RAVULA Chandrasekhar Reddy
-
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
-
ప్రచారానికే టీఆర్ఎస్ నేతల ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మొదలు కిందిస్థాయి నాయకుల వరకు చేసే పని కంటే ప్రగల్భాలు, ప్రచారానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. లంచం అడిగిన వారిని చెప్పుతో కొట్టమని కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఉద్యోగాల కోసం సీఎంఓలోని వ్యక్తులకు, టీఆర్ఎస్ పార్టీ వారికీ రూ.40 లక్షలు ఇచ్చినట్లు సతీష్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పిన విషయం అన్ని పత్రికల్లో వచ్చిందని గుర్తుచేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బులు లేనిదే ఈ ప్రభుత్వంలో ఏ పని కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మిషన్‌కాకతీయలో అవినీతి జరగకపోతే అంతమంది అధికారులు ఎందుకు సస్పెండ్ అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయలో మట్టి అమ్ముకోవడంపై, ఇసుక దోపిడీపై విచారణ జరిపించగలరా అని ఆయన ప్రశ్నించారు. సీఎం కార్యా లయంలో చోటు చేసుకున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీటీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. -
మహా ఒప్పందం ఎలా చారిత్రాత్మకం? : రావుల
హైదరాబాద్: గోదావరి జలాల పంపకాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఎలా చారిత్రాత్మకమో వివరించాలని టీఆర్ఎస్ నేతలను టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్వ హక్కులు మహారాష్ట్రకు తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఏమాత్రం వాస్తవాలు చెప్పడం లేదని విమర్శించారు. ఇది చీకటి ఒప్పందమని ఆయన అభివర్ణించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టులు కడితే కాల్వలకు నీళ్లు వస్తాయని తెలిపారు. 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ఏటా వందలాది కోట్ల రూపాయలు నిర్వహణ ఖర్చులు పెరుగిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రాజెక్టులు తెల్ల ఏనుగులుగా మారతాయని ఆందోళన చెందారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అఖిల పక్షాల నిర్ణయాలకు గౌరవం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ హామీని మరిచిపోయారన్నారు. అప్పుడు మహా ఒప్పందంలో భాగంగా ముంబాయి వెళ్లి హడావిడి చేశారని, ఇప్పుడూ అదే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రతో ఒప్పందానికి వెళ్లే ముందు కనీసం అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనాడు ఎంఓయూ అన్నారు.... ఈనాడు ఒప్పందం అంటున్నారని...ఈ మధ్య కాలంలో ఒక్క సారైనా అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉంటే బావుండేదని రావుల అభిప్రాయపడ్డారు. మహా ఒప్పందంలో స్పష్టత లేదు కాబట్టి, దీనిని చీకటి ఒప్పందంగా తెలంగాణ టీడీపీ భావిస్తోందని రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఆ ప్రాజెక్టులు మా ప్రభుత్వం చేపట్టినవే
టీడీపీ నేత రావుల సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులు టీడీపీ హయాం లో చేపట్టినవేనని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.ఈ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు గతంలో ప్రారంభించిన వాటినే మళ్లీ ప్రారంభిస్తోందని పేర్కొన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డితో కలసి ఆయన ఎన్టీఆర్ట్రస్ట్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే మోటార్లు బిగించి జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా పైలాన్లు నిర్మించి మళ్లీ ప్రారంభిస్తున్నారన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వొచ్చని ఎప్పుడో ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి ప్రతిపాదించి అంతర్రాష్ట్ర జల వివాదాల్లోకి లాగారని దయాకర్‌రెడ్డి అన్నారు. -
టీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: రావుల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండేళ్ల పాలనపై టీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి హితవు పలికారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోం దన్నారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమర్శలకు సమాధానం చెప్పకుండా కేబినెట్లోని మంత్రులు ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు. పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై లేనిపోని అపోహలు సృష్టిస్తోంది ప్రభుత్వమేనని అన్నారు. -
'ఓటర్లను మభ్యపెడుతున్న టీఆర్ఎస్'
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్‌లోని ఓటర్లను మభ్యపెట్టేలా అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని టీడీపీ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. అందులోభాగంగానే విద్యుత్, వాటర్ బిల్లు బకాయిలు రద్దు చేస్తామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తుందని రావుల గురువారం హైదరాబాద్‌లో విమర్శించారు. ఓటర్లను ఆశపెట్టి ఆకట్టుకుంటున్నారని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులపై రావుల చంద్రశేఖరరెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పాలనలో ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మస్కబారిందని రావుల చంద్రశేఖరరెడ్డి తెలిపారు. -
ఏ పక్షంలో ఉన్నా నిధులొస్తాయి: రావుల
వనపర్తి : చిత్తశుద్దితో పని చేస్తే అధికార, ప్రతిపక్షంలో ఎక్కడ ఉన్న ప్రజాప్రయోగ పనులకు నిధులు సాధించడం సులువేనని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అధికార పక్షంలోనే ఉంటే నిధులొస్తాయి, ప్రతిపక్షంలో ఉంటే నిధులు రావానే అపోహ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం వనపర్తిలోని బ్రహ్మణ సంస్కృతిక భవన నిర్మాణం, రూ. కోటి రూపాయాలతో నిర్మించిన ఇండోర్ స్టేడియం పనులను ఆయన పరిశీలించారు. బ్రహ్మణ సంస్కృతిక భవనానికి తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో రూ.5 లక్షలు ఇచ్చానని రావుల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భవన నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తానన్ని ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి రాష్ట్రంలో అత్యధిక నిధులు తెచ్చిన పది నియోజకవర్గాల్లో వనపర్తి పేరుండటం ఇందుకు నిదర్శనమని రావుల పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ది కోసం తాను అవసరమైన ప్రతి చోట ఒక్క మెట్టు కిందికి దిగానని... అందువల్లే నియోజకవర్గం పది మెట్లు పైకి నిలబెట్టాగలిగామని అన్నారు. వనపర్తి ఆర్డీవో కొత్త భవనానికి రూ. 2 కోట్లు, ఐసీడీఎస్ భవనానికి రూ. 40 లక్షలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ. కోటి, సబ్ ట్రేజరీ కార్యాలయానికి రూ.కోటి, ఎంపీడీవో కార్యాలయాన్నికి రూ. రెండు కోట్ల చొప్పున తన హయంలో నిధలు విడుదలైన సంగతిని ఆయన వివరించారు. సబ్ ట్రేజరీ, మండల పరిషత్ తప్ప మిగతా ఏ కార్యాలయాల పనులు ప్రారంభం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను జిల్లా కలెక్టర్‌ను కలిసి పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తానన్నారు. డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంకు అనుబంధంగా రూ. కోటి రూపాయాలతో అన్ని వసతులు,సౌకర్యాలతో ఇండోర్ స్టేడియం పూర్తియిందని... ఇది క్రీడకారులకు ఉపయుక్తంగా ఉండనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్యయాదవ్, కౌన్సిలర్లు ఉంగ్లం తిరుమల్, పార్వతి, టీడీపీ నాయకులు నందిమల్ల అశోక్, గిరి, నందిమల్ల రమేష్, పి. రవి, షఫీ, బాలరాజు, దినేష్ , కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 5న వరంగల్‌లో దీక్ష: టీటీడీపీ నేతలు
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై టీ టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి గురువారం హైదరాబాద్‌లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణాలు మాఫీ కాక, వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదని వారు ఆరోపించారు. రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తోందన్నారు. రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్... పేదల ఇళ్లు నిర్మాణాల బిల్లులను పెండింగ్‌లో పెట్టడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఏడాదిగా బిల్లులు చెల్లించకపోవడంతో పేదలు అప్పుల బారిన పడుతున్నాని ఎర్రబెల్లి, రమణ, రావుల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించాలనే డిమాండ్‌తో ఆగస్టు 5వ తేదీన వరంగల్‌లో దీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాల వారీగా ప్రజా సమస్యలపై దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తామని ఎర్రబెల్లి, రమణ, రావుల స్పష్టం చేశారు. -
ప్రజాపక్షమా.. బాబు పక్షమా!
టీటీడీపీ నేతలు తేల్చుకోవాలి: మంత్రి జూపల్లి * పాలమూరు ఎత్తిపోతలపై వైఖరి స్పష్టం చేయాలి సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుకూలమో కాదో తేల్చకుండా తెలంగాణ టీడీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఈ విషయంలో టీటీడీపీ నేతలు తాము ప్రజల పక్షమో, చంద్రబాబు పక్షమో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జూపల్లి విలేకరులతో మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావుకు బహిరంగ లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. లేఖలో పేర్కొన్నట్లుగా టీడీపీ హయాం లో తెలంగాణకు నీటి ప్రాజెక్టులపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. భీమా ఎత్తిపోతల పథకానికి 1985లోనే అన్ని అనుమతులు వచ్చినా, 1985 నుంచి 2004 మధ్యలో ఐదేళ్లు మినహా టీడీపీ అధికారంలోనే ఉన్నా ప్రాజెక్టుకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని జూపల్లి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు రూపాయి ఖర్చుపెట్టినట్లు రుజువు చేస్తానంటే శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు వస్తానని, రావుల ఆ రికార్డులతో రావాలని అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు కలిపి రూ.10 కోట్లు ఖర్చుపెట్టినట్లు రుజువు చేస్తారా అని సవాల్ చేశారు. చంద్రబాబు 1999 ఎన్నికల ముందు కల్వకుర్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, అదే ప్రాజెక్టుకు 2004 ఎన్నికల ముందు మరోసారి కొబ్బరికాయ కొట్టారని జూపల్లి గుర్తు చేశారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదని, బాబు మొరగమంటే మొరగడమే తెలుసని ఎద్దేవా చేశారు. సవాల్‌కు సిద్ధం: రావుల మహబూబ్‌నగర్ జిల్లాలోని భీమా ప్రాజెక్టుకు నాటి ఏపీ సీఎంగా చంద్రబాబు నిధులు ఖర్చు చేశారని రుజువు చేస్తామని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. భీమా ప్రాజెక్టుకు చంద్రబాబు ఒక్క రూపాయి ఖర్చుచేశాడని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మంత్రి జూపల్లి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామన్నారు. సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భీమా ప్రాజెక్టులో అంతర్భాగమని మంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు. బాబు హయాంలోనే ఈ రిజర్వాయరు నిర్మాణమైందన్నారు. గతంలో టీడీపీలో ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, టీడీపీ హయాంలో మహబూబ్‌నగర్‌కు సాగునీటి రంగంలో అభివృద్ధి జరగలేదని ఆ ఫిరాయింపు నాయకులతో చెప్పించగలుగుతారా? అని రావుల ప్రశ్నించారు. -
న్యాయవ్యవస్థపై నమ్మకముంది: రావుల
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డికి బెయిల్ లభించడంపై ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో స్పందించారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకముందన్నారు. రేవంత్‌కు బెయిల్ లభించడంతో న్యాయమే గెలిచిందని తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారం రాజకీయ కుట్రతోనే జరిగిందని తాము మొదటి నుంచి చెబుతునే ఉన్నామని రావుల చంద్రశేఖరరెడ్డి గుర్తు చేశారు. టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంగళవారం మంజురు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి పై విధంగా స్పందించారు. -
ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్‌పై చార్జిషీట్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను అవమానించేలా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు శనివారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఇటీవల ఎర్రబెల్లి, రావుల ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ను, విమర్శిస్తూ రాష్ట్ర చిహ్నాలను అవమానించే విధంగా మాట్లాడారంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేత కె.గోవర్ధన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో వీరిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఇటీవలే నాంపల్లి కోర్టు ఆదేశించింది. శనివారం వీరిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, చార్జిషీటు కూడా దాఖలు చేశారు. -
'అజాంఖాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి'
హైదరాబాద్: సంక్షేమ పథకాలు అమలులో అర్హులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు తమ వివరాలు ఇస్తున్నారు... ఇప్పుడేమో దరఖాస్తులంటూ ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వెళ్లి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మంగళవారం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అజంఖాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సైదాబాద్ మండల పరిధిలోని స్వామి వివేకానంద స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోడానికి వచ్చిన సపోటాబాగ్‌కు చెందిన ఆజమ్‌ఖాన్(65) క్యూలోనే స్పృహ తప్పి పడిపోయి మృతి చెందిన సంగతి తెలిసిందే. -
10, 11, 12 తేదీల్లో టీటీడీపీ బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ ఈ నెల 10, 11, 12 తేదీల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఇ.పెద్దిరెడ్డి, రావులపాటి సీతారామారావు, చాడ సురేష్‌రెడ్డి, బిల్యానాయక్ తెలిపారు. మంగళవారమిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు. కళ్ల ముందే ఎండిపోతున్న పంటను చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారులో చలనం లేదని ధ్వజమెత్తారు. రైతులకు అండగా నిలిచేందుకు 10న నల్లగొండ జిల్లా, 11న వరంగల్, 12న ఆదిలాబాద్ జిల్లాల్లో బస్సు యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీఆర్ఎస్లో చేర్చుకోవడమే పాలన అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న అనాలోచిత విధానాల వల్లనే రైతులు మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ జిల్లా పాలకుర్తిలో విమర్శించారు. ప్రతిపక్షాలపై అనవసర విమ ర్శలు మానుకోవాలన్నారు. మార్క్‌ఫెడ్, సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో పార్టీ కోసం పనిచేయండి!
రేవంత్‌రెడ్డికి చంద్రబాబు సూచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి జాతీయ స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నాయకులతో పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలోని చంద్రబాబు చాంబర్లో పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి అక్కడికి వచ్చారు. ఆయన్ను చూసిన యనమల ఇక్కడ కూడా తెలంగాణ వారి పెత్తనమేనా అని సరదాగా వ్యాఖ్యానించారు. వెంటనే రేవంత్.. ‘ఇప్పటికే మా నేతలు ఇద్దరు మీ కోసం పనిచేస్తున్నారు.’ అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని.. ‘రావుల, వేం జాతీయ స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తారు. మీరు తెలంగాణలో పార్టీ అభివృద్ధికి పనిచేయండి’ అని రేవంత్‌కు సూచించారు. పార్టీ ఆదేశిస్తే మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేం దుకు సిద్ధమని అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి చెప్పారు. -
రావుల ఆరోపణలు నిరూపించు: అవినాష్ రెడ్డి
రాష్ట్రంలోని తన బ్యాంకు ఖాతాలోకి విదేశాల నుంచి నిధులు భారీగా వచ్చి చేరాయంటూ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలను కడప లోక్‌సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఖండించారు. తనపై రావుల నిరాధారమైన ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఆదివారం కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన మూడు దేశాలలో తనకు రెండు దేశాల వీసానే లేదని తెలిపారు. సింగపూర్‌కు కూడా ఒక్కసారి మాత్రమే వెళ్లానని వివరించారు. తనకు అసలు విదేశాలలో బ్యాంక్ అకౌంట్లే లేవన్నారు. టీడీపీ ఆఫీసులో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రావుల చంద్రశేఖర రెడ్డి చదివారే కానీ... అసలు వాస్తవాలు తెలుసుకోలేదని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. సింగపూర్ నుంచి తనకు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ బ్యాంక్ అకౌంట్‌కు నగదు బదిలీ అయిందో చెప్పాలని ఈ సందర్బంగా రావుల చంద్రశేఖరరెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. అన్యాయంగా తమపై బురద జల్లి... ఆ తర్వాత కడుక్కోమనడం సమంజసం కాదన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని రావుల చంద్రశేఖరరెడ్డిని వైఎస్ అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రావులని వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరించారు. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్ అవినాష్ రెడ్డి బ్యాంకు ఖాతాలలోకి విదేశాల నుంచి రూ.100 కోట్లు వచ్చాయని రావుల చంద్రశేఖరరెడ్డి శనివారం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఆదివారం స్పందించారు. -
విభజనకు టీడీపీ అనుకూలం: రావుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు టీడీపీ అనుకూలంగా ఉందని, తెలంగాణకు అనుకూలంగా గతంలో ఇచ్చిన లేఖను పార్టీ వెనక్కి తీసుకోలేదని టీడీపీ సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. విభజనబిల్లుపై శాసనసభలో శుక్రవారం వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ... అన్ని పార్టీలు తమ విధానాలు మార్చుకున్నా.. టీడీపీ మార్చుకోలేదని చెప్పారు. కానీ తమ పార్టీ మీదే అన్ని పార్టీలు విమర్శల దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీఆర్ఎస్ సభ్యుడు కె.తారక రామారావు చేసిన వ్యాఖ్యలపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ తీవ్రంగా స్పందించారు. శాసనసభలో ప్రసంగం తర్వాత రావుల అసెంబ్లీ లాబీల్లోని పంచాయుతీరాజ్ శాఖ వుంత్రి జానారెడ్డి చాంబర్‌కు వచ్చారు. అక్కడే ఉన్న వుంత్రులు సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలను పలకరించారు. ఆ సవుయుంలో వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్రంగానే రావుల ప్రసంగం సాగిందని వుంత్రులు ప్రస్తావించగా... ‘‘టీఆర్ఎస్ నేతలను మెల్లిగా గిల్లితే వాళ్లు వూపై బడి రక్కుతారు. బీజేపీ వాళ్లను ఏమీ అనలేం. కవుూ్యనిస్టులను నిందించలేం. ఇక మిగిలింది కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే వూకు వుుఖ్యం కనుక దానిపైనే వివుర్శలు చేస్తున్నాం’’ అని వివరించారు. సభలో రావుల ఏమన్నారు? - బిల్లుకు సవరణలు చేసే అధికారం శాసనసభకు లేదు. బిల్లులో మార్పులు చేయమని పార్లమెంట్‌కు విజ్ఞప్తి చేస్తూ ప్రతిపాదనలు చేస్తున్నాం. అన్ని క్లాజులపై వ్యాఖ్యలను కేంద్రం కోరింది. కాలయాపన లేకుండా బిల్లును పంపించాలి. - అధికార పార్టీ నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష పార్టీకి బాధ్యత అంటగడుతూ విమర్శలు చేయడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? - మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా ఆఖరు బాల్, సిక్స్ అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. - సమైక్యవాదంతో నెగ్గుకురావాలని వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్సీపీ విభజనను అడ్డుకుంటే మరిన్ని అనర్థాలు జరుగుతాయి. జగన్‌కు బెయిల్ రావడానికి కాంగ్రెస్‌తో చేతులు కలపడమే కారణం. మంత్రి కన్నా: ఎవరితోనూ చేతులు కలపాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదు. కాంగ్రెస్‌లో ఎదిగిన చంద్రబాబు, జగన్ ఇద్దరూ తల్లిపార్టీ గుండెల మీద తన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి, ఇప్పుడు ముఖ్యమంత్రి, కొంతమంది మంత్రులు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. తెలంగాణకు అనుకూలమని వైఎస్ సభలోనే ప్రకటన చేశారు. విభజనకు ఆయనే మూలం. సీఎం స్పందన.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన మాట వాస్తవమే. అసంబద్ధమైన, అహేతుకమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తాం. విభజన నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నానో శాసనసభలో చెబుతానని ప్రకటించాను. చెబుతాను. రాష్ట్రానికి, తెలంగాణకు జరిగే అన్యాయాల్ని వివరిస్తాను. తెలంగాణ ప్రజలకు మీరు (టీఆర్ఎస్) ఏం సమాధానం చెబుతారో చూస్తాం. శైలజానాథ్ ఏమన్నారు?: తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్లు టీఆర్ఎస్ నేతలే. వైఎస్ రహస్యంగా ఏమీ ఒప్పందం చేసుకోలేదు. సభలోనే ప్రకటన చేశారు. పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకోవడానికి కమిటీ ఏర్పాటు చేయాలని సభాముఖంగా చెప్పారు.