అది ‘క్లీన్‌ చిట్‌’ కాదు బాబు మెడకు బిగుస్తున్న ఉచ్చు | Andhra Pradesh: ED attaches Rs 23. 54 cr property in skill scam case | Sakshi
Sakshi News home page

అది ‘క్లీన్‌ చిట్‌’ కాదు బాబు మెడకు బిగుస్తున్న ఉచ్చు

Published Thu, Oct 17 2024 4:14 AM | Last Updated on Thu, Oct 17 2024 4:14 AM

Andhra Pradesh: ED attaches Rs 23. 54 cr property in skill scam case

స్కిల్‌ స్కామ్‌లో ఈడీ తాజాగా రూ.23.54 కోట్ల ఆస్తుల అటాచ్‌

దాన్ని తప్పుదోవ పట్టిస్తూ చంద్రబాబుకు క్లీన్‌ చిట్‌గా ప్రచారం  

నిందితులకు ఆస్తులెలా వచ్చాయి? 

13 చోట్ల సంతకం పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయలేదా? 

బయటకు పోయిన సొమ్మును దారి మళ్లించింది వాస్తవం కాదా? 

విచారణే పూర్తి కాకుండా క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు ఎలా చెప్పుకుంటారు? 

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్‌రెడ్డి

సాక్షి, అమరావతి: స్కిల్‌ స్కామ్‌లో చంద్ర­బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరె­క్టరేట్‌ (ఈడీ) క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని, ఈడీ దర్యాప్తుతో ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి చెప్పారు. అయినా క్లీన్‌చిట్‌ ఇచ్చి పూలదండలు వేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నా­రని ఎద్దేవా చేశారు. రూ.371 కోట్ల ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించి తిరిగి తన ఖజానాకు మళ్లించుకున్నారని, ఈడీ దర్యాప్తులో ఇదే కచ్చితంగా తేలుతుందని స్పష్టం చేశారు.

సతీష్ కుమార్‌ రెడ్డి బుధవారం తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడి­యాతో మాట్లాడుతూ.. స్కిల్‌ స్కా­మ్‌లో ఈడీ తాజాగా రూ.23.54 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేస్తే.. దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈడీ చంద్రబాబుకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదమని అన్నారు.  కేసులో చంద్రబాబును ముద్దాయిగా ఈడీ గుర్తించిందని, అందుకే అటాచ్‌మెంట్‌ రాగానే వణికిపోతున్నారని, అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని అన్నారు. 

ఈడీ ప్రెస్‌నోట్‌లో క్లీన్‌చిట్‌ విషయం లేకపోయినా, ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని చెప్పారు. క్లీన్‌చిట్‌ ఇవ్వాల్సింది కోర్టులని, విచారణ పూర్తి కాకుండానే క్లీన్‌ చిట్‌ వచ్చిందని ఎలా చెప్పుకుంటారని ప్రశి్నంచారు.   నిందితులకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయని, వాటికి డబ్బులు ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబే 13 చోట్ల సంతకం పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం నిజం కాదా అని నిలదీశారు. బాబు సంతకం లేకుండా ప్రభు­త్వ సొమ్ము ఎలా బయటకెళ్లిందన్నారు. ఆయ­న సంతకంతో ప్రభుత్వ సొమ్ము బయటకు పోయినప్పుడు చంద్రబాబు నేరస్తుడు కాకుండా పోతా­డా? అని ప్రశ్నించారు. అలా బయటకు వెళ్లిన సొ­మ్ము­ను దారి మళ్లించిన మాట వాస్తవం కాదా అని నిలదీ­శారు. ఇన్ని ఆధారాలు స్పష్టంగా ఉంటే,  ఈ­డీ క్లీన్‌­చిట్‌ ఇచి్చందని ఎలా చెప్పుకుంటారని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement