poor performance
-
ఆంధ్ర లక్ష్యం 321
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆంధ్ర జట్టు... ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆంధ్ర జట్టు... నాలుగో మ్యాచ్‌లోనూ పరాజయం దిశగా సాగుతోంది. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 321 పరుగుల లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 8 పరుగులు చేసింది.ఓపెనర్ అభిషేక్ రెడ్డి (6) అవుట్ కాగా... హేమంత్ రెడ్డి (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు విజయానికి 313 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 92/4తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 56.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (91 బంతుల్లో; 43; 6 ఫోర్లు) ఒక్కడే ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ 49 ఓవర్లలో 128/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. స్వప్నిల్ సింగ్ (39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. కెపె్టన్ రవికుమార్ సమర్థ్ (1), అఖిల్ రావత్ (0), ప్రియాన్షు ఖండూరి (4), యువరాజ్ (13), ఆదిత్య తారె (10) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో చీపురుపల్లి స్టీఫెన్, కేవీ శశికాంత్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
మార్చిలో ‘సేవలు’ అంతంతే..!
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మార్చిలో పేలవ పనితీరును కనబరిచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరికన్నా తక్కువకు పడిపోయి 57.8కి చేరింది. సూచీ ఫిబ్రవరిలో 12 నెలల గరిష్ట స్థాయి 59.4ను చూసిన సంగతి తెలిసిందే. కొత్త బిజినెస్ ఆర్డర్లు అంతంత మాత్రంగానే పెరిగినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డి లిమా పేర్కొన్నారు. కాగా, సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన వరుసగా 20 నెలల నుంచి సూచీ వృద్ధి ధోరణిలో పయనిస్తోంది. తయారీ–సేవల రంగం కలిపినా డౌన్! కాగా, తయారీ–సేవల రంగం కలిపినా ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 59.0 వద్ద ఉంటే, మార్చిలో 58.4కు పడిపోయింది. మరోవైపు ఒక్క తయారీ రంగం చూస్తే మార్చిలో మంచి పురోగతి కనబరచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మార్చిలో మూడు నెలల గరిష్ట స్థాయిలో 56.4కు వద్దకు చేరింది. డిమాండ్ ఊపందుకోవడంతో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినట్లూ వివరించింది. ఫిబ్రవరిలో పీఎంఐ 55.3గా నమోదయ్యింది. 400 మంది తయారీదారుల ప్యానల్లో కొనుగోళ్లు జరిపే మేనేజర్ల స్పందన ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదు చేస్తారు. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా 60%. పరిశ్రమల రంగం వాటా దాదాపు 15% అయితే, అందులో తయారీ రంగం వెయిటేజ్ 70% ఉంటుంది. -
కోహ్లికి సూచనలివ్వడానికి మీరెవరు ?
ఇస్లామాబాద్ : న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఘోరంగా విఫలం కావడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ పాక్ మాజీ కెప్టెన్ ఇంజామామ్-ఉల్-హక్ మాత్రం మద్దతుగా నిలిచాడు. కోహ్లి ఆటతీరును తప్పుబడుతూ క్రిటిక్స్ చేసిన విమర్శలకు యూట్యూబ్ చానెల్ వేదికగా దీటుగా బదులిచ్చాడు. ' కోహ్లి ఆటతీరు, అతని టెక్నిక్‌పై పెదవి విరుస్తున్న వాళ్లకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. అంతర్జాతీయ కెరీర్లో 70 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లి టెక్నిక్‌పై విమర్శలు చేసే హక్కు మీకెవరికి లేదు. ప్రతి క్రికెటర్ ఏదో ఒక దశలో బ్యాడ్‌ఫేజ్‌లో ఉండడం సహజమే, దీనికే మీరంతా కోహ్లి ఆటను తప్పు బట్టడం సరికాదు. అయినా ఒక క్రికెటర్ తన కెరీర్లో ఉత్తమ ప్రదర్శన చేసినా ఒక్కోసారి విఫలమవుతూనే ఉంటారు. ఒకప్పుడు మా జట్టు ఆటగాడు మహ్మద్ యూసఫ్ ఇలాగే తన పూర్ ఫామ్‌ను కొనసాగించినప్పుడు అతని టెక్నిక్‌పై కూడా ఇలాగే విమర్శలు సంధించారు. అప్పుడు నేను యూసఫ్‌కు ఒకటే చెప్పా.. నీకు టెక్నిక్ అనేది లేకపోయుంటే ఇన్ని పరుగులు ఎలా సాధించేవాడివా అని ప్రశ్నించాను. (జర్నలిస్టుపై కోహ్లి ఆగ్రహం) అయినా కివీస్ పర్యటనలో భారత్ విఫలమైందంటే అది కోహ్లి ఒక్కడివల్ల మాత్రం కాదు. కోహ్లి పరుగులు సాధించలేదు నిజమే మరి జట్టులో మిగతావారు కూడా విఫలమయ్యారు.. దాని గురించి మాత్రం ఎవరు ఎందుకని మాట్లాడడం లేదు. కోహ్లి ప్రదర్శనపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతని టెక్నిక్‌పై కూడా విమర్శలు అవసరం లేదు. ఈ పర్యటనలో విఫలమైనా తిరిగి ఫుంజుకునే సత్తా కోహ్లిలో ఉందని నేను బలంగా నమ్ముతున్నా. నా దృష్టిలో సయీద్ అన్వర్, సౌరవ్ గంగూలీ లాంటి ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఎన్నోసార్లు ఆకట్టుకున్నారు.. అయితే విఫలమైన ప్రతీసారి తిరిగి బౌన్స్‌బ్యాక్ అయ్యారు.. ఇప్పుడు కోహ్లి కూడా అలాగే మెరుగైన ప్రదర్శన ఇస్తాడని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కివీస్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మొత్తం మూడు ఫార్మాట్లు కలిపి 11 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 218 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. కాగా కివీస్ పర్యటనలో టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయగా, వన్డేలతో పాటు టెస్టు సిరీస్‌ను ఆతిథ్య జట్టు క్లీన్‌స్వీప్ చేయడం గమనార్హం. (ఆ ముగ్గురు క్రికెట్ గతిని మార్చారు : ఇంజమామ్) (మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు) -
పారిశ్రామికం నేల చూపు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం– ఐఐపీ (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) మే నెలలో పేలవ పనితీరును ప్రదర్శించింది. కేవలం 3.2 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి. గత ఏడాది మే నెలలో వృద్ధి 2.9 శాతమే కావడం గమనార్హం. తయారీ, విద్యుత్ రంగాల పేలవ పనితీరును ప్రదర్శించాయి. కాగా ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలను చూస్తే (ఏప్రిల్, మే) పారిశ్రామిక రంగం వృద్ధి 3.1 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. కేంద్ర గణాంకాల కార్యాలయం గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాలను చూస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు మే నెలలో స్వల్పంగా మాత్రమే పెరిగింది. 2017 మే నెలలో 2.6 శాతం వృద్ధి రేటు ఉంటే ఇది 2018 మే నెలలో 2.8 శాతంగా మాత్రమే నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ఈ వృద్ధి 2.8 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. విద్యుత్: నెలవారీగా వృద్ధి 8.3 శాతం నుంచి 4.2 శాతానికి పడిపోగా, ఏప్రిల్, మే నెలలను కలిపిచూస్తే, ఈ రేటు 6.9 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గింది. మైనింగ్: మేలో వృద్ధి రేటు 0.3 శాతం నుంచి భారీగా 5.7 శాతానికి ఎగిసింది. రెండు నెలలను కలిపిచూస్తే, రేటు 1.6 శాతం నుంచి 4.9 శాతానికి చేరింది. ఎఫ్ఎంసీజీ: అసలు వృద్ధిలేకపోగా – 2.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2017 మే నెలలో ఈ రంగం వృద్ధి రేటు 9.7 శాతం. కన్జూమర్ గూడ్స్: కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధిలేకపోగా –2.6 క్షీణత నెలకొంది. -
టీమిండియా విక్టరీ.. చుక్కలు చూపిన ఫ్యాన్స్
కోలంబో: టీమిండియాతో జరుగుతున్న సిరీస్ లో ఆతిథ్య జట్టు శ్రీలంక పేలవమైన ప్రదర్శన ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహా జ్వాలలు పెల్లుబిక్కుతున్నాయి. డంబుల్లాలో మొదటి వన్డే ఓటమి తర్వాత ఏకంగా సభ్యులను ఘోరావ్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆదివారం వన్డే ముగిశాక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డగించి వ్యతిరేక నినాదాలు చేశారని సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చే తీవ్రంగానే యత్నించినట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. మరోవైపు జట్టులో అంతర్గత కలహాలపై కోచ్ నిక్ పోతస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు ఫిట్నెస్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నారని, అయితే సమస్యలు డ్రెస్సింగ్ రూంలోనే పుడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో తనకు జట్టులో స్వేచ్ఛ ఇవ్వాలంటూ మీడియా సాక్షిగా ఆయన బోర్డుకు విజ్నప్తి చేయటం విశేషం. మరోపక్క జట్టుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మాజీ ఆటగాడు కుమార సంగక్కర స్పందించారు. ఇలాంటి సమయంలో సంయమనంతో ఉండి జట్టు సభ్యులకు మద్ధతుగా నిలవాలంటూ సంగక్కర ఓ వీడియో సందేశంలో పిలుపునిచ్చారు. -
ప్రచారమో రామచంద్రా
కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య కానరాని సమన్వయం ఎవరికివారుగా ప్రచారం కన్నెత్తి చూడని దొంతి మాధవరెడ్డి వర్గపోరుతో కొరవడిన ఐకమత్యం వరంగల్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ..ప్రచార పర్వంలో మాత్రం ముందుకు వెళ్లడంలేదు. పీసీసీ ఆగ్రనేతలు జిల్లాకు వస్తున్నా ఒకటి రెండు కార్యక్రమాలతో సరిపెట్టి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తరఫున జిల్లా నేతల నుంచి ఆశించిన సహకారం లభించడం లేదనే అభిప్రాయం హస్తం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మొదట తాము విముఖత చూపిన సర్వే సత్యనారాయణ అభ్యర్థిగా రావడాన్ని కాంగ్రెస్ జిల్లా నేతలు ఇంకా మరిచిపోవడంలేదు. మరోవైపు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో సంఘటన షాక్ నుంచి కాంగ్రెస్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోవడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ జిల్లా ముఖ్యనేతల ప్రచార తీరు ఎవరికివారు యమునా తీరు అన్నట్లుగా కొనసాగుతోంది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో నియోజకవర్గస్థాయి నాయకులు సైతం ప్రచారం మొదలుపెట్టనే లేదు. కొన్ని మండలాల్లో ద్వితీయశ్రేణి నాయకుల పరిస్థితీ ఇలాగే ఉంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఉప ఎన్నికకు పూర్తి బాధ్యుడిగా వ్యవహరిస్తారని జిల్లా నేతలు భావించారు. నామినేషన్ దాఖలు తర్వాత ఒకటిరెండు రోజులు హడావుడి చేసి ఉత్తమ్ కూడా వెళ్లిపోయారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అంతా తానై వ్యవహరించాలనే యత్నం చేస్తున్నారు. దీన్ని జిల్లా నేతలు అంగీకరించడం లేదు. పొన్నాల వర్గం పెత్తనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన ప్రత్యర్థి వర్గం ప్రచారానికి దూరంగా ఉంటోంది. జిల్లాలో కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న దొంతి మాధవరెడ్డి ప్రచారంలో పాల్గొనడం లేదు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిణామాలుగా మారుతున్నారుు. నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి.. స్టేషన ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం పరిస్థితి దయనీయంగా ఉంది. లింగాలఘనపురం, రఘునాథపల్లి మండలాల కార్యకర్తలతో నాయకులు మాట్లాడారు. నామమాత్రంగానే ప్రచారం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలో పోటీచేసి ఓడిపోయిన జీ.విజయరామారావు ప్రచారంలో కనిపించడం లేదు. రాజారపు ప్రతాప్ దూరమయ్యారు. ఇన్చార్జిగా ఉన్న లక్ష్మయ్య పరిస్థితీ అలాగే ఉంది. జిల్లా కేంద్రంలోని తమ ఇళ్లకు కార్యకర్తలను పిలిచి అదే ప్రచారంగా చూపే యత్నాలు ఆ పార్టీ ప్రధాన నేతలు చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వర్గపోరు నానాటికీ ముదురుతోంది. డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన దుగ్యాల శ్రీనివాస్‌రావుల మధ్య వర్గపోరు నెలకొంది. పీసీసీ అధిష్టానం ఈ నియోజకవర్గ బాధ్యతల విషయంలో నిర్ణయం తీసుకోకుండా చోద్యం చూస్తోంది. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయూన్ని మిగిల్చింది. మొత్తంగా ఉప ఎన్నికలో ఇది ప్రభావం చూపే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. జంగా రాఘవరెడ్డి వర్గం మాత్రం కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహిస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతోంది. మాజీ మంత్రి సారయ్య పెద్దగా ప్రచారం చేయడంలేదు. డివిజన్ల వారీగా కాంగ్రెస్ బాధ్యులు సైతం ఇదే వైఖరితో ఉంటున్నారు. సర్వే సత్యనారాయణ అభ్యర్థిత్వం విషయంలో మాజీ మంత్రి సారయ్య అసంతృప్తితో ఉండడం వల్లే వరంగల్ తూర్పులో ప్రచారం పెద్దగా జరగడంలేదని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ ప్రచారం బాగానే సాగుతున్నా..అది ఆశించిన మేరకు లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఎక్కువగా ఇదే నియోకవర్గంలో పర్యటిస్తున్నారు. వీరి వెంట కాంగ్రెస్ జిల్లా నేతలు ఉంటున్నారు. నియోజకవర్గ ఇన్చార్జీ బాధ్యతల విషయంలో లోలోపల వర్గపోరు జరుగుతోంది. ఇది క్షేత్రస్థాయిలో ప్రచారంపై ప్రభావం చూపుతోంది. -
సేమ్ టు షేమ్