Cash for vote scam
-
చంద్రబాబే నాతో మాట్లాడారు.. ప్రత్యేక కోర్టులో స్టీఫేన్
హైదరాబాద్: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలంటూ తనను ప్రలోభ పెట్టాడని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఫోన్లో నేరుగా తనతో మాట్లాడారని, ‘మనవాళ్లు అంతా బ్రీఫ్ చేశారు, వాళ్లు చెప్పినట్లు చేయాలి’ అని కోరారని.... తానున్నానని, వాళ్లు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని వివరించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్సన్ గురువారం ప్రత్యేక కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ కన్వీనర్‌గా పరిచయం చేసుకున్న సెబాస్టియన్...చంద్రబాబునాయుడుతో ఫోన్లో మాట్లాడించారని తెలిపారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఎంత డబ్బు కావాలో చెబితే చంద్రబాబునాయుడు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సెబాస్టియన్ చెప్పినట్లు వివరించారు. రేవంత్‌రెడ్డి వస్తారని సెబాస్టియన్ చెప్పారు.. ‘‘2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసే విషయంలో చంద్రబాబునాయుడు నేరుగా మాట్లాడాలను కుంటున్నారని ఆంథోనీ అనే వ్యక్తి ద్వారా హ్యారీ సెబాస్టియన్ నన్ను సంప్రదించారు. చంద్ర బాబునాయుడు ప్రతినిధిగా పార్టీలో కీలకమైన వ్యక్తి వస్తేనే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. దీంతో చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా రేవంత్‌రెడ్డి మాట్లాడడానికి వస్తారని చెప్పారు’’ అని స్టీఫెన్సన్ వివరించారు. లంచం తీసుకోవడం ఇష్టం లేదని, దీంతో వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించానని తెలిపారు. రూ.50 లక్షలు అడ్వాన్స్ అని చెప్పారు.. ‘‘ఏసీబీ అధికారులు మేము ఉన్న ఫ్లాట్‌లో ఐఫోన్‌ను, ఇతర ఆడియో, వీడియో పరికరాలను ఏర్పాటు చేశారు. 2015 మే 30న రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలు నేను ఉన్న ఫ్లాట్‌కు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తాం. అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇస్తున్నాం. మిగిలిన డబ్బు ఓటింగ్ తర్వాత ఇస్తాం అని చెప్పారు. ఇందులో భాగంగా రూ.2.5 లక్షలుగా ఉన్న 500 రూపాయల బండిళ్లు 20 టీపాయ్ మీద పెట్టారు. వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి రేవంత్‌రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు’’ అని స్టీఫెన్సన్ వివరించారు. ఈ మేరకు ఆయన వాంగ్మూలాన్ని పాక్షికంగా నమోదు చేసిన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు....తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేశారు. రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై అభ్యంతరం.. ఇదిలా ఉండగా ఇదే కేసులో మరికొందరు సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయ్యే వరకూ స్టీఫెన్సన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను ఆపాలంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 7కు వాయిదా వేశారు. ఉదయసింహ అప్పీల్ కొట్టివేత.. మరోవైపు ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ తాను దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మరో నిందితుడు ఉదయసింహ దాఖలు చేసుకున్న అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే ప్రత్యేక కోర్టు డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసిందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. -
అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్!
సాక్షి, అమరావతి : తీవ్ర సంచలనం సృష్టించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న డేటా స్కాం బాగోతంలో సీఎం చంద్రబాబునాయుడు.. నాడు ఓటుకు కోట్లు కేసులో వ్యవహరించినట్లుగానే నేడు కూడా అచ్చు అలాగే అడుగులేస్తున్నారు. అప్పట్లో పోలీసులతో పోటీ రాజకీయం నడపినట్లుగా ఇప్పుడు కూడా డేటా స్కాంలోనూ అలాగే చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ.. కోట్లాది మంది పౌరుల రహస్య సమాచారాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) తప్పించుకునేందుకే ‘సిట్’ ఏర్పాటు ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఓటుకు కోట్లు కేసు తరహాలోనే మళ్లీ దీనిపై కూడా ‘సిట్’ ఏర్పాటుచేయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. 2015లో వెలుగుచూసిన ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పన్నిన ఎత్తుగడనే ప్రస్తుత డేటా స్కాం విషయంలోనూ అవలంబిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య తెలంగాణ పోలీసులకు చిక్కితే ఇబ్బందులు తప్పవని భావించిన చంద్రబాబు.. ఏపీలో అతనికి షెల్టర్ ఇచ్చినట్లు విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై ఎదురు కేసులు పెట్టించి ‘సిట్’ ఏర్పాటుచేశారు. అదే సమయంలో చంద్రబాబు తన మకాన్ని హుటాహుటిన విజయవాడకు మార్చారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ‘బ్రీఫ్డ్ మీ..’ వాయిస్ ఆయనదిగానే నిర్ధారణ అయింది. (‘ఐటీ గ్రిడ్స్’కు సిట్ తాళం) మత్తయ్య తరహాలోనే అశోక్‌కు ఆశ్రయం? ఇదిలా ఉంటే.. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కాంకు పాల్పడిందని బట్టబయలు కావడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ఈ బాగోతంలోనూ ఆయన పోలీసులను ప్రయోగించి విమర్శలపాలయ్యారు. డేటా స్కాం బయటపడిన రాత్రికిరాత్రి ఏపీ పోలీసులను హైదరాబాద్ పంపి హడావుడి చేయించడం చేతులు కాల్చుకున్నట్లయ్యింది. మరోవైపు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన ఐటీ గ్రిడ్స్ అధినేత దాకారపు అశోక్‌కు కూడా గతంలో మత్తయ్యకు మాదిరిగానే ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే రాజకీయంగా చంద్రబాబు, లోకేశ్‌లు ఇబ్బందులు తప్పవనే భయంతో అతన్ని ఏపీ పోలీసుల కస్టడీలో రహస్య ప్రాంతంలో ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. అశోక్ వద్ద కీలకమైన మూడు హార్డ్ డిస్క్‌లు, ఐఫోన్ దొరికితే డేటా స్కాం కేసులో గుట్టురట్టవుతుందని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ పోలీసుల దర్యాప్తును అడ్డుకునే అవకాశంలేక ఏపీ పోలీసులను రంగంలోకి దించి ఇది రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓట్లు తొలగింపులపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పోలీసులకు ఫిర్యాదులు చేయించారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో కూడా తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేయించడం గమనార్హం. రెండు సిట్లు ఏర్పాటు.. కాగా, ఐటీ గ్రిడ్స్ డేటా స్కాంతో ఇప్పటికే కలవరపడుతున్న ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ సర్కార్ సిట్ ఏర్పాటుచేయడంతో ఇక్కడ కూడా హడావుడిగా గురువారం రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్) ఏర్పాటుచేసింది. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ రాజధానిలో పెట్టిన కేసును విచారించేందుకు ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ఏడీజీ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఒక సిట్‌ను, ఫారం–7 ద్వారా ఓట్ల తొలగింపు ప్రయత్నాలపై దర్యాప్తునకు లీగల్ ఐజీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో రెండో సిట్‌ను నియమించారు. -
ఓటుకు కోట్లు కేసు.. మరో సాక్ష్యం
-
మా ప్రశ్నలకు చంద్రబాబు జవాబు చెప్పాలి
-
ఓటుకు కోట్లు : ఏది జరిగినా మీరే బాధ్యులు..!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో గురువారం మరో వీడియో బయటపడింది. స్పై కెమెరాలకు సమాంతరంగా ఏసీబీ ఏర్పాటు చేసిన ఫోన్ కెమెరాలో తాజా వీడియో రికార్డయింది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే, ఆంగ్లో ఇండియన్ ఎల్విస్ స్టీఫెన్సన్ను కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్లకు బేరం కుదిరినట్టు ఈ వీడియో లో స్పష్టమైంది. టీడీపీ నేత సెబాస్టియన్, స్టీఫెన్‌సన్‌తో.. ‘తొలుత బాబు గారు 3.5 కోట్లు ఇవ్వడానికే ఒప్పుకున్నారు. నా ఒత్తిడి మేరకు రూ. 5 కోట్లు ఇవ్వడానికి సరేనన్నారు’ అని మాట్లాడారు. అదే సమయంలో.. రేవంత్‌రెడ్డి బయటకు వెళ్లిన తర్వాత స్టీఫెన్సన్కు ముట్టజెప్పే సొమ్ములో తన కొచ్చే కమీషన్ గురించి కూడా సెబాస్టియన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. (సార్ ఎవరు? ) ఈ వ్యవహారంలో మధ్యవర్తులు ఉన్నట్టు వారి మధ్య జరిగిన సంభాషణ ద్వారా వెల్లడైంది. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రేవంత్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఈ వీడియో ముగుస్తుంది. కాగా, ఈ డీల్ సమయంలో స్టీఫెన్సన్కు ఇచ్చిన రూ.50 లక్షల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెండ్ డెరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించినది ఎవరేనేది కూడా విచారణలో తేలనుంది. గత నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజా వీడియోతో విచారణ వేగం కావొచ్చని పలువురు భావిస్తున్నారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) కాగా,‘ఓటుకు కోట్లు’ కేసులో ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలతో పాటు మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్ రెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) తాజా వీడియో ఆధారంగా సంభాషణ.. స్టీఫెన్సన్ : లెటస్ గో టు ది డీల్.. సెబాస్టియన్ : నిజానికి బాబు ముందు 3.5 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పారు. నా ఒత్తిడి మేరకు రూ.5 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డిని మీరు నమ్ముతున్నారు. బాబు నన్ను నమ్ముతున్నారు. మీరు రేవంత్ రెడ్డిని నమ్మడంతో ఆయన తెరమీదకు వచ్చారు. ఏది జరిగినా మీరే బాధ్యులు.. ఓకే సార్. సంబధిత వార్తలు.. దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు -
‘చంద్రబాబును చూసి సిగ్గుతో చచ్చిపోతున్నాం’
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు తమ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడంతో ఆయన స్పందించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... తప్పు ఒప్పుకుని తెలుగుజాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసుపై త్వరితగతిన నిష్పక్షపాత విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మనీ, మీడియా, మానిపులేషన్‌లతో చంద్రబాబు మోసాలు చేస్తున్నారని మండిపడ్డారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలంటే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. భారత దేశ చరిత్రలో ఇంత నిసిగ్గుగా డబ్బులతో ఎదుటివారిని కొనేసి రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. నిజంగా చంద్రబాబుకు సిగ్గుండాలా. నాలుగేళ్ల క్రితం ఓటు కోట్లు కేసులో టీడీపీ నాయకులు ఆడియో, వీడియో టేపుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన వైనాన్ని దేశం యావత్తు చూసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రలోభాలకు దిగడంతో ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకున్నారు. (సార్ ఎవరు?) ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఫలానా నాయకుడు మా ముఖ్యమంత్రి అని గర్వంగా చెప్పుకునేట్టు ఉండాలి. మీ సీఎం ఎవరని అడిగితే చంద్రబాబు అని చెప్పటానికి సిగ్గుపడే పరిస్థితులు ఇవాళ కన్పిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాయి. తప్పు ఒప్పుకుని తెలుగు జాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. కోర్టులను అడ్డం పెట్టుకుని స్టేలు తెచ్చుకుని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును విచారణను వేగవంతం చేయాలి. చంద్రబాబు పట్ల కేసీఆర్ ఉదారంగా వ్యహరించడం సరికాదు. చట్టబద్ధంగా నిష్పక్షపాత దర్యాప్తు జరిపాల’ని అప్పిరెడ్డి అన్నారు. (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) -
ఆ కేసులో చంద్రబాబే ప్రధాన ముద్దాయి
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మఅన్నారు. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన ముద్దాయని ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చంద్రబాబు నాయుడు బేరసారాలకు దిగారని, ఈ విషయం ఈ రోజు బయటపడ్డ వీడియోలో స్పష్టంగా కనబడుతుందన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడినా..నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ చేసిన తప్పులను ఏపీ, తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో, వీడియోలో అడ్డంగా దొరికినా.. ఆ విషయంపై ఇప్పటికీ చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. రూ.కోట్లు కుమ్మరించి రేవంత్ టీమ్ ఎమ్మెల్యేను కొనేందుకు చూశారన్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు దేనికైనా తెగబడతారని ఆరోపించారు. చివరకు ఏపీ ప్రజల ఓట్లు కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనికి ఐటీ గ్రిడ్స్ డేటా చోరీయే నిదర్శనమన్నారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యలను తారుమారు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలను, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనను కచ్చితంగా ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. (దొరికిన దొంగ చంద్రబాబు) -
చంద్రబాబు గుట్టురట్టు..మరో సాక్ష్యం
-
‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఓటుకు కోట్లు కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని ఇంగ్లిష్ డెయిలీ డెక్కన్ క్రానికల్ ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో.. తార్నాకలోని మాల్కం టేలర్ అనే వ్యక్తి ఇంట్లో తీసిన వీడియో బయటికొచ్చింది. 11 నిముషాల నిడివి గల ఈ వీడియోలో టీడీపీ నేత సెబాస్టియన్, టీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసేందుకు బేరసారాలు నడిపారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సెబాస్టియన్ స్టీఫెన్‌సన్‌తో బేరం మాట్లాడినట్టు ఈ వీడియో ద్వారా తెలిసింది. (సార్ ఎవరు?) అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇవ్వడానికి నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వస్తాడని సెబాస్టియన్ చెప్పినట్టు ఈ వీడియోలో స్పష్టమైంది. తొలుత 3.5 కోట్లకే బాబు ఒప్పుకున్నారని, కానీ తన సిఫారసుతో 5 కోట్లకు డీల్ ఓకే అయిందని సెబాస్టియన్ స్టీఫెన్ సన్తో చెప్పిన విషయం వెల్లడైంది. మిగతా సొమ్ముకు తనదే బాధ్యత అంటూ సెబాస్టియన్ హామీయిచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఓటుకు కోట్లు కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం తెలియనుంది. ఇప్పటికే ఈ కేసులో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 సెబాస్టియన్, ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డి విచారణ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకమైన చంద్రబాబు– స్టీఫెన్సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టేపును ప్రఖ్యాతి గాంచిన చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. అయినా ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజాగా బయటపడిన వీడియో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి..! (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) సంబధిత వార్తలు : దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు -
ఓటుకు కోట్లు కేసులో మరో వీడియో సంచలనం
-
సార్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు సాగుతుండటం.. త్వరలోనే మరింతమంది కీలకమైన వ్యక్తులను విచారించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విచారణ రెండోరోజూ కొనసాగింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బషీర్‌బాగ్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వచ్చిన రేవంత్‌ను రాత్రి 7.45 గంటల వరకు అధికారులు సుదీర్ఘంగా విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్çసన్‌కు లంచంగా ఇవ్వజూపిన రూ.5 కోట్లపైనా, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపైనా ఈడీ అధికారులు ఆరాతీశారు. ఈ కేసులో ఇప్పటికే విచారించిన ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డిలు చెప్పిన విషయాల ఆధారంగా రూపొందించిన ప్రశ్నావళినే బుధవారమూ కొనసాగించారు. ఆ రూ.50 లక్షలు ఎలా వచ్చాయి? అవి ఇస్తానన్న సార్ ఎవరు? నగరానికి డబ్బు ఎలా వచ్చింది? ఇక్కడిదేనా లేక హవాలా రూపంలో వచ్చిందా? రూ.4.5 కోట్లు ఎక్కడుంచారు? అని ప్రశ్నించినట్లు తెలిసింది. వీడియోలో పదే పదే ప్రస్తావించిన సార్ ఎవరు? ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఏంటని ఆరా తీసినట్లు సమాచారం. మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై రేవంత్ ముక్తసరిగా సమాధానాలిచ్చినట్లు తెలిసింది. చాలావాటికి గుర్తులేదనే చెప్పినట్లు సమాచారం. రేవంత్ చెప్పే విషయాలను ధ్రువీకరించుకునేందుకు గతంలో కేసును విచారించిన ఐటీ, ఏసీబీ అధికారుల సహాయం తీసుకున్నారు. ఈడీ అధికారులు తమకు సందేహం వచ్చిన ప్రతీసారి పక్క గదిలో ఉన్న ఐటీ, ఏసీబీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చంద్రబాబుకు నోటీసులిచ్చే విషయం తెలియదు: రేవంత్‌రెడ్డి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తమపై వేధింపులకు పాల్పడుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విచారణ అనంతరం ఆయ న మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారన్నారు.‘ఈ కేసులో హైకోర్టు తీర్పులు ఇచ్చినా కూడా విచారణ పేరుతో వేధిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయింది. పార్లమెంటు ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీసేం దుకు కుట్ర జరుగుతోంది. చంద్రబాబుకు ఈ కేసులో నోటీసులు ఇస్తారా లేదా అన్నది అధికారులకే తెలుసు. ఈడీ అధికారుల ఇక్కడ విచారణ చేస్తున్నా..వారి గురి ఆ గట్టునే ఉంది. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పాను. కేసుతో సంబంధం లేని వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారు.’అని రేవంత్ పేర్కొన్నారు. -
మనవాళ్లు బ్రీఫ్డ్
-
ఏపీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు : మత్తయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓటుకు కోట్లు’కేసులో జెరూసలేం మత్తయ్య పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. పోలీసు రక్షణ కోరుతూ తెలంగాణ డీజీపీకి మత్తయ్య దరఖాస్తు చేసుకుంటారని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఏపీ సీఎం చంద్రబాబు బృందం కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల పేర్ల నుంచి మత్తయ్యను హైకోర్టు తొలగించడాన్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 2016లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యను ఆదేశిస్తూ 2017 జనవరి 16న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. తొలుత మత్తయ్య తరఫున తాను వకాల్తా పుచ్చుకున్నానని, 2 వారాల సమయం కావాలని న్యాయవాది సుప్రియ నివేదించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున హరీన్ పి.రావల్ వాదనలు వినిపిస్తూ అనేక కారణాలతో తరచూ వాయిదా అడుగుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తదుపరి తాను తప్పనిసరిగా కౌంటర్ దాఖలు చేయడంతోపాటు వాదనలు వినిపిస్తానని న్యాయవాది నివేదించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. నన్ను పోలీసులు అడ్డుకున్నారు విచారణ ముగిసిన కొద్దిసేపటికి మత్తయ్య కోర్టులోకి వచ్చారు. తనను కోర్టులోకి రానివ్వకుండా ఏపీ పోలీసులు అడ్డుకున్నారని, తన గుర్తింపు కార్డు లాక్కున్నారని, అందుకే లోనికి తొందరగా రాలేకపోయానని, తన కేసులో ఎవరినీ న్యాయవాదిగా పెట్టలేదని, తానే వాదిస్తానని కోరారు. ‘నాకు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదు. ఈ కేసులో నా పాత్ర లేదు. దానిపై నేనే స్వయంగా వాదనలు వినిపించుకుంటానని న్యాయస్థానానికి విన్నవించుకున్నాను’అని తెలుగులో నివేదించారు. అంతకుముందు మత్తయ్య తరపున హాజరైన న్యాయవాదిని జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రశ్నించగా పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ గుంటూరు ప్రభాకర్ ‘ఇదిగోండి.. నిన్న తానే నా చాంబర్‌కు వచ్చి మత్తయ్య సంతకం చేసి ఇచ్చిన కాగితం. నన్నే వాదించమన్నారు’అంటూ నివేదించారు. ‘నేను ఎవరినీ కలవలేదు. నేను అడ్వొకేట్‌ను పెట్టుకునే అవకాశం ఉంటే నేనే పార్టీ ఇన్ పర్సన్‌గా ఎలా వాదించుకుంటానని దరఖాస్తు పెట్టుకుంటాను’అని మత్తయ్య వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ముందుగా వచ్చిన న్యాయవాది వకాల్తాను ధర్మాసనం రద్దు చేసింది. నాకు రక్షణ లేదు.. తాను వాదనలు వినిపించేందుకు కోర్టులోకి వస్తుంటే ఏపీ పోలీసులు అడ్డుకున్నారని, తనకు రక్షణ కావాలని, హైదరాబాద్‌లో కూడా రక్షణ లేదని కోర్టుకు విన్నవించారు. అయితే ఇక్కడ పోలీసులు ఎందుకు ఉంటారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాది హరీన్ రావల్ మాట్లాడుతూ.. ‘ఏపీ పోలీసులు అడ్డుకున్నారని మత్తయ్య చెబుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది. దీనిపై విచారణకు ఆదేశించండి. న్యాయస్థానానికి రాకుండా ఆపడం ఎంతవరకు సమంజసం’అని పేర్కొన్నారు. నాతో ఫిర్యాదు చేయించినవారెవరో చెబుతా: మత్తయ్య విచారణ అనంతరం మత్తయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజకీయ ఎత్తుగడలకు నేను బలయ్యాను. కొన్ని ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు వాడుకున్నాయి. ఒక పార్టీలో ఉన్న క్రైస్తవ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ఇంకో పార్టీలోని క్రైస్తవులను బలి పశువులుగా చేసేందుకు కుట్ర చేశారు. మమ్మల్ని పావులుగా వాడుకుంటున్న టీడీపీ పార్టీ గానీ, టీఆర్ఎస్లోని క్రైస్తవులకు గుర్తింపు లేకుండా పోయింది. ఇద్దరు చేసిన తప్పులను, రాజకీయ పార్టీల కుట్రలను ధర్మాసనం ముందు చెబుతా. ఇప్పటికీ నా వెంట పోలీసులు ఫాలో అవుతున్నారు’అని వివరించారు. ‘నాపై తప్పుడు ఆరోపణలు పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో డబ్బులు ఇచ్చింది ఒక పార్టీ.. తీసుకున్నది మరో పార్టీ.. నాపై ఎందుకు కేసు పెట్టారు. ఎవరు నా పేరు పెట్టాలని ఒత్తిడి చేశారు? టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎవరు నాతో ఫిర్యాదు చేయించారు.. అన్నీ న్యాయస్థానానికి చెబుతా’అని వివరించారు. చర్యలు తీవ్రంగా ఉంటాయి: ధర్మాసనం కోర్టుకు రాకుండా అడ్డుకోవడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే జోక్యం చేసుకుంటూ ‘మీ రాజకీయాలు ఏమున్నాయో మాకు తెలియదు. కానీ పోలీసులు ఇలా సుప్రీంకోర్టుకు రాకుండా అడ్డుకోవడం చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఎవరైనా నిరోధించినట్లు తేలితే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం’అని పేర్కొన్నారు. మత్తయ్యకు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను నవంబర్ 22కు వాయిదావేసింది. -
కదులుతున్న డొంక
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు మళ్లీ కదులుతోంది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై విచారణ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయపన్ను శాఖ అధికారులకు ‘ఓటుకు కోట్లు కేసు’మూలాలు లభించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అందులో భాగంగానే రేవంత్‌రెడ్డితో పాటు ఓటుకు కోట్లు కేసులో సహ నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లో తనిఖీలు జరిపారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ముట్టజెప్పిన సందర్భంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక శాఖ అధికారులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తాము పట్టుకున్న రూ.50 లక్షలను న్యాయస్థానం అనుమతితో ఆదాయపన్ను శాఖకు అందజేశారు. ఈ కేసులో కీలకమైన చంద్రబాబు– స్టీఫెన్సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టేపును ప్రఖ్యాతి గాంచిన చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. అయినా ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. అయితే, స్టీఫెన్సన్కు ఇచ్చిన డబ్బులు, ఇస్తామన్న డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు చేసి వివరాలు ఇవ్వాలంటూ అవినీతి నిరోధక శాఖ ఈడీకి లేఖ రాసింది. అయినప్పటికీ, దాదాపు రెండున్నరేళ్లపాటు ఈడీ ఎటువంటి విచారణ జరపలేదు. దీంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పోలీసు శాఖ ఇటీవల ఈడీ డైరెక్టర్‌కు లేఖ రాయడంతో.. విచారణ ఎక్కడా ఆగిందో తెలుసుకుంటామని సమాధానం ఇచ్చింది. వెంటనే ఓ అధికారుల బృందాన్ని ఏర్పాటుచేసి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. విచారణలో ఈడీయే బిత్తరపోయే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విదేశీ బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇక్కడి బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్టుగా దర్యాప్తులో తేలింది. తీగ లాగితే డొంక కదలినట్లు కోట్లాది రూపాయల వ్యవహారం బయటపడటంతో.. గుట్టుచప్పుడు కాకుండా గురువారం ఉదయం రేవంత్‌తో పాటు ఈ కేసులో సహ నిందితులైన సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా, విదేశీ బ్యాంకుల నుంచి నిధులు తరలించిన ఘటనలో ప్రముఖుల హస్తం ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. వారు ఎవరో అనే విషయం తెలుసుకునే పనిలో ఈడీ నిమగ్నమైంది. -
ఐటీ దాడులు
-
ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా?
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు కోట్లు’ కేసులో ఏ1 రేవంత్ రెడ్డి, ఏ2 సెబాస్టియన్లు లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ దాడుల నిర్వహించింది. ఓటకు నోటు విషయంలో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఇచ్చిన 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ముందస్తు అంగీకారం ప్రకారం ఇచ్చిన రూ 50 లక్షలతో పాటు ఇవ్వాలనుకున్న నాలుగున్నర కోట్ల విషయంపైనా ఐటీ అధికారులు దృష్టి సారించారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన భూపాల్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌పైనా అధికారులు తనీఖీలు చేస్తున్నారు. గత కొంత కాలంగా ఓటుకు కోట్లు కేసు నత్తనడకన నడుస్తోందని, కేసు నీరుగారుతుందంటూ విమర్శలు వినిపిస్తున్నా తరుణంలో ఐటీ దాడులు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. గురువారం ఉదయం నుంచి చేపట్టిన ఐటీ సోదాల్లో అసలు దోషులు బయటకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర, ఆడియో టేపు (బ్రీఫ్డ్ మీ), ఆయన డైరెక్షన్‌పై కూడా విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవిలపై దర్యాప్తు చేయాల్సిందిగా ఈ నెల 13న ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఐటీ శాఖకు లేఖ రాశారు. ఏసీబీ లేఖ అందగానే ఆదాయపు పన్ను శాఖ పని ప్రారంభించింది. ( బ్రేకింగ్: రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు ) చంద్రబాబు నాయడు 2014లో అధికారంలోకి రాగానే మొట్టమొదట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ‘ఓటుకు కోట్లు’ వ్యవహారానికి తెరలేపి తన మార్కు ఫార్టీ ఫిరాయింపుల పర్వానికి తెరతీశారు. ఓటుకు నోటు కేసు మూడేళ్ళ క్రితం రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, జాతీయ స్థాయిలో ఎంతలా హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఆ కేసు వల్లనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చాల్సివచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి వీడియోల సాక్షిగా స్టీఫెన్ సన్ ఇంట్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. చదవండి: నన్ను అరెస్టు చేసేందుకు కేసీఆర్ కుట్ర -
ఓటుకు కోట్లు ఆడియోపై విచారణకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో సాధ్యం కాని అభివృద్ధి ఒక్క ఏడాదిలో ఎలా సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆడియో టేపులపై విచారణ చేపట్టాలని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓటుకు కోట్లు కేసులో బాబు ఆడియో టేప్‌లు 90 శాతం మ్యాచ్ అవుతున్నాయి. బాబు ఆడియో టేపుపై కూడా యనమల డిమాండ్ చేసి ఉంటే బాగుండేదని’ పార్థసారధి అన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి కంపెనీకి మొట్టమొదట లీజుకు ఇచ్చింది చంద్రబాబేనని పార్థసారధి గుర్తుచేశారు. జనార్దన్‌రెడ్డిని చంద్రబాబు సింగపూర్‌లో కలిసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జనార్దన్‌రెడ్డినే కాదు.. చంద్రబాబుపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎవరినీ పట్టించుకోవడం లేదు చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని పార్థసారధి విమర్శించారు. రైతులకు మద్ధతు ధర లేక అల్లాడుతుంటే సోమిరెడ్డి పట్టించుకోవడం లేదని.. అలాగే మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర సమస్యలను వదిలిపెట్టి కర్ణాటక గురించి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ధర్మపోరాటం పేరుతో బాబు దగా.. పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు.. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. బీజేపీ, టీడీపీ ఇద్దరు కలిసి చేసిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాజధానిలో ఇప్పటివరకూ ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదని, మాయ మాటలు చెప్పి రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతకాక ప్రభుత్వం ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారని పార్థసారధి అన్నారు. -
ఓటుకు నోటు @ 2 ఏళ్లు
-
తెలంగాణ దెబ్బకు చంద్రబాబు మకాం మార్చిండు
- టీడీపీలో ఉన్న నేతలంతా ఉనికి కోసమే విమర్శలు - మంత్రి కె. తారకరామారావు ఎద్దేవా సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ దెబ్బకు టీడీపీ అధినేత చంద్రబాబు, చిన్నబాబు తట్టా బుట్టా సర్దుకుని అమరావతికి మకాం మార్చిండని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి నగర పంచాయతీ అభివృద్ధికి రూ.50కోట్లు ప్రకటించారు. అనంతరం పెద్దపల్లి, మంథని, రామగుండంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో మిగిలిపోయిన చోటామోటా టీడీపీ నేతలంతా ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్న కేటీఆర్..భవిష్యత్ టీఆర్ఎస్దేనని, టీడీపీలో మిగిలిపోయినవారు ఆ పార్టీని విడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ ఆనాడే చెప్పాని, ఆ పార్టీ నాయకులు చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు జలాలు అందించేందుకు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే కాంగ్రెస్ నాయకులు చచ్చిపోయిన వారి సంతకాలతో కోరున్టు ఆశ్రయించారని ఆరోపించారు. రాష్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు 65ఏళ్లలో వదిలిన దరిద్రాన్ని, గబ్బును కడిగేందుకే మూడేళ్లు సరిపోయిందన్నారు. 'తెలంగాణ అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఒక్కరోజులో అభివృద్ధి చేసేందుకు ఏమైనా అద్భుతదీపాన్ని ఇచ్చాయా?' అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఆనాడు ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగకుండా పనిచేసుంటే తెలంగాణకు ఈ రోజు ఈ గతి పట్టి ఉండేది కాదని జానారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీగా అవతరించిదని చెప్పారు. కాంగ్రెస్ అంటే గతం, టీఆర్ఎస్ అంటే భవిష్యత్ అన్నారు. కేటీఆర్ పర్యటనలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, రామగుండం మున్సిపల్ చైర్మన్ కొంకటి లక్ష్మీనారాయణ, నగర పంచాయతీ చైర్మన్ ఎలువాక రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. నిప్పువైతే రాజీనామా చెయ్
వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తాను నిప్పు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ ఎదుర్కొని నిప్పో.. తుప్పో తేల్చుకోవాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఓటుకు కోట్లు కేసులో సూత్రధారి అయిన ఆయన తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏసీబీ వేసిన అనుబంధ చార్జిషీటుతో కేసులో ఆయనే కీలకవ్యక్తి అని మరోసారి బయటపడ్డా సీఎంగా ఇంకా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో బొత్స మాట్లాడా రు. ఓటుకు కోట్లు కేసులో ఖల్నాయక్ చంద్రబాబేనని, ఒక ముఖ్యమంత్రిపై కోర్టులో చార్జిషీటు దాఖలైనప్పుడు దేశంలో ఎక్కడా సదరు సీఎం పదవిలో కొనసాగలేదని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏసీబీ తాజాగా సమర్పించిన అనుబంధ చార్జిషీటును మీడియా ప్రతినిధులకు చూపించారు. త్వరలో ఫోరెన్సిక్స్ రిపోర్టు కూడా వస్తుందన్నారు. ఇంత జరుగుతున్నా న్యాయస్థానాలకు వెళ్లి ఆ గొంతు తనది కాదని చంద్రబాబు ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. నైతిక విలువలు ఉంటే, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే, భావితరాలకు, రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలంటే వెంటనే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోవాలన్నారు. తెలంగాణ, కేంద్రంతో రాజీ..: ఓటుకు కోట్లు కేసు వల్ల రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం, తెలంగాణ రాష్ట్రంతో చంద్రబాబు రాజీపడుతున్నారని బొత్స చెప్పారు. కృష్ణాజలాల విషయంలో రాష్ట్ర రైతులు దెబ్బతినేలా వ్యవహరించారని చెప్పారు. కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.సుప్రీం కోర్టు నోటీసులకు, ఏసీబీకి మధ్య తేడా ఉందన్నారు. న్యాయం జరగాలని ఓ పౌరుడిగా ఎమ్మెల్యే ఆర్కే కేసు వేశారని పేర్కొన్నారు. -
అవినీతి అధినేతల మాటేమిటి?
డేట్లైన్ హైదరాబాద్ ఉక్రోషానికి పోరుు తెలంగాణ ప్రభుత్వం మీద విరుచుకుపడి నాకూ ఏసీబీ ఉంది, నాకూ పోలీసు శాఖ ఉంది, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్స్టేషన్లు పెడతా అని స్థారుు మరచిన ప్రకటనలు చేశారు తప్ప, తనకు ఈ కేసుతో సంబంధం లేదని రుజువు చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. మండలికి సభ్యులు ఎన్నిక కావడం అన్నది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. దానికి విఘాతం కలిగించే విధంగా ఎంఎల్ఏలను కొనుక్కునే పథక రచన చేసి, ఆడియో టేప్‌లలో దొరికిన చంద్రబాబును కేసులో నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? ‘ఈరోజుల్లో 30 ఏళ్లకే సుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ వంటి జబ్బులొస్తున్నారుు. అలాంటప్పుడు లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించి ఏం చేసు కుంటారు...?’ శిక్షణ పొందుతున్న పబ్లిక్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి పదిరోజుల నాడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్న మాటలివి. సెంట్రల్ సర్వీస్ అధికారులకు 91వ ఫౌండేషన్ కోర్స్ ప్రారంభిస్తూ గవర్నర్ ఈ మాటలు అన్నారు. ఆ సమయంలోనే, హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఒక అవినీతి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాత్ర మీద దర్యాప్తు జరిపి నెలరోజుల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. అందరూ ఊహించినట్టుగానే చంద్రబాబునాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఎనిమిది వారాల స్టే తెచ్చుకున్నారు. ఆ గొంతు ఆయనదే అయినా.... ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే, పదిహేను మాసాల క్రితం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఒక కేసులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని, టీఆర్ఎస్ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్కు 50 లక్షల రూపాయలు బయానా ఇస్తూ, మరో మూడున్నర కోట్లు త్వరలో ఇస్తామని చెపుతూ ఆడియో వీడియో టేప్‌లలో దొరికిపోరుు జైలుకు పోయాడు. మరో శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కూడా ఈ కేసులో తరువాత అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్లి బెరుుల్ మీద తిరిగొచ్చాడు. మరో నిందితుడు మత్తయ్యను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆశ్రయం ఇచ్చి జైలుకు పోకుండా కాపాడారు. ఈ సంఘటనలో రేవంత్‌రెడ్డి, సంద్ర వెంకటవీరయ్య, మత్తయ్య వగైరా వగైరాలంతా పావులు మాత్రమే. ఎంఎల్ఏలను కోట్ల రూపాయల డబ్బు ఇచ్చి కొని ఎంఎల్సీ ఎన్నికలు గెలవాలని పథకం రచించినదీ, కార్యాచరణకు ఆదేశించినదీ సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది జగమెరిగిన సత్యం. సెబాస్టియన్ అనే మరో తెలుగుదేశం నాయకుడు కలిపి ఇచ్చిన ఫోన్లో చంద్రబాబునాయుడు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడుతూ మనవాళ్లు నాకు అంతా చెప్పారు, నేను మీకు అండగా ఉన్నాను, భయంలేదు ముందుకు వెళ్లండి అని తనదైన శైలిలో, ఇంగ్లిష్‌లో చెప్పిన విషయం రికార్డు అరుుంది. ఆ గొంతు ఆయనదేనని అందరికీ తెలుసు. ఆయన కూడా ఎంతసేపూ నా ఫోన్ ట్యాప్ చేస్తారా అని హూంకరించారే తప్ప అది నా గొంతు కాదు అని ఒక్కసారి కూడా అనలేదు. ఉక్రోషానికి పోరుు తెలంగాణ ప్రభుత్వం మీదా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదా విరుచుకుపడి నాకూ ఏసీబీ ఉంది, నాకూ పోలీసు శాఖ ఉంది, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్స్టేషన్లు పెడతా అని స్థారుు మరచిన ప్రకటనలు చేశారు తప్ప తనకు ఈ కేసుతో సంబంధం లేదని రుజువు చేసుకునే ప్రయత్నం ఒక్కటీ చెయ్యలేదు. శాసనసభ నుండి మండలికి సభ్యులు ఎన్నిక కావడం అన్నది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. ఆ ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే విధంగా కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా వెదజల్లి ఎంఎల్ఏలను కొనుక్కునే పథక రచన చేసి, ఆడియో టేప్‌లలో దొరికిపోరుున చంద్రబాబునాయుడును కేసులో నిందితుడిగా ఎందుకు చేర్చ లేదన్నది ప్రశ్న. ఏమైపోయాయా గర్జనలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంకో రాష్ట్రంలో జరిగిన వ్యవహారంలో నింది తుడిగా చేర్చడానికి ఏమరుునా విధివిధానాలు ఉంటే వాటిని అనుసరించే తెలంగాణ ఏసీబీ చంద్రబాబునాయుడును నిందితుల జాబితాలో చేర్చి ఉండాలి. ఈ సంఘటన జరిగిన తొలి రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు జైలుకు వెళ్లకుండా బ్రహ్మదేవుడు కూడా రక్షించ లేడు అన్నారు. ఆ తరువాత అంతా నిశ్శబ్దం. ఓటుకు కోట్లు కేసు ప్రస్తావన వస్తే చాలు తెలంగాణలో అధికారపక్షం టీఆర్ఎస్ నాయకులు పైస్థాయి నుంచి కింది దాకా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని పక్కకు తప్పుకుంటున్నారు. ఏసీబీ దర్యాప్తులో కూడా మొదలుపెట్టినప్పుడు ఉన్న వేగం తగ్గి మందకొడిగా సాగింది. అంతేకాదు వీరి నుండి వారికి, వారి నుండి వీరికి ఆహ్వానాలు, వీరు అమరావతికి వెళ్లి స్నేహహస్తం చాచి వస్తే, వారు యాగాలకు హాజరై సుహృద్భావాన్ని ఆధ్యాత్మికంగా ప్రకటించిపోతారు. ఇదంతా చూస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల అధినేతల మధ్య సత్సంబంధాలు చూసి మురిసి ముక్కలరుు పోతుంటారు. అంతేకాదు, ఇరువురు ముఖ్యమంత్రులు గవర్నర్‌గారి దగ్గర కూర్చుని సమస్యను పరిష్కరించుకున్నారు కదా ఇంకా దాని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని కొందరు బీజేపీ నాయకులు అంటుంటే, నిన్నటికి నిన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా తన మిత్రుడు చంద్ర బాబునాయుడుకు క్లీన్చిట్ కూడా ఇచ్చేశారు. ‘‘చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదు, ఆయనకు సంబంధించిన విచారణ ప్రతిపాదనలు ఏవీ కేంద్రం వద్ద లేవు, ఇవన్నీ చౌకబారు రాజకీయాలు’’ అని ఒక దినపత్రిక, టీవీ చానల్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుగారి మరో ఆత్మబంధువు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ గత వారం తిరుపతిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సీబీఐ అంటే భయపడుతున్నారా, ఏమన్నా లొసుగులు ఉంటే భయపడాలి, మీకేమన్నా లొసుగులున్నాయా అని బాబును ఉద్దేశించి అన్నారు. దానికి వెంకయ్య నాయుడు గారు జవాబు ఇచ్చేశారు. పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారు, వెంకయ్య నాయుడు జవాబు ఇస్తారు. చంద్రబాబు సంతోషిస్తారు. సమాజం ప్రేక్షక పాత్ర వహించాలని ఆ ముగ్గురూ అనుకుంటారు. ఓటుకు కోట్లు ఆషామాషీ వ్యవహారమా? నిజమే, చంద్రబాబును విచారించడానికి కేంద్రం దగ్గర దరఖాస్తులేవీ పెండింగ్‌లో లేవు. అంతమాత్రాన ఓటుకు కోట్లు వ్యవహారం ఆషామాషీ విషయంగా భావించాలా? ఈ వ్యవహారాన్ని ఎవరో రోడ్డున పోయే జులా యిలు ఒక గొప్ప స్టేట్స్‌మన్ మీద చేసిన ఆకతారుు ఫిర్యాదుగా కేంద్రంలో పెద్దలు చూస్తున్నారా? వెంకయ్యనాయుడుగారి ప్రకటన వింటే అట్లాగే అనిపిస్తుంది. ముందే చెప్పినట్టుగా చంద్రబాబునాయుడు ఈ కేసుతో తనకు సంబంధం లేదని నిరూపించుకునే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. ఇదే కాదు ఆయన ఏ కేసులోనూ ఆ ప్రయత్నం చెయ్యరు. ఆ కేసులు కొట్టేయా ల్సిందిగా కోర్టులను కోరతారు. స్టేలు తెచ్చుకుంటారు. ఏళ్ల తరబడి స్టేల మీద గడిపేస్తుంటారు. ప్రజాక్షేత్రంలో ఉన్న ఏ నాయకుడూ చెయ్యకూడని పని అది. ప్రజా బలం కలిగిన నాయకులు ఎవరరుునా ధైర్యంగా నిలబడి విచారణను ఆహ్వానించి తన నిర్దోషిత్వం నిరూపించుకుంటారు. చంద్రబాబు ఆ పని ఎందుకు చెయ్యరు? రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌గారు కేంద్ర సర్వీస్‌ల అధికారులకు నీతిమంతంగా ఉండండని సుద్దులు చెప్పి నట్టుగానే చంద్ర బాబును కూడా మీ నిర్దోషిత్వం నిరూపించుకోండి అని ఎందుకు హితవు చెప్పరో అర్థంకాదు. అవినీతి రహిత పాలన అందించడం మా లక్ష్యం ‘‘అచ్చే దిన్ వచ్చేశారుు’’ అని చెపుతున్న కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన గల ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఓటుకు కోట్లు వ్యవహారం అవినీతి కార్యక్రమంగా కనిపించడం లేదా? నీతివంతమైన పాలన ఇస్తామన్న కేంద్రం తన ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఈగ వాలకుండా చూసుకుంటుంది సరే, మరి ప్రశ్నిస్తాను, ప్రశ్నిస్తాను అని పదే పదే మాట్లాడి ఆవేశపడే పవన్ కల్యాణ్ తిరుపతిలో బహిరంగ సభ పెట్టి ఒక్క ప్రత్యేక హోదా గురించి మాత్రమే ఎందుకు ప్రశ్నించారు? ఆవేశ పడిపోయారు? ఆయన రాజకీయాల్లో ఉన్నానని అంటున్నారు, జనసేన పార్టీని పూర్తి స్థారుు రాజకీయ పార్టీగా నడిపిస్తానని చెపుతున్నారు. అటు వంటి నాయకుడికి ఓటుకు కోట్లు వ్యవహారంతో సహా అన్ని విషయాల మీదా స్పష్టమరుున అవగాహన ఉండాలి కదా! తప్పులన్నిటినీ ఎత్తి చూపాలి కదా, వ్యతిరేకించాలి కదా! ఒక్క ప్రత్యేక హోదా కోసమే ఆయన రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వచ్చి ఆ పని అరుుపోతే మళ్లీ వెనక్కి వెళ్ళిపోతారా? ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఇటువంటి చేష్టలు చూసినప్పుడు! చంద్రబాబు నాయుడును, టీడీపీ పార్టీని రక్షించడానికే పవన్ కల్యాణ్ రాజకీయ ధ్యేయ మైతే త్వరలోనే ఆయన పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బాబు ఆడిన డ్రామా..
-
అడ్డంగా దొరికిపోయి.. నిస్సిగ్గుగా అడుగుతారా
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తన గొంతు ఎలా రికార్డు చేస్తారంటూ నిస్సిగ్గుగా అడుగుతున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. తాను ఏ తప్పూ చేయకపోయినా అసెంబ్లీ నుంచి తనను ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆమె అన్నారు. మరిప్పుడు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబుకు శిక్ష పడాలా వద్దా అని రోజా ప్రశ్నించారు. అసెంబ్లీలో రౌడీయిజం చేసిన అచ్చెన్నాయుడు, బోండా ఉమామహేశ్వరరావులను శిక్షించాలా వద్దా అని అడిగారు. ఎమ్మార్వో వనజాక్షిని కొట్టిన విప్ చింతమనేని ప్రభాకర్‌కు శిక్ష వేయాలా వద్దా అని నిలదీశారు. -
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు..
-
’కోట్లు’ కుట్ర....
-
ఓటుకు కోట్లు కేసుపై స్పందించిన చంద్రబాబు
విజయవాడ : ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానమివ్వకుండా దాని గురించి నేను మాట్లాడటమేంటి? అంటూ దాటవేశారు. ఆ కేసులో ఏముందని మాట్లాడటానికి... అంటూ ఆ అంశాన్ని తేలికగా కొట్టిపారేసినట్టు కనిపించే ప్రయత్నం చేశారు. తేలికగా తీసివేయాలని ప్రయత్నించినప్పటికీ ఆ విషయాన్ని మా అడ్వకేట్లు చూసుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ప్రత్యేక కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే దర్యాప్తు నివేదికను సెప్టెంబరు 29లోగా సమర్పించాలని న్యాయమూర్తి సోమవారం ఏసీబీని ఆదేశించారు. ఓటుకు కోట్లు కుట్ర కేసులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, ఆయనపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 120(బి)కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి(ఆర్కే) ఈనెల 8న ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. నేర విచారణ చట్టం సెక్షన్ 210 కింద విచారణ చేపట్టాలని ఆ ఫిర్యాదులో కోరిన సందర్భంలో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ తో జరిపిన ఫోన్ సంభాషణలోని స్వరం చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక రుజువుచేస్తోందని పిటిషన్ లేవనెత్తిన అంశంపై ప్రాథమిక ఆధారాలు సమర్పించిన తర్వాత కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. సోమవారం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత చంద్రబాబు పలువురు న్యాయవాదులతో సమాలోచనలు జరిపారు. తదుపరి చర్యలపై చర్చించారు. మంగళవారం కరవు పరిస్థితులపై వివరాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా విలేకరులు ఓటుకు నోట్లు కేసుపై కోర్టు ఆదేశాలను ప్రస్తావించారు. దానిపై ఆయన స్పందిస్తూ... ఆ కేసులో ఏముందో మీడియానే అధ్యయనం చేసి చెప్పాలని వ్యాఖ్యానించారు. దాని గురించి నేను మాట్లాడటమేంటి? మా అడ్వకేట్లు చూసుకుంటారు అంటూ దాటవేశారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేయాలన్న అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు న్యాయవాదులకు చెప్పినట్టు సమాచారం. ఈ దర్యాప్తును ఏదో రకంగా నిలుపుదల చేయించని పక్షంలో తీవ్ర నష్టం జరిగే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలావుండగా, కోర్టు తాజా ఆదేశాలపై ఏసీబీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తీర్పు ప్రతిని అధ్యయనం చేశారు. కోర్టు ఉత్తర్వులపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఆ మేరకు తదుపరి దర్యాప్తును కొనసాగించాలని అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. -
ఓటుకు కోట్లు కేసులో బాబు పాత్రపై దర్యాప్తు.
-
ప్రధాని సహాయనిధికి 'ఓటుకు కోటి' సొమ్ము
సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్, బీజేపీకి చెందిన ముగ్గురు మాజీ ఎంపీల నుంచి 2008లో 'ఓటుకు కోటి' స్కాంలో స్వాధీనం చేసుకున్న కోటి రూపాయల సొమ్మును ప్రధాన మంత్రి సహాయనిధికి జమ చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఆ సొమ్ము తమదని ఎవరూ చెప్పకపోవడంతో సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ప్రధాని సహాయనిధికి పంపాలని తెలిపింది. నాటి బీజేపీ ఎంపీ అశోక్ అర్గల్ ఇంటి సమీపంలో అమర్ సింగ్ మాజీ సహచరుడు సంజీవ్ సక్సేనా ఈ సొమ్ము పంచుతుండగా పోలీసులు పట్టుకున్నట్లు ప్రాసిక్యూషన్ వర్గాలు వాదించాయి. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులపైన ఛార్జిషీటు దాఖలుచేశారని, ఇక ఈ కేసులో పెండింగు అంశమంటూ ఏమీ లేదని కోర్టు తెలిపింది. ఈ సొమ్ము ఏం చేయాలన్న విషయమై కూడా ఏమీ తేలకపోవడంతో.. మొత్తం కోటి రూపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి పంపాలని ఆదేశించింది. -
ఆ మూడు లేదు !
-
'వాళ్లిద్దరినీ ఉద్దేశపూర్వకంగానే దాచారు'
ఓటుకు కోట్లు కేసులో నిందితులైన సండ్ర వెంకట వీరయ్య, జెరూసలెం మత్తయ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టిందని అరుణ్ కుమార్ అనే న్యాయవాది ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆయన ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. తెలంగాణ ఏసీబీ అధికారులను భయభ్రాంతులకు గురిచేసి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆ మెమోలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి తదితరులపై చర్య తీసుకోవాలంటూ మెమో దాఖలు చేశారు. కాగా న్యాయవాది అరుణ్ కుమార్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు స్వీకరించింది. -
ఆ నివేదిక వస్తే సంచలనాలే!
ఓటుకు కోట్లు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం తెలంగాణ ఏసీబీ వర్గాలు వేచి చూస్తున్నాయి. ఇప్పటి వరకు సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన ఏసీబీ, త్వరలోనే మరి కొంతమందికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని పరిశీలిస్తున్న ఏసీబీ వర్గాలు.. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కూడా తమ చేతికి అందుతుందని భావిస్తున్నాయి. స్టీఫెన్సన్ ఇప్పటికే తన వాంగ్మూలంలో చంద్రబాబే కుట్రకు సూత్రధారుడని చెప్పటంతో బాబుకు నోటీసులు ఇచ్చే అంశంపై న్యాయ నిపుణులతో ఏసీబీ సంప్రదిస్తోంది. అయితే చంద్రబాబు, స్టీఫెన్సన్ ఆడియో టేపులకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత, వాటిని పరిశీలించి.. వాటి ఆధారంగానే నోటీసులు ఇస్తే బాగుంటుందని న్యాయ నిపుణులు ఏసీబీకి సూచించినట్లు తెలుస్తోంది.. దీంతో ఇప్పటికే స్తబ్దుగా ఉన్న ఏసీబీ మరో రెండు రోజులపాటు ఇదే నిశ్శబ్దాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఆ తర్వాత సంచలనాలే ఉంటాయని ఏసీబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
బాబు రాజకీయాలకు పట్టిన తుప్పు
చంద్రబాబు తప్పులు చేసి, నిందలు తమపై వేస్తారా అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. తన తప్పులపై ఎవరూ మాట్లాడకూడదన్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు. స్టీఫెన్సన్కు రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడం తప్పు కాదు గానీ, ఆ తప్పును తాము ఎత్తి చూపించడమే తప్పంటున్నారన్నారు. తన తప్పులను ఎవరైనా వేలెత్తి చూపిస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, తెలంగాణ టీడీపీ నేతలతో తమపై కేసు పెట్టించి టీన్యూస్ కు నోటీసులు ఇప్పిస్తారా అంటూ నిలదీశారు. కేసీఆర్ మీద ఏపీలో దాఖలైన కేసులపై సిట్ వేయడం సిల్లీథింగ్ అని ఆయన అన్నారు. ఓటుకు కోట్లు కేసులో మీ అంతట మీరే ఇరుక్కున్నారని, తాము ఇరికించాలనుకుంటే చాలా ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ బిడ్డలు ఇచ్చిన మరణ వాంగ్మూలాల్లో చంద్రబాబు పేరుందని, అది అన్నింటికంటే పెద్ద సాక్ష్యమని తెలిపారు. చంద్రబాబు వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నామని వాళ్లు తమ సొంత చేతిరాతతో రాశారన్నారు. తమకు కక్షసాధింపు ఆలోచన లేదని, తెలంగాణ అభివృద్ధి మీదే దృష్టి ఉందని హరీశ్ అన్నారు. ఒక రాష్ట్రంలో మరో రాష్ట్ర పోలీసుల మోహరింపు ఎక్కడైనా ఉందా అని గవర్నర్‌ను తాము అడుగుతామన్నారు. దీనిపై కేంద్రం కూడా స్పందించాలని కోరారు. తెలంగాణలో ఆంధ్రా పోలీసు స్టేషన్లను కూడా పెడతామంటున్నారని, ఇదెక్కడి విడ్డూరమని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆంధ్రావాళ్లు ఉంటారని, వాళ్ల ధనమాన ప్రాణ రక్షణ బాధ్యత కూడా ఆంధ్రా పోలీసులే తీసుకుంటారా అని ప్రశ్నించారు. నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు.. విజయవాడ నుంచి పైపులైన్లు వేసుకుంటారా అని అడిగారు. విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో్ దిగితే నేరుగా సచివాలయానికి వస్తారా, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు రోప్ వేలు వేసుకుంటారా అని మండిపడ్డారు. చంద్రబాబు తమిళనాడు వెళ్లినా, వెంట పోలీసులను తీసుకెళ్తారా.. కర్ణాటకలోను, తమిళనాడులో కూడా పోలీసు స్టేషన్లు పెడతారా? అలా చేస్తే తన్ని తగలేస్తారని స్పష్టం చేశారు. సండ్ర వెంకట వీరయ్యను విశాఖలో దాస్తారు, మత్తయ్యను విజయవాడలో దాస్తారని, ఇలా నిందితులను దాచే సంస్కృతి ఎక్కడిదని ఆయన అడిగారు. ఇంటి నిర్మాణానికి అనుమతి రాకపోతే దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రం మొత్తానికి సీఎంగా చేసిన అనుభవజ్ఞుడికి.. పాత ఇళ్లు కూల్చాలనుకుంటే జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియదా అని హరీశ్ రావు అడిగారు. అనుమతి రాకుండా ఇంటి నిర్మాణం మొదలుపెట్టచ్చా? అనుమతి రాకుండా ఎలా మొదలుపెట్టారు? ఇది తప్పా.. ఒప్పా? తప్పయితే ఎందుకు చర్య తీసుకోకూడదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో 10 మీటర్ల ఎత్తు మాత్రమే ఉండాలంటే 12.5 మీటర్లు పెట్టారు... అది డీవియేషనా కాదా అంటూ నిలదీశారు. దేన్నయినా మేనేజ్ చేయగలనని చంద్రబాబుకు గట్టి నమ్మకం ఉందని, అందులో తాను దిట్ట అనుకుంటారని చెప్పారు. ఆయన ఎలా మేనేజ్ చేశారో, ఎక్కడెక్కడ ఎలా తప్పించుకున్నాడో, మేనేజ్మెంట్లో ఆయనకున్న డాక్టరేట్ల గురించి అందరికీ అవగాహన ఉందన్నారు. దేన్నయినా మేనేజ్ చేయగలరు గానీ మా తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను, మీడియాను మేనేజ్ చేయలేరని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ మీడియా మీరు చేసిన తప్పులను నగ్నంగా బయటపెడితే అర్ధరాత్రి నోటీసులు ఇస్తారా.. స్థానిక పోలీసులకు చెప్పకుండా ఎలా నోటీసులు ఇస్తారని మండిపడ్డారు. ఏపీ సర్కారు ఒక తప్పు నుంచి తప్పించుకోడానికి పది తప్పులు చేస్తోందన్నారు. తమకు చట్టం మీద గౌరవం ఉందని, మీరు ఎంత కయ్యం పెట్టుకోవాలని చూసినా తమ ప్రభుత్వం చట్ట ప్రకారమే ముందుకు పోతుందని ఆయన అన్నారు. ఒకరోజు ట్యాపింగ్ అన్నారు, ఒకరోజు మార్ఫింగ్ అన్నారు, ఒకరోజు కట్ పేస్ట్ అన్నారు... పూటకో మాట, నాయకుడికో మాట అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంతకీ అసలు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో మాట్లాడిన గొంతు చంద్రబాబుదా.. కాదా అన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు ఇప్పటికీ స్పష్టంగా చెప్పడంలేదంటూ మండిపడ్డారు. -
'ముద్దాయిలకు షెల్టర్‌జోన్‌గా బెజవాడ'
-
విశ్వదాభిరామ వినుర బాబు!
తప్పుచేయువారు తమ తప్పులెరగరయ్యా విశ్వదాభిరామ వినుర బాబు! చేసిన ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తారన్నది సామెత. నీవు మాత్రం ఇంతవరకు పది తప్పులు మాత్రమే చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సాక్షాత్తు మీడియా ముందు తెగేసి చెప్పారు. కలియుగ శిశుపాలుడు అన్న బిరుదు కూడా ఇచ్చిపారేశారు. ఆ లెక్కన కూడా చూసుకుంటే ఇంకా 90 తప్పులు చేయొచ్చన్నమాట. పోయిన పరువు ఎలాగూ పోయింది కొత్త తప్పులతో కొత్తగా పోయేదేమీ లేదు. అందుకే సరదాగా ఈ తప్పులు ట్రై చేస్తో పోలా..! -ముందు చూపుతో ఫోరెన్సిక్ నిపుణుడిని సలహాదారుడిగా పెట్టుకున్నావు. ఇప్పటికీ నీ మాటల టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్‌లోనే ఉన్నాయి. నీ బుద్ధి ముందే పసిగట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం టేపులను తారుమారు చేయకుండా గట్టి భద్రతను ఏర్పాటుచేసింది. వీలైతే నానాయాగీ చేసి ఏపీ పోలీసులను అక్కడ పెట్టు. -నీవు అనుకున్నది జరక్కపోతే వాయిస్ శాంపిల్స్ టెస్ట్కెళ్లాల్సి ఉంటుంది. గ్రహరాశి నీకు అనుకూలించేవరకు గొంతు నొప్పంటూ కాలయాపన చేయి. - ఈలోగా వాయిస్ శాంపుల్స్ టెస్ట్‌లో దొరక్కకుండా ఉండేందుకు ఫోరెన్సిక్ నిపుణుడి సలహాతో మూడు రకాల ఫ్రీక్వెన్సీ కాకపోతే 36 రకాల ఫ్రీక్వెన్సీలో మాట్లాడేందుకు ప్రాక్టీస్ చేసి టెస్ట్‌లో దొరక్కుండా చూసుకో. -అప్పటికీ నోరు తిరగకపోతే గొంతు క్యాన్సర్ అంటూ అస్పత్రిలో చేరు. అప్పటికీ తమకనుకూలంగా పరిస్థితులు మారకపోతే ఏకంగా క్యాన్సర్ పేరుతో 'వోకల్ కార్డ్'ను తొలగించుకో. ఎలాగూ మాట్లాడలేవు గనక శాంపుల్స్ టెస్ట్‌లో దొరకవు. తప్పుమీద తప్పులు మాట్లాడలేవు. 'వెర్రిబాబు'లోడిలాగా సైగలతో ఎలాగోలా కేసు నుంచి బయటపడొచ్చు. -ఓ నెటిజెన్ వ్యంగ్యోక్తులు -
కేసు వల్లే కృష్ణాజలాల సాధనలో రాజీ పడ్డారా?
కృష్ణా జలాలను సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం రాజీ పడినట్లు కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి మండిపడ్డారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడటంలో బాబు సర్కారు విఫలం అయ్యిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా కాపాడుకున్న ఏపీ హక్కులను కాస్తా కృష్ణార్పణం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర, కృష్ణా జలాల హక్కులను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈనెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తామని మైసూరారెడ్డి చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడం వల్లే కృష్ణాజలాలు సాధించడంలో చంద్రబాబు రాజీ పడినట్లు కనిపిస్తోందని ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులు కాలరాయడం అన్యాయమని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడానికి చంద్రబాబు సిద్ధం అవుతున్నారని మైసూరా ఆరోపించారు. -
ముద్దాయిలకు షెల్టర్ జోన్‌గా బెజవాడ: గౌతంరెడ్డి
ఓటుకు కోట్లు కేసులో ఉన్న ముద్దాయిలకు విజయవాడ షెల్టర్ జోన్‌గా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ నాయకుడు గౌతం రెడ్డి మండిపడ్డారు. ఈ కేసులో ఎ4గా ఉన్న మత్తయ్యకు బొండా ఉమామహేశ్వరరావు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆశ్రయం కల్పించారని ఆయన ఆరోపించారు. కేసులోంచి బయట పడేందుకు పోలీసు అధికారులతో వారికి తర్ఫీదు ఇప్పిస్తున్నారని గౌతం రెడ్డి అన్నారు. తప్పు చేయకపోతే ఇలాంటి పాట్లు పడాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నేతలకు ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. -
’కేసు వల్లే కృష్ణాజలాల సాధనలో రాజీ పడ్డారా?’
-
’మరణవాంగ్మూలాల్లో బాబు పేరు’
-
మత్తయ్యకు ఏపీ సర్కార్ అండ!
-
మత్తయ్యకు ఏపీ సర్కార్ అండ!
* అందుకే అతని తరఫున హాజరైన ఏపీ పీపీ పోసాని.. న్యాయమూర్తి ముందు కేసు గురించి ప్రస్తావన * ఓ నిందితుని తరఫున హాజరు కావడంపై న్యాయ నిపుణుల విస్మయం సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్ల వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న మత్తయ్యకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోందా? హైకోర్టులో గురువారం జరిగిన పరిణామాలను గమనించిన న్యాయ నిపుణులు అవుననే అంటున్నారు. మత్తయ్య కేసీఆర్, ఆ రాష్ట్ర పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీఐడీకి బదలాయించారు. ఈ నేపథ్యంలో మత్తయ్య నేరుగా హైకోర్టును ఆశ్రయించి తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మత్తయ్య తరఫున పొనకంపల్లి రవికుమార్ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సాధారణంగా ఈ కేసు గురువారం విచారణకు వచ్చే అవకాశమే లేదు. మత్తయ్యను కాపాడుతున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు ఈ కేసును విచారణకు తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వ పెద్దలకు హైకోర్టులో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ‘అధికారిక’ కార్యాలయాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ కార్యాలయం నుంచే ఆ కీలక వ్యక్తి సహాయకుడొకరు తెలంగాణ ఏసీబీ స్పెషల్ పీపీ రవికిరణ్‌రావుకు ఫోన్ చేసి, తాము మత్తయ్య కేసు గురించి న్యాయమూర్తి ముందు ప్రస్తావించి, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరనున్నామని చెప్పారు. ఆ తర్వాత మత్తయ్య తరఫున ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు న్యాయమూర్తి ముందు కేసు గురించి ప్రస్తావించి మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టాలని కోరారు. మత్తయ్య తరఫున ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పోసాని వెంకటేశ్వర్లు హాజరై కేసు గురించి ప్రస్తావించడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ కేసులో రవికుమార్‌కు మత్తయ్య వకాలత్ ఇచ్చారే తప్ప, పోసాని వెంకటేశ్వర్లుకు కాదు. అలాంటప్పుడు న్యాయవాదులు అంత మంది ఉండగా పోసాని ఎందుకు కేసు ప్రస్తావించారనే దానిపై ఇప్పుడు హైకోర్టులో చర్చనీయాంశమైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న వ్యక్తి ఓ నిందితుని తరఫున హాజరు కావడమేంటని విస్మయం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా నిందితుని తరఫున హాజరు కావడమన్నది ఇప్పుడే జరిగింది. ఇంకో విషయమేమింటే మత్తయ్య తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూత్రా హాజరవుతున్నారు. లూత్రా వంటి సీనియర్ న్యాయవాదిని ఫీజుల పరంగా భరించేంత శక్తి మత్తయ్యకు ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మత్తయ్య వాంగ్మూలం నమోదు
తెలంగాణలో నమోదైన 'ఓటుకు కోట్లు' కేసులో నాలుగో నిందితుడిగా, విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో ఫిర్యాదిగా ఉన్న జెరుసలెం మత్తయ్య వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు శుక్రవారం నమోదు చేశారు. ఈ కేసును సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడలో మత్తయ్య నుంచి దర్యాప్తు అధికారి సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం వాంగ్మూలం నమోదు చేశారు. హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో ఆయన సోదరుడు ప్రభుదాస్ వాంగ్మూలాన్ని మరో ప్రత్యేక బృందం నమోదు చేసింది. ప్రాథమికంగా ఈ ప్రక్రియలు పూర్తయిన తరవాత నోటీసులు జారీ చేయడానికి సీఐడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
విశాఖపట్నంలో వీరయ్య?
ఓటుకు కోట్ల కేసులో ఏసీబీ నోటీసులు జారీచేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసింది. అక్కడ కూడా ఆయన తన సొంత పేరుతో కాకుండా.. వేరే రోగి పేరుతో చేరినట్లు విశ్వసనీయ సమాచారం. ఆస్పత్రి యజమాని ఆయనకు సన్నిహిత మిత్రుడు కావడంతో, అక్కడే చేరారని అంటున్నారు. అయితే.. కార్పొరేట్ ఆస్పత్రుల వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా ధ్రువీకరించడం లేదు. ఎవరికి వారు తమ ఆస్పత్రిలో చేరలేదనే చెబుతున్నారు. (వెంకట వీరయ్య లేఖ ప్రతి) విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా సండ్ర వెంకట వీరయ్య ఇక్కడకు వచ్చారన్న విషయాన్ని ఎక్కడా పొక్కనివ్వడం లేదు. మొత్తం విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. అయితే, తెలంగాణ పోలీసులు కూడా ఇందుకు దీటుగానే వ్యూహాలు రూపొందిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు తీసుకుని.. వాటి సాయంతో వాళ్లు సండ్ర వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు కావల్సిన ఏర్పాట్లలో తెలంగాణ ఏసీబీ ఉన్నట్లు సమాచారం. -
విశాఖపట్నంలో వీరయ్య?
-
టేపుల డీకోడింగ్ ప్రారంభం
-
ఓటుకు కోట్లు: టేపుల డీకోడింగ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఆడియో, వీడియో టేపులను డీకోడింగ్ చేసే కీలక ప్రక్రియను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటుచేసింది. మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను తెలంగాణ ఏసీబీ వర్గాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు గతంలో పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిని విడిగా కాపీచేసి, వాటిలోని నిజాలను నిగ్గుతేల్చేందుకు ఎఫ్ఎస్ఎల్ సిద్ధమైంది. ఇందుకోసం ఏర్పాటుచేసిన మూడు బృందాలు ఇప్పటికే తమ పని మొదలుపెట్టేశాయి. తన ఫోన్ ట్యాప్ చేశారని ఒకసారి, అసలు అందులో ఉన్నది తన గొంతు కాదని మరోసారి.. అప్పుడప్పుడు వేర్వేరు సందర్భాలలో మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఈ టేపులు రూపొందించారని ఇంకోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ మొత్తం విషయాలన్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటుచేసిన మూడు ప్రత్యేక బృందాలు నిగ్గు తేలుస్తాయి. డీకోడింగ్ తర్వాత అన్ని విషయాల్లో వాస్తవాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. -
ఢిల్లీలో కాళ్లు పట్టుకోలేదా?
అసలు కుట్ర పుట్టిందే తెలుగుదేశం పార్టీలోనని, చంద్రబాబు నాయుడి దగ్గర్నుంచేనని వైఎస్ఆర్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. మీకే దాని సంగతి తెలుసని, అసలు కుట్రకు పేటెంటు చంద్రబాబు దగ్గరే ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోను, మంత్రి హరీశ్ రావుతోను కుట్ర పన్నారంటూ టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వేసిన ప్రశ్నలకు కౌంటర్‌గా వైఎస్ఆర్ సీపీ.. చంద్రబాబుకు, టీడీపీకి 23 ప్రశ్నలు సంధించింది. ఇవి వాస్తవమో కాదో చెప్పాలని సవాల్ విసిరింది. సుజనా చౌదరిని ఢిల్లీ పంపి.. అక్కడ కేటీఆర్ కాళ్లు పట్టించిన మాట వాస్తవం కాదా అని బొత్స అడిగారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ కాళ్లు పట్టకునేందుకు సిద్ధమైన మాట నిజం కాదా అని నిలదీశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను ఉపయోగించి ఎన్డీయే పెద్దలందరినీ ప్రాధేయపడ్డారన్నారు. ఇక గవర్నర్ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అసలెందుకు ఇలాంటి పరిపాలన చేస్తారు.. ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, రాష్ట్రానికి సంబంధించి ఆయనతో ఏమైనా ఇబ్బంది ఉంటే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవాలనే తాము చెప్పామని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. ఒకరేమో గంగిరెద్దు అని, మరొకరేమో ధ్రుతరాష్ట్రుడని వ్యాఖ్యానించారన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మాత్రం ఎవరినీ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటున్నారని.. అంటే రాజీ చేసుకుందామనా అని ప్రశ్నించారు. సెక్షన్ 8 అప్పుడే అమలు జరిగిపోయిందా.. ఎందుకు తగ్గారని నిలదీశారు. తప్పులన్నీ మీదగ్గర పెట్టుకుని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి కుట్ర అంటారా అంటూ మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే 50 లక్షల లంచం ఇచ్చి, దేశ ప్రజలందరూ టీవీలలో చూస్తుండగా పట్టుబడి మళ్లీ ఏం మాట్లాడుతున్నారని కడిగేశారు. ఆంధ్రప్రదేశ్‌కు తలవంపులు తెచ్చారని, పరిపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. రైతులు అల్లాడిపోతున్నారని, వాళ్లకు కనీస మద్దతుధరను కేవలం రూ. 50 మాత్రమే పెంచినా దానిమీద కనీస స్పందన కూడా లేదని అన్నారు. సంక్షేమం దూసుకెళ్లిపోతోందని చెబుతున్నారని.. కానీ అవినీతిలోనే సర్కారు దూసుకుపోతోందని మండిపడ్డారు. మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్నారని, నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారని,. అవి ఎక్కడ చేశారని.. మీ సంక్షేమం ఏమైందని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందన్నారు... జరిగితే పట్టుకోండి కానీ కట్టిన వాళ్లకు బిల్లులు ఇవ్వలేదని, కొత్తగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఓటుకు నోటు కార్యక్రమం వల్ల వంద రోజులుగా పాలన లేకుండా పోయిందన్నారు. నిన్న పట్టిసీమ చూద్దామని వెళ్లినప్పుడు పక్కనే పోలవరం ఉంటే ఒక కన్నైనా అటువైపు వేశారా, అటు చూశారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. -
నిప్పువా.. కందిపప్పువా బాబూ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు సెటైర్లు వేశారు. రాజకీయాల్లో తనను తాను నిప్పు లాంటి మనిషినని చంద్రబాబు చెప్పుకొంటారని, ఇప్పుడు ఏసీబీకి సహకరించి నిప్పువో.. కందిపప్పువో నిరూపించుకోవాలని ఆయన సవాలు చేశారు. గతంలో స్టాంపుల కుంభకోణంలో కృష్ణయాదవ్‌ను సస్పెండ్ చేశారని, అలాంటప్పుడు ఇప్పుడు ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. -
ఏసీబీ.. ఏం చేస్తోంది?
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ.. గురువారం అంతా ఆధారాల పరిశీలన, డాక్యుమెంట్ల తయారీలో మునిగిపోయింది. ముందు ముందు ఎలా సాగాలన్న దానిపై కూడా తీవ్రస్థాయిలో ఏసీబీ అధికారులు చర్చించారు. న్యాయపరమైన అంశాలు, నిందితులకు జారీ చేయాల్సిన నోటీసుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం రికార్డ్ చేసిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం శుక్రవారం సాయంత్రంలోగా ఏసిబీకి అందే అవకాశాలున్నాయి. ఒక్కసారి అది అందిన వెంటనే ఏసీబీ విచారణ మరింత వేగం పుంజుకోనుంది. ఇప్పటివరకు ఏసీబీ సేకరించిన ఆడియో, వీడియో ఫుటేజీలు ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఉన్నాయి. వాటి నివేదికలు కూడా ఇంకా అందాల్సి ఉంది. మొత్తమ్మీద గురువారం మొత్తం ఏసీబీ ఉన్నతాధికారులు ఎవరూ పెద్దగా బయటకు వెళ్లిన దాఖలాలు లేవు. డాక్యుమెంటేషన్ ప్రక్రియమీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. మరో రెండు రోజులు కూడా ఇలాగే ఉండొచ్చని సమాచారం. అయితే.. నిందితులు ఎవరూ తప్పించుకోకుండా ఏసీబీ చాకచక్యంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా ఏసీబీ వద్ద విచారణకు హాజరు కావాల్సి ఉంది. అలాగే ఇప్పటికే ఒకసారి విచారించిన వేం నరేందర్ రెడ్డిని మళ్లీ సోమవారం పిలుస్తారని సమాచారం. ఇవన్నీ జరిగిన తర్వాత చకచకా పావులు కదిపి మరింతమందికి నోటీసులు ఇవ్వడం, అవసరమైతే అరెస్టులు చేయడం లాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. -
ఏసీబీ.. ఏం చేస్తోంది?
-
ఢిల్లీకి చేరిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
ఓటుకు నోటు కేసు రోజురోజుకూ బిగుసుకుంటుండటంతో.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం కలిశారు. తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ట్యాప్ చేస్తోందంటూ ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని పట్టించుకోవాలని కోరారు. అయితే ఈ విషయంలో రాజ్‌నాథ్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. మరోవైపు ఇదే అంశంపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్‌ను, టెలికం కార్యదర్శిని కూడా ఐవైఆర్ కృష్ణారావు తదితరులు కలిసినట్లు సమాచారం. -
మత్తయ్యకు హైకోర్టులో కొద్దిపాటి ఊరట
-
'హోదాతో పనిలేదు.. ఎవరికైనా నోటీసులివ్వచ్చు'
-
మత్తయ్యకు హైకోర్టులో కొద్దిపాటి ఊరట
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు హైకోర్టులో కొద్దిపాటి ఊరట లభించింది. తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఎఫ్ఐఆర్ నుంచి తన పేరు తొలగించాలంటూ మత్తయ్య హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి, ఏసీబీకి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సూచిస్తూ అందుకు ఈనెల 24వ తేదీని గడువుగా విధించింది. కేసు విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఈలోపు తన క్లయింటును అరెస్టు చేయకుండా చూడాలని మత్తయ్య తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దాంతో మత్తయ్య అరెస్టుపై ఈనెల 24వ తేదీ వరకు హైకోర్టు స్టే విధించింది. స్టీఫెన్సన్కు ఇచ్చిన డబ్బులతో గానీ, ఈ కేసుతో గానీ తనకు సంబంధం లేదని, అందువల్ల తనను ఈ కేసు నుంచి తప్పించాలని మత్తయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. -
'హోదాతో పనిలేదు.. ఎవరికైనా నోటీసులివ్వచ్చు'
స్పష్టమైన ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేష్‌రెడ్డి చెప్పారు. నోటీసులు ఇవ్వడానికి హోదాలతో సంబంధం లేదని, అలాగే అందుకు ఎవరి పర్మిషన్లు కూడా అవసరం లేదని వ్యాఖ్యానించారు. చట్టం పరిధిలో ఉన్న అంశాలపై గవర్నర్ కూడా జోక్యం చేసుకోలేరని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద కేంద్రం సుమోటోగా జోక్యం చేసుకోబోదని, నోటీసులు ఇచ్చే అంశం తెలంగాణ ఏసీబీ పరిధిలోనే ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల స్వేచ్ఛకు, ఆస్తులకు రక్షణ లేకపోతే సెక్షన్-8లో గవర్నర్ జోక్యం చేసుకుంటారని దినేష్ రెడ్డి వివరించారు. అంతేతప్ప మొత్తం శాంతి భద్రతలు పూర్తిగా గవర్నర్ చేతుల్లోకి వెళ్లవన్నారు. రాష్ట్రపతి పాలనలో మాత్రమే గవర్నర్‌కు పూర్తి అధికారాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులపై దాడులు జరిగితే గవర్నర్ జోక్యం చేసుకుంటారన్నారు. -
సెక్షన్-8తో ఎవరికి ఉపశమనం?
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో తమకు ఏమాత్రం రక్షణ లేదని, అందువల్ల ఇక్కడ తప్పనిసరిగా విభజన చట్టంలోని సెక్షన్-8 అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రుల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అందరూ డిమాండు చేస్తున్నారు. గవర్నరే శాంతిభద్రతలను చూడాలని తొలుత చెప్పినా.. చివరకు తమ రక్షణను తమ పోలీసులే చూసుకుంటారంటూ పూర్తిగా ఆ అంశాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు సెక్షన్ -8 అంటే ఏంటి? రేవంత్ అండ్ కో చేసిన తప్పు నుంచి అది ఎవరికైనా ఉపశమనం కల్పిస్తుందా? ఇంతకీ సెక్షన్-8 ఏం చెబుతోందో ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ విభజన, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న సమయంలో శాంతిభద్రతల కోసం ఏర్పాటు చేసినదే సెక్షన్-8. రాష్ట్ర ఆవిర్భావ తేదీ నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ పాలన సజావుగా నిర్వహించే క్రమంలో ఇక్కడి ప్రజలందరి భద్రత, స్వేచ్ఛ, వారి ఆస్తుల రక్షణ విషయంలో గవర్నర్ ప్రత్యేక బాధ్యత కలిగి ఉంటారు. ఇది సెక్షన్-8లోని మొదటి రూల్. రెండోది శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ఆస్తుల రక్షణ, అలాగే ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణ వంటి విషయాలపై గవర్నర్ తన బాధ్యతలు విస్తరించవచ్చని చెబుతోంది. మూడో రూల్ విధుల నిర్వహణలో తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించిన మీదట గవర్నర్ తన వ్యక్తిగత విచక్షణ మేరకు తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని చెబుతోంది. నాలుగో రూల్ గవర్నర్‌కు విధుల్లో సహకరించేందుకు కేంద్రం ఇద్దరు సలహాదారులను నియమిస్తుంది. మొత్తంగా సెక్షన్ 8 చెప్పేది ఒకటే. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలున్నాయి. అక్కడ ప్రజల ప్రాణాలు, ఆస్తులు, స్వేచ్ఛకు ఇబ్బందులు ఏర్పడినపుడు గవర్నర్ ఆ బాధ్యతలు నిర్వహించే అవకాశముంది. తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించి తర్వాత తన విచక్షణ మేరకు చర్యలు చేపట్టవచ్చు. ఆ క్రమంలో శాంతి భద్రతల్లాంటి అంశాలకు కూడా ఆయన బాధ్యతలు విస్తరించవచ్చు. ఇందుకోసం కేంద్రం నియమించిన సలహాదారుల సేవలు వినియోగించుకోవచ్చు. ఆయన చర్యలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఇదీ సెక్షన్ 8 చెప్పే మాట. ఇందులో ఎక్కడా ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని గానీ లేదా సలహా తీసుకోవాలన్న మాట, ప్రస్తావన లేనే లేదు. అంటే ఏపీ ప్రభుత్వానికి సెక్షన్-8తో ఏ ప్రమేయమూ లేదని చట్టం స్పష్టం చేస్తోంది. ఏపీ పోలీసు బలగాలను హైదరాబాద్ రప్పించడం చట్ట విరుద్ధమన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. చంద్రబాబు చెన్నై వెళ్లినా అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందే తప్ప సొంత రక్షణ తీసుకుపోలేరని వారు గుర్తుచేస్తోంది. కేసులో ఇప్పటికే వీడియో, ఆడియో సాక్ష్యాలు బయటకు వచ్చినందున న్యాయస్థానాల్లో చంద్రబాబుకు ఉపశమనం లభించడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. -
'మత్తయ్య నిందితుడని తెలియదు'
-
చంద్రబాబును వదలొద్దు: ఆప్
తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబును వదిలి పెట్టొద్దని ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణ భారత విభాగం ఇన్చార్జి, ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించొద్దని ఆయన చెప్పారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సోమనాథ్ భారతి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే ఏసీబీకి చిక్కినా... కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పట్ల చొరవ చూపకపోవడం విచారకరమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మాట మాత్రం కూడా దీనిపై మాట్లాడడం లేదన్నారు. తెలంగాణలో కుటుంబపాలన నడుస్తోందని ఆరోపించారు. ఒక కుటుంబానికి చెందిన నలుగురి చేతుల్లో పాలన కేంద్రీకృతమై ఉందన్నారు. కేంద్రంలో కూతురుకు పదవి కోసం సీఎం కేసీఆర్ రాయబారం చేస్తున్నారని, దీంతో కేంద్రం ఏం చేసినా విమర్శించడం లేదని ఆయన దుయ్యబట్టారు. -
'మత్తయ్య నిందితుడని తెలియదు'
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోట్ల కేసులో మత్తయ్య అనే వ్యక్తి కూడా నిందితుడు అన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. అందుకే మత్తయ్య నేరుగా విజయవాడలోని సత్యన్నారాయణపురం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదుచేసినా అతడిని తాము అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం మత్తయ్య తమ ఆధీనంలో లేడని కూడా ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. మత్తయ్య నిందితుడైనా అతడు మీడియాతో మాట్లాడుతున్నా తన నివాసాన్ని ఎప్పటికప్పుడు మార్చడంతో అతడి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నామని ఓ దశలో పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ మత్తయ్య విజయవాడ వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఇంత జరిగినా.. మత్తయ్య నిందితుడన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ సీపీ చెప్పడం గమనార్హం. -
ఓటుకు కోట్లు.. నాటకీయ పరిణామాలు
ఓటుకు కోట్లు కేసులో బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని చెప్పిన కాసేపటికే.. ఆయన తాను అరెస్టు కాలేదంటూ బయటికొచ్చి, స్వేచ్ఛగా ఇంటికి వెళ్లిపోయారు. అలాగే ఈ కేసులో అత్యంత కీలక సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తన వాంగ్మూలాన్ని నాంపల్లి ఏసీబీ కోర్టులో నమోదు చేశారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలు ఒక్కసారి చూద్దాం.. * నోటీసులిచ్చినా రాజీనామా చేయబోనని సన్నిహితులతో తెలిపిన చంద్రబాబు * ఉదయం 8 గంటలకు ఆంధ్రా పోలీసులను రీకాల్ చేసిన ఏపీ డీజీపీ జెవి రాముడు * ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్‌తో డీజీపీ అనురాగ్ శర్మ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఇంటలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డి భేటీ * ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ - 6 గంటల పాటు చర్చలు * ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని పిలిచిన తెలంగాణ ఏసీబీ, కార్యాలయానికి వచ్చిన నరేందర్ రెడ్డి * ఉదయం 10.50 గంటలకు నిందితుడు మత్తయ్యను ప్రవేశపెట్టిన విజయవాడ పోలీసులు, మత్తయ్యకు ప్రాణ భయం ఉందని వెల్లడి, మత్తయ్య ఫిర్యాదును సీఐడీ పర్యవేక్షిస్తోందని ప్రకటన * మధ్యాహ్నం12 గంటలకు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను ఈ నెల 24కు వాయిదా వేసిన హైకోర్టు * మధ్యాహ్నం 2 గంటలకు రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్, గవర్నర్ తో చర్చలు * మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి కోర్టుకు వచ్చిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం, స్టీఫెన్సన్ కూతురు జెస్సికా, ఇంటి ఓనర్ మార్క్ టేలర్ వాంగ్మూలం కూడా సేకరణ * సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్సీపీ ప్రెస్ మీట్, చంద్రబాబు సర్కారును బర్తరఫ్ చేయాలన్న ధర్మాన * సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరైన డీజీపీ జేవీ రాముడు * సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఏసీబీకి ఎన్నికల ప్రధాన సంఘం నుంచి లేఖ, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని సూచించిన ఎన్నికల కమిషన్ * సాయంత్రం 4.15 గంటలకు వేం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టు ఏసీబీ వర్గాల సమాచారం * సాయంత్రం 05.20కి ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వేం నరేందర్ రెడ్డి, అరెస్ట్ కాలేదని ప్రకటన -
కేసును తుదివరకు తీసుకెళ్లండి: ఈసీ
ఓటుకు నోటు కేసును తుది వరకు అర్థవంతంగా తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి తెలంగాణ సర్కారుకు ఓ లేఖ అందింది. వాస్తవానికి ఓటుకు నోటు కుంభకోణం గత నెల 31వ తేదీ రాత్రి వెలుగుచూసింది. మర్నాడే తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ కేసు వివరాలను అప్పట్లోనే ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. అయితే, ఇప్పటికే తెలంగాణ ఏసీబీ ముమ్మరంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నందున దీన్నే కొనసాగించాలని ఈసీ తెలిపింది. దీన్ని 'లాజికల్ ఎండ్' వరకు తీసుకెళ్లాలని ఆ లేఖలో సూచించింది. రేవంత్ రెడ్డి, ఇతరులపై ఎల్విస్ స్టీఫెన్సన్ చేసిన ఆరోపణల కేసును ముమ్మరంగా దర్యాప్తు చేయాలని, దాన్ని తుదివరకు అర్థవంతంగా విచారించాలని తెలిపింది. ఈ విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) లేఖ ద్వారా తెలిపారు. నిన్న మొన్నటి వరకు ఓటుకు నోటు కేసుతో తెలంగాణ ఏసీబీకి సంబంధం లేదని, వాళ్లకు నోటీసులు ఇచ్చే హక్కు, అరెస్టు చేసే అధికారం లేదని టీడీపీ నేతలు వాదిస్తూ వచ్చారు. ఇది ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి, ఎన్నికల కమిషనే దీని గురించి చెప్పాలన్నారు. అయితే.. ఇప్పుడు నేరుగా ఎన్నికల కమిషనే కలగజేసుకుని, ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేయాలని, లాజికల్ ఎండ్ వరకు తీసుకెళ్లాలని సూచించడంతో.. తెలుగుదేశం పార్టీ నాయకులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దీని గురించి ఇంక ఏమీ మాట్లాడే పరిస్థితి ఆ పార్టీ నాయకులకు కనిపించడం లేదు. -
కేసును తుదివరకు తీసుకెళ్లండి: ఈసీ
-
వాంగ్మూలం ఇచ్చిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్
ఓటుకు కోట్లు కేసులో కీలక సాక్షి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తన వాంగ్మూలాన్ని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఇచ్చారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆయన వద్ద వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ముందుగా బోయిగూడ ప్రాంతంలోని తన ఇంటి వద్ద నుంచి బులెట్ ప్రూఫ్ కారులో కుమార్తె జెస్సికా, స్నేహితుడు మార్క్ టేలర్లతో కలిసి బయల్దేరి కోర్టుకు వెళ్లిన స్టీఫెన్సన్.. అక్కడ అత్యంత కీలకమైన తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఓటుకు కోట్లు కేసు మొత్తం ఆయన చుట్టూనే తిరిగిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ఆఫర్ గానీ, చంద్రబాబు ఆడియో టేపులు గానీ.. ప్రతి అడుగులోనూ స్టీఫెన్సన్ ప్రధాన సాక్షిగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన ఫిర్యాదు మేరకే ఏసీబీ వర్గాలు వలపన్ని రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహాలను అరెస్టు చేశారు. -
మత్తయ్య కేసులో ఏపీ పోలీసులకు చిక్కులు
-
నమ్మకం లేకపోతే పదవి నుంచి తప్పుకోండి: ధర్మాన
గవర్నర్ వ్యవస్థపైనే తనకు నమ్మకం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని, అంత నమ్మకం లేకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తొలగిపోవాలని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. లేకపోతే గవర్నరే మిమ్మల్ని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ను గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన కోరారు. ఓటుకు నోటు కేసు పరిణామాలపై ఆయన హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు తెలివితేటలను చూసి తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారని, ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉండి కూడా కేవలం ఒక కేసులో తనకు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న కారణంతో ఆయనపై విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. గవర్నర్ మీద తమకు విశ్వాసం లేదంటూ మంత్రులు రావెల కిశోర్ బాబు, అచ్చెన్నాయుడు తదితరులు వ్యాఖ్యానాలు చేశారని, వారిని బర్తరఫ్ చేయాలని ధర్మాన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు కేవలం ఒక వ్యక్తి మాత్రమేనని, అందువల్ల ఆయన ఓటుకు నోటు కేసులో విచారణకు సహకరించాలని కోరారు. విచారణకు సహకరించకుండా.. పైపెచ్చు, తనకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించొచ్చా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చాలా తప్పుల మీద తప్పులు చేస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థ మీద, శాసన వ్యవస్థ మీద గౌరవం లేకుండా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఇప్పుడు ఎవరి హక్కులకు భంగం వాటిల్లిందని మీరు భావిస్తున్నారని ప్రశ్నించారు. శాంతి భద్రతల వ్యవస్థకు ఎక్కడ వైఫల్యం వచ్చిందని అడిగారు. ఊరికే రెండు రాష్ట్రాల ప్రజలను భయభ్రాంతులను చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కూడా హైదరాబాద్‌లో నియమించిన 400 మంది వరకు పోలీసులను రీకాల్ చేయడం చూస్తుంటే.. వాళ్ల మీద నాయకులు ఎంతగా ఒత్తిడి తెచ్చారోనన్న విషయం అర్థమవుతోందన్నారు. -
మత్తయ్య కేసులో ఏపీ పోలీసులకు చిక్కులు
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన మత్తయ్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. ఈనెల పదోతేదీన మత్తయ్య విజయవాడ సత్యన్నారాయణపురం పోలీసు స్టేషన్‌కు వచ్చారు. స్వయంగా ఆయనే వచ్చి సీఐకి ఫిర్యాదు చేయడంతో.. దీనిపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే కేసును సీఐడీకి అప్పగించింది. దాంతో ఈ కేసు రికార్డులను సత్యన్నారాయణపురం పోలీసులు సీఐడీకి అప్పగించారు. అయితే, మత్తయ్య మాత్రం తమ ఆధీనంలో లేడని సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు అంటున్నారు. వేరే రాష్ట్రంలో నిందితుడైన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదంటూ ఇప్పుడు విమర్శలు తలెత్తుతున్నాయి. ఒక కేసులో నిందితుడైన వ్యక్తి నుంచి ఎలా ఫిర్యాదు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మత్తయ్యను అదుపులోకి తీసుకుని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసీఆర్ మనుషులమని చెప్పుకొన్న కొందరు తనను బెదిరించారంటూ తన ఫిర్యాదులో మత్తయ్య పేర్కొన్నారు. అయితే, ఈ ఫిర్యాదు ఆధారంగా ముందుకు వెళ్లలేమన్న భావనలో అధికారులున్నారు. మత్తయ్య ఫిర్యాదుపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు దాటవేశారు. -
కోర్టుకు వెళ్లిన స్టీఫెన్సన్
ఓటుకు నోటు కేసులో కీలక సాక్షి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కోర్టుకు బయల్దేరి వెళ్లారు. ఈ కేసులో తన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట ఇచ్చేందుకు ఆయన బోయిగూడ లోని తన నివాసం నుంచి నాంపల్లి లోని ఏసీబీ కోర్టుకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కోర్టు వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో ఆయనను పటిష్ఠమైన భద్రత నడుమ కోర్టుకు తరలించారు. ఈ కారులో స్టీఫెన్సన్ ఒక్కరే బయల్దేరారు. 15-20 మంది వరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. ముందుగానే దారి మొత్తం భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కేసులో స్టీఫెన్సన్ వాంగ్మూలం అత్యంత కీలకం కావడంతో అంతా దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యాయమూర్తికి ఆయన చెప్పే విషయాలు కేసు దర్యాప్తులో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి. తనతో బేరసారాలు జరిపినవారి పేర్లను ఆయన కోర్టుకు వెల్లడించబోతున్నారు. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు బయట భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కోర్టుకు వెళ్లిన స్టీఫెన్సన్
-
రూ.50 లక్షలు నావని తేలితే రాజీనామా: సీఎం రమేష్
హైదరాబాద్ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మరోసారి మీడియాపై మండిపడ్డారు. మీడియా తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఆయన బుధవారమిక్కడ ఎదురుదాడికి దిగారు. ఓటుకు కోట్లు కేసులో రూ.50 లక్షలు తనవని తేలితే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఏసీబీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. కాగా ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్న సీఎం రమేశ్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం అవుతుంది. మరోవైపు ఈ కేసులో నోటీసులు అందుకున్న టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి ..ఇవాళ ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. -
'రాజకీయాల్లో ముడుపులు సర్వసాధారణం'
-
చంద్రబాబుతో టీ-టీడీపీ నేతల భేటీ
-
రాజకీయాల్లో ముడుపులు సర్వసాధారణం: జేసీ
రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి ప్రధాని వరకు ముడుపులు ఇవ్వడం సర్వ సాధారణమని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటికి మరో నాయకుడు, ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముడుపుల వ్యవహారంలో రేవంత్ రెడ్డి పట్టుబడటం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆధారాలు ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోవాలని జేసీ చెప్పారు. దీన్ని ఓ పెద్ద విషయంగా చూపిస్తే.. రెండు రాష్ట్రాల ప్రజలపై ప్రభావం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుతో టీ-టీడీపీ నేతల భేటీ
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, గరికపాటి రామ్మోహనరావు, ఎల్. రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. వారితో పాటు ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు. -
మీడియాకు సీఎం రమేష్ పాఠాలు
-
మీడియాకు సీఎం రమేష్ పాఠాలు
ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసుల గురించి తనను ప్రశ్నించిన మీడియాకు తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ తనదైన శైలిలో పాఠాలు చెప్పారు. ఇప్పటివరకు అసలు ఎలాంటి పరిణామాలు జరగలేదని, వస్తున్నవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లను భయభ్రాంతులను చేసి తాము గెలవాలని టీఆర్ఎస్ అనుకుంటోందని ఆయన చెప్పారు. అసలు తన దగ్గరకు ఎందుకు వస్తున్నారని, నేరుగా పోయి ఏసీబీ అధికారులనే అడగాలని మీడియాకు సూచించారు. అసలు ఇలా లీకులు ఎందుకు ఇస్తారని వాళ్లను ప్రశ్నించాలని తెలిపారు. ఒక నిర్మాణ సంస్థ.. టీడీపీ ఆఫీసు దగ్గర్లో ఉంది, వాళ్ల బ్యాంకు ఖాతాల నుంచే డబ్బులు వెళ్లాయంటున్నారని, కానీ ఇది కనుక్కోవాలంటే ఏదో రాకెట్ సైన్స్‌లా పరిశోధించాల్సిన అవసరం లేదని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఏసీబీ వాళ్లు బ్యాంకు దగ్గరకు పోయి అడిగితే తప్పనిసరిగా బ్యాంకు వాళ్లు ఇవ్వాలని చెప్పారు. స్టీఫెన్సన్ ఇచ్చిన ఫిర్యాదు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు చేతిలో అధికారం ఉందన్న సాకుతో నేరుగా ఏసీబీకి అప్పగించిందని తెలిపారు. అసలు ఈ కేసుతో తెలుగుదేశం పార్టీకే సంబంధం లేదని, తమ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారో లేదో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఏసీబీ నుంచి అదిగో ఇదుగో అంటే అందరూ పరిగెడుతున్నారు తప్ప మీడియా కూడా స్పష్టంగా ఏసీబీ వర్గాలను అడగట్లేదెందుకని ఆయన ఎదురు ప్రశ్నించారు. కేసులో రేవంత్ రెడ్డి డబ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు కదా.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అవన్నీ ఎమ్మెల్యే బయటకు వచ్చిన తర్వాతే తెలుస్తుందంటూ సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. -
'ఇక మేం మాట్లాడేదేం లేదు'
-
ఇక మేం మాట్లాడేదేం లేదు: రాజ్‌నాథ్
ఓటుకు నోటు కేసులో తాము మాట్లాడేది ఇక ఏమీ లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర మీద కచ్చితమైన ఆధారాలు లభ్యం కావడంతో ఆయనకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీ భావించడం, అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తగిన ఆధారాలుంటే 'గో ఎహెడ్' అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న కథనాలు వచ్చిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాగే, హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 అమలుచేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ముఖ్యమంత్రి చేస్తున్న డిమాండ్ల మీద కూడా రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని కేంద్ర హోం శాఖ కార్యదర్శి పరిష్కరిస్తారని ఆయన చెప్పారు. తద్వారా ఈ వివాదం విషయంలో ఏ ఒక్క ప్రభుత్వానికి అనుకూలంగా తాము వ్యవహరించడం లేదన్నట్లుగా ఆయన చెప్పినట్లయింది. -
'టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే ఆధారాలున్నాయి'
-
'టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే ఆధారాలున్నాయి'
తమ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టగలిగిన స్థాయిలో ఆధారాలున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు నాయుడితో మంత్రుల సమావేశం అయిన అనంతరం ఆయన మరో మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ''టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది. ఏసీబీకి నోటీసులు జారీచేసే అధికారం లేదు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినప్పుడు, ఎన్నికల ప్రక్రియ ఉన్నందువల్ల అంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. ఎలాంటి చర్య విషయంలోనైనా ఈసీ జోక్యం చేసుకోవాలి. ఏసీబీ కేవలం ఉద్యోగుల అవినీతిని అరికట్టడానికే ఏర్పాటైంది. ఈసీ మాత్రమే ఇలాంటి సందర్భంలో రియాక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏసీబీతో నోటీసులు ఇప్పిస్తున్నామంటూ లీకులిస్తున్నారు. ఏసీబీకి నోటీసులిచ్చే అధికారంలేదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సంభాషణలు అంటున్నారు.. అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి గానీ, ఏసీబీ అధికారులు గానీ ఈ నిమిషం వరకు చెప్పలేకపోతున్నారు. నోటీసులు ఇవ్వబోతున్నారు, సీఎం రాజీనామా చేస్తారు, అశోక్ సీఎం అవుతారు అంటూ తప్పుడు వార్త పంపిస్తున్నారు. తాటాకు చప్పుళ్లకు మేం భయపడేది లేదు. కేసీఆర్ మీద ఏపీలో నమోదైన 87 కేసులపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణ జరపబోతోంది. మత్తయ్యను బెదిరించడంపై సీబీసీఐడీ విచారణ జరపబోతోంది. ఫోన్ ట్యాపింగ్‌కు మా వద్ద పక్కా ఆధారాలున్నాయి. మేం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మా దగ్గర తెలంగాణ ప్రభుత్వం కూలిపోయే ఆధారాలున్నాయి. తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు ఏమయ్యారో ఒక్కసారి చూడండి. పెట్టుకునేవాళ్లకు అదే పరిస్థితి ఎదురవుతుంది. ఈరోజు ఒక అడుగు మీరు ముందుకేస్తే ఏపీ ప్రభుత్వం రెండు అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరికీ అధికారాలున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు, రాజీనామా అక్కర్లేదు, ఏపీ ప్రజలు కూడా భయపడక్కర్లేదు'' -
ఆధారాలుంటే.. గో ఎహెడ్!
ఓటుకు కోట్లు కేసులో తగిన ఆధారాలుంటే 'గో ఎహెడ్' అంటూ కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ ఏసీబీకి సమాచారం వచ్చిందని చెబుతున్నారు. కేంద్రం నుంచి ఆమోదముద్ర రావడంతో ఏసీబీ కూడా తన విచారణలో వేగాన్ని పెంచింది. చంద్రబాబు తదితరులకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం ఇప్పటికే గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులకు కూడా సమాచారం అందించిన సంగతి తెలిసిందే. -
డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆయన సోమవారం ఉదయం తన నివాసంలో ఏపీ డీజీపీ రాముడు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై ఓటుకు కోట్లు వ్యవహారంపై చర్చలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా చంద్రబాబు ప్రతిరోజూ పోలీసులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ తన దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో చంద్రబాబు...తాజా పరిణామాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఏసీబీ డీజీతో కూడా ఆయన నిన్న భేటీ అయ్యారు. -
'బాబును A1 ముద్దాయిగా చేర్చాలి'
-
ఆందోళనలో ఆ ముగ్గురు నేతలు?
-
ఒక ఓటు 5 కోట్లు