
అడ్డంగా దొరికిపోయి.. నిస్సిగ్గుగా అడుగుతారా
కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తన గొంతు ఎలా రికార్డు చేస్తారంటూ అడుగుతున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తన గొంతు ఎలా రికార్డు చేస్తారంటూ నిస్సిగ్గుగా అడుగుతున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. తాను ఏ తప్పూ చేయకపోయినా అసెంబ్లీ నుంచి తనను ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆమె అన్నారు.
మరిప్పుడు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబుకు శిక్ష పడాలా వద్దా అని రోజా ప్రశ్నించారు. అసెంబ్లీలో రౌడీయిజం చేసిన అచ్చెన్నాయుడు, బోండా ఉమామహేశ్వరరావులను శిక్షించాలా వద్దా అని అడిగారు. ఎమ్మార్వో వనజాక్షిని కొట్టిన విప్ చింతమనేని ప్రభాకర్‌కు శిక్ష వేయాలా వద్దా అని నిలదీశారు.