‘సింగపూర్‌ పర్యటన కాదు.. దొంగపూర్‌ పర్యటన’ | YSRCP Leader Sudhakar Babu Slams Over CM Chandrababu Singapore Tour | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 10 2018 5:06 PM | Last Updated on Wed, May 29 2019 3:21 PM

YSRCP Leader Sudhakar Babu Slams Over CM Chandrababu Singapore Tour - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌ బాబు

సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యేలు ఓటమి భయంతోనే వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌ బాబు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబుది సింగపూర్‌ పర్యటన కాదు.. దొంగపూర్‌ పర్యటన అని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో సుధాకర్‌ బాబు మీడియాతో మాట్లాడారు. అంతేకాక టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

ఎమ్మెల్యే రోజాపై పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మాట్లాడిన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. ‘బోడె ప్రసాద్‌ వాజమ్మలా మాట్లాడాడు. బోడె ప్రసాద్‌ ఇసుక దొంగ అని చిన్న పిల్లలు కూడా చెబుతారు. బోడె మిత్రుడు శ్రీకాంత్‌ కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ నిందితుడు. ఈ విషయం అప్పటి సీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్వయంగా చెప్పారు. బోడె నీ ఇంట్లో ఆడవాళ్ళు ఐనా నీ ప్రెస్‌మీట్‌​ చూడగలరా? నోటి కొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడడం కాదు. వీధి రౌడీలా, గూండాలా మాట్లాడుతావా? పెనమాలూరులోని ఇసుక దోపిడీని నిరూపిస్తాం. బోడె నీకు ఇంక 5,6 నెలల కాలమే ఉంది, గుర్తుంచుకో. బోడె ఇంటర్‌ పరీక్షల్లో వేరే వారితో దొంగ పరీక్ష రాయించిన ఘనుడువని ధ్వజమెత్తారు.

సెక్స్‌, కాల్‌మనీ పనులు ఆపండి. బోడిమాటలు మాట్లాడటం ఆపు బోడె ప్రసాద్‌. ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలో అడ్డంగా దొరికిపోయావు. శాసన సభ్యుడిగా కొనసాగే అర్హత బోడె ప్రసాద్‌కు లేదు. రోజాపై ఒక్క చెప్పు పడితే.. మీ నాయకుడిపై లక్షల చెప్పులు పడతాయి. దమ్ముంటే ఎమ్మెల్యే రోజా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకుంటున్నారు. 52 నెలల పాలనలో 24 సార్లు విదేశాలకు వెళ్లారు. కనీసం 24 కోట్ల రూపాయల పెట్టుబడులైనా తీసుకొచ్చారా?  చంద్రబాబు నీ దొంగపూర్ పర్యటనల పేరుతో రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశావని’ వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్‌ బాబు విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement