తమ పంచ్ పవర్‌ను చాటుకుంటూ భారత బాక్సర్లు మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు
ఆసియా సీనియర్ బాక్సింగ్
బ్యాంకాక్ : తమ పంచ్ పవర్‌ను చాటుకుంటూ భారత బాక్సర్లు మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన వీరిద్దరూ శనివారం నేరుగా తమ ప్రత్యర్థులతో ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌లో తలపడ్డారు. మన్‌ప్రీత్ సింగ్ 3-0తో నువాన్ సుగీవ సంపత్ (శ్రీలంక)పై... సతీశ్ 3-0తో జిన్ హ్యోక్ (ఉత్తర కొరియా)పై విజయం సాధించారు. అయితే భారత్‌కే చెందిన మరో బాక్సర్ మనీశ్ కౌశిక్ (60 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది.