chargesheet
-
అది చార్జిషి ట్ కాదు..పదేళ్ల పాలన డిశ్చార్జ్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడంలో ప్రజా ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార.. పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చార్జిషీట్ అంటూ ఆ పార్టీ నివేదిక విడుదల చేసిందని, కానీ అది పదేళ్ల బీఆర్ఎస్ పాలన డిశ్చార్జ్ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు.ఆదివారం సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార..పౌరసంబంధాల శాఖల ప్రగతి నివేదికల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారని, మొత్తంగా తుగ్లక్ పాలనను తలపించి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశారని పొంగులేటి ఆరోపించారు. ప్రజల స్వేచ్ఛను హరించారని, పోలీసులను కార్యకర్తల్లా వాడుకున్నారని ధ్వజమెత్తారు. ధర్నాచౌక్‌ను ఎత్తివేసి ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు ఇంకా జ్ఞానం రాలేదన్నారు. ధరణి దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యేలా చూస్తాం ‘ప్రజా ప్రభుత్వం వచి్చన వెంటనే ధరణిని ప్రక్షాళన చేసే ప్రక్రియను వేగవంతం చేశాం. పోర్టల్ నిర్వహణను గతంలో ఓ అంతర్జాతీయ సంస్థకు అప్పగించారు. దాన్ని ఈ ఏడాది డిసెంబర్ 1నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీకి అప్పగించాం. ధరణి మాడ్యూల్స్ తగ్గిస్తున్నాం. పహాణీలో ఇదివరకు 33 కాలమ్స్ ఉండేవి. వాటిని 11 నుంచి 13 వరకే పరిమితం చేస్తున్నాం. ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఆర్జీదారు సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.ధరణి సమస్యల పరిష్కారానికి ఈ ఏడాది మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. గతంలో పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులతో పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా వచ్చిన 1.38 లక్షల దరఖాస్తుల్లో చాలావరకు పరిష్కరించాం. కొత్తగా ఆర్వోఆర్–2024 చట్టం సిద్ధమైంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో ఈ బిల్లును ఆమోదింపజేసి అమలు చేస్తాం.పాత వీఆర్వో, వీఆర్ఏలకు పరీక్ష పెడతాం ‘గ్రామాల్లో రెవెన్యూ పాలనకు అధికారులుండేవారు. గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో రెవెన్యూ సమస్యలు పేరుకుపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికీ ఓ రెవెన్యూ అధికారిని నియమిస్తున్నాం. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటారు. ఇదివరకు పనిచేసిన వీఆర్వో, వీఆర్ఏలకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి గ్రామాలకు తిరిగి పంపిస్తాం.ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తొలివిడత 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ పాలనలో పూర్తికాకుండా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రజా ప్రభుత్వం పూర్తి చేస్తుంది..’అని మంత్రి చెప్పారు, ప్రజాపాలన విజయోత్సవాల తర్వాత జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి చర్చిస్తామని, ఆ తర్వాత సీఎంతో జరిగే మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. -
కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్.. మంత్రి కోమటిరెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. పదేళ్లలో మీరు ఏం చేశారని.. మాపై ఛార్జ్‌షీట్ అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి చేయని పథకం లేదంటూ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ రాకుంటే చరిత్ర హీనునిగా మిగిలిపోతారంటూ వ్యాఖ్యానించారు.హరీష్, కేటీఆర్ గురించి మాట్లాడడం అనవసమని సీఎం రేవంత్ రెడ్డికి సూచించా.. ఇక నేను కూడా మాట్లాడను. తెలంగాణ విగ్రహావిష్కరణ కు రానివారంతా తెలంగాణ ద్రోహులే.. త్వరలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశాం’’ అని కోమటిరెడ్డి చెప్పారు. -
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్
సాక్షి, హైదరాబాద్: రేవంత్ పాలనలో అన్నీ తిట్లు, ఒట్లేనని.. ప్రశ్నించే గొంతుకలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరిట ఆయన ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, పోలీసుల చేత పోలీస్ కుటుంబాలను కొట్టించారన్నారు.‘‘రేవంత్‌రెడ్డికి పరిపాలనలో స్థిరత్వం లేదు. రేవంత్ విధానాలతో తెలంగాణ తిరోగమనంలో వెళ్లింది. గ్యారెంటీలు, హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావడం లేదు. రేవంత్ అడుగులు కూల్చివేతలతో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగం అయ్యింది. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది.’’ అని హరీష్‌రావు ధ్వజమెత్తారు.‘‘శాంతి భదత్రల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ హయాంలో తొమ్మిది చోట్ల మత కలహాలు జరిగాయి. మద్యం విక్రయాలు పెంచాలని మెమోలు ఇచ్చారు. గాంధీభవన్‌లో ఇచ్చే సూచనల ఆధారంగా చట్టాలు చేస్తున్నారు’’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.ఇదీ చదవండి: ఇది గారడీ సర్కార్ -
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
-
KSR Live Show: కాంగ్రెస్ అబద్ధాపు గ్యారంటీలపై బీజేపీ ఛార్జ్ షీట్ అందుకే !
-
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జీషీట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. 6 అబద్ధాలు.. 66 మోసాలు.. పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఛార్జీషీట్‌ను విడుదల చేశారు. ఎంపీలు డికె అరుణ, రఘునందన్ రావు, నగేష్, బీజే ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే లు హరీష్ బాబు, పైడి రాకేశ్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి పలువురు హాజరయ్యారు.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు అందలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలపైనే మా పోరాటం అని.. ప్రజల తరపున ఛార్జ్‌షీట్ రూపంలో ప్రభుత్వం ముందు పెట్టామని కిషన్‌రెడ్డి అన్నారు.‘‘కాంగ్రెస్ విజయోత్సవాలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. హామీలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు. వందరోజుల్లో హామీలు పూర్తి చేస్తామన్నారు. ఏడాదైంది. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏం తేడా లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాపై ఉంది. ప్రజలను నమ్మించడం కోసం దేవుడిపై ఒట్లు పెట్టారు. రుణమాఫీ ఇప్పటివరకు కొంతమంది రైతులకే జరిగింది. ఏడాది పూర్తయింది.. రైతు భరోసా ఎక్కడ?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. -
ఆర్జీ కర్ ఆస్పత్రిలో అవినీతి.. సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ప్రధాన నిందితునిగా పేర్కొంటూ సీబీఐ ఆ ఛార్జ్ షీట్లో పేర్కొంది. 1000 పేజీల చార్జిషీటును సీబీఐ సిద్ధం చేసింది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌ను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ చార్జిషీటులో ఐదుగురిని నిందితుల జాబితాలో చేర్చారు.సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (సస్పెండ్ అయ్యారు)తో పాటు మరో నలుగురు అరెస్టయిన నిందితుల పేర్లు ఛార్జ్ షీట్లో ఉన్నాయన్నారు. ఇందులో బిప్లబ్ సింగ్, అఫ్సర్ అలీ, సుమన్ హజ్రా, ఆశిష్ పాండే పేర్లు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిపై చార్జిషీట్ దాఖలు చేయడానికి అవసరమైన అధికారిక అనుమతి పొందలేనందున అలీపూర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ ఛార్జిషీట్‌ను అంగీకరించలేదు.ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇదే సమయంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో భారీ అవినీతి జరిగిందంటూ విద్యార్థులు, కొంతమంది వైద్యులు ఆరోపించారు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణలో పలు ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. వైద్యసామగ్రి కొనుగోలులో నిందితులు అవినీతికి పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
అదానీపై అమెరికా కేసు వ్యవహారంలో ముకుల్ రోహత్గీ విశ్లేషణ
-
దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం
న్యూఢిల్లీ: ముంబైలో ఎస్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య దరిమిలా దీనివెనక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తముందనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌తో సహా పలువురు పేరుమోసిన గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఎ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక వివరాలున్నాయి.లారెన్స్ బిష్ణోయ్‌కు సంబంధించిన టెర్రర్ సిండికేట్ మునుపెన్నడూ లేని విధంగా విస్తరించిందని ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. దావూద్ ఇబ్రహీం 90వ దశకంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ, తన నెట్‌వర్క్‌ను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడో.. అదే మార్గాన్ని లారెన్స్ బిష్ణోయ్ కూడా అనుసరించాడు. దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ స్మగ్లింగ్, టార్గెట్ కిల్లింగ్, దోపిడీ రాకెట్లతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తర్వాత పాక్ ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకుని, తన నెట్వర్క్ విస్తరించాడు. కాగా దావూద్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన డి కంపెనీ మాదిరిగానే బిష్ణోయ్ గ్యాంగ్ చిన్న చిన్న నేరాలు చేస్తూ ఇప్పుడు ఆరు దేశాలకు విస్తరించింది.బిష్ణోయ్ గ్యాంగ్‌లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నారని, వారిలో 300 మంది పంజాబ్‌కు చెందినవారని ఎన్ఐఎ తెలిపింది. బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను విరివిగా వినియోగించుకుంలాయి. బిష్ణోయ్ ముఠా 2020-21 మధ్యకాలంలో దోపిడీల ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఆ డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించింది.ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం బిష్ణోయ్ గ్యాంగ్ ఒకప్పుడు పంజాబ్‌కు మాత్రమే పరిమితమైంది. ఆ తరువాత గోల్డీ బ్రార్‌తో జతకట్టి హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ముఠాలతో పొత్తు పెట్టుకుంది. బిష్ణోయ్ గ్యాంగ్ ప్రస్తుతం ఉత్తర భారతదేశం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్‌లలో విస్తరించింది. సామాజిక మాధ్యమాలు, ఇతర పద్ధతుల ద్వారా వీరు యువతను తమ ముఠాలో చేర్చుకుంటారు. ఈ ముఠా అమెరికా, అజర్బైజాన్, పోర్చుగల్, అరబ్, రష్యా వరకూ వ్యాపించింది.కొద్ది రోజుల క్రితం లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ సహా మొత్తం 16 మంది గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిలోని వివరాల ప్రకారం గోల్డీ బ్రార్ కెనడా, పంజాబ్, ఢిల్లీలో ముఠాలను నిర్వహిస్తున్నాడు. రోహిత్ గోద్రా రాజస్థాన్, మధ్యప్రదేశ్, అరబ్ కంట్రీలోని ముఠాలను పర్యవేక్షిస్తుంటాడు. అన్మోల్ బిష్ణోయ్ పోర్చుగల్, అమెరికా, ఢిల్లీ , మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లకు కమాండ్‌గా ఉన్నాడు. ఈ ముఠాకు ఆయుధాలు మధ్యప్రదేశ్‌లోని మాల్వా, మీరట్, ముజఫర్‌నగర్, యూపీలోని అలీగఢ్, బీహార్‌లోని ముంగేర్, ఖగారియా నుంచి వచ్చి చేరుతుంటాయి. అలాగే పాక్‌లోని పంజాబ్ జిల్లాతో పాటు అమెరికా, రష్యా, కెనడా, నేపాల్ దేశాల నుంచి కూడా ఈ ముఠాకు ఆయుధాలు అందుతుంటాయని ఎన్ఐఏ గుర్తించింది.ఇది కూడా చదవండి: సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య? -
కోల్‌కతా డాక్టర్ ఉదంతం: ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సోమవారం మధ్యాహ్నం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ ఛార్జిషీటును సమర్పించింది.ఈ ఘటనలో సామూహిక అత్యాచారం లేదని సీబీఐ తేల్చి చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన కోల్‌కతా పోలీసులతో కలిసి వాలంటీర్‌గా పనిచేసిన నిందితుడు సంజయ్ రాయ్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశాడని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాయ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది.జూనియర్ డాక్టర్ ఆగస్టు 9న ఆర్జీకర్ ఆస్పత్రిలో మృతిచెందినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది, మెడికల్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఈ కేసును కోల్‌కతా హకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఘటన జరిగిన మరుసటి రోజు నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇతర ఆధారాలతో సహా సంజయ్ రాయ్‌ను సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.ఇక.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు.చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ -
లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై మూడో ఛార్జ్‌షీట్
బెంగుళూరు: హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన అత్యాచారం కేసులో.. సిట్ పోలీసులు మూడవ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. జేడీఎస్ పార్టీకి చెందిన ఓ మహిళపై తుపాకీతో బెదిరించి పలుమార్లు లైంగింకంగా వేధింపులకు పాల్పడినట్లు ఆ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.2020 ఫిబ్రవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఓ మహిళపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు తెలిపారు. 1691 పేజీలు ఉన్న ఛార్జ్‌షీట్ లో 120 మంది సాక్ష్యుల వాంగ్మూలం కూడా ఉంది. లైంగిక చర్యకు చెందిన వీడియోలు తీసి, దాంట్లో ముఖం కనబడకుండా చేసి బెదిరింపులకు పాల్పడినట్లు సిట్ తెలిపింది. వీడియోల ఆధారంగా మళ్లీ మళ్లీ ఆ మహిళను లైంగికంగా వేధించినట్లు ఛార్జీషీట్లో పేర్కొన్నారు.కాగా తన కేసు విచారణ గోప్యంగా నిర్వహించాలని కోరుతూ ప్రజ్వల్ తన న్యాయవాదుల సహకారంతో వేసుకున్న అర్జీని జస్టిస్ ఎం.నాగప్రసన్న తోసిపుచ్చారు. బాధిత మహిళల విచారణలో గోప్యత పాటించవలసి ఉంటుందని, ప్రజ్వల్ విషయంలో విచారణ ఎలా ఉండాలో న్యాయస్థానం తీర్మానిస్తుందని ప్రకటించి.. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు. -
జగదీశ్ టైట్లర్‌పై హత్యాభియోగం
న్యూఢిల్లీ: 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై ఢిల్లీ కోర్టు హత్య తదితర అభియోగాలు మోపింది. ఢిల్లీలోని పాల్ బంగాశ్ ప్రాంతంలో ముగ్గురువ్యక్తుల హత్యకు సంబంధించిన కేసుపై స్పెషల్ కోర్టు ఆగస్ట్ 30న విచారణ జరిపింది. ఆయనపై అభియోగాలు మోపేందుకు తగు ఆధారాలున్నట్లు స్పష్టం చేసింది. శుక్రవారం టైట్లర్‌పై హత్యతోపాటు దొంగతనం, చట్ట విరుద్ధంగా గుమికూడటం, కొట్టాట, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలు మోపుతూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో సీబీఐ గతేడాది మే 20వ తేదీన టైట్లర్‌పై చార్జిషీటు నమోదు చేసింది. 1984 నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని పాల్ బంగాశ్ గురుద్వారా వద్దకు తెల్ల అంబాసిడర్లో వచ్చిన టైట్లర్..సిక్కులను చంపండి..వాళ్లు మా అమ్మ(అప్పటి ప్రధాని ఇందిర)ను చంపారు’అంటూ అనుచరులను రెచ్చగొట్టారని చార్జిషీటులో పేర్కొంది. దీంతో, టైట్లర్ అనుచరుల దాడిలో ముగ్గురు సిక్కులు ప్రాణాలు కోల్పోయారంది. 1984లో అప్పటి ప్రధాని ఇందిర హత్యానంతరం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరగడం తెలిసిందే. -
ఎవరిని వదిలిపెట్టను వార్నింగ్ ఇచ్చిన హేమ
-
రామేశ్వరం బ్లాస్ట్ కేసు: NIA ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు!
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జిషీట్ దాఖలు చేసింది. నలుగురిపై అభియోగాలు నమోదు చేసిన ఎన్ఐఏ.. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున బెంగళూరు బీజేపీ ఆఫీస్‌పై దాడికి యత్నించి విఫలమయ్యారని పేర్కొంది.ఐసిస్ అల్ హింద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ముసవీర్ హుస్సేన్ షాబీబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మజ్ మునీర్, ముజామిల్ షరీఫ్‌లు ఈ కేసులో నిందితులు. వీళ్లపై ఐపీసీ సెక్షన్లు, యూఏపీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. .. వీళ్లు నలుగురు డార్క్ వెబ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్‌తో కలిసి ఈ నలుగురు భారీ కుట్ర పన్నారు. మార్చి 1వ తేదీన బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో దాడి జరిగింది. మార్చి 3వ తేదీన ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. షాజీబ్ అనే వ్యక్తి కేఫ్‌లో బాంబ్ పెట్టాడు. తాహా, షాబీజ్ ఇద్దరూ శివమొగ్గ జిల్లాకు చెందిన వాళ్లు. NIA Chargesheets 4 in Rameshwaram Cafe Blast Case pic.twitter.com/BnEBy29Khp— IANS (@ians_india) September 9, 2024 2020లో అల్ హింద్ ఉగ్రసంస్థ మూలాలు బయటపడగానే.. వీళ్లు పరారయ్యారు. వీళ్లు ఉగ్ర మూలాలు ఉన్న మరో ఇద్దరు నిందితులతో డార్క్ వెబ్‌లో జత చేరారు. టెలిగ్రామ్ ద్వారా వీళ్ల మధ్య సంభాషణలు జరిగాయి. క్రిఫ్టో కరెన్సీలతో వీళ్ల లావాదేవీలు సాగాయి. ఆ డబ్బుతో బెంగళూరులో మరిన్ని దాడులు జరిపి అలజడి సృష్టించాలనుకున్నారు. అయితే..అయోధ్య ప్రాణప్రతిష్ట రోజున( జనవరి 22, 2024) బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై బాంబు దాడి చేయాలని ప్లాన్ గీసుకున్నారు. కానీ, అది ఫలించలేదు. దీంతో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అని ఎన్ఐఏ తెలిపింది. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో సెంట్రల్ బ్యూరో ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వటాన్ని సీబీఐ వ్యతిరేకిస్తోంది. ఇవాళ సీబీఐ కేసులో హైకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ విచారణ చేపట్టనున్నారు.ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. జూన్ 26న సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు అనుమతితో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక.. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో కేజ్రీవాల్ ఒకరని సీబీఐ అభియోగాలు మోపింది. కేజ్రీవాల్ సన్నిహితుడు విజయ్ నాయర్ అనేక మంది మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులతో టచ్‌లో ఉన్నారని ఆరోపణలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. అయితే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా.. అనంతరం ఇదే కేసులో సీబీఐ అరెస్ట్ చేయటంతో తిహార్ జైలులోనే ఉన్నారు. -
లిక్కర్ స్కాం.. సీబీఐ కేసులో కవిత విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ జూలై 22 వాయిదా వేసింది.కోర్టులో వాదనలు సందర్భంగా.. సీబీఐ చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా పేర్కొన్నారు. దీనిపై సీబీఐ న్యాయవాది స్పందిస్తూ తప్పులు లేవని చెప్పారు.చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవేజా ప్రశ్నించారు. చార్జ్‌షీట్‌లో తప్పులుంటే కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని తెలిపారు. అయితే కోర్టు ఆర్డర్ అప్ లోడ్ కాలేదని నితీష్ రాణా తెలిపారు.డిఫాల్ట్ బెయిల్, చార్జ్ షీట్‌పై తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలన్న నితీష్ రాణా వాదించారు. అయితే చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, కవిత డిఫాల్ట్ బెయిల్‌కు సంబందం లేదన్న సీబీఐ వాదించింది. చార్జ్‌షీట్ పూర్తిగా లేదని తాము వాదించడం లేదని, తప్పుగా ఉందని మాత్రమే చెబుతుననట్లు నితీష్ రాణా పేర్కొన్నారు.దీనికి సీబీఐ స్పందిస్తూ.. తాము సరైన పద్దతిలో చార్జ్‌షీట్ ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది. 60 రోజుల తరువాత డిఫెక్టివ్ చార్జ్‌షీట్ దాఖలు చేయడం కవిత డిఫాల్ట్ బెయిల్ హక్కును కాలరాయడమేనని కవిత న్యాయవాది ఆరోపించారు. అనంతరం కవిత డిఫాల్ట్ బెయిల్, సీబీఐ చార్జ్షీట్నుపరిగణలోకి తీసుకునే అంశంపైనా జూలై 22న విచారణ జరువుతామని తెలిపింది. -
లిక్కర్ కేసు: కవితకు మరో షాక్
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారం(మే29) పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జూన్3న ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులందరూ కోర్టుకు రావాలని వారెంట్లు జారీ చేసింది. దీంతో కవితను ఈడీ అధికారులు అదే రోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, ఈ కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. -
ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరికొందరిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషిటుపై ఈనెల 29న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవడంపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రెండోరోజూ మంగళవారం ఈడీ వాదనలు విన్నారు. ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా ఈ కేసులో కవిత పాత్రపై మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.శరత్‌రెడ్డి, బుచి్చబాబు, శ్రీనివాస్‌ల వాంగ్మూలం ఆధారంగా కుంభకోణంలో కవిత కింగ్‌పిన్‌గా వ్యవహరించిన ట్లు తెలిసిందన్నారు. హవాలా రూపంలో డబ్బులు తరలించడంలో ఎవరెవరి పాత్ర ఏంటనేది వివరించారు. వాదనల అనంతరం ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషిటును పరిగణనలోకి తీసుకొనే అంశంపై ఈ నెల 29న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి కావేరి బవేజా పేర్కొన్నారు. -
