ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 146 ఆలౌట్
ఉత్తరాఖండ్ రెండో ఇన్నింగ్స్ 128/9 డిక్లేర్డ్
స్టీఫెన్, శశికాంత్‌లకు మూడేసి వికెట్లు
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆంధ్ర జట్టు... ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆంధ్ర జట్టు... నాలుగో మ్యాచ్‌లోనూ పరాజయం దిశగా సాగుతోంది. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 321 పరుగుల లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 8 పరుగులు చేసింది.
ఓపెనర్ అభిషేక్ రెడ్డి (6) అవుట్ కాగా... హేమంత్ రెడ్డి (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు విజయానికి 313 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 92/4తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 56.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (91 బంతుల్లో; 43; 6 ఫోర్లు) ఒక్కడే ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ 49 ఓవర్లలో 128/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. స్వప్నిల్ సింగ్ (39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. కెపె్టన్ రవికుమార్ సమర్థ్ (1), అఖిల్ రావత్ (0), ప్రియాన్షు ఖండూరి (4), యువరాజ్ (13), ఆదిత్య తారె (10) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో చీపురుపల్లి స్టీఫెన్, కేవీ శశికాంత్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment