Asian Games
-
‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది!
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో సీనియర్ రెజ్లర్లు పోరాడారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వీరంతా సమష్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మలిక్ నిరాటంకంగా పాల్గొని పోరాటాన్ని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు సాక్షి మలిక్ నాటి ఘటనపై పలు భిన్నమైన విషయాలు చెప్పింది. తన పుస్తకం ‘విట్నెస్’లో సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్‌లపై ఆమె విమర్శలు కూడా చేసింది. ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సడలింపు వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అభిప్రాయ పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం తర్వాత బాధ్యతలు తీసుకున్న తాత్కాలిక కమిటీ హాంగ్జౌ ఆసియా క్రీడల సెలక్షన్స్‌లో పాల్గొనకుండా నేరుగా పాల్గొనే అవకాశం వినేశ్, బజరంగ్‌లకు కల్పించింది. సాక్షి మాత్రం దీనికి అంగీకరించలేదు. ‘వినేశ్, బజరంగ్ సన్నిహితులు కొందరు వారిలో స్వార్థం నింపారు. వారిద్దరు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించేలా చేయగలిగారు. వినేశ్, బజరంగ్‌లకు సడలింపు ఇవ్వడం మేలు చేయలేదు. మా నిరసనకు అప్పటి వరకు వచి్చన మంచి పేరును ఇది దెబ్బ తీసింది. ఒకదశలో సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అంతా అనుకునే పరిస్థితి వచి్చంది’ అని సాక్షి వెల్లడించింది. మరోవైపు బబిత ఫొగాట్ తమ నిరసనకు మద్దతు పలకడంలో కూడా స్వార్థమే ఉందని ఆమె పేర్కొంది. ‘మేమందరం బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడుతూ వచ్చాం. బబిత ఫొగాట్ మరోలా ఆలోచించింది. బ్రిజ్‌భూషణ్‌ను తొలగించడమే కాదు. అతని స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుంది. అందుకే మా శ్రేయోభిలాషి తరహాలో ఆమె ప్రవర్తించింది’ అని సాక్షి వ్యాఖ్యానించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్య పతకం గెలుచుకుంది. . -
2026 ఆసియా క్రీడల్లో ప్రదర్శన క్రీడగా ‘యోగాసన’
న్యూఢిల్లీ: భారతదేశ ప్రాచీన వ్యాయామ పద్ధతి ‘యోగాసన’కు ఆసియా క్రీడల్లో చోటు దక్కింది. 2026లో జపాన్‌లోని ఐచీ–నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో యోగాసనను ప్రదర్శన ఈవెంట్‌గా చేర్చుతున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ప్రకటించింది. ఆదివారం జరిగిన 44వ ఓసీఏ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓసీఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రణ్‌దీర్ సింగ్ మాట్లాడుతూ... ‘2026 ఆసియా క్రీడల్లో యోగా భాగం కానుంది. దీనికి అందరి ఆమోదం లభించింది. అన్ని సభ్య దేశాలను ఒప్పించేందుకు పది రోజుల సమయం పట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఆ దిశగా ఇది మరో ముందడుగు వంటింది. 2030 ఆసియా క్రీడల వరకు యోగాను పతక క్రీడల్లో భాగం చేసేలా చూస్తాం’ అని అన్నారు. -
కన్నడ కస్తూరి.. పతకాలపై గురి
2017లో సీనియర్ నేషనల్స్ సమయంలో దుర్గారావుకు, రష్మికి పరిచయం ఏర్పడింది. దుర్గారావు డిస్కస్ త్రోయర్. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2020లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది రష్మికి రైల్వేలో టీటీ ఉద్యోగం వచ్చింది. అంతకు ముందే దుర్గారావు కూడా క్రీడా కోటాలో టీటీ ఉద్యోగం సాధించారు. ఇద్దరూ క్రీడాకారులవడంతో వాటి ప్రాముఖ్యత బాగా తెలుసు. అందుకే దుర్గారావు ఉద్యోగం చేస్తూ భార్య రష్మికి సహకారంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె జాతీయ క్రీడా క్యాంప్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.గుంటూరు వెస్ట్ (క్రీడలు): కన్నడ నాట జన్మించిన రష్మి గుంటూరు కోడలు అయింది. పట్టణానికి చెందిన దుర్గారావును ప్రేమ వివాహం చేసుకుంది. అథ్లెటిక్స్‌లో గత ఐదేళ్లుగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికి పేరు తెస్తోంది. భార్యాభర్తలిద్దరూ జాతీయ అథ్లెట్స్ మాత్రమే కాదు.. భారతీయ రైల్వేలో టీటీలుగా కొలువులు సాధించారు. క్రీడల కోసం ప్రస్తుతం బిడ్డల్ని కూడా వద్దనుకుని కఠోర శిక్షణలో మునిగిపోయింది రష్మి.అద్భుత విజయాలురష్మి తన సోదరుడు అభిషేక్‌తోపాటు పాఠశాల టీటీ సహకారంతో అథ్లెట్‌గా మారింది. ఈ క్రమంలో జూనియర్ సీనియర్ విభాగాల్లో జాతీయ స్థాయిలో డజన్ల కొద్దీ బంగారు, రజత, కాంస్య పతకాలు కై వసం చేసుకుంది. సీనియర్స్ విభాగంలో ఈ ఏడాది నిలకడైన ప్రతిభతో రెండు బంగారు, ఒక కాంస్య పతకం సాధించింది. ఆంధ్రా తరఫున అద్భుతమైన ప్రతిభతో ముందుకు వెళుతోంది. భర్త దుర్గారావు అన్ని విధాలుగా సహాయ, సహకారాలందిస్తున్నారు.స్పాన్సర్ కావాలిరష్మి శిక్షణ, డైట్ అన్నీ కలుపుకుని నెలకు కనీసం రూ.50 నుంచి రూ.70 వేలు అవసరమవుతుంది. దీంతోపాటు పోటీలకు కోచ్‌తో వెళ్లాలి. భర్త దుర్గారావు జీతం మొత్తం రష్మికే ఖర్చు చేస్తున్నారు. ఆమెకు వచ్చే జీతంలో సగం ఇంటికి వాడుతున్నారు. ఒక్క జావెలిన్ ఖరీదు రూ.2 లక్షలు ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మరింత మెరుగైన సదుపాయాలు, క్రీడా సామగ్రి అవసరం. స్పాన్సర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సౌత్ ఏషియన్ కంట్రీస్ క్రీడా పోటీలే లక్ష్యంగా రష్మి సాధన చేస్తోంది.పెళ్లికి దారితీసిన పరిచయం 2017లో సీనియర్ నేషనల్స్ సమయంలో దుర్గారావుకు, రష్మికి పరిచయం ఏర్పడింది. దుర్గారావు డిస్కస్ త్రోయర్. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2020లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది రష్మికి రైల్వేలో టీటీ ఉద్యోగం వచ్చింది. అంతకు ముందే దుర్గారావు కూడా క్రీడా కోటాలో టీటీ ఉద్యోగం సాధించారు. ఇద్దరూ క్రీడాకారులవడంతో వాటి ప్రాముఖ్యత బాగా తెలుసు. అందుకే దుర్గారావు ఉద్యోగం చేస్తూ భార్య రషి్మకి సహకారంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె జాతీయ క్రీడా క్యాంప్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. భారత్‌కు పతకాలు తేవడం లక్ష్యంచిన్న నాటి నాకు ఆటలంటే ప్రాణం. మన దేశానికి క్రీడల్లో పతకాలు సాధించాలనేదే నా ఆకాంక్ష. గత నాలుగేళ్ల నుంచి దాదాపు కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ సాధన చేస్తున్నాను. ఈ క్రమంలో మెరుగైన ప్రతిభతో జాతీయ స్థాయి పతకాలు సాధిస్తున్నా. అత్యుత్తమ కోచ్ రాజేంద్రసింగ్ సారథ్యంలో ప్రస్తుతం జాతీయ శిక్షణ తీసుకుంటున్నా. భర్త దుర్గారావు సహాయ, సహకారాలు ఎంత చెప్పినా తక్కువే. ఆయన కూడా క్రీడాకారుడు కావడంతో ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. అనుక్షణం నావెంట ఉండి నడిపిస్తున్నారు. నా సోదరుడి ప్రోత్సాహం కూడా ఎపుడూ నన్ను ముందుకు నడిపిస్తోంది. ఏషియన్ గేమ్స్‌లో పకతం సాధించడమే లక్ష్యం. స్పాన్సర్స్ లభిస్తే మరింత సౌలభ్యంగా ఉంటుంది. శిక్షణ సమయంలో చాలా ఖర్చు అవుతోంది.– కె.రష్మి, జాతీయ స్థాయి జావెలిన్ త్రోయర్ -
సరికొత్త శిఖరాలకు...
కాలక్రమంలో మరో ఏడాది గడిచిపోనుంది... ఒకప్పుడు ప్రాతినిధ్యానికి పరిమితమైన భారత క్రీడాకారులు... ఏడాదికెడాది తమ ప్రతిభకు పదును పెడుతున్నారు... అంతర్జాతీయ క్రీడా వేదికలపై అద్వితీయ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. కొన్నేళ్లక్రితం వరకు అందని ద్రాక్షలా కనిపించిన స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సగర్వంగా తమ మెడలో వేసుకుంటున్నారు. మొత్తానికి ఈ ఏడాదీ భారత క్రీడాకారులు విశ్వ క్రీడారంగంలో తమదైన ముద్ర వేసి సరికొత్త శిఖరాలకు చేరుకున్నారు. ఊహించని విజయాలతో భారత క్రీడా భవిష్యత్ బంగారంలా ఉంటుందని విశ్వాసం కల్పించారు. కేవలం విజయాలే కాకుండా ఈ సంవత్సరం కూడా వీడ్కోలు, వివాదాలు భారత క్రీడారంగంలో కనిపించాయి. రెండు దశాబ్దాలుగా భారత మహిళల టెన్నిస్‌కు ముఖచిత్రంగా ఉన్న సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలకడం... దేశానికి తమ పతకాలతో పేరు ప్రతిష్టలు తెచ్చిన మహిళా మల్లయోధులు తాము లైంగికంగా వేధింపులు ఎదుర్కొన్నామని వీధుల్లోకి రావడం... ఈ వివాదం ఇంకా కొనసాగుతుండటం విచారకరం. –సాక్షి క్రీడా విభాగం తొలిసారి పతకాల ‘సెంచరీ’ గత ఏడాదే జరగాల్సిన ఆసియా క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమిచ్చిన ఈ క్రీడల్లో భారత బృందం తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఏకంగా 107 పతకాలతో ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పతకాల సెంచరీ మైలురాయిని దాటింది. భారత క్రీడాకారులు 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు గెల్చుకున్నారు. ముఖ్యంగా ఆర్చరీ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది. పీటీ ఉష తర్వాత ఒకే ఆసియా క్రీడల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ బంగారు పతకాలు గెలిచిన భారత క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ గుర్తింపు పొందింది. బ్యాడ్మింటన్‌లో ఈ ఏడాది పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి అదరగొట్టింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో తొలిసారి డబుల్స్‌లో స్వర్ణ పతకాలు అందించిన ఈ ద్వయం స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్, ఇండోనేసియా ఓపెన్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్ స్థానానికి ఎగబాకింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెల్చుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు ఆశించిన ఫలితాలు లభించలేదు. ఆమె కేవలం ఒక టోర్నీలో (స్పెయిన్ మాస్టర్స్) మాత్రమే ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. నిఖత్ పసిడి పంచ్... గత ఏడాది తాను సాధించిన ప్రపంచ టైటిల్ గాలివాటం ఏమీ కాదని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఈ సంవత్సరం నిరూపించింది. న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్ మళ్లీ తన పంచ్ పవర్ చాటుకుంది. 50 కేజీల విభాగంలో నిఖత్ స్వర్ణం సాధించి వరుసగా రెండో ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో భారత్ నాలుగు స్వర్ణాలు సాధించి ఓవరాల్ చాంపియన్‌గా అవతరించడం విశేషం. ఆసియా క్రీడల్లోనూ నిఖత్ రాణించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మన బల్లెం బంగారం... భారత అథ్లెటిక్స్‌కు ఈ ఏడాది సూపర్‌గా గడిచింది. రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి అందర్నీ అబ్బురపరిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి ఆశ్చర్యపరిచాడు. ఈ ఏడాది మరింత ఎత్తుకు ఎదిగిన నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా స్వర్ణ పతకంతో మెరిశాడు. ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో నీరజ్ జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరి విశ్వవిజేతగా అవతరించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా అథ్లెట్ జ్యోతి యెర్రాజీ కూడా ఈ సంవత్సరం మెరిపించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. సానియా అల్విదా... రెండు దశాబ్దాలుగా భారత టెన్నిస్‌కు ముఖచిత్రంగా నిలిచిన సానియా మీర్జా ఈ ఏడాది తన కెరీర్‌కు ముగింపు పలికింది. ప్రొఫెషనల్ ప్లేయర్ హోదాలో ఫిబ్రవరిలో దుబాయ్ ఓపెన్‌లో ఆమె చివరిసారిగా బరిలోకి దిగింది. మార్చి 5వ తేదీన సానియా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేశారు. గతంలో డబుల్స్‌లో తన భాగస్వాములుగా ఉన్న ఇవాన్ డోడిగ్, కారా బ్లాక్, బెథానీ మాటెక్, రోహన్ బోపన్నలతో కలిసి సానియా ఈ వీడ్కోలు మ్యాచ్ ఆడింది. మాయని మచ్చలా... ఈ ఏడాది జనవరి 18న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారత మహిళా రెజ్లర్లు ఆందోళనకు దిగారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ ఆసియా చాంపియన్ వినేశ్ ఫొగాట్, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, బజరంగ్ పూనియా, సంగీత ఫొగాట్ తదితరులు ఆందోళన చేపట్టారు. అనంతరం క్రీడా శాఖ కమిటీ ఏర్పాటు చేసి రెజ్లర్ల ఆరోపణలపై విచారణ చేపట్టారు. బ్రిజ్‌భూషణ్ సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినా ఆయనపై మాత్రం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. తాజాగా రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షి మలిక్ తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ తమ ‘ఖేల్‌రత్న, పద్మశ్రీ, అర్జున’ పురస్కారాలను వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. -
దివ్యమైన పతకాల పంట
భారతీయ క్రీడా రంగానికి ఇది కనివిని ఎరుగని సీజన్. ఇటీవలే ఏషియన్ గేమ్స్‌లో పతకాల శతకం సాధించిన భారత్ తాజాగా ఏషియన్ పారా గేమ్స్‌లోనూ శతాధిక పతకాలను చేజిక్కించుకుంది. మునుపెన్నడూ లేని విధంగా ఆసియా పారా క్రీడోత్సవాల్లోనూ శతాధిక పతకాలు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబరాలు జరుపుకొనే మరో సందర్భం అందించింది. విధి క్రూరంగా వ్యవహరించినా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగితే విజయానికి ఆకాశమే హద్దు అనడానికి తాజా ఆసియా పారా క్రీడోత్సవాల్లో పాల్గొన్న మన 303 మంది ఆటగాళ్ళ విజయగాథలే ఉదాహరణ. ఈ పారా గేమ్స్‌లో భారత్ అరడజను ప్రపంచ రికార్డులు, 13 ఏషియన్ రికార్డులు నెలకొల్పింది. క్రీడల్లోనూ భారత్ బలంగా ఎదుగుతున్న క్రమానికి ఇది మరో మచ్చుతునక. 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్య దేశంగా నిలవాలని ఆశిస్తున్న భారత్‌కు ఈ విజయాలు అతి పెద్ద ఉత్ప్రేరకాలు. ఈసారి ఆసియా క్రీడోత్సవాల్లో భారత బృందం నినాదం ‘ఇస్ బార్ సౌ పార్’. అలా వంద పతకాల లక్ష్యాన్ని దాటడమే ఈసారి లక్ష్యమనే నినాదంతో ముందుకు దూకిన భారత్ 107 పతకాలతో ఆ గోల్ సాధించింది. చైనాలోని హాంగ్జౌలో సాగిన ఏషియాడ్‌తో పాటు, ఆ వెంటనే అదే వేదికగా సాగిన ఏషియన్ పారా గేమ్స్‌లోనూ భారత్ 111 పతకాలతో మరోసారి ఈ శతాధిక విన్యాసం చేయడం విశేషం. ఏషియన్ గేమ్స్‌లో మనవాళ్ళు కనివిని ఎరుగని రీతిలో పతకాల సాధన చేయడంతో, అందరి దృష్టీ ఈ పారా అథ్లెట్ల మీదకు మళ్ళింది. మొత్తం 191 మంది పురుష అథ్లెట్లు, 112 మంది స్త్రీ అథ్లెట్లు 17 క్రీడా విభాగాల్లో మన దేశం పక్షాన ఈ క్రీడా సంరంభంలో పాల్గొన్నారు. మునుపెన్నడూ పారా క్రీడోత్సవాల్లో లేని విధంగా 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలు దేశానికి తెచ్చిపెట్టారు. పతకాల పట్టికలో చైనా, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా తర్వాత అయిదో స్థానంలో మన దేశాన్ని నిలిపారు. నిజానికి, భారత క్రీడా వ్యవస్థలో పారా క్రీడల పట్ల దీర్ఘకాలికంగా ఉదాసీనత నెలకొంది. ఉదాహరణకు, 2008 నాటి బీజింగ్ పారాలింపిక్స్‌లో మనం అయిదుగురు అథ్లెట్లనే పంపాం. రిక్తహస్తాలతో ఇంటిదారి పట్టాం. అయితే, ఎనిమిదేళ్ళ క్రితం రియోలోని క్రీడాసంరంభంలో 19 మంది భారతీయ పారా ఒలింపియన్లు పాల్గొని, 2 స్వర్ణాలు సహా మొత్తం 4 పతకాలు ఇంటికి తెచ్చారు. అక్కడ నుంచి పరిస్థితులు క్రమంగా మారాయి. రెండేళ్ళ క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో మనవాళ్ళు 5 స్వర్ణాలు సహా 19 మెడల్స్ గెలిచారు. అలా పారా అథ్లెట్లకూ, క్రీడలకూ ప్రాచుర్యం విస్తరించింది. ఏషియన్ పారా గేమ్స్‌లోనూ 2018లో భారత్ 72 పతకాలు గెల్చి, తొమ్మిదో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. అదే ఈసారి హాంగ్జౌలో మనవాళ్ళు ఏకంగా 111 పతకాలు సాధించి, అయిదో స్థానానికి ఎగబాకారు. రానున్న ప్యారిస్ పారాలింపిక్స్ పట్ల ఆశలు పెంచారు. చైనా గెల్చిన 521 పతకాలతో పోలిస్తే, మన సాధన చిన్నదే కావచ్చు. అయితే, దేశంలో అథ్లెట్లతో పాటు పారా అథ్లెట్లూ పెరుగుతూ, క్రీడాంగణాన్ని వెలిగిస్తున్న వైనం మాత్రం అవిస్మరణీయం. ఈ పారా – అథ్లెట్ల భారత బృందం సాధించిన 111 పతకాలకూ వెనుక 111 స్ఫూర్తి కథనాలున్నాయి. చేతులు లేకపోతేనేం, విలువిద్యలో దిట్ట అయిన కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ళ శీతల్ దేవి తన పాదాలతోనే బాణాన్ని సంధించి, లక్ష్యాన్ని ఛేదించి, పతకం సాధించిన తీరు వైరల్ అయింది. నిరాశలో కూరుకున్న కోట్లమందికి ఆమె సరికొత్త స్ఫూర్తి ప్రదాత. అలాగే, ఒకప్పుడు రెజ్లర్‌గా ఎదుగుతూ, రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పోగొట్టుకున్న సుమిత్ అంతిల్ మరో ఉదాహరణ. జీవితంలో పూర్తిగా నిస్పృహలో జారిపోయిన ఆ ఆటగాడు కన్నతల్లి ప్రోత్సాహంతో, అప్పటి దాకా విననైనా వినని పారా క్రీడల్లోకి దిగారు. ఇవాళ జావెలిన్ త్రోయర్‌గా పారాలింపిక్స్‌కు వెళ్ళారు. ఏషియన్ ఛాంపియన్‌గా ఎదిగారు. తాజా క్రీడోత్సవాల్లో తన ప్రపంచ రికార్డును తానే మెరుగుపరుచుకున్నారు. సోదరుడి వివాహంలో కరెంట్ షాక్‌తో చేతులు రెండూ కోల్పోయిన పారా స్విమ్మర్ సుయశ్ నారాయణ్ జాధవ్, కుడి మోచేయి లేని పరుగుల వీరుడు దిలీప్, నడుము కింది భాగం చచ్చుబడినా తొణకని కనోయింగ్ వీరుడు ప్రాచీ యాదవ్... ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు. పారా క్రీడల విషయంలో గతంలో పరిస్థితి వేరు. దేశంలో పారా క్రీడలకు పెద్ద తలకాయ అయిన భారత పారా ఒలింపిక్ కమిటీ అనేక వివాదాల్లో చిక్కుకుంది. 2015లో అంతర్జాతీయ పారా లింపిక్ కమిటీ సస్పెండ్ చేసింది. ఆ పైన 2019లో జాతీయ క్రీడా నియమావళిని ఉల్లంఘించారంటూ, సంఘం గుర్తింపును క్రీడా శాఖ రద్దు చేసింది. ఏడాది తర్వాత పునరుద్ధరించింది. అంతర్గత కుమ్ములాటలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి ఆరోపణలు సరేసరి. అన్ని అవరోధాల మధ్య కూడా ఆటగాళ్ళు పట్టుదలగా ముందుకు వచ్చారు. ఒకప్పుడు నిధులు, శిక్షణ కొరవడిన దశ నుంచి పరిస్థితి మారింది. ప్రత్యేక అవసరాలున్న ఆటగాళ్ళకు నిధులు, శిక్షణనివ్వడంలో శ్రద్ధ ఫలిస్తోంది. భారత క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన పలు కేంద్రాల్లో భారత పారా అథ్లెట్లకు మునుపటి కన్నా కొంత మెరుగైన శిక్షణ లభిస్తోంది. విదేశీ పర్యటనలతో వారికి క్రీడా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. ఆటగాళ్ళ దీక్షకు తల్లితండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహం తోడై పతకాల పంట పండిస్తోంది. పారా స్పోర్ట్స్ అంటే ఎవరికీ పెద్దగా తెలియని రోజుల నుంచి దివ్యాంగులు పలువురు క్రీడల్ని ఓ కెరీర్‌గా ఎంచుకొనే రోజులకు వచ్చాం. అయితే, ఇది చాలదు. వసతుల్లో, అవకాశాల్లో సాధారణ ఆట గాళ్ళతో పాటు దివ్యాంగులకూ సమప్రాధాన్యమివ్వాలి. దేశంలోని దివ్యాంగ క్రీడాకారుల్లోని ప్రతిభా పాటవాలు బయటకు తేవాలి. 9 నెలల్లో రానున్న ప్యారిస్ పారాలింపిక్స్‌కి అది చేయగలిగితే మేలు! -
సీఎం జగన్ కు కలిసిన ఏషియన్ గేమ్స్ క్రీడాకారులు
-
సీఎం జగన్‌ను కలిసిన ఏషియన్ గేమ్స్ క్రీడాకారులు
సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి.. సీఎం జగన్‌ను ఇవాళ క్యాంప్ కార్యాలయంలో కలిశారు. క్రీడాకారుల్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దగ్గరుండి సీఎం జగన్‌కు కలిపించారు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో సాధించిన పతకాలను విజేతలు సీఎం జగన్‌కు చూపించారు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మొత్తం రూ. 4.29 కోట్లను క్రీడాకారులకు ప్రభుత్వం అందించింది. ఇదీ చదవండి: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్ -
Asian Games Medal Winners Pics: ప్రధాని మోదీతో ఏషియన్ గేమ్స్‌లో మెడల్స్ విన్నర్స్ (ఫొటోలు)
-
అమలాపురం టు ఆసియా క్రీడలు
సాక్షి, అమలాపురం: పన్నెండేళ్ల ప్రాయం అంటే అమ్మానాన్న చేతులు పట్టుకుని నడిచి వెళ్లే వయస్సు. కానీ ఆ వయస్సులోనే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని.. దాని కోసం తల్లిదండ్రులను వదిలి.. బంధాలకు.. అనుబంధాలకు దూరంగా ఉంటూ.. ఇష్టాలను కాదనుకుని.. లక్ష్య సాధనకు ఉపక్రమించాడు అమలాపురానికి చెందిన అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్. అప్పటి వరకూ ఆట విడుపుగా ఆడుతున్న షటిల్ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే లక్ష్యానికి అనుగుణంగా నిరంతర సాధన చేస్తున్నాడు.. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాడు. రెండేళ్ల క్రితం మొదలైన సాత్విక్, అతడి సహచరుడు చిరాగ్ శెట్టిల విజయయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. తాజాగా చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో మన దేశానికి శనివారం బంగారు పతకం అందించారు. తద్వారా అంతర్జాతీయ వేదికపై సాత్విక్ మరోసారి సత్తా చాటాడు. గతంలో జరిగిన ఆసియా కప్‌లో భారత జట్టు తరఫున రజత పతకానికి మాత్రమే పరిమితమైన సాత్విక్.. ఈసారి డబుల్స్‌లో బంగారు పతకం సాధించడం.. ఆయన సొంత ప్రాంతమైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాసుల్లో సంతోషాన్ని నింపింది. సాత్విక్ తన పన్నెండో ఏట నుంచే గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. 15వ ఏట తొలి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాడు. నాటి నుంచి నేటి వరకూ ఎన్నో అంతర్జాతీయ టోర్నీ ల్లో విజేతగా నిలిచాడు. వీటిలో రెండుసార్లు కామన్వెల్త్, ఒకసారి థామస్ కప్, తాజాగా ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించడం సాత్విక్ క్రీడా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయాలు. ఊరిస్తున్నది ఒలింపిక్స్ పతకమే.. గత ఒలింపిక్స్ క్రీడల్లో చేతి వరకూ వచ్చిన పతకం సాత్విక్ జోడీకి దూరమైంది. డబుల్స్ విభాగంలో సహచరుడు చిరాగ్ శెట్టితో కలిసి మూడు మ్యాచ్‌లకు గాను, రెండు మ్యాచ్‌లు గెలిచినా పాయింట్లు తక్కువ కావడంతో క్వార్టర్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. లేకుంటే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో సాయిరాజ్ సాత్విక్ జంట ఏదో ఒక పతకాన్ని సాధించేది. జీవితాశయమైన ఒలింపిక్ పతకం త్రుటిలో చేజారినా సాత్విక్ కుంగిపోలేదు. ఆ ఓటమి నుంచి వెంటనే కోలుకుని.. తరువాత కామన్వెల్త్, థామస్ కప్, తాజాగా ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించాడు. సాత్విక్ 2021లో అర్జున్ అవార్డు అందుకున్నాడు. పలువురి అభినందనలు ఆసియా క్రీడల్లో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ బంగారు పతకం సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. వారిని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. సాత్విక్ తల్లిదండ్రులు రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్, రంగమణి దంపతులు ప్రస్తుతం కర్ణాటకలోని మంగుళూరులో ఉన్నారు. అక్కడ బ్యాడ్మింటన్ క్రీడాకారులు, స్థానికులు వారి వద్దకు వచ్చి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. స్థానికులు ఫోనులో శుభాకాంక్షలు అందజేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు కూడా సాత్విక్‌ను అభినందించారు. మరపురాని విజయాలెన్నో.. బ్యాడ్మింటన్ క్రీడలో థామస్ కప్ కీలకమైంది. అటువంటి మెగా టోర్నీలో భారత జట్టు ఎప్పుడూ ఫైనల్స్‌కు వెళ్లలేదు. కానీ గత ఏడాది ఫైనల్స్‌కు చేరడమే కాదు.. ఏకంగా మన జట్టు బంగారు పతకం సాధించడంలో సాత్విక్ ద్వయం కీలకంగా నిలిచింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో దేశానికి బంగారు పతకం అందించిన జట్టులో సాత్విక్ సభ్యునిగా ఉన్నాడు. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల డబుల్స్ విభాగంలో భారత జట్టు తరఫున సాత్విక్ బంగారు పతకం, డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించాడు. గత ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో డబుల్స్‌లో బంగారు పతకం సాధించాడు. ఈ క్రీడల్లో డబుల్స్ విభాగంలో కూడా భారత్ జట్టు తరఫున బంగారు పతకాలు సాధించాడు. వేగవంతమైన బ్యాడ్మింటన్ స్మాష్ (షటిల్‌ను వేగంగా కొట్టడం)లో సాత్విక్ గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆయన స్మాష్ గంటకు 565 కిలోమీటర్లు (372.6 మైళ్లు) అని గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ గుర్తించింది. -
పసిడి పోరుకు సాకేత్–రామ్ జోడీ
ఆసియా క్రీడల టెన్నిస్ ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 6–7 (6/8), 10–0తో ‘సూపర్ టైబ్రేక్’లో సెంగ్‌చన్ హాంగ్–సూన్‌వూ క్వాన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో సనమ్ సింగ్‌తో కలిసి రజత పతకం, మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు. నేడు ఉదయం గం. 7:30 నుంచి జరిగే ఫైనల్లో జేసన్ జంగ్–యు సియో సు (చైనీస్ తైపీ) జంటతో సాకేత్–రామ్ జోడీ తలపడుతుంది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న–రుతుజా భోస్లే (భారత్) ద్వయం సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రుతుజా 7–5, 6–3తో జిబెక్ కులామ్‌బయేవా–గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్)లపై గెలిచారు. నేడు జరిగ సెమీఫైనల్లో యు సియో సు–చాన్ హావో చింగ్ (చైనీస్ తైపీ)లతో బోపన్న–రుతుజా తలపడతారు. -
మన గురి అదిరె..
ఆసియా క్రీడల్లో ఐదో రోజూ భారత్ పతకాల వేట కొనసాగింది. ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి గురువారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత షూటర్లు నాలుగో స్వర్ణం సాధించగా... వుషులో రోషిబినా దేవి రజతం, ఈక్వెస్ట్రియన్‌లో అనూష్ కాంస్యం గెలిచారు. ఫలితంగా భారత్ పతకాల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. నేటి నుంచి అథ్లెటిక్స్ ఈవెంట్ కూడా మొదలుకానుండటం... టెన్నిస్, షూటింగ్, స్క్వాష్‌లలో కూడా మెడల్ ఈవెంట్స్ ఉండటంతో పతకాల పట్టికలో నేడు భారత్ నాలుగో స్థానానికి చేరుకునే అవకాశముంది. హాంగ్జౌ: భారీ అంచనాలతో ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత షూటర్లు నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నారు. పోటీల ఐదో రోజు గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్‌లతో కూడిన భారత బృందం క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానం సంపాదించి పసిడి పతకం గెల్చుకుంది. క్వాలిఫయింగ్‌లో భారత జట్టు మొత్తం 1734 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. సరబ్జోత్ సింగ్ 580 పాయింట్లు, అర్జున్ సింగ్ 578 పాయింట్లు, శివ నర్వాల్ 576 పాయింట్లు స్కోరు చేశారు. సరబ్జోత్ ఐదో స్థానంలో, అర్జున్ సింగ్ ఎనిమిదో స్థానంలో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అయితే వ్యక్తిగత విభాగంలో సరబ్జోత్, అర్జున్ సింగ్‌లకు నిరాశ ఎదురైంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అర్జున్ 113.3 పాయింట్లు స్కోరు చేసి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలువగా... సరబ్జోత్ 199 పాయింట్లు సాధించి నాలుగో స్థానం దక్కించుకొని కాంస్య పతకానికి దూరమయ్యాడు. మరోవైపు స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్ జీత్ సింగ్, గనీమత్ సెఖోన్‌లతో కూడిన భారత జట్టు ఏడో స్థానంలో నిలిచింది. నేడు షూటింగ్లో నాలుగు మెడల్ ఈవెంట్స్ (పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ టీమ్, వ్యక్తిగత విభాగం; మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్, వ్యక్తిగత విభాగం) ఉన్నాయి. ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత షూటర్లు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు గెలిచారు. అనూష్ ఘనత.. ఈక్వె్రస్టియన్ (అశ్వ క్రీడలు)లో భారత్‌కు మరో పతకం దక్కింది. డ్రెసాజ్ వ్యక్తిగత విభాగంలో అనూష్ అగర్వల్లా కాంస్య పతకం సాధించాడు. 14 మంది పోటీపడిన ఫైనల్లో అనూష్, అతని అశ్వం 73.030 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆసియా క్రీడల చరిత్రలో డ్రెసాజ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. మరోవైపు వుషు క్రీడాంశంలో స్వర్ణ పతకం సాధించాలని ఆశించిన భారత క్రీడాకారిణి రోషిబినా దేవికి నిరాశ ఎదురైంది. వు జియోవె (చైనా)తో జరిగిన 60 కేజీల సాండా ఈవెంట్ ఫైనల్లో రోషిబినా దేవి 0–2తో ఓడిపోయి రజత పతకం కైవసం చేసుకుంది. భారత్ ‘హ్యాట్రిక్’ విజయం భారత పురుషుల హాకీ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో గురువారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–2 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున అభిõÙక్ (13వ, 48వ ని.లో) రెండు గోల్స్ చేయగా... మన్దీప్ (24వ ని.లో), అమిత్ రోహిదాస్ (34వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. క్వార్టర్ ఫైనల్లో సింధు బృందం.. మహిళల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ చేరింది. మంగోలియాతో జరిగిన తొలి రౌండ్లో భారత్ 3–0తో గెలిచింది. పీవీ సింధు, అషి్మత, అనుపమ తమ సింగిల్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. స్క్వాష్ జట్లకు పతకాలు ఖాయం వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల స్క్వాష్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 0–3తో మలేసియా చేతిలో ఓడిపోగా.. భారత పురుషుల జట్టు 3–0తో నేపాల్‌పై నెగ్గింది. తమ గ్రూపుల్లో రెండో స్థానంలో నిలవడం ద్వారా ∙భారత జట్లు సెమీఫైనల్ బెర్త్‌లు పొందాయి. నిశాంత్ పంచ్ అదుర్స్.. భారత బాక్సర్లు నిశాంత్ దేవ్ (71 కేజీలు), జాస్మిన్ లంబోరియా (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లి పతకానికి విజయం దూరంలో నిలువగా... దీపక్ (51 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. నిశాంత్ పంచ్‌లకు అతని ప్రత్యర్థి బుయ్ తుంగ్ (వియత్నాం) తొలి రౌండ్లోనే చిత్తయ్యాడు. జాస్మిన్ పంచ్‌లకు హదీల్ గజ్వాన్ (సౌదీ అరేబియా) తట్టుకోలేకపోవడంతో రిఫరీ రెండో రౌండ్లో బౌట్‌ను ముగించాడు. దీపక్ 1–4తో ప్రపంచ మాజీ చాంపియన్ టొమోయా సుబోయ్ (జపాన్) చేతిలో ఓడిపోయాడు. -
ముగ్గురు భారత అథ్లెట్లకు చైనా వీసా నిరాకరణ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వుషు పోటీల్లో పాల్గొనాల్సిన 11 మంది సభ్యుల భారత బృందంలో ముగ్గురికి చైనా ప్రభుత్వం వీసా నిరాకరించింది. ఈ ముగ్గురూ అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే. అరుణాచల్‌ప్రదేశ్‌కు సంబంధించి భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వీసా నిరాకరణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముగ్గురు మహిళా వుషు ప్లేయర్లు నైమన్ వాంగ్సూ, ఒనిలు టెగా, మేపుంగ్ లంగులను భారత అథ్లెట్లుగా గుర్తించేందుకు చైనా నిరాకరించింది. దాంతో శుక్రవారం రాత్రి వీరు మినహా మిగిలిన ముగ్గురు ఆసియా క్రీడల కోసం చైనా బయల్దేరి వెళ్లారు. ఈ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసియా క్రీడలకు హాజరయ్యేందుకు చైనాకు వెళ్లాల్సిన ఠాకూర్... తాజా పరిణామాలకు నిరసనగా తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. -
చైనా కవ్వింపు.. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు
ఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించడంపై భారత్ మండిపడింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమని స్పష్టం చేసిన అనురాగ్ ఠాకూర్.. చైనా కవ్వింపు చర్యలను ఖండించారు. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు.. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భారత 'వుషు' ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా రద్దు చేసింది. వారి వీసాలను, అక్రిడేషన్‌ను రద్దు చేసింది. ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన మిగిలిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్జౌకు విమానంలో బయలుదేరింది. భారత్ మండిపాటు.. ఈ వ్యవహారంలో చైనా తీరుపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడం వంటి వివక్షను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆటగాళ్ల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భారత ఆటగాళ్లను ఢిల్లీకి తీసుకువచ్చింది. అరుణాచల్ మాదే.. ఆసియా గేమ్స్‌ను నిర్వహించే అత్యున్నత కమిటీ దీనిపై స్పందించింది. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్ కమిటీకి తీసుకువెళ్లినట్లు తెలిపింది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశించింది. భారత ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడంపై చైనా విదేశాంగ శాఖ మంత్రి మావో నింగ్ స్పందించారు. అన్ని దేశాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం చెప్పుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ప్రభుత్వం గుర్తించలేదు. ఆ భూభాగం చైనాకు చెందిన జియాంగ్ ప్రాంతంలోనిదేనని ఆయన అన్నారు. అది చైనాలో అంతర్భాగమని తెలిపారు. ఇటీవల చైనా విడుదల చేసిన మ్యాప్ విమర్శలకు దారితీసింది. భారత్‌లోని అరుణాచల్‌ని చైనా తమ అంతర్భాగంలోనిదేనని చూపుతూ ఇటీవల మ్యాప్ రిలీజ్ చేసింది. దీనిపై భారత్ విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ అప్పట్లో స్పందించారు. చైనా కవ్వింపు చర్యలు సహించరానివని అన్నారు. అరుణాచల్ భారత్‌లో భాగమని స్పష్టం చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, భూభాగాలను ఎప్పుడూ కాపాడుకుంటుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..? -
వాలీబాల్‌లో భారత్ సంచలనం
హాంగ్జూ (చైనా): మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల వాలీబాల్ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. గ్రూప్ ‘సి’లో టాప్ ర్యాంక్‌లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం కంబోడియా జట్టును ఓడించిన భారత జట్టు బుధవారం పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా జట్టును భారత్ బోల్తా కొట్టించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు 25–27, 29–27, 25–22, 20–25, 17–15తో దక్షిణ కొరియాపై గెలిచింది. 1966 నుంచి ప్రతి ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో ఏదో ఒక పతకం సాధిస్తూ వస్తోంది. భారత జట్టు చివరిసారి 1986 సియోల్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచింది. కొరియాతో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సమష్టి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా అమిత్ అత్యధికంగా 24 పాయింట్లు స్కోరు చేశాడు. వినిత్ కుమార్, అశ్వల్ రాయ్ 19 పాయింట్ల చొప్పున సాధించారు. మనోజ్ ఎనిమిది పాయింట్లు, ఎరిన్ వర్గీస్ ఏడు పాయింట్లు అందించారు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కొరియా రజత పతకం నెగ్గగా, భారత్ 12వ స్థానంలో నిలిచింది. రోయింగ్‌లో జోరు... రోయింగ్‌లో భారత క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశి‹Ùలతో కూడిన భారత పురుషుల జట్టు కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరింది. మహిళల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్లో అశ్వతి, మృణమయి సాల్గావ్కర్, ప్రియా దేవి, రుక్మిణి, సొనాలీ, రీతూ, వర్ష, తెన్దోన్తోయ్ సింగ్, గీతాంజలిలతో కూడిన భారత జట్టు కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు మలేసియాతో భారత మహిళల పోరు మహిళల టి20 క్రికెట్లో భారత నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మలేసియాతో నేడు జరిగే పోరులో స్మృతి మంధాన బృందం బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరడంతోపాటు పతకం రేసులో నిలుస్తుంది. ఉదయం గం. 6:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
పతాకధారులుగా హర్మన్‌ప్రీత్ సింగ్, లవ్లీనా
ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి పతాకధారులగా పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ వ్యహరించనున్నారు. ఈనెల 23న చైనాలోని హాంగ్జూ నగరంలో ఆసియా క్రీడలకు తెర లేవనుంది. అస్సాంకు చెందిన 25 ఏళ్ల లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. పంజాబ్‌కు చెందిన హర్మన్ భారత్ తరఫున 191 మ్యాచ్‌లు ఆడి 155 గోల్స్ చేశాడు. -
చైనా చేతిలో చిత్తుగా...
హాంగ్జూ (చైనా): ఆసియా క్రీడల కోసం ఫుట్‌బాల్ జట్టునే పంపడం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటన...నేరుగా ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ కోచ్ లేఖ...చివరకు గ్రీన్ సిగ్నల్...అత్యుత్తమ ఆటగాళ్లను ఇవ్వలేమంటూ ఐఎస్ఎల్ జట్ల కొర్రీలు...ఆఖరి నిమిషంలో తృతీయ శ్రేణి జట్టు ఎంపిక...కనీసం టీమ్ జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు కూడా రాసుకోలేని స్థితి... ఇన్ని అడ్డంకుల తర్వాత ఎట్టకేలకు భారత ఫుట్‌బాల్ జట్టు సోమవారం సాయంత్రం చైనా గడ్డపై అడుగు పెట్టింది. కనీసం ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ లేదు...16 గంటల్లోనే మ్యాచ్ బరిలోకి...సబ్స్టిట్యూట్లుగా దించేందుకు తగినంత మంది కూడా బెంచీపై లేరు... చివరకు ఊహించినట్లుగానే ప్రతికూల ఫలితం వచ్చింది. తొలి పోరులో ఆతిథ్య చైనా చేతుల్లో చిత్తుగా ఓడి నిరాశను మిగిల్చింది. అధికారికంగా ఆసియా క్రీడలు ఈ నెల 23నుంచి ప్రారంభం అవుతున్నా...కొన్ని ఈవెంట్లు ముందే మొదలైపోయాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో చైనా 5–1 గోల్స్ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 1–1తో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా...రెండో అర్ధభాగంతో నాలుగు గోల్స్‌తో చైనా చెలరేగింది. చైనా తరఫున జియావో టియాని (17వ నిమిషం), డీ వీజన్ (51వ నిమిషం), టావో కియాగ్లాంగ్ (72వ నిమిషం, 75వ నిమిషం), హావో ఫాంగ్ (90+2వ నిమిషం)లో గోల్స్ సాధించారు. భారత్ తరఫున ఏకైక గోల్‌ను కనోలీ ప్రవీణ్ రాహుల్ (45+1వ నిమిషం) నమోదు చేశాడు. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్ల మధ్య తీవ్ర అంతరం కనిపించింది. 86 నిమిషాలు మైదానంలో ఉన్నా కెప్టెన్ సునీల్ ఛెత్రి ఏమీ చేయలేక చూస్తుండిపోయాడు. జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు మొత్తం 90 నిమిషాలు ఫీల్డ్ ఉండటం పరిస్థితిని చూపిస్తోంది. భారత్ ఈ గ్రూప్‌నుంచి ముందంజ వేయాలంటే తర్వాతి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, మయన్మార్‌లపై తప్పనిసరిగా గెలవాలి. కంబోడియాను ఓడించి... వాలీబాల్‌లో మాత్రం భారత్ గెలుపుతో శుభారంభం చేసింది. ఈ పోరులో భారత్ 3–0 (25–14, 25–13, 25–19) తేడాతో తమకంటే బాగా తక్కువ ర్యాంక్ గల కంబోడియాను ఓడించింది. గ్రూప్ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్‌లో రేపు అత్యంత పటిష్టమైన కొరియాను భారత్ ఎదుర్కోనుంది. -
ఫుట్‌బాల్ దిగ్గజం హబీబ్ ఇకలేరు.. చిరస్మరణీయ క్షణాలు అవే!
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, 70వ దశకంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న మొహమ్మద్ హబీబ్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. హైదరాబాద్‌కు చెందిన హబీబ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 18 ఏళ్ల పాటు అక్కడే 1970లో మరో హైదరాబాదీ సయ్యద్ నయీముద్దీన్ నాయకత్వంలో బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో హబీబ్ కీలక సభ్యుడు. అయితే హబీబ్ కెరీర్ అత్యుత్తమ దశ కోల్‌కతాలోనే గడిచింది. 1966నుంచి 1984 వరకు దాదాపు 18 ఏళ్లు పాటు ఆయన అక్కడ ప్రధాన ఆటగాడిగా కొనసాగడం విశేషం. చిరస్మరణీయ క్షణం అదే మిడ్‌ఫీల్డర్‌గా మూడు ప్రఖ్యాత క్లబ్‌లు మోహన్‌బగాన్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మదాన్ స్పోర్టింగ్‌లకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. హబీబ్ కెరీర్లో చిరస్మరణీయ క్షణం 1977లో వచ్చింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో హబీబ్ మోహన్‌బగాన్ తరఫున బరిలోకి దిగగా...ప్రత్యర్థి టీమ్ కాస్మోస్ క్లబ్లో ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లు పీలే, కార్లోస్ ఆల్బర్టో ఉన్నారు. నాడు పీలే ప్రత్యేక అభినందనలు మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగియగా, ఇందులో హబీబ్ కూడా ఒక గోల్ చేశారు. మ్యాచ్ అనంతరం పీలే ప్రత్యేకంగా హబీబ్‌ను పిలిచి ఆయన ఆటను ప్రశంసించడం విశేషం. ప్రతిష్టాత్మక డ్యురాండ్ కప్ మూడు వేర్వేరు ఫైనల్ మ్యాచ్‌లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా ఇప్పటికీ హబీబ్ రికార్డు నిలిచి ఉంది. జాతీయ ఫుట్‌బాల్ టోర్నీ ‘సంతోష్ ట్రోఫీ’ని ఏకైక సారి ఆంధ్రప్రదేశ్ జట్టు 1966లో గెలుచుకుంది. పదేళ్ల పాటు భారత జట్టుకు ఆడి నాడు ఏపీ తరఫున చెలరేగిన హబీబ్...ఫైనల్లో బెంగాల్‌నే ఓడించడం ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం. పదేళ్ల పాటు (1965–75) భారత జట్టు తరఫున ఆడిన హబీబ్‌ను కేంద్ర ప్రభుత్వం 1980లో ‘అర్జున’ పురస్కారంతో గౌరవించింది. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత టాటా ఫుట్‌బాల్ అకాడమీకి, భారత్ ఫుట్‌బాల్ సంఘానికి చెందిన అకాడమీకి కూడా కోచ్‌గా వ్యవహరించారు. చదవండి: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సౌతాఫ్రికా సిరీస్ నుంచి కెప్టెన్ ఔట్..! -
హర్మన్ ఆడేది... ఫైనల్ చేరితేనే!
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగాలంటే టీమిండియా ఫైనల్ చేరాలి. ఎందుకంటే చైనా ఆతిథ్యమిచ్చే ఈ ఈవెంట్లో భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ ఎంట్రీ లభించింది. కెప్టెన్ హర్మన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం ఉన్న నేపథ్యంలో క్వార్టర్స్, సెమీఫైనల్ గెలిచి భారత్ తుదిపోరుకు అర్హత సాధిస్తే తప్ప ఆమె ఆసియా క్రీడల ఆట ఉండదు. చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఇందులో మహిళల క్రికెట్ ఈవెంట్లో 14 జట్లు, పురుషుల ఈవెంట్లో 18 జట్లు బరిలోకి దిగుతాయి. అయితే ఈ రెండు విభాగాల్లోనూ భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు నేరుగా క్వార్టర్స్ ఫైనల్స్ ఎంట్రీ లభించింది. -
రవి దహియాకు షాక్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ రవి దహియా ఆసియా క్రీడలకు అర్హత సాధించలేకపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, వరుసగా మూడేళ్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన రవి దహియా (57 కేజీలు) ఆదివారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆతీశ్ తోడ్కర్ (మహారాష్ట్ర) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. అయితే ఈ విభాగంలో అమన్ సెహ్రావత్ విజేతగా నిలిచి ఆసియా క్రీడల బెర్త్‌ను దక్కించుకున్నాడు. ఇతర విభాగాల్లో దీపక్ పూనియా (86 కేజీలు), విక్కీ (97 కేజీలు), యశ్ (74 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు), విశాల్ కాళీరామన్ (65 కేజీలు) విజేతలుగా నిలిచారు. 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియాకు నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం కల్పించడంతో విశాల్ ‘స్టాండ్‌బై’గా ఉంటాడు. -
బీసీసీఐకి థాంక్స్.. కచ్చితంగా స్వర్ణం గెలుస్తాం: టీమిండియా కొత్త కెప్టెన్
Asian Games 2023- Team India: ఆసియా క్రీడల్లో భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం ఇచ్చినందుకు మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు. ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి పాల్గొంటున్న జట్టుకు తాను నాయకుడిని కావడం గర్వంగా ఉందన్నాడు. తనతో పాటు జట్టులోని ఇతర సభ్యులు కూడా ఈ ఈవెంట్లో ఆడేందుకు ఎంతో ఉత్సుకతో ఉన్నారని తెలిపాడు. కాగా చైనాలో జరుగనున్న ఆసియా క్రీడలు-2023కి పురుష, మహిళా క్రికెట్ జట్లను పంపేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 28 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్ నేపథ్యంలో జట్లను ప్రకటించింది. ఇక అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి పురుష జట్టును చైనాకు పంపనుంది. గోల్డ్ మెడల్ గెలిచి ఈ టీమ్‌కు టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ విషయంపై స్పందించిన రుతు.. ‘‘ఆసియా క్రీడల్లో పాల్గొననుండటం ఎంతో సంతోషంగా ఉంది. దేశం కోసం ఆడే మ్యాచ్‌లో కచ్చితంగా స్వర్ణ పతకం గెలుస్తామనే నమ్మకం ఉంది. గోల్డ్ మెడల్ గెలిచి పోడియం వద్ద నిల్చుని జాతీయ గీతం పాడాలనే కల నెరవేర్చుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. ఈ జట్టుకు నన్ను సారథిగా ఎంపిక చేసినందుకు బీసీసీఐ సెలక్టర్లకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. 🗣️ “𝑻𝒉𝒆 𝒅𝒓𝒆𝒂𝒎 𝒘𝒐𝒖𝒍𝒅 𝒃𝒆 𝒕𝒐 𝒘𝒊𝒏 𝒕𝒉𝒆 𝒈𝒐𝒍𝒅 𝒎𝒆𝒅𝒂𝒍, 𝒔𝒕𝒂𝒏𝒅 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒑𝒐𝒅𝒊𝒖𝒎 𝒂𝒏𝒅 𝒔𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒏𝒂𝒕𝒊𝒐𝒏𝒂𝒍 𝒂𝒏𝒕𝒉𝒆𝒎 𝒇𝒐𝒓 𝒕𝒉𝒆 𝒄𝒐𝒖𝒏𝒕𝒓𝒚” A happy and proud @Ruutu1331 is excited to lead #TeamIndia at the #AsianGames 😃 pic.twitter.com/iPZfVU2XW8 — BCCI (@BCCI) July 15, 2023 -
ఒకప్పుడు జట్టులో చోటే దిక్కు లేదు.. ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా!
చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో భారత క్రికెట్ జట్లు తొలిసారి పాల్గొనబోతున్నాయి. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ ఆసియాగేమ్స్‌లో భారత పురుషల జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను సారథిగా ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం అనూహ్యంగా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. దావన్కు కనీసం జట్టులో కూడా చోటు దక్కలేదు. ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు. ఆగస్టు 31 నుంచి ఆసియాకప్ జరగనుండడంతో భారత ద్వితీయ శ్రీణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టులో ఐపీఎల్ హీరో రింకూ సింగ్‌తో పాటు తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్, ప్రభుసిమ్రాన్‌కు చోటు దక్కింది. వీరితోపాటు ఆల్‌రౌండర్ శివమ్ దుబే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఒకప్పుడు జట్టులో చోటుకే దిక్కులేదు.. ఇక ఆసియాకప్‌లో పాల్గోనే జట్టుకు రుత్‌రాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ధావన్ వంటి అనుభవం ఉన్న ఆటగాడని కాదని గైక్వాడ్‌ను సారధిగా ఎంపిక చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అయితే దేశవాళీ టోర్నీల్లో మాత్రం మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా రుత్‌రాజ్ వ్యవహరిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో కెప్టెన్‌గా రుత్‌రాజ్ విజయవంతం కావడంతో.. భారత జట్టు పగ్గాలను అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే రుత్‌రాజ్ కెప్టెన్‌గా ఎంపికైనప్పటికి.. భారత్ సీనియర్ జట్టు తరపున ఆడిన అనుభవం మాత్రం పెద్దగా లేదు. అతడు ఇప్పటి వరకు టీమిండియా తరపున 9 టీ20లు, కేవలం ఒక్క వన్డే మాత్రం ఆడాడు. 9 టీ20ల్లో 16.88 సగటుతో 135 పరుగులు చేయగా.. ఏకైక వన్డేలో 19 పరుగులు రుత్‌రాజ్ సాధించాడు. రుత్‌రాజ్ చివరగా టీమిండియా తరపున గతేడాది జూన్‌లో ఆడాడు. అప్పటినుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్-2023లో రుత్‌రాజ్ అదరగొట్టడంతో విండీస్ టూర్‌కు సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. విండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు రుత్‌రాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. కానీ విండీస్‌తో తొలి టెస్టుకు మాత్రం తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే ఒకప్పుడు జట్టులొ చోటు కోసం అతృతగా ఎదురుచూసిన రుత్‌రాజ్.. ఇప్పుడు ఏకంగా భారత జట్టును నడిపించే స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఆసియా గేమ్స్ ఆక్టో 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగుతాయి. చదవండి: Rohit Sharma Serious On Ishan Kishan: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్‌పై రోహిత్ సీరియస్! వీడియో వైరల్ టీమిండియా పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, శివం మావి, శివం దూబే, ప్రభ్సిమ్రాన్ సింగ్ స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ -
Asia Games: జట్లను ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల టి20 క్రికెట్ జట్టును శుక్రవారం రాత్రి ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారధ్యం వహించనుండగా.. పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ టీమిండియాకు ఎంపిక కాగా.. ఐపీఎల్లో రాణించిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, ప్రబ్‌సిమ్రన్ సింగ్‌లకు తొలిసారి జాతీయ జట్టుకు ఆడనున్నారు. కాగా ఆసియా క్రీడలు చైనాలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగుతాయి. ఇక మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వాణి, బారెడ్డి అనూషలకు టీమిండియాలో చోటు దక్కింది. టీమిండియా పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, శివం మావి, శివం దూబే, ప్రభ్సిమ్రాన్ సింగ్ స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ NEWS 🚨- Team India (Senior Men) squad for 19th Asian Games: Ruturaj Gaikwad (Captain), Yashasvi Jaiswal, Rahul Tripathi, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Washington Sundar, Shahbaz Ahmed, Ravi Bishnoi, Avesh Khan, Arshdeep Singh, Mukesh Kumar, Shivam Mavi, Shivam… — BCCI (@BCCI) July 14, 2023 టీమిండియా మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి సర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గయాక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అనూషా బారెడ్డి TEAM - Harmanpreet Kaur (C), Smriti Mandhana (VC), Shafali Verma, Jemimah Rodrigues, Deepti Sharma, Richa Ghosh (wk), Amanjot Kaur, Devika Vaidya, Anjali Sarvani, Titas Sadhu, Rajeshwari Gayakwad, Minnu Mani, Kanika Ahuja, Uma Chetry (wk), Anusha Bareddy https://t.co/kJs9TQKZfw — BCCI Women (@BCCIWomen) July 14, 2023 చదవండి: #RAshwin: అశ్విన్ మాయాజాలం; బ్యాటర్లే కాదు రికార్డులైనా దాసోహం అనాల్సిందే -
Asian Games: వినేశ్, బజరంగ్‌లకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందా?
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లింగ్ జట్లను ఎంపిక చేసేందుకు ఈనెల 22, 23 తేదీల్లో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్‌హక్ కమిటీ ప్రకటించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి... నిరసన చేపట్టిన రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్, సాక్షి మలిక్, సంగీత ఫొగపాట్, సత్యవర్త్, జితేందర్‌లకు ట్రయల్స్‌లో ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలా వద్దా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని అడ్‌హక్ కమిటీ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ బజ్వా తెలిపారు. అభిషేక్‌కు కాంస్యం బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ తొలి రోజు భారత్‌కు ఒక కాంస్య పతకం లభించింది. పురుషుల 10 వేల మీటర్ల విభాగంలో అభిషేక్ పాల్ కాంస్య పతకం సాధించాడు. అభిషేక్ 29 నిమిషాల 33.26 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి (59.10 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచింది. -
WC 2023: అతడి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.. అందుకే ఇలా!
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు పాల్గొనేందుకు బీసీసీఐ అధికారిక ముద్ర వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు జరుగనున్న ఈ టోర్నీకి పురుషుల విభాగంలో ద్వితీయ శ్రేణి జట్టును పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టు బౌలింగ్ విభాగం కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ దీపక్ చహర్‌కు తన జట్టులో తప్పకుండా స్థానం ఇస్తానని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. అతడిని పట్టించుకోలేదు ‘‘వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే క్రమంలో సెలక్టర్లు దీపక్ చహర్ పేరును కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. నిజానికి తను చాలా కాలంగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇప్పుడైతే బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టులో అతడికి అవకాశం ఇస్తారని భావిస్తున్నా. అదే విధంగా ఉమ్రాన్ మాలిక్‌కు కూడా నా జట్టులో చోటు ఇస్తాను. దీపక్ మాదిరే వరల్డ్‌కప్ జట్టులో ఉమ్రాన్‌కు కూడా స్థానం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి తను ఆసియా క్రీడల జట్టులో తప్పక ఉంటాడు. ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా! గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఆటగాడికి ఈ మాత్రం గౌరవమైనా ఇవ్వాలి కదా! ఇక రవి బిష్ణోయి. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా.. వీరంతా ప్రపంచ కప్ జట్టులో స్థానం ఖాయం చేసుకునే జాబితాలో ముందున్న వాళ్లు. అలాంటపుడు రవి బిష్ణోయి అవకాశాలు సన్నగిల్లినట్లే కదా! కాబట్టి రవి బిష్ణోయి కూడా చైనాకు వెళ్లే ద్వితీయ శ్రేణిలో జట్టులో ఉంటే మంచిది. వరుణ్ చక్రవర్తికి మరో స్పిన్నర్‌గా నా జట్టులో స్థానం కల్పిస్తాను. గతంలో వరల్డ్‌కప్ టోర్నీ ఆడిన అనుభవం అతడికి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. తన జట్టులో మూడో స్పిన్నర్‌గా మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మకు పార్ట్‌టైమ్ స్పిన్ బౌలర్‌గా ఛాన్స్ ఇస్తానని తెలిపాడు. చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా -
ఆసియా క్రీడలకు భారత టీటీ జట్టులో శ్రీజ.. జట్ల వివరాలివే
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను శుక్రవారం ప్రకటించారు. 10 మంది సభ్యులతో కూడిన భారత పురుషుల, మహిళల జట్లకు ఆచంట శరత్ కమల్, మనిక బత్రా సారథ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్ జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కూడా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తెలంగాణకు చెందిన ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, మహారాష్ట్ర ప్లేయర్ సానిల్ షెట్టి రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. ఆసియా టీటీ చాంపియన్‌షిప్ సెపె్టంబర్ 3 నుంచి 10 వరకు దక్షిణ కొరియాలో... ఆసియా క్రీడల టీటీ ఈవెంట్ చైనాలోని హాంగ్జౌలో సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. భారత టీటీ జట్లు: పురుషుల టీమ్ విభాగం: ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, మనుష్ షా. రిజర్వ్: ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, సానిల్ శెట్టి. మహిళల టీమ్ విభాగం: మనిక బత్రా, ఆకుల శ్రీజ, సుతీర్థ ముఖర్జీ, అహిక ముఖర్జీ, దియా చిటాలె. రిజర్వ్: అర్చన కామత్, రీత్ రిష్యా. పురుషుల డబుల్స్: శరత్ కమల్–సత్యన్; మానవ్–మనుష్. మహిళల డబుల్స్: సుతీర్థ–అహిక ముఖర్జీ; శ్రీజ–దియా. మిక్స్డ్ డబుల్స్: మనిక– సత్యన్; శ్రీజ–హర్మీత్ దేశాయ్. ఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి చౌధరీ (భారత్) ద్వయం 6–4, 6–3తో పునిన్ కొవాపిటుక్‌టెడ్–మంచాయ సావంగ్కెవ్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గింది. హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సహజ 0–6, 6–1, 6–1తో లీ జాంగ్ సియో (కొరియా)పై విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ రెండు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. -
Asian Games: బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక దేశవాళీ టీ20 టోర్నీలోనూ..
BCCI- Asian Games 2023: ముంబై: ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పాల్గొనడం ఖాయమైంది. శుక్రవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనికి అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. చైనాలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి. అయితే ఈ పోటీల్లో మహిళల విభాగంలో మాత్రమే భారత రెగ్యులర్, పూర్తి స్థాయి జట్టు బరిలోకి దిగుతోంది. పురుషుల విభాగంలో మాత్రం ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 5 నుంచి భారత్‌లోనే వన్డే వరల్డ్ కప్ జరుగుతుండటమే దీనికి కారణం. అదే విధంగా.. ఐపీఎల్–2023 సీజన్లో కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. చదవండి: బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
రింకూ సింగ్‌కు గుడ్ న్యూస్.. భారత జట్టులో చోటు! వాళ్లకు కూడా
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్-2023లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేష్ శర్మ, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు విండీస్ సిరీస్‌కు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మకు మాత్రమే ఛాన్స్ ఇచ్చి వీరిముగ్గరిని పరిగణలోకి తీసుకోలేదు. అయితే వీరిని ఎంపికచేయకపోవడానికి ఓ ప్రధాన కారణం ఉందంట. వీరి ముగ్గురిని చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు తొలిసారి పాల్గొంటోంది. అయితే వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఈ క్రీడలకు ద్వితీయశ్రేణి జట్టును పంపాలని బీసీసీఐ నిర్ణయించకున్నట్లు సమాచారం. ఈ జట్టుకు శిఖర్ ధావన్ సారధ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. ఆసియా క్రీడలకు భారత జట్టును బీసీసీఐ మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీసీఐ జూలై 15లోగా ఆటగాళ్ల జాబితాను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, జితేష్ శర్మతో పాటు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్, తిలక్ వర్మలకు ఆసియా గేమ్స్‌కు వెళ్లే భారత జట్టులో చోటు దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆసియాక్రీడలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా వంటి స్టార్ క్రికెటర్లు దూరంగా ఉండనున్నారు. ఈ ఆసియా గేమ్స్ సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు జరగనున్నాయి. విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: IND vs WI: ఎలక్ట్రీషియన్ కుటుంబంలో పుట్టి టీమిండియాలోకి.. క్రికెట్ కిట్ కొనడానికి కూడా అప్పు చేసి! హ్యాట్సాఫ్ తిలక్ -
Asian Games: శిఖర్ ధావన్ కాదా!? టీమిండియా కెప్టెన్‌గా అతడు..!
Asian Games 2023: చైనాలో ఈ ఏడాది జరుగనున్న ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్లను పంపేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్-2023 మొదలుకానున్న నేపథ్యంలో మెన్స్ క్రికెట్‌కు సంబంధించి ద్వితీయ శ్రేణి జట్టును పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అత్యుత్తమ క్రికెటర్ పీటీఐతో మాట్లాడిన సందర్భంగా... టీమిండియా- బీ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ అయితే బాగుంటుందని డీకే వ్యాఖ్యానించాడు. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు సారథ్యం వహించే అర్హత అశూకు ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘అత్యుత్తమ, గొప్ప క్రికెటర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్‌కు కచ్చితంగా స్థానం ఉంటుంది. అశ్విన్- దినేశ్ కార్తిక్ ఆ హక్కు తనకు ఉంది.. అర్హుడు కూడా కనీసం ఒక్కసారైనా టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం అతడికి రావాలి. అందుకు అతడు వందకు వందశాతం అర్హుడే. ఆ హక్కు తనకి ఉంది’’అని డీకే పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్-2023లో టీమిండియా వికెట్ కీపర్ రేసులో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని 36 ఏళ్ల దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా వెస్టిండీస్ పర్యటనతో బిజీకానుంది. జూలై 12 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు భారత ఆటగాళ్లు కరేబియన్ గడ్డపై అడుగుపెట్టారు. కాగా విండీస్‌తో టెస్టు జట్టులో వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ అశ్విన్‌కు స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 23- అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: WC 2023: గొప్ప బ్యాటర్వే! కానీ నీకసలు బుర్ర లేదు.. WC 2023: వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చిన స్కాట్లాండ్! మరీ ఘోరంగా.. -
ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ!
గతేడాది డిసెంబరులో ఆఖరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఛట్టోగ్రామ్ వేదికగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడాడు. ఆ తర్వాత గబ్బర్‌కు జట్టులో చోటు కరువైంది. మెరుగైన ప్రదర్శన ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ సారథిగా అవతారమెత్తిన శిఖర్ ధావన్.. బ్యాటర్‌గా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆడిన 11 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 373 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో అతడి అత్యధిక స్కోరు 99 నాటౌట్. అయితే, బ్యాటర్‌గా సఫలమైనప్పటికీ కెప్టెన్‌గా గబ్బర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అడపా దడపా టీమిండియా సారథిగా వ్యవహరించిన అతడు.. ఐపీఎల్లో పంజాబ్‌ను కనీసం టాప్-5లో కూడా నిలపలేకపోయాడు. ఐపీఎల్ పదహారో ఎడిషన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో పంజాబ్ కేవలం ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆర్నెళ్లుగా జట్టుకు దూరం ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ ఈసారి ఏకంగా కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు అతడు సారథిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ధావన్ నేతృత్వంలో ద్వితీయశ్రేణి జట్టు హాంగ్జూకు వెళ్లనున్నట్లు సమాచారం. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా రీఎంట్రీ! ప్రధాన జట్టు ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండనున్న తరుణంలో.. సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు నిర్వహించనున్న ఆసియా క్రీడలకు బీ-టీమ్‌ను పంపే యోచనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ జట్టుకు కెప్టెన్ ధావన్, హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. టీమిండియా జూలై 12 - ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనలో గడుపనుంది. చదవండి: WC 2023: వెస్టిండీస్ కొంపముంచిన జింబాబ్వే! ఇక ఆశలు వదులుకోవాల్సిందే! టీమిండియాతో టెస్టులకు సై.. కెప్టెన్‌గా బ్రాత్‌వైట్.. వాళ్లంతా జట్టుకు దూరం -
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మనసు మార్చుకున్న బీసీసీఐ! మరోసారి పాక్‌తో
ఏషియన్ గేమ్స్(ఆసియా క్రీడలు)-2023కు చైనా అతిధ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. చైనాలోని హాంగ్జౌ నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఈ పోటీలు జరుగనున్నాయి. అయితే ఈసారి ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను భాగం చేశారు. ఆసియా గేమ్స్‌లో క్రికెట్‌ను ఇప్పటివరకు కేవలం రెండు సార్లు మాత్రమే చేర్చారు. చివరగా 2010, 2014 ఆసియా క్రీడలలో క్రికెట్‌ను భాగం చేశారు. అయితే ఈ క్రీడల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, శ్రీలంక వంటి క్రికెట్ జట్లు ఆడినప్పటికీ.. భారత క్రికెట్ జట్టు మాత్రం ఒక్క సారి కూడా పాల్గొనేలేదు. అయితే ఈ సారి కూడా తమ బీజీ షెడ్యూల్ కారణంగా ఆసియాక్రీడల్లో భారత క్రికెట్ జట్టు భాగం కాదని బీసీసీఐ గతంలో తెలిపింది. కానీ బీసీసీఐ ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న ఆసియా గేమ్స్‌కు భారత పురుష, మహిళ జట్లను పంపించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరగనుంది. అయితే ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఆసియా క్రీడలకు భారత ద్వితీయ శ్రేణి జట్టును పంపనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ టోర్నీలో భారత మహిళల జట్టు కూడా పాల్గోనుంది. ఆసియాక్రీడలకు సీనియర్ మహిళల జట్టునే బీసీసీఐ పంపే ఛాన్స ఉంది. జూన్ 30లోపు బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి ఆటగాళ్ల జాబితాను పంపనున్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్-పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఆసియాకప్-2023లో దాయుదులు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ ఏడాది ఆసియాకప్ ఆగస్టు 31 నుంచి శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా జరగనుంది. చదవండి: #CWCQualifiers2023: కెప్టెన్ వీరోచిత శతకం.. జోరు మీదున్న స్కాట్లాండ్, వరుసగా రెండో విజయం -
హర్షనీయం.. ఒక్క బౌట్తోనే అర్హతకు అవకాశం
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై కొన్ని నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్న స్టార్ రెజ్లర్లకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్‌హక్ కమిటీ గొప్ప ఊరటనిచ్చింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం నిర్వహించే ట్రయల్స్‌లో ఆరుగురు రెజ్లర్లకు కేవలం ఒకే బౌట్ ద్వారా అర్హత పొందే అవకాశం కల్పించింది. స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, సంగీత ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, బజరంగ్ పూనియా, జితేందర్ కిన్హాలు మిగతా సెలక్షన్ ట్రయల్స్ విజేతలతో తలపడి గెలిస్తే చాలు ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు దీనికి సంబంధించిన ట్రయల్స్ నిర్వహిస్తారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన వీరంతా కేంద్ర క్రీడాశాఖను నేరుగా ఆయా క్రీడల్లో పాల్గొనే వెసులుబాటు కల్పించాలని కోరారు. దీంతో స్టార్ రెజ్లర్ల విన్నపాన్ని కేంద్ర క్రీడాశాఖ, ఐఓఏ మన్నించాయి. అయితే ఈ నామమాత్ర బౌట్‌పై ఇతర ఔత్సాహిక రెజ్లర్లు విమర్శిస్తున్నారు. -
భారత అథ్లెట్లకు మూడు పతకాలు
యెచోన్ (కొరియా): ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. మహిళల 400 మీటర్ల విభాగంలో రెజోనా మలిక్ హీనా, పురుషుల డిస్కస్ త్రోలో భరత్‌ప్రీత్ సింగ్ బంగారు పతకాలు సాధించారు. మహిళల 5000 మీటర్ల విభాగంలో అంతిమా పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 16 ఏళ్ల రెజోనా 53.31 సెకన్లలో లక్ష్యానికి చేరింది. భరత్‌ప్రీత్ డిస్‌్కను 55.66 మీటర్ల దూరం విసిరి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ఇక అంతిమ పాల్ 17 నిమిషాల 17.11 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. అరువు ‘పోల్’తో... పోల్ వాల్ట్ ఈవెంట్లో భారత ఆటగాడు దేవ్ కుమార్ మీనాకు నిరాశ ఎదురైంది. ఎయిరిండియా నిర్వాకంతో అరువుతెచ్చిన ‘పోల్’ (పొడవాటి కర్ర)తో పోటీపడాల్సి రావడంతో అతను మూడు ప్రయత్నాల్లోనూ 4.50 మీటర్ల ఎత్తును అందుకోలేకపోయాడు. 18 ఏళ్ల దేవ్ రోజూ ప్రాక్టీసు చేసుకునే పోల్‌ను ఎయిరిండియా సిబ్బంది సాంకేతిక కారణాలతో అనుమతించలేదు. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య నిర్వాహకులకు సమాచారమిచ్చి పోల్‌ను సమకూర్చాల్సిందిగా కోరింది. -
జోరు వర్షంలోనూ ఆగని పరుగు.. గెలిచినోళ్ల కంటే ఎక్కువ పేరు
ఆటపై ఇష్టం.. గెలవాలన్న పట్టుదల ఉంటేనే ఛాంపియన్స్‌గా నిలుస్తారని అంటారు. అంతిమంగా ఆటలో ఒకరే ఛాంపియన్ కావొచ్చు..ఒకవేళ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైనా చివరి వరకు పోటీలో ఉండాలని కోరుకుంటారు కొందరు. ఆ కొందరి నుంచి పుట్టిందే కంబోడియాకు చెందిన అథ్లెట్ బౌ సామ్నాంగ్. ఓటమి ఖరారైనా జోరు వర్షంలోనూ సామ్నాంగ్ తన పరుగును ఆపలేదు. 5000 మీటర్ల రేసును వర్షంలోనే పూర్తి చేసి ఆటపై తనకున్న మక్కువను చూపించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యం దిశగా సాగి గెలవాలన్న తన పట్టుదలను పరిచయం చేసింది. తోటి అథ్లెట్లు పక్కకు తప్పుకున్నా తాను మాత్రం లక్ష్యాన్ని వీడలేదు. అందుకే రేసులో గెలిచిన అథ్లెట్ కంటే బౌ సామ్నాంగ్కు ఎక్కువ పేరొచ్చింది. 22 నిమిషాల 52 సెకన్లలో రేసు పూర్తి చేసిన అనంతరం సామ్నాంగ్ ఎమోషనల్ అయింది. దేశ జాతీయ జెండాతో అక్కడున్న వారికి అభివాదం చేసింది. జోరు వర్షంలోనూ తన పరుగుకు మద్దతిచ్చిన అభిమానులకు కృతజ్క్షతలు తెలిపింది. రేసులో బౌ సామ్నాంగ్ ఓడినా అభిమానుల మనసులను మాత్రం గెలుచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బౌ సామ్నాంగ్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. కంబోడియా రాజధాని నమ్ పెన్ నగరంలో జరిగిన సౌత్ఈస్ట్ ఏషియన్ గేమ్స్‌లో ఈ అద్బుతం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన 5000 మీటర్ల రేసులో వియత్నాంకు చెందిన గుయన్ తి వోనా విజేతగా నిలిచింది. ఇక రేసు అనంతరం కంబోడియా ప్రధాని హున్ సన్.. బౌ సామ్నాంగ్ అంకితభావానికి ముచ్చటపడి 10వేల డాలర్లను రివార్డుగా ఇవ్వడం విశేషం. బౌ సామ్నాంగ్ను ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోసీ) ఆకాశానికెత్తింది. రేసు ఓడిపోయి ఉండొచ్చు.. తన అంకితభావంతో విజేతను మించిపోయింది అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం బౌ సామ్నాంగ్ రేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Even if you're in last place. 🏃 Even if the weather is terrible. 🌧️ Even if it feels like you can't do it. 🚫 𝙉𝙚𝙫𝙚𝙧 𝙜𝙞𝙫𝙚 𝙪𝙥 💪 Nothing was going to stop Cambodia's Bou Samnang 🇰🇭 from finishing the women's 5,000 metre race at the #SEAGames. pic.twitter.com/iVMxwqVrFQ — The Olympic Games (@Olympics) May 9, 2023 View this post on Instagram A post shared by The Guardian (@guardian) -
Asian Games 2023: ఆసియా క్రీడలకు భారత బ్యాడ్మింటన్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ప్రకటించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–20లో ఉన్న వారిని నేరుగా ఎంపిక చేయగా... మిగతా బెర్త్‌లను ఆదివారం ముగిసిన సెలెక్షన్ ట్రయల్స్ టోర్నీ ద్వారా ఖరారు చేశారు. భారత పురుషుల జట్టు: ప్రణయ్, శ్రీకాంత్, లక్ష్య సేన్, మిథున్ మంజునాథ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల–ఎంఆర్ అర్జున్, రోహన్ కపూర్, సాయిప్రతీక్. మహిళల జట్టు: పీవీ సింధు, అష్మిత, అనుపమ, మాళవిక, గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, సిక్కి రెడ్డి. -
BCCI: 'భారత క్రికెట్ జట్లను చైనాకు పంపించలేం'
ఈ ఏడాది చైనాలో జరగనున్న ఏషియన్ గేమ్స్‌కు భారత క్రికెట్ జట్లను(పురుషులు, మహిళలు) పంపించలేమని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫ్యూచర్ టూర్ ప్రోగామ్(ఎఫ్టీపీ)లో భాగంగా కొన్ని కమిట్మెంట్స్ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌ వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. గతేడాది బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌కు బీసీసీఐ మహిళల క్రికెట్ జట్టును పంపిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో ఓడిన హర్మన్ సేన సిల్వర్ మెడల్ గెలుచుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లానే ఏషియన్ గేమ్స్‌లోనూ ఈసారి క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. భారత ఏషియన్ గేమ్స్ చీఫ్ భుపేందర్ భజ్వా మాట్లాడుతూ.. ''చైనాలో జరగనున్న ఏషియన్ గేమ్స్‌లో అన్ని విభాగాల్లో ఎంట్రీ పేర్లు ఇచ్చాం.. ఒక్క క్రికెట్ తప్ప.. ఎందుకంటే క్రికెట్ జట్లను అక్కడికి పంపకూడదని బీసీసీఐ నిర్ణయించింది.'' అని తెలిపాడు. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ..''డెడ్‌లైన్‌కు ఒక్కరోజు ముందు మాకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నుంచి మెయిల్ వచ్చింది. కానీ అప్పటికే బీసీసీఐ ఎఫ్టీపీలో భాగంగా పరుషులు, మహిళల క్రికెట్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. ఏషియన్ గేమ్స్ సమయంలో ముఖ్యమైన మ్యాచ్‌లు ఉన్నాయి. అందుకే భారత క్రికెట్ జట్లను చైనాకు పంపించకూడదని నిర్ణయించుకున్నాం.'' అని పేర్కొన్నాడు. ఇక ఎఫ్టీపీ ప్రకారం టీమిండియా మెన్స్ జట్టు అక్టోబర్-నవంబర్ నెలల్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఆడనుంది. అదే సమయంలో మహిళల జట్టు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లతో సిరీస్‌లు ఆడనుంది. అయితే ఏషియన్ గేమ్స్ కూడా అప్పుడే జరుగుతున్నందున వేరే దారి లేక పోటీల్లో తాము పాల్గొనడం లేదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఒకవేళ ఏషియన్ గేమ్స్‌లో ఆడాలనుకుంటే బీసీసీఐకి ఒక దారి ఉంది. మహిళల క్రికెట్‌కు అవకాశం లేనప్పటికి.. పురుషుల క్రికెట్లో మాత్రం అందుకు ఆస్కారం ఉంది. వన్డే ప్రపంచకప్‌కు ఎలాగూ సీనియర్ జట్టు ఉంటుంది కాబట్టి.. ఏషియన్ గేమ్స్‌కు జూనియర్ జట్టును పంపిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ 1998లో కౌలలంపూర్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల జట్టు పాల్గొంది. అదే సమయంలో పాకిస్తాన్‌తో టొరంటోలో మరో టీమిండియా జట్టు వన్డే సిరీస్‌ను ఆడింది. తాజాగా 2021లో భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్ ఆడేందుకు వెళ్లగా.. శిఖర్ ధావన్ సారధ్యంలో జూనియర్ జట్టు శ్రీలంకలో వన్డే సిరీస్ ఆడింది. ఈ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఏషియన్ గేమ్స్‌కు ఇలాంటి స్ట్రాటజీని అమలు చేస్తే బాగుంటుందని.. పైగా ఏషియన్ గేమ్స్‌లో పతకం తేవడం దేశానికి కూడా గర్వకారణం అవుతుంది. కాగా హాంగ్జౌ వేదికగా ఏషియన్ గేమ్స్ గతేడాదే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. చదవండి: #Gary Balance: 'రెండు' దేశాల క్రికెటర్ రిటైర్మెంట్.. బ్రాడ్‌మన్‌తో పోల్చిన వైనం -
మేరీకోమ్ రిటైర్మెంట్ అప్పుడే..
ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయి. గతేడాది కామన్వెల్త్ క్రీడల సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా ఆమె ఎడమ మోకాలికి గాయమై శస్త్రచికిత్స చేయించుకుంది. అప్పటినుంచి మేరీకోమ్ బరిలోకి దిగలేదు. అయితే తాజాగా సెప్టెంబర్ 23న మొదలుకానున్న ఆసియా క్రీడల్లో పాల్గొనాలని మేరీకోమ్ భావిస్తోంది. అయితే నిబంధనల ప్రకారం 40 ఏళ్లు పైబడిన బాక్సర్లు పోటీల్లో పాల్గొనేందుకు ఆస్కారం లేదు. ఇప్పటికే మేరీకోమ్ వయస్సు 40 ఏళ్లు. ఈ ఏడాది నవంబర్‌లో మేరీకోమ్‌కు 41 ఏళ్లు నిండనున్నాయి. అందుకే బహుశా ఆమెకు ఆసియా క్రీడల్లో చివరిసారి బరిలోకి దిగే చాన్స్ ఉంది. కాగా ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మేరీకోమ్ పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ''కామన్వెల్త్ క్రీడల ట్రయల్స్ సందర్భంగా దురదృష్టవశాత్తూ గాయమైంది. శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. తిరిగి రింగ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.నాకు ఏడాది మాత్రమే మిగిలి ఉంది. వచ్చే ఏడాది రిటైర్ కావాల్సిందే. కాబట్టి వీడ్కోలుకు ముందు టోర్నీలో ఆడాలనుకుంటున్నా. మరో ఐదేళ్ల పాటు బాక్సింగ్ రింగ్‌లో కొనసాగాలని ఉన్నా నిబంధనల ప్రకారం 40 ఏళ్లు పైబడితే ఆటకు దూరమవక తప్పదు. ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం ఆసియా క్రీడలు. అప్పటివరకు పూర్తిగా కోలుకుంటాననే నమ్మకం ఉంది. ఒకవేళ ఆసియా క్రీడలకు అర్హత సాధించకపోతే చివరగా ఏదైనా అంతర్జాతీయ టోర్నీలో పోటీపడాలనుంది'' అని పేర్కొంది. -
Union Budget 2023-2024: క్రీడారంగాన్ని కరుణించిన నిర్మలమ్మ
Union Budget: 2023-2024 కేంద్ర బడ్జెట్లో క్రీడారంగానికి పెద్దపీట లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (ఫిబ్రవరి 1) లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్రీడారంగానికి గతేడాదితో పోలిస్తే కేటాయింపులు ఓ మోస్తరుగా పెరిగాయి. 2022-23 బడ్జెట్లో క్రీడా రంగానికి రూ. 3062 కోట్ల మేర కేటాయింపులు జరగ్గా.. ఈ ఏడాది అది రూ. 3397 కోట్లకు (రూ. 334.72 కోట్ల పెరుగుదల) పెరిగింది. Sports Budget: Rs 3397.32 crore allocated to Sports in Union Budget 2023-2024 (⬆️ Rs 334.72 crore) Sports Budget Allocation 2023-24: ➡️ Khelo India: Rs 1045 Cr ➡️ SAI: 785.52 Cr ➡️ National Sports Feds: 325 Cr ➡️ NSS: 325 Cr ➡️ National Sports Development Fund: Rs 15 Cr — India_AllSports (@India_AllSports) February 1, 2023 గత ఐదేళ్ల కాలంలో కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి ఏటా ఓ మోస్తరుగా నిధులు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది ఆసియా క్రీడలు, వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో క్రీడా రంగానికి ప్రాధాన్యత పెరిగింది. బడ్జెట్ చరిత్రలో క్రీడారంగానికి ఈ స్థాయిలో నిధులు మంజూరు కావడం ఇదే మొదటిసారి. గతేడాది మంజూరైన రూ. 3062 కోట్లే ఇప్పటివరకు రికార్డుగా ఉండింది. తాజా బడ్జెట్లో నిర్మలమ్మ క్రీడలను కరుణించడంతో ఆ రికార్డు బద్ధలైంది. Sports Budget for the last 5 years: 2018-19 - ₹2197 crore 2019-20 - ₹2776 crore 2020-21 - ₹2826 crore 2021-22 - ₹2596 crore 2022-23 - ₹3062 crore This year’s budget allocation 𝟮𝟬𝟮𝟯-𝟮𝟰 - ₹𝟯𝟯𝟵𝟳 𝗰𝗿𝗼𝗿𝗲📈 — Enakshi Rajvanshi (@enakshi_r) February 1, 2023 స్పోర్ట్స్ బడ్జెట్లో ఎవరికి ఎంత..? ఖేలో ఇండియా: రూ. 1045 కోట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్): రూ. 785.52 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్: రూ. 325 కోట్లు నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎన్ఎస్): రూ. 325 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్: రూ. 15 కోట్లు -
Asian Games: ఆసియా క్రీడల రీషెడ్యూల్.. తేదీలు ఖరారు!
Asian Games- కువైట్ / బీజింగ్: వాయిదా పడిన ఆసియా క్రీడల్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించేలా రీషెడ్యూల్ చేశారు. నిజానికి చైనా ఆతిథ్యమిచ్చే ఈ ఆసియా మెగా ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు జరగాల్సింది. కానీ ఆ దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదల, వైరస్‌లో కొత్త స్పైక్ కలకలంతో ఆసియా గేమ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు మే 6న ప్రకటించారు. గత రెండు నెలలుగా పలు దఫా చర్చల అనంతరం తాజాగా రీషెడ్యూలును వెల్లడించారు. ‘ఆసియా క్రీడలు తిరిగి నిర్వహించేందుకు టాస్క్‌ఫోర్స్ రెండు నెలలుగా కృషిచేస్తోంది. చైనీస్ ఒలింపిక్ కమిటీ, హాంగ్జౌ ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ చర్చలు జరిపింది. మరో మేజర్ ఈవెంట్ నిర్వహణకు ఏ ఇబ్బంది లేకుండా తేదీల్ని ఖరారు చేయాలని నిర్ణయించింది’ అని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: Babar Azam: కోహ్లిని తలపిస్తున్న పాక్ కెప్టెన్.. ఖాతాలో మరో మైలురాయి -
చైనాలో కరోనా తీవ్రత.. ప్రతిష్టాత్మక క్రీడలు వాయిదా!
Asian Games 2022: చైనాలో కోవిడ్-19 భయాల నేపథ్యంలో ఆసియా క్రీడలు-2022 వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘ఈ ఏడాది సెప్టెంబరు 10 నుంచి 25 వరకు చైనాలోని హాంగ్జౌ నగరంలో నిర్వహించాల్సిన 19వ ఆసియా క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలిపింపిక్ కౌన్సిల్ ప్రకటించింది’’ అని పేర్కొంది. తదుపరి తేదీలను మరికొన్ని రోజుల్లో వెల్లడించనున్నట్లు తెలిపింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం చైనాలో మరోసారి కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక షాంఘై నగరానికి సమీపంలోని హాంగ్జౌలో ఇప్పటికే ఆసియా, పారా క్రీడల కోసం 56 వేదికలు నిర్మించినట్లు నిర్వాహకులు గతంలో పేర్కొన్నారు. కాగా కరోనా తీవ్రత నేపథ్యంలో షాంఘైలో గత కొద్ది రోజులుగా లాక్డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడ బలవంతంగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారంటూ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న తరుణంలో పాలకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి👉🏾David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్ కదూ! -
పరిస్థితులను బట్టి ‘ఏషియాడ్’పై నిర్ణయం: ఠాకూర్
ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగే ఆసియా క్రీడల్లో భారత్ బరిలోకి దిగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని... ఈ మెగా ఈవెంట్ సన్నాహాలపై ఆతిథ్య చైనా దేశం నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం చైనాలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఒకవేళ కరోనా కేసులు నియంత్రణలోకి రాకపోతే మాత్రం ఆసియా క్రీడలు వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. -
ఆసియా క్రీడల్లో ఆడలేమన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
మెల్బోర్న్: పోటీతత్వం మరింత మెరుగు పడాలనే ఉద్దేశంతో... ఆసియా దేశాలు కాకపోయినా... ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆడాలని ఒసియానియా దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఆహ్వానించింది. ఈ రెండు దేశాల కోసం 300 అథ్లెట్ల కోటా కింద ఒక్కో దేశానికి 150 మంది చొప్పున పంపాలని ఓసీఏ కోరింది. అయితే ఓసీఏ ఆహ్వానాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒలింపిక్ కమిటీలు తిరస్కరించాయి. ఆసియా క్రీడల్లో తమ దేశాల క్రీడాకారులను పంపించలేమని తెలిపాయి. -
సైనా నెహ్వాల్ కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: ఈ ఏడాది బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో... భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునే అవకాశం కనిపించడంలేదు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, థామస్ కప్ –ఉబెర్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేసేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్వహించే సెలెక్షన్ ట్రయల్స్‌కు దూరంగా ఉండాలని 23వ ర్యాంకర్ సైనా నిర్ణయించుకుంది. ఈ మేరకు ఈనెల 15న నుంచి 20 వరకు జరిగే ట్రయల్స్‌కు దూరంగా ఉంటున్నానని సైనా ‘బాయ్’కు లేఖ రాసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో టాప్–15 లో ఉన్నవారికి నేరుగా చోటు లభిస్తుందని... 16 నుంచి 50 ర్యాంకింగ్స్‌లో ఉన్న వారు ట్రయల్స్‌కు హాజరుకావాలని ‘బాయ్’ తెలిపింది. చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ -
Nikhat Zareen: ఒలింపిక్స్ పతక విజేత లవ్లీనాతో పాటు మన అమ్మాయి కూడా
Asian Games- Telangana Boxer Nikhat Zareen- న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ కోసం నిర్వహించిన ట్రయల్స్ ఫైనల్లో నిఖత్ (51 కేజీల విభాగం) 7–0 తేడాతో మంజురాణిపై ఘన విజయం సాధించింది. ఇటీవలే స్ట్రాండ్జా మెమోరియన్ టోర్నీలో విజేతగా నిలిచిన నిఖత్... ఏషియాడ్‌లోనూ సత్తా చాటుతానని నమ్మకంతో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 10–25 వరకు చైనాలోనూ హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతాయి. నిఖత్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), జాస్మీన్ (60 కేజీ), మనీశా (57 కేజీ), సవీటీ బూరా (75 కేజీ) కూడా ఆసియా క్రీడలకు క్వాలిఫై అయ్యారు. స్వర్ణపతకంతో తిరిగి రావాలి ఏషియాడ్‌కు అర్హత సాధించిన నిఖత్ జరీన్‌ను అభినందించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి... ఆమె స్వర్ణపతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్ శర్మ -
బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన నిర్ణయం
Mary Kom To Skip World Championships And Asian Games: ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. యువ తరానికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌తో పాటు ఆసియా క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌పై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మేరకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ)కి లేఖ ద్వారా తెలియజేసింది. మేరీ కోమ్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపారు. కాగా, ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ ఈ ఏడాది మే 6 నుంచి 21 వరకు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరగనున్నాయి. అలాగే, జులై 28 నుంచి కామన్వెల్త్ క్రీడలు, సెప్టెంబరు 10 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. చదవండి: IPL2022: సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. రాజస్థాన్ రాయల్స్‌తో మొదలై..! -
Praveen Kumar Sobti: స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచిన అథ్లెట్..భీముడిగా గుర్తింపు
Praveen Kumar Sobti:- న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విజేయుడు... ‘మహాభారత్’లో భీముడు ప్రవీణ్ కుమార్ సోబ్టీ కన్నుమూశారు. 74 ఏళ్ల ప్రవీణ్ సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. పంజాబ్‌కు చెందిన ప్రవీణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో డిస్కస్ త్రో, హ్యామర్ త్రో ఈవెంట్లలో పతకాలు నెగ్గిన ఈ అలనాటి దిగ్గజం ఓ క్రీడాకారుడిగా కంటే విలక్షణ నటుడిగా సుపరిచితం. ఇప్పుడు ఒక్క కాంస్య పతకంతోనే రాత్రికి రాత్రే స్టార్ అవుతుండగా... ఆ కాలంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో విజయవంతమైన అథ్లెట్‌గా ఎదిగారు. అయినప్పటికీ క్రీడల్లో రాని గుర్తింపు, పేరు ప్రతిష్టలు ఒక్క ‘మహాభారత్’ సీరియల్‌తోనే వచ్చాయి. ఇవీ ఆయన ఘనతలు ►అమృత్‌సర్‌లో 1947 డిసెంబర్ 6న పుట్టిన ప్రవీణ్ 1960 నుంచి 1974 వరకు పలు మెగా ఈవెంట్లలో పతకాలతో మెరిశారు. ►1966 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో చాంపియన్‌గా నిలిచిన ప్రవీణ్ హ్యామర్ త్రోలో కాంస్యం నెగ్గారు. ►అదే ఏడాది కింగ్‌స్టన్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో హ్యామర్ త్రోలో రజతం గెలుపొందారు. ►1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రో ఈవెంట్లో టైటిల్ నిలబెట్టుకున్న ప్రవీణ్ 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో రజతం గెలిచారు. ►1968 మెక్సికో, 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ ప్రవీణ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారతంలో భీముడు దూరదర్శన్‌లో 90వ దశకంలో ప్రసారమైన సుప్రసిద్ధ పౌరాణిక ధారావాహిక ‘మహాభారత్’లో పంచ పాండవుల్లో భీముడిగా ప్రవీణ్ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తదనంతరం పలు హిందీ, తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించారు. 2013లో రాజకీయాల్లోనూ ప్రవేశించి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలోని వాజిర్పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. చదవండి: IND VS WI 2nd ODI: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..! -
బడ్జెట్లో క్రీడలకు రూ.3,062 కోట్లు.. 305.58 కోట్లు పెరిగింది!
Union Budget 2022: 3062 Crores Allocated For Sports : కేంద్ర బడ్జెట్లో క్రీడలకు కేటాయింపులు పెంచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో క్రీడల కోసం రూ. 3,062.60 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చుకుంటే రూ. 305.58 కోట్లు పెరిగింది. టోక్యో ఒలింపిక్స్‌లో పెరిగిన పతకాల సంఖ్యతోపాటు ‘ఖేలో ఇండియా’కు మరింత ఊతమిచ్చేందుకు బడ్జెట్ నిధుల్ని పెంచారు. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో రూ.2596.14 కోట్లు కేటాయించగా తర్వాత దీన్ని రూ.2757.02 కోట్లకు సవరించారు. కామన్వెల్త్ క్రీడలు (బర్మింగ్‌హామ్), ఆసియా క్రీడల (హాంగ్జౌ) రూపంలో ఈ ఏడాది రెండు మెగా ఈవెంట్లున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటాయింపుల్ని గణనీయంగా పెంచినట్లు తెలిసింది. మొత్తం క్రీడల బడ్జెట్లో ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 974 కోట్లు (గతంలో రూ. 657.71 కోట్లు), ప్రోత్సాహక అవార్డులు, రివార్డుల కోసం రూ.357 కోట్లు (గతంలో రూ.245 కోట్లు), స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి రూ. 653 కోట్లు కేటాయించారు. జాతీయ క్రీడాభివృద్ధి నిధిని రూ. 9 కోట్ల నుంచి 16 కోట్లకు పెంచారు. అయితే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల కోసం గతంలో లాగే ఈసారి రూ. 280 కోట్లు కేటాయించారు. చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా -
ఆసియా క్రీడలపైనే దృష్టి: కెప్టెన్
ఈ ఏడాది భారత పురుషుల హాకీ జట్టు ప్రధాన లక్ష్యం ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి 2024 పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడమేనని కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించాడు. వచ్చే నెలలో మొదలయ్యే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు సన్నాహకంగా భావిస్తామని మన్‌ప్రీత్ తెలిపాడు. భువనేశ్వర్‌లో జరిగే ప్రొ హాకీ లీగ్‌లో స్పెయిన్, జర్మనీ, అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో భారత్ ఆడుతుంది. చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్ చేసిన ధావన్ -
ఆర్ఆర్ఆర్ సినీ ప్రియులకు.. అయితే, కెకెకె క్రీడాభిమానులకు.. కాస్కో... చూస్కో...
సాక్షి క్రీడా విభాగం: ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్. తెగ ఆకర్షిస్తోంది. ఇది పూర్తిగా సినీ ప్రియులకు సంబంధించిన వ్యవహారం. అలాగే ఈ ఏడాది కె.కె.కె (క్రికెట్... క్రీడలు... ఖేల్) కూడా కనీవినీ ఎరుగని రీతిలో అలరించేందుకు, అదరగొట్టేందుకు, బ్రహ్మాండాన్ని బద్దలు చేసేందుకు ముస్తాబైంది. ఈ కె.కె.కె ప్రత్యేకతలు తెలుసుకుందాం. క్రికెట్ విషయానికొస్తే ఐపీఎల్ మెగా వేలం నుంచి లీగ్ దాకా, అలాగే పురుషుల టి20 ప్రపంచకప్, కుర్రాళ్లు (అండర్–19), అమ్మాయిల ప్రపంచకప్ (వన్డే)లు, ఇతరత్రా టోర్నీలున్నాయి. క్రీడలు... అంటే ఈ ఏడాది జరగబోయే మెగా ఈవెంట్స్ అన్నీ లోకాన్నే మైదానంలో కూర్చోబెట్టేంత రద్దీతో ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ఫుట్‌బాల్ ప్రపంచకప్, వింటర్ ఒలింపిక్స్ ఇలా దేనికదే తీసిపోనంత ప్రతిష్టాత్మక ఈవెంట్లు. అన్నీ సై అంటే సై అనే క్రీడలే! ఖేల్... అంటే క్రికెట్, మెగా ఈవెంట్లు కాకుండా జరిగే టోర్నీలు. ప్రపంచ అథ్లెటిక్స్, ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు, ప్రపంచ ఆర్చరీకప్, ప్రపంచకప్ షూటింగ్ పోటీలతో పాటు రెగ్యులర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు, బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్, ఫార్ములావన్ రేసింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ పంచ్‌లతో ఈ పన్నెండు నెలలు పండంటి వినోదమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ► అండర్–19 క్రికెట్ వరల్డ్‌కప్ వేదిక: వెస్టిండీస్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు ► మహిళల క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ వేదిక: న్యూజిలాండ్ మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ► భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ దక్షిణాఫ్రికాలో పర్యటన జనవరి 3 నుంచి 23 వరకు 2 టెస్టులు, 3 వన్డేలు ► ఐపీఎల్–2022 మెగా వేలం వేదిక: బెంగళూరు ఫిబ్రవరి 12, 13 ► భారత్‌లో వెస్టిండీస్ పర్యటన ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ► భారత్‌లో శ్రీలంక పర్యటన ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు 2 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు ► భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన జూన్ 9 నుంచి 19 వరకు 5 టి20 మ్యాచ్‌లు ► ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన జూలై 1 నుంచి 17 వరకు 1 టెస్టు, 3 టి20లు, 3 వన్డేలు ► న్యూజిలాండ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఫిబ్రవరి 5 నుంచి 24 వరకు 1 టి20 మ్యాచ్, 5 వన్డేలు ► ఫార్ములావన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1)లో మొత్తం 23 రేసులు జరుగుతాయి. మార్చి 20న బహ్రెయిన్ గ్రాండ్‌ప్రితో ఎఫ్1 సీజన్ మొదలవుతుంది. అనంతరం సౌదీ అరేబియా (మార్చి 27), ఆస్ట్రేలియా (ఏప్రిల్ 10), ఇటలీ (ఏప్రిల్ 24), మయామి–యూఎస్ఏ (మే 8), స్పెయిన్ (మే 22), మొనాకో (మే 29), అజర్బైజాన్ (జూన్ 12), కెనడా (జూన్ 19), బ్రిటన్ (జూలై 3), ఆస్ట్రియా (జూలై 10), ఫ్రాన్స్ (జూలై 24), హంగేరి (జూలై 31), బెల్జియం (ఆగస్టు 28), నెదర్లాండ్స్ (సెప్టెంబర్ 4), ఇటలీ (సెప్టెంబర్ 11), రష్యా (సెప్టెంబర్ 25), సింగపూర్ (అక్టోబర్ 2), జపాన్ (అక్టోబర్ 9), ఆస్టిన్–యూఎస్ఏ (అక్టోబర్ 23), మెక్సికో (అక్టోబర్ 30), బ్రెజిల్ (నవంబర్ 13) గ్రాండ్‌ప్రి రేసులు ఉన్నాయి. చివరగా నవంబర్ 20న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో సీజన్ ముగుస్తుంది. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: ఇస్తాంబుల్ (టర్కీ) మే 6 నుంచి 21 వరకు ► వింటర్ ఒలింపిక్స్ వేదిక: బీజింగ్ (చైనా) ఫిబ్రవరి 4–20 పాల్గొనే దేశాలు: 84 ► కామన్వెల్త్ గేమ్స్ వేదిక: బర్మింగ్హమ్ (ఇంగ్లండ్) జూలై 28–ఆగస్టు 8 ► కామన్వెల్త్ గేమ్స్ వేదిక: బర్మింగ్హమ్ (ఇంగ్లండ్) జూలై 28–ఆగస్టు 8 ► ఆసియా క్రీడలు వేదిక: హాంగ్జౌ (చైనా) సెప్టెంబర్ 10–25 ► ఫుట్‌బాల్ ప్రపంచకప్ వేదిక: ఖతర్ నవంబర్ 21–డిసెంబర్ 18 పాల్గొనే జట్లు: 32 ► ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వేదిక: ఒరెగాన్ (అమెరికా) జూలై 15–24 ► ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు వేదిక: చెంగ్డూ (చైనా) జూన్ 26–జూలై 7 ► ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ వేదిక: బెల్గ్రేడ్ (సెర్బియా); సెప్టెంబర్ 10–18 ► పురుషుల టి20 క్రికెట్ వరల్డ్‌కప్ వేదిక: ఆస్ట్రేలియా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 షూటింగ్ ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: రబాట్ (మొరాకో); ఫిబ్రవరి 7–18 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ వేదిక: కైరో (ఈజిప్ట్); ఫిబ్రవరి 26–మార్చి 8 ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: నికోసియా (సైప్రస్); మార్చి 8–19 ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: లిమా (పెరూ); మార్చి 27–ఏప్రిల్ 7 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ వేదిక: రియో డి జనీరో (బ్రెజిల్); ఏప్రిల్ 9–19 ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: లొనాటో (ఇటలీ); ఏప్రిల్ 19–30 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ వేదిక: బాకు (అజర్బైజాన్); మే 27–జూన్ 9 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ వేదిక: చాంగ్వాన్ (కొరియా); జూలై 9–22 ► ప్రపంచ షాట్‌గన్ చాంపియన్‌షిప్ వేదిక: క్రొయేషియా; సెప్టెంబర్ 27– అక్టోబర్ 10 ► ప్రపంచ రైఫిల్, పిస్టల్ చాంపియన్‌షిప్ వేదిక: కైరో (ఈజిప్ట్); అక్టోబర్ 12–25 ఆర్చరీ ► ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ వేదిక: అంటాల్యా; ఏప్రిల్ 18–24 ► ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ వేదిక: గ్వాంగ్జు; మే 16–22 ► ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ వేదిక: పారిస్ (ఫ్రాన్స్); జూన్ 20–26 ► ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీ వేదిక: మెడెలిన్ (కొలంబియా); జూలై 18–24 బ్యాడ్మింటన్ ► ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నీ వేదిక: న్యూఢిల్లీ జనవరి 11–16 ► సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీ వేదిక: లక్నో జనవరి 18 –23 ► ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: బర్మింగ్హమ్; మార్చి 16 –20 ► థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ వేదిక: బ్యాంకాక్; మే 8 –15 ► ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: జకార్తా;జూన్ 14 –19 ► ప్రపంచ చాంపియన్‌షిప్ వేదిక: టోక్యో; ఆగస్టు 21 –28 ► వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ వేదిక: గ్వాంగ్జౌ;డిసెంబర్ 14 –18 ► టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదిక: మెల్బోర్న్ జనవరి 17–30 ► ఫ్రెంచ్ ఓపెన్ వేదిక: పారిస్ మే 22– జూన్ 5 ► వింబుల్డన్ ఓపెన్ వేదిక: లండన్; జూన్ 27–జూలై 10 ► యూఎస్ ఓపెన్ వేదిక: న్యూయార్క్; ఆగస్టు 29–సెప్టెంబర్ 11 -
కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకున్న భారత జట్లు
న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్ క్రీడల బరి నుంచి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తప్పుకున్నాయి. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానంద్రో నింగోంబం మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కామన్వెల్త్ గేమ్స్ బరి నుంచి తప్పుకున్న భారత జట్లు.. ఆసియా క్రీడలపై దృష్టిసారించనున్నాయని నింగోంబం తెలిపారు. ఆసియా క్రీడల్లో చక్కని ప్రదర్శన కనబరిస్తే 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు కానుందని, అందుకే కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, 2022 జులైలో కామన్వెల్త్ క్రీడలు, ఆగస్టులో ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రాంక్ చేసి భార్యను బెదరగొట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. -
ఆసియా క్రీడల్లోనూ బ్రేక్ డ్యాన్స్
న్యూఢిల్లీ: బ్రేక్ డ్యాన్స్ అంటే తెలుగువారికి ఠక్కున గుర్తొచ్చేవి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు. చిత్రగీతాల్లో బ్రేక్ డ్యాన్స్‌ను ఎప్పుడో చూశాం. ఈ డ్యాన్స్‌తోనే చిరంజీవి తెలుగు చిత్రసీమను ఏలారు. ఇప్పుడు ఈ డ్యాన్స్ కోసం చిరంజీవి పాత పాటల్ని, సినీ పాటల్ని చూడాల్సిన అవసరం లేదు. ఆసియా క్రీడలను చూసినా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్ ఆటలపోటీ అయింది. చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమివ్వనున్న 2022 ఆసియా క్రీడల్లోనూ బ్రేక్ డ్యాన్స్‌ను మెడల్ ఈవెంట్‌గా చేర్చారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ బ్రేక్ డ్యాన్స్‌ను మెడల్ ఈవెంట్‌గా ఖరారు చేస్తూ ఇటీవలే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఈ–స్పోర్ట్స్ (ఎల్రక్టానిక్ క్రీడలు) కూడా మెడల్ ఈవెంట్‌గా మారింది. ఈ–స్పోర్ట్స్ ఆసియా క్రీడలకు కొత్తకాదు. 2007 మకావులో జరిగిన ఆసియా ఇండోర్ క్రీడల్లో తొలిసారిగా మెడల్ ఈవెంట్‌గా ఆడించారు. గత ఆసియా క్రీడల్లో (ఇండోనేసియా) కూడా ఈ–స్పోర్ట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ పతకాల పట్టికలో వాటిని పరిగణించలేదు. తాజా నిర్ణయంతో ఆసియా క్రీడలకు కొత్త ఈవెంట్లు మరింత వన్నె తీసుకొస్తాయని ఆశిస్తున్నట్లు ఓసీఏ డైరెక్టర్ హైదర్ ఫర్మాన్ చెప్పారు. -
దోహాలో 2030 ఆసియా క్రీడలు
మస్కట్ (ఒమన్): ఆసియా క్రీడలను రెండోసారి నిర్వహించే అవకాశాన్ని ఖతర్ రాజధాని దోహా దక్కించుకుంది. 2030 ఆసియా క్రీడలకు దోహా ఆతిథ్యం ఇవ్వనుంది. బుధవారం జరిగిన ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) సమావేశంలో ఓటింగ్ ద్వారా 2030, 2034 ఆసియా క్రీడల ఆతిథ్య నగరాలను ఎంపిక చేశారు. 2030 ఆసియా క్రీడల నిర్వహణ కోసం దోహా... సౌదీ అరేబియా రాజధాని రియాద్ పోటీపడ్డాయి. ఓటింగ్‌లో రియాద్‌ను వెనక్కినెట్టి దోహా ఆతిథ్య హక్కులను సంపాదించింది. రియాద్‌కు 2034 ఆసియా క్రీడల ఆతిథ్య హక్కులు కట్టబెట్టామని ఓసీఏ అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబా (కువైట్) ప్రకటించారు. గతంలో 2006లో దోహా తొలిసారి ఆసియా క్రీడలను నిర్వహించింది. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌలో... 2026 ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచి–నగోయా నగరాల్లో జరుగుతాయి. -
ఆ జంప్... ఆహా!
స్కూల్‌గేమ్స్‌లో అంజూ తొలి గెలుపు హర్డిల్స్‌లో! హర్డిల్స్ అంటే తెలుసుగా... అన్నీ దాటుకుంటూ సాగే పరుగు పందెం. ఈ పందెం అమె కెరీర్‌కు చక్కగా నప్పుతుంది. పాఠశాల స్థాయి పోటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల దాకా ఎదురొచ్చిన అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ చివరకు ప్రపంచ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. అంజూ బాబీ జార్జి ఎన్నో హర్డిల్స్నైతే అధిగమించింది కానీ... చరిత్రలో నిలిచింది మాత్రం హర్డిల్స్ క్రీడాంశంలో కాదు... లాంగ్‌జంప్‌తో! స్కూల్లో హర్డిల్స్‌తో మొదలైన తన ఆటల బాటలో రిలే, లాంగ్‌జంప్, హైజంప్, హెప్టాథ్లాన్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్లి చివరకు లాంగ్‌జంప్ వద్ద ఆగింది. ఈ జంప్‌తోనే ‘ప్రపంచ’ పతకాన్ని గెలిచింది. ఆ వెంటే ‘ఖేల్‌రత్న’ం వరించింది. కన్నోడు... కట్టుకున్నోడు... చిన్నారి అంజూ చురుకైంది. చదువులో తెలివైంది. ఆటల పోటీల్లో గెలుపు గుర్రంలాంటిది. అందుకే ఆమె కన్నతండ్రి తనకు పుట్టింది అమ్మాయేగా చదువొక్కటి అబ్బితే చాల్లే అని అనుకోలేదు. 40 ఏళ్ల క్రితం ఆయన అలా అనుకొని వుంటే 2003లో పారిస్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించేది కాదు. 1980లో ఆమెను చదువుకోవాలన్నాడు. పోటీపడతానంటే ‘సై’ అన్నాడు. దీంతో 1992లో స్కూల్ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్ చాంపియనైంది. తదనంతరం క్రీడాకారుడే భర్తగా రావడం ఆమె కెరీర్‌ను ఉన్నతస్థితికి తీసుకెళ్లింది. ఇలా ఆమె జీవితంలో కన్నతండ్రి కె.టి.మార్కోజ్, కట్టుకున్న భర్త బాబీ జార్జిలది అమూల్యమైన ప్రోత్సాహం. వరల్డ్ ఫైనల్స్ చాంపియన్.... రెండేళ్ల తర్వాత (2005) మొనాకోలోని మోంటెకార్లోలో ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్ టోర్నీ జరిగింది. ఇందులో ఆమె 6.75 మీటర్ల దూరం గెంతి రజతం గెలిచింది. కానీ ఆమె రిటైరయ్యాక... తొమ్మిదేళ్లయ్యాక ఆ పతకం రంగు మారింది. ఆ పోటీల్లో స్వర్ణం నెగ్గిన తాతియానా కొటోవా (రష్యా–6.83 మీటర్లు) 2014లో డోపింగ్‌లో దొరికిపోవడంతో నిర్వాహకులు ఆమె స్వర్ణాన్ని రద్దు చేసి అంజూను చాంపియన్‌గా ప్రకటించి పసడి పతకాన్ని ఖాయం చేశారు. ఇలా భారత క్రీడాకీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన అంజూ ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’... ‘అర్జున’... ‘పద్మశ్రీ’ పురస్కారాలను అందుకుంది. ఆమె ఘనతలివీ.... ప్రపంచ అథ్లెటిక్స్ కంటే ముందే అంజూ మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్ (2002)లో కాంస్యంతో మెరిసింది. బుసాన్ (2002లో), దోహా (2006లో) ఆసియా క్రీడల్లో వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకుంది. అలాగే వరుసగా ఇంచియోన్ (2005లో), అమ్మాన్ (2007లో) ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ స్వర్ణ, రజతాలను రిపీట్ చేసింది. ప్రస్తుతం 43 ఏళ్ల అంజూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. ఐదో ప్రయత్నం... ప్రపంచ పతకం అంజూ 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం తుది సన్నాహాల్లో ఉంది. అయితే ఈ క్రమంలో ఆమె తీవ్రమైన అలసటతో అస్వస్థతకు గురైంది. ఓ దశలో పారిస్ ఈవెంట్ నుంచి తప్పుకుందామని భావించింది. కానీ భర్త బాబీ ముందుండి ధైర్యం చెప్పాడు. బరిలో దిగేందుకు తోవ చూపాడు. అలా చివరకు ఓ మేజర్ ఈవెంట్‌కు అయిష్టంగానే వచ్చినా మొక్కుబడిగా తలపడలేదు. దేశం కోసం, పతకం కోసం వందశాతం అంకిత భావం కనబరిచింది. ప్రపంచ మేటి అథ్లెట్లు, డిఫెండింగ్ చాంపియన్లు బరిలో ఉన్న లాంగ్‌జంప్‌లో ఒక్కొక్కరి ప్రయత్నాలు మొదలయ్యాయి. అంజూ ఐదో ప్రయత్నంలో 6.70 మీటర్ల దూరం మేర దూకింది. నిజానికి ఇది ఆమె గొప్ప ప్రయత్నమేమీ కాదు. ఎందుకంటే షూస్ స్పైక్ ఒక కాలితో మరొకటి తచ్చాడటంతో ఇబ్బంది పడింది. క్షణాల్లోనే ఇదంతా జరిగినా కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకొని అంత దూరం గెంతడం అంత ఆషామాషీ కాదు. కాసేపయ్యాక ఆరో ప్రయత్నం చేసినా అదేమంతా సక్సెస్ కాలేదు. చివరకు అందరివీ అన్నీ ప్రయత్నాలు పూర్తయ్యాక చూస్తే అంజూ మూడో స్థానం ఖాయమైంది. పోడియంలో కాంస్యం అందుకొని చరిత్ర పుటలకెక్కింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన ఉత్సాహంలో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన అంజూ ఐదో స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ ఆమె బరిలోకి దిగినా ఫైనల్ చేరలేకపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
'పుత్రోత్సాహంలో ప్రముఖ హీరో'
చెన్నై: ఆసియా ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రముఖ హీరో మాధవన్ తనయుడు వేదాంత్ రజతం సాధించాడు. తన కుమారుడి విజయం పట్ల మాధవన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. దేవుడి అనుగ్రహంతో భారత్‌కు తన కుమారుడు ఆసియా క్రీడల్లో రజత పతకం అందించడం సంతోషకరమని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వేదాంత్ విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గొప్ప విజయాన్ని సాధించిన వేదాంత్, మాధవన్‌కు అభినంధనలు తెలియజేస్తున్నట్లు నటుడు రాహుల్‌రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశాడు. అద్భుత విజయంతో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడంటూ పలువురు అభిమానులు వేదాంత్‌ను కొనియాడారు. ఇక బాలీవుడ్ భామ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజీవ్కుంద్రా వేదాంత్‌ను రాక్‌స్టార్‌తో పోల్చడం విశేషం. కాగా మాధవన్ పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా వెబ్ సిరీస్‌లోను నటించాడు. ఇటీవల కాలంలో బాలీవుడ్ బాద్షా షారూఫ్ఖాన్ జీరో సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన మాధవన్.. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నంబీ నారాయణన్ అనే ఇస్రో శాస్త్రవేత్త పాత్రలో మాధవన్ నటిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలలో త్వరలోనే విడుదల కానుండడం విశేషం. View this post on Instagram India gets her Silver medal at the Asian Age Games . Gods grace .. Vedaants first official medal representing India .🙏🙏🙏🙏 A post shared by R. Madhavan (@actormaddy) on Sep 25, 2019 at 8:29pm PDT -
2022 ఆసియా క్రీడల్లో చెస్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో చెస్ మెడల్ ఈవెంట్‌గా పునరాగమనం చేయనుంది. వరుసగా 2006 దోహా... 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో పతకాంశంగా ఉన్న చెస్‌ను ఆ తర్వాతి రెండు ఆసియా క్రీడల్లో నిర్వహించలేదు. అయితే 2022లో చైనాలోని హాంగ్జౌలో జరిగే ఆసియా క్రీడల్లో చెస్‌ను మళ్లీ ప్రవేశ పెడుతున్నట్లు ఈ క్రీడల నిర్వాహక కమిటీ అధికారికంగా ఆసియా చెస్ సమాఖ్యకు సమాచారం ఇచ్చింది. 2022లో సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి. -
ఆసియా క్రీడల్లో మళ్లీ క్రికెట్
బ్యాంకాక్: ఆసియా క్రీడల్లో మళ్లీ క్రికెట్‌కు చోటు దక్కనుంది. 2022లో చైనాలోని హాంగ్జౌలో జరిగే క్రీడల్లో క్రికెట్‌ను ఆడించాలని ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ) నిర్ణయించింది. అలాగే ఆస్ట్రేలియాకు ఆసియా క్రీడల్లో అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. 2010, 2014 ఆసియా గేమ్స్‌లో టి20 ఫార్మాట్లో క్రికెట్ క్రీడను ఆడించారు. కానీ గతేడాది ఇండోనేసియాలో జరిగిన క్రీడల్లో మాత్రం ఈ ఆటను తొలగించారు. రెండు సార్లు క్రికెట్ ఆడించినా భారత్ మాత్రం బరిలోకి దిగలేదు. స్వతంత్రంగా ఉండాలనుకునే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)... భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గొడుగు కిందకు వచ్చేందుకు నిరాకరిస్తూ... ఆసియా గేమ్స్‌కు దూరంగా ఉంది. ఆసియా ఒలింపిక్స్ మండలి తాజా నిర్ణయాన్ని ఐఓఏ స్వాగతించింది. వచ్చే క్రీడల్లో టీమిండియా ఆడేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపారు. మరోవైపు బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘2022 గేమ్స్‌కు చాలా సమయం ఉంది. ముందు చర్చించి, ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుంటాం’ అని అన్నారు. -
ఆటంకాలున్నా ఆగలేదు
మెగా టోర్నీల్లో ఆసియా క్రీడలది విరామం లేని ప్రయాణం. ఒలింపిక్స్, ఫుట్‌బాల్ ప్రపంచ కప్, కామన్వెల్త్ క్రీడలకు ఎదురైనట్లు ఈ టోర్నీకి రెండో ప్రపంచ యుద్ధ అవాంతరం తలెత్తకపోవడమే దీనికి కారణం. దీంతో అప్రతిహతంగా 18వ సారి నిర్వహణకు నోచుకుంటోంది. అయితే, క్రీడలు నిలిచిపోయేంత స్థాయిలో కాకున్నా... కొన్ని వివాదాలు, మరికొన్ని బహిష్కరణలు ‘ఆట’ంక పర్చాయి. మరో తొమ్మిది రోజుల్లో ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటి గురించి పరిశీలిస్తే... సాక్షి క్రీడా విభాగం:ప్రస్తుతం సరిగ్గా నాలుగేళ్లకోసారి ఆసియా క్రీడలు నిర్వహిస్తున్నారు కానీ... న్యూఢిల్లీ వేదికగా తొలి పోటీలు ముగిసిన మూడేళ్లకే 1954లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో రెండో ఏషియాడ్ జరిగింది. తర్వాత నుంచి మాత్రం ‘నాలుగేళ్ల’ సంప్రదాయం తప్పడం లేదు. తొలి మూడు ఎడిషన్లు సక్రమంగానే సాగినా... ఏదో ఒక పరిణామం తలెత్తుతూ జకార్తా (ఇండోనేసియా–1962) నుంచి వివాదాలు ప్రారంభమయ్యాయి. అయితే, కొత్త శతాబ్దంలో మాత్రం ఇవన్నీ సద్దుమణగడం గమనార్హం. ఆ దేశాలను వద్దన్న ఇండోనేసియా... మతపర కారణాలతో ఇజ్రాయెల్‌కు, రాజకీయ కోణంతో తైవాన్‌కు 1962 జకార్తా ఏషియాడ్‌లో పాల్గొనేందుకు ఇండోనేసియా అనుమతి నిరాకరించింది. ఇది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి ఆగ్రహం తెప్పించింది. క్రీడలకు స్పాన్సర్షిప్ ఉపసంహరించడమే కాక, ఇండోనేసియాను ఐఓసీ సభ్య దేశాల నుంచి తొలగించింది. ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య, అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య, అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్యలు జకార్తా ఏషియాడ్‌ను గుర్తించబోమని ప్రకటించాయి. జారుకున్న దక్షిణ కొరియా... షెడ్యూల్ ప్రకారం 1970 ఆసియా క్రీడలకు దక్షిణ కొరియా ఆతిథ్యం ఇవ్వాలి. కానీ, జాతీయ భద్రతా కారణాలను చూపుతూ చేతులెత్తేసింది. ఆర్థికంగా తట్టుకోలేమనే దక్షిణ కొరియా ఈ పని చేసిందని అంతా చెప్పుకొంటారు. దీంతో థాయ్‌లాండ్ వరుసగా రెండోసారి వేదికగా మారింది. జపాన్ సైతం ముందుకొచ్చినా ఇదే సమయంలో ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ ఉండటంతో థాయ్‌లాండ్ వైపే మొగ్గుచూపారు. నిర్వహణ ఖర్చుకు దక్షిణ కొరియా నిధులు పంపించడం ఓ విశేషమైతే... తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్లలో ప్రత్యక్ష ప్రసారం కావడం ఈ ఏషియాడ్లోని మరో విశేషం. చైనా ఆగమనం... తైవాన్‌కు తిరస్కరణ... ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 1974 క్రీడలతో చైనా టోర్నీలో అడుగిడింది. ఉత్తర కొరియా, మంగోలియాలకు సైతం తొలిసారి ప్రాతినిధ్యం దక్కింది. అరబ్ దేశాల వ్యతిరేకత నడుమ ఇజ్రాయెల్ పోటీల్లో పాల్గొంది. ‘చైనీస్ తైపీ’ పేరిట పాల్గొనేలా తొలుత అంగీకరించినా, తర్వాత ఆ హోదాను రద్దు చేయడంతో తైవాన్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆతిథ్యం తప్పించుకున్న పాక్... ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత చూపుతూ 1978 ఆసియా క్రీడల నిర్వహణ బాధ్యత నుంచి మూడేళ్ల ముందే పాకిస్తాన్ తప్పుకొంది. టోర్నీ మళ్లీ థాయ్‌లాండ్‌కు మళ్లింది. 1962లో లాగానే ఇజ్రాయెల్, తైవాన్ ప్రాతినిధ్యాన్ని నిరాకరించారు. అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య సహా చాలా సంఘాలు దీనిని వ్యతిరేకించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు 1974 ఏషియాడే చివరిదైంది. తరచూ వివాదాలు తలెత్తుతుండటంతో టోర్నీకి గుడ్‌బై కొట్టి... ఐరోపా దేశాల సమాఖ్య క్రీడల్లో పాల్గొంటోంది. సంస్కరణల పథం... సంక్షోభాల నేపథ్యంలో ఆసియా దేశాల ఒలింపిక్ కమిటీలు ఏషియాడ్ రాజ్యాంగంలో సంస్కరణలకు ఉపక్రమించాయి. ఇజ్రాయెల్ లేకుండా 1981లో ‘ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ)’ అవతరించింది. క్రీడల షెడ్యూల్‌ను మార్చకుండానే ముందుకెళ్లాలని కౌన్సిల్ నిర్ణయించింది. 1986 నుంచి ఓసీఏ పర్యవేక్షణలోనే ఏషియాడ్ సాగుతోంది. 16 ఏళ్ల అనంతరం 1990లో తైవాన్ పునరాగమనం చేసింది. కానీ చైనా ఒత్తిడితో ‘చైనీస్ తైపీ’గానే దానిని పరిగణించారు. ఇరాక్ దూరం... సోవియట్ దేశాల ప్రవేశం గల్ఫ్ యుద్ధం కారణంగా 1990లో పాల్గొనని ఇరా క్‌ను 1994 హిరోషిమా ఏషియాడ్ నుంచి బహిష్కరించారు. రాజధాని కాకుండా వేరే నగరంలో జరిగిన తొలి ఆసియా క్రీడలు ఇవే. రాజకీయ అంశాలను చూపుతూ ఉత్తర కొరియా బాయ్ కాట్ చేసింది. సోవియట్ యూనియన్ నుంచి వేరుపడిన కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశం హోదాలో పాల్గొనడం విశేషం. -
ఏషియాడ్ వచ్చేస్తోంది
ఒలింపిక్స్ అంతటి భారీ సమరం... అతిపెద్ద ఖండ శక్తిని చాటే సందర్భం... ఫార్ ఈస్ట్రన్ చాంపియన్‌షిప్ గేమ్స్‌గా ఆరంభమై... భారతీయుడి ఆలోచనతో పేరు మార్చుకుని... కొత్త రూపంతో భారత్‌లోనే బీజం వేసుకుని... అప్రతిహతంగా పద్దెనిమిదోసారి అలరించేందుకు... మరో 10 రోజుల్లో వచ్చేస్తోంది ఏషియాడ్! 16 రోజుల పాటు 45 దేశాల ఆటగాళ్ల పాటవం! ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు పోరాటం! సాక్షి క్రీడా విభాగం: క్రికెట్ ప్రపంచ కప్, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఫుట్‌బాల్ వరల్డ్ కప్ వంటి నాలుగేళ్లకోసారి జరిగే మహా క్రీడా సంబరాలకు దీటుగా జరిగేవి ఆసియా క్రీడలు. సంక్షిప్తంగా ఏషియాడ్. ఓ ఖండానికే పరిమితమైనా, దేశాల (45) ప్రాతినిధ్యం దృష్ట్యా ఒలింపిక్స్ స్థాయి ఉన్న ఈవెంట్ ఇది. కామన్వెల్త్ క్రీడల్లో ఇంతకంటే ఎక్కువ (71) దేశాలు పాల్గొంటున్నా... క్రీడాంశాలను లెక్కలోకి తీసుకుంటే మాత్రం ఆసియా క్రీడలదే పైచేయి. ఈసారి పోటీలకు ఇండోనేసియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇలా రెండు నగరాలు వేదికగా నిలవడం ఆసియా క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూర్వనామం ఫార్ ఈస్ట్రన్... ఆసియా దేశాలకు ఓ క్రీడోత్సవం ఉండాలన్న ఆలోచన... జపాన్, ఫిలిప్పీన్స్, చైనా చొరవతో 1912లో మొగ్గ తొడిగింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా తదుపరి ఏడాదే ఇది కార్యరూపం దాల్చింది. నాడు ‘ఫార్ ఈస్ట్రన్ గేమ్స్ చాంపియన్‌షిప్’ పేరిట ఈ క్రీడలను నిర్వహించారు. ఆరు దేశాలు మాత్రమే ప్రాతినిధ్యం వహించాయి. రెండేళ్లకోసారి చొప్పున 1934 వరకు ఈ చాంపియన్‌షిప్ సాగింది. 1938లో జపాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా... మాంచు రాజ్యం ఒక దేశంగా ప్రాతినిధ్యం వహిస్తుండటాన్ని నిరసిస్తూ క్రీడలను చైనా బహిష్కరించింది. అప్పటితో ఫార్ ఈస్ట్రన్ చాంపియన్ షిప్ కథ ముగిసింది. పదిసార్లు జరిగిన ఈ క్రీడల్లో భారత్ 1930లో మాత్రమే పాల్గొంది. భారతీయుడి నామకరణమే రెండో ప్రపంచ యుద్ధం అనంతరం భారత్ సహా చాలా ఆసియా దేశాలు స్వాతంత్య్రం పొందడంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. దీంతో ఏషియాడ్ దిశగా అడుగులు పడ్డాయి. 1948 వేసవి ఒలింపిక్స్ సందర్భంగా లండన్‌లో చైనా, ఫిలిప్పీన్స్ దేశాల క్రీడా ప్రతినిధులు ‘ఫార్ ఈస్ట్రన్’ పునరుద్ధరణను తెరపైకి తెచ్చారు. అయితే, ఇది సరికొత్త రూపు దాల్చిన ఆసియా దేశాల అస్తిత్వాన్ని ప్రతిబింబించదంటూ... ఒలింపిక్ కమిటీలో భారత ప్రతినిధి అయిన గురుదత్ సోంధి ‘ఏషియాడ్’ రూపంలో ప్రత్యామ్నాయం సూచించారు. ఇదే ప్రాతిపదికపై 1949లో ఢిల్లీలో ‘ఆసియా అథ్లెటిక్ సమాఖ్య’, ‘ఆసియా క్రీడల సమాఖ్య’లను ఏర్పాటు చేశారు. తొలి ఆసియా క్రీడలను 1951లో ఢిల్లీలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జపాన్... చైనా జోరు... 1951తో పాటు 1982లో ఏషియాడ్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ రెండుసార్లూ ఢిల్లీనే వేదికైంది. అత్యధికంగా థాయ్‌లాండ్ నాలుగు సార్లు పోటీలను నిర్వహించింది. విశేషమేమంటే... పతకాల పట్టికలో ఇప్పటివరకు జపాన్, చైనా మినహా మరే దేశం అగ్రస్థానంలో నిలవకపోవడం. 1978 వరకు జపాన్... ఆ తర్వాత నుంచి చైనా జైత్రయాత్ర కొనసాగుతోంది. 45 దేశాలు... 465 ఈవెంట్లు ఈసారి ఆసియాడ్‌లో 45 దేశాలు పాల్గొననున్నాయి. 40 క్రీడాంశాల్లోని 465 ఈవెంట్లకు పోటీలు జరుగనున్నాయి. -
ఆసియన్ కబడ్డీ: అజయ్ ఠాకూర్‌కే పట్టం
హైదరాబాద్: దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీ గెలుచుకొని ఉత్సాహంగా ఉన్న భారత కబడ్డీ జట్టు మరో సమరానికి సిద్దమైంది. ఏడు సార్లు ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత టీమిండియా మరోసారి విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆగష్టులో ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియన్ గేమ్స్‌లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆసియన్ గేమ్స్‌లో పాల్గోనే 12 మంది సభ్యులతో కూడిన కబడ్డీ జట్టును అఖిల భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య (ఏకేఎఫ్) ప్రకటించింది. తమిళ్ తలైవాస్ సారథి అజయ్ ఠాకూరే మరోసారి టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు. సీనియర్లను పూర్తిగా పక్కకు పెట్టిన సమాఖ్య యువకులతో కూడిన జాబితాను విడుదల చేసింది. సీనియర్లు రాకేశ్ కుమార్, అనూప్ కుమార్, మంజీత్ చిల్లర్, సురేంద్ర నాడాలకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. మరోసారి.. ఆసియన్ గేమ్స్‌లో పోటీపడుతున్న పదిజట్లలో టీమిండియానే అన్ని విధాలుగా బలంగా కనిపిస్తోంది. మరోసారి విజేతగా నిలవాలని భారత్ జట్టు ఆశపడుతోంది. ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్, రిషాంక్ దేవడిగ, రోహిత్ కుమార్, మోనూ గోయత్‌లతో రైడింగ్ విభాగం బలంగా ఉండగా.. దీపక్ నివాస్ హుడా, సందీప్ నర్వాల్, గిరీష్ మారుతి ఎర్నాక్, మోహిత్ చిల్లర్, రాజు లాల్ చౌదరీ, మల్లేష్ గంగాధరిలతో ఢిఫెండింగ్ దుర్భేద్యంగా ఉంది. -
ఆసియా క్రీడలకు గాయత్రి, ఉత్తేజిత
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ గాయత్రి ఇండోనేసియాకు పయనం కానుంది. ఆసియా క్రీడల కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) 20 మంది సభ్యులతో కూడిన మహిళల, పురుషుల జట్లను ప్రకటించింది. ఇరు జట్లలోనూ ఆరుగురు యువ షట్లర్లకు చోటు కల్పించారు. బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, సిక్కి రెడ్డిలు ఉన్న మహిళల జట్టులో 15 ఏళ్ల పుల్లెల గాయత్రి ఎంపికైంది. మరో తెలుగమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావుతో పాటు అష్మిత చాలిహ, ఆకర్షి కశ్యప్, రుతుపర్ణ, ఆర్తి సారాలు చోటు దక్కించుకున్నారు. వీరంతా బెంగళూరు, హైదరాబాద్‌లలో ‘బాయ్’ నిర్వహించిన సీనియర్ ర్యాంకింగ్ టోర్నీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా జకార్తా మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. గాయత్రి హైదరాబాద్‌లో జరిగిన టోర్నీలో సెమీఫైనల్ చేరింది. జకార్తా ఆతిథ్యమిచ్చే ఆసియా గేమ్స్ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరగనున్నాయి. పురుషుల జట్టు: కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, సుమీత్ రెడ్డి, మను అత్రి, ప్రణవ్ జెర్రీ చోప్రా, సౌరభ్ వర్మ. మహిళల జట్టు: సైనా నెహ్వాల్, పీవీ సింధు, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, సాయి ఉత్తేజిత రావు, అష్మిత చాలిహ, రుతుపర్ణ పండ, ఆర్తి సారా సునీల్, ఆకర్షి కశ్యప్, గాయత్రి. కోచ్‌లు: పుల్లెల గోపీచంద్, తన్ కిమ్ హర్, అరుణ్ విష్ణు, ఎడ్విన్ ఐరివాన్. -
ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టా: శ్రీకాంత్
న్యూఢిల్లీ: గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లతో దిగ్గజాల సరసన నిలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ తాజాగా ఫిట్‌నెస్‌పైనే దృష్టి సారించాడు. గాయాల బారిన పడకుండా ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పతకం సాధించాలంటే వందశాతం ఫిట్‌గా ఉండాలని భావిస్తున్నాడు. ఈ ఏడాది పాల్గొనే ప్రతి టోర్నీలోనూ గాయాల పాలవకుండా అత్యుత్తమ ఆటను ఆడాలనుకుంటున్నానని 25 ఏళ్ల శ్రీకాంత్ చెప్పాడు. ‘ప్రస్తుతం ఫిట్నెస్ కాపాడుకోవడమే నాముందున్న అతిపెద్ద చాలెంజ్. ఒలింపిక్స్ తర్వాత కుడి మడమ, గతేడాది ఎడమ మడమ గాయాలతో ఇబ్బంది ఎదురైంది. ఈ ఏడాది నాలుగు, ఐదు టోర్నమెంట్లు నాకు చాలా కీలకం. అందుకే జాగ్రత్తగా ఉంటున్నా. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టా’ అని శ్రీకాంత్ వివరించాడు. గతేడాది అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ హైదరాబాద్ స్టార్ ఫ్రెంచ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియన్ ఓపెన్ టైటిళ్లను సాధించి తన స్థాయిని పెంచుకున్నాడు. ఈ ఏడాది ఈ నాలుగు టైటిళ్లను నిలబెట్టుకోవాలనే ఒత్తిడి తనపై లేదని, ప్రస్తుతం ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీకాంత్ పేర్కొన్నాడు. ‘గతేడాది ప్రదర్శనను పునరావృతం చేయాలని అనుకోవట్లేదు. ఈ ఏడాది ప్రత్యేక లక్ష్యాలను పెట్టుకున్నాను. ఒకటి కామన్వెల్త్లో పతకం సాధించాలనుకున్నా. రెండోది ఆసియా క్రీడల్లో. ఈ రెండు టోర్నీలు చాలా ముఖ్యమైనవి. ప్రతి ఏడాది ఆడేందుకు కుదరదు. మొదటి లక్ష్యం చేరుకున్నా. ఇక ఆసియా క్రీడలు మిగిలిఉన్నాయి. ఇందులో పతకం కోసం మరో నాలుగేళ్లు నేను వేచి ఉండలేను. అప్పుడు ఈ క్రీడలకు అర్హత సాధిస్తానో లేదో కూడా తెలియదు. బ్యాడ్మింటన్‌లో పోటీ బాగా పెరిగింది. అందుకే ఇప్పుడే పతకం సాధించేయాలి. వరల్డ్ చాంపియన్‌షిప్‌పై కూడా నా దృష్టి ఉంది. ప్రపంచ చాంపియన్ అనే హోదా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. కొన్ని సూపర్ సిరీస్ టోర్నీల్లోనూ రాణించాల్సి ఉంది’ అన్నాడు. మలేసియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్ టోర్నీల్లో పాల్గొంటానన్న శ్రీకాంత్ సింగపూర్ ఓపెన్ నుంచి తప్పుకుంటానని తెలిపాడు. -
పేస్ పునరాగమనం
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం... ఈనెల 17న 45 ఏళ్లు పూర్తి చేసుకోనున్న వెటరన్ స్టార్ లియాండర్ పేస్ మరోసారి ఆసియా క్రీడల బరిలోకి దిగబోతున్నాడు. ఏషియాడ్ కోసం సోమవారం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ప్రకటించిన ఆరుగురు సభ్యుల జట్టులో పేస్‌కు చోటు లభించింది. 1994 నుంచి 2006 వరకు నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో పాల్గొని ఎనిమిది పతకాలు సాధించిన పేస్ 2010, 2014 పోటీలకు దూరమయ్యాడు. పతకాల వేటలో ఇప్పుడు మళ్లీ కొత్త ఉత్సాహంతో సన్నద్ధమయ్యాడు. సింగిల్స్‌లో భారత అత్యుత్తమ ర్యాంకర్ (94) అయిన యూకీ బాంబ్రీ యూఎస్ ఓపెన్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం ఉండటంతో అతడిని ఎంపిక నుంచి మినహాయిస్తున్నట్లు ‘ఐటా’ ప్రకటించింది. ఆసియా క్రీడల సమయంలోనే యూఎస్ ఓపెన్ టోర్నీ కూడా జరగనుంది. ముగ్గురు సింగిల్స్ స్పెషలిస్ట్‌లు రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, సుమిత్ నాగల్లను... ముగ్గురు డబుల్స్ స్పెషలిస్ట్‌లు పేస్, రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌లను కమిటీ ఎంపిక చేసింది. డేవిస్ కప్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఉన్న మహేశ్ భూపతి తాను ఏషియాడ్‌కు దూరంగా ఉంటానని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో జీషాన్ అలీకి ఆ బాధ్యతలు అప్పగించారు. -
‘దంగల్’ సిస్టర్స్‌పై వేటు
న్యూఢిల్లీ : నేషనల్ క్యాంప్‌కు హజరుకానందుకుగాను జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఫోగట్ సిస్టర్స్‌పై వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే డబ్ల్యూఎఫ్ఐ ఫోగట్ సిస్టర్స్‌కు మరో అవకాశం ఇచ్చింది. నేషనల్ కాంప్‌కు హాజరుకానందుకు కల కారణాన్ని వివరిస్తే వారిని తిరిగి చేర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించడమే కాక వారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోగట్ సిస్టర్స్ గీత, బబితలతో పాటు వీరి చెల్లెళ్లు రీతు, సంగీత కూడా ప్రస్తుతం లక్నోలో నిర్వహిస్తున్న నేషనల్ క్యాంప్‌కు హాజరుకాలేదు. ఈ కారణం వల్ల డబ్ల్యూఎఫ్ఐ వీరి మీద వేటు వేసింది. ఈ విషయం గురించి డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘నేషనల్ క్యాంప్‌కు ఎంపికైన ఏ రెజ్లర్ అయిన మూడురోజుల్లోగా తన శారీరక దృఢత్వం గురించి క్యాంప్‌లో తెలియచేయాలి. ఒకవేళ వారికి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి గురించి కోచ్‌తో చెప్పి పరిష్కరించుకోవాలి. అయితే గీతా, బబిత వారి ఇద్దరు సోదరీమణులు రీతూ, సంగీత కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కనీసం వారితో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. డబ్ల్యూఎఫ్ఐ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి, వారిపై క్రమశిక్షణా రహిత్యం కింద చర్యలు తీసుకుంది. ఇక వారు ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చ’ని అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ చర్యల వల్ల ఫోగట్ సిస్టర్స్ ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో జరగబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోనున్నట్లు సమాచారం. అయితే డబ్ల్యూఎఫ్ఐ వీరికి ఒక ఊరట కల్పించింది. ఒకవేళ ఫోగట్ సిస్టర్స్ కనుక వారి గైర్హాజరుకు సరైన కారణాన్ని చెప్తే వారికి మరో అవకాశం ఇస్తామని శరణ్ సింగ్ తెలిపారు. ఫోగట్ సిస్టర్స్‌తో పాటు రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ భర్త సత్యవర్త్ కడియాన్పైనా కూడా డబ్ల్యూఎఫ్ఐ నిషేధం విధించింది. నిషేధం గురించి నాకేం తెలియదు : బబిత అయితే ఈ విషయం గురించి బబిత స్పందిస్తూ.. ‘డబ్ల్యూఎఫ్ఐ నాపై వేటు వేసిన సంగతి నాకు తెలియదు. దీనికి సంబంధించి ఎటువంటి నోటీసు నాకు రాలేదు. నేను నేషనల్ కాంప్‌కు హాజరుకాని మాట వాస్తవం. ఎందుకంటే నేను మోకాలి గాయాలతో బాధపడుతున్నాను. అయితే ఈ విషయం గురించి నేను డబ్ల్యూఎఫ్ఐకి సమాచారం ఇవ్వలేదు. ఈరోజే దీని గురించి వారికి తెలియజేస్తాను. అలానే రీతూ, సంగీత రష్యాలో నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్యాంప్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ వారికి ఇంకా వీసాలు రాలేదు. ఈ విషయం గురించి డబ్ల్యూఎఫ్ఐను సంప్రదించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం గీత బెంగుళూరులో శిక్షణ తీసుకుంటోంది. ఆమె నేషనల్ క్యంప్కు ఎందుకు గైర్హాజరయ్యిందో నాకు తెలియద’ని చెప్పారు. గీతా ఫోగట్ 2010 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించడమే కాక 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి మల్లయుద్ధంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. అలానే ఆమె సోదరి బబిత 2014 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించింది. -
ఫైనల్లో శ్యామ్
జకార్తా: ఆసియా క్రీడల టెస్ట్ ఈవెంట్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ ఫైనల్‌కు చేరాడు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో బుధవారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం సెమీఫైనల్లో మొహమ్మద్ ఫౌద్ రెడ్జూన్ (మలేసియా) నుంచి వాకోవర్ లభించడంతో శ్యామ్ కుమార్ ఫైనల్ చేరాడు. తుది పోరులో అతను ఇండోనేసియాకు చెందిన మారియో బ్లాసౌస్తో తలపడనున్నాడు. ఈ టోర్నీలో భారత్ నుంచి శ్యామ్‌తో పాటు శశి చోప్రా, పవిత్ర, కౌశిక్, షేక్ సల్మాన్ అన్వర్, ఆశిష్ ఫైనల్‌కు అర్హత సాధించారు. రీతు, మొహమ్మద్ ఇతాశ్ ఖాన్, పవన్ కుమార్, ఆశిష్ కుమార్‌లు సెమీస్‌లో ఓడి కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. -
లక్ష్యరేఖ
చాలా సందర్భాల్లో లక్ష్యానికి, విజయానికి మధ్య విభజన రేఖ చిన్నదిగా కనిపిస్తుంది. వింటిని గట్టిగా లాగి సూటిగా వదిలిన బాణంలా అలుపెరగక దూసుకుపోతే లక్ష్యం చిన్నదవుతుంది. ఆ సన్నని గీత చెరిగిపోయి విజయరేఖగా మారుతుంది. చివరకు తనపేరులోని రేఖను విజయ రేఖగా మార్చుకున్న జ్యోతి సురేఖలా ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. అవమానాలకు కళ్లెంవేస్తూ అవాంతరాలపై స్వారీ చేస్తూ ప్రపంచ ఆర్చరీ పటంలో తానొక పుటగా ఆవిష్కృతమవుతుంది. ప్రతిభను వెతుక్కుంటూ వచ్చే పద్మశ్రీ అవార్డులకు, ఆదర్శ పాఠాలు నేర్చుకునే వర్ధమాన క్రీడాకారులకు అర్జున అవార్డు గ్రహీత జ్యోతిసురేఖ చిరునామాగా మారుతుంది. ♦ అప్పుడు ఆ చిన్నారి పాప వయస్సు నాలుగేళ్ల 11 నెలలు. ఆ వయసులో ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదిని చూడటానికే భయపడతారు. అలాంటిది నదిలో 5 కిలోమీటర్ల దూరాన్ని చేపపిల్లలా మూడుసార్లు అటూ ఇటూ 3 గంటల 6 నిమిషాల వ్యవధిలో ఈదేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించేసింది. ♦ ఇప్పుడు ఆమె వయస్సు 23 సంవత్సరాలు. విలువిద్యలో ఏకలవ్యుడి శిష్యురాలిలా దూసుకుపోతోంది. విల్లు చేతబూని విలువిద్యలో తనకు సాటిలేరని నిరూపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. దేశంలోనే కాంపౌండ్ ఆర్చరీలో తొలిసారిగా, జిల్లాలో తొలి అమ్మాయిగా అర్జున అవార్డు సాధించి వర్ధమాన క్రీడాకారులకు లక్ష్యరేఖగా మారింది. ఆమె పేరే జ్యోతి సురేఖ. విజయవాడ స్పోర్ట్స్: జ్యోతి సురేఖ 1996, జూలై 3వ తేదీన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో వెన్నం సురేంద్రకుమార్, శ్రీదుర్గకు జన్మించారు. కేవలం క్రీడల్లోనే కాదు.. చదువులోనూ టాపే. కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) పాసై అదే యూనివర్సిటీలో ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. తొలుత పిన్నవయసులోనే స్విమ్మింగ్‌లో రాణించి.. అనంతరం ఆర్చరీని ఎంచుకుంది. అయితే, ఆర్చరీ ప్రాక్టీస్‌కు అవకాశం కుదరలేదు. స్థానికంగా ప్రోత్సాహం లభించలేదు. అయినా కుంగిపోకుండా, పట్టువిడవక తల్లిదండ్రులు, స్నేహితులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహంతో ప్రాక్టీస్ చేసి ఏషియన్ గేమ్స్‌లో పతకం సాధించింది. ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి రాష్ట్ర, దేశఖ్యాతిని ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించింది. ఘనత ♦ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో ప్రపంచ స్థాయిలో 14వ ర్యాంకులో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా 30 పోటీల్లో పాల్గొంటే, 8 స్వర్ణ, 8 రజత, 5 కాంస్య పతకాలు కైవసం ♦ 2015ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో 80కి 80 పాయింట్లు సాధించి వరల్డ్ రికార్డు సమం. ♦ 2017లో 20వ ఏషియన్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో 720 పాయింట్లకు 703 పాయింట్లు సాధించిన తొలి ఇండియన్ కాంపౌండ్ ఆర్చరర్‌గా ఘనత. ♦ ఒకే ఏడాది సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో చాంపియన్. అవార్డులు ♦ 2017లో అర్జున అవార్డు, 2014లో అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ అవార్డు, 2013లో వరల్డ్ ఆర్చరీ ఫిటా గోల్డెన్ టార్గెట్ అవార్డు, 2002లో భారత ప్రభుత్వం నుంచి ఎక్స్‌సెప్షనల్ అచీవ్మెంట్ అవార్డు. 2016 సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డు ♦ 2017 ఢాకాలో 20వ ఏషియన్ ఆర్చరీ చాంపిన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో కాంస్య, టీమ్ విభాగంలో స్వర్ణ, మిక్స్డ్ విభాగంలో రజత పతకాలు సాధించింది. కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంది చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ. ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడింది. ఆర్చరీ అంటే ఇష్టపడటంతో చేర్పించాం. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందింది. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం ఆనందంగా ఉంది. – వెన్నం సురేంద్రకుమార్, జ్యోతి సురేఖ తండ్రి -
అక్టోబర్‌లో ప్రొ కబడ్డీ ఆరో సీజన్
ముంబై: ఈ ఏడాది ప్రొ కబడ్డీ లీగ్ షెడ్యూల్‌ను నిర్వాహకులు ఖరారు చేశారు. ఆరో సీజన్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి జరుగుతాయని నిర్వాహక సంస్థ మషాల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. మొత్తం 13 వారాల పాటు ఈ పోటీలు జరుగుతాయి. గత ఐదో సీజన్లో ఫ్రాంచైజీల సంఖ్య 8 నుంచి 12కు పెంచడంతో మ్యాచ్‌ల సంఖ్య, నిర్వహణ సమయం కూడా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆసియా గేమ్స్ జరుగనున్న నేపథ్యంలో ఆటగాళ్లకు సరైన విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు ప్రొ కబడ్డీ కమిషనర్ అనుపమా గోస్వామి తెలిపారు. -
కామన్వెల్త్, ఆసియా క్రీడలు
కామన్వెల్త్ క్రీడల్లో కామన్వెల్త్ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు. ఈ క్రీడలు తొలిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తారు. ప్రపంచ యుద్ధాల కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో వీటిని నిర్వహించలేదు. 1930–50 కాలంలో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా, 1954–66 మధ్య బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌గా, 1970–74 కాలంలో బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్‌గా ఈ క్రీడలను పిలిచారు. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్‌గా పిలుస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాలు (ఆరు) ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాయి. ఈ క్రీడలను ఆస్ట్రేలియా, కెనడాలు అత్యధికంగా చెరో నాలుగుసార్లు నిర్వహించాయి. భారతదేశం 2010 లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. 20వ కామన్వెల్త్ క్రీడలు 20వ కామన్వెల్త్ క్రీడలు 2014, జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. ఈ క్రీడల్లో 71 దేశాలకు చెందిన 4,947 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 17 క్రీడల్లో 261 ఈవెంట్లు జరిగాయి. ఇంగ్లండ్ అత్యధికంగా 58 స్వర్ణ, 59 రజత, 57 కాంస్య పతకాలను సాధించింది. ఈ క్రీడల్లో మొత్తం 174 పతకాలను కైవసం చేసుకుని ఇంగ్లండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు 15 స్వర్ణ, 30 రజత, 19 కాంస్య పతకాలు కలిపి మొత్తం 64 పతకాలు లభించాయి. ఆరంభ వేడుకల్లో భారత్ తరపున షూటర్ విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని చేబూని భారత క్రీడా బృందానికి ముందు నడిచాడు. ముగింపు వేడుకల్లో సీమా పూనియా (డిస్కస్ త్రో) జాతీయ పతాకధారిగా నిలిచింది. భారత స్వర్ణపతక విజేతలు సంజిత కుముక్చామ్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ సుఖేన్ డే పురుషుల వెయిట్ లిఫ్టింగ్ అభినవ్ బింద్రా షూటింగ్ అపూర్వి చందేల మహిళల షూటింగ్ రాహి సర్నోబత్ మహిళల షూటింగ్ సతీష్ శివలింగం వెయిట్ లిఫ్టింగ్ జీతూ రాయ్ షూటింగ్ అమిత్ కుమార్ రెజ్లింగ్ వినేష్ ఫోగత్ మహిళల రెజ్లింగ్ సుశీల్ కుమార్ రెజ్లింగ్ బబిత కుమారి మహిళల రెజ్లింగ్ యోగేశ్వర్ దత్ రెజ్లింగ్ వికాస్ గౌడ డిస్కస్ త్రో దీపికా పల్లికల్ జ్యోత్స్న చిన్నప్ప స్క్వాష్ (మహిళల డబుల్స్) పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్ కామన్వెల్త్ క్రీడలు– వేదికలు ఇప్పటివరకు 20 కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. కొన్నింటి వివరాలు. సంవత్సరం నగరం దేశం 1930 హామిల్టన్ కెనడా 1934 లండన్ ఇంగ్లండ్ 1938 సిడ్నీ ఆస్ట్రేలియా 1950 అక్లాండ్ న్యూజిలాండ్ 1954 వాంకోవర్ కెనడా 1998 కౌలాలంపూర్ మలేసియా 2002 మాంచెస్టర్ ఇంగ్లండ్ 2006 మెల్బోర్న్ ఆస్ట్రేలియా 2010 న్యూఢిల్లీ ఇండియా 2014 గ్లాస్గో స్కాట్లాండ్ ఆసియా క్రీడలు ఆసియా క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఒలంపిక్స్ తర్వాత ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబరంగా వీటిని పేర్కొంటారు. ఈ క్రీడలు తొలిసారి 1951లో (న్యూఢిల్లీ) జరిగాయి. భారత్, ఇండోనేసియా, జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్ (ఏడు) దేశాలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లో పాల్గొన్నాయి. 17వ ఆసియా క్రీడలు 17వ ఆసియా క్రీడలు 2014లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగాయి. వీటికి దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన 9,501 క్రీడాకారులు పాల్గొన్నారు. 36 క్రీడల్లో 439 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. చైనా 151 స్వర్ణపతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వీటితో పాటు 108 రజత, 83 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 342 పతకాలను చైనా సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, ఇరాన్, థాయిలాండ్, ఉత్తర కొరియా దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ 57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో 11 స్వర్ణ, 10 రజత, 36 కాంస్య పతకాలను భారత క్రీడాకారులు సాధించారు. జపాన్ స్విమ్మర్ హగినో కొసుకే నాలుగు స్వర్ణాలతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించి ‘శాంసంగ్ అత్యంత విలువైన క్రీడాకారుడు’ అవార్డును గెలుచుకున్నాడు. -
ఏసియన్ పోటీల్లో కర్నూలు ‘తేజం‘
కర్నూలు: ఏసియన్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో జిల్లా కానిస్టేబుల్ కె.తేజేశ్వరరెడ్డి (పీసీ నెం.1399) రజతం, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. అక్టోబరు 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు థాయ్‌ల్యాండ్ దేశంలో ఈ పోటీలు జరిగాయి. మొత్తం 16 దేశాలు పాల్గొనగా.. థాయ్‌ల్యాండ్‌కు మొదటి స్థానం, ఇండియాకు రెండో స్థానం లభించింది. ఇండియా టీమ్ నుంచి మొత్తం 12 మంది పాల్గొనగా, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలుకు చెందిన తేజేశ్వరరెడ్డి ఉన్నారు. ఇండియాకు మూడు రజత, కాంస్య పతకాలు వచ్చాయి. ఇందులో తేజేశ్వరరెడ్డికి మిక్సిడ్ లైట్ వెయిట్ ఫోర్ 500 మీటర్స్ ఈవెంట్స్‌లో రజత పతకం, మిక్సిడ్ లైట్ వెయిట్ డబుల్ 200 మీటర్స్ ఈవెంట్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌లో 2016 జనవరి జరిగిన సీనియర్ నేషనల్స్‌లో కూడా కాంస్య పతకం సాధించాడు. ఈయన 2013లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. సెయింట్ జోషఫ్ కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్నారు. స్వగ్రామం ఓర్వకల్లు. తల్లిదండ్రులు రైతు కుటుంబానికి చెందిన వారు. పతకాలు సాధించి జిల్లాకు చేరుకున్న తేజేశ్వరరెడ్డిని శుక్రవారం సాయంత్రం పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆకె రవికృష్ణ, ఇతర పోలీసు అధికారులు అభినందించి శాలువాతో సత్కరించారు. 2018 ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచి పతకాలు కైవసం చేసుకొని జిల్లా పోలీసు శాఖ గౌరవాన్ని పెంచాలని ఎస్పీ కొనియాడారు. కోచ్‌కు కృతజ్ఞతలు కఠోరమైన శ్రమ, అంకిత భావం, క్రమశిక్షణ గల ఇండిన్ కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్‌బేగ్ శిక్షణతోనే ఈ గెలుపు సాధ్యమైందని తేజేశ్వరరెడ్డి అన్నారు. ఆత్మవిశ్వాసంతో, గెలవాలనే పట్టుదలతో ఇండియా టీమ్‌తో కలిసి థాయ్‌ల్యాండ్‌కు వెళ్లి ఏషియన్ చాపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. భారతదేశ జెర్సిని (ఇండియన్ ట్రాక్ షూట్) ధరించి గేమ్స్‌లో పాల్గొనడం మాటల్లో చెప్పలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. రెండు సంవత్సరాలు పడ్డ కష్టం అంతా ఈ పతకాలతో ఫలించిందన్నారు. తన విజయానికి సహకరించిన కోచ్ ఇస్మాయిల్‌కు తల్లిదండ్రులు వెంకటరామిరెడ్డి, క్రిష్ణవేణమ్మలకు, జిల్లా పోలీసు అధికారులకు తేజేశ్వరరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఆర్ఐలు జార్జ్, రంగముని, రామకృష్ణ, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అమరావతిలో 2018 ఒలింపిక్స్
విస్తుపరిచిన సీఎం ప్రకటన సాక్షి, విశాఖపట్నం : అమరావతిలో 2018 ఒలింపిక్స్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. శనివారం సాయంత్రం విశాఖ సాగరతీరంలో నైట్ బే మారథాన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ అమరావతిలో ఆసియా గేమ్స్ జరగ నున్నాయని మొదట చెప్పిన ఆయన.. ఆ వెంటనే ఒలింపిక్స్ గేమ్స్ జరగబోతున్నాయన్నారు. దీంతో అంతా విస్తుపోయారు. వాస్తవానికి వచ్చే నెల 5న బ్రెజిల్ దేశంలో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ప్రతి నాలుగేళ్లకోసారి నిర్వహించడం, వేదికలను ముందే ఖరారు చేయడం ఆనవాయితీ. అలా 2020లో టోక్యోలో, 2024లో రోమ్‌లో వీటిని నిర్వహించాలని ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ ఖరారు చేసింది. అలాంటప్పుడు 2018లో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని సీఎం ఎలా ప్రకటించారో అర్థంగాక జనం తలలు పట్టుకున్నారు. అనంతరం 10కె రన్ విభాగంలో విజేతగా నిలిచిన తెలంగాణ లోని నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన యువతి నవ్యా పటేల్‌కు రూ.50 వేలను అందజేశారు. పాల్మాన్పేట ఘటనపై విచారణ: సీఎం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పాల్మాన్పేట ఘటనపై విచారణ జరిపిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం విశాఖ వచ్చిన చంద్రబాబును బాధితులు కలిసి వివరించారు.దీనికి స్పందించిన సీఎం ఘటనపై విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 వేలు చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని చెప్పారు. కొత్తగా బోర్లు వేయకుండా నిషేధం సాక్షి, విజయవాడ బ్యూరో: భూగర్భజలాలను పరిరక్షించేందుకు అవసరమైతే కొత్తగా బోర్లు వేయకుండా నిషేధం విధిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో వర్షపునీటి వినియోగం, భూగర్భజలాల గురించి మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైపుల నుంచి ఈనెల 6న పోలవరం కుడి కాలువకు గోదావరి నీటిని వదులుతామని సీఎం చెప్పారు. పాలార్ ప్రాజెక్టును ఇంకా మొదలు పెట్టకుండానే తమిళనాడు సీఎం జయలలిత దాన్ని కట్టొద్దని లేఖ రాశారన్నారు. -
కామన్వెల్త్ , ఆసియా క్రీడలు
కామన్వెల్త్ క్రీడలు కామన్వెల్త్ క్రీడల్లో కామన్వెల్త్ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు. ఈ క్రీడలు తొలిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తారు. ప్రపంచ యుద్ధాల కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో వీటిని నిర్వహించలేదు. 1930-50 కాలంలో బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్‌గా, 1954-66 మధ్య బ్రిటీష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌గా, 1970-74 కాలంలో బ్రిటీష్ కామన్వెల్త్ గేమ్స్‌గా ఈ క్రీడలను పిలిచారు. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్‌గా పిలుస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాలు (ఆరు) ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాయి. ఈ క్రీడలను ఆస్ట్రేలియా, కెనడాలు అత్యధికంగా చెరో నాలుగు సార్లు నిర్వహించాయి. భారతదేశం 2010 లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. 20వ కామన్వెల్త్ క్రీడలు: 20వ కామన్వెల్త్ క్రీడలు 2014, జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. ఈ క్రీడల్లో 71 దేశాలకు చెందిన 4,947 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 17 క్రీడల్లో 261 ఈవెంట్లు జరిగాయి. ఇంగ్లండ్ అత్యధికంగా 58 స్వర్ణ, 59 రజత, 57 కాంస్య పతకాలను సాధించింది. ఈ క్రీడల్లో మొత్తం 174 పతకాలను కైవసం చేసుకుని ఇంగ్లండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు 15 స్వర్ణ, 30 రజత, 19 కాంస్య పతకాలు కలిపి మొత్తం 64 పతకాలు లభించాయి. ఆరంభ వేడుకల్లో భారత్ తరపున షూటర్ విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని భారత క్రీడా బృందానికి ముందు నడిచాడు. ముగింపు వేడుకల్లో సీమా పూనియా (డిస్కస్ త్రో) జాతీయ పతాకధారిగా నిలిచింది. భారత స్వర్ణపతక విజేతలు: సంజిత కుముక్చామ్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ సుఖేన్ డే పురుషుల వెయిట్ లిఫ్టింగ్ అభినవ్ బింద్ర షూటింగ్ అపూర్వి చందేల మహిళల షూటింగ్ రాహి సర్నోబత్ మహిళల షూటింగ్ సతీష్ శివలింగం వెయిట్ లిఫ్టింగ్ జీతురాయ్ షూటింగ్ అమిత్ కుమార్ రెజ్లింగ్ వినేష్ ఫోగత్ మహిళల రెజ్లింగ్ సుశీ కుమార్ రెజ్లింగ్ బబిత కుమారి మహిళల రెజ్లింగ్ యోగేశ్వర్ దత్ రెజ్లింగ్ వికాస్ గౌడ డిస్కస్ త్రో దీపికా పల్లికల్ జ్యోత్స్న చిన్నప్ప స్క్వాష్ (మహిళల డబుల్స్) పారుపల్లి కశ్వప్ బ్యాడ్మింటన్ కామన్వెల్త్ క్రీడలు- వేదికలు ఇప్పటి వరకు 20 కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. కొన్నింటి వివరాలు. సంవత్సరం నగరం దేశం 1930 హామిల్టన్ కెనడా 1934 లండన్ ఇంగ్లండ్ 1938 సిడ్నీ ఆస్ట్రేలియా 1950 అక్లాండ్ న్యూజిలాండ్ 1954 వాంకోవర్ కెనడా 1998 కౌలాలంపూర్ మలేసియా 2002 మాంచెస్టర్ ఇంగ్లండ్ 2006 మెల్బోర్న్ ఆస్ట్రేలియా 2010 న్యూఢిల్లీ ఇండియా 2014 గ్లాస్గో స్కాట్లాండ్ ఆసియా క్రీడలు ఆసియా క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఒలంపిక్స్ తర్వాత ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబరంగా వీటిని పేర్కొంటారు. ఈ క్రీడలు తొలిసారి 1951లో(న్యూఢిల్లీ) జరిగాయి. భారత్, ఇండోనేసియా, జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్ (ఏడు) దేశాలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లో పాల్గొన్నాయి. 17వ ఆసియా క్రీడలు: 17వ ఆసియా క్రీడలు 2014లో సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు జరిగాయి. వీటికి దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన 9, 501 క్రీడాకారులు పాల్గొన్నారు. 36 క్రీడల్లో 439 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. చైనా 151 స్వర్ణపతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వీటితో పాటు 108 రజత, 83 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 342 పతకాలను చైనా సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, ఇరాన్, థాయిలాండ్, ఉత్తర కొరియా, దేశాలు వరుసగా తర్వాతి ఏడు స్థానాల్లో నిలిచాయి. భారత్ 57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో 11 స్వర్ణ, 10 రజత, 36 కాంస్య పతకాలను భారత క్రీడాకారులు సాధించారు. జపాన్ స్విమ్మర్ హగినో కొసుకే నాలుగు స్వర్ణాలతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించి ‘శాంసంగ్ అత్యంత విలువైన క్రీడాకారుడు’ అవార్డును గెలుచుకున్నాడు. భారత స్వర్ణ పతక విజేతలు: జీతురాయ్ (షూటింగ్) యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్) సానియా మీర్జా (టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్) సాకేత్ మైనేని సీమా పూనియా (మహిళల డిస్కస్ త్రో) మేరీ కోమ్ (మహిళల బాక్సింగ్) 4 గీ 400 మీటర్ల రిలే (భారత మహిళల జట్టు) భారత హకీ జట్టు పురుషుల కబడ్డీ జట్టు మహిళల కబడ్డీ జట్టు స్వ్కాష్ పురుషుల జట్టు పురుషుల కాంపౌండ్ జట్టు (ఆర్చరీ) ఆసియా క్రీడలు- వేదికలు ఇప్పటి వరకు 17 ఆసియా క్రీడలు జరిగాయి. కొన్ని వేదికల వివరాలు. సంవత్సరం నగరం దేశం 1982 న్యూఢిల్లీ ఇండియా 1986 సియోల్ దక్షిణ కొరియా 1990 బీజింగ్ చైనా 1994 హిరోషిమా జపాన్ 1998 బ్యాంకాక్ థాయిలాండ్ 2002 బుసాన్ దక్షిణ కొరియా 2006 దోహా ఖతార్ 2010 గ్వాంగ్ జు చైనా 2014 ఇంచియాన్ ద క్షిణ కొరియా కోపా అమెరికా కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్లో దక్షిణ అమెరికా ఖండ దేశాలు పాల్గొంటాయి. ఇది తొలిసారి 1916లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఉరుగ్వే అత్యధికంగా 15 సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది. 44వ కోపా అమెరికా టోర్నీ 2015, జూన్ 11 నుంచి జూలై 4 వరకు చిలీలో జరిగింది. ఈ టోర్నీలో మొత్తం 12 దేశాలు పాల్గొన్నాయి. శాంటియాగోలో జరిగిన ఫైనల్లో ఆతిథ్య దేశం చిలీ అర్జెంటీనాను పెనాల్టీ షూటౌట్లో ఓడించి తొలిసారి కోపా అమెరికా కప్‌ను సాధించింది. వచ్చే ఏడాదితో కోపా అమెరికా కప్‌కు వందేళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా సెంటెన్నియల్ కోపా అమెరికా టోర్నీని 2016, జూన్‌లో యూఎస్ఏలో నిర్వహించనున్నారు. తొలిసారి కోపా అమెరికా కప్‌ను దక్షిణ అమెరికా ఖండం వెలుపల నిర్వహించనున్నారు. మాదిరి ప్రశ్నలు 1. 2018లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియా నగరం? 1) సిడ్నీ 2) పెర్త్ 3) హాబార్ట్ 4) గోల్డ్ కోస్ట్ 2. 22వ కామన్వెల్త్ క్రీడలు 2022లో ఎక్కడ జరగనున్నాయి? 1) కౌలాలంపూర్, మలేసియా 2) ఎడ్మంటన్, కెనడా 3) డర్బన్, దక్షిణాఫ్రికా 4) వెల్లింగ్టన్, న్యూజిలాండ్ 3. దీపా కర్మాకర్ భారత్‌కు తొలి కామన్వెల్త్ పతకాన్ని ఏ క్రీడలో సాధించింది? 1) జిమ్నాస్టిక్స్ 2) స్క్వాష్ 3) జావెలిన్ త్రో 4) డిస్కస్ త్రో 4. భారత్ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సంవత్సరం? 1) 2010 2) 1986 3) 1982 4) 1998 5. భారత హాకీ జట్టు 2014 ఆసియా క్రీడల ఫైనల్లో ఏ దేశాన్ని ఓడించి స్వర్ణపతకాన్ని దక్కించుకుంది? 1) దక్షిణ కొరియా 2) జపాన్ 3) ఇరాన్ 4) పాకిస్థాన్ 6. ఆసియా క్రీడలు 2018లో ఏ నగరంలో జరగనున్నాయి? 1) మనీలా 2) టోక్యో 3) జకర్తా 4) న్యూఢిల్లీ 7. 19వ ఆసియా క్రీడలు 2022 సెప్టెంబరులో చైనాలోని ఏ నగరంలో జరుగుతాయి? 1) బీజింగ్ 2) షాంఘై 3) గ్వాంగ్ జు 4) హాంగ్ జు 8. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను 2019లో ఏ దేశంలో నిర్వహిస్తారు? 1) బ్రెజిల్ 2) అర్జెంటీనా 3) పెరూ 4) బొలీవియా 9. దక్షిణ కొరియాలో ఇప్పటి వరకు ఆసియా క్రీడలు నిర్వహించని నగరం? 1) సియోల్ 2) బుసాన్ 3) ఇంచియాన్ 4) నామ్వన్ 10. 2016లో వందేళ్లు పూర్తి చేసుకోనున్న టోర్నమెంట్? 1) ప్రపంచకప్ ఫుట్‌బాల్ 2) కోపా అమెరికా 3) ఆసియా క్రీడలు 4) కామన్వెల్త్ క్రీడలు సమాధానాలు 1) 4 2) 3 3) 1 4) 3 5) 4 6) 3 7) 4 8) 1 9) 4 10) 2 -
దూకుడే..
స్కేటింగ్‌లో రాణిస్తున్న చైతన్య కుమార్ అనతి కాలంలోనే అంతర్జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు ఏషియన్స్ గేమ్స్ లక్ష్యంగా సాధన చేస్తున్న టెన్త్ విద్యార్థి. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని నిరూపించాడు ఓ విద్యార్థి. స్కేటింగ్‌పై మక్కువ పెంచుకోవడమే కాదు ఆ మేరకు సాధన చేసి దూసుకుపోతున్నాడు. అనతి కాలంలోనే అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడాకారుడిగా నిలిచాడు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 26 మెడల్స్‌తోపాటు ఇతర పోటీల్లోనూ అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురి మన్ననలు అందుకున్నాడు కోలా చైతన్య కుమార్. - శేరిలింగంపల్లి భెల్ ఎంఐజీ కాలనీలో ఉండే కోలా శ్రీనివాస్ కుమారుడే కోలా చైతన్య కుమార్. మదీనగూడలోని జెనిసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నాడు. ఆరో తరగతిలో ఉన్నప్పుడే స్కేటింగ్‌పై శ్రద్ధ కనబరిచాడు. అతని ఆసక్తిని గమనించిన తండ్రి శ్రీనివాస్ భెల్ స్కేట్ నైన్ కోచ్ విఠలా వద్ద శిక్షణ ఇప్పించారు. అక్కడ శిక్షణ పొందిన కొద్ది కాలంలోనే పలు మెడల్స్ సాధించాడు. నిత్యం ప్రాక్టీస్... ఓవైపు చదువుతూనే మరోవైపు నిత్యం భెల్ లోని రింక్‌లో సాయంత్రం వేళ స్కేటింగ్ సాధన చేసేవాడు. ఇంటర్నేషనల్ స్కేటింగ్‌లో పాల్గొనేందుకు అవసరమైన బ్యాంక్ ట్రాక్ శేరిలింగంపల్లి ప్రాంతంలో అందుబాటులో లేకపోవడంతో నగరంలోని ఇందిరాపార్కుకు ప్రతి ఆదివారం ప్రాక్టీస్ కోసం వెళ్లేవాడు. కోలా చైతన్యకుమార్ కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని చాంపియన్ షిప్ మెడల్ సాధించాడు. రాష్ర్ట, జాతీయ స్థాయిల్లో పలు పతకాలు అందుకున్నాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ర్ట, జాతీయ స్థాయి పోటీల్లో, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 2011-12 కాకినాడలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడు గోల్డ్ మెడల్స్. ► ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సిల్వర్ మెడల్ ►2012-13లో వైజాగ్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయిలో 3 గోల్డ్ మెడల్స్ ► 2011-12లో ఆర్ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయిలో రెండు గోల్డ్, ఒక బ్రాంజ్ మెడల్స్ ► జాతీయ స్థాయిలో ఒక బ్రాంజ్ మెడల్ ► 2012-13లో రాష్ట్ర స్థాయిలో సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ ► 2013-14లో రాష్ట్ర స్థాయిలో మూడు గోల్డ్ మెడల్స్ ► జాతీయ స్థాయిలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ► సీబీఎస్ఈ సౌత్‌జోన్ పోటీల్లో గోల్డ్ మెడల్ ► సీబీఎస్ఈ జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ ► 2014 ఆర్ఎస్ఎఫ్ఐ రాష్ర్ట స్థాయి పోటీల్లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించాడు ► బెల్జియంలో జరిగిన ప్లాండ ర్స్ గ్రాండ్ ఫిక్స్ షార్ట్ డిస్టెన్స్‌లో చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు. ప్రభుత్వ సహకారం అవసరం... శేరిలింగంపల్లి ప్రాంతంలో బ్యాంక్‌ట్రాక్ లేకపోవడంతో ఇందిరాపార్కుకు తీసుకెళ్లడం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన పని. ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు బ్యాంక్‌ట్రాక్ ప్రాక్టీస్ ఎంతో అవసరం. దాన్ని ఈ ప్రాంతంలో అందుబాటులోకి తేవాలి. స్కేటింగ్ క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటే మరెంతో మంది రాణిస్తారు. మా అబ్బాయి చైతన్యకు స్కేటింగ్‌లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా మెడల్స్ రావడం వెనుక కోచ్ విఠలా కృషి ఎంతో ఉంది. - కోలా శ్రీనివాస్ (చైతన్యకుమార్ తండ్రి) ఏషియన్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం కోసం... స్కేటింగ్‌లో ఏషియన్ గేమ్స్‌లో దేశం తరఫున పొల్గొనడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంటర్నేషనల్ గేమ్స్‌లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటున్నా. తల్లిదండ్రులు, కోచ్ విఠలా, పాఠశాల యాజమాన్యం సహకారంతో పతకాలు సాధించగలిగా. - కోలా చైతన్య కుమార్ -
సాధించాల్సింది చాలా ఉంది!
‘సాక్షి’కి ప్రత్యేకం ⇒ ఇది ఆరంభం మాత్రమే ⇒ వచ్చే ఏడాది ఇంకా బాగా ఆడతా ⇒ పీవీ సింధు మనోగతం సాక్షి, హైదరాబాద్: పూసర్ల వెంకట సింధు... 19 ఏళ్ల వయసులోనే బ్యాడ్మింటన్ ప్రపంచంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. వరుసగా రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు సాధించిన ఆమె ఆటతీరు ప్రతి ఏటా మరింత మెరుగుపడుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మరింత నిలకడగా ఆమె ఫలితాలు సాధించింది. తాజాగా మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ గెలిచిన సింధు, తన కెరీర్ గురించి పలు అంశాలను ‘సాక్షి’తో పంచుకుంది. విశేషాలు ఆమె మాటల్లోనే... మకావు విజయం: టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాను. మకావులో మళ్లీ విజేతగా నిలవడం సంతోషకరం. గత ఏడాది ఇదే టోర్నీ గెలుచుకోవడానికి, దీనికి పోలిక లేదు. పోటీ, ప్రత్యర్థులు అంతా మారిపోయారు. నా శ్రమకు తగిన ఫలితం లభించింది. దీనికి ముందు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. అయితే గెలుపుతో ఏడాది ముగించగలిగాను. 2014లో ప్రదర్శన: కచ్చితంగా గత సంవత్సరంతో పోలిస్తే నా ఆట మెరుగు కావడంతో పాటు, గుర్తుంచుకోదగ్గ విజయాలు దక్కాయి. కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఉబెర్ కప్‌లో పతకాలు...వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో పాటు ఇప్పుడు మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ గెలిచాను. కాబట్టి మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉంది. మకావుకు ముందు పరాజయాలు: నిజమే, మంచి విజయాలతో పాటు ఈ సారి నేను కొన్ని ఓటములు కూడా ఎదుర్కొన్నాను. అయితే ఆటలో ప్రతీ రోజు ఒకేలా ఉండదు. కొన్ని సార్లు మననుంచి అద్భుతమైన ప్రదర్శన వస్తుంది. మరికొన్ని సార్లు ఏమీ ఆడకుండా చేతులెత్తేస్తాం. కానీ ఒక టోర్నీ గెలవాలంటే ఆ రోజు అత్యుత్తమంగా ఆడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంతకంటే బాగా ఆడితే బాగుండేది అనిపిస్తుంది. అయితే ఇది నిరంతర ప్రక్రియ. కష్టపడటం కొనసాగించాలి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. కోచింగ్‌పై ప్రత్యేక ప్రణాళికలు: ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కోచ్ గోపీచంద్ కారణం. ఆయనకు నా కృతజ్ఞతలు. నేనే కాదు చాలా మంది ఇతర ప్లేయర్లకు కూడా గోపీ సర్ వల్లే గుర్తింపు దక్కింది. చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉంటే సరిదిద్దుకోవడం తప్ప ఇప్పటి వరకైతే కోచింగ్ విషయంలో ప్రత్యేక ప్రణాళికలు ఏమీ లేవు. ఆయన నాకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. దీనిని కొనసాగిస్తే చాలు. వచ్చే ఏడాది టోర్నీలు: సరిగ్గా ఏయే టోర్నీల్లో బరిలోకి దిగుతానో ఇంకా నిర్ణయించలేదు. దానిని కోచ్ నిర్ణయిస్తారు. నేను నా ప్రాక్టీస్‌పైనే దృష్టి పెట్టాను. అయితే ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఏడాది కూడా కాబట్టి కచ్చితంగా కీలక సంవత్సరంగా చెప్పగలను. రియోలో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. మరిన్ని సూపర్ సిరీస్ టోర్నీలలో గెలవాలని కోరుకుంటున్నా. కానీ దాని కోసం ఒత్తిడి పెంచుకోను. నా వయసు ఇంకా 19 ఏళ్లే. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అయితే కొత్త ఏడాదిలో నా ఆట ఇంకా మెరుగవుతుందని నమ్ముతున్నా. కొత్త పాయింట్ల పద్ధతి: ప్రస్తుతం దీనిని గ్రాండ్ ప్రి ఈవెంట్లలోనే అమలు చేస్తున్నారు. మేం ఇంకా ఆ పద్ధతిలో ఆడలేదు. అయితే ప్రత్యేకంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... నా దృష్టిలో 21 పాయింట్ల పద్ధతే బాగుంటుంది. భవిష్యత్తులో స్కోరింగ్ పద్ధతిలో ఇంకా ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి. -
శరత్ కొత్త చరిత్ర
ఆసియా పారా గేమ్స్‌లో ఆరు పతకాలతో రికార్డు ఇంచియాన్: తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ భారత స్విమ్మర్ శరత్ మహదేవరావు గైక్వాడ్ ఆసియా పారా గేమ్స్‌లో ఆరో పతకాన్ని సాధించాడు. తద్వారా ఒకే ఆసియా క్రీడల్లో (పారా గేమ్స్‌తో కలిపి) అత్యధిక పతకాలు గెలిచిన భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ‘పరుగుల రాణి’ పీటీ ఉష పేరిట ఉండేది. 1986 ఆసియా క్రీడల్లో ఉష నాలుగు స్వర్ణాలు, రజతంతో కలిపి ఐదు పతకాలు సాధించింది. శుక్రవారం జరిగిన పురుషుల 4ఁ100 మీటర్ల మెడ్లే రిలే రేసులో శరత్ గైక్వాడ్, స్వప్నిల్ పాటిల్, నిరంజన్, ప్రశాంత కర్మాకర్లతో కూడిన భారత బృందం 5ని:23.32 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. ఇంతకుముందు ఈ క్రీడల్లో 23 ఏళ్ల శరత్ 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో రజతం నెగ్గగా... 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో, 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లో కాంస్య పతకాలు గెలిచాడు. -
సాకేత్‌కు సన్మానం
సనత్‌నగర్: ఆసియా క్రీడల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన తెలుగు తేజం, భారత డేవిస్ కప్ టెన్నిస్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేనికి ప్రముఖ సీఏ విద్యా సంస్థ మాస్టర్‌మైండ్స్ యాజమాన్యం అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా సాకేత్‌ను ఆ సంస్థ కార్యాలయంలో డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఏ రంగంలో ఉన్నా తెలుగువాడు తన సత్తా చాటుతూ భారతదేశ గొప్పతనాన్ని నిలబెడుతూనే ఉంటాడని అన్నారు. క్రీడల్లో రాణించాలనుకునే యువతకు సాకేత్ సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ ఇన్చార్జి శ్రీనివాసరావు, అంజిరెడ్డి, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
బంగారు పూవమ్మ
బెంగళూరు : ఆసియా క్రీడల్లో పతకాలను సాధించిన పూవమ్మకు మంగళవారం మంగళూరు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. దక్షిణ కొరియా నుంచి వచ్చిన అమెను తల్లిదండ్రులు అక్కున చేర్చుకుని ముద్దాడారు. రిలే రేస్‌లో స్వర్ణం, 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలను ఆమె సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా పూవమ్మ మాట్లాడుతూ... రాష్ట్ర, ఇండియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ల నుంచి ఇప్పటి వరకు తనకు మద్దతు లభించలేదని నిష్టూరమాడారు. ఇకనుంచైనా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటానని తెలిపారు. అంతకు ముందు ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్‌షిప్‌లపై దృష్టి సారిస్తానని చెప్పారు. వచ్చే ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించాలన్నది తన లక్ష్యమని వెల్లడించారు. కాగా పూవమ్మకు మంత్రులు రమానాథ్ రై, అభయ చంద్ర జైన్ కూడా స్వాగతం పలికారు. వారిద్దరూ ఆమెను సత్కరిస్తూ, అథ్లెటిక్స్‌లో ఆమెకు అంతర్జాతీయ శిక్షణనిప్పించడానికి ముఖ్యమంత్రితో మాట్లాడతామని తెలిపారు. -
ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు అదృశ్యం!
కొలంబో: దక్షిణ కోరియాలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు శ్రీలంక క్రీడాకారుల అదృశ్యమయ్యారని అధికారులు వెల్లడించారు. శ్రీలంక హకీ క్రీడాకారుడు ప్రసన్న దిసనాయకే, మరో బీచ్ వాలీబాల్ క్రీడాకారుడు గత శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. అదృశ్యమయ్యారా లేక ఉద్యోగ కోసం కావాలనే కనిపించకుండా పోయారా అనే విషయాన్ని అధికారులు తేల్చి చెప్పలేకపోతున్నట్టు సమాచారం. దక్షిణ కోరియాలో శ్రీలంకకు కార్మికులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. ఇంచెయాన్ లో జరిగిన 17వ ఆసియా క్రీడల కోసం 60 పురుషులు, 20 మంది మహిళలను శ్రీలంక దేశం పంపారు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న నేపాల్ అథ్లెట్లు కూడా అదృశ్యమైన సంగతి తెలిసిందే. -
ఆర్చరీ మెరుపులు
- విజయవాడ చేరుకున్న పూర్వాష, జ్యోతిసురేఖ - ఏషియన్ గేమ్స్ పతక విజేతలకు ఘనస్వాగతం విజయవాడ స్పోర్ట్స్ : ఏషియన్ గేమ్స్‌లో బెజవాడ కీర్తిపతాకను ఎగురవేసి నగరానికి వచ్చిన ఆర్చర్లకు ఘనస్వాగతం లభించింది. ఇంచియాన్ (కొరియా)లో జరిగిన 17వ ఏషియన్ గేమ్స్‌లో విజయవాడ నుంచి భారత కాంపౌండ్ మహిళా ఆర్చరీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు సాధించిన పూర్వాష, వెన్నం జ్యోతి సురేఖ నగరానికి చేరుకున్నారు. శుక్రవారం పూర్వాష తన కోచ్ ఎల్.చంద్రశేఖర్‌తో కలిసి గన్నవరం చేరుకోగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పి.రామకృష్ణ, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పి.రావు, క్రీడాసంఘాల ప్రతినిధులు నామిశెట్టి వెంకట్, డి.శ్రీహరి, శాతవాహన కళాశాల పీడీ సంగీతరావు, ఓల్గా ఆర్చరీ అకాడమీ అర్చర్లతో పాటు పూర్వాష చదువుకున్న విశ్వభారతి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ర్యాలీగా నగరానికి చేరుకున్నారు. ఏపీ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ, విజయవాడ ఓల్గా అకాడమీ ఆర్చర్లు తప్పకుండా పతకాలు సాధిస్తారని ముందుగానే చెప్పామని, అదిప్పుడు నిజమైందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సీఎంను కలిసిన సురేఖ భారత జట్టుతో శుక్రవారం ఢిల్లీ వచ్చిన మరో ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అక్కడ్నుంచి హైదరాబాద్‌కు చేరుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి శనివారం నగరానికి చేరుకుంది. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, క్రీడాసంఘాలు, సహచర ఆర్చర్లు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఘనస్వాగతం పలికారు. జ్యోతి సురేఖకు సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ సీబీఆర్ ప్రసాద్ రూ.5 లక్షల చెక్కును అందజేశారు. 1951 ఢి ల్లీలో జరిగిన తొలి ఏషియన్ గేమ్స్‌లో కృష్ణా జిల్లాకు చెందిన కామినేని ఈశ్వరరావు, దండమూడి రాజగోపాలరావు వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించగా.. ఇన్నేళ్ల తరువాత జ్యోతి సురేఖ కాంస్య పతకం సాధించిందన్నారు. ఆమెకు ఏ విధమైన సహకారం కావాలన్నా అందిస్తానని ప్రసాద్ హామీ ఇచ్చారు. జ్యోతిసురేఖ వెంట తండ్రి సురేంద్ర, డీఎస్డీవో పి.రామకృష్ణ, కేఎల్‌యూ డెరైక్టర్ రామకృష్ణ, శాయ్ కోచ్ వినాయకప్రసాద్, సెపక్తక్రా అసోసియేషన్ అధ్యక్షుడు అర్జా పాండురంగారావు ఉన్నారు. -
ఆసియా క్రీడలు : ఖేల్ ఖతమ్!!
-
చరిత్ర పునరావృతమైంది
‘‘ఆసియా క్రీడల్లో 16 ఏళ్ల తర్వాత మన జట్టు స్వర్ణం నెగ్గడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. చివరిసారి 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గిన జట్టులో నేనూ సభ్యుడిగా ఉన్నాను. ఈ రోజు ఫలితం చూస్తే చరిత్ర పునరావృతం అయినట్లు అనిపిస్తోంది. అప్పుడు కూడా మేం లీగ్ దశలో కొరియాతో ఓడి ఫైనల్లో వారినే ఓడించాం. ఈసారి లీగ్‌లో పాకిస్థాన్‌తో ఓడినా... తుది పోరులో వారిని చిత్తు చేశాం. ఫైనల్ మ్యాచ్‌లో నిస్సందేహంగా గోల్ కీపర్ శ్రీజేష్ హీరో అని చెప్పవచ్చు. తీవ్ర ఒత్తిడి సమయంలో అతను షాట్లను అడ్డుకున్న తీరు అద్భుతం. ఇక మ్యాచ్ పరంగా చూస్తే మన డిఫెన్స్ బాగుంది కానీ ఫార్వర్డ్ బలం ఆ స్థాయిలో కనిపించలేదు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం మంచి విషయం. ఆలోగా మనం దిద్దుకోవాల్సిన విషయం ఎక్కువ మంది ఫార్వర్డ్లను తయారు చేయడం. రెండేళ్లలో కీలక ఆటగాళ్లు గాయాలపాలైతే పరిస్థితి కష్టమవుతుంది. కాబట్టి ఫార్వర్డ్ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.’’ - ‘సాక్షి’తో ముకేశ్ కుమార్ (ట్రిపుల్ ఒలింపియన్ ) -
‘కనక’ కాంతలు...
- 4x400 రిలేలో నాలుగోసారి భారత మహిళలకు పసిడి పతకం - షాట్‌పుట్‌లో ఇందర్‌జిత్‌కు కాంస్యం ఇంచియాన్: రిలే రేసుల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ భారత మహిళల జట్టు వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో ప్రియాంక, టింటూ లుకా, మన్దీప్ కౌర్, పూవమ్మలతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది. దీంతో 2002 బుసాన్ గేమ్స్ నుంచి వరుసగా నాలుగోసారి పసిడి పతకం భారత్ సొంతమైంది. 3ని 28.68 సెకన్లలో రేసును పూర్తి చేసిన భారత బృందం ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పింది. 2010లో తమ పేరిటే ఉన్న రికార్డును (3ని 29.02 సెకన్లు) తిరగరాసింది. జపాన్ (3ని 30.80 సెకన్లు), చైనా (3ని 32.02 సెకన్లు)లు రజతం, కాంస్యం దక్కించుకున్నాయి. తొలి అంచెలో పరుగెత్తిన ప్రియాంక..... జపాన్ అమ్మాయి కంటే కాస్త వెనుకబడింది. అయితే రెండో అంచెలో టింటూ అద్భుతమైన పరుగుతో భారత్ లోటును పూర్తి చేసింది. మూడో అంచెలో జపాన్ నుంచి సవాలు ఎదురైనా మన్దీప్ ఏమాత్రం తడబడకుండా ఆధిక్యాన్ని కొనసాగిస్తూ పరుగు పూర్తి చేసింది. చివరిదైన నాలుగో అంచెలో పూవమ్మ యాంకర్ పాత్రలో అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చి భారత్‌కు కనకాన్ని అందించింది. పురుషుల షాట్‌పుట్‌లో భారత్‌కు కాంస్యం లభించింది. ఫైనల్లో ఇందర్జిత్ సింగ్ ఇనుప గుండును 19.63 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఐదో ప్రయత్నంలో భారత షాట్ పుటర్ ఈ దూరాన్ని అందుకున్నాడు. -
‘పసిడి’ కూతకు విజయం దూరంలో...
కబడ్డీ ఫైనల్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఇంచియాన్: మిగతా క్రీడాంశాల్లో ఫలితాలు ఎలా ఉన్నా.... ఆసియా క్రీడల్లో కచ్చితంగా రెండు స్వర్ణాలు గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్న క్రీడాంశం కబడ్డీ. అంచనాలకు అనుగుణంగానే భారత పురుషుల, మహిళల జట్లు తమ జైత్రయాత్ర కొనసాగిస్తూ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. పురుషుల జట్టు వరుసగా ఏడో స్వర్ణంపై... మహిళల జట్టు వరుసగా రెండో స్వర్ణంపై గురి పెట్టాయి. గురువారం జరిగిన పురుషుల గ్రూప్ ‘ఎ’ సెమీఫైనల్లో భారత్ 36-25తో కొరియాపై గెలిచింది. తొలి అర్ధభాగానికి 14-12 ఆధిక్యంలో నిలిచిన భారత్ రెండో అర్ధభాగంలో మరింత దూకుడుగా ఆడి 22 పాయింట్లు సొంతం చేసుకుంది. కొరియా 13 పాయింట్లు మాత్రమే గెలవడంతో ఓటమి తప్పలేదు. తొలి భాగంలో ఏడు, రెండో భాగంలో ఒక బోనస్ పాయింట్లు గెలిచిన భారత్ రెండుసార్లు లోనాను నమోదు చేసింది. కేవలం ఐదు బోనస్ పాయింట్లతో సరిపెట్టుకున్న కొరియా ఒక్క లోనా కూడా చేయలేకపోయింది. మహిళల సెమీస్‌లో భారత్ 41-28తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో రెండు జట్ల స్కోరు 14-14తో సమమైంది. అయితే రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చిన భారత్ చకచకా 27 పాయింట్లను కైవసం చేసుకుంది. థాయ్ క్రీడాకారిణిలు 14 పాయింట్లతో సరిపెట్టుకున్నారు. భారత్‌కు మొత్తం 6 బోనస్ పాయింట్లతో పాటు రెండు లోనాలు లభించాయి. థాయ్ 13 బోనస్ పాయింట్లు నెగ్గినా లోనాను మాత్రం నమోదు చేయలేకపోయింది. శుక్రవారం జరిగే ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు ఇరాన్‌తో; మహిళల జట్టు కూడా ఇరాన్‌తోనే తలపడతాయి. వాలీబాల్: భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. 5-8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ పురుషుల జట్టు 3-1తో థాయ్‌లాండ్‌పై నెగ్గింది. మహిళల టీమ్ 0-3తో హాంకాంగ్ చేతిలో ఓడి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. టేబుల్ టెన్నిస్: స్టార్ ప్లేయర్ సౌమ్యజిత్ ఘోష్ ప్రిక్వార్టర్స్‌లో 1-4తో స్నిహోక్ పాక్ (కొరియా) చేతిలో; మహిళల విభాగంలో మానికా బాత్రా 0-4తో ఇషికావా కసుమీ (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యారు. అంకితా దాస్ తొలి రౌండ్లో 2-4తో వింగ్ నామ్ (హాంకాంగ్) చేతిలో ఓడింది. తైక్వాండో: 63 కేజీల క్వార్టర్స్‌లో సౌరవ్ 4-5తో అబాసి అహ్మద్ (అఫ్ఘానిస్థాన్) చేతిలో; 68 కేజీల విభాగంలో శివ్ కుమార్ 7-11తో గాజి ముషాబ్బా (సౌదీ ఆరేబియా) చేతిలో ఓడారు. మహిళల 62 కేజీల విభాగంలో రేఖా రాణి 0-15తో చువాంగ్ (చైనీస్‌తైపీ) చేతిలో; 67 కేజీల కేటగిరీలో శ్రేయా సింగ్ 6-7తో వోన్జిన్ లీ (కొరియా) చేతిలో ఓటమి చెందారు.