కవితపై ఈడీ ఛార్జ్‌షీట్.. 29న కోర్టు కీలక తీర్పు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో మొత్తం 8వేల పేజీలతో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జ్‌షీట్‌లో పలు ఆధారాలను ఈడీ కోర్టు ముందుంచింది. కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహేడ్ ఉద్యోగి అరవింద్ సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది. అభిషేక్ బోయినపల్లి ఇంటరాగేషన్‌లో కూడా వీరి పాత్ర ఉందని తేలింది. ముత్తా గౌతమ్ స్టేట్మెంట్ కూడా వీరి పాత్రను బయటపెట్టింది. హవాలా సొమ్ము రవాణాలో చారియట్ మీడియా ఉద్యోగి దామోదరశర్మ పాత్ర కూడా ఉంది. వాట్సాప్ చాట్ మెసేజ్ ద్వారా వీరి పాత్రపై సాక్ష్యాలు లభించాయి -
అసైన్డ్ భూముల కుంభకోణం:చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సోమవారం వెల్లడించింది. రూ.4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు.. అసైన్డ్ భూముల స్కాంలో ప్రధాన ముద్దాయి. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ ముద్దాయిగా ఛార్జ్‌షీట్‌లో సీఐడీ పేర్కొంది. 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ తెలిపింది. అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్‌తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడికి పాల్పడినటట్లు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కాజేసినట్టు సీఐడీ గుర్తించింది.రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారణ చేసింది. చంద్రబాబు, నారాయణతో పాటుమాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయిలుగా సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. చదవండి: అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం -
శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు.. చిక్కుల్లో ప్రముఖ యూట్యూబర్!
అందాల తార, తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శ్రీదేవి. కానీ ఉహించని విధంగా దుబాయ్‌లోని ఓ హోటల్లో కన్నుమూసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచింది.బాలీవుడ్ నిర్మాత బోనీ కపూప్ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. పెద్దకూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరలో కనిపించనుంది. మరోవైపు చిన్నకూతురు ఖుషీ కపూర్ సైతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే శ్రీదేవి మరణంపై ఒడిశాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా పలువురు ప్రముఖుల పేర్లతో నకిలీ లేఖలను యూట్యూబ్‌లో ఉంచింది. శ్రీదేవి మరణంపై విచారణను రెండు ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆమెపై గతేడాది ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె యూట్యూబ్ వీడియోలో ఉంచిన పత్రాలు నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా శ్రీదేవి మరణానికి స్పాన్సర్‌గా ప్రభుత్వాన్ని కించపరిచేలా పదేపదే మాట్లాడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి లేఖలతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన పత్రాలు, యూఏఈ ప్రభుత్వం నుంచి వచ్చిన రికార్డులు నకిలీవని తేలిందని న్యాయవాది ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆయన ఫిర్యాదుతో యూట్యూబర్ దీప్తితో ఆమె లాయర్ భరత్ సురేశ్ కామత్‌లపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తానికి శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేసి ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పడ్డారు యూట్యూబర్. తాజాగా సీబీఐ ఛార్జిషీట్ వేయడంపై దీప్తి స్పందించారు. ఆ ఛార్జ్ షీట్ నమ్మేలా లేదని దీప్తి ఆరోపించారు. నా స్టేట్మెంట్ను రికార్డ్ చేయకుండా ఛార్జిషీట్ దాఖలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్ 2న భువనేశ్వర్‌లోని ఆమె నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుంది. శ్రీదేవి మరణంతో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో జరిగిన చర్చల్లోనూ దీప్తి చురుకుగా పాల్గొంది. -
పేలుడు పదార్థాల సరఫరా కేసులో.. 8 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాదళాలపై పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన ఎనిమిది మంది మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం చార్జిషిట్ దాఖలు చేసింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తులపై 2023 జూన్ 5న చెర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులపై ఐపీసీ సెక్షన్ 120(బీ), 143, 147, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 10,13,18,20ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. పట్టుబడిన నిందితులు మావోయిస్టులకు కొరియర్లుగా పనిచేస్తున్నట్లు చార్జిషీట్లో తెలిపింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లేథ్ మెషీన్లు సరఫరా చేస్తుండగా పునెం నాగేశ్వరరావు, దేవనూరి మల్లికార్జున రావు, వొల్లిపోగుల ఉమాశంకర్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు జన్ను కోటి, ఆరేపల్లి శ్రీకాంత్, తాళ్లపల్లి ఆరోగ్యం, బొంత మహేందర్, సోనబోయిన కుమారస్వామిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. పునెం నాగేశ్వరావు, దేవనూరి మల్లికార్జునరావు, వొల్లిపోగుల ఉమాశంకర్‌లు 2023 మార్చిలో డ్రిల్ మిషన్, మే 2023లో ఒక లేథ్ మిషన్ కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ ముగ్గురు నిందితులు మే లో డ్రోన్లు, పేలుడు పదార్థాలు గుర్తించినట్లు తెలిపింది. -
‘న్యూయార్క్‌లో హత్యకు కుట్ర పన్నింది ఆ భారతీయుడే’!
అమెరికాలో నివసిస్తున్న ఒక సిక్కు వేర్పాటువాది హత్యకు భారత్ నుంచే కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నిఖిల్ గుప్తాపై నేరం రుజువైతే, అతనికి గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాగా ఈ ఆరోపణలపై అమెరికా నుంచి అందిన ఇన్‌పుట్‌పై విచారణ జరుపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడానికి నవంబర్ 18న భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అందించే వివరాల ఆధారంగా భారత ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టనుంది. ఇదిలాఉండగా నవంబర్ 20న గురుపత్వంత్ సింగ్ పన్నుపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఎయిరిండియాలో ప్రయాణించే వ్యక్తులను భయాందోళనకు గురిచేసేలా పన్నూ సోషల్ మీడియా సందేశాలను జారీ చేశారని ఎన్ఐఏ ఆరోపించింది. ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ ఇండియాలో ప్రయాణించేవారు ప్రమాదంలో ఉన్నారని పన్నూ సందేశం పంపాడు. నవంబర్ 19న ఎయిరిండియాకు అనుమతి ఇవ్వబోమని కూడా ఆయన పేర్కొన్నాడు. కాగా దీనికిముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కెనడా ఆరోపణలన్నింటినీ భారత ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. కెనడాతో భారత ప్రభుత్వ దౌత్యపరమైన వివాదం ముగిసిన రెండు నెలల తర్వాత ఇప్పుడు అమెరికా న్యాయ శాఖ ఈ ప్రకటన వెలువరించడం విశేషం. నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌కు హర్దీప్ సింగ్ నిజ్జర్ చీఫ్. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న ఇతను ఈ ఏడాది జూన్‌లో హత్యకు గురయ్యాడు. ఇతని హత్యపై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని భారత్ అభివర్ణించింది. దీనికి సంబంధించిన ఆధారాలను అందించాలని భారత ప్రభుత్వం కెనడాను కోరింది. అయితే కెనడా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు అందించలేదు. ఇది కూడా చదవండి: కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం -
అవినీతి.. వైఫల్యాలు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదన్నరేళ్ల పాలనలో అవినీతి, అరాచకాలు, లోటుపాట్లు, వైఫల్యాలు ఇతర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బీఆర్ఎస్ సర్కార్‌పై చార్జ్‌షీట్‌ను ప్రకటిస్తున్నట్టు బీజేపీ వెల్లడించింది. దేశంలోనే అవినీతికి, లంచగొండితనానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఉదాహరణగా మారిందని ధ్వజమెత్తింది. బీఆర్ఎస్ ప్రభుత్వం–అవినీతి అనేవి రెండూ పర్యాయ పదాలుగా మారిపోయాయని విమర్శించింది. కాళేశ్వరంలో అవి నీతి ఎక్కడుందో చూపాలంటూ సవాళ్లు చేశారని, అయితే నిజం అనేది దాగదు కాబట్టి ఎన్నికలకు ముందు భగవంతుడే పిల్లర్ల కుంగుబాటు ద్వారా దానిని ప్రజల ఎదుట పెట్టాడని తెలిపింది. ఈ మేరకు బీఆర్ఎస్ సర్కార్‌పై చార్జ్‌షిట్‌ను సోమ వారం బీజేపీ రాష్ట్ర శాఖఅధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్, మేనిఫెస్టోకమిటీ చైర్మన్ పి.మురళీధర్‌రావు, డా.కె.లక్ష్మణ్, యెండల లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తేజావత్ రామచంద్రుడు, జయచంద్ర విడుదల చేశారు. దళితులకు దగా, బీసీలకు ద్రోహం, విద్యారంగం ఆగం, వైద్యరంగంలో హామీల బుట్టదాఖలు, నిరుద్యోగులకు మోసం, విశ్వనగరం–విషాదనగరం.. ఇలా 31 అంశాల్లో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఈ చార్జ్షిట్లో బీజేపీ ప్రస్తావించింది. చార్జ్‌షీట్‌లో ముఖ్యాంశాలు... బీఆర్ఎస్ అవినీతి: 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక అవినీతి విలయతాండవం. సీఎంతో సహా మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు. ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియా.. వీటన్నింటిలోనూ బీఆర్ఎస్ నేతలకు సంబంధాలు. మిషన్ భగీరథ అంతా అవినీతికంపే. మిషన్ కాకతీయ పేరుతో రూ. 30 వేల కోట్లలో అధిక సొమ్ము బీఆర్ఎస్ నాయకుల జేబులోకి పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి కంపు. ప్రాజెక్టును రీడిజైన్ చేసి, అంచనాలు పెంచారు. రూ.40వేల కోట్ల రూపాయల అంచనాను రూ. లక్షా 40 వేల కోట్లకు పెంచి, సీఎంకుటంబసభ్యులే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు. మేడిగడ్డ కూలిపోయే స్థితికి రావడం తెలంగాణ ప్రజల రక్తమాంసాలను తాగినట్టుగానే మేం భావిస్తున్నాం. సీఎం కూతురికే లిక్కర్ స్కాంతో సంబంధాలున్నాయి. ధరణి పోర్టల్ బీఆర్ఎస్ నాయకులకు పెద్ద ఆదాయవనరుగా మారింది. చెరువులు, కుంటలు, పార్కులు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములు, కాందిశీకుల భూములు... ల్యాండ్ మాఫియాలో బీఆర్ఎస్ నిండా మునిగి ఉంది. అవినీతికి ఎవరు పాల్పడినా 040–23452933 నంబర్‌కు కాల్ చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ ఆ నంబర్ అసలు మనుగడలోనే లేదు. రైతులకు మోసం: అప్పుల బాధతో తొమ్మిదిన్నరేళ్లలో 7,800 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినా బస్తా యూరియా కూడా ఇయ్యలే. నీటి పారుదల రంగం: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నా, ఇంతవరకు కొత్త ఆయకట్టుకు నీరందింది లేదు. పాలమూరు– రంగారెడ్డి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఇంతవరకు పూర్తి చేయలేదు. దళితులకు దగా: దళితుడిని ముఖ్యమంత్రి చెయ్యలే, భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యలేదు గిరిజనులు : గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేయలేదు. పోడు భూములు పూర్తిగా ఇవ్వలేదు. బీసీలకు ద్రోహం: బీసీల సమగ్ర అభివృద్ధికి రూ.25 వేల కోట్లు, బీసీ కార్పొరేషన్‌కు ఏటా వెయ్యికోట్లు కేటాయిస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎంబీసీ కుల వర్గీకరణ చేయలేదు. విద్యారంగం ఆగం: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు హామీని నెరవేర్చలేదు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలతో ఈ–లైబ్రరీల నిర్మాణానికి ఇంతవరకు అతీగతి లేకుండా పోయింది. ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా బోధనా సిబ్బందిని నియమించలేదు. మహిళలకు అన్యాయం: డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణాలిస్తామని ఇంతవరకు ఇచ్చింది లేదు. మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి, కాగితాలకే పరిమితమైంది. మహిళలకు రక్షణ లేదు. నిరుద్యోగులకు మోసం : ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నడు, కనీసం ఊరికొక ఉద్యోగం కూడా ఇయ్యలే. పోలీసుశాఖలో తప్ప ఇతర శాఖలలో నియామకాలే లేవు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు తొమ్మిది సంవత్సరాల తర్వాత 2022లో ఇచ్చిండు. కానీ అది కూడా అనేక ఆరోపణలతో రెండుసార్లు రద్దు అయ్యింది. సర్కారు వైఖరితో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగులకు నెలకు 3016/– భృతి, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. విద్యుత్ రంగం: కొత్తగా 10 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. వేల రూపాయల బిల్లు వేస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలపై భారం వేసి ఆర్థికంగా ఇబ్బందులు చేశారు. పారిశ్రామిక రంగం: నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలే. కార్మికులు, రైతులను అన్యాయం చేశారు. కాగజ్‌నగర్ నుంచి మణుగూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని గాలిమాటలు చెప్పిండు. విశ్వనగరం కాదు... విషాద నగరం: మూసీనదిని బ్యూటిఫికేషన్ చేసి, టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దుతామని వాగ్దానం చేసిండు. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మూసీ మురికిపోలే, కంపుపోలే. హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ జరగలేదు కానీ కబ్జాలు జరుగుతున్నాయి. కార్మికులు: కార్మికులకు అన్ని రంగాల్లోనూ తీవ్ర అన్యాయం చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తానన్న హామీ నెరవేర్చలేదు. తెలంగాణ ఉద్యమకారులు: అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు ఇవ్వలేదు. రూ. 10 లక్షలు ఇవ్వలేదు. ఉద్యమకారులకు గుర్తింపేలేదు, అమరవీరులకు విలువ లేదు. రాష్ట్రం కోసం పోరాడిన వారిని కూడా మోసం చేసిండు. జర్నలిస్టులు: జర్నలిస్టులకు ఇంటిస్థలాలు ఇవ్వకుండా దగా చేసిండు. జేఎన్జే సొసైటీకి 38 ఎకరాల స్థలాన్ని కోర్టు ఉత్తర్వులు వచి్చన తర్వాత కూడా బదలాయించలేదు. పరిపాలనాలోపాలు: ప్రజలకు అందుబాటులో లేని సీఎంగా కేసీఆర్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిండు. కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం సీఎంని కలవరు. రాష్ట్ర పాలన మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు ఆదేశాల ప్రకారమే నడుస్తోంది. కేసీఆర్ కుటుంబం చేతిలో యావత్ తెలంగాణ బందీ అయ్యింది. అతివాదం, ఉగ్రవాదం ఊతమిచ్చే కుట్ర :బీజేపీ చార్జ్ షీట్ కమిటీ చైర్మన్ మురళీధర్‌రావు ప్రజల భద్రతకు ఒకప్పుడు నక్సలైట్ల తీవ్రవాదంతో ఎలాంటి ముప్పు ఉన్నదో, నేడు అతివాదం, ఉగ్రవాదంతో అంతే ప్రమాదం ఉందని బీజేపీ నేత, పార్టీ చార్జ్‌షీట్ కమిటీ చైర్మన్ పి. మురళీధర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ కారిడార్‌ను ఉగ్రవాదం, అతివాదం వైపు మళ్లించేందుకు (ర్యాడికలైజేషన్ ఆఫ్ ఇస్లాం) ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అనేక సంఖ్యలో ఉన్నారని, ఈ విషయంలో ఎంఐఎం, బీఆర్ఎస్ అలైన్మెంట్ కారణంగా సవాళ్లు ముందుకొస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనపై బీజేపీ అభియోగపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎఫ్ఐతో లింకులు ఇక్కడ బయటపడ్డాయని, ఎన్ఐఏ ఇక్కడకు వచ్చి కొందరిని అరెస్ట్ కూడా చేసిందని తెలిపారు. తెలంగాణ–మద్యం, హైదరాబాద్–డ్రగ్స్ అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని మండిపడ్డారు. -
మార్గదర్శి దందాపై విచారించాలి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ, శైలజా కిరణ్ తదితరులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టులను ఆదేశించాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకే రోజు రెండు కోర్టులు దాదాపు ఒకే రకం ఉత్తర్వులు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టులు, సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్లను రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా, విశాఖపట్నంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఒకే రకంగా ఉండటం గమనార్హం. జాప్యానికి చాలా కారణాలు.. ‘డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రత్యేక కోర్టు తన పరిధిని వినియోగించాలంటే, నిందితులు చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాలను ఎగవేసినట్లు ఫిర్యాదుతో పాటు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుంది. చార్జిషీట్లను పరిశీలిస్తే, ఏ చందాదారు కూడా తమకు చెల్లించాల్సిన మొత్తాలను నిందితులు ఎగవేసినట్లు ఎక్కడా చెప్పలేదు. జాప్యానికి అనేక కారణాలుంటాయి. నిధుల మళ్లింపు డిపాజిటర్ల చట్టం పరిధిలోకి రాదు. భవిష్యత్తు చందా చెల్లింపుల కోసం కొంత మొత్తాలను మార్గదర్శి తమ వద్దే అట్టిపెట్టుకున్నట్లు, ఆ మొత్తాలకు వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్లు కొందరు చందాదారులు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. దీనిని ఎగవేతగా భావించడానికి వీల్లేదు. ప్రైజ్ మొత్తాలను ఎగవేశారనేందుకు ఆధారాలు సమర్పిస్తేనే ప్రత్యేక కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. కేసు విచారణకు స్వీకరించేంత ఆధారాలు ఏవీ చార్జిషీట్లో లేవు. అందువల్ల చార్జిషీట్లను రిటర్న్ చేస్తున్నాం. ఫిర్యాదుదారు సంబంధిత కోర్టును గానీ, సంబంధిత సమార్థాధికారిని గానీ ఆశ్రయించాలి’ అని రెండూ ప్రత్యేక కోర్టులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. కళ్లెదుటే చట్ట ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఈ ఉత్తర్వులపై సీఐడీ తన అప్పీళ్లలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గడువు ముగిసి, ష్యూరిటీలు సమర్పించిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. కుంటిసాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా చెప్పారు. తమ బ్రాంచ్ బ్యాంకు ఖాతాల్లో తమ మొత్తాలున్నాయో లేదో తెలుసుకోకుండా చందాదారులను మార్గదర్శి అధికారులు అడ్డుకున్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం వంటివన్నీ కూడా డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. ఇన్ని ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రత్యేక కోర్టు మాత్రం వాటిని పట్టించుకోకుండా ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదని పేర్కొనడం సరికాదు. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీ చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చెల్లింపులు చేయడానికి సరిపడనంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి, చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా తమ వద్ద అట్టిపెట్టుకుని ఆ మొత్తాలను మార్గదర్శి రోటేషన్ చేస్తూ వస్తోంది. ప్రత్యేక ఖాతాల్లో చందాదారుల డబ్బు ఉంచాల్సి ఉన్నప్పటికీ, అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేస్తోంది. ఈ విషయాలన్నింటినీ తగిన ఆధారాలతో చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నాం. చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేక కోర్టులు పలు అంశాలను స్పష్టంగా నిర్ధారించాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధం’ అని సీఐడీ తన అప్పీళ్లలో వివరించింది. ఎగవేతలపై స్పష్టంగా వాంగ్మూలాలు ‘చార్జిషీట్లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయి. అలా చెప్పి ఉండకూడదు. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ప్రైజ్ మొత్తాల ఎగవేత శాశ్వతమా లేక తాత్కాలికమా అన్న దాని మధ్య ఎలాంటి తేడా లేదు. కేసును విచారణకు స్వీకరించకుండానే ఆయా అంశాల మధ్య తేడాలు లేవనెత్తడం సమంజసం కాదు. చార్జిషీట్లను లోతుగా పరిశీలిస్తే మార్గదర్శి పాల్పడిన ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుల వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ఓ ఆర్థికసంస్థ ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుడే ఫిర్యాదుదారు అయి ఉండాల్సిన అవసరం లేదు. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాల ఎగవేత, చెల్లింపుల్లో జాప్యం అంశాలను ప్రత్యేక కోర్టులు పరిగణనలోకి తీసుకోలేదు. సీతంపేట బ్రాంచ్‌లో చందాదారులకు చెల్లింపులు చేయడానికి తగినంత మొత్తాలు లేవన్న విషయం చార్జిషీట్లో స్పష్టంగా ఉంది. ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చార్జిషీట్లో పేర్కొన్నవన్నీ ప్రాథమిక ఆధారాలే అయినప్పటికీ, వాటిని సరైన దృష్టికోణంలో ప్రత్యేక కోర్టులు చూడలేకపోయాయి’ అని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. తదుపరి తమ కేసును విచారణకు స్వీకరించేలా కూడా ప్రత్యేక కోర్టులను ఆదేశించాలని అభ్యర్థించింది.