
సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. కంకిపాడు పీఎస్‌లో బోడె ప్రసాద్‌పై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు, అడ్వకేట్లు వెళ్లారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోకుడా.. ఇది కంకిపాడు పీఎస్‌కు రాదని.. పెనమలురు పీఎస్‌కు వెళ్లాలని పోలీసులు సూచించారు.
దీంతో నాయకులు పెనమలూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు అక్కడి వెళ్లి గంటలపాటు పడిగాపులు కాశారు. కొన్ని గంటలపాటు పీఎస్‌లోనే ఉన్నారు. అయినా కూడా ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. బోడె ప్రసాద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment