లొమ్రోర్, శుభమ్ సెంచరీలు
రాజస్తాన్ 425 ఆలౌట్
హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్ 36/0
జైపూర్: పసలేని బౌలింగ్.. ఫీల్డర్ల తడబాటు.. వెరసి దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం చేజారింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న పోరులో మహిపాల్ లొమ్రోర్ (150 బంతుల్లో 111; 12 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభమ్ గర్వాల్ (107 బంతుల్లో 108; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలు బాదడంతో రాజస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 117/1తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రాజస్తాన్ చివరకు 108.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది.
ఐపీఎల్‌లో మంచి ఇన్నింగ్స్‌లతో గుర్తింపు తెచ్చుకున్న మహిపాల్ లొమ్రోర్ చక్కటి శతకం నమోదు చేసుకోగా.. శుభమ్ గర్వాల్ విధ్వంసం సృష్టించాడు. హైదరాబాద్ బౌలర్ల భరతం పడుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. జుబైర్ అలీ (57; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కెప్టెన్ దీపక్ హుడా (1), వికెట్ కీపర్ కునాల్ సింగ్ రాథోడ్ (9), దీపక్ చహర్ (5) విఫలమయ్యారు. ఆఖర్లో అరాఫత్ ఖాన్ (32; 4 ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ జట్టుకు 15 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పెట్టాడు.
హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3.. చామా మిలింద్, రోహిత్ రాయుడు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిరత్ రెడ్డి (28 బ్యాటింగ్; 4 ఫోర్లు), తన్మయ్ అగర్వాల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా.. చేతిలో 10 వికెట్లు ఉన్న హైదరాబాద్ ఓవరాల్‌గా 21 పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఆధిక్యం సాధించినందుకు రాజస్తాన్‌కు 3 పాయింట్లు, హైదరాబాద్‌కు ఒక పాయింట్ లభిస్తుంది.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 410; రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్: అభిజిత్ తోమర్ (బి) తనయ్ త్యాగరాజన్ 60; రామ్ చౌహాన్ (సి) రాహుల్ రాదేశ్ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 11; మహిపాల్ లొమ్రోర్ (సి) రాహుల్ రాదేశ్ (బి) రక్షణ్ రెడ్డి 111; దీపక్ హుడా (సి) రాహుల్ రాదేశ్ (బి) చామా మిలింద్ 1; జుబైర్ అలీ (ఎల్బీ) (బి) తనయ్ త్యాగరాజన్ 57; శుభమ్ గర్వాల్ (సి) రాహుల్ సింగ్ (బి) చామా మిలింద్ 108; కునాల్ సింగ్ రాథోడ్ (ఎల్బీ) (బి) రోహిత్ రాయుడు 9; దీపక్ చహర్ (ఎల్బీ) (బి) రోహిత్ రాయుడు 5; అజయ్ సింగ్ (బి) తనయ్ త్యాగరాజన్ 13; అరాఫత్ ఖాన్ (సి) హిమతేజ (బి) అనికేత్ రెడ్డి 32; అనికేత్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (108.2 ఓవర్లలో ఆలౌట్) 425.
వికెట్ల పతనం: 1–27, 2–150, 3–169, 4–216, 5–285, 6–302, 7–334, 8–374, 9–405, 10–425. బౌలింగ్: చామా మిలింద్ 19–3–73–2, రక్షణ్ రెడ్డి 18–5–36–1, అజయ్‌దేవ్ గౌడ్ 15–1–65–1; తనయ్ త్యాగరాజన్ 25–2–104–3; రోహిత్ రాయుడు 18–5–65–2; అనికేత్ రెడ్డి 13.2–2–75–1.
హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బ్యాటింగ్) 8; అభిరత్ రెడ్డి (బ్యాటింగ్) 28; మొత్తం (7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 36. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–0, అజయ్ సింగ్ 3–0–14–0, దీపక్ హుడా 1–0–6–0, మహిపాల్ లొమ్రోర్ 1–0–5–0.
Comments
Please login to add a commentAdd a comment