ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో సెంట్రల్ బ్యూరో ఇన్‌వేస్టిగేషన్ (సీబీఐ) చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వటాన్ని సీబీఐ వ్యతిరేకిస్తోంది. ఇవాళ సీబీఐ కేసులో హైకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ విచారణ చేపట్టనున్నారు.
ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. జూన్ 26న సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు అనుమతితో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక.. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో కేజ్రీవాల్ ఒకరని సీబీఐ అభియోగాలు మోపింది. కేజ్రీవాల్ సన్నిహితుడు విజయ్ నాయర్ అనేక మంది మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులతో టచ్‌లో ఉన్నారని ఆరోపణలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. అయితే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా.. అనంతరం ఇదే కేసులో సీబీఐ అరెస్ట్ చేయటంతో తిహార్ జైలులోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment