ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు అదృశ్యం!
Published Mon, Oct 6 2014 5:21 PM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM
కొలంబో: దక్షిణ కోరియాలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు శ్రీలంక క్రీడాకారుల అదృశ్యమయ్యారని అధికారులు వెల్లడించారు. శ్రీలంక హకీ క్రీడాకారుడు ప్రసన్న దిసనాయకే, మరో బీచ్ వాలీబాల్ క్రీడాకారుడు గత శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. అదృశ్యమయ్యారా లేక ఉద్యోగ కోసం కావాలనే కనిపించకుండా పోయారా అనే విషయాన్ని అధికారులు తేల్చి చెప్పలేకపోతున్నట్టు సమాచారం.
దక్షిణ కోరియాలో శ్రీలంకకు కార్మికులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. ఇంచెయాన్ లో జరిగిన 17వ ఆసియా క్రీడల కోసం 60 పురుషులు, 20 మంది మహిళలను శ్రీలంక దేశం పంపారు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న నేపాల్ అథ్లెట్లు కూడా అదృశ్యమైన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement