రోజా అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన | Protest against the arrest of Roza | Sakshi
Sakshi News home page

రోజా అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన

May 5 2018 1:36 PM | Updated on Oct 29 2018 8:08 PM

Protest against the arrest of Roza - Sakshi

ఎస్‌.కోట దేవీ జంక్షన్‌లో నిరసన తెలుపుతున్న కృష్ణారావు

శృంగవరపుకోట : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎస్‌. కోటకు చెందిన ఒక అభిమా ని మండుటెండలో ఉదయం నుంచి  సాయంత్రం వరకూ నిరసన తెలిపారు. గుం టూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్సీపీ ఎమ్మె ల్యే రోజా సహా పలువురు నాయకులు దాచేపల్లి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రోడ్డుపై బైఠాయించిన సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో గుంటూరు జీజీహెచ్‌ వద్ద పోలీసులు అప్రజాస్వామికంగా, దౌర్జన్యంగా రోజా సహా వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎస్‌.కోటకు చెందిన వెలుచూరి కృష్ణారావు ఎస్‌.కోట దేవీ కూడలిలో శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ మహిళలు, బాలికలపై పైశాచికంగా దాడులు జరుగుతుంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ రాజ్యంలో బతుకుతున్నామో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్న ప్రభుత్వం తీరు దుర్మార్గమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో శ్రద్ధ చూపిస్తే సమాజం బాగుపడుతుందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement