Manpreet singh
-
Manpreet Singh: ‘లాస్ట్’ ఏంజెలిస్!
న్యూఢిల్లీ: ఒకవేళ ఫిట్నెస్ సహకరిస్తే...2028లో జరిగే లాస్ ఏంజెలిస్ (ఎల్ఏ) ఒలింపిక్స్‌లోనూ ఆడి కెరీర్‌కు గుడ్‌బై చెబుతానని భారత హాకీ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మూడేళ్ల క్రితం టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకాన్ని గెలిచిన భారత జట్టుకు మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించాడు. తాజా పారిస్ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంలోనూ కీలకపాత్ర పోషించిన మన్‌ప్రీత్ వరుస ఒలింపిక్స్ పతకాల్లో భాగమయ్యాడు. ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడిన మన్‌ప్రీత్ దిగ్గజాలు ఉధమ్ సింగ్, లెస్లీ క్లాడియస్, ధనరాజ్ పిళ్లై, ఇటీవలే రిటైరైన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ సరసన నిలిచాడు. భారత హాకీకి శ్రీజేశ్ చేసిన సేవలు అందరికీ తెలుసని అన్నాడు. అతనో గ్రేటెస్ట్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. సరిగ్గా ఒలింపిక్స్‌కు ముందు స్విట్జర్లాండ్‌లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిబిరం జట్టుకు బాగా ఉపకరించిందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో 32 ఏళ్ల స్టార్ మిడ్‌ఫీల్డర్ తన భవిష్యత్ లక్ష్యాలతో పాటు వరుస ఒలింపిక్ పతకాలపై తన మనోగతాన్ని వివరించాడు. లక్ష్యం ఎల్ఏ–2028 ‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే ఇది సాధించాలంటే నేను పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉండాలి. నేను ఇలాగే ఫామ్‌ను కొనసాగిస్తూ... ఫిట్నెస్ను కాపాడుకుంటేనే లక్ష్యం చేరుకోగలను. ఇప్పుడు హాకీలో ఫిట్నెస్ ప్రధాన భూమిక పోషిస్తోంది. మైదానంలో చురుకైన పాత్రకు ఇదే కీలకం. ఆ తర్వాతే మిగతావన్నీ’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. అదృష్టవశాత్తూ ఈ వెటరన్ స్టార్ సుదీర్ఘ కెరీర్లో చెప్పుకోదగ్గస్థాయిలో గాయాల బారిన పడలేదు. 378 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లాడిన అతను 44 గోల్స్ చేశాడు. వరుస ఒలింపిక్ పతకాలు ‘ఏ అథ్లెట్ లక్ష్యమైనా ఒలింపిక్ పతకమే! అది ప్రతిఒక్కరి కల. మేం మూడేళ్ల క్రితం టోక్యోలో... ఇప్పుడేమో పారిస్‌లో ఇలా వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల తర్వాతే భారత్... హాకీలో ఇలా వరుస విశ్వక్రీడల్లో పతకాలు గెలిచింది. నేను ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడాను. తొలి రెండు మెగా ఈవెంట్లలో పతకాల్లేవు. కానీ తర్వాత రెండు ఈవెంట్లలో పతకం కల నెరవేరడంతో నా ఆనందానికి హద్దుల్లేవు’ అని హర్షం వ్యక్తం చేశాడు. జట్టు కోసం ఏ పాత్రకైనా... పారిస్‌లో బ్రిటన్‌తో జరిగిన కా>్వర్టర్ ఫైనల్ పోరులో అమిత్ రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ పడటంతో జట్టు పది మందితోనే ఆడాల్సి వచి్చంది. అప్పుడు మన్‌ప్రీత్ డిఫెండర్‌గా రక్షణపంక్తిలో ఉండి జట్టును ఆదుకున్నాడు. ‘నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. జట్టు అవసరాల కోసం నా స్థానం మారినా, ఎక్కడ సర్దుబాటు చేసినా సరే! జట్టు ఏం డిమాండ్ చేస్తే అదే పని నేనూ చేస్తాను. ఇందుకోసం నేను శిక్షణ తీసుకున్నా. ప్రొ లీగ్ హాకీ మ్యాచ్‌ల్లో ఆదే చేశాను. కాబట్టే నా స్థానం మారినా నాకే బెంగ ఉండదు. కష్టమని అనిపించదు. జట్టులో నేను ఎంత కీలకమో... నా బాధ్యతలెంటో నాకు బాగా తెలుసు. మా ప్రణాళికల్ని అమలు చేసేందుకు ఎల్లప్పుడు రెడీగా ఉంటాను’ అని అన్నాడు. మెడలో పతకం... పక్కన భార్యాపిల్లలు! భార్యాపిల్లల సమక్షంలో పతకం గెలుపొందడం చాలా ఆనందాన్నిచి్చందని చెపుకొచ్చాడు. ‘పతకాల ప్రదానోత్సవం ముగిసిన వెంటనే నా భార్య ఇలి నజ్వా సాదిక్ (మలేసియన్), కుమార్తె జాస్మిన్ గ్రౌండ్లోకి రావడం... వారితో నేను సాధించిన పతకం, నా సంతోషం పంచుకోవడం చాలా గొప్ప అనుభూతినిచి్చంది’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లి మెడలో వేసిన మన్‌ప్రీత్ ‘పారిస్’ నుంచి తిరిగి వచి్చన వెంటనే అలాగే చేశాడు. -
కల్నల్ మన్‌ప్రీత్‌కు కీర్తిచక్ర
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులతో పోరులో వీరమరణం పొందిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ హుమయూన్ ముజ్జామిల్ భట్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డ్‌ను ప్రకటించింది. రైఫిల్మన్ రవికుమార్ (మరణానంతరం), మేజర్ మల్ల రామగోపాల్ నాయుడు, (మరణానంతరం)లనూ కీర్తిచక్రతో ప్రభుత్వం గౌరవించింది. శాంతిసమయంలో ప్రకటించే రెండో అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డ్‌కు ఈసారి నలుగురికి ఎంపికచేశారు. అనంత్ నాగ్ అడవుల్లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులను నేరుగా ఎదుర్కొని ఒక ఉగ్రవాదిని కల్నల్ మన్‌ప్రీత్ హతమార్చారు. తర్వాత నక్కిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ముర్ము బుధవారం మొత్తం 103 గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించారు. కీర్తిచక్రతోపాటు 18 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్, 63 మందికి సేనా మెడల్, 11 మందికి నావో సేనా మెడల్, ఆరుగురికి వాయుసేనా మెడల్ ప్రకటించారు. ఒక ప్రెసిడెంట్ తట్‌రక్షక్ మెడల్, మూడు తట్‌రక్షక్ మెడళ్లనూ తీర గస్తీ దళాలకు ప్రకటించారు. -
Paris Olympics: భారత పురుషుల హాకీ జట్టు ప్రకటన
పారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనబోయే భారత పురుషుల హాకీ జట్టును బుధవారం ప్రకటించారు. విశ్వ క్రీడల్లో ఆడబోయే 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించారు.కెప్టెన్‌గా అతడేడ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్‌ను అతడికి డిప్యూటీగా ఎంపిక చేశారు. ఇక ఈ జట్టులో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది. కాగా 2016లో మొదటిసారిగా ఒలింపిక్స్(రియో) జట్టులో చోటు దక్కించుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్.. 2020 టోక్యో క్రీడల జట్టులోనూ భాగమయ్యాడు. అదే విధంగా.. వెటరన్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్, మాజీ కెప్టెన్, మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్‌కు ఇవి నాలుగో ఒలింపిక్స్. భారత హాకీ జట్టు డిఫెన్స్ విభాగం హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్‌లతో పటిష్టంగా ఉంది. ఇక మిడ్ ఫీల్డర్లుగా రాజ్ కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ సత్తా చాటుతున్నారు.అదే విధంగా ఫార్వర్డ్ లైన్లో అభిషేక్ , సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుజ్రాంత్ సింగ్ తదితరులు ఉండనే ఉన్నారు.ఇక వీరితో పాటు అదనపు ఆటగాళ్లుగా గోల్‌కీపర్ క్రిషన్ బహదూర్ పాఠక్, మిడ్ ఫీల్డర్ నీలకంఠ శర్మ, డిఫెండర్ జుగ్రాజ్ సింగ్ అందుబాటులో ఉండనున్నారు. కాగా తమ జట్టు అనుభవజ్ఞులైన, యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లతో సమతూకంగా ఉందని చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫాల్టన్ పేర్కొన్నాడు. ఇక జూలై 29 నుంచి ఒలింపిక్ క్రీడలు ఆరంభం కానున్నాయి.పారిస్ ఒలింపిక్స్‌కు భారత పురుషుల హాకీ జట్టుగోల్ కీపర్: శ్రీజేష్ పరాట్టు రవీంద్రన్డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), సుమిత్, సంజయ్మిడ్ ఫీల్డర్లు: రాజ్ కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ఫార్వర్డ్స్: అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జాంత్ సింగ్ప్రత్యామ్నాయ ఆటగాళ్లు: నీలకంఠ శర్మ, జుగ్రాజ్ సింగ్, క్రిషన్ బహదూర్ పాఠక్.తొలిసారి ఒలింపిక్స్ హాకీ జట్టులో చోటు దక్కించుకున్నది వీళ్లేజర్మన్ప్రీత్ సింగ్, సంజయ్, రాజ్ కుమార్ పాల్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్. -
Colonel Manpreet Singh Funeral: జై హింద్ పాపా!
చండీగడ్: వయసు నిండా ఆరేళ్లే. ఇంకా ముక్కు పచ్చలే ఆరలేదు. కళ్లెదుట కన్న తండ్రి పార్థివ దేహం. అయినా సరే, వీర మరణం పొందిన తండ్రికి అంతే వీరోచితమైన వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో ఏమో.. అంతటి అంతులేని దుఃఖాన్నీ పళ్ల బిగువున అదిమిపెట్టాడు. యుద్ధానికి సిద్ధమయ్యే సైనిక వీరుల యూనిఫాం ధరించాడు. త్రివర్ణ పతాకం కప్పి ఉన్న తండ్రి శవపేటికను మౌనంగా సమీపించాడు. ఆ పేటికనే చిట్టి చేతులతో బిగియారా కౌగిలించుకున్నాడు. ఆ సమయాన ఆ చిన్ని మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో! ఎన్నెన్ని భావాలు చెలరేగాయో! ఎంతటి దుఃఖం పొంగుకొచ్చిందో! అవేవీ పైకి కనిపించనీయలేదు. కన్నీటిని కనీసం కంటి కొసలు కూడా దాటి రానివ్వలేదు. తండ్రి పార్థివ దేహం ముందు సగౌరవంగా ప్రణమిల్లాడు. రుద్ధమైన కంఠంతోనే, ‘జైహింద్ పాపా‘ అంటూ తుది వీడ్కోలు పలికాడు. అందరినీ కంట తడి పెట్టించాడు...! చండీగఢ్: కశ్మీర్ లోయలో ఉగ్ర ముష్కరులను ఏరిపారేసే క్రమంలో వీర మరణం పొందిన సైనిక వీరులు కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ దోంచక్ అంత్యక్రియలు శుక్రవారం అశ్రు నయనాల నడుమ ముగిశాయి. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో మన్‌ప్రీత్ స్వగ్రామం బహరౌన్ జియాన్‌లో ఉదయం నుంచే సందర్శకుల ప్రవాహం మొదలైంది. చూస్తుండగానే జనం ఇసుకేస్తే రాలనంతగా పెరిగిపోయారు. వారందరి సమక్షంలో పూర్తి సైనిక లాంఛనాల నడుమ మన్ ప్రీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా కుమారుడు కబీర్ సింగ్ కనబరిచిన గుండె దిటవు, ’జైహింద్ పాపా’ అంటూ తండ్రికి తుది సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ తో పాటు రాష్ట్ర మంత్రులు, మాజీ సైనికాధిపతి వేదప్రకాశ్ మాలిక్, సైనిక ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మేజర్ ఆశిష్ అంత్యక్రియలు కూడా హరియాణాలోని పానిపట్‌లో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. బుధవారం కశ్మీర్‌లోని కోకొర్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్ ప్రీత్, మేజర్ ఆశిష్‌తో పాటు మొత్తం ముగ్గురు సైనిక సిబ్బంది, ఒక డీఎస్పీ అసువులు బాయడం తెలిసిందే. గుండెలవిసేలా రోదించిన భార్య మన్ ప్రీత్ అంత్యక్రియల సందర్భంగా గుండెలవిసేలా రోదించిన ఆయన భార్యను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గవర్నర్, మంత్రులు తదితరులు మన్ ప్రీత్ భార్య, తల్లి తదితరులను ఓదార్చారు. అంత్యక్రియల సందర్భంగా భారత్ మాతా కీ జై నినాదాలతో ఊరంతా మారుమోగింది. మన్ ప్రీత్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభావంతుడని ఆయన చిన్ననాటి గురువులు గుర్తు చేసుకున్నారు. తమ అభిమాన శిష్యుని అంత్యక్రియల సందర్భంగా వారంతా వెక్కి వెక్కి రోదించారు. ‘మేము వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తున్నాం. అదే సమయంలో, దేశం కోసం ప్రాణాలను ధార పోసిన మా శిష్యుణ్ణి చూసి గర్వంగానూ ఉంది‘ అని మన్‌ప్రీత్‌కు ఒకటో తరగతిలో పాఠాలు చెప్పిన ఆశా చద్దా అనే టీచర్ చెప్పారు. మూడో తరం సైనిక వీరుడు మన్‌ప్రీత్ తన కుటుంబంలో మూడో తరం సైనిక వీరుడు. ఆయనత తాత సైన్యంలో పని చేశారు. ఆయన తండ్రి సైన్యం నుంచి రిటైరయ్యాక తొమ్మిదేళ్ల క్రితం మరణించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి తన కుమారుని పార్థివ దేహం కోసం ఉదయం నుంచే ఇంటి ముందు వేచి చూస్తూ గడిపింది. సైనిక వాహనం నుంచి శవపేటిక దిగగానే కుప్పకూలింది! -
కామన్వెల్త్ గేమ్స్‌కు భారత హాకీ జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలు వాయిదా పడటంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. వచ్చే నెల 28 నుంచి బర్మింగ్హమ్లో జరిగే ఈ క్రీడల్లో పాల్గొనే 18 మంది సభ్యులుగల భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. ఇటీవల ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌ల కోసం మన్‌ప్రీత్ స్థానంలో అమిత్ రోహిదాస్‌ను జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే చైనాలో కరోనా ఉధృతితో ఈ ఏడాది జరగాల్సిన ఆసియా క్రీడలు వాయిదా పడ్డాయి. దాంతో హాకీ ఇండియా కామన్వెల్త్ గేమ్స్ కోసం అగ్రశ్రేణి ఆటగాళ్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండుసార్లు రజత పతకాలు నెగ్గిన భారత్ ఈసారి పూల్ ‘బి’లో ఇంగ్లండ్, కెనడా, వేల్స్, ఘనా జట్లతో ఆడుతుంది. భారత పురుషుల హాకీ జట్టు: మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ సింగ్ (వైస్ కెప్టెన్), పీఆర్ శ్రీజేష్, కృషన్ బహదూర్ పాథక్ (గోల్ కీపర్లు), జుగ్రాజ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, వరుణ్ కుమార్, సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్. చదవండి: వింబుల్డన్ ఆడేందుకు రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన టెన్నిస్ క్రీడాకారిణి -
అమిత్ రోహిదాస్కే భారత హాకీ పగ్గాలు
FIH Pro League: జర్మనీ జట్టుతో ఈనెల 14, 15వ తేదీల్లో భువనేశ్వర్‌లో జరిగే ప్రొ లీగ్ హాకీ మ్యాచ్‌ల్లో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ జట్టులో సభ్యుడిగా, వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. స్వదేశంలో అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో జరిగిన నాలుగు ప్రొ లీగ్ మ్యాచ్‌ల్లో అమిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొమ్మిది జట్లు బరిలో ఉన్న ప్రొ లీగ్‌లో భారత్ 21 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌లో ఉంది. చదవండి: IPL 2022: టైటాన్స్ జోరుకు రైజర్స్ బ్రేక్ -
ఆసియా క్రీడలపైనే దృష్టి: కెప్టెన్
ఈ ఏడాది భారత పురుషుల హాకీ జట్టు ప్రధాన లక్ష్యం ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి 2024 పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడమేనని కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించాడు. వచ్చే నెలలో మొదలయ్యే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు సన్నాహకంగా భావిస్తామని మన్‌ప్రీత్ తెలిపాడు. భువనేశ్వర్‌లో జరిగే ప్రొ హాకీ లీగ్‌లో స్పెయిన్, జర్మనీ, అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో భారత్ ఆడుతుంది. చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్ చేసిన ధావన్ -
పాక్‌పై నెగ్గిన భారత్.. కాంస్యం కైవసం
పురుషులు హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్.. పాకిస్తాన్‌ను 4-3 తేడాతో ఓడించి కాంస్యం కైవసం చేసుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మన్‌ప్రీత్ సింగ్ నిలిచాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ తరపున హర్మన్‌ప్రీత్, అక్షదీప్‌సింగ్, వరుణ్ కుమార్, గుర్‌సాహిబిజిత్ సింగ్‌లు గోల్ చేశారు. చదవండి: BWF Rankings: అదరగొట్టిన కిదాంబి శ్రీకాంత్.. రెండేళ్ల తర్వాత..! ఇక పాకిస్తాన్ తరపున అర్ఫాజ్, అబ్దుల్ రాణా, అహ్మద్ నదీమ్‌లు గోల్ చేశారు. ఇక లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో గ్రూఫ్ టాపర్‌గా నిలిచిన భారత్ సెమీఫైనల్లో మాత్రం జపాన్ చేతిలో చతికిలపడింది. అయితే కాంస్య పతక పోరు కోసం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం భారత్ విజయం సాధించింది. లీగ్ దశలోనూ భారత్ పాకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. -
మన్‌ప్రీత్ సింగ్‌కూ ‘ఖేల్ రత్న’
ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అందుకోనున్న ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది. ఇటీవల 11 మందికి ‘ఖేల్ రత్న’ ప్రకటించగా... తాజాగా ఈ జాబితాలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేరును కూడా చేర్చారు. ఈ ఏడాది 35 మందికి ‘అర్జున’... పది మందికి ‘ద్రోణాచార్య’ అవార్డు... ఐదుగురికి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డు ఇవ్వనున్నారు. ఈనెల 13న రాష్ట్రపతి భవన్లో 2021 జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. -
Colored Rims: నెస్టింగ్ డాల్స్..బెంగళూరు టు చంఢీగఢ్!
ఒకప్పుడు చదువులు పూర్తయ్యాక గానీ ఉద్యోగాన్వేషణ మొదలయ్యేది కాదు. ఇప్పుడా పరిస్థితులు లేవు. వేగంగా పెరిగిపోతున్న టెక్నాలజీని ఒడిసి పట్టుకుని ఆసక్తి ఉన్న రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తుంటే, మరికొందరు నైపుణ్యాలను ఔపోసన పట్టి ఏకంగా స్టార్టప్‌లతో దూసుకుపోతున్నారు. వాళ్లు నిలదొక్కుకోవడమేగాక, మరికొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మన్‌ప్రీత్ సింగ్, శ్రేయా గుప్తా, శృతి చౌహాన్లు ఈ బాటలోనే నడుస్తూ ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. మన్‌ప్రీత్ సింగ్, శ్రేయా గుప్తా, శృతి చౌహాన్లు భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాజీ తొలి బ్యాచ్ విద్యార్థులు. డిగ్రీ నుంచి మంచి స్నేహంగా మెలిగిన ఈ ముగ్గురు తరువాత ఫ్యాషన్ మేనేజ్ మెంట్లో మాస్టర్స్ పూర్తిచేశారు. మాస్టర్స్ చేసే సమయంలో ‘ముగ్గురం కలిసి కొత్తగా ఏదైనా చేద్దాం. ఉద్యోగాలు కాకుండా మనమే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిద్దాం’ అనుకున్నారు. 2015లో మాస్టర్స్ అయ్యాక ముగ్గురూ మూడు రంగాలను ఎంచుకుని వారి ఉద్యోగాల్లో బిజీ అయిపోయినా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కష్టసుఖాలు పంచుకోవడం మానలేదు వారు. ఈ క్రమంలోనే ఒకరోజు శృతి.. ‘‘హ్యాండ్ మేడ్ మార్కెట్ బావుంది. దీనిలో ఏదైనా కొత్తగా చేద్దాం’’ అని ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనే నేడు ఈ ముగ్గురు స్నేహితుల స్టార్టప్‌కు పునాది. కలర్డ్ రిమ్స్ కాలేజీ రోజుల నుంచి బాటిల్ క్యాప్స్ మీద వివిధ రకాల పెయింటింగ్‌లు వేసి ఆకట్టుకునే శృతి ప్రతిపాదన అందరికి నచ్చింది. దీంతో వినూత్నమైన హ్యాండ్ మేడ్ పెయింటింగ్‌ను కలర్పుల్గా తీసుకువస్తే బావుంటుందని భావించారు. ఈ క్రమంలోనే 2016 బెంగళూరులో ‘కలర్డ్ రిమ్స్’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించి నెస్టింగ్ డాల్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు. నెస్టింగ్ డాల్స్ సెట్లో మొత్తం ఆరు బొమ్మలు ఉంటాయి. 17 సెంటీమీటర్ల నుంచి 4.5 సెంటీమీటర్ల మధ్య పరిమాణంలో ఈ డాల్స్ ఉంటాయి. బొమ్మల సైజుతోపాటు బొమ్మల మీద ఉన్న ఆకారాలు మారడం ఈ బొమ్మల ప్రత్యేకత. కలర్డ్ రిమ్స్ టీమ్ వారణాసి, చెన్నైలలో దొరికే బీచ్ ఉడ్‌తో బొమ్మలను తయారు చేస్తున్నారు. కర్రను సిలిండర్ ఆకారంలోకి మార్చడమే ఈ డాల్స్ తయారీలో ముఖ్యమైన... కష్టమైన పని. బొమ్మ ఆకారం తయారయ్యాక దానిమీద వివిధ రకాల పెయింటింగ్స్‌తో అందంగా తీర్చిదిద్దుతారు. పెయింటింగ్స్‌లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, పాతకాలపు బొమ్మల ప్రతిరూపాలు ఉండేలా పెయింట్ చేస్తారు. కస్టమర్లు ఈ బొమ్మలను ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలనుకున్నప్పుడు వారి అభిరుచి మేరకు, సూచించిన విధంగా వివిధ రూపాలను బొమ్మలపై చిత్రీకరిస్తారు. దీనిలో ముఖ కవళికలు అన్ని స్పష్టంగా ఉండేలా తయారు చే స్తారు. చెక్కబొమ్మల(నెస్టింగ్ డాల్స్) పై రంగురంగుల పెయింటింగ్స్ వేసి దేశంలోని వివిధ విమానాశ్రయాలు, షాప్స్‌లో విక్రయిస్తున్నారు. వీరి బొమ్మలకు మంచి ఆదరణ ఉంది. బెంగళూరు టు చండీగఢ్... విక్రయాలు బాగానే జరుగుతున్నా, తయారీకి అయ్యే ఖర్చు కంటే అమ్మగా వచ్చే ఆదాయం తక్కువగా ఉండడాన్ని ముగ్గురు గమనించారు. దీనిని అధిగమించడానికి 2017లో స్టార్టప్‌ను బెంగళూరు నుంచి చండీగఢ్‌కు మార్చారు. జీఎస్టీ భారం, జీవన వ్యయం, ముడిసరుకు కొనుగోలు ఖర్చులు తగ్గడంతో నెస్టింగ్ డాల్స్ తయారీ భారం తగ్గింది. ప్రస్తుతం ఈ స్టార్టప్‌లో శ్రేయా, మన్‌ప్రీత్‌లు మార్కెటింగ్ మేనేజ్మెంట్ చూసుకొంటుండ గా, శృతి ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. వీళ్ల టీమ్‌లో మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. కొంతమంది కాలేజీ విద్యార్థులు, వికలాంగ కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. కరోనా సమయంలో బాగా పడిపోయిన కలర్డ్ రిమ్స్‌కు, కుటుంబాల్లోని అనుబంధాల థీమ్‌ను జోడించి డాల్స్‌ను రూపొందించడంతో ఎక్కువ మంది ఈ డాల్స్‌కు కనెక్ట్ అయ్యారు. దీంతో ఆన్లైన్ విక్రయాలు పెరిగాయి. కుక్క, పిల్లి, తాబేలు బొమ్మలకు ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. అంతేగాక తమకు ఎంతో ఇష్టమైన వారి ముఖచిత్రాలను బొమ్మలపై చిత్రించి బహుమతి ఇవ్వాలనుకున్న వారు సైతం వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముగ్గురు స్నేహితుల నెస్టింగ్ డాల్స్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. -
Manpreet Singh: తండ్రి కాబోతున్న భారత జట్టు కెప్టెన్!
Indian Hockey Skipper Manpreet Singh: భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నాడు. తొలిసారి తండ్రి కాబోతున్న అనుభూతిని ఆస్వాదిస్తూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బతవుతున్నాడు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన మన్‌ప్రీత్... గర్భవతి అయిన భార్యతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. తెలుపు రంగు టీషర్టులు వేసుకుని ట్విన్నింగ్ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తున్న ఈ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మన్‌ప్రీత్ సింగ్ గతేడాది డిసెంబరులో మలేషియా దేశానికి చెందిన తన స్నేహితురాలు ఇలి నజ్వా సిద్ధిఖీని వివాహం చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో జలంధర్‌లో వీరి పెళ్లి జరిగింది. అయితే, ఆ సమయంలో కరోనా వ్యాప్తి కారణంగా విమాన రాకపోకల్లో ఆంక్షలు ఉన్న విషయం విదితమే. ఈ క్రమంలో నజ్వా ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అయితే, తమకు సమాచారం లేకుండా నజ్వా పంజాబీ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం తప్పుగానే పరిగణిస్తామని మలేసియా ఉప ప్రధాని(మత వ్యవహారాలు) మర్జుక్ అప్పట్లో పేర్కొన్నారు. ఇక ఆట విషయానికొస్తే... టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి: Viral Video: ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. స్లిప్స్‌లో ఎనిమిది మంది ఫీల్డర్లు.. తొలి బంతికే! If you don’t know, now ya know! A grand adventure is about to begin in November 💖 #babyIM #babyontheway @illisaddique pic.twitter.com/BuFxlUekUs — Manpreet Singh (@manpreetpawar07) October 1, 2021 -
తల్లి మెడలో కాంస్య పతకం.. ఒడిలో హాయిగా నిద్రపోయాడు
జలంధర్: టీమిండియా పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ చేసిన పని సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒలింపిక్స్ నుంచి ఇటీవలే తన ఇంటికి చేరుకున్న మన్‌ప్రీత్ కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపాడు. ఒలింపిక్స్‌లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లికి చూపించి మురిసిపోయాడు. ఆ తర్వాత తన తల్లి మెడలో ఆ పతకాన్ని వేసి.. ఒడిలో హాయిగా నిద్రపోతున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది. పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ లీగ్‌లో ఆస్ట్రేలియా మినహా మిగతా జట్లపై మంచి విజయాలను నమోదు చేసింది. ఇక సెమీస్‌లో బెల్జియం చేతిలో ఓడినప్పటికి.. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అద్భుతంగా ఆడిన మెన్స్ టీమ్ 5-4 తేడాతో విజయం సాధించి 41 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించింది. ఈ విజయంలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ కీలకం.. ఒత్తిడి సమయాల్లో జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. కాగా ఇటీవలే టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్న పురుషుల హాకీ జట్టు సభ్యులకు ఘన స్వాగతం లభించింది. View this post on Instagram A post shared by Manpreet Singh (@manpreetsingh07) -
గ్రూపులుగా శిక్షణ... జట్టుగా పతకం
మన్‌ప్రీత్ సింగ్ గత 24 గంటలుగా పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాం. ఆటగాళ్లంతా భావోద్వేగంతో ఉన్నారు. టోక్యోలో మేం (పురుషుల హాకీ) కాంస్యం గెలిస్తే... అమ్మాయిల జట్టేమో అద్భుతంగా పోరాడి నాలుగో స్థానంలో నిలిచింది. హాకీలో భారత జట్ల ప్రదర్శన యావత్ జాతిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. ఇరు జట్లు ఇంతగా రాటుదేలడంలో ఎంతో ప్రణాళికబద్ధమైన కృషి దాగి ఉంది. శిక్షణ శిబిరాల్లో, మైదానాల్లో మేం కష్టపడితే... మా కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, హాకీ ఇండియా (హెచ్ఐ) కష్టపడ్డాయి. అవసరమైన అన్నీ ఏర్పాట్లను సమయానుకూలంగా చేసి పెట్టాయి. గతేడాది మార్చి మొదట్లో కరోనా అలజడి మొదలైంది. కేంద్ర క్రీడా శాఖ లాక్‌డౌన్‌కు రెండు వారాల ముందే బెంగళూరు ‘సాయ్’ కేంద్రంలో మమ్మల్ని లాక్‌డౌన్‌కు సిద్ధం చేసింది. తొలుత ఈ కట్టడి కష్టమైనప్పటికీ తర్వాత్తర్వాత కేసుల పెరుగుదలతో అసలు సమస్య ఏంటో అర్థమైంది. లాక్డౌన్ తర్వాత తెర మీదికొచ్చిన కోవిడ్ ప్రొటోకాల్ పాటించడం అనివార్యమైంది. భౌతిక దూరంతో మా శిక్షణ కూడా మారింది. ఒకే శిబిరంలో ఉన్నా... కోవిడ్ రిస్క్ దృష్ట్యా గ్రూపులుగా, బ్యాచ్‌లుగా శిక్షణ ఇచ్చారు. ఇదే ఇప్పుడు జట్టుగా పతకం గెలిచేందుకు ఉపయోగపడింది. శిక్షణ ముగిసినా క్వారంటైన్, ఐసోలేషన్‌లతో ఇంటిముఖం చూసేందుకు నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. 2019 డిసెంబర్లో జట్లను టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చేర్చడం మాకెంతో మేలైంది. దీంతో ఎక్కడా మాకు నిధుల కొరతే ఎదురుకాలేదు. మహమ్మారి వల్ల మ్యాచ్ ప్రాక్టీస్ కోల్పోయిన మాకు జూనియర్ జట్లతో ఏర్పాటు చేసిన పోటీలు కూడా ఉపయోగపడ్డాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాటలు మాకెంతో స్ఫూర్తినిచ్చాయి. టోక్యోకు వెళ్లేముందు, పతకం గెలిచాక ఆయన వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఉత్తేజపరడం, స్ఫూర్తి రగిలించడం కన్నా గొప్ప రివార్డు, అవార్డులు ఏముంటాయి. -
భారత హాకీ జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు
-
మాటలు రావడం లేదు.. చివరి 6 సెకన్లలో..
టోక్యో: ‘‘అసలేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఈ భావన ఎంతో అద్భుతంగా ఉంది. తొలుత మేం 3-1 తేడాతో వెనుకంజలో ఉన్నాం. కానీ, మేం పతకానికి అర్హులమని గాఢంగా విశ్వసించాం. గత 15 నెలలుగా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. బెంగళూరులో ఉన్న సమయంలో మాలో కొంత మందికి కరోనా కూడా సోకింది. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేశాం. చివరి ఆరు సెకన్లలో వాళ్లకు పెనాల్టీ కార్నర్ లభించింది. ప్రాణాలకు తెగించైనా సరే దానిని అడ్డుకోవాలని భావించాం. అది నిజంగా ఎంతో కష్టతరమైనది. సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్ పతకం లభించింది. అవును.. మనం సాధించగలమనే విశ్వాసం పెరిగింది. ఒలింపిక్స్‌లో గెలిస్తే ఎక్కడైనా గెలవగలమనే నమ్మకం పెరుగుతుంది. పడి లేచాం. తిరిగి పోరాడాం. ఇప్పుడు మెడల్. ఇది నిజంగా ఎంతో అద్భుతమైన భావన ’’ అని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. కాంస్య పతక పోరులో జర్మనీపై విజయం సాధించిన అనంతరం అతడు స్పందిస్తూ.. ‘‘స్వర్ణ పతకం కోసం ఇక్కడికి వచ్చాం. కాంస్యం గెలిచాం. అయినా పర్లేదు. హాకీ అభిమానులకు ఇదొక గొప్ప జ్ఞాపకంగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నాడు. ఈ విజయాన్ని కోవిడ్ వారియర్స్‌కు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ఇక మ్యాచ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ప్రీత్, కోచ్‌తో ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలిపారు. గొప్ప టోర్నమెంట్లో పతకం గురువారం నాటి మ్యాచ్‌లో గోల్‌తో రాణించిన రూపీందర్ పాల్ సింగ్.. ‘‘ఎప్పుడూ ఇంత గొప్ప ఫీలింగ్ కలగలేదు. గోల్డ్ కోసం వచ్చాం. కాంస్య పతకం గెలిచాం. అది కూడా గొప్ప టోర్నమెంట్లో’’ అని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు జర్మనీని 5-4 తేడాతో ఓడించి కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ తరఫున సిమ్రన్‌జీత్ రెండు, హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్, రూపీందర్ పాల్ సింగ్ ఒక్కో గోల్ చేసి ఆకట్టుకున్నారు. అదే విధంగా గోల్ కీపర్ శ్రీజేష్ అడ్డుగోడలా నిలబడి జర్మనీని గోల్స్ చేయకుండా కట్టడి చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా ఈ విజయంతో తాజా ఒలింపిక్స్‌లో భారత్ గెలిచిన పతకాల సంఖ్య ఐదుకు చేరుకుంది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం, షట్లర్ పీవీ సింధు కాంస్యం, బాక్సర్ లవ్లీనా కాంస్యం, పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించగా.. రెజ్లర్ రవికుమార్ దహియాకు ఇప్పటికే పతకం ఖాయమైంది. గురువారం అతడు ఫైనల్లో తలపడనున్నాడు. మీ అభిప్రాయం చెప్పండి: Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు? -
1980 తర్వాత తొలిసారి; కాంస్య పోరు.. ఫొటోలు వైరల్
Indian Men's Hockey Won Bronze Emotions In Pics: టోక్యో ఒలిపింక్స్‌లో భారత కీర్తి పతాకను ఎగురవేసిన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 1980 తర్వాత హాకీలో తొలి ఒలింపిక్ పతకం సొంతం కావడంతో భారతీయుల హృదయం సంతోషంతో నిండిపోయింది. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాగా కాంస్య పతక పోరులో మన్‌ప్రీత్ సేన జర్మనీపై అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి క్వార్టర్ ముగిసే సరికి గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి వచ్చిన జర్మనీ.. రెండో క్వార్టర్లోనూ 3-1తేడాతో ఆధిపత్యం కనబరిచింది. అయితే, వెంటనే భారత్ సైతం గోల్ కొట్టి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించడంతో పోరు రసవత్తరంగా మారింది. ఇక రెండో క్వార్టర్ ముగిసే సరికి రెండు జట్లు మూడేసి గోల్స్‌తో (3-3) సమంగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆ తర్వాత మూడో క్వార్టర్ ముగిసే సరికి 5-3 తేడాతో భారత్ ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. A COMEBACK of the highest order! 🔥🔥🔥#IND scored two back-to-back goals in the second quarter to make it 3-3 vs #GER and then broke through in the third quarter to turn the match in their favour. 👏#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #BestOfTokyo pic.twitter.com/SW8ZrbGrTp — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 5, 2021 కానీ, చివరి క్వార్టర్లో జర్మనీ గోల్ చేసి 5-4కు ఆధిక్యాన్ని తగ్గించడంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్నప్పటికీ భారత డిఫెన్స్ టీం చక్కగా రాణించి విజయాన్ని ఖాయం చేసింది. భారత్ తరఫున సిమ్రన్‌జీత్ రెండు, హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్, రూపీందర్ పాల్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. గోల్‌కీపర్ శ్రీజేష్ చక్కగా రాణించాడు. An UNFORGETTABLE moment! 🙌😍 The one that #IND has been hungry for over 41 long years. ❤️#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #BestOfTokyo | #Hockey | #Bronze pic.twitter.com/R530dyTjS1 — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 5, 2021 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హాకీలో ఘోరంగా...
ఓ రోజు ముందు మహిళల జట్టు కనబరిచిన పేలవమైన ప్రదర్శనను మరుసటి రోజు పురుషుల జట్టూ మన కళ్లముందుంచింది. పూల్ ‘ఎ’లో ఆదివారం జరిగిన రెండో లీగ్‌లో భారత జట్టు 1–7తో ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియా చేతిలో పరాభవం చవిచూసింది. మన్‌ప్రీత్ బృందం అన్ని రంగాల్లో విఫలమైంది. డిఫెండర్లు ప్రత్యర్థి జోరును అడ్డుకోలేకపోయారు. మన మిడ్‌ఫీల్డర్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ను ఛేదించలేకపోయారు. భారత్ తరఫున ఏకైక గోల్‌ను దిల్‌ప్రీత్ సింగ్ (34వ ని.లో) చేశాడు. ఆసీస్ శిబిరంలో బ్లేక్ గోవర్స్ (40వ, 42వ ని.) రెండు గోల్స్ చేయగా, డానియెల్ (10వ ని.), హేవర్డ్ (21వ ని.), అండ్రూ ఫ్లిన్ (23వ ని.), బెల్జ్ (26వ ని.), టిమ్ బ్రాండ్ (51వ ని.) తలా ఒక గోల్ చేశారు. -
పతాకధారులుగా మేరీకోమ్, మన్‌ప్రీత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈనెల 23న జరిగే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో వీరిద్దరు భారత బృందానికి పతాకధారులుగా (ఫ్లాగ్ బేరర్స్) వ్యవహరించనున్నారు. ఈ మేరకు మేరీకోమ్, మన్‌ప్రీత్ సింగ్ పేర్లను ఖరారు చేస్తూ టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సమాచారం ఇచ్చింది. ఆగస్టు 8న ఒలింపిక్స్ ముగింపు ఉత్సవంలో భారత బృందానికి స్టార్ రెజ్లర్, ప్రస్తుత ఆసియా, కామన్వెల్త్ క్రీడల చాంపియన్ బజరంగ్ ఫ్లాగ్ బేరర్‌గా ఉంటాడని ఐఓఏ తెలిపింది. ఇప్పటివరకైతే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో మొత్తం 115 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. లింగ సమానత్వం పాటించాలనే సదుద్దేశంతో ఈసారి నుంచి ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో ఆయా దేశాలు ఇద్దరు చొప్పున (1 మహిళ, 1 పురుషుడు) క్రీడాకారులకు పతాకధారులుగా వ్యవహరించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా భారత బృందానికి ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించాడు. బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి విశ్వ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం నెగ్గిన ఏకైక భారతీయ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. బాక్సింగ్‌కే మణిహారం... మణిపూర్‌కు చెందిన 38 ఏళ్ల మేరీకోమ్ కెరీర్లో చివరిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనుంది. దాంతో ఆమెకు గౌరవప్రద వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఐఓఏ ఫ్లాగ్ బేరర్‌గా ఎంపిక చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన మేరీకోమ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. 2014 ఆసియా క్రీడల్లో... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు నెగ్గిన మేరీకోమ్ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు కూడా గెల్చుకుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న మేరీకోమ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ (2020), పద్మభూషణ్ (2013), పద్మశ్రీ (2006) పౌర పురస్కారాలు.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న–2009’ ‘అర్జున అవార్డు–2003’ కూడా లభించాయి. అంచెలంచెలుగా... పంజాబ్‌లోని జలంధర్ పట్టణానికి చెందిన 28 ఏళ్ల మన్‌ప్రీత్ సింగ్ 2011లో తొలిసారి భారత సీనియర్ పురుషుల హాకీ జట్టులోకి వచ్చాడు. హాఫ్ బ్యాక్ పొజిషన్లో ఆడే మన్‌ప్రీత్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో, 2016 రియో ఒలింపిక్స్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ అతనే భారత్‌కు సారథ్యం వహించనున్నాడు. ఇప్పటి వరకు 269 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఆడిన మన్‌ప్రీత్ 22 గోల్స్ చేశాడు. 2019లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డు పొందిన తొలి భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన మన్‌ప్రీత్ సారథ్యంలో 2019లో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలిచి ‘టోక్యో’ బెర్త్ సంపాదించింది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన భారత జట్టులో మన్‌ప్రీత్ సభ్యుడిగా ఉన్నాడు. నా కెరీర్‌లోని చివరి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న సందర్భంగా ఈ గౌరవం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఓఏకు, కేంద్ర క్రీడా శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరోసారి పతకం సాధించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. –మేరీకోమ్ భారత్ తరఫున ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవంలో పతాకధారిగా వ్యవహరించనున్న మూడో మహిళా క్రీడాకారిణి మేరీకోమ్. గతంలో అథ్లెట్లు షైనీ విల్సన్ (1992 బార్సిలోనా), అంజూ జార్జి (2004 ఏథెన్స్)లకు ఈ గౌరవం దక్కింది. నా కెరీర్లో ఇదో గొప్ప ఘట్టం. ఆనందంలో నాకు మాటలు రావడంలేదు. మేరీకోమ్ లాంటి దిగ్గజ క్రీడాకారిణితో కలిసి ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత్ బృందానికి పతాకధారిగా వ్యవహరించబోతున్నందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. –మన్‌ప్రీత్ సింగ్ భారత్ తరఫున ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పతాకధారిగా వ్యవహరించనున్న ఆరో హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్. గతంలో లాల్షా (1932–లాస్ ఏంజెలిస్), ధ్యాన్‌చంద్ (1936–బెర్లిన్), బల్బీర్‌సింగ్ సీనియర్ (1952 హెల్సింకి, 1956 మెల్బోర్న్), జఫర్ ఇక్బాల్ (1984–లాస్ ఏంజెలిస్), పర్గత్ సింగ్ (1996–అట్లాంటా)లకు ఈ గౌరవం లభించింది. -
మన్‌ప్రీత్ పెళ్లిపై వివాదం
కొటాబహరు (మలేసియా): భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పెళ్లికి సంబంధించి అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. తన చిరకాల స్నేహితురాలు, మలేసియా దేశానికి చెందిన ఇలి నజ్వా సిద్దీఖీని గత బుధవారం జలంధర్‌లో మన్‌ప్రీత్ పెళ్లి చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో ఈ వివాహం జరిగింది. అయితే దీనిపైనే మలేసియా దేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ముస్లిం మహిళ అయిన నజ్వా ఇలా పెళ్లి చేసుకోవడం ఏమిటని, ఆమె మతం మార్చుకుందా అంటూ ప్రశ్నలు వచ్చాయి. చివరకు ఇందులో మలేసియా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కరోనా కారణంగా విమాన రాకపోకల్లో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పెళ్లి కోసమంటూ నజ్వా ప్రత్యేక అనుమతి తీసుకొని భారత్‌కు వచ్చినట్లు సమాచారం. అయితే మలేసియా ఉప ప్రధాని (మత వ్యవహారాలు) అహ్మద్ మర్జుక్ మాత్రం తమకు ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని...నజ్వా స్వదేశానికి తిరిగొచ్చి అన్ని అంశాలపై స్పష్టతనివ్వాల్సి ఉందని చెప్పారు. ‘ఇలి నజ్వా సొంత రాష్ట్రం జొహర్ ప్రభుత్వ అధికారుల నుంచి మరిన్ని వివరాలు కోరాం. ప్రస్తుతానికి మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆమె ముస్లిం. ఇంకా మతం మారలేదు. విదేశంలో పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా ఆమె ప్రభుత్వానికి ఎలాంటి దరఖాస్తు పంపించలేదు. ఆమె ముస్లింగానే ఉంటూ పంజాబీ తరహా పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పు చేసినట్లుగానే భావిస్తాం’ అని మర్జుక్ అన్నారు. తాజా వివాదంపై అధికారికంగా నజ్వా కానీ మన్‌ప్రీత్ సింగ్ కానీ ఇంకా స్పందించలేదు. -
మన్‌ప్రీత్ ‘పాజిటివ్’
న్యూఢిల్లీ: భారత హాకీలో కోవిడ్–19 కలకలం చెలరేగింది. భారత పురుషుల సీనియర్ హాకీ జట్టు సభ్యులు ఐదుగురు కరోనా బారిన పడ్డారు. కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తోపాటు డిఫెండర్ సురేందర్ కుమార్, జస్కరణ్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, కిషన్ పాఠక్‌లకు వైరస్ సోకింది. నెల రోజుల విరామం తర్వాత... వీరందరూ తమ స్వస్థలాల నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి హాజరయ్యేందుకు వచ్చారు. వీరందరికీ కోవిడ్–19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ‘నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. కరోనా నియంత్రణలో భాగంగా ‘సాయ్’ వర్గాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నాను’ అని మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. స్వస్థలాల నుంచి బెంగళూరుకు వచ్చే క్రమంలో వీరికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. మన్‌ప్రీత్, సురేందర్‌లో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఈ ఇద్దరితోపాటు మరో పది మంది ఆటగాళ్లు గురువారం ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. ఇతర ఆటగాళ్ల ఫలితాలు రావాల్సి ఉన్నాయి. -
‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా మన్‌ప్రీత్ సింగ్
లుసానే: భారత పురుషుల హాకీ జట్టు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించిన సారథి మన్‌ప్రీత్ సింగ్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.పురుషుల విభాగంలో 2019 ఏడాదికి గానూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెల్చుకున్నాడు. దాంతో ఈ అవార్డును గెల్చుకున్న తొలి భారత హాకీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ అవార్డు కోసం బెల్జియం ప్లేయర్ ఆర్థర్ వాన్ డోరెన్, అర్జెంటీనా ఆటగాడు లుకాస్ విల్లాలు పోటీ పడగా... పోలైన మొత్తం ఓట్లలో 35.2 శాతం ఓట్లను దక్కించుకున్న మన్‌ప్రీత్ విజేతగా నిలిచాడు. ఆర్థర్ 19.7 శాతం, లుకాస్ 16.5 శాతం ఓట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ అవార్డును తన జట్టు సభ్యులకు అంకితమిస్తున్నట్లు మన్‌ప్రీత్ తెలిపాడు. 2019లో తమ ప్రధాన లక్ష్యం ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే అని... రష్యాతో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా ఒలింపిక్ కల నెరవేరిందని ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. 2011లో భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన మన్‌ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు 263 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడాడు. అంతే కాకుండా 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ల్లో భారత్‌కు ఆడాడు. 2017లో సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇక వెనుదిరిగి చూడలేదు. ముఖ్యంగా 2019లో భారత హాకీ జట్టుకు అద్వితీయమైన విజయాలను అందించాడు. భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ చాంపియన్‌గా భారత్‌ను నిలబెట్టడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ బెర్తును ఖాయం చేశాడు. వీటితో పాటు టోక్యోలో జరిగిన ఒలింపిక్ టెస్టు ఈవెంట్ విజేతగా... సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఫైనల్స్‌కు భారత్‌ను చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే మన్‌ప్రీత్‌తో పాటు భారత యువ మిడ్‌ఫీల్డర్ వివేక్ సాగర్ ప్రసాద్ ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెల్చుకున్నాడు. మహిళల విభాగంలో ఇదే అవార్డును భారత ప్లేయర్ లాల్రెమ్సియామి గెల్చుకుంది. -
ఎఫ్ఐహెచ్ అవార్డు రేసులో మన్‌ప్రీత్
లుసానే (స్విట్జర్లాండ్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులను నామినేట్ చేశారు. భారత సీనియర్ పురుషుల జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో ఉండగా... వివేక్ ప్రసాద్, లాల్రెమ్సియామి వరుసగా పురుషుల, మహిళల ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు బరిలో ఉన్నారు. 27 ఏళ్ల మన్‌ప్రీత్ భారత్ తరఫున 242 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అతని సారథ్యంలోనే భారత జట్టు ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో రష్యాపై గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 19 ఏళ్ల వివేక్ ప్రసాద్ గత ఏడాది యూత్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు రజతం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 19 ఏళ్ల లాల్రెమ్సియామి ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళల జట్టులో సభ్యురాలిగా ఉంది. జాతీయ సంఘాలు, ఆటగాళ్లు, అభిమానులు, హాకీ జర్నలిస్ట్‌లు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఓటింగ్ వచ్చే ఏడాది జనవరి 17 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరిలో విజేతలను ప్రకటిస్తారు. -
మన్‌ప్రీత్, శ్రీజేష్‌లకు విశ్రాంతి
న్యూఢిల్లీ: రెగ్యులర్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మాజీ కెప్టెన్, గోల్ కీపర్ శ్రీజేశ్‌లకు విశ్రాంతి కల్పిస్తూ... ఆగస్టు 17 నుంచి 21 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్లో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత హాకీ జట్టును హాకీ ఇండియా గురువారం ప్రకటించింది. డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు తాత్కాలిక సారథ్య బాధ్యతలను అప్పగించింది. అతనికి డిప్యూటీగా మన్దీప్ సింగ్ వ్యవహరించనున్నారు. నవంబర్‌లో జరిగే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్టు జట్టు కోచ్ గ్రాహమ్ రీడ్ తెలిపారు. సీనియర్ల గైర్హాజరీలో ఆశిస్ టోప్నో, షంషేర్ సింగ్‌లు తొలి సారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. భారత జట్టు: హర్మన్ ప్రీత్ సింగ్ (కెప్టెన్), మన్దీప్ సింగ్ (వైస్ కెప్టెన్), క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కెర, గురీందర్ సింగ్, కొత్తాజిత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్, జస్కరణ్ సింగ్, గుర్సాహిబ్జిత్ సింగ్, నీలమ్ సంజీప్, జర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, ఆశిస్ టోప్నొ, ఎస్వీ సునీల్, గుర్జంత్ సింగ్, షంషేర్ సింగ్. -
అజేయ భారత్
భువనేశ్వర్: సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చలాయించిన భారత పురుషుల హాకీ జట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన ఫైనల్లో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 5–1 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ, 25వ నిమిషాల్లో), వరుణ్ కుమార్ (2వ, 49వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ సాధించగా... వివేక్ ప్రసాద్ (35వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున రిచర్డ్ పౌట్జ్ (53వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. తుది ఫలితంతో సంబంధం భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 4–2తో అమెరికాను ఓడించింది. అదే జోరు... లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్... సెమీఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ను చిత్తుగా ఓడించింది. అదే జోరును ఫైనల్లోనూ కనబరిచింది. ఆట మొదలైన రెండో నిమిషంలోనే వరుణ్ కుమార్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను, పెనాల్టీ స్ట్రోక్‌ను లక్ష్యానికి చేర్చడంతో భారత ఆధిక్యం 3–0కి పెరిగింది. ఆ తర్వాత భారత్ అదే దూకుడు కొనసాగించగా... దక్షిణాఫ్రికా డీలా పడింది. ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత్ 35 గోల్స్ సాధించి, కేవలం నాలుగు గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. -
భారత్ రెండో విజయం
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ హాకీ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో శుక్రవారం భారత్ 3–1తో పోలాండ్‌పై గెలుపొందింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (21వ, 26వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... డ్రాగ్ ఫ్లిక్కర్ హర్మన్‌ప్రీత్ సింగ్ (36వ ని.) ఒక గోల్ చేశాడు. పోలాండ్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మాతెజ్ హల్బోజ్ (25వ ని.) సాధించాడు. శుక్రవారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ 3–1తో మెక్సికోపై, రష్యా 12–1తో ఉజ్బెకిస్తాన్‌పై విజయం సాధించాయి. సోమవారం జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది.