bode prasad
-
‘బ్లాక్మెయిల్ చేసేవారికే TDP టికెట్లా?’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విపక్ష కూటమిలో టికెట్ల పంచాయితీ కొలిక్కి రావడం లేదు. పొత్తులో భాగంగా ఓ పార్టీకి టికెట్ వెళ్లడంతో మిగిలిన పార్టీల్లోని ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో బహిరంగంగా ఆందోళనకు, విమర్శలకు దిగుతున్నారు. తాజాగా పెనమలూరు టీడీపీలో ముసలం రాజుకుంది. బొడే ప్రసాద్‌కు పెనమలూరు టికెట్ ఇవ్వడంపై చలసాని పండు(వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడే ప్రసాద్‌కు టికెట్ కేటాయించడంపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తూ.. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు,లోకేష్ తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని స్మిత ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో తమ తండ్రి ఓటమికి పార్టీనే కారణమని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే తన తండ్రికి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. తండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారన్నారు. మామగారు చనిపోయిన బాధలో ఉన్నా పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అయినా 2014, 2019 లోనూ టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు. చదవండి: చంద్రన్న దెబ్బ! చౌదరిగారికి పరాభవం ఈసారి టికెట్ ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారని.. చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేసినట్లు తెలిపారు. బోడే ప్రసాద్‌కే ఏవిధంగా సీటిస్తారని ప్రశ్నించారు. గ్రౌండ్ వర్క్ చేసుకునేది తామైతే.. టిక్కెట్లు లాబీయిస్టులకిస్తారా అని మండిపడ్డారు. ఈసారి తమకు టికెట్ ఇవ్వాలని రెండేళ్లుగా అడుగుతున్నామని.. మా నాన్నను గెలిపించుకుంటామని బాబుని కోరినట్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్ అనేక మార్లు టిక్కెట్ కోసం అడిగామన్నారు. ‘టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారో కనీసం పిలిచి కూడా చంద్రబాబు మాకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాం. లోకేష్‌కు వాట్సాప్‌లలో మెసేజ్‌లు పెట్టాం. మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మా మెసెజ్‌లకు సమాధానం ఇవ్వం లేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ మేం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశాం. టికెట్ లేదంటే బోడే ఏడ్చాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు. మేం బోడేలా చేయలేదు కదా. మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా? బోడే ప్రసాద్ లాగా బ్లాక్ మెయిల్ చేసే వారికే చంద్రబాబు టికెట్లు ఇస్తారా? నా వెనుక ఎవరూ లేరనేగా ఆడిపిల్లనైన నన్ను ఏడిపిస్తున్నారు. మాకు తీవ్ర అన్యాయం జరిగింది. మేం చేసిన తప్పేంటో చంద్రబాబు సమాధానం చెప్పాలి. విలువలేని పార్టీకోసం మేం ఎందుకు పనిచేయాలి?. చంద్రబాబు సతీమణిలాగే మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం’ అని దేవినేని స్మీత తెలిపారు. -
చంద్రబాబుపై బోడే ప్రసాద్ తీవ్ర అసహనం
సాక్షి, కృష్ణా: పెనమలూరు టీడీపీలో సీటు పంచాయితీ ఇంకా కొనసాగుతోంది. అభ్యర్థితత్వం ఖరారు కాకపోవడంతో ఎవరికివారే ప్రచారంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో.. సొంత మనుషులే తనను మోసం చేస్తున్నారంటూ ఆవేదన, అలాగే పార్టీ అధినేత తీరుపై అసహనం వ్యక్తం చేశారు బోడే ప్రసాద్. పార్టీ కోసం పని చేయడం ఒక్కటే నాకు తెలుసు. పార్టీ కోసం ఎంతో కోల్పోయా. అయినా సొంత వాళ్లే నన్ను మోసం చేశారు. పని చేయడం రానివాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. టికెట్ కోసం నాపై లేనిపోనివి అధిష్టానానికి చెబుతున్నారు. పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ?. కొడాలి నాని వంశీలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా పిల్ల మీద ప్రమాణం చేసి చెబుతున్నా. వంశీతో ఒకటి , రెండుసార్లు ఆయనే ఫోన్ చేస్తే మాట్లాడా. కోడాలి నానితో ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. అయినా వాళ్లతో సంబంధాలు ఉన్నట్లు టీడీపీవాళ్లే ప్రచారం చేస్తున్నారు అని బోడే ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు తీరును బోడే ప్రసాద్ ప్రశ్నించారు. ‘‘సర్వేలన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి. కానీ, రకరకాల పేర్లతో అధినేత చంద్రబాబు నాయుడు సర్వే చేయిస్తున్నారు’’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన. అలాగే.. పెనమలూరులో తనకు టికెట్ లేదని స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసి చెప్పేసినా ఇంకా టికెట్ పై ఆశలు ఉన్నాయని, టికెట్ తనకే వస్తుందన్న నమ్మకం ఉందని, అదిష్టానం తీసుకుబోయే నిర్ణయం బట్టి తాను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారాయన. ఇదిలా ఉంటే.. పెనమలూరు టికెట్ సీటు ఇవ్వకపోతే రెబల్ అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని బోడే ప్రసాద్ ఇదివరకే ప్రకటించారు. -
అధిష్టానం పిలుపు.. బోడె స్టంటేనా!
కంకిపాడు: టీడీపీ అధిష్టానం నుంచి పిలుపువచ్చిందంటూ పెనుమలూరు మాజీఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరగణం సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం అంతా పబ్లిసిటీ స్టంటేనని టీడీపీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. ఈ చర్యలు పార్టీ వర్గాలు, శ్రేణులను గందరగోళానికి, అయోమయానికి గురిచేసేందుకేనని పేర్కొంటున్నాయి. పెనమలూరు సీటు వ్యవహారం తేలాలంటే మరో రెండు రోజులు నిరీక్షించక తప్పదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ అధిష్టానం సీటు కేటాయింపులో తనకు అన్యాయం చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రజల్లోకి వెళ్లారు. స్వతంత్రంగా అయినా పోటీకి సిద్ధమంటూ కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో బోడె ప్రసాద్ భేటీ అయినప్పటికీ, చివరికి ఆయనకు అక్కడా రిక్త హస్తమే మిగిలింది. ఈ విషయాన్ని బోడె ప్రసాద్ స్వయంగా కార్యకర్తలకు స్పష్టంచేశారు. అయితే బోడె యనమలకుదురు కాలవకట్ల మీద ప్రచారం చేస్తున్న క్రమంలో సోమవారం అధిష్టానం నుంచి మళ్లీ పిలుపు వచ్చిందని తీపికబురు వినబోతున్నామంటూ బోడె వర్గీయులు సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు. దీంతో బోడెకు దాదాపుగా సీటు ఖరారు అయ్యిందా? అన్నట్లు ప్రచారం చేశారు. అయితే బోడె తనవెంట ఎవరినీ తీసుకెళ్లకుండా ఆయన ఒక్కడే కారులో మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి వెళ్లినప్పటికీ అక్కడ చంద్ర బాబుతో భేటి కాలేదని, అక్కడి పెద్దలను కలిసి వచ్చినట్లుగా టీడీపీలోని మరో వర్గం చెబుతోంది. దీంతో కేవలం పబ్లిసిటీ కోసం, పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా బోడె తనవర్గీయులతో కలిసి ఇలా పబ్లిసిటీ స్టంట్ చేశారని విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఏదో ఒకటి తేలి ఉంటే నియోజకవర్గంలో సంబరాలు జరిగేవి కాదా? అన్నప్రశ్నలూ వ్యక్తమవుతున్నాయి. రోజుకో విధంగా జరుగుతున్న ప్రచారాలు, కొత్త వ్యక్తుల రంగప్రవేశం టీడీపీ శ్రేణులను అయోమయంలో పడేస్తున్నాయి. అధిష్టానం సీటు తేల్చకుండా సాగదీస్తుండటంపై వారిలో ఉత్కంఠ నెలకొంది. సీటు ఎవరికి ఇస్తారనే విషయాన్ని తేల్చకుండా ఇలా కార్యకర్తలను నిరీక్షణకు గురిచేస్తుండటం తగదంటూ చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. -
పెనమలూరులో టీడీపీ టికెట్ రచ్చ! అసమ్మతిలో బోడె ...
కంకిపాడు: పెనమలూరు టీడీపీలో కుర్చీలాట సాగుతోంది. ఎవరికి వారే సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం సీటును ఎవరికిచ్చేది తేల్చకుండా నాన్చుతోంది. దీంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సీటే తేలకపోవటంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయి. అధిష్టానం తీరు సరికాదంటూ మండిపడుతున్నాయి ఇదెక్కడి లొల్లి.. సమీకరణల్లో సీటు ఇవ్వటం కుదరటం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు బోడె ప్రసాద్‌కు తేల్చిచెప్పారు. తనకు అధిష్టానం అన్యాయం చేయాలని చూస్తోందని, ప్రజలే న్యాయం చెప్పాలంటూ బోడె ప్రసాద్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. స్వతంత్రంగానైనా పోటీకి సిద్ధమనే సంకేతాన్ని అధిష్టానానికి పంపారు. బయటి వ్యక్తులు, వెదవలు, ఓటమిపాలయ్యే వాళ్లకు సీటు ఇస్తే ఊరుకోనంటూ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. మరో వైపు చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత 2014 ఒప్పందం ప్రకారం సీటు వస్తుందని భావిస్తున్నారు. కొద్ది నెలలుగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. వర్గాన్ని సమీకరించి పోటీకి సమాయత్తం అవుతున్నారు. అయితే బోడె ప్రసాద్‌కు సీటు ఇస్తే సహకరించేది లేదని కూడా చెబుతున్నట్లు తెలిసింది. తాజాగా టీడీపీలో చేరిన తుమ్మల చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యతిరేక వర్గాన్ని దగ్గర చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, నియోజకవర్గంలోని పలువురు నేతలను కలుసుకుని మద్దతు కోరుతున్నారు. ఈ చర్యతో కొత్త వర్గం నియోజకవర్గంలో తయారైంది. తలలు పట్టుకుంటున్న శ్రేణులు.. ఎవరికి వారే ప్రజల్లోకి వచ్చి సీటు నాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి తోడు రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. లోకల్‌కి ఇస్తారా?, నాన్ లోకల్‌కి ఇస్తారా? అర్థం కాక ఎవరి వెంట ప్రయాణం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. అధిష్టానం తీరు నచ్చక కొందరు పార్టీ మారుతున్నారు. -
మరోసారి చంద్రబాబు మొండిచేయి.. రగిలిపోతున్న సీనియర్లు
-
Penamaluru: చుక్కలు చూపిస్తాం.. బోడే అనుచరులు హెచ్చరిక
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరులో బోడే ప్రసాద్‌కు టిక్కెట్ దక్కక పోవడంపై కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు తీరుపై బోడే అనుచరులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. 40 ఏళ్లుగా పార్టీలో ఎందుకున్నామా అనినిపిస్తోందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బోడే కాలికి బలపం కట్టుకుని పెనమలూరులో తిరిగారు. చంద్రబాబు,లోకేష్ కూడా బోడే మాదిరి తిరగలేదు. చంద్రబాబు జైల్లో ఉంటే మా ఇంట్లో మనిషిలాగా భావించాం. 53 రోజులు నిరాహారదీక్షలు చేశాం. నేటి నుంచి టీడీపీ,చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం. చంద్రబాబు సీఎం కుర్చీలో ఎలా కూర్చుంటాడో చూస్తాం. పెనమలూరుకు వచ్చే టీడీపీ అభ్యర్ధికి రేపటి నుంచి చుక్కలు చూపిస్తాం’’ కార్యకర్తలు హెచ్చరించారు. ఇదీ చదవండి: ఫైనల్‌గా ఫిక్స్.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ -
చంద్రబాబుకు పెనమలూరు సెగ
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలో నిరసన సెగ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గం చంద్రబాబు కాన్వాయ్ వైపు దూసుకొచ్చింది. బోడె ప్రసాద్‌కే పెనమలూరు టికెట్ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు నినాదాలు చేశారు. ఇసుక కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించడానికి తడిగడప సీఐఈడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరిక నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా బోడె ప్రసాద్ వర్గం ఆందోళన చేపట్టింది. నిరసనకారులను అడ్డుకోవడం పోలీసుల వల్ల కూడా కాలేకపోయింది. దీంతో పోలీసులు ఏర్పాట్లు చేసిన బారికేడ్లను సైతం తోసేసి ఫ్లకార్డులతో బాబు వైపు దూసుకొచ్చారు. కాగా ఇసుక పాలసీ కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం పాలసీ కేసులో బాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
అక్కడ తమ్ముళ్ల పరిస్థితి అగమ్యగోచరం!
ఆ నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం డామినేషన్ ఉందని చెప్పుకునేవారు. కాని గత ఎన్నికల్లో అక్కడ టీడీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయింది. అందుకే ఈ సారి అక్కడ మళ్ళీ పట్టు నిలుపుకోవాలని పచ్చ పార్టీ బాస్ తెగ ఆరాటపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేను కాకుండా బాగా డబ్బు ఖర్చు పెట్టగల అభ్యర్థిని దించాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. బాస్ తీరుతో ఈసారి టిక్కెట్ రాదేమోనని ఆ మాజీ ఎమ్మెల్యేకు గుండె దడ మొదలైందట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని తమ్ముళ్లు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందట. ఎవరికి వారే తమకే టిక్కెట్టు దక్కుతుందని ఇన్నాళ్లూ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న నేతలకు చంద్రబాబు నిర్ణయాలు షాకిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే..2014లో సైకిల్ జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ప్రభంజనంలో సైకిల్ పార్టీ ముక్క చెక్కలైంది. అయితే ఈ సారి ఎలాగైనా పెనమలూరు నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ పెద్ద కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పెనమలూరు టిక్కెట్ కోసం టీడీపీలో పెద్ద ఫైటే నడుస్తోందని సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, చలసాని వెంకటేశ్వరరావు మేనల్లుడు దేవినేని గౌతమ్ వేర్వేరు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారట. వీరంతా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ టిక్కెట్ తమదే అని చెప్పుకుంటున్నారట. ఇలాంటి సమయంలో చంద్రబాబు పెనమలూరు నియోజకవర్గంలో వీరందరినీ కాదని వేరే అభ్యర్ధిని బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే మూడు గ్రూపులతో ఎవరి వెంట నడవాలో అర్ధంకాక తలపట్టుకుంటున్న క్యాడర్ చంద్రబాబు తాజా నిర్ణయంతో మరింత కన్ఫ్యూజన్ లో పడ్డారట. పెనమలూరు నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజికవర్గాలు బలమైనవి. దీంతో ఇప్పుడు ఈ రెండు సామాజికవర్గాల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనట. ప్రస్తుత టీడీపీ ఇంఛార్జి బోడే ప్రసాద్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వాడే అయినప్పటికీ 2024 ఎన్నికల్లో దండిగా ఖర్చు పెట్టగలిగిన కమ్మనేతను బరిలోకి దించాలనుకుంటున్నారట చంద్రబాబు. బోడే ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ధీటైన అభ్యర్ధి కాదని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే కమ్మ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు దేవినేని ఉమా లేదా కేశినేని చిన్ని పేర్లను పరిశీలిస్తున్నారట. వీరెవరూ కాకపోతే కొనకళ్ల నారాయణ తమ్ముడు కొనకళ్ల బుల్లయ్యను బరిలోకి దించి బిసి ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈక్రమంలోనే గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా దేవినేని ఉమా, కొనకళ్ల నారాయణ, కొనకళ్ల బుల్లయ్య పాల్గొంటున్నారట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇప్పటి వరకూ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న బోడే ప్రసాద్ కు ఈ పరిణామాలతో అసంతృప్తికి గురవుతున్నారు. నాలుగేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ ...ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా రోడ్డెక్కి నిరనసలు చేసిన తనను కాదని ఇప్పుడు మరో అభ్యర్ధిని నిలబెట్టాలని చూడటంపై బోడే లోలోన రగిలిపోతున్నాడట. ఆ మధ్య చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు దీక్షలు చేపట్టిన సమయంలో...బోడే మాట్లాడుతూ, ఎవరెవరో వచ్చి తమకే టిక్కెట్ అంటున్నారు.. పార్టీ కోసం కష్టపడిన తనను పక్కన పెట్టాలని చూడటం కరెక్ట్ కాదని బహిరంగంగానే తన ఆవేదన వెళ్ళగక్కారు. అప్పటి ఆవేదన ఇప్పుడు నిజమైతే తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక బోడే ప్రసాద్ కుమిలిపోతున్నారట. -
విజయవాడ సెంట్రల్, పెనమలూరు టీడీపీలో అసమ్మతి జ్వాలలు
సాక్షి, విజయవాడ: వరుస పరాజయాలను మూటకట్టుకున్న టీడీపీ పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోజు రోజుకూ మరింతగా దిగజారుతోంది. పెనమలూరు నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి బుసలు కొడుతోంది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బోడె ప్రసాద్‌పై ఆ పార్టీ నాయకులు ఏకంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సైతం పార్టీ నాయకులు, కార్యకర్తలు నాలుగు వర్గాలుగా చీలిపోయారు. ఒకరి మీద మరొకరు కారాలూ మిరియాలు నూరుకొంటున్నారు. బోడెపై తీవ్ర వ్యతిరేకత మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్‌పై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘అసమర్థుడు, చిత్తశుద్ధి లేదు, అవినీతిపరుడు, అధికార దుర్వినియోగం’ చేశాడు అంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీలోని ఓ వర్గం బోడెపై తీవ్ర స్థాయిలో తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్ (వైవీబీ), పండు వర్గాలు, బోడె ప్రసాద్‌పై బహిరంగంగానే విమర్శల దాడి చేస్తున్నాయి. ‘మీకు బదులు వేరే వాళ్లతో పరీక్షలు రాయిస్తూ పట్టుబడిన మాట వాస్తవం కాదా’ అంటూ బోడెను ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన కంకిపాడు, పెనమలూరు మండలాలకు చెందిన పలువురు నాయకులు బోడె ప్రవర్తనతో విసిగి పార్టీ మారారంటూ నిందిస్తున్నాయి. చదవండి: (అనకాపల్లి.. ఇదేం లొల్లి..?) కోడిపందేలు, పేకాటతో అపఖ్యాతి బోడె ప్రసాద్ ఈడుపుగల్లులో కోడిపందేలు, పేకాట, క్యాసినో సంస్కృతిని తెచ్చి, ఆయా జూదాల నిర్వాహకుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసిన వైనాన్ని వ్యతిరేక వర్గం నాయకులు ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. ఇప్పటికీ కాల్‌మనీ, సెక్స్ రాకెట్, క్యాసినో నిందితులతో అంతర్గత వ్యాపారం ఉన్న మాట వాస్తవం కాదా అని నిలదీస్తున్నారు. వారితో కలిసి పట్టాయి, బ్యాంకాక్, దుబాయ్, మహాబలిపురం తదితర ప్రాంతాలకు ఇటీవలే వెళ్లి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గతంలోనే ఈడుపుగల్లులో సంక్రాంతి సంబరాలకు క్యాసినో పెట్టాలని గోవా నుంచి యువతులను, సామగ్రిని తెచ్చి హోటల్లో ఉంచిన విషయాన్ని మరిచారా అంటూ ప్రశ్నిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలకు ఆయన అభిమానులు ఆహ్వానిస్తే, అహంకారంతో వ్యవహరించిన బోడె తీరును ఇంకా మర్చిపోలేదంటూ గుర్తుచేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే నిజమైన కార్యకర్తల పరిస్థితి ఏమిటని సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలే బోడె ప్రసాద్‌ను నిలదీయడం పార్టీ దుస్థితికి అద్దంపడుతోంది. ఓడిపోయినా తీరుమారని బోడే అంటూ పోస్టులు పెడుతున్నారు. మరో వైపు సర్పంచ్ల సంఘం దొంగ డ్రామాలు అంటూ వైవీబీ వర్గంపై బోడె వర్గం ఎదురుదాడి చేస్తోంది. సెంట్రల్లో నాలుగు ముక్కలాట విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీలో నాలుగు ముక్కలాట సాగుతోంది. నియోజకవర్గంలో బొండా ఉమా సొంతంగా ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన వద్దకు కొత్తగా వచ్చిన నాయ కుడు ఒకరు నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవ హరిస్తున్నాడు. దీంతో ఆది నుంచి టీడీపీలో ఉన్న తెలుగు తమ్ముళ్లు బొండా ఉమాకు దూరమయ్యారు. ఈ నియోజకవర్గంలో బొండా ఉమాది ఓ వర్గం. కేశినేని చిన్నిది మరో వర్గం. వంగవీటి రాధాది ఇంకో వర్గం. పార్టీని మొదటి నుంచి వెన్నంటి ఉన్నవారు నాలుగో వర్గంగా విడిపోయారు. ఈ నాలుగు గ్రూపులు ఎవరికి వారుగా వ్యవహరిస్తూ, పార్టీలో అసమ్మతిని రాజేస్తున్నారు. ఇటీవల 63 డివిజన్ పరిధిలో అన్నా క్యాంటీన్ వద్ద ఇరువర్గాలు ఎదురుపడి పరస్పరం తిట్ల పురాణంతో రెచ్చిపోయాయి. చొక్కాలు పట్టుకొని కొట్టుకొనేంత స్థాయికి వెళ్లడంతో అక్కడే ఉన్న పోలీసులు సర్ది చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. పార్టీ నాయకులే గ్రూపులుగా విడిపోవడంతో కార్యకర్తలు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య అసమ్మతి పార్టీ పుట్టి ముంచడం ఖాయమనే భావన సొంత పార్టీ కార్యకర్తల్లోనే వ్యక్తమవుతోంది. -
పెనమలూరులో పచ్చ రాజకీయం.. ఆ క్రెడిట్ కొట్టేయడానికే చీప్ పాలిటిక్స్
ఆ మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నపుడు నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఐదేళ్ళలో ఒక కాలువపై చిన్న వంతెన కూడా పూర్తి చేయించలేకపోయాడు. అన్ని రకాలుగా జనాన్ని దోచుకుతిన్నాడు. ఇప్పుడు మాజీగా మిగిలాక కూడా జనంపై కక్ష తీర్చుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో, ఆయన గొడవేంటో.. మీరే చదవండి సైకిల్ పని వివాదం సృష్టించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులతో పచ్చ పార్టీ నాయకులు గంగవెర్రులెత్తుతున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికి నానాపాట్లు పడుతున్నారు. తాజాగా వివాదాలకు కేరాఫ్ గా నిలిచే విజయవాడ నగర శివార్లలోని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చీప్ పాలిటిక్స్ చూసి జనం అసహ్యించుకుంటున్నారు. యనమలకుదురులో అసంపూర్తిగా ఆగిపోయిన వంతెన వద్ద బోడే ప్రసాద్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. అక్కడి కాల్వపై వంతెన నిర్మాణానికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న ప్రస్తుత పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి చొరవతో ఈ వంతెన మంజూరైంది. శంకుస్థాపన జరిగిన వెంటనే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పెనమలూరు నుంచి పోటీ చేసిన బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హాయాంలో ఐదేళ్ళలో వంతెన పనులు పూర్తిచేయలేకపోయారు. బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో చిన్న వంతెన నిర్మాణాన్ని కాంట్రాక్టర్ ఐదేళ్ల పాటు సాగదీశాడు. వంతెనపై పచ్చ రాజకీయం 2019 ఎన్నికల్లో బోడే ప్రసాద్ ఓడిపోయి పార్థసారథి విజయం సాధించారు. కాంగ్రెస్ హయాంలో తాను శంకుస్థాపన చేసిన వంతెన ఇంకా పూర్తికాకపోవడంతో వంతెన నిర్మాణంపై పార్ధసారధి ప్రత్యేక దృష్టి సారించారు. ఇరిగేషన్ శాఖ అడ్డంకులన్నీ తొలగించి వంతెన నిర్మాణం పూర్తిచేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇదే అదనుగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కాంట్రాక్టర్ తో కోర్టులో కేసు వేయించాడు. అప్పటి వరకూ జరిగిన పనులకు బిల్లులు చెల్లించలేదని.. అవి చెల్లించాలంటూ కాంట్రాక్టర్ కోర్టుకెళ్లాడు. గత రెండేళ్లుగా కోర్టులో పోరాడి, కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడంతో పాటు అసంపూర్తిగా మిగిలిపోయిన వంతెనను పూర్తిచేసేందుకు అన్ని అనుమతులు తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో పనులు తిరిగి మొదలు కానున్నాయి. విషయం తెలిసిన టీడీపీ నేత బోడే ప్రసాద్ తన వల్లే పనులు మొదలవుతున్నాయని చెప్పుకునేందుకు ఇప్పుడు కొత్తగా చిల్లర రాజకీయాలకు తెరతీసాడు. ఇదేం ఖర్మరా బాబూ..! తన ఐదేళ్ళ పదవీ కాలంలో పూర్తి చేయకపోగా.. ఇప్పుడు వంతెన పూర్తి చేసిన క్రెడిట్ అధికార పార్టీ ఎమ్మెల్యే పార్ధసారధికి వెళ్తుందనే అక్కసుతో బోడే ప్రసాద్ ఇదేం ఖర్మరా బాబూ అంటూ వంతెన వద్ద ఆందోళన చేపట్టాడు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు శాంతియుత నిరసన తెలిపారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడటంతో పోలీసులు మోహరించారు. ఇదే అదనుగా భావించిన బోడే ప్రసాద్.. మహిళలను అడ్డం పెట్టకుని వైసీపీ శ్రేణులపై భౌతికదాడులకు పాల్పడ్డారు. ఫలితంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వంతెన వద్ద నిరసన పేరుతో బోడే ప్రసాద్ చాలా సేపు డ్రామా నడిపించాడు. బోడే చేపట్టిన నిరసన డ్రామాపై వైసీపీ శ్రేణులతో పాటు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన వంతెనను ఐదేళ్లలో పూర్తిచేయకుండా ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడానికి ఇలా చీప్ పాలిటిక్స్ ప్లే చేయడాన్ని తప్పుబడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి డబ్బు దండుకుని.. అభివృద్ధి పనులను గాలికి వదిలేసిన బోడే ప్రసాద్ ఇప్పుడు ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడాన్ని సహించబోమని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. - హితైషి, పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Yanamalakuduru Bridge: రక్తికట్టని మాజీ ఎమ్మెల్యే బోడే డ్రామా
పెనమలూరు(కృష్ణా జిల్లా): యనమలకుదురు పరిధిలో బందరు కాలువపై అసంపూర్తిగా మిగిలిన వంతెన నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వింత నాటకాలకు తెరలేపారు. ప్రతిపక్షంలో ఉండగా వంతెన శిలాఫలకానికి పిండ ప్రదానాలు చేసి ప్రజలపై కల్లబొల్లి ప్రేమ కురిపించిన ఆయన.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా వంతెన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వంతెన నిర్మాణంపై దృష్టి సారిస్తుండటంతో అక్కసుతో కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిర్మాణానికి మోకాలడ్డారు. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారాన్ని రాజకీయ స్వలాభం కోసం పచ్చనాటకానికి తెరలేపారు. అధికారంలోకి వచ్చినా నిర్లక్ష్యం.. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వంతెన నిర్మాణానికి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ రాశారు. అయితే ఆయన వెంటనే పనులు ప్రారంభించలేదు. జలరవాణాకు వంతెన అడ్డుగా ఉంటుందని సాకు చూపి వంతెన పనులు టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో యనమలకుదురు ప్రజలు దిక్కుతోచక లాకుల మీదుగా నానా ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు. తరచూ ట్రాఫిక్ ఇక్కట్లతో ఈ ప్రాంత ప్రజలు అగచాట్లు పడ్డారు. అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేగా ఉన్న బోడె ప్రసాద్ వంతెన నిర్మాణంపై ఏమాత్రం చొరవ చూపలేదు. కాంట్రాక్టర్‌తో చెట్టాపట్టాల్ వేసుకుని కాలం గడిపారు. గతంలో బోడె ప్రసాద్ వంతెన కోసం ఆందోళనలు చేసి గ్రామస్తులను దగా చేశారు. ఆలస్యంగా పనులు ప్రారంభం.. యనమలకుదురు వంతెన అగ్రిమెంట్ రాసిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు 2016లో ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ రామవరప్పాడు వద్ద రైవస్ కాలువపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభించి, సకాలంలో పూర్తి చేశారు. వంశీ వంతెన పనులు చకచకా పూర్తి చేయటంతో అప్పటివరకు నిద్రావస్థలో ఉన్న బోడె ప్రసాద్ నిద్రలేచి వంతెన పనులు ప్రారంభించారు. తన వలనే వంతెన పనులు ఆలస్యంగా ప్రారంభించామని యనమలకుదురు గ్రామసభలో బోడెప్రసాద్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. కాంట్రాక్టర్‌కు బిల్లు ఎగ్గొట్టిన టీడీపీ.. యనమలకుదురు వంతెన పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు టీడీపీ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయే నాటికి రూ 3.60 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించే బాధ్యత బోడెప్రసాద్‌పై ఉన్నా ఆయన పూర్తి నిర్లక్ష్యం చూపాడు. దీంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పథకం ప్రకారం వంతెన పనులు నిలుపుదల చేశాడు. మరో కాంట్రాక్టర్‌తో వంతెన పనులు చేయించాలని ప్రభుత్వం సిద్ధపడగా కాంట్రాక్టర్ కోర్టు స్టే తెచ్చుకున్నాడు. వంతెన పనులు విషయంలో కాంట్రాక్టర్ సహకరించక పోవటంతోనే అసలు సమస్య వచ్చింది. కాంట్రాక్టర్‌కు రూ. 4 కోట్లు బిల్లులు చెల్లించటానికి అధికారులు చర్యలు చేపట్టారు. కాంట్రాక్టర్ బిల్లులు రావాలనే ఉద్దేశంతోనే నేడు బోడెప్రసాద్ వంతెన నాటకానికి తెరలేపారని గ్రామస్తులు మండి పడుతున్నారు. బోడె ప్రసాద్ అరెస్టు.. యనమలకుదురు వంతెన వద్ద శాంతి భద్రతలకు భంగం కలిగించిన మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. యనమలకుదురు వంతెన వద్ద మంగళవారం బోడెప్రసాద్ వంద మందితో వెళ్లి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా బందరు కాలువలో దూకుతానని బెదిరించారు. ఈ ఘటనపై పోలీసులు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, బోడెప్రసాద్, మరో వంద మందిపై కేసు నమోదు చేశారు. వారికి నోటీసులు ఇచ్చి, బోడెప్రసాద్, అనుమోలు ప్రభాకరరావును అరెస్టు చేసినట్లు పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపారు. వంతెన కథ ఇది.. యనమలకుదురులో బందరు కాలువపై వంతెన నిర్మాణం చేయాలని 2011లో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి రూ. 8 కోట్లు మంజూరు చేశారు. అయితే అనుకున్న సమయానికి పనులు జరగక పోవటంతో ప్రతిపక్షంలో ఉన్న బోడె ప్రసాద్ శిలాఫలకం వద్ద పిండ ప్రదానం, కర్మకాండలు నిర్వహించి పచ్చ మీడియా ప్రచారంతో వార్తల్లోకెక్కారు. (క్లిక్ చేయండి: ఇప్పటం పిటిషనర్లకు ఏపీ హైకోర్టు షాక్) వంతెన పనులు పూర్తి చేస్తాం.. యనమలకుదురు వంతెనకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాం. పనులు కూడా ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేస్తాం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నాం. – కృష్ణారావు, ఈఈ, నీటిపారుదల శాఖ -
TDP-Chikoti Praveen: టీడీపీతో చికోటి ప్రవీణ్‌కు లింకులు!
సాక్షి, అమరావతి: క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్‌తో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అతనితో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే పలువురు టీడీపీ నేతలు ఇక్కడ క్యాసినో ఏర్పాటుకు సైతం సన్నాహాలు చేశారు. కొద్దిరోజుల క్రితం విజయవాడ సమీపంలోని కంకిపాడు వద్ద ఈడుపుగల్లులో టీడీపీకి చెందిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చికోటి ద్వారా ఇందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. ఖాళీ వ్యవసాయ భూమిలో బ్యాంకాక్ తరహాలో క్యాసినో సెట్టింగ్ వేయడానికి అవసరమైన సరంజామాను కూడా తీసుకొచ్చారు. కొంత పనికూడా పూర్తయింది. అలాగే, గోవా నుంచి కొందరు మహిళలను కూడా తీసుకొచ్చారు. పేకాట సహా పలు రకాల జూదాలు, మద్యం, డ్యాన్సులు వంటి సకల సౌకర్యాలు అక్కడ ఉంటాయని ప్రచారం చేశారు. సోషల్ మీడియాలోనూ క్యాసినోకు సంబంధించిన వివరాలు, పోస్టర్లూ చక్కర్లు కొట్టాయి. నిర్వాహకులే ప్రచారం కోసం వాటిని విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారికి దీని గురించి సమాచారమిచ్చారు. రాజకీయంగా ఇబ్బంది వస్తుందని వెనక్కి.. అయితే, ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం.. విజయవాడ, కంకిపాడు పరిసర గ్రామాల్లో విస్తృతంగా చర్చ మొదలవడంతో వెనక్కి తగ్గారు. తానే క్యాసినో ఏర్పాటుకు కారణమని తెలిస్తే రాజకీయంగా ఇబ్బంది వస్తుందని, స్థానికంగా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతాయనే భయంతో చివరి నిమిషంలో దాన్ని రద్దుచేసుకుని తెచ్చిన సరంజామా, అమ్మాయిలందరినీ వెనక్కి పంపేశారు. ఇదంతా చికోటి ప్రవీణ్, బోడె ప్రసాద్‌ల నేతృత్వంలోనే జరిగింది. పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా తెర వెనుక ఇందుకు సహకరించినట్లు తెలిసింది. చికోటిపై ఇప్పుడు ఈడీ విచారణ మొదలవడంతో అతనితో బోడె ప్రసాద్‌కున్న సంబంధాలు వారి వ్యవహారాలు చర్చనీయాంశమయ్యాయి. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లోనూ పాత్ర విజయవాడ కేంద్రంగా గతంలో వెలుగుచూసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లోనూ టీడీపీ నేతల పాత్ర అందరికీ తెలిసిందే. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో బోడె ప్రసాద్, బుద్దా వెంకన్నతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కాల్‌మనీ వ్యవహారాల్లో ఆరితేరినట్లు స్పష్టమైంది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వారందరినీ ఆ కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కేసు బయటపడినప్పుడు బోడె ప్రసాద్ బ్యాంకాక్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆయనే స్వయంగా ఒక వీడియో ద్వారా వెల్లడించారు. చికోటి ప్రవీణ్‌తో కలిసి ఆయన పలుమార్లు బ్యాంకాక్, శ్రీలంక వంటి ప్రాంతాలకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. చికోటి హవాలా వ్యవహారాల్లోనూ టీడీపీ నేతలకు లింకు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆస్ట్రేలియాకు పారిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్‌పై దాడి చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గుట్టు చప్పుడు కాకుండా దేశం వదిలి పారిపోయారు. నాలుగు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఈ నెల 17న పెనమలూరులో రేషన్‌షాపును పీడీఎస్ డీటీ గుమ్మడి విజయ్‌కుమార్ తనిఖీ చేశారు. స్టాకు తేడా ఉండటంతో రిపోర్టు రాస్తుండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన అనుచరులతో వచ్చి డీటీ విజయ్‌కుమార్, వీఆర్వో మంగరాజుపై దాడి చేశారు. ఈ దాడి తర్వాత కనిపించకుండాపోయారు. పోలీసులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. బోడె అనుచరులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నాలుగు రోజులు తర్వాత బోడె ప్రసాద్ ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ పారిపోయి అక్కడ తల దాచుకున్నారని, ఆ తర్వాత 19వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. ఆ రేషన్ డీలర్ టీడీపీ కార్యకర్తే.. సోషల్ మీడియాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం వీడియో విడుదల చేశారు. రేషన్ డీలర్ లుక్కా అరుణ్‌బాబు టీడీపీ కార్యకర్త అని మరోసారి బహిరంగపరిచారు. రేషన్ షాపు తనిఖీ చేయడం నేరమని, డీటీని ప్రశ్నించేందుకు వెళితే అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేదిలేదని, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనుచరులను జైలు పాల్జేసి తాను మాత్రం కుటుంబ సభ్యులతో విదేశాలకు పారిపోవడంపై ఆ పార్టీ శ్రేణులే మండిపడుతున్నాయి. రేషన్ షాపులో అక్రమాలు జరగకపోతే స్టాకులో 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార ఏమైనట్టని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
బోడె... మామూలోడు కాదు.. ఆది నుంచీ అంతే! ఏకంగా 33 కేసులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పెనమలూరు: వివాదాలు, గొడవలు, దౌర్జన్యాలకు లెక్కేలేదు. సెటిల్మెంట్లు, దందాలు, అధికారులపై దాడులకు అంతూ పొంతూ లేదు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడూ దూకుడు తగ్గలేదు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 33 కేసులు నమోదు చేయించుకొన్న ఘనుడు పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. రెండు రోజుల క్రితం పెనమలూరులో ఓ రేషన్ షాపు తనిఖీలకు వెళ్లిన డెప్యూటీ తహసీల్దార్, వీఆర్ఓలపై హత్యాయత్నానికి పాల్పడి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. మన బోడె కేసుల చిట్టా పరిశీలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. సామాన్యుల నుంచి అధికారుల వరకు.. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. పోలీసు కేసుల్లో ఇరుక్కోవటం, అధికారులపై దౌర్జన్యం చేయడం ఆయనకు కొత్త కాదు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు బోడెకు అండగా నిలుస్తున్నారు. బోడె ప్రసాద్ గత చరిత్రను ఒక్క సారి పరిశీలిస్తే.. టీడీపీ పాలనలో వెలుగు చూసిన కాల్‌మనీ, సెక్స్ రాకెట్ ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అప్పట్లో పార్టీ అధికారంలో ఉండటంతో ఆయనపై కాల్‌మనీ కేసులు నమోదు కాలేదు. చదవండి👉 తెలుగుయువత నేత ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ బోడె ప్రసాద్ సింగపూర్‌లో పర్యటనలో ఉండగా తనకు బదులు మరో వ్యక్తితో పోరంకిలో ఉన్నత విద్య పరీక్ష రాయించారన్న వివాదం కూడా ఉంది. అంతేకాదు గతంలో వణుకూరులో ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ తవ్వకాలను అప్పటి విజయవాడ సబ్‌కలెక్టర్ మీషా సింగ్ అడ్డుకున్నారు. మట్టి తవ్విన పొక్లెయిన్‌ను స్వాధీనం చేయాలని మీషాసింగ్ ఆదేశించగా బోడె ప్రసాద్ దురుసుగా ప్రవర్తించి పొక్లెయిన్‌ను దాచేసి, సబ్‌కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన ఘటన సంచలనం కలిగించింది. కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డే లేదు. జగన్నాథపురంలో ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు ఇస్తానంటూ బందరు రోడ్డు విస్తరణ బాధితుల వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఇప్పటి వరకూ పట్టాలు ఇవ్వలేదు. యనమలకుదురులో గ్రూప్ హౌస్‌లు ధ్వంసం వ్యవహారంలో కూడా బోడె ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపించింది. చదవండి👉🏻 నకిలీ మందుల ఊసే ఉండకూడదు సమస్యలను నివేదించడానికి వచ్చిన ప్రజలను దూషిస్తున్న బోడె ప్రసాద్ (ఫైల్) కేసుల్లో ఘనాపాటి బోడె ప్రసాద్ దురుసు ప్రవర్తనతో ఇప్పటి వరకు 33 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా డెప్యూటీ తహసీల్దార్ గుమ్మడి విజయ్‌కుమార్‌పై దాడి కేసులో ఆయన పారిపోయాడు. ఈ కేసులో తొమ్మిది మంది కటకటాల పాలై, బొడే ఒక్కరే పారిపోవడం వెనుక పోలీసుల మెతక వైఖరి ఉందన్న విమర్శలున్నాయి. ఓ పోలీసు అధికారి లోపాయికారీగా ఆయనకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నియోజకవర్గ స్థాయి నేత పోలీస్‌స్టేషన్‌లో కూర్చొని బోడెను కేసు నుంచి తప్పించేందుకు చర్చలు సాగించినట్లు ప్రచారం జరుగుతోంది. బోడె ఒక్కడే పారిపోడం దీనికి ఊతం ఇవ్వడంతోపాటు స్థానిక పోలీసు అధికారుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. తరచూ వివాదాల్లో నిలిచే ఆయనపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించకుండా, రౌడీ షీట్ ఓపెన్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి👉 నారాయణ, లింగమనేని పిటిషన్లపై విచారణ వాయిదా -
డిప్యూటీ తహసీల్దార్‌పై టీడీపీ నేతల హత్యాయత్నం
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో రేషన్ షాపును తనిఖీ చేయడానికి వెళ్లిన డిప్యూటీ తహసీల్దారుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోడే ప్రసాద్, ఆయన అనుచరులు హత్యాయత్నానికి ఒడిగట్టారు. అక్కడే ఉన్న వీఆర్వోపైనా దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరులో డీలర్ లుక్కా అరుణ్‌బాబు నిర్వహిస్తున్న రేషన్ దుకాణం (నం.27)లో స్టాకు తనిఖీకి డిప్యూటీ తహసీల్దార్ (పీడీఎస్) గుమ్మడి విజయ్‌కుమార్, వీఆర్వో మంగరాజు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వెళ్లారు. తనిఖీల్లో 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అధికారులు డీలర్ స్టేట్మెంట్ తీసుకుని రిపోర్టు రాస్తున్న సమయంలో బోడే ప్రసాద్ రాత్రి 10 గంటలకు రేషన్‌షాపు వద్దకు వచ్చి.. తన వెంట వచ్చిన అనుచరులతో అధికారులపై దాడి చేయించారు. వారు డిప్యూటీ తహసీల్దార్ గొంతు నులిమి చంపే యత్నం చేశారు. రిపోర్టును బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ కంటికి తీవ్ర గాయమైంది. ఆయనకు కంటికి వైద్యం కోసం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో వీఆర్వో మంగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. పరారీలో బోడే ప్రసాద్.. దాడి తర్వాత బోడే ప్రసాద్ పరారీలో ఉన్నట్టు పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. దాడిలో పాల్గొన్న వారిపై ఐపీసీ 353, 332, 323, 506, 392, 307 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఎ1గా బోడే ప్రసాద్, ఎ2గా వంగూరు పవన్, ఎ3గా కంఠమనేని పార్థు, ఎ4గా దొంతగాని పుల్లేశ్వరరావు, ఎ5గా కొల్లిపర ప్రమోద్‌కుమార్, ఎ6గా కిలారు ప్రవీణ్‌కుమార్, ఎ7గా బోడె మనోజ్, ఎ8గా కాపరౌతు వాసు, ఎ9గా కిలారు కిరణ్‌కుమార్, ఎ10గా చిగురుపాటి శ్రీనివాసరావులతో పాటు మరికొందరు ఉన్నారని చెప్పారు. వీరిలో ఎ1, ఎ3 మినహా మిగతా వారిని బుధవారం అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు బోడే ప్రసాద్ కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. రేషన్ షాపు సీజ్ చేశాం ప్రతి నెలా అన్ని రేషన్ షాపుల్లో స్టాకు తనిఖీలు చేస్తాం. ఇందులో భాగంగానే పెనమలూరులో రేషన్‌షాపును తనిఖీ చేసి రిపోర్టు రాస్తుండగా దాడి చేశారు. ఈ ఘటనతో రేషన్‌షాపు సీజ్ చేశాం. తనిఖీకి వచ్చిన అధికారులపై దాడి చేయటం దారుణం. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. డీలర్‌ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. – జి.భద్రు, తహసీల్దార్, పెనమలూరు -
పర్మిషన్ లేకుండా లే అవుట్ వేస్తే తప్పేంటి...?
సాక్షి, కృష్ణా జిల్లా: అనుమతులు లేకుండా వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు చెందిన అక్రమ లే అవుట్‌ను అధికారులు ధ్వంసం చేశారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గొల్లగూడెం గ్రామంలో కనీసం పంచాయతీ అనుమతులు కూడా తీసుకోకుండా లే అవుట్ వేసినట్లు అధికారులు తెలిపారు. అనధికార లే అవుట్‌పై బోడె ప్రసాద్‌ను అధికారులు ప్రశ్నించగా.. ఇక్కడ కొన్ని స్థలాలు అనుమతులు లేకుండానే ఉన్నాయని.. పర్మిషన్ లేకుండా వేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. మహిళ అధికారి అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు తెలిపారు. -
బొండా, బోడే, కొల్లు తొలిసారితో సరి..
సాక్షి, విజయవాడ : శాసన సభ్యులుగా ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని జనానికి చేరువు కాకుండా రూ.కోట్ల సంపాదనపై దృష్టి పెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు తిరస్కరించారు. మంత్రులతో పాటు తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేల విషయంలోనూ ప్రజలు ఏ మాత్రం దయ చూపలేదు. అందర్ని ఓడించి ఆ పార్టీపై తమ ఆగ్రహాన్ని చూపించారు. పదవి అలంకారం కాదు.. బాధ్యతల సమాహారం అని భావించాల్సిన వారు అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. దౌర్జన్యం.. దోపిడీకి కొమ్ము కాయడంతో ప్రజలు ఎన్నికల సమరంలో ఓటు అనే ఆయుధంతో కుళ్లబొడిచారు. ‘మీ ప్రజా సేవ చాలులే’ అని ఓటుతో చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఘోర పరాజయానికి స్వయంకృతమే తొలి కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన అవకాశాన్ని.. ప్రజల నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమవ్వడం వల్లే ఫలితాలు టీడీపీ అభ్యర్థులకు చేదు నిజాన్ని తెలియజెప్పాయి. స్వయంకృతాపరాధం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తొలిసారిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. కొల్లు రవీంద్రకు తొలిసారి ఎన్నిక కాగానే మంత్రి పదవి వరించింది. అయినా ఆయన రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు. బొండా ఉమామహేశ్వరరావు ఐదేళ్లలో నియోజకవర్గాన్ని తన సొంత జాగీరుగా భావించి పెత్తనం సాగించారు. స్వాతంత్య్ర సమరయోధుల భూములు కబ్జా, ఒక మహిళకు చెందిన ఇంటిని కబ్జా చేశారు. ఓ కుటుంబానికి చెందిన చిన్నారి మరణానికి కారణమయ్యారు. తన నోటి దురుసుకు కార్పొరేటర్లు కూడా ఆయన్ను చీదరించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో కలిసి ప్రచారం చేసినా ఆయన విజయం సాధించలేకపోయారు. చివరకు 25 ఓట్లు తేడాతో ఓడిపోయారు. బోడే ప్రసాద్ కూడా తన పదవీ కాలంలో ఇసుక దందాలు చేయడం, బిల్డర్ల వద్ద ముక్కుపిండి దందాలు చేశారు. దీంతో ఈసారి ప్రజలు ఆయన్ను పదవికి దూరం చేసి కె.పార్థసారథికి పట్టం కట్టారు. అవినీతే కొంప ముంచింది.. దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, జలీల్‌ఖాన్, వల్లభనేని వంశీమోహన్, మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. నీరు–చెట్టు పథకం కింద రూ.కోట్లు కొల్లగొట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధిపై కంటే ఆ పనుల్లో వచ్చే వాటాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఐదేళ్లలో ఒక్కొక్క ఎమ్మెల్యే కనీసం రూ.100 కోట్లకుపైగా సంపాదించారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మంత్రి ఉమా అయితే జలవనరుల ప్రాజెక్టుల నుంచి నీరు–చెట్టు పథకం వరకు ఎక్కడ అవకాశం వచ్చినా అడ్డంగా దోచేశారు. నియోజకవర్గానికి ఆయన చెప్పుకోదగిన పనులు ఏమీ చేయకపోవడంతో ప్రజలు ఆయనకు షాక్ ఇచ్చారు. కొల్లు రవీంద్ర మంత్రిగా చెప్పుకోదగిన ప్రతిభ కనబరచలేదు. కేవలం మంత్రిగానే కొనసాగారు తప్ప నియోజకవర్గానికి కానీ, జిల్లాకు గానీ ఆయన సాధించింది ఏమీ లేదు. దీంతో ఆయన్ను మచిలీపట్నం ప్రజలు తిరస్కరించారు. అవనిగడ్డ నుంచి డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకపోవడం, రైతులకు సాగునీరు ఇప్పించలేకపోవడంతో ఆయనకు ఓటర్లు బాయ్.. బాయ్ చెప్పారు. మహిళా అభ్యర్థులకు నో చాన్స్ ఈసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా తంగిరాల సౌమ్య (నందిగామ), ఉప్పులేటి కల్పన (పామర్రు), షాబానా ఖాతూన్ (విజయవాడ పశ్చిమ) ఎన్నికల బరిలో దిగారు. ఇందులో తంగిరాల సౌమ్య, ఉప్పులేటి కల్పన ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వీరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఖాతూన్ తండ్రి జలీల్‌ఖాన్ పార్టీ ఫిరాయించడం, వక్ఫ్ ఆస్తులపై కన్నేయడంతో ఆమెను ప్రజలు పదవికి దూరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో ముగ్గురు టీడీపీ మహిళా అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో చుక్కెదురైంది. -
బోడె ప్రసాద్@కబ్జాల..కాలకేయ!
సాక్షి,అమరావతి : అధికారం అండతో అందినకాడికి దండుకున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. ఇసుక రేవుల నుంచి చెరువుల్లో మట్టిదాకా ప్రతి చోట అవినీతే. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అతని అనుచరులు సాగించిన అక్రమాలు, అరాచకాలు, భూకబ్జాలు,దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. అభివృద్ధి పనులను తూతూ మంత్రంగా చేపట్టి రూ.కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టినా అడిగే నాథుడే లేదు. ప్రతి పనికి పర్సంటేజి విధించి కమీషన్ల దందాకు తెరలేపారు.. బోడె, అతని అనుచరులు కలిసి నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్లు దోచుకున్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దొంగ పరీక్ష రాయించిన మేధావి.. ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే విదేశీ పర్యటనకు వెళ్లి డిగ్రీ అర్హత కోసం దూరవిద్యలో పరీక్షకు తాను హాజరు కాకుండా మరో యువకుడితో రాయించిన ఘనత బోడె ప్రసాద్‌ది. వాస్తవానికి ఎమ్మెల్యే పదో తరగతి పాసై పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ అయ్యారు. బీటెక్ బిల్డప్‌ను జనాల్లో ఇచ్చారు. అయితే తన విద్యార్హతను పెంచుకునే విషయంలో పరీక్ష రాసే సత్తా లేక దూరవిద్యలో డిగ్రీ చేయాలని సన్నిహిత వర్గాల ద్వారా కసరత్తు చేశారు. ఇందులో భాగంగా అతను విదేశాల్లో ఉన్నా పోరంకిలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో దొంగ పరీక్ష రాయించేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కళాశాలకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చిన యువకుడు పరారయ్యాడు. అయితే పరీక్షకు హాల్ టిక్కెట్ జారీ, పరీక్షకు హాజరైనట్లు సంతకం కూడా ఉంది. అయితే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించినా జరిగిన వాస్తవాలను చూసిన ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఉచిత ఇసుక..కాసుల వేట.. అనేక ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టింది. తొలుత చోడవరంలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. కూలీలతోనే లోడింగ్ చేయించాలనే నిబంధన ఉన్నా, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ నదీగర్భంలో పొక్లెయిన్లతో ఇసుక తోడి ప్రైవేటు ర్యాంపుల గుండా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు లారీలు, ట్రాక్టర్లలో ఇసుక రవాణా సాగించారు. వేరే వ్యక్తులు క్వారీలోకి వెళ్లి ఉచిత ఇసుకను తీసుకునే అవకాశం లేకుండా అధికార పార్టీ గుత్తాధిపత్యంగా ఇసుక క్వారీలను తమ ఆధీనంలో ఉంచుకుంది. నిత్యం వెయ్యి నుంచి 1600 వరకూ ట్రాక్టర్లలో ఇసుక రవాణా సాగించినట్లు అంచనా. తద్వారా ఎమ్మెల్యే బోడె వర్గం రూ.కోట్లు అక్రమార్జన చేసినట్లు సమాచారం. ‘వసూల్ రాజా’ స్వయంగా ఆయనే ఒక బిల్డర్ అయి ఉండి, బిల్డర్లకు ఉన్న బాధలు మరిచి ఎమ్మెల్యేగా తనకు ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలోని బిల్డర్ల నుంచి రూ.3 కోట్లు అక్రమంగా వసూలు చేశారు. గ్రూప్ హౌస్‌ల నిర్మాణాలు లక్ష్యంగా వసూలు దందా నడిపారు. ఒక్కో ఫ్లాట్‌కి రూ.40 వేలు నుంచి రూ.60 వేలు వసూలు చేశారు. ఓ బిల్డర్ వద్ద ఏకంగా ముక్కుపిండి మరీ రూ.80 లక్షలు వసూలు చేశారు. అభివృద్ధి తన లక్ష్యమని ప్రజల్ని నమ్మిస్తూ వసూలు చేసిన డబ్బుతో గ్రామంలో అభివృద్ధి చేపడతామని ఈ దందా నడిపారు. కృష్ణానదిలో ఇసుక, బుసక తెచ్చి రహదారులు నిర్మించి ఎంతో గొప్పగా తానే అభివృద్ధి చేశానని మభ్యపెట్టారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు సీఆర్డీఏ, పంచాయతీలు, ఇతర శాఖల నిధులు నుంచి రోడ్లు, డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులు జరగాల్సి ఉండగా నిధులు సమీకరించటంలో వైఫల్యం చెందారు. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బిల్డర్ల నుంచి వసూలు చేశానని, తాను సచ్చీలుడనని అభివృద్ధికే తాను డబ్బు వసూలు చేశానని సభలు, సమావేశాలు, బహిరంగ సభల్లో గొప్పగా చెప్పుకోవటం, ప్రజల్ని నమ్మించే యత్నం చేయటం ఈయనకే చెల్లింది. ఇసుక రవాణాలో కమీషన్ల దందా టీడీపీ నేతలు ఇసుకను ప్రధాన ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఇసుకను తవ్వేసి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఉచిత ఇసుక విధానం అర్థమే మార్చేశారు. అడ్డగోలుగా ఇసుక తవ్వేసి కోట్లు గడించారు. దీనిలో కీలక సూత్రధారి అధికార పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఆయన అండ చూసుకుని అతని ముఖ్య అనుచరులు. ఇది బహిరంగ రహస్యమే. అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెనమలూరు మండలం పెద పులిపాక కేంద్రంగా ఉన్న క్వారీలో అమ్మకాలు చేపట్టారు. నిత్యం 400 నుంచి 600 ట్రాక్టర్లు, లారీల్లో ఇక్కడి నుంచి రవాణా సాగించేవి. క్వారీలో లోడింగ్ పనులను మాత్రం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన బినామీల పేరుతో పొక్లెయిన్లను ఏర్పాటు చేయించారనే విమర్శ ఉంది. నిత్యం ఈ క్వారీలో వాహనాల క్యూ ఉండగానే దొడ్డిదారిన 50కు పైగా ట్రాక్టర్లు, లారీలు ఇసుక లోడింగ్ చేయించటం, అధిక ధరకు అమ్ముకునేవారు. తెలంగాణ, గోదావరి జిల్లాలకు సైతం ఇక్కడి నుంచి ఇసుకను రవాణా సాగించారు. లారీ ఇసుక రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకూ అప్పట్లో ధర పలికింది. సుమారు ఏడాదిన్నర పాటు యథేచ్ఛగా ఇసుక అక్రమ లోడింగ్, రవాణా ఇక్కడి నుంచి సాగింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఇసుక అక్రమ వ్యాపారంపై కోర్టుకు వెళ్లారు. దీంతో ఇసుక రవాణా ఆగింది. అక్రమాలకు అండ.. యనమలకుదురు, పెద పులిపాక గ్రామ పంచాయతీల్లో జరిగిన భారీ కుంభకోణాలకు సంబంధించి చర్యలు తీసుకోకుండా బోడె అడ్డుగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. యనమలకుదురులో అక్రమ భవన నిర్మాణ ప్లాన్లు, పారిశుద్ధ్య పనులకు అక్రమంగా సామగ్రి కొనుగోళ్లు ఇలా ఈ పంచాయతీలో రూ.కోటికి పైగా అక్రమాలు జరిగాయి. పెదపులిపాకలో రూ.70 లక్షలు నిధులు దుర్వినియోగం జరిగినా ఇప్పటి వరకూ ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకుండా అటకెక్కించేశారు. యనమలకుదురు గ్రామంలో సుమారు 700 దొంగ ప్లాన్ జారీకి రూ.2 కోట్లు చేతులు మారాయి. దీనిపై విజిలెన్స్ విచారణ జరిగినా వాస్తవాలు మాత్రం వెలుగులోకి రాలేదు. -
కోఢీ అంటే ఢీ
సాక్షి, అమరావతి: కత్తులు కట్టిన కోళ్లు బరిలోకి దిగాయి. మొదటిరోజే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.350కోట్లకు పైగా చేతులు మారాయి. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాను తలదన్నే రీతిలో కృష్ణా జిల్లాల్లోనూ వందలాది బరుల్లో వేల సంఖ్యలో పందేలు సాగాయి. ఆడా..మగా, చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా కోడి పందేలు చూసేందుకు జనం ఎగబడ్డారు. కత్తి కట్టి పందేలు వేయవద్దని, డింకీ పందేలు వేసుకోవచ్చని పోలీసులు చేసిన సూచనలను బేఖాతరు చేస్తూ డింకీ పందేలే అంటూ టీడీపీ నేతల దన్నుతో కత్తులు కట్టి నిర్వహించారు. అమెరికాలోని లాస్ వేగాస్‌లో ప్రసిద్ధి చెందిన క్యాసినో జూదాన్ని ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఉభయ గోదావరి జిల్లాలను సైతం తలదన్నేలా రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటుచేసిన టీడీపీ నేతలు పందేల నిర్వాహకుల అవతారమెత్తారు. బెట్టింగ్‌లపై వచ్చే లక్షలాది రూపాయల కేవుల్ (నిర్వహణ వాటా) కోసం వారు కోడి పందేల నిర్వాహణకు క్యూకట్టారు. ఈసారి పోలీసులకు మామూళ్లు ఇచ్చే అవసరంలేకపోవడంతో మొత్తం మిగుల్చుకునేందుకు టీడీపీ నేతలు పోటీపడ్డారు. భీమవరం మండలంలోని ఓ గ్రామంలో గుండాట నిర్వహణకు బరి ఏర్పాటు చేసిన కోడిపందేల నిర్వాహకులకు రూ.72 లక్షలు ముట్టజెప్పేలా ఒప్పందం చేసుకున్నారంటే జూదం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థంచేసుకోవచ్చు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటుచేయగా.. వాటి పక్కనే పేకాట, కోతాట, గుండాట తదితర జూద కేంద్రాలనూ పెద్ద సంఖ్యలోనే ఏర్పాటు చేశారు. తూ.గో. జిల్లా అచ్చంపేట బరిలో తలపడుతున్న పందెం కోళ్లు పెదగరువులో క్యాసినో..: అమెరికాలోని లాస్వేగాస్లో ప్రసిద్ధి చెందిన క్యాసినో జూదాన్ని ఈసారి సంక్రాంతికి పశ్చిమగోదావరి జిల్లా పెదగరువులో ప్రవేశపెట్టారు. దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన దీనిని ఈసారి మూడు బస్సుల్లో ఇక్కడ నిర్వహించారు. పైకి టూరిస్టు బస్సులా కన్పించే వీటిలో క్యాసినో నిర్వహణకు ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు విదేశీయులతోపాటు దేశంలోని పలు మెట్రో నగరాలకు చెందిన జూదరులు అతిథులుగా వచ్చినట్టు తెలిసింది. ఒక్క సోమవారం నాడే ఈ ఆటలో సుమారు రూ.60 కోట్లు చేతులు మారినట్టు సమాచారం. టీడీపీ నేతల కనుసన్నల్లో.. - పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో ఎమ్మెల్యే చింతమనేని, ఉండి నియోజకవర్గంలో కనుమూరు రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. - కాళ్ళ మండలం సీసలిలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు పందేలు ప్రారంభించారు. - పాలకొల్లు మండలం పూలపల్లిలో ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు నేతృత్వంలోనూ, ఏఎంసీ మాజీ చైర్మన్ చెరుకూరి పండురాజు ఆధ్వర్యంలోనూ కోడిపందేలు జరిగాయి. - కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దగ్గరుండి మరీ నిర్వహించారు. - గుంటూరు జిల్లా తెనాలి వద్ద స్థానిక ఎస్ఐ కోడి పందేల టెంట్లను తొలగించడంతో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వయంగా అక్కడకు వెళ్లి పందేలు దగ్గరుండి మరీ నిర్వహించారు. పందేలకు తెలంగాణ ప్రముఖులు ఏటా రాష్ట్రంలో జరిగే కోడి పందేలను తిలకించేందుకు తెలంగాణ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు ఈసారీ పలువురు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరులో నిర్వహించిన కోడి పందేలకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కూకట్పల్లి ఎమ్మెల్యే ఎం.కృష్ణారావులు హాజరు కాగా.. కృష్ణాజిల్లా కొత్తూరులో పందేలకు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాష్‌గౌడ్, నాగేశ్వరరావులతోపాటు సినీనటులు శివారెడ్డి, జబర్దస్త్ నటులు వేణు, రాకేష్ తదితరులు హాజరయ్యారు. నాలుగు జిల్లాల్లో 700కు పైగా బరులు ఉభయ గోదావరి జిల్లాల్లో సోమవారం 600 వరకు బరుల్లో పందేలు జరిగినట్లు సమాచారం. అలాగే, కృష్ణాలో ఈసారి రికార్డు స్థాయిలో 210కి పైగా బరుల్లో నిర్వహించారు. విజయవాడ భవానీపురంలో జరుగుతున్న కోడి పందేలను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కత్తులు కట్టకుండా డింకీ పందేలు నిర్వహించుకోవచ్చని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. గుంటూరు జిల్లాలోను దాదాపు 150 బరుల్లో పందేలు జరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోను కొనసాగాయి. కాగా, మొదటి రోజే కోడి పందేలు, జూదాల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా. జిల్లాల్లో జోరుగా.. నిన్నటి వరకూ ఉక్కుపాదం మోపిన పోలీసులు.. వాటిని చూసీచూడనట్లు ఉండాలని సర్కారు నుంచి లోపాయికారిగా వచ్చిన సంకేతాలతో సోమవారం సైలెంట్ అయిపోయారు. దీంతో కోడి పందేల నిర్వాహకులు చెలరేగిపోయారు. - పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా కోడిపందేలు ప్రారంభమయ్యాయి. వీటిని చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. రాత్రి వేళల్లోనూ పందేలు సాగించడానికి చాలా బరుల్లో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేశారు. లక్ష్యణేశ్వరంలో యాంకర్ శ్రీముఖి, జబర్దస్త్ నటులతో ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. మొగల్తూరులో సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయం పక్కనే బరి ఏర్పాటుచేశారు. ఈ జిల్లాలో తొలిరోజు రూ.120కోట్లకు పైగా పందేలు జరిగినట్లు సమాచారం. - ‘తూర్పు’లో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పందేల సంఖ్య రెట్టింపయింది. సోమవారం ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా. మంగళ, బుధవారాలు సంక్రాంతి, కనుమ రోజున పందేలు ఎక్కువుగా జరగనున్నట్టు అంచనా. జిల్లాలో సుమారు 400కు పైగా బరిలు వెలిశాయి. సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దాపురం, సొంత నియోజకవర్గం అమలాపురాల్లోనే పందేలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. - కృష్ణా జిల్లాలో కంకిపాడు, బాపులపాడు, ముసునూరు, కైకలూరు, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ మండలాల్లో రూ.70–80 కోట్ల మేర కోడిపందేలు జరిగాయి. కంకిపాడు మండలం ఈడుపుగల్లులో పందేలు హోరెత్తాయి. ఇక్కడ ఒక్కచోటే రూ.15 కోట్ల మేర పందేలు జరిగినట్లు తెలుస్తోంది. - గుంటూరు జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. రేపల్లె నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కోడి పందేలు నిర్వహించారు. - విశాఖపట్నం జిల్లాలో సోమవారం అక్కడక్కడ జరిగాయి. మంగళ, బుధవారాల్లో విస్తృతంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల్లోని పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, భీమిలి, గాజువాక నియోజకవర్గాల్లో ఏటా కోడి పందేలు నిర్వహిస్తుంటారు. -
ఎమ్మెల్యే బోడె ఓవరాక్షన్
పెనమలూరు: రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన పొక్లెయిన్‌ను తరలించకుండా అడ్డుకోవడమే కాకుండా కృష్ణాజిల్లా, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దానిని తన గెస్ట్‌హౌస్‌లో దాచిన ఘటన స్థానికంగా ఉద్రిక్తత సృష్టించింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మీషాసింగ్‌తో ఎమ్మెల్యే వాదనకు దిగారు. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్.. పొక్లెయిన్‌ను సీజ్ చేయాలని, దానిని తరలించిన వారిని, భూమి తవ్వకాలు, చదును చేసినవారిని అరెస్టు చేయాలని ఆదేశించినా శనివారం రాత్రి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి. పెనమలూరు మండలం వణుకూరులో రూ.10 కోట్లు విలువ చేసే 2.84 ఎకరాల పుల్లేరు కట్టభూమిపై టీడీపీ నాయకులు కొందరు కన్నేశారు. కట్టను తవ్వుతున్న వైనంపై ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్ పొక్లెయిన్‌ను సీజ్ చేయాలని పెనమలూరు తహసీల్దార్ మురళీకృష్ణ, సిబ్బందిని ఆదేశించారు. దీంతో అధికారులు సదరు భూమిలో పనులు కొనసాగిస్తున్న పొక్లెయిన్‌ను సీజ్ చేశారు. వాహనంలో తరలిస్తుండగా ఎమ్మెల్యే ప్రసాద్ తన గన్మెన్లతో అక్కడికి వచ్చారు. పొక్లెయిన్‌ను తరలిస్తే సహించేది లేదంటూ దానిని పోరంకిలోని తన గెస్ట్‌హౌస్ కం ఆఫీస్ వద్దకు తరలించి దాచేశారు. సబ్ కలెక్టర్ ఆదేశించినా అరెస్టుల్లేవు..! ఈ నేపథ్యంలో వణుకూరు వచ్చిన సబ్ కలెక్టర్ పోలీసులను పిలిపించి పొక్లెయిన్ ఎక్కడున్నా సీజ్ చేయాలని ఆదేశించారు. పోలీసులు చేతులెత్తేయటంతో ఎమ్మెల్యే గెస్ట్‌హౌస్‌లో పొక్లెయిన్ ఉందనే అనుమానంతో ఆమె అక్కడికి వెళ్లారు. పొక్లెయిన్‌ను అప్పగించాలని ఎమ్మెల్యే ప్రసాద్‌ను కోరారు. అప్పగించేది లేదని, అవసరమైతే తనను అరెస్టు చేసుకోండంటూ ఆయన ఆవేశంగా సమాధానం ఇచ్చారు. అయితే తనకు పొక్లెయిన్ అయినా అప్పగించాలని లేదా రూ.2 లక్షలు జరిమానా అయినా చెల్లించాలని సబ్ కలెక్టర్ పట్టుబట్టారు. ఈ లోగా సెంట్రల్ జోన్ ఏసీపీ అంకినీడు ప్రసాద్ తన సిబ్బందితో రావడం చూసిన ఎమ్మెల్యే తాను వణుకూరు వెళ్లి విలేకరులతో మాట్లాడుతానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎమ్మెల్యే గెస్టుహౌస్ వద్దే ఉన్న సబ్ కలెక్టర్ పోలీసులకు అరెస్టు ఆదేశాలు జారీ చేసి వెళ్లిపోయారు. భూమి ఆక్రమణ, తవ్వకాలకు సంబంధించి తహసీల్దార్ మురళీకృష్ణ శుక్రవారం ద్రోణవల్లి కోటేశ్వరరావు, పుట్టగుంట రవిపై ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు వారిపై కేసునమోదు చేయకుండా తాత్సారం చేయటంతోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని స్థానికులు చెప్పారు. శనివారం నాటి ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. -
కృష్ణా: ఉయ్యూరు జన్మభూమి రసాభాస
-
టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ పోలీసులను మంగళవారం హైదరాబాద్ హైకోర్టు ఆదేశించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోడె ప్రసాద్‌పై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదుచేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బోడే ప్రసాద్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె ఆగస్టులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీస్ కమిషనర్, పెనమలూరు ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా నేడు రోజా పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణలో రోజా తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. -
బోడెపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన ఫిర్యాదు ఆధారంగా బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ గత వారం రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గత నెల 9న బోడె ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే రోజాను ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ మాట్లాడారన్నారు. దీనిపై గత నెల 14న పెనమూరు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదును తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారన్నారు. దీంతో రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపగా, ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు. -
బోడే ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం లేదు
సాక్షి, హైదరాబాద్: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా హైకోర్టును ఆశ్రయించారు. బోడే ప్రసాద్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీస్ కమిషనర్, పెనమలూరు ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా గత నెల 9న బోడే ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి, తనను ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ మాట్లాడారని తెలిపారు. మహిళ అన్న కనీస మర్యాద, గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. ఈ నేపథ్యంలో తాను గత నెల 14న పెనమలూరు పోలీసులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు ఆ ఫిర్యాదును తీసుకోలేదని ఆమె వివరించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. -
బెజవాడలో మళ్లీ కాల్‌నాగుల అరాచకాలు