R K Roja
-
యువ గళమా.. నారా గరళమా? మంత్రి రోజా ఫైర్
సాక్షి,తిరుపతి: టీడీపీ నేత నారా లోకేష్ ‘యువ గళం’ పేరుతో చేపట్టబోయే యాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. అది యువ గళమా లేక నారా గరళమా? అంటూ ఎద్దేవా చేశారు. కరోనా కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్నవారు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని నిలదీశారామె. తిరుపతి పర్యటనలో భాగంగా బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి రోజా. టీడీపీకి ప్రతిపక్ష అర్హత కూడా లేదని విమర్శించారు మంత్రి రోజా. లోకేష్ దొంగదారిలో మంత్రి అయ్యాడు. నారా ఫ్యామిలీ ఏపీని అప్పుల్లో ముంచెత్తిందని విమర్శించారు. ‘ఏ రోజు ఏ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్.. ఇవాళ అన్‌స్టాపబుల్ షోకి వెళ్ళాడు. చంద్రబాబు వెళ్ళిన తర్వాత ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్ళాడు. అలగా జనం, సంకర జాతి వంటి పచ్చి బూతులు తిట్టిన బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షోకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం ఎంతకైనా దిగజారుతాడు. జనసేన కార్యకర్తలతో బీజేపీ, టీడీపీ జెండాలు మోయిస్తున్నారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ప్రజలకు మంచి చేసే జగన్మోహన్రెడ్డి వెంట నడవండి. ప్రతిపక్షాలు.. కోడి గుడ్డుపై ఈకలు పీకే పని చేయకండంటూ హితబోధ చేశారామె. అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. టీడీపీ హయాంలో 30 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే..వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 62లక్షల మందికి సంక్షేమ పథకాలు ఇస్తోంది. రెండున్నర లక్షల మందికి అదనంగా జనవరి నెలలో ఇస్తున్నారు అని మంత్రి రోజా తెలిపారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నాడు: మంత్రి అంబటి ఫైర్ -
‘కడుపుకి అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా’
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అనంతరం టీడీపీ చేస్తున విమర్శలపై ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. విజయపురం మండలం విద్య వనరుల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 70 సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, క్యాబినేట్ మంత్రులు కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా అంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఎంత వెటకారంగా, స్టుపిడ్‌గా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక తప్పు జరిగితే ఆ తప్పు వెనకున్న నేరస్థుడిని పట్టుకుని శిక్షించకుండా.. ఆ తప్పు ఎవరి మీద నెట్టేయాలని, ఎలా తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ ప్రెసెమీట్లను చూస్తుంటే అధికారులను ఏవిధంగా వాడుకుంటున్నాడో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు చెబుతున్న ప్రతిమాట అబద్దమని నిరూపితమవుతూనే ఉందన్నారు. కత్తి జనవరి నుంచి హోటల్లోని ఉందని, అప్పటి నుంచి హోటల్ యజమాని హర్షవర్దన్ చౌదరి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆయన లోకేష్‌కు , చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను అంతమొందించడానికి ఇది టీడీపీ చేసిన కుట్రేనని విమర్శించారు. ఆపరేషన్ గరుడ గురించి సిగ్గులేకుండా మాట్లాడుతన్న చంద్రబాబు.. శివాజీని అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలన్నారు. ఆపరేషన్ గరుడ వెనుక ఉన్న వ్యక్తులెవరో బయటకి తీయాలని డిమాండ్ చేశారు. -
‘అప్పుడు దండగన్నాడు.. ఇప్పుడేమంటాడో’
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. క్యాబినెట్ హోదా కలిగిన ఎమ్మెల్యేకే రక్షణ లేనిచోట ఇక ప్రజలకు రక్షణ ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి రక్షణ లేదనీ, మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కాగా, అరుకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని మావోయిస్టులు ఆదివారం ఉదయం కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇక వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇప్పుడు అమెరికాలో వ్యవసాయంపై మాట్లాడతాననడం విడ్డూరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. ప్రజాభిమానం జగన్‌కు జై అంటోంది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోందని ఎమ్మెల్యే రోజా ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అడుగులో అడుగేసి లక్షలాది జనం కదం తొక్కడంతో కృష్ణా బ్యారేజీ గడగడలాడిందనీ, గోదారి తీరం ఉప్పొంగిందనీ, విశాఖ తీరం పోటెత్తిందని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల ప్రజలు వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దతుగా విజయపురం మండలంలో మంగళవారం రోజా పాదయాత్ర చేశారు. కాగా, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర సోమవారం విజయనగరం జిల్లాలోని కొత్త వలసలో 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. -
మోహన్‌బాబుకు మాతృవియోగం
ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం కన్ను మూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం ఉదయం కన్నుమూశారు. లక్ష్మమ్మ భౌతికకాయాన్ని ఎ.రంగంపేట సమీపంలోగల శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆమె నివాసానికి తరలించారు. విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ మరణవార్త తెలియగానే హుటాహుటిన ఇండియాకి బయలుదేరారు. ‘‘మా నానమ్మ లక్ష్మమ్మగారు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్సవుతాం నానమ్మా. ఈ సమయంలో మేం ఇండియాలో లేకపోవడం బాధ కలిగించింది. ఇది ఊహించని పరిణామం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని ట్వీటర్ ద్వారా మంచు మనోజ్ పేర్కొన్నారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం తిరుపతిలో జరుగుతాయి. సినీ నటి, ఎమ్మెల్యే రోజా లక్ష్మమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
ఉద్యోగులేమైనా ఉగ్రవాదులా ?
విజయపురం : వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేసి, ఓపీఎస్‌ను అమలు చేస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీని ప్రభుత్వం భగ్నం చేయడంపై బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల ద్రోహి అని.. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమేనని విమర్శించారు. సీపీఎస్ రద్దు కోరుతూ చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఉద్యోగులను ఉగ్రవాదుల్లాగా కొట్టి ఈడ్చుకెళ్లి అరెస్టు చేయించడం దారుణమన్నారు. ఉద్యోగులపై సర్కారు దమనకాండను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఇదే చంద్రబాబు 2003లో సీపీఎస్‌ను తీసుకొచ్చారని, వాటిని రద్దు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఉద్యోగస్తులను కొట్టడం చంద్రబాబుకు కొత్తేమి కాదని.. ఇది వరకే అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే సీపీఎస్ రద్దు చేస్తామని, ఇది ఉద్యోగులు గుర్తించుకోవాలన్నారు. -
స్త్రీలోక సంచారం
►తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ నాలుగేళ్లలో మహిళల సమస్యలను పరిష్కరించలేకపోయిన అధికార టి.ఆర్.ఎస్.పార్టీ వైఫల్యాలను మహిళలే ఎండగట్టాలని మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బి.జె.పి.మహిళా మోర్చా సమావేశంలో పిలుపునిచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్.. తెలంగాణ తొలి క్యాబినెట్లోనే మహిళలకు చోటు లేకపోవడం సిగ్గు చేటు అని అంటూ, ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ రక్షణశాఖ మంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా మహిళల్నే నియమించడాన్ని గుర్తు చేశారు. బి.జె.పి త్వరలోనే హైదరాబాద్‌లో ‘మహిళా సమ్మేళన్’ని నిర్వహించబోతోందని, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ హాజరవుతున్నారని లక్ష్మణ్ తెలిపారు. ►కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ‘టెన్జింగ్ నార్గే నేషనల్ అవార్డ్ 2017’కు ఎంపికైన తెలంగాణ యువతి బొడ్డపాటి ఐశ్వర్యకు సీఎం కేసీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ నావికాదళంలో లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా ఉన్న ఐశ్వర్య.. గతంలో నారీ శక్తి అవార్డు, నావ్సేన అవార్డులను కూడా పొందారు. ► చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చెయ్యాలని మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ హైకోర్టు.. 2013 నాటి లలితా కుమారి కేసులో ఎఫ్.ఐ.ఆర్. నమోదు విషయమై సుప్రీంకోర్టు జారీ చేసిన నియమావళిని అనుసరించాలని కూడా ఈ సందర్భంగా పోలీసులకు సూచించింది. పత్రికా ప్రతినిధుల సమావేశంలో బోడె ప్రసాద్ అసభ్యకరమైన భాషలో తనను దూషించారని రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు అతడిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయలేదని రోజా హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అతడిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదుకు ఆదేశించింది. ► కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న రెండవ ‘యూరేషియన్ ఉమెన్స్ ఫోరమ్’లో పాల్గొనేందుకు బుధవారం నాడు ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా సోనియా మొదట.. ‘మహిళల భద్రత, నిరంతర అభివృద్ధి’ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్లో పాల్గొని, ఆ తర్వాత.. యువతీ యువకుల నుంచి మహిళా సంక్షేమానికి, అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు స్వీకరించే చర్చావేదికలో ప్రసంగిస్తారు. ►జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా, ఖాజీగండ్‌లో శనివారం నాడు జరిగిన ఎన్కౌంటర్లో మరణించడానికి ముందు.. రెండేళ్ల క్రితమే తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరిన 16 ఏళ్ల జాహిద్ అహ్మద్ మిర్ అలియాస్ హషీమ్.. ఒక ఇంట్లో దాక్కుని ఉన్న తనను భద్రతాదళాలు చుట్టుముట్టి, ప్రాణాల మీద ఆశ ఉంటే లొంగిపొమ్మని హెచ్చరిస్తుండగా.. ఆ ఆఖరి నిమిషాల్లో అతడు తల్లికి ఫోన్ చేసి.. ‘‘అమ్మా నన్ను లొంగిపొమ్మంటున్నారు. ఏం చెయ్యమంటావు అని అడిగినప్పుడు ఆ తల్లి.. ‘‘వద్దు వద్దు.. తప్పించుకోగలిగితే తప్పించుకో. అంతే తప్ప లొంగిపోవాలన్న ఆలోచనలే రానీయకు’’ అని చెప్పిన ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నెల బక్రీద్ రోజు ఫయాజ్ అహ్మద్ అనే పోలీస్ కానిస్టేబుల్ హత్యతో కూడా సంబంధం ఉన్న జాహిద్ అహ్మద్.. చనిపోయేముందు తన తల్లితో మాట్లాడిన ఫోన్ ఆడియో క్లిప్పును ఇప్పుడు కశ్మీర్‌లోని వేర్పాటువాదులు.. తల్లిదండ్రుల భావోద్వేగభరితమైన విజ్ఞప్తులకు తలవొగ్గి భద్రతాదళాలకు యువత లొంగిపోకుండా ఉండటం కోసం విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ►తొలిసారి ప్రసవించినవారు ఆన్లైన్లో షేర్ చేసుకుంటున్న తమ భయానకమైన అనుభవాలను చదివి గర్భిణులలో ఎక్కువ శాతం మంది సహజమైన ప్రసవాన్ని కోరుకోవడానికి జంకుతున్నారని ఇంగ్లండ్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ హల్’లో సీనియర్ ఫెలో రీసెర్చ్‌గా పని చేస్తున్న క్యాట్రియోనా జోన్స్.. గతవారం జరిగిన ‘బ్రిటిష్ సైన్స్ ఫెస్టివల్’లో ప్రసంగిస్తున్నప్పుడు వెల్లడించారు. ఈ ‘హారర్ స్టోరీలు’ చదివి ‘టోకోఫోబియా’కు గురవుతున్న ఎందరో గర్భిణులు సిజేరియన్లకు మొగ్గుచూపుతున్నారనీ, అయితే.. ఆన్లైన్లో భయానక అనుభవాలతో పాటు.. అరకొరగా ఉండే అహ్లాదకరమైన అనుభవాలనే తమకు వర్తించుకుని గర్భిణులు భయపడ్డం మానేయాలని, బిడ్డకు జన్మనివ్వడం అనేది మరీ అంత ప్రాణాంతకం ఏమీ కాదని జోన్స్ సలహా ఇస్తున్నారు. ► హాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత, రెండు ఆస్కార్ల విజేత సీన్ పెన్ (58).. ‘మీ టూ’ ఉద్యమం.. సమాజంలో స్త్రీ, పురుషులను వేరు చేస్తోందనీ, వారి మధ్య అనుమానాలను, అపార్థాలను శత్రుత్వాన్ని పెంచి పోషిస్తోందనీ విమర్శించారు. అమెరికన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ‘హులు’ నిర్మించి, ఈ నెల 14న ప్రారంభించిన ఎనిమిది ఎపిసోడ్ల అమెరికన్–బ్రిటిష్ డ్రామా వెబ్ టెలి విజన్ సిరీస్ ‘ది ఫస్ట్’లో తన సహనటి నటాషా మెకెల్హోన్తో పాటు నటిస్తున్న సీన్ పెన్.. ఆ సీరియల్ కథలో అంగారక గ్రహానికి ప్రమాదకరమైన ప్రయాణం చేసే శక్తిమంతమైన మహిళల గురించి తమను ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా ‘మీ టూ’ ప్రస్తావన వచ్చినప్పుడు తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ►బుధవారం (నిన్న) ఇండియా–పాకిస్తాన్ మధ్య దుబాయ్‌లోని స్పోర్ట్స్ క్లబ్లో ఆసియా కప్ క్రికెట్ వన్డే మ్యాచ్ మొదలవడానికి కొన్ని గంటల ముందు భారత టెన్నిస్ స్టార్, ఇప్పుడీ మ్యాచ్‌లో ఆడుతున్న పాకిస్తానీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య అయిన సానియా మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సైన్ అవుట్ అయ్యారు! ‘‘ఇక ఈ ఆట మొదలయ్యాక ఆరోగ్యకరంగా ఉండే మనిషి కూడా సిక్ అవుతారు. అలాంటి ఉంటాయి సోషల్ మీడియాలో కామెంట్లు. పైగా ఒక గర్భిణికి అసలే అవసరం లేని కామెంట్స్ అవి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇది మ్యాచ్ మాత్రమే’’ అని ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి అదృశ్యం అయిపోయారు సానియా. -
రోడ్డు మీద నాట్లేసిన రోజా
చిత్తూరు : రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రభుత్వానికి తెలపడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వినూత్న నిరసన తెలిపారు. మేళపట్టు గ్రామంలో నీటమునిగిన రోడ్డు మీద మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని.. నీళ్లు నిలిచి పోయి కాలువలను తలపిస్తున్నాయని మేళపట్టు గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు రోజా ఇలా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు పాలనలో రహదారులు పరమ అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. కానీ మంత్రి లోకేష్ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గ్రామాలలోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశంలో అనేకసార్లు రోడ్ల దుస్టితి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు. ఈ రోజు రోజా నగరిలో ఓ పెట్రోల్ బంక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే
-
ఆ ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యే: రోజా
సాక్షి, తిరుపతి : రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రామయ్య దంపతులది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే సీఎం చంద్రబాబు అబద్ధాల హామీలు ఇచ్చారని మండిపడ్డారు. ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని, ఈ హామీ వట్టి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రుణాలు కూడా మాఫీ కాలేదని, ఈ బూటకపు హామీలతో అమాయక ప్రజలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు కార్మిక ద్రోహిఅని, ఆయన పాలనలో చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీ, విజయపాల ఫ్యాక్టరీలు మూతబడ్డాయన్నారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్ మంచి గుర్తింపు పొందిందని, కార్మికుల పొట్టకొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్‌ను ఇతర జిల్లాలకు తరలించేయత్నం జరుగుతోందన్నారు. ఈ గ్యారేజ్ కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని రోజా స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన రామయ్య దంపుతులు రుణమాఫీ కాలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ కాకపోవడంతో పాటు తీసుకున్న అప్పుకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. చదవండి: రుణమాఫీ కాలేదని భార్యాభర్తల బలవన్మరణం -
వైఎస్ జగన్ పిలుపుతో కేరళకు కదిలిన కార్యకర్తలు
సాక్షి, చిత్తూరు : భారీ వర్షాలతో విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కేరళకు సహాయం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వారు సానుకూలంగా స్పందించారు. కేరళకు అండగా నిలవడానికి తమ వంతుగా విరాళాలు అందించారు. నగరి ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో చిత్తూరులో ఒక్క రోజులోనే 10 లక్షల రూపాయలు, 14 టన్నుల బియ్యం, పప్పు ధాన్యాలు, చీరలు సేకరించారు. పుత్తూరు నుంచి 30 మందితో కూడిన పార్టీ బృందం.. సేకరించిన సరుకులు, నగదును తీసుకుని కేరళకు పయనమైందని రోజా తెలిపారు. కాగా, తన వంతు సహాయంగా నెల రోజుల వేతనాన్ని ప్రకటించి ఎమ్మెల్యే రోజా బాధితులకు బాసటగా నిలిచారు. -
బోడెపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన ఫిర్యాదు ఆధారంగా బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ గత వారం రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గత నెల 9న బోడె ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే రోజాను ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ మాట్లాడారన్నారు. దీనిపై గత నెల 14న పెనమూరు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదును తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారన్నారు. దీంతో రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపగా, ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు. -
ఏపీని దోచుకుని సింగపూర్‌లో దాచుకుంటున్నారు
ప్రకాశం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుని సింగపూర్‌లో దాచుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు..వాళ్లు ఆడవారో మొగవారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు పెట్టిన ఏడేళ్ల తర్వాత ఆయన సతీమణి వైఎస్ భారతిపై కేసు పెట్టడం ఒక కుట్ర అని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో టీడీపీ కుమ్మక్కై విర్రవీగుతున్నారని మండిపడ్డారు. మీ ఇంట్లో వాళ్లను కూడా కోర్టుకు లాగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జగన్‌పై పెట్టిన కేసులు వీగిపోతున్నాయని..అది తట్టుకోలేకే భారతిపై రాద్ధాంతం చేస్తున్నారని తెలియజేశారు. బీజేపీతో కొట్లాడుతున్నట్లు నటిస్తూ టీడీపీ లోలోపల కుమ్మక్కు అయింది.. వైఎస్సార్సీపీ కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాసం పెడితే తీసుకోలేదు..టీడీపీ పెడితే తీసుకున్నారు..ఇదే కుమ్మక్కుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ను ఓడించండి అన్న చంద్రబాబు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కౌగిలించుకుంటున్నారు..పదవుల కోసం గాడిద కాళ్లు కూడా పట్టుకునే రకం చంద్రబాబు అని తీవ్రంగా ఎద్దేవా చేశారు. పచ్చపత్రికల అండతో టీడీపీ రెచ్చిపోతుందని, భారతిపై కావాలని బురద జల్లుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇంట్లో వాళ్లను కూడా బయటకు లాగే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. బాబుకు కౌంట్‌డౌన్ మొదలైందని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికినా అరెస్ట్ చేయలేదు..టీడీపీ నేత సుజానా చౌదరీ బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన దొంగ..అలాంటి వారు కూడా భారతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ప్రజల తరపున పోరాటం చేస్తుంటే ఓర్వలేకనే చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెరలేపారని వ్యాఖ్యానించారు. -
బోడే ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం లేదు
సాక్షి, హైదరాబాద్: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా హైకోర్టును ఆశ్రయించారు. బోడే ప్రసాద్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీస్ కమిషనర్, పెనమలూరు ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా గత నెల 9న బోడే ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి, తనను ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ మాట్లాడారని తెలిపారు. మహిళ అన్న కనీస మర్యాద, గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. ఈ నేపథ్యంలో తాను గత నెల 14న పెనమలూరు పోలీసులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు ఆ ఫిర్యాదును తీసుకోలేదని ఆమె వివరించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. -
బెల్టు షాపుల తొలగింపునకు.. 15 రోజులు గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బెల్టు షాపులను తొలగించేందుకు 15 రోజులు గడువు ఇస్తున్నామని, ఆలోగా ప్రభుత్వం స్పందించకపోతే మహిళలే రంగంలోకి దిగి ధ్వంసం చేస్తారని ఎమ్మెల్యే ఆర్కే రోజా హెచ్చరించారు. బెల్టుషాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విజయవాడలోని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి ఆందోళన చేపట్టారు. బెల్టు షాపులను లేకుండా చేయడంతో పాటు, బడికి గుడికి, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని కోరుతూ అంతకుముందు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ నాయుడుకు వినతిపత్రం అందజేసింది. అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ అనే తుపాన్‌తో రాష్ట్రంలోని అన్ని వర్గాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో గృహ హింస జరగడానికి, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు జరగడానికి మద్యం ప్రధాన కారణమన్నారు. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత సీఎంకు ఉన్నా పట్టించుకోకుండా అన్ని నేరాలకు బాధ్యుడయ్యారని విమర్శించారు. ఇన్ని చేస్తూ కూడా చంద్రబాబు సిగ్గు లేకుండా మహిళా సంక్షేమం అంటూ విజయవాడ రోడ్లపై ర్యాలీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన నియోజకవర్గమైన నగిరిలో చంద్రబాబు ఆయన బినామీలకు తప్పుడు దారిలో మద్యం లైసెన్స్ ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. సంతకం పెడితే నిమిషంలోనే అమలులోకి తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు చేసిన సంతకాలకు విలువ లేకుండా పోయిందన్నారు. కాల్‌మని, సెక్స్ రాకెట్, అత్యాచారాల నిందితులకు టీడీపీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. బెల్టు షాపుల వల్ల ఎక్కడపడితే అక్కడే మద్యం విక్రయాలు చేపడుతున్నందున మహిâýళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. నేరస్థుల పట్ల సీఎం తీరుతోనే మహిళలపై అఘాయిత్యాలు నేరస్థులను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రోత్సహిస్తుండటం వల్లే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాల ఫలితంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళల మద్దతు కూడగట్టేలా పార్టీ మహిళా విభాగం పెద్ద ఎత్తున కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా తెలుగుదేశం పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిన విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అదే విధంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల సంక్షేమానికి ప్రకటించిన ప«థకాలు, వారి రక్షణకు తీసుకునే చర్యలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మహిళలు ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందారో తెలిజేయాలని కోరారు. మద్యం నియంత్రణ లేకపోవడంతోనే నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కరువైందని, ఆడవాళ్లు రోడ్డుపై ఒంటరిగా నడవాలంటే భయపడే పరిస్థితి నెలకొందని పలు జిల్లాల నుంచి హాజరైన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త పద్మావతి, కొల్లి నిర్మిలా కుమారి, కైలా జ్ఞానమణి, కృష్ణవేణి, తాతినేని పద్మావతి, బండి నాగపుణ్యశీల తదితరులు పాల్గొన్నారు. -
‘15 రోజుల్లోగా బెల్టు షాపులు తొలగించాలి’
సాక్షి, విజయవాడ : 15 రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని బెల్టు షాపులను తొలగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. బెల్టు షాపులను తొలగించాలని కోరుతూ బుధవారం ఆమె ప్రసాదం పాడు ఎక్సైజ్ కార్యాలయంకు వెళ్లి కమిషనర్‌కు వినతిపత్రం అందిచారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మద్యాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యతను చంద్రబాబు గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరిగుతున్నాయని ఆరోపించారు. మహిళల సాధికారత దిశగా చంద్రబాబు సర్కార్ ఆలోచించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అన్ని నేరాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం తరపున ఒక్క సంతకం పెడితే ఆ నిమిషం నుంచే ఏదైనా అమల్లోకి రావాలని, అది వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమవుతుందన్నారు. కోర్టులను కూడా ఎక్సైజ్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. -
పథకం ప్రకారమే పచ్చ డ్రామా
సాక్షి, హైదరాబాద్: ‘అసలు రాందాస్ అథవాలే ఎవరు? ఆయన మమ్మల్ని బీజేపీలోకి ఆహ్వానించడమేంటి? దాన్ని పచ్చ చానల్స్ హంగామా చేయడమేంటి? చూస్తుంటే.. ఇదంతా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పథకం ప్రకారం ఆడిన డ్రామాలా అన్పించడం లేదా?’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రోజా ఏమన్నారంటే.. ‘తండ్రీకొడుకులు కేంద్ర మంత్రి అథవాలేతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుని, ఆయనతో ప్రెస్‌మీట్ పెట్టించి ప్రకటన ఇప్పించారు... ఆయన అలా ప్రకటన చేయడం ఆలస్యం నారా లోకేశ్ ఇది కుట్రంటూ ట్వీట్ చేసేశారు.. ఆ మరుక్షణమే సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టారు. నిజంగా ఇదంతా కుట్ర కాదా? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమే ఇది. బీజేపీ కాదుకదా.. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామని వైఎస్ జగన్ ప్రతి సభలోనూ పదేపదే చెబుతున్నారు’ అని రోజా గుర్తు చేశారు. అధికారం కోసం వైఎస్ జగన్ ఏ పార్టీతోనూ ఇప్పటివరకూ జత కట్టలేదని, పొత్తు పెట్టుకుని అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడలేదని తెలిపారు. దమ్ముంటే కెమెరా ముందుకు రా పప్పూ చంద్రబాబు తన 1500 రోజుల దరిద్రపు పాలనపై ప్రజలు చర్చించుకోకుండా పక్కదారి పట్టించేందుకు డ్రామాకు తెరతీశారని రోజా అన్నారు. జగన్ బీజేపీలోకొస్తే బాగుంటుందని అథవాలే చేసిన ప్రకటన ఇందులో భాగమేనన్నారు. వెంటనే నిప్పు (చంద్రబాబు) ప్రెస్‌మీట్ పెట్టేశాడని, నిమిషాల్లోనే పప్పు (లోకేశ్) ఇది కుట్రంటూ ట్వీట్లు చేశాడని మండిపడ్డారు. లోకేశ్‌కు ధైర్యం ఉంటే తమ పార్టీ ఏం కుట్ర చేసిందో కెమెరాల ముందుకొచ్చి చెప్పాలన్నారు. జనంలోకి వెళ్లలేక.. బురదజల్లుతారా? మంచి చేసి ప్రజల మెప్పు పొందాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని, ఎదుటివారిపై బురదజల్లి, తన పచ్చమీడియాలో ప్రచారం చేసుకుని లబ్ధి పొందడమే ఆయనకు తెలిసిన విద్యని రోజా ధ్వజమెత్తారు. 1999, 2004, 2014 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసే చంద్రబాబు ఎన్నికలకెళ్లారని గుర్తుచేశారు. ఒంటరిగా ఏనాడూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తికి జగన్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. మేలు జరిగిందెవరికి? చంద్రబాబు పాలనలో ఆయనకు, ఆయన కుమారుడికి, ఆయన మీడియా సంస్థలకు తప్ప ఇంకెవరికీ ప్రయోజనం కలగలేదని రోజా అన్నారు. ప్రజల సంపదను దోచుకోవడమే కాకుండా, టీటీడీ ఆస్తులూ కాజేసేందుకు పథకాలు వేశారని ఆమె మండిపడ్డారు. ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాల్లో 99 శాతం అమలు చేసినట్టు చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే 2014 ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి ఎందుకు తీసేశారో చెప్పాలన్నారు. కరవుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు కరవుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబని, ఆయన ఎప్పుడొచ్చినా రైతుల జీవితాలు కరవుతో అల్లాడిపోతున్నాయని విమర్శించారు. గతంలో చంద్రబాబు 3,178 రోజులు పరిపాలించాడని, ఆ పాలన దరిద్రంగా ఉండబట్టే ప్రజలు పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ఎస్సీ ఎస్టీ మహిళలపై అత్యాచారాలు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడంలో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా చేయడమే చంద్రబాబు సాధించిన ఘనతని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే పోలవరం అవినీతి, టీటీడీ అక్రమాలు, రాజధానిలో రైతుల భూములు దోచుకోవడం, ఓటుకు కోట్లు కేసుపై సీబీఐ విచారణ వేయించుకోవాలని సవాల్ చేశారు. గోదావరి పుష్కరాల్లో చనిపోయినవారికి ఇప్పటికీ న్యాయం చేయని పాలన బాబుదని ధ్వజమెత్తారు. పాఠశాలలకు సెలవైనా వనం– మనం పేరుతో పిల్లలను తీసుకెళ్లి పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అరాచకాలపై విచారణ జరుపుతామని, నష్టపోయినవారికి న్యాయం చేస్తామని చెప్పారు. -
రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. బోడె ప్రసాద్‌పై ఫిర్యాదు..
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. కంకిపాడు పీఎస్‌లో బోడె ప్రసాద్‌పై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు, అడ్వకేట్లు వెళ్లారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోకుడా.. ఇది కంకిపాడు పీఎస్‌కు రాదని.. పెనమలురు పీఎస్‌కు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో నాయకులు పెనమలూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు అక్కడి వెళ్లి గంటలపాటు పడిగాపులు కాశారు. కొన్ని గంటలపాటు పీఎస్‌లోనే ఉన్నారు. అయినా కూడా ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. బోడె ప్రసాద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
‘సింగపూర్ పర్యటన కాదు.. దొంగపూర్ పర్యటన’
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యేలు ఓటమి భయంతోనే వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబుది సింగపూర్ పర్యటన కాదు.. దొంగపూర్ పర్యటన అని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. అంతేకాక టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాపై పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడిన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. ‘బోడె ప్రసాద్ వాజమ్మలా మాట్లాడాడు. బోడె ప్రసాద్ ఇసుక దొంగ అని చిన్న పిల్లలు కూడా చెబుతారు. బోడె మిత్రుడు శ్రీకాంత్ కాల్‌మనీ, సెక్స్ రాకెట్ నిందితుడు. ఈ విషయం అప్పటి సీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా చెప్పారు. బోడె నీ ఇంట్లో ఆడవాళ్ళు ఐనా నీ ప్రెస్‌మీట్ చూడగలరా? నోటి కొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడడం కాదు. వీధి రౌడీలా, గూండాలా మాట్లాడుతావా? పెనమాలూరులోని ఇసుక దోపిడీని నిరూపిస్తాం. బోడె నీకు ఇంక 5,6 నెలల కాలమే ఉంది, గుర్తుంచుకో. బోడె ఇంటర్ పరీక్షల్లో వేరే వారితో దొంగ పరీక్ష రాయించిన ఘనుడువని ధ్వజమెత్తారు. సెక్స్, కాల్‌మనీ పనులు ఆపండి. బోడిమాటలు మాట్లాడటం ఆపు బోడె ప్రసాద్. ఓపెన్ టెన్త్ పరీక్షలో అడ్డంగా దొరికిపోయావు. శాసన సభ్యుడిగా కొనసాగే అర్హత బోడె ప్రసాద్‌కు లేదు. రోజాపై ఒక్క చెప్పు పడితే.. మీ నాయకుడిపై లక్షల చెప్పులు పడతాయి. దమ్ముంటే ఎమ్మెల్యే రోజా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకుంటున్నారు. 52 నెలల పాలనలో 24 సార్లు విదేశాలకు వెళ్లారు. కనీసం 24 కోట్ల రూపాయల పెట్టుబడులైనా తీసుకొచ్చారా? చంద్రబాబు నీ దొంగపూర్ పర్యటనల పేరుతో రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశావని’ వైఎస్సార్సీపీ నేత సుధాకర్ బాబు విమర్శించారు. -
వైఎస్సార్ పేరు కాదు.. బ్రాండ్: రోజా
-
వైఎస్సార్ పేరు కాదు.. బ్రాండ్: రోజా
సాక్షి, విజయవాడ : నేడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగిరి ఎమ్మెల్యే రోజా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యలయంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రతి గుండే ఇప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డిని తలుచుకుంటోందని రోజా అన్నారు. వైఎస్సార్ అనేది పేరు కాదు.. బ్రాండ్ అని తెలిపారు. విశ్వసనీయత, నమ్మకానికి మారు పేరు వైఎస్సార్ అని పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. తొమ్మిదేళ్ల పాలనలనో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్సార్‌లాగా సంక్షేమాన్ని అందించగలిగే, వైఎస్సార్ వారసత్వాన్ని నిలబెట్టగలిగే వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని రోజా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది దోచుకొని దాచుకునే నైజమని రోజా వ్యాఖ్యానించారు. బాబు అసమర్ధత సీఎం అని, విదేశీ పర్యటనలో పేరుతో దోచుకున్న డబ్బుని దాచి వస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి, టీడీపీ మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యనమల రామకృష్ణుడు నువ్వు కూడా జగన్‌ని విమర్శిస్తావా.? నాలుగేళ్లు బీజేపీతో ఉండి ఇప్పుడు విమర్శలా.. అని దుయ్యబట్టారు. అఫిడవిట్ విషయంలో సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. -
ఎమ్మెల్యే రోజాపై దాడికి యత్నం
పుత్తూరు: నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు ఆర్కే రోజాపై అధికార టీడీపీకి చెందిన అల్లరిమూకలు దాడికి యత్నించాయి. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన భవనాలను బుధవారం ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు మద్యం మత్తులో ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించాయి. టీడీపీ అల్లరిమూకల చర్యలతో ఆస్పత్రి ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. మరోవైపు దివంగత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుల మధ్య ఆధిపత్య పోరుకు ఆస్పత్రి నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం వేదికైంది. రాష్ట్రమంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడికి ప్రయత్నించడంతో ఆ పార్టీ వర్గాలు విస్తుపోయాయి. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితిని తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎమ్మెల్యే రోజా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా నూతన భవనాల కోసం రూ.1.75 కోట్లు మంజూరు చేసింది. ఆ భవనాల ప్రారంభోత్సవాన్ని అధికారులు బుధవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా అధ్యక్షత వహించగా, మంత్రి అమర్నాథ్ రెడ్డి, గాలి సరస్వతమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ముద్దుకృష్ణమనాయుడు ఇద్దరు కుమారులు గాలి భానుప్రకాష్, గాలి జగదీష్ వారి అనుచర వర్గాలతో భారీ సంఖ్యలో అక్కడికి చేరారు. ఎమ్మెల్యే రోజా పంచాయతీరాజ్ అతిథి గృహం నుంచి పాదయాత్రగా వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు దివంగత మద్దుకృష్ణమ పేరుతో నినాదాలు చేయగా, వైఎస్సార్సీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలిచ్చారు. ఇంతలో టీడీపీకి చెందిన అల్లరి మూకలు మద్యం మత్తులో ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమెను చుట్టుముట్టారు. ఒక దశలో చేతులు పైకెత్తి ఎమ్మెల్యేపై దాడికి దూసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే రోజా గన్‌మాన్ తుపాకి గాలిలోకి ఎక్కుపెట్టి హెచ్చరించారు. మరో వైపు గాలి భానుప్రకాష్ వర్గీయులు గాలి జగదీష్‌పైకి దూసుకు వచ్చారు. ఎమ్మెల్యే రోజా గాలి జగదీష్‌ను తనవైపునకు రమ్మని రక్షణనిచ్చారు. అల్లరి మూకలు రెచ్చగొట్టినా ఎమ్మెల్యే రోజా సంయమనం పాటించి నేతలందరినీ సన్మానించి రాజనీతి ప్రదర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు డ్రామా కంపెనీ నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు దొంగదీక్షలు చేస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొత్తడ్రామాకు తెరసీందని ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. పుత్తూరు ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని నాలుగేళ్లుగా పోరాడకుండా ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేత దొంగదీక్ష చేయించారని ఆరోపించారు. ఆయన చేసిన నిరాహారదీక్షకు సంబంధించి మెడికల్ రిపోర్టులను బహిర్గతం చేయాలని రోజా డిమాండ్ చేశారు. చేతనైతే ఎంపీలతో రాజీనామా చేయించి ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్షలు చేయాలని ఆమె చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. అలాకాకుండా చీకట్లో ప్రధానిమోదీ, అమిత్‌షా కాళ్లు పట్టుకుంటూ రాష్ట్రంలో దీక్షలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. -
టీడీపీ దాదాగిరి: రోజాపై దాడికి యత్నం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు దాదాగిరికి దిగారు. పుత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ప్రోటోకాల్‌కు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతే కాకుండా ఆమెపై దాడికి యత్నించారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి ఆమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవడం గమనార్హం. అంతకు మందు రోజా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. మొన్న టమోటా, ఇప్పుడు మామిడి రైతులు రోడ్డుపాలు అయ్యారన్నారు. మామాడికి గిట్టుబాటు లేక రైతులు రోడ్లెక్కారు. ఇది చంద్రబాబు సర్కారుకు సిగ్గు కాదా అన్నారు. రైతుల మీద చంద్రబాబుది దొంగ ప్రేమ అని మండిపడ్డారు. -
టీడీపీకి ఓటమి భయం
సాక్షి, హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకోవడం వల్లే ముందస్తు ఎన్నికలు వద్దని ప్రెస్మీట్లు పెట్టడంతో పాటుగా ట్వీట్లు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోవడమే కాక, ఆయన వెంట జనం ప్రభంజనంలాగా నడుస్తుండటంతో టీడీపీ నేతలకు కంటి మీద కునుకు కరవైందన్నారు. ఫ్లెక్స్ సంస్థపై వచ్చిన వార్తను ప్రస్తావిస్తూ... లోకేశ్ చేసిన ట్వీట్లు చూస్తే ఆయనకున్న పప్పు అనే బిరుదును సార్థకం చేసుకున్నట్లుందన్నారు. ఈ సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా రాయితీలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఏదో తమ ఘనతగా లోకేశ్ చెప్పుకుంటున్నారని ఆమె విమర్శించారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు రాష్ట్రంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ చెప్పుకుంటున్నారని, రూ. 20 లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చినట్లు ప్రకటించారన్నారు. అయితే నాలుగేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.16,933 కోట్లు మాత్రమేనన్నారు. లోకేశ్‌ను తొలుత పప్పు ఏదో అనుకున్నామని, ఇపుడాయన తెలివితేటలు చూస్తూంటే గన్నేరు పప్పు అనే విషయం చంద్రబాబుకు కూడా అర్థమై పోయిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కనకదుర్గమ్మకు ముక్కుపుడక ఇవ్వడానికి విజయవాడ వస్తే మంత్రి దేవినేని ఉమా ఆయనకు వంగి వంగి నమస్కారాలు పెట్టి సేవలందించారన్నారు. దేవినేని ప్రొటోకాల్ మంత్రిగా వ్యవహరించలేదని ఓటుకు కోట్లు కేసులో ఇరుకున్న తమ నేత చంద్రబాబుపై కేసులు రాకుండా కాళ్లు పట్టుకున్నట్లుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ నేత కళా వెంకటరావు జగన్‌కు లేఖ పేరుతో ఏవో పిచ్చి ప్రశ్నలు వేశారన్నారు. లక్ష కోట్లు అని పాతపాటే పాడారని, నాలుగేళ్లుగా కేంద్రంతో జత కట్టిన టీడీపీ వారు లక్ష కోట్లకు ఆధారాలు ఎందుకు తీసుకురాలేదో? చెప్పాలన్నారు. తన లక్ష కోట్ల ఆస్తిని చూపిస్తే అందులో పది శాతం ఇస్తే మిగతాది మీకే రాసిస్తానని జగన్ అసెంబ్లీలోనే సవాలు విసిరితే ముందుకు రాని టీడీపీ వారు ఇంకా అదే విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కళా కనుక చర్చకు వస్తే ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామని, లేకుంటే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని రోజా ప్రశ్నించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏరువాక అంటూ బయలుదేరారని, అయితే రైతులు ఆయనపై పోరువాకకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. 2014–16లో మహిళలపై అత్యాచారాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంటే ఇపుడు అది నాలుగో స్థానానికి చేరిందని ఇదీ చంద్రబాబు సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఈరోజు సెక్స్ రాకెట్ అమరావతి నుంచి చికాగో వరకూ తీసుకు వెళ్లి తెలుగు వారి గౌరవాన్ని గంగలో కలిపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రమేష్ దీక్ష చేస్తున్నది ఏ ప్రభుత్వంపైన నాలుగేళ్లు బీజేపీ ప్రభుత్వంతో అంటకాగిన టీడీపీకి ఇపుడే స్టీలు ఫాక్టరీ ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని రోజా ప్రశ్నించారు. అసలు ఎంపీ సీఎం రమేష్ ఎవరి ప్రభుత్వంపై దీక్ష చేస్తున్నారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు గత తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ స్టీల్‌ప్లాంట్ గుర్తుకు రాలేదని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో స్టీల్ ఫ్యాక్టరీకి ఉపక్రమిస్తే నానా యాగీ చేసింది చంద్రబాబేనని ఆమె దుయ్య బట్టారు. తమ పార్టీ ఎంపీ అవినాశ్‌రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి 8 సార్లు పార్లమెంటులో మాట్లాడితే ఒక్క టీడీపీ ఎంపీ కూడా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో మంతెన, వీరమాచినేని డైటింగ్ గురించి చర్చ జరుగుతోందని ఇపుడు సీఎం రమేష్, బిటెక్ రవి దీక్ష చూశాక వారి డైటింగ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. -
ఆంధ్రజ్యోతిది నీతిమాలిన సర్వే
పుత్తూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్సైట్ల ద్వారా ప్రచారం అవుతున్న వివరాలనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆదివారం సంచికలో సర్వే పేరుతో ప్రచురించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తేల్చి చెప్పారు. సోమవారం ఆమె చిత్తూరు జిల్లా పుత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ.. నగరిలో వైఎస్సార్సీపీ గెలుస్తుందని ప్రచురించిన ఆంధ్రజ్యోతి సోమవారం మాత్రం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా పరిస్థితి బాగాలేదని ప్రచురించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని తలంటడంతో నగరిలో ఒక్కరోజులో గెలుపు ఓటమిగా మారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 19 నియోజకవర్గాల్లో సర్వే చేసి టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించడం హాస్యాస్పందంగా ఉందని, ఇది నీతిమాలిన సర్వే అని స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాలకు ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు దోచిపెడుతున్నారు కాబట్టే ఆ పత్రికా యాజమాన్యం స్వామి భక్తి చూపిస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై, డీసీసీబీ డైరెక్టర్ దిలీప్‌రెడ్డి, రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, రవిశేఖర్‌రాజు, ప్రతాప్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాహీన్ పాల్గొన్నారు. -
బాబువి ఊసరవెల్లి రాజకీయాలు
తిరుపతి రూరల్: తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. తన అవినీతిపై విచారణ జరగకుండా ఉండటం కోసమే బీజేపీకి చెందిన వారి బంధువులను సలహాదారులుగా పెట్టుకున్నారని, టీటీడీ బోర్డులో కూడా సభ్యులుగా నియమించారని విమర్శించారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి హాజరైన బొత్స సత్యసత్యనారాయణ, ఎమ్మెల్యే ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఎవరి స్థాయిలో వారు దోచుకుంటున్నారని, పంచభూతాలను సైతం వదలడం లేదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో సెస్‌ను విధించి ప్రజలపై పెట్రోల్, డీజిల్ భారం భారీగా మోపుతోందని ఆరోపించారు. ప్రభుత్వం చేతకానితనంతో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే ప్రజల ముందుకు వెళ్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు సీమ ద్రోహి: ఆర్కే రోజా రాయలసీమ అభివృద్ధికి గుండెకాయ వంటి కడప ఉక్కు పరిశ్రమ, మన్నవరం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి సీఎం చంద్రబాబు సీమద్రోహిగా నిలిచారని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. యువతకు ద్రోహం చేస్తున్న చంద్రబాబును తరిమికొట్టి.. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.