వర్తమాన రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి.
ఏ విలువలు అయితే పాటించకూడదో, ఎలాంటి వ్యక్తిత్వానికయితే దూరంగా ఉండాలో ఆ ఇద్దరు వ్యక్తులు సజీవ సాక్ష్యంగా కనిపిస్తారు.
మొదటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ లో ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి అన్ని హంగులు, అర్భాటాలు అనుభవించి.. చివరికి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి.. ఇప్పుడు ఏకంగా పార్టీకే పంగనామాలు పెట్టారు కిరణ్ కుమార్.
ఇక రెండో వ్యక్తి చంద్రబాబు. ఆయన మాస్టర్ ప్లాన్ మామూలుగా ఉండదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఎప్పటికప్పుడు అతి తెలివి ప్రదర్శిస్తునే ఉంటారు. తన అనుయాయులందరిని బీజేపీలోకి పంపించి తన పబ్బం గడుపుకుంటున్న వ్యక్తి చంద్రబాబు.
ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వెనక కూడా చంద్రబాబే ఉన్నారా? కావొచ్చంటున్నారు సీనియర్ జర్నలిస్టు దేవుల పల్లి అమర్. కిరణ్ కుమార్, చంద్రబాబు.. ఇద్దరి వ్యవహారాలు కచ్చితంగా భిన్నంగా చూడాల్సిందేనంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment