విభజనకు టీడీపీ అనుకూలం: రావుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు టీడీపీ అనుకూలంగా ఉందని, తెలంగాణకు అనుకూలంగా గతంలో ఇచ్చిన లేఖను పార్టీ వెనక్కి తీసుకోలేదని టీడీపీ సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. విభజనబిల్లుపై శాసనసభలో శుక్రవారం వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ... అన్ని పార్టీలు తమ విధానాలు మార్చుకున్నా.. టీడీపీ మార్చుకోలేదని చెప్పారు. కానీ తమ పార్టీ మీదే అన్ని పార్టీలు విమర్శల దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు టీఆర్‌ఎస్ సభ్యుడు కె.తారక రామారావు చేసిన వ్యాఖ్యలపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ తీవ్రంగా స్పందించారు. శాసనసభలో ప్రసంగం తర్వాత రావుల అసెంబ్లీ లాబీల్లోని పంచాయుతీరాజ్ శాఖ వుంత్రి జానారెడ్డి చాంబర్‌కు వచ్చారు. అక్కడే ఉన్న వుంత్రులు సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలను పలకరించారు. ఆ సవుయుంలో వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్రంగానే రావుల ప్రసంగం సాగిందని వుంత్రులు ప్రస్తావించగా... ‘‘టీఆర్‌ఎస్ నేతలను మెల్లిగా గిల్లితే వాళ్లు వూపై బడి రక్కుతారు. బీజేపీ వాళ్లను ఏమీ అనలేం. కవుూ్యనిస్టులను నిందించలేం. ఇక మిగిలింది కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే వూకు వుుఖ్యం కనుక దానిపైనే వివుర్శలు చేస్తున్నాం’’ అని వివరించారు.
సభలో రావుల ఏమన్నారు?
- బిల్లుకు సవరణలు చేసే అధికారం శాసనసభకు లేదు. బిల్లులో మార్పులు చేయమని పార్లమెంట్‌కు విజ్ఞప్తి చేస్తూ ప్రతిపాదనలు చేస్తున్నాం. అన్ని క్లాజులపై వ్యాఖ్యలను కేంద్రం కోరింది. కాలయాపన లేకుండా బిల్లును పంపించాలి.
- అధికార పార్టీ నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష పార్టీకి బాధ్యత అంటగడుతూ విమర్శలు చేయడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా?
- మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా ఆఖరు బాల్, సిక్స్ అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు.
- సమైక్యవాదంతో నెగ్గుకురావాలని వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్‌సీపీ విభజనను అడ్డుకుంటే మరిన్ని అనర్థాలు జరుగుతాయి. జగన్‌కు బెయిల్ రావడానికి కాంగ్రెస్‌తో చేతులు కలపడమే కారణం.
మంత్రి కన్నా: ఎవరితోనూ చేతులు కలపాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదు. కాంగ్రెస్‌లో ఎదిగిన చంద్రబాబు, జగన్ ఇద్దరూ తల్లిపార్టీ గుండెల మీద తన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి, ఇప్పుడు ముఖ్యమంత్రి, కొంతమంది మంత్రులు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. తెలంగాణకు అనుకూలమని వైఎస్ సభలోనే ప్రకటన చేశారు. విభజనకు ఆయనే మూలం.
సీఎం స్పందన..
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన మాట వాస్తవమే. అసంబద్ధమైన, అహేతుకమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తాం. విభజన నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నానో శాసనసభలో చెబుతానని ప్రకటించాను. చెబుతాను. రాష్ట్రానికి, తెలంగాణకు జరిగే అన్యాయాల్ని వివరిస్తాను. తెలంగాణ ప్రజలకు మీరు (టీఆర్‌ఎస్) ఏం సమాధానం చెబుతారో చూస్తాం.
శైలజానాథ్ ఏమన్నారు?: తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్లు టీఆర్‌ఎస్ నేతలే. వైఎస్ రహస్యంగా ఏమీ ఒప్పందం చేసుకోలేదు. సభలోనే ప్రకటన చేశారు. పునర్‌వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకోవడానికి కమిటీ ఏర్పాటు చేయాలని సభాముఖంగా చెప్పారు.