అవినీతి అధినేతల మాటేమిటి? | devulapalli amar write on dateline | Sakshi
Sakshi News home page

అవినీతి అధినేతల మాటేమిటి?

Published Wed, Sep 7 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

అవినీతి అధినేతల మాటేమిటి?

అవినీతి అధినేతల మాటేమిటి?

డేట్‌లైన్ హైదరాబాద్
 
ఉక్రోషానికి పోరుు తెలంగాణ  ప్రభుత్వం మీద విరుచుకుపడి నాకూ ఏసీబీ ఉంది, నాకూ పోలీసు శాఖ ఉంది, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్‌స్టేషన్‌లు పెడతా అని స్థారుు మరచిన ప్రకటనలు చేశారు తప్ప, తనకు ఈ కేసుతో సంబంధం లేదని రుజువు చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. మండలికి సభ్యులు ఎన్నిక కావడం అన్నది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. దానికి విఘాతం కలిగించే విధంగా ఎంఎల్‌ఏలను కొనుక్కునే పథక రచన చేసి, ఆడియో టేప్‌లలో దొరికిన చంద్రబాబును కేసులో నిందితుడిగా ఎందుకు చేర్చలేదు?
 
 ‘ఈరోజుల్లో 30 ఏళ్లకే సుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ వంటి జబ్బులొస్తున్నారుు. అలాంటప్పుడు లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించి ఏం చేసు కుంటారు...?’ శిక్షణ పొందుతున్న పబ్లిక్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి పదిరోజుల నాడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్న మాటలివి. సెంట్రల్ సర్వీస్ అధికారులకు 91వ ఫౌండేషన్ కోర్స్ ప్రారంభిస్తూ గవర్నర్ ఈ మాటలు అన్నారు. ఆ సమయంలోనే, హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఒక అవినీతి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాత్ర మీద దర్యాప్తు జరిపి నెలరోజుల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ  రాష్ట్ర అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. అందరూ ఊహించినట్టుగానే చంద్రబాబునాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఎనిమిది వారాల స్టే తెచ్చుకున్నారు.
 
 ఆ గొంతు ఆయనదే అయినా....
 ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే, పదిహేను మాసాల క్రితం తెలంగాణ  అవినీతి నిరోధక శాఖ ఒక కేసులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని, టీఆర్‌ఎస్ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌కు 50 లక్షల రూపాయలు బయానా ఇస్తూ, మరో మూడున్నర కోట్లు త్వరలో ఇస్తామని చెపుతూ ఆడియో వీడియో టేప్‌లలో దొరికిపోరుు జైలుకు పోయాడు. మరో శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కూడా ఈ కేసులో తరువాత అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్లి బెరుుల్ మీద తిరిగొచ్చాడు. మరో నిందితుడు మత్తయ్యను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆశ్రయం ఇచ్చి జైలుకు పోకుండా కాపాడారు. ఈ సంఘటనలో రేవంత్‌రెడ్డి, సంద్ర వెంకటవీరయ్య, మత్తయ్య వగైరా వగైరాలంతా పావులు మాత్రమే.
 
 ఎంఎల్‌ఏలను కోట్ల రూపాయల డబ్బు ఇచ్చి కొని ఎంఎల్‌సీ ఎన్నికలు గెలవాలని పథకం రచించినదీ, కార్యాచరణకు ఆదేశించినదీ సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది జగమెరిగిన సత్యం. సెబాస్టియన్ అనే మరో తెలుగుదేశం నాయకుడు కలిపి ఇచ్చిన ఫోన్‌లో చంద్రబాబునాయుడు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడుతూ మనవాళ్లు నాకు అంతా చెప్పారు, నేను మీకు అండగా ఉన్నాను, భయంలేదు ముందుకు వెళ్లండి అని తనదైన శైలిలో, ఇంగ్లిష్‌లో చెప్పిన విషయం రికార్డు అరుుంది.
 
 ఆ గొంతు ఆయనదేనని అందరికీ తెలుసు. ఆయన కూడా ఎంతసేపూ నా ఫోన్ ట్యాప్ చేస్తారా అని హూంకరించారే తప్ప అది నా గొంతు కాదు అని ఒక్కసారి కూడా అనలేదు. ఉక్రోషానికి పోరుు తెలంగాణ  ప్రభుత్వం మీదా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదా విరుచుకుపడి నాకూ ఏసీబీ ఉంది, నాకూ పోలీసు శాఖ ఉంది, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్‌స్టేషన్‌లు పెడతా అని స్థారుు మరచిన ప్రకటనలు చేశారు తప్ప తనకు ఈ కేసుతో సంబంధం లేదని రుజువు చేసుకునే ప్రయత్నం ఒక్కటీ చెయ్యలేదు. శాసనసభ నుండి మండలికి సభ్యులు ఎన్నిక కావడం అన్నది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. ఆ ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే విధంగా కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా వెదజల్లి ఎంఎల్‌ఏలను కొనుక్కునే పథక రచన చేసి, ఆడియో టేప్‌లలో దొరికిపోరుున చంద్రబాబునాయుడును కేసులో నిందితుడిగా ఎందుకు చేర్చ లేదన్నది ప్రశ్న.
 
 ఏమైపోయాయా గర్జనలు?
 ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంకో రాష్ట్రంలో జరిగిన వ్యవహారంలో నింది తుడిగా చేర్చడానికి ఏమరుునా విధివిధానాలు ఉంటే వాటిని అనుసరించే తెలంగాణ  ఏసీబీ చంద్రబాబునాయుడును నిందితుల జాబితాలో చేర్చి ఉండాలి. ఈ సంఘటన జరిగిన తొలి రోజుల్లో తెలంగాణ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు జైలుకు వెళ్లకుండా బ్రహ్మదేవుడు కూడా రక్షించ లేడు అన్నారు. ఆ తరువాత అంతా నిశ్శబ్దం. ఓటుకు కోట్లు కేసు ప్రస్తావన వస్తే చాలు తెలంగాణలో అధికారపక్షం టీఆర్‌ఎస్ నాయకులు పైస్థాయి నుంచి కింది దాకా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని పక్కకు తప్పుకుంటున్నారు.
 
 ఏసీబీ దర్యాప్తులో కూడా మొదలుపెట్టినప్పుడు ఉన్న వేగం తగ్గి మందకొడిగా సాగింది. అంతేకాదు వీరి నుండి వారికి, వారి నుండి వీరికి ఆహ్వానాలు, వీరు అమరావతికి వెళ్లి స్నేహహస్తం చాచి వస్తే, వారు యాగాలకు హాజరై సుహృద్భావాన్ని ఆధ్యాత్మికంగా ప్రకటించిపోతారు. ఇదంతా చూస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల అధినేతల మధ్య సత్సంబంధాలు చూసి మురిసి ముక్కలరుు పోతుంటారు.
 
 అంతేకాదు, ఇరువురు ముఖ్యమంత్రులు గవర్నర్‌గారి దగ్గర కూర్చుని సమస్యను పరిష్కరించుకున్నారు కదా ఇంకా దాని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని కొందరు బీజేపీ నాయకులు అంటుంటే, నిన్నటికి నిన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా తన మిత్రుడు చంద్ర బాబునాయుడుకు క్లీన్‌చిట్ కూడా ఇచ్చేశారు. ‘‘చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదు, ఆయనకు సంబంధించిన విచారణ ప్రతిపాదనలు ఏవీ కేంద్రం వద్ద లేవు, ఇవన్నీ చౌకబారు రాజకీయాలు’’ అని ఒక దినపత్రిక, టీవీ చానల్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడుగారి మరో ఆత్మబంధువు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ గత వారం తిరుపతిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సీబీఐ అంటే భయపడుతున్నారా, ఏమన్నా లొసుగులు ఉంటే భయపడాలి, మీకేమన్నా లొసుగులున్నాయా అని బాబును ఉద్దేశించి అన్నారు. దానికి వెంకయ్య నాయుడు గారు జవాబు ఇచ్చేశారు. పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారు, వెంకయ్య నాయుడు జవాబు ఇస్తారు. చంద్రబాబు సంతోషిస్తారు. సమాజం ప్రేక్షక పాత్ర వహించాలని ఆ ముగ్గురూ అనుకుంటారు.
 
