assets attached
-
అది ‘క్లీన్ చిట్’ కాదు బాబు మెడకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఈడీ దర్యాప్తుతో ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి చెప్పారు. అయినా క్లీన్చిట్ ఇచ్చి పూలదండలు వేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రూ.371 కోట్ల ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించి తిరిగి తన ఖజానాకు మళ్లించుకున్నారని, ఈడీ దర్యాప్తులో ఇదే కచ్చితంగా తేలుతుందని స్పష్టం చేశారు.సతీష్ కుమార్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్‌లో ఈడీ తాజాగా రూ.23.54 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తే.. దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈడీ చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచ్చిందని టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదమని అన్నారు. కేసులో చంద్రబాబును ముద్దాయిగా ఈడీ గుర్తించిందని, అందుకే అటాచ్మెంట్ రాగానే వణికిపోతున్నారని, అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని అన్నారు. ఈడీ ప్రెస్‌నోట్‌లో క్లీన్చిట్ విషయం లేకపోయినా, ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని చెప్పారు. క్లీన్చిట్ ఇవ్వాల్సింది కోర్టులని, విచారణ పూర్తి కాకుండానే క్లీన్ చిట్ వచ్చిందని ఎలా చెప్పుకుంటారని ప్రశి్నంచారు. నిందితులకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయని, వాటికి డబ్బులు ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబే 13 చోట్ల సంతకం పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం నిజం కాదా అని నిలదీశారు. బాబు సంతకం లేకుండా ప్రభుత్వ సొమ్ము ఎలా బయటకెళ్లిందన్నారు. ఆయన సంతకంతో ప్రభుత్వ సొమ్ము బయటకు పోయినప్పుడు చంద్రబాబు నేరస్తుడు కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు. అలా బయటకు వెళ్లిన సొమ్మును దారి మళ్లించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఇన్ని ఆధారాలు స్పష్టంగా ఉంటే, ఈడీ క్లీన్చిట్ ఇచి్చందని ఎలా చెప్పుకుంటారని అన్నారు. -
నీరవ్ మోదీ రూ.29.75 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల విలువైన తాజా ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. రూ. 6,498 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసు విచారణలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈడీ జప్తు చేసిన వాటిల్లో స్థిరాస్తులు, ఇండియాలో బ్యాంకు బ్యాలెన్స్‌లు ఉన్నట్టు తెలిపారు.మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)-2002 కింద ముంబై జోనల్ కార్యాలయం ఈ జప్తులు చేపట్టింది. కాగా ఇంతకు ముందు భారత్‌తో పాటు విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీకి చెందిన రూ.2,596 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇవే గాక పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం (ఎఫ్ఈఓఏ)-2018 కింద ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మరో రూ.692.90 కోట్ల ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైలులో ఉన్నారు -
G7 Summit 2024: జీ7 ప్యాకేజీ ఎప్పుడు? ఎలా?
28 నెలలుగా కొనసాగుతున్న రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ చాలావరకు ధ్వంసమైంది. యుద్ధం ఆగేదెన్నడో, ఉక్రెయిన్ పునరి్నర్మాణం మొదలయ్యేదెప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జీ7 దేశాల కూటమి 50 బిలియన్ డాలర్ల (రూ.4.17 లక్షల కోట్లు) రుణ ప్యాకేజీని ప్రకటించడం ఉక్రెయిన్‌కు ఎంతగానో ఊరట కలిగించే పరిణామం అనే చెప్పాలి. వివిధ దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయం నుంచే ఈ ప్యాకేజీని ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్లు జీ7 దేశాలు వెల్లడించాయి. దీనిపై ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ విజేతగా నిలవడానికి ఈ సాయం ఒక గొప్ప ముందడుగు అని అభివరి్ణంచారు. ఈ నేపథ్యంలో జీ7 ప్రకటించిన రుణ ప్యాకేజీ, ఉక్రెయిన్‌కు కలిగే లబ్ధి, ఇందులో ఇమిడి ఉన్న ఇబ్బందులు, వివిధ దేశాలు స్తంభింపజేసిన రష్యా ఆస్తుల గురించి తెలుసుకుందాం. 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై హఠాత్తుగా దాడికి దిగింది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సైతం ఎదురుదాడి ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. వేలాది మంది సామాన్య ప్రజలు, సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలంటూ పశి్చమ దేశాలు హెచ్చరించినా రష్యా లెక్కచేయడం లేదు. దీంతో రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి తమ దేశంలో ఉన్న రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను పశి్చమ దేశాలు స్తంభింపజేశాయి. ఈ ఆస్తుల విలువ 300 బిలియన్ డాలర్ల (రూ.25.06 లక్షల కోట్లు) వరకు ఉంటుంది. వీటిపై ప్రతి సంవత్సరం 3 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్లు) వడ్డీ, ఆదాయం లభిస్తోంది. రష్యా ఆస్తులు చాలావరకు ఐరోపా దేశాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నందుకు రష్యా పరిహారం చెల్లించాల్సిందేనని అమెరికా సహా పశి్చమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు రష్యా ఒప్పుకోవడం లేదు. దాంతో రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీని, ఆదాయాన్ని పరిహారం కింద ఉక్రెయిన్‌కు ఇవ్వాలని తాజాగా జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇబ్బందులు ఏమిటి? విదేశాల్లో ఉన్న ఆస్తులు ఒకవేళ మళ్లీ రష్యా నియంత్రణలోకి వస్తే రుణాన్ని తిరిగి చెల్లించడం కష్టమే. స్తంభింపజేసిన రష్యా ఆస్తులను శాంతి చర్చల్లో భాగంగా విడుదల చేయాల్సి వస్తే రుణాన్ని చెల్లించడానికి జీ7 దేశాలు మరో మార్గం వెతుక్కోవాలి. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రష్యా ఆస్తులపై కొన్నిసార్లు అనుకున్నంత వడ్డీ గానీ, ఆదాయం గానీ రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులెదురవుతాయి. అలాగే రుణ భారాన్ని జీ7 దేశాలన్నీ పంచుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో వారం రోజుల్లో తుది ప్రణాళికను ఖరారు చేయనున్నారు. యూరప్‌లోని రష్యా ఆస్తులపై ఆంక్షలను కొనసాగించడానికి ప్రతిఏటా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ఓటింగ్ జరుగుతోంది. ఈయూలోని ఏ ఒక్క సభ్యదేశం వీటో చేసినా ఆంక్షలు రద్దవుతాయి. ఆస్తులు రష్యా అ«దీనంలోకి వెళ్లిపోతాయి. ఈయూలోని హంగేరీ దేశం ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ హంగేరీ వీటో చేస్తే ఉక్రెయిన్ రుణ ప్యాకేజీ ప్రణాళికలు మొత్తం తలకిందులవుతాయి. తమ ఆస్తులపై వచ్చే వడ్డీని, ఆదాయాన్ని పశి్చమ దేశాలు మింగేస్తామంటే రష్యా చూస్తూ కూర్చోదు కదా! కచ్చితంగా ప్రతీకార చర్యలకు దిగుతుంది. రష్యాలోనూ పశి్చమ దేశాల ఆస్తులున్నాయి. వాటిని రష్యా ప్రభుత్వం గతంలోనే స్తంభింపజేసింది. తమ ఆస్తులపై వడ్డీని కాజేసినందుకు ప్రతిచర్యగా పశ్చిమదేశాల ఆస్తులపై వడ్డీని సైతం రష్యా లాక్కొనే అవకాశం లేకపోలేదు. హక్కులు బదిలీ చేయడం సాధ్యమేనా? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నష్టపరిహారంగా ఉక్రెయిన్‌కు ఇవ్వాలనుకోవడం బాగానే ఉన్నప్పటికీ ఇందులో చట్టపరమైన అవరోధాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రష్యా అంగీకారం లేకుండా ఇలా చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటున్నారు. మొండిగా ముందుకెళ్తే తీవ్ర వివాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తొలుత న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఒక దేశానికి సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసిప్పటికీ వాటిపై హక్కులను ఇతర దేశాలకు బదిలీ చేయడం సాధ్యం కాదు. అవి ఎప్పటికైనా సొంత దేశానికే చెందుతాయి. భౌగోళికంగా తమ దేశంలో ఉన్న ఇతర దేశాల ఆస్తులను ఆయా దేశాల అనుమతి లేకుండా స్వా«దీనం చేసుకొని అనుభవిస్తామంటే కుదరదు. రష్యా ఆస్తులను ఎలా వాడుకోవచ్చు? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు ఇచ్చేసే అవకాశం లేదు. జీ7లోని ఏ దేశమైనా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకొని ఆ సొమ్మును ఉక్రెయిన్‌కు ఇవ్వొచ్చు. రుణాన్ని తీర్చేయడానికి రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీ, ఆదాయాన్ని చెల్లించవచ్చు. తమకు అందే సొమ్మును ఆయుధాలు కొనుగోలు చేయడానికి, దేశ పునరి్నర్మాణానికి ఉక్రెయిన్ ఉపయోగించుకొనేందుకు ఆస్కారం ఉంది. జీ7 నుంచి రుణ ప్యాకేజీ ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు చేరే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి రాబోయే పదేళ్లలో 486 బిలియన్ డాలర్లు (రూ.40.58 లక్షల కోట్లు) అవసరం. ఇది ముమ్మాటికీ దొంగతనమే: పుతిన్ రష్యా ఆస్తులపై వచ్చే ఆదాయంతో ఉక్రెయిన్‌కు ప్యాకేజీ ఇవ్వాలన్న జీ7 దేశాల నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ దొంగతనమేనని చెప్పారు. చోరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తమ ఆస్తుల జోలికి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. పుతిన్ శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీ7 దేశాల నిర్ణయంపై చర్చించారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా దొంగతనం కచ్చితంగా దొంగతనమే అవుతుందన్నారు. జీ7 దేశాల నిర్ణయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా శుక్రవారం ఖండించారు. ఈ నిర్ణయం చట్టపరంగా చెల్లదని తేలి్చచెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉదయనిధి స్టాలిన్ ఫౌండేషన్ ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి నడిపే ఫౌండేషన్‌కు చెందిన రూ.36 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఫౌండేషన్‌కు చెందిన తమిళనాడులోని రూ.36 కోట్ల విలువైన స్థిరాస్తులను, రూ.34.7 లక్షల బ్యాంక్ డిపాజిట్లను ఈనెల 25న అటాచ్ చేసినట్లు వివరించింది. ఈ కేసు దర్యాప్తులో కల్లాల్ గ్రూప్, యూకే కేంద్రంగా పనిచేసే లైకా గ్రూప్ అనుబంధంగా భారత్‌లోని లైకా ప్రొడక్షన్స్, లైకా హోటల్స్‌లో సోదాలు జరిపినట్లు తెలిపింది. -
ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసిన ఈడీ
న్యూఢిల్లీ: దేశంలో అక్రమ నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసింది. వీరిలో పలు కార్పొరేట్ సంస్థల డైరెక్టర్లున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు ఈ మేరకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ‘‘కార్పొరేట్ మోసాలకు సంబంధించి స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులపై ఈడీ కేసులు పెట్టింది. రూ.33,862.20 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. వీటిలో రూ.15,113 కోట్ల ఆస్తులను ప్రభుత్వ బ్యాంకులు అధీనంలోకి తీసుకున్నాయి. ఈడీ అప్పగించిన ఆస్తులను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం విక్రయించి రూ.7,975.27 కోట్లు ఆర్జించింది’’ అని మంత్రి వివరించారు. -
Bengal Schools Scam: పార్థా చటర్జీకి చెందిన రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ, ఆయన సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన రూ.46.22 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రాష్ట్రంలో 2016లో చోటుచేసుకున్న టీచర్ల నియామకం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పార్థా చటర్జీ, అర్పితా ముఖర్జీల ఆస్తులను జప్తు చేసినట్లు సోమవారం తెలిపింది. ఈడీ సోమవారం వీరిపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ వేసింది. వీరిద్దరినీ ఈడీ జూలైలో అరెస్ట్ చేసింది. వీరికి చెందిన పలు ప్రాంతాల్లో దాడులు జరిపిన ఈడీ రూ.55 కోట్ల నగలు, నగదును స్వాధీనం చేసుకుంది. ఇలా ఉండగా, ఇదే కుంభకోణానికి సంబంధించి సీబీఐ నార్త్ బెంగాల్ యూనివర్సిటీ వీసీ సుబిరెస్ భట్టాచార్యను సోమవారం అరెస్ట్ చేసింది. అప్పట్లో ఆయన బెంగాల్ సెంట్రల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉండేవారు. -
కార్వీ స్కామ్: భారీగా ఆస్తులు స్వాధీనం
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కెఎస్‌బీఎల్) సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. కార్వీ సీఎండీ పార్థసారథి ఇతరులపై మనీ లాండరింగ్ విచారణకు సంబంధించి రూ.110 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ శనివారం తెలిపింది. కార్వీ స్కామ్‌లో మనీలాండరింగ్ యాక్డ్ కింద కార్వీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఈ కేసులో ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ మొత్తం విలువ రూ.2,095 కోట్లకు చేరుకుంది. ఇందులో షేర్లు, భూములు, భవనాల షేర్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు ఉన్నాయి. కాగా దాదాపు రూ. 2,800 కోట్ల విలువైన తమ ఖాతాదారుల షేర్లను అక్రమంగా తాకట్టు పెట్టి కార్వీ గ్రూప్ పెద్ద మొత్తంలో రుణాలు పొందిందని, ఆ రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయని ఆరోపిస్తూ రుణాలిచ్చిన బ్యాంకుల ఫిర్యాదులపై హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదైంది. విచారణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో పార్థసారథి గ్రూప్ సీఎఫ్‌వో జి కృష్ణ హరిని అరెస్టు చేసింది. ఇద్దరూ ఇప్పుడు బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. -
నీరవ్ ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.253.62 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నీరవ్ కంపెనీలకు చెందిన రత్నాలు, నగలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసినట్లు తెలిపింది. సుమారు రూ.16వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ప్రస్తుతం యూకేలో జైలు శిక్ష అనుభవిస్తున్న నీరవ్‌ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు తుదిదశలో ఉన్నట్లు పేర్కొంది. తాజా జప్తుతో కలిపి నీరవ్‌కు చెందిన మొత్తం రూ.2,650 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లయిందని వివరించింది. -
బ్యాంకులను మోసగించిన కేసులో రూ.100 కోట్ల ఆస్తుల జప్తు
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ)/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన రెబ్బా సత్యనారాయణ, అతడి కుటుంబసభ్యుల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం జప్తు (అటాచ్) చేసింది. చేపల చెరువుల కోసం రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకు నుంచి 143 మంది బినామీల పేరుతో రూ.112.41 కోట్ల రుణం తీసుకున్న ఆయనపై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వ్యవసాయ భూములు, చేపల చెరువులు, బ్యాంకులో నగదు, ప్లాట్ల రూపంలో ఉన్న రూ.100 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తుచేసింది. సత్యనారాయణ అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఒక సంస్థకు 24 లక్షల డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆధారాలను సేకరించాల్సి ఉందని ఈడీ ప్రకటించింది. బినామీల పేర్లతో రుణాలు తీసుకుని ఆ ఖాతాల్లోకి డబ్బు రాగానే సత్యనారాయణ విత్‌డ్రా చేసుకున్నాడు. ఈడీ అటాచ్ చేసిన సత్యనారాయణ ఆస్తులు అతడి పేరుమీదే కాకుండా కుటుంబసభ్యులు, బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేశాడు. ఆ ఆస్తులను ఇతర బ్యాంకులకు తనఖా పెట్టి మళ్లీ రుణాలు తీసుకున్నాడు. ఎగుమతులు, దిగుమతుల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. బినామీల పేరు మీద రుణాలు పొంది బ్యాంకును మోసం చేసినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు గ్రహించి సత్యనారాయణపై కేసు పెట్టడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు గత కొన్నేళ్లుగా ఇదే విధంగా బ్యాంకులను మోసం చేస్తూ బినామీ వ్యాపారాల కోసం రుణాలు పొందుతూ, కొత్త రుణాలతో పాత రుణాలను సెటిల్ చేస్తూ వస్తున్నట్లు వెల్లడైంది. బినామీ పేర్లతో రుణాలు తీసుకున్న వ్యవహారంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. -
చిన్నమ్మకు గట్టి షాకిచ్చిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నె: తమిళనాడు రాష్ట్రంలోకి అడుగుపెట్టి 24 గంటలు గడిచాయో లేదో అప్పుడే తమిళనాడు ప్రభుత్వం శశికళకు షాక్ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ అడుగుపెట్టిన వెంటనే ఆమెకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని సోమవారం చెన్నైకు చేరుకున్న శశికళకు అభిమానులు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జయలలితకు తానే వారుసురాలిని, అన్నాడీఎంకే తనదేనని, తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పూనుకుందని సమాచారం. ఈ క్రమంలోనే వందల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తూత్తుకుడి జిల్లాలో ఉన్న 800 ఎకరాల భూములను ప్రభుత్వం జప్తు చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కోట్లు విలువ చేసే భూములను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే జప్తు చేసిన ఆస్తులన్నీ ఇలవరసి, సుధాకరన్ పేరుతో ఉన్నట్లు తెలుస్తోంది. శశికళ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తునకు సంబంధించి 2017లో సుప్రీంకోర్టు తీర్పునివ్వగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. -
మాయా సోదరుడి 400 కోట్ల స్థలం అటాచ్
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన ప్లాట్‌ను ఆదాయపన్ను శాఖ(ఐటీ) అటాచ్ చేసింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోని నొయిడాలో ఏడెకరాల్లో బినామీ పేరుతో ఉన్న ఈ స్థలం అసలు యజమాని మాయా సోదరుడు ఆనంద్ కుమార్, అతని భార్యకు చెందినట్లుగా ఐటీ అనుమానిస్తోంది. కాగా, కుమార్‌ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మాయావతి ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐటీకి చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్(బీపీయూ) ఈ మేరకు ఈ నెల 16వ తేదీన అటాచ్మెంట్ ఉత్తర్వులు వెలువరించింది. నోయిడాలోని సెక్టర్ 94లో 28వేలకు పైగా చదరపు మీటర్లు అంటే సుమారు ఏడెకరాల వాణిజ్య భూమిలో ఫైవ్‌స్టార్ హోటల్, ఇతర నిర్మాణాలు చేపట్టాలని ఆనంద్‌కుమార్, అతని భార్య విచితర్ లత ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఇది వారి పేరు బదులు మరొకరి పేరుతో ఉంది. మార్కెట్లో ఈ భూమి విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భూమి కొనుగోలు కోసం ఆరు బినామీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా అక్రమ సంపాదనను హవాలా మార్గంలో మళ్లించినట్లు ఐటీ విభాగం అనుమానిస్తోంది. బినామీ చట్టం–1988ని మోదీ ప్రభుత్వం 2016 నుంచి అమలు చేస్తోంది. ఈ చట్టం కింద దోషిగా తేలిన వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు సదరు ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం మేర జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఐటీ చట్టం–1961 ప్రకారం కూడా విచారించే వీలుంటుంది. దేశంలో బినామీ ప్రొహిబిషన్ చట్టం అమలు అధికారం ఐటీ విభాగానికి ఉంది. -
అగస్టా కేసులో ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో న్యాయవాది గౌతం ఖెతాన్‌కు చెందిన రూ.8.46 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అటాచ్ చేసింది. రెండో దశ విచారణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. వెల్లడించని విదేశీ ఖాతాలను ఆయన కలిగి ఉన్నారని వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా భారీ మొత్తంలో సింగపూర్, మారిషస్ దేశాల నుంచి విదేశీ కరెన్సీని ఖెతాన్ పొందినట్లు విచారణలో తేలిందని ఈడీ వివరించింది. ఢిల్లీ, హరియాణా, ఉత్తరాఖండ్‌లలో ఆయన ఆస్తులు కలిగి ఉన్నారని, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అగస్టా కేసులో నిందితుడిగా ఉన్న ఖెతాన్ బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసి ఆయనను జనవరి 25న అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆదాయపన్ను శాఖ వివరాలను ఆధారంగా చేసుకుని తాజాగా ఆయనపై మరో కేసును ఈడీ నమోదు చేసింది. -
రాబర్ట్ వాద్రా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లో అక్రమాస్తుల కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బికనీర్ భూ కుంభకోణం కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి వాద్రా కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ లిమిటెడ్‌కు చెందిన రూ 4.62 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఈడీ అటాచ్ చేసింది. ఇదే కేసులో మరికొందరి ఇతరుల ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది. భూ నిర్వాసితులకు కేటాయించిన భూమిని రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కేవలం రూ 72 లక్షలకే దాదాపు 150 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అదే భూమిని రూ 5.15 కోట్లకు అలిగెన్సీ అనే కంపెనీకి విక్రయించారని ఈడీ ఆరోపిస్తోంది. అక్రమ లావాదేవీ ద్వారా ఆయన మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ వాద్రాపై అభియోగాలు మోపింది. -
కార్తీ చిదంబరం ఆస్తులు అటాచ్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన సంస్థకు చెందిన భారత్, బ్రిటన్, స్పెయిన్లలో రూ 54 కోట్ల ఆస్తులను ఈడీ గురువారం అటాచ్ చేసింది. ఈ కేసులో దాఖలైన ఎఫ్ఐఆర్కు అనుగుణంగా గత ఏడాది మే 15న కార్తీని చెన్నైలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి రూ 305 కోట్ల నిధులు సమకూర్చేందుకు ఎఫ్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ లభించడంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐపీబీ క్లియరెన్స్ లభించేలా చేసినందుకు కార్తీ చిదంబరం రూ పది లక్షల ముడుపులు స్వీకరించారని ఆరోపించిన సీబీఐ ఆ తర్వాత ఆ మొత్తాన్ని 100 మిలియన్ డాలర్లుగా సవరించింది. -
లాలూ ఫ్యామిలీకి భారీ షాక్
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి భారీ షాక్ తగిలింది. లాలూ కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్న 11 ఫ్లాట్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) జప్తు చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలో షాపింగ్ మాల్ నిర్మాణం జరగుతున్నట్టు తెలుస్తోంది. మార్కెట్ రేట్ ప్రకారం వీటి విలువ 44.75 కోట్ల రూపాయలు ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఐఆర్సీటీసీ హోటల్ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినందుకు ఈడీ ఈ స్థలాన్ని సీజ్ చేసినట్టు ఈడీ తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఫ్లాట్లను జప్తు చేసినట్టు పేర్కొంది. ఈడీ జప్తు చేసిన ప్రాపర్టీ తొలుత డీలైట్ మార్కెటింగ్ ప్రైవేటు కపంనీ పేరు మీద ఉండగా.. ప్రస్తుతం లారా ప్రాజెక్ట్స్ పేరు మీద ఉన్నాయి. అందులో లాలూ సతీమణి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవితో పాటు లాలూ తనయులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పటికే దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కోర్టు ఆరువారాల ప్రొవిజనల్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
డైమండ్ కింగ్ నీరవ్ మోదీకి మరో షాక్
న్యూఢిల్లీ : డైమండ్ కింగ్ నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును భారీ కుంభకోణంలో ముంచెత్తి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి చెందిన 170 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మోదీ ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్టు ఈడీ చెప్పింది. వీటిలో నీరవ్ మోదీ ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై, సూరత్‌లో ఉన్న పండ్ర ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఉన్నాయి. మరో అత్యంత విలువైన ప్రాపర్టీ అయిన హెచ్‌సీఎల్ హౌజ్ కూడా ఈ అటాచ్‌మెంట్స్‌లో ఉంది. దీని విలువ దాదాపు 63 కోట్ల రూపాయలు. ఆస్తుల అటాచ్మెంట్ మాత్రమే కాక, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నీరవ్ మోదీకి, సోదరుడు నిశాల్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లు, వీరి సంస్థల ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకు అకౌంట్లను కూడా అటాచ్ చేసుకుంది. మొత్తం వీటిలో 104 బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, వీటి విలువ 58 కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలిసింది. నీరవ్‌మోదీకి చెందిన పలు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లను, నీరవ్ మోదీ సంస్థలకు చెందిన 4 కోట్ల రూపాయల విలువైన 11 వాహనాలను ఏజెన్సీ అటాచ్ చేసినట్టు వెల్లడైంది. పీఎన్బీలో వీరు దాదాపు రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో వీరి సంస్థలపై, ఆస్తులపై, బ్యాంకు అకౌంట్లపై దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్నాయి. మరోవైపు, నీరవ్ మోదీ బంధువులకు కూడా సమన్లు జారీ అయ్యాయి. స్కాంకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని, ఆయన మేనమామ మెహుల్ చౌక్సిలను ఎలాగైనా భారత్‌కు రప్పించాలని ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. -
మరో 44 కోట్లు అటాచ్!
ముంబై/న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం నీరవ్ మోదీకి సంబంధించిన 44 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. నీరవ్ భార్య అమీ, మామ చోక్సీలు 26న విచారణకు రావాలని సమన్లు జారీచేసింది. వివిధ ప్రాంతాల్లో నీరవ్ ఆస్తులపై జరిగిన సోదాల్లో దిగుమతి చేసుకున్న ఖరీదైన చేతివాచీలను, ఇతర ముఖ్యమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, గీతాంజలి గ్రూప్‌నకు సంబంధించిన 144 బ్యాంకు అకౌంట్లను (రూ.20.26కోట్లు) ఐటీ అధికారులు అటాచ్ చేశారు. అటు, నీరవ్ మోదీ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నటి ప్రియాంకా చోప్రా.. ఆ సంస్థతో తన కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నారు. రొటొమ్యాక్ యజమాని విక్రమ్ కొఠారీ, ఆయన కుమారుడు రాహుల్‌లను ఒక్కరోజు సీబీఐ తాత్కాలిక రిమాండ్‌కు అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలిచ్చింది. లక్నో కోర్టులో హాజరుపరిచేందుకు సీబీఐకి అనుమతిచ్చింది. -
శశికళకు భారీ షాక్!
నకిలీ, బోగస్ పేర్లతో ఉన్న సంస్థల జప్తులో భాగంగా శశికళ, ఆమె కుటుంబ ఆస్తులపై కేంద్రం గురిపెట్టినట్టు సమాచారం. ఇందుకు తగ్గ కసరత్తుల్లో సీఎం పళనిస్వామి ప్రభుత్వం నిమగ్నమైనట్టు తెలిసింది. నల్లధనం నిర్మూలన లక్ష్యంగా చర్యలు చేపట్టిన కేంద్రం, నకిలీ, బోగస్ సంస్థలను గుర్తించి, వాటి భరతం పట్టే విధంగా ముందుకు సాగుతోంది. ఆయా సంస్థల ఆస్తుల్ని జప్తుచేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ, కుటుంబీకుల సంస్థలు కూడా ఉన్నట్టు సమాచారం. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో అమ్మ జయలలిత గొడుగు నీడలో గతంలో చిన్నమ్మ శశికళ కుటుంబం సాగించిన అవినీతి భాగోతాలకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిని పసిగట్టిన జయలలిత 2011లో శశికళ కుటుంబీకుల్ని సాగనంపిన విషయం తెలిసిందే. జయలలితకు తెలియకుండా కోట్లాది రూపాయాల్ని ఆర్జించి, విదేశీ బ్యాంకుల ద్వారా కొన్ని సంస్థలకు నగదు బదిలీలు సాగినట్టు ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చి ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం కేసు శశికళతో పాటు ఆమె కుటుంబానికి చెందిన పలువురి మీద ఉండడం ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన జాబితాలో పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ, ఆమె కుటుంబానికి చెందిన పలు సంస్థల పేర్లు ఉన్నట్టు తెలిసింది. నకిలీ కంపెనీలుగా గుర్తింపు శశికళ, ఆమె కుటుంబీకుల పేర్లతో ఉన్న ఆరేడు కంపెనీలు నకిలీవిగా గుర్తించి, వాటి ఆస్తుల జప్తు మీద దృష్టి పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఎప్పుడెప్పుడు చిన్నమ్మ కుటుంబం భరతంపడుదామా..? అని ఎదురుచూస్తున్న సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే పాలకులు ఇందుకు తగ్గ పనుల్ని చాప కింద నీరులా వేగవంతం చేసినట్టు తెలిసింది. చిన్నమ్మ కుటుంబీకుల ఆస్తుల్ని, సంస్థల్ని గుర్తించడం పాలకులకు పెద్ద కష్టం ఉండదని చెప్పవచ్చు. ఇందుకు కారణం, ఇదివరకు చిన్నమ్మ గొడుగు నీడలో అమ్మకు పాదపూజ చేసిన వాళ్లే ప్రస్తుతం అధికారంలో ఉండటమే. -
మంత్రిగారి ఆస్తులు ఎటాచ్!
ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆస్తులను ఆదాయపన్ను శాఖ అధికారులు ఎటాచ్ చేశారు. దేశ రాజధానిలో ఆయనకు ఉన్న దాదాపు 40 ఎకరాల బూమితో పాటు పలు కంపెనీలలో ఉన్న షేర్లను కూడా ఎటాచ్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మధ్య వార్ మరింత ముదిరింది. భూమి రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ. 17 కోట్లు, షేర్ల విలువ రూ. 16 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మార్కెట్ విలువ ఇంకా ఎక్కువేనంటున్నారు. ఇండో మెటల్ఇంపెక్స్, అకించన్ డెవలపర్స్, ప్రయాస్ ఇన్ఫోసొల్యూషన్స్, మంగల్యతన్ ప్రాజెక్ట్స్ కంపెనీలలో ఉన్న షేర్లను కూడా ఎటాచ్ చేశారు. ఈ కంపెనీలకు సత్యేంద్ర జైన్ నగదు రూపంలో చెల్లింపులు చేసి, షేర్ల కొనుగోలుకు అక్రమంగా బుక్ ఎంట్రీలు చేయించుకుంటున్నారని పన్ను అధికారులు ఆరోపించారు. ఇండోమెటల్ఇంపెక్స్కు చెందిన మరికొంత భూమిని కూడా ఎటాచ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతులైన మంత్రులలో సత్యేంద్ర జైన్ ఒకరు. ఆయనకు ఆరోగ్యం, రవాణా, పీడబ్ల్యుడీ లాంటి కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఆదాయపన్ను శాఖ చర్యలపై సత్యేంద్ర జైన్‌ను మీడియా ప్రశ్నించగా, ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రాథమికంగా 90 రోజుల పాటు ఈ ఎటాచ్మెంట్ ఉంటుంది. బినామీ లావాదేవీలతో సంపాదించిన సొమ్ముతోనే ఈ ఆస్తులన్నింటినీ సేకరించారని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఆదాయాన్ని దాచిపెట్టినందుకు మంత్రిపై ప్రత్యేకంగా దర్యాప్తు జరుగుతోంది. కోల్‌కతాకు చెందిన బడా ఆపరేటర్లు జీవేంద్ర మిశ్రా, అభిషేక్ చొఖానీ, రాజేంద్ర బన్సల్ తదితరులతో సత్యేంద్ర జైన్‌కు సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. వీళ్లు నగదు తీసుకుని కేవలం కాగితాల మీదే ఉన్న కంపెనీల షేర్లను ఎక్కువ ధరలకు ఇస్తారు. ఆ షేర్ల రూపంలో వాళ్ల డబ్బంతా తెల్లధనం అయిపోతుంది.