
దుబాయ్: ఆరు దేశాలు పాల్గొన్న దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగి ట్రోఫీ చేజిక్కించుకుంది. శనివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో ప్రపంచ చాంపియన్ భారత్ 44–26తో ఇరాన్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్ ప్రథమార్ధం ముగిసేసరికి 18–11తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ జయభేరి మోగించింది. బలమైన భారత డిఫెన్స్‌ను ఛేదించలేక ఇరాన్ చతికిలబడింది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైడ్ పాయింట్లతో సత్తా చాటాడు.
Comments
Please login to add a commentAdd a comment