Devulapalli Amar
-
జగన్ పని అయిపోలేదు.. కథ ఇప్పుడే మొదలైంది
-
ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా ?
-
ఎన్నికల ఫలితాల సర్వేల పై దేవులపల్లి అమర్ సెన్సేషనల్ కామెంట్స్
-
రాహుల్ గాంధీ కడప పర్యటన దేవులపల్లి స్ట్రాంగ్ రియాక్షన్
-
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
-
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
-
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
ప్రజలకు దారి చూపినవాడు నాయకుడవుతాడు. ప్రజలు నడిచే దారిలో తానూ నడిచినవాడే నాయకుడవుతాడు. ప్రజలు నాయకుడి వైపు ఎందుకు చూస్తారు? మా దారిలో కష్టం ఉంది తొలగించు... మా గింజలకు వెలితి ఉంది పూరించు... మాకు జబ్బు చేస్తే వైద్యానికి దోవ లేదు చూపించు... మా పిల్లలకు చదువు చెప్పించు... మా నెత్తిన ఒక నీడ పరువు... మా పిల్లలకు ఒక ఉపాధి చూపించు... ఇలా చెప్పుకోవడానికే కదా.అవి విన్నవాడే నాయకుడవుతాడు. నేను ఉన్నానని అనేవాడే పాలకుడవుతాడు.ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వర్తమాన పరిణామాలకు మూలాలు ఏమిటో తెలియడం తెలుగు ప్రజలకు అవసరం. ఎందుకంటే ప్రజల నొసట రాత పాలకులే రాస్తారు. నాటి మద్రాసు రాష్ట్రంతో మొదలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రకటన, తెలంగాణ ఉద్యమాల దరిమిలా తెలుగు రాష్ట్రాల విభజన... వీటన్నింటిలో పాలకుల ఎత్తుగడలకు, ప్రజల ఆకాంక్షలకు జరిగిన ఘర్షణ ఒక క్రమానుగతంగా చదివితే ఎక్కడెక్కడ నాయకుడనేవాడవసరమో అక్కడక్కడ తెలుగు జాతి ఒక నాయకుణ్ణి తయారు చేసుకోగలిగింది అనిపిస్తుంది. అయితే ముందే చెప్పుకున్నట్టుగా ఈ నాయకుల్లో ప్రజల కోసం నిలిచే నాయకులూ ఉన్నారు. ప్రజలను వంచించే నాయకులూ ఉన్నారు.సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల విషయంలో ప్రదర్శించిన అహం, ప్రోత్సహించిన ముఠా రాజకీయాల సంస్కృతి ఆంధ్రరాష్ట్రాన్ని ఒక అనిశ్చితిలోనే ఉంచాయి. స్థిరంగా నిలిచి, బలంగా కొనసాగే నాయకుడు ఉన్నప్పుడే జాతి ముందుకు వెళ్లగలదు. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు సమర్థమైన నాయకత్వం వహించినా కుర్చీ కింద పెట్టే మంటలు వారిని కుర్చీ వదులుకునేలా చేశాయి. అసలు తెలుగువారికి ఒక ఆత్మాభిమానం ఉందా అనే సందేహం కలిగించాయి.ఈ సందర్భమే ఎన్.టి.రామారావు పుట్టుకకు కారణమైంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన నాయకుడిగా, చరిష్మా కలిగిన పాలకుడిగా, పేదవాడి గురించి ఆలోచన చేసిన అభిమాన నేతగా ఎన్.టి.రామారావు ప్రజల మెప్పును పొందారు. కాని ఆయన అహం, తొందరపాటు చర్యలు కుట్రలకు తెరలేపాయి. చంద్రబాబు నాయుడు తెలుగుజాతి అవమానపడే రీతిలో ఎన్.టి.ఆర్‌ను వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ ఫండ్ ఉన్న అకౌంట్‌ను కూడా హస్తగతం చేసుకున్న వార్త అందిన రోజున ఎన్.టి.ఆర్. తీవ్ర మనస్తాపం చెందారు. అదే ఆయన మృతికి కారణమైందన్న భావన ఉంది.‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్’ అన్నాడు గురజాడ. ఒక రాష్ట్రాన్ని ప్రజల వారసత్వంగా చూడాల్సిందిపోయి దానినో కార్పొరెట్ ఆఫీసుగా మార్చి, దానికి తాను సి.ఇ.ఓగా భావించి పాలించడం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగు ప్రజలు చులకనను ఎదుర్కొన్నారు. గుండు దెబ్బలు తిన్నారు. నీతి, రీతులే వ్యక్తిత్వమని భావించే మన సంస్కృతిలో వంచనతో వచ్చిన నాయకుడిని నమ్మి మోసపోతున్నామని తెలుగు ప్రజలకు పదేపదే అనిపించిన ఉదంతాలు ఉన్నాయి. వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చి పెద్ద గీత గీసే వరకూ చంద్రబాబు ఎంత చిన్న గీతో ప్రజలకు అర్థమైందని విశ్లేషకులు అంటారు.ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత... పాలన చేస్తే ఎలా ఉంటుందో వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చూపారు. విశాలమైన హృదయం, దయ, ఆర్ద్రత ఉన్న నాయకుడు తన పాలనలో ప్రతి వ్యక్తి ఉన్నతి కోసం తపన పడతాడని, పడాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత కరెంట్, జలయజ్ఞం... రాష్ట్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నదని ప్రజలు పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఉన్న కాలమది.కాని రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తెలుగుజాతిని స్థాణువును చేసింది. రాజశేఖర రెడ్డిని చూసిన కళ్లు అలాంటి నాయకుడి కోసమే వెతుకులాడాయి. ఆ నాయకుణ్ణి వై.ఎస్.జగన్‌లో చూసుకున్నాయి. అయితే రాజకీయ కుయుక్తులు పన్నడంలో తలపండిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, జగన్‌కు మధ్య సైంధవుడిలా నిలిచారు. టక్కుటమార విద్యలు ప్రదర్శించి, అబద్ధాల మేడలు కట్టి మరోసారి జనాన్ని నమ్మించి సి.ఎం. అయ్యారు. కాని చంద్రబాబు పరిపాలనా కాలంలో రాష్ట్రం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. చిన్నా చితక పథకాల ప్రయోజనాల కోసం కూడా ప్రజలు అల్లల్లాడారు. ఒక వర్గం ప్రజలు రాజధాని నిర్మాణం వల్ల లబ్ధి పొందుతున్నారని సామన్యులకు అవగతమైంది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుని కోసం వారు తిరగబడ్డారు. వై.ఎస్.జగన్‌ని తమ ముఖ్యమంత్రిని చేసుకున్నారు.రాష్ట్ర విభజన వల్ల అనేక వెసులుబాట్లు కోల్పోయి, నిధుల లోటులో రాష్ట్రం ఉన్నప్పటికీ జగన్ తన విశిష్ట సమర్థతతో ప్రజాహిత పాలన కోసం నవరత్నాలతో ముందుకు వచ్చారు. రెండేళ్ల కరోనా కాలం ప్రపంచాన్ని స్తంభింపచేసినా తెలుగు రాష్ట్రం ముందంజలో ఉండేలా చూసుకున్నారు. విద్య నుంచి వికాసం, వైద్య ఖర్చు నుంచి విముక్తి ప్రధాన అజెండాగా చేసుకున్న జగన్ విస్తృత తెలుగు సమూహాలను గట్టున పడేశారు. తెలుగు ప్రజలు ఎన్నడూ చూడని విధంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణి జరిగింది. రాజధానిలో పేదలకూ చోటుండాలని భావించిన జగన్ వంటి ముఖ్యమంత్రి ఉన్నారా?దారులు స్పష్టం. ప్రజలు ఏ దారిని ఎంచుకోవాలో తమకు తాముగా నిర్ణయించుకోవాలని అంటారు దేవులపల్లి అమర్. ఆయన రాసిన ‘మూడు దారులు’ గ్రంథం ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి మొదలయ్యి ప్రభావవంతమైన ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎన్.టి.రామారావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధోరణులను తెలియచేస్తూ ఇప్పుడు వై.ఎస్. జగన్‌తో తల పడుతున్న చంద్రబాబు ‘యూ టర్న్’లను, వెన్నుపోట్లను, నమ్మించి వచించిన సంఘటలను విపులంగా తెలియచేసి పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది.అనుభవజ్ఞుడైన జర్నలిస్టుగా మాత్రమే కాదు, చేయి తిరిగిన జర్నలిస్టుగా కూడా దేవులపల్లి అమర్ ఎంతో సులభంగా, సరళంగా చరిత్రని, వర్తమానాన్ని, తెలుగు నేలకు సంబంధించిన రాజకీయ ఘటనలను ఒక వరుసలో ఉంచి పాఠకులకు గొప్ప అవగాహన కలిగిస్తారు. కొన్ని ఘటనలు జరక్కపోయి ఉంటే తెలుగు జాతి మరింత ముందంజలో ఉండేది కదా అనిపించే విషయాలన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది నేటి రాజకీయ కార్యకర్తలకు, నిపుణులకే కాదు భావి విద్యార్థులకు కూడా కీలకమైన రిఫరెన్స్ గ్రంథం.‘చరిత్రదేముంది... చింపేస్తే చిరిగి పోతుంది’ అనేది సినిమాలో డైలాగ్. కాని చరిత్ర చిరిగిపోదు. అలాగే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఉజ్జీవనం చెందుతూనే ఉంటుంది. చరిత్ర నిర్మింపబడే కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విభజన అయ్యాక కాళ్లూ చేతులు ఊనుకుని ఒక గొప్ప పురోగమనానికి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో ఎటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలో, తద్వారా ఎటువంటి ఘన చరిత్రకు తెలుగు జాతి ఆలవాలంగా ఉండాలో ఈ ఎన్నికల కాలంలో నిర్ణయించుకోవాలి. దారి స్పష్టం కావాలంటే ఈ గ్రంథం చదవండి.మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు; రచన– దేవులపల్లి అమర్; ప్రచురణ– రూప బుక్స్; పేజీలు: 210; వెల–395; ప్రతులకు–రూప పబ్లికేషన్స్, హైదరాబాద్.– వి.ఎన్.ప్రసాద్ (చదవండి: మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు) -
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
-
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
-
చంద్రబాబు పై అమర్ షాకింగ్ కామెంట్స్
-
సీఎం జగన్ పై రఘురామ రాజు ప్రకటన దేవులపల్లి అమర్ కౌంటర్
-
JPకి దేవులపల్లి అమర్ కౌంటర్
-
గందరగోళంలో పవన్ కళ్యాణ్.. దేవులపల్లి అమర్ విశ్లేషణ
-
చంద్రబాబు, పవన్ వేస్ట్ ..మోదీ కి సీన్ అర్థమైంది
-
నేను చంద్రబాబుకి వ్యతిరేకం కాదు .. ఈ పుస్తకం రాయడానికి అసలు కారణం
-
కక్ష సాధింపు కోసమే అన్ని పార్టీలు దాడి చేస్తున్నాయి
-
చంద్రబాబు ఢిల్లీ టూర్ పై ఎల్లో మీడియా అసత్యాలు
-
విశాఖలో మూడు దారులు పుస్తక పరియ కార్యక్రమం
-
Amar : మూడు దారులు : రాజకీయ రణరంగంలో భిన్న ధృవాలు
-
Amar : మూడు దారులు : రాజకీయ రణరంగంలో భిన్న ధృవాలు
సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన "మూడు దారులు" రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు.. పుస్తకం సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందనీ, పరిశోధకులకు చక్కటి గైడ్‌గా, రిఫరెన్స్ మెటీరియల్‌గా పనికొస్తుందని పుస్తక పరిచయ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయం సభా మందిరంలో బుధవారం నిర్వహించిన "మూడు దారులు" పుస్తక పరిచయం కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు రచయిత అమర్ కృషిని అభినందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ పూర్వ ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబీ వర్ధన్ సభకు అధ్యక్షత వహించగా, లీడర్ దిన పత్రిక సంపాదకులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి పుస్తకంలోని అంశాలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.బాలమోహన్ దాస్ ప్రసంగిస్తూ తొలి అధ్యాయంలో రచయిత తెలుగు రాష్ట్రాల పూర్వ చరిత్రను, ఆనాటి రాజకీయాలను వివరించిన తీరు, ముఖ్యమంత్రుల వ్యవహార శైలి సమగ్రంగా పొందుపరిచారని ప్రశంసించారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్న ప్రొఫెసర్ బాల మోహన్ దాస్ వైఎస్ ఆర్ విద్యా విషయాల పట్ల ఎంతో శ్రద్ధ పెట్టేవారనీ, పాలనా వ్యవహారాలలో తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేవారని పేర్కొన్నారు. రాజకీయాలలో నైతిక విలువలకు వైఎస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని అన్నారు. మూడు దారులు పుస్తకంలో రచయిత ప్రత్యేకంగా ప్రస్తావించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.జగన్మోహన రెడ్డి గురించి పుస్తకం చదివిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారో తానే స్వయంగా రాండమ్ శాంపిల్ సర్వే చేశానని ఆయన వివరిస్తూ.. వైఎస్ఆర్ కు 87 శాతం, చంద్రబాబు కు 49.5 శాతం, జగన్ కు 78.5 శాతం జనం మద్దతుగా మాట్లాడారని పేర్కొన్నారు. మూడు దారులు పుస్తకం భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పుస్తకాన్ని సమగ్రంగా సమీక్ష చేసిన లీడర్ దిన పత్రిక ఎడిటర్ రమణమూర్తి అన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దించేందుకు జరిపిన వైస్రాయ్ ఉదంతాన్ని రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారనీ, ఎన్నో ఆధారాలతో ఆ కుట్రను పాఠకుల ముందు ఉంచారని పేర్కొన్నారు. చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని, ఈ పుస్తకం ద్వారా అమర్ నెరవేర్చారన్నారు. పుస్తకంలో ముగ్గురు ముఖ్యమంత్రులను కథా వస్తువుగా అమర్ తీసుకున్నారని, అయితే నాలుగో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా దర్శనమిస్తారని తెలిపారు. అధికారం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌ని వెన్నుపోటుకు సైతం వెనుకాడని సంఘటన పుస్తకంలో సాక్షాత్కరిస్తుందన్నారు. ముఖ్యంగా చంద్రబాబు చేసిన ‘వైస్రాయ్ కుట్ర’ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ ఆత్మ ఎలా క్షోభించింది, అడ్డదారిలో చంద్రబాబు పాలన ఎలా కైవసం చేసుకున్నారో తెలుసుకోవచ్చన్నారు. ఈ ఆధారాలతో అమర్ రాయడం విశేషమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం మొదలు, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనుక ఉద్యమాలు, రాజకీయాలను రచయిత సాధికారికంగా ఆవిష్కరించారన్నారు. చరిత్రలో వాస్తవిక దృష్టితో రాయడంలో రచయిత సఫలీకృతులయ్యారన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఏయూ జర్నలిజం శాఖ విశ్రాంత ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబివర్ధన్ మాట్లాడుతూ.. పాత్రికేయులు అమర్ రాసిన మూడు రహదారుల పుస్తకంపై పి.హెచ్.డి చేయవచ్చన్నారు. సాధారణంగా చరిత్రలను, జీవిత కథలను రాస్తూ ఉంటారని, అందుకు భిన్నంగా ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనా చరిత్రను తొలిసారిగా రాసి అమర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. పరిశోధనాత్మక జర్నలిజం ప్రాంతీయ భాషలోనే చేయవచ్చని, అందుకు ఉదాహరణ ఈ పుస్తకమే అన్నారు. పాత్రికేయ ప్రముఖులు మంగు రాజగోపాల్ ఆత్మీయ ప్రసంగం చేస్తూ జర్నలిస్టులలో రాసే జర్నలిస్టు అక్షర బాహుబలి అమర్ అన్నారు. జర్నలిస్టులు ఎప్పటికప్పుడు సమాజంలోని రాజకీయ పరిణామాలకు అప్డేట్ అవ్వాలని, వారిలో అమర్ ముందుంటారన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలన స్వయంగా చూసి అమర్ ఈ పుస్తకం రాశారని తెలిపారు. పుస్తక రచయిత అమర్ మాట్లాడుతూ.. దక్షిణాది వారిని ఉత్తరాది వారు పట్టించుకోరని, మద్రాసీయూలుగా పిలిచే తెలుగువారిని ఆంధ్రులుగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారని, 1983 వరకు ఓకే పార్టీలో కలిసి ప్రయాణించారని తెలిపారు. 83లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాలను ప్రభావితం చేశారన్నారు. ఈ పుస్తకం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చానని, ఎవరిని కించపరిచే ఉద్దేశంతో రాయలేదన్నారు. అనంతరం, రచయిత అమర్ ను అతిథులు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. పాత్రికేయులు బిఎస్ రామకృష్ణ వందన సమర్పణతో సభ ముగిసింది. -
'మూడుదారులు': రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు!
నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. కాకపొతే, ఈ మువ్వురిలో చంద్రబాబు నాయుడిది రాజకీయంగా భిన్నమైన మార్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలభయ్ ఏళ్ళ చరిత్ర ఈ ముగ్గురితో ముడిపడి వుంది. ఈ చారిత్రక పరిణామాలను ఒక సీనియర్ జర్నలిస్టుగా దగ్గరనుంచి పరిశీలించగలిగిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని దేవులపల్లి అమర్, తన అనుభవ సారాన్ని తాను రాసిన మూడు దారులు అనే ఈ రెండువందల పేజీల గ్రంథంలో సవిస్తరంగా ప్రస్తావించారు. చంద్రబాబు అనగానే గుర్తు వచ్చే మరో ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ. రామారావు. ఆ పేరు వినగానే తలపుకు వచ్చే మరో పదం వైస్రాయ్ ఎపిసోడ్. ఇప్పుడు మూడు, నాలుగు పదుల వయసులో వున్నవారికి గుర్తు వుండే అవకాశం లేదు కానీ, కొంత పాత తరం వారికి తెలుసు. విచిత్రం ఏమిటంటే వారికీ పూర్తిగా తెలియదు. ఆ కాలంలో చురుగ్గా పనిచేసిన కొందరు జర్నలిస్టులు అప్పటి రాజకీయ పరిణామాలను నిశితంగా చూసిన వారే అయినా, ఇంకా ఏదో కొంత సమాచారం మరుగున ఉందేమో అనే సందేహం, వారు ఈ అంశంపై రాసిన రచనలు, వార్తలు, పుస్తకాలు చదివినప్పుడు పాఠకులకు కలగడంలో ఆశ్చర్యం లేదు. కారణాన్ని కూడా అమర్ తన గ్రంథంలో ప్రస్తావించారు. ఆయన అప్పట్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్రప్రభలో రిపోర్టింగ్ బ్యూరో ఇంచార్జ్ గా వున్నారు. ‘మరి, అప్పట్లో ఇటువంటి (ఈ గ్రంథంలో పేర్కొన్న) విషయాలను మీరెందుకు రిపోర్ట్ చేయలేదని కొందరు మితృలు నన్ను ప్రశ్నించారు. వాళ్ళు అలా అడగడం సబబే. ఇలా అడిగిన వారిలో మీడియా మితృలు కూడా వున్నారు. పత్రికా స్వేచ్ఛ నేతి బీరకాయ చందం అని వారికి తెలియనిది కాదు. పత్రిక పాలసీని సంపాదకులు కాకుండా యజమానులే నిర్ణయించే కాలానికి వచ్చాక జరిగిన ఉదంతం ఇది. అప్పుడు నేను పనిచేస్తున్న పత్రిక యజమాని, చంద్రబాబు నాయుడు పక్షం ఎంచుకున్నారు. ఇక మా ఎడిటర్ ఆయన్ని మించి బాబు భక్తి ప్రదర్శించేవారు.’ అంటూ రాసుకొస్తూ అమర్ ఆ రోజుల్లో జరిగిన డిస్టిలరీ అనుమతి ఉదంతాన్ని పేర్కొన్నారు. ‘బాబుకు అనుకూలంగా రాసిన ఆ వార్తను ఈనాడు పత్రిక మాత్రమే ప్రముఖంగా ప్రచురించడం, ఆ వార్త మా పత్రికలో మిస్ అవడం తట్టుకోలేని మా ఎడిటర్, మా బ్యూరోను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. జరిగిన పొరబాటును దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా మర్నాడు మొదటి పేజీలో, సుదీర్ఘంనైన సంపాదకీయం రాసి, చంద్రబాబు పట్ల తన విధేయతను చాటుకున్నారు. అయితే సంపాదకుడి వైఖరికి నిరసనగా ఉద్యోగాన్ని వదిలి వేయవచ్చు కదా అంటే, నిజమే చేయవచ్చు. కానీ అప్పట్లో వెంటనే మరో చోట ఉద్యోగం దొరికే అవకాశం లేక ఆ సాహసం చేయలేదు. చాలామంది జర్నలిస్టుల పరిస్థితి అదే. బయటకు చెప్పుకోలేక పోవచ్చు. ఇప్పుడయినా ఆ వివరాలన్నీ రాసే అవకాశం వచ్చింది. వైస్రాయ్ సంఘటనలో నిజానిజాలు గురించి నేటి యువతరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సవివరంగా రాయడం జరిగింది’ అని అమర్ ఇచ్చిన వివరణ. మూడు దారుల్లో ఇదొకటి. మిగిలినవి రెండూ వై.ఎస్. ఆర్., వై ఎస్. జగన్ ఎంచుకున్న దారులు. ఈ దారులపై మీడియా కావాలని వికృత ధోరణితో వార్తలు వండి వార్చింది అనే ఆరోపణలకు సంబంధించి కొన్ని దృష్టాంతాలను అమర్ ఈ గ్రంథంలో పేర్కొన్నారు. నాటి సంఘటనలకు సాక్షీభూతులైన అనేకమందిని కలుసుకుని, చంద్రబాబు అనుకూల, ప్రతికూల జర్నలిస్టులు, రచయితలు రాసిన పుస్తకాలలోని అంశాలను కూడా ఆయన ఉదహరించి, తన రచనకు సాధికారతను ఒనగూర్చే ప్రయత్నం చేశారు. తాను స్వయంగా గమనించిన విషయాలతో పాటు, తనకు తెలియ వచ్చిన మరి కొన్ని అంశాలను ధ్రువపరచుకునేందుకు అమర్ చాలా కసరత్తు చేసినట్టు ఈ పుస్తకం చదివిన వారికి తెలుస్తుంది. కన్నవీ, విన్నవీ విశేషాలతో కూడిన గ్రంధరచన కాబట్టి కొంత వివాదాస్పదం అయ్యే అవకాశాలు వున్నాయి. నాటి సంఘటనలకు నేనూ ఒక ప్రత్యక్ష సాక్షిని కనుక పుస్తకం చదువుతున్నప్పుడు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంగతులు మూగ మనసులు సినిమాలోలా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాఠకులను ఇది ఆకర్షిస్తుంది. ఈ పుస్తకాన్ని ముందు అమర్ ఆంగ్లంలో DECCAN POWER PLAY అనే పేరుతొ ప్రచురించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. తెలుగు అనువాద రచన మూడు దారులు పుస్తకావిష్కరణ కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్లో మరోమారు జరగనుంది. తోకటపా: విజయవాడ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగ ఉవాచ: ‘దేవులపల్లి అమర్ కు వై.ఎస్. రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ. జగన్ మోహన్ రెడ్డి అంటే పిచ్చి. ఇక ఈ పుస్తకంలో చంద్రబాబు గురించి ఏమి రాసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు’. భండారు శ్రీనివాస్ రావు, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు) -
ఈ నెల 27న విజయవాడలో 'మూడు దారులు' పుస్తక ఆవిష్కరణ
-
శ్వేత టీడీపీకి రాజీనామా చేయడానికి అసలు కారణం పై క్లారిటీ ఇచ్చిన దేవులపల్లి అమర్
-
లోకేష్ ను మంత్రిని చేసినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు ..!
-
అట్టర్‌ప్లాప్ అయినా ఫర్వాలేదనుకుంటున్న పవన్!
టాస్క్ అనే ఇంగ్షీషు పదానికి గూగుల్ తెలుగులో ఇచ్చే నిర్వచనం ఒక పనికి ఒప్పుకోవడం. ‘‘టాస్క్’’ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎవరికి వారే ఒక పని సాధించాలని అనుకోవడం. ఆ కోవకు చెందిన వాళ్ళకు స్పష్టత ఉంటుంది. అది తాము వెళ్ళే మార్గం పట్లా.. చేరుకోవాల్సిన గమ్యం పట్లా!. ఇక రెండో కోవకు చెందిన వాళ్ళు ఎవరో ఇస్తే చేసే పని. ఇటువంటి వారికి మార్గం , గమ్యం దేని పట్లా స్పష్టత ఉండదు. పని ఇచ్చిన వాడు ఏం చెప్తే అది చేయాలి.. ప్రతిఫలం తీసుకోవాలి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒక టాస్క్‌కు ఒప్పుకున్నాడు. ఆయన ఒక రాజకీయ పార్టీ ప్రారంభించాడు. ఆయన పార్టీ పెట్టి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన నిర్వాకాన్ని విశ్లేషించి నట్టయితే ఆయన మనం ముందు చెప్పుకున్న రెండో కోవకు చెందిన వ్యక్తి అని ఎవరికయినా అర్ధం అవుతుంది . తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ఆయనకో టాస్క్ ఇచ్చాడు . 2014 లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశాన్ని అధికారం లోకి తీసుకురావడం 2019 లో తెలుగు దేశం తిరిగి గెలిచేట్టు చూడటం 2024లో బీజేపీని దగ్గర చేర్చి మళ్ళీ తెలుగు దేశం అధికారం లోకి రావడానికి ప్రయత్నించడం ఈ మూడు పనుల్లో ఆయన విఫలం కావడమే కాక రెంటికీ చెడ్డ రెవడి సామెత అయ్యింది ఆయన పని. 2014 లో ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు దేశం గెలవడానికి పవన్ కల్యాణ్ చేసిందేమీ లేదు , మోదీ హవా బలంగా వీస్తున్న సమయం అది . చంద్రబాబు నాయుడు ఇచ్చిన పని చేసే ధ్యాసలో పడి పోయి పవన్ తన పార్టీ గురించి మర్చిపోయాడు . ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకునే ఎవరయినా ముందు తన పార్టీ నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తారు . ఆ పార్టీ బలోపేతం అయితేనే కదా ఇంకెవరికాయినా సహాయం చేయగలిగేది. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఆ మాట చెప్పడు. ఎందుకంటే పవన్ పార్టీ బలం పుంజుకుంటే మళ్ళీ తనకే నష్టం అని ఆయనకు బాగా తెలుసు . అందుకే పవన్ పార్టీ నిద్రావస్థలోనే ఉండాలి అతను మాత్రం తన కోసం పని చేయాలి.. ఇదీ బాబు ఆలోచన . తాను ఎన్డీయే భాగస్వామిననీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , హోం మంత్రి అమిత్ షా తాను పిలిస్తే పలుకుతారనీ పవన్ తరచూ చెప్తూ ఉంటాడు . పట్టుమని పది పంచాయితీలను గెలుచుకోలేని పార్టీని, దాని నాయకుడిని రాజకీయాల్లో రాటు తేలిన బీజేపీ ఎందుకు పక్కన పెట్టుకుంటున్నదో అర్ధం చేసుకోలేని స్థితి పవన్‌ది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 14 రోజులు అన్నపానీయాలు మాని ఏడుస్తూ పడుకున్నానని ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్ళి బహిరంగ సభల్లో చెప్పుకున్న పవన్.. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తానని ముందు ప్రకటించాడు. బీజేపీతో పొత్తులో చివరికి ఎనిమిది స్థానాలకే సంతృప్తి పడ్డాడు. ఆ ఎనిమిది స్థానాల్లో కూడా అభ్యర్ధులు కరువై బీజేపీ వాళ్ళకే పవన్ పార్టీ కండువాలు కప్పారంటే ముందే చెప్పినట్టుగా పార్టీ నిర్మాణం మీద ఆయన శ్రద్ద చూపించారో అర్ధం అవుతుంది. తెలంగాణా ఎన్నికల వాలకం చూస్తే ఆయన పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్ లు వస్తాయనే నమ్మకం కూడా లేదు . పోటీ చేసిన అన్నీ చోట్లా డిపాజిట్లు పోగొట్టుకోవడం ఆయన పార్టీకి కొత్త ఏం కాదు . తెలంగాణ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకే ఆంధ్ర ప్రదేశ్‌లో శాసన సభకూ, లోక్‌సభకూ ఎన్నికలు జరుగుతాయి . తెలంగాణలో బీజేపీ తో దోస్తీ , ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్ళి తెలంగాణ లో బోర్డ్ తిప్పేసిన తెలుగు దేశంతో దోస్తీ పవన్ రాజకీయ గందరగోళానికి అద్దం పడుతుంది. నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పెట్టుకుని, ఆ ఎన్నికల్లో తాను ప్రధాన పాత్ర పోషించబోతున్నానని చెప్పుకునే ఏ రాజకీయ నాయకూడూ పవన్ చేసిన తప్పు చేయడు కదా!. తనకు పని ఇచ్చిన చంద్ర బాబు ఎట్లాగూ ఇటువంటివి చెప్పడు. ఆయనను చూసైనా పవన్ జాగ్రత్త పడాలి కదా. అలా కాకుండా తెలంగాణాలో నవ్వులపాలయి ఆంధ్ర ప్రదేశ్ కు వెళితే చంద్రబాబు పార్టీ 16 స్థానాలిచ్చి అక్కడికంటే రెట్టింపే ఇచ్చాం సరిపెట్టుకో అనడం ఖాయం. సినిమా పోతే పోయింది , హీరో రెమ్యునరేషన్ వొస్తే చాలు కదా!. నిర్మాతలు, ప్రేక్షకులూ (నమ్ముకున్న పార్టీ నాయకులు , కార్యకర్తలు ) ఏమైపోతే ఏం . :::దేవులపల్లి అమర్, రాజకీయ విశ్లేషకులు -
అమిత్ షాతో లోకేష్ భేటీ వెనుక కర్త, కర్మ, క్రియ..
-
అలా మాట్లాడినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకు రాలేదా
-
చంద్రబాబు మాస్టర్ ప్లాన్ : దేవులపల్లి అమర్
-
రాజకీయాల గురించి దేవులపల్లి అమర్ వ్యాఖ్యలు చేశారు
-
ఈనాడు పిచ్చిరాతలపై ప్రత్యక్ష సాక్షి చెప్పిన అసలు నిజాలు
-
నువ్వు నీ పిచ్చి యాత్రలు : దేవులపల్లి అమర్
-
పార్లమెంట్లో మణిపూర్ ప్రకంపనలు పై దేవులపల్లి అమర్ క్లియర్ కట్ విశ్లేషణ
-
మంత్రాలకు చింతకాయలు రాలవు...పవన్ ఇక జైలుకేనా...
-
‘పవన్ కళ్యాణ్‌ది అవగాహన లేమి’
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే చాలా కష్టపడాలని, దాంతో పాటు పూర్తి అవగాహన ఉండాలని, చాలా విషయ పరిజ్ఞానం ఉండాలన్నారు. ప్రజల్ని నమ్మించగలను అనే ఆత్మవిశ్వాసం ఉండాలని, అదే సమయంలో అతి విశ్వాసం అనేది ఉండకూడదన్నారు. అయితే పవన్ కళ్యాణ్‌లో ఆత్మ విశ్వాసం లేదు, అతి విశ్వాసం కూడా లేదన్నారు. కానీ ఆత్మనున్యతా భావంతో ఉన్నట్లే పవన్ కళ్యాణ్ ప్రసంగాల్ని బట్టి అర్ధమవుతుందన్నారు. -
మేనిఫెస్టో అంటే జగన్.. ఉన్నది ఉన్నట్టుగా..: దేవులపల్లి అమర్
సాక్షి, సత్తెనపల్లి: మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అందులో ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన "మేనిఫెస్టో అంటే జగన్" చర్చా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. "జగన్ 650 హామీలు ఇచ్చారని, అందులో 20 శాతం కూడా అమలు చేయలేదంటూ టీడీపీ ఒక బుక్ రిలీజ్ చేస్తోందట. కాంగ్రెస్ నినాదం గరీబీ హఠావో అమలు కాలేదు. సమాజమే దేవాలయం అన్న టీడీపీ 20 ఏళ్లు పాలించింది. అయినా రాష్ట్రంలో పేదరికం ఇంకా ఎందుకు ఉంది? జగన్ పేదవాడి కష్టాలు తీర్చేలా మేనిఫెస్టో పెట్టారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతటి గెలుపు జగన్‌కే సాధ్యమైంది. నేను చేసిన సంక్షేమం మీకు అందితేనే నాకు ఓటు వేయండి అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. జగన్ ఒక భిన్నమైన తత్వవేత్త, ఫిలాసఫర్. ప్రతీ గడపకు నాయకులు అధికారులు వెళ్లి సమస్య తెలుసుకుని పరిష్కరించే వ్యవస్థను జగన్ క్రియేట్ చేసారు. ఈ వ్యవస్థలో ఏం జరిగినా క్షణాల్లో జగన్ తెలుసుకుంటారు" రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి తరఫున గడప గడపకు తిరిగి నిరంతరం శ్రమించేలా ఒక వ్యవస్థ ను రూపొందించిన వ్యక్తి జగన్ అని, దేశంలో ఎక్కడా ఇటువంటి వ్యవస్థ లేదని అమర్ అన్నారు. ఒకప్పుడు సమాజంలో పత్రికలు విశ్వసనీయత కలిగి ఉన్నాయి అని, నేడు సోషల్ మీడియా ద్వారా సత్యం కనుమరుగు అవుతున్నది, వాస్తవాలు ప్రజలకు చేరడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! ప్రజా సంక్షేమ పార్టీ కాబట్టే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయని, ప్రతి గడపకు లబ్దిచేకూరాలనే ధ్యేయంతో సీఎం పని చేస్తున్నారని అమర్ అన్నారు. అభివృద్ది అంటే భవనాలు కట్టించడం మాత్రమే కాదు అని, పేదరిక నిర్మూలన, ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే అభివృద్ది అవుతుంది అని, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది కేవలం అపోహ మాత్రమే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, డొక్కా మాణిక్య వరప్రసాద్, సీనియర్ పాత్రికేయులు వివిఆర్ కృష్ణంరాజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఒక పనికిమాలిన న్యూస్ ఛానల్ అవినాష్ రెడ్డి కేసుపై రాసిన రాతలు
-
ఇలాంటి పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెట్టకండి రైలు ఘటనకి దానికి సంబంధం ఏంటీ..
-
‘కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వెనక కూడా చంద్రబాబే!’
వర్తమాన రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఏ విలువలు అయితే పాటించకూడదో, ఎలాంటి వ్యక్తిత్వానికయితే దూరంగా ఉండాలో ఆ ఇద్దరు వ్యక్తులు సజీవ సాక్ష్యంగా కనిపిస్తారు. మొదటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ లో ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి అన్ని హంగులు, అర్భాటాలు అనుభవించి.. చివరికి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి.. ఇప్పుడు ఏకంగా పార్టీకే పంగనామాలు పెట్టారు కిరణ్ కుమార్. ఇక రెండో వ్యక్తి చంద్రబాబు. ఆయన మాస్టర్ ప్లాన్ మామూలుగా ఉండదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఎప్పటికప్పుడు అతి తెలివి ప్రదర్శిస్తునే ఉంటారు. తన అనుయాయులందరిని బీజేపీలోకి పంపించి తన పబ్బం గడుపుకుంటున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వెనక కూడా చంద్రబాబే ఉన్నారా? కావొచ్చంటున్నారు సీనియర్ జర్నలిస్టు దేవుల పల్లి అమర్. కిరణ్ కుమార్, చంద్రబాబు.. ఇద్దరి వ్యవహారాలు కచ్చితంగా భిన్నంగా చూడాల్సిందేనంటున్నారు. -
మీకు శిక్షణ ఎవరిస్తున్నారు లోకేష్?
ఎలుక తోక తెచ్చి ఏడాది పాటు ఉతికినా, నలుపు నలుపే గాని, తెలుపు కాదు అని తెలుగులో ఓ సామెత ఉంది. అప్పుడప్పుడు ఇది అనుకోకుండా.. నేనున్నానంటూ మరీ గుర్తుకొస్తుంది. ఆ అవసరాన్ని తెలుగు ప్రజలకు తరచుగా గుర్తు చేస్తున్నారు టీడీపీ నేత నారా లోకేష్. పాదయాత్రలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంలో బోలెడు తప్పులు (కావాలనో?.. లేక జనాన్ని పక్కదారి పట్టించాలానో?) చేస్తున్నారు. కొన్ని సార్లు మాత్రం పద ప్రయోగంలోనో, లేక పలకడంలోనే తేడా కొట్టి కొన్ని సుభాషితాలు వల్లిస్తున్నారు. ఇక ఈ మాటల విషయంలో టీడీపీ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇది మానడం లేకపోగా.. మరింత పెరుగుతున్నాయంటున్నారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్. ఇటీవల అనంతపురంలో లోకేష్ చేసిన ప్రసంగాన్ని విశ్లేషించారు అమర్ దేవులపల్లి. ఇక నైనా ఇలాంటివి సవరించుకోకుంటే నవ్వుల పాలవుతారని హితవు పలికారు. -
లోకేష్ ముందు చరిత్ర తెలుసుకో.. నువ్వు మీ బాబులా తయారయ్యావ్
-
‘ఎన్టీఆర్‌ను ఆ విధంగా నమ్మించారు.. స్వెట్టర్లు అమ్మే వ్యక్తి రాయబారి అయ్యారు’
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు భారీగా విజయవంతం కావడం తెలుగుదేశం పార్టీకి గానీ, ఎల్లో మీడియాకు గానీ ఏ మాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. ఏకంగా దేశంలో ఉన్న టాప్ క్లాస్ బిజినెస్ మాగ్నెట్లు అంతా రావడం, ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని కొనియాడటం, వేల కోట్ల పెట్టుబడులు పెడతామని నేరుగా ప్రకటించడం.. ఎల్లో బ్యాచ్‌కు మింగుడు పడలేదు. సాధారణంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారుల సదస్సు జరిగితే అందులో రకరకాల వేషాలు, డ్రామాలు పుట్టుకొస్తాయి. అలాంటి ఓ విచిత్రమైన ఘటనను షేర్ చేసుకున్నారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మంత్రిగా ఉండేవారు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన, ఆయన చెప్పిన అనుభవం ఇది. "తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఫేక్ షోలు చేయడం అలవాటు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం.. ఆయనకు పెద్దగా తెలియదు. ఎప్పుడూ చుట్టూ ఉండే చంద్రబాబు, ఆయన మనుష్యులు ఓ రోజు ఒకాయనను తీసుకొచ్చారు. నేరుగా ఎన్టీఆర్ దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేశారు. అయ్యా.. ఈయన భూటాన్ రాయబారి అని పరిచయం చేశారు. ఎన్టీఆర్ దానికి ఎంతో సంతోషించారు.. స్వయంగా వెంట తీసుకెళ్లి బుద్ధుడి విగ్రహాం చూపించారు. ఆ వ్యక్తితో ఫోటోలు దిగి పేపర్లో వేయించారు. టుప్కా అని భూటాన్ నుంచి రాయబారి వచ్చారని, ముఖ్యమంత్రిని కలిశారని పేపర్లలో ప్రచారం చేయించారు. అప్పట్లో నేను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తుండే వాడిని. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత .. నాతో పని చేస్తోన్న ఓ కొలీగ్ ఓ ఫోటో చూపించారు. అందులో నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న వ్యక్తి ఫోటో ఉంది. ఇతనే కదా మొన్న ఎన్టీఆర్‌ను కలిసిన భూటాన్ రాయబారి అని చెప్పారు. తెలుగుదేశం వాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటారు. స్వెట్టర్లు అమ్ముకునే వ్యక్తిని భూటాన్ రాయబారి అని చెప్పించిన ఘనత చంద్రబాబుది.." అని దేవులపల్లి అమర్ అన్నారు. చదవండి: జాకీ యూనిట్‌పై రాప్తాడులో టీడీపీ కాకిగోల.. వాస్తవాలతో సాక్ష్యం ఇదిగో -
ఈనాడు తప్పుడు కథనాలపై మండిపడ్డ దేవులపల్లి అమర్
-
కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు
సాక్షి, అమరావతి: కరోనాతో చనిపోయిన జర్న లిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ చెప్పారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు చాలా మంది కరోనాతో చనిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండోదశ వైరస్ విజృంభణలో ఎక్కువమంది జర్న లిస్టులు మృతిచెందారని తెలిపారు. వీరి కుటుం బాలకు శాశ్వత మేలు కల్పించడానికి ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే ఈ సాయం ఆ కుటుంబాలకు పూర్తిస్థాయిలో భరోసా ఇవ్వలేదని భావించి శాశ్వత మేలు చేయాలని ఆలోచిస్తోందని చెప్పారు. జర్నలిస్టుల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలినుంచి సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు సంతకం చేసిన కొద్ది ఫైళ్లలో జర్నలిస్టుల హెల్త్‌స్కీమ్ ఫైలు ఒకటని గుర్తుచేశారు. ఐజేయూ అధ్యక్షుడు ఇటీవల మాట్లాడుతూ ఏపీలో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని, దీనిపై ప్రశ్నించాలంటూ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించడం సమంజ సం కాదన్నారు. ఈ నెల 17న ఏపీయూడబ్ల్యూజే ఆ విర్భావ దినోత్సవాన్ని సా వధాన దినోత్సవంగా జరు పుకోవడానికి పిలుపునివ్వడాన్ని తప్పుబట్టారు. యాజమాన్యాలను ఎందుకు ప్రశ్నించరు? రూ.కోట్లు ఆర్జిస్తూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీస వేతనాలివ్వని యాజమాన్యాల ను యూనియన్ నాయకులు ఎందుకు ప్రశ్నించరని అమర్ దుయ్యబట్టారు. ఏపీడబ్ల్యూ జర్నలిస్టుల సంక్షేమానికి అనేక రాయితీలు ఇస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం యూనియన్ నాయకులకు తగదన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ జర్నలిస్టులపై దాడులు జరిగాయో ఆధారాలతో ని రూపించాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం జర్నలిస్టులను అన్ని విధా లుగా ఆదుకుందని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నానీని కలిసి జర్నలిస్టు యూనియన్ నాయకులు కృతజ్ఞత లు తెలిపారని, ప్రస్తుతం వారే ప్రభుత్వంపై బురద జల్లే చర్యలకు దిగుతుండటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు పరిశీలనలో ఉంది రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం అక్రిడిటేషన్ మంజూరు చేస్తుందని చెప్పారు. అక్రిడిటేషన్లు ఇవ్వడంలో ఆలస్యమైందని విమర్శించే వారు దాని వెనుక వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. అక్రిడిటేషన్ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు సమాచారశాఖ మంత్రి పేర్ని నాని కృషి చేస్తున్నారని తెలిపారు. చిన్న పత్రికలకు జీఎస్టీ మినహాయింపు, అక్రిడిటేషన్ కమిటీల్లో యూనియన్లకు ప్రాతినిథ్యం అంశాలు సమాచారశాఖ దృష్టిలో ఉన్నాయన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. సగర్వదినంగా జరుపుకోవాలి: యూనియన్ల నేతలు రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో తెలియజేస్తూ ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్ను శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యాలరావు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల యూనియన్ నాయకులు శుక్రవారం ఓ ప్రకట నలో తెలిపారు. ఈ 17న ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని జర్నలిస్టులు సావధాన దినంగా కాకుండా సగర్వ దినంగా జరుపుకోవా లని పిలుపునిచ్చారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు కలి గించేదిశగా ప్రభుత్వం ఆలోచించడం హర్షణీయ మని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ ఉన్నతమైన ఆలోచన విధానంతో ఉన్నారని, జర్నలిస్టులకు త్వరలోనే తీపి కబురు అందిస్తామని అమర్ హామీ ఇచ్చారని తెలిపారు. -
సీఎం జగన్ హామీ : 5 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి : ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా దేశంలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. వీరిలో మరీ ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్ట్‌లు ఎక్కువగా ఉన్నారు. వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు వీరంతా తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ నేపథ్యంలో కరోనా క్లిష్ట సమయంలోనూ ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. వైరస్‌పై పోరులో మరణించిన ప్రతి జర్నలిస్ట్‌కు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని మంగళవారం మీడియా ముందు వెల్లడించారు. (ఉచిత విద్యుత్‌కు కొత్త ఎనర్జీ) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో కరోనా వల్ల అనేక మంది చనిపోతున్నారు. దీనిలో జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు.వార్తా సేకరణ క్రమంలో అందరూ ముందుండి నడిచారు. ప్రధాని కూడా జర్నలిస్ట్ లు కరోనా వారియర్స్ అని చెప్పారు. జర్నలిస్టులను ప్రభుత్వాలు కూడా సహకారం ఇవ్వాలి. 50 లక్షలు బీమా ఇవ్వాలని కోరుతున్నాం. ఏపీలో 38 మంది జర్నలిస్టులు మృతి చెందారు. వారిని ఆదుకోవాలని ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. 38 మంది చనిపోయారని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 5 లక్షలు ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. చికిత్స తీసుకునే వారికి కూడా ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేశారు. సీఎంకు, దీనికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని కే శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ..‘ కోవిడ్ వల్ల చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం జగన్ ముందుకు రావడం మంచి పరిణామం. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. యూనియన్లు కేంద్రం ప్రకటించిన 50 లక్షల బీమాను డిమాండ్ చేస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల వెనుక ఉండి ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని నిరూపితమైంది. భవిష్యత్తులో కూడా సీఎం జగన్ జర్నలిస్టుల వెనుక ఉంటారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. -
రామకృష్ణపై దేవులపల్లి అమర్ ఫైర్
సాక్షి, అమరావతి : సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిపై అంతరాష్ట్ర, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేస్తున్న విమర్శలు ఖండించారు. ప్రభుత్వ సలహాదారులు ఏ విధంగా సలహాలు, సూచలనలు ఇవ్వాలో తమకు తెలుసని, రామకృష్ణ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం తమకు లేదని హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం అమర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ సలహాదారుల మీద చేసిన వ్యాఖ్యలు చదివాను. సలహాదారులు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు పత్రికా ప్రకటన ద్వారానో, వీధి ప్రదర్శనల ద్వారానో ప్రకటించే విధంగా ఉండవు. అధికారంలో భాగస్వామ్యం కోసమో, చట్ట సభల్లో సొంత శక్తితో వెళ్లలేక అధికార పక్షాల మొప్పు కోసమో, లేదా ఇతర ప్రయోజనాల కోసం చేసే ప్రదర్శనలు కావు. ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ప్రజా బాహుళ్యానికి మంచి చేసేందుకు ప్రభుత్వానికి అవసరమైన రీతిలో, తగిన సమయంలో ఇచ్చే విధంగా ఉంటాయి. ఇవ్వనీ రామకృష్ణ లాంటి వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదు. సీపీఐని కొంతైనా మెరుగుపరిచేందుకు ఎవరైనా మంచి సలహాదారుడిని వెతుక్కోవాలని నా సూచన’ అని లేఖలో పేర్కొన్నారు. -
దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులపై సీఎం జగన్‌కు అపార గౌరవం ఉందని.. ఆయనలోనూ ఓ జర్నలిస్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో నకిలీ వార్తలు ప్రమాదకరంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనాథ్‌రెడ్డి... జర్నలిస్టులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకోవలసిన అవసరం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంత విలేకరుల సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆయనను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ... పాత్రికేయ రంగంలో శ్రీనాథ్‌రెడ్డి సేవలను గుర్తించి సీఎం జగన్.. ఆయనను ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించారని పేర్కొన్నారు. శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ మరింతగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కూడా శ్రీనాథ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ‘గతంలో ఏ ప్రభుత్వాలు జర్నలిస్టులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే సీఎం జగన్ మాత్రం ఆరుగురు సీనియర్ జర్నలిస్టులకు తన ప్రభుత్వంలో పలు పదవులు ఇచ్చారు’ అని హర్షం వ్యక్తం చేశారు. ‘1996 లో ప్రెస్ అకాడమీ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ శిక్షణ ఇచ్చేది. గత కొంత కాలంగా ప్రెస్ అకాడమీలు నామమాత్రంగా మారాయి. ప్రెస్ అకాడమీకి స్థలం, నిధులు ఇచ్చి జర్నలిస్టులను ప్రోత్సహించాలి’ అని విఙ్ఞప్తి చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్, సీనియర్ పాత్రికేయులు ఆర్. దిలీప్‌రెడ్డి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కాగా శ్రీనాథ్‌రెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామం. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. -
దేవులపల్లి అమర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమితులైన సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ మీడియాలో గతంలో దక్షిణాదికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై కవరేజి తక్కువగా ఉండేదని చెప్పారు. ఇటీవల కాలంలో జాతీయ మీడియా కూడా దక్షిణాది వైపు దృష్టి పెట్టిందని.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, పాలనాపరమైన అంశాలను జాతీయ మీడియాకు చేరువయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ఏపీ ప్రభుత్వ జీవోలో కొత్తగా ఏమీ లేదు
-
‘కమలం’ ఆశలు ఫలిస్తాయా?
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో అఖండవిజయం సాధించిన బీజేపీ తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ కలిగించింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభంజనం ధాటికి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు బి. వినోద్‌కుమార్ మాత్రమే కాకుండా కేసీఆర్ తనయ కవిత సైతం ఓడిపోవడం దిగ్భ్రాంతికరం. పైగా తెలంగాణలో 2023లో తామే అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ముఖ్యనేత రాం మాధవ్ చెప్పడం కేసీఆర్‌కి మింగుడుపడని విషయమే. ఇక ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గల అపూర్వ ప్రజాదరణ, ఆయన అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రజా ప్రయోజనంకోసం చేస్తున్న పనుల వేగం చూస్తే రాం మాధవ్ చెప్పినట్టు అక్కడ అధికారంలోకి వచ్చే మాట అట్లా ఉంచి ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి రావడానికి కూడా బీజేపీ ఓ పదేళ్ళు ఆగాల్సిందే. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి ఇప్పటిదాకా ఒక్క కర్ణాటక రాష్ట్రం మీదనే ఆశలు ఉండేవి. గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన కారణంగా రాష్ట్రంలో అధికారం కోల్పోయిందే తప్ప బీజేపీకి మంచి స్థానాలే వచ్చాయి. నిజానికి అక్కడ అప్పటి దాకా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పడి పోయి సంకీర్ణానికి ఆ పార్టీ మద్దతు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంతేకాదు మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి సంపూర్ణ ఆధిక్యత లభించింది. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉంటే గత పార్లమెంట్లో బీజేపీ 17 స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తే మొన్నటి ఎన్నికల్లో సొంతంగా 25 స్థానాలు గెలిచి తాము బలపరిచిన మరో స్థానంలో సినీనటి సుమలతను గెలిపించుకున్నది. అంటే ఇప్పుడు కర్ణాటకలో 28కి 26 స్థానాలు బీజేపీ ఖాతాలో పడ్డాయన్న మాట. ఇదే ఊపులో రేపో మాపో అక్కడి సంకీర్ణ సర్కారును పడగొట్టి తామే తిరిగి అధికారాన్ని చేపట్టే ప్రయత్నాల్లో అప్పుడే పడిపోయారు కమలనాధులు. మరో ముఖ్య దక్షిణ రాష్ట్రం తమిళనాడులో బీజేపీ చేసిన ప్రయోగం ఫలితాన్ని ఇవ్వలేదు, తాను నిలబెట్టదల్చుకున్న ఏఐడీఎంకే చతికిల పడటంతో ఇప్పుడప్పుడే తమిళనాట సమయం వృథా చెయ్యడానికి సిద్ధంగా లేదని చెప్పాలి. మొన్నటి లోక్‌సభ ఫలితాలు చూసిన తరువాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో అక్కడ స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది. మరో రాష్ట్రం కేరళ బీజేపీకి నెరవేరని కోరికగానే నిలిచిపోయింది. ఇక బీజేపీ ముఖ్య నాయకుడు రాం మాధవ్ రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ తెలంగాణలో 2023లో తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం 2029 దాకా ఆగాల్సి ఉంటుం దని చెప్పారు. బీజేపీలో రాం మాధవ్ ఒక ముఖ్య నాయకుడు. అల్లా టప్పా మనిషి కాదు. ఆంధ్రప్రదేశ్ విషయం కాసేపు అట్లా పెడదాం. తెలంగాణాలో 2023లో అధికారంలోకి వస్తామని అంత గట్టిగా ఎట్లా చెప్పగలుగుతున్నారు ఆయన అన్నది మాట్లాడుకుందాం. ఇటీవల జరి గిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా నాలుగు స్థానాలలో గెలిచింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో బలంగా ఉన్న తెలుగుదేశంతో పొత్తుల కారణంగా ఒకసారి, ఒంటరిగా ఒకసారి రెండు స్థానాలు గెలిచినా సొంతంగా నాలుగు లోక్‌సభ స్థానాలు గెలవడం బీజేపీకి ఇదే ప్రథమం. చిత్రంగా గత డిసెంబర్ నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయిదు నుండి ఒక స్థానానికి పడిపోయి 119 స్థానాలకుగాను నూటికి పైగా స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయిన బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు చోట్ల అందునా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మూడుచోట్ల కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో గెలవడంతో అందరి దృష్టి బీజేపీ వైపు మళ్ళింది. ఇందులో నిజామా బాద్ స్థానంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఓడిపోవడం ఒకటయితే, గతంలో కేసీఆర్ తాను ముమ్మారు ప్రాతి నిధ్యం వహించి అద్భుత ఆధిక్యతలతో గెలిచిన తరువాత తనకు అత్యంత సన్నిహితుడయిన బోయినపల్లి వినోద్ కుమార్‌కు అప్పగిస్తే ఆయనా ఓటమి పాలు కావడం మరొకటి. ఆదిలాబాద్‌లో సోయం బాపురావు గెలుపు కేసీఆర్ గిరిజనుల మధ్య చిచ్చు పెట్టబోయి చేతులు కాల్చుకోవడానికి నిదర్శనంగా చూడాలి. సికింద్రాబాద్‌లో గెలిచి కేంద్ర మంత్రి కూడా అయిన కిషన్ రెడ్డి అదృష్టవంతుడు అని చెప్పాలి. శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన అయిదు మాసాల్లోనే లోక్‌సభకు ఎన్నిక కావడం కేంద్రంలో పదవి దక్కడం అదృష్టమే కదా. 1980 దశకంలో మావోయిస్ట్ ఉద్యమం ఉధృతంగా ఉండి వామపక్ష ఉద్యమాలకూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికీ గుండెకాయగా నిలిచిన ఉత్తర తెలంగాణలో మూడు లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం ఆషామాషీగా చూడాల్సిన విషయం కాదు. తెలంగాణలో బీజేపీ బలం పెంచుకోడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు అనుసరిస్తున్న రాజ కీయ ఎత్తుగడలే కారణం. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కేసీఆర్ ఉద్యమ కాలంలో ఫిరాయింపుల మీద విరుచుకుపడే వారు. అప్పట్లో ఆయన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటల్లోనే ‘‘ఇతర పార్టీల నుండి గెలిచినోణ్ని పార్టీ ఫిరాయింప చేస్తే ప్రజలు చీరి చింతకు కడతారు, ఇంత కిర్కిరి, ఇంత హరాకిరి ఉంటదా, ఇంత వ్యభిచార బుద్ధా రాజకీయాల్లో, నీతి ఉండొద్దా రాజకీయాల్లో’’ ఇట్లా సాగింది ఆయన ప్రవచనం. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కేసీఆర్ చేస్తున్న పనే ఎడాపెడా ఫిరాయింపులు చేయించడం. 2014లో 119కి గాను 62 స్థానాలే లభించాయి అసెంబ్లీలో, ఏ ముగ్గురిని చంద్రబాబునాయుడు టీడీపీలోకి లాగేసినా తన ప్రభుత్వం పడిపోవడం ఖాయం (చంద్రబాబు అటువంటి పిచ్చి ప్రయత్నం ఒకటి మొదలుపెట్టి రెడ్ హండెడ్‌గా దొరికిపోయి రాత్రికి రాత్రి విజయవాడకు మకాం మార్చిన విషయం తెలిసిందే) కాబట్టి అప్పట్లో తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని ఖాళీచేసి ఇద్దరు ముగ్గురు మినహా ఎమ్మెల్యేలందరినీ కొనేశారు కేసీఆర్, అప్పట్లో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ చివరికి సీపీఐ సభ్యులను వదలకుండా తన పార్టీలో కలుపుకున్నప్పుడు ఉద్యమ సమయంలో తానే∙తిట్టిన తిట్లు ఇప్పుడు తనకే వర్తిస్తాయని మరిచిపోయారు. ఆయనకు ఇంకో ఆలోచన కూడా ఉండింది, ఏనాటికయినా తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే కాబట్టి తెలుగుదేశం లాగానే దాన్ని కూడా తుడిచిపెట్టేస్తే ఇక తిరుగు ఉండదు అన్నది ఆ ఆలోచన. అందుకు అనుగుణంగానే ఆయన పావులు కదిపారు. 2018లో గడువుకంటే ముందే శాసనసభ ఎన్నికలకు వెళ్లి 88 స్థానాలు గెల్చుకుని మంచి మెజారిటీ సాధించినా ఆగకుండా కాంగ్రెస్ శాసన సభ్యులను టీఆర్ఎస్లో చేర్చుకునే పని కొనసాగించారు. ఇక కాంగ్రెస్ పని అయిపోయింది తెలంగాణలో తన పార్టీకి తిరుగులేదు అన్నది ఆయన ధీమా. కానీ పరిస్థితులు అట్లా లేవు. శాసనసభకూ లోక్‌సభకు వేర్వేరుగా ఎన్నికలొస్తే గెలుపు సులభం అవుతుందన్నది ఆయన ఆలో చన కాగా అసదుద్దీన్ ఒవైసీ స్థానం మినహాయిస్తే మిగిలిన 16 స్థానాలూ తన పార్టీవే అని ఎంత గొంతు చించుకుని చెప్పినా ప్రజలు తొమ్మిది స్థానాల దగ్గరే టీఆర్ఎస్ను ఆపేశారు. కాంగ్రెస్‌ను, తెలుగుదేశాన్ని తెలంగాణలో లేకుండా చెయ్యడం కోసం కేసీఆర్ చేసిన కార్యకమాలన్నిటికీ బీజేపీ మౌన సమర్థన ఉంది. ఎందుకంటే ఆ తరువాత తెలంగాణాలో ఏర్పడే శూన్యంలోకి తాము ప్రవేశించి అధికారం చేజిక్కించు కోవాలన్నది కమలనాధుల ఆలోచన. మోదీ మద్దతు తనకు ఉందని మురిసిపోయిన కేసీఆర్‌కు బీజేపీ అసలు ఆలోచన అర్ధం కాలేదు. ముస్లిం మైనారిటీల పట్ల సానుకూలంగా ఉండ టానికీ మజ్లిస్ పార్టీతో అతిగా పూసుకోడానికీ మధ్య తేడాను కేసీఆర్ మరిచిపోయిన కారణంగా కూడా తెలంగాణలో బీజేపీ బలపడటానికి తానే కారణం అయ్యారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సమాధి అయి నట్టేననీ టీఆర్ఎస్కు తిరుగులేదనీ సంబరపడినంతసేపు పట్టలేదు లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మూడు చోట్ల కాంగ్రెస్‌ను గెలిపించడానికి. అందు లోనూ ఎవరి రాజకీయ జీవితాన్ని సమాప్తం చెయ్యాలని కేసీఆర్ అను కున్నారో ఆ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుండి లోక్‌సభకు వెళ్లడం ఇంకో షాక్. కేసీఆర్ కోరిక నెరవేరి తెలంగాణలో కాంగ్రెస్ పతనం అవుతుందో లేదో తెలియదు కానీ మరో బలమయిన ప్రత్యర్ధి బీజేపీ తెలంగాణలో ప్రవేశించింది అనడంలో సందేహం లేదు. పైగా ఏ ఫలితంలేని ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన ముందుకు తెచ్చి ఆయన కమలనాధుల కటాక్షాన్ని కూడా కోల్పోయారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం అక్కడి నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గల అపూర్వ ప్రజాదరణ, ఆయన అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రజా ప్రయోజనంకోసం చేస్తున్న పనుల వేగం చూస్తే రాం మాధవ్ చెప్పినట్టు అధికారంలోకి వచ్చే మాట అట్లా ఉంచి ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి రావడానికి కూడా బీజేపీ ఓ పదేళ్ళు ఆగాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ది కనీసం తెలం గాణ పరిస్థితి కూడా కాదు. మొన్నటిదాకా అధికారంలో ఉన్న తెలుగు దేశం భవిష్యత్తు ఆ పార్టీ నాయకత్వమే గందరగోళంలో పడేసుకుంది కాబట్టి బీజేపీ బలపడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలో సంపూర్ణ అధికారంలో ఉన్న బీజేపీ పెద్దఎత్తున చేయూత ఇస్తేనే ప్రజలు హర్షిస్తారు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
చంద్రబాబు విమర్శ వింతల్లోకెల్లా వింత
రాజకీయ జీవిత చరమాంకంలో చంద్రబాబు ఈ దేశానికీ పెద్ద నష్టం చెయ్యడానికి సిద్ధపడ్డారు. ఎన్నికల నిర్వహణ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించడమే ఆ నష్టం. ఈ దుష్ప్రచారాన్ని ఈ దేశ ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి మన ఎన్నికల వ్యవస్థ పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కానీ ఇటువంటి నాయకులే వచ్చిపోతుంటారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతలను పూర్తిగా తుంగలో తొక్కిన కారణంగానే ప్రజాదరణ కోల్పోయి ఒక యువనేత చేతిలో ఓడిపోతున్నానన్న వాస్తవాన్ని అంగీకరించలేక చంద్రబాబు తన ఓటమికి ఈసీ అసమర్థత, ఎన్నికల్లో జరిగిన అవకతవకలూ కారణం అని చెప్పేందుకు తయారు చేసుకుంటున్న వేదికే ఈ నాటకం అంతా. బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ ఎన్నికలప్పుడూ చూడని వింతలు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం. ఎన్నికల్లో గెలుపు పట్ల కొన్ని రాజకీయ పక్షాలు ధీమాగా ఉంటాయి. కొన్ని పార్టీలకు గెలుస్తామో లేదో అర్థం కాకపోవచ్చు. వాళ్ళు కొంచెం సందిగ్ధంలో ఉంటారు. ఓటమి ఖాయం అని కొన్ని పార్టీలకు ముందే తెలిసి పోతుంది. ఈ అన్ని కోవలకు చెందిన పార్టీలు ఎన్నికలు అయ్యాక ఫలితాలు వెలువడే వరకూ తమకు తోచిన లెక్కలు వేసుకుని జయాపజయాలను గురించిన ఒక అంచనాకు రావడం సహజంగా జరిగే పని. గెలుపు పట్ల ధీమా ఉన్నవాళ్ళు లేదా గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు, మనం చెయ్యాల్సిన ప్రయత్నం మనం చేశాం అనుకునే వాళ్ళు ఫలితాలు వెలువడే వరకూ ప్రశాంతంగా గడిపేస్తారు. ఎన్నికల సమయంలో పడ్డ శ్రమను మరిచిపోడానికి విశ్రాంతి తీసుకుంటారు. ఎన్నికలప్పుడు సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ, అక్రమాలకూ పాల్పడిందనీ ఫిర్యాదు చేస్తారు. అధికార పక్షం చాలా ధీమాగా ఉంటుంది. ఫలితాలు వెలువడిన తరువాత ఓడిపోయినా పార్టీలు కారణాలను విశ్లేషించుకోవడం సహజం. వీలయితే తప్పులు సరిదిద్దుకుని మళ్ళీ అయిదేళ్లకు వచ్చే ఎన్నికల్లో ప్రజాభిమానం చూరగొనడానికి ఏం చెయ్యాలో ఆలోచించి ఆ ప్రకారం నడుచుకోవడం కూడా సహజం. ఈసీపై బాబు విమర్శ వింతల్లోకెల్లా వింత ఓటమికి కారణాలను వెతుక్కోవడం, విశ్లేషించుకోవడం అంటే తమ వల్ల జరిగిన తప్పులను గుర్తించడం, మళ్ళీ ఆ తప్పులు జరక్కుండా చూసుకోవడం. మొదట్లోనే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అట్లా కాకుండా ఒక వింత పరిస్థితి నెలకొని ఉన్నది. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తాను అధికారంలో ఉన్నానో, ప్రతిపక్షంలో ఉన్నానో అర్థం కాని పరిస్థితుల్లో ప్రవర్తిస్తున్న తీరు ఈ వింత పరిస్థితికి దారి తీసింది. 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. అంతకు ఒక రోజు ముందు నుండే ఆయన ఈ ఎన్నికలు జరిగిన తీరు మీద అభ్యంతరాలు వ్యక్తం చెయ్యడం, అక్రమాలు జరగబోతున్నాయని వాపోవడం, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించడం మొదలు పెట్టారు. తన పోలీసులనే తనను అరెస్ట్ చెయ్యమని ప్రేరేపించడం పరాకాష్ట. ఇన్నీ చేసి పోలింగ్ రోజున మళ్ళీ పొద్దున్నే బుద్ధిమంతుడిలా బూత్‌కు వెళ్లి ఓటు వేసి బయటికొచ్చి భార్యా బిడ్డలతో కలిసి వేలి మీద సిరా గుర్తు చూపించి ఇంటికి వెళ్ళారు. అట్లా వెళ్ళిన గంట తరువాత గోల మొదలు పెట్టారు ఈవీఎంలు మొరాయించాయనీ, తప్పులు చేస్తున్నాయనీ ప్రతిపక్షానికి అనుకూలంగా ఓట్లు మారుతున్నాయనీ. అసలు ఈ ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణే తప్పు.. పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలనీ ఉపన్యాసం మొదలుపెట్టారు. ఆయన ఇట్లా ఉపన్యసిస్తున్న సమయంలోనే ఆయన ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన పెద్దమనిషి కోడెల శివప్రసాద్ ఒక బూత్‌లో దూరి తలుపులు వేసుకుని రిగ్గింగ్ మొదలుపెట్టి జనం చేత బయటికి ఈడ్పించేసుకున్నాడు. 1994లో తాను భాగస్వామిగా ఉన్న టీడీపీ.. 1999, 2014లో తను అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ ఎన్నికలలో గెలిచినప్పుడు ఇవే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగిన విషయం ఆయన మరిచిపోతున్నారు. పోనీ అప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయి ఇప్పుడు చెయ్యడం లేదు, అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిజాయితీగా పనిచేసింది ఇప్పుడు చెయ్యడం లేదు అనుకుంటే గత అయిదేళ్లుగా ఎందుకు ఒక్క మాటా మాట్లాడలేదు? మొన్నటికి మొన్న నంద్యాల శాసన సభ ఉపఎన్నికల సందర్భంలో ఎందుకు మాకు ఈవీఎంలు వద్దు, ఈ ఎన్నికల సంఘం వద్దు అనలేదు. ఇప్పుడు తన కొత్త మిత్రులు కాంగ్రెస్ వారు పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో గెలిచినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? గెలుపుపై ధీమా.. తోడుగా చిత్తచాంచల్యం ఇప్పుడెందుకు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ కప్పెక్కి ఈవీఎంలనూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు? ఈ ఎన్నికలలో ప్రజల తీర్పు ఆయనకు ముందే తెలిసి పోయింది. అధికారం కోల్పోబోతున్నామని అర్థం అయింది. అందుకే పొంతన లేని మాటలు మొదలు పెట్టారు. కాసేపు నా ఓటు నా పార్టీకి పడిందో లేదో అని అనుమానం వ్యక్తం చేస్తారు, మళ్ళీ వెంటనే తన పార్టీకి 150 స్థానాలు లభిస్తాయని మాట్లాడతారు. గెలుపు మీద ధీమా ఉన్న వాళ్ళెవ్వరూ ఇట్లా చిత్త చాంచల్యం ప్రదర్శించరు. ‘‘స్టేట్స్‌మన్‘‘ అయితే ఓటమిని కూడా ధైర్యంగా స్వీకరిస్తారు. ఆత్మవిమర్శ చేసుకుంటారు. ఇక్కడ చంద్రబాబునాయుడు ఎంత సేపూ ఆత్మస్తుతి పరనిందతోనే గడిపేస్తారు. ఆయన రాజకీయ జీవితం అంతా అట్లానే గడిచింది. ఈ చివరి అంకంలో ఆయన మారతారని ఎట్లా అనుకుంటాం. ఎన్నికలు అయిపోయాయి. ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రంగా ఉన్నాయి. మే 23వరకూ ఆగితే ఫలితం తెలిసి పోతుంది. ఇప్పుడు ఎన్ని విన్యాసాలు ప్రదర్శించినా పరిస్థితి మారదు, మళ్ళీ ఎన్నికలు జరగవు. మరెందుకు చంద్రబాబు ఇంత గోల చేస్తున్నట్టు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పట్టుమని పదేళ్ళయినా పూర్తి కాని ఒక యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒంటరి పోరాటంలో తాను మట్టికరవబోతున్నానన్న ఆలోచనే ఆయనకు మింగుడు పడటం లేదు. సీనియర్ రాజకీయవేత్తగా విలువల విషయంలో మార్గదర్శిగా ఉండాల్సిన తాను యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. నిజాయితీ నా సొంతం, నేను నిప్పును అని చెప్పుకునే ఆయన ప్రజాప్రతినిధులను కొంటుంటే, జగన్ తన పార్టీలో చేరే వాళ్ళు పదవులకు రాజీనామా చెయ్యాలని నిబంధన విధించి కొన్ని విలువలను ప్రతిష్టించాడు. ఈ అయిదేళ్ళలో జగన్మోహన్ రెడ్డికి పెరిగిన ప్రజాదరణ, ముఖ్యంగా 14 మాసాలపాటు ఆయన చేసిన పాదయాత్రను జనం ఆదరించిన తీరు చంద్రబాబునాయుడును గంగవెర్రులు ఎత్తిస్తున్నది. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పాటించకపోగా వాటిని పూర్తిగా తుంగలో తొక్కిన కారణంగానే ప్రజాదరణ కోల్పోయి ఒక యువనేత చేతిలో ఓడిపోతున్నానన్న వాస్తవాన్ని అంగీకరించలేక చంద్రబాబు నాయుడు తన ఓటమికి ఎన్నికల సంఘం అసమర్థత, ఎన్నికల్లో జరిగిన అవకతవకలూ కారణం అని చెప్పేందుకు తయారు చేసుకుంటున్న వేదికే ఈ నాటకం అంతా. ఓటమి ముంగిట్లోనూ డబ్బు చేసుకోవడమే! అంతే కాదు, ఫలితాలు వెలువడే దాకా ఈ నలభై రోజులు బీజేపీ వ్యతిరేక శిబిరంలో తానే చక్రం తిప్పుతున్నాననే భ్రమలో ఉండి, ఇతరులను కూడా ఉంచి మకాం ఢిల్లీకి మార్చాలనే ఆలోచన కూడా ఇందుకు కారణం కావచ్చు. కానీ వాతావరణం చూస్తే అట్లా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 లోక్‌సభ స్థానాల్లో కచ్చితంగా ఆయన పార్టీ గెలవగల స్థానం ఒక్కటి కూడా గట్టిగా చెప్పలేని స్థితిలో ఉన్నారు. లోక్‌సభ స్థానాలు లేకుండా ఢిల్లీలో ఆయనను పిలిచి పీట వేసే వాళ్ళు ఎవరూ ఉండరన్న విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. చంద్రబాబు ఆయన పార్టీ నేతలూ ఇంకా 150 స్థానాలు మావే అని చెప్పుకుని తిరగడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మళ్ళీ ఆయనే వస్తాడేమో అనే భయంతో డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వసూలు చేసుకోవడం (ఇది జరుగుతున్నది అనడానికి నిదర్శనం నిన్న మొన్న ముఖ్యమంత్రి అధికార నివాసం ఫోన్ నుంచి వ్యాపారులను డబ్బు ఇవ్వాలని పీడిస్తూ వెళ్ళిన ఫోన్ కాల్స్, ఆ వ్యాపారులు చేసిన పోలీసు కంప్లైంట్స్). రెండో కారణం ఓడిపోతున్నామని తెలిస్తే ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి కూడా ఎవరూ పిలవరేమో అన్న దుగ్ధ కావొచ్చు. ఏది ఏమయినా రాజకీయ జీవిత చరమాంకంలో చంద్రబాబు నాయుడు ఈ దేశానికీ పెద్ద నష్టం అయితే చెయ్యడానికి సిద్ధపడ్డారు. ప్రజాస్వామ్య పండుగగా అందరం కీర్తించే ఎన్నికల నిర్వహణ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం పట్ల ప్రజల్లో విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించడమే ఆ నష్టం. అభినవ గోబెల్ చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ దుష్ప్రచారాన్ని ఈ దేశ ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి మన ఎన్నికల వ్యవస్థ పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఇటువంటి నాయకులే వచ్చిపోతుంటారు. ఏది ఏమయినా వచ్చే నలభై రోజులు అమరావతిలోని ఉండవల్లి వేదిక బీట్ చూస్తున్న విలేకరులకు మాత్రం రోజూ కొన్ని గంటలు చంద్రబాబు పత్రికాగోష్టి పేరిట ఇచ్చే ఉపన్యాసాల ఘోష భరించక తప్పదు. -దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
డేటాచౌర్యంలో చంద్రబాబే దోషి!
ప్రభుత్వం దగ్గర సురక్షితంగా ఉండాల్సిన పౌరుల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే వెంటనే కదిలి విచారణకు ఆదేశించి బాధ్యులైనవారిపై చర్యలు చేపట్టాల్సింది పోయి నా డేటా నాకు పంపాలి కానీ మీరు కేసులు ఎట్లా పెడతారు అని తెలంగాణ పోలీసుల మీద, ప్రభుత్వం మీద చంద్రబాబు రంకెలేస్తున్నారు. పౌరుల వ్యక్తిగత వివరాలు ఏపీ ప్రభుత్వంలోని ఎవరో ఒకరు ఇవ్వకపోతే ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎట్లా అందాయి? ఎన్నికలలో గెలవడం కోసం ఇన్నాళ్ళూ అవలంబిస్తున్న పద్ధతులు ఈసారి ఫలితం ఇచ్చేట్టు లేవని అర్థం అయిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు వెయ్యిరెట్లు ప్రమాదకరమైన వంచనాత్మక క్రీడలో అదే పద్ధతిలో దొరికిపోయేట్టున్నారు. ‘‘నా సత్తా ఏంటో తెలియాలంటే ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమా చూడమనండి మోదీని, కేసీఆర్‌ని’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అన్నారు. 1984 ఆగష్టు సంక్షోభంలో నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటు నుంచి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాపాడటంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అని ఈ సినిమాలో చూపించారు. కాబట్టే చంద్రబాబు తన పార్టీ సమావేశాల్లో, మంత్రివర్గ సమావేశాల్లో బహిరంగ సభల్లో ఈ సినిమా ప్రమోషన్ మొదలు పెట్టారు. 84 తరువాత పుట్టిన వాళ్ళు చాలామందికి ఆనాటి ఆగష్టు సంక్షోభంలో ఏం జరిగిందో తెలిసే అవకాశం తక్కువ, వాళ్ళంతా ఇప్పుడు ఓటర్లు అయ్యారు కాబట్టి ఈ సినిమాలో చూపించినదంతా నిజమని నమ్మి తనకు ఓట్లు వేస్తారని ఆయన అభిప్రాయం. నిజంగా అలా జరుగుతుందనే ఆయన అనుకుంటారు, నమ్ముతారు కూడా, ఎందుకంటే ఆయన చరిత్ర చదవరు , చరిత్ర దండగ అనే అభిప్రాయం ఆయనది కాబట్టి తనలాగే ఈ వర్గం ఓటర్లు చరిత్ర చదవకుండా, తెలుసుకోకుండా గుడ్డిగా తనకు ఓట్లు వేస్తారని ఆయన భావిస్తూ ఉండొచ్చు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 84లో నాదెండ్ల భాస్కర్‌రావును ముందు పెట్టి ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అస్థిర పరి చేందుకు చేసిన కుట్రను భగ్నం చెయ్యడంలో చంద్రబాబు పాత్రే ప్రధానమని చూపించారు ఈ సినిమాలో. ఇది పూర్తిగా అబద్ధం అని ఆనాటి తరం వాళ్ళందరికీ, ముఖ్యంగా ఎన్టీఆర్‌ను ఆయన ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న రాజకీయ పక్షాలకూ, మేధావులకు, పత్రికా సంపాదకులకూ బాగా తెలుసు. ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న వెంకయ్యనాయుడుకు, జైపాల్‌రెడ్డికి తెలుసు. అరుణ్ శౌరి, కులదీప్ నయ్యర్ వంటి ప్రముఖ సంపాదకులకు తెలుసు ఆనాడు చంద్రబాబుది కేవలం ఒక మేనేజర్ పాత్ర అని. చంద్రబాబు అప్పుడప్పుడే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాడు. ఆయన బంధుత్వాన్ని ప్రయోగించి మామ పంచన చేరాడే తప్ప సినిమాలో చూపించినట్టు ఎన్టీఆర్ ఏమీ ఆయనను ఆహ్వానించలేదు. రామకృష్ణ స్టూడియోస్‌లో తెలుగుదేశం, దాని మిత్రపక్షాల శాసన సభ్యుల శిబిరంలో అయినా, వాళ్ళందరినీ ట్రైన్లో ఢిల్లీకి తరలించే క్రమంలో అయినా, ఢిల్లీ నుంచి వాళ్ళందరినీ బెంగళూరు సమీపంలోని నందిహిల్స్ శిబిరానికి తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు శాసనసభలో బలపరీక్ష కోసం తరలించిన అన్ని సంఘటనల్లో చంద్రబాబుది మేనేజర్ పాత్రే. శాసన సభ్యుల అవసరాలు తీర్చడం, సౌకర్యాలు ఏర్పాటు చెయ్యడం మినహా ఆయన చేసిందేమీ లేదు, రామకృష్ణ స్టూడియోలో, ఎంఎల్ఏల ఢిల్లీ ట్రైన్ ప్రయాణంలో, నందిహిల్స్ శిబిరంలో వారి వెన్నంటి ఉండి ప్రత్యక్ష సాక్షులయిన పలువురు పాత్రికేయులలో నేనూ ఒకడిని. అయితే ఈ సినిమాలో మాత్రం చంద్రబాబు ఫైటింగ్‌లు కూడా చేసి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నిలబెట్టినట్టు చూపిస్తారు. ముఖ్యంగా ఎంఎల్ఏలను ట్రైన్లో ఢిల్లీ తరలించినప్పుడు రివాల్వర్‌తో దాడి చేసిన వాళ్ళతో ఆయన స్వయంగా తలపడినట్టు, దుండగులను తరిమికొట్టినట్టు చూపిస్తారు. ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడ్డ వాళ్ళంతా ఎన్టీఆర్‌కు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ఆయన ప్రభుత్వానికి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా నిలబడ్డారు తప్ప చంద్రబాబు సినీ ఫక్కీ ఫైట్లతో విజయం చేకూరలేదు. నెల రోజుల సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర పోలీసు ఐజీని మార్చి మహేందర్ రెడ్డి అనే అధికారిని నియమించారు. రామకృష్ణ స్టుడియోలో ఉన్న శాసన సభ్యులను బలవంతంగా అక్కడి నుండి తరలించి బయటకు తెచ్చి వదిలెయ్యాలన్న భాస్కర్‌రావు ఆదేశాలను అరవిందరావు పాటించి ఉంటే కథ వేరేగా ఉండేది. ఆయన ఆ పని చెయ్యనని కచ్చితంగా తిరస్కరించారు. అట్లాగే రాష్ట్ర ప్రజల మనోగతాన్ని ఇందిరా గాంధీకి వివరించి మళ్ళీ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పునరుద్దరింపచేసిన ఘనత శంకర్ దయాళ్ శర్మది. ఇప్పుడింత వక్రీకరణలతో కూడిన సినిమా ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ఆయనది. 84లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ దగ్గరి నుంచి 95లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకూ చంద్రబాబుది మేనేజర్ పాత్రే. ప్రజాస్వామ్యంలో రాజ కీయాలను, ఎన్నికలను ఈవెంట్లుగా మాత్రమే చూడటం వాటికి తానూ మేనేజర్‌గా వ్యవహరించడమే ఆయన 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర, అనుభవం. రాజకీయాల్లో మానవీయ కోణం ఉంటుందని కానీ, నైతిక విలువలు ఉంటాయని కానీ ఆయన ఒప్పుకోరు. బాబు నమ్మే సిద్ధాంతం రాజకీయమే దేవాలయం అధికారమే దైవం. రాజకీయాలంటే అధికారం, దానికోసం ఏమైనా చేయొచ్చు అదీ ఆయన సిద్ధాంతం. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. 1992లో రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక కోట్ల విజయభాస్కర్ రెడ్డి పాణ్యం నుండి శాసనసభ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఆయన మీద టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఉపఎన్నికలో ప్రజల సానుభూతి పొందడానికి చంద్రబాబు ఎటువంటి స్కెచ్ ప్రతిపాదించారో దాన్ని ఎన్టీఆర్, ఇతర నాయకులు ఎట్లా వ్యతిరేకించారో రేణుకా చౌదరిని, దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఆ నాటి టీడీపీ నాయకులను అడిగితే చెపుతారు. ఎన్టీఆర్‌ను దించేసి సీఎం అయిన కొద్ది రోజుల్లోనే 1996లో పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో చంద్రబాబు గాంధీగారిని (కరెన్సీ) ఓటర్లకు బాగా పరిచయం చేసారని ఆ పార్టీ సీనియర్ నాయకులే చమత్కారంగా చెప్పుకునేవారు. ఎన్నికల్లో ధన ప్రభావం మొదలయింది ఆ ఎన్నికల నుంచే, దానికి ఆద్యుడు చంద్రబాబే. 1996లో అత్తిలి నుండి 2017 నంద్యాల ఉపఎన్నికలదాకా చంద్రబాబు డబ్బు ప్రభావాన్ని ఎంత పెంచేసారో, ప్రజాస్వామ్యాన్ని ఎంత అవినీతిమయం చేసేసారో అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలోనే ఓటుకు కోట్లు కేసు ప్రయోగం విఫలం అయి హైదరాబాద్ శాశ్వతంగా వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు అదే హైదరాబాద్‌లో అంతకు వెయ్యిరెట్లు ప్రమాదకరమయిన ఒక క్రీడలో అదే పద్ధతిలో దొరికిపోయేట్టున్నారు. ఎన్నికలలో గెలవడం కోసం ఇన్నాళ్ళూ అవలంబిస్తున్న పద్ధ్దతులు ఈసారి ఫలితం ఇచ్చేట్టు లేవని అర్థమయి ఈ కొత్త క్రీడకు శ్రీకారం చుట్టారు. మూడున్నర కోట్ల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల వ్యక్తిగత వివరాలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర ఉన్న విషయాన్ని సామాజిక కార్యకర్త, ఆంధ్రప్రదేశ్ పౌరుడు లోకేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. హైదరాబాద్‌లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా ఆ కంపెనీలో జరిపిన సోదాల్లో అందరూ నిర్ఘాంత పోయే వివరాలు బయటపడ్డాయి. ప్రభుత్వం దగ్గర సురక్షితంగా ఉండాల్సిన పౌరుల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే ఏపీ ప్రభుత్వం వెంటనే కదిలి ఇదెలా జరిగిందో విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలకు పూనుకోవాల్సిందిపోయి నా డేటా నాకు పంపాలి కానీ మీరు కేసులు ఎట్లా పెడతారు అని తెలంగాణ పోలీసుల మీద, ప్రభుత్వం మీద బాబు రంకెలేస్తున్నారు. పౌరుల వ్యక్తిగత వివరాలు ప్రభుత్వం లోని ఎవరో ఒకరు ఇవ్వకపోతే ఐటీ గ్రిడ్‌కు ఎట్లా అందాయి? ఎట్లా అందాయో తెలియాలంటే ఐటీ గ్రిడ్ యజమానిని ప్రశ్నించాలి. ఆయన పారిపోయి ఏపీలో ప్రభుత్వ ఆశ్రయంలో ఉన్నాడు. ఆయనకు పూర్తి రక్షణ అక్కడి ప్రభుత్వమే కల్పిస్తున్నది అంటే అర్థం ఏమిటి? నిందితుడిని విచారించి నిజాలు బయటపెట్టాల్సిన ప్రభుత్వం అతడికి రక్షణ ఇచ్చి, నేరాన్ని బయటపెట్టిన బాధ్యతగల పౌరుడు లోకేశ్వర్ రెడ్డిని దారినబోయే దానయ్య అని చులకనగా మాట్లాడి ఆయనను హైదరాబాద్ నుంచి ఎత్తుకుపోయే ప్రయత్నం చెయ్యడంలో అర్థం ఏమిటి? ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, ప్రభుత్వమే రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను ఒక ఐటీ కంపెనీకి ఇచ్చి తన పార్టీకి సంబంధించిన సేవా మిత్ర అనే యాప్ ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలోని తన పార్టీ కార్యకర్తలకు అందచేసే ఏర్పాటు చేసింది. సీఎంగా తన దృష్టికి వచ్చే విషయాలను అవసరమయిన మేరకు తప్ప ఎక్కడా వెల్లడించనని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన బాబు ప్రభుత్వం నుంచి టీడీపీ ప్రయోజనాల కోసం ఈ వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోవడమంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టే. ఈ వివరాల సహాయంతో ఎన్నెన్ని అక్రమాలకూ పాల్పడతారో ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి, ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో బాటు ఐటీ రంగ నిపుణులూ, మేధావులూ వివరంగా చెపుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక్క మాట చెప్పాలి. టీడీపీ ప్రభుత్వ ఘాతుక చర్య కారణంగా మీ ఎవ్వరి వ్యక్తిగత జీవితాలూ భద్రంగా మాత్రం లేవు అని. ఈ వ్యవహా రాన్ని పోలీసులు, న్యాయస్థానాలు తేలుస్తాయి అని రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇది ఓట్లకు సంబంధించిన వ్యవహారం కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. ఏపీలోని చివరి ఓటు వరకూ భద్రం అని తేలేదాకా, మొత్తం ఓటర్ల జాబితా నూటికి నూరు శాతం సరిగ్గా ఉందని నిర్ధారణ జరిగాకనే అక్కడ ఎన్నికలు జరపాలి. అవీ స్వతంత్రంగా జరపాలి. తీగ అయితే లాగారు డొంక కదులుతుందా లేదా చూడాలి. వ్యాసకర్త: దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
నిజాలను దాచేసే సినిమాలెందుకు?
ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఏ నాటికయినా ఇబ్బంది రాకుండా ఉండటానికే బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలలో ఎన్టీఆర్ ఇమేజ్ అవసరం కాబట్టి బావమరిది చేత రెండు సినిమాలు తీయించ బూనుకున్నారు. బాలకృష్ణ తన తండ్రి ప్రజాజీవిత వ్యక్తిత్వాన్ని నిజాయితీగా చిత్రీకరిస్తే చంద్రబాబును విలన్‌గా చూపిం చాలి. ఎన్టీఆర్ చివరి శ్వాస వరకూ జరిగిన ఘటనలను మహానాయకుడు చిత్రీకరిస్తే మాత్రం చంద్రబాబు పాత్రలో వక్రీకరణలు తప్పవు. ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో వక్రీకరణలకు ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాం గోపాల్ వర్మ నిర్మించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏమన్నా సమాధానం చెబుతుందేమో చూడాలి. వి డోంట్ నీడ్ ఎన్టీఆర్ (మాకు ఎన్టీఆర్ అవసరం లేదు) అని ఎన్టీరామారావు నుంచి అధికారం లాక్కున్న కొద్ది రోజులకే ఒక స్థానిక ఆంగ్ల దిన పత్రికకు చంద్రబాబు నాయుడు ఇంటర్వూ్య ఇచ్చిన సమయానికి నందమూరి బాలకృష్ణ ఆయనతోనే ఉన్నాడు. బాలకృష్ణ, హరికృష్ణ మొదలయిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఆ సమయంలో చంద్రబాబు వెంటనే ఉన్నారు. ఎన్టీ రామారావును దుర్మార్గంగా పదవీచ్యుతుడిని చేసిన తరువాత సచివాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో గోడలకు ఉన్న ఫొటోలను తీసి మరుగు దొడ్ల పక్కన పడేస్తే మీడియా వాళ్ళు ఫొటోలు తీసి ప్రచురించిన విషయం ప్రపంచానికి తెలుసు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన రసీదు పుస్తకాల మీద పార్టీ ఆవిర్భావం నుంచీ ప్రచురిస్తూ వచ్చిన ఎన్టీఆర్ బొమ్మను తొలగించేసిన చంద్రబాబు తరువాత హరికృష్ణ అలగడంతో తిరిగి ఆ రసీదు పుస్తకాలను మార్చి ఎన్టీఆర్ బొమ్మ ముద్రించిన విషయమూ తెలుసు. ఇప్పుడు ఎన్టీరామారావు స్థాపించిన పార్టీ అని, ఆయన విగ్రహాలకు దండలు వేసినంత మాత్రాన ఆయన మీద చెప్పులు వేయించిన విషయం ఎవరూ మరిచిపోరు. ఎన్నికలలో గెలుపు కోసం ఎన్టీఆర్ భజన తప్ప ఈ బృందం ఆయనను నిజాయితీగా గౌరవించింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి కాబట్టి ఎన్టీఆర్ స్తోత్ర పారాయణంలో స్వరం పెంచారు చంద్రబాబు. ప్రపంచంలో ప్రతి విషయాన్ని పదవి కోణంలో నుండి చూడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ అయిదేళ్ళ కాలంలో చంద్రబాబు పరిపాలనను చూసిన జనం మార్పు కోరుతున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్న తరుణంలో మళ్ళీ ఒకసారి ఎన్టీఆర్‌ను ఎన్నికలలో లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం సినిమాల రూపంలో మొదలుపెట్టారు చంద్రబాబు. బాలకృష్ణ తన తండ్రి జీవితాన్ని వెండితెరకు ఎక్కిస్తుంటే చంద్ర బాబును ఎందుకు మధ్యలోకి తేవడం అని ఎవరయినా అనుకోవొచ్చు. చంద్రబాబు అన్నీ అట్లాగే చేస్తారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఏ నాటికయినా ఇబ్బంది రాకుండా ఉండటానికే బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలలో ఎన్టీఆర్ ఇమేజ్ అవసరం కాబట్టి బావమరిది చేత రెండు సినిమాలు తీయించ బూనుకున్నారు. మొదటిది ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదల అయింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ నట జీవితం చివరన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించే వరకే చూపించారు. ఎన్టీఆర్ రాజకీయాలు, ఎన్నికలు, అధికారంలోకి రావడం ఇట్లాంటివన్నీ ఉండే రెండో భాగం ఎన్టీఆర్ మహా నాయకుడు ఎల్లుండి విడుదల కాబోతున్నది. మొదటి భాగం కథానాయకుడును జనం పెద్దగా ఆదరించలేదు. ఈ రెండో భాగం ఎట్లా ఉండబోతున్నది అన్న ఆసక్తి అందరిలో నెలకొన్నది. దాని గురించి పెద్దగా ఆలోచించడానికి ఏముంది? ఎన్టీరామారావు రాజకీయాల్లో నిలబడటానికి, కొనసాగడానికీ విజయాలు సాధించడానికీ బాబు నిర్వహించిన గొప్ప పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఎన్టీరామారావు కథానాయకుడిగా తీసిన మొదటి భాగం పెద్ద ఇబ్బందికరమైందేమీ కాదు. రెండవ భాగం అట్లా కాదు రెండు ఆగస్టు సంక్షోభాలను ఇందులో తెరకెక్కించాలి. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్‌రావు చేసింది ఎన్టీఆర్‌కు వెన్నుపోటు అయితే, 1995 ఆగస్టులో బాబు చేసింది కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటే కావాలి, బాబు చేసింది ప్రభుత్వాన్ని, పార్టీని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభీష్టం మేరకు జరిగినదిగా భావిస్తే 84లో నాదెండ్ల చేసిందీ అదే అనుకోవాలి, అయితే నాదెండ్ల విఫలం అయ్యారు, బాబు సఫలం అయ్యారు. ఇవన్నీ ఎట్లా చూపిస్తారు ఈ సినిమాలో, అసలు చూపిస్తారా లేదా? ఆ రెండు ఎపిసోడ్లు లేకుండా ఎన్టీఅర్ రాజ కీయ జీవితాన్ని తెరకు ఎక్కించడం ఎట్లా సాధ్యం? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులనూ, రాజ కీయ పరిశీలకులనూ వేధిస్తూ ఉండవచ్చు. ఈ మధ్యలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవి తంలోని ఒక స్వల్ప ఘట్టం, ఎంతో ముఖ్యమయిన ఘట్టం కూడా, పాదయాత్రను ఆధారం చేసుకుని తీసిన యాత్ర సినిమా అద్భుత ప్రజాదరణ పొందింది. ఈ సినిమా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి కొంత లాభం చేస్తే చెయ్యొచ్చు కానీ అందుకోసమే తీసిన సినిమా కాదు, ఎందుకంటే ఇందులో ఎన్నికలలో లబ్ధి కోసం ఉద్దేశించిన వక్రీకరణలు లేవు. అటువంటి వక్రీకరణలకు ఈ సినిమాలో అవకాశం కూడా లేదు. యాత్ర తీసిన వాళ్ళు చాలా స్పష్టంగా వైఎస్ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొం టున్న కొన్ని తీవ్ర సమస్యలకు అధికారంలోకి రాగానే కనుగొన్న పరిష్కారాలకు సంబంధించినంత వరకే పరిమితం అయ్యారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ అందులో ప్రధానమైనవి. ఈ పథకాల కారణంగా రాజశేఖరరెడ్డి పరిపాలనలో లాభపడ్డ కోట్లాది మందికి కొత్తగా చెప్పాల్సింది, మెప్పించాల్సింది ఏమీ లేదు. ఇంకెవరికో రాజకీయ లబ్ధి చేకూరేందుకు కాకుండా ప్రజా జీవి తంలో వైఎస్ ఆర్ వ్యక్తిత్వాన్ని చిత్రీకరించడం వరకే పరిమితం అయ్యారు కాబట్టి యాత్ర సినిమా అందరినీ ఆకట్టుకున్నది. మరి ఎన్టీఆర్ రాజకీయ జీవి తాన్ని తెరకు ఎక్కించాలనుకుంటున్న బాలకృష్ణ కేవలం ఆయన ప్రజాజీవిత వ్యక్తిత్వాన్ని నిజాయితీగా చిత్రీకరిస్తారా లేక చంద్రబాబు రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా తీస్తారా అన్నది చూడాలి. నిజాయితీగా తీస్తే చంద్రబాబును విలన్‌గా చూపించాలి. ఎందుకంటే ఎన్టీఆర్ చెప్పిన చివరి మాటలు అవే కదా. జామాతా దశమగ్రహం అన్నాడు ఎన్టీఆర్ చంద్రబాబును ఉద్దేశించి. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అతడిని నమ్మడమే అని కూడా చివరి మాటల్లో బాధపడ్డాడు ఎన్టీఆర్. పోనీ చంద్రబాబు పాత్ర లేకుండా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని సినిమాగా తీస్తారా, అదెట్లా సాధ్యం? మా నాయకురాలు కోరితే మామ మీద అయినా పోటీ చేస్తాను అన్న దగ్గరి నుంచి వైస్రాయ్ కుట్ర దాకా చంద్రబాబు పాత్ర లేకుండా ఎన్టీఆర్ రాజకీయ సినిమా ఎట్లా తీస్తారు? చంద్రబాబు ఒక్కడే కాదు లక్ష్మీ పార్వతి లేకుండా కూడా ఈ సినిమా సంపూర్ణం కాదు. అయితే తనను గొప్ప రాజకీయ దురంధరుడిగా, లక్ష్మీపార్వతి ఒక చవకబారు స్త్రీగా చిత్రించే విధంగా గతంలో పుస్తకాలు రాయించిన చరిత్ర చంద్రబాబుది. బాలకృష్ణ తీసే సినిమాలో కూడా బావగారి రాజకీయ చతురత, పరిపాలనా సామర్థ్యం ముందు పీఠిన ఉండి మొత్తానికి ఎన్టీఆర్ వ్యక్తిత్వం మరుగున పడే ప్రమాదం ఉంది. ఎన్టీఆర్ చివరి శ్వాస వరకూ ఈ సిన్మా ఉంటే మాత్రం చంద్రబాబు పాత్రలో విపరీతమైన వక్రీకరణలు తప్పవు. ప్రజా జీవితంలో ఎన్టీఆర్ మహనీయతకు మహానాయకుడు సినిమాలో చంద్రగ్రహణం తప్పదు. నా తండ్రి వంగవీటి రంగాను హత్య చేయించింది తెలుగుదేశంవారు కాదు అని ఆయన కుమారుడు రాధా చేత చెప్పించి రాజకీయ నడివీధిలో అతడిని వదిలేయగలిగిన తెలివితేటలూ చంద్రబాబువి. అటువంటి చంద్రబాబు బాలకృష్ణ చేత ఈ సినిమాలో మా బావ బంగారం అనిపించకుండా ఉంటాడని ఎట్లా అనుకుందాం. ఎన్టీఆర్ మరణించిన 23 ఏళ్ళ తరువాత ఇప్పుడెందుకు ఆయన జీవితాన్ని తెరకెక్కించాలని అని పించింది అంటే రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి కోసమే అనడంలో సందేహం లేదు. మరి రాజశేఖరరెడ్డి మీద సినిమా ఆయన మరణించిన పదేళ్లకు ఎందుకు తీయాల్సి వొచ్చింది అన్న ప్రశ్న కూడా చంద్రబాబు అభిమానులు అడగొచ్చు. రాజశేఖర్ రెడ్డి సినిమా తీసింది ఆయన కొడుకు కాదు, రాజకీయాల్లో కూడా లేడు. ఎన్టీఆర్ సినిమా తీస్తున్నది ఆయన కుమారుడు, రాజకీయంగా తన బావకు, తద్వారా తన అల్లుడికి లాభం చెయ్యాలని అనుకుంటున్న వ్యక్తి. బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో వక్రీకరణలకు ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాం గోపాల్ వర్మ నిర్మించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏమన్నా సమాధానం చెబుతుందేమో చూడాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనగానే ఇది లక్ష్మీ పార్వతికి అనుకూలంగా ఉంటుందనే భావన వెంటనే కలుగుతుంది, 1989లో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం ఘోర పరాజయం నుండి ఆయన తుది శ్వాస దాకా ఉండే ఈ సినిమాలో అయినా లక్ష్మీపార్వతి పాత్రకు న్యాయం జరుగుతుందేమో చూడాలి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
రక్షకుల ముసుగులో భక్షకులు
ఏకంగా మూడు రాష్ట్రాల్లో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలను ఘోరంగా మోసం చేసిన శారదా స్కాంలో దర్యాప్తును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్షకు దిగడం విడ్డూరం. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వచ్చారు. అయినా వారికి అడ్డుపడి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. ఆదాయపన్ను అధికారులకు రక్షణ కల్పించవలసిన పోలీసుల సహాయాన్ని ఉపసంహరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు ఎగవేసే బడా వ్యాపారులకు కొమ్ము కాసింది. మమత, చంద్రబాబులు తమనూ, తమ వారినీ రక్షించుకునేందుకు వ్యవస్థల రక్షకులం అనే ముసుగులు ధరిస్తారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అజోయ్ ముఖర్జీ తన రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోవడం పట్ల నిరసనగా ఒక రోజు సత్యాగ్రహం చేశాడట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆయన రెండుసార్లు ముఖ్య మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ వీడి బాంగ్ల కాంగ్రెస్ స్థాపించాక ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో బాంగ్ల కాంగ్రెస్‌తో బాటు మార్క్సిస్ట్ పార్టీ కూడా భాగ స్వామి. ఆ ప్రభుత్వంలో సీపీఎం నాయకుడు జ్యోతిబసు హోంమంత్రి. తన ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపడానికి ఆనాడు అజోయ్ ముఖర్జీ సత్యా గ్రహం చేస్తే, ఇన్నేళ్ళకు తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసం ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన దీక్ష చేపట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరయినా పడ గొట్టే ప్రయత్నం చేస్తుంటే , దాన్ని అడ్డుకునే పరిస్థితి లేక నిస్సహాయతకు గురయితే నిరసనకు దిగాలి. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం ఏదీ జరుగుతున్న దాఖలాలు లేవు. ఏకంగా మూడు రాష్ట్రాల్లో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలను ఘోరంగా మోసం చేసిన ఒక సంస్థ వ్యవహారంలో దర్యాప్తు ముందుకు సాగ కుండా అడ్డుకునేందుకు మమతా బెనర్జీ ఈ దీక్ష చేశారు. శారదా స్కాంలో పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నాయకుల హస్తం ఉన్నదన్న ఆరోపణల మీద అరెస్ట్‌లు కూడా జరిగాయి గతంలో. ఈ కుంభకోణాలపైన దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను విచా రించడానికి వెళితే, స్థానిక పోలీసులు ఎదురు తిరిగి వారిని అడ్డుకోవడమే కాదు ఏకంగా ముఖ్యమంత్రి బయలుదేరి ఆ పోలీసు కమిషనర్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి సీబీఐ చర్యకు నిరసనగా తాను ధర్నాకు పూనుకున్నారు. ఇంతకంటే విడ్డూరం బహుశా ఇంకోటి ఉండదేమో. ఒక అధికారి మీద ఆరోపణలు వస్తే దాని మీద విచారణకు అంతకంటే పైస్థాయి సంస్థ దర్యాప్తు చేస్తుంటే చట్టాన్ని తన పని తాను చేసుకుపోనివ్వవలసిన ముఖ్యమంత్రే అడ్డుపడటం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగడం అజోయ్ ముఖర్జీ కాలానికీ, మమతా బెనర్జీ కాలానికీ మారిపోయిన రాజకీయ విలువలకు–మారిపోయిన అనడం కంటే దిగజారిపోయిన అంటే బాగుంటుంది–అద్దం పడుతున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లో కేసులు దర్యాప్తు చెయ్యాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిందే, అందులో ఎటువంటి వివాదమూ లేదు. అయితే కోర్టులు ఆదేశించినప్పుడు ఆ నిబంధన వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక అనుమతి అప్పుడు అవసరం ఉండదు. ఇక్కడ మొన్న కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు సుప్రీం కోర్టు ఆదేశాలమేరకే వచ్చారు. అయినా మమతా బెనర్జీ ప్రభుత్వం వారికి అడ్డుపడి కోర్టు ధిక్కారానికి పాల్పడటమేకాక దీక్షలకు దిగడం విచిత్రం. మళ్ళీ సుప్రీంకోర్టే కోల్‌కతా పోలీసు కమిషనర్ సీబీఐ అధికారుల ముందు హాజరై కేసు దర్యాప్తునకు సహకరించవలసిందేనని చెప్పాల్సి వచ్చింది. ఒక కేసు దర్యాప్తులో ఒక అధికారిని రక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రే నడుం బిగించడం, అదీ కొన్ని లక్షల కుటుంబాలను నాశనం చేసిన ఒక దుర్మార్గమైన కేసులో కావడం వెనక ఉన్న ప్రయోజనం ఏమిటో సామాన్యులకు కూడా అర్థం అవు తుంది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను విచారించడానికి సీబీఐ ఎంచుకున్న సమయం కేంద్ర ప్రభుత్వం మీద లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ మీద అనుమానాలకు తావు ఇస్తున్నది. రెండు మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం, ఎన్డీఏకు ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రతిపక్ష ఫ్రంట్ ఒకటి ఏర్పడటం, ఆ ఫ్రంట్ గత వారమే కోల్‌కతాలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించడం కూడా ఈ అనుమానాలకు ఊతం ఇస్తున్నది. ఒకప్పుడు మమతా బెనర్జీ బీజేపీకి మిత్రురాలే. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కూడా. ఆమెలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న మొన్నటి దాకా ఎన్డీఏలో భాగస్వామే. బీజేపీకి మంచి మిత్రుడే. రాజకీయంగా తెగతెంపులు చేసుకున్నాక ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ప్రవేశానికి అనుమతిని రద్దు చేసింది, చంద్రబాబు అడుగుజాడల్లో నడిచి మమతా బెనర్జీ బెంగాల్లో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా సీబీఐ ప్రవేశించనే లేదు, ఆదాయ పన్ను అధికారులు కొన్ని వ్యాపార సంస్థల మీదా సంపన్నుల మీద దాడులు చేస్తేనే సహించలేని చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించిందో చూశాం. ఆదాయ పన్ను అధికారులకు రక్షణ కల్పించ వలసిన పోలీసుల సహాయాన్ని ఉపసంహరించుకుని ఏపీ ప్రభుత్వం పన్నులు ఎగవేసే బడా వ్యాపారులకు కొమ్ము కాసింది. శారదా స్కాంలో నిందితులను రక్షించడానికి కంకణ బద్ధురాలైన మమతా బెనర్జీకి మద్దతు తెలపడానికి బాబు, కుమారుడు లోకేష్ హుటాహుటిన కలకత్తా వెళ్ళారు. పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి వీలులేదని మమతా బెనర్జీ సీబీఐని అడ్డుకుంటే, సుప్రీంకోర్టు అలా కుదరదని విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్తే–అందులో మమత విజయం చంద్రబాబుకు ఏం కనిపించిందో? అధికారంలో ఉన్నవారు చట్టబద్ధ వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం మామూలైపోయిన మాట నిజం. ఇవ్వాళ బాబు, మమత ఏ కూటమిలో అయితే చేరారో అదే యూపీఏ అధికారంలో ఉండగా సుప్రీంకోర్టే సీబీఐ పంజరంలోని రామ చిలకగా మారిందని వ్యాఖ్యానించింది. ఎవరు అధికారంలో ఉన్నా చట్టబద్ధ వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను తమకు అనుకూలంగా, తమ వ్యతిరేకులను రాజకీయంగా వేధించడానికి ఉపయోగించుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు రావలసిందే తప్ప రాజకీయ పార్టీలు చేస్తామంటున్న, చేస్తున్న పోరాటాల్లో చిత్తశుద్ధి కనిపించదు. జాతిని రక్షిస్తాం, వ్యవస్థలను రక్షిస్తాం, అందుకే కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నానని చెపుతున్న చంద్రబాబు గతంలో ఇవే వ్యవస్థలను రాజకీయ వేధింపుల కోసం కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏను అడ్డగోలుగా వాడుకున్నప్పుడు తానూ భాగస్వామి అయిన విషయం ఇంకా ఎవరూ మరిచిపోలేదు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్న శారదా స్కాం వంటిదే ఆంధ్రప్రదేశ్‌లో అగ్రి గోల్డ్ కుంభకోణం. ఇంకా అనేక ఆర్థిక అవకతవకలకు సంబంధించి తెలుగు దేశం ప్రభుత్వం, దాని అధినేత, ఆయన కుమారుడూ, మంత్రులూ, నాయకులూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బహుశా కేంద్ర సంస్థల కన్ను ఈ అక్రమాల మీద పడుతుందన్న అనుమానం కలిగిందేమో కొంత కాలంగా–ముఖ్యంగా బీజేపీతో తెగతెంపులు అయిన దగ్గరి నుండీ– బాబు ప్రజలను తనకు రక్షణగా ఉండాలని పదేపదే కోరుతున్నారు. నిన్నగాక మొన్న శాసన సభలో కూడా నన్ను జైలులో పెడతారా అని గొంతు చించుకుని మాట్లాడారు. ఏ తప్పూ జరగకపోతే జైలులో పెడతారేమో అన్న అనుమానం ఎందుకు కలుగుతున్నది ఏపీ ముఖ్యమంత్రికి? నిజానికి దీక్షలు చెయ్యడంలో మమతకి బాబే ఆదర్శం. నాలుగేళ్ళు ప్రత్యేక ప్యాకేజీ పాటపాడి, తప్పనిసరి పరిస్థితుల్లో మాట మార్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నాక ఆయన రోజుకో దీక్ష చేస్తున్నారు. చిత్రం ఏమిటంటే ఆ దీక్షలన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే. అన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీని కాపీ కొట్టినట్టుగానే మొన్న అసెంబ్లీలో కూడా నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపే కార్యక్రమం చేశారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శాసన సభలో నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపితే, శాసన సభను అపవిత్రం చేస్తారా అన్న చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అదే ప్రతిపక్షం నిరసనను కాపీ కొట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసుకోనిచ్చే పరిస్థితులు ఇవాళ కనపడటం లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని మమత, చంద్రబాబులు తమనూ, తమ వారినీ రక్షించుకునేం దుకు వ్యవస్థల రక్షకులం అనే ముసుగులు ధరిస్తారు. ఈ ముసుగులను తొలగించి వారివారి నిజ స్వరూపాలు బయటపెట్టే పని ప్రజలే చెయ్యాలి. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘రామ్‌రహీమ్‌ను దోషిగా తేల్చడాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రాంచందర్ చత్తర్‌పతి హత్య కేసులో డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మిత్ రామ్‌రహీమ్‌ను దోషిగా తేల్చడాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ప్రధాన కార్యదర్శి సబీనా ఇందర్జిత్ స్వాగతించారు. బాధిత జర్నలిస్టు కుటుంబంతో పాటు, యావత్ జర్నలిస్ట్ సమాజానికి న్యాయం దక్కిందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2002 మేలో డేరా సచ్చాసౌదాలో సాధ్వీలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని ఓ సాధ్వి ఇచ్చిన ఫిర్యాదును తాను నిర్వహించే ‘పూచ్ సచ్’అనే పత్రికలో చత్తర్‌పతి ప్రచురించారని తెలిపారు. 2002 అక్టోబర్ 24న చత్తర్‌పతి ఆయన నివాసంలోనే హత్యకు గురైన కేసును 2003లో రిజిష్టర్ చేయగా 2006లో సీబీఐకు అప్పగించారన్నారు. పన్నెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సీబీఐ కోర్టు రామ్‌రహీమ్‌తో పాటు, మరో ముగ్గురిని దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో రామ్‌రహీమ్‌కు కఠినశిక్ష విధించాలన్న చత్తర్‌పతి కుమారుడు అన్షూ్షల్ డిమాండ్‌కు ఐజేయూ మద్దతు తెలుపుతోందని ప్రకటించారు. -
చంద్రులిద్దరూ దొందూ దొందే
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలు చంద్రశేఖర్‌రావు , చంద్రబాబునాయుడు ఇద్దరికీ ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం విశ్వాసం కానీ, గౌరవం కానీ లేవు. చంద్రశేఖర్‌రావు అయినా చంద్రబాబునాయుడు అయినా వోట్లేసి గెలిపించిన ప్రజలకు తాము జవాబుదారీ కాదు అనుకుంటారు కదా. కాంగ్రెస్ వ్యతిరేక ప్రయోజనాలు కేసీఆర్‌వి అయితే, బీజేపీ వ్యతిరేక ప్రయోజనాలు చంద్రబాబువి. ఈయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్నా,ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని బలోపేతం చేస్తానన్నా ఇద్దరూ ఆశిస్తున్న ఫలితం ఒక్కటే. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆ రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం సం బంధంలేని ఒక రాజకీయ యుద్ధం జోరుగా సాగుతున్నది. ఇటీవలే ముగిసిన తెలంగాణ శాసన సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ యుద్ధం మరింత తీవ్రం అయింది. ఈ రెండు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధాన్ని రెండు జాతీయ రాజకీయ పార్టీలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. కొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల మీద ఈ రెండు ప్రాంతీయ పార్టీల అధినేతల రాజకీయ యుద్ధం ప్రభావం ఆ రెండు జాతీయ పార్టీల జయాపజయాల మీద కొద్దో గొప్పో ఉండకపోదు కాబట్టే వాటికి ఈ ఆసక్తి. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలు చంద్రశేఖర్‌రావు , చంద్రబాబు నాయుడు ఇద్దరికీ ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం విశ్వాసం కానీ, గౌరవం కానీ లేవు. తెలంగాణ సాధన కోసం పద్నాలుగేళ్ళు సాగిన మలి విడత ఉద్యమ కాలంలో కానీ, తత్ఫలితంగా సాకారం అయిన తెలంగాణా రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా నాలుగున్నర ఏళ్ళు పరిపాలన సాగించిన కాలంలో కానీ చంద్రశేఖర్ రావు ఆ విషయాన్ని అనేక మార్లు రుజువు చేసుకున్నారు. మళ్ళీ మంచి ఆధిక్యతతో ప్రజలు అధికారం కట్టబెట్టి రెండవసారి ముఖ్యమంత్రిని చేశాక అయినా ఆయన కొంచెం మారుతారేమో, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారేమో అనుకున్న వారికి ఆశాభంగమే అయింది. ఈ పదవీ కాలంలో ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండబోతున్నదో ఈ మూడు వారాల కాలంలో తెలంగాణ ప్రజలకు రుచి చూపించారు. డిసెంబర్ 11 న ఎన్నికల ఫలితాలు వెలువడితే ఇవాళ జనవరి రెండవ తేదీ వరకు అంటే 21 రోజులయినా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చెయ్యలేదు. ఆయన దృష్టిలో మంత్రివర్గం ఉన్నా లేకున్నా ఒకటే. అవును మంత్రివర్గం ఉన్ననాడు కూడా నిర్ణయాలన్నీ ఆయనే చేసినప్పుడు ఇంకా మంత్రివర్గంతో పని ఏముంటుంది? తన పార్టీ తరఫున గెలిచిన 88 మంది శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఉన్నా ఇద్దరు స్వతంత్ర ఎంఎల్ఏలను రెండో రోజే కండువా కప్పి పార్టీలో కలిపేసుకున్నారు. తన కుమారుడికి పార్టీ కార్యాధ్యక్ష పదవి కట్టబెట్టి రానున్న రోజుల్లో ఆయనే ముఖ్య మంత్రి, అన్ని అధికారాలూ ఆయనవే అన్న సంకేతాలు బలంగా పంపించారు. అధికార కేంద్రం ఇప్పుడు తెలంగాణ భవన్లో కేటీ రామారావు చాంబర్‌కు బదిలీ అయిపోయింది. మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళంతా ఆయన ఆఫీస్ ముందు క్యూ కడుతున్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఇటువంటివి సహజమే కాబట్టి అవి పార్టీ లో ప్రజాస్వామ్యయుతంగా అత్యధికుల ఆమోదంతో జరిగాయా లేదా అన్నది ఎవరూ పట్టించుకోరు. దేశమంతటా ప్రాంతీయ పార్టీలలో ఏక వ్యక్తి అధికారం చెలాయించిన చోటల్లా ఇదే పరిస్థితి ఉంటుంది. దాన్నే కేసీఆర్ కూడా ఆదర్శంగా తీసుకుంటారు. అంతేకానీ అందుకు భిన్నంగా ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలని ఎందుకు అనుకుంటారు. రాష్ట్రంలో మంత్రివర్గం ఉండదు. శాసన సభ్యులతో∙ఒక పూట అసెంబ్లీని సమావేశ పరిచి ప్రమాణం అయినా చేయిద్దామనే ఆలోచన ఉండదు. స్వతంత్ర ఎంఎల్ఏలతోబాటు, శాసన మండ లిలో కాంగ్రెస్ పక్షాన్ని నిర్వీర్యం చేస్తూ ఆ పార్టీ సభ్యులను కలుపుకుని వారికి చట్టబద్ధత కల్పిస్తారు. కానీ తమను విభేదించి బయటికివెళ్ళిన మండలి సభ్యుల మీద మాత్రం 24 గంటల్లో వేటు వేయిస్తారు. అదే శాసన మండలిలో కాంగ్రెస్ నుండి తన పార్టీలోకి కొంతకాలం క్రితం ఫిరాయించిన వారి మీద వేటు ఉండదు. ఇంకాపదిమంది దాకా కాంగ్రెస్ సభ్యులకు కండువాలు కప్పబోతున్నామని ఆయన నోటనే విన్నాం. వాళ్ళు వొస్తానంటే నేనువొద్దని ఎలా అనాలి అని ఆయనే స్వయంగా విలేకరులకు చెప్పారు. వంద స్థానాలు గెలుస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటను ఈ విధంగా నిజం చెయ్యాలన్నది తండ్రీకొడుకుల పట్టుదల అని అర్థం అవుతూనే ఉంది. ఒక పార్టీ పేరు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళుతున్న వాళ్ళు సిగ్గుపడనప్పుడు చేర్చుకునే వాళ్ళెందుకు సిగ్గు పడాలి? అని కదా ఇవాళ దేశమంతటా రాజకీయ పార్టీలు చెపుతున్నది. అదే కేసీఆర్ కూడా పాటిస్తున్నారు. ప్రతిపక్షం నుండి 23 మంది శాసన సభ్యులను కొనుగోలు చేసి కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్ర బాబు మొన్నటికి మొన్న తెలంగాణా ప్రచారంలో పార్టీ ఫిరాయింపుల విషయంలో టీఆర్ఎస్ మీద విరుచుకుపడిన విడ్డూ రంచూసాం కదా. నాలుగైదు మాసాల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల దాకా తెలంగాణాలో ఇదే పరి స్థితి కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు. ముఖ్య మంత్రే చెప్పారు. తన పరిపాలనా పద్ధ తికి ప్రజలు ఆమోదం తెలిపారనడానికి నిదర్శనమే మొన్నటి ఫలితాలు అని. సచివాలయానికి వెళ్ళవలసిన పని లేదని ప్రజలే అంగీకరించారు కదా అని చెప్పేశారు ఆయన. ఆయనను ఎదిరించే సాహసం ఆ పార్టీలో ఎవరూ చెయ్యలేరు. మంత్రివర్గం లేకుండా ప్రగతి భవన్ దర్బార్‌లో ఆయన నిర్వహిస్తున్న సమీక్షల తీరు చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులకే నోరు లేనప్పుడు అధికారులు మాత్రం ఏం మాట్లాడుతారు? ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటి పారుదల ప్రాజెక్ట్‌ల పురో గతి సమీక్షలో నాలుగున్నర సంవత్సరాలు నిద్రాహారాలు మాని ప్రాజెక్ట్ సైట్ల దగ్గర గడిపిన అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఉండడు,వాటితో ఏ సంబంధం లేని ఇతర ప్రజాప్రతినిధులు ఉంటారు. ఎన్నికల ప్రచార సభల్లో ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ చేసిన కృషిని ఆకాశానికి ఎత్తిన కేసీఆర్‌కు మళ్ళీ గెలిచాక సమీక్షల్లో ఆయన కూడా ఉండాలని అనిపించదు, పైగా పనిలో జాప్యం జరుగుతున్నదని అధికారులను మందలించడం దేనికి సంకేతం?హరీశ్ రావును వేనోళ్ళ పొగిడిన నోటనే ఆయన అధ్వర్యంలో పనిసరిగా జరగలేదని చెప్పడమా! ప్రాజెక్ట్‌ల సందర్శనకు కూడా బయలుదేరారు ఆయన. తన కుమారుడి ప్రాముఖ్యత పెంచే క్రమంలో హరీష్ సమర్ధతను తగ్గించి చూపే ప్రయ త్నం కావొచ్చు, అది వారి రాజకీయ విజ్ఞతకే వొదిలేద్దాం. కానీ ఈ వ్యవహారం అంతా అప్రజాస్వామికంగా ఉంది అని చెప్పేదెవరు ఆయనకు. మాట్లాడితే మీడియా మీద విరుచుకు పడుతున్నారాయే. మొన్నటి పత్రికా గోష్టిలో ఆయన ఇంకోమాట కూడా చెప్పారు. దాన్నిబట్టి రేపటి నుండి పత్రికల్లో,టీవీ లలో ఎటువంటి వార్తలు రాయాలో,చూపాలో కూడా ఆయనే నిర్ణయిస్తారు. ప్రముఖ విద్యావేత్త, మేథావి చుక్కా రామయ్య చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారి అయిన మౌన సంస్కృతి రాజ్యం ఏలుతున్న కారణంగానే పాలకులు ఇట్లా వ్యవహరించగలుగుతున్నారు. కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా వోట్లేసి గెలిపించిన ప్రజలకు తాము జవాబుదారీ కాదు అనుకుంటారు కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కూడా గడ్డు కాలం నడుస్తున్నది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు వెయ్యి కోట్లకు పైగా పేరుకు పోయాయి. కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం ఎందుకు చెయ్యడం లేదు ఆరోగ్యశ్రీ ప«థకం కింద? సామాన్యుడి అవసరాలు తీరనప్పుడు పాలకులు చెప్పే వృద్ధిరేటుల ఊసెవరికి కావాలి? రాష్ట్రం మీద నుండి దృష్టి మళ్ళించడానికే ఆయన ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలు అని అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఆయనకు ఏనాడయినా కాంగ్రెస్‌తోనే సమస్య. అందుకే ఆయన కాంగ్రెస్ ఉండే ఫ్రంట్‌ను వ్యతిరేకిస్తారు. బీజేపీని కూడా విమర్శిస్తున్నాం, ఆ పార్టీ ఉండే ఫ్రంట్‌లో కూడా చేరబోము అన్న మాటలు ఇప్పటి వరకే. లోక్‌సభ ఎన్నికల తరువాత అది బహిరంగ రహస్యమే అవుతుంది. అప్పటి రాజకీయ అవసరాలు అని సమర్థించుకోవొచ్చు. 2009లో ఎన్నికల ఫలి తాలు వెలువడక ముందే లుధియానా వెళ్లి అడ్వాణీ ప్రచార సభ వేదిక ఎక్కి కూర్చున్నది కేసీఆరే కదా. ఇక తెలంగాణ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడుకు గత నాలుగున్నర సంవత్సరాల్లో ఆ రాష్ట్రాన్ని భయంకరమయిన అప్పుల్లో ముంచేసి అస్తవ్యస్తం చేసిన పరిస్థితి నుండి జనం దృష్టి మళ్ళించడానికి, రోజురోజుకూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి,ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయ కుడు జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మందిలో పెరిగిపోతున్న అభిమానం నుండి దృష్టి మళ్ళించడానికి మార్గం కావాలి. కేంద్ర ప్రభుత్వ అధినేత మోదీ, కేసీఆర్‌ను జగన్‌కు జత కట్టేసి లబ్ధి పొందాలన్న దుగ్ధ ఆయనది. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేస్తానని బయలుదేరిన చంద్రబాబు రెండు ప్రయోజనాలు ఆశించారు. ఒకటి ముందే చెప్పుకున్నట్టు రాష్ట్ర సమస్యల నుండి, తన అస్తవ్యస్త, అవినీతిమయ పాలన నుండి ప్రజల దృష్టి మళ్ళించడం, రెండవది బీజేపీ నుండి తన మీదకు దూసుకు వొచ్చి పడుతుందని ఊహిస్తున్న ప్రమాదాల నుండి రక్షణ పొందడం. అయితే ఆ ప్రయత్నం పెద్దగా ఫలించకపోవడంతో ఇప్పుడు మోదీ, కేసీఆర్, జగన్ కలయిక అనే కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. ఒకే అసత్యాన్ని పదేపదే చెపితే జనం నమ్మేస్తారు అన్న గోబెల్ పక్కా వారసుడు ఆయన. ఆ అసత్యాన్ని అంతే స్థాయిలో అన్నిసార్లూ ప్రచారం చెయ్యడానికి ఆయన చేతిలో మీడియా ఉండనే ఉంది. కాంగ్రెస్ వ్యతిరేక ప్రయోజనాలు కేసీఆర్‌వి అయితే, బీజేపీ వ్యతిరేక ప్రయోజనాలు చంద్ర బాబువి. ఈయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్నా,ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని బలో పేతం చేస్తానన్నా ఇద్దరూ ఆశిస్తున్న ఫలితం ఒక్కటే. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే కేసీఆర్‌కు, బీజేపీ కూటమి అధికారంలోకి వొస్తే చంద్రబాబుకు రాజకీయంగానే కాదు. ఇతరత్రా కూడా ఇబ్బందులు తప్పవు. అదీ జాతీయ రాజకీయాలపై వారు చూపు తున్న మక్కువకు అసలు కారణం.ఆ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా ఈ ఇద్దరు ప్రాంతీయ నాయకులను అందుకే అంత ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయిదు మాసాలాగితే లోక్‌సభ ఫలితాలు వెలువడిన 24గంటల్లో దూద్ కా దూద్ పానీ కా పానీ, అసలు రంగులన్నీ బయట పడతాయి. వ్యాసకర్త: దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
కాంగ్రెస్ భుజం మీద తుపాకీ పెట్టి..
కాంగ్రెస్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణలో టీఆర్ఎస్ను, జాతీయ స్థాయిలో బీజేపీని కాల్చేందుకు సిద్ధం అయ్యాడు చంద్రబాబు. రేపు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, నెత్తి మీద కత్తిలా వేలాడుతున్న ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందని ఆయన భయం. ప్రచారాస్త్రం కోసం వెతుక్కుంటున్న కేసీఆర్‌కు... బాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల రంగంలోకి రావడం మంచి ఆయుధం దొరికినట్టు అయింది. బాబుతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ కూడా కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీడియా స్వేచ్ఛపట్ల స్పృహ అంటే ఆ మీడియా అధిపతికి బాబు, కేసీఆర్‌లలో ఎవరితో ఉండాలో తేల్చుకోవాల్సిన సమయం. కూట్లో రాయి ఏరలేనమ్మ ఏట్లో ఏరబోయిం దన్న సామెత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుకు సరిగ్గా సరిపోతుంది . 2014 లో అపారమైన రాజకీయ అనుభవం ఉంది కాబట్టి తనకే అధికారం ఇవ్వాలని ఆయన కోరితే, కాబోలు అనుకుని ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆ రాష్ట్రాన్ని ఆగం ఆగం చేసిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణాను ఉద్ధరిస్తాననీ, దానితోబాటు దేశాన్నే ఉద్ధరిస్తాననీ బయలుదేరాడు. చంద్రబాబు ఎందుకు తెలంగాణలో తలదూర్చాలని అనుకుంటున్నాడు? సోనియాగాంధీ ఇటలీ దయ్యం, దేశాన్ని నాశనం చేసిందని మాట్లాడిన నోటితోనే కాంగ్రెస్ గానం ఎందుకు చేస్తున్నాడు అన్న విషయం మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఆయన చెపుతున్న ప్రజాస్వామ్య అనివార్యత దేశ ప్రయోజనాల కోసం కాదు, సొంత ప్రయోజనాల కోసం అనీ మళ్ళీ మాట్లాడితే తానూ తన పార్టీ వారు, అనుయాయులూ అవినీతి కేసుల నుండి రక్షణ పొందడానికి అని అందరికీ అర్థం అయిపోయింది. ఇప్పుడు ఆయన తెలంగాణాలో ఎందుకు తలదూర్చాడో మాట్లాడుకుందాం. కాంగ్రెస్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణలో టీఆర్ఎస్ను, జాతీయ స్థాయిలో బీజేపీని కాల్చేందుకు సిద్ధం అయ్యాడు చంద్రబాబు. తెలంగాణలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు కొనసాగడం అంటే చంద్రబాబు చిక్కుల్లో పడ్డట్టే . టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించుకుని రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇద్దరు నాయకులను అధ్యక్షులుగా నియమించుకుని తనను తాను జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న చంద్రబాబు తెలంగాణ ఏర్పడిన కొత్తలో వేసిన ఒక తప్పటడుగు కారణంగా హైదరాబాద్‌లో పదేళ్ళు ఉండే అవకాశాన్ని వదులుకుని అమరావతికి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. ఒక్క శాసన మండలి స్థానం కోసం కక్కుర్తి పడి శాసన సభ్యులను కొనుగోలు చేసే కార్యక్రమం ఆయన చెయ్యక పోయి ఉంటె కేసీఆర్ టీడీపీని తెలంగాణలో ఖాళీ చేయించే పనికి నడుంకట్టి ఉండేవాడు కాదేమో. అది చంద్రబాబు స్వయంకృతం. రేపు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే, నెత్తి మీద కత్తిలా వేలాడుతున్న ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందని ఆయన భయం. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ కేసును నీరు కార్చేయ్యవచ్చునన్నది చంద్రబాబు ఆలోచన. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పట్ల, ఆ పార్టీ పాలన తీరు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఏ పొత్తూ లేకపోయినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు నియంతృత్వ ధోరణి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణం అయింది. చెప్పేవి శనగలు, అమ్మేవి ఆముదాలు, కొనేటివి గోధుమలు అన్న రీతిన సాగిన ఆయన ప్రకటనలు, ప్రగతి భవన్ పేరిట నిర్మించిన గడీకి పరిమితమై ఆయన సాగించిన ‘ఎంపిక చేసిన పాలన’ (ట్ఛl్ఛఛ్టిజీఠ్ఛి జౌఠ్ఛిటn్చnఛ్ఛి) అంటే ప్రజా బాహుళ్యానికి లాభం చేసే పనులు కాకుండా తమకు లాభం చేకూర్చే పనులు మాత్రమే చెయ్యడమని ప్రజలకు అర్థమయ్యింది. ప్రజలకే కాదు, సొంత పార్టీ నాయకులకు చివరికి మంత్రులకు కూడా అందుబాటులో లేకుండా పోయిన వైనం, ఎక్కువమంది శాసన సభ్యులు మూటగట్టుకున్న అవినీతి అన్నీ కలిసి ఈసారి టీఆర్ఎస్ ఓటమి ఖాయం అన్న వాతావరణాన్ని సృష్టించాయి తెలంగాణలో. ఆయన కుటుంబ సభ్యుల వ్యవహార శైలి, ముఖ్యంగా కొడుకు కేటీ రామారావు, కూతురు కవిత వ్యవహార శైలి టీఆర్ఎస్కు తీవ్ర నష్టం చేసే విధంగా తయారయింది. పరిస్థితిని చక్కదిద్దడానికి సలహాలు ఇచ్చేందుకు నోరు విప్పి మాట్లాడే స్థితిలో పార్టీ నాయకులు లేరు. మంత్రులే ఆ సాహసం చెయ్యలేని దుస్థితి. పేరుకు ఇద్దరు ఉప ముఖ్య మంత్రులు, ఒకాయన దళితుడు, మరొకాయన మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు. ఇరువురూ శాసన మండలి సభ్యులే. వీరిలో ఒకాయన సీఎం దృష్టికి కొన్ని విషయాలు తీసుకురాదలచుకుని ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి ఎంతకూ కుదరక చివరికి ఏమైతే అది అయిందని ప్రగతి భవన్‌కు వెళ్ళాడట. ముందుగా అపాయింట్మెంట్ లేకుండా ఇంకొకసారి మీరు ప్రగతి భవన్‌కు రావద్దని పేషీలోని పీఏ స్థాయి ఉద్యోగి చెప్పి పంపేశారట. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఇది. ముఖ్యమంత్రి బహిరంగంగానే మజ్లిస్ తన మిత్ర పక్షం అని ప్రకటించినా ఆయన మత విశ్వాసాలు వ్యక్తిగతం కాకుండా అధికారికం కావడం విమర్శలకు దారి తీసింది. ప్రగతి భవన్ ప్రారంభోత్సవం నాడు చిన్న జియ్యర్ స్వామిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడం దగ్గరి నుండి మొన్న రెండు రోజులు రాజ శ్యామల యాగం చెయ్యడం దాకా ఆయన కార్యక్రమాలు వివాదాస్పదం అవుతూనే వచ్చాయి. వీటన్నిటికి కొనసాగింపుగా ఆయన గడువు కన్నా చాలా ముందు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పుకోలేని స్థితి. ఇవన్నీ టీఆర్ఎస్కు ప్రతికూల అంశాలుగా జనం నోళ్ళలో నానుతున్న సమయంలో ప్రచారాస్త్రం కోసం వెతుక్కుంటున్న కేసీఆర్‌కు చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల రంగంలోకి రావడం మంచి ఆయుధం దొరికినట్టు అయింది. బాబుతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ కూడా కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను ప్రజాకూటమి ఎట్లా అధిగమిస్తుందో చూడాలి. చంద్రబాబు ఆలోచన మాత్రం ఒక్కటే. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్ళీ పెత్తనం చెయ్యడానికి అవకాశం వస్తుంది. పైగా జాతీయస్థాయిలో పలుకుబడి పెరుగుతుంది తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దుష్పరిపాలన నుండి రాష్ట్రం, దేశం దృష్టి మళ్ళించవచ్చు. తెలంగాణలోనే కాక శాసన సభ ఎన్నికలు జరుగుతున్న మిగతా నాలుగు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్‌కు ఆయన పెద్ద ఎత్తున ఎన్నికల నిధులు సమకూర్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నిధులు సమకూర్చినట్టు మోదీ అమిత్ షా దగ్గర రుజువులు ఉన్నాయట. కర్ణాటక ఎన్నికలలో కూడా ఇదే మాట విన్నాం. తెలంగాణాలో మళ్ళీ చంద్రబాబు ప్రవేశాన్ని కోరుతున్న ఆయన అనుకూల మీడియాకు హఠాత్తుగా ఒత్తిడి పెరిగిందనే విషయం గుర్తుకొచ్చింది . తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో చంద్రబాబు అండ చూసుకుని తెలంగాణ ప్రభుత్వం మీద కయ్యానికి కాలు దువ్వి, ఛానల్ ప్రసారాలు నిలిచిపోయే దాకా తెచ్చుకుని; చంద్రబాబు అమరావతికి పలాయనం చిత్తగించాక తెలంగాణ ప్రభుత్వ అధినేతతో సంధి చేసుకుని అధికార పక్షం నడుపుతున్న పత్రిక, చానల్‌ను కూడా మించిపోయి కేసీఆర్ మౌత్ పీస్‌గా మారిన ఆ మీడియా యజమానికి తెలంగాణ ఎన్నికలలోకి మళ్ళీ చంద్రబాబు ప్రవేశించే సరికి మీడియా మీద ప్రభుత్వ ఒత్తిడి హఠాత్తుగా గుర్తొచ్చింది. నాలుగున్నర సంవత్సరాలపాటు అటు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌కు, తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌కు డబ్బా కొట్టిన ఈ మీడియా అధిపతికి ఇప్పుడు కేసీఆర్ కొంగర కలాన్ బహిరంగ సభ విఫలం అయిన విషయం గుర్తొచ్చింది. మిగిలిన అన్ని మీడియా సంస్థల్లాగే ఆనాడు కొంగర కలాన్ సభ అద్భుతం అని రాసిన, చూపించిన ఆయన ఇవాళ ఒత్తిడి గుర్తు చేసుకుంటున్నాడు. ఎంత విచిత్రం. ఎందుకీ హఠాత్ ఆత్మపరిశీలన, పశ్చాత్తాపం? మీడియా స్వేచ్ఛపట్ల స్పృహ అంటే ఇప్పుడిక ఆ మీడియా అధిపతికి చంద్రబాబు, చంద్రశేఖర్‌రావుల మధ్య ఎవరితో ఉండాలో తేల్చుకోవాల్సిన సమయం. చంద్రబాబును రక్షించుకోవాలి, ఆయనను రక్షించుకుంటేనే తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. (ఈ మధ్యనే ఒక విశ్రాంత చీఫ్ సెక్రెటరీ చెప్పారు. ఒక మీడియా సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం 700 కోట్ల రూపాయల లాభం చేసిందని), అది కొనసాగాలంటే.. చంద్రబాబును రక్షించాలంటే తెలంగాణలోప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకోవాలి. కాబట్టే ఇప్పుడు హఠాత్తుగా మీడియా మీద ఒత్తిడి గుర్తొచ్చింది. ఆ మీడియా అధిపతి మాటల్లోనే చెప్పాలంటే మీడియా తన మనుగడ, విశ్వసనీయత కోసం స్వతంత్రంగా పని చెయ్యవలసిన అవసరం ఏర్పడిందట. కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలోకి ప్రవేశించక ముందు టీఆర్ఎస్కు 80 సీట్లు తప్పకుండా వస్తాయని రాసిన అదే మీడియా అధిపతి ఇవాళ స్వరం మార్చేశాడు. మీడియా సంస్థలు రాజ కీయ పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. ఆ పని ఇష్టంతో చెయ్యడం వేరు, భయంతో చెయ్యడం వేరు అని హిత బోధ చేస్తున్న ఆ పత్రికాధిపతి నిన్నటి దాకా కేసీఆర్‌కు బాకా ఊది, ఇప్పుడు మీడియా స్వతంత్రత, విశ్వసనీయత గురించి లెక్చర్లు ఇస్తున్నాడు. రేపొక వేళ కేసీఆర్ కొత్త అస్త్రం చంద్రబాబు వ్యతిరేకత పనిచేసి టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఈయన మళ్ళీ ప్లేటు ఫిరాయిస్తాడా? తెలంగాణలో చంద్రబాబు, ఆయన వందిమాగధ మీడియా వ్యవహారాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ గమనించి జాగ్రత్త పడితే మంచిది. అధికార పక్షం టీఆర్ఎస్కు అటువంటి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. మీడియాను ఎన్ని కిలోమీటర్ల లోతున పాతి పెట్టాలో బాగా తెలి సిన నాయకుడు ఉన్నాడు ఆపార్టీకి. ఆయనే చూసుకుంటాడు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
జాతీయ పత్రికా దినోత్సవం- జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం
-
ఐజేయూ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దేవులపల్లి అమర్
సాక్షి, అమృత్సర్ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ)అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్ బాధ్యతలు చేపట్టారు. శని, ఆదివారాలు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఐజేయూ 9వ మహాసభలో ఎస్. ఎన్ సిన్హా నుంచి అమర్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీకి చెందిన సబినా ఇంద్రజిత్ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. జాతీయ కార్యవర్గానికి ఈరోజు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి వై. నరేందర్ రెడ్డి కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నగునూరి శేఖర్, కె.సత్యన్నారాయణ ఎన్నికయ్యారు. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా స్థానిక సంస్థలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియా స్వతంత్ర్యంగా, నిర్భయంతో పనిచేయాలన్నారు. -
‘దిగజారుడు’లో పరాకాష్ట
ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్ విషయంలో మొదటి నుంచీ దిగజారుడు రాజకీయాలే నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఛీకొట్టి బయటకు వచ్చాడనే కారణంతో జగన్ మీద అక్రమ కేసులు బనాయించి పదహారు మాసాలు జైలుపాలు చేసిన నాటి నుంచి ఏపీలో ఇవే రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ ఏపీలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి కానీ, ప్రజల మనోభావాలు కానీ రెండు జాతీయ పార్టీలకు ఇంకా అర్థం కాలేదు. టీడీపీ తోక పట్టుకుని ఎలాగోలా ఎన్నికల సముద్రం ఈదాలని జాతీయ పార్టీలు భావించవచ్చు కానీ ప్రజా సంకల్పయాత్రకు పోటెత్తుతున్న ప్రజాభిప్రాయం సాక్షిగా, రహస్య స్నేహ పాచికలు ఇక పారవన్న సత్యం ఆ మూడు పార్టీలు అర్థం చేసుకుంటే మంచిది. సమకాలీన రాజకీయ పోకడలు చూస్తుంటే పదే పదే గురజాడ వారి ‘కన్యాశుల్కం’ తొలి అంకంలో మధురవాణి అన్న మాటలు గుర్తొ స్తాయి. గిరీశంతో పూర్తిగా తెగతెంపులు కాక ముందే తనను తాకచూసిన రామప్ప పంతులుతో మధురవాణి ‘‘వేశ్య అనగానే అంత చులకనా పంతులు గారు? సానిదానికి మాత్రం నీతి ఉండొద్దా? అయ్యా, ఇటు పయిని మీ తోవ మీది. నా తోవ నాది’’ అని అంటుంది. కొన్ని పార్టీ లను చూస్తే మధురవాణి ఎంత నీతిమంతురాలో కదా అనిపిస్తుంది. మొన్న ఒక సందర్భంలో బీజేపీకి చెందిన నాయకుడొకరు వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద నడుస్తున్న అక్రమ ఆస్తుల కేసులో ఏడేళ్ళ తరువాత ఆయన సతీమణి భారతి పేరు చేర్చే ప్రయత్నం గురించి ప్రస్తావించి ‘‘మా వాళ్లు కూడా దిగజారుడు రాజకీయాలాడటం విచారకరం’’ అని తన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీ ద్వయాన్ని ఉద్దేశించి అన్నారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్ విషయంలో, ఆయన పార్టీ విషయంలో మొదటి నుంచీ దిగజారుడు రాజకీయాలే నడుస్తున్నాయి. కాంగ్రెస్ రాజకీయాలు నచ్చక ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి తానూ, ఎంఎల్ఏ పదవికి ఆయన తల్లీ రాజీనామా పారేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచీ చూస్తున్నాం ఈ తరహా రాజకీయా లను. కాంగ్రెస్ విధానాలతో విభేదించాడు, తన దారి తాను చూసు కున్నాడు అని ఊరుకోకుండా జగన్ మీద అక్రమ కేసులు బనాయించి పదహారు మాసాలు జైలుపాలు చేసిన నాటి నుంచి ఏపీలో ఇవే రాజకీ యాలు నడుస్తున్నాయి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ (ఆ అధి కారం కాంగ్రెస్‌కు జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ పెట్టిన భిక్ష), ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కలిసి ఈ దిగజారుడు రాజకీయాలకు తెర లేపాయి. నాటినుంచి నేటి వరకూ టీడీపీతో కలిసి కాంగ్రెస్, ఈ నాలు గేళ్ళుగా అదే టీడీపీతో కలిసి బీజేపీ జగన్‌ను రాజకీయంగా పరిమార్చ డానికి ఈ రాజకీయాలు ఆడుతూనే ఉన్నాయి. వాటిని ప్రజల్లోకి తీసుకు పోయి జగన్‌ను, ఆయన స్థాపించిన పార్టీని అప్రతిష్టపాలు చెయ్యడానికి బాబు కనుసన్నల్లో మెలిగే మీడియా మోహరించి ఉండనే ఉన్నది. వైఎస్సార్సీపీ పెట్టినప్పటి నుంచే కుట్రలు వైఎస్ జగన్‌ని, ఆయన పార్టీని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నది రాజకీయ పక్షాలే అయితే అర్థం చేసుకోవచ్చు, ఏపీలోని మీడియా యాజ మాన్యం అంతా కూడా దాదాపు ఒక్కటై జగన్‌ను రాజకీయాల్లో లేకుండా చెయ్యాలనే కుట్ర 2011లో ఆయన కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్సీపీ స్థాపించినప్పుడే మొదలయింది. దేశానికి స్వతంత్రం వచ్చాక ఎన్నో పార్టీలు ఆవిర్భవించాయి, కొన్ని నిలబడ్డాయి, ఎన్నో కూలబడ్డాయి, సోదిలో లేకుండా పోయిన పార్టీలు, శక్తిచాలక వెళ్లి వేరే జాతీయ పార్టీ లతో చేతులు కలిపి పదవుల కోసం ప్రయాసపడిన పార్టీలు అనేకం చూశాం. నిజానికి అలా మఖలో పుట్టి పుబ్బలో మాయమైన పార్టీల న్నిటి నాయకులూ జగన్ కంటే వయసులోనూ, అనుభవంలోనూ చాలా పెద్దవారు. అలాకాకుండానే రాజకీయాల్లో నిలదొక్కుకుని ప్రజాదరణ పొందుతున్నాడు కాబట్టే అందరూ ఏకమై ఆయనను ఒంటరిని చేయ డానికే ఈ ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించగానే తన పదవికి రాజీనామా చేసి కడప నుంచి లోక్çసభకు మళ్లీ పోటీకి దిగిన నాడే బాబు జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాడని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసి బోర్లా పడ్డారు. 5.45,672 ఓట్ల మెజారిటీతో గెలిపించారు ప్రజలు జగన్‌ను ఆనాడు. ఇంత చేస్తే బీజేపీతో తన పాత స్నేహాన్ని తిరిగి పునరుద్ధరించుకున్నది బాబే. రాజకీయాల్లో రహస్య స్నేహాలు చెయ్యడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్న రోజుల్లో తనపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల విషయంలో అర్ధరాత్రి ఆనాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం శరణుజొచ్చిన విషయం అందరికీ తెలుసు. ఆ మాట చిదంబరమే స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత జగన్‌పై కేసులు పెట్టించడం, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని అవిశ్వాసం నుంచి గట్టెక్కించడానికి ఉమ్మడి అసెంబ్లీలో బల పరీక్ష సందర్భంగా టీడీపీని గైర్హాజరు పరచడం నుంచి మొదలై నిన్న కాక మొన్న రాజ్యసభలో పీఏసీ సభ్యుడిగా తన సభ్యుడు íసీఎం రమేష్ గెలుపు కోసం కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం, అదే సభలో డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వెయ్యడం దాకా కాంగ్రెస్‌తో చంద్రబాబు దోస్తీ కొనసా గుతూనే ఉంది. ఇప్పటికైతే చెప్పలేదుగాని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాయంతో గట్టెక్కాలన్నదే బాబు ఆలోచన. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఏనాడూ ఒంటరిగా పోటీ చేసి గెలిచిన సందర్భాలు లేవు. 1983, 85, 94 ఎన్నికల్లో ఎన్టీఆర్ కారణంగా గెలిచిన టీడీపీ బాబు చేతుల్లోకి వచ్చాక 1999లో ఏబీ వాజ్‌పేయి, 2014లో మోదీ ప్రభంజనాల్లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లి గెలిచింది. 2019 ఎన్నికల్లో కూడా ఒంటరి పోరుతో గెలవలేమన్న విషయం బాబుకు బాగా తెలుసు. ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్లే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి బాబు సిద్ధం కాబట్టి కాంగ్రెస్‌తో చేతులు కలిపైనా సరే ఎన్నికల్లో గెలవాలన్నది ఆయన అశ. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టా గోష్టి జరిపిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీతో పొత్తు అవకాశాలను ఖండించ లేదు సరికదా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల నిర్ణయానికి వదిలేస్తామన్నారు. ఏపీలో ఈ మధ్యనే బాబు మిత్రుడు, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి కాంగ్రెస్ తెచ్చుకున్నది బాబు సూచన మేరకే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పోకడలు చిత్రంగా ఉంటాయి. పార్టీకి విధేయుడై ఉండి రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన రాజ శేఖరరెడ్డి మరణిస్తే ఆ విషాదాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదా ర్చబోయిన జగన్ బయటికి పోయేదాకా పొగ పెడతారు, లాస్ట్ బాల్ ఇంకా ఉంది అని చివరి దాకా చెప్పి పార్టీని సోదిలోకి లేకుండా చేసి పోయిన కిరణ్‌ను మళ్లీ తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు ఏపీలో స్వశక్తి మీద నాలుగు సీట్లయినా తెచ్చుకునే స్థితి లేదు. ఆ మాట రాహుల్ మీడియా ఇష్టాగోష్టిలో ఒప్పుకున్నారు. మరి ఇటలీ మాఫియా, సోనియా దయ్యం అని దూషించిన బాబుతో దోస్తీ ఎందుకు అంటే జగ న్ను రాజకీయంగా తుదముట్టించడానికే. ఏపీలో ఇవ్వాళ కాంగ్రెస్‌కు మరొక ఎజెండా లేదు. అయితే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలపై నేడు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబుపై చావని బీజేపీ ఆశలు? నలభై ఏళ్ల అనుభవం అని ఊదరగొట్టి నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు వందల సంవత్సరాల వెనక్కు తీసుకుపోయిన చంద్రబాబు నిర్వాకమూ తెలుసు. కాంగ్రెస్ సరే. మరి బీజేపీ ఎందుకు తమ సహాయం తీసుకుని ఎన్నికల్లో గెలిచి, నాలుగేళ్లు కలిసి నడిచి గెలుపు రాజకీయాల ఎత్తుగడలో భాగంగా తెగతెంపులు చేసుకున్న తెలుగుదేశా నికే సాయం చేయాలనుకుంటోంది? జగన్మోహన్రెడ్డికి సంబంధించిన కేసుల్లో భారతిని కూడా నిందితురాలిగా చేర్చడం ద్వారా చంద్రబాబుకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నది బీజేపీ అన్నది నిర్వివాదాంశం. ‘బాబూ, ఇంకా మా తలుపులు తెరిచే ఉన్నాయి నీకోసం, జగన్ కేసుల విచారణను వేగిరపరిచి ఆయనను మళ్లీ జైలుకు పంపాలని, ఆయన బయట ఉంటే తట్టుకోలేనని నువ్వు ఎన్నోసార్లు అడిగావు, ఇదిగో ఆయన సతీమణిని కూడా ఈ కేసులో ఇరికించాం,’ అని ఈ చర్య ద్వారా బీజేపీ చెప్పకనే చెప్పింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బాబు అవసరం వస్తుందేమోనన్న భయంతోనే మోదీ, అమిత్ షాలు తమ తలుపులు చంద్రబాబు కోసం తెరిచి ఉంచారు. బాబు, మోదీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతూనే ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? లేకపోతే బీజేపీ నాయకులే స్వయంగా చెబుతున్న లెక్కల ప్రకారం వేలాది కోట్ల అవినీతి చంద్రబాబు ప్రభుత్వంలో జరిగితే జీవీఎల్ నరసింహారావు అనే ఎంపీతో టీవీ చర్చల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఆయన అవినీతిని దుయ్యబట్టించారే తప్ప ఏ చర్యలూ ఎందుకు ఉండవు? భారతి పేరు నిందితుల జాబితాలో చేర్చే ఆసక్తీ, ఉత్సాహం చంద్రబాబు అవినీతి విషయంలో ఏమైనట్టు? ఆంధ్రప్రదే శ్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితి కానీ, ప్రజల మనోభావాలు కానీ రెండు జాతీయ పార్టీలకు ఇంకా అర్థం కాలేదు. అవినీతిలో నిండా మునిగిన తెలుగుదేశం తోక పట్టుకుని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నికల సముద్రం ఈదాలనుకుంటున్న రెండు జాతీయ పార్టీలను ప్రజలు గమ నిస్తూనే ఉన్నారు. గత నవంబర్ ఆరో తేదీన జగన్మోహన్రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర ప్రారం భించిన నాటి నుంచి పది జిల్లాలు దాటి నిన్న విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించే దాకా ఈ తొమ్మిది మాసాల్లో ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా, పిల్ల కాలువగా మొదలయి మహానదిగా ఈ యాత్ర మారింది. జనంతో సాగుతున్న ఈ యాత్ర ప్రజాభిప్రాయానికి అద్దం పడుతోంది. రహస్య స్నేహ పాచికలు ఇక పారవన్న సత్యం ఆ మూడు పార్టీలు అర్థం చేసుకుంటే మంచిది. దేవులపల్లి అమర్(datelinehyderabad@gmail.com) -
ఐజేయూ కొత్త అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్
-
ఓ సర్వజ్ఞుడి అంతరంగం
డేట్లైన్ హైదరాబాద్ స్టేట్స్‌మన్ చంద్రబాబు ఈ మధ్య దిక్కు తోచని స్థితిలో పడ్డట్టున్నారు. సొంతంగా ఆలోచించి ప్రజా ప్రయోజనాల గురించి కానీ, రాజకీయంగా కానీ నిర్ణయాలు తీసుకోలేని స్థితి అది. ప్రతిపక్ష నాయకుడు ఎజెండా నిర్ణయిస్తుంటే ఆయన అనుసరిస్తున్నారు. ప్రతిపక్షాన్ని వెంట తీసుకుపోవలసిన ముఖ్యమంత్రి అదే ప్రతిపక్షాన్ని అనుసరించాల్సిన పరిస్థితికి వచ్చారంటే దానికి ఆయనే బాధ్యుడనడంలో సందేహం లేదు. ఈ స్థితిలో అఖిలపక్షమో, అఖిల సంఘమో అర్థం కాని, ఏ మాత్రం ప్రయోజనం లేని కుప్పిగంతులు ఆపడం మంచిది. నలుగురి అభిప్రాయాలు తెలుసుకోవడం, సలహాలు సూచనలు తీసు కోవడం, సంప్రదింపులు జరపడం, మంచిచెడులను బేరీజు వేసుకో వడం, ఫలితాలను అంచనా వేయడం వీటన్నిటి నుంచి అంతిమంగా తమకు వచ్చిన ఆలోచనను అమలు చేయడం విజ్ఞుల లక్షణం. ఇందుకు చాలా సమయం పట్టవచ్చు, అనేక అవరోధాలు ఎదురు కావచ్చు, ప్రతి ఘటన కూడా పెద్ద ఎత్తున ఉండవచ్చు. కానీ ఒక సమస్యకు సరైన పరిష్కారం సాధించాలనుకునే వారు విజ్ఞులయితే ఈ కష్టాన్ని భరిస్తారు, ఇదే మార్గంలో వెళతారు. రాజకీయాల్లో ఉన్న వారికీ, అందునా అధికా రంలో ఉన్నవారికీ ఇది చాలా అవసరం. ప్రజల జీవితాలతో, వారి మంచి చెడ్డలతో వ్యవహారం కాబట్టి, వారికి మంచే చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వస్తారు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి వారినే రాజకీయాల్లో రాజనీతిజ్ఞులు (స్టేట్స్‌మన్) అంటారు. ‘నేను మామూలు రాజకీయ నాయకుడిని కాను. చట్టసభలతో 40 ఏళ్ల అనుభవం నా ఒక్కడికే సొంతం. దేశంలో చాలామంది కంటే ముందే, అదీ చిన్న వయసులో ముఖ్యమంత్రిని అయ్యాను. జాతీయ రాజకీయాల్లో సంకీర్ణశకం నాతోనే మొదలయింది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ కాన్ఫరెన్స్ హాల్‌గా మారిన ఆ రాష్ట్ర శాసనసభలో గంటల తరబడి ఇదే విషయం చెబుతున్నారు. ఒక అసత్యాన్ని వందసార్లు చెబితే సత్యం అయి పోతుం దన్న సిద్ధాంతం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచే బాగా ఒంట బట్టించుకున్నారు. రాజనీతిజ్ఞుడనగా....! ఆయన కన్నా చిన్న వయసులో ప్రజాక్షేత్రంలో పోరాడి గెలిచి ముఖ్య మంత్రులు అయిన పిన్న వయస్కులు చాలా మంది ఉన్నారు. ఆయన కంటే రాజకీయాల్లో తలపండిన భీష్ములు ఇంకా మిగిలే ఉన్నారు. కానీ ఆయన మాత్రం వాళ్లెవరినీ పరిగణనలోకి తీసుకోరు. తానే ‘సీనియర్’ని అంటారు. అందరూ నమ్మాలని కూడా చెబుతారు. సభలో తెలుగు తమ్ముళ్లకు మరో దారి లేదు కాబట్టి బల్లలు చరిచి హర్షామోదాలు ప్రకటిస్తుంటారు. నారా చంద్ర బాబునాయుడు స్వయం ప్రకటిత స్టేట్స్‌మన్. విజ్ఞులు, రాజనీతిజ్ఞులు (స్టేట్స్ మన్) ఎట్లా ఆలోచిస్తారో, ఎట్లా వ్యవహరిస్తారో ముందే మాట్లాడుకున్నాం. మరి మన స్వయంప్రకటిత స్టేట్స్‌మన్ చంద్రబాబునాయుడు వ్యవహారం మొదటి నుంచి ఎట్లా ఉందో ఒక్కసారి చూద్దాం! 1995లో ఎన్టీ రామారావు కష్టఫలాన్ని కుట్రపన్ని చేజిక్కించుకున్న తరు వాత చంద్రబాబు బీజేపీ హవాలో, వాజ్‌పేయి ప్రజాకర్షణ తోడై 1999లో అధికారం సొంతం చేసుకున్నారు. అప్పుడే ఏదో సందర్భంలో అఖిలపక్ష సమావేశం ఒకటి నిర్వహించారు. సమావేశం ముగిశాక అఖిలపక్షం అన్నారు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆహ్వానించలేదు ఎందుకు అని విలేఖరులు అడిగితే శాసనసభలో వారికి ప్రాతినిధ్యం లేదు కదా అని తడుముకోకుండా జవాబిచ్చారు. ఆ ఎన్నికల్లో సీపీఐ శాసనసభలో ఒక్క స్థానం కూడా గెలవని మాట వాస్తవమే. కానీ సీపీఐ జాతీయ పార్టీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉంది. ఎన్నికల సంఘం గుర్తింపు ఉంది కదా అని మళ్లీ ప్రశ్నిస్తే స్టేట్స్‌మన్ దగ్గర జవాబు లేదు. సభలో ప్రాతినిధ్యం లేని పార్టీలను పిలవద్దనుకున్న ప్పుడు ఇది అఖిలపక్షం ఎట్లా అవుతుంది, ఫ్లోర్ లీడర్ల సమావేశం అనాలి కదా అని మరో విలేకరి రెట్టిస్తే స్టేట్స్‌మన్‌కు కోపం వచ్చింది. మీ మైండ్‌సెట్ మారాలి అని వెళ్లిపోయారు. ఈ పందొమ్మిదేళ్ల కాలంలో ఆ విలేకరి మైండ్‌సెట్ ఎంత మారిందో తెలియదు కానీ తన మైండ్ సెట్ ఏ మాత్రం మార్చుకోకుండా మీడియా మైండ్ సెట్ మాత్రం విజయవంతంగా మార్చే శారాయన. అఖిలపక్షం ఎత్తుగడ దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఆయనకు హఠాత్తుగా అఖిలపక్షం అవసరమైంది. సరే, ఇందులో ఒక దశాబ్దం పాటు అధికారానికి దూరంగానే ఉన్నారు కాబట్టి మళ్లీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లే లెక్కలోకి తీసు కుందాం. తన మీదా, తన పరిపాలన మీదా తనకే నమ్మకం లేక మాటి మాటికీ సర్వేలు చేయించుకునే స్టేట్స్‌మన్ చంద్రబాబునాయుడు ఆ సర్వేల్లో 95 శాతం జనం తన వెంటే ఉన్నారు కాబట్టి ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలు అవసరం లేదు అని దబాయించి, శాసనసభలో ఉన్న ఒకే ఒక్క బలమయిన ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా చేసి, చివరికి ఆ ప్రతిపక్షం శాసనసభను నిరంతరంగా బహిష్కరించే పరిస్థితికి తీసుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రాజధాని లేని, రూ. 16 వేల కోట్లకు మించిన లోటుతో రాష్ట్రం మిగిలిపోతే ఏ ఒక్క రోజూ ఏం చేద్దాం ఈ పరిస్థితిని అధిగమించడానికి అని ఏ ఒక్క ప్రతిపక్షాన్ని సలహా అడిగిన పాపాన పోనీ స్టేట్స్‌మన్ చంద్రబాబు. రాజధాని కోసం అనువైన స్థలాన్ని సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే ఆ కమిటీ నివేదికను ప్రజల ముందు ఉంచడం మాట దేవుడెరుగు. కనీసం శాస నసభకు సమర్పించని చంద్రబాబుకు, రాజధాని స్థల నిర్ణయం విషయంలో గానీ, అక్కడ వేలాది ఎకరాలు పంట భూములను రైతుల వద్ద నుంచి తీసు కున్నప్పుడు కానీ, అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తానని గొప్పలకు పోయి వందల వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథాగా ఖర్చు చేసినప్పుడు కానీ ప్రతిపక్షాలు గుర్తుకు రాలేదు. ఎన్నికల హామీగా అయిదు నుంచి పదిహేను సంవత్సరాలకు పెంచిన ప్రత్యేక హోదాను ముగిసిపోయిన అధ్యాయంగా ప్రకటించి, కేంద్రం ఇస్తానన్న ప్యాకేజీ మహా ప్రసాదంగా స్వీకరించిన నాడు ఒక్క నిముషం ఆగి ప్రతిపక్షాలను కూడా సంప్రదించి నిర్ణయం తీసుకుందాం అన్న ఆలోచనే రాలేదు ఆయనకు. శాసనసభ సమా వేశాలు నడుస్తున్నాయి. కనీసం పొద్దుటి దాకా ఆగి సభకు సమాచారం అందించి బహిరంగ ప్రకటన చేద్దాం అన్న సోయి కూడా లేకుండా అర్ధరాత్రి దాటాక మీడియా ముందుకు వచ్చి కేంద్ర నిర్ణయాన్ని ఒక్కడే సమర్థించిన ముఖ్యమంత్రి ఇప్పుడు అఖిలపక్ష/సంఘ సమావేశం అంటూ బయలు దేరారు. ఆనాడు కనీసం తన పార్టీలోని ముఖ్యులతో కూడా మాట్లాడని చంద్రబాబునాయుడు నాలుగేళ్లు గడిచాక ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఈ నాలుగేళ్లూ అలుపెరుగని పోరాటం చేసి ప్రజలను మరింత జాగరూకులను చేశాక ఇప్పుడు తూతూ మంత్రంగా అఖిలపక్షం అంటూ బయలుదేరారు. ఒక పక్క ప్రతిపక్షం వైఎస్సార్íసీపీ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి దాని మీద చర్చకు పట్టుపట్టి ఇతర పక్షాలను కూడ గట్టుతున్న స్థితిలో తప్పనిసరి అయి ఆ పార్టీని అనుసరించిన చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని పిలవడంలో అర్థం లేదు. పరిష్కారం ఏమిటో తెలియని స్థితిలో, అది సాధించడానికి అనుసరించాల్సిన మార్గాన్ని నిర్ణయించుకునే క్రమంలో ప్రతిపక్షాన్ని సంప్ర దించాలి కానీ సమస్యకు తానే కారకుడై, దాని పరిష్కారానికి ఇతరులు ఇప్పటికే పోరాటంలో చాలా దూరం వెళ్లిపోయాక వాళ్లను అందుకోలేక ఉన్నచోటనే చతికిలబడి సహాయం కోసం అర్ధించినట్టుగా ఉంది ముఖ్య మంత్రి వ్యవహారం. కామ్రేడ్స్ దారెటు? చట్టసభలో ప్రాతినిధ్యం లేని పార్టీని అఖిలపక్షానికి పిలవబోనని 1999లో చెప్పిన చంద్రబాబు ప్రస్తుత ఆహ్వానాన్ని అదే చట్టసభలో ప్రాతినిధ్యం కలి గిన పార్టీలు వైఎస్సార్సీపీ, బీజేపీ తిరస్కరిస్తే ప్రాతినిధ్యం లేని వామపక్షాలే ఆయనకు దిక్కయ్యాయి. పోనీ ఆనాడు పనికిరాని వాళ్లం ఇప్పుడెట్లా పని కొచ్చాం అని అడగడానికి సంకోచించారో, సరేలే ఇప్పటికయినా గుర్తించారు కదా అని సర్డుకుపోవాలని వెళ్లారో తెలియదు. ఆయన ఎవరినీ గుర్తించరు, అవసరం వచ్చినప్పుడు వాడుకుని వదిలేస్తారు, అంతే. 1995 ఆగస్టు 31 అర్ధరాత్రి (ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రాత్రి) కమ్యూనిస్ట్ పార్టీల శాసనసభాపక్షాల నాయకుల ఇళ్లకు వెళ్లి మద్దతు కోసం అర్థించిన చంద్రబాబు, ఆ తరువాత దేశానికి కావలసింది కమ్యూనిజం కాదు, టూరిజం అనడానికి ఎక్కువ సమయం పట్టలేదని వామపక్షాలు జ్ఞాపకం చేసుకుంటే మంచిది. స్టేట్స్‌మన్ చంద్రబాబునాయుడు ఈ మధ్య దిక్కు తోచని స్థితిలో పడ్డట్టున్నారు. సొంతంగా ఆలోచించి ప్రజా ప్రయోజనాల గురించి కానీ, రాజకీయంగా కానీ నిర్ణయాలు తీసుకోలేని స్థితి అది. ప్రతిపక్ష నాయకుడు ఎజెండా నిర్ణయిస్తుంటే ఆయన అనుసరిస్తున్నారు. ప్రతిపక్షాన్ని వెంట తీసు కుపోవలసిన ముఖ్యమంత్రి అదే ప్రతిపక్షాన్ని అనుసరించాల్సిన పరిస్థితికి ఆయనే బాధ్యుడనడంలో సందేహం లేదు. ఇటువంటి స్థితిలో అఖిలపక్షమో, అఖిల సంఘమో అర్థం కాని, ఏ మాత్రం ప్రయోజనం లేని కుప్పిగంతులు ఆపడం మంచిది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కచ్చితంగా తెచ్చి తీరే విధంగా, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరే విధంగా ప్రధాన ప్రతిపక్షమూ, ప్రజలూ చేస్తున్న పోరాటాలకు ఊతం ఇచ్చే విధంగా స్టేట్స్‌మన్ చంద్రబాబు నిర్ణయాలు ఉంటేనే ప్రజలు హర్షిస్తారు. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘చంద్రుల’ నోట చైనా పాట
డేట్లైన్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల పాలకులు ఇద్దరూ తమకు అడ్డంకిగా మారిన ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ కాలరాస్తున్నారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. నిరసనలకు తావే లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్పింగ్లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు సీఎంలకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్లుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ మధ్య వేర్వేరు సందర్భాలలో చైనాలో పరిపాలనను, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఉదహరించారు. ఇటు తెలం గాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తాను జాతీయ రాజకీయాలకు వెళ్లనున్నట్టు ప్రకటించిన సభలో చైనాను ప్రస్తావిస్తే, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అక్కడి శాసనసభలో మాట్లాడుతూ చైనాను కొనియాడారు. ఇద్దరి మాటల్లోనూ మనకు అర్థం అయింది ఏమిటంటే అభివృద్ధి సాధించాలంటే చైనాను ఆదర్శంగా తీసుకోవాలి అని. అభివృద్ధి అంటే ఏమిటి? అది ఎవరి అభివృద్ధి? దేన్నయినా పణంగా పెట్టి ఆ అభివృద్ధి సాధించుకోవలసిందేనా? చైనా సాధిస్తున్న అభివృద్ధిని గురించి ఇంకోసారి చర్చించుకుందాం. ఇటీవలే చైనా దేశ రాజ్యాంగాన్ని సవరించి ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ జీవితకాలం పదవిలో కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది ఆ దేశ పార్లమెంట్. రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష పదవిలో ఎవరూ కొనసాగకూడదన్న నియమాన్ని సవరించి జిన్‌పింగ్‌కు నిరాఘాటంగా అధికారంలో కొనసాగే అవకాశం కల్పించడం చైనా దేశాన్ని ఏకవ్యక్తి నియంతృత్వం వైపు నెట్టడమే అన్న విమర్శను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చి ఈ చర్యకు ప్రజల ఆమోదం ఉందని తేల్చేసింది. చైనా మోడల్ దేనికి నిదర్శనం? అభివృద్ధి పేరిట చైనా దేన్ని పణంగా పెడుతుందో ఈ తాజా చర్యల వల్ల మనకు అర్థమవుతుంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో, అభివృద్ధి కోసం దేశాన్ని నియంతృత్వ పాలకుల చేతుల్లో ఎలా పెట్టెయ్యవచ్చునో, దానికోసం స్వేచ్ఛాస్వాతంత్య్రాల అవసరం అసలే అక్కరలేదనో ఎవరయినా ఆర్థిక శాస్త్ర పండితులు చెప్తారేమో. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛను, జీవించే హక్కును కోరుకునే వారెవ్వరూ ఇప్పటి చైనా పోకడలను హర్షించరు, ఆమోదించరు. విచిత్రంగా చైనాలో ఈ రాజ్యాంగ సవరణ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరి నోటా చైనా అభివృద్ధి పాట వినిపించింది. నిజంగా ఈ ఇద్దరు నాయకులను చైనాలో జరుగుతున్న అభివృద్ధి ఆకర్షించిందా లేకపోతే జిన్‌పింగ్ లాగా తమకు శాశ్వత అధికారం కట్టబెడితేనే చైనా మోడల్ అభివృద్ధి సాధిస్తామని ప్రజలకు చెప్పదల్చుకున్నారా తెలియదు. ఈ సందేహం రావడానికి కారణం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి నిరసనలకు తావు లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపొయింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తానూ చెయ్యబోయే అభివృద్ధిని 2050 సంవత్సరం వరకూ విస్తరిస్తుంటారు. అంటే ఆయన, ఆయన కొడుకు లోకేష్, ఆ తరువాత మనుమడు దేవాన్‡్ష కూడా ముఖ్యమంత్రులు అయిపోవొచ్చు ఈ 52 ఏళ్ళ కాలంలో. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 20 ఏళ్ళ దాకా మాదే అధికారం అంటారు. ప్రతిపక్షాలు లేనే లేవు, ఎప్పుడు ఎన్నికలొచ్చినా రాష్ట్ర శాసనసభలోని 119 స్థానాల్లో 106 మావేననీ, వచ్చే 20 ఏళ్ళు అధికారం మాదే అని కూడా అంటుంటారు. ఇద్దరూ ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ, విలువలనూ కాలరాస్తుంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్పింగ్లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు ముఖ్యమంత్రులకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్టు ఉన్నది. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి కుప్పిగంతులే! రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలిచ్చి, విడిపోతున్న సమయంలో 15 ఏళ్ళు ప్రత్యేక తరగతి హోదా కావాలని డిమాండ్ చేసి ఆ తరువాత అధికారంలోకి వచ్చాక అదే హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాన్ని, ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కదలనివ్వదు, జైళ్ళలో పెడుతుంది. కేసులు పెడుతుంది. హోదా సంజీవని కాదు, ప్యాకేజీతోనే ప్రయోజనం అని చెప్పి చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసి, చివరికి ప్రజాగ్రహానికి తలొగ్గక తప్పని స్థితిలో మళ్ళీ ప్రత్యేక హోదా పాట అందుకున్నది. ఎన్నికల ఎత్తుగడగా బీజేపీని వదిలించుకోవాలని ఆలోచిస్తున్నప్పటికీ చంద్రబాబుకు పూర్తి ధైర్యం చాలడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో నుండి మాత్రం తన మంత్రులతో రాజీనామా చేయించి ఎన్డీఏ కూటమిలో మాత్రం కొనసాగుతున్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కేంద్రంతో తగాదా పడలేము, మంచిగా ఉండి సాధించుకోవాలి అనే పాట పాడుతూ వొచ్చిన చంద్రబాబుకు, ఆయన పార్టీ నాయకులకూ ఇప్పుడు బీజేపీతో సంబంధాలు చెడేసరికి సహకార ఫెడరలిజం గుర్తొచ్చింది. 2016 సెప్టెంబర్ 8న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తున్న ప్యాకేజీ గురించి ప్రకటించినప్పుడు ఉబ్బితబ్బిబ్బయిపోయి ఆయనకు సన్మానాలు చేసిన చంద్రబాబు, అదే ప్రకటనను అక్షరం పొల్లుపోకుండా 2018 మార్చిలో చేస్తే మాత్రం అన్యాయం జరిగిందని ప్రకటనలు చేస్తున్నారు. అధికారాన్ని మళ్ళీ ఎట్లాగయినా దక్కించుకోవాలన్న ఆరాటం స్పష్టంగా కని పిస్తూనే ఉంది ఆయన నిర్ణయాల్లో. తాము ఇంకా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూనే, ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకయినా మద్దతు ఇస్తామన్న ప్రతిపక్షాన్ని మాత్రం బీజేపీలో చేరబోతున్నది అని నిందించేందుకు చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు శతవిధాలా చేస్తున్న ప్రయత్నాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటే పొరపాటు. ఇక దేశానికే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తాను ఇస్తాననీ మూడవ ఫ్రంట్‌కు తాను నాయకత్వం వహిస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రైతు సమస్యల మీద కేంద్రాన్ని నిలదీయడానికి ఉద్యమం చేస్తానని, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉండదు. హైదరాబాద్‌లో ధర్నా చౌక్ ఎత్తేసి నిరసనకారులను ఇళ్ళల్లో నిర్బంధించి అవసరం అయితే పోలీస్ స్టేషన్లకు తరలించి ముఖ్యమంత్రి మాత్రం జంతర్ మంతర్‌కు నిరసన కార్యక్రమం నిర్వహించడానికి వెళతారు. రిజర్వేషన్ల పెంపు డిమాండ్ మీద ఆయన పార్టీ ఎంపీలు లోక్‌సభను స్తంభింప చెయ్యొచ్చు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపవచ్చు కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం విపక్షాల నిరసనకు అనుమతి లేదు. ప్లకార్డులు ధరించి సభకు రావడం అరాచకం. దాడుల రాజకీయంలోనూ పక్షపాతమే! శాసనసభలో గవర్నర్ మీద దాడి హేయమయిన చర్య. ఎవరూ సమర్థించకూడని చర్య. అయితే గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలపడం ఇవాళ కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. నిలబడి నిరసన తెలపడం, నినాదాలు చెయ్యడం, ప్రసంగాల ప్రతులను చించివెయ్యడం చాలా కాలంగా శాసనసభల్లో మామూలు అయిపోయింది. అయితే భౌతికంగా గవర్నర్ మీద దాడికి దిగడం ఎవరితో ప్రారంభం అయింది? ఉమ్మడి రాష్ట్రంలో ఇదే గవర్నర్ గారి మీద ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు కాదా దాడి చేసింది. శాసన సభ ఆవరణలో ఒక ఎంఎల్ఏను కొట్టండిరా తన్నండిరా అని రెచ్చగొట్టిన పెద్ద మనిషి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్నాడు. రేపో మాపో ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సంఘటనను ఆదర్శంగా చేసుకుని గవర్నర్ మీద మళ్లీ దాడి చెయ్యడాన్ని ఎవరూ సమర్థించరు. చెప్పేదేమంటే మేం చేస్తే మంచిది, ఇతరులు చేస్తే చెడ్డది అన్న ప్రభుత్వాల, రాజ కీయ పక్షాల వైఖరి సరయినది కాదు అనే. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమం అనేక మార్గాల్లో, అనేక పద్ధతుల్లో సాగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉందో చెప్పడానికి మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటి పలు కార్యక్రమాలు జరి గాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ఆ ఉద్యమ కార్యక్రమాలు అన్నింట్లో భాగస్వామి. వాటిల్లో ఒకటయిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ జరుపుకోవడాన్ని ఎందుకు ప్రభుత్వం అడ్డుకున్నట్టు? ఉద్యమ కాలంలో తెలంగాణ సాధన కోసం ఆ నాటి ప్రభుత్వంతో తలపడిన దానికి, ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి తేడా లేదా? మిలియన్ మార్చ్ నిర్వహణను నిషేధించడానికి ఆ నాడు ప్రభుత్వం ఏ కారణాలు చెప్పిందో, స్ఫూర్తి సభను నిషేధించడానికి నేటి ప్రభుత్వమూ అవే కారణాలు చూపడం విడ్డూరం. ఆ నాటి దృశ్యమే ఈనాడూ ట్యాంక్ బండ్ చుట్టూ కనిపించింది. ఆనాడు వేల మంది పోలీసులు ఉద్యమకారుల మీద విరుచుకుపడి అరెస్టులు సాగిస్తే ఈనాడు పోలీసులు అంతకంటే ఎక్కువ దాష్టీకం చేశారు, దౌర్జన్యం చేశారు. పాలకులు ఎవరయినా ప్రజా ఉద్యమాల పట్ల, వారి ఆకాంక్షల పట్ల ప్రదర్శించే అసహనంలో మాత్రం మార్పు ఉండదేమో! మన పాలకులూ చైనా దారి పట్టినట్టు ఉన్నారు..!! దేవులపల్లి అమర్ ఈమెయిల్ : datelinehyderabad@gmail.com -
‘నివాళి’ చెబుతున్న నిజాలు
డేట్లైన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌కు అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ, టీడీపీ రెండూ కూడా రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ అన్న విషయం గుర్తించాలి. కేంద్రం నుంచి ఏ సహాయమూ రాలేదంటున్న చంద్రబాబు కేంద్ర సహాయం అద్భుతం, అమోఘం అని ఈ నాలుగేళ్లు ఎందుకు భజన చేశారో చెప్పాలి. తాము ఇచ్చిన నిధులకు ఇప్పుడు లెక్కలు చెపుతూ అందులో బోలెడు అవినీతి జరిగిందంటున్న బీజేపీ నాయకులు అధికారం తమ చేతిలో ఉండి కూడా ఇంతకాలం లెక్కలు ఎందుకు అడగలేదో, ఎందుకు అవినీతికి అడ్డుకట్ట వేయలేదో కూడా చెప్పాలి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర చదువుకున్నవారికి వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి తెలియకుండా ఉండదు. బీజేపీ, ఆరెస్సెస్ సహా హిందూత్వవాదులంతా ఆయనను స్వాతంత్య్ర వీర్ సావర్కర్ అని పిలుచుకుంటారు. దేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న మితవాదశక్తులు నిద్రలో కూడా కలవరించే ‘అఖండæభారత్’ఆలోచన వీర్ సావర్కర్ బలపరిచినదే. స్వాతంత్య్రోద్యమంలో సావర్కర్ పాత్ర గురించి రెండు వాదనలు ఉన్నాయి. దేశæస్వాతంత్య్రం కోసం పోరాడినందుకు సావర్కర్‌కు బ్రిటిష్ పాలకులు 50 ఏళ్ల జైలు శిక్ష విధించి అండమాన్ సెల్యూలర్ జైలుకు పంపారని బీజేపీ, ఆరెస్సెస్ తదితర హిందూత్వ అనుకూలవాదులు చెబుతారు. బ్రిటిష్ పాలనకు అనుగుణంగా నడుచుకుంటాననీ, క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటూ లేఖ రాసినకారణంగా ఆయనను విడుదల చేశారనీ, మహాత్మాగాంధీ పిలుపు మేరకు జరిగిన క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొనవద్దనీ, బ్రిటిష్ వారిచ్చిన పదవులకు రాజీనామా చెయ్యొద్దనీ తన వారికి పిలుపు ఇచ్చిన సావర్కర్ స్వాతంత్య్రవీరుడు ఎట్లా అవుతాడని కాంగ్రెస్ వాదులూ కమ్యూనిస్ట్లూ వాదిస్తుంటారు. బీజేపీ, ఆరెస్సెస్‌లకు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ సావర్కర్ ఆరాధ్యదైవమే. నివాళిలోనూ రాజకీయమే సరే, సావర్కర్‌ను ఎవరి కోణం నుంచి వారు విశ్లేషించవచ్చు. స్వాతంత్య్ర పోరాటకాలంలో వ్యవహార శైలిని బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరయినా అంచనా వెయ్యవచ్చు. ఎవరికయినా, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లు ఇటువంటి విషయాల్లో స్పష్టమయిన అభిప్రాయం కలిగి ఉండాలి, ఉంటారు కూడా. అయితే ఇప్పుడు సావర్కర్ ప్రస్తావన ఎందుకు అనే సందేహం కలగవచ్చు. మొన్న అంటే ఈ నెల 26వ తేదీ సావర్కర్ వర్ధంతి. 1966 ఫిబ్రవరి 26 వ తేదీన, అంటే 52 ఏళ్ల క్రితం ఆయన చనిపోయారు. ఆ సందర్భంగా దేశంలో చాలామంది సావర్కర్ అభిమానులు ముఖ్యంగా హిందూత్వవాదులు తమకు తోచిన పద్ధతుల్లో నివాళులు అర్పించారు. సావర్కర్ పాత్రను వ్యతిరేకించే వారు ఎవ్వరూ ఎక్కడా ఆయనకు నివాళులు అర్పించలేదు. అంతమాత్రాన ఆయన అభిమానులకు పోయేదేమీలేదు. అయితే సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించి అంతలోనే నాలుక కరుచుకుని ఆ నివాళిని వెనక్కి తీసుకునే వాళ్లను ఏమనాలి? అదికూడా మామూలు వ్యక్తులు అయితే వేరు. రాజకీయ దిగ్గజం, అపర చాణక్యుడు అని పేరు తెచ్చుకున్న, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నాయకుడు ఆ పని చేస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి? పాపం, సావర్కర్ గురించి ఆయనకు ఏమీ తెలియదు, ఎవరో చెపితే పొరపాటున నివాళులు అర్పించారు. ఆ వెంటనే మరెవరో, అయ్యో సావర్కర్ బ్రిటిష్ పాలనను సమర్ధించినవాడు, క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించాడు అని గుర్తు చేస్తే వెనక్కి తీసుకున్నారని అర్థం చేసుకోవాలా? ఆ పని చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చంద్రబాబు చాలా సీనియర్ నాయకుడు. ఆయనే తరచూ ఆమాట చెబుతూ ఉంటారు, దేశంలో ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వాళ్లందరిలో తానే సీనియర్‌నని. అంతేకాదు, తాను స్టేట్స్‌మన్‌ని అని కూడా ఆయనే పదే పదే గుర్తు చేస్తుంటారు. వీర్ సావర్కర్ ఎవరో, ఆయనకు నివాళులు అర్పించాలా, కూడదా అన్న విషయాలు చంద్రబాబునాయుడు వంటి ‘స్టేట్స్‌మన్’కు తెలియకుండా ఉంటాయని ఎట్లా అనుకుంటాం? మొన్న 26వ తేదీన పొద్దున్నే చంద్రబాబునాయుడు ట్వీటర్లో వీర్ సావర్కర్‌కు నివాళులు అర్పించారు. అయితే కొద్దిసేపట్లోనే ఆ నివాళిని ట్వీటర్ నుంచి తొలగించేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఇది ఎవరూ పెద్దగా పట్టించుకునే విషయం కాదు. రాజకీయ అవసరాల కోసం ఎవరినయినా ఏ జంకూ లేకుండా వదిలించుకోగలిగిన చంద్రబాబు బీజేపీని మరొక్కసారి వదిలించుకోబోతున్నారనే వార్తలు బాగా ప్రచారంలో ఉన్న సమయంలో ఇది జరిగింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన వీర్ సావర్కర్‌ను కీర్తించాల్సిన అవసరం లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో బీజేపీ సిద్ధాంతాలను నూటికి నూరు శాతం సమర్ధించే వారే ఉండాలని లేదు. రాజకీయ అవసరాల కోసం, మళ్లీ మాట్లాడితే అధికారం కోసం ఎవరు ఎవరితో అయినా జత కడుతుంటారు, ఎవరినయినా వదిలేస్తారు. అందులో సిద్ధహస్తుడయిన చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2004 ఎన్నికల ముందటి అవతారం మళ్లీ ఎత్తదల్చుకున్నారు కాబట్టి చంద్రబాబునాయుడు ఇప్పుడు బీజేపీని వదిలించుకుని సెక్యులర్ బురఖా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టే ట్వీటర్లో నుంచి వీర్ సావర్కర్ నివాళి మాయమైంది. ఇద్దరూ సమాధానాలు చెప్పాలి చంద్రబాబునాయుడు తమను వదిలేస్తాడన్న విషయం బీజేపీకి కూడా తెలుసు. అందుకే కొన్నిరోజులుగా స్వరం పెంచింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు ఆంధ్రప్రదేశ్‌కి ఈ మూడున్నర ఏళ్లలో ఇచ్చిన నిధుల లెక్కలు చెబుతున్నారు. మరో బీజేపీ నాయకుడు, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు ఆ నిధుల్లో జరిగిన అవినీతి గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. 1995లో ఎన్టీ రామారావు నుంచి అక్రమంగా అధికారం లాక్కున్నాక, 1999లో బీజేపీ సహాయంతో, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రజాకర్షణ శక్తి, కార్గిల్ వంటి అంశాలు కలిసొచ్చి అత్తెసరు మార్కులతో బయటపడ్డారు చంద్రబాబు. మళ్లీ 2014లో అదే బీజేపీ సహాయం, మోదీ సమ్మోహన శక్తి, పవన్‌కల్యాణ్ సహకారంతో మరోసారి అత్తెసరు మార్కులతోనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు మరోసారి బీజేపీని వదిలేయడం పెద్ద విశేషం ఏమీకాదు. ఆయనకు ఎన్నడూ స్వయం ప్రకాశకత్వం లేదు. అందుకే బహుశా 2019లో కొత్త మిత్రుల వెతుకులాటలో పడ్డారేమో! అయితే 2004లో ఆయన హైదరాబాద్‌లోనే అడ్వాణీ ర«థం దిగేసి తెగతెంపులు చేసుకున్నప్పటి బేలతనం ప్రస్తుత బీజేపీ నాయకత్వంలో లేదు. బీజేపీ ఇప్పుడు అమాయక చక్రవర్తి అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల్లో లేదు. ‘కట్ త్రోట్’రాజకీయాలు నడుపుతున్న అమిత్ షా, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌కు అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ, టీడీపీ రెండూ కూడా రాష్ట్ర ప్రజలకు అనేక విషయాల్లో జవాబుదారీ అన్న విషయం గుర్తించాలి. కేంద్రం నుంచి ఏ సహాయమూ రాలేదంటున్న చంద్రబాబునాయుడు కేంద్ర సహాయం అద్భుతం, అమోఘం అని ఈ నాలుగేళ్లు ఎందుకు భజన చేశారో ప్రజలకు చెప్పాలి. తాము ఇచ్చిన నిధులకు ఇప్పుడు లెక్కలు చెపుతూ అందులో బోలెడు అవినీతి జరిగిందంటున్న బీజేపీ నాయకులు అధికారం తమ చేతిలో ఉండి కూడా ఇంతకాలం లెక్కలు ఎందుకు అడగలేదో, ఎందుకు అవినీతికి అడ్డుకట్ట వేయలేదో కూడా ప్రజలకు చెప్పాలి. సరయిన జవాబులు రాకపోతే ఏం చెయ్యాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. విజన్ 2033లో చంద్రబాబు చివరగా, చంద్రబాబునాయుడు చట్టసభల్లోకి ప్రవేశించి నిన్నటితో 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన మానసపుత్రిక అయిన ఒక మీడియా సంస్థ యజమానితో పెట్టిన సుదీర్ఘ ముచ్చట్లలో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు– క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదటిరోజే మంత్రి పదవిని ఆశించిన విషయం. అట్లాగే రాజకీయ పుట్టుకే అసమ్మతితో అని కూడా చెప్పుకున్నారు. మొదటిసారి 1978లో 26 ఏళ్ల వయసులోనే మంత్రి పదవి ఇవ్వనందుకు డాక్టర్ చెన్నారెడ్డి ప్రభుత్వం మీద అసమ్మతి కార్యక్రమం మొదలు పెట్టానని గర్వంగా చెప్పుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అందునా ఆంధ్రప్రదేశ్ వంటి సంక్షోభ స్థితిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పదవీకాలంలో ప్రజలకు ఏం చేసిందీ చెప్పే ప్రయత్నం లేకపోగా ‘మందు కొట్టేవారా, తోటి విద్యార్థుల చేత మందు కొట్టించి తగాదాలకు వెంట తీసుకువెళ్లేవారా, చిల్లర ఖర్చుల కోసం పేకాట ఆడేవారా’ వంటి చిల్లర ముచ్చట్లకు పరిమితం కావడంతో వీక్షకులు ముక్కున వేలేసుకున్నారు. ఈ ముచ్చట్లలోనే ముఖ్యమంత్రి ఒక్క విషయం మాత్రం స్పష్టం చేశారు. అమరావతిలో రాజధాని నిర్మించడానికీ, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికీ తనకు ఇంకో పదిహేను సంవత్సరాలు అధికారం కావాలని చెప్పారు. బహుశా ఆయన విజన్ 2033 కావచ్చు. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
‘హోదా’ గోదాలో కొత్త కదలిక
విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం ఇవాళే ఉద్యమం ప్రారంభం కాలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి తొలిరోజు నుండి ఈనాటి వరకూ ప్రత్యేక హోదా కోసం అన్ని వేదికల మీదా మాట్లాడుతున్నారు. దాని వల్ల రాష్ట్రానికి జరిగే లాభాలను గురించి ప్రజలకు చెబుతూనే ఉన్నారు. ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి ఆయన ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగితే దాన్ని భగ్నం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అదే ప్రత్యేక హోదా పాట పాడటం హాస్యాస్పదం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపున, అంటే ఏప్రిల్ 6 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రకటించడంతో హోదా అంశం మళ్లీ ఊపందుకుంది. దీనితో అధికార తెలుగుదేశం పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారయింది. హోదా రాకపోతే చరిత్ర క్షమించదన్న వాస్తవం అర్థంకాని తెలుగుదేశానికి ఇది ఆషామాషీ వ్యవహారం కాదని జగన్ మళ్లీ తేల్చి చెప్పినట్టయింది. హోదా కోసం ఎవరు నిజాయితీగా పోరాడుతున్నారో ప్రజలకు మరొకసారి అర్థమయింది. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు, అందుకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం’ అని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడో తేల్చేసింది. అట్లా కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన మరుక్షణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని స్వాగతించింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే, మరుక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందరి నిద్రలూ చెడగొట్టి ఆ ప్రకట నను స్వాగతిస్తూ కొన్ని గంటలు ప్రసంగించారు. ఏపీని బీజేపీ మోసం చేసిందా? ఎలా! ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ ఉండదు, అది సంజీవని కాదు, ప్రత్యేక హోదా వల్ల జరిగే లాభం కంటే ఎంతో ఎక్కువ లాభం జరిగే విధంగా కేంద్రం నిధుల వరదలెత్తించబోతున్నది, దాన్ని అడ్డుకునేందుకు, అభివృద్ధి జరగకుండా చూసేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తున్నది అని చంద్రబాబునాయుడు ఆనాడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దగ్గర పట్టుబట్టి ఒప్పించుకున్న అంశం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ప్రతిపత్తి అయిదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని నాడు రాజ్యసభలో ఉన్న ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, మరో అడుగు ముందుకు వేసి, పదిహేనేళ్లు కావాలన్నారు. 2014 ఎన్నికల ప్రచార సందర్భంగా ఎన్డీఏ నాయకులు ఇరువురూ(మోదీ, బాబు) అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్పని సరిగా ఇస్తాం అని ప్రజలకు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇద్దరూ మాట మార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రం మనం అడిగిన దానికంటే చాలా ఎక్కువే ఇచ్చింది అని చెప్పారు. మరి ఇప్పుడేమయింది? కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తే వాటికి రాష్ట్రం లెక్కలు చెప్పడంలేదనీ,పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనీ కేంద్రంలో ఎన్డీఏ ప్రధాన భాగస్వామి బీజేపీ ప్రతినిధులు చెబుతూ ఉంటే, ప్యాకేజీ పేరు చెప్పి మోసం చేశారు, నిధులు ఇవ్వడం లేదు అని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఎక్కడ బెడిసినట్టు? ఇద్దరికీ ఎక్కడ చెడింది? గత వారంరోజులుగా ఒకరినొకరు బహిరంగంగానే ఎందుకు విమర్శించుకుంటున్నారు? ఈ ఆరోపణలూ ప్రత్యారోపణలకు ఏ మాత్రం అయినా విలువ ఉండాలంటే అవతల నరేంద్ర మోదీ కానీ, అమిత్ షా కానీ నోరు విప్పాలి. ఇవతల చంద్రబాబునాయుడు నోరు తెరవాలి. ఆ పని ఎందుకు జరగడం లేదు? మిత్రధర్మం లేదా సంకీర్ణధర్మం అనుకుంటే అటు కానీ, ఇటు కానీ ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదు కదా! అంతర్గతంగా మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుని బయటికి వచ్చి ఒకే స్వరంతో మాట్లాడితే కదా సంకీర్ణ ధర్మాన్ని పాటించినట్టు! కేంద్రాన్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇచ్చింది తీసుకోవాలి, ఆ తరువాత మరింత కావాలని అడుక్కోవాలి అన్న ధోరణిని చంద్రబాబునాయుడు ఎందుకు అవలంబిస్తున్నారు? ఎందుకు ఎక్కడికక్కడ సర్దుబాటు ధోరణిని అవలంబిస్తున్నది? నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఇదే పరిస్థితి. సంకీర్ణ భాగస్వాములు కూడా అవసరం అయినప్పుడు కనీస స్నేహపూర్వక విమర్శ అయినా చేస్తారు, ఆ సాహసం కూడా ఎందుకు చంద్రబాబు చెయ్యలేకపోతున్నారు? అంత బలహీన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, దాని అధినేత ఎందుకు ఉన్నారు? అందుకు గల బలమయిన కారణాలు ఏమిటి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అప్పాయింట్మెంట్ కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఫెడరల్ రాజ్యంలో ఎందుకు ఉన్నది? రాష్ట్రంలో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయినా బిక్క మొహం వేసుకుని ప్రధాని పిలుపు కోసం ఎదురుచూస్తూ ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్కపూట లోక్‌సభలో నోరు విప్పి మాట్లాడినందుకు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్‌కు ఊరేగింపులు, సన్మానాలు ఎందుకు చేస్తున్నారు? పదే పదే అదే పాట అరుణ్ జైట్లీ నోట పాడించినందుకా తెలుగుదేశం విజయోత్సవాలు? మేము బోలెడు నిధులు ఇచ్చాం, వాటికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదు అని చెబుతున్న బీజేపీ ఎంఎల్సీ సోము వీర్రాజుకు జవాబు చెప్పే స్థితిలో తెలుగుదేశం నాయకులు ఎందుకు లేకుండా పోయారు? ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి మాట్లాడరేం? ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు సరే, రెండురోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, వీర్రాజు విడుదల చేసిన లెక్కల్లో తప్పులుంటే రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధికారికంగా ఆ తప్పులను సరి చేయవచ్చు కదా! ఆయన అయినా ఎందుకు మాట్లాడటం లేదు? కేంద్రం నుండి ఎన్ని నిధులు వచ్చాయి, వాటిని ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఖర్చు చేశామన్న విషయం తెలుసుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది కదా! వాళ్లు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చామన్న విషయం మరిచిపోయి మేము ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అన్న ధోరణిలో ఉంటే ప్రజలెట్లా సహిస్తారు? తాజా పరిస్థితే తీసుకుందాం. హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలన్న విషయం గుర్తొచ్చిన తెలుగుదేశం పార్టీ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేవని బయటికొచ్చి మాట్లాడుతున్నా ఆ పార్టీ అధినేత మాత్రం నోరు విప్పి ఒక్క మాటా మాట్లాడటం లేదు. చీటికి మాటికి మీడియా ముందుకొచ్చి గంటల తరబడి మాట్లాడిందే మాట్లాడే అలవాటు మొదటి నుండీ ఉన్న చంద్రబాబునాయుడు పెదవి విప్పక పోవడం వెనక రహస్యం ఏమిటి? ఎన్ని లీకులు ఇచ్చినా, వందిమాగధ మీడియాలో ఎంత రాయిం చినా అధినేత నోరు విప్పి మాట్లాడితేనే కదా శ్రేణులు పరిస్థితిని అర్ధం చేసుకునేది. ఆయన ఆ పనికి సిద్ధంగా లేరన్నవిషయం స్పష్టం అవుతున్నది. అదే సమయంలో క్రమక్రమంగా బీజేపీ నుండి దూరం జరగాలి, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో తాను ఇచ్చిన 600 హామీలు ఎందుకు అమలు కాలేదని ఎవరూ ప్రశ్నించకుండా కేంద్రం నుండి సహకారం లేని కారణంగా అభివృద్ధి చెయ్యలేకపోయామని చెప్పుకుని జనాన్ని మళ్లీ ఓట్లు అడగాలన్నది చంద్రబాబు ఆలోచన. ప్రజలు ఎప్పుడయినా ఒక్కసారి మోసపోతారుకానీ అన్నిసార్లు మోసపోరు కదా! ఆది నుంచి వైకాపా నినాదం అదే విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం ఇవాళే ఉద్యమం ప్రారంభం కాలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి తొలిరోజు నుండి ఈనాటి వరకూ ప్రత్యేక హోదా కోసం అన్ని వేదికల మీదా మాట్లాడుతున్నారు. దాని వల్ల రాష్ట్రానికి జరిగే లాభాలను గురించి ప్రజలకు చెబుతూనే ఉన్నారు. ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి ఆయన ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగితే దాన్ని భగ్నం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అదే ప్రత్యేక హోదా పాట పాడటం హాస్యాస్పదం. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉద్యమాల్లో భాగస్తులు కావద్దని ప్రజ లకు పిలుపునిచ్చిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి ప్రతిపత్తితో వచ్చే ప్రయోజనం ఏదీ ఉండదని దబాయించిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రిదే. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయించి, అక్రమ కేసులు పెట్టిన చరిత్ర ఆయన ప్రభుత్వానిది. పదహారు మాసాల తరువాత తనను కలుసుకున్న చంద్రబాబునాయుడి నియోజకవర్గాల పెంపు కోరికను ప్రధాని మోదీ అంగీకరించి ఉంటే ఏ గొడవా ఉండేదికాదు. ఎవరి కోసం ఖర్చు చేశారో తేల్చాలి ఇక్కడ బీజేపీ ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులకురాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదు అని వారు ఫిర్యాదు చేస్తే సరిపోదు. కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత అన్న లెక్కలతో బాటు, ఆ నిధులు ఎక్కడ ఎందుకు ఎవరికోసం ఖర్చు చేశారో తేల్చేందుకు కూడా ప్రయత్నించాలి. లేకుంటే జరిగేది ఒక్కటే. ఎన్డీఏ రథం దిగిపోయి చంద్రబాబు బీజేపీని నిందించడం ప్రారంభిస్తారు. ఇది చంద్రబాబుకు కొత్త కూడా కాదు, ఆ సంగతి బీజేపీకి కూడా అనుభవంలో లేనిది కాదు. పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణకు బయలుదేరిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితర మేధావుల బృందం, దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోనూ అత్యంత సంపన్నుడయిన చంద్రబాబునాయుడు పాలనలో అత్యధిక ప్రజలు పేదరికంలో ఎందుకు ఉన్నారు, వారి సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు అన్న నిజాన్ని నిగ్గు తేలిస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రులు అందరిలో అత్యంత సంపన్నుడు చంద్రబాబునాయుడే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదికలో పేర్కొన్నట్టు ఈరోజే పత్రికల్లో వచ్చింది మరి! - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఉత్తమ రాజకీయాలకు దారేది?
డేట్లైన్ హైదరాబాద్ పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగడాన్ని కూడా ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. ఎవరికయినా స్వేచ్ఛ ఉంది. కానీ పవన్ మాట్లాడుతున్నదేమిటి? కేసీఆర్ తాట తీస్తానన్న నోటితోనే, ‘ఆయన అంటే నాకు మొదటి నుంచి చాలా అభిమానం’ అంటున్నారు. విభజన బాధతో పదకొండు రోజులు పస్తు ఉన్నానన్న నోటితోనే జై తెలంగాణ నినాదం వందేమాతరం అంత పవిత్రమయిందని కూడా అంటున్నారు. ఆయన మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మాలా? అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండాల్సిన అవసరంలేదు, మారవచ్చు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఈ మధ్య ఒక సభలో మాట్లాడినప్పుడు ‘రాగ్ దర్బారీ’ అనే ఒక రాగం గురించి ప్రస్తావించారు. వెనకటికి మహారాజును పొగడటానికి ప్రత్యేకంగా కొంత మందిని నియమించేవాళ్లట. వారికి రకరకాల పేర్లు. వందిమాగధులనీ, విదూషకులనీ ఉండేవారు. ఆస్థానకవుల పనీ దాదాపు అదే. కానీ రాజరిక వ్యవస్థ అంతరించింది. ప్రజాస్వామ్యం వచ్చింది. అయినా ఈ ప్రభువులను పొగిడే జాతి మాత్రం వేర్వేరు రూపాల్లో కొనసాగుతూనే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నడుస్తున్నది కూడా రాగ్ దర్బారీయే అంటే అతిశయోక్తి కాదు. ఆధునిక యుగపు ప్రభువులను కీర్తించడానికి కొత్తగా ఒక విదూషకుడు రాగ్ దర్బారీ ఆలపిస్తూబయలుదేరాడు. పైగా రాజాస్థానానికే పరిమితం కాకుండా రాజ్యం అంతటా తిరిగి ప్రభువు కీర్తి ప్రతిష్టలను ప్రజల ముందు వేనోళ్ల నోరారా పొగిడే పని భుజాన వేసుకున్నాడు ఈ కొత్త విదూషకుడు. అంతేకాదు రాజును విమర్శించే వాళ్లను దండించడానికి ఆ కాలంలో కొరడాలు వాడితే, ఇప్పుడు చట్టాలకు కొత్త పదును పెట్టి పరుష పదజాలాలు వాడితే కారాగార వాసం తప్పదని హుకుంనామాలు జారీ చేసేశారు. ఎంతసేపు ఈ డొంక తిరుగుడు? నేరుగా విషయానికి రావచ్చు కదా అని విసుక్కునే వాళ్లకోసం ఇక విషయానికి వచ్చేద్దాం! పరిహాసమవుతున్న ప్రజాస్వామ్యం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ‘తెలంగాణ గాంధీ’ అని కీర్తిస్తున్న వాళ్లు ఉన్నారు. ఆయన ఫొటోలకు పాలాభిషేకాలు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఆయనను స్తుతిస్తున్న వాళ్లూ అనేక మంది ఉన్నారు తెలంగాణ సమాజంలో. పదమూడు సంవత్సరాల సుదీర్ఘ మలిదశ శాంతియుత పోరాటం తరువాత ప్రత్యేక రాష్ట్రం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనేతగా చంద్రశేఖరరావు సర్వదా, సదా అభినందనీయుడే. అయితే ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడానికి వీల్లేదు అంటేనే చిక్కంతా. తనను ఎవరూ విమర్శించడానికి వీల్లేదని మహాత్ముడు ఎన్నడూ అనలేదు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో భాగం అయినవాళ్లూ, కాని వాళ్లూ ఎవరయినా సరే ప్రభుత్వ పనితీరు పట్ల ఒక అభిప్రాయం కలిగి ఉండే, ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ, విమర్శించే హక్కు ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం పౌరులందరికీ ఇచ్చింది. ఆ స్వేచ్ఛ ఒకరికి ఒక రకంగా, ఇంకొకరికి మరో రకంగా ఉండదు. అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఎవరినయినా ‘సన్నాసులు’, ‘పనికిమాలి నోళ్లు’ అంటాను. కానీ నన్ను ఎవరూ ఏమీ అనకూడదు అంటే కుదరదు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకూ, మలిదశ ఉద్యమానికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినది 1998 వరంగల్ డిక్లరేషన్. ఆ ఘట్టానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తలపెట్టిన ఊరేగింపు మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆరోజు వరంగల్ పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద గుమిగూడిన తెలంగాణ వాదుల మీద ఆడా మగా అని చూడకుండా పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేసి నిర్బంధించారు. తెలంగాణ ఉద్యమకాలంలో తమ పోరాటానికి విశ్వసనీయతను జత చేసిన సంస్థ జేఏసీ. కొలువుల కోసం కొట్లాడుతానని జేఏసీ కోర్టు అనుమతి తెచ్చుకున్న కూడా ఎక్కడివాళ్లను అక్కడ అరెస్ట్ చేసి సభను భగ్నం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ మధ్య వరంగల్ పట్టణంలో ఒక మహిళా సంఘం వాళ్లు హాల్ మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా అక్కడి పోలీస్ కమిషనర్ అనుమతి ఇవ్వకుండా చేయడంలో హైదరాబాద్ నుంచి ఆదేశాలు ఉన్నాయన్న విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇట్లా అనేకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆటా పాటా మాట మీద విరుచుకుపడుతున్న నిర్బంధానికి పరాకాష్ట– ధర్నా చౌక్ ఎత్తివేత. 1985–89 మధ్యకాలంలో ఎన్టీ రామారావు పరిపాలన నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు ఈనాటి పాలకులు. అప్పుడు కూడా తెలంగాణలో ఆటా మాటా పాటా బంద్ అయ్యాయి. ఇదేం ధోరణి? తన 25వ సినిమా విజయం సాధించలేకపోవడంతో ఇక పూర్తి స్థాయిలో రాజకీయాలనే వృత్తిగా చేసుకునే ఆలోచనకు వచ్చారు నటుడు పవన్ కల్యాణ్. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభించారాయన. ఆ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయడాన్ని ఎవరయినా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్న ఎందుకు వేయవలసి వచ్చిందం టే– సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆనాటి ఎంపీ జగన్మోహన్రెడ్డి పార్లమెంట్లో ప్లకార్డ్ పట్టుకున్నారు. దానిని కారణంగా చూపించి, ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన మానుకోటకు బయలుదేరితే రచ్చ రచ్చ చేసి తీవ్ర ఉద్రిక్తతలకు కారకులయ్యారు కొందరు. వారే ఈరోజు అధికారంలో ఉండి పవన్‌కల్యాణ్‌కు ఎర్రతివాచీ పరచడం వెనుక మతలబు ఏమిటి? పవన్‌కల్యాణ్∙కేసీఆర్ తాట తీస్తానన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టినందుకు భరించలేని దుఃఖంతో పదకొండురోజులు అన్నపానాలు మానేసి బాధపడ్డానన్నారు. జగన్మోహన్రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ ఒక్క పరుష పదప్రయోగం అయినా చేశారా? మరెం దుకు ఈ తేడా? అప్పుడు పరిస్థితి వేరు అంటారేమో! అప్పుడయినా ఇప్పుడయినా భావ ప్రకటనా స్వేచ్ఛకు అర్థం మాత్రం ఒకటే. ఇప్పుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగడాన్ని కూడా ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. ఎవరికయినా స్వేచ్ఛ ఉంది. కానీ పవన్ మాట్లాడుతున్నదేమిటి? కేసీఆర్ తాట తీస్తానన్న నోటితోనే, ‘ఆయన అంటే నాకు మొదటి నుండి చాలా అభిమానం’ అంటున్నారు. విభజన బాధతో పదకొండు రోజులు పస్తు ఉన్నానన్న నోటితోనే జై తెలంగాణ నినాదం వందేమాతరం అంత పవిత్రమయిందని కూడా అంటున్నారు. ఆయన మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మాలా? అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండాల్సిన అవసరంలేదు, మారవచ్చు. అది ముందు చెప్పాలి. అప్పుడు నేను మాట్లాడిన మాటలు పొరపాటు, చెంపలు వేసుకుంటున్నాను, నా అభిప్రాయం తప్పు అని ప్రజల ముందుకు రావాలి. ఆయన ఆ పని చెయ్యలేదే! రాజకీయ పార్టీ పెట్టానంటున్న పెద్దమనిషి ప్రభుత్వాలను విమర్శించను అంటున్నాడంటే ఆయనను ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజకీయ అవినీతికీ, దివాలాకోరుతనానికీ నిదర్శనంగా నిలిచిన ఓటుకు కోట్లు కేసు గురించి మాట్లాడను అని చెబుతున్న ఈ నాయకుడు ఈ దేశానికే నీతిపాఠాలు చెబుతానంటూ బయలుదేరాడు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకే ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. నిజం చెప్పాలంటే పవన్ కల్యాణ్‌ది అక్కడా ఇక్కడా కూడా రాగ్ దర్బారీయే. ఉద్యమ విజయశక్తిని నరనరాన నింపుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులూ, శ్రేణులూ తమ అధినేత తాట తీస్తానన్న మాటకు క్షమాపణ చెప్పి, నిరాహారంగా పడుకుని బాధ పడ్డానంటూ తెలంగాణను అవమానించినందుకు ఆ తప్పును కూడా ఒప్పుకుని తెలంగాణ వీధుల్లో కదులు అని పవన్ కల్యాణ్‌ను ఎందుకు నిలదీయలేక పోయారు? పైగా సమర్థనలకు పూనుకోవడం వెనుక ఉన్న ఎజెండా ఏమిటి? జగన్ యాత్రను హైజాక్ చేయడానికే! వెయ్యి మందికి పైగా విద్యార్ధులు, యువకులు ఆత్మాహుతి చేసుకున్న తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పుడు రక్తం ధారపోస్తాను అని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆపై ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాడు. అక్కడ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువ రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సాగుతున్నది. జనం నుంచి ఆయనకు అద్భుతమయిన ఆదరణ లభిస్తున్నది. ఆయన పాదయాత్ర దారిలోనే పవన్ కల్యాణ్‌ను ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆయన ప«థక రచనలో భాగంగానే ఈ పర్యటన సాగుతున్నది. జగన్మోహన్రెడ్డి శాసనసభలో ప్రతిపక్షనేత, ఆ కారణం వల్ల ఆయనది కేబినెట్ హోదా. శాసనసభలో ప్రతిపక్షాన్ని ‘గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్’ అంటారు. 2014 ఎన్నికల్లో అధికార పక్షానికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కూ వచ్చిన ఓట్ల తేడా రెండు శాతం కంటే తక్కువ. అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ఆయన ఆ మధ్య అధికార పక్షానికి చెందిన ఒక ఎంపీ నడిపే బస్ ప్రమాదానికి గురైనప్పుడు, ఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పోస్ట్ మార్టం చెయ్యకుండా ఎందుకు తరలించారని జిల్లా కలెక్టర్‌ను నిలదీసినందుకు ఆయన మీద కేసు పెట్టారు. ఏ హోదా లేని సినిమా నటుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తుంటే మాత్రం అనంతపురం జిల్లాలో మంత్రి, ప్రజా ప్రతినిధులూ, అధికారులూ ఆయన ఆదేశిస్తే ఫైళ్లు చంకన పెట్టుకుని వెళ్లి సమీక్షలు జరిపారు. పవన్ కల్యాణ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఒక్క వార్డ్ మెంబర్ కూడా లేడు. జగన్మోహన్రెడ్డికి లభి స్తున్న ప్రజాదరణను దారి మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఈ ఎత్తు వేస్తున్నట్టు కనిపిస్తుంది. పార్ట్‌టైం రాజకీయాలను ప్రజలు ఎప్పుడూ ఆదరించిన దాఖలాలు చరిత్రలో లేవు. అటు తెలంగాణలో అయినా, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అయినా పవన్ కల్యాణ్ విషయంలో జరుగుతున్నది ఒకే విధంగా కనిపిస్తున్నది. 2019 లోనో, ఇంకొంచెం ముందుగానో వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం రెండు రాష్ట్రాల అధిపతులను పట్టి పీడిస్తున్న కారణంగానే పవన్ కల్యాణ్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నట్టు అర్థం అవుతున్నది. మరి పవన్‌కల్యాణ్ ఎందుకు అక్కడా ఇక్కడా ‘రాగ్ దర్బారీ’ అందుకున్నారు? ఏది ఏమయినా అభిమానుల పేరిట ఉన్మాద మూకలను వెంటేసుకుని తిరిగే సినిమా నటుడు రాజకీయాల్లో తమకు ఉపయోగపడతాడని రెండు రాష్ట్రాల అధికారపక్షాలు భావిస్తూ ఉంటే పొరపాటు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే ఈ వికృత క్రీడకు తెర తీయడం ఆందోళన కలిగించే విషయమే. దీని గురించి రెండు రాష్ట్రాల ప్రజలూ ఆలోచించుకోవాల్సిందే. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఉచిత విద్యుత్.. ఒకింత ఊరట
డేట్లైన్ హైదరాబాద్ నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల లబ్ధి జరుగుతుంది. కానీ పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది! కరెంట్ బిల్లులు కట్టనందుకు బావి దగ్గర నుంచి ఫ్యూజులు పీక్కొచ్చి ఎంఆర్ఓ కార్యాలయంలోనో, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లోనో పెట్టేసుకోవడం చూశాం. నీరందక కళ్ల ముందే ఎండిపోతున్న చేనును చూసి దిక్కుతోచకుండా మిగిలిన రైతు పరిస్థితి చూశాం. అలాంటి రైతు ‘ఊరన్నా ఇడిచిపెట్టి పోవాలె, ఉసురన్నా తీసుకోవాలె.’ బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసిన తెలంగాణ రైతుల దైన్యం ఎలా ఉండేదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, చంద్రబాబునాయుడి ప్రభుత్వ హయాంలో చూశాం. అప్పుడే, ‘నేను అధికారంలోకి వచ్చాక ఉచిత కరెంట్ ఇస్తాను, కరెంట్ బిల్లుల బకాయిలు రద్దు చేస్తాను’ అని అప్పటి ప్రతిపక్షనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. దీనికి చంద్రబాబు స్పందన ఏమిటో కూడా మన విన్నాం.‘ఆ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే!’ అని ఎద్దేవా చేసిన చంద్రబాబునాయుడు తరువాత డాక్టర్ వైఎస్ తను ఇచ్చిన హామీని నెరవేర్చడం స్వయంగా చూశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సర్కార్ కార్యాలయాల్లో బందీలుగా ఉన్న ఫ్యూజులను పైసా అపరాధ రుసుం కట్టించుకోకుండానే రైతులకు ఎట్లా తిరిగి ఇచ్చిందీ కూడా చంద్రబాబు వీక్షించారు. హామీ మేరకు ఉచిత కరెంట్ ఎట్లా ఇచ్చిందీ, కరెంట్ బిల్లుల బకాయిలు ఎట్లా మాఫీ చేసిందీ కూడా ఆయన గమనించారు. అప్పటికి దేశంలో ఇంకా విద్యుత్ సంస్కరణలు ఊపందుకోలేదు. ఈ చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్ధికభారం మోయవలసి వచ్చింది. అయినా రాజశేఖరరెడ్డి వెనక్కు తగ్గలేదు. ఫతేమైదాన్‌లో ప్రమాణ స్వీకారం చేశాక ఆయన మొదటి సంతకం ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్ మీదనే చేశారు. ఆయన జీవించినంత కాలం అదే విధానం అమలు పరిచారు. రాజశేఖరరెడ్డి నిర్ణయం తెలుగు ప్రాంత రైతులకు గొప్ప ఊరట. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలంగాణ రైతులకు మరీ పెద్ద ఊరట. తెలంగాణలో అత్యధికంగా, ఇరవై అయిదు లక్షల బోరు బావులు వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. కరెంట్ అవసరం ఆనాడు తెలంగాణ రైతులకే ఎక్కువ. ఇప్పటికీ తెలంగాణలో బోరు బావుల మీద ఆధారపడి చేస్తున్న వ్యవసాయం శాతం అధికమే. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట తలపెట్టిన ప్రాజెక్టులు అన్నీ పూర్తయితే పరిస్థితి మారుతుంది. బోరు బావుల అవసరం పూర్తిగా తగ్గిపోతుంది. కాలువలు పారుతున్నప్పుడు బోర్ల అవసరం ఉండదు. పైగా భూగర్భ జలాల పరిస్థితి కూడా చాలా మెరుగు పడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఏర్పడిన నూతన ప్రభుత్వం నిరంతరాయంగా వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే ఉంది. రైతులకు మంచిరోజలు 2017 డిసెంబర్ 31 రాత్రి 12 గంటల ఒక్క నిమిషం, అంటే నూతన సంవత్సరం లోకిఅడుగుపెట్టిన క్షణం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 24 గంటల విద్యుత్ సరఫరా మీద అనుకూలంగా, ప్రతికూలంగా జరుగుతున్న చర్చలూ, విమర్శలూ, విశ్లేషణల గురించి తరువాత మాట్లాడుదాం. ఇందులో 40 శాతం విద్యుత్ సరఫరా, వ్యవసాయం కోసం ప్రభుత్వం ఉచితంగా చేస్తుంది. దానికి ప్రభుత్వం భరించాల్సిన మొత్తం సంవత్సరానికి రూ. 600 కోట్లు. ప్రాజెక్టులు పూర్తయి కాలవల్లోకి నీళ్లొస్తే ఈ వ్యయం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల కోసం వాడే విద్యుత్ భారం ప్రభుత్వానికి తప్పదు. ఏది ఏమైనా తెలంగాణ రైతు వ్యవసాయం మీద ఆశలు పెంచుకునే మంచిరోజులు వచ్చాయని చెప్పాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఉచితంగా విద్యుత్ వస్తున్నది, అందునా 24 గంటల సరఫరా జరుగుతున్నది కాబట్టి వృథా అయ్యే అవకాశాలను కూడా ప్రభుత్వం గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆటోమేటిక్ స్టార్టర్ల విషయంలో ప్రభుత్వం ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. వాటిని తొలగింప చెయ్యడానికి పై స్థాయి నుంచి కింది దాకా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పని చేయవలసి ఉంటుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మీద వస్తున్న విమర్శల గురించి ఆలోచిస్తే– 2003 ప్రాంతాల్లో ప్రారంభమైన విద్యుత్ సంస్కరణలు తరువాత కాంగ్రెస్ నాయకత్వం లోని యూపీఏ ఒకటి, రెండు ప్రభుత్వాల హయాంలలో (పదేళ్లలో) ఊపందుకుని విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు పూర్తయి అనేక రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ లభ్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని జేఏసీ అంచనా. ఇందుకు ఆధారంగా జేఏసీ నాయకులు 2017 –2018 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వార్షిక నివేదికలో రూపొందించిన వివరాలను చూపుతున్నారు. అయితే దేశమంతటా ఇబ్బడి ముబ్బడిగా కరెంట్ ఉత్పత్తి అయి మిగులు పరిస్థితిలోకి వెళితే ఆ వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చెయ్యడానికి వాడుకుంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. జేఏసీ చెబుతున్నది కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించడం కూడా సరికాదు. 24 గంటల విద్యుత్ సరఫరా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వల్ల పడనున్న భారం ఏటా రూ.600 కోట్లని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా అందుకోసం విద్యుత్ సంస్థల మీద పది వేల కోట్ల రూపాయల మేర భారం పడనుందనీ, అందులో రూ. 5,500 కోట్ల భారాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తానని అంటున్నదని జేఏసీ చెబుతున్నది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దానికీ, జేఏసీ చూపుతున్న లెక్కలకూ చాలా వ్యత్యాసం ఉంది. ఎంతైనా ప్రజల డబ్బే కాబట్టి ప్రభుత్వం దీనికి సరైన వివరణ ఇస్తే బాగుంటుంది. అంతిమంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోకుండా చూడాల్సిన బాధ్యతా ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 24 గంటల విద్యుత్ సరఫరా ఫలితాలు రెండు రోజుల్లోనే తెలియవు. కొంతకాలం పరిశీలించాల్సిందే. ఎకరాకు ఎనిమిదివేలు రైతులకు లాభం చేకూర్చే మరో కార్యక్రమం– ఎకరాకు ఏటా ఎనిమిది వేల రూపాయలు.రెండు విడతలుగా రైతులకు చెల్లించే ఈ మొత్తం ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా మొత్తం అవసరాలు తీర్చలేకపోయినా కూడా రైతుకు ఊరటే. కానీ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు– కౌలు రైతులకు ఈ పథకం వర్తింపచేసే ప్రసక్తే లేదని. తెలంగాణలో ఎంతమంది రైతులు సొంతంగా వ్యవసాయం చేస్తున్నారు, ఎంత భూమి కౌలుదారుల చేతుల్లో ఉంది అనే లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఆ లెక్కలు తేల్చి ఈ పథకం అమలు చేస్తే ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది. పైగా పేద, ధనిక భేదం లేకుండా అందరికీ ఎకరానికి ఎనిమిది వేలు ఇస్తామనడం సరయినది కాదు. తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల తప్పక కొంత లబ్ధి జరుగుతుంది. కానీ ఇంకా తక్కువ సంఖ్యలోనే అయినా పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది! తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి ఏటా 8 వేల రూపాయల ఆర్థికసాయం మంచి ఆలోచనే అయినా రైతులను వేధిస్తున్న ఇతర సమస్యల మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతో ఆర్భాటంగా ముఖ్యమంత్రి ప్రకటించిన రైతు సమాఖ్యల మీద పెద్ద పెట్టున విమర్శలు రావడంతో మళ్లీ వాటి ఊసే ఎత్తడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న జన్మభూమి కమిటీల లాగా కాకుండా రైతు సంక్షేమానికి పాటు పడే, న్యాయం జరిగేటట్టు చూసే ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే ఉంది. పంటకు గిట్టుబాటు ధర రాక, నాణ్యమైన విత్తనాలు లభిం చక, పంటల బీమా లేక ఊపిరి సలపక రైతుల ఉసురు తీస్తున్న ఉదంతాలు అనేకం. పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగలేదన్న సంగతి వాస్తవం. ముప్పిరిగొంటున్న ఈ సమస్యలన్నిటికీ తగిన పరిష్కారం చూపకుండా కేవలం 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి, ఏడాదికి ఎనిమిది వేలు ఇచ్చినంత మాత్రాన రైతు పరిస్థితి బాగుపడదు. మిగిలిన రైతు సమస్యల పరిష్కారమూ ముఖ్యమేనని చెప్పడం అందుకే. గడువు కంటే ముందుగానే వస్తాయంటున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్ర శేఖరరావు ఈ సమస్యలతో పాటు తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తేనే సాధ్యం. అంతేతప్ప చంద్రబాబునాయుడి మార్గంలో రాజకీయ పేకాటలో జోకర్ వంటి పవన్‌కల్యాణ్ లాంటి వాళ్లు సాయపడతారనుకుంటే పొరపాటు. తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్‌లను మూయించి ఎన్నో కుటుంబాలను కాపాడిన ముఖ్యమంత్రికి బహుశా ఆ ఆట రాదేమో. పేకాటలో జోకర్లు ఎన్ని ఉన్నా ఒరిజినల్ సీక్వెన్స్ ఒకటి తప్పనిసరి. లేకపోతే ఆటలో ఓటమే. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బీజేపీ గెలుపుతో.. రూటు మార్చిన చంద్రబాబు
డేట్లైన్ హైదరాబాద్ గుజరాత్లో బీజేపీ ఓడిపోతుందని గామోసు ఏపీ ముఖ్యమంత్రి కొంచెం స్వరం పెంచి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్, రాజధానికి సాయం విషయాల్లో కేంద్రాన్ని విమర్శిం చడం మొదలుపెట్టారు. పోలవరాన్ని కేంద్రానికి దండం పెట్టి అప్పజెప్తానన్నారు. మిత్రుడు బలహీనపడితే వదిలేసి, కొత్త మిత్రులను వెతుక్కోవడం ఆయనకు అలవాటే. డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు బీజేపీ గెలవడంతో ఆయన రూటు మార్చి, బీజేపీని విమర్శించే టీడీపీ తమ్ముళ్లకు నోరు మూసుకోండి అని ఆదేశాలు పంపారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి ఖాయం అన్న అభిప్రాయం మొన్న ఫలితాలు వెలువడే వరకూ చాలా మందిలో ఉండేది. ఏకంగా 22 ఏళ్ళ పాలన అధికార పార్టీ బీజేపీపట్ల ఎంతో వ్యతిరేక తను తెచ్చిపెట్టి ఉంటుంది. దానికి తోడు రాష్ట్ర స్థాయిలో సమర్ధ నాయకత్వం లేదు. జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాల ప్రతికూల ప్రభావం, పెరిగి పోయిన మతపరమయిన అసహనం వెరసి బీజేపీకి ఓటమి తప్పదనే భావ నను కలిగించి ఉండొచ్చు. వీటన్నిటికి తోడు∙కాంగ్రెస్ పార్టీ ప్రచార సరళి మెరుగుకావడమూ, ముఖ్యంగా తాజాగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన రాహుల్ గాంధీలో కొంత రాజకీయ పరిణతి కనిపించడం, అది ఆయన ప్రచార ప్రసంగాలలో ప్రతిబింబించడమూ మొద లైన అంశాలన్నీ కలసి కాంగ్రెస్‌ను గుజరాత్లో గెలిపిస్తాయని అనుకున్నారు. మోదీ, అమిత్ షా జోడీ కూడా ఒక దశలో ఓడిపోతున్నామనే అనుకున్నారు. అందుకే మోదీ చివరి వారం ప్రచారంలో తన శక్తియుక్తులన్నిటినీ ప్రయో గించాల్సి వచ్చింది. ప్రధాన మంత్రి స్థాయి నుంచి చాలా కిందికి దిగజారి మాట్లాడాల్సి వచ్చింది. చివరి రోజుల్లో ఆయన చేసిన ప్రచారం.. సొంత పార్టీ వారే ముక్కున వేలేసుకునేట్టు చేసింది. చావు తప్పి కన్ను లొట్టబోయి... కాంగ్రెస్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు అంటగట్టారు. తనను చంపడానికి కాంగ్రెస్ సుపారి ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ వారు ఔరంగజేబు వార సులన్నారు, గుజరాత్ అస్మిత (ఆత్మగౌరవం) గురించి పదే పదే మాట్లాడి ప్రాంతీయాభిమానాన్ని రెచ్చగొట్టారు. తనను నీచ జాతి వాడు అని మణి శంకర్ అయ్యర్ దూషించాడని, అది గుజరాతీలు అందరినీ తిట్టినట్టేననీ రెచ్చగొట్టారు. మణిశంకర్ అయ్యర్‌కు హిందీ సరిగా రాదు, అయినా ఆయన మోదీ మీద చేసిన వ్యాఖ్య ఒక కులాన్ని కానీ, జాతిని కానీ ఉద్దేశించి చేసింది కాదు. వ్యక్తిగతంగా మోదీని ఉద్దేశించి చేసింది. అయినా మోదీ దాన్ని వాడు కుంటారని, నష్టం జరుగుతుందనీ తెలుసు కనుక రాహుల్ ఆ వ్యాఖ్య చేసి నందుకు మణిశంకర్ అయ్యర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించారు. 2014 ఎన్నికల సందర్భంగా కూడా మణిశంకర్ అయ్యర్ మోదీని ‘చాయ్ వాలా’ అని సంబోధించి బీజేపీ నెత్తిన పాలు పోసిన విషయం అందరికీ తెలి సిందే. ఇలా దొరికిన ప్రతిదాన్నీ వాడుకున్నా గుజరాత్లో బీజేపీ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచింది. 2014 ఎన్నికల నినాదం ‘కాంగ్రెస్ ముక్త భారత్’ ఇక అసాధ్యమని గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఫలితాల తదుపరి మోదీ పార్లమెంట్‌లోకి వెళుతూ విజయ సంకేతం ఇచ్చి నప్పుడు సైతం ఆయన ముఖంలో కనిపించినది మేకపోతు గాంభీర్యమే తప్ప, సహజ విజయహాసం కాదు. మోదీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల వ్యతిరేకత వల్ల కావచ్చు, హార్ధిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మెవాని త్రయం తిరుగుబాటు వల్ల వచ్చిన మార్పు కావొచ్చు గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం పెరిగింది. సరిగ్గా ఎన్నికలకు కొద్దిగా ముందు శంకర్‌సింగ్ వఘేలా పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టకపోతే కాంగ్రెస్‌కు ఇంకో పది సీట్లు పెరిగి ఉండేవి. గుడ్డిలో మెల్ల అన్నట్టు బీజేపీ హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను ఓడించి అధికారం కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ ముక్త భారత్‌ను సంపూర్ణం చెయ్యడానికి తామిక ఐదు రాష్ట్రాల దూరంలోనే ఉన్నామని బీజేపీ చెప్తున్నది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే, ఏం చేసైనా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కైవసం చేసుకోవడమేనని ఇప్పుడు అందరికీ అర్థం అవుతున్నది. అయినా ఒక రాజకీయ పార్టీని లేకుండా చెయ్య డం ప్రజాస్వామ్యంలో సాధ్యపడదని కమలనా«థులకు గుజరాత్ ఫలితాల తరువాత అర్థమై ఉంటుంది. కాంగ్రెస్ ముక్త భారత్ అసాధ్యం 2018 ప్రారంభంలో మరో నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జర గనున్నాయి . వాటిల్లో మూడు చాలా చిన్న రాష్ట్రాలు. కర్ణాటక మాత్రమే పెద్ద రాష్ట్రం, పైగా అది కాంగ్రెస్ పాలనలో ఉంది. పంజాబ్ తరహా ఎన్నికల వ్యూహాన్నే కనుక కాంగ్రెస్ కర్ణాటకలో కూడా అనుసరిస్తే అక్కడ అది మళ్లీ గెలవడం ఖాయం. ఏ ఎన్నికనైనా మోదీకి, రాహుల్‌కు మధ్య పోటీగా చూస్తే కాంగ్రెస్ తట్టుకుని నిలబడటం కష్టం. మోదీకి దీటుగా రాహుల్ నిలవడానికి ఇంకా కొంత సమయం కావాలి. పంజాబ్‌లో ఓటర్లు అది కెప్టెన్ అమరేందర్ సింగ్‌కు, బాదల్‌కు మధ్య పోటీగా చూసినందువల్లనే కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటకలో మోదీ గుజరాత్లో లాగా అస్మిత అంటూ ప్రజల్ని రెచ్చగొట్టలేరు. ప్రస్తుతానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు దీటయిన నాయకుడు కర్ణాటక బీజేపీలో కానరాడు. కర్ణాటక విజయాన్ని కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్‌కు బహుమతిగా ఇస్తామని సిద్దరామయ్య ఇప్పటికే ప్రక టించారు. 2018 చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్ రాష్ట్రల్లో బీజేపీనే అధికారంలో ఉంది. గుజరాత్ అంత సుదీర్ఘ కాలంగా కాకపోయినా మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉంది. అంతో ఇంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని పిస్తున్నది ఆ రాష్ట్రాల్లోనే. రాజస్థాన్‌లో ఏ పార్టీకీ రెండోసారి అధికారం ఇవ్వడం సాధారణంగా జరగదు. అసలు ఆ మూడు రాష్ట్రాల ఎన్నికలతోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్వహించాలన్న ఆలోచనలో మోదీ ఉన్నట్టు వార్తలు వస్తు న్నాయి. అత్యధిక రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకున్నామన్న సంతోషంలో తలమునకలు అవుతున్న బీజేపీ ఆయా రాష్ట్రాల్లో సహజంగానే ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకతకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల వ్యతిరేకత తోడై జమిలిగా దెబ్బ కొడతాయేమో చూసుకోవాలి. ఈ స్థితిలో కాంగ్రెస్ ముక్త భారత్ కలగానే మిగిలిపోతుందేమో అని గుజరాత్ ఎన్నికల ఫలితాల విశ్లేషకుల అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో దక్షిణాదిని కైవసం చేసుకోవాలన్న బీజేపీ కల నెరవేరే అవకాశం కనిపించడం లేదు. కేరళ మీద ఆశలు ఎలాగూ లేవు. జయలలిత మరణం తరువాత తమిళనాడును తమ అదుపులోకి తెచ్చుకోవాలన్న కమల నాథుల ప్రయత్నాలు నెరవేరేట్టు లేవని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తు న్నాయి. ఇక మిగిలినవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు. నమ్మదగని మిత్రుడు చంద్రబాబు నాయుడుతో కలసి అధికారం పంచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఒక పక్క, దాగుడు మూతలాగే చంద్రశేఖర్‌రావు అధికారంలో ఉన్న తెలంగాణ మరో పక్క. ప్రతిసారీ మేం మిత్ర పక్షం చేతుల్లో మోసపోతూనే ఉన్నాం అని నిన్న బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అన్న మాటలే చంద్రబాబు నమ్మదగ్గ మిత్రుడు కాదనడానికి రుజువు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేసి నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని 18 శాతం ఓట్లు సంపాదించుకున్న చరిత్ర కలిగిన బీజేపీ ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం నీడన గడపాల్సి రావడానికీ, తెలంగాణలో టీఆర్ఎస్ పుట్టుక కంటే చాలా ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా సుష్మాస్వరాజ్ వంటి నాయ కులను ముందుంచి నడిచినా, తెలంగాణ ఏర్పాటుకు పూర్తి సహకారం అందించినా గానీ తమ పార్టీ.. నిజాంను కీర్తిస్తూ, మజ్లిస్‌కు పెద్ద పీట వేస్తున్న కేసీఆర్ ధాటికి తట్టుకోలేని దుస్థితిలో ఉండటానికీ కారణం ఏమిటో అందరికీ తెలుసు. 1998లో 18 శాతం ఓట్లు తెచ్చుకున్న నాటి నుంచే స్వతంత్రంగా కొనసాగి ఉంటే బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కచ్చితంగా బలమయిన రాజకీయ శక్తిగా ఎదిగి ఉండేది. మిత్రుడి చేతుల్లో ప్రతిసారీ మోసపోతూనే ఉన్నామని వీర్రాజు ఇప్పుడు బాధ పడటం చేతులు కాలాక ఆకులు పట్టు కున్నట్టుంది. 2019 ఎన్నికల్లో సొంతంగా గెలవలేమని భావిస్తే కేసీఆర్ బీజేపీతో పొత్తుకు సిద్ధపడతారని తెలిసిందే. బీజేపీ స్థానిక నాయకత్వం కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నట్టుంది. గుజరాత్ ఫలితాలు చూసి తెలంగాణలో కూడా మేం గెలుస్తాం అని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రక టించారు సరే, అందుకు అనువైన పరిస్థితులైతే కనిపించడం లేదు. బెడిసికొట్టిన టీడీపీ అంచనాలు గుజరాత్లో బీజేపీ ఓడిపోతుందన్న అభిప్రాయం ఏపీ ముఖ్యమంత్రికి కూడా కలిగినట్టుంది. అందుకే కొంచెం స్వరం పెంచి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్, రాజధానికి సాయం విషయాల్లో కేంద్రాన్ని విమర్శించడం మొద లుపెట్టారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన పోలవరాన్ని కేంద్రానికి దండం పెట్టి అప్పజెప్తానన్నారు. మిత్రుడు బలహీనపడితే వదిలేసి, కొత్త మిత్రులను వెతుక్కోవడం చంద్రబాబుకు అలవాటే. గెలవడానికి ఆయనకు ఎవరో ఒకరి సాయం కావాలి. ఆయన స్వయం ప్రకాశితుడు కాదని అన్ని ఎన్నికలూ రుజువు చేశాయి. 1999, 2014 రెండుసార్లూ ఆయన అధికారంలోకి వచ్చింది బీజేపీ కారణంగానే. అవసరం తీరాక బీజేపీ రథం ఎలా దిగిపోయారో కూడా చూసాం. గుజరాత్లో బీజేపీ ఓడిపోతే మోదీ బలహీన పడతారు. అప్పుడు తెగదెంపులు చేసుకుని బీజేపీ కారణంగానే రాష్ట్రానికి తాను ఏమీ చెయ్యలేక పోయానని 2019లో ప్రజల ముందుకు వెళ్లాలనేది ఆయన ఆలోచనగా కని పిస్తుంది. పవన్‌కల్యాణ్‌లో ఆయన ఎట్లాగూ కొత్త మిత్రుడిని చూస్తున్నారు. డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు గుజరాత్లో బీజేపీ మళ్లీ గెలిచి కూర్చుంది. అయితే ఈ విషయాలు టీడీపీ నాయకుడు రాజేంద్రప్రసాద్‌కు ఏం తెలుసు? విశ్రాంతి కోసం అధినేత మాల్దీవులకు వెళ్లే ముందటి వైఖరినే వ్యక్తం చేశారు. కానీ పథకం మారింది. బీజేపీని విమర్శించే వైఖరి మారింది. నోరు మూసుకోండి అని తెలుగుదేశం తమ్ముళ్లకు మాల్దీవుల నుంచి ఆదేశాలు అందాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోము వీర్రాజు టీడీపీని, ప్రభుత్వాన్ని కడిగి పారేశాడు. మా దయవల్లే బీజేపీకి ఏపీలో నాలుగు సీట్లు వచ్చాయని రాజేంద్రప్రసాద్ అంటే, 2014లో మేం లేకుంటే టీడీపీ గెలిచేదా? అన్నాడు వీర్రాజు. అంతే కాదు నోట్లు రద్దు చేసి మేం గెలు స్తుంటే, నోట్లు పంచి టీడీపీ గెలుస్తున్నది అని ఆయన నంద్యాల ఉప ఎన్ని కను గుర్తు చేశారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కావడంతో ఆ పార్టీ నాయకులకు స్వేచ్ఛ లభించినట్టుంది. అందుకే ఏపీలో బీజేపీ బలపడకూడదంటే సహించబోం అని హెచ్చరించారు వీర్రాజు. ఆయన టీడీపీ మీద, చంద్రబాబు మీదా ఇంకా చాలా విమర్శలే చేసారు. గుజరాత్ ఫలితాల తరువాత బీజేపీతో తెగదెంపుల ఆలోచన పక్కన పెట్టేసిన చంద్రబాబు మాల్దీవుల నుంచి వచ్చాక నష్ట నియం త్రణ కోసం ఏం చేస్తారో చూడాలి. వ్యాసకర్త, ప్రముఖ పాత్రికేయులు దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
పేదలుంటే పెట్టుబడులు రావా?
మెట్రో పనులైనా, పోలవరం ప్రాజెక్ట్ పనులైనా డాక్టర్ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదలయ్యాయన్న వాస్తవం ఎట్లా మరచిపోతారు? రాజకీయ పార్టీలు వస్తాయి, పోతాయి. ప్రభుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక కల సాకారమైన సమయంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అది మా గొప్పే అనుకుంటే ఎట్లా? మరింత ఆలస్యం జరగకుండా ఆ మిగిలిన పనులు సత్వరం పూర్తి అయ్యేటట్టు చూసి మెట్రోను పరుగులు పెట్టిస్తే కార్పొరేషన్లో గెలిపించినందుకు వారి రుణం తీర్చుకున్నట్టయినా ఉంటుంది. ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సభలు (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్–జీఈఎస్) ముగిశాయి. హైదరాబాద్ సౌందర్యానికీ, తెలంగాణ ప్రభుత్వ ఆతిథ్యానికీ విదేశీ ప్రతినిధులంతా మురిసిపోయారు. ఆ జ్ఞాపకాలను మూటగట్టుకుని తిరిగివెళ్లారు. ఏ మహా నగరానికైనా కొంచెం మరమ్మతు కావాలనుకుంటే అప్పుడప్పుడు ఇటువంటి ప్రపంచ స్థాయి సంబ రాలు అవసరమే. ఇప్పుడు జరిగింది పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన సదస్సు కాదు. దీని కారణంగా నూతన తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు వచ్చిపడవు కూడా. ఆయా దేశాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుని, తాము లాభం పొందేందుకు అవకాశం కలిగించే వేదికగా ఈ సదస్సును నిర్దేశించారు. ఏదయితే ఏమి, ఎనిమిదవ జీఈఎస్‌కు దక్షిణ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వేదిక కావడం తెలంగాణ వాసులందరికీ సంతోషం కలిగించే విషయమే. ఇది అమెరికన్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో కలసి ఏర్పాటు చేసిన సదస్సు. ఈ మూడురోజుల సదస్సు ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహించవలసి రావడం అనివార్యం. అందునా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కూతురు ఇవాంక ముఖ్య అతిథిగా హాజరైన సభలకు మనం హైదరాబాద్‌ను వీలయినంత అందంగా తయారు చెయ్యడం అవసరమే. ఇవాంక పర్యటించే అవకాశం ఉన్న ప్రాంతాలను మరింత అందంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసింది. బిచ్చగాళ్లందరినీ ఆ మూడురోజులూ ఎవరికంటా, ముఖ్యంగా ఇవాంక తదితర విదేశీ అతిథుల కంట పడకుండా దాచెయ్యగలిగాం. నగరాన్ని సుందరంగా అలంకరించాం. ఈ సభలు ఆశించిన ఫలితాలు సాధిం చాయా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుందేమో కానీ తక్షణ ఫలితం, అందునా తెలంగాణ రాష్ట్రానికి ఒనగూడింది మాత్రం మన రాష్ట్ర యువ మంత్రి కేటీ రామారావుకు అమెరికా సందర్శన కోసం స్వయంగా ఇవాంక నుంచి ఆహ్వానం అందడం. సదస్సులో ఒక గోష్టికి ఆయన సంధానకర్తగా వ్యవహరించి అందరి చేతా శభాష్ అనిపించుకోవడం. ఐటీ అంటేనే ఇవాంకా ట్రంప్ అని మన యువ ఐటీ మంత్రిగారు కొత్త నిర్వచనం చెప్పిన తరువాత అమెరికా సందర్శనకు ఆయనకు ఆ మాత్రం ఆహ్వానం రాకుండా ఎట్లా ఉంటుంది? ఈ సదస్సు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇంతకు మించి ఏమైనా లాభం జరిగి ఉంటే ప్రభుత్వం వారో, ఈ రంగంలో నైపుణ్యం కలవారో చెప్తే అర్థం చేసుకుని రాష్ట్ర ప్రజలు కూడా ఆనందిస్తారు. చాలాకాలం బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉన్నందుకేనేమో మనలో ఇంకా బానిస మనస్తత్వం అంతరించలేదు. అతిథి మర్యాదలకు లోటు చెయ్యని సంస్కారం, సంప్రదాయం మన సొంతమైనా ఆ అతి«థి మర్యాదలు అతిగా మారి మన బానిసత్వ లక్షణాలను బయట పెడుతుంటాయి. మొన్న ముగి సిన ఈ అంతర్జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడి కూతురికి మనం చేసిన మర్యాదలు ఆ కోవలోకే వస్తాయి. పేదరికాన్ని దాచగలిగామా! సరే, సభలు ముగిశాయి. మన పేదరికాన్ని దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా మాయమైన బిచ్చగాళ్లు ఎక్కడున్నారో వెతుక్కోవాలి ఇప్పుడు. బహుశా ఇప్పటికే మళ్లీ రోడ్ల మీదకు వచ్చేసి ఉంటారు. విదేశీ అతి థుల ముందు మన పేదరికాన్ని తాత్కాలికంగా దాచిపెట్టుకునే ప్రయత్నానికి బదులు దాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తే ఎవరైనా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. అది జరగదు. మన ప్రయత్నాలు బిచ్చగాళ్లను నిర్మూలిం చడం కాకుండా, భిక్షాటనను నిర్మూలించే దిశగా సాగాలి. చివరి మనిషి కూడా పేదరికం నుంచి బయటపడ్డ నాడు బంగారు తెలంగాణ సాధించామని చెబితే ఆ ప్రభుత్వాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. హైదరాబాద్ నగరంలో భిక్షాటన ఒక వ్యాపారంగా మారిందని, దిక్కూ మొక్కూ లేనివాళ్లను, ఎందరో పసివాళ్లను తెచ్చి రోజంతా రోడ్ల మీద అడుక్కునేటట్టు చేసి, వాళ్లు సంపాదించినదంతా దోచుకుపోతున్న ఒక మాఫియా పని చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదంటే ఆశ్చర్యమే. అద్భుతంగా పని చేసిందని అమెరికా పోలీసుల ప్రశంసలు అందుకున్న హైదరాబాద్ పోలీసుల దృష్టి ఇటువంటి నేర సామ్రాజ్యాల మీద పడకపోవడాన్ని ఎట్లా చూడాలి? పోలీసులు అత్యుత్సాహం కొలువుల కొట్లాట కోసం కలిసి మాట్లాడుకుంటామని కోర్టుల అనుమతి కూడా పొందిన వారిని సభలకు పోకుండా అడ్డుకోవడానికి అరెస్టులు చెయ్యడం, తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆవేదన చెందుతున్న యువకులను ఉస్మానియా హాస్టల్ గదుల తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్లి చావగొట్టి అరెస్టులు చెయ్యడం, కవరేజీకి పోయిన విలేకరులను అరెస్ట్ చేసి ఠాణాలో గంటల తరబడి కూర్చోబెట్టడం వంటి పనుల్లో తీరిక లేకుండా ఉన్న మన పోలీసులకు రోడ్ల మీద అడుక్కునే వాళ్ల వెనుక ఉన్న మాఫియాను పసిగట్టే సమయం ఎక్కడుంది? ఇవాంక పర్యటన తరువాత అయినా మన ప్రభుత్వం, పోలీసు పెద్దలూ ఈ మాఫియాను ఛేదించి, ఆ పేదలకు విముక్తి కలి గించి పునరావాసం కల్పించే ఆలోచన చేస్తే బాగుంటుంది. పేదరికాన్ని పారదోలుతాం, రాష్ట్రాన్ని బంగారం చేస్తామని పదే పదే ప్రకటించుకునే పాలకులు ఈ వైపు ఆలోచించాలి. అదెట్లా కుదురుతుంది? భిక్షాటన నిర్మూలిం చడం అయ్యే పనేనా అని ఎవరయినా అంటే మన ప్రభుత్వంలోనే ప్రస్తుతం కార్యదర్శి స్థాయిలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం సలహా తీసుకోవచ్చు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతల సహాయం తీసుకుని ఎక్కడికక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసి రోడ్ల మీద బిచ్చగాళ్లు కనిపించకుండా చేశారు. అన్ని జిల్లాల్లో ఇటువంటి ప్రయత్నం జరగాలి. జిల్లాల అధికారులకు వదిలేయకుండా ప్రభుత్వమే తన పాలనలో భాగంగా గట్టి నిర్ణయాలు చేస్తే తప్ప ఇటువంటివి సాధ్యం కావు. ఒక్క మనిషి ఆకలితో అలమటిస్తున్నా, ఒక్క మనిషికి శరీరం నిండా కప్పుకోడానికి బట్టలు లేకపోయినా అది సంక్షేమ రాజ్యం అనిపించుకోదు. ఈ నెలలోనే భాషను ఉద్ధరించేందుకు ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా చాలామంది విదేశీ ప్రతినిధులు వస్తున్నట్టున్నారు. మన ప్రతిష్ట నిలుపుకోడానికి మళ్లీ మన వీధుల్లో బిచ్చగాళ్లు మాయమవుతారేమో!అంతర్జాతీయ స్థాయిలో మనకు ప్రతిష్ట తెచ్చే సభలు, మన భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సమావేశాలు ప్రభుత్వాలు పూనుకుని నిర్వహించడం తప్పుకాదు. మానవీయ కోణం లోపించిన ఇటువంటి కార్యక్రమాలన్నీ సువాసన లేని ప్లాస్టిక్ పువ్వుల వంటివే. ఇంతకీ మెట్రో ఘనత ఎవరిది? జీఈఎస్ సభల పుణ్యమా అని హైదరాబాద్ మెట్రో రైల్ 30 కిలోమీటర్ల పరుగుకూడా ప్రారంభం అయింది. అంతర్జాతీయ సభలకు హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను ఉపయోగించుకుని తెలంగాణ ప్రభుత్వం మియాపూర్ నుంచి నాగోల్ దాకా మొదటి దశ మెట్రో రైల్ సౌకర్యాన్ని ఆయన చేత ప్రారంభింప చేసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడంలో తీవ్రమైన జాప్యానికీ, వేల కోట్ల అదనపు వ్యయానికీ కారణమైన తెలంగాణ రాష్ట్ర సమితి, దాని నాయకుడు చంద్రశేఖరరావు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కారణంగా ఆ ఘనత తమదేనని చెప్పుకోవడం హాస్యాస్పదం. మెట్రో రైల్ మార్గం శాసనసభ ముందు నుంచి పోతే ఆ భవన సముదాయం అందం పోతుందన్న ఉద్యమకారుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఇప్పుడు మెట్రో రైల్ కల సాకారం చేసిన ఘనత తనకే దక్కాలంటున్నారు. సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో వెళితే రక్తాలు పారుతాయన్న ఉద్యమకారుడు కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చినందునే అది సాధ్యపడిందని అంటున్నారు. ఇక్కడ మెట్రో పనులైనా, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్ట్ పనులైనా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదలయ్యాయన్న వాస్తవం ఎవరైనా ఎట్లా మరచిపోతారు? రాజకీయ పార్టీలు వస్తాయి, పోతాయి. ప్రభుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక కల సాకారమైన సమయంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అది మా గొప్పే అనుకుంటే ఎట్లా? మరింత ఆలస్యం జరగకుండా ఆ మిగిలిన మార్గాల్లో కూడా పనులు సత్వరం పూర్తి అయ్యేటట్టు చూసి మెట్రోను పరుగులు పెట్టిస్తే హైదరాబాద్ నగరవాసులు కార్పొరేషన్లో 99 సీట్లలో గెలిపించినందుకు వారి రుణం తీర్చుకున్నట్టయినా ఉంటుంది. కొంచెం రాజకీయ సందడి ఈ సందడిలో కొంచెం రాజకీయం కూడా నడిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో భారతీయ జనతా పార్టీశ్రేణులను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. అక్కడ ఆయన హైదరాబాద్‌ను విముక్తం చేసినందుకు సర్దార్ పటేల్‌ను, తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను జ్ఞాపకం చేసుకున్నారు. ఉద్యమ కాలం నుంచి, మొన్నటికి మొన్న శాసనసభ వేదిక మీద మాట్లాడే వరకూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిజాం రాజును కీర్తిస్తున్న తీరుకు జవాబుగా మోదీ అన్న మాటలు చాలా మందికి అర్థమయ్యాయి. ప్రొటోకాల్‌తో సంబంధం లేకుండా బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలను ప్రధానమంత్రి తన వెంట తీసుకుపోయిన తీరు కూడా చర్చనీయాంశమైంది. కార్యకర్తల సమావేశంలో మోదీ మాటలు తెలుగు రాష్ట్రాల్లో సమీప భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వచ్చే ఆశలను వదులుకున్నట్టు స్పష్టం చేశాయి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
వాస్తవాలు చెబితే అదే పదివేలు!
తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజాం రాజును వేనోళ్ల పొగడినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీ రామారావుకు బ్రహ్మరథం పట్టినా, ఆయన జీవితం మీద సినిమాలు నిర్మించేటట్టు చూస్తున్నా ఎన్నికల రాజకీయాల కోసమేనని అందరికీ తెలుసు. ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించబోతున్న కేసీఆర్‌కు నిజాం పాలనలో తెలుగు భాషాసంస్కృతులు ఎంత నిర్వీర్యం అయ్యాయో ఆయన చుట్టూ చేరిన మేధావులు చెప్పరెందుకు? జాతీయ స్థాయిలో పద్మావతి సినిమా గొడవ, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో నంది పురస్కారాల రగడ పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నవారు ఇద్దరు– ఏడవ నిజాం, ఎన్టీ రామారావు. తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజాం రాజును వేనోళ్ల పొగడినా, ఆయనను మహానీయుడిగా చిత్రించడానికి చరిత్ర తిరగరాస్తానని చెప్పినా; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీ రామారావుకు బ్రహ్మరథం పట్టినా, ఆయన జీవితం మీద సినిమాలు నిర్మించేటట్టు చూస్తున్నా ఎన్నికల రాజకీయాల కోసమేనని అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు జీవితం మీద ఎవరో సినిమాలు తీస్తే చంద్రబాబునాయుడుకు ఏం సంబంధం అని ప్రశ్నించేవాళ్లూ ఉండొచ్చు. ప్రత్యక్షంగా చంద్రబాబునాయుడుకు ఆ సినిమాలతో ఏమీ సంబంధం లేకపోయినా ఆ సిని మాలు తీస్తున్న వాళ్లు ఎవరు, దాని వెనక వాళ్ల ప్రయోజనాలు ఏమిటి, అంతి మంగా అవి ఎవరికి ప్రయోజనకరంగా మారతాయి? అన్న విషయాలు కొంచెం ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఎన్టీ రామారావు జీవితం మీద మూడు సినిమాలు రాబోతున్నట్టు వార్తలొచ్చాయి. అందులో ఒకటి స్వయానా ఎన్టీ రామారావు కుమారుడు, చంద్రబాబునాయుడి బావమరిది, వియ్యంకుడు, ఆయన పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నిర్మించబోతుంటే, మరొకటి ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్‌వర్మ తీయబోతున్నారు. మూడో సినిమా నిర్మిస్తున్నవారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ఆయన ఎన్టీఆర్ అభిమాని. ఈ మూడు సినిమాలూ కూడా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, ముఖ్యంగా లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడం, ఆయన మరణించే వరకు జరి గిన ఘట్టాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టబోతున్నాయన్నది నిజం. ఎన్టీఆర్ అంటే భక్తితోనేనా! నటుడు బాలకృష్ణ తాను నిర్మించబోయే సినిమాకు సంబంధించి ఇంకా వివరాలు బయటపెట్టకపోయినా అది కచ్చితంగా లక్ష్మీపార్వతి పట్ల ప్రేక్షకులలో అంటే ప్రజలలో వ్యతిరేక భావాన్ని పెంచేదిగానే ఉంటుంది. అంతే తప్ప అధికారంలో లేనప్పుడు అందరూ ఎన్టీఆర్‌పై కనీసం జాలి లేకుండా గాలికి వది లేస్తే ఆమె చేరువయింది, సపర్యలు చేసింది, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నది అన్న కోణంలో నుంచి మాత్రం తీయబోరనేది స్పష్టం. రాజకీయంగా చంద్రబాబునాయుడుకు తద్వారా తన సొంత అల్లుడికి నష్టం జరిగే విధంగా బాలకృష్ణ ఈ సినిమాలో వాస్తవాలు చిత్రీకరిస్తారని ఎవరయినా ఎందుకనుకుం టారు? ఇక రాంగోపాల్‌వర్మ సినిమా! ఆయన తీసే సినిమాలు ఎట్లా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా రాయలసీమ ముఠా తగాదాల నేప«థ్యంలో పరిటాల రవి, మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి మధ్య కక్షలకు సంబంధించి రక్తచరిత్ర పేరిట ఆయన తీసిన రెండు సినిమాలలో వాస్తవాల వక్రీకరణ తెలిసిందే. అది వాస్తవాలకు కల్పన జోడించి తీసిన సినిమా అంటారాయన. ఇప్పుడు తీయబోయే సినిమా మాత్రం వాస్తవ జీవితచిత్రణేనని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు నిర్మాత అంటూ వార్తలు వచ్చాయి కాబట్టి చంద్రబాబునాయుడి ప్రయోజనాలతో సంబంధం లేకుండా జరిగింది జరిగినట్టు చిత్రీకరిస్తారన్న భావన కొందరిలో ఉండొచ్చు. కానీ వర్మ సినిమా టైటిల్, దానికి సంబంధించి బయటికొచ్చిన ఒక పోస్టర్ చూస్తే ఈ సినిమాది కూడా బాలకృష్ణ సినిమా దారేనని అర్థం అవుతుంది. ఈ సినిమా పేరు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాజకీయ రంగంలోని వ్యక్తుల జీవితాల ఆధారంగా వర్మ తీసిన సినిమాలన్నీ వివాదాస్పదమే అయ్యాయి. ఇదేమవుతుందో చూడాలి! ఇక తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినిమా నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తీయబోయే మూడో సినిమా పేరు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ (వెంకట సుబ్బారావు పేరు గుర్తుకొచ్చే విధంగా పెట్టిన పేరు). టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది లక్ష్మీపార్వతి పాత్రను అవమానకరంగా చిత్రించబోతున్నారని! సినిమా కథ ఏమిటో తెలియకుండా ఆ మాట ఎట్లా అంటారని అడగొచ్చు ఎవరయినా! ఎన్టీఆర్‌తో వివాహానికి ముందు లక్ష్మీపార్వతి వీరగంధం వెంకటసుబ్బారావు అనే ఆయన భార్య. కారణాలు ఏమయినా... అవి మనకు అనవసరం కూడా, ఆయన నుంచి విడాకులు తీసుకుని ఆమె ఎన్టీఆర్‌ను పెళ్లి చేసుకున్నారు. సినిమా పేరు వీరగంధం అని పెట్టడంలోనే చిత్రకథ ఏ వైపు వెళుతున్నదో అర్థమవుతుంది. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆమె మీద బురద చల్లడానికీ, తద్వారా ఎన్టీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికీ అప్పటి కొందరు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానూ, తెలుగుదేశం పార్టీ లోనే చంద్రబాబు నాయుడు వంటి నాయకులు రహస్యంగానూ వీరగంధం సుబ్బారావును పావుగా వాడుకోజూసిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిల పెళ్లి క్షమించరాని నేరంగా చిత్రీకరించే ప్రయత్నం ఆ రోజుల్లో జరిగింది. అనారోగ్యం పాలయి సేవలు చేసే దిక్కులేని పరిస్థితులలో తోడు అవసరం కాబట్టి పెళ్లి చేసుకుంటే మిన్ను విరిగి మీద పడ్డట్టు ఎన్టీ రామారావు మీద విరుచుకుపడ్డ వాళ్లే ఎక్కువ. అందులో తెలుగుదేశం నాయకులు తక్కువ తినలేదు. చంద్రబాబునాయుడు అందుకు మినహాయింపు కాదు. స్త్రీల పట్ల ఏమాత్రం గౌరవం లేని ఎంతో మంది చీకటి జీవితాల కంటే ఎన్టీఆర్ చాలా గొప్పవాడు. ఆయనను పెళ్లి చేసుకున్నాక తెలుగుదేశం రాజకీయాల్లో ఆమె జోక్యం కానీ, పరిపాలన విషయంలో ఎన్టీఆర్ ఆమె ప్రభావానికి లోనై నిర్ణయాలు తీసుకోబోయారన్న విషయంలో కచ్చితమైన సమాచారం ఉంటే ఎవరయినా విమర్శనాత్మకంగా చర్చించవచ్చు. కానీ దాదాపు 22 ఏళ్ల క్రితం మరణించిన ఎన్టీఆర్ జీవితం తెరకెక్కించే ప్రయత్నం చేసేవారు ఎవరయినా సంపూర్ణ సమాచారం సేకరించుకుని చేస్తే బాగుంటుంది. ఆత్మకథలు రాసే వారికి నిజాయితీ, జీవిత చరిత్రలు రాసే వారికి పరిశోధన చాలా ముఖ్యం అన్న విషయం సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఎన్టీఆర్ పేరు ప్రతిష్టలను, ప్రజాభిమానాన్ని ఎన్నికల రాజకీయాల కోసం మాత్రమే వాడుకునే చంద్రబాబునాయుడి తెలుగుదేశం ఈ మూడు సినిమాల నుంచి లబ్ధి పొందే హడావుడిలో ఎన్టీఆర్‌ను నవ్వుల పాలు చేసే అవకాశాలే ఎక్కువ. నిజాం బూజును దులపాలి ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను పొగుడుతున్న తీరు జుగుప్సాకరంగా తయారయింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఆంధ్రా వలస పాలకుల కంటే నిజాం రాజు పాలనే మెరుగ్గా ఉండేది అనేమాట ఉద్యమకారుల నుంచి తరచూ వినబడేది. మూర్ఖుడూ, ప్రజా కంటకుడూ అయిన నిజాం కంటే ఎక్కువ దుర్మార్గులు వలస పాలకులు అన్న అర్థం స్ఫురించే విధంగా ఉండేది ఆ పోలిక. నిజానికి అందులో వాస్తవం లేకపోయినా ఉద్యమ కాలంలో ఇటువంటివి సహజం అని సరిపెట్టుకునేవాళ్లం. నిజాం రాజు, ఆయన కిరాయి సైనికులు(రజాకార్లు) తెలంగాణ ప్రాంత ప్రజల మీద సాగించిన దమనకాండను మరచిపోయి, ఆయనో మహనీయుడు అని తాను కీర్తించడమే కాక భావితరాల వారికి తప్పుడు సమాచారాన్ని పంపే ప్రయత్నంలో భాగంగా చరిత్రను తిరగ రాస్తానని అంటున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి దశ ఉద్యమంలో చంద్రశేఖరరావు, ఆయన నాయకత్వం వహించిన టీఆర్ఎస్ల పాత్ర విస్మరించడానికి వీలు లేనిదే అయినా, అందుకు ప్రతిఫలంగా రాష్ట్రాన్ని ఏలే అధికారం ప్రజలు ఆయన పార్టీకి కట్టబెట్టినా చరిత్రను వక్రీకరించి తిరగరాస్తానంటే కుదరదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు పన్నెండు శాతం ముస్లింలను ఆకర్షించడానికీ, మజ్లిస్ పార్టీ సహకారంతో వచ్చే ఎన్నికలలో గట్టెక్కడానికీ మైనారిటీ సంక్షేమం పేరిట ఎన్ని పథకాలయినా తీసుకురావచ్చు, ఎన్ని వందల, వేల కోట్ల రూపాయల నిధులయినా కేటాయించవచ్చు. ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. ముస్లింలు ఈ దేశ పౌరులు. తెలంగాణ సమాజంలో వాళ్లు భాగంగా ఉన్నారు. తెలంగాణలో ముస్లింలకు నిజాం ప్రతినిధి కాదు, మజ్లిస్ నాయకులు అంతకన్నా కాదు. తెలంగాణ ప్రజల ఆస్తులు కొల్లగొట్టి, స్త్రీల మాన ప్రాణాలను హరించి, వందలాది మందిని ఊచకోత కోసి సంపాదించిన నెత్తుటి బంగారాన్ని నిజాం రాజు ఆస్పత్రి కట్టించడానికి దానం చేశాడని పొంగిపోయి శాసనసభ సాక్షిగా ఆ క్రూరుడిని, అతడి పాలనను వేనోళ్ల కీర్తించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రజాస్వామ్యాన్ని, ఆ అద్భుత పునాదుల మీద నిర్మించుకున్న విలువలను ధ్వంసం చేసేందుకు పూనుకున్నారు. మేధావులు వాస్తవాలు చెప్పాలి తెలుగుభాషను గొప్పగా కీర్తిస్తూ, ఆ కీర్తిని నేల నాలుగు చెరగులా వ్యాపింపచేసే ప్రయత్నంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించబోతున్న ముఖ్యమంత్రికి నిజాం పాలనలో తెలుగు భాషాసంస్కృతులు ఎంత నిర్వీర్యం అయ్యాయో, ఉర్దూ రాజభాషగా వెలుగొందుతూ ఉంటే అజ్ఞాతంలో ఉండిపోయిన తెలుగు భాషకు మద్దతుగా ఉద్యమాలు సాగాయనీ, అందులో భాగంగానే గ్రంథాలయోద్యమం వేళ్లూనుకున్నదనీ ఆయన చుట్టూ చేరిన మేధావులు చెప్పరెందుకు? రావణాసురుడిని కొలిచే వాళ్లు ఉంటారు. అది వాళ్ల ఇష్టం. నిజాం రాజును కొలిచే వాళ్లూ ఉంటారు, అది కూడా వాళ్ల ఇష్టం. కానీ ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ రాజ కీయ ప్రయోజనాల కోసం ఆ పని చెయ్యడం తగదు. రామాయణ కాలంలో ఏం జరిగిందో మనకు తెలియదు. రావణుడు మంచివాడా, ప్రజాకంటకుడా అన్నదీ మనకు తెలియదు. కానీ నిజాం కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసు, ఆయన దుష్పరిపాలనా మనకు తెలుసు. ఆయన రాజ్యంలో ప్రజల మీద జరిగిన దమనకాండ గురించి మనకు తెలుసు. తెలిసీ మౌనంగా ఉండటం నేరం. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బయట పేచీ, లోపల లాలూచీ
డేట్లైన్ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రెండు వైపులా ప్రజలకు సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దడంలో ప్రదర్శించని సఖ్యత, వ్యాపారాలు పెంచుకోవడంలో ప్రదర్శిస్తేనే అభ్యంతరం. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకుంటూ వ్యక్తిగత వ్యాపార సామ్రాజ్యాలను విస్తరింప చేసుకోవడానికి అజ్ఞాత స్నేహాలు చేస్తేనే అభ్యంతరం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే. తన రాజకీయ అవసరాల కోసం రేవంత్‌రెడ్డి కొన్ని వ్యవహారాలు మాత్రం బయట పెట్టి ఉండవచ్చు. బయటికి రానివి ఇంకెన్నో! యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి. తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా, రామకృష్ణుడినే నంబర్ టూగా పరిగణించాలి. నిజానికి యనమల రామకృష్ణుడు లేకపోతే రాజకీయాల్లో చంద్రబాబునాయుడు లేరు. 1995లో ఎన్టీ రామారావును అన్యాయంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడు శాసనసభ స్పీకర్‌గా ఉన్న యనమల కొంచెం భిన్నంగా వ్యవహరించి ఉంటే చంద్రబాబునాయుడి రాజకీయ చరిత్ర అక్కడితో ముగిసి ఉండేది. శాసనసభలో అంతకు ముందురోజు వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న రామారావును తామందరికీ రాజకీయ భిక్ష పెట్టారన్న విషయాన్ని కూడా మరచి కనీసం మాట్లాడేందుకు కూడా అనుమతించకుండా యనమల ఆరోజు చంద్రబాబు అనుకూల వైఖరి తీసుకుని ఉండకపోతే ఏం జరిగి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరిటాల సునీత, అదే తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవి భార్య. ప్రస్తుత మంత్రివర్గ సభ్యురాలు. పయ్యావుల కేశవ్ మాజీ శాసనసభ్యుడు. ప్రస్తుత శాసన మండలి సభ్యుడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో ‘బ్యాక్ రూమ్ మేనేజ్మెంట్’ అద్భుతంగా చేసినందుకు చంద్రబాబు చేత ప్రత్యేక సత్కారం అందుకున్న ముఖ్యుడు. రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని, సమీప భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందనే ఆశ కూడా లేని తెలంగాణ రాష్ట్ర విభాగం కార్యాధ్యక్షుడు, శాసనసభ్యుడు. పార్టీ అధినేత, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నిన ఒక తప్పుడు వ్యూహంలో పావుగా మారి, జైలుకు వెళ్లి, తీరని నిందను మోస్తున్నవాడు. ఈ నలుగురి ప్రస్తావనే ఇప్పుడెందుకంటే, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆనాడేమైందీ ప్రశ్నించే గుణం? రేవంత్‌రెడ్డి పార్టీ మారబోతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలోని పలువురు ముఖ్య నేతలను, కార్యకర్తలను తీసుకుని కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వార్త. అందుకోసం ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరితే తన వర్గం వారికి పది పదకొండు లోక్‌సభ స్థానాలు, ఓ 25 శాసనసభ స్థానాలు ఇవ్వాలన్న డిమాండ్ పెట్టారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దీనితో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను పిలిచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వివరణ కోరారు. తెలుగుదేశంలో ఉంటూ నువ్వు రాహుల్ గాంధీని ఎట్లా కలుస్తావు? అందుకు చంద్రబాబునాయుడి అనుమతి తీసుకున్నావా? అని ప్రశ్నిస్తే, మీకెవ్వరికీ నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి వచ్చాక ఆయనకే చెప్తాను అన్నీ అన్నారు రేవంత్‌రెడ్డి. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అది నెగ్గకుండా చూడటానికి తెలుగుదేశం పక్షం సభ నుంచి గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే. అప్పుడు కాంగ్రెస్‌తో ఎందుకు కుమ్మక్కు అవుతున్నారని చంద్రబాబును ఈ నాయకులు ప్రశ్నించలేదు. ఇంతెందుకు, 1996లో యునైటెడ్ ఫ్రంట్‌ను కట్టి కాంగ్రెస్ సహాయంతో కేంద్రంలో పార్టీని చేర్చినప్పుడు మనది కాంగ్రెస్ వ్యతిరేక పునాది మీద పుట్టిన పార్టీ అని మోత్కుపల్లి నర్సింహులు ఎందుకు గుర్తు చెయ్యలేదో మరి! మొన్నటికి మొన్న, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో, నిన్న సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేశామని తెలంగాణ టీడీపీ నాయకులు తమను తాము ప్రశ్నించుకుంటే బాగుండేది. అప్పుడు మాట్లాడని నాయకులు రేవంత్ నుంచి వచ్చిన సమాధానంతో సమావేశం నుంచి వాకౌట్ చేస్తే, రేవంత్ మాత్రం దర్జాగా ట్రస్ట్ భవన్‌లోనే కూర్చున్నారు. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎట్లా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ గాని, ఇంకెవరైనా గాని ఇక్కడ పార్టీ వ్యవహారాల మీద ఏమాత్రం పట్టు లేనివాళ్లని తేలిపోయింది. క్రమశిక్షణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి ఇది. ఆయన కుమారుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌బాబు మూడు రోజులు హైదరాబాద్‌లో మకాం వేసి కూడా ఎవరినీ కట్టడి చెయ్యలేని స్థితిలో తిరిగి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. వీరిది పోరాటం, వారిది వ్యాపారం తాను సభ్యుడిగా ఉన్న రాష్ట్ర పార్టీలో నాయకత్వానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని తలెగరేసిన రేవంత్ పక్క రాష్ట్రంలోని మంత్రుల మీద, నాయకుల మీద కూడా విరుచుకు పడ్డారు. పార్టీ కోసం నేను జైలుకు వెళితే, తెలంగాణ లో ప్రభుత్వంతో కొట్లాడుతుంటే ఆంధ్ర మంత్రులు, నాయకులు తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యంగా వ్యవహరించి వ్యాపారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పయ్యావుల కేశవ్ ఒక్కడే బయటపడి వివరణ ఇచ్చారు తప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత నోరు మెదపలేదు. బహుశా అధినేత ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు. అయినా అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రితో మాట్లాడటం ఈ రోజుల్లో ఏమంతపని! మాట్లాడే ఉంటారు. ఆయన ఏం చెప్పారో అందరూ అర్థం చేసుకోవచ్చు కూడా. అటు ఆంధ్ర మంత్రులూ నాయకులకయినా, ఇటు తెలంగాణ పార్టీ నేతలకయినా ఈ పరిస్థితిలో చంద్రబాబునాయుడు ఏం చెబుతారు? ఇంకొకరు ఎవరయినా అయితే పార్టీ నుంచి తక్షణం బహిష్కరించి ఉండే వాళ్లం కానీ, ఈయన రేవంత్‌రెడ్డి అయిపోయారు. కాస్త ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, ఎవరూ తొందర పడకండి అనే చెప్పి ఉంటారు. నిజమే కదా! ఓటుకు కోట్లు కేసులో వ్యూహం రచించింది తానూ, అమలు చేస్తూ దొరికిపోయి జైలుకు వెళ్లింది రేవంత్ రెడ్డి కాబట్టి, ఆ కేసు ఇంకా నెత్తి మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. ఎంత స్నేహహస్తం చాచుతున్నట్టు కనిపిస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అవసరమైతే దాన్ని మళ్లీ తన మీద ప్రయోగించడానికి వెనుకాడరన్న విషయం చంద్రబాబునాయుడుకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చేదాకా ఇటూ అటూ తెలుగుదేశం వారంతా ‘వ్యూహాత్మక మౌనం’పాటించాల్సిందే, తప్పదు. ఇక యనమల రామకృష్ణుడి సంబంధీకులకు తెలంగాణలో వేల కోట్ల రూపాయలకాంట్రాక్టులు, పరిటాల సునీత కుమారుడికీ,పయ్యావుల కేశవ్ అల్లుడికీ వ్యాపార లైసెన్సుల గురించి రేవంత్ మాట్లాడితే; రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత కలసి వ్యాపారం చెయ్యడం కోసం కంపెనీ రిజిస్టర్ చేయడం గురించి కేశవ్ ప్రస్తావించారు. ఈ విషయానికి వస్తే ఇందులో ఎవరు పులుకడిగిన ముత్యాలు అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులూ; అక్కడివారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడ వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి కాంట్రాక్ట్‌లు, లైసెన్స్‌లు తెచ్చుకుంటూనే ఉన్నారు. వ్యాపారం చేయవద్దని ఎవరూ చెప్పరు. ఫలానా వర్గం వారే వ్యాపారాలు చెయ్యాలనీ ఎవరూ చెప్పరు. రాజకీయాల్లో ఉన్నవాళ్లు వ్యాపారాలకు అర్హులు కాదు అనే చట్టం ఏమీలేదు. తమకు ఇష్టమైన వ్యాపారం చేసుకునే హక్కు జీవించే హక్కు వంటి ఇతర హక్కుల వంటిదే. రాజ్యాంగం ప్రసాదించిన హక్కే. అయితే చిక్కంతా ఎవరు ఎటువంటి వ్యాపారాలు ఏ రకంగా చేస్తున్నారు అన్న విషయం దగ్గరనే. పయ్యావుల కేశవ్ చెప్పినట్టు తెలంగాణలో మద్యం వ్యాపారం చేసుకోవడానికి నిబంధనలను అనుసరించి ఆయన మేనల్లుడో, ఇంకొకరో ఆంధ్ర ప్రాంతానికో, రాయలసీమ ప్రాంతానికో చెందినవారు లైసెన్సులు తెచ్చుకుంటే ఆక్షేపించనక్కర లేదు. తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం చేసుకునే హక్కును ఎవరూ కాదనలేరు. నిజానికి దేశంలో ఈ చివర నుంచి, ఆ చివర దాకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు నిర్మించే కాంట్రాక్టర్లు కొంతమంది తెలుగువాళ్లేనన్న విషయం మరిచిపోవద్దు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ఒక సందర్భంలో స్వయంగా తానే చెప్పారు, ఆంధ్రప్రాంతం వారితో తనకున్న వ్యాపార లావాదేవీలను గురించి. రాజకీయాలు, వ్యాపారం కలగాపులగం అయిపోయినందునే సమస్యంతా. ఉదాహరణకు రాజకీయ అవసరాలకారణంగానే అమాయకులయిన విద్యార్థులు చదువుల ఒత్తిడి తట్టుకోలేక అన్యాయంగా ప్రాణాలు తీసుకుంటుంటే ఏ చర్యా లేకుండా పోయింది, ఇక్కడయినా, అక్కడయినా. ముందు నుయ్యి వెనుక గొయ్యి ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రెండు వైపులా ప్రజలకు సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దడంలో ప్రదర్శించని సఖ్యత, వ్యాపారాలు పెంచుకోవడంలో ప్రదర్శిస్తేనే అభ్యంతరం. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకుంటూ వ్యక్తిగత వ్యాపార సామ్రాజ్యాలను విస్తరింప చేసుకోవడానికి అజ్ఞాత స్నేహాలు చేస్తేనే అభ్యంతరం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే. తన రాజకీయ అవసరాల కోసం రేవంత్‌రెడ్డి కొన్ని వ్యవహారాలు మాత్రం బయట పెట్టి ఉండవచ్చు. బయటికి రానివి ఇంకెన్నో! ఏది ఏమైనా రేవంత్‌రెడ్డి వ్యవహారం మాత్రం తెలుగుదేశం పార్టీని అక్కడా ఇక్కడా మరింత అయోమయంలో పడేసిన మాట వాస్తవం. పార్టీ నుంచి బహిష్కరిస్తే ఓటుకు కోట్లు వ్యవహారం ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో, బుజ్జగించి పార్టీలోనే ఉంచుకుందామంటే టీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి కచ్చితంగా అవలంబించాల్సిందే అన్న రేవంత్ షరతు మింగుడు పడదాయే. ముందునుయ్యి, వెనుక గొయ్యి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
మీడియాపై దాడులను అడ్డుకుందాం
కొరుక్కుపేట : మీడియాపై దాడులను అడ్డుకునేందుకు చెన్నైలో జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఇందులో దాడుల అడ్డుకట్టకు, మీడియా భద్రతకు ఐదు తీర్మానాలు చేశారు. వీటిని కేంద్రంతోపాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించనున్నారు. ఫెడరేషన్ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా లీడ్ పేరుతో మీడియాపై దాడులు– బెదిరింపులు – మీడియాలో నేటి పరిస్థితిపై జాతీయ సదస్సు ఆదివారం జరిగింది. సదస్సు కోఆర్డినేటర్ సంధ్య రవిశంకర్ సంధానకర్తగా రెండు సెషన్లతో కార్యక్రమం జరిగింది. ఇందులో సాక్షి మీడియా తరఫున ఈడీ రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్, ది హిందూ చైర్మన్ ఎన్.రామ్, ఎడిటర్ ముకుంద్ పద్మనాభన్, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ అరుణ్ రామ్, నటి గౌతమి, తమిళనాడు తమిళ భాష అభివృద్ధి శాఖ మంత్రి ఎం.పాండియరాజన్, ఎన్డీ టీవీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావిస్ కుమార్, డీఎంకే ఎమ్మెల్యే త్యాగరాజన్, వెటరన్ జర్నలిస్ట్ భాస్కర్, తమిళ మీడియా సంపాదకులు పాల్గొన్నారు. సదస్సులో మీడియాపై దాడులు, ప్రభుత్వాల తీరు, మీడియా సంస్థల్లో ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. -
కత్తులు దూసినా పొత్తులు తప్పవా!
డేట్లైన్ హైదరాబాద్ ఇక తెలుగుదేశం అవసరం తెలంగాణలో ఎవరికైనా, ఏ రూపంలోనైనా ఉంటుందో లేదో తెలియదు కానీ, పొత్తుల అవసరం ఆ పార్టీ మనుగడకు మాత్రం చాలా ముఖ్యం. అందుకే కాంగ్రెస్‌తో కలసి పోటీ చేద్దామని ఒకరు, లేదు టీఆర్ఎస్తో కలిసి నడుద్దామని మరొకరు తెలుగుదేశంలోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్తో కలసి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అధినేత చంద్రబాబు నాయుడిదేనని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ అప్పుడే రాజకీయ పార్టీలలో పొత్తుల ముచ్చట జోరందుకున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆలోచిస్తున్న విధంగా జమిలి ఎన్నికలు జరిగేటట్టయితే 2018 చివరలోనే ప్రజా తీర్పు కోరవలసి ఉంటుంది. ఈ ముందస్తుకైనా ఏడాది సమయం ఉంది. ఎక్కడైనా బలహీనంగా ఉన్న పార్టీలే పొత్తుల గురించి ఎక్కువ ఆలోచిస్తాయి. బలహీనం అంటే సిద్ధాంతరీత్యా కాక ఎన్నికలలో ప్రజాబలం రీత్యా అని అర్ధం చేసుకోవాలిక్కడ. కొన్ని పార్టీలైతే రెండు విధాలా బలహీనంగా ఉంటాయి. వాటికి పొత్తులు మరీ అవసరం. ఇవాళ తెలుగు రాష్ట్రాలలో కొన్ని పార్టీలలో ఈ పొత్తుల వెంపర్లాట అప్పుడే బాహాటంగా కనిపిస్తున్నది. మరికొన్ని పార్టీలు లోపల ఆందోళన పడుతున్నా, దానిని బయట పడనీయకుండా గుంభనంగా ఉన్నాయి. చంద్రబాబు స్వయంకృతం 2014లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పొత్తు పెట్టుకున్నాయి. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో మాత్రం ఆ ఎన్నికలలో అరకొర విజయంతో సరిపెట్టుకోవడమే కాకుండా, ఈ మూడేళ్లలో చిరునామా లేకుండా పోయింది. దానికి కారణం ప్రజలు నిరాకరించడం కాదు. అది ఆ పార్టీ నేత చంద్రబాబునాయుడు చేజేతులా కొనితెచ్చుకున్న దీనావస్థ. ఈసారి ఎన్నికలలో మాత్రం తెలంగాణలో తెలుగుదేశంతో కలసి పోటీ చేసే సమస్యే లేదని బీజేపీ రాష్ట్ర శాఖ బహిరంగంగానే చెబుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ లోలోపల గొణుక్కుం టున్నది. పొత్తు గురించి అక్కడ స్పష్టత రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. పొత్తుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే ఎక్కువ కదలిక కనిపిస్తున్నది. ఇతర పార్టీలలో కంటే తెలుగుదేశంలోనే ఆ హడావుడి మరీ ఎక్కువగా కనిపించింది గతవారం. ఈ హడావుడి గురించే చంద్రబాబునాయుడు స్వయంగా హైదరాబాద్‌కి వచ్చి ప్రస్తుతానికి ఆపండని చెప్పి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. ఆదివారం నాడు ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ తెలుగుదేశం ముఖ్యులను సమావేశపరచి సమయం వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం అందరితో చర్చించి పొత్తుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందనీ, అప్పటిదాకా ఎవరూ నోరు మెదపవద్దని చెప్పారనీ ఆ వార్తల సారాంశం. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ కలసి పోటీ చేస్తే బాగుంటుందనీ, వీరితో బీజేపీ కూడా కలిస్తే మరింత మెరుగ్గా ఉంటుందనీ ఒక ప్రచారం ఈ మధ్యనే మొదలైంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు, మా విజయం అప్రతిహతం. కాబట్టి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అనవచ్చు. అందుకు రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికలను ఉదాహరణగా చూపవచ్చు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనులలో కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఇటీవలనే జరిగిన ఎన్నికలను ఉదహరించవచ్చు. సింగరేణిలోని 11 డివిజన్లలో టీబీజీకేఎస్ 9 గెల్చుకున్న మాట నిజమే కానీ, ఓట్ల సంగతేంటి? ఓట్లేసిన సింగరేణి కార్మికులలో 50 శాతానికి పైగా అధికార పక్షానికి చెందిన కార్మిక సంఘానికి వ్యతిరేకంగా ఓటేసిన విషయం మరచిపోకూడదు. అధికార పక్షం భూమ్యాకాశాలను తలకిందులు చేసినా ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావడంతో ఈ ఫలితం వచ్చిందన్న విషయం గ్రహించలేనంత అమాయకులు కాదు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఫలితాలు వెలువడగానే నిర్వహించిన పత్రికా గోష్టిలో ఆయన మాట్లాడిన తీరును బట్టే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. గెలిచాం కదా అని విర్రవీగకూడదు, ఒదిగి ఉండాలి అని చెపుతూనే, నెహ్రూ నుంచి సోనియాగాంధీ దాకా కాంగ్రెస్ మీద ఆయన విరుచుకుపడిన తీరు, మొట్టమొదటిసారిగా కోదండరాం పట్ల ప్రదర్శించిన తీవ్ర అసహనం సింగరేణి ఫలితాన్ని ఆయన ఎట్లా చూస్తున్నారో స్పష్టం చేస్తున్నది. అదే పత్రికా గోష్టిలో ఆయన టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలు కవిత, ఇతర నాయకులు సరిగా పని చేయలేదని కూడా తెరాస నేత ఆక్షేపించారు. నిజానికి స్థానికంగా టీబీజీకేఎస్ నాయకత్వం పట్ల కార్మికులలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత కారణంగానే సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది. ప్రభుత్వం ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేయాలని సంకల్పించినా, అధినేతకు ఎంతటి జనాకర్షణ ఉన్నా క్షేత్రస్థాయిలో నాయకత్వం సరిగా లేకపోతే గెలుపు అంత సులభం కాదని చెప్పడానికి సింగరేణి ఎన్నికల ఫలితం మంచి ఉదాహరణ. కేసీఆర్ వ్యూహం ఏమిటో? ఈ పరిస్థితులలో ప్రస్తుతం మాకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదని అధికార టీఆర్ఎస్ చెప్పినా, ఎన్నికలు సమీపించే నాటికి కేసీఆర్ వ్యూహం ఎట్లా ఉండబోతున్నదో ఊహించవచ్చు. ఇప్పటికైతే ఆయనకు దీటైన నాయకుడు ఎవరూ ప్రతిపక్షాలలో కనిపించడంలేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అని ముఖ్యమంత్రి వేసిన ఎదురు ప్రశ్నలో చాలావరకు వాస్తవం ఉన్నా, ఆ పార్టీకి తెలంగాణలో ఒక వర్గం మద్దతు ఇప్పటికీ ఉన్నదన్న విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. ఆ సామాజిక వర్గం ప్రస్తుతానికి మచ్చిక అయినట్టు కనిపిస్తున్నా, దానిని పూర్తిగా నమ్మడానికి ఆయన సిద్ధంగా లేరు. అందుకే వీలయినంత ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకోడానికీ లేదా తటస్థం చెయ్యడానికీ ఏ అవకాశం వచ్చినా వదులుకోవడంలేదు. మొన్నటికి మొన్న ప్రత్యేక విమానంలో ఆ సామాజిక వర్గానికే చెందిన నాయకులనూ, ఒక పత్రిక యజమానినీ వెంట పెట్టుకుని అనంతపురంలో పరిటాల రవి కుమారుడి పెళ్లికి వెళ్లి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తే మానవబాంబునవుతానని బెదిరించి, డిసెంబర్ తొమ్మిది ప్రకటన మరునాడే జేసీ దివాకర్ రెడ్డితో కలసి ఆంధ్రప్రాంతానికి చెందిన అన్ని పార్టీల శాసనసభ్యుల రాజీనామాలను సేకరించడంలో ప్రధాన పాత్ర వహించిన పయ్యావుల కేశవ్‌తో ఆప్యాయంగా ముచ్చటించారు. ఇక తెలుగుదేశం అవసరం తెలంగాణలో ఎవరికైనా, ఏ రూపంలోనైనా ఉంటుందో లేదో తెలియదు కానీ, పొత్తుల అవసరం ఆ పార్టీ మనుగడకు మాత్రం చాలా ముఖ్యం. అందుకే కాంగ్రెస్‌తో కలసి పోటీ చేద్దామని ఒకరు, లేదు టీఆర్ఎస్తో కలిసి నడుద్దామని మరొకరు తెలుగుదేశంలో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలసి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అధినేత చంద్రబాబునాయుడిదేనని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. తద్వారా పార్టీ శ్రేణులలోకీ, ప్రజలలోకీ ఎట్లాంటి సంకేతాలు వెళతాయో చూద్దామని ఆయనే ఈ ఆలోచనను ప్రచారంలోకి తెచ్చారని సమాచారం. తీరా గందరగోళం అయ్యేసరికి ప్రస్తుతానికి ఎవరూ మాట్లాడవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఎన్టీ రామారావు నాయకత్వంలో ఏర్పడినది తెలుగుదేశం పార్టీ. కానీ రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలో అదే కాంగ్రెస్‌తో టీడీపీ చెట్టపట్టాలు వేసుకుని తిరిగేట్టు చేసినవారు చంద్రబాబు. అంతకుముందు 2009లో కాంగ్రెస్‌ను ఓడించడం కోసం టీఆర్ఎస్, వామపక్షాలతో కలసి మహాకూటమి కట్టారు. అయినా ఓడిపోయారు. ఒకచోట అధికారాన్ని నిలుపుకోవడానికీ, మరొకచోట అస్తిత్వాన్ని కాపాడుకోడానికీ ఏ పార్టీతో అయినా చంద్రబాబు జత కడతారనడానికి ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబునాయుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారా, ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా మిగిలిపోతారా అనేది 2019 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తేల్చేస్తాయి. ఆయన ఖేదం, ఈయన నిర్వేదం మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం సీనియర్ నాయకుడు. తనకు గవర్నర్ పదవి వస్తుందనీ, ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి చంద్రబాబునాయుడు ఆ పదవి ఇప్పిస్తారని కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. మోదీ నాకే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఇక గవర్నర్ పదవి ఏమిస్తారని మొన్నటి సమావేశంలో చంద్రబాబునాయుడు ఒక నిట్టూర్పుతో సరిపెట్టారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్తో కలసి పోటీ చేయవచ్చునన్న మాట చెప్పింది ఈ నర్సింహులు గారే. దానికి ఆయన ఒక సూత్రీకరణ కూడా చేశారు. మనది కాంగ్రెస్ వ్యతిరేక పునాది మీద ఏర్పడిన పార్టీ కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి రాకుండా నిలువరించడానికే ఈ ప్రతిపాదన అన్నారు. అదే ఎన్టీ రామారావును దుర్భాషలాడి పార్టీ నుంచి వెళ్లిపోయి స్వతంత్రంగా పోటీ చేసిన నాయకుడు, కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి తిరిగొచ్చిన నాయకుడు నర్సింహులు ఈ కాంగ్రెస్ వ్యతిరేకత సూత్రాన్ని ముందుకు తేవడం ఆశ్చర్యకరం. పలికినవాడు నర్సింహులు పలికించినవారెవరో మనకు తెలుసు. ‘టీఆర్ఎస్తో పొత్తు అంటే నన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు’ అన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తీవ్రమైన టీఆర్ఎస్ వ్యతిరేకత ఆయనను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కొంత దగ్గర చేసింది. అవసరార్థం కాంగ్రెస్‌తో కలవడంలో తప్పు లేదన్న సూత్రం నీవు నేర్పిన విద్యయే కదా అని ఆయన ఇప్పుడు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి అదృష్టం కొద్దీ చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసులో ఫోన్ సంభాషణలో దొరికారు కానీ, లేకుంటేæ రేవంత్‌ను ఒంటరిని చేసి ఆ వ్యవహారంలో తనకు ఏమీ సంబంధం లేదని పార్టీ నుంచి వెళ్లగొట్టి ఉండేవారు. రేపటి రోజున నర్సింహులు ప్రతిపాదనలే కార్యరూపం దాలిస్తే రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయ మార్గం కాంగ్రెస్ తప్ప మరొకటి లేదు. అయితే అక్కడ ఆయన క్యూలో నిలబడే నాయకుల్లో ఏ వందో వాడో అవుతారు. ‘రెంటికీ చెడ్డ రేవంత్’ కాకూదదనుకుంటే కాంగ్రెస్ వరుసలో నిలబడక తప్పదేమో! దీర్ఘకాలం వెనుకబడిన తరగతుల వారికోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న బీసీ నాయకుడు, తెలంగాణ తెలుగుదేశం 2014 సీఎం అభ్యర్థి, శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో కొనసాగనేమో అని ఇటీవలే ఒక సభలో ప్రకటించారు. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో ఆయన ప్రకటనతో అర్థం అయిపోలేదా? దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
చరిత్రను రాజకీయం చేయవద్దు
డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికార ఉత్సవంగా జరపకపోవడానికి గల కారణాలను గురించి తలలు బద్దలు కొట్టుకోనక్కరలేదు. అవి చాలా సుస్పష్టం. మజ్లిస్‌తో స్నేహం చెడగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే, ముస్లింలను సంతోషపరుస్తున్నాననుకుంటూ పొద్దున్న లేస్తే నిజాం నవాబును, ఆయన పరిపాలనను వేనోళ్ల స్తుతిస్తూ విమోచన దినం అధికారికంగా ఎట్లా నిర్వహించడం అనేది మరో కారణం. ఒకవైపు కాళోజీని, దాశ రథిని కొనియాడుతూ, మరో వైపు నిజాం రాజును స్తుతించడం కేసీఆర్‌కే చెల్లింది. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విలీనమైన ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు ఏటా విమోచన దినోత్సవం జరుపుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో కలసిన తెలంగాణ ప్రాంతంలో కూడా అదే రీతిలో సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలన్న డిమాండ్ ఉంది. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా దీని గురించి వింటూనే ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు ఏనాడూ ఆ పని చెయ్యడానికి అంగీకరించలేదు. ఎక్కువకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్‌లోనో మరెక్కడో పార్టీ పరంగా మొక్కుబడిగా ఉత్సవాలు జరిపిందే తప్ప ఆరోజు ప్రాముఖ్యాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఆ రెండు పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఉత్సవాలు అధికారికంగా జరిగాయి. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వాన్నీ, ఆయన ప్రతిష్టనూ తన సొంతం చేసుకోవడానికి తపిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని ఏటా కోరుతోంది. సర్దార్ పటేల్ నామస్మరణ తప్ప, నెహ్రూ, గాంధీ వంటి నాయకుల పేర్లను ఉచ్చరించడమే పాపం అన్నట్టుగా బీజేపీ వ్యవహరించడం ఈ మూడున్నర ఏళ్లుగా చూస్తున్నాం. మహాత్ముడిని ‘చతుర్ బనియా’(తెలివిగల వ్యాపారి) అని హేళనగా మాట్లాడే నాయకత్వం కలిగిన పార్టీ బీజేపీ. ఉక్కు మనిషిగా ఖ్యాతి చెందిన సర్దార్ పటేల్ జ్ఞాపకాన్ని మహాత్ముడి జన్మస్థానం గుజరాత్లో చిరస్మరణీయం చెయ్యాలన్న ఆలోచన బీజేపీది. పాత ప్రభుత్వాల బాటనే టీఆర్ఎస్ సెప్టెంబర్ 17 విషయానికి వద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అసలు ఈ విషయంలో ఒక అవగాహన కానీ, అధ్యయనం కానీ లేవు. ఏ రాజకీయ పార్టీకైనా చరిత్ర పట్ల అవగాహన అవసరం. ఆ చరిత్ర పట్ల తనకంటూ ఒక రాజకీయ వైఖరి కూడా ఉండటమూ తప్పనిసరి. కానీ తెలుగుదేశం పార్టీకీ, దాని అధినాయకత్వానికీ ముఖ్యంగా ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చరిత్ర అంటే అస్సలు గిట్టదు. చరిత్రను అధ్యయనం చెయ్యడం శుద్ధ దండగ అని ఆయన అభిప్రాయం. కాబట్టి వారి కాలంలో కూడా అధికారికంగా ఉత్సవాలు జరగలేదు. ఇప్పుడిక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచించడం కూడా అనవసరం. ఆ పార్టీ ఇక్కడి నుంచి జెండా ఎత్తెయ్యడం స్వయంకృతమే. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సెప్టెంబర్ 17ను అధికారిక ఉత్సవంగా నిర్వహించడానికిఅంగీకరించడం లేదు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన చివరి దశ ఉద్యమానికి నాయకత్వం వహించిన 13 సంవత్సరాల కాలంలో ఉద్యమ సంస్థగా టీఆర్ఎస్, దాని అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలుమార్లు సెప్టెంబర్ 17న రెండు పొరుగు రాష్ట్రాల మాదిరిగానే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని అప్పటి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆ రోజును అధికారికంగా జరుపుతామని పలుమార్లు ప్రకటించారు. ఒపీనియన్స్ మార్చుకోని వాడు పొలిటీషియన్ కాడు అంటాడు గిరీశం, ‘కన్యాశుల్కం’లో. చాలా విషయాల్లో మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు గిరీశమే ఆదర్శమనిపిస్తుంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ ఇచ్చిన హామీ విషయంలో కానీ, ఇంటికో ఉద్యోగం, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య కానీ చివరికి సెప్టెంబర్ 17 న ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం విషయంలో కూడా ఆయనది గిరీశం బాటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మూడేళ్లలో మళ్లీ ఈ డిమాండ్ ముందుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ డిమాండ్ విషయంలో అనుసరించిన వైఖరే ఇప్పుడు చంద్రశేఖరరావు ప్రభుత్వ వైఖరి కూడా. ఎందుకీ చర్చ? ఇంతకూ సెప్టెంబర్ 17 ప్రాముఖ్యం ఏమిటి, ఇంత చర్చ ఎందుకు? 1948 సంవత్సరం అదే రోజున భారత ప్రభుత్వ సైన్యాలు జనరల్ చౌదురి నాయకత్వంలో నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ ఆదేశాల మేరకు హైదరాబాద్ సంస్థానాన్ని లోబరుచుకున్నాయి. భారత సైన్యంతో యుద్ధం చేసే శక్తి లేని నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ పటేల్‌కు లొంగిపోయి రాజప్రముఖ్‌గా గౌరవం, సుఖసౌఖ్యాలూ అనుభవించాడు. అప్పుడు జరిగింది విలీనమా, విమోచనా లేక విద్రోహమా అన్న చర్చ ఈ రోజుకూ జరుగుతూనే ఉంది. సర్దార్ పటేల్ నాయకత్వంలో ఆనాడు జరిగింది విమోచనే అయితే నిజాం రాజుకు అన్ని మర్యాదలెందుకు జరిగాయి? ఆనాటి హైదరాబాద్ సంస్థాన ప్రజలను నానా హింసలకు గురిచేసి వేలాది మంది వీరుల మరణానికి కారకులయిన నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్లలో ఒక్కడికైనా శిక్ష పడిందా? పరమ కిరాతకుడైన రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ దేశం విడిచి సురక్షితంగా పాకిస్తాన్‌కో, మరెక్కడికో ఎట్లా పారిపోగలిగాడు? ఆనాడు జరిగింది విమోచన కాదు అని వాదిస్తున్న వారి నుంచి వస్తున్న ప్రశ్నలివి. అందుకే ఇది విలీనం మాత్రమే అంటున్న వాళ్లూ ఉన్నారు. అసలు ఆ రెండూ కాదు, ఆనాడు జరిగింది నిజాం పాలనను ఎదిరించి ధైర్యంగా సాయుధ పోరాటం చేసిన తెలంగాణ రైతాంగం జరిపిన అలుపెరుగని పోరాటానికి, అసువులు బాసిన అమర వీరులకు జరిగిన విద్రోహం అన్న వాదన కూడా బలంగా ఉన్నది. ఈ చర్చ అట్లా ఉంచితే సెప్టెంబర్ 17ను ప్రభుత్వం ఘనంగా అధికార ఉత్సవంగా నిర్వహించాలని బీజేపీ తదితర ప్రతిపక్షాలూ, ససేమిరా అని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడెందుకు పట్టుబట్టి కూర్చున్నాయన్న విషయం మాట్లాడుకుందాం. బీజేపీ పట్టు సెప్టెంబర్ 17 తేదీని విమోచన దినంగా ప్రభుత్వమే నిర్వహించాలని బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న మాట నిజం. ప్రజలను కదిలించే ప్రాంతీయ అంశాలను తీసుకుని 2019 ఎన్నికల్లో దక్షిణాదిన కూడా పాగా వెయ్యాలన్న అధిష్టానం ఆలోచనలో భాగంగా ఈసారి తెలంగాణలో విమోచన దినం డిమాండ్‌ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకుపోయేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వారం రోజుల యాత్ర నిర్వహించారు. అదే క్రమంలో తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలను కూడా బీజేపీ నాయకులు పోయిన చోటల్లా ఎండగట్టారు. పాపం స్థానిక నాయకత్వం ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీ నుంచి ఒక కేంద్రమంత్రి వచ్చి ‘కేసీఆర్ ప్రభుత్వం భేష్!’అని కితాబిస్తాడు. మహారాష్ట్ర గవర్నర్‌గారు వచ్చి తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తున్నదని పొగుడుతారు. ఇంకో వైపు నుంచి బిహార్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇక్కడి సుపరిపాలన గురించి నాలుగు మంచి మాటలు చెబుతారు. ఇదేమిటి అని అడిగితే ప్రభుత్వాల మధ్య సంబంధాలు వేరు, పార్టీల ఎజెండాలు వేరు అని ఒక బలహీన వాదన వినిపిస్తారు. దక్షిణాదిన పట్టు సాధిస్తాం, తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం అన్న ఆలోచనకు ప్రస్తుతం మోదీ, అమిత్ షా ద్వయం స్వస్తి చెప్పిందనడానికి నిదర్శనం– ఉన్నఒకే ఒక్క కేంద్రమంత్రి, తెలంగాణ వాది, వెనుకబడిన తరగతుల సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయను క్యాబినెట్ నుంచి తొలగించడం. 2019లో కలసి నడవడానికి కేసీఆర్‌లో ఒక మంచి మిత్రుడిని వారు వెతుకుతున్నట్టు వార్తలొస్తున్నాయి. సర్వేల పేరుతో మళ్లీ అధికారం తమదే అని బయటికి చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగా తెలిసిన ముఖ్యమంత్రి కూడా బీజేపీకి స్నేహహస్తం చాచక తప్పని పరిస్థితే. మజ్లిస్‌తో మైత్రి వదలలేకే! తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికార ఉత్సవంగా జరపకపోవడానికి గల కారణాలను గురించి తలలు బద్దలు కొట్టుకోనక్కర లేదు. అవి చాలా సుస్పష్టం. మజ్లిస్‌తో స్నేహం చెడగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే, ముస్లింలను సంతోషపరుస్తున్నాననుకుంటూ పొద్దున్న లేస్తే నిజాం నవాబును, ఆయన పరిపాలనను వేనోళ్ల స్తుతిస్తూ విమోచన దినం అధికారికంగా ఎట్లా నిర్వహించడం అనేది మరో కారణం. ఒకవైపు కాళోజీని, దాశరథిని కొనియాడుతూ, మరో వైపు నిజాం రాజును స్తుతించడం కేసీఆర్‌కే చెల్లింది. అయినా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఒక మతానికి వ్యతిరేకంగా కాదు, రాజరిక వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిస్తూ కమ్యూనిస్టుపార్టీ చేసిన ప్రకటన మీద సంతకాలు చేసిన ముగ్గురిలో కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రజాకవి మక్దూం మొహియుద్దీన్ ముఖ్యుడు. ఆయన స్వయంగా అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటంలో పాల్గొన్నాడు. నిజాంను వ్యతిరేకిస్తూ రజాకార్లకు వ్యతిరేకంగా, భూస్వాముల గూండాలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అనేక మందిలో షోయేబుల్లా ఖాన్, బందగి వంటి వారు కూడా ఉన్నారు. ఈ చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియకే సెప్టెంబర్ 17 పట్ల విముఖంగా ఉన్నారని అనలేం. అన్నిటిని మించిన అసలు కారణం 2001 కంటే ముందు తెలంగాణ చరిత్రకు సంబంధించి దేనినీ గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేకపోవడమే. 2001లో తాను తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తరువాత 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా జరిగిందే చరిత్రలో నిలిచిపోవాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తున్నది. 1969లో కానీ, అంతకు ముందు కానీ తెలంగాణలో సమరశీలపోరాటాలు జరిగాయని, వాటి పునాదుల మీదనే తమ నేతృత్వంలో జరిగిన మలి దశ టీఆర్ఎస్ ఉద్యమ విజయం సాధ్యం అయిందని ఆయన అంగీకరించరు. చరిత్ర అడగొద్దు, మేం చెప్పింది వినాలి అంటే కుదరదు. ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిపిన సుదీర్ఘ పోరాటాల ఫలితమే 69 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఇండియన్ యూనియన్‌లో విలీనమైందన్న మాట వాస్తవం. సెప్టెంబర్ 17ను దాని చారిత్రిక నేప«థ్యాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు అందరూ మానేస్తే మంచిది. చరిత్రను పాలకులు విస్మరిస్తారేమో కానీ, ప్రజలు మాత్రం మరవరు. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘నంద్యాల’ విజేత నల్లధనమే!
డేట్లైన్ హైదరాబాద్ ఒక్కసారి శోభా నాగిరెడ్డి మరణం సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉండగా ప్రమాదంలో మరణిస్తే కనీసం ఆ పిల్లలను పలకరించని, ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించని చంద్రబాబు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం పట్టుపడితే తప్ప మొక్కుబడిగా సంతాప తీర్మానం కూడా పెట్టని బాబు, ఆయన పార్టీ పాపం తల్లితండ్రులు లేని పసిపిల్లలు అని ఇప్పుడు సానుభూతి చూపడం ఓట్లు దండుకోవడానికే కదా! ఏ ఆట అయినా గెలవడానికే ఆడతారు ఎవరయినా! ఏ ఎన్నికలో అయినా గెలవాలనే పోటీ చేస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా! ఫలితాలు వెలువడిన తరువాత సమీక్షించుకోవడం సహజం. ఈ సమీక్ష మామూలుగా ఓడిన పక్షం వైపే ఎక్కువగా జరుగుతుంది. ఏయే కారణాల వల్ల ఓడిపోయాం? ఎక్కడ పొరపాటు జరిగింది? భవిష్యత్తులో గెలవడానికి పనితీరును ఎట్లా మెరుగు పరుచుకోవాలి...? ఇలా, ఈ రీతిలో సమీక్షించుకుంటారు. సోమవారం దేశ వ్యాప్తంగా జరిగిన నాలుగు శాసనసభా స్థానాల ఉప ఎన్నికల్లో అధికార పక్షాలే గెలుపొందాయి. గోవాలో రెండు స్థానాలనూ అక్కడి అధికార పక్షం భారతీయ జనతా పార్టీ, ఢిల్లీలో ఒక స్థానం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల స్థానాన్ని అధికార పక్షం తెలుగుదేశం పార్టీ గెల్చుకున్నాయి. మందీ మార్బలం, హంగూ ఆర్భాటం, అధికార యంత్రాంగం తమ పక్షాన పనిచేస్తాయి కాబట్టి సాధారణంగా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా అధికార పక్షాన్నే గెలుపు వరించడం సహజం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉప ఎన్నికల్లో అధికార పక్షం ఓడిపోవడం చూస్తాం. ఉప ఎన్నికలలో ఇది మామూలే ఇటీవలి చరిత్ర పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి ఫలితాలను మనం చూశాం. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 2006లో కేంద్ర మంత్రి పదవికీ, కరీంనగర్ లోక్‌సభ స్థానానికీ రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అధికార కాంగ్రెస్ అభ్యర్థి మీద రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, పార్లమెంట్ సభ్యత్వానికీ రాజీనామా చేసి కడప పార్లమెంట్ స్థానానికి మళ్లీ పోటీ చేసినప్పుడు అద్భుతమయిన ఆధిక్యం సాధించారు. ఆయనతో బాటు డాక్టర్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి కూడా పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ మంచి మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తరువాత జగన్మోహన్రెడ్డికి మద్దతుగా శాసనసభ్యత్వాలకూ, పార్లమెంట్ సభ్యత్వాలకూ రాజీనామాలు చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యధికులు గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత తెలంగాణలో కూడా పలువురు వివిధ పార్టీల శాసనసభ్యులు రాజీ నామా చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఈ అన్ని సందర్భాల్లోనూ కొన్ని స్పష్టమయిన అంశాలు ఎన్నికలను ప్రభావితం చేశాయి. కేసీఆర్ పోటీ చేసినప్పుడు, ఆ తరువాత తెలంగాణలో పలువురు శాసనసభ్యులు పోటీ చేసిన ప్పుడు ఉప ఎన్నికల మీద తెలంగాణ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉండటం చూశాం. జగన్మోహన్రెడ్డి పోటీ చేసిన ఉప ఎన్నిక తండ్రి మరణానంతరం ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి బలంగా ప్రభావం చూపింది. ఆ తరువాత కాలంలో వైఎస్ఆర్ సీపీలో చేరిన ఇతర పార్టీల ఎంఎల్ఏల ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఇదే అంశం అధికార పక్షం ఓడిపోడానికి కారణం అయింది. 2004 నుంచి 2014 దాకా చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో 40కి పైగా శాసనసభా స్థానాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగితే ఎక్కడా తెలుగుదేశం పార్టీ గెలవకపోగా 20 స్థానాలకు పైగా డిపాజిట్లు కూడా కోల్పోవడం గమనార్హం. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే కొందరు తెలుగుదేశం మంత్రులు, నాయకులు విజయోత్సాహం తట్టుకోలేక ప్రతిపక్షం పని అయిపోయింది, ఇక జగన్మోహన్రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుంది అని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మరి అంత దీనస్థితిలోకి తెలుగుదేశం పార్టీ ఆనాడు దిగజారితే ఆ పార్టీకి నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎందుకు సన్యాసం తీసుకోలేదు? నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి ఓటమికి ఆనాడు టీడీపీ వారి ఓటమికి ఎక్కడయినా పోలిక ఉందా? తప్పించుకోలేరు కాబట్టే... ఇక నంద్యాల ఉప ఎన్నిక విషయానికి వద్దాం. ఈ అసెంబ్లీ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందినది. ఈ స్థానం నుంచి గెలిచి, పార్టీ ఫిరాయించి అధికార పక్షానికి వలసపోయిన నాగిరెడ్డి మరణం కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరిగింది. నంద్యాలతో బాటు తమ పార్టీ నుంచి అధికార పక్షానికి వలసపోయిన మరో 20 శాసనసభా స్థానాలకు కూడా ఆ ఎంఎల్ఏలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూనే ఉంది. అందుకు ఏ మాత్రం సాహసం చెయ్యని చంద్రబాబునాయుడుకు నాగిరెడ్డి ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నికకు వెళ్లక తప్పలేదు. ఇప్పుడు నంద్యాలలో గెలిచాక ఇకపైన ఎక్కడ ఎన్నిక జరిగినా తమ పార్టీయే గెలుస్తుందని ప్రకటించుకున్నారు. అదేక్షణం మరి మిగిలిన 20 స్థానాలకు ఉప ఎన్నికలకు సిద్ధమేనా అంటే సమాధానం దాటవేసి వెళ్లిపోయారు. ఆ ఇరవై స్థానాలలో కూడా జరిగితే...! నిజంగానే నంద్యాల ప్రజలు ఈ మూడేళ్ల రెండుమాసాల కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసిన తీరుకు ముచ్చట పడి ఓట్లేసి గెలిపించి ఉంటే మిగిలిన 20 స్థానాల్లో కూడా ఎన్నికలను ఎదుర్కోడానికి వెనకాడటం ఎందుకు? ఆ సాహసం ఆయన చేయరన్న విషయం అందరికీ తెలుసు. అదే చేయవలసి వస్తే ఓ నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యాలి. ఒక్క ఎన్నిక కాబట్టి నంద్యాలలో 200 కోట్లతో సరిపెట్టారు. అట్లాగే ఒక్కచోటే ఎన్నిక కాబట్టి మొత్తం మంత్రివర్గాన్నీ, ఎంఎల్‌ఏలనూ, ఎంపీలనూ నెల రోజులపాటు నంద్యాలలోనేవిడిది చేయించారు. అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మోహరింప చెయ్యగలిగారు. ఫలితం వెలువడగానే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు, నంద్యాల ఉప ఎన్నిక కారణంగా రాష్ట్రమంతటా అభివృద్ధి ఆగిపోయిందని. ఒక్క ఉప ఎన్నిక కోసం మొత్తం అధికార యంత్రాంగాన్ని నంద్యాలకు తరలించమని ఎవరు చెప్పారు ఆయనకు? ఆ అవసరం ఎందుకొచ్చిందట! ఇంత చేస్తే ఈ మాత్రం గెలుపు సాధించగలిగారు. నంద్యాల ఫలితం వెలువడ్డ తరువాత పలువురు తెలుగుదేశం సీనియర్ నాయకులు సంతోషానికి బదులు దిగులు పడ్డారట. ఎందుకంటే ఒక్క నంద్యాల ఎన్నికకే 50 స్థానాల్లో పోటీ చేసినంత కష్టపడ్డాం, ఇక 2019 ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలో అని ఆందోళన చెందారట. అట్లాంటిది ఇప్పుడు 20 స్థానాలకు ఒక్కసారే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది? అందుకే చంద్రబాబు ఆ పనికి సిద్ధంగా లేకపోగా మీ ఎంపీలతో రాజీనామా చెయ్యించండని వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? సక్రమంగా గెలిచిన పార్లమెంట్ సభ్యులు రాజీనామా చెయ్యడమా, అక్రమంగా పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలు రాజీనామా చెయ్యడమా? దబాయించేస్తే సరిపోతుంది అనుకుంటే ఎలా? గెలుపు ఎవరిది? ఇంతకీ నంద్యాలలో ఎవరు గెలిచారు? మొత్తం ఎన్నికల కాలంలో ఒక్క క్షణం కూడా నోరు విప్పని భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారా, ఆయనకు టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గెలిచారా? సాంకేతికంగా గెలిచింది తెలుగుదేశం అభ్యర్ధి బ్రహ్మానందరెడ్డి అయినా, అసలు గెలిచింది మాత్రం మితిమీరిన అధికార దుర్వినియోగం, వందల కోట్ల రూపాయల నల్లధనం, అభివృద్ధి పేరిట జరిగిన విధ్వంసం, గెలిపించకపోతే అభివృద్ధిని ఆపేస్తామన్న బెదిరింపులు. నిజానికి నంద్యాల ఉపఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనవ్వుల పాలయ్యారు. పెద్ద నోట్ల రద్దు (డిమోనిటైజేషన్)తో నల్లధనం మొత్తం బయట పడిపోయిందని మోదీ చెబుతుంటే ఆయన మిత్రపక్షం తెలుగుదేశం మాత్రం నంద్యాల వీధుల్లో నల్లధనం పారిం చింది. భూమా నాగిరెడ్డి మరణం, అంతకు ముందే ఆయన భార్య శోభా నాగిరెడ్డి మరణం ఈరెండింటినీ సానుభూతిగా మలచి తనకు అనుకూలంగా మార్చుకోడానికి కూడా చంద్రబాబునాయుడు ఏ అవకాశమూ వదిలిపెట్టలేదు. తల్లీతండ్రీ లేని పిల్లలను చూసి తెలుగుదేశంకు ఓటు వెయ్యండని నంద్యాల వీధుల్లో ఆ ఇద్దరి మరణానికి సంబంధించిన వీడియోలు, లేజర్ షోలు చూపించారు. ఒక్కసారి శోభా నాగిరెడ్డి మరణం సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉండగా ప్రమాదంలో మరణిస్తే కనీసం ఆ పిల్లలను పలకరించని, ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించని చంద్రబాబునాయుడు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం పట్టుపడితే తప్ప మొక్కుబడిగా సంతాప తీర్మానం కూడా పెట్టని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ పాపం తల్లితండ్రులు లేని పసిపిల్లలు అని ఇప్పుడు సానుభూతి చూపడం ఓట్లు దండుకోవడానికే కదా! నంద్యాలలో ఓడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి పార్టీ ఫిరాయింపుల విషయంలో జాతీయ స్థాయిలో చర్చకు తెర తీయడంలో విజయం సాధించారు. ఆరేళ్ల శాసన మండలి సభ్యత్వానికి శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన రాజీనామా చిన్న త్యాగం కాదు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవాల్సింది ఎవరు? సాధారణంగా ఏ ఎన్నిక ఫలితాన్నయినా సమీక్షించుకునేది ఓడిపోయిన పక్షమే. కానీ ఇక్కడ అష్టకష్టాలు పడి, అన్ని అడ్డదారులూ తొక్కి గెలిచి ఓడిన అధికార పక్షమే సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
నైతికతకు పట్టం కట్టాల్సిన పోరు
డేట్లైన్ హైదరాబాద్ నంద్యాల ఉపఎన్నికలో గెలవడానికి చంద్రబాబు ఇంత అవస్థ ఎందుకు పడుతున్నారు? ఆయనా, ఆయన మంత్రులు, అనుచరగణం కలసి వందలు, వేల కోట్ల రూపాయల పనులు చేస్తామని నంద్యాల ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? తన పాలన పట్ల ప్రజాభిప్రాయం ఎట్లా ఉందో ఆయన చేయించుకున్న సర్వేలే స్పష్టం చేశాయి మరి. ఏ మాత్రం వీలున్నా, ఎన్నికల కమిషన్ కూడా స్పీకర్ల వ్యవస్థ లాగా తన చెప్పుచేతల్లో నడిచేదే అయితే, తప్పకుండా ఆయన ఈ ఉపఎన్నికను జరగకుండా ఆపించి ఉండేవారు. నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో కాంగ్రెస్ వాళ్లను తిట్టడానికి ఒక మాట వాడేవారు. ఆయనకు ఆ మాటంటే చాలా మోజు. పదే పదే వాడే వారు. జనానికి కూడా బాగా నచ్చింది. ఆయన నోటి వెంట ఆ మాట వచ్చిన ప్రతిసారీ సభ ఆవరణ అంతా ఈలలూ, చప్పట్లతో మార్మోగేది. కొన్ని వందల బహిరంగ సభల్లో ఆయన ఆ మాట వాడి ఉంటారు. రాజకీయాల్లో ఆ మాట బాగా ప్రసిద్ధి చెందింది కూడా ఆయన కారణంగానే. ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్లను తిట్టడానికి ఆయన వాడిన ఆ మాట ‘‘కుక్కమూతి పిందెలు’’. రాజకీయాల్లో అక్కడక్కడ కుక్కమూతి పిందెలు మొలవడం సహజమే. కానీ, తాను స్థాపించిన పార్టీయే తరువాత కాలంలో, తన సొంత అల్లుడి నేతృత్వంలోనే కుక్కమూతి పిందెలకు నిలయం అవుతుందని మహానుభావుడు ఎన్టీ రామారావు ఊహించి కూడా ఉండరు. ఆయనే జీవించి ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకా ఆయన అదుపులోనే ఉంటే కచ్చితంగా ఈ కుక్కమూతి పిందెలను ఎరివేసేవారు, అది సాధ్యం కాదనుకుంటే పార్టీనే రద్దు చేసి ఉండేవారు. కొందరు ఆయన చర్యలను మూర్ఖత్వం కింద కొట్టిపారేసినా, నమ్మిన దానికోసం అధికారాన్నే తృణప్రాయంగా ఎడమ చేత్తో విదిలించి పారేసిన నాయకుడు ఎన్టీఆర్. విలువలకు పట్టంగట్టిన నేత ఎన్టీఆర్ ఆయన రాజకీయ జీవితం కేవలం పద్నాలుగు సంవత్సరాలే. ఆ స్వల్ప కాలంలోనే ఆయన రెండుసార్లు అధికారం కోల్పోతానని తెలిసి కూడా తాను చెయ్యదల్చుకున్నది చేసేశారు. అంతే తప్ప, అధికారాన్ని కాపాడుకోవాలని, పట్టుకుని వేళ్లాడాలని కుక్క మూతి పిందెలను దరిచేరనివ్వలేదు. ఎన్నికల ముంగిట్లో నిలబడి కూడా మంత్రి వర్గాన్ని మొత్తంగా రద్దు చేసి పారెయ్యగలిగిన ధైర్యం ఆయనది. ఆ కారణంగానే ఆయన 1989లో అధికారం కోల్పోయారు. మళ్లీ 1995లో అదే జరిగింది. శ్రేయోభిలాషుల సలహా పాటించి ఒంటరిగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు ఏర్పాటు చేసిన క్యాంప్‌కు వెళ్లి ఎంఎల్ఏలను కలసి ఉంటే అల్లుడి రాజకీయ జీవితం అక్కడితో ముగిసి ఉండేది. వైస్రాయ్ హాటల్ క్యాంప్ రాజకీయాలను ఒక ప్రధాన దినపత్రిక ముఖ్య విలేకరిగా ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్ట్‌గా ఆ మాట కచ్చితంగా చెప్పగలను. విలేకరులం ఆ క్యాంప్‌లోని ఏ శాసన సభ్యుడిని కదిలించినా ఎన్టీ రామారావుకు ద్రోహం చేస్తున్నామన్న బాధ, ఆవేదన వారిలో స్పష్టంగా కని పించేది. ఒక్కసారి అన్నగారు క్యాంప్‌కు వచ్చి భరోసా ఇస్తే మూకుమ్మడిగా ఆయన వెంట బయటికి వెళ్లిపోయి ఉండేవారు ఎంఎల్ఏలు. ఎక్కువ మంది ఎంఎల్ఏలు క్యాంప్‌లో ఉండిపోయి చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వడానికి కారణం ఎన్టీఆర్ శాసన సభ రద్దు కోసం గవర్నర్‌కు సిఫారసు చెయ్యబోతున్నాడనే ప్రచారాన్ని చంద్రబాబు బలంగా వ్యాపింప చెయ్యడమే. ఎన్టీఆర్ స్వయంగా, ఒంటరిగా వచ్చి, అట్లా చెయ్యబోనని ఒక్కమాట అని ఉంటే ఆ భరోసాతో వారు ఆయనతో వెళ్లి ఉండే వారు. చంద్రబాబు పని ఆనాడే ‘‘ఖేల్ ఖతం దుకాన్ బంద్’’ అయ్యుండేది. కానీ ఎన్టీఆర్ ఆ పని చెయ్యలేదు. అధికారం కోల్పోయారు. అయితేనేం విలువలకు కట్టుబడి ఉన్న పేరు నిలిచిపోయింది. అధికారం శాశ్వతం అనో లేదా అది శాశ్వతంగా తనకే ఉండాలనో కోరుకున్న వారు కాదు కాబట్టే ఎన్టీ రామారావు ఆ పని చెయ్యగలిగారు. ఆయన చనిపోయి రెండు దశాబ్దాలు దాటినాక, ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవడం ఇప్పుడెందుకు? అని ఎవరయినా అడగొచ్చు. కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ స్థానానికి ఈ నెల 23వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న సందర్భంగా... అటు అధికార పక్షం అయిన తెలుగుదేశం పార్టీ, దాని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలకిందులుగా చేస్తున్న విన్యాసాలనూ, ఇటు రాజకీయాల్లో విలువలను ముందుకు తీసుకుపోతానని చెప్పడమే కాదు, పాటించి చూపుతున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్నీ పోల్చి చూస్తుంటే ఎన్టీఆర్ నడిపిన రాజకీయాలను గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది. అధర్మ యుద్ధం సాగిస్తున్న అధికార పక్షం ఎన్టీ రామారావు జీవించి ఉంటే జగన్మోహన్రెడ్డిని, శిల్పా చక్రపాణిరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందించి ఉండేవారు. ఒక పార్టీ ద్వారా ఎన్నికై, ఇంకో పార్టీలోకి వెళ్లాలనుకునే వారు వారి పదవులకు రాజీనామా చెయ్యాల్సి ఉంటుందని పార్టీ పెట్టిన కొద్ది రోజులకే తిరుపతి మహానాడులో నిర్ణయించి, దానికి కట్టుబడనందుకు ఆదయ్య, నారాయణ వంటి వారిని పార్టీ నుండి బహిష్కరించారు. అలాంటి తన విగ్రహానికి మొక్కుబడిగా దండలు వేసి తన విధానాలను, విలువలను ఏట్లోకి విసిరేసిన నేటి తెలుగుదేశం పార్టీని, దాని ప్రస్తుత నాయకుడిని కచ్చితంగా ఛీత్కరించుకుని ఉండేవారు. ఎన్టీఆర్ కోరుకున్న విలువలను పాటిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన చీదరించుకున్న, ద్వేషించిన కుక్కమూతి పిందెలతో నిండిన అధికార పక్షం చేస్తున్న అధర్మ యుద్ధాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో సమర్థించి ఉండేవారు కాదు. తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి, దొంగ వేషాలూ దొడ్డి దారులూ వెతుక్కోకుండా, స్పీకర్ ఫార్మాట్లో ఆ రాజీనామాను సమర్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన చక్రపాణిరెడ్డి రాజీనామాను పది రోజుల్లో ఆమోదించారు. ఈ పని వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి ఫిరాయించి అధికార పక్షం పంచన చేరిన 21 మంది శాసన సభ్యుల విషయంలో ఎందుకు జరగలేదు. ఆ 21 మందిలో ఒకరు చనిపోయారు, ఆ కారణంగానే నంద్యాలకు ఉప ఎన్నిక అవసరం అయింది. మిగిలిన 20 మంది తమ పదవులకు రాజీనామాలు ఎందుకు చెయ్యలేదు? అందులో నలుగురు మంత్రివర్గంలో చేరిన పూటే రాజీనామాలు సమర్పించారని, అవి స్పీకర్‌కు అందాయని చివరి నిముషంలో చెప్పారు. అలాంటప్పుడు చక్రపాణిరెడ్డి రాజీనామాతో బాటు ఆ నలుగురి రాజీనామాలను కూడా ఆమోదించి ఉండాలి కదా, అదెందుకు జరగలేదు? చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదంలో చూపిన వేగం, వారి విషయంలో ఎందుకు లేకుండా పోయింది? దీనికి సమాధానం చెప్పడం చాలా సులభం. ప్రజాభిప్రాయం, ప్రజాభి మతం, ప్రజామోదం ఎవరి వైపు ఉంటాయో వారికే నైతిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం బలంగా ఉంటాయి. వారు ఏ నిర్ణయం అయినా నిబ్బరంగా తీసుకోగలరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఉన్నది, తెలుగుదేశం పార్టీకి లేనిది అదే. దివాలాకోరు రాజకీయాలను ప్రజలు క్షమించరు, తిరస్కరిస్తారు, బుద్ధి చెపుతారు కాబట్టి వీలయినంత కాలం పదవులు పట్టుకు వేళ్లాడుదామని చూసే వాళ్లనే ఎన్టీ రామారావు కుక్క మూతి పిందెలు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో గెలిచి పదవులు వీడకుండా అధికార పక్షం వైపు వలసపోయిన వాళ్లు ఆ కోవకు చెందిన వారే. నంద్యాల కోసం ఎందుకిన్ని పాట్లు అసలు చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికలో గెలవడానికి ఇంత అవస్థ ఎందుకు పడుతున్నారు? ఆయన అధికారంలోకి వచ్చాక మూడేళ్లు నంద్యాల వైపు తొంగి కూడా చూడని ఆయనా, ఆయన మంత్రివర్గ సహచరులూ, పార్టీ నాయకులూ, కిరాయికి తెచ్చిన వందలాది మంది నకిలీ కార్యకర్తలూ కలసి వందలు, వేల కోట్ల రూపాయల పనులు చేస్తామని నంద్యాల ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నంద్యాలలో ఓడిపోతే చంద్రబాబు ప్రభుత్వం ఏమీ పడిపోదు. అదసలు ఆయన పార్టీ గెలిచిన స్థానమే కాదు. ఇదో ఉప ఎన్నిక, మేం చేసిన అభివృద్ధిని చూసి జనం ఓట్లేస్తారని, అభ్యర్థిని ప్రకటించి, ప్రచార బాధ్యతలను స్థానిక నాయకత్వానికి అప్పజెప్పి.. తాను ప్రభుత్వాన్ని నడిపే పని చెయ్యెచ్చు కదా! ఈ నెల మూడవ తేదీన జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు 2019లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నాంది అని చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. అసలు ఉపఎన్నికలు రావడమే ఆయనకు ఇష్టం లేదు. తన పాలన పట్ల ప్రజాభిప్రాయం ఎట్లా ఉందోనని పలుమార్లు ఆయన స్వయంగా చేయించుకున్న సర్వేలు స్పష్టం చేశాయి, మరి. కానీ భూమా నాగిరెడ్డి హఠాత్తుగా చనిపోవడంతో, ఏదో సామెత చెప్పినట్టు చంద్రబాబు ప్రాణం మీదికి వచ్చింది. ఏ మాత్రం వీలున్నా, ఎన్నికల కమిషన్ కూడా స్పీకర్ల వ్యవస్థ లాగా తన చెప్పు చేతల్లో నడిచేదే అయితే, తప్పకుండా ఆయన ఈ ఉపఎన్నికను జరగకుండా ఆపించి ఉండేవారు. ఎన్నిక తప్పనిసరి కావడంతో ఆయన నంద్యాల ప్రజలకు చంద్రుడిని కూడా తెచ్చిస్తానని చెపుతున్నారు. అయితే నంద్యాలలో మకాం వేసిన మంత్రివర్యులంతా ‘‘మరి చంద్రబాబు నాయుడు చంద్రుడిని సగం దూరం తెచ్చారు, మీరు ఈ ఉప ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించకపోతే ఆ చంద్రుడు వెనక్కి వెళ్లి పోతాడు’’ అన్నట్టు రోజూ హెచ్చరిçకలు చేస్తూ వీధుల వెంట తిరుగుతున్నారు. ఎవరు గెలిచినా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా జరగాల్సిందే. ప్రతిపక్షాల నియోజకవర్గాలు అభివృద్ధికి, సంక్షేమానికి పనికి రావు అని మన రాజ్యాంగం చెప్పలేదు, చట్టాల్లో రాసి లేదు. అదే నిజమయితే అధికార పక్షం ఓడిపోయిన ప్రతి నియోజక వర్గమూ వెనకబడి పోవాల్సిందే కదా. నంద్యాల ప్రజలకు, ఆ మాట కొస్తే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలం దరికీ ఆ విషయం బాగా తెలుసు. నిజానికి ప్రస్తుత నంద్యాల ఉపఎన్నికను మిగిలిన అన్ని అంశాలనూ పక్కన పెట్టి రాజకీయాల్లో నైతికత, అనైతికత మధ్య పోరాటంగా పరిగణించి ఓటర్లు తీర్పు చెప్పాలి. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘దక్షిణం’ కోసం ప్రదక్షిణలు
డేట్లైన్ హైదరాబాద్ తనను తీవ్రంగా వ్యతిరేకించి, అవమానకరంగా వ్యవహరించిన నితీశ్‌నే అక్కున చేర్చుకున్న మోదీ చంద్రబాబు ఆనాడు చేసిన అవమానాన్ని తమ రాజకీయ ప్రయోజనం కంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకుంటారా? అదేమైనా మనసులో ఉన్నా అసలు కారణాలు వేరే ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, అన్ని వర్గాలనూ దూరం చేసుకున్న పరిస్థితిలో మునుగుతున్న పడవలో ప్రయాణం చెయ్యాలని ఎవరనుకుంటారు? ఈ ఆగస్టులో ఏపీ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఏం చేయాలని అనుకుంటున్నది? తెలంగాణలో అధికారపక్షాన్ని తన దారికి తెచ్చుకుని, ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షంతో తెగతెంపులు చేసుకోవాలని అనుకుంటున్నదా? మిత్రుపక్షాలైనా సరే, భారంగా మారతాయనిపిస్తున్న పార్టీలను వదిలించుకుని కొత్త స్నేహాల కోసం బీజేపీ చేయి చాస్తున్నట్టు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదేదో రెండు తెలుగురాష్ట్రాలలో తన వ్యూహంగా మాత్రమే బీజేపీ చేస్తున్నట్టు లేదు. 2019 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బీజేపీకి గతంలో కంటే ఎక్కువ స్థానాలను సాధించుకోవడంతో బాటు, రాష్ట్రాల్లో కూడా తమ ప్రభుత్వం లేదా తమ మిత్రుల ప్రభుత్వాలు అధికారంలో ఉండేటట్టు చూసుకోవడం నరేంద్ర మోదీ, అమిత్ షా తాజా వ్యూహం. తద్వారా లోక్‌సభతో బాటు రాజ్యసభలో కూడా తమ మాట నెగ్గేటట్టు చేసుకుంటే ఇక అడ్డు ఉండదన్నది ఆ నాయకద్వయం ఆలోచన. సంపూర్ణ అధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్న ఈ నాయకులు ఇద్దరికీ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల మీద ప్రత్యేకమైన ప్రేమ కానీ, ద్వేషం కానీ లేవు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న మాటను నూటికి నూరు పాళ్లు నిజం చేస్తూ మొన్ననే బిహార్‌లో నితీశ్‌కుమార్ మోదీ శిబిరంలో చేరిపోవడం, మోదీని మించిన నాయకుడు ఈ దేశంలోనే లేరు అనేంత దాకా వెళ్లడం చూశాం. ఇంకెవరయినా ఈ మాటలు మాట్లాడితే ఆశ్చర్యపోనక్కర లేదు. నితీశ్ బీజేపీతో జత కట్టడాన్ని ఘర్‌వాపసీ అంటున్న వాళ్లంతా మోదీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ససేమిరా అనే నితీశ్ ఎన్డీఏ కూటమిని వీడిన విషయం, ఒక దశలో బీజేపీయేతర పార్టీలన్నిటికీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొచ్చిన విషయం మరిచిపోయినట్టున్నారు. ఇటీవలే జరిగిన బిహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యు) మధ్య జరిగిన మాటల యుద్ధం కూడా గుర్తు చేసుకోవాలి వాళ్లు. నైతికమా అనైతికమా, న్యాయమా అన్యాయమా, చట్ట విరుద్ధమా రాజ్యాంగ బద్ధమా అన్న చర్చ చేయడానికి కేంద్రంలోఅధికారంలో ఉన్న మోదీ షా జోడీ ఆలోచించేందుకు సిద్ధంగా లేదు. దేశాన్నంతటినీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం లక్ష్యంగా ముందుకు పోతున్నారు. తమిళనాడు పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం కదా! ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాడు ఇక బీజేపీ అదుపులోకి వచ్చినట్టే. బిహార్ బీజేపీ బుట్టలో పడనే పడింది. దీంతో 15 రాష్ట్రాలు బీజేపీ పాలనలోకి వచ్చేసినట్టే. నియోజకవర్గాల పెంపు లేకపోతే... తమిళనాడులో ఏఐడీఎంకే గ్రూపులు దారికి రాకపోతే రాష్ట్రపతి పాలన విధించి 2018లో మరికొన్ని రాష్ట్రాలతో బాటు ఎన్నికలు నిర్వహించవచ్చు. దక్షిణాదిలో కూడా అధికారంలోకి రావాలన్న బీజేపీ వ్యూహకర్తల లక్ష్యంలో భాగంగా తమిళనాడును దారికి తెచ్చుకునే పనిలోపడ్డట్టున్నారు. కర్ణాటకలో గతంలో అధికారం అనుభవించిన బీజేపీ మళ్లీ అధికారం లోకి వచ్చే అవకాశాల పట్ల ఆశతోనే ఉంది. కేరళ కొరకరాని కొయ్య. ఇక పోతే దక్షిణాదిలో మిగి లింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్–రెండు తెలుగు రాష్ట్రాలు. ఇటీవలి పరిణామాల నేప«థ్యంలో ఈ రెండు రాష్ట్రాలలో మోదీ షా జోడీ ఏం చేయబోతున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ అధికార పక్షాలు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లో మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను మాత్రం కచ్చితంగా పెంచేందుకు కేంద్రాన్ని ఒప్పించగలమన్న ధీమాతో ఎడా పెడా ప్రతిపక్షాల నుంచి శాసనసభ్యులను చేర్చుకుని కూర్చున్నారు. తెలంగాణలో 25 మంది, ఆంధ్రప్రదేశ్‌లో మరో 21 మంది శాసనసభ్యులు, కొంతమంది లోక్‌సభ సభ్యులు అధికార పక్షానికి వలసపోయారు. ఇద్దరికీ మిత్రుడిగా, తమ ప్రయోజనాల పరిరక్షకుడిగా చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు భావించిన వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి పదవికి పంపించడం, ఆ వెంటనే, నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదని స్పష్టం చెయ్యడంతో ఇద్దరు నేతలూ దిక్కు తోచని స్థితిలో పడ్డారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రిని కలసి నియోజకవర్గాల పెంపు విషయంలో స్పష్టమయిన ప్రకటన చేయించుకు రావాలని గట్టి ఆలోచనతో వెళ్లారు. చంద్రబాబునాయుడుకు య«థావిధిగానే ప్రధానమంత్రి అపాయిం ట్మెంట్ దొరకలేదు. అయితే ప్రధానితో సమావేశం కోసం వేచి ఉండకుండా తొందర పనులు ఉన్నందున చంద్రబాబే విజయవాడకు వెళ్లిపోయారని ఆయన అనుయాయులు నమ్మించే ప్రయత్నం చేశారనుకోండి! ఇక ప్రధానమంత్రి అపాయింట్మెంట్ పొంది మరునాడు ఆయనను కలసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఆ అంశం మరిచిపోవచ్చునని మీడియా మిత్రులకు చెప్పారు. నియోజకవర్గాల సంఖ్య పెరగకపోయినా మాకేం ‘ఫరక్’ పడదు అని ఆయన గాంభీర్యం ప్రదర్శించినా కొంచెం స్వరం మారడం గమనించవచ్చు. గత సంవత్సరం మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన వెంటనే తీవ్రంగా స్పందించి, తెలివి తక్కువ చర్యగా వర్ణించిన చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి ఉపదేశం విన్నాక కనువిప్పు కలిగి అదొక విప్లవాత్మక నిర్ణయం అని కొనియాడారు. ఏం మతలబు జరిగిందో ఆయనకే తెలియాలి. ఇంతమాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే మొన్న ప్రధానిని కలసి బయటికొచ్చాక అదే చంద్రశేఖర్‌రావు పెద్ద నోట్ల రద్దు సత్ఫలితాలు ఏమీ కనిపించలేదని మీడియాకు చెప్పారు. సొంతంగా ఎదిగేందుకు బీజేపీ కృషి ఈ మధ్యకాలంలో ఒకపక్క తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శల బాణాలు విసురుతూనే ఉన్నా స్నేహబంధం కుదిరిపోయిందనీ, ఈ పార్లమెంట్ సమావేశాల తరువాత టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరనుందనీ వార్తలు వచ్చాయి. కేసీఆర్ కూడా అమిత్ షాను విమర్శించినా కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ మీద ఈగ వాలనివ్వక పోవడం ఆ ప్రచారానికి ఆస్కారం కల్పించింది. అంతెందుకు, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చి మర్యాద పూర్వకంగా కలుస్తానన్నా కనీసం ఫోన్లో కూడా ఆమెతో మాట్లాడటానికి సిద్ధపడక పోవడం బీజేపీ మెప్పు కోసమే అన్న విమర్శ అయితే ఉంది. సొంతంగానే పోటీ చేస్తాం అని శ్రేణుల్లో ఉత్సాహం కలిగించడం కోసం మాట్లాడుతున్నా టీఆర్ఎస్ అధినేతకు పరిస్థితులు బాగా తెలుసు, వచ్చే ఎన్నికలలో గెలుపు నల్లేరు మీద నడక కాదని. నియోజకవర్గాల పెంపు లేకపోతే అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యం. ఆ విధంగా తెలంగాణ లో అధికారపక్షం తమతో పొత్తుకు ముందుకు రాక తప్పని పరిస్థితి కల్పిస్తూనే సొంతంగా ఎదిగే ప్రయత్నంలో బీజేపీ పడ్డట్టుంది. మోదీ అమిత్ షా ఎత్తుగడలను తట్టుకుని టీఆర్ఎస్ సొంతంగానే నిలబడుతుందా, సర్దుకుపోతుందా చూడాలి. టీడీపీతో బెడిసిన సంబంధాలు ఇక ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. వాజ్‌పేయి, అడ్వానీల కాలం నాటి ఎన్డీఏ కాదనీ మోదీ, అమిత్ షాల కాలమనీ గుర్తించడానికి చంద్రబాబునాయుడుకు ఎక్కువ కాలం పట్టలేదు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబునాయుడుకు ముందు వరుసలో స్థానం కేటాయించారని అనుకూల మీడియాలో రాయిం చుకోవడం కేవలం ఢిల్లీలో ఇంకా తమకు సముచిత గౌరవం ఉందని చెప్పుకోవడానికే. ఈ మూడేళ్లకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం నడుస్తున్న తీరు తెలియనంత అజ్ఞానంలో బీజేపీ నాయకత్వం ఉండదు కదా! కేంద్రం విడుదల చేసిన నిధులను ఖర్చు చేస్తున్న తీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దల వ్యవహార శైలి ఎప్పటికప్పుడు తెలుసుకుం టున్న కేంద్ర నాయకత్వం ఇక్కడ కూడా సొంతంగా పార్టీని బలోపేతం చేసే ఆలోచనతో బాటు, ప్రత్యామ్నాయ మిత్రులను వెతుక్కోవడం సహజంగానే జరుగుతున్నది. ఇక్కడొక విషయం మాట్లాడుకోవాలి. దేశమంతా ఇంతకాలం బీజేపీకి దూరంగా ఉన్న పలు పార్టీలు దగ్గరై ఎన్డీఏలో చేరడానికి సిద్ధపడుతుంటే, పాత భాగస్వామి తెలుగుదేశం ఎందుకు దూరమవుతున్నది అన్నదే ఆ విషయం. రాజకీయ దురంధరుడినని తనకు తానే కితాబు ఇచ్చుకునే చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణవాయువు వంటి ప్రత్యేక హోదా మొదలైన అన్ని హామీలను గాలికి వదిలేసి అణిగి మణిగి ఉన్నా ఎందుకు బెడిసింది? కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీనపరిచే క్రమంలో వీలైనన్ని పార్టీలను తమ కూటమిలో చేర్చుకోజూస్తున్న బీజేపీ ఆయనను ఎందుకు దూరం పెడుతున్నది? నేలకు ఒరిగిపోతున్న చంద్రబాబు రాజకీయ ప్రతిష్ట వెన్నుకు వెదురు బద్దలు కట్టి నిటారుగా నిలబెట్టే ప్రయత్నంలో తలమునకలవుతున్న ఆయన మిత్ర మీడియా చెప్పినట్టు వాజ్‌పేయి హయాంలో ఎన్డీఏ కన్వీనర్‌గా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీని పదవి నుంచి తొలగించాలని పట్టుపట్టి ఢిల్లీ ఆంధ్రభవన్లో మూడు గంటలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించినందుకే ఇప్పుడు మోదీ చంద్రబాబును దూరం పెడుతున్నారా? తనను తీవ్రంగా వ్యతిరేకించి, అవమానకరంగా వ్యవహరించిన నితీశ్‌నే అక్కున చేర్చుకున్న మోదీ చంద్రబాబు ఆనాడు చేసిన అవమానాన్ని తమ రాజకీయ ప్రయోజనం కంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకుంటారా? అదేమైనా మనసులో ఉన్నా అసలు కారణాలు వేరే ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, అన్ని వర్గాలనూ దూరం చేసుకున్న పరిస్థితిలో మునుగుతున్న పడవలో ప్రయాణం చెయ్యాలని ఎవరనుకుం టారు? ఇక ఎవరి సర్వేలు వాళ్లకు ఉంటాయికదా! హనీమూన్ ఇక ముగిసినట్టే. ఈ ఆగస్టు మాసంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తి కరమైన మలుపులు తిరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక ఇదే నెలలో జరుగుతున్నది, అక్కడ జరుగుతున్న అధికారదుర్వినియోగం, ధన ప్రవాహం అధికార పక్షం ఎంత దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిందో స్పష్టం చేస్తున్నది. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
'సూటి మాట’ ఆవిష్కరణ
విజయవాడ: రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాజకీయాల విశ్లేషణపై సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ రాసిన సూటి మాట పుస్తకాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. చరిత్రకు సాక్ష్యాధారాలుగా అమర్ రాసిన పుస్తకం పనికి వస్తుందని వక్తలు కొనియాడారు. రాష్టానికి సంబంధించిన వివిధ సంఘటలను కళ్ళకు కట్టినట్లు పుస్తకంలో వివరించారని, పత్రికల్లో సంపాదకీయం రాయడం కొంతమందికి మాత్రమే సాధ్యమని, వారిలో అమర్ ఒకరని అన్నారు. పేరుకు తగ్గట్టుగానే పుస్తకంలో అమర్ అన్ని విషయాలు సూటిగా రాశారన్నారు. విభజన తరువాత రెండు రాష్ట్రాల ఆర్థిక విధానాల్లో పెద్దగా మార్పు లేదనన్నారు. ప్రధానంగా ప్రజా సమస్యలపై మీడియా దృష్టి సారించాలన్నారు. జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ తనకు అమర్‌తో 32 ఏళ్ల పరిచయం ఉందని, ఏదైనా సూటిగానే కాదు కర్కశంగా కూడా చెబుతారని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సాక్షి, ఈనాడు పేపర్లు చదువుతానని, ఈ రెండు పేపర్లు చదివితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. జర్నలిజం ప్రజాహితాన్ని కోరాలన్నారు. మనం ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాం అన్నది ఆలోచించాలి అని సూచించారు. రాజకీయాల్లో అసహనం పెరిగిపోయింది: అమర్ పాతికేళ్లుగా కాలమ్స్ రాస్తున్నానని, మధ్యలో ఐదు సంవత్సరాలు ప్రెస్ అకాడమి ఛైర్మన్ గా ఉన్నప్పుడు మాత్రమే కాలమ్స్ రాయలేదని, సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి ప్రోత్సహంతోనే రెండవసారి కాలమ్స్ మొదలుపెట్టానని అమర్ చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో అసహనం పెరిగిపోయిందని, తాము తప్ప రాజకీయాల్లో ఎవరూ ఉండకూడదనే భావన పెరిగిపోయిందని అన్నారు. సమాజానికి రాజకీయ, న్యాయ వ్యవస్థ ఎంత అవసరమో మీడియా కూడా అంతే అవసరమన్నారు. మీడియాను అణగదొక్కాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అయితే వారికి అది కుదరడం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ పక్షాల్లో పెరిగిన అసహనం కారణంగానే కాలమ్స్ రాస్తున్నానంటూ ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు ప్రజలు ఎప్పటికీ కలిసే ఉండాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ సచివాలయాన్ని పాడు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
'సూటి మాట’ ఆవిష్కరణ
-
ఒక ఉప ఎన్నిక, ఒక ఉలికిపాటు
డేట్లైన్ హైదరాబాద్ నంద్యాల స్థానం కోసం చంద్రబాబునాయుడు ఎందుకు అంత తహతహలాడిపోతున్నారు? ఎందుకు తెలుగుదేశం పార్టీ వందల కోట్ల రూపాయలు వెదజల్లడానికి సిద్ధపడుతున్నది? పెద్ద సంఖ్యలో బడా నాయకులను, మంత్రులను నంద్యాలలో దింపుతున్నది? మూడేళ్లలో ఎన్నడూ నంద్యాల మొహం చూడని మున్సిపల్ మంత్రి నారాయణ ఇప్పుడు అక్కడే మకాం వేసి అభివృద్ధి జపం ఎందుకు చేస్తున్నారు? నంద్యాల ఉపఎన్నిక ఫలితం వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతం కాబోతున్నదా? భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల శాసనసభ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నిక మీద ఇవాళ అందరి దృష్టి పడింది. ఈ ఎన్నిక తీరుతెన్నులను పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తుంటే, రాజకీయ పక్షాలు, ముఖ్యంగా అధికార పక్షం ఉద్విగ్న క్షణాలను లెక్కపెట్టుకుంటున్నది. నిజానికి 175 స్థానాలు కల ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతానికి అధికార తెలుగుదేశం పక్షానికి కావలసిన దానికన్నా ఎంతో ఎక్కువ మెజారిటీ ఉంది. బీజేపీ, పవన్ కల్యాణ్‌ల సహాయంతో తాను గెల్చుకున్న సీట్లే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుక్కున్న 20 మంది కూడా ఉన్నారు, కాబట్టి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల వరకు «ఢోకా లేదు. మరి ఎందుకు చంద్రబాబునాయుడు అంత టెన్షన్ పడుతున్నారు? ఏపీ ముఖ్యమంత్రికి ఎందుకీ హైరానా? వేర్వేరు కారణాల వల్ల అనేకసార్లు ఉప ఎన్నికలు వస్తుంటాయి. చాలా సందర్భాలలో అవేమీ ప్రభుత్వాలను తలకిందులు చేసే విధంగా ఉండవు. చాలా యాంత్రికంగా జరిగిపోతాయి. ఆ ఒక్క నియోజకవర్గ ఫలితం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ కలిగించ బోవడంలేదు. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏమీలేదు. మరి ముఖ్యమంత్రికి ఈ ఆందోళన ఎందుకు? ఆ టెన్షన్లో ఆయన ఎందుకు మానసిక సమతౌల్యాన్ని కూడా కోల్పోయి ప్రజల మీద విరుచుకుపడుతున్నారు? రాష్ట్రం తన సొంతం అయినట్టూ, బొక్కసంలో ధనమంతా తన పూర్వీకులు కష్టపడి సంపాదిస్తే తాను మాత్రం ప్రజల కోసం ఖర్చు చేస్తున్నట్టూ భావించుకోవడం ఎందుకు? రాజరిక వ్యవస్థలో కూడా రాజులు ప్రజల బాగు కోసం చేసే ఖర్చు గురించి అట్లా అనుకుని ఉండరు. ఎందుకంటే రాజరిక వ్యవస్థలో అయినా, ప్రజాస్వామ్యంలో అయినా ఖర్చు చేసేదంతా ఆనాడు కప్పం రూపంలో, ఈనాడు పన్నుల రూపంలో ప్రజలు ఇచ్చిందే. అది ప్రజాధనమే కదా! ప్రజాధనానికి తాము ధర్మకర్తలం అన్నమాట మరిచిపోయి విదేశీ, స్వదేశీ ప్రయాణాలకు, ప్రముఖులకు ఇచ్చే ఆడంబరపు విందు వినోదాలకు, తన సొంత నివాస సముదాయాలకు, ప్రజోపయోగం ఏ మాత్రం లేని ఆర్భాటాలకు తానూ, తన ప్రభుత్వం చేస్తున్నది వృ«థా ఖర్చు అని, ఆ దుబారా చేసే అధికారం తనకు ప్రజలు ఇవ్వలేదనీ ఎందుకు మరిచిపోతున్నారు? ‘నా బియ్యం తింటున్నారు, నేనిచ్చే పెన్షన్ డబ్బులు తింటున్నారు, నేనేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను పెట్టించిన దీపాల వెలుగులో ముందుకుపోతున్నారు’ అని బహిరంగ వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. వయసు మీద పడుతున్న కారణంగా ఆయన మానసిక సమతౌల్యం కోల్పోయారనుకోవడం ఒకట యితే, అధికారం చేజారిపోయే క్షణాలు కళ్ల ముందు కనిపించడం రెండవది. ఈ రెండు కాక, మరొక కారణం ఇంకొకటి ఏదైనా ఉంటే ఆయనే చెప్పాలి, అదేమిటో. ఆయన మాట్లాడుతున్న మాటలూ, అడ్రస్ లేని సంస్థల చేత సర్వేలు చేయించుకుని మళ్లీ అధికారం తథ్యమని తన సొంత మీడియాలో ఊదరగొట్టించుకోవడం ఇవన్నీ ఆయన మానసిక ఆందోళనకు అద్దం పడుతున్నాయి. నా బియ్యం తింటున్నారు అంటున్నారు తప్ప, కనీసం నా ప్రభుత్వం అని కూడా అనేందుకు ఆయనకు నోరు రావడం లేదంటే ఆయన ప్రభుత్వంలోని సహచర మంత్రులు, నాయకులే ఆలోచించుకోవాలి తాము ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంత్రులమా, లేకుంటే రాజు గారి దగ్గర బంటులమా అన్న విషయం. ఆసిఫ్‌నగర్ ఎన్నికను గుర్తు చేసుకోండి! ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఉప ఎన్నికలు తరచూ వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవి ప్రతిష్టాత్మకం కూడా కావచ్చు. ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించేవిగా కూడా ఉండవచ్చు. కానీ రానున్న కొద్దిరోజుల్లో జరగబోయే నంద్యాల ఉప ఎన్నిక అలాంటి కోవలోకి వచ్చేది కాదు. ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు మరణిస్తే అక్కడ ఉప ఎన్నిక అవసరం ఏర్పడింది. పార్టీ పోటీ చెయ్యాలనుకుంటే అభ్యర్థిని ప్రకటించి, పార్టీ స్థానిక శాఖకు బాధ్యతలు వదిలిపెడితే సరిపోతుంది. నంద్యాల ఉపఎన్నిక అనేసరికి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాగానే జరిగిన ఆసిఫ్‌నగర్ ఉప ఎన్నిక గుర్తొస్తుంది. దానం నాగేందర్ రాజశేఖరరెడ్డి శిష్యుడు. (ఆయన లేరు కాబట్టి ఇప్పుడు కాదంటారేమో) 2004 ఎన్నికలప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డి. శ్రీనివాస్ నాగేందర్‌కు అభ్యర్థిత్వం రాకుండా చేశారు (ఈ మేరకు ప్రచారం అయితే జరిగింది). రాత్రికి రాత్రి నాగేందర్ తెలుగుదేశంలో చేరి అదే ఆసిఫ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ తెచ్చుకున్నారు. గెలిచి ఎమెల్యే అయ్యారు. తెలుగుదేశం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నాగేందర్ టీడీపీని వీడి తిరిగి కాంగ్రెస్ గూటిలో చేరారు. చంద్రబాబు లాగా రాజశేఖరరెడ్డి నాగేందర్‌కు కాంగ్రెస్ కండువా కప్పేసి అసెంబ్లీలో కూర్చోబెట్టలేదు. మంత్రి పదవీ ఇవ్వలేదు. పైగా నాగేందర్‌ను శాసనసభ స్థానానికి రాజీ నామా చేయించి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి మళ్లీ అదే ఆసిఫ్‌నగర్ నుంచి పోటీ చేయించారు.ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు పట్టుదలకు పోతున్నట్టు ఆనాడు రాజశేఖరరెడ్డి పంతానికి పోలేదు. పంతం పట్టి గెలిపించుకునే కుయుక్తులు పన్నలేదు. ఆ ఉప ఎన్నికలో నాగేందర్ ఓడిపోయారు. నాగేందర్ అట్లా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కుప్పిగంతులు వెయ్యడం ఆసిఫ్‌నగర్ ప్రజలకు నచ్చలేదు మరి. రాజశేఖరరెడ్డి ఏమీ ఆసిఫ్‌నగర్ ప్రజలను ఆడిపోసుకోలేదు. మరెందుకు చంద్రబాబు అంత అసహనంగా ఉన్నారు నంద్యాల ప్రజల మీద? సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు నంద్యాల ఉపఎన్నిక విషయంలో మరోకోణం గురించి కూడా చర్చించాలి. అక్కడ ఉపఎన్నిక రావడానికి కారణం ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మరణం. భూమా నాగిరెడ్డి ఏ పార్టీ ఎమ్మెల్యే? శాసనసభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన ఇటీవలి బులెటిన్ ప్రకారం కూడా ఆయన వైఎస్సార్సీపీ శాసనసభ్యుడు. తెలుగుదేశం పార్టీ సంప్రదాయాలను గురించి మాట్లాడుతున్నది. అదే సంప్రదాయం ప్రకారం అయితే న్యాయంగా ఆ స్థానాన్ని మళ్ళీ వైఎ స్సార్ సీపీకే వదిలెయ్యాలి. కానీ, చంద్రబాబు, ఆయన పార్టీ వాదన ఎంత విచిత్రంగా ఉన్నాయంటే నాగిరెడ్డిని భయపెట్టో, బతిమాలో, ప్రలోభపెట్టో తమ పార్టీలోకి ఫిరాయింప చేసుకున్నది చాలక, మరణించే నాటికి ఆయన తమ శిబిరంలో ఉన్నాడు కాబట్టి ఆ స్థానాన్ని తమకు వదిలెయ్యడమే సంప్రదాయం, ఆ సంప్రదాయాన్ని వైఎస్సార్ సీపీ పాటించడం లేదని నిష్టురమాడుతున్నది.సెంటిమెంట్‌ను వాడుకోడం కోసం చంద్రబాబు నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియను ఏకగ్రీవం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం దగ్గరికి, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి దగ్గరికి పంపినట్టు కూడా వార్తలొచ్చాయి. 2014 ఎన్నికల సమయంలో ఆళ్లగడ్డ వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ప్రమాదంలో చనిపోతే ఆ ఎన్నిక వాయిదా వేయించడానికి తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నాలను అఖిలప్రియ అంత తొందరగా మరిచిపోవడం ఆశ్చర్యం. నాగిరెడ్డి వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి రాష్ట్రంలో ప్రతిపక్షం భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసి ఉంటే, ఆయన టీడీపీ టికెట్ మీదనే గెలిచి మరణించి ఉంటే ఇప్పుడు సంప్రదాయాన్ని పాటించలేదని వైఎస్సార్ కాంగ్రెస్‌ను నిందిస్తే అర్ధం ఉండేది. ప్రతిపక్షాన్నే గుర్తించను, నా రాష్ట్రంలో ప్రతిపక్షం అనే దే ఉండకూడదు అంటున్న చంద్రబాబును ఆయన అధికారాన్ని ప్రతిపక్షం మాత్రం ఎందుకు గుర్తించాలి? ఎందుకు మర్యాదలు పాటించాలి? ఎన్నికల సంఘం నిఘా అవసరం ఒక్క నంద్యాల స్థానం కోసం చంద్రబాబునాయుడు ఎందుకు అంత తహతహలాడిపోతున్నారు? ఎందుకు తెలుగుదేశం పార్టీ వందల కోట్ల రూపాయలు వెదజల్లడానికి సిద్ధపడుతున్నది? పెద్ద సంఖ్యలో బడా నాయకులను, మంత్రులను నంద్యాలలో దింపుతున్నది?మూడేళ్లలో ఎన్నడూ నంద్యాల మొహం చూడని మున్సిపల్ మంత్రి నారాయణ ఇప్పుడు అక్కడే మకాం వేసి అభివృద్ధి జపం ఎందుకు చేస్తున్నారు? నంద్యాల ఉపఎన్నిక ఫలితం వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతం కాబోతున్నదా? కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక మీద డేగ కన్ను వేస్తే మంచిది. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
భజన రాదంటే బలిపీఠానికే!
రూల్ ప్రకారం పనిచేస్తాను, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాను అంటే కృష్ణారావును ఎందుకు ఉండనిస్తారు, ఫేస్బుక్ పోస్టింగ్‌ల కారణం చూపి హడావుడిగా ఇంటికి పంపెయ్యక. ఈ కారణాల ఆధారంగానే కృష్ణారావును తొలగించాలనుకుంటే, ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి మర్యాదగా చెప్తే ఆయనే రాజీనామా చేసి వెళ్లేవారు కదా! అట్లా చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకవుతారు? చంద్రబాబు ఇప్పుడు ఎందరి చేతుల్లోనో బందీ. వాళ్లను ఏమీ చెయ్యలేకనే కృష్ణారావు లాంటి వాళ్ల మీద తన ప్రతాపం చూపుతుంటారు. ‘మనం ఫాసిజంలో బతుకుతున్నామా?’ఇదేదో మామూలుగా వినిపించే ప్రశ్న కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక ఉన్నత ఐఏఎస్ అధికారి మంగళవారం(20–6–17) మధ్యాహ్నం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల గోష్టి నిర్వహించి వెలిబుచ్చిన ఆవేదన ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉన్నదో ఇదే స్పష్టం చేస్తున్నది. రాష్ట్రం విడిపోయి, ఆంధ్రప్రదేశ్ వేరు రాష్ట్రం అయ్యాక మొదటి రెండు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు తప్పనిసరిగా ఆందోళన కలిగించే విషయాలే. పదవీ విరమణ అనంతరం రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడిగా నియమితులయిన కృష్ణారావును మంగళవారం ఉదయం ఆ పదవి నుంచి తొలగించారు. దానికి కారణం– తన అభిప్రాయాలను స్వేచ్ఛగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించడమే. నిజమే, ఆయన ప్రభుత్వ పదవిలో ఉన్నారు కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలూ, భావాలూ ఉన్నా అణచివేసుకోవాలే తప్ప వెల్లడించడానికి వీల్లేదు. ఈ నిబంధన నుంచి అధికార రాజకీయ పక్షానికి చెందిన నాయకులకు మాత్రం మినహాయింపు ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌లో. అదీ అందరికీ కాదు, జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని నాని, బొండా ఉమా, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అయ్యన్నపాత్రుడు తరహా నాయకులకు మాత్రమే ఉంటుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ మనిషికి ఊపిరి కంటే ముఖ్యం, అది సంపూర్ణంగా ఉన్న సమాజమే పురోగతిని సాధించగలదు అన్న వాస్తవం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పెద్దలకూ, ముఖ్యంగా దాని అధినేత చంద్రబాబునాయుడుకూ అస్సలు పట్టదు. అందుకే ఐవైఆర్ కృష్ణారావు మీద వేటు పడింది. తన ఫేస్బుక్ అకౌంట్లో ప్రభుత్వానికీ, తెలుగుదేశం పార్టీకీ నచ్చని, నష్టం చేసే పోస్టింగ్‌లు పెట్టిన లేదా ఇతరులు పెట్టిన పోస్టింగ్‌లను ఫార్వర్డ్ చేసిన పాపానికి కృష్ణారావు చైర్మన్ పదవి ఊడిపోయింది. సామాజిక వర్గాల మనోభావాలు పట్టవా? కృష్ణారావు పెట్టిన పోస్టింగ్‌లు ఏవి? ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్న పరిస్థితి మీద తన లేదా తన లాంటి కొందరు ఇతరుల అభిప్రాయాలు– అవి వ్యంగ్యచిత్రాలు కావచ్చు, వ్యంగ్యవ్యాఖ్యలూ కావచ్చు, అలాంటివే అన్నీ. ప్రభుత్వంలో భాగమయిన ఒక కార్పొరేషన్‌కు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి సొంత అభిప్రాయాలు కలిగి ఉండకూడదని నిబంధన ఏమీలేదు. మేము జీతం ఇస్తున్నాం కదా అనవచ్చు, కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకున్నా అది ముఖ్యమంత్రి జేబులో నుంచి ఇస్తున్నది మాత్రం కాదు, ప్రజల డబ్బు అన్న విషయం మరిచిపోకూడదు. అసలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదు అన్న నిబంధన ఏమయినా ఉంటే దాన్ని తక్షణం రద్దు చేసి పారెయ్యాలి. అందులోనూ ప్రజలకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వం పరిపాలన సాగినప్పుడు, ప్రజల ప్రా«థమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఏలికలు ప్రవర్తించినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఎవరయినా సరే, ఏ స్థాయి వాళ్లయినా సరే నిలబడి మాట్లాడాల్సిందే. సామాజిక మాధ్యమాలలో చంద్రబాబునాయుడు పరిపాలన తీరుతెన్నుల మీద, అధికార పక్ష పెద్దల వ్యవహార శైలి మీదా వ్యంగ్యచిత్రాలు వేసినందుకు ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్ చెయ్యడం తప్పు అని భావించారు కృష్ణారావు, భావించి ప్రభుత్వ కొలువులో ఉన్నాను కాబట్టి బయటికి మాట్లాడకూడదు అని ఊరుకోకుండా తన భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించుకున్నందుకు ఆయనను అందరూ అభినందించి తీరాల్సిందే. ఇంతకూ ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఇతర విషయాలు ఏమిటి? చంద్రబాబునాయుడి బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పోస్ట్ పెట్టారు. చరిత్రను వక్రీకరించిన ఆ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఎట్లా ఇస్తారన్నది ఆయన వాదన. ఆ సినిమా చరిత్ర వక్రీకరణేనన్న విషయం ఒక్క కృష్ణారావు గారేం ఖర్మ, మొత్తం లోకం కోడయి కూస్తున్నది. అంత మాత్రానికే తెలుగుదేశం కార్యకర్తలకు కోపం రావాలా? ఆయనను హడావుడిగా ఉద్యోగం నుంచి తొలగించే దాకా ముఖ్యమంత్రి వెళ్లాలా? కృష్ణారావును తొలగించి, ఆయన స్థానంలో ఇంకో బ్రాహ్మణ ప్రముఖుడిని అధ్యక్షుడిగా నియమించవచ్చు, తన ఆస్థానంలోనే ఉన్న ఇంకో వందిమాగధ ప్రముఖుడి చేత ఆయన మీద నిందలు మోపవచ్చు. అంతమాత్రం చేత కృష్ణారావును తొలగించిన కారణం, తీరు ఆ సామాజిక వర్గ ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో చూసుకోవద్దా? చంద్రబాబునాయుడు రెండవ విడత అధికారంలోకి వచ్చాక ఇటువంటి విషయాలేవీ పట్టించుకోవడం లేదు. వివిధ సామాజిక వర్గాల మనోభావాలను ఆయన ఎట్లా గాయపరుస్తున్నారో రిజర్వేషన్లు కల్పిస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చండి మహాప్రభో అంటూ ఉద్యమం చేస్తున్న కాపు కులస్తుల పట్లా, ఆ ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్లా, ఆయన కుటుంబం పట్లా దారుణంగా వ్యవహరించడాన్ని బట్టే అర్థమవుతుంది. పోస్టింగులే కారణమా? నిజానికి కృష్ణారావును తొలగించింది ఆయన ఫేస్బుక్లో పెట్టిన పోస్టింగ్‌ల కారణంగా అనుకుంటే పొరపాటు. అందుకు వేరే కారణాలు ఉన్నాయి. తన ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఒక కార్పొరేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఆరుమాసాల పాటు కలవడానికి అపాయింట్మెంట్ ఉండదు. కానీ రోజుకు సగటున ఎనిమిది నుంచి పది గంటల సేపు ముఖ్యమంత్రి ఇస్తున్న ఉపన్యాసాలలో ప్రజోపయోగం ఎంతో అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడికి ఏ వ్యవస్థ మీదా గౌరవం ఉండదు, అన్నిటినీ ఆయన ఓటు బ్యాంకులుగానే చూస్తారు. అధికార రాజకీయాలనే ఆయన శ్వాసిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణులు అందరినీ తెలుగుదేశం బ్రాహ్మణులుగా మార్చే ఉద్యోగం ఇచ్చారు చంద్రబాబునాయుడు. అది అర్థం చేసుకోలేని అమాయకపు కృష్ణారావు రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రాహ్మణులందరికీ సేవ చెయ్యాలనీ, ఒక వ్యవస్థను నిర్మించాలనీ అనుకున్నారు. తెలుగుదేశం తమ్ముళ్లనే ఆయన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లాల సమన్వయకర్తలుగా నియమించారు. కానీ ఆ కార్పొరేషన్ ద్వారా అందే సహాయం కూడా టీడీపీ బ్రాహ్మణులకే ఇవ్వాలన్న మాట ఆయన మరిచిపోయారు. అందుకే తెలుగు తమ్ముళ్లు కృష్ణారావు వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణులకూ, కాంగ్రెస్ బ్రాహ్మణులకూ, కమ్యూనిస్ట్ బ్రాహ్మణులకూ సహాయం చెయ్యడం మీద అధినేతకు ఫిర్యాదు చేశారు. అర్హత, అవసరం కలవారే అయినా, వేరే పార్టీల వాళ్లకు ఎట్లా సహాయం చేస్తారన్నది చంద్రబాబునాయుడూ, ఆయన పార్టీ నాయకులూ, కార్యకర్తల విమర్శ. ఇతర పార్టీల కార్యకర్తలకు హక్కు లేదా? ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కోట్ల మంది కూడా ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి, ఆ పార్టీకే ఓట్లెయ్యాలి, ఆ అధినేత, ఆయన కుమారుడికే పల్లకీ మోయాలి అన్నది వాళ్ల అభిమతం. కృష్ణారావు ఆ పని చెయ్యక పోగా అదే పనికోసం ఏర్పాటయిన జన్మభూమి కమిటీలను ఖాతరు చెయ్యకపోవడం ఇంకెంత పెద్ద నేరం! అందుకే ఆయనకు ఉద్వాసన పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికి వెళ్లినా జన్మభూమి కమిటీలలో ఎవరు ఉన్నారో, అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు ఎవరు భోంచేస్తున్నారో జనం కథలు కథలుగా చెప్తారు. అయినా కృష్ణారావుకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయాలు తెలియవు. అవి తెలిసిన జేసీ దివాకర్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావు వగైరా వగైరా నాయకులనయితే చంద్రబాబు నాయుడు పదిలంగా చూసుకుంటారు. తనవారి ఆగడాల మాటో?! విమానాశ్రయ ఉద్యోగితో మాటా మాటా జరిగినందుకే మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి ప్రజా ప్రతినిధులు జైలుకు వెళ్లాలి. విమానాశ్రయంలో వీరంగం వేసి భౌతికదాడికి దిగినా కూడా జేసీ దివాకర్‌రెడ్డి మీద ఏ చర్యా ఉండదు. కనీసం కేసు కూడా ఉండదు. ఎందుకంటే మిథున్, భాస్కరరెడ్డి వైఎస్ఆర్సీపీ కాబట్టి కేసులు. దివాకర్‌రెడ్డి తెలుగుదేశం కాబట్టి కేసులు లేవు. కేశినేని నాని, బొండా ఉమా తెలుగుదేశం కాబట్టి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను దుర్భాషలాడినా, ఉద్యోగులు, అధికారుల మీద చెయ్యి చేసుకున్నా చర్యలుండవు. ఒక ప్రమాదంలో మరణించినవారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కలెక్టర్‌ను నిలదీసినందుకు ప్రతిపక్ష నాయకుడు నేరస్తుడవుతాడు. మహిళా ఉద్యోగిని బరబరా ఈడ్చుకుపోయి కొట్టినా తెలుగుదేశం శాసనసభ్యుడు కాబట్టి చింతమనేని ప్రభాకర్‌ను పల్లెత్తు మాట అనరు. ఇవన్నీ తెలిసీ రూల్ ప్రకారం పనిచేస్తాను, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాను అంటే కృష్ణారావును ఎందుకు ఉండనిస్తారు, ఫేస్బుక్ పోస్టింగ్‌ల కారణం చూపి హడావుడిగా ఇంటికి పంపెయ్యక. ఈ కారణాల ఆధారంగానే కృష్ణారావును తొలగించాలనుకుంటే, ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి మర్యాదగా చెప్తే ఆయనే రాజీనామా చేసి వెళ్లేవారు కదా! అట్లా చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకవుతారు? చంద్రబాబు ఇప్పుడు ఎందరి చేతుల్లోనో బందీ. కింద కార్యకర్తల నుంచి మీద నాయకుల దాకా అందరి చేతుల్లో బందీ. వాళ్లను ఆయన ఏమీ చెయ్యలేకనే కృష్ణారావు లాంటి వాళ్ల మీద తన ప్రతాపం చూపుతుంటారు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
అత్యంత ‘సీనియర్’ అబద్ధాలు
డేట్లైన్ హైదరాబాద్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలూ నాకు కావలసిన వాళ్లే, తెలంగాణలో కూడా పార్టీని అధికారంలోకి తెస్తానని చెప్పిన చంద్రబాబు కోదాడ దాటి జగ్గయ్యపేట చేరగానే స్వరం మార్చి చీకటిరోజు, హత్య అని మాట్లాడితే, అవతల అదేరోజున సంతోషంగా సంబరాలు జరుపుకున్న తెలంగాణ ప్రజల మనోభావాలు ఎంత దెబ్బ తిని ఉంటాయి? దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడూ, ఏకైక స్టేట్స్‌మన్ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? పైగా అది హత్యే అనుకుంటే అందుకోసం ఒకటి కాదు, రెండుసార్లు లేఖాయుధాలు అందించింది చంద్రబాబు కాదా? భారతదేశంలో స్వయం ప్రకటిత అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు నారా చంద్రబాబునాయుడుకు చరిత్ర అంటే గిట్టదు. చరిత్ర చదువుకోవడం శుద్ధ దండగ అంటారాయన. చరిత్రను గుర్తు పెట్టుకోవడం కూడా పరమ వేస్ట్ అని ఆయన నిశ్చితాభిప్రాయం. అందుకే ఆయన మొదటి విడత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చరిత్ర, సామాజిక శాస్త్రాలను పాఠ్యాంశాల నుంచి తొలగించాలని ప్రకటనలు చేసేవారు. నిజానికి ఆయనకు దేని మీదా ఒక కచ్చితమైన అభిప్రాయం ఉండదు. అవసరాన్ని బట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కూడా. అభిప్రాయాలు మార్చుకోనివాడు రాజకీయ నాయకుడు కాదన్న గిరీశం ఆయనకు ఆదర్శం. ఇంకో విషయం కూడా చెప్పాలిక్కడ. చంద్రబాబునాయుడుకు చరిత్ర అన్నా, దాన్నిగుర్తు పెట్టుకోవడం అన్నా చాలా భయం కూడా. ఆయన అభిప్రాయాలూ, భయాలూ ఎట్లా ఉన్నా చరిత్ర పునాదుల మీదనే వర్తమానం, భవిష్యత్తు నిర్మితమవుతాయన్న విషయం ఆయనకు, ఆయన వంటి అభినవ గిరీశాలకు అప్పుడప్పుడు గుర్తుచేస్తూ ఉండాల్సిందే. చరిత్ర చదవరాదు, గుర్తు పెట్టుకోరాదు చరిత్రను గుర్తు పెట్టుకున్నా, జ్ఞాపకం చేసుకున్నా ఆయన మనసుకు నచ్చని బోలెడు విషయాలు మనో ఫలకం మీదకు వచ్చి చికాకు పరుస్తాయి. ఇప్పుడా విషయాలన్నీ ఇక్కడ ఏకరువు పెట్టడం కుదరదు కానీ, మచ్చుకు ఒకటి రెండు చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉండి, అక్కడ పదవులు అనుభవించి ఆ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన విషయం, రెండోసారి రాజకీయ భిక్ష పెట్టిన మామ ఎన్టీఆర్‌ను దించేసి అధికారం చేజిక్కించుకున్న విషయం వగైరాలన్నీ ఉన్న చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. నారావారిపల్లె నుంచి అమరావతి దాకా ఆయన రాజకీయ ప్రయాణంలో ఇటువంటి చికాకు కలిగించే కఠోర సత్యాలు ఎన్నో. అందుకే ఆయనకు చరిత్ర అంటే చికాకు. దానికి తోడు దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఏం చెబితే అది జనం నమ్మేస్తారన్న గొప్ప విశ్వాసం. హైదరాబాద్ తన బ్రెయిన్ చైల్డ్ అన్నా, ఇటలీకి స్వాతంత్య్రం వచ్చింది జూన్ రెండునే అన్నా, రాష్ట్ర విభజనను హత్యతో పోల్చినా, జూన్ రెండును చీకటిరోజు అన్నా చంద్రబాబునాయుడికే చెల్లింది. ఇంకొకరెవరూ అంత సునాయాసంగా అసత్యాలు పలకలేరు. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది జూన్ రెండవ తేదీన కాబట్టి తెలంగాణ వారు నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఏడాది అదే రోజున ఘనంగా జరుపుకుంటారు. అందులో లాజిక్ ఉంది. తెలంగాణ విడిపోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ తన అవతరణ దినోత్సవాలు ఎప్పుడు జరుపుకోవాలి? దానికి కూడా ఒక లాజిక్ ఉంటుంది కదా! రెండు రాష్ట్రాలయ్యాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా జూన్ రెండునే పునరవతరణ దినోత్సవం జరుపుకోవచ్చు. లేదా రాజధాని లేకపోయినా ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కాదు కాబట్టి 1956 నవంబర్ ఒకటిన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌గానే కొనసాగి, ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలి. నిజానికి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించింది కూడా నవంబర్ ఒకటినే అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలని. అట్లా కుదరదు, అందులోని తెలం గాణ విడిపోయింది కదా అనుకుంటే కంపోజిట్ మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన సంవత్సరం, నెల తేదీనయినా గుర్తు చేసుకుని ఆ రోజును ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలి. పోనీ అవేవీ కాదంటే 2014, జూన్ ఎనిమిదిన తమ ప్రభుత్వం ఏర్పాటు కోసం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునయినా అవతరణ దినోత్సవంగా తాత్కాలికంగా పాటించే అవకాశం ఉంది. తాత్కాలికం అనడం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదు కాబట్టి, రేపు అధికారంలోకి వచ్చే పార్టీ చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం రోజును రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోదు కాబట్టి. ఆంధ్రాకు అవతరణ దినోత్సవం లేదు మొత్తానికి ఈ గందరగోళంలో పడి ఒక ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌కు అవతరణ దినోత్సవం అనేది లేకుండా చేశారు చంద్రబాబునాయుడు. ఇంత అనుభవం కలిగిన దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు ఈ వ్యవహారాన్ని ఎందుకింత కంగాళీ చేశారో ఎవరికీ అంతుబట్టడం లేదు. జూన్ రెండును ఆయన చీకటిరోజు అంటున్నారు, ఆ రోజున ఒక ఘోర హత్య జరిగిందని కూడా చెపుతున్నారు, ఇటలీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు కాబట్టే ఆ రోజున మనకీ కష్టాలు కలిగించారని చెపుతున్నారు. చివరిమాట మొదలు మాట్లాడుదాం, ఇటలీకి స్వాతంత్య్రం వచ్చింది జూన్ రెండున కాదు. జూన్ రెండు ఇటలీ రిపబ్లిక్‌డే. చరిత్ర అంటే గిట్టదు కాబట్టి ఇటువంటి తప్పులు చెయ్యడం చంద్రబాబుకు కొత్తేం కాదు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టింది కాబట్టీ, ఆ ప్రభుత్వాన్ని నడిపించింది సోనియా గాంధీ కాబట్టీ, ఆ సోనియాగాంధీ ఇటలీ దేశస్తురాలు కాబట్టీ, మొన్న జూన్ రెండు బెజవాడ బెంజ్ సర్కిల్లో ఖాళీ కుర్చీల చేత నవ నిర్మాణ దీక్ష చేయించిన సందర్భంగా చంద్రబాబు ఇటలీ ప్రస్తావన తెచ్చి ఉంటారు. కుర్చీలకు ఆలోచించే తెలివి ఉండదు కదా, అందుకే నమ్మేశాయి. మనుషులు నమ్మడం ఎట్లా? ఇక చీకటిరోజు, ఘోర హత్య గురించి మాట్లాడుకుందాం. ఓ వారం పదిరోజుల కిందే అనుకుంటా హైదరాబాద్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో మాట్లాడాడు చంద్రబాబునాయుడు. ఆ సభలో ఆయనకు చీకటిరోజు కానీ, హత్య సంఘటన కానీ గుర్తే రాలేదు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలూ నాకు కావలసిన వాళ్లే, తెలంగాణలో కూడా పార్టీని అధికారంలోకి తెస్తానని చెప్పిన చంద్రబాబు కోదాడ దాటి జగ్గయ్యపేట చేరగానే స్వరం మార్చి చీకటిరోజు, హత్య అని మాట్లాడితే, అవతల అదేరోజున సంతోషంగా సంబరాలు జరుపుకున్న తెలంగాణ ప్రజల మనోభావాలు ఎంత దెబ్బతిని ఉంటాయి? దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడూ, ఏకైక స్టేట్స్‌మన్ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? పైగా అది హత్యే అనుకుంటే అందుకోసం ఒకటి కాదు, రెండుసార్లు లేఖాయుధాలు అందించింది చంద్రబాబునాయుడు కాదా? చీకటిరోజే అనుకుంటే తానూ, తనతోబాటు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారు కూడా ఆ దీపాలు ఆర్పిన వాళ్లలో ఉన్నారు కదా! ఇటువంటి వ్యాఖ్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెచ్చగొట్టగలమనుకుంటే పొరపాటు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన లాగా చరిత్రను విస్మరించే వాళ్లు కాదు. ఆ ప్రయోజనం నెరవేరక పోగా తెలంగాణలో కొడిగట్టిన తెలుగుదేశం పార్టీ దీపం పూర్తిగా ఆరిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ హైదరాబాద్‌లో మాట్లాడిన మాటలు విజయవాడకు, అక్కడ అమరావతిలో మాట్లాడిన మాటలు హైదరాబాద్‌కు తెలియక పోవడానికి మనం మధ్య యుగాల్లో లేము. చంద్రబాబు గారే ప్రవేశపెట్టానని చెప్పుకుంటున్న ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య అగాధం సృష్టించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల వల్ల ఫలితం ఏమీ ఉండదు. రాజకీయ నాయకుల కంటే మన ప్రజలు చాలా విజ్ఞత కలవారు. నవ నిర్మాణ ఊదర జూన్ రెండున తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని మరునాటి నుంచి ఎవరి పనుల్లో వాళ్లు పడిపోతుంటే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు మాత్రం జూన్ రెండు నుంచి మొదలు పెట్టి తాను ప్రమాణ స్వీకారం చేసిన జూన్ ఎనిమిది వరకూ వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షల పేరిట ప్రజలనూ, ప్రభుత్వాన్ని వేరే పని చేసుకోకుండా గంటల తరబడి ఉపన్యాసాలతో ఊదరగొట్టేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఎక్కడో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఉపన్యాసాలు వినీ వినీ ప్రజల చెవుల్లో నుంచి రక్తాలు కారుతున్నాయన్నారు. నవ నిర్మాణ దీక్షతో ప్రారంభం అయి, పునరంకిత దీక్షతో ముగిసే ఈ వారం రోజుల కార్యక్రమంతో ఆచరణలో ఒరుగుతున్నదేమిటో అర్ధం కాక అధికారపక్షం వారే విసుక్కుంటున్నారు. చంద్రబాబునాయుడి పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అయిదేళ్లు తమ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించుకునే అవకాశం అయితే కోల్పోయారు. ఇది ఆ రాష్ట్ర అస్తిత్వానికి సంబంధించిన అంశం అన్న విషయం ఎవరూ మరిచిపోగూడదు. రాష్ట్ర విభజన వల్ల రాజధాని తెలంగాణలో ఉండిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిష్కారాలు ఆలోచించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కష్టాలనుండి గట్టెక్కిస్తానని ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాల అమలు గురించి ఆలోచించాలి తప్ప నెపం ఇతరుల మీదకు నెట్టి దీక్షా జపం చేస్తూ కూర్చుంటే ప్రజలు హర్షించరు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
తెలుగునాట ముందస్తు ముచ్చట
డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణలో ప్రతిపక్షం తిరిగి బలం పుంజుకునే ప్రయత్నాల్లో పడితే, ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క ప్రతిపక్షం ప్రజాక్షేత్రంలో సమస్యల మీద నిత్యం నినదిస్తున్న పరిస్థితి. రెండు రాష్ట్రా ల్లోనూ ప్రశ్నించాల్సిన మీడియా, కారణాలు ఏమైనా, అయితే పాలకపక్షం వహించడం లేదా మౌనం వహించడం. ఇది దురదృష్టం. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అన్నాడు లెనిన్. ఇప్పుడు ఎవరి నినాదాల వెనుక ఏ ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. నిర్ణీత గడువు కంటే ముందుగా వచ్చేదాన్ని ‘ముందస్తు’ అంటున్నాం. ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది 2003లో. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అలిపిరి వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చి గాయపరిచిన దరిమిలా, జనంలో ఆ ఘటన తాలూకు సానుభూతి చెరిగిపోక ముందే ఎన్నికలకు వెళితే ప్రభుత్వ వ్యతిరేకత తెరమరుగై, తెలుగుదేశం మళ్లీ గెలుస్తుందని ఒకానొక జర్నలిస్ట్ మిత్రుడు తొలుత తాను పనిచేస్తున్న పత్రికలో ఒక కథనం వెలువరించారు. అప్పటి ముఖ్యమంత్రికి కూడా అది నచ్చి, తనతో బాటు కేంద్రాన్ని కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధం చేశారు. అయినా గడువుకు ముందే ఎన్నికలు జరగాలన్న ఆ ఆలోచన ఎన్నికల సంఘం ముందు పెద్దగా పనిచెయ్యలేదు. చంద్రబాబు, ఆయన ఆనాటి మిత్రబృందం ఆశించినట్టు అలిపిరి ఘటన రాష్ట్ర ప్రజల్లో సానుభూతి కలిగించకపోగా, అప్పటికి ఎనిమిదిన్నరేళ్ల క్రితం జరిగిన బషీర్‌బాగ్ కాల్పులు వంటి ప్రజా వ్యతిరేక చర్యలే తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడాయి. అయినా ఎన్నికలను కొన్నిమాసాలు ముందుకు జరిపితే ప్రజాభిప్రాయం మారిపోతుందా? స్వాగతించదగిన నిర్ణయం ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వినిపిస్తున్నది. ఇందుకు కారణం ‘ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు’ నినాదం. ఇది నిజంగానే మంచి ఆలోచన. లోక్‌సభకు ఎన్నికలు జరిగి కేంద్రంలో ప్రభుత్వం తన సీటు మీద ఇంకా కుదురుకోక ముందే ఏవో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు రావడం, ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం, ఐదేళ్ల పుణ్యకాలం కాస్తా ఎన్నికల పోరులోనే గడిచిపోతే ఇక పాలన మీద దృష్టి ఎట్లా ఉంటుంది? ప్రజలకు ఏం మంచి చెయ్యగలరు? కాబట్టి లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆలోచనను అందరూ ఆహ్వానించవలసిందే. అయితే ఒకేసారి ఎన్నికల నిర్వహణ అనగానే ఎదురయ్యే సాధకబాధకాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది– ఎన్నికల నిర్వహణ యంత్రాంగం సంసిద్ధత. మొన్ననే ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఒక పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కూడా ఉండే సరికి దాదాపు ఏడు విడతల పోలింగ్ అవసరమైంది. మరి, దేశమంతటా ఒకేసారి ఎన్నికలు అంటే సక్రమ నిర్వహణ సాధ్యమేనా? అక్రమాలను అరికట్టడానికీ, శాంతిభద్రతల పరిరక్షణకూ అవసరమైనంత మందీ మార్బలం మనకు ఉన్నాయా అన్న విషయం కేంద్రం నిశితంగా ఆలోచించుకోవాలి. అన్ని వనరులూ సమకూడి లోక్‌సభకూ, అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు జరపగలిగితే కొన్ని రాష్ట్రాలు ఐదేళ్ల కాలపరిమితి ముగియకుండానే తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్న రాష్టాలు ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనకు అంగీకరించవచ్చు. కానీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అంత సులభంగా ఇందుకు ఒప్పుకుంటాయా? ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి సమస్య ఎదురవుతుంది. అటువంటి వారిని ఎట్లా దారిలోకి తెచ్చుకుంటారో చూడాలి. మిగతా విషయాలు ఎట్లా ఉన్నా, ఈ మార్పుతో ఒనగూడే ఒక ప్రయోజనం మాత్రం అందరికీ సంతోషం కలిగించేదే. అది–2019 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగితే ఎండలు మండిపోతుంటాయి. అభ్యర్థులకూ, ఎన్నికల యంత్రాంగానికీ, ముఖ్యంగా ఓటర్లకూ నరకం కనిపిస్తుంది. అనేకచోట్ల ఓటింగ్ శాతం తగ్గడానికి ఇదొక ముఖ్య కారణం కూడా. మన బాధ్యతా రాహిత్యంతో ఏ ఏటికి ఆ యేడు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. మోదీ ఆలోచిస్తున్నట్టుగా 2018 నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎన్నికలొస్తే అందరికీ హాయి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పక్షాలు పుట్టించే ప్రచార వేడిని వాతావరణంలోని శీతలం చల్లబరుస్తుంది. తెలుగు ప్రాంతానిది ఎప్పుడూ అదే దారి గడువు కంటే ముందుగా వచ్చే ఈ ఉమ్మడి ఎన్నికల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు సమస్య ఏమీ లేదు. 1994లో తప్ప, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1989 నుంచి కూడా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలోనే జరిగాయి. లోక్‌సభకు 1991లో మధ్యంతర ఎన్నికలు జరిగిన కారణంగా, 1994లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు గడువు మేరకు విడిగా ఎన్నికలు జరిగాయి. రాష్ట్రం విడిపోయిన సంవత్సరం కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటే (2014) అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. కాబట్టి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు కలసి వచ్చినా ఇక్కడ పెద్ద తేడా ఉండదు. అయితే ఎన్నికలు గడువు కంటే ముందే రావడం, దాని వల్ల ఎదురయ్యే లాభనష్టాలను గురించి అధికార పక్షాలు ఆలోచించడం సహజం. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ప్రతిపాదన ప్రకారం లోక్‌సభకూ, అసెంబ్లీలకూ 2018 నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎన్నికలు జరగవచ్చు. అంటే గడువు కంటే కేవలం అయిదారు మాసాల ముందన్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికార పక్షాల విషయం ఆలోచిస్తే ఎన్నికలు కొంచెం ముందు జరిగినంత మాత్రాన పెద్ద తేడా ఏమీ ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో ప్రజలకు స్పష్టత ఉంది. ఈ ఐదారు మాసాల్లో ప్రజాభిప్రాయాన్ని పెద్దగా మార్చగల స్థితి ఏమీ కనబడదు. మొన్నటి నీతి ఆయోగ్ సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన ఇద్దరు ముఖ్యమంత్రులూ ఈ మార్పునకు అంగీకరించి వచ్చినట్టే వార్తలు వెలువడినాయి. టీఆర్ఎస్కు బీజేపీ బెడద తెలుగు రాష్ట్రాలలోని అధికార పక్షాల పరిస్థితి గురించి మాట్లాడుకుంటే, తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ మొన్ననే జరి గింది. రేపు వరంగల్‌లో లక్షలాది మందిని సమీకరించి ఆవిర్భావ దినోత్సవం పేరుతో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. ప్రజలనూ, పార్టీ శ్రేణులనూ ఎన్నికలకు సన్నద్ధం చేసే బహిరంగ సభ ఇదే అవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాలకు ఎడా పెడా గుప్పిస్తున్న వరాలు కూడా గడువు కంటే ముందే రానున్న ఎన్నికలకు సంకేతాలు పంపుతున్నాయి. దక్షిణాదిన బీజేపీ కన్నేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమైనదన్న విషయం కూడా టీఆర్ఎస్ను కొంచెం కలవరపాటుకు గురిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. చిరకాల పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీగా, ప్రతిపక్షాన్ని రాష్ట్రంలో దాదాపు నిర్వీర్యం చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితికి తిరిగి అధికారంలోకి తామే వస్తామన్న ధీమా ఉండటం సహజం. కానీ క్షేత్రస్థాయిలో ఎన్నికల సమరంలో ముందుండి పార్టీని గెలిపించాల్సిన శ్రేణుల్లో కేంద్రీకృత అధికారం కారణంగా తీవ్ర నిరాసక్తత కనిపిస్తున్న మాట నిజం. ప్రజాభీష్టం ఎంత తమ వైపు ఉన్నా, వారిని పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాల్సిన శ్రేణులు పనిచెయ్యకపోతే ఏం జరుగుతుందో 1989లో ఎన్.టి. రామారావుకూ, ఆయన పార్టీకీ ఎదురైన అనుభవమే పెద్ద రుజువు. ఒకచోట ఆయనే ఓడిపోయిన పరిస్థితి. ఆ ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు ఆ విషయం తెలిసే ఉంటుంది. తెలంగాణలో అధికారపక్ష ప్రజాప్రతినిధులలో కొంత నైరాశ్యం మొన్నటి కొంపల్లి ప్లీనరీలో స్పష్టంగా కని పించింది. ప్రజా ప్రతినిధులలో నైరాశ్యం, కార్యకర్తల్లో నిరాసక్తతను అధిగమించి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన ప«థకాలు ఏ మేరకు అధికార పక్షానికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని స్థిరం చేస్తాయో చూడాలి. ధనం జనాభిప్రాయాన్ని మార్చలేదు ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షం తెలుగుదేశం పార్టీ వచ్చే నెల విశాఖపట్నంలో మహానాడును నిర్వహించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికార పక్షం ఒక్కటి కాదు రెండు, ఆ రెండో అధికారపక్షం భారతీయ జనతా పార్టీ మొన్ననే కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గుట్టు చప్పుడు కాకుండా ఒక ఉత్సవం జరుపుకుంది. ఎంత గుట్టు చప్పుడు కాకుండా అంటే, ఆ పార్టీ ముఖ్య నాయకులే చాలామందికి సమాచారం కూడా లేనంత గుట్టుగా. ఇక భాగస్వామి అయిన తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును పిలవనేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షం వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడం తప్ప విజయానికి ఇంకో మార్గమే లేదన్నట్టు వ్యవహరిస్తున్నది. నిధుల సేకరణకు అడ్డదారులు అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారుల సమావేశంలో తన మనోగతం వెల్లడించారు. అక్కడి నుంచే తెలుగుదేశం నాయకులు మీది నుంచి కింది వరకూ వచ్చే ఎన్నికలకు అవసరమైన నిధులను ఎన్ని అడ్డదారులైనా తొక్కి సంపాదించుకునే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న తీరు, ఆ మొత్తం వ్యవహారంలో అందరూ అధికార పక్షానికి సంబంధించిన వారే ఉండటమూ ఇందుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఆర్థిక అక్రమాలను గురించీ, అవినీతి గురించీ కేంద్రానికి పూర్తి సమాచారం ఉన్నా పల్లెత్తు మాట అనక పోవడానికీ, వేలెత్తి చూపకపోవడానికీ మిత్రధర్మం కారణం కావచ్చు. కేవలం డబ్బే జనాభిప్రాయాన్ని మార్చబో దన్న వాస్తవం గతంలో పలుమార్లు రుజువైన సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడిప్పుడే తిరిగి బలం పుంజుకునే ప్రయత్నాల్లో పడితే, ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క ప్రతిపక్షం ప్రజాక్షేత్రంలో సమస్యల మీద నిత్యం నినదిస్తున్న పరిస్థితి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రశ్నించాల్సిన మీడియా, కారణాలు ఏమైనా, అయితే పాలకపక్షం వహించడం లేదా మౌనం వహించడం. ఇది దురదృష్టం. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అన్నాడు లెనిన్ మహాశయుడు. ఇప్పుడు ఎవరి నినాదాల వెనుక ఏ ప్రయోజనాలు ఉన్నాయో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే తెలుసుకోగలిగి నంత విజ్ఞులయ్యారు తెలుగు ప్రజలు. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
జనం గమనిస్తున్నారు సుమా!
