టీమిండియా విక్టరీ.. చుక్కలు చూపిన ఫ్యాన్స్
Published Mon, Aug 21 2017 5:03 PM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM
కోలంబో: టీమిండియాతో జరుగుతున్న సిరీస్ లో ఆతిథ్య జట్టు శ్రీలంక పేలవమైన ప్రదర్శన ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహా జ్వాలలు పెల్లుబిక్కుతున్నాయి. డంబుల్లాలో మొదటి వన్డే ఓటమి తర్వాత ఏకంగా సభ్యులను ఘోరావ్ చేసినట్లు తెలుస్తోంది.
సుమారు 50 మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆదివారం వన్డే ముగిశాక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డగించి వ్యతిరేక నినాదాలు చేశారని సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చే తీవ్రంగానే యత్నించినట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. మరోవైపు జట్టులో అంతర్గత కలహాలపై కోచ్ నిక్ పోతస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు ఫిట్‌నెస్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నారని, అయితే సమస్యలు డ్రెస్సింగ్ రూంలోనే పుడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో తనకు జట్టులో స్వేచ్ఛ ఇవ్వాలంటూ మీడియా సాక్షిగా ఆయన బోర్డుకు విజ్నప్తి చేయటం విశేషం.
మరోపక్క జట్టుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మాజీ ఆటగాడు కుమార సంగక్కర స్పందించారు. ఇలాంటి సమయంలో సంయమనంతో ఉండి జట్టు సభ్యులకు మద్ధతుగా నిలవాలంటూ సంగక్కర ఓ వీడియో సందేశంలో పిలుపునిచ్చారు.
Advertisement