ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్‌పై చార్జిషీట్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను అవమానించేలా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు శనివారం చార్జిషీట్ దాఖలు చేశారు.
ఇటీవల ఎర్రబెల్లి, రావుల ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ను, విమర్శిస్తూ రాష్ట్ర చిహ్నాలను అవమానించే విధంగా మాట్లాడారంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేత కె.గోవర్ధన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో వీరిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఇటీవలే నాంపల్లి కోర్టు ఆదేశించింది. శనివారం వీరిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, చార్జిషీటు కూడా దాఖలు చేశారు.