Sourth korea
-
ఒక్క బిడ్డను కంటే రూ.61 లక్షలు!
జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా దేశంలో జనన రేటును పెంచేందుకు వినూత్న చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు (దాదాపు రూ.61 లక్షలు) ఇచ్చే అంశాన్ని ఆ దేశ ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక, పౌర హక్కుల కమిషన్ ఓ పబ్లిక్ సర్వేను చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఏప్రిల్ 17న ప్రారంభమైంది. పిల్లల్ని కనేవారికి అందించే ప్రోత్సాహాల కోసం ఏటా 12.9 బిలియన్ పౌండ్లు ( సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) ఖర్చు చేయనుంది. ఇది ఆ దేశ బడ్జెట్లో దాదాపు సగం.దక్షిణ కొరియా దేశంలో జననాల రేటు భారీగా తగ్గిపోతోంది. 2023లో ఇది 0.72కు పడిపోయింది. 2023లో నమోదైన జాతీయ జనన రేటు ఆ దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టం. దేశంలో జనాభా సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత.. వెరసి దంపతులు వివాహ బంధానికి, పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నారు. -
పుతిన్‌కు కిమ్ జోంగ్ ఉన్ లేఖ
సియోల్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల విజయం 75 వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తిపై రష్యా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కరోనాపై విజయం సాధించి శక్తివంతమైన రష్యాను నిర్మించడానికి అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యాలో కరోనా కోరలు చాస్తుంది. ఇప్పుడు అక్కడ ప్రతీరోజు కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. రష్యాలో కరోనా కేసులు లక్షా 87వేలకు చేరుకోగా, మృతుల సంఖ్య 1723కు చేరుకుంది. (దాయాది దేశంపై మండిపడ్డ ఉత్తర కొరియా) అంతకుముందు కిమ్ చైనా కరోనాపై పోరాటం చేసి సాధించిన విజయాలను ప్రశంసిస్తూ ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యక్తిగత సందేశాన్ని పంపినట్లు అధికారిక కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం తెలిపింది. వైరస్ బారిన పడకుండా నెలల తరబడి దేశ సరిహద్దును మూసివేసిన తరువాత చైనా, ఉత్తర కొరియా దౌత్యపరమైన చర్యలు ఆర్థికంగా లాభం చేకూరుతాయని నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 40 లక్షలు దాటగా, ఇప్పటివరకు కరోనాతో 2.75 లక్షల మంది మృతి చెందారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 13.77 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. (జిన్‌పింగ్‌పై కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసలు!) (మొన్న కనబడింది నకిలీ కిమ్, మరో కొత్త వాదన!) -
ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు అదృశ్యం!
కొలంబో: దక్షిణ కోరియాలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు శ్రీలంక క్రీడాకారుల అదృశ్యమయ్యారని అధికారులు వెల్లడించారు. శ్రీలంక హకీ క్రీడాకారుడు ప్రసన్న దిసనాయకే, మరో బీచ్ వాలీబాల్ క్రీడాకారుడు గత శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. అదృశ్యమయ్యారా లేక ఉద్యోగ కోసం కావాలనే కనిపించకుండా పోయారా అనే విషయాన్ని అధికారులు తేల్చి చెప్పలేకపోతున్నట్టు సమాచారం. దక్షిణ కోరియాలో శ్రీలంకకు కార్మికులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. ఇంచెయాన్ లో జరిగిన 17వ ఆసియా క్రీడల కోసం 60 పురుషులు, 20 మంది మహిళలను శ్రీలంక దేశం పంపారు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న నేపాల్ అథ్లెట్లు కూడా అదృశ్యమైన సంగతి తెలిసిందే.