Kiran Kumar Reddy Nallari
-
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుపై మిథున్ రెడ్డి సీరియస్ కామెంట్స్
-
కిరణ్‌కుమార్‌ను చిత్తుగా ఓడిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కారణమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, పెద్దిరెడ్డి శుక్రవారం పుంగనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. విద్య, వైద్యం కోసం వేల కోట్లు రూపాయలు ఖర్చు చేసి సీఎం జగన్ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం ఖర్చు చేసే పనిలేకుండా ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకున్నారు. సీఎం జగన్‌ను మళ్లీ గెలిపించి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకే కుటుంబం ఇక్కడ 30 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపించాం. త్వరలోనే ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందిస్తాం. మే 13న జరిగే ఎన్నికల్లో నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాను. మీ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ విజయానికి మనమంతా కృషి చేయాలి. ఇదే సమయంలో.. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఓడించాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఓడిస్తాం. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం వైఎస్ జగన్‌ను వేధించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు. కిరణ్ కుమార్ నమ్మకద్రోహి’ అంటూ కామెంట్స్ చేశారు. -
నల్లారి కిరణ్‌పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
సాక్షి, అనంతపురం: చంద్రబాబుకి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు అయినా చంద్రబాబు కట్టడా? అంటూ ప్రశ్నించిన పెద్దిరెడ్డి.. సీఎం జగన్ రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ‘‘చంద్రబాబుని కుప్పంలో కూడా ఒడిస్తాం. కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చింది సీఎం జగన్. సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి చంద్రబాబు. అమిత్ షా కాళ్లు పట్టుకుని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీనే పొత్తు అడిగిందని అబద్దాలు చెప్తున్నాడు’’ అంటూ పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ‘‘కిరణ్‌కుమార్ రెడ్డికి నా గురించి మాట్లాడే అర్హత లేదు. ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్‌రెడ్డిది. ఎన్నికలు అవ్వగానే కిరణ్ కుమార్‌రెడ్డి సూట్ కేసు సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతాడు. సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం జగన్‌ని అణగదొక్కడానికి సోనియాగాంధీతో కుమ్మక్కయ్యాడు. ఇప్పుడు మేము ఓడించి బుద్ధి చెప్తాము’’ అని పెద్దిరెడ్డి అన్నారు. ‘‘సీఎం జగన్ బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోంది. నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్సు యాత్రలో కనిపిస్తున్నారు. 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకం బస్సు యాత్రతో కలిగింది’’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
రబ్బరు బుల్లెట్లకు కూడా ఒప్పుకోలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంపై సోనియా గాంధీ చాలా సానుకూలంగా ఉండేవారని, ఉద్యమం ఎంతటి తీవ్ర రూపం దాల్చినా బలప్రయోగం చేయవద్దని, కనీసం రబ్బరు బుల్లెట్లు కూడా ఉద్యమకారులపై ప్రయోగించకూడదని ఆమె కచ్చితమైన ఆదేశాలిచ్చారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి చెప్పారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి సోనియా గాంధీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. సమైక్య రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలే తప్ప అణచివేతలు వద్దని ఆదేశించారన్నారు. వైఎస్ దిగ్రేట్.. కాగా, తనకు విమానం ఎక్కడం ఇష్టం ఉండదని, అయినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆదేశాలతో ఒకసారి ఎక్కానని జగ్గారెడ్డి చెప్పారు. ఏ విషయాన్నయినా ఫాలోఅప్ చేయడంలో వైఎస్ దిగ్రేట్ అని, ఆయన సీఎం అవడానికి ఎంత కష్టపడ్డారో, అయ్యాక కూడా అంతే కష్టపడ్డారని చెప్పారు. వైఎస్ తనకు అప్పగించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేయడం చాలా సంతోషానిచ్చేదని అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకులు ఇప్పుడు లేకపోవడం దురదృష్టకరమని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, ఉమ్మడి రాష్ట్రంలోనే తనకు మంత్రిపదవి ఆఫర్ చేసినా వద్దన్నానని చెప్పారు. కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి వస్తుందని, అందరూ కలసి పనిచేయాలని ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ తమకు దిశానిర్దేశం చేశారన్నారు. సీఎల్పీ కార్యాలయానికి మంత్రి వేముల ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ సభ్యులు సభలోకి వెళ్లకపోవడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. లాబీల్లో నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తీసుకుని ఆయన సీఎల్పీకి వచ్చారు. ఆ సమయంలో సీఎల్పీ నేత భట్టి, శ్రీధర్, వీరయ్యలు అక్కడే ఉన్నారు. దీంతో సభకు వచ్చి అసెంబ్లీ సమావేశాలు సజావుగా నడిచేందుకు సహకరించాలని ప్రశాంత్‌రెడ్డి వారిని కోరారు. శనివారం కేటీఆర్ మాట్లాడిన సందర్భంగా తమను జంతువులతో పోల్చడం బాధ కలిగించిందని, ఈ విషయంలో స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు. కానీ, ప్రశాంత్‌రెడ్డి సర్దిచెప్పి వారిని సభలోపలికి తీసుకెళ్లడం గమనార్హం. -
కమలంలో ఆగని లుకలుకలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోని అసంతృప్త స్వరాలు ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన సభలో వేదికపై కొందరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు, ఆ తర్వాత ట్వీట్ల ద్వారా స్పందించిన వైఖరిపై పార్టీలో చర్చ జరుగుతోంది. తన విషయంలో వ్యవహరించినట్టుగా కాకుండా కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని, ఢిల్లీకి వెళ్లి లేనిపోని ఫిర్యాదులు, రిపోర్టులు ఇవ్వొద్దని మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొనడంపై బీజేపీ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే ఒరవడి శుక్రవారం అర్ధ్థరాత్రి దాకా సాగిన రాష్ట్ర పార్టీ కోర్‌కమిటీ సమావేశంలోనూ కొనసాగినట్టు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణకు కిరణ్‌కు సంబంధమేమిటి? తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తెలంగాణకు సంబంధించిన పార్టీ కార్యక్రమానికి ఎలా పిలుస్తారని విజయశాంతి ప్రశ్నించినట్లు తెలిసింది. ఇది తెలంగాణ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదం ఉందని ఆమె అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ విషయంలో జాతీయ, రాష్ట్ర నేతలను హెచ్చరించి, ఆమె తన నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. అలా ఎలా సంజయ్? కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో బండి సంజయ్ మాట్లాడిన తీరు బాగా లేదని రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. బండి వ్యాఖ్యలు పార్టీకేడర్‌ను గందరగోళంలో పడేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిసింది. ఏవైనా ఇలాంటి అభిప్రాయాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాలే తప్ప, బహిరంగంగా మాట్లాడడం ఏమిటని సంజయ్ తీరును తప్పు పట్టినట్లు సమాచారం. ఈ మేరకు కోర్ కమిటీ మీటింగ్‌లో వారు సంజయ్‌కి క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. గతం నుంచే బండి సంజయ్, ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావుల మధ్య కొంత గ్యాప్ ఉండడంతో ఈ సమావేశంలోనూ అది బయట పడినట్టు తెలిసింది. దీంతో ఆయన సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఉద్యమ కార్యాచరణ... శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా సాగిన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రజాసమస్యలపై ఉధృతంగా ఉద్యమించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ సర్కారు అవినీతి, అక్రమాలు, సీఎం కేసీఆర్ వైఫల్యాలు, హామీల అమల్లో వైఫల్యంపై ప్రధానంగా కార్యాచరణను రూపొందించుకోవాలని భావించారు. తొలిసారిగా కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కోర్ కమిటీ భేటీలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. అలాగే ముఖ్యనేతలు ఎవరొచ్చినా.. దళితవాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీఆర్ఎస్ సర్కారు వారికి చేసిన మోసాన్ని తెలియ జేసేలా చైతన్యం తీసుకురావాలని తీర్మానించారు. బీజేపీ మాత్రమే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించగల దనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉందని.. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ.. మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. -
కిషన్ రెడ్డి వచ్చినా కొత్త టెన్షన్.. తలలు పట్టుకున్న బీజేపీ నేతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో, తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇక, శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ నేతలు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్‌లో రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్ పాల్గొన్నారు. ఇక, ఈ మీటింగ్ సందర్బంగా తెలంగాణలో బీజేపీ నేతల మధ్య సమన్వయం కోసం హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించే పనిలో హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీకి మరో కొత్త టెన్షన్ కలవరపెడుతోంది. బీజేపీ నేతల సమావేశాలకు ఏపీ నేతలు రావడంతో తెలంగాణ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి రాకను బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యతిరేకించారు. కిరణ్ కుమార్ మాకొద్దు అని రాష్ట్ర బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక, కిరణ్‌కుమార్‌రెడ్డిని స్థానిక నేతలు మరో చంద్రబాబులాగా భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ను ఫాంహౌస్ అరెస్టు చేస్తాం -
కిరణ్ కుమార్ రెడ్డిపై విజయశాంతి ఘాటు విమర్శలు
-
తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తిని ఎలా ఆహ్వానిస్తారు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే పార్టీ నేతల మధ్య లుకలుకలు బయట పడ్డాయి. కిషన్‌రెడ్డి బాధ్య తల స్వీకరణ కార్యక్రమానికి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానించడాన్ని, ఆయన సభలో పాల్గొనడాన్ని పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఆయనను ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడ్డట్లు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు కేటాయించబోమని, ఏమి చేసుకుంటారో చేసుకోండన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎలా పిలుస్తారని కొందరు నేతలు పార్టీ నాయకత్వాన్ని పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, విజయశాంతి, తదితరులు అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. ఉద్యమ సమయంలో తనపై కేసులు పెట్టి వేధించిన వ్యక్తిని పిలవడంపై విజయశాంతి నిలదీసినట్టు తెలిసింది. ఇదే తరహాలో రాజ్‌గోపాల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సభలో పాల్గొన్న విజయశాంతి కొంతసేపటి తర్వాత వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత ఆమె ఒక ట్వీట్ చేశారు. ‘కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానంటూ పాత్రికేయ మిత్రులు నన్ను అడుగుతున్నారు. కానీ అది సరి కాదు. కిషన్‌రెడ్డిని అభినందించి, శుభాశీ స్సులు తెలియజేసిన తర్వాతే వచ్చాను. అయితే నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ వాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాలని ప్రయత్నించిన వారు ఉన్నచోట ఉండటం నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఆ పరిస్థితి వల్ల ముందుగా వెళ్లవలసి వచ్చింది. అక్కడ చివరి వరకు ఉండటం అసాధ్యం. అందుకే కార్యక్రమం ముగియకముందే వెల్లిపోవాల్సి వచ్చింది..’ అని వివరణ ఇచ్చారు. నేతల వ్యాఖ్యల కలకలం కిషన్‌రెడ్డి బీజేపీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేతల ప్రసంగాలు దుమా రం రేపుతున్నాయి. సొంత పార్టీలోనే కొందరు తనపై నాయకత్వానికి ఫిర్యాదులు చేశారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తప్పించేందుకు.. సీఎం కేసీఆర్ ఈడీని మేనేజ్ చేశారని ఆయన అనడం పార్టీ నేతల మధ్య చర్చకు దారితీసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి రాకను విజయశాంతి వ్యతిరేకించడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. -
టీడీపీతో పొత్తులాంటి నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్‌కు మనుగడ ఎలా?
సాక్షి, అమరావతి: విభజన తర్వాత కూడా ఒక దశలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు 8 శాతానికి పెరిగినట్లు ఓ సర్వేలో తేలిందని, ఆ సమయంలో ఆ పార్టీ పెద్దలు హఠాత్తుగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, ఇలాంటి నిర్ణయాల వల్ల ఆ పార్టీ ఎలా ముందుకు పోతుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండోసారి తాను కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తానన్నా.. తాను నిరాకరించానని తెలిపారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన బుధవారం విజయవాడ వచ్చారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉండే వారికి ప్రజాజీవితంలో కొనసాగే పరిస్థితి లేదని.. తాను ఇంకా ప్రజాజీవితంలో కొనసాగాలనే బీజేపీలో చేరినట్టు వివరించారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నప్పటికీ.. గతంలో కేంద్రం హోదాకు బదులు ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధపడగా అప్పటి ప్రభుత్వం దానికి అంగీకరించిందని పరోక్షంగా చంద్రబాబు నిర్ణయాన్ని గుర్తుచేశారు. మూడు రాజధానులపై పార్టీ అభిప్రాయమే తన అభిప్రాయమని తెలిపారు. తన తమ్ముడు టీడీపీలో కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఏ పా ర్టీలో కొనసాగాలన్నది వారి వ్యక్తిగత నిర్ణయమన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
‘కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వెనక కూడా చంద్రబాబే!’
వర్తమాన రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఏ విలువలు అయితే పాటించకూడదో, ఎలాంటి వ్యక్తిత్వానికయితే దూరంగా ఉండాలో ఆ ఇద్దరు వ్యక్తులు సజీవ సాక్ష్యంగా కనిపిస్తారు. మొదటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ లో ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి అన్ని హంగులు, అర్భాటాలు అనుభవించి.. చివరికి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి.. ఇప్పుడు ఏకంగా పార్టీకే పంగనామాలు పెట్టారు కిరణ్ కుమార్. ఇక రెండో వ్యక్తి చంద్రబాబు. ఆయన మాస్టర్ ప్లాన్ మామూలుగా ఉండదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఎప్పటికప్పుడు అతి తెలివి ప్రదర్శిస్తునే ఉంటారు. తన అనుయాయులందరిని బీజేపీలోకి పంపించి తన పబ్బం గడుపుకుంటున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వెనక కూడా చంద్రబాబే ఉన్నారా? కావొచ్చంటున్నారు సీనియర్ జర్నలిస్టు దేవుల పల్లి అమర్. కిరణ్ కుమార్, చంద్రబాబు.. ఇద్దరి వ్యవహారాలు కచ్చితంగా భిన్నంగా చూడాల్సిందేనంటున్నారు. -
అదానీ, ఐదుగురు నేతలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
-
కిరణ్ కుమార్‌రెడ్డి.. తెలంగాణ బీజేపీ కోసమా? ఏపీ బీజేపీకా?
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన కుటుంబం ప్రస్తుతం రాజకీయాలలో తలోదారి చూసుకుంటున్నట్లుగా ఉంది. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కిరణ్ అయితే 2014 నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అలా అని రాజకీయాలను వదలివేయలేదు. మధ్యలో కొంతకాలం కాంగ్రెస్‌లో చేరివచ్చారు. కాని అంత సంతృప్తి కలగలేదు. ఆ పార్టీ అధిష్టానం కూడా కిరణ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆయన బీజేపీలో ఏమైనా గుర్తింపు వస్తుందేమోనన్న ఆశతో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉన్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతోందని ఆయన అన్నారు. తప్పు నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి. అంటే దీని అర్ధం కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేయడం కూడా తప్పు నిర్ణయమేనా?అని ప్రశ్నిస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఆయనకు నచ్చలేదు. బాగానే ఉంది. కాని ఆయన ఒకసారి పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ లో ఎందుకు చేరినట్లు? ఆ తర్వాత బీజేపీలో చేరడంలోని ఆంతర్యం ఏమిటి? బీజేపీ కూడా ఉమ్మడి ఏపీ విభజనకు సహకరించిన పార్టీనే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి విభజన హామీలన్నిటిని నెరవేర్చలేదు కదా! పోలవరం ప్రాజెక్టు కు పూర్తిస్థాయిలో నిదులు ఇవ్వడానికి వెనుక, ముందాడుతోంది కదా! తెలంగాణ బీజేపీ కోసమా? ఏపీ బీజేపీకా? విశాఖ రైల్వేజోన్ ను ఆరంభించలేదు కదా! తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనకు చొరవ తీసుకోవడం లేదు కదా! ఇలా పలు అంశాలలో బీజేపీ పెద్ద సీరియస్‌గా లేదని విమర్శలు ఉన్న తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో చేరడం విశేషం. అసలు కిరణ్ తెలంగాణ బీజేపీ కోసం పనిచేస్తారా?లేక ఏపీకి పరిమితం అవుతారా? లేక రెండు రాష్ట్రాలలో కీలక పాత్ర పోషిస్తారా? అందుకు తెలంగాణ బీజేపీ నేతలు అంగీకరించే అవకాశం ఉంటుందా?ఏపీతో పాటు తెలంగాణలో కూడా కిరణ్ ప్రభావం ఉంటుందని పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి అన్నారు. అది అయ్యేపనేనా! ఇప్పటికే భారతీయ రాష్ట్ర సమితి ఈ విషయమై విమర్శలు చేసింది. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నించిన కిరణ్ ను బీజేపీలో చేర్చుకున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే బల్క సుమన్ ద్వజమెత్తారు. ఏపీలో క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకున్నా,అక్కడ పార్టీ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జనసేనతో పొత్తు ఉంటుందో, లేదో తెలియని అయోమయ పరిస్థితి. ఈ నేపధ్యంలో కిరణ్ సోదరుడు టీడీపీలో ఉండడం, ఈయనేమో బీజేపీలో చేరడం ఏమైనా వ్యూహం ఉందా అన్న అనుమానం వస్తుంది. నేరుగా తెలుగుదేశం లో చేరలేని పరిస్థితిలో ఆయన బీజేపీలో చేరవలసి వచ్చిందా? కిషోర్ కుమార్ రెడ్డి 2014లో అన్న స్థాపించిన జై సమైక్యాంద్ర పార్టీ తరపున పీలేరులో పోటీచేసి ఓడిపోయారు. తదుపరి ఆయన టీడీపీలో చేరి గతసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఒకరు టీడీపీ.. మరొకరు బీజేపీ? కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన మరో సోదరుడు సంతోష్ రెడ్డి ఆయా వ్యవహారాలను చక్కబెట్టేవారని అంటారు. నిజానికి నల్లారి కుటుంబం వ్యక్తి ఒకరు టీడీపీలో చేరడం, మరొకరు బీజేపీలో ప్రవేశించడం ఆశ్చర్యమే. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కిరణ్‌కు మధ్య ఉప్పు,నిప్పు మాదిరగా పరిస్థితి ఉండేది. కిరణ్ స్పీకర్ గా ఎన్నికైనప్పుడు ఆయనను సీటులో కూర్చోబెట్టడానికిగాను ముఖ్యమంత్రి ,ఇతర పార్టీల నేతలతో కలిసి సీటువరకు రావడానికి చంద్రబాబు అంత ఇష్టపడలేదని చెబుతారు. కాని రాజకీయం ఎప్పుడూ ఒకమాదిరిగా ఉండదు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో రాజకీయాలు మారిపోయాయి. సీనియర్ నేత రోశయ్య సీఎం అయ్యారు. తదుపరి కిరణ్ అధిష్టానాన్ని ఎలా దారిలోకి తెచ్చుకున్నారో తెలియదు కాని, అందరిని ఆశ్చర్యపరుస్తూ రోశయ్య తర్వాత , ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. సీనియర్ నేత చిదంబరం, ఏపీకి చెందిన పల్లంరాజు, ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ ల ద్వారా రాహుల్ గాంధీని ఆకట్టుకోగలిగారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజనకు పరోక్ష కారణమన్న ప్రచారం కూడా.. కిరణ్ ముఖ్యమంత్రి అవడం సంగతి ఎలా ఉన్నా, రాష్ట్ర విభజనకు ఆయన కూడా పరోక్షంగా కారణమన్న ప్రచారం ఉంది. అదెలా అంటే ఒకదశలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఉమ్మడి ఏపీని విభజించకుండా తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అనుకున్నారు. ఆ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు జరగవలసి ఉంది. ఆ సమావేశాలు అయిన తర్వాత ప్యాకేజీని ప్రకటించాలని కిరణ్ కోరారని చెబుతారు. దాంతో అధిష్టానానికి ఈయనపై నమ్మకం సన్నగిల్లి తెలంగాణ ఏర్పాటుకు మొగ్గు చూపారని చెబుతారు. దానికి తోడు కాంగ్రెస్ ఎమ్.పిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని వదలిపెట్టి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని సంచలనంగా మారడంతో ఆయన హవా తగ్గించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ విభజన వైపు వెళ్లిందని అంటారు. కిరణ్ కుమార్ రెడ్డికి బదులుగా జగన్ కు ముఖ్యమంత్రి బాద్యతలు అప్పగించి ఉంటే విభజనకు ఆస్కారం ఉండేదికాదని చాలా మంది నమ్ముతారు. అదంతా చరిత్ర. ఒక సారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు సహకరించి కిరణ్ ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడారు.అంతకుముందే జగన్ పై సోనియాగాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు కేసులు పెట్టి, ఆయనను జైలుకు పంపించిన స్నేహం కూడా ఉంది. విశేషం ఏమిటంటే కాంగ్రెస్ అధిష్టానం విభజనకు సంబందించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు ఇస్తానని చెప్పిన కిరణ్ అప్పట్లో చిత్ర, విచిత్రంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి సమైక్యాంధ్ర పార్టీ.. ఆంధ్ర, రాయలసీమ మంత్రులతో క్యాబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేశారు. అలాగే అసెంబ్లీలో గందరగోళం మధ్య కేంద్రం పంపిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఆ పరిణామాలను పార్టీ ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ వంటివారు సమర్దించడం మరో విడ్డూరం. ఈ పరిణామాలన్నిటిని గమనించిన ప్రజలు కాంగ్రెస్‌ను అసహ్యించుకున్నారు.ఈ నేపద్యంలో కిరణ్ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి జై సమైక్యాంద్ర పార్టీ అంటూ సొంతంగా పార్టీ పెట్టుకుని, చెప్పుల గుర్తుతో ఎన్నికలలో దిగారు. ఆయన పోటీచేయకుండా తన అభ్యర్ధులను నిలబెట్టారు. కాని ఒక్క చోట కూడా గెలవలేదు సరికదా..దాదాపు అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. ఆ ఎన్నికలలో విభజిత ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తదుపరి కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ టీడీపీలో ప్రవేశించడం విశేషం. దీనికి కిరణ్ అనుమతి లేకుండా జరిగిందా అన్న చర్చ కూడా వచ్చింది. అయినా రాజకీయాలలో ఇలాంటివి మామూలే అనుకున్నా, కిరణ్ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తదుపరి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కాని యాక్టివ్ కాలేదు. ఇప్పుడు సడన్ గా బీజేపీ వైపు ఆయన మనసుపడ్డారు. ప్రధాని మోడీ బాగా పనిచేస్తున్నారని మెచ్చుకుంటున్నారు. కిరణ్ వల్ల ఏపీలోకాని, తెలంగాణలో కాని బీజేపీకి ఎంత ప్రయోజనమన్నది అప్పుడే చెప్పలేం.కాకపోతే కిరణ్ బాల్యం నుంచి హైదరాబాద్ లోనే ఎక్కువకాలం పెరిగారు. అదే కిరణ్‌కు టర్నింగ్ పాయింట్ ఆయన తండ్రి అమరనాధ్ రెడ్డి కరడుకట్టిన కాంగ్రెస్ వాదిగా గుర్తింపు పొందారు. ఇందిరాగాంధీకి విదేయుడుగా ఉన్నారు. తండ్రి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కిరణ్ తల్లి టీడీపీపై పోటీచేసి ఓటమిచెందడం మరో ప్రత్యేకత. ఆ తర్వాత కిరణ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి 1989, 1999, 2004, 2009లలో గెలుపొందారు. తొలుత వైఎస్ హయాంలో ఛీప్ విప్ గా పనిచేసి, అనేక సందర్భాలలో చంద్రబాబును ఇరుకున పెట్టడానికి యత్నించేవారు. 2009లో కిరణ్ కు వైఎస్ స్పీకర్ పదవి ఇచ్చారు. అది ఆయనకు టర్నింగ్ పాయింట్ . ఆ హోదాతో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. అంతేకాక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రోశయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలన్న ఆలోచన రావడం వంటివి ఆయనకు కలిసి వచ్చాయి. తన పదవిలో ఉన్నప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసి కొన్ని కేసులలో జైలులో పెట్టించడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అయినా కాంగ్రెస్‌కు అవేమీ పనికి రాలేదు. అభయహస్తం పేరుతో వంద రూపాయలకే నిత్యావసర వస్తువులు ఇచ్చే స్కీమును తీసుకు వచ్చారు కాని జనం పట్టించుకోలేదు. తెలుగులో అంత పెద్ద వాగ్దాటి లేని కిరణ్ ఉమ్మడి ఏపీలో చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. కాంగ్రెస్‌ను కాదని బీజేపీలో చేరిన కిరణ్ ఆ పార్టీకి ఎలా ఉపయోగపడతారో అప్పుడే చెప్పలేం.కొసమెరుపు ఏమిటంటే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా ఏపీ, తెలంగాణలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు పెద్దగా డిల్లీలో కనిపించకపోవడం. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ -
నల్లారి కుటుంబంపై పీలేరు ఎమ్మెల్యే సవాల్
-
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తథ్యం
సాక్షి, వనపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే సీఎం కేసీఆర్ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, ప్రజాఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపేందుకు బుధవారం వనపర్తికి వచ్చిన ఆయన మాట్లా డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఏనాడూ ప్రభుత్వ అత్యున్నత అధికారి, మరో ముగ్గురు ఐఏఎస్‌లను హైకోర్టు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసిందంటే అన్యాయం ప్రభుత్వం వైపు ఉందని తెలుస్తోందన్నారు. తెలంగాణ ఇస్తే చాలా రాష్ట్రాల డిమాండ్లు వస్తాయని కేంద్రం అంటే.. ఉన్న తెలంగాణ ఇవ్వాలని అడిగినం. అలాగే ఆర్టీసీ విలీనం చేస్తే 91 కార్పొరేషన్ల డిమాండ్ చేస్తాయని చెబుతున్న సీఎం కేసీఆర్.. పూర్వం ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీనే విలీనం చేయమని కోరుతున్నామని తెలుసుకోవాలని హితవు పలికారు. హైకోర్టులో తీర్పు రాకముందే సుప్రీం కోర్టు వెళ్తామని చెప్పడం కార్మికుల అంతిమ విజయానికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ సంగతి చూస్తాం... అంతు తేలుస్తాం అంటారే తప్పితే చేసిందేమీ లేదని, న్యాయస్థానంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు బోనులో దోషిగా నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీ కార్మికులదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌కు శాపనార్థాలు పెట్టవద్దని, దేవుడా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని ప్రతి కార్మికుడు కోరుకోవాలని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకావడం తథ్యమని అన్నారు. యుద్ధంలో శత్రువు బతికి ఉన్నప్పుడే గెలవాలని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్ జాగీరుకాదని, ఏవడబ్బ సొమ్మని అమ్ముకుంటావు అంటూ నిప్పులు చెరిగారు. కార్మికులు విధుల్లో చేరకపోతే 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం చూస్తే కేసీఆర్ ముందే కుట్రపన్నాడని తెలుస్తోందన్నా రు. హైకోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి అక్షింతలు తప్పడంలేదని, ఒక దశలో ఇదేమి రాజరికంకాదని వ్యా ఖ్యానించిందంటే ప్రభుత్వంపై రాజ్యాంగ సంస్థ ఎంతమేర అసహనంతో ఉందో ఇట్టే అర్థమైతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఆర్.గోపిగౌడ్, జేవీ స్వామి, ఖయ్యాం, విశ్వనాథ్, యాదయ్య, డీబీకే రెడ్డి, వీవీమూర్తి, చలపతిరెడ్డి, బాలస్వామి ఉన్నారు. 40వ రోజుకు చేరిన సమ్మె ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 40వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యా్యమూర్తులతో కమిటీ వేస్తామంటే విముఖత చూపడం ప్రభుత్వ దివాళాకోరు తానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, బీసీ సంఘం నేత యుగంధర్‌గౌడ్, బీజేపీ కృష్ణ, పరశురాం, వెంకటేశ్వర్‌రెడ్డి. ఎమ్మార్పీఎస్ గద్వాల కృష్ణ, కోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
బాడీ బిల్డర్స్‌కు మంత్రి తనయుడి చేయూత
మారేడుపల్లి : చైనా దేశంలోని మంగోలియాలో సెప్టెంబర్ 12 నుండి 18 వరకు జరుగనున్న మిస్టర్ ఏషియన్, మిస్టర్ వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీలకు ఎంపికైన బాడీ బిల్డర్స్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ చేయూతనిచ్చారు. కార్ఖానా కాకగూడకు చెందిన కిరణ్‌కుమార్ సాధించిన పతకాలతో పాటు మిస్టర్ వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీల ఎంపికకు సంబంధించి ‘సాక్షి’ దినపత్రికలో ‘చేయూతనందిస్తే సత్తా చాటుతా’ అనే కథనం సోమవారం ప్రచురితమైంది. తలసాని సాయికిరణ్ యాదవ్ స్పందించి కిరణ్‌కుమార్‌ను మంగళవారం తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలను సేకరించారు. పోటీలకు ఎంపికైన కిరణ్‌కుమార్‌తో పాటు మహ్మద్ నిజాముద్దీన్లకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్న వారికి రానుపోను 6 లక్షల రూపాయలు చెల్లించి విమాన టిక్కెట్లను బుక్‌చేశారు (ఒక్కొక్కరికి 3 లక్షలు చొప్పున). ఈ సందర్బంగా సాయికిరణ్‌యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు చేయూతనందిస్తుందని ఆయన అన్నారు. -
బాలస్వామి సన్యాస స్వీకార మహోత్సవం ఆరంభం
సాక్షి, విజయవాడ/తాడేపల్లిరూరల్ (మంగళగిరి) : విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ బాలస్వామి సన్యాస స్వీకరణ, పట్టాభిషేక మహోత్సవాలకు.. వేద మంత్రోచ్ఛారణలు, హోమాల మధ్య శనివారం ఉదయం అంకురార్పణ జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కృష్ణానది కరకట్టవెంట ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమం.. సన్యాస స్వీకరణ కార్యక్రమానికి వేదికైంది. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం తొలిరోజు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో అంగరంగవైభవంగా జరిగింది సన్యాసదీక్ష స్వీకరిస్తున్న కిరణ్‌కుమార్ శర్మ స్వస్థలం విశాఖ జిల్లా భీమునిపట్నం. 1993 ఏప్రిల్ 4న ఆయన జన్మించారు. హనుమంతరావు ఇద్దరి కుమారుల్లో పెద్దవాడు కిరణ్‌కుమార్ శర్మ. మూడో తరగతి చదువుతున్నప్పుడు తల్లిదండ్రులతో స్వామిజీ ఆశ్రమానికి వచ్చారు. మహాస్వామి కంటికి ఆ బాలుడు అపర శంకరుడుగా గోచరించడంతో పీఠంలో చేర్చాలని తల్లిదండ్రులను మహాస్వామి కోరారు. తర్వాత మహాస్వామికి ప్రధాన శిష్యుడయ్యారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ శ్రీరాజశ్యామలాదేవి పీఠం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్వరూపానందేంద్రను దర్శించుకున్న ప్రముఖులు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, సినీనటి శారద, సినీ హీరో శ్రీకాంత్, ఊహ దంపతులు స్వామిని దర్శించుకున్నారు. -
ప్రజా విజయ 'కిరణం'
సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్ట నష్టాలు చూసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ఉన్న ఆధరాభిమానాలు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పార్టీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్‌కు ఎమ్మెల్యేగా ప్రజలు భారీ మెజార్టీతో పట్టంకట్టారు.గురువారం విడుదలైన 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో భారీ గెలుపుతో ఫ్యాన్ స్పీడ్ విజయకేతం ఎగురవేసింది. టీడీపీ అరాచక, అవినీతి పాలనను అనుభవిస్తూ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అందక, మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడ్డారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రజలు కష్టాలు తెలుసుకున్నారు. ప్రజాసంక్షేమం కోసం పరితపించే జననేత వచ్చారని, ఐదేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు ఉండవని, జగన్మోహన్రెడ్డి సుపరిపాలనతో పాటు నవరత్నాల పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయని సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురుచూశారు. టీడీపీ అరాచక పాలనతో విసుగెత్తిన ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గొర్లె కిరణ్‌కుమార్, టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ప్రజలతో మమైకమై ప్రజా కష్టాలు తెలుసుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరి ఓటేశారు. వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. వైఎస్సార్సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. గురువారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అనుహ్య మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ను గెలిపించారు. మండలంలోని 115 పంచాయతీల్లో అన్ని గ్రామాలు వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చి ప్రజలు వైఎస్సార్సీపీపై ఉన్న ఆదరాభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్సీపీదే ఆధిక్యత ఎచ్చెర్ల నియోజకవర్గంలో జి.సిగడాం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో అన్ని రౌండ్‌ల్లోనూ వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఏ దశలోనూ కనీసం టీడీపీ పోటీ ఇవ్వలేకపోయింది.కళా వెంకట్రావుపై గొర్లె కిరణ్‌కుమార్ అనూహ్యంగా విజయం సాధించారు. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. గొర్లె కిరణ్‌కుమార్ 18,813 ఓట్ల ఆధిక్యతతో టీడీపీకి చెందిన కళా వెంకట్రావుపై గెలిచారు. పనిచేయని ఈవీఎంలు ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఓట్ల కౌంటింగ్‌లో రెండు ఈవీఎంలు మొరాయించాయి. 45వ పోలింగ్ కేంద్రం నిద్దాం ప్రాంతానికి చెందిన ఈవీఎం, 172 కొవ్వాడకు చెందిన ఈవీఎంలు పనిచేయలేదు. ఓట్లు డిస్ప్లే కాకపోవడంతో ఆయా ఈవీఎంలను కౌంటింగ్ సూపర్వైజర్లు సరెండర్ చేశారు. వీటి స్థానంలో వీవీ ప్యాట్లను లెక్కించి పరిగణనలోకి తీసుకున్నారు. స్పష్టమైన మెజార్టీ ఉండడంతో రాజకీయ పార్టీ ఏజెంట్లు సైతం ఎటువంటి అభ్యంతరం తెలియజేయలేదు. మొరాయించిన 168వ నంబర్ పోలింగ్ ఈవీఎం విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఓటింగ్ కౌంటింగ్‌కు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గంలో మెంటాడకు చెందిన 168వ పోలింగ్ కేంద్రం పనిచేయలేదు. ఈవీఎం స్థానంలో వీవీప్యాట్‌ను అధికారులు లెక్కించారు. ఈ కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీకి– 335. టీడీపీకి–229 ఓట్లు, జనసేన–4 నమోదయ్యాయి. మిగిలిన ఓట్లు ఇతరకు నమోదయ్యాయి. ఎంపీకి స్పష్టమైన ఆధిక్యత వైఎస్సార్సీపీకి ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌కు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. 14,476 ఓట్లు ఆధిక్యత వచ్చింది. సుమారు 23 రౌండ్లో 22 ఆధిక్యం కొనసాగింది. బెల్లాన చంద్రశేఖర్ 96112 ఓట్లు, ప్రత్యర్థి టీడీపీకి చెందిన ఎంపీ అశోక్‌కు 81636 ఓట్లు, జనసేన అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావుకు 4530, కాంగ్రెస్ అభ్యర్థి ఆదిరాజుకు 2134 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. కౌంటింగ్‌ను పరిశీలించిన కిరణ్‌కుమార్ శివానీ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన కౌంటింగ ప్రక్రియను గొర్లె కిరణ్‌కుమార్ పరిశీలించారు. తనకు మెజార్టీ వచ్చిన రౌండ్లు, గ్రామాలు పరిశీలించారు. జనరల్ ఏజెంట్లు పిన్నింటి సాయికుమార్, ఎం.మురళీధర్ బాబా పోలింగ్ సరళిని ఆయనకు వివరించారు. మెజార్టీ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్ల వివరాలు ఎచ్చెర్ల క్యాంపస్: విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించిన పోస్టల్ బ్యాలెట్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో సగానికి పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలో 1394 ఓట్లు వినియోగించుకోగా 726 ఓట్లు చెల్లలేదు. 668 ఓట్లు నమోదయ్యాయి. మూడు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. 326 ఓట్లు వైఎస్సార్సీపీకి మెజార్టీ లభించింది. పోస్టల్ బ్యాలెట్లో నమోదైన ఓట్ల వివరాలు వైఎస్సార్సీపీ– 479, టీడీపీ– 153, జనసేన–42, కాంగ్రెస్–3, నోటా–5 తిరస్కరణ–3 మొత్తం– 685 422 సర్వీసులు ఓట్ల వినియోగం ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల జోన్లో 422 సర్వీసు ఓటర్ల నమోదయ్యాయి. ఇందులో 333 ఓట్లు చెల్లిన ఓట్లు 123,. టీడీపీకి–118, బీజీపే–34, జనసేన–51, కాంగ్రెస్–6, ఒక ఓటు తిరస్కరణకు గురైంది. -
తొలి గెలుపు అదుర్స్
సాక్షి, శ్రీకాకుళం: ఫ్యాన్ గెలుపు సునామీలో సైకిల్ కొట్టుకుపోయింది. తలపండిన టీడీపీ నేతలకు దిమ్మతిరిగేలా ఓటర్లు షాక్ ఇచ్చారు. అవినీతిపరుల పాలనను మూకుమ్మడిగా తిరస్కరించారు. రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న నవ నాయకత్వానికి పట్టం కట్టారు. జిల్లాలో ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తొలిసారి గెలుపు రుచేంటో చూపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలిసారి అడుగిడునున్న రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, సీదిరి అప్పలరాజుల గెలుపునకు దోహదపడిన కొన్ని అంశాలు చదివిద్దేమిలా.. డాక్టర్ దెబ్బకు టీడీపీ కోట బద్దలు మందస: ఓ వైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం.. సామ, దాన, భేద, దండోపాయాలు తెలిసిన నాయకత్వం గౌతు శ్యామసుందర శివాజీ సొంతం. మరోవైపు పిన్న వయస్కుడు, అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు భారతంలోని అభిమన్యుడు లాంటి వాడే. ఈయన కురువృద్ధుడు లాంటి శివాజీ రాజకీయ బాణాలను, పాశుపతాస్త్ర, బ్రహ్మాస్త్రాలతో ఎదుర్కొని జయకేతనం ఎగురవేశారు. వజ్రపుకొత్తూరు మండలంలోని ఓమారుమూల గ్రామమైన దేవునల్తాడలో ఓ సామాన్య మత్స్యకార కుటుంబానికి చెందిన సీదిరి దాలయ్య, నీలమ్మ దంపతులకు అప్పలరాజు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెతను రుజువు చేస్తూ, విద్యలో మంచి ప్రతిభ చూపారు. ఎంబీబీఎస్ చదివి పలాస–కాశీబుగ్గలో ప్రాక్టీసు చేస్తూ ఎంతో మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ అప్పలరాజు ప్రతిభ, నిపుణత చూసి, పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా రాజకీయాల్లో దూసుకుపోయారు. ప్రజల మనసులో మంచిస్థానం సంపాదించగలిగారు. ఈయన్ను ఎదుర్కొనలేక టీడీపీ కుటిల యత్నాలకు దిగింది. ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే గౌతు శివాజీ, అభ్యర్థిగా శిరీష, ఆమె భర్త వెంకన్నచౌదరి, గౌతు విజయలక్ష్మి, జీకే నాయుడు, పీరికట్ల విఠల్‌రావు, వజ్జ బాబురావు ఇలా ఒకరేమిటి ఎంతోమంది రాజకీయ అనుభవం గల నాయకులు ఒక వైపు.. తానొక్కడే ఒంటిచేత్తో మరో వైపు పోరాడిన అప్పలరాజు సునాయాస విజయాన్ని చేజిక్కించుకున్నారు. అత్యధికంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శివాజీ కుమార్తె శిరీషను ఓడించి, పలాసలో వైఎస్సార్సీపీకి స్థానం కల్పించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజకీయ వ్యూహానికి రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రెడ్డి శాంతి ప్రభంజనం ఎల్.ఎన్.పేట: పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి గెలుపు జన ప్రభంజనంగా నిలిచింది. ఈమెను ఓడించాలని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పన్నిన కుయుక్తులు ఓటర్ల సునామీలో కొట్టుకుపోయాయి. స్థానికేతరాలని, ఈమెను కలవాలంటే ఢిల్లీ వెళ్లాలా అంటూ ప్రత్యర్థి పార్టీ నాయకులు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. వంశధార నిర్వాసితులను బలవంతంగా గ్రామాల నుంచి బయటకు పంపించిన తెలుగుదేశం పార్టీకి వారి ఉసురే తగిలిందని నిర్వాసిత గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు నిర్వాసితుల అండగా నిలుస్తారని భావించినప్పటికీ గట్టి గుణపాఠమే చెప్పారు. మెళియాపుట్టి మండలంలో ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌లో నష్టపోయిన బాధితుల సమస్యలతోపాటు వంశధార నిర్వాసితుల సమస్యలపైన పోరాటం చేస్తూ అండగా నిలిచిన ఈమె తన విజయానికి బాటలు వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు చేసిన అక్రమాలు ప్రజలకు వివరించడంతోపాటు ప్రజలకు అండగా ఉంటానని నియోజకవర్గం మొత్తంగా పర్యటించినందుకు ప్రజలంతా అక్కున చేర్చుకున్నారు. కిరణ్‌కే పట్టం ఎచ్చెర్ల క్యాంపస్: రాజకీయ కురువృద్ధుడు, మంత్రి కళా వెంకటరావును ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మట్టి కరిపించారు. టీడీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీ ఉనికి లేకుండా చేసిన కళాకు ఓటర్లు సైతం గట్టి సమాధానమిచ్చారు. ఈ మేరకు స్థానిక నేత గొర్లె కిరణ్‌కుమార్‌కు బ్రహ్మరథం కట్టారు. 2014 ఎన్నికల్లో కళా వెంకటరావు చేతిలో కిరణ్ ఓటమి చవిచూశారు. అయినప్పటికీ నిరాశ చెందకుండానే వైఎస్సార్సీపీ శ్రేణులతో కలసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై పోరాడుతూ వచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం మీసాల నీలకంఠంనాయుడు కూడా పోటీపడినప్పటికీ కొన్ని నెలల క్రితం ఈయన మంత్రి కళా లాబీయింగ్‌తో టీడీపీలో చేరిపోయారు. దీంతో కిరణ్‌కుమార్‌కు టిక్కెట్టు ఖాయమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావటంవ వల్ల కళా విజయం తథ్యంగా టీడీపీ వర్గాలు భావించాయి. అయితే కిరణ్‌కుమార్ స్థానికుడు కావటం, ఎన్నికల్లో ఓడినా నిరంతరం ప్రజల్లో ఉండటంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచారు. -
అవకాశమిస్తే... అభివృద్ధి చేస్తా..
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం): వైఎస్సార్సీసీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్ స్థానికుడు. మాజీ మంత్రి, మాజీ జెడ్పీ చైర్మన్ గొర్లె శ్రీరాములనాయుడు రాజకీయ వారసుడిగా అందరికీ సుపరిచితుడే. నియోజకవర్గంలోని సమస్యలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు నిత్యం ప్రజలతో మమేకమై, వారి కష్టాల్లో చేదోడు వాదోడుగా నిలుస్తూ అండగా ఉంటున్న గొర్లె కిరణ్‌కుమార్ నియోజకవర్గ ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న కిరణ్‌కుమార్ తన మనసులో మాటను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వ్యక్త పరిచారు. ప్రశ్న: నియోజకవర్గం ప్రజలతో ఎలా మమేకమయ్యారు? జవాబు: మాజీ మంత్రి, మాజీ జెడ్పీ చైర్మన్ దివంగత గొర్లె శ్రీరాములనాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను.రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నాను. నేను స్థానికుడిని, రణస్థలం మండలం పాతర్లపల్లి నా స్వగ్రామం. నా భార్య పరిమళ రణస్థలం ఎంపీపీగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2009 లో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం తృటిలో తప్పింది. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాను. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ ప్రారంభించినప్పటి నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నాను. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉన్నాను. 115 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను నా కుటుంబంగా భావించాను. ప్రజలతో నాకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు? జవాబు: మహానేత వైఎస్సార్ హయాంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గంలోని సమస్యలను పూర్తిగా విస్మరించింది. నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఉంది. తోటపల్లి, నారాయణపురం ఆనకట్టు ఆధునికీకరణ, ఎస్.ఎం.పురం పెద్దచెరువుకు మడ్డువలస మిగులు జలాలు తరలింపు జరగలేదు. ట్రిపుల్ ఐటీ ఎచ్చెర్లలో ఏర్పాటు చేసినా నూజివీడులో తరగతులు కొనసాగుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు, సిబ్బంది కొరత ఉంది. పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేవు. ఈఎస్ఐ వంద పడకల ఆస్పత్రి కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. జెట్టీలు లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. బుడుమూరు నారాయణసాగరం జలాశయం ఏర్పాటు సమస్యగా మిగిలిపోతుంది. ప్రశ్న: సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు? జవాబు: స్థానికుడిగా ప్రతి సమస్యపై నాకు అవగాహన ఉంది. సాగునీటి సమస్య పరిష్కారిస్తా. ట్రిపుల్ ఐటీ, బీఆర్‌ఏయూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తాను. స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు, యువతకు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను. జెట్టీల నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్‌లు, ఎచ్చెర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,బి.ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాను. వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి ప్రాధాన్యత నిస్తాను. ప్రశ్న: టీడీపీ పాలనలో ఇబ్బందులకు గురైన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు? జవాబు: టీడీపీ పాలనలో సంక్షేమ పథకాలు అమల్లో అర్హులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వ పథకాల ఎంపికలో నిష్షక్ష పాతంగా జరగాలి, కాని జన్మభూమి కమిటీల పెత్తనం సాగింది. వైఎస్సార్సీపీ అధికారంలో వచ్చిన వెంటనే రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హునికీ ప్రభుత్వ పథకాలు ఇంటికి చేరేలా అమలు చేస్తాం. ప్రశ్న: మీ విజయానికి వ్యూహాలు ఏమిటి? జవాబు: ప్రత్యేక వ్యూహం అంటూ లేదు. టీడీపీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. నియోజక వర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండానే మంత్రి కుమారుడికి భూములు కేటాయించారు. మంత్రి కళా వెంకట్రావు పీఏలు, పథకాల పేరుతో టీడీపీ నాయకులు ప్రజా ధనం దోచుకున్నారు. ఎస్.ఎం.పురం తదితర ప్రాంతాల్లో జెడ్పీ ఛైర్పర్సన్ కుటుంబ సభ్యులు భూ పట్టాలు అక్రమంగా చేసుకున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం మంత్రి కళా వెంకట్రావు కనుసన్నల్లో సాగుతోంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను టీడీపీ నాయకులు అమ్ముకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాం. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో, నవరత్నాల పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నాం. మంత్రి కళా వెంకట్రావు నియోజకవర్గ సమస్యలను పట్టించుకోలేదు. ఈ విషయం ప్రజలకు తెలుసు. ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రత్యేక హోదాపై మేం పోరాటాలు చేశాం. అన్ని అంశాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వైఎస్సార్‌సీపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. -
ఇక కళా వెంకట్ర్రావు అక్రమాలు చెల్లవు
-
స్వైన్‌ఫ్లూనే..!
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలో స్వైన్‌ప్లూ కలకలం రేగినప్పటికీ స్వైన్‌ప్లూతో ఒక రోగి సికింద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వైద్యశాఖ అధికారులు మాత్రం దీనిని దాచి పెట్టే యత్నం చేస్తున్నారు. స్థానిక శిఖామణి చర్చి వద్ద నివశిస్తోన్న పెట్‌షాప్ నిర్వాహకులు జూలూరు వెంకట రమణ కిరణకుమార్‌కు స్వైన్‌ఫ్లూ సోకింది. దీంతో జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ఆసుపత్రుల్లో పలు వైద్యరీక్షలు నిర్వహించి రోగి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని సికింద్రాబాద్ తరలించారు. సికింద్రాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిరణ్‌కుమార్‌కు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతనికి స్వైన్‌ప్లూ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ప్లూ సోకిందని “సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురించడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు రెండు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం పీహెచ్సీ సిబ్బందిని కిరణ్‌కుమార్ వైద్య పరీక్షలు నివేదిక తీసుకువచ్చేందుకు సికింద్రాబాద్ పంపారు. అయితే తమకింకా కిరణ్‌కుమార్‌కు సంబంధించి వైద్యపరీక్షల నివేదికలు రాలేదని వైద్యాధికారులు చెప్పుకొస్తున్నారు. కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ప్లూ సోకలేదని, ఇన్ప్లూయేంజాతో బాధపడుతున్నారని మభ్యపెడుతూ వచ్చారు. అయితే కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ప్లూ సోకడమే కాకుండా అతనికి ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బతిని అపస్మారక స్థితిలో సికింద్రాబాద్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. కిరణ్‌కుమార్ వైద్యానికి సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారు. అయినా వైద్యాధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. కిరణ్‌కుమార్‌కు చెందిన వైద్య పరీక్ష నివేదికలు కూడా తమకు ఇంకా అందలేదని చెబుతూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ జూలూరి వెంకట రమణ కిరణ్‌కుమార్‌కు స్వైన్‌ప్లూ సోకినట్లు సికింద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 5వ తేదీనే అక్కడి వైద్యులు కిరణ్‌కుమార్‌కు నిర్వహించిన వైద్యపరీక్షల నివేదిక సాక్షి సేకరించింది. ఆ నివేదికలో కిరణ్‌కుమార్‌కు ఇన్‌ప్లూయేంజా ఏ/హెచ్1–2009 ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంటే ఇన్‌ప్లూయేంజా–ఎ వైరస్ ఉన్నట్లైతే రోగికి స్వైన్‌ప్లూ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. ఇప్పటికైనా వైద్యాధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకుని స్వైన్‌ప్లూపై ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతున్నారు. స్వైన్‌ప్లూ లేదని చెప్పే వైద్యులు దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కిరణ్‌కుమార్ వైద్యంపై వైద్యశాఖ జోక్యం చేసుకుని మెరుగైన వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు. -
కిరణ్‌కుమార్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్
-
ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం...
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: సీల్డ్ కవర్ సీఎం కావాలా, సింహం లాంటి కేసీఆర్ కావాలో తేల్చుకోవాలని ఓటర్లను తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరారు. మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో 40 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు. తోడు దొంగలైన కాంగ్రెస్, టీడీపీ జట్టు కట్టి సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నాయని విమర్శించారు. రైతులను రాబందులుగా కాల్చుకుతిన్న ఈ రెండు పార్టీలు ఒక్కటైయ్యాయని, తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పట్లో తేలేది కాదన్నారు. ‘వాళ్లు సీట్లు పంచుకునే లోపు మనం స్వీట్లు పంచుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అన్నివర్గాల సంక్షేమం కోసం దేశంలో ఎవరు చేయనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అంధకారమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోపే విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాకపోయివుంటే ఇవన్నీ జరిగేవా అని ప్రశ్నించారు -
అవధుల్లేని అవకాశవాదం
త్రికాలమ్ నిర్దిష్టమైన సిద్ధాంతాలూ, విలువల ఆధారంగా రాజకీయాలు ఉంటాయన్న సంగతి రాజకీయ నేతలు మరచిపోయారు. సూత్రబద్ధమైన రాజకీయాలూ, జన హితమైన విధానాల కంటే ఎత్తులూ, వ్యూహాలూ నేటి రాజకీయాలను శాసిస్తు న్నాయి. గెలుపే ప్రధానంగా అభ్యర్థులను ఎంపిక చేయడం, సర్వేలు జరిపించి ఎవరికి విజయావకాశాలు ఉంటే వారికే టిక్కెట్లు ఇస్తామని ప్రకటించడం సర్వ సాధారణమైపోయింది. ఎన్నికలలో గెలుపుకోసం డబ్బు ఖర్చు చేయాలనీ, కుల సంఘాల నాయకులను పట్టుకోవాలనీ, ఏ కులం ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ కులానికి చెందిన అభ్యర్థికే టిక్కెట్టు ఇవ్వాలనీ, అలవికాని హామీలు గుప్పించైనా సరే, నిన్నటి వరకూ ప్రబల ప్రత్యర్థులుగా పరిగణించినవారిని కలుపుకొని పోవ లసి వచ్చినా సరే ఆ పని నిస్సంకోచంగా చేసేయాలనీ మినహాయింపు లేకుండా అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. పచ్చి అవకాశవాదం రాజ్యమేలుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకుల విన్యాసాలు చూస్తుంటే ప్రజా స్వామ్యంలో విశ్వాసం ఉన్నవారి మనసు వికలం అవుతుంది. పరమ నికృష్టమైన క్రీడలో పావులవుతున్నందుకు ప్రజల పట్ల సానుభూతి పెరుగుతుంది. నేతలను ప్రశ్నించకుండా, నిలదీయకుండా వెన్నెముకలేని అమాయక జనం వారినే పదే పదే గెలిపిస్తున్నందుకు ఆగ్రహం కలుగుతుంది. కాంగ్రెస్–టీడీపీ చెలిమి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు తనదైన శైలిలో కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చారు. అదే ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలోనూ, లోక్‌సభ ఎన్నికలలోనూ అమలు చేయబోతున్నట్టు సమాచారం. 2014లో భాగస్వామ్య పక్షాలతో వైరం పెట్టు కోవాలనీ, అప్పటి వైరిపక్షాలతో స్నేహం చేయాలన్నది తాజా వ్యూహం. నాలుగు న్నర సంవత్సరాలలో సాధించిన ఘనకార్యం ఏదీ ప్రజలకు చూపించడానికి లేదు కనుక తాను ఏమీ చేయలేకపోవడానికి ఎన్డీఏ సర్కార్, ప్రధాని నరేంద్రమోదీ కారణమని చెప్పాలని కొన్ని మాసాల కిందటే నిర్ణయించుకు న్నారు. ఆ విధంగానే ముందుకు పోతున్నారు. అయినదానికీ, కానిదానికీ మోదీతో లింకు పెట్టి ఆయనను ప్రతినాయకుడిగా చిత్రించడానికి చేయవల సిందంతా చేస్తున్నారు. ఒక పథకంగా ప్రకారం అడుగులు వేస్తున్నారు. అటు వంటి అడుగే ఒకటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా వేశారు. తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాననీ, బీజేపీ పడనీయలేదనీ, తనకూ, కేసీఆర్‌కీ మధ్య మోదీ దూరం పెంచారనీ చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. మోదీలో లౌకికతత్వం లోపించిందని టీడీపీ లెజిస్లేచర్‌పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. గోధ్రా ఉదంతాన్నీ, గుజరాత్ అల్లర్లనూ ప్రస్తావించారు. ‘నారా హమారా’ అంటూ ముస్లింల సమావేశం ఏర్పాటు చేశారు (అది బెడిసికొట్టిందనేది వేరే విషయం). బీజేపీతో కూటమి కట్టడం వల్ల మైనారిటీలు దూరమైనారు. వారిని ఆకర్షించడానికి ఏదో ఒక నినాదం పట్టుకొని, ఒక సభ పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టుకోవచ్చునని ఆశ. ఒక్క ముస్లిం మంత్రి కూడా లేకుండా ఇంతకాలం ప్రభుత్వం నడిపిన సంగతి ముస్లిం ప్రజలు గుర్తించకుండా గుడ్డిగా ‘నారా హమారా’ అంటారని అనుకోవడం భ్రమ. గుజరాత్లో అల్లర్లు జరిగిన తర్వాత కూడా చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకోలేదు. 2004లో బీజేపీతో కలిసే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేశారు. ఓడిపోగానే ‘జీవితంలో బీజేపీతో కలిసి పోటీ చేసే సమస్య లేదు’ అంటూ ప్రకటించారు. అల్లర్లు జరిగినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారో, ఎవరికి రాజ ధర్మం గురించి నాటి ప్రధాని వాజపేయి ప్రబోధం చేశారో ఆ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీతోనే 2014లో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో, రాష్టప్రభుత్వంలో భాగస్వాములుగా సహజీవనం చేశారు. మోదీకి తిరుపతి ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇచ్చేవారు. అణుకువగా ఉండేవారు. ఎన్నికలు దగ్గరపడేవరకూ ఒక బలిపశువు అవసరం ఏర్పడింది. బీజేపీని బలి చేయాలని నిర్ణయించుకున్నారు. రెండుసార్లు పొత్తు పెట్టుకొని విడిపోయిన చంద్రబాబు 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో మూడోసారి సంబంధం కలుపుకోరన్న పట్టింపు ఏమీ లేదు. మోదీ సైతం రియల్‌పొలిటిక్ (ఏది ఆచ రణయోగ్యమో, ఏది అవసరమో అదే చేసే గడుసు రాజకీయం) తెలిసిన నేత కనుక ఎన్నికల తర్వాత అవసరం ప్రకారం వ్యవహరిస్తారు. 2002లో తనను చంద్రబాబు ఏ విధంగా విమర్శించారో మోదీకి తెలుసు. అయినా టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాదు ఉమ్మడి వేదికలపైన ప్రచారం చేశారు. ఒకరినొకరు పొగుడుకున్నారు. ఇప్పుడు చేస్తున్న విమర్శలను సైతం రాజకీయ అవస రార్థమేనని మోదీ అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్పార్టీనీ, సోనియాగాంధీని ఇటలీ మాఫియా అనీ, అవినీతి అనకొండ అనీ, ప్రజలు కత్తులూ, కొడవళ్ళతో వీధులలోకి వచ్చి కాంగ్రెస్‌ని నరికి భూస్థాపితం చేయాలనీ, మన్మోహన్ సింగ్ పనికిమాలిన ప్రధాని అనీ తిట్టిన తిట్టు తిట్టకుండా నాలుగున్నర సంవత్సరాలు తిట్టి ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడటాన్ని అస్మదీయులు చక్రం తిప్పడంగా అభివర్ణించి ఆనందించవచ్చు. సాధారణ ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? రాజకీయ నాయకుల అవసరాలకు అను గుణంగా రంగులు మార్చితే ప్రజలు కూడా అదే విధంగా అభిప్రాయాలు మార్చుకుంటూ పోవాలా? టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందామని అనుకున్నారట. అదేమీ చంద్ర బాబుకి కొత్త కాదు. 2009 ఎన్నికలలో టీఆర్ఎస్తో కలిసే పోటీ చేశారు. మరోసారి అదే పని చేయాలని అనుకున్నా అది ఏకపక్ష నిర్ణయమే. టీఆర్ఎస్ టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? శాసనసభ్యుల ఫిరాయింపులతో దాదాపు గల్లంతైన పార్టీకి మళ్ళీ ఊపిరెందుకు పోస్తుంది? టీడీపీ టిక్కెట్టుపై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్లో చేరినప్పుడు హైదరాబాద్‌లో చంద్రబాబు ఎంత తీవ్రంగా టీఆర్ఎస్నీ, కేసీఆర్నీ నిందించారో అవసరార్థం ఆయన మరచిపోవచ్చును కానీ కేసీఆర్ మరచిపోతారా? ‘ఓటుకు కోట్ల’ కేసులో ఏసీబీకి చిక్కినప్పుడు ‘చంద్రబాబూ, నిన్ను బ్రహ్మదేవుడుకూడా రక్షించలేడు’ అంటూ కేసీఆర్ హుంకరించిన విషయం ప్రజలకు గుర్తుండదా? నాయకులు మరచిపోయినట్టు నటించవచ్చును కానీ ప్రజలకు నటించవలసిన అవసరం ఏమున్నది? ప్రతి ఎన్నికలకూ భాగస్వామ్య పక్షాలను మార్చి కొత్త కూటములు కట్టడం తెలివైన రాజకీయపుటెత్తుగడ కావచ్చునేమో కానీ నైతికం మాత్రం కానేకాదు. ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొని, విడిపోయి, మళ్ళీ కలిసి, మళ్ళీ విడిపోయి రకరకాల కపట విన్యాసాలు చేసే రాజకీయ నాయ కులను ప్రజలు ఎందుకు గౌరవించాలి? నలభై ఏళ్ళు అధికార రాజకీయాలలో అనుభవం ఉన్నా విలువలు లుప్తమైనప్పుడు ఆదరించవలసిన అవసరం ఏమున్నది? తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ స్నేహం అందుకే కృతకంగా కనిపిస్తోంది. ఇది అవకాశవాద రాజకీయానికి పరాకాష్ఠ. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించి ఆంధ్రులకు అన్యాయం చేసిందంటూ తిట్టిపోసిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు చంద్రబాబుకి ఎందుకు అవసరం? కాంగ్రెస్‌తో భాగస్వామ్యం ఉన్నట్లయితే దళితులలో, ఆదివాసీలలో, ముస్లింలలో కొంత శాతమైనా ఓట్లు దక్కు తాయేమోనన్న ఆశ. నరేంద్రమోదీకీ, పవన్‌కల్యాణ్‌కీ దూరం జరిగిన అనంతరం కేవలం టీడీపీ ఓట్లు మాత్రమే చంద్రబాబు చేతిలో ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ ఓట్లు కలిస్తేనే ఒకటిన్నర శాతం తేడాతో 2014లో అతికష్టంపైన గట్టెక్కగలిగారు. అప్పుడు లేని కొత్త అంశం ప్రభుత్వం పట్ల బలంగా ఉన్న వ్యతిరేకత. అదనుకోసం ఎదురు చూస్తున్న జనం ప్రభుత్వం చేతల వల్ల, చేతకానితనం వల్ల, చిత్తశుద్ధిలేమి వల్ల నష్టపోయిన ప్రజలు టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు అదను కోసం ఎదురు చూస్తున్నారు. నెపం అంతా మోదీపైకి తోసినంత మాత్రాన ప్రజలు చంద్రబాబును క్షమించరు. మోదీపట్ల వ్యతిరేకత పెరుగుతుంది. కానీ చంద్రబాబుపట్ల సానుకూలత పెరిగే అవకాశం లేదు. దొందూ దొందే అని ప్రజలు ఛీత్కరించే అవకాశాలే ఎక్కువ. మోదీ, చంద్రబాబు మాత్రమే ప్రజల ముందున్న ప్రత్యామ్నాయాలు కాదు. మోదీకి కానీ బీజేపీకి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ప్రాబల్యం లేదు. టీడీపీకి ప్రత్యామ్నాయం వైఎస్ఆర్సీపీ రూపంలో సిద్ధంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకుడు రేపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయబోతున్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో జనసందోహం, ప్రజలలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న ఆశాభావం, ఆనందోత్సాహాలు ఇప్పుడు గాలి ఎటు వీస్తున్నదో స్పష్టం చేస్తున్నాయి. రాజకీయం అంటే కేవలం ఎత్తుగడలూ, వ్యూహాలూ, ధనబలం, కండబలం, కులబలం మాత్రమే కాదనీ ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను ఆలకిస్తూ, సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకం కలిగిస్తూ నిజా యితీగా నడిచే రాజకీయాన్ని జనం గౌరవిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావంచకుండా ప్రజల దృష్టిని సమస్యలపై నుంచీ, వాస్తవాలపై నుంచీ మరల్చేందుకు టీవీ చానళ్ళలో ‘టాక్‌షోల’లో విని యోగిస్తూ, సోషల్ మీడియాను ప్రయోగిస్తూ సంచలనాత్మక, వినోదాత్మక, వ్యూహాత్మక, ఊహాజనిత సన్నివేశాలను ప్రదర్శిస్తూ వచ్చే ఎన్నికలలో గెలు పొందవచ్చునని భావించడం ప్రజలనూ, వారి వివేకాన్నీ అవమానపరచడమే. ప్రజల విషయమే కాదు సొంత పార్టీలోని నాయకుల, కార్యకర్తల వివేకం పట్ల కూడా టీడీపీ అధినేతకు గౌరవం లేదు. 2009లో సీమాంధ్ర నాయకులకు ఇష్టం లేకపోయినా ఆదరాబాదరాగా ఒక కమిటీ వేసి, దాన్ని రాష్ట్రం అంతటా తిప్పించి, తనకు కావలసిన నివేదికను ఇప్పించుకొని, పార్టీ పొలిట్‌బ్యూరో చేత ఒప్పించి రాష్ట్ర విభజనకు సుముఖమేనంటూ ప్రణబ్కుమార్ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చారు. తీరా 2009 డిసెంబర్ 9న నాటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ఎంపీలూ, ఎంఎల్ఏలతో కలిసి టీడీపీ ఎంపీలూ, ఎంఎల్ఏలూ రాజీనామా చేయడాన్ని నిరోధించకపోవడం చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతానికి నిదర్శనం. ఇప్పుడు కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీలో అత్యధికులకు కాంగ్రెస్‌తో పొత్తు సుతరామూ ఇష్టం లేదు. నిజానికి జీవితకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులలో చాలామందికి ఇది మింగుడుపడటం లేదు. మింగలేకా కక్కలేకా సతమతం అవుతున్నారు. బాబు జాగ్రత్త మొన్న కర్నూలు సభ తర్వాత ఢిల్లీకి తిరిగి వెడుతూ శంషాబాద్ విమానా శ్రయంతో తనను కలిసిన కాంగ్రెస్ నాయకులతో రాహుల్ మాట్లాడుతూ, ‘బాబు మీద ఈగ వాలనివ్వకండి. ఒకవేళ టీఆర్ఎస్ నేతలు బాబుని విమర్శిస్తే మీరు ఎదురుదాడి చేయండి’ అంటూ ఉద్బోధించారని వార్త. కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ఓట్లు టీడీపీకీ, టీడీపీ ఓట్లు కాంగ్రెస్కీ బదిలీ అవుతాయో లేదో తెలియదు కానీ టీఆర్ఎస్కి బలమైన ప్రచారాస్త్రాలు లభిం చాయి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తామంటూ వాగ్దానం చేస్తున్న కాంగ్రెస్‌ని గెలిపిస్తే, కాంగ్రెస్–టీడీపీ సర్కార్ ఏర్పడితే, ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణలో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కి తరలివెడతాయని టీఆర్ఎస్ బలంగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే హరీష్‌రావు, కేటీఆర్ ఈ దిశగా ప్రచారం ప్రారంభించారు. కేసీఆర్ సభలు ఆరంభమైతే ఇది అనూహ్యంగా ఊపందుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం 30 లేఖలు రాసిందంటూ టీఆర్ఎస్ ధ్వజం ఎత్తుతుంది. టీడీపీ వల్ల కాంగ్రెస్‌కూ, కాంగ్రెస్ వల్ల టీడీపీకీ నష్టం జరుగుతుందనీ, రెండు పార్టీల వల్ల తెలంగాణకు విపరీతంగా అపకారం జరుగుతుందనీ టీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. కమిటీలు వేస్తేనే భగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత ఎన్ని వీరంగాలు వేస్తారో, కుంటియానూ, గులాంనబీనీ ఎంతగా కడిగిపారేస్తారో ఊహించుకోవచ్చు. మొత్తంమీద తెలంగాణలో ఎన్నికల ప్రచారం అత్యంత వేడిగా, వాడిగా, రసవత్తరంగా, బూటకంగా, నాటకీయంగా జరగబోతున్నదని మాత్రం నిస్పందేహంగా చెప్పవచ్చు. కె. రామచంద్ర మూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్ సాక్షి దినపత్రిక -
పీలేరులో అన్నదమ్ముల సవాల్..
సాక్షి, తిరుపతి: పీలేరులో నల్లారి సోదరుల మధ్య పోరు ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో వీరి మధ్య పోటీ తప్పదని స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నా, వచ్చే ఎన్నికల్లో కిశోర్‌కుమార్ రెడ్డి అన్నకు మద్దతుగా ఉంటారని ఆయన వర్గీయులు భావించారు. తిరుపతిలో సోమవారం నల్లా రి కిశోర్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గీయులకు ఆగ్రహం తెప్పించాయి. పీలేరు బరిలో తాను టీడీపీ అభ్యర్థిగా ఉంటానని, ఎవరి మీదైనా పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. సొంత అన్న అయినా పోటీ చేసి తీరుతానని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కిరణ్‌కుమార్ రెడ్డి పోటీ చేస్తే తప్పుకుంటారా? అని విలేకరులు కిశోర్‌ని ప్రశ్నించారు. ఎవరు పోటీ చేసినా.. చేయకపోయినా తాను టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటానన్నారు. కిశోర్ మాటలు ఆయన సోదరుడి వెంట ఉన్నవారిని కంగు తినిపిం చాయి. కిరణ్‌కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా... సీఎం అయినా పెత్తనం అంతా తమ్ముడికే అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. షాడో సీఎంగా చెలామణి కావడానికి కారణమైనవారెవరో తెలుసుకోవాలని కిరణ్ వర్గీయులంటున్నారు. అన్నకు కిశోర్ వెన్నుపోటు సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి ఉన్నా...అభివృద్ధి చేసిందంతా తానేనని కిశోర్‌కుమార్‌రెడ్డి .. ఆయన అనుచరులు, నియోజక వర్గంలో చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కిరణ్ వర్గీయులకు చేరినట్లు సమాచారం. ప్రస్తుతం పదవుల కోసం టీడీపీలో చేరినా... వచ్చే ఎన్నికల్లో అన్న కిరణ్‌కు అండగా నిలబడతారని మాజీ సీఎం వర్గీయులు ఇన్నాళ్లూ మిన్నకుండిపోయారు. కిశోర్ తన సిసలైన వైఖరి బట్టబయలు చేశారు. దీనిపై కిరణ్ వర్గీయులు మండిపడుతున్నట్లు భోగట్టా. చంద్రబాబు పంచన చేరి ఆయన బుద్ధులే వచ్చాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచినట్లు... నీవు అన్నకు వెన్నుపోటు పొడుస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నో అక్రమాలు చేస్తున్నా పట్టించుకోలేదని కిరణ్ వర్గీయులంటున్నారు. ఎన్ని చేసినా అన్నకు అండగా ఉంటారని భావించామని కిరణ్ వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీలో చేరాక స్వార్థం చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న ఉన్న సమయంలో, ప్రస్తుతం చేస్తున్న అక్రమాలన్నీ తొందర్లోనే బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. ‘నీకు దమ్ముంటే... మేము చేసిన అక్రమాలను నిరూపించు’ అని కిరణ్ వర్గీయులు సవాల్ విసురుతున్నారు. కిశోర్ వర్గీయులు కూడా తాము తక్కువేం కాదంటూ... కిరణ్‌కుమార్ రెడ్డిని, ఆయన అనుచరులను టార్గెట్ చేస్తూ వ్యతిరేకంగా ప్రచారం చేయటం ప్రారంభించడం గమనార్హం.