవాడు. ఉదయం అమ్మ అడిగితే 4 గంటల తర్వాతే వెళ్లానని చెప్పేవాడు. తనయుడు ఎప్పుడు వెళ్లాడో తల్లికి తెలుసు! అయినా కొడుకు ఆసక్తికి అడ్డుచెప్పకూడదని ఆ మాతృమూర్తి నిర్ణయించుకుంది. అక్కడ సీన్ కట్ చేసి టోక్యోలో చూస్తే ఆ బాలుడు బజరంగ్ పూనియా అయ్యాడు. రెజ్లింగ్ బరిలో కాంస్యం గెలిచాడు. టోక్యో: ‘పసిడి’ పతకానికి దూరమైనా... తన కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో బజరంగ్ 8–0తో దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్)పై గెలిచాడు. తద్వారా 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో నియాజ్బెకోవ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. హాజీ అలియెవ్ (అజర్బైజాన్)తో జరిగిన సెమీఫైనల్లో లెగ్ డిఫెన్స్ బలహీనత, కౌంటర్ ఎటాక్‌లో తడబడి పాయింట్లు చేజార్చుకున్న బజరంగ్ ఈ బౌట్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. నియాజ్‌బెకోవ్‌కు ఏదశలోనూ పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. దాంతో నియాజ్బెకోవ్ చివరకు ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే ఓటమి చవిచూశాడు. హరియాణకు చెందిన 27 ఏళ్ల బజరంగ్ తన కెరీర్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు (రజతం, 2 కాంస్యాలు), ఆసియా చాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు (2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు), ఆసియా క్రీడల్లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం), కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం) సాధించాడు. బజరంగ్ బాహువుల్లోనో లేదంటే పిడికిలిలోనో రెజ్లింగ్ లేదు. అతని రక్తంలోనే మల్లయుద్ధం వుంది. ఎందుకంటే తన తండ్రి, సోదరుడు కూడా దంగల్ వీరులే! ఈ కుస్తీపట్లే నరనరాన జీర్ణించుకున్న బజరంగ్ తాజాగా ఒలింపిక్ పతకం పట్టాడు. అన్నట్లు ఇతనికి ఒలింపిక్ పతకం కొత్తేమో కానీ ఈ నంబర్‌వన్ (65 కేజీల కేటగిరీ) రెజ్లర్ ఖాతాలో ప్రపంచ, ఆసియా చాంపియన్ షిప్, ఆసియా గేమ్స్ స్వర్ణాలు చాలానే ఉన్నాయి. అందుకే అసలు సిసలు సత్తాచాటాల్సిన చోట స్వర్ణ, రజతాలు చేజార్చుకున్నాడేమో కానీ పతకం లేకుండా ఉత్తచేతులతో రాలేదు. కాంస్యం పోరు లో విజేయుడిగా నిలిచాడు. 34 కేజీల బరువుతో 60 కేజీల విభాగంలో... మచ్రోలి గ్రామంలో 2008లో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు బజరంగ్ వెళ్లాడు. కానీ 34 కిలోల బరువున్న అతన్ని 60 కేజీల కేటగిరీలో పాల్గొనేందుకు నిర్వాహకులు నిరాకరించారు. ఎలాగోలా అతని అన్న హరిందర్ నచ్చచెప్పడంతో ఆర్గనైజర్లు అంగీకరించారు. అపుడు దంగల్‌లో దిగిన బజరంగ్ తనకంటే ఎక్కువ బరువున్న రెజ్లర్ ఓడించడం అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ కుర్రాడి బాహువు బలం తెలిసిన కోచ్ ఆర్య వీరేందర్ మల్లయుద్ధంలో బజరంగ్ పూనియాను తీర్చిదిద్దాడు. అదే ఏడాది తండ్రి బల్వాన్ సింగ్ తనయుడిని ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియంలో చేర్పించాడు. అక్కడ అందరు మేటి రెజ్లర్లే ఉండటంతో వారితో తలపడిన బజరంగ్ రెండేళ్లకే ఆసియా క్యాడెట్ చాంపియన్ అయ్యాడు. మరుసటి ఏడాది (2011) దాన్ని నిలబెట్టుకున్నాడు. అక్కడ్నుంచి ఇక వెనుదిరిగి చూడకుండా ఇంటాబయటా పతకాల పట్టు పట్టేవాడు. 2018లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను సాధించిన రజతం బజరంగ్‌ను ఒలింపిక్ మెడలిస్ట్‌ల జాబితాలో చేర్చింది. యోగేశ్వర్ దత్ కిటుకులు... ఛత్రశాల్ స్టేడియం చేసిన మేలు, మెరుగైన తీరు అంతా ఇంతా కాదు. అక్కడ ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ సాహచర్యం... బజరంగ్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం... అంతర్జాతీయ పోటీల్లో అసాధారణ రెజ్లర్‌గా, పతకాల విజేతగా నిలబెట్టాయి. యోగేశ్వర్ రాజకీయాల్లోకి వెళ్లాక భారత రెజ్లింగ్ సమాఖ్య బజరంగ్‌కు వ్యక్తిగత కోచ్‌గా జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్ను నియమించింది. ఇతని వల్ల విదేశీ రెజ్లర్లతో చేసిన ప్రాక్టీస్ బజరంగ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్ పతక విజేతగా మార్చింది. తల్లి ప్రోత్సాహం... బజరంగ్ తల్లి ఓంప్యారీకి 11 ఏళ్ల తనయుడి అడుగులు ఎటువైపో తెలుసు. అందుకే తెల్లారుజామునే వెళ్తున్నా... ఉదయం లేచాక అబద్ధం చెబుతున్నా... మిన్నకుండిపోయింది. అయితే ఒక విషయం మాత్రం మాతృమూర్తి గట్టిగా చెప్పేది. ‘ఓడినంత మాత్రాన ఏడవొద్దు. ప్రత్యర్థుల ముందు పలుచనవ్వొద్దు. ఓటములను గెలిచేందుకు మెట్లుగా మలచుకోవాలి’ అని! ఈ మాట బాగా వంటబట్టించుకున్న బజరంగ్ చదువులో వెనుకబడినా... దంగల్‌లో మట్టికరిచినా... ఎప్పుడు కన్నీరు కార్చలేదు. అమ్మ అన్నట్లే ప్రతి ఓటమిని గెలుపు మలుపుగా చేసుకున్నాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింహాబలుళ్లను ఓడించే శక్తి తన తల్లి మాటల ద్వారానే సంపాదించుకున్నాడు. -
నీరజ్‌కు హరియాణా ప్రభుత్వం నజరానా రూ. 6 కోట్లు
భారత అథ్లెటిక్స్‌లో స్వర్ణ చరిత్ర లిఖించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అటు ప్రశంసలు ఇటు రూ. కోట్లు కురుస్తున్నాయి. హరియాణాకు చెందిన ఈ చాంపియన్ అథ్లెట్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ భారీ నజరానా ప్రకటించారు. హరియాణా క్రీడాపాలసీ ప్రకారం అతనికి రూ. 6 కోట్ల పారితోషికం, క్లాస్–1 ఉన్నతోద్యోగంతో పాటు నివాస స్థలం (నామమాత్రపు ధరతో) ఇస్తామని సీఎం తెలిపారు. కాంస్యం నెగ్గిన రెజ్లర్ బజరంగ్ పూనియాకు రూ.2 కోట్ల 50 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం, నివాస స్థలం అందజేస్తామని చెప్పారు. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాకు క్రికెట్ వర్గాలు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా రూ. ఒక కోటి, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రూ. ఒక కోటి నజరానాగా ఇస్తామని వెల్లడించింది. దేశీ వాహనరంగ సంస్థ మహీంద్ర త్వరలో విడుదల చేసే ‘ఎక్స్‌యూవీ700’ ప్రీమియం కారును తొలుత నీరజ్‌కే బహుమతిగా ఇస్తామని మహీంద్ర గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర వెల్లడించారు. -
గ్రూపులుగా శిక్షణ... జట్టుగా పతకం
మన్‌ప్రీత్ సింగ్ గత 24 గంటలుగా పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాం. ఆటగాళ్లంతా భావోద్వేగంతో ఉన్నారు. టోక్యోలో మేం (పురుషుల హాకీ) కాంస్యం గెలిస్తే... అమ్మాయిల జట్టేమో అద్భుతంగా పోరాడి నాలుగో స్థానంలో నిలిచింది. హాకీలో భారత జట్ల ప్రదర్శన యావత్ జాతిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. ఇరు జట్లు ఇంతగా రాటుదేలడంలో ఎంతో ప్రణాళికబద్ధమైన కృషి దాగి ఉంది. శిక్షణ శిబిరాల్లో, మైదానాల్లో మేం కష్టపడితే... మా కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, హాకీ ఇండియా (హెచ్ఐ) కష్టపడ్డాయి. అవసరమైన అన్నీ ఏర్పాట్లను సమయానుకూలంగా చేసి పెట్టాయి. గతేడాది మార్చి మొదట్లో కరోనా అలజడి మొదలైంది. కేంద్ర క్రీడా శాఖ లాక్‌డౌన్‌కు రెండు వారాల ముందే బెంగళూరు ‘సాయ్’ కేంద్రంలో మమ్మల్ని లాక్‌డౌన్‌కు సిద్ధం చేసింది. తొలుత ఈ కట్టడి కష్టమైనప్పటికీ తర్వాత్తర్వాత కేసుల పెరుగుదలతో అసలు సమస్య ఏంటో అర్థమైంది. లాక్డౌన్ తర్వాత తెర మీదికొచ్చిన కోవిడ్ ప్రొటోకాల్ పాటించడం అనివార్యమైంది. భౌతిక దూరంతో మా శిక్షణ కూడా మారింది. ఒకే శిబిరంలో ఉన్నా... కోవిడ్ రిస్క్ దృష్ట్యా గ్రూపులుగా, బ్యాచ్‌లుగా శిక్షణ ఇచ్చారు. ఇదే ఇప్పుడు జట్టుగా పతకం గెలిచేందుకు ఉపయోగపడింది. శిక్షణ ముగిసినా క్వారంటైన్, ఐసోలేషన్‌లతో ఇంటిముఖం చూసేందుకు నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. 2019 డిసెంబర్లో జట్లను టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చేర్చడం మాకెంతో మేలైంది. దీంతో ఎక్కడా మాకు నిధుల కొరతే ఎదురుకాలేదు. మహమ్మారి వల్ల మ్యాచ్ ప్రాక్టీస్ కోల్పోయిన మాకు జూనియర్ జట్లతో ఏర్పాటు చేసిన పోటీలు కూడా ఉపయోగపడ్డాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాటలు మాకెంతో స్ఫూర్తినిచ్చాయి. టోక్యోకు వెళ్లేముందు, పతకం గెలిచాక ఆయన వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఉత్తేజపరడం, స్ఫూర్తి రగిలించడం కన్నా గొప్ప రివార్డు, అవార్డులు ఏముంటాయి. -
నీ ఆటకు నీరాజనం...
సాక్షి క్రీడా విభాగం: ‘విజయం సాధించాలనే కాంక్ష మీకు నిద్ర పట్టనివ్వకపోతే... కష్టపడటం తప్ప మరే విషయం మీకు నచ్చకపోతే... ఎంత శ్రమించినా గానీ అలసట అనిపించకపోతే... విజయంతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లు అర్థం చేసుకోండి’... దాదాపు రెండేళ్ల క్రితం ఈ స్ఫూర్తిదాయక వ్యాఖ్యను ట్వీట్ చేసిన నీరజ్ చోప్రా ఇప్పటికీ దానినే తన పిన్డ్ ట్వీట్‌గా పెట్టుకున్నాడు. బహుశా రాబోయే రోజుల్లో తాను భారత క్రీడా చరిత్రలో కొత్త చరిత్రను లిఖిస్తాననే ఆత్మవిశ్వాసం కావచ్చు, కానీ నిజంగానే నీరజ్ శనివారం అతి పెద్ద ఘనతను నమోదు చేసి ఒలింపిక్స్ ‘బంగారు బాబు’గా నిలిచాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌తో మొదలు పెట్టి ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో స్వర్ణాలతో ఇప్పటికే ఈతరంలో భారత అత్యుత్తమ అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నీరజ్ కళ్ల ముందు ఒలింపిక్ పతకమే లక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే ఏకంగా స్వర్ణం కొల్లగొట్టి అతను తన స్థాయిని ఒక్కసారిగా పెంచుకున్నాడు. ఇంతింతై... నీరజ్ విజయం ఒక్కసారిగా, అనూహ్యంగా వచ్చిం ది కాదు. అతని కెరీర్‌ను చూస్తే ఒక్కో దశలో తన ఆటను మెరుగుపర్చుకుంటూ, ఒక్కో పతకాన్ని తన ఖాతాలో చేర్చుకుంటూ మెల్లగా ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. జూనియర్ స్థాయిలో ఆకట్టుకునే ప్రదర్శనల తర్వాత 2016 ‘శాఫ్’ క్రీడల్లో 82.23 మీటర్ల త్రో విసిరి అతను తొలిసారి అందరి దృష్టిలో పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత పోలాండ్‌లో జరిగిన అండర్–20 వరల్డ్ చాంపియన్íషిప్లో నీరజ్ సత్తాను గుర్తించేలా చేసింది. 86.48 మీటర్లతో అతను ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం. నిజానికి ఈ దూరంతో అతను రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేవాడే. కానీ ఒలింపిక్స్ కటాఫ్ తేదీ ముగిసిన తర్వాత ఈ ఈవెంట్ జరగడంతో అతనికి అవకాశం పోయింది. గాయంతో ఆట ఆగినా... వరుస టోర్నీలు, విజయాలతో పాటు సహజంగానే అథ్లెట్ల వెన్నంటి గాయాలు కూడా ఉంటాయి. రెండేళ్ల క్రితం నీరజ్ కూడా దాని బారిన పడ్డాడు. జావెలిన్ త్రో కారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే కుడి మోచేతి గాయం కారణంగా నీరజ్‌కు శస్త్ర చికిత్స కూడా చేయాల్సి వచ్చింది. 2019 వరల్డ్ చాంపియన్‌షిప్ సహా అతను పలు టోర్నీలకు దూరమయ్యాడు. దాంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కష్టంగా మారింది. చివరకు 2020 జనవరిలో అతను తన తొలి టోర్నీలో సత్తా చాటి క్వాలిఫై అయ్యాడు. అయితే కరోనా కారణంగా క్రీడలు ఏడాది వాయిదా పడ్డాయి. ఈ సమయాన్ని అతను సమర్థంగా వాడుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకునే పనిలో పడ్డాడు. ‘ఫౌల్’ సమస్య రాకుండా తన టెక్నిక్‌ను మార్చుకోవడంతో పాటు ఎదురు గాలి వీచే వాతావరణ పరిస్థితుల్లోనూ సమస్య రాని విధంగా ఉండే జావెలిన్లను కూడా ఎంచుకొని సాధన చేశాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించే అంచనాలు ఉన్న డిఫెండింగ్ చాంపియన్ థామస్ రోలర్, వరల్డ్ సిల్వర్ మెడలిస్ట్ మాగ్నస్ కర్ట్, ఆండ్రీస్ హాఫ్మన్ గాయాలతో ఒలింపిక్స్ నుంచి ముందే తప్పుకోగా... 2012 చాంపియన్ వాల్కాట్, 2019 వరల్డ్ చాంపియన్ పీటర్స్, మార్సిన్ క్రుకోస్కీ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగారు. తన ప్రతిభకు తోడు అన్ని కలిసి రావడంతో నీరజ్ ఇప్పుడు స్వర్ణ ఘనతను సాధించాడు. చూపుల్లో బాలీవుడ్ హీరోలా కనిపించే నీరజ్ సినిమాలు కాకుండా మరో దారిని ఎంచుకొని ఎవరెస్ట్ స్థాయిని అందుకున్నాడు. ఇప్పుడు భారత క్రీడా రంగానికి అతను ఒక పెద్ద ‘పోస్టర్ బాయ్’గా మారాడు. ప్రపంచ అండర్–20 స్వర్ణ పతకంతో... -
మనోడు బంగారం
టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయుల బంగారు స్వప్నం సాకారమైంది. రెండు వారాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ‘పసిడి దృశ్యం’ శనివారం ఆవిష్కృతమైంది. అథ్లెటిక్స్ ఈవెంట్లో భాగంగా పురుషుల జావెలిన్ త్రోలో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా అద్వితీయ ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. గతంలో మిల్కా సింగ్ (1960 రోమ్), పీటీ ఉష (1984 లాస్ ఏంజెలిస్) నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాలను కోల్పోయారు. అభినవ్ బింద్రా (షూటింగ్– 2008 బీజింగ్) తర్వాత ఒలింపిక్స్ క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారుడిగా నీరజ్ గుర్తింపు పొందాడు. శనివారం భారత్ ఖాతాలో రెండో పతకం కూడా చేరింది. పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. కాంస్య పతకపోరులో బజరంగ్ 8–0తో నియాజ్బెకోవ్(కజ కిస్తాన్)పై గెలిచాడు. మహిళల బాక్సింగ్(69 కేజీల విభాగం)లో కాంస్యం సాధించిన లవ్లీనా శనివారం పతకాన్ని అందుకుంది. మొత్తంగా ‘టోక్యో’ క్రీడల్లో 7 పతకాలతో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా 6 పతకాలు లభించాయి. నేటితో విశ్వ క్రీడలు ముగియనున్నాయి. బల్లెం దిగింది..బంగారమొచ్చింది చేతిలో బల్లెం... కళ్లల్లో చురుకుదనం... గుండెల్లో ఆత్మవిశ్వాసం... ప్రపంచాన్ని గెలవాలనే పట్టుదల... పోటీకి సిద్ధమైన వేళ ఆందోళన, ఒత్తిడి ఎక్కడా లేవు... అలా పది అడుగుల ప్రయాణం మొదలైంది... వేగం పెంచుతూ ముందుకు దూసుకొచ్చిన తర్వాత అంతే వేగంగా జావెలిన్ చేయి దాటింది... అలా అలా గాల్లో దూసుకుపోయిన బల్లెం 87.58 మీటర్ల తర్వాత మైదానంలో కసుక్కున దిగింది. అంతే... నీరజ్ చోప్రాకు తాను కొత్త చరిత్ర సృష్టించానని అర్థమైపోయింది. ఇక తానూ టోక్యో నుంచి పతకంతో ఖాయంగా వెళతానని తెలిసిపోయింది. అందుకే సంబరాలు చేసుకునేందుకు ఆలస్యం చేయలేదు. అయితే తాను అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం మాత్రమే అందించలేదని, అది మరి కొద్దిసేపటిలో పసిడిగా కూడా మారబోతోందని ఆ క్షణాన నీరజ్ ఊహించలేదు. ఆ తర్వాత మిగతా ప్రత్యర్థులంతా కలిసి యాభై నాలుగు ప్రయత్నాల్లోనూ నీరజ్ స్కోరును అధిగమించలేకపోవడంతో అతని ప్రదర్శన శిఖరాన నిలిచింది. ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారతీయుల ప్రదర్శన అంటే హాజరు పట్టికలో పేర్లు నమోదు చేసుకోవడమే... 1920 నుంచి పోటీల్లో పాల్గొంటున్న మన ఆటగాళ్లు గెలుపు కాదు కదా, ఫైనల్స్ చేరడం కూడా గొప్ప ఘనతగా భావించే పరిస్థితి. క్వాలిఫయింగ్కే పరిమితమై వెనుదిరగడం ప్రతీ ఒలింపిక్స్‌లో కనిపించే దృశ్యమే. అథ్లెటిక్స్‌లో మన దేశం పతకాలు సాధించగలదని ఏనాడూ ఏదశలోనూ ఎవరూ కనీసం అంచనా వేయలేదు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో మిల్కా సింగ్, 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పీటీ ఉష నాలుగో స్థానాల్లో నిలిచిన ఘనతలే ఇప్పటి వరకు అత్యుత్తమంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇలాంటి స్థితిలో నీరజ్ సాధించిన బంగారు పతకం గురించి ఎంత చెప్పినా తక్కువే. గత కొన్నేళ్లుగా ఒక్కో మెట్టే ఎక్కుతూ జావెలిన్‌లో అతను వరుస విజయాలు సాధించినా... ఒలింపిక్స్‌కు వచ్చేసరికి అందరిలాగే అతనూ చివరి క్షణంలో తడబడతాడేమోనని ఒకింత ఆందోళన... అయితే నీరజ్ జావెలిన్ అన్ని భయాలను బద్దలు కొట్టింది. ‘నన్ను ఓడించడం నీరజ్ వల్ల కాదు...నేను టోక్యోలో కనీసం 90 మీటర్లకు పైగా జావెలిన్ విసరగలను’... వరల్డ్ నంబర్‌వన్ వెటెర్ ఇటీవల నీరజ్‌కు విసిరిన సవాల్ ఇది. ఈ ఏడాదిలోనే వెటెర్ ఏకంగా ఏడుసార్లు 90 మీటర్ల స్కోరును దాటగా, అత్యుత్తమం 97.76 మీటర్లు. ఒలింపిక్స్‌కు ముందు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 88.07 మీటర్లు మాత్రమే. మరో జర్మన్, 9వ ర్యాంక్ వెబర్ అత్యుత్తమ స్కోరు 88.29 కూడా నీరజ్కంటే ఎక్కువే. అయితే భారత త్రోయర్ ప్రత్యర్థి పాత ఘనతలకు బెదరలేదు. ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. క్వాలిఫయింగ్‌లో తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచి ఫైనల్‌కు చేరిన నీరజ్ తన ప్రదర్శన ‘గాలివాటం’ కాదని నిరూపిస్తూ భారతీయులు గర్వపడే ప్రదర్శన చేశాడు. ఒలింపిక్స్ వేదికపై సగర్వంగా భారత జాతీయ పతాకం ఎగరడం మాత్రమే కాదు... 13 ఏళ్ల తర్వాత, అదీ రవీంద్రుడి వర్ధంతి రోజునే జనగణమన...వినిపించడం ప్రతీ భారతీయుడి గుండె భావోద్వేగంతో ఉప్పొంగేలా చేసింది. ఇదీ నీరజ్ దేశానికి అందించిన బంగారపు కానుక. టోక్యో: భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున రెండో వ్యక్తిగత స్వర్ణం సాధించిన ఆటగాడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఒలింపిక్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కాగా... అదీ స్వర్ణం కావడం నీరజ్ ఘనతను రెట్టింపు చేసింది. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ 87.58 మీటర్ల దూరం బల్లెం విసిరి నంబర్‌వన్‌గా నిలిచాడు. జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 86.67 మీటర్లు), వితెస్లావ్ వెసిలీ(చెక్ రిపబ్లిక్; 85.44 మీటర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) స్వర్ణం సాధించిన తర్వాత భారత్‌కు ఒలింపిక్స్ మళ్లీ మరో పసిడి పతకం లభించింది. నీరజ్ స్వర్ణ పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 7కు చేరింది. దీంతో 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలతో సాధించిన భారత అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించింది. శనివారంతో టోక్యో క్రీడల్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. ఆదివారంతో టోక్యో ఒలింపిక్స్ క్రీడలు కూడా ముగియనున్నాయి. రెండో ప్రయత్నంలోనే... క్వాలిఫయింగ్ ఈవెంట్లో 86.65 మీటర్లు జావెలిన్ విసిరి అగ్రస్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించిన నీరజ్ శనివారం కూడా అంతే ఆత్మవిశ్వాసంతో ఆటను మొదలు పెట్టాడు. తన తొలి ప్రయత్నంలో అతను విసిరిన బల్లెం 87.03 మీటర్లు దూసుకుపోయింది. ఫైనల్లో పాల్గొన్న 12 మంది తొలి ప్రయత్నాల్లో నీరజ్ అందరికంటే ఎక్కువ దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక రెండో ప్రయత్నంలో దానిని మరింత మెరుగుపర్చుకుంటూ 87.58 మీటర్లతో అతని జావెలిన్ మరింత ముందుకు వెళ్లింది. ఈ దూరమే నీరజ్ చివరి వరకూ నిలబెట్టుకోగలిగాడు. తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో (మొత్తం ఆరు) అతను వరుసగా 76.79 మీటర్లు, ఫౌల్, ఫౌల్, 84.24 మీటర్లు జావెలిన్ విసిరినా నష్టం లేకపోయింది. ఫేవరెట్లలో ఒకడైన జొనాస్ వెటెర్ (జర్మనీ) తన తొలి ప్రయత్నంలో 82.52 మీటర్లు జావెలిన్ విసిరి వెనుకబడ్డాడు. తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ ‘ఫౌల్’ చేసిన అతను 9వ స్థానం లో నిలిచాడు. దాంతో టాప్–8 లో పోటీ పడే అవకాశం కూడా లేకుండా వెటెర్ నిష్క్రమించాడు. మిగతా త్రోయర్లు చివరి వరకు ప్రయత్నించినా నీరజ్ స్కోరును అందుకోలేకపోయారు. ‘సూరజ్’ వరకు ‘నీరజ్’ జావెలిన్ నీరజ్ చోప్రాకు అభినందనలు. అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలవాలనే వందేళ్ల భారతీయుల కలను నువ్వు నిజం చేశావు. ఈ విజయం దేశంలోని ఇతర క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. –కె.చంద్రశేఖర రావు, తెలంగాణ ముఖ్యమంత్రి భారత సైన్యంలో పని చేస్తున్న సిపాయి ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించి దేశం గర్వపడేలా చేశాడు. తొలి ఒలింపిక్స్‌లోనే జావెలిన్‌తో నీరజ్ చరిత్ర సృష్టించాడు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారత జాతి కల నెరవేర్చిన నీకు కృతజ్ఞతలు. మా బంగారు క్లబ్‌లోకి ఆహ్వానం. చాలా గర్వంగా ఉంది. నిన్ను చూస్తే సంతోషం వేస్తోంది. –అభినవ్ బింద్రా ఇలాంటి రోజు కోసం నాన్న ఎన్నో ఏళ్లు ఎదురు చూశారు. ఇప్పుడు అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణంతో ఆయన కల తీరింది. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. ఇది సాధించిన నీరజ్‌కు కృతజ్ఞతలు. నువ్వు గెలవడమే కాదు నాన్నకు పతకాన్ని అంకితమివ్వడం చాలా గొప్పగా అనిపిస్తోంది. –జీవ్, మిల్కా సింగ్ కుమారుడు 37 ఏళ్ల క్రితం అసంపూర్తిగా మిగిలిపోయిన నా కల ఇప్పుడు పూర్తయింది. థ్యాంక్యూ మై సన్. –పీటీ ఉష నీ వల్ల భారత్ ప్రకాశిస్తోంది నీరజ్... నీ జావెలిన్ త్రివర్ణాన్ని ఎగురవేసి అందరూ గర్వపడేలా చేసింది. –సచిన్ టెండూల్కర్ నమ్మలేకపోతున్నా. తొలిసారి అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించడం చాలా గొప్పగా అనిపిస్తోంది. నేనూ, నా దేశం గర్వించే క్షణమిది. నేను విసిరిన దూరం బంగారం అందిస్తుందని ఊహించలేదు. ఇంకా ఆ భావోద్వేగంలోనే ఉన్నాను. నేను మామూలుగా మారేందుకు కొంత సమయం పడుతుందేమో. నా జీవితంలో ఇదే అత్యుత్తమ క్షణం. త్రో సమయంలో నేను ఒక్కసారి కూడా ఒత్తిడికి లోను కాలేదు. బలంగా జావెలిన్ విసరాలని మాత్రమే అనుకున్నా. ఇటీవలే కన్నుమూసిన దిగ్గజం మిల్కా సింగ్‌కు నా పతకం అంకితం. స్టేడియంలో భారత జాతీయగీతం వినపడాలని ఆయన కోరుకున్నారు. ఆయన లేకపోయినా ఆ కల నేను పూర్తి చేశాను. – నీరజ్ చోప్రా -
నీరజ్ చోప్రాకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా?
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో అద్బుత ప్రదర్శన చేసి స్వర్ణం కొల్లగొట్టిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. స్వర్ణం సాధించి భారతీయుల కలను సాకారం చేసిన నీరజ్ చోప్రాకు ఇష్టమైన ఫుడ్ ఏంటనేది నెటిజన్లు తెగ వెతికేశారు. అయితే నీరజ్ చోప్రాకు స్వీట్లు అంటే మహా ప్రాణం. స్వతహగా హర్యానా వాసి అయిన నీరజ్ చిన్నప్పటి నుంచి స్వీట్లు ఎక్కువగా తినడం వల్లే 12 ఏళ్ల వయసులో 90 కేజీలకు పైగా పెరిగాడు. ఆ బరువును తగ్గించుకునేందుకే జావెలిన్ త్రోను ఎంచుకున్నాడు. ఈరోజు ఆ క్రీడే దేశానికి ఒలింపిక్స్‌లో స్వర్ణం తెచ్చేలా చేసింది. అయితే నీరజ్ చోప్రా బ్రెడ్ ఆమ్లెట్ తినడం ఎంతో ఇష్టమని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇక తనకిష్టమైన సాల్టెడ్ రైస్‌ను తానే స్వయంగా వండుకొని తినడం అలవాటు చేసుకున్నాడు. ఇక టోర్నమెంట్లు ఉన్న సమయాల్లో సలాడ్లు, పండ్లు తినడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. ఇక ప్రాక్టీస్ చేసేప్పుడు మాత్రం పండ్లరసాలు ఎక్కువగా తీసుకుంటాడు. ఏ దేశంలో పోటీలకు హాజరైతే.. అక్కడ దొరికే ఆహారాలను తీసుకోవడం నీరజ్‌కు అలవాటు. తాజాగా తన డైట్‌లోకి సాల్మన్ చేపలను కూడా యాడ్ చేసుకున్నాడు. ఇక శనివారం సాయంత్రం జరిగిన ఈవెంట్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి పసిడి పతకాన్ని కొల్లగొట్టాడు. -
ఆర్మీ సుబేదార్ నుంచి స్వర్ణ పతక విజేతగా
సాక్షి, వెబ్‌డెస్క్: ఆటలాడటం.. యుద్ధం చేయడం దాదాపు రెండు ఒకలాంటివే. రెండింటిలోనూ విజయం సాధించడం అంత సులవేం కాదు. అందుకే అటు సైనికుడు.. ఇటు ఆటగాడు.. ఇరువురు ప్రతినిత్యం శ్రమిస్తూనే ఉంటారు. తమలోని పోరాట యోధునికి.. క్రీడాకారుడికి పదునుపెట్టుకుంటునే ఉంటారు. యుద్ధంలోనూ, ఇటు క్రీడల్లోను సాధించే విజయాన్ని దేశం మొత్తం ఆనందిస్తుంది. ప్రతి భారతీయుడు.. తానే గెలిచినట్లు సంబరాలు చేసుకుంటాడు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఇదే దృశ్యం కనిపిస్తుంది. ఒలింపిక్స్‌లాంటి అంతర్జాతీయ వేదిక మీద ఓ సైనికుడు చూపిన అసమాన ప్రతిభకు స్వర్ణం లభించింది. 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో.. టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి.. గోల్డోన్ ముగింపు పలికాడు. ఆర్మీ సుబేదార్ నుంచి స్వర్ణం విజేతగా నీరజ్ చోప్రా ప్రస్థానం ఇది.. హరియాణాలోని పానీపత్ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా(23) వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు వ్యవయం చేస్తూ.. జీవనం సాగించేవారు. బాల్యంలో నీరజ్ చాలా బద్ధకంగా ఉండేవాడట. దాంతో విపరీతంగా బరువు పెరిగాడు. ఎంతలా అంటే.. 12 ఏళ్లకే 90కిలోల బరువు ఉన్నాడు. అంత చిన్న వయసులో.. ఇంత భారీగా బరువు పెరగడం పట్ల నీరజ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బరువు తగ్గించడం కోసం ఇంట్లో వాళ్లు ఎక్సర్సైజ్ చేయమని ఎంత చెప్పినా నీరజ్ వినేవాడు కాదట. నీరజ్ జీవతంలోకి జావెలిన్ త్రో ప్రవేశం.. ఈ క్రమంలో ఓ సారి నీరజ్ అంకుల్ భీమ్ చోప్రా అతడిని పానీపత్ స్టేడియంలో జాగింగ్ చేయడానికి తీసుకెళ్లాడు. అక్కడే అతడికి జావెలిన్ త్రో ఆటగాడు జై చౌధరీ తారసపడ్డాడు. జావెలిన్ త్రోను చేతికిచ్చి విసరమని జై చెప్పగానే.. అంత భారీశరీరం ఉన్నప్పటికి కూడా నీరవ్ ఎంతో చక్కటి ప్రదర్శన కనబర్చాడట. జావెలిన్ త్రో గురించి ఏ మాత్రం తెలియకపోయినప్పటికి.. నీరజ్ మొదటి ప్రయత్నంలోనే 35-40 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడట. ఇది గమనించిన జై చౌధరీ.. నీరజ్‌లో పుట్టుకతోనే ప్రతిభ ఉందని అనుకున్నాడు. దీని గురించి జై చౌధరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆటపై నీరజ్‌కు ఆసక్తి పెరిగింది. జావెలిన్‌లో శిక్షణ పొందాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వ్యాయామమంటే ఏమాత్రం ఇష్టం లేని నీరజ్ బరువు తగ్గడానికి సిద్ధపడ్డాడు. ఊహించని ఈ మార్పుతో అతడి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. అయితే నీరజ్ జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్నాడని అతడి కుటుంబ సభ్యులకు తెలియదు. ఓ సారి పేపర్లో నీరజ్ ఫోటో రావడంతో అప్పుడు దీని గురించి వారికి తెలిసింది. అప్పటి వరకు జావెలిన్ త్రో అనే ఆట ఉందనే విషయమే అతడి కుటుంబ సభ్యులకు తెలియదు. ఆర్థికంగా కష్టమైన.. ఆసక్తిని కాదనలేక.. అప్పటికే నీరజ్ జావెలిన్ త్రో పట్ల మమకారాన్ని పెంచుకున్నాడు. అయితే నీరజ్‌ను ఆ రంగంలో ప్రోత్సాహించడం అతడి కుటుంబానికి ఆర్థికంగా చాలా కష్టం. అయినప్పటికి నీరజ్ ఇష్టాన్ని కాదనలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. నీరజ్ శిక్షణకు కావాల్సినవన్నీ సమకూర్చారు. 2011 నుంచి చదువును కొనసాగిస్తూనే నీరజ్ జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు. దాంతో నేషనల్ క్యాంప్ నుంచి నీరజ్‌కు పిలుపు వచ్చింది. మొదలైన పతకాల వేట... నేషనల్ క్యాంప్‌లో చేరిన తర్వాత నీరజ్ ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. ఇక 2016 నుంచి నీరజ్ కెరీర్.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. 2016 జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్ అండర్ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2016 గౌహతిలో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలు, 2017 భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండింటిలోనూ స్వర్ణం సాధించాడు. చైనాలోని జియాక్సింగ్లో జరుగుతున్న ఆసియా గ్రాండ్ ప్రి అథ్లెటిక్స్ మీట్ రెండో దశలో నీరజ్ రజత పతకాన్ని సాధించాడు. 2018 లో, అతను జకార్తాలో జరిగిన గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన 2019.. నీరజ్ కెరీర్లో 2019 సంవత్సరం ఒక చేదు జ్ఞాపకం. ఎందుకంటే.. భుజానికి గాయం, శస్త్రచికిత్స కారణంగా అతడు ఆ ఏడాదిలో జరిగిన పోటీల్లో పాల్గొనలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నీరజ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివిధ పోటీల్లో పాల్గొంటూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. తనలో ఎలాంటి మార్పూ రాలేదని నిరూపిస్తూ.. ముందులాగే రికార్డుల పర్వం కొనసాగించాడు. 2020లో ఒలింపిక్ కోటాలో పలు పోటీల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మార్చి 2021లో జరిగిన జావెలిన్ త్రో పోటీలో పాల్గొని మరో రికార్డు సృష్టించాడు. 2018లో తన పేరుపై ఉన్న 87.43 మీటర్ల రికార్డును 88.07 మీటర్లతో బద్దలుకొట్టాడు. ఒలింపిక్స్ కోసం కఠోర శిక్షణ.. ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా నీరజ్ చోప్రా కఠోర శిక్షణ తీసుకున్నాడు. తన ఉత్తమ ప్రదర్శనలతో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ ప్రోగ్రామ్‌లో చోటు దక్కించుకున్న నీరజ్.. ఆస్ట్రేలియా కోచ్ గారీ కాల్వర్ట్ వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం జర్మన్ బయో మెకానిక్స్ నిపుణుడు క్లాస్ బార్టోనియెట్జ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణం గెలిచి.. తన కలను నెరవేర్చుకున్నాడు. తన కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాడినే కాదని.. తన విజయానికి కారణం వారే అంటాడు నీరజ్. ప్రస్తుతం అతడు ఇండియన్ ఆర్మీలో 4 రాజ్‌పుతానా రైఫిల్స్‌లో సుబేదార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నీరజ్ చోప్రా చండీగఢ్‌లోని డీఏవీ కళాశాలలో గ్రాడ్యుయేన్ పూర్తి చేశాడు. -
నీరజ్ చోప్రా : 'చరిత్ర తిరగరాశావు..దేశం గర్విస్తుంది'
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జావెలిన్ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు.100 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అథ్లెటిక్స్ ఫీల్డ్ అండ్ ట్రాక్ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. 23ఏళ్ల నీరజ్ చోప్రా తొలిసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, మహేశ్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి సహా పలువురు ప్రముఖులు నీరజ్ చోప్రాను అభినందించారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ.. 'ఇది భారత్‌కు అద్భుతమైన విజయం. ఈ క్షణం రావడానికి 101 ఏళ్లు పట్టింది. నీరజ్ చోప్రా..మీరు చరిత్ర లిఖిండమే కాదు..చరిత్రను తిరగరాశావు' అంటూ ప్రశంసలు జల్లు కురిపించారు. THIS Is AN ABSOLUTELY GLORIOUS MOMENT FOR INDIA!!! 101 years in the Making for this moment! An Olympic Gold in Athletics!!@Neeraj_chopra1 Take A Bow!!! You have scripted History and You have changed the Course of History!!! #Olympics #Tokyo2020 #GoForGold pic.twitter.com/8jhY4uskrZ — Chiranjeevi Konidela (@KChiruTweets) August 7, 2021 Super super win by @Neeraj_chopra1 as he wins the gold medal in men’s javelin🥇🕺🇮🇳#JavelinThrowFinal #IndiaTodayAtOlympics #OlympicGames pic.twitter.com/ALvM79OWXB — Venkatesh Daggubati (@VenkyMama) August 7, 2021 India's first ever gold in athletics! Absolutely elated and proud! @Neeraj_chopra1's name is etched in history forever.. Bravo!! 👏👏👏 #Tokyo2020 pic.twitter.com/mSqMi3Pm70 — Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2021 A dream of #Gold. A dream of 130 crore Indians. A dream fulfilled yet again! Kudos #NeerajChopra for winning #OlympicGold in athletics… A massive moment for the Nation 👏🏻👏🏻👏🏻 JAI HIND. 🇮🇳🇮🇳🇮🇳 — rajamouli ss (@ssrajamouli) August 7, 2021 -
13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతం: వైరల్ వీడియో
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి భారత్ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించారు. దీంతో 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినిపించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో బంగారు పతకం సాధించినపుడు భారత జాతీయ గీతాన్ని వినిపించగా.. మళ్లీ ఇన్నేళ్లకు నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడంతో ఒలింపిక్స్‌లో జాతీయ గీతాన్ని వినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మొదటి ప్రయత్నంలో చోప్రా జావెలిన్‌ను 87.03 మీటర్లకు విసిరారు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లకు విసిరారు. కాగా రెండో స్థానంలో చెక్ రిపబ్లిక్కు చెందిన వడ్లెక్ నిలిచారు. ఈయన గరిష్ఠంగా 86.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు. అంతే కాకుండా చెక్ రిపబ్లిక్కు చెందిన విటెజ్స్లావ్ వెస్లీ మూడో స్థానంలో నిలిచారు. ఆయన గరిష్టంగా 85.44 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు. ఇక అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన గంట వ్యవధిలోనే లక్షకు పైగా నెటిజనులు వీక్షించారు. అంతేకాకుండా నీరజ్ చోప్రాకు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తూ.. అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రాకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. #IND National Anthem at Olympic Stadium in #Tokyo2020 Thank you @Neeraj_chopra1 #NeerajChopra pic.twitter.com/68zCrAX9Ka — Athletics Federation of India (@afiindia) August 7, 2021 -
టోక్యోలో మెరిసిన భారత్.. ఒలింపిక్ చరిత్రలో అత్యధిక పతకాలు
సాక్షి, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మెరిసి మురిసింది. ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రాణించి యావత్ భారతావనిని ఆకర్షించింది. ఆరంభంలోనే రజతం సాధించి సత్తాచాటిన భారత్.. ముగింపులో స్వర్ణాన్ని సాధించి శభాష్ అనిపించింది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు దక్కించుకున్న భారత్ ఏడు పతకాలను ఖాతాలో వేసుకుంది. అందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ఇంతకముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అయితే దీనిని పక్కకు తోస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరింత అద్బుతంగా ఆడింది. ఓవరాల్‌గా ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఏ విభాగాల్లో పతకాలు సాధించిదనేది ఒకసారి పరిశీలిద్దాం.. నీరజ్ చోప్రా- స్వర్ణం(జావెలిన్ త్రో) భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్ రెండో రౌండ్లో 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్ ముగింపు ఇచ్చాడు. మీరాబాయి చాను- రజతం(వెయిట్ లిఫ్టింగ్) ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే రజతం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది మీరాబాయి చాను. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో పోటీపడింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. అయితేనేం రజతం ద్వారా భారత్ పతకాల బోణీని తెరిచిన తొలి వ్యక్తిగా నిలిచింది. రవికుమార్ దహియా- రజతం( రెజ్లింగ్) ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రవికుమార్ దహియా అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే అదరగొట్టాడు. 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ అర్హత, క్వార్టర్స్, సెమీస్ బౌట్లలో దుమ్మురేపి ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా ఫైనల్లో రష్యాకు చెందిన రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి 7-4 తేడాతో ఓడిపోయాడు. తద్వారా సుశీల్ కుమార్ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పీవీ సింధు- కాంస్యం( బాడ్మింటన్) రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన పీవీ సింధుపై ఈ ఒలింపిక్స్‌లో మంచి అంచనాలు ఉండేవి. ఆ అంచనాలు నిజం చేస్తూ లీగ్, ప్రీ క్వార్టర్స్, క్వార్టర్స్‌లో దుమ్మురేపిన ఆమె ఒక్క గేమ్ కోల్పోకుండా సెమీస్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్చేతిలో పరాజయం పాలైన సింధు.. కాంస్య పతక పోరులో సత్తాచాటింది. సింధు 21–13, 21–15తో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోను చిత్తు చేసి కాంస్యం గెలిచింది. ఫలితంగా రెండు ఒలింపిక్ పతకాలతో భారత క్రీడా చరిత్రలో ఎవరినీ అందనంత ఎత్తులో నిలిచింది. భారత మెన్స్ హాకీ టీమ్- కాంస్యం టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంస్యంతో చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో ఒక్క ఆస్ట్రేలియా మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో విజయాలతో దుమ్మురేపింది. క్వార్టర్స్‌లో గ్రేట్ బ్రిటన్‌పై ఘన విజయం సాధించి సెమీస్‌లో ప్రవేశించింది. అయితే సెమీస్‌లో బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో 5-4తో విజయం సాధించి ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పతకం సాధించి హాకీకి పూర్వ వైభవం తీసుకొచ్చింది. లవ్లీనా బొర్గోహెయిన్- కాంస్యం( బాక్సింగ్) బాక్సింగ్ మహిళల 69 కిలోల విభాగం సెమీ ఫైనల్లో లవ్లీనా.. టర్కీ బాక్సర్ బుసేనాజ్ చేతిలో 0-5 తేడాతో లవ్లీనా పరాజయం పాలైంది. అయితే, గత నెల 30న జరిగిన క్వార్టర్స్‌లో చిన్ చైన్‌పై విజయం సాధించినందుకు గానూ లవ్లీనాకు కాంస్య పతకం దక్కింది. ఇక ఇప్పటి వరకు భారత బాక్సింగ్‌లో విజేందర్ సింగ్(2008), మేరీ కోమ్(2012) తర్వాత పతకం సాధించిన మూడో బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. భజరంగ్ పూనియా- కాంస్యం(రెజ్లింగ్) ఇక భజరంగ్ పూనియా టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే కాంస్యంతో అదరగొట్టాడు. రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ దౌలత్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఉడుం పట్టు అంటే ఏంటో ప్రత్యర్థికి రుచి చూపించాడు. ► వీరు మాత్రమే గాక ఈసారి ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు, గోల్ప్‌లో అదితి అశోక్, రెజ్లింగ్‌లో దీపక్ పూనియాలు కూడా మంచి ప్రదర్శన చేశారు. ముందుగా భారత మహిళల హాకీ జట్టు ప్రదర్శన గురించి చెప్పుకోవాలి. 41 ఏళ్ల తర్వాత సెమీస్‌కు చేరుకున్న భారత మహిళల జట్టు అర్జెంటీనా చేతిలో ఓటమి పాలైంది. అయితే కాంస్య పతక పోరు కోసం భారత అమ్మాయిల జట్టు 3–4తో బ్రిటన్ చేతిలో పోరాడి ఓడింది. కాగా ఒలింపిక్స్‌లో మూడో ప్రయత్నంలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానం సంపాదించిన భారత మహిళల జట్టు ప్రదర్శన కాంస్య పతకంలాంటిదేనని దేశం వారిని పొగడ్తలతో ముంచెత్తింది. ► ఆటల్లో రిచ్చెస్ట్ గేమ్‌గా గోల్ఫ్‌కు ఓ పేరుంది. అలాంటి ఆటలో.. అదీ ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌దాకా చేరుకుని భారత్‌కు పతక ఆశలు చిగురింపజేసింది 23 ఏళ్ల అదితి. టోక్యో ఒలింపిక్స్‌కి ముందు.. ప్రారంభమైన తర్వాతా పతకాన్ని తెస్తారనే ఆశలు ఉన్న పేర్ల లిస్ట్‌లో అదితి పేరు కనీసం ఏదో ఒక మూలన కూడా లేదు. కారణం.. మహిళా గోల్ఫ్ ర్యాకింగ్స్లో ఆమెది 200వ ర్యాంక్. అలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. పతాక పోరు దాకా అదితి చేరుకోవడం, ఆ పోరాటంలో ఓడి కోట్ల మంది హృదయాలను గెల్చుకోవడం ప్రత్యేకంగా నిలిచిపోయింది. -
నీరజ్.. టోక్యోలో చరిత్ర లిఖించావ్: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఒకేరోజు రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు చివరి రోజున నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి.. గోల్డెన్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇక రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. అరంగ్రేంట్రంలోనే భజరంగ్ పూనియా కాంస్యం సాధించి.. చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా, భజరంగ్ పూనియాకులకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నీరజ్.. టోక్యోలో చరిత్ర లిఖించావ్: మోదీ ‘‘నీరజ్ చోప్రా ఈ రోజు టోక్యోలో సాధించని విజయం ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఈ రోజు టోక్యోలో చర్రిత సృష్టించావ్. అద్భుతమైన అభిరుచితో ఆడావు.. అసమానమైన గ్రిట్ చూపించావు. స్వర్ణం గెలిచినందుకు నీకు అభినందనలు’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. History has been scripted at Tokyo! What @Neeraj_chopra1 has achieved today will be remembered forever. The young Neeraj has done exceptionally well. He played with remarkable passion and showed unparalleled grit. Congratulations to him for winning the Gold. #Tokyo2020 https://t.co/2NcGgJvfMS — Narendra Modi (@narendramodi) August 7, 2021 Delightful news from #Tokyo2020! Spectacularly fought @BajrangPunia. Congratulations to you for your accomplishment, which makes every Indian proud and happy. — Narendra Modi (@narendramodi) August 7, 2021 నీవు సాధించిన విజయం యువతకు స్ఫూర్తి: రామ్‌నాథ్ కోవింద్ ‘‘నీరజ్ చోప్రా సాధించిన అపూర్వ విజయం! మీరు మీ మొదటి ఒలింపిక్స్‌లో భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడల్‌ను ఇంటికి తీసుకువచ్చారు. మీ ఫీట్ మా యువతకు స్ఫూర్తినిస్తుంది. మీ విజయం పట్ల భారతదేశం ఉప్పొంగిపోతుంది! మీకు హృదయపూర్వక అభినందనలు’’ అంటూ రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. Unprecedented win by Neeraj Chopra!Your javelin gold breaks barriers and creates history. You bring home first ever track and field medal to India in your first Olympics. Your feat will inspire our youth. India is elated! Heartiest congratulations! — President of India (@rashtrapatibhvn) August 7, 2021 A special moment for Indian wrestling! Congratulations to Bajrang Punia for winning the Bronze at #Tokyo2020. You have distinguished yourself as an outstanding wrestler with untiring efforts, consistency and tenacity over the years. Every Indian shares the joy of your success! — President of India (@rashtrapatibhvn) August 7, 2021 నీరజ్ చోప్రాకు భారీ నజరానా ప్రకటించిన హరియాణా ప్రభుత్వం చండిగఢ్: 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. హరియాణాకు చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో హరియాణా సర్కార్ నీరజ్ చోప్రాకు భారీ నజరానా ప్రకటించింది. అతడికి 6 కోట్ల రూపాయల నగదు బహుమానంతోపాటు.. క్లాస్-1 గ్రేడ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. -
నీరజ్, భజరంగ్‌లను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో ఘనమైన ముగింపు ఇచ్చిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు.జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన జావెలిన్ త్రో తుది పోరులో నీరజ్ చోప్రా 87. 58 మీటర్ల దూరం విసిరి చరిత్ర సృష్టించాడు. అదే సమయంలో టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలోకాంస్యం సాధించి కొత్త అధ్యాయం లిఖించిన భజరంగ్ పూనియాను సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. అత్తుత్తమ ప్రదర్శన, అంతర్గత బలం కనబరచి.. దేశానికి పతకం సాధించావని భజరంగ్ పూనియాను సీఎం జగన్ అభినందించారు. రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ దౌలత్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించి.. భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ భజరంగ్ పూనియాకు అభినందనలు తెలిపారు. Congratulations to @BajrangPunia on winning bronze in 65kgs freestyle #Wrestling, taking India's Olympic medal count to 6. He deserves praise for his outstanding display of courage & inner strength to win the bout with 8-0 for #TeamIndia. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2021 -
నీరజ్ చోప్రా అద్భుతం.. వారెవ్వా భారత్‌కు 'గోల్డెన్' ముగింపు
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి భారత్ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. తద్వారా 100 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అథ్లెటిక్స్ ఫీల్డ్ అండ్ ట్రాక్ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. మ్యాచ్ విషయానికొస్తే మొదటి రౌండ్లోనే 87.03 మీటర్లు విసిరి టాప్ పొజీషన్లో ఉన్న నీరజ్ రెండో రౌండ్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈసారి ఏకంగా 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేశాడు. ఆ తర్వాత మూడో రౌండ్లో 76. 79 మీటర్లు విసిరినప్పటికి తొలి రెండు రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో తొలి స్థానంలో కొనసాగాడు. ఇక నాలుగో;ఐదో రౌండ్లో త్రో వేయడంలో విఫలమయ్యాడు.ఇక చివరగా ఆరో రౌండ్లో 84.24తో ముగించాడు. ఓవరాల్‌గా 87.58తో సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకున్నాడు. ఇక భారత్‌కు వ్యక్తిగత విభాగంలో స్వర్ణం తెచ్చిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా చరిత్రలోకెక్కాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో అభివన్ బింద్రా భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. -
చరిత్ర సృష్టించిన భజరంగ్ పూనియా.. భారత్‌కు మరో పతకం
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భజరంగ్ పూనియా చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే కాంస్యంతో అదరగొట్టాడు. రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ దౌలత్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఉడుం పట్టు అంటే ఏంటో ప్రత్యర్థికి రుచి చూపించిన భజరంగ్ తన కాంస్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు. అంతేగాక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో దేశానికి పతకం అందించిన ఆరో రెజ్లర్‌గా నిలిచాడు. ఇదే ఒలింపిక్స్‌లో రవి కుమార్ దహియా రజతం గెలవగా.. తాజాగా భజరంగ్ కాంస్యం గెలిచాడు. ఇంతకముందు కేడీ జాదవ్(కాంస్యం), సుశీల్ కుమార్ (కాంస్యం, రజతం), సాక్షి మాలిక్( కాంస్యం), యేగేశ్వర్ దత్( కాంస్యం), రవి దహియా(రజతం) గెలిచారు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ పీరియడ్‌లో భజరంగ్ మొదట ఓ పాయింట్ సాధించాడు. రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ కొట్టిన దౌలత్.. ఈ మ్యాచ్‌లో భజరంగ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఫస్ట్ పీరియడ్ ముగింపులో మరో పాయింట్‌ను భజరంగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆ పీరియడ్‌లోకి అతనికి 2-0 లీడ్ వచ్చింది. సెకండ్ పీరియడ్ కూడా రసవత్తరంగా సాగింది. అయితే ఆ పీరియడ్ ఆరంభంలోనే భజరంగ్ రెండు పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత వరుసగా రెండేసి పాయింట్లను రెండు సార్లు సాధించిన పూర్తి ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. ఆ పీరియడ్‌లో ఆరు పాయింట్లు గెలిచాడు. కాగా భజరంగ్ కాంస్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటివరకు భారత్‌కు 2 రజతాలు, 4 కాంస్య పతకాలు వచ్చాయి. -
వరుసగా 8 ఒలింపిక్స్‌లు; అందుకే ఘనమైన వీడ్కోలు
టోక్యో: ప్రపంచంలోని ప్రతి అథ్లెట్ కనీసం ఒక్క ఒలింపిక్స్ అయినా ఆడాలని కలగనడం సహజం. ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్గేమ్స్, ఏషియన్ గేమ్స్ ఇలా వేటిలో పతకాలు సాధించినా.. ఒలింపిక్స్‌లో సాధించే పతకానికి క్రేజ్ వేరే ఉంటుంది. పతకం గెలిచినా గెలవకపోయినా.. తాము ఆడుతున్న దేశం తరపున కనీసం ఒక్క ఒలింపిక్స్‌లో అయినా పాల్గొనాలని అనుకుంటారు. అయితే ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వాల్ట్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా వరుసగా 8 ఒలింపిక్స్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ మొదలుకొని 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు ఒక్కసారి కూడా మిస్ కాకుండా పాల్గొనడం విశేషం. అంతేగాక మూడు దేశాల తరపున ఒలింపిక్స్‌లో ఆడిన రెండో జిమ్నాస్ట్ మహిళగా చుసోవిటినా రికార్డు సాధించింది. 8 ఒలింపిక్స్‌లో ఆడిన ఆమె 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడం విశేషం. తాజాగా అత్యధిక ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఒక్సానాకు స్టాండింగ్ ఒవేషన్(ఘనమైన వీడ్కోలు) లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తనకు ఇవే చివరి ఒలింపిక్స్ అని ఒక్సానా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే చెప్పింది. ఈసారి ఒలింపిక్స్‌లో వాల్ట్ జిమ్నాస్టిక్స్‌లో రెండు వాల్ట్స్ పూర్తి చేసి 14.166 స్కోరు నమోదు చేశాడు. అయితే ఆమె చేసిన స్కోరు సరిపోకపోవడంతో క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే వెనుదిరిగింది. -
మనసులు గెలిచిన అదితి.. పార్, బర్డీ, ఈగల్ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, వెబ్‌డెస్క్: ‘‘ఏం అర్థం కావడం లేదు. కానీ చూడటానికి మాత్రం బాగుంది’’.. టోక్యో ఒలింపిక్స్‌లో అంచనాలకు మించి రాణించిన భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ ఆడుతున్న సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ ఇది. నిజమే.. గోల్ఫ్ అంటే ఏంటో తెలియని వాళ్లను కూడా టీవీని అతుక్కుపోయేలా చేసింది మన అమ్మాయి. తొలిసారి ఫైనల్‌కు చేరిన అతిదిని ఉద్దేశించి అభిమానులంతా.. ‘‘కమాన్ అదితి.. నీకోసం మేమంతా ప్రార్థిస్తున్నాం’’ అని ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు. ఫలితం ఎలా ఉన్నా అదితి పోరాటం స్ఫూర్తిదాయకం. మూడు రౌండ్ల వరకు ఆమె సాగించిన ప్రయాణం నవతరానికి మార్గదర్శనం. పతకం చేజారినా అదితి అద్భుత ప్రదర్శన భారతీయులను గర్వపడేలా చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై కురుస్తున్న ప్రశంసల వర్షమే ఇందుకు నిదర్శనం. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే.. రిచ్చెస్ట్ గేమ్‌గా పేరొందిన గోల్ఫ్ గురించి మనలో చాలా మందికి బేసిక్ రూల్స్, పదాల గురించి కూడా అవగాహన ఉండదు కదా! అయితేనేం, అదితి ఆడుతున్నంత సేపు అందరూ ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా పార్స్, బర్డీస్, ఈగల్స్, బొగేస్ అన్న పదాల గురించి సోషల్ మీడయాలో చర్చ జరిగింది. అసలు వీటికి అర్థాలేంటి? గోల్ఫ్ వ్యక్తిగత విభాగంలో విజేతను ఎలా తేలుస్తారన్న అంశాల గురించి సంక్షిప్త సమాచారం మీకోసం.. ►సాధారణంగా పచ్చికతో లేదా ఇసుకతో నిండి ఉన్న విశాలమైన ప్రదేశంలో స్టిక్‌తో ప్రత్యేక బంతిని గమ్యస్థానమైన నిర్ణీత రంధ్రంలోకి ముందుకు తీసుకెళ్లడమే గోల్ఫ్ లక్ష్యం. గోల్ఫ్ కోర్సులో 9 లేదా 18 రంధ్రాలు ఉంటాయి. ఒక్కొక్కటి పరస్పర విరుద్ధ రూపాలు, లక్షణాలు కలిగి ఉంటాయి. బంతిని హోల్లోకి కొట్టేందుకు కనీసమైన స్ట్రోకులు(షాట్లు) చేయాల్సి ఉంటుంది. పార్: ప్రొఫెషనల్ గోల్ఫర్.. గోల్ఫ్ కోర్సులోని ఒక నిర్ణీత హోల్లోకి ఎన్ని స్ట్రోక్‌లలో బంతిని చేర్చారన్న స్కోరును తెలిపేదే పార్. సింపుల్‌గా చెప్పాలంటే.. స్ట్రోకుల సంఖ్యను ‘పార్’ సూచిస్తుంది. ►హోల్స్ పొడవు, లక్షణాల ఆధారంగా పార్-3(హోల్లో బంతిని చేర్చేందుకు మూడు స్ట్రోకులు), పార్-4, పార్-5.. అరుదుగా పార్-6.. గోల్ఫ్ కోర్సు స్వరూపం, రేటింగ్‌ను నిర్ణయిస్తారు. ►ఇక నిర్ణీత స్ట్రోకుల కంటే తక్కువ షాట్స్‌లోనే లక్ష్యాన్ని చేరితే.. సదరు గోల్ఫర్ స్కోరును అండర్ పార్తో సూచిస్తారు. అంతకంటే ఎక్కువ స్ట్రోకులు తీసుకుంటే ఓవర్ పార్ అంటారు. ►బర్డీ, ఈగల్స్, బొగేస్ అనేవి ఒక గోల్ఫర్ ప్రదర్శనకు కొలమానంగా నిలిచే అంశాలు. ►బర్డీ- ఒక హోల్లో బంతిని చేర్చేందుకు అవసరమైన నిర్ణీత స్ట్రోకుల కంటే కచ్చితంగా ఒక స్ట్రోకు తక్కువగా ఉంటే దానిని (1- అండర్ పార్) బర్డీగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు.. పార్-5 హోల్‌ను పూర్తి చేసేందుకు కేవలం నాలుగు స్ట్రోకులు మాత్రమే అవసరమైతే దానిని బర్డీ అంటారు. ►బొగే- అదే విధంగా నిర్ణీత స్ట్రోకుల కంటే ఒకటి ఎక్కువ తీసుకుంటే.. 1-ఓవర్ పార్ ఆన్ హోల్‌ను బొగేగా వ్యవహరిస్తారు. 2- ఓవర్ పార్ అయితే డబుల్ బొగే, 3- ఓవర్ పార్ అయితే ట్రిపుల్ బొగే అంటారు. ►ఈగల్- 2-అండర్ పార్ ఆన్ హోల్‌ను ఈగల్ అంటారు. అత్యంత అరుదుగా నమోదయ్యే 3- అండర్ పార్ను డబుల్ ఈగల్ అంటారు. పార్-3, పార్-, పార్-5 హోల్స్.. గోల్ఫ్ స్కోరింగ్ ఇలా పార్-5 హోల్: ►డబుల్ ఈగల్: పార్- 5 స్కోరింగ్ అంటే.. రెండు స్ట్రోకుల్లోనే లక్ష్యం పూర్తిచేసినట్లు అర్థం. అదే విధంగా... ఈగల్- 3 స్ట్రోకులు, బర్డీ- 4 స్ట్రోకులు, పార్- 5 స్ట్రోకులు, బొగే- 6 స్ట్రోకులు, డబుల్ బొగే- 7 స్ట్రోకులు, ట్రిపుల్ బొగే- 8 స్ట్రోకులలో టార్గెట్ ముగించినట్లన్న మాట. పార్- 4 హోల్.. లక్ష్యం పూర్తి చేసే విధానం, స్కోరు. ►డబుల్ ఈగల్- పార్-4: ఒకే ఒక్క స్ట్రోకులో లక్ష్యాన్ని చేరడం(దాదాపు అసాధ్యం) ఈగల్- 2 స్ట్రోక్స్‌లో.. బర్డీ: 3 స్ట్రోక్స్‌లో.. పార్- 4 స్ట్రోక్స్‌లో.. బొగే- 5 స్ట్రోక్స్‌లో.. డబుల్ బొగే- 6 స్ట్రోక్స్‌లో.. ట్రిపుల్ బొగే- 7 స్ట్రోక్స్‌లో పార్-3 హోల్: ►డబుల్ ఈగల్- పార్-3 హోల్లో డబుల్ ఈగల్ సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్క షాట్ కూడా ఆడకుండా లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం. ►ఈగల్- ఒకే ఒక స్ట్రోక్‌తో లక్ష్యాన్ని చేరుకోవడం ►బర్డీ- 2 స్ట్రోకుల్లో ►పార్- 3 స్ట్రోకుల్లో ►బొగే- 4 స్ట్రోకుల్లో ►డబుల్ బొగే- 5 స్ట్రోకుల్లో ►ట్రిపుల్ బొగే- 6 స్ట్రోకుల్లో అంటే, తక్కువ షాట్స్‌లో బంతిని హోల్లో చేర్చిన వారినే విజేతగా నిర్ణయిస్తారన్న మాట. శుక్రవారం నాటి టోక్యో ఒలింపిక్స్ ఫైనల్లో అమెరికాకు చెందిన కోర్డా నెల్లే స్వర్ణ పతక విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇనామీ మోనె(జపాన్), కో లిడియా(న్యూజిలాండ్) రజత, కాంస్య పతకాలు గెల్చుకున్నారు. అదితి నాలుగో స్థానానికే పరిమితమైంది. -
జలకన్యల విన్యాసాలు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవంతే!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలు సందడిగా మారాయి. ఓ వైపు కరోనా మహమ్మారి కొనసాగుతున్నా.. అథ్లెట్లు పతకాల కోసం పోటీపడున్నారు. అంతార్జాతీయ క్రీడల్లో తమ దేశానికి పథకం తీసుకురావలనే ఆశయంతో ప్రతీ క్రీకాకారుడు పోరాడుతున్నారు. ఒలింపిక్స్‌లో హాకీ, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ ఇలా..ఎన్నో రకాల పోటీలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ఆర్టిస్టిక్ స్విమ్మింగ్(కళాత్మక ఈత). ఈతలో ఈ రకమైనది ఒకటి ఉందని ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఈ పోటీల్లో పాల్గొంటున్న వుమెన్ స్మిమ్మర్స్ మాత్రం తమ ప్రతిభతో అదరగొడుతున్నారు. నీళ్లల్లోనూ స్ప్రింగ్‌లా కదులుతూ మిరాకిల్ సృష్టిస్తున్నారు.. ఆ ఫోటోలు మీకోసం.. -
Artistic Swimming: జలకన్యల విన్యాసాలు.. వావ్ అనాల్సిందే!
-
అదితి ఓ సెన్సేషన్.. ఈ పోరు చరిత్రలో నిలవాల్సిందే!
క్రీడాభిమానుల గుండె వేగం పెంచే ఆట క్రికెట్ ఒక్కటేనా?.. ఛా.. ఛా.. ఈసారి ఒలింపిక్స్‌లో అలాంటి క్షణాలు చాలానే కనిపించాయి. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్.. అంటూ హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్.. ఆఖరికి రూల్స్‌పై కూడా సరిగా అవగాహనా- ఆటపై అంతగా ఆసక్తి సైతం లేని గోల్ఫ్‌ను సైతం కోట్ల భారతావనిని ఆసక్తిగా తిలకించేలా చేశారు మన ఆటగాళ్లు. అలాంటి ఉత్కంఠంతో చివరిదాకా మ్యాచ్‌ను కొనసాగించి.. ఓడినా చరిత్ర సృష్టించింది భారత యువగోల్ఫర్ అదితి అశోక్ . సాక్షి, వెబ్‌డెస్క్: ఆటల్లో రిచ్చెస్ట్ గేమ్‌గా గోల్ఫ్‌కు ఓ పేరుంది. అలాంటి ఆటలో.. అదీ ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌దాకా చేరుకుని భారత్‌కు పతాక ఆశలు చిగురింపజేసింది 23 ఏళ్ల అదితి. టోక్యో ఒలింపిక్స్‌కి ముందు.. ప్రారంభమైన తర్వాతా పతకాన్ని తెస్తారనే ఆశలు ఉన్న పేర్ల లిస్ట్‌లో అదితి పేరు కనీసం ఏదో ఒక మూలన కూడా లేదు. కారణం.. మహిళా గోల్ఫ్ ర్యాకింగ్స్లో ఆమెది 200వ ర్యాంక్. అలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. పతాక పోరు దాకా అదితి చేరుకోవడం, ఆ పోరాటంలో ఓడి కోట్ల మంది హృదయాలను గెల్చుకోవడం ప్రత్యేకమనే చెప్పాలి. బెంగళూరుకు చెందిన అదితి అశోక్.. టోక్యో ఒలింపిక్స్‌లో నిన్నటి పొజిషన్లో(మూడో రౌండ్) రెండో స్థానంలో నిలవగా.. అదృష్టం బావుండి ఇవాళ్టి వాతావరణం బాగోలేకపోతే దాదాపు పతాకం ఖాయమయ్యేదే. అయితే శనివారం ఉదయం సైటమాలోని కాసుమిగాసెకి కౌంట్రీ క్లబ్లో జరిగిన ఫైనల్ గేమ్ రసవత్తరంగా నడిచింది. అయినా అతిది అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. టాప్ పొజిషన్లో నిలిచి ఒకానొక టైంలో అభిమానుల్లో స్వర్ణం ఆశలు రేకెత్తించి ఉత్కంఠ పెంచిన అదితి.. ఆపై రెండు, మూడు.. చివరికి స్వీయ తప్పిదం-ప్రత్యర్థులకు కలిసి రావడంతో నాలుగో స్థానానికి సెటిల్ అయ్యింది. పతకం దక్కించుకోకపోతేనేం.. గోల్ఫ్ ఆటలోనూ అసలైన మజాను కోట్ల మంది భారతీయులకు రుచి చూపించింది అదితి. ఇక రియో ఒలింపిక్స్‌లో 41 వ స్థానంలో టైతో నిష్క్రమించిన అదితి అశోక్.. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా ఫైనల్ దాకా దూసుకెళ్లడం విశేషం. క్యాడీగా(గోల్ఫ్ బ్యాగులు మోస్తూ సాయం చేసే వ్యక్తి) తల్లి వెంటరాగా.. 200వ ర్యాంక్‌తో బరిలోకి దిగిన ఈ యువ కెరటం ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ నెల్లీ కోర్డా, మాజీ ఛాంపియన్ లైడియా కో(11), ఎమిటీ క్రిస్టియన్(72), మోన్ ఇనామీ(28)మధ్య గట్టి పోటీ ఇస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఒకానొక దశలో ప్రపంచ నెంబర్ వన్, మాజీ నెంబర్ వన్లకు ముచ్చెమటలు పోయించింది ఈ భారత గోల్ఫ్ ప్లేయర్. చదవండి: భారత హాకీ: పతాకం నుంచి పతనం.. ఆపై పతకం గోల్ఫ్ ఆట తీరు అర్థంకాకపోయినా.. అదితి ఆడుతున్నంతసేపూ ఉత్కంఠను తట్టుకోలేకపోయారు యావత్ భారత క్రీడాభిమానులు. గోల్ఫ్ అంటే ఆసక్తి లేనోళ్లను.. సైతం శనివారం పొద్దుపొద్దున్నే టీవీలకు, సెల్‌పోన్లకు అతుక్కుపోయేలా చేసింది అదితి అశోక్. అంతేకాదు కొందరిని ఆటలోని పదాలను, ఆట తీరును అర్థం చేసుకునేలా చేసింది. ఇక ఒలింపిక్ జాబితాలో పీటీ ఉష, దీపా కర్మాకర్, ఈ ఒలింపిక్స్‌లో ఉమెన్స్ హాకీ టీం.. ఇప్పుడు అదితి అశోక్.. ఇలా ఫోర్త్ సెటిల్ సెంటిమెంట్(తృటిలో పతకం చేజార్చుకున్న ఆటగాళ్ల) ప్రస్తావనను మరోసారి తెర మీదకు తెచ్చింది. -
హ్యాట్రిక్ గర్ల్‌కు ప్రభుత్వ భారీ నజరానా
డెహ్రాడూన్: హాకీ క్రీడాకారిణి, హ్యాట్రిక్ గర్ల్ వందన కటారియాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనకుగాను ఆమెకు రూ. 25 లక్షల నగదు బహుమతిని ఇవ్వనున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. అలాగే ఆటలలో ప్రతిభను పెంపొందించేందుకు త్వరలోనే ఒక ఆకర్షణీయమైన కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకురానున్నామని కూడా ఆయన చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీలో భారత అత్యుత్తమ ప్రదర్శనలో వందన కటారియా పోషించిన అద్భుతమైన పాత్ర తమకు గర్వకారణమని సీఎం ఆమెను ప్రశంసించారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ లో సెమి ఫైనల్లో ఓటమికి వందన కటారియానే కారణమంటూ కులంపేరుతో దూషించిన కేసులో ఇద్దరు వ్యక్తులనుపోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక నేషనల్ హాకీ ప్లేయర్ అని సమాచారం. తెలుస్తోంది. అతడిపై భారత హాకీ సమాఖ్య తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.భారత మహిళా హాకీ జట్టు అర్జెంటీనాపై 1-2 తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో వందన కటారియా వల్లనే ఓడి పోయిందంటూ దారుణమైన ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. కొందరు ఆమె నివాసం వద్ద నిరసనకు దిగారు. దీనిపై వందన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని రోష్నాబాద్ గ్రామానికి చెందిన హాకీ క్రీడాకారిణి వందనా కటారియా. టోక్యో ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ గోల్స్ కొట్టి సరికొత్త రికార్డు సాధించింది. భారత మహిళా హాకీ ప్లేయర్ ఇలా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడం ఇదే తొలిసారి.ఈ మ్యాచ్‌లో 4-3 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాటి హోరా హోరీ కాంస్య ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో ఓటమి పాలైంది. ముఖ్యంగా చివరి క్వార్టర్లో ఫలితం తారుమారుకావడంతో తొలి ఒలింపిక్ పతకాన్ని సాధించాలనే భారత మహిళల హాకీ జట్టు ఆశ ఫలించకుండా పోయింది. -
సూపర్ ఫెలిక్స్: ఏకంగా 10 ఒలింపిక్ పతకాలు.. ఈసారి కూతురితో
Allyson Felix 10th Olympic Medal: అమెరికా మహిళా స్టార్ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ క్రీడాంశంలో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా ఆమె రికార్డు నెలకొల్పింది. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మహిళల 400 మీటర్ల ఫైనల్ రేసులో 35 ఏళ్ల ఫెలిక్స్ 49.46 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. తద్వారా 10 ఒలింపిక్ మెడల్స్ (6 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం)తో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళగా ఘనతకెక్కింది. ‘టోక్యో’కు ముందు వరకు ఈ రికార్డు జమైకా అథ్లెట్ మెర్లిన్ ఒట్టి (9 పతకాలు) పేరిట ఉండేది. అంతేకాకుండా ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన అమెరికా అథ్లెట్‌గా పేరున్న కార్ల్ లూయిస్ (10 పతకాలు) రికార్డును కూడా ఫెలిక్స్ సమం చేసింది. నేడు జరిగే మహిళల 4్ఠ100 మీ. టీమ్ రిలేలో కూడా ఆమె పతకం సాధి స్తే... అమెరికా తరఫున అత్యధిక పతకాలు సాధించిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా ఫెలిక్స్ నిలుస్తుంది. ఓవరాల్ రికార్డు మాత్రం ఫిన్లాండ్ అథ్లెట్ పావో నుర్మీ (12 పతకాలు) పేరిట ఉంది. 400 మీ. పరుగులో ఫెలిక్స్ కంటే ముందుగా 48.36 సెకన్లలో గమ్యాన్ని చేరిన షానే మిల్లర్ విబో (బహామస్) స్వర్ణాన్ని... మెరిలిడీ పౌలినో (49.20 సెకన్లు–డొమినికన్ రిపబ్లిక్) రజతాన్ని దక్కించుకున్నారు. అమ్మతనం కోసం... ఈతరంలో ‘క్వీన్ ఆఫ్ ట్రాక్’గా అలీసన్ ఫెలిక్స్‌కు గుర్తింపు ఉంది. టోక్యోకు ముందే 6 స్వర్ణాలు సహా ఆమె ఖాతాలో 9 ఒలింపిక్ పతకాలు ఉన్నాయి. అద్భుత ఫలితాలు సాధి స్తుండటంతో ఆమెతో పలు పెద్ద కంపెనీలు బ్రాండింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో వరల్డ్ నంబర్‌వన్ స్పోర్ట్స్ కంపెనీ ‘నైకీ’ ఒకటి. నైకీతో ఫెలిక్స్ అనుబంధం పదేళ్లకు పైగా సాగింది. మరో అథ్లెట్ కెన్నెత్ ఫెర్గూసన్‌తో పెళ్లి తర్వాత 2018లో ఆమె తల్లి కావడానికి సిద్ధమైంది. అయితే ఈ వార్త తెలిసిన ‘నైకీ’ కాంట్రా క్ట్ పొడిగింపు సమయంలో గతంలో ఇచ్చిన దాంట్లో ఏకంగా 70 శాతం తక్కువగా ఇస్తామని చెప్పడంతో ఫెలిక్స్ షాక్‌కు గురైంది. పైగా ప్రసవానికి ముందు, తర్వాతి రోజుల్లో ఆమె ప్రదర్శన బాగా లేకపోతే డబ్బులు తగ్గిస్తామని కూడా స్పష్టం చేసింది. ‘ఇంత పెద్ద అథ్లెట్నైన నాతోనే నైకీ ఇలా చేస్తే మిగతావారి పరిస్థితి ఏమిటి’ అంటూ ప్రశ్నించిన ఫెలిక్స్ ఆ కంపెనీతో సంబంధాలు తెంచుకుంది. ‘గ్యాప్’ కు చెందిన ‘అథ్లెటా’తో ఒప్పందం చేసుకుంది. వారు ‘అథ్లెట్...అమ్మ’ అంటూ ఆమెను తమ ప్రచారంలో వాడుకున్నారు. ఫెలిక్స్ దెబ్బకు అంతటి ‘నైకీ’ కూడా దిగి వచ్చింది. జనంలో బాగా చెడ్డపేరు రావడంతో అథ్లెట్ల కోసం కొత్త మెటర్నిటీ పాలసీని ప్రకటించింది. ఇప్పుడు నైకీ అథ్లెట్లకు గ్యారంటీ మొత్తం లభించడంతో పాటు ప్రసవానికి ముందు, తర్వాత 18 నెలల బోనస్ కూడా లభిస్తుంది. మహిళా అథ్లెట్ల హక్కు కోసం 170 బిలియన్ డాలర్ల విలువ గల కంపెనీతో పోరాడేందుకు సన్నద్ధమైన ఫెలిక్స్... ఇప్పుడు తన కూతురు క్యామ్రిన్ తోడుగా పదో ఒలింపిక్ పతకంతో మురిసిపోతోంది! ఫెలిక్స్ పతకాల జాబితా సంవత్సరం ఒలింపిక్స్ వేదిక క్రీడాంశం పతకం 2004 ఏథెన్స్ 200 మీటర్లు రజతం 2008 బీజింగ్ 200 మీటర్లు రజతం 2008 బీజింగ్ 4X400 మీ.రిలే స్వర్ణం 2012 లండన్ 4X100 మీ.రిలే స్వర్ణం 2012 లండన్ 200 మీటర్లు స్వర్ణం 2012 లండన్ 4X400 మీ.రిలే స్వర్ణం 2016 రియో 400 మీటర్లు రజతం 2016 రియో 4X100 మీ.రిలే స్వర్ణం 2016 రియో 4X400 మీ.రిలే స్వర్ణం 2020 టోక్యో 400 మీటర్లు కాంస్యం చదవండి: Tokyo Olympics: భారత బృందం ఆసియా రికార్డు.. కానీ -
టోక్యో: భారత బృందం ఆసియా రికార్డు.. కానీ
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్లో భారత పురుషుల రిలే జట్టు 4X400 మీటర్ల విభాగంలో కొత్త ఆసియా రికార్డు నెలకొల్పింది. అనస్ యాహియా, టామ్ నోవా నిర్మల్, రాజీవ్ అరోకియా, అమోజ్ జాకబ్‌లతో కూడిన భారత రిలే జట్టు రెండో హీట్‌లో 3ని:00.25 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 3ని:00.56 సెకన్లతో ఖతర్ జట్టు పేరిట ఉన్న ఆసియా రికార్డును భారత బృందం సవరించింది. అయితే భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. మరోవైపు మహిళల 20 కిలోమీటర్ల నడక రేసులో భారత వాకర్స్ ప్రియాంక గోస్వామి 17వ స్థానంలో... భావన జాట్ 32వ స్థానంలో నిలిచారు. #IND's 4x400m relay team set a new Asian record at the #Olympics! 😱 Watch Amoj Jacob's finishing blitz that helped India finish fourth in heat 2 and sprint straight into the history books. 🙌#StrongerTogether | #UnitedByEmotion | #Tokyo2020 | #BestOfTokyo pic.twitter.com/gdDYPX2RLD — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 6, 2021 -
టోక్యో ఒలింపిక్స్ అప్డేట్స్: నీరజ్ చోప్రాకు స్వర్ణం
►నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించాడు. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సూపర్ షో కనబరిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జావెలిన్‌ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. అథ్లెటిక్స్‌లో నీరజ్ బంగారు పతకాన్ని అందించి ఇండియాకు చిరస్మరణీయ రోజును మిగిల్చాడు. తాజాగా నీరజ్ చోప్రా పతకంతో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. ఓవరాల్‌గా చూసుకుంటే భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో 47వ స్థానంలో నిలిచి ఘనంగా టోక్యో ఒలింపిక్స్‌ను ముగించింది. అంతేగాక 2012 లండన్ ఒలింపిక్స్(ఆరు పతకాలు) తర్వాత ఏడు పతకాలతో భారత్ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. తొలి ప్రయత్నంలో అతను 87.03 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. ఇక రెండో అటెంప్ట్‌లో అతను మరింత పదునుగా త్రో చేశాడు. సెకండ్ అటెంప్ట్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. నిజానికి క్వాలిఫయింగ్ రౌండ్లో ఫస్ట్ త్రోతోనే అందరికీ షాకిచ్చాడు నీరజ్. అతని పర్సనల్ బెస్ట్ 88.07 మీటర్లు. దానికి తగినట్లే నీరజ్ టోక్యోలో తన ట్యాలెంట్ చూపించాడు. ముందు నుంచి ఫెవరేట్‌గా ఉన్న నీరజ్.. అనుకున్నట్లే ఇండియాకు ఓ స్వర్ణాన్ని అందించాడు. ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. నాలుగ, ఐదు రౌండ్లలో త్రో వేయడంలో విఫలమైనప్పటికీ ఓవరాల్‌గా ఇప్పటికీ నీరజ్ చోప్రా టాప్‌లోనే కొనసాగుతున్నాడు. మూడో రౌండ్లో 76.79 మీటర్లు విసిరినప్పటికి ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. మొత్తంగా ఆరు రౌండ్ల తర్వాత తుది ఫలితం రానుంది. ► టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి రౌండ్లో 87.03 మీటర్ల దూరం విసిరి టాప్ 1లో నిలిచాడు. తొలి రౌండ్లో 87.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా... సెకండ్ రౌండ్లోనూ అదే జోరును 87.58 మీటర్ల దూరం విసిరి ఇప్పటికీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ►టోక్యో ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో భారత రెజ్లర్ భజరంగ్ బ్రాంజ్ మెడల్‌ను గెలుచుకున్నాడు. కాంస్య పతకం కోసం సాగిన మ్యాచ్‌లో భజరంగ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి 8-0 తేడాతో మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో కజకస్తాన్కు చెందిన దౌలత్ నియాజ్బెకోవ్తో ఇండియన్ స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థిని ఓ పట్టు పట్టి కాంస్యాన్ని సాధించాడు. Golf: Women's Tournament Final: టోక్యో ఒలింపిక్స్ 2020 గోల్ప్ మహిళా విభాగం తుది మ్యాచ్ రసవత్తరంగా ముగిసింది. అదితి అశోక్ నాలుగో స్థానంలో నిలిచింది. అయితే భారత ఖాతాలో పతకం పడకపోయినా.. ఫైనల్లో గట్టి పోటీ ఇచ్చి ఆకట్టుకుంది అదితి అశోక్. నెల్లీ కోర్డా స్వర్ణం కన్ఫర్మ్ చేసుకోగా, జపాన్ ఇనామీ, న్యూజిలాండ్ లడియా కో రెండో ప్లేసులో సంయుక్తంగా నిలిచి.. రజత, కాంస్యాలు అందుకున్నారు. చివర్లో పతకంకు అవకాశాలకు కేవలం రెండు హోల్స్ ఉన్న సమయంలో.. వర్షంతో మ్యాచ్ నిలిపి వేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాసేపటికి తిరిగి ఆట మొదలైంది. వర్షం తర్వాత మొదటి ప్లేస్‌లో నెల్లీ కోర్డా, ఇనామీ లు లీడ్‌లో నిలవడం విశేషం. తర్వాతి ప్లేస్‌లో లిడియా(ఎల్) కో నిలిచింది. వర్షం తెరిపి ఇచ్చాక మొదలైన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో తర్వాతి హోల్లో నాలుగో పొజిషన్‌కి పడిపోయింది అదితి. ఆపై ఒక్క షాట్ తేడాతో కాంస్యం తృటిలో చేజార్చుకుంది అతిధి. ఏది ఏమైనా 200 వ ర్యాంకర్ అయిన ఈ భారత్ యువ గోల్ఫర్ ఓవరాల్‌గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. World no.200 is competing against world no.1, What an achievement #AditiAshok 🦾 Go for gold🏅🏅 #Golf #golfindia #TokyoOlympics2020 pic.twitter.com/jQFTTk6Qtn — Rahul🇮🇳🇮🇳 (@iamrk287) August 7, 2021 Tokyo Olympics 2020 Live Updates: ►పోరాడిన ఓడిన భారత యువ గోల్ఫర్ అదితి అశోక్ ► నెల్లీ కోర్డాకు స్వర్ణం ► లిడియాకు రజతం అవకాశం ► లిడియా కో-అతిది మధ్య కాంస్యం కోసం ఫైనల్ హోల్ షాట్ ► హోల్‌కి దగ్గర్లో పడిన అతిది షాట్ ► ఇనామీ మెడల్ గ్యారెంటీ ► ఆరో స్థానంలో పెడెర్సన్ క్లోజ్ ► ఆట మొదలు.. నాలుగో స్థానానికి పడిపోయిన అదితి.. మిగిలింది ఒకే హోల్ ► ఆట రద్దా? కొనసాగింపా? మిగిలినవి రెండే హోల్స్. పతకంపై గందరగోళం.. ఒలింపిక్ కమిటీ నుంచి రావాల్సిన స్పష్టత ► వాతావరణం కారణంగా ఒకవేళ మ్యాచ్ ఇవాళ కొనసాగే అవకాశం. లేకుంటే.. రేపు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రేపు కూడా ప్రతికూల పరిస్థితులే ఉంటే శుక్రవారం నాటి ఫలితం ఆధారంగా మెడల్స్ ఇస్తారా? అనేది ఒలింపిక్ కమిటీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ► ప్రారంభమైన వర్షం.. మ్యాచ్ నిలిపివేత ► వాతావరణంలో మార్పులు.. మ్యాచ్ నిలిపివేత? ► చివర్లో మారుతున్న సమీకరణాలు.. మళ్లీ మూడో పొజిషన్‌కు అతిది! ► పుంజుకుంటున్న ప్రత్యర్థులు ► అదితి అశోక్.. మరో మూడు హోల్స్ మాత్రమే ► ఛాన్స్ చేజార్చుకున్న అదితి.. నాలుగో స్థానానికి ► గోల్డ్ ఆశలు సజీవం?! ► ప్రత్యర్థి నెగెటివ్ పాయింట్ల మీదే ఆధారపడ్డ Aditi Ashok పతకం ► మరో నాలుగు బంతులు.. రెండు పాయింట్ల తేడా మాత్రమే! ► ఆఖరికి చేరుకున్న ఫైనల్.. మరింత పెరిగిన ఉత్కంఠ. ► అనూహ్యంగా రెండో స్థానానికి అదితి ► ఆఖరుకు చేరుకున్న ఆట.. మూడో స్థానంలో అదితి! ► ఒలింపిక్స్ చరిత్రలో మహిళా గోల్ఫ్ ఫైనల్లో రెండో స్థానంలో నలుగురి పోటీ-అందులో అతిది ఒకరు. ► అదితిపై పెరుగుతున్న ఒత్తిడి.. మూడో స్థానం ► ఎమిలీ, లైడాతో రెండో స్థానంలో టైలో నిలిచింది అతిది. ► నాలుగో రౌండ్ ఉత్కంఠభరింతంగా కొనసాగుతోంది. ►ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన 23 ఏళ్ల అదితి.. ఒకానొక దశలో అగ్ర స్థానంలోకి దూసుకొచ్చింది. ► అదితి అశోక్, నీరజ్ చోప్రా, బజరంగ్ పూనియా మీదే భారత్ ఆశలు క్లిక్ చేయండి: త్వరపడండి.. క్యాష్ ప్రైజ్ గెల్వండి ఇవాళ్టి షెడ్యూల్ టోక్యో ఒలింపిక్స్‌లో నేడు భారత్‌కు కీలక మ్యాచ్‌లు రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో కాంస్యం కోసం పోరు కాంస్యం కోసం తలపడనున్న బజ్రంగ్ పునియా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో బరిలోకి నీరజ్ చోప్రా తొలిసారి ఒలింపిక్స్ ఆడుతున్న నీరజ్ చోప్రా ఫైనల్లో నీరజ్ చోప్రా గెలిస్తే అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం -
Aditi Ashok: ఊహించని పతకం లభించేనా..?
టోక్యో: అంతా అనుకున్నట్లు జరిగితే... టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాభిమానులెవరూ ఊహించని పతకం శనివారం లభించే అవకాశం ఉంది. మహిళల గోల్ఫ్ వ్యక్తిగత స్ట్రోక్ ప్లే ఈవెంట్లో భారత గోల్ఫర్ అదితి అశోక్ పతకం రేసులో ఉంది. శుక్రవారం మూడో రౌండ్ పూర్తయ్యే సమయానికి అదితి టోటల్ పార్ స్కోరులో 201తో రెండో స్థానంలో ఉంది. అమెరికా గోల్ఫర్ నెల్లీ కోర్డా (పార్ 198)తో అగ్రస్థానంలో ఉంది. నిర్ణీత నాలుగు రౌండ్లు ముగి శాక తక్కువ పార్ స్కోరు ఉన్న టాప్– 3 గోల్ఫర్లకు పతకాలు లభిస్తాయి. -
Bajrang Punia: తొలి ప్రయత్నంలోనే పథకం సాధిస్తాడా..?
ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో మూడు పతకాలు నెగ్గిన ఏకైక భారత రెజ్లర్... ఆసియా చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు... అంతర్జాతీయ టోర్నీ లలో క్రమం తప్పకుండా పసిడి, రజత పతకాలు... అయితేనేం ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత క్రీడా వేదికపై తొలిసారి ఆడుతున్న బజరంగ్ అసలు సిసలు సత్తా చాటాల్సిన చోట తడబడ్డాడు. తొలి రౌండ్లో అంతగా అంతర్జాతీయ అనుభవంలేని కిర్గిజిస్తాన్ రెజ్లర్‌పై అతికష్టమ్మీద నెగ్గిన అతను, క్వార్టర్ ఫైనల్లో ఇరాన్ ప్రత్యర్థిని ‘బై ఫాల్’ పద్ధతిలో ఓడించినా... కీలకమైన సెమీఫైనల్లో మాత్రం నిరాశపరిచి ఓటమి మూటగట్టుకున్నాడు. దాంతో స్వర్ణ–రజత పతకాలపై ఆశలు వదులుకొని ఇక కాంస్య పతకం కోసం పోరాడనున్నాడు. టోక్యో: తన కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని తొలి ప్రయత్నంలోనే సాధించేందుకు భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో 27 ఏళ్ల బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాడు. దాంతో నేడు జరిగే కాంస్య పతక పోరులో దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్)–ఆడమా దియాతా (సెనెగల్) మధ్య ‘రెపిచేజ్’ బౌట్ విజేతతో బజరంగ్ తలపడనున్నాడు. అనుభవం, గత రికార్డుల దృష్ట్యా రెపిచేజ్ బౌట్లో నియాజ్బెకోవ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నియాజ్బెకోవ్తో బజరంగ్ ఆడాల్సి వస్తే మాత్రం భారత రెజ్లర్ గెలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. 32 ఏళ్ల నియాజ్బెకోవ్ మూడుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలువడంతోపాటు 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో బజరంగ్‌ను ఓడించాడు. వివిధ వయో కేటగిరీల్లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హాజీ అలియేవ్ (అజర్బైజాన్)తో జరిగిన సెమీఫైనల్లో బజరంగ్ 5–12 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. బజరంగ్ లోపాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నట్లు అలియేవ్ ఆడాడు. బజరంగ్ లెగ్ డిఫెన్స్‌లో బలహీనంగా ఉండటంతో అలియేవ్ భారత రెజ్లర్ కాళ్లను ఒడిసి పట్టుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. తొలి భాగంలో 2, 2 పాయింట్లు స్కోరు చేసిన అలియేవ్ ఒక పాయింట్ కోల్పోయాడు. రెండో భాగంలోనూ అలియేవ్ దూకుడు కొనసాగించగా... బజరంగ్ కూడా కౌంటర్ ఎటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రెండుసార్లు సఫలమై 2, 2 పాయింట్లు సాధించాడు. అయితే అలియేవ్ ఒత్తిడికి లోనుకాకుండా బజరంగ్ రెండు కాళ్లను పట్టేసి రెండుసార్లు తిప్పేసి 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. ఆ తర్వాత 1, 2 పాయింట్లు తన ఖాతాలో వేసుకొని 11–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరి సెకన్లలో బజరంగ్ రిఫరీ నిర్ణ యాన్ని చాలెంజ్ చేసి దానిని కోల్పోవడం తో అలియేవ్ ఖాతాలో మరో పాయింట్ చేరింది. అంతకుముందు తొలి రౌండ్లో బజరంగ్ 3–3తో ఎర్నాజర్ అక్మతలియేవ్ (కిర్గిజిస్తాన్)పై గెలుపొందాడు. తొలి భాగంలో బజరంగ్ 1, 2 పాయింట్లు సాధించి, మరో పాయింట్ చేజార్చుకొని 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ రెండో భాగంలో ఎర్నాజర్ వరుసగా 1, 1 పాయింట్లు సాధించి స్కోరును 3–3తో సమం చేశాడు. బౌట్ ముగిశాక ఇద్దరూ సమఉజ్జీగా నిలిచినా నిబంధనల ప్రకారం బజరంగ్ ఒకే ఎత్తులో హై స్కోరింగ్ (2) పాయింట్లు సాధించ డంతో అతనిని విజేతగా ప్రకటించారు. ‘బై ఫాల్’తో విక్టరీ... ఇరాన్ రెజ్లర్ మొర్తజా ఘియాసి చెకాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 4 నిమిషాల 56 సెకన్లలో ‘బై ఫాల్’ పద్ధతిలో గెలిచాడు. తొలి భాగం ముగిశాక 0–1తో వెనుకబడ్డ బజరంగ్ రెండో భాగం ఆరంభంలో 2 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత ఇరాన్ ప్రత్యర్థిని కింద పడేసి అతని భుజాలను కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు తగిలించాడు. దాంతో నిబంధనల ప్రకారం బజరంగ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించారు. సీమా తొలి రౌండ్లోనే... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బరిలో నిలిచిన చివరి రెజ్లర్ సీమా బిస్లా (50 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సారా హమ్దీ (ట్యునీషియా)తో జరిగిన తొలి రౌండ్లో సీమా 1–3తో ఓటమి పాలైంది. ఆ తర్వాత సారా హమ్దీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో సీమాకు రెపిచేజ్ పద్ధతిలో కాంస్య పతకం రేసులో నిలిచే అవకాశం కూడా చేజారింది. -
ఫిన్లాండ్తో ‘డేవిస్’ పోరుకు బోపన్న
సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న భారత డేవిస్ కప్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల అఖిల భారత టెన్నిస్ సంఘంతో ఒలింపిక్స్ విషయమై బోపన్న గొడవ పడ్డాడు. ఇది పతాక స్థాయికి చేరడంతో అతన్ని భవిష్యత్తులో జట్టులోకి ఎంపిక చేయరనే వార్తలు వచ్చాయి. అయితే సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఫిన్లాండ్ వేదికగా ఫిన్లాండ్తో జరిగే వరల్డ్ గ్రూప్–1 పోరులో పాల్గొనే భారత జట్టులో బోపన్నను ఎంపిక చేశారు. ఈ పోటీలో డబుల్స్‌లో దివిజ్ శరణ్–బోపన్న జంట ఆడుతుంది. -
Tokyo Olympics: నాలుగులోనూ వెలుగు
విశ్వ క్రీడల్లో వరుస పరాజయాలతో మొదలైన భారత మహిళల హాకీ జట్టు ఆట జేజేలతో ముగిసింది. అలా అని మన హాకీ జట్టేమీ పతకం గెలవలేదు. కానీ చరిత్ర సృష్టించింది... ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్ బరిలో నిలిచి! మనసుల్ని గెలిచింది.... కాంస్యం కోసం పోరాడి! ఇక్కడా మళ్లీ భారత్ ఓడి ఉండవచ్చు. కానీ మరీ బాధపడాల్సిన పరాజయమైతే కాదు... పరాభవం అంతకన్నా కాదు... త్రుటిలో చేజారిన విజయం. పతకం రాకున్నా వేనోళ్లా ప్రశంసలు వస్తున్నాయన్నది నిజం... అడుగడుగునా అమ్మాయిల పోరాటం అద్వితీయం. అందుకే జాతి యావత్తు జేజేలు పలుకుతోంది. ఒలింపిక్స్‌లో మూడో ప్రయత్నంలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానం సంపాదించిన భారత మహిళల జట్టు ప్రదర్శన కాంస్య పతకంలాంటిదేనని దేశం గర్వపడుతోంది. టోక్యో: చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు పోరాటం చివరికి నిరాశగా ముగిసింది. కానీ బంగారంలాంటి ప్రదర్శనతో కోట్ల మంది మనసుల్ని గెలిచింది. కాంస్యం చేజారిందనే బాధ ఉంది. అయితే కాంస్యం కూడా ‘వీరి మెడలో ఎందుకు పడలేదు’ అనుకునేలా మన జట్టు పోరాడింది. మూడో స్థానం కోసం శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు 3–4తో బ్రిటన్ చేతిలో పోరాడి ఓడింది. భారత్ తరఫున గుర్జీత్ సింగ్ (25వ, 26వ ని.లో) రెండు గోల్స్, వందన కటారియా (29వ ని.లో) ఒక గోల్ చేశారు. బ్రిటన్ జట్టుకు ఎలీనా (18వ ని.లో), సారా రాబర్ట్సన్ (24వ ని.లో), వెబ్ హోలీ పెర్న్ (35వ ని.లో), గ్రేస్ బాల్స్‌డన్ (48వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. మనదే ఆధిపత్యం... తొలి క్వార్టర్లో బ్రిటన్ గోల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ భారత మహిళలు గట్టిగా బదులు చెప్పడంతో నిష్ఫలమయ్యాయి. ప్రత్యర్థి దాడుల్ని భారత డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. అక్కడి నుంచి గోల్‌పోస్ట్‌ను సమీపిస్తే సవిత ఊరుకోలేదు. రెండు పెనాల్టీ కార్నర్లను, మరో రెండు ఫీల్డ్ గోల్స్‌ను సవిత చాకచక్యంగా ఆపేసింది. దీం తో గోల్ లేకుండా ఈ క్వార్టర్ ముగిసింది. ఎట్టకేలకు రెండో క్వార్టర్లో బ్రిటన్ ప్లేయర్లు ఎలీనా రేయ ర్, సారా రాబర్ట్సన్ లక్ష్యాలు ఫలించాయి. కానీ ఈ ఆనందం మరో ఐదు నిమిషాలకే ఆవిరైంది. ఈ క్వార్టర్‌తో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 3– 2తో పైచేయి సాధించింది. అది కూడా 5 నిమిషాల వ్యవధిలోనే భారత్ మూడు గోల్స్ సాధించింది. కలిసిరాని మూడో క్వార్టర్ అయితే మూడో క్వార్టర్లో హోలీ పియర్న్ వెబ్ గోల్ చేయడంతో స్కోరు 3–3 వద్ద సమమైంది. ఈ క్వార్టర్లో మనకు లభించిన 3 పెనాల్టీ కార్నర్లను గుర్జీత్ (రెండుసార్లు), దీప్ ఎక్కా గ్రేస్ గోల్‌గా మలచలేకపోవడం భారత్‌కు ప్రతికూలించింది. చివరి క్వార్టర్లో బ్రిటన్ పకడ్బందీగా కదంతొక్కడం... ఇదే సమయంలో ఉదిత ఎల్లో కార్డుతో, షర్మిలా గ్రీన్ కార్డ్‌తో కాసేపు ఆటకు దూరమవడం బ్రిటన్ పనిని సులువు చేసింది. 48వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను గ్రేస్ బాల్స్‌డన్ గోల్‌పోస్ట్‌పై గురిపెట్టడంతో భారత్ 3–4తో వెనుకబడింది. ఆ తర్వాత తుదికంటా అమ్మాయిలు పోరాడినా భారత్‌కు ఫలితం దక్కలేదు. రూ. అర కోటి నజరానా... కాంస్య పతక పోరులో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు భారీ నజరానాలే అందనున్నాయి. ఈ జట్టులో హరియాణాకు చెందిన 9 మంది క్రీడాకారిణులకు రూ. 50 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేస్తామని ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా తమ ప్లేయర్లు సలిమా టేటే, నిక్కీ ప్రధాన్లకు రూ. 50 లక్షల నగదు పురస్కారం ఇస్తామని సీఎం వెల్లడించారు. ఇక చాలు...నే వెళ్తా కోచ్ జోర్డ్ మరీన్ రాజీనామా భారత మహిళల జట్టు చీఫ్ కోచ్ జోర్డ్ మరీన్ మ్యాచ్ ముగిసిన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. ‘కొనసాగే ఆలోచనలేవీ లేదు. ఇదే నా ఆఖరి మ్యాచ్. ఈ జట్టుతో నా ప్రయాణం సంతృప్తికరంగానే సాగింది. మూడున్నరేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న నేను ఇప్పుడు పూర్తిగా కుటుంబానికే అంకితమవ్వాలనుకుంటున్నాను’ అని వర్చువల్ మీడియా సమావేశంలో తెలిపారు. పొడిగింపు ఇస్తామన్నా కోచ్ నిరాకరించినట్లు తెలిసింది. మీరెవరూ ఏడవొద్దు ఫోన్లో ఓదార్చిన ప్రధాని మోదీ కాంస్యం చేజార్చుకున్న మహిళల హాకీ జట్టు పోరాటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఫోన్లో భారత జట్టు సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బాధను జీర్ణించుకోలేక విలపిస్తున్న అమ్మాయిల్ని వారించారు. ఏడిచే పని చేయలేదని జాతి యావత్ గర్వపడే పోరాటం చేశారని ప్రశంసించారు. ‘మీరంతా బాగా ఆడారు. మీ కృషికి పతకం దక్కలేదేమో కానీ కోట్ల మంది చిన్నారులకు మీ నుంచి ఎంతో ప్రేరణ దక్కింది. కోచ్, జట్టు సభ్యులందరికీ అభినందనలు’ అని ఫోన్లో మాట్లాడుతుండగానే అమ్మాయిలు ఏడ్చారు. ఇది గమనించిన ప్రధాని ‘ప్లీజ్ మీరెవరూ ఏడవొద్దు. మొత్తం దేశం మీ ప్రదర్శన పట్ల గర్విస్తోంది. మీ వల్లే మన జాతీయ క్రీడకు మళ్లీ పునరుత్తేజం వచ్చింది’ అని అన్నారు. -
Tokyo Olympics: అందరి దృష్టి నీరజ్‌పైనే
అథ్లెటిక్స్‌లో ఊరిస్తోన్న ఒలింపిక్ పతకాన్ని భారత్‌కు ఈసారైనా లభిస్తుందా లేదా అనేది నేడు తేలిపోతుంది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. హరియాణాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా క్వాలిఫయింగ్‌లో జావెలిన్‌ను 86.59 మీటర్ల దూరం విసిరి ‘టాపర్’గా నిలువడంతో అందరి దృష్టి అతనిపైనే కేంద్రీకృతమైంది. నీరజ్ ఫైనల్లోనూ తన ప్రావీణ్యాన్ని పునరావృతం చేసి పతకం సాధిస్తాడా లేదా అనేది నేటి సాయంత్రానికల్లా తెలిసిపోతుంది. నీరజ్‌తోపాటు జోనస్ వెటెర్ (జర్మనీ), జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), వితెస్లా వెసిలీ (చెక్ రిపబ్లిక్), వెబెర్ (జర్మనీ) కూడా పతకాల రేసులో ఉన్నారు. 12 మంది పోటీపడుతున్న ఈ ఫైనల్లో తొలుత అందరికీ మూడు అవకాశాలు లభిస్తాయి. టాప్–8లో నిలిచిన వారికి మరో మూడు అవకాశాలు ఇస్తారు. అనంతరం టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. -
ఫ్రంట్‌లైన్ వారియర్.. బార్బీ
ప్రస్తుతం ప్రపంచమంతా... ఒలింపిక్స్ క్రీడలు, క్రీడాకారులు ఎవరు బాగా ఆడుతున్నారు? ఏ దేశానికి ఏయే మెడల్స్ ఎన్నెన్ని వస్తున్నాయి వంటి అంశాలపై ఆసక్తిగా గమనిస్తోంది. మరోపక్క పతకాలు సాధించిన క్రీడాకారులను భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలిచేలా ఆయా దేశాల ప్రభుత్వాలు ఉన్నత సత్కారాలతో స్వదేశానికి ఆహ్వానిస్తున్నాయి. క్రీడాకారులకు ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు, గౌరవ మర్యాదలతో వారు రాబోయే తరాలకు స్పూర్తిగా నిలుస్తారు. వీరిని చూసి మరెంతోమంది ఆ స్థాయికి ఎదగాలని కలలు కంటుంటారు. సరిగ్గా ఇదే విషయాన్ని బొమ్మల రూపంలో చెబుతోంది బార్బీ బొమ్మల తయారీ సంస్థ. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మలలో బార్బీ డాల్ ఒకటి. చిన్న పిల్లలను ముఖ్యంగా అమ్మాయిలను ఎంతగానో ఆకట్టుకునే ఈ బార్బీ బొమ్మలు సరికొత్తగా రాబోతున్నాయి. ఇప్పటిదాకా వ్యోమగామిగా, ఫైర్ ఫైటర్‌గా, గేమ్ డెవలపర్‌గా అనేక రకాలుగా రూపాంతరం చెంది పెద్దల నుంచి పిల్లల వరకు అందర్నీ ఆకట్టుకునే బార్బీబొమ్మలు ఈసారి సరికొత్త రూపంలో సందడి చేయనున్నాయి. దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కోవిడ్–19ను ఎదుర్కోవడంలో ధైర్యసాహసాలతో ముందుండి ప్రజారోగ్యం కోసం పోరాడుతున్న వారి రూపాలతో బార్బీ సంస్థ బొమ్మలను తీర్చిదిద్దింది. కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తోన్న సమయంలో ముందుండి పోరాడిన ఆరుగురు మహిళల రూపాలతో బార్బీలను తయారుచేసింది. ఈ ఆరుగురి రూపాలను వారి వృత్తికి తగినట్లుగా డ్రెస్‌లు వేసి ఆకర్షణీయమైన బొమ్మలుగా మలిచింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ రూపకల్పనలో కృషిచేసిన సారా గిల్బర్ట్ ఆరుగురిలో ఒకరుగా నిలవడం విశేషం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన గిల్బర్ట్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు. గిల్బర్ట్ బార్బీ బొమ్మగా మరింత ఆకర్షణీయంగా కనిపించారు. కురులను వదులుగా వదిలి, నేవీ బ్లూ రంగు ప్యాంట్ సూట్, తెల్లని జాకెట్‌తో సరికొత్త బార్బీ డాల్‌గా మెరిసిపోతున్నారు. గిల్బర్ట్తోపాటు న్యూయార్క్‌లో తొలి కోవిడ్ రోగికి వైద్యం అందించిన ఎమర్జెన్సీ రూమ్ నర్స్ అమీ ఓ సల్లివాన్, లాస్వేగాస్లో వివక్షకు గురైన డాక్టర్ ఆడ్రిక్రుజ్, హెల్త్‌కేర్‌లో జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన కెనడాకు చెందిన మానసిక వైద్య నిపుణురాలు చిక స్టేసీ ఒరివ్వా, కోవిడ్ జన్యుక్రమాన్ని గుర్తించిన బ్రెజిల్ బయోమెడికల్ రీసెర్చర్ జాక్వెలిన్ గోస్డిజెస్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్కోసం ‘ఉతికి మళ్లీ వేసుకోగల’ సర్జికల్ గౌనును రూపొందించిన ఆస్టేలియా డాక్టర్ కిర్బి వైట్లు బార్బీ బొమ్మల్లో ప్రేరణాత్మకంగా ఒదిగిపోయారు. మహమ్మారి కోరలు చాస్తోన్న సమయంలో తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి, ధైర్యంగా ముందుండి పోరాడిన హెల్త్ వర్కర్స్ కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్బీ సంస్థ మాట్టె్టల్ తెలిపింది. ‘‘ఫ్రంట్‌లైన్ వారియర్స్ పడ్డ ఆందోళన, చేసిన కృషిని భవిష్యత్ తరాలకు అందించడానికి సరికొత్త బార్బీడాల్స్ను తీసుకొచ్చాము. మా ప్రయత్నం కొంతమంది చిన్నారుల్లోనైనా స్పూర్తి తీసుకురాగలిగితే ఆ దిశగా వారు ఎదుగుతారని ఆశిస్తున్నాం’’ అనిÐ ] ూట్టెల్ యాజమాన్యం చెప్పింది. ‘‘బార్బీ బొమ్మను నా రూపంలో రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉంది. టీకా నిపుణిరాలిగా నా ప్రతిమను బార్బీలో చూసిన అమ్మాయిల్లో కొంతమంది అయినా సైన్స్‌ను కెరియర్‌గా ఎంచుకుని అద్భుతాలు సాధించాలి’’ అని గిలబర్ట్ చెప్పింది. -
ఈ విజయం... నూతన శుభోదయం
ప్రపంచ క్రీడారంగంలో ఎన్నో ఆశలతో అడుగుపెడుతున్న దుర్బలులకు 1970లలో హాకీ, 1980ల వరకు క్రికెట్ ఓ గర్వకారణంగా, ఒక సామాజిక హోదాగా ప్రాతినిధ్యం వహించేవి. ఆనాటి భారతీయ హాకీ మా తరానికీ, మన జాతీయ గర్వానికీ ప్రతీకగా నిలిచి ఉండేది. ప్రస్తుతం క్రికెట్ చుట్టూ అలుముకుంటున్న జనబాహుళ్యపు ఉన్మాదం మన సాంస్కృతిక మొరటుదనానికి ప్రతీకగా ఉంటోంది. అవమానాల పాలైన భారతీయులకు – నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశం పొందుతూ వచ్చిన అన్ని వైఫల్యాలకు చికిత్సలాగా అప్పట్లో క్రికెట్ హీరోలు రంగంమీది కొచ్చారు. కానీ నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు భారతీయ హాకీ సాధించిన ఈ పునరుజ్జీవనం... మరొక ప్రగాఢమైన, సానుకూల జాతీయవాదం మనలో ఇప్పటికీ మనగలుగుతోందని అందరికీ హామీనిచ్చింది. మరుగునపడి ఉండవచ్చు కానీ అది మన జాతీయ చైతన్యం నుంచి మాత్రం తొలగిపోలేదు. సాధారణంగా నేను పెందలకడనే లేచే వ్యక్తిని కాదు. కానీ ఈ మంగళవారం ఉదయం నాకు భిన్నంగా కనిపించింది. ఒలింపిక్ హాకీ సెమీ ఫైనల్లో భారత్–బెల్జియం మ్యాచ్ చూడటం కోసం నేనూ నాతోపాటు కుటుంబం మొత్తంగా త్వరగా నిద్రలేచాం. ఇరు జట్లమధ్య జరిగిన పోటీ అసంఖ్యాక భారతీయ అభిమానులకు లాగే మమ్మల్ని కూడా పరవశం నుంచి, ఆందోళన, బాధవరకు అనేక అనుభూతులతో కదిలించివేసింది. నిజానికి భారత హాకీ జట్టు గొప్పగా ఆడింది. కానీ ఆ పోటీలో ఓడిపోవడం మాకు అవమానం కలిగించలేదు. అంతకుముందు హార్దిక్ సింగ్ బ్రిటన్ జట్టుపై చేసిన ఏకైక, అద్భుతమైన గోల్‌ను చూస్తున్నప్పుడు కలిగిన ఆ మొదటి ఆనందం ఇప్పటికీ మనసులోంచి తొలిగిపోలేదు. లేదా మన మహిళల హాకీ జట్టు ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు కలిగిన చక్ దే మూమెంట్ గర్వాతిశయాన్ని కూడా మర్చిపోలేదు. ఆ ఘటన నాకు దాదాపు 50 ఏళ్ల క్రితం నాటి నా పాఠశాల రోజులను గుర్తుకు తెచ్చింది. నేను చదువుకున్న శ్రీ గంగానగర్ లోని ఎస్జీఎన్ ఖల్సా హయ్యర్ సెకండరీ స్కూల్లో గ్రామీణ సిక్కు అబ్బాయిలు ఎక్కువగా ఉండి ఆటలకు ఎంతో పేరుపొందింది. ఆ రోజుల్లో రాజస్తాన్ తరపున ఆడుతున్న 11 మందిలో 6 నుంచి 8 మంది సభ్యులు మా స్కూలుకి చెందినవారే. తర్వాత నేను చదివిన ఎస్జీఎన్ ఖల్సా కాలేజీ కూడా హాకీ, అథ్లెటిక్స్‌లో అదే రకమైన పేరు కలిగి వుండేది. నా తోటివారి లాగే నేను కూడా అప్పట్లో హాకీకి పెద్ద అభిమానిగా ఉండేవాడిని. అప్పటికే భారతీయ హాకీ తన స్వర్ణ యుగాన్ని దాటేసింది కానీ అంతర్జాతీయ ప్రతిష్ట, గుర్తింపు నుంచి ఇంకా దూరం కాలేదు. 1975లో కౌలాలంపూర్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన గేమ్‌లో అస్లామ్ షేర్ ఖాన్ చివరి నిమిషంలో చేసిన గోల్ మన హాకీ వైభవాన్ని నిర్వచించిన ఘటనగా మిగి లిపోయింది. ఆనాటి భారతీయ హాకీ మా తరానికీ, మన జాతీయ గర్వానికీ ప్రతీకగా నిలిచి ఉండేది. అలాగని మన జట్టు కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేం కానీ దానికి ఒక ప్రతిష్ట అంటూ ఉండేది. నా తరంలో చాలామందికి లాగే, హాకీ పట్ల నా అనురక్తి మెల్లగా క్రికెట్ వైపుకు మళ్లింది. 1974–75 శీతాకాలం సీజన్లో క్లైవ్ లాయిడ్ జట్టు భారత్‌కు రావడంతో అది మొదలైంది. ఈ సీరీస్‌లోనే గార్డన్ గ్రీనిడ్జ్, వివియన్ రిచర్డ్స్, ఆండీ రాబర్ట్స్ తమ తొలి మ్యాచ్ ఆడారు. నాకు వ్యక్తిగతంగా జి. విశ్వనాథ్, బ్రిజేష్ పటేల్, బీఎస్ చంద్రశేఖర్ అంటే చాలా ఇష్టం. వీరంతా కర్ణాటకకు చెందినవారే. ఆ పోటీలో భారత్ సిరీస్ కోల్పోయింది కానీ తన గౌరవాన్ని మాత్రం నిలబెట్టుకుంది. 1976 ఒలింపిక్స్‌లో ఆస్ట్రో టర్ఫ్‌ని ప్రవేశపెట్టడంతో భారతీయ హాకీ ప్రాభవం మళ్లీ పుంజుకోలేనంతగా పతనమార్గం పట్టింది. 1980 నాటి మాస్కో ఒలింపిక్స్‌లో సులభంగా మన జట్టు స్వర్ణం సాధించిం దనుకోండి. ఆ సమయంలోనే క్రికెట్ ఆటకు ప్రాచుర్యం పెరగడం, 1983 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు డ్రీమ్ విక్టరీ సాధించడం కాకతాళీయంగా జరిగిపోయింది. మా స్నేహితులు కొందరు ముందుకొచ్చి స్థానిక క్రికెట్ టీమ్‌ను నెలకొల్పారు. దానికి ఎలెవన్ స్టార్ క్లబ్ అని మహా గొప్ప పేరుండేది. అప్పటికింకా ప్రారంభించని నూతన ఏపీఎంసీ మైదానం మా క్రికెట్ గ్రౌండ్‌గా ఉండేది. క్రమంగా క్రికెట్ స్టార్లు (ఈ జాబితాలో నేను కపిల్ దేవ్‌ను చేర్చాను) కొత్త జాతీయ హీరోలు అయ్యారు. భారతజట్టు అప్పటికీ ప్రాధాన్యత లేని జట్టుగానే ఉండేది. ప్రత్యర్థులను అçప్పుడప్పుడూ ఓడిస్తూ మన గర్వాన్ని కాస్త పెంచుతూ వచ్చేది. భారత్ ఆడనప్పుడు నేను వెస్టిండీస్‌కి చెందిన వివియన్ రిచర్డ్స్, పాకిస్తాన్ ఆటగాడు జహీర్ అబ్బాస్‌ను ఆరాధించేవాడిని. మూడో ప్రపంచ దేశాలకు, అలీనోద్యమానికి సంఘీభావం తెలుపుతున్న రోజులవి. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు నేను క్రీడా ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాను. క్రికెట్ పట్ల నా ఆసక్తిని నా వృత్తిపట్ల అనురక్తి కనుమరుగు చేస్తూ వచ్చింది. హాకీ గతించిన జ్ఞాపకంలా ఉండేది. అలాంటి సమయంలో ‘లగాన్’ మళ్లీ ప్రేరణ కలిగించింది కానీ క్రికెట్ పట్ల నా ఆసక్తిని మాత్రం పెంచలేకపోయింది. ‘చక్ దే! ఇండియా’ భారత్‌ని ఆనందభాష్పాలతో ముంచెత్తింది కానీ వాస్తవ ప్రపంచంలో అలాంటిది ఏదీ మిగలలేదు. ఆ తర్వాత నా కుమారుడు కొన్నేళ్ల క్రితం నాలోని క్రీడాసక్తిని తిరిగి వెలిగించిన సమయానికి క్రికెట్ కొత్త గేమ్‌గా అవతరించింది. ట్వంటీ 20 టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌ని, పేస్‌ని కూడా మార్చేసింది. ఈ సరికొత్త మార్పులను నేను చిన్నచూపు చూడలేదు. టీ20 మ్యాచ్‌లంటే నాకు ఇష్టం. సిక్సర్ల విందును మనం ఎందుకు ఆస్వాదించకూడదు? బ్యాట్స్మన్ల కోసం రూపొందిన ఒక ఫార్మాట్ ఇప్పుడు బౌలర్లకు స్వర్గధామం కావడం చూసి ఆశ్చర్యపడుతుంటాను. ఇప్పుడు భారతీయ క్రికెట్లోని ఈ టాలెంట్ పూల్‌ని చూసి నిజంగానే దిగ్భ్రాంతి చెందుతున్నాను. ఇప్పుడు క్రికెట్ ఒక విస్తరించిన వినోద పరిశ్రమగా మారిపోయింది. మనం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ హబ్‌కి చెందినవారమని నాకు తెలుసు. కానీ నా జాతీయ స్వీయగౌరవానికి అది అదనంగా దేన్నీ జోడించదు. ముఖానికి రంగు పూసుకుని, టీషర్టులు ధరించి ఇంటా బయటా క్రికెట్ చూస్తున్న భారతీయ అభిమానులను చూస్తుంటాను. కానీ వారి ఆనందపు అరుపులు, హోరుకేకల్లో నేను భాగం కాలేదు. 2007లో టీ20 ప్రపంచ కప్‌లో మన విజయం 1983 ప్రపంచకప్, 1975 ప్రపంచ హాకీ కప్ విజయంతో సమానమైంది కాదని నా అభిప్రాయం. ఈసారి ఒలింపిక్స్‌లో మన హాకీ జట్లపై కూడా నా అభిప్రాయం ఇదే. హాకీ కూడా మారిందనడంలో సందేహమే లేదు. నాలుగు క్వార్టర్ల ఫార్మాట్, గేమ్ తీరు, కొత్త నిబంధనలు చోటు చేసుకున్నప్పటికి మౌలికంగా అది ఒకనాటి క్రీడనే తలపిస్తుంది. ఆస్ట్రేలియా జట్టుపై భారత మహిళా జట్టు నెగ్గినప్పుడు 46 ఏళ్ల క్రితం అజిత్ పాల్ సింగ్ నేతృత్వంలోని జట్టు సాధించిన విజయానుభూతులను మళ్లీ గుర్తుకు తెచ్చాయి. ఇప్పటి మన మహిళా హాకీ ప్లేయర్ల విజయగాథలు 1970ల నాటి భారతీయ హాకీ క్రీడాకారుల విజయగా«థలకు తీసిపోవు. ఒలింపిక్ పతకాలు మనవాళ్లు గెలవకపోయినా నేను లెక్క చేయను. (భారత పురుషుల హాకీ టీమ్ కాంస్యం దక్కించుకోగా, శుక్రవారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోటీలో మన మహిళల టీమ్ తృటిలో కాంస్యం చేజార్చుకుంది.). ఒకటి మాత్రం నిజం మన పురుషులు, మహిళల హాకీ టీమ్ గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఇప్పుడు మన జాతీయ సంకేతాలుగా నిలుస్తారు. ఇది నా కథ మాత్రమే కాదు. వలస పాలనానంతర జాతీయవాదం నుంచి కఠినమైన అల్ట్రా జాతీయవాదం పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇది ఒక తరం గాథ కూడా. క్రికెట్ చుట్టూ వలసవాద రాజకీయాల కథపై రాసిన ఆశీష్ నంది మనకో విషయం గుర్తుచేశారు. ‘మూలాలు మర్చిపోయిన, అవమానాల పాలైన, సంస్కృతి కోల్పోయిన భారతీయులకు– నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశం పొందుతూ వచ్చిన అన్ని వైఫల్యాలకు చికిత్సలాగా క్రికెట్ హీరోలు రంగంమీదికొచ్చారు’. ఈ నేపథ్యంలో భారతీయ హాకీ పునరుజ్జీవనం మరొక ప్రగాఢమైన, సానుకూల జాతీయవాదం మనలో ఇప్పటికీ మనగలుగుతోం దని నాకు హామీ ఇస్తోంది. అది మరుగున పడి ఉండవచ్చు కానీ మన జాతీయ చైతన్యం నుంచి మాత్రం తొలగిపోలేదు. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ సంస్థాపకులు (‘ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మరో స్వర్ణ యుగానికి శ్రీకారం
సంకల్పం... మనిషిని ఉన్నత శిఖరాలకు మోసుకువెళ్ళే ఐరావతం. నమ్మకం... కోరిన విజయాన్ని అందించే కల్పవృక్షం. భారత హాకీ స్త్రీ, పురుష జట్లు రెండూ తాజా టోక్యో ఒలింపిక్స్‌లో అది మరోసారి రుజువు చేశాయి. జాతీయక్రీడ హాకీలో భారత్‌ది వట్టి గత వైభవం కాదని ప్రపంచ వేదికపై చాటాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అనేక దేశాలు బహిష్కరించిన 1980 మాస్కో ఒలింపిక్స్‌లో హాకీలో మనకు స్వర్ణం వచ్చింది. మళ్ళీ 41 ఏళ్ళ తర్వాత మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని పురుషుల జట్టు ఈసారి కాంస్యంతో ఒలింపిక్ పతకాల పట్టికనెక్కడం చిరస్మరణీయం. రాణీ రామ్‌పాల్ కెప్టెన్సీలోని మహిళల హాకీ జట్టు వెంట్రుక వాసిలో పతకం చేజార్చుకున్నా, హోరాహోరీ పోటీలలో సత్తా చాటి, ప్రజల మనసు గెలుచుకోవడం మరో చరిత్ర. ధ్యాన్‌చంద్ లాంటి దిగ్గజాల ఆటతో 8 ఒలింపిక్ స్వర్ణాలు గెలిచిన ప్రాభవం ఒకప్పుడు మన హాకీ జట్టుది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు అర్హత కూడా సంపాదించుకోలేక, అభిమానుల్ని క్రమంగా క్రికెట్‌కు కోల్పోయిన మన పురుషుల జట్టు 2016 నుంచి పుంజుకున్న తీరు ప్రశంసనీయం. రియో ఒలింపిక్స్‌లో 12వ స్థానంలో నిలిచి, ఘోర పరాభవం పాలైన మహిళల జట్టు ఇప్పుడు ఏకంగా విశ్వవేదికపై నాలుగో స్థానంలో నిలవడం గణనీయమైన పురోగతి. భారత హాకీ చరిత్రలో ఇది ఓ కొత్త శకం. ఒక దశలో అంపశయ్యపై ఉందని భావించిన భారత హాకీకి ఇప్పుడు మళ్ళీ స్వర్ణయుగం వస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ సువర్ణ స్వప్నం నిజం కావాలంటే, చేయాల్సింది చాలా ఉంది. కానీ, ఈ లోగా తాజా క్రీడా విజయాలను సర్కారు రాజకీయంగా వాడుకొనేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలొస్తున్నాయి. ఆగస్టు 5న భారత పురుషుల హాకీ జట్టు కాంస్య విజయాన్ని సందర్భంగా తీసుకొని, ఓ ఉత్తరప్రదేశ్ సభలో మోదీ చేసిన వర్చ్యువల్ ప్రసంగమే అందుకు తార్కాణమంటున్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రెండేళ్ళ క్రితం ఆగస్టు 5నే రద్దు అయిందనీ, సరిగ్గా ఏడాది క్రితం అయోధ్య రామాలయానికి భూమిపూజ చేసిందీ, ఇప్పుడు హాకీ పతకం వచ్చిందీ అదే తేదీన అంటూ, భారత నవోదయానికి ఇది నాంది అన్నట్టు మోడీ మాట్లాడడాన్ని విమర్శకులు తప్పుబట్టారు. 85 ఏళ్ళ క్రితం 1936లో ఇదే తేదీన బెర్లిన్ ఒలింపిక్స్‌లో ఆఫ్రికన్ – అమెరికన్ అథ్లెట్ జెస్సీ ఓవెన్స్ గెలిచారు. ఆర్యులే గొప్ప అని చాటాలనుకున్న హిట్లర్ ఆశల్ని తుంచేశారు. మరి, ఆ సంగతి మోదీ మర్చిపోయారా అని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ఇక, క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారం పేరును ‘రాజీవ్ ఖేల్ రత్న’ నుంచి ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’గా మార్చాలన్న మోదీ తాజా నిర్ణయం మరో వివాదమైంది. ఇది ‘రాజకీయ ప్రతీకార చర్య’ అని ప్రతిపక్షం నిరసిస్తోంది. నిజానికి, పార్టీలకు అతీతమైన క్రీడలకు ఇలా రాజకీయ రంగులు అద్దడం ఏ ప్రభుత్వం చేసినా అది తప్పే! ‘చక్ దే’ లాంటి కలల్ని వెండితెరపై విక్రయించడమే తప్ప, వాస్తవంలో ఐపీఎల్ లాంటి లాభసాటి క్రికెట్ వ్యాపారాల వైపే మన దేశంలో షారుఖ్ ఖాన్ సహా సోకాల్డ్ తారల మొగ్గు. ఇలాంటి చోట పాలకులు ఏం చేయాలన్నదానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓ ఉదాహరణ. హాకీ జట్టుకు స్పాన్సరర్ బాధ్యత నుంచి 2018లో ‘సహారా’ సంస్థ తప్పుకున్నప్పుడు, ఆయన అండగా నిలిచిన వైనాన్ని దేశమంతా ఇప్పుడు వేనేళ్ళ ప్రశంసిస్తోంది అందుకే! స్వయంగా హాకీ మాజీ గోల్ కీపరైన నవీన్ తమ ప్రభుత్వ పక్షాన భారత హాకీ జట్ల కోసం వంద కోట్ల పైనే వినియోగించిన వైనం ఇప్పుడు ఓ ఆసక్తికర స్ఫూర్తిగాథ. ఇలాంటి అవిరళ కృషే ఇవాళ హాకీలో మన కొత్త శకానికి శుభారంభం పలికింది. 2023లో పురుషుల హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడానికి సైతం ఒడిశా సర్కారు సిద్ధమవుతోంది. రూర్కేలాలో అంతర్జాతీయ స్టేడియమే కడుతోంది. స్వార్థం చూసుకోకుండా పాలకులు శ్రద్ధ పెడితే, ఏ రంగంలోనైనా ప్రతిభా పురోగమనం సాధ్యమనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. పాలకుల సహకారం మాటెలా ఉన్నా, ప్రతిభావంతుల ప్రయత్నాలు ఆగలేదు. టోక్యో ఒలింపిక్స్‌తో ఆ విషయం స్పష్టమైంది. దుర్భర దారిద్య్రం, లింగ, కుల వివక్ష, పక్షపాతం, కనీస వసతుల లేమి లాంటి ఎన్నో ఆటంకాలు ఉన్నా, పట్టుదల ఉంటే ప్రపంచ వేదికపై రాణించగలమని మన గ్రామీణ క్రీడాకారులు నిరూపించారు. పతకాల వేటలో నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నామని భావిస్తున్న వేళ దేశం నలుమూలల నుంచి మట్టిలో మాణిక్యాలెన్నో మెరిశాయి. నిజానికి, ఈసారి కూడా మన దేశానికి పతకాల సంఖ్య గణనీయంగా ఏమీ పెరగలేదు. కానీ, మనవాళ్ళు విశ్వక్రీడా సంరంభంలో పోటాపోటీ ప్రతిభ చూపడం, భవిష్యత్తుపై ఆశలు రేపడం కచ్చితంగా విశేషమే! హాకీ సహా అనేక ఆటల్లో వెల్లువెత్తిన ఈ కొత్త ఉత్సాహం ఆసరాగా, రాగల కాలంలో బలమైన క్రీడాశక్తిగా భారత్ అవతరించడానికి ఇదే సరైన తరుణం. అయితే, ఇప్పుడిక తగిన దిశానిర్దేశంతో ప్రభుత్వాలు, క్రీడాసంస్థలు దీర్ఘకాలిక ప్రణాళికా రచన చేయాలి. క్రికెట్లో ఐపీఎల్ లాగా హాకీలో జాతీయస్థాయి లీగ్ లాంటివి మొదలుపెట్టడం లాంటివి చేయవచ్చు. అన్నిటి కన్నా ముఖ్యంగా చదువుతో పాటు ఆటల్ని అంతర్భాగం చేసే మంచి పద్ధతుల్ని పునఃప్రతిష్ఠించాలి. శిక్షణ నిమిత్తం నగరాలకు వెళ్ళలేని ప్రతిభావంతులైన గ్రామీణుల కోసం స్థానిక స్థాయిలో, వీలుంటే ప్రతి జిల్లాలో క్రీడా సముదాయాలు నెలకొల్పాలి. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు తగిన తర్ఫీదు నివ్వాలి. ఇలా కింది స్థాయి నుంచి దృఢసంకల్పంతో కృషి మొదలుపెట్టి, ఆటగాళ్ళలో నమ్మకం పెంపొందిస్తే – ఒక్క హాకీలోనే కాదు... అనేక క్రీడల్లో అంతర్జాతీయ యవనికపై మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది. మెడలో పతకాల హారంతో దేశం మెరిసిపోతుంది, మురిసిపోతుంది. -
ఒలింపిక్స్‌లో రేపే మనకు ఆఖరిరోజు.. కలిసి వస్తుందా!
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పోటీ పడుతున్న క్రీడాంశాలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటివరకు భారత్ ఐదు పతకాలు సాధించింది. అందులో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ విభాగం నుంచి రెండు రజతాలు.. బాడ్మింటన్, హాకీ, బాక్సింగ్ విభాగాల్లో కాంస్యాలు లభించాయి. కాగా ఒలింపిక్స్ రేపు మనకు ఆఖరిరోజు అయినా పతకాల ఆశలు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా జావెలిన్ త్రోపై ఎక్కువ ఆశలు ఉన్నాయి. నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానంలో నిలవడంతో ఫైనల్లో కచ్చితంగా మెడల్ గెలుస్తాడని అంతా భావిస్తున్నారు. ఇక రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్యం కోసం తలపడనున్నాడు. అలాగే గోల్ఫ్‌లో భారత క్రీడాకారిణి అదితి అశోక్ పతకంపై ఆశలు రేపుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రేపటి భారత షెడ్యూల్ ►జావెలిన్ త్రో ఫైనల్- నీరజ్ చోప్రా ►రెజ్లింగ్‌లో కాంస్య పతక పోరు- భజరంగ్ పునియా ►గోల్ఫ్ పతకం రేసులో భారత క్రీడాకారిణి అదితి అశోక్.. వాతావరణం అనుకూలించక గోల్ఫ్ ఆట రద్దయితే.. రెండోస్థానంలో ఉన్న అదితికి రజతం దక్కే అవకాశం -
కాంస్య పతక పోరు; భజరంగ్ పూనియా వీడియో వైరల్
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్ అజర్బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్‌తో జరిగిన సెమీస్ బౌట్లో భజరంగ్ 5-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. కాగా సెమీస్‌లో ఓడిన భజరంగ్ రేపు కాంస్య పతక పోరుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా భజరంగ్‌కు సంబంధించిన ఒక పాత వీడియోను బాలీవుడ్ స్టార్ రణదీప్ హుడా ట్విటర్లో షేర్ చేశాడు. ఆ వీడియోలో భజరంగ్ మ్యాచ్ సందర్భంగా బౌట్‌కు సిద్ధమవుతుండగా ఇంతలో ఒక వ్యక్తి రింగ్‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే భజరంగ్ అతన్ని రింగ్ బయటే ఆపేందుకు ప్రయత్నించాడు. అతను ఆగకపోవడంతో బజరంగ్ అతన్ని రింగ్ నుంచి ఎత్తిపడేశాడు. ఆ తర్వాత మళ్లీ రింగ్‌లోకి వచ్చి విజయసంకేతాన్ని చూపించాడు. దీనిని షేర్ చేసిన రణదీప్ ఇలాంటి ప్రదర్శనను ఒలింపిక్స్‌లో చూపించాలి అంటూ ట్వీట్ చేశాడు. కాగా సెమీస్‌లో ఓటమి పాలైన పూనియా కాంస్య తెస్తాడేమో చూడాలి. Can’t wait to celebrate like this again .. #BajrangPunia #Olympics #Olympics2020 #Tokyo2020#Wrestling @BajrangPunia pic.twitter.com/TNOHg9sMIf — Randeep Hooda (@RandeepHooda) August 6, 2021 -
'భారత మహిళల హాకీ జట్టుతో నా ప్రయాణం ముగిసింది'
టోక్యో: భారత మహిళల హాకీ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జోర్డ్ మారిజైన్ స్పష్టం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్రిటన్‌తో జరిగిన కాంస్య పతక పోరులో భారత్ ఓటమి అనంతరం మారిజైన్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ''బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్ నా చివరి అసైన్మెంట్. ఈరోజుతో భారత్ మహిళల హాకీ టీంతో నా ప్రయాణం ముగిసింది.ఇంతకాలం మాకు మద్దతిచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మేం ఈరోజు ఒలింపిక్స్‌లో మెడల్ గెలవలేకపోవచ్చు.. కానీ అంతకంటే పెద్ద విజయాన్ని అందుకున్నాం. అదే అభిమానుల ప్రేమాభిమానాలు. ప్రాభవం కోల్పోతున్న స్థితి నుంచి పతకం కోసం పోరాడే స్థాయికి చేరుకున్నాం. ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అందరి అంచనాలకు భిన్నంగా రాణించింది. వారి ఆటతీరుతో ఈరోజు లక్షలాది అమ్మాయిల మనసు గెలుచుకున్నాం'' అంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశాడు. We did not win a medal, but I think we have won something bigger. We have made Indians proud again and we inspired millions of girls that dreams CAN come true as long as you work hard for it and believe it! Thanks for all the support! 🇮🇳 — Sjoerd Marijne (@SjoerdMarijne) August 6, 2021 కాగా నెదర్లాండ్స్‌కు చెందిన మారిజైన్ 2017 నుంచి భారత మహిళల హాకీ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని పనితీరుపై ముగ్దులైన భారత హాకీ సంఘం మెన్స్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించమని అడిగింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత మళ్లీ టీమిండియా మహిళల హాకీ జట్టును మరింత మెరుగ్గా తయారు చేసే పనిలో పడ్డాడు. కరోనా విరామం అనంతరం.. 2019లో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 6-5తో అద్భుత ప్రదర్శన చేసిన అమ్మాయిలు ఒలింపిక్స్‌కుఅర్హత సాధించారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో బరిలో దిగి, ఆద్యంతం గట్టి పోటీనిచ్చిన రాణి రాంపాల్ సేనకు యావత్ భారతావని మద్దతుగా నిలిచింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్ సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించింది. తాజాగా శుక్రవారం బ్రిటన్‌తో జరిగిన కాంస్య పతక పోరు మ్యాచ్‌లో 4-3 తేడాతో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో పోరాట పటిమ ప్రదర్శించినప్పటికీ.. చివరి క్వార్టర్లో ఫలితం తారుమారుకావడంతో పతకం గెలవలేకపోయింది. కాంస్య పతక పోరులో భాగంగా మ్యాచ్ ఆరంభమైన కొద్ది నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి బ్రిటన్ గట్టి పోటీనివ్వగా.. పడిలేచిన కెరటంలా దూసుకుకొచ్చిన రాణి సేన రెండో క్వార్టర్ ముగిసే సరికి చివరి 5 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ చేసి సత్తా చాటింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ 2, వందనా కటారియా ఒక గోల్ చేశారు. -
ప్రధాని మోదీ ఫోన్, కన్నీరు మున్నీరైన అమ్మాయిలు
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఓటమి పాలైన భారత మహిళల హాకీ టీమ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. గుర్జీత్ కౌర్ అసమాన ప్రదర్శనతో ఆరు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసినప్పటికీ చివరి క్వార్టర్లో బ్రిటన్‌కి హ్యాట్రిక్ పెనాల్టీ కార్నర్లు జట్టుకు విజయాన్ని దూరం చేశాయి. అయినా 130 కోట్ల మంది దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ నెటిజన్లు జట్టును అభినందించారు. అటు అద్భుతంగా ఆడారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రశంసించారు. ఫోన్ ద్వారా ప్రధాని మోదీ జట్టు సభ్యులు, కోచ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు తీవ్రంగా ఏడవటం ప్రారంభించారు. అయితే ప్రధాని మోదీ వారిని అనునయించి దేశం మీ గురించి గర్వపడుతుందంటూ ప్రోత్సాహకరంగా వ్యాఖ్యానించారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ టీంకు భారీ నిరాశ ఎదురైంది. గ్రేట్ బ్రిటన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్ భారత మహిళల హాకీ టీమ్ 3-4 తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. ఈ పరాజయాన్ని టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి మరో కాంస్య పతకం దక్కకుండా పోయింది. ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన మ్యాచ్ లోతొలి క్వార్టర్లో రెండు టీమ్‌లు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. కానీ రెండో క్వార్టర్ లో బ్రిటన్ రెండు గోల్స్ సాధించగా, ఇండియా మూడు గోల్స్‌తో ఆధిపత్యాన్ని చాటుకుంది. 25, 26వ నిమిషంలో గుర్జీత్ కౌర్ రెండు వరుస గోల్స్ చేయగా 29వ నిమిషంలో మూడో గోల్ చేసింది నందనా కటారియా. ఫలితంగా రెండో క్వార్టర్లో ముందంజలో ఉన్నా, మూడు నాలుగు క్వార్టర్లలో ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. ప్రధానంగా నాలుగో క్వార్టర్ వైఫల్యంతో ఇండియా పరాజయం పాలైంది.. #WATCH | Indian Women's hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at #Tokyo2020 pic.twitter.com/n2eWP9Omzj — ANI (@ANI) August 6, 2021 -
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన పీవీ సింధు
-
అద్భుత ప్రదర్శన.. ప్రత్యర్థి సైతం శెభాష్ అన్న వేళ.. ఫొటోలు
Indian Women Hockey Team Fight In Pics: టోక్యో ఒలింపిక్స్ కాంస్యం పోరులో భారత మహిళా హాకీ జట్టు పోరాటం వృథా అయింది. చివరికంటా ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాణి సేన బ్రిటన్ చేతిలో తలవంచక తప్పలేదు. చివరిదైన 15 నిమిషాల ఆటలో బ్రిటన్ గోల్ కొట్టడంతో 4-3 తేడాతో భారత్ పరాజయం ఖరారైంది. అయితే, తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్ సాగించిన పోరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ►ముఖ్యంగా చివరి వరకు పట్టుదల వీడకుండా ముందుకు సాగిన తీరును భారతీయులు, సహా ప్రత్యర్థి జట్టు సైతం అభినందిస్తోంది. ‘‘అత్యద్భుతమైన ఆట.. అత్యంత అద్భుతమైన ప్రత్యర్థి.. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ ఇండియా ప్రత్యేకంగా నిలిచింది. మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలి’’ అని గ్రేట్ బ్రిటన్ హాకీ ట్వీట్ చేసింది. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన బ్రిటన్‌కు కాంస్య పతక వేటలో గట్టిపోటీనిచ్చిన భారత జట్టు భావోద్వేగాల సమాహారం ►ఈ మ్యాచ్‌లో భారత్ తరపున గుర్జీత్ కౌర్ రెండు, వందనా కటారియా ఒక గోల్ చేశారు. ►హోరాహోరీగా పోరాడినప్పటికీ ఓటమి ఎదురుకావడంతో భారత మహిళా జట్టు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ►ఓటమి బాధలో ఉన్న రాణి సేనను బ్రిటన్ మహిళా జట్టు ఓదార్చింది. క్రీడా స్ఫూర్తిని చాటుకుంది. -
ఓటమి తట్టుకోలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు
-
విశ్వ క్రీడల్లో సత్తా చాటుతున్న భారత యువ గోల్ఫర్ అదితి అశోక్
-
ఏడ్వొద్దు ప్లీజ్.. తలెత్తుకో సవితా: టీజ్ చేసిన వాళ్లకు జవాబు ఇచ్చావుగా!
సాక్షి, వెబ్‌డెస్క్: ఆద్యంతం ఉత్కంఠ... తొలి క్వార్టర్లో బ్రిటన్ ఆధిపత్యం.. రెండో క్వార్టర్లో సీన్ రివర్స్.. క్వార్టర్ ముగిసే సరికి 5 నిమిషాల వ్యవధి(25 ని, 26 ని, 29వ నిమిషం)లో ఏకంగా మూడు గోల్స్ కొట్టి 3-2 తేడాతో ఆధిక్యంలోకి దూసుకొచ్చిన రాణి సేన.. మూడో క్వార్టర్ ముగిసేంత వరకు 3-3తో సమంగానే ఉంది.. అటు స్ట్రైకర్లు, ఇటు డిఫెన్స్ టీం చక్కగా రాణించినప్పటికీ.. చివరిదైన నాలుగో క్వార్టర్లో ప్రత్యర్థికి గోల్ కొట్టే అవకాశం లభించింది. ఫలితంగా.. భారత మహిళల హాకీ జట్టు చరిత్రలో ఒలింపిక్ పతకం చేరుతుందన్న ఆశలు అడియాశలయ్యాయి. కాంస్యం కోసం హోరాహోరీగా సాగిన పోరులో చివరికి విజయం బ్రిటన్నే వరించింది. దీంతో ఒలింపిక్స్‌లో తొలి మెడల్ సాధించే అద్భుత అవకాశం చేజారడంతో మన అమ్మాయిలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తలెత్తుకో సవితా ముఖ్యంగా భారత ఓటమిని ఖరారు చేసే ఫైనల్ విజిల్ వినిపించగానే గోల్ కీపర్ సవితా పునియా కన్నీటి పర్యంతమైంది. టోక్యో ఒలింపిక్స్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సుమారు పన్నెండు సార్లు బ్రిటన్ను గోల్ చేయకుండా అడ్డుకున్న తన పోరాటం వృథా అయినందుకు.. చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు స్పందనగా.. ‘‘మీరంతా గొప్ప ప్రదర్శన కనబరిచారు. తలెత్తుకో సవితా’’ అంటూ భారతావని ఆమెకు అండగా నిలుస్తోంది. చిన్న గ్రామంలో జన్మించిన సవితా పునియా.. భారత అత్యుత్తమ గోల్‌కీపర్‌గా ఎదిగిన తీరును ప్రశంసిస్తూ నీరాజనాలు పలుకుతోంది. అలా మొదలైంది హర్యానాలోని జోద్ఖాన్ సవిత స్వస్థలం. ఆమె తాతయ్య రంజిత్ పునియా హాకీ మ్యాచ్ చూసేందుకు ఒకసారి ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన మదిలో ఒకటే ఆలోచన. తన కుటుంబంలో కూడా ఒక హాకీ ప్లేయర్ ఉండాలని బలంగా భావించారు. అప్పటి నుంచి మనవరాలు సవితాను హాకీ ఆడే విధంగా ప్రోత్సహించారు. అలా పునియా కుటుంబం నుంచి వచ్చిన తొలి హాకీ క్రీడాకారిణిగా సవిత ప్రయాణం మొదలైంది. మొదట్లో హాకీ ఆడటాన్ని ద్వేషించేది తాతయ్య చెప్పినట్లు అంతా బాగానే ఉంది.. కానీ.. ప్రాక్టీసు కోసం వారానికి ఆరు రోజులు.. పోనురానూ కలిపి సుమారు 60 కిలోమీటర్ల ప్రయాణం.. సిర్సా పట్టణంలోని మహరాజా అగ్రాసన్ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌కు వెళ్తేనే ఆట సజావుగా సాగేది.. ఎందుకంటే తమ గ్రామానికి సమీపంలో ఉన్న ఏకైక హాకీ క్రీడా ప్రాంగణం, కోచ్‌లు గల పాఠశాల అది. ఇలా రోజూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణాలు సవితాకు చిరాకు పుట్టించేవి. అందుకే తొలుత ఆమె హాకీ ఆడటాన్ని ద్వేషించేదని సవిత తండ్రి మొహేందర్ పునియా ఇండియా టుడేతో వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయాన్ని చెప్పండి: Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు? ఫొటో కర్టెసీ: ఇండియా టుడే అబ్బాయిలు టీజ్ చేసేవారు ‘‘ప్రాక్టీసుకు వెళ్లేందుకు సవిత బస్సులో ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితే, కిట్‌బ్యాగ్‌తో ఆమెను లోపలికి అనుమతించేవారు కాదు. బ్యాగ్‌ను టాప్‌పైన పెడితేనే బస్సు ఎక్కనిస్తామని కండక్టర్లు హెచ్చరించేవారు. కానీ సవితకు అది ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తను చాలా సార్లు రూఫ్ మీద కూర్చుని ప్రయాణం చేసేది. ఒక్కోసారి ఇంటికి వచ్చి తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పి బాధపడేది. ‘‘నాన్నా.. బస్సులో అబ్బాయిలు నన్ను టీజ్ చేస్తున్నారు’’ అని మనసు చిన్నబుచ్చుకునేది. నిజానికి అలాంటి అనుభవాలే తనను మరింత ధైర్యంగా ఉండేలా మార్చాయి. నా కూతురిని ఏడిపించిన అబ్బాయిల అందరి చెంప మీద కొట్టినట్లుగా తన ప్రతీ ప్రదర్శన వారికి ఒక జవాబునిచ్చింది’’ అని కూతురి విజయాల గురించి చెబుతూ మొహేందర్ పునియా పుత్రికోత్సాహంతో పొంగిపోయారు. 2007 నుంచి మొదలు.. మూడేళ్ల నిరీక్షణ తర్వాత లక్నోలోని నేషనల్ క్యాంపులో శిక్షణకు సవితా 2007లో ఎంపికైంది.ఆ మరుసటి ఏడాదే జాతీయ జట్టు నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. అయితే, తన మొదటి జాతీయ హాకీ మ్యాచ్ ఆడేందుకు మాత్రం మూడేళ్లపాటు నిరీక్షించాల్సి వచ్చింది. 2014లో ఇంచియాన్ ఏసియన్గేమ్స్లో భాగంగా అద్భుత ప్రదర్శన కనబరిచి వెలుగులోకి వచ్చింది సవితా పునియా. ఆ ఏడాది భారత్ కాంస్య గెలవడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా 2017 ఏసియన్ కప్‌లో ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించడంతో గోల్‌కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచి సత్తా చాటింది. ఆ మ్యాచ్‌లో చైనాతో జరిగిన ఉత్కంఠ పెనాల్టీ షూటౌట్లో భారత్ 5-4తో డ్రాగన్ దేశాన్ని ఓడించి 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా విజేతగా నిలిచింది. ఫొటో కర్టెసీ: సోనీ టీవీ మనసులు గెల్చుకున్నారు ఇక ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లోనూ సవిత తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సెమీస్‌లో ప్రవేశించేందుకు ఆస్ట్రేలియాను ఓడించడంలోనూ, కాంస్య పతక వేటలో చివరికంటా భారత మహిళా హాకీ జట్టు బ్రిటన్‌తో జరిపిన పోరాటంలోనూ గోల్‌కీపర్‌గా తనవంతు బాధ్యత నిర్వహించి వాల్‌కు సరికొత్త నిర్వచనంలా నిలిచింది. ఏదేమైనా పతకం చేజారినా, అద్భుత ప్రదర్శనతో మనసులు గెల్చుకున్న మన అమ్మాయిలు.. బంగారు తల్లులే!! భవిష్యత్ తరానికి స్ఫూర్తిదాతలే!! 5 minutes on the timer ➡️ 3 goals on the score board!#IND had pulled off an impressive comeback in the final five minutes of Q2 in their loss vs #GBR to make it 3-2 at one stage via Gurjit Kaur’s brace while Vandana earned the lead with a crucial field goal. 👏#BestOfTokyo pic.twitter.com/Fyn4os5w6h — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 6, 2021 -
మీరాబాయి గొప్ప మనసు, నెటిజన్లు ఫిదా, వైరల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం విజేతలకు పెట్టని అభరణం. దీన్ని 2020 టోక్యో ఒలింపిక్స్ ఇండియాకు తొలి పతకాన్ని అందించిన ఘనతను చాటుకున్న వెయిల్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈ మాటను మరోసారి నిరూపించారు. మహిళల విభాగంలో రజత పతకం సాధించిన తర్వాత, మీరాబాయి తన కల నెరవేరడానికి సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అరుదైన బహుమతిని అందించింది. అకాడమీకి వెళ్లేటపుడు సహకరించిన ప్రతి ఒక్కరినీ గౌరవించాలని భావించారు. అలా మరోసారి మీరాబాయి నెటిజన్లు హృదయాలను దోచుకుంది. ఆమె గెల్చుకున్నది వెండి పతకం అయినా ఆమె మనకు మాత్రం 24 క్యారెట్ బంగారం. జీవితంలో సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు అంటూ నెటిజనులు ఫిదా అవుతున్నారు. తాజాగా మళ్లీ ప్రాక్టీస్ షురూ చేసిన ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో 2024 పారిస్ ఒలింపిక్స్‌కి బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అభిమానులు ట్వీట్ చేశారు. 2022 ఆసియా గేమ్స్, 2024 ఒలింపిక్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయంటూ ఇంకొకరు వ్యాఖ్యానించడం విశేషం. ఉచితంగా లిప్ట్ ఇచ్చి కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ట్రక్ డ్రైవర్లకు గిఫ్ట్ ఇచ్చి పెద్దమనసు చాటుకుంది మీరాబాయి చాను. దాదాపు150 మంది డ్రైవర్లను ఇంటికి పిలిచి భోజనం పెట్టింది. అంతేకాదు వారికి ఒక షర్ట్, మణిపురి కండువాను బహుమానంగా ఇచ్చి సత్కరించింది. శిక్షణా కేంద్రానికి వెళ్లేందుకు రెగ్యులర్‌గా లిఫ్ట్ అందించిన ట్రక్కర్లను కలిసి, వారి ఆశీర్వాదం పొందాలని కోరుకున్నానని మీరాబాయి ఈసందర్భంగా ప్రకటించింది. కష్ట సమయంలో వారంతా ఆదుకున్నారు. అందుకే భవిష్యత్తులో వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఫిల్మ్ మేకర్ నౌరెం మోహెన్ ట్విటర్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. కాగా మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మీరాబాయి తన ఇంటి నుండి శిక్షణా అకాడమీకి 30 కి.మీ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. అటు ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం, ఇటు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకొనే స్థోమత లేని మీరాబాయి ఇంపాల్‌కు ఇసుకను తీసుకెళ్తున్న ట్రక్కుల ద్వారానే లిఫ్ట్ తీసుకునేది. అలా కఠోర సాధనతో టోక్యో ఒలింపిక్స్‌లో తన కలను సాకారం చేసుకోవడమే కాదు, యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. pic.twitter.com/mrYZRXHtlK — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 6, 2021 Olympiad @mirabai_chanu home was more than 25 km from the Sport Academy. No means of transport during those days, except trucks which carried river sands to the City. These truck drivers gave her lift everyday. Today she rewarded these truck drivers. pic.twitter.com/9WegUkwjkz — Naorem Mohen (@laimacha) August 5, 2021 -
సెమీస్ చేరిన భారత రెజ్లర్ భజరంగ్ పునియా
-
హాకీ క్రీడాకారిణులకు 50 లక్షల నజరానా
Indian Women Hockey Team Wins Hearts: కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత మహిళా హాకీ జట్టు అద్భుత ప్రదర్శనను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్ ఆడిన జట్టులో భాగమైన తమ రాష్ట్ర హాకీ క్రీడాకారిణులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. మొత్తం తొమ్మిది మందికి ఈ నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పోరాట పటిమ కనబరిచారంటూ హాకీ జట్టుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా భారత మహిళా హాకీ ఒలింపిక్ చరిత్రలో రాణి సేన తొలిసారి సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, సెమీ ఫైనల్లో ఓడిన అమ్మాయిలు.. శుక్రవారం కాంస్యం కోసం జరిగిన పోరులో బ్రిటన్‌తో హోరాహోరీగా పోరాడారు. కానీ, చివరి క్వార్టర్లో ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించడంతో 4-3 తేడాతో ఓటమి పాలయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Haryana Government will award Rs 50 lakhs each to the nine members of the Olympics women's hockey team who are from Haryana. I congratulate the Indian team for their praiseworthy performance at the Tokyo Olympics. — Manohar Lal (@mlkhattar) August 6, 2021 -
గుండె పగిలింది.. పతకం చేజారింది.. మరేం పర్లేదు!
న్యూఢిల్లీ: ‘‘అయ్యో చివరి దాకా పోరాడినా ఫలితం లేకుండా పోయిందే. మహిళల హాకీ చరిత్రలో భారత్‌కు తొలి పతకం వస్తుందనుకుంటే నిరాశే మిగిలింది. ఈ ఓటమితో మా గుండె పగిలింది. మరేం పర్లేదు అమ్మాయిలు. ఇప్పటి దాకా మీరు సాగించిన పోరాటం అసమానం. శెబ్బాష్.. ఆఖరి వరకు ప్రాణం పెట్టి ఆడారు. ఈసారి పతకం చేజారినా.. వచ్చే ఒలింపిక్స్‌లో కచ్చితంగా మెడల్ సాధిస్తారు’’... కాంస్యపు పోరులో మహిళా హాకీ జట్టు ఓడిన తర్వాత భారతీయుల మదిలో మెదిలిన భావనలు ఇవి. పతకం రానందుకు బాధపడుతూనే, ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి సెమీస్ చేరి, కాంస్య పతక వేటలో నిలిచినందుకు రాణిసేనను అభినందిస్తున్నారు. తదుపరి టోర్నమెంట్లలో ఇదే స్థాయి ప్రతిభ కనబరిచి.. విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అమ్మాయిలకు మద్దతుగా నిలుస్తున్నారు. గెలుపోటములు సహజమని, ఎల్లప్పుడూ మీ వెంటే మేము అంటూ సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియజేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-3 తేడాతో బ్రిటన్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆద్యంతం ఆసక్తి రేపిన మ్యాచ్‌లో హోరాహోరీగా పోరాడిన భారత మహిళల జట్టు.. మూడో క్వార్టర్ వరకు గట్టిపోటీనిచ్చింది. అయితే, చివరి 15 నిమిషాల ఆటలో పెనాల్టీ కార్నర్‌ను సేవ్ చేయలేకపోవడంతో గోల్ కొట్టిన బ్రిటన్ గెలుపు ఖరారైంది. దీంతో తొలి పతకం సాధించాలన్న భారత మహిళల హాకీ జట్టుకు మొండిచేయి ఎదురైంది. ఇక ఓటమి అనంతరం భారత క్రీడాకారిణులు భావోద్వేగానికి గురికావడంతో బ్రిటన్ ప్లేయర్లు వారిని ఓదారుస్తూ క్రీడాస్ఫూర్తిని చాటుకోవడం విశేషం. మీ ప్రదర్శన స్ఫూర్తి దాయకం ‘‘చాలా దగ్గరగా వచ్చాం.. కానీ అంతే దూరంలో ఉన్నాం. హృదయం పగిలింది. అయితేనేం.. ఎప్పుడూ జరగదు అనుకున్నది చేసి చూపించారు. అసాధ్యం అనుకున్న విషయాన్ని ఈ జట్టు సుసాధ్యం చేసి చూపింది. ఇప్పటి వరకు మీరు సాగించిన ప్రయాణం, ప్రదర్శన స్ఫూర్తిదాయకమైనది’’ అని హాకీ ఇండియా ట్విటర్ వేదికగా అమ్మాయిలకు అండగా నిలిచింది. గర్వంగా ఉంది: ప్రధాని మోదీ ‘‘మహిళా హాకీ జట్టు చివరి దాకా పోరాడినా విజయం చేజారింది. అయితేనేం.. నవ భారత పోరాట పటిమను ఈ జట్టు ప్రతిబింబించింది. టోక్యో ఒలింపిక్స్‌లో మీరు సాధించిన విజయాలు.. హాకీలో భారత ఆడకూతుళ్లు అడుగుపెట్టేందుకు స్ఫూర్తినిస్తాయి. ఈ జట్టు పట్ల గర్వంగా ఉంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ రాణిసేనకు అండగా నిలిచారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) We narrowly missed a medal in Women’s Hockey but this team reflects the spirit of New India- where we give our best and scale new frontiers. More importantly, their success at #Tokyo2020 will motivate young daughters of India to take up Hockey and excel in it. Proud of this team. — Narendra Modi (@narendramodi) August 6, 2021 బాధ పడకండి తల్లులు.. ‘‘బాధ పడకండి అమ్మాయిలు. టాప్-4లో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు అద్భుతంగా రాణించారు. భారత్ గర్వపడేలా చేసినందుకు మిమ్మల్ని ప్రశంసిస్తున్నా’’ అని కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. हॉकी का सुनहरा दौर वापस लौट आया है ! 🇮🇳 Don't break down girls, you all played superb at #Tokyo2020 by reaching top 4 in the world! I appreciate our Women's Hockey for making India proud. #Cheer4India !! https://t.co/74J5QwxrYN pic.twitter.com/xMaGC3yLg6 — Kiren Rijiju (@KirenRijiju) August 6, 2021 -
కాంస్య పతక వేటలో పోరాడి ఓడిన అమ్మాయిలు
టోక్యో: కాంస్యపు పోరులో భారత మహిళా హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్రిటన్‌తో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో 4-3 తేడాతో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో పోరాట పటిమ ప్రదర్శించినప్పటికీ.. చివరి క్వార్టర్లో ఫలితం తారుమారుకావడంతో పతకం గెలవలేకపోయింది. కాంస్య పతక పోరులో భాగంగా మ్యాచ్ ఆరంభమైన కొద్ది నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి బ్రిటన్ గట్టి పోటీనివ్వగా.. పడిలేచిన కెరటంలా దూసుకుకొచ్చిన రాణి సేన రెండో క్వార్టర్ ముగిసే సరికి చివరి 5 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ చేసి సత్తా చాటింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ 2, వందనా కటారియా ఒక గోల్ చేశారు. ఇక మూడో క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు 3-3తో సమంగా ఉండగా... నాలుగో క్వార్టర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన చివరి 15 నిమిషాల ఆటలో బ్రిటన్ తొలి గోల్ చేసి 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి గెలుపును ఖరారు చేసుకుంది. దీంతో మహిళల హాకీ చరిత్రలో తొలి ఒలింపిక్ పతకం చేరాలని ఆశించిన భారత్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో బరిలో దిగి, ఆద్యంతం గట్టి పోటీనిచ్చిన రాణి సేనకు యావత్ భారతావని మద్దతుగా నిలుస్తోంది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్ సెమీస్‌కు చేరినందుకు వారి పోరాట పటిమను కొనియాడుతోంది. కాంస్య పతక పోరులో భాగమైన భారత మహిళా హాకీ జట్టు: సవితా పునియా(గోల్ కీపర్), గుర్జీత్ కౌర్, దీప్ గ్రేస్ ఎక్కా, ఉదిత, నిషా, నేహ, మోనిక, నవజోత్ కౌర్, నవనీత్ కౌర్, రాణి(కెప్టెన్), వందనా కటారియా. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒలింపిక్స్‌కు వెళ్లేముందు సీఎం జగన్ సపోర్ట్ చేశారు: సింధు
-
సెమీస్‌లో భజరంగ్ పూనియా ఓటమి
సెమీస్‌లో భజరంగ్ పూనియా ఓటమి ►ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత్ స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా పరాజయం పాలయ్యాడు. ప్రపంచ చాంపియన్ అజర్బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్‌తో జరిగిన సెమీస్ బౌట్లో భజరంగ్ 5-12 తేడాతో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన రెండు బౌట్లలోనూ గెలిచి గోల్డ్‌పై ఆశలు రేపిన భజరంగ్.. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ కోసం శనివారం తలపడనున్నాడు. రియో గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ప్రత్యర్థి హజి ముందు భజరంగ్ నిలవలేకపోయాడు. కాగా కాంస్య పతక పోరు కోసం భజరంగ్ పూనియా రేపు మరో మ్యాచ్ ఆడనున్నాడు. Tokyo Olympics 2020 Live Updates: గోల్ఫ్‌లో భారత్‌కు పతకం వచ్చే అవకాశం కనబడుతోంది. మూడో రౌండ్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన అదితి అశోక్ పతకం సాధించేలా కనిపిస్తోంది. వాతావరణం అనుకూలించకుంటే, శనివారం జరుగనున్న నాలుగో రౌండ్ ఫలితం తేలనట్లయితే, మూడో రౌండ్ ఫలితాలను బట్టి అదితి అశోక్‌కు మెడల్ వచ్చే అవకాశం ఉంది. సెమీస్ చేరిన భజరంగ్ ► పురుషుల 65 కిలోల విభాగంలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సెమీస్ చేరాడు. ఇరాన్ రెజ్లర్‌పై 2-1 తేడాతో భజరంగ్ విజయం సాధించాడు. ► రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సత్తా చాటాడు. కజికిస్థాన్ రెజ్లర్ అక్మతలీవ్పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. పోరాడి ఓడిన భారత్ ►కాంస్య పతకం పోరులో భారత్- బ్రిటన్ మహిళల జట్ల జరిగిన హోరాహోరీ పోరులో బ్రిటన్ విజయం సాధించింది. 4-3 తేడాతో భారత్‌పై గెలుపొందింది. నాలుగో క్వార్టర్ ఆరంభంలోనే పెనాల్టీ కార్నర్ ద్వారా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని గోల్ కొట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బ్రిటన్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 41 ఏళ్ల తర్వాత సెమీస్ చేరి చరిత్ర సృష్టించిన రాణి సేన.. ఈ ఓటమి కారణంగా రిక్తహస్తాలతోనే స్వదేశానికి తిరిగిరానుంది. ►మూడో క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు 3-3 స్కోరుతో సమంగా ఉన్నాయి. నిరాశ పరిచిన సిమీ బిస్లా ►రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. సారా హమీద్ చేతిలో భారత మహిళా రెజ్లర్ సీమీ బిస్లా ఓటమి పాలైంది. బ్రిటన్‌తో భారత్ హోరాహోరీ ►రెండో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 3-2తో ఆధిపత్యం ప్రదర్శించగా... మూడో క్వార్టర్ ఆరంభంలోనే గోల్ కొట్టి 3-3కి భారత్ ఆధిక్యాన్ని బ్రిటన్ తగ్గించేసింది. ►బ్రిటన్‌తో జరుగుతున్న కాంస్యపు పోరులో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. రెండో క్వార్టర్ వరకు బ్రిటన్ ఆధిక్యంలో కొనసాగగా.. వెంటనే తేరుకున్న రాణి సేన క్వార్టర్ ముగిసే సరికి వరుస గోల్స్ చేసి 3-2తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ రెండు, వందనా కటారియా ఒక గోల్ చేశారు. ► శుక్రవారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో భారత్-గ్రేట్ బ్రిటన్ మధ్య కాంస్యపు పోరు. ► బ్రిటన్‌కు దక్కిన పెనాల్టీ కార్నర్.. సేవ్ చేసిన నవనీత్ ►లీగ్ దశలో బ్రిటన్ చేతిలో 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయిన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. గుర్జీత్ కౌర్, వందన కటారియా, కెప్టెన్ రాణి రాంపాల్, గోల్‌కీపర్ సవితా పూనియా మరోసారి భారత్‌కు కీలకం కానున్నారు. Let's own the stage. 💪 🇬🇧 0:0 🇮🇳https://t.co/FEfTJeC69a#GBRvIND #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/sC5lUzw937 — Hockey India (@TheHockeyIndia) August 6, 2021 ►ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరి అర్జెంటీనా చేతిలో ఓడిపోయిన భారత జట్టు నేడు జరిగే కాంస్య పతక పోరులో 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. ► పురుషుల 50 కి.మీ నడకలో భారత్‌కు నిరాశ. 50 కి.మీ నడకను పూర్తిచేయలేకపోయిన గురుప్రీత్‌సింగ్. టోక్యో ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ►ఉ.7 నుంచి హాకీ మహిళల కాంస్య పతక పోరు (భారత్ Vs బ్రిటన్) ►ఉ. 8 గంటలకు రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగం (సీమీ బిస్లా) ►ఉ.8:45కు రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగం (బజరంగ్ పునియా) ►మ.ఒంటిగంట నుంచి మహిళల 20 కి.మీ వడక (ప్రియాంక, భావన) ►మధ్యాహ్నం 3 గంటలకు రెజ్లింగ్ పురుషుల సెమీస్ ►మధ్యాహ్నం 3:15 నుంచి రెజ్లింగ్ మహిళల సెమీస్ సాయంత్రం 5 గంటలకు పురుషుల 4x400 మీటర్ల హీట్స్ -
నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను
మన ఆటగాళ్లకు కాంస్యం దక్కిన క్షణం చూసిన నాకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు. ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. మా వల్ల సాధ్యం కానిది ఈతరం ఆటగాళ్లు సాధించడం గర్వంగా అనిపిస్తోంది. జర్మనీతో మ్యాచ్‌లో మన జట్టులో కొన్ని లోపాలు కనిపించినా చివరకు మెడల్ గెలవగలిగాం. ఎప్పటిలాగే చివరి క్షణాల్లో గోల్ ఇచ్చేస్తారేమోనని భయపడ్డాను. ఆ ఉత్కంఠను అధిగమించి మ్యాచ్‌ను నిలబెట్టుకోగలిగారు. నేను ఆడిన రోజుల్లో ఒలింపిక్స్‌కు ముందు యూరోప్ దేశాలకు వెళ్లి 100 శాతం శ్రమించి గెలిచి రావడం, అసలు ఒలింపిక్స్‌కు వచ్చేసరికి విఫలం కావడం జరిగాయి. మిగతా జట్లు ఒలింపిక్స్‌లోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కోసం సన్నద్ధమయ్యేవి. దీనిని కూడా గుర్తించలేని స్థితిలో మా ఆట సాగింది. ఇప్పుడు అంతా మారిపోయింది. విదేశీ కోచ్‌లు బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టును యూరోపియన్ శైలికి అనుగుణంగా మనోళ్ల ఆటను తీర్చిదిద్దారు. గత 6–7 ఏళ్లుగా ఇది సాగుతుండగా ఫలితం ఇప్పుడు కనిపించింది. కొత్త తరహా షాట్లు వచ్చి అంతా ‘పవర్‌గేమ్’గా మారిపోయింది. మేం ఆడిన రోజులతో పోలిస్తే సబ్స్టిట్యూట్ల సంఖ్య విషయంలో పరిమితి లేకపోవడంతో ఎక్కువ మందిని రొటేట్ చేస్తూ అందరినీ మ్యాచ్ ఆసాంతం తాజాగా ఉంచే అవకాశం కలిగింది. దాంతో ఆటలో వేగం పెరిగింది. ఇలా కాలానుగుణంగా వచ్చిన మార్పులను భారత జట్టు సమర్థంగా అమలు చేయగలగడమే మళ్లీ పతకం గెలుచుకోవడానికి కారణమైంది. –‘సాక్షి’తో ముకేశ్ కుమార్ (ట్రిపుల్ ఒలింపియన్–1992, 1996, 2000) భారత హాకీకి ఇదో పునర్జన్మలాంటిది. ఈ పతకం సాధించి భవిష్యత్తులో ఎవరైనా హాకీ ఆడేందుకు కావాల్సిన ప్రేరణను అందించగలిగాం. ఆఖరి పెనాల్టీ కార్నర్‌కి ముందే ఒకటే మాట అనుకున్నాను. 21 ఏళ్లుగా హాకీ కోసం కష్టపడ్డాను. ఇప్పుడు ఈ పెనాల్టీని ఆపలేకపోతే అదంతా వృథా అనిపించింది. ఆపి చూపించాను. –పీఆర్ శ్రీజేశ్, గోల్ కీపర్ యావద్భారత దేశం ఈ పతకం కోసం ఎదురు చూస్తోందని నాకు బాగా తెలుసు. ఈ విజయంలో నేనూ ఒక పాత్ర పోషించడం గొప్పగా అనిపిస్తోంది. జట్టు సభ్యులంతా ఎన్నో త్యాగాలు చేసి కష్టపడ్డారు. కరోనా బారిన పడి కూడా అంతే పట్టుదలగా సాధన చేశారు. మ్యాచ్ పూర్తిగా ముగిసే వరకు అంతా అయిపోయినట్లు కాదు. ఈ మ్యాచ్‌లో జట్టు వెనుకబడి కూడా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించింది. –గ్రాహం రీడ్, చీఫ్ కోచ్ అద్భుతంగా అనిపిస్తోంది. మాకు పతకం గెలిచే అర్హత ఉందని భావించాం. 15 నెలలుగా దీని కోసం ఎంతో కష్టపడ్డాం. మ్యాచ్‌లో వెనకబడ్డా మేం నిరాశ చెందలేదు. చివరి వరకు పోరాడాం. చివరి ఆరు సెకన్లలో పెనాల్టీని ఆపేందుకు మా ప్రాణాలు అడ్డువేయాలన్నట్లుగా అనిపించింది –మన్‌ప్రీత్ సింగ్, కెప్టెన్ ప్రతీ భారతీయుడి హృదయంలో హాకీకి ప్రత్యేక స్థానం ఉంది. హాకీ ప్రేమికులకు, క్రీడాభిమానులకు ఆగస్టు 5, 2021 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి భారత జట్టు 41 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించింది. 1–3తో వెనుకబడి కూడా ఎంతో పట్టుదల కనబరుస్తూ 5–4తో గెలవడం నిజంగా అద్భుతం. కాంస్యం గెలిచి జట్టుకు నా అభినందనలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం గెలవడం మనందరం సంబరాలు చేసుకోవాల్సిన ఘట్టం. జట్టుకు నా అభినందనలు. ఈ విజయంతో హాకీ పునర్వైభవం తిరిగి వస్తుందని ఆశిస్తున్నా. కె. చంద్రశేఖర రావు, తెలంగాణ ముఖ్యమంత్రి 1983, 2007, 2011లను మరచిపోండి. భారత హాకీ జట్టు సాధించిన ఈ పతకం ఏ ప్రపంచ కప్‌కంటే కూడా ఎక్కువే. –గౌతం గంభీర్, మాజీ క్రికెటర్ -
‘స్టిక్’ సీన్ మారింది...
సాక్షి క్రీడా విభాగం: ఎన్నో ఏళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలు లేని బాధ, ఆటతీరుపై జోక్‌లు... అధికారుల చేతకానితనం, జట్టులో అంతర్గత రాజకీయాలు... ప్రతిభకు పాతర, ఆటగాళ్లంటే చులకనభావం... ఇంటా, బయటా భారత హాకీపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఇలాంటి స్థితిలో రెండేళ్ల క్రితం చీఫ్ కోచ్‌గా వచ్చిన ఆస్ట్రేలియన్ గ్రాహం రీడ్ ‘భారత జట్టు ఉండాల్సింది ఈ స్థానంలో కాదు. దీన్ని నేను ఎక్కడికో తీసుకెళతాను’ అని తొలి మాటగా అన్నాడు. కొత్తగా రాగానే అందరూ చెప్పే మాటలే ఇవి అని ఎవరూ నమ్మలేదు. పైగా అంతర్గత రాజకీయాలతోపాటు కొత్తగా వచ్చే మార్పులను అంత సులభంగా అంగీకరించలేని తత్వం ఉన్న ఆటగాళ్ల జట్టుతో అతను సాధిస్తాడా అని అంతా తేలిగ్గా తీసుకున్నారు. కానీ రీడ్ ఎక్కడా తగ్గలేదు. కంప్యూటర్ సైన్స్ చదివి ఐటీ రంగంలో సుదీర్ఘ కాలం పని చేయడంతో పాటు ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థల్లో పెద్ద హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న రీడ్ హాకీలోనూ తనదైన కొత్త శైలితో ఆటగాళ్లను దారిలో పెట్టాడు. రీడ్ వచ్చే నాటికి జట్టులో అందరూ వ్యక్తిగతంగా పెద్ద ప్లేయర్లే. కానీ తుది ఫలితం వరకు వచ్చేసరికి మాత్రం అంతా అంతంతమాత్రమే. ముందుగా టీమ్‌ను ఒక్క చోటికి చేర్చడంలో అతను సఫలమయ్యాడు. పేరుకు శ్రీజేశ్, మన్‌ప్రీత్, మన్దీప్, బీరేంద్ర లక్డాలాంటి సీనియర్లు ఉన్నా వారెప్పుడూ జట్టుకంటే ఎక్కువ కాదనే భావనను రీడ్ కల్పించాడు. కోచింగ్ క్యాంప్‌లో రీడ్ భార్య స్వచ్ఛందంగా ఆటగాళ్లకు ‘పర్సనాలిటీ డెవలప్మెంట్’ క్లాస్‌లు తీసుకొని వారిలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేసిందంటే రీడ్ ఎంతగా తన మిషన్‌లో మునిగాడో అర్థమవుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఎంపికైన వారిలో 12 మందికి ఇదే తొలి ఒలింపిక్స్. ఇలాంటి టీమ్‌ను ఎంచుకోవడంలో కూడా కోచ్ సాహసం కనిపిస్తుంది. ఆటగాళ్లు, అధికారులతో ఏ విషయంలోనైనా మొహమాటం లేకుండా నిక్కచ్చిగా నిజం మాట్లాడే రీడ్ తత్వం అందరికీ మేలు చేసింది. ఫిట్నెస్ సూపర్... సుదీర్ఘ కాలంగా భారత హాకీ వైఫల్యాల్లో ఫిట్‌నెస్‌లేమి కూడా కీలకపాత్ర పోషించింది. ఆటపరంగా ఎంతో బాగున్నా, ఆస్ట్రోటర్ఫ్‌పై కొద్దిసేపు ఆడగానే అలసటకు గురై మనోళ్లు ఇబ్బంది పడుతూ కొనసాగడం గతంలో చాలాసార్లు జరిగింది. దీనిని ఎలాగైనా మార్చాలని రీడ్ సంకల్పించాడు. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లతో పాటు సైంటిఫిక్ అడ్వైజర్ రాబిన్ అర్కెల్ సహకారం తీసుకొని ఆటగాళ్లను ఫిట్‌గా తయారు చేశాడు. యూరోపియన్ జట్లతో పోటీ పడినప్పుడు గతంలో ఎదురైన సమస్యలేవీ లేకుండా మనోళ్లు వారితో సమానంగా మైదానంలో చురుగ్గా కనిపించడం ఆటగాళ్లలో వచ్చిన కీలకమార్పు. తీవ్రమైన వేడి ఉన్న ఒసి స్టేడియంలో 13 రోజుల వ్యవధిలో 8 మ్యాచ్‌లు ఆడగలగడం వారి ఫిట్నెస్ను చూపించింది. రీడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మనోళ్లు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడం బాగా మెరుగైంది. టోక్యోలో భారత్ 8 మ్యాచ్‌లలో 25 గోల్స్ చేసింది. ఇక సబ్స్టిట్యూట్లను సమర్థంగా వాడుకోవడం రీడ్ వ్యూహాల్లో బాగా పని చేసింది. సెమీస్‌లో సిమ్రన్‌జిత్‌కు విశ్రాంతినివ్వగా, కాంస్య పోరులో అతను కొత్త ఉత్సాహంతో వచ్చి రెండు గోల్స్ చేశాడు. అమిత్ రోహిదాస్ ‘ఫస్ట్ రషర్’ రూపంలో శ్రీజేశ్కంటే ముందే పెనాల్టీలను ఆపడానికి ముందుకు దూసుకురావడం మనం గతంలో చూడని మార్పు. భారత ఆటగాళ్లు తమను, తమ కోచ్‌ను, తమ సహచరులను, తమ శిక్షణను నమ్మారు కాబట్టే ఈ ఫలితం వచ్చింది. నాలుగు దశాబ్దాలుగా బరిలోకి దిగిన ప్రతీ భారత జట్టు మట్టిపై ఆడిన తమ ముందు తరంవారి విజయాల భారం మోస్తూ కుప్పకూలిపోయేది. ఈ జట్టు మాత్రం అలా కాలేదు. హాకీ మున్ముందు మరింత వెలిగేందుకు తమ వైపునుంచి తొలి అడుగు వేసింది. -
హ్యాకీ డేస్.. బంగారంలా మెరిసిన భారత కాంస్యం
అప్పట్లో భారత హాకీ జట్టు చాలా అద్భుతంగా ఆడేదట! ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలుచుకుందట! ఒక తరం మొత్తం వింటూ వచ్చిన కథ ఇది. రికార్డు పుస్తకాల్లో, క్విజ్ పోటీల్లో, కొన్నేళ్ల తర్వాత గూగుల్ సెర్చ్‌లో... ఇలా అలనాటి ఘనత గురించి వినడమే తప్ప ఒక్కసారి కూడా మన ఇండియా ఒలింపిక్ పతకం గెలవడం ఈతరం చూడలేదు. ఆఖరిసారిగా 1980లో స్వర్ణం నెగ్గిందని సమాధానం గుర్తించడమే కానీ మన దేశం పతకం సాధించిన రోజు కలిగే ఆనందం ఎలా ఉంటుందో అనుభవిస్తే గానీ అర్థం కాదు. ఇప్పుడు కొత్త తరం క్రీడాభిమానులు కూడా మేం భారత్ ఒలింపిక్ పతకం గెలవడాన్ని చూశామని ఘనంగా చెప్పుకోవచ్చు... జర్మనీని ఓడించి పోడియంపై మన స్టార్లు సగర్వంగా నిలబడిన సమయాన జాతీయ పతాకం ఎగురుతున్న దృశ్యం మా కళ్లల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని సంతోషాన్ని ప్రకటించవచ్చు! ఆ సమయంలో భావోద్వేగానికి గురికాని భారతీయుడు ఎవరు! మైదానంలో ఆడి గెలిచిన మనోళ్లు సంబరాలు చేసుకున్నారు... హాకీతో సంబంధం లేని ఆటగాళ్లు కూడా ఆనందాన్ని పంచుకుంటున్నారు... మాజీ హాకీ ఆటగాళ్లయితే తామే గెలిచినంతగా గంతులు వేస్తున్నారు... ఒలింపిక్స్‌లో ఆడి పతక విజయంలో భాగం కాలేనివారు ఇప్పుడు గెలిచిన బృందంలో తమను తాను చూసుకుంటున్నారు. ఓడినా, గెలిచినా సుదీర్ఘ కాలంగా భారత హాకీనే ప్రేమిస్తూ వచ్చిన వారి స్పందన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు... ఈ గెలుపును ఆస్వాదించాలంటే హాకీ అభిమానులే కానవసరం లేదు. భారతీయుడైతే చాలు! టోక్యోలో ఇతర పతకాలు కూడా మన ఖాతాలో చేరుతున్నాయి. కానీ హాకీ విజయాన్ని అందరూ కోరుకున్నారు, ప్రార్థించారు. ఎందుకంటే ఇది ఫలితానికి సంబంధించి మాత్రమే కాదు, ఆ ఆటతో ఎంతో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. మరో ఈవెంట్లో ఓడినా, గెలిచినా హాకీ జట్టు మాత్రం పతకం సాధించాలని కోరుకోనివారు లేరంటే అతిశయోక్తి కాదు. 1984, 1988, ...., 2012, 2016... కాలక్రమంలో తొమ్మిది సార్లు ఒలింపిక్స్ వచ్చి వెళ్లాయి... పతకం మాత్రం రాలేదు. ఒకసారి అయితే ఒలింపిక్స్‌లో అడుగు పెట్టే అవకాశం కూడా దక్కలేదు. బంగారు హాకీ ఘనతలు ముగిసిన తర్వాత మొదలైన పతనం వేగంగా సాగిపోయింది. ఈ సారైనా గెలవకపోతారా, ఒక్కసారైనా అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తూ రావడం... ఆ ఆశలు కుప్పకూలడం రొటీన్‌గా మారిపోయాయి. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించే ఆటలు అంటూ అంచనాలు పెంచే జాబితాలోంచి హాకీ పేరు ఎప్పుడో తీసేశారు. కానీ గెలిస్తే బాగుండేదన్న చిరు కోరిక మాత్రం అభిమానుల మనసులో ఏమూలనో ఉండేది. అందుకే ఈ మూడో స్థానమూ మురిపిస్తోంది. పసిడి రాకపోతేనేమి, పునరుజ్జీవం పొందుతున్న ఆటకు ఈ విజయం బంగారంకంటే గొప్ప. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో హాకీకి దక్కిన ఈ కాంస్య పతకం విలువ అమూల్యం. టోక్యో: కోట్లాది అభిమానులకు ఆనందం పంచుతూ భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మూడో స్థానం కోసం గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5–4 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. ఒకదశలో 1–3తో వెనుకబడినా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మన టీమ్ చివరకు విజయాన్ని అందుకుంది. భారత్ తరఫున సిమ్రన్‌జిత్ సింగ్ (17వ, 34వ నిమిషాల్లో), హార్దిక్ సింగ్ (27వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (29వ నిమిషంలో), రూపిందర్‌పాల్ సింగ్ (31వ నిమిషంలో) గోల్స్ సాధించారు. జర్మనీ తరఫున టిమర్ ఒరుజ్ (2వ నిమిషంలో), నిక్లాస్ వెలెన్ (24వ నిమిషంలో), బెనెడిక్ట్ ఫర్క్ (25వ నిమిషంలో), ల్యూకాస్ విండ్‌ఫెడర్ (48వ నిమిషంలో) జర్మనీ జట్టుకు గోల్స్ చేశారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత జట్టు స్వర్ణం సాధించిన ఇన్నేళ్లకు మళ్లీ భారత్ ఖాతాలో మరో హాకీ పతకం చేరింది. వెనుకంజ వేసి... కాంస్యం సాధించాలనే లక్ష్యంతో ఎన్నో ఆశలతో మ్యాచ్ బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. గత రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ రెండో నిమిషంలోనే గోల్‌తో ముం దంజ వేసింది. భారత నెమ్మదైన డిఫెన్స్‌ను ఛేదించిన ఒరుజ్ రివర్స్ హిట్‌తో తొలి గోల్ నమోదు చేశాడు. మరో మూడు నిమిషాలకే భారత్‌కు పెనాల్టీ లభించినా అది వృథా అయింది. వరుసగా గోల్ పోస్ట్‌పై దాడులు చేస్తూ జర్మనీ తొలి క్వార్టర్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్స్‌లో భారత జట్టు కుదురుకుంది. మిడ్ ఫీల్డ్ నుంచి నీలకంఠ శర్మ ఇచ్చిన పాస్‌ను సర్కిల్లో అందుకున్న సిమ్రన్ జర్మనీ కీపర్‌ను తప్పించి రివర్స్ హిట్ కొట్టడంతో స్కోరు సమమైంది. ఈ జోరులో భారత్ అటాక్‌కు ప్రయత్నించినా, జర్మనీ వెంటనే కోలుకుంది. నీలకంఠ, సురేంద్ర కుమార్‌లు చేసిన పొరపాట్లతో బంతిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న జర్మనీ వరుస నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టింది. దాంతో ఆ జట్టు ఆధిక్యం 3–1కి పెరిగింది. మళ్లీ దూసుకెళ్లి... గతంలోనైతే ఇలాంటి స్థితి నుంచి భారత్ ఇక ముందుకు వెళ్లడం కష్టంగా మారిపోయేదేమో. కానీ ఎలాంటి ఆందోళన లేకుండా, ఆశలు కోల్పోకుండా భారత్ పట్టుదలగా ఆడటం సత్ఫలితాన్ని ఇచ్చింది. రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. హర్మన్‌ప్రీత్ కొట్టిన పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ కీపర్ స్టాడ్లర్ సమర్థంగా అడ్డుకున్నా, రీబౌండ్లో హార్దిక్ దానిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఆ వెంటనే మరో పెనాల్టీ రాగా, ఈసారి హర్మన్‌ప్రీత్ విఫలం కాలేదు. స్కోరు 3–3కు చేరడంతో భారత్ జట్టులో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడో క్వార్టర్ మొదటి నిమిషంలోనే భారత్‌కు కలిసొచ్చింది. భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌ను జర్మనీ ఆటగాళ్లు సర్కిల్ లోపల మొరటుగా అడ్డుకోవడంతో ‘పెనాల్టీ స్ట్రోక్’ లభించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రూపిందర్ దీనిని గోల్ చేయడంతో ఆధిక్యం 4–3కు పెరిగింది. మరో మూడు నిమిషాలకే గుర్జంత్ ఇచ్చిన పాస్‌ను అందుకొని దూసుకుపోయిన సిమ్రన్‌జిత్ మరో గోల్ చేయడంతో భారత్ 5–3తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈ దశలో మరింత దూకుడుగా ఆడిన భారత్‌కు వరుస పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. అయితే అవి గోల్‌గా మారలేదు. చివరి క్వార్టర్లో జర్మనీ మళ్లీ బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరో పెనాల్టీ అవకాశం దక్కించుకున్న జర్మనీ దానిని ఉపయోగించుకోవడంతో భారత్ ఆధిక్యం 5–4కు తగ్గింది. మ్యాచ్ ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు జర్మనీ తీవ్రంగా ప్రయత్నించింది. తమ గోల్ కీపర్‌ను ఆ స్థానం నుంచి తప్పించి ఫీల్డ్‌లోకి తీసుకొచ్చి దాడులకు దిగింది. అయితే వీటిని మన గోల్ కీపర్ శ్రీజేశ్ సమర్థంగా అడ్డుకోగలిగాడు. తమకు దక్కిన 13 పెనాల్టీ కార్నర్లలో జర్మనీ ఒకదానిని మాత్రమే గోల్‌గా మలచగా... భారత్ 6 పెనాల్టీలలో రెండింటిని గోల్స్‌గా మార్చుకోగలిగింది. 6.8 సెకన్ల ముందు... అద్భుతంగా ఆడటం... ఇక మనం గెలిచేశాం అనుకుంటుండగా చివరి క్షణాల్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించి మ్యాచ్‌లు చేజార్చుకున్న దృశ్యం భారత హాకీ చరిత్రలో లెక్కలేనన్ని సార్లు జరిగింది. మన ఉదాసీతనకు తోడు అనూహ్యంగా వచ్చే అటాక్‌ను అంచనా వేసే లోపే ప్రమాదం జరిగిపోతూ ఉంటుంది. మ్యాచ్ ముగియడానికి మరో 6.8 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉన్న దశలో కూడా జర్మనీకి పెనాల్టీ లభించింది. దీనిని జర్మనీ గోల్ చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అయితే డిఫెన్స్‌లో ముందుగా దూసుకొచ్చి న అమిత్ రోహిదాస్, కీపర్ శ్రీజేశ్ కలిసి ఆపగలిగారు. అంతే... భారత ఆటగాళ్లు పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించగా, జర్మనీ ప్లేయర్లు కుప్పకూలిపోయారు. టిక్..టిక్.. టైమర్ ఆగిపోయింది! మ్యాచ్ మరో 29 సెకన్లలో ముగుస్తుందనగా మైదానంలో ఉన్న అఫీషియల్ టైమర్ పని చేయడం ఆగిపోయింది. కానీ ఆట మాత్రం సాగిపోయింది. చివరకు 11 సెకన్ల తర్వాత అది మళ్లీ పని చేసింది. సాంకేతిక సమస్యలతో టైమర్ పని చేయలేదు. జర్మనీకి 6 సెకన్ల ముందు పెనాల్టీ లభించిందంటే ఒక రకంగా అది అదనపు సమయంలో భారత్‌కు జరిగిన నష్టమే! మ్యాచ్ ముగిశాక కూడా నిర్వాహకులు దీనిపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. భారత జట్టు విజయం సాధించింది కాబట్టి సమస్య రాలేదు కానీ అదే చివరి పెనాల్టీ గోల్‌గా మారి ఉంటే..! -
Men's Hockey: ‘మా ఇంటిని.. నా కొడుకు చేతిలోని హాకీ స్టిక్ నిలబెట్టింది’
కొడుకు ఫీల్డ్‌లో పరిగెడుతుంటే అమ్మ గుండెలు పరిగెడతాయి. కొడుకు చెమటలు కక్కుతుంటే అమ్మ కళ్లు కన్నీరు చిందుతాయి. అమ్మ రెండు చేతులు ఎప్పుడూ కొడుకు విజయం కోసమే కదా ప్రార్థిస్తాయి. 41 సంవత్సరాల తర్వాత హాకీలో విజయం సాధించిన భారత జట్టు వెనుక ఉన్నది ఈ దేశమే కావచ్చు. కాని వారి తల్లులు కూడా. దేశం కోసం గెలిచిన కొడుకులను చూసి చూపుడు వేలికి కాటుక రాసుకుని దిష్టి చుక్క పెట్టడానికి ఎదురు చూస్తున్నారా తల్లులు. సంతోషంతో తబ్బిబ్బవుతున్నారని వేరే చెప్పాలా? పంజాబ్ క్రీడా శాఖామంత్రి గుర్మిత్ సింగ్ సోధి తమ రాష్ట్రం నుంచి హాకీ టీమ్‌లో ఉండి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ప్రతి ఒక్క సభ్యుడికి కోటి రూపాయలు అనౌన్స్ చేసి వారు రావడంతోటే చెక్ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.కాని ఆ కోటి రూపాయల సంగతి తర్వాత. జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ మాత్రం తన తల్లి మంజిత్ కౌర్ చేసే ఆలూ పరాఠాల కోసం కాచుకుని ఉన్నాడు. భారతదేశం చేరుకుని ఇంటికి వచ్చిన వెంటనే అతడు తినాలనుకుంటున్నది తల్లి చేతి ఆలూ పరాఠానే. ‘నా కొడుకు కోసం స్వహస్తాలతో ఆలూ పరాఠాలు చేస్తా. ఆలుగడ్డ కూర కూడా చేస్తా’ అని ఆమె అంది. మన్‌ప్రీత్ ఇంటి బయట కోలాహలం జలంధర్ జిల్లాలోని మిథాపూర్ అనే చిన్న ఊరు ఇప్పుడు సంతోషంతో కేరింతలు కొడుతోంది. మన్‌ప్రీత్ సింగ్‌ది ఆ ఊరే. అతనిదే కాదు... ప్రస్తుతం హాకీ టీమ్‌లో ఉన్న మరో ఇద్దరు కూడా ఆ ఊరివారే. అందుకే దానిని ‘ఒలింపిక్ గ్రామం’ అని అంటారు. కాంస్యం కోసం జర్మనీతో హోరాహోరి పోరు గురువారం జరుగుతున్నప్పుడు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తల్లి చేత హాకీ బ్యాట్ పట్టుకుని ఇరుగుపొరుగు వారితో కలిసి ఇంట్లో ఉత్కంఠగా మేచ్ చూసింది. కుటుంబసభ్యులతో కెప్టెన్ మన్‌ప్రీత్‌సింగ్, గ్రౌండ్లోమన్ప్రీత్సింగ్ ‘ఈ బ్యాటే నా కొడుకును అంత దూరం తీసుకెళ్లింది’ అందామె మేచ్ గెలిచాక ఉద్వేగపడుతూ. మేచ్ మొదలయ్యే ముందు మన్‌ప్రీత్ తల్లికి వీడియో కాల్ చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ‘బాగా ఆడు నాన్నా... కాని జర్మనీని తక్కువ తీస్కోవద్దు’ అని హెచ్చరించింది ఆమె. ‘వాహె గురు నా ప్రార్థనలు ఆలకించాడు. గురుద్వార్ వెళ్లి ఇవాళ ప్రత్యేక ప్రార్థనలు చేస్తాను’ అని చెప్పిందామె. 2016లో మన్‌ప్రీత్ తండ్రి మరణించాడు. అప్పటి నుంచి తల్లే మన్‌ప్రీత్ ఆటకు వెన్నుదన్నుగా ఉంది. అతణ్ణి ముందుకు తీసుకెళ్లింది. తన శ్రమ ఫలించిన సంతృప్తి ఆమె కళ్లల్లో కనిపించింది. ఉంగరం కానుక ఇక మరో ఆటగాడు హార్దిక్ సింగ్ తల్లి కన్వల్జిత్ కౌర్ కొడుకు కోసం ఒలింపిక్ రింగ్స్‌ను పోలిన బంగారు ఉంగరం చేయించి సిద్ధంగా ఉంది. ‘నా కొడుకు విజయానికి నేనిచ్చే కానుక ఇది’ అని ఆ తల్లి చెప్పింది. 22 ఏళ్ల మిడ్‌ఫీల్డ్ ఆటగాడు హార్దిక్ సింగ్ ఒలింపిక్స్ జట్టులో ఎంపికైయ్యాక అతని తమ్ముడు ‘అన్నయ్యా... మన కారు మీద ఒలింపిక్స్ లోగో వేయించేదా’ అని అడిగాడు. దానికి హార్దిక్ ‘ఇప్పుడే వద్దురా. టైమ్ వచ్చినప్పుడు చెప్తాను’ అని జవాబు ఇచ్చాడు. ‘ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. నా కొడుకు కారు మీద ఒలింపిక్స్ లోగో ఉంటుంది’ అని కన్వల్జిత్ కౌర్ తన చుట్టుపక్కల వారికి ఒకటి రెండు స్వీట్లు పంచుతోంది. తల్లి ఉషతో గోల్‌కీపర్ శ్రీజేష్, ఆనందంలో శ్రీజేష్ గోడ కట్టిన కొడుకు ఇక కొచ్చిలో హాకీ టీమ్ గోల్ కీపర్ శ్రీజేష్ ఇంటి దగ్గర హడావిడి అంతా ఇంతా లేదు. టపాకాయలు మోగిపోతున్నాయి. ‘కాంస్యమైతే ఏంటి... బంగారంతో సమానం’ అని శ్రీజేష్ తల్లి ఉషా అంది. వచ్చిపోయే వారిని, కొడుకు గొప్పతనం గురించి పొగుడుతున్నవాళ్లను ఎక్కడ దిష్టి తగులుతుందో అని కంగారుగానే వింటూ తబ్బిబ్బవుతోంది ఆమె. ‘నా కొడుకు శత్రువులకు అడ్డంగా గోడలా నిలబడ్డాడు’ అని ఆమె అంది. నిజంగానే జర్మనీతో సాగిన మేచ్‌లో గోల్ కీపర్‌గా శ్రీజేష్ ఎదుర్కొన్న వొత్తిడి తక్కువది కాదు. శ్రీజేష్ భార్య అనీషా ఆయుర్వేద డాక్టర్. ‘ఆయన రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను’ అంది సంబరంగా. ఒరిస్సా వీరుడు ఐదు మంది సంతానంలో చివరివాడుగా పుట్టిన ఒరిస్సా ఆటగాడు అమిత్ రోహిదాస్ ఇంటికే కాదు దేశానికి కూడా కీలకంగా మారడం అతడి తల్లిని గర్వపడేలా చేస్తోంది. ‘మేము పేదరైతులం. నా కొడుకే మా ఇంటిని నిలబెట్టాడు. నా కొడుకు చేతిలోని హాకీ స్టిక్ నిలబెట్టింది’ అని అతని తల్లి అంది. వాళ్ల గ్రామం సౌనామోరా (రూర్కెలా నుంచి 120 కి.మీ) ఇప్పుడు అమిత్ తల్లిని ప్రశంసలతో ముంచెత్తుతోంది. కేవలం ప్లాస్టిక్ కుర్చీలు ఉన్న ఇంటిలో ఊపిరి బిగపట్టి మేచ్ చూసిన అమిత్ తల్లి గెలిచాక మురిసిపోయింది. మరి కాసేపటికి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెతో మాట్లాడటం కూడా చిన్న అనుభవం కాదు. అన్నట్టు ఒరిస్సా ముఖ్యమంత్రి తమ రాష్ట్రం నుంచి కాంస్యం తెచ్చిన ప్రతి ఆటగాడికి రెండున్నర కోట్లు ప్రకటించారు. అమిత్‌కు కూడా ఆ నగదు కాచుకుని ఉంది. దానికంటే ముందు ఆ తల్లి ఆలింగనం కూడా. తల్లిదండ్రులు తమ సంతానం కోసం జీవితాలను త్యాగం చేస్తారు. వాటిలో చాలామటుకు పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పడతారు. పిల్లలు విజయం సాధించినప్పుడు ఆ త్యాగాలకు ఒక అర్థం దొరికి సంతృప్తిపడతారు. ఇవాళ భారత హాకీటీమ్లోని ప్రతి సభ్యుని తల్లిదండ్రులు ఈ అద్భుత సంతృప్తితో తల ఎత్తుకు తిరుగుతారు. -
పీవీ సింధుకు విజయవాడలో గ్రాండ్ వెల్ కమ్
సాక్షి, విజయవాడ: పీవీ సింధుకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ఏపీ మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, ఇతర అధికారులు, క్రీడాకారులు సింధుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్ వెళ్లేముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు సపోర్ట్ చేశారని, అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపింది. ఒలింపిక్స్‌లో పతకం తేవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సింధు నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. చిన్న వయసులోనే రెండు మెడల్స్ తీసుకురావటం దేశానికి గర్వకారణమని కొనియాడారు. యువతకి సింధు రోల్ మెడల్‌గా నిలుస్తుందన్నారు. సింధును ఆదర్శంగా తీసుకొని యువత భవిష్యత్తులో రాణించాలని సూచించారు. ఇక విశాఖలో అకాడమీ కోసం సింధుకి సీఎం జగన్ రెండు ఎకరాలు భూమి ఇచ్చారని గుర్తుచేశారు. -
PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత విజయంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పాత్ర మరువలేనిది. జర్మనీకి 13 పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ, అడ్డుగోడగా నిలబడి, అద్భతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి గోల్స్‌ను అడ్డుకొని విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం శ్రీజేష్ పేరు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్. తాజాగా శ్రీజేష్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. 1998లో తన 12 ఏళ్ల వయసులో హాకీలో ఓనమాలు నేర్చుకునేందుకు తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్ స్కూల్లో చేరాడు. అయితే ఆ స్కూల్ హాకీ కోచ్ శ్రీజేష్ను గోల్ కీపింగ్ చేయమని సలహా ఇచ్చాడు. కోచ్ చెప్పిన విషయాన్ని శ్రీజేష్ తన తండ్రికి వివరించాడు. కొడుకు కలను సాకారం చేసేందుకు తండ్రి పీవీ రవీంద్రన్ తన ఇంటి దైవంగా భావించిన ఆవును అమ్మేసి శ్రీజేష్‌కు గోల్ కీపింగ్ కిట్‌ను కొనిచ్చాడు. అయితే ఆ సమయంలో రవీంద్రన్ శ్రీజేష్‌కు ఒక మాట చెప్పాడు. '' ఈరోజు నీ భవిష్యత్తు కోసం నా ఇంటి దైవాన్ని తాకట్టు పెడుతున్నా. నువ్వు అనుకున్న కలను సాధించాలి.. హాకీలో గోల్ కీపర్‌గా మెరవాలి.. దేశానికి పతకం తేవాలి.'' అని చెప్పుకొచ్చాడు. తండ్రి మాటలను శ్రీజేష్ ఈరోజుతో నెరవేర్చాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో తన గోల్ కీపింగ్‌తో మెప్పించి దేశానికి కాంస్యం అందించాడు. ఇటు తండ్రి కోరికను నెరవేర్చడంతో పాటు ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల పతక నిరీక్షణకు తన జట్టుతో కలిసి తెరదించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే .. హోరా హోరీ పోరులో చివరికి జర్మనీపై మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో టీమిండియా హాకీ జట్టు ఆధిపత్యాన్ని చాటుకుంది. 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగ రాసింది. ముఖ్యంగా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టఫ్ ఫైట్ లో భారత్ 5-4 తేడాతో జయకేతనం ఎగురవేసి కాంస్యం దక్కించుకుంది. -
రవి దహియా గ్రామంలో సంబరాలు.. ఆనంద్ మహీంద్ర స్పందన ఇలా
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా రజతం గెలుచుకున్నాడు. 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ విభాగంలో రష్యాకు చెందిన రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్ 7-4 తేడాతో ఓడి రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారావేత్త ఆనంద్ మహీంద్ర రవి దహియా గ్రామ ప్రజలపై ప్రశంసలు కురిపించారు. మిమ్మల్ని చూసి నేను ఎంతో గర్విస్తున్నాను అన్నారు. ఇందుకు గల కారణాన్ని కూడా తెలిపారు ఆనంద్ మహీంద్ర. ఈ క్రమంలో ఆనంద్ మహీంద్ర తన ట్విటర్లో రవి దహియా పతకం సాధించడంతో అతడి గ్రామస్తులు ఎంత సంబరపడుతున్నారో వివరించారు. తమ ఊరి వ్యక్తి ఒలిపింక్స్‌లో పతకం సాధించడంతో వారు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు తప్ప.. స్వర్ణం సాధించలేదని బాధపడటం లేదన్నారు. ఇక తమ గ్రామస్తుడికి ఘన స్వాగతం తెలిపేందుకు వారు ఉవ్విళ్లురుతున్నారని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ క్రమంలో రవి దహియా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడిన వీడియోని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. దీనిలో సదరు వ్యక్తి ‘‘మేం మ్యాచ్‌ని చాలా ఎంజాయ్ చేశాం. రవి దహియా స్వర్ణం సాధించలేకపోయాడు..పర్లేదు. అతను సాధించిన రజతమే మాకు బంగారం కన్నా ఎక్కువ. ఎందుకుంటే ఎలాంటి సౌకర్యాలు లేకుండానే అతడు రజతం గెలిచాడు. అందుకు మేం చాలా గర్వపడుతున్నాం. తనకి ఘన స్వాగతం పలికేందుకు మేం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం’’ అన్నాడు. Chinese athletes securing ‘only’ silver/bronze are being trolled by their fellow citizens. We may be lightweights in terms of medal performance but I’m so proud we’re true to the real Olympic spirit where ‘taking part’ is more important. I applaud the residents of Ravi’s village https://t.co/lXyFHQBS9l — anand mahindra (@anandmahindra) August 5, 2021 ఈ వీడియోని ఆనంద మహీంద్ర తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘‘రజతం, కాంస్యం మాత్రమే గెలుస్తున్నందుకు చైనీస్ అథ్లెట్స్‌ని ఆ దేశస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయంలో నా దేశ వాసుల పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. పతక ప్రదర్శనలో మనం అంత బలంగా లేము. ఒప్పుకుంటాను. కానీ ఒలింపిక్స్ లాంటి వేదికలో భాగం కావడమే మనం ఎంతో గొప్పగా భావిస్తున్నాం. నా దేశ ప్రజల్లోని ఈ నిజమైన ఒలింపిక్ స్ఫూర్తికి నేను ఎంతో గర్వపడుతున్నాను. రవి దహియా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.. వారిని అభినందిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. -
రెజ్లర్ రవి దహియాకు భారీ నజరానా.. క్లాస్ 1 కేటగిరీ ఉద్యోగం..!
చండిగఢ్: టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్ పోరులో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఒలింసిక్స్‌లో రజతం సాధించిన రెజ్లర్ రవి కుమార్ దహియాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. దేశానికి పతకం సాధించి పెట్టిన రవి దహియాకు రూ.4 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే క్లాస్-1 కేటగిరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. రవి దహియా అడిగిన చోట 50శాతం రాయితీతో ఓ ఫ్లాట్ స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. దహియా పుట్టి పెరిగిన తన స్వగ్రామం నహ్రిలో.. రెజ్లింగ్ కోసం ప్రత్యేకంగా ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు వెల్లడించింది. కాగా ఫైనల్లో రష్యా రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన దహియా 7-4 తేడాతో ఓడి రజతం గెలిచాడు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో సుశీల్ కుమార్ తర్వాత రజతం సాధించిన రెండో రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన రవి దహియాపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు ట్విటర్ వేదికగా రవి దహియాకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక దహియా పతకంతో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ రెండు రజతాలు, మూడు కాంస్యాలు సాధించింది. ఇక సుశీల్ కుమార్ 2012 లండన్ గేమ్స్‌లో రజతం గెలుచుకోగా.. అక్కడ యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. ఇక 2008 బీజింగ్ గేమ్స్‌లో సుశీల్ కాంస్యం గెలుచుకున్నారు. అంతేకాకుండా జాదవ్ 1952 హెల్సింకి గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. 2016 రియో ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్‌గా సాక్షి మాలిక్ నిలిచిన సంగతి తెలిసిందే. -
అరంగేట్రంలోనే అదరగొట్టావ్ రవి దహియా: సీఎం జగన్
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్ పోరులో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. రష్యా రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్ 7-4 తేడాతో ఓడి రజతం గెలిచాడు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో సుశీల్ కుమార్ తర్వాత రజతం సాధించిన రెండో రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన రవి దహియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు ట్విటర్ వేదికగా రవి దహియాకు శుభాకాంక్షలు చెప్పారు. కంగ్రాట్స్ రవి దహియా: సీఎం జగన్ టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో రజతం సాధించిన రవి దహియాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి రెండో రజతం అందించిన నీకు శుభాకాంక్షలు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే అదరగొట్టే ప్రదర్శన చేశావు. '' అంటూ ట్వీట్ చేశారు. Congratulations to wrestler #RaviDahiya, for adding second Silver medal to India's tally at #Tokyo2020. India is proud of this young champ who made his mark in his debut #Olympics . Ravi has been brilliant throughout his Olympic journey for #TeamIndia . — YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2021 ఓడిపోయినా మనసులు గెలుచుకున్నావు: మోదీ '' రవి కుమార్ దహియా ఒక గొప్ప రెజ్లర్.. ఫైనల్లో అతని పోరాట పటిమ నన్ను ఆకట్టుకుంది. అతని పోరాట స్పూర్తి.. మ్యాచ్ గెలవాలనే దృడత్వం అమోఘం. కానీ మ్యాచ్‌లో విజేత ఒకరే అవుతారు. దహియా.. నువ్వు ఈరోజు మ్యాచ్ ఓడిపోయుండొచ్చు.. కానీ మా మనసులు గెలుచుకున్నావ్.. రజతం సాధించిన నీకు శుభాకాంక్షలు.. నీ ప్రదర్శనతో దేశ గౌరవాన్ని మరింత పెంచావు'' అంటూ ట్వీట్ చేశారు. Ravi Kumar Dahiya is a remarkable wrestler! His fighting spirit and tenacity are outstanding. Congratulations to him for winning the Silver Medal at #Tokyo2020. India takes great pride in his accomplishments. — Narendra Modi (@narendramodi) August 5, 2021 ''టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించావు.. మీ ప్రదర్శనను చూసి దేశం గర్విస్తుంది'' - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ India is proud of Ravi Dahiya for winning the wrestling Silver at #Tokyo2020. You came back into bouts from very difficult situations and won them. Like a true champion, you demonstrated your inner strength too. Congratulations for the exemplary wins & bringing glory to India. — President of India (@rashtrapatibhvn) August 5, 2021 ''గ్రేట్ గోయింగ్.. రవి కుమార్ దహియా.. రజతం సాధించిన నీకు ఇవే నా శుభాకాంక్షలు.. మున్ముందు దేశానికి మరిన్ని పతకాలు తేవాలని కోరుకుంటున్నా''- రాహుల్ గాంధీ -
ఫైనల్లో ఓడినా.. చరిత్ర లిఖించాడు
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు. 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ విభాగంలో రష్యాకు చెందిన రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్ 7-4 తేడాతో ఓడి రజతం గెలుచుకున్నాడు. తద్వారా సుశీల్ కుమార్ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒలింపిక్స్‌లో పతకం తెచ్చిన ఐదో రెజ్లర్‌గా రవి కుమార్ నిలిచాడు. కేడీ జాదవ్(కాంస్యం), సుశీల్ కుమార్(కాంస్యం, రజతం), సాక్షి మాలిక్( కాంస్యం), యేగేశ్వర్ దత్( కాంస్యం) తర్వాత రవి దహియా టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. గతంలో 2012 ఒలింపిక్స్‌లో సుశీల్‌కుమార్ రెజ్లింగ్‌లో సిల్వర్ సాధించిన విషయం తెలిసిందే. టక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు రవికుమార్ దహియాపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ రవికుమార్ బుధవారం జరిగిన అర్హత, క్వార్టర్స్, సెమీస్ బౌట్లలో దుమ్మురేపాడు. దాదాపు అన్ని ఏకపక్ష విజయాలు సాధించిన రవికుమార్ సెమీస్‌లో కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ సనయేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందు వెనుకబడినా చివరి నిమిషంలో అద్బుతంగా నిలదొక్కుకొని విక్టరీ బై ఫాల్ కింద గెలపొంది ఫైనల్‌కు ప్రవేశించాడు. -
ఓడిపోతున్నానని రవి దహియా చేయి కొరికేసిన కజకిస్తాన్ రెజ్లర్
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో రవికుమార్ దహియా ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వర్ణం సాధించేందుకు రవికుమార్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. గురువారం సాయంత్రం రష్యా రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో రవికుమార్ తలపడనున్నాడు. ఈ విషయం పక్కనపెడితే.. బుధవారం కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి దశలో సనయేవ్ ఓడిపోతున్నా అనే బాధలో రవికుమార్ చేతిని కొరకడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే విషయంపై టీమిండియా మాజీ డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. '' ఇదేం పద్దతి.. ఎంత ఓడిపోతున్నాననే బాధలో ఉంటే ప్రత్యర్థి చేయి కొరకడం సమంజసం కాదు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్ధం. ఒక ఆటగాడిని గౌరవించే పద్దతి ఇదేనా అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి భాగం ముగిశాక రవికుమార్ 2–1తో ముందంలో ఉన్నాడు. అయితే రెండో భాగం ఆరంభంలో సనయేవ్ ఒక్కసారిగా 9–2తో ఏడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. అప్పటికి బౌట్ ముగిసేందుకు 90 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారీ తేడాతో వెనుకబడినా రవి ఒత్తిడికి లోనుకాలేదు. తన బలాన్నంతా కూడదీసుకొని ‘డబుల్ లెగ్ అటాక్’తో రెండు పాయింట్లు సంపాదించాడు. సనయేవ్‌ను మ్యాట్‌పైకి రవి ఎత్తి పడేయంతో కజకిస్తాన్ రెజ్లర్ మోకాలికి దెబ్బ తగిలింది. మోకాలికి పట్టీ కట్టుకొని సనయేవ్ బౌట్‌ను కొనసాగించగా... వెంటనే రవి మరోసారి అతని రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని మళ్లీ ఎత్తి పడేశాడు. ఈసారి రవి తన ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని సెకన్లపాటు అలాగే పెట్టి ఉంచాడు. దాంతో నిబంధనల ప్రకారం రవిని ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిలో రిఫరీ విజేతగా ప్రకటించారు. అప్పటికి బౌట్ ముగియడానికి మరో 39 సెకన్లు మిగిలి ఉన్నాయి. ఒకదశలో 2–9తో వెనుకబడిన రవి చివరకు పాయింట్లతో సంబంధం లేకుండా విజయాన్ని అందుకోవడం విశేషం. How unfair is this , couldn’t hit our #RaviDahiya ‘s spirit, so bit his hand. Disgraceful Kazakh looser Nurislam Sanayev. Ghazab Ravi , bahut seena chaunda kiya aapne #Wrestling pic.twitter.com/KAVn1Akj7F — Virender Sehwag (@virendersehwag) August 4, 2021 -
వైరల్ వీడియో: టోక్యో ఒలింపిక్స్‌లో మాధురి దీక్షిత్ సాంగ్
-
టోక్యో ఒలింపిక్స్‌లో మాధురి దీక్షిత్ సాంగ్ వైరల్
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఇదివరకు లేని రికార్డులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసిన ఈ అంతర్జాతీయ ఆటలకు చెందిన విషయాలే హల్చల్ చేస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన బోలేడు వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో బాలీవుడ్‌కు చెందిన ఓ పాట ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్ జట్టు స్మిమర్స్ ఈడెన్ బ్లెచర్, షెల్లీ బోబ్రిట్క్సీ.. ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ డ్యూయెట్ ఫ్రీ రొటీన్ ప్రిలిమినరీలో మంగళవారం పోటీ పడ్డారు. ఆ సమయంలో బీటౌన్ బ్యూటీ మాధురి దీక్షిత్ నటించిన పాపులర్ సాంగ్ ‘ఆజా నాచ్లే’ పాటకు డ్యాన్స్ చేస్తూ స్వీమ్ చేశారు. అన్నే దానం అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘చాలా ధన్యవాదాలు ఇజ్రాయెల్ టీమ్. ఆజా నాచ్లే పాటను వినడానికి, చూడటానికి ఎంత ఉత్సాహంగా ఉందో మీకు తెలియదు’. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఇజ్రాయెల్ స్విమర్స్ బాలీవుడ్ పాటను ఎంచుకున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్విమ్మింగ్‌లో వారి స్టైల్‌కు ఫిదా అయిపోతున్నారు. ఒలింపిక్స్‌లో బాలీవుడ్ సాంగ్ వినిపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మాధురి దీక్షిత్, కొంకణ సేన్, కునాల్ కపూర్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆజా నాచ్లే . 2007లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ మెహతా దర్శకత్వం వహించారు. -
జర్మనీకి చుక్కలు చూపించిన స్టార్ ఆటగాడెవరో తెలుసా?
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత విజయంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన హోరా హోరీ పోరులో చివరికి జర్మనీపై మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో టీమిండియా హాకీ జట్టు ఆధిపత్యాన్ని చాటుకుంది. 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగ రాసింది. ముఖ్యంగా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టఫ్ ఫైట్ లో అనుభవజ్ఞుడైన భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ జర్మనీ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. జర్మనీకి 13 పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ, అడ్డుగోడగా నిలబడి, అద్భతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి గోల్స్‌ను అడ్డుకొని 5-4 తో విజయాన్ని భారత్‌కు అందించారు. మరోవైపు ఈ విజయంపై టీమిండియా కోచ్ , ఆస్ట్రేలియన్, గ్రాహం రీడ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందన్నారు. అలాగే మ్యాచ్ మొత్తానికి హీరోగా నిలిచిన స్టార్ గోల్ కీపర్ శ్రీజేష్ విజయానందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. దీనిపై తన కుటుంబం గర్వంగా ఫీలవుతోందన్నారు. ఈ ఆనందంలో అమ్మ కన్నీరు పెట్టుకుందని తనతో సరిగ్గా మాట్లాడలేకపోయిందని పేర్కొన్నాడు. తనకు ఇది పునర్జన్మ అని ఈ ఘనత కొత్త తరం ఆటగాళ్లను తయారు చేయడంలో సహాయపడుతుందనే విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే.. అపూర్వ విజయం విజిల్ వినిపించగానే నార్త్ పిచ్‌లో శ్రీజేష్ గోల్‌పోస్ట్ పైకి ఎక్కిన ఫోటో వైరల్‌గా మారింది. ‘జీవితమంతా పోస్ట్‌తోనే గడిపాను. అది నా ప్లేస్. నా కష్టం, నష్టం...సంతోషం...దుఃఖం అన్నీ పోస్ట్‌తోనే.. అందుకే అలా ఎక్కి వేడుక చేసుకున్నా’ అని శ్రీజేష్ భావోద్వేగంతో వెల్లడించాడు. మరోవైపు లాంగ్ హాలిడే ప్లాన్ చేస్తున్నామని శ్రీజేష్ భార్య అనీషా మీడియాతో పేర్కొనడం విశేషం. కాగా భారత జట్టులోని సిమ్రంజీత్ సింగ్ (17, 34 వ నిమిషాలు) తొలి బ్రేస్ సాధించగా, హార్దిక్ సింగ్ (27 వ), హర్మన్‌ప్రీత్ సింగ్ (29 వ) రూపిందర్ పాల్ సింగ్ (31 వ) గోల్ సాధించారు. జర్మనీ తరఫున తైమూర్ ఒరుజ్ (2 వ), నిక్లాస్ వెల్లెన్ (24 వ), బెనెడిక్ట్ ఫుర్క్ (25 వ) లుకాస్ విండ్‌ఫెడర్ (48 వ) గోల్స్ సాధించిన సంగతి తెలిసిందే. -
భారత హాకీ జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు
-
పంజాబ్ ఆటగాళ్లకు భారీ నజరానా
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో విజయ దుందుభి మోగించిన టీమిండియా హాకీ జట్టులో తమ ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జర్మనీతో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్‌లో విజయంతో కాంస్య పతకం సాధించిన జట్టులో రాష్ట్రానికి చెందిన హాకీ జట్టు ఆటగాళ్లకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు సర్కార్ వెల్లడించింది. పంజాబ్ క్రీడా మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధి ఈ ప్రకటన చేశారు. ఇండియన్ హాకికి ఇదొక చారిత్రాత్మక రోజని ఆయన ట్వీట్ చేశారు. మరింత ఉన్నతమైన గోల్డ్ మెడల్‌తో తిరిగి రావాలని ఎదురుచూస్తున్నామన్నారు. మరోవైపు భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, కోచ్ గ్రాహం రీడ్, సహాయక కోచ్ పియూష్ దుబేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్బంగా జట్టులోని సభ్యులందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు మోదీ. కాగా టోక్యో ఒలింపక్స్ జర్మనీతో గురువారం జరిగిన మ్యాచ్ భారత్ టీం 5-4 తేడాతో విజయం సాదించింది. తద్వారా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు, 41 ఏళ్ల తరువాత తొలిసారి ఒలింపిక్ పతకాన్ని సాధించిన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. On this historic day for #IndianHockey I am delighted to announce a cash award of Rs 1crore each to players 4m #Punjab We await ur return to celebrate the much deserving medal in #Olympics #Cheer4India #Tokyo2020 #IndvsGer #Hockey #IndianHockeyTeam@capt_amarinder @Media_SAI https://t.co/VJ8eiMu1up — Rana Gurmit S Sodhi (@iranasodhi) August 5, 2021 #WATCH | PM Narendra Modi speaks to the India Hockey team Captain Manpreet Singh, coach Graham Reid and assistant coach Piyush Dubey after the team won #Bronze medal in men's hockey match against Germany#TokyoOlympics pic.twitter.com/NguuwSISsV — ANI (@ANI) August 5, 2021 -
మాటలు రావడం లేదు.. చివరి 6 సెకన్లలో..
టోక్యో: ‘‘అసలేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఈ భావన ఎంతో అద్భుతంగా ఉంది. తొలుత మేం 3-1 తేడాతో వెనుకంజలో ఉన్నాం. కానీ, మేం పతకానికి అర్హులమని గాఢంగా విశ్వసించాం. గత 15 నెలలుగా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. బెంగళూరులో ఉన్న సమయంలో మాలో కొంత మందికి కరోనా కూడా సోకింది. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేశాం. చివరి ఆరు సెకన్లలో వాళ్లకు పెనాల్టీ కార్నర్ లభించింది. ప్రాణాలకు తెగించైనా సరే దానిని అడ్డుకోవాలని భావించాం. అది నిజంగా ఎంతో కష్టతరమైనది. సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్ పతకం లభించింది. అవును.. మనం సాధించగలమనే విశ్వాసం పెరిగింది. ఒలింపిక్స్‌లో గెలిస్తే ఎక్కడైనా గెలవగలమనే నమ్మకం పెరుగుతుంది. పడి లేచాం. తిరిగి పోరాడాం. ఇప్పుడు మెడల్. ఇది నిజంగా ఎంతో అద్భుతమైన భావన ’’ అని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. కాంస్య పతక పోరులో జర్మనీపై విజయం సాధించిన అనంతరం అతడు స్పందిస్తూ.. ‘‘స్వర్ణ పతకం కోసం ఇక్కడికి వచ్చాం. కాంస్యం గెలిచాం. అయినా పర్లేదు. హాకీ అభిమానులకు ఇదొక గొప్ప జ్ఞాపకంగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నాడు. ఈ విజయాన్ని కోవిడ్ వారియర్స్‌కు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ఇక మ్యాచ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ప్రీత్, కోచ్‌తో ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలిపారు. గొప్ప టోర్నమెంట్లో పతకం గురువారం నాటి మ్యాచ్‌లో గోల్‌తో రాణించిన రూపీందర్ పాల్ సింగ్.. ‘‘ఎప్పుడూ ఇంత గొప్ప ఫీలింగ్ కలగలేదు. గోల్డ్ కోసం వచ్చాం. కాంస్య పతకం గెలిచాం. అది కూడా గొప్ప టోర్నమెంట్లో’’ అని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు జర్మనీని 5-4 తేడాతో ఓడించి కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ తరఫున సిమ్రన్‌జీత్ రెండు, హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్, రూపీందర్ పాల్ సింగ్ ఒక్కో గోల్ చేసి ఆకట్టుకున్నారు. అదే విధంగా గోల్ కీపర్ శ్రీజేష్ అడ్డుగోడలా నిలబడి జర్మనీని గోల్స్ చేయకుండా కట్టడి చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా ఈ విజయంతో తాజా ఒలింపిక్స్‌లో భారత్ గెలిచిన పతకాల సంఖ్య ఐదుకు చేరుకుంది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం, షట్లర్ పీవీ సింధు కాంస్యం, బాక్సర్ లవ్లీనా కాంస్యం, పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించగా.. రెజ్లర్ రవికుమార్ దహియాకు ఇప్పటికే పతకం ఖాయమైంది. గురువారం అతడు ఫైనల్లో తలపడనున్నాడు. మీ అభిప్రాయం చెప్పండి: Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు? -
41ఏళ్ల కలను నిజం చేశారు: స్పీకర్ ఓంబిర్లా
-
గత మూడేళ్ళుగా మన ఆటతీరు మెరుగైంది: ముకేశ్ కుమార్
-
తన రికార్డును తానే బద్దలుకొట్టి; స్వర్ణం, రజతం వారికే
టోక్యో: పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో నార్వే అథ్లెట్ కర్స్టెన్ వార్హోమ్ ప్రపంచ రికార్డును మరిచిపోకముందే... మహిళల విభాగంలోనూ అటువంటి ప్రదర్శనే పునరావృతమైంది. బుధవారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో అమెరికా అథ్లెట్ సిడ్నీ మెక్లాఫ్లిన్ అందరికంటే ముందుగా 51.46 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆమె... ఈ ఏడాది జూన్‌లో జరిగిన యూఎస్ ఒలింపిక్స్ ట్రయిల్స్‌లో 51.90 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. అంతేకాకుండా జమైకన్ అథ్లెట్ మెలైనె వాకర్ పేరిట ఉన్న ఒలింపిక్ రికార్డును (52.64 సెకన్లు; 2008 బీజింగ్ ఒలింపిక్స్) 21 ఏళ్ల మెక్లాఫ్లిన్ తన పేరిట బదిలీ చేసుకుంది. దాలియా మొహమ్మద్ (అమెరికా; 51.58 సెకన్లు) రజతం... ఫెమ్కే బోల్ (నెదర్లాండ్స్; 52.03 సెకన్లు) కాంస్యం గెలిచారు. -
13 ఏళ్ల అనంతరం కొత్త చాంపియన్.. ఉసేన్ బోల్ట్ తర్వాత అతడే
గత మూడు ఒలింపిక్స్ (2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో) క్రీడల్లో పురుషుల 200 మీటర్ల విభాగంలో ఉసేన్ బోల్ట్ రూపంలో ఒక్కడే చాంపియన్‌గా నిలిచాడు. ఇతర ప్రత్యర్థులు అతనికి సమీపంలోకి రాలేకపోయారు. అయితే ఇప్పుడు బోల్ట్ లేడు. దాంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కెనడా అథ్లెట్ ఆండ్రీ డి గ్రాసీ 200 మీటర్ల పరుగులో మెరిశాడు. ‘రియో’లో రెండో స్థానంలో నిలిచి స్వర్ణాన్ని చేజార్చుకున్న గ్రాసీ... ఈసారి మాత్రం ఎటువంటి పొరపాటు చేయకుండా విజేతగా నిలిచి ఒలింపిక్ స్వర్ణ స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. టోక్యో: నాలుగు రోజుల క్రితం జరిగిన పురుషుల 100 మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకున్న కెనడా స్ప్రింటర్ ఆండ్రీ డి గ్రాసీ అద్భుతం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగులో 19.62 సెకన్లలో గమ్యానికి చేరి బంగారు పతకంతో మెరిశాడు. దాంతో 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ 200 మీటర్ల పరుగులో కొత్త విజేత అవతరించాడు. అంతేకాకుండా డొనోవాన్ బెయిలీ (1996 అట్లాంటా) తర్వాత స్ప్రింట్ రేసులో మళ్లీ పసిడి పతకాన్ని సాధించిన తొలి కెనడా అథ్లెట్‌గా గ్రాసీ నిలిచాడు. ఒలింపిక్స్ల్లో గ్రాసీకిది ఐదో పతకం. 2016 ‘రియో’లో 100 మీటర్లు, 4్ఠ100 మీటర్ల టీమ్ రిలేలో కాంస్యా లను... 200 మీటర్ల పరుగులో రజతాన్ని దక్కించుకున్నాడు. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటికే 100 మీటర్ల పరుగులో కాంస్యాన్ని నెగ్గాడు. గ్రాసీ తర్వాత 19.68 సెకన్లలో గమ్యాన్ని చేరిన కెనెత్ బెడ్నారెక్ (అమెరికా–19.68 సెకన్లు) రజతం... నోవా లైలెస్ (అమెరికా–19.74 సెకన్లు) కాంస్యం సాధించారు. అప్పుడు చేజారింది... ఇప్పుడు దక్కింది అది రియో ఒలింపిక్స్... 200 మీటర్ల సెమీఫైనల్–2 హీట్... గన్ ఫైరింగ్ శబ్దం వినగానే బోల్ట్ తన పరుగును ఆరంభించాడు. కొద్ది సేపటి తర్వాత తన ప్రత్యర్థులు ఎంత వెనుకగా వస్తున్నారో చూద్దాం అన్నట్లు బోల్ట్ వెనక్కి ఒక లుక్కేశాడు. ఒక్కరు మినహా మిగిలిన రన్నర్లందరూ చాలా దూరంలో ఉన్నారు. అయితే బోల్ట్ వారిని పట్టించుకోలేదు. తన వెంటే వస్తోన్న గ్రాసీపైనే దృష్టి సారించాడు. వెంటనే పరుగు వేగం పెంచాడు. అలా 19.80 సెకన్లలో రేసును ముగించి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. అయితే గ్రాసీ కేవలం 0.2 సెకన్లు వెనుకగా రెండో స్థానంలో నిలిచి అతడు కూడా పసిడి పోరుకు క్వాలిఫై అయ్యాడు. రేసు పూర్తయ్యాక బోల్ట్... ‘నువ్వు నన్ను చాలా కష్టపెట్టావ్’ అన్నట్లు వేలితో చూపించాడు. ఫైనల్లో మాత్రం బోల్ట్ గ్రాసీకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. రేసును వేగంగా ముగించి స్వర్ణంతో మెరవగా... రెండో స్థానంలో నిలిచిన గ్రాసీ రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే సరిగ్గా ఐదేళ్ల తర్వాత బోల్ట్ లేని పరుగులో గ్రాసీ పసిడిని చేజిక్కించుకోవడం విశేషం. -
పాయింట్ల పట్టికలో అట్టడుగున.. పడి పడి పైకి ఎగసి
ఒలింపిక్స్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత దక్కిన పతకం.. చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ టీం. మ్యాచ్ ఆరు సెకండ్ల వ్యవధిలో ముగుస్తుందనగా.. ప్రత్యర్థికి దక్కిన పెనాల్టీ కార్నర్. మ్యాచ్ ఫలితాన్నే మార్చేసే ఆ గోల్‌ను తీవ్ర ఒత్తిడిలోనూ చాకచక్యంగా అడ్డుకుని హీరో అయ్యాడు భారత పురుషుల హాకీ టీం గోల్ కీపర్ శ్రీజేష్. ‘అయినా గెలిచింది కాంస్యమే కదా.. ఆ మాత్రానికేనా ఇంతా?’ అని అనుకునేవాళ్లు బోలెడు మంది ఉండొచ్చు. కానీ, ఇవాళ్టి విజయం నిజంగానే సంబురాలకు అర్హమైందని భారత హాకీ చరిత్ర చెప్పకనే చెబుతోంది. హాకీ.. మన జాతీయ క్రీడ. ఈ పేరు వినగానే జైపాల్ సింగ్ ముండా, లాల్ షా బోఖారి, ధ్యాన్ చంద్, కిషన్‌లాల్, కేడీ సింగ్ లాంటి హాకీ దిగ్గజాల పేరు గుర్తుకు వచ్చేది ఒకప్పుడు. వీళ్ల సారథ్యంలో వరుస ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు సాధించింది భారత హాకీ పురుషుల జట్టు. ఒక రజతం, మళ్లీ స్వర్ణం, ఆపై రెండు వరుస కాంస్యాలు.. ఒక ఒలింపిక్ గ్యాప్(కెనడా ఒలింపిక్స్‌లో 7 స్థానం) తర్వాత మరో స్వర్ణం.. ఇదీ వరుస ఒలింపిక్స్‌లో భారత హాకీ టీం సాధించిన ట్రాక్ రికార్డు. అలాంటిది ఆ తర్వాతి నుంచి ఒలింపిక్ పతాకం కాదు కదా.. పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఎక్కడో అట్టడుగునకు చేరుతూ వచ్చింది భారత పురుషుల హాకీ టీం. ఇక మహిళల జట్టు సంగతి సరేసరి. అయితేనేం కిందపడ్డా.. పోరాట పటిమను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇన్నేళ్లలో మెరుగైన స్థితిని అందుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత జాతీయ క్రీడలో భారత్‌కు దక్కిన ఒలింపిక్ పతక విజయం అద్భుతమనే చెప్పాలి. క్లిక్ చేయండి:1980 తర్వాత తొలిసారి.. ఫొటో హైలెట్స్ కారణాలు.. క్రీడలకు కమర్షియల్ రంగులు అద్దుకుంటున్న టైం అది. ఆ టైంలో ఆటల్లో ‘రాజకీయాలు’ ఎక్కువయ్యాయి. హాకీలో టాలెంట్‌కు సరైన అందలం దక్కకపోగా.. రిఫరెన్స్‌లు, రికమండేషన్లతో సత్తువలేని ఆటగాళ్ల ఎంట్రీ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య గొడవలు ఒక సమస్యగా మారితే.. ‘కోచ్’ ఓ ప్రధాన సమస్యగా మారింది. తరచూ కోచ్‌లు మారుతుండడం, భారత హాకీ ఫెడరేషన్లో నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం, స్పానర్షిప్-ఎండోర్స్మెంట్ వివాదాలు వెంటాడాయి. వెరసి.. ఈ ప్రతికూల ప్రభావాలన్నీ ఆటగాళ్లపై, ఆటపై పడ్డాయి. తెరపైకి అప్పుడప్పుడు కొందరు హాకీ ప్లేయర్ల పేర్లు వచ్చినా, విజయాలు పలకరించినా.. అవి కేవలం వార్తల్లో మాత్రమే వినిపిస్తుండేవి. వీటికితోడు క్రికెట్‌కు పెరిగిన ఆదరణతో హాకీ ఉత్త జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రోత్సాహకాల్లో మిగిలిన ఆటలకు తగ్గిన ప్రాధాన్యం(హాకీ అందులో ఒకటి)తో ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ఇదే ధోరణిని జనాల్లోనూ పెరిగిపోయేలా చేశాయి. గత నలభై ఏళ్లలో లీగ్ టోర్నీలు, ఆసియన్ టోర్నీల్లో తప్పా.. ప్రపంచ కప్‌ల్లో(తొలి రెండింటిల్లో కాంస్యం, ఆపై 1975లో స్వర్ణం), మిగతా టోర్నమెంట్లలో ఎక్కడా భారత హాకీ టీం హవా నడవలేదు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం గ్రాహం రెయిడ్ కోచింగ్‌లో రాటుదేలిన భారత హాకీ టీం.. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగి టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌లో బ్రిటన్ను ఓడించడం సంచలన విజయమనే చెప్పాలి. అటుపై సెమీస్‌లో ఛాంపియన్ బెల్జియం చేతిలో ఓటమి, ఆపై కాంస్యపు పోరులో జర్మనీపై విజయాన్ని.. అద్భుతంగానే వర్ణించాలి. ఒకవేళ ఓడిపోయి ఉన్నా.. ఈ ఒలింపిక్స్‌లో మనవాళ్లు సత్తా చూపారనే భావించాల్సి వచ్చేది. మొత్తం 12.. 1980 మాస్క్ ఒలింపిక్స్‌లో గోల్డ్ తర్వాత(అప్పుడు నేరుగా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది భారత్)..ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల టీం కనబరిచిన ప్రదర్శన కచ్చితంగా మెరుగైందనే చెప్పొచ్చు. 1984 నుంచి వరుస ఒలింపిక్స్‌లో ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, పన్నెండు స్థానాల్లో కొనసాగుతున్న వచ్చిన భారత పురుషుల హాకీ టీం .. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కాకపోవడంతో తీవ్ర విమర్శలపాలైంది. ఈ తరుణంలో హాకీలో తిరిగి జవసత్వాలు నింపుతూ వస్తున్న యువ టీం.. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ దాకా చేరుకోవడం, అటుపై కాంస్యం పోరులో నెగ్గడం విశేషం. ఇప్పటిదాకా జరిగిన ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు.. ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో(టోక్యో కాంస్యంతో కలిపి) పతకాలు సాధించించింది. ఈ మెరుగైన ప్రదర్శనను జట్టు మునుముందు ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం. -సాక్షి, వెబ్ డెస్క్ -
క్రమశిక్షణ ఉల్లంఘన చర్య; భారత ప్లేయర్‌కు షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ సలహాలు తీసుకునేందుకు నిరాకరించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రాకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) సిద్ధమైంది. మనిక వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేకు ఒలింపిక్స్‌లో పోటీలు జరిగే ప్రదేశంలో ప్రవేశించడానికి అవసరమైన అక్రిడేషన్ కార్డు లేకపోవడంతో మనిక ఆడే మ్యాచ్‌లకు అతడు దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో సౌమ్యదీప్ సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించినా... మనిక పట్టించుకోలేదు. ఈ విషయం గురించి టీటీఎఫ్ఐ కార్యదర్శి అరుణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘టోక్యోలో జరిగింది దురదృష్టకరం. క్రమశిక్షణా ఉల్లంఘన చర్య. మనికా తన వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేతో అక్కడికి వెళ్లారు. కానీ ఆయన అక్రిడేషన్ కార్టుతో పోటీలు జరిగే చోట ప్రవేశించలేరు. దీంతో పరాంజపే కార్డు అప్‌గ్రేడ్ చేయాలని మనికా డిమాండ్ చేసింది. కానీ నిబంధనల ప్రకారం అది కుదరలేదు. సౌమ్యదీప్ సలహాలు తీసుకోమని చెప్పగా.. సుతిర్థా ముఖర్జీకి ఆయన ఒకప్పుడు వ్యక్తిగత కోచ్‌గా ఉన్నారంటూ మనికా అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
1980 తర్వాత తొలిసారి; కాంస్య పోరు.. ఫొటోలు వైరల్
Indian Men's Hockey Won Bronze Emotions In Pics: టోక్యో ఒలిపింక్స్‌లో భారత కీర్తి పతాకను ఎగురవేసిన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 1980 తర్వాత హాకీలో తొలి ఒలింపిక్ పతకం సొంతం కావడంతో భారతీయుల హృదయం సంతోషంతో నిండిపోయింది. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాగా కాంస్య పతక పోరులో మన్‌ప్రీత్ సేన జర్మనీపై అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి క్వార్టర్ ముగిసే సరికి గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి వచ్చిన జర్మనీ.. రెండో క్వార్టర్లోనూ 3-1తేడాతో ఆధిపత్యం కనబరిచింది. అయితే, వెంటనే భారత్ సైతం గోల్ కొట్టి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించడంతో పోరు రసవత్తరంగా మారింది. ఇక రెండో క్వార్టర్ ముగిసే సరికి రెండు జట్లు మూడేసి గోల్స్‌తో (3-3) సమంగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆ తర్వాత మూడో క్వార్టర్ ముగిసే సరికి 5-3 తేడాతో భారత్ ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. A COMEBACK of the highest order! 🔥🔥🔥#IND scored two back-to-back goals in the second quarter to make it 3-3 vs #GER and then broke through in the third quarter to turn the match in their favour. 👏#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #BestOfTokyo pic.twitter.com/SW8ZrbGrTp — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 5, 2021 కానీ, చివరి క్వార్టర్లో జర్మనీ గోల్ చేసి 5-4కు ఆధిక్యాన్ని తగ్గించడంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్నప్పటికీ భారత డిఫెన్స్ టీం చక్కగా రాణించి విజయాన్ని ఖాయం చేసింది. భారత్ తరఫున సిమ్రన్‌జీత్ రెండు, హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్, రూపీందర్ పాల్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. గోల్‌కీపర్ శ్రీజేష్ చక్కగా రాణించాడు. An UNFORGETTABLE moment! 🙌😍 The one that #IND has been hungry for over 41 long years. ❤️#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #BestOfTokyo | #Hockey | #Bronze pic.twitter.com/R530dyTjS1 — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 5, 2021 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మురిసిపోతున్న సెలబ్రిటీలు: సంబరాలు మామూలుగా లేవుగా!
టోక్యో ఒలింపిక్స్ వేదికగా భారత కీర్తి పతాకం మరోసారి సగర్వంగా రెపరెపలాడింది. గురువారం జర్మనీతో జరిగిన పోరులో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయం సాధించి యావత్‌దేశాన్ని ఎనలేని ఆనందంలో ఓలలాడించింది. ఈ చారిత్రక విజయంపై భారత రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఆనంద్ మహీంద్ర, కిరణ మజుందార్ షా లాంటి వ్యాపారవేత్తలు సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు భారత హాకీ జట్టు ఘనతను పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లకు కల నిజమైందంటూ మురిసిపోతున్నారు. మెన్ ఇన్ బ్లూ.. చక్ దే ఇండియా అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ స్పందిస్తూ వావ్ !! భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన మ్యాచ్ అంటూ షారూఖ్ పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే విజయం! అద్భుత ప్రదర్శన 41 సంవత్సరాల తర్వాత ఇండియాకు ఒలింపిక్ పతకం.. అంటూ టీమిండియాకు అభినందనలు తెలిపారు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా. మరోవైపు పురుషుల హాకీలో టీమిండియా విజయం సాధించిన సందర్భంగా మణిపూర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇంపాల్‌లో హాకీ ఆటగాడు నీలకంఠ శర్మ కుటుంబం సంతోషానికి హద్దే లేకుండా పోయింది. బంధువులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులంతాచేరి నృత్యాలతో సందడి చేశారు. అటు పంజాబ్‌లో అమృత సర్‌లో కూడా పండగ వాతావరణం నెలకొంది. గుర్జంత్ సింగ్ కుటుంబ సభ్యులు డాన్స్‌లతో భారత జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒలింపిక్స్‌లో పురుషుల హాకీలో టీం కాంస్య పతకం ఖాయం కావడంతో పంజాబ్‌కు భారత హాకీ ఆటగాడు మన్ దీప్ సింగ్ కుటుంబం సంబరాలు చేసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత భారతదేశం పతకం సాధించింది. ఈ విజయంపై తనకు మాటలురావడం లేదంటూ మన్ దీప్ తండ్రి రవీందర్ సింగ్ ఆనందాన్ని ప్రకటించారు. Yeaaa! What a win for our men in blue - after 41 years we get to stand on the podium for Olympic Hockey! Jai Hind! 👏👏👍 — Kiran Mazumdar-Shaw (@kiranshaw) August 5, 2021 -
జాతి గర్వపడేలా చేశారు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో 5-4తేడాతో భారత్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ద్వారా 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం గెలిచి జాతిని గర్వపడేలా చేశారని మన్‌ప్రీత్ సేనను కొనియాడారు. భారతీయులందరితో కలిసి సంతోషకర సమయాన్ని తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా గురువారం నాటి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో భారత పురుషుల హాకీ జట్టు జర్మనీని చిత్తు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. తద్వారా తాజా ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది. భారత పురుషుల హాకీ జట్టు: మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), శ్రీజేశ్ పీఆర్(గోల్ కీపర్), అమిత్ రోహిదాస్, రూపీందర్‌సింగ్ పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్, సింగ్ మన్దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్. India creates history after 41 years! An incredible comeback, after being down by 1-3. #Teamindia displayed strong intent, sealing the match with a 5-4 win at the end. Many congratulations @TheHockeyIndia on winning bronze for India at #Olympics #Tokyo2020 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2021 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాయ్స్.. మీరు సాధించేశారు.. ఇక కేకలే!
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో గెలుపొందిన భారత పురుషుల హాకీ జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్ పతకంతో తిరిగి వస్తున్నందుకు భారతీయుల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా పలువురు ఈ విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెల్డన్ బాయ్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సరికొత్త చరిత్రకు నాంది: భారత రాష్ట్రపతి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారత పురుషుల హాకీ జట్టును అభినందించారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన నైపుణ్యం, ప్రతిభాపాటవాలు, అంకితభావంతో ఈ గెలుపు సాధ్యమైందని కొనియాడారు. గురువారం నాటి చారిత్రాత్మక విజయం భారత హాకీ చరిత్రలో మరో సరికొత్త యుగానికి నాంది అని, క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకునే విధంగా స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Congratulations to our men's hockey team for winning an Olympic Medal in hockey after 41 years. The team showed exceptional skills, resilience & determination to win. This historic victory will start a new era in hockey and will inspire the youth to take up and excel in the sport — President of India (@rashtrapatibhvn) August 5, 2021 ప్రతి భారతీయుడి మనసులో గుర్తుండే జ్ఞాపకం ‘‘చరిత్రాత్మకం! ప్రతీ భారతీయుడి మనసులో ఈ జ్ఞాపకం ఎల్లప్పుడూ నిలిచి పోతుంది. కాంస్య పతకంతో స్వదేశానికి తిరిగి వస్తున్న భారత పురుషుల హాకీ జట్టుకు శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించి జాతి మొత్తాన్ని గర్వపడేలా చేవారు. ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చారు. హాకీ జట్టు మనకు గర్వకారణం’’ ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా మన్‌ప్రీత్ సేనను కొనియాడారు. Historic! A day that will be etched in the memory of every Indian. Congratulations to our Men’s Hockey Team for bringing home the Bronze. With this feat, they have captured the imagination of the entire nation, especially our youth. India is proud of our Hockey team. 🏑 — Narendra Modi (@narendramodi) August 5, 2021 ఇక కామ్‌గా ఎలా ఉండగలం ‘‘భారత్‌కు శుభాకాంక్షలు. అబ్బాయిలు.. మీరు సాధించేశారు! ఇక మేం నిశ్శబ్దంగా ఎలా ఉండగలం. ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ.. ఒలింపిక్ చరిత్రలో మరోసారి భారత విజయాన్ని మరోసారి లిఖించింది పురుషుల హాకీ జట్టు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం’’ అని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. A BILLION CHEERS for INDIA 🇮🇳! Boys, you’ve done it ! We can’t keep calm !#TeamIndia 🥉! Our Men’s Hockey Team dominated and defined their destiny in the Olympic history books today, yet again ! We are extremely proud of you!#Tokyo2020 pic.twitter.com/n78BqzcnpK — Anurag Thakur (@ianuragthakur) August 5, 2021 -
నాకు బంగారంలా కనిపిస్తోంది: ఆనంద్ మహీంద్ర
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పురుషుల హాకీ జట్టు సాధించిన ఘన విజయంపై పారిశ్రామిక వేత్త మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో స్పందించారు. ఒక్కసారిగా తనకు కలర్ బ్లైండ్నెస్ ఆవరించిదంటూ హాకీ టీం విజయంపై సంతోషాన్ని ప్రకటించారు.. మనవాళ్లు గెల్చుకున్న కాంస్య పతకం కాస్తా స్వర్ణ పతకంలా కనిపింస్తోందంటూ కితాబిస్తూ ట్వీట్ చేశారు. కాగా జర్మనీతో గురువారం జరిగిన పురుషుల హాకీ పోరులో భారత్ అద్భుత విజయాన్ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో చివరకు మన్‌ప్రీత్ సింగ్ సారధ్యంలోని జట్టు 5-4 తేడాతో జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా భారత ఖాతాలో మరో ఒలింపిక్ పతకం చేరింది. అంతేకాదు. 41 ఏళ్ల తరువాత హాకీలో తొలిసారి ఒలింపిక్ పతకాన్ని సాధించడం విశేషం. భారత జట్టు సాధించిన విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువ కురుస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) I have suddenly become colour-blind. That Bronze looks Golden to me… #ChakDeIndia #TokyoOlympics2020 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽 https://t.co/0FHbNrtnA1 — anand mahindra (@anandmahindra) August 5, 2021 -
కాంస్య పోరు: భారత్ వీరవిహార విజయం, 41 ఏళ్ల తర్వాత..
Tokyo Olympics 2020 Men Hockey Bronze Match: టగ్ ఆఫ్ వార్‌గా భావించిన పోరులో భారత్ జయకేతనం ఎగరేసింది. ఒలింపిక్స్ కాంస్యపు పోరులో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ పురుషుల హాకీ టీం విజయం సాధించింది. ఆఖర్లో ఉత్కంఠను పెంచి 5-4 తేడాతో జర్మనీని ఓడించింది. తద్వారా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్ పతకాన్ని ఖాతాలో వేసుకుంది ఇండియన్ మెన్స్ హాకీ టీం. ఇక పెనాల్టీ కార్నర్లు ఈ మ్యాచ్‌ను శాసించడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో జర్మనీ-భారత్ మధ్య కాంస్యం కోసం పోరు జరిగింది. ఆరంభంలో రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ కట్టబెట్టిన భారత్.. మొదట్లో తడబడినట్లు కనిపించింది. ఇక రెండో క్వార్టర్లో సిమ్రాన్‌జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమంగా ముగిసింది. మూడో క్వార్టర్లో మాత్రం నువ్వా నేనా అన్నట్లు సాగింది మ్యాచ్. జర్మనీ రెండు గోల్స్ కొట్టగా.. ఆ వెంటనే భారత్ మరో గోల్ కొట్టింది. ఆపై పెనాల్టీ కార్నర్‌ను అందిపుచ్చుకుని హాఫ్ టైం ముగిసేసరికి 3-3తో సమం చేసింది భారత్. పూర్తి పైచేయి మూడో క్వార్టర్లో పూర్తిగా భారత్ డామినేషన్ కొనసాగింది. ఆరంభంలోనే ఓ గోల్ సాధించి.. 4-3తో ఆధిక్యం కనబరిచింది భారత్. ఆ వెంటనే మరో గోల్‌తో 5-3 ఆధిక్యంలో నిలిచి.. జర్మనీపై ఒత్తిడి పెంచింది. ఆపై ప్రత్యర్థికి మరో గోల్ దక్కకుండా డిఫెండింగ్ గేమ్ ఆడింది. మధ్యలో గోల్ అవకాశం దక్కినా.. ఇరు జట్లు తడబడడంతో మూడు క్వార్టర్ భారత్ వైపే ఆధిక్యంతో ముగిసింది. చివర్లో.. జర్మనీ గోల్‌తో స్కోర్ 4-5 అయ్యింది. ఇక అక్కడి నుంచి మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. మరో గోల్ దక్కకుండా చాలా ప్రయత్నించింది భారత్. ఆఖర్లో జర్మనీకి దక్కిన పెనాల్టీ కార్నర్ విఫలం కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఆఖర్లో సెకన్ల వ్యవధిలో దక్కిన జర్మనీ షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకోవడంతో.. భారత్ విక్టరీ ఖాయమైంది. రియల్ హీరో.. హాకీ టీం గోల్ కీపర్ శ్రీజేష్.. చివర్లో షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకుని హీరో అనిపించుకున్నాడు. మన్‌ప్రీత్ సారథ్యంలో ఒలింపిక్ పతాక కలను సార్థకం చేశాడు. హాకీలో డిఫెండింగ్ దిగ్గజంగా కోచ్ గ్రాహం రెయిడ్.. సూచనలు భారత జట్టుకు ఎంతో ఉపకరించాయి. 17, 27, 29, 31, 34 నిమిషాల్లో గోల్స్ చేసిన భారత్జట్టులో 2 గోల్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు సిమ్రన్జీత్సింగ్. -
టోక్యో ఒలింపిక్స్: కాంస్యం పోరులో దీపక్ పునియా ఓటమి
► టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ దీపక్ పూనియా నిరాశ పరిచాడు. రెజ్లింగ్ 86 కేజీల విభాగంలో సాన్ మారినోకు చెందిన మైల్స్ నాజెల్ చేతిలో 2-4 తేడాతో ఓడిపోయాడు. దీంతో భారత్ తృటిలో మరో పతకం గెలుచుకునే అవకాశం కోల్పోయాడు. ► టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు . 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ విభాగంలో రష్యాకు చెందిన రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్ 7-4 తేడాతో ఓడి రజతం గెలుచుకున్నాడు. తద్వారా సుశీల్ కుమార్ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తాజాగా రవికుమార్ రజతంతో మెరవడంతో టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం పతకాల సంఖ్య ఐదుకి చేరింది. ► టోక్యో ఒలింపిక్స్‌లో 20 కి.మీ. నడక రేసులో భారత అథ్లెట్లు నిరాశపరిచారు. ఆరంభంలో చైనా అథ్లెట్ వాంగ్‌కు భారత్ అథ్లెట్ సందీప్ కుమార్ గట్టిపోటీ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య కేవలం ఒక సెకన్ మాత్రమే ఉండడంతో హోరాహోరీగా కొనసాగింది. అయితే అదే టెంపోనూ సందీప్ చివరివరకు నిలబెట్టలేకపోయాడు. గంట 25 నిమిషాలు 7 సెకన్లలో రేసును ముగించిన సందీప్ ఓవరాల్‌గా 32వ స్థానంలో నిలవగా.. మరో భారత అథ్లెట్ రాహుల్ గంట 32 నిమిషాల 6 సెకన్లలో రేసు ముగించి 47వ స్థానంలో నిలిచాడు. ఇక ఇటలీకి చెందిన స్టానో మాసిమో గంట 21 నిమిషాల 05 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని స్వర్ణం గెలవగా.. జపాన్‌కు చెందిన ఇకిడా కోకి గంట 21 నిమిషాల 14 సెకన్లతో రజతం.. జపాన్‌కే చెందిన మరో అథ్లెట్ యమాన్షి తోషికాజు గంట 21 నిమిషాల 28 సెకన్లతో కాంస్యం గెలుచుకున్నాడు. Tokyo Olympics Day 14 Updates: టోక్యో ఒలింపిక్స్‌లో 20 కి.మీ. నడక పోటీ హోరాహోరీగా సాగుతోంది. మొదటి స్థానంలో చైనా అథ్లెట్ వాంగ్ కొనసాగుతుండగా.. భారత్‌కు చెందిన సందీప్ కుమార్(హర్యానా) రెండో స్థానంలో ఉన్నాడు. వాంగ్‌కు, సందీప్‌కు మధ్య తేడా కేవలం ఒక సెకన్ మాత్రమే తేడా ఉండటం విశేషం. కాగా ఈ పోటీలో ముందున్న కాలు మడత పడకుండా నడవాలన్న నిబంధన ఉంటుంది. అదే విధంగా... ఏదో ఒక కాలు కచ్చితంగా నేల మీదుండాలన్నది రెండో నిబంధన. సుమారు ఒక గంట 20 నిమిషాల పాటు ఈ రేసు సాగనుంది. ఇక 20కి.మీ. నడక రేసులో ఇప్పటివరకున్న ప్రపంచ రికార్డు 1గంట 16నిమిషాలు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ అద్భుతం చేసింది. కాంస్యం కోసం జరిగిన పోరులో జర్మనీని 5-4 తేడాతో ఓడించి పతకంతో పాటు కోట్లాది మంది భారతీయుల మనసును గెలుచుకుంది. భారత్ తరఫున సిమ్రన్‌జీత్ రెండు, హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్, రూపీందర్ పాల్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. తద్వారా సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత పురుషుల హాకీ జట్టు ఖాతాలో ఒలింపిక్స్ పతకం చేరింది. ఇక తాజాగా మన్‌ప్రీత్ సేన విజయంతో.. ఇప్పటి వరకు తాజా ఒలింపిక్స్‌లో భారత్ గెలిచిన పతకాల సంఖ్య మొత్తంగా ఐదుకు చేరింది. భారత పురుషుల హాకీ జట్టు: మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), శ్రీజేశ్ పీఆర్(గోల్ కీపర్), అమిత్ రోహిదాస్, రూపీందర్‌సింగ్ పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్, సింగ్ మన్దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్. నిరాశ పరిచిన వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్ మహిళల 53 కిలోల విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బెలారస్‌కు చెందిన వనేసా చేతిలో 3-9 తేడాతో ఓటమి పాలైంది. అయితే, రెజిచేజ్ రూపంలో వినేశ్ కాంస్య పతకం గెలిచే ఆశలు సజీవంగానే ఉన్నాయి. భారత్- జర్మనీ హోరాహోరీ: ►టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం భారత్- జర్మనీ పురుషుల హాకీ జట్టు మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. చివరిదైన నాలుగో క్వార్టర్ ఉత్కంఠను రేపుతోంది. మూడో క్వార్టర్ వరకు భారత్ 5-3తో ఆధిక్యంలో కొనసాగగా.. ఆఖరి క్వార్టర్లో జర్మనీ తొలి గోల్ చేసి 5-4కు ఆధిక్యాన్ని తగ్గించింది. మరోసారి జర్మనీకి గోల్ చేసే అవకాశం వచ్చినా భారత డిఫెన్స్ టీం చక్కగా అడ్డుకుంది. ప్రస్తుతం స్కోరు 5-3గా ఉంది. ►టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం జర్మనీతో జరుగుతున్న పోరులో భారత పురుషుల హాకీ జట్టు అదరగొడుతోంది. మూడో క్వార్టర్ ఆరంభంలోనే రెండు గోల్స్ చేసి సత్తా చాటింది. పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని రూపీందర్ పాల్ సింగ్ చక్కగా సద్వినియోగం చేసుకుని ఈ క్వార్టర్లో భారత్‌కు పాయింట్ అందించగా.. సిమ్రన్‌జీత్ రెండో గోల్ సాధించాడు. తద్వారా మూడో క్వార్టర్ ముగిసే సరికి 5-3 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకో 15 నిమిషాల ఆట మిగిలి ఉంది. వహ్వా వినేశ్ రెజ్లింగ్ మహిళల 53 కిలోల విభాగంలో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సత్తా చాటింది. సోఫియా మగ్డలెనాను 7-1 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మీ అభిప్రాయం చెప్పండి: Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు? నిరాశపరిచిన అన్షుమాలిక్ రెజ్లింగ్ మహిళల 57 కిలోల రెపిచేజ్‌లో భారత మహిళా రెజ్లర్ అన్షుమాలిక్ నిరాశ పరిచింది. 1-5తేడాతో ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైంది. అదరగొడుతున్న భారత్... 5-3తో ఆధిక్యంలో ►టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం జర్మనీతో జరుగుతున్న పోరులో మూడో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 5-3 తేడాతో ఆధిక్యంలో ఉంది. ►టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం భారత్- జర్మనీ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. నిమిషాల వ్యవధిలో ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠను రేపుతోంది. మూడో క్వార్టర్ ఆరంభంలోనే భారత్ నాలుగో గోల్ చేసి 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని రూపీందర్ పాల్ సింగ్ చక్కగా సద్వినియోగం చేసుకుని భారత్‌కు పాయింట్ అందించాడు. ►రెండో క్వార్టర్ ముగిసే సరికి రెండు జట్లు మూడేసి గోల్స్‌తో (3-3) సమంగా ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్ తరఫున సిమ్రన్‌జీత్, హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ ఒక్కో గోల్ చేశారు. చివరి రెండు గోల్స్ పెనాల్టీ కార్నర్ ద్వారా లభించాయి. ఇక జర్మనీకి తైమూర్ ఓరుజ్, నిక్లాస్ వెలెన్, బెనెడిక్ట్ మూడు పాయింట్లు అందించారు. ►కాంస్యం కోసం భారత పురుషుల హాకీ జట్టు జర్మనీతో పోరాడుతోంది. రెండో క్వార్టర్లో జర్మనీ వరుసగా రెండు గోల్స్ కొట్టి 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, వెంటనే భారత్ సైతం గోల్ కొట్టి జర్మనీ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించింది. ఈసారి హార్దిక్ సింగ్ భారత్‌కు పాయింట్ అందించాడు. ఇక అంతకుముందు సిమ్రన్‌జీత్ గోల్‌తో భారత్‌కు ఒక పాయింట్ దక్కింది. ►రెండో క్వార్టర్లో సిమ్రన్‌జీత్ గోల్ కొట్టి భారత్‌కు శుభారంభం అందించాడు. తాజా ఒలింపిక్స్‌లో అతడికిది రెండో గోల్. ప్రస్తుతం స్కోరు 1-1 సమంగా ఉంది. ►గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ తొలి క్వార్టర్ ముగిసే సరికి జర్మనీ గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలో ఉంది. జర్మనీ ప్లేయర్ తైమూర్ ఓరుజ్ ఈ మ్యాచ్‌లో తొలి గోల్ నమోదు చేశాడు. మరోవైపు... జర్మనీకి చివరి నిమిషంలో పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చినా భారత డిఫెన్స్ చక్కగా అడ్డుకుని మరో గోల్ కొట్టకుండా అడ్డుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ►ఉదయం 7 గంటలకు హాకీ పురుషుల కాంస్య పతక పోరు ►ఉ.7:30 నుంచి రెజ్లింగ్ మహిళల 57 కిలోల రెపిచేజ్ (అన్షుమాలిక్) ►ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్ మహిళల 53 కిలోల విభాగం (వినేశ్ ఫొగాట్) ►మధ్యాహ్నం ఒంటిగంట నుంచి అథ్లెటిక్స్ పురుషుల 20 కి.మీ నడక ఫైనల్ ►మధ్యాహ్నం 2:45 నుంచి రెజ్లింగ్ మహిళల 57 కిలోల కాంస్య పతక పోరు ►మధ్యాహ్నం 2:45 నుంచి రెజ్లింగ్ మహిళల 53 కిలోల విభాగం సెమీస్ ►మ.2:45 నుంచి పురుషుల 57 కిలోల విభాగం ఫైనల్ (రవికుమార్ దహియా) ►మ.2:45 నుంచి పురుషుల 86 కిలోల కాంస్య పతక పోరు (దీపక్ పునియా) -
ఇక చాలు అనుకోలేదు
అలుపన్నది ఉందా ఎగిరే అలకు... విరామమన్నది లేదా సింధు సాధనకు... టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పీవీ సింధు పడిన కష్టం మాటలకు అందనిది. కోర్టులో తన ఆటను మెరుగుపర్చుకోవడం ఒక ఎత్తు కాగా, అత్యుత్తమ ఫిట్నెస్ నుంచి సాధించేందుకు బ్రేక్ అనేదే లేకుండా సుదీర్ఘ సమయం పాటు కొన్ని నెలలపాటు చేసిన ట్రైనింగ్ ఆమెకు మరో పతక విజయంలో కీలకపాత్ర పోషించింది. బ్యాడ్మింటన్‌పై ఉన్న మక్కువే గత ఐదేళ్లలో తనను నడిపించిందని సింధు ‘సాక్షి’తో వెల్లడించింది. సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం... నలుపు రంగు జంప్ సూట్లో బయటకు వస్తున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును చూసి ఆ ప్రాంతమంతా హోరెత్తింది. పూలతో అభినందన, శాలువాలతో సత్కారం...పొలిటీషియన్ల నుంచి పోలీస్ ఉన్నతాధికారి వరకు ఆమెను అభినందనలతో ముంచెత్తారు. మాస్క్ వెనక దాగిన ఆమె చిరునవ్వులో రెండో ఒలింపిక్ పతకం సాధించిన విజయగర్వం కనిపించింది. అనంతరం ఇంటికి చేరిన సింధు, తన కెరీర్‌లోని ప్రత్యేక సందర్భం విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకుంది. ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే... ‘రియో’ రజతంతో పోలిస్తే... సహజంగానే రజత పతకం తర్వాత స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే సన్నద్ధమయ్యాను. సెమీఫైనల్లో కూడా నా శక్తిమేర ప్రయత్నించినా విజయం సాధించలేదు. అదే కాంస్యం కోసం జరిగిన మ్యాచ్ చూస్తే ఎంత పదునైన ఆటతీరు కనబర్చానో కనిపిస్తుంది. రజతంతో పోలిస్తే ఒక మెట్టు దిగినట్లు కనిపిస్తున్నా... ఒలింపిక్ పతకానికి ఉండే విలువ ఎప్పుడైనా ప్రత్యేకమే. కరోనా పరిస్థితులను అధిగమించి... ఒకదశలో ఒలింపిక్స్ జరగవేమో అనిపించింది. నిజానికి ఏ ప్లేయర్‌కైనా తాను తర్వాత ఎప్పుడు, ఎక్కడ ఆడబోతున్నాడో తెలిస్తేనే ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంటుంది. కానీ ఈ ఒలింపిక్స్ విషయంలో అలా జరగలేదు. గత ఏడాది పరిస్థితి కొంతమారి లాక్డౌన్ పాక్షికంగా తొలగించిన తర్వాతా టోర్నీల విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ప్రాక్టీస్ చేసినా ఏం లాభం అనే పరిస్థితి కనిపించింది. ఇలాంటప్పుడు కూడా నేను సాధన కొనసాగించాను. నిజానికి ఆ సమయాన్ని నేను ఇంకా బాగా వాడుకున్నట్లే లెక్క. హైదరాబాద్ విమానాశ్రయంలో సింధుకు స్వాగతం పలికిన తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అందరి సహకారంతోనే... ఒక ఒలింపిక్ మెడల్ విజయం వెనక ఆట మాత్రమే కాదు, అదనంగా అనేక అంశాలు కలిసి రావాల్సి ఉంటుంది. ప్లేయర్‌గా నేను కష్టపడటంతోపాటు అండగా నిలిచే ఒక ‘ఎకో సిస్టం’ అవసరం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొదటి నుంచి తోడుగా ఉన్నారు. కెరీర్లో నేను ఎదుగుతున్న కీలక సమయంలో 2014లో సహకరించేందుకు ముందుకు వచ్చిన బేస్‌లైన్ కంపెనీ ఇప్పటికీ నాతో కలిసి పని చేస్తోంది. కోచ్ పార్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్రైనర్, ఫిజియోల వల్లే గాయాల నుంచి తప్పించుకుంటూ ఒలింపిక్స్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లగలిగాను. ఫిట్నెస్ ట్రైనింగ్‌తో... కష్టం, పోరాటం లేనిది విజయం రాదని నమ్మే వ్యక్తిని నేను. అత్యుత్తమ అథ్లెట్లతో పోటీ పడే విధంగా నా ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమించాను. ట్రైనర్ శ్రీకాంత్ నాకు శిక్షణ ఇచ్చారు. ఆయన నన్ను ఎంత కష్టపెట్టినా భరించాను. కష్టసాధ్యమైన ఎక్సర్సైజ్లు, వెయిట్ ఎక్సర్సైజ్లు చాలా చేశాను. గంటలకొద్దీ ట్రైనింగ్ తర్వాత కూడా ఏ రోజూ ఇక చాలు అని ఆగిపోలేదు! మళ్లీ దేనికైనా సిద్ధం అన్నట్లుగా మానసికంగా దృఢంగా ఉన్నాను. గతంలో సుదీర్ఘ ర్యాలీల సమయంలో అలసిపోయి మ్యాచ్‌లు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దానిపైనా దృష్టి పెట్టాం. ఒలింపిక్స్ మ్యాచ్‌లలో ముఖ్యంగా టోక్యో బయల్దేరడానికి రెండు నెలల ముందు నుంచైతే ఇంకా కఠోర సాధన చేసాను. ప్రతీ రోజు, ప్రతీ సెషన్‌ను కీలకంగానే భావించా తప్ప విరామం తీసుకోలేదు. మళ్లీ మళ్లీ గెలవాలనే తపనే... ఒకసారి ఒలింపిక్ పతకం గెలుచుకున్నాక ఇక కెరీర్లో అన్ని సాధించేసిన భావన చాలా మందిలో వచ్చేస్తుంది. రియోలో రజతం తర్వాత సహజంగానే కొంత కాలం ఆ విజయాన్నే ఆస్వాదించాను. అయితే ఇక చాలు అనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదు. అదే మరో ఒలింపిక్ పతకం వరకు తీసుకెళ్లింది. నాకు బ్యాడ్మింటన్ అంటే పిచ్చి ప్రేమ. మనకు నచ్చిన పని చేయడంలో ఎవరికీ కష్టం అనిపించదు. అలాంటప్పుడు ప్రేరణ సహజంగానే లభిస్తుంది. మధ్యలో కొన్నిసార్లు మన మనసు చెదిరి ఇతర అంశాలపై దృష్టి వెళ్లడం కూడా సహజం. అయితే వెంటనే మన లక్ష్యం ఏమిటో తెలిస్తే వెంటనే మళ్లీ దారిలో పడతాం. ఒలింపిక్స్ పతకమే కాదు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత కూడా నేను ఆగిపోలేదు. మున్ముందూ అంతే పట్టుదలగా ఆడతాను. కెరీర్లో ఇంకా వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించలేదు. బాగా ఆడి అది కూడా అందుకోగలను. ఇప్పుడే 2024 పారిస్ ఒలింపిక్స్ గురించి ఆలోచించడం లేదు. కొంతకాలం ఈ విజయాన్ని ఆస్వాదించి మళ్లీ ప్రాక్టీస్‌లోకి దిగుతా. అంతకుముందు ఉదయం ‘సాక్షి’ న్యూఢిల్లీ ప్రతినిధితో మాట్లాడుతూ సింధు... ‘2016లో మొదటిసారి మెడల్ వచ్చినప్పుడు నాపై అంత అంచనాలు ఏవీ లేవు. కానీ ఈసారి ఒలింపిక్స్‌కు వచ్చేసరికి ఒత్తిడి, అంచనాలు, బాధ్యతలు చాలానే ఉన్నాయి. సెమీఫైనల్స్‌లో ఓడిపోయినప్పుడు కొంచెం బాధేసింది. కానీ మా కోచ్, మా ఫిజియో నాకు చాలా సపోర్ట్ చేశారు. పేరెంట్స్ కూడా ఫోన్ చేసి నీకు ఇంకో ఛాన్స్ ఉంది అని నన్ను ప్రోత్సహించారు. ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురవుతాం. ఆ ఆలోచనలను పక్కనబెట్టి కాంస్య పతకంపై దృష్టి పెట్టాలని మా కోచ్ నాకు సూచించారు. కాంస్య పతకం రావడం, నాలుగో స్థానంలో ఉండడానికి చాలా తేడా ఉంటుందని కోచ్ చెప్పారు. కష్టపడితే నువ్వు తప్పకుండా కాంస్యం సాధిస్తావని ఆయన నన్ను ప్రోత్సహించారు. అందువల్లే నేను మెడల్ సాధించగలిగాను. బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ప్రయాణం ప్రారంభించినప్పుడు స్వల్పకాలిక లక్ష్యాలు ఉండేవి. ఆ తర్వాత నేను నా ఆటను చాలా మెరుగు పర్చుకున్నాను. వచ్చే రెండు వారాల్లో ప్రధాని సమయం కేటాయించినప్పుడు వెళ్ళి ఆయనను కలుస్తాము. ప్రధాని చెప్పినట్లుగానే ఆయనతో కలిసి ఐస్‌క్రీం తింటాను. ఆయనను కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను’ అని వ్యాఖ్యానించింది. -
Tokyo Olympics: దహియా ధమాకా...
భారత రెజ్లింగ్ అంటే ఇన్నాళ్లూ సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ పేర్లే ఠక్కున గుర్తుకు వచ్చేవి. కానీ ఈరోజు నుంచి అందరికీ తన పేరు చిరకాలం గుర్తుండిపోయేలా చేశాడు భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా. తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన ఈ హరియాణా మల్లయోధుడు ‘టోక్యో’లో తన ‘పట్టు’దలతో ప్రకంపనలు సృష్టించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో 23 ఏళ్ల రవి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ విశ్వ క్రీడల్లో భారత్‌కు నాలుగో పతకాన్ని ఖరారు చేశాడు. పతకం రంగు స్వర్ణమా, రజతమా అనేది నేడు తేలుతుంది. భారత్‌కే చెందిన మరో యువ రెజ్లర్ దీపక్ పూనియా 86 కేజీల విభాగంలో కాంస్య పతకం కోసం పోటీపడనుండగా... మహిళల 57 కేజీల విభాగంలో అన్షు మలిక్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా... ఆమెను ఓడించిన బెలారస్ ప్రత్యర్థి ఫైనల్‌కు చేరడంతో రెపిచేజ్ పద్ధతి ప్రకారం అన్షుకు కాంస్య పతకం రేసులో నిలిచే అవకాశం లభించింది. టోక్యో: గత రెండేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో తాను సాధిస్తున్న పతకాలు గాలివాటంగా రాలేదని భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా నిరూపించాడు. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత వేదికపై తొలిసారి బరిలోకి దిగినా ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా... ప్రశాంతంగా ప్రత్యర్థుల పట్టు పట్టి... మూడు వరుస విజయాలతో ‘పసిడి’ పతక పోరుకు సగర్వంగా చేరుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో స్వర్ణ–రజత ఫైనల్ బౌట్‌కు అర్హత పొందిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి దహియా ఘనత వహించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ 66 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకొని రజత పతకం సాధించాడు. రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) రెజ్లర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జవూర్ ఉగుయెవ్తో నేడు జరిగే ఫైనల్లో రవి దహియా గెలిస్తే... షూటర్ అభినవ్ బింద్రా (2008 బీజింగ్ ఒలింపిక్స్) తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత క్రీడాంశంలో స్వర్ణం సాధించిన రెండో భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. వెనుకబడినా... నూరిస్లామ్ సనయేవ్ (కజకిస్తాన్)తో జరిగిన సెమీఫైనల్లో రవి అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరాడు. తొలి భాగం ముగిశాక రవి 2–1తో ముందంలో ఉన్నాడు. అయితే రెండో భాగం ఆరంభంలో రవి రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని సనయేవ్ నాలుగుసార్లు మ్యాట్‌పై అటుఇటు తిప్పేయడంతో అతనికి 2, 2, 2, 2 పాయింట్ల చొప్పున మొత్తం ఎనిమిది పాయింట్లు వచ్చాయి. సనయేవ్ ఒక్కసారిగా 9–2తో ఏడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. అప్పటికి బౌట్ ముగిసేందుకు 90 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారీ తేడాతో వెనుకబడినా రవి ఒత్తిడికి లోనుకాలేదు. తన బలాన్నంతా కూడదీసుకొని ‘డబుల్ లెగ్ అటాక్’తో రెండు పాయింట్లు సంపాదించాడు. సనయేవ్‌ను మ్యాట్‌పైకి రవి ఎత్తి పడేయంతో కజకిస్తాన్ రెజ్లర్ మోకాలికి దెబ్బ తగిలింది. మోకాలికి పట్టీ కట్టుకొని సనయేవ్ బౌట్‌ను కొనసాగించగా... వెంటనే రవి మరోసారి అతని రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని మళ్లీ ఎత్తి పడేశాడు. ఈసారి రవి తన ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని సెకన్లపాటు అలాగే పెట్టి ఉంచాడు. దాంతో నిబంధనల ప్రకారం రవిని ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిలో రిఫరీ విజేతగా ప్రకటించారు. అప్పటికి బౌట్ ముగియడానికి మరో 39 సెకన్లు మిగిలి ఉన్నాయి. ఒకదశలో 2–9తో వెనుకబడిన రవి చివరకు పాయింట్లతో సంబంధం లేకుండా విజయాన్ని అందుకోవడం విశేషం. స్పష్టమైన ఆధిపత్యం... నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన రవి తొలి రౌండ్లో 13–2 పాయింట్ల తేడాతో ఎడువార్డో ఆస్కార్ టిగ్రెరోస్ (కొలంబియా)పై ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజయం సాధించాడు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం దక్కిన వెంటనే బౌట్‌ను నిలిపివేసి ఆ ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు. దీనిని ‘టెక్నికల్ సుపీరియారిటీ’ విజయంగా పరిగణిస్తారు. ఎడువార్డోతో జరిగిన బౌట్లో రవి మూడు నిమిషాల నిడివి గల తొలి భాగంలో 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మూడు నిమిషాల నిడివి గల రెండో భాగంలో రవి ఒక్కసారిగా విజృంభించి ‘టేక్‌డౌన్’ ఎత్తులతో వరుసగా 2, 2, 2, 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. దాంతో రవి 13–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించినందుకు రవిని విజేతగా ప్రకటించారు. అదే దూకుడు... తొలి రౌండ్లో గెలుపు తర్వాత క్వార్టర్ ఫైనల్లో బల్గేరియా రెజ్లర్ జియార్జి వలెంటినో వంజెలోవ్తో తలపడ్డ రవి ఇక్కడా వెనక్కి తగ్గలేదు. మరోసారి తన భుజ బలంతోపాటు బుద్ధి బలం ఉపయోగించి తొలి భాగంలో వరుసగా 2, 2, 2 పాయింట్లు స్కోరు చేసి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో భాగంలో వంజెలోవ్ 2, 2 పాయింట్లు సాధించినా... రవి తానేం తక్కువ కాదన్నట్లు వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. బౌట్ ముగియడానికి మరో నిమిషం ఉందనగా 14–4తో ఆధిక్యంలోకి వచ్చాడు. రవి ఆధిక్యం పది పాయింట్లకు చేరడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు. చేతిని కొరికినా... ‘బై ఫాల్’ కాకుండా ఉండేందుకు కజకిస్తాన్ రెజ్లర్ సనయేవ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. తన మెడను రవి గట్టిగా పట్టుకోవడంతో ఆ పట్టు నుంచి వదిలించుకునేందుకు సనయేవ్ రవి చేతిని కొరికాడు. అయినప్పటికీ రవి నొప్పిని భరిస్తూనే సనయేవ్కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. కాంస్యానికి విజయం దూరంలో దీపక్ ... పురుషుల 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ దీపక్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. హరియాణాకు చెందిన 22 ఏళ్ల దీపక్ తొలి రౌండ్లో 12–1తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అగియోమోర్ (నైజీరియా)ను ఓడించాడు. అనంతరం క్వార్టర్ ఫైనల్లో దీపక్ 6–3తో లిన్ జుషెన్ (చైనా)పై గెలిచి సెమీఫైనల్ చేరుకున్నాడు. అయితే సెమీఫైనల్లో దీపక్ 0–10తో డేవిడ్ మోరిస్ టేలర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. షబానౌ అలీ (బెలారస్)–నజీమ్ (సాన్మరినో) మధ్య ‘రెపిచేజ్’ బౌట్లో విజేతగా నిలిచిన రెజ్లర్‌తో నేడు జరిగే కాంస్య పతక పోరులో దీపక్ తలపడతాడు. అన్షుకు పతకావకాశం... మహిళల 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యూరోపియన్ చాంపియన్ ఇరీనా కురాచ్‌కినా (బెలారస్)తో జరిగిన బౌట్లో అన్షు 2–8తో ఓడిపోయింది. అయితే కురాచ్‌కినా ఫైనల్‌కు చేరడంతో ‘రెపిచేజ్’ పద్ధతిలో అన్షుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం దక్కింది. ఫైనల్ చేరే క్రమంలో కురాచ్‌కినా చేతిలో ఓడిన వారి మధ్య బౌట్లను నిర్వహిస్తారు. ఇందులో గెలిచిన వారు కురాచ్‌కినా చేతిలో సెమీఫైనల్లో ఓడిన రెజ్లర్‌తో కాంస్యం కోసం తలపడతారు. నేడు జరిగే ‘రెపిచేజ్’ తొలి రౌండ్లో కొబ్లోవా (రష్యా)తో అన్షు ఆడుతుంది. ఇందులో గెలిస్తే నికొలోవా (బల్గేరియా)తో అన్షు కాంస్యం కోసం తలపడుతుంది. గతంలో సనయేవ్‌ను రెండుసార్లు ఓడించాను. దాంతో భారీ ఆధిక్యంతో వెనుకబడినా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నా. సనయేవ్కు నేను ఎక్కువ పాయింట్లు ఇవ్వాల్సింది కాదు. ఇంకా నా పని పూర్తి కాలేదు. నేను స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే టోక్యోకు వచ్చాను. స్వర్ణం గెలిస్తేనే నా లక్ష్యం నెరవేరుతుంది. –రవి దహియా -
Tokyo Olympics: ప్రపంచ రికార్డులను ఎత్తేశాడు
జార్జియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ లాషా తలాఖద్జె సంచలన ప్రదర్శన చేశాడు. బుధవారం పురుషుల +109 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో లాషా... తన ఆకారానికి తగ్గట్టే బరువులను ఇట్టే ఎత్తేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. ఆరు అడుగుల ఆరు అంగుళాల ఎత్తు... 176 కేజీల బరువుతో అజానుబాహుడైన లాషా... మొత్తం 488 కేజీలు (స్నాచ్‌లో 223+క్లీన్ అండ్ జెర్క్‌లో 265) బరువు ఎత్తి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌తో పాటు ఓవరాల్ బరువులో గతంలో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. రెండో స్థానంలో నిలిచిన అలీ డెవౌడి (ఇరాన్) కంటే లాషా 47 కేజీలు ఎక్కువగా ఎత్తడం విశేషం. ఒలింపిక్స్‌లో లాషాకు ఇది రెండో స్వర్ణం. 2016 రియోలో +105 కేజీల విభాగంలో బరిలోకి దిగిన అతడు బంగారు పతకంతో మెరిశాడు. అలీ డెవౌడి 441 కేజీల (స్నాచ్‌లో 200+క్లీన్ అండ్ జెర్క్‌లో 241)తో రజతాన్ని.... మన్ అసద్ (సిరియా) 424 కేజీల(స్నాచ్‌లో 190+క్జీన్ అండ్ జెర్క్‌లో 234)తో కాంస్యాన్ని దక్కించుకున్నారు. -
పొట్టి బట్టలు వేసుకోవద్దన్నారు.. ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు
‘ఆటలాడితే ఏమొస్తుంది’ అన్నారు తల్లిదండ్రులు. ‘నేను ఆడతాను’ అంది నిషా. ‘పొట్టి బట్టలు వేసుకోకూడదు’ అన్నారు మత పెద్దలు. ‘నేను లెగ్గింగ్స్ వేసుకుని ఆడతాను’ అంది నిషా. ‘మేము బూట్లు బ్యాటు ఏమీ కొనివ్వ లేము’ అన్నారు అయినవాళ్లు. ‘నేనే ఎలాగో తిప్పలు పడతాను’ అంది నిషా. హర్యానాలో సోనిపట్‌లో 25 చదరపు మీటర్ల ఇంట్లో నివాసం ఉండే నిషా ఇవాళ మహిళా హాకీ టీమ్ లో ఇంత పెద్ద దేశానికి పతకం కోసం పోరాడుతోంది.. ‘మాకు మూడో కూతురుగా నిషా పుట్టింది. మళ్లీ ఆడపిల్లా అని బంధువులు హేళన చేశారు. ఇవాళ బ్యాట్‌తో సమాధానం చెప్పింది’ అని ఆనందబాష్పాలు రాలుస్తున్నారు తల్లిదండ్రులు. ఒక సన్నివేశం ఊహించండి. తొమ్మిదేళ్ల వయసు నుంచి హాకీ ఆడుతోంది ఆ అమ్మాయి. గుర్తింపు వచ్చి జాతీయ స్థాయిలో ఆడే రోజులు వచ్చాయి. ఇక దేశానికి పేరు తెలియనుంది. ఏమో... రేపు ప్రపంచానికి తెలియవచ్చేమో. కాని ఆ సమయంలోనే తండ్రికి పక్షవాతం వస్తుంది. ముగ్గురు కూతుళ్లున్న ఆ ఇంట్లో ఆ తండ్రి జీవనాధారం కోల్పోతే తినడానికి తిండే ఉండదు. ఇప్పుడు తండ్రి స్థానంలో బాధ్యత తీసుకోవాలా బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగాలా? దిగినా కుదురుగా ఆడగలదా తను? అలాంటి పరిస్థితిలో ఆడగలరా ఎవరైనా అని ఆలోచించండి. ఆడగలను అని నిరూపించిన నిషా వర్శీని చూడండి. ఆమె పోరాటం తెలుస్తుంది. ఆమె నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో తెలుస్తుంది. టైలర్ కూతురు హర్యానాలోని సోనిపట్‌లో పేదలవాడలో పుట్టింది నిషా వర్శి. తండ్రి షొహ్రబ్ వర్శి టైలర్. ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురుగా నిషా జన్మించింది. టైలర్‌గా సంపాదించి ఆ ముగ్గురు కూతుళ్లను సాకి వారికి పెళ్లి చేయడమే పెద్దపని అనుకున్నాడు షొహ్రబ్. ‘పాపం... ముగ్గురు కూతుళ్లు’ అని బంధువులు జాలిపడేవారు అతణ్ణి చూసి. మూడోసారి కూతురు పుడితే ‘మూడోసారి కూడానా. ఖర్మ’ అని అన్నవాళ్లు కూడా ఉన్నారు. షొహ్రబ్ ఏమీ మాట్లాడలేదు. ముగ్గురిని ప్రాణంగా చూసుకున్నాడు. నిషా వర్శి హాకీ ఆడతానంటే ‘మన ఇళ్లల్లో ఆడపిల్లలు ఆటలు ఆడలేదు ఎప్పుడూ’ అన్నాడు. కాని తల్లి మెహరూన్ కూతురి పట్టుదల గమనించింది. ఆడనిద్దాం అని భర్తకు సర్దిచెప్పింది. నిషా వర్శి తల్లిదండ్రులు ఎన్నో అడ్డంకులు క్రీడల్లో రాణించడం, అందుకు తగిన పౌష్టికాహారం తినడం, ట్రైనింగ్ తీసుకోవడం, అవసరమైన కిట్లు కొనుక్కోవడం ఇవన్నీ పేదవారి నుదుటిరాతలో ఉండవు. కలలు ఉండొచ్చు కాని వాటిని నెరవేర్చుకోవడం ఉండదు. కాని నిషా పట్టుపట్టింది. ప్రస్తుతం భారత హాకీ టీమ్‌లో ఆడుతున్న నేహా గోయల్ కూడా ఆమె లాంటి నేపథ్యంతో ఆమె వాడలోనే ఉంటూ ఆమెకు స్నేహితురాలై హాకీ ఆడదామని ఉత్సాహపరిచింది. ఇద్దరూ మంచి దోస్తులయ్యారు. కాని తెల్లవారి నాలుగున్నరకు గ్రౌండ్లో ఉండాలంటే తల్లిదండ్రులు నాలుగ్గంటలకు లేవాల్సి వచ్చేది. తల్లి ఏదో వొండి ఇస్తే తండ్రి ఆమెను సైకిల్ మీద దించి వచ్చేవాడు. ఒక్కోసారి తల్లి వెళ్లేది. వారూ వీరు చూసి ‘ఎందుకు ఈ అవస్థ పడతారు. దీని వల్ల అర్దనానా కాణీనా’ అని సానుభూతి చూపించేవారు. మరొకటి ఏమంటే– ఇస్లాంలో మోకాళ్ల పైభాగం చూపించకూడదని భావిస్తారు. హాకీ స్కర్ట్ మోకాళ్ల పైన ఉంటుంది. మత పెద్దల నుంచి అభ్యంతరం రాకూడదని కోచ్‌కు చెప్పి లెగ్గింగ్స్ తో ఆడటానికి ఒప్పించింది నిషా. ఒలింపిక్స్‌లో కూడా లెగ్గింగ్స్తోనే ఆడింది. కొనసాగిన అపనమ్మకం 2016లో తండ్రి పక్షవాతానికి గురయ్యాక దీక్ష వీడక ఆడి జాతీయ, అంతర్జాతీయ మేచెస్ లో గుర్తింపు పొందింది నిషా వర్శీ. రైల్వే బోర్డ్ టీమ్‌లో ఆడటం వల్ల ఆమెకు రైల్వేలో 2018లో ఉద్యోగం దొరికింది. పరిమిత నేపథ్యం ఉన్న నిషా కుటుంబానికి ఇదే పెద్ద అచీవ్మెంట్. ‘చాలమ్మా... ఇక హాకీ మానెయ్. పెళ్లి చేసుకో’ అని నిషాను ఒత్తిడి పెట్టసాగారు. అప్పటికి ఆమెకు 24 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా ఆలస్యమైతే పెళ్లికి చిక్కులు వస్తాయేమోనని వారి ఆందోళన. కాని నిషాకు ఎలాగైనా ఒలింపిక్స్‌లో ఆడాలని పట్టుదల. ‘ఒలింపిక్స్‌లో ఆడేంత వరకూ నన్ను వదిలేయండమ్మా’ అని తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబం మంచి చెడ్డలు చూసుకుంటానని మేనమామ హామీ ఇచ్చాక పూర్తిగా ఆట మీదే ధ్యాస పెట్టింది. ఆమె గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంటికి వెళ్లడమే లేదు. హాకీ సాధనలో, ఒలింపిక్స్ కోసం ఏర్పాటు చేసిన ట్రయినింగ్ క్యాంప్‌లో ఉండిపోయింది. చివరకు ఆస్ట్రేలియా మీద గెలిచాక సగర్వంగా ఇంటికి ఫోన్ చేసింది. అవును.. ఆడపిల్లే గొప్ప ఒకప్పుడు ఆడపిల్ల అని తక్కువ చూసి బంధువులు, అయినవారే ఇప్పుడు నిషాలోని గొప్పతనం అంగీకరిస్తున్నారు. ప్రతిభకు, ఆటకు, కుటుంబానికి, జీవితానికి కూడా ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సమానమే అని భావన తన సమూహంలో చాలా బలంగా ఇప్పుడు నిషా తీసుకెళ్లగలిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా గోల్ కొట్టడమే అసలైన ప్రతిభ. తాను అలాంటి గోల్ కొట్టి ఇవాళ హర్షధ్వానాలు అందుకుంటోంది నిషా. -
Tokyo Olympics: ఓడిపోయారు.. కాంస్యం గెలిచినా చరిత్రే
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన మహిళల హాకీ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే మహిళల జట్టు సెమీస్‌లో ఓడిపోయినప్పటికి అభిమానుల మనసులు మాత్రం గెలుచుకుంది. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత మహిళల జట్టు ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. అర్జెంటీనాతో జరిగిన సెమీస్‌లో ఆట ఆరంభంలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి భారత్‌కు శుభారంభం అందించింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్టర్లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్టర్లలో రెండు గోల్స్ ప్రత్యర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్టర్లో రాణి రాంపాల్ టీమ్‌కు స్కోరు సమం చేసే అవకాశం రాలేదు. అయితే భారత్ జట్టు సెమీస్‌లో ఓడినప్పటికి రాణి రాంపాల్ సేనకు మరో సువర్ణావకాశం ఉంది. కాంస్య పతక పోరులో భాగంగా ఆగస్టు 6న బ్రిటన్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గనుక అది కూడా ఒక చరిత్రే అవుతుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు ఇంతవరకు పతకం సాధించలేదు. ఒకవేళ కాంస్యం గెలిస్తే మాత్రం సరికొత్త చరిత్ర కానుంది. -
బాధపడొద్దు.. మీ ప్రదర్శన చూసి దేశం గర్విస్తోంది
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ల్లో అర్జెంటీనాతో జరిగిన మహిళల హాకీ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. తొలి రెండు క్వార్టర్లు మంచి ప్రదర్శనను కనబరిచిన భారత జట్టు మిగిలిన రెండు క్వార్టర్లలో ఒత్తిడికి గురైన భారత జట్టు అర్జెంటీనాకు 2-1 తేడాతో మ్యాచ్‌ను అప్పగించింది. అయితే ఒలింపిక్స్‌లో ఎటువంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన భారత మహిళల జట్టు సెమీస్‌లో ఓడిపోయినా యావత్ దేశం వారిపై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మ్యాచ్ అనంతరం భారత మహిళల హాకీ జట్టుతో ఫోన్లో మాట్లాడారు. మహిళల కెప్టెన్ రాణి రాంపాల్, కోచ్‌తో ప్రధాని ఫోన్లో సంభాషించారు. ఆటలో గెలుపోటములు సహజం. మీ ప్రదర్శనను చూసి దేశం గర్విస్తోంది. ఓటమితో నిరాశ చెందొద్దు. తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెట్టి గెలవండి. భారత్‌కు కాంస్య పతకాన్ని తీసుకురండి అని ఆకాంక్షించారు. కాగా కాంస్య పతక పోరులో భాగంగా భారత మహిళల జట్టు ఆగస్టు 6న బ్రిటన్‌తో తలపడనుంది. -
నా గెలుపును ఆకాంక్షించిన అందరికి ధన్యవాదాలు: పీవీ సింధు
-
10 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ వైపు అడుగులు
ఢిల్లీ: రవికుమార్ దహియా.. చరిత్ర సృష్టించడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. అయితే టోక్యో ఒలింపిక్స్ వెళ్లడానికి ముందు రవికుమార్‌పై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. కానీ బుధవారం జరిగిన రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో చరిత్ర సృష్టించాడు. ఉదయం జరిగిన అర్హత బౌట్ మ్యాచ్‌లో మంచి ఆధిపత్యం ప్రదర్శించిన రవికుమార్ క్వార్టర్స్‌లోనూ అదే జోరు కనబరిచాడు. అనంతరం సెమీఫైనల్లో కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై విక్టరీ బైఫాల్ కింద గెలుపొంది ఫైనల్‌కు ప్రవేశించాడు. రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన రెండో ఆటగాడిగా రవికుమార్ నిలిచాడు. ఈ సందర్భంగా రవికుమార్ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టిన తీరు ఒకసారి పరిశీలిద్దాం. రవికుమార్ దహియా సొంతూరు హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఉన్న నాహ్రి. హర్యానా గడ్డపై పుట్టినవాళ్లకు స్వతహాగా రెజ్లింగ్‌పై ఇష్టం ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసర లేదు. రవికుమార్ కూడా 10 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ వైపు అడుగులు వేశాడు. రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సుశీల్‌కుమార్ కోచ్ సత్పాల్ సింగ్ దగ్గరే రెజ్లింగ్ ఓనమాలు నేర్చుకున్నాడు. అయితే రవికుమార్ గొప్ప కుటుంబం నుంచి వచ్చాడనుకుంటే పొరపాటే. రవికుమార తండ్రి రాకేష్ దహియా ఒక సాధారణ రైతు. కనీసం సొంత భూమి కూడా లేకపోవడంతో కౌలు రైతుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. నిజానికి రవి దహియా రెజ్లింగ్‌లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయినా అతడే పట్టుపట్టి రెజ్లింగ్ నేర్చుకున్నాడు అయినా తన కొడుకు కోరికను కాదనలేక అతనికి రెజ్లింగ్ నేర్పించాడు. ప్రతి రోజూ రవికి పాలు, పండ్లు ఇవ్వడానికి రాకేశ్ దహియా 40 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఇలా ఒకటీ రెండూ కాదు పదేళ్ల పాటు చేయడం విశేషం. తన కొడుకు ఇప్పుడీ స్థాయికి చేరినా.. రాకేశ్ దహియా మాత్రం ఇప్పటి వరకూ రవికుమార్ రెజ్లింగ్‌ను చూడకపోవడం విశేషం. రవికుమార్ ఘనతలు: ► 2019 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడం ద్వారా రవికుమార్ దహియా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ► 2015 జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్ ► 2017లో మోకాలి గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరం ► 2018లో అండర్ 23 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ గెలిచి తన రాకను బలంగా చాటాడు. ► 2019లో ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి సీనియర్ స్థాయిలో మెడల్ గెలిచాడు. అప్పటి నుంచీ 57 కేజీల కేటగిరీలో నిలకడగా రాణిస్తున్నాడు. -
ఇంటికి చేరుకున్న పీవీ సింధు
-
Tokyo Olympics 2020: రెజ్లింగ్ ఫైనల్ చేరిన రవికుమార్
-
రవి దహియా కొత్త చరిత్ర.. సుశీల్ కుమార్ తర్వాత అతనే
టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా చరిత్ర సృష్టించాడు. బుధవారం 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీఫైనల్లో కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై రవికుమార్ విక్టరీ బైఫాల్ కింద గెలుపొందాడు. ఇక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ పురుషుల విభాగంలో పతకం తీసుకొచ్చిన మూడో రెజ్లర్‌గా రవికుమార్ నిలవనున్నాడు. ఇంతకముందు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌లు రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు పతకాలు అందించారు. అయితే యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకోగా.. సుశీల్ కుమార్ మాత్రం ఫైనల్లో ఓడిపోయి రజతం దక్కించుకున్నాడు. తాజాగా సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ చేరిన రెండో వ్యక్తిగా రవికుమార్ దహియా నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒలింపిక్స్‌లో పతకం తెచ్చిన ఐదో రెజ్లర్‌గా నిలవనున్నాడు. కేడీ జాదవ్(కాంస్యం), సుశీల్ కుమార్(కాంస్యం, రజతం), సాక్షి మాలిక్( కాంస్యం), యేగేశ్వర్ దత్( కాంస్యం) నలుగురు ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఒక దశలో ప్రత్యర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమయంలో రవికుమార్ అతన్ని రింగ్ బయటకు తోసే క్రమంలో నూరిస్లామ్ కాలికి గాయమైంది. కాలికి కట్టుకొని మళ్లీ రింగులోకి వచ్చినా.. అతడు రవికుమార్ పట్టుకు నిలవలేకపోయాడు. దీంతో రిఫరీ రవికుమార్‌ను విక్టరీ బై ఫాల్ కింది విజేతగా ప్రకటించాడు. రవికుమార్ ఫైనల్ చేరడంతో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. -
కొడుకు పుట్టలేదని అమ్మానాన్నను వేధించారు.. వారికిదే జవాబు
సాక్షి, వెబ్‌డెస్క్: అసోంలోని గోల్ఘాట్ జిల్లాలోని మారుమూల గ్రామం బారోముఖియా.. రాజధాని డిస్పూర్ నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ఊరికి ఇంతవరకు సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు.. బయటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే మట్టి రోడ్డే దిక్కు.. అటువంటి గ్రామం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ పుట్టిన గడ్డగా ప్రత్యేకతను సంతరించుకుంది. విశ్వ క్రీడల్లో భారత కీర్తి పతాకను ఎగురవేసిన ఘనతను సాధించినందుకు తమ ఆడపడుచుకు స్వాగతం పలికేందుకు ముస్తాబు అవుతోంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన లవ్లీనా ఈ విజయంతో తన దేశమంతా గర్వపడేలా చేసింది. పొలంలో నాట్లు వేయడం కూడా వచ్చు.. లవ్లీనా తండ్రి టికెన్ బొర్గోహెయిన్‌కు స్వస్థలంలో చిన్న తేయాకు తోట ఉంది. సాధారణ కుటుంబం. మొత్తం ముగ్గురు అమ్మాయిల్లో లవ్లీనా చిన్నది. కవల అక్కల బాటలో సరాదాగా ఆమె కూడా మువతాయ్ (కిక్ బాక్సింగ్)తోనే కెరీర్ ఆరంభించింది. 2009లో కోచ్ ప్రశాంత కుమార్ దాస్ వద్ద తన అక్కలతో పాటు శిక్షణ తీసుకుంది. ముగ్గురూ కలిసి బారోముఖియా నుంచి 3- 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్పాథార్లోని కోచింగ్ సెంటర్‌కు సైకిల్‌పై వెళ్లేవారు. ఫొటో కర్టెసీ: ఇండియా టుడే ఈ విషయాల గురించి లవ్లీనా తండ్రి టికెన్ మాట్లాడుతూ.. ‘‘అమ్మాయిలు చాలా కష్టపడేవారు. రాళ్లురప్పలతో నిండిన మట్టిరోడ్డు మీద ప్రయాణం వారికి నరకప్రాయంగా ఉండేది. వచ్చేటపుడు గాయాలతో తిరిగి వచ్చేవారు. వాళ్లెంత కష్టపడ్డారో నాకు తెలుసు’’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా లవ్లీనా ఎన్నటికీ తన మూలాలు మర్చిపోదని, లాక్డౌన్ సమయంలోలో పొలంలో నాట్లు వేస్తూ తమకు సహాయపడిందని బిడ్డపై ప్రేమను కురిపించారు. కాగా మువతాయ్ కొనసాగిస్తున్న సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్ పదమ్ బోరో దృష్టిలో పడటంతో లవ్లీనా కెరీర్ మలుపు తిరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని... టోక్యోకు కోచ్ ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన లవ్లీనా... 2020లో జోర్డాన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. లాక్డౌన్లో సొంతూరిలోనే ఉన్న ఆమె.. ప్రాక్టీస్ ప్రారంభం కావడంతో పటియాలాలోని శిక్షణా శిబిరానికి పయనమైంది. కానీ, కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న తల్లికి సహాయంగా ఉండేందుకు అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ క్రమంలో లవ్లీనా కరోనా బారిన పడింది. దీంతో 52 రోజుల ప్రత్యేక శిక్షణ కోసం స్పెయిన్ వెళ్లాల్సిన భారత బాక్సర్ల బృందం నుంచి ఆమె వైదొలగాల్సిన పరిస్థితి. అయినా సరే ఆమె కుంగిపోలేదు. కోవిడ్‌ను జయించడమే కాకుండా.. పట్టుదలగా ముందుకు సాగి టోక్యోలో సత్తా చాటింది ఈ 23 ఏళ్ల బాక్సర్. కంచు పంచ్‌తో కాంస్యం సాధించి, ప్రతిభ ముందు ఏ అవాంతరాలైనా దూదిపింజల్లా తేలిపోవాల్సిందేనని నిరూపించింది. విశ్వ క్రీడల్లో పతకంతో మెరిసి, ఈ ఘనత సాధించిన మూడో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. అమ్మానాన్నలను ఎన్నో మాటలు అన్నారు.. వారికిదే సమాధానం ‘‘ముగ్గురు ఆడపిల్లలను కలిగి ఉన్నందుకు గానూ నా తల్లిదండ్రులను ఈ సమాజం ఎన్నో మాటలు అన్నది. గత జన్మలో ఏదో పాపం చేసినందుకే కొడుకు పుట్టలేదంటూ వేధించేవారు. నిజానికి నేను బాక్సింగ్ చేయడం ప్రారంభించినపుడు చాలా మంది నన్ను చూసి నవ్వారు. ముఖ్యంగా లింగ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారికి నా ప్రదర్శన, ఈ పతకం ముఖం మీద కొట్టినట్లుగా సమాధానం ఇస్తుందని భావిస్తున్నా. మాకోసం తమ జీవితాలను త్యాగం చేసిన నా తల్లిదండ్రులకు ఈ విజయం అంకితం చేస్తున్నా’’ అని సెమీ ఫైనల్ అనంతరం ఆజ్‌తక్‌తో మాట్లాడుతూ లవ్లీనా భావోద్వేగానికి గురైంది. ఫైనల్ చేరాలని భావించానని, అయితే తన ప్రణాళికను పక్కాగా అమలు చేయలేకపోయానని పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్‌తో తప్పక ఇంతకంటే మెరుగ్గా రాణించి, మరో పతకం గెలుస్తానని లవ్లీనా చెప్పుకొచ్చింది. అంతకంటే ముందు... వరల్డ్ చాంపియన్‌షిప్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏసియన్ గేమ్స్‌లో సత్తా చాటాల్సి ఉందని అని పేర్కొంది. ఏదేమైనా.. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించిన లవ్లీనా నిజంగానే బంగారుకొండ.. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ లవ్లీనా!! -
దేశానికి పతకం తీసుకురావడం ఆనందంగా ఉంది
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన పీవీ సింధు బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు పీవీ సింధుకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. '' ఒలింపిక్స్‌లో పతకం రావడం ఆనందంగా ఉంది. దేశానికి పతకం తీసుకురావడం ఆనందంగా ఉంది. ఒలింపిక్స్‌లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా నిన్న(మంగళవారం) టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్న పీవీ సింధుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించిన సంగతి తెలిసిందే. అనంతరం కేంద్ర మంత్రులు సింధుతో పాటు ఆమె కోచ్ పార్క్‌ను ఘనంగా సత్కరించారు.2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. -
ఒలింపిక్స్‌లో పతకం రావడం ఆనందంగా ఉంది: పీవీ సింధు
-
Tokyo Olympics: లవ్లీనాను అభినందించిన సీఎం వైఎస్ జగన్
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పీవీ సింధుకు ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్: టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీ చేరుకున్న పీవీ సింధు అక్కడి నుంచి ఈ రోజు (బుధవారం) హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సింధుకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సింధు రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టు నుంచి ఆమె నేరుగా ఫిలింనగర్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఇక మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించిన సంగతి కూడా తెలిసిందే. -
53 ఏళ్ల తర్వాత... ఎట్టకేలకు
టోక్యో: అప్పుడెప్పుడో 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో చివరిసారి మాడిలైన్ మ్యానింగ్ అమెరికాకు మహిళల 800 మీటర్ల విభాగంలో స్వర్ణం అందించింది. ఆ తర్వాత ఈ విభాగంలో యూరోపియన్, ఆఫ్రికన్ అథ్లెట్ల ఆధిపత్యం మొదలైంది. ఎట్టకేలకు 53 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్ 800 మీటర్ల మహిళల విభాగంలో అమెరికాకు స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన 800 మీటర్ల ఫైనల్లో అమెరికా టీనేజర్, 19 ఏళ్ల ఎతింగ్ మూ సంచలన ప్రదర్శన నమోదు చేసింది. ఎతింగ్ మూ 1ని:55.21 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచి పసిడి పతకాన్ని దక్కించుకుంది. కీలీ హాడ్జ్‌కిన్సన్ (బ్రిటన్–1ని:55.88 సెకన్లు) రజతం... రెవీన్ రోజర్స్ (అమెరికా–1ని:56.81 సెకన్లు) కాంస్యం సాధించారు. -
లవ్లీనాను అభినందించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం గెలుపొందేందుకు ఆమె పోరాడిన తీరు అద్భుతమని కొనియాడారు. ఎల్లప్పుడూ ఇలాగే గొప్పగా ఆడుతూ.. యువ క్రీడామణులకు, యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్ బుధవారం ట్వీట్ చేశారు. కాగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో లవ్లీనా, టర్కీ బాక్సర్ బుసేనాజ్ చేతిలో ఓడి పోయిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిన్‌చెన్‌పై విజయం సాధించి ఆమె కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు. తద్వారా ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన మూడో భారత బాక్సర్‌గా లవ్లీనా నిలిచారు. అంతకు ముందు విజేందర్ సింగ్, మేరీ కోమ్ ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Congratulations to @LovlinaBorgohai for winning the third medal for India at #Tokyo2020 . She fought the best in her category and won a medal in her debut #Olympics . May you keep shining and inspire many young girls through your career ahead. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 4, 2021 -
వరుస పసిడి పతకాలు.. ఏకైక మహిళా అథ్లెట్‌గా
ఒలింపిక్స్ మహిళల అథ్లెటిక్స్‌లో జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ హెరా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మంగళవారం జరిగిన మహిళల 200 మీటర్ల ఫైనల్ రేసులో ఆమె విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ‘స్ప్రింట్’ రేసుల్లో ‘డబుల్’ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఎలైన్ 100, 200 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెల్చుకుంది. ఫలితంగా వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. పురుషుల విభాగంలో మాత్రం ఉసేన్ బోల్ట్ (జమైకా) వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు. టోక్యో: ఒలింపిక్స్‌లో స్ప్రింట్ రేసు అంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు ఉసేన్ బోల్ట్. అతడు అంతలా స్ప్రింట్ రేసులను తన ప్రదర్శనతో ప్రభావితం చేశాడు. తాజా ఒలింపిక్స్‌లో అటువంటి ప్రదర్శననే జమైకన్ మహిళా స్ప్రింటర్ ఎలైన్ థామ్సన్ హెరా ప్రపంచానికి చేసి చూపింది. ఒకవైపు స్ప్రింట్ రేసుల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన జమైకన్ పురుష అథ్లెట్లు విఫలమవుతుంటే... మహిళల విభాగంలో మాత్రం ఎలైన్ అదరగొట్టింది. నాలుగు రోజుల క్రితం మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన ఆమె మరోసారి మెరిసింది. మంగళవారం జరిగిన 200 మీటర్ల పరుగులోనూ పసిడిని తెచ్చే ప్రదర్శనను చేసింది. 21.53 సెకన్లలో అందరికంటే ముందుగా రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. తద్వారా స్ప్రింట్ (100, 200 మీటర్లు) ఈవెంట్లను క్లీన్ స్వీప్ చేసింది. 2016 ‘రియో’లోనూ థామ్సన్ స్ప్రింట్ ఈవెంట్లను క్లీన్ స్వీప్ చయడం విశేషం. ఇలా రెండు వరుస ఒలింపిక్స్‌ల్లోనూ 100, 200 మీటర్లలో స్వర్ణాలు సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. క్రిస్టినే ఎమ్‌బోమా (నమీబియా; 21.81 సెకన్లు) రజతం... గాబ్రియేలా థామస్ (అమెరికా; 21.87 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ఈ నెల 6న జరిగే మహిళల 4*100 టీమ్ రిలేలోనూ ఎలైన్ థామ్సన్ బరిలోకి దిగనుంది. Elaine Thompson-Herah does it again! It is the double-double for the #JAM sprint queen in 21.53!#Gold women’s 200m Tokyo 2020#Gold women’s 100m Tokyo 2020#Gold women’s 200m Rio 2016#Gold women’s 100m Rio 2016@WorldAthletics | #StrongerTogether | #Tokyo2020 | #Athletics pic.twitter.com/AENA2JzT1X — Olympics (@Olympics) August 3, 2021 -
మూడో బాక్సర్‌గా లవ్లీనా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది!
టోక్యో/న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో బాక్సింగ్ విభాగంలో భారత్‌కు మూడో పతకం అందించిన మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో ఓడినప్పటికీ ఇప్పటి దాకా ఆమె సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అంకితభావంతో ముందుకు సాగి కాంస్య పతకం గెలిచినందుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు.. ‘‘చాలా బాగా పోరాడావు లవ్లీనా! బాక్సింగ్ రింగ్‌లో ఆమె విజయం ఎంతో మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చింది. కాంస్యం సాధించినందుకు శుభాకాంక్షలు. భవిష్యత్‌లో మరింత మెరుగ్గా రాణించాలి’’ అని ట్విటర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. కాగా బుధవారం జరిగిన బాక్సింగ్ మహిళల 69 కిలోల విభాగం సెమీ ఫైనల్లో లవ్లీనా.. టర్కీ బాక్సర్ బుసేనాజ్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 0-5 తేడాతో లవ్లీనా పరాజయం పాలైంది. అయితే, గతనెల 30న జరిగిన క్వార్టర్స్‌లో చిన్ చైన్‌పై విజయం సాధించినందుకు గానూ లవ్లీనాకు కాంస్య పతకం దక్కింది. ఇక ఇప్పటి వరకు భారత బాక్సింగ్‌లో విజేందర్ సింగ్(2008), మేరీ కోమ్(2012) ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. గర్వంగా ఉంది లవ్లీనా.. ‘‘బాక్సింగ్‌లో భారత్‌కు కాంస్యం. నిన్ను చూసి భారత్ గర్వపడుతోంది లవ్లీనా’’ అని లండన్ ఒలింపిక్స్ పతక విజేత, భారత బాక్సర్ విజేందర్ సింగ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. #IND's Lovlina Borgohain wins India's THIRD medal at #Tokyo2020 - and it's a #Bronze in the women's #Boxing welterweight category! #StrongerTogether | #UnitedByEmotion | #Olympics pic.twitter.com/wcX69n3YEe — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 4, 2021 𝐁𝐑𝐎𝐍𝐙𝐄 𝐈𝐓 𝐈𝐒 🥳 We are proud of you @LovlinaBorgohai , you went on to @Tokyo2020 to play your maiden #Olympics and clinched 🥉 in it. It's a all time 3️⃣rd Olympic medal from #Boxing for 🇮🇳.#RingKeBaazigar#Tokyo2020#Cheer4India#TeamIndia pic.twitter.com/snmCiuWwtL — Boxing Federation (@BFI_official) August 4, 2021 Well fought @LovlinaBorgohai! Her success in the boxing ring inspires several Indians. Her tenacity and determination are admirable. Congratulations to her on winning the Bronze. Best wishes for her future endeavours. #Tokyo2020 — Narendra Modi (@narendramodi) August 4, 2021 -
లవ్లీనాకు వెల్కం : శరవేగంగా పనులు
టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్‌లో సెమీస్‌లోకి దూసుకొచ్చిన భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం వేటలో నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన పోటీలో టర్కీకి చెందిన బుసేనాజ్ సుర్మెనెలీ ఓటమి పాలైంది. అయినా కాంస్య పతకాన్ని గెల్చుకున్నలవ్లీనాపై ‘లవ్లీ’ అంటూ అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు లవ్లీనా స్వగ్రామం అస్సాం రాష్ట్రంలోని బారోముఖియా ఆమెకు వెల్కం చెప్పేందుకు ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో గోలాఘాట్ జిల్లాలోని ఆమె నివాసానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ఊపందు కున్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు ఇక్కడ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 3.5 కిలోమీటర్ల నిర్మితమవుతున్న ఈ రోడ్డు ఒలింపిక్స్ పతకంతో మురిపించిన లవ్లీనాకు వెల్కం చెప్పేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఆ గ్రామంలో సందడి నెలకొంది. మరోవైపు సెమీ ఫైనల్ నేపథ్యంలో అసాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు అసెంబ్లీని వాయిదా వేయాలని నిర్ణయించింది. చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించాలని కోరుకుంటూ తమ అభిమాన బాక్సర్‌ని ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించాలని డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ స్పీకర్ బిశ్వజిత్ డైమరీని అభ్యర్థించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. బౌట్ ముగిసేంతవరకు సభలోని సభ్యులందరూ, అసెంబ్లీ సిబ్బంది దీన్ని వీక్షించారు. కాగా అస్సాం నుంచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి క్రీడాకారిణి, అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న రాష్ట్రం నుండి మొదటి మహిళా అథ్లెట్ కూడా లవ్లీనే కావడం విశేషం. కాగా టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ సెమీస్‌లో లవ్లీనా బొర్గోహైన్‌కు నిరాశ ఎదురైంది. టర్కీకి చెందిన బుసేనాజ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో లవ్లీనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.