 ఓటుకు కోట్లు ఆషామాషీ వ్యవహారమా?
నిజమే, చంద్రబాబును విచారించడానికి కేంద్రం దగ్గర దరఖాస్తులేవీ పెండింగ్‌లో లేవు. అంతమాత్రాన ఓటుకు కోట్లు వ్యవహారం ఆషామాషీ విషయంగా భావించాలా? ఈ వ్యవహారాన్ని ఎవరో రోడ్డున పోయే జులా యిలు ఒక గొప్ప స్టేట్స్‌మన్ మీద చేసిన ఆకతారుు ఫిర్యాదుగా కేంద్రంలో పెద్దలు చూస్తున్నారా? వెంకయ్యనాయుడుగారి ప్రకటన వింటే అట్లాగే అనిపిస్తుంది. ముందే చెప్పినట్టుగా చంద్రబాబునాయుడు ఈ కేసుతో తనకు సంబంధం లేదని నిరూపించుకునే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. ఇదే కాదు ఆయన ఏ కేసులోనూ ఆ ప్రయత్నం చెయ్యరు. ఆ కేసులు కొట్టేయా ల్సిందిగా కోర్టులను కోరతారు. స్టేలు తెచ్చుకుంటారు. ఏళ్ల తరబడి స్టేల మీద గడిపేస్తుంటారు.
 
 ప్రజాక్షేత్రంలో ఉన్న ఏ నాయకుడూ చెయ్యకూడని పని అది. ప్రజా బలం కలిగిన నాయకులు ఎవరరుునా ధైర్యంగా నిలబడి విచారణను ఆహ్వానించి తన నిర్దోషిత్వం నిరూపించుకుంటారు. చంద్రబాబు ఆ పని ఎందుకు చెయ్యరు? రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌గారు కేంద్ర సర్వీస్‌ల అధికారులకు నీతిమంతంగా ఉండండని సుద్దులు చెప్పి నట్టుగానే చంద్ర బాబును కూడా మీ నిర్దోషిత్వం నిరూపించుకోండి అని ఎందుకు హితవు చెప్పరో అర్థంకాదు.

అవినీతి రహిత పాలన అందించడం మా లక్ష్యం ‘‘అచ్చే దిన్ వచ్చేశారుు’’ అని చెపుతున్న కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన గల ఎన్‌డీఏ ప్రభుత్వానికి తెలంగాణ  రాష్ట్రంలో జరిగిన ఓటుకు కోట్లు వ్యవహారం అవినీతి కార్యక్రమంగా కనిపించడం లేదా? నీతివంతమైన పాలన ఇస్తామన్న కేంద్రం తన ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఈగ వాలకుండా చూసుకుంటుంది సరే, మరి ప్రశ్నిస్తాను, ప్రశ్నిస్తాను అని పదే పదే మాట్లాడి ఆవేశపడే పవన్ కల్యాణ్ తిరుపతిలో బహిరంగ సభ పెట్టి ఒక్క ప్రత్యేక హోదా గురించి మాత్రమే ఎందుకు ప్రశ్నించారు? ఆవేశ పడిపోయారు? ఆయన రాజకీయాల్లో ఉన్నానని అంటున్నారు, జనసేన పార్టీని పూర్తి స్థారుు రాజకీయ పార్టీగా నడిపిస్తానని చెపుతున్నారు.
 
 అటు వంటి నాయకుడికి ఓటుకు కోట్లు వ్యవహారంతో సహా అన్ని విషయాల మీదా స్పష్టమరుున అవగాహన ఉండాలి కదా! తప్పులన్నిటినీ ఎత్తి చూపాలి కదా, వ్యతిరేకించాలి కదా! ఒక్క ప్రత్యేక హోదా కోసమే ఆయన రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వచ్చి ఆ పని అరుుపోతే మళ్లీ వెనక్కి వెళ్ళిపోతారా? ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఇటువంటి చేష్టలు చూసినప్పుడు! చంద్రబాబు నాయుడును, టీడీపీ పార్టీని రక్షించడానికే పవన్ కల్యాణ్ రాజకీయ ధ్యేయ మైతే త్వరలోనే ఆయన పశ్చాత్తాపపడే రోజు వస్తుంది.
 

దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement