మాస్టర్స్ కబడ్డీ టోర్నీ గెలుచుకున్న ఆనందంలో భారత కబడ్డీ జట్టు (ఫైల్ ఫోటో)
హైదరాబాద్: దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీ గెలుచుకొని ఉత్సాహంగా ఉన్న భారత కబడ్డీ జట్టు మరో సమరానికి సిద్దమైంది. ఏడు సార్లు ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత టీమిండియా మరోసారి విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆగష్టులో ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియన్ గేమ్స్‌లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.
ఆసియన్ గేమ్స్‌లో పాల్గోనే 12 మంది సభ్యులతో కూడిన కబడ్డీ జట్టును అఖిల భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య (ఏకేఎఫ్) ప్రకటించింది. తమిళ్ తలైవాస్ సారథి అజయ్ ఠాకూరే మరోసారి టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు. సీనియర్లను పూర్తిగా పక్కకు పెట్టిన సమాఖ్య యువకులతో కూడిన జాబితాను విడుదల చేసింది. సీనియర్లు రాకేశ్ కుమార్, అనూప్ కుమార్, మంజీత్ చిల్లర్, సురేంద్ర నాడాలకు తుది జట్టులో అవకాశం దక్కలేదు.
మరోసారి.. ఆసియన్ గేమ్స్‌లో పోటీపడుతున్న పదిజట్లలో టీమిండియానే అన్ని విధాలుగా బలంగా కనిపిస్తోంది. మరోసారి విజేతగా నిలవాలని భారత్ జట్టు ఆశపడుతోంది. ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్, రిషాంక్ దేవడిగ, రోహిత్ కుమార్, మోనూ గోయత్‌లతో రైడింగ్ విభాగం బలంగా ఉండగా.. దీపక్ నివాస్ హుడా, సందీప్ నర్వాల్, గిరీష్ మారుతి ఎర్నాక్, మోహిత్ చిల్లర్, రాజు లాల్ చౌదరీ, మల్లేష్ గంగాధరిలతో ఢిఫెండింగ్ దుర్భేద్యంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment