PNB Scam
-
ఇంటర్‌పోల్ నిర్ణయం: చోక్సీకి విముక్తి లభించినట్టేనా?
సాక్షి,ముంబై: పీఎన్బీలో రూ. 13,000 కోట్ల మోసానికి పాల్పడి భారతదేశంనుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు నుంచి మెహుల్ చోక్సీని ఎందుకు తొలగించారనేది చర్చనీయాంశంగా మారింది. చోక్సీ లాయర్ ఏమన్నారంటే? తన క్లయింట్ (మెహుల్ చోక్సీ) వ్యతిరేకంగా జారీ అయిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు విత్ డ్రా చేసిందని, ఇది సంతోషించ దగ్గ పరిణామమని చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ ప్రకటించారు. లీగల్ టీమ్ ఇంటర్‌పోల్‌తో విచారణ జరుపుతోంది. తాజా నిర్ణయంతో ఇపుడు అతను భారతదేశం మినహా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగొచ్చని, ఇది ఇండియాలో అతనిపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ వ్యాజ్యాన్ని ప్రభావితం చేయదని కూడా ప్రకటించారు. (పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం) The legal team is taking up the matter with Interpol. Interpool has removed RCN on my client (Mehul Choksi) and now he is free to travel anywhere except India. This is not going to affect his criminal litigation pending in India. This RCN was an effort that he can be caught and… https://t.co/hN9zGXOnYP pic.twitter.com/BY5m4oRQV5 — ANI (@ANI) March 21, 2023 ఇంటర్‌పోల్ నిర్ణయం ప్రభావితం చేయదు మరోవైపు మెహుల్ చోక్సీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సిఎన్) రద్దు కేసును ప్రభావితం చేయదని కేంద్రం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.ఈ కేసు ఇప్పటికే అధునాతన దశలో ఉందని చోక్సీ అరెస్టు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది. అసలు ఏం జరిగింది? సంచలన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడిగా విదేశాలకు చెక్కేసిన మెహుల్చోక్సీని ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుంచి ఉపసంహరించుకుందనేది ఇపుడు హాట్ టాపిక్. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని వాదించి చోక్సీ, సీబీఐ చార్జ్‌షీటు, రెడ్ కార్నర్ నోటీసులపై సీబీఐ అభ్యర్థనను సవాల్ చేస్తూ లియోన్ హెడ్‌క్వార్టర్స్ ఏజెన్సీకి అప్పీల్ చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఇంటర్‌పోల్ ఐదుగురు సభ్యుల కమిటీ ఈ కేసును పరిశీలించింది. ముఖ్యంగా డొమినికాలో చోక్సీని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వెలువడిన తర్వాత భారతదేశంలో న్యాయమైన విచారణ జరగక పోవచ్చని కమిటీ తెలిపింది. ఈ కేసు రాజకీయ కుట్ర ఫలితమని పేర్కొంది. హిందూస్తాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ఇంటర్‌పోల్ ఇలా ప్రకటించింది. చోక్సీని ఆంటిగ్వా నుండి డొమినికాకు కిడ్నాప్ చేయడంలో అంతిమ ఉద్దేశ్యం ఇండియాకు రప్పించడమేనని వ్యాఖ్యానించింది. అలాగే చోక్సిని ఇండియాకు తరలిస్తే.. ఈ కేసులో న్యాయమైన విచారణ లేదా అనారోగ్యంతో ఉన్న చోక్సి సరియైన చికిత్స పొందే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొంది. -
పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం
సాక్షి,ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 13వేల కోట్ల రుణం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న మెహుల్ చోక్సీకి సంబంధించికీలక పరిణామంకలకలం రేపింది. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు లిస్ట్‌నుంచి చోక్సీ పేరును తొలగించింది. దీంతో అతనిని స్వదేశానికి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బేనని విమర్శలు వెల్లువెత్తాయి. 2018 డిసెంబర్లో జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ ఇపుడు ఉపసంహరించుకోవడం గమనార్హం. అంటే మెహుల్ చోక్సీ విదేశీ గడ్డపై దొరికితే అరెస్ట్ చేసే అధికారాన్ని భారత ప్రభుత్వం కోల్పోయినట్టే. అయితే తాజా పరిణామంపై సీబీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్నమెహుల్ చోక్సీ పేరు ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుండి తొలగించారు. లియోన్-హెడ్‌క్వార్టర్డ్ ఏజెన్సీకి చోక్సి అప్పీల్ మేరకే చోక్సీ పేరును రెడ్ లిస్ట్‌లో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఇంటర్‌పోల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. అయిదేళ్లనుంచి పరారీలో ఉన్న చోక్సీని ఇండియాకు ఎపుడు రప్పిస్తారంటూ కాంగ్రెస్ ట్విటర్ ద్వారా మోదీ సర్కార్‌ను ప్రశ్నించింది. PM मोदी का चहेता मेहुल 'भाई' चोकसी अब वांटेड नहीं रहा। भगोड़े मेहुल चोकसी के खिलाफ इंटरपोल ने रेड कॉर्नर नोटिस हटा लिया है। PM मोदी जवाब दें कि आपके 'मेहुल भाई' को देश वापस कब लाया जाएगा। 5 साल से फरार है, अब और कितना वक्त चाहिए? — Congress (@INCIndia) March 20, 2023 రెడ్ నోటీసు (లేదా రెడ్ కార్నర్ నోటీసు) 2018లో డిసెంబరు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. నాలుగేళ్ల తరువాత మెహుల్ చోక్సీని రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ తొలగించింది. తాజా నివేదికల ప్రకారం ఆ నోటీసు ఇప్పుడు ఇంటర్‌పోల్ వెబ్సైట్లో అందుబాటులో లేదు. మంగళవారం ఉదయం 8 గంటల నాటికి, మొత్తం రెడ్ నోటీసుల సంఖ్య 7023కి చేరింది. ఇంటర్‌పోల్‌లో 195 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు అనేది అప్పగించడం, లొంగిపోవడం లేదా ఇలాంటి చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాన్ని అమలు చేసేవారికి చేసే అభ్యర్థన. రెడ్ నోటీసు అరెస్ట్ వారెంట్‌తో సమానం కాదు. అయితే సంబంధిత వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అనేదానిపై సభ్యదేశాలు తమ స్వంత చట్టాలను వర్తింపజేయాలి. అనేక సందర్భాల్లో నిందితుడిని కోరుకున్న దేశానికి అప్పగిస్తారు. కాగా పీఎన్బీ స్కాం ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీకి దగ్గరి బంధువు మెహుల్ చోక్సీ. దేశంలో అతిపెద్ద స్కాం వెలుగులోకి రావడంతో ఆంటిగ్వా , బార్బుడా పారిపోయి, అక్కడి పౌరసత్వం పొందాడు. ఈడీ, సీబీఐ దర్యాప్తు, ఫుజిటివ్ నేరస్తుడుగా కేంద్రం ప్రకటించింది. సీబీఐ అభ్యర్థన మేరకు పది నెలల తర్వాత ఇంటర్‌పోల్ అతడి రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే సీబీఐ ఛార్జిషీట్‌పై చోక్సీ అభ్యంతరాలు లేవనెత్తడంతోపాటు,పలు సందర్భాల్లో భారతీయ జైళ్లు, ఆరోగ్య సమస్యలను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈ కీలక పరిణామాల మధ్య మే 2021లో చోక్సీ ఆంటిగ్వా నుండి అదృశ్యమైనాడు. ఆ తరువాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడన్న ఆరోపణలపై డొమినికాలో అరెస్ట్ కావడంతో 51 రోజులు డొమినికా జైలులో గడిపాడు. అనంతరం అక్రమంగా ప్రవేశించిన చోక్సీపై ఉన్న అన్ని అభియోగాలను కూడా డొమినికా కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
వేల కోట్లు ఎగొట్టి.. ఇప్పుడేమో డబ్బులు లేవు, అప్పు తీసుకోవాలంటున్న ఘనుడు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.11వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని వేల కోట్లు స్కాంలో కీలక నిందితుడు అయిన నీరవ్ దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని చెబుతున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా స్వయంగా అతనే ఈ వ్యాఖ్యలు చేశాడు. నీరవ్ విషయంలో కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అతన్ని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయాత్నాలు చేస్తూనే.. మరోవైపు బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేసే పనిలో పడింది. పైసలు లేవు.. అప్పు తీసుకుంటా ప్రస్తుతం నీరవ్ నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. అతడిని భారత్‌కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ చెల్లింపులకు సంబంధించి నీరవ్ అక్కడి నుంచే వర్చువల్ ద్వారా తూర్పు లండన్‌లోని బార్కింగ్‌సైడ్ మేజిస్ట్రేట్ కోర్టులో ముందు హాజరయ్యాడు. చెల్లింపులపై వజ్రాల వ్యాపారి న్యాయస్థానానికి ఈ రకంగా విన్నవించుకున్నాడు.. తాను కోర్టు తీర్పు ప్రకారం డబ్బులను ఒకేసారి చెల్లించలేనని, నెలకు 10 వేల పౌండ్ల చొప్పున కడతానని అభ్యర్థించాడు. ఎందుకంటే భారత ప్రభుత్వం తన ఆస్తులన్నీ సీజ్ చేయడంతో డబ్బులు పరంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అనంతరం దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ 10 వేల పౌండ్లను ఎక్కడి నుంచి తెస్తావని అడగగా.. కోర్టుకు చెల్లించాల్సిన మొత్తం కోసం రుణం తీసుకుంటున్నానని చెప్పాడు. కాగా ఈ వ్యాపారవేత్తపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగాల ఆధారంగా నేరవ్ మోదీని 2019 మార్చిలో అరెస్టు చేసిన మూడేళ్ల తర్వాత అప్పీల్‌ను తిరస్కరించడం జరిగింది. -
ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి కేంద్రం భారీ షాక్!
బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. కేంద్రం ఓ వైపు విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయాత్నాలు చేస్తూనే.. మరోవైపు బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తుంది. కటకటాల్లోకి మార్చి 2019లో భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థనల మేరకు లండన్‌లో ఉన్న నీరవ్‌ని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం స్థానిక వాండ్స్‌వర్త్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అక్కడే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆస్తుల వేలం ఈ నేపథ్యంలో పూణేలో ఉన్న నీరవ్ ప్రాపర్టీలను వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో ఆక్షన్ పక్రియ ప్రారంభం కానుందని, ముంబైకి చెందిన డెబిట్ రికవరీ ట్రైబ్యూనల్-ఐ (డీఆర్టీ-ఐ) విభాగం ఈ వేలం చేపట్టనుంది. రికవరీ అధికారి అషుకుమార్ ఆదేశాలతో నీరవ్‌కు చెందిన రెండు ప్రాపర్టీలపై ఈ- ఆక్షన్ జరగనుంది. అధికారుల దర్యాప్తు ముమ్మరం పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణం పేరుతో వేలకోట్ల ఆర్ధిక మోసాలకు పాల్పడ్డ నీరవ్ మోడీ, మోహిల్ చోక్సీలు ప్రధాన నిందితులు. ఇద్దరు బ్యాంకుల్లో వేల కోట్లను అప్పుగా తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో భారత ప్రభుత్వం నిందితులకు ఇచ్చిన రుణాల్ని తిరిగి రాబట్టేందుకు దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులతో దర్యాప్తు చేయిస్తుంది. ప్రాప్టరీ విలువ ఎంతంటే విచారణ కొనసాగుతుండగానే పూణేలోని హదప్సర్లో ఉన్న యో పూణే హౌసింగ్ స్కీమ్‌లోని 398 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఎఫ్ 1 భవనంలోని 16వ అంతస్తు... ఆ పక్కనే 396 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మరో ప్లాట్ ధరల్ని రూ. 8.99కోట్లు, రూ. 8.93 కోట్లుగా నిర్ణయించారు. వాటినే వేలం వేయనున్నారు. నోటీసులు జారీ వేలంపై అధికారులు ఇప్పటికే నీరవ్‌కు చెందిన స్టెల్లార్ డైమండ్స్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్ డైమండ్ ఆర్ యూఎస్, ఏఎన్ఎం ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్డీఎం ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేశారు. -
నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన యూకే హైకోర్టు.. త్వరలో భారత్‌కు..
చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొనేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హైకోర్టులో చుక్కెదురైంది. దేశం నుంచి పరారీలో ఉన్న నీరవ్ మోదీని భారత్‌కి తిరిగి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ పిటీషన్ దాఖలైంది. అయితే నీరవ్ మోదీని అప్పగించడం అన్యాయం లేదా అణచివేత కాదని కోర్టు పేర్కొంటూ అతని పిటీషన్‌ను తిరస్కరించింది. దీంతో త్వరలో నీరవ్ భారత్‌కు రానున్నారు. ఈ అప్పీల్ విచారణకు అధ్యక్షత వహించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు. ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో కటకటాల వెనుక ఉన్న 51 ఏళ్ల వ్యాపారవేత్త, గత ఫిబ్రవరిలో భారత్‌కు అప్పగింతకు అనుకూలంగా జిల్లా జడ్జి సామ్ గూజీ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని రూ. 13,500 కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయాడు. అప్పటినుంచి భారత్‌కు తిరిగి రాకుండా తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నాడు. చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! -
మేహుల్ చోక్సీపై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త మేహుల్ చోక్సీపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పదేళ్ల నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా 45 రోజుల్లోగా చెల్లించమని ఆదేశిస్తూ రూ. 5 కోట్ల జరిమానా సైతం విధించింది. గీతాంజలి జెమ్స్ కౌంటర్లో అక్రమ లావాదేవీలు చేపట్టిన అభియోగాలపై సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. దీంతో సెక్యూరిటీల మార్కెట్లో చోక్సీ పదేళ్లపాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి లావాదేవీలు చేపట్టేందుకు వీలుండదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గీతాంజలి జెమ్స్ షేర్ల ట్రేడింగ్‌లో ఇన్సైడర్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చోక్సీపై సెబీ ఏడాది కాలం నిషేధాన్ని, రూ. 1.5 కోట్ల జరిమానాను విధించింది. ఇక 2020 ఫిబ్రవరిలో లిస్టింగ్ తదితర పలు నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ రూ. 5 కోట్ల జరిమానా చెల్లించవలసిందిగా చోక్సీతోపాటు, గీతాంజలి జెమ్స్‌ను సెబీ ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్, చైర్మన్ చోక్సీ నీరవ్ మోడీకి మేనమావకాగా.. వీరిరువురిపైనా పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ. 14,000 కోట్లకుపైగా మోసం చేసిన కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2018 మొదట్లో పీఎన్బీ మోసం బయటపడిన తొలినాళ్లలోనే చోక్సీ, మోడీ విదేశాలకు తరలిపోయారు. చోక్సీ ఆంటిగ్వా, బార్బుడాలలో తలదాచుకుంటున్నట్లు వార్తలు వెలువడగా.. ఇండియాకు అప్పగించాలన్న ప్రభుత్వ వాదనను బ్రిటిష్ జైల్లో ఉన్న మోడీ వ్యతిరేకిస్తున్నారు. -
చిక్కుల్లో మెహుల్ చోక్సీ భార్య?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కు రూ 13,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ భార్య ప్రీతి చిక్కుల్లో పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మూడో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో మెహుల్ చొక్సీతో పాటు అతని భార్య ప్రతీని మరికొందరి పేర్లు చేర్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన రుణాల ఎగవేత కేసులో మెహుల్ చోక్సీకి సహాకరించారనే అభియోగాలను ఆమెపై ఈడీ మోపింది. పీఎన్బీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే 2018, 2020లలో రెండు ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. కాగా మూడో ఛార్జ్‌షీట్ ఇప్పుడు వేసింది. ఇందులో మెహుల్ చోక్సీ దంపతులతో పాటు గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, గిలి ఇండియా లిమిటెడ్, నక్షత్ర బ్రాండ్ లిమిటెడ్ కంపెనీల పేర్లతో పాటు పీఎన్బీ బ్రాండీ హౌజ్ శాఖ మేనేజర్ గోకుల్నాథ్షెట్టిల పేర్లు చేర్చింది. చదవండి: మోహుల్ చోక్సీ బాధితుల జాబితాలో చేరిన మరో కంపెనీ! -
సీబీఐ బిగ్ ఆపరేషన్..నీరవ్‌మోదీ ప్రధాన అనుచరుడు అరెస్ట్..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కాం కేసులో సీబీఐ కీలక పురోగతిని సాధించింది. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాన అనుచరుడు సుభాష్ శంకర్‌ను ఈజిప్టు రాజధాని కైరోలో సీబీఐ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సుభాష్‌ను ఈజిప్టు నుంచి భారత్‌కు తీసికొచ్చినట్లుగా సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 13 వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత ఆరోపణలను నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నారు. ఈ స్కామ్‌లో సుభాష్ శంకర్ కీలక నిందితుడు. పీఎన్బీ స్కాంకు సంబంధించి సీబీఐ అభ్యర్థన మేరకు.. నీరవ్, అతని సోదరుడు నిషాల్ మోదీ , అతని ఉద్యోగి సుభాష్ శంకర్ పరబ్‌లపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది. 2018లో కేసు నమోదైనప్పటి నుంచి సుభాష్ శంకర్ పరారీలో ఉన్నాడు. అతడు కైరోలో అజ్ఞాతంలో దాక్కున్నాడు. తమకు అందిన ఇన్పుట్ల ఆధారంగా సీబీఐ ఆపరేషన్ నిర్వహించి శంకర్‌ని పట్టుకుంది. అతడిని ప్రత్యేక విమానంలో సీబీఐ అధికారులు.. ముంబైకి తీసుకొచ్చినట్లు సమాచారం. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని సీబీఐ కోర్టులో శంకర్‌ను హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. ఇక కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకుగాను సుభాష్‌ను విచారణ నిమిత్తం కస్టడీకి సీబీఐ కోరనుంది. చదవండి: భారత ఆర్థిక వ్యవస్థపై మూడీస్ ఆసక్తికర వ్యాఖ్యలు..! -
అందుకే నన్ను కిడ్నాప్ చేశారు : చోక్సీ వింత వాదన
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ తన కిడ్నాప్ వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కరేబియన్ దేశానికి భారత్ కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించినందుకుగా ప్రతిగానే తనను కిడ్నాప్ చేసినట్టు ఆరోపించారు. ఆంటిగ్వా అండ్ బార్బుడాకు ఇండియా కరోనా వ్యాక్సిన్లను ఎగుమతి చేయడాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, చోక్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనే తన అపహరణకు సంబంధించిన పుకార్లు తన చెవిన పడినట్టు చెప్పుకొచ్చారు. ఒక విమానం వచ్చిందని, చాలా మంది ఫాలో అవుతున్నారనని తనను బయటకు తీసుకెళ్ళి చంపేస్తారని చెప్పారని కూడా తెలిపారు. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) ఏజెంట్లు అని చెప్పుకుంటూ గుర్మిత్ సింగ్, గుర్జిత్ భండాల్ ఆంటిగ్వా బార్బుడా నుంచి తనను అపహరింకు పోయారని చెప్పారు. వీరి గురించి తాను చాలా కథలు విన్నాననీ, ప్రపంచవ్యాప్తంగా ద్వీపాలు, ప్రదేశాల చుట్టూనే ఉంటారని చోక్సీ ఆరోపించారు. కాగా సుమారు 14 వేల కోట్ల రూపాయల పీఎన్బీ స్కాం నిందితుడు చోక్సీ 2018 జనవరిలో భారత్ నుంచి ఆంటిగ్వా అండ్ బార్బుడాకు పారిపోయి, అక్కడ తలదాచుకున్నాడు. అయితే ఇటీవల డొమినికాకు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. డొమినికాలో దాదాపు 51 రోజుల కస్టడీ తర్వాత వైద్యకారణాలరీత్యా డొమినికా హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. చోక్సి ప్రస్తుతం ఆంటిగ్వా, బార్బుడాలో ఉన్న సంగతి తెలిసిందే. -
రూ.2.75 లక్షల పూచీకత్తుతో చోక్సీకి బెయిల్
న్యూఢిల్లీ: అక్రమంగా దేశంలోకి ప్రవేశించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీకి డొమెనికా హైకోర్టు సుమారు రూ.2.75 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా బార్బుడాకు చోక్సీ వెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. దీంతో చోక్సీని ఇండియాకు తీసుకురావాలన్న యత్నాలకు విఘాతం కలిగినట్లయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడైన చోక్సీ 2018 నుంచి ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. ఇటీవలే ఆయన్ను కొందరు అపహరించి డొమెనికాకు తీసుకుపోవడం కలకలం సృష్టించింది. చోక్సీ అక్రమ చొరబాటుపై మెజిస్ట్రేట్ కోర్టు ముందు జరిగే విచారణపై కూడా స్టే మంజూరు చేసింది. చికిత్స అనంతరం చోక్సీ విచారణకు హాజరుకావాల్సిందేనని, ఈ విషయంలో బెయిల్ కుదరదని తెలిపింది. -
Mehul Choksi కిడ్నాప్: డొమినికా ప్రధాని స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కామ్ ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సిని ఆంటిగ్వా నుంచి బలవంతంగా అపహరించడం వెనుక తమ ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలను డొమినికా ప్రధాని రూజ్వెల్ట్ కొట్టి పారేశారు. ఆ దేశంలో ప్రసారమయ్యే ఒక వీక్లీ షోలో పాల్గొన్న రూజ్వెల్ట్, ఇవన్నీ అర్ధం లేని ఆరోపణలని వ్యాఖ్యానించారు. కోర్టు తన పని తాను చేస్తుందని, అలాగే తమ రాజ్యాంగం ప్రకారం చోక్సి ఉన్న హక్కులకు రక్షణ లభిస్తుందని తెలిపారు. భారత్ నుంచి పారిపోయిన చోక్సి 2018 నుంచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. ఆదేశం నుంచి చోక్సిని భారత్‌కు రప్పించడంలో కాలయాపన జరుగుతున్నందున అతన్ని భారత ప్రభుత్వంతో కలిసి రూజ్వెల్ట్ ప్రభుత్వం అపహరించిందని డొమినికాలో ఆరోపణలున్నట్లు ఆదేశ మీడియా తెలిపింది. వీటిని రూజ్వెల్ట్ తోసిపుచ్చారు. అలాంటి పనుల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. అయితే ఒకదేశంలో ఒక నేరం చేసి మరో దేశంలో హాయిగా తిరగనివ్వడం మంచిదా? లేక ఆ దేశం నుంచి హంతకుడిని తీసుకువచ్చి శిక్షించడం మంచిదా? ఆలోచించాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తులను వారి అంతస్తులను బట్టి తమ దేశం ప్రవర్తించే తీరులో మార్పుఉండదని, అందరినీ చట్టం ముందు సమానంగా చూస్తామని తెలిపారు. అయితే చోక్సి లాయర్లు మాత్రం ఇది ప్రభుత్వాల పనేనని ఆరోపిస్తున్నారు. డొమినికా లేదా ఆంటిగ్వా ప్రభుత్వాలకు ఇందులో ప్రమేయం ఉందని తేలితే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. మరోవైపు పారిపోయిన వ్యాపారవేత్తలు మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలపై చట్టపరమైన చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ శుక్రవారం (జూలై 2 ) తెలిపింది. మెహుల్ చోక్సీకిడ్నాప్ ఆరోపణలను డొమినికన్ ప్రధాని ఖండించిన నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ)ఈ ప్రకటన చేసింది. మెహుల్, నీరవ్లపై చర్యలు, స్వదేశానికి రప్పించే చర్యలపై ప్రశ్నించినపుడు చట్ట పరమైన అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని విదేశాఖ అధికారిక ప్రతినిధి అరిందం బాగ్చి వ్యాఖ్యానించారు. -
నీరవ్‌కు లండన్ హైకోర్టులో చుక్కెదురు
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ.13,500 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్‌లోని హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ నీరవ్ లండన్‌లోని హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతించాలంటూ సంబంధిత పత్రాలను సమర్పించారు. ఈ పత్రాలను పరిశీలించిన కోర్టు మంగళవారం తిరస్కరించింది. అయితే, మరో ఐదు రోజుల్లోపు నీరవ్ హైకోర్టులో మరోసారి అప్పీల్‌చేసుకునే అవకాశముంది. భారత్‌లో ఆర్థికనేరాల్లో నిందితుడైన కారణంగా నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలంటూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. నీరవ్ భారత్‌లో మనీ ల్యాండరింగ్, నమ్మకద్రోహం తదితర నేరాభియోగాలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్.. నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు సమ్మతి తెలుపుతూ ఏప్రిల్ 15న ఆదేశాలు జారీచేశారు. హోం మంత్రి నిర్ణయాన్ని, వెస్ట్‌మినిస్టర్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు అవకాశమివ్వాలంటూ నీరవ్ హైకోర్టులో దాఖలుచేసిన ‘అప్పీల్’ అనుమతి పత్రాలను కోర్టు మంగళవారం తిరస్కరించిందని హైకోర్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 50ఏళ్ల నీరవ్‌ను 2019 మార్చి 19న అరెస్ట్‌చేసిన యూకే పోలీసులు అతడిని నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంచారు. -
పీఎన్బీ స్కాం: నీరవ్ మోదీకి భారీ షాక్
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. మోదీని ఇండియాకు అప్పగించాలన్న వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయడానికి నీరవ్ చేసుకున్న లిఖిత పూర్వక అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది కోర్టు అధికారి తెలిపారు. ఈ అప్పగింత తీర్పుపై మోదీకి మరో అవకాశం ఉంది. చట్టం ప్రకారం అతను మరో ఐదు రోజుల్లోగా మౌఖికంగా అభ్యర్థన చేసుకోవచ్చు. ఒకవేల ఈ అభ్యర్థనను అంగీకరిస్తే విచారణ చేపడుతుంది, తిరస్కరిస్తే నీరవ్ భారత్‌కు రాక తప్పదని అధికారిక వర్గాల సమాచారం. నీరవ్ మోడీ మౌఖికంగా దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అతను మౌఖికంగా అప్పీల్ చేస్తే అప్పీల్ ప్రొసీడింగ్స్ కు అనుగుణంగా మేం చర్యలు తీసుకుంటాం అని భారత అధికారుల తరఫున కోర్టులో వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) పేర్కొంది. తప్పుడు సమాచారంతో పీఎన్బీని నీరవ్ మోదీ మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడింది. అప్పటికే మోడి లండన్ కు పారిపోయాడు. నీరవ్ మోడీ రెండు సంవత్సరాల క్రితం 19 మార్చి 2019న అరెస్టు ఇంగ్లాండ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పటి నుంచి నైరుతి లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో ఉన్నారు. పీఎన్బీ బ్యాంకును రూ.13,500కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలంటూ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఫిబ్రవరిలో వెలువరించిన విషయం తెలిసిందే. చదవండి: ఆర్థిక నేరగాళ్ల రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం -
డబ్బు ఎర చూపి వీవీఐపీ ట్రీట్మెంట్ పొందిన చోక్సి
రోజో: భారత్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ. 13,500 కోట్ల మేర మోసం చేసిన మెహుల్ చోక్సి డొమినికా రాజధాని రోజోలోని ఆస్ప త్రిలో వీవీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నట్లు సమాచారం. డొమినికాలో న్యాయ పర్యవేక్షణలో ఉన్న ఆయన 2 వారాల క్రితం ఆరోగ్యం బాగోలేదంటూ ఆస్పత్రిలో చేరారు. అనంతరం తనకు చల్లదనం కోసం ఏకంగా ఆస్పత్రికే ఏసీలు దానం చేశాడని, వైద్యులకు లంచాలిచ్చి వీవీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నాడని తెలుస్తోంది. ఈ వ్యవహారం మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని, చోక్సి మరోసారి దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. గురువారం ఆయన రోజోలోని కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, అనారోగ్య కారణాలను చూపి హాజరుకాలేదు. చివరకు కోర్టు.. చోక్సి చికిత్స పొందుతున్న ఆస్పత్రి గదినే జైలుగా మార్చాలని ఆదేశించింది. -
పీఎన్బీకి చోక్సి కంపెనీలు 6 వేల కోట్ల టోకరా
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాభరణాల వ్యాపారి మెహుల్ చోక్సికి చెందిన సంస్థలు.. నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ), ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ల (ఎఫ్ఎల్సీ) ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) రూ. 6,345 కోట్ల మేర మోసగించినట్లు సీబీఐ విచారణలో తేలింది. ముంబైలోని ప్రత్యేక కోర్టుకి సీబీఐ గత వారం ఈ మేరకు సప్లిమెంటరీ చార్జిషీటును సమర్పించింది. చోక్సి, ఆయన కంపెనీల సిబ్బందితో పీఎన్బీ ఉద్యోగులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెరతీశారని ఇందులో పేర్కొంది. 2017 మార్చి–ఏప్రిల్‌లో ఎలాంటి మార్జిన్లు లేకుండా, బ్యాంకు సిస్టమ్‌లో ఎంట్రీలు చేయకుండా ముంబైలోని బ్రాడీ హౌస్ బ్రాంచ్‌లోని పీఎన్బీ ఉద్యోగులు.. చోక్సి కంపెనీలకు 165 ఎల్వోయూలు, 58 ఎఫ్ఎల్సీలు జారీ చేశారని తెలిపింది. వీటి ద్వారా విదేశీ బ్యాంకుల నుంచి చోక్సి సంస్థలు భారీగా రుణాలు తీసుకున్నాయి. కానీ వాటిని తిరిగి కట్టకపోవడంతో వడ్డీతో కలిపి రూ. 6,345 కోట్లను విదేశీ బ్యాంకులకు పీఎన్బీ చెల్లించిందని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. -
చోక్సికి డొమినికా హైకోర్టు బెయిల్ నిరాకరణ
డొమినికా: పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆర్థిక కుంభకోణంలో నిందితుడు మెహుల్ చోక్సికి డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ ఇవ్వడానికి ఆ దేశ హైకోర్టు నిరాకరించింది. బెయిల్ మంజూరు చేస్తే చోక్సి దేశం విడిచిపెట్టే అవకాశాలున్నాయన్న ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. డొమినికాతో చోక్సికి సంబంధ బాంధవ్యాలు లేవని, అతనిపై కోర్టు కూడా ఎలాంటి ఆంక్షలు, షరతులు విధించలేదని న్యాయమూర్తి ఆడిరిన్ రాబర్ట్స్ వ్యాఖ్యానించారు. వెనక్కి రప్పించడానికి భారత్ ప్రయత్నాలు చోక్సిని భారత్‌కు వెనక్కి రప్పించడానికి విదేశాంగ శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. డొమినికా న్యాయస్థానంలో విదేశాంగ శాఖ, సీబీఐ రెండు వేర్వేరు ఇంప్లీడ్ పిటిషన్లను దాఖలు చేశాయి. చోక్సి పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు అన్న అంశాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించడానికి సీబీఐ పకడ్బందీగా అన్ని అంశాలను తన పిటిషన్లో జతపరిచింది. మరోవైపు విదేశాంగ శాఖ చోక్సి భారతీయుడన్న విషయాన్ని కోర్టులో రుజువు చేసే సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. చోక్సి మాత్రం తాను భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నానని, ప్రస్తుతం తాను ఆంటిగ్వా పౌరుడునని వాదిస్తున్నారు. -
చోక్సీకి కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి,న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. క్యూబాకు పారిపోతూ డొమినికాలో అరెస్ట్ అయిన చోక్సీకి డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్లైట్ రిస్క్ కారణాలతో బెయిల్ ఇవ్వలేమని అక్కడి న్యాయమూర్తి వైనెట్ అడ్రియన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. అలాగే చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు కూడా ఉందని న్యాయవాది లారెన్స్ వాదించారు. కాగా పీఎన్బీ బ్యాంకులో 13,500 కోట్ల రూపాయల స్కాం కేసులో నిందితుడగా ఉన్న చోక్పీ 2018లో అంటిగ్వాకు పారిపోయిన సంగతి తెలిసిందే. మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వాన్ని అనుభవిస్తున్న చోక్సీ మే 23న ఆంటిగ్వానుంచి పారిపోతూ డొమినికాలో అరెస్టయ్యాడు. దీంతో అక్కడ విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు చోక్సీని అక్రమ వలసదారుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. చదవండి : చోక్సీ గర్ల్‌ఫ్రెండ్ : మరో ట్విస్టు క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్ -
చోక్సీ గర్ల్‌ఫ్రెండ్ : మరో ట్విస్టు
సాక్షి,న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కుంభకోణం నిందితుడు, డొమినికాలో కోర్టు విచారణని ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చోక్సీ గర్ల్‌ఫ్రెండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా వ్యాఖ్యలపై చోక్సీ భార్య ప్రీతి చోక్సీ ఘాటుగా స్పందించారు. మెహుల్ తనను తాను రాజ్ అని పరిచయం చేసుకున్నాడనే బార్బరా వాదనను కొట్టి పారేశారు. నిజానిజాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఉందిగా అని ప్రశ్నించారు. అదంతా బోగస్ అని, బార్బరా ఆరోపణలకు అసలు ఎలాంటి ప్రామాణికత లేదని ప్రీతి వెల్లడించారు. డొమినికా మీదుగా క్యూబాకు పారిపోయి అక్కడ స్థిరపడాలని చోక్సి పన్నాగం పన్నాడన్న ఆరోపణలను ప్రీతి తీవ్రంగా ఖండించారు. రాజ్‌గా పరిచయం చేసుకున్నాడనే దానిపై మండిపడిన ప్రీతి నిజానికి చిన్న పిల్లలు కూడా ఎవరితోనైనా స్నేహం చేసేటపుడు ఫ్రెండ్స్ లిస్ట్‌ను ఇంటర్నెట్లో చూస్తున్నారని, లేదా "రివర్స్ గూగుల్ సెర్చ్" సోషల్ మీడియాలో వెతుకుంటాం. ఇందుకు కొన్ని సెకన్ల సమయం చాలు.. ఇది చాలా ఈజీ కూడా అని ప్రీతి గుర్తు చేశారు. చోక్సీ చెప్పింది గుడ్డిగా నమ్మేందుకు, ఏమైనా రాతి యుగంలో బతుకుతున్నామా?! అని ప్రశ్నించారు. అంతేకాదు వాట్సాప్ సందేశాల కంటెంట్ మార్చడం, ఫోటోషాప్ ద్వారా ఫోటోలు మార్ఫింగ్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో బార్బరా ఆరోపణలకు ఎలాంటి విశ్వసనీయత లేదని తేల్చి చెప్పారు. ఈ విషయలో ఇంత దుమారం రేగుతున్నా..ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లలో ఒక్కరు కూడా ఆమెకు మద్దతుగా ఎందుకు నిలవలేదని పేర్కొన్నారు. తప్పుడు ప్రకటనలతో తన భర్తపై బురద జల్లే ప్రయత్నం ఇదని, అసలు తను ఎక్కడ ఉంటోంది తదితర వివరాలను వెల్లడించని బార్బరా వెర్షన్‌ను ఎలా విశ్వసిస్తామని ప్రీతి చోక్సీ ప్రశ్నించారు. చోక్సీకి మరో ఎదురుదెబ్బ ఇదిలా ఉంటే డొమినికా జాతీయ భద్రతా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చోక్సీని "నిషేధిత వలసదారు" గా ప్రకటించింది. అక్రమంగా దేశంలో ప్రవేశించినందున నిషేధిత ఇమ్మిగ్రేషన్ చట్టం కింద తీసుకోవలసిన చర్యలతో పాటు అతన్ని స్వదేశానికి పంపించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి రేబర్న్ బ్లాక్మూర్ ఆదేశించారు. చదవండి : క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్ -
క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, డొమినికాలో కోర్టు విచారణని ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డొమినికా మీదుగా క్యూబాకు పారిపోవాలని చోక్సి పన్నాగం పన్నాడని ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా చెప్పారు. వచ్చేసారి క్యూబాలో కలుసుకుంటామని చోక్సి తనతో చెప్పినట్టుగా ఆమె ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ అతను క్యూబాలో స్థిరపడాలని భావించాడు’అని బార్బరా చెప్పారు. చోక్సికి తాను గర్ల్‌ఫ్రెండ్‌ని కాదన్నారు. చోక్సి నేరస్తుడని తెలీదు చోక్సి పరారీలో ఉన్న నేరస్తుడని తనకు అసలు తెలీదని, అతని అసలు పేరు, బ్యాక్ గ్రౌండ్ ఏదీ తనకు తెలీదని బార్బరా చెప్పారు. ‘నేను యూరోపియన్‌ని. భారత ఆర్థిక నేరగాళ్ల జాబితా గురించీ తెలీదు. చోక్సి అసలు పేరేమిటో గత వారం వరకు నాకు తెలీదు. గత ఏడాది ఆగస్టులో మొదటిసారి చోక్సిని కలుసుకున్నాను. తన పేరు రాజ్ అని పరిచయం చేసుకున్నాడు. తరచు నాకు మెసేజ్‌లు పెడుతూ ఉండేవాడు. కానీ నెలకోసారి మాత్రం రిప్లయ్ ఇచ్చేదాన్ని’ అని చెప్పారు. మరోవైపు ఆంటిగ్వాలో కిడ్నాప్ చేసి తనను డొమినికాకు తీసుకువచ్చారని, ఆ కిడ్నాప్‌లో బార్బరా హస్తం కూడా ఉందంటూ చోక్సి చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. మెహుల్ చోక్సి బెయిల్ పిటిషన్ విచారణని డొమినికా హైకోర్టు 11వ తేదీకి వాయిదా వేసినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. కింద కోర్టు అతని బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో చోక్సి హైకోర్టుకెక్కారు. -
‘‘నేను స్నేహాన్ని కోరుకుంటే.. తను ఇంకేదో ఆశించేవాడు’’
-
‘‘నేను స్నేహాన్ని కోరుకుంటే.. తను ఇంకేదో ఆశించేవాడు’’
న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందుతుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్, కిడ్నాప్ డ్రామా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రముఖంగా వినిపించిన పేరు బార్బరా జబారికా. మెహుల్ చోక్సీ గర్ల్ ఫ్రెండ్‌గా వెలుగులోకి వచ్చిన జబారికా ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. తాను చోక్సీని ఓ స్నేహితుడిగానే భావించానని.. కానీ ఆయన తన దగ్గర నుంచి వేరే ఆశించేవాడని తెలిపింది. అందులో భాగంగానే తన విమాన టిక్కెట్ల ఖర్చు భరించేవాడని.. హోటల్లో రూమ్ బుక్ చేసేవాడని తెలిపింది. ఇక తాను చోక్సీతో కలిసి కాఫీ, డిన్నర్, వాకింగ్‌కు వెళ్లానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా జబారికా మాట్లాడుతూ.. ‘‘చోక్సీ నా అపార్ట్మెంట్కి వచ్చేవాడు. నేను తనతో కేవలం స్నేహం, బిజినెస్ అంతవరకు మాత్రమే ఉండాలని భావించేదాన్ని. కానీ అతడు అంతకు మించి ఎక్స్పెక్ట్ చేసేవాడు . అందులో భాగంగా హోటల్ రూం బుకింగ్, ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేయడం వంటివి చేసేవాడు. కానీ నేను వాటన్నింటిని తిరస్కరించేదాన్ని. ఏం ఆశించి అతను ఇవన్ని చేసేవాడో నేను ఊహించగలనను. అతడు మా రిలేషన్‌ని తప్పుగా అర్థం చేసుకున్నాడు’’ అని తెలిపింది. ‘‘ఇక మే నెలలో మొత్తం పరిస్థితులు తారుమారయ్యాయి. చోక్సీ నాకు బిజినెస్ ఆఫర్స్ ఇవ్వడం ప్రారంభించాడు. నేను ప్రాపర్టీ సంబంధింత పనులు చూసుకుంటుండంతో అతడు ఆంటిగ్వాలో క్లబ్బులు, హోటళ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. వాటన్నింటికి తానే పెట్టుబడి పెడతానని తెలిపాడు. అలా వ్యాపారం మీద నాకు ఆసక్తి కలిగించాడు’’ అంటూ చెప్పుకొచ్చింది జబారికా. ‘‘ఇండియా నుంచి పారిపోయి వచ్చిన వజ్రాల వ్యాపారి చోక్సీ తనను రాజ్‌గా నాకు పరిచయం చేసుకున్నాడు.. నకిలీ వజ్రపుటుంగరాలను నాకు బహుకరించాడు. వాట్సాప్, సిగ్నల్ వంటి వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వేర్వేరు నంబర్ల నుంచి నాకు మెసేజ్‌లు చేసేవాడు. ఆరు నెలల్లో అతడు ఆరు నంబర్లు మార్చాడు. వాటి నుంచి మెసేజ్ చేసేవాడు. ప్రతి సారి రాజ్ అనే చెప్పుకునేవాడు. ద్వీపంలోని ప్రజలు, రెస్టారెంట్ సిబ్బంది తనను రాజ్ అనే పిలిచేవారు’’ అంటూ 33 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూలో బార్బరా జబారికా వెల్లడించారు. చదవండి: దాదాపు 10 మంది నన్ను చితకబాదారు: చోక్సీ -
దాదాపు 10 మంది నన్ను చితకబాదారు: చోక్సీ
న్యూఢిల్లీ: ఆంటిగ్వాకు చెందిన పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టినట్లు (పీఎన్బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తెలిపాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రుణం ఎగవేసిన కేసులో ప్రధాన నిందితుడైన చోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉన్నాడు. ఈ క్రమంలో తన సురక్షితస్థావరాన్ని వదిలి గర్ల్‌ఫ్రెండ్‌ను పొరుగునున్న డొమినికా దేశానికి డిన్నర్‌కు తీసుకెళ్లడమే మెహుల్ చోక్సీ పట్టివేతకు దారితీసింది. ఈ క్రమంలో ఆంటిగ్వాకు చెందిన సుమారు 8 నుంచి 10 మంది పోలీసులు తనను చితకబాదినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించాడు చోక్సీ. అంతేకాక తన కిడ్నాప్ వ్యవహారంలో బార్బరా జబారికాకు కూడా భాగం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. చోక్సీ జూన్ 2న ఇచ్చిన 5 పేజీల ఈ ఫిర్యాదులో.. ‘‘గత ఏడాది కాలంగా నేను, జబరికా చాలా స్నేహంగా ఉన్నాము. మే 23వ తేదీన ఆమె తనను ఇంటి వద్ద పికప్ చేసుకోవాలని చెప్పింది. అక్కడకు వెళ్లిన తర్వాత 8 నుంచి పది మంది నాపై దాడి చేశారు. ఏమాత్రం జాలీ, దయ లేకుండా నన్ను విపరీతంగా కొట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జబారికా వారిని ఏమాత్రం అడ్డుకోలేదు. కనీసం మరొకరి సహాయం కూడా ఆమె కోరలేదు. జబారికా వ్యవహరించిన తీరు అనుమానం రేకిత్తిస్తుంది. నన్ను కిడ్నాప్ చేసిన వారిలో ఆమె కూడా భాగస్వామి అని డౌట్ వస్తోంది’’ అని వెల్లడించాడు చోక్సీ. ఫోన్, వాచ్, వ్యాలెట్ తీసుకుని తనపై వాళ్లు దాడి చేసినట్లు చోక్సీ తెలిపాడు. ఇక తనను కిడ్నాప్ చేసిన వారు పడవలో తీసుకెళ్లారని.. బోటు మీద 2 భారతీయులు, ముగ్గురు కరేబియన్లు ఉన్నారని వెల్లడించాడు. ఆ తర్వాత ఉన్నత స్థాయి భారతీయ రాజకీయ నాయకుడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి తనను ప్రత్యేక ప్రదేశానికి తీసుకువెళ్లారు అని చోక్సీ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఇక ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కారణంగా చోక్సీని అరెస్ట్ చేశారు. ఇక పోలీస్ స్టేషన్లో తనను ఉంచిన "హోల్డింగ్ సెల్" వద్ద ఉన్న పరిస్థితులను కూడా చోక్సీ ప్రస్తావించాడు. ‘‘నన్ను ఉంచిన గది కేవలం 20 చదరపు అడుగుల పరిమాణంలో ఉంది. దానిలో కనీసం ఓ పరుపు కూడా లేదు’’ అని తెలిపాడు. పీఎన్బీ కేసులో చోక్సీని ఇండియాకు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. తనను ఎవరో అపహరించాలంటూ చోక్సీ తరపు న్యాయవాదులు పేర్కొనడంతో ఆ ఘటనపై ఆంటిగ్వా ప్రధాని విచారణకు ఆదేశించారు. చోక్సీ లాయర్లు కిడ్నాపర్ల పేర్లు పోలీసులకు చెప్పారని ప్రధాని బ్రౌనీ తెలిపారు. చదవండి: మిషన్ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే? -
మిషన్ చోక్సీ బృందం తిరుగుముఖం
న్యూఢిల్లీ: రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఇప్పట్లో భారత్‌కు అప్పగించే అవకాశాలు కనిపించడం లేదు. డొమినికా దేశ ప్రభుత్వం చోక్సీని అప్పగిస్తే వెంట తీసుకువద్దామని ఆ దేశానికి వెళ్లిన ‘మిషన్ చోక్సీ’భారత అధికారుల బృందం స్వదేశానికి తిరిగి బయల్దేరింది. సీబీఐ అధికారిణి శారద రౌత్ నేతృత్వంలోని బృందం డొమినికాలో ఏడు రోజుల పాటు మకాం వేసింది. చోక్సీ తరఫు లాయర్లు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ విచారణ వచ్చే నెలకి వాయిదా పడడంతో 8 మంది సభ్యులతో కూడిన భారత్ బృందం తిరుగుముఖం పట్టింది. జూన్ 3 రాత్రి 8 గంటల ప్రాంతంలో డొమినికా విమానాశ్రయం నుంచి ప్రత్యేక ప్రైవేట్ జెట్ విమానంలో భారతీయ అధికారులు స్వదేశానికి బయల్దేరినట్టుగా ఆ దేశంలోని స్థానిక మీడియా వెల్లడించింది. డొమినికాలో చోక్సీపై రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఆంటిగ్వా నుంచి డొమినికా దేశానికి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలతో అరెస్టయిన కేసులో న్యాయస్థానం చోక్సీకి బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసు విచారణ ఈ నెల 14న జరగనుంది. మరోవైపు చోక్సీ లాయర్లు ఆయన కనిపించడం లేదంటూ హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణను జూలైకి వాయిదా పడింది. ఈ పరిణామాలతో చోక్సీని డొమినికా ప్రభుత్వం వెనువెంటనే భారత్‌కు అప్పగించే అవకాశాలు లేకపోవడంతో భారత్ బృందం వెనక్కి బయల్దేరింది. మరోవైపు కోర్టులో విచారణ సాగుతుండగా కొందరు నిరసనకారులు డొమినికాకు చోక్సీని ఎవరు తీసుకువచ్చారు? అని రాసి ఉన్న ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. 62 ఏళ్ల వయసున్న చోక్సీ తన ప్రియురాలితో కలిసి డొమినికాకు వచ్చి పట్టుబడ్డాడని కొందరు చెబుతూ ఉంటే, ఆయనని కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని చోక్సీ తరఫు లాయర్లు వాదిస్తున్నారు. 2018లో భారత ప్రభుత్వం కళ్లుగప్పి అంటిగ్వాకు పరారైన చోక్సీ మే 23న అంటిగ్వాలో కనిపించకుండా పోయారు. డొమినికాలో పోలీసులకు పట్టుబడ్డారు. -
మెహుల్ చోక్సీకి నో బెయిల్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా న్యాయస్థానం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. అంటిగ్వా నుంచి తమ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన చోక్సికి బెయిల్ ఇవ్వలేమని గురువారం పిటిషన్‌ను కొట్టివేసింది. చోక్సీ(62) వీల్ చైర్లో కోర్టుకు హాజరయ్యారు. చోక్సీ అక్రమంగా డొమినికాకు రాలేదని, ఆయనని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని అందుకే బెయిల్ ఇవ్వాలంటూ చోక్సీ తరఫు లాయర్ వాదించారు. మరోవైపు చోక్సీకి బెయిల్ ఇస్తే అతను పారిపోతాడని, భారత్‌లో ఆర్థిక నేరాలకు సంబంధించిన 11 కేసులు ఉన్నాయని, ఇంటర్‌పోల్ నోటీసులూ అతనిపై జారీ అయ్యాయని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. చోక్సీ చుట్టూ ఉన్న పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉండడం వల్ల బెయిల్ ఇవ్వలేమని మెజిస్ట్రేట్ కేండియా కేరట్ జార్జ్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో అక్రమంగా ప్రవేశించినందుకు వేసే జరిమానాకు రెట్టింపు మొత్తం 10 వేల కరీబియన్ డాలర్లు చెల్లిస్తామని చోక్సీ తరఫు లాయర్ చెప్పినా న్యాయమూర్తి అంగీకరించలేదు. అయితే బెయిల్ కోసం పై కోర్టుకు వెళతామని లాయర్ విజయ్ అగర్వాల్ మీడియాకి వెల్లడించారు. వాదనల సమయంలో భారత్ నుంచి వెళ్లిన బృందం కోర్టుకి హాజరైంది. డొమినికా ప్రభుత్వం చోక్సీని అప్పగిస్తే భారత్‌కు తీసుకురావడానికి ఆ బృందం వెళ్లింది. అయితే ఇప్పుడిప్పుడే చోక్సీని అప్పగించే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులంటున్నారు. చోక్సీపై కోర్టుకు వెళితే మరిన్ని రోజులు ఈ కేసు సాగే అవకాశాలున్నాయి. 2018 నుంచి అంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ అక్కడ్నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతను ప్రేయసితో విహార యాత్ర కోసం డొమినికాకు వెళ్లాడన్న ఆరోపణలున్నాయి. మే 23న తమ దీవుల్లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారంటూ డొమినికా పోలీసులు చోక్సీని అదుపులోకి తీసుకున్నారు. చోక్సీని వెనక్కి తెస్తాం: భారత విదేశాంగ శాఖ మెహుల్ చోక్సీని కచ్చితంగా భారత్‌కు తీసుకువస్తామని విదేశాంగ శాఖ ధీమా వ్యక్తం చేసింది. డొమినికాలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయితే వెంటనే అతనిని భారత్‌కి తెస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చి చెప్పారు. ఆ సమస్య మనకొద్దు చోక్సీని డొమినికా నుంచే భారత్‌కు పంపిస్తే మంచిదని అంటిగ్వా, బార్బుడా దేశం భావిస్తోంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో చోక్సీ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ప్రస్తుతం చోక్సీ డొమినికా పోలీసు కస్డడీలో ఉన్నందున ఇది వాళ్ల వ్యవహారమని, ఇక్కడికి వస్తే ఆ సమస్యలు తమకు చుట్టుకుంటాయని సమావేశం అభిప్రాయపడింది. -
మిషన్ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో కీలక నిందితుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని స్వదేశానికి రప్పించేందుకు మల్టీ-ఏజెన్సీ బృందం డొమినికాకు చేరుకుంది. "మిషన్ చోక్సీ" పేరుతో ఏర్పాటైన ఎనిమిది మంది సభ్యుల ఈ బృందానికి సీబీఐ అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న శారదా రౌత్ నేతృత్వం వహించడం విశేషంగా నిలిచింది. సీబీఐ, ఈడీ , సీఆర్పీఎఫ్ సభ్యులు ఈ బృందంలో భాగమని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సీబీఐ బ్యాంకింగ్ మోసాలను విచారించే విభాగం చీఫ్ ముంబైకి చెందిన శారదా రౌత్ నేతృత్వంలోని ఈ బృందం రేపు (జూన్ రెండు) చోక్సీపై జరిగే కోర్టు విచారణకు హాజరవుతుంది. అక్కడ రాజకీయంగా దుమారాన్ని రేపిన ఈ కేసులో డొమినికన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సహాయం చేయనుంది. అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే ఒక ప్రయివేట్ విమానం ద్వారా ఈ బృందం చోక్సీని వెనక్కి తీసుకురానుందని సమాచారం. డిల్లీలో విమానాశ్రయంలో అడుగుపెట్టిన మరుక్షణమే చోక్సీని అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. సీబీఐ అధికారి శారదా రౌత్ (ఫైల్ ఫోటో) ఇది ఇలాఉంటే అందరూ భావిస్తున్నట్టుగా మే 25 న కాకుండా మే 23నే మెహు్‌ల్ చోక్సీ డొమినికాకు చేరుకున్నాడని ఆంటిగ్వా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అవుట్ బౌండ్ క్లియరెన్స్ పత్రం ద్వారా తెలుస్తోంది. సెయింట్ లూసియా ఆధారిత పడవ 'కాలియోప్ ఆఫ్ ఆర్నే' ద్వారా డొమినికాలో అడుగుపెట్టాడు. అక్కడినుంచి భారత్‌తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని క్యూబాకు చెక్కెయ్యాలని ప్రయత్నించి చోక్సీ చివరికి బుక్కయి పోయాడు. కాగా నకిలీ పత్రాలు, పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై వేలకోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడిన కేసులో డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, అతని మేనమామ మెహెల్ చోక్సీ కీలక నిందితులుగా ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద కుంభకోణంగాఈ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత ఆంటిగ్వాకు పారిపోయి అక్కడి పౌరసత్వాన్ని అనుభవిస్తున్న మెహుల్ చోక్సీ ఇటీవల క్యూబాకు పారిపోతూ డొమినికాలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డొమినికా పౌరసత్వంలేని చోక్సీని నేరుగా భారత్‌కు అప్పగించవచ్చని ఆంటిగ్వా ప్రకటించింది. చోక్సీ భారతదేశానికి తిరిగి వెళ్లాల్సిందే..అక్కడ నేరారోపణల విచారణను ఎదుర్కోవలసిందే అని ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ తేల్చి చెప్పారు. అలాగే చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించినందుకు చోక్సిని అదుపులోకి తీసుకోవాలని డొమినికన్ ప్రభుత్వాన్ని బ్రౌన్ కోరినట్లు ఆంటిగ్వా మీడియా వెల్లడించింది. మరోవైపు చోక్సీ భారత పౌరుడు కాదు కాబట్టి, చట్టబద్దంగా భారతదేశానికి తరలించలేరని చోక్సీ న్యాయవాది వాదిస్తున్నారు. అంతేకాదు కొన్ని రాజకీయ కారణాల రీత్యా బలవంతంగా డొమినికాకు చోక్సీని తీసుకెళ్లారని కూడా ఆరోపించారు. అటు చోక్సీ వ్యవహారం డొమినికాలో రాజకీయ వివాదానికి దారి తీసింది. అంతర్జాతీయంగా తమ ప్రతిష్ట దెబ్బదింటోందంటూ డొమినికా ప్రతిపక్ష నాయకుడు లెన్నాక్స్ లింటన్ ప్రధానమంత్రి రూజ్వెల్ట్ స్కెర్రిట్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చదవండి : Mehul Choksi: గర్ల్‌ఫ్రెండ్‌తో డిన్నర్‌కు వెళ్లి చిక్కాడు కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు -
Mehul Choksi: గర్ల్‌ఫ్రెండ్‌తో డిన్నర్‌కు వెళ్లి చిక్కాడు
న్యూఢిల్లీ: ఆంటిగ్వాలోని తన సురక్షితస్థావరాన్ని వదిలి గర్ల్‌ఫ్రెండ్‌ను పొరుగునున్న డొమినికా దేశానికి డిన్నర్‌కు తీసుకెళ్లడమే మెహుల్ చోక్సీ పట్టివేతకు దారితీసింది. ప్రస్తుతం ఆయన కరీబియన్ ద్వీప దేశం డొమినికాలో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ‘గర్ల్‌ఫ్రెండ్‌తో సరదాగా గడుపుదామనో, డిన్నర్ కోసమో చోక్సీ ఆమెతో కలిసి డొమినికాకు బోటులో వెళ్లాడు. అక్కడ పోలీసులకు దొరికిపోయాడు. అదే ఆయన చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే ఆంటిగ్వాలో ఉంటే ఇక్కడి పౌరుడు కాబట్టి ఆయనకు రక్షణ ఉంటుంది. మేము చోక్సీని భారత్‌కు అప్పగించలేం’ అని ఆంటిగ్వా– బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌనే అన్నారు. జూన్ 2న కేసు తదుపరి విచారణకు వచ్చేదాకా చోక్సీని డొమినికాలోనే ఉంచాలని అక్కడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలు భిన్నంగా ఉంటే తప్పితే... చోక్సీని డొమినికా ప్రభుత్వం భారత్‌కే అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డొమినికాకు ప్రైవేట్ జెట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13,500 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ (62)ని వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చోక్సీ ఆర్థిక నేరాలకు సంబంధించిన పత్రాలను భారత్ ఈనెల 28న ఒక ప్రైవేట్ జెట్ విమానంలో డొమినికాకు పంపింది. పీఎన్బీ కుంభకోణం కేసులో మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి చోక్సి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. -
సినీ ఫక్కీలో పరార్.. దొరికిన చోక్సీ!
న్యూఢిల్లీ: సినిమాలో లాగా స్కెచ్ వేసి పరార్ అయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. పీఎన్బీ స్కామ్ నిందితుడు, పరారీలో ఉన్న వ్యాపారి చోక్సీ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న అంటిగ్వా పోలీసులు.. క్యూబాకు అతను పారిపోయి ఉంటాడని అంతా అనుమానించారు. అయితే.. ఆ అనుమానాలకు తగ్గట్లు చోక్సీ ముందుగా కరేబియన్ ద్వీపం డొమినికాకు బోటు ద్వారా చేరుకున్నట్లు తెలుస్తోంది. 62 ఏళ్ల చోక్సీ అక్కడి నుంచి క్యూబాకు వెళ్లాలని స్కెచ్ వేశాడు. ఈలోపు అంటిగ్వా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో చోక్సీకి గుర్తించిన డొమినికా పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు డొమినికా పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే అంటిగ్వా మాత్రం చోక్సీ మిస్సింగ్‌ను ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోవడం విశేషం. కాగా, పీఎన్బీ స్కామ్ కేసులో మెహుల్ చోక్సీ భారత్‌ను వీడి ఆంటిగ్వా, బార్బుడాకి పారిపోయిన విషయం తెలిసిందే. రూ.14 వేల కోట్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతన్ని దేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని క్యూబాకు చోక్సీ ప్రయత్నించి పట్టుబడ్డాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వేల కోట్ల రూపాయల రుణ మోసానికి పాల్పడిన ఆరోపణలున్న చోక్సీ చివరిసారిగా ఆదివారం తన కారులో ఆంటిగ్వా, బార్బుడాలో కనిపించాడు. అయితే తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ఈడీ అక్రమంగా భారత్‌లో ఉన్న 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అక్రమంగా చేసిందని చోక్సీ వాదిస్తున్నాడు. చదవండి: అర్జెంట్‌గా బాత్రూం వెళ్లిన డ్రైవర్, రైల్లో.. -
Mehul Choksi: అదృశ్యం.. రంగంలోకి దిగిన సీబీఐ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అదృశ్యమయిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న చోక్సీ ఆదృశ్యమైనట్లు అక్కడి పోలీసులు తెలిపారు. దాంతో ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులు తనను పిలిచి మాట్లాడారని చోక్సీ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విషయమై ఆంటిగ్వా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని వెల్లడించారు. అతని భద్రత గురించి కుటుంబ సభ్యులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. అక్కడి ప్రముఖ రెస్టారెంట్లో విందు కోసం చోక్సీ సోమవారం సాయంత్రం వెళ్లినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. దీంతో అంటిగ్వా పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. అయితే ఆయన క్యూబాకు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. 2017లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. 2018లో పీఎన్బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌మోదీతోపాటు మెహుల్ చోక్సీ దేశం విడిచి పరారయిన సంగతి తెలిసిందే. చదవండి: పీఎన్బీ స్కాం: చోక్సీకి భారీ షాక్ -
పీఎన్బీ స్కామ్: కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. దేశం విడిచి పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కనిపించకుండాపోయారు. అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న చోక్సీ.. కనిపించకుండా పోయారని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించాడు. చోక్సీ అదృశ్యం నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి ఓ రెస్టారెంట్లో విందు కోసం చోక్సీ వెళ్లినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. దీంతో అంటిగ్వా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆయన కోసం వెతుకుతున్నారు. అయితే ఇండియాకు అప్పగిస్తారనే భయంతోనే ఆయన పరారైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బహుశా ఆయన క్యూబాకి పారిపోయి ఉంటారని ఓ అధికారి చెప్తున్నారు. ఇండియాకు క్యూబాకు మధ్య నేరస్తుల అప్పగింతల ఒప్పందాలేవీ లేవు. అందుకే అక్కడికి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చదవండి: నిర్మాత అత్యాచారం, ఆపై గర్భం.. 2017లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నాడు. 2018లో పీఎన్బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌మోదీతోపాటు మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయాడు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఇద్దరూ బంధువులు. కాగా, మెహుల్ అప్పగింత అంశంపై అక్కడి పీఎం గాస్టోన్ బ్రౌన్ ఇదివరకే భారత ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడారు కూడా. -
భారత్‌కు అప్పగించొద్దు.. నీరవ్ మోదీ పిటిషన్
లండన్: భారత్ తిరిగి రాకుండా ఉండేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అతడిని భారత్‌కు అప్పగించాలని ఫిబ్రవరి 25న యూకే కోర్టు తీర్పు ఇచ్చింది. అదే క్రమంలో ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు అడ్డుపడే క్రమంలో ప్రస్తుతం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఆయన మరోసారి యూకే హైకోర్టులో తాజాగా పిటిషన్ కూడా దాఖలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు రూ. 14వేల కోట్ల మోసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ భారత్‌కు తిరిగి రాకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌కు అప్పగించొద్దు... నీరవ్ మోదీ కోర్టులో.. భారత్‌లో తనకు న్యాయం జరగదని, తన మానసిక స్థితి సరిగా లేదంటూ బ్రిటన్ కోర్టుకు విన్నవించారు. అయితే, ఆయన చేసిన వాదనలను అక్కడి కోర్టు తోసిపుచ్చింది. మనీలాండరింగ్ కేసులో భారత్ సమర్పించిన ఆధారాలు పరీశిలించామని, తప్పు చేసినట్లు రుజువులు ఉన్నాయని.. కనుక అతడిని అప్పగించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కోర్టు తీర్పునిచ్చింది. ఆపై యూకే హోంమంత్రిత్వశాఖ కూడా ఇందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం భారత్‌కు రాకుండా ఉండడానికి తాజాగా మరో ప్రయత్నంగా యూకే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. తప్పుడు ఎల్వోయూలతో పీఎన్బీని నీరవ్ మోదీ మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడింది. అయితే అప్పటికే అతడు దేశం విడిచి పారిపోయారు. 2018 డిసెంబర్లో నీరవ్ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అక్కడి వాండ్స్‌వర్త్ జైల్లో నీరవ్ ఉంటున్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బ్రిటన్ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. ( చదవండి: బిల్ గేట్స్: వ్యాక్సిన్ ఫార్ములాను భారత్‌కు ఇవ్వద్దు ) -
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(50)ని భారత్‌కు రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమయ్యింది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అప్పగింత ఉత్తర్వుపై యునైటెడ్ కింగ్డమ్ హోంశాఖ మంత్రి(సెక్రెటరీ) ప్రీతి పటేల్ సంతకం చేసినట్లు యూకేలోని భారత రాయబార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలకు సంబంధించి మోసం, మనీలాండరింగ్ కేసులు నీరవ్ మోదీపై నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. హోంశాఖ సెక్రెటరీ జారీ చేసిన తాజా ఉత్తర్వుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరడానికి నీరవ్ మోదీకి 14 రోజుల గడువు ఇచ్చారు. ఆధారాల పట్ల కోర్టు సంతృప్తి నీరవ్ మోదీ తన మామ మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు ఇండియాలో కేసులు నమోదయ్యాయని, అతడు ఇండియాలోని న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న స్పష్టం చేసింది. నీరవ్‌పై నమోదైన కేసుల విషయంలో ఇండియాలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. నీరవ్‌ను భారత్ అప్పగించే విషయంలో నిర్ణయాన్ని హోంశాఖకు వదిలేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇండియాలో అయితే సరైన వైద్యం అందదన్న నీరవ్ వాదనను న్యాయస్థానం కొట్టిపారేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడని చెప్పేందుకు ఉన్న ఆధారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మనీ లాండరింగ్, సాక్షులను బెదిరించడం, ఆధారాలను మాయం చేయడం తదితర అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడని స్పష్టంగా బయటపడుతోందని గుర్తుచేసింది. అందుకే బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తెలియజేసింది. యూకే అప్పగింత చట్టం–2003 ప్రకారం.. న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని హోంశాఖ సెక్రెటరీకి తెలియజేస్తారు. ఇండియా–యూకే మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని పర్యవేక్షించే అధికారం ఉన్న యూకే కేబినెట్ మంత్రి దీనిపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిప్రకారమే నీరవ్ మోదీ అప్పగింతకు హోంశాఖ మంత్రి ప్రీతి సుముఖత వ్యక్తం చేశారు. అప్పగింత ఎప్పుడు? నీరవ్ మోదీని వాండ్స్‌వర్త్ జైలు నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్న 12వ నంబర్ బ్యారక్‌కు తరలించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యూకే హోంమంత్రి ఉత్తర్వులను సవాలు చేస్తూ లండన్ హైకోర్టును ఆశ్రయించేందుకు నీరవ్ మోదీకి అవకాశం కల్పించారు. ఆయన ఒకవేళ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడే మరికొంత కాలం విచారణ జరుగనుంది. యూకే సుప్రీంకోర్టులో కూడా నీరవ్‌మోదీ అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుందని సమాచారం. అయితే, లండన్ హైకోర్టు అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది. తాజా పరిణామాలపై నీరవ్ మోదీ లీగల్ టీమ్ ఇంకా స్పందించలేదు. హైకోర్టుకు వెళ్తారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. యూకేలో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే నీరవ్ మోదీ భారత్‌కు చేరుకుంటారు. అసలేమిటి కేసు? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు మరికొందరు లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ను (ఎల్ఓయూ) దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ 2018 జనవరి 31న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసింది. ఎల్ఓయూ అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఎల్‌ఓయూతో నీరవ్ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్బీ బ్యాంక్ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ కేసులో సీబీఐ 2018 మే 14న నీరవ్‌తోసహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్ కోర్టులో దాఖలు చేసింది. 2019 డిసెంబర్ 20న 30 మందిపై రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్లో ఉన్నవారంతా రెండో చార్జిషీట్లోనూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్ మోదీ ముఠా దుబాయ్, హాంకాంగ్‌లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారిమళ్లించారు. నీరవ్ మోదీ 2018 జనవరి 1న ఇండియా నుంచి తప్పించుకున్నాడు. ట్రయల్ కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 జూన్‌లో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు, లండన్ హైకోర్టు కొట్టివేశాయి. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది. -
పీఎన్బీ స్కాం: చోక్సీకి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్నేషనల్ బ్యాంకు కుంభకోణం (పీఎన్బీ స్కాం)లో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు, నీరవ్‌మోదీ మేనమామ, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. వేలకోట్ల రూపాయల మేర పీఎన్బీ బ్యాంకునకు కుచ్చుటోపీ పెట్టి, ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ పౌరసత్వాన్ని ఆంటిగ్వా అండ్ బార్బుడా రద్దు చేసింది. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్టు సమాచారం. గత సంవత్సరమే తన పౌరసత్వాన్ని ఆంటిగ్వా రద్దు చేయడంతో, సెయింట్ జాన్‌లోని సివిల్ కోర్టును ఆశ్రయించాడు. చోక్సీ. అయితే భారత బ్యాంకులను మోసం చేసి, తమ దేశంలో స్థిర పెట్టుబడుల పేరుతో తమ దేశంలో ఆశ్రయం పొందటానికి వీల్లేదన్న అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో, చోక్సీ పిటిషన్‌ను కొట్టివేసి అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలో హామీ ఇచ్చినట్టుగా చోక్సీని భారత్‌కు అప్పగించే చర్యలు త్వరితగతిన ప్రారంభమవు తాయని వారు తెలిపారు. కాగా దౌత్యపరమైన ఒత్తిడి తరువాత మెహుల్ చోక్సీ పౌరసత్వ ఉపసంహరణకు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలోనేఅంగీకరించారు. నేరస్థులకు, ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి తమ దేశంలో చోటు లేదని 2019 జూన్‌లో స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే పీఎన్బీ స్కాంకు సంబంధించి లండన్ కోర్టు తీర్పు అనంతరం, ఈ కేసులోప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు రంగం సిద్ధ మవుతున్న సంగతి తెలిసిందే. -
పీఎన్బీ స్కాం సంచలనం : నీరవ్‌కు భారీ షాక్
సాక్షి, ముంబై: బ్యాంకింగ్ రంగాన్ని పట్టికుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ నేర చరిత్ర మూలంగా తమ జీవితాలు నాశనమైపోయాయంటూ నీరవ్ సోదరి పూర్వి, ఆమె భర్త మైయాంక్ మెహతా సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను ఇస్తామంటూ అప్రూవర్‌గా మారేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. పీఎన్బీ స్కాం, నీరవ్ నుంచి తమను దూరం చేయాలని కోరుతూ పూర్వి మోదీ, ఆమె భర్త కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని, సాక్ష్యాలను అందించేందుకు అంగీకరించారు. అతని నేరపూరిత కార్యకలాపాలు మూలంగా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు స్థంభించి పోయాయని వాపోయారు. ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వీరిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు అనుమతించింది. క్షమాపణ తెలిపిన తరువాత నీరవ్ చెల్లెలు పూర్వి మోడీ, ఆమె భర్తను అప్రూవర్లుగా అంగీకరించాలని కోర్టు తెలిపింది. ప్రస్తుతం బెల్జియం పౌరసత్వంతో ఆదేశంలో ఉన్న పూర్వి మోదీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా పీఎన్బీ స్కాంలో నీరవ్ మోడీ , అతని మామ మెహుల్ చోక్సీ, కొంతమంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలతో పీఎన్బీని రూ .14 వేల కోట్లకు ముంచేశాడు. అనంతరం విదేశాలకు పారిపోయిన నీరవ్‌ను 2019 మార్చిలో భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ జైల్లో ఉన్న నీరవ్‌ను భారత్‌కు అప్పగించే అంశం విచారణలో ఉంది. -
నవంబర్ 3 వరకు నీరవ్ మోదీ రిమాండ్ పొడిగింపు
లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ జ్యుడీషియల్ రిమాండ్‌ను యూకే కోర్టు నవంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి సంబంధించిన కేసు తదుపరి విచారణ నవంబర్ 3న జరగనుండడంతో అప్పటివరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ మోదీ విదేశాలకు పరారయ్యాడు. లండన్‌లో తలదాచుకుంటున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన లండన్ కోర్టు మెజిస్ట్రేట్ అతడి రిమాండ్‌ను నవంబర్ 3 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పం -
పీఎన్బీలో మరో భారీ స్కాం
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)లో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (సిల్) 1,203.26 కోట్ల రూపాయల మేర టోపీ పెట్టింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి పీఎన్బీ స్కాం వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాకముందే పీఎన్బీ ఈ భారీ స్కాం గురించి రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారాన్ని అందించింది. అహ్మదాబాద్ జోనల్ కార్యాలయంలోని కార్పోరేట్ శాఖలో ఈ మోసం జరిగినట్లు తెలిపింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ మోసపూరితంగా రూ.1,203 కోట్ల రుణాన్ని పొందిందని బ్యాంకు ప్రకటించింది. సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్ క్లోజర్ రిక్వైర్ మెంట్స్ (ఎల్ఓడిఆర్) బ్యాంకు విధానాల ప్రకారం సింటెక్స్ ఇండస్ట్రీస్ నికర నిర్థక ఆస్తుల్లో రూ.1203 కోట్ల మేర మోసంతో తీసుకున్న రుణాలు ఉన్నాయని ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. -
న్యాయవ్యవస్థపై మార్కండే కట్జు సంచలన వ్యాఖ్యలు
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండే కట్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సరైన న్యాయ విచారణ జరగదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరస్తుడు మోదీకి ఇండియాలో న్యాయం జరగదంటూ లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో వాదనల సందర్భంగా డిఫెన్స్ సాక్షిగా ఆయన పేర్కొన్నారు. కచ్చితంగా మోదీ దోషిగా తేలతాడు ఏ న్యాయవాది అతని కేసును తీసుకోడు. దేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోయిందంటూ శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుండి వీడియో లింక్ ద్వారా 130 నిమిషాల వాదనలో కట్జు న్యాయవ్యవస్థ, పరిశోధనా సంస్థలపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోయిందని, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి పరిశోధనా సంస్థలు రాజకీయ నేతల ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని ఆరోపించారు. న్యాయస్థానాలు అవినీతి, అక్రమాలకు నెలవయ్యాయని ఆరోపించడం సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందుకు కొన్ని కేసులను ఆయన ఉదహరించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు 2019 అయోధ్య తీర్పు, పదవీ విరమణ అనంతరం ఆయన రాజ్యసభ ఎంపిగా నామినేట్ కావడంవంటి అనేక ఆరోపణలను కట్జు గుప్పించారు. గత 50 సంవత్సరాల్లో అత్యంత అవమానకరమైన తీర్పు అయోధ్య తీర్పు అని కూడా వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని ధ్వజమెత్తారు. అంతేకాదు విచారణ పూర్తి కాకుండానే నిందితుడు మోదీని "నేరస్థుడు"గా పేర్కొంటూ న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ (మే నెలలో ఒక విలేకరుల సమావేశంలో)చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఇలాంటి తీర్పు చెప్పడానికి ఆయనేమీ న్యాయమూర్తి కాదు కదా, ఆయనేం న్యాయశాఖా మంత్రి అంటూ ఏద్దేవా చేశారు. మోదీ నేరస్థుడని భారత ప్రభుత్వం నిర్ధారించేసుకుంది. కోర్టులు వారు చెప్పినట్టే చేస్తాయి. ఇక న్యాయమైన విచారణను ఎలా ఆశించగలమని ఆయన మండిపడ్డారు. కేంద్రాన్ని నాజీ జర్మనీతో పోల్చుతూ..ఆర్థిక మాద్యం,నిరుదోగ్యం, ఇతర సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి ప్రస్తుత ప్రభుత్వానికి బలిపశువు అవసరం. ఆ బలిపశువే నీరవ్ మోదీ అని సుప్రీం మాజీ న్యాయమూర్తి పేర్కొన్నారు. సీబీఐని పంజరంలో చిలుక అని పేర్కొన్న 2013 నాటి సుప్రీం వ్యాఖ్యలను కట్జు గుర్తుచేసుకున్నారు. సీబీఐ, ఈడీ రాజకీయాలకు అతీతంగా లేవని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేతలుడిగి చూస్తోందని మండిపడ్డారు. ఇవన్నీ రాజకీయ అధినేతల చేతుల్లో పావులుగా మారిపోయాయని వ్యాఖ్యనించారు. నీరవ్ మోదీపై సీబీఐ, ఈడీ ఆర్థిక నేరాల ఆరోపణల గురించి తాను ఏమీ చెప్పలేనన్న కట్జు ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయమైన విచారణ జరగదంటూ పదే పదే నొక్కి వక్కాణించారు. కాగా కట్జు వ్యాఖ్యలపై భారతదేశం తరఫున వాదిస్తున్న న్యాయవాది హెలెన్ మాల్కం స్పందిస్తూ.. హై ప్రొఫైల్ కేసులో వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఐదు రోజుల విచారణలో చివరి రోజున, జస్టిస్ శామ్యూల్ గూజీ తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. మోడీని స్వదేశానికి రప్పించే అంశంపై తుది తీర్పు డిసెంబరులో రానుందని భావిస్తున్నారు. -
పీఎన్బీ స్కాం : నీరవ్ భార్యకు రెడ్ కార్నర్ నోటీసు
సాక్షి,న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ భార్య అమీ మోడీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. మనీలాండరింగ్ ఆరోపణలతో నమోదైన కేసులో భాగంగా దర్యాప్తు సంస్థ ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. (చదవండి: నీరవ్ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ) న్యూయార్క్ నగరంలో 30 మిలియన్ డాలర్ల విలువైన రెండు అపార్టుమెంట్ల కొనుగోలుకు సంబంధించి మోడీ అక్రమ లావాదేవీలకుపయోగించిన పలు కంపెనీలకు డైరెక్టరుగా ఉన్న అమీ పేరును తొలిసారిగా గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుబంధ చార్జిషీట్లో జత చేసింది. తాజాగా అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్‌గా భావించే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. ఈ కుంభకోణంలో ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించక ముందే, 2018 జనవరి మొదటి వారంలో అమీ, భర్త నీరవ్ మోడీ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లండన్ కు పారిపోయారు. కాగా అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన 13,500 కోట్ల రూపాయల పీఎన్బీ స్కాంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (48), అతని మామ, మెహుల్ చోక్సీ( 60) ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిన సీబీఐ, ఈడీ పలు చార్జ్ షీట్లను మోదు చేయడంతోపాటు, కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చింది. దర్యాప్తులో భాగంగా పలు విదేశీ, స్వదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. గత ఏడాది లండన్‌లో అరెస్టయి, ప్రస్తుతం వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన సాధారణ రిమాండ్ విచారణ అనంతరం లండన్ కోర్టు మోడీని ఆగస్టు 27 వరకు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. -
నీరవ్ మోదీ,మెహూల్ చోక్సీకి షాక్ ఇచ్చిన ఈడీ
-
నీరవ్ మోదీకి ఈడీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ పీఎన్బీని రుణాల పేరుతో రూ 14,000 వేల కోట్ల మేర మోసగించి విదేశాల్లో తలదాచుకున్న నీరవ్ మోదీకి ఈడీ గట్టిషాక్ ఇచ్చింది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల కంపెనీలకు చెందిన రూ 1350 కోట్ల విలువైన వజ్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలను హాంకాంగ్ నుంచి ఈడీ స్వాధీనం చేసుకుంది. వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. నీరవ్‌ను అప్పగించాలని భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై గత ఏడాది లండన్ కోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పీఎన్బీని మోసగించిన కేసులో నీరవ్ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి : నీరవ్ మోడీకి షాకిచ్చిన స్పెషల్ కోర్టు -
పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీ విచారణ షురూ!
సాక్షి. న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ (49) పై లండన్ కోర్టులో విచారణ మొదలు కానుంది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీని విచారణ కోసం యుకె కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం సౌత్‌వెస్ట్ లండన్‌లోని వర్డ్స్‌వర్త్ జైల్లో ఉన్న ఆయనను అధికారులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మోడీని భారత్‌కు అప్పగించాలని దాఖలైన పిటిషన్‌పై 5 రోజుల పాటు విచారణ జరగనుంది. వేలకోట్ల రూపాయల మేర బ్యాంకును మోసం చేసి లండన్‌కు పారిపోయిన మోడీని అప్పగించాలంటూ భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కోవిడ్-19 వాప్తి, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో వీడియో లింక్ ద్వారా ఆయనను విచారించే విషయాన్ని కూడా డిస్ట్రిక్ జడ్జి శామ్యూల్ గూజీ పరిశీలిస్తున్నారు. ''కొన్ని జైళ్లు నిందితులను వ్యక్తిగతంగా ప్రవేశపెడుతున్నందున ఈ నెల 11న నీరవ్ మోదీని కోర్టు ముందుకు తీసుకురావాలని ఆదేశిస్తాం. ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో లైవ్ వీడియో లింక్ ద్వారా విచారిస్తాం..'' అని న్యాయమూర్తి గూజీ పేర్కొన్నారు. (మరో మెగా డీల్‌కు సిద్ధమవుతున్న అంబానీ) నీరవ్ మోడీని అప్పగించాలంటూ గతేడాది భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నుంచి ఐదు రోజుల పాటు లండన్ కోర్టు విచారణ జరపనుంది. గత ఏడాది మార్చి 19న అరెస్టు అయినప్పటి నుండి నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో మోడీ పీఎన్బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. (కరోనా : అనుకోని అతిధి వైరల్ వీడియో) -
నీరవ్ మోదీకి షాక్ ఇచ్చిన తమ్ముడు!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) లో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన ఆరోపణలతో లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. తన అన్న అక్రమాలకు, నేరపూరిత కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపిస్తూ నీరవ్ తమ్ముడు నిషాల్ మోదీ ముందుకు వచ్చాడు. నీరవ్ మోదీ అవినీతి గురించి తనకు తెలియందటూ నిషాల్ ఈడీని ఆశ్రయించాడు. ఈ మేరకు తాను దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు ఒక లేఖ రాశాడు. తన వ్యాపార ప్రయోజనాల కోసం బ్యాంకులతో నీరవ్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నదీ తనకు తెలియదనీ, వార్తల్లో వచ్చేంతవరకు తనకు ఈ కుంభకోణం గురించి తెలియదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాననీ, చట్టం ప్రకారం సహాయం చేస్తానని ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆంట్వెర్ప్లో ఉన్న తనను కలవాలని ఈడీని కోరారు. నీరవ్ మోదీ సంపదకు తాను లబ్ధిదారుడిని కాదని నొక్కిచెప్పిన నీషల్ ఫైర్‌స్టార్ డైమండ్ డైరెక్టర్‌గా వేతనంతోపాటు వ్యాపారం ద్వారా వచ్చే చట్టబద్ధమైన ఆదాయాన్ని మాత్రమే తాను పొందానని, క్రమం తప్పకుడా పన్నులు కూడా చెల్లించానని రాశాడు. మరోవైపు ఈ లేఖ విషయాన్ని ధ్రువీకరించిన ఈడీ అధికారి ఒకరు నీషల్ నిందితుడు కాబట్టి, అతని సమాచారానికి విలువ వుండదని పేర్కొన్నారు. అంతేకాదు విచారణకు సహకరించదల్చుకుంటే అతనే భారతదేశానికి రావాలని తెలిపారు. కాగా దాదాపు రూ.14వేల కోట్ల పీఎన్బీ స్కాంలో ప్రధాన ఆరోపణలపై నీరవ్ మోదీని 2019 మార్చిలో లండన్‌లో అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో మరో ప్రధాన నిందితుడు అతని మామ మెహుల్ చోక్సీ, నీరవ్ సోదరుడిపై కూడా ఇప్పటికే పలు ఆరోపణలు కింద సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న నీరవ్‌ను వీడియో ద్వారా విచారించిన వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు అతడి జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏప్రిల్ 28వ తేదీవరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
జైల్లోనే నీరవ్ మోదీ
లండన్/ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు కుచ్చుటోపీ, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను యూకే కోర్టు గురువారం అయిదోసారి తిరస్కరించింది. గతేడాది మార్చిలో అరెస్టయినప్పటి నుంచి నీరవ్ నైరుతీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి బాకీ ఉన్న పన్నుల వసూలుకు గాను ఆ సంస్థ వజ్రాల వ్యాపారి, పీఎన్బీ స్కాంలో నిందితుడి నీరవ్ మోదీకి చెందిన 3 ఆస్తులను అటాచ్ చేసింది. నీరవ్ బీఎంసీకి రూ. 9.5 కోట్ల పన్ను చెల్లించాలని, ఇందుకుగాను అతని 4 ఆస్తుల్లో మూడింటిని అటాచ్ చేసినట్లు బీఎంసీ తెలిపింది. రుణాల ఎగవేతదారు నీరవ్ మోదీ ఆస్తులను వేలం వేయగా రూ. 51 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు వచ్చినట్లు అధికారులు గురువారం తెలిపారు. వేలం వేసిన వస్తువుల్లో రోల్స్ రాయిస్ కారు, పలు ప్రముఖ చిత్రలేఖనాలు, డిజైనర్ బ్యాగు సహా మొత్తం 40 వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
వేలానికి నీరవ్‌మోదీ విలాస వస్తువులు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకును రుణాల రూపంలో రూ.14,000 కోట్లకు పైగా మోసగించి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త నీరవ్‌మోదీకి చెందిన విలాస వస్తువులు వేలానికి రానున్నాయి. అరుదైన పెయింటింగ్‌లు, చేతి గడియారాలు, లగ్జరీ కార్లు ఇలా 112 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరఫున ‘శాఫ్రోనార్ట్’ అనే సంస్థ వేలం వేయనుంది. వీటికి సంబంధించి మార్చి 5న ప్రత్యక్ష వేలం నిర్వహించనుంది. అలాగే, మరో 72 వస్తువులకు మార్చి 3, 4వ తేదీల్లో ఆన్లైన్ వేలం కూడా చేపట్టనుంది. తొలుత ప్రత్యక్ష వేలాన్ని ఈ నెల 27న నిర్వహించేందుకు నిర్ణయించగా, ఈడీ నుంచి వచ్చిన ఆదేశాలతో మార్చి 5కు మార్చినట్టు శాఫ్రోనార్ట్ స్పష్టం చేసింది. విలువైన పెయింటింగ్‌లు.. ♦ 1935నాటికి చెందిన అమృత షేర్ గిల్ వేసిన పెయింటింగ్ ‘బోయ్స్ విత్ లెమన్స్’’ అధికంగా రూ.12–18 కోట్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ వేసిన 1972 నాటి పెయింటింగ్‌ను కూడా వేలం వేయనున్నారు. దీనికి కూడా దగ్గర దగ్గర ఇంతే ధర వస్తుందని భావిస్తున్నారు. అలాగే వీఎస్ గైతోండే, మంజిత్‌బవా, రాజా రవివర్మ పెయింటింగ్‌లను వేలంలో అందుబాటులో ఉంచనున్నారు. ♦ జాగర్ లీకోల్చర్ పురుషుల ‘రివర్స్ గైరోటర్బిల్లాన్ 2’ అనే లిమిటెడ్ ఎడిషన్ చేతి గడియారానికి రూ.70 లక్షలు వస్తుం దని అంచనా. పటేక్ ఫిలిప్ నాటిలస్ అనే బంగారం, వజ్రాల చేతి గడియారానికి కూడా రూ.70 లక్షలు లభిస్తుందని భావిస్తున్నారు. ♦ రోల్స్ రాయిస్ గోస్ట్ కారు రూ.95 లక్షలు పలుకుతుందని అంచనా. n బ్రాండెడ్ హ్యాండ్‌బ్యాగులను కూడా వేలంలో ఉంచనున్నారు. n ఇక మార్చి 3, 4న జరిగే వేలంలో పోర్షే ప్యానెమెరికా ఎస్ కార్ తదితర 72 వస్తువులను వేలానికి ఉంచనున్నట్టు శాఫ్రోనార్ట్ తెలిపింది. -
కంపెనీ డైరెక్టర్‌ను చంపేస్తానని బెదిరించిన నీరవ్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ.13వేలకోట్లు ఎగ్గొట్టి పరారైన వజ్రాలవ్యాపారి నీరవ్ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం చార్జిషీట్ దాఖలు చేసింది. తన సంస్థలోని ఒక డమ్మీ డైరెక్టర్‌ను నీరవ్ బెదిరించారని మహారాష్ట్రలోని ప్రత్యేక కోర్టుకు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈజిప్టులోని కైరో నుంచి ఇండియాకు తిరిగొస్తే చంపేస్తానని డైరెక్టర్లలో ఒకరైన ఆశిష్ మోహన్ భాయ్ లాడ్‌ను నీరవ్ బెదిరించాడని తెలిపింది. బ్యాంకు స్కామ్ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి లాడ్ దుబాయ్ నుంచి కైరోకు పారిపోయాడు. తర్వాత 2018లో భారత్‌కి తిరిగి రావాలని అనుకున్నప్పుడు నీరవ్ తరఫున నేహాల్ మోదీ బెదిరించాడని వెల్లడించింది. యూరప్ కోర్టులో జడ్జి ముందు నీరవ్‌కి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలని, దీనికి లాడ్‌కు నేహాల్ రూ.20 లక్షలు ఇవ్వజూపారని, అయితే దీనిని లాడ్ తిరస్కరించాడని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది. -
ఇండియాకు వెళ్తే నిన్ను చంపేస్తా : నీరవ్ మోదీ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పై శనివారం క్రిమినల్ చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మహారాష్ట్ర స్పెషల్ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ కంపెనీ డైరక్టర్లలో ఒకరైన ఆశిష్ మోహన్‌భాయ్ లాడ్ ను చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ తెలిపింది. 'కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ కంపెనీ డైరక్టర్లలో ఆశిష్ లాడ్ కూడా ఉన్నారు. కాగా ఈ కేసులో ఆశిష్ లాడ్ అరెస్టవ్వకుండా ఉండేందుకు దుబాయ్ ద్వారా కైరో వెళ్లి తలదాచుకున్నాడు. జూన్ 2018లో మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నఆశిష్ లాడ్‌ను తన సోదరుడు నేహాల్ మోదీ ద్వారా నీరవ్ మోదీ ఫోన్లో నువ్వు తిరిగి ఇండియాకు వెళితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని' సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది. నీరవ్‌మోదీ మాట్లాడక ముందు అతని సోదరుడు నేహాల్ మోదీ ఆశిష్‌కు యూరోపియన్ కోర్టులో జడ్జి ముందు నీరవ్ మోదీకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ రూ. 20 లక్షలు ఆఫర్ చేశారు. అయితే దీనిని ఆశిష్ లాడ్ తిరస్కరించడంతో నిన్ను చంపేస్తామంటూ నీరవ్ మోదీ బెదిరింపులకు పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. కాగా ఈ కేసులో అరెస్టవ్వకుండా ఉండేందుకు నీరవ్‌మోదీ విదేశాలకు పారిపోయాడు. దీంతో నీరవ్‌మోదీని తిరిగి రావాలంటూ భారతదేశానికి చెందిన పలు దర్యాప్తు సంస్థలు, కోర్టులు సమన్లు జారీ చేసిన తిరిగి రాకపోవడంతో అతనిపై ఫ్యజిటివ్ ఎకనమిక్ అపెండర్ చట్టం కింద పలాయన ఆర్థిక నేరస్తుడిగా పేర్కొంది. నీరవ్ మోదీ ప్రస్తుతం నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. అతని మామ మెహుల్ చోక్సీతో కలిసి బ్యాంకుకు రూ .13,570 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నీరవ్ మోదీను ఈ ఏడాది మార్చిలో స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
నీరవ్ మోదీకి భారీ షాక్
న్యూఢిల్లీ : పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి ముంబైలోని స్పెషల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా నీరవ్‌ను గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద ముంబైలోని అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్ఏ) కోర్టు అతడిని ఆర్థిక నేరగాడిగా పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ.14వేల కోట్ల మేర మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని అప్పగించాలంటూ భారత్ యూకేను కోరుతోంది. ఈ నేపథ్యంలో లండన్‌లో అరెస్టైన నీరవ్.. బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకోగా నాలుగుసార్లు తిరస్కరణకు గురైంది. దీంతో అతడిని నైరుతి లండన్‌లోని వాన్‌డ్స్‌వర్త్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో డిసెంబర్ 4న వీడియో లింక్ ద్వారా అతడిని కోర్టు విచారించనుందని వార్తలు వెలువడ్డాయి. కాగా నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను భారత్ తరపున వాదిస్తున్న న్యాయవాది లండన్ కోర్టులో సవాల్ చేశారు. ఇక భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్ మోదీ బెదిరించిన విషయం తెలిసిందే. కాగా భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను ముంబై కోర్టు ఆర్థిక నేరస్తుడిగాఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో మాల్యా తర్వాత ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన రెండో వ్యక్తిగా నీరవ్ నిలిచాడు. -
నీరవ్ మోదీ కార్లను వేలం వేయనున్న ఈడీ
ముంబయి : వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకోనుంది. తాజాగా అతనికి చెందిన 13 కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) వేలం వేయనుంది. కాగా, ఈ వేలం నవంబర్ 7న జరగనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీని గతేడాది మార్చిలో లండన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైళ్లో ఉన్న నీరవ్ మోదీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విచారణ నవంబర్ 6న జరగనుంది. అయితే ఈ ఏడాది ఆగస్టులో నీరవ్ మోదీ ఆస్తులన్నింటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు నీరవ్‌కు చెందిన విలువైన వాచ్‌లు, పెయింటింగ్స్, కార్లను వేలం వేయడానికి అనుమతి పొందింది. ఇందులో భాగంగానే నవంబర్ 7న కార్ల వేలం వేయనున్నారు.అయితే వేలం వేయనున్న కార్లలో బెంట్లీ ఆర్నేజ్ , రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఎంహెచ్, పోర్స్చే పనామెరా, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. -
పీఎన్బీ స్కాం : ఆంటిగ్వా ప్రధాని సంచలన వ్యాఖ్యలు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణంలో కీలక నిందితుడు, ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ మేనమామ, మెహుల్ చోక్సీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ రంగ బ్యాంకు పీఎన్బీలో రూ.14\వేల కోట్లు ఎగవేసి భారీ కుంభకోణానికి పాల్పడి ఆంటిగ్వా పారిపోయి, అక్కడి పౌరసత్వంతో ఎంజాయ్ చేస్తున్న చోక్సీపై దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంటిగ్వాఅండ్ బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్. ఫ్యుజిటివ్ బిలియనీర్ మెహుల్ చోక్సీ ఒక మోసగాడు, వంచకుడు అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని తెలిపారు. సాధ్యమైనంత త్వరలోనే చోక్సిని బహిష్కరిస్తాం..అతన్ని తిరిగి భారతదేశానికి రప్పించుకోవచ్చన్నారు. చోక్సీ ద్వారా దేశానికి ఉపయోగంలేదనీ, త్వరలోనే చోక్సి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో భారతీయ అధికారులు ఎప్పుడైనా వచ్చి చోక్సీని విచారించవచ్చు అని ప్రధాని గాస్టన్ తెలిపారు. అతనిపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చన్నారు. అంతేకాదు మంచి వ్యక్తిగా చోక్సిని భారత అధికారులు క్లియర్ చేయడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు భారత అధికారులే బాధ్యత వహించాలని కూడా చురకలంటించారు. కాగా పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే డైమండ్ వ్యాపారులు నీరవ్ మోదీ, చోక్సీ విదేశాలకు పారిపోయారు. అయితే వీరి పాస్‌పోర్టులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, నిందితులను తిరిగి దేశానికి రప్పించేందుకు మల్లగుల్లాలు పడుతోంది. నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో ఉండగా, అతని రిమాండ్‌ను అక్టోబర్ 17 వరకు పొడిగించింది లండన్ కోర్టు. తాను నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడివి అంటున్న చోక్సీ గతంలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఒక సందర్బంగా ఆంటిగ్వా ప్రభుత్వం చోక్సీని సమర్ధించింది కూడా. అలాగే అనారోగ్యం సాకుతో విచారణకు ఎ గ్గొడుతూ, మూక హత్యలు కారణంగా తాను ఇండియాకు రాలేనంటూ చిలక పలుకులు పలుకుతున్న చోక్సీ, జూన్ 2018 లో ముంబై అవినీతి నిరోధక కోర్టులో దాఖలు చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. #WATCH Antigua & Barbuda PM Gaston Browne: Got subsequent information that Mehul Choksi is a crook, he doesn't add value to our country. He will be deported ultimately after he exhausts appeals, Indian officials are free to investigate based on his willingness to participate. pic.twitter.com/FbAaIml0Fv — ANI (@ANI) September 25, 2019 -
పీఎన్బీ స్కాం: నీరవ్ రిమాండ్ పొడిగింపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ (48)కి మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. లండన్ వాండ్స్‌వర్త్ జైలు జైల్లో ఉన్న నీరవ్‌మోదీ బెయిల్ నిరాకరించి, రిమాండ్‌ను మరో 28 రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 17 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతినిస్తూ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆదేశించింది. ఇప్పటికే మూడుసార్లు బెయిల్ నిరాకరించారు. కాగా దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాని నిందితుడు. బ్యాంకును సుమారు 13వేల కోట్ల రూపాయలకు పైగా ముంచేసి లండన్‌కు పారిపోయిన నీరవ్ మోదీని తిరిగి భారత్‌కు రప్పించేందుకు కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈనేపథ్యంలోనే ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడంతో లండన్ పోలీసులతో కలిసి నీరవ్‌ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం నీరవ్ లండన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
నీరవ్‌కు మరో దెబ్బ, నేహాల్‌పై రెడ్ కార్నర్ నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఇప్పటికే నీరవ్ సోదరి పూర్వి మోదీ మెహతాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ కాగా తాజాగా సోదరుడు నేహాల్ దీపక్ మోదీ(40) పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ ఈ నోటీసు జారీ చేసింది. నీరవ్ విదేశాలకు పారిపోవడంలో నేహాల్ పాత్రకీలకమైందని ఆరోపిస్తూ అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఈడీ ఇటీవల ఇంటర్ పోల్‌ను అభ్యర్థించింది.మనీలాండరింగ్, సాక్ష్యాలను నాశనం చేసేందుకు, నేహాల్ ఉద్దేశపూర్వకంగా సహాయపడ్డాడని ఈడీ ఆరోపించింది. కాగా ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్బ్యాంకులో ఎల్ఓయుల ద్వారా రూ.13వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ విదేశాలకు చెక్కేశాడు. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఇప్పటికే నీరవ్ కేసులు నమోదు చేయడంతో పాటు పలు ఆస్తులను ఎటాచ్ చేశాయి. అటు నీరవ్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిన కేంద్రప్రభుత్వం ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. అతనిని తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
భూషణ్ పవర్ అండ్ స్టీల్ మరో భారీ కుంభకోణం
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేలకోట్ల రూపాయల స్కాంలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అలహాబాద్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ (బిపిఎస్ఎల్) రూ .1,774.82 కోట్లకు ముంచేసిందంటూ అలహాబాదు బ్యాంకు శనివారం ప్రకటించింది. భూషణ స్టీల్ కంపెనీకి సంబంధించి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరువాత, అలహాబాద్ బ్యాంకులో ఇంత పెద్ద భారీ కుంభకోణం వెలుగు చూడటం బ్యాంకింగ్ వర్గాలను విస్మయ పర్చింది. ఫోరెన్సిక్ ఆడిట్ దర్యాప్తు ఫలితాల ఆధారంగా ఈ స్కాంను గుర్తించామని రెగ్యులేటరీ సమాచారంలో అలహాబాదు బ్యాంకు వెల్లడించింది. దీంతో స్యూ మోటో ప్రాతిపదికన కంపెనీ, దాని డైరెక్టర్లపై కేసు నమోదు చేశామని పేర్కొంది. అక్రమంగా నిధులను మళ్లించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అలహాబాద్ బ్యాంకు నివేదించింది. ఇప్పటికే 900.20 కోట్ల రూపాయల కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వ బ్యాంకు తెలిపింది. ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి, అక్రమ పద్ధతుల్లో బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసి కన్సార్షియం బ్యాంకులను మోసం చేసినట్టుగా గుర్తించినట్టు తెలిపింది. కాగా దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఇటీవల పీఎన్బీ వెల్లడించింది. ప్రస్తుతం దివాలా తీసిన బీపీఎస్ఎల్ కేసు విచారణ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో తుది దశలో ఉందని, ఈ ఖాతా నుంచి పెద్ద మొత్తమే రాబట్టుకోగలమని ఆశిస్తున్నామని పీఎన్బీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మెహుల్ చోక్సీకి ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు, గీతాంజలి అధినేత మెహుల్‌చోక్సీకి మరో షాక్ తగిలింది. దుబాయ్‌లో చోక్సీకి చెందిన విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. దుబాయ్‌లోని మూడు వాణిజ్య ఆస్తులను, అతి విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ ఈ280, కారును, 24.8 కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లను ఎటాచ్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చర్య తీసుకుంది. కాగా 14వేల కోట్ల రూపాయల పీఎన్బీ స్కాంలో మెహుల్ చోక్సీ కిలక నిందితుడుగా ఉన్నాడు. చోక్సీపై కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐలు దర్యాప్తు చేస్తున్నాయి. చోక్సీ పాస్‌పోర్టు రద్దు చేయడంతోపాటు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆంటిగ్వాలో తలదాచుకున్న చోక్సీని తిరిగి భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కేసులో మరో కీలక నిందితుడు చోక్సీ మామ, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లండన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ED attaches under PMLA, 3 commercial properties in Dubai, valuables, 1 Mercedes Benz E280 and Fixed Deposit totaling to Rs. 24.8 crores of accused Mehul Choksi in a #Bankfraud case. — ED (@dir_ed) July 11, 2019 -
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మరో షాక్!!
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ ఫ్రాడ్ నుంచి తేరుకునేందుకు నానా తంటాలు పడుతున్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)కి మరో షాక్ తగిలింది. తాజాగా దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్ (బీపీఎస్ఎల్) సంస్థ దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు పీఎన్బీ వెల్లడించింది. ఖాతాల్లో అంకెల గారడీతో బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు పొందిన బీపీఎస్ఎల్.. ఆ నిధులను దుర్వినియోగం చేసిందని ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైనట్లు పీఎన్బీ పేర్కొంది. ‘ఫోరెన్సిక్ ఆడిట్ విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన నిధుల మళ్లింపు అభియోగాలతో బీపీఎస్ఎల్, దాని డైరెక్టర్లపై సీబీఐ సుమోటో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీన్ని ఆర్బీఐకి నివేదించాం‘ అని పేర్కొంది. అయితే, ఈ ఖాతాకు సంబంధించి నిబంధనల ప్రకారం ఇప్పటికే రూ. 1,932 కోట్ల మేర కేటాయింపులు జరిపినట్లు పీఎన్బీ తెలిపింది. బీపీఎస్ఎల్ దేశీయంగా చండీగఢ్‌లోని పీఎన్బీ కార్పొరేట్ బ్రాంచ్ నుంచి రూ. 3,192 కోట్లు, విదేశీ శాఖల (దుబాయ్, హాంకాంగ్) నుంచి రూ.614 కోట్లు రుణాలుగా తీసుకుంది. ప్రస్తుతం దివాలా తీసిన బీపీఎస్ఎల్ కేసు విచారణ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో తుది దశలో ఉందని, ఈ ఖాతా నుంచి పెద్ద మొత్తమే రాబట్టుకోగలమని ఆశిస్తున్నామని పీఎన్బీ వివరించింది. వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులు పీఎన్బీని దాదాపు రూ. 13,500 కోట్ల మేర మోసగించిన సంగతి తెలిసిందే. -
పీఎన్బీకి 7,200 కోట్లు చెల్లించండి
పుణే: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు రూ. 7,200 కోట్లు వడ్డీతో కలిపి చెల్లించాలని పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని రుణ రికవరీ ట్రిబ్యునల్ శనివారం ఆదేశించింది. పీఎన్బీని మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు అనుకూలంగా రుణ రికవరీ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దీపక్ కుమార్ రెండు ఉత్తర్వులు జారీ చేశారు. ‘జూన్ 30, 2018 నుండి సంవత్సరానికి 14.30 శాతం వడ్డీతో రూ. 7,200 కోట్ల మొత్తాన్ని ఏకమొత్తంగా లేదా విడతలవారీగా దరఖాస్తుదారునికి (పీఎన్బీ) చెల్లించాలని ప్రతివాదిని, అతని భాగస్వాములను ఆదేశిస్తున్నట్టు డీఆర్టీ ఉత్తర్వులో పేర్కొంది. మరో ఉత్తర్వును వెలువరిస్తూ, జూలై 27, 2018 నుండి 16.20 శాతం వడ్డీతో రూ. 232 కోట్లు చెల్లించాలని న్యాయమూర్తి నీరవ్‌ని ఆదేశించారు. లేనిపక్షంలో అధికారులు తదుపరి చర్యలను ప్రారంభిస్తారని ట్రిబ్యునల్ అధికారి స్పష్టం చేశారు. -
నీరవ్ మోదీకి సింగపూర్ హైకోర్టు షాక్..!
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త నీరవ్ మోదీ కుటుంబసభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలంటూ సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మెహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఈ అకౌంట్స్‌లో సుమారు 6.122 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 44.41 కోట్లు) ఉన్నట్లు పేర్కొంది. బ్యాంకులను మోసం చేయడం ద్వారా వచ్చిన సొత్తులో ఇది కూడా భాగమేనని, దీన్ని నిందితులు విత్‌డ్రా చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే నీరవ్ మోదీకి స్విస్ బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేశాయి. వీటిలో దాదాపు రూ. 283 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. పీఎన్బీని నీరవ్ మోదీ దాదాపు రూ. 14,000 కోట్ల మేర మోసం చేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును ఈడీ, సీబీఐ తదితర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. -
పిఎస్బి స్కాంలో నీరవ్ మోదీకి షాక్
-
సింగపూర్‌లో నీరవ్ మోదీకి చుక్కెదురు
పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సింగపూర్‌లో మోదీ సన్నిహితులకు చెందిన ఆస్తులను ఎటాచ్ చేయాలని సింగపూర్ హైకోర్టు ఆదేశాలచ్చింది. నీరవ్‌మోదీ సోదరి, ఆమె భర్త నిర్వహిస్తున్న కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ. 44.41 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రూ. 44కోట్లను, బ్యాంకు ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు సొమ్మును భారత బ్యాంకులనుంచి అక్రమంగా తరలించారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ అభ్యర్థన మేరకు సింగపూర్ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో నకిలీ పత్రాలు, లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఒయు) లాంటి అక్రమ పద్ధతుల ద్వారా వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో వ్యాపారి నీరవ్ మోదీ కీలక నిందితుడు. భారీగా రుణాలను ఎగవేసి లండన్‌కు చెక్కేసిన మోదీని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడుగా భారత ప్రభుత్వం ప్రకటించడంతోపాటు తిరిగి భారత్‌కు రప్పించాలని భారీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో లండన్ పోలీసులు సహకారంతో గత ఏడాది నీరవ్‌మోదీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం లండన్‌లో జైల్లో ఉన్న మోదీ బెయిల్ పిటిషన్‌ను వెస్ట్ మినిస్టర్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
స్విస్ షాక్ : రూ.283 కోట్లు ఫ్రీజ్
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ కుంభకోణం విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వేల కోట్లకు పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి స్విస్ అధికారులు భారీ షాకిచ్చారు. కోట్ల రూపాయల విలువైన వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. పీఎన్బీ స్కాంను విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విజ్ఞప్తి మేరకు వారు ఈ చర్య చేపట్టారు. మనీలాండరింగ్ నివారణ (పిఎంఎల్ఎ) చట్టం కింద ఈడీ అభ్యర్థన మేరకు స్విట్జర్లాండ్‌లోని నాలుగు బ్యాంకు ఖాతాలను అక్కడి అధికారులు సంభింపచేశారు. నీరవ్‌మోదీ, ఆయన సోదరి పుర్వీ మోదీకు చెందిన ఖాతాలతో సహా మొత్తం నాలుగు అకౌంట్లలోని రూ. 283.16 కోట్ల రూపాయలను స్విస్ అధికారులు ఫ్రీజ్ చేశారు. భారతీయ బ్యాంకుల నుండి అక్రమంగా స్విస్ బ్యాంకు ఖాతాల్లో మళ్లించారని స్విస్ అధికారులకు ఈడీ తెలిపింది. కాగా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఒయు) ద్వారా పీఎన్బీలో రూ. 14వేల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చీ రాగానే నీరవ్‌మోదీ, బంధువులతో సహా లండన్‌కు పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. అటు భారత ప్రభుత్వం నీరవ్ పాస్‌పోర్టును రద్దు చేసింది. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన సీబీఐ లండన్ పోలీసుల సహాయంతో, ఈ ఏడాది మార్చి నెలలో మోదీని అరెస్టు చేసింది. వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న మోదీ బెయిల్ పిటిషన్లను పలుసార్లు లండన్ కోర్టు తిరస్కరించింది. ఆర్థికనేరగాళ్ల చట్టం కింద మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయ్నత్నిస్తోంది. మరోవైపు ఇదే కేసులో మరో కీలక నిందితుడు, నీరవ్ మోదీ మామ మెహుల్ చోక్సీ కూడా ఆంటిగ్వాకు పారిపోయాడు. అయితే చోక్సీని అప్పగించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆంటిగ్వా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మెహుల్ చోక్సీకి ఎదురు దెబ్బ
ఆంటిగ్వా/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.14వేలకోట్లు కుచ్చుటోపి పెట్టిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంటిగ్వా ప్రభుత్వం అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తామని, న్యాయపరమైన ప్రక్రియ ముగిశాక భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించింది. న్యాయపరంగా అన్ని దారులు మూసుకుపోతే భారత్‌కు పంపిస్తామని ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనే చెప్పారు. చోక్సీ బ్యాంకుకి డబ్బులు ఎగ్గొట్టాక కరేబియన్ దీవులకు పరారై ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. పీఎన్బీలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చాక చోక్సీ గత ఏడాది జనవరిలో పరారయ్యాడు. అంతకు ముందే 2017 నవంబర్‌లో సిటిజెన్షిప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ (సీఐపీ) కింద ఆంటిగ్వా, బార్బడా జంట దీవుల పౌరసత్వాన్ని తీసుకున్నాడు. కాగా, లక్ష అమెరికా డాలర్లను ఇన్వెస్ట్ చేసి ఆంటిగ్వా, బార్బడా పౌరసత్వాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. మరోవైపు చోక్సీ తానేమీ పారిపోలేదని, వైద్య చికిత్స కోసం ఆంటిగ్వాకు వచ్చానని ట్రీట్మెంట్ అయిపోగానే భారత్‌కు వస్తానని అతని కేసు విచారిస్తున్న బాంబే హైకోర్టుకు వెల్లడించాడు. గీతాంజలి జెమ్స్ కంపెనీకి చెందిన వజ్రాల వ్యాపారులైన చోక్సీ, నీరవ్ మోదీలు పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం నీరవ్ లండన్ జైల్లో ఉన్నాడు. వారిద్దరినీ తిరిగి భారత్‌కు తీసుకురావడానికి ఈడీ, సీబీఐ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. -
మెహుల్ చోక్సీకి షాక్
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన డైమండ్ వ్యాపారి, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ పత్రాలతో రుణాలు పొంది రూ 14,000 కోట్లకు పైగా పీఎన్బీ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని అంటిగ్వా ప్రభుత్వం నిర్ణయించింది. చోక్సీ పౌరసత్వంపై విచారణ చేపట్టామని, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసి భారత్‌కు అప్పగించే ప్రక్రియ చేపడతామని అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆర్థిక నేరాల్లో పాలుపంచుకున్న నేరగాళ్లకు అంటిగ్వాను సురక్షిత ప్రదేశంగా మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రుణ కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటూ దేశం విడిచి అంటిగ్వాలో తలదాచుకున్న చోక్సీ అప్పగింత ప్రక్రియ ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది. చోక్సీ తన వాదనను సమర్ధించుకోవడంలో విఫలమై, న్యాయ ప్రక్రియలో చేతులెత్తేసిన అనంతరం ఆయనను అప్పగిస్తామని హామీ ఇస్తున్నామని అంటిగ్వా ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని అప్పగించాలన్న భారత్ పిటిషన్‌ను బ్రిటన్ కోర్టులో ఎదుర్కొంటున్నారు. నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్లను బ్రిటన్ కోర్టులు పలుమార్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
పీఎన్బీ స్కాం : చోక్సీకి ఈడీ కౌంటర్
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీలను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనంటూ కుంటిసాకులు చెబుతూ వస్తున్న చోక్సీకి షాకిచ్చేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. విచారణను ఆలస్యం చేసే ఉద్దేశంతో కావాలనే సాకులు చెబుతున్నాడని, చోక్సీకి వ్యతిరేకంగా నాన్ బెయిల్‌బుల్, రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఈడీ ముంబై కోర్టును కోరింది. దర్యాప్తునకు సహకరించకుండా, భారతదేశాని తిరిగి రావడానికి నిరాకరిస్తున్నాడని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న చోక్సీ అభ్యర్థనను కొట్టివేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో పీఎన్బీ స్కాం విచారణను ఆంటిగ్వాలో జరపాలంటూ మెహుల్ చోక్సీ పెట్టుకున్న విజ్ఞప్తిని ఈడీ శనివారం తిరస్కరించింది. అలాగే ఆంటిగ్వా నుండి చోక్సిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి వైద్య నిపుణులతో ఎయిర్ అంబులెన్స్‌ను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దేశంలో అవసరమైన అన్ని వైద్య చికిత్సలను అందుబాటులో ఉంచుతామని కూడా ఇడి కోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ముంబై కోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అనారోగ్య కారణం పేరుతో చట్టపరమైన చర్యలను ఆలస్యం చేస్తూ, కోర్టును తప్పుదోవ పటిస్తున్నాడని చోక్సీ పై ఈడీ మండిపడింది. భారతదేశం తిరిగి వచ్చేలా అఫిడవిట్ దాఖలు చేయాలని చోక్సీని ఆదేశించాలని కోర్టును కోరింది. అతను తిరిగి రావడానికి ఖచ్చితమైన తేదీని పేర్కొనాలని ఈడీ కోరింది. ఆర్డర్ ఇచ్చిన తేదీ నుండి ఒక నెలలోపు రావాలని పేర్కొంది. కాగా నకిలీ పత్రాలతో పీఎన్బీలో 14వేల కోట్ల రూపాయల మేర రుణాలను తీసుకొని ఎగ్గొట్టి నీరవ్‌మోదీ లండన్‌కు పారిపోగా, మెహుల్ చోక్సీ ఆంటిగ్వాకు చెక్కేసి అక్కడి పౌరసత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. -
‘భారత్ రాలేను..దర్యాప్తు అధికారినే పంపండి’
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్‌లో ప్రధాన నిందితుల్లో ఒకరైన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ తాను భారత్ నుంచి పారిపోలేదని, వైద్య చికిత్స కోసమే విదేశాలకు వెళ్లానని బొంబాయి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. తాను ఏయే వ్యాధులతో బాధపడుతున్నదీ ఈ అఫిడవిట్లో ఆయన పొందుపరిచారు. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు సంస్ధల విచారణకు హాజరయ్యేందుకు అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన తాను భారత్‌కు ప్రయాణించలేనని చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాను నివసిస్తున్న అంటిగ్వాలోనే దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ తనను ప్రశ్నించాలని ఆయన కోరుతున్నారు. తాను చెబుతున్నది సరైనదేనని భావిస్తే విచారణ అధికారిని అంటిగ్వా వెళ్లి తనను విచారించాల్సిందిగా ఆదేశించాలని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో చోక్సీ కోరారు. కాగా రూ 13,400 కోట్ల పీఎన్బీ రుణ కుంభకోణంలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను భారత్ రప్పించేందుకు ఈడీ, సీబీఐలు ప్రయత్నిస్తున్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు నకిలీ పత్రాలతో భారత బ్యాంకుల నుంచి రూ వేల కోట్ల రుణాలను పొంది తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పీఎన్బీ కుంభకోణం వెలుగుచూసినప్పటి నుంచీ మోదీ, చోక్సీలు దేశాన్ని దాటి విదేశాల్లో తలదాచుకుంటున్నారు. -
బెయిల్ కోసం మళ్లీ బ్రిటన్ కోర్టుకు నీరవ్ మోదీ
లండన్ : పీఎన్బీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ కోసం మరోసారి బ్రిటన్‌లో ఎగువ కోర్టును ఆశ్రయించారు. నీరవ్ మోదీకి గతంలో బెయిల్ ఇచ్చేందుకు దిగువ కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. మోదీ అప్పగింత కేసును విచారిస్తున్న వెస్ట్‌మినిస్టర్ మేజిస్ర్టేట్ కోర్టు ఇప్పటికే ఆయన బెయిల్ వినతిని మూడు సార్లు తోసిపుచ్చింది. కాగా మోదీని ఉంచిన వ్యాండ్స్‌వర్త్ జైలులో కనీస సౌకర్యాలు లేవని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు నివేదించినా బెయిల్ మంజూరుకు న్యాయస్ధానం అంగకరించలేదు. వ్యాండ్స్‌వర్త్ జైలుకు ప్రత్యామ్నాయంగా మోదీ లండన్‌లోని తన లగ్జరీ ఫ్లాట్‌లోనే 24 గంటల పాటు ఉండేందుకు అనుమతించాలన్న ఆయన న్యాయవాదుల అప్పీల్‌ను కోర్టు అంగీకరించలేదు. పీఎన్బీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న మోదీని భారత్‌కు అప్పగించడంపై బ్రిటన్ కోర్టులో వాదోపవాదాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నీరవ్ మోదీని ఈ ఏడాది మార్చి 20న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్‌చేశారు. నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీలు నకిలీ పత్రాలతో పీఎన్బీ నుంచి రూ 11,400 కోట్ల మేర రుణాలు పొంది తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
పీఎన్బీ స్కాం: చోక్సీకి భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కాంలో నిందితుడు, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉద్దేక పూర్వక రుణ ఎగవేసిన ఆర్థిక నేరస్తుడు, తప్పించుకుని పారిపోయినాడు ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం బాంబే హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో చోక్సీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా ఈడీ కోరింది. ఈ మేరకు ఈడీ రెండు పిటిషన్లను దాఖలు చేసింది. ఒకటి ఫ్యుజిటివ్ ఆర్థికనేరస్తుడిగా చోక్సీని ప్రకటించాలని, రెండవది అతనిని ప్రశ్నించేందుకు అనుమతినివ్వాలని కోరింది. అలాగే నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ కోర్టుముందు హాజరు కాకుండా ఉద్దేశ పూర్వకంగా తప్పించుకు తిరుగుతున్నాడంటూ జస్టిస్ ఐఎ మహంతి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం సమర్పించిన అఫిడవిట్లో ఈడీ ఆరోపించింది. విచారణకు సహకరించే ఉద్దేశం అతనికి లేదని మండిపడింది. దీనిపై తదుపరి విచారణను మంగళవారం చేపట్టనుంది బాంబే హైకోర్టు . -
నీరవ్ మోదీకి మళ్లీ షాక్
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి మరోసారి చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నీరవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు బుధవారం మూడోసారి తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో నీరవ్‌కు బెయిల్ మంజూరుచేస్తే ఆయన తిరిగి విచారణకు హాజరుకాకపోవచ్చని చీఫ్ మెజిస్ట్రే్టట్ ఎమ్మా అర్బత్నాట్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నీరవ్ న్యాయవాది క్లేర్ మాంట్గొమెరి వాదిస్తూ..‘లండన్ శివార్లలో ఉన్న వాండ్స్‌వర్త్ జైలులో పరిస్థితులు మనుషులు జీవించేలా లేవు. కోర్టు బెయిల్ కోసం ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తాం. అలాగే పూచికత్తుగా 20 లక్షల పౌండ్లు సమర్పిస్తాం. నీరవ్ 24 గంటలు నిఘానీడలో ఇంటిలోనే ఉండేలా కోర్టు ఆదేశించినా మాకు అంగీకారమే’ అని చెప్పారు. ఇది సాధారణ కేసు కాదనీ, నీరవ్ గతంలోనే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదిరించేందుకు ప్రయత్నించారని భారత న్యాయవాది నిక్ హెర్న్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు మే 30కి వాయిదా వేసింది. -
24 వరకు రిమాండ్‌లో నీరవ్
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టు మే 24 వరకు రిమాండ్ విధించింది. భారత్‌కు నీరవ్‌ను తిరిగి అప్పగించే కేసు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నీరవ్ గత నెలలో అరెస్టయ్యారు. అప్పటినుంచి వాండ్స్‌వర్త్ జైలులోనే ఉంటున్నారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు రాగా, వెస్ట్‌మినిస్టర్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నాట్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీరవ్ హాజరయ్యారు. మే 30న పూర్తి స్థాయి వాదనలు వింటామని, ఆ రోజు వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఎమ్మా ఆదేశించారు. అయితే మే 24న మరోసారి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని నీరవ్ తరఫు న్యాయవాది జెస్సికా జోన్స్‌ను అడగగా.. ఏమీ లేవని బదులిచ్చారు. దీంతో నీరవ్ తరఫున వేరే బెయిల్ పిటిషన్ ఏదీ దాఖలు కాలేదని ఎమ్మా రుజువు చేసుకుని విచారణ కొనసాగించారు. నీరవ్‌కు బెయిల్ మంజూరు చేస్తే తిరిగి లొంగిపోరనే కారణంతో మార్చి 29న ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. నీరవ్ కార్ల వేలం.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన 13 లగ్జరీ కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేలం వేసింది. నీరవ్‌కు చెందిన 11 కార్లు, చోక్సీకి చెందిన రెండు కార్లను ఈ–వేలం వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3.29 కోట్ల ఆదాయం వచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద వారి కార్లను ఈడీ అటాచ్ చేసింది. వాటిని వేలం వేసుకోవచ్చని ఈడీకి మార్చిలోనే ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు అనుమతులిచ్చింది. దీంతో గురువారం వాటిని ఈడీ ఆన్లైన్లో వేలం వేసింది. మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ వేలాన్ని నిర్వహించింది. -
రూ. 5 కోట్ల కారు కోటి రూపాయలకే..
ముంబై : 5 కోట్ల రూపాయిల విలువైన రోల్స్ రాయిస్ కారు ముంబైలో కేవలం రూ 1.3 కోట్ల నుంచే అందుబాటులో ఉంది. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి చెందిన 13 కార్లలో ఈ లగ్జరీ కారు ఒకటి కావడం గమనార్హం. ఈ 13 కార్లను ఈడీ ఆన్లైన్ వేలంలో విక్రయించనుఒంది. వేలం వేయనున్న నీరవ్ మోదీకి చెందిన 13 లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, పోర్షే పనమెరా, రెండు మెర్సిడెస్ బెంజ్, టొయోటా ఫార్చూనర్, ఇన్నోవా, రెండు హోండా బ్రియోస్‌లున్నాయి. కాగా, రూ 13,000 కోట్ల విలువైన పీఎన్బీ స్కామ్ వెలుగుచూసిన అనంతరం స్వాధీనం చేసుకున్న నీరవ్ మోదీ కార్లను వేలం వేసేందుకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్ధానం ఈడీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వేలం ప్రక్రియలో భాగంగా బిడ్డర్లు ఈనెల 21 నుంచి 23 వరకూ ఆయా కార్లను తనిఖీ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే వారికి వాహనాలను టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకువెళ్లేందుకు మాత్రం అనుమతించలేదు. ఈ 13 వాహనాల ఫోటోలను మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ సైట్లో అప్లోడ్ చేశారు. ఇందులోనే వాహనం ప్రారంభ ధర, తనిఖీ చేసుకునే ప్రదేశం, రిజిస్ర్టేషన్ నెంబర్, మోడల్ వంటి వివరాలను పొందుపరిచారు. కాగా, అంతకుముందు నీరవ్ మోదీ పెయింటింగ్‌లను వేలం వేసిన ఈడీ రూ 54 కోట్లను సమకూర్చుకుంది. పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకోగా, ఆయనను తమకు అప్పగించాలని భారత దర్యాప్తు ఏజెన్సీలు బ్రిటన్ను కోరుతున్నాయి. కాగా నీరవ్ మోదీ బెయిల్ అప్పీల్‌ను లండన్ కోర్టు తిరస్కరించింది. -
పీఎన్బీ స్కాం : కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై చీఫ్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఈడీ స్పెషల్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్యుజిటివ్ వ్యాపారవేత్త పీఎన్బీ స్కాం నిందితుడు నీరవ్ మోదీ కేసును పరిశీలిస్తున్న అధికారులను ఆయన అకారణంగా బదిలీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వినీత్ అగర్వాల్‌పై ఈ వేటు వేసింది. ఈడీ స్పెషల్ డైరెక్టర్‌గా తొలగించి, తన సొంత కేడర్‌కు బదిలీ చేస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఈడీ జాయింట్ డైరెక్టర్ సత్యబ్రత కుమార్‌ను నీరవ్ మోదీ కేసు విషయమై లండన్‌లో ఉండగా.. ఆయనను బదిలీ చేస్తూ మార్చి 29న వినీత్ అగర్వాల్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అయితే వెంటనే స్పందించిన ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రా, సుత్యబ్రత బదిలీని రద్దు చేశారు. జాయింట్ డైరెక్టర్ విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు స్పెషల్ డైరెక్టర్ వినిత్ అగర్వాల్‌కు ఎలాంటి అధికారాలు లేవని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంతో వినీత్ పదవీకాలం ఇంకా మూడేళ్లు మిగిలి వుండగానే ఆయనకు షాక్ ఇచ్చింది కేంద్రం. కాగా 1994 ఐపీఎస్ బ్యాచ్, మహారాష్ట్రకు క్యాడర్‌కు చెందిన అధికారి వినిత్ అగర్వాల్. 2017 జనవరిలో ఆయనను డిప్యుటేషన్ మీద ఈడీ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించింది ప్రభుత్వం. ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగాల్సి ఉంది. వినిత్ అగర్వాల్ ముంబై ఈడీ స్పెషల్ డైరెక్టర్ గా పనిచేసిన కాలంలో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో కార్యకలాపాలను చూసేవారు. -
రోల్స్ రాయిస్ సహా 13 లగ్జరీ కార్లు వేలానికి
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీపై దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఫ్యుజిటివ్ వ్యాపారి మోదీకి చెందిన ఖరీదైన పెయింటింగ్‌లను గత వారం వేలం వేసిన ఈడీ, సిబీఐలు తాజాగా మరో వేలానికి సిద్ధపడ్డాయి. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ మెటల్ స్ర్కాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్టీసీ) ద్వారా 13 విలాసవంతమైన కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చే వారం వేలం నిర్వహించనుంది. రోల్స్ రాయిస్ ఘోస్ట్, పోర్షే పనమేరా, రెండు మెర్సిడెస్ బెంజ్ కార్లు, మూడు హోండాకార్లు, ఒక టొయాటా ఫార్చునర్, ఇన్నోవా తదితర కార్లను వేలానికి పెట్టింది. ఏప్రిల్ 18న ఆన్లైన్ ద్వారా వీటిని విక్రయించనుంది. వేలం వేయనున్న కార్లకు సంబంధించిన ధర, ఫోటోలు, కంపెనీ తదితర వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనుంది. పీఎంఎల్ఏ కోర్టు ప్రత్యేక అనుమతితో ఈడీ వీటిని వేలం వేయనుంది. మరోవైపు లండన్ వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్న నీరవ మోదీ గత శుక్రవారం పెట్టుకున్న రెండవ బెయిల్ పిటిషన్ కూడా వెస్ట్‌మినిస్టర్ కోర్టు నిరాకరించింది. దీంతో ఏప్రిల్ 26 తదుపరి విచారణ వరకు మోదీ జైలు ఊచలు లెక్క బెట్టాల్సిందే. కాగా 14 వేల కోట్ల రూపాయల పీఎన్‌బీస్కాం విచారణలో భాగంగా గత ఏడాది ఫిబ్రవరిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 350 సీడీఐలు, టొయోటా ఫార్చునర్, ఇన్నోవా కారు, పోర్షే పనమేరా, మూడు హోండా కార్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 7.80 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, షేర్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : నీరవ్ మోదీ గుండె పగిలే వార్త -
కుక్క ఉంది.. బెయిల్ ఇవ్వండి!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13,500 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు బెయిల్ నిరాకరించినపుడు చిత్రమైన ఘటన జరిగింది.∙ఈ సందర్భంగా నీరవ్ బెయిల్ పొందేందుకు వీలుగా ఆయన లాయర్ల బృందం కొత్తతరహా వాదనను కోర్టుముందుకు తీసుకొచ్చింది. నీరవ్ పెంపుడు కుక్కను కారణంగా చూపుతూ బెయిల్ ఇవ్వాలని కోరింది. నీరవ్ తరఫున క్లేర్ మాంట్గోమెరీ వాదనలు వినిపిస్తూ..‘నీరవ్ మోదీ కుమారుడు ఇక్కడే చార్టర్‌హౌస్ ప్రాంతంలో పాఠశాల చదువు పూర్తిచేశారు. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారు. దీంతో ఒంటరితనంతో ఉన్న నీరవ్ ఓ కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నారు దేశాన్ని వదిలిపోయే వ్యక్తులెవరైనా ఈ పని చేస్తారా? బ్రిటన్ ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులకు పేరుగాంచింది’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌కు వచ్చాక మరో దేశపు పౌరసత్వం కోసం నీరవ్ దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఒకవేళ బెయిల్ మంజూరుచేస్తే నీరవ్ పాస్‌పోర్టును స్వాధీనం చేయడంతో పాటు హాంకాంగ్, సింగపూర్, యూఏఈలో ఉన్న నివాస అనుమతి పత్రాలను సరెండర్ చేస్తారని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం నీరవ్ దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. -
నీరవ్ మోదీకి బెయిల్ నో
లండన్ / న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కు రూ.13,500 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు మరోసారి షాకిచ్చింది. బెయిల్ కోసం నీరవ్ మోదీ రెండోసారి దాఖలుచేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి ఎమ్మా అర్బత్నాట్ శుక్రవారం తిరస్కరించారు. నీరవ్‌కు ఒకవేళ బెయిల్ మంజూరుచేస్తే ఆయన బ్రిటన్ విడిచి పారిపోతారని చెప్పడానికి గట్టి సాక్ష్యాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఈ కేసు విచారణ సాగుతుండగానే నీరవ్ 2017లో వనౌతు అనే పసిఫిక్ ద్వీప దేశపు పౌరసత్వం పొందేందుకు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేసిన ఎమ్మా.. ఈసారి వాండ్స్‌వర్త్‌లోని హర్ మేజిస్టీ జైలు నుంచి వీడియో లింక్ ద్వారా నీరవ్‌ను విచారిస్తామని స్పష్టం చేశారు. రేడియో ట్యాగ్‌కు ఒకే.. భారత న్యాయవాదుల వాదనల్ని నీరవ్ న్యాయవాది ఖండించారు. నీరవ్ తరఫున బారిస్టర్ క్లేర్ మాంట్గోమెరీ వాదనలు వినిపిస్తూ..‘నీరవ్ బ్రిటన్ను స్వర్గంగా భావిస్తున్నారు. బ్రిటన్‌లోనే తనకు న్యాయం జరుగుతుందని ఆయన నమ్ముతున్నారు. మా క్లయింట్‌కు బ్రిటన్ను విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశం లేదు. బెయిల్ మంజూరు చేస్తే నీరవ్ కదలకల్ని గుర్తించేందుకు వీలుగా ఆయనకు రేడియో ట్యాగ్ అమర్చేందుకు మేం సుముఖంగా ఉన్నాం’ అని వెల్లడించారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి ఎమ్మా అర్బత్నాట్.. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే నీరవ్ మోదీ పారిపోతారని చెప్పేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ పిటిషన్‌ను తిరస్కరించారు. మరోవైపు ఈ విచారణకు హాజరైన సీబీఐ–ఈడీ అధికారుల బృందం కొత్త సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. అంతకుముందు ఒకవేళ నీరవ్‌ను అప్పగిస్తే ఏ జైలుకు తరలిస్తారని న్యాయమూర్తి భారత న్యాయవాదిని ప్రశ్నించారు. దీంతో లిక్కర్‌కింగ్ విజయ్‌మాల్యాను ఉంచాలని భావిస్తున్న ఆర్థర్ రోడ్ జైలుకే నీరవ్‌ను తరలిస్తామని ఆయన జవాబిచ్చారు. ఆర్థర్రోడ్ జైలు వీడియోను తాను చూశాననీ, అక్కడ గదిలో ఇద్దరికీ సరిపడా స్థలం ఉందని జడ్జి ఎమ్మా వ్యాఖ్యానించారు. అధికారిపై వేటు.. ఉపసంహరణ నీరవ్ మోదీ కేసులో ఈడీ విచారణాధికారి(ఐఓ) అయిన జాయింట్ డైరెక్టర్ సత్యబ్రత్ కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి శుక్రవారం తప్పించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. కుమార్ లండన్ పర్యటనలో ఉండగానే ఈడీ పశ్చిమజోన్ ప్రత్యేక డైరెక్టర్ వినీత్ అగర్వాల్ ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఈ వార్త మీడియాలో వైరల్ కావడంతో ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రా ఈ ఉత్తర్వుల్ని నిమిషాల్లోనే రద్దుచేశారు.ఈడీ నిబంధనల మేరకు ఓ అధికారి ఐదేళ్లకు మించి ఒకే పోస్టులో కొనసాగరాదనీ, అదే సమయంలో కుమార్ పదవీకాలాన్ని పొడిగించాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని మిశ్రా తెలిపారు. సాక్షుల్ని చంపేస్తామని బెదిరించారు లండన్‌లోని కోర్టుకు నీరవ్ మోదీ మడతలు పడ్డ తెలుపురంగు చొక్కాతో శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) న్యాయవాది టోబీ కాడ్మన్ వాదిస్తూ..‘నీరవ్‌కు మోదీకి బెయిల్ మంజూరుచేస్తే ఆయన న్యాయప్రక్రియకు విఘాతం కల్గించడంతో పాటు దేశం విడిచి పారిపోయే ప్రమాదముంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను నీరవ్ ఇప్పటికే ఫోన్లో బెదిరించారు. స్మార్ట్ఫోన్లతో పాటు సర్వర్లలో ఉన్న కీలక సాక్ష్యాలను ధ్వంసం చేయించారు. పీఎన్బీని రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆశిష్ లాడ్‌ను చంపేస్తామని నీరవ్ ఫోన్లో బెదిరించారు. ఒకవేళ తన వాంగ్మూలం మార్చుకుంటే రూ.20 లక్షలు లంచం ఇస్తానని ఆశచూపారు. ఇదే కేసులో సాక్షులుగా ఉన్న నీలేశ్ మిస్త్రీ, మరో ముగ్గురిని ఇదే తరహాలో భయపెట్టారు’ అని కోర్టుకు తెలిపారు. -
నీరవ్ మోదీ కోసం లండన్‌కి సీబీఐ, ఈడీ
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ కేసు లండన్ కోర్టులో విచారణకు రానుండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం లండన్ బయలుదేరింది. ఈడీ–సీబీఐ నుంచి జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని బుధవారం లండన్ బయలుదేరారు. నీరవ్‌మోదీ భార్య అమీపై ఈడీ ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు కూడా తీసుకువెళ్లనున్నారు. భారతీయ అధికారులు ఆ దేశంలోని వివిధ అధికారులను, క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌ను కలిసి మోదీ, అతని కుటుంబ సభ్యులు, ఇతరులపై భారత్‌లో దాఖలైన కేసులకు సంబంధించిన వివరాలు, తాజా సాక్ష్యాలు గురించి వారికి తెలియజేస్తారు. నీరవ్‌మోదీ తన బంధువు మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణాలు తీసుకుని ఎగవేసినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. -
నీరవ్ మోదీ గుండె పగిలే వార్త
సాక్షి, ముంబై: పీఎన్బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ గుండెలు బద్దలయ్యే వార్త ఇది. దేశం నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారిని గత వారం లండన్‌లో స్కాట్లాండ్ పోలీసులకు చిక్కి, బెయిల్ రాక జైల్లో ఉన్న నీరవ్‌మోదీకి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. మోదీకి చెందిన ఖరీదైన కళాకృతులను ఆదాయ పన్నుశాఖ వేలం వేసింది. ముంబైలో మంగళవారం నిర్వహించిన ఈ వేలంలో రాజా రవివర్మ పెయింటింగ్ ఏకంగా 16.10 కోట్ల రూపాయలకు అమ్ముడు బోయింది. దాదాపు అన్నీ అంచనాకు మించి ధర పలకడం విశేషం. మొత్తం 54. 84 కోట్ల రూపాయల సొమ్మును త్వరలోనే కోర్టుకు సమర్పించనుంది ఐటీ శాఖ. 173 విలువైన పెయింటింగ్స్, 11 వాహనాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ(ఈడీ) వేలానికి ముంబై స్పెషల్ కోర్టు అనుమతిని పొందాయి. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం... తనకు రావల్సిన రూ.95.91 కోట్ల పన్ను బకాయిలకు సంబంధించి ఐటీ శాఖ 68 పెయింటింగ్స్‌ను వేలం నిర్వహించగా సరియైన ధర లభించక 13 అమ్ముడు పోలేదు. దాదాపు 100 మంది పాల్గొన్న ఈ వేలంలో జొగెన్ చౌదురీ పెయింటింగ్ రూ.46 లక్షల ధర అమ్ముడయింది. దీనికి రూ.18 లక్షలు విలువ అంచనా వేశారు. ఎఫ్.ఎన్ సౌజా 1955 ఇంక్ ఆన్ పేపర్‌కు రూ.32 లక్షలు పలికింది. అంచనా విలువ రూ.12 లక్షలతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ. వి.ఎస్. గైటోండె 1973 ఆయిల్ పెయింటింగ్ ధర ఏకంగా రూ.25.24 కోట్లు. అలాగే వేలంలో విక్రయమైన పెయింటింగ్స్‌లో కే లక్ష్మాగౌడ్, అక్బర్ పదంసే, రీనా కల్లత్, అతుల్ డోదియా, గుర్చరణ్ సింగ్, హెచ్ఏ గాదే వంటి కళాఖండాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఫ్యుజిటివ్ డైమండ్ వ్యాపారి పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13వేల కోట్ల ముంచేసి లండన్‌కు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీపై సీబీఐ,ఈడీ కేసులను నమోదు చేసింది. అలాగే పలు ఆస్తులతో పాటు, లగ్జరీ కార్లు, అత్యాధునిక వాహనాలు, విలువైన పెయింటింగ్‌లను కూడా ఎటాచ్ చేసింది. అలాగే మోదీ పాస్‌పోర్టును రద్దు చేసిన కేంద్రం తిరిగి అతడిని భారత్‌కు రప్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు బ్రిటన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో లండన్‌లో నీరవ్‌మోదీని అరెస్ట్ చేసిన పోలీసులు మార్చి29 వరకు రిమాండ్‌కు తరలించిరు. మరోవైపు ఆయన మొదట బెయిల్ పిటీషన్‌ను వెస్ట్‌మినిస్టర్ కోర్టు తిరస్కరించిన నేపథ్యలో రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు మోదీ సిద్ధమవుతున్నాడు. -
నీరవ్ కోసం లండన్‌కు ప్రత్యేక బృందం
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడు, ఫ్యూజిటివ్ డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ (49)కి చెక్ చెప్పేందుకు కేంద్ర చకా చకా పావులు కదుపుతోంది. గతవారం లండన్‌లో అరెస్టయ్యి రిమాండ్‌లో ఉన్న నీరవ్ మోదీని ఇండియాకు తిరిగి తీసుకొచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఈ నెల 29న కీలక విచారణ జరగనున్న నేపథ్యంలో అక్కడి అధికారులకు సహకరిచేందుకు సీబీఐ ఈడీ ప్రత్యేక బృందం లండన్ బయలు దేరి వెళ్లనుంది. జాయింట్ డైరెక్టర్‌స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం లండన్ వెళుతోంది. మరోవైపు 13 వేల కోట్ల రూపాయల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు శుక్రవారం (మార్చి29) హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రెండవసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు నీరవ్ సిద్ధమవుతున్నారు అక్కడి కోర్టు వర్గాలు ధృవీకరించాయి. గత వారం మోదీని అరెస్ట్ చేసిన స్కాట్లాండ్ యార్డ్ అధికారులు కోర్టు ముందు హాజరుపర్చగా.. అతని బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది. దీంతో మోదీని జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
నీరవ్ ఎఫెక్ట్ : చోక్సీ కొత్త రాగం
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలకనిందితుడు, గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్ చోక్సీ (60) రోగాల రాగం అందుకుని పీఎంఏల్‌ఏ కోర్టు కొత్త అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆర్థిక నేరస్తుడు చోక్సీని ఆంటిగ్వా నుంచి తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ముంబైలోని మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఏ) కోర్టులో కొత్తగా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కారణంగాను తాను విచారణకు రాలేనని కోర్టును కోరాడు. ఇటీవల పీఎన్బీ స్కాంలో మరో కీలక నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఇటీవల లండన్‌లో అరెస్టు చేయడంతోపాటు బెయిల్ నిరాకరించి జైలుకు తరలించిన నేపథ్యంలో తనకు కూడా అరెస్ట్ తప్పదని భావించిన ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త మెహుల్ చోక్సి చోక్సీ ఈ చర్యకు దిగాడు. తాను దీర్ఘ కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ ముంబై కోర్టును ఆశ్రయించాడు. ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధి, కాలిలో తీవ్రమైన నొప్పి, మెదడులో గడ్డ తదితర రుగ్మతలతో బాధపడుతున్నానని పేర్కొన్నాడు. కాగా గతంలో కూడా ఆంటిగ్వానుంచి 41గంటలపాటు విమానంలో ప్రయాణించి ఇండియాలో కోర్టు విచారణకు హాజరు కాలేననీ, అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపించాలని కోర్టుకు విన్నవించు కున్నాడు. తాజాగా మరోసారి విచారణకు ముఖం చాటేస్తూ కోర్టుకు దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం. బ్యాంకింగ్ రంగంలోఅతిపెద్ద కుంభకోణంగా పేరొందిన రూ.13వేల కోట్ల పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీకి మేనమామ మెహుల్ చోక్సీ. వేలకోట్ల రూపాయల మేర బ్యాకులకు ఎగనామం పెట్టిన చోక్సీ విదేశాలకు పారిపోయాడు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ, సీబీఐ చార్జి షీట్లను దాఖలు చేసాయి. అలాగే చోక్సీ పాస్‌పోర్టును రద్దు చేయడతోపాటు ఇంటర్ పోల్ నోటీసు కూడా జారీ అయింది. ప్రస్తుతం చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వంతో అక్కడ తలదాచున్న సంగతి తెలిసిందే. -
గుర్తుపట్టకుండా ప్లాస్టిక్ సర్జరీ!
లండన్/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు దాదాపు రూ.13,500కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారత్‌లో కేసుల దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్లు తేలింది. ఇందులోభాగంగా తొలుత ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల తూర్పున ఉన్న వనౌతు ద్వీప దేశపు పౌరసత్వం కోసం నీరవ్ దరఖాస్తు చేసుకున్నారు. సింగపూర్‌లో శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మూడో దేశంలో ఆశ్రయం పొందేందుకు వీలుగా బ్రిటన్‌లోని ప్రముఖ న్యాయసంస్థలను నీరవ్ సంప్రదించారు. అంతేకాకుండా భారత అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఆయన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని భావించారట. అయితే మెట్రో బ్యాంకు క్లర్క్ నీరవ్‌ను గుర్తుపట్టడంతో ఆయన ప్రణాళికలన్నీ బెడిసికొట్టాయి. మరోవైపు హోలీ పర్వదినం రోజున నీరవ్ మోదీ లండన్ శివార్లలోని వాండ్స్‌వర్త్‌లో ఉన్న ‘హర్ మెజెస్టీ జైలు’లో గడిపారు. మార్చి 28 వరకూ నీరవ్ ఇదే జైలులో ఉండనున్నారు. ఈ జైలులో అత్యవసర సమయంలో రోగులకు చికిత్స అందించే పరికరాలు లేవనీ, మౌలిక సదుపాయాలు కూడా అధ్వానంగా ఉన్నాయని గతంలో బ్రిటన్ జైళ్ల శాఖ విడుదల చేసిన నివేదికలు స్పష్టం చేశాయి. నీరవ్ కదలికలపై దృష్టి.. నీరవ్ మోదీ 2018, జనవరిలో భారత్‌ను విడిచిపెట్టి పారిపోయాక ఆయన ప్రతీ కదలికపై భారత విచారణ సంస్థలు దృష్టిసారించాయి. యూరప్, యూఏఈకి నీరవ్ సాగించిన రాకపోకలు, ఆయన ఆర్థిక వ్యవహారాలు, సమావేశాలను పరిశీలించాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘నీరవ్ మోదీ తన మామయ్య మెహుల్ చోక్సీ అంత తెలివైనవాడు కాదు. ఎందుకంటే వీరిద్దరి పరారీ అనంతరం సీబీఐ, ఈడీలు రెడ్‌కార్నర్ నోటీసులు ఇవ్వాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. దీంతో వెంటనే చోక్సీ స్పందిస్తూ.. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని తన ప్రతిస్పందనను దాఖలుచేశారు. కానీ భారత అధికారులు దేశం బయట తనను పట్టుకోలేరన్న ధైర్యంతో నీరవ్ ఈ విషయమై స్పందించలేదు’ అని వ్యాఖ్యానించారు. మాల్యా కేసుతో అవగాహన.. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు అంతర్జాతీయంగా ఏ న్యాయస్థానాల్లో అయినా చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘అంటిగ్వాలో తలదాచుకుంటున్న నీరవ్ మోదీ మామయ్య చోక్సీని ఆ దేశం భారత్‌కు అప్పగిస్తుందని భావిస్తున్నాం. నీరవ్‌ను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలన్న పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇది త్వరలోనే ఆమోదం పొందుతుందని అనుకుంటున్నాం. నీరవ్ మోదీని త్వరలోనే బ్రిటన్ భారత్‌కు అప్పగిస్తుంది. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలను అందించాం. కింగ్ ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా కేసులో ఎదురైన అనుభవాలతో బ్రిటన్ అప్పగింత చట్టాలపై భారత విచారణ సంస్థలకు ఓ అవగాహన వచ్చింది. అందుకు అనుగుణంగానే భారత అధికారులు నీరవ్ కేసు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించారు’ అని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొనాలని భారత సంస్థలకు బ్రిటన్ నుంచి ఇంకా ఆహ్వానం రాలేదన్నారు. ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న నీరవ్ సోదరుడు నిషాల్, సోదరి పూర్వీలకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నీరవ్ అరెస్ట్‌పై ప్రియాంక గాంధీ కామెంట్
చందౌలీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ అరెస్ట్‌పై కాంగ్రెస్ యూపీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ స్పందించారు. వేలకోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి పారిపోయిన నీరవ్‌మోదీ అరెస్టుతో ఇపుడేదో ఘనత సాధించినట్టు ఎన్డీఏ ప్రభుత్వం గప్పాలు పోతోందని విమర్శించారు. అసలు మోదీని లండన్‌కు పారిపోయేలా చేసింది ఎవరంటూ ఎద్దేవా చేశారు. ఇదో ఎన్నికల ఎత్తుగడ అన్నట్టుగా ఆమె కొట్టి పారేశారు. గత నెలలో పుల్వామా ఉగ్రదాడులో మరణించిన సైనిక కుటుంబాన్ని ప్రియాంక గాంధీ పరామర్శించారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మరోవైపు ఆర్థిక నేరగాళ్లపై చర్యలకు నరేంద్రమోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే.. 2015లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇచ్చిన మోసగాళ్ల జాబితాను ఎందుకు నిర్లక్ష్యం చేశారన్న విమర్శ రాజకీయవర్గాల్లో నానుతోంది. రూ.13వేల కోట్ల పీఎన్బీ స్కాంలో నిందితుడు నీరవ్‌మోదీని నిన్న (మార్చి 20, బుధవారం) స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పర్చారు. దీంతో మోదీ బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించిన కోర్టు మార్చి 29వ తేదీ వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. -
లండన్ జైల్లో నీరవ్ మోదీ
లండన్ / న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కు రూ.13,500 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)ని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు బ్రిటన్‌లో అరెస్ట్ చేశారు. లండన్‌లోని మెట్రో బ్యాంకులో ఖాతా తెరిచేందుకు మంగళవారం వచ్చిన మోదీని గుర్తించిన క్లర్క్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు మోదీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నగరంలోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం మోదీని హాజరుపరచగా, కోర్టు ఆయనకు మార్చి 29 వరకూ కస్టడీ విధించింది. నీరవ్ మోదీకి బెయిల్ నిరాకరించిన న్యాయమూర్తి మేరీ మల్లాన్.. ఒకవేళ బెయిల్ ఇస్తే ఆయన కోర్టు ముందు హాజరుకాబోరని చెప్పేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాట్లాడుతూ..భారత అధికారుల విజ్ఞప్తి మేరకు నీరవ్‌ను హోల్బోర్న్ ప్రాంతంలో అరెస్ట్ చేశామని తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలుచేసిన పిటిషన్ ఆధారంగా లండన్‌లోని ఓ కోర్టు నీరవ్ అరెస్ట్‌కు వారెంట్ జారీచేసిందన్నారు. అతిప్రచారం కారణంగానే అరెస్ట్ నీరవ్ మోదీ తరఫున బారిస్టర్ జార్జ్ హెప్బర్న్ స్కాట్, ఆనంద్ దూబే వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు వినిపిస్తూ..‘నీరవ్ మోదీపై చేసిన ఆరోపణలన్నింటిని మేం ఖండిస్తున్నాం. నీరవ్‌ను స్వదేశానికి తిప్పిపంపే విషయంలో ఆయన న్యాయబృందం స్కాట్లాండ్యార్డ్ పోలీసులతో కొన్నినెలలుగా చర్చలు జరుపుతోంది. ఇందుకు నీరవ్ మోదీ పూర్తిగా సహకరిస్తున్నారు. వచ్చే సోమవారం సెంట్రల్ లండన్ పోలీస్‌స్టేషన్‌లో నీరవ్ లొంగిపోయేందుకు ఆయన న్యాయబృందం, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఓ అంగీకారానికి వచ్చారు. కానీ ఈ కేసులో జరిగిన అతిప్రచారం కారణంగా నీరవ్‌ను చూడగానే బ్యాంక్ క్లర్క్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు ఆయన్ను ముందుగానే అరెస్ట్ చేశారు. నీరవ్ ప్రస్తుతం డైమండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే సంస్థలో నెలకు 20,000 పౌండ్ల(18.15 లక్షలు) వేతనానికి పనిచేస్తున్నారు. పన్నులను నిర్ణీత గడువులోగా చెల్లిస్తున్నారు. కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయండి. నీరవ్ తరఫున బెయిల్ కోసం 5,00,000 పౌండ్లు పూచీకత్తు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ సంస్థ అధినేత విజయ్‌మాల్యా తరఫున వాదించిన జార్జ్ హెప్బర్న్ బృందాన్నే నీరవ్ ఎంపిక చేసుకోవడం గమనార్హం. అప్పగింత ప్రక్రియ వేగవంతం విజయ్‌మాల్యాతో పోల్చుకుంటే నీరవ్ మోదీని భారత్‌కు బ్రిటన్ అప్పగించే ప్రక్రియ వేగంగా సాగే అవకాశముందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎందుకంటే నీరవ్ మోదీ పీఎన్బీ బ్యాంకును మోసం చేసినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. అందుకే 2017, ఏప్రిల్‌లో మాల్యాకు బెయిల్ మంజూరుచేసిన కోర్టు, నీరవ్‌కు మాత్రం నిరాకరించిందని వ్యాఖ్యానించారు. దీనికితోడు భారత్ గట్టి సాక్ష్యాలను బ్రిటన్‌లోని న్యాయస్థానానికి సమర్పించిందని పేర్కొన్నారు. నీరవ్ అరెస్ట్‌ను స్వాగతిస్తున్నాం: భారత్ నీరవ్ మోదీ అరెస్ట్‌ను భారత్ స్వాగతించింది. నీరవ్ అప్పగింత విషయంలో భారత్ బ్రిటన్‌తో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ తెలిపారు.ఆయన్ను వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేందుకు బ్రిటన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. బెయిల్ ఇస్తే దొరకడు జార్జ్ హెప్బర్న్ స్కాట్, ఆనంద్ దూబే వాదనల్ని భారత్ తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్)కు చెందిన జొనాథన్ స్వైన్ ఖండించారు. ‘భారత్‌లో దాదాపు రూ.13,500 కోట్లు అక్రమ నగదు చలామణి, మోసానికి పాల్పడ్డ కేసులో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్నారు. బ్రిటన్ చట్టాల ప్రకారం మోసం చేసేందుకు కుట్ర పన్నితే కనీసం ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అలాగే మోసం చేశాక రహస్యంగా దాక్కునేందుకు ప్రయత్నిస్తే పదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష విధించవచ్చు. నీరవ్ మోదీకి బెయిల్ ఇవ్వడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఓసారి బెయిల్ మంజూరు చేస్తే నీరవ్ మరోసారి కోర్టు ముందు హాజరుకాకపోవచ్చు’ అని జొనాథన్ కోర్టుకు విన్నవించారు. దీంతో ఇరుపక్షాల వానదలు విన్న జిల్లా జడ్జి మేరీ మల్లాన్.. నీరవ్ మోదీపై ఉన్న ఆరోపణలు, భారీ నగదుకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ కేసులో బెయిల్ నిరాకరిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ బెయిల్ ఇస్తే కోర్టు విచారణ నుంచి ఆయన తప్పించుకోవడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. హర్ మెజెస్టీ జైలుకు నీరవ్ మోదీ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్‌చేసిన నీరవ్ మోదీని వాండ్స్‌వర్త్‌లోని ‘హర్ మెజెస్టీ జైలు’కు తరలించే అవకాశముందని అధికారిక వర్గాలు తెలిపాయి. అక్కడే జైలులో ప్రత్యేక గదిని మోదీకి కేటాయించే అవకాశముందని లేదంటే మిగతా ఖైదీలతో గదిని పంచుకోవాల్సి రావొచ్చని వెల్లడించాయి. లండన్ శివార్లలో ఉన్న ఈ జైలు పశ్చిమ యూరప్‌లోనే అతిపెద్దది. ఈ జైలును ‘బీ’ కేటగిరిలో చేర్చారు. అంటే హైలెవల్ సెక్యూరిటీ రిస్క్ లేని వ్యక్తులను ఇక్కడ ఉంచుతారు. 1851లో ఏర్పాటైన ఈ జైలు ఖైదీలతో కిటకిటలాడుతోందనీ, ప్రస్తుతం ఇక్కడ 1,628 మంది ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో చాలామంది డ్రగ్స్ స్మగ్లర్లు, వ్యసనపరులు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారని వెల్లడించారు. అక్కడ మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉంటాయనీ, ఖైదీలను జైలు గది బయట ఎక్కువసేపు తిరగనివ్వరని వ్యాఖ్యానించారు. నీరవ్ మోదీ ఈ నెల 29 వరకూ ఇదే జైలులో ఉంటారని చెప్పారు. కాగా, ప్రస్తుతం హర్ మెజెస్టీ జైలులో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు జబైర్ మోతీ కూడా ఉన్నాడనీ, అతడిని అప్పగించాలని అమెరికా కోరుతుందని పేర్కొన్నారు. -
నీరవ్ మోదీ అరెస్ట్
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును 13వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి లండన్ చెక్కేసిన ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశాలతో వారు నీరవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో నీరవ్ మోదీని తమకు అప్పగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ బ్రిటన్ను కోరిన సంగతి తెలిసిందే. భారత్ వినతిపై స్పందించిన వెస్ట్ మినిస్టర్ కోర్టు రెండు రోజుల క్రితం నీరవ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అధికారులు మరికాసేపట్లో నీరవ్‌ని వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపర్చనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్, అతని మామ మెహుల్ చోక్సీపై ఈడీతోపాటు సీబీఐ కూడా మనీలాండరింగ్, తదితర నేరాల కింద కేసులు నమోదు చేశాయి. ఈ నేరాల కింద నీరవ్, అతని కుటుంబానికి చెందిన సుమారు రూ. 2,300 కోట్ల ఖరీదైన ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది. పారిపోయిన నీరవ్ లండన్‌లోని ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు ఇటీవల అక్కడి మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. -
నీరవ్ మోదీపై అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: రూ.13వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో అతడిని స్వదేశానికి పంపించాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వినతి మేరకు అక్కడి న్యాయస్థానం స్పందించిందని అధికార వర్గాలు తెలిపాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు మోదీపై ఇటీవలే వారెంట్ జారీ చేసినట్లు అక్కడి దర్యాప్తు విభాగం తమకు సమాచారం అందించిందని అధికారులు తెలిపారు. లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు మోదీని త్వరలోనే అధికారికంగా అరెస్టు చేసే అవకాశాలున్నాయన్నారు. అనంతరం వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరుస్తారు. ఆపైన అతడిని భారత్‌కు అప్పగించే న్యాయ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అయితే, అతడిని అరెస్టు చేసి, అభియోగాలు మోపే వరకు ఈ పరిణామాలపై స్పందించలేమని లండన్ కోర్టు, స్కాట్లాండ్ యార్డు పోలీసు అధికారులు స్పష్టం చేశారు. మోదీని అప్పగించాలంటూ ఈ నెల ప్రారంభంలో ఈడీ బ్రిటన్ హోం మంత్రిని కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో మోదీ, అతని మామ మెహుల్ చోక్సీపై ఈడీతోపాటు సీబీఐ కూడా మనీలాండరింగ్, తదితర నేరాల కింద కేసులు నమోదు చేశాయి. ఈ నేరాల కింద మోదీ, అతని కుటుంబానికి చెందిన సుమారు రూ. 2,300 కోట్ల ఖరీదైన ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది. పారిపోయిన మోదీ లండన్‌లోని ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు ఇటీవల అక్కడి మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. రూ. 9 వేల కోట్ల మేరకు మోసం చేసి బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కూడా చివరి దశలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మోడీ విషయంలో అనుసరించిన ప్రక్రియనే మాల్యాకు వర్తింపజేస్తామని పేర్కొన్నాయి. ఈడీ వినతి మేరకు లండన్ కోర్టు విజయ్ మాల్యాపై 2017 వారెంట్ జారీ చేయగా ప్రస్తుత ఆయన బెయిల్‌పై ఉన్నారు. -
‘రూ 934 కోట్లు సర్దేశాడు’
ముంబై : పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ రూ 934 కోట్లను తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించాడని ప్రత్యేక న్యాయస్ధానంలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో ఈడీ పేర్కొంది. ఈ మొత్తంలో రూ 560 కోట్లను తన ఖాతాలో వేసుకున్న నీరవ్ రూ 200 కోట్లను తన భార్య అమీ ఖాతాలోకి, రూ 174 కోట్లను తండ్రి దీపక్ మోదీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలోకి మళ్లించాడని ఈడీ ఆరోపించింది. నకిలీ పత్రాలతో పీఎన్బీ నుంచి నీరవ్ మోదీ వేల కోట్ల రుణాలను మోసపూరితంగా పొందాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రూ 12,000 కోట్ల పీఎన్బీ స్కామ్‌లో నీరవ్ ప్రధాన నిందితుడు కాగా, గీతాంజలి జెమ్స్ అధినేత నీరవ్ బంధువు మెహుల్ చోక్సీ కూడా పీఎన్బీ స్కామ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ కేసులో తాజా వివరాలను పేర్కొంటూ గతవారం ముంబై ప్రత్యేక న్యాయస్ధానంలో ఈడీ అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. తాజా చార్జిషీట్‌తో ఈ కేసులో నీరవ్ భార్య అమీ మోదీ సైతం నిందితురాలిగా చేరారు. గత ఏడాది ఈడీ సమర్పించిన తొలి చార్జిషీట్లో అమీని నిందితురాలిగా చేర్చలేదు. దర్యాప్తు సంస్థలు నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన లండన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు పలు కథనాలు వెల్లడయ్యాయి. -
నీరవ్ మోదీకి త్వరలోనే అరెస్ట్ వారెంట్ ?
సాక్షి,ముంబై: పీఎన్బీ కుంభకోణంలో కీలక నిందితుడు, ఆర్థిక నేరగాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజా ఛార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. లండన్‌లో స్వేచ్ఛగా చక్కర్లు కొడుతున్న మోదీ వీడియో రేపిన సంచలనం నేపథ్యంలో ఈడీ మరో చార్జి షీటును దాఖలు చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద అనుబంధ చార్జిషీట్‌గా నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా నీరవ్ భార్య అమి మోదీను ఇందులో చేర్చారు. ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం దీన్ని దాఖలు చేసింది. దాంతోపాటు అదనపు ఆధారాలను కూడా సమర్పించినట్లు అధికారులు ఈడీ అధికారులు వెల్లడించారు. అంతేకాదు సీబీఐ, ఈడీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం త్వరలోనే లండన్ బయలు దేరనుందని తెలుస్తోంది. అలాగే మోదీని దేశానికి తిరిగి రప్పించడానికి సంబందించిన నోటిషికేషన్‌ను వెస్ట్‌మినిస్టర్ మాజిస్ట్రేట్ కోర్టుకు పంపినట్టు బ్రిటన్ హోం శాఖ అధికారులు ధృవీకరించారు. దీని పరిశీలన అనతరం అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కు సుమవారు 14వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లండన్‌కు పారిపోయాడు. లండన్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న మోదీ అక్కడ వజ్రాల వ్యాపారం కూడా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం బ్రిటిష్ మీడియా విడుదల చేసిన వీడియో ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
నీరవ్‌తో ప్రధానికి పోలికలు
హవేరి(కర్ణాటక)/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మోసం కేసులో నిందితుడు నీరవ్ మోదీకి ప్రధాని మోదీకి మధ్య అసాధారణమైన సారూప్యతలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎద్దేవా చేశారు. వీరిద్దరూ చట్టానికి అతీతులమని భావిస్తుంటారన్నారు. వేల కోట్ల రుణాలు ఎగొట్టిన నీరవ్ మోదీపై మీడియా కథనాలపై రాహుల్ స్పందించారు. ‘ వీరిద్దరి పేర్లు మోదీనే. ఇద్దరూ దేశాన్ని దోచుకుంటున్నవారే. చట్టానికి అతీతులమని వీరు భావిస్తున్నారు. వీరిని చట్టం ముందు నిలబెడతాం’ అని ట్వీట్ చేశారు. ఇలాంటి పరారైన నేరగాళ్ల కోసం మోదీ ప్రభుత్వం ‘మోసగాళ్ల సెటిల్మెంట్ యోజన’ను ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదానికి కాంగ్రెస్ తలొంచదు అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్‌ను ఎన్డీఏ ప్రభుత్వం జైలు నుంచి ఎందుకు విడిచిపెట్టిందో ప్రజలకు వెల్లడించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ‘ ఏ ప్రభుత్వం అతడిని జైలు నుంచి వదిలిపెట్టింది?’ అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో హవేరీలో జరిగిన సభలో మాట్లాడారు.‘ఇటీవల కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు చంపారు. ఈ జవాన్లను ఎవరు చంపారు? జైషే మొహమ్మద్ చీఫ్ ఎవరు? మసూద్ అజార్.. భారత్ జైలులో ఉన్న అతడిని పొరుగుదేశం పంపిందెవరు? వాజ్‌పేయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కాదా? దీనిని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీ ప్రభుత్వ హయాంలో జైలు నుంచి బయటకు వచ్చిన మసూదే ఇప్పుడు జవాన్లను చంపాడన్న విషయం ఎందుకు మీరు చెప్పడం లేదు?’ అంటూ ప్రశ్నించారు. ‘మోదీజీ..మీకు మాదిరిగా కాంగ్రెస్ ఉగ్రవాదులకు తలొంచదు’ అని రాహుల్ అన్నారు. -
నీరవ్ లండన్‌లో తేలాడు
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీ(48) లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడి ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్లో నివాసముంటున్న మోదీ కొత్తగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ‘ది డైలీ టెలీగ్రాఫ్’ పత్రిక శనివారం వెలుగులోకి తెచ్చింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిచేందుకు ఇక్కడి వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో వారెంట్ జారీ ప్రక్రియ ప్రారంభమైందని సంబంధిత అధికారులు చెప్పారు. త్వరలోనే మోదీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశాలున్నాయని, దీంతో అప్పగింత ప్రక్రియలో ముందడుగు పడుతుందని భారత అధికారులు తెలిపారు. మరోవైపు, నీరవ్ మోదీని అప్పగించాలని కోరుతూ భారత్ దాఖలుచేసిన విజ్ఞప్తిని యూకే హోం శాఖ కార్యదర్శి సాజిద్ జావీద్ ధ్రువీకరించారు. భారత్ గత ఆగస్టులోనే ఈ మేరకు దరఖాస్తు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి మోసపూరితంగా రూ.13,500 కోట్ల రుణాలు పొందిన కుంభకోణంలో నీరవ్ మోదీతో పాటు అతని మేనమామ మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ మోసం వివరాలు బహిర్గతం కాకముందే 2018, జనవరిలో ఈ ఇద్దరు దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. నీరవ్ మోదీని భారత్ తీసుకొచ్చి విచారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది. నీరవ్ మోదీ లాంటి వాళ్ల కోసం మోదీ సర్కారు ‘మోసగాళ్ల సెటిల్మెంట్ యోజన’ అనే పథకాన్ని నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. నో కామెంట్..ప్లీజ్ మహారాష్ట్రలోని కిహిమ్ బీచ్‌లో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నీరవ్ మోదీ భారీ సౌధాన్ని అధికారులు కూల్చివేసిన మరుసటి రోజే ఆయన జాడ అధికారికంగా తెలియడం గమనార్హం. రోడ్డుపై మోదీకి తారసపడిన విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. బ్రిటన్‌లో రాజకీయ శరణార్థి కోసం దరఖాస్తు చేసుకున్నారా? భారత్ చేస్తున్న ఆరోపణలపై స్పందనేంటి? లాంటి ప్రశ్నలకు ‘నో కామెంట్’ అని మాత్రమే ఆయన సమాధానమిచ్చాడు. మోదీ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసినా, అతని అరెస్ట్ కోసం ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసినా..లండన్‌లో తాను నివాసముంటున్న ప్రాంతానికి సమీపంలోనే కొత్తగా వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్లు తెలిసింది. నీరవ్ మోదీని అప్పగించాలని భారత హైకమిషన్ గతేడాది ఆగస్టులోనే విజ్ఞప్తి చేయగా, ఆ ప్రతిపాదన అప్పటి నుంచి యూకే హోం శాఖ పరిశీలనలో ఉంది. మోదీ లండన్‌లోనే ఉన్నట్లు తాజాగా ధ్రువీకరణ కావడంతో యూకే హోం శాఖ స్పందిస్తూ..నిందితులపై అప్పగింత వారెంట్ జారీ అయిన తరువాత నేరస్థుల అప్పగింత ప్రక్రియ ముందుకు సాగుతుందని పేర్కొంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా విషయంలోనూ ఇలాగే జరిగింది. నీరవ్ మోదీపై అప్పగింత వారెంట్ జారీ అయిన తరువాత స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు విచారణ జరపనున్నారు. అరెస్ట్‌కు ‘శరణార్థి’ అడ్డంకి? గతేడాది జూలైలో మోదీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. యూకేలో ఆయన శరణు కోరాడా? లేదా? అన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఒకవేళ శరణార్థి హోదా కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లయితే, అది పరిష్కారమయ్యే వరకు ఆయన్ని అరెస్ట్ చేయడం కుదరదు. స్వదేశంలో విచారణ పక్షపాతంగా జరగడం లేదని, వేధింపులకు గురవుతున్నానని, తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని నిరూపించగలిగితే సదరు వ్యక్తికి శరణార్థి హోదా ఇచ్చే అవకాశాలున్నాయని సీనియర్ వలసల నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. గతేడాదే లండన్‌కు పారిపోయి వచ్చిన నీరవ్ మోదీ 2018 ఫిబ్రవరిలో భారత అధికారులు ఆయన పాస్‌పోర్టును రద్దు చేశాక కూడా కనీసం నాలుగు సార్లు బ్రిటన్ నుంచి విదేశాలకు ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆయన బ్రిటన్‌లో పనిచేసుకోవడానికి, పెన్షన్‌కి, ఆన్లైన్ బ్యాంకింగ్‌కి అవకాశం కల్పిస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ని కూడా పొందినట్లు ది డైలీ టెలీగ్రాఫ్ తెలిపింది. నీరవ్ అక్కడున్న సంగతి తెలుసు: భారత్ నీరవ్ మోదీ లండన్‌లో తలదాచుకున్న సంగతి తెలుసు కాబట్టే ఆయన్ని అప్పగించాలని బ్రిటన్ను విజ్ఞప్తి చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఆయన్ని భారత్ తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. నీరవ్ మోదీని లండన్‌లో గుర్తించినంత మాత్రాన వెంటనే భారత్‌కు తీసుకురాలేమని, ఇందుకోసం అధికారిక ప్రక్రియ ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. నీరవ్‌ను అప్పగించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ వేర్వేరుగా విన్ననపాలు పంపినట్లు చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ స్పందిస్తూ...బ్యాంకు మోసగాళ్ల కోసం మోదీ ప్రభుత్వం ప్రత్యేక సెటిల్మెంట్ యోజనా నడుపుతోందని తీవ్రంగా మండిపడింది. బ్యాంకుల నుంచి రూ. లక్ష కోట్లు కొల్లగొట్టి పారిపోయిన బడా పారిశ్రామికవేత్తల్లో ఒక్కరినైనా ఈ ఐదేళ్లలో తీసుకురాలేకపోయారని దుయ్యబట్టింది. రూ.9 లక్షల కోటు, బుర్ర మీసాలతో బొద్దుగా, బుర్ర మీసాలతో సుమారు రూ. 9 లక్షల విలువ చేసే ఆస్ట్రిచ్ హైడ్ కోటు ధరించిన నీరవ్ మోదీ లండన్ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను ‘ది డైలీ టెలిగ్రాఫ్’ విడుదల చేసింది. టాటెన్హామ్ కోర్టు రోడ్డులో బహుళ అంతస్తుల విలాసవంతమైన ఆకాశహార్మ్యంలోని ఒక ఫ్లోర్లో సగభాగాన్ని ఆయన అద్దెకు తీసుకున్నట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ ఫ్లాట్ అద్దె నెలకి రూ.15.48 లక్షలు అని అంచనా. నీరవ్ మోదీ ఈ ఫ్లాట్‌కి వంద గజాల దూరంలోనే కొత్తగా వజ్రాలæ వ్యాపారం మొదలుపెట్టినట్లు తెలిసింది. నీరవ్ మోదీ తన అపార్ట్మెంట్ నుంచి సెంటర్ పాయింట్లో ఉన్న ఈ వజ్రాల వ్యాపార సంస్థ వరకూ తన చిన్న కుక్కపిల్లను వెంటబెట్టుకొని ప్రతిరోజూ వెళుతున్నట్టు ఆ పత్రిక వెల్లడించింది. నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లోని ఈ బహుళ అంతస్తుల భవంతిలోని ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు -
డైమండ్ కింగ్ ఆశల సౌధాన్ని కుప్పకూల్చిన అధికారులు
-
లండన్‌లో ప్రత్యక్షమైన నీరవ్ మోదీ
-
బ్రిటన్ వీధుల్లో దర్జాగా ఆర్థిక నేరగాడు
లండన్ : భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ.. ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నీరవ్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని, అతడు దొరకగానే భారత్‌కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే నీరవ్ మాత్రం దర్జాగా బ్రిటన్ వీధుల్లో తిరుగుతూ.. రాజభోగాలు అనుభవిస్తున్నాడు. లండన్‌లోని సెంట్రల్ పాయింట్ టవర్ బ్లాక్‌లో నీరవ్ ఉన్నట్లు టెలిగ్రాఫ్ ధృవీకరించింది. నీరవ్ లండన్ వీధుల్లో తిరుగుతున్న వీడియోను తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. దీంతో నీరవ్ ఆచూకీ వెలుగులోకి వచ్చింది. తప్పు చేశానన్న భయం ఏమాత్రం లేదు ఏ మాత్రం భయం లేకుండా రద్దీగా ఉండే లండన్‌లోని వెస్ట్ ఎండ్‌లో విహరిస్తున్న నీరవ్‌ను టెలిగ్రాఫ్ రిపోర్టర్ గుర్తించాడు. అనంతరం అతడితో సంభాషించేందుకు ప్రయత్నించాడు. నీరవ్ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, రిపోర్టర్ వదలలేదు. భారత్‌లో చేసిన ఆర్థిక నేరం, లండన్‌లో ఎక్కడ నివసిస్తున్నారు, ఏం చేస్తున్నారంటూ నీరవ్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే వీటన్నింటికి నో కామెంట్ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు నీరవ్. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆ రిపోర్టర్ వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఆర్థిక నేరగాడి ఆచూకి వెలుగు చూసింది. ఇక తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మీసాలు, గడ్డాలు పెంచాడు. అంతేకాకుండా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో నీరవ్ ధరించిన కోటు ధర సుమారు ఏడు లక్షలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం నీరవ్ మోదీ సెంట్రల్ పాయింట్ టవర్ బ్లాక్‌లో లగ్జరీ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్నాడని.. ఆ అపార్ట్మెంట్ అద్దె నెలకు రూ.16 లక్షలని సమాచారం. లండన్‌లోనూ తిరిగి బిజినెస్ ప్రారంభించాడని.. వెస్ట్ ఎండ్‌లో భారీ ఎత్తున వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరోవైపు నీరవ్‌కు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసినా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సుమారు రూ.13 వేల కోట్లకు పైగా అప్పు తీసుకున్న నీరవ్.. అనంతరం ఆ బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. చదవండి: పీఎన్బీ స్కాం : నీరవ్‌కు మరో ఎదురు దెబ్బ డైనమైట్లతో నీరవ్ మోడీ బంగ్లా పేల్చివేత -
డైనమైట్లతో నీరవ్ మోడీ బంగ్లా పేల్చివేత
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో రు.13 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీ నివాస భవనాన్ని ఇవాళ (శుక్రవారం) అధికారులు కూల్చివేశారు. అలీబాగ్‌లో విలాసవంతమైన బంగ్లాను రాయగడ్ జిల్లా కలెక్టర్ విజయ సూర్యవంశి,ఇతర అధికారుల సమక్షంలో పూర్తిగా నేలమట్టం చేశారు. బిల్డింగ్ బుల్డోజర్లకు లొంగక పోవడంతో, ప్రత్యేక బృందాన్ని పిలిపించి మరీ పని పూర్తి చేశారు. దీంతో డైమండ్ కింగ్ ఆశల సౌధం కుప్పకూలింది. శక్తివంతమైన దాదాపు 100 డైనమైట్లు వినియోగించి బంగ్లాను ధ్వంసం చేశారు. రూ.33 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ బంగ్లాను నాణ్యమైన సిమెంట్‌తో నిర్మించడంతో బుల్డోజర్లతో కూల్చడం కష్టమని భావించిన అధికారులు డైనమైట్లతో పూర్తిగా పడగొట్టారు. ఈ భవనం విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇప్పటికే ఈ భవనాన్ని ఈడీ ఎటాచ్ చేసింది కూడా. -
ఆ భవనం కూల్చివేతకు ముహూర్తం ఫిక్స్
సాక్షి, ముంబై: డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి ఊహించని షాక్ తగిలింది. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు నీవర్‌కు చెందిన అలీబాగ్ విలాసవంతమైన భవనాన్ని అధికూరులు పూర్తిగా కూల్చి వేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ డిటోనేటర్లతో ఈ భవనాన్నిపూర్తిగా నేలమట్టం చేయడానికి శుక్రవారం ముహర్తం పెట్టారు. ఇందుకు ప్రత్యేక టెక్నికల్ బృందాన్ని కూడా రప్పించారు. రాయగడ్ జిల్లాలో సముద్రతీర ప్రాంతంలో 30వేల చదరపుగజాల్లో విస్తరించి ఉన్న ఈ భవనానికి మూడు డ్రిల్లింగ్ మెషీన్ల సాయంతో రంధ్రాలు చేసిన డైనమేట్లు పేర్చి కుప్పకూల్చ నున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ భవనం పిల్లర్స్‌లో రంధ్రాలు చేసే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అయితే ఈ విలువైన షాండ్లియర్‌ను, బుద్ధుని విగ్రహాన్ని భద్రపరిచామని దీన్ని ఈడీ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ జిల్లా అధికారులు కూల్చివేతకు ఆదేశించిన ఈ భవనాన్ని పీఎన్ బీ కేసులో ఈడీ ఎటాచ్ చేసింది. ఈ బంగ్లా విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మేరకు రాయగఢ్ జిల్లా కలెక్టరు విజయ్ సూర్యవంశి అదనపు కలెక్టరు భరత్ షితోలేకు బాధ్యతలను అప్పగించారు. పేలుళ్ల ద్వారా భారీ బిల్డింగులను కూల్చిన అనుభవం భరత్ సొంతం. అంతేకాదు డిమోలిషన్ మ్యాన్‌గా పేరు కూడా తెచ్చుకున్నారు. కాగా బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణానికి కారకులు డైమండ్ వర్తకుడు నీరవ్ మోదీ, ఆయన మేనమాడ, గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీ. సుమారు రూ14వేలకోట్ల మేరకు ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి విదేశాలకు చెక్కేశారు. ఇప్పటికే వీరిపై సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయడంతోపాటు, పలు ఆస్తులను ఎటాచ్ చేశాయి. అటు ప్రభుత్వం నీరవ్, చోక్సీల పాస్ పోర్టులను రద్దు చేసింది. వీరిని తిరిగి దేశానికి రప్పించేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
పీఎన్బీ స్కాం : నీరవ్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలోప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఈడీ మరోసారి ఝలక్ ఇచ్చింది. రూ. 148 కోట్ల విలువైన ఆస్తులను మంగళవారం అటాచ్ చేసింది. ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెట్‌కు 147.72 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రూ.50కోట్ల విలువైన అమృతా షెర్-గిల్, ఎం.ఎఫ్ హుస్సేన్ లాంటి ప్రముఖ కళాకారుల పెయింటింగ్స్ ఇందులో ఉన్నాయి. మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఏ) కింద ఈడీ ఈ చర్య చేపట్టింది. మోదీ అతని కంపెనీలకు చెందిన ఎనిమిది కార్లు, ప్లాంట్, మెషీన్లు, బంగారు ఆభరణాలు, పెయింటింగ్స్‌తోపాటు ఇతర స్థిరమైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ విదేశాల్లో నీరవ్‌కు చెందిన 1725 కోట్ల రూపాయల ఆస్తులను ఇప్పటికే ఈడీ ఎటాచ్ చేసింది. కాగా రూ.14వేల కోట్ల రూపాయల పీఎన్బీ స్కాంలో నీరవ్‌మోదీతోపాటు, ఆయన మేనమామ గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్ చోక్సీ ప్రధానంగా నిందితులుగా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కేసులు నమోదు చేశాయి. వేలకోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడి విదేశాలకు చెక్కేసిన నీరవ్, చోక్సీలను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘చోక్సీని భారత్‌కు అప్పగించం’
న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పించే ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ ప్రస్తుతం అంటిగ్వా పౌరుడని ఆయనను భారత్‌కు పంపబోమని ఓ అంటిగ్వా అధికారి స్పష్టం చేశారు. రూ 13,500 కోట్ల పీఎన్బీ స్కామ్‌లో నిందితుడైన చోక్సీని దేశానికి రప్పించేందుకు భారత్ ప్రత్యేక విమానాన్ని కరీబియన్ దీవులకు పంపుతోందన్న వార్తల నేపథ్యంలో అంటిగ్వా అధికారి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మెహుల్ చోక్సీ కోసం భారత్ నుంచి అధికారులు అంటిగ్వా, బార్బుడాలకు వస్తున్నారన్న సమాచారం తమ ప్రభుత్వం వద్ద లేదని ప్రధాని గాస్టన్ బ్రౌన్ కార్యాలయ సిబ్బంది చీఫ్ మాక్స్ హర్ట్ పేర్కొన్నట్టు ఇండియా టుడే టీవీ వెల్లడించింది. మెహుల్ చోక్సీ ఇప్పుడు అంటిగ్వా పౌరుడని,ఆయన తన భారత పౌరసత్వాన్ని వదిలివేయడంతో భారత పౌరుడు కారని ఆయన అంటిగ్వా పౌరసత్వాన్ని తాము రద్దు చేయబోమని హర్ట్ పేర్కొన్నారు. వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత బృందం అంటిగ్వాకు రానుందని తాను భావిస్తున్నాన్నారు. చోక్సీని అరెస్ట్ చేయడం లేదా ఆయనను తీసుకువెళ్లేందుకు భారత బృందం అంటిగ్వా వస్తుందని తాము భావించడం లేదన్నారు. జనవరి 31న వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ అంటిగ్వాలో ప్రారంభమవుతుండటంతో భారత అధికారులు అంటిగ్వా రావచ్చని చెప్పుకొచ్చారు. -
స్పెషల్ మిషన్‌తో చోక్సీకి చెక్?
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితులైన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీని స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేక మిషన్ ద్వారా గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పించే పనిలో ఉన్నాయి. ఇందుకోసం ఎయిర్ ఇండియాకు లాంగ్ రేంజ్ బోయింగ్ విమానంలో సీబీఐ, ఈడీ అధికారులు వెస్ట్ ఇండీస్‌కు తరలి వెళ్లనున్నాయని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు తిరుగు ప్రయాణంలో యూరప్ నుంచి నీరవ్ మోదీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. పీఎన్బీ స్కాంలో కీలక నిందితులైన వజ్రాల వ్యాపారులు, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీలను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే వీరిద్దరి పాస్‌పోర్టులను రద్దు చేయడంతోపాటు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే నిందితులిద్దరూ విదేశాలకు చెక్కేశారు. నీరవ్ మోదీ లండన్‌లో తలదాచుకోగా, చోక్సీ వెస్టిండిస్‌లోని ఆంటిగువా అండ్ బార్బుడా దేశ పౌరసత్వం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు రాలేనంటూ కుంటి సాకులు చెబుతూ, ఇటీవల కేసులనుంచి తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా భారతీయ పౌరసత్వాన్ని కూడా వదులుకున్నట్టు చోక్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నీరవ్‌కు షాక్ : విలాసవంతమైన బంగ్లా కూల్చివేత
సాక్షి,ముంబై : పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. ముంబైకి సమీపంలోని నీరవ్‌కు చెందిన విలాసవంతమైన అలీబాగ్ బంగ్లా కూల్చివేతకు అధికారులు ఆదేశాలిచ్చారు. ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని రాయిఘడ్ జిల్లా కలెక్టర్ సూర్యవంశి వెల్లడించారు. చాలా దృఢమైన ఈ భవాన్ని కూల్చడానికి కొంత సమయం పడుతుందని, రెండు బుల్డోజర్లు, ప్రొక్లెయిన్లతో ఇప్పటికే పని ప్రారంభించినట్టు తెలిపారు. సముద్ర తీరంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఈ భవనాన్ని నీరవ్‌మోదీ నిర్మించారని తేల్చిన అధికారులు శుక్రవారం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ భవనంతో పాటు మరో 58 భవనాలు అక్రమంగా నిర్మించారని అధికారులు ప్రకటించారు. దాదాపు 30వేల చదరపు అడుగుల్లో విస్తరించిన వున్న ఈ బంగ్లా విలువ రూ.42కోట్లు వుంటుందని గతంలోనే ఈడీ ప్రకటించింది. కాగా బీచ్ తీరంలో అక్రమ భవనాలు, హోటళ్లు, రిస్టార్ట్లను తొలగించాల్సిందిగా కోరుతూ ఎన్జీవో కార్యకర్త శాంబూర్జే యువ క్రాంతి 2009లో హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇది అక్రమమైన కట్టడమేనని కలెక్టర్ సూర్యవంశి గత ఏడాది డిసెంబరులో ధృవీకరించారు. దీంతో కోర్టు ఆయా భవనాల కూల్చివేతకు ఆదేశించింది. అలాగే దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా నీరవ్‌మోదీ తదితరులకు నోటీసులు పంపించినా, ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈడీతో సంప్రదింపుల అనంతరం కూల్చివేతకు నిర్ణయించామని కలెక్టరు వివరించారు. -
భారత పౌరసత్వం వదులుకున్న చోక్సీ
-
భారత పౌరసత్వం వదులుకున్న చోక్సీ
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో తలదాచుకున్న రుణ ఎగవేతదారులను భారత్‌కు రప్పించాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రయత్నాలకు గండిపడింది. పీఎన్బీ స్కామ్‌లో నిందితుడు, పరారీలో ఉన్న మెహుల్ చోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకుని అంటిగ్వా ప్రభుత్వానికి తన పాస్‌పోర్ట్‌ను అప్పగించారు.చోక్సీ ఏడాదికి పైగా అంటిగ్వాలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. రుణ ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తాను భారత్ వెళ్లేందుకు తన ఆరోగ్యం సహకరించదని 2018 డిసెంబర్ 25న చోక్సీ న్యాయస్ధానం ఎదుట తన వాదనను వినిపించారు. అంటిగ్వా నుంచి భారత్‌కు 41 గంటల పాటు ప్రయాణం చేసే పరిస్ధితిలో తాను లేనని కోర్టుకు వివరించారు. తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి డైమండ్ వ్యాపారి చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ 13,000 కోట్లకు మోసం చేసినట్టు దర్యాప్తు సంస్ధలు ఆయనపై విచారణ చేపట్టాయి. కాగా భారత పౌరసత్వం వదులుకోవడం ద్వారా భారత చట్టాల ప్రకారం తనపై జరిగే విచారణను అడ్డుకునేందుకు చోక్సీ ఇలా వ్యవహరించారని భావిస్తున్నారు. -
క్రిమినల్ లావాదేవీలుగా చూపారు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో తాను భారత్‌కు తిరిగిరాలేనని నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తెలిపారు. భారత్‌లో తన ప్రాణాలకు భద్రత లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.నీరవ్ మోదీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని ఈడీ ముంబైలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన న్యాయవాది న్యాయస్థానంలో ఈ మేరకు స్పందించారు. ఈ వ్యవహారంలో తానే దోషి అన్నట్లు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారని నీరవ్ పిటిషన్లో తెలిపారు. తాను చేసిన సాధారణ బ్యాంకింగ్ వ్యవహారాలను కూడా పీఎన్బీ అధికారులు క్రిమినల్ లావాదేవీలుగా కలరింగ్ ఇచ్చారని ఆరోపించారు. -
పీఎన్బీ స్కామ్ : చోక్సీ ఫ్యాక్టరీని అటాచ్ చేసిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్ నిందితుడు, పరారీలో ఉన్న డైమండ్ జ్యూవెలర్ మెహుల్ చోక్సీకి చెందిన రూ 13 కోట్ల విలువైన ఆస్తిని శుక్రవారం ఈడీ అటాచ్ చేసింది. థాయ్‌లాండ్‌లోని రూ 13 కోట్లకు పైగా విలువైన గీతాంజలి గ్రూప్‌కు చెందిన ఫ్యాక్టరీని ఈడీ పీఎంఎల్ఏ చ్టం కింద అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫ్యాక్టరీ గీతాంజలి గ్రూప్‌కు చెందిన అభేక్రెస్ట్ (థాయ్‌లాండ్) లిమిటెడ్‌దిగా భావిస్తున్నారు. పీఎన్బీని మోసగించడం ద్వారా నకిలీ హామీలతో ఈ సంస్థ రూ 92.3 కోట్ల రుణాలను పొందినట్టు విచారణలో వెల్లడైందని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విదేశీ ఆస్తికి సంబంధించి, దాని యాజమాన్య హక్కులపై కీలక ఆధారాలు రాబట్టిన తర్వాతే అటాచ్ చేశామని తెలిపింది. దీంతో పీఎన్బీ స్కామ్‌లో ఇప్పటివరకూ దాదాపు రూ 4765 కోట్ల మేర ఆస్తుల అటాచ్ పూర్తయిందని ఈడీ వెల్లడించింది. -
‘41 గంటల ప్రయాణం చేయలేను’
ఆర్థిక నేరగాడు, పీఎన్బీ కుంభకోణంలో కీలక నిందితుడు మొహుల్ చోక్సీ తాను విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాశాడు. తన ఆరోగ్యం పరిస్థితి బాగాలేని కారణంగా ఇండియాలో విచారణకు రాలేనంటూ సమాచారం అందించాడు. ఆంటిగ్వానుంచి 41గంటలకుపాటు ప్రయాణం చేయలేనని బొంబాయి కోర్టు విచారణకు రాలేనని చెప్పుకొచ్చాడు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అనుమతించాలని కోరాడు. బ్యాంకులతో తాను నిరంతరం టచ్‌లోనే ఉంటూ, సమస్య పరిష్కానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. అంతేకాదు తన అనారోగ్య పరిస్థితులను కావాలనే ఈడీ తప్పుదోవపట్టించేలా దాచిపెడుతోందని ఆరోపించాడు. కాగా గీతాంజలి గ్రూపు అధిపతి మొహుల్ చోక్సిని ఫ్యుజిటివ్ ఆర్ధికనేరస్థుడిగా ప్రకటించడంతోపాటు, ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ఈడీ బొంబాయి కోర్టును కోరింది. విదేశాల్లో రుణాలను పొందేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా నకిలీ హామీలతో 13వేల కోట్ల రూపాయల కుంభకోణంలో డైమండ్ వ్యాపారం నీరవ్‌మోదీ ఆయన మామ చోక్సీ నిందితులు. ఈ స్కాం వెలుగులోకి రావడంతో విదేశాలకు చెక్కేసిన చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వాన్ని పొందాడు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, డిసెంబరులో ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. అటు నీరవ్‌మోదీని, ఇటు ఆంటిగ్వా నుండి చోక్సిని తిరిగి దేశానికి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
చోక్సీపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్
సాక్షి, న్యూఢిల్లీ : రూ 13,000 కోట్ల పీఎన్బీ బ్యాంకు స్కామ్ కేసులో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్ధుడు మెహుల్ చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. సీబీఐ అభ్యర్ధనపై ఇంటర్‌పోల్ చోక్సీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బ్యాంకులను మోసగించిన కేసులో చోక్సీపై దర్యాప్తు సంస్ధలు సీబీఐ, ఈడీలు ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేయడంతో అమెరికా అధికారులు చోక్సీని గుర్తించి అతడి సమాచారాన్ని భారత్‌కు చేరవేయనున్నారు. బ్యాంకు స్కామ్ వెలుగుచూసినప్పటి నుంచి అమెరికాలో వైద్య చికిత్సల కోసం వెళ్లిన చోక్సీ తిరిగి భారత్‌కు చేరుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చోక్సీ కదలికలను పసిగట్టి ఆయనను దేశం విడిచివెళ్లకుండా అమెరికా అధికారులు జల్లెడపట్టనున్నారు. కాగా చోక్సీ ప్రస్తుతం తన స్టేట్మెంట్ను రికార్డు చేసే పరిస్ధితిలో లేరని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితేనే భారత్‌కు తిరిగివస్తారని ఆయన న్యాయవాది గత నెలలో పేర్కొఆన్నరు. నకిలీ గ్యారంటీలతో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల మేర టోకరా వేసిన చోక్సీ, ఆయన మేనల్లుడు జ్యూవెలర్ నీరవ్ మోదీ కోసం దర్యాప్తు సంస్ధలు గాలిస్తున్న సంగతి తెలిసిందే. -
నాకు ప్రాణహాని.. భారత్‌కు రాను: నీరవ్
ముంబై: బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి భారత్‌లో ప్రాణహాని కలిగే అవకాశం ఉందని, అందుకే ఆయన దేశానికి రాలేకపోతున్నట్లు అతని తరఫు న్యాయవాది శనివారం ఇక్కడి ప్రత్యేక కోర్టుకు విన్నవించారు. విచారణలో భాగంగా నీరవ్ తరఫున లాయర్ విజయ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. అతను దేశానికి వస్తే ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు మూకదాడులు జరిపే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. వీరి వాదనను ఈడీ తోసిపుచ్చింది. ఒకవేళ నీరవ్‌కు నిజంగా ప్రాణహాని కలిగే అవకాశం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి గానీ, ఇలా దర్యాప్తుకు సహకరించపోవడం తగదని పేర్కొంది. -
పీఎన్బీ స్కాం: రూ. 255కోట్ల హాంకాంగ్ ఆస్తులు ఎటాచ్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను13వేల కోట్ల రూపాయలకు మోసం చేసి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరిన్నిఆస్తులను ఎటాచ్ చేసింది. హాంకాంగ్‌కు చెందిన రూ. 255 కోట్ల విలువైన ఆస్తులను ఈడీఎటాచ్ చేసింది.మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ ఈ చర్య తీసుకుంది. దీంతో మొత్తం ఎటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ. 4,744కోట్లకు చేరింది. -
జైట్లీ కుమార్తె ఖాతాలోకి చోక్సీ డబ్బు
రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లక్ష్యంగా సోమవారం విమర్శలు గుప్పించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ నుంచి జైట్లీ కుమార్తె రూ.24 లక్షలు తీసుకుందని ఆరోపించారు. ఈ విషయాన్ని బయటపెట్టేందుకు మీడియా భయపడుతోందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోమవారం జరిగిన రైతుల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. ‘దేశం నుంచి రూ.35,000 కోట్ల నిధులతో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల గురించి మీరు వినే ఉంటారు. చోక్సీ రూ.24 లక్షలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశారు. కానీ ప్రముఖ మీడియా సంస్థలేవీ ఈ విషయాన్ని ప్రసారం చేయడం లేదు. నిజాన్ని బయటపెట్టాల్సిన మీడియా సంస్థలు బెదిరింపులకు, అణచివేతకు గురవుతున్నాయి’ అని తెలిపారు. రఫేల్ ఫైటర్ జెట్ల కాంట్రాక్టు నుంచి ప్రభుత్వ రంగ హాల్ సంస్థను తప్పించిన ప్రధాని మోదీ.. కనీసం కాగితపు విమానాన్ని తయారుచేసిన అనుభవం కూడా లేని రిలయన్స్ సంస్థకు కాంట్రాక్టును అప్పగించారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం 10 రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని రాహుల్ ప్రకటించారు. పనామా పేపర్లలో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ పేరు రావడంపై స్పందిస్తూ.. ‘పనామా వ్యవహారంలో పేరు వచ్చినందుకు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏకంగా జైలు పాలయ్యారు. కానీ ఇక్కడ మాత్రం అభిషేక్ సింగ్‌పై కనీసం చర్యలు కూడా తీసుకోలేదు’ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే ప్రతి జిల్లాలో ఓ ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి, అవకాశాలు మెరుగవుతాయని వెల్లడించారు. ఆదివాసీ, రైతుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాలన్నింటిని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజల్లోకి వెళ్లి బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పార్టీ కార్యకర్తలను కోరిన రాహుల్.. కార్యకర్తల అభీష్టం మేరకే ఎమ్మెల్యే టికెట్లను కేటాయిస్తామనీ, చివరి నిమిషంలో కాంగ్రెస్‌లోకి వచ్చినవారికి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి వచ్చే నెల 12న, 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న ప్రకటించనున్నారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదు చెన్నై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల కూటమి విజయం సాధిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్ చెప్పలేదని ఆ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంతో పాటు కేంద్రంలో ప్రగతిశీల ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ముందున్న లక్ష్యమని వెల్లడించారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించలేదు. రాహుల్ కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. ఒకరిద్దరు నేతలు ఈ విషయమై మాట్లాడినా, ఇకపై దీనిపై చర్చించరాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారికి సూచించింది. విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై మాకు పట్టింపులేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మిత్రపక్షాలతో చర్చించి ఈ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
పీఎన్బీ కేసులో రూ.218 కోట్లు జప్తు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ సన్నిహితుడు మిహిర్ భన్సాలీలకు సంబంధించి రూ.218 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది. జప్తు చేసిన వాటిలో భన్సాలీ విదేశాల్లో కొన్న రూ.51 కోట్ల ఫ్లాట్, చోక్సీ రూ.27 కోట్లతో మరో దేశంలో కొన్న విల్లా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పేరుతో 2.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవంతి, ముంబైలోని ట్రంప్ టవర్‌లో రూ.1.7 కోట్లతో కొన్న ఫ్లాట్, నీరవ్‌కి చెందిన రూ.18.76 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. తాజా జప్తుతో ఇప్పటివరకూ ఈడీ రూ.4,488 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు అయింది. -
బ్యాంక్ స్కామ్ : రూ 637 కోట్ల నీరవ్ ఆస్తులు అటాచ్
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌కు సంబంధించి బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ 637 కోట్ల విలువైన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఈడీ అటాచ్ చేసింది. భారత్‌తో పాటు పలు దేశాల్లో విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని దర్యాప్తు సంస్ధ అధికారి ఒకరు వెల్లడించారు. న్యూయార్క్‌లో నీరవ్ మోదీకి చెందిన రూ 216 కోట్ల విలువైన రెండు స్ధిరాస్తులను కూడా మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద అటాచ్ చేసినట్టు అధికారులు తెలిపారు. వీటితో పాటు రూ 278 కోట్ల నిల్వలున్న నీరవ్‌కు చెందిన రెండు విదేశీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. రూ 22.69 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన ఆభరణాలను హాంకాంగ్ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. దక్షిణ ముంబైలో రూ 19.5 కోట్ల విలువైన ఫ్లాట్‌ను అటాచ్ చేశారు. మరోవైపు నీరవ్ మోదీ ఉదంతంతో పాటు పలు కుంభకోణాల్లో ప్రమేయం ఉన్న ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముక్ అథియాను ప్రాసిక్యూట్ చేయాలని సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. నీరవ్ మోదీతో హస్ముక్ అథియా ఇప్పటికీ టచ్‌లో ఉంటూ ఆయనకు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
మెహుల్ చోక్సీ తాజా వీడియో సంచలనం
ఆంటిగ్వా: పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడు,గీతాంజలి గ్రూపు చైర్మన్ మెహుల్ చోక్సీకి చెందిన వీడియో ఒకటి ఇపుడు సంచలనంగా మారింది. తనపై తప్పుడు ఆరోపణలు నమోదు చేశారని వాదిస్తున్న చోక్సీ తాజాగా అదే వాదనను మరోసారి వినిపించారు. తనను తాను సమర్ధించుకుంటూ మొట్టమొదటిసారిగా ఆంటిగ్వా నుండి వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు తనపై చేసిన ఆరోపణల అవాస్తవాలనీ, నిరాధారమైనవని పేర్కొన్నాడు. చోక్సీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఈడీ, తాజాగా మరో ‘రిమైండర్ నోటీసు’ పంపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు 2 బిలియన్ డాలర్ల మేర మోసం చేసి, చోక్సీ దేశం నుంచి పారిపోయాడు. అలాగే పీఎన్బీ స్కాంలో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు నీరవ్ మోదీ కుటుంబ సభ్యులకు (సోదరి పుర్వీ దీపక్ మోదీ, సోదరుడు నీషల్ మోదీ) రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన అంనతరం చోక్సీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈడీ అధికారులు తనపై అక్రమ కేసులు బనాయించారనీ, చట్ట విరుద్ధంగా తన ఆస్తులను సీజ్ చేశారని ఈ వీడియోలో ఆరోపించాడు. భారత ప్రభుత్వం రద్దు చేసిన తన పాస్‌పోర్టు పునరుద్ధరను భారీ ప్రయత్నాలు చేశాననీ, కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందనరాలేదని ఆరోపించాడు.పోర్టును ఎందుకు రద్దు చేశారో చెప్పలేదు, తన వల్ల దేశానికి ప్రమాదం ఎలాంటి ఉందో ముంబైలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం వివరణ ఇవ్వలేదని తెలిపాడు. పాస్‌పోర్ట్ రద్దు చేసిన అనంతరం ఇక తాను లొంగిపోవడం అనే ప్రశ్నే లేదని చోక్సీ వాదించాడు. కాగా సుమారు 14వేల కోట్ల పీఎన్బీ స్కాంలో చోక్సీ నీరవ్ మోదీ తరువాత కీలక నిందితుడుగా ఉన్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన అధికారులు చోక్సీ పాస్‌పోర్టును రద్దు చేసారు. అలాగే గత నవంబరులో ఆంటిగా పౌరసత్వాన్ని స్వీకరించిన చోక్సీ అక్కడ తలదాచుకున్న సంగతి తెలిసిందే. Defending himself, fugitive diamantaire Mehul Choksi on Tuesday said that all allegations against him by the Enforcement Directorate (ED) are "false and baseless." Read @ANI story | https://t.co/f2ZCaN0CoK pic.twitter.com/HfqFQ2sRGt — ANI Digital (@ani_digital) September 11, 2018 -
నీరవ్ మోదీ సోదరికి రెడ్ కార్నర్ నోటీసులు
-
పీఎన్బీ స్కాం: నీరవ్ సోదరికి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో మరో కీలకపరిణామం చేసుకుంది. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంగా నిలిచిన ఈ కేసులో డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా పీఎన్బీ స్కాం కేసులో ఇంటర్ పోల్ అధికారులు బెల్గావ్లో ఉంటున్న మోదీ సోదరి పుర్వీ దీపక్ మోదీ (44) వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు మనీ లాండరింగ్ చట్టం కింద ఈ నోటీసులిచ్చినట్టు అధికారులు వెల్లడించారు. స్పెషల్ ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం కింద ముంబైకోర్టు ఈ నోటీసులిచ్చింది. మోదీ సోదరి, సోదరుడు నిశాల్ సెప్టెంబర్ 25న, లేదా అంతుకుమందు గానీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కాని పక్షంలో భారీ ఆర్థిక సంక్షోభాలను నిరోధించేందుకు ఉద్దేశించిన నూతన చట్టం కింద వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు గత వారం నీరవ్ మోదీ సన్నిహితుడు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మోహిర్ ఆర్ బన్సాలికి (40) ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. కాగా రూ.14వేల కోట్ల రుణాలను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, మరో డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీని దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వీరి పాస్‌పోర్టులను రద్దు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇరువురికి చెందిన పలు ఆస్తులను ఎటాచ్ చేసింది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
నీరవ్ మోదీకి భారీ షాక్!
-
నీరవ్, చోక్సీలకు భారీ షాక్
సాక్షి,ముంబై: పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులు, డైమండ్ వ్యాపారులు నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలకు భారీ షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ.13 వేల కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో దాక్కున్ననీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల అక్రమ బంగళాలను కూల్చివేయాలని మహారాష్ట ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. రాయ్‌గడ్ జిల్లా కిహిమ్ గ్రామంలో ఉన్న నీరవ్ మోదీ బంగ్లాను, ఆవాస్ గ్రామంలోని చోక్సీ అక్రమ భవనాలను కూల్చివేయనున్నామని మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రాందాస్ కదం తెలిపారు. అక్రమ బిల్డింగ్‌ల వ్యవహారంలో ప్రభుత్వ తాత్సారంపై ముంబై హైకోర్టు అంసతృప్తిని, అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మోదీ, చోక్సీలకు చెందిన ఈ బంగ్లాలను ఇప్పటికే ఈడీఎటాచ్ చేసింది. కాబట్టి ఈ బంగ్లాల కూల్చివేత ప్రక్రియలో ఈడీ అనుమతి తీసుకున్న తర్వాత ముందుకు సాగుతామని జిల్లా కలెక్టర్ విజయ్ సూర్యవంశీ ప్రకటించారు. ఆలీబాగ్, మురాద్ తీర ప్రాంతంలో మోదీ, చోక్సీలతో పాటు, ఇతర సెలబ్రిటీలు తీరప్రాంత రెగ్యులేషన్ జోన్ (సిఆర్జెడ్) నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన బంగళాలు 111 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే కొన్ని బంగళాల యజమానులు వాటిపై చర్యలు తీసుకోకుండా న్యాయస్థానం నుంచి నిలుపుదల ఉత్తర్వులను పొందడంతో ఈ కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు బదిలీ చేశామన్నారు. మరో రెండు మూడునెలల్లో వీటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. -
బ్రిటన్‌లోనే నీరవ్: సీబీఐ కీలక చర్య
సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంకు సంబంధించి సీబీఐ కీలక సమాచారాన్ని సేకరించింది. దాదాపు రూ.14000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లోనే ఉన్నట్టు సీబీఐ సోమవారం వెల్లడించింది. ఈ మేరకు బ్రిటన్ అధికారులు సమాచారం ఇచ్చినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. వేలకోట్ల రుణాలను ఎగొట్టి లండన్‌కు చెక్కేసిన బిలియనీర్ వజ్రాల వ్యాపారి నీరవ్‌ను తమకు అప్పగించాలని కోరినట్టు తెలిపింది. నీరవ్ మోదీ అప్పగించాల్సిందిగా సీబీఐ హోమ్ మంత్రిత్వ శాఖ ద్వారా దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తును విదేశాంగ శాఖ బ్రిటన్‌కు పంపిస్తుంది. అలాగే నీరవ్ మోదీని అదుపులోకి తీసుకోవాల్సిందిగా సీబీఐ యుకె అధికార యంత్రాంగాన్ని కోరింది. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్కామ్ పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ, భార్య అమీ మోదీ, సోదరుడు నిశాల్ మోదీ మామ మెహుల్ చోక్సీ విదేశాలకు చెక్కేశారు. ఈ కేసు విచారణలో భాగంగా మోదీ, చోక్సీల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసింది. అలాగే ఇంటర్ పోల్ కూడా మాల్యాకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అటు ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.9,వేల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కూడా లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. -
భారీ నష్టాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్
న్యూఢిల్లీ : నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి కుంభకోణంతో తీవ్రంగా ప్రభావితమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరోసారి భారీగా నష్టాలను నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్) తొలి క్వార్టర్లో బ్యాంక్ రూ.940 కోట్ల మేర నష్టాలను నమోదు చేసినట్టు వెల్లడించింది. గతేడాది ఇదే క్వార్టర్లో బ్యాంక్ రూ.343 కోట్ల నికర లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆస్తుల పరంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నాలుగో అతిపెద్ద లెండర్. డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సిలు ఈ బ్యాంకులో భారీగా రూ.13,417 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చాక వెల్లడించిన క్వార్టర్ ఫలితాల్లో కూడా బ్యాంక్ భారీగా నష్టాలను నమోదు చేసింది. వరుసగా ఈ క్వార్టర్లో కూడా పీఎన్బీ నష్టాలనే నమోదు చేసింది. బ్యాంక్ మొత్తం ఆదాయాలు రూ.15,072 కోట్లగా ఉన్నట్టు పీఎన్బీ తన క్వార్టర్ ఫలితాల్లో తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ ఆదాయాలు రూ.14,468.14 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయాలు ఏడాది ఏడాదికి 22 శాతం పెరిగి రూ.4,692 కోట్లగా నమోదయ్యాయి. సీక్వెన్షియల్‌గా 53 శాతం పెరిగి రూ.3,063.3 కోట్లగా రికార్డయ్యాయి. మొత్తం రుణాల్లో బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 18.26 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు కూడా 10.58 శాతానికి తగ్గాయి. బ్యాంక్ రుణ వృద్ధి జూన్ ముగిసే నాటికి సుమారు 4 శాతం పెరిగి రూ.4.15 లక్షల కోట్లగా నమోదయ్యాయని పీఎన్బీ చెప్పింది. డిపాజిట్ వృద్ధి ఫ్లాట్‌గా రూ.6.30 లక్షల కోట్లగా మాత్రమే నమోదైంది. ఫలితాల ప్రకటన అనంతరం బ్యాంక్ షేర్లు 2.16 శాతం కిందకి పడిపోయాయి. పీఎన్బీలో చోటు చేసుకున్న కుంభకోణం దేశీయ బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్దది. గత కొన్నేళ్లుగా ముంబై బ్రాంచులో పీఎన్బీ స్టాఫ్‌ను ఉపయోగించుకుని నకిలీ గ్యారెంటీలతో విదేశాల్లో రూ.13,000 కోట్లకు పైగా నగదును నీరవ్ మోదీ, మెహుల్ చోక్సిలు అక్రమంగా పొందారు. -
చోక్సీని వెనక్కు పంపండి: భారత్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లకు మోసగించి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న మెహుల్ చోక్సీని వెనక్కు పంపాలని ఆ ప్రభుత్వాన్ని భారత్ అభ్యర్థించింది. చోక్సీని తిరిగి తీసుకొచ్చే విషయమై ఆంటిగ్వా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత్ నుంచి ఓ బృందం కొన్ని రోజుల క్రితమే ఆ దేశానికి వెళ్లినట్లు అధికార వర్గాలు చెప్పాయి. భారత బృందం ఆంటిగ్వా విదేశాంగ శాఖను శనివారం కలిసి, చోక్సీని భారత్‌కు తిప్పి పంపాలని అభ్యర్థించినట్లు ఓ అధికారి వెల్లడించారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని బంధువైన చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.12 వేల కోట్ల మేర మోసగించి దేశం నుంచి పారిపోవడం తెలిసిందే. -
ఇండియానే క్లీన్ చిట్ ఇచ్చింది
న్యూఢిల్లీ: తాము విచారణ చేసినప్పుడు మెహుల్ చోక్సీకి భారత్ క్లీన్ చిట్ ఇచ్చిందని, ఆ తరువాతే చోక్సీకి పౌరసత్వం ఇచ్చామని ఆంటిగ్వా ప్రభుత్వం వెల్లడించింది. చోక్సీకి పౌరసత్వం మంజూరు చేయడంలో తామేమీ తప్పు చేయలేదని స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణంలో నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ వాంటెడ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 2017 మేలో పౌరసత్వం కోసం చోక్సీ దరఖాస్తు చేసుకోగా, భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) క్లీన్ చిట్ ఇచ్చాయని ఆంటిగ్వా ప్రభుత్వం పేర్కొంది. తర్వాతే చోక్సీకి పౌరసత్వం ఇచ్చామని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో మోదీ ప్రభుత్వ తీరు తేటతెల్లమవుతోందని కాంగ్రెస్ విమర్శించింది. అసలేం జరిగింది... ఆంటిగ్వా అండ్ బార్బుడా సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్మెంట్ యూనిట్ (సీఐయూ) చోక్సీకి సంబంధించి స్థానిక మీడియాకు విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటనలో పలు వివరాలు వెల్లడించింది. ‘2018 జనవరి మొదటి వారంలో చోక్సీ భారత్‌ను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 2017 మేలో చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. పలు విచారణలు చేసి అన్నింటిలో క్లీన్ చిట్ వచ్చాకే కిందటేడాది నవంబర్‌లో దాన్ని ఓకే చేశాము. ఇందుకోసం ఆయన ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద రూ.1.3 కోట్లు చెల్లించారు. అంతేకాదు ఈ ఏడాది జనవరి 15న ఆయన ఆంటిగ్వా పౌరుడిగా విధేయతా ప్రమాణం చేశారు. ఇది జరిగిన 15 రోజుల తరువాత అంటే జనవరి 29న కేంద్ర నేర పరిశోధన సంస్థ (సీబీఐ) నీరవ్ మోదీ, చోక్సీపై కేసులు నమోదు చేసి, విచారణ ప్రారంభించింది. చోక్సీ ప్రస్తుతం మా దేశ పౌరుడు కనుక ఆయనను దేశం నుంచి పంపించలేం’ అని వివరించింది. ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయడంలో పొరపాటు జరగలేదని పేర్కొంది. ఆయనకు మంజూరు చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే చట్టబద్ధమైన ప్రక్రియను చేపట్టవలసి ఉంటుందని, ఆయన ప్రస్తుతం ఆంటిగ్వా చట్టాల రక్షణలో ఉన్నారని తెలిపింది. ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌనే మాట్లాడుతూ తన చేతులు కట్టేసి ఉన్నాయన్నారు. చోక్సీకి క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు? చోక్సీపై పలు ఫిర్యాదులుండగా విదేశీ వ్యవహారాల శాఖ క్లీన్ చిట్ ఎలా ఇచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ ఉదంతం దోపిడీదారుల పట్ల మోదీ ప్రభుత్వ తీరును తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఏప్రిల్‌లో ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌనేని కలిసినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అప్పట్లో కేసుల్లేవు కాబట్టే పీసీసీ ఇచ్చాం ఆంటిగ్వా ప్రభుత్వం విచారణ చేసినప్పుడు మెహుల్ చోక్సీపై కేసులేం లేవని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముంబై పాస్‌పోర్టు కార్యాలయం అప్పటి పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు (పీవీఆర్)ను అనుసరించి 2016 మార్చి 16న చోక్సీకి క్లీన్ చిట్ ఇచ్చిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. అప్పటికి అతనిపై కేసులేం లేనందున అతనికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) ఇచ్చారని తెలిపారు. చోక్సీకి సంబంధించి తామేం క్లీన్ చిట్ ఇవ్వలేదని, అసలు ఆంటిగ్వా నుంచి తమకు ఎలాంటి అభ్యర్థనా రాలేదని, తాము వారికి ఏ సమాచారం ఇవ్వలేదని సెబీ తెలిపింది. -
చోక్సీపై ఆంటిగ్వా ప్రభుత్వం న్యూ ట్విస్ట్
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుల్లో ఒకడైన మెహుల్ చోక్సీ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ద్రోహులకు తమ దేశంలో స్థానంలేదు, ఇరుదేశాల స్నేహ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన ఆంటిగ్వా అండ్ బర్బూడా ప్రభుత్వం తాజాగా యూ టర్న్ తీసుకుంది. మెహుల్ చోక్సీకి పౌరసత్వం మంజూరు చేయడంలో తామేమీ తప్పు చేయలేదని ప్రకటించింది. భారత ప్రభుత్వ సానుకూల నివేదిక ఆధారంగాను ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేసినట్టు తెలిపింది. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాటు జరగలేదని వివరించింది. ఈ కొత్త మలుపుతో చోక్సీని భారత్‌కు రప్పించాలని చూస్తున్న ప్రభుత్వానికి కొత్తతలనొప్పి మొదలైంది. అయితే చోక్సీపై నేరారోపణలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించిన అనంతరం చోక్సీ అప్పగింత అంశాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంటిగ్వా విదేశాంగ మంత్రి వెల్లడించారు. మెహుల్ చోక్సీ 2017 మేలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా, భారతదేశ హోం శాఖ, సెబీ సానుకూల నివేదికలు ఇచ్చాయని ఆంటిగ్వా అండ్ బర్బూడా ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడిదారుల యూనిట్, క్యాపిటల్ మార్కెట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ద్వారా ప్రభుత్వం నుంచి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త మెహుల్ చోక్సికి పౌరసత్వాన్ని మంజూరు చేసినట్టు తెలిపింది. అలాగే విదేశీ వ్యవహారాల రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి వచ్చిన ధ్రువపత్రంలోనూ చోక్సీకి సంబంధించి ప్రతికూల అంశాలేమీ లేవని ఆంటిగ్వా వెల్లడించింది. అంతేకాదు చోక్సీ దరఖాస్తుపై నేపథ్య తనిఖీలు కూడా చేశామని తెలిపింది. ఏ సందర్భంలోనూ ఆయన ధరఖాస్తుపై అనుమానాస్పద సమాచారం లేదని పేర్కొంది. ప్రస్తుతం చోక్సీ తమ దేశ పౌరుడు కనుక ఆయనను దేశం నుంచి పంపించలేమని స్పష్టం చేసింది. అయితే చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే చట్టబద్ధమైన ప్రక్రియను చేపట్టవలసి ఉంటుందని పేర్కొంది. -
పట్టుకోండి.. ఎక్కడికీ పారిపోనీకండి!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు కోట్లాది రూపాయల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మోహుల్ ఛోక్సీని అష్టదిగ్బంధనం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తాను పారిపోలేదని ఆటింగ్వా పౌరసత్వం తీసుకున్నానంటూ ప్రకటించిన చోక్సీకి షాకిచ్చేలా భారత ప్రభుత్వం కదులుతోంది. చోక్సీని నిర్బంధించాల్సిందిగా ఆంటిగ్వా, బర్బుడా ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. త్వరలోనే భారత రాయబారి ఆటింగ్వాలోని బర్బుడా ప్రభుత్వ ధికారులను కలవనున్నారు. ఆంటిగ్వాలో మెహుల్ చోక్సీ వ్యవహారంపై అక్కడి ప్రభుత్వం స్పందించిన వెంటనే జార్జిటౌన్‌లోని భారత హై కమిషన్ అధికారులు ఆంటిగ్వా , బార్బుడా ప్రభుత్వాలకు లేఖలు రాశారు. చోక్సీ కదలికల గురించి నిఘా పెట్టి.. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, అతన్నివెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. భూ, వాయు లేదా సముద్ర మార్గాల్లో పారిపోకుండా అడ్డుకోవాలని కోరినట్టు ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ స్కాం రూ.13వేల కోట్ల పీఎన్బీ కుంభకోణం కేసులో కీలక నిందితులు, డైమండ్ వ్యాపారులు నీరవ్ మోదీ, చోక్సీని భారత్ రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే భారత ప్రభుత్వం వీరి పాస్‌పోర్టులను రద్దు చేసింది. అలాగే పలు ఆస్తులను ఎటాచ్ చేసిన దర్యాప్తు బృందాలు ఈడీ, సీబీఐ దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నాయి. కాగా ద్రోహులకు తమ దేశంలో స్థానం లేదనీ, భారత ప్రభుత్వం కోరితే చోక్సీ అరెస్ట్‌కు తగిన చర్యలు తీసుకుంటామని, భారత ప్రభుత్వానికి సహకరిస్తామంటూ ఆంటిగ్వా విదేశాంగ మంత్రి స్పందించడంతో భారత ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. అయితే తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు గతేడాది ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్లు పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గీతాంజలి సంస్థల అధిపతి మెహుల్ చోక్సీ గతవారం ప్రకటించాడు. తద్వారా 130 దేశాలకు ఎటువంటి వీసా లేకపోయినా ప్రయాణించే అనుమతి ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చోక్సీకి షాక్ : ప్రభుత్వానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు, గీతాంజలి సంస్థల అధిపతి మెహుల్ చోక్సికి దిమ్మతిరిగే వార్త ఇది. వ్యాపార విస్తరణకోసం ఆంటిగ్వా పౌరసత్వాన్ని తీసుకున్నానని ప్రకటించిన చోక్సీకి షాకిచ్చేలా అక్కడి ప్రభుత్వం స్పందించింది. తమదేశ పౌరసత్వం దుర్వినియోగానికి తాము అనుమతించమని స్పష్టం చేసింది. ద్రోహులకు తమ నేలపై దాక్కునేందుకు అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆంటిగ్వా , బార్బుడా విదేశాంగ మంత్రి ఇ. పాల్ చెట్ గ్రీన్ ఒక ప్రకటన విడుదల చేశారు. అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న డైమండ్ వ్యాపారి చోక్సీకి చెక్ పెట్టే క్రమంలో కేంద్రానికి ఊరట కల్గించేలా ఆంటిగ్వా ప్రభుత్వం స్పందించింది. చోక్సీకి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యర్థన తమకు చేరలేదని తెలిపింది. చోక్సీ పౌరసత్వం రద్దు, లేదా అరెస్టు కోసం న్యూఢిల్లీ నుండి అధికారికంగా తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పింది. భారతదేశ వ్యాపారవేత్త చోక్సిని బహిష్కరించాలని భావించి, అటువంటి అభ్యర్ధనను గౌరవిస్తామని స్పష్టం చేసింది. ఆర్థిక నేరగాళ్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందనీ, వారికి ఆంటిగ్వా స్వర్గంగా మారిందన్న విమర్శను విదేశాంగ మంత్రి తోసిపుచ్చారు. ఆటింగ్వా ప్రభుత్వ సానుకూల స్పందనపై కేంద్రం ఎలాంటి చర్యల్ని చేపట్టనుందో చూడాలి. భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నట్టు గ్రీన్ చెప్పారు. ఇరు దేశాల సంబంధాలకు హాని కలిగించే చర్యల్ని చేపట్టబోమని వెల్లడించారు. మరోవైపు చోక్సీ ఆటింగ్వాకు తలదాచుకున్న వైనం అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఆటింగ్వా ప్రధాని మౌనంపై విమర్శలు గుప్పించాయి. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా నాయకులు డిమాండ్ చేశారు. -
నేను పారిపోలేదు -మెహుల్ చోక్సీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కాంలో కీలక నిందితుడైన గీతాంజలి సంస్థల అధిపతి మెహుల్ చోక్సీ ఆటింగ్వాలో దాక్కున్నాడన్న వార్తలపై స్పందించారు. తాను న్యాయబద్ధంగానే ఆటింగ్వాలో ఉంటున్నట్టు స్పష్టం చేశారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు గత ఏడాది ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నానని ప్రకటించారు. ఈ మేరకు చోక్సీ న్యాయవాది డేవిడ్ డోర్సెట్ ఒక ప్రకటన విడుదల చేశారు. 132 దేశాల్లో వీసా రహిత ప్రయాణానికి కరేబియన్ దేశం అనుమతించినట్టు తెలిపింది. ఇందులో భారత ప్రభుత్వ ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని చోక్సీ వాదించారు. . ఆంటిగ్వా వార్తాపత్రిక డైలీ అబ్జర్వర్ కథనం ప్రకారం ఈ ఏడాది నవంబరు 2017లో పౌరసత్వం రాగా, జనవరి 15 న చెక్సీ ఆంటిగ్వా పౌరసత్వాన్ని స్వీకరించారు. అలాగే వైద్య చికిత్సల నిమిత్తం చోక్సీ 2018 జనవరిలో నుంచి అమెరికాకు వెళ్లానన్నారు. ఇంకా కోలుకుంటున్న నేపథ్యంలో ఆటింగ్వా,బార్బుడాలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. కాగా పీఎన్బీ స్కాంలో వేలకోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు ఉడాయించిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కరేబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్నారని, ఆ దేశం పాస్‌పోర్టు కూడా తీసుకున్నాడన్న సమాచారంపై సీబీఐ చర్యలకు ఉపక్రమించింది. ఆయన ఆచూకీ చెప్పాలని ఆంటిగ్వా అధికారులకు లేఖ రాసింది. ఈనెలలోనే చోక్సీ ఆమెరికా నుంచి ఆంటిగ్వాకు వెళ్లిపోయి, అక్కడి పాస్‌పోర్ట్ కూడా తీసుకున్నారని ఆంటిగ్వా అధికారులు ధ్రువీకరించిన విషయం బయటకు రావడంతో సీబీఐ తాజాగా లేఖ రాసింది. చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసును దృష్టిలో ఉంచుకుని ఆయన కదలికలు, ప్రస్తుతం ఉంటున్న ప్రాంత వంటి వివరాలు తమకు తెలియజేయాల్సిందిగా సీబీఐ ఆ లేఖలో కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు 2017లో దాదాపు 28 మంది భారతీయులు ఆటింగ్వా పౌరసత్వం తీసుకున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. -
భారత్‌కు రాకపోవడానికి కారణమిదే..!
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాల్లో నక్కిన గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సి, డైమండ్ కింగ్ నీరవ్ మోదీలు భారత్‌కు రావడానికి ససేమిరా అంటున్నారు. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులుగా ఉన్న వీరు, ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా స్పష్టంగా తెలియడం లేదు. విచారణ కోసం భారత్ న్యాయస్థానాల ముందు హాజరు కావాలని ఎన్ని సార్లు లేఖలు పంపినా.. సరిగా స్పందించడం లేదు. తాజాగా తాను భారత్‌కు వస్తే, తనపై మూక దాడి జరుగుతుందని మెహుల్ చోక్సి నాటకాలు ఆడుతున్నారు. తన మాజీ ఉద్యోగులు, రుణదాతల నుంచే కాకుండా.. జైలు అధికారులు, ఖైదీల నుంచి కూడా తన ప్రాణానికి ముప్పు ఉందంటూ చోక్సి చెబుతున్నారు. ‘ భారత్‌లో పలు మూక దాడులు జరుగుతున్నాయి. రోడ్డుపై జరుగుతున్న మూక దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయి. నాకు వ్యతిరేకంగా అనేక మంది ఆగ్రహంతో ఉన్నారు. దీంతో నేను కూడా ఈ ముప్పును ఎదుర్కొనవచ్చు’ అని స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టుకు సమర్పించిన అప్లికేషన్లో పేర్కొన్నారు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు, రుణదాతలకు నగదు వెనక్కి ఇవ్వలేదు, వీరందరూ ప్రస్తుతం తనపై ఆగ్రహంతో ఉన్నట్టు చెప్పారు. వీరి చేతులో తన జీవితం ప్రమాద బారిన పడుతుందని అన్నారు. చోక్సి సమర్పించిన ఈ అప్లికేషన్‌పై స్పందించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను స్పెషల్ పీఎంఎల్ఏ జడ్జీ ఎంఎస్ అజ్మి ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 18 చేపడతామని పేర్కొన్నారు. చోక్సి, అతని మేనల్లుడు నీరవ్ మోదీలు, మోసపూరిత గ్యారెంటీలతో పీఎన్బీలో దాదాపు రూ.13,00 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి వచ్చి, పీఎన్బీ ఫిర్యాదు చేయడానికి కంటే ముందే, వీరిద్దరూ భారత్ విడిచి పారిపోయారు. భారత్‌లో చోక్సిక చెందిన బ్యాంక్ అకౌంట్లను, ఆస్తులను దర్యాప్తు సంస్థలు సీజ్ చేశాయి. భారత్‌లో అతనికి చెందిన ఆయన ఆఫీసులను మూసి కూడా వేశాయి. చోక్సికి వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంటీ కూడా జారీ అయింది. ఈ అరెస్ట్ వారెంటీని రద్దు చేయాలని కూడా అతను కోరుతున్నాడు. -
మెహుల్ చోక్సి ఇక్కడ లేడు
వాషింగ్టన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సిలు ప్రపంచంలో ఏ మూలన దాగి ఉన్నారా? అంటూ గల్లిగల్లి వెతుకున్నారు. వారిద్దరిన్నీ పట్టుకోవడానికి ప్రతి ఒక్క దేశం భారత్‌కు, సాయపడుతోంది. తమ దేశంలో ఏమైనా నక్కి ఉన్నారేమోనని వెతుకులాట చేపట్టిన ఇంటర్ పోల్ వాషింగ్టన్, మెహుల్ చోక్సి తమ దేశంలో లేడంటూ క్లారిటీ ఇచ్చింది. గత బుధవారం భారత్ పంపిన అభ్యర్థనకు ఇంటర్‌పోల్ వాషింగ్టన్ స్పందించింది. మెహుల్ చోక్సి అమెరికాలో లేడని తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే వెంటనే ఇంటర్‌పోల్ వాషింగ్టన్కు భారత్ మరో లేఖ పంపింది. చోక్సి ఆచూకీ గురించి ఏమైనా తెలిస్తే తమకు అందజేయాలని కోరింది. కాగ, పారిపోయిన ఆర్థిక నేరస్తుల ఆర్డినెన్స్ 2018 కింద నీరవ్, చోక్సిలకు వ్యతిరేకంగా ఈడీ రెండు దరఖాస్తులను ముంబైలోని మనీ లాండరింగ్ నిరోధక చట్ట స్పెషల్ కోర్టులో జూన్ 11న నమోదు చేసింది. భారత్, యూకే, యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో ఉన్న వారి ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ఈడీ కోరింది. ఇప్పటివే నీరవ్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ అయి ఉంది. అతనికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేసింది. నీరవ్ ప్రవేశాన్ని అడ్డుకోవాలని ఇతర దేశాలను భారత్ కోరిందని కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నీరవ్ ఆచూకీ తెలుసుకునేందుకు ఫ్రాన్స్, యూకే, బెల్జియం వంటి యూరోపియన్ దేశాల సహాయం కూడా భారత్ తీసుకుంటోందని పేర్కొంది. -
స్కాం దెబ్బకి ఆ బ్రాంచ్ మూతపడుతోంది
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)లో దాదాపు రూ.13,900 కోట్ల భారీ కుంభకోణం దెబ్బకు ముంబై బ్రాంచ్ మూతపడుతోంది. ఈ స్కాంకు ప్రధానమైన ముంబై బ్రాడీ హౌజ్ బ్రాంచులో దాదాపు అన్ని కార్యకలాపాలు మూసివేసినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణానికి ఈ బ్రాడీ హౌజ్ బ్రాంచు నెలువుగా మారిన సంగతి తెలిసిందే. ఈ స్కాంతో పోగొట్టుకున్న పరువు, ప్రతిష్టను తిరిగి వెనక్కి తెచ్చుకునేందుకు నియంత్రణా అధికారాలను కఠినతరం చేస్తున్నట్టు తెలిసింది. జనవరిలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పీఎన్బీ సగానికి పైగా తన మార్కెట్ విలువను కోల్పోయింది. బ్రాడీ హౌజ్ బ్రాంచుకు ఉన్న పెద్ద పెద్ద క్లయింట్స్‌ను బ్యాంకు పక్కన ఉన్న ఇతర బ్రాంచులకు తరలిస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పీఎన్బీలో చోటు చేసుకున్న ఈ స్కాంతో గత కొన్నేళ్ల కాలంగా అసాధారణమైన అభివృద్ధిని సాధించిందని అంతర్గత విచారణ సైతం వెల్లడించింది. దీంతో బ్యాంక్ క్లయింట్ కస్టమర్లందరిన్నీ వేరే బ్రాంచులకు తరలించేస్తోంది. 50 కోట్లకు పైన వార్షిక లావాదేవీలు జరిపే పెద్ద అకౌంట్లను, కొంతమంది ఉద్యోగులను ట్రాన్సఫర్ చేసినట్టు పీఎన్బీకి చెందిన ఒక అధికారి చెప్పారు. మెరుగైన పర్యవేక్షణ కోసం వీటిని తరలించినట్టు పేర్కొన్నారు. కేవలం చిన్న రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే ప్రస్తుతం అక్కడ ఉన్నాయని తెలిపారు. సాధారణ పునర్వ్యస్థీకరణలో భాగంగానే అకౌంట్లను ట్రాన్సఫర్ చేసినట్టు పీఎన్బీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. పీఎన్బీ అంతర్గత సిస్టమ్స్‌ను బలోపేతం చేసేందుకు, కొన్ని క్లిష్టమైన విధులను కేంద్రీకరించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్టు పేర్కొన్నారు. పీఎన్బీ కస్టమర్ల రిటైల్ కార్యకలాపాలు అక్కడే కొనసాగుతాయని చెప్పారు. 24 మంది ఉద్యోగుల వరకు బ్రాడీ హౌజ్ కార్యకలాపాలను మూసివేస్తారని చెప్పారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే కార్యకలాపాలు మూసివేసే ఆలోచనలు ఏమీ లేవని అధికార ప్రతినిధి అంటున్నారు. కాగ, బ్రాడీ హౌజ్ బ్రాంచ్ ఉద్యోగులతో కలిసి, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సిలు ఈ కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ స్కాంకు పాల్పడిన ఉద్యోగులను దర్యాప్తు ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి. -
నీరవ్ మోదీపై రెడ్‌కార్నర్ నోటీసులు
న్యూఢిల్లీ: దాదాపు 13 వేల కోట్ల రూపాయల పీఎన్బీ కుంభకోణంలో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని సోదరుడు నిశాల్ మోదీ, ఆ కంపెనీ ఉద్యోగి సుభాష్ పరబ్‌లపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేసింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ ఈ నోటీసులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. రెడ్‌కార్నర్ నోటీసుల జారీ నేపథ్యంలో అంతర్జాతీయ నిఘా విభాగాల కళ్లుగప్పి వివిధ దేశాల మధ్య మోదీ రాకపోకలు సాగించడం ఇకపై కష్టం. అతని అరెస్టుకు మార్గం సుగమమవుతుంది. ఒకవేళ నీరవ్ కనిపిస్తే తక్షణ అరెస్టు చేయడం లేదా అదుపులోకి తీసుకోవాలని నోటీసుల్లో 192 సభ్య దేశాల్ని ఇంటర్‌పోల్ కోరింది. ఒకసారి అరెస్టయితే అతన్ని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మే 2008– మే 2017 మధ్య కాలంలో నీరవ్ మోదీకి జారీ చేసిన ఐదు పాస్‌పోర్టుల వివరాల్ని ఆర్‌సీఎన్‌లో పేర్కొన్నారు. ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీటుతో పాటు ప్రత్యేక న్యాయమూర్తి ఇచ్చిన అరెస్టు వారెంట్ ఆధారంగా రెడ్ కార్నర్ నోటీసు(ఆర్సీఎన్)ను ఇంటర్‌పోల్ జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగుచూడక ముందే.. నీరవ్ మోదీ, అతని భార్య అమీ మోదీ, సోదరుడు నిశాల్, మామ చోక్సీ విదేశాలకు పరారయ్యారు. అవినీతి, మోసం ఆరోపణలపై మోదీ, చోక్సీలతో పాటు నిశాల్, పరబ్‌ల పేర్లను సీబీఐ చార్జ్‌షీట్‌లో చేర్చింది. -
నీరవ్ మోదీకి షాక్, ఏ క్షణంలోనైనా అరెస్ట్!
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి ఇంటర్‌పోల్ షాకిచ్చింది. భారత అభ్యర్థన మేరకు నీరవ్ మోదీకి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ రెడ్-కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల జారీతో విదేశాల్లో నక్కిన నీరవ్ మోదీని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంటర్‌పోల్‌కు చెందిన 192 దేశాల పోలీసులు ఎవరైనా ఇతన్ని అరెస్ట్ చేయవచ్చు. ఒక్కసారి నీరవ్ మోదీ అరెస్ట్ అయితే, అతన్ని తమకు అప్పగించమని భారత్ కోరవచ్చు. ఈ ప్రక్రియ విజయవంతమవడానికి భారత్ ఆ దేశాలతో ఉన్న ఒప్పందాలు, సంబంధాలు సహకరిస్తాయి. నీరవ్ మోదీతో పాటు మోదీ సోదరుడు నిశాల్, సుభాష్ పరబ్‌లకు వ్యతిరేకంగా కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీఅయ్యాయి. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసులను ఏజెన్సీ తన వెబ్సైట్లో పెట్టింది. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా జారీచేసిన నోటీసులను ప్రజల ముందుకు తీసుకురావాలని సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ ఈ నోటీసులను తన వెబ్సైట్లో పొందుపరించింది. నీరవ్‌కు వ్యతిరేకంగా జారీ అయిన నోటీసుల్లో అతని ఫోటోగ్రాఫ్, వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ, అతనికి వ్యతిరేకంగా మనీ లాండరింగ్ ఛార్జస్ నమోదైనట్టు ఉన్నాయి. నీరవ్ మోదీ, అతని సన్నిహితులు కలిసి పీఎన్బీలో దాదాపు రూ.13 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా స్కాం చేసి దక్కించుకున్న నగదును, మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించాడు. పీఎన్బీ ఈ కేసును వెలుగులోకి బట్టబయలు చేస్తుందనే క్రమంలో మోదీ, అతని సన్నిహితులు జనవరిలో దేశం విడిచి పారిపోయారు. ఇప్పటి వరకు నీరవ్ ఎక్కడ ఉన్నాడన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. ఈ కేసుపై విచారణ చేపట్టిన దర్యాప్తు ఏజెన్సీలు సీబీఐ, ఈడీలు ఈ-మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినప్పటికీ, అతని నుంచి సరియైన స్పందన రాలేదు. భారత్‌కు వచ్చేది లేదంటూ చెప్పుకొచ్చాడు. తానేమీ తప్పు చేయలేదని వాదిస్తున్నాడు. -
నీరవ్‌పై మౌనం వీడిన విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన డైమండ్ కింగ్ నీరవ్ మోదీ ఆరు పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని వస్తున్న వార్తలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు స్పందించింది. ఒక్క వాలిడ్ పాస్‌పోర్టు మించి అతని దగ్గర ఇంకేమీ లేవవి విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మోదీ ఆరు పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని వస్తున్న రిపోర్టులను కొట్టిపారేసిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్, ఊహాగానాలకు చెక్ పెట్టాలని సూచించారు. ప్రతీసారి ముందస్తు పాస్‌పోర్టును పూర్తిగా రద్దు చేసిన అనంతరమే, మోదీకి కొత్త పాస్‌పోర్టును జారీ చేసేవారమని తెలిపారు. ఇతర దేశాల పాస్‌పోర్టులతో నీరవ్ మోదీ గతవారం బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం దేశాలను సందర్శించినట్లు రిపోర్టులు వచ్చిన సంగతి తెలిసిందే. నీరవ్‌ను పట్టుకునేందుకు సహకరించాలని పలు యూరోపియన్ దేశాలకు లేఖలు రాసినట్లు తెలిపారు. పాస్పోర్టుతో పాటు మూడు ముఖ్యమైన విషయాలపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. ఫిబ్రవరిలోనే మోదీ పాస్‌పోర్టును రద్దు చేయాలని ఆల్ఇండియా మిషన్లకు ఆదేశించామని, ఇదే విషయాన్ని సంబంధిత దేశాలకు భారత రాయబారులు తెలిపారని చెప్పారు. రెండోది.. నీరవ్ మోదీని పట్టుకునేందుకు సహకరించాలని ఎంపిక చేసిన దేశాలకు తాజాగా లేఖలు రాసినట్టు తెలిపారు. వారి భూభాగంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు. ఒకవేళ వారి దేశంలో ఉన్నట్టు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరినట్టు కూడా చెప్పారు. ఇక మూడోది... ఏజెన్సీల నుంచి నీరవ్ మోదీని అప్పగించాలని ఎలాంటి అభ్యర్థన రాలేదని తెలిపారు. నీరవ్ అప్పగింత ప్రక్రియను చేపట్టాలని ముంబై కోర్టు ఈ వారంలో ఈడీకి అనుమతి జారీచేసింది. కానీ ఇప్పటి వరకు ఈడీ, విదేశాంగ శాఖను సంప్రదించలేదు. నీరవ్ ఎక్కడున్నారనే కచ్చితమైన ప్రదేశం తెలియకుండా.. మంత్రిత్వ శాఖ కూడా ఏం చేయలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనంతవరకు విదేశాల్లో నీరవ్ మోదీని అరెస్ట్ చేయడం సాధ్యం కాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
మెహుల్ చోక్సీపై ఈడీ చార్జిషీటు
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి మరో కీలక పరిణామం చోసుకుంది. ఈ కుంభకోణంలో కీలక నిందితుడు నీరవ్ మోదీ సమీప బంధువు, మరో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చార్జిషీటు దాఖలు చేసింది. పీఎన్బీ స్కాంలో మెహల్ చోక్సీ సహా మరో 13 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఏ) సెక్షన్ 4 కింద దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో 5 కంపెనీలు ఉన్నాయి. ముంబైలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టుకు ముందు ఈడీ దీన్ని దాఖలు చేసింది. మెహల్ చోక్సి కి చెందిన గీతజాలి జెమ్స్ లిమిటెడ్, గిల్లి ఇండియా, నక్షత్ర బ్రాండ్లు లిమిటెడ్‌కు చెందిన మూడు కంపెనీలు ఇందులో ఉన్నాయి. వీటికి అక్రమ పద్దతుల్లో రూ. 3011.39 ఎల్ఓయూలు జారీ అయినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఇది ఇలావుంటే అనారోగ్య కారణాలరీత్యా తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలని చోక్సీ కోరారు. తన న్యాయవాది ద్వారా బుధవారం, ముంబై ప్రత్యేక సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో తాను ఎక్కడున్నదీ బహిర్గతం చేయలేననీ, వైద్య కారణాల వలన ప్రయాణం చేయలేనని చోక్సీ పేర్కొన్నాడు. అందుకే తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ఆ స్కామ్‌లో క్లర్క్ నుంచీ మేనేజర్ వరకూ..
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుప్రకంపనలు రేపిన పీఎన్బీ స్కామ్‌లో బ్యాంక్ అంతర్గత విచారణలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీకి నకిలీ పత్రాలపై భారీగా రుణాలు అందచేసే ప్రక్రియలో సాధారణ క్లర్క్ నుంచి విదేశీ మారకద్రవ్య మేనేజర్లు, ఆడిటర్లు, రీజినల్ కార్యాలయ అధిపతుల వరకూ పలువురి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భారీ స్కామ్‌కు కొద్దిమంది బ్యాంకు అధికారులే కుట్రపన్నినా నష్ట నివారణ, పర్యవేక్షణ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటంతో అక్రమ లావాదేవీలను అడ్డుకోలేకపోయినట్టు బ్యాంకు అంతర్గత విచారణలో వెల్లడైంది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన జ్యూవెలరీ సంస్థలకు ముంబయిలోని పీఎన్బీ బ్రాంచ్ నకిలీ బ్యాంకు హామీ పత్రాలతో రుణాలు పొందేలా సహకరించిందని తొలుత భావించినా బ్యాంకుకు చెందిన అన్ని స్థాయిల్లో అన్ని విభాగాల్లో ఈ స్కామ్ మూలాలున్నాయని అంతర్గత విచారణలో తేలింది. బ్యాంక్‌కు సంబంధించిన రిస్క్ మేనేజ్మెంట్ విభాగానికి ఏప్రిల్ 5న అంతర్గత విచారణ నివేదికను పీఎన్బీ అధికారులు సమర్పించారు. ఈ కేసులో సహకరించేందుకు పోలీసులకు సైతం అంతర్గత విచారణలో రాబట్టిన వివరాలు, ఈ మెయిల్ సమాచారం సహా ఆధారాలను అందచేశారు.మరోవైపు తాజా పరిణామాలపై స్పందించేందుకు పీఎన్బీ ప్రతినిధి నిరాకరించారు. న్యాయస్ధానం పరిధిలో ఉన్న అంశాలను వెల్లడించలేమని, అయితే అక్రమాలకు పాల్పడినా ఏ స్థాయి ఉద్యోగిపైనైనా బ్యాంకు కఠిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. -
నీరవ్ కేసు : టాప్ సీబీఐ అధికారికి షాక్!
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ కేసును ఇటు సీబీఐ అధికారులు, అటు ఈడీ ఎంతో కీలకంగా తీసుకుంది. ఈ కేసులో అణువణువు ఎంతో క్లుప్తంగా విచారణ చేస్తున్నాయి దర్యాప్తు ఏజెన్సీలు. కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఎలాగైనా భారత్‌కు రప్పించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో టాప్ సీబీఐ అధికారికి షాక్ తగిలింది. నీరవ్ మోదీ కేసును విచారిస్తున్న టాప్ సీబీఐ అధికారి ఈ-మెయిల్ అకౌంట్ బ్లాక్ అయింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సింగ్ కంప్యూటర్ కూడా సీజ్ అయింది. దీంతో నీరవ్ మోదీ కేసుకు సంబంధించి ఏమైనా కీలకమైన సమాచారం లీకైందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సిమ్లాలో రాజీవ్ సీంగ్ మెయిల్ ఓపెన్ అయిందని, పెద్ద మొత్తంలో మెయిల్స్‌ను పంపించుకున్నారని తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన త్రిపురకు వచ్చారు. ఈమెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి, హ్యాకర్లు పంపించుకున్న డాక్యుమెంట్లలో బ్యాంకు మోసాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్టు వెల్లడవుతోంది. తొలుత ఆయన ఈమెయిల్ అకౌంట్ ద్వారా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయని మే 16న గుర్తించారు. ఆ అనంతరం ఆయన అకౌంట్‌ను ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) బ్లాక్ చేసింది. సీఈఆర్టీ, సీబీఐను అలర్ట్ చేసిన అనంతరం సిమ్లాలో మరోసారి సింగ్ అకౌంట్ యాక్సస్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఈ-మెయిల్ అకౌంట్‌ను బ్లాక్, ఎవరు ఈ పన్నాగానికి పాల్పడ్డారో సైబర్ క్రైమ్ అధికారులు విచారిస్తున్నారు. నీరవ్ కేసుకు సంబంధించిన ఏమైనా సమాచారం లీకైందా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. సీబీఐ సైతం ఈ ఈమెయిల్ లీక్‌పై విచారణ ప్రారంభించింది. నీరవ్ కేసు విచారిస్తున్న టాప్ అధికారి ఈ-మెయిల్ హ్యాక్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. తన అకౌంట్ నుంచి అనుమానిత కార్యకలాపాలు సాగడంపై సింగ్ వెంటనే స్పందించలేదు. మరోవైపు విదేశాల్లో చక్కర్లు కొడుతున్న నీరవ్ మోదీకి సంబంధించి మరింత కీలక సమాచారాన్ని అధికారులు సేకరించారు. కనీసం ఆరు భారతీయ పాస్‌పోర్ట్ లతో వివిధ దేశాలలో తిరుగుతున్నట్టు కనుగొన్నారు. ఈ నేరానికి మోదీపై తాజా ఎఫ్ఐఐఆర్ నమోదు చేయాలని దర్యాప్తు బృందాలు కోరుతున్నాయని సీనియర్ అధికారులు ధృవీకరించారు. ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉండటం, అలాగే రద్దు చేయబడిన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించడం నేరమని అధికారులు పేర్కొన్నారు. -
నీరవ్‌కు వ్యతిరేకంగా రెడ్‌కార్నర్ నోటీసు
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల కుంభకోణం పాల్పడిన నీరవ్ మోదీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని సీబీఐ కోరుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసిందని అధికారులు చెప్పారు. నీరవ్ కేసును విచారిస్తున్న మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా ఆయనకు వ్యతిరేకంగా రెడ్‌కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్‌పోల్‌ను మార్చిలోనే కోరింది. ఒక్కసారి రెడ్‌కార్నర్ నోటీసు జారీచేస్తే, లియోన్ ఆధారిత అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశముంటుంది. పీఎన్బీ కుంభకోణానికి సంబంధించిన కేసులో నీరవ్, చోక్సీపై కొద్ది రోజుల క్రితమే సీబీఐ విడివిడిగా చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిందితులను విచారణ కోసం తిరిగి భారత్‌కు రప్పించాలన్న లక్ష్యంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్రలోనే పీఎన్బీ కుంభకోణం అతిపెద్దది. ఈ బ్యాంకులో దాదాపు రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి చాలా రోజుల ముందే తన భార్య అమీ (అమెరికా పౌరురాలు), సోదరుడు నిశాల్ మోదీ (బెల్జియం పౌరుడు)తో పాటు నీరవ్ మేనమామ, గీతాంజలి గ్రూపు సంస్థల ప్రమోటర్ మెహుల్ చోక్సీతో కలసి భారత్ నుంచి జారుకున్నారు. -
ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు సమాధానం ఇచ్చుకోవాలి
కోల్హాపూర్: ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీరెడ్డి ఇటీవలే వెలుగు చూసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు–నీరవ్ మోదీ రూ.13,000 కోట్ల స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వరంగ బ్యాంకుల యజమానిగా ఈ తరహా స్కామ్‌ల వల్ల పెరిగిపోతున్న నష్టాలపై పన్ను చెల్లింపుదారులకు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎన్బీలో చోటుచేసుకున్నది కచ్చితంగా మోసమేనని, దీనిపై ఎక్కువగా ఆందోళన చెందేది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులను సురక్షితంగా ఉంచడం ఎలా అన్న అంశంపై ఇక్కడ జరిగిన చర్చలో పాల్గొని వైవీరెడ్డి మాట్లాడారు. తమ డబ్బులకు సంరక్షకుడిగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ తరహా స్కామ్‌లను నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతుందని పన్ను కట్టేవారు ప్రశ్నించాలని సూచించారు. ప్రభుత్వం తాను నియమించిన డైరెక్టర్లు ఏం చేస్తున్నారనే దానిపై... తన సొంత పెట్టుబడుల పర్యవేక్షణ, నియంత్రణ విషయంలో కచ్చితంగా ఆందోళన చెందాల్సిందేనన్నారు. ఆర్బీఐ ప్రధాన బాధ్యత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, డిపాజిట్ల పరిరక్షణ అయినప్పటికీ, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత విస్మరించరానిదని అభిప్రాయపడ్డారు. మోసాలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో పలువురు బ్యాంకర్లపై ఇటీవలే సీబీఐ చేపట్టిన చర్యలు అసాధారణంగా ఉన్నాయని వైవీ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకుల వద్ద డిపాజిట్లు తగినన్ని ఉన్నాయని, అవి బాగున్నంత వరకు అవి కొనసాగుతాయని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద డిపాజిటర్లకు సరిపడా నిధులు లేకపోయినప్పటికీ, ఎక్కువ వాటా ప్రభుత్వానిదే కనుక డిపాజిట్‌దారుల సొమ్ము సురక్షితమేనన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయంలో జాప్యం, అనిశ్చితి ఆందోళనలు కలిగించే అంశాలేనని వైవీ రెడ్డి అన్నారు. -
ఐటీ ఆఫీసులో అగ్ని ప్రమాదం : మోదీ రికార్డులు సేఫ్!
న్యూఢిల్లీ : ముంబైలోని ఆదాయపు పన్ను ఆఫీసులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఎన్బీ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఆ ప్రమాదంలో కాలిబూడిద అయిపోయాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిల విచారణకు చెందిన రికార్డులన్నీ సురక్షితంగా ఉన్నాయని, అగ్నిప్రమాదం జరుగడానికి కాస్త ముందుగానే వాటిని వేరే ప్రాంతానికి తరలించినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. ముంబైలోని ఆదాయపు పన్ను ఆఫీసుకు చెందిన సింధియా హౌజ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నీరవ్, మెహుల్‌ల విచారణకు సంబంధించిన రికార్డులన్నీ కాలిపోయినట్టు న్యూస్ రిపోర్టులు వచ్చాయి. అయితే ఈ రిపోర్టులన్నీ పూర్తిగా అవాస్తవం, తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయంటూ సీబీడీటీ క్లారిటీ ఇచ్చింది. ఈ విచారణకు చెందిన డాక్యుమెంట్లను, రికార్డులను అంచనా కార్యక్రమంలో భాగంగా పలు భవంతుల్లో ఉన్న అసెస్మెంట్ విభాగాలకు పంపించినట్టు పేర్కొంది. రికార్డులు, డాక్యుమెంట్లు కోల్పోయామంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ తెలిపింది. ప్రస్తుతం పీఎన్బీ బ్యాంకులో చోటు చేసుకున్న రూ.13,400 కోట్ల కుంభకోణంపై సీబీఐ, ఈడీతో పాటు ఐటీ డిపార్ట్మెంట్ కూడా విచారణ జరుపుతోంది. -
ప్రభుత్వరంగ బ్యాంకుల దివాలా
-
12వేల పేజీలతో ఈడీ తొలి చార్జిషీటు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మూడు నెలల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం తన తొలి చార్జిషీటును దాఖలు చేసింది. నీరవ్ మోదీ, ఆయన సన్నిహితులపై తాము తొలి చార్జిషీటు దాఖలు చేస్తున్నామని ఈడీ అధికారులు పేర్కొన్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం పలు సెక్షన్ల కింద 12వేల పేజీల చార్జిషీటును దాఖలు చేసి స్పెషల్ కోర్టు ముందుకు తీసుకొచ్చినట్టు తెలిపారు. నీరవ్ మోదీ మేనమామ మెహుల్ చౌక్సి, ఆయన వ్యాపారాలకు వ్యతిరేకంగా కూడా ఏజెన్సీ రెండో చార్జిషీటు దాఖలు చేయబోతోంది. ఈ చార్జిషీటులో కేసు ప్రారంభమైనప్పటి నుంచి మోదీకి, ఆయన అసోసియేట్స్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని అటాచ్మెంట్ల వివరాలను పేర్కొంది. ఈ నెల మొదట్లో సీబీఐ సైతం పీఎన్బీ కుంభకోణ కేసులో రెండు ఛార్జ్షీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.13వేల కోట్లకు పైగా పీఎన్బీలో వీరు కుంభకోణానికి పాల్పడినట్టు తెలిసింది. కొందరు బ్యాంకు ఉద్యోగుల సాయంతో వీరు ఈ కుంభకోణం చేశారు. పీఎన్బీ ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే వారు దేశం విడిచి పారిపోయారు. ఇటు విచారణకు సైతం సహకరించడం లేదు. ఈ కేసులో ఈడీ మనీ లాండరింగ్ విషయాలపై ఎక్కువగా దృష్టిసారించిందని సీనియర్ అధికారులు చెప్పారు. -
డైమండ్ కింగ్ నీరవ్ మోదీకి మరో షాక్
న్యూఢిల్లీ : డైమండ్ కింగ్ నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును భారీ కుంభకోణంలో ముంచెత్తి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి చెందిన 170 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మోదీ ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్టు ఈడీ చెప్పింది. వీటిలో నీరవ్ మోదీ ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై, సూరత్‌లో ఉన్న పండ్ర ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఉన్నాయి. మరో అత్యంత విలువైన ప్రాపర్టీ అయిన హెచ్‌సీఎల్ హౌజ్ కూడా ఈ అటాచ్‌మెంట్స్‌లో ఉంది. దీని విలువ దాదాపు 63 కోట్ల రూపాయలు. ఆస్తుల అటాచ్మెంట్ మాత్రమే కాక, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నీరవ్ మోదీకి, సోదరుడు నిశాల్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లు, వీరి సంస్థల ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకు అకౌంట్లను కూడా అటాచ్ చేసుకుంది. మొత్తం వీటిలో 104 బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, వీటి విలువ 58 కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలిసింది. నీరవ్‌మోదీకి చెందిన పలు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లను, నీరవ్ మోదీ సంస్థలకు చెందిన 4 కోట్ల రూపాయల విలువైన 11 వాహనాలను ఏజెన్సీ అటాచ్ చేసినట్టు వెల్లడైంది. పీఎన్బీలో వీరు దాదాపు రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో వీరి సంస్థలపై, ఆస్తులపై, బ్యాంకు అకౌంట్లపై దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్నాయి. మరోవైపు, నీరవ్ మోదీ బంధువులకు కూడా సమన్లు జారీ అయ్యాయి. స్కాంకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని, ఆయన మేనమామ మెహుల్ చౌక్సిలను ఎలాగైనా భారత్‌కు రప్పించాలని ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. -
స్కాం సెగ: పీఎన్బీ మూడీస్ రేటింగ్ డౌన్
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌నకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సెగ మరో రూపంలో తాకింది. ఊహించినట్టుగానే బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాం నేపథ్యంలో రేటింగ్ సంస్థ పీఎన్బీకి గట్టి షాక్ ఇచ్చింది. రూ.11,400 కోట్ల భారీ కుంభకోణం.. పీఎన్బీ అంతర్గత రిస్కు మేనేజ్మెంట్ వ్యవస్థ, నియంత్రణ సంస్థ పర్యవేక్షణపై సందేహాలు నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఈ నిర్ణయం తీసుకుంది. రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ల సర్వీసెస్ పీఎన్బీ రేటింగ్‌ను భారీగా తగ్గించింది. బ్యాంకు మూలధనంపై మోదీ కుంభకోణం ప్రభావం ప్రతికూలంగా ఉండనుందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే లోకల్, విదేశీ కరెన్సీ డిపాజిట్ రేటింగ్‌ను డౌన్ గ్రేడ్ చేసింది. దీన్ని బీఏ1కు డౌన్‌గ్రేడ్ చేసింది. అలాగే బ్యాంకు ఎన్‌పీని బీఏఏ 3 నుంచి పీ-3కి తగ్గించింది. అంతేకాదు బ్యాంకు క్రెడిట్ అంచనా (బీసీఏ) ను తగ్గించింది. బీసీఏ బీఏ 3నుంచి బీ 1 కు తగ్గించామని మూడీస్ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆ వివరాల వెల్లడికి పీఎన్బీ నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో వెల్లడైన రూ 13,000 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆడిట్, విచారణ వివరాలను వెల్లడించేందుకు బ్యాంక్ నిరాకరించింది. ఈ వివరాలు వెల్లడిస్తే విచారణ ప్రక్రియపై ప్రభావం చూపుతుందని పీఎన్బీ పేర్కొంది. స్కామ్‌కు సంబంధించి తనిఖీ చేసిన పత్రాల నకలును వెల్లడించేందుకూ పీఎన్బీ నిరాకరించింది. ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నలకు బ్యాంక్ బదులిస్తూ సంస్థలో చోటుచేసుకున్న కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ, ఇతర నిఘా సంస్థలు విచారణ చేపడుతున్న దృష్ట్యా ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని ఆర్టీఐ చట్టం 8 (1) (హెచ్) కింద ఇవ్వలేమని ఆర్టీఐ దరఖాస్తుదారుకు బ్యాంక్ స్పష్టం చేసింది. కేసు విచారణ పురోగతి, నిందితుల ప్రాసిక్యూషన్‌పై ప్రభావం చూపే సమాచారాన్ని సదరు సెక్షన్ల కింద నిరాకరించవచ్చని పేర్కొంది. పీఎన్బీలో నకిలీ పత్రాలతో బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్లు మెహుల్ చోక్సీ రూ వేల కోట్లు రుణాలు పొంది విదేశాల్లో తలదాచుకున్న విషయం తెలిసిందే. -
పీఎన్బీ స్కాం : మోదీ బంధువులు బుక్కయ్యారు
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ కుంభకోణ కేసులో ఇప్పటికే సీబీఐ రెండు ఛార్జ్షీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్కాంను దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నీరవ్ మోదీ బంధువులకు సమన్లు జారీచేసింది. కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీ తండ్రి దీపక్ మోదీ, సోదరి పూర్వి మెహతా, ఆమె భర్త మయాంక్ మెహతాలకు సమన్లు జారీచేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. పీఎన్బీ కుంభకోణ కేసు విచారణలో భాగంగా ఈ సమన్లను పంపినట్టు పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా వచ్చే వారం మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి చెందిన స్పెషల్ కోర్టులో హాజరు కావాలని వీరికి ఆదేశాలు జారీచేసినట్టు ఈడీ ఇన్వెస్టిగేటర్లు తెలిపారు. ముంబై ఆఫీసులో వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. ఈ నెల తొలి వారంలోనే నీరవ్ మోదీ బంధువులకు సమన్లు జారీచేశామని ఈడీ ఇన్వెస్టిగేటర్లు చెప్పారు. తమ ముందు హాజరు కావడానికి వారికి 15 రోజుల సమయమిచ్చినట్టు పేర్కొన్నారు. నీరవ్ మోదీ, ఆయన గ్రూప్ కంపెనీలు, అంకుల్ మెహుల్ చౌక్సి, ఆయన డైమాండ్ కంపెనీలు కలిసి పీఎన్‌బీఐలో దాదాపు రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయి. ఒకవేళ ఈ సమన్లకు నీరవ్ తండ్రి, సోదరి, బావ స్పందించకపోతే, మరోసారి నోటీసులు జారీచేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నీరవ్ తండ్రి దీపక్ బెల్జియంకు చెందిన వాడు కాగ, పూర్వి, ఆమె భర్త హాంకాంగ్‌లో స్థిరపడ్డారు. మెయిల్ ద్వారా ఈ సమన్లను అధికారులు వారికి జారీచేశారు. పూర్వి ఇప్పటికే ఈడీ కనుసన్నల్లో ఉన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా భారత్‌కు మనీ లాండరింగ్‌కు పాల్పడటానికి నీరవ్‌కు ఆమె సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆమె భర్త కూడా ఇదే కార్యకలాపాలతో నీరవ్‌కు సాయపడినట్టు తెలుస్తోంది. వీరందరూ కలిసి 2011 నుంచి 2017 మధ్యలో ముంబైలోని బ్యాంకుకు చెందిన బ్రాడీ హౌజ్ బ్రాంచు ఆఫీసర్లతో కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు వెల్లడైంది. స్కాం బయటపడటానికి కొన్ని రోజుల ముందే నీరవ్ మోదీ, ఆయన భార్య, అంకుల్ మెహుల్ చౌక్సిలు దేశం విడిచి పారిపోయారు. జనవరి 31న ఈ కేసులో సీబీఐ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని పీఎన్బీ కుంభకోణం ఈడీ కూడా మనీ లాండరింగ్ విచారణ చేపడుతోంది. -
ప్రభుత్వ బ్యాంకులు.. కుదేలు!
ముంబై: మొండిబాకీలు, స్కాములతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటిదాకా ఫలితాలు ప్రకటించిన పది బ్యాంకుల్లో రెండింటిని మినహాయిస్తే.. మిగతావాటన్నింటి పరిస్థితీ ఇదే. మొత్తం ఎనిమిది నష్టాలు ఏకంగా రూ. 39,803 కోట్ల మేర ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిధుల కొరత నుంచి గట్టెక్కించడానికి కేంద్రం గత ఆర్థిక సంవత్సరం ఆఖర్లో అందించిన రూ. 80 వేల కోట్ల అదనపు మూలధనంలో ఇది సగానికి సమానం కావడం గమనార్హం. ఈ గణాంకాలు కేవలం ఎనిమిది బ్యాంకులవి మాత్రమే... ఇంకా పలు బ్యాంకులు ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 12,282 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ. 5,871 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. విజయ బ్యాంక్ (రూ. 727 కోట్లు), ఇండియన్ బ్యాంక్ (రూ. 1,258 కోట్లు) మాత్రమే వార్షిక లాభాలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకులు సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు కేంద్రం కనీసం రూ. లక్ష కోట్లయినా సమకూర్చాల్సి రావొచ్చనేది విశ్లేషకుల అంచనా. బ్యాంకులకు పీసీఏ చిక్కులు .. ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఇంకా ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఈ బ్యాంకులు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలు చేస్తున్నాయి. ఇప్పటికే పీసీఏ అమలు చేస్తున్న బ్యాంకులు.. మొండిబాకీల ప్రొవిజనింగ్‌పై ఆర్బీఐ కొత్త నిబంధనలతో మరిన్ని నష్టాలు ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా. దీంతో కేంద్రం సమకూర్చిన అదనపు మూలధనంలో ఏకంగా 75–85 శాతం వాటా హరించుకుపోవచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుతం 11 పీఎస్‌యూ బ్యాంకులు పీసీఏ కింద ఉన్నాయి. వరుసగా రెండేళ్ల పాటు నష్టాలు ప్రకటించి, మొత్తం మొండిబాకీలు పది శాతం దాటేసిన పక్షంలో రిజర్వ్ బ్యాంక్ పీసీఏ అమలు చేయాలని ఆదేశిస్తుంది. పీసీఏ విధించిన పక్షంలో ఆయా బ్యాంకులు కొత్తగా మరిన్ని శాఖలు తెరవడంపైనా, సిబ్బందిని తీసుకోవడంపైనా, రిస్కు ఎక్కువగా ఉండే రుణగ్రహీతలకు రుణాలివ్వడంపైనా ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ద్వితీయార్థంలో మెరుగ్గా పరిస్థితులు.. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులు మరో రెండు త్రైమాసికాలకు మాత్రమే పరిమితం కావొచ్చని, ఆ తర్వాత నుంచి పనితీరు మెరుగుపడొచ్చని బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. బినాని సిమెంట్, ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్ మొదలైన వాటి దివాలా ప్రక్రియలు మొదటి లేదా రెండో త్రైమాసికాల్లో పూర్తయిపోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. వీటి నుంచి రావాల్సినది ఎంతో కొంత వచ్చినా... ఆదాయాలు మెరుగుపడటానికి ఉపయోగపడొచ్చని వారంటున్నారు. బ్యాంకులపై నేడు కేంద్రం సమీక్ష న్యూఢిల్లీ: మొండిబాకీల ప్రక్షాళన తదితర అంశాలకు సంబంధించి సత్వర దిద్దుబాటు చర్యలు(పీసీఏ) అమలవుతున్న 11 ప్రభుత్వ బ్యాంకుల పనితీరుపై ఆర్థిక శాఖ గురువారం సమీక్ష నిర్వహించనుంది. వాచ్ లిస్ట్ నుంచి బయటపడేందుకు ఆయా బ్యాంకుల చర్యలను సమీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత పీసీఏ అమలు చేస్తున్న బ్యాంకులపై పలు నియంత్రణలుంటాయి. శాఖల విస్తరణ, రుణాల మంజూరు, సిబ్బంది నియామకాలు మొదలైన విషయాల్లో ఆంక్షలు వర్తిస్తాయి. ప్రస్తుతం కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో తదితర బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. తాజా ఏడాది కనిష్టానికి 9 బ్యాంక్ షేర్లు.. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు భారీ నష్టాలను ప్రకటించడం, తాజా రుణాలు జారీ చేయకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో 9 ప్రభుత్వ బ్యాంక్ షేర్లు బుధవారం తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఈ షేర్లన్నీ చివరకు 2–12 శాతం నష్టాలతో ముగిశాయి. అలహాబాద్ బ్యాంక్(రూ.38.80 ముగింపు ధర), ఓబీసీ (రూ.78.85), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (రూ32.10), పీఎన్బీ (రూ.75.55), దేనా బ్యాంక్ (రూ.16.25), బ్యాంక్ ఆఫ్ మహారాష ్ట్ర(రూ.13.12), కార్పొరేషన్ బ్యాంక్ (రూ.26), సిండికేట్ బ్యాంక్ (రూ.43.85), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు (రూ.11.02) ఈ జాబితాలో ఉన్నాయి. -
పీఎన్బీ స్కాంలో మరో ఛార్జ్‌షీటు
ముంబై : డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులో పాల్పడిన భారీ కుంభకోణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్బీ స్కాంలో మరో సూత్రధారి అయిన నీరవ్ మేనమామ మెహుల్ చౌక్సి, ఆయన గీతాంజలి గ్రూప్ కంపెనీలకు వ్యతిరేకంగా సీబీఐ బుధవారం మరో ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టులో ఈ ఛార్జ్‌షీటును నమోదుచేసినట్టు అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితమే ఈ కేసులో తొలి ఛార్జ్‌షీటును సీబీఐ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పీఎన్బీలో దాదాపు రూ.13వేల కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు సీబీఐ తన ఛార్జ్షీటుల్లో పేర్కొంది. తొలుత దాఖలు చేసిన ఛార్జ్షీటులో సీబీఐ పలు బ్యాంకు టాప్ అధికారుల పేర్లను ప్రస్తావించింది. దీనిలో పీఎన్బీ మాజీ చీఫ్ ఉషా సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. పీఎన్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేవీ బ్రహ్మాజీ రావు, సంజయ్ శరణ్, జనరల్ మేనేజర్(ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) నేహాల్ అహద్‌లను కూడా సీబీఐ తన తొలి ఛార్జ్షీటులో పేర్కొంది. ప్రస్తుతం నమోదు చేసిన ఛార్జ్షీటులో మెహుల్ చౌక్సి, ఆయన గీతాంజలి సంస్థలను చేర్చింది. తొలి ఛార్జ్‌షీటు దాఖలైన మరుసటి రోజే పీఎన్బీ తన నాలుగో క్వార్టర్లో భారీగా రూ.13,416.91 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. బ్యాంకు ఇప్పటి వరకు పోస్టు చేసిన ఫలితాల్లో ఇదే అత్యధిక నష్టంగా విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, పీఎన్బీ భారీ కుంభకోణాన్ని విచారిస్తున్న సీబీఐ తన తొలి ఎఫ్ఐఆర్ను జనవరి 31న నమోదు చేసింది. నీరవ్‌మోదీ, ఆయన భార్య, సోదరుడు నిషాల్, అంకుల్ మెహుల్ చౌక్సి, పలువురు పీఎన్‌బీఐ అధికారులకు వ్యతిరేకంగా అప్పట్లో ఈ ఎఫ్ఐఆర్ను దాఖలు చేసింది. వెంటనే మరో రెండు ఎఫ్ఐఆర్లను కూడా సీబీఐ ఫైల్ చేసింది. తొలి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని సోమవారం సీబీఐ తన తొలి ఛార్జ్‌షీటును దాఖలు చేయగా.. రెండో ఎఫ్ఐఆర్ ఆధారితంగా నేడు రెండో ఛార్జ్‌షీటు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
కుంభకోణం ఎఫెక్ట్ : ‘పీఎన్బీ’కి భారీ నష్టాలు
ముంబై : ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో చోటు చేసుకున్న నీరవ్ మోదీ కుంభకోణం ఆ బ్యాంకును భారీ నష్టాల్లో ముంచెత్తింది. నేడు బ్యాంకు ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సరపు మార్చి క్వార్టర్ ఫలితాల్లో దాదాపు రూ.13,416.91 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. అంతకుముందు సంవత్సరం క్యూ4లో బ్యాంకు రూ.261.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంగతి తెలిసిందే. వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, మెహుల్ చౌక్సీ చేసిన 13వేల కోట్ల రూపాయల భారీ స్కాం మూలంగానే ఈ క్వార్టర్లో పీఎన్బీ ఇంత పెద్ద మొత్తంలో నష్టాలను నమోదు చేసిందని అధికారులు తెలిపారు. పీఎన్బీ స్కాం వల్ల గతేడాది క్వార్టర్లో నమోదైన 5,753.3 కోట్ల రూపాయల నష్టం కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. మొండి బకాయిల కేటాయింపులు దాదాపు మూడు రెట్లు పెరిగాయని పీఎన్బీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కేటాయింపులు రూ.3,908.3 కోట్ల నుంచి రూ.10,080.9 కోట్లకు చేరాయని తెలిపింది. ఫలితంగా మొత్తం ఆదాయం రూ.12,889 కోట్ల నుంచి రూ.11,555 కోట్లకు తగ్గిందని వివరించింది. అలానే మొత్తం రుణాల్లో ఎన్పీఏల వాటా కూడా అధికంగా ఉన్నట్లు తెలిపింది. 2017, డిసెంబర్ నాటికి 12.11 శాతం, 2017 మార్చి చివరి నాటికి 12.5 శాతంగా ఉన్న ఎన్పీఏలు, 2018, మార్చి చివరి నాటికి మొత్తం రుణాల్లో 18.38 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. అంతేకాక ఎన్పీఏల నిష్పత్తి గత క్వార్టర్లో 7.55 శాతం, అంతకుముందు ఏడాది క్వార్టర్లో 7.81 శాతం ఉండగా, ఈ క్వార్టర్లో ఎన్పీఏల నిష్పత్తి 11.24 శాతానికి పెరిగింది. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయాలు... అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌కు రూ.3,683.5కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్వార్టర్లో 16.8శాతం తగ్గి రూ.3,06335కోట్లకు చేరింది. రాయిటర్స్ పోల్ ప్రకారం నికర వడ్డీ ఆదాయం 7శాతం పెరిగి రూ.3,939.7కోట్లు పెరిగిందని అంచనా. -
పీఎన్బీ స్కాం : కీలక పరిణామం
సాక్షి, ముంబై: డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి నేడు ( సోమవారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద స్కాంగా నిలిచిన పీఎన్బీ కుంభకోణంపై విచారణ జరుపుతున్న సీబీఐ ప్రధాన నిందితుడు నీరవ్ మోదీతోపాటు, బ్యాంకు అధికారులపై మొట్టమొదటి చార్జిషీటును నమోదు చేసింది. ముంబై కోర్టులో ఈ చార్జ్‌షీటును ఫైల్ చేసింది. పీఎన్బీ మాజీ ఎండీ సీఈవో, ప్రస్తుతం అలహాబాద్ బ్యాంకు సీఎండీ ఉషా అనంత సుబ్రమణియన్, తదితర టాప్ అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. సుమారు 400కోట్ల రూపాయల తప్పుడు ఎల్వోయూలు జారీ చేశారని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. 2016లో పీఎన్బీ సీఎండీగా ఉన్న అనంత సుబ్రమణియన్ స్విఫ్ట్ నిబంధనలను ఉల్లఘించారని సీబీఐ ఆరోపించింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో పీఎన్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బ్రహ్మాజీ రావు, సంజీ శరణ్‌లతోపాటు జనరల్ మేనేజర్ నెహల్ అహాద్ తదితరుల పేర్లను చేర్చినట్టు తెలుస్తోంది. కాగా 2011-18 సంవత్సరాల మోదీ స్కాం చోటు చేసుకోగా.. ఉషా సుమారు 21 నెలలపాటు పీఎన్బీకి సీఎండీగా వ్యవహరించారు. పీఎన్బీ నిందితులుగా పేర్కొన్న పీఎన్బీ, అలహాబాద్ బ్యాంకు డైరెక్టర్లకు అన్ని అధికారాలు తీసివేయాలని బ్యాంకులను ఆదేశించినట్టు డీఎఫ్ఎస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. -
హాంకాంగ్ నుంచి నీరవ్ మోదీ జంప్
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంలో ప్రధాన సూత్రధారి అయిన నీరవ్ మోదీకి అరెస్ట్ భయం పట్టుకుంది. నీరవ్ మోదీని అరెస్ట్ చేయాలని భారత్ పెట్టుకున్న ప్రతిపాదనకు హాంకాంగ్ అధికారులు ఒప్పుకోవడంతో, ఆయన అక్కడ నుంచి కూడా పారిపోయినట్టు తెలుస్తోంది. హాంకాంగ్ నుంచి నీరవ్ మోదీ న్యూయార్క్ తరలి వెళ్లినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.13,600 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోదీ, ఆ స్కాం బయటికి రాకముందే భారత్ విడిచి పారిపోయాడు. భారత్ నుంచి పారిపోయి యూఏఈలో తలదాచుకున్నాడు. అయితే అక్కడ కఠినతరమైన శిక్షలు ఉండటంతో, వెంటనే హాంకాంగ్ వెళ్లినట్టు తెలిసింది. ఫిబ్రవరి 2 నుంచి నీరవ్ మోదీ హాంకాంగ్‌లో ఉన్నట్టు భారత అధికారులు గుర్తించారు. నీరవ్‌ను అరెస్ట్ చేయాలంటూ హాంకాంగ్ అధికారులను కోరుతూ భారత్ ఓ అభ్యర్థనను సైతం పంపింది. అలాగే పీఎన్బీ బ్యాంకు కూడా హాంకాంగ్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హాంకాంగ్‌లో ఉండటం కూడా ప్రమాదకమేనని భావించిన నీరవ్ మోదీ, వెంటేనే న్యూయార్క్ వెళ్లినట్టు రిపోర్టు పేర్కొన్నాయి. మోదీ ఒరిజినల్ పాస్పోర్ట్రద్దు చేసినప్పటికీ, అతని వద్ద మరో పాస్‌పోర్టు ఉందని, దాంతోనే ఒక దేశం నుంచి మరో దేశానికి పారిపోవడానికి సహకరిస్తున్నట్టు తెలిపాయి. మోదీ కేవలం బ్యాంకులను ముంచడమే కాకుండా.. నకిలీ పాస్‌పోర్ట్ కలిగి ఉండి చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు తెలిసింది. నిబంధనల ప్రకారం భారత పౌరులు ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండటానికి అనుమతి లేదు. మరోవైపు బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి పత్తా లేకుండా పోయిన డిఫాల్ట్రర్లను వెతికి పట్టుకునేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు డిటెక్టివ్‌ల సాయం తీసుకుంటోంది. ఇందు కోసం సర్వీసులు అందించేందుకు డిటెక్టివ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులను సైతం ఆహ్వానిస్తోంది. పత్తా లేకుండా పోయిన లేదా బ్యాంకు రికార్డుల్లోని చిరునామాల్లో లేని రుణగ్రహీతలు, గ్యారంటార్లతో పాటు వారి వారసుల ఆచూకీని దొరకపుచ్చుకునేందుకు ఈ డిటెక్టివ్ ఏజెన్సీలు తోడ్పాటు అందించాల్సి ఉంటుంది. -
డిటెక్టివ్‌లతో డిఫాల్టర్ల వేట!
న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన మొండి బాకీలను రికవర్ చేసుకునేందుకు ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా పత్తా లేకుండా పోయిన డిఫాల్టర్లను వెతికి పట్టుకునేందుకు డిటెక్టివ్‌ల సాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం సర్వీసులు అందించేందుకు డిటెక్టివ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మే 5లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొండి బాకీలను రాబట్టుకునే క్రమంలో క్షేత్ర స్థాయి సిబ్బందికి గణనీయంగా తోడ్పాటు అందించేలా డిటెక్టివ్ ఏజెన్సీలను నియమించుకోవాలని నిర్ణయించినట్లు పీఎన్బీ పేర్కొంది. పత్తా లేకుండా పోయిన లేదా బ్యాంకు రికార్డుల్లోని చిరునామాల్లో లేని రుణగ్రహీతలు, గ్యారంటార్లతో పాటు వారి వారసుల ఆచూకీని దొరకపుచ్చుకునేందుకు ఈ డిటెక్టివ్ ఏజెన్సీలు తోడ్పాటు అందించాల్సి ఉంటుంది. డిఫాల్టర్ల ప్రస్తుత చిరునామా, ఉద్యోగం, వృత్తి, ఆదాయ మార్గాలు, ఆస్తుల వివరాలు మొదలైన సమాచారాన్ని డిటెక్టివ్లు సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. నివేదిక సమర్పించేందుకు ఏజెన్సీలకు గరిష్టంగా 60 రోజుల వ్యవధి ఉంటుంది. కేసు సంక్లిష్టతను బట్టి అవసరమైతే 90 రోజుల దాకా దీన్ని పొడిగించే అవకాశం ఉంది. రూ.13,000 కోట్ల నీరవ్ మోడీ స్కామ్‌తో సతమతమవుతున్న పీఎన్బీ నికర నిరర్థక ఆస్తులు 2017 డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 57,519 కోట్ల మేర ఉన్నాయి. స్థూల రుణాల్లో ఇది 12.11 శాతం. వీటిని రికవర్ చేసుకునేందుకు బ్యాంకు ఇప్పటికే గాంధీగిరీ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది. దీని ద్వారా ప్రతి నెలా రూ. 150 కోట్లు రికవరీ కాగలవని ఆశిస్తోంది. -
మోదీ ధ్యాసంతా మళ్లీ ప్రధాని కావడం మీదే
-
ధ్యాసంతా మళ్లీ పీఎం కావాలనే
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం సహా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో తాను 15 నిమిషాలు మాట్లాడితే ప్రధాని మోదీ సభ నుంచి పారిపోతారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో సోమవారం ప్రారంభమైన సేవ్ ది కాన్స్టిట్యూషన్(రాజ్యాంగాన్ని కాపాడండి) కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా, మైనారిటీలపై దాడులు, దళితుల హక్కులకు భంగం కలిగినా, చివరికి దేశం తగలబడిపోయినా మోదీకి పట్టదని మండిపడ్డారు. మోదీ ధ్యాసంతా మళ్లీ ప్రధాని కావడం మీదే ఉంటుందన్నారు. కేంద్రం అన్ని వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ నేతలతోనే నింపేస్తోందని దుయ్యబట్టారు. మోదీ గతంలో ఇచ్చిన ‘బేటీ బచావో–బేటీ పఢావో’ నినాదం ప్రస్తుతం ‘బీజేపీ నేతల నుంచి మీ కుమార్తెల్ని కాపాడుకోండి’గా మారిపోయిందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోదీకి తమ మనసులోని మాటను(మన్‌కీ బాత్) చెబుతారని ఆయన చురకలంటించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించగల సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రాసినా, విమర్శించినా మీడియాకు అండగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మీడియాకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొద్ది రోజుల్లో మీడియా స్వేచ్ఛగా మాట్లాడే రోజులొస్తాయన్నారు. వంశపారంపర్యాన్ని కాపాడే కార్యక్రమం.. వంశపారంపర్యమైన పాలనను కాపాడుకోవడానికే రాహుల్ ‘సేవ్ ది కాన్స్టిట్యూషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాకుండా వంశపారంపర్య పాలను కోరుకుంటోందని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ రూపొందించిందని రాహుల్ చెప్పడం బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడమేనని షా విమర్శించారు. కాగా, రెండు లోక్‌సభ ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమికి నెహ్రూ వ్యక్తిగతంగా కృషి చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. -
పీఎన్బీ ‘గాంధీగిరి’, ఇక వారికి చుక్కలే..!
న్యూఢిల్లీ : ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చూసిన వారికి ‘గాంధీగిరి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్యాయం చేసిన వ్యక్తికి బుద్ధి చెప్పడానికి హింసామార్గంలో కాదు...గాంధీమార్గంలో కూడా బుద్ధి చెప్పవచ్చని చూపించారు ఈ సినిమాలో. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే మొండి బకాయిలను వసూలు చేయాడానికి ప్రస్తుతం పీఎన్బీ ఇదే మార్గాన్ని ఎంచుకుంది. పీఎన్బీ ప్రస్తుత పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీ ఇద్దరు కలిసి పంజాబ్ బ్యాంక్‌లో 13 వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. పేరుకుపోయిన ఎన్పీఏల వసూళ్ల గురించి రోజురోజుకు ఆందోళనలు పెరగడంతో వాటి వసూలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో పీఎన్బీ ఈ ‘గాంధీగిరి’కి శ్రీకారం చుట్టింది. గతేడాది మేలో ప్రారంభించిన ఈ ‘గాంధీగిరి’ విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేసి నెలకు రూ.100-150 కోట్ల రూపాయల వరకు రుణాలను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ‘గాంధీగిరి’ విధానంలో ఉద్యోగులు రుణం తీసుకుని చెల్లించని వారి నివాసాలు, కార్యలయాల ముందు మౌనంగా కూర్చుంటారు. ఉద్యోగులు ఇలా చేయడాన్ని అవమానంగా భావించి అయిన అప్పు తీసుకున్నవాళ్లు రుణం చెల్లిస్తారనే ఉద్దేశ్యంతో బ్యాంకు ‘గాంధీగిరి’ని ప్రారంభించింది. దీన్ని అమలు చేయడానికి 1,144 మంది ఉద్యోగులను కూడా నియమించింది. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల విషయంలో జారీ చేసిన ఆదేశాల మేరకు పీఎన్బీ గత కొన్ని వారాల నుంచి దీన్ని చాలా కఠినంగా అమలుచేస్తోంది. తాము ఇప్పటికే 1,084 వేల మందిని ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులుగా గుర్తించామని, వారిలో 260 ఫోటోలను పేపర్లలో కూడా ప్రచురించామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఎగవేతదారుల విషయంలో తాము కఠిన చర్యలు తీసుకున్నామని, 150 మంది పాస్‌పోర్టులను సైతం స్వాధీనం చేసుకున్నామని, 37మందిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశామని చెప్పారు. ఇకనుంచి రుణాల మంజూరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని అందుకు గాను ఒక ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీతో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ఈ భాగస్వామ్యం వల్ల రుణాల వసూలు సులభతరం అవ్వడమే కాక క్రెడిట్, ఫ్రాడ్ రిస్క్‌ను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందిని బ్యాంకు అధికారులు చెప్పారు. ఎన్పీఏల వసూలు కోసం వన్ టైం సెటిల్మెంట్ విధానాలను తీసుకువచ్చామని, ఫలితంగా ఒక సంవత్సర కాలంలో 70-80 వేల ఎన్పీఏల దగ్గర రుణాలు వసూలు చేశామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. 2017, డిసెంబర్ నాటికి పీఎన్బీలో 57,519కోట్ల రూపాయల ఎన్పీఏలు ఉన్నాయని సమాచారం. -
పీఎన్బీ స్కామ్ ఆస్తుల అటాచ్‌కు అనుమతించండి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రుణ మోసంతో సంబంధమున్న వ్యక్తుల, సంస్థల ఆస్తుల ను ఆటాచ్ చేయడానికి అవకాశమివ్వాలని నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ)ను ప్రభుత్వం కోరింది. ఈ స్కామ్‌కు సంబంధించి ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని ఎన్సీఎల్ఏటీకి కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. బకాయిల రికవరీ కోసం, మేనేజ్మెంట్ తొలగింపుకు సంబంధించిన అధికారాలను కూడా ఇవ్వాలని కోరుతూ సదరు మంత్రిత్వ వాఖ ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది. జస్టిస్ ఎస్. జె. ముఖోపాధ్యాయ అధ్యక్షతన గల ఇద్దరు సభ్యులు గల ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం ఈ పిటిషన్‌ను ఈ నెల 23న విచారించనున్నది. ఈ రుణ స్కామ్‌కు సంబంధించి ఉత్తర్వుల్లో భాగంగా దాదాపు 60 కంపెనీలు, వ్యక్తులు తమ తమ ఆస్తులను విక్రయించకుండా ఎన్సీఎల్టీ నిషేధం విధించింది. నీరవ్ మోదీ, మేహుల్ చోక్సి వంటి వ్యక్తులు, గీతాంజలి జెమ్స్, గిల్లి ఇండియా, నక్షత్ర బ్రాండ్లు, ఫైర్‌స్టార్ డైమండ్ వంటి కంపెనీలు, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్ వంటి భాగస్వామ్య సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. -
వ్యాపార విశ్వాసం దిగువకు!
ముంబై: జూన్ త్రైమాసికానికి సంబంధించి కార్పొరేట్ల వ్యాపార విశ్వాసం తగ్గింది. రూ.13,000 కోట్ల పీఎన్బీ కుంభకోణం, ద్రవ్యలోటు కట్టుతప్పడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ‘గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో విశ్వాసం పెరిగింది. ఇది తర్వాత 2018 తొలి త్రైమాసికంలో 91 శాతం గరిష్ట స్థాయికి ఎగసింది. అయితే రెండో త్రైమాసికంలో 6.6 శాతం క్షీణతతో 85 శాతానికి తగ్గింది’ అని ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కంపెనీ డాన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకుల్లో కుంభకోణాలు చోటుచేసుకోవడం, ద్రవ్యలోటు కట్టుతప్పడం వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయని తెలిపింది. వీటితోపాటు పీఎన్బీ కుంభకోణం నేపథ్యంలో ఎల్ఓయూల నిలుపుదల, అమెరికా రక్షణాత్మక విధానాలు అనుసరించడం కూడా ఆందోళనలకు ఆజ్యం పోశాయని పేర్కొంది. ఈ అంశాలన్నీ కంపెనీల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయని పేర్కొంది. అయితే అప్టిమిజమ్ ఇండెక్స్‌లో వార్షిక ప్రాతిపదికన 7.6% వృద్ధి నమోదయ్యిందని తెలిపింది. రంగాల వారీగా చూస్తే ఇంటర్మీడియట్ గూడ్స్ అత్యంత ఆశావహ రంగంగా అవతరించిందని పేర్కొంది. ఇక నిర్మాణ రంగం చివరిలో నిలిచిందని తెలిపింది. -
బావ అలా చేశారంటే మేమే షాకయ్యాం...
బీజింగ్ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో పాల్పడిన వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన సెలబ్రిటీల స్టార్, డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం దేశ ప్రజల మాత్రమే కాక, అతని సన్నిహితులు కూడా నీరవ్‌ను చీదరించుకోవడం ప్రారంభించారు. హాంకాంగ్‌లో ఉన్న నీరవ్ బావ మయాంక్ మెహతా సైతం నీరవ్ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బావ పీఎన్బీలో రూ.13,600 కోట్ల కుంభకోణానికి పాల్పడటం నిజంగా తమల్ని షాక్‌కి, ఆశ్చర్యానికి గురిచేసిందని నీరవ్ సోదరి పూర్వి భర్త మయాంక్ మెహతా ఇండియా టుడేతో అన్నారు. పూర్వి మెహతా ఫ్లాట్‌లో నీరవ్ తలదాచుకున్నాడనే వార్తల నేపథ్యంలో ఇండియా టుడే టీమ్, వారిని ఆశ్రయించింది. హాంకాంగ్‌లో వారు నివసించే ఎస్టోరియల్ కోర్టు హౌజింగ్ కాంప్లెక్స్‌కు వెళ్లిన ఇండియా టుడే టీమ్‌కు తొలుత అక్కడ నిరాశే ఎదురైంది. ఇక్కడ నీరవ్ లేదా పూర్వి పేరుతో ఎవరూ లేరంటూ వీరి ముఖం మీదనే ఆ ఫ్లాట్‌లో ఉంటున్న వారు తలుపులు వేసేశారు. అయితే ఈ బిల్టింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న ఆమె, తనకు పూర్వి సోదరుడు మోదీ తెలుసని తెలిపింది. కానీ ఇటీవల మోదీ ఇక్కడ కనిపించలేదని పేర్కొంది. అనంతరం మయాంక్‌తో ఇండియా టుడే మాట్లాడింది. మోదీ ఇలా చేస్తారని తాము అసలు ఊహించలేదని, మొత్తం సమస్యను అర్థం చేసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. మోదీ అంకుల్ ఎందుకు గూగుల్‌లో కనిపిస్తున్నారంటూ తమ పిల్లలు అడుగుతున్నారని, నిజాలను మాత్రం తోసిపుచ్చలేమని, వారితో తాము ఇక సంబంధాలు పెట్టుకోవాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు. పూర్వి గురించి ప్రస్తావించగా, తన భార్య ట్రావెలింగ్‌లో ఉందని తెలిపారు. అయితే పూర్వి ఫ్లాట్‌లోనే ఉన్నట్టు ఈ బిల్టింగ్ స్టాఫ్‌గా పనిచేసే సిబ్బంది చెప్పారు. మోదీ ప్రొవిజనల్ అరెస్ట్‌పై స్పందించిన మయాంక్.. ఇదే సరియైన ప్రక్రియ అని, మా ఇంటిని ప్రభుత్వం సెర్చ్ చేసుకోవచ్చని, మా ఇంట్లో నీరవ్ ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తనకు తెలుసని పేర్కొన్నారు. కాగ, ఇటీవలే నీరవ్‌మోదీ హాంకాంగ్‌లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. అతన్ని ప్రొవిజనల్ అరెస్ట్ చేయాలంటూ హాంకాంగ్ అథారిటీలను భారత్ కోరింది. దీనిపై హాంకాంగ్ సైతం సానుకూలంగా స్పందించింది. -
‘నీరవ్ అరెస్టుపై నిర్ణయం హాంకాంగ్‌దే’
బీజింగ్: హాంకాంగ్‌లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి, పీఎన్బీ స్కాం కీలక నిందితుడు నీరవ్ మోదీ అరెస్టు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ‘సరెండర్ ఆఫ్ ఫ్యుజిటివ్ అఫెండర్స్ అగ్రిమెంట్’ కింద నీరవ్‌ను అరెస్టు చేయాలని ఇప్పటికే హాంకాంగ్‌కు భారత్ విజ్ఞప్తి చేసింది. భారత్ ప్రతిపాదనపై హాంకాంగ్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు, స్కాం కేసులో కొనసాగుతున్న దర్యాప్తును తాను పర్యవేక్షించబోనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలంటూ దాఖలైన పిల్ విచారణార్హమా? కాదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. -
నీరవ్ మోదీ అరెస్టు దిశగా అడుగులు
-
పీఎన్బీ స్కాం: డైమండ్ కింగ్ నీరవ్ మోదీ అరెస్ట్!
హాంకాంగ్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుని భారీ కుంభకోణంలో ముంచెత్తి, విదేశాలకు పారిపోయిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీని హాంకాంగ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది. భారత అభ్యర్థన మేరకు, అక్కడి స్థానిక చట్టాలు, పరస్పర న్యాయ సహాయం ఒప్పందాలపై హాంకాంగ్ పోలీసులు నీరవ్ మోదీని అదుపులోకి తీసుకోనున్నారని చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జెంగ్ షుయాంగ్ తెలిపారు. ఇటీవలే నీరవ్ మోదీ హాంకాంగ్‌లో ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. పీఎన్బీ కుంభకోణ కేసులో భాగంగా నీరవ్ మోదీని ప్రొవిజనల్ అరెస్ట్(తాత్కాలిక నిర్భందం) చేయాలని హాంకాంగ్ అథారిటీలను కోరినట్టు ప్రభుత్వం పేర్కొంది. 2018 మార్చి 23నే ఈ అభ్యర్థనను హాంకాంగ్ అథారిటీలకు సమర్పించామని మంత్రిత్వ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. అయితే ఆదివారమే నీరవ్‌కు వ్యతిరేకంగా ముంబై సీబీఐ స్పెషల్ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసిన సంగతి తెలిసిందే. నీరవ్‌తో పాటు మెహుల్ చౌక్సిపై కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. కాగ, నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చౌక్సిలు కలిసి పీఎన్బీ బ్యాంకులో రూ.13,500 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. జనవరిలో ఈ కుంభకోణం బయటికి రాకముందే, వీరిద్దరూ దేశం విడిచి పారిపోయారు. తొలుత స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్టు వార్తలు రాగ, తర్వాత న్యూయార్క్, ఆ అనంతరం హాంకాంగ్‌లో ఉన్నట్టు తెలిసింది. దేశం విడిచి పారిపోయిన వీరిద్దరిన్నీ భారత్‌కు రప్పించడానికి దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.