Manpreet Singh: తండ్రి కాబోతున్న భారత జట్టు కెప్టెన్‌! | Indian Hockey Skipper Manpreet Singh Announces Baby Coming Soon | Sakshi
Sakshi News home page

Manpreet Singh: తండ్రి కాబోతున్న భారత హాకీ జట్టు కెప్టెన్‌!

Published Sat, Oct 2 2021 1:16 PM | Last Updated on Sat, Oct 2 2021 2:01 PM

Indian Hockey Skipper Manpreet Singh Announces Baby Coming Soon - Sakshi

Indian Hockey Skipper Manpreet Singh: భారత హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నాడు. తొలిసారి తండ్రి కాబోతున్న అనుభూతిని ఆస్వాదిస్తూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బతవుతున్నాడు. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన మన్‌ప్రీత్‌... గర్భవతి అయిన భార్యతో దిగిన ఫొటోను షేర్‌ చేశాడు. తెలుపు రంగు టీషర్టులు వేసుకుని ట్విన్నింగ్‌ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తున్న ఈ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా మన్‌ప్రీత్‌ సింగ్‌ గతేడాది డిసెంబరులో మలేషియా దేశానికి చెందిన తన స్నేహితురాలు ఇలి నజ్వా సిద్ధిఖీని వివాహం చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో జలంధర్‌లో వీరి పెళ్లి జరిగింది. అయితే, ఆ సమయంలో కరోనా వ్యాప్తి కారణంగా విమాన రాకపోకల్లో ఆంక్షలు ఉన్న విషయం విదితమే. ఈ క్రమంలో నజ్వా ప్రత్యేక అనుమతి తీసుకున్నారు.

అయితే, తమకు సమాచారం లేకుండా నజ్వా పంజాబీ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం తప్పుగానే పరిగణిస్తామని మలేసియా ఉప ప్రధాని(మత వ్యవహారాలు) మర్జుక్‌ అప్పట్లో పేర్కొన్నారు. ఇక ఆట విషయానికొస్తే... టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుపొందిన సంగతి తెలిసిందే.

చదవండి: Viral Video: ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. స్లిప్స్‌లో ఎనిమిది మంది ఫీల్డర్లు.. తొలి బంతికే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement