సాక్షి, ముంబై: డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి నేడు ( సోమవారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద స్కాంగా నిలిచిన పీఎన్‌బీ కుంభకోణంపై విచారణ జరుపుతున్న సీబీఐ ప్రధాన నిందితుడు నీరవ్ మోదీతోపాటు, బ్యాంకు అధికారులపై మొట్టమొదటి చార్జిషీటును నమోదు చేసింది. ముంబై కోర్టులో ఈ చార్జ్‌షీటును ఫైల్ చేసింది.
పీఎన్‌బీ మాజీ ఎండీ సీఈవో, ప్రస్తుతం అలహాబాద్ బ్యాంకు సీఎండీ ఉషా అనంత సుబ్రమణియన్, తదితర టాప్ అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. సుమారు 400కోట్ల రూపాయల తప్పుడు ఎల్‌వోయూలు జారీ చేశారని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. 2016లో పీఎన్‌బీ సీఎండీగా ఉన్న అనంత సుబ్రమణియన్ స్విఫ్ట్ నిబంధనలను ఉల్లఘించారని సీబీఐ ఆరోపించింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో పీఎన్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బ్రహ్మాజీ రావు, సంజీ శరణ్‌లతోపాటు జనరల్ మేనేజర్ నెహల్ అహాద్ తదితరుల పేర్లను చేర్చినట్టు తెలుస్తోంది. కాగా 2011-18 సంవత్సరాల మోదీ స్కాం చోటు చేసుకోగా.. ఉషా సుమారు 21 నెలలపాటు పీఎన్‌బీకి సీఎండీగా వ్యవహరించారు. పీఎన్‌బీ నిందితులుగా పేర్కొన్న పీఎన్‌బీ, అలహాబాద్ బ్యాంకు డైరెక్టర్లకు అన్ని అధికారాలు తీసివేయాలని బ్యాంకులను ఆదేశించినట్టు డీఎఫ్‌ఎస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment