ఆంధ్ర లక్ష్యం 321
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆంధ్ర జట్టు... ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆంధ్ర జట్టు... నాలుగో మ్యాచ్‌లోనూ పరాజయం దిశగా సాగుతోంది. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 321 పరుగుల లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 8 పరుగులు చేసింది.ఓపెనర్ అభిషేక్ రెడ్డి (6) అవుట్ కాగా... హేమంత్ రెడ్డి (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు విజయానికి 313 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 92/4తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 56.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (91 బంతుల్లో; 43; 6 ఫోర్లు) ఒక్కడే ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ 49 ఓవర్లలో 128/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. స్వప్నిల్ సింగ్ (39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. కెపె్టన్ రవికుమార్ సమర్థ్ (1), అఖిల్ రావత్ (0), ప్రియాన్షు ఖండూరి (4), యువరాజ్ (13), ఆదిత్య తారె (10) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో చీపురుపల్లి స్టీఫెన్, కేవీ శశికాంత్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.