డేట్లైన్ హైదరాబాద్ పదిమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్ మృత దేహానికి పోస్ట్‌మార్టం ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించిన పాపానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద కేసులెందుకు పెట్టారు? తిరుపతి విమానాశ్రయంలో ఒక ఉద్యో గితో జరిగిన స్వల్ప వాగ్వివాదం సంఘటనలో పట్టుబట్టి ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డి, శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరుల మీద కేసులెందుకు పెట్టారు? రోజుల తరబడి భాస్కర్‌రెడ్డిని జైలుకెందుకు పంపించారు? తోటకూర నాడే చెప్పి ఉంటే... అని ఒక పాత సామెత ఉంది. ఒక ఆక తాయి పిల్లవాడు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడట. మొట్టమొదటిసారి పక్కింటి పెరట్లో నుంచి తోటకూర దొంగతనంగా తెంపుకొచ్చి తల్లికి ఇస్తే ఆమె కొడుకుని మెచ్చుకుని వండిపెట్టి తినిపించింది. రెండోసారి ఇంకెవరి దొడ్లో నుంచో సొరకాయలు తెంపుకొచ్చాడు దొంగతనంగా. కొడుకు ప్రయో జకుడు అవుతున్నాడని మెచ్చుకుందట ఆ తల్లి. ఆ తరువాత ఊళ్లోవాళ్లు గంప కింద దాచుకున్న కోళ్లను తెచ్చేవాడు. మంచి వేపుడు చేసి కొడుక్కు పెట్టి తానూ తిని ఆనందించేది తల్లి. చిల్లర దొంగతనాల నుంచి మనవాడు తల్లి ప్రోత్సాహంతో ఆరితేరిన గజదొంగగా మారాడు. ఏదో ఒకరోజు పాపం పండక తప్పదు కదా! ఒక ఇంట్లో అర్ధరాత్రి దొంగతనానికి వెళ్లాడు. ఆ ఇంటి వాళ్లు పట్టుకోబోతే, విడిపించుకునే క్రమంలో ఒకరిని హత్య కూడా చేసేస్తాడు మనవాడు. తెల్లవారగానే పోలీసులు ఇంటికొచ్చి అతడిని అరెస్ట్ చేసి, సంకెళ్లు వేసి తీసుకుపోతుంటే హత్య చేస్తావా దుర్మార్గుడా అని కొడుకును తిడుతూ తల్లి తల బాదుకుని ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు కొడుకు పోలీసుల అనుమతి తీసుకుని, తల్లి దగ్గరికి వచ్చి ఆమెను ఎడాపెడా బాది తోటకూర నాడే నన్ను బొంద పెట్టి ఉంటె ఇంత పెద్ద నేరస్తుడిని అయ్యేవాడినా, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అని శిక్ష అనుభవించడానికి వెళ్లిపోయాడట. ఇసుక మాఫియా దగ్గరే... నిజమే, చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నప్పుడే కొడుకుని దండించి, దారిలో పెట్టి ఉంటే హంతకుడు అయ్యేవాడు కాదు కదా! ఈ సామెత కథ ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవహార శైలికి సరిగ్గా సరిపోతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, మద్దతుదారుల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా ఆ తల్లి వ్యవహారం లాగే ఉంది. తెలుగుదేశం పార్టీ దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఇసుక అక్రమ తవ్వకాలూ, రవాణా వ్యవ హారంలో ఎంఆర్వో వనజాక్షి మీద దాడి చేసిన నాడే ముఖ్యమంత్రి చంద్ర బాబు కఠినంగా వ్యవహరించి, చట్టపరమయిన చర్యలకు అనుమతించి ఉంటే రవాణా శాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రహ్మ ణ్యంను దూషించడానికీ, ఆయన గన్‌మ్యాన్ మీద చేయి చేసుకోడానికీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని, శాసనసభ్యుడు బొండా ఉమా, శాసన మండలి (దీనిని పెద్దల సభ అంటాం) సభ్యుడు బుద్ధా వెంకన్న సాహసించి ఉండేవారా? చింతమనేని ప్రభాకర్ చేసిన తప్పుకు ఆయన మీద చట్టపరమయిన చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి ఇప్పుడు నాని తదితరుల మీద ఏం చర్యలు తీసుకోగలరు? అట్లా తీసుకోవాలనే ఆలో చన కూడా ఆయనకు ఏ కోశానా ఉన్నట్టు కనిపించదు. చింతమనేని నుంచి కేశినేని దాకా తన వాళ్లను రక్షించుకునే క్రమంలో ముఖ్యమంత్రితో పాటు, ఆయన ప్రభుత్వం ప్రజల్లో చులకన అయిపోతున్న విషయాన్ని మరిచిపోతున్నారో, పట్టించుకోనక్కరలేదని అనుకుంటున్నారో తెలియదు. చింతమనేని వ్యవహారంలో తన ఏరియాలోకి రాని చోటికి వెళ్లి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారని ఎంఆర్వో వనజాక్షిని ఆక్షేపించారే కానీ ఆ అక్రమానికి పాల్పడ్డ ప్రభాకర్‌ను మాత్రం పల్లెత్తు మాట అనడానికి సాహసించలేదు. తనవారి తప్పులు కానరావు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాజధాని భూముల వద్దకు వెళ్లి అధికారులూ, ఉద్యోగులను ఉద్దేశించి అసభ్య పదజాలం ప్రయోగించినా చర్యలు ఉండవు. శాసనసభ్యులు, మంత్రుల కుమారులు కొందరు నడి రోడ్ల మీద ఆడపిల్లను కార్ లోకి లాగే ప్రయత్నం చేసినా, మోటార్ సైకిల్ రేసుల్లో విజయవాడ వీధుల్లో స్వైర విహారం చేసి అమాయకుల మీదకు బండ్లు ఎక్కిం చినా ముఖ్యమంత్రి ఏ చర్యలూ తీసుకునేందుకు చొరవ చూపరు. ఇప్పుడు కేశినేని నాని తదితరులు ఏకంగా ఒక ఐపీఎస్ అధికారి మీదికి పోట్లాటకు వెళ్లి, పరుష పదజాలం ఉపయోగించి గన్‌మ్యాన్‌ను నెట్టి అవమానిస్తే క్షమా పణలతో సరిపుచ్చేసారు. ప్రజాస్వామ్య మూల స్థంభాలుగా చెప్పుకునే నాలుగు వ్యవస్థల్లో రెండు– శాసనవ్యవస్థ, అధికార యంత్రాంగం మధ్య ఘర్షణ మంచిది కాదు, చట్ట పరమయిన చర్యల దాకా వెళ్లకుండా శాంతియుతంగా పరిష్కరించాలనే సదుద్దేశం ముఖ్యమంత్రికి ఉంది కాబట్టే కేసులు లేవని కాసేపు అనుకుందాం. ఎందుకంటే ఆయనను సమర్ధించేవారు అదే మాట చెబుతున్నారు. మరి అదే నిజమయితే పదిమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్ మృత దేహానికి పోస్ట్‌మార్టం ఎందుకు చెయ్యలేదని జిల్లా కలెక్టర్‌ను, వైద్యాధికారులను ప్రశ్నించిన పాపానికి ప్రతి పక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి మీద కేసులేందుకు పెట్టారు? తిరుపతి విమానాశ్రయంలో ఒక ఉద్యోగితో జరిగిన స్వల్ప వాగ్వివాదం సంఘటనలో పట్టుబట్టి ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డి, శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరుల మీద కేసులెందుకు పెట్టారు? రోజుల తరబడి భాస్కర్‌రెడ్డిని జైలు కెందుకు పంపించారు? ప్రతిపక్షానికి ఒక నీతి, అధికార పక్షానికి ఒక నీతా అని ప్రశ్నించి, నిరసనకు దిగిన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని రోజంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి సాయంత్రం ఎందుకు వదిలేశారు. ఒక శాసనసభ్యుడిని సమావేశాలు జరుగుతున్న రోజున అరెస్ట్ చేసి ఏ కేసూ పెట్టకుండా, కారణం అయినా చెప్పకుండా సాయంత్రానికి ఇక వెళ్ళిపో అని వదిలేసారంటే ఇక ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య ప్రజలకు దిక్కేమిటి? రాజకీయ నాయకత్వానికీ, అధికార యంత్రాంగానికీ మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణంలో అన్ని సంఘటనలనూ ఒకే విధంగా చూడాలని కొందరు బీజేపీ నాయకులు సుద్దులు చెబుతున్నారు. అలాంటప్పుడు అన్ని సంఘటనల్లోనూ కేసులు ఉండాలి కదా! ఇటువంటి సంఘటనలు జరిగి నప్పుడు అవి ఎంత స్వల్పమయినవి అయినా ప్రతిపక్షం మీదనే కేసులెం దుకు నమోదు చేయడం? అవి ఎంత తీవ్రమైనవైనా అధికార పక్షం మీద కేసులు ఉండవెందుకు? సర్దుబాట్లు, క్షమార్పణలకే పరిమితమెందుకు? స్నేహధర్మంలో భాగంగా అధికార పక్షాన్ని కాపాడేందుకు ఇటువంటి కప్ప దాటు వైఖరి అవలంబించే బీజేపీ నాయకులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. విశాఖపట్నం దగ్గర భూముల కుంభకోణం గురించి మాట్లాడుతూ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆధారాలు చూపుతున్న బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణుకుమార్రాజుకే బెదిరింపులు వస్తున్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న కొందరు ఆ పార్టీ నాయకులు గుర్తించాలి. మేనేజ్ చెయ్యడమనగా....! నేను దేన్నయినా మేనేజ్ చెయ్యగలను అని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతుంటారు. అధికార యంత్రాంగం నోరు నొక్కెయ్యడం, ప్రతి పక్షాన్ని శాసనసభ లోపల మైకులు కట్ చేసి, బయట కేసుల్లో ఇరికించి మాట్లాడకుండా చేసి, మీడియా మీద దాడి చేసి బహుశా మేనేజ్ చెయ్యడం అంటే ఇదేనని చెబుతారేమో చంద్రబాబు. తనను వ్యతిరేకించే మీడియాను నియంత్రించేందుకు చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన నాటి నుంచి విఫలయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావు సభ వెలుపల ఒక సమావేశంలో మాట్లాడుతూ మహిళలను గ్యారేజీలో ఉండే కొత్త కార్లతో పోలుస్తూ మాట్లాడిన మాటలను ప్రచురించినందుకూ, ప్రసారం చేసినం దుకు ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానల్లను లక్ష్యం చేసుకుని ఇబ్బందిపెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని స్పష్టం అవుతున్నది. స్థానిక మీడియాతో పాటు, జాతీయ ప్రచార ప్రసార మాధ్యమాలు అనేకం ఈ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తెచ్చి స్పీకర్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం తెలిపినా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక్క ‘సాక్షి’ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రసంగం క్లిప్పింగ్‌లను చూపడం దేనికి సంకేతమో అందరికీ తెలుసు. అధికార పక్షానికి వత్తాసు పలకడం లేదు కాబట్టి ఒక మీడియా సంస్థను ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది. మీడియాను భయపెట్టి, బెదిరించి, లొంగ దీసుకోవాలనే ప్రయత్నాలు గతంలో చాలానే జరిగాయి, అవి ఎటు వంటి దుష్ఫలితాలను ఇచ్చాయో ఉదాహరణలు మన కళ్లముందే ఉన్నాయి. వ్యవస్థలన్నీ పరస్పర గౌరవంతో మెలిగితేనే ప్రజాస్వామ్యానికి వన్నె చేకూరుతుంది. ఇకపోతే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం న్యాయ వ్యవస్థ ఒకటే మిగిలిందిక. ఒక్క కేసులో కూడా విచారణ ఎదుర్కోకుండా స్టేలు తెచ్చు కోవడం చూస్తూనే ఉన్నాం. 2050 వరకూ తామే అధికారంలో ఉంటామన్న ఊహల్లో విహరిస్తూ, అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి అయిదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయని కానీ, అవి మరో రెండేళ్లలో ముంచుకు రానున్నాయని కానీ మరచిపోయినట్టున్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతిపక్షం ఉండకూడదు, సత్యాలు మాట్లాడే మీడియా ఉండకూడదు. ప్రజాభిప్రా యంతో తనకు పనిలేదన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. ఏం చేసినా అంతి మంగా ఓట్లు వేయవలసింది ప్రజలే, అంత ముఖ్యమైన విషయం మరచి పోతే ఎలా? - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
మరో వెన్నుపోటు విషాదం
డేట్లైన్ హైదరాబాద్ నాగిరెడ్డిని మంత్రిని చేస్తానని, తామే పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాననీ చెప్పి పార్టీ ఫిరాయించేటట్టు చేసిన చంద్రబాబు ఆయనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారు. తీరా చివరకు నీ ప్రత్యర్థి వర్గ అభ్యర్థిని ఎంఎల్సీగా గెలిపించుకోనిస్తేనే అవన్నీ చేస్తామన్నారు. ఆ కారణంగానే నాగిరెడ్డి తీవ్ర మానసిక వ్యధకు గురై మరణించారని బాబుకు బాగా తెలుసు. కాబట్టే నాగిరెడ్డి మరణ వార్త విన్నప్పటి నుంచి ఆయన ఏ పదవీ ఆశించలేదు, ఆయనకు ఏ కోరికలూ లేవు అంటూ పదే పదే మాట్లాడుతున్నారు. శవయాత్ర సాగుతుండగా పాడె మీదకు విసిరే చిల్లర డబ్బులు, పేలాలు ఏరుకునే వారు ఉంటారు. అది వారి వృత్తి కావొచ్చు లేదా పేదరికం వారిచేత ఆ పని చేయిస్తూ ఉండొచ్చు. అంత హీన స్థితిలో ఉన్న మనుషులు ఇంకా మన మధ్య జీవిస్తున్నందుకు, వారి బ్రతుకులను మార్చలేక పోతున్నందుకు మనం అందరం సిగ్గుపడాలి తప్ప వారిని అగౌరవంగా చూడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, దాని అధినాయకుడు చంద్రబాబునా యుడు నాయకత్వంలో ప్రస్తుతం చేస్తున్న రాజకీయం అంతకన్నా హీనంగా ఉన్నది. ఇటువంటి రాజకీయం చేస్తున్న వారిని చూసి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే పరిస్థితి. కర్నూల్ జిల్లా నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి మొన్న ఆకస్మికంగా మరణించారు. ఆయన ఏడాది క్రితం ఏవో ప్రలోభాలకో లేదా ఒత్తిడులకో లొంగి తెలుగుదేశం పార్టీ పంచన చేరినా సాంకేతికంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడే. అందుకే ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేస్తానని గవర్నర్ దగ్గరికి వెళ్లినప్పుడు... తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేదిలేదని, వారి శాసనసభ సభ్యత్వాలకు రాజీ నామా చేయించి అప్పుడు రండని చెప్పి పంపేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించి మంత్రివర్గంలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేత ప్రమా ణం చేయించినందుకు తెలుగుదేశం వాళ్లు తిట్టిన తిట్లను గవర్నర్ ఎలా మరచి పోతారు? కాబట్టి భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ, ఆయన బావమరిది ఎస్వీ మోహన్‌రెడ్డి సహా మొత్తం 21 మంది ఎంఎల్ ఏలూ సాంకేతికంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంఎల్ఏలే. అఖిలప్రియ, మోహన్‌రెడ్డి సహా ఆ ఫిరాయింపుదారుల్లో ఎవరికి మంత్రి పదవి కట్టబెట్టాల నుకున్నా ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర గవర్నర్‌ను మార్పించి, అందుకు అను కూలంగా నడుచుకునే గవర్నర్‌ను వేయించుకోవాలి. ప్రస్తుతానికి అది ఆయన వల్ల జరిగే పనిలా కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్ని కల్లో సాధించిన అద్భుత విజయం తరువాత మోదీకి చంద్రబాబు కోరికలను తీర్చాల్సిన పరిస్థితి లేదు. మోదీ గురించి తెలిసిన వారు ఇప్పుడు అసలు బాబుకు ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే అంటున్నారు. క్షుద్ర రాజకీయంతోనే గుండెలు పగిలే వ్యధ నాగిరెడ్డి చితి మంటలు ఇంకా ఆరక ముందే ఆయన కుమార్తెను, బావమరి దిని శాసనసభకు రప్పించి వారి చేత రాజకీయాలు మాట్లాడించిన వైనం చూసి విస్తుపోవాల్సి వచ్చింది. అందువల్లనే మంత్రి పదవుల విషయంలో అఖిలప్రియ, మోహన్‌రెడ్డిల పేర్లను ప్రస్తావించాల్సి వచ్చింది. నాగిరెడ్డి మర ణించిన విషయం తెలిసినప్పటి నుండి ఆయన భౌతిక కాయానికి అంత్య క్రియలు జరిగే వరకూ... ఆయన ఏ పదవీ ఆశించలేదు, ఆయనకు ఏ కోరి కలూ లేవు అంటూ పదే పదే అరిగిపోయిన రికార్డ్‌లా బాబు మాట్లాడిన తీరు అట్లాగే ఉంది. నాగిరెడ్డిని మంత్రిని చేస్తానని, తామే పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాననీ ప్రలోభపెట్టి, పార్టీ ఫిరాయించేటట్టు చేసి ఒక ఏడాది పాటు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారు. తీరా చివరి రోజున నీ ప్రత్యర్ధి ముఠా వ్యక్తిని ఎంఎల్సీగా గెలిపించుకోనిస్తేనే అవన్నీ చేస్తామని చెప్పి పంపించిన కార ణంగానే నాగిరెడ్డి తీవ్ర మానసిక వ్యథకు గురై, దాన్ని తట్టుకోలేకనే మర ణించారని బాబు మనసుకు బాగా తెలుసు. కాబట్టే ఆయన ఇప్పుడు ఈ మాటలు వల్లెవేస్తున్నాడు. శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపించుకు రావడం అంత సులభం కాదు. రాయలసీమలో ముఠాలు, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ముఠాలు ఎట్లా పని చేస్తాయో అందరికీ తెలుసు. చట్టసభలోకి ప్రవేశించే నాటికే నాగిరెడ్డికి అది అనుభవపూర్వకంగా తెలుసు. ఆ తరువాత కూడా అదే రాజకీయాల్లో జీవించాడు కాబట్టి ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపు చేయించిన చంద్రబాబే షరతులు పెట్టే దగ్గరికి వచ్చే సరికి తట్టుకోలేక పోయాడు. ఏం జరిగిందో తెలిపే వాస్తవాలన్నీ కాలక్రమేణా తప్పకుండా బయటకు వస్తాయి. శవ రాజకీయం బ్రతికి ఉన్నప్పుడు, చనిపోయాకా ఎన్టీ రామారావుకు ఏం జరిగిందో నాగి రెడ్డికి కూడా అదే జరుగుతున్నది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకు రాలు శోభా నాగిరెడ్డి ప్రమాదంలో మరణిస్తే అభ్యర్ధుల జాబితా నుండి ఆమె పేరు తొలగించాలని ఎన్నికల సంఘానికి పిటిషన్లు పెట్టిన తెలుగుదేశం వారు, విభజనానంతర ఏపీ తొలి శాసనసభలో ఆమెకు కనీసం సంతాపం తెలపడానికైనా ఇష్టపడని తెలుగుదేశం వారు, నాగిరెడ్డిని అడ్డగోలు కేసుల్లో ఇరికించి ఆస్పత్రుల పాలు చేసి, చివరకు జైలుకు కూడా పంపిన తెలుగుదేశం వారు... ఆయన చనిపోయాక ఆ కుటుంబం మొత్తం తమదేనని ప్రకటించు కునే ప్రయత్నం చెయ్యడాన్ని మించిన శవ రాజకీయం ఇంకొకటి ఉండబోదు. వయసులో, అనుభవంలో చిన్న కాబట్టి అఖిలప్రియకు ఇంకా ఈ విషయం అర్థం కాకపోవచ్చు, మోహన్‌రెడ్డికయినా తెలియకుండా ఉంటుందా ? ఏది ఏమైనా నాగిరెడ్డి మరణం ఆయన కుటుంబానికి, ముఖ్యంగా పిల్ల లకు తీరని లోటు. ఎవరూ తీర్చలేని వ్యక్తిగత దుఃఖం. తల్లిని కోల్పోయిన మూడేళ్లలోపే తండ్రిని కూడా పోగొట్టుకున్న ఆ పిల్లల దుఃఖాన్ని ఎవరూ తీర్చ జాలరు. నాగిరెడ్డి శాసనసభకు వచ్చింది కూడా అటువంటి విషాద సంద ర్భమే. తన అన్న, శాసనసభ్యుడు భూమా వీరశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఖాళీ అయిన ఆళ్లగడ్డ స్థానం నుండి 1992 ఉప ఎన్నికల్లో నాగి రెడ్డి పోటీ చేశారు. అదే సమయంలో ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాల నుండి లోక్‌సభకు పోటీ చేశారు. ఆ వార్తల కోసం వెళ్లిన నాకు నాగి రెడ్డి నామినేషన్ సందర్భంగా జరిగిన ఘర్షణను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది. కాకలు తీరిన నేత భవితనే ప్రశ్నార్థకంగా మారిస్తే? పీవీ కోసం లోక్‌సభ సభ్యత్వాన్ని త్యజించిన గంగుల ప్రతాప్‌రెడ్డిని కలసి నాగిరెడ్డి ఇంటికి చేరుకునే సరికి ఆయన నామినేషన్ వెయ్యడానికి ఊరేగిం పుగా బయలుదేరారు. ఆ వాహన శ్రేణి చివర మా వాహనం ఉంది. కొద్దిగా ముందుకు పోగానే ర్యాలీ మీద బాంబుల వర్షం. జీపుపైన నాగిరెడ్డితోబాటు అప్పటి తెలుగుదేశం నాయకుడు అవుకుకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. నాగిరెడ్డిని నామినేషన్ వెయ్యకుండా ఆపే ప్రయత్నంలో జరి గిన ఆ దాడిని ఎదుర్కొంటూ, సమయం మించి పోతుండటంతో ఆయన ఒక లారీలో దాక్కుని నామినేషన్ వేయాల్సిన కార్యాలయానికి చేరుకొని మీడి యాతో మాట్లాడారు. ఈ ఘటన అంతటికీ నాతో బాటు ‘ఇండియా టుడే’ ఆంగ్ల పత్రిక ప్రతినిధి అమర్నాథ్ మీనన్ కూడా ప్రత్యక్ష సాక్షి. ప్రత్యర్థి ముఠా బాంబు దాడిని ఎదుర్కొని, తొలి నామినేషన్ వేసి గెలిచి శాసనసభకు వెళ్లిన నాగిరెడ్డి పలు మార్లు శాసనసభ సభ్యునిగా, పార్లమెంటు సభ్యుని గెలిచారు. చివరికి అటువంటి మరో ప్రత్యర్థిని గెలిపించకపోతే రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అన్న మానసిక వ్యధతో కుంగిపోవాల్సి రావడం, ఆ కార ణంగా గుండె ఆగి చనిపోవడం విచారకరం. నాగిరెడ్డి మరణాన్ని రాజకీయ ప్రయోజనంగా మలచుకోచూస్తున్న తెలుగుదేశం అధినేత పోకడ మరీ దుర్మార్గం. మనిషి చనిపోయినంత మాత్రాన వాస్తవాలు మారిపోవు. తప్పులు ఒప్పులు అయిపోవు. తల్లి తండ్రి లేని అమ్మాయి కాబట్టి అఖిలప్రియ పార్టీ ఫిరాయింపు చట్టబద్ధం కాబోదు. మిగిలిన 19 మందితో బాటు మరణించిన నాగిరెడ్డి ఫిరాయింపు కూడా చట్ట వ్యతిరేకమే, ప్రజాస్వామ్య విలువలకు, సంప్రదాయాలకూ విఘాతమే, అత్యంత అనైతికమే. మరణించిన వారి గురించి మంచే మాట్లాడాలి. కాబట్టి ఈ విషయాలు ప్రస్తావించలేకే మంగళవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు బయటే ఉండిపోయింది. ఇంతకూ లోపల ఉన్న తెలుగుదేశం అధినేత, నాగిరెడ్డిని ఏ పార్టీ మనిషిగా భావించి నివాళి అర్పించినట్టు? - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఆ నేతలకు ఇది నిషిద్ధాక్షరి
డేట్లైన్ హైదరాబాద్ చాలా రాష్ట్రాల్లో అధినేతల పిల్లలు రాజకీయాల్లోకి వచ్చి తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించడం మామూలే. అయితే ప్రజాక్షేత్రంలో పోటీకి నిలబడి గెలిచి, రాజకీయాల్లో కొనసాగేవారే ఎక్కువ. కొందరు ఆ నమ్మకం లేక దొడ్డిదారిన కూడా ప్రవేశిస్తుంటారు. ఇప్పుడు నారా లోకేశ్ కూడా అదే దారిలో రాజకీయ ప్రవేశం చెయ్యబోతున్నారు. యువ కులు రాజకీయాల్లోకి రావాలి. లోకేశ్ కూడా యువకుడే. తొలి అడుగే దొడ్డి దారిన పడటం ఏ మాత్రం శోభ తెచ్చిపెడుతుందో ఆయనే ఆలోచించుకోవాలి. ‘రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడేది ఎవరు?’ అంటారు మహేశ్ విజాపృకర్. మహారాష్ట్రలో ఇటీవల స్థానిక సంస్థలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత భారతీయ జనతాపార్టీ, శివసేన మధ్య సాగుతున్న రగడ గురించి విశ్లేషిస్తూ మహేశ్ ఈమాట అన్నారు. ‘నగర పాలక సంస్థలో అసలు ప్రతిపక్షమే లేకుండా చెయ్యడం కోసం బీజేపీ, శివ సేన చేతులు కలుపుతాయి. అట్లా కాకుండా బీజేపీ మేయర్ పదవి కోరుకో కుండా ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతిపక్షంలో కూర్చోవడానికే సిద్ధ మైతే ప్రతిపక్షం బలంగా ఉండి పారదర్శకత కోసం ప్రయత్నించే వీలవు తుంది. కానీ ప్రతిపక్షం అనేదే లేకుండా చెయ్యాలన్న ఆలోచన ఉన్న వాళ్లు రాజకీయాల్లో గౌరవం గురించి ఎందుకు ఆలోచిస్తారు?’ అంటారు మహేశ్. సీనియర్ పాత్రికేయుడు మహేశ్ విజాపృకర్ తెలుగువాడు కాకపోయినా ఆయన జర్నలిజం తొలిరోజులు ఆంధ్రప్రదేశ్‌లోనే గడిచాయి. ఎమర్జెన్సీ రోజుల్లో హైదరాబాద్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో, వరంగల్‌లో హిందూ దిన పత్రిక విలేకరిగా పని చేసి అంతిమంగా ముంబైలో హిందూ విలేకరిగా సుదీర్ఘ కాలం పనిచేసి ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతున్నారు. అయినా మహేశ్ కొన్ని దశాబ్దాలుగా భారత దేశ రాజకీయాలను రిపోర్ట్ చెయ్యడంతో బాటు విశ్లేషిస్తూనే ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన నాటి రాజకీయాలు కావు ఇప్పుడు నడుస్తున్నవి. వెనుకటి రాజకీయాలు కూడా చూసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో గౌరవం గురించి ఎవరు పాకులాడుతారు అని ప్రశ్నించారాయన. నేతలు మార్చేసిన రాజకీయ చిత్రం ఇప్పుడు రాజకీయాల్లో ‘గౌరవం’ అనే అంశం గురించి ఎవరికి పట్టింది? 1970 దశకంలోనే ఈ దేశ రాజకీయాల రూపు, రంగు, రుచి మారడం ప్రారం భమైంది. ఆ సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన నాయకులలో చాలామంది అంతకుముందు ఉన్న విలువలు, ఆదర్శాలు, నీతి వంటి వాటిని వెనకే వదిలేసి కొత్త సిద్ధాంతాలతో ముందుకు సాగారు. రాజకీయాలు మారిపో యాయి. నాయకులూ తదనుగుణంగా మారిపోయారు. నిజం చెప్పాలంటే రాజకీయాలు కాదు మారింది, పదవీ కాంక్ష అవధులు దాటి, మంచీచెడు విచక్షణ మరిచి నాయకులే వాటిని మార్చేశారు. ప్రజాస్వామ్యం అనే మాటకు అర్ధం లేకుండా పోయింది. తమను వ్యతిరేకించేవాడు కనిపించకూడదు. వారే శాశ్వతంగా అధికారంలో ఉండాలి. తాము కాకపోతే తమ సంతానం అధి కారం చేపట్టాలి. సృష్టి ఉన్నంత కాలం తమ ఏలుబడిలోనే ప్రజలు జీవిం చాలి. అట్లా ఉండటం కోసం ఎన్ని అక్రమాలకయినా పాల్పడటానికి సిద్ధం. బోలెడంత డబ్బు, సంపద ఎన్ని తప్పుడు పనులు చేసి అయినా సంపా దించాలి. అసత్యాలు చెప్పాలి, ప్రజలకు ఇచ్చిన మాట ఎప్పటికప్పుడు తప్పాలి. ఏమన్నా అంటే మేమెప్పుడు ఇచ్చాం హామీ? అని బుకాయించాలి. ఇదీ నేటి రాజకీయం. అధికారంలో ఉన్న వాళ్లకు ఇటువంటి లక్షణాలు ఉంటే, ఇంక రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడే తీరిక ఎక్కడ ఉంటుంది? ఆ సమయంలోనే క్రియాశీల రాజకీయాల్లోకి, ఆ మాట అనడం కంటే ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించిన నాయకుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఇంకా చాలామంది లాగే ఆయన కూడా పైన పేర్కొన్న నాయకత్వ లక్షణాలన్నిటికి ప్రతినిధిగా నిలుస్తారనడానికి ఆ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే సాక్ష్యం. భారతీయ జనతాపార్టీ, శివసేన రాజకీయాల్లో సహజ మిత్రులు, వాళ్ల ఆలోచన, భావజాలం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఆ రెండూ రాజ కీయాల్లో చిరకాలం మిత్రత్వం నెరిపిన పార్టీలే. కాలక్రమేణ విభేదాలు ఏర్ప డ్డాయి. ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో వారు కలసి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసినా పెద్దగా చర్చించుకోడానికి ఏమీలేదు. పాలకవర్గం మాత్రమే మిగిలి, ప్రతిపక్షం లేకుండా పోతే ప్రశ్నించే వాళ్లు ఉండరు, పార దర్శకత మృగ్యమవుతుందని మహేశ్ విజాపృకర్ లాంటి పెద్దలు బాధపడు తున్నారు తప్ప, ఆ రెండు పార్టీల కలయికను వారు కొత్తగా ఏమీ చూడటం లేదు. చంద్రబాబునాయుడు కూడా శివసేన వలెనే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ లో భాగస్వామి. కానీ ఆయన రాజకీయాల్లో ఎవరికీ సహజ మిత్రుడు కారు, నమ్మదగ్గ మిత్రుడు అసలే కాదని బీజేపీ పెద్దలే చెపుతుంటారు. ఈ సంగతి అందరికంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే బాగా తెలుసు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు తన విషయంలో తీసుకున్న వైఖరి మోదీ మరిచిపోయి ఉండరు. అధికారంలో లేనప్పుడు ద్వేషించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే స్నేహం చేసే కోవకు చెందిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. వారసత్వ రాజకీయాల కొనసాగింపు ఇక ప్రస్తుతానికి వస్తే మొన్న సోమవారం నాడు వెలగపూడిలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల సభ్యులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలికి జరగనున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక మీద కూడా చర్చించి శాసనసభ నుంచి ముఖ్యమంత్రి కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను మండలికి ఎన్నిక చేయించుకోవడం మొదలుకుని ఇతర అభ్యర్ధుల ఎంపిక వరకూ అధి కారాన్ని పొలిట్ బ్యూరో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుకు అప్పగించింది. శాసనసభ సమావేశాల ముహూర్తాన్ని నిర్ణయించడంతో బాటు పక్క రాష్ట్రం తెలంగాణ రాజకీయ పరిస్థితులను కూడా ఈ సమావేశంలో చర్చించారు. రాజకీయాల్లో, అందునా ప్రాంతీయ రాజకీయాల్లో కొడుకులూ కూతుళ్లు తమ తండ్రుల బాట పట్టడం కొత్తేమీ కాదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిల్లలు ఇద్దరూ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. కూతురు పార్లమెంట్ సభ్యురాలు, కాగా కొడుకు ఆయన క్యాబినెట్లోనే మంత్రి. దానికీ విమర్శలు వస్తు న్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన సుదీర్ఘ తుది విడత పోరాటంలో ఆ ఇద్దరు పిల్లలూ చురుకయిన పాత్ర పోషించారు. ప్రజా మోదం పొంది గెలిచి వచ్చారు. కాబట్టి చంద్రశేఖరరావు ఆ విమర్శలను తట్టుకోగలుగుతున్నారు. ఇట్లా చాలా రాష్ట్రాల్లో అధినేతల పిల్లలు రాజకీయా ల్లోకి వచ్చి తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించడం భారతదేశ ప్రాంతీయ రాజకీయాల్లో మామూలే. అయితే చాలా వరకు ప్రజాక్షేత్రంలో పోటీకి నిలబడి గెలిచి, రాజకీయాల్లో కొనసాగేవారే ఎక్కువ. కొందరు ఆ నమ్మకం లేక దొడ్డిదారిన కూడా ప్రవేశిస్తుంటారు. ఇప్పుడు నారా లోకేశ్ కూడా అదే దారిలో రాజకీయ ప్రవేశం చెయ్యబోతున్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో కొత్త ఒరవడికి దోహదపడాలి. లోకేశ్ కూడా యువకుడే. రాజకీయాల్లో కొనసాగడానికి సుదీర్ఘ జీవితం ముందు ఉన్నది. తొలి అడుగే దొడ్డి దారిన పడటం ఆయనకు ఏ మాత్రం శోభ తెచ్చి పెడుతుందో ఆయనే ఆలోచించుకోవాలి. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, కానీ ఎట్లా వచ్చాం, ఎంత కాలం ఉన్నాం, ఎటువంటి పేరు తెచ్చుకున్నాం అన్నది ముఖ్యం. సరే అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి మాట్లాడాల్సింది పెద్దగా ఏమీలేదు. కానీ రాజకీయాల్లో తనను వ్యతిరేకించే వాళ్లే ఉండకూడదు, ప్రతిపక్షం లేకుండా చేసేయాలన్న ఆలోచన గల చంద్ర బాబునాయుడు సొంత కొడుకునే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించి గెలి పించుకోలేక దొడ్డి దారిన అధికారంలో భాగస్వామిని చేయబూనుకోవడం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు రాజకీయాల్లో గౌరవం గురించి ఆలోచించ కపోవడం కిందికే వస్తుంది. గౌరవం కోసం తపన పడేవాళ్లయితే... నిజమే రాజకీయాల్లో గౌరవం గురించి పాకులాడేవాళ్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల శాసన సభాపతుల ధోరణి ఇట్లా ఎందుకు ఉంటుంది? రెండు రాష్ట్రాల్లోనూ పదవులకు రాజీనామా చెయ్యకుండా పార్టీ ఫిరాయించిన వారి విషయంలో ఏళ్లూపూళ్లూ గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడం, అనర్హత వేటు వెయ్యకపోవడం రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడేవాళ్లు ఆ పదవిలో లేనందువల్లనే జరుగుతుందని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిలోని తాత్కాలిక శాసన సభా భవన సముదాయంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి జరగనున్న తొలి సమా వేశాల్లోకి దొంగసొత్తుతో జనస్వామ్య దేవాలయం అయిన అసెంబ్లీలోకి ప్రవేశిస్తారా అని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీకర్‌కు రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించడాన్ని ఎట్లా తప్పుపడతారు? తాను ఎంపీగా, తన తల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయిన పార్టీ నుంచి వైదొలగాలనుకున్న ప్పుడు, కొత్త పార్టీ పెట్టాలనుకున్నప్పుడు పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలిచి వచ్చిన చరిత్ర, తన పార్టీలోకి రావాలనుకున్న వారి చేత రాజీనామాలు చేయించి తిరిగి పోటీ చేయించిన చరిత్ర ఆయనది. కాబట్టి ఇవాళ స్పీకర్‌ను ఆ డిమాండ్ చేసే పూర్తి అర్హత ఆయనకే ఉంది. మిగిలిన వారు కూడా రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడకపోయినా కొంచెం ప్రయత్నం అయినా చేస్తే బాగుండేది. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
జనం సంగతి పట్టని ‘ఆవేదన’
డేట్లైన్ హైదరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌ల పేరిట వచ్చి పెత్తనం చేసే వాళ్లు కూడా తెలంగాణ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఏ రకంగాను ఉపయోగపడకపోగా నష్టం చేసే విధంగా వ్యవహరి స్తారు. కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు పరిష్కరించడం మాటేమోగానీ అరకొర సమాచా రంతో వారు మాట్లాడే మాటలు వారి రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతుంటాయి. నిజామాబాద్‌లో జరిగిన జన ఆవేదన సభలో మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి ఫార్మ్ హౌస్‌లోనే గడుపుతారంటూ చేసిన విమర్శ అటువంటిదే. దేశమంతటా ఎట్లాఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీది విషాదకర పరిస్థితి. అది స్థానిక నాయకుల స్వయంకృతాపరాధమే. తెలంగాణలో నాయకుల స్వయంకృతం అంటే అర్ధం చేసుకోవచ్చు కానీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులను ఎట్లా నిందిస్తారు, అధిష్టానం నిర్వాకానికి ఆ రాష్ట్రంలో పార్టీ బలయింది కదా అని ఎవరైనా వాదించవచ్చు. అది కొంత నిజమే అయినా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలువురు స్థానిక నాయకుల నిర్వా కమే ఈ స్థితికి కారణమన్న విషయం నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి సున్నా మార్కులు రావడానికి కారణాలు తరువాత విశ్లేషించు కోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ హడావుడి నడుస్తున్నది కాబట్టి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. ప్రాంతీయ ఆకాంక్షలు బలంగా పనిచేసి, వాటి పునాదుల మీద ఏర్పడిన ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు బలోపేతమైన రాష్ట్రాలలో తమ పప్పులు ఉడకవని రుజువు చేసే అనుభ వాలు ఎన్ని ఎదురైనా పాఠాలు నేర్చుకోడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండదు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఏదో ఒక ద్రవిడ పార్టీ తోక పట్టుకుని నడవాల్సిన పరిస్థితి. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలు, నేటి సోనియా గాంధీ, రేపోమాపో పార్టీ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్‌కు దశ దిశ నిర్దేశిం చబోతున్న రాహుల్ గాంధీ దాకా ఇదే సంప్రదాయం. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ వంటి ప్రాంతీయ పార్టీ యువ నాయకుడు అఖిలే శ్ యాదవ్‌తో దోస్తీ చెయ్యాల్సిన దుస్థితి. జాతీయ నాయకత్వానికి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తూనే ప్రాంతీయ పార్టీల మాదిరిగా ఒకే నాయకుడి కనుసన్నల్లో నడిచే విధంగా పార్టీని మార్చుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి నాయకులు ప్రయోగాత్మకంగా రుజువు చేసినా కాంగ్రెస్ అధిష్టానానికి పట్టలేదు. రాష్ట్రాల్లో ఒక నాయకుడు బలపడితే తమ పెత్తనం సాగదన్న దుగ్ధ ఆ పార్టీ మొదటికే మోసం వచ్చేటట్టు చేస్తున్న, చేసిన సందర్భాలు అనేకం. జాతీయ పార్టీలో ఉండి కూడా ప్రాంతీయ నాయకులకు ఉండే ప్రజాకర్షణ, ప్రజామోదం పొందిన నాయకుడు కాబట్టి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖరరెడ్డిని ముట్టుకునే సాహసం కాంగ్రెస్ అధిష్టానం చెయ్యలేదు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ పదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉండగలి గింది. 1978లో ఆ తరువాత 1989లో లాగానే 2004లో కూడా ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులను మార్చి ఉంటే 2009లో మహాకూటమి ప్రయోగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫలించి 2009లోనే అధికారం కోల్పోయి ఉండేదేమో! నిజానికి 2009లో పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన డాక్టర్ రాజశేఖ రరెడ్డి హఠాన్మరణం తరువాత ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిల నాయకత్వంలో నడిచినవి పరోక్షంగా సంకీర్ణ ప్రభుత్వాలే. ప్రత్యక్షంగా ప్రజా రాజ్యం పార్టీ విలీనమై తోడ్పడితే తెర వెనుక నుంచి ఆ ప్రభుత్వాలను నడి పించింది తెలుగుదేశం పార్టీ అన్న విషయం జగమెరిగిన సత్యం. నిస్సహాయ అధిష్టానం ఏ రాజకీయ నేప«థ్యమూ లేని సినిమా నటుడు ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీ పెడితేనే ఆదరించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి తెచ్చిన తెలుగు ప్రజలు మూడు దశాబ్దాల పైబడిన రాజకీయ అనుభవం, అద్భుతమైన విషయ పరిజ్ఞానం, ఆ విషయాలన్నిటినీ అరటిపండు ఒలిచి పెట్టినట్టు చెప్పి మెప్పించగల వాక్చాతుర్యం, 14 సంవత్సరాల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన శక్తియుక్తులూ కలిగిన ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావు పట్ల ఇంత తొందరలో విముఖత ఏర్పరచుకుంటా రని కాంగ్రెస్ పెద్దలు భావించడం పొరపాటు. నిజానికి సమకాలీన రాజ కీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాకర్షణ, అభిమానం కలిగిన, ప్రజా భిప్రాయాన్ని ప్రభావితం చెయ్యగలిగిన నాయకులు ఎన్టీ రామారావు, డాక్టర్ రాజశేఖరరెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనడంలో సందేహం లేదు. ఎన్టీ రామారావు, రాజశేఖరరెడ్డి ఇప్పుడులేరు, ఆ ఇద్దరు నాయకుల కంటే చంద్రశేఖరరావుకు ఉన్న అదనపు అర్హత రాష్ట్ర సాధన పోరాటానికి సుదీర్ఘ కాలం నాయకత్వం వహించడం. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో కేసీఆర్ తో పోటీ పడగలిగే నాయకుడు ఇతర ఏ పార్టీలోనూ లేకపోవడం వల్ల తెలం గాణ ప్రతిపక్ష శిబిరంలో రాజకీయ శూన్యత నెలకొన్న మాట వాస్తవం. తమ పార్టీల తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సమితికి వలస పోతుంటే కళ్లప్పగించి ఉండిపోవడం తప్ప, వాళ్లను ఆపుకోలేని నిస్సహాయ నాయకత్వం కాంగ్రెస్‌ది. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అధికారపక్షా నికి ఏ కారణాల చేత, ఏ ప్రలోభాలకు లొంగి వలసపోయినా, అది ఎంత అనైతిక వ్యవహారమైనా దాన్ని సమర్ధంగా ఎదుర్కొని పోరాడే సరైన నాయ కత్వం కాంగ్రెస్‌లో కొరవడిందన్న మాట వాస్తవం. ఎంతో అనుభవం కలిగిన, సుదీర్ఘకాలం మంత్రి పదవుల్లో ఉన్న వాళ్లం ఇంత మందిమి ఉండగా సమర్ధ నాయకుడు లేడని ఎట్లా అంటారు అంటూ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఆగ్ర హించవచ్చు. అయినా వాస్తవాలు మాట్లాడుకోక తప్పదు. సందర్భశుద్ధి లేని నాయకత్వం ఇంతింత అనుభవం కలిగిన పెద్దలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వం అన్న విషయం ప్రజల్లోకి తీసుకు పోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇచ్చింది కాంగ్రెస్ అయినా పోరాటం చేసి తెచ్చింది మేమే అన్న వాదనను కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగింది. పైగా ఒకే జిల్లాకు చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు మూడు ముఠాలుగా చీలిపోయి నాయకత్వం కోసం పోట్లాడుకుంటూ ఉంటే ఆ పార్టీ బలోపేతం కావడం ఎట్లా సాధ్యం? ప్రజలు ఆ పార్టీ మీద నమ్మకం ఎట్లా పెంచుకుంటారు? తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను నెరవేర్చడం లేదనీ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నదనీ కాంగ్రెస్ తెలంగాణలో జనావేదన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎక్కడైనా అది ప్రతిపక్షాల బాధ్యత, నిత్యం జనంలో ఉండాల్సిందే. వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చెయ్యా ల్సిందే. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ధోరణి వింతగా ఉంటుంది. ఒక స్థానిక సంస్థకు ఎన్నికలు జరుగుతూ ఉంటే పోలింగ్ ఎల్లుండి ఉందనగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అయిదు రూపాయల భోజనం అద్భుతంగా ఉందని ఆ భోజనం తెప్పించుకుని తింటూ ఫొటోలకు పోజులిచ్చి పత్రికలవారికి చూపించిన పెద్దలు ఇంకా అధికార పార్టీ మీద ఏం పోరాటం చేస్తారు? నిజా నికి అయిదు రూపాయల భోజనం అందరి ప్రశంసలూ అందుకుంది. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఆ వాస్తవాన్ని బయటికి చెప్పొద్దనడం భావ్యం కాదు. కానీ ఎంచుకున్న సందర్భం ఎటువంటిది? ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నది, ప్రజల్లో తమ పార్టీకి ఎంత ఆదరణ ఉందో తెలుసుకోవాలని అనుకోవడం తప్పు కాదు. అందుకోసం పీసీసీ అధ్యక్షుడే స్వయంగా ఒక రహస్య సర్వే జరిపించుకోవడం కూడా తప్పు కాదు, నిజానికి తమ స్థానం ఏమిటో తెలుసుకునేందుకు, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోడానికి ఇది ఎంతో ఉపయోగపడు తుంది. అయితే ఇప్పటికే తీవ్రంగా ఉన్న అంతర్గత విభేదాలు మరింత పెరిగే విధంగా సరిగ్గా జనావేదన సభల ముంగిట ఆ సర్వే వివరాలను బహిర్గతం చేసుకోడం కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగానూ తోడ్పడదు. అదే జిల్లాకు చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకులూ ఏదో ఒక సంద ర్భంలో తామే ముఖ్యమంత్రులం అని ప్రకటించుకోవడం పార్టీని నగు బాటుకు గురి చేయడం తప్ప బలోపేతానికి తోడ్పడే విధంగా లేదు. ఈ మూడు గ్రూపుల నాయకులూ ఒకరి మీద ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకోడం చూస్తే ఇంకా జనావేదన ఏం వింటారనిపిస్తుంది. ఇన్‌చార్జ్‌లు మోత బరువు ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకులు, ఇన్‌చార్జ్‌ల పేరిట వచ్చి పెత్తనం చేసే వాళ్లు కూడా తెలంగాణ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఏ రకంగాను ఉపయోగపడకపోగా నష్టం చేసే విధంగా వ్యవహరిస్తారు. కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు పరిష్కరించడం మాటేమో గానీ అరకొర సమాచారంతో వారు మాట్లాడే మాటలు వారి రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతుంటాయి. ప్రభుత్వం లోపాలను ప్రతిపక్షం ఎత్తి చూపాల్సిందే, ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే ప్రజల్లోకి ఆ విషయం తీసుకెళ్లి పోరాటం చెయ్యాల్సిందే. కానీ పనికిరాని చిల్లర విమర్శలు చెయ్యడం వారి స్థాయికీ తోడ్పడదు, పార్టీ బలో పేతానికీ ఉపయోగపడదు. నిజామాబాద్‌లో జరిగిన జన ఆవేదన సభలో మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి ఫార్మ్ హౌస్‌లోనే గడుపుతారంటూ చేసిన విమర్శ అటువంటిదే. ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, ముఖ్యమంత్రి ఏంచేస్తున్నారు అన్న విషయంలో ఆయన తన పార్టీ స్థానిక నాయకత్వం నుంచి సరైన సమాచారం తీసుకుని మాట్లాడి ఉంటే బాగుండేది. ఇటీవలే నిర్మించిన ప్రగతిభవన్‌లోని జనహితలో ముఖ్యమంత్రి వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులను పెద్ద సంఖ్యలో కలుసుకుని వారి సమస్యలకు పరిష్కారాలను, కార్యక్రమాలను అన్వేషిస్తున్నారు, ప్రకటనలు చేస్తున్నారు. నిధులు కేటాయిస్తామని చెబు తున్నారు. అవి ఏ మేరకు కార్య రూపం దాలుస్తాయి, ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంత అనేది కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ప్రతిపక్షంగా కాంగ్రెస్ కూడా మాట్లాడవచ్చు, అంతిమంగా ఏం చెయ్యాలో నిర్ణయించు కోడానికి ప్రజలకు రెండేళ్లే సమయం ఉంది. ఈలోగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేనంటే నేను ముఖ్యమంత్రిని అని పోట్లాడుకోడం మానేసి అందరినీ కలుపుకుని పోయే నాయకత్వంగా తమను తాము మలుచుకుంటే సగం విజయం సాధించినట్టే. మిగిలిన సగం విజయం సంగతి ప్రజలకు వదిలేస్తే మంచిది. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
మాటలో ఆదర్శం, మనసులో విషం
డేట్లైన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పట్ల అధికార పక్ష నేతలు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న భౌతిక దాడులు అధికార గణం మహిళా సమస్యల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగా దెబ్బతిని పోతున్న సీఎం ఆయన ప్రభుత్వ ఇమేజ్‌ని జాతీయ మహిళా పార్లమెంట్ల పేరిట ఎన్ని జాతరలు జరిపినా తిరిగి తెచ్చి పెట్టలేవు. ప్రభుత్వ ఉద్యోగి వనజాక్షి మొదలుకుని అనంతపురం జిల్లాలో ఒక అబల దాకా ఏపీలో అధికార పక్ష ప్రజా ప్రతినిధులు, నాయకులు వ్యవహరించిన తీరు ఆ రాష్ట్ర ప్రతిష్టను పెంచేదిగా ఎంతమాత్రం లేదు. ‘బసవతారకపుత్ర బాలకృష్ణ’ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూసి నా ఫ్రెండ్ ఒకరు ఫేస్బుక్ లోనో, వాట్స్యాప్లోనో స్పందిస్తూ ఈ సినిమాకు సంబంధించి అందరి పేర్ల ముందూ ఇలా తల్లుల పేర్లు ఉండటం చాలా సంతోషం కలిగించిందన్నారు. ఆ ఫ్రెండ్ చాలా ప్రగతిశీల భావాలు గల మహిళ. మానవ హక్కుల ఉద్యమ కార్యకర్త, మహిళా పక్షపాతి. పైగా విషయాలను విమర్శనా దృష్టితో పరిశీలించగల పాత్రికేయురాలు కూడా. ఆ ఫ్రెండ్ ఈ సినిమా చూశారో లేదో తెలియదు. చూసి ఉంటే ఆమె అందులో భారీ డైలాగ్‌లలో మహిళలకు లభించిన గౌరవానికి మరింత ఆనందంలో తల మునకలు అయ్యేవారేమో! శాతకర్ణి ఒక సందర్భంలో తన తల్లికి అగ్రపూజ చెయ్యాలనుకుంటే; కొందరు స్త్రీకి అగ్రపూజ ఏమిటి అని అభ్యంతరం తెలిపి నప్పుడు ఆయన చెప్పిన డైలాగు విని కచ్చితంగా మహిళలందరూ సంతోషి స్తారు. శాతకర్ణి నిజంగా అగ్రపూజ తల్లికి అందించాడా లేదా అనడానికి చారి త్రిక ఆధారాలు ఏమీలేవు. అసలు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మొత్తం చరిత్రను వక్రీకరించి తీసిందే అన్న విమర్శ ఉంది. ఇక్కడ ఆ చర్చ అప్ర స్తుతం. క్రిష్ అనే దర్శకుడు చెప్పినట్టు నటించడం, బుర్రా సాయిమాధవ్ అనే మాటల రచయిత రాసిచ్చిన డైలాగ్‌లను బట్టీ పట్టి అప్పచెప్పడం తప్ప అది బాలకృష్ణ ఒరిజినల్ క్యారెక్టర్ అనుకుంటే పొరపాటు. తెర మాట మనసు మాట కాదు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది, వియ్యంకుడు, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ ఒరిజి నల్ క్యారెక్టర్ మహిళల విషయంలో ఏమిటో ఇటీవల ఒక సినిమా ఫంక్షన్ వేదికగా మాట్లాడిన మాటలు స్పష్టం చేస్తాయి. ఆ మాటలు చాలా మంది మీడియా ద్వారా విని ఉన్నారు, చదివి కూడా ఉన్నారు. మళ్లీ ఉచ్చ రించడానికి సిగ్గుగా ఉంది. చాలా మంది మగవాళ్లకు స్త్రీలంటే అటువంటి చిన్న చూపే ఉంటుంది, అయితే బయటపడరు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లు తమ ఈ ఒరిజినల్ క్యారెక్టర్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ తారు. హీరో బాలకృష్ణకు తాను రాజకీయాల్లో ఉన్నాననీ, అధికారపక్షంలో ఉన్నాననీ స్పృహ లేనట్టుంది. తరచూ సినిమా వాళ్లు చాలామంది మాట్లాడే భాషే ఆయనా మాట్లాడారు. అందుకే ‘బసవతారకపుత్ర బాలకృష్ణ’ అని స్క్రీన్ మీద కనిపించినంత మాత్రాన్నే ఆ ఫ్రెండ్ ఎక్సైట్ కావడం ఆశ్చర్యం కలిగించింది. బాలకృష్ణకు రాజకీయాలు తెలియవు, పైగా స్టార్ హీరో, అభి మానులను అలరించడానికి ఎన్నో మాట్లాడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు కూడా బాలకృష్ణ స్థాయిలోనో, అంత కంటే క్రింది స్థాయిలోనో మాట్లాడితే ఏమనుకోవాలి? పేరు గొప్ప సదస్సు దిబ్బ జాతీయ మహిళా పార్లమెంట్ పేరుతో ఆంద్రప్రదేశ్ శాసనసభ ఆధ్వర్యంలో మొన్న అమరావతిలో జరిగిన మూడురోజుల సమావేశాలు జరిగిన తీరు, ఆ సందర్భంగా ఈ ఇద్దరు నాయకులు చేసిన వ్యాఖ్యానాలు, జరిగిన పరిణా మాలు ఈ ప్రశ్నకు తావిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృ«థా చేసి నిర్వహించిన ఈ మూడురోజుల సభలు తమకు అనుకూలురయిన వారి చేత తమకు సంతోషం కలిగించే కొన్ని ముచ్చట్లు చెప్పుకోడానికి తప్ప సాధిం చింది శూన్యం, కొండను తవ్వి ఎలుకనయినా పట్టలేకపోయారు. జాతీయ మహిళా పార్లమెంట్ ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారు? అందులో ఎంతమంది ప్రజా ప్రతినిధులను దేశవ్యాప్తంగా ఆహ్వానించారు? అందులో భిన్నాభిప్రా యాలు ఏమయినా వెలువడ్డాయా? వాటి మీద చర్చ జరిగిందా? వాటి సారాంశంగా తీర్మానాలు, సిఫార్సులు ఏమయినా చేశారా..? అంటే ఏమీ లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు మహిళా సాధికారత విషయంలో గతంలో చాలానే జరిగాయి. ఇది వాటికి భిన్నంగా ఏమీలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ఇమేజ్ను పెంచుకోడానికి జరిపిన ఒక ఈవెంట్‌గా ముగిసింది. ఏపీలో మహిళల దుస్థితి తెలియనిదా? కానీ గత రెండున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పట్ల అక్కడి అధికార పక్ష నేతలు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న భౌతిక దాడులు అధికారగణం మహిళా సమస్యల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగా దెబ్బ తిని పోతున్న ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వ ఇమేజ్‌ని జాతీయ మహిళా పార్లమెంట్ల పేరిట ఎన్ని జాతరలు జరిపినా తిరిగి తెచ్చిపెట్ట లేవన్నది సత్యం. ప్రభుత్వ ఉద్యోగి వనజాక్షి మొదలుకుని అనంతపురం జిల్లాలో ఒక అబల దాకా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్ష ప్రజా ప్రతినిధులు, నాయకులు వ్యవహరించిన తీరు ఆ రాష్ట్ర ప్రతిష్టను పెంచేదిగా ఎంతమాత్రం లేదు. ఆయా సంఘటనల్లో పోలీసు యంత్రాంగం ధోరణి దిగ్భ్రాంతి కలిగించే విధంగా ఉంటున్నది. కర్నూలు జిల్లాలో అత్యాచారానికి గురయిన ఒక మహిళ తన భర్తను వెంట బెట్టుకుని న్యాయం కోసం రాష్ట్ర రాజధాని పోలీ సుల దగ్గరికి వెళితే జాతీయ మహిళా పార్లమెంట్ భద్రతా పనుల్లో తీరిక లేని పోలీసులు ఆమె గోడు పట్టించుకోక పోవడం ఆ రాష్ట్ర పోలీసు పెద్దల ప్రాధా న్యతలను స్పష్టం చేస్తున్నది. ఏం మాట్లాడాలో పోలీసులు చెబుతారా! మహిళా జాతీయ పార్లమెంట్లో ఒక శాసనసభ్యురాలు ఆర్ కే రోజా ఏం మాట్లాడాలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ సాంబశివరావు నిర్దేశిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యురాలి హోదాలో రోజాకు ఈ సమావేశాలకు ఆహ్వానం అందుతుంది, హోటల్ గది బుక్ చేస్తారు, విమానాశ్రయానికి కార్ కూడా పంపుతారు. తీరా ఆమె వెళ్తే అరెస్ట్ చేసి దొంగ దారిలో తిప్పి తిప్పి హైదరా బాద్ పంపించేస్తారు! ఇదేమి అన్యాయం అని అడిగితే డీజీపీ సాంబశివరావు ఆమె వివాదాలు రేగకుండా ఉండేవిధంగా మాట్లాడుతానని హామీ ఇస్తే అను మతిస్తాం అంటారు. సభలను నిర్వహించేదీ, ఆహ్వానాలు పంపేదీ శాసనసభ స్పీకర్. అందులో పాల్గొనే వాళ్లు ఏం మాట్లాడాలో నిర్ణయించేది పోలీసు బాస్. భిన్నాభిప్రాయాలు చర్చకు రావలసిన, ఆ చర్చల ద్వారా మహిళా సాధి కారతకు ఏ కొద్ది మేలు అయినా జరగవలసిన వేదిక మీద ఏం చర్చించాలో పోలీసులు నిర్ణయించడానికి మించిన దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండ దేమో! ప్రత్యేక హోదా కోసం జనం శాంతియుతంగా విశాఖపట్నం రామ కృష్ణా బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినా, కడప జిల్లాలోమంచి నీళ్ల కోసం మహిళలు బిందెలతో ప్రదర్శనలు జరిపినా వాటిని ప్రజాస్వామ్య కోణం నుంచి కాకుండా పోలీసు కళ్లతో చూడటం, ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను కూడా ఇష్టం వచ్చినట్టు అడ్డగించడం అరెస్టులు చెయ్యడం ఆంధ్రప్రదేశ్‌లో నిత్యకృత్యం అయినట్టుంది. అన్నీ ఒక తాను ముక్కలే ఇక ప్రారంభంలో చెప్పుకున్నట్టు శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన మాటలు వింటే పోలీసు పెద్దలు అట్లా వ్యవహరించడాన్ని తప్పు పట్టి లాభం ఏముం దిలే అనిపించక మానదు. సమావేశాల సందర్భంగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ కొత్త కారు గ్యారేజ్‌లో, స్త్రీలు ఇంట్లో ఉంటేనే ప్రమాదాలు జరగవు, భద్రంగా ఉంటారని అన్నారు. కొన్ని దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగి ప్రజల కోసం చట్టాలు చెయ్యవలసిన సభకు అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు ఇట్లాంటి అభి ప్రాయం కలిగి ఉండటం దేశవ్యాప్తంగా విమర్శకు, నిరసనకు దారితీసింది. ఇది వ్యక్తీకరణ లో లోపం తప్ప స్పీకర్ మాట్లాడిన దానిలో తప్పేముంది అని ఆయనను వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జాతీయ మీడియా కూడా అమ్ముడుపోయింది. కాబట్టి తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది అని విరుచుకుపడ్డారు. నాయకుడి తీరే అదే అయితే...? మీడియా మేనేజ్మెంట్లో కాకలు తీరిన చంద్రబాబు నాయుడు ఒక్కసారి మీడియాలో సత్యాలు వినిపిస్తే సహించలేక పోతున్నారు. అదే నిజమయితే అనుకూల మీడియా అంతా ఆయనకు అమ్ముడు పోయినట్టేనా? ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వ్యవహారంలో గతంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ‘కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దు అంటుందా?’ అని ఆడవాళ్లను అవమానించే విధంగా మాట్లాడిన చంద్ర బాబునాయుడుకు స్పీకర్ మాట్లాడిన మాటల్లో తప్పు ఎందుకు కనిపిస్తుంది? స్థాయి వేరయినా, హోదాలు వేరయినా బాలకృష్ణ, కోడెల శివప్రసాదరావు, చంద్రబాబు నాయుడు తదితరుల ఆలోచనా ధోరణిలో తేడా ఉండదన్న విషయం స్పష్టం. అన్నీ ఆ తానులో ముక్కలే కదా! datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
అక్షరాన్ని అపార్థం చేసుకోవద్దు!
డేట్లైన్ హైదరాబాద్ ప్రశ్నించే వారిని ఎట్లా కట్టడి చెయ్యాలి? వాళ్ల మీద ఎదురు దాడి చెయ్యడమే అందుకు మందు అనుకున్నారాయన. ప్రశ్నలు అడిగే విలేకరులను ఎద్దేవా చెయ్యడం, ‘నీకేం తెలుసు?’ అనడం, ‘నేను దేశంలో, ప్రపంచంలో చాలామంది జర్నలిస్టులను చూశాను, నువ్వెంత?’ అంటూ వారిని అవమానించడం నేర్చుకున్నారు. తనను ఇరుకున పెట్టే ప్రశ్న అడిగిన జర్నలిస్ట్‌ను ‘నువ్వే పత్రిక నుంచి?’ అని అడగడం, పేరు చెప్పగానే, ‘నీకు నేను జవాబు చెప్పను’ అనడం, అనుకూల ప్రశ్న వేసే వారికి జవాబు ఇవ్వడం పరిపాటైంది. మహాత్ముడిని హత్య చేయడాన్ని సమర్థించుకుంటూ నాథూరాం వినాయక్ గాడ్సే న్యాయస్థానంలో చేసిన సుదీర్ఘ ప్రకటనలో తాను ఆ పని చెయ్యడానికి గాంధీ దేశాన్ని ఇష్టానుసారం విభజించిన తీరే కారణమని చెబుతూ ఆనాటి పత్రికల మీద కూడా విరుచుకుపడ్డాడు. పత్రికలు నిష్పక్షపాతంగా వ్యవహరిం చలేదనీ, సత్యం గొంతు నొక్కేశాయనీ విరుచుకుపడ్డాడాయన. ఆనాడు పత్రి కలు సత్యం వైపు నిలబడి ఉంటే దేశ విభజన జరిగి ఉండేది కాదంటాడు 1948 నవంబర్ నాటి తన ప్రసంగంలో గాడ్సే. పత్రికలు దిగజారి తనను విమర్శించాయని ఆయన దూషించాడు. గాంధేయవాదులను వెనకేసుకొచ్చి పత్రికలు తప్పు చేశాయని విమర్శించాడు. దేశానికి స్వాతంత్య్రం ఎట్లా వచ్చిందో, విభజన ఎందుకు అవసరమైందో, ఆ రోజుల్లో ఇరువైపులా నెల కొన్న ఉద్రిక్త పరిస్థితి, జరిగిన హింసల గురించి మనం చాలాసార్లు చదువు కున్నాం. అటువంటి స్థితిలో పత్రికలు ఇంకా ఏ రీతిలో వ్యవహరించి ఉండా ల్సిందో గాడ్సేకే తెలియాలి. దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో పత్రికలు నిర్వహించిన పాత్రను గాడ్సే విస్మరించి, తాను కోరుకున్న విధంగా పత్రికలు రాయలేదు కాబట్టి విమర్శించాడు. అస్మదీయులు, తస్మదీయులు గాడ్సే నుంచి అరవింద్ కేజ్రివాల్ దాకా, ట్రంప్ నుంచి చంద్రబాబునాయుడి దాకా తమకు అనుకూల ప్రచారం రాకపోతే మీడియాను విమర్శించడం, దుర్భాషలాడటం, బెదిరించటం వీలైన చోట్ల కట్టడి చెయ్యడం సర్వసాధారణ మైపోయింది. మీడియా తమ చెప్పుచేతల్లో ఉండాలన్న కోరిక మెజారిటీ రాజకీయ నాయకులకు ఉంటుంది. కొంతమంది అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. మీడియాను తమ దారిలోకి తెచ్చుకోలేకపోతే ఇలాగే విరుచుకు పడుతుంటారు. మీడియా లొంగకపోతే దాని విశ్వసనీయతను దెబ్బ తీసే కుట్రలు పన్నుతుంటారు. అందులో పైన పేర్కొన్న నలుగురిలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. ఆయన హయాంలో నవ్యాంధ్రప్రదేశ్‌లో ఒక విలేకరి హత్యకు గురైతే, ఆ హత్య వెనక ఒక మంత్రి పరోక్ష ప్రమేయం ఉందని తెలిసీ కనీసం చలించని, ఒక ఓదార్పు ప్రకటన అయినా చెయ్యని రాజకీయవేత్త చంద్రబాబు. ఇవాళ మీడియా స్వతంత్రంగా లేదు. నిజమే, దానికి కారణాలు ఏమిటి, కారకులు ఎవరు? చంద్రబాబునాయుడితో సహా రాజకీయ నాయ కులకు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి బాధ్యత లేదా? ప్రశ్న అంటే కంపరం అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయంలోనే మీడియా పట్ల తన అసహనాన్ని పలుమార్లు బహిరంగంగానే ప్రదర్శించాడు. ఎన్నికై, పదవీ స్వీకారం చేసిన తరువాత మరోసారి విరుచుకుపడ్డాడు. కారణం ఏమిటంటే ఆయనకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను మీడియా ప్రచారం చెయ్యడం. ట్రంప్ గొప్పవాడు, ఆయన చేసే పనులన్నీ మంచిపనులు, దేశంలో ఎక్కడా ఎవరూ ఆయనను వ్యతిరేకించడం లేదు అని అసత్యాలు రాస్తే అది మంచి మీడియా. లేకపోతే మీడియా వాళ్లంతా అబద్ధాలకోరులు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యక ముందే మీడియాతో ఆయన వ్యవహారం ఎట్లా ఉండబోతుందో ప్రపంచమంతటికీ తెలిసింది. ఆయన తొలి పత్రికా గోష్టిలో ప్రశ్నలు అడగొద్దని ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్ ప్రతినిధిని ట్రంప్ ప్రెస్ సెక్రటరీ ఆజ్ఞాపించాడు. అమెరికన్ మీడియా దానికి స్పందించి మీడియా ఏ ప్రశ్నలు వెయ్యాలో, ఏం రాయాలో, ఏం ప్రసారం చెయ్యాలో తాను నిర్ణయించుకుంటుంది, మీరు కాదు అంటూ ఒక బహిరంగ లేఖ రాసింది. చంద్రబాబునాయుడికి కూడా ప్రశ్నలడిగే జర్న లిస్టులంటే ఇష్టం ఉండదు. అసలు ప్రశ్నలు అడిగే వాళ్లు తన పత్రికా సమా వేశాలకే రాకుండా చేస్తే సరిపోతుంది కదా అని, మొదట్లో ఆయన తన పార్టీ కార్యాలయానికీ, సచివాలయానికీ కొన్ని పత్రికలూ, టీవీ చానెళ్ల ప్రతినిధులు రాకుండా నిషేధం విధించారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమం, ప్రెస్ కౌన్సిల్ వంటి సంస్థలు ప్రజాస్వామ్యంలో అది కుదరదని తేల్చాక విధి లేక ఆ నిషేధాన్ని ఎత్తేశారు. మరి ప్రశ్నించే వారిని ఎట్లా కట్టడి చెయ్యాలి? వాళ్ల మీద ఎదురు దాడి చెయ్యడమే అందుకు మందు అనుకున్నారాయన. ప్రశ్నలు అడిగే విలేకరులను ఎద్దేవా చెయ్యడం, ‘నీకేం తెలుసు?’ అనడం, ‘నేను దేశంలో, మళ్లీ మాట్లాడితే ప్రపంచంలో చాలామంది జర్నలిస్టులను చూశాను, నువ్వెంత?’ అంటూ వారిని అవమానించడం నేర్చుకున్నారు. తనను ఇరు కున పెట్టే ప్రశ్న అడిగిన జర్నలిస్ట్‌ను ‘నువ్వే పత్రిక నుంచి?’ అని అడగడం, పేరు చెప్పగానే, ‘నీకు నేను జవాబు చెప్పను’ అనడం, తనకు అనుకూల ప్రశ్న వేసే జర్నలిస్ట్‌ల వైపు ఆప్యాయంగా చూసి, ముసిముసి నవ్వులు నవ్వుతూ జవాబులు ఇవ్వడం పరిపాటి అయింది. ట్రంప్ లాగానే చంద్రబాబునాయుడు కూడా మీడియా ఏ ప్రశ్నలు వెయ్యాలో, ఏం రాయాలో, ఏం ప్రసారం చెయ్యాలో తానే చెప్పాలనుకుంటారు. అధికారంలో లేనప్పుడు ‘ఒక పత్రిక, టీవీ కార్యాలయాల మీద దాడులు చెయ్యండి!’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక భిన్నంగా వ్యవహరిస్తా రని ఎవరైనా ఎలా అనుకుంటారు? ఆయన అప్రజాస్వామిక, మీడియా వ్యతి రేక చర్యలను వ్యతిరేకించిన కారణంగా జాతీయ స్థాయిలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన, అరవై ఏళ్ల చరిత్ర కలిగిన ఒక జర్నలిస్ట్ సంఘాన్ని నిర్వీర్యం చెయ్యడానికీ, తమ అడుగులకు మడుగులొత్తే ఒక జేబు సంఘాన్ని ఏర్పాటు చెయ్యడానికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా విఫల ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలియనిదెవరికి? బహి రంగ వేదికల మీద వినతిపత్రం ఇవ్వడం కోసం వచ్చే ప్రతినిధి బృందంలోని జర్నలిస్ట్‌లు మనకు అనుకూలురా, వ్యతిరేకులా అని అడిగి మరీ ఆ సమ స్యలు వింటున్న ముఖ్యమంత్రి ఇక ప్రజలను కూడా విభజించి చూడరని ఎవరనుకుంటారు? చంద్రబాబునాయుడు జర్నలిస్ట్‌లకు రాజకీయాలు కూడా ఆపాదిస్తారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరుగుతున్నది. అది కేవలం రాజ కీయ పార్టీల సొంత వ్యవహారమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటు న్నారు. అయిదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సమ స్యతో సమాజంలోని ఏ ఇతర వర్గానికీ సంబంధం లేదన్నది ఆయన అభిప్రాయం. అందుకే ఎవరు ప్రత్యేక హోదా విషయంలో ప్రశ్నించినా వాళ్లను ఆయన ప్రతిపక్షాల ప్రతినిధులుగా లెక్క వేస్తారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో ఒక ప్రశ్న అడిగిన ‘ప్రజాశక్తి’ విలేకరితో ఆయన మాట్లాడిన తీరు సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ‘నువ్వొక రాజకీయ పార్టీకి చెందిన వాడివి, నీతో నేను మాట్లాడను, నీ ప్రశ్నకు జవాబు చెప్పను’ అంటూ విపరీత ధోరణి ప్రదర్శించారు చంద్రబాబు. ‘ప్రజాశక్తి’ మార్క్సిస్ట్ పార్టీ భావజాలానికి అనుకూలమైన పత్రిక అన్న విష యంలో దాపరికం లేదు. అట్లాగే ‘విశాలాంధ్ర’ దినపత్రిక కూడా కమ్యూ నిస్ట్ భావజాలానికి అనుకూలంగా ఉండే పత్రిక. అయినంతమాత్రాన ఆ రెండు పత్రికల్లో పనిచేసే జర్నలిస్ట్‌లు అదే రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండా లనిలేదు. ఒకవేళ ఉన్నా, ఒక విషయంలో ముఖ్యమంత్రి నుంచి సమాధానం రాబట్టేందుకు ప్రశ్నించే హక్కు వారికి సంపూర్ణంగా ఉందనే విషయం చంద్ర బాబు మరచిపోతున్నారు. వామపక్షాలు ఇవాళ ఆయన రాజకీయాలతో విభే దిస్తున్నాయి కాబట్టి వాటి ఆధ్వర్యంలో నడిచే పత్రికలకూ, ఇతర మీడియా సంస్థలకూ చెందిన జర్నలిస్ట్‌ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ముఖ్య మంత్రి నిరాకరిస్తారు! తమకు రుచించని వార్తలు రాసే ఏ మీడియా సంస్థతో నైనా మాట్లాడటానికీ, సమాధానాలు చెప్పడానికీ ఆయన ఇష్టపడరు. ఆ రెండు వామపక్షాలతో స్నేహం నెరపిననాడు ఏమయ్యింది ఈ వ్యతిరేకత, ద్వేషభావం చంద్రబాబుగారూ? 1995లో ముఖ్యమంత్రి పదవిని పదిలం చేసుకోడం కోసం వాళ్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసిన విషయం మరిచి పోయారా? తమకు వ్యక్తిగతంగా, రాజకీయంగా అనుకూలంగా ఉండే మీడియా సంస్థలకు మాత్రమే సమాచారం ఇస్తానంటే కుద రదు. అటువంటి మీడియా యాజమాన్యాలకు వేరే రకాలైన లాభాలు చేకూర్చవచ్చు, ఆ పని చంద్రబాబునాయుడు ఎలాగూ చేస్తున్నారు. కానీ సమాచార సేకరణ విష యంలో మాత్రం తరతమ భేదాలు ఉండటానికి వీల్లేదు. రాజకీయ పక్షా లకూ, మీడియా యాజమాన్యాలకూ ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి కానీ, తోటి జర్నలిస్ట్‌ను ముఖ్యమంత్రి అవమానిస్తుంటే కనీస నిరసన తెల పని మిత్రులను ఎలా అర్ధం చేసుకోవాలి? అధికారం శాశ్వతం కాదు. ప్రభుత్వం మారితే ‘ప్రజాశక్తి’ ప్రతినిధి స్థానంలో మనం ఉండాల్సి వస్తుందే మోనన్న ఆలోచన ఆ మిత్రులకు రాకపోవడం అన్యాయం. పోరాడితే పోయేది పోలవరమట! ‘ప్రజాశక్తి’ జర్నలిస్ట్ మీద ఆగ్రహం ప్రదర్శించి, ఆయన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి నిరాకరించిన సందర్భంలో చంద్రబాబు ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు–ప్రత్యేక హోదా గురించి తాను కేంద్రంతో పోరా టం చేస్తే పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు ఆగిపోతాయట. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్నారు కదా, కేంద్రమే ఆ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యడానికి బాధ్యత తీసుకుందని కదా చెప్పారు. విభజన సమయంలో అంగీకరించిన విషయం కదా! మరి చంద్రబాబునాయుడు కేంద్రంతో పోరాడితే పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోతుందని ఎందుకు భయపడుతున్నట్టు? కేంద్ర ప్రభుత్వంతో పోరాటం అంటేనే చంద్రబాబునాయుడు ఎందుకు బెంబేలు ఎత్తుతున్నట్టు? దీనికి వెంకయ్యనాయుడుగారు వివరణ ఇస్తే బాగుంటుందేమో! ఈ లెక్కన ప్రత్యేక హోదా మాదిరిగానే, పోలవరం ప్రాజెక్ట్ కూడా అటకెక్కుతుందేమోనన్న సందేహం కలగక మానదు. దేవులపల్లి అమర్, (datelinehyderabad@gmail.com) -
ఇలాంటి ప్రజాగ్రహానికి పగ్గాలేవి?
డేట్లైన్ హైదరాబాద్ జల్లికట్టు మీద నిషేధం శాశ్వతంగా తొలగించినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే పొరపాటు. ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు, కర్ణాటకలో బర్రెల కొట్లాట ఇట్లా దేశమంతటా ఏదో పద్ధతిలో పాత సంప్రదాయం, ఆచారం తలెత్తి కేంద్ర ప్రభుత్వం కాళ్లకు బంధాలు వెయ్యడం ఖాయం. ఆ సమస్యతో ఏకీభావం ఉన్నా, లేకున్నా దాని పరిష్కారానికి తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత ఎంచుకున్న మార్గం కచ్చితంగా అనుసరణీయమే. మిగిలిన ప్రభుత్వాలు కూడా సెల్వం ప్రభుత్వ మార్గాన్ని అనుసరిస్తే మంచిది. తమిళనాడు పురాతన సంప్రదాయం జల్లికట్టు మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా చెన్నై మెరీనా బీచ్‌లో జరుగుతున్న ఆందోళన దేశంలో మరికొన్ని ఉద్యమాలకు కొత్త ఊపిరిని ఇవ్వబోతున్నట్టు కనిపిస్తున్నది. దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్న ఒక సమస్య మీద వేల సంఖ్యలో జనం కదిలి రావడం, జనాగ్రహానికి వెరచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌లు తీసుకురావడం, ప్రజల భావోద్వేగాల దృష్ట్యా కొద్దికాలం ఆగండని సుప్రీంకోర్టును కేంద్రం వేడుకోవడం, హడావుడిగా శాసనసభ సమావేశం నిర్వహించి బిల్లు ఆమోదించడం ఒక కోణంలో నుంచి చూస్తే అద్భుతమైన దృశ్యం. అత్యంత శక్తిమంత మైన రాజ్యాన్ని ధిక్కరించి నిలిచి ప్రజలు విజయం సాధిస్తే ప్రజాస్వామ్య ప్రియులు ఎవరికైనా అద్భుతంగానే అనిపిస్తుంది. ఇదొక్కటేనా సమస్య? ఒక సమస్య మీద ప్రజలు ఒక్కటై ప్రభుత్వాల మెడలు వంచడం ఆహ్వానించదగ్గ విషయమే అయినా, తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత గత వారం మెరీనా బీచ్‌లో సాగించిన ఉద్యమానికి మూలమైన సమస్య మాత్రం సమర్థనీయం కాదు. పక్షులతో కత్తులాట నిర్వహించడం, నోరులేని అమాయక జంతువులతో పరుగు పందాలు సాగించి ఆనందించడం ఒక వికృత క్రీడ. ప్రపంచవ్యాప్తంగా పశుపక్ష్యాదులను క్రీడల పేరుతో హింసించడం సరికాదని ప్రజలు ఉద్యమిస్తున్న వేళ తమిళనాడులో జరిగిందీ, జరుగుతున్నదీ సమర్థనీయం కాదు. ఇటువంటి దారితప్పిన ఒక ఉద్యమానికి సంఘంలో ప్రముఖులూ, రాజకీయ పక్షాలూ మద్దతుగా నిలవడం ఏవగింపు కలిగిస్తుంది. ఇంతకంటే చాలా తీవ్రమైన ప్రజాసమస్యల విషయంలో ఈ సెలబ్రిటీలు ఎందుకు నోరు మెదపరు? దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనేక సమస్యల మీద ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి, వాటి గురించి వీళ్లు ఎందుకు మాట్లాడరు? తమిళనాడు విషయమే తీసుకుందాం. అక్కడ పేదరికం వికటాట్టహాసం చేస్తున్నది. నిజానికి జయలలిత అక్కడి జనం దృష్టిలో 'అమ్మ'గా స్థిరపడిపోవడానికి కారణం ఆ పేదలకు ఆమె విదిలించిన కొన్ని పథకాలే. పేదరికాన్ని శాశ్వతంగా పారదోలేందుకు ఆమె కూడా చేసిందేమీ లేదు. అంత తీవ్రంగా ఉన్న పేదరికం మీద, నిరుద్యోగం మీదా అన్నిటికీ మించి అవినీతికి నిలయంగా మారిన రాజకీయ వ్యవస్థ మీదా నిరసనగా ఈ యువత ఎందుకు రోడ్ల మీదకు రాలేదు? జల్లికట్టు నిషేధాన్ని వ్యతిరేకించి గెలిచిన స్థాయిలో ఈ సమస్యల మీద ఎందుకు యుద్ధం చెయ్యలేదు? తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టు నిషేధ వ్యతిరేక ఉద్యమం పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నది. అందులో ప్రధానమైనది న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం. ప్రజాగ్రహానికి వెరచి ప్రభుత్వాలు లొంగి వచ్చి విజ్ఞప్తి చేస్తే న్యాయస్థానాలు నిర్ణయాలను మార్చు కోవడమో, వాయిదా వేసుకోవడమో జరగడం ఈ సందేహానికి తావిస్తున్నది. జంతు హింస సరికాదు నిన్న మొన్నటి దాకా జయలలిత నీడన పెరిగిన పన్నీర్ సెల్వం ప్రభుత్వం జనాభిప్రాయానికి విలువనిచ్చి ఈ సమస్యను పరిష్కరించే దిశగా వడివడిగా అడుగులు వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాగా కేంద్రంతో ఘర్షణ మంచిది కాదు, ఆందోళనలు చెయ్యకూడదు అని హితబోధలు చెయ్యలేదు. నిజానికి దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ, మరే ముఖ్యమంత్రీ కేంద్రానికి ఇంతగా జీహుజూర్ అన్నట్టు వ్యవహరించడంలేదు. పన్నీర్ సెల్వం వెంటనే ఢిల్లీ వెళ్లారు, ప్రధానమంత్రికి సమస్యను వివరించారు. ఇద్దరి నిర్ణయం మేరకే ఆర్డినెన్స్ వచ్చింది. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. జల్లికట్టు మీద నిషేధం అనేది చాలా చిన్న సమస్య, అనాదిగా వస్తున్న ఒక ఆచారానికి సంబంధించింది. నిజానికి తమిళనాడు ప్రజలు యావన్మందీ ఈ దురాచారాన్ని, కాలం చెల్లిన సంప్రదాయాన్ని సమర్థిస్తూ ఉన్నారనడానికి వీల్లేదు. జల్లికట్టు మీద నిషేధం శాశ్వతంగా తొలగించినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే పొరపాటు కూడా. ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు, కర్ణాటకలో బర్రెల కొట్లాట ఇట్లా దేశమంతటా ఏదో పద్ధతిలో ఏదో ఒక పాత సంప్రదాయం, ఆచారం తలెత్తి కేంద్ర ప్రభుత్వం కాళ్లకు బంధాలు వెయ్యడం ఖాయం. పశువులనూ, పక్షులనూ హింసించే పద్ధతు లకు స్వస్తి చెప్పాలంటూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలను తేలికగా తీసుకోడానికి వీల్లేదు. ఆ రెండు ఉద్యమాలు ఒక్కటేనా? సరే, జల్లికట్టు నిషేధాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట జరిగిన ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి స్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటున్న వారిని అభినందించాల్సిందే. ఆ సమస్యతో ఏకీభావం ఉన్నా, లేకున్నా దాని పరిష్కారానికి తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత ఎంచుకున్న మార్గం కచ్చితంగా అనుసరణీయమే. మిగిలిన ప్రభుత్వాలు కూడా పన్నీర్ సెల్వం ప్రభుత్వం మార్గాన్ని అనుసరిస్తే మంచిది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా విషయంలో తననో, కేంద్రాన్నో రక్షించుకునే ధోరణి వదిలేసి రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజెప్పి ప్రత్యేక హోదా తెచ్చే ప్రయత్నం చేసి ఉండాల్సింది. చంద్రబాబునాయుడే చెప్పినట్టు రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆందోళనకూ, జల్లికట్టు కోసం జరుగుతున్న ఆందోళనకూ పోలికలేదు. జల్లికట్టు సమస్య తాత్కాలికం, ప్రత్యేక హోదా కోట్లాది మంది ఆంధ్ర ప్రజల, ముఖ్యంగా యువత భవిష్యత్తును నిర్ణయించే సమస్య. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండుసార్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసిన నాటి నుంచి ప్రతిపక్షాలది ఉద్యమబాట, ప్రభుత్వానిది రాజీ పాట. ప్రధాన ప్రతిపక్షం అనునిత్యం ప్రత్యేక హోదా కోసం ఉద్యమ బాటనే సాగుతున్నది. పార్లమెంట్ లోపలా బయటా ప్రతిపక్షం ఆందోళన చేస్తుంటే అధికార పక్షం మంత్రి పదవులను కాపాడుకునే ప్రయత్నంలో తలమునకలై ఉంది. ప్రతిపక్ష నేత ఆమరణ నిరాహార దీక్ష, కాంగ్రెస్ కోటి సంతకాలు, వామపక్షాల నిరసన ఆందోళనలు; చివరికి 2014 ఎన్నికల్లో మిత్రుడిగా ఉండి, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేందుకు తన వంతు సాయం చేసిన ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ కూడా మీరు తెచ్చిన ప్యాకేజీలు పాచి పోయిన లడ్డూలతో సమానం, అవి ఏమీ వద్దు ప్రత్యేక హోదా తీసుకురండి అని నిలదీస్తున్నాడు. ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం మాత్రం అశేష ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా నీరో చక్రవర్తిని, అతడి ధోరణిని మరిపింపచేస్తున్నారు. అంతేకాదు, తమకు ఏమైనా సమస్యలుంటే, కేంద్రాన్ని నిలదీసే శక్తి లేకపోతే, మిన్నకున్నా బాగుండేది, అట్లా చెయ్యక పోగా ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షం చేస్తున్న ప్రతి ఉద్యమాన్ని అణచివేసే, బురద జల్లి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు సంపూర్ణంగా సాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి తలొగ్గాల్సిందే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం రామకృష్ణా బీచ్ సహా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపునకు అన్ని ప్రతిపక్షాలూ కలిసొచ్చే వాతావరణం ఏర్పడింది. జనసేన నేత పవన్ కల్యాణ్ సహా అన్ని పార్టీలు రేపటి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ఇది నిన్న మొన్న తమిళ నాడును కుదిపేసిన జల్లికట్టు నిషేధ వ్యతిరేక ఉద్యమ రూపు తీసుకోనుందనే మాట వినిపిస్తున్నది. మంచిదే, బధిరులకు వినిపించాలంటే భారీ విస్ఫో టనం అవసరమని స్వాతంత్య్ర పోరాటంలో షహీద్ భగత్ సింగ్ పార్లమెంట్ మీద తాను బాంబు వేయడాన్ని సమర్థించుకుంటూ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. దావోస్ నుంచి తిరిగొచ్చిన వెంటనే ముఖ్యమంత్రి మళ్లీ ఒకసారి కేంద్రంతో తగువుకు తానూ సిద్ధంగా లేనని స్పష్టంగా చెప్పారు. ఆయన పార్టీ నాయకులేమో చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన హింస విశాఖ ఆర్కే బీచ్‌లో కూడా జరగాలని అనుకుంటున్నారా అని సన్నాయి నొక్కులు నొక్కుతు న్నారు. నాలుగు రోజులపాటు ప్రశాంతంగా సాగిన చెన్నై ఆందోళన కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు చొరబడి, పోలీసులు కూడా ప్రతిచర్యకు దిగిన తరు వాతే హింసాత్మకమైంది. జల్లికట్టు సమస్య పరిష్కారం కోసం పన్నీర్ సెల్వం అనుసరించిన పద్ధతి వదిలేసి ఆయన ప్రభుత్వంలోని పోలీసులు ఆందో ళనను విచ్ఛిన్నం చెయ్యడానికి ఎంచుకున్న పద్ధతిని అనుసరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి తలొగ్గాల్సిందే అని జల్లికట్టు ఉద్యమం మరోసారి రుజువు చేసింది, ఆంధ్రప్రదేశ్లోనయినా అంతే. అది గుర్తించకపోతే ప్రభుత్వానికి భంగపాటు తప్పదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ వ్యవస్థనూ, పౌర సమాజాన్ని ఒక్క తాటి మీదకు తీసుకొచ్చి జల్లికట్టు ఉద్యమంతో పోల్చదగిన మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటి శాంతి యుత ఆందోళనలు నిర్వహించిన జేఏసీ అధ్యక్షులు కోదండరాం తెలం గాణలో జల్లికట్టు ఉద్యమ తరహాలో భారీ నిరుద్యోగుల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. అంత బలమైన ఉద్యమాన్ని ముందుకు ఉరికించిన తెలంగాణ ఉద్యమ నాయకత్వమే జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవడాన్ని పాల కులందరూ గ్రహిస్తే మంచిది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఆయన మృతి.. వెంటాడే స్మృతి
డేట్లైన్ హైదరాబాద్ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు అంత హడావుడి చేసిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఆ తరువాత ఆయనను పూజించారా? ఎన్టీఆర్ ఫొటోలు ఎక్కడా కనిపించకుండా కొంతకాలం పాటు జాగ్రత్తపడ్డ విషయం రేవంత్‌కు తెలియక పోవచ్చు. ఆయన ఫొటోలు సచివాల యంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాత సామాను గదుల్లో, పనికిరాని వస్తువుల మధ్యనా, విరిగిన కుర్చీలు, బల్లల మధ్యన చాలా రోజులు పడి ఉన్న విషయం పత్రికలు ఫొటోలతో సహా ప్రచురించిన విషయం కూడా రేవంత్‌కు తెలియకపోవచ్చు. జనవరి 18, 1996. సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ల క్రితం ఇదేరోజు తెల్లవారు జామున ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి్తతే అవతల ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు దగ్గర ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న విజయ్‌కుమార్. ఆందోళన ధ్వనించే గొంతుతో ‘‘బాసూ! ఎన్టీ రామారావు గారు చనిపోయారు, వెంటనే బయలుదేరి ఆయన ఇంటికి రాగలవా!’’ బతి మాలుతున్నట్టు అడిగాడు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చనిపోయిన వార్త ఆయన శత్రు శిబిరం నుంచి రావడం ఏంటి అని ఒక్కక్షణం సందేహం వచ్చింది. నమ్మశక్యంగా లేదు. అంతకుముందు సాయంత్రమే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు నేనూ వెళ్లాను. ఆరోగ్యంగా కనిపించారు. వెన్నుపోటు పొడిచి తన నుంచి∙అధికారం లాక్కున్న చంద్రబాబు మీద మరోసారి విరుచుకు పడ్డారు. రాత్రికి రాత్రి ఏం జరిగి ఉంటుంది? ఆలోచనల్లో ఉండగానే విజయ్ కుమార్ మళ్లీ ‘‘బాసూ! సీఎం బయలుదేరి వెళ్లారు, ఎన్టీఆర్ ఇంటికి. అక్కడ ఏం జరుగుతుందో ఏమో, సీనియర్ జర్నలిస్టులంతా ఉంటే మంచిది’’ అన్నాడు. నాకు అర్థమైంది. ఎన్టీఆర్ చనిపోయాడని తెలిస్తే ఆయన అభిమానులు అక్కడికి చేరుకుంటారు. కొద్దిమాసాల క్రితమే తమ అభిమాన నేత నుంచి అధికారం లాక్కున్నాడన్న ఆగ్రహంతో చంద్రబాబును అడ్డుకోవచ్చు. దాడి కూడా చేయొచ్చు. పరిస్థితి తప్పకుండా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. వెంటనే స్కూటర్ వేసుకుని బంజారాహిల్స్‌లో ఆయన ఇంటికి వెళ్లాను. అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడికి చేరుకో వడం, ఎన్టీఆర్ మాత్రమే కూర్చునే సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకునే పనిలో పడటం కనిపించింది. బంజా రాహిల్స్ ఇంటి నుంచి ఆయన మృతదేహాన్ని ఫతేహ్ మైదాన్ స్టేడియంకు తరలించే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారు. ఒకరొకరు మీడియా వాళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. సమయం గడుస్తూ ఉంటే సందర్శకులు కూడా పెరుగుతారు. మృతదేహం అక్కడే ఉంటే పరిస్థితి తమ అదుపులో లేకుండా పోయే అవకాశం ఉంది, కాబట్టి అక్కడి నుంచి తరలిస్తే వ్యవహారం ప్రభుత్వ అదుపులోకి వస్తుందనేది చంద్రబాబు ఆలోచన. బంజారాహిల్స్ ఇల్లు అప్ప టికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి అధీనంలో ఉంది కాబట్టి ఆమె దగ్గరి నుంచి ఆయన lమృతదేహాన్ని దూరం చేసేందుకు, తరువాత జరిగే తంతులో ఆమె పాత్ర లేకుండా జాగ్రత్త పడేందుకు చేసిన ఆలోచన అది. దృశ్యమానమైన శవ రాజకీయాలు శవ రాజకీయాలు అంటుంటాం. అవి ఎట్లా ఉంటాయో ఎన్టీ రామారావు మృతి సందర్భంగా కళ్లారా చూశాం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఇంకా అక్కడికి చేరుకోక ముందే ఆయన పార్థివ దేహాన్ని ఫతేహ్ మైదాన్‌లో లాల్ బహదూర్ స్టేడియంకు తరలించేశారు. విదేశీ పర్యటనలో ఉన్న అప్పటి రవాణ శాఖ మంత్రి, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ హుటాహుటిన తిరిగొ చ్చిన క్షణం నుంచి లక్ష్మీపార్వతిని దూరం పెట్టారు. ఆ మరునాడు నెక్లెస్ రోడ్లో ఆయన అంత్యక్రియలు జరిపిన చోటు వరకూ సాగిన ఊరేగింపులో కూడా లక్ష్మీపార్వతిని ప్రధాన వాహనం మీదకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఆ కార్యక్రమం వరకు ఎన్టీఆర్ వారసులం తామే అని ప్రదర్శించు కునే విషయంలో చంద్రబాబు వ్యూహం విజయవంతమైంది. 1995 ఆగస్ట్‌లో వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించిన వాళ్లే ఆయన భౌతికకాయం దగ్గర హడావుడి చేసి, అంతిమయాత్రలో అగ్రభాగాన నిలవడం పెద్ద విషాదం. అడగవలసిన వాళ్లను అడగొచ్చు కదా! 21 సంవత్సరాల తరువాత ఈ వర్ధంతి రోజున ఆనాటి విషయాలు జ్ఞాపకం చేసుకోవడం ఎందుకూ అంటే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాధ్యక్షుడు, శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రకటన అందుకు కారణం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరపా లని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ కాబట్టి అధికారికంగా ఈ వేడుకలు జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్. అంతేకాదు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కూడా ఆయన కోరారు. ఇవి జరగకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కేంద్రానికి ఏమని ఫిర్యాదు చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం మీద కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతుంది ఈ విషయంలో? ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి అధికారికంగా జరపండి అని తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్రం హుకుం జారీ చేస్తుందా? విమానాశ్రయం టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? ఆ పని కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి, మళ్లీ మాట్లాడితే కేంద్రంలోని విమానయాన శాఖ చెయ్యాలి. విమాన యాన శాఖకు మంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్ల మెంట్ సభ్యుడు అశోక్ గజపతిరాజు చెయ్యాలి. రెండున్నర ఏళ్లుగా కేంద్రంలో ఆ శాఖను నిర్వహిస్తున్న అశోక్ గజపతిరాజు కానీ, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ స్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కానీ ఈ విషయంలో ఎటువంటి ప్రయత్నమూ ఎందుకు చెయ్యలేదు? అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. పార్లమెంట్లో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయించే విష యంలో జరిగిన రాజకీయాలు మన కళ్ల ముందు కనిపిస్తుంటే దేశీయ టెర్మి నల్కి ఎన్టీఆర్ పేరు పెట్టడం గురించి దానితో సంబంధం లేని వాళ్లను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నట్టు వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉంది. అజ్ఞాతంలో అన్నగారి ఫొటోలు ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు అంత హడావుడి చేసిన చంద్రబాబు నాయుడు, ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఆ తరువాత ఆయ నను పూజించారా? ఎన్టీఆర్ ఫొటోలు ఎక్కడా కనిపించకుండా కొంతకాలం పాటు జాగ్రత్తపడ్డ విషయం రేవంత్‌కు తెలియక పోవచ్చు. ఆయన ఫొటోలు సచివాలయంలో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాత సామాను గదుల్లో, పనికిరానిæ వస్తువుల మధ్యనా, విరిగిపోయిన కుర్చీలు, బల్లల మధ్యన చాలా రోజులు పడి ఉన్న విషయం పత్రికలు ఫొటోలతో సహా ప్రచురించిన విషయం కూడా రేవంత్‌కు తెలియకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాల మీదా ఎన్టీఆర్ బొమ్మను తొలగించినందుకు ఎన్నికల ముందు హరికృష్ణ అలిగితే, మళ్లీ ఆయన బొమ్మలు ప్రత్యక్షమైన విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలియక పోవచ్చు, ఎందుకంటే ఆ సమ యంలో ఆయన తెలుగుదేశంలో లేరు. ఆ తరువాత పన్నెండు సంవత్స రాలకు ఆయన తెలుగుదేశం తరఫున 2009 లో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. అంతకు ముందు మిడ్జెల్ నుంచి జెడ్పీటీసీగా, ఆ తరువాత ఎమ్మెల్సీగా స్వతంత్రంగానే గెలిచారు. ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటే చాలు ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది 1982లో. అప్పటికి రేవంత్ రెడ్డి 13 ఏళ్ళ పసి వాడు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజా ప్రతినిధి అయింది మాత్రం 2009లో. అంటే ఎన్టీ రామారావు చనిపోయిన 13 సంవత్సరాల తరువాత. రామారావు విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తేనో, ఏటేటా అధికారి కంగా జయంతులూ, వర్ధంతులూ చేస్తేనో ఆయనను గౌరవించినట్టు కాదు. సమావేశాలు జరిగినప్పుడు ఆయన విగ్రహానికి ఒక పూలదండ వేసి నమ స్కారం పడేస్తే , ఏవో కొన్ని పథకాలకు ఆయన పేరు తగిలించేస్తే కూడా ఆయనను గౌరవించినట్టు కాదు. ఎన్టీ రామారావు రాజకీయాలు నీతిమం తంగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి, ఆయన బాస్ చంద్రబాబునాయుడు ఆ విషయంలో పార్టీ వ్యవస్థాపక నేత ఎన్టీఆర్‌ను అనుసరిస్తే అదే ఆయనకు ఇచ్చే పెద్ద గౌరవం అనిపించుకుంటుంది. (నేడు ఎన్టీ రామారావు 20వ వర్ధంతి) దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
సినీ ఖైదీ రాజకీయ అభిలాష
డేట్లైన్ హైదరాబాద్ చిరంజీవి చేసిన 150వ సినిమా ఆయన రాజకీయ జీవితంలో భాగంగా చూడాలంటే మాత్రం కుదరదు. అది తమిళంలో అద్భుతంగా నడిచిన సినిమా. నీళ్లు, రైతుల కడగండ్లు ప్రధాన ఇతివృత్తంగా కథ నడుస్తుంది. చిరంజీవి సహా ఆయన సమర్ధకులంతా ఈ సినిమాతో రైతుల సమస్యలు తీసుకుని గొప్ప పోరాటం చేసినట్టు చెప్పుకోవడం సమంజసం కాదు. రాజకీయాల్లో ఉండి, ఈ తొమ్మిది సంవత్సరాలు మీరు రైతులకు ఏం ఒరగబెట్టారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. రాజకీయాలు కొందరికి వృత్తి, మరి కొందరికి హాబీ, మరెందరికో వ్యాపారం. అయితే రాజకీయాలు ఇంతకంటే భిన్నమైనవీ, ఇంతకంటే విలక్షణమైనవీ, ఇంతకంటే ఉదాత్తమైనవీ అన్న విషయం చాలా మంది రాజకీయ నాయకులు మరచిపోతున్నారు. ప్రజల కోసం జీవించడం అసలైన రాజకీయం అన్న విషయం తెలియని చాలామంది, సంపన్నులు కావడానికి రాజకీయాలు షార్ట్‌కట్ అనుకుంటుంటారు. అందుకే రాజకీయాల్లోకి వస్తారు. చెల్లితే స్థిరపడిపోతారు. చెల్లకపోతే వాపస్ వెళ్లిపోతారు. రాజకీయాలంటే పై మూడింటితో పాటు అధికారం కూడా అనుకుంటారు చాలామంది. ఒకసారి వస్తే ఆ అధికారం శాశ్వతమని నమ్మేవాళ్లు కొందరైతే, దాన్ని శాశ్వతం చేసు కోవడానికి నానా గడ్డీ కరవడానికి సిద్ధపడే వాళ్లు మరికొందరు. చేతికొచ్చిన అధికారాన్ని ఏంచేసైనా సరే కాపాడుకోవడం, కలకాలం చేజారిపోకుండా చూసుకోవడం రాజనీతి అని కొందరు అనుకుంటారు. ఆ రకంగా తమను మించిన రాజనీతిజ్ఞులు ప్రపంచంలో లేరని నమ్ముతుంటారు. అదే విషయం అందరికి చెబుతుంటారు కూడా. ఇట్లాంటి వారంతా ఇతరేతర కారణాలతో అధికారంలోకి వచ్చినా తెరమరుగు అయ్యాక చరిత్ర వీరిని మరచిపోతుంది. కొందరు మాత్రం కొంతలో కొంత అయినా జనం కోసం ఏదో ఒకటి చెయ్యా లనే తపన పడి సాధ్యమైనంత మేలు చేసి చిరస్థాయిగా నిలిచిపోతారు. సమ కాలీన రాజకీయాల పోకడ మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం నాయకులు రాజకీయాల అర్థం మార్చేస్తున్నారు. అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం రాజకీయాలకే కొత్త నిర్వచనం చెబుతున్నారు. ప్రజారాజ్యం ముందూ–వెనుకా ఇటువంటి ఒకానొక సమయంలో రాజకీయాలలోకి వచ్చారు ప్రముఖ నటుడు చిరంజీవి. 2007లో తన 149వ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ విడుదలైన తరువాత 2008లో ఆయన సొంత పార్టీ ప్రజారాజ్యం స్థాపిం చారు. దేశ పౌరులందరికీ రాజకీయాలలోకి వచ్చే స్వేచ్ఛ ఉన్నట్టే చిరంజీవికి కూడా ఉంది. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నా, మళ్లీ ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా అది ఆయన ఇష్టం. రాజకీయాలకు కామా పెట్టి 150వ చిత్రంలో నటించినా ఎవరూ ఆక్షేపించనక్కరలేదు. ‘కామా పెట్టి’ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే 150వ సినిమా చేస్తున్నాను అన్నారు తప్ప రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తున్నాను అని ఫుల్స్టాప్ పెడు తున్నట్టు ఆయన ప్రకటించలేదు కాబట్టి. నిజానికి ఆయన రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఇబ్బందులు కల్పించి ఉండేది కాదేమో! అలాగే ఆయన తమ్ముడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరై ఉండేవారు కాదేమో! ఇప్పటికైతే చిరంజీవి ఇంకా కాంగ్రెస్ నాయకుడే. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు కూడా. చిరంజీవి సినిమాలకే పరిమితమైనా, రాజకీయాల్లోకి వచ్చాక ఇక సినిమాల వైపు చూడకపోయినా ఆయన గురించి ఇది చర్చిం చుకునే సందర్భం అయ్యేది కాదు. సినిమా రంగానికే పరిమితమై ఆయన మంచిచెడులను గూర్చి మాట్లాడేవాళ్లం, రాజకీయాల్లోనే ఉండిపోతే ఇంకో రెండేళ్ల పాటు ఆయన గురించి, ఆయన పార్టీ కాంగ్రెస్ గురించి మాట్లాడు కోవడానికి పెద్దగా ఏమీ ఉండేది కాదు. ఆయన రాజకీయాల్లో కొనసాగు తూనే మళ్లీ సినిమా మీద దృష్టి పెట్టిన సమయం సందర్భం కారణంగా ఈ చర్చ తప్పనిసరైంది. సమయం సందర్భం అంటే సంక్రాంతికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 150వ సినిమా, తెలుగుదేశం శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం రెండింటి విడుదల. సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ సినిమాలు ఇప్పటి వరకు 18 విడుదల అయ్యాయట. అందులో ఆరు సినిమాలు చిరం జీవి సినిమాలతో పోటీ పడి బాక్సాఫీస్ హిట్ అయ్యాయి. గతంలో లాగా వీళ్లు సినిమా నటులు మాత్రమే కాదు, రెండు వైరి రాజకీయ పక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రెండు సామాజిక వర్గాలకు ప్రతినిధులు. ఆ ముగ్గురూ... తెలుగునాట సినిమా రంగానికీ, రాజకీయాలకూ మధ్య రేఖలు పూర్తిగా చెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఇప్పుడున్న రాజకీయ వాతావరణమే కొనసాగితే ముగ్గురు నటులు మూడు పార్టీలుగా ఎన్నికల బరిలోకి దిగి తమకు ఎంత ప్రజా భిమానం ఉందో తేల్చుకోవచ్చు. అప్పటిదాకా అదే పార్టీలో కొనసాగితే 2019లో చిరంజీవి కాంగ్రెస్‌కు స్టార్ ప్రచారకుడవుతారు, పోటీ చెయ్యాలన్న ఆలోచనలో మార్పు రాకపోతే పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనకు ఆకర్షణగా నిలబడతాడు. ఇక మూడో నటుడు, అధికారపక్షంలో ఉన్న మరో నటుడు, శాసనసభ్యుడు, మహానటుడు ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ. ఇది ఆంధ్రప్రదేశ్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య ఎంతోకాలంగా ఉన్న రాజకీయ ఘర్షణగా కూడా తీసుకోవచ్చు. కాపు సామాజిక వర్గానికి రిజర్వే షన్లు కల్పించకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాన్ని తుంగలో తొక్కిందని ఆందోళన చేస్తున్న మాజీమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా నిలబడ్డారు చిరంజీవి. కాగా కాపులకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పార్టీలో ఒక నాయకుడు బాలకృష్ణ. ఆ రాజకీయ సినిమాకి ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు అసలు సినిమాల గురించి మాట్లాడుకుందాం. రాజకీయాల్లో కొనసాగుతూ సినిమాల్లో నటించడం సమంజసమేనా అన్న చర్చ జరుగుతున్నది. రాజ కీయాల్లోకి వచ్చాక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉంటూ విశ్వామిత్ర సినిమాలో నటించారు. సినిమా షూటింగ్ జరిగిన నాచారం స్టూడియోకి అధికారులు ఫైళ్లు చంకన పెట్టుకుని సంతకాల కోసం వెళ్లేవారు. ఆయన విశ్వామిత్రుడి మేకప్‌లోనే ఆ ఫైళ్ల మీద సంతకాలు చెయ్యడం దేశమంతటా పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. ఎన్టీఆర్‌ను నటుడిగా ఆరాధించి, ఆ కారణంగానే కాంగ్రెస్‌ను మట్టికరిపించి తెలుగుదేశంను అధికారంలోకి తీసుకొచ్చిన తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా ఆయన సినిమాల్లో వేషాలు వెయ్యడం నచ్చలేదు. అందుకే ఆ వెంటనే వచ్చిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. ఎటు ప్రయాణం? ఇక చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన తిరుపతి బహిరంగ సభలో ‘నాకు గంజీ తెలుసు, బెంజీ తెలుసు’ అని ప్రకటించి తొమ్మిదేళ్ల తరువాత ‘బాస్ ఈజ్ బ్యాక్ ’ అంటూ 150వ సినిమాతో మళ్లీ రంగ ప్రవేశం చెయ్యడం చర్చనీయాంశమైంది. అయితే బాస్ మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లరా? అన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఇవాళ విడుదల అవుతున్న సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందేమో రాజకీయ భవిష్యత్తు మీద ఆయన నిర్ణయం. రాజకీయాల్లో కొనసాగడమా, శాశ్వతంగా సినిమాల్లోకి తిరిగి రావడమా లేక అక్కడో కాలు, ఇక్కడో కాలు వేసి అదృ ష్టాన్ని పరీక్షించుకోవడమా అన్నది చిరంజీవి నిర్ణయించుకుంటారు. కానీ ఆయన చేసిన 150వ సినిమా ఆయన రాజకీయ జీవితంలో భాగంగా చూడా లంటే మాత్రం కుదరదు. ఈ సినిమా తమిళంలో అద్భుతంగా నడిచిన సినిమా. నీళ్లు, రైతుల కడగళ్లు ప్రధాన ఇతివృత్తంగా కథ నడుస్తుంది. చిరంజీవి సహా ఆయన సమర్ధకులంతా ఈ సినిమాతో రైతుల సమస్యలు తీసుకుని గొప్ప పోరాటం చేసినట్టు చెప్పుకోవడం సమంజసం కాదు. రాజ కీయాల్లో ఉండి, ఈ తొమ్మిది సంవత్సరాలు మీరు రైతులకు ఏం ఒరగ బెట్టారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక అరవయ్యవ పడిలో పెద్దల సభ అని గౌరవంగా చెప్పుకునే రాజ్యసభ సభ్యుడై ఉండి, కేంద్ర మాజీమంత్రి అయి ఉండి చవకబారు పాటలకు చేసే డ్యాన్స్‌లను మాత్రం జనం మెచ్చరు. ఈ సందర్భంలో మహానటుడు అమితాబ్ బచ్చన్ గుర్తొస్తున్నాడు. ఆయన నెహ్రూ–గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. రాజీవ్‌గాంధీకి ఆప్తమిత్రుడు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో మిత్రుడి కోరిక మేరకు అలహాబాద్ నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కానీ కొద్ది మాసాల్లోనే పదవికి రాజీనామా చేశారు. అప్పుడాయన చేసిన వ్యాఖ్య, ‘నేను నటుడిని, సినిమాల్లోనే తప్ప రాజకీయాల్లో నటించలేను’ అని. (వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ datelinehyderabad@gmail.com) -
నిజాలకు సమాధి కడతారా?
డేట్లైన్ హైదరాబాద్ నయీమ్‌కి శిక్ష పడాల్సిందే. కానీ నయీమ్ చనిపోయిన తరువాత దర్యాప్తు పేరుతో జరిగిన, ఇంకా జరుగుతున్న తతంగం ఎంత హాస్యాస్పదంగా ఉందో నారాయణ దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం మీద తెలంగాణ హోంశాఖ వేసిన కౌంటర్ అఫిడవిట్ స్పష్టం చేస్తుంది. నయీమ్ చనిపోయిన తరువాత స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఆస్తిపత్రాలు, పెద్ద మొత్తంలో నగదుతో పాటు అతడికి ఎవరెవరితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే విషయంలో బోలెడంత సమాచారం ఉన్న డైరీలు కూడా దొరికాయి. నయీమ్ ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కోరుతూ సీపీఐ నాయకుడు కె. నారాయణ న్యాయస్థానంలో దాఖలు చేసిన ప్రజాప్రయోజ నాల వ్యాజ్యం మీద తెలంగాణ హోం శాఖ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ కొన్ని గొప్ప సత్యాలను వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద తాను సేకరించిన కొన్ని వివరాల ఆధారంగా నారాయణ ఈ కేసు దర్యాప్తు రాష్ట్ర పోలీసులతో కాకుండా, కేంద్ర స్థాయి సంస్థ దర్యాప్తు చేస్తే బాగుంటుందని ఆశించి ఉండవచ్చు, అందులో తప్పులేదు. నారాయణ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన పార్టీ లేదా ఆయన పార్టీతో మిత్రత్వం నెరపుతున్న ఇతర వామపక్షాలు అధికారంలో ఉన్న సందర్భాలు తక్కువ కాబట్టి అధికార యంత్రాంగం, అందునా పోలీసు వ్యవస్థ ఎవరి చెప్పుచేతల్లో నడుస్తుందో అనుభవపూర్వకంగా తెలియకపోవచ్చు కానీ, నారాయణ అసలేమీ తెలియని అమాయకుడని ఎవరూ అనరు. నయీమ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన’ సిట్’ చిన్న పోలీసు అయితే, కేంద్ర స్థాయిలోని సీబీఐ పెద్ద పోలీసు. అంతకంటే పెద్ద తేడా ఏమైనా నారాయణ చూసినట్టయితే ఆయన అభిప్రాయం మార్చుకుంటే మంచిది. స్థానిక పోలీసు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో పనిచేస్తే, సీబీఐ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో మెలుగుతుంది. కేంద్ర ప్రభుత్వ హోం శాఖ పరిధిలో పనిచేసే సీబీఐ ఈ దేశంలో దర్యాప్తు జరుపుతున్న అనేక కేసుల్లో జరుగుతున్న నిర్వాకాలను కళ్లతో చూస్తూ కూడా నారాయణ నయీమ్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరడం వింతగా ఉంది. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభు త్వానికీ, తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలకూ మధ్య ఉన్న సత్సంబంధాలను మరిచిపోయి నారాయణ సీబీఐ వల్ల న్యాయం జరుగుతుందని నమ్మితే ఆయన నమ్మకం ఆయనది. ఎవరైనా ఎందుకు కాదనాలి? నయీమ్ వ్యవ హారంలో దర్యాప్తు న్యాయంగా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. మొద టిరోజు నుంచి ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అన్నమాట మన రాజకీయ నాయకులకూ, ప్రభుత్వ అధి కారులకూ ఊతపదంగా మారింది తప్ప, కొందరు పలుకుబడి కలిగిన వారి చుట్టంగా మారిపోయిన చట్టం వారి కనుసన్నల్లోనే నడుచుకుంటుందని తెలు సుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు. పెంచి పోషించింది పెద్దలే దాదాపు పదిహేను సంవత్సరాలపాటు నయీమ్ చేసిన అకృత్యాలు ప్రభు త్వాలకూ, ముఖ్యంగా పోలీసు బాసులకూ తెలియకుండా జరిగినవి కాదు. తొలిరోజుల్లో వాళ్ల ప్రోత్సాహంతోనే నేరాలు చేసిన నయీమ్ వంటివారు, ఆ తరువాత వాళ్లకే తలపోటుగా మారి సొంత నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న విషయం అందరికీ తెలిసిందే. తమకు సైతం కొరకరాని కొయ్యగా తయా రయ్యాక, ఇక భరించే స్థితి దాటిపోయే సరికి అడ్డు తొలగించుకున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇక నయీమ్ షాద్‌నగర్‌లోని మిలీనియం కాలనీలో ఉన్నట్టు సమాచారం రావడం, పోలీసులు వెళ్లి హెచ్చరించడం, లొంగక పోగా పోలీసుల మీదనే కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం వీళ్లు తిరిగి కాల్పులు జరపగా నయీమ్ చనిపోవడం–ఇది సర్వే సర్వత్రా వినిపించే కథనం. ఈ దేశంలో పోలీసు ఎన్కౌంటర్లు మొదలయినప్పటి నుంచి∙ఇటువంటి కథలు వందలూ వేలూ విని ఉంటాం. ఎన్‌కౌంటర్‌కు అర్థాన్ని మార్చేసి చాలాకాలమైంది. ఎన్కౌంటర్ అంటే ఎదురుకాల్పులు అనే అర్థం మారి, పోలీసులు ఎవరినైనా పట్టుకుపోయి కాల్చి చంపడం అనే అర్థం స్థిరపడిపోయింది. సరే, నయీమ్ ఎన్కౌంటర్ నిజమైనదా, కాదా? అన్నది ఇక్కడ అప్రస్తుతం. నయీమ్ పాలకవర్గాల కంటే ప్రజలనే ఎక్కువ హింసించాడు. పేదలూ, మధ్యతరగతి వర్గాల ఆస్తులనూ, మాన ప్రాణాలనూ హరించాడు. చిన్న పిల్లలూ, అమాయక స్త్రీల జీవితాలతో చెలగాటమాడాడు. బడా బడా అధికారులూ, రాజకీయ నాయకుల నుంచి పెద్ద మొత్త్తంలో డబ్బు వసూలు చేసి ఉంటాడు, అందుకు బదులుగా వారికేవో సహాయాలు చేసే ఉంటాడు. కొందరిని ఇతరుల నుంచి రక్షించడానికి మరికొందరికి తన నుంచే రక్షణ కల్పించడానికి నయీమ్ చాలా మంది పెద్ద వాళ్ల నుంచి పెద్ద మొత్తా్తలనే రాబట్టాడన్న అంశంలో సందేహంలేదు. కాబట్టి నయీమ్‌కి శిక్ష పడాల్సిందే. కానీ నయీమ్ చనిపోయిన తరువాత దర్యాప్తు పేరుతో జరిగిన, ఇంకా జరుగుతున్న తతంగం ఎంత హాస్యాస్పదంగా ఉందో నారాయణ దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం మీద తెలంగాణ హోం శాఖ వేసిన కౌంటర్ అఫిడవిట్ స్పష్టం చేస్తుంది. నయీమ్ చనిపోయిన తరువాత ఆయ నకు సంబంధించిన పలు స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయు« దాలు, ఆస్తిపత్రాలు, పెద్ద మొత్త్తంలో నగదుతో పాటు నయీమ్‌కు ఎవరెవ రితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే విషయంలో బోలెడంత సమా చారం ఉన్న డైరీలు కూడా దొరికాయి. నయీమ్‌కు తనను కలిసిన ప్రతి ఒక్క రితో ఫోటోలు దిగడం, సంభాషణలు రికార్డు చెయ్యడం, వీడియోల్లో నిక్షిప్తం చెయ్యడం, లెక్కలన్నీ వివరంగా రాసుకోవడం అలవాటు అనీ అవన్నీ తమకు దొరికాయని మీడియాకు చెప్పింది పోలీసులే. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆరంభం కానీ వీటిని ఎందుకు బయట పెట్టడం లేదు? నయీమ్ ఎన్కౌంటర్ తరు వాత మీడియాలో బోలెడు కథనాలు వచ్చాయి. ఇవేవీ ఇప్పుడు పోలీసులు చెప్పే విధంగా పూర్తి నిరాధారమైనవి కాదు. నిరాధారమే అయి ఉంటే కొందరు రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటికి వచ్చాయి కదా, ఆ నాయకులు సదరు మీడియా సంస్థల మీద పరువు నష్టం దావా వెయ్యక పోగా, కలుగులో దూరిన ఎలుకల్లాగా కొంతకాలం కనిపించకుండా పోయా రెందుకు? నయీమ్ నేరాలు చేసింది, వాటికి ప్రభుత్వ పెద్దల నుంచి ఆశీ స్సులు అందుకున్న ముచ్చట ఇప్పటిది కాదు, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే జరిగింది. పొరుగు తెలుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో నయీమ్ ఆగడాలు నిరాటంకంగా సాగాయి. నిజానికి నయీమ్ మరణం తరువాత బయటపడ్డ డైరీలోని సమాచారం గురించి విని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో పని చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న కొందరు, పదవీ విరమణ చేసిన మరికొందరు బాబుగారి దగ్గరికి వెళ్లి ప్రభుత్వం ఆదేశాల మేరకే కదా మేము అవన్నీ చేసింది, అప్పుడు మీరే కదా ముఖ్యమంత్రి, ఇప్పుడు మమ్మల్ని మా ఖర్మానికి వదిలేస్తే ఎలా, మీరే కాపా డాలి అని మొర పెట్టుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న కొందరు రాజకీయ నాయకులకు నయీమ్‌తో దగ్గరి సంబంధాలు ఉండేవన్న వార్తలు కూడా చదివాం. కానీ మొన్న నారాయణ కేసులో తెలంగాణ ప్రభుత్వ హోం శాఖ సమ ర్పించిన కౌంటర్ అఫిడవిట్లో మాత్రం అధికారులకూ, రాజకీయ నాయ కులకూ నయీమ్‌తో ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టంగా పేర్కొంది. పైగా నారాయణ కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకి అయినందున రాజకీయ ప్రయోజనం ఆశించి ఈ కేసు వేశారు, కొట్టెయ్యండి అని కోర్టును కోరింది. తెలంగాణ ప్రభుత్వం నయీమ్ కేసులో దర్యాప్తునకు నియమించిన’ సిట్’ అంతిమంగా ఏం తేల్చబోతున్నదో హోం శాఖ దాఖలు చేసిన కౌంటర్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. డైరీలను ప్రజల ముందు ఉంచండి! నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే, మన నేతలు చెప్పే విధంగా చట్టం తన పని తాను చేసుకుపోతే చాలా విషయాలు బయటికి వస్తాయి. అదేం జరగకపోగా ఎవ రెవరిని ఇందులో నుంచి బయట పడెయ్యాలో తద్వారా ఎవరి ప్రయోజనాలు కాపాడాలో ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. అదే నిజం కాకపోతే పోలీసు శాఖకు కూడా తెలియకుండా హోం శాఖ అఫిడవిట్ ఎట్లా దాఖలు చేస్తుంది. ఈ విషయంలో పోలీసు శాఖలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నట్టు వార్తలు వచ్చాయి. మొత్తం పాలకవర్గాల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిన నయీమ్ కేసును ఇంతగా నీరుకార్చడం వ్యవస్థను ఏ విలువల వైపు నడిపించడానికి? ఇదంతా అబద్ధమైతే నయీమ్ డైరీలను ప్రజల ముందు ఉంచాలి. ఆ పని చేస్తారా? (వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ datelinehyderabad@gmail.com) -
‘ప్రశ్న’కు దూరంగా ఉద్యమస్ఫూర్తి
డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికార పక్షం కార్యాచరణ చూసిన ఎవరికైనా అర్థమ వుతుంది ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఉనికిని కూడా అది సహించజాలదని. ఆ మేరకు ఇతర రాజకీయ పక్షాలను నిర్వీర్యం చేసే కార్యక్రమం కొనసాగుతుండగానే శత్రువు జేఏసీ రూపంలో వస్తున్నాడేమో అన్న సందేహం, ఆందోళన కారణంగానే ఇవాళ అధికారపక్షం కోదండరామ్ మీద కత్తి కట్టినట్టు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. 1980 దశకం తొలిరోజులు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయంలో విద్యార్థినిని వేధించిన సంఘటనలో ఒక ప్రొఫెసర్‌ను సస్పెండ్ చెయ్యాలని కోరుతూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. యూనివ ర్సిటీ పాలకవర్గం దిగిరాలేదు. ఉద్యమంలో భాగంగా దశలవారీ ప్రదర్శ నలు, రిలే నిరాహార దీక్షలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక విద్యా ర్థులు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అప్ప టికి హైదరాబాద్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఏర్పడలేదు. విద్యా ర్థిని వేధింపు వ్యవహారంలో ప్రొఫెసర్ మీద చర్యలు తీసుకోవాలని ఉద్యమిం చిన విద్యార్థుల బృందమే అంతకు ముందు యూనివర్సిటీ పాలకవర్గానికి ఒక ముసాయిదా నియమావళిని తయారుచేసి సమర్పించింది. దాని మీద ఇంకా నిర్ణయం జరగక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో విద్యా ర్థులు ఉద్యమించారు. యాజమాన్యాన్ని దారికి తెచ్చేందుకు హైదరాబాద్ అబిడ్స్ గోల్డెన్ త్రెషోల్డ్లో ఒక విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిం చాడు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందున ముందుగా ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసి విచారణ జరపాలన్నది విద్యార్థుల డిమాండ్. విచారణలో తేలితే కానీ సస్పెండ్ చేయబోమని యూనివర్సిటీ యాజమాన్యం మొండి కేసింది. చివరికి ప్రొఫెసర్ సస్పెన్షన్ జరిగాకే ఆ విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష విరమించాడు. ఆ సంఘటనతో చాలా మార్పు వచ్చింది. విద్యార్థి బృందం సమర్పించిన ముసాయిదా నియమావళిని మెజారిటీ విద్యార్థులు ఆమోదించి ఆనాటి నుంచి దాని ఆధారంగానే విద్యార్థి సంఘానికి ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు. యూనివర్సిటీ యాజమాన్యం ప్రమేయం ఏ మాత్రం లేకుండా విద్యార్థులే ఈ ఎన్నికలు అత్యంత ప్రజాస్వామిక వాతా వరణంలో ఇప్పటికీ జరుపుకోవడం విశేషం. తోటి విద్యార్థినికి న్యాయం చేయడం కోసం ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు తెగించిన ఆ విద్యార్థి ఆ తరువాత కాలంలో ఒక మంచి అధ్యాపకుడిగా, పౌర హక్కుల ఉల్లంఘనను ప్రతిఘటించేందుకు జరిగిన ప్రతి ఆందోళనలోనూ అడుగు కలిపిన మానవ హక్కుల కార్యకర్తగా సుప్రసిద్ధుడైన ప్రొఫెసర్ కోదండరామ్. 2009 డిసెంబర్ 9 రాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి 24 గంటలలోనే వెనక్కి పోయిన కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మళ్లీ దారికి తేవడం కోసం ఏర్పడిన తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి (టీజేఏసీ) చైర్మన్. సెంట్రల్ యూని వర్సిటీలో విద్యార్థినికి న్యాయం చేయడం కోసం దీక్ష చేయడం మొదలు, తెలంగాణ సాధన కోసం జరిగిన మహోద్యమంలో జేఏసీ అధ్య క్షుడి బాధ్య తలు నిర్వహించే వరకూ కోదండరామ్ ప్రజాపక్షమే. పొలిటికల్ జేఏసీ ఎలా వచ్చింది? డిసెంబర్ 9 ప్రకటనతో ఆమరణ నిరాహార దీక్ష విరమించిన ఉద్యమ నేత, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసు కోవడంతో హుటాహుటిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానా రెడ్డి ఇంటికి వెళ్లి చర్చించిన అనంతరం తీసుకున్న నిర్ణయం ఫలితమే ఇవాళ మనం పొలిటికల్ జేఏసీ అని చెప్పుకుంటున్న సంఘం. 2009 డిసెంబర్ 24న హైదరాబాద్ లోని కళింగభవన్‌లో జరిగిన ఒక సమావేశంలో ప్రొఫసర్ కొత్తపల్లి జయశంకర్ ప్రతిపాదన మేరకు ప్రొఫెసర్ కోదండరామ్ చైర్మన్‌గా రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఏర్పాటైంది. తరువాత వాటి వాటి కార ణాల వల్ల కాంగ్రెస్ వంటి పార్టీలు బయటికి వెళ్లిపోయాయి. టీడీపీ వంటి పార్టీని పంపించేశారు. అన్ని రాజకీయ పక్షాలనూ ఒక్క తాటి మీదకు తెచ్చి రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఆలోచనతో, కేసీఆర్ చొరవతో ఏర్పడిన ఈ జేఏసీ బహుశా ప్రపంచంలోనే ప్రజా ఉద్యమాలన్నిటికీ మార్గదర్శిగా, దిక్సూ చిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర విభజన కోసం బలంగా నాటుకుపోయిన ఆకాంక్ష కారణంగా రాజకీయాలను పక్కకు నెట్టేసి సబ్బండ వర్ణాలూ ఈ జేఏసీలో చేరిన కారణంగానే ఉద్యమం విజయం సాధించిందనడంలో సందేహం లేదు. జేఏసీ మొత్తం తెలంగాణ సమాజాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే కుల, వృత్తి, ఉద్యోగ, విద్యార్థి సంఘాలన్నీ జేఏసీలుగా ఏర్పడి ప్రధాన జేఏసీ వెంట నడిచి ఉద్యమాన్ని విజయవంతం చేశాయి. మిలియన్ మార్చ్ చేసినా, సాగరహారం నిర్మించినా, సకల జనుల సమ్మెను చెదిరిపోకుండా బలంగా నిలబెట్టినా, రాష్ట్రమంతటా వంటావా ర్పులు చేసి వందల కిలోమీటర్ల రోడ్లను దిగ్బంధం చేసినా, ఒక్క పిలుపుతో రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయినా అది కోదండరామ్ నాయకత్వంలోని జేఏసీ కృషి, పట్టుదల, నిబద్దత కారణంగానే. ఉద్యమ సంస్థగా తెలంగాణ రాష్ట్ర సమితికీ, దానికి నాయకత్వం వహించి, అన్ని ఆటుపోట్లనూ తట్టుకుని ముందుకు నడిపిన చంద్రశేఖరరావుకు రాజకీయ నాయకత్వాన్ని ప్రభా వితం చేసి కేంద్రాన్ని రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకునే వైపు అడుగులు వేయించిన ఘనత ఎంత దక్కుతుందో, క్షేత్ర స్థాయిలో ప్రజలను కదిలించి, వారిని ప్రభావితం చేసి ఉద్యమ సెగ పాలకవర్గాలకు తగిలేట్టు చేసి టీఆర్ఎస్కు అవసరమైన బలాన్ని సమకూర్చిన జేఏసీకి అంతే దక్కుతుంది. ఒకానొక దశలో జేఏసీ తెరాస కనుసన్నల్లో నడుస్తున్నదని ఇతర రాజకీయ పక్షాలు విమర్శించినా, తమ మాట వినడంలేదని కోదండరామ్ మీద టీఆర్ఎస్ పెద్దలు అలకబూని పరోక్ష సహాయ నిరాకరణకు దిగినా చలించకుండా ఉద్య మానికి జేఏసీని బాసటగా నిలిపింది కోదండరామ్ నాయకత్వ దక్షతే. జేఏసీ ఆవిర్భావ సభ చరిత్రాత్మకమే తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆవిర్భవించి మొన్న 24వ తేదీకి ఏడేళ్లు నిండిన సందర్భంగా సభ జరిగింది. తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్ద్ధమై చంద్రశేఖరరావు చేసిన ఆమరణ దీక్షను గుర్తుచేసుకోడానికి దీక్షా దివస్ నిర్వహించడం ఎంత సమంజసమో, జేఏసీ ఆవిర్భావ సభను జరుపుకోవడం అంతే సమంజసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానపాత్ర నిర్వహించిన జేఏసీని మరచిపోవడానికి వీలులేదు. అయితే లక్ష్యం నెరవేరిన తరువాత కూడా జేఏసీ అవసరం ఏముంది? అన్న ప్రశ్న వినిపిస్తున్నది. ఉద్యమ సంస్థగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో కూడా అప్పట్లో ఇటువంటి వాదనే వినిపించింది. అయితే టీఆర్ఎస్ ఉద్యమ సంస్థ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది ఎన్నికల బరిలో నిలిచి అధికారం చేజిక్కించుకుంది. నిజానికి ఇవాళ పేరుకే అది పొలిటికల్ జేఏసీ కానీ, అందులో టీఆర్ఎస్ సహా ఏ రాజకీయ పార్టీ భాగస్వామి కాదు. ఉద్యమకాలంలో ఉన్న ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు దూరమ య్యాయి. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులకూ, జేఏసీలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన ఇతర విద్యార్థి నాయకులకూ, మేధావులకూ కొన్ని ప్రభుత్వ పదవులు వచ్చాయి. అట్లా పదవులు పొందిన వారి అర్హతలను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ జేఏసీని కొనసాగించడానికీ, దానిని మళ్లీ పునర్వ్యవస్థీకరించడానికీ సాగుతున్న ప్రయత్నం మీద ఎందుకు పెద్ద ఎత్తు్తన దాడి జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మళ్లీ అన్యాయం జరగకుండా సచివాలయం ముందు కుర్చీ వేసుకుని కూర్చుని కాపలా కాస్తాను అన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో పరిపాలనలో జరిగే పొరపాట్ల మీద విమర్శలు చేసే వారి పట్ల అసహనం సముచితమేనా? కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫారం తీసుకుని పోటీ చేసి గెలిచిన శాసన సభ్యులను రాజీనామా చేయించకుండా తమ బలాన్ని పెంచుకున్న టీఆర్ఎస్ పార్టీలోని ఏ నాయకుడికి అయినా కోదండరామ్ టీఆర్ఎస్ ఏజెంట్ అనే అర్హత ఎట్లా ఉంటుంది? జేఏసీ ఏర్పడే వరకూ కోదండరామ్ ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యుడుకాదు. భవిష్యత్తులో ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే ఎవరికీ ఆక్షేపణ ఉండాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యక్రమాలూ, పథకాల మీద జేఏసీ కానీ, కోదండరామ్ కానీ చేసే విమర్శలు అవాస్తవాలు అయితే వివరణ ఇచ్చే అవకాశాన్ని, అవసరాన్ని వదిలేసి అసహనాన్ని వ్యక్తం చెయ్యడం, అందునా గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన చందంగా రాజ కీయాల్లో ఓనమాలు కూడా నేర్వని బాల్క సుమన్ వంటి వాళ్ల చేత దాడి చేయించడం ఆరోగ్యకరం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికార పక్షం కార్యాచరణ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఉనికిని కూడా అది సహించజాలదని. ఆ మేరకు ఇతర రాజకీయ పక్షాలను నిర్వీర్యం చేసే కార్యక్రమం కొనసాగుతుండగానే శత్రువు జేఏసీ రూపంలో వస్తున్నాడేమో అన్న సందేహం, ఆందోళన కారణంగానే ఇవాళ అధికారపక్షం కోదండరామ్ మీద కత్తి్త కట్టినట్టు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. ఇంకా ఆదరిస్తున్నారు. టీఆర్ఎస్కు ఆ విశ్వసనీయత రావడంలో జేఏసీ పాత్ర కూడా ఉంది. ఆ కారణం కూడా తోడై ఇతర రాజకీయపక్షాలు ఇవాళ నామ మాత్రంగా, నిష్క్రియాపరంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో జేఏ సీని బలోపేతం చేసే ఆలోచన కోదండరామ్ వంటి వారికి రావడాన్ని సహ జంగానే అధికారపక్షం జీర్ణించుకోలేకపోతున్నది. కోదండరామ్ నాయకత్వంలో బలోపేతం కావాలనుకుంటున్న జేఏసీ భవిష్యత్తులో రాజకీయ స్వరూపం తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడే నిర్ణయించలేం కానీ, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ శూన్యం మాత్రం ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తు న్నది. ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజాస్వామ్యవాదులంతా ఆహ్వానిం చాల్సిందే. (వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ datelinehyderabad@gmail.com) -
పసుపు పార్టీ ‘నల్ల’ న్యాయం
డేట్లైన్ హైదరాబాద్ తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖరరెడ్డి దగ్గర నూట ఇరవై కోట్ల రూపాయల నల్లధనం, వంద కిలోలకు మించి బంగారు కడ్డీలు దొరికాయి. కేసు నమోదైంది. దొరికిన నగదులో చాలావరకు కొత్త నోట్లు. అవి రిజర్వు బ్యాంక్ నుంచి నేరుగా శేఖరరెడ్డి ఇంటికి తరలి వచ్చాయా? అన్న అనుమానం మొదట్లో కలిగినా, విచారణ తరువాత రెండు బ్యాంక్‌ల శాఖల నుంచి ఆ డబ్బు వచ్చిందని వెల్లడైంది. సరే, బ్యాంకుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచించుకుంటుంది. శేఖరరెడ్డికి ఎలాంటి శిక్ష పడుతుందో భవిష్యత్తులో తెలుస్తుంది. దేశమంతటా ఇటువంటి కొందరు ‘నల్ల’దొరలు ఈ ఐదువారాలలో దొరికారు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి డబ్బు కూడా దొరికింది. ఈ మొత్తం కొత్త నోట్లు వాళ్లకు ఎట్లా వస్తున్నాయన్నది ప్రశ్న. కచ్చితంగా ఈ నేరం బ్యాంకు అధికారులదే అనడంలో సందేహం లేదు. శేఖరరెడ్డి బడా కాంట్రాక్టర్. వేల కోట్ల రూపాయలలోనే ఉంటుందట కాంట్రాక్టుల వ్యవహారం. తమిళనాడులో అధికార పక్షం అన్నా డీఎంకేకి అత్యంత సన్నిహితుడు, దివంగత ముఖ్యమంత్రి జయలలితకూ, ఆమె ప్రియసఖి శశికళకూ, కొత్త ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకూ కూడా శేఖరరెడ్డి అత్యంత సన్నిహితుడనే వార్తలు వచ్చాయి. జయ భవనంలోకి అలవోకగా వెళ్లగల పలుకుబడి కలవాడని సమాచారం. శేఖరరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించాల్సిందిగా తమిళనాడు అధికారపక్షం నుంచి ఒత్తిడి వచ్చిందని ఆయన నల్లధనం బయటపడిన తరువాత ఆంధ్రప్రదేశ్ అధికారపక్షం వాదించడం ఆరంభించింది. ఎవరో చెబితే ఆయనను బోర్డు సభ్యుడిగా నియమించాల్సి వచ్చిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. టీటీడీ బోర్డులో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒక్కొక్క సభ్యుడిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకు నియమిస్తారు, కాబట్టి మాకేం సంబంధం? అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పించుకోజూస్తున్నది. సరే, ఆయనను బోర్డు నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఇంతటితో చంద్రబాబు బాధ్యత తీరినట్టేనా? శేఖరరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా తొలగించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఇది బాధ్యతా రాహిత్యం కాదా? వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల అధ్యక్షులుగా, బోర్డుల సభ్యులుగా తమ వారిని నియమించుకునే అధికారం ప్రభుత్వ పక్షానికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వ అధినేత ఇటువంటి నియామకాలు చేసేటప్పుడు సదరు అభ్యర్థుల నేపథ్యం గురించి కొంతైనా ఆలోచించకుండా, రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకోవడం సాధారణమైపోయింది. ఆర్థికబలం, రాజకీయ పలుకుబడి కలిగినవారే ఎక్కువ భాగం ఈ నామినేటెడ్ పదవులను దక్కించుకుంటూ ఉంటారు. అయితే ధార్మిక కార్యకలాపాలకు సంబంధించిన టీటీడీ బోర్డు వంటి వాటిల్లో నియామకాలనైనా రాజకీయాలకూ, అవినీతికీ దూరంగా ఉంచితే బాగుండేది. అలాంటిదేమీ జరగకపోగా, ‘ఎవరో చెప్పారు నేను నియమించాను!’ అని ముఖ్యమంత్రే చెప్పడం బాధ్యతారాహిత్యం. శేఖరరెడ్డి వంటి వారిని టీటీడీ బోర్డు వంటి సంస్థలలో సభ్యులుగా నియమించేటప్పుడు వారి గత చరిత్ర ఏమిటో చూసుకోవాల్సిన అవసరం లేదని భావించేంతగా చంద్రబాబు మీద ఏ రకమయిన ఒత్తిడి వచ్చిందో ఆయన స్వయంగా ప్రకటిస్తేనే బాగుంటుంది. శేఖరరెడ్డి నేపథ్యం ఎలాంటిదో చంద్రబాబునాయుడుకు తెలియకుండానే ఈ నియామకం జరిగిందంటే మాత్రం ఎవరూ నమ్మరు. ఈ అవినీతి వ్యవహారం బయటపడ్డాక ఆయనను బోర్డు నుంచి తొలగించి చేతులు దులుపుకున్నానని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చిన్నదో పెద్దదో ఇంకో అవినీతి బురద పూసుకున్న తెలంగాణ టీడీపీ శాసనసభ్యుడు వెంకటవీరయ్యను అదే టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఎందుకు కొనసాగిస్తున్నట్టు? సండ్రను ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు? తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఒక శాసనసభ్యుడిని డబ్బుతో కొనేందుకు ప్రయత్నించిన కేసులో మరో శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి సహ నిందితుడు సండ్ర వెంకటవీరయ్య. ఆ కేసులో ఆయన కూడా కొద్దిరోజులు జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకొచ్చారు. మరి శేఖరరెడ్డిని బోర్డు నుంచి తొలగించిన తెలుగుదేశం ప్రభుత్వం వెంకటవీరయ్యను ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు? రెండు రోజులక్రితం ఢిల్లీలో ఓటుకు కోట్లు కేసు విషయంలో విలే కరులు అడిగిన ప్రశ్నకు ఇందులో మాట్లాడటానికి ఏముందని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో ఏమీలేదని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అక్కడి అధికార పక్షం వారి వారి కారణాల వల్ల భావించుకోవచ్చు కానీ, జరిగిన బాగోతం అంతా చరిత్రలో రికార్డు అయ్యే ఉంది. బహుశా అందులో ఏమీ లేదనుకున్నారు కాబట్టే వెంకటవీరయ్యను టీటీడీ బోర్డు నుంచి తొలగించకుండా ఉంచేసుకున్నట్టున్నారు చంద్రబాబు. బహుశా తన ప్రోద్బలం మీదనే ఓటుకు కోట్లు వ్యవహారం నడిచింది కాబట్టి వెంకటవీరయ్య విషయంలో చూసీచూడనట్టు ఉండిపోయారేమో! ఇటువంటి వారా దేవుడి వ్యవహారాలు చక్కబెట్టేది అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. విపక్షనేతను లాగడం ఎందుకు? ‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు’ అన్న రీతిలో నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి కొద్దిమాసాల ముందు స్వచ్ఛందంగా సంపద ప్రకటించే ఒక పథకాన్ని తెచ్చింది. ఆ పథకం కింద ఆదాయాన్ని ప్రకటించే వారి పేర్లు గోప్యంగా ఉంటాయి. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఒకరు రూ. 10 వేల కోట్లు ప్రకటించినట్టు వార్తలు వెలువడ్డాయి. వెంటనే చంద్రబాబునాయుడు విలేకరులను సమావేశపరచి, ఆ 10 వేల కోట్ల రూపాయల ప్రకటన వెనుక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నట్టు ధ్వనించే రీతిలో మాట్లాడారు. ఆయన మాటల నుంచి స్ఫూర్తి పొందిన ఆయన మంత్రివర్గ సభ్యుడొకరు పేరుతో సహా ప్రతిపక్ష నాయకుడి మీద ఆరోపణ చేశారు. ఈ వ్యవహారం మొన్న బయటపడింది. ఆ వ్యక్తి పేరు లక్ష్మణరావు. ఆ లక్ష్మణరావు ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తే ఆయనకు అంత సీన్ లేదనీ, అదంతా బోగస్ అనీ తేలింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, మంత్రుల స్థాయి వ్యక్తులూ ఇట్లా నిరాధారమైన ప్రకటనలు చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు? ఇక ఇంకో అధికార పక్ష నేత, మంత్రి ఇంకో అడుగు ముందుకు వేసి ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని బంకర్లలో వేల కోట్లు దాచి ఉంచారని బాధ్యతారహితంగా మాట్లాడతారు. అధికారంలో ఉన్నదెవరు? చంద్రబాబు సీఎం కాదా? ఆయన పార్టీ అధికారంలో లేదా? నిజంగానే ఇడుపులపాయలో వేల కోట్లు దాచి ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అధికారికంగానే దాడి చేసి వాటిని బయటపెట్టి ఉండొచ్చు కదా! శేఖరరెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల విషయంలో వ్యవహరించిన తీరు చూసినా, లక్ష్మణరావు విషయంలో నోళ్ళు జారిన విషయమైనా, ఇడుపులపాయ బంకర్ల గురించి అవాకులూ చవాకులూ పేలినా అందరికీ అర్థమవుతున్నది ఒక్కటే– అధికార పక్షం అయోమయంలో పడి దిక్కుతోచని మాటలు మాట్లాడుతున్నది. వాళ్ల మైండ్‌సెట్ మారాల్సిందే... మొన్న ఢిల్లీలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ‘నా ప్రభుత్వమంతా నా కంప్యూటర్లోనే ఉంది, నేను దేన్నయినా మేనేజ్ చెయ్యగలను’ అన్నారు. ఆయన దేన్నయినా మేనేజ్ చెయ్యగలరేమో కొంతకాలం. కానీ, ప్రభుత్వం ఆయన కంప్యూటర్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇవ్వాళ ఇట్లా ఉండేది కాదేమో! ఆ కంప్యూటర్ నుంచి కాస్త దృష్టి మళ్లించి చూస్తే వాస్తవ పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాదు, ప్రజల మైండ్‌సెట్ మారాలని తనకు చాలా ఇష్టమైన పాత డైలాగ్‌నే తిరిగి చెప్పారాయన. నిజమే, తాను మోదీకి లేఖ రాసి పెద్ద నోట్లు రద్దు చేయిస్తే దాని ఫలితంగా బ్యాంకుల ముందు బారులు తీరి, రోజుల తరబడి గడుపుతూ తమకు వచ్చిన కష్టానికి బాధ్యులు ఎవరా అని ఆలోచిస్తున్న ప్రజల మైండ్‌సెట్ మారాల్సిందే. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఆమె లేరు, ప్రశ్నలున్నాయి!
డేట్లైన్ హైదరాబాద్ జయలలిత లేని ఏఐఏడీఎంకే భవిష్యత్తు ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రాంతీయ పార్టీలన్నీ ఏక వ్యక్తి నాయకత్వం కింద నడవటం సహజం. జాతీయ పార్టీలలో కూడా అక్కడక్కడా ఈ సంస్కృతి కనిపించినా ప్రాంతీయ పార్టీలలోనే వ్యక్తి పూజకు విపరీతమైన ప్రాధాన్యం ఉంటుంది. ద్రవిడ రాజకీయాలలో ఇది మరి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అరుుతే తమిళనాట అన్నాదురై మరణానంతరం, ఎంజీ రామచంద్రన్ మరణానంతరం ఎదురుకాని ఒక ప్రశ్న జయలలిత మరణం తరువాత ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి, పురచ్చితలైవీ (విప్లవ నాయిక) జె. జయలలిత 74 రోజులపాటు చెన్నైలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం నాడు మరణించారు. సమకాలీన భారతదేశ రాజకీ యాలలో ఆమెది ఒక విశిష్ట స్థానం. ద్రవిడ రాజకీయాలలో ఆమె కీర్తి చిర స్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. జీవితమంతా ఒంటరి పోరాటం చేసి అంతటా విజయాలనే సాధించడం, అందునా ఒక మహిళ ఆ పని చేయగలగడం ఊహకు అందేదికాదు. నిజానికి అవకాశం ఉంటే మహిళలే ఏ రంగంలో అయినా సమర్థులుగా నిరూపించుకుంటారన్న విషయం చాలా సందర్భాలలో వ్యవస్థ అనుభవానికి వచ్చిందే. భారత రాజకీయాలలో ఇందిరాగాంధీ తరువాత మళ్లీ అంత ఖ్యాతి సాధించిన నాయకురాలు జయలలిత. ఆమె తన 68వ ఏట మరణించారు. భారత దేశ క్రియాశీల రాజకీయ నాయకుల వయసుతో పోల్చుకుంటే అదేం పెద్ద వయసు కాదు. ఆరోగ్యంగా ఉంటే ఇంకో పదేళ్లు ఆమె తమిళనాడు రాజ కీయాలలోనే కాకుండా, జాతీయ రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర నిర్వహించేవారే. జాతీయ పార్టీలు బలహీనపడి, ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ బలోపేతం అవుతూ, కేంద్రంలో సంకీర్ణాలకు తప్ప దిక్కులేదు అన్న పరిస్థితి ఏర్పడ్డాక ఒక దశలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి జయలలిత కూడా నేతృత్వం వహించే అవకాశం ఉండేది. ఆమె ఎప్పుడో ఒకప్పుడు ప్రధానమంత్రి కాగలరంటూ చర్చ కూడా జరిగింది. మరో ఇద్దరు మహిళా నేతలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పేర్లు కూడా కేంద్ర ప్రభుత్వ నాయకత్వం విషయంలో చర్చకు వచ్చినా వారిలో జయలలితదే మొదటి స్థానం. దేశంలో ప్రాంతీయ రాజకీయాల్లో ఈ ముగ్గురు మహిళా నేతల ప్రభంజనం వీస్తున్న తరుణంలో జయలలిత మరణం విచారకరం. విద్యాధికురాలు, పలుభాషల్లో ప్రావీణ్యం కలిగిన జయలలిత అటు సినిమా రంగం మీదా, ఇటు రాజకీయ రంగం మీదా ప్రత్యేక ముద్రను వదిలి వెళ్లారు. అందులో సందేహం లేదు. సినిమా రంగంలో ఆమెకు పెద్దగా కష్టాలు ఎదురైన దాఖలాలయితే లేవు. ఒకవేళ ఉన్నా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ రాజకీయ రంగంలో ఆమె నడిచి వచ్చింది పూలబాట ఎంత మాత్రం కాదు. ఆమె నాయకత్వం ఆదర్శవంతం తీవ్రమైన అవమానాల నుంచి ఎగసిన ప్రతీకారేచ్ఛకు నిలువెత్తురూపంగా జయలలిత రాజకీయ వ్యక్తిత్వాన్ని చూడాల్సి ఉంటుంది. ఆమె రాజకీయ జీవితం అంతా సంచలనాలూ, సంఘర్షణలూ, వివాదాలూ, పోరాటాల మయమే. వాటన్నింటినీ మళ్లీ ఒంటరిగానే ఎదుర్కొన్న ధీరత్వం ఆమెది. కుటుంబం లేదు, బంధువులు లేరు, ఆప్తులు, సన్నిహితులు అంటూ ఎవరూ లేరు. కేవలం ప్రజలూ, పార్టీలో విధేయులూ తప్ప. బహుశా ఇంత ఒంటరి పోరాటం చేసి గెలిచి నిలిచిన నాయకులు మనకు చాలా తక్కువ మంది తారసిల్లుతారు. ‘బోల్డ్ ఎండ్ బ్యూటిఫుల్’ నాయకురాలు జయలలిత. సొంత కుటుంబం లేని జయలలిత తమిళ ప్రజలందరికీ అమ్మే అనడానికి మంగళవారం చెన్నైలోని రాజాజీ హాల్లో ఆమె పార్థివదేహాన్ని సందర్శించు కోడానికీ, మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకూ హాజరైన జన సందోహమే నిదర్శనం. జయలలిత రాజకీయ ప్రస్థానం ఎంతో మంది మహిళలకు ఆదర్శ వంతం అవుతుందనడంలో సందేహం లేదు. దేశమంతా ఆ దివంగత నేతకు నివాళులర్పిస్తున్నది. ఆలోచించతగ్గ పరిణామాలు జయలలిత జీవితం నుంచి, రాజకీయ ప్రస్థానం నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉన్నట్టే, ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన దగ్గరి నుంచి, మరణించే వరకూ 74 రోజుల పాటు తమిళ రాజకీయాలలో నెలకొన్న పరిణామాల నుంచి కూడా దేశం గుణపాఠం నేర్చుకోవాలి. ఆ మహా నాయకురాలి మరణానంతరం సంభవించబోయే రాజకీయ పరిణామాల గురించి అంచనా వేయాలి. వాటిని గురించి శాసనకర్తలూ, రాజకీయ పక్షాలూ ఆలోచించాలి. జయలలిత రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ 1984లో ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. పరిపాలనా పగ్గాలు ఎవరు చేపట్టాలి అన్న ప్రశ్న వచ్చింది. కోమాలోకి వెళ్లిపోవడంతో ఆయన మాట్లాడే స్థితిలో లేరు. ముఖ్యమంత్రి మరణిస్తేనో, రాజీనామా చేస్తేనో, నాయకత్వ మార్పు కారణంగానో, పదవి నుంచి వైదొలగితేనో శాసనసభాపక్షం సమావేశమై కొత్త నాయకుడిని ఎన్నుకుం టుంది. ఆనాడు పరిస్థితి అట్లా లేదు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహాల మేరకు రాష్ట్ర గవర్నర్ నడుచుకోవాలి. కానీ ముఖ్యమంత్రి లేకుండా మంత్రిమండలి ఎట్లా సమావేశం అవుతుంది? గవ ర్నర్‌కు సలహాలు ఎట్లా ఇస్తుంది? ఇదే మీమాంస ఆనాడు రెండవ స్థానంలో ఉన్న నెడుంచెజియన్‌కు బాధ్యతలు అప్పచెప్పడం దగ్గర అప్పటి గవర్నర్ ఎస్ఎల్ ఖురానాకు ఎదురైంది. The constitution is silent on these issues (రాజ్యాంగంలో ఇటువంటి సమస్యకు పరిష్కారాలేవీ సూచించ లేదు) అని ఆనాడు ఖురానా వ్యాఖ్యానించారు. సరిగ్గా 32 ఏళ్లు గడిచాక అదే తమిళనాడులో మళ్లీ ముఖ్యమంత్రి జయలలిత అదే స్థితిలో ఆస్పత్రిలో చేరి పాలనా వ్యవహారాలు నిర్వహించలేని స్థితిలో ఉంటే, ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావుకు సరిగ్గా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయన కూడా ఖురానా బాటనే నడవాల్సి వచ్చింది. అప్పుడు నెడుంచెజి యన్‌కు ముఖ్యమంత్రి శాఖలను అప్పగిస్తే, ఇప్పుడు పన్నీర్ సెల్వంకు అప్ప గించారు. అప్పుడూ ముఖ్యమంత్రి ఆదేశాలే అన్నారు, ఇప్పుడూ ముఖ్య మంత్రి ఆదేశాలే అన్నారు. ఈ రెండు సందర్భాలలోనూ ఇద్దరు ముఖ్య మంత్రులూ స్పృహలో లేరు. అచేతనంగా ఆస్పత్రి మంచం మీద ఉన్న ముఖ్యమంత్రుల చేత వేలిముద్రలు తీసుకుని పని నడిపించే పద్ధతి మాను కుని ఇప్పటికైనా ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏంచెయ్యాలో రాజ్యాం గాన్ని సవరించడం ద్వారా నిర్ధారించుకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు కాకుండా ఉంటుంది. ఈ పని ఎంజీ రామచంద్రన్ నాటి అనుభవం తోనే జరిగి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. వెంటాడుతున్న ప్రశ్నలు ఇక మరణానంతర మీమాంస. జయలలిత లేని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) భవిష్యత్తు ఏమిటి అన్న ప్రశ్న తలెత్తు తోంది. ప్రాంతీయ పార్టీలన్నీ ఏక వ్యక్తి నాయకత్వం కింద నడవటం సహజం. జాతీయ పార్టీలలో కూడా అక్కడక్కడా ఈ సంస్కృతి కనిపించినా ప్రాంతీయ పార్టీలలోనే వ్యక్తి పూజకు విపరీతమైన ప్రాధాన్యం ఉంటుంది. ద్రవిడ రాజకీయాలలో ఇది మరి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అరుుతే తమిళనాట అన్నాదురై మరణానంతరం, ఎంజీ రామచంద్రన్ మరణానం తరం ఎదురుకాని ఒక ప్రశ్న జయలలిత మరణం తరువాత ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నది. అధికారంలో ఉన్నా, అన్నాడీఎంకే భవిష్యత్తు ఏమిటీ? అని. వారసత్వ సమస్య తప్పదా? అన్నాదురైకి వారసులుగా కరుణానిధి, ఎంజీ రామచంద్రన్‌తో బాటు నెడుం చెజియన్ ఉండేవారు. వారు ఇరువురూ దాదాపు సమఉజ్జీలు, సమ ర్థులు కూడా. ఎంజీ రామచంద్రన్ తన వారసురాలిగా జయలలితను తయారు చేసుకున్నారు. కాబట్టి ఆ రెండు సందర్భాలలో ఆయన తరువాత ఎవరు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదు. ఇప్పుడు మాత్రం జయలలిత తరువాత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. పన్నీర్ సెల్వం జయలలితకు అత్యంత విధేయుడు, మంచివాడు. అంతే తప్ప రాబోయే రోజులలో ఎదురయ్యే రాజకీయ సంక్షోభాన్ని తట్టుకుని పార్టీనీ, ప్రభుత్వాన్నీ ముందుకు సమర్థంగా నడపగలడా? రెండు వేర్వేరు సందర్భాలలో తానూ తప్పుకుని విధేయుడు పన్నీర్ సెల్వంను జయలలిత ముఖ్యమంత్రిగా నియమించారు. కాబట్టి ఆమె అభీష్టం అదే అరుు ఉంటుంది అని ఇప్పుడు కూడా ఆయననే ముఖ్యమంత్రిని చేసి, పార్టీ పగ్గాలు మాత్రం జయలలిత ఇష్టసఖి శశికళకు అప్పగించి సమస్యను పరిష్కరించాం అని ఢిల్లీ పెద్దలు అనుకుంటున్నారు. కానీ ఇదెంతకాలం సజావుగా సాగుతుందో చెప్పడం కష్టం. జయలలిత తన పార్టీలో వీరవిధేయత నేర్పారు తప్ప, సమర్థ వారసుడిని మాత్రం తయారు చేయలేదు. ఇదంతా దాని ఫలితమే. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే తమ నాయకురాలు ఏ స్థితిలో ఉన్నారో కూడా విశ్వసనీయ సమాచారం తెలుసుకోకుండానే, ఆ శక్తి కూడా లేకనే, ఆమె మరణవార్త ధ్రువీకరణ జరగక ముందే పార్టీ కార్యాలయం మీద పతాకాన్ని అవనతం చేసి, కొద్దిసేపటికి తప్పు దిద్దుకున్న పరిస్థితి వారిది. రాజ కీయ పార్టీలన్నీ, ముఖ్యంగా సొంత వారసులు లేని ప్రాంతీయ పార్టీలన్నీ ఇది గమనించి జాగ్రత్త పడితే మంచిది. ప్రజాకర్షణకు ప్రతి రూ పంగా నిలిచినా, జయలలిత పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించలేదా? దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఎందుకీ ఉరుకులు, పరుగులు?
డేట్లైన్ హైదరాబాద్ యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అప్పట్లో ఏ మాత్రమూ రాజధాని గురించి ఆలోచన చెయ్యలేదు. చేసినట్టయితే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఆయన ఎంతసేపు రాజకీయ లబ్ధి కోసం చూసిన కారణంగానే ఈ ఆలోచన రాకపోయి ఉండొచ్చు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోగానే ఆయన హడావుడిగా పత్రికల వారిని పిలిచి నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే కొత్త రాజధాని కట్టుకుంటాం అని కూడా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోయినట్టే. రెండున్నర సంవత్సరాలయినా గడవక ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తేసింది. ఇందుకు కారణం తెలంగాణ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలూ కాదు. అర్ధంతరంగా తట్టా బుట్టా సర్దుకుని వెళ్లి వస్తానని ఎవరికీ ఒక్క మాటయినా చెప్పకుండా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అనే చిరునవ్వుతో కూడిన ఆహ్వానాన్నయినా అందుకోకుండా ఆంధ్రప్రదేశ్ పరిపాలన వెలగపూడి బాట పట్టడం విచారకరం. అదీ అరకొర వసతుల తాత్కాలిక సచివాలయానికి వెళ్లిపోవడం బాధాకరం. అర్ధంతరంగా హైదరాబాద్ వదిలిపోవడానికి పూర్తి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుదే. హైదరాబాద్ సచి వాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం కేటాయించిన భవన సము దాయాలు, అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయ సముదాయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం కేటాయించిన లేక్ వ్యూ అతిథి గృహం మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోట్లాది రూపాయలను వెచ్చించి పది సంవత్సరాలు కాకపోయినా, పట్టుమని పదిరోజులయినా విడిది చెయ్య లేని పరిస్థితి చంద్రబాబు చేజేతులా కొనితెచ్చుకున్నారు. రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఎప్పటికయినా ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఆ రాష్ట్రం నుంచి జరగాల్సిందే. పరిపాలన కోసం ఎక్కడో ఒకచోట రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిందే. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన సందర్భంలో పదేళ్లపాటు విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా పరిపాలనను హైదరాబాద్ రాజధానిగా కొనసాగించే వీలు కల్పించారు. అందుకోసం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రెండు రాష్ట్రాలకూ ఒకే గవర్నర్ ఉండే విధంగా ఏర్పాటు జరిగింది. పది సంవత్సరాలు సమయం ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు సావకాశం ఉంటుందని అర్థం. 2024 దాకా ఆంధ్రప్రదేశ్ పరిపాలన హైదరాబాద్ నుంచి జరిగేందుకు చట్టబద్ధమయిన ఏర్పాటు ఉందని అర్థం. ఈ లోపల 2019లో మరోసారి శాసనసభలకూ, లోక్‌సభకూ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఎవరికి ఇచ్చినా మన రాజ్యాంగం ప్రకారం అయిదు సంవత్స రాలే. ఆ అయిదు సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలిస్తే మళ్లీ ఎన్ని కయ్యే అవకాశం ఏ రాజకీయ పార్టీకి అయినా ఉంటుంది, లేదంటే అయిదేళ్ల తరువాత తలరాతలు మారొచ్చు. అధికారం లోకి వచ్చే ఏ పార్టీ అయినా ఇది దృష్టిలో ఉంచుకుని నడవాల్సిందే. చంద్రబాబు ఆ విషయం మరిచి పోయి నట్టున్నారు. అందుకే ఆయన ప్రణాళికలన్నీ వచ్చే 50 సంవత్సరాలకు సరి పడా వేస్తుంటారు. 50 ఏళ్లలో పదిసార్లయినా సార్వత్రిక ఎన్నికలు జరుగు తాయనీ, తామే ఈ పది ఎన్నికల్లో గెలిచి అధికారంలో కొనసాగుతామనే పూచీ ఏదీ లేదనీ ఆయన మరచిపోతుంటారు. రాజధాని గురించి ఆలోచించలేదు ఇక రాజధాని ఏర్పాటు చేసుకోవడం అంటే మాటలు కాదు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పడిన చిన్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్ పూర్ ఇంకా పూర్తి కానేలేదు. రెండున్నర సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రపదేశ్‌కు ఇంత తొందరగా రాజధాని ఏర్పడటం కష్టమే. నిజానికి గతంలో బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి విడిపోయి ఏర్పడిన జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌లకు రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ మాత్రం రాజధాని సహితంగా విడిపోయింది. కాబట్టి ఆ మూడు కొత్త రాష్ట్రాల సరసన చేర్చాల్సింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్నే కానీ, తెలంగాణ కాదు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించండి’ అని ఉత్తరాలు రాసి బహిరంగ సభల్లో మాట్లాడి, ‘ఏమయింది, ఇంకా ఎందుకు నిర్ణయం తీసు కోవడం లేదు?’ అని కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతూ వచ్చిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అప్పట్లో ఏ మాత్రమూ రాజధాని గురించి ఆలోచన చెయ్యలేదు. చేసి ఉన్నట్టయితే పరిస్థితి ఇంకొక లాగా ఉండేది. ఆయన ఎంత సేపు రాజకీయ లబ్ధి కోసం ఆలోచించిన కారణంగానే ఆయ నకు ఈ ఆలోచన రాకపోయి ఉండొచ్చు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోగానే ఆయన హడావుడిగా పత్రికల వారిని పిలిచి నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే కొత్త రాజధాని కట్టుకుంటాం అని కూడా ప్రకటించారు. అది ఎలాగూ సాధ్యంకాదని అందరికీ తెలుసు. ఇదంతా స్వయంకృతం సరే, విభజన సందర్భంగా హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న నిర్ణయం జరిగాక ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని మంచి రాజధానిని ఏర్పాటు చేసుకుని వెళ్దామనే ఆలోచన ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు రాలేదు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిలో ఉండే వాతావరణాన్ని ఆయనే చేజేతులా చెడగొట్టుకున్నారు. పదేళ్లు కచ్చితంగా హైదరాబాద్ నుంచే పరిపాలన కొనసాగిస్తామని తొలినాళ్లలో చెప్పడమే కాకుండా, తమ పార్టీ తెలంగాణ లో కూడా మళ్లీ త్వరలోనే అధికారంలోకి వస్తుంది అని ప్రకటించిన చంద్రబాబు అర్ధంతరంగా హైదరాబాద్ నుంచి వెళ్లిపోవడానికి ఒక్కటంటే ఒక్క సరయిన కారణం చెప్పగలరా? దసరా నాడు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి పరిపాలన ప్రారం భించిన రోజున ఆయన జరిపిన సుదీర్ఘ మీడియా గోష్టిలో మనకు జరుగు తున్న అవమానాన్ని ఇంకెంత మాత్రం సహించలేక పరిపాలనను ఇక్కడికి తరలించేశాను అని చెప్పారు. అవమానం ఎవరికి ఎందుకు జరిగిందో అదే గోష్టిలో ఆయన విడమరచి చెప్తే బాగుండేది. అట్లా కాకుండా ఆయన విజ్ఞుల యిన రాజకీయవేత్తలు ఎవరూ చెయ్యని ఒక దుర్మార్గమయిన ఆలోచనతోనే ఆ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల వ్యతిరేక భావన కల్పించే ప్రయత్నమే అది. హైదరాబాద్‌లో ఆయనను ఎవరూ అవమానించలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం అనే ప్రసక్తే రాదు. చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ లో చేసిన నిర్వాకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధ్యులు కారు. ఎవరూ ఆయనను, ఆయన ప్రభుత్వాన్ని వెళ్లగొట్టలేదు. నిజానికి చంద్రబాబునాయుడు రాష్ట్రం విడిపోయే నాటికి హైదరాబాద్ ఓటర్. 2014 ఎన్నికల్లో ఆయన హైదరా బాద్‌లో ఓటేశారు. ఈ రోజుకూ ఆయనకు హైదరాబాద్‌తో బోలెడు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. జూబిలీహిల్స్‌లో పాత ఇంటి స్థానంలో కోట్లాది రూపాయలు వెచ్చించి బ్రహ్మాండమయిన ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. నిజంగానే హైదరాబాద్ లేదా తెలంగాణ ఆయనను అవమానించి ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? ఆయన శేష జీవితం గడపడానికి హైదరాబాద్ రారని ఎవరయినా కచ్చితంగా చెప్పగలరా? శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణలో కొందరు శాసనసభ్యులను కోట్లాది రూపాయలు డబ్బు ఆశ చూపి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసి దొరికిపోయిన కారణంగా ఆయన పరిపాలనను హడావుడిగా తరలించుకు పోయి ఉద్యోగులనూ, అధికారులనూ, ప్రజాప్రతినిధులను ఇబ్బందుల పాలు చేశారు తప్ప మరే కారణమూ లేదు. ఈ పరిణామాలకు ఎవరు బాధ్యులు? తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. విశ్వాసాలతో పాటు రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మొట్టమొదట అధి కారంలోకి వచ్చిన విషయం చిరస్థాయిగా నిలిచిపోవడం కోసం ఆయన అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో కొన్ని వివాదాస్పదం కూడా అవుతున్నాయి. అందులో భాగంగానే ఆయన కొత్త సచివాలయం కట్టుకో వాలని నిర్ణయించారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మొన్న ఒక తీర్మానం చేసి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు అందచేసింది. అదే సమ యంలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న సచివాలయ భవన సముదాయాలను తెలంగాణ ప్రభు త్వానికి అప్పచెప్పాలని నిర్ణయించింది. అందుకు బదులుగా ఢిల్లీ ఆంధ్ర భవన్ మాదిరిగా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ భవన్ ఒకటి కేటాయించా ల్సిందిగా కోరాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియచేశారు. ఆ మేరకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం కూడా సమావేశమై అందుకు ఆమోదం తెలపడం లాంఛ నంగా జరిగేదే.పదేళ్లు దర్జాగా ఉమ్మడి రాజధాని నుండి పరిపాలన సాగించాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరకు ఒక భవనం కేటాయించాలని కోరే దుస్థితికి కారణం ఏమిటి? కారకులు ఎవరు? మొన్న ఎక్కడో గవర్నర్ గారు అన్నట్టు ఈ పరిస్థితి మీడియా సృష్టి మాత్రం కాదు. (వ్యాసకర్త : దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com) -
ప్రశ్నించడం పాపమైనచోటు
డేట్లైన్ హైదరాబాద్ రాజధాని భూసమీకరణ పేరిట తమ సన్నిహితులు దందాలు చేస్తున్నారని మీడియా చెపితే, రాష్ట్రం జ్వరంతో వణుకుతున్నది పట్టించుకోండి అంటే, ఎలుకలు కొరికి, చీమలు కరిచి పసి పిల్లలు చనిపోతున్నారు ప్రభుత్వ వైద్యశాలలను బాగుచేయండి అంటే కూడా మీడియాది ఉన్మాదమే. శాసనసభ్యులను సంతలో పశువుల్లా కొనకూడదు అని చెప్పినా, ఓటు కోసం ఒక పక్క రాష్ట్ర శాసనసభ్యుడికి కోట్లు ఆశ జూపి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడినా విచారణను ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకోవడం సరైనది కాదు అని చెప్పినా మీడియాది ఉన్మాదమే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నోట ఇటీవల కాలంలో ఉన్మాదం అనే పదం పదే పదే వినిపిస్తున్నది. అది చాలా తీవ్రమ రుున పదం. ఆయనకు నచ్చనిదంతా ఉన్మాదమేనన్నది ప్రస్తుతం చంద్ర బాబునాయుడి సూత్రీకరణ. ఆయనా, ఆయన ప్రభుత్వంలోని వారూ, పార్టీ వారూ, ఆయనను సమర్థించేవారూ తప్ప ఆయన దృష్టిలో మిగిలినవారం దరూ ఉన్మాదులే. ప్రశ్నించే పాత్రికేయులు ఉన్మాదులు. ఆయన ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎత్తి చూపే మీడియా యాజమాన్యాలూ, అందులో పనిచేసే పాత్రికేయులూ అంతా ఉన్మాదులే. యజమానులు ధనార్జన పరులరుున ఉన్మాదులరుుతే, జర్నలిస్టులు జీతాలు తీసుకుని పనిచేసే ఉన్మాదులు. పాలనలో అవకతవకలనూ, అవినీతినీ ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల వారంతా కూడా ఉన్మాదులే. ఎదిరించి నిలబడే మేధావులు, పౌర సమాజం యావ న్మందీ ఉన్మాదులే. చక్రవర్తి చంద్రబాబు సింగపూర్‌లో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా 50 ఏళ్ల పాటు తమ ప్రభుత్వం ఉండాలన్న తన మనోగతాన్ని కొద్దిరోజుల క్రితమే చంద్రబాబు బహిర్గతం చేశారు. ‘ముఖ్యమంత్రి పదవి శాశ్వతం నాన్నా!’ అని ఆయన కుమారుడు లోకేశ్‌బాబు తన 13వ ఏటనే చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం అధినేత ఏకసూత్ర కార్యక్రమం ఏమిటంటే సింగపూర్‌లో వలెనే 50 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం, తాను ముఖ్యమంత్రిగా కొనసాగటం. ఈ లెక్కన సుమారుగా 110 ఏళ్లు వచ్చేవరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న మాట. మొన్న శాసనసభ వర్షా కాల సమావేశాల చివరిరోజున మండలిలో మాట్లాడినప్పుడు తాను ఎంత ఆరోగ్యవంతుడో, ఆరోగ్యం కోసం ఎంత నిష్టగా ఉంటారో చెప్పారు. తన ఆహార వ్యవహారాల గురించి వివరంగానే తెలిపారు. కాబట్టి చంద్రబాబు గారు 110 ఏళ్ల వరకూ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువే. కానీ ప్రజాస్వామ్య భారతదేశంలో మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం, ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల పేరిట ప్రజల దగ్గరికి వెళ్లాలి. వాళ్లు నచ్చితే ఓట్లేసి మళ్లీ గెలిపిస్తారు. లేదంటే ఇంటికి పంపేస్తారు. రాజనీతి కోవిదుడయిన చంద్రబాబు ఇవన్నీ తెలియకుండానే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారా? లేక తన మీద వచ్చే ఆరోపణల మీద విచారణలు జరగకుండా చీటికీ మాటికీ స్టేలు తెచ్చుకున్నట్టే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఓ 50 ఏళ్లు స్టే తెచ్చుకోగలమని అనుకుంటున్నారా? అది సాధ్యం కాదని ఆయనకు బాగా తెలుసు. గతంలో ఒకసారి ఆయనకు ఈ విషయంలో అను భవమయింది కూడా. చంద్రబాబు 2020 కలను ప్రజలు 2004లో చెరిపేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రాష్ట్ర విభజన, మోదీ, పవన్‌కల్యాణ్‌ల పుణ్యమా అని 2014లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అనుకోకుండా చేజిక్కిన అధికారం చేజారిపోకుండా 50 ఏళ్ల పాటు ఉండాలంటే తమకు వ్యతిరేకంగా పోటీ చేసేవాడు ఉండకూడదు. విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో జాడ లేకుండాపోయింది. కమ్యూనిస్టుల బలం రోజు రోజుకూ తగ్గిపోతున్నది. సొంత బలం లేని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తమను కాదని వెళ్లే పరిస్థితి ఇప్పట్లో లేదు. రాదు. అప్పుడప్పుడు అమిత్‌షా చేసే ప్రకటనలు తమను ఏమీ చెయ్యలేవన్న ధీమా కూడా. ఇక మిగిలినవి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీడియా. ఈ రెండింటినీ లేకుండా చేస్తే 50 ఏళ్లు అధికారంలో ఉండొచ్చునన్నది చంద్రబాబు ఆలోచన. మొన్న ఒక సమావేశంలో ఆయన ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమా, తమ్ముళ్లూ చెప్పండి!’ అన్నారు. అక్కడ ఉన్నవాళ్లందరూ తెలుగు తమ్ముళ్లే కాబట్టి అవసరం లేదన్నారు. ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో కేవలం నాలుగు లక్షల ఓట్ల వ్యత్యాసంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఉండన వసరం లేదంటున్నారు. కాంగ్రెస్ కూడా అక్కరలేదట. సభలోని తెలుగు తమ్ముళ్లతో ఆ మాట కూడా అనిపించారాయన. ఒక రాజకీయ పార్టీ ఉండాలా, వద్దా అని నిర్ణరుుంచాల్సింది ప్రజలు కదా! పార్టీ మీటింగ్‌లో చేతులు ఎత్తించినంత మాత్రాన పార్టీలు ఉండకుండాపోతాయా? రాజకీయ పార్టీలు ఉండొద్దు. వ్యతిరేక వార్తలు రాసే మీడియా ఉండొద్దు. ప్రజాస్వా మ్యంలో విమర్శే వినిపించకూడదనే పాలకుడు మాట్లాడే మాటలను ఏమ నాలి? ప్రశ్నించేవాడే ఉండకూడదనే ఏలికను గురించి ఏమనుకోవాలి? యావన్మందీ ఉన్మాదులే ఏటా మూడు, నాలుగు పంటలు పండే అద్భుతమరుున వ్యవసాయ భూము లను రాజధాని నిర్మాణం కోసం సమీకరించడం సరికాదని రాసే పత్రికలది ఉన్మాదం. స్విస్ చాలెంజ్ పేరుతో విదేశీ సంస్థలకు భూములు అప్పజెప్పడం అన్యాయం అని రాస్తే ఉన్మాదం. విదేశీ ప్రయాణాలకూ, పుష్కరాలకూ మరింకేవో అనవసరం అరుున వాటికీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయవద్దంటే, ప్రత్యేక హోదా అనేది హక్కు, ప్యాకేజీ అనేది దయా ధర్మం మీద వచ్చేది అని చెబితే, పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌గా అంగీకరించి, దాని నిర్మాణ బాధ్యత రాష్ట్రానికి వదిలేసి, నిధులు తమ దోసిట్లో పోయాలని కోరుకోవడం తప్పు అంటే ఉన్మాదం. రాజధాని భూసమీకరణ పేరిట తమ సన్నిహితులు దందాలు చేస్తున్నారని మీడియా చెపితే, రాష్ట్రం జ్వరంతో వణుకుతున్నది పట్టించుకోండి అంటే, ఎలుకలు కొరికి, చీమలు కరిచి పసిపిల్లలు చనిపోతున్నారు ప్రభుత్వ వైద్యశాలలను బాగుచేయండి అంటే కూడా మీడియాది ఉన్మాదమే. శాసనసభ్యులను సంతలో పశువుల్లా కొన కూడదు అని చెప్పినా, ఓటు కోసం ఒక పక్క రాష్ట్ర శాసనసభ్యుడికి కోట్లు ఆశ జూపి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడినా విచారణను ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకోవడం సరరుునది కాదు అని చెప్పినా మీడియాది ఉన్మాదమే. ఒకటా రెండా, మీడియా ప్రభుత్వ వ్యతిరేక వార్త ఏది రాసినా అది ఉన్మాదం కిందకే వస్తుంది. మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేక మీడియాను నిషేధిస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభిప్రాయం కావచ్చు. అక్కడక్కడా ఆయన అటువంటి ప్రకటనలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలే రాసే మీడియా కనుక లేకపోతే ప్రతిపక్షం పనిపట్టడం చాలా సులభం అన్నది అధినేత ఆలోచనలాగా ఉంది. ఎన్నికల హామీలు నెరవేర్చండి అని అడిగే ప్రతిపక్షం, మీడియా కూడా ఉండ కూడదన్నది ముఖ్యమంత్రి కోరిక. 2014 ఎన్నికల సమయంలో ఆయన ‘నౌ ఆర్ నెవర్’ (ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పుడూ కాదు ) అన్నట్టు ఎడాపెడా అలవికాని హామీలన్నీ గుప్పించారు. వాటిని అమలు చేయలేక సతమత మవుతూ మీడియానూ, ప్రతిపక్షాన్నీ ఉన్మాదులు అంటున్నారు. అట్లా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపులను బీసీల్లో చేర్చడం. హామీ నెరవేర్చు స్వామీ అని ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు ఉద్యమిస్తే, ఆ సందర్భంలో తునిలో ఒక రైల్‌ను దుండగులు తగులబెడితే ఆ నేరాన్ని ప్రధాన ప్రతిపక్షం మీదకు నెట్టే ప్రయత్నం ప్రభుత్వం, సాక్షాత్తు ముఖ్యమంత్రే చేస్తున్నారు. జనవరి 30న ఓ పక్క ముద్రగడ సభ జరుగుతుండగానే, తుని స్టేషన్లో రైలు బోగీలు తగలబడుతుండగానే విజయవాడలో ముఖ్యమంత్రి మీడియాను పిలిచి, ఇది రాయలసీమ నుండి వచ్చిన దుండగుల పనే అని తేల్చేస్తారు. ప్రతిపక్ష నాయకుడే ఈ పని చేయించాడని ఆరోపిస్తారు. సంఘటన జరు గుతూ ఉండగానే, ప్రాథమిక దర్యాప్తు అరుునా జరగకుండానే నేరం ఎట్లా నిర్ధారిస్తారు అని అడిగిన మీడియా ఉన్మాది. ఈ సంఘటన మీద వేసిన సీఐడీ విచారణలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను ఇరికించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఆ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డిని కేసులో విచారణకు పిలిపించడం. ఈ వార్తా వ్యాఖ్య రాస్తున్న సమయానికి ఇంకా కరుణాకర్‌రెడ్డి గుంటూరులో సీఐడీ కార్యాలయంలో విచారణలో ఉన్నారు. ఆయన మీద అభియోగం మోపి అరెస్ట్ చేస్తారా, వదిలేస్తారా చూడాలి. అరుుతే నిన్న మొన్న ఈ కేసులో సీఐడీ విచారణకు హాజరయిన సుధాకర్ నాయుడు, మెహెర్ అనే వ్యక్తులు అధికారులకు ఏం చెప్పారో ఒక పత్రికలో వచ్చేసింది, అదెలా సాధ్య మని అంబటి రాంబాబు వంటి సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తుని వ్యవహారంలో డబ్బులు హైదరాబాద్ నుండే వెళ్లాయనీ, డ్రోన్లు కూడా హైదరాబాద్‌లోనే కొన్నారనీ సుధాకర్‌నాయుడు చెపితే, కరుణాకర్‌రెడ్డి డబ్బు సమకూర్చినట్టు మెహెర్ చెప్పినట్టుగా ఆ పత్రిక ఒక వార్త ప్రచురించింది. సీఐడీ విచారణలో వాళ్లేం చెప్పారో అన్న విషయం ఈ పత్రిక ఎలా రాసింది అన్నది వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రశ్న. కరుణాకర్‌రెడ్డిని ఇవ్వాళ అరెస్ట్ చెయ్యొచ్చు అని కూడా ఆ పత్రిక రాసింది. చేసినా చేయవచ్చు. బోగీలు ఇంకా తగలబడుతూ ఉండగానే ప్రతిపక్షానికీ, దాని నాయకుడికీ నేరం అంటగట్టిన ముఖ్యమంత్రి ఏలుబడిలో ఇది అసాధ్యం ఏమీకాదు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ పత్రికలో విచారణ వార్త ఎట్లా వచ్చింది అని అడగ డంలో అర్ధంలేదు. జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపే క్రమంలో జరిగిన సీబీఐ విచారణ వార్తలే రోజూ కళ్లకు కట్టినట్టు లేదా విచారణాధికారి ప్రెస్ కాన్ఫరెన్ పెట్టి చెప్పినట్టు రాసిన ఘనత గల పత్రిక అది. సీఐడీ అనగా ఎంత? ఇది కూడా ముఖ్యమంత్రి తనను వ్యతిరేకించే మీడియాతో బాటు ప్రతిపక్షాన్ని కూడా లేకుండా చేసే ఆలోచనలో భాగమే అని వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తించాలి. ‘పత్రిక ఒక్కటున్న పదివేల సైన్యంబు పత్రిక ఒక్క టున్న మిత్రకోటి’ అని నార్ల వారు అన్నది ప్రజల తరఫున నిలబడటానికే గాని, ప్రభువుల కొమ్ము కాయడానికి కాదు అని ఆ పత్రిక యాజమాన్యానికి ఎవరు చెప్పాలి? దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
అవినీతి అధినేతల మాటేమిటి?
డేట్లైన్ హైదరాబాద్ ఉక్రోషానికి పోరుు తెలంగాణ ప్రభుత్వం మీద విరుచుకుపడి నాకూ ఏసీబీ ఉంది, నాకూ పోలీసు శాఖ ఉంది, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్స్టేషన్లు పెడతా అని స్థారుు మరచిన ప్రకటనలు చేశారు తప్ప, తనకు ఈ కేసుతో సంబంధం లేదని రుజువు చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. మండలికి సభ్యులు ఎన్నిక కావడం అన్నది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. దానికి విఘాతం కలిగించే విధంగా ఎంఎల్ఏలను కొనుక్కునే పథక రచన చేసి, ఆడియో టేప్‌లలో దొరికిన చంద్రబాబును కేసులో నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? ‘ఈరోజుల్లో 30 ఏళ్లకే సుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ వంటి జబ్బులొస్తున్నారుు. అలాంటప్పుడు లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించి ఏం చేసు కుంటారు...?’ శిక్షణ పొందుతున్న పబ్లిక్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి పదిరోజుల నాడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్న మాటలివి. సెంట్రల్ సర్వీస్ అధికారులకు 91వ ఫౌండేషన్ కోర్స్ ప్రారంభిస్తూ గవర్నర్ ఈ మాటలు అన్నారు. ఆ సమయంలోనే, హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఒక అవినీతి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాత్ర మీద దర్యాప్తు జరిపి నెలరోజుల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. అందరూ ఊహించినట్టుగానే చంద్రబాబునాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఎనిమిది వారాల స్టే తెచ్చుకున్నారు. ఆ గొంతు ఆయనదే అయినా.... ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే, పదిహేను మాసాల క్రితం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఒక కేసులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని, టీఆర్ఎస్ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్కు 50 లక్షల రూపాయలు బయానా ఇస్తూ, మరో మూడున్నర కోట్లు త్వరలో ఇస్తామని చెపుతూ ఆడియో వీడియో టేప్‌లలో దొరికిపోరుు జైలుకు పోయాడు. మరో శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కూడా ఈ కేసులో తరువాత అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్లి బెరుుల్ మీద తిరిగొచ్చాడు. మరో నిందితుడు మత్తయ్యను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆశ్రయం ఇచ్చి జైలుకు పోకుండా కాపాడారు. ఈ సంఘటనలో రేవంత్‌రెడ్డి, సంద్ర వెంకటవీరయ్య, మత్తయ్య వగైరా వగైరాలంతా పావులు మాత్రమే. ఎంఎల్ఏలను కోట్ల రూపాయల డబ్బు ఇచ్చి కొని ఎంఎల్సీ ఎన్నికలు గెలవాలని పథకం రచించినదీ, కార్యాచరణకు ఆదేశించినదీ సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది జగమెరిగిన సత్యం. సెబాస్టియన్ అనే మరో తెలుగుదేశం నాయకుడు కలిపి ఇచ్చిన ఫోన్లో చంద్రబాబునాయుడు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడుతూ మనవాళ్లు నాకు అంతా చెప్పారు, నేను మీకు అండగా ఉన్నాను, భయంలేదు ముందుకు వెళ్లండి అని తనదైన శైలిలో, ఇంగ్లిష్‌లో చెప్పిన విషయం రికార్డు అరుుంది. ఆ గొంతు ఆయనదేనని అందరికీ తెలుసు. ఆయన కూడా ఎంతసేపూ నా ఫోన్ ట్యాప్ చేస్తారా అని హూంకరించారే తప్ప అది నా గొంతు కాదు అని ఒక్కసారి కూడా అనలేదు. ఉక్రోషానికి పోరుు తెలంగాణ ప్రభుత్వం మీదా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదా విరుచుకుపడి నాకూ ఏసీబీ ఉంది, నాకూ పోలీసు శాఖ ఉంది, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్స్టేషన్లు పెడతా అని స్థారుు మరచిన ప్రకటనలు చేశారు తప్ప తనకు ఈ కేసుతో సంబంధం లేదని రుజువు చేసుకునే ప్రయత్నం ఒక్కటీ చెయ్యలేదు. శాసనసభ నుండి మండలికి సభ్యులు ఎన్నిక కావడం అన్నది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. ఆ ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే విధంగా కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా వెదజల్లి ఎంఎల్ఏలను కొనుక్కునే పథక రచన చేసి, ఆడియో టేప్‌లలో దొరికిపోరుున చంద్రబాబునాయుడును కేసులో నిందితుడిగా ఎందుకు చేర్చ లేదన్నది ప్రశ్న. ఏమైపోయాయా గర్జనలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంకో రాష్ట్రంలో జరిగిన వ్యవహారంలో నింది తుడిగా చేర్చడానికి ఏమరుునా విధివిధానాలు ఉంటే వాటిని అనుసరించే తెలంగాణ ఏసీబీ చంద్రబాబునాయుడును నిందితుల జాబితాలో చేర్చి ఉండాలి. ఈ సంఘటన జరిగిన తొలి రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు జైలుకు వెళ్లకుండా బ్రహ్మదేవుడు కూడా రక్షించ లేడు అన్నారు. ఆ తరువాత అంతా నిశ్శబ్దం. ఓటుకు కోట్లు కేసు ప్రస్తావన వస్తే చాలు తెలంగాణలో అధికారపక్షం టీఆర్ఎస్ నాయకులు పైస్థాయి నుంచి కింది దాకా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని పక్కకు తప్పుకుంటున్నారు. ఏసీబీ దర్యాప్తులో కూడా మొదలుపెట్టినప్పుడు ఉన్న వేగం తగ్గి మందకొడిగా సాగింది. అంతేకాదు వీరి నుండి వారికి, వారి నుండి వీరికి ఆహ్వానాలు, వీరు అమరావతికి వెళ్లి స్నేహహస్తం చాచి వస్తే, వారు యాగాలకు హాజరై సుహృద్భావాన్ని ఆధ్యాత్మికంగా ప్రకటించిపోతారు. ఇదంతా చూస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల అధినేతల మధ్య సత్సంబంధాలు చూసి మురిసి ముక్కలరుు పోతుంటారు. అంతేకాదు, ఇరువురు ముఖ్యమంత్రులు గవర్నర్‌గారి దగ్గర కూర్చుని సమస్యను పరిష్కరించుకున్నారు కదా ఇంకా దాని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని కొందరు బీజేపీ నాయకులు అంటుంటే, నిన్నటికి నిన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా తన మిత్రుడు చంద్ర బాబునాయుడుకు క్లీన్చిట్ కూడా ఇచ్చేశారు. ‘‘చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదు, ఆయనకు సంబంధించిన విచారణ ప్రతిపాదనలు ఏవీ కేంద్రం వద్ద లేవు, ఇవన్నీ చౌకబారు రాజకీయాలు’’ అని ఒక దినపత్రిక, టీవీ చానల్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుగారి మరో ఆత్మబంధువు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ గత వారం తిరుపతిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సీబీఐ అంటే భయపడుతున్నారా, ఏమన్నా లొసుగులు ఉంటే భయపడాలి, మీకేమన్నా లొసుగులున్నాయా అని బాబును ఉద్దేశించి అన్నారు. దానికి వెంకయ్య నాయుడు గారు జవాబు ఇచ్చేశారు. పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారు, వెంకయ్య నాయుడు జవాబు ఇస్తారు. చంద్రబాబు సంతోషిస్తారు. సమాజం ప్రేక్షక పాత్ర వహించాలని ఆ ముగ్గురూ అనుకుంటారు. ఓటుకు కోట్లు ఆషామాషీ వ్యవహారమా? నిజమే, చంద్రబాబును విచారించడానికి కేంద్రం దగ్గర దరఖాస్తులేవీ పెండింగ్‌లో లేవు. అంతమాత్రాన ఓటుకు కోట్లు వ్యవహారం ఆషామాషీ విషయంగా భావించాలా? ఈ వ్యవహారాన్ని ఎవరో రోడ్డున పోయే జులా యిలు ఒక గొప్ప స్టేట్స్‌మన్ మీద చేసిన ఆకతారుు ఫిర్యాదుగా కేంద్రంలో పెద్దలు చూస్తున్నారా? వెంకయ్యనాయుడుగారి ప్రకటన వింటే అట్లాగే అనిపిస్తుంది. ముందే చెప్పినట్టుగా చంద్రబాబునాయుడు ఈ కేసుతో తనకు సంబంధం లేదని నిరూపించుకునే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. ఇదే కాదు ఆయన ఏ కేసులోనూ ఆ ప్రయత్నం చెయ్యరు. ఆ కేసులు కొట్టేయా ల్సిందిగా కోర్టులను కోరతారు. స్టేలు తెచ్చుకుంటారు. ఏళ్ల తరబడి స్టేల మీద గడిపేస్తుంటారు. ప్రజాక్షేత్రంలో ఉన్న ఏ నాయకుడూ చెయ్యకూడని పని అది. ప్రజా బలం కలిగిన నాయకులు ఎవరరుునా ధైర్యంగా నిలబడి విచారణను ఆహ్వానించి తన నిర్దోషిత్వం నిరూపించుకుంటారు. చంద్రబాబు ఆ పని ఎందుకు చెయ్యరు? రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌గారు కేంద్ర సర్వీస్‌ల అధికారులకు నీతిమంతంగా ఉండండని సుద్దులు చెప్పి నట్టుగానే చంద్ర బాబును కూడా మీ నిర్దోషిత్వం నిరూపించుకోండి అని ఎందుకు హితవు చెప్పరో అర్థంకాదు. అవినీతి రహిత పాలన అందించడం మా లక్ష్యం ‘‘అచ్చే దిన్ వచ్చేశారుు’’ అని చెపుతున్న కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన గల ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఓటుకు కోట్లు వ్యవహారం అవినీతి కార్యక్రమంగా కనిపించడం లేదా? నీతివంతమైన పాలన ఇస్తామన్న కేంద్రం తన ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఈగ వాలకుండా చూసుకుంటుంది సరే, మరి ప్రశ్నిస్తాను, ప్రశ్నిస్తాను అని పదే పదే మాట్లాడి ఆవేశపడే పవన్ కల్యాణ్ తిరుపతిలో బహిరంగ సభ పెట్టి ఒక్క ప్రత్యేక హోదా గురించి మాత్రమే ఎందుకు ప్రశ్నించారు? ఆవేశ పడిపోయారు? ఆయన రాజకీయాల్లో ఉన్నానని అంటున్నారు, జనసేన పార్టీని పూర్తి స్థారుు రాజకీయ పార్టీగా నడిపిస్తానని చెపుతున్నారు. అటు వంటి నాయకుడికి ఓటుకు కోట్లు వ్యవహారంతో సహా అన్ని విషయాల మీదా స్పష్టమరుున అవగాహన ఉండాలి కదా! తప్పులన్నిటినీ ఎత్తి చూపాలి కదా, వ్యతిరేకించాలి కదా! ఒక్క ప్రత్యేక హోదా కోసమే ఆయన రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వచ్చి ఆ పని అరుుపోతే మళ్లీ వెనక్కి వెళ్ళిపోతారా? ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఇటువంటి చేష్టలు చూసినప్పుడు! చంద్రబాబు నాయుడును, టీడీపీ పార్టీని రక్షించడానికే పవన్ కల్యాణ్ రాజకీయ ధ్యేయ మైతే త్వరలోనే ఆయన పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
'నయీం కేసులో పెద్దల పేర్లు బహిర్గతం చేయాలి'
-టీయూడబ్ల్యూజే సెక్రటరీ జనరల్ అమర్ వరంగల్ : గ్యాంగ్‌స్టర్ నయూం కేసులో కావాలని జర్నలిస్టుల పేర్లు బయటపెట్టిన సిట్ అధికారి నాగిరెడ్డి.. నయీంతో ములాఖత్ అయి కోట్లు గడించిన రాజకీయ నేతలు, పోలీసు అధికారుల పేర్లు బహిర్గతం చేయాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ ప్రోగ్రామ్ కవరేజీకి వెళ్లిన విలేకరులకు రూ.300 విలువైన వాచ్ ఇస్తే నల్లగొండ జిల్లాలోని 67 మంది విలేకరుల పేర్లు బహిర్గతం చేసి ఎఫ్ఐఆర్లో పెడతారా ? అని అమర్ ప్రశ్నించారు. అధికారులు కావాలనే జర్నలిస్టులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని, నల్లగొండ ఘటనే దీనికి నిదర్శనమన్నారు. పోరాటాల ద్వారానే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఇప్పుడున్న యూనియన్లు సర్కారీ సంఘాలని, జర్నలిస్టుల సమస్యల పట్ల ఎదుటి సంఘానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మావోయిస్టు నేత జగన్ జర్నలిస్టుల సమస్యలపై లేఖ ద్వారా స్పందిస్తే కావాలనే ఐజేయూ నేతలు ప్రకటన ఇప్పించారానడం నీచ సంస్కృతికి నిదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ... జర్నలిస్టు జీవితం సమాజానికి అంకితమన్నారు. రాజకీయ నేతలు అధికారంలోకి రాక ముందు జర్నలిస్టులతో మిత్రులుగా ఉంటారని, అధికారంలోకి వచ్చాక శత్రువులుగా మారుతారని అన్నారు. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా కన్వీనర్ టి.శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నేతలు కరుణాకర్, డి.క్రిష్ణారెడ్డి, డి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పతకాల వెనుక పథకాలు
డేట్లైన్ హైదరాబాద్ రొహతక్‌కు చెందిన సాక్షి మలిక్కి కానీ, హైదరాబాద్‌కు చెందిన సింధుకు కానీ - ఇలాంటి విజయాలు ఎవరు సాధించి వచ్చినా ప్రభుత్వాలూ ఇతర సంస్థలూ పోటాపోటీగా కానుకలు ఇవ్వడం కొత్తేమీ కాదు కూడా. గతంలో సానియా మీర్జా, సైనా నెహ్వాల్ ఇంకా అనేకమంది దేశవ్యాప్తంగా ఇటువంటి సత్కారాలు అందుకున్నారు. ప్రశ్న ఒక్కటే. మొత్తంగా మన దేశం అంతర్జాతీయ క్రీడారంగంలో రాణించడానికి ఇది చాలా? చాలదని చెప్పడానికి అనేక అంశాలను ప్రస్తావించవచ్చు. సింధుకు జననీరాజనం(ఇన్ సెట్: కొలిపాక ఉమ) రెండురోజులుగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో సాగిన అత్యంత అనాగరిక రాజకీయ క్రీడను మనం వీక్షించాం. ఈ ఆట ఆడింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, వాటి అధినేతలే. ప్రపంచ క్రీడాభిమానులు ఎవ్వరూ హర్షించని రాజకీయ క్రీడ అది. రియో ఒలింపిక్స్ క్రీడోత్సవంలో మొట్టమొ దటిసారి యువ క్రీడాకారిణి పి.వి. సింధు ఆడిన ఆట చూసి గత శుక్రవారం ప్రపంచం అబ్బురపడింది, జేజేలు పలికింది. చివరి మ్యాచ్ ఓడినా అత్యంత క్రీడాస్పూర్తిని ప్రదర్శించి తన మీద గెలిచిన స్పెరుున్ క్రీడాకారిణిని తానే పల కరించి, అభినందించింది. ఆమె పుట్టి పెరిగిన సికింద్రాబాద్, హైదరాబాద్ లలో గానీ, ఆమె బంధుకోటి ఉన్న విజయవాడలో కానీ ఆ క్రీడాస్ఫూర్తి ఎందుకు కనిపించలేదు? ఫైనల్స్‌లో ఓడిపోతూ కూడా అద్భుతంగా ఆడిన సింధును ఆనందంగా చూసిన వాళ్లే; హైదరాబాద్, విజయవాడ వీధుల్లో ఆమె పాల్గొన్న సర్కారీ ఊరేగింపులు చూసీ, పోటీలు పడి ప్రకటించిన నజరానాలతో ఏలినవారు ఆమెను తమ సొంతం చేసుకునే ప్రయత్నాలు చూసీ అసహ్యించుకుంటూ టీవీలు కట్టేసిన మాట నిజం. ఇంతకూ సింధు ఎవరు? ఆంధ్రప్రదేశ్ అమ్మాయా, తెలంగాణ బిడ్డా, భారతీయురాలా? క్రీడా కారులకు దేశం, ప్రాంతం, కులం, మతం ఉంటాయా? ఉంటే అవి క్రీడలెట్లా అవుతారుు? ఆమె అంతర్జాతీయ మహిళ. తన పుట్టుక రీత్యా, చదువు సంధ్యల రీత్యా, వృత్తి వ్యాపకాల రీత్యా ఏ విజయవాడకో, హైదరాబాద్‌కో చెంది ఉండొచ్చు. కానీ క్రీడారంగానికీ, అందునా ఆమె ఆడి నిలిచిన బాడ్మిం టన్ క్రీడకూ సింధు అంతర్జాతీయ మహిళే. అటు ఆంధ్రప్రదేశ్‌కు కానీ, ఇటు తెలంగాణ కు కానీ, ఆమాటకొస్తే యావద్భారతానికి గానీ - ఇది నిజంగా సంతోషించవలసిన సమయమే. అదే సమయంలో మనమేమిటో సమీక్షించు కోవలసిన సమయం కూడా. ఒక్కసారి రియో ఒలింపిక్స్ దృశ్యాన్ని రివైండ్ చేసి చూడండి. ఇంత జనాభా ఉన్న దేశానికి ఒక రజతం మరో కాంస్యమేనా అనిపించకమానదు. 119 మంది క్రీడాకారులు వెళ్లి తెచ్చిన పతకాలు రెండు. రాజకీయ క్రీడ క్రీడాకారులు స్వశక్తితో పోరాడి పతకాలు సాధించుకొస్తే, అప్పుడు మాత్రం వారిని గుర్తించి పోటీలు పడి నగదు బహుమానాలు ప్రకటించి, క్రీడలను మేమే ప్రోత్సహిస్తున్నామని చెప్పుకోవడం మినహా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నారుు? మనకు సరైన క్రీడా విధానం లేదు కాబట్టే అంతర్జాతీయ క్రీడా వీధుల్లో నగుబాటు తప్పడం లేదు. 2020 ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం సాధిం చాలని మనందరం కోరుకోవాల్సిందే, అందుకోసం దేశం మొత్తం ఆమెను ప్రోత్సహించవలసిందే. ఆ విజయం సాధించడం కోసం సింధు కృషి చేసే క్రమంలో ఆమెకు ఎటువంటి అడ్డంకులూ, ఇబ్బందులూ ఉండకూడదు. దానికి అవసరమైన వాతావరణం, పరిస్థితులు ఉండాలి. వాటిని కల్పించా ల్సిన విధి ప్రభుత్వాలది. ప్రభుత్వాలు ఆ పని చేస్తే వందమంది సింధులు తయారవుతారు రాష్ట్రంలో, దేశంలో. రొహతక్‌కు చెందిన సాక్షి మలిక్కి కానీ, హైదరాబాద్‌కు చెందిన సింధుకు కానీ- ఇలాంటి విజయాలు ఎవరు సాధించి వచ్చినా ప్రభుత్వాలూ ఇతర సంస్థలూ పోటాపోటీగా కానుకలు ఇవ్వడం కొత్తేమీ కాదు కూడా. గతంలో సానియా మీర్జా, సైనా నెహ్వాల్ ఇంకా అనేకమంది దేశ వ్యాప్తంగా ఇటువంటి సత్కారాలు అందుకున్నారు. ప్రశ్న ఒక్కటే. మొత్తంగా మన దేశం అంతర్జాతీయ క్రీడారంగంలో రాణించడానికి ఇది చాలా? చాలదని చెప్ప డానికి అనేక అంశాలను ప్రస్తావించవచ్చు. మరుగున పడిన మాణిక్యాలను పట్టించుకోకుండా, తమ గొప్ప కోసం రాజకీయ నాయకులు విజేతలకు నజరానాలు ప్రకటించి, వారే విమర్శల పాలవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక చర్చకు అవకాశం కలిగినందుకు సంతోషించవలసిందే. ‘సాక్షి’ (23-8-16) సంపాదకీయ పేజీలో లేఖల కాలమ్‌లో నీలం వెంకన్న పడ్డ ఆవేదన చూడండి! ఆయన మాటల్లోనే ‘పేదరికంలో పుట్టి కాయ కష్టం చేస్తూ, కనీస సదుపాయాలు లేని స్కూళ్లల్లోనే అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్న గ్రామీణ సింధువులెందరో కన్నీటి బిందువులుగా మారిపోతు న్నారు’ అంటున్న ఆయన వరంగల్ జిల్లా కేసముద్రంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న కొలిపాక ఉమ దైన్యాన్ని గురించి లోకానికి చాటారు. క్రీడారంగంలో ప్రతిభను మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పారు. ఖోఖోలో ఉమ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎనిమిదిసార్లు జిల్లాకు బంగారు పతకాలు సాధించిపెట్టింది. రెండుసార్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయి కూడా ఆర్థిక సాయం లేక వెళ్లలేక పోయింది. తండ్రి అకాల మరణంతో క్రీడలకు దూరమై ఇస్త్రీ పెట్టెను పట్టి బ్రతుకుతో పోరాడుతున్నది. కొలిపాక ఉమ లాంటి వాళ్లు వేల సంఖ్యలో ఉంటారు, వీళ్ళందరికీ గోపీచంద్ అకాడమి లాంటి చోట శిక్షణ పొందే అవకాశం జీవితంలో లభిస్తుందా? లభించినప్పుడే కదా, మన పతకాల సంఖ్య గౌరవప్రదంగా కనిపిస్తుంది. నాణేనికి మరోవైపు క్రీడల పట్ల, వాటి అభివృద్ధి పట్లా నిజాయితీ, చిత్తశుద్ధీ లేని పరిస్థితి దేశమంతా ఉంది. కొలిపాక ఉమలు దేశమంతటా ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సీతా సాహు ఒలింపిక్స్‌లో రెండుసార్లు భారతదేశానికి కాంస్య పతకాలు తెచ్చిపెట్టింది. 2011లో ఏథెన్స్ లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌లో తన పదిహేనవ ఏటనే సీతా సాహు 200 ,1600 మీటర్ల పరుగు పందెంలో గెలిచి రెండు కాంస్యాలు సాధించి పెట్టింది. బ్రతకడం కోసం చిన్న కొట్టు పెట్టుకుని కాలం గడుపుతున్నది. ఇప్పుడు ఆమెను పట్టించుకున్న ప్రభుత్వాలే లేవు. కొలిపాక ఉమలు, సీతా సాహూలు అనేకమంది. వీరి పరిస్థితి ఇట్లా ఉంటే, ప్రభుత్వాలు మాత్రం ఈ వాస్తవాల జోలికి పోకుండా తాజా విజేత లకు పోటీ పడి నజరానాల వర్షం కురిపించాయి. ఒక పక్క నేతలు కొత్త విజేత లను సత్కరిస్తూ ఉండగానే పంజాబ్‌కు చెందిన జాతీయ స్థారుు హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి పూజ తన 20వ ఏటనే ఉరేసుకుని తనువు చాలించింది. కాలేజీలో చదువుకీ, హాస్టల్ ఫీజులు చెల్లించే స్తోమత లేక ఆత్మహత్య చేసుకున్న పూజ తన వంటి పేద ఆడపిల్లలకు ఉచిత విద్య ఏర్పాటు చెయ్యాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాసి పోయిది. పూజ తండ్రి కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఏమయింది మన బేటీ బచావో, బేటీ పడావో? క్రీడల పట్ల ఆసక్తి ఉండి, ప్రతిభ ఉండి అవకాశాలు లేక, ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాణించలేక పోతున్న క్రీడాకారులు మన దేశంలో లక్షల్లో ఉంటారు. ఆ ప్రతిభను గుర్తించి వారికి సరైన వనరులు, వసతులు కల్పించే క్రీడా విధానం మనకెక్కడిది? అది లేదు కాబట్టే రియో ఒలింపిక్స్‌లో ఒకరికి రజతం, ఒకరికి కాంస్యం. వాటితోనే రాజకీయ పబ్బం గడుపుకోవాలని మన నేతలు రాజకీయ క్రీడను ఆరంభించారు. క్రీడలకు ఏదీ ప్రోత్సాహం? ముగిసిన రియో ఒలింపిక్స్‌లో అమెరికాకు 30 పైగా స్వర్ణ పతకాలోచ్చాయి, మొత్తం మీద ఎక్కువ పతకాలు గెలుచుకుని ప్రథమ స్థానంలో నిలిచింది ఆ దేశమే. ఎందుకు? అది సంపన్న దేశం కాబట్టా? కాదు. అక్కడి ప్రభుత్వా లకు, ప్రజలకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంత కంటే ముఖ్యం కాబట్టి. మురళీ చల్లా చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డాడు. ఇద్దరు పిల్లలు ఆయనకు. స్కూల్‌కు పోతున్నారు. అమెరికా వదిలేసి భారతదేశం వచ్చి స్థిరపడాలనుకున్నారు మురళీ, ఆయన సతీమణి కల్పన. దాదాపుగా నిర్ణయం అయిపోయింది. నెల్లూరు వాస్తవ్యులయినా చిన్నప్పటి నుండి హైద రాబాద్‌లో పెరిగారు కాబట్టి, రాజధాని కూడా కాబట్టి హైదరాబాద్‌కే రావాలనుకున్న మురళీ కుటుంబం ఆ నిర్ణయాన్ని మార్చుకుని అమెరికాలోనే ఉండి పోవాల్సివచ్చింది. కారణం ఏమిటంటే ఆయన ఇద్దరు పిల్లలూ అమె రికాలో టెన్నిస్ నేర్చుకుంటున్నారు. దాన్ని హైదరాబాద్‌లో కొనసాగించడా నికి సరైన వసతులు, శిక్షణ సంస్థలు లేకపోవడం ఒక కారణం కాగా, అసలు స్కూళ్లలో క్రీడల ఊసే లేకపోవడం రెండో కారణం. అమెరికాలో ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఏదో ఒక ఆట నేర్చుకోవడం, అందులో ప్రావీణ్యం సంపా దించడం తప్పనిసరి. అది ప్రభుత్వ విధానం. అందుకే అమెరికాకు మెడల్స్ వస్తాయి, మనకు రావు. ఉన్న మైదానాలనే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎప్పుడెప్పుడు ఇచ్చేద్దామా, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఎప్పుడు కట్టేద్దామా అని మనం ఉబలాట పడిపోతుంటామాయే. మొన్న సింధు రియోలో సెమీ ఫైనల్స్ ఆడుతున్నప్పుడు నాతో పాటు ఆట చూస్తున్న సంజు, రాజు చెపుతు న్నారు, ‘‘ వారంలో ఒక పీటీ క్లాస్ ఉంటే, దాన్ని కూడా రద్దు చేసి పోర్షన్ పూర్తికాలేదని వేరే సబ్జెక్టులు చెపుతుంటే ఇండియాకు మెడల్స్ ఎట్లా వస్తాయి, ఒక్కపూట అన్నా ఆడనిస్తున్నారా మమ్మల్ని?’’అని. మన విద్యా విధానం ఎన్ని వెర్రితలలు వేస్తున్నదో చెప్పారు. ఆ ఇద్దరిలో ఒకడు హైస్కూల్ విద్యార్థి, మరొకడు కాలేజీ విద్యార్థి. ఒక ప్రభుత్వ స్కూల్లో పీటీ సార్ ఒక టెన్నిస్ రాకెట్, బాల్ కొనుక్కొచ్చి 50 రూపాయలు బిల్లు పెడితే ఆ డబ్బు మంజూరు చెయ్యడానికి వందసార్లు తిరగాలి. స్కూళ్లలో ఆటస్థలాల మాటే లేదు. అసలు చదువు తప్ప ఇంకో ముచ్చటే లేదు. మనం స్కూళ్లలో బ్రాయిలర్ కోళ్లను తయారు చేస్తున్నాం తప్ప మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులరుున పౌరులను ఎక్కడ ఎదగనిస్తున్నాం? విద్యా, క్రీడా విధానాల పట్ల మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారి ఒక పటిష్టమయిన విధానం వస్తే తప్ప లాభం లేదు. లేదంటే మళ్లీ ఒకటి రెండు పతకాలకే పరిమితమై, వాటిని చూసి మురిసిపోవలసిందే. ఇంకా-గోపీచంద్ అకాడమికి నేను భూమి ఇచ్చాను, కాబట్టి సింధు రియోలో పతకం సాధించగలిగింది, అది కూడా నా ఘనతే అంటూ నేతలు పలికే డంబాలు మళ్లీ వినకతప్పదు. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
అదేమో వేదం.. ఇది ఉన్మాదం!
డేట్లైన్ హైదరాబాద్ ఎవరికో అన్యాయం జరుగుతుందని మీరెట్లా వారి తరఫున పోరాడుతారు అంటే, దశాబ్దా లుగా దేశంలో కొన్ని వేల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వచ్చి ఉండేవేకావు. ప్రజా ప్రయో జన వ్యాజ్యాల పేరిట ప్రాధాన్యం లేని చిన్న చిన్న విషయాల్లో కూడా కేసులు వచ్చి కోర్టు లను చీకాకు పరుస్తూ ఉండవచ్చు. కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అత్యు న్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చి సమగ్ర విచారణ కోరడం ఏబీకే ప్రసాద్ వంటి సీనియర్ సంపాదకుడికే కాదు, సామాన్య పౌరుడికి కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కదా! ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కావాలి. ఆ రాజధానిని ఎక్కడ, ఎవరు, ఎలా నిర్మించాలో రాష్ర్ట విభజనకు ముందే నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న నేటి అధికారపక్షం భారతీయ జనతా పార్టీ సావధానంగా ఆలోచించి నిర్ణయించాల్సింది. అలా జరగకపోవడం వల్ల ఇవాళ అది పెద్ద సమస్య అయి కూర్చుంది. అధికారం కోసం మొహం వాచి ఉన్న ఉమ్మడి రాష్ర్ట ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ అయినా ముందు దీని సంగతి తేల్చండి అని ఆనాడు పట్టుబట్టి ఉండాల్సింది. ఆ పని చేయక పోగా రాష్ర్ట విభజన నిర్ణయం ప్రకటన వెలువడిన మరుక్షణమే పత్రికా గోష్టి నిర్వహించి చంద్రబాబునాయుడు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే మంచి రాజధాని కట్టుకుంటాం అని ప్రకటించేశారు. సొంతిల్లా? రాజధానా? రాజధానికి ఏమేం కావాలి అన్న చర్చకు తరువాత వద్దాం. రాష్ర్టం విడి పోయాక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి అన్న అంశం మొదలు చంద్రబాబునాయుడు సొంత ఎజెండా అమలు ఆలోచన కార్యరూపం దాల్చింది. నూతన రాజధాని ప్రాంతాన్ని గుర్తించడానికి కేంద్రం శివ రామకృష్ణన్ కమిటీని నియమించింది. ఈ నియామకం ప్రకటన వెలువడ గానే, అది తన పనిని ప్రారంభించక ముందే చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యుడు నారాయణ అధ్యక్షతన సొంత కమిటీ ఏర్పాటు చేసేశారు. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెబుతుందో వినక ముందే నారాయణ కమిటీ రాజధాని ప్రాంతాన్ని నిర్ధారించింది. నారాయణ కమిటీ నిర్ణయం మేరకు, అంటే చంద్రబాబు నిర్ణయించుకున్న ప్రాంతాన్నే రాజధాని నిర్మాణ ం కోసం ఖరారు చేసుకుని చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించే ఆలోచన కూడా చేయలేదు. ఒక రాష్ర్ట రాజధాని నిర్మాణం వ్యవహారం ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం సొంత ఇంటి నిర్మాణం తరహాలో జరిగింది. ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములు వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకునే నిర్ణయం కూడా జరిగి పోయింది. వేలాది ైరైతు కుటుంబాలను ఛిద్రం చేసే ఈ నిర్ణయం మంచిది కాదంటూ, రాజధాని కోసం మరో ప్రాంతాన్ని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా ఇది తప్పు అని ఎవరు మాట్లాడినా, రైతుల దగ్గర నుంచి భూములు బలవంతంగా తీసుకోవద్దని హితవు చెప్పినా వాళ్లు రాజధాని వ్యతిరేకులనే ముద్ర వేయడం మొదలు పెట్టారు. భూములు ఇవ్వ నిరాకరించిన రైతులను బెదిరించారు, దౌర్జన్యాలు చేశారు. ఒక భయానక వాతావరణం సృష్టించి వాటిని స్వాధీనం చే సుకున్నారు. ఇదంతా జరిగి ఏడాది కావస్తున్నది. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య కారణంగా పర్యావరణం ప్రమాదంలో పడుతుంది, రైతు జీవితం అస్తవ్యస్తం అయిపోవడమే కాక ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఎవరు చెప్పినా వినే స్థితి లేదు. రాజధాని కోసం నిర్ణయించిన ప్రాంతం గురించిన వివాదం ఇట్లా ఉంటే, ఆ రాజధానిని ఏ రీతిలో నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారో చూస్తే ముక్కున వేలేసుకోవలసిందే. చంద్రబాబు నిర్ణయించిన ప్రకారమే జరిగితే అందరు కోరుకుంటున్నట్టుగా, ఆశిస్తున్నట్టుగా అమరావతి ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ రాజధాని నగరంగా కాక, ఒక విదేశీ కాలనీగా మాత్రమే మిగులుతుంది. రాజధాని పేరిట అమరావతిని చుట్టుకున్న భూదందాను మీడియా ఆధారాలతో సహా బయటపెట్టింది. భూములు ఇచ్చేది లేదని ఇప్ప టికీ ఎదురు తిరుగుతున్న వారు కొందరైతే, లాక్కోవద్దని ప్రాధేయ పడుతున్నవారు కొందరు. కన్సార్టియం కథేమిటి? రాజధానికి ఏం కావాలి అన్న చర్చ దగ్గరికి ఇప్పుడు వద్దాం. శాసనసభ, సచివాలయం, రాజ్‌భవన్, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు; ఆ సిబ్బందికి గృహవసతి, ఇతర సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. వీటి నిర్మా ణానికి అయ్యే ఖర్చు కేంద్రం ఇస్తుంది. ఇప్పటికే కేంద్రం నిధులిచ్చింది, రాష్ర్ట ప్రభుత్వం లెక్కలు చెప్పడంలేదు అని కేంద్రం అంటున్నది. రాజధాని కోసం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని కూడా అధికార పక్ష ప్రధాన భాగస్వా ములు బీజేపీ వారు చెబుతున్నారు. ఒక విదేశీ సంస్థల కన్సార్టియంను ఏర్పాటు చేసి, దానికి రాజధాని నిర్మాణం బాధ్యత అప్పచెబుతున్నామని ప్రభుత్వం అంటున్నది. ఆ కన్సార్టియం ఏం కట్టబోతున్నది? ఎవరికీ తెలి యదు. భూములు మాత్రం వారికి అప్పచెబుతారు. అందులో సింహభాగం అభివృద్ధి చేసి, మళ్లీ అమ్ముకునే అధికారం ఆ కన్సార్టియంకు ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో తలెత్తే న్యాయపరమైన లావాదేవీలన్నిటినీ లండన్ కోర్టులో తేల్చుకోవాలి. జిల్లా కోర్టుకు కూడా వెళ్లే స్థోమత లేని రైతులు లండన్ వెళ్లే ఆలోచన చెయ్యగలరా? ఇదిగో, ఇంత తలా తోకా లేని వ్యవహారం జరుగుతున్నది, రైతులు రోడ్డున పడుతున్నారు, పర్యావరణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది; వీటన్నిటినీ మించి అవినీతి విలయతాండవం చేస్తున్నది అని సీనియర్ సంపాదకుడు ఏబీకే ప్రసాద్, మరో జర్నలిస్ట్ రమణమూర్తి; ఇంకో జర్నలిస్ట్, న్యాయవాది శ్రావణ్‌కుమార్ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ చేత దర్యాప్తు జరిపించా లని కూడా కోరారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరిం చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ అంశంతో పిటిషనర్‌కు ఏం సంబం ధం అనడం సమంజసంగా లేదు. రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రభుత్వం సొంతంగా నిర్మించుకుంటే మీరు ఆపుతారా? రాజధాని ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయిస్తారా? అసలు మీకూ రాజధానికీ ఏమిటి సంబంధం? మీరేమైనా రైతులా, భూములు కోల్పోయారా? అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకటి, నోరులేని వారికి అన్యాయం జరుగుతుంటే వారికి న్యాయం చేయడం కోసం ఎవరైనా మాట్లాడవచ్చు. పాత్రికేయులు సమాజంలో జరిగే అన్యాయా లను ప్రజల దృష్టికి తీసుకు రావడంతో పాటు అవసరమయితే వారి తరఫున పోరాడటం కొత్త కాదు. ఎవరికో అన్యాయం జరుగుతుందని మీరెట్లా వారి తరఫున పోరాడుతారు అంటే, దశాబ్దాలుగా దేశంలో కొన్ని వేల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వచ్చి ఉండేవేకావు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరిట ప్రాధాన్యం లేని చిన్న చిన్న విషయాల్లో కూడా కేసులు వచ్చి న్యాయ స్థానాలను చీకాకు పరుస్తూ ఉండవచ్చు. కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చి సమగ్ర విచారణ కోరడం ఏబీకే ప్రసాద్ వంటి సీనియర్ సంపాదకుడికే కాదు, సామాన్య పౌరుడికి కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కదా! నర్మదా బచావో ఆందోళన్‌తో మేధా పాట్కర్‌కు ఏం సంబంధం, లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే ఎందుకు పోరాడాలి? అంటే ఎట్లా ఉంటుంది? సీనియర్ సంపాదకుడు ఉన్మాదా? ఇక సుప్రీం కోర్ట్టు నిర్ణయం వెలువడిన వెంటనే చంద్రబాబు ఏబీకే ప్రసాద్‌ను ఉన్మాది అన్నారు. మీలోనూ ఉన్మాదులున్నారని ఆయన మీడియా మిత్రులతో విజయవాడలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను, ప్రజా వ్యతిరేక చర్యలను, నిర్ణయాలను ప్రశ్నించే ప్రతి వారిని ఆయన ఉన్మాదులు గానే చూస్తున్నారు. వీలైతే అధికార బలాన్ని ప్రయోగించి ఉద్యోగాలు ఊడగొట్టిస్తున్నారు. వీలుకానిచోట ఉన్మాదులనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. సింగపూర్ తరహాలో 50 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని ప్రజాస్వామ్యంలో కలలుగనే అధినేతకు ప్రజల తరఫున ఏం మాట్లాడినా, ఎవరు నిజం రాసినా ఉన్మాదంగానే కనపడుతుంది. చంద్రబాబు రాజధానిని నిర్మించేందుకు తెగ కష్టపడి పోతుంటే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం న్యాయమూర్తులకు కలిగి ఉండవచ్చు. అందులో తప్పేమీలేదు. ఈ మధ్యనే కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించే పేరిట చంద్రబాబు ఢిల్ల్లీ వెళ్లి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు న్యాయమూర్తులను కలసి ఒక్కొక్కరి దగ్గరా ఒంటరిగా అరగంట పాటు గడిపినప్పుడు రాజధాని కోసం తానెంత కష్టపడుతున్నదీ చెప్పుకుని వాపోయి ఉండొచ్చు. సహజంగానే దాని ప్రభావం న్యాయమూ ర్తుల మీద ఉండొచ్చు. దేశంలో ప్రతిష్టాత్మకంగా జరిగే కుంభమేళాకు అది జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబులాగా ఆహ్వానాలు పట్టుకుని ఢిల్లీలో ఇంటింటికీ తిరిగిన సందర్భం ఒక్కటి కూడా లేదు. మరి తమ ప్రతిష్ట మసకబారే ఇటువంటి సమావేశాలను న్యాయమూర్తులు ఎందుకు అనుమ తిస్తున్నట్టు? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి? సుప్రీం కోర్టు న్యాయ వాది, ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం లో ఏబీకేతో పాటు సహా పిటిషనర్ శ్రావణ్‌కుమార్ సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను కోరారు. దర్యాప్తు అవసరమే ఇక చంద్రబాబు కనుసన్నల్లో మెదిలే ఒక నయా పత్రికాధిపతి, ప్లస్ జర్నలిస్ట్ ఇంకాస్త ముందుకు పోయి సుప్రీం కోర్టులో కేసు వేయడానికి ఏబీకే ప్రసాద్‌కు డబ్బు ఎక్కడిది, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన వృద్ధాశ్రమంలో సతీ సమేతంగా కాలం గడుపుతున్నారు కదా అని తన పత్రికలో రాసుకున్నారు. సుప్రీంకోర్టులో కేసు కొట్లాడటానికి లక్షల రూపాయలు కావాలని ఆయన అంటున్నారు. సరే ఏబీకే ప్రసాద్ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఆయన ఎందుకు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అన్న విషయాలు ఇక్కడ అప్రస్తుతం. సుప్రీం కోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి అయిన ఖర్చు కేవలం తొమ్మిది వేల రూపాయలు. 50 ఏళ్లకు పైగా జర్నలిస్ట్‌గా, చాలాకాలం సంపాదకుడిగా పనిచేసిన ఏబీకే, మరీ తొమ్మిది వేల రూపాయలు లేనంత నిరుపేద కాదు. ఆ నయా పత్రికాధిపతి ఇదే ఏబీకే సంపాదకుడిగా ఉన్న పత్రికలో చోటా విలేకరిగా పనిచేసిన విషయం మరిచి ఉండవచ్చు. వృత్తిని అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కి హఠాత్తుగా కోట్లకు పడగెత్త లేదు. కాబట్టే ఏబీకే ప్రసాద్ ఇవాళ వృద్ధాశ్రమంలో జీవిస్తున్నా అందరి గౌరవం అందుకుంటున్నారు. ఏబీకే ప్రసాద్ పిటిషన్ సంగతి ఎలా ఉన్నా రాజధాని వ్యవహారంలో ఒక స్వతంత్ర వ్యవస్థ చేత దర్యాప్తు చేయించడం అవసరమే. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఈ ‘ఆగ్రహం’ అంతరార్థం?
డేట్లైన్ హైదరాబాద్ ఏపీ ప్రత్యేకహోదాపై రాజ్యసభలో జరిగిన చర్చకు జైట్లీ సమాధానం ఇచ్చాక చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం మీద సంధించిన విమర్శలన్నీ ఆయనకూ, ఆయన ప్రభుత్వానికి సరిగ్గా వర్తిస్తాయి. ‘హామీలను నెరవేర్చని పార్టీలను ప్రజలు ఇంటికి పంపుతారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలు ఊరుకోరు. ప్రజలు చాలా తెలివైన వారు, దేనికయినా ఒక లాజికల్ ముగింపు ఇస్తారు’. ఈ డైలాగులు ఎవరికి వర్తిస్తాయి? అవును, ప్రజలు తెలివైనవాళ్లు. అది రుజువు కావడానికి ఇంకో రెండున్నరేళ్లు పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణి చంద్రబాబు నాయుడుకు ఆగ్రహం తెప్పించింది. రెండు రోజుల పాటూ రాజ్యసభలో ఆరున్నర గంటలు సాగిన చర్చ అనంతరం అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం విని ఆయన రక్తం సల సల కాగింది. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అని ఆయన చాలా ఆవేశంగా ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కొడుకు చెప్పినా వినను. జైట్లీ సమాధానం వింటుంటే ఒళ్లు మండిపోతున్నది. మోదీని నేనెందుకు కలవాలి? అని చంద్రబాబు చాలా తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు హఠాత్తుగా ఇంత కోపం ఎందుకొచ్చింది? ప్రత్యేక హోదా రాదన్న నోరే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ ధోరణిలోకి ఎందుకు వచ్చారంటే... రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు దాటిపోయింది. ఈ రెండేళ్లూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వేదికల మీదా, అన్ని రకాలుగా ప్రత్యేక హోదా కావాలని పోరాడింది. ఆ తదుపరి ఇతర రాజకీయ పార్టీలూ అదే మార్గం పట్టి, ఏపీ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి వీధుల్లోకి వచ్చాయి. చివరికి ప్రధాన ప్రతిపక్షం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ బంద్‌ను రాష్ట్రమంతటా ప్రజలు విజయవంతం చేయబోతున్నారని అర్థం అయ్యాక చంద్రబాబుకు ఆగ్రహం వచ్చింది. 2014 జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజలు బంద్‌కు ఉపక్రమించిన నిన్నటి వరకు ఆయన అనేక సందర్భాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదనీ, అది రాదనీ తన మాటల ద్వారా చేతల ద్వారా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదు, ఏళ్ల తరబడి ప్రత్యేక హోదాను అనుభవించిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి, ఏం బావుకున్నాయి? అని ఆయన అనేకమార్లు స్పష్టంగా అన్నారు. ప్రత్యేక హోదా అవసరాన్ని గురించిన ప్రస్తావన తెచ్చిన వారినందరినీ హేళన చేసి మాట్లాడారు. ప్రత్యేక హోదా కోరుతూ నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్న ప్రతిపక్ష నేత పట్ల అవమానకరంగా, అనాగరికంగా వ్యవహరించి దీక్షను భగ్నం చేశారు. మేధావులూ, ప్రజా సంఘాలూ, ప్రతిపక్ష రాజకీయ పార్టీల వారూ రాష్ట్రాభివృద్ధి కోసం తాను చేస్తున్న యాగాన్ని అడ్డుకునే రాక్షసుల్లా తయారయ్యారనీ, వాళ్లు అసలు ఉండకూడదనీ చాలాసార్లు మాట్లాడారు. ఇదంతా ఎందుకంటే ఎన్డీఏ హయాంలో ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయనకు, ఆయన పార్టీ వారికి స్పష్టంగా తెలుసు. పదేళ్లు హోదాను కోరిన తన మిత్రుడు వెంకయ్య నాయుడూ, చాలదు పదిహేనేళ్లు ఇవ్వమన్న తానూ కలిసి తపస్సు చేసినా కేంద్రం దిగిరాదనీ, కేంద్రం మెడలు వంచే శక్తి తనకు లేదనీ కూడా చంద్రబాబుకు తెలుసు. మారిన మాట-మారని రూటు ఈ రెండేళ్లుగా జరిగిన ఉదంతాలను వివరించడానికి ఇక్కడ స్థలం సరిపోదు. ఒకే ఒక్క సంఘటన గురించి మాట్లాడుకుందాం. అది చంద్రబాబు మానస ‘‘పత్రిక’’లు నిన్న ప్రస్తావించిన విషయమే. ‘‘గత ఏడాది (2015) ఆగస్టు 25న ప్రధాన మంత్రి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ ముసాయిదా రూపకల్పన బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించారు. ఆ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాని కొనసాగింపుగానే నీతి ఆయోగ్ తన సిఫారసులను కేంద్ర ఆర్థికశాఖకు సమర్పించింది.’’ ఏడాది కిందటి ఈ వార్తను ఆ ప్రముఖ దినపత్రిక మళ్లీ ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది? చంద్రబాబు చెబుతున్నట్టుగా గాక, ప్రత్యేక హోదా విషయంలో ప్రజల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయనీ, ప్రతిపక్షం చేస్తున్న ఆందోళనను వారు బలంగా సమర్థిస్తున్నారనీ అర్థం చేసుకున్న వెంకయ్యనాయుడు సోమవారం ప్రధానిని కలిసి, నీతి ఆయోగ్ ఏ సూచనలను చేసిందో వాకబు చేశారు. ఆ కథనాన్ని తెలిపే సందర్భంగా దానికి ప్రాతిపదిక 2015 ఆగస్టు 25 నాటి సమావేశమేనని తెలపడం కోసమే దాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. బట్టీయం డైలాగులు ఎవరి కోసం? అంటే ఎన్డీఏ హయాంలో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే సమస్యే లేదని, ప్యాకేజీలు మాత్రమే వస్తాయని చంద్రబాబుకు 2015 ఆగస్టు నాటికే తెలుసు. అయినా ఆయన గత రెండు రోజులుగా ఎందుకు మాట మార్చారు? జనాగ్రహాన్ని తట్టుకునే శక్తి లేక అని ఆయనా అంగీకరిస్తారు. జనంతో ఓట్లు వేయించుకుని వారి అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే నాయకులంతా చంద్రబాబు పరిస్థితిని ఎప్పుడో ఒకసారి ఎదుర్కోక తప్పదు. ప్రత్యేక హోదా సంజీవని కాదు అన్న నోటితోనే ఇది ఏపీ జీవన్మరణ సమస్య అని ఒప్పుకోవాల్సి వచ్చింది. గత వారంలో రెండు రోజుల పాటు రాజ్యసభలో జరిగిన చర్చకు జైట్లీ సమాధానం ఇచ్చాక చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతిలో తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అంతకంటే ముందే ఆయన తప్పనిసరిగా ఇంట్లో నిలువుటద్దం ముందు నిలబడి ప్రాక్టీసు చేసి ఉంటారు. ఎందుకంటే ఆయన మీడియా ముందుకొచ్చి కేంద్రం మీద, బీజేపీ మీద సంధించిన విమర్శలన్నీ ఆయనకూ, ఆయన ప్రభుత్వానికి సరిగ్గా వర్తిస్తాయి. ‘‘హామీలను నెరవేర్చని పార్టీలను ప్రజలు ఇంటికి పంపుతారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలు ఊరుకోరు. ప్రజలు చాలా తెలివైనవాళ్లు దేనికయినా ఒక లాజికల్ ముగింపు ఇస్తారు’’. ఈ డైలాగులు ఎవరికి వర్తిస్తాయి? అధికారంలో ఎవరున్నారు, ఎన్నికలప్పుడు అలవికాని హామీలు ఇచ్చి వాటిని తీర్చలేక బొక్కబోర్లాపడింది ఎవరు? చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీయే కదా. మరి ఆయన ఎవరిని నిలదీస్తున్నట్టు? ఎవరిని ప్రశ్నిస్తున్నట్టు? ఆయనే చెప్పినట్టు ప్రజలు తెలివైనవాళ్లు. ఆ మాట మరొక్కసారి రుజుపు కావడానికి ఇంకో రెండున్నరేళ్ల సమయం ఉంది. సింగపూర్ మాదిరిగా 50 ఏళ్లు అధికారంలో కొనసాగాలని కోరుకుంటే సరిపోదు. అందుకు అవసరమయిన విధంగా ప్రజా హృదయాలను చూరగొనాలి. అది కేవలం డబ్బుతో సాధ్యం కాదన్న విషయం ప్రజలు అనేక సందర్భాలలో అన్ని రాజకీయ పార్టీలకూ నిరూపించి చూపించారు. ఆడలేక మద్దెల ఓడన్నట్టు... తిరిగి ఏపీ ప్రత్యేక హోదా, టీడీపీ పాత్ర విషయానికి వస్తే... చంద్రబాబును సమర్థిస్తున్న మీడియా అంత బలంగా కూడా ఆయన కేంద్రాన్ని విమర్శిస్తు న్నట్టుగా కనబడదు. కేంద్రాన్ని విమర్శించాలంటే ఆయన స్వరం మారిపోతుంది. గొంతు బలహీనంగా మారుతుంది. జపాన్ తరహా ఉద్యమాలు చెయ్యండని ప్రజలకు పిలుపు ఇస్తారు. రాష్ట్రవిభజన కారణంగా ఏర్పడ్డ ఆర్థిక దుస్థితి వల్ల రాష్ట్రాభివృద్ధి కొన్ని తరాల పాటూ వెనుకబడిపోబోతున్నదన్న ఆవేదనతో ఉన్న ప్రజలకు... మొక్కలను నాటండి, ఉత్పత్తిని పెంచి నిరసన తెలపండి, ఒక గంట ఎక్కువ పని చేయండి అనే నీతులు సాంత్వన కలిగిస్తాయా? మోదీని నేనెందుకు కలుస్తాను, నాకేం అవసరం అన్నారాయన. ప్రధాని అపాయింట్మెంట్ లభించడం అంత సులభం కాదని ఆయనకు తెలుసు. కాబట్టే ఆ డైలాగు కొట్టారు. మోదీ అపాయింట్మెంట్ను కోరుతూ టీడీపీ ఎంపీలు ప్రధాని కార్యాలయం ఓఎస్డీకి రాసిన లేఖకు ఇంకా (మంగళవారం సాయంత్రానికి) మోక్షం లభించినట్టు లేదు. ప్రధాని రెండు గంటలు దృష్టి పెడితే చాలు అంటున్న చంద్రబాబు మరి ఈ రెండేళ్లలో ఒక రెండు గంటలు మోదీ దృష్టిని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే విషయంపైకి ఎందుకు మళ్లించలేకపోయారు? ఆ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అని ప్రశ్నిస్తే చంద్రబాబు మళ్లీ ఇదంతా ప్రతిపక్షం కుట్ర అంటారు. యువ ప్రతిపక్ష నేతకు రాజకీయాల్లో ఓనమాలు రానందునే ఈ పరిస్థితి అంటారు. మరి డాక్టరేట్ సాధించిన మీరెందుకు ఈ సమస్యను పరిష్కరించలేక చతికిల పడ్డారు? అని ప్రశ్నించే మీడియాను మాత్రం ఈ భూమ్మీద ఉండకుండా చేస్తామంటారు. రాష్ట్ర బంద్‌ను విఫలం చెయ్యడానికి ఏపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ రాజకీయ పార్టీల కార్యకర్తలను, నాయకులనూ అరెస్ట్‌లు చేస్తే సమస్య పరిష్కారం కాదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. బంద్ విఫలం లేదా పాక్షికం అని తమను సమర్థించే మీడియాలో రాయించుకోడానికి అదేమైనా ఉపయోగ పడితే పడొచ్చు. చంద్రబాబు నాయుడు మాటల్లోనే ‘‘ప్రజలు చాలా తెలివైనవాళ్లు దేనికయినా ఒక లాజికల్ ముగింపు ఇస్తారు’’. (వ్యాసకర్త: దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com) -
ఎవరికీ పట్టని రెండు రంగాలు
డేట్లైన్ హైదరాబాద్ ప్రధానమంత్రి మోదీ మొదలు మన ముఖ్య మంత్రి దాకా అందరూ స్వచ్ఛ భారత్ గురించే మాట్లాడతారు. ఈ మధ్య దానికోసం ప్రత్యేక పన్ను కూడా వేస్తున్నారు. రాష్ట్రాలకు నిధులు కూడా ఇస్తున్నారు. ఇళ్లూ, కార్యాలయాలూ, వీధుల మాట అలా ఉంచండి. కనీసం ఆస్పత్రులయినా శుభ్రంగా ఉండవేంటి? ఈ డబ్బంతా ఎక్కడికి పోతున్నట్టు అని ప్రశ్నించుకుంటే, మళ్లీ అవినీతి దగ్గరికే వస్తాం. మన ప్రభుత్వ ఆస్పత్రులను శుభ్రంగా ఉంచే పనిని ప్రభుత్వాలు బయటివాళ్లకు కాంట్రాక్ట్‌కు ఇస్తాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కొంతకాలంగా విద్య, వైద్యసేవలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వరంగం ఈ రెండు విషయాలలో తీవ్ర విమర్శలకు గురవుతున్నది. కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహించడానికే ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తు న్నాయని ఎవరికీ విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో విధంగా ప్రజలకు వైద్యం అందించే బాధ్యతను పూర్తిగా వదిలించుకుంటే బాగుంటుందనే ప్రభుత్వాల భావన. ఎందుకంటే వాళ్లు తలపెట్టిన పెద్ద పెద్ద పనుల ముందు విద్య, వైద్యం చాలా అల్పమైనవి. విద్య ఇప్పటికే పూర్తి ప్రైవేట్ పరం అయింది. ఇటీవల లోక్‌సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మేకపాటి రాజమోహనరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సంబంధిత మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లకాలంలో తెలంగాణ లో 2,501 పాఠశాలలు మూతబడ్డాయనీ, ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో 879 పాఠశాలలు మూత బడ్డాయనీ దాని సారాంశం. ఎందుకంటే ప్రవేశాల నమోదు ఆధారంగా పాఠ శాలల హేతుబద్ధీకరణ వల్ల ఇన్ని పాఠశాలలు మూతబడ్డాయనీ, అయితే ఇందువల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయనీ సదరు మంత్రి చెప్పారు. పాఠశాలలు మూతబడటానికి రాష్ట్రాలు ఇచ్చిన కారణాలను పార్లమెంట్లో మంత్రిగారు వివరించిన తీరు పిల్లి అంటే మార్జాలం అని అర్థం చెప్పినట్టే ఉంది. మనం మామూలుగా అర్థం చేసుకునేది ఏమిటంటే తగిన లేదా నిర్ణీత సంఖ్యలో పిల్లలు చేరకపోతే ఉన్న పిల్లలను వేరే పాఠశాలకు తరలించి దీన్ని మూసేస్తారు. ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి, విద్యార్థుల సంఖ్యను బట్టి ఇటువంటి నిర్ణయాలు తీసు కుంటాయి ప్రభుత్వాలు. దీనినే బహుశా కేంద్ర మంత్రిగారు పాఠశాలల హేతుబద్ధీకరణ అని నిర్వచించి ఉంటారు. అదీ కాకుండా ఇంకో అర్థం ఏమ యినా ఉంటే తెలుగు రాష్ట్రాల విద్యాశాఖల అధికారులో, మంత్రులో వివ రణ ఇవ్వవచ్చు. కేజీ నుంచి పీజీ ఏమైంది? తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఉద్యమం జరుగుతున్న కాలంలో చంద్రశేఖర్ రావు తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకూ మొత్తం చదువు బాధ్యత ప్రభు త్వానిదేనని ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు గడిచింది. ఇప్పటివరకు ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. పైగా నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్టు తయారయింది తెలంగాణలో ప్రభుత్వ విద్య. విద్యా శాఖలో ఏం జరుగుతున్నదో ఒకసారి ముఖ్యమంత్రి దృష్టి పెడితే చాలా విష యాలు బయటికొస్తాయి. ఆయన ప్రాధాన్యతల్లో విద్య లేని కారణంగా ఆ శాఖలో కొందరు ఆడింది ఆట అన్నట్టు తయారయింది. ఒకటి రెండు ఉదాహ రణలు చాలు ప్రభుత్వ విద్య పరిస్థితి ఏమిటో చెప్పడానికి. తెలంగాణలో పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రహసనం మొదటిదయితే, నిన్నగాక మొన్న బయ టపడ్డ తెలంగాణ ఎంసెట్ -2 ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం రెండోది. అర్హత లేని ముద్రణ సంస్థకు మళ్లీ మాట్లాడితే బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు పాఠ్య పుస్తకాల ముద్రణ పని అప్పచెప్పడం కోసం మూడుసార్లు టెండర్లు రద్దు చేసి అర్హులయిన ప్రింటర్లకు పని దక్కకుండా చేసి, విద్యార్థ్ధులకు పుస్తకాలు చేరడంలో జాప్యానికి కారకులయిన వారిని గురించి ప్రభుత్వం పట్టించు కోదు. ఎంసెట్ -2కు సంబంధించి పరీక్ష పత్రాలు లీక్ అయిన విషయం తన దృష్టికి వస్తే విద్యాశాఖ మంత్రి ఇదంతా కట్టుకథ లేదా మీడియా సృష్టి అంటారు. నిజంగానే ఏదో జరిగిందని అర్థం అయ్యాక వైద్యవిద్యకు సంబం ధించింది కనక ఆ శాఖ మంత్రి దీనిమీద స్పందిస్తారని తప్పుకుంటారు. ముఖ్యమంత్రి స్వయంగా కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించాక కానీ సీఐడీ విచారణ మొదలుపెట్టలేదు. విద్యారంగం ఇంత గందరగోళంలో ఉంది. ప్రభుత్వం ఆ వైపు, ముఖ్యంగా పాఠశాల విద్య పైన దృష్టి పెడితే మంచిది. ఇక వైద్యరంగం విషయానికి వస్తే, సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రెండువారాల క్రితం జరిగిన సంఘటన, గాంధీ ఆస్పత్రిలో మరణాలకు సంబంధించి వస్తున్న వార్తలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. బోలెడు వాస్తవాలు బయటికొస్త్తున్నాయి. దశాబ్దాలుగా పాతుకుపోయిన కొన్ని వ్యవస్థలను తక్షణం ప్రక్షాళనం చెయ్యాల్సిన అవసరం ఉందని ఈ ఉదంతాలు చె బుతున్నాయి. వైద్యరంగం దుస్థితి సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రోగుల కళ్లు శుభ్రం చేసే ద్రావకం కారణంగా కొంతమంది చూపు కోల్పోయారు. అది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దవా ఖానా. ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికే వచ్చి తమ సమస్యలకు చికిత్స, లేదా శస్త్ర చికిత్సలు చేయించుకున్న సందర్భాలున్నాయి. నిపుణులయిన వైద్య బృందం కూడా ఉంది. మరి లోపం ఎక్కడ జరిగింది అంటే ఆ ఆస్పత్రికి సరఫరా చేసిన ఆ ద్రావకం కారణం. ప్రభుత్వ ఆస్పత్రులకు కావలసిన వైద్య సంబంధమయిన సామగ్రి, మందులు సరఫరా చెయ్యడానికి ఒక సంస్థ ఉంటుంది. దానికో అధ్యక్షుడు ఉంటారు. కార్పొరేషన్లు అన్నిటి వలెనే ఈ సంస్థకు కూడా రాజకీయ నియామకం ద్వారానే ప్రభుత్వాలు అధ్యక్షులను నియమిస్తుంటాయి. వాళ్లకు ైవైద్య పరికరాలు, ఔషధాలు, పరికరాలకు సంబంధించిన కనీస పరిజ్ఞానం కూడా ఉండవు. అటువంటి అధ్యక్షుల పర్య వేక్షణలో పనిచేసే సిబ్బంది పై నుంచి కింది వరకూ ఈ రంగంతో ఎటువంటి సంబంధమూ లేనివారే. ఔషధాల నాణ్యత, పరికరాల నాణ్యత తెలిసిన ప్రత్యేక అర్హతలు కలిగిన వారిని కాకుండా సాధారణంగా ప్రభుత్వాలు ఈ పని ఇంజనీర్లకు అప్పగిస్తుంటుంది. ఔషధ తయారీ సంస్థలతో బేరసారాలు వీరే బాగా చేయగలరన్న నమ్మకం. ఏటా కొన్నివేల మంది మన రాష్ర్టం లోని ఫార్మసీ కళాశాలలలో చదువుకుని బయటికొచ్చి నిరుద్యోగులుగా ఉండి పోతున్నారు. వాళ్లు చెయ్యాల్సిన ఈ పనిని వైద్యంతో, ఔషధాలతో ఏమీ సంబంధం లేనివారు చేస్తున్నందున ఈ అనర్థాలు జరుగుతున్నాయి. అవి నీతికి మారుపేరుగా నిలిచిన ఈ కార్పొరేషన్ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం కట్టకపోతే సరోజినీదేవి ఆస్పత్రిలో జరిగినటు వంటి ఘటనలు ఇంకా తీవ్రమై ప్రజల ప్రాణాలకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. పరిశుభ్రత పగటి కలేనా? మన ప్రభుత్వ ఆస్పత్రులు శుభ్రంగా ఎందుకుండవు? ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఎందుకు అంత తళతళలాడుతుంటాయి? అన్న ప్రశ్న మనం చాలాసార్లు వింటుంటాం. ప్రధానమంత్రి మోదీ మొదలు మన ముఖ్య మంత్రి దాకా అందరూ స్వచ్ఛ భారత్ గురించే మాట్లాడతారు. ఈ మధ్య దానికోసం ప్రత్యేక పన్ను కూడా వేస్తున్నారు. రాష్ట్రాలకు నిధులు కూడా ఇస్తున్నారు. ఇళ్లూ, కార్యాలయాలూ, వీధుల మాట అలా ఉంచండి. కనీసం ఆస్పత్రులయినా శుభ్రంగా ఉండవేంటి? ఈ డబ్బంతా ఎక్కడికి పోతున్నట్టు అని ప్రశ్నించుకుంటే, మళ్లీ అవినీతి దగ్గరికే వస్తాం. మన ప్రభుత్వ ఆస్ప త్రులను శుభ్రంగా ఉంచే పనిని ప్రభుత్వాలు బయటివాళ్లకు కాంట్రాక్ట్‌కు ఇస్తాయి. కాంట్రాక్టర్ల నుంచి కాంట్రాక్టర్లు, వాళ్ల చేతులలో నుంచి ఇంకా చిన్న కాంట్రాక్టర్ల చేతులలోకి వెళ్లి, చివరికి ఓ 150 మందితో చేయించాల్సిన ఈ శుభ్రతా కార్యక్రమం పదిమందికో పదిహేను మందికో పరిమితమై ప్రభుత్వ ఆస్పత్రులు మురికివాడలను గుర్తు చేస్తుంటాయి. ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలైపోతున్న విషయం బహిరంగ రహస్యమే. ఆస్పత్రులలో ఎక్స్‌రేలకు ఫిల్మ్‌లు ఉండవు. సర్జరీ చేస్తుండగా కరెంట్ పోతే ఆ కొద్ది సేపయినా మొబైల్ ఫోన్ల లైట్ల వెలుగు సహాయం తీసుకుంటారు వైద్యులు. ఇది హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న తంతు. దీనిమీద ఇటీవల మీడియా వెలువరిస్తున్న వాస్తవాల చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గరలోని గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రులలో అయితే పసికందులను చీమలు కుట్టి చంపుతాయి, ఎలుకలు కొరికి చంపుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్యం దుస్థితి గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. విద్యా, వైద్య రంగాలకు పట్టిన ఈ మురికిని వదిలించడానికి ప్రభుత్వ పెద్దలు పై నుంచి కింది దాకా ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టకపోతే బంగారు తెలంగాణ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ఇటువంటప్పుడే మన కాలపు తత్వవేత్త బాలగోపాల్ మాటలు మళ్లీ మళ్లీ జ్ఞాపకం వస్తాయి-అభివృద్ద్ధి అంటే బడుగువర్గాల సంక్షేమమే అని. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేది ఆ వర్గాలే. (వ్యాసకర్త : దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com) -
వెంకయ్య హితోక్తులు ఎవరికి?
డేట్లైన్ హైదరాబాద్ దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులను చూసి ఆవేదన చెందుతున్న వెంకయ్య నాయుడు... మోదీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన అన్నట్టే పార్టీ ఫిరాయించిన రోజునే పదవి పోయేట్టు చేస్తే బాగుంటుంది. తన ప్రియ మిత్రుడు చంద్రబాబును ఒప్పించి ఏపీలో పార్టీ ఫిరాయించిన ఇరవై మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయిస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారవుతారు. అక్షర క్రమంలో మొదటిదైన ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ బృహత్ కార్యం ప్రారంభమైతే, దానికి వెంకయ్య నాయుడు కారకులైతే ఇంకా బాగుంటుంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా గత వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో జరిగిన ఆత్మీయ సభల్లో ఆయనను ఘనంగా సత్కరించారు. విజయవాడ సన్మానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. అక్కడి ప్రసం గాలు విన్న వారికి అది వెంకయ్య నాయుడు ఒక్కరి సత్కార సభగా అనిపించ లేదు. దాదాపు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్న ఇద్దరు నాయుళ్ల అభినందన సభలాగా అనిపించింది. ఆయనను ఈయనా, ఈయనను ఆయనా కావాల్సినంత పొగిడారు. హైదరాబాద్ సన్మాన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కనిపించలేదు. ఆయన ప్రభుత్వం తరఫున కూడా ఎవరూ హాజరయినట్టు లేరు. ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు, తెలంగాణ బీజేపీ, టీడీపీ నాయ కులు హాజరయ్యారు. విజయవాడ సన్మానానికి ఏపీ ముఖ్యమంత్రి హాజరు కావడానికి వెంకయ్య నాయుడుతో ఆయనకు ఉన్న వ్యక్తిగత స్నేహానికి తోడు ప్రస్తుత రాజకీయ బంధం కూడా కారణం కావచ్చు. ఆ అవసరం తెలంగాణ ముఖ్యమంత్రికి లేకపోయినా, కేంద్ర మంత్రి అందునా పార్లమెంటరీ వ్యవహా రాలను చూస్తున్న సీనియర్ నేత కాబట్టి మర్యాదపూర్వకంగా హాజరై ఉండొచ్చు. అయితే రాష్ట్రంలోని అధికార పక్షానికీ, కేంద్రంలోని అధికార పక్షానికీ మధ్య ఉండాల్సిన మామూలు సంబంధాల విషయం ఎట్లా ఉన్నా... రాజకీయంగా రెండు రాష్ట్రాల అధికార పక్షాల పరిస్థితి పూర్తి విరుద్ధం. రెండు రాష్ట్రాలు - రెండు తీరుల బంధాలు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ రెండూ మిత్రపక్షాలుగా కలసి పోటీ చేశాయి. కేంద్రంలో, రాష్ట్రంలో కలసి అధికారం పంచుకుంటున్నాయి. అప్పుడప్పుడు, అక్కడక్కడా కింది స్థాయి నాయకులు లోలోపల గొణుక్కున్నట్టు ఒకరినొకరు విమర్శించుకున్నా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీలో పర్యటించి పార్టీని ఎవరి మద్దతూ అవసరంలేని విధంగా బలోపేతం చెయ్యనున్నామని భ్రమలు కల్పించినా... వ్యవహారం అంతా ఇద్దరు నాయుళ్ల కనుసన్నల్లోనే నడుస్తుంది. తెలంగాణలో పరిస్థితి అది కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో సంబంధాలు ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ అధినాయకత్వం ఏపీ కంటే తెలంగాణ మీదనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించినట్టుంది. తెలంగాణ బీజేపీ నాయకత్వం అక్కడి ప్రభుత్వాన్ని సమస్యల మీద నిలదీయడంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు. పైగా అమిత్ షా ఒకటికి రెండుసార్లు తెలంగాణలో పర్యటించి, పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేసే ప్రయత్నాల్లో పడ్డారు. 2019 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో, రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ స్నేహాలు ఎలా మారతాయో తెలియదు. ప్రస్తుతానికి ఏపీలో టీడీపీతో బీజేపీ సఖ్యతకు ఇద్దరు నాయుళ్ల స్నేహబంధం కూడా అందుకు కారణం కావచ్చు. 2019 నాటికి ఏపీలో టీడీపీతో స్నేహం కొనసాగింపు విషయంలో మోదీ-అమిత్ షా జోడీ ఏం ఆలోచిస్తుందో, వెంకయ్య నాయుడు మాట అప్పుడు చెల్లు బాటు అవుతుందో లేదో చూడాలి. తెలంగాణలో మాత్రం ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు వ్యవహార శైలి... బీజేపీ సహా ఇతర ఏ రాజకీయ పార్టీకీ ఏ మాత్రం సందు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించదు. టీఆర్ఎస్ను రాజకీయంగా అత్యంత బలోపేతం చేసే ఆలోచ నతో ఆయన చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర విభజనా నంతరం రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా వెంకయ్యనాయుడు చూపిన అనుకూల, ప్రతికూల ప్రభావాలు చాలా బలమై నవి. అందువల్లనే వెంకయ్య సన్మాన సభల సందర్భంలో బీజేపీ-టీడీపీ, బీజేపీ-టీఆర్ఎస్ల మధ్య సంబంధాలపై ఈ చర్చ చేయవలసి వచ్చింది. రాజస్తాన్‌కు ‘వలస’లోని మర్మం ఇక ఈ రెండు ఆత్మీయ సత్కార సభల్లో ఆయన ప్రసంగాలను చూద్దాం. వెంకయ్య నాలుగవసారి రాజ్యసభకు ఎక్కడి నుంచి ఎన్నికవుతారనే విష యంపై జరిగిన ప్రచారంపట్ల ఆయన ఈ సభల్లో తీవ్ర ఆవేదన, కించిత్ ఆగ్రహం ప్రదర్శించారు. ‘చంద్రబాబును నేను సీటు అడుగుతానా? ఇందిరా గాంధీ, ఎన్టీఆర్లకు వ్యతిరేకంగా నిలిచి గెలిచిన వాడిని’ అంటూ ఆయన తాను 1978, 1983 ఎన్నికల్లో రెండుసార్లు నెల్లూరు జిల్లా నుంచి శాసనసభకు ఎన్నికైన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ మద్దతు ఉన్నా 1985 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అదే జిల్లా నుంచి ఎందుకు గెలవలేకపోయారో కూడా వివరించి ఉంటే బాగుండేది. ఆ తరువాత పార్టీకి అంకితమై పనిచెయ్యడం కోసమే ఎన్నికల్లో పోటీ చెయ్యలేదంటున్న వెంకయ్య... ఒవైసీ మీద గెలుస్తా నంటూ మంచి పోటీ ఇచ్చే సత్తా ఉన్న తెలంగాణ భూమిపుత్రుడు బద్దం బాల్రెడ్డికి అన్యాయం చేసి మరీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఘోర పరాజయం పాలు ఎందుకయ్యారో? ఆ తరువాత నాలుగుసార్లు పరోక్షంగా పార్లమెంట్‌లోకి ప్రవేశించే మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నారో? మూడుసార్లుగా కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్న ఆయనపట్ల ఆ రాష్ట్ర బీజేపీ నాయకత్వంలోనూ, శ్రేణులలోనూ తీవ్ర వ్యతిరేకత రావడం వల్లనే వెంకయ్య రాజస్తాన్ ఎడారి దారి పట్టారన్న నగ్నసత్యాన్ని ఎలా కాదం టారు? రాజకీయాల అంతిమ లక్ష్యం అధికారం, ఆ విషయం ఒప్పుకుంటే ఏ పేచీ ఉండదు కదా! కర్ణాటక నుంచి ఆయన పక్కనే ఉన్న తన సొంత రాష్ట్రం ఏపీకి రావచ్చు. అక్కడ చంద్రబాబు ఎలాగూ ఒక రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఈసారి ఇక్కడి నుంచి మరో రాష్ట్రానికి మార్చి, వెంకయ్య నాయుడును ఇక్కడి నుంచి బరిలోకి దింపడానికి బదులు బీజేపీ అధిష్టానం సురేష్ ప్రభు అనే కొత్త పాత్రను ఎందుకు ప్రవేశ పెట్టినట్లు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు కారకులై ఉండి కూడా నేటి ఏపీకి వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా సహా పలు హామీలను కేంద్రం చేత అమలుచే యించడంలో విఫలమైన కారణంగా ఆ ఇద్దరు మంత్రుల పట్ల రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకత వల్లనే వారిని ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయలేదని వినవస్తోంది. వారిద్దరూ ఏపీ ప్రజల చెవులు చిల్లులు పడేట్టుగా ప్రత్యేక హోదా తదితర హామీల గానం వినిపించినవారు. ఆ తరువాత ఏమీ చేయలేక చేతులెత్తేసి దబాయింపులకు దిగినవారు. సురేష్ ప్రభుకు వీటితో సంబంధం లేదు. ఆయన రైల్వే మంత్రి కాబట్టి విశాఖ రైల్వే జోన్ గురించి అడగవచ్చంతే. ఫిరాయింపుల వేళ హితవచనాల జోరు వెంకయ్య నాయుడు ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చెయ్యను అంటున్నారు. ఆరేళ్ల నాటికి రాజెవరో రౌతెవరో? అదలా ఉంచితే, ఇక ఈ ఆత్మీయ సభల్లో ఆయన ప్రస్తావించిన అతి ముఖ్యమైన అంశం... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్య సౌధాల పునాదులకు ముప్పుగా మారుతున్న పార్టీ ఫిరాయిం పుల సమస్య. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో విలువలు పతనం అయిపోతు న్నాయని వెంకయ్య తెగ బాధ పడిపోయారు. పార్టీ మారిన వెంటనే, అదే రోజున పదవి పోవాలని చెబుతున్నారాయన. ఉత్తరాదిలో బీజేపీ మాడు పగిలేసరికి పార్టీ ఫిరాయింపు నీతిమాలిన పని అని గుర్తొచ్చింది. రాజకీ యాల్లో విలువలు లుప్తం అవుతున్నాయన్న స్పృహ కలిగింది. విజయవాడలో చంద్రబాబును, హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని వేదిక మీద తన సరసన కూర్చోబెట్టుకుని ఆయన పార్టీ ఫిరాయింపులను క్షణం కూడా సహించ కూడదని హితవు పలికారు! తెలంగాణలోని అధికార పక్షం వద్ద ఆయన మాట చెల్లక పోవచ్చు. మరి ఏపీలోని చంద్రబాబుకు ఆ హితవు ఎందుకు చెప్పరు? పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఫిరాయింపులను చూసి ఆవేదన చెందుతున్న వెంకయ్య... మోదీ ప్రభుత్వాన్ని ఒప్పించి పార్టీ ఫిరాయింపుల చట్టంలో సమూల మార్పులను చేయించి ఆయన అన్నట్టే పార్టీ ఫిరాయించిన రోజునే పదవి పోయేట్టు చేస్తే బాగుంటుంది. ఆయన మాటలకు విలువ ఉంటుంది. తన ప్రియమిత్రుడు చంద్రబాబును కూడా ఒప్పించి ఏపీలో టీడీపీలోకి ఫిరాయించిన 20 మంది శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లేట్టు చేస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారవుతారు. అక్షర క్రమంలో మొదటిదైనా ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ బృహత్ కార్యం ప్రారంభం అయితే, దానికి వెంకయ్య నాయుడు కారకులయితే ఇంకా బాగుంటుంది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
సభాపతుల కోసం ఓ సవరణ
డేట్లైన్ హైదరాబాద్ రాజ్యాంగాన్ని మనం బోలెడుసార్లు సవరించుకున్నాం. ఇంకో సవరణ, అది కూడా రాజకీయాలలో నైతిక విలువల రక్షణ కోసం చేసుకోవలసిన సమయం వచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద స్పీకర్లకు కాకుండా గవర్నర్లకు నిర్ణయాధికారాలు ఇస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన తాజా పరిణామాలనే ఉదాహరణగా తీసుకుని, పార్లమెంట్ చర్చించి తగిన సవరణలు తెచ్చి ఫిరా యింపుల మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి. న్యాయస్థానాల పుణ్యమా అని ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గండం గడిచి బయటపడింది, ఓ వారం రోజుల కిందట. ఇది కాంగ్రెస్ అంతర్గత సమస్య అని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఎంత సమర్ధ్థించుకోవాలని చూసినా, ఉత్తరాఖండ్‌లో ఆ పార్టీకి శృంగభంగం అయిం దన్న విషయం వాస్తవం. ఉత్తరాఖండ్ శాసనసభ గడువు ముగియడానికి ఇంకా ఏడెనిమిది నెలలే మిగిలి ఉంది. స్వల్ప ఆధిక్యతతో, అవినీతి ఆరోపణల మధ్య నెట్టుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నాలుగేళ్లూ ఇబ్బంది పెట్టనందుకు ఆ రాష్ర్టంలో బీజేపీకి మంచి పేరే వచ్చింది. ఈ ఎనిమిది మాసాలు కూడా అలాగే కొనసాగనిచ్చి ఉంటే 2017 ఆరంభంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఖాయంగా గెలిచి ఉండేది. అరుణాచల్‌ప్రదేశ్‌లో చేసిన ప్రయోగమే ఇక్కడా చేయబోయి అనవసరంగా ఆ రాష్ర్టంలో అధికారంలోకి వచ్చే సువర్ణావకా శాన్ని జార విడుచుకుంది. బీజేపీ పెద్దలు ఈ మాట ఒప్పుకోరు. అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమే, మాకు సంబంధం లేదంటారు. అదే నిజమయితే రాష్ర్టపతి పాలన తెచ్చే ప్రయత్నమే చేసి ఉండకూడదు. రాష్ర్టపతి ఉత్తర్వులను న్యాయ స్థానాలు తోసిపుచ్చే పరిస్థితి తెచ్చుకుని ఉండాల్సింది కాదు. సరే, కాసేపు బీజేపీ చేస్తున్న వాదనతోనే ముందుకు పోదాం. కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు. ఆ శాసనసభ స్పీకర్ వెంటనే వారిని అనర్హులుగా ప్రకటించి, శాసన సభలో బలపరీక్ష సందర్భంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేయ కుండా నిలువరించారు. దాంతో హరీశ్ రావత్ ప్రభుత్వం బలపరీక్షలో విజ యం సాధించగలిగింది. ఉత్తరాఖండ్ శాసనసభ స్పీకర్‌ను ఇందుకు అభినం దించాల్సిందే. కాంగ్రెస్ టికెట్ మీద ఎన్నికయి ప్రభుత్వాన్ని కూల్చేందుకు పార్టీ ఫిరాయించాలని భావించిన శాసనసభ్యులకు ఆయన తగిన శాస్తి చేశారు. ఆ తొమ్మండుగురు శాసనసభ్యులు హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తట్టినా లాభం లేకపోయింది. స్పీకర్ నిర్ణయం సరయినదే అన్నాయి కోర్టులు కూడా. మరి అదే స్పీకర్ బలపరీక్ష రోజునే బీజేపీ నుంచి ఫిరాయించి, రావత్ పంచన చేరిన ఎమ్మెల్యేల మీద ఏ చర్యా ఎందుకు తీసుకోలేదు? చర్చనీయాంశం అవుతున్న స్పీకర్లు ఇలాంటి సందర్భాలలోనే శాసనసభల గౌరవ స్పీకర్ల పాత్ర చర్చనీయాంశమ వుతున్నది. వివాదాస్పదం కూడా అవుతున్నది. ఇంతసేపూ ఉత్తరాఖండ్ వ్యవ హారం గురించి మాట్లాడుకున్నది ఎందుకంటే అక్కడి మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ శాసనసభ్యుల ఫిరాయింపుల వ్యవహారం బరితెగించి సాగుతున్నది. రెండు రాష్ట్రాల శాసనసభల స్పీకర్లూ ఏళ్లు గడు స్తున్నా ఈ ఫిరాయింపుల నాటకాన్ని కొనసాగిస్తున్నారు తప్ప, ఏ చర్యా లేదు. తెలంగాణ రాష్ర్టంలో వేరే పార్టీల నుంచి గెలిచిన మొత్తం 23 మంది శాసనసభ్యులు అధికార పక్షం పంచన చేరిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క ప్రతిపక్షం నుంచి 16 మంది శాసనసభ్యులు అధికార తెలుగుదేశం గూటికి వలసపోయారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు సంవత్సరాలలో పార్టీ ఫిరాయించిన ఈ 39 మంది శాసనసభ్యులు ఒకటే బృందగానం చేశారు. అది తమ నియోజకవర్గాల అభివృద్ధి. అంటే ప్రభుత్వం అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుల నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేస్తుందా? ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వదా? రాష్ర్ట ప్రజలందరూ ప్రభుత్వానికి సమానం కాదా? ప్రతి పక్షాలు ప్రాతినిధ్యం వహిస్త్తున్న నియోజకవర్గాల ప్రజలు పన్నులు కట్టడం లేదా? ఎంత వింతగా ఉంది ఇది? ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాలతో సఖ్యంగా ఉండో, పోరాడో నియోజకవర్గాలకు కావలసినన్ని నిధులు తెచ్చుకుని అద్భుతమయిన అభి వృద్ధి సాధించి చూపించిన ప్రజా ప్రతినిధులు మనకు చరిత్రలో చాలా మంది కనిపిస్తారు. నియోజకవర్గాల అభివృద్ధి అనేది ఒక సాకు. వీరంతా తమ సొంత అభివృద్ధి కోసమే పోతున్నారు. కోట్ల రూపాయల కాంట్రాక్టులు, భూములు, రక రకాల స్వప్రయోజనాలను ఆశించి పోతున్న వాళ్లే వీళ్లంతా. ఉత్తరాఖండ్ స్పీకర్లాగా రెండు తెలుగు రాష్ట్రాల స్పీకర్లు ఎందుకు సత్వర నిర్ణయం తీసు కోలేదు? ఎందుకు ఏళ్లు గడిపేస్తున్నారు? ఉత్తరాఖండ్ స్పీకర్ నిర్ణయాన్ని కూడా చర్చించవలసిందే. ఎందుకంటే ఉత్తరాఖండ్‌లో అధికార పక్షం నుంచి తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు కాబట్టి స్పీకర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అదే రావత్ సర్కారు కనుక మైనారిటీలో పడి ప్రతిపక్ష బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కనుక అధికారపక్షాన్ని ఆదుకోవడానికి ఫిరాయించినా కూడా ఆ రాష్ర్ట స్పీకర్ ఇదే నిర్ణయం తీసుకునే వారా అన్నది అనుమానాస్పదమే. తొమ్మిదిమంది కాంగ్రెస్ సభ్యుల మీద అనర్హత వేటు వేసిన అదే స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలు రావత్ వైపు వస్తే ఎందుకు ఊరు కున్నట్టు? ఎందుకంటే స్పీకర్ అధికార పక్షానికి సంబంధించిన వారే కావడం. రెండు తెలుగు రాష్ట్రాల లో జరుగుతున్నది కూడా అదే. విపక్షం కాబట్టే! ప్రతిపక్షాలకు చెందిన శాసనసభ్యులు అధికారపక్షానికి వలసపోతున్నారు కాబట్టి స్పీకర్లు ఏ చర్యా తీసుకోవడం లేదన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. రాష్ర్టం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికలలో గెలిచినప్పుడు టీఆర్ఎస్ సంఖ్యాబలం అరవై రెండు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యకు ఒక్కటే స్థానం ఎక్కువ. ఆ పరిస్థితులలో ప్రతిపక్షాలు కొద్దిమంది శాసనసభ్యులను తమ వైపు తిప్పుకున్నా ప్రభుత్వం నిలవడం కష్టం అయ్యేది. అప్పుడు కూడా స్పీకర్ ఇప్పటివలెనే వ్యవహరించేవారా? అవతల ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే. అరవై ఏడుగురు సభ్యులతో ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ 21 మంది తెలుగుదేశం సభ్యులను తన వైపు తిప్పుకుని ఉంటే ఆ ప్రభుత్వం పరిస్థితి ఏమిటి? అప్పుడు కూడా అక్కడి స్పీకర్ ఇప్పటివలెనే వ్యవహరించేవారా? ఇదంతా స్పీకర్లు వివాదా స్పదులవుతున్నారు, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది అని చెప్పడానికే. శాసన వ్యవస్థకు ఉండే పవిత్రతను ఎవరూ ప్రశ్నించకూడదు, స్పీకర్ నిర్ణయాలను కూడా ప్రశ్నించకూడదు నిజమే కానీ, ఇటువంటి సంద ర్భాలలో స్పీకర్ల వ్యవస్థ చర్చలోకి రాక తప్పదు. ఎన్టీ రామారావు అప్రజాస్వామికంగా పదవీచ్యుతుడయిన రెండుసార్లు స్పీకర్ల వ్యవస్థ విమర్శకు గురయింది, గవర్నర్లు కూడా నిందలు మోయ వలసి వచ్చింది. మొదటిసారి కేంద్ర ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని గవర్నర్‌ను మార్చి సభలో బలపరీక్షకు అవకాశం కల్పించి నందుకు ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. రెండవసారి ఆ అవకాశమే రాకుండా చేసి ఆయనను అధికారానికి దూరం చేయగలిగారు. రాష్ర్టపతి ఉత్తర్వులనే, తాజాగా ఉత్తరాఖండ్ వ్యవహారంలో జరిగింది, న్యాయస్థానాలు పక్కన పెట్టినప్పుడు స్పీకర్ల నిర్ణయాలనో లేదా నిష్క్రియాపరత్వాన్నో ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఫిరా యింపుల ప్రహసనం మీద అక్కడి ప్రతిపక్షం వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. న్యాయస్థానాలు ఏం చెబుతాయో చూడాలి. ఒకే రకమయిన రెండు సమస్యలకు రెండు భిన్నమయిన పరిష్కారాలు ఉంటాయా? మరో సవరణ అవసరం కాదా! భారత రాజ్యాంగాన్ని మనం బోలెడుసార్లు సవరించుకున్నాం. ఇంకో సవ రణ, అది కూడా రాజకీయాలలో నైతిక విలువల రక్షణ కోసం చేసు కోవలసిన సమయం వచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద స్పీకర్లకు కాకుండా గవర్నర్లకు నిర్ణయాధికారాలు ఇస్తే బాగుంటుందన్న చర్చ జరుగు తున్నది. కానీ కేంద్రం నియమించే గవర్నర్లు ఎంత స్వతం త్రంగా నిర్ణయాలు తీసుకోగలరు? కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన తాజా ఫిరాయింపులనే ఉదాహరణగా తీసుకుని, పార్లమెంట్ చర్చించి తగిన సవ రణలు తెచ్చి పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కొసమెరుపు : ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రయత్నం బెడిసికొట్టాక కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల మీద తెగ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు భాగస్వాములుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, మీ ఆప్తమిత్రుడు, ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే ఈ నీతిమాలిన వ్యవహారం నడుస్తున్నది, దాన్నేం చేస్తారు అని వెంకయ్య నాయుడుని ఒక్క మీడియా మిత్రుడయినా అడిగిన పాపానపోలేదు. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
గోదాలోకి దింపుతున్న‘హోదా’
డేట్లైన్ హైదరాబాద్ రాష్ర్ట ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదు? రెండేళ్లు గడిచిపోయాయి. ఇట్లా అయితే దోస్తీ కటీఫ్ అని ఎందుకు మోదీకి చెప్పడం లేదు? కేంద్రంలోని తన ఇద్దరు మంత్రులను ఎందుకు వెనక్కి పిలిపించుకోవడం లేదు? ప్రత్యేక హోదా అనే సరికి ఎందుకు ఆయన పిల్లిమొగ్గలేస్తున్నారు? పైగా కేంద్రంతో ఘర్షణ కూడదని సహచరులతో పదే పదే ఎందుకు చెబుతున్నట్టు? కారణాలు ఏమైనా ఆయన కేంద్రాన్ని నిలదీయడానికి జంకుతున్నారన్నది స్పష్టం. బీజేపీ, తెలుగుదేశం కూటములు ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో అధికారంలో ఉండగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని స్పష్టమై పోయింది. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇంకా మభ్య పెట్టకుండా ఆ రెండు పార్టీల బాధ్యులూ, ముఖ్యంగా నాయుడు ద్వయం ఒక పత్రికా గోష్టి నిర్వహించి ఆ విషయం స్పష్టంగా ప్రకటించి ఈ మూడేళ్లూ ఎవరి పనులు వాళ్లు చక్క బెట్టుకుంటే మంచిది. ఆ తరువాత ప్రజలే నిర్ణయించుకుంటారు ఏం చేయాలో. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో అన్నీ అనుభవించి తెలుగుదేశానికి వలసపోయి, పార్లమెంట్ సభ్యుడ యిన జేసీ దివాక రరెడ్డి చెప్పినా, రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి పార్లమెంట్ ఆవరణ నుంచి ఇంత మట్టి, కొన్ని కలుషిత యమునా జలాలు తెచ్చి ఇచ్చినా, రాజ్యసభలో కేంద్రమంత్రి చౌదరి ప్రకటించినా, టీడీపీ లోక్‌సభ సభ్యుడు అవంతి శ్రీనివాసరావుకు మరో కేంద్రమంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేసినా, వాటన్నిటి సారాంశం - ఆంధ్రప్రదేశ్‌కు ఈ ప్రభుత్వాల హయాంలో ప్రత్యేక హోదా రాదనే. హోదా పాటను మరిచారు! ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం శాసనసభ లోపలా వెలుపలా ఒంటరి పోరాటం చేస్తోంది. శాసనసభలోకి ప్రవేశం దొరకని ఇతర పార్టీలూ, ప్రజాసంఘాలూ, మేధావులూ వారూవీరూ అని తేడా లేకుండా ప్రత్యేక హోదా కోసం పోరాడడం కనిపిస్తోంది. అయితే రెండు అధికార పక్షాలకూ చీమ కుట్టినట్టు కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలుచోట్ల యువ భేరి కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక హోదా అవసరం మీద యువతను జాగృతం చేసింది. అసెంబ్లీలో రెండుసార్లు హోదా కోరుతూ ఏకగ్రీవ తీర్మానానికి దోహదం చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా బంద్ నిర్వహించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేశారు. మంగళవారం నాడు రాష్ర్ట మంతటా జిల్లా కలెక్టరేట్ల ముందు ఆ పార్టీ ధర్ణాలు నిర్వహించింది. రాష్ర్ట విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని వారి వారి స్థాయిల్లో ఉద్యమాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లు ఈవారం చర్చకు రానుంది. మరి తెలుగుదేశం తదితర పక్షాలు ఏం చేస్తాయో చూడాలి. రాష్ర్ట విభజనలో తన వంతు పాత్ర కూడా నిర్వహించిన బీజేపీ, రాష్ర్ట విభజనను సమర్థిస్తూ కేంద్రానికి లేఖలు ఇచ్చిన తెలుగుదేశం మాత్రం ప్రత్యేక హోదా గురించి నోరు మెదపడానికి కూడా సిద్ధంగా లేవు. ఈ రెండు పార్టీలూ మొదటి నుంచీ ప్రత్యేక హోదాకు వ్యతిరేకం అయితే, ఏనాడూ హోదా గురించి మాట్లాడకపోయుంటే వాళ్లను విమర్శించడం ఏమిటి అని అనుకోవచ్చు. కానీ పోటీలు పడి ప్రత్యేక హోదా కాల పరిమితిని వేలం పాట మాదిరిగా ఐదు, పది, పదిహేను సంవత్స రాలంటూ పెంచుకుంటూ పోయింది ఆ రెండు పార్టీల పెద్దలే, అందునా ఆ ఇద్దరు నాయుళ్లే. ఆ మధ్య తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణ మనాయుడు ఒక ప్రకటన చే శారు- వెంకయ్యనాయుడు భావి రాష్ర్టపతి, చంద్రబాబునాయుడు భావి ప్రధానమంత్రి అని. నిన్నకాక మొన్న అదే నోటితో వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు ముద్దుకృష్ణమనాయుడు. మంత్రులూ, పాత విధేయులూ కొత్తగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక రాగం అందుకున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న చందంగా తాజా విధేయుడు జలీల్ ఖాన్ రెండు రోజులలో మా పార్టీ కేంద్రమంత్రులు ఇద్దరూ రాజీనామా చేస్తారు చూడండి అని ప్రకటించేశారు. ఆయన చెప్పి పది రోజులయినా ఆ సూచనలేవీ లేవు. ఆమధ్య కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా ప్రత్యేక హోదా త్వరలో వస్తుందని ప్రకటించి కూర్చున్నారు. అది ఎక్కడి వరకు వచ్చిందో ఆయనకే తెలియాలి. మంత్రులు, పార్ల మెంట్ సభ్యులు, అధికారపక్షంలోని ఛోటా బడా నాయకులందరూ ఎవరి తోచినట్టు వారు మాట్లాడి ప్రత్యేక హోదా విషయంలో గందర గోళం సృష్టిస్తున్నారు. అసలు వారి నాయకుడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఎంత గందరగోళంలో ఉన్నారో, జనాన్ని ఎంత గందరగోళంలోకి నెడుతున్నారో ఆయన చేస్తున్న పరస్పర విరుద్ధమయిన ప్రకటనలు చూస్తే తెలుస్తుంది. హోదా కోసం ఏదీ కృషి? రాష్ర్ట విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ ప్రకటిస్తే, ఆనాటి ప్రతిపక్షం బీజేపీ తరఫున ముప్పవరపు వెంకయ్యనాయుడు, కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేశారు. చంద్ర బాబు అది పదిహేను సంవత్సరాలకు పెంచేశారు. పరిశ్రమలు రావ డానికే మూడేళ్లు పడితే, ప్రత్యేక హోదా ఐదేళ్లకు సరిపెడితే అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న చంద్రబాబు, మరి ఆ దిశగా చేసిన కృషి ఏమిటి అంటే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ గందరగోళ పడిపోవడమే. ఒకసారి ప్రత్యేక హోదా సంజీవని కాదంటారాయన. హోదా కంటే ఎక్కువ నిధులొస్తే వద్దంటామా అనే అర్థంలో కోడలు కొడుకును కంటా నంటే వద్దు అనే అత్త ఉంటుందా అని తన పురుషాహంకారాన్ని ప్రద ర్శించుకుంటారు. ఒకసారి రాజధాని నిర్మాణానికి ఐదులక్షల కోట్లు అడుగుతారు. మరోసారి రెండున్నర లక్షల కోట్లు ఇవ్వండి చాలంటారు. వీటన్నిటికీ పరాకాష్ట కొత్త రాజధాని శంకుస్థాపన ఉత్సవంలో చంద్రబాబు చేసిన ప్రకటన, ఆ వెంటనే సవరించుకున్న తీరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇతర ప్రముఖులంతా ఉన్న వేదిక మీద చంద్ర బాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోండి అన్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే నాలిక కరుచుకుని మీడియా వారిని పిలిచి, ప్రత్యేక హోదా అనబోయి, తొందరలో ప్రత్యేక ప్యాకేజీ అన్నానని సవరించుకున్నారు. కోట్లాది మంది రాష్ర్ట ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సమస్య మీద సాక్షాత్తూ ముఖ్యమంత్రి ధోరణి ఇది. ప్రత్యేక హోదా పట్ల ఆయనకున్న ఆసక్తి ఎంతో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఒక నాయుడు కోరినట్టు పదేళ్లో, ఇంకో నాయుడు కోరి నట్టు పదిహేనేళ్లో లభించే ప్రత్యేక హోదాను మించి రాష్ట్రానికి ఎక్కువ లాభం ఒనగూడే రీతిలో ఎక్కువ నిధులు ప్యాకేజీల ద్వారా లభించేటట్టు ఉంటే అదే తీసుకురావచ్చు. కానీ అదీ జరగడం లేదేమిటి? మోదీ అంటే భయమా? రాష్ర్ట ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదు? రెండేళ్లు గడిచిపోయాయి. ఇట్లా అయితే దోస్తీ కటీఫ్ అని ఎందుకు మోదీకి చెప్పడం లేదు, కేంద్రంలోని తన ఇద్దరు మంత్రులను ఎందుకు వెనక్కి పిలిపించుకోవడం లేదు? ప్రత్యేక హోదా అనే సరికి ఎందుకు ఆయన పిల్లిమొగ్గలేస్తున్నారు? పైగా కేంద్రంతో ఘర్షణ కూడదని సహ చరులతో పదే పదే ఎందుకు చెబుతున్నట్టు? కారణాలు ఏమైనా ఆయన కేంద్రాన్ని నిలదీయడానికి జంకుతున్నారన్నది స్పష్టం. తెలంగాణలో తొలి రోజులలోనే ఓటుకు కోట్లు నిర్వాకంలో ఇరుక్కున్న కేసులకు భయపడో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మరే అవినీతి కార్యక్రమాలు బయటికొస్తాయన్న భయంతోనో కానీ మొత్తానికి ఆయన ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయలేరని తేలిపోయింది. మాతో ఉండాలనుకుంటే మేం చెప్పినట్టు నడవండి అని కేంద్రం ఇప్పటికే రాష్ర్ట ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాదు రేపో మాపో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం చేయబోతున్నదో స్పష్టమయిన ఒక ప్రకటన రాబోతున్నదనీ, దానికోసం ఢిల్లీలో కసరత్తు జరుగుతున్నదని సమాచారం. ప్రతిపక్షనేత రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రోడ్డెక్కితే, కనీవినీ ఎరుగని ఎండలకు గొంతు తడుపుకోవడానికి కూడా కూడా నీరందక రాష్ర్ట ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి అమెరికా విహారయాత్రకు వెళ్లారు. నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తున్నారు వినండి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
దబాయింపుల రూటు కలంపై వేటు!
డేట్లైన్ హైదరాబాద్ రాజధాని భూముల అక్రమాల గురించి రాసిన మీడియా మీద కూడా కేసులు పెడతామని ఏపీ సీఎం పత్రికా గోష్టిలోనే బెదిరించారు. సోమవారం పోలీసులు కృష్ణా, గుంటూరు జిల్లాల సాక్షి విలేకరులను పిలిపించి, భూకుంభకోణం కథనాలకు ఆధారాలను తెలపాలని కోరారు. ఇది జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నమే. ఇంతకంటే ఏదైనా మంచి మార్గంలో ప్రభుత్వం ఈ వ్యవహారంలో తమకంటిన కళంకాన్ని తొలగించుకుంటే మంచిది. మీడియా స్వేచ్ఛ జోలికి పోతే ఏం జరుగుతుందో చెప్పే గత అనుభవాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏ ప్రాంతంలో వస్తుందో అధికారికంగా నిర్ణయం కాక ముందే, ఆ రాష్ర్ట ప్రజలకు ఎవరికీ తెలియక ముందే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, వారి సన్నిహితులు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, వారిలో కొందరు మంత్రులు, శాసన సభ్యులు సహా ఇతర ప్రముఖులు ఉన్నారని సాక్షి మీడియా కొద్ది రోజుల క్రితం కొన్ని వార్తా కథనాలను ప్రచురించింది. అవి సాక్షి టీవీలోనూ ప్రసార మయ్యాయి. ఆ భూములను కొన్నారని ఎవరెవరి పేర్లు బయటికొచ్చాయో వారు... ఇదంతా పచ్చి అబద్ధం, సాక్షి మీడియా అభూత కల్పన అని ఖండించ లేదు. పైగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎందుకు కొన్నారో చెప్పు కునే ప్రయత్నం చేశారు. తాము చేసిన దానిలో ఏ తప్పూ లేదని, అధికార పక్షానికి దగ్గరగా ఉన్నామనే తమను అప్రతిష్టపాలు చెయ్యడానికి ప్రయత్ని స్తున్నదని నిందించారు. దబాయింపులే సమాధానాలా? అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తే దాని చుట్టు పక్కల ఏ భూముల ధరలు తక్షణం రెక్కలు కట్టుకుని నింగికి ఎగరగలవో అలాంటి భూములనే ఈ పెద్దలు కొన్నారన్నది సాక్షి వాదన. అందుకు ఆధారాలు తన వద్ద ఉన్నా యని కూడా సాక్షి పేర్కొంది. ఇటువంటప్పుడు ఏం జరగాలి? నిజంగానే ఇందులో తమ ప్రమేయమేమీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఆరోప ణలు ఎదుర్కొంటున్న వారు నిజంగా ఈ కొనుగోళ్ళు చెయ్యలేదా లేక రాజ ధాని ప్రకటన తరువాతనే వాటిని కొనుక్కున్నారా? అనేది విచారణలో తేలు తుంది. కాబట్టి వారంతా పులు కడిగిన ముత్యాల్లా ఈ వివాదం నుంచి బయ టికి రావొచ్చు. నిరాధారమైన కథనాలను ప్రచురించి ఉంటే, సాక్షి విశ్వ సనీయతకే భంగం వాటిల్లి ఉండేది. కానీ ఏపీ ప్రభుత్వం ఆ పని చెయ్యలేదు. శాసనసభ లోపలా వెలుపలా కూడా దబాయింపునే అస్త్రంగా ఎంచుకున్నది. ఇదంతా ప్రతిపక్షం కుట్రనీ, పెట్టుబడులు రాకుండా అడ్డుకోడానికి ప్రతిపక్ష నాయకుడు ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించడానికే పరిమితం అయ్యింది. అసలు ఇప్పుడు ఏం జరిగినా దాని వెనక ప్రతిపక్ష నాయకుడి హస్తమే కనిపి స్తున్నది ఏపీ పాలక పక్షానికి. ఒక ఏపీ మంత్రి కుమారుడిని తెలంగాణ పోలీసులు ఒక మహిళను వేధించిన కేసులో అరెస్ట్ చేస్తే... ఆ మంత్రి పత్రికా సమావేశం పెట్టి ఇదంతా జగన్మోహన్రెడ్డి చేయించారని ఆరోపించారు! కలంపై కత్తి దూసే నేత... తోక ఊపే మర్కటం సాక్షి మీడియా గ్రూప్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి కుటుంబానికి సంబంధించినదే, అందులో దాపరికం ఏమీ లేదు. ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పత్రికను, టీవీ చానల్‌ను ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో అందరికీ తెలుసు. నిష్పక్షపాతంగా నిజాలే రాస్తాం, మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదంటూ... ఆ ముసు గులో తమ కుల, వర్గ రాజకీయాలను ప్రచారం చేసే, ప్రయోజనాలను రక్షించుకునే మేక వన్నె పులి వంటి యాజమాన్యాల కంటే ఇది ఎలా చూసినా మెరుగే. అయితే సాక్షి మీడియాలో పని చేస్తున్న వారంతా, ముఖ్యంగా జర్న లిస్టులు ప్రతిపక్ష నాయకుడి పార్టీ కార్యకర్తలనే అభిప్రాయాన్ని కలిగించగలి గితే చాలు... అది బయట పెట్టే అధికారపార్టీ అవకతవకలు, తప్పులన్నీ ఒప్పులయి పోతాయనుకుంటే పొరపాటు. సాక్షిలో పని చేసే జర్నలిస్టులే కాదు, మొత్తంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం (ఏపీయూడబ్ల్యూజే) కూడా ప్రతిపక్ష నాయకుడి పక్షం వహించిందని బాహాటంగా విమర్శించే దుస్సాహసం ఏపీ సీఎం, మంత్రులు, నాయకులూ చేస్తున్నారు. సాక్షి సహా రాష్ర్టంలోని అన్ని మీడియా సంస్థల జర్నలిస్టులందరి సమస్యల మీద 60 ఏళ్ళుగా రాజీలేని పోరాటాలు చేస్తూ సమరశీల ఉద్యమ సంస్థగా అపార విశ్వ సనీయతను సంపాదించుకున్న జర్నలిస్టుల సంఘంపైనే విరుచుకుపడటం వారి అసహనానికి పరాకాష్ట. అది చాలదని... మేమే ఓకే సంఘం పెట్టాం అందులో చేరండి మీకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం అని సాక్షాత్తూ సీఎం బహిరంగ వేదికల మీద జర్నలిస్టులను కోరడాన్ని మించిన దిగజారుడు ఇంకే ముంటుంది? రాజకీయాల్లో ఉన్న వారిలో కొందరు స్వతంత్ర వ్యవస్థల విశ్వ సనీయతను దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో ఏపీ సీఎం సిద్ధహస్తులు. ఆయన ఏం మాట్లాడినా తోకాడించే పత్రికాధిపత మర్కటం ఒకటి జర్నలిస్టుల ఉద్యమ నాయకుడు సాక్షిలో ఉద్యోగం చేస్తున్నాడనే (‘జగన్ కొలువులో’) వెక్కిరింతతో తన ప్రభుభక్తిని చాటుకుంది. దాదాపు రెండేళ్ళు తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తే ఆ నాయకుడే, అదే జగన్ కొలువు నుంచి నడిచొచ్చి పోరాటం ముందు భాగాన నిలిచిన విషయం ఆ మర్కటానికి ఇప్పుడు గుర్తుకు రాదు. మీడియా సంస్థల మీద దాడి జరిగిన ప్రతిసారీ జర్నలిస్టు ఉద్యమం ముందు నిలిచింది. సరే, మర్కటాల గొడవ అలా వదిలేద్దాం. అవి ఎప్పుడెలాటి చేష్టలు చేస్తాయో చెప్పలేం కదా? ముఖ్యమంత్రి తీరు విస్మయకరం రాజధాని భూముల వ్యవహారానికే వస్తే, ముందే చెప్పినట్టు ప్రభుత్వ పక్షం దబాయింపునే ఎంచుకున్నది. శాసన సభ్యులు, మంత్రులు, నాయకులు సహా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఇదే పద్ధతిని ఎంచుకున్నారు. శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరిగి నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఈ భూముల వ్యవహారాన్ని ప్రస్తావిస్తే సీఎం ఊగిపోయారు, సంయమనం కోల్పోయారు. తన ఇద్దరు మంత్రుల మీద వచ్చిన ఆరోపణలకు ఆధారాలను అందించనంత వరకు సభ సాగే ప్రసక్తే లేదని భీష్మించారు. మా వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, కొనుక్కున్నారు. వ్యాపారం చేసుకోవడం తప్పా? అని ఎదురు తిరిగారు. వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఏ వ్యాపారం ఎట్లా చేస్తున్నారన్నది ముఖ్యం. సీఎం, ఆయన కుమారుడూ, కొందరు అధికార పక్ష పెద్దలకు బినామీలుగా ఉన్న వారు ముందే ఉప్పందుకుని ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నారన్న సాక్షి వార్తా కథనాల్లో నిజానిజాలు తేల్చడానికి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించ కుండా, ఆధారాలు ఇవ్వందే సభ నడవడానికి వీల్లేదని సీఎం భీష్మించుకు కూర్చోవడం ఆశ్చర్యపరిచింది, ఎబ్బెట్టుగా అనిపించింది. దర్యాప్తునకు అంగీ కరించకపోగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను అర్ధంతరంగా క్లోజర్ మోషన్‌తో ముగించారు. మన శాసన సభ చరిత్రలో 35 ఏళ్ళ తరువాత మొదటిసారి జరిగిందిలా. పాత్రికేయ స్వేచ్ఛ జోలికి వస్తే.... శాసనసభ వెలుపల సైతం ముఖ్యమంత్రి నిజాలు నిగ్గుతేల్చుతామనే భరోసా ఇవ్వలేదు. రాజధాని భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని రాసిన మీడియా మీద కూడా కేసులు పెడతాం అని ఆయన పత్రికా గోష్టిలోనే బెదిరించారు. నేరం చేసిన వాడి మీదనే ఎందుకు, మీ మీద కూడా కేసు పెట్టాలి అని ఆయన అన్న మాటలు రికార్డయి ఉన్నాయి. ప్రభుత్వం రచించిన ఈ పథకంలో భాగంగానే సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సాక్షి విలేకరులు కొందరిని మంగళగిరి పోలీసులు పిలిపించి తమకు అందిన కొన్ని ఫిర్యాదుల దృష్ట్యా ఈ భూకుంభకోణానికి సంబంధించిన వార్తలకు ఆధారాలను తెలపాలని కోరారు. వార్తలకు ఆధారాలను (న్యూస్ సోర్సెస్) అడిగే అధికారం పోలీసులకు ఎంత మాత్రం లేదు. తమ సోర్స్‌ను రక్షించుకోడం కోసం జైలుకు వెళ్ళడానికి సైతం సిద్ధపడ్డ జర్నలిస్టుల ఉదాహ రణలు ఎన్నో ఉన్నాయి. జర్నలిస్ట్‌లు తమ సోర్స్‌ను వెల్లడించడానికి ఇష్టపడక పోతే, వారిని బలవంత పెట్టకూడదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం లోనే ఉంది. అంతే కాదు, జస్టిస్ పీబీ సావంత్ ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన జర్నలిస్టులను సోర్స్ బయటపెట్టాలని వత్తిడి చెయ్యొ ద్దని న్యాయస్థానాలకు సలహా పూర్వక నోట్లను కూడా పంపారు. మరి మంగళగిరి డీఎస్పీ జర్నలిస్టులను సోర్స్ చెప్పండని ఏ అధికారాలతో అడుగు తున్నారు? ఇది కేవలం ఖాకీ బలం చూపించి జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నమే. ఇటువంటి ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఇంత కంటే మంచి మార్గం ఏదయినా ఎంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని భూముల వ్యవహారంలో తమ వారికి వచ్చిన కళంకాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. మీడియా స్వేచ్ఛ జోలికి పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి పాలకులకు గత అనుభవాలు చాలానే ఉన్నాయి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
అమర్ 'డేట్లైన్ హైదరాబాద్' ఆవిష్కరణ
హైదరాబాద్ : జర్నలిజంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ రాసిన 'డేట్ లైన్ హైదరాబాద్ ' వ్యాస సంకలనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం ఆవిష్కరించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు, పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ అమర్ ఎక్కడా రాజీ పడకుండా తన వృత్తిని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అమర్ సమాజంలోని వివిధ అంశాలపై నిశిత పరిశీలనతో ఈ వ్యాసాలు రాశాడని అన్నారు. -
ఎలాంటి నేతలు రావాలి?
డేట్లైన్ హైదరాబాద్ రాజకీయాలు లేకుండా, సమాజం పట్ల ఒక సక్రమ అవగాహన లేకుండా పోతే జస్టిస్ రమణ చెపుతున్నట్టు మంచి నాయకులు తయారుకాలేరు. ఓ వైపు దేశంలో జార్జ్‌రెడ్డి నుంచి కన్హయ్య కుమార్ దాకా విద్యాలయాల నుంచి మంచి నాయకులుగా తయారై రావాలని ఎట్లా చూస్తున్నారో, మరో వైపు అందుకు పూర్తి భిన్నంగా జస్టిస్ రమణ ఆవేదనకు నిదర్శనంగా ఓ కొత్త నాయకత్వం తయారవుతున్నదీ దేశంలో. అటువంటి వారికి సమాజంతో సంబంధం లేదు, వారసత్వంగా వచ్చే అధికార అహంకారం తప్ప. కృష్ణా జిల్లా కంచికచర్లలో నాలుగు రోజుల కిందట ఒక పాఠశాల 68వ వార్షికోత్సవానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ముఖ్య అతిథిగా హాజరయినప్పుడు నేటితరం విద్యార్థులలో సామాజిక స్పృహ కోరవడుతున్న కారణంగా దేశానికి సరైన నాయకులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మన చదువులనీ, వాటి వెనక వెర్రెత్తినట్టు పరుగులు తీస్తున్న విద్యార్థులనీ, వాళ్ల తల్లిదండ్రుల ధోరణినీ, వేకువ నాలుగు గంటల నుంచి రాత్రి ఏ 11 గంటల దాకానో పుస్తకాల్లో దూరి ఉండి పోయే విద్యార్థులనూ గమనిస్తే ఎవరికైనా జస్టిస్ రమణకు కలిగిన అభిప్రాయమే కలుగుతుంది. రమణగారు ఇంకొన్ని మంచి మాటలు కూడా చెప్పారు. తాను చదువుకునే రోజులలో సామాజిక అంశాలు, వర్తమాన సంఘటనల మీద పాఠశాలల్లో విద్యార్థుల మధ్య చర్చలు జరిగేవనీ, ప్రస్తుతం సామాజికాంశాల మీద విద్యార్థులకు అవగా హన కొరవడి స్పందన లేకుండా పోతున్నదనీ ఆయన బాధపడ్డారు. డాక్టర్లూ, ఇంజనీర్లూ, శాస్త్రవేత్తలూ తయారవుతున్నారు కానీ, మంచి నాయకులు తయారు కావడం లేదన్నారు జస్టిస్ రమణ. ఇది ఆయన ఒక్కరి అభిప్రాయం కాదు. రాజకీయ వ్యవస్థతో సంబంధం లేకుండా దాని వెలుపల ఉన్న అనేకమంది కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. గడచిన రెండుమాసాలుగా భారతదేశం ఒక అవాంఛనీయ, పరస్పర విద్వేషపూరిత, వర్గ వైషమ్యాల వలలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవు తున్న సమయంలో, రాజకీయ వ్యవస్థ ఉన్నత విద్యాసంస్థలను అందుకు ఆటస్థలాలుగా ఎంచుకున్న సమయంలో ఆయన ఈ మాటలు చెప్పారు. చదువు అనేది కేవలం డాక్టర్లనూ, ఇంజనీర్లనూ తయాదుచేసేదిగా కాకుండా మనిషి మనోవికాసానికి, సమాజం పట్ల ఒక సమున్నతమయిన అవగాహన కల్పించడానికి తోడ్పడేది అయి ఉండాలని కోరుకునే వారంతా ఇవాళ జస్టిస్ రమణ లాగానే ఆలోచిస్తున్నారు. సమాజం పురోగమిస్తున్న క్రమంలో మనిషి ఆలోచనలూ, అవగాహనా మారాలి. కానీ చదువుల పట్ల, విద్యాలయాల పట్ల కొన్ని వ్యవస్థలు, సంస్థల ఆలోచన ఎన్ని తరాలు గడిచినా మారదు. వాళ్లు-జస్టిస్ రమణ లాంటి వారు విద్యాలయాలలో ఏది లేదని బాధ పడుతున్నారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండటానికి వీల్లేదని వాదిస్తున్న వాళ్లు. యువత పయనం ఎటు? మన యువత ఎట్లా ఆలోచిస్తున్నది, ఎటువైపు నడుస్తున్నది? ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నది? సమాజం పట్ల దాని అవగాహన ఏమిటి? అన్న చర్చ జరుగుతున్న ఈ సమయంలో గత రెండు మాసాలలో దేశంలోని రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు తీవ్ర అలజడికీ, ఆందోళనకూ గురయ్యాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ అనే విద్యార్ధి ఆత్మహత్య, అంతకు ముందు, ఆ తరువాత జరిగిన సంఘటనలు, వీటి కొనసాగింపుగా ఢిల్లీలోని మరో ప్రతిష్టాత్మక విద్యాలయం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో జరిగిన ఆందోళన, తదనంతర పరిణామాలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సరిగ్గా ఇదే సమయంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాదాపు 45 ఏళ్ల క్రితం హత్యకు గురైన యువ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితచరిత్రను ప్రచురించింది. అన్యాయాన్నీ, సమాజంలోని హెచ్చుతగ్గులనీ ఎదుర్కొనే క్రమంలో 25 ఏళ్ల జార్జ్‌ని క్యాంపస్‌లోనే చంపేశారు. ఆనాడు జార్జ్ హత్యకు కారకు లయిన వాళ్లూ, మొన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ప్రతిభావంతుడైన రీసెర్చ్ స్కాలర్ రోహిత్‌ను ఆత్మహత్య వైపు బలవంతంగా నెట్టిన వాళ్లూ, దాని కొనసాగింపుగా ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను దేశద్రోహి అని నిందించి రాజద్రోహ నేరం కింద జైలుకు పంపించాలని పట్టుబట్టిన వాళ్లూ, ఆ పని చేయించిన వాళ్లూ అందరూ ఒకే భావజాలానికి చెందినవారు. సరిగ్గా ఈ సమయంలో జార్జ్ జీవితం మీద అంత సమగ్రం కాకపోయినా కొంత యినా వివరించే ఒక పుస్తకం రావడం కాకతాళీయమే కావచ్చు. కానీ సరైన సమయానికే వచ్చిందని అనుకోవాలి. ఆనాడు జార్జ్‌రెడ్డి అయినా, ఇప్పటి రోహిత్, కన్హయ్య కుమార్ అయినా రమణ గారు చెప్పిన ఆ సామాజిక స్పృహను కాపాడుకునే ప్రయత్నంలోనే ఇబ్బందులు పడ్డారు. వర్తమాన సమాజం స్థితిగతుల మీద విద్యార్థులకు అవగాహన ఉండాలి కనుకనే, విద్యాలయాల్లో వీటి మీద చర్చ జరగాలని కోరుతున్నారు కనుకనే హత్యలకు గురవుతున్నారు. ఆత్మహత్యల వైపు నెట్టబడుతున్నారు. రాజద్రోహం నేరారోపణ మీద కారాగారాల పాలవుతున్నారు. విద్యాసంస్థలలో ఏ వాతావరణం ఉండాలని జస్టిస్ రమణ వంటి పెద్దలు కోరుతున్నారో వీళ్లంతా అటువంటి ఆలోచనలను ముందుకు తీసుకుపోతున్నవారే. కొత్తతరం నేతలు ఎక్కడ? భారతదేశం నుంచి కాకుండా భారతదేశంలోనే తనకూ, తనలాంటి ఎంతో మందికీ స్వేచ్ఛ కావాలని కోరుతున్నవాడు కన్హయ్య కుమార్. అయితే ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరతాడో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆయనను ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు నెట్టాలని చూస్తున్న పెద్దలకు కన్హయ్య కుమార్‌కు రాజకీయాలు ఉండడం మాత్రం ఇష్టం లేదు. రాజకీయాలు లేకుండా, సమాజం పట్ల ఒక సక్రమ అవగాహన లేకుండా పోతే జస్టిస్ రమణ చెపుతున్నట్టు మంచి నాయ కులు తయారుకాలేరు. ఓ వైపు దేశంలో జార్జ్‌రెడ్డి నుంచి కన్హయ్య కుమార్ దాకా విద్యాలయాల నుంచి మంచి నాయకులుగా తయారై ఎట్లా రావా లని చూస్తున్నారో, మరోవైపు అందుకు పూర్తి భిన్నంగా, జస్టిస్ రమణ ఆవేదనకు నిదర్శనంగా ఓ కొత్త నాయకత్వం తయారవుతున్నదీ దేశంలో. అటువంటి వారికి సమాజంతో సంబంధం లేదు, వారసత్వంగా వచ్చే అధికార అహంకారం తప్ప. మన దేశంలో ఇప్పుడు ఎటువంటి నాయ కులు చట్ట సభలలోకి వస్తున్నారు, వారు ఎటువంటి వారసులను తయారు చేసే పనిలో పడ్డారు అనే సంగతి చెప్పడానికి బోలెడు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. గతవారం రోజులలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల ఉదంతాలే అందుకు తాజా ఉదాహరణ. వారిలో ఒకరు పేర్గాంచిన నట, రాజకీయ దిగ్గజానికి రెండింటా వారసుడు కాగా, మరొకరు కొత్తగా రాజకీయాల రుచి తెలిసిన నాయకుడి కాబోయే వారసుడు. ఒకాయన నందమూరి బాలకృష్ణ అయితే, మరొక రు రావెల సుశీల్‌బాబు. నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు నట వారసుడే కాదు, బయటికి చెప్పక పోయినా ఎప్పుడో అప్పుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఉన్న నాయకుడు కూడా. ప్రస్తుతం శాసనసభ్యుడి పదవితో సరిపెట్టుకుని అధికార పార్టీకి పెద్ద ఆకర్షణగా నిలబడ్డవాడు. ఒక సినిమా ఫంక్షన్లో స్త్రీల పట్ల అతి జుగుప్సాకర వ్యాఖ్యలు చేసి అందరూ తిట్టేసరికి తప్పు ఒప్పుకుని క్షమా పణలు చెప్పారు. ఆయన వంటి వారిని ఆదర్శంగా తీసుకుని పట్టపగలు హైదరాబాద్ నడివీధిలో ఒక యువతి పట్ల అభ్యంతరకరంగా వ్యవహ రించి సుశీల్ జైలుకు వెళ్లారు. బావమరిది బాలకృష్ణ చేసిన దానికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నోరెత్తి ఒక్కమాట కూడా అనరు. కొడుకు సుశీల్ చేసిన దాన్ని తండ్రి, మంత్రి రావెల కిశోర్‌బాబు సమర్థించుకుంటారు. మంచి నాయకులు తయారుకావడంలేదని ఆందోళన చెందడానికి ఇటు వంటి నాయకుల చేష్టలే కారణం. విశ్వవిద్యాలయాలలో రాజకీయాలు ఎందుకు అంటున్నవాళ్లు, రాజకీయాలలో ఈ కీచకపర్వం ఏమిటి అని మాత్రం ప్రశ్నించరు. కన్హయ్య కుమార్ వంటివారిని జైల్లో పెట్టాలంటారు. రావెల సుశీల్ వంటి వారిని వెనకేసుకొస్తారు, కాపాడే ప్రయత్నం కూడా చేస్తారు. విద్యార్థులకు రాజకీయాలు వద్దా! విద్యార్థులకు రాజకీయాలు వద్దు, విశ్వవిద్యాలయాలలో చదువు తప్ప ఇంకొకటి ఉండకూడదు అనే వాళ్లు ఉన్నంతకాలం జార్జ్‌రెడ్డి లాంటి వాళ్ల హత్యలు జరుగుతాయి. రోహిత్‌లు ఆత్మహత్యలు చేసుకుంటారు. కన్హయ్యలు రాజద్రోహ నేరం కింద జైలుకు వెళుతూనే ఉంటారు. రాజకీయాలలో వారసుల ఆగడాలను ఇట్లా మనం చూస్తూనే ఉంటాం. (వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్) -
అభద్రతా వలయంలో చంద్రుడు
డేట్లైన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేసిన ఈ కార్యక్రమం వల్ల తెలంగాణలో తమ పార్టీకి అన్యాయం జరిగిందంటూ నోరెత్తి చెప్పుకునే అర్హత పూర్తిగా కోల్పోయారు. ఓటుకు కోట్లు వ్యవహారం నడిపించి ఇంకొన్నాళ్లు హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించే అవకాశాన్ని వదులుకున్న చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ పెద్దలు తెలంగాణలో తమ పార్టీకి అక్కడి అధికార పార్టీ వల్ల జరిగిన నష్టాన్ని గురించి నోరెత్తే అర్హతను కూడా సోమవారం రాత్రి భూమా నాగిరెడ్డి బృందాన్ని తమ పార్టీలో చేర్చుకుని కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజులలోనే ఆయనకు ఒక కోరిక ఉండేదట. దాని గురించి స్నేహితులతో చెబుతూ ఉండేవారట కూడా. ఏనాటికయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి అన్నదే ఆ కోరిక. నారావారిపల్లె నుంచి తిరుపతికి బస్సులో రావడానికి కూడా డబ్బులు లేని రోజులవి. తాడూ బొంగరం లేదు, కాణీకి ఠికానా లేదు. బాబు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడని సావాసగాళ్లంతా ముక్కున వేలేసుకునేవారట. అవి యూనివర్సిటీలో ఎం.ఎ. చదువుతున్న రోజులు. తీరిక దొరికి నప్పుడల్లా ఇదే పాట. కోరికలు అందరికీ ఉంటాయి. అవన్నీ నేరవేరేనా? అని ఆయన మాటలను తేలిగ్గా తీసుకునేది ఆయన మిత్రబృందం. ఓ ఇరవయ్యేళ్లు కాలగర్భంలో కలసిపోయాయి. చంద్రబాబునాయుడు 1995 చివర్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కల నెరవేరింది. పాత మిత్రులంతా ఆయన చిరకాల వాంఛను గుర్తు చేసుకుని మనవాడు పట్టుదలతో అనుకున్నది సాధించాడు, పట్టుదల అంటే అలా ఉండాలి! భేష్ అని మెచ్చుకున్నారు. ఇదంతా చంద్రబాబు తన మామగారు ఎన్.టి. రామారావుకు శ్రమతో దక్కిన అధికారాన్ని అక్రమంగా లాగేసుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పుడు కొన్ని పత్రికలలో ఆయన దృఢసంకల్పాన్ని వేనోళ్ల కీర్తిస్త్తూ రాసిన కథనాలలో భాగంగా మనం కూడా చదువుకున్నదే. పదవే ముఖ్యం చంద్రబాబు కోరిక నెరవేరింది నిజమే, కానీ అది ఏ విధంగా అన్నది ఆ మిత్రులు మరిచిపోయారు. మిత్రులు కాబట్టి, విషయం తెలిసినా, ఎలా అయితే ఏమి మన మిత్రుడు ముఖ్యమంత్రి అయ్యాడని మురిసిపోయి ఉంటారు. ఏ మార్గంలో వెళ్లామన్నది అనవసరం. అంతిమ ఫలితం ఏమిటన్నది ముఖ్యం అన్న చందంగా రాజకీయాలు తయారై చాలా కాలమైంది. ఓ ఇరవై సంవత్సరాల క్రితమే రాజకీయాలలో నీతి అనేది నేతి బీరకాయలో నెయ్యి వంటిదని చెప్పినవారు చంద్రబాబు. దేశమంతటా సాగుతున్న ఫిరాయింపు రాజకీయాలకు ఆయన ఆదర్శం. చంద్రబాబు 1995 ఆగస్ట్ సంక్షోభం సమయంలో వైస్రాయ్ హోటల్లో శిబిరం ఏర్పాటు చేసిననాడు 30, 35 మంది ఎమ్మెల్యేలకు మించి ఆయనతో లేరు. రెండోరోజు, మూడోరోజు గడిచే సరికి పత్రికల వార్తలకు భయపడి కొందరు, ప్రలోభాలకు లొంగి కొందరు మొత్తానికి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమయిన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఆయన పక్కన చేరారు. ఆ సంక్షోభం నాటి విషయాలు ఇప్పుడెందుకు అన్న సందేహం ఎవరికయినా కలగవచ్చు. అట్లా సందేహం కలగడం సహజం. ఎందుకంటే ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు లాక్కున్నాడు. ఇప్పుడు అట్లా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన పార్టీని గెలిపిస్తేనే ముఖ్యమంత్రి అయ్యారు కదా అన్న వాదన రావడం కూడా సహజమే. 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎన్ని సర్కస్‌లు చేస్తే అధికారంలోకి వచ్చిందీ అందరికీ తెలుసు. అధికార పక్షానికీ, ప్రతిపక్షానికీ మధ్య ఓట్ల తేడా ఎంతో కూడా అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాల్సిందే కానీ, ఈ 20 నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజల భ్రమలు తొలగిపోయి ఎంత అసంతృప్తిలో ఉన్నారో కూడా ఆయనకు తెలుసు. ఎప్పుడేం జరుగుతుందో అనే అభద్రత ఆయనను వెన్నాడుతున్నట్టే ఉంది. ఆది నుంచీ అభద్రతా భావమే సోమవారం నాటి సాక్షి చానల్లో ఫోర్త్ ఎస్టేట్ చర్చలో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం, అక్కడి ప్రభుత్వంలో భాగస్వామి భారతీయ జనతా పార్టీ నాయకుడు గరిమెళ్ళ చిట్టిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అభద్రతాభావం వల్లనే ప్రతిపక్ష శాసన సభ్యులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయిదేళ్లు పాలించమని ప్రజలు తీర్పు ఇచ్చాక అభద్రతాభావం ఎందుకు అన్న అంశం దగ్గరే 1995 ప్రస్తావన కూడా అవసరం. చంద్రబాబు నాయుడు చదువుకునే రోజులలో ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న మాట నిజమే. అప్పుడాయన యువకుడు. విద్యావంతులయిన యువకులు సహజం గానే నీతిమంతమయిన రాజకీయాల ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏమయినా మంచి చేద్దామనుకుంటారు. ఆయన ఆ దారి వదిలేసి, రెండో దారి వెతుక్కున్నారన్న విషయం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుంది. అడ్డదారులంటే కోపం రావచ్చు. ఇంగ్లిష్‌లో షార్ట్ కట్స్ అందాం. ఆయన షార్ట్ కట్స్ ద్వారానే ముఖ్యమంత్రి స్థాయికి రాగలిగారు. కాబట్టే అడుగడుగునా ఆయనను అభద్రతాభావం వెంటాడుతూ ఉంటుంది. అందుకే షార్ట్ కట్ పద్ధతులు అనుసరిస్తుంటారు. అత్యద్భుతమయిన ప్రజా తీర్పుతో రెండోసారి అధికారం చేపట్టిన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చాలా కొద్ది మాసాలలోనే కూలదోసి అధికారంలోకి రావడానికి కూడా చంద్రబాబునాయుడులో ఆనాడు ఉన్న అభద్రతాభావమే కారణం. ఆనాటి మంత్రివర్గంలో రెండు ముఖ్య శాఖలు- రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇచ్చినా కూడా ఆయనలో అభద్రతాభావం అలాగే ఉండిపోయి, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసే దాకా వెళ్ళింది. ఆ తరువాత కూడా ఎన్టీఆర్‌తో ఉన్న శాసనసభ్యులను కూడా తన శిబిరంలోకి రప్పించుకునే వరకూ ఆయనను అభద్రత వదలలేదు. ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని నడుపుకునేందుకు అవసరమైనంతమంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీలో ఉన్నారు. అయినా ఎందుకు ప్రతిపక్ష శాసన సభ్యులను పార్టీలోకి లాక్కునే పనిలో పడ్డారు? తమ ప్రభుత్వ పనితీరు నచ్చి, అభివృద్ధిని కాంక్షించి ఓ నలుగురు శాసన సభ్యులు ప్రతిపక్షాన్ని వీడి తమ పంచన చేరారని తెలుగుదేశం వారు చెబుతున్నారు. మరి పక్క రాష్ర్టం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అధికార పార్టీలోకి వలసపోతే నీతిబాహ్యం అని నోరు పారేసుకున్నారెందుకు? చంద్రబాబు అభద్రతాభావం కారణంగానే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. అభద్రత కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అందులో నుంచి బయట పడాలనుకున్నారు. అది బెడిసి కొట్టి చివరికి తెలంగాణలో పార్టీ ఉనికి కూడా లేకుండా చేసుకున్నారు. తెలంగాణలో మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొంటున్నారు చూశారా తమ్ముళ్లూ అని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు పక్షం రోజులు తిరక్కుండానే చేసిందేమిటి? ఆయనలో అభద్రతాభావం 2014 నాటి ఎన్నికలలో గెలిచిన క్షణం నుంచే ఉంది. అందుకే ప్రమాణ స్వీకారాలయినా కాకుండానే ఇద్దరు ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులకు తన పార్టీ కండువా కప్పారు. ప్రతిపక్ష శాసన సభ్యుల వేట కూడా ఆయన ఆనాడే ప్రారంభించారు. ఆ నలుగురిని లాక్కోడానికి 20 నెలలు పట్టింది. నైతిక హక్కును కోల్పోలేదా? ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేసిన ఈ కార్యక్రమం వల్ల తెలంగాణలో తమ పార్టీకి అన్యాయం జరిగిందంటూ నోరెత్తి చెప్పుకునే అర్హత పూర్తిగా కోల్పోయారు. ఓటుకు కోట్లు వ్యవహారం నడిపించి ఇంకొన్నాళ్లు హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించే అవకాశాన్ని వదులుకున్న చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ పెద్దలు తెలంగాణలో తమ పార్టీకి అక్కడి అధికార పార్టీ వల్ల జరిగిన నష్టాన్ని గురించి నోరెత్తే అర్హతను కూడా సోమవారం రాత్రి భూమా నాగిరెడ్డి బృందాన్ని తమ పార్టీలో చేర్చుకుని కోల్పోయారు. తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడే తల ఎగరేశారు. ఫిరాయింపు రాజకీయాల గురించి ఇక తెలంగాణ తెలుగుదేశం వీరుడు రేవంత్‌రెడ్డి ఏం ఫిర్యాదు చేస్తారు? తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరి చేతా రాజీనామాలు చేయించి మళ్లీ పోటీ చేసి గెలవండని శాసించే స్థితిలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లో మీ నిర్వాకం మాటేమిటి అని ఎవరయినా ఎదురు ప్రశ్నిస్తే? భవిష్యత్ రాజకీయాలను నడిపించాల్సిన యువతరం ఈ నీతిమాలిన వ్యవహారాలను నిలదీసి కడిగెయ్యాలి. కానీ నాన్న వేలు పట్టుకుని అలవోకగా పార్టీ మారిపోయిన యువ రాజకీయవేత్త అఖిలప్రియను చూశాక ఆ ఆశ కూడా సన్నగిల్లుతున్నది. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
ఆ ప్రభుభక్తితో ప్రమాదమే!
‘నారా లోకేశ్‌బాబుకు తెలంగాణ అధికారులను కూడా శాసించే స్థాయి పదవి ఏదన్నా ఇవ్వండి, అప్పుడు రాష్ట్రంలో మేం పార్టీని బలోపేతం చేస్తాం’ అని తెలుగుదేశం శాసనసభా పక్షానికి కొత్త నాయకుడిగా నియమితుడయిన ఆనందంలో రేవంత్‌రెడ్డి పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని వేడుకున్నారు. ఎవరీ లోకేశ్‌బాబు అంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధినేత కుమారుడు. ఆంధ్రప్రదేశ్‌లో అనధికారికంగానే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నవాడు. అక్కడ తెలుగుదేశం అధికారంలో ఉంది. ప్రాంతీయ పార్టీ కాబట్టి అధినాయకుడికి తిరుగుండదు. చంద్రబాబు ఈసారి అధికారంలోకి వచ్చాక ఆయన కుమారుడు కూడా రంగప్రవేశం చేశాడు. వారం క్రితమే లోకేశ్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘మేమే నంబర్ వన్’ అని ప్రచారం చేసుకుని, చివరికి ఒకే ఒక్క డివిజన్ గెలుపుతో సరిపెట్టుకుని హుటాహుటిన విజయవాడ బాట పట్టారు. నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికే వెళ్లి మంత్రులతో సమీక్షలు జరిపారు. ఆయన సీనియర్ మంత్రులతో ప్రభుత్వ కార్యకలాపాల మీద సమీక్ష జరుపుతున్నంత సేపూ ముఖ్యమంత్రి అదే భవన సముదాయంలో మరో గదిలో ఉన్నారు. చంద్రబాబునాయుడు నెమ్మదిగా తన బాధ్యతలను కుమారుడికి అప్పగించే ఆలోచనతో ఉన్నారన్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది. లోకేశ్‌బాబుకు మాత్రం ఆ నెమ్మది నచ్చినట్టులేదు. ఆయన వేగం పెంచేశారు. రాజకీయాలు, అధికారిక కార్యకలాపాలతో సహా ఆర్థిక లావాదేవీలను కూడా ఆయనే చక్కబెడుతున్నారన్న ప్రచారం బలంగా వినిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులూ, సీనియర్ మంత్రులూ కొందరు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నా మరో మార్గం లేదు కాబట్టి మెదలకుండా ఊరుకుంటున్నారు. ఇదేమీ కొత్త పరిణామం కాదు కొడుకులనూ, కూతుళ్లనూ; కొండొకచో భార్యనూ రాజకీయ వారసులను చేయాలని నాయకులు కోరుకోవడం దేశ రాజకీయాలలో కొత్తేమీ కాదు, వింత అంత కన్నాకాదు. నెహ్రూ కుటుంబం నుంచి మొదలు, కింది స్థాయి దాకా బోలెడు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. దేశ రాజకీయాలలో ఇప్పుడు నెహ్రూ కుటుంబంలో నాలుగో తరం నడుస్తున్నది. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో అధికారంలోకి వస్తే కొడుకు స్టాలిన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిని చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి ఆలోచిస్తుంటే, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ తన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసి, పార్లమెంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. బిహార్‌లో లాలూప్రసాద్ ఎన్నడో తన భార్యను వారసురాలిని చేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తాను వెనక నుంచి చక్రం తిప్పారు. ఇట్లా బడా కాంగ్రెస్ నుంచి, చోటా ప్రాంతీయ పార్టీల దాకా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తెలంగాణ లో టీఆర్ఎస్ అధినేత, రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా తన కుమారుడు, రాష్ర్ట మంత్రి కేటీ రామరావును ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం కూడా బలంగా ఉన్నది. మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో మొత్తం ప్రచార బాధ్యత ఆయనకు అప్పగించి కేసీఆర్ అందుకు వేదిక సిద్ధం చేసేశారని కూడా ప్రచారం జరుగుతున్నది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డి కూడా రాజకీయాలలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో బలమయిన రాజకీయశక్తినని నిరూపించుకున్నారు. కాంగ్రెస్‌ను కాదని, సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికలలో పోరాడి ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. కేటీ రామారావు, జగన్మోహన్రెడ్డిల రాజకీయ ప్రవేశాలని లోకేశ్ రాజకీయ ప్రవేశంతో పోల్చడానికి వీలులేదు. డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత, ఆయనకున్న ప్రజాదరణ కారణంగా వెంటనే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని దాదాపు మంత్రివర్గమంతా సంతకాలు చేసి ఒత్తిడి తెచ్చినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. నిజానికి అధిష్టానం మీద తిరగబడి జగన్మోహన్రెడ్డి వెంట నడిచే మూడ్‌లో వారంతా ఉన్నా, జగన్మోహన్రెడ్డి ఆ పనిచేయలేదు. ఆ పని ఆయన చేసి ఉంటేఅప్పటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఆనాడే ఖాళీ అయ్యి ఉండేది. కానీ ఆయన ఆ పని చేయకుండా కాంగ్రెస్ పదవిని వదిలేసి, సొంత పార్టీ పెట్టి స్వశక్తి మీద ప్రజాబలంతో నెగ్గి ప్రతిపక్ష నాయకుడయ్యారు. తెలంగాణ రాష్ర్టం కోసం జరిగిన తుది విడత సుదీర్ఘ పోరాటంలో భాగస్వామి అయ్యారు కాబట్టే కేటీఆర్ ముఖ్యమంత్రి కొడుకయినా రాజకీయాలలో ప్రజామోదం పొందగలిగారు. ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేశ్ పైలట్, మాధవరావు సింధియాల కుమారులు కూడా తండ్రుల రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని కేంద్ర రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే. తండ్రుల ప్రతిష్ట, ప్రజాదరణ కొంత పనిచేసినా వారూ స్వశక్తి మీద రాజకీయాలలో రాణించిన వాళ్లే. కొంప ముంచుతున్న ప్రభుభక్తి ఇన్ని ఉదాహరణలు ఉండగా లోకేశ్ రాజకీయాలలోకి రావడాన్ని ఎవరూ అభ్యంతర పెట్టరు. టీడీపీలో చంద్రబాబునాయుడు ఎంతంటే అంత కాబట్టి ఆయన కుమారుడిని వారసునిగా నిర్ణయిస్తే అది ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఇష్టం. తెలంగాణలో సమస్య అంతా రేవంత్‌రెడ్డి వంటి వారి ప్రభుభక్తి వల్ల వస్తుంది. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఏర్పడిన రాష్ర్టంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇక్కడి అధికారులను శాసించే అధికారాలు లోకేశ్‌కు ఇప్పించండి దేవరా అని చంద్రబాబును ప్రాధేయపడుతున్నారు రేవంత్‌రెడ్డి. తెలంగాణలో లోకేశ్ అధికారాలు ఎలా సాగుతాయి? అసలు రేవంత్‌రెడ్డి ఏం కోరుకుంటున్నారు? అంటే లోకేశ్‌ను రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రిపదవి కూడా ఇప్పించి తెలంగాణ అధికారులను శాసించే అధికారాలు హక్కు భుక్తం చేయండి అని. లోకేశ్‌ను రాజ్యసభకు పంపడం చంద్రబాబు చేతిలో పని. మరి మిగతా రెండు? కేంద్ర మంత్రిపదవి కూడా ఎన్డీఏ భాగస్వామిగా, వెంకయ్యనాయుడు లాంటి నాయకుల సహకారంతో, ఇప్పుడున్న ఇద్దరిలో ఒకరికి ఉద్వాసన పలికి లోకేశ్‌కు ఇప్పించుకోవచ్చు. అప్పుడయినా ఆయన తెలంగాణ అధికారులను ఎలా శాసిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం రేవంత్‌రెడ్డి మాత్రమే చెప్పగలరు. ఈ ప్రపంచంలో మరెవరికీ అర్థం కాని ప్రశ్న ఇది. రాష్ర్టంలో, కేంద్రంలో కూడా ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర మంత్రుల హవా రాష్ట్రాలలో అంతంత మాత్రమేనని మనకు తెలుసు. లోక్‌సభకు ప్రజల చేత ఎన్నికయి కేంద్ర మంత్రులయిన వారి అధికారాలు కూడా పరిమితమే. ఇంకా చెప్పాలంటే, కేంద్రంలో ఒక పార్టీ, రాష్ర్టంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రమంత్రుల హవా ఇంకా పరిమితం. అట్లాంటిది తెలంగాణ లో జెండా పీకేసిన తెలుగుదేశం పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి లోకే శ్ను ఎన్డీఏలో మంత్రిని చెయ్యండి అని రేవంత్‌రెడ్డి అడుగుతున్నారు. దీన్ని రాజకీయ పరిణతి అందామా? ఇటువంటి రాజకీయ పరిణతి కారణంగా చేసిన ఓటుకు కోట్లు నిర్వాకం తెలంగాణ లో టీడీపీ పతనానికి నాంది అనీ, ఆ నిర్వాకం ఇదే రాజకీయ ధురంధరుడు రేవంత్రెడ్డిదేననీ మనందరికీ తెలుసు. ప్రస్తుతానికయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దుకాణం ఖాళీ అయింది. గెలిచిన పదిహేనుమందిలో పదిమంది అధికార పార్టీలోకి వలసపోయారు, ఇంకో ఇద్దరు సిద్ధంగా ఉన్నారట, రేపో మాపో గోడ దూకడానికి. అసాధ్యాలు సుసాధ్యాలవుతాయా? లోకేశ్‌బాబు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పూర్వ ైవైభవం పొందడం రెండూ వేర్వేరు అంశాలన్న విషయం రేవంత్‌రెడ్డి వంటి ప్రభుభక్తి పరాయణులు గుర్తిస్తే మంచిది. లోకేశ్ రాజకీయాలలో రాణిస్తాడా లేదా అన్నది ఆయన మీదే ఆధారపడి ఉంటుంది. సహజంగా ఆ లక్షణాలు లేకుండా బలవంతంగా ఎవరూ నాయకులు కాలేరు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి లోకేశ్ వంటి యువకుడి అవసరం ఉండి ఉండవచ్చు. అయితే రాజకీయాలలో ఆయన ఏ మాత్రం రాణిస్తారో ముందు ముందు తెలుస్తుంది. తెలంగాణలో టీడీపీ బలోపేతం కావడం మాత్రం నిజాయితీ గల నాయకత్వంతో, సమస్యల మీద పోరాటం చేసి మళ్లీ ప్రజాదరణ పొందితే తప్ప తేరగా వచ్చిన డబ్బు గుప్పించి ఎమ్మెల్యేలను కొనుగోలు చే స్తేనో, లోకేశ్‌ను దొడ్డిదారిన కేంద్రమంత్రిని చేస్తేనో సాధ్యం కాదు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
తుని తగువుతో నగుబాటు
డేట్లైన్ హైదరాబాద్ తునిలో విధ్వంసం కొనసాగుతూ ఉండగానే ముఖ్యమంత్రి విజయవాడలో మీడియాను పిలిచి, ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రకటించేశారు. అక్కడ ఏం జరుగుతున్నదో అక్కడ ఉన్నవారికే అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబుకు కళ్లకు కట్టినట్టు కనిపించడం ఆశ్చర్యం. ఆ దృశ్యంలో ఆయనకు ప్రతిపక్ష నేత కనిపించాడు, పులివెందుల కూడా కనిపించింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరిగితే వాస్తవాలు తెలుసుకుని బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వాధినేత ఒక పక్క తుని తగలబడుతుంటే హేట్ స్పీచ్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గడిచిన గురువారం తెలంగాణ భవన్లో పత్రికల వారితో మాట్లాడారు. ఈ పత్రికా గోష్టి, రెండురోజులకు పెరేడ్ గ్రౌండ్స్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగం వరకే ఆయన తన ప్రచారాన్ని పరిమితం చేశారు. ముఖ్యమంత్రి బదులు ఆయన కుమారుడు, రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రచార బాధ్యత మొత్తం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మంచిదే. ఆయన నగరంలో తిరిగి ప్రచారం చేస్తే జనానికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. భద్రతా ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమంత్రి పత్రికాగోష్టిలో పొరుగు రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబునాయుడుకు హైదరాబాద్‌లో ఏం పని? హిందూపురం నుంచి ఇచ్ఛాపురం దాకా ఊడ్చాల్సిన నగరాలు బోలెడున్నాయి’ అని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ ఆక్షేపణను చాలామంది తప్పు పట్టారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌కు పరిమితమయిన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎన్నికయిన ఇద్దరు శాసనసభ్యులను పార్టీలో చేర్చుకుని, అందులో ఒకరికి మంత్రి పదవి కూడా ఇచ్చిన చంద్రశేఖర్‌రావు తోటి తెలుగు ముఖ్య మంత్రికి ఇక్కడేం పని అనడం బాగా లేదన్నారు కొందరు. హైదరాబాద్‌లోనే ఉంటారా? ఆయన పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు, జాతీయ అధ్యక్షుడి హోదాలో వస్తేతప్పేంటి అన్నారు మరికొందరు విమర్శకులు. నిజమే, ఎవరయినా ఎక్కడికైనా వెళ్లి మాట్లాడవచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. ఆ కోణం నుంచేచంద్రబాబు ప్రచారం చేయడాన్ని చూడాలి. అప్పటికే ఆయన కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌బాబు, ఇతర నాయకులు హైదరాబాద్ ప్రచారంలో ఉన్నారు. లోకేశ్ తన ప్రచారంలో కొన్నిచోట్ల, ‘నేను హైదరాబాద్‌లో పుట్టాను, ఇక్కడే పెరిగాను, కాబట్టి ఇక్కడి వాడినే!’ అని చెప్పారు. ఎవరికీ అభ్యంతరం ఉండ నక్కరలేదు. నిజానికి ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా హైదరాబాద్ వాసే. 2014 ఎన్నికలలో ఆయన హైదరాబాద్(తెలంగాణ)లో ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. అయితే పరిస్థితులు మారిపోయాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికలలో ప్రచారం చేస్తూ చంద్రబాబు, నేనెక్కడికీ పోలేదు, ఇక్కడే ఉన్నా, ఉంటాను అని కూడా అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటా నంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండకూడదు. భారతదేశంలో ఎక్కడయినా స్వేచ్ఛగా జీవించే హక్కు మన రాజ్యాంగం అందరితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ప్రసాదించింది. మరి, ఆయన ఇక్కడే ఉంటానని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? నేనున్నానని ఆయన ఎవరికి భరోసా కలిగించాలని అనుకుంటున్నారు, హైదరాబాద్‌లో? ఇక్కడ ఆయన లేనప్పుడు ఎవరికయినా ఇబ్బంది కలిగితే, అప్పుడు అలాంటి భరోసా కలిగిస్తే అర్థం ఉంది. అటువంటి వాతావరణం హైదరాబాద్‌లో ఎక్కడా కనిపించలేదు ఈ 20 మాసాల్లో. ఇక్కడ లేకుండా పోవాల్సిన పరిస్థితులను ఆయనే కల్పించుకున్నారు. సరిగా ఉంటే పదేళ్లపాటు (2019లో ప్రజలు మళ్లీ అధికారం ఇస్తే గిస్తే ) ఆయన ప్రభుత్వాన్ని హాయిగా హైదరాబాద్ నుంచే నడుపుకుని ఉండేవారు. అట్లా కాకుండా అర్ధంతరంగా మూటా ముల్లే సర్దు కుని విజయవాడలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన చెయ్యాల్సి రావ డానికి కారణం అందరికీ తెలిసిందే. ఈ జూన్ మాసం నాటికి అంతా విజయవాడ వచ్చెయ్యాల్సిందేనని ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆదేశాలు జారీ చేసి, ఇంకో పక్క నేనెక్కడికీ పోను ఇక్కడే ఉంటానని చంద్రబాబు చెప్ప డంలో అర్థం ఉందా? మరి ఇలా మాట్లాడతారెందుకు? ఎందుకంటే, నగ రంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతవాసులు ఈ భరోసాతో జీహెచ్ఎంసీ ఎన్నిక లలో టీఆర్ఎస్కు కాకుండా, తమకు ఓట్లేస్తారన్న ఆశ. పోలింగ్ కూడా పూర్త యింది. ఇక్కడి ఆంధ్రుల ఓటు ఎవరిదో రెండురోజుల్లో తెలిసిపోతుంది. ఎప్పుడూ పరనిందే ఇక తెలంగాణ సీఎం పత్రికా గోష్టిలో చేసిన వ్యాఖ్య గురించి- ఆయన చెప్పిన హిందూపురం, ఇచ్ఛాపురాల మధ్యలోనే తుని అనే పట్టణం ఉంది. హిందూ పురానికీ ఇచ్ఛాపురానికీ మధ్య చంద్రబాబునాయుడు ఊడ్చాల్సింది చాలా ఉందన్నమాట అక్షరసత్యమని మొన్ననే తుని చెప్పేసింది. వెనుకబడిన వర్గాల జాబితాలో తమను చేర్చాలని కాపు సామాజికవర్గం కొన్ని దశా బ్దాలుగా ఉద్యమాలు చేస్తున్న విషయం అపార రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహి స్తున్న ముద్రగడ పద్మనాభం పట్టుదల, కార్యాచరణ శైలి కూడా చంద్ర బాబుకు సుపరిచితమే. ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఉద్యమంలో ముద్రగడ దగ్గరికి వెళ్లి చంద్రబాబు మద్దతు కూడా ప్రకటించారు. ఇది తెగని సమస్యగా ఉందనీ, పూర్తిగా తమ చేతుల్లో ఉండదనీ, కేంద్ర ప్రభుత్వం కూడా కలసి రావాలనీ, ఆంధ్రప్రదేశ్‌లో కాపులను బీసీల జాబితాలో చేర్చితే ఇంకోచోట గుజ్జర్లు, జాట్లు, పటేళ్లు తలనొప్పిగా తయారవుతారు కాబట్టి కేంద్రం ఈ అంశంలో కలసిరాదనీ చంద్రబాబుకు తెలియదనుకోవాలా? ఆయనకు అన్నీ తెలుసు. రైతు రుణ మాఫీ తమ వల్ల కాదని తెలుసు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేననీ తెలుసు. కాపులను బీసీలలో చేర్చలేననీ తెలుసు. అయినా అసెంబ్లీ ఎన్నికలలో గట్టెక్కడానికి ఆయన చేసిన ఒకానొక వాగ్దానం ఇవ్వాళ తుని సంఘటన రూపంలో మెడకు చుట్టుకున్నది. తన మెడకు చుట్టుకున్న పామును ప్రతిపక్షాల మెళ్లో, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడి మెడలో వెయ్యడానికి ఆయన రెండు రోజులుగా అవస్థపడుతున్నారు. విపక్షనేతపై అసహనం కాపులను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చుతామని, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ. 1,000 కోట్లు సమకూరుస్తామని ఎన్నికల సమ యంలో వాగ్దానం చేసి, మాట తప్పినందుకు ఆ సామాజికవర్గం ఆందోళనకు దిగబోతున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికీ, ప్రభుత్వానికీ చాలా ముందే తెలుసు. తునిలో జరగబోయే కాపు గర్జనను అడ్డుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. అయినా సాధ్యం కాలేదు. అధికార పార్టీతో సహా అన్ని పార్టీలలో ఉన్న ఆ సామాజికవర్గం వారు చిన్నా పెద్దా తుని చేరుకున్నారు. ఆందోళన అదుపు తప్పింది. ఒక రైలు మొత్తం దగ్ధం చేశారు. పోలీస్స్టేషన్ల మీద దాడి చేశారు. పోలీసులను కొట్టారు. దీనినం తటినీ అన్ని న్యూస్ చానళ్లూ ప్రసారం చేశాయి. కానీ, ముఖ్యమంత్రికీ, ప్రభుత్వానికీ మరీ ముఖ్యంగా నిఘా విభాగానికీ సమాచారం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ఎంత అదుపు తప్పి సాగుతున్నదో అర్థం చేసు కోవచ్చు. ఒక పక్క తునిలో విధ్వంసం కొనసాగుతూ ఉండగానే సీఎం విజయవాడలో మీడియాను పిలిచి, ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రకటించేశారు. అక్కడ ఏం జరుగుతున్నదో అక్కడ ఉన్నవారికే అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబుకు మాత్రం మొత్తం జరిగిందంతా కళ్లకు కట్టినట్టు కనిపించడం ఆశ్చర్యం. ఆ దృశ్యంలో ఆయనకు ప్రతిపక్ష నాయకుడు కనిపించాడు, పులివెందుల పట్టణం కూడా కనిపించింది. ఇటువంటి అవాంఛనీయ సంఘ టన జరిగితే సంయమనం పాటించి, వాస్తవాలు తెలుసుకుని బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వాధినేత ఒక పక్క తుని తగలబడుతుంటే హేట్ స్పీచ్ (ద్వేష ప్రసంగం) యథేచ్ఛగా చేసేశారు. ఆందోళన అదుపు తప్పి విధ్వంసం జరిగే ప్రమాదం ఉందన్న సమాచారం సేకరించి తనకు అందించలేకపోయిన నిఘా వ్యవస్థను నిలదీయాల్సింది పోయి, ఆరు న్యూస్ చానళ్ల ఓబీ వ్యాన్లు అక్కడికి ఎలా వెళ్లాయి? వాళ్లకు ముందే ఇదంతా జరుగుతుందని తెలుసు అని ఒక సీఎం మాట్లాడటం హాస్యాస్పదం. ప్రచార ప్రసార మాధ్యమాలు ఎట్లా పనిచేస్తాయో ఆయనకూ, ఆయన సమాచార వ్యవస్థను నిర్వహిస్తున్న భజనపరులకూ తెలియని కారణంగానే చంద్రబాబు మీడియాను ఆడిపోసుకుంటున్నారు. చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఏం పని అని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తే ఆక్షేపించిన వాళ్లే ఇప్పుడు అవును, అక్కడ తుని తగలబడుతుంటే చంద్రబాబు హైదరాబాద్‌లో ఫిడేల్ వాయించడం ఏమిటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. కాపుల ఉద్యమం ఇక్కడితో ఆగిపోవడం లేదు. శుక్రవారం నుంచి ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య ఆమరణ నిరాహార దీక్షకు కూర్చో బోతున్నారు. ముద్రగడ దీక్షలు ఎట్లా ఉంటాయో చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ప్రతిపక్ష నాయకుడినీ, మీడియానూ తిడుతూ కూర్చో కుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన నిఘా వ్యవస్థను చక్క దిద్దుకుని, కాపుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తే మంచిది. కేరళలో షూటింగ్లో ఉన్న పవన్ కల్యాణ్‌ను హుటాహుటిన రప్పించి మీడియా ముందు హాజరుపరిస్తే సమసిపోయే అంత సులువయిన సమస్య కాదిది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
విద్యాలయాలా? బలిపీఠాలా?
డేట్లైన్ హైదరాబాద్ ‘ఏమైనా నిజాయితీ ఉన్నట్టయితే ఆ విశ్వవిద్యాలయం పెద్దలు తమ క్యాంపస్‌ను సంస్కరించుకోవాలి. దళిత విద్యార్థులకు శత్రుదేశంలో సంచరి స్తున్నామన్న అనుభూతి కలగని స్నేహ వాతావరణం కల్పించాలి. ఇటు ఉద్యమకారులూ, పీడిత ప్రజల శ్రేయోభిలాషులూ పీడన నుండి పుట్టిన నిరసన తీసుకునే అన్ని రూపాలనూ అర్థం చేసుకునే దగ్గర ఆగిపోకుండా ఆ పీడనను అంతం చేసే దిశగా ప్రజలు నడవడానికి అవసరమైన విమర్శలనూ, సలహాలనూ నిర్మొహమాటంగా అందించడానికి సిద్ధపడాలి.’ ప్రముఖ మానవ హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్ 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రీయవిశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) గురించి ఒక వ్యాసంలో రాసిన వాక్యాలివి. డాక్టర్ బాలగోపాల్ చేసిన సూచనను ఆ యూనివర్సిటీ పెద్దలు ఇన్నేళ్లయినా పాటించే ప్రయత్నం చెయ్యక పోగా ఇంకా ఇంకా అదే మార్గంలో వెళుతూ, మరింత దుర్మార్గంగా తయారయ్యారని ప్రస్తుత ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గతంలోనూ ఇదే జరిగింది 2002లో హెచ్‌సీయూ యాజమాన్యం క్యాంపస్‌లో జరిగిన ఒక అల్లరి కారణంగా పది మంది రీసెర్చ్ స్కాలర్లను యూనివర్సిటీ నుంచి తొలగిం చింది. అంటే వారు ఇంకే ఇతర యూనివర్సిటీలోనూ చేరడానికీ, తమ చదువు పూర్తి చెయ్యడానికీ వీల్లేని శిక్ష. ఆ పదిమంది విద్యార్థుల భవిష్యత్తు ఏమయిందో, ఇప్పుడు వాళ్లెక్కడ ఉన్నారో మనకు తెలియదు కానీ, ఇప్పుడా సంఘటన గురించి మాట్లాడుకోడానికి అనేక కారణాలున్నాయి. బాలగోపాల్ మాటలను గుర్తు చే సుకోడానికి కూడా. అప్పట్లో యూనివర్సిటీ నుంచి రస్టికేట్ అయిన పదిమందీ దళితులే, అంబేడ్కర్ విద్యార్థి సంఘం సభ్యులే కూడా. ఆనాటి తగాదా అంతా యూనివర్సిటీలో మెస్ నిర్వహణ గురించి. చీఫ్ వార్డెన్‌గా వచ్చిన ఒక ప్రొఫెసర్ మెస్ కొనుగోళ్లను ఒక కాంట్రాక్టర్‌కు అప్ప గించాలని ప్రతిపాదించాడు. దానిని విద్యార్థులు, ముఖ్యంగా దళిత విద్యార్థులు వ్యతిరేకించారు. మెస్ బిల్లులు పెరుగుతాయనే కాకుండా, అప్పటి దాకా ఆ బాధ్యత దళిత విద్యార్థులే చూసుకుంటున్నారు. చీఫ్ వార్డెన్‌గా వచ్చి ఈ కొత్త ప్రతిపాదన తెచ్చిన ప్రొఫెసర్ పేరు అప్పారావు. ఆయన చేసిన నిర్వాకం చినికి చినికి గాలివానగా మారి ఘర్షణలకు దారి తీసి, యాజమాన్యం 10 మంది దళిత విద్యార్థులను రస్టికేట్ చేసే దాకా వెళ్లింది. బాలగోపాల్ కోరుకున్నట్టు విశ్వవిద్యాలయం పెద్దలు తమ క్యాంపస్నయితే సంస్కరించుకోలేదు కానీ, దళిత విద్యార్థులు తాము శత్రుదేశంలో సంచరి స్తున్నామన్న అనుభూతి అంతకు వంద రెట్లు ఎక్కువయ్యేటట్టు మాత్రం చెయ్యగలిగారు. ఆనాడు చీఫ్ వార్డెన్‌గా పది మంది దళిత విద్యార్థులు రస్టికేట్ కావడానికి బాధ్యుడయిన ప్రొఫెసర్ గారు ఈ రోజు అదే యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా మరో అయిదుగురు దళిత విద్యార్థులను క్యాంపస్‌లోనే సంఘ బహిష్కరణకు గురిచేశారు. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఈ పద్నాలుగేళ్లుగా ఈ ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నది. ఈ యూనివర్సిటీలో ప్రస్తుత సంఘటన చూస్తుంటే ఇదే బాలగోపాల్ ఇంకోచోట చెప్పినట్టు ఇవి విజ్ఞాన కేంద్రాల్లాగా కాకుండా ఆధునిక అగ్రహారాల్లాగా కనిపిస్తాయి. ఇది సంఘ బహిష్కారం కాదా? ఇక ప్రస్తుతానికి వస్తే, హెచ్‌సీయూ యాజమాన్యం అయిదుగురు విద్యా ర్థులకు పదిహేనురోజుల క్రితం సంఘ బహిష్కారం విధించింది. ఈమాట వింతగా అనిపించవచ్చు. కానీ జరిగింది ఇదే. ఈ అయిదుగురు విద్యార్థులు తరగతులకు హాజరు కావచ్చు. కానీ హాస్టల్లో ఉండకూడదు. మెస్‌లో భోజనం చెయ్యకూడదు. లైబ్రరీకి వెళ్లకూడదు. విద్యార్థులెవరితోనూ మాట్లా డకూడదు. దీన్ని సంఘ బహిష్కారం అనకుంటే, మరేం అనాలో యూని వర్సిటీ పెద్దలు, ముఖ్యంగా వైస్ చాన్స్‌లర్ అప్పారావు చెప్పాలి. రెండు వారాల పాటు యూనివర్సిటీ క్యాంపస్‌లోనే వెలివాడ పేరిట ఒక గుడారం వేసుకుని గడిపిన ఆ విద్యార్థులలో రోహిత్ వేముల మొన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రపంచానికి అద్భుతమయిన మేధావులను అందించాల్సిన విశ్వవిద్యాలయంలో వెలివాడ వెలియడం ఏ విలువలకు, సంస్కారానికి అద్దం పడుతుంది అనే మాట గురించి తరువాత మాట్లాడుకుందాం. జరిగింది రెండు విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ. యాకూబ్ మెమెన్ ఉరి శిక్షను వ్యతిరేకించిన వర్గం విద్యార్థులకు, అది జాతివ్యతిరేక వైఖరి అని వాదించే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ. యాకూబ్ మెమెన్‌ను ఉరి తీయడం తప్పు అని నమ్మేవాళ్లు, వాదించే వాళ్లు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. దేశద్రోహులనే ముద్రవేస్తారని భయపడి అందరూ బయటపడకపోవచ్చు. ఈ ఘర్షణలో ఒక ఏబీవీపీ నాయకుడి మీద దాడి చేశారన్న అభియోగం ఈ దళిత విద్యార్థుల మీద ఉంది. యూనివర్సిటీ అధికారులు పద్నాలుగేళ్ల నాడే బాలగోపాల్ లాంటి పెద్దలు చెప్పిన మాటలను చెవికెక్కించుకుని ఉంటే ఒక అద్భుత విద్యా వంతుడయిన యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాదు. ఏబీవీపీ నాయకుడి ఫిర్యాదును కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కేంద్రం దాకా తీసుకుపోయి ఉండకపోతే, ఇది విద్యార్థి వర్గాల మధ్య జరిగే సాధారణ ఘర్షణగానే పరిగణించినా కూడా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఏబీవీపీ నాయకుడి ఫిర్యాదు మీద ఆయన కేంద్ర మానవవనరుల మంత్రి స్మృతి ఇరానీకి రాసిన అధికారిక లేఖ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే కాదు, దిగ్భ్రాంతి కలుగుతుంది. హెచ్‌సీయూ క్యాంపస్ ఇటీవలి కాలంలో కులతత్వవాదులకు, తీవ్రవాదులకు, జాతి వ్యతిరేక రాజకీయాలకు నిలయంగా మారిందని ఆయన స్మృతి ఇరానీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. క్యాంపస్ ఇట్లా మారింద నడానికి ఆయన ఇదే లేఖలో పేర్కొన్న ఉదంతం ఏమిటంటే, దళిత విద్యా ర్థులు తమ ఏబీవీపీ నాయకుడి మీద క్యాంపస్‌లో దాడి చెయ్యడం. యాకూబ్ మెమెన్ ఉరిని వ్యతిరేకిస్తూ అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నిరసనలు తెలిపితే దానికి అభ్యంతరం తెలిపినందుకు ఏబీవీపీ నాయకుడి మీద దాడి చేశారు కాబట్టి ఇది జాతి వ్యతిరేక, తీవ్రవాద, కులోన్మాద రాజకీయం అని కేంద్రమంత్రి మరో కేంద్రమంత్రికి రాసిన లేఖలో నిర్ధారించేస్తారు. మంత్రుల వైఖరి సరికాదు దత్తాత్రేయ ఆ లేఖ రాసి ఊరుకుంటే బాగుండేది. ఆయనో, ఆయన తరఫున ఆ పార్టీ నాయకులు మరొకరో కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ మీద ఎంత పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారో చెప్పడానికి యూనివర్సిటీ అధికారులకు ఆ మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ వరసగా వచ్చిన నాలుగు అధికారిక లేఖలు నిదర్శనంగా నిలుస్తాయి. ఏ ఆలోచనతో చేసినా కేంద్ర మంత్రుల ఇరువురి చర్య ఇవాళ భారతీయ జనతా పార్టీనీ, ఆ పార్టీ ప్రభుత్వాన్నీ బోనులో నిలబెట్టింది. దీంతో సహజంగానే రాజకీయ పార్టీలు అధికారపక్షాన్ని దోషిగా నిలబెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం హెచ్‌సీయూ క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ఇతర పార్టీల నాయకులు కూడా విద్యార్థులకు సంఘీభావంగా నిలబడనున్నట్టు వార్తలొస్తున్నాయి. వ్యవస్థపైనే ఆగ్రహం ఇక వెలివాడ వేసుకుని పక్షం రోజులుగా యూనివర్సిటీ యాజమాన్యం, బీజేపీ నాయకత్వం దుర్మార్గపు చర్యకు నిరసన తెలుపుతున్న రోహిత్ మిత్రులు మాత్రం మొత్తం సమాజంలోని అన్ని వర్గాల పట్ల ఆగ్రహంగా ఉన్నారు. అద్భుతమయిన భవిష్యత్ కలిగిన సైన్స్ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకునే వరకూ తమను పట్టించుకోని రాజకీయ పార్టీలూ, వాటిలో ఉన్న దళిత నాయకులూ, దళిత సంఘాలూ, మీడియా పట్ల విద్యార్థుల్లో ఉన్న ఆగ్రహం ఒక్కసారి క్యాంపస్ వైపు వెళ్లి చూస్తే తెలుస్తుంది. రోహిత్ మృతదేహాన్ని తరలించడంలో, అంత్యక్రియలు హడావుడిగా జరిపించిన తీరు పట్ల కూడా విద్యార్థులు ఆగ్రహంతోనే ఉన్నారు. నిజమే, ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే తప్ప మనమెవ్వరం కదలమా? వారి ఆగ్రహం ధర్మమే కదా! బాలగోపాల్ ఇప్పుడు లేరు. ఆయన ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడయినా యూనివర్సిటీ పెద్దలు అర్థం చేసుకుని, రాజకీయ పెద్దలు జొరబడకుండా చూసుకుని సంస్క రించుకుంటే మంచిది. మా ఆలోచనను వ్యతిరేకించే వాళ్లంతా దేశ ద్రోహులే అన్న ఆలోచన బీజేపీ పెద్దలు కూడా మానుకుంటే మంచిది. దళితులే కాదు, మనుషులెవరూ శత్రుదేశంలో సంచరిస్తున్నామన్న భీతికి లోనుకాకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుందాం. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
కొత్త సినిమా విడుదల ఎప్పుడో?
డేట్లైన్ హైదరాబాద్ పతాక సన్నివేశం తరువాత ఎప్పటిలాగే శుభం కార్డు పడింది. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్న ప్రశ్న మిగిలే ఉంది. ప్రస్తుతానికైతే ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బయటపడడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కొంతకాలం పాటు అపూర్వ సహోదరుల మాదిరిగానే కొనసాగుతారు. ‘ఆగర్భ శత్రువులు-అపూర్వ సోదరులు’ అనే చలనచిత్రాన్ని 2015 సంవత్సరంలో మనం రెండు భాగాలుగా చూశాం. ఇక ఈ ఏడాది ఎలాంటి సినిమాలు చూపించబోతున్నారో మన నాయకులు? కొత్త సంవత్సరం ప్రవేశించింది ఇప్పుడే కదా! తినబోతూ రుచులు అడగడం ఎందుకు? అయితే 2016లో కూడా మనం తప్పనిసరిగా కొన్ని సినిమాలు చూస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అయితే కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఒక సినిమా చూపించేశారు. మొన్న ప్రకాశం జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి అక్కడ ఆయన చూపించిన సినిమాకు, ‘బాబుగారి గది’ అని పేరు పెడితే బాగానే ఉంటుంది. ఈ మధ్యనే ‘రాజుగారి గది’ అన్న పేరుతో ఒక బడ్జెట్ సినిమా విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా కథ ఏమిటంటే, ఆ రాజుగారి గదిలో అన్నీ దయ్యాలూ, భూతాలూ ఉన్నట్టు భ్రమ కలుగు తుందట. ఆయన వైఖరి చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఇలాంటి భ్రమలే కలుగుతున్నాయేమోననిపిస్తుంది. ఆయననూ, ఆయన ప్రభుత్వాన్నీ ఎవరు విమర్శించినా, నిరసించినా సరే, అందులో చంద్ర బాబుకు వైఎస్ఆర్సీపీయే కనిపిస్తున్నదట. ఆయన రాజ్యంలో ఎవరూ నిరసన తెలిపే సాహసం చేయకూడదు. అసలు నిరసనకారులంతా ఆయన కంటికి టైస్టుల మాదిరిగా కనిపిస్తున్నారు. నిరసన తెలియచేస్తారని ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో, వారందరినీ బాబుగారి పర్యటన సంద ర్భంగా పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు కర్తవ్యాన్ని పూర్తి చేశారు. జర్నలిస్టులకూ సమస్యలు ఉంటాయి, వారు కూడా నిరసన తెలియచేయగలరన్న ఊహ తట్టకపోవడం వల్ల పోలీసులు విలేకరుల జోలికి పోలేదు. తీరా ప్రెస్ గ్యాలరీలో కూర్చున్న విలేకరులు తమ బొడ్లో దాచి పెట్టిన నినాదాల కాగితాలు తీసి ప్రదర్శించడంతో చంద్రబాబుగారికి ఎక్కడ లేని ఆగ్రహం పెల్లుబికింది. విలేకరులు బొడ్లో నుంచి తీసినవి కాగితాలే, కత్తులు కావు. అయినా వాళ్లు కూడా ఆయనకు టైస్టుల్లాగే కనిపించారు. అంతేకాదు, ఆ జర్నలిస్టులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం కూడా వైఎస్ఆర్సీపీ నడుపుతున్న సంఘంలా కనిపించింది. అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎవరు నిరసన తెలియచేసినా కూడా ఆ నిరసనకారులంతా వైఎస్ఆర్సీపీ సభ్యులుగా, లేదా ఆ పార్టీ అనుబంధ సంస్థల సభ్యులుగానో చంద్రబాబు కంటికి కనిపిస్తున్నారు. తొలిభాగంలో... తాము మనుగడ సాగిస్తున్నది ప్రజాస్వామిక వ్యవస్థ అన్న సంగతిని చంద్ర బాబు మరచిపోతున్నారు. ‘ఏదన్నా అడుక్కోవాలంటే ఓ పక్కకొచ్చి నిలబడండి! వెళ్లేటప్పుడు చూస్తాను. అంతేకానీ నిరసన తెలియచేస్తే మీ సంగతి తేలుస్తా!’ అని బెదిరిస్తారాయన. నిరసనకారులంతా మన పాలకులకు అడు క్కునేవాళ్ల మాదిరిగా కనిపించడం ప్రజాస్వామ్యానికి చేటు. జర్నలిస్టులకు సంబంధించి ఇలాంటి బెదిరింపులు ఇంకొక చోట కూడా వినిపించిన సంగతి గుర్తుకు రావడం లేదా!? ఔను, చంద్రబాబుకు అపూర్వ సోదరుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా అధికారంలోకి రాగానే తెలంగాణ జర్నలిస్టుల నిరసనను అణచివేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంతకంటే తీవ్ర స్వరంతో హెచ్చరికలు సంధించారు. ఈయన మీ సంగతి తేల్చేస్తానన్నారు. ఆయన మెడలు విరిచి అవతల పారేస్తానన్నారు. ఈ రెండు వ్యక్తీకరణలకీ పెద్ద తేడా లేదు. ఆరు దశాబ్దాల సమరశీల పోరాటాల చరిత్ర కలిగిన జర్నలిస్ట్ ఉద్యమానికి రాజకీయ ముద్రలు వేసే ప్రయత్నం చేస్తు న్నారు. బాబుగారు గది నుంచి బయటకు వస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అసలు సినిమా ‘ఆగర్భ శత్రువులు-అపూర్వ సోదరులు’ విషయానికి వస్తే; ముందే చెప్పుకున్నట్టు ఇది రెండు భాగాలుగా సాగింది. ఫిరాయింపు రాజకీయాలు, ఎంఎల్సీ ఎన్నికలు, ఓటుకు కోట్లు వ్యవహారం, శాసనసభ్యుడే జైలుకు వెళ్లడం, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రే అవినీతిని ప్రోత్సహిస్తూ ఫోన్లో మాట్లాడి పబ్లిగ్గా దొరికిపోవడం, నువ్వు జైలుకు పోతావంటే, నువ్వు నాశనమైపోతావని ముఖ్యమంత్రులిద్దరూ రోడ్డెక్కి బాహాటంగా తిట్టుకోవడం మొదటి భాగంలో చూశాం. ఇంకా, కొన్ని రోజుల పాటు సాగిన ఉద్రిక్త వాతావరణంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చంద్రశేఖరరావు బహిరంగ వేదికల మీదే గర్జించగా, నీ అంతు చూస్తాను, నాకూ ఏసీబీ ఉంది. పోలీసులూ ఉన్నారు అంటూ చంద్రబాబు విజయవాడ వీధులలో హుంకరిం చారు. ముఖ్యమంత్రులమన్న సంగతి సరే, అసలు నాగరికులమన్న స్పృ హను కూడా వారు కోల్పోయారు. వీరి కోపతాపాలకు అనుగుణంగా అటూ ఇటూ మంత్రులు, ఎంఎల్ఏలు, పార్టీల నాయకులు ఒకరినొకరు నోరారా తిట్టుకోవడం వంటి ఘట్టాలు కూడా ఈ భాగంలోనే తిలకించాం. సినిమా ఏ మలుపు తిరుగుతుందోనని అనుకుంటూ విశ్రాంతి సమ యంలో చాయ్ తాగి థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకులు దిమ్మెరపోయారు. రెండోభాగంలో ఆ ఇద్దరూ అపూర్వ సోదరులైపోయారు. ఆలింగనాలు, పుష్పగుచ్ఛాలు, పిండివంటలతో భోజనాలు, దుశ్శాలువలతో మర్యాదలు, వాటిని కొనసాగింపుగా ఆహ్వానాలు- ఇదీ వరస. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి చంద్రబాబు స్వయంగా విచ్చేస్తే, తాను నిర్వహించిన అయుత చండీయానికి రమ్మని చంద్రబాబును పిలవడానికి చంద్రశేఖరరావు విజయవాడ వెళ్లారు. ఈ ఆహ్వానాల కార్యక్రమం కోసం వారు ఉపయోగించిన హెలికాప్టర్ తదితర సౌకర్యాలకు అయిన ఖర్చంతా రెండు రాష్ట్రాల ప్రజలదే. అట్టహాసంగా జరిగిన అమరావతి శంకుస్థాపనకు చంద్రశేఖరరావు హాజరు కాగా, అయుత చండీయాగానికి దీక్షా వస్త్రాలు ధరించి మరీ చంద్రబాబు హాజరయ్యారు. ప్రభుత్వాధినేత యాగం చేస్తే ఎలా? అమరావతి శంకుస్థాపన గురించీ, చండీయాగం గురించి ఇక్కడ కొంచెం స్పష్టంగా మాట్లాడాలి. స్పష్టంగా అనడం ఎందుకంటే, వాటి గురించి బాహా టంగా విమర్శించడానికి చాలామంది జంకుతున్నారు. కొంతమంది తమలో తాము గొణుక్కుంటూ ఉంటే, కొందరు తమకెందుకులే అని మౌనం దాల్చారు. అమరావతి వ్యవహారంలో కొద్దిపాటి నిరసన అయినా వ్యక్తమైం ది. ఆ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. అది బలమైన ప్రతిపక్షం. వైఎస్ఆర్సీపీ, ఇతర పార్టీలు కూడా శంకుస్థాపన ఆర్భాటాన్నే కాకుండా, ఇతర అంశాల గురించి కూడా గళం ఎత్తాయి. కొన్ని కోట్ల ప్రజాధనం ఎందు కు వృథా చేయాలని విమర్శించాయి. అయుత చండీయాగం విషయంలో అలా కాదు. సొంత సొమ్ముతో నిర్వహిస్తున్నానని చంద్రశేఖరరావు ప్రకటిం చారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ మూఢ నమ్మకాలను పారద్రోలి ప్రజలలో శాస్త్రీయ అవగాహన పెంచవలసిన కాలంలో ప్రభుత్వాధి నేతలు యాగాలు చేయడం ఏమిటని ఒక్కరూ ప్రశ్నించకపోవడం విచార కరం. పూర్వం రాజులు ఈ యాగాలు చేశారు. అవన్నీ రాజ్య విస్తరణ కాంక్షతో చేసినవే తప్ప, ప్రజల క్షేమం కోసం చేసినవి మాత్రం కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అయుత చండీయాగం చేస్తానని మొక్కుకు న్నట్టు చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇంకేముంది! అందరి నోళ్లూ మూతప డ్డాయి. అక్కడ అమరావతి నిర్మాణం విషయంలో విమర్శలు ఎక్కుపెట్టిన వారిని రాజధానికే వ్యతిరేకులని ఏ విధంగా ముద్ర వేస్తున్నారో, తెలంగా ణలో కూడా అయుత చండీయాగాన్ని విమర్శిస్తే తెలంగాణకే వ్యతిరేకులన్న ముద్ర పడవచ్చుననే వాతావరణం కల్పించారు. యాగాలు మత సంబంధమై నవి. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. వాటిని చులకన చేయవలసిన అవ సరం లేదు. కానీ అవి వ్యక్తులకూ, వారి ఇళ్లకూ పరిమితం కావాలి. అంతే తప్ప, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాధినేతలు యాగాలు చేయడం సరికాదు. వ్యక్తిగత హోదాలో సీఎం ఈ యాగాన్ని నిర్వహించారనే అనుకుంటే, ప్రజా స్వామ్యంలోని నాలుగు అంగాలకు చెందిన పెద్దలు కూడా పాల్గొనడం ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి దోహదం చేయగలుగుతుంది? పతాక సన్నివేశంలో... ఇక సినిమా పతాక సన్నివేశం తరువాత ఎప్పటిలాగే శుభం కార్డు పడింది. కానీ తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య ఈ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్న ప్రశ్న మిగిలే ఉంది. ప్రస్తుతానికైతే ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బయట పడడం కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి తెలం గాణ సీఎం కొంతకాలం పాటు అపూర్వ సహోదరుల మాదిరిగానే కొనసాగు తారు. తెలంగాణ రాష్ట్రానికి మకుటం హైదరాబాద్. అక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎప్పుడూ గెలవలేదు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా గెలవలేకపోతే ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడుతుంది. గెలవాలంటే హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రుల ఓట్లు కావాలి. జీహెచ్ఎంసీ ఎన్ని కలు పూర్తి కాగానే ఈ సంవత్సరంలోనే ఈ ముఖ్యమంత్రులు ఇద్దరూ రాజకీయ వెండితెర మీద మరో కొత్త సినిమా చూపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. (వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రెటరీ జనరల్, datelinehyderabad@gmail.com ) -
ఓట్ల వేటలో ‘ఆహ్వానాల’ ఆట
డేట్లైన్ హైదరాబాద్ ఇటు కేసీఆర్, చంద్రబాబును చండీయాగానికి ఆహ్వానిస్తూనే, అటు తన కుమారుడితో తెలంగాణలో టీడీపీని ఖాళీ చేసే యాగాన్ని జరిపించేస్తున్నారు. ఆయన కుమారుడు టీడీపీ సీనియర్ నేత విజయరామారావు ఇంటికి వెళ్లి మరీ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇదేమీ ఆశ్చర్యకరమైన సంగతి కాదు. విజయవాడలో ముఖ్యమంత్రులు ఇద్దరూ సరదా కబుర్లు చెప్పుకుంటుంటే, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ నేతలు టీఆర్ఎస్ను తిట్టిపోస్తుంటారు. కేటీఆర్ తదితరులు టీడీపీ లీడర్లకు గులాబీ కండువాలు కప్పుతుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎర్రబెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న అయుత చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడానికి సోమవారం నాడు ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడ వెళ్లారు. ఆ ఆహ్వానాన్ని ఆయన ఆనందంగా స్వీకరించారు. పత్రికలు, వార్తా చానళ్లు కనువిందు చేసే ఈ అపురూప కలయికను కళ్లకు కట్టినట్టు చూపాయి. నిజమే, కొన్ని నెలల క్రితం ఈ ఇద్దరే సభ్యతను సైతం మరచి ఒకరినొకరు బండబూతులు తిట్టుకున్నారు. అందుకే మొన్నటి కలయిక అపురూపంగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రులు ఇరువురూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాస స్థలం చుట్టూ ఉన్న ఆహ్లాదకర వాతావరణం దగ్గరి నుంచి ఏపీ ఆర్థిక పరిస్థితి దాకా చర్చకు వచ్చాయి. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య ఈ సఖ్యత చిరకాలం వర్ధిల్లాలని, అక్కడా, ఇక్కడా ప్రజలందరి ఆకాంక్ష. దానివల్ల ప్రజలకు మేలు జరగాలన్నది కూడా అందరి కోరిక. గులాబీ కండువాల యాగం అయితే ఇదేదో దీర్ఘకాలం కొనసాగే స్నేహమని ఎవరూ విశ్వసించడం లేదు. వచ్చే నెల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న గ్రేటర్ హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని ఆకట్టుకుని, టీఆర్ఎస్ను గెలిపించుకోడానికే చంద్రశేఖర్‌రావు ఈ విజయవాడ ప్రయాణం పెట్టుకున్నారని అందరూ నమ్ముతున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఎత్త్తున నిర్వహిస్తూ చంద్రబాబు ఈయనను ఆహ్వానించారు. కాబట్టి ఈయన అదేస్థాయిలో అయుత చండీయాగం తలపెట్టి ఆయనను పిలిచారని కూడా అనుకుంటున్నారు. చంద్రశేఖరరావు ఒక పక్క చంద్రబాబు నాయుడును చండీయాగానికి ఆహ్వానిస్తూనే, మరోపక్క తన కుమారుడితో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసే యాగాన్ని జరిపించేస్తున్నారు. ఆయన కుమారుడు, రాష్ర్ట మంత్రి కేటీ రామారావు టీడీపీ సీనియర్ నేత విజయరామారావు ఇంటికి వెళ్లి మరీ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలుపు కోసం ఎడాపెడా టీడీపీ వారిని టీఆర్ఎస్లో చేర్చుకుంటున్న నేపథ్యంలో ఇది ఆశ్చర్యకరం కాదు. ఒక పక్క విజయవాడలో కృష్ణ ఒడ్డున ముఖ్యమంత్రులు ఇద్దరూ సరదా కబుర్లు చెప్పుకుంటుంటే.. ఇక్కడ హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ నేతలు టీఆర్ఎస్ను తిట్టిపోస్తుంటారు, కేటీఆర్ వగైరా నాయకులు టీడీపీ లీడర్లకు గులాబీ కండువాలు కప్పుతుంటారు. ఇదీ నిఖార్సయిన రాజకీయం అంటే. గులాబీ గూట్లో విజయరామారావు ఇక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కే విజయరామారావు పార్టీ మార్పిడి విషయానికి వద్దాం. పోలీసు శాఖలో మంచి పేరున్న ఆయన ప్రతిష్టాత్మకమైన సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. 1999 ఎన్నికలకు కొద్ది మాసాల ముందు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో వివిధ స్థాయిల ప్రభుత్వ అధికారుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా పౌరహక్కులు, తీవ్రవాద ఉద్యమం గురించి మాట్లాడటానికి విజయరామారావుతో బాటు నన్ను కూడా పిలిచారు. ఆ సందర్భంగా నేను ఆయన అనుభవాలను గ్రంథస్తం చేయమని కోరాను. ఆ ఆలోచన ఉంది, తప్పకుండా చేద్దామన్నారు. టీడీపీలోకి చంద్రబాబు తటస్తులను ఆహ్వానిస్తున్నారని, వారిలో విజయరామారావు కూడా ఉన్నారని తదుపరి రెండో రోజున పత్రికల్లో వార్త వచ్చింది. వెంటనే వారికి ఫోన్ చేయగా ఆయన ధ్రువీకరించారు. పోలీసు అధికారిగా మంచి పేరున్న మీరు రాజకీయాల్లో చేరడం ఎందుకని నేను అన్నాను. లేదు, ఇంకా పని చేసే శక్తి ఉంది కదా, రాజకీయాలు మంచి వేదికని ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నారాయన. ఆ తరువాత ఒకటి రెండు, రోజుల్లో ఆయన టీడీపీలో చేరడం, 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలవడం, రాష్ర్ట మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. ఆ తరవాత చాలా కాలం నేను వారిని కలవలేదు. కానీ విషయాలు తెలుస్తూ ఉండేవి. ఇవాళ నడుస్తున్న రాజకీయాలకు విజయరామారావు వంటి వారు పనికి రారన్నది నా అభిప్రాయం. పైగా రాజకీయాల్లో రాటుదేలిన చంద్రబాబుతో స్నేహం ఎంతో కాలం కొనసాగడం కష్టమే. అదే జరిగింది. 2004 ఎన్నికలలో ఆయన మళ్లీ గెలవలేదు. ఆ తరువాత టీడీపీలో, దాని అధినేత వద్ద విజయరామారావుకు ఎంత ప్రాధాన్యత లభించిందీ అందరికీ తెలుసు. రాజకీయాల్లో ఇట్లాగే జరుగుతుందని విజ్ఞ్ఞులయిన ఆయనకు ముందే తట్టక పోవడం విచారకరం. ఆయన ఆపై మళ్లీ అటువంటిదే ఇంకో నిర్ణయం తీసుకుని ఇప్పుడు టీఆర్ఎస్లో చేరారు. విజయరామారావు టీఆర్ఎస్లో చేరడం గురించి మాట్లాడుకునే ముందు ఆయన గురించి మరొక్క విషయం చెప్పుకోవాలి. ఆయన మంత్రి కాకపోతే టీఆర్ఎస్ లేదుగా! తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుని, పార్లమెంట్ ముందు రాష్ర్ట విభజన బిల్లు పెట్టబోతున్న రోజుల్లో, ఒక సందర్భంగా ఆయనను కలిశాను. అక్కడ ఓ పది మందిమి ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నాం. తెలంగాణ రాష్ర్టం ఎవరి వల్ల వచ్చిందని అక్కడున్న వాళ్లను నేను అడిగాను. అందరూ ముక్తకంఠంతో కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల అన్నారు. నేను విజయరామారావును చూపించి వీరి వల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందన్నాను. ఆయన కొంత ఇబ్బందిగా ఫీలయ్యారు. మిగతా వాళ్లు అదెలాగన్నారు. 1999లో తిరిగి గెలిచాక చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి ఆయనను తీసుకున్నారు... అదే సామాజిక వర్గానికి, అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రావును పక్కన పెట్టేశారు. ఆనాడు మిత్రులందరూ పలికిన హితవును మన్నించి చంద్రబాబు, విజయ రామారావుకు బదులు చంద్రశేఖర్‌రావును కేబినెట్లోకి తీసుకుని ఉంటే టీఆర్ఎస్ లేదు కదా! అందుకే తెలంగాణ మలి దశ ఉద్యమం రావడానికి పరోక్షంగానే అయినా విజయరామారావే కారణమన్నాను. ఉద్యమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోయి రాష్ర్టం సాధించుకున్న తెలంగాణ ఉద్యమకారులు, సంస్థలను కించపరిచేందుకు అంటున్న మాటలు కావివి. అప్పుడున్న వాస్తవ పరిస్థితి అది. చంద్రశేఖర్‌రావు కాకపోతే మరొకరు ఉద్యమించే వారు, తెలంగాణ స్వప్నం సాకారం అయ్యేది. నాడు చంద్రబాబు మంత్రి వర్గ ఏర్పాటు కసరత్తు చేస్త్తున్న సమయంలో, ఒక రోజు రాత్రి ఆయనకు సన్నిహితంగా ఉండే ఒక టీడీపీ నాయకుడు నాకు ఫోన్ చేసి చంద్రశేఖర్‌రావును మంత్రివర్గం బయట ఉంచడం మంచిది కాదు, ఈ విషయం చంద్రబాబుకు చెప్పగలరా? అని నన్ను అడిగారు. ఇప్పుడాయన తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో ఉన్నారు. వృత్తి, ట్రేడ్ యూనియన్ అవసరాల దృష్ట్యా నాకు ముఖ్యమంత్రిని తరచూ కలిసే అవకాశం ఉండేది. సున్నితంగానే ఆ మిత్రుడి అభ్యర్థనను నిరాకరించాను. ఎవరి కారణంగానయితే చంద్రశేఖర్‌రావు ఆ నాడు మంత్రివర్గంలో చేరలేక పోయారో అదే విజయరామారావును ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి మరి. వారెందుకు పిలిచారు? ఈయన ఎందుకు వెళ్లారు? టీఆర్ఎస్, విజయరామారావును పార్టీలోకి ఆహ్వానించడానికి కారణం... రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసి విజయం సాధించాలని. మరి విజయరామారావు ఎందుకు టీడీపీని వీడి టీఆర్ఎస్కు వలస పోతున్నట్టు? రాజకీయ వ్యూహాలు, ఎత్త్తుగడల విషయానికి వస్తే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు కంటే తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే కొంచెం ఎక్కువే. తెలుగుదేశంలో కరువయిన గౌరవాన్ని టీఆర్ఎస్లో వెతుక్కోడానికే ఆయన బహుశా పార్టీ మారుతున్నారేమో. విజయరామారావుగారి సన్నిహితులు చెబుతున్న ప్రకారం టీఆర్ఎస్లో ఆయన కోసం ఒక గ్రాండ్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. అదేమిటో త్వరలోనే తెలుస్తుంది. కానీ బయట ప్రచారంలో ఉన్నట్టు కుమార్తె రాజకీయ అరంగేట్రం కోసం ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకుని ఉంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. అంతకంటే ఆయన సుదీర్ఘ వృత్తి జీవితం, స్వల్ప రాజకీయ పయనం అనుభవాలను గ్రంథస్తం చేస్తే భావితరాలకు కొంత మేలు చేసిన వారవుతారు. వ్యాసకర్త, దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
దానాల్లో గొప్ప దానం ‘విలువ’
డేట్లైన్ హైదరాబాద్ ప్రస్తుతానికి దానం నాగేందర్ మరొక్కసారి పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఆగినట్టే. మాటామంతీ అంతా అయిపోయింది.పోయిన సోమవారమే కాంగ్రెస్‌ను విడిచి తెలం గాణ రాష్ర్ట సమితిలో చేరడమే తరువాయి అనుకుంటుంటే ఆఖరి నిమిషంలో నాగేందర్ మనసు మార్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో హైదరాబాద్ బ్రదర్స్‌లో ఒకడిగా ప్రసిద్ధి చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి వలస పోతున్నాడంటే పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు. తెలం గాణ రాష్ర్ట సమితి నాయకత్వం ఆయనను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నది అన్న అంశం కూడా ఎవరినీ ఆశ్చ ర్యపరచలేదు. అంతకు రెండు రోజుల ముందు టీఆర్ఎస్లో చేరిన టీడీపీ శాసనసభ్యుడు సాయన్న విలేకరులతో ఒక మాటన్నారు. టీఆర్ఎస్లో సర్దుకు పోయి పని చేయగలరా వంటి ప్రశ్న ఒకటి అడిగితే, ‘అస్సలు ఇబ్బందే ఉండదు’ అన్నారాయన. అదెలా అంటే, ‘ఏముంది? అంతా తెలిసిన వాళ్లే, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా తె లుగుదేశంలో మంత్రిగా ఉన్నారు కదా!’ అన్నారు సాయన్న. ఔను! ముఖ్యమంత్రి సహా పలు వురు మంత్రులు, నాయకులు పూర్వాశ్రమంలో తెలుగు దేశం వారే. అలాంటప్పుడు సాయన్నకు కొత్తగా ఎందు కుంటుంది? పార్టీ కార్యాలయం చిరునామా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు మారినంత తేలికైన విషయంగా అనిపించింది ఆయనకు. సాయన్న వెంటే టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ ప్రభాకర్‌కు కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ అనిపించదు. టీఆర్ఎస్ కార్యాల యం నిండా ఎక్కడ చూసినా కాంగ్రెస్ నాయకులే కనిపించి, ఆయనకు కూడా అది మరో గాంధీభవన్ లాగా కనిపించింది తప్ప, కొత్త చోటికి వచ్చినట్టేమీ లేదు. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాగా, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి గాంధీభవన్ లాగా కనిపించేంతగా ప్రజాస్వామ్యీకరణ చెందిందన్నమాట తెలంగాణ భవన్. ఎవరినైనా ఇముడ్చుకోగల సహనం, ఔదార్యం, విశాల హృదయం తెలంగాణ భవన్‌కు ఉండ డం గొప్ప విషయమే. ఇంకా వస్తారు, రావాలి కూడా. సాధించుకున్న తెలంగాణకు సంపూర్ణత్వం సిద్ధించా లంటే తెలంగాణ భవన్ తప్ప అన్ని పార్టీల కార్యాల యాలకూ తాళాలు పడాలి. అప్పుడుగాని, మనం సాధించుకున్న తెలంగాణ కు అర్థం ఉండదు. రాష్ర్టంలో ఒకే పార్టీ కార్యాలయం ఉండాలి. దాని మీద ఒకే జెండా ఎగరాలి. ఇదే లక్ష్యం. ఈ అడుగులన్నీ దాని సాధన దిశగానే పడుతున్నాయి. జనవరి మాసాంతంలో జరగ బోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధిస్తే తప్ప తెలం గాణ రాష్ర్ట ఏర్పాటు సంపూర్ణం కాదు. తడబడిన అభిమానులు ఇదే లక్ష్యంగా పని చేస్తున్న టీఆర్ఎస్ కండువాలు కప్పు తూనే ఉన్నది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు కప్పిం చుకుంటూనే ఉన్నారు. అదే క్రమంలో దానం నాగేందర్ చేరిక కూడా దాదాపు ఖరారయింది. ఆయనకేవో డిమాండ్లు ఉన్నాయి. అవి కూడా దాదాపుగా ఒప్పు కున్నట్టే కాబట్టి సోమవారం ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరతారని అంతా అనుకున్నారు. ఆయన అనుచరులు నగరమంతా దానం చేరికను ఆహ్వానిస్తూ, వెల్లడిస్తూ ఫ్లెక్సీలు కూడా కట్టారు. చివరి నిమిషంలో దానం పార్టీ మార్పిడి రద్దయింది. అనుచరులు యుద్ధ ప్రాతిపదికన ఫ్లెక్సీలను తొలగించేశారు. పార్టీ మారుడు వ్యవహారం ఇంత ఆషామాషీగా ఉంటుందా అని ఆశ్చర్యపోనక్కరలేదు. నాగేందర్ షరతులకు ముఖ్య మంత్రి అంగీకారం లభించలేదు. పైగా తన సమక్షంలో కాకుండా, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సమక్షంలో చేరమని కబురు పంపారట ముఖ్యమంత్రి. కేశవరావు సమక్షంలో చేరితే మరీ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్‌లోనే చేరినట్టే ఉంటుందని నాగేందర్, ఆయన అనుచరులూ భావించినట్టున్నారు. కేశవరావు నిన్నటి దాకా కాంగ్రెస్ నాయకుడు. పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంత వేగంగా మరిచిపోవడం కష్టం కదా! ఆ మాటంటే ఎక్కడ డి. శ్రీనివాస్ సమక్షంలో చేరండి అంటారోనని ఈ పార్టీ మార్పిడి ఆలోచనను ప్రస్తుతానికి మానుకు న్నారట దానం నాగేందర్. కేశవరావు కన్నా తాజా మాజీ పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్. ఈ మధ్యనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఒక తెలుగు దేశం బ్యాచ్ ఇంకో కాంగ్రెస్ బ్యాచ్ చేరిపోవడంతో, అసలు టీఆర్ఎస్ బ్యాచ్ తెలంగాణ భవన్లో తమ కెవరు దిక్కు అని దిక్కులు చూస్తున్నదట. మొత్తానికి నాగేందర్ తన పార్టీ మార్పిడి ఆలోచ నను కాసేపు పక్కన పెట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ ఎన్నికలకు కాంగ్రెస్‌ను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. అయితే ఇది చివరి దాకా నిలిచే నిర్ణయం అని భావించవలసిన పని లేదు. ఏ క్షణాన్నయినా, అర్ధరాత్రి అని కూడా చూడకుండా పార్టీ మారిపోయే, మళ్లీ అదే వేగంతో తిరిగొచ్చే చాకచక్యం దానం నాగేందర్ సొంతం. 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాగేం దర్‌కు ఆసిఫ్‌నగర్ టికెట్ నిరాకరించింది. అప్పటికి ఆయన సిట్టింగ్ సభ్యుడు. ఆ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డి. శ్రీనివాస్ నాగేందర్‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నాడని ఆరోపించి నాగేందర్ రాత్రికి రాత్రి రాజకీయ బద్ధ శత్రువు చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి పసుపుపచ్చ కండువా కప్పుకుని తెలుగు దేశంలో చేరిపోయి టికెట్ తెచ్చుకుని, అదే ఆసిఫ్‌నగర్ నుంచి టీడీపీ ఎమెల్యేగా గెలిచారు. ఎన్నికలలో తెలుగు దేశం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్ది నెలల్లోనే దానం టీడీపీని వదిలి కాంగ్రెస్ గూటికి చేరారు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ అదే నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడి పోయారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రజాకర్షణ శక్తి కూడా నాగేందర్‌ను గెలిపించలేకపోయింది. ఇప్పుడయితే ఆ సమస్యే లేదు. ఆయన శాసన సభ్యుడు కారు. కానీ 2004లో ఎవరి కారణంగా అయితే తనకు టికెట్ రాలేదో అదే శ్రీనివాస్‌తో టీఆర్ఎస్లో చేరే విషయంలో నాగేందర్ చర్చలు జరిపారని, ఆయనతో టచ్‌లో ఉన్నా రని వార్తలొచ్చాయి. రాజకీయాలు అంటే ఇట్లానే ఉంటాయి మరి. ఇలా ఇంకెందరో! ఇలా పార్టీలు మారుతున్న వారంతా ఘన చరిత్ర కలవారే. కంటోన్మెంట్ సాయన్నను చూడండి! మొన్ననే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమించారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తేనే అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవేవీ లెక్కలోకి రావన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరో శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్‌కు ఆ పదవి ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఆయన కూడా టీఆర్ఎస్లో చేరతారని సాయన్న చేరికకు ముందే ప్రచారం జరిగింది. తన నియోజకవర్గం రాజేందర్‌నగర్ అభివృద్ధికి నిధులిస్తానంటే టీఆర్ఎస్లో చేరడానికి ఎప్పుడయినా సిద్ధమేనని ప్రకాష్ గౌడ్ బహిరంగంగానే చెప్పారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి టీటీడీకి మరో సభ్యుడిని వెతుక్కోవలసిరావచ్చు. శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు రాష్ర్ట వ్యాప్తంగా 12 మందిని ఎన్నుకోవలసి ఉన్న తరుణంలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముంచు కొస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ పార్టీ మార్పి డులను చూస్తే తెలంగాణ లో మరో రాజకీయ పార్టీ మిగులుతుందా లేదా అన్న సందేహం కలగక మానదు. కానీ ఇదంతా ఎక్కువ కాలం కొనసాగే బలం కాదనీ, తాత్కాలిక వాపేనని అందరికీ అర్థమయ్యే రోజు రాక తప్పదు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వాలు బాగా పనిచేయగలవనే ప్రజాస్వామ్య సూత్రం ఇప్పుడు అధికార పార్టీ చెవికి ఇంపుగా అనిపించదు. కానీ ఈ మొత్తం వ్యవహారం కప్పల తక్కెడగా మారాక తెలంగాణ రాష్ర్టసమితి తన సహజత్వాన్ని కోల్పోయిందన్న విష యం గుర్తిస్తే మంచిది. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బ్రేకింగ్ న్యూస్.. అనర్థాల రేస్
డేట్లైన్ హైదరాబాద్ మీడియా మరింత జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలన్న విషయంలో ఎవరికీ విభేదం లేదు. కేంద్ర మంత్రయినా, గవర్నరయినా, పేద పత్తి రైతైనా... వారి విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందే. మీడియాను వృత్తిగా స్వీకరించే వారికి అలాంటి శిక్షణ తప్పక ఉండాల్సిందే. కాకపోతే అదే స్వరంలో మీడియా మీద జరుగుతున్న ముప్పేట దాడిని గురించి కూడా మాట్లాడుకోవాలి. మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛల పట్ల పలుపురి వైఖరి, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఉంటోంది. రాష్ర్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గత ఆదివారం నాడు ఒక సభలో మాట్లాడుతూ మీడియా పోకడల మీద కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోని ఆవేదననూ, ధర్మాగ్రహాన్ని మీడియాతో సహా ఎవరూ కాదనలేరు. తన సోదరుడి మృతి విషయంలోనే మీడియా వ్యవహరించిన తీరును ఆయన గతంలో కూడా కొన్ని సందర్భాలలో ఉదహరించారు. నరసింహన్ సోదరుడు ఐఏఎస్ అధికారిగా అస్సాంలో పని చేస్తుండగా ఉగ్రవాదుల మందుపాతర పేలుడుకు బలైపోయారు. ఆ విషాద సంద ర్భంలో ఆయన ముఖం మీద మైకు పెట్టి, ఎలా అనిపిస్తుంది? అని అడగడం కంటే దుర్మార్గం ఉంటుందా? 30 ఏళ్ల క్రితమే, మండల్ కమిషన్ సిఫార సులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలోనే మీడియా అమానవీయతపై పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. అప్పటికింకా 24 గంటల వార్తా చానళ్లూ లేవు, ఇంత పోటీ, ఉరుకులుపరుగులూ లేవు. 1985లో, ఆ ఉద్యమం సాగుతుండగా రాజీవ్ గోస్వామి అనే యువకుడు వందలాది మంది సమక్షంలో వంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాన్ని మరుసటి వారం ఒక ప్రముఖ ఇంగ్లిష్ వారపత్రిక రంగుల ముఖ చిత్రంగా ప్రచురించి సభ్యసమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. ఆత్మాహుతికి పాల్పడుతున్న వ్యక్తిని అడ్డు కుని, రక్షించాల్సిందిపోయి, ఆ పత్రిక ఫొటోగ్రాఫర్ ముఖచిత్రం కోసం ఆరాటపడటం ఏమిటని అంతా విమర్శించారు. అనారోగ్యకర పోటీ ఈ మూడు దశాబ్దాలలో మీడియా ఇటువంటి విషయాలలో ఏమీ మారలేదు సరికదా మరింత అమానవీయంగా తయారయింది. 24 గంటల న్యూస్ చానళ్లు వచ్చిన తరువాత అయితే పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. నరసింహన్ గారు చెప్పినట్టు ధ్యాస అంతా బ్రేకింగ్ న్యూస్ మీదే అయ్యేసరికి మిగతా విలువలన్నీ వెనుకబడి పోతున్నాయి. గవర్నరే అన్నట్టు దీనికి ప్రధాన కారణం ‘రాట్ రేస్’ (విపత్కర పోటీ). అందరికన్నా ముందున్నామని చెప్పు కోడానికి పెడుతున్న అనారోగ్యకరమైన పరుగు. ఫలితంగా చాలా సంద ర్భాల్లో వాస్తవాలు తెరమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. రెండు రోజుల క్రితమే జరిగిన సంగతి చూడండి. 800 ఏళ్ల తరువాత ఒక హిందూ పాలకుడు దేశాన్ని పాలించబోతున్నాడని సార్వత్రిక ఎన్నికల విజయానంతరం నేటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారని, లోక్‌సభలో మార్క్సిస్ట్ సభ్యుడు సలీం అన్నారు. ఒక ప్రఖ్యాత ఆంగ్ల పత్రికపై ఉన్న నమ్మకంతో ఆ పత్రిక చేసిన వ్యాఖ్యనే ఆయన ఉదహరించారు. చాలా సీనియర్ మార్క్సిస్ట్ నాయకుడైన సలీం వ్యాఖ్యలు లోక్‌సభను కుదిపేశాయి. రాజ్‌నాథ్, తానా వ్యాఖ్యలు చెయ్యలేదని ఖండించారు, సలీం క్షమాపణ చెప్పాలని పట్టు బట్టారు. మార్క్సిస్ట్ నాయకులు ససేమిరా అన్నారు. ఇంత రాద్ధాంతానికి కారణమైన ఆ పత్రిక ‘‘అయ్యా క్షమించాలి. ఆ మాటలు అన్నది రాజ్‌నాథ్ కాదు, స్వర్గీయ అశోక్ సింఘాల్. మా పొరపాటును సవరించుకుంటున్నాం, మా పత్రిక ఆన్ లైన్ ఎడిషన్‌లో మార్చేశాం’’ అని ట్వీట్టర్లో సవరణ జారీ చేసింది. చిన్నదీ చితకదీ కాని ఆ పత్రికను నమ్మిన ఆ ప్రముఖ నేతకూ, ఆయన విమర్శకు గురైన మంత్రికి కూడా బాధ కలిగింది, నష్టం జరిగింది. మీడియా నుంచి జరిగే ఇలాంటి తప్పులు పెద్దవైనా చిన్నవైనా హానికరమైనవి. అనారోగ్యకర పోటీతో సాగిస్తున్న ఈ ఉరుకులుపరుగుల వల్ల ఇలాంటి ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. కొద్ది కాలం క్రితం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఓ రైతు కలెక్టర్ కార్యాలయం మెట్ల మీద పురుగుల మందు తాగి, ఆత్మహత్యాయత్నం చేశాడు. జనం ఆ రైతును ఆస్పత్రికి తరలించే హడావుడిలో ఉంటే, మీడియా మిత్రులు మాత్రం ఆ రైతు ముఖం మీద మైకులు పెట్టి ప్రశ్నలు గుప్పించారు. ఇటీవలే ఒక వార్తా చానల్, పత్రిక, ఒక వ్యక్తి సెల్ టవర్ మీద నుంచి దూకదాన్ని దశలవారీగా చిత్రించి ప్రసా రంచేసి, ప్రచురించి సంబరపడింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నయినా చెప్పొచ్చు. మీడియా... అవి పత్రికలే కావొచ్చు, వార్తా చానళ్లే కావొచ్చు మరింత జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలన్న విషయంలో ఎవరికీ విభేదం లేదు. మీడియాకు స్వీయ నియంత్రణ అవసరమని మీడియా పెద్దలే నిత్యమూ ఘోషిస్తున్నారు. కేంద్ర హోంమంత్రే అయినా, రాష్ర్ట గవర్నర్ అయినా, పేద పత్తి రైతయినా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించా ల్సిందే. మీడియాను వృత్తిగా స్వీకరించే వారికి అలాంటి శిక్షణ తప్పక ఉండాల్సిందేననడంలోనూ భిన్నాభిప్రాయం లేదు. తెలుగు ఏలికల రాజకీయ అసహనం కాకపోతే అదే స్వరంలో మీడియా మీద జరుగుతున్న ముప్పేట దాడిని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎంత సేపూ మీడియా స్వీయ నియంత్రణ గురించే మాట్లాడే వారు సమాజంలో పెచ్చుపెరుగుతున్న అసహనాన్ని గురించి కూడా మాట్లాడితే, దానికి నివారణ మార్గం చూపితే బాగుంటుంది. మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మీడియాకు వెలుపల ఉన్న పలుపురి వైఖరి.. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఉంటోంది. గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా మీడియా మీద, విలేకరుల మీద ఆందో ళనకరమైన రీతిలో దాడులు జరుగుతున్నాయి. అందుకు కారణం కారణం రాజకీయ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరే. ప్రస్తుతం ఎక్కడ చూసినా అస హనంపై చర్చే వినవస్తోంది. ఇక్కడ ప్రస్తావిస్తున్నది అవార్డు వాపసీలపై ప్రద ర్శిస్తున్న అసహనం గురించి కాదు. అటువంటి విషయాలను వార్తలుగా మలిచి ప్రజలకు చేరవేస్త్తున్న మీడియా పట్ల రాజకీయ వర్గాల్లో పెరిగిపోతున్న అసహనం గురించి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు, దేశ వ్యాప్తంగానే ఉంది. గత జూన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో జగేంద్రసింగ్ అనే జర్నలిస్ట్‌ను స్థానిక రాజకీయ నాయకుడి ప్రాపకంలోని గూండాలూ, పోలీసులు కలిసి తగులబెట్టి చంపారు. అదే నెలలో మధ్య ప్రదేశ్‌లో మరో జర్నలిస్ట్‌ను ఇలాగే హతమార్చారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి మరో పది వరకు దాడుల్లో పలువురు జర్నలిస్టులు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ ఘటనలన్నింటికీ రాజకీయ నాయకత్వం అసహనమే కారణం. తమకు నచ్చని లేదా తమ ప్రయోజనాలను దెబ్బతీసే వార్తలు రాసినందుకే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మీడియాపై ముప్పేట దాడి గవర్నర్ నరసింహన్ ఏలుబడిలోనే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ కీయ నాయకత్వం అసహనాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన వెంటనే అక్కడి ప్రభుత్వం ప్రదర్శించిన అసహనాన్ని ప్రపంచమంతా చూసింది. అది గవర్నర్ దృష్టికి రాలేదనుకోగలమా? అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలకు కొన్ని మీడియా సంస్థలను అనుమతించని విషయం, వర్కింగ్ జర్నలిస్ట్‌ల ఉద్య మం నిరసన అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం కూడా అందరికీ తెలుసు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలను వెలువరిస్తున్నాయంటూ, నిన్నగాక మొన్న ఏపీ ముఖ్యమంత్రి సాక్షి దిన పత్రిక చదవొద్దని, సాక్షి టీవీ చూడొద్దనీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో తప్పులు జరిగితే, ప్రజాధనం దుర్వి నియోగమైతే వాటిని వెలుగులోకి తేకుండా ఉండాలనే కోరిక పాలకులకు ఉండొచ్చు. కానీ, ఆయన పిలుపు మేరకు ఎవరైనా వాటిని చదవడం, చూడ టం మానేస్తే అది వారి ఇష్టం. కానీ, కొన్నేళ్లుగా అధికార పార్టీ కార్యాల యంలోకి కొన్ని మీడియా సంస్థల ప్రతినిధుల ప్రవేశాన్ని నిషేధించడం ప్రజాస్వామ్యంలో సరైన చర్యేనా? అని గవర్నర్ ఆలోచించాలి. తన ఏలు బడిలోనే జరుగుతున్న ఈ అప్రజాస్వామిక చర్యను గురించి గవర్నర్ మాట్లాడకపోయినా, సరిచేస్తే బాగుండేది. చివరగా, తెలుగుదేశం పార్టీ నాయకుల అసహనం. దానికి పరాకాష్ట ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కార్యా ద్యక్షుడు రేవంత్‌రెడ్డి గత బుధవారం విలేకరుల గోష్టిలో చేసిన వ్యాఖ్యలు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ... రేవంత్‌రెడ్డిని వెంట పెట్ట్టుకుని ప్రచారం చెయ్యడం ఏమిటని రాసినందుకు ఆయన ఈ కాలమిస్ట్ మీద విరుచుకుపడ్డారు. నిజమే కదా, అంతకు కొద్ది నెలల క్రితమే శాసన మండలి ఎన్నికల్లో అవతల పార్టీ శాసనసభ్యుడికి రూ.50 లక్షలు లంచం ఇవ్వజూపి ఏసీబీకి దొరికిపోయి, జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటున్న వ్యక్తిని వెంట పెట్టుకుని ప్రచారానికి పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో, అందునా వరంగల్ వంటి చోట ఎక్కువ ఓట్లెలావొస్తాయి? ఆ మాట అన్నందుకు అసహనం, అవాకులు చవా కులూ పేలడమా? ఈ తరహా రాజకీయ నాయకులను ఎవరు కట్టడి చెయ్యాలి? - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ప్రెస్‌క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం
జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గంలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని.. ఈ తీరును జీర్జించుకోలేక ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలకు దూరంగా ఉంటున్నట్లు టీయూడబ్ల్యూ జే నేతలు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, దేవుల పల్లి అమర్ బషీర్ బాగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ కు సోమాజీ గూడలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కేటాయిస్తూ.. 1995లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని.. యూనియన్ వారసత్వంగా ఉన్న ప్రెస్ క్లబ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీయూడబ్ల్యూ జేకి అనుబంధంగానే కొనసాగాల్సి ఉంటుందని అన్నారు. కార్యవర్గంలోని కొందరు వ్యక్తులు జర్నలిస్టుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చట్టబద్దంగా ప్రెస్ క్లబ్ కు సంక్రమించిన అధికారాలను కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రెస్‌క్లబ్ పాలకమండలి పదవీకాలం ముగియగా, స్వర్ణోత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 50 సంవత్సరాలు ప్రెస్‌క్లబ్‌ను తీర్చిదిద్దిన వారిని కనీసం సంప్రదించకుండా, ప్రెస్‌క్లబ్‌కు మాతృసంస్థగా ఉన్న యూనియన్ నేతలను పరిగణలోకి తీసుకోకుండా స్వర్ణోత్సవాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 1965 మే 25న ఏర్పాటైన ప్రెస్‌క్లబ్‌కు ఆరునెలల తరువాత స్వర్ణోత్సవాలు నిర్వహించ డాన్ని తప్పుపట్టారు. ఈ సమావేశంలో ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు అమరనాథ్, ఐజేయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, హెచ్‌యూజే అధ్యక్షుడు కోటిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రెస్‌క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం
-
'కల్యాణ' మస్తు అంటే చాలా?
డేట్లైన్ హైదరాబాద్ ముఖ్యమంత్రిని కలవడానికి చాలామంది ప్రముఖులు వస్తుంటారు. వారిలో చాలామంది పవన్ కంటే కూడా ప్రముఖులే ఆయా రంగాల్లో. అందరికీ ఇటువంటి స్వాగతం ముఖ్యమంత్రి నుండి లభిస్తుందా? అందరి మాటెందుకు, అదే రోజున ముఖ్యమంత్రిని కలసిన కమల్ హాసన్‌కి ఇంతే ప్రాధాన్యం ఇచ్చారా? లేదు. కారణం ఏమిటంటే ఆడిన మాట తప్పి తమకు ఏమీ చెయ్యలేదని ఆగ్రహించి దూరం కాబోతున్న సామాజిక వర్గాన్ని బుజ్జగించడానికి కమల్ హాసన్ పనికిరాడు కదా. గత వారం పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలో కలుసుకున్నారు. ఆయన వెంట రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పవన్ హీరోగా నటిస్తున్న గబ్బర్‌సింగ్ 2 సినిమా నిర్మాత శరత్ మరార్ కూడా ఉన్నా పవన్, బాబు మాత్రమే మూడు గంటలపాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. బయట మీడియా వారు టెన్షన్‌గా వెయిటింగ్. మూడు గంటలు పవన్ కల్యాణ్‌తో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే ఎంతో ముఖ్యమయిన విషయాలే అయి ఉంటాయి. మంచి వార్తే దొరుకుతుంది అని సంబర పడుతూ తిండితిప్పలు మరిచిపోయి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట పడిగాపులు పడ్డారు. మీడియాకి తమ సమావేశం వివరాలు ఏం చెప్పాలి, ఏ మేరకు చెప్పాలి అనే విషయం చర్చించుకుంటున్నారు లోపల, అందుకే ఇంత ఆలస్యం అవుతున్నది అని ఒక తుంటరి విలేకరి వ్యాఖ్యానిస్తే మీడియా వారికి కోపం కూడా వచ్చి ఆ విలేకరిని ఏం బెహద్బీ అని ఆక్షేపిం చారట కూడా. సమావేశం ముగిసింది. పవన్‌కల్యాణ్ బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో, ఏం చెప్పాలనుకున్నారో అర్థంకాక మీడియా మిత్రులు తలలు పట్టుకుంటే సదరు తుంటరి విలేకరి వాళ్ల వైపు ఓ నవ్వు విసిరి అక్కడి నుండి నిష్ర్కమించాడట. సినిమా హీరోలు సొంతంగా మాట్లాడితే ఇట్లాగే ఉంటుంది, మీరే అర్థం చేసుకోవాలి, అయినా అర్థంకాకపోతే సర్ద్దుకుపోవాలి అన్నట్టుగా ఆయనతోబాటు వచ్చిన మంత్రి కామినేని ఓ చిరునవ్వు విసిరి వెళ్లిపోయారట. పవన్, బాలయ్య నిజమే మాటల రచయిత రాసిచ్చిన డైలాగులు బట్టీ పట్టి లేదా చూసి చదివి డబ్బింగ్ చెప్పే హీరోలను ధారాళంగా, అనర్గళంగా మాట్లాడమంటే ఎట్లా సాధ్యం చెప్పండి! తాము చెప్పదలచుకున్న విషయంలో స్పష్టత లేకపోడానికి హీరోలు కారణం ఎట్లా అవుతారు పాపం. సినిమాల్లో లాగే రాజకీయాల్లో కూడా మాటల రచయితలు ఉంటారు. కానీ తేడా ఏమిటంటే రాజకీయాల్లో అన్ని సందర్భాలలో మాటల రచయితలూ రెడీగా ఉండరు కదా ఏం మాట్లా డాలో, ఎలా మాట్లాడాలో చెప్పడానికి. పైగా సినిమా వార్తలు రాసే వాళ్లు హీరోలను ఇరుకున పెట్టే ప్రశ్నలు అడగరు కూడా. అందుకే హీరోలు రాజకీ యాలు మాట్లాడినప్పుడు ఈ సమస్యలు తప్పవు మరి. ఆ మధ్య మరో ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా గురించి విలేకరులు ప్రశ్నిస్తే తడబడి మా బావగారు ఒక నిర్ణయం తీసుకుని ప్రక టిస్తారు అన్నందుకు సోషల్ మీడియా ఎంత హంగామా చేసింది! పాపం ఆయన ముఖ్యమంత్రికి బావమరిది, వియ్యంకుడు అయినంత మాత్రాన అన్నీ తెలిసి ఉండాలనుకుంటే ఎలా? అదే మాట పవన్‌కల్యాణ్‌కు కూడా వర్తిస్త్తుంది కదా. నిజమే దాన్నెవరూ కాదనరు. కానీ సినిమాల్లో వేషాలన్నా వేసుకోవాలి, పూర్తిగా రాజకీయాల్లోకి అయినా రావాలి అన్న విజ్ఞప్తుల మాట కూడా నిజమే కదా. బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చాడంటే అది కుటుంబ వ్యవహారం. తండ్రి తరువాత తండ్రి అంతటి అన్న స్థానంలో స్వయానా బావగారికి తోడుగా ఉండటానికి ఆయన శాసనసభ్యుడయ్యారు. పవన్‌కల్యాణ్‌కి ఏం పని రాజకీయాల్లో? ఆయనేం చంద్రబాబు బావ మరిది కాదు, తమ్ముడూ కాదు. పైగా ఆయన కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయిన మరో ప్రముఖ హీరో చిరంజీవి తమ్ముడు. ఆయనేమీ ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. శాసనసభ్యుడో, పార్ల మెంట్ సభ్యుడో కాదు. ఆయనే చెప్పినట్టు జనసేన అనే పార్టీ పెట్టినా దాన్ని నడిపించడానికి తగిన ఆర్థిక స్తోమత కలవాడు కాదు. మరి అటువంటప్పుడు అప్పుడప్పుడు ఎలుక కలుగులో నుండి తల బయట పెట్టినట్టు ముఖ్యమం త్రిని కలసి ఏవో నాలుగు మాటలు మీడియాకి చెప్పేసి మళ్లీ కనపడకుండా పోతాడు! ఇలా జరగడం మొదటిసారి కాదు. 2014 ఎన్నికల సమయంలో బయటికొచ్చి తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి, తప్పులు జరిగితే ప్రశ్నిస్తానని కనిపించకుండాపోయిన పవన్‌కల్యాణ్ మధ్యలో ఒకసారి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుండి బల వంతంగా భూములు లాక్కున్నప్పుడు రెండోసారి బయటికొచ్చాడు. భూములు కోల్పోయిన రైతుల దగ్గర ఒక మాట, హైదరాబాద్ వచ్చి చంద్ర బాబును కలిశాక ఇంకో మాట. మళ్లీ కలుగులోకి. మళ్లీ గతవారం విజయ వాడలో చంద్రబాబును కలవడానికి మూడోసారి. ఏ సమస్యను గురించి చర్చించారు, సందర్భం ఏమిటి? ఇంత హఠాత్తుగా ప్రత్యేక విమానంలో ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు? ప్రజలకు తెలిసే అవసరం లేదా? మర్యాద వెనుక ఆంతర్యం అమరావతి శంకుస్థాపనకు పిలిచారు రాలేకపోయాను, అందుకు కృతజ్ఞ్ఞత తెలపడానికి వచ్చానన్నారు ఒకసారి. బాగుంది, ఆ కృతజ్ఞతలు ఫోన్లో కూడా చెప్పొచ్చు. లేదా ఈయన కంటే పెద్ద నటుడు, గొప్ప నటుడు కమల్ హాసన్ కూడా అదే రోజు ముఖ్యమంత్రిని కలసి ఇటువంటి కృతజ్ఞతలే చెప్పి వెళ్లారు. అట్లా చేసి ఉండొచ్చు కదా. విజయవాడ నుండి ఒక ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ స్వయంగా హైదరాబాద్ వెళ్లి పవన్‌కల్యాణ్‌తో మాట్లాడి జాగ్రత్తగా వెంట పెట్టుకుని అదే విమానంలో విజయవాడకు తీసుకొచ్చి ముఖ్యమంత్రితో భేటీ చేయించి తిరిగి జాగ్రత్తగా తీసుకువెళ్లి హైదరాబాద్‌లో దింపివచ్చారు. పవన్ విజయవాడ క్యాంపు కార్యాలయానికి రాగానే ముఖ్యమంత్రి స్వయంగా బయటి దాకా వచ్చి ఆయనను సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు. తిరిగి వెళ్లేప్పుడు కూడా అంతే ఘనంగా పవర్‌స్టార్‌కు వీడ్కోలు పలికారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిని కలవడానికి చాలా మంది ప్రముఖులు వస్తుంటారు. వారిలో చాలా మంది పవన్ కంటే కూడా ప్రముఖులే ఆయా రంగాల్లో. అందరికీ ఇటు వంటి స్వాగతం ముఖ్యమంత్రి నుండి లభిస్తుందా? అందరి మాటెందుకు, అదే రోజున ముఖ్యమంత్రిని కలసిన కమల్ హాసన్‌కి ఇంతే ప్రాధాన్యం ఇచ్చారా? లేదు. కారణం ఏమిటంటే ఆడిన మాట తప్పి తమకు ఏమీ చెయ్య లేదని ఆగ్రహించి దూరం కాబోతున్న సామాజిక వర్గాన్ని బుజ్జగించడానికి కమల్ హాసన్ పనికి రాడు కదా. అమరావతి శంకుస్థాపనకు తనకు అందిన ఆహ్వానం తీరుకు పవన్ కల్యాణ్ కినుక వహించాడనీ, ఆ విషయం తెలిసిన లోకేశ్‌బాబు పవన్ సామా జిక వర్గం మీద ఆధారపడి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవలేదని పార్టీ నాయకుల సమక్షంలో వ్యాఖ్యానించాడనీ దానితో తెలుగుదేశంలోని ఆ సామాజికవర్గం శాసనసభ్యులు, నాయకులు ఆగ్రహంగా ఉన్నారనీ వార్తలు వచ్చాయి. పవన్‌కల్యాణ్ సామాజికవర్గం కాపులను బీసీలలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్న ఎన్నికల వాగ్దానం అటకెక్కింది. కాపుల సంక్షేమా నికి ఈ ఐదేళ్ల కాలంలో ఐదు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తామన్న మాట కూడా మరిచిపోయారు ఏ మొహం పెట్టుకు తిరగాలని అధికార పార్టీ లోని కాపు నాయకులు మథనపడుతుండగా పుండు మీద కారం జల్లినట్లు మాజీ మంత్రి, బహుపార్టీల మాజీ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య ప్రచురించిన ఆత్మకథలో 1989లో జరిగిన వంగవీటి రంగా హత్యకు సూత్రధారుడు చంద్రబాబు అని పేర్కొంటూ ఆనాడు తనకు తెలిసిన విషయాలు రాసి వివాదం సృష్టించాడు. అదెంతవరకు నిజం అనే మాట పక్కన పెడితే కాపు సామాజికవర్గం ఆ రోజుల్లో తిరుగులేని నాయకుడిగా భావించిన రంగా హత్యలో ఆనాటి అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జోగయ్యగారు అదే అధికార పార్టీ టీడీపీ లోనే ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత జోగయ్య చేస్తున్న ఆరోపణలకు ఏ మాత్రం విశ్వసనీయత ఉంటుంది? చట్టపరంగా, న్యాయపరంగా ఏ మేరకు నిలబడు తుంది? అన్న విషయాలు పక్కన పెడితే మానుతున్న గాయాన్ని జోగయ్య గారు మరోసారి రేపినట్టు మాత్రం అయింది. జోగయ్య కలకలంతోనేనా ? ఇవన్నీ కలసి ఏపీ సీఎం చంద్రబాబు పవన్‌కల్యాణ్‌ను ప్రత్యేక విమానంలో పిలిపించి గుమ్మం దాకా వెళ్లి స్వాగతం పలికి, మూడు గంటలు ముచ్చటించి సంతృప్తిపరిచి పంపాల్సివచ్చింది. పవన్ సంతృప్తి చెందాడనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన బయటికొచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ముఖ్య మంత్రికి ఇబ్బంది కలిగించే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. పైగాప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే బీజేపీకి కష్టాలు తప్పవన్నారు. పవన్ సంతృప్తి చెందాడు సరే, రాష్ర్ట ముఖ్యమంత్రి మీద గుర్రుగా ఉన్న కాపు సామాజికవర్గం మాటేమిటి? తమ వర్గానికి చెందిన పవన్‌ను పిలిచి ముచ్చటించారు కాబట్టి వారూ సంతృప్తి చెందినట్టేనా? పవన్ మంత్రం ప్రతిసారీ పారుతుందా? హామీలు నెరవేర్చకుండా, సమస్యలు పరి ష్కరించకుండా ఆ వర్గం జనానికి ముఖ్యమంత్రి ఎంతకాలం పవన్ బామ్ రాస్తారో వేచి చూడాల్సిందే. వ్యాసకర్త: దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు కొట్టి పోయారు
(డేట్లైన్ హైదరాబాద్) మూడు నాలుగు పంటలు పండే బంగారం లాంటి భూములు కోల్పోయిన రైతులకు ఏ ప్రయోజనం చేకూర్చనున్నారో శంకుస్థాపన సందర్భంగా ప్రకటిస్తారని అంతా ఆశించారు. ప్రత్యేక హోదాపైనకూడా ఒక స్పష్టత ఇస్తారని కూడా అనుకున్నారు. బిహార్ తరహాలో కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తారని కొందరు ఆశపడ్డారు. కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖాన కొట్టి వెళ్లిపోయారు ప్రధానమంత్రి. ఈ మన్ను, నీళ్ల కథే పెద్ద ప్రహసనం. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును ఆహ్వానించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లారనే వార్త విని సంతోషం పట్టలేకపోయానని ప్రధాని నరేంద్ర మోదీ సభా వేదిక మీద పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు సఖ్యంగా ఉంటే ప్రధాని నిజంగా సంతోషించవలసిందే. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ విభేదాలను, అహాన్ని పక్కన పెట్టి ప్రజోప యోగం కోసం కలసి పని చెయ్యాలనుకుంటే ప్రధానమంత్రే కాదు, ఈ రెండు రాష్ట్రాల ప్రజలూ సంతోషిస్తారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ భుజం భుజం కలిపి నడిస్తే తెలుగు ప్రజల అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన వారవుతారని ప్రధాని కూడా చెప్పారు. చంద్రబాబు ఆహ్వానించడంతో కేసీఆర్ సహచరులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారట, శంకుస్థాపనకు తాను స్వయంగా వెళ్లడమా లేక మంత్రుల బృందాన్ని పంపడమా అని. ఆయనే హాజరైతే బాగుంటుందని అందరూ సూచించాక, అందుకు సిద్ధమై, తెలంగాణ నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి విరాళంగా ప్రకటించాలని కూడా నిర్ణయించుకుని బయలు దేరారట. అయితే రాజధాని నిర్మాణానికి నిధులను గురించిన ప్రస్తావన ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి కానీ, అటు ప్రధాని నుంచి కానీ రాకపోవ డంతో తెలంగాణ ముఖ్యమంత్రి తానెందుకు ఆ చొరవ చూపాలని మిన్న కుండిపోయారనీ, లాంఛనంగా అభినందనలతో ముగించారనీ టీఆర్ఎస్ ముఖ్యవర్గాలే చెబుతున్నాయి. నిజమే, నిర్మాణ భారం వహించవలసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, ఇచ్చిన మాట మేరకు ఇతోధిక సాయం ప్రకటిం చాల్సిన కేంద్ర ప్రభుత్వానికీ పట్టనప్పుడు చంద్రశేఖర్‌రావు ఎందుకు అత్యు త్సాహం చూపించడం? ఇదే ప్రధాని చూపిన స్వర్గం గత సార్వత్రిక ఎన్నికలలో మోదీ, బాబు జోడీ కలసి పోటీ చేసింది. ప్రపంచ ప్రఖ్యాత రాజధానిని నిర్మించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అందలం ఎక్కిస్తామని వాగ్దానాలు చేశారు. కానీ అమరావతి శంకుస్థాపన నాడు ఆ అంశం జోలికి ఎందుకు వెళ్లలేదు? అంతకు ముందు దాదాపు రెండుమాసాల నుంచి టీడీపీ, బీజేపీ నాయకులు మీడియాలో ఊదరగొట్టారు, ‘ప్రధాని వస్త్తున్నారు, చూసు కోండి, ఏమేం తెస్తున్నారో!’ అని. ఓ జన్నత్ దిఖాయేగా (ఆయన స్వర్గం చూపిస్తాడు) అని. అవును, ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగానే స్వర్గం చూపించారు. పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం. ఆ దేవాలయం నుంచి స్వయంగా మట్టి తెచ్చారు. అది స్వర్గం నుంచి వచ్చినట్టే! మరో స్వర్గతుల్య మయిన యమునా పుణ్యజలాలను కూడా రాజధాని నిర్మాణంలో తమ వాటాగా అందించారు ప్రధాని. ఓ జన్నత్ ది ఖాయా అవుర్ జహాన్నూం మే పహుంచాయా (అరచేతిలో స్వర్గం చూపించి అడవిలో వదిలి వెళ్లాడు). శంకు స్థాపన ముగిశాక లెక్కకు మించిన హెలికాప్టర్లు ప్రముఖులను తీసుకుని గాలిలోకి ఎగరడంతో దుమ్ము పడ్డ కళ్లు నులుముకుంటూ ఇంటి దారి పట్టిన ఆ ప్రాంత రైతులు ఇదే గొణుక్కున్నారు. కార్యక్రమం ముగిశాక మామూలు మనుషులు కావడానికి టీడీపీ, బీజేపీ కూటమికి రెండు మూడురోజులే పట్టింది. చంద్రబాబు ఇరవై నాలుగు గంటల తరువాత మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. తాను ప్రత్యేక హోదా అనబోయి, పొరపాటున ప్రత్యేక ప్యాకేజీ అన్నానని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధాన మంత్రి, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఇంత ముఖ్యమైన విషయంలో ఇంత బాధ్యతారహితంగా ఉంటారా? ఎన్నో చేశారు అని ముఖ్యమంత్రి, అన్నీ చేస్తామని ప్రధానమంత్రి ప్రకటించడం తప్ప బోలెడు ప్రజాధనాన్ని వెచ్చించి ఇంత అట్టహాసంగా, ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రం నుంచి భవిష్యత్లోనయినా ఎలాంటి సాయం వస్తుంది అన్న అంశం మీద ఎవరికీ స్పష్టత రాలేదు. ఆత్మార్పణల సంగతి తెలియదా? ఇక్కడ ఓ విషయం మాట్లాడుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానించిన విషయం ప్రధాని దృష్టికి వచ్చింది కానీ, కేంద్రమే ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలుకు జరుగుతున్న ఆందోళనలు మాత్రం ఆయన దృష్టికి రాలేదు. ప్రత్యేక హోదా రాదేమో అన్న నిస్పృహతో కొందరు ఆత్మాహుతికి పాల్పడ్డారు. భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్‌లో తమ ఉనికినే ప్రశ్నార్థకం చేయగల ఉద్యమం ఒకటి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్నదన్న విషయం, దాని కోసం ఆ అమరావతికి కూతవేటు దూరంలోనే ఒక పక్షం రోజుల ముందు ప్రతిపక్ష నేత నిరవధిక దీక్ష చేసిన విషయం ప్రధాని దృష్టికి రాష్ర్ట ప్రభుత్వం కానీ, కేంద్ర నిఘావర్గాలు కానీ, ఆయన పార్టీ యంత్రాంగం కానీ తీసుకుపోకపోవడం చిత్రమే. కనీసం మీడియా ద్వారానైనా తెలిసి ఉండదా అంటే జాతీయ మీడియాకు ఆంధ్ర ప్రదేశ్ అనే రాష్ర్టం ఉన్నట్టు కానీ, అక్కడ ప్రత్యేక హోదా కోసం జీవన్మరణ పోరాటం జరుగుతున్నట్టు కానీ తెలిసినట్టే లేదు. తెలంగాణలో కవితమ్మ ఆధ్వర్యంలో ఆడించే బతుకమ్మలను చూడటానికీ, అమరావతిలో రాజధాని శంకుస్థాపన వేడుకలు చూడటానికీ పొలోమని రావడానికి తీరిక ఉన్న ఢిల్లీగత జీవులయిన జాతీయ మీడియాకు ఆంధ్రప్రదేశ్‌లో హోదా కోసం సాగుతున్న ఉద్యమం ఊసే పట్టకపోవడం విచారకరం. మూడు నాలుగు పంటలు పండే బంగారం లాంటి భూములు కోల్పోయిన రైతులకు ఏ ప్రయోజనం చేకూర్చనున్నారో శంకుస్థాపన సందర్భంగా ప్రకటిస్తారని అంతా ఆశించారు. ప్రత్యేక హోదాపైనకూడా ఒక స్పష్టత ఇస్తారని కూడా అనుకున్నారు. బిహార్ తరహాలో కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తారని కొందరు ఆశపడ్డారు. కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ముఖాన కొట్టి వెళ్లిపోయారు ప్రధానమంత్రి. ఈ మన్ను, నీళ్ల కథే పెద్ద ప్రహసనం. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించి సెంటిమెంట్‌తో కొట్టాలన్న పనికిరాని ఆలోచన ఇది. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కి రాజధాని ప్రాంతం అంతటా సర్వమత సమానత్వం పేరిట చర్చిల నుంచి, గురుద్వారాల నుంచి, మసీదుల నుంచి తెచ్చిన మట్టి, నీళ్లు చల్లడం, దీనికో పవిత్రతను ఆపాదించే ప్రయత్నం ప్రభుత్వాధినేతలే చేయడం రాజకీయ జిమ్మిక్కు అని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు. ముందున్నది ముసళ్ల పండుగ ప్రత్యేకహోదా కావాలని ముఖ్యమంత్రి ఈ వేదిక మీద పట్టుపట్టనందుకు ప్రధాన మంత్రి మోదీ, రాజధాని నిర్మాణం ఎవరికి అప్పగించనున్నారు? లెక్కాపత్రం ఏమిటి అని ప్రధాని ప్రశ్నించనందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి- ఇద్దరే ఆ ప్రాంగణం నుంచి సంతోషంగా తిరిగి వెళ్లారు. సంతో షంగా తిరిగి వెళ్లిన మూడో వ్యక్తి- తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను చూసి చేసిన హర్షధ్వానాలు, త్వరలో వస్తాయనుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్ర ప్రజల ఓట్లు తన పార్టీకి తెచ్చి పెడతాయనడానికి నిదర్శనమన్న సంబరం ఆయనది. అటు ప్రధానమంత్రికి కానీ, ఇటు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకు కానీ ఇందులో సంతోషించాల్సింది ఏమీలేదు. ముందున్నది ముసళ్ల పండుగ. ఆయన పిలిచారు, మీరు వెళ్లారు బాగానే ఉంది. కాని ఓటుకు కోట్లు వ్యవహారం సంగతి ఏమిటి అని చంద్రశేఖర్ రావును తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు. అంతేకాదు, మీరు కూర్చున్న వేదిక మీద ప్రధాని తెలంగాణ రాష్ర్ట ఏర్పాటునే వ్యతిరేకిస్తూ మాట్లాడితే మీరేం చేస్తున్నారు అని కూడా అడుగుతారు తెలంగాణ ప్రజలు. స్వార్థపరులు, రాజ కీయ స్వప్రయోజనాలు ఆశించిన వారూ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌ను చీల్చారు అని అమరావతి సాక్షిగా నరేంద్ర మోదీ మరొక్కమారు ప్రకటిం చారు. ఇది తెలంగాణ ఉద్యమ వీరుడు చంద్రశేఖర్‌రావు చెవులకు సోకలేదా? అమరావతి సందర్శన ప్రధానమంత్రికీ ఆయన పార్టీకీ రెండు రాష్ట్రా ల్లోనూ రెంటికీ చెడ్డ రేవడి అనుభవాన్ని మిగిలించే అవకాశం ఉంది. చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన, రాష్ర్ట విభజనను పూర్తిగా సమర్థించిన భారతీయ జనతా పార్టీ విధానమూ, నరేంద్ర మోదీ విధానమూ వేర్వేరా అనే అభిప్రాయం కలుగుతున్నది. ఆయన ఎన్నికల ప్రచార సమయంలో కూడా తల్లిని చంపి బిడ్డను బతికించారు అని రాష్ట్ర విభజన వ్యతిరేక వైఖరినే చాటుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి తెలంగాణలోనూ, ప్రత్యేక హోదా సహా ఏ ప్రయోజనమూ అందించక ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ నాయకులు, శ్రేణులు ప్రజల్లో తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చుకోవడం మాత్రం తథ్యం. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ ఒత్తిడుల కారణంగా చేస్త్తున్నారో కానీ మొన్న అమరావతి వేదిక మీద మాట్లాడినప్పటి లాగానే కేంద్రాన్ని సమర్థిస్తూ పోతే విపరిణామాలు మరింత తీవ్రం కాకతప్పదు. (వ్యాసకర్త: దేవులపల్లి అమర్, ప్రముఖ పాత్రికేయులు) -
బాపూ బాటకు గ్రహణం పట్టిందా?
డేట్లైన్ హైదరాబాద్ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష వల్ల ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి, చేసిన వ్యాఖ్యలు సత్యాగ్రహానికి కాలం చెల్లిందేమో అనిపించే విధంగా ఉన్నాయి. ప్రత్యేక హోదా కోరుతూ శాసన సభ చేసిన నిర్ణయాన్ని కేంద్రం ముందుంచి అమలు చేయించాల్సిన ముఖ్యమంత్రే ఆ డిమాండ్‌ను అపహాస్యం చేయడాన్ని ఏమనాలి? ప్రతిపక్ష నేత నిరాహార దీక్షను భగ్నం చేశారు సరే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా కోసం బలంగా పెరుగుతున్న కోర్కెను ఏం చేస్తారు? రాష్ట్ర విభజన సమయంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ అంగీకరించిన విధంగానే, విభజనానంతర ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అదే డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల ఏడవ తేదీన ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్షను ఆరు రోజుల తరవాత మంగళ వారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఆందోళనకరంగా మారిన ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా డాక్టర్ల సూచన మేరకు జగన్మోహన్రెడ్డిని ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు చెప్పారు. గత రెండేళ్ల కాలంలో జగన్మోహన్రెడ్డి నిరవధిక దీక్షను చేపట్టడం ఇది మూడవసారి. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య నినాదంతో ఒకసారి జైల్లో, మరోసారి హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద ఆయన దీక్షలు జరిపారు. రాష్ట్రం విడిపోయాక ఆయన ఇప్పుడు మళ్లీ నిరవధిక నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చింది. ‘ఆంధ్ర రాష్ట్రం’లోనే దీక్షపై అపహాస్యాలా? నిరాహార దీక్ష, ప్రజాస్వామ్యంలో సత్యాగ్రహాన్ని, ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే బలమైన ఆయుధం. స్వాతంత్య్ర పోరాట కాలంలో మహాత్ముడు పలుమార్లు భిన్న కారణాలతో నిరాహార దీక్షలు చేశాడు. ప్రజల ప్రబలమైన ఆకాంక్షను నెరవేర్చాలని పాలకుల మీద ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాలు ఎంచుకునే శాంతియుత పోరాట రూపం నిరాహారదీక్ష. దాదాపు ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఎన్నో వందల, వేల మంది నేతలు, కార్యకర్తలు వివిధ కారణాలతో ఈవిధ మైన నిరసనను ప్రదర్శించారు. కొన్ని సందర్భాల్లో సత్యాగ్రహానికి తలొగ్గి ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించడం, కొన్ని సందర్భాల్లో ఈ రకం ఉద్యమాలు విఫలం కావడమూ కూడా మనకు తెలుసు. పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష ఫలితంగానే మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నిరాహార దీక్ష ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్న సీమాంధ్రలోనే నిన్నటి దాకా సాగిన జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్ష పట్ల ప్రభుత్వం, పాలక పార్టీ పెద్దలు అనుసరించిన వైఖరి, చేసిన వ్యాఖ్యలు సత్యాగ్రహానికి కాలం చెల్లిందేమో అనిపించే విధంగా ఉన్నాయి. అంతే కాదు నేటి పాలకుల వెకిలితనాన్ని కూడా బయట పెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఆ రాష్ట్రంలో ఒక ఉద్యమం సాగుతున్నది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ తమ తమ పద్ధతుల్లో అదే డిమాండుతో ఆందోళన చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి అన్ని మార్గాలూ అన్వేషించి, అన్ని దారులూ నడచి, చివరి అస్త్రంగా ఈ నిరాహార దీక్షను ఎంచుకున్నారు. అది కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలన్నిటికీ ఏకాభిప్రాయం ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలనే కోరిక మీదనే చేపట్టిన దీక్ష. గత నెల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో సభ్యులంతా చర్చించిన మీదట రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులతో పాటూ, బీజేపీ, తెలుగుదేశం పార్టీల సభ్యులు కూడా ఆ తీర్మానాన్నిఆమోదించారు. చట్టసభ తీర్మానానికి విలువే లేదా? శాసనాలు చేసే చట్ట సభ తీసుకున్న నిర్ణయానికి ఉండే విలువ ప్రాముఖ్యత ఒక్క అధికార పక్షానికి, దాని మిత్ర పక్షంగా ఉన్న బీజేపీకి తప్ప అందరికీ తెలుసు. శాసన సభ నిర్ణయాన్ని కేంద్రం ముందుంచి, ఇది మా రాష్ర్ట ప్రజల నిర్ణయం దీన్ని అమలు చెయ్యండని పట్టుబట్టాల్సింది సభా నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. కానీ ఆయనే శాసనసభ తీర్మానించాక కూడా ప్రత్యేక హోదాను చులకన చేస్తూ మాట్లాడారు. అయనతోబాటు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌కు పేటెంట్ తనదేనని చెప్పుకునే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పలుమార్లు ఈ అంశాన్ని ‘జిందా తిలిస్మాత్’, ‘అమృతాంజనం’ అంటూ హేళన చేయడం అంతా చూశారు. అటు శాసన సభలో తీర్మానం చేసి దానికి భిన్నంగా బయట ఎట్లా మాట్లాడతారో చంద్ర బాబే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉండగా కొట్లాడి, ఒప్పించి తెచ్చుకున్న ప్రత్యేక హోదాను అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వలేకపోతున్నారో స్పష్టం చెయ్యాల్సింది బీజేపీ పెద్దలే. పదేళ్లు చాలదు పదిహేనేళ్ల కావాలన్న తామే ప్రత్యేక హోదా కోసం ఎందుకు పట్ట్టుబట్టడం లేదో చెప్పాల్సింది చంద్రబాబే. ప్యాకేజీల గుట్టు ఎవరికి తెలియనిది? కావాల్సినన్ని నిధులు ప్యాకేజీల ద్వారా వస్తుంటే ఇంకా ప్రత్యేక హోదా రాద్ధాంతం దేనికని అధికార పక్షం, దానికి గుడ్డిగా వంత పాడుతున్న మీడియాలోని ఒక వర్గం వాదన. చట్టబద్ధంగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి, తమ చిత్తం వచ్చిన రీతిలో ప్యాకేజీల పేరిట నిధులు ఇవ్వడానికి మధ్య ఎంత తేడా ఉందో కొందరు బీజేపీ నాయకుల మాటలే స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ శాసనసభ్యుడు సోమూ వీర్రాజు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. అంతేకాదు ఆరెస్సెస్‌తో గాఢమైన అనుబంధం ఉన్నవారు. ప్రధాని మోదీతో ఆయనకున్న స్నేహానుబంధం కూడా జగమెరిగిన సత్యం. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదని ఆయనే పబ్లిగ్గా చెప్పారు. పోలవరానికి రూ. 700 కోట్లు ఇస్తే లెక్కలు చెప్పలేదు, నిధులిస్తే బ్యాంకులలో వేసుకుని వడ్డీ తింటున్నారు తప్ప అభివృద్ధి పనులు చేపట్టడం లేదు అని కూడా ఆయన విమర్శించారు. ఆయన ప్రతిపక్షంలో లేరు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ నేత. ప్యాకేజీలు ఎప్పుడయినా ఆగిపోవచ్చు, హోదా కచ్చితంగా నిర్ణీత కాలానికి కలగాల్సిన లాభాలన్నీ కలుగుతాయి. ప్యాకేజీల కంటే ప్రత్యేక హోదానే ముఖ్యం అంటున్న వారంతా ఇదే చెబుతున్నారు. ఇటువంటి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాల్సింది, అవసరమైతే నిరాహార దీక్షకు కూర్చోవాల్సింది చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్. వారా పనిచేయకపోగా ప్రతిపక్ష నేత చేస్తున్న ఆందోళనకు అన్ని దశల్లోనూ అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ దీక్షలు చేస్తే ప్రజలకు ఇబ్బంది అనీ, చనిపోతామంటే అనుమతి ఇవ్వాలా? అనీ గుంటూరులో జగన్ దీక్ష గురించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన తానూ గతంలో ప్రతి పక్షంలో ఉన్నాననీ, అప్పుడు తానూ కొన్ని దీక్షలు చేశాననీ మరిచిపోయినట్టుంది. విదూషక మంత్రుల తీరు గర్హనీయం జగన్మోహన్రెడ్డి దీక్షను ఆపలేక పోవడంతో దాన్ని అపహాస్యం చెయ్యడానికి శతవిధాలా యత్నించారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆందోళన జగన్ దీక్షతో ప్రజల్లోకి మరింత బలంగా వెళుతున్న సంకేతాలు అందడంతో, ఆయన దాని మీంచి దృష్టి మళ్ళించడానికి తన కొలువులోని ఇద్దరు విదూషకులను ప్రయోగించారు. బీజేపీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, టీడీపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆస్థాన విదూషకులుగా జగన్ దీక్ష మీద అవాకులు చవాకుల మాట్లాడారు. కేబినెట్ మంత్రి స్థాయి ఉన్న ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు నిరాహార దీక్ష చేస్తుంటే ఆరవ రోజు దాకా వైద్య నివేదిక విడుదల చెయ్యకపోవడమే ఆయన దీక్ష విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. పైగా ఆయన ఆరోగ్య పరిస్థితి మీద, దీక్ష మీద ఇష్టానుసారం వ్యాఖ్యానించడం దుర్మార్గం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతాయుత స్థానంలో ఉండి, స్వయంగా డాక్టర్ కూడా అయిన కామినేని శ్రీనివాస్ మాట్లాడిన తీరు గర్హనీయం. ఇక గుంటూరు జనరల్ ఆస్పత్రి పరీక్షా పరికరాలను గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎలుకలను అరికట్టలేకపోయిన ఆ ఆసుపత్రిలో నాణ్యత గల పరికరాలు, పరీక్షా సదుపాయాలు ఉంటాయనుకోగలమా? ప్రజా ఉద్యమాలను పరిహసిస్తే భంగపాటే జగన్మోహన్రెడ్డి దీక్షను అపహాస్యం చేసిన 48 గంటలలోపే ఆయనను ఎందుకు ఆస్పత్రికి తరలించాల్సివచ్చింది? ఆరోగ్య వైద్యశాఖ మంత్రే సమాధానం చెప్పాలి. కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించి లేదా బెదిరించి ప్రత్యేక హోదా సాధించుకోగలమా, లేదా? అనేది టీడీపీ, బీజేపీ పెద్దలు ఆలోచించుకోవాలి. కానీ ఆ డిమాండ్‌తో జరిగే ఉద్యమాలను పలుచన చెయ్యబోతే ఇటువంటి ఎదురుదెబ్బలే తగులుతాయి, నవ్వులపాలవ్వడమే జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడి నిరాహార దీక్షనయితే భగ్నం చెయ్యగలిగారుగానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా కోసం బలంగా పెరుగుతున్న కోర్కెను ఏం చేస్తారు? ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత లేకుండా చూసుకోడానికి నాలుగు మంచి పనులు చెయ్యాలి కానీ, నాలుగు మంచి పనులు చెయ్యండని డిమాండ్ చేసే ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలనుకుంటే ఇట్లాగే అవుతుంది. -దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
'జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తోంది'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడమేనని, నిరుద్యోగాన్ని పారద్రోలడమేనని సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో నాడు కేంద్రంలోని అధికార పార్టీ, ప్రతిపక్ష బీజేపీ హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. మరోపక్క, ప్రత్యేక హోదా కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారా దీక్షను జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. సాధారణంగా జాతీయ మీడియా పట్టించుకున్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి సమస్య తెలుస్తుందని, అలాంటిది ఆ మీడియా ఎందుకు ఈ విషయాన్ని పక్కకు పెట్టాయో అర్థం కావడం లేదని చెప్పారు. స్థానిక మీడియా బాగానే ప్రచారం చేస్తుందని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని, కొంత ఆందోళన కరంగా ఉందని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పారు. ఈ దీక్ష వైఎస్ జగన్ కోసం చేస్తున్నది కాదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసమే దీక్ష చేస్తున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. -
'జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తోంది'
-
జీవితాలను కల్తీ చేసిన కాలం
డేట్లైన్ హైదరాబాద్ సోమవారం నాటి ‘సాక్షి’ దినపత్రిక లోపలి పేజీలలో ‘ఆగని కల్తీకల్లు మరణాలు’ శీర్షికన ప్రచురించిన వార్తలోనే ఆసక్తి కలిగించే మరో చిన్నవార్త గుండ్రటి బాక్స్‌లో కనిపిస్తుంది. ఆ బాక్స్ ఐటమ్ సారాంశం ఏమిటంటే పది రోజులపాటు కల్తీకల్ల్లు బాధితులతో కిటకిటలాడిన మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల్ల మండలం బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆదివారం తాకిడి తగ్గింది అని. తిరగబడ్డ వాస్తవం రోగులు రాకపోతే, రోగాలు తగ్గుముఖం పడితే అదో వార్త కావాలి. ఆస్ప త్రులు ఖాళీగా ఉంటే జనమంతా సంతోషించాలి. కానీ ఇక్కడ అది పూర్తిగా తిరగబడింది. అదే వార్తలో ఇంకా కొంచెం ముందుకుపోయి చదివితే, కల్తీ కల్లు బాధితుడు ఒక్కరు కూడా ఆదివారం ఆస్పత్రిలో చేరలేదు అని ఉంటుం ది. అంతకుముందు పదిరోజులపాటు ఇదే ఆస్పత్రిలో 13 మంది కల్తీకల్లు బాధితులు చనిపోయారు. మరో వందమంది దాకా చికిత్స తీసుకున్నారు. వింతచేష్టలు, మరణాలతో అట్టుడికిన ఆస్పత్రి ప్రాంగణం ఆదివారం ప్రశాం తంగా కనిపించడంతో డాక్టర్లు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ చివరి వాక్యం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ వాక్యం గురించే ఇప్పుడు చర్చించుకోవాలి. బాధపడాలి, ఆందోళన చెయ్యాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ఇంతకీ ఆ వాక్యం అంతరార్థం ఏమిటి? మత్తు కలిపిన కల్లు, అంటే కల్తీకల్లు మళ్లీ దొరుకుతున్నందు వల్లనే బాధితులు తగ్గిపోయారనే. కల్తీ కడుపులో పడక చావులా? గత పక్షంరోజులలో తెలంగాణలో చాలా జిల్లాల నుంచి ఇటువంటి వార్తలు వరసగా ప్రచురితం అవుతూనే ఉన్నాయి. ఇందులో వింతేముంది అని ఎవరైనా అనుకోవచ్చు. మామూలుగా మనం ఏమనుకుంటాం? కల్తీకల్లు, కల్తీ సారా తాగేవాళ్ల ఆరోగ్యాలు పాడైపోతాయి. దానితో చనిపోతారనే కదా! కల్తీ జరిగిన ఆహారం తింటే మనుషులూ, కల్తీమందులు చల్లితే చెట్లూ, పంటలూ కూడా చనిపోతాయని కదా మన అవగాహన. ఇలాంటి సర్వ సామాన్యమైన మన అవగాహన ఈ సందర్భంలో దారుణంగా దెబ్బతిన్నది. ఇప్పుడు తెలం గాణలో జరుగుతున్న తంతు ఏమిటంటే జనం కడుపులోకి కల్తీ వెళ్లక అనా రోగ్యం పాలవుతున్నారు. చనిపోతున్నారు కూడా. ఏమిటీ విచిత్రం? ‘ఆగని కల్తీకల్లు మరణాలు’ అని వార్తలకు శీర్షికలు ఉంటాయి. సామాన్యులు ఇది చూసి ఏం అర్థం చేసుకుంటారు? ఓహో! కల్తీకల్లు తాగడం వల్లనే జనం చని పోతున్నట్టున్నారు అని కదా అనుకుంటారు. అయినా కల్తీకల్లును నిరోధించ కుండా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఈ బాగోతం చూస్తూ కూర్చోడానికేనా ఓట్లేసి గెలిపించింది? అని తిట్టుకుంటారు కూడా. పాపం, ఈ ఉదంతంలో ప్రభుత్వాన్ని నిందించవద్దండీ! ఈ మరణాలూ, అనారోగ్యాలూ కల్తీకల్లు తాగినందువల్ల కాదు, తాగడానికి ఆ కల్తీకల్లు అందుబాటులో లేనందువల్ల. ఈ వ్యాసం ఆరంభంలో బాదేపల్లి ఆస్పత్రి ప్రస్తావన తెచ్చింది అందుకే. కల్తీ కల్లును అడ్డుకునేందుకు మన ఆబ్కారీ శాఖ గత కొద్దిరోజులుగా నడుం బిగించి, దాడులు చేసి ఎక్కడికక్కడ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఏళ్ల తరబడి ఆ మత్తుకు బానిసలైనవాళ్లు తీవ్రమైన ఇబ్బందులలో పడిపోయారు. అది దొరక్క అనారోగ్యం పాలై, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఆస్పత్రుల పాలవుతు న్నారు. వారిలో కొందరు చనిపోతున్నారు కూడా. కల్తీకల్లు ప్రవాహం మీద విరుచుకుపడాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే కల్తీ ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించవలసిందే. కల్తీ ఆహారం, కల్తీ మద్యం, కల్తీ పురుగుల మందులు, కల్తీ ఎరువులు వైగైరా వైగైరా. అన్ని కల్తీలతో పాటు కల్తీ రాజకీయాలను కూడా. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీకల్లును అరికట్టేందుకు నడుం బిగించిన ఆబ్కారీ శాఖ సంకల్పం ఏమై నట్టు? మళ్లీ కల్తీకల్లు దొరుకుతున్నందు వల్లనే బాదేపల్లి ఆస్పత్రికి రోగులు రావడం లేదన్న వార్త అంతరార్థం ఏమిటి? ఆకస్మిక నిర్ణయాలతో వచ్చిన తంటా ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం! ఆలోచనారహితమైన, లోపభూయిష్టమైన, ఆకస్మికమైన ప్రభుత్వ నిర్ణయాలు చే టు చేస్తాయని తెలంగాణ రాష్ర్టంలో మద్యపానం వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు గొప్ప ఉదాహరణగా మిగులుతాయి. ప్రస్తుతం తెలంగాణలో కల్తీకల్లు అందుబాటులో లేక సంభవిస్తున్న మరణాలు, రోగా లతో జనం ఆస్పత్రుల పాలు కావడానికి గల నేపథ్యాన్ని గురించి మాట్లాడు కుంటే ఈ పరిస్థితి అంతటికీ ప్రభుత్వమే జవాబుదారీ అవుతుందని అంతా అంగీకరిస్తారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మద్యం విషయంలో అనుసరిస్తున్న ధోరణి ఇప్పటి గందరగోళానికి కారణం. అధికా రంలోకి రాగానే కల్లు విధానం ప్రకటించారు. హైదరాబాద్‌లో కల్లు అమ్మ కాలను అనుమతించాలని నిర్ణయించారు. అసలు చుట్టుపక్కల తాడిచెట్లు, ఈతచెట్లు లేనిచోట కల్లు దుకాణాలు తెరిస్తే అక్కడ అమ్మేది కల్తీకల్లే మహా ప్రభో అంటే, మన సర్కార్ కొట్టిపారేసింది. ఇప్పటికే చాలా గ్రామాలలో తాటివనాలు అంతరించిపోయాయి. ఆ వృత్తి మీద జీవిస్తున్న సామాజిక వర్గంలోని తరువాతి తరం చదువుల వైపు చూస్తున్నది. మెరుగైన జీవన ప్రమాణాల కోసం అన్వేషిస్తున్నది. సరైన ఆధారం లేని ప్రమాదకరమయిన ఆ వృత్తిలో ఉండటానికి ఇప్పటితరం అంగీకరించడం లేదు. అయినా సరే, కల్లు డిపోలూ, దుకాణాల తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కల్తీకల్లు విక్రయాలు చాటుమాటుగా కాకుండా బహిరంగంగానే జరుగుతున్నాయి. ఈ కల్తీకల్లు తాగడం వల్ల ఎప్పుడో అప్పుడు మనుషులు తీవ్ర అనారోగ్యం పాలై, చివరికి చనిపోవడం ఖాయం. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇది విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది. ఒత్తిడితోనే సర్కారు వెనక్కి తగ్గిందా? ఇప్పుడు దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం కదా, మళ్లీ విమర్శి స్తారెందుకు అని ఘనత వహించిన మన సర్కారు వారు దబాయించవచ్చు. ఇప్పుడు ఈ కల్తీకల్లు మీద ఎందుకు విరుచుకుపడ్డట్టు? జనం చనిపోవడం మొదలు కావడంతో మళ్లీ కొంతకాలం చూసీచూడనట్టు వ్యవహరించాలని ఎందుకు అనుకుంటున్నట్టు? ఈ తదుపరి నిర్ణయం ఎవరి స్థాయిలో జరి గిందో కానీ కల్తీకల్లు తయారీదారుల ఒత్తిడికి లొంగి ప్రభుత్వం తన సంకల్పం నుంచి వెనక్కు తగ్గిందని మాత్రం ప్రైవేటుగా ఏ అధికారిని అడిగినా చెబు తాడు. సరే, కల్తీకల్లును అరికట్టాలన్న నిర్ణయం వెనక మతలబు ముందు తెలుసుకుందాం. చీప్‌లిక్కర్ ప్రత్నామ్నాయం కారాదు తెలంగాణ రాష్ర్టంలో కల్తీకల్లు, సారాయి, గుడుంబా వంటి ప్రాణాంతక మత్తుపానీయాలను అరికట్టడం కోసం చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని అను కుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రక టన చేశారు. చీప్‌లిక్కర్ పేరిట జనాన్ని మరింత వ్యసనపరులను చేస్తారా అని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున విరుచుకుపడటంతో ఆ నిర్ణ యం వెనక్కు తీసుకున్నారు. కల్తీ మద్యం బారి నుంచి జనాన్ని కాపాడటానికి మేం చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టాలనుకుంటే అడ్డుతగులుతారా, మీరే చూడండి ఫలితాలు ఎట్లా ఉంటాయో? అని కల్తీకల్లు మీద దాడులు మొదలు పెట్టిం చింది ప్రభుత్వం. ఎప్పటికైనా ఈ మహమ్మారిని పారద్రోలాల్సిందే కాబట్టి జన బాహుళ్యం దీన్ని సమర్ధిస్తున్నది. కానీ ప్రభుత్వం ఈ చర్య తీసుకో వడానికి ముందు కల్తీకల్లుకు బానిసలైన వారిని బయటకు తీసుకువచ్చి, వాళ్ల ప్రాణాలు రక్షించడానికి అవసరమైన కార్యాచరణను ముందే రూపొందించి అమలులోకి తెచ్చి ఉంటేఅందరి ప్రశంసలు అందుకునేది. కానీ ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇంకా ఎన్ని వైపరీత్యాలు చూడాలో! మద్యం అలవాటు మాన్పించడం కోసం అవసరమైనన్ని డీ అడిక్షన్ కేంద్రా లను నెలకొల్పవలసిందని న్యాయస్థానాలు ముందే చెప్పాయి. అటువంటి ఆలోచనలు ఏమీ చెయ్యకుండా, అవసరమయిన మౌలిక సదుపాయాలు ఏర్పరచుకోకుండా, సరైన వైద్య సదుపాయాలు కల్పించకుండా, కల్తీకల్లు మీద ఒక్కసారిగా విరుచుకుపడితే ఇటువంటి ఫలితాలే ఎదురవుతాయి. కల్తీ మద్యానికి చీప్‌లిక్కర్ ప్రత్యామ్నాయం కాకూడదు. జనాన్ని ఆ దుర్వ్యసనం నుంచి బయటకు తీసుకువచ్చి వారి ఆరోగ్యాలు బాగుచేసే పథకాలు ప్రభుత్వం రూపొందిస్తే అంతా సంతోషిస్తారు. అది సాధ్యమేనా? రాష్ర్టం నడపడానికి నిధుల కోసం సాగే వేటలో మద్యం ఒక ప్రధాన వనరుగా ఉన్నం తకాలం ఏ ప్రభుత్వానికైనా సాధ్యంకాదు. ప్రభుత్వాలు ఈ సాలెగూడు నుం చి బయటపడే వరకు ఇంకా ఎన్నో వైపరీత్యాలను మనం చూడవలసిందే. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ప్రభుత్వాల ‘ప్యాకేజీ’ ప్రహసనం
డేట్లైన్ హైదరాబాద్ ప్రత్యేక హోదాకు, ప్యాకేజీలకు మధ్య ఉన్న తేడా ప్రభుత్వంలోని పెద్దలకు, వారి తరఫున లేదా వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్న పెద్దలకు, ఆ వర్గం మీడియాకు తెలియదనుకోవాలా? ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీల కారణంగా ఏర్పడే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులకు నడుమ ఉండే తేడాను ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రత్యేక హోదా ద్వారా వచ్చేది అభివృద్ధి కాగా, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులు తాత్కాలిక ప్రయోజనాలనే నెరవేరుస్తాయి. అందులో ఎంత సద్వినియోగం అవుతుందో ఎవరు మాత్రం ఎలా చెప్పగలరు? నరేంద్ర మోదీ మహరాజ్ బిహార్ రాష్ర్టం మీద వరాల జల్లు కురిపించారు. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి కదా, మహరాజ్ అంటారేమిటి అనే సందేహం వద్దు. ఆయన తాను ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నానని కానీ, ఆ దేశానికి అయిదేళ్లపాటు ప్రధానమంత్రిగా ఉండి తమ తరఫున పరిపాలన చెయ్యమని ప్రజలు ఓట్లేసి గెలిపించారని కానీ అనుకుంటున్నట్టు లేరు. బిహార్ పర్యటనలో భాగంగా ఆయన చేసిన ప్రసంగం, ఆయన హావభా వాలూ రాజరిక వ్యవస్థ ప్రతినిధిని తలపిస్తాయే తప్ప, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్న నాయకుడు ఉపన్యసిస్తున్న తీరులో మాత్రం కనిపించవు. బిహార్‌కు ఆర్థికసాయం ఎంత కావాలి అని అడిగిన మోదీ, జనం చప్పట్లు, ఈలల మోత పెరిగిన కొద్దీ ఆ మొత్తాన్ని పెంచుకుంటూ పోయారు. ఆయన బిహార్‌కు ఒక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలనుకున్నారు. దాని కోసం ఆయన 50 వేల కోట్ల రూపాయల నుండి మొదలు పెట్టి లక్షా ఇరవై ఐదు వేల కోట్ల సాయం ప్రకటించారు. ఆ కోట్లు ఎవరివి? బిహార్‌కు బోలెడు డబ్బు అవసరమే కావచ్చు. కేంద్ర సహాయం కూడా చాలా అవసరమే కావచ్చు. కానీ ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, బిహార్‌కు సాయంగా అందిస్తానని మోదీ చెబుతున్న లక్షా ఇరవై ఐదువేల కోట్లు ఎవరి డబ్బు? ఎక్కడి నుండి వచ్చింది? రెండు, ఏ ప్రాతిపదికన, ఎవరి ఆమోదంతో ఈ సాయం ప్రకటించారు? ఈ ప్రశ్నలు ఎందుకు వెయ్యాల్సి వస్తున్నదంటే రాష్ర్ట విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఊసు ఎత్తితేనే కేంద్రంలోని పెద్దలు లేవనెత్తే అభ్యంతరాల జాబితా, చూపే కుంటిసాకుల జాబితా చేంతాడంత ఉంటుంది. మరి, బిహార్‌కు లక్షా ఇరవై ఐదు వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించేటప్పుడు ఈ సమస్యలేవీ అడ్డురాలేదా? లేకపోతే 2014 ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన ఉత్తుత్తి హామీగానే బిహార్‌కు ప్రకటించిన సహాయాన్ని కూడా పరిగణించాలా? ఈ అనుమా నాలు ఎందుకొస్తాయంటే బిహార్ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి. ఎన్నికల తరువాత ఓడిపోతే సరే సరి, మమ్మల్ని గెలిపిస్తే ఈ సాయం అందేది అని తప్పించుకోవచ్చు. గెలిచినా కూడా ఎగ్గొట్టెయ్యవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసింది అదే కదా! ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదు పదేళ్లు కావాల్సిందే అని రాజ్యసభలో వీరంగం వేసిన వెంకయ్యనాయుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రి. పదేళ్లు కూడా సరిపోవు పదిహేనేళ్లు ఇవ్వాల్సిందేనన్న తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీని భాగస్వామిగా చేర్చుకున్నదే. ఆంధ్ర ప్రజలకు ఏం చెబుతారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్టీని ఎన్నికలలో గెలిపించడానికి బిహార్‌లో ఇంకా ఇటువంటి సర్కస్‌లు ఎన్నయినా చెయ్యొచ్చు. ఒక్కటి మాత్రం బీజేపీ పెద్దలు గుర్తించుకోవాలి. పద్నాలుగు మాసాలు గడిచి పోతున్నా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీని నెరవేర్చక పోగా, ఢిల్లీ నుండి గల్లీ దాకా బీజేపీ, టీడీపీ పెద్దలు, చిన్నలు మాట్లాడుతున్న మాటలు ఆ రాష్ర్ట ప్రజల మనోధైర్యాన్ని ఎంతగా దెబ్బతీశాయో తిరుపతిలో మునికోటి ఆత్మా హుతితో అయినా గుర్తించకపోతే అధికార టీడీపీ సరే, స్వతంత్రంగా రాజ కీయ ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి కూడా భంగపాటు తప్పదు. బిహార్‌కు నరేంద్ర మోదీ చేసిన వాగ్దానం తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అధికా రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రజలకు ఏం జవాబు చెబు తుందో చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతి పక్షాలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా ఇప్పటి దాకా రకరకాల కార ణాలు చెబుతూ కాలయాపన చేశారు. ముఖ్యమైన ఈ సమస్య మీద అఖిల పక్షాన్ని దగ్గరికి తీసుకుని, చర్చించడానికి ఏనాడూ ప్రయత్నం చేయలేదు. పైగా కాసేపు ప్రణాళికా సంఘం రద్దయి, నీతి ఆయోగ్ వచ్చిందంటారు. మరి కాసేపు ఆర్ధిక సంఘం బూచిని చూపిస్తారు. ఇంకాసేపు ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్లో ప్రకటనలు చేయిస్తారు. మళ్లీ ప్రత్యేక హోదా మీద పట్ట్టుదల ఎందుకు, ప్రత్యేక ప్యాకేజీల ద్వారా బోలెడు నిధులు తెస్తాం అంటారు. ఏదీ, మరి ఏ సాయమూ అందలేదేమిటంటే, బిహార్ ఎన్నికల భూతాన్ని చూపిస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రే స్వయంగా బిహార్‌కు చేయబోయే సాయాన్ని ప్రకటించాక ఏం చెబుతారు? ప్రత్యేక హోదా ఎక్కడ? ప్యాకేజీ ఎక్కడ? అసలు ఈ ప్రత్యేక హోదా కోసం పట్టుదల ఎందుకు? మనకు కావలసినన్ని నిధులు తెచ్చుకుంటే చాలదా అని వాదిస్తున్న పెద్దలు కొందరు ఉన్నారు. మీడియాలోని ఒక వర్గం కూడా ఈ అంశాన్నే గట్టిగా ప్రచారం చేస్తున్నది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక దశ వరకు ప్రజలను మానసికంగా ప్యాకే జీలకు సిద్ధం చేసే ప్రయత్నమే చేసింది. ఇదొక విచిత్రమయిన వాదన. జనాన్ని మోసం చేసే మాటలు ఇవి. ప్రత్యేక హోదాకు, ప్యాకేజీలకు మధ్య ఉన్న తేడా ప్రభుత్వంలోని పెద్దలకు, వారి తరఫున లేదా వారిని కాపాడ టానికి ప్రయత్నిస్తున్న పెద్దలకు, ఆ వర్గం మీడియాకు తెలియదనుకోవాలా? ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీల కారణంగా ఏర్పడే ఉద్యోగ ఉపాధి అవ కాశాలకు, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులకు నడుమ ఉండే తేడాను ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రత్యేక హోదా ద్వారా వచ్చేది అభివృద్ధి కాగా, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులు తాత్కాలిక ప్రయోజనాలనే నెరవేరుస్తాయి. అందులో ఎంత సద్వినియోగం అవుతుందో ఎవరు మాత్రం ఎలా చెప్పగలరు? అయినా ప్యాకేజీల జపమే చేస్తూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు చివరికి కేంద్రాన్ని కొంచెం గట్టిగా అడిగినట్టు జనానికి చూపించుకోక తప్పలేదు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే మళ్లీ ఇందులో రాజకీయ క్రీడ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ర్టంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రజల ముందు ఒకరినొకరు పలచన చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇదంతా అన్న వాదన కూడా వినబడుతున్నది. ఏకాంతంలో ఏం చర్చిస్తారు? ఏదిఏమైనా, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారూ రోడ్డెక్కాక, ప్రత్యేక హోదా కోసం తొలి నాటి నుండే పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమం జంతర్ మంతర్ చేరాక, మునికోటి ఆత్మాహుతి చేసుకున్నాక ఎట్టకేలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నుండి రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్లో ఆహ్వానం అందింది. చూశారా! ‘మీరే ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి!’ అని చెప్పడా నికి మనుషులు చావాలన్న మాట. కనీసం ఇప్పుడైనా పిలిచారు సంతోషం. రేపు, అంటే ఇరవయ్యవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు, ప్రత్యేక హోదా గురించి చర్చించడానికి. తామిద్దరూ జంటగా ఎన్నికల ప్రచార వేదికలెక్కి ఇచ్చిన మాట ప్రత్యేక హోదా. దాని మీద మళ్లీ ఏకాంతంలో ఏం చర్చిస్తారు? బిహార్ తరహాలో ఆంధ్రప్రదేశ్ మీద లక్ష కోట్ల కాసుల వాగ్దాన వర్షం కురిపిస్తారా? బిహార్ విషయంలో ఇది ఎవరి సొమ్ము అని ఎట్లా అంటున్నామో ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అదే అనవలసివస్తుంది. ఆహ్వానం తెప్పించుకుని మరీ ఢిల్లీ వెళుతున్న ముఖ్యమంత్రికి బాగా తెలుసు- కేంద్రం నుండి ఆంధ్ర ప్రదేశ్‌కు రాబోయే సాయం ఏమిటో. అయినను పోయిరావలె హస్తినకు. కాబట్టి వెళతారు, వస్తారు. (వ్యాసకర్త దేవులపల్లి అమర్) -
గులాబీ తీర్థంతో ‘పునర్నిర్మాణం’
డేట్లైన్ హైదరాబాద్ తనకు అంత చేసిన తల్లిలాంటి పార్టీని వదిలి వస్తున్న శ్రీనివాస్ వంటి నేతలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అవుతారా? పార్టీకి శిరోభారం అవుతారా? అనే దానిపై కేసీఆర్‌కు తన లెక్కలు తనకున్నాయి. వేలం వెర్రిగా చేరుతున్నవాళ్లకే అసలేమైనా లెక్కలంటూ ఉన్నాయా? అనేదే అసలు ప్రశ్న. మరి కొందరు సీనియర్ నేతలూ తెలంగాణ భవన్ బాట పట్టనున్నారని వార్త. కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే అరుదైన అవకాశం లభిస్తోంది. ఈ మహదవకాశాన్ని అందుకోడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? ధర్మపురి శ్రీనివాస్ ఒకప్పటి రిజర్వు బ్యాంకు ఉద్యోగి. సీనియర్ కాంగ్రెస్ నేత గడ్డం రాజారామ్ ప్రియ శిష్యుడు. క్రియాశీల రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించక ముందు నుంచే ఆయన నాకు తెలుసు. 1970 దశకం చివర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఒక బలమైన అసమ్మతి వర్గం పని చేస్తుండేది. ఆ వర్గానికి నాయకుడైన మంత్రి రాజారామ్ ఇంట్లోనే అసమ్మతి వర్గ సమావేశాలు జరిగేవి. పొలిటికల్ రిపోర్టర్లంతా సాయంకాలం కాగానే అక్కడికి చేరే వారు. పత్రికలకు బోలెడంత మేత. వెనుకబడిన తరగతుల బల మైన నాయకుడైన రాజారాం ఇంటికి నేనూ అప్పట్లో కొన్నిసార్ల్లు అసమ్మతి రాజకీయాల రిపోర్టింగ్ పనిపై వెళ్తుండేవాడిని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి నేతగా ఉన్న శ్రీనివాస్‌తో నాకు అక్కడే పరిచయం. అదీ పలకరింపు లకే పరిమితం. చెన్నారెడ్డి అదృష్టమనండి, అసమ్మతివర్గీయుల దురదృష్టం అనండి భారీగా వర్షం కురుస్తున్న ఓ రాత్రో లేదా తెల్లారుజామునో గానీ రాజారాం కారు ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత కొద్ది కాలానికే ఎన్టీ రామారావు తెలంగాణలో పెద్ద ఎత్తున వెనుకబడిన తరగతుల మద్ద తును కూడగట్టుకోగలగడానికి ఒక ముఖ్యకారణం రాజారాం ఆకస్మిక మృతే నని అనుకోవాలి. అయనే ఉంటే వెనుకబడిన తరగతుల వారు పెద్దగా తెలుగుదేశం వెంట వెళ్లేవారు కాదని అప్పట్లో రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఫిరాయింపులతోనే ‘పునర్నిర్మాణం’ రాజారాం మరణానంతరం శ్రీనివాస్ కాంగ్రెస్ రాజకీయాల్లో అంచెలంచె లుగా ఎదిగారు. పంచెలు మార్చినంత సులభంగా పార్టీలు మార్చేయడం చాలా మంది రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. పదవుల కోసం కొం దరు, ‘పనుల’ కోసం ఇంకొందరు, నాలుగురాళ్లు వెనకేసుకుందామని మరి కొందరు, ‘న్యాయం’ జరగడం లేదని ఇంకా కొందరు ‘కండువాలు’ మారు స్తుంటారు. పార్టీ విధానాలో, సిద్ధాంతాలో నచ్చక పార్టీలు మారే వాళ్ళు నేడు మచ్చుకు కూడా కనిపించరు. అయితే శ్రీనివాస్ దాదాపు 30 ఏళ్లు కాం గ్రెస్లోనే కొనసాగి, మొన్ననే తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరారు. తమకు ఇష్టమైన రాజకీయాలను ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తాను ఏ రాజకీయ పార్టీలో ఉండాలో నిర్ణయించుకునే హక్కు శ్రీనివాస్‌కు లేదా? ఉంది. కానీ ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ కూడా ఆ పార్టీని పల్లెత్తు మాట అనలేదు, ఆ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని ఆకాశానికి ఎత్తారు. మరి ఎందుకు పార్టీ మారారు? అంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తానూ భాగస్వామిని కావడం కోసమేనని ప్రకటించారు. ఆత్మప్రబోధం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిపారు. శ్రీనివాస్ కాంగ్రెస్‌ను వీడడానికి, టీఆర్ఎస్ ఆయనను చేర్చుకోడానికి నిజంగా ఇదే కారణమా? ఇక్కడే మనం శ్రీనివాస్‌నూ, టీఆర్ఎస్నూ కొన్ని ప్రశ్నలు అడగాలి. ఒకటి, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏమిటి? రెండు, కాంగ్రెస్‌లో కొనసాగుతూనో లేదా కాంగ్రెస్ రాజ కీయాల పట్ల విసుగు చెంది ఉంటే అన్ని పార్టీలకు దూరంగా ఉంటూనో శ్రీనివాస్ ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనలేకపోయే వారా? మూడు, తమ పార్టీలో చేరే వారిని తప్ప ఇంకెవరినీ టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వమూ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగం పంచుకోనివ్వవా? అనేక దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే, చివరిదశ పోరాటంలో నిర్వహించిన పాత్ర కారణంగా టీఆర్ఎస్ను ప్రజలు గెలిపిస్తే, ఆ పార్టీ, ప్రభుత్వమూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మరెవరు భాగస్వాములు కారాదనేటంత హ్రస్వ దృష్టితో ఆలోచిస్తున్నాయా? అయినా తెలంగాణ పునర్నిర్మాణం ఒక్క రోజులోనో, ఒక్క ఐదేళ్ల కాలంలోనో, ఒక్క రాజకీయ పార్టీతోనో, ఒక్క ప్రభుత్వంతోనో అయ్యేంత చిన్న పని అని అధికార పార్టీ, దానిలోకి వలసపోతున్న నాయ కులు భావిస్తున్నారా? మొత్తం తెలంగాణ సమాజం నడుంబిగిస్తేనే అది సాధ్యం. అందుకూ చాలా సమయం పడుతుంది. ‘వడ్డించిన విస్తరి’పైనే కినుకా? శ్రీనివాస్ పార్టీ మారుతూ పదవుల కోసం తాను కాంగ్రెస్‌ను వీడటం లేద న్నారు. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప కాంగ్రెస్‌లో తాను అన్ని పదవులనూ చేపట్టాననీ చెప్పారు. కాంగ్రెస్‌ను వీడి వెళ్తూ కూడా వాస్తవాలను అంగీకరించి నందుకు ఆయన్ను అభినందించాలి. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. అందులో అందరికీ అన్ని వేళలా, అన్ని అవకాశాలూ రావు. ఏ పదవీ రాకపోయినా కాంగ్రెస్‌నే పట్ట్టుకుని ఉండే విధేయులు కోకొల్లలు. శ్రీనివాస్ ఆ కోవకు చెందిన వారు కారు. కాంగ్రెస్‌లో ఆయన జీవితం వడ్డించిన విస్తరి. శాసన సభ్యుడిగా ఉన్నారు, మంత్రిగా పని చేశారు. రెండుసార్లు రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. మూడుసార్ల్లు శాసన సభ ఎన్నికల్లో వరుసగా ఓడినా... సోనియా ఆయనకు శాసన మండలిలో స్థానం కల్పించడమే కాదు, కాంగ్రెస్ పక్ష నేతను చేశారు. అరుదైన అలాంటి ఆదరణ ఆయనకు దక్కింది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆయనకు అధినేత్రి అపాయింట్మెంట్ దొరికే దనేది జగమెరిగిన సత్యం. అటువంటి పార్టీని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని కష్ట కాలంలో... అదీ అవతల ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా నష్టపోతామని తెలిసి కూడా వదిలేసి వెళ్లిన శ్రీనివాస్ వంటి సీనియర్ నేత తరువాతి తరం రాజకీయ నాయకులకు ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు? కాంగ్రెస్‌కు మహదవకాశం తనకు అంత చేసిన తల్లిలాంటి పార్టీని వదిలేసి వస్తున్న శ్రీనివాస్ వంటి నేతలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అవుతారా? లేక తమ పార్టీకి శిరో భారం అవుతారా? అనేది టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి తట్టలేదనుకుంటే అది ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని తక్కువగా అంచనా వేసినట్టే అవుతుంది. ఆయన లెక్కలు ఆయనకున్నాయి. వేలం వెర్రిగా వెళ్లి చేరుతున్నవాళ్లకే అసలేమైనా లెక్కలంటూ ఉన్నాయా? అనేదే అసలు ప్రశ్న. శ్రీనివాస్ కాంగ్రెస్ వీడే నాటికి ఆయన ఏ పదవిలోనూ లేరు. ఆయన విషయంలో గుడ్డిలో మెల్లగా చెప్పుకోవాల్సింది అదే. ఒక పార్టీ టికెట్ మీద గెలిచి, ఇంకో పార్టీలో చేరి, మంత్రి పదవి చేపట్టి కూడా నిస్సిగ్గుగా నా రాజీనామా లేఖ జేబులో ఉంది, మా ఇంట్లో అటక మీద దాచి ఉంచాను అని చెప్పుకు తిరుగుతున్న నాయకుల కంటే ఆయన చాలా నయం. ఇంకా కొం దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా తెలంగాణ భవన్ బాట పట్టను న్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఇదొక మంచి అవకాశం. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే అరుదైన అవకాశం లభి స్తోంది. కాంగ్రెస్ ఈ మహదవకాశాన్ని అందుకోడానికి సిద్ధంగా ఉందా? దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
తెలంగాణను అడ్డుకున్న వారే.. ప్రగతినీ
హన్మకొండ కల్చరల్ (వరంగల్ జిల్లా): తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నవారే ప్రగతిని కూడా అడ్డుకుంటున్నారని.. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కన బెట్టి ఇలాంటి వారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రజాతంత్ర దినపత్రిక 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి ఆమర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీహరి ముఖ్య అతిథిగా మాట్లాడారు. దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందరెందరో వివిధ రకాలుగా కృషిచేశారని, తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారన్నారు. తీరా తెలంగాణ వచ్చే సమయానికి పక్కకు పోయినవారు కూడా ఉన్నారని అన్నారు. 15 ఏళ్లుగా ప్రభుత్వాలు అనుసరించిన అనాలోచిత చర్యల వల్ల విశ్వవిద్యాలయాలు కోలుకొలేనంతంగా దెబ్బతిన్నాయన్నారు. కేవలం 8మంది ప్రొఫెసర్లతో పాలమూరు విశ్వవిద్యాలయం కొనసాగడం బాధకరమని.. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా నియూమకాలు జరిగాయన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు భవిష్యత్‌లో న్యాక్ గుర్తింపు కష్టంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు ఉన్నత స్థానంలో ఉండాలంటే మంచి స్టాఫ్‌ను నియమించుకోవాలని, అప్పుడే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. చాన్స్‌లర్, వైస్ చాన్సలర్లను నియమించడానికి కొత్తచట్టాలను తేవడంలో కొంత అలస్యం జరుగుతోందన్నారు. త్వరలో విద్యావేత్తలతో ఈ విషయమై సమావేశమవుతానన్నారు. -
బలిపీఠం ఎక్కేది గవర్నరేనా?
డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌ను మార్చబోతున్నట్టు ఒక ఆంగ్ల దినపత్రికలో రెండు రోజుల క్రితం వార్తా కథనం వెలువడింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తరువాత ఆయనకు స్థానచలనం లేదా ఉద్వాసన జరుగుతుం దని ఆ కథనం సారాంశం. ఒక తెలుగు దినపత్రిక గవర్నర్ నరసింహన్ మీద కత్తికట్టినట్టు కొంతకాలంగా ఆయన ఉద్వాసన గురించి రాస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం నరసింహన్‌ను రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ బాధ్యతల నుంచి తప్పిస్తారనే అనిపిస్తున్నది. కొద్దిరోజు లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ అంచనాకు ఊతం ఇస్తున్నాయి. భిన్నమైన నియామకం 2008లో ఛత్తీస్గడ్ గవర్నర్‌గా నరసింహన్ నియమితులయ్యారు. తరువాత 2010లో ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టిన నరసింహన్‌కు రెండవ దఫా కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇంకా దాదాపు రెండేళ్లు ఆయన పదవిలో ఉండవచ్చు. మామూలుగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక పాత ప్రభుత్వం నియమించిన గవర్నర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయడం సంప్ర దాయం. వారు తప్పుకోకపోతే కేంద్రం ఉద్వాసన పలకడమూ మామూలే. ఏడాది క్రితం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఒకటి రెండు రాష్ట్రాల గవర్నర్లకు అలా ఉద్వాసన చెప్పవలసి వచ్చింది కూడా. అయినా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవ ర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ మాత్రం పదవులలో కొనసాగారు. ఈ లెక్కలో ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉండవచ్చు. కానీ ఈ ఇద్దరు గవర్నర్ల ఉదాహరణే తీసుకోడం ఎందుకంటే ఆ రెండూ పూర్తి భిన్నమైన నియామకాలు. రోశయ్య నిలువెత్తు రాజకీయజీవి. ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్ సేవలో గడిచింది. కార్యకర్త మొదలుకుని ముఖ్యమంత్రి దాకా అన్ని పదవులూ ఆయన ఆ పార్టీ ద్వారా సాధించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినందునే ఆయ నకు యూపీఏ ప్రభుత్వం గవర్నర్ పదవి ఇచ్చింది. ఎన్డీయే అధికారంలోకి రాగానే నిజానికి తొలగాల్సిన తొలి గవర్నర్ రోశయ్యే. కానీ ఎన్డీయే కొనసా గించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆయననే కొనసాగించా లని కోరుకున్నారు కాబట్టే ఇది సాధ్యమైందని వార్తలు వచ్చాయి. గవ ర్నర్గా నరసింహన్ నియామకం పూర్తి భిన్నమైనది. ఆయన టాప్ కాప్. ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. నిఘా విభాగం ైడెరైక్టర్గా పదవీ విరమణ చేశారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. గవర్నర్ పదవులు రాజ కీయ పునరావాస కేంద్రాలన్న విమర్శ ఉన్నా, అక్కడో ఇక్కడో నరసింహన్ లాంటి వారు కూడా నియమితులవుతూంటారు. కాబట్టి నరసింహన్ గురించి బీజేపీ రాజకీయంగా ఆలోచించి ఉండకపోవచ్చు. వివాదాల గవర్నర్లు గవర్నర్లు కేంద్ర ప్రతినిధులు. కాబట్టి అక్కడ అధికారంలో ఉన్నవారు తమకు అనుకూలమైనవారినే గవర్నర్లుగా నియమించుకోవడం సహజం. కేంద్రంలో, రాష్ట్రాలలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్ల కార ణంగా ఘర్షణలు జరగడం అనేక సందర్భాలలో చూశాం. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించిన గవర్నర్ రామ్‌లాల్, అదే ఎన్టీఆర్ హయాంలోనే గవర్నర్‌గా పనిచేసిన కుముద్‌బెన్ జోషి ఇద్దరూ వివాదాస్పదులుగా పేర్గాంచారు. వీరు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సంబంధా లకు విఘాతం కలిగే విధంగా వ్యవహరించారన్న అపఖ్యాతి ఉంది. ఆ రెండు సందర్భాలలోనూ కేంద్రంలో కాంగ్రెస్, రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీల ప్రభు త్వాలు ఉన్నాయి. రెండవసారి ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన సందర్భంలో చంద్ర బాబునాయుడుకు అనుకూలంగా వ్యవహరించారన్న అపవాదును సోష లిస్ట్‌గా పేరుపొందిన కృష్ణకాంత్ భరించవలసి వచ్చింది. మార్పు ఈ దశలోనా? మళ్లీ ప్రస్తుత తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విషయానికి వస్తే, ముం దే పేర్కొన్నట్టు ఆయన రాజకీయ నాయకుడు కాదు. గవర్నర్ బాధ్యతలూ, పరిమితులూ బాగా తెలిసినవారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత, సంక్లిష్ట పరిస్థితులలో ఆయనను యూపీఏ ప్రభుత్వం గవర్నర్‌గా ఉమ్మడి రాష్ట్రానికి పంపింది. అప్పుడు కేం ద్రంలోనూ, రాష్ర్టంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. నిజానికి ఒక యుద్ధ సమయంలో ఆ నియామకం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మహోధృతమైన సమయంలో గవర్నర్ బాధ్యతలు నిర్వహించడం మామూ లు విషయం కాదు. చాలామంది ఇతర గవర్నర్ల మాదిరిగా కాక నరసిం హన్ చాలా చురుకైన వ్యక్తి. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ గట్టిగా నిర్ణ యించుకుని, విధివిధానాలను మొదలుపెట్టిన కాలంలో సీమాంధ్రలో మొద లైన సమైక్య ఉద్యమకాలంలోనూ ఆయన తన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వ హించారు. కాబట్టే విభజన తరువాత రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి గవర్నర్‌గా ఆయననే కొనసాగించారు. ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచీ అభ్యంతరం వ్యక్తం కాలేదు కూడా. విభజనకు ముందూ, తరువాతా ఆయన కేంద్రానికి క్రమంతప్పకుండా నివేదికలు ఇస్త్తూనే ఉన్నారు. కేంద్రం కూడా సంతృప్తిగానే ఉంది. మరి మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగా ఇప్పుడు గవర్నర్‌ను మార్చాలని కేంద్రం ఎందుకు ఆలోచిస్తున్నది? నరసింహన్ వారసునిగా ఒక రాజకీయ నాయకుడిని పంపాలని కేంద్రం యోచిస్తు న్నట్టుగా కూడా ఆ ఆంగ్లపత్రిక వెల్లడించింది. విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. ఈ తరుణంలో సమస్య మూలాలు తెలిసిన గవర్నర్‌కు స్థానచలనం కల్పించి, ఏ అవగాహనా లేని ఒక రాజకీయ జీవిని తెచ్చి పెడితే పరిస్థితి మరింత జటిలం అవుతుంది. నాడు లేని అభ్యంతరం నేడు ఎందుకు? ఇంతకూ కేంద్రానికి ఈ ఆలోచన ఎందుకు వచ్చినట్టు? ఎన్డీఏ భాగస్వామి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టుపట్టినందునే, సంకీర్ణ ధర్మాన్ని పాటించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. రాష్ర్ట విభజన సమయంలో నరసింహన్‌ను కొనసాగించినప్పుడు లేని అభ్యం తరం చంద్రబాబుకు ఇప్పుడెందుకు? కారణం అందరికీ తెలిసిందే. తెలుగు దేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు ఓటుకు కోట్లు వ్యవహారంలో పట్టుబ డడం, దానిని సెక్షన్ 8తో ముడి పెట్టజూసినా అందుకు సహకరించనందుకే గవర్నర్ మీద కినుక వహించి చంద్రబాబు ఆయనను తప్పించాలని పట్టు పట్టి ఉండవచ్చు. తెలుగుదేశం ప్రముఖులు, మంత్రులు కూడా గవర్నర్‌ను అవమానించే విధంగా విమర్శిస్తే చంద్రబాబు నోరు విప్పనప్పుడే గవర్నర్ బదిలీకి రంగం సిద్ధమైనట్టు అర్థమైంది. సెక్షన్ 8ని ప్రయోగించవలసిన పరిస్థితి హైదరాబాద్‌లో లేనప్పుడు గవర్నర్ మాత్రం ఏం చేస్తారు? హైదరా బాద్ లో ఒక్క తెలంగాణేతరుడి నుంచైనా ఫిర్యాదు వచ్చిందా? తప్పు చేస్తూ దొరికిన తెలుగుదేశం నాయకుల మీద కేసులుపెట్టడం, ఏసీబీ విచారణ జరపడం వంటివాటిని సెక్షన్ 8 ఉల్లంఘనగా గవర్నర్ పరిగణించనందుకే ఆయన బదిలీ కోరడం, కేంద్రం ఆ ఆలోచనను ప్రోత్సహించడం రాజకీ యంగా కూడా ఎంత తెలివిలేనితనం! గవర్నర్ పక్షపాతం చూపగలరా? తెలంగాణ ప్రభుత్వం పట్ల గవర్నర్ అనుకూలంగా ఉన్నారనే విమర్శను కూడా తెలుగుదేశం వారు విస్తృతంగా ప్రచారంలో పెట్టారు. అట్లా అనుకునే అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే తెలం గాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తరచూ గవర్నర్‌ను కలుస్తున్నారు. తెలంగాణలో చేపట్టే కార్యక్రమాలలో ఆయనను ఎక్కువగా భాగస్వామిని చేస్తున్నారు. ఆ విషయంలో చంద్రబాబు కొంచెం వెనుకబడ్డారు. గవర్నర్ తెలంగాణ పక్షపాతిగా చెబుతున్నప్పటికీ ఆయన కొత్త రాష్ట్రానికి అదనంగా చేసేదేముంది? ఏదైనా పునర్విభజన చట్టానికి లోబడి చేయవలసిందే. కానీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన దరి మిలా తన మీద వచ్చిన విమర్శకు గవర్నర్ జవాబు చెప్పుకోక తప్పదు. తెలు గుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి, శాసన సభ్యత్వానికి రాజీనామా చెయ్యకుం డానే మంత్రివర్గంలో చేరడానికి వస్తే ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించి ఉండాల్సింది కాదు. ఏది ఏమైనా ఈ పరిస్థితులలో గవర్నర్ మార్పు అంటే ఎన్డీయే మరిన్ని తలనొప్పులను కొనితెచ్చుకున్నట్టే. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
పుష్కరాల తరువాత జర్నలిస్టులకు బస్‌పాస్‌లు
ఒంగోలు సబర్బన్: గోదావరి పుష్కరాల తరువాత జర్నలిస్టుల బస్‌పాస్‌ల వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. ఒంగోలులో ఆదివారం నిర్వహించిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్కరాలు పూర్తి కాగానే యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలను తీవ్రంగా ఖండించాలని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ ప్రభుత్వానికి సూచించారు. యూనియన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ శ్రీకాంత్, జేసీ హరిజవహర్‌లాల్, ఐజేయూ నాయకుడు కె.శ్రీనివాసరెడ్డి, ప్రెస్‌కౌన్సిల్ సభ్యుడు అమర్నాథ్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమసుందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వి.సుబ్బారావు, నాయకులు అంబటి ఆంజనేయులు, నరేంద్రరెడ్డి, నల్లి ధర్మారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మురళి, సురేష్, ప్రజానాట్యమండలి నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలి
కవాడిగూడ: ఇటీవల ఉత్తర భారతదేశంలో జరుగుతున్న జర్నలిస్టుల హత్యలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హత్యలను నివారించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గురువారం ఐజేయూ, టీయూడబ్ల్యూజే, హెచ్‌యూజే సంయుక్త ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ చౌరస్తాలో నిరసన ధర్నా జరిగింది. ఈసందర్భంగా హాజరైన దేవులపల్లి అమర్ మాట్లాడుతూ తాజాగా వెలుగు చూస్తున్న వ్యాపమ్ కుంభకోణంలో నిందితులు, సాక్షులు, జర్నలిస్టులు మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలోని ఓ మంత్రి అనుయాయులు షాజాపూర్‌లో జితేందర్‌సింగ్‌ను పగపట్టి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా జితేందర్ సింగ్ తన మరణ వాంగ్మూలంలో కూడా వివరించినట్లు తెలిపారు. ఎంపీలో దీక్షిత్ అనే జర్నలిస్టును హత్య చేశారన్నారు. వీటితో పాటు అస్సోం, ఉత్తరాఖండ్‌లలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఐజేయూ నేత నరేందర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.సత్యనారాయణ, హెచ్‌యూజే హైదరాబాద్ అధ్యక్షులు కోటిరెడ్డి, ఎ.రాజేష్, శంకర్‌గౌడ్, ఐలు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంతం మాటున పగటికల
ఎన్.టి.రామారావును పదవి నుంచి దించేసి అధికారం చేజిక్కించుకున్న నాడు నారా చంద్రబాబునాయుడి లక్ష్యం 2020. ఆ మేరకు ఆయన 1996 లోనే 2020 పేరిట ఒక విజన్ డాక్యుమెంట్‌ను కూడా విడుదల చేశారు. పదవిలో కొనసాగినంత కాలం ఆయన అదే డాక్యుమెంట్‌ను పదే పదే వల్లె వేసే వారు. మామూలుగా అయితే 2020 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ చేరుకో వలసిన అభివృద్ధి లక్ష్యంగా దీనిని అర్థం చేసుకోవాలి. కానీ చంద్రబాబు ఆలో చనలో 2020కి మరో అర్థం ఉంది. అది- 2020 వరకూ ఆయన అధికారంలో కొనసాగడం. అయితే చంద్రబాబు లక్ష్యానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో 2004లోనే కాంగ్రెస్ పార్టీ గండి కొట్టేసింది. ఇలాంటి గండి 1999లోనే పడవలసి ఉంది. కానీ అటల్ బిహారీ వాజపేయి పట్ల దేశ వ్యాప్తంగా ఏర్పడ్డ సానుభూతి పవనాలూ, కార్గిల్‌యుద్ధ ప్రభావం, బీజేపీతో మిత్రత్వం చంద్రబాబుకు కలిసొచ్చింది. కాంగ్రెస్ చేసిన కొన్ని తప్పులు కూడా తోడై ఆ ఎన్నికలలో బతికి బయటపడింది తెలుగుదేశం. అట్లా కలిసొ చ్చిన అదృష్టాన్ని తన లక్ష్యం ‘2020’ వరకు నిలుపుకోడానికి ఆయన ప్రజా ప్రయోజన విధానాలను ఎన్నుకుంటే ఎలా ఉండేదో కానీ, ఇదంతా తన సొంతబలం అనుకున్నారు. తనకు ఎదురులేదన్నట్టే వ్యవహరించారు. ఇలా తీవ్ర ప్రజావ్యతిరేకతను కొనితెచ్చుకోవడంతో ఆయన లక్ష్యానికి 2004లో గండిపడింది. రాజశేఖరరెడ్డి మృతి, తెలంగాణ ఉద్యమ ఉధృతి, విభజనకు యూపీఏ అనుమతి లేకుంటే చంద్రబాబు 2020 లక్ష్యం కలగానే మిగిలేది. తర్కం లేని ఆలోచన ఈ సోది ఇప్పుడెందుకు అనిపిస్తుంది ఎవరికైనా. తాజా పరిణామాలకూ, చంద్రబాబు 2020 స్వప్నానికీ సంబంధం ఉంది. 2020 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కొనసాగాలనుకున్న చంద్రబాబు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడమే కాక, 2014లో చేతికొచ్చిన అధికారం కూడా తన సొంత బలంతో కాక, పూర్తిబలంతో కాక అదీ అర్ధరాజ్యమే చేతికి రావడం, ఆ అర్ధ రాజ్యం కూడా 2019 వరకే కావడంతో తన కల నెరవేరదే మోనన్న అనుమానం కలిగింది. నిజానికి చంద్రబాబు కల నెరవేరాలంటే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల వేళకు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలి. నిజాయితీగా పనిచేసి రెండు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వస్తే సంతోషమే. ఇక్కడ ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. ముఖ్యమంత్రి కావడం కోసం తన పార్టీకే చెందిన శివా రెడ్డి అనే మరో నాయకుడిని హత్య చేయించిన ఒక రాజకీయ నాయకుడితో ఆ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి అంటాడు, ‘శివారెడ్డి చని పోతే మీరు ముఖ్యమంత్రి అవుతారు, శివారెడ్డిని హత్య చేస్తే మీరు హంతకుడ వుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు?’ అని. ఇది చంద్రబాబు వైఖరికి అద్దం పట్టే ైడైలాగ్. ఎలాగంటే, తెలంగాణ లో ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసి, వారి మన్ననలను పొంది పార్టీని బలోపేతం చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో చేజిక్కిన అధికా రాన్ని ప్రజాసంక్షేమానికీ, చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికీ ఉపయోగిస్తే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకానీ, తెలంగాణలో ఎమ్మెల్యేలనూ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ దాకా అన్ని స్థాయిలలో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తే అధికారం రాదు. పట్టుబ డితే రేవంత్‌రెడ్డికి పడ్డట్టు అరదండాలు పడతాయి అన్న చిన్న లాజిక్ చంద్ర బాబు మరిచిపోవడం ఆశ్చర్యం. 2019లో తెలంగాణ లో మేమే అధికారంలోకి వస్తాం అని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ తెలంగాణ శాఖ నాయ కులూ ఈ సంవత్సర కాలంలో చాలాసార్లు ప్రకటించారు. ఆ దిశగా ప్రజలలో బలం పెంచుకునే పని మానేసి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం కక్కుర్తిపడి దొరికి పోయి ఇప్పుడింకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. నామినేటెడ్ శాసన సభ్యుడు ఎల్విస్ స్టీఫెన్సన్కు బయానాగా రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీకి దొరికి పోయిన రేవంత్‌రెడ్డి జైలుకు పోయి ఇవ్వాళ్టికి 24 రోజులు. ఈ 24 రోజుల్లో చంద్రబాబునాయుడు ఆయన పార్టీ, ప్రభుత్వ పెద్దలూ 10 తప్పులు చేశారు. రేవంత్‌రెడ్డిని సమర్థించడం, స్టీఫెన్‌సన్‌తో తాను స్వయంగా మాట్లాడిన ఆడియో బయటపడితే వివరణ ఇవ్వడానికి బదులు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదంటూ అందరి దృష్టినీ మళ్లించే ప్రయత్నం నుం చిచివరికి తెలంగాణ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇప్పించే వరకూ చంద్ర బాబునాయుడు తప్పులు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి మీడియా సలహా దారు పరకాల ప్రభాకర్ తన విధుల పరిమితి దాటి చంద్రబాబు తరఫున తెలంగాణ ప్రభుత్వం మీద విరుచుకుపడిన విధానం, రాష్ర్ట మంత్రుల చేత గవర్నర్ మీద పరుష పదజాలంతో తీవ్ర ఆరోపణలు చేయించడం, పక్క రాష్ర్టంలో సొంత పోలీస్స్టేషన్లు పెట్టుకుంటాం అనడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన నేరంలో నాల్గవ నిందితుడిగా ఉన్న మత్తయ్యకు, అదే కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన టీడీపీ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్యకు ఆశ్రయం ఇవ్వడం వంటి తప్పులు చేస్తూనే ఉన్నారు. ఎదురుదాడికే మొగ్గు విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు బోలెడు సమస్యలున్నాయి. ఎన్నికల వాగ్దా నాలను నెరవేర్చడానికి నిధులు లేవు. రాజధాని నిర్మాణానికి డబ్బు కావాలి. కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదా పత్తాలేదు. ప్రతి పనికీ హుండీ పెట్టి చందాలు ఇవ్వండనే పరిస్థితి. చంద్రబాబునాయుడు హైదరాబాద్ నివాసి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, సొంత ఇల్లు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇల్లు కట్టడం మొదలు పెట్టారాయన. ఆయన మీద వచ్చిన ఒక నేరారోపణను దర్యాప్తు అధికారులు ఆ కోణం నుంచే చూడా లి తప్ప చంద్రబాబు కోరుకుంటున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద అభియోగంగా చూడటానికి వీలులేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఈ వ్యక్తిగత నేరారోపణ అంశాన్ని రెండు ప్రభుత్వాల మధ్య, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. మంగళగిరి సంకల్పసభలో మాట్లాడినా, ఢిల్లీలో జాతీయ మీడియా ముందు మాట్లాడినా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య అంతరాలను సృష్టించి, వాటిని పెంచే ధోరణిలోనే మాట్లాడుతున్నారు చంద్రబాబు. ఒక నేరం జరిగింది. నిందితులు జైల్లో ఉన్నారు. ఆ నేరాన్ని సమర్థించినట్టు మరొకరు మాట్లాడిన ఆడియో బయటపడింది. దర్యాప్తు జరుగుతున్నది. ఒక స్టేట్స్‌మన్‌గా (ఆ మాటను ఆయనే పలు సందర్భాలలో చెప్పారు) చంద్రబాబునాయుడు ఏం చేయాలి? పదవికి రాజీనామా చేసి మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. కనీసం చట్టం తన పని తను చేసుకుపోతుంది అనైనా అనాలి. అలా చెయ్యక పోగా, నా మీదే కేసులు పెడతారా అన్న ధోరణి సరైనది కాదు. పైగా మా శాసనసభ్యులను తెలంగాణ రాష్ర్ట సమితి ప్రలోభ పెట్టి తన వైపు తిప్పుకు న్నది, అది తప్పు కాదా అంటున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ను ఎవరూ సమర్థించరు. దానికి బదులుగా మేం ఇది చేశాం అన్న టీడీపీ సమర్థింపునూ ఎవరూ హర్షించరు. ఉభయులూ ఈ బేరసారాలను ఆపాల్సిందే. దృష్టిని మళ్లించేందుకే సెక్షన్ 8 ఊసు ఈ వ్యవహారాన్నంతా పక్కదారి పట్టించేందుకు రాష్ర్ట పునర్విభజన చట్టం లోని సెక్షన్ 8ని ముందుకు తెస్తున్నారు చంద్రబాబునాయుడు. సెక్షన్ 8 చెబు తున్నది ఏమిటంటే, ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ప్రజల ప్రాణాలనూ, ఆస్తులనూ, స్వేచ్ఛనూ రక్షించే ప్రత్యేక బాధ్యతలను రాష్ర్ట గవర్నర్ కలిగి ఉంటారనే. శాంతిభద్రతలకు, అంతర్గత భద్రతకు విఘాతం కలిగితే, ముఖ్య మైన కట్టడాలకు భద్రత లోపిస్తే, ఉమ్మడి రాజధాని ప్రాంతంలో కార్యాల యాల కేటాయింపులో సమస్యలొస్తే గవర్నర్ జోక్యం చేసుకుంటారు. ఈ అంశాలలో మంత్రిమండలి చేసే సూచనలు కాదని గవర్నర్ సొంత నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఈ ఏడాది కాలంలో ఎవరి ధన మాన ప్రాణాలకు భం గం కలిగిందో తెలుగుదేశం నాయకులే చెప్పాలి. ప్రముఖ జర్నలిస్ట్ సంజయ్ బారు చెప్పినట్టు హైదరాబాద్ (ఉమ్మడి రాజధాని) ప్రశాంతంగా ఉన్నది, హాయిగా ఆనందంగా ఉన్నది. శాసనసభ్యుడిని డబ్బుతో ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన రేవంత్‌రెడ్డి కేసు, దానిని ప్రోత్సహించే రీతిలో వినిపిస్తున్న చంద్రబాబు గొంతు గల టేప్‌ల మీద దర్యాప్తు ఇవేవీ సెక్షన్8 పరిధిలోకి రావు. ప్రస్తుతం తెలంగాణ అవినీతి నిరోధకశాఖ ఈ కేసులో జరుపుతున్న దర్యాప్తులో గవర్నర్‌గారే కాదు, న్యాయవ్యవస్థ కూడా జోక్యం చేసుకోజాలదు. ఇవన్నీ సుదీర్ఘ రాజకీయ, పరిపాలననుభవం కలిగిన చంద్రబాబుకు తెలియ వనుకోవాలా? 2020 లక్ష్యాన్ని అడ్డదారిలో చేరుకోవాలన్న ప్రయత్నమే తెలు గుదేశం అధినేతకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. -దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
’బాబు ప్రయత్నాలన్ని ప్రజలదృష్టి మళ్లించేందుకే’
-
విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
-
దొరికినా దొరేనంటారా?
డేట్లైన్ హైదరాబాద్ రాజకీయాలలో అవకాశం దొరికితే ‘తొండి’ చెయ్యడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కంటే తక్కువేమీ తినలేదని ఇదే కాలమ్‌లో రెండు వారాల క్రితం తెలంగాణ శాసన మండలి ఎన్నికల గురించి రాస్తూ అన్నాను. నా మాటను నిజం చెయ్యాలనుకున్నారో ఏమో చంద్రబాబు అవకాశం లేకున్నా తొండి చేసి అడ్డంగా దొరికి పోయారు. జూన్ 1న జరిగిన మండలి ఎన్నికల్లో ఒక స్థానం గెలుచుకోడానికి 18 మంది శాసన సభ్యుల బలం అవసరం. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలసి తెలుగుదేశం సాధించుకున్నవి 20 సీట్లు. కానీ ఐదుగురు శాసన సభ్యులను తెలంగాణలోని అధికార పార్టీ తన వైపు లాక్కుంది. దీంతో బీజేపీతో కలసి టీడీపీ బలం 15కు తగ్గిపోయింది. వాటితో ఒక స్థానం గెలవడం అసాధ్యం. కాబట్టి తొండి చేసైనా ఒక స్థానం గెలవా ల్సిందేనని మహానాడు వేదిక మీదనే పథక రచన జరిగింది. ఒక స్థానం గెలవాలంటే ఇంకా ముగ్గురు సభ్యుల మద్దతు అవసరం. ఎందుకయినా మంచిది పడి ఉంటారని ఓ ఎనిమిది మందిని కొనెయ్యండని పురమాయించి టీడీపీ అధినేత మహానాడు వేదికపై నుంచి రాజకీయాలలో నీతిని గురించిన తన ప్రసంగాన్ని కొనసాగించడానికి వెళ్లారట. అక్కడాయన తెలంగాణలో అధికార పార్టీ తమ శాసన సభ్యులను సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నదంటూ రాజకీయాలలో నీతి, విలువల గురించి ప్రబోధిస్తున్న సమ యంలోనే టీడీపీ ఎల్పీ ఉప నాయకుడు రేవంత్ రెడ్డి శాసన సభ్యుల కొనుగోళ్ల కార్యక్రమానికి స్కెచ్ వెయ్యడం మొదలెట్టారు. మనో దౌర్బల్యం గల కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుర్తించి, ఎర వేశారు. చేపలు వలలో పడతాయనుకుంటున్న తరుణంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావుకు ఈ సమాచారం అందింది. వెంటనే ఆయన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో మండలి ఎన్నికల్లో తేడా వస్తే శాసన సభను రద్ద్దు చెయ్యడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. అంతేకాదు టీడీపీ ప్రలోభాన్ని బయట పెట్టాలని నామినేటెడ్ శాసన సభ్యుడు స్టీఫెన్సన్ను సిద్ధం చేశారు. రాజకీ యాల్లో ఎవరు మాత్రం పోనీలే అని ఎందుకు ఊరుకుంటారు? రేవంత్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టిచ్చారు. సిగ్గుతో తలలు వంచుకోక...! కొద్ది మాసాల క్రితం జరిగిన పట్టభద్రుల స్థానం ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడి పోయింది. కాబట్టి ఈ ఎంఎల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని తాము ఎలాగోలా నెగ్గితే టీఆర్ఎస్కు వరుసగా రెండవ పరాజయం అవుతుంది. అది చూపి, ప్రజలు టీఆర్ఎస్ను తిరస్కరిస్తున్నారు అని తేల్చేయొచ్చనే టీడీపీ ఈ ఘన కార్యానికి దిగింది. పైగా మాటి మాటికీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా మాదే అధికారమని చంద్రబాబు చెపుతున్న జోస్యాన్ని శాంపిల్‌గా రుజువు చేసినట్టూ అవుతుంది. దీన్ని ఘనకార్యమనడానికీ కారణం ఉంది. సిగ్గుతో తలలు దించుకుని మీడియాకు దొరక్కుండా దాక్కోవాల్సిన సమయంలో ఆ పార్టీ ముఖ్య నేతలూ, మంత్రులూ, చిన్నా చితకా నాయకులంతా టీవీ చానళ్ళ ముందుకొచ్చి శాసన సభ్యుడి కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు, రేవంత్‌లను తెగ వెనకేసుకొస్తున్నారు! ఈ వీరంగం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. శాసనసభ్యుడికి డబ్బు ఇస్తూ కెమెరాలకు దొరికిపోయిన రేవంత్‌ను ఆయన నాయకుడు చంద్రబాబు వెనకేసుకొస్తుండగా... ‘నువ్వు రా, మాకు అమ్ముడు పో, నీకు ఏ ఇబ్బందీ లేకుండా నేను చూసుకుంటా’నని ఫోన్లో ధైర్యం నూరిపోసిన చంద్ర బాబును ఆయన పార్టీ యావత్తూ అవినీతి అంతుచూసే మరో అన్నా హజారేగా కీర్తిస్తోంది. శాసన సభ్యుల కొనుగోళ్ల వ్యవహారంతో మాకు ఎటు వంటి సంబంధం లేదని ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా టీడీపీ నుంచి గానీ, దాని అధినేత నుంచి గానీ రాకపోవడం దిగ్భ్రాంతికరం. ఎంత సేపూ, టీఆర్ఎస్ తమ శాసన సభ్యులను కొనుగోలు చేసిందని ఎదురుదాడికి ప్రయ త్నించడమే తప్ప, తమ వల్ల తప్పు జరిగిందని వినమ్రంగా అంగీకరిం చేందుకు టీడీపీ సిద్ధపడటం లేదు. ఒక తప్పును ఎత్తిచూపడం వల్ల ఇంకో తప్పు ఒప్పు అయిపోదని సదరు నేతలకు తెలియకనేనా! విచారణకు సిద్ధపడాలి రేవంత్ వ్యవహారంలో తన ప్రమేయం లేకపోతే చంద్రబాబు ఇంత అప్రతి ష్టను ఎందుకు మోస్తున్నట్టు? ఆయన దర్శకత్వంలోనే ఇది జరగకపోయి ఉంటే రేవంత్‌ను వెంటనే పార్టీ నుండి బహిష్కరించాల్సింది. గతంలో ఆయన ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సుద్దాల దేవయ్య, కోడెల శివప్రసాద్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ యాదవ్ వంటి వారిని మంత్రి వర్గం నుండి తొలగించడమో, పార్టీ నుండి సస్పెండ్ చెయ్యడమో చేశారు. మరి ఇప్పుడెందుకు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు? పైగా తానే స్వయంగా ఫోన్లో మాట్లాడిన మాటల టేపు మీడియాలో బయటికొస్తే పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? ఒక వైపు అది తన గొంతు కాదంటారు, మరో వైపు మా ఫోన్లు ట్యాప్ చేస్తారా? అని మహా సంకల్ప సభా ప్రాంగణం నుండి ఉక్రోషంతో పెద్దగా అరుస్తారు. అంతేకాదు, ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం సమావేశమై రేవంత్ కుటుంబానికి బాసటగా నిలవాలని నిర్ణయించినట్టు కూడా వార్తలొచ్చాయి. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి, ఆయన సహచరులు పరోక్షంగానైనా తప్పు జరిగిందని అంగీకరిస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ చేసిన దానికి ప్రతీకారంగా చేసినదే కాబట్టి తప్పు కాదని సమర్థించుకోజూస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏం యోచి స్తున్నదో తెలియదు. కానీ ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ కేంద్ర పార్టీ తరఫున తాము చంద్రబాబుకు అం డగా ఉంటామని ప్రకటించేశారు. ఇక తెలంగాణలో ఆ పార్టీ అధికారికంగా ఏమీ మాట్లాడుతున్నట్టు లేదు. ఇప్పటికే కుటిల రాజకీయాలతో విసుగెత్తి పోయి ఉన్న ప్రజలు... రాజకీయాలు మరీ ఇంత దరిద్రంగా తయార య్యాయా? అని చీదరించుకుంటున్నారు. రాజకీయాల మీదా, నాయకుల మీదా వాళ్లకు మళ్లీ కాసింతైనా విశ్వాసం కలగాలంటే కుంటిసాకులు చెప్పక చంద్రబాబు విచారణను ఎదుర్కోడానికి సిద్ధపడాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే మరీ మంచిది. కానీ ఆయన తాత్కాలికంగానే అయినా అధి కారాన్ని మరొకరి చేతిలో పెట్టడానికి సిద్ధపడకపోవచ్చు. రేవంత్ విషయంలో ఇప్ప టికే చట్టం తన పని తాను చేస్తున్నది. దాన్ని ఆ పని చెయ్యనివ్వాలి. దుర్మార్గం, ప్రమాదకరం దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఏపీ ముఖ్య మంత్రి... తనకూ తెలంగాణ ముఖ్యమంత్రికీ మధ్య సాగుతున్న అహాల సంఘర్షణను, టీఆర్ఎస్, టీడీపీల మధ్య జరుగుతున్న బలాబలాల నిర్ధారణ తగాదాను ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా చిత్రించే ప్రయత్నం చెయ్యడం దుర్మార్గం, ప్రమాదకరం కూడా. రెండు రాష్ట్రాల మధ్య వాటి ప్రజల మధ్య ఘర్షణను ప్రోత్సహించే విధంగా ఆయన ప్రసంగం సాగడం దురదృష్టకరం. తెలంగాణలో కేసీఆర్ తన వాళ్ళను ఎత్తుకుపోతున్నారని మొత్తుకుంటున్న చంద్రబాబు ఏపీలో చేసిందే మిటి? కాళ్ళ పారాణి ఆరక ముందే అన్నట్లు... ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పార్లమెంట్‌కు గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి ఇచ్చిన పత్రం మీద సంతకం తడి ఆరకముందే ఇద్దరు ఎంపీలను టీడీపీలోకి ఆహ్వానించి, పచ్చ కండువా కప్పడం ఏ నీతికి, ఏ విలువలకు నిదర్శనం? ఇంత జరుగుతుంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని జనసేన పెట్టిన పవన్ కల్యాణ్ ఏమైనట్టు? ఆయన ఎందుకు నోరు విప్పడం లేదు? ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇతర పార్టీల నుండి తాము ఏదో ఒక రూపంలో కొనుగోలు చేసిన లేదా తమ పార్టీలోకి వలస వచ్చిన శాసనసభ్యుల స్థానాలకు వారి చేత రాజీనామాలు చేయించి, స్పీకర్ చేత ఆమోదింపజేసుకుని వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధపడాలి. అంతే కానీ తన స్థాయి మరిచి బహిరంగ సభలలో అభ్యంతరకరమైన భాషలో రెచ్చిపోవడం మంచిది కాదు. నీతి అందరికీ ఒకటిగానే ఉంటుంది. బంగారు తెలంగాణకు ఒక నీతి, స్వర్ణాంధ్రప్రదేశ్‌కు మరో నీతి, మిగతా సమాజానికి అంతటికీ ఇంకో నీతి ఉండదు. అవినీతి రహిత భారత్ నిర్మాణమే మా ధ్యేయం అని ప్రకటించుకున్న మోదీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ అవినీతి బాగోతం విషయంలో ఎట్లా వ్యవహరిస్తుం దో వేచి చూడాల్సిందే. - దేవులపల్లి అమర్ (datelinehyderabad@gmail.com) -
మండలి’ ఓటుకూ మకిలేనా!
డేట్లైన్ హైదరాబాద్ ఈ ఐదుగురు అభ్యర్థుల పట్లా తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగి వచ్చి, శాసన సభ్యులుగా ఎంపికైన వారు సుముఖంగానే ఉన్నారా? అటువంటివారు రహస్య బ్యాలెట్‌ను అనుసరిస్తే ఫలితం ఎలా ఉంటుంది? మన మేధావి జగదీశ్వర్‌రెడ్డి సమాధానం చెప్పాలి. అయినప్పటికీ, ఐదు స్థానాలూ అధికార పక్షమే గెలుస్తుందని ఘంటాపథంగా అంటారా? ఇక, మన రాజకీయాలలోని నీతిని కొనియాడవలసిందే! మండలి ఎన్నికలలో పడే ఓట్ల మతలబు ఏమిటో త్వరలోనే వెల్లడవుతుంది. అసెంబ్లీ సభ్యుల కోటా నుంచి శాసనమండలికి జరిగే ఎన్నికలు జూన్ ఒక టిన జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికలు సాఫీగానే సాగిపోయా యి. నాలుగు స్థానాలకు (వైఎస్ఆర్సీపీ-1, తెలుగుదేశం-3) ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఎలాంటి సందులేకపోవడంవల్ల కాబోలు అక్కడ అధి కార పార్టీ ఎలాంటి తొండీ పెట్టకుండా ప్రక్రియను సాగనిచ్చింది. నిజానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీ యాలు ఆడడానికి వెనుకాడరు. తెలంగాణలో మాత్రం ఈ తొండి తప్పేటట్టు లేదు. శాసనసభ సభ్యుల కోటా నుంచి ఆరు ‘మండలి’ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ శాసనసభ సభ్యుల సంఖ్యను ఆరుతో భాగిస్తే వచ్చే సంఖ్యతో సమంగా ఒక్కొక్క అభ్యర్థికి ఓట్లు రావాలి. కానీ ఆరు స్థానాల కోసం ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఐదో స్థానం గెలుపు ధీమా ఎక్కడిది? ఒకసారి లెక్కలు చూద్దాం. తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య 119. నామినే టెడ్ సభ్యునితో కలిపి 120. శాసనసభ కార్యదర్శి (పదవీకాలం పొడిగిం చారు) రాజా సదారామ్ చెబుతున్నట్టు, రాష్ట్రపతి, రాజ్యసభ ఎన్నికలలో ఓటు అర్హతలేని నామినేటెడ్ సభ్యునికి, మండలి ఎన్నికలలో ఓటు హక్కు ఇస్తే మాత్రమే ఆ సంఖ్యను 120గా పరిగణించాలి. అయితే రాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి అర్హత లేని సభ్యుల ఓటు శాసన మండలి ఎన్ని కలలో మాత్రం ఎలా చెల్లుబాటు అవుతుందో ఎన్నికల సంఘం స్పష్టం చేయా లి. నిజానికి కరీంనగర్ జిల్లా, వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ ఓటు హక్కు కూడా వివాదాస్పదంగానే ఉంది. ఆయన ఎన్నడో జర్మనీ పౌరస త్వం తీసుకున్నారు. ద్వంద్వ పౌరసత్వం వల్ల ఆయనకు ఈ ఎన్నికలలో ఓటు వేసే హక్కు లేదని తెలుగుదేశం సభ్యుల వాదన. అయితే రమేశ్ ఇప్పటికి ఉప ఎన్నికలతో కలిపి మూడు నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఎన్నికవు తూనే ఉన్నారు. శాసనసభకు ఎన్నిక కావడానికి లేని అభ్యంతరం, మండలి ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించడం దగ్గర ఎందుకు చెల్లుబాటు కాదో కూడా ఎన్నికల సంఘం వివరించాలి. ఎన్నికల సంఘం ఆ ఇద్దరికీ అనుమతి ఇస్తుందని అనుకుంటే, శాసనసభ్యుల సంఖ్య 120. లేకుంటే 118. శాసన సభలో టీఆర్ఎస్ బలం 65 స్థానాలు. అంటే మూడు స్థానాలు మాత్రమే (ఒక్కొక్క అభ్యర్థికి 20 వంతున ఓట్లు పడితే) ఆ పార్టీకి దక్కుతాయి. పోగా కొద్ది ఓట్లు మాత్రం మిగులుతాయి. శాసనసభలో ఎంఐఎంకు ఏడు ఓట్లు ఉన్నాయి. మొదటి నుంచి నిజాం నవాబు మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్న కారణంగానూ, మజ్లిస్‌తో ఉన్న సఖ్యత కారణంగానూ వారి ఓట్లు కూడా తమకే వస్తాయని టీఆర్ఎస్ భావిస్తే, ఆ రెండు పార్టీల ఓట్ల సంఖ్య 72కు చేరుతుంది. అప్పుడు 20తో (ఒక్కొక్క అభ్యర్థికి రావలసిన ఓట్లు) భాగించినా అధికార పార్టీకి దక్కేవి ఆ మూడు స్థానాలే. అంటే, మిగిలి పోయే ఓట్లు కొద్దిగా పెరగడం మినహా, వచ్చే సీట్ల సంఖ్యలో మార్పేమీ లేదు. ఇక ‘బం గారు తెలంగాణ బ్యాచ్’ (బీటీ బ్యాచ్) అని అంతా ముద్దుగా పిలు చుకుం టున్న టీడీపీ, కాంగ్రెస్ వలస సభ్యులు - తొమ్మండుగురిని కూడా కలుపు కుంటే, అధికార పార్టీ బలం 81కి చేరుకుంటుంది. ఈ సంఖ్య ప్రకా రమైతే నాలుగు మండలి స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోగలదు. 21 స్థానాలు ఉన్న కాంగ్రెస్‌కు ఒక మండలి స్థానం; బీజేపీ-5, తెలుగుదేశం-15 మంది సభ్యులతో ఆ కూటమికి ఒక స్థానం తప్పక చెందవలసిందే. మరి అధికార పార్టీ ఏ ధీమాతో ఐదో స్థానానికి ఆశపడుతున్నట్టు? ఎవరి వైఖరి ఏమిటి? మాకు గొప్ప వ్యూహం ఉందని మంత్రులు చెబుతున్నదంతా డంబాచార మేనా? ‘మేం ఐదు స్థానాలూ గెలుస్తాం, అందుకు చర్చలు జరుపుతున్నాం’ అని సాక్షాత్తు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి గత వారమే ప్రకటిం చారు. అంటే శాసనసభ్యులను ప్రలోభాలకు గురి చేసే, కొనుగోలు చేసే కార్య క్రమం మరోసారి జరగబోతున్నదన్నమాట. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అదే జరిగితే తగిన జవాబు చెబుతారు కూడా. ప్రతి అవాంఛనీయ కార్య క్రమానికి బంగారు తెలంగాణ భవిష్యత్తు అంటూ ఒక ముద్రవేసి, వ్యతి రేకించే వారి మీద రంకెలు వేసే అధికార పక్షం ఈ సంగతి గుర్తించాలి. ఇంతకీ శాసనమండలి ఎన్నికలలో మజ్లిస్ వైఖరి ఏమిటి? అది ఇంకా స్పష్టం కాలేదు. ఎట్టి పరిస్థితులలోనూ ఈ సంవత్సరాంతంలో గ్రేటర్ మున్సి పల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరపవలసిందేనని న్యాయస్థానాలు చెప్పే శాయి. ఈ నేపథ్యంలో మండలి ఎన్నికలలో మజ్లిస్ మద్దతును బహిరంగంగా తీసుకోవడానికి టీఆర్ఎస్ సిద్ధపడుతుందా? పట్టభద్రుల నియోజకవర్గ ఎన్ని కలలో ఉద్యమవీరుడు దేవీప్రసాద్‌కు ఎదురైన ఓటమి అనుభవం నుంచి అధి కార పక్షం పాఠాలు నేర్చుకుని ఉంటే, అందుకు సిద్ధపడదు. నిజానికి టీడీపీ, బీజేపీ కూటమి బలోపేతం కావడానికి ఆ పరిణామం ఉపకరిస్తుంది. మజ్లిస్ కూడా టీఆర్ఎస్తో దోస్తీకి ఆసక్తి చూపించకపోవచ్చు. కొద్దిమాసాల క్రితం మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిద ర్శనం. కారు (టీఆర్ఎస్)తో దోస్తీ విషయం గురించి విలేకరులు అడిగితే, ‘స్టీరింగ్ మా చేతులలోనే ఉంది’ అని ఆయన అన్నారు. ఆ తరువాత పరిస్థి తులు మారాయి. ఆలేరు దగ్గర జరిగిన వికారుద్దీన్ ముఠా బూటకపు ఎన్ కౌంటర్‌తో మజ్లిస్ మిత్రులు ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. వీటికి తోడు ముఖ్యమంత్రి కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మోదీతో సెల్ఫీలు తీసుకోవడం, ఆయన ఆహ్వానిస్తే ప్రభుత్వంలో చేరే విష యం ఆలోచిస్తామనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ సభ్యుల మద్దతు టీఆర్ఎస్ అభ్యర్థులకు లభిస్తుందా? ఇప్పటికీ అదే చిరునామా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంఎల్ఏలూ, వారి పార్టీల వివరాలతో శాసనసభ కార్యదర్శి విడుదల చేసిన జాబితాను కూడా పరిశీలించాలి. 120 మంది సభ్యుల ఆ జాబితాలో అధికార పక్షంలోకి వలసపోయిన ఐదుగురు తెలుగుదేశం, నలుగురు కాంగ్రెస్ సభ్యుల పేర్లు ఆయా పార్టీల పరిధిలోనే ఉన్నాయి. ఆ జాబితా ప్రకారం అధికార టీఆర్ఎస్ బలం 65 మంది సభ్యులే. మరి తొమ్మిది మంది ‘బీటీ బ్యాచ్’ అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు ఎలా వేస్తారు? ‘ఇది రహస్య బ్యాలెట్ బాబూ!’ అని మేధావి, మంత్రి జగదీశ్‌రెడ్డి నవ్వవచ్చు. కానీ జాబితాలూ, ఆ లెక్కలూ మారవు కదా! ఏమో గుర్రం ఎగరావచ్చునంటారా? సరే చూద్దాం! అభ్యర్థుల సంగతి ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆకుల లలితను అభ్యర్థిగా ఎంపిక చేసింది. తెలుగుదేశం పార్టీ మైనస్ పాయింట్లేమీ లేని నరేందర్‌రెడ్డిని ఎంపిక చేసింది. కానీ టీఆర్ఎస్ ఎంపిక చేసుకున్న ఐదుగురు అభ్యర్థులతో ఇబ్బందులకు గుర య్యే అవకాశమే ఎక్కువ. ఈ ఐదుగురు ప్రత్యేక రాష్ట్రం విషయంలో చివరి నిమిషం వరకు టీఆర్ఎస్ వ్యతిరేకులే. ఉప ముఖ్యమంత్రి, విద్యామంత్రి కడి యం శ్రీహరి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేయించిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యట నకు వస్తే, ప్రతిఘటించిన ఉద్యమకారులను పోలీసులతో చావగొట్టించిన ఘనత కూడా ఆయనదే. ఇప్పుడు ఆయన వరంగల్ లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. లోక్‌సభకు ఇంకా ఎందుకు రాజీనామా చేయరు? అని అడిగితే జవాబు లేదు. ఇక్కడ గెలుపు ధీమా లేకనో, అక్కడ ఉప ఎన్నిక నల్లేరు మీద నడక కాదని నమ్మడం వల్లనో మరి? మరో అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని తేలాక జరిగిన ఎన్నికలలో కూడా తెలుగు దేశం అభ్యర్థిగానే పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓడిపోయి, తరువాత టీఆర్ ఎస్‌లో చేరారు. పైగా శ్రీహరి, తుమ్మల- ఈ ఇద్దరినీ కూడా మంత్రివర్గంలో చేర్చుకోవడం గురించి అసంతృప్తితో ఉన్న శాసనసభ్యుల సంఖ్య కూడా తక్కువేమీకాదు. ఇక మిగిలిన ముగ్గురి గురించి. నేతి విద్యాసాగర్, తెలం గాణ శాసనమండలి ఆధిపత్యం టీఆర్ఎస్కు అప్పగించినందుకు ప్రతిఫలం గా ఈ అభ్యర్థిత్వం దక్కింది. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన యాదవరెడ్డి నరనరాన రాజకీయ గురువు సూదిని జైపాల్‌రెడ్డి ఆలోచనలే ప్రవహిస్తూ ఉంటాయి. ఐదో అభ్యర్థి బోడకుంట్ల వెంకటేశ్వర్లు- ఆయన టీడీపీ నుంచి వచ్చినవారే. తెలంగాణ సాధన కోసం ఎన్నడూ పనిచేసిన వారు కాదు. ఈ ఐదుగురి పట్లా తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగివచ్చి, శాసనసభ్యులుగా ఎంపికైన వారు సుముఖంగానే ఉన్నారా? అటువంటివారు రహస్య బ్యాలె ట్ను అనుసరిస్తే ఫలితం ఎలా ఉంటుంది? మన మేధావి జగదీశ్వర్‌రెడ్డి సమాధానం చెప్పాలి. అయినా, ఐదు స్థానాలూ అధికార పక్షం గెలుస్తుందని అంటారా? ఇక, మన రాజకీయాలలోని నీతిని కొనియాడవలసిందే! datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
అంతరాత్మనే ఆవిష్కరిస్తారా?
కొణిజేటి రోశయ్యను చెప్పాపెట్టకుండా తొలగించి, కనీసం మంత్రిగా కూడా అనుభవం లేని, శాసనసభ్యులెవరి మద్దతూ లేని తనను ఎందుకు అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించిందో కిరణ్ రాసుకుంటారా? రాష్ట్రాన్ని విభజిస్తున్నాం, మీరే ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రక్రియను సజావుగా పూర్తి చెయ్యాలని సోనియాగాంధీ స్వయంగా చెప్పిన విషయాన్ని కిరణ్ ఇప్పుడు కాదని రాయబోతున్నారా తన పుస్తకంలో? రాష్ర్టంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చి, ఒంటిచేత్తో రెండోసారి కూడా పార్టీని అధికారంలోకి తెచ్చినవారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. కానీ వైఎస్ఆర్ అర్ధంతరంగా నిష్ర్కమించినప్పటికీ రాష్ట్ర ప్రజల మీద ఆయన వేసిన ముద్రను తుడిచిపెట్టే పని తనకే అప్పగించారని రాసుకుంటారా? ‘నేను నా సమాధి నుంచి మాట్లాడుతున్నానన్న విషయం ఈ ఆత్మకథ రాస్తున్నప్పుడు తప్పనిసరిగా దష్టిలో ఉంచుకుంటాను. నిజంగానే నేను నా సమాధి నుంచే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ ఆత్మకథ పుస్తకంగా వెలు వడే నాటికి నేను జీవించి ఉండను. ఒక మంచి కారణంతోనే నేను సజీవుడిగా కంటే సమాధి నుంచి మాట్లాడటాన్నే ఇష్టపడ్డాను. అప్పుడే స్వేచ్ఛగా మాట్లా డగలను. ఒక మనిషి తన వ్యక్తిగత విషయాలను గురించి రాయవలసి వచ్చి నప్పుడు అది చాలా అవసరం. తాను జీవించి ఉండగానే ఇతరులు ఈ ఆత్మ కథను చదువుతారని అనుకున్నప్పుడు దాపరికం లేకుండా రాయడానికి సంకోచిస్తాడు. దాపరికం లేకుండా చేయటానికి అతను చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ‘ఒక మానవ హదయం, మెదడూ సజించే దాపరికం లేని, స్వేచ్ఛా యుతమైన, వ్యక్తిగతమైన విషయం ప్రేమలేఖేనని నా అభిప్రాయం. తాను రాస్తున్నది ఇతరులు ఎవరూ చూడరన్న భావన కారణంగా తన భావప్రకట నలో అపరిమితమైన స్వేచ్ఛను ప్రేమలేఖ రాస్త్తున్నప్పుడు మాత్రమే అనుభ విస్తాడు. నేను చనిపోయేంత వరకూ ఈ ఆత్మకథ ఎవరి కంటా పడకుండా ఉంటుందని తెలిస్తే నా ఆత్మకథను కూడా ప్రేమలేఖ రాసినంత స్వేచ్ఛగా, దాపరికం లేకుండా రాయగలనని అనిపించింది. అందుకే సజీవుడిగా కంటే సమాధి నుంచి మాట్లాడటాన్నే ఇష్టపడతాను.’ అమెరికాకు చెందిన విఖ్యాత రచయిత మార్క్‌టై్వన్ మహాశయుడు తన ఆత్మకథకు రాసుకున్న పరిచయ వాక్యాలు ఇవి. ‘కొంత పొడవే అయినా ఆయన రాసుకున్న ఈ మాటలు ఇక్కడ తప్పని సరిగా ప్రస్తావించడం అవసరం, సందర్భం కూడా. సమకాలీన సమాజంలో వెలువడిన కొన్ని వందల, వేల ఆత్మకథలూ, స్వీయచరిత్రలూ మనం చదు వుతూ ఉంటాం. కారణం, అవి ఆసక్తికరమే కాక అనేక విషయాలు తెలుసు కునేందుకు ఉపయోగపడతాయి. రాజకీయ నాయకులూ తమ అనుభ వాలను రాస్తూ ఉంటారు. అలాంటి స్వీయ అనుభవాలు జాతీయస్థాయిలో ఎక్కువ. అవి చాలా సందర్భాలలో తీవ్రమయిన సంచలనాలకూ, వివాదా లకూ దారి తీసి, బ్రహ్మాండంగా అమ్ముడుపోవడం కూడా తెలిసిందే. ప్రాంతీ యంగా కూడా మనం కొందరు రాజకీయ నాయకులు రాసిన అనుభవాలను చాలానే చదివాం. ఇప్పుడు ఆ కోవకే చెందిన ఇంకో రచన రాబోతున్నది. ఆత్మకథలు, స్వీయానుభవాలు రాసే వాళ్లకు నిజాయితీ; అలాగే జీవిత చరి త్రలు రాసే వాళ్లకు చరిత్ర పరిశోధనపై ఆసక్తి, శ్రద్ధ ఉండాలంటారు పెద్దలు. ఏం చెప్పబోతున్నారు కిరణ్‌కుమార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి అనా లనుకుంటా, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తన అనుభవాలను పుస్తకరూపంలో వెలువరిస్తున్నారంటూ రెండురోజుల క్రితం ఒక ఆంగ్ల దినపత్రికలో వార్త వచ్చింది. నాలుగు వందల పేజీల ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు సంబంధించి బోలెడు వివరాలు వెల్లడించను న్నట్టు తెలిసింది. దీని కోసం ఆయన కొన్ని మాసాల పాటు అమెరికాలో కసరత్తు కూడా చేశారు. బహుశా నెలలో ఈ పుస్తకం మన చేతుల్లో ఉంటుంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పుస్తకం రాస్త్తున్నారన్న విషయం మనకు ఆ ఆంగ్ల దినపత్రిక ద్వారా తెలియడానికి రెండురోజుల ముందే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల ఎదుట ఆత్మ విమర్శ చేసుకుం టూ జీవితంలో తాను చేసిన పెద్ద తప్పిదం కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమం త్రిని చెయ్యడమే అన్నారట. రోశయ్యను తప్పించి కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్య మంత్రిని చెయ్యాలన్న నిర్ణయం పూర్తిగా తనదేననీ, ఆ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఈ దుర్గతి పట్టిందనీ, మళ్లీ కాంగ్రెస్‌కు ఆ వైభవం ఎప్పుడొస్తుందో చెప్పలేననీ వాపోయారట కూడా. చేతులు కాలాక... రెండురోజుల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ తరు వాత కొద్ది రోజుల్లోనే ఆయన ఆంధ్రప్రదేశ్‌లో కూడా పర్యటించి నిర్వీర్యమై పోయిన కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి పోస్తారట. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్గతి పట్టడానికి కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యడమేనని రాహుల్ గాంధీ వాపోతుంటే, కిరణ్ మాత్రం సోనియాగాంధీ , రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు వైగైరా వైగైరా నాయకులంతా ఇవాళ్టి పరి స్థితికి ఎట్లా కారకుల య్యారో, ఎవరెవరు ఏం చేశారో తన పుస్తకంతో బయట పెడతానని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజనలో కిరణ్‌కుమార్‌రెడ్డి సహా ఎవరి పాత్ర ఏమిటో ఇప్పుడు ఆయన పుస్తకం రాస్తే కానీ తెలియదా తెలుగు ప్రజలకి? ఇంతకు అమెరికాలో కూర్చుని కిరణ్ తయారు చేసుకున్న ఈ ఆత్మ చరిత్రాత్మక రచనలో బయట పెట్టబోయే సంచలనాలు ఏమై ఉం టాయి? ఆయన ఎంత నిజాయితీగా సంఘటనలను రికార్డు చెయ్యబోతు న్నారు? ఇలాంటి అంశాలు మనం పుస్తకం చదివితే కానీ తెలియవు. మార్క్‌టై్వన్ చెప్పినట్టు ఈ రచన సమాధిలో నుంచి రాసినంత నిజా యితీగా ఉండగలదా? తన భావప్రకటనలో అపరిమితమైన స్వేచ్ఛను అను భవిస్తూ రాసిన ప్రేమలేఖ లాగా ఉంటుందా? అటువంటి నిజాయితీ మన కాలపు రాజకీయ నాయకుల నుంచి ఆశించడం అత్యాశే. ఇంతకూ కిరణ్ కుమార్‌రెడ్డి రాస్తున్న పుస్తకంలో ఈ క్రింది విషయాలన్నీ ఉంటాయా? ఈ విషయాలు చెప్పగలరా? సీనియర్ నాయకుడు కొణిజేటి రోశయ్యను చెప్పాపెట్టకుండా తొలగించి, అధిష్టానం కనీసం మంత్రిగా కూడా అనుభవం లేని, శాసనసభ్యులెవరి మద్ద తూ లేని తనను ఎందుకు ముఖ్యమంత్రిగా నియమించిందో కిరణ్ రాసు కుంటారా? రాష్ట్రాన్ని విభజిస్తున్నాం, మీరే ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రక్రి యను సజావుగా పూర్తిచెయ్యాలని సోనియాగాంధీ స్వయంగా చెప్పిన విష యాన్ని, కిరణ్ ఇప్పుడు కాదని రాయబోతున్నారా తన పుస్తకంలో? మూడు దశాబ్దాలకు పైబడి కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడిగా కొనసాగి, రాష్ర్టంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చి, ఒంటి చేత్తో రెండోసారి కూడా పార్టీని అధికారంలోకి తెచ్చిన వారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. అలా కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేపట్టడానికి మార్గం సుగమం చేశారా యన. కానీ వైఎస్ఆర్ అర్ధంతరంగా నిష్ర్కమించినప్పటికీ రాష్ట్ర ప్రజల మీద ఆయన వేసిన ముద్రను తుడిచిపెట్టే పని తనకే అప్పగించారని రాసుకుం టారా? వైఎస్ఆర్ కుమారుడు జగన్మోహన్రెడ్డిని పార్టీ నుంచి వెళ్లగొట్టేం దుకు రాయలసీమ ప్రాంతానికే చెంది, వయసులో కొంత దగ్గరగా ఉన్న కారణంగానే తనను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారని నిర్భయంగా రాసుకుంటారా? 2009 డిసెంబర్ 9 ప్రకటన తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఇందులో కొత్తగా కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యంగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రాష్ర్ట విభజన విషయంలో అనుసరించిన ద్వంద్వవైఖరి కానీ, దాచిపెట్టిన విషయాలు కానీ ఏమీలేవు. మరి ఇంతకు మించి సంచలనమైన విషయాలు ఏం చెప్పబోతున్నారాయన? చంద్రబాబు పాత్రను ఎలా చిత్రిస్తారు? చంద్రబాబు నాయుడు గురించి కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి తన పుస్తకంలో రాయబోతున్నారని తెలిసింది. రాష్ర్ట విభజన విషయంలో మొదటి నుంచి తెలుగుదేశం, చంద్రబాబునాయుడు అనుసరించిన వైఖరి ప్రపంచానికం తటికీ తెలిసిందే. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా, అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉండి చంద్రబాబు ఎలా కాపాడారో, దాని వెనక మత లబు ఏమిటో కొత్తగా రాస్తే చదవడానికి ఆసక్తికరంగా ఉంటుందేమో! ముఖ్య మంత్రి పదవిలో చివరి నిమిషం దాకా కొనసాగడమే లక్ష్యంగా తన సొంత పార్టీ నాయకులను కూడా అజ్ఞానాంధకారంలో ఉంచిన విషయం కూడా కిరణ్ రాసుకుంటారా? చివరికి పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకుని, ఎన్నికల అధికారి కార్యాలయం వరకూ ఊరేగింపుగా వెళ్లి ఆఖరి నిమిషంలో తను నామినేషన్ వెయ్యకుండా తమ్ముడితో వేయించడం వెనుక దాగిన గొప్ప వ్యూహం ఏమిటో కూడా వాస్తవికంగా పేర్కొంటారా? ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చరమగీతం పాడించి, దిక్కులేకుండా వదిలేసి, భార తీయ జనతా పార్టీలో చేరిపోవాలనుకుని కూడా, అది ఎందుకు కుదరలేదో కారణాలు రాసుకుంటారా ఈ పుస్తకంలో? ముఖ్యమంత్రిగా చివరి రోజులలో క్యాంపు కార్యాలయంలోనే మీడియా మిత్రులను పిలిచి కిరణ్ నిర్వహించిన పత్రికా గోష్టి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏదో సంచలనమైన వార్త చెబుతారని అంతా ఆశించారు. తీరా కూలిన బెర్లిన్ గోడ ముక్క ఒకటి చూపించి రాష్ర్టం కలిసే ఉంటుందని చెప్పబోయారాయన. ఆయన రాస్తున్న పుస్తకంలో విషయాలు కూడా అలాగే ఉన్నా ఆశ్చర్యపోనక్కర లేదు. - దేవులపల్లి అమర్ -
ఏవీ ఆ మాటల తూటాలు?
దేవులపల్లి అమర్ చంద్రశేఖరరావు తాను తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను, తనతో నడిచిన వాళ్లను ఈ మహాసభలో గుర్తు చేసుకున్నారు. ఒకచోట కొంచెం ఉద్వేగానికి కూడా లోనయ్యారు. కొట్టొచ్చినట్టు కనిపించింది ఏమిటంటే తెలంగాణ ఉద్యమానికి అత్యంత దన్నుగా నిలిచి మొత్తం ఉద్యమ విశ్వసనీయతను ఆకాశం ఎత్తుకు పెంచిన రాజకీయ జేఏసీ, అది నిర్వహించిన సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్ ఇంకా అనేక పోరాటాల ప్రస్తావనే ముఖ్యమంత్రి ఈ సభలో తీసుకురాకపోవడం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. వనరులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సోమవారం నాటి పరేడ్ గ్రౌండ్స్ సభల వంటి సభలు చాలా సునాయాసంగా జరపవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 14 ఏళ్లు పోరాడి, రాష్ట్రాన్ని సాధించుకుని ఎన్నికలలో ప్రజల మన్నన పొంది అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ బహిరంగ సభ నిర్వహణ టీఆర్ఎస్కు ‘బాయే హాత్ కా ఖేల్’ (ఎడం చేత్తో సునాయాసంగా ఆడడం) లాంటిదే. బహిరంగ సభల నిర్వహణ తెలంగాణ రాష్ట్ర సమితికి మొదటి నుంచి చాలా సులువైన ఆటే. ఉద్యమం అద్భుతంగా ఉన్నకాలంలో నిర్వహిం చినా, కొంత నిరాశ చోటు చేసుకుంటున్నదని అనిపించిన సమయంలో ఏర్పాటు చేసినా, ఉప ఎన్నికల వేళ అయినా, ఎప్పుడైనా టీఆర్ఎస్ నిర్వహిం చిన సభలకు జనం బ్రహ్మాండంగానే హాజరయ్యారు. అటువంటి నిబద్ధత గల నాయకులూ, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలూ ఆ పార్టీకి వేల సంఖ్యలో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం తరువాత కరీంనగర్లో నిర్వహించిన బహిరంగ సభ మొదలు, తరువాత వరంగల్, హైదరాబాద్‌లలో- నిర్వహించిన ప్రతి చోటా ప్రాంగణాలు కిక్కిరిసిపోవలసిందే. ఉద్యమకాలంలో తమ నాయకుడు తన మాటలతో మంటలు సృష్టించేవాడు. జనాన్ని పోరాటం వైపు నడిపించే వాడు. కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేవాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వాక్పటిమ అద్భుతం. ఎంతటివారినైనా కదలకుండా నిలబెట్టేస్తుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన వెంటనే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మొత్తం ప్రచారం ఒంటరిగా పది జిల్లాలలోనూ వందకు పైగా సభలలో ఆయన ప్రసంగించారు. ఆ వాగ్ధాటి పార్టీకి అంతటి ఘన విజయాన్ని సాధించిపెట్టింది. నిరుత్సాహపరచిన ప్రసంగం అటువంటి నాయకుడు మొన్న 24వ తేదీన ఫతేహ్ మైదానంలో జరిగిన పార్టీ ప్లీనరీలోనూ, సోమవారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలోనూ చేసిన ప్రసంగాలు టీఆర్ఎస్ శ్రేణులనే తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. ఎంతో శ్రమించి లక్షలాదిమందిని సభకు సమీకరించిన మంత్రులు, రెండో శ్రేణి నేతలు, కార్యకర్తలు కూడా అర్థంకాలేదు- అధినాయకుని ప్రసంగం అంత తక్కువసేపు, అంత నిరుత్తేజంగా ఎందుకు సాగిందో. నాయకుని ఉపన్యాసం జనంలో నిరాశ కలిగించిన మాట వాస్తవం. ఆయన మొత్తం ప్రసంగం నలభై నిమిషాల లోపునే ముగిసింది. ఏవో అద్భుతమైన ప్రకటనలు వస్తాయి, ప్రజా సంక్షేమానికీ, అభివృద్ధికీ సంబంధించిన కొత్త పథకాల ప్రకటన ఏమైనా ఉంటుందని ఆశించినవారు సహజంగానే నిరాశకు గురైనారు. మామూలుగా బహిరంగ సభలు జనబలాన్ని ప్రదర్శించుకోవడానికి ఉపయోగపడతాయి. కింది స్థాయి నాయకులు తమ ప్రాబల్యాన్ని ప్రదర్శించుకోవడానికి, అధినాయకత్వం వద్ద మార్కులు వేయించుకోవడానికి కూడా ఉపయోగ పడతాయి. అటువంటి సభలలో రాజకీయ దిశా నిర్దేశం చేసే ప్రసంగాలు ఉండకపోవడం సహజమే. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో కూడా పార్టీ అధ్యక్షుడి ప్రసంగం నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే విధంగా సాగలేదు. అస్పష్టంగా ప్రాజెక్టుల ప్రస్తావన ముఖ్యమంత్రి తన ముక్తసరి ప్రసంగానికి కారణం చెప్పారు- అప్పుడు మాట్లాడే సమయం, ఇప్పుడు పనిచేసే సమయం అని. చాలా విలువైన మాట చెప్పారు. ప్రభుత్వాధికారులు అందరూ చెయ్యవలసిన పని అది. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తేనే కదా ప్రజలకు సేవలు సక్రమంగా అందేది. తెలంగాణ ముఖ్యమంత్రి చాలా పథకాల గురించి 11 మాసాలుగా మాట్లాడుతున్నారు. కాని వాటి అమలు ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత ఇవ్వడం లేదు. ఆ స్పష్టత నిన్నటి బహిరంగ సభలో కూడా రాలేదు. వచ్చే మార్చి నెల నుంచి వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల కరెంటు కచ్చితంగా ఇస్తామన్నారు. అది ఎట్లా ఇస్తారో చెప్పలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నాయకుడు హరీశ్‌రావు ఆశ్చర్యపోతూ ఉంటారు, మా ముఖ్యమంత్రి ఏం మాయ చేశారో కాని కరెంట్ కోతలే లేవు అని. కోతలు లేవు అనడం కోతలు కొయ్యడమే అని వారికీ తెలుసు. సాగు వినియోగం సగం పడిపోవడం, ఆ కారణంగానే అనీ, ఎడా పెడా కోతల కారణంగా ఖరీఫ్‌లో పంటలు ఎండిపోవడంతో భయపడి రైతులు ఈ రబీలో పంటలు వెయ్యక విద్యుత్ డిమాండ్ పడిపోయిందే తప్ప, ఇందులో మనం చేసింది ఏమీ లేదని కూడా వారికి బాగా తెలుసు. వచ్చే ఖరీఫ్‌లో తీవ్రమైన కరెంట్ కష్టాలు తప్పవు. అవి ఉండవు అనే భరోసా ఇస్తున్నారు తప్ప, ఎట్లా సాధ్యమో చెప్పడం లేదు. నిరుద్యోగులకు నిరాశ ఇక ముఖ్యమంత్రి ప్రసంగంలో రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వివిధ సందర్భాలలో ఆయన ఈ అంశం మీద వివిధ రకాల ప్రకట నలు చేశారు. ఆయన పార్టీ నాయకులు కూడా చేశారు. అంతకు ముందు ఒక సందర్భంలో పార్టీ జనరల్ సెక్రటరీ కె. కేశవరావు అతి స్వల్పకాలంలో ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ ఒక సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు అని చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షులైతే కొత్త సంవత్సరం కొత్త ఉద్యోగాలు అని ప్రకటించారు. ఇలా భిన్నమైన ప్రకటనలు నిరుద్యోగ యువతను గందరగోళంలోకి నెడుతున్నాయి. నిరాశకు గురి చేస్తు న్నాయి. ముఖ్యమంత్రి ప్రస్తావించిన మిగిలిన అంశాలు మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్. ఈ రెండు పథకాలకు అవినీతి మట్టి అంటకుండా చూడగలిగితే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. చంద్రశేఖరరావు ఇంకోసారి చరిత్రలో నిలిచిపోతారు. ఇక రెండు గదుల ఇళ్ల పథకాన్ని ఎవరూ సీరియస్‌గా పట్టించు కోవడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యమా? మొత్తం మీద ఆయన చివరలో మరచిపోతే పక్కనున్న వారు గుర్తు చేయడంతో చెప్పిన మాట హైదరాబాద్‌ను సింగపూర్, జపాన్‌లకు మించి, డల్లాస్ నగరంగా తీర్చిదిద్దుతామనడం. హైదరాబాద్‌లో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గంట మోగింది. ఆ ప్రక్రియను డిసెంబర్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదు. దానితో రాజధాని నగరంలో ఆ పార్టీకి రాజకీయ అస్తిత్వమే లేదనే ప్రచారం జరిగింది. ఇప్పుడు విపక్ష శాసనసభ్యులను పార్టీలో చేర్చు కోవడం అయినా, నిజాం రాజును పొగడ్తలలో ముంచెత్తడం అయినా, సెటిలర్లే లేరు అంతా మావాళ్లే అనడం అయినా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే. సోమవారం నాటి మహాసభ రానున్న పురపాలక ఎన్నికలను ప్రభా వితం చేస్తుందేమో చూడాలి. రాజకీయాలంటే ఇంతేనా? బహిరంగ సభలో రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే పరిమిత మైనాయి. బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ల మీద విమర్శ ప్రస్తావన మాత్రం గానే జరిగింది. రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలసి బలమైన పోటీ ఇస్తాయని ముఖ్యమంత్రికీ, ఆయన పార్టీ పెద్దలకూ తెలియంది కాదు. ఇటీవలే జరిగిన శాసన మండలి ఎన్ని కలలో బీజేపీ అభ్యర్థి రామ్‌చందర్‌రావు గెలుపుతోనే అది అర్థమై ఉండాలి. అందుకే తెలుగుదేశం మీద విమర్శకే ఎక్కువ దృష్టి పెట్టారేమో. జీహెచ్ఎంసీ ఎన్నికలు లక్ష్యంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవాడలో నిర్వహిం చాలన్న ఆలోచనను మార్చుకుని హైదరాబాద్‌లో జరపబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇక చంద్రశేఖరరావు తాను తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను, తనతో నడిచిన వాళ్లను ఈ మహా సభలో గుర్తు చేసుకున్నారు. ఒకచోట కొంచెం ఉద్వేగానికి కూడా లోన య్యారు. కొట్టొచ్చినట్టు కనిపించింది ఏమిటంటే తెలంగాణ ఉద్యమానికి అత్యంత దన్నుగా నిలిచి మొత్తం ఉద్యమ విశ్వసనీయతను ఆకాశం ఎత్తుకు పెంచిన రాజకీయ జేఏసీ, అది నిర్వహించిన సకల జనుల సమ్మె, సాగర హారం, మిలియన్ మార్చ్ ఇంకా అనేక పోరాటాల ప్రస్తావనే ముఖ్యమంత్రి ఈ సభలో తీసుకురాకపోవడం. రాజకీయాలు ఇట్లానే ఉంటాయేమో! తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఇప్పుడు రాజకీయ పార్టీయే కదా! datelinehyderabad@gmail.com -
సర్కారీ కిక్కు.. చేస్తుందా మేజిక్కు?
డేట్లైన్ హైదరాబాద్ అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్‌లను పూర్తిగా తొలగించి, మద్యాన్ని నియంత్రిస్తామని టీడీపీ వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చాక ఒక ఉత్తరువు జారీ చేసి చేతులు దులుపుకుంది. అసలు బెల్ట్ షాపులు అధికారికంగా నడిచేవే కావు. వాటిని ఎత్తేస్తామని అధికారిక ఉత్తరువులు జారీ చెయ్యడం హాస్యాస్పదం. బెల్ట్ షాపులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శారీరకంగా, ఆర్థికంగా ఎంత ముప్పును కలిగిస్తున్నాయో తెలిసిందే. వాటిని నియంత్రించలేని ప్రభుత్వం మద్యం వ్యాపారంతో మద్యం మాఫియాల భరతం పట్టి, మద్యపానాన్ని నియంత్రించేస్తుందా? రెండు తెలుగు రాష్ర్ట ప్రభుత్వాలకూ ఆదాయం దయ్యం పట్టింది అన్నాడొక రాజకీయ నాయకుడు ఇటీవల. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికో లేదా తెలుగుదేశంకో చెందిన వ్యక్తి కాదని వేరే చెప్పనవసరం లేదు. దయ్యం పట్టడం ఏముంది? రెండు రాష్ట్రాలకూ ఇప్పుడు బోలెడన్ని నిధులు అవస రమే కదా? ఇటు తెలంగాణ ప్రభుత్వ రాష్ర్ట పునర్నిర్మాణ లక్ష్యాల సాధన కైనా, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానితో సహా అన్నీ కొత్తగా నిర్మించు కోవడం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోడానికైనా డబ్బే కదా కావల సింది? ఎవరి పద్ధతుల్లో వారు ఆదాయ వనరులను మెరుగుపరుచుకోడానికి కృషి చేస్తే తప్పేంటి? దాన్ని దయ్యం పట్టిందనడం కువిమర్శనే అంటాయి రెండు ప్రభుత్వాలూ. నిజమే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పెద్దగా సహాయం అందించే స్థితిలో లేదు. అలాంటప్పుడు స్వయం సమృద్ధిని సాధించడం కోసం ఆదాయ వనరులను పెంచుకోడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. పైగా ప్రతిష్టాత్మకమైన పనులెన్నిటినో రెండు ప్రభుత్వాలూ ప్రకటించి కూర్చున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజా ప్రభు త్వాలు ఏర్పడి పది మాసాలు గడిచింది. కాబట్టి, ఇప్పుడే కదా మేం అధికా రంలోకి వచ్చింది, కాస్త కుదురుకోనివ్వండని మాటలు చెప్పే గడువు దాటి పోయింది . ప్రజలు ఇంకా ఎంతో కాలం ఊరుకోరు. మాటలుగాక ఇక చేతలు చూపాల్సిందేనని రెండు ప్రభుత్వాలూ గుర్తించాలి. సర్కారీ మద్యంతో ఖజానాకు చికిత్స రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు లోటు బడ్జెట్‌ను అప్ప చెప్పింది. ఆదాయ మార్గాలను అన్వేషించవలసిందే తప్పదు. అందుకు ఒక మార్గం మద్యం వ్యాపారం. మద్యం వ్యాపారం నుంచి రాష్ట్రానికి ప్రతి ఏటా బోలెడు ఆదాయం వస్తోంది. అది వేల కోట్ల రూపాయల్లో ఉంటుందనే విష యం అందరికీ తెలిసిందే . ఏ ఏటికాఏడు ఆదాయాన్ని మరింత పెంచడం కోసం ప్రభుత్వాలు పెట్టే టార్గెట్లూ, వాటిని పూరించడానికి ఆబ్కారీ శాఖ పడే అవస్థలూ తెలియనివి కావు. మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తుల చేతుల మీదుగా సాగుతుంటేనే ఖజానాకు ఇంత ఆదాయం వస్తున్నప్పుడు మనమే ఆ వ్యాపారం ఎందుకు చెయ్యకూడదు? అనే ఆలోచన ఆంధ్రా సర్కార్ బుర్రలో మెరుపులా మెరిసింది. అంతే... ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన విద్య ప్రైవేటు పరం అయిపోతోంది, వైద్యం ప్రైవేటు పరం అయిపోతున్నది, ఇంకా ప్రజోపయోగకర సర్వీసులు, కార్యక్రమాలు అనేకం ప్రైవేటు పరం అయిపోతున్నాయి, జవాబుదారీతనం లేకుండాపోతున్నది అని నెత్తీ నోరూ కొట్టుకుని మొత్తుకున్నా వినని ప్రభుత్వం... సమర్థత, నాణ్యతలు కొరవడ టాన్ని బూచిగా చూపి ఉచితానుచితాలు మరచి అన్నింటిని ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వం... ఒక్క మద్యం వ్యాపారాన్ని మాత్రం తానే నిర్వహిస్తాన నడం మొదలుపెట్టింది. అందుకే అది మరింత వివాదాస్పదమైంది, పెద్ద చర్చనీయాంశం అయింది. సర్కారీ ‘సీసా’ మన మంచికే ప్రభుత్వ యోచనంతా ఆదాయం పెంచుకోడానికేనని అంటే అంగీకరించక పోవచ్చు. మద్యం వ్యాపారం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఆ అల వాటును నియంత్రించే వీలుంటుంది, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడ టం వీలవుతుందని కూడా ప్రభుత్వం వాదించవచ్చు. అది కూడా ఒక విధంగా నిజమే. మన దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం ప్రభుత్వాల ఆధీనంలోనే ఉంది. కాబట్టి అలాంటి రాష్ట్రాల అనుభవాలను కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం పూర్తిగా ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది. అందువల్ల ప్రయోజనాలు ఏమిటి? అంటే... మద్యం ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అందరికీ అందుబాటులో ఉండదు, మద్యం కల్తీకి అవకాశాలు తక్కువ, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయాలు జరగడానికి వీలుంటుంది అంటూ ప్రయోజనాలను ఏకరువు పెట్టొచ్చు. కానీ ఆ రాష్ట్రాల్లో అలా మద్యపాన నియంత్రణ సాధ్యం అయ్యిందా? అంటే, అటువంటి దాఖలాలు ఏమీ లేవు. రాజకీయ సంకల్పం ఉండాలే గానీ రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం వ్యాపారంలోకి దిగకుండానే ఆ ప్రయోజనాలనన్నిటినీ సాధించవచ్చు. ప్రైవేటు రంగంలోని మద్యం అమ్మకా లకు లెసైన్స్‌లను ఇచ్చేది ప్రభుత్వాలే కాబట్టి అవి తలుచుకుంటే ఏమైనా సాధ్యమే. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో సాగుతున్న ‘‘డ్రంకెన్ డ్రైవ్’’ కార్యక్రమం ఒక మంచి ఉదాహరణ. ఈ విషయంలో పోలీసుశాఖ చూపుతున్న శ్రద్ధాసక్తులు ప్రశంసార్హమైనవి. మద్యం అమ్మకాల నియంత్ర ణలో ప్రభుత్వం కూడా ఆ సంకల్పశుద్ధిని చూపితే సత్ఫలితాలు సాధ్యమే. అంతేగానీ తాను చేయాల్సిన ప్రజోపయోగకరమైన పనులను ఎన్నిటినో వదిలేసి ప్రభుత్వమే మద్యం అమ్ముకోవాల్సిన అగత్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని స్వయంగా చేపట్టనున్న దని వార్తలు వెలువడ్డాయి. నిప్పు లేనిదే పొగ రాదు కదా. ఆ ఆలోచనయితే సర్కారు బుర్రను తొలుస్తున్నట్టు కనిపిస్తున్నది. అధికారిక నిర్ణయం ఇంకా జరగకపోయినా, ఆ దిశగా కసరత్తు జరిగిన మాట వాస్తవం. వచ్చే జూలై మాసం నుంచే ఏపీలో తమిళనాడు తరహా మద్యం విధానం ప్రవేశపెట్టబోతు న్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వమే స్వయంగా రాష్ర్టమంతటా నాలుగు వేల దుకాణాలు తెరవాలని అనుకుంటున్నట్టు సమాచారం. ముందే చెప్పినట్టు కేరళ, తమిళనాడు, ఢిల్లీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మద్యం వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం తమిళనాడు మద్యం విధానాన్నే ఎందుకు అనుసరించాలని అనుకుంటున్నట్టు? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా? ఆ విషయాన్ని అలా ఉంచి, అంతకన్నా ముందే మరో విషయం ఆలోచిం చాల్సి ఉంది. మద్యం వ్యాపారం చుట్టూ ఉన్న బలమైన, భయంకర మాఫి యాను కాదని, గట్టిగా వాటికి ఎదురు నిలిచి ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వాలు ఈ వ్యాపారాన్ని కొనసాగించగలవా? అన్నది జవాబు దొరకని ప్రశ్న. మద్య నిషేధం తెలుగుదేశం పార్టీ విధానం. 1994లో ఎన్టీ రామారావు ‘సంపూర్ణ మద్య నిషేధం’ నినాదంతోనే అత్యద్భుతమైన మెజారిటీ సాధించి, అధికారంలోకి వచ్చారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రత్యర్థులు ఆయన, లక్ష్మీ పార్వ తిని వివాహం చేసుకోవడాన్ని ఆయనకు వ్యతిరేకంగా ప్రచారాస్త్రాన్ని చేయడా నికి ఎంతగా ప్రయత్నించినా ‘సంపూర్ణ మద్య నిషేధం’ ఆ అంశాన్ని పక్కకు నెట్టేసిన విషయం తెలిసిందే. అది ఆచరణ సాధ్యం కాదని ఎంత చెప్పినా వినకుండా ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మద్య నిషేధం అమలు చేశారు కూడా. ఆయన అధికారంలో కొనసాగి ఉంటే ఎలా ఉండేదో కానీ, ఆయనను పదవి నుంచి తప్పించి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మద్య నిషేధాన్ని ఎత్తేశారు. మద్య పానం విష యంలో నేటి టీడీపీ విధానం ఏమిటో స్పష్టంగా ఎప్పుడూ చెప్పలేదు. అయితే అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్‌లను పూర్తిగా తొలగించి, మద్యాన్ని నియంత్రిస్తామని ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక ఒక ప్రభుత్వ ఉత్తరువు జారీ చేసి చేతులు దులుపుకుంది. అసలు బెల్ట్ షాపులు అధికారికంగా నడిచేవి కావు. మద్యం అక్రమ విక్రయాలకు మరో పేరు బెల్ట్ షాపులు. వాటిని ఎత్తేస్తామని అధికారిక ఉత్తరువులు జారీ చెయ్యడం హాస్యాస్పదం. ‘‘డ్రంకెన్ డ్రైవ్’’వ్యవహారంలో చూపిన దృఢసం కల్పం, పట్టుదల, నిజాయితీ ఉంటే తప్ప బెల్ట్ షాపుల నిర్మూలన సాధ్యం కాదు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల శారీరక, ఆర్థిక ఆరోగ్యానికి బెల్ట్ షాపు లు ఎంత ముప్పు తెచ్చి పెడుతున్నాయో అందరికీ తెలుసు. వీటి నిర్మూలనకు తగిన యంత్రాంగమే లేదు. ఎందుకంటే ప్రభుత్వ ప్రాధాన్యాలు వేరు. బెల్ట్ షాపులను నియంత్రించలేని ప్రభుత్వం మద్యం వ్యాపారంతో మద్యం మాఫి యాల భరతం పట్టేసి, మద్యపానాన్ని నియంత్రించేస్తుందా? పరిస్థితి ఇలా ఉండగా ఏపీ ప్రభుత్వం మద్యం వ్యాపారం స్వయంగా చెయ్యాలని, అదీ తమిళనాడు తరహాలో చెయ్యాలని యోచించడం ఎలా సముచితమో అర్థం కాదు. అధికార పార్టీకి చెందిన పది వేల మందికి ఉపా ధిని కల్పించే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వ మద్యం వ్యాపార నిర్ణయంలో భాగంగా ఉండబోతున్నదని వార్తలు వచ్చాయి. మద్యం కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించి, ఆ ప్రత్యేక కంపెనీల బ్రాండ్ల మద్యాన్నే విక్రయించే పరిస్థితి ప్రభుత్వ విధానంలో కచ్చితంగా భాగమవుతుంది. ఎందుకంటే తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఏపీ ప్రభుత్వం మద్యం వ్యాపార యోచనకు స్వస్తి పలకకపోతే... వచ్చే జూలై మాసం తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతటా తెలుగుదేశం కార్యకర్తల నిర్వహణలో ‘‘ఎన్టీఆర్ వైన్స్,’’ ‘‘దేశం బార్ అండ్ రెస్టారెంట్’’ల బోర్డులు వెలిగిపోతుండటాన్ని చూడాల్సి వస్తుందేమో! datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
తుపాకులే మాట్లాడతాయా?
డేట్లైన్ హైదరాబాద్ ఒకే ఎన్కౌంటర్లో 20 మంది చనిపోతే... నోరైనా విప్పకుండా చైనా వెళ్ళిన ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు నేరస్తులే కావొచ్చు. రాష్ట్రానికి బోలెడు ఆదాయాన్నిచ్చే ఎర్ర చందనం దొంగలే కావొచ్చు. నేరస్తులే అయినా వారిని చంపే అధికారాన్ని రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇవ్వలేదు. తెలంగాణ ఎన్‌కౌంటర్‌కు కితాబులిచ్చిన వెంకయ్యనాయుడు ఏపీ ఎన్‌కౌంటర్‌పై మాత్రం ఎన్కౌంటర్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు, అది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని మౌనం దాల్చారు. గత వారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒకే రోజున జరిగిన రెండు ఎన్కౌంటర్లకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీది ఒక విచిత్రమైన పరిస్థితి. తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన ఐదుగురూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియో గాలతో జైల్లో ఉండి విచారణను ఎదుర్కొంటున్నవారు, అంతా ముస్లింలే కావడంతో... బీజేపీ స్థానిక నాయకులు కొందరు చాలా అలవోకగానో లేదా యధాలాపంగానో వికారుద్దీన్ ముఠాను మట్టుబెట్టడంలో మన పోలీసులు ప్రదర్శించిన ధైర్యసాహసాలను కొనియాడారు. స్థానిక నాయకులేం కర్మ, జాతీయస్థాయిలోనే అత్యంత ముఖ్య నాయకుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కుడిభుజంగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడుది సైతం అదే ధోరణి. ‘సిమి’ (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా) ఉగ్రవా దులను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసిందని ప్రశంసించారు. (ఉగ్రవాదాన్ని సమర్థవం తంగా ఎదుర్కోవడ మంటే ఇట్లా చేతులకు సంకెళ్ళు వేసివున్న ఖైదీలను చంపేసి, చేతిలో తుపాకీ పెట్టేయడమేనా వెంకయ్య నాయుడు గారూ?) ఇక ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో అనుమానాలను నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత మాత్రం ఆ రాష్ర్ట ప్రభుత్వానిదేనని ఆయన ఒక్క మాటలో తేల్చిపారేశారు. ‘శేషాచలం’పై వెంకయ్య మౌనవ్రతం ఈ రెండు ఎన్కౌంటర్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు, అది రాష్ట్రా లకు సంబంధించిన అంశం అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తెలం గాణలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి కితాబులిచ్చిన కేంద్ర మంత్రి ఏపీ ఎన్కౌంటర్ విషయంలో కూడా అంతే స్పష్టంగా ఏదో ఒక మాట అని ఉండొచ్చు కదా? ఏపీలోని ‘‘శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం నరుక్కుపోతున్న వాళ్ళను చంపడంలో తప్పు లేదు. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, మా అడవుల్లోకి వస్తే ఇదే పని చేస్తాం’’ అని అధికార పార్టీకి చెందిన బాధ్యతగలిగిన నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉన్నారు కదా! వారితో ఏకీభవిస్తున్నామనో లేదా వ్యతిరేకిస్తున్నామనో చెప్పా లి కదా, మరి ఎందుకిలా రాష్ర్ట ప్రభుత్వంపైకి బాధ్యతను నెట్టేసి మౌనంగా ఉన్నారు వెంకయ్యనాయుడు గారూ? రెండు రాష్ట్రాల్లో పోలీసు కాల్పుల్లో మరణించిన వారు వేర్వేరు మతాలకు చెందిన వారు కావడం వల్లనేనా? వెంకయ్య నాయుడు ప్రకటనే అటువంటి అనుమానానికి తావునిస్తున్నది. ముస్లింలకు ఓటు హక్కు తీసెయ్యాలనే విపరీత ధోరణిని వెంకయ్యనాయుడు భావజాలానికి సన్నిహితులైనవారు అతి బిగ్గరగా మాట్లాడుతున్న రోజులివి. ‘‘ఇండోనేసియా తరువాత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ముస్లింలు నివసించే భారత దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండటం ఎంతో దారుణం, బాధాకరం’’ అన్నారు ప్రముఖ మానవ హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్ ఒక సందర్భంలో. ఎర్రచందనం నెత్తుటి మడుగున ఏపీ సర్కారు సరే, ఈ అంశాన్ని పక్కన పెట్టి ఏపీ ఎన్కౌంటర్ గురించే మాట్లాడుకుందాం. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించాక రాష్ర్ట ప్రభుత్వానికి వేరే దారి లేదు. ప్రత్యక్ష సాక్షులున్నారు కాబట్టి శేషాచలం ఎన్కౌంటర్ నిజానిజాలు బయటికి రాక తప్పదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లెక్కలేనన్ని ఎన్కౌంటర్లలో ఎన్నిం టిని బూటకంగా నిరూపించగలిగారు? ఎన్నింట్లో పోలీసులకు శిక్షలు పడ్డాయి? అని తేలికగా కొట్టి పారేయలేరు. గతంలో జరిగిన ఎన్కౌంటర్ లకూ, దీనికి తేడా ఉంది. ‘శేషాచలం’లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరుకున పడక తప్పేట్టు లేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీసు అధికారులు, కొన్ని మీడియా సంస్థలు ఎంతసేపూ ఆ ఎన్‌కౌంటర్‌ను సమర్థిం చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయే తప్ప ఎంతటి నేరస్తులనైనా చంపే అధి కారం పోలీసులకు లేదనే విషయం మరచిపోతున్నారు. దొంగలకు కూడా పౌర హక్కులుంటాయని బాలగోపాల్ కొన్ని వందలసార్లు చెప్పి ఉంటాడు, రాసి ఉంటాడు. ఎర్ర చందనాన్ని దొంగతనంగా నరుక్కుపోయే స్మగ్లర్లకూ, పొట్ట కూటి కోసం, కిరాయికి స్మగ్లర్ల కోసం అడవుల్లో చె ట్లు కొట్టడానికి వ చ్చి తూటాలకు బలైన కూలీలకు కూడా ఆ పౌర హక్కులుంటాయి. ఆ మాటంటే మరి విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బందినీ అధికారులనూ, పోలీసు ఉద్యోగులనూ ఎర్ర చందనం స్మగ్లర్లు హింసించి చంపినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు? అని ఎదురు ప్రశ్నిస్తారు. అధికార పార్టీ, ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం అంతా నిజానికి అదే. ఎర్ర చందనం దొంగల అకృత్యాల గురించి గతంలో ఎన్నడు లేనంతగా పత్రికల్లో వరుసగా కథనాలు వస్తు న్నాయి. అధికారులూ, రాజకీయ నాయకులూ అదే మాట్లాడుతున్నారు. ఈ ఎన్కౌంటర్ అన్యాయం అని అంటే చాలు... ఈ ఉదాహరణలతో వారి మీద విరుచుకు పడిపోతున్నారు. ఆ ఇరవై మందినీ చంపేయడం న్యాయమేనని అందరినీ ఒప్పించేయడానికి సకల ప్రయత్నాలూ సాగుతున్నాయి. అడ్డగోలు ప్రకటనలతో బిగుస్తున్న ఉచ్చు శేషాచలం అడవుల నుంచి ఎర్ర చందనం నరుక్కుపోవడానికి 150 మంది కూలీలు వచ్చినట్టు సమాచారమని డీఐజీ కాంతారావు తొలి ప్రకటన. వాళ్ళను ఎదుర్కోవడానికి 24 మందితో కూడిన రెండు టాస్క్ఫోర్సు బృందాలు వెళ్లాయనీ ఆయనే చెప్పారు. ఆ బృందాలకు 100 మంది స్మగ్లర్లు ఎదురుపడ్డారనీ ప్రకటించారు. 100 మంది గొడ్డళ్ళూ, రాళ్ళతో దాడికి దిగితే, 24 మంది సాయుధ పోలీసులు వారిని నిలువరించలేక కాల్పులు జరిపారనీ, 20 మందిని చంపగలిగారనీ చెబితే ఎవరు నమ్మాలి? ఆ ప్రకటనలే ఇదో కట్టు కథని స్పష్టంగా చెబుతున్నాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు కూడా బోలెడు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మంత్రులూ, అధికార పార్టీ నాయకులూ చేస్తున్న ప్రకట నలను చూస్తే వీళ్ళకు రాజ్యాంగంపట్లా, చట్టాల పట్లా ఏ మాత్రం గౌరవం లేదనుకోవాలో, అవగాహన లేదనుకోవాలో అర్థంకాని పరిస్థితి. మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఎన్కౌంటర్ జరిగిన జిల్లాకే చెందినవారు, పైగా అటవీశాఖ మంత్రి. అటవీ సంపదను హరించడానికి వస్తే హతమారుస్తాం అంటాడాయన. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి అయిన బొజ్జల, ఈ ప్రకటన చేశాక ఇంకా మంత్రి పదవిలో ఎట్లా కొనసాగుతారు? కూలీలు అర్ధరాత్రి గడ్డి కోసుకోడానికి వచ్చారా? తమిళనాడు కూలీలకు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఏం పనీ? అంటూ అటవీ శాఖామాత్యులు ఇంకా చాలానే మాట్లాడారు. ఇక సాక్షాత్తూ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన నిమ్మకాయల చిన్నరాజప్ప ఎన్కౌంటర్లో చనిపోయినవారు మన రాష్ట్రానికి చెందిన వారు కారు కాబట్టి నష్ట పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చేశారు. రాష్ర్ట సంపదను కళ్ళ ముందే కొల్లగొట్టి, తీసుకెళ్ళే వాళ్ళను కాల్చి చంపేస్తే తప్పేంటి? అంటూ మాజీ మంత్రి, చాలా సీనియర్ నాయ కుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఏకంగా విధాన ప్రకటనే చేసేశారు. ఇదీ మన నాయకుల తీరు. బాధ్యతారహితమైన ఈ ప్రకటనలన్నీ తమ ప్రభుత్వం గొంతుకు ఉచ్చును మరింతగా బిగిస్తున్నాయని వారు అర్థం చేసుకోడం లేదు. నేరస్తులను చంపే హక్కు ప్రభుత్వాలకు లేదు ఇంత పెద్ద సంఘటన జరిగి, ఒక పొరుగు రాష్ర్టంతో సంబంధాలు చెడిపోయే పరిస్థితి వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడకపోవడం మరీ విడ్డూరం. వాళ్ళు నేరస్తులే కావొచ్చు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి బోలెడు ఆదాయాన్ని సమకూర్చే ఎర్ర చంద నాన్ని కొల్లగొట్టుకుపోతున్న దొంగలే కావొచ్చు. కానీ ఒకే ఒక్క ఎన్కౌంటర్ ఘటనలో 20 మంది మనుషులు తానే పాలకునిగా ఉన్న రాజ్యంలో చని పోతే... కనీసం నోరైనా విప్పకుండా చైనా వెళ్ళిపోయిన ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనాగానీ ఇక్కడ చూడవలసినది ఎన్కౌంటర్ మృతులు తమిళనాడు వారా, స్మగ్లర్లా, కూలీలా, మరింకెవరైనానా? అనేది కాదు. ఎర్ర చందనం నరుక్కుపోవడానికి వచ్చారా, గడ్డి కోసుకోవడానికి వచ్చారా? అనేదీ కాదు. వాళ్ళు మనుషులు, ఆ మనుషులు నేరస్తులయినా సరే చంపే అధికారాన్ని మన రాజ్యాంగం ప్రభుత్వాలకు ప్రసాదించలేదు. ఇక్కడ తుపాకులే మాట్లాడతాయి అంటే చెప్పేదేమీ లేదు. datelinehyderabad@gmail.com -
రెండు రాష్ట్రాలు.. రెండు ఘటనలు..
డేట్లైన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కొన్నేళ్ల పాటు మొత్తం అందరి దృష్టి - పోలీసులతో సహా- ఉద్యమాల మీదనే నిలిచిపోయింది. ఉద్యమాలను అణచివేయడానికి కొంతకాలం, ఉదారంగా ఉండడానికి మరికొంతకాలం వెచ్చించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొత్త రాష్ట్రాలలో మామూలు కర్తవ్యం మరచిపోయారేమోనన్న సందేహం అందరికీ కలుగుతున్నది. ఇటువంటి నిర్ధారణలకు రావడానికి దోహదం చేసే విధంగానే సంఘటనలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో మంగళవారం రెండు భారీ స్థాయి ఎదురు కాల్పుల ఘటనలు జరిగాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలనొప్పిగా తయారైన ఎర్రచందనం దొంగ రవాణాకు సంబంధించిన ఘటన ఇందులో ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మొత్తం భారతదేశాన్నీ, ఆ మాటకొస్తే ప్రపంచాన్నే చికాకు పరుస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదులకు సంబం ధించిన ఘటన రెండవది. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం శేషాచలం అడవులలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకంగా 20 మందిని చంపేశారు. ఇం తకూ, ఆ చనిపోయినవారు ఎవరు అన్న విషయం నిర్ధారణ కావలసి ఉంది. ఆంధ్ర ప్రభుత్వానికి మచ్చ ఎవరిని చంపుతున్నామో తెలియకుండానే చంపేసి, ఇంకా నిర్ధారణ కావలసి ఉంది అంటే అర్థం ఏమిటి? చనిపోయిన వారిలో ఎవరు కూలీలో, ఎవరు స్మగ్లర్లో ఇంకా నిర్ధారణ కాలేదని సామాన్యులెవరో అనలేదు. ఆ మాటలు అన్నది ఏదో మీడియా వారు అయినా ఫరవాలేదు. ఇంకా పూర్తి సమాచారం తెలిసి ఉండకపోవచ్చునని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆ మాటలు అన్నది సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు. వాళ్లు కూలీలా, స్మగ్లర్లా అన్నది నిర్ధారణ కాకుండా ఇరవై మందిని ఏకబిగిన ఎట్లా కాల్చి చంపారు? స్మగ్లర్లు తలనొప్పిగా మారారు, నిజమే. వారి ఆగడాలను అరికట్టవలసిందే. ఇప్పటికే చాలామంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో వారికి రాజభోగాలు కల్పిస్తున్నారన్న నింద మోస్తున్న వారు ఇప్పుడు తాజా ఎన్కౌంటర్ ఘటనలో ఇరవైమంది మృతికి కారణమై మరింత అప్ర తిష్ట మూటకట్టుకోబోతున్నార న్నది నిజం. శేషాచలం అడవులలో జరిగిన ఈ భారీ ఎదురుకాల్పులలో చనిపోయిన వారు స్మగ్లర్లు నియమించిన కూలీలే అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వమూ, పోలీసు బాసులూ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? పొట్టకూటి కోసం వచ్చిన కూలీలను పొట్టన పెట్టుకున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. మిగి లిన ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనను ఖండించాయి. పొరుగు రాష్ట్రం తమిళ నాడు రాజకీయ పార్టీలు కూడా నిరసన తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ చర్చించుకుని పరిష్కరించవలసిన అంశమని అంటున్నారు. మొత్తం మీద గోరుచుట్టు మీద రోకటిపోటులా తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి. విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. వీటిలో అత్యంత ముఖ్యమైనది రాజ ధాని నిర్మాణం. దీనితో మిగిలిన సమస్యలన్నీ పక్కకు పోయాయి. అదే క్రమంలో శాంతిభద్రతలు కూడా ప్రభుత్వ ప్రాధాన్యాల నుంచి తప్పు కున్నట్టు కనిపిస్తోంది. టీ హోంమంత్రి ప్రకటన హాస్యాస్పదం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోను ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొని ఉందని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రెండుమూడు రోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటనలో ఈ రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహా రెడ్డి, పోలీస్ డెరైక్టర్ జనరల్ అనురాగ్ శర్మ చేసిన ప్రకటన, శేషాచలం అడవుల ఘటన మీద ఆంధ్ర డీజీపీ చేసిన ప్రకటన కంటే హాస్యాస్పదం. సూర్యాపేట బస్టాండ్ దగ్గర పోలీసుల మీద కాల్పులు జరిపినవారు దోపిడీ దొంగలేననీ, ఉగ్రవాదులు కానేకారనీ ఆ ఇద్దరూ ప్రకటించారు. పూర్తి సమా చారం లేకుండానే బాధ్యత గల పదవులలో ఉన్నవారు మీడియా ముందు ఇలా మాట్లాడడం క్షమించరాని విషయం. ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కొన్నేళ్ల పాటు మొత్తం అందరి దృష్టి - పోలీసులతో సహా- ఉద్యమాల మీదనే నిలిచిపోయింది. ఉద్యమాలను అణచివేయడానికి కొంతకాలం, ఉదారంగా ఉండడానికి మరికొంతకాలం వెచ్చించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొత్త రాష్ట్రాలలో మామూలు కర్తవ్యం మరచిపోయారేమోనన్న సందేహం అందరికీ కలుగుతున్నది. ఇటు వంటి నిర్ధారణలకు రావడానికి దోహదం చేసే విధంగానే సంఘటనలు జరుగుతున్నాయి. సరే, ప్రస్తుత సంఘటనల దగ్గరకొద్దాం! ప్రహసన ప్రాయమైన ఎదురుకాల్పుల కథలు మంగళవారం వరంగల్ నుంచి ఖైదీలను హైదరాబాద్ కోర్టుకు తీసుకు వస్తుం డగా ఘర్షణ జరిగి విచారణలో ఉన్న ఐదుగురు ఖైదీలు పోలీసుల ‘ఎదురు కాల్పులలో చనిపోయారు’. నిజానికి పోలీసులూ, వారు జరిపే ఎదురు కాల్పులూ పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయాయి. వీటిని సమాజం నమ్మే స్థితి ఎప్పుడో పోయింది. నిజానికి మంగళవారం పోలీసులు వరంగల్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న విచారణ ఖైదీలలో ఒకడు వికారుద్దీన్. గతంలో కూడా ఇదే మార్గంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈసారి కూడా నిజంగానే ఆ ఐదుగురు తప్పించుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చునని కాసేపు అనుకుందాం. కానీ తెలంగాణ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ నవీన్‌చంద్ చెబుతున్నట్టుగానే ఆ ఖైదీలు ఐదుగురు, పోలీసులు పదిహేనుమంది. పోలీసుల దగ్గర ఆయుధాలు ఉంటాయి. వీళ్ల చేతులకు బేడీలు ఉంటాయి. ఎట్లా తిరగబడతారు? ఎట్లా పోలీసుల చేతులలో నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేస్తారు? లేదా పారిపోయే సాహసం చేస్తారు? ఇదంతా నమ్మశక్యంగా ఉండదు. దీనికితోడు ఎన్కౌంటర్ అనగానే పోలీసులే చంపి ఉంటారులేనన్న భావన. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని వికారుద్దీన్ అనే విచారణ ఖైదీ తండ్రి అంటూనే ఉన్నాడు. శనివారం నల్లగొండ జిల్లా సూర్యా పేటలో జరిగిన ఘటన, దాని కొనసాగింపుగా జానకీపురం దగ్గర ఎన్ కౌంటర్, మళ్లీ మంగళవార ం అదే జిల్లాలోని ఆలేరు దగ్గర విచారణలో ఉన్న ఖైదీలు ఎదురుకాల్పులలో చనిపోవడం వరుసగా పేర్చి చూస్తే - సూర్యాపేట ఘటనకు సంబంధించి పోలీస్‌శాఖ మీద వచ్చిన విమర్శల పర్యవసానమే ఆలేరు పరిణామమన్న అనుమానం కలగక తప్పదు. ఆలేరు ఎదురుకాల్పుల ఘటన ఎలా జరిగింది? ఏమిటి? అనే వివ రాలన్నీ తరువాత తప్పక వెల్లడవుతాయి. కానీ ఈ వార్తా లేఖ రాస్తున్న సమ యానికే జానకీపురం ఘటనలో గాయపడిన పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధయ్య మరణించిన వార్త వచ్చింది. దీనితో నలుగురు పోలీసులు ఈ ఘటనలలో మరణించినట్టయింది. ఆ నలుగురు లింగయ్య, మహేశ్, నాగరాజు, సిద్ధయ్య - ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డ్. జానకీపురం దగ్గర జరిగిన ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరు విజయవాడవైపు వెళ్లినట్టు కూడా అనుమానం. హైదరాబాద్ ప్రశాంతమేనా? సూర్యాపేట బస్టాండ్‌లో జరిగిన సంఘటన నుంచి, జానకీపురంలో ఉగ్ర వాదులతో జరిగిన ఘర్ణణ నుంచి మన పోలీసుశాఖ, ప్రభుత్వం ఏం నేర్చుకు న్నాయి. ఏం తెలుసుకున్నాయి? నిన్నటికి నిన్న కూడా తెలంగాణ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి హైదరాబాద్ ప్రశాంతంగా ఉందనీ, అనవ సరంగా ఒక మతస్థులను నిందించవద్దనీ అన్నారు. నిజంగానే హైదరాబాద్ ప్రశాంతంగా ఉందా? లేకపోతే హోమంత్రి చెబుతున్నట్టు వినిపిస్తున్నవన్నీ నిందలేనా? వాటిలో నిజాలే లేవా? అంతే అయితే హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకుని దేశమంతా కల్లోలం సృష్టించడానికి ఉగ్రవాదులు పథకాలు రచిస్తు న్నారంటూ కేంద్ర స్థాయి పరిశోధనా సంస్థలు, నిఘా సంస్థలు ఇస్తున్న నివేదికలకు అర్థం ఏమిటి? ఆలేరు ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్‌లో సోదాలు ఎందుకు మొదలయ్యాయి? భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రశ్నల న్నింటికీ బయటకు జవాబులు చెప్పకపోయినా, ప్రభుత్వం వీటన్నిటి మీదా దృష్టి పెడితే మంచిది. ఇక గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక విభాగాలతో పాటు సివిల్ పోలీసులకు కూడా కొంత మెరుగైన శిక్షణ ఇవ్వడం, మెలకువలు నేర్పడం వంటివి చేసి ఉంటే సూర్యాపేట, జానకీపురాలలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదు. ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పినట్టు ఆయుధాలు ఉపయోగించడంలో తరచూ పోలీసుల ప్రావీణ్యాన్ని మెరుగు పరచాలి. శరీర దారుఢ్యాన్ని పెంచుకునే వ్యాయామాలు కూడా మరచిపోతున్నారట మన పోలీసులు. రాజకీయ నాయకులకు రక్షణ కల్పిం చడం ఒక్కటే కాదు, తమను తాము రక్షించుకునే నేర్పు కూడా పోలీసు వ్యవస్థకు ఉండాలి. నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే ఆ నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్న మాట వాస్తవం. తెలంగాణ ప్రభుత్వం ఆధునిక వాహనాలు సమకూరిస్తే సరిపోదు. పోలీసు వ్యవస్థను ఆధునీకరించే వైపుగా కూడా దృష్టి సారించవలసి ఉంది. datelinehyderabad@gmail.com -
వ్రతం చెడినా దక్కని ‘ఫలితం’
దేవులపల్లి అమర్ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్న చందంగా మొన్నటి పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు వెలువడడంతో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక ఈ గిమ్మిక్కులతో లాభం లేదని మొత్తం పార్టీనీ, ప్రభుత్వాన్నీ ప్రక్షాళన చేయబోతున్నారని వార్తలు వెలువడినాయి. దీనితో మంత్రులు, నాయకులు, శ్రేణులు కూడా గందరగోళంలో పడ్డారు. ముఖ్యమంత్రి ఇంత తీవ్రమైన మార్పులను ఎందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు? ఎందుకంటే- కౌన్సిల్ ఫలితాలు అధికార పార్టీనీ, నాయకుడినీ పెద్ద షాక్కే గురి చేశాయి కాబట్టి. తెలంగాణకు మారుపేరు టీఆర్ఎస్, సుదీర్ఘ పోరాటాల కారణంగా సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్కు తప్ప మరొక పార్టీకి స్థానం లేదనీ, గులాబీ రంగు తప్ప మిగతా రంగులన్నింటినీ తెలంగాణ ప్రకృతిలో నుంచి తొలగిస్తామనీ ఈ పదినెలల కాలం ఉపన్యాసాలతో ఊదరగొట్టిన అధికార పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. గతవారం జరిగిన శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్కు మింగుడు పడకపోవడంలో ఆశ్చర్యం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మహ బూబ్‌నగర్ జిల్లాలకు కలిపి ఉన్న నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, న్యాయవాది రామచందర్‌రావు సాధించిన ఆధిక్యం ఆ పార్టీ సహా, అన్ని రాజకీయ పార్టీలను ఆశ్చర్యచకితులను చేసింది. ఎందరినో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అధికార పార్టీకి మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. రామచందర్‌రావు సాధించిన ఆధిక్యం ఓ పక్క బాధపెడుతుం టే, మరో పక్క నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు కలిపి ఉన్న నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచిన తీరు కుంగ దీసింది. ఏమిటీ అధిక ప్రసంగం? ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రీ, ఆయన కుమారుడూ, ఇతర నాయ కులూ బోలెడు మాట్లాడారు. ప్రతిపక్షాలు లేనేలేవన్నారు. ముఖ్యమంత్రి మరింత ముందుకుపోయి బీజేపీకి ఓట్లు వేస్తే మోరీ (మురుగు కాలువ)లో వేసినట్టేనన్నారు. ఆయన కుమారుడు, కేటీ రామారావు తెలంగాణ ప్రజలకు పసుపు వర్ణం శుభసూచకమే కాదంటారు. అది తమకు గిట్టని తెలుగుదేశం జెండా రంగన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌ను ఓడించిన బీజేపీ అభ్యర్థి అదే పసుపు జెండా నీడన ప్రచారం చేసి గెలిచారు మరి! సాధ్య మైతే సప్తవర్ణాలలో తమ పార్టీ జెండా రంగు గులాబీ లేదు కాబట్టి ఆ ఏడు రంగులనూ నిషేధిస్తాను అన్న ధోరణి ఆయనది. తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచే, నిజానికి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టక ముందే పసుపు రంగు ఉందనీ, ఎరుపు రంగును కమ్యూనిస్టులు కనుగొనలేదనీ అలాగే గులాబీ రంగు చంద్రశేఖరరావు పరిశోధనలో బయటపడింది కాదనీ యువనాయకుడికి ఎవరు చెప్పాలి? ఈ వింత ధోరణి సుదీర్ఘ రాజకీయ భవి ష్యత్తు కలిగిన కేటీఆర్ వంటి యువనేతకు ఉండడం విచారకరం. పైగా రేపో మాపో పార్టీపగ్గాలు ఆయనకే అప్పగించనున్నారనే వార్త చలామణిలో ఉంది. ఇక ప్రస్తుతం శాసనమండలి ఎన్నికల విషయానికి వస్తే - ఫలితాలు వెలువడ్డాక అధికార పక్షీయుల మాట పడిపోయింది. ఫలితాల మీద స్పందిం చిన కొద్ది మంది, అభ్యర్థి దేవీప్రసాదరావు సహా, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఫలి తం అనడానికి లేదన్నారు. మొదట్లో చెప్పుకున్నట్టు, తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి స్థానం లేదని ఈ పదిమాసాలూ అధికార పార్టీ బెదిరించి, విపక్షాలను ఖాళీ చేసే పనిలో పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినన్ని స్థానాలను ఎన్నికలలో సాధించుకున్నప్పటికీ, సంతృప్తి చెందని అధికార పార్టీ, దాని అధిపతీ స్వయంగా వలసలను ప్రోత్స హించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను తమ పార్టీలోకి లాక్కున్నారు. నైతికత గురించి మాట్లా డిన వారిని తెలంగాణ వ్యతిరేకులని ముద్రవేశారు. వారంతా బంగారు తెలం గాణ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి స్వచ్ఛందంగా చేరినవారేనని ప్రచారం చేశారు, ప్రకటనలు ఇప్పించారు. ప్రక్షాళనే మార్గమా? వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్న చందంగా మొన్నటి పట్టభద్రుల నియోజక వర్గ ఫలితాలు వెలువడడంతో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక ఈ గిమ్మిక్కులతో లాభం లేదని మొత్తం పార్టీనీ, ప్రభుత్వాన్నీ ప్రక్షాళన చేయ బోతున్నారని వార్తలు వెలువడినాయి. దీనితో మంత్రులు, నాయకులు, శ్రేణు లు కూడా గందరగోళంలో పడ్డారు. ముఖ్యమంత్రి ఇంత తీవ్రమైన మార్పు లను ఎందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు? ఎందుకంటే- కౌన్సిల్ ఫలితాలు అధికార పార్టీనీ, నాయకుడినీ పెద్ద షాక్కే గురి చేశాయి కాబట్టి. టీఆర్ఎస్ రంగంలో దింపిన ఇద్దరు అభ్యర్థులు చిన్నాచితకా నాయకులు కారు. దేవీప్రసాదరావు మలిదశ ఉద్యమంలో రాజకీయ జేఏసీలో కీలక నాయకుడు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా నిలబడిన తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు. రెండవ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2014 ఎన్నికలలో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అధిష్టా నానికి అత్యంత సన్నిహితుడు. మొత్తం పార్టీ వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పల్లాయే అధ్యక్షునిగా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసేటంత సన్నిహితుడు. అంటే మొన్న కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేసే నాటికి అధికార పార్టీ పెద్ద దిక్కు ఆయనే. అటువంటి ఇద్దరు ప్రముఖులను బరిలోకి దింపితే ఎదురైన ఫలితం చంద్రశేఖరరావును దిగ్భ్రాంతికి గురి చేయడంలో ఆశ్చర్యం ఏముంది? ఈ రెండు కౌన్సిల్ స్థానాలను గెలుచుకోవడానికి ఆయన ఎన్నెన్ని ప్రకటనలు చేశారు? ‘సెటిలర్’ అన్న పదమే తెలంగాణలో వినిపించడానికి వీలులేదని హఠాత్తుగా ప్రకటించినా అంతా నమ్మేస్తారని కూడా ఆయన అనుకున్నారు. అదీ జరగలేదు. రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఐదు గంటలు గడిపినా, రామా నాయుడి అంత్యక్రియలు అధికారికంగా జరిపించినా అందులో ఆ వర్గాల వారు చిత్తశుద్ధిని చూడలేదు. ఓటమి వెనుక.. ఎదురేలేదని టీఆర్ఎస్ గట్టి నమ్మకంతో ఉన్న కాలంలో ఇటువంటి ఫలితం రావడానికి కారణం ఏమిటి? అందుకు బోలెడు కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు. మరీ దీర్ఘంగా కాకుండా ముఖ్యమైన కారణాలను చెప్పుకుందాం! మొదటిదీ, ముఖ్యమైనదీ - మితిమీరిన ఆత్మ విశ్వాసం. పార్టీలోనే జరిగిన అంతర్గత వెన్నుపోటు. మాటలు తప్ప చేతలేమీ లేవన్న పట్టభద్రుల ఆగ్రహం (వీరిలో ఉపా ధ్యాయులు, నిరుద్యోగులు కూడా ఉన్నారు). బీజేపీ ముందు నుంచే అభ్యర్థిని నిర్ణయించి ప్రచారం చేయడం. అన్నింటికీ మించినది- అధికార పార్టీ సృష్టిస్తున్న గందరగోళం, దానితో బలౌతున్న నైతికత. ఒకటి పోయినా మరొకటి గెలిచాం కదా అని అధికార పక్షం వాదించ వచ్చు. అది ఎటువంటి గెలుపో ఒకసారి సమీక్షించుకుంటే అర్థమవుతుంది. ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థను నడుపుతున్న నాయకత్వం ఆ పని ఇప్పటికే చేసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక నిర్దిష్టమైన లక్ష్య సాధన కోసం ఏర్పడిన పోరాట సంస్థ. అవసరం కాబట్టి రాజకీయ రూపం, నిర్మాణం సంత రించుకున్నది. లక్ష్యాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. సంపూర్ణ రాజకీయ పార్టీగా మారింది, కాబట్టి బలోపేతం కావలసిందే. కానీ గెలుపే పరమావధి, ఇంకో పార్టీని బతకనివ్వం అన్న ధోరణిని ప్రజాస్వామ్యంలో జనం మెచ్చరు. ఆ విషయాన్ని స్పష్టం చేయడానికే ప్రజలు ఈ ఫలితం ఇచ్చారు. ముందున్నది ముసళ్ల పండుగ అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఏదో రెండు కౌన్సిల్ స్థానాల ఎన్నికలే కదా అని ఊరుకోవడానికి వీలు లేదు. ముందున్నది ముసళ్ల పండుగ. కాం గ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి వలస వచ్చిన శాసన సభ్యుల స్థానాలకు ఏదో ఒకరోజు ఎన్నికలు జరగవలసిందే. అలాంటివి పది వరకు ఉంటాయి. ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నాక కడియం శ్రీహరి ప్రాతి నిధ్యం వహిస్తున్న వరంగల్ పార్లమెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరపక తప్పదు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులను అడిగి చూడండి, ఈసారి ఏం చెయ్యబోతున్నారో! తుమ్మల నాగేశ్వరరావును మంత్రిగా కొనసాగిం చడానికి ఎక్కడి నుంచి గెలిపిస్తారో? నిన్నగాక మొన్న పలు కౌన్సిల్ స్థానాలు కూడా సభ్యుల పదవీకాలం పూర్తికావడంతో ఖాళీ అయ్యాయి. వీటన్నిటి కన్నా ముఖ్యమైనది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఓ పక్క హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంది, ఎప్పుడు ఎన్నికలు పెడతారని! ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరో ఎన్నిక వరం గల్ మునిసిపల్ కార్పొరేషన్. ఉద్యమకాలంలో రాజీనామాలు పడేసి మళ్లీ పోటీచేస్తే ప్రజలు గెలిపించారు, ఎన్నిసార్లయినా. రాష్ట్రం ఏర్పడుతున్న సం దర్భంలో జరిగిన తొలి ఎన్నికలలో సుదీర్ఘ పోరాటం చేసి సాధించినందుకు గెలిపించారు ప్రజలు. ఎల్లకాలం ఇదే విధంగా సాగుతుందని అధికార పక్షం భావిస్తే పప్పులో కాలేసినట్టే. అందుకు సంబంధించిన వ్యక్తీకరణే ఈ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు. కానీ, తెలంగాణ పున ర్నిర్మాణంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎన్నికలూ, వాటితో వచ్చే పదవులూ పరమార్థం కాదు. datelinehyderabad@gmail.com -
ఇలాగైతే తెలంగాణ గెలిచేనా?
డేట్లైన్ హైదరాబాద్ ప్రభుత్వం ఏర్పాటుకు తగిన బలమున్నా ఇతర పార్టీల సభ్యులను చేర్చుకుని టీఆర్ఎస్ ఏర్పరచినది సంకీర్ణ ప్రభుత్వమే. ఇప్పుడున్నది టీఆర్ఎస్, బీఎస్పీ, టీడీపీల ప్రభుత్వం. కాదంటే టీడీపీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. బీఎస్పీకి చెందిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్పలిద్దరూ టీఆర్ఎస్లో చేరిపోయారు. అయినా బీ ఫారం ఇచ్చిన పార్టీకి రాజీనామా చెయ్యడం న్యాయం కాదా? సూత్రబద్ధమైన, చట్టబద్ధమైన, నైతికమైన బాధ్యతలను నెరవేరిస్తేనే ప్రపంచం ముందు తెలంగాణ గెలుస్తుంది. లేకపోతే ఓడిపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం నాడు ఒక సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కలసికట్టు గా పనిచెయ్యాలి అన్నారు. ఇవి పైకి వినిపించేట్టుగా మాట్లాడిన మాటలు. ఆయనను సన్నిహితంగా గమనిస్తున్న వారికి ఆ మాటల అంతరార్థం మరోలా స్ఫురించింది. రాష్ట్రాభివృద్ధి కోసం అంతా కలసి పనిచే యడమంటే అందరూ టీఆర్ఎస్లో కలసిపోవడమేనని. వివిధ రాజకీయ పక్షాల నేతలంతా తమ తమ రాజకీయ అభిప్రాయాలూ, సిద్ధాంతాలూ ఒదిలేసి, వరుసలో నిలబడి ముఖ్యమంత్రి కేసీఆర్ చేత గులాబీ కండువా కప్పించు కుని, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోవడమే తెలంగాణను అభివృద్ధి చేయడమని ప్రస్తుతార్థం. రాజకీయాల్లో పార్టీలు మారడం వింతేమీ కాదు. అలాంటప్పుడు ఒక్క టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాత్రమే ఎందుకు విమర్శించాలని ఎవరైనా అనొచ్చు. నిజమే, ఈ రుగ్మత ఒక్క తెలంగాణకే పరిమితమైనది కాదు. ఒక్క కేసీఆర్ మాత్రమే ఈ తరహా నీతి బాహ్యమైన వ్యవహారాన్ని ప్రోత్సహించడం లేదు. సందర్భాన్ని బట్టి అందరి గురించీ మాట్లాడుకోవాల్సిందే. అవతల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఏం తక్కువ తినలేదు. ఆయన ప్రయ త్నాలు ఆయనా చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం ఎంత గొప్పగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నదో ఇప్పుడు జరుగుతున్న ఆ రాష్ట్ర శాసనసభా సమావేశాల తీరే చెబుతుంది. అయితే అక్కడి అధికార పార్టీ, టీఆర్ఎస్ స్థాయిలో ఫిరాయింపులను విజయవంతం చేసుకోలేకపోతు న్నది. దానికి ప్రధాన కారణం ఏపీలో ప్రతిపక్షం బలంగా ఉన్నది, ఒక్క మాట మీద నిలబడి ఉన్నది. కాగా తెలంగాణలో ప్రతిపక్షం పరిస్థితి అగమ్య గోచరంగా, అయోమయంగా ఉన్నది. అందుకే చంద్రశేఖరరావు నాయక త్వంలో టీఆర్ఎస్ ఏం చేసినా ప్రస్తుతానికి చెల్లిపోతున్నది. గెలుపునకు అర్థం ఫిరాయింపులేనా? రాష్ట్ర విభజన తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పా టు చెయ్యడానికి అవసరమైనన్ని స్థానాలు టీఆర్ఎస్కు లభించాయి. అయినా ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీల నుంచి కొంత మంది శాసన సభ్యులను తమ వైపు లాక్కున్నారు. తమకు అస్సలే బలంలేని శాసన మండలిలో ఏకంగా 14 మంది ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ సభ్యులను చేర్చుకుని, మండలి చైర్మన్ స్థానాన్నే కైవసం చేసుకున్నారు. ఇవన్నీ మళ్లీ ఎందుకు గుర్త్తు చెయ్యడమంటే, సోమవారం ముఖ్యమంత్రి ఇంకో మాట కూడా అన్నారు... రాజకీయాలకు ఇది సమయం కాదు, ప్రపంచం ఎదుట తెలంగాణను గెలిపించాలని. నిజమే ఆరు దశాబ్దాల పోరాటం తరవాత సాధించుకున్న రాష్ట్రం కాబట్టి తెలంగా ణను అందరూ కలసి గెలిపించుకోవలసిందే. కానీ ప్రపంచం ముందు తెలం గాణ ఎప్పుడు గెలుస్తుంది? ఎట్లా గెలుస్తుంది? రాజకీయాలను కలగాపులగం చేసి, నీతిబాహ్యమైన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే గెలుస్త్తుందా? అధి కార పార్టీ అభిప్రాయం తప్ప మరే రాజకీయ అభిప్రాయం వినిపించకుండా చేసేస్తే తెలంగాణ గెలిచినట్టేనా? తెలంగాణ గెలవడమంటే చట్టవిరుద్ధంగా ఇతర పార్టీలను తమలో కలిపేసుకోవడమేనా? తెలంగాణ, ఏం చేస్తే ప్రపం చం ముందు గెలుస్త్తుందో, ఏం చెయ్యకపోతే ఓడిపోతుందో, నవ్వుల పాలవు తుందో బిగ్గరగా మాట్లాడుకోవాల్సిన సమయమిది. ఇప్పుడు మౌనం వహిం చడమంటే ప్రపంచం ముందు తెలంగాణ ఓడిపోవడానికి కారణం కావడమే. హోల్‌సేల్ ఫిరాయింపులతో టీఆర్ఎస్ శాసన మండలి అధ్యక్ష స్థానాన్ని దక్కించుకుంది సరే. రాజకీయాల్లో ఇలాంటివి మామూలేనని కాసేపు సరి పెట్టుకుందాం. గత వారం శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాస నమండలి ఒక బులెటిన్ విడుదల చేసింది. టీడీపీ లెజిస్లేచర్ పార్టీ టీఆర్ ఎస్‌లో విలీనమైందని తెలిపింది. కానీ ఇంకా మండలి సభ్యులు ఇద్దరు టీడీపీ లోనే కొనసాగుతున్నారు. పోనీ టీఆర్ఎస్లో చేరిన ఐదుగురైనా తామే మెజా రిటీ కాబట్టి లెజిస్లేచర్ పార్టీ మాదేనని ప్రకటించుకున్నారా? లేదు. అధికార పక్షం పంచన చేరి, గులాబీ కండువాలు కప్పించుకు కూర్చున్నారంతే. అలాంటప్పుడు టీడీపీ లెజిస్లేచర్ పార్టీ అధికార పార్టీలో విలీనమైనట్టు మం డలి అధ్యక్షులు ఎలా ప్రకటిస్తారు? ఒక పార్టీ మొత్తంగా ఇంకో పార్టీలో చేరా లంటే ఒక చట్టపరమైన తతంగం ఉంటుంది. శాసన మండలిలోని ఆ పార్టీ సభ్యులు నిర్ణయించుకుంటే సరిపోదు. పార్టీ విలీనానికి నిర్ణయం తీసుకుని సదరు రాజకీయ పార్టీయే స్వయంగా ఎన్నికల సంఘానికి రాయాలి. దాని అనుమతి పొందిన తర్వాత విలీనం చేసుకోవచ్చు. ఇక్కడ అదేమీ జరగలేదు. మండలి చైర్మన్ ఒక బులెటిన్‌ను విడుదల చేసి చేతులు దులుపుకున్నారంతే. ఇటువంటి చర్య ప్రపంచం ముందు తెలంగాణను గెలిపిస్తుందా? ఇది సంకీర్ణ ప్రభుత్వం కాదా? ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనన్ని శాసనసభ స్థానాలున్నా ఇతర పార్టీల శాసన సభ్యులను చేర్చుకుని టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవును, ఇప్పుడు తెలంగాణలో ఉన్నది మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వమే. టీఆర్ఎస్, బహుజన సమాజ్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం. కాదని ఖండిస్తే టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తలసాని శ్రీని వాస్ యాదవ్ చేత శాసన సభ్యత్వానికి రాజీనామా చేయించి మళ్లీ గెలిపిం చుకోవాలి. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బహుజన సమాజ్ పార్టీ తరఫున గెలి చిన మరో సభ్యుడు కోనప్ప కూడా టీఆర్ఎస్లో చేరారు. కాబట్టి మొత్తం ఆ పార్టీ విలీనమైందని వాదించవచ్చు. కానీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చెయ్యడానికి బీ ఫారం ఇచ్చిన పార్టీకి రాజీనామా చెయ్యడం న్యాయ సమ్మతమూ, నైతిక విజ్ఞత కాదా? సూత్రబద్ధమైన, చట్టబద్ధమైన, నైతికమైన రాజకీయ బాధ్యతలను నెరవేరిస్తేనే ప్రపంచం ముందు తెలంగాణ గెలు స్తుంది. లేకపోతే ఓడిపోతుంది. కడియం శ్రీహరిని వరంగల్ ప్రజలు పార్ల మెంటుకు గెలిపించి పంపితే, ఆయనను రాష్ట్ర మంత్రిని చేశారు. ఆరు నెలల దాకా ఆయన ఏ సభ నుంచీ ఎన్నిక కాకుండానే మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. కానీ పార్లమెంటుకు రాజీనామా ఎందుకు చేయించరు? దీన్ని ప్రపం చం హర్షిస్తుందా? ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేర్చుకున్న శాసనసభ, శాసన మండలి సభ్యులందరి చేతా రాజీనామాలు చేయించి, మళ్లీ ఎన్నికలు నిర్వహించి వారిని గెలిపించుకుంటేనే ప్రపంచం ముందు తెలంగాణ గెలిచేది. లేకపోతే దివాలాకోరు రాజకీయాలకు బలై ఓడిపోతుంది. నవ్వులపాలు చేస్తారా? తలెత్తి నిలిచేలా ప్రవర్తిస్తారా? ఒక దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఏ వివరణా ఇవ్వ కుండా తొలగించి మాసాలు గడుస్తున్నాయి. కనీస విచారణ లేకుండా, ప్రజ లకు వివరణ ఇవ్వకుండా ప్రభుత్వం మౌనం వహిస్తే ప్రపంచం ముందు తెలంగాణ గెలవదు. మాజీ ఉప ముఖ్యమంత్రిపై వచ్చిన అవే ఆరోపణలు మరో మంత్రి మీదా వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ముఖ్యమంత్రికి పట్టదు. ఆ మంత్రి అగ్రకులస్తుడు, తమ సింహాసనాలకే ఎసరు పెట్టగలిగిన వర్గాల నాయకుడు కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం కూడా ప్రపంచం ముందు తెలంగాణను గెలిపించదు. ఆరోపణలను విచారించి నిజాలు నిగ్గుదేల్చి ఆ మంత్రి పులు కడిగిన ముత్యం అని తేల్చినప్పుడు తెలంగాణ గెలుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ అస్తిత్వంలో ఉండ కూడదన్న ఆలోచన తెలంగాణను ప్రపంచం ముందు గెలిపించదు. నవ్వుల పాలు చేస్తుంది. తెలంగాణలో ప్రతిపక్షం మొత్తంగా నాయకత్వ లోపంతో నానాటికీ బలహీన పడటంవల్ల కూడా అధికార పార్టీ ఇలా ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం కలిగింది. శాసనసభలో ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీలు రెండూ ఒకే రకమైన గందరగోళ స్థితిలో ఉన్నాయి. శాసనసభ నుంచి బహి ష్కృతులైన టీడీపీ సభ్యులు ఏకంగా భారత రాష్ట్రపతికి మొరపెట్టుకోడానికి వెళ్లడాన్ని అంతా వింతగా చెప్పుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ దాష్టీ కాన్ని సమర్థవంతంగా ఎండగట్టలేని దుర్బలత్వం వారిది. పొరుగు రాష్ట్రం లోని అధినాయకుడి నుంచి ఆదేశాలు తీసుకోవాల్సిన స్థితిలోని ఆ పార్టీ అంత కంటే బలంగా పోరాడగలదని ఎవరు మాత్రం భావించగలరు? ఇక కాంగ్రెస్ ఎప్పటి మాదిరిగానే తలో దారి అన్నట్టు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడిది ఒక దారైతే, ఆయన పార్టీ శాసన సభ్యులది మరో దారి. వీళ్ల దారులు ఎప్పటికీ ఒక్కటి కావు. అధికార పక్షం ఒక్కటే ఉంటే సరిపోదు, బలమైన ప్రతిపక్షం ఉంటేనే తెలంగాణ గెలుస్తుంది. నీతివంతమైన రాజకీయాలే తెలంగాణను ప్రపంచం ముందు తలెత్తుకు నిలిచేలా చేస్తాయని గుర్తించాలి. datelinehyderabad@gmail.com -
నిధుల వేట.. నేతల ఆట
దేవులపల్లి అమర్ బాబు కోరుతున్న సహాయం చెయ్యడానికి కేంద్రం వద్ద నిధులు గుట్టలుగా లేవు. టీడీపీ, బీజేపీలు రెండూ వాస్తవ పరిస్థితిని ప్రజల నుంచి దాచినందువల్లనే ఈ దుస్థితి. పైగా మోదీ-షా నాయకద్వయం ఏపీ, తెలంగాణల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం మీదనే దృష్టి కేంద్రీకరిం చింది. దీంతో తాము కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ వాపోవాల్సిన విచిత్ర స్థితి నెలకొంది. బాబు వంటి సీనియర్ నేత మాటకే దిక్కులేని చోట పార్ట్ టైం పొలిటీషియన్ పవన్ రాయబారం ద్వారా ఏం సాధించనున్నారో వేచి చూడాలి. పరిశేష ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగు తున్నాయి. సరిగ్గా తొమ్మిది నెలలయినా గడవక ముందే ఒక రకమైన రాజకీయ అనిశ్చితి ఆ రాష్ర్ట అధికార పక్షాలలో అలుముకున్నది. ఆంధ్ర ప్రదేశ్‌లో అధికార కూటమికి నాయకత్వం వహిస్త్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిక్కుతోచని స్థితిలో తలపట్టుకుని కూర్చున్నారు. ఏమిటి ఇట్లా జరిగింది? అన్న అడిగిన మీడియా మిత్రులతో... నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అని నిట్టూర్పు విడిచారు. రేపటి నుంచి ఏం చెయ్యా లి? ప్రజలకు ఏం చెప్పాలి? వాళ్లను ఎట్లా నమ్మించాలి? ఎట్లా ముందుకు పోవాలి? బీజేపీని నమ్ముకుని నట్టేట మునగాల్సి వస్తుందని బాబు కలలో కూడా ఊహించి ఉండనందునే ఆయన ఇంతగా దిగ్భ్రాంతికి గురయ్యారని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషుల మాట. మా నేత అత్యంత అనుభవ శాలి, రాజకీయ చతురుడు. ఈ గండం నుంచి తాను బయటపడతారు. రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారు అన్న ధీమాను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరుగుతున్నది? కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్ల్లీ ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్లో ఏపీకి సరైన కేటాయింపులు లేవు. రాష్ర్ట విభజన నాడు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం రూ.100 కోట్లు కేటా యించి చేతులు దులుపుకున్నది. ‘‘ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రాజధానిని నిర్మించుకోండి, నేనున్నాను’’ అన్న ప్రధాని బడ్జెట్లో దానికి రూపాయి విదిలించలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ బాగా వాడుకున్న అస్త్రం రుణమాఫీ విషయంలో కూడా కేంద్రానిది సహాయ నిరాకరణ ధోరణే. హుద్‌హుద్ తుపాను ఉత్తరాంధ్రను కుదిపివేయగా దాదాపు 70 వేల కోట్ల నష్టం సంభవించింది. వెయ్యి కోట్లు తక్షణ సహాయం ప్రకటించిన మోదీ హామీ ప్రకటనకే పరిమితమైంది. వీటన్నిటికీ ‘‘కేంద్రం సహాయం చేస్త్తుం దిలే’’ అన్న ధీమాతో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏం చెయ్యాలో తోచనిస్థితిలో పడింది. ఇదంతా చూసి ఏపీ ప్రజలు అయోమయంలో పడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ అండ ఉంటే తమ రాష్ర్టం బాగుపడుతుందని నేతలు చెప్పిన మాటలు నమ్మి వారు టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించారు. తీరా జరుగుతున్నది చూసి వారు హతాశులు కావడంలో ఆశ్చర్యం లేదు. అనూహ్య ఫలితాలు 2004 ఎన్నికలకు ముందు బీజేపీ మతతత్వ పార్టీ అంటూ టీడీపీ దానితో తెగ తెంపులు చేసుకుంది. రెండుసార్లు ఓటమిని చవిచూశాక, చివరి ప్రయత్నంగా మొన్నటి ఎన్నికల్లో మళ్లీ ఆ పార్టీ చెయ్యి అందుకున్నది. లోక్‌సభలో మెజారి టీని సాధించి మోదీని ప్రధానిని చేసుకునే ప్రయత్నంలో బీజేపీ కూడా టీడీపీ మద్దతు తీసుకోక తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అటు బీజేపీకి ఇటు టీడీపీకి కూడా అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. టీడీపీ వంటి పార్టీల అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగల సంఖ్యాబలం బీజేపీకి లభించింది. ఇది టీడీపీకి మింగుడుపడని విషయమే. ఎన్నికలకు వెళుతున్న ప్పుడు ఆ పార్టీకి గెలుపుపట్ల పెద్దగా ఆశలులేవు. బీజేపీతో పొత్తుపెట్ట్టుకున్నా, సినిమా నటుడు పవన్ కల్యాణ్ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినా, రుణమాఫీ వంటి అలవికాని వాగ్దానాలు చేసినా... అన్నీ ఆ ఆశలు లేని కారణంగానే. తప్పిన బాబు లెక్కలు రాష్ట్రంలో టీడీపీ గెలుపును, కేంద్రంలో తమలాంటి ప్రాంతీయ మిత్రుల మీద ఆధారపడ్డ సంకీర్ణ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత ఆశించారు. అట్లా జరిగితే యునెటైడ్ ఫ్రంట్ కాలంలోనూ, ఆ తరువాత అటల్ బిహారీ వాజపేయి జమానాలో లాగే ఇప్పుడు కూడా తాను కేంద్రంలో చక్రం తిప్పొచ్చునని ఆయన భావించారు. కానీ దేశ ప్రజలు సంకీర్ణ యుగానికి స్వస్తి పలికి బీజేపీకి సొంత బలం ఇచ్చారు. మిత్రుల మీద ఆధారపడవలసిన అవసరం లేక పోవడంతో బాటు, మోదీ ప్రధాన మంత్రి కావడం కూడా టీడీపీకి కలిసి రాని వ్యవహారమే. పోనీలే ఏపీకి చెందిన వెంకయ్య నాయుడు కేంద్రంలో అత్యంత కీలక స్థానంలో ఉన్నారు, రాష్ట్ర అవసరాలను చూసుకోడానికి ఆయన చాలులే అనుకుంటే, ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న మాటను ఆయన పదే పదే వినిపిస్తూ వచ్చారు. పైగా మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ సహజ మిత్రులైన శివసేన వంటి పార్టీలనే పక్కన పెట్టి తమ సొంత బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. వారు ఏపీ, తెలం గాణల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి పెట్టడం కూడా టీడీపీని ఇబ్బందుల్లో పడేసింది. రాష్ర్టంలో బీజేపీ, కేంద్రంలో టీడీపీ ప్రభుత్వ భాగ స్వాములుగా ఉండి కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ వాపో వడం ఒక విచిత్ర స్థితి. పవన్ రాయబార పర్వం ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. బాబు ప్రభుత్వం కోరుతున్న మేరకు సహా యం చెయ్యడానికి కేంద్రం దగ్గరా నిధులు గుట్టలు గుట్టలుగా పడి లేవు. రెండు పార్టీలూ వాస్తవ పరిస్థితిని ప్రజల నుంచి దాచి ఉంచినందువల్లే ఇవ్వాళ ఈ దుస్థితి. గోప్యత కొంప ముంచుతుందని ఇకనైనా తెలుసు కుంటే మంచిది. ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదీ ప్రతిపక్షాలకు తెలియదు. వాళ్లను విశ్వాసంలోకి తీసుకోవడం అట్లా ఉంచి ప్రతిపక్షం అస్థిత్వాన్నే గుర్తించడానికి సిద్ధంగా లేని స్థితి. చంద్రబాబు నాయుడు తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని మహజరులు ఇచ్చి వచ్చారు. ప్రతిపక్షంతో కనీసం ఇదీ పరిస్థితి అని చెప్పారా? లేదు. ఇప్పుడు కూడా చేస్తున్నదేమిటి? జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను రాయబారానికి పంపుతున్నారని వార్తలు వచ్చాయి. ఒకటి రెండు రోజుల్లో ఆయన ప్రధాన మంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చెయ్యండని బాబు తరఫున కోరతారట. ఏపీ సీఎం బాబు వంటి సీనియర్ నాయకుని మాటకే దిక్కులేని దగ్గర పార్ట్ టైం రాజకీయాల పవన్ కల్యాణ్ ఏం సాధించు కొస్తారో చూడాలి. ఏపీని మేం తప్ప ఇంకెవరూ ఆదుకోలేరు అన్నట్టు విభజన బిల్లు మీద చర్చ సందర్భంగా రాజ్యసభలో వాదించిన వెంకయ్య నాయుడు కేంద్రంలో కీలక స్థానంలో ఉన్నారు. ఆయన మాటకంటే పవన్ కల్యాణ్ మాటే అక్కడ చెల్లు బాటయ్యే పరిస్థితి ఉందేమో కూడా చూడాలి . ముందున్నది మొసళ్ల పండుగే ఇదంతా మొన్న శనివారం నాటి బడ్జెట్ కేటాయింపులతో మొదలు కాలేదు, అక్కడితో ఆగిపోదు కూడా. రాష్ర్టంలో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య అధికారం లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పొరపొచ్చాలు బయట పడ్డాయి. బీజేపీ తమకు దీర్ఘకాల మిత్రుడేమీ కాదని తెలుగుదేశం వారూ, టీడీపీ నమ్మదగ్గ స్నేహితు డేమీ కాదని భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న ఉదంతాలు మనకు మొదటి నుంచి కనిపిస్తాయి. కాకపోతే బడ్జెట్ వ్యవహారం తరువాత గొంతులు పెంచారంతే. ముఖ్యమంత్రి వెంట వెళ్లి నమస్కారాలు పెట్టి రావడం తప్ప మేం చెయ్యగలిగింది ఏమీ లేదన్న ఎంపీ దివాకర్ రెడ్డి అంటే, ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఇక తిరుపతి ఎంపీ డాక్టర్ శివప్రసాద్, విరాట రాజు కొలువులోని పాండవుల పరిస్థితి మాది అని వాపోయారు. వారితోపాటూ ఇంకా పలువురు ఇతర టీడీపీ నాయకులు మాట్లాడుతున్న ఇలాంటి మాటలు ఆషామాషీగా కొట్టి పారేయాల్సినవి కావు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్ర ప్రదేశ్‌లోని రెండు మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు ముందున్నది మొసళ్ల పండుగే. datelinehyderabad@gmail.com -
పారదర్శకతకు పాతర!
మమతా బెనర్జీ, జయలలిత, కేజ్రీవాల్, చంద్రశేఖరరావు- ఈ నలుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు మీడియా పట్ల ప్రదర్శిస్తున్న అసహనం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది. నిజానికి మీడియాకు అపరిమితమైన స్వేచ్ఛ ఏనాడూ లేదు. అనేక పరిమితుల మధ్యనే అది పని చేస్తున్నది. కొన్ని సందర్భాలలో మీడియా కూడా లక్ష్మణరేఖను దాటుతున్న మాట వాస్తవం. అయినా సహేతుక ఆంక్షలైనా, లక్ష్మణరేఖలైనా మీడియా స్వయం నియంత్రణ ద్వారానే జరగాలి. ఉద్యమకాలంలో మీడియా అంటే దేవుళ్లు. ఉద్యమం విజయవంతమై, అదే మీడియా సహకారంతో అధికారం కూడా చేపట్టాక మాత్రం అవి దెయ్యాలు. దేశ రాజకీయ వ్యవస్థలో ఇదొక కొత్త వింత ధోరణి. ఒక్కసారి సింహాసనం మీద కూర్చున్నాక మీడియాను అణచి పారేయాలని అనిపిస్తుంది. పాతర పెట్టాలనీ అనిపిస్తుంది. జైలుకు పంపాలని కూడా కోరిక పుడుతుంది. ఇలా ఆలోచించే శత్రువర్గం మీడియాకు తక్కువేమీ లేదు. ఆ వర్గంలో తాజాగా రాజకీయ పార్టీలు కూడా చేరిపోతున్నాయి. ఈ ధోరణి జాతీయ రాజకీయ పక్షాలలో కంటే, ప్రాంతీయ పార్టీలలో తరచుగా గమనిస్తున్నాం. ఎందుకీ అసహనం? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ మధ్య బంగ్లాదేశ్‌లో పర్య టించారు. ఆమె వెంట వెళ్లిన బృందంలో వ్యాపారవేత్త, సినీ నిర్మాత శివాజీ పంజా ఒకరు. ఈయనను నకిలీ పత్రాలు సమర్పించి కోట్లాది రూపాయల రుణం తీసుకున్న ఆర్థిక నేరం మీద ఢిల్లీ పోలీసులు కోల్‌కతాలో అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటకొచ్చారు. ఇందులో నిజానిజాలను కోర్టులు నిగ్గుతేలుస్తాయి. కానీ అప్పటిదాకా ఆయన నిందితుడే. కాబట్టి నేర చరిత్ర కలిగి, అరెస్టయిన వ్యక్తి ముఖ్యమంత్రి బృందంలో విదేశీ పర్యటనకు ఎలా అనుమతి పొందాడని బెంగాల్ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. తరువాత విలేక రులు, ‘మీ వెంట విదేశ పర్యటనకు వచ్చిన సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. మీ స్పందనేమిటి?’ అని తమదైన శైలిలో అడిగారు. ఇదే ప్రశ్న వేసిన విపక్షాల మీద కాదు, ఆఖరికి ఆరోపణ ఉన్నప్పటికీ తన వెంట వచ్చిన శివాజీ మీద కాదు, మీడియా మీద మమతకు కోపం వచ్చింది. ‘ఎంత సాహసం, ఇలాంటి ప్రశ్న అడుగుతారా? ఇందుకు మిమ్మల్ని జైలుకే పంపొచ్చు. కానీ దయతలచి వదిలేస్తున్నా, వెళ్లండి!’ అని కసురుకున్నారు. మమత పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియా మీద దాడి చేయడం ఇదే మొదటి సారి కాదు. కాబట్టి ఎవరూ ఆశ్చర్యపోలేదు. ఒక కార్టూనిస్టును అరెస్టు చేసి, జైలు పాల్జేసిన ఘటన ఆమె హయాంలోనే జరిగింది. ఇంతకీ, కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్ (రాష్ట్ర సచివాలయం)లోకి మీడియా వారికి ప్రవేశం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు పొందిన నాయకురాలు మమతా బెనర్జీ. వామపక్షాల పట్ల సొంత పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బయ టకొచ్చి ‘తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో వేరే పార్టీని స్థాపించి ఏళ్ల తరబడి పోరాడారు. తరువాత అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలో మీడియా ఆమెకు అందించిన సహకారం తక్కువేమీ కాదు. తృణమూల్ అంటే గ్రాస్ రూట్ (అట్టడుగు) అని అర్థం. కానీ చాలా నిరాడంబరంగా ప్రజలకు దగ్గరగా ఉండే పార్టీ అని అందరూ భావించే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన పని - మీడియా మీద నియంత్రణ. పశ్చిమ బెంగాల్ సచివాలయం మొత్తం ఇప్పుడు రైటర్స్ బంగ్లాలో లేదు. అక్కడికి కొద్దిదూరం లోని నబన్న అనే (నూతన) భవన సముదాయంలోకి మారింది. ఇక్కడికి కూడా మీడియాకు అనుమతి లేదు. దక్షిణాదిన తమిళనాట కూడా ఇదే పరి స్థితి. అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్నంతకాలం మీడి యా ముఖం చూడరు. అక్కడి సచివాలయంలోనూ షరా మామూలే- మీడి యాకు నో ఎంట్రీ. అదే బాటలో ‘ఆప్’ నిన్నగాక మొన్న రెండు జాతీయ రాజకీయ పక్షాలను మట్టి కరిపించి ఢిల్లీ కోటను స్వాధీనం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కూడా సచివా లయంలోకి మీడియాను అనుమతించేది లేదని తేల్చి చెప్పేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే సామాన్య ప్రజల పార్టీ. మరి, సమాచారాన్ని తెలుసుకునేం దుకు సామాన్యులకు ఉన్న హక్కును తమ బాధ్యతగా నిర్వర్తిస్తున్న మీడియా మీద ఆప్ సర్కారుకు ఎందుకు ఆగ్రహం కలిగినట్టు? ఢిల్లీ ఎన్నికలలో రెండో సారి అత్యద్భుతమైన విజయం సాధించడంలో ఆ పార్టీకి మీడియా అందిం చిన సహకారం ఎంతో ఉంది. ఆప్ ఒక నిరసన ఉద్యమం నుంచి, భ్రష్టు పట్టిపోతున్న సంప్రదాయ రాజకీయాల పట్ల ప్రజలలో తలెత్తిన ధిక్కార ధోరణి ఫలితంగా ఆవిర్భవించిన మాట నిజమే. ఆ ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కల్పించినది మీడియా కాదా! అటువంటి ఆప్ కూడా ఢిల్లీ సచివాలయంలోకి మీడియాను ప్రవేశించనీయకుండా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘సహేతుక’ ఆంక్షలు ఉంటాయా? తెలంగాణ సచివాలయంలోకి మీడియా ప్రవేశాన్ని నిషేధించేందుకు సంబం ధించిన నిర్ణయం త్వరలోనే వెలువడనున్నదని పత్రికలూ, న్యూస్ చానళ్లూ రాశాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంటే, మనం చేస్తే తప్పేమిటి అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారులతో అన్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. కానీ మీడియా నుంచీ, జర్నలిస్టుల సంఘాల నుంచీ వచ్చిన నిరసన వేడి వల్ల కాబోలు, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా ఆపినట్టుంది. ఆ వెంటనే ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు సంపాదకులను, జర్నలిస్టు సంఘాల నాయకులను సమావేశ పరచి పాత్రికేయుల సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. వారం రోజులలో నివేదిక ఇచ్చేందుకు గాను ఒక కమిటీని కూడా నియమించారు. కానీ, సచివాలయంలో మీడియాను నియంత్రించవలసిన అవసరమైతే కచ్చితంగా ఉందని అదే సమయంలో ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, జర్నలిస్టులందరితోనూ చర్చించిన మీదటే ఒక నిర్ణయం తీసుకుం టామని భరోసా ఇచ్చారు. అది జరిగి 48 గంటలు గడవక ముందే సోమ వారం సమాచార శాఖ అధికారులు కొద్దిసేపు అత్యుత్సాహం ప్రదర్శిం చారు. సమత బ్లాక్ (ముఖ్యమంత్రి కార్యాలయ భవనం)లో పౌర సంబం ధాల అధికారి చాంబర్ నుంచి పోలీసుల సాయంతో మీడియాను గెంటేశారు. మళ్లీ, ‘అటువంటిదేమీ లేదు, రావొచ్చ’న్నారు. సచివాలయం నుంచి మీడి యాను పూర్తిగా నిషేధించరు గాని, సహేతుకమైన ఆంక్షలు (రీజనబుల్ రెస్ట్రిక్షన్స్) మాత్రం ఉంటాయనీ, వాటికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ ప్రెస్ అకాడమీ అధ్యక్షుని చేత చెప్పించారు. అంటే ఇంకా ప్రమాదం తొలగిపోలేదన్నమాట. మీడియా నెత్తి మీద సచివాలయంలో ప్రవేశానికి నిషేధం అనే కత్తి వేలాడుతూనే ఉన్నదన్నమాట. ఫోర్త్ ఎస్టేట్ తత్వాన్ని మరిచారు మీడియా అంటే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు తెలియనిది కాదు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఆ సుదీర్ఘ పోరాటం మీడియా అండ లేకుండానే జరిగిందని టీఆర్ఎస్ చెప్పగలదా? చెప్పలేదు! ఉద్యమం సాగు తున్న కాలంలో అప్పటి ప్రభుత్వాలు మీడియా వైపు కన్నెత్తి చూసినా విరుచుకుపడిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉండి, ఆంక్షల గురించి మాట్లాడడం విడ్డూరం. ఇంతకూ ఈ ఆంక్షల విధింపు వెనుక కారణాలు ఏమిటి? పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు సచివాలయంలో తిరగాడుతుండడం వల్ల మంత్రులూ, అధికారులూ సక్రమంగా విధులు నిర్వర్తించలేకపోతున్నా రని ప్రభుత్వం చెబుతోంది. మీడియా నిషేధం దీనికి పరిష్కారం ఎలా అవుతుంది? మీరెవరూ ప్రత్యక్షంగా చూడొద్దు, వినొద్దు, రాసుకోవద్దు. మేమే సమాచారం పంపుతాం! అదే ప్రచురించండి!’ అంటే ఇంక మీడియా దేనికి? దానికి ఫోర్త్ ఎస్టేట్ అని బిరుదు ఎందుకు? స్వయం నియంత్రణ కే ప్రాధాన్యం మమత, జయ, కేజ్రీవాల్, కేసీఆర్- ఈ నలుగురు ప్రాంతీయ పార్టీల అధి నేతలు మీడియా పట్ల ప్రదర్శిస్తున్న అసహనం ప్రజాస్వామ్యానికి చేటుచే స్తుంది. నిజానికి మీడియాకు అపరిమితమైన స్వేచ్ఛ ఏనాడూ లేదు. అనేక పరిమితుల మధ్యనే అది పనిచేస్తున్నది. కొన్ని సందర్భాలలో మీడియా కూడా లక్ష్మణరేఖను దాటుతున్న మాట వాస్తవం. అయినా సహేతుక ఆంక్షలైనా, లక్ష్మణరేఖలైనా మీడియా స్వయం నియంత్రణ ద్వారానే జరగాలి. ప్రజా సేవలో మీడియా ఎక్కడైనా అడ్డంకిగా తయారైందని ప్రభుత్వం భావిస్తే, ఆ వ్యవస్థ యజమానులను, సంపాదకులను, జర్నలిస్టు సంఘాల నేతలను కూర్చోబెట్టి చర్చించి ఆ అడ్డంకులను తొలగించుకోవాలి. అంతేతప్ప ఇలాంటి నిషేధాలు ప్రజాప్రయోజనానికి ఉపయోగపడవు. అంతిమ ఫలితం పారదర్శ కతను బలిచేయడమేనని పాలకులు గుర్తుంచుకోవాలి. (వ్యాసకర్త మొబైల్: 98480 48536) -
కాగల కార్యాన్ని తీర్చేది కమలమే
డేట్లైన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోపభూయిష్టంగా ఉన్నదన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండనవసరం లేదు. ఆ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా విషయాలలో స్పష్టత లోపించి ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తొలిరోజులలో ఆంధ్రప్రదేశ్ అధికారులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోవడం నుంచి మొదలై, నాగార్జునసాగర్ డ్యాం మీద నీటి విడుదల కోసం ఇరు రాష్ట్రాల అధికారులూ, పోలీసులూ తన్నుకులాడిన పరువు తక్కువ ఘటన వరకూ నిందించవలసినది రెండు ప్రభుత్వాలనే! ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి మార్పులు తీసుకురావలసిన అవసరం చాలా ఉందని కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇటీవల తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన ప్రతిసారీ చెబుతున్నారు. ఈ నెలాఖరులో ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఆ సవరణలు తీసుకురావచ్చు కూడా. ఇంతకూ విభజన చట్టంలో తీసుకురావలసిన మార్పు లేమిటి? ఎలాంటి మార్పులు అవసరమని కేంద్రం అనుకుంటున్నది? పోనీ ఈ మార్పులను గురించి పదే పదే మాట్లాడుతున్న వెంకయ్యనాయుడికైనా ఈ విషయంలో స్పష్టత ఉందా? మార్పులు సరే, అవి ఎలాంటివి? ఒకటి నిజం. వెంకయ్యనాయుడు ఇప్పటివరకు ఈ మార్పులకు సంబంధించి చెప్పిన వివరాలు పెద్దగా లేవు. శాసనమండలి, శాసనసభల స్థానాల హెచ్చింపు, రాజ్యసభ సభ్యులకు రాష్ట్రాల కేటాయింపులో జరిగిన మార్పులు వంటి అంశాలే అందులో వినిపిస్తున్నాయి. కానీ ఇవి ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధిలో పెద్దగా సంబంధంలేనివే. అంతర్రాష్ర్ట సమస్యల మీద సరైన నిర్ణయాలు తీసుకోకుండానే హడావుడిగా విభజన బిల్లును పార్లమెం ట్లో ఆమోదింపచేసుకున్నారని విపక్షాలన్నీ కాంగ్రెస్ మీద విరుచుకుపడుతు న్నాయి. కానీ, అవే లోపాలను సవరిస్తానని చెబుతున్న వెంకయ్య నాయుడు గారి పాత్ర కూడా అందులో చాలా ఉందని ఎన్డీఏకు నాయకత్వం వహి స్తున్న బీజేపీ గుర్తించాలి. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి, పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఈ వ్యవహారం ఇట్లాంటి మలుపు తిరిగి ఉండేది కాదు. ఎంతసేపూ రాష్ర్ట విభజన మీద ‘మీ వైఖరి స్పష్టం చెయ్యండి!’ అని ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టే ఎత్తుగడ తప్ప భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల మీద కాంగ్రెస్ ఏనాడూ దృష్టి పెట్టలేదు. కాబట్టే అక్కడా, ఇక్కడా ఆ పార్టీ శిక్ష అనుభవిస్తోంది. ఇక బీజేపీ విషయం చూస్తే, ‘ఆనాడు మా వెంకయ్యనాయుడు గట్టిగా నిలబడి ఉండకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ అన్యాయమైపోయి ఉండేది!’ అని మాట్లాడుతున్నది. ఈ ఎనిమిది నెలల కాలంలో రెండు కేంద్ర మంత్రిపదవులు మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు ఆ పార్టీ చేసిందేమిటి? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదు కాదు, పదేళ్లు ఉండా ల్సిందేనని రాజ్యసభలో అంత గట్టిగా మాట్లాడి, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేత మౌఖిక హామీ పొందిన వెంకయ్యనాయుడు ఇప్పు డేమో ‘ప్రత్యేక హోదా చాలా కష్టం, అన్ని రాష్ట్రాలూ అంగీకరించాలి’ అని పదేపదే చెబుతున్నారు. మిత్రపక్షం తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నోటితో కూడా చెప్పిస్తున్నారు. చంద్రబాబునాయుడయితే ఇంకాస్త ముందుకు పోయి, కేంద్రం కష్టాల్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడే ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టొద్దు అని మంత్రివర్గ సహచరులతో చెబుతున్నారు. దీనిలో మతలబు ఏమై ఉంటుంది? మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ చేతుల్లోనో, దాని మిత్రపక్షాల చేతుల్లోనో ఉన్నాయి. ఇంకొన్ని కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. అలాంటప్పుడు ముఖ్యమంత్రులను ఒప్పించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పించడం వారికి ఎందుకు అంత దుస్సాధ్యమయింది? సాగర్‌లో కొట్టుకుపోయిన పరువు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోపభూయిష్టంగా ఉన్నదన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండనవసరం లేదు. ఆ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా విషయాలలో స్పష్టత లోపించి ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తమ తమ రాష్ట్రాలలో ప్రజల మెప్పు పొందడం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వీటికి పరోక్షంగానే అయినా మద్దతు పలుకుతున్నారు. తొలిరోజులలో ఆంధ్రప్రదేశ్ అధికారు లను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోవడం నుంచి మొదలై, మొన్న శుక్రవారం నాగార్జునసాగర్ డ్యాం మీద నీటి విడుదల కోసం ఇరు రాష్ట్రాల అధికారులూ, పోలీసులూ తన్నుకులాడిన పరువు తక్కువ ఘటన వరకూ నిందించవలసినది రెండు ప్రభుత్వాలనూ, వాటి ముఖ్యమంత్రులనే. ఇద్దరు ముఖ్యమంత్రులకూ సమాచారం లేకుండానే ఈ ఘటనలన్నీ జరుగుతు న్నాయా? నాగార్జునసాగర్ డ్యాం దగ్గర జరిగిన సంఘటన ఎటువంటిది? యావత్ భారతదేశం ముందు రెండు తెలుగు రాష్ట్రాలకూ తలవంపులు తెచ్చిన సంఘటన. రెండు రాష్ట్రాల అధికారులూ, పోలీసులూ ఒకరినొకరు తిట్టుకున్నారు. తోసుకున్నారు, లాఠీ చార్జ్ చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. కంట్రోల్ రూం మీద దాడి చేసి, తలుపులూ, కిటికీలూ బద్దలుకొట్టుకున్నారు. ఇటువంటి చిల్లరమల్లర పనులకు పాల్పడే అల్లరి మూకలను నియంత్రించే నైతిక హక్కు ఇకపై ఈ రెండు రాష్ట్రాల పోలీసులకు ఏం మిగిలింది? ఆరంభంలోనే పరిస్థితిని చక్కబరచకపోగా, పరువంతా పోయాక ముఖ్యమంత్రులు ఇరువురూ గవర్నర్ సమక్షంలో సమస్యను పరి ష్కరించుకుందాం అని ఫోన్లో మాట్లాడుకున్నారు. మరునాడు ఉద యమే రాజభవన్లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో మాట్లాడుకున్న ముఖ్య మంత్రులు అన్ని వివాదాలనూ శాశ్వతంగా పరిష్కరించుకోడానికి చర్చలు జరుపుకోవాలని నిర్ణయానికి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఆ వెంటనే రెండు రాష్ట్రాల నీటి పారుదల మంత్రులు రెండు రాష్ట్రాల పంటలకు నష్టం జరగకుండా చూస్తామని మీడియా ముందు ప్రకటించడమూ సంతోషించదగ్గ పరిణామమే. అయితే, ఇది మొదట్లోనే ఎందుకు జరగలేదు? ఇంతకీ ఈ మాటకు ఇరువురూ కట్టుబడి ఉంటారా అన్నది కూడా సందేహం. శుక్రవారం నాగార్జునసాగర్ డ్యాం మీద జరిగిన ఘటన విషయంలో ఇరు రాష్ట్రాల పొలీస్ డెరైక్టర్స్ జనరల్ పట్ల గవర్నర్ నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు, వివరణ కోరినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. నిజంగా ఈ వ్యవహారం ఇరువురు ముఖ్యమంత్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అంద కుండానే జరిగిపోయి ఉంటే, ఇద్దరు డీజీపీలను వివరణ కోరడం కాదు, బాధ్యతా రాహిత్యం కింద పదవుల నుంచి తొలగించాల్సి ఉంటుంది కదా! కాంగ్రెస్ తప్పిదాలు పునరావృతం కారాదు ఇదంతా ఉదహరించడానికి కారణం రాష్ర్ట విభజన చట్టం లోపభూయిష్టంగా ఉందని చెప్పడానికే. ఇక ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే కేంద్రం నోరు మెదపదు. ప్రధానమంత్రి మాట్లాడరు, కేంద్ర హోంమంత్రి పెదవి విప్పరు. వెంకయ్యనాయుడు మాత్రం విభజన బిల్లులో మార్పులు తేవలసి ఉంది అని గత నాలుగైదు మాసాలుగా పాడిన పాటే పాడుతున్నారు. కేంద్రం లో కీలక స్థానంలో ఉండి వెంకయ్యనాయుడు ఈ ఎనిమిది మాసాలలో రెండు మాటలు మాత్రమే మాటిమాటికీ చెబుతున్నారు. అందులో మొదటిదే - ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కష్టం. విభజన చట్టంలో సవరణలు అవసరం అన్నది రెండో మాట. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో మార్పులు రెండు రాష్ట్రాల మంచి కోసం చెయ్యదలిస్తే ఆహ్వానించవలసిందే. అయితే కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పు మళ్లీ చెయ్యకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమం త్రులతో పాటు అన్ని ప్రతిపక్షాలను ఒకచోట కూర్చోపెట్టి సావధానంగా వారి వారి వాదనలు కూడా విని పారదర్శకంగా వ్యవహరిస్తే అందరికీ మంచిది. ఎలాగూ ఆంధ్రప్రదేశ్‌లో తన మిత్రపక్షమే అధికారంలో ఉంది. బీజేపీ తానూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి సమస్య లేదు. ఎన్డీఏ దిశగా టీఆర్ఎస్? ఇక మిగిలింది తెలంగాణ రాష్ర్టం. అక్కడి ప్రభుత్వాన్నీ తన దారికి తెచ్చుకునే ప్రయత్నంలో మోదీ - షా ద్వయం పడిందని జాతీయ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఆ మేరకు తెలంగాణ లోని అధికార పార్టీ టీఆర్ఎస్, భార తీయ జనతా పార్టీల నాయకుల స్వరాలలో మార్పు కూడా ప్రస్ఫుటమ వుతున్నది. వచ్చే ఏప్రిల్‌లో కేంద్ర మంత్రివర్గంలో జరిగే మార్పులలో టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు స్థానం దక్కబోతున్నదనీ, ఇటు తెలంగాణ ప్రభుత్వంలో ఇద్దరు బీజేపీ సభ్యులు చేరబోతున్నారనీ వార్తలొస్తున్నాయి. పేర్లు కూడా దాదాపు ఖరారైనట్టే. తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత , టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె .కేశవరావు కేంద్రంలో చేరితే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ రాష్ర్ట ప్రభుత్వంలో చేరవచ్చు. సమస్యలు పరిష్కరించడం సాధ్యం కానప్పుడు ఇది మంచి ఉపాయం కదా! రెండు తెలుగు రాష్ట్రాలలో మిత్రపక్షాలే కొలువై వుంటే ఇంకేం కావాలి! ఇదే జరిగితే త్వరలో మనం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తన పొరుగు రాష్ర్ట ముఖ్యమంత్రి వలెనే కేంద్రం కష్టాలలో ఉంది, మనం ఒత్తిడి చేయవద్దు, ఇబ్బంది పెట్టవద్దు అని సహచరులను కూర్చో బెట్టుకుని బోధలు చేయడం చూడవచ్చు! datelinehyderabadgmail.com -
ఆకలి కేకలు.. ఆశల సౌధాలు
వందల అంతస్తుల భవనాలతో విశ్వనగరాలు సిద్ధమయ్యేసరికి వాటిలో నివసించడానికి మనుషులంటూ ఉండాలని ఏలినవారు ఎందుకు మరచిపోతున్నారు? సచివాలయం తరలింపునకు కారణం వాస్తు దోషమేనని ప్రభుత్వమే చెబుతోంది. వాస్తు వంటి నమ్మకాలు వ్యక్తిగతం కావాలే తప్ప, వాటిని రాష్ర్టంపై రుద్దడం సరికాదు. కేసీఆర్ వ్యక్తిగతంగా ఎన్ని మొక్కులైనా మొక్కుకోవచ్చు, సొంత డబ్బుతోనో, పార్టీ నిధులతోనో తీర్చుకోవచ్చు. అంతేగానీ ఏలికల వ్యక్తిగత విశ్వాసాల కోసం, విలాసాల కోసం ప్రజాధనం వెచ్చిస్తామంటే కుదరదు. ‘‘తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు జిల్లా భవిష్యత్తు’’ అన్న అంశం పై ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో పౌరహక్కుల నేత ప్రొఫె సర్ హరగోపాల్ మాట్లాడుతూ విలువలేని మెటల్ లాంటి తెలంగాణ కాదు, మనిషి మనిషిగా బ్రతికే రాష్ర్టం కావాలని అన్నారు. బంగారు తెలంగాణ అనే భావజాలంలోనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకోవాలంటే ముందుగా సమస్యల జాబితా తయారు చేసుకోవాలని అన్నారు. అయితే అదేమంత తేలికైన విషయం కాదని, ఎంతో జాగ్రత్తగా ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సదస్సులో మాట్లాడిన పెద్దలంతా తెలంగాణ రాష్ర్ట సాధన ఆకాంక్షను తమ ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో నిండుగా నింపుకున్న వారే. అదే రోజున, అదే సమ యంలో హైదరాబాద్‌లోనే మరో చోట ‘‘తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేం ద్రం,’’ జన విజ్ఞాన వేదికతో కలసి ‘‘శాస్త్రీయత - అశాస్త్రీయత’’ అన్న అం శంపై ఏర్పాటు చేసిన సదస్సులో జస్టిస్ చంద్రకుమార్ తదితర పెద్దలు... ప్రభుత్వం తరఫున మొక్కులు తీరుస్తామనడం, వాస్తు పేరిట కోట్ల రూపా యల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తామనడం సరికాదని వ్యాఖ్యానించారు. వృద్ధుల వ్యథలతోనే కలల సాకారమా? సరిగ్గా ఈ రెండు సదస్సులు జరుగుతున్న సమయంలోనే నేను వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలం బొల్లికుంట గ్రామంలో బోజ్జం పెద్ద వెంకటయ్య అనే 72 ఏళ్ల వృద్ధుడితో మాట్లాడుతున్నా. వెంకట య్య ముదిరాజ్ కులస్తుడు. వృత్తిరీత్యా నీరటిగాడు. తెలంగాణలో నీరటి దనం వంశపారంపర్యంగా వస్తుంది. అయితే ఆయన వంశంలో అన్నదమ్ము లు, వాళ్ల పిల్లలు కలసి సంఖ్య ఎక్కువ కావడంతో వెంకటయ్యకు ఎనిమిదేళ్ల తరువాత ఈ ఏడు మళ్లీ నీరటి పని దక్కింది. వృద్ధాప్యం కారణంగా శక్తి చాలని వెంకటయ్య ఆ పని తన రెండో కొడుకుకు ఇచ్చేశాడు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడటానికి ముందు, నెలా నెలా అందే 200 రూపాయల ప్రభుత్వ పింఛన్‌తో ఆయన నెట్టుకొచ్చేవాడు. అది కాస్తా తర్వాత ఆగిపోయింది. పింఛన్ వస్తుందో, రాదో తెలియదు. ఈ వయసులో ఎట్లా బ్రతకాలో అర్థం కాదు. ఏం చెయ్యాలని అడగడానికి వెంకటయ్య నా దగ్గరికి వచ్చాడు. తల్లిదం డ్రులిద్దరినీ పోషించే స్థోమత కొడుకులకు లేదు. వెంకటయ్యలాంటి సంపాద నాపరులైన పిల్లలుగల వృద్ధులకు పింఛన్లక్కర్లేదన్నట్టు ప్రభుత్వం విపరీత వాదనకు దిగుతోంది. కొడుకుల ఆదాయం నుంచి కొంత తల్లిదండ్రులకు అం దేట్టు చర్యలు తీసుకుంటామని కూడా అంటున్నది. దీనివల్ల కుటుంబ సంబం ధాలు చెడిపోవడం తప్ప మేలు మాత్రం జరగదు. ఎప్పుడో నిర్మాణం జరిగే బంగారు తెలంగాణ గురించి వెంకటయ్యకు తెలియదు. భార్యాభర్తలిద్దరూ రెండుపూటలా ఇంత ముద్ద తిని, గౌరవంగా బతకగలిగితే అదే ఆయనకు బం గారం. పాలమూరు సదస్సులో హరగోపాల్ లాంటి పెద్దలు చెప్పింది అదే. ఆరు వేలకుపైగా జనాభా కలిగిన బొల్లికుంట మొదటి నుంచీ ఎంతో చైతన్యవంతమైన గామం. వరంగల్ కోట గోడను ఆనుకుని ఉండే ఆ గ్రామ పంచాయితీని ఇటీవలే వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో కలిపేశారు. తెలంగాణ ఉద్యమంలో అది నేడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వెంట నడి చిన గ్రామం. వెంకటయ్య సహా ఆ గ్రామానికి చెందిన 900 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ కోసం కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని ఆశగా ఎదురు చూశారు. రకరకాల విన్యాసాల తరువాత వారిలో 200 మందికి మాత్రమే పింఛన్ మంజూరు అయింది. వెంకటయ్యసహా మరో 700 వందల మంది పింఛన్ వస్తుందో, రాదో తెలియని అగమ్యగోచరస్థితిలో జీవిస్త్తున్నారు. వారంతా తెలంగాణ ప్రజలే, పరాయి రాష్ర్ట పౌరులు కారు. ఇటీవలే ఆ గ్రామం సందర్శించిన స్థానిక శాసనసభ్యులు ధర్మారెడ్డికి, అధికార గణానికి వారి పరిస్థితి తెలుసు. బొల్ల్లికుంట ఒక ఉదాహరణ మాత్రమే. ఇది పది తెలంగాణ జిలాల్లోని వేలాది గ్రామాల్లోని లక్షలాది మంది వెంకటయ్యల దైన్యస్థితికి మచ్చుతునక. పింఛన్లు రావేమోనని, రేషన్ కార్డులు తీసేస్తారేమోనని బెంగతో గుండెపగిలి చనిపోయిన ఘటనల గురించి ఈ తొమ్మిది నెలల కాలంలో పలు వార్తలు విన్నాం, చదివాం. ఆంధ్ర పాలకులు ధ్వంసం చేసిన తెలంగాణ పునర్నిర్మాణానికి సమయం కావాలి కదా, ప్రణాళికలు రచిస్తు న్నాం కదా అంటే చెల్లదు. ఆ దూర దృష్టి ఎన్నికలకు ముందే ఉండాల్సింది. రూ. 200 పింఛన్ తీసుకుంటున్న నిస్సహాయులకు వెయ్యి రూపాయలు ఇస్తామని ఆశ చూపాల్సింది కాదు. వెనుక నుంచి ముందుకు నడక! కోదండరామ్ సూచించినట్టే రాష్ట్ర ప్రభుత్వం సమస్యల జాబితాలను తయా రు చేసుకునే తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకున్నా... వందలాది అంత స్తుల భవనాలను నిర్మించి, విశ్వనగరాలను తయారుచేసేసరికి వాటిలో నివసించడానికి మనుషులంటూ ఉండాలని ఏలిన వారు ఎందుకు మరచిపో తున్నారు? ముందుగా ప్రజల కనీస అవసరాలు తీర్చి, ఆ తరువాత విశ్వ నగరాల నిర్మాణానికి ఆలోచనలు చేస్తే మంచిది. తెలంగాణ ప్రభుత్వం వెనక నుండి ముందుకు నడిచే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ కోణం నుంచే రాష్ర్ట మంత్రివర్గ సమావేశం గతవారం తీసుకున్న నిర్ణయాలను చర్చించవలసి ఉన్నది. వాటిలో కొన్ని అభ్యంతరకరమైనవి కాగా, మరి కొన్ని వివాదాస్పదమైనవి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అనే రెండే అంశాలు తలలో గూడు కట్టుకుపోవడం వల్లనే ప్రభుత్వం ఇలా అస్తవ్యస్త నిర్ణయాలు చేస్తోం దనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు చెపుతున్నట్టు ఆ రెండు నగరాల్లో ఒకటి డల్లాస్, మరొకటి న్యూయార్క్ నగరాలయితే సంతోషమే. కానీ ప్రజల కనీస అవసరాలను పట్టించుకోకుండా ఇలా అర చేతి స్వర్గాలను చూపిస్తే ప్రజలు నమ్మరు. నేతల నమ్మకాలను ప్రజలపై రుద్దుతారా? హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఉన్న సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చి, అక్కడి ఛాతీ వ్యాధుల కేంద్రాన్ని 70 కిలోమీటర్ల దూరాన ఉన్న వికారాబాద్‌లోని అనం తగిరి కొండల మీదికి తరలించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. పరి పాలనా సౌలభ్యం కోసం సచివాలయాన్ని మరింత విశాలంగా కట్టుకోవా లంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. సచివాలయం తరలింపునకు కారణం వాస్తు దోషమేనని ప్రభుత్వమే చెబుతోంది. వాస్తు, జ్యోతిష్యం వంటి నమ్మ కాలు వ్యక్తిగతం కావాలె తప్ప, ప్రభుత్వాలు వాటిని రాష్ర్టం మీద రుద్దడం సరికాదు. ప్రస్తుత సచివాలయ భవన సముదాయానికి వాస్తు దోషం ఉన్న మాట నిజమే కానీ, దానిని కొన్ని మార్పు, చేర్పులతో సరిచేసి, అక్కడి నుంచే నిరభ్యంతరంగా పాలన సాగించవచ్చునని కొందరు వాస్తు నిపుణులు చెబు తున్నారు. అలాంటి వారందరిపైనా అధికార పార్టీ వారు తమ వ్యతిరేకులనే ముద్రలు వేస్తున్నారు. పోనీ ఎర్రగడ్డ ప్రాంగణం వాస్తు బ్రహ్మాండంగా ఉం దా? అంటే అక్కడ ఇంతకంటే ఘోరమైన వాస్త్తు దోషాలున్నాయని ఆ రంగం లోని నిపుణులే చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి భారీ వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయాన్ని తరువాత అధికారం లోకి వచ్చిన జయలలిత ఉపయోగించకుండా వదిలేసిన వైనం రాష్ట్ర ప్రభు త్వానికి, ముఖ్యమంత్రికి తెలియదని అనుకుందామా? లేక ఈ సృష్టి అంత రించే వరకూ టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ఏ జ్యోతిష్యులైనా చెప్పా రా? లేకపోతే వికారాబాద్‌లో ఉన్న నిజాం కాలంనాటి క్షయవ్యాధి చికిత్సా కేంద్రం ప్రస్తుతం ఎలాంటి దుస్థితిలో ఉందో తెలిసి కూడా, అక్కడికే ప్రజ లకు అందుబాటులో ఉన్న ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రి సముదాయాన్ని తరలించాలని ఎందుకు భీష్మించుకు కూచున్నట్టు? ఎవరినీ ఒప్పించ లేని ఈ నిర్ణయం వెనక వేరే కారణాలు ఉన్నాయన్న అపవాదాన్ని లేదా విమర్శను ప్రభుత్వం మొండిగా ఎందుకు మోస్తున్నట్టు? ప్రజలకు ఐదేళ్ల పాటూ తాత్కా లిక ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు తమ నమ్మకాలను ఇలా ప్రజల నెత్తిన రుద్ద్దుతామనడం సమంజసం కాదు. ఇక తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం జరుగుతున్న కాలంలో తాను మొక్కిన దేవుళ్లందరికీ ప్రజాధనం వెచ్చించి మొక్కులు తీర్చాలని ముఖ్య మంత్రి తన మంత్రివర్గం చేత నిర్ణయం చేయించారు. తిరుపతి వెంకన్నకు, విజయవాడ కనకదుర్గకు, వరంగల్ భద్రకాళికి, శ్రీశైలం మల్లన్నకు ఇంకా ముక్కోటి దేవతలకు కేసీఆర్ మొక్కుకుని ఉండొచ్చు. వాటికి, రాష్ట్ర ముఖ్య మంత్రికి ఏ సంబంధమూ లేదు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యక్తిగతంగా ఎన్ని మొక్కులైనా మొక్కుకోవచ్చు, తన సొంత డబ్బుతోనో లేదా తమ పార్టీ నిధులతోనో నిరభ్యంతరంగా వాటిని తీర్చుకోవచ్చు. అంతేగానీ ఏలికల వ్యక్తి గత విశ్వాసాలకోసం, విలాసాలకోసం ప్రజాధనం వెచ్చిస్తామంటే కుదరదు. డేట్లైన్ హైదరాబాద్: దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
ఒకటే పాట... ‘చంద్రుల’ నోట
డేట్లైన్ హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హయాంలో ‘వారుణి వాహిని’ పేరిట ప్రభుత్వ సారాయిని ఆకర్షణీయమైన సీసాలలో అందించడం తెలిసిందే. అప్పుడు సైతం పల్లెల్లో, హైదరాబాద్ పాతబస్తీలో గుడుంబా పారలేదా? ప్రభుత్వ సారాయితో గుడుంబా దందా దానికదే మూతపడుతుందా? తెలంగాణలో ఎక్కడెక్కడ గుడుంబా స్థావరాలున్నాయో ఆబ్కారీ అధికారులకు తెలియదా? ఆ శాఖను సరిగా పనిచేయించి, గుడుంబాను నిర్మూలించాల్సింది పోయి... చట్టబద్ధంగా సారాయిని ప్రవహింపజేయాలని సీఎం కేసీఆర్ భావించడం దురదృష్టం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలు రెండూ ఈ ఏడు మాసాల కాలంలో ప్రకటించిన కార్యక్రమాలు ఎటువంటివి? అవి అభివృద్ధి కార్యక్రమాలా? సంక్షేమ పథకాలా? అవన్నీ అమలు చెయ్యడానికి ఎంత కాలం పడుతుంది? ఎంత పెద్ద ఎత్తున నిధులు కావాలి? అనే చర్చ ఇప్పుడు అక్కడా, ఇక్కడా జోరందుకున్నది. అక్కడా ఇక్కడా ప్రతిపక్షాలు మాట్లాడు తూనే ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చెప్పే మాటలు వినే స్థితిలో లేవు. అధికారంలోకి వచ్చిన ఊపులో వాళ్లు చేస్తున్న వాగ్దానాల అమలుకు లక్షల కోట్ల రూపాయల నిధుల అవసరం వారికి గుర్తుకు రావడం లేదు. తెలంగాణ రాష్ర్ట ఆదాయం అంతంత మాత్రంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌తో ప్రయాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కానీ, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ ప్రతిపక్షాలను పట్టించుకునే స్థితిలో లేదు. ప్రజా తీర్పు ఆ పార్టీని నేల మీద నిలవనీయడం లేదు. దూకుడుగా ముందుకుపోతూ, ప్రతిపక్షాల దుకాణాలు ఖాళీచేసే పనిలో పడింది. ఇక మిగిలిన అరకొర నాయకుల మాట ఏం వింటుంది? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి భిన్నమయింది. అక్కడ ఉన్న ఏకైక ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చెయ్యాలనే ఆలోచనలో అధికార పక్షం ఉన్నా, సాధ్యపడక రాష్ర్టంలో ప్రతిపక్షమే లేదని కళ్ళు మూసుకుని, తనను తాను నమ్మించుకునే ప్రయ త్నంలో పడింది. వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఎవరి మాటా వినే స్థితిలోలేవు. ఎన్ని లక్షల కోట్ల విలువ చేసే వాగ్దానాలు చేస్తేనేం? వాటి అమలు కోసం అడిగే వాళ్లేరి? అన్న ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వ సారా మూడు విధాల మేలు సుదీర్ఘ పోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ర్టం విషయమే చూద్దాం. టీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత చంద్రశేఖర్‌రావు కేవలం హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రకటించిన పథకాలకు రెండు లక్షల కోట్ల రూపా యలు అవసరమని అంచనా. నిజంగానే వాటిని అమలు చేయడం మొదల యితే ఈ మొత్తం ఇంకా పెరగవచ్చు. తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలు కాగా, అందులో ప్రణాళికా వ్యయం 48 వేల కోట్లు. వచ్చే నాలు గేళ్ల ప్రణాళికా నిధులన్నింటినీ హైదరాబాద్‌కే కేటాయించినా ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలుకే సరిపోవు. ఇక జిల్లాలను ఏం పెట్టి అభివృద్ధి చేస్తారన్న ప్రతిపక్షాల విమర్శను వినే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదు. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టు ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటనలు చెపుతున్నాయి. అలా యోచించాల్సిందే. అది ప్రభుత్వాల బాధ్యత కూడా. కానీ అలా ఆలోచించేటప్పుడు ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యతలను మరిచిపోకూడదని ఏలిన వారికి ఎవరు గుర్తు చెయ్యాలి? సారాయిని మళ్ళీ ప్రవేశ పెట్టాలనీ, మద్యం ఉత్పత్తికి సొంత డిస్టిలరీలను ఏర్పాటు చేసుకోవాలనీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. రాష్ర్టంలో అమ్ముడయ్యే చాలా బ్రాండ్ల మద్యాన్ని బయటి రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోడంవల్ల రాష్ట్రానికి ఆ పన్నులు రాకుండా పోతున్నాయని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. సొంత డిస్టిలరీల వల్ల ఆ మేరకు ఆదాయం పెరుగుదలతో పాటు, స్థానికులకు ఉపాధి లభిస్తుందని, మద్యం ధర కొంత తగ్గి వినియోగదారులకు కూడా లబ్ధి కలుగుతుందని ఆయన మూడు లాభాలు చూపించారట. సింగపూర్, డాలస్లకు రహదారి సంపూర్ణ మద్య నిషేధం ఏ ప్రభుత్వం తరమూ కాదని, మన దేశంలోనే కాక, అమెరికా వంటి దేశాల్లో కూడా గతంలో తేలిపోయింది. అయితే, వీలైనంత మేరకు ఈ వ్యాపారాన్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించడం పాలకుల బాధ్యత. అది మరిచి, మనుషుల బలహీనత మీద జరిగే ఈ వ్యాపారం ద్వారా ఆదాయం పెంచుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన తెలంగాణ ప్రభుత్వా నికి రావడం విచారకరం. సీఎం కేసీఆర్ మొన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సర్కారీ సారాయి మళ్ళీ ప్రవేశపెట్టే ఆలోచన బయట పెట్టారు. అక్రమ సారాయి అంటే గుడుంబాను అరికట్టడం కోసమే ఈ ప్రతిపాదన విషయం యోచిస్తున్నామని ఆయన వివరణ. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ సారాయిని ‘వారుణి వాహిని’ పేరిట అందమైన, ఆకర్షణీయమైన సీసాలలో అందించి అమ్మకాలను పెంచడం తెలిసిందే. అప్పుడు సైతం తెలంగాణ పల్లెల్లో, హైదరాబాద్ పాత బస్తీలో, ముఖ్యంగా ధూల్‌పేట ప్రాంతంలో గుడుంబా తయారీ జరగలేదా? ప్రభుత్వ సారాయితో గుడుంబా దందా దానికదే మూత పడుతుందా? తెలంగాణలో ఎక్కడెక్కడ గుడుంబా స్థావరా లున్నాయో ఆబ్కారీ అధికారులకు తెలియదా? ఆ శాఖను సరిగా పని చేయించి, గుడుంబాను సమూలంగా నిర్మూలించాల్సింది పోయి...మళ్ళీ చట్ట బద్ధంగా సారాయిని ప్రవహింపజేయాలని ముఖ్యమంత్రి భావించడం దురదృష్టం. వరంగల్ జిల్లా గరీబ్‌నగర్‌లో మహిళలు మళ్ళీ ప్రభుత్వ సారాయి తేవాలని అడిగారనో, అక్రమ సారాయి, కల్తీ సారాయి తాగి ప్రజలు ఆరో గ్యాలు పాడు చేసుకుంటున్నారనో తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సారాయి వ్యాపారంలోకి దిగబోతోందనుకుంటే పొరపాటు. సారాయిని ఒక ఆదాయ మార్గంగా చూస్తున్నందువల్లే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయనడంలో సందేహమే అక్కరలేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోకి కల్లు తిరిగి ప్రవేశించింది. సీఎం కేసీఆర్ చెప్పినట్టు కొన్ని రోజుల్లో ప్రభుత్వం ఒక చర్చ జరిపి, ఒక విధానాన్ని రూపొందించి ప్రభుత్వ సారాయిని ప్రవేశ పెట్టేస్తుంది. ప్రభుత్వమే స్వయంగా మద్యం ఉత్పత్తి చేపట్టబోతున్నది కాబట్టి ఇక తెలంగాణ ప్రజలకు తాగినోళ్లకు తాగినంత, ప్రభుత్వానికి హైదరాబాద్‌ను సింగపూర్, లండన్, డల్లాస్ నగరాల స్థాయికి చేర్చే ఆకాశ హర్మ్యాలను కట్టడానికి కావలసినంత ఆదాయం. దారి తప్పుతున్న ప్రాధాన్యాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 20 సంవత్సరాల క్రితమే సంపూర్ణ మద్యనిషేధం అమలు అసాధ్యం అని రుజువువైంది. రాష్ట్రమంతా సారాయిని పారించిన ఎన్టీఆర్ 1994లో మద్యనిషేధం నినాదాన్ని ఎవరి ప్రోద్బలంతో తలకెత్తుకు న్నాడో అందరికీ తెలుసు. ఆయనను గద్దెదించిన చంద్రబాబు నాయుడు మద్య నిషేధాన్ని ఎత్తెయ్యడం వెనక కూడా అవేశక్తులు పనిచేసాయనీ తెలి సిందే. సాధ్యమైనంతవరకు మద్యపానంపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించ డానికి ప్రయత్నించడం లేదా ఆ ప్రయత్నం చేస్తూనే మద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చెయ్యడం ప్రభుత్వాల బాధ్యత. ఆదాయాలు పెంచుకుని ఆకాశహర్మ్యాలు నిర్మించాలి కాబట్టి మద్యం ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆలోచించడం అన్యాయం. ప్రజలకు ఏం కావాలి? మనం ప్రజలకు ఏం ఇవ్వాలి? అనే విషయాలను గురించి ప్రభుత్వాలు జాగ్ర త్తగా ఆలోచించాలి. అక్కడే ప్రాధాన్యతల ప్రసక్తివస్తుంది. ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం దారి తప్పుతున్నదని పెద్దలంటున్నారు. మొన్న శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లో తెలంగాణ విద్యావం తుల వేదిక (తెవివే) 5వ రాష్ర్ట మహాసభలు జరిగాయి. సభలను ప్రారం భిస్తూ ప్రఖ్యాత సామాజిక ఉద్యమనేత స్వామి అగ్నివేష్ ఫిలింసిటీలా, రైతుల ఆత్మహత్యలు ఆపడమా? ఏది ముఖ్యం? అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం దారి తప్పుతున్నదనడానికి ఆ మాటలు చాలు. తెవివే కూడా సభల ముగింపు సందర్భంగా ఫిలింసిటీలు, ఫార్మాసిటీలు వద్దని హితవు పలుకుతూ తీర్మానాలు చేసింది. తెవివే, స్వామి అగ్నివేష్‌లు తెలం గాణ రాష్ర్ట ఉద్యమంలో అధికార పార్టీ టీఆర్ఎస్ వెంట, దాని నాయకుడూ, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వెన్నుదన్నుగా నిలిచిన వారేనని మరువ కూడదు. ప్రతిపక్షాల మాట వినకపోతే పోయారు కనీసం అగ్నివేష్ మాటల యినా ఆలకించండి. విద్యావంతుల వేదిక వినతి అయినా వినండి. datelinehyderabad@gmail.com