Ajay Thakur
-
కరోనాపై పోరు: విధుల్లో స్టార్ ప్లేయర్
సిమ్లా: కరోనా పోరులో నేను సైతం అంటూ భారత కబడ్డీ జట్టు సారథి అజయ్ ఠాకూర్ రంగంలోకి దిగారు. రైడింగ్, ట్యాకిల్స్‌తో ప్రత్యర్థి జట్టు పనిపట్టడంతో పాటు.. సారథిగా జట్టును బ్యాలెన్స్ చేయడంలో, వారిలో ఆత్మస్థైర్యం నింపడంలో అజయ్ ఠాకూర్ సిద్దహస్థుడన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్, ప్రాక్టీస్ సెషన్స్ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో కరోనా పోరాటంలో అజయ్ ఠాకూర్ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో లాక్డౌన్ సందర్భంగా బిలాస్పూర్ డీఎస్పీ అజయ్ ఠాకూర్ తన బృందంతో కలసి రంగంలోకి దిగారు. బిలాస్‌పూర్‌లోని గల్లీగల్లీని పరిశీలించారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులు, ప్రజలను ఆపి లాకౌడౌన్ ఉద్దేశాన్ని వివరించారు. అంతేకాకుండా కరోనా పోరులో భాగంగా తాను నిర్వర్తించిన విధులకు సంబంధించిన వీడియోను అజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలు స్వచ్చందంగా లాక్డౌన్లో పాల్గొనాలని, అత్యవసర సమయాల్లో మినహా వీధుల్లోకి రాకూడదని బిలాస్పూర్ డీఎస్సీ అజయ్ ఠాకూర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. View this post on Instagram On duty # अभी भी समय है अपने घर रहे ओर दूसरों क़ो भी बोले आप सब सहयोग करें प्रशासन का । तभी य मुमकिन है A post shared by AJAY THAKUR (@ajaythakurkabaddi) on Mar 25, 2020 at 8:38am PDT చదవండి: ‘ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి’ తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా -
ఆసియా క్రీడల్లో కబడ్డీ జట్టుకు ఊహించని షాక్
-
ఏషియన్ గేమ్స్ చరిత్రలో తొలిసారి..
జకర్తా: ప్రపంచ కబడ్డీ చాంపియన్ భారత్‌కు ఆసియా క్రీడల్లో ఊహించని షాక్ తగిలింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫైనల్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. సెమీఫైనల్లో భాగంగా గురువారం బలమైన ఇరాన్ చేతిలో 18-27 తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ఇరాన్ ఆటగాళ్లు.. బలమైన డిఫెన్స్‌తో అజయ్ ఠాకూర్‌సేనకు పాయింట్లు చిక్కకుండా అడ్డుకున్నారు. బలమైన డిఫెండింగ్ గల ఇరాన్ సూపర్ ట్యాకిల్ పాయింట్లతో విరుచుకపడింది. దీంతో ఆత్మరక్షణలో పడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు తలవంచారు. టీమిండియా సారథి అజయ్ ఠాకూర్, ప్రో కబడ్డీ లీగ్ స్టార్ రైడర్లు ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరీ, రిషాంక్ దేవడిగా, మోనూ గోయత్‌లు ఇరాన్ డిఫెండింగ్ ముందు తేలిపోయారు.భారత రైడర్లు పాయింట్లు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక డిఫెండింగ్‌లోనూ భారత ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు. తొలుత డిఫెండర్ గిరీష్ మారుతి ఎర్నాక్ రాణించినా చివర్లో విఫలమయ్యారు. మోహిత్ చిల్లర్, దీపక్ నివాస్ హుడా, సందీప్ నర్వాల్‌లు కూడా చేతులెత్తాశారు. భారత ఆటగాళ్లు సమిష్టిగా విఫలమవ్వడంతో ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుస్తుందనుకున్న జట్టు తొలి సారి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక మరోవైపు భారత మహిళల కబడ్డీ జట్టు ఆసియా క్రీడల్లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత మహిళల జట్టు 27-14తేడాతో చైనీస్ తైపీ జట్టును చిత్తు చేసి కనీసం రజతం ఖాయం చేశారు. -
ఆసియన్ కబడ్డీ: అజయ్ ఠాకూర్‌కే పట్టం
హైదరాబాద్: దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీ గెలుచుకొని ఉత్సాహంగా ఉన్న భారత కబడ్డీ జట్టు మరో సమరానికి సిద్దమైంది. ఏడు సార్లు ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత టీమిండియా మరోసారి విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆగష్టులో ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియన్ గేమ్స్‌లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆసియన్ గేమ్స్‌లో పాల్గోనే 12 మంది సభ్యులతో కూడిన కబడ్డీ జట్టును అఖిల భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య (ఏకేఎఫ్) ప్రకటించింది. తమిళ్ తలైవాస్ సారథి అజయ్ ఠాకూరే మరోసారి టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు. సీనియర్లను పూర్తిగా పక్కకు పెట్టిన సమాఖ్య యువకులతో కూడిన జాబితాను విడుదల చేసింది. సీనియర్లు రాకేశ్ కుమార్, అనూప్ కుమార్, మంజీత్ చిల్లర్, సురేంద్ర నాడాలకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. మరోసారి.. ఆసియన్ గేమ్స్‌లో పోటీపడుతున్న పదిజట్లలో టీమిండియానే అన్ని విధాలుగా బలంగా కనిపిస్తోంది. మరోసారి విజేతగా నిలవాలని భారత్ జట్టు ఆశపడుతోంది. ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్, రిషాంక్ దేవడిగ, రోహిత్ కుమార్, మోనూ గోయత్‌లతో రైడింగ్ విభాగం బలంగా ఉండగా.. దీపక్ నివాస్ హుడా, సందీప్ నర్వాల్, గిరీష్ మారుతి ఎర్నాక్, మోహిత్ చిల్లర్, రాజు లాల్ చౌదరీ, మల్లేష్ గంగాధరిలతో ఢిఫెండింగ్ దుర్భేద్యంగా ఉంది. -
భారత్ అదరహో
దుబాయ్: ఆరు దేశాలు పాల్గొన్న దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగి ట్రోఫీ చేజిక్కించుకుంది. శనివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో ప్రపంచ చాంపియన్ భారత్ 44–26తో ఇరాన్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్ ప్రథమార్ధం ముగిసేసరికి 18–11తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ జయభేరి మోగించింది. బలమైన భారత డిఫెన్స్‌ను ఛేదించలేక ఇరాన్ చతికిలబడింది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైడ్ పాయింట్లతో సత్తా చాటాడు. -
అందరికీ కలిపి 10 లక్షలా..!
ప్రభుత్వ ప్రోత్సాహకంపై భారత కబడ్డీ ఆటగాడు అజయ్ నిరాశ న్యూఢిల్లీ: కబడ్డీ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకం పట్ల జట్టు సభ్యుడు అజయ్ ఠాకూర్ నిరాశ వ్యక్తం చేశాడు. ఈ విజయానంతరం క్రీడా శాఖ మన జట్టుకు రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఇది చాలా చిన్న మొత్తం కాగా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఆటగాళ్ల కోసం ఏమీ ప్రకటించకపోవడం తనను ఆశ్చర్యపరచిందని అతను అన్నాడు. ‘కబడ్డీ మన దేశంలో ఇంతగా పాపులర్ అవుతుందని, నేను వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిని అవుతానని అసలు ఏనాడూ ఊహించలేదు కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. అరుుతే మేము కోట్ల రూపాయలు కనకవర్షం కురిపించమని అడగడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తాన్ని అందరం పంచుకుంటే ఎంత వస్తుందో మీరే ఊహించుకోండి. ఆట ఏదైనా అందరికీ ఒకే తరహాలో ప్రోత్సాహం అందాలి కదా’ అని అజయ్ వ్యాఖ్యానించాడు. కబడ్డీ ప్రపంచకప్‌లో అజయ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.