నీరవ్ మోదీ
ముంబై/న్యూఢిల్లీ: పీఎన్‌బీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం నీరవ్ మోదీకి సంబంధించిన 44 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. నీరవ్ భార్య అమీ, మామ చోక్సీలు 26న విచారణకు రావాలని సమన్లు జారీచేసింది. వివిధ ప్రాంతాల్లో నీరవ్ ఆస్తులపై జరిగిన సోదాల్లో దిగుమతి చేసుకున్న ఖరీదైన చేతివాచీలను, ఇతర ముఖ్యమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, గీతాంజలి గ్రూప్‌నకు సంబంధించిన 144 బ్యాంకు అకౌంట్లను (రూ.20.26కోట్లు) ఐటీ అధికారులు అటాచ్ చేశారు. అటు, నీరవ్ మోదీ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నటి ప్రియాంకా చోప్రా.. ఆ సంస్థతో తన కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నారు. రొటొమ్యాక్ యజమాని విక్రమ్ కొఠారీ, ఆయన కుమారుడు రాహుల్‌లను ఒక్కరోజు సీబీఐ తాత్కాలిక రిమాండ్‌కు అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలిచ్చింది. లక్నో కోర్టులో హాజరుపరిచేందుకు సీబీఐకి అనుమతిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment