fans protest
-
రోజా అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన
శృంగవరపుకోట : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎస్. కోటకు చెందిన ఒక అభిమా ని మండుటెండలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరసన తెలిపారు. గుం టూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్సీపీ ఎమ్మె ల్యే రోజా సహా పలువురు నాయకులు దాచేపల్లి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రోడ్డుపై బైఠాయించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గుంటూరు జీజీహెచ్ వద్ద పోలీసులు అప్రజాస్వామికంగా, దౌర్జన్యంగా రోజా సహా వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎస్.కోటకు చెందిన వెలుచూరి కృష్ణారావు ఎస్.కోట దేవీ కూడలిలో శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ మహిళలు, బాలికలపై పైశాచికంగా దాడులు జరుగుతుంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ రాజ్యంలో బతుకుతున్నామో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్న ప్రభుత్వం తీరు దుర్మార్గమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో శ్రద్ధ చూపిస్తే సమాజం బాగుపడుతుందన్నారు. -
టీమిండియా విక్టరీ.. చుక్కలు చూపిన ఫ్యాన్స్
కోలంబో: టీమిండియాతో జరుగుతున్న సిరీస్ లో ఆతిథ్య జట్టు శ్రీలంక పేలవమైన ప్రదర్శన ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహా జ్వాలలు పెల్లుబిక్కుతున్నాయి. డంబుల్లాలో మొదటి వన్డే ఓటమి తర్వాత ఏకంగా సభ్యులను ఘోరావ్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆదివారం వన్డే ముగిశాక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డగించి వ్యతిరేక నినాదాలు చేశారని సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చే తీవ్రంగానే యత్నించినట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. మరోవైపు జట్టులో అంతర్గత కలహాలపై కోచ్ నిక్ పోతస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు ఫిట్నెస్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నారని, అయితే సమస్యలు డ్రెస్సింగ్ రూంలోనే పుడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో తనకు జట్టులో స్వేచ్ఛ ఇవ్వాలంటూ మీడియా సాక్షిగా ఆయన బోర్డుకు విజ్నప్తి చేయటం విశేషం. మరోపక్క జట్టుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మాజీ ఆటగాడు కుమార సంగక్కర స్పందించారు. ఇలాంటి సమయంలో సంయమనంతో ఉండి జట్టు సభ్యులకు మద్ధతుగా నిలవాలంటూ సంగక్కర ఓ వీడియో సందేశంలో పిలుపునిచ్చారు. -
టీడీపీ హయాంలో విగ్రహాల ధ్వంసం: రాధా
విజయవాడలో రంగా విగ్రహం ధ్వంసం విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్): విజయవాడ నగరమంతా సంక్రాంతి వేడుకల్లో నిమగ్నమవడాన్ని అదునుగా చేసుకొన్న కొంతమంది దుండగులు బరితెగించారు. విజయవాడ సింగ్‌నగర్ పైపులరోడ్డులో ఉన్న వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ఆదివారం తెల్లవారుజామున విగ్రహం ధ్వంసాన్ని గుర్తించిన వంగవీటి రంగా అభిమానులు పెద్దసంఖ్యలో పైపులరోడ్డుకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విగ్రహం కూల్చిన దిమ్మెపై రంగా చిత్రపటాన్ని ఉంచి క్షీరాభిషేకం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న రంగా తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న నగరంలో మళ్లీ అల్లర్లు సృష్టించి, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని 24 గంటల్లోగా అరెస్టు చేయాలని, లేనిపక్షంలో ఇటువంటి చర్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. -
టీడీపీ హయాంలో విగ్రహాల ధ్వంసం: రాధా
-
వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం.
-
వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం
విజయవాడ : నగరంలోని సింగ్ నగర్లో వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగ్ నగర్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహం ధ్వంసమై ఉండడాన్ని స్థానికులు ఈ రోజు ఉదయం కనుగొన్నారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో రంగా అభిమానులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని ధర్నాకు దిగారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, రంగా విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష్టించాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళవకారులకు నచ్చచెప్పారు. విగ్రహాన్ని కూల్చిన దుండగులను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.