Trophy
-
ఆధిక్యం కోల్పోయిన హైదరాబాద్
జైపూర్: పసలేని బౌలింగ్.. ఫీల్డర్ల తడబాటు.. వెరసి దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం చేజారింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న పోరులో మహిపాల్ లొమ్రోర్ (150 బంతుల్లో 111; 12 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభమ్ గర్వాల్ (107 బంతుల్లో 108; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలు బాదడంతో రాజస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 117/1తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రాజస్తాన్ చివరకు 108.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది.ఐపీఎల్లో మంచి ఇన్నింగ్స్‌లతో గుర్తింపు తెచ్చుకున్న మహిపాల్ లొమ్రోర్ చక్కటి శతకం నమోదు చేసుకోగా.. శుభమ్ గర్వాల్ విధ్వంసం సృష్టించాడు. హైదరాబాద్ బౌలర్ల భరతం పడుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. జుబైర్ అలీ (57; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కెప్టెన్ దీపక్ హుడా (1), వికెట్ కీపర్ కునాల్ సింగ్ రాథోడ్ (9), దీపక్ చహర్ (5) విఫలమయ్యారు. ఆఖర్లో అరాఫత్ ఖాన్ (32; 4 ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ జట్టుకు 15 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పెట్టాడు.హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3.. చామా మిలింద్, రోహిత్ రాయుడు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిరత్ రెడ్డి (28 బ్యాటింగ్; 4 ఫోర్లు), తన్మయ్ అగర్వాల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా.. చేతిలో 10 వికెట్లు ఉన్న హైదరాబాద్ ఓవరాల్‌గా 21 పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఆధిక్యం సాధించినందుకు రాజస్తాన్‌కు 3 పాయింట్లు, హైదరాబాద్‌కు ఒక పాయింట్ లభిస్తుంది. స్కోరు వివరాలుహైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 410; రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్: అభిజిత్ తోమర్ (బి) తనయ్ త్యాగరాజన్ 60; రామ్ చౌహాన్ (సి) రాహుల్ రాదేశ్ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 11; మహిపాల్ లొమ్రోర్ (సి) రాహుల్ రాదేశ్ (బి) రక్షణ్ రెడ్డి 111; దీపక్ హుడా (సి) రాహుల్ రాదేశ్ (బి) చామా మిలింద్ 1; జుబైర్ అలీ (ఎల్బీ) (బి) తనయ్ త్యాగరాజన్ 57; శుభమ్ గర్వాల్ (సి) రాహుల్ సింగ్ (బి) చామా మిలింద్ 108; కునాల్ సింగ్ రాథోడ్ (ఎల్బీ) (బి) రోహిత్ రాయుడు 9; దీపక్ చహర్ (ఎల్బీ) (బి) రోహిత్ రాయుడు 5; అజయ్ సింగ్ (బి) తనయ్ త్యాగరాజన్ 13; అరాఫత్ ఖాన్ (సి) హిమతేజ (బి) అనికేత్ రెడ్డి 32; అనికేత్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (108.2 ఓవర్లలో ఆలౌట్) 425.వికెట్ల పతనం: 1–27, 2–150, 3–169, 4–216, 5–285, 6–302, 7–334, 8–374, 9–405, 10–425. బౌలింగ్: చామా మిలింద్ 19–3–73–2, రక్షణ్ రెడ్డి 18–5–36–1, అజయ్‌దేవ్ గౌడ్ 15–1–65–1; తనయ్ త్యాగరాజన్ 25–2–104–3; రోహిత్ రాయుడు 18–5–65–2; అనికేత్ రెడ్డి 13.2–2–75–1.హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బ్యాటింగ్) 8; అభిరత్ రెడ్డి (బ్యాటింగ్) 28; మొత్తం (7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 36. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–0, అజయ్ సింగ్ 3–0–14–0, దీపక్ హుడా 1–0–6–0, మహిపాల్ లొమ్రోర్ 1–0–5–0. -
హిందీ బిగ్ బాస్ విన్నర్‌గా టాలీవుడ్ నటి (ఫోటోలు వైరల్)
-
12 రోజులు.. 5000 కిలోమీటర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ సైక్లింగ్ పోటీల్లో అత్యంత కఠినమైన రేస్ ఎక్రాస్ అమెరికా (వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ) సైక్లింగ్ ఈవెంట్. దీనికి అర్హత సాధించానని హైదరాబాద్ బండ్లగూడకు చెందిన రవీందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 10 నుంచి సైక్లింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయన్నారు. భారత్ నుంచి తొలిసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న తొలి వ్యక్తి తానేనని, 12 రోజులు, 12 నగరాల మీదుగా 5 వేల కిలో మీటర్ల నిరంతరాయంగా సైక్లింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.ఈస్ట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమై న్యూజెర్సీలో ముగుస్తుందన్నారు. ప్రపంచంలో 60 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు, 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులో 5 గరు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి ప్లస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో ఈ సైక్లింగ్ ఉంటుందన్నారు. పేద పిల్లలకు ఫండ్ రైజింగ్‌లో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారని, గతంలో 29 మంది సైక్లిస్టులు రూ.100 కోట్ల ఫండ్ రైజ్ చేశారని గుర్తుచేశారు.గతంలో రేస్ ఎక్రాస్ ఇండియా, రేస్ ఎక్రాస్ ఆసియా పోటీల్లో విజేతగా నిలిచానని తెలిపారు. రేస్ ఎక్రాస్ అమెరికా ఈట్లోనూ 50 ఏళ్ల కేటగిరిలో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ట్రయల్స్‌లో భాగంగా ప్రస్తుతం అమెరికాలో సైక్లింగ్ చేయనున్న రూట్లో ట్రయల్ వేస్తున్నారు.ఇవి చదవండి: Singer Smita: ఓల్డ్ స్కూల్ బృందావనం! నగరంలో కొత్త కాన్సెప్ట్.. -
సాక్షి ఆఫీస్‌లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
-
సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..
-
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
అర్జెంటీనా దివంగత దిగ్గజ ఫుట్‌బాలర్ డీగో మారడోనా 1986లో గెల్చుకున్న ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీ వేలానికి రానుంది. జూన్ 6వ తేదీన పారిస్‌లోని అగుటెస్ ఆక్షన్ హౌజ్‌లో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ వేలం జరుగుతుందని, దీనికి కనీస ధరను ఇంకా నిర్ణయించలేదని వేలం నిర్వాహకులు తెలిపారు. మెక్సికో ఆతిథ్యమిచ్చిన 1986 ప్రపంచకప్ లో మారడోనా సారథ్యంలో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోరీ్నలో మారడోనా ఐదు గోల్స్ చేయడంతోపాటు ఉత్తమ ప్లేయర్‌కు అందించే ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీని సాధించాడు. -
అరుదైన ఛాన్స్ కొట్టేసిన రౌతేలా.. ఆ విషయంలో తొలి నటి ఆమెనే!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు అభిమానులను మెప్పించింది. బాస్ పార్టీ అంటూ సాగే సాంగ్‌తో ఉర్రూతలూగించింది. ఆ తర్వాత కూడా అఖిల్ అక్కినేని చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా ఈ భామ అరుదైన అవకాశాన్ని అందుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: 'స్నానం చేస్తుండగా వీడియోలు తీసేవాడు'.. హీరోయిన్ తీవ్ర ఆరోపణలు! ) ఇండియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు ట్రీఫీ చాలా దేశాలను చుట్టేసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక ఈఫిల్ టవర్ ముందు ఐసీసీ ప్రపంచ కప్ -2023ను ఆవిష్కరించారు. అయితే ఈ ట్రోఫీని బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఆవిష్కరించింది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి నటిగా ఉర్వశి నిలిచింది. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వరల్డ్ కప్ ముందు ఫోటోలకు పోజులిచ్చింది. పంచుకుంది. ఈ అవకాశమిచ్చిన ఐసీసీకి కృతజ్ఞతలు తెలిపింది. ఇది చూసిన అభిమానులు ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'రిషబ్ భయ్యా దృష్టిలో పడేందుకేనా..' అంటూ కామెంట్స్ చేశాడు. మరో నెటిజన్ ఊర్వశి రౌతేలా వరల్డ్ కప్ పట్టుకుందంటే.. ఇక నెక్స్ట్ రిషబ్ భయ్యా వంతు అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు గెలవాల్సింది ఒకటి కాదు.. రెండు ట్రోఫీలు అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. రిషభ్ పంత్‌తో డేటింగ్ రూమర్స్ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్-2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. కాగా.. గతంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో ఊర్వశి రౌతేలా డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరీ ఈ ఫోటో చూసిన రిషబ్ పంత్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. డిప్రెషన్లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి!) -
రొనాల్డో ఖాతాలో మరో ట్రోఫీ
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండేళ్ల తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్లో మరో ట్రోఫీని అందుకున్నాడు. తొలిసారి ఆసియాకు చెందిన అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా) తరఫున బరిలోకి దిగిన రొనాల్డో తన జట్టును అరబ్ క్లబ్ చాంపియన్స్ కప్‌లో విజేతగా నిలిపాడు. అల్ హిలాల్ క్లబ్‌తో జరిగిన ఫైనల్లో రొనాల్డో కెప్టెన్సీ లోని అల్ నాసర్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. రొనాల్డో రెండు గోల్స్ (74వ, 98వ ని.లో) చేశాడు. -
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 ట్రోఫీ ఫొటోలు చూశారా
-
అంతరిక్షంలో వన్డే ప్రపంచకప్!
వన్డే ప్రపంచకప్‌కు మరో 100 రోజుల సమయం ఉంది. భారత్‌లో జరిగే ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బీసీసీఐ సంయుక్తంగా కొత్త తరహాలో ప్రచారాన్ని మొదలు పెట్టాయి. వరల్డ్ కప్ ట్రోఫీని ఏకంగా అంతరిక్షంలోకి పంపించి టోరీ్నపై ఆసక్తిని మరింతగా పెంచే ప్రయత్నం చేశాయి. బిస్పోక్ బెలూన్‌తో జత చేసిన ట్రోఫీ భూమి నుంచి 1 లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న ‘స్ట్రాటోస్ఫియర్’ను చేరింది. అక్కడ ఉన్న ట్రోఫీని 4కె కెమెరాతో కొన్ని షాట్స్ తీశారు. అనంతరం ట్రోఫీ నేలకు దిగి నేరుగా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి చేరింది. నేటినుంచి జరిగే వరల్డ్ టూర్లో భాగంగా ట్రోఫీ 18 దేశాలకు ప్రయాణిస్తుంది. ఇందులో ప్రపంచ కప్‌లో భాగం కాని కువైట్, బహ్రెయిన్, మలేసియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలు కూడా ఉన్నాయి. నేడు ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరుగుతుంది. -
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!
-
WTC ఫైనల్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుకంటే..!
-
IPL 2024కి రెడీ 41 ఏళ్ళ వయసు ఆయన తగ్గేదేలే ..!
-
CSK IPL ట్రోఫీ కి ప్రత్యేక పూజలు..!
-
చెన్నై పాంచ్ పటాకా
-
గుజరాత్ గ్రేట్ చెన్నై తోపు ...
-
ఐపీల్ కప్పుతో తిరిగొస్తా... కూతురికి మాటిచ్చిన రోహిత్ శర్మ
-
ధోని తెరపైకి తెచ్చాడు.. కోహ్లి పాటిస్తున్నాడు!
అహ్మదాబాద్: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అప్పట్లో తెరపైకి తెచ్చిన ఓ నూతన సంప్రదాయాన్ని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 3-2తో సీరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ట్రోఫీని అందుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ దాన్ని నేరుగా తీసుకెళ్లి అరంగేట్రం ఆటగాడైన ఇషాన్ కిషన్ చేతికి అందించాడు. ధోనిని ఫాలో అవుతున్నకోహ్లీ గతంలో సిరీస్ గెలిచిన సందర్భాల్లో ధోని కూడా ఇలానే జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడి చేతికి మొదట ట్రోఫీని అందించి, తాను పక్కకి వెళ్లి నిల్చునేవాడు. ఇప్పుడు కోహ్లి కూడా అదే సంప్రదాయాన్నికొనసాగిస్తున్నాడు. వాస్తవానికి చివరి టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తుది జట్టులో లేడు. కానీ.. రెండు, మూడు టీ20ల్లో ఆడిన ఇషాన్ కిషన్.. తన హిట్టింగ్తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తొడ కండరాల గాయం కారణంగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇదే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా భారత్ జట్టులోకి అరంగేట్రం చేసి.. అంచనాలకి మించి రాణించాడు. కానీ.. సూర్యకుమార్ వయసు 30 ఏళ్లుకాగా.. ఇషాన్ కిషన్ వయసు కేవలం 22 ఏళ్లే. దాంతో.. ధోని తరహాలో యువ క్రికెటర్లలో ఉత్సాహం నింపేందుకు ఇషాన్ చేతికి ట్రోఫీని అందించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. విరాట్ కోహ్లీ (80) నాటౌట్, రోహిత్ శర్మ (64) మెరుపు హాఫ్ సెంచరీలు, పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తమదైన శైలిలో మెరుపులు మెరిపించడంతో భారత్ 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో డేవిడ్ మలాన్ (68) జోస్ బట్లర్ (52) హాఫ్ సెంచరీలతో పోరాడినా వారి వికెట్ల అనంతరం ఇంగ్లండ్ జట్టు 188/8కే పరిమితమైంది. దాంతో.. 36 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ( చదవండి :ఆఖరి పోరులో అదరగొట్టారు ) C.H.A.M.P.I.O.N.S! 🏆🏆#TeamIndia @GCAMotera #INDvENG @Paytm pic.twitter.com/V0zCW4BugT — BCCI (@BCCI) March 20, 2021 -
ఎల్బీ స్టేడియంలో చోరీ, దొంగ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ట్రోఫీలను చోరీచేసిన దొంగను సైఫాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అదనపు ఇన్స్పెక్టర్ (డీఐ) రాజు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బెల్గాం జిల్లాకు చెందిన శివ సంజీవ షిండే (30) నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై గడుపుతుంటాడు. ఇటీవల ఎల్బీ స్టేడియంలోని ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయం తలుపులు నెట్టి అందులో ఉన్న పలు ట్రోఫీలను చోరీచేశాడు. వాటిని మాంగార్ బస్తీలో తనకు తెలిసిన ఓ వృద్ధుడి ఇంట్లో ఉంచాడు. అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. చోరీకి గురైన వాటిలో వెండి ట్రోఫీతో పాటు ఇత్తడి ట్రోఫీలు 15 ఉన్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే అక్కడ తెలుపు రంగులో ఉన్నవేవీ దొంగిలించలేదని తేలింది. అతని వద్ద నుంచి ట్రోఫీలను స్వాధీనం చేసుకున్నారు. -
ఇదేం ట్రోఫీ మహానుభావా..!
అబుదాబి: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు బిస్కట్ రూపంలో ట్రోఫీని రూపొందించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) నవ్వుల పాలైన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌తో యూఏఈ వేదికగా ప్రారంభమైన టెస్ట్ సిరీస్‌కు కూడా వినూత్న రీతిలో ట్రోఫిని రూపొందించింది. టెస్టు సిరీస్ ఆరంభం సందర్భంగా మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు ట్రోఫీని ఆవిష్కరించారు. ‘ఓయ్ హోయే’ అనే పదాలతో ట్రోఫీపై వచ్చేలా ఫన్నీగా రూపొందించారు. ప్రస్తుతం ఆ ట్రోఫీ రూపంపై, పీసీబీ తీరుపై నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు. ఇక అభిమానులు పీసీబీని ట్రోల్ చేస్తూ ఓ ఆట ఆడుకున్నారు. పీసీబీకి ట్రోఫీలను ఎవరు తయారు చేయించి ఇస్తున్నారో చారో వారికి శతకోటి దండాలు పెట్టాలని కొందరు కామెంట్ చేస్తుండగా, బోర్డుకు ట్రోఫీలను అందంగా డిజైన్ చేయించడం కూడా రాదా అంటూ మండిపడుతున్నారు. ఇక ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్ సందర్భంగా ఫన్నీగా రూపొందించిన బిస్కట్ ట్రోఫీ పాకిస్తాన్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో పాకిస్తాన్ చెలరేగి పోతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను పాక్ కైవసం చేసుకోగా, వన్డే సిరీస్ డ్రా అయ్యింది. ఇక మూడు టెస్టుల సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది. -
గొడుగేసుకున్న పుతిన్, ఆగని సోషల్ మీడియా
మాస్కో : తిరుగులేని ప్రదర్శనతో క్రొయేషియాను మట్టికరిపించిన ఫ్రాన్స్, ఫిఫా ప్రపంచకప్ 2018 విజేతగా నిలిచింది. రసవత్తరంగా సాగిన ఫైనల్లో ప్రపంచకప్ తన సొంతం కావడంతో, ఫ్రాన్స్‌లో సంబురాలు అంబరాన్నంటాయి. మాస్కోలో జరిగిన ఈ ప్రపంచకప్ తుది సమరంలో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ప్రపంచ అభిమానులను అలరించాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ ఆనందమైతే ఇక పట్టరానిది. స్టేడియంలోనే ఎగిరి గెంతేశారు. ఇక ప్రపంచ కప్ ట్రోఫీని విజేతకు ఇచ్చే సంబురంలో, పలువురు దేశాధ్యక్షులు పాల్గొన్నారు. స్టేజీపై ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగబోతుండగా.. ఒక్కసారిగా ఫ్రెంచ్ వేడుకను వర్షం సైతం పలకరించింది. ప్రపంచ అధినేతలందరూ వర్షంలోనే తడిసిముద్దవుతూ.. ఈ వేడుకను ఎంజాయ్ చేస్తుండగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం చినుకు సైతం తనపై పడకుండా.. గొడుగు వేసుకుని నిల్చున్నారు. ప్రపంచ అధినేతలందరూ తడుస్తూ.. పుతిన్ మాత్రమే గొడుగు వేసుకోవడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. పొడియంపై ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్, క్రొయేషియా అధ్యక్షుడు కోలిండా గ్రాబార్-కిటరోవిక్ మధ్యలో పుతిన్ నిల్చున్నారు. వారందరిన్నీ, ఫిఫా ట్రోఫీని కవర్ చేస్తూ.. పుతిన్ గొడుగేసుకుని నిల్చోవడంతో, సోషల్ మీడియా నవ్వులు పూయిస్తోంది. పుతిన్ గొడుగు దాదాపు ట్రోఫీ వేడుకను కప్పివేసిందని ఒక యూజర్ కామెంట్ చేయగా.. సర్, మనం ఎన్ని గొడుగులు తెచ్చుకున్నామేమిటీ? అని మరో యూజర్ వ్యాఖ్యానించాడు. పుతిన్‌పై వస్తున్న జోకులు ఏ విధంగా ఉన్నాయో ఓసారి మీరే చూడండి... Putin’s umbrella almost overshadowed the trophy ceremony #WorldCup — Omar Abdullah (@OmarAbdullah) July 15, 2018 Sir how many umbrellas should we bring? Putin: Just one. They didn't let us win. Let them soak! #FRACRO #WorldCup #WorldCupFinal pic.twitter.com/RM0Qzv1xW6 — The Writer Formerly Known As Elnathan (@elnathan_john) July 15, 2018 Do they only have one umbrella in Russia?!! 😂🙈 — Siobhan ⚽️👐🏼 (@Sio_Chamberlain) July 15, 2018 @PutinRF_Eng to @EmmanuelMacron : "My umbrella is my umbrella, its not your umbrella, you French fry get yourself soaked in rain first!!!"😉😉 #FIFAWorldCup #FRACRO #FrancevsCroatia #FinalRusia2018 #Russia #France #HighLevel #Attitude #Supreme Power #KokulaKrishnaHariK pic.twitter.com/HXNAcXHuNE — Kokula Krishna Hari™ (@kkkhari) July 16, 2018 As far back as I can remember, I always wanted to be a gangster. pic.twitter.com/KYzhucLPJM — southpaw (@nycsouthpaw) July 15, 2018 “France won MR. Putin what shall we do?” “Flood them.”#worldcupfinal pic.twitter.com/PNUvsI2qaD — K.J (@KJWLDN) July 15, 2018 So the Russians only remembered an umbrella for their own President Putin... left the leaders of France and Croatia out in the rain for minutes... pretty much sums up today’s international politics. #WorldCup18 pic.twitter.com/W5UDTTwMxS — Keir Simmons (@KeirSimmons) July 15, 2018 -
భారత్ అదరహో
దుబాయ్: ఆరు దేశాలు పాల్గొన్న దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగి ట్రోఫీ చేజిక్కించుకుంది. శనివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో ప్రపంచ చాంపియన్ భారత్ 44–26తో ఇరాన్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్ ప్రథమార్ధం ముగిసేసరికి 18–11తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ జయభేరి మోగించింది. బలమైన భారత డిఫెన్స్‌ను ఛేదించలేక ఇరాన్ చతికిలబడింది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైడ్ పాయింట్లతో సత్తా చాటాడు. -
ట్రోఫిని అభిమానులకు ఇచ్చేసిన కేఎల్ రాహుల్
-
కలిసి వుంటే కలదు గెలుపు
అది, జపాన్‌లోని ఒక పాఠశాల. విద్యార్థులకు ఆటల పోటీలు జరుగుతున్నాయి. అంతా ఒకటి, రెండు తరగతులు చదివే చిన్న పిల్లలు. దూరం నుంచి పరుగెత్తుకొచ్చి ఒక హర్డిల్ దాటాలి. ఒక పిల్లాడు పరుగెత్తుకొచ్చాడు. ఊహు, శక్తి చాలలేదు. ఫెయిల్. మళ్లీ రెండోసారి మరింత దూరం నుంచి ఉరుకుతూ వచ్చాడు. అయినా లాభం లేదు. ఈసారీ ఆ ఎత్తు దగ్గర చిత్తయిపోయాడు. పరుగెత్తి వచ్చి, మూడోసారి మళ్లీ ఎగిరాడు. ప్చ్. అయినా జయం కలగలేదు. ఇక నాలుగోసారి కూడా దాన్ని దాటలేకపోయేసరికి పిల్లాడి కళ్లల్లో చెమ్మ. అప్పుడు జరిగిందో అద్భుతం! ఆ పిల్లలకు ఎవరూ ప్రత్యేకంగా అలా చేయమని చెప్పలేదు. అయినా ఆ అబ్బాయి క్లాస్మేట్స్ అందరూ వారి వారి స్థానాల్లోంచి పరుగెత్తుకొచ్చారు. పిల్లాడి వెన్నుతట్టారు. భుజం భుజం కలిపి గుండ్రంగా నిలబడ్డారు.ఆ భుజాల్లోంచి భుజశక్తి ఏమైనా ప్రవహిస్తుందా? మళ్లీ పిల్లలంతా వెనక్కి వెళ్లి తమ తమ సీట్లలో కూర్చున్నారు. ఈ అబ్బాయి వెనక్కి పరుగెత్తాడు. పొజిషన్లో నిల్చుని, కొద్దిగా ముందుకు వంగి, శక్తి కూడదీసుకుని పరుగెత్తుతూ వచ్చి హర్డిల్ మీదుగా ఇట్టే లంఘించేశాడు. దానికి ఏమాత్రం తాకకుండా పిట్టలాగా అవతలికి దూకేశాడు. సక్సెస్!అందరమూ జీవితంలో పరుగెడుతున్నవాళ్లమే. హర్డిల్స్ దాటడానికి శాయశక్తులా కృషి చేస్తున్నవాళ్లమే. అవసరమైతే అందరికంటే ముందు దాటి ఆ ట్రోఫీ ఏదో చేతబట్టాలని కలలు కంటున్నవాళ్లమే. ఆ ట్రోఫీ కొందరికి పేరు ప్రఖ్యాతులు కావొచ్చు, మరికొందరికి డబ్బు సంపాదన కావొచ్చు, మరేదైనా కావొచ్చు. మనం ఆ హర్డిల్ దాటగలుగుతాం సరే. మరి దాటలేనివాళ్ల సంగతేమిటి? ఆ జపాన్ చిన్నారులు మనకేమైనా చెబుతున్నారా! ఒక సంస్కృతిగా మనం కూడా వారి ప్రోత్సాహగుణాన్ని అలవాటు చేసుకోగలగాలి. ముందు వెళ్లడంలో ఆనందం ఉంది; కానీ మనం మాత్రమే ముందుకు వెళ్లడంలో ఏమీలేదు. అందరమూ కలుపుకొని పోవాలి. అందరితో కలిసిపోవాలి. మనలోని చిట్టచివరి మనిషి కూడా గెలిచినప్పుడే ఆ గెలుపు నిజమైన గెలుపు అనిపించుకుంటుంది. -
‘యారో’ హీరో..
నగరవాసి రూపొందించిన బైక్ జాతీయస్థాయి పోటీల్లో గుర్తింపు పొందింది. సిటీ యూత్ కస్టమైజ్డ్ బైక్స్ మోజును చాటిచెప్పింది. కస్టమైజ్డ్ బైక్స్‌కు సంబంధించి ‘ఇండియా బైక్ వీక్’ (ఐబీడబ్ల్యూ) పోటీ ఇటీవల గోవాలో జరిగింది. ఇందులో సిటీకి చెందిన మోహిత్ చావ్డా అండ్ టీమ్ రూపొందించిన ‘యారో’ బైక్ ది బెస్ట్‌గా నిలిచి ‘బిల్డ్ ఆఫ్ విన్నర్’ ట్రోఫీ అందుకుంది. ఆ బైక్ కథా కమామీషు... లక్షల ఖరీదైన బైక్స్ సిటీ రోడ్స్ మీద దౌడ్ తీయడం సర్వసాధారణమైపోయింది. సిటీజనులు ఇప్పుడు బైక్ ఎంత ఖరీదైందని చూడడం లేదు. ఎంత వైవిధ్యంగా ఉందనే చూస్తున్నారు. దీంతో కస్టమైజ్డ్ బైక్స్‌కి ప్రాధాన్యత పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ట్రెండ్‌కు అనుగుణంగా కస్టమైజ్డ్ బైక్స్‌కు సంబంధించిన జాతీయస్థాయి కాంటెస్ట్ ఇటీవల గోవాలో జరిగింది. ఈ పోటీలో నగరవాసి రూపొందించిన బైక్ ‘బిల్డ్ ఆఫ్ విన్నర్’ ట్రోఫీ అందుకుంది. సిటీకి ఈ ట్రోఫీ దక్కడం ఇదే తొలిసారి. దీంతో బైక్‌ల వాడకంలోనే కాదు... బైక్స్‌ను సృష్టించడంలోనూ ముందున్నామని నిరూపించింది సిటీ. ఇండియా బైక్ వీక్ (ఐబీడబ్ల్యూ)... ఆసియాలోనే అతి పెద్ద బైకర్స్ ఈవెంట్. ఈ ఈవెంట్ ప్రతిఏటా గోవాలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల బైక్‌లు, వాటి యాక్ససరీస్ విక్రయ సంస్థలు, పోటీలు, అదరగొట్టే రాక్షోస్, విందు వినోదాల వేదిక ఈ ఈవెంట్. నవంబరు నెలాఖరులో గోవాలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కి 20వేల మంది వరకు హాజరైతే... ఈసారి కూడా నగరవాసులు పెద్ద సంఖ్యలోనే వెళ్లారు. ఇందులో కస్టమైజ్డ్ బైక్స్‌కి సంబంధించిన కాంటెస్ట్‌లో నగరవాసి సృష్టించిన బైక్ ‘యారో’ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో బైక్‌ను క్రియేట్ చేసిన మోహిత్ చావ్డా అండ్ టీమ్ తమ బైక్ విశేషాలను ‘సాక్షి’తో పంచుకుంది. వైవిధ్యమే గుర్తింపు.. ఈ బైక్‌ను డిజైన్ చేసిన మాదాపూర్ నివాసి మోహిత్ 2014లో డెక్కన్ కస్టమ్ మోటార్ సైకిల్స్‌తో ప్రారంభించి, ఇప్పుడు నిజాంపేటలో 36 మోటోను ప్రత్యేకంగా కస్టమైజ్డ్ బైక్స్ కోసం నెలకొల్పారు. ‘బుర్రలో తిరిగే ఆలోచనల్ని ఆవిష్కరించడమే మోటార్ సైకిళ్ల రూపకల్పన. మనం ఎప్పుడు వైవిధ్యంగా ఏది సృష్టించినా నిస్సందేహంగా దానికి గుర్తింపు వస్తుంది’ అంటారు మోహిత్. ఈ బైక్‌ని విక్రయిస్తారా? అంటే ఆఫర్‌ని బట్టి ఆలోచిస్తామన్నారు. ఈ బైక్ సిటీ రోడ్ల మీద కనిపిస్తే కంగ్రాట్స్ చెప్పడం మరచిపోకండి. కేవలం 23 రోజుల్లో. ‘రెంచ్ అనేది మా పెయింట్ బ్రష్. రా స్టీల్ కాన్వాస్. కస్టమైజ్డ్ బైక్స్ ప్రదర్శించేందుకు ఐబీడబ్ల్యూ కరెక్ట్ వేదిక. ఆ విషయం తెలిసి వెంటనే మేం అనుకుంటున్న డిజైన్‌తో ఎంట్రీ పంపించాం. అలా దేశవ్యాప్తంగా వచ్చిన ఎంట్రీల నుంచి షార్ట్ లిస్ట్ చేశారు. ఈ పోటీలో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటేమో మోడిఫైడ్ బైక్స్.. అంటే ఉన్న బైక్స్‌ని కొత్తగా తీర్చిదిద్డడం. రెండోది అతి క్లిష్టమైంది బిల్డ్ ఆఫ్... అంటే పూర్తిగా కొత్త బైక్‌ని క్రియేట్ చేయడం. ఈ విభాగంలో మాకు అవకాశం దక్కింది. దాంతో పని ప్రారంభించి కేవలం 23 రోజుల్లోనే ‘యారో’ని సృష్టించి, బిల్డ్ ఆఫ్ విన్నర్ ట్రోఫీ గెలుచుకున్నాం. మా బృందంలో మహ్మద్ అబూ సుఫియాన్, గౌతమ్ (ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్), సయ్యద్ జైన్, సయ్యద్ అల్తాఫ్ (మెకానికల్), ప్రీతమ్ (డిజైనింగ్, బ్రాండింగ్), దేవిరెడ్డి, సంతోష్, జగ్మీత్ సింగ్ సభ్యులు. మేం రూపొందించిన కేఫ్ రేసర్ స్టైల్ బైక్ కోసం 1985 యమహా ఆర్డీ 350 టార్క్‌ని వాడాం. క్రియేట్ చేసిన బైక్‌లో ఇంజిన్, ఛాసిస్ మాత్రమే పునర్వినియోగం అయ్యాయి. మిగిలినవన్నీ మేం తయారు చేసినవేన’ని చెప్పారు బైక్ డిజైనర్ మోహిత్ చావ్